You are on page 1of 29

దసరా ప్రత్యేక సంచిక 2018

శ్రీగాయత్రి
Sree Gayatri
Spiritual & Astrological Monthly Online Magazine

విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018


2

శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక – జ్యేతిష మాస పత్రిక
(తెలుగు – ఆంగా మాధేమం )

సంపుటి:1 ప్రత్యేక సంచిక


ఈ ప్
ర త్యేక సంచికలో
ఆశవయుజ శు“ పాడ్ేమి -- ఆశవయుజ శు” దశమి

సనాతన ధర్మ పరిషత్ శ్రీ కృషణ


గాయత్రీ మందిర్ం
ప్రచుర్ణ - సంపాదకతవం సంపాదకీయమ్ 05

శర్ననవరాత్రులు – దేవీ వైభవం .... పీసపాటి గిరిజా


వి. యన్. శాస్త్రి మనోహర్ శాస్త్రి 08

మానేజంగ్ ట్రస్టీ
యోగినీ దేవతలు – జయం వంకటా చలపతి 26
సహకార్ం

జె.వంకటాచలపతి
ఉదయ్ కార్తీక్ పప్పు
——————-
ఫ్లాట్ నం.04, జాస్త్రమన్ టవర్, ఎల్ & టి -
శేర్తన్ కంటీ, గచిిబౌలి, హైదరాబాద్ –32
తెలంగాణ - ఇండియా

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
3

శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక - జ్యేతిష మాస పత్రిక

“Sree Gayatri” Spiritual & Astrological Monthly Online Magazine


శ్రీ గాయత్రి ఆధ్యేతిమక – జ్యేతిష మాస పత్రిక

గౌర్వ సలహా సంఘం (Advisory Committee)

బ్రహమశ్రీ సవితాల శ్రీ చక్ర భాసకర్ రావు, గాయత్రీ ఉపాసకులు ,


వేవస్థాపకులు – అధేక్షులు -- అక్షర్కోటి గాయత్రీ శ్రీ చక్ర పీఠం ,
గౌతమీ ఘాట్, రాజమండ్రి ,
“శ్రీ గాయత్రీ” మాస పత్రిక సలహా సంఘ అదేక్షులు
సెల్: 99497 39799 - 9849461871

Dr. Kompella Subrahmanya Gandhi, B.E., M.Tech, PhD. 45


years’ service in Power Sector, Worked with APSEB, BHEL,
NTPC and few Private Companies.

Member, Advisory Committee “Sree Gayatri”

Resides at Secunderabad (M):9391385949

Mutya Subrahmanyam.BA BL
Retired Income Tax Officer,
State Treasurer of Andhra Vanavasi Kalyan Ashram,
Secretary of Uttar Andhra Veda Parishad.
Executive Member, Akshara Koti Gayatri Sri Chakra Peetham
Member, Advisory Committee “Sree Gayatri”
Resides at Visakhapatnam (M) 93466 90641

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
4

శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక - జ్యేతిష మాస పత్రిక
EDITORIAL BOARD

V.N.Sastry, B.Sc. B.Ed., CAIIB, M.A (PhD) Astrology. Retired State Bank
of India Officer (VR) Hyderabad. Life Member, JVVS and ICAS. Guest Faculty
for M.A.(Astrology), Telugu University, Hyderabad. Contributor to Jyothir
Vastu VIjnana, Astrological Magazine, Hyderabad and Modern Astrology,
Bangalore. Submitted Thesis on Chakra System (Spiritual Astrology) in
pursuance of PhD.
Managing Trustee, SANATHANA DHARMA PARISHATH AND SRI
KRISHNA- GAYATRI MANDIRAM.

Editor “SREE GAYATRI” (M):9866242585 / 8247778506 / 040-23003024


mail:sdparishath@gmail.com

J.Venkatachalapathi, B.Com (CAIIB), Retired SBI Officer, Hyderabad


LHO, MA (Astrology) Sri Potti Sreeramulu Telugu University, Hyderabad.
Life Member, JVVS and ICAS Contributor to Jyothir Vastu Vijnanam,
Jyotisha-Vastu Monthly Magazine, Hyderabad.
Sectional Editor “SREE GAYATRI” Hyderabad.
Settled at Madanapalle, Chittoor Dt. Andhra Pradesh, India.

M: 08247870462 – (L) 0810 6833554

Uday Karthik Pappu, Consultant Software and Hardware,


Trustee: SANATHANA DHARMA PARISHATH and SREE KRISHNA
GAYATRI MANDIRAM,
Technical Editor: “SREE GAYATRI” Hyderabad.
(M): – 8247450978

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
5

लौकििानाां कि साधनू ा,ां अर्थं वागनवु र्तर्े ।


ॠषीणाां पुनराद्यानाां, वाचमर्थोsनुधावकर् ।।
(భవభూతి కృత ఉతత రరామచరితం)

లౌకికులయిన సత్పురుషులు భావప్రకటననిమితీం భాషనుపయోగిస్థీరు.


కానీ మహరుులమాటను భావం అనుసరిస్ీంది.
Spiritual people use words to reflect their inner feelings.
Thoughts follow Great Rishis’ words

సంపాదకీయం

శ్ర
ర మాత నారాధంచు మార్
గ ము లనేకములునాాయి. సృష్ట్
య ేది నంచి మాతృ పూజ
ి ని మంచిన్ ై ద వము లేదు గదా. యోగులు శ్ర
జరుగుతూనే యున్ాది. తల్ల ర మాతన
ి ని ఊర్
మూలాధార్మునండి కండల్లనీ శక్త ్ వ ముఖ మొన్రంచి, స్వవధస్వ
ా న్ము ,
మణిపూర్కము, అనాహతము, విశుది
్ , ఆజ
ఞ చకరముల దావరా సుషుమా మార్
గ మున్
సహస్వ
ర ర్ కమలమందు దేవిని ధాేనించి అమృత స్వ
ర వమున్ందు మునిగెడి వారు. ఈ
యోగస్వధనా కరమము నేడు అంతరంచింది. దేవిని ప్ర్తతవముగా భావించి మోక్షార్
్ ము
ై యా జగనాాతన ఆరాధంచుట అనేకలక
ధాేనించుటకన్ా, ఐహిక సుఖములక
ఆచార్మ
ై న్ది. దక్షిణాచార్ము బ్
ర ై హ్ ాక సిది ై న్ ప్ండితులచే
్ క్త హేతువు. కశలుల
నారాధంప్బ్డు మార్
గ ము దక్షిణాచార్ మార్
గ ము. పామరులచే అనసరంప్బ్డు మార్
గ ము
ర ి ప్త క్త హేతువుగా ప్
వామాచార్ము. ఇది భోగసుఖ పా ర సిది
్ కక్తిన్ది. ఆటవికలు తమ తమ
వంశాచార్ముల న్నసరంచి వామ మార్
గ మున్ దేవిని పూజంతురు. జంతుబ్లులు,
సురాపాన్ము స్వమాన్ేము. మేరు తంత
ర ము వామమార్
గ మున బ్హుదా ఖండించు
చున్ాది. ై ై దికీ పూజ ్
ర ్ ఞ నలు ై ై దికమ
య ము. ్ ై న్ దక్షిణాచార్ మార్
గ మునే

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
6

ఆశ
ర యింప్వలన.

కల్ల యుగంలో ధాేన్ మార్


గ మే ్
ర ్
ా మని చెబుతారు. ప్ర్మేశవర రూపానిా ధాేన్
గ న్ దరశంచాల్ల. రాగసవరూప్ పాశాఢ్యే – క్ర
మారా ర ధాకారాంక శోజవలా అని గదా నామాలు.
రాగదేవష్ట్లే పాశాంకశాలు. అవే ఆయుధాల రూప్ంలో ఆవిడ చేతులో
ి ఉనాాయి. ఆవిడ
వాటిన్నిాంటినీ మన్ మీద ప్
ర యోగంచనూ గలదు. ఉప్సంహరంచనూ గలదు. ప్ ి
ర యోగస్త
ి స్వయుజే సుఖ మనభవిస్వ
సంస్వర్ంలో వచిి ప్డతాం. ఉప్సంహరస్త ి ం. రాగ దేవష్ట్లక
ి చెప్తి ఇంది
సవసి ర యాలతో ఏ ప్ని చేసినా వాటి ఫల్లతం మన్కంటదు. ప్
ర మాదం లేదు.
“రాగదేవ్ వియుక ి వి్యా నింది
ై సు ర ైయ శిర్న్” అని భగవద్గ
గ త చెప్తిన్ మాటలోని
ై హికమ
ి అప్పుడ
ఆంతర్ేమీదే. రాగదేవష్ట్లు లేకండా జీవితం స్వగస్త ్ కామాల ై ై పు
ై న్ అర్
పోదు మన్ దృష్ట
య . ఆముష్టాకమ ్ ం ై ై పే మళ్ళుతుంది. అంటే
ై న్ ధర్ాం లేక మోక్ష పురుష్ట్ర్
మన్క కావలసిన్ ధన్ధాన్ే సుఖ సంతోష్ట్లనీా ప్ ి ంది. లేదా మోక్షానేా ప్
ర స్వదిసు ి ంది.
ర స్వదిసు
ి మార్
భక్త గ ై మ నా, ్
ఞ న్ మార్ ి కర్ా ఫల్లతం
గ ై మ నా కర్ా చెయే వలసిందే. కర్ా చేస్త
వచిిప్డుతుంది. ఫల్లతం కావాలా అకిర్లేదా అన్ాది మన్మే నిర్
ణ యం చేసుక్రవాల్ల.
ి ంది. ఆ
కావాలనకన్ాప్పుడు ఆ ఫల్లతమనభవించడం లో మరంత కర్ా చేయవలసి వసు
ఫల్లతం ఏవిధంగా ఉంటంది అన్ాది అప్ిటి మన్ మన్ః సి
ి తిని బ్టి
య ఆధార్ప్డి ఉంటంది.
అటి
య ఫల్లతం పందేటప్పుడు ఆయురా
ా యం లేకపోయిన్ట
ి యిత్య, తిరగ జన్ా
ి ంది. కర్ా ఫల్లతం వద
తీసుక్రవలసివసు ా నకంటె జన్ా రాహితేమే. అందుకే నిష్ట్ిమ కర్ా
చెయేమని శ్ర
ర కృ్
ణ ప్ర్మాతా చెప్తింది. ఈ మార్
గ ంలో బుద
్ జీవులు కొనిా నియమాలు
పాటించవలసుంటంది. (1) ధర్ాబ్ద
్ ై మ న్ జీవితం గడప్టం (2) మన్స్వ-వాచా-కర్ాణా
ఎవరని బాధంచకండటం (3) అనిా వేళలా సతేమే మాట్ల
ి డటం (4) ఒకర వి్యాలు
ఇంకొకరదగ
గ ర్ ప్
ర ి స్వ వించకండటం (5) చెపేి నీతులు సవయంగా ఆచరంచడం. ఇవనీా
చెప్తిన్ంత సులువేమీ కాదు ఆచరంచడం అంటే. సనిాహితులు-కావలసిన్వారు దూర్ం

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
7

కావచుి. మన్ం మౌన్ంగా ఉంటే మన్మీదే దోష్ట్లు ఆపాదించబ్డవచుి. హింద్గలో ఒక


స్వమత ఉంది. (ఛొర్ మాఛాయే షోర్) అంటే దంగతన్ం చేసిన్వాడే దంగ దంగ అని
అరచాడుట. అంటే తప్పులు చేసిన్వారే మన్మీద ఆతప్పులని ఆపాదించవచుి. ఇంకా
ి డులు ఎదుర్కివలసి వసు
ఎన్నా వతి ి ంది. అనిాట్ల నిలచిన్ప్పుడు ఆ ఆన్ందమే వేరు.

ఞ నానిక్త అరు
ు డవుతారు. ఈ జీవితానిక్త ఒక స్వర్
్ కత.

లేన్ప్పుడు

“పున్ర్ప్త జన్న్ం – పున్ర్ప్త మర్ణం

పున్ర్ప్త జన్నీ జఠరే శయన్ం

ఇహ సంస్వరే బ్హు దుస్వ


ి రే

కృప్యా~పారే పాహి మురారే

పా
ర ర్బ్ ి , భగవదర్ిణ భావంతో, లోకకళ్యేణం గురంచి నిష్ట్ిమకర్ాలు
ా కర్ాల న్నభవిస్త
ి ంటే, పూర్వ వాసన్లు ఖర్ియి కొత
చేసు ి వాసన్లు చేర్కండా ఉండి, వాసనాక్షయ
మవగానే సంస్వర్చకర ం నండి ై బ టప్డవచుి. అందుక్రసం కూడా శ్ర
ర లల్లతా ప్ర్మేశవర
అనగ ి శ
ర హం కావాల్ల. అతేంత భక్త ర ద
్ లతో ఆమన కొలవడం ఒకటే శర్ణేం.

శుభం భూయాత్
వి. యన్. శాసి
ి

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
8

శర్ననవ రాత్రులు – దేవీ వైభవం

ర్చన: పీసపాటి గిరిజా మనోహర్ శాస్త్రి, రాజమహంద్రవర్ం.

(మొబైల్): 94403 56770

దేవినవరాత్రులు, దసరా ప్రాముఖ్ేత సంతరించుకునన పండుగలు. నవరాత్రి అనేవి ఏటా ఐదు స్థరుా వస్థీయి.
అవి వసంతనవరాత్రి (చైత్ర నవరాత్రి), ఆషాఢ నవరాత్రి, శర్ద్ నవరాత్రి(శర్ననవరాత్రి), పుషే నవరాత్రి, మాఘ
నవరాత్రి అనే పేర్ాతో నిర్వహంచ బడుత్పనానయి. ఈ ఐదింటిలో శర్ననవరాత్రి వసంత నవరాత్రి ప్రాచుర్ేం
పందాయి. ఈసందర్భంగా సకలదేవతాసవరూపిణి మరియు మహాలక్ష్మి, మహాసర్సవతి, మహాకాళిగ
సంతరించిన త్రిమూరాీాతమకమైన దేవిని కొలుస్థీరు. దసరానే శర్ననవరాత్రులు అంటారు. సరిగాా వసంత
నవరాత్రులు గడిచిన ఆరుమాసములకు శర్త్ నవరాత్రులు వస్థీయి.

"శాంభవీ శార్దారాధే" అని ప్రస్త్రదిి. శర్తాకలంలో అమమవారిని ఆరాధంచడ్ం అనేది, ఇకకడ్ నుంచి
సంవతసర్కాలమంతా క్షేమకర్ంగా ఉండ్డానికి. అమమవారిని ఆరాధంచినప్పుడు బాధలు, దుుఃఖాలు
తొలుగుతాయి.

"త్రిరాత్రం వాపి కర్ీవేమ్ సపీమాేది యథాక్రమం". తొమిమది రాత్రులు జరుపుకోలేనివారు ఐదు, మూడు
కనీసం ఒకక రాత్రిగా జరుపుకోవాలని భవిషే పురాణం ఘోషిస్ీందని పెదదలు చెబుతారు.

పూజావిధ్యనం మూడు విధ్యలు, అవి లఘుపూజ, నితేపూజ, విశేషపూజ. లఘుపూజ దీనినే పంచోపచార్
పూజ అందురు. పంచభూతములకు స్థక్ష్యేలు అని చెపుబడే గంధ(భూమి) పుషు(ఆకాశం) ధూప(వాయు)
దీప(త్యజస్స) నైవేదేం(అమృతము,జలము) వీటితో చేయు పూజ. నితేపూజ షోడ్శోపచార్పూజ. పదహారు
ఉపచారాలతో చేయు పూజ. వేదమంత్రములతో చేయు పూజ వేదోకీ విధ్యనమనియు, శోాకములతో చేయు
పూజ పురాణోకీ విధ్యనమనియు అందురు. (పూజా విధ్యనం ఈ సందర్భంగా వ్రాయలేదు).

ఈ దేవియొకక ప్రాశసీాం, ఆవిరాభవాలు గుఱంచి పురాణాలు ఆధ్యర్ంగాను, పూజా క్రమం శార్దానవరాత్ర


పూజా విధ్యనం ప్రకార్ం ఏ తిథినాడు ఏ దేవిని పూజంచాలి మరియు నివేదనలు గుఱంచి వ్రాయబడినది.

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
9

బాలా త్రిపుర్స్ందరి (పాడ్ేమి)

శోా|| పారాంకుశౌ పుసీకాక్ష సూత్రేచ దధతీకరుః|

ర్కాీత్రేక్ష్య చంద్ర బాలా ధ్యేయా బాలాస్రారిితా||

శార్దా నవరాత్ర పూజావిధ్యనం ప్రకార్ం మొదటి రోజైన పాడ్ేమి నాడు శ్రీ బాలా త్రిపుర్స్ందరిని
పూజస్థీరు. బాల లలితాకామేశవరుల పుత్రిక, తొమిమది సంవతసర్ముల ప్రాయం
కలది. ఈమె లలితాపర్మేశవరి యొకక బంగారు కవచం నుండి ఉదభవించినది.
ఈమె ఎలాప్పుడూ లలితా అమమవారి చెంతనే వుంటంది. ఈమె లలిత ఉచావాస
నిశావసములు మరియు నాలుగవ విలోచనము. ఈ బాల
సమసీశకిీమండ్లములకు పూజ్యేరాలు, పరాక్రమశాలి, లలితతోసమానమైన
ఆకార్ము కలది. ఆమె నవవర్ువలె సర్వవిదేలకు మహాఖ్ని. బాలసూరుేని వలె ఎఱ్ఱని, గుండ్రని రూపం,
ఎఱ్ఱని తీగవంటి శర్తర్ము కలది. మహారాజి యొకక పాదపీఠమున నితేము సనినధ్యనము కలది.

లలితాదేవి భండాస్ర్ యుదిసమయమున, భండాస్రుడు తన సమసీ సైనేం ధవంసమగుటతో ఖినునడై,


తన మహాబలులైన ముపుది మంది పుత్రులను ఒకే గుంపుగా చేస్త్ర యుదిము చేయదలచెను.

ఇది తెలిస్త్రన బాల ఉతాసహముకల , భండాస్ర్ పుత్రులకు ఎదురుగా యుదిము చేయ నిశియించి
మహారాజికి విననవించెను. లలితాంబ మొదట నిరాకరించిన, ఆమె దృఢనిశియము చూచి, సమమతించి తన
ఆయుధములలోని కొనిన ఆయుధములనిచిి యుదిమునకు పంపెను.

బాల భండాస్రిని ముపుది పుత్రులతోను ఘోర్ముగా యుదిము చేసెను. ఆఖ్రున ఒకేస్థరి ముపుది
అర్ిచంద్ర బాణములను వదిలి భండాస్రుని ముపుది మంది పుత్రుల తలలను నరికెను.

ఈ బాలాత్రిపుర్స్ందరిని పూజంచుట వలన జాినవృదిి కలుగును. దేవికి పులగము నివేదన.

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
10

అననపూరాణదేవి (విదియ)

శోా||వామే మాణికేపాత్రం మధుర్సభరితం బిభ్రతీం పాణిపదేమ

దివయేర్నయనుః ప్రపూరాణం ధృతమణివలయే దక్షిణే ర్తనదర్తవమ్

ర్తానంగం పీనత్పంగ సీనభర్నమితాం తారాహారోపసేవాేం

వందేపూర్ణందుబింబ ప్రతిభట వదనా మంబి కామననపూరాణమ్.

శార్దా నవరాత్ర పూజావిధ్యనం ప్రకార్ం రండోరోజైన విదియనాడు శ్రీ అననపూరాణదేవిని పూజస్థీరు.

సమసీ ప్రాణికోటికి జీవనాధ్యర్ం అననం. అందుకే అననం పర్బ్రహమ సవరూపం అనానరు. పార్వతీదేవి సృషిీంచిన
ఒక సంఘటన వలన పర్మశివునికి ఎకకడ్ భిక్ష దొర్కని సందరాభన అననపూరాణదేవి ర్సపాత్రతో
దర్శనమిస్ీంది. ఆదిభిక్షువైన ఈశవరునికి భిక్ష పెటిీన దేవత అననపూరాణదేవి.

శిషుేలతో కా క క్షేత్రమును దరిశంచిన వాేస్నికి


ఏడురోజ్యల పాట ఎకకడా భిక్ష దొర్కలేదు. దాంతో
క్షుదాాధ భరించలేక వాేస్డు తన చేతి కమండ్లంలోని
ఉదకానిన దక్షిణ హసీంలో పోస్కుని కా క నగరానిన
శపించేందుకు పూనుకుంటాడు.

వంటనే అననపూరాణదేవి వృది వనిత రూపంలో వచిి అతనిని


వారించి "నీ ఆగ్రహం ముకకంటికి ఇంకా కోపం
తెపిుంచదా? ఆయినా నీవు క్షుదాాధతో వునానవు. నా ఇంటికి
రా మంచి ఆతిథాేనిన ఇస్థీను" అననది. అనంతర్ం వాేస్డు శిషుేలతో సహా గంగానదిలో స్థననం ముగించి
భోజనానికి వస్థీడు. కమమని భోజనానిన శిషుేలంతా ఆర్గించారు. అప్పుడు వాేస్డు స్థక్ష్యత్పీ
అననపూరాణదేవి ఈరూపంలో వచిి తన క్షుదాాధను, కోపానిన చలాబరిచి కడుపునింపిందని గ్రహంచి, తలిాని

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
11

అనుగ్రహంచమని ప్రారిాసూీవుండ్గా కా క విశేవశవరుడు వచిి వాేస్ని కా క పటనం వదలి పమమని


శాశిస్థీడు.

అనంతర్ం అననపూరాణదేవి కటాక్షంతో దక్షిణ కాశి గా పేరుగాంచిన దక్ష్యరామ భీమేశవరుని చెంతకు చేరాడు.

ప్రపంచ సృషిీ పోషకురాలు అననపూరాణదేవి. ఈమెను ధ్యేనిసేీ అననవస్థిలకు లోటండ్దు, మేధ్యశకిీ వృదిి
చెందుత్పంది. మధుర్భాషణ, సమయసూూరిీ, వాకుశదిి, భకిీశ్రదిలు, ఐశవర్ేం కలుగుతాయి.

ఈమెకు నివేదన దధేననము.

మహాగౌరి (తదియ)

శోా||రౌద్రాయై నమోనితాేయై గౌరయేధ్యత్ర్యేనముః|

జ్యేతాసాయై చేందురూపిణ్యే స్ఖాయై సతతంనముః||

శోా||గౌర్త మమప్రియేదేవి, శంకరార్ి శర్తరిణి|

సౌభాగేం కురుమేదేవి, శివశకిీర్నమోస్ీత్య||

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
12

ఈమె గౌర్వర్ణ శోభతో మలెాపూలను,


శంఖ్మును, చంద్రుని తలపింపజేస్ీంది.
ఈమె ధరించిన వసిములు,
ఆభర్ణములు ధవళ కాంత్పలు
వదజలుాచుండును. ఈమె చత్పరుభజ,
వృషభ వాహన, తన కుడి చేత్పలలో
ఒకదాని యందు అభయముద్రను,
మరియొక దానియందు త్రిశూలము
కలిగియుండును. అట్లా ఎడ్మ చేత్పలోా
ఒకదానియందు డ్మర్కమును,
వేరొకదానియందు వర్ముద్రను
కలిగియుండును. ఈమెది ప్రశాంత
వదనము.

పార్వతి అవతార్మున పర్మశివుని


పందుటకు కఠోర్మైన తపస్స చేయగా
ఈమె శర్తర్ము పూరిీగా నలుపెకెకను. ప్రసనునడైన శివుడు గంగా జలంతో అభిషేకించగా ఈమె శేవతవర్ణంలో
విదుేతాకంత్పలను విర్జముమతూ "మహాగౌరి" అని వాస్త్రగాంచెను. ఈమె శకిీ అమోఘం. తతాకల (సదేుః)
ఫలమును ఇస్ీంది.

ఈమెను ఆరాధంచుటచే భకుీల సంచిత పాపాలు తొలిగిపోయి, పాప, సంతాప (దుుఃఖ్ం) భయాదులు
దరిచేర్వు. సౌభాగేస్త్రదిి పందుతారు .

దేవికి క్షీరాననం నివేదించవలెను.

శ్రీ గాయత్రీ దేవి (చవితి)

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
13

ముకాీవిద్రుమ హమనీల ధవళచావయైరుమఖై సిేక్షణుః

యుకాీమిందు నిబదిర్తన మకుటాం తతాీార్ావరాణతిమకామ్|

గాయత్రీం వర్దా భయాంకుశ కశా శుశభ్రంకపాలం గదాం

శంఖ్ంచక్రమదార్విందయుగళం హసెయీర్వహంతీం భజే||

"నగాయత్ర్ేుః పర్ం మంత్రం నమాత్పుః పర్ వతమ్"- తలిాని


మించిన వం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు అని
భావం. గాయత్రి సకల వేదసవరూపిణి. అనిన మంత్ర్లకు
మూలశకిీ. ఆమె ఐదు ముఖాలతో ప్రకాశిసూీ ఉంటంది. అవి ముకీ, విద్రుమ, హమ, నీల, ధవళ వరాణలతో
ప్రకాశిసూీ ఉంటాయి. చేత్పలలో శంఖ్, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్ీంది.

అమమ ప్రాతుఃకాలంలో గాయత్రి గాను, మధ్యేహనకాలంలో స్థవిత్రి గాను, స్థయంసంధేలో సర్సవతి గాను
పూజంపబడుత్పంది. గాయత్రి ధ్యేనం అనంత మంత్రశకిీ ప్రదాత.గాయత్రి ఉపాసనవలా బుదిి త్యజ్యవంతం
అవుత్పంది. గాయత్రీమంత్ర జపం చత్పర్వదపారాయణం అంత ఫలితానిన ఇస్ీంది.

గాయత్రి ఆవిరాభవం:

(శ్రీ వేదవాేస విర్చితమైన పదమపురాణం, సృషిీ ఖ్ండ్ం, పదహార్వ అధ్యేయంలో తెలుపబడినది.)

ఇచిట శతరూప అనునావిడ్ స్థవిత్రిగా పేరొకనబడినది. బ్రహమకి ఆమె ధర్మపతినయని చెపుబడినది.


పులస్ీాడు మొదలైన సమసీ మునులను, దక్షుడు మొదలైన ప్రజాపత్పలను ఆమె కననదని పేరొకనబడినది.

మునుపు ఒకప్పుడు బ్రహమదేవుడు లోకక్షేమం కోరి పుషకర్తీర్ామున యజిము చేయదలచి, శ్రీ


మహావిషుణవునకు తెలియజేస్త్ర, ముహూర్ీం నిశియించి అందరికి ఆహావనములు పంపెను.

బ్రహమ, ముహూర్ీం సమీపించుచుండుటచే స్థవిత్రిని పిలుచుకొని ర్మమనమని ఇంద్రుని పంపెను. స్థవిత్రి


అప్పుడు, తన పిలిచినవారవవరు రాలేదని, వారురాగానే వచెిదనని తెలియజేసెను. బ్రహమకు ఈవిషయం

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
14

తెలియజేయగ అంత బ్రహమ, ఎవవరినైనా కనేను చూడుము, భార్ేగా గ్రహంచి సంకలుము చేసెదననను.
ఇంద్రుడు భూలోకమునకు పోయి, పాలు పెరుగు అముమకొనుచునన ఒక గొలాకనేను లాగుకొని వచెిను. ఆ
కనే మొదట ఏడుసూీ అభేంతర్ం తెలిపిన, బ్రహమను చూడ్గానే, తన లోకమును తన వారిని
మర్చిపోయెను. వంటనే హరిహరులు పెదదలుగా ఆ కనేతో గాంధర్వ వివాహం జరిగిపోయెను. అంత బ్రహమ
దేవుడు సంకలుం చేస్త్ర యజిం ఆర్ంభించెను.

తరువాత తీరికగా స్థవిత్రి లక్ష్మీపార్వత్పలతోను ఇతర్ సఖులతోను వచెిను. జరిగిన సంగత్పలు తెలుస్కొని
మండిపడెను. ఆమెను చూచి బ్రహామదులు భయపడిరి. ఆమె బ్రహమను, యజివాటికలో వునన నారాయణుడు,
శివుడు, ఇతర్ దేవతలను, ఋత్పవకులుగా వచిిన బ్రాహమణులను ఒకొకకకరిని ఒకొకకక విధంగా
కోపావేశమున శపించెను. విషుణవు ఆమె దగార్కు వళిి అనేక విధముల స్ీతించి ప్రసనునరాలిని చేయుటకు
ప్రయతినంచెను.

బ్రహమదేవుని పెండాాడి యజిమునందు యజమానురాలయి యుండుటచే గాయత్రికి (పూరావశ్రమంలో


గొలాభామ) దేవతా మహమలు కలిగెను. స్థవిత్రి శాపమునకు మికికలి దీనముతో వునన దేవతలను,
ఋషులను మొదలైన వారిని చూచి ఇటానను. "మహాత్పమలారా, మీరు స్థవిత్రి శాపములకు విచారింపకుడు.
నేను బ్రహమను చేపటిీన ప్రభావంచేతను నాకు కలిగిన దేవతవంచేతను వాటికి(ఆ శాపములకు) ప్రతికూలంగా
మీకు వరాలు ఇస్థీను" అని ఎవరికి ఏఏ శాపములు ఇచిినో వాటికి నివార్ణగా వర్ములు ఇచెిను.
(సాలాభావంచే విపులంగా వ్రాయలేదు). ఋతివకుకలుగా వచిిన బ్రాహమణులకు గాయత్రి మంత్రం జపిసేీ
దోషములు పోయి పాప విముకుీలగుదుర్ని వర్ములిచెిను.

"బ్రహమహతాే సమం పాపం తత్ క్షణా దేవ నశేతి" - గాయత్రి మంత్రమును మూడుస్థరుా జపించినచో
బ్రహమహతాే సమానపాపములు పరిహార్ మగును.

చిత్ర్ననం(పులిహోర్) నివేదించవలెను.

శ్రీలలితాదేవి (పంచమి)

(ఉపాంగ లలితా వ్రతం)

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
15

శోా||సకుంకుమ విలేపనామళిక చుంబి కసూీరికాం |

సమందహస్త్రత్యక్షణాం సశర్చాప పాశాంకుశాం||

అశేషజనమోహనీ మరుణ మాలే భూషామారాం|

జపాకుస్మ భాస్రాం జపవిధౌసమర్దమిాకామ్||

ఆ కవయుజ శుది పంచమి నాడు ఉపాంగ లలితా వ్రతం ఆచరిస్థీరు.(శర్ననవరాత్రులలో). ఈ పంచమిని


"లలితా పంచమి" అని అంటారు. 'ధర్మస్త్రంధు'లో నిర్దశించిన ప్రమాణం ప్రకార్ం ఈ పంచమి తిథి
అపరాహణకాలమమునకు వుండ్వలెను. (ఇది ఉపాంగ లలితా వ్రతం ఆచరించేవారికి వరిీస్ీంది.)

మహారాజి లలితా పర్మేశవరి చత్పరుభజ చెరుకు గడ్, విలుా, పాశము,


అంకుశం ధరించి ఉంటంది.

శోా||అరుణాం కరుణాతర్ంగితాక్షీం

ధృతపాశాంకుశ పుషుబాణచాపాం|

అణిమాదిభి రావృతాం మయూఖై

ర్హమిత్యే వ విభావహ మహ కమ్||

బ్రహామండ్ మహాపురాణంలో లలితోపాఖాేనంలో లలితాదేవి చరిత్ర


చెపుబడినది. భండాస్రుని సంహరించడానికి దేవి అవతరించినది. శ్రీ పుర్మును సూచించే శ్రీచక్రం
నిరామణం వరిణంచబడింది. శ్రీ లలితా సహస్రనామ స్ీత్రం తెలుపబడింది.

ఈమె సర్వజి, సర్వశకిీ, సరయవశవర్ేప్రదాయిని, సర్వజాినమయి, సర్వవాేధవినాశిని, సరావధ్యర్సవరూప,


సర్వపాపహరి, సరావనందమయి, సర్వర్క్ష్యకరి, సర్వపిసతప్రద.

శ్రీచక్రారాధనలోను, శ్రీవిదే ఉపాసనలోను లలితోపాసకులు లలితా సహస్రనామ పూజ, అర్ిన లేదా


పారాయణ (చేసే సందరాభనిన బటిీ) కొనిన విధవిధ్యనాలు పాటిసూీ చేస్థీరు.

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
16

శ్రీ లలితా దేవి చరిత్ర:

దాక్ష్యయణి పార్వతీదేవిగా అవతరించింది. శివుడు విరాగియై తపస్స చేస్కోస్థగాడు. తార్కాస్ర్


సంహార్ం కుమారుడు(కుమార్స్థవమి) జనిమసేీగాని జర్గదని దేవతలు ఎదురుచూసూీ ఉంటారు. వార్ందరూ
కలస్త్రవళిి మనమధుడిన వేడుకుంటారు. పార్వతీదేవి మీద అనుర్కిీ కలిగించడానికి మనమధుడు పర్మేశవరుని
మీద పుషుబాణాలను విడిచిపెటాీడు. రుద్రుడు కోపోద్రికుీడై తన మూడోకనున తెరుచుటతో మనమధుడు
దహంచుకుపోయాడు. ఇది చూస్త్రన దేవతలు చింతిసూీ భసమరాశిని అకకడేవదిలి వళిిపోయారు.

ఆ భసమరాశి ఉననటవంటి ప్రదేశానికి చిత్రకర్మ అని పిలువబడే గణపతి (కొనిన గణాలకు నాయకుడు)
వచాిడు. ఆయన ఆతెలాని భసమరాశిని చూస్త్ర ఒక బొమమను చేసేీ బాగుంటందని అనుకొని ఒక అందమైన
బొమమను తయారు చేస్థడు. ఆ బొమమకు ప్రాణప్రతిషీ జరిగింది. అందులోంచి ఒక వేకిీ లేచాడు. ఆ వేకిీని
చూచిన చత్పరుమఖ్ బ్రహమగారు నోరు త్యలేస్త్ర 'భండ్ భండ్' అనానరు. అపుటినుంచి ఆ వేకిీకి భండాస్రుడ్ని
పేరు స్త్రార్పడిపోయింది. ఆ వేకిీ మొదట శివుణిణ చూస్థడు. చిత్రకర్మ ఉపదేశంతో 'శతరుద్రీయం' పారాయణ
చేస్త్ర రుద్రుడిన మెపిుంచి "నాతో ఎవరు యుదిం చేస్త్రనా వాళిలోని సగం బలం నాకు రావాలి,శత్రువుల అస్థిలు
నిర్తవర్ేములై ననున బాధంచకూడ్దు" అని కోరాడు. శివుడు తథాస్ీ అనానడు. భండాస్రునుకి లభించిన
వర్ం వలా దేవతలు నిసేీజ్యలయాేరు. దానవుల బలం పెరిగింది. ఇంద్రుని బలం క్షీణించింది.

అప్పుడు ఇంద్రాదులు నార్దుని సలహామేర్కు శ్రీ మాతారాధన చేయడ్ం ప్రార్ంభించారు. తరువాత


పర్మేశవరుని మెపిుంచి పర్మేశవరుని సహకార్ంతో మహాయాగం చేయనార్ంభించారు. ఆఖ్రున ఆ
యాగంలో దేవతలంతా హోమగుండ్ంలోకి ప్రవేశిస్థీరు(దేవతలు తనను తాము హోమాగినకి
సమరిుంచుకుంటారు). అంతటితో యాగం ముగిస్త్రపోత్పంది. శ్రీ లలితా మాతను పైకి ర్మమని పర్మేశవరుడు
స్ీతించాడు. ఇక్షుధనస్స, పంచబాణాలు, పాశం, అంకుశం అనన నాలుగు ఆయుధ్యలను నాలుగు
చేత్పలలోను ధరించి ‘చత్పరాాహు సమనివత’, ‘చిదగినకుండ్సంభూత’, ‘చక్రరాజర్ధ్యరూఢ’, దేవకార్ే
సముదేతా - సర్వలోక ర్క్షణకోసం, భండాస్ర్ సంహార్ం కోసం మహారాజి శ్రీ లలితా పర్మేశవరి
ఆవిర్భవించి శ్రీచక్రం అధరోహంచింది.

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
17

ఆమె బహు స్ందరాకార్ంతో వుననది. శంకరుడు తపు మిగిలిన ఎవరునూ ఈమెకు వరుడు కానేర్రు అని
తలపింపజేస్ీననది. అప్పుడు శంకరుడు దివేశర్తర్ంతో, కోటి మనమధులను తలంపు జేయుచు, సమసీ
భూషణాలతో కిర్తటం ధరించి జగనోమహనరూపంతో అచిటకు వచాిడు. బ్రహమ అతనికి కామేశవరుడ్ని
నామధ్యయం చేసెను.

లలితా పర్మేశవరి తన చేతిలోని ఒక హారానిన పైకెతిీ ఆకాశం మధేకు విస్త్రరింది. ఆమె విసరిన హార్ం
ఆకాశంలో ప్రకాశిసూీ కామేశవరుని కంఠమున (మెడ్లో) పడింది. వంటనే పూల వర్ుం కురిస్త్రంది.
(సాలాభావంచే విపులంగా వ్రాయలేకపోత్పనానను). అనంతర్ం లలితాకామేశవరుల వివాహం జరిగింది.

ఆమె కార్ణజనుమరాలు. భండాస్రుడిన సంహరించడానికి బయలుదేరింది. శ్రీ లలితా పర్మేశవరి అంకుశం


నుంచి సంపతకర్తదేవి పాశం నుంచి అశావరూఢాదేవి ఉదభవించారు. సేనాని అయిన హఠా
హమాత(వారాహ), మంత్రిణి శాేమలాదేవి ఆమెకు ఇరుప్రకకల వునానరు. మహారాజి లలితా పర్మేశవరి ఈ
సమర్ంలో అడుగడుగునా ఎంతో మంది వీరులైన స్టిమూరుీలను ఉదభవింపజేస్త్రంది. తన కుమారీ బాలచే
భండాస్రుని ముపుది మంది పుత్రులను సంహరింపజేస్త్రంది. ఘోర్ంగా యుదిం చేస్త్ర భండాస్రుడిన
వధంచింది.

ఆమెను పూజంచిన నితేము శుభములు కలుగజేస్ీంది.

చకెకర్పంగలి నివేదించవలెను.

శ్రీరాజరాజేశవర్తదేవి (షషిి మరియు దశమి)

శోా|| చత్పరుభజే చంద్రకలావతంసే కుచోననత్య కుంకుమరాగ శోణే|

పుండ్రేక్షు పాశాంకుశ పుషుబాణ హసేీ నమసేీ జగదేక మాతుః||

రాజరాజేశవరిదేవియే లలితాదేవి (లలితా సహస్రనామాలలో 684 నామం). అనంత శకిీ సవరూపమైన


శ్రీచక్రానికి అధషాానదేవత. సకలదేవతలయందు శ్రేషిమైనది. సదాశివుని అరాింశముగా వలుగుచుననది.
ఈమెయే పరాశకిీ అనబడుచుననది. శకిీ లేనిచో శివుడు వేవహార్ ర్హత్పడ్గుచునానడు. ఈ అర్ామునే
ఆదిశంకరాచారుేల వారు 'సౌందర్ేలహరి'లో తెలియజేయుచునానరు. ఈ శకిీ యొకక కలయకలేనిదే

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
18

శివుడు కదులుటకైనా శకిీవంత్పడుకాడ్ని, అలాగే లోకమందలి ప్రతి వస్ీవు శకిీమిళితమైనది అగును.


త్రిగుణాతీతమగు శకిీచేతనే దుర్ా, లక్ష్మి, వాణి అనే దేవతలు ముగుారు ప్రభవింపజేయబడుచునానరు. అందుకనే
ఆంధ్ర మహాభాగతంలో పోతన "అమమలగననయమమ ముగుర్మమల మూలపుటమమ" అని అనానరు.

ఇటిీ పరాశకిీ, మాయామోహముచే ప్రభావితమైన మానవ మనస్సను చైతనేవంతంచేస్ీంది.

"ఇచావశకిీ జాినశకిీ క్రియాశకిీ సవరూపిణి". ఇచవ, జాినము, యతనము అనడి మూడు విధములగు గుణములు
తన సవరాపముగా కలది.

మంత్ర శాసింలో మికికలి శ్రేషిస్థానం పందినది శ్రీ విదే. శ్రీవిదే సర్వయంత్ర, సర్వతంత్ర సర్వమంత్ర
సవరూపము. ప్రతిఫలం ఆపేక్షించక చేయువారికి మోక్షం తపుక లభిస్ీంది. "చర్మే జనమనియదా
శ్రీవిదాేపోసకో భవేత్" అననటా ఎవరికైత్య ఇది కడ్పటి జనమయో, ఇక జనిమంచడో అటిీవానికి శ్రీవిదే
లభిస్ీంది. మరియు సకలసంపదలను జీవనుమకిీని ఇస్ీంది.

మంత్రములలో శ్రీవిదే ఎటా ముఖ్ేమో, పుర్ములలో శ్రీపుర్ం ఎటా ముఖ్ేమో, శ్రీ విదోేపాసకులలో
పర్మశివుడు ఎలాశ్రేషిడో అట్లా దేవీ సహస్రనామావళులలో శ్రీ లలితా సహస్రనామములు శ్రేషిములైనవి.

అపాులు నివేదించవలెను.

సర్సవతీ దేవి (సపీమి)

శోా|| యాకుందేందు త్పషార్హార్ ధవళా యాశుభ్రవస్థినివతా|

యావీణావర్దండ్ మండితకరా యాశేవతపదామసనా||

యాబ్రహామచుేతశంకర్ ప్రభృతిభిర్దవైససదాపూజతా|

స్థమాంపాత్ప సర్సవతీ భగవతీ నిశేశషజాఢాేపహా||

త్రిమూరుీలలో ఒకరన బ్రహమకు దేవేరి ఈ మాత. వాకుక , బుదిి, వివేకం, విదే, కళలు, విజాినం వీటనినంటికీ
అధదేవత సర్సవతీదేవి. జ్యేతి లక్షణం కాంతి. ప్రసర్ణ, కాంతి యెకక లక్షణం. అదే విధంగా చైతనే మయమైన
విదేవలానే పర్బ్రహమం గోచరించబడుత్పంది.

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
19

సర్సవతీదేవి సవరూప వర్ణన: సకలాభర్ణ భూషితయై నాలుగు చేత్పలతో కూడి, కుడిచేత్పలయందు వీణ,
అక్షమాల ఎడ్మచేతి యందు పుసీకం ఉంటంది. ఈమె హంసవాహని.

ఆమెకు తెలుపు అంటె ఇషీం.


తెలుపు చీర్ ధరించి ఉంటంది.
అందుకని ఆమెను తెలాటి
పూవులతో పూజస్థీరు.

మాఘశుది పంచమి ఆమె


జనమదినం. ఈ రోజ్యను
వసంతపంచమి లేక శ్రీ పంచమి
అంటారు. ఋగేవదం, దేవి
భాగవతం, బ్రహమవైవర్ీ పురాణం,
పదమపురాణాలోా ఈమె గుఱంచి
తెలియజేయబడింది. సకల సృషిీ
కర్ీ బ్రహమ సర్సవతిని కూడా
సృషిీంచాడ్ని, సృషిీ కార్ేక్రమంలో
తనకు తోడుగా ఉండ్టానికి తన
జహవపై ధరించాడ్ని ఒక గాథ.
శివమహాపురాణంలో ఉమా
సంహతలో సర్సవతీ ప్రాదురాభవం గుఱంచి చెబుతూ ఈసర్సవతి 'పార్వతీదేవి దేహమనే కోశమునుంచి
ఉదభవించుటచే కశిక అని పేరు వచిిందని శుంభనిశుంభులనే రాక్షస్లను వధంచిందని చెపుబడింది'.

ఈమెను సమసీ దేవతలు, బ్రహమవిషుణమహశవరులు సదా కొలుసూీవుంటారు. ఈమె దేవతలోా గొపుది అలాగే
నదులోానూ గొపుది. సర్సవతీనది ఒక మహానదిగా ప్రవహంచింది. ఇప్పుడు అంతరావహనిగా ప్రవహస్ీంది.

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
20

అమమని మహాకాళి మహాలక్ష్మి మహాసర్సవతి అంటారు. అందుకనే నవరాత్రులోా మూడు రూపాలోా ఒకే
అమమగా ఆరాధంపబడుతోంది.

సర్సవతీ దావదశ నామాలు:

1. భార్తి, 2. సర్సవతి, 3. శార్ద, 4. హంసవాహని, 5. జగతీఖాేత, 6. వాణీశవర్త, 7. కమారి. 8.


బ్రహమచారిణి, 9. బుదిదధ్యత్రి, 10. వర్దాయిని 11. క్షుద్రఘంట 12. భువనేశవరి.

గోధుమతో చేస్త్రన పిండివంట ప్రస్థదంగా నివేదించవలెను.

దురాాదేవి (అషీమి)

శోా|| ఓం విదుేదాదమ సమప్రభాం మృగపతిం, సకందస్త్రాతాం భీషణాం

కనాేభిుః కర్వాలఖేటవిలసదదస్థీభిరాసేవితామ్||

హసెయీశిక్రగదా శిఖేటవిశిఖా శాిపంగుణంతర్జనీమ్|

బిభ్రాణా మనలాతిమకాం శశిధరాం, దురాాంత్రినేత్ర్ంభజే||

ఈమె దుర్ాముడ్నే రాక్షస్ని వధంచుటచే "దుర్ా" అనే పేరు స్థర్ాకమైనది. ఈమె అఖ్ండ్ బ్రహామండ్ములకు
అధీశవరి, తతవమస్త్ర, వాకుకనకు మనస్సనకు దొర్కనిది, నితాే, నిరుాణి, నిర్హంకారి, నితాేనందమయి,
గొపుదయామయి.

దుర్ామాస్రిని వధ:

మహాబలశాలియైన దుర్ాముడ్నే రాక్షస్డు బ్రహమ ఇచిిన వర్ములచేత గొపు బలసంపనునడై వేదములను


తీస్కునిపోయెను. అతడు తన బలముతో భూలోకమున అలాకలోాలం సృషిీంచుటచే సవరాానవునన దేవతలు
భయభ్రాంత్పలైరి. వేదములు అదృశేమగుటచే వేదోకీ కర్మలు, తపస్స, యాగము కాని హోమం కాని
లేకుండెను. అందువలన భూలోకంలో అనావృషిీ ఏర్ుడెను. నదులు, సముద్రాలు, సర్స్సలు
ఎండిపోయాయి. అప్పుడు నేముతో వునన మానవుల దుుఃఖ్మును చూచి దేవత్పలు జగనామతను
వేడుకునానరు. "అమామ! కాపాడుము, మానవులంతా నీవార్, వారిమీద కోపమునన ఉపసహరించు.

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
21

దయామయీ, నీవు దీనులకు బంధురాలివి. ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచిినా నీవు కాపాడుచునానవు.
ప్రజలంతా చాలా దుుఃఖ్ంలో వునానరు. దయతో వారిని కాపాడు." అని వేడుకొనిరి. ఈ విధంగా వారి గోడు
వినన మాత అనేక ర్కాల శాకాలు, ఫలాలు పటీకుని (శాకాంబర్త మూరిీగా) నిలబడింది. దుుఃఖ్ంతోవునన
ప్రజలను దయగా చూచి తొమిమది రాత్రులు తొమిమది పగలు దుుఃఖించుటచే, ఆమె కళినుంచి కారిన కనీనటికి
నదులు, సర్స్సలు నిండిపోయినవి. భూములు ససేశాేమలమయెేను.

ఇది చూచి ఆనందించిన దేవతలు మాత


వదదకు వళిి దుర్ాముని వదదవునన వేదములు
తెచిిమమని వేడుకొనిరి. అప్పుడు
సవర్ాంలోను, భూమి మీద కోలాహలం
ఏర్ుడింది. వంటనే అమమ దుర్ాముడి
నగర్మును అనినవైపులనుంచి
ముటీడించెను. ఇది గమనించిన మాత
దేవతల ర్క్షణకై చుట్టీ చక్రమును
ఏరాుటచేస్త్ర, తాను సవయముగ బయటకు
వచెిను. అపుడు దేవి దుర్ామునితో
యుదిమునకు తలబడెను. ఈ యుదింలో
ఆమె శర్తర్ం నుండి కాళి, తార్, చిననమసీ,
శ్రీ విదే, భువనేశవరి, భైర్వి, బగళ, ధూమ్ర,
శ్రీ మతిిపుర్స్ందరి, మాతంగి అను
రూపములతో ఆయుధములు ధరించి
బయటకువచిి, యుదింలో తలపడెను.
దుర్ాముని వంద అక్షౌహణీల సైనేమును వారు హతమారిిరి. అనంతర్ం దేవి దుర్ామాస్రిని శూలాగ్రముతో
కొటిీ నరికెను. దుర్ాముని మర్ణాంతర్ం నాలుా వేదములు తీస్కుని వచిి దేవతలకు ఇచెిను.

దుర్ాముడ్నే రాక్షస్ని సంహరించుటచే దుర్ా, భగవతి, భద్ర అని మరియు ఈమె దేహంనుండి శాకములు
ఉదభవించుటచే శాకాంబరి అని పేరుా వచెిను.

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
22

నవ దుర్ాలు:

1. శైలపుత్రి, 2. బ్రహమచారిణి, 3. చంద్రఘంట, 4. కూషామండ్, 5. సకంధమాత 6. కాతాేయని, 7. కాళరాత్రి,


8. మహాగౌరి 9. స్త్రదిిధ్యత్రి.

గారలు నివేదించవలెను.

అషీమి తిథి నాడు దురాాదేవినే మహషాస్ర్ మర్దనిగా కొంతమంది పూజస్థీరు.

శోా|| మాత్పర్మమధుకైటభగిన

మహషప్రాణోపహారోదేమే|

హలానిరిమతధూమ్రలోచనవధ్య| హచండ్ముండారిదని||

నిశేశషీకృతర్కీబీజ దనుజే| నిశుంభాపహ|

శుంభధవంస్త్రని| సంహరాస్దుర్ా| నమసేీాంబికే||

జయ జయ హ మహషాస్ర్ మరిదని ర్మేకపరిదని శైలస్త్య.

ఈమె దేవతలందరియొకక త్యజస్సతో ఉదభవించింది కనుక సర్వదేవతా సవరూపిణి. సర్వదేవత


ఆయుధభూషిత, జయసవరూపిణి, మంగళసవరూపిణి.

మహషాస్ర్మరిదని దేవి గాథ:

ర్ంభుడ్నే రాక్షస్నికి మహషాస్రుడ్నే గొపు బలశాలియైన పుత్రుడుండెను. ఆరాక్షస్డు యుదింలో


దేవతలందరినీ ఓడించి మహంద్రుని స్త్రంహాసనంపై అధషిించెను. దేవతలు బ్రహమను శర్ణుజొచిిరి. బ్రహమ
వీరిని తోడ్కకని విషుణ మహశవరుల వదదకు వళ్ళిను. విషయం తెలుస్కునన శివనారాయణుల ముఖాలు
కోపంతో అరుణవర్ణం దాలాియి. వారి ముఖాలనుంచి ప్రకాశవంతమైన ఒక త్యజస్స బయటకు వచెిను.
దేవిని ధ్యేనించుచునన దేవతల దేహాలనుండి కూడ్ ఒక త్యజస్స బయటకు వచిి ఒకచోట ముదదగా చేరి ఒక స్టి
రూపం దాలెిను. ఈ రూపానేన "సర్వదేవతా రూపం" అంటారు. ఆ శకిీ సవరూపిణి పదమమునందు కూరొిని
ఉండెను. దేవతలందరూ తమతమ ఆయుధ్యలిన దేవికి ఇచాిరు. శివుడు తన త్రిశూలానిన, విషుణవు చక్రానిన,

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
23

ఇంద్రుడు వజ్రాయుధ్యనిన, హమవంత్పడు వాహనంగా స్త్రంహానిన, వరుణుడు శంఖ్ము పాశానిన, అగిన శకిీని,
వాయువు ధనస్స బాణాలను, యముడు మృత్పేదండ్మును, ప్రజాపతి అక్షమాలను, ఈ విధంగా దేవతలు
ఒకొకకకరు ఒకొకకక ఆయుధం ఇచాిరు.

అనంతర్ం శకిీసవరూపిణి యుదాినికి సననదిమై భయంకర్మైన శంఖ్నాదం చేసెను. ఆ శంఖానాదానికి


ములోాకాలు ప్రతిధవనించాయి. సముద్రాలు చెలాాచెదుర్యాేయి. దేవతలు ఆయుధ్యలు చేతపటీకుని
యుదిమునకు సంస్త్రదుిలైరి. మహషాస్రిని తర్ఫున అనేకమంది శూరులు దేవితో యుదిర్ంగంలో
పోరాడారు. అపుడు దేవి శత్రువులను గద, బాణములు, శూలం, గొడ్డలి మొదలైన వాటితో కొటిీంది.
మహషాస్రుడు తన డెకకలతో, కొముమలతో, తోకతో కొటిీ చీలుిచుండెను.

అనంతర్ం మహషుడు స్త్రంహరూపం దాలిి దేవితో యుదాినికి స్త్రదిపడాడడు. తరువాత మానవరూపంలో


ఖ్డ్ాం చేపటిీ యుదిం చేస్థడు. మతీగజంలా ఏనుగుగా మారి ముటీడించబోయాడు. తరువాత తన
సహజరూపంలో అమమమీద దండెతాీడు. అంత మహశవరి మేఘ గర్జనవలె ఘంకరించి వానిపైకి దూకి
రాక్షస్ని దేహం క్రిందకు పడ్వేచి వాని కంఠం పాదముతో తొకికపెటిీ శూలముతో పడిచెను. ఆ మహషం
తొకికపెటిీన పాదము నుండి బయటికి రాబోతూ సగము మాత్రమే రాగలిగాడు. అపుడామె పెదదకతిీతో వాని
తలను నరికి నేలపై పడ్వేసెను. ఇంద్రుడు మొదలైన దేవతలు దేవిని స్ీతించిరి.

గారలు నివేదన చేయుదురు.

లక్ష్మీదేవి (నవమి)

శోా|| శంఖ్చక్ర గదాశార్జఞ గృహాత పర్మాయుధ్య

ప్రస్టద వైషణవీరూపే, నారాయణీ నమోస్ీత్య||

స్మనస వందిత, స్ందరి, మాధవి చంద్రసహోదరి హమమయే

మునిగణ మండిత, మోక్ష ప్రదాయని మంజ్యల భాషిణి, వేదమత్య

పంకజవాస్త్రని, దేవస్పూజత సదుాణ వరిుణి, శాంతియుత్య,

జయ జయ, హమధుసూదన కామిని ఆదిలక్షీ జయపాలయమాం||

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
24

లక్ష్మీదేవి శ్రీ మనానరాయణుని దేవేరి. ఐశవర్ే ప్రదాత. లక్ష్మీదేవి సంపదలకు మాత్రమే కాక, అనుకూల
దృకుథానికి ఆమె సూక్ష్మ రూపమని ఉపనిషత్పీలు చెపుీనానయి. సక్రమ పంథాకు కూడ్ ఆమె ప్రతీక.

లక్షీనివాసం: స్లక్షణమైన గృహమందు, జయ ధవజమందు, ఆవులయందు, యజివాటికలయందు,


ఛత్రచామరాలయందు, తామర్పువువలయందు, దీపములోను, పంటభూములలోను, మంగళకర్మైన
వస్ీవులలోను లక్ష్మి నివాసముండును. త్పలస్త్ర చెటీ వునన ఇంట్లాను, గోవులునన ఇంట్లాను,
ధ్యనేపురాస్లోాను, కనేలయందు, నితేం ముగుాలు పెటిీన గృహాలలోను లక్ష్మి నివాసముంటంది.

లక్ష్మీదేవి సరావభర్ణ భూషితయై, ర్తనఖ్చిత కిర్తటం


ధరించి, చత్పరుభజాలతో, రండు హస్థీలయందు
రండు కమలాలతో, అభయ హసీంతో ధనరాస్ల
వదజలుాతూ, రండు గజాలు ఇరుపకకల నిలబడి
తొండ్ములతో నీరు అభిషేకిసూీ వుండ్గా, తామర్
పుషుం మీద ఆ కనురాలై చిరునవువతో
దర్శనమిస్ీంది.

అషీలక్షుమలు: 1.ఆదిలక్ష్మి, 2. ధ్యనేలక్ష్మి, 3. ధైర్ేలక్ష్మి,


4. గజలక్ష్మి, 5. సంతానలక్ష్మి, 6. విజయలక్ష్మి, 7.
విదాేలక్ష్మి, 8. ధనలక్ష్మి.

లక్ష్మీదేవి ప్రాదురాభవం: (సకంద మహాపురాణం నుంచి


గ్రహంచినది)

దేవదానవులు అమృతం కొర్కు మందర్పర్వతమును కవవముగాను, వాస్కి అను సర్ుంను తాడుగా చేస్త్ర
క్షీర్స్థగరానిన మథనం చేయస్థగారు. అటాచిలకగా చంద్రుడు, స్ర్భి(కామధ్యనువు), కలువృక్షం,
పారిజాతం, చూతవృక్షం(మామిడిచెటీ), సంతానక వృక్షం, కస్ీభం, చింతామణి, ఉఛైశ్రవము(అశవం),
ఐరావతం (గజం), నాలుగు తెలాటి మదపుట్లనుగులు ఇవనినయు చిలుకుచుననప్పుడు ఒకొకకకటిగ
జనిమంచినవి.

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
25

దేవతలంతా క్షీర్స్థగరానిన మర్ల మథించిరి. అపుడు భువనములకు మూలమైన దివేమైన లక్ష్మి


జనించినది. ఆమె జనిమంచిన వంటనే బ్రహమవేతీలు 'అనివక్షికీ' అని, ఇతరులు 'మూలవిదే' అని, కొందరు
ఆజియని, మరికొందరు ఆశ అని అనస్థగరి.

వార్ందరు నమమదిగా వస్ీనన మహాలక్ష్మిని చూచిరి. ఆమె విశాలమైన పదమం వంటి ముఖ్ం, ఎర్రటి వననగల
స్కుమార్మైన శర్తర్ం, చకకటి పలువర్స చిరునవువలు చిందిసూీ తలపైన ఛత్రము, వింజామర్లతో
విసర్బడుచుండ్గా తెలాటి ఏనుగును అధరోహంచి మహరుులచేత స్ీతింపబడుతూ వచెిను. దేవతలు
ఉత్పసకతతో చూచుచుండ్గా ఆమె వారిని చూచెను. అపుడు లక్ష్మీదేవి నీలమేఘచావయతో చకకని కపోలం
నాస్త్రక కలిగిన విషుణవును చూచెను. వంటనే ఆమె వనమాలతో సహా గజమునుండి క్రిందకి దిగి విషుణమూరిీ
మెడ్లో మాల వేసెను. అనంతర్ం శ్రీహరి ఎడ్మ వైపున చేరి కూరుిననది. ఇది చూచిన స్ర్లు, త్పేలు,
అపసర్సలు, కిననర్లు, చార్ణులు సంతోషించిరి. లక్ష్మీనారాయణ సమాగమం చేత లోకములనినంటికి
ఆనందం కలిగినది. బూరలు కాని బొబాటాగాని నివేదించవలెను.దశమినాడు మర్ల రాజరాజేశవరిని
పూజంచి ఉదావసన చెబుతారు.

--oOo--

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
26

మహాచత్పషుషిీకోటియోగినీ గణ సేవితా

......జయం వంకటాచలపతి –మదనపలిా

M 08571223554

యోగినీదేవతలెవరు? వీరు ఎకకడ్ ఉంటారు? వీరు ఎంతమంది? వీరికి సంబంధంచిన వివర్ములు ఎకకడ్
వుననవి? ఇతాేది విషయాలు పరి కలిస్థీము.

‘యోగిని’: ‘యోగయుకాీ నార్త’ అని నిర్వచనము. యోగయుకీ యైన స్టి అని అర్ాము. ‘యోగినీ
దేవత’ అనినచో యోగయుకీ యైన దేవతా స్టి అని అర్ాము. మార్కండేయ పురాణంలో “భగవతాేుః
సఖీరూపా ఆవర్ణ దేవతా. స్థ కోటివిధ్య. తాస్థం మధ్యే చత్పషుషిీ ప్రధ్యనాుః” (జగనామత కు సఖుల రూపంలో
ఉనన ఆవర్ణ దేవతలని, వారు కోటి సంఖాేకులని (అనేకులు), అందులో ప్రధ్యనము అరువది నలుగుర్ని
అర్ాము)

వేదవిషయములను కథాసంవిధ్యనములో సరువలకు అర్ామగునటా వాేసమహరిు 18


పురాణములను ర్చన చేస్త్రన విషయము సరువలకు విదితమేగాదా! ఈ పురాణములను బ్రహమ, విషుణ, శివ
పర్ముగా మూడువిభాగములుగా పేరొకంటారు. ఇందులో “సకంధమహాపురాణము” శివసంబంధ
విభాగములోనిది. 81,000 శోాకములతో విరాజలుాత్పనన ఈ మహాపురాణము – మహశవర్ ఖ్ండ్ము, విషుణ
ఖ్ండ్ము, బ్రహమ ఖ్ండ్ము, కా క ఖ్ండ్ము, ఆవంతే ఖ్ండ్ము, నాగర్ ఖ్ండ్ము, మఱయు ప్రభాస
ఖ్ండ్ము అని 7 భాగములతో 1730 అధ్యేయములతో ర్చించడ్ము జరిగింది. చరిత్రకారులు,
పరి కలకులు, పరిశోధకులు ఇందనేక ప్రక్షిపీములుననవని చెప్పుచునానరు. ఇది ప్రస్ీతము మనకు
చర్ినీయాంశముకాదు. ఈ మహాపురాణములో నాలావ ఖ్ండ్మైన “కా క ఖ్ండ్ము” 100
అధ్యేయములలో 13,000 పైగా శోాకములు గలిా పూరావర్ిఖ్ండ్ము (50 అధ్యేయములు), ఉతీరార్ిఖ్ండ్ము
(50 అధ్యేయములు) అని రండు భాగములుగా ప్రకటింపబడినది. పూరావర్ిఖ్ండ్మునందలి నలువదియైదవ
అధ్యేయము చత్పషుషిి యోగినీదేవతలు, వారిని సమరించునంతమాత్రమునగలుా శుభములు, సమరించు
విధ్యనము మొదలైన విశేషములు తెలుపుచుననది.

శోా. ........మునిుః ప్రపృచవషణుమఖ్ం , కానికానిచ నామాని తాస్థం తాని వదేశవర్

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
27

భజనాదోేగినీనాంచ కాశాేం కిం జాయత్య ఫలం కస్త్రమన్ పర్వణి తాుః పూజాేుః కథం పూజాేశి
తదవద.

అగసీామహరిు సకంధునితో ఈవిధంగా అడుగుచునానడు: ఆ యోగినులు కా కయందు ఏ యే నామాలతో


స్త్రార్పడాడరు? ఆయోగినీగణాలను కాశి యందు సేవించినచో ఏమి ఫలము దొరుకుత్పంది? ఏ యే
పర్వములయందు వారిని పూజంచాలి? అని ప్రశినంచిన అగస్ీానికి సకంధుడు ఇటాచెప్పుచునానడు.

శోా. నామధ్యయాని వక్ష్యేమి యోగినీనాం ఘట్లదభవ! ఆకర్ణా యాని పాపాని క్షయంతి భవినాం
క్షణాత్.

ఓ అగస్థీా! ఏ నామాలను వినడ్ము వలన స్థంస్థరికుల పాపాలు నశించి పోతాయో అటిీ యోగినీ
గణముయొకక నామాలను చెపెుదను స్థవధ్యనముగా వినుము:

శోా. గజాననీ స్త్రంహముఖీ గృదాిాస్థే కాకత్పండికా , ఉషరగ్రీవా హయగ్రీవా వారాహీ శర్భాననా

ఉలూకికా శివారావా మయూర్త వికటాననా , అషీవకాి కోటరాక్షీ కుబాజ వికటలోచనా

శుషోకదర్త లలజజహావ శవదంష్ట్రా వానరాననా , ఋక్ష్యక్షీ కేకరాక్షీ చ బృహత్పీండా స్రాప్రియా

కపాలహస్థీ ర్కాీక్షీ శుకీ శేేనీ కపోతికా , పాశహస్థీ దండ్హస్థీ ప్రచండా చండ్విక్రమా

శిశుఘన పాప హనీిచ కాళీ రుధర్పాయినీ , వస్థధయా గర్భ భక్ష్య శివ హస్థీంత్రమాలినీ

సూాలకే క బృహత్పకక్షిుః సరాుస్థే ప్రేతవాహనా , దందశూకకరా క్రంచీ మృగ కరాు వృషాననా

వాేతాీస్థే ధూమనిుః శావస్థ వ్యేమైక చర్ణోర్ిాదృక్, తాపనీశోషణీ దృషిీకోకటర్త సూాలనాస్త్రకా

విదుేతుాభా బలాకాస్థే మారాజర్త కటపూతనా, అటాీటహా


ీ స్థ కామాక్షీ మృగాక్షీ మృగలోచనా

అని 64 నామాలతో కా క యందు సంచరిస్ీనన వీరి నామాలను ప్రతిదినము మూడు పూటలు ఎవరు
జపిస్థీరో వారికి దుషీబాధలు నశిస్థీయి. డాకినీదేవతలుగానీ శాకినులుగానీ కూషామండ్
యక్షరాక్షస్లుగానీ ఈ నామాలను జపించెడివానిని పీడించవు. శిశువులకు శాంతిని గరాభనికి శాంతిని
యిస్థీయి. ర్ణమునకాని రాజకులమునకాని వివాదములయందుకాని జయానిన

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
28

కలుగచేస్థీయి.యోగినీపీఠానిన సేవించెడివాడు అభీషిస్త్రదిిని పందగలడు. ఆపీఠములయందు


మంత్ర్ంతర్ములను అనుషిించిననూ స్త్రదిిని పందగలడు. బలిపూజ్యపహార్ములు ధూప దీప
సమర్ుణములతో యోగినీదేవతలు క్షిప్రముగా ఫలానినస్థీరు.శర్తాకలమున విధవిధ్యనముగా
మహాపూజనాచరించి హవిస్సను హోమముచేస్త్రన మహాస్త్రదిిని పందగలడు. ఆశివయుజ శుకా
ప్రతిపదనార్ంభించి నవమి వర్కు పూజంచినచో చింతితార్ాస్త్రదిి కలుగగలదు. కృషణపక్ష పంచమినా
డుపవస్త్రంచి జాగర్ణానిన చేస్త్రన నరోతీముడు మహాస్త్రదిిని పందగలడు. ప్రణవాది చత్పర్ాాంతముతో
ఈనామములతో భకిీపూర్వకముగా నిశికాలమున ప్రత్యేకముగా 108 మారుా హవనముచేయాలి. నయిే
గుగిాలము మొదలైన ద్రవేములతో హోమముచేస్త్రన ఏయే స్త్రదిిని తాను కోరుకునానడో అది వానికి
లభిస్ీంది. చైత్రకృషణ ప్రతిపదనాడు ప్రయతనపూర్వకముగా క్షేత్రవిఘన ప్రశాంతికొర్కై యాత్రనుచేయాలి.
స్థంవతసరికీ యాత్రను ఎవడుచేయడో కా కలో నివస్త్రంచెడివానికి యోగినీగణాలు విఘానలను కలిగిస్థీయి.
యోగినీగణమంతా మణికరిణకకు ఎదురుగా వుననది. వారికి నమసకరించినంత మాత్ర్న విఘానలు
తొలగిపోతాయి.

మార్కండేయ మహాపురాణము, బృహననందికేశవర్ పురాణములలో కూడా ఈ చత్పషుషిీ యోగినీ


దేవతల ప్రస్థీవన, వారి నామములు కొంత బేధములతో వివరింప బడినవి.

బ్రహామండ్ పురాణములో గల స్ప్రస్త్రది ‘లలితా సహస్ర నామ’ స్ీత్రములో గల 237 వ నామము


“మహాచత్పషుషిీకోటియోగినీ గణ సేవితా” అని యోగినీ దేవతల ప్రస్థీవన గల స్త్రది నామము. ఇందు శ్రీ
లలితామాత అరువదినాలుగు కోటా యోగినీ గణములచే సేవి౦పబడుచుననదని చెపుబడినది. ప్రధ్యనముగా
అమమ శకుీలు ఎనిమిది. అందువలననే అషీ బాహువులుగల దుర్ాగా అమమను భావింత్పరు. ప్రకృతి స్థానములు
ఎనిమిది. ఈ ఎనిమిది యోగినీ శకుీలకు మర్ల ఎనిమిది ఉపశకుీలుననవి. అనగా ఇవి అరువదినాలుగు
అయినవి. ఎనిమిది ప్రకృతి స్థానములలో ఒకొకకక దానిలో మర్లా సూాల సూక్ష్మములుగ ఎనిమిది
తతీాములుండును. ఈ అరువది నాలుగు యోగినీ శకుీలకు కోటా సంఖ్ేల గుంపులు లేక సేనలు కలవు. ఈ
మొతీము ననినంటిని విశేషము చెప్పుటకు, చత్పషుషిీ అను పదమును మహా చత్పషుషిి అని తెలుపుట
జరిగినది. మహతవమనగా తొమిమదింతలని అర్ాము. మహాచత్పషుషిీ కోటి యోగినీ గణములు ఇచిట
గ్రహంచబడినది. అనగా ఎనిమిది ముఖ్ే శకుీలు, ఎనిమిది ప్రకృతి స్థానములలో అరువది నాలుగు కోటాగ

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
29

ఆవరించి యుండ్గ అటిీ మొతీము శకుీలు తొమిమదింతలై శ్రీ చక్రమందలి నవావర్ణముల యందు ఆవరించి
యునానర్ని భావము.

శ్రీ చక్రరాజమందలి తొమిమది ఆవర్ణములందు ప్రత్యేకముగ అరువదినాలుగుకోటా యోగినీ శకుీలు


కలవని తంత్రశాసిము తెలుపుచుననది.

యోగినీ దేవతలచే సేవిముబడుచునన ఆ లలితా పరాభటాీరిక ఈ జగత్పీనంతయు పరిపూర్ణ


దయాపూరిత కరుణాకటాక్షములతో ర్క్షించుగాక యని శర్ననవరాత్రి శుభాకాంక్షలతో,

ఓం తతసత్.

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018

You might also like