You are on page 1of 108

1

వీక్షణం
ప్రత్యేక సంచిక -2021

కూర్పు- డా|| కె.గీత

ై న్ - కాంతి పాతూరి
కవర్ డిజ

2
విషయ సూచిక
కవితలు
1. రేడియో -వజ్రాల రాజగోపాల్ ................................................ 4
2. కార్మికులారా వర్ధిల్లండి! - డా|| కె.గీత ........................................................ 7
3. బిచ్చగాడు - శ్రీధర్ బిల్లా ........................................................ 10
4. అవనీమాతకు అక్షరమాల - ముప్పలనేని ఉదయలక్ష్మి..................................... 12
5. తిరిగిరావా నేస్తం! - శారదా కాశీ వఝల.............................................. 13
6. వస్తే ఏంటి పొ తే ఏంటి - డా. తాటిపర్తి బాలకృష్ణా రెడ్డి .................................. 14

కథలు
7. కోరికలు -విద్యార్థి............................................................... 16
8. ఇవాక్యుయేషన్  - డా||కె.గీత........................................................ 30
9. ఆన్నీ - అనిల్ ఎస్. రాయల్............................................ 38
10. ప్రవాహం - హిమబిందు . ఎస్ ............................................. 44
11. మలుపు - కె. వరలక్ష్మి....................................................... 49
12. మా చిన్న చెల్లె లు -ఆరి సీతారామయ్య .............................................. 52
13. ఓ పాలబుగ్గ ల జీతగాడా - ఎన్నెల............................................................. 58
14. మనసొ క చోట మనుగడ మరొక చోట - వేదుల చిన్న వేంకట చయనులు .......................... 65
15. మజిలీ -డా.కె.మీరాబాయి (తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం)....... 70
16. ఒక తల్లి కోరిక - ఆకెళ్ల కృష్ణ కుమారి ............................................ 76

వ్యాసాలు
17. యండమూరి నవలలు - స్ఫూర్తి - మధు బాబు ప్రఖ్యా................................. 79
18. అమెరికా ఆంధ్రు లు
తెలుగు తల్లి కి చేసిన సేవ - వేమూరి వేంకటేశ్వరరావు & కలశపూడి శ్రీనివాసరావు........ 81
19. భాగవత- తరంగాలు - టి. పి. ఎన్. ఆచార్యులు........................................ 86
20. కృతి - భాషాకృతి -
భావనాకృతి - శ్రా వ్యాకృతి  - అపర్ణ మునుకుట్ల గునుపూడి .............................. 88
21. జాషువా సాహిత్యం -శ్రీధర్ బిల్లా .......................................................... 96
22. ఆలోచనాత్మక కథలల్లి న
గొప్పరచయిత కారా మాస్టారు - డా॥ కొండపల్లి నీహారిణి........................................ 98

3
కవితలు

గత పాతికేళ్ లు గాై హ దరాబాద్ అడ్వర్ టై జింగ్ రంగంలో క్రియేటివ్ై ర టర్ గా


పని చేస్తు న్న వజ్ రా ల రాజగోపాల్, కృష ్ణ జిల్లా లోని చనుబండ గ్రా మములో
పదో తరగతి వరకు చదివి, తదుపరి సత్ తు పల్
లి లో డిగ్రీ ,ై హ దరాబాద్ లో
కామర్స్, లా, మాస్ కమ్యూనికేషన్స్ లో మాస ్ట ర్స్ పూర్తి చేసారు. కవి,
రచయత వంటి పెద ్ద పెద ్ద పదాలకు తాను సరితూగనని చెప్పుకునే వజ్ రా ల
రాజగోపాల్, తనని తాను ‘రాతగాడు’గా చెప్పుకోడానికి ఇష ్ట పడతారు.
మనసు స్పందించినప్పుడు అడపాదడపా ‘రాతలు’ రాస్తుంటారు. వీరి
తల్
లి దండ్ రు లు శ్ రీ మతి స్వరాజ్యలక్ష్మి, శ్ రీ గురుబ ్ర హ్మ చారి. భార్య లక్ష్మి
మధురవాణి రియల్ ఎస్ టే ట్ రంగంలో కొనసాగుతుండగా, పుత్ రు డు రాజ
సహస ్ర వర ్ష , పుత్
రి క రాణి అమృతవర్షి ణి కళాశాల విద్య అభ్యసిస్ తు న్నారు.

1. రేడియో
-వజ్రాల రాజగోపాల్
డబ్బాలా పేద్ద రేడియో
అది నా చిన్ననాటి నేస్తం…

మా చిట్టి అమ్మమ్మ వాళ్ళింటికెళతే ్


పెద్ద పెటటె ల
్ ాంటి రేడియో
రాజసం వెలగబో సేది
అందనంత ఎత్తు లో ఉండేది
కుర్చీ ఎక్కి దాన్ని ట్యూన్ చేసినప్పుడు
ఎవరెస్టు ఎక్కినంత ఆనందం
అది మూడు బ్యాండ్ల రేడియో అంట.

రేడియోలకి పన్ను రాయితీ ప్రకటిస్తే


మా ఇంట్లోకి ప్రవేశించింది ఓ మాటల డబ్బా
అబ్బ ఎంత ఆనందం
ఎంత గర్వం ఎంత మురిపెం…
నాకున్న ఆసక్తి నాకున్న అభిమానం చూసి
నాన్న నన్ను రేడియో ఆపరేటర్ గా నియమించారు
వాయిస్ నోయిస్ కలిసి వినిపించే ప్రసారాలు
గుర్రుమనకుండా వినడానికి చేసిన ప్రయత్నాలు
అన్నీ విఫలయత్నాలుగానే మిగిలేవి
దూరపు స్టేషన్లు కోసం చేసే ప్రయత్నాలు

4
ఎప్పటికీ అలుపెరగేవి కావు…
షార్టు వేవులో రేడియో మాస్కో
సిలోన్ రేడియో తరంగాల కోసం
నేను పడ్డ తిప్పలు నాకు పెద్ద గొప్పలు …

అద్దంకి మన్నారు, ఏడిద గోపాలరావు


తిరుమలశెట్టి శ్రీరాములు వార్తా స్వరాలు
మనసు మీటే శారదా శ్రీనివాసన్ నవ్వు
ఆదివారం ఉషశ్రీ గంభీర వచనాలు
మీనాక్షి పుణ్ణు దొ ర�ై అక్కయ్య మాటలు
యువవాణి వనితావని
ఆదివారం మధ్యాహ్నం నాటకం
అప్పుడపుడు సంక్షిప్త శబ్ధ చిత్రాలు
అన్నీ అద్భుతాలే
ఆద్యంతం తియ్యని అనుభూతులే

ఉదయం మధ్యాహ్నం సాయంత్రం


మూడు ప్రసారాల మధ్య నిశ్శబ్దం
ఈ అంతరాయాలకు విసుగొచ్చేది
రోజంతా రేడియో ఉంటే ఎంత బాగుంటుంది
పొ ట్ట చేత పట్టు కుని పట్ట ణం వచ్చాక
ఆ కోరికా తీరింది, రోజంతా ప్రసారాలే
కానీ వినడానికే తీరిక లేకుండా పో యింది

మారుతున్న కాలంతో నా రేడియో


స�ైజు తగ్గి జేబుల్లో ఒదిగి పో యింది
సెల్లు ఫో ను రాకతో
అందులోను దూరింది
అప్పుడు మొదలయ్యింది
నా జీవితంలో మొబ�ైల్ వినోదం…
రెండు చక్రా ల బండ�ైనా,
నాలుగు చక్రా ల కార�ైనా
రేడియో నాతోనే పరుగులు తీసేది
ఆప�ై రేయింబవళ్ లు వినోదం పంచేది
ఆహా ఎంత సంతోషమో
ఏమి నా భాగ్యమో…

ఏమిటో మరి..
ఆ ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు
పరిణామంతో పాటు

5
ప్రమాణం కూడా తగ్గింది నా రేడియోకి
ప్రవ
ై ేట్ ఛానళ్లు పుట్టు కతో
పిచ్చి మాటలు వెర్రి కూతలు నేర్చింది
బహుభాషల పద ప్రయోగాలతో
బహు విధాలా భాషను బష ్ర ్టు పట్టించింది
పెద్దా చిన్నా తేడా లేకుండా
ఏకవచన ప్రయోగాలతో బరితెగించింది
తరాల అంతరాలు మరిచి
వ్యంగ వాక్బాణాలు విసురుతుంది
అసందర్భ వాక్యాలతో
అనాలోచిత వ్యాఖ్యానాలతో
మతి పో గొడుతుంది…
అయ్యో నా రేడియో…
ఎందుకిలా తయారయ్యిందో
ఎందుకలా దూరమయ్యిందో ….

మళ్ళీ ఇప్పుడనిపిస్తుంది
ఆరోజులు మళ్ళీ వస్తే బాగుండు
రోజుకు రెండు గంటలే ఉన్నా ఇబ్బంది లేదు
కర్ణ భేరిప�ై గంటారావం లేకుంటే చాలు
డబ్బాలో గులకరాళ్ళ మోతలా లేకుంటే చాలు
నా రేడియో డబ్బాలా ఉన్నా ఫర్వాలేదు
అప్పటిదే అసలుసిసలు నేస్తం
ఆ డబ్బా రేడియోనే నా చిన్ననాటి నేస్తం…

***

6
తూ.గో.జిల్లా జగ ్ గంపేటలో జన్మించిన డా|| కె.గీత కవయిత్ రి , గాయని,
భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్ జా ల వనితా మాస పత్
రి క వ్యవస్థా పక
సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. ప ్ర ముఖ కథా
రచయిత్ రి శ్రీ మతి  కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి .
ఆంధ ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీ షు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు
భాషా శాస్ త్ రంలో పిహెచ్.డి, అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో
ఎం.ఎస్ చేశారు.  పది సం. రాల పాటు మెదక్ జిల్ లా లో ప
్ర భుత్వ కళాశాల
అధ్యాపకురాలిగా పనిచేసారు.  2006లో అప్పటి ఉమ్మడి ఆంధ ్ర ప ్ర దేశ్

్ర భుత్వం నించి “ఉత ్త మ ఉపాధ్యాయ అవార్ డు ” పొందారు.  ప ్ర స్తు తం
అమెరికాలో సాఫ్ ట్ వేర్ ఫీల్
డు లో  “తెలుగు భాషా నిపుణురాలి”గా
పనిచేస్తు న్నారు.

్ర వ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ ది వెన్నెల (2013),
సెలయేటి దివిటీ (2017)  కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా
(2018) కథా సంపుటి ప ్ర చురింపబడ్డా యి.  ‘గీతా కాలం’, “అనగనగా
అమెరికా” కాలమ్స్,  “నా కళ ్ల తో అమెరికా”, “యాత్రా గీతం” ట్రా వెలాగ్స్,
“కంప్యూటర్ భాషగా తెలుగు” అనే భాషా పరిశోధనా వ్యాసాలు’ వీరి
ఇతర రచనలు. కవిత్వంలో అజంతా, దేవులపల్ లి , రంజనీ కుందుర్తి ,
సమతా రచయితల సంఘం అవార్ డు మొ.న పురస్కారాలు పొందారు.
అమెరికాలో “వీక్షణం” సాహితీ వేదిక, “తెలుగు రచయిత” వెబ ్సైటు
వ్యవస్
థా పక అధ్యక్షులు, నిర్వాహకులు. టోరీ తెలుగు రేడియోలో
“గీతామాధవీయం” పేరుతో సంగీత, సాహిత్య టాక్ షో ని నిర్వహిస్ తు న్నారు.
అమెరికాలోని “తానా” తెలుగు బడి “పాఠశాలకి కరికులం ై డ రక్ట ర్ గా
సేవలందిస్తు న్నారు.  

2. కార్మికులారా వర్ధిల్లండి!
-డా|| కె.గీత 
కార్మికులారా వర్ధిల్లండి!
ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల
కార్మికులారా వర్ధిల్లండి!
మీ మెదళ్ల పెట్టు బడి మీద
గజాలు దిగ్గజాలుగా రూపుదిద్దు కునే
కార్మికులారా!
చివరి బొ ట్టు వరకూ శ్రమించండి
పచ్చ నోట ో
పచ్చ కార్డో

7
జీవిత ధ్యేయమ�ైన చోట
మీ నరనరాల తాకట్టు మీద
అఖండ శక్తు లుగా ఎదిగే దిగ్గజాల్ని తీర్చి దిద్దడానికి
బిలియన్ల కు పడగలెత్తించి బ్రహ్మండాన్ని ఏలడానికి
శాయశక్తు లా పిప్పి కండి
కార్మికులారా వర్ధిల్లండి!
విస్త ట్లో పంచ భక్ష్య పరమాన్నాలున్నా
తినడానికి సమయం ఉండదు
అత్యుత్త మ జీతాలున్నా
ఒక్క పెన్నీ మిగలదు
సంపాదించే పతీ ్ర డాలరు వెనకా
తరుముకొచ్చే మూడొంతుల టాక్సు
నెల తిరిగే సరికి పెనుభూతంలా నిలుచున్న
నాలుగంకెల ఇంటద్దె
నిద్ద ట్లోనూ ఉలిక్కిపడేట్లు
ఎప్పుడూ తీరని
అయిదంకెల క్రెడిట్ కార్డు
దాటి
సరదాగా
సినిమాకి షికారుkainaa
నోచుకోని
ఘన కార్మికులారా వర్ధిల్లండి!
మీ మెదళ్ల మొదళ్ల
ఊటలతో సహా పీల్చివేసి
అందమ�ైన ఆశల్ని ఎర వేసి
ఎనిమిది గంటల కాంట్రాక్టు ఉద్యోగం మాటున
ఎనభ�ై గంటల పని చేయించే
సాఫ్ట్వేర్ దిగ్గజాలు
లాభాపూరిత ప్రేతాల�ై
జుర్రుకునే మొదటి నెత్తు టి boTlani ధారపో సే
ఉత్త మ కార్మికులారా వర్ధిల్లండి!
మీ రక్త పో టు నుంచి
మీ మధుమేహం నుంచి
మీ గుండెదడ నుంచి
పుట్టే
కంపెనీల పెనువేగపు వృద్ధి
జీవన ప్రమాణాల్ని పెంచుతోందో
జీవితాల్ని హరిస్తుందో
ఆలోచించే తీరికలేని
అత్యుత్త మ కార్మికులారా వర్ధిల్లండి!

8
పదవీ విరామ కాలాన
జీవితాన్ని తడుముకుంటే
పెన్షను ఎలాగూ ఉండదు
అయ్యో! కాసిన్ని బతికిన క్షణాల�ైనా ఉంటే బావుణ్ణు
పడీలేచీ పాకులాటలో
నెమలికన్ను వంటి ఒక్క జ్ఞాపకమ�ైనా మిగిల్తే బావుణ్ణు
లక్షలాది కార్మికుల
వెన్ను మీద
మొలిచే ఆకాశ హర్మ్యాలు
వెన్నుదన్ను కాలేని
మయ సభలు
చేతి వేళ్ల మీద
నిర్మితమయ్యే
అత్యుత్త మ పరికరాలు
కొన ఊపిరిని స�ైతం
హరించే
మాయాజాలాలు
ఫలితాల కొద్దీ సత్వరిత వృద్ధిని
పరుగుల కొద్దీ సాధించే
ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల
కార్మికులమని గొప్పగా పొ ంగిపో యే
బానిసలారా వర్ధిల్లండి!
పని రాక్షసులారా వర్ధిల్లండి!

***

9
నా పేరు శ్
రీ ధరరెడ్డి బిల్
లా . గత 10 సంవత్సరాలుగా క్యుపెర్టి నో,
క్యాలిఫోర్నియాలో నివసిస్ తు న్నాను. జన్మస
్థ లం మల
్ల క్కపల్
లి (గ్రా ),
ధర్మసాగరం(మం) వరంగల్ జిల్ లా .
విద్యాభ్యాసం అంతా గురుకులంలో జరగటం వల ్ల శ్లోకాలు, సాహిత్యం
అంటే మక్కువ ఏర్పడింది. వృత్తి రీత్యా సాఫ్
టు వేరు ఇంజినీరును. సంగీత,
సాహిత్య,హాస్య ప్
రి యుణ్ణి . 
పౌరాణిక చిత్రా లు, పద్య నాటకాలు చూడటం చాలా ఇష
్టం. 
చిన్న పద్యఖండాలు, వచన కవితలు రాస్తూ ఉంటాను. 

3. బిచ్చగాడు
-శ్రీధర్ బిల్లా
బిచ్చగాడొ కడు..
బొ చ్చె చేతబట్టి,
బూది నుదుటబెట్టి ,
భుజాన జోలె వేళాడేసి ,
కాలు నిలువక తిరుగుచున్నాడు
కన్నతల్లి లేని ఆ ‘అనాథ’ !

‘అమ్మయ�ైన చెట్టు కొమ్మ నుంచి


జారిపడ్డ పండొ కటి
అమ్మలేని ఆ అనాథకు
ఆకలి తీర్చింది !

దారిలోన ఓ నల్ల పిల్లి


దాని వెనుక దాని పిల్ల!
“తల్లి తనకెందుకు లేదో ?” యని
తల్ల డిల్లింది ఆ బిచ్చగాని మనసు!

మాతృ ప్రేమ నోచుకున్న


మంచి సూటు వేసుకున్న మనిషొ కడు,
ఇంకేదో ఇవ్వమంటూ,
ఏదో గుడి ముందు మోకరిల్లు తున్నాడు!

“అంతులేని వీని ఆశ అనంతం,


అంతుచిక్కని ఓ రహస్యం !
వీని ఆశ తీరిపో దు ,
నా ఆయుష్షు తరిగిపో దు!”

10
“ఆకలితీర్చిన పండు కోరలేదే కోరిక!
నిందలపాల�ైనా, నల్ల పిల్లి కోరలేదే కోరిక!
తల్లి ప్రేమ ఉండగా, ఇంకే కోరికలేదేమో!
తల్లి ప్రేమను పొ ంది యుండీ,
నరులకు ఇంకేమి కోరికలెందుకో?”
అనుకుంటూ నవ్వుతున్నాడా
ఆద్యంత రహిత ఆదిభిక్షువు!
అర్థనారీశ్వరుడు!

తల్లి అంటూ తనకు లేదు


తల్లి నిచ్చాడు సర్వజీవాలకు!

***

11
ముప్పలనేని ఉదయలక్ష్మి స్వస్థ లం బాపట ్ల . ప తు త నివాసం కాలిఫోర్నియా.
్ర స్
కళలు, సంగీతం పట ్ల అభిరుచి. ఉత ్త మ గ ్రంథాలు ఎన్నో చదవాలనే
అభిలాష. ఆంధ ్ర రాష్ట్ రాలలోని గ్రా మాలలో గ ్రంథాలయాల అభివృద్ ధి కి
తనవంతు కృషి చేయాలనే ఆకాంక్ష.

4. అవనీమాతకు అక్షరమాల
- ముప్పలనేని ఉదయలక్ష్మి
కనుచూపు అందినంతమేర పచ్చని ప�ైరునేల
ఎదురుగాఉన్న నా  మనసులో భావపరంపర
ఆనందించే అద్భుత ఆకాశంలా 
జీవితకాలం హత్తు కున్న నాన్నప్రేమలా 
ఆలంబన�ై నిలబెట్టిన వెన్నెముకలా 
అమ్మ మమకారానికి ప్రతిరూపం ఈభూమి !
 
కన్నపేగు దీవెనకు అస్థి త్వమయి 
ఆర్ధిక ఉన్నతికి సో పానమ�ై 
ఈశ్వరుని దయకు ఇచ్ఛాస్వరూపిణివ�ై 
ఊపిరికి ఎదురీదే ఏటికి తీరంచూపి 
ఓర్పు విలువకు ఉదాహరణను చేశావు  
ఓపలేని బరువును  మోస్ తూ గమ్యంకేసి నడిపావు 
చల్లని మనసుతో   చలివేంద్రమయ్యావు

తల్లి లా ఆదుకుంటూ నమ్మకమ�ై నిలబెటటా ్వు 


పంటఫలమ�ై భద్రతాకౌగిటలో  భరోసానిచ్చావు

మమతాయతివ�ై  సత్యశ్వాసల అంతః కరణమ�ైనావు 
హలంతో గాయపరుస్తు న్నా వరాలే కురిపించావు
ఇన్ని ఇచ్చి నన్ను నీవుగా మార్చిన నా అవనీ .....
పంచభూతాత్మకమ�ైన ఈ దేహం 
నీలో ఒక రేణువుగా మారిపో తేకూడా 
నీ ఋణం కొంత�ైనా తీరుతుందామ్మా  !!
***

12
నా పేరు శారద కాశీవఝల. కాలిఫోర్నియా వాస ్తవ్యురాలిని.
వృత్తికి సాఫ్ ట్వేర్ మేనేజర్ని. ప ్ర వృత్తికి తెలుగుభాషా అభిమానిని:)
ఓ పదేళ్ళు సిలికానాంధ ్ర లో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల
నిర్వాహణలో ై నికురాలిగా
భాషాస పనిచేశాను. అవధానాల్లో
పృచ్చకురాలిగా పాల్ గొ న్నాను. సన్మానపత్రా లు రాశాను. తెలుగు మీద
మక్కువతో, పిల ్ల ల మీద మమకారంతో మనబడి అధ్యాపకురాలిగా
ఆరేళ్ళు బాధ్యత హించాను.పత్ రి కాసంపాదకీయం చేశాను. కథ,
కవిత,గేయరచన,వ్యాసాల పోటీలలో పాల్ గొ నడం ప ్ర వృత్తి . బే ఏరియాలోని
సాహితీ గవాక్షమ ై న వీక్షణంలోనూ, వంగూరి వారి సాహిత్యవేదికల్లో నూ,
ఎన్నో సంస ్థ ల,కూటముల సాహితీ సదస్సుల్లో ్త గా, కార్యకర
వక ్త గా
పాలుపంచుకున్నాను. వ్యాఖ్యాతగానూ, విమర్శకురాలిగానూ రచనలు
చేశాను. రచించి, దర్శకత్వం వహించి పిల ్ల ల చేత, పెద ్ద ల చేత నాటకాలు
వేయించాను. రేడియోల్లో నూ,వేదికలప ై నా సభానిర్వాహకురాలిగానూ,

్ర కటనకర ్త గానూ పని చేశాను. సాంస్కృతిక, సాహిత్య,సంగీత
కార్యక్రమాలను ఏర్పాటు చెయ్యడం చాలా చాలా  సరదా!

5. తిరిగిరావా నేస్తం!
- శారదా కాశీ వఝల
(చిన్న జ్వరం అనుకుని ఆసుపత్రికి వెళితే, జ్వరం మీద సెల�ైన్ ఎక్కించి... సహ విద్యార్ధిని సునీతని
మాకు జీవితకాలపు జ్ఞాపకంగా మాత్రమే మిగిల్చిన షాక్ ఇరవ�ై ఏళ్ళు అయినా ఇంకా తీరట్లేదు )

చిరు సమస్య అనుకున్న చలిజ్వరం


చెలికి చావును తెస్తుందని తెలియని పసితనంలో -
కూతురి శవం ముందు ఒక తల్లి, గుండెలవిసేలా
స్నేహితుల రోదనలకి నాయకత్వం వహిస్తుంటే,
వెన్నులో వేయి విస్ఫో టాలూ, కళ్ళలో కోటి జలపాతాలూ ఉరికాయి…
మొదటిసారి చెడు, చేదు, అన్యాయం, నిర్ద య పదాలకు అర్ధం తెలిసింది -
ఇరవ�ై ఏళ్ళైనా మరపురాని ఆ జ్ఞాపకం
ప్రతిరాత్రీ కంటి మింటి నుంచి కన్నీటి తారగా రాలిపో తోంది..
నిద్రఒడిలో దిగులు గుండెని ఓదార్చుదామనుకుంటుంటుంటే
ప్రతినిత్యం ప్రియనేస్తం తలపులతో జాము వాలిపో తోంది!!

***

13
డా. తాటిపర్తి బాలకృష్ణా రెడ్డి వృత్తి పరంగా జీవరసాయన శాస్ త్ రంలో
డాక్ట రేట్ సంపాదించి ప తు తం బే ఏరియా లోని లారెన్స్ బర్కిలీ నేషనల్
్ర స్
లాబరేటరీలో ై మ క్రో బయోమ్ రంగంలో పరిశోధన చేస్ తు న్నారు. జీనోమ్స్
మరియు మెటాజీనోమ్స్ కి సంభందించిన మెటాడేటా డేటాబేస్ నిర్వహణ
తు న్నారు. ఆలోచన రేకెత్తించే, సృజనాత్మక కవితలను అందించడం
చేస్
్ర వృత్తి .

6. వస్తే ఏంటి పొతే ఏంటి


-డా. తాటిపర్తి బాలకృష్ణా రెడ్డి
మండే సూరీడు
కాలే కడుపు
రగిలే గుండె
కాలే కాష్టం
కారే కన్నీరు
అగ్ని దేవునికి ఆర్తి
చెమట సంద్రంలో కలిసే
ఉప్పునీటి కయ్యలా

కండరాల కంకరలో
నెత్తు రు సిమెంటు పో సి
ఎముకలు పిండిసేసి
కట్టిన కట్ట డాలు నీడలో
కలలు లేని
కలలు రాని
కనుల తో
కాలం కదలిక కోసం
కన్నులొట్ట వోయి
చూసే శ్రామికునికి
మే డే వస్తే ఏంటి
పొ తే ఏంటి

స�ైనికుల రక్ తంతో గీసిన


దేశ సరిహద్దు లు
చెరిగిపో తాయనే
భయం నాకు లేదు
ముళ్ళ కంపలు
దాటి ముందుకెళ్లలేను

14
ముద్ద కయినా
మందుకయినా
మహమ్మారి ఎక్కడో
జడలువిప్పి వూగుతుందంట
నా జటరాగ్ని
నిత్యం నాట్యం చేస్తుందిక్కడ

ఉన్నోడికిదో పండగ
పిల్లలు పాపలతో
ఇంట్లోనే పిక్నిక్లా
పని ఇంటి నుంచేనంటా
పని వాళ్ళతో పని లేదంట
పస్తు లుండటం అలవాటె
కానీ పస్తు లు పెట్టలేని
నాకు మే డే వస్తే ఏంటి
పొ తే ఏంటి

***

15
కథలు
విద్యార్థి కలంపేరు. వృత్తి గిట్టు బాటుకాని వ్యవసాయం. ప
్ర వృత్తి కంప్యూటర్
ఇంజినీర్.  మూఢ నమ్మకాలు, ్రీస్త విజయం, నిజ జీవిత పోరాటం సాగించే
నాయికానాయుకలు మొదల ై న  సమకాలీన సామాజిక అంశాల గురించి
అప్పుడప్పుడూ కథలు వ్రాస్తుంటాను.

7. కోరికలు
-విద్యార్థి
“గడప దాటి అడుగు ముందుకు పడదుగానీ, నాకలోకానికి ఎగబకుతానందట, నీబో టి ముసిల్దే .
యేడకొస్తా వేటి , ఇదో ఈ దిగువు అహో బిల సామి ఉన్నాడు, నీబో టి ముసిలాళ్ల కోసమే. ఈడ దండమెట్టు కుని,
ఈడనే కూసో , మేం ఎగువ అహో బిలానికి పో యొస్తాం”. గట్టిగానే హెచ్చరించిది ఒక పల్లె పడుచు ముసల్ల మ్మని.
“ఇదో బో టి, నాకోసం పెద్దన్న అటో కడితే, మీరందరు వెంటడొ చ్చారు. తొమ్మండుగురు ఆటోలో
ఇరుక్కుని రేతిరంతా ప్రయాణంలో నన్ను నలిపి, ఇప్పుడు ప�ైన సామిదగ్గ రకు నన్ను రావొద్దంటావా, ఎంత
ధ�ైర్యం నీకు, నా సంగతి తెలీదేటి నీకు? ఎవరనుకుంటున్నావేటి నన్ను? నేను చెంచు బిడ్డ ను” గట్టిగానే
బదులిచ్చింది ముసలమ్మ.
“నీ సంగతి తెలీకే, నిన్న గాక మొన్న జ�ైలు నుండి వచ్చావు. నీతో మాకెందుకులే. సరే సూస్తా ఏడ
దాకా ఎక్కుతావో. అయినా అంత ప�ైకెక్కి మొక్కుకోటానికి, నీబో టి ముసిలికి కోరికలేట ో” అన్నది ఒకతె.
“నాకు కోరికలేటే బో టి, నీకే మంచి మొగుడు రావాల, నీ కడుపు పండాల” అన్నది ముసలమ్మ.
సిగ్గు మొలకలతో కొంచెం తల తిప్పుకుంది ఆ పూబో టి.
“ఈ బో టి సో ద్యం ఎందుకు కానీ, పెద్దనా, నువ్వు గొయింద కొట్టు ” అని కేక వేసింది ముసలవ్వ .
“మూడు గీతలోడా గోయిందా గోయిందా” అన్నాడు పెద్దన్న
“గోయిందా, గోయిందా” అని వల్లించారు ఆ ఆడవారందరూ.
“నిలూ గీతలోడా గోయిందా గోయిందా”
“గోయిందా గోయిందా”
“ఓబులేశా గోయిందా గోయిందా”
“గోయిందా గోయిందా”
చెట్ల కొమ్మల మీది పక్షులు అహో బిలేశునికి మేల్కొలుపులు పాడుతున్నాయి. గరుడాద్రి ప్రక్కనుండి
సూర్యుడు హారతి వెలుగులతో ఆకాశానికి సింధూర తిలకం దిద్దు తున్నాడు. ఇటు వ�ైపున స్వాతి నక్షత్రం
వేదాద్రిప�ైన కొండెక్కుతున్నది. గరుడాద్రి వేదాద్రి పర్వత శ్ణ
రే ుల సంధిలో అహో బిల క్షేత్రం భక్తు ల గోవింద
నామావళితో మేల్కొంటున్నది.

16
ఎగువ అహో బిలానికి వెళలే ్ మెట్ల దగ్గ రగా ఎవరో గొప్పింటివారు, ఎగువ అహో బిలానికి వెళ్లే దారి
ఇదేనా అని అడుతున్నారు. ప�ైకి తలెత్తి చూసి, హమ్మో అనుకున్న వాళ్ లు ఒకరు. దారిలో తినటానికి
తాగటానికి ఏమీ తెచ్చుకోలేదు అనుకున్నవారు కొందరు. ఇప్పుడు ప�ైకెక్కితే ముఖ్యమ�ైన పనులకు తిరిగి
వెళ్లటానికి ఆలస్యమవుతుంది, ఇప్పుడు కాదులే అనుకున్నవారు ఇంకొందరు. ప�ైకి కారు వెళ్లే దారి ఎందుకు
వెయ్యలేదని ప్రశ్నించేవారు మరి కొందరు. అదే ఫారిన్ కంట్స్ రీ ‌లో అయితే ఈ పాటికి కేబుల్ కార్ వేసావాళ్
లు ,
ఛ, చా అంటు వాపోయినవారు ఒకరు. చివరికి ఆ గొప్పింటివారందరూ కోరికలన్నీ దిగువ అహో బిలంలోనే
చెప్పుకుని క్రిందే మొక్కుకుని వెళ్లదాము అని నిర్ణ యించుకున్నారు.
పెద్దన్న వెంటబడి ఆ తొమ్మండుగురు ఆడవారు మాత్రం గట్టి గట్టిగా మాట్లా డుకుంటూ, ఊసులాడుతూ,
ఒకరినొకరు పరిహాసాలాడుతూ సునాయాసంగా మెట్లు ఎక్కుతున్నారు. దట్ట మ�ైన నల్ల మల అడవి ప్రాంతం.
మెట్ల ప్రక్కనున్న చెట్ల మీద, కొండ ఎక్కేవారి దగ్గ ర ఉన్న తిను బండారాల కోసం కోతుల గుంపులు కాపు
కాసివున్నాయి. ఆ కోతులని చూపిసతూ ్ ఒక పడుచు, “ఇదిగో ముసిలవ్వా, ఈడ కోతులే కాదు, ముందుగాళ్ల
అడివిలో తోడేళుంటాయి” అని భయపెట్టబో యింది.
“ఓసో సి, నాకు సెపుతావంటే బో టి, నా పసిగాపునాడే నే ఒంటిగా కట్టె పుల్ల లేరుకోటానికి అడివికి
పో యెచ్చేదాన్ని. ఓ పరి మేకల మీదకి తోడేలొస్తే , నే గొడ్డలి తిప్పి తరిమి కొట్టినాను. ఆ తోడేళలే ్ అల్లూ
పో యాయి. ఏటనుకుంటున్నావో”, ఆ బో టితో మెట్లు పో టీగా ఎక్కుతూ చెప్పింది ముసలవ్వ.
ఆ వేగంతోనే నవ నరసింహ క్షేత్రాలలో మొదటిద�ైన భర్గో టి నరసింహాలయం చేరుకున్నారు. స్వామి
దర్శనం తరువాత అక్షయ తీర్థంలోనుంచి కొంచెం నీళ్ లు త్రాగుతుంటే, ఆ గుంపులో నుంచి ఇంకొకామె
“ముసిలవ్వా, ఈడదాకా ఎక్కావు కదా, సామి నీ కోరికలు తీరుస్తా డు. ఈడ మంచి నీళ్
లు కూడా ఉండాయి.
ఈడనే ఉండరాదు, మేం ప�ైదాకా పో యెస్తాం” అన్నది.
“ఒసే బక్కదానా, నాకు కోరికలేటే, సామి నాకిచ్చేటియ్యన్నీ ఎప్పుడో ఇచ్చేశాడు. నీకే, కడుపు
పండాల, పండంటి బిడ్డ పుట్టాల, ఓబులేశు అని పేరు పెటటా ్ల. నేను ఎగువ సామిని సూసేది సూసేదే,
పెద్దన్నా, ఈ బక్కదాని సో దెందుకుగానీ, గోయింద కొట్టు ”.
“బొ గ్గో టి నరసింహా గోయిందా గోయిందా”
“గోయిందా, గోయిందా”
ప�ైకి వందల మెటలో ్, వేల మెటలో ్ ఏటవాలుగా ఉన్నాయి. వడి వడిగా ఎక్కుతున్నారు పెద్దన్నతోబాటు
ఆ ఆడవాళ్ లందరూ. ఒక పక ్ర ్క కొండ చరియ, ఇంకొక పక
్ర ్క లోయలో ప్రవహిస్తు న్న భవనాశిని నది. మధ్య
నిట్ట నిలువుగా వున్న మెట్ల మీద ఈ శ్రామిక వర్గా నికి చెందినవారు సునాయాసంగా ప�ైకి ఎక్కుతున్నారు.
ఇంతలో కర్రలు గట్టిగా తాటిస్తు న్న చప్పుడుతో, తప్పుకోండి, తప్పుకోండి అంటూ కేకలు వినిపించాయి.
అందరూ ఒక ప్రక్కకు జరిగితే, ఒకప్పుడు సుఖపడి, ఇప్పుడు డో లీలో ప్రాయాసపడుతున్న మనిషి ఒకరిని
వేరే మనుషులు ఎగువ అహో బిలం గుడికి మోసుకు వెళలు ్తున్నారు.
“మనుషులు మోసుకు పో తే సామి కోరికలు తీరుస్తా డేటి? సొ ర్గా నికి కూడా డబ్బులు కట్టి,
కూలీలెట్టు కుని మోసుకు పో తారా?” అంటూ వెటకరించింది ఆ ఆడవాళ్ల గుంపులోనుంచి ఒకతె.
“ఆ అమ్మ ఏ కష్టంలో ఉన్నప్పుడు సామికి మొక్కుకుందో ? కష్టాలు తీరేటప్పటికి ఎక్కలేకపో తాంది. ఏ,
ఎలాగ�ైతేనేటి? సామిని సూడాలనుకుంది ఆ మనిషి, నీకేటి? మోసుకెళలే ్ మనుషులేవన్నా ఊరకే మోసుకు
పో తున్నారా? అసువంటి అమ్మలుంటేనే మోసుకెల్లే వాళ్ల కి కూలి గిడతది, ఆ పూటకు బువ్వస్తొ ది, కడుపు
నిండుతుది.” అన్నది ముసల్ల వ్వ.
“కూలేట?
ి సుఖపడేది ఆళ్
లు , కూలి సేసేది మనమా??

17
“కష్ట పడే మనుసులకు రాత్రి బాగా నిద్రడతది. అంతకంటే సుఖమేటి? ఉన్న సుఖాలు మర్సిపోయి
లేని సుఖాలకు అర్రులు చాచటమెందుకూ?” ప్రశ్నకు ప్రశ్నలతోనే జవాబిచ్చింది ముసలవ్వ.
“నీకూ డో లీ కట్టిస్తాంలే ముసలవ్వా. నీ కోరికలు కూడా ఎగువ సామి తీరుస్తా డులే” అంటూ వెటకారం
చెయ్యబో యింది ఇంకొకతె.
“ఇదో యెర్రదానా, ఏటనుకుంటావో, నాకు ఈడు రాక మునుపే, వేసంగిలో, ఊరి సెరువు ఎండిపో తే,
ఉరుకురుకున పోయి కొండకావల కోనేటిలో నుండి నీటి బిందె మీద నీటిబిందెలెట్టు కుని తెస్తిని. నాకివ్వాల్సిన
సత్తు వ సామి ఎప్పుడో ఇచ్చేసాడు. ఇంక నాకు కోరికలేట?
ి నీ బిడ్డ కే మనువు కుదరాలా, నీ నెత్తి నే బో లెడు
సారెత్తు కుపో వాలా, సాయానికి నన్ను రమ్మనాల”.అన్నది ముసలవ్వ.
కొండ ప�ైకి మెట్లు అలా సాగుతూనే ఉన్నాయి. కొండ దారిలో ఒక కానుగ చెట్టు క్రింద చల్లని నీడలో
చిన్న మందిరం కనబడింది. లోపల స్వామికి దణ్ణం పెట్టు కుని బయటకు వచ్చారందరు.
గుడి ప్రక్కగా ఉన్న రాళ్ల గుట్ట ల మీద పడిన కానుగ కాయలు ఏరటం మొదలుపెట్టింది ముసలవ్వ.
“ఓయ్, ముసలవ్వ, ఏడ పడితే ఆడ ఎక్కుతుండావ్, ఆ రాళ్ల కింద పురుగూ పుట్రా కుడితే ఏటి
సేస్తా వ్, నీకు మందూ మాకెయ్యటానికి ఈడ ఏదీలేదు” అరిచింది ఒకతె.
“ఇదో సో గుదాన, నాకేటీ మందక్కర్లా , కానుగ గింజల అరగదీసీ రాస్తే తేలు కుట్టినా నొప్పి పో తది,
కానుక్కాయలు కనబడితే ఏరతన్నా. నా సిన్నతనాన అడివిలో సింతాకు కొయ్యటానికి పో నప్పుడు తేలు
కుడితే, ప్రక్కనే పడున్న కానుగ గింజల అరగదీసి రాసుకున్నా, అదే మందు” అన్నది ముసలవ్వ.
“ఏది సెప్పినా అన్నీ తెలిసినట్టు సెపుతావే”?
“ఇదో సో గుదాన, నేను చెంచును, ఈ అడివిలో పుట్టినాను, పెరిగినాను. అడివంతా తెలుసు. సామి
మాకు అడివిలో అన్నీ ఇచ్చినాడు. తిండికిచ్చినాడు, మందుకీ ఇచ్చినాడు. కానుగ సెట్టు ఆకులతో దురద
రోగం తగ్గు ద్ది, కాయలతో పుండు తగ్గు ద్ది, తేలు కుడితే విషం తగ్గు ద్ది. కానుగు సెట్టుంటే రోగాలకి మందుంటాది,
సామి ఉంటే మనసుకు మందుంటాది. తెల్సుకో. పెద్దన్నా, ఈ సో గుదానితో వాదెందుక్కానీ, గోయింద కొట్టు ”
అన్నది ముసలవ్వ.
“కానుగ సెట్టు నరసింహా, గోయిందా గోయింద”
“గోయిందా గోయింద”
మళ్లీ మెట్ల మార్గం చేరి ప�ైకి ఎక్కటం మొదలు పెటటా ్రు అందరూ. తెల్లని పంచె కట్టు , ఆ ప�ైన
కుంభాకారపు ఉదర భారం, ఆ ప�ైన తిరునామంతో ఒక అయ్యవారు “మహో గ్ర భీకరాకారం ..” అంటూ
నరసింహ స్తో త్రం చెయ్యబో తూ, అయాసం ఎక్కువయ్యి, ఎగశ్వాసతో ఇబ్బంది పడుతూ నెమ్మదిగా
ఎక్కుతున్నారు. వారి వెనుక, వారి ఆండాళ్ లు పూజా సామాగ్రి సంచులు మోసుకుంటూ ఇంకా భారీగా
ప్రాయాసపడుతూ ఎక్కుతున్నారు. వడివడిగా ఎక్కుతున్న ఈ శ్రామిక స్త్ ల రీ ు వారిని దాటుకుని ప�ైకి
ఎక్కబో తుండంగా, ముసలవ్వ ఆ ఆండాళ్ లు తో, “మాయమ్మ, అంతేటి సంచులు సేతులతో మోస్ తూ అంతేటి
కాకు పడుతుండవ్, నే నెత్తి నెట్టు కొచ్చి ప�ైన సామి దేవళం దగ్గ ర ఇస్తా , ఇటియమ్మా అన్నది”. ఆ ఆండాళ్ లు
సంచులందించబో యి అయ్యవారి వంక సందేహంగా చూసింది. అయ్యవారు చిరునవ్వుతో, “మహాలక్ష్మినే
చెంచులక్ష్మి అయ్యి, నరసింహ స్వామిని చేరుకుంది. ఫర్వాలేదు, ఈ చెంచు స్త్ ల రీ ు పూజ సామాగ్రి పట్టు కుంటే
ఆచారానికి దో షమేమీ ఉండదు” అన్నారు. ఆ ఆడవాళ్ లు ఆ సంచులు మోస్ తూ ప�ైకి ఎక్కుతుంటే ఆండాళ్ లు
కొంత తేలికపడింది.
“అయ్యోరు, సామి కథ సెపుతూ ఎక్కరాదే” అన్నది ముసలవ్వ. ఆ ఆండాళ్
లు అయాసపడుతూ

18
ఎక్కుతున్న అయ్యవారిని కొంటెగా చూస్ తూ , “కూర్చుని రాత్రు ళ్ లంతా పురాణం చెప్పటం కాదు, కొండ
ఎక్కుతూ ఇప్పుడు పురాణం చెప్పండి, చూద్దాం” అన్నది. అయ్యవారు ఎగశ్వాసతోనే, గట్టిగా నవ్వి పాడడం
మొదలు పెటటా ్రు.
“వినరయ్య నరసింహ విజయం జనులాల
అనిశము సంపదలు నాయువు నొసగును
.....”
అలా పాడుతూ ఎక్కుతున్నారు. ఇంతలో, రెండు పెద్ద, పెద్ద పర్వత శ్ణ
రే ుల మధ్య నున్న జలపాతం
కనబడింది. అయ్యవారు “అదిగో భవనాశి నది” అంటూ, పెరిగిన ఉత్సాహంతో, హెచ్చిన ఎగశ్వాసతో ఎక్కటం
మొదలుపెటటా ్రు.
“అయ్యోరూ, ఈ ఏటికి పేరు సెప్పారే, అర్థం సెప్పరూ”, అడిగింది ముసలవ్వ.
“భవము అంటే పుట్టు క, ఈ పుట్ట కలోని పాపాలను నశింప చేసి, స్వామి సాన్నిధ్యమునకు తీసుకు
వెళ్లే ది ఈ భవనాశినీ నది. నరసింహ స్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత, ఉగ్రనరసింహుడిని
శాంతింప చేయటానికి ఆకాశ గంగయే జలపాతముగా దిగి వచ్చింది. అదిగో అటు గరుడాద్రి, ఇటు వేదాద్రి
పర్వత శ్ణ రే ుల సంధిలోనుండి పడుతున్నది. అదిగో ఆ ప�ైన అహో బిలం ఉగ్ర నరసింహ స్వామి ఆలయం!”,
అన్నారు అయ్యవారు.
“అయ్యోరు, అసలు ఈ సంధి ఏటో, అసలు ఓబులేశు సామి కథేటి? అర్థ మేటి?” అడిగింది ముసలవ్వ.
“భవనాశినిలో స్నానం చేసి కథ చెప్పుకుందాము” అన్నారు అయ్యవారు. ఆ ఆడవాళ్ల గుంపు
పెద్దన్నతో కలసి హాయిగా ఆ జలపాతంలో నిలబడి స్నానం చేసారు. ప�ైకి వస్తు న్న కొందరు భక్తు లు “అమ్మో!,
నీళ్
లు ఇంత చల్ల గా ఉన్నాయేమిటి?” అనుకుంటూ, అరచేతితో తీర్థం పట్టినట్టు , పట్టి, మూడు సార్లు తలప�ై
పో సుకుని ముందుకు సాగారు. అయ్యవారూ, ఆండాళ్ లు చలి వణుకులతోనే మంత్రో చ్చారణ చేసుకుంటూ
స్నానం చేశారు. ఈ శ్రామిక వర్గా నికి మాత్రం చలి తెలవలేదు. తలలు భవనాశిని జలపాతం క్రింద పెట్టి
తన్మయత్వంతో తడిచారు. ఆడవాళ్ లు చీరలు అడ్డంగా పట్టు కుని తడి బట్ట లు తీసి పో డి బట్ట లు మార్చుకుని
మెట్లమీద కూర్చుంటే, అయ్యవారు ప�ై మెట్టు మీద కూర్చుని పురాణం మొదలుపెటటా ్రు.
“ఒకసారి విష్ణు వు లక్ష్మీ దేవితో ఏకాంతములో ఉండగా, సనక సనందులు అనే మహర్షులు స్వామిని
చూడడానికి వచ్చారు. వారిని జయ విజయులు అనే ద్వారపాలకులు అడ్డ గించారు. ఆ మహర్షులకి కోపం
వచ్చి జయ విజయులని రాక్షసులుగా పుట్ట మని శపించారు ....”
“సామి అమ్మోరుతో ఉంటే, కాపలా కాసేట ోళ్ లు ఆళ్ల పని ఆళ్
లు సేసారు, తప్పేటి? ఎవుడడితే ఆడు నేను
సన్నాసిని, నాకు అన్నీ తెలుసంటూ ఇంటోకి తోసుకుపో తుంటే కాపలా కాసేట ోళ్ లు అడ్డు పడొ ద్దా ? మనం
కాపలా పనికి కుదిరితే యెళ్లనిస్తా మా?” అన్నది ఒకతె.
“పెద్దపెద్దోళ్ల దగ్గ ర కొలువు సేసేటప్పుడు భద్రముండాల, మెలుకువుండాల. వచ్చినోళలూ ్ సదూకున్న
సాములే గందా, ఆళ్ల తో సరీగా మాటాడి కూకోపెటటా ్లి, అంతేగానీ తరుముతారా?” అన్నది ఇంకొకతె.
వాదులాట పెరగబో యింది. “ఊకే గోల సేస్తరు, అయ్యోరు కథ సెప్తుంటే, యినుకోరాదే?” అంటూ
ఖస్సు మన్నాడు పెద్దన్న.
“అయ్యోరూ, కాపలా కాసేట ోళ్
లు సేసిన పని వోపో కాదో అగుపడటలే, సరిగా సెప్పు” అన్నది ముసలవ్వ.
“సర�ైన పశ
్ర ్న. జీవితములో ఏది ఒప్పో , ఏది తప్పో తెలియని సంధి కాలములో, పగలనక రేయనక,
లోపల పరిష్కరించాలా బయట పరిష్కరించాలా అంటూ తాత్సారం చేయక, సందేహించక, అవసరమ�ైతే

19
మనిషే మృగమ�ై సన్మార్గా నికి దారి చూపించే కథే నరసింహ స్వామి కథ. హిరణ్యము అంటే బంగారం, కశిపు
అంటే వస్త్రం. మిల మిలలాడే బంగారపు వస్త్రాము వంటి అహాన్ని తొడుగుకున్నప్పుడు, కోరరాని కోర్కెలతో
అహాన్ని పెంచుకుంటున్నప్పుడు, సర్వాంతర్యామి ఆ అహాన్ని సంహరించటమే నరసింహవతార కథ. ఈ
అహం మనందరిలోనూ ఉంటుంది, బ్రహ్మమూ మనందరిలోనూ ఉంటుంది. మనలోని బ్రహ్మము అహాన్ని
సంహరించటమే నరసింహో పాసన” అంటూ ఇంకా ఏదో చెప్పబో యారు అయ్యవారు.
“ఇసుమంత అగుపడ్డ ది, అసలు కథ సెప్పరాదే అయ్యోరు?” అన్నది మరొకతె.
అయ్యవారు, గట్టిగా ఉపిరి పీల్చుకుని, “అదిగో, ఆ కనబడుతున్నదే, నిట్ట నిలువుగా కొండ,
అదే ఉగ్ర స్ తంభం, ఆ ప�ైన ఉక్కు స్ తంభం ఉన్నది. విష్ణు వు సర్వాంతర్యామి అని ప్రహ్లదుడి అన్నప్పుడు,
హిరణ్యకశిపుడు ఆ ఉగ్ర స్ తంభం ప�ైన ఉన్న ఉక్కు స్ తంభాన్ని చూపించి, “స్థంభే న దృశ్యతి” అంటే, ఎక్కడ
ఆ విష్ణు వు స్ తంభంలో కనబడటం లేదు అంటాడు. అప్పుడు ప్రహ్లా దుడు “స్ తంభేన దృశ్యతి” అంటే నాకు
స్ తంభంలోనే కనపడుతున్నాడు అని అంటాడు. అప్పుడు ఉగ్ర నరసింహస్వామి, ఆ ఉక్కు స్ తంభంలోనుంచి
వచ్చి హిరణ్యకశిపుడుని, అదిగో, ఆ ప�ైన ఉన్న బిలం, అంటే గుహ. ఆ బిలానికి లోపలా బయటా కాని గడప
మీద కూర్చుని హిరణ్యకశిపుడుని సంహరించాడు. అప్పుడు, దేవతలు అశ్చర్యంతో “అహో బలం”, అనగా,
ఆశ్చర్యంతో అహో , స్వామికి ఎంత బలం అన్నారు. అందుకనే ఈ క్షేత్రం పేరు “అహో బలం” అయ్యింది.
ఉగ్రనరసింహస్వామి ఆ బిలంలో ఉన్నాడు కావున, అహో బిలం అని అయ్యింది”.
“సామి వచ్చిన ఆ ఉక్కు కంభానికి దండమెట్టు కుని వత్తా ” అంటూ లేచింది ముసలవ్వ.
అయ్యవారు ఆశ్చర్యంగా ఆ కొండ వంకా, ముసలవ్వ వంకా చూసి, “ఉగ్ర స్ తంబం ప�ైన ఉన్న ఉక్కు
స్ తంభానికి నమస్కరించితే, కోరికలన్నీ తీరుతాయి అని అంటారు. కానీ, స్వామిని కోరేవాళ్ల కి మాత్రమే ప�ై
దాకా వెళ్లే శక్తి ఉంటుందేమో!”
“అయ్యోరూ, నాకు ఈడు రాక మునుపే కొండల ప�ైకి మేకల్ని తోల్కపో యేదాన్ని. కొండలకావల నా
నల్ల మేక జంటిగా ఈనితే, రెండు మేక పిల్లలని మెడ మీదేస్కుని కొండలు దాటి వచ్చా. నాకు కోరికలేటి,
సామి నాకిచ్చేటి బలం ఎప్పుడో ఇచ్చేసాడు. అయ్యోరూ, నువ్వే సల్ల గుండాల, అమ్మోరు సల్ల గుండలా. మీ
పిల్లగాండ్లు సల్ల గుండి, ఈలానే అందరికీ సామి కథ సెప్పాల”. అంటూ ఉగ్ర స్ తంభం ఎక్కటానికి వెళలే ్ దారికి
అడ్డంగా ఉన్న ఒక బండరాయి ప�ైకి ఎక్కటం మొదలుపెట్టింది.
“జ�ైలునుండీ ఇప్పుడే వచ్చినావు కూసో మంటే కూసో లా. సామిని సూడాలని గోలెట్టింది. ఈడదాకా
వస్తే , ఇప్పుడు ఉగ్గ కంభం మీదకి యెగబాకుతానంటాది. ఆగు మేమూ వస్తాం” అంటూ బయలదేరారందరూ.
జ�ైలు మాట వినపడగానే ఆండాళ్ లు జంకింది. అయినా, ఆ ప�ైన ఉక్కు స్ తంభం మీద పూజ చెయ్యటానికి ఒక
చిన్న కుంకుమ పొ ట్ లం, కొన్ని పూలు, గబ గబా సంచిలోనుంచి తీసి ఆ ముసలవ్వకి అందించింది ఆండాళ్ లు .
ముసలవ్వ ప�ైకెక్కుతూనే, “అయ్యోరూ, గోయింద కొట్ట రాదే” అంటూ కేక వెసింది.
“గరుడాద్రి వాసా, గోవిందా గోవిందా”
“గోయిందా గోయిందా”
“ప్రహ్లా ద వరదా, గోవిందా గోవిందా”
“గోయిందా గోయిందా”
“లక్ష్మీనృసింహా, గోవిందా గోవిందా”
“గోయిందా గోయిందా”
ఉగ్ర స్ తంభం ప�ైకి వెళలే ్ దారి. దారంటే దారి కాదు. ఏటవాలుగా ఉంది. ఒక దరి లోయ, మరొక దరి

20
నిటారు కొండ చరియ. వాడిగా, పదునుగా కోసుకుపో యే రాళ్ల దారికి, అడ్డంగా నిలువెత్తు బండ రాళ్ లు . ఊతం
పట్టు కుని ఎక్కబో తే, కదిలి ఊడివచ్చే రాయ ఒకటి, కాలు కింద జారుడు రాయలు కొన్ని, కొండ చరియ
నుండి పొ డుచుకు వస్తు న్న ములుకు రాళ్ లు మరికొన్ని. కొన్ని చోట్ల అడుగు పడితే జారిపో యే సూది మొన
కల్లు రాళ్ల గుట్ట లు. అయినా వాదులాటలు మానకుండా, గోల గోలగా, హుషారుగా పెద్దన్న నాయకత్వంలో
ఎక్కుతున్నారు అందరూ.
ఎదురుగా ఒక పట్నం కుర్రా ళ్ల గుంపు జాగ్రత్తగా ప�ైకి ఎక్కుతున్నారు. కుర్రా ళ్
లు బండ రాళ్ల మీద
ఫో జులు పెడుతూ, సెల్ఫీలు కొట్టు కుంటూ ఎక్కుతున్నారు. వాళ్ల ని దాటుకుంటూ ఎక్కబో యింది ఈ ఆడవాళ్ల
గుంపు. ఉన్నట్టుండి ముసలవ్వ గట్టిగా గావు కేక పెట్టి ఒక కుర్రవాడిని చెట్టు ప్రక్కకి గట్టిగా తోసి, తను
కూడా ఒక బండ రాయి క్రింద నక్కి కూర్చుంది. కొండ చరియ ప�ైనుండి రెండు బండ రాళ్ లు ఒక క్షణం క్రితం
వీళ్ళు నుంచున్న బండ రాయి మీద పడి ముక్కల�,ై క్రింద లోయలోకి డొ ల్లు కుంటూ పో యాయి.
ఆ కుర్రవాడు తేరుకోలేదు. క్రింద బండరాయి మీద పడ్డ నొప్పితో మెలికలు తిరుగుతున్నాడు. “కుర్రా డికి
పిర్రలు పగిలిపొ యాయి” అంటూ నవ్వింది ఒకతె. ద్రౌపది నవ్వితే సుయోధనుడికి వచ్చినంత కోపం వచ్చిందా
కుర్రా డికి. అవమానానికి గట్టిగా ఘీంకరించి, తిట్లు తో కూడిన నాలుగు డ�ైలాగులు చెప్పబో యి, క్రింద పడిన
నొప్పితో నాలుగు కాళ్ల మీద లేసతూ ్ సన్నగా మ్యావ్ అంటూ మూల్గా డు.
“బిడ్డ కి దెబ్బ తగిలితే, ఆసికాలా” అంటూ ఖసురుకుంది ముసలవ్వ. నెమ్మదిగా ఆ కుర్రా డిని లేప
బో యింది. ఇంతలో మిగతా కుర్రవాళ్ లు అక్కడికి వచ్చి, “దెబ్బ తగిలితే తగిలింది, నువ్వు వాడిని ప్రక్కకి
తొయ్యకపో తే తల పగిలి, బతికేవాడు కాదు” అంటూ ముసలవ్వ చేతులు పట్టు కున్నారు. ఇంతలో ఒకడు,
“మేము ట్క రె ్కింగ్ అని ప్లా న్ చేసుకుని, మంచి బూట్లు కొనుక్కుని, ఎక్కటానికి సరంజామాతో వచ్చాం.
మీరేమో చెప్పులు కూడా లేకుండా చీరలు ఎగగట్టు కుని ఎక్కుతున్నారు!” అంటూ ఆశ్చర్యపో యాడు.
ఉగ్ర స్ తంభం కొప్పురం ప�ైకి చేరుకున్నారు అందరూ. ఆ పది మంది మాత్రమే ఇరుక్కుంటే పట్టే కొండ
కొన. హో రున చలి గాలి. ఉన్నట్టుండి, ఉవ్వెత్తు న తెరలు తెరలుగా కొడుతున్న గాలి దెబ్బలు. ప�ైకి వచ్చిన
ఆ చిన్న దారి తప్పితే చుట్ టూ , కను చూపు మేర పచ్చని చెట్లు కప్పివేసిన లోయలు. ఇంతలో ఒక గరుడ
పక్షి వీళ్ల ప�ైన ఐదడుల ఎత్తు లో చక్కర్లు కొడుతో ఆశ్చర్యంగా చూసి వెళ్లింది.
క్రింద లోయలను చూపుతూ పెద్దన్న, “ఈడనే అన్నమాట, సామి ఇరణ్యకశిపుడితో కోట్లా డి, ఆడికి
కాలు అడ్డు పెట్టి పడేసి, ఆడు పడిపో కుండా జుట్ట ట్టు కుంటే, కింద లోయాలోకి తోస్తా డని అల్లూ పో యాడు”
అన్నాడు.
“ఉక్కు కంభం ఏది?” అన్నది ముసలవ్వ.
“ఇదో , ఈ పరి దిగూకి సున్నంతో గీత పెటటా ్రు. ఈ బండ రాళ్ల మీద నుండి దిగాలేమో” అంటూ
చూపింది ఒకతె.
“ఇదో ముసిల్లవ్వా, ఈడ దాక ఎక్కినావ్, ఇక సాల్లే, ఇంకేడకి దిగుతావు. “ అన్నది ఇంకొకతె.
“ఇదో , పొ ట్టిదానా, నే మనువాడిన తరువాత, నా మగడు తాడు నా నడుము కట్టి పట్టు కుంటే,
యేలాడుతూ కొండ దరికి పట్టిన తేన తుట్టు కు దిగి, తేనె తుట్టు ముక్కలు బుట్ట లో యేసుకిని ప�ైకి
తెచ్చేదాన్ని. ఈడనూ దిగగలను, సామి నాకు ధ�ైర్యం ఇచ్చినాడు, నాకేటి భయం” అన్నది ముసల్ల వ్వ.
ఒక్కరు మాత్రమే పట్టే ఆ దారిలో బండ రాళ్ల మీద నుండి జారుకుంటూ, హో రు గాలి తోపుళ్ల కు రాళ్ల ని
కరుచుకుంటూ సాగింది ముసలవ్వ. పెద్దన్న వెనక తోడువస్తే ఉక్కు స్ తంభం చేరుకుంది. కాలు ఒక నూలు
పో గు వాసి జారినా పాతాళాన్ని తలపించే లోయలోకి పడటం ఖాయం. అయినాసరే ఉక్కు స్ తంభం చుట్ టూ
మూడు సార్లు ప్రదక్షిణ చేసింది. క్రింద ఆండాళ్
లు ఇచ్చిన కుంకుమ పొ ట్ లం, పూలూ కొంగు ముడిలోనుండి

21
తీసి ఉక్కు స్ తంభానికి పూజ చేసింది.
“జ�ైలు నుండీ రాటం రాటం ఓబులేసు సామిని సూడాలని గోల గోల సేసినావ్. ఈడ దాక ఎక్కినావు.
ఇంకేటన్నా కోరికలున్నాయా” అన్నాడు పెద్దన్న.
“పెద్దన్నా, సామి నన్ను ఈడ దాకా తీసుకొచ్చినాడు. నే తొలీగా కడుపుతా ఉన్నప్పుడు, నా మొగుడు
నా కోసం పుట్ట తేనె అట్టు కుని వచ్చేప్పుడు, ఇనపరాయి కోసం రెడ్డి మనుసులు సుంకాలమ్మ గుడి
ఇరగ్గొ డుతాంటే అడ్డు పడ్డా డు. ఆ కొట్లా టలో ఆడు గొడ్డలితో ఫాక్షనోళని ఇద్ద రిని నరికితే, ఆళ్ లు నా మొగుడిని
కొట్టేసారు. నా బిడ్డ డిని ఒక్కదాన్నే సాకా. ఫాక్షనోళలు ్ నా మీద కచ్చ కట్టి గుడిస తగలెటటా ్రు, ఎన్నో తగాదాలు
సేసారు. అయినా ఏడో తరగతి దాకా నా కొడుక్కి సదూ సెప్పించితే, ఆడు మిలట్ల రీ ో జేరాడు. నా బతుక్కి
సత్తు వ సామి ఎప్పుడో ఇచ్చేశాడు. ఇంక నాకేటీ వద్దు . నీకే మంచి కోడలు రావాలా, నీకు కడుపునిండా
మూడు పొ ద్దు లా బువ్వ పెటటా ్ల. గోయింద కొట్టు ” అన్నది.
“వీర నరసింహా గోయిందా గోయిందా”
“గోయిందా గోయింద”
ముసలవ్వ కాసేపు అక్కడే ఉక్కు స్ తంభాన్ని అంటి పెట్టు కుని కూర్చుంది. తనలో తనే ఏదో
మాట్లా డుకుంది. కంటి తడి కొంగుతో తుడుచుకుంది. నెమ్మదిగా కొండ కొన ప�ైకి చేరుకుని మిగతా ఆడవాళ్ల తో
కలసి, ఉగ్ర స్ తంభం దిగటం మొదలుపెటటా ్రు.
అందరూ మళ్లీ వాదులాడుకుంటూ గోల గోలగా భవనాశి జలపాతం దగ్గ రకు చేరుకున్నారు. మళ్లీ
అటు వ�ైపు ప�ైకి మెట్లు ఎక్కి ఎగువ అహో బిలం గుహాలయం చేరుకున్నారు. ఎవరో రాజకీయ నాయకుడు,
ఎలచ్చన్లయినాయి, ఇంకా పెద్ద పదవి కోరుకోవటానికి డో లీ ఎక్కి వచ్చాడట. వాళ్ల మందీ మార్బలంతో
హడావుడిగా ఉన్నది. వాళ్ల ని దాటుకుని గుహాలయంలోకి వెళ్లా రు. ముసలవ్వ వడి వడిగా ముందుకు
సాగింది. గుహ గడప దగ్గ ర రాజకీయ నాయకుడి సెక్యూరిటీ వాళ్ లు ఇద్ద రు ముసలవ్వను భుజం పట్టు కు
తోస్తే , క్రింద పడింది, “ఏయ్, ముసిల్దా నా, యేడకి తోసుకుపో తావ్? లోపల మంత్రిగారు అభిషేకం
చేయించుతున్నారు, ఈ గడపకి ఇవతలే దండం పెట్టు కు ఫో , కోరికలేమన్నా ఉంటే ఇక్కడే చెప్పుకో, ఫో ,
ఇంకో ఆడుగేసావో కేసు పెట్టి జ�ైలులో తోస్తా ” అంటూ అరిచాడు ఒకడు.
ముసలవ్వ ఉవ్వెత్తు న లేచింది. కళ్ల తో రక్ తం చిమ్మింది. “ఎవుడురా నే సామి కాడికొస్తే అడ్డు సెప్పేది?
ఏటి జ�ైలా? నా కొడుకు మిలట్,రీ ఆడు దేశానికి కాపలాకు పో తే, నిండుమనిషి నా కోడలుతో ఉంటిని.
సుంకాలమ్మ గుడి కూల్చినప్పుడు నా మొగుడును కొట్టేసిన రెడ్డి కచ్చతో, బిడ్డ పుట్ట గూడదని, నా కోడల్ని
భంగపర్చటానికి ఆడి కొడుకునూ, ఫాక్షన్ రౌడీలని పంపినప్పుడు, ఫాక్షనోడి కొడుకుని గడప మీదే పుల్ల ల
కొట్టే గొడ్డలితో కొట్టేసి, నా కోడల్నీ, బిడ్డ నీ కాపాడా. పద్దా నుగేళలు ్ జ�ైలులో ఉండి రాటం రాటమే సామి దగ్గ రికి
వస్తిని. ఎవుడురా నాకు అడ్డ మొచ్చేది? నాకు జ�ైలంటే భయమేటి? సామి ఇరణ్యకశిపుడిని ఈ గడప మీద
వట్టి సేతులతో సంపినాడు, అడ్డ మొస్తే నిన్ను కూడా ఈ గడప మీదే సంపుతా. ఫాక్ష్నోడి రగతంతో తడిసిన
సేతులియ్యి, సూస్తా వరా ఈటి దెబ్బ? నాకు కోరికలేట,ి సామి కడుపుతూండ నా కోడల్ని కాపాడే ఉద్రేకం
నాకెప్పుడో ఇచ్చేసినాడు” అంటూ పూనకం పట్టినట్టు ఊగిపో తూ, ఒక సెక్యూరిటీ వాడిని గట్టిగా తోసింది.
ఈ అల్ల రిక,ి అరుపులకీ, లోపల పూజ చేస్తు న్న అర్చకుడు వచ్చాడు. “అయ్యా, ఈమె చెంచు స్త్.రీ
చెంచులక్ష్మి అమ్మవారు వీరి ఆడపడుచు. వీరికి అహో బిలం ఆలయ ప్రవేశం ఎప్పుడూ ఉంటుంది. వారిని
కాదంటే అందరికీ అనర్ధం” అని సర్ది చెప్పి లోపలికి తీసుకు వెళ్లా డు.
ఆలయం లోపల నుండి మంత్రి గారు పళ్ లు బిగబట్టి గమనిస్తు న్నాడు. ముసలవ్వ పూనకంతో
ఊగిపో తూ స్వామి విగ్రహం ముందు కెళ్లి , “పెద్దన్నా, గోయింద కొట్టు ” అని అరిచింది.

22
“పదును గోళ్ల వాడా, గోయిందా గోయింద”
“గోయిందా గోయిందా”
“కోర దవడలోడా. గోయిందా గోయింద”
“గోయిందా గోయింద”
“ఉగ్గ నరసింహా, గోయిందా గోయింద”
“గోయిందా గోయింద”
అర్చకులవారు హారతి కర్పూరం వెలుగులో ముసలవ్వ రౌద్రం, స్వామి రౌద్రం రెండూ కనబడ్డాయి.
ఆలయం బయటకి వచ్చినా ముసలవ్వ పూనకంతో ఊగిపో తున్నది.
“ఇరణ్యకశిపుడి పేగులు తీసి సంపిన తరవాత సామి ఊగి పోయినట్టు ఊగుతావేటి? సామి కోపం
తగ్గించటానికి లచ్చిమీ దేవి చెంచులచ్చిమిగా వచ్చింది. నీకెవడొ స్తా డూ? సాలు, సాలులే తగ్గు , అదో
చెంచులచిమి, మన కుల దేవత దేవళం” అన్నది ఒకతె. అందరూ చెంచులక్ష్మి గుడిలో తమ ఆడపడుచుని
చూసుకుని ఇంకో కొండదారి పట్టారు.
భవనాశి తుంపర్ల లో తడుస్
తూ , నది ప్రక్కనున్న ఇరుకు దారిలో నుండి క్రో ఢ నరసింహస్వామి
గుహాలయం చేరుకుని, దర్శనం చేసుకుని కొండ దిగుతున్నారు అందరూ. ముసలవ్వకి పూనకం ఇంకా
తగ్గ లేదు. “ఇంకా ఊగుతావేటి? ముసిల్దా నివి ఇంకా ఇంత కోపం ఏటి?” అన్నది ఒకతె.
“సామి సెప్పింది, కోపం రావాల్సినప్పుడు కోపం తెచ్చుకోవాలే యెర్రిదానా, పెద్దన్నా గోయింద కొట్టు ”
అని కేక వేసింది ముసలవ్వ.
“కోఢ నరసింహా గోయిందా గోయింద”
“గోయిందా గోయింద”
కొండ అంచుని ఆనుకుని ఒకరి వెనక ఒకరు మాత్రమే నడిచే బండరాళ్ల దారి పట్టారు. ఒక వ�ైపు నిట్ట
నిలువు కొండ. రెండో వ�ైపు అగాధం. చీమల బారులు లాగా సాగుతున్నారు అందరూ. కొండ చరియ మీద
నుండి ఒక జలపాతం ఈ రాళ్ల దారి మీద పడుతున్నది. “హమ్మో! దాటుకుని వెళ్లా లంటే కాళ్ లు జారి క్రింద
పడతాము, వెనక్కి తిరిగి వెళదాము” అన్నది ఒకతె. “ఓసో స్, ఈ మాత్రం దాటలేమా? అందరూ ఒకరి
సేతులు ఒకరు పట్టు కుంటే అందరికీ ఉతం ఉంటది” అంటూ దాటించారు, ముసలవ్వ పెద్దన్నా కలసి. మరి
కొంత దూరం నడిచేటప్పటికి గరుడాద్రి వేదాద్రి పర్వత శ్ణ
రే ులుగా చీలే మధ్యలో, ఒక సువిశాలమ�ైన రాతి
పలకను చేరుకున్నారు. ఆ పలక రాతి మీద లక్షలకొలది గుండ్రటి అక్షరాలు, దిద్దు తున్నట్లు గా చెక్కబడి
ఉన్నాయి. ప�ైనుంచి ఒక జలపాతం, నీరు ఒక మడుగులోకి చేరి ఎర్రబడుతోంది. ఆ వెనుక జ్వాలా నరసింహ
గుహాలయం.
“ఇదే పెహ్లా దుడి బడి. సెండామార్కులు బండరాతి మీద అచ్చరాలు దిద్దించినాడు. ఈ రెండు కొండల
మజ్జి గ ఉండేది ఇరణ్యకశిపుడి మిద్దె. ఇదో మిద్దెకి గడప, సామి ఇరణ్యకశిపుడిని ఉగ్గ కంభం మీద కొట్టేసినాక,
ఈడకి ఈడుసుకొచ్చాడు. సామి వేడి వేడి ఊపిర్లతో బుసకొడుతూ ఊగాడు. కళ్ల లోనుండి నిప్పులు పడ్డాయి.
అందుకే జోలా నరసింహ సామి. దవడలు గిట గిట ఊగినాయి, పెదాలు పెట పెట లాడాయి, పళ్ లు పట
పటలాడాయి. ఎగువ బొ ఱ్ఱె కాడ సామి ఇరణ్యకశిపుడి పేగులు పీకి సంపేసినాక, ఈడ కొచ్చి రగతం సేతులు
ఈ మడుగులోనే కడుక్కున్నాడు. ఇరణ్యకశిపుడి రగతంతో తడిసిన నీళ్ లు గందా, అందుకే ఈ మడుగులో
నీళ్
లు యెర్రగుంటాయి” అంటూ ఎర్రమడుగుని చూపించాడు పెద్దన్న.

23
అందరూ జ్వాలా నరసింహ స్వామి గుహాలయంలో దండం పెట్టు కుని బయట పడ్డా రు. ప్రహ్లా దుడు
అక్షారులు దిద్దిన పలక మీద నుండి వస్తు న్నారు. ఉన్నట్లుండి ఒకతె, తమతో వచ్చిన ఇంకొకతెతో “ఇదో
బీబీ, మా సామి దుండగీడుని ఎట్టా సంపినాడో సూసినావా” అన్నది ఇంకొకతె.
“నా సామి, నీ సామీ ఏటీ? అన్ని సాములొకటే” అన్నది బీబి.
“బాగా సెప్పినావు. బీబీ, నీ బిడ్డ సల్ల గుండూలా, పెహ్లా దుడికి మల్లే బాగా సదూకోవాల. ఈ పరి నువ్వు
గోయింద కొట్ట రాదే” అన్నది.
“జోలా నరసింగ్ బాబా కీ జ�ై” అన్నది బీబి
“జోలా నరసింహా గోయిందా గోయిందా” అన్నారు అందరూ.
ఎర్రగుంటలోని నీళ్
లు కొంచెం తలప�ైకి జల్లు కుని ముందుకు సాగుతూ దగ్గ రలోని ఒక ప్రసాంత వనంలోకి
ప్రవేశించారు. కొండ గోగులు విరగ పూచి వున్నాయి. ఎదురుగా ఇంకొక దేవాలయం కనిపించింది. ముసలవ్వ
కొంగులోకి కొండగోగు పూలు కొయ్యటం మొదలుపెట్టింది. “ముసలవ్వా, నీకు పూల మీద మనసడ్డా ది, నీకు
కొత్త కొరికలేటున్నాయి?” అంటూ పరాచికమాడబో యింది ఒకతె.
“ఒసే, బుగ్గీ, ఈ పూలు సామికే, రోజూ మొగుడితో కొట్టాడుతుంటావ్, నివ్వే తల నిండా పూలెట్టు కు
పో రాదే నీ మొగుడు దగ్గ రకి, అప్పుడు ఆడు నిన్ను అక్కున తీసుకుంటాడు, అపుడుగానీ నీ కడుపు
పండుతాది, అప్పుడు మేమందరూ నీకు సీమంతం సెయ్యాల. అదేనే నే కోరేది” అన్నది ముసలవ్వ. బుగ్గి
బుగ్గ లు ఎర్రబడ్డాయి.
దేవళంలో ప్రవేశించారు. “ఈడ సామి కథేటి అయ్యోరు” అంటూ గుడిలోని అర్చకడుని ముసలవ్వ అడి
గింది.
“నరసింహ స్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత, లక్ష్మీ దేవి చెంచులక్ష్మి రూపంలో వచ్చి
ఆయనను శాంత పరిచింది. అప్పుడు స్వామి ప్రేమతో చెంచులక్ష్మీ దేవిని తన వళ్లో కూర్చోపెట్టు కుంటాడు.
“మా” అంటే లక్ష్మీ దేవి, “లోల” అంటే అమితమ�ైన ప్రేమ. అందుకే ఇక్కడ స్వామిని “మాలోల లక్ష్మీ నరసింహ
స్వామి” అంటారు”, అన్నాడు అర్చకుడు.
ముసలవ్వ తను కోసుకొచ్చిన కొండగోగు పూలతో చెంచులక్ష్మినీ, స్వామినీ అలంకరించింది.
“అయ్యోరూ, అంత పెద్ద పేరు, నువ్వయితే సరీగా సెపుతావ్, గోయింద కొట్టు ” అన్నది.
“ఈ రోజు స్వాతి నక్షత్రం శుభ దినం. స్వాతి నాడు అమ్మవారిక,ీ స్వామికీ పూజ చేశారు, మీ అందరికీ
శుభం”, అన్నారు అర్చకులు.
“మాలోల లక్ష్మీ నరసింహా గోవిందా గోవింద”
“గోయిందా గోయిందా”
ఇంకొక కొండదారి పట్టు కున్నారు అందరూ. సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నా, దట్ట మ�ైన అడవిలో
చెట్ల క్రింద నడుస్తు న్న వాళ్ల ను ఇబ్బంది పెట్టలేకపో తున్నాడేమో, అందరూ గోల గోలగా మాట్లా డుకుంటూ,
వాదులాడుకుంటూ, నవ్వుకుంటూ, కొండల మధ్య నుండి ఆదిశేషుడి తోకలాగా మెలికలు తిరుగుతూ, వడి
వడిగా ప్రవహిస్తు న్న పావని నదిని అంటుకుని ఉన్న దారి మీద ముందుకు సాగుతున్నారు. ఉన్నట్లుండి
దగ్గ రగా కొమ్ము బూరలు, డప్పుల చప్పుడు వినబడ్డాయి. ప్రక్కన ఉన్న చెంచు గూడెంలోని వాళ్ లందరూ,
చెంచు భాషలో పాటలు పాడుకుంటూ, తలలమీద గంపలలోనూ, కుండలలోనూ ముడుపులు పెట్టు కుని
చిందులువేసుకుంటూ వచ్చి వీళ్ల దారిలో కలిసారు. ఈ ఆడవాళ్ లు కూడా చెంచుల భాషాలోని పాటలకు గొంతు
కలిపి చిందులు వేసతూ ్ సాగుతూ ఇంకొక గుహాలయానికి చేరుకున్నారు. ఆ గుహాలయం ముందు చెంచుల

24
సంబారాలు జరుగుతున్నాయి. చెంచులు కొమ్ము బూరలూదుతూ, డప్పులు కొడుతుంటే, చెంచితలు
పాటలు పాడుతూ చిందులు వేస్తు న్నారు. అర్ధ చంద్రాకారములో ఆడవారు అందరూ ఒకరి భుజాల మీద
ఇంకొకరు చేతులు వేసుకుని నిలబడి, వేడుకగా, చాలా పాటాలు పాడారు, చిందులు వేశారు.
ఇంతలో కొండాగాలి తిరిగింది. చెట్లన్నీ జోరుగా తలలు ఊపాయి. ప్రక్కనే ఉన్న వెదురు పొ దలోనుండి
గాలి ఆనంద భ�ైరవి రాగం పలికింది. అర్ధ చంద్రాకారములో నిలబడి చిందులు వేస్తు న్న ఆడవాళ్ల కి ఎదురుగా
ఎక్కడి నుండో ఒక నెమలి వచ్చి వాలి, పురి విప్పి ఆడటం మొదలు పెట్టింది. వడి వడిగా నల్లని మబ్బులు
కమ్ముకొన్నాయి.
ఉన్నట్లుండి ముసలవ్వ “మా ఇంటి పడుచు, చెంచు లచ్చమ్మా” అంటూ రాగం తీసింది.
చెంచులందరికీ తెలిసిన పాటేమో, వాళ్ లు వెంటనే “మా ఇంటి పడుచు, చెంచు లచ్చమ్మా” అంటూ వంత
పాడుతూ, చిందేస్తుంటే, వాళ్ల అందెలు తాళం వేసాయి. మేఘాలు ఆది తాళంలో మృదంగనాదముతో,
హర్షణ ఘర్జనలతో ప్రతిద్వనించాయి. స్వాతి వాన జల్లు పడటం మొదలయ్యింది.
ముసలవ్వ పాట కొనసాగించింది.

మా ఇంటి పడుచు, చెంచు లచ్చమ్మా


తేనెటీగ సామిని కోరిక కోరినానని సెప్పమంది
మా ఇంటి పడుచు, చెంచు లచ్చమ్మా

సామికి పుట్ట తేనె తీసేటేళ


కొమ్మ కొమ్మకూ పూలు కావాల పూల గుత్తు లూ కావాలని
తేనెటీగ ఝుమ్మంటూ సెవిలోన సేరి కోరినాది

మా ఇంటి పడుచు, చెంచు లచ్చమ్మా


సెట్టు కున్న పువ్వు సామిని కోరిక కోరినానని సెప్పమంది
మా ఇంటి పడుచు, చెంచు లచ్చమ్మా

సామికి కొమ్మ మీది పూలు కోసేటేళ


సెట్టు కి సల్లని గాలి, సల్లని నీరు కావాలని
సెట్టు కున్న పువ్వు నా బుగ్గ లకు గిలిగింత పెట్టి కోరినాది

మా ఇంటి పడుచు, చెంచు లచ్చమ్మ


పాములేటి నీరు సామిని కోరిక కోరినానని సెప్పమంది
మా ఇంటి పడుచు, చెంచు లచ్చమ్మ

25
సామికి పాములేటిలో జలకము తెచ్చేటేళ
కొండ కోన మీద జడివాన కురువాల రంగుల విల్లు గుడి కట్టాలని
పాములేటి నీరు నా సేతులను తడిమి కోరినాది

మా ఇంటి పడుచు, చెంచు లచ్చమ్మ


పాములేటి నీరు సామిని కోరిక కోరినానని సెప్పమంది
మా ఇంటి పడుచు, చెంచు లచ్చమ్మ

సామికి తేనే పూలూ నీరు తేవాలంటే


చెంచులను సామి కాయాలని, చెంచితల కడుపు పండాలని
ఓబులేశునకు సేతులెత్తి దండమెట్టి కోరినామని

మా ఇంటి పడుచు, చెంచు లచ్చమ్మ


చెంచు కులముద్ద రించాలని సామిని కోరినామని సెప్పమ్మ
మా ఇంటి పడుచు, చెంచు లచ్చమ్మ
ఇంకా ఎన్నో పాటలు పాడారు చిందులు వేసారు. ఆట పాటలు ముగిసే సమయానికి వాన వెలసి,
గరుడాద్రి, వేదాద్రి కొండకోనల మీద హరివిల్లు గుడి కట్టింది.
గుహ ముందు నుంచుని “అల్లు డో రికి మూడుపులు తెచ్చినాం, మా ఆడబొ ట్టికి సారెలు తెచ్చినాం”
అంటూ కేక వేసతూ ్ గుహాలయంలోకి ప్రవేశించబో యారు. నుదుట పెద్ద బొ ట్టు తో, కాషాయం లాల్చీ వేసుకున్న
పెద్ద మనిషి ఒకరు, “హదేవిటి, ఎవరు పడితే వాళ్
లు లోపలికి వెళ్లకూడదు, అపచారం” అంటూ ఇంకా ఏదో
అనబో యాడు.
అప్పటిదాకా చిందులు వేసిన ముసలవ్వ, నుదుటి మీద చెమటని తుడుచుకుంటూ, “ఇదో పెద్దా యనా,
నరసింహసామి ఇరణ్యకశిపుడిని ఇరిసినాక, తీవరంగా తుక తుక లాడుతుంటే దేవతలడిలిపో నారు.
అప్పుడు మా ఆడుబిడ్డ చెంచులచిమి సామికి కోపం తగ్గించి ఈ బొ ఱ్ఱె లోనే కొలువ�ైనాది. మా బిడ్డ కి మా
అల్లు డికి సాతి నాడు ముడుపులెట్టటం మా ఆచారం. ఇదో పెద్దా యనా, నువు తగ్గు తగ్గు . చెంచుదొ రా ఈ
మనిసి సంగతి నే సూసుకుంటా గాని, నువు లోనికి పోయి ముడుపులు సెల్లించు” అంటూ ఆ పెద్ద మనిషిని
కళ్ల తో గుచ్చుతూ నిలబడింది.
చెంచుల ఆచారం ప్రకారం పూజలు అయిన తరువాత అందరూ కలసి వేడుకగా సంబరాలు
జరుపుకుంటూ అన్నీ పంచుకుని తిన్నారు.
చెంచుల సంబరాలు ముగించుకుని వెళ్లబో తున్నారు. ముసల్ల వ్వ చెంచు దొ రతో, “గోయింద కొట్ట రాదే”
అన్నది.
“పాములేటి నరసింహా గోయిందా గోయిందా”

26
“గోయిందా గోయిందా”
సూర్యుడు వేదాద్రి కొండల చాటుకు చేరుకునే వేళకి ఈ తొమ్మండుగురు ఆడవాళ్
లు పెద్దన్నతో కలసి
కొండ దిగటం మొదలుపెటటా ్రు. పావన నరసింహుడి సంబరాలు ముగిసినా ఈ శ్రామికుల సందడి మాత్రం
తగ్గ లేదు. అదే ఉత్సాహంతో ఊసులాడుకుంటూ త్వర త్వరగా దిగుతున్నారు.
కొండ దిగువలో యోగముద్రలో ఉన్న నరసింహుడి విగ్రహంతో కూడిన తోరణం కనబడింది. దాటుకుని
వెళితే, ఇంకొక గుహాలయం. యోగముద్రలో ఉన్న నరసింహ స్వామి ప్రహ్లా దుడికి రాజ్యం అప్పచెప్పే
ముందు యోగ విద్యను ప్రసాదించిన గుహ. దర్శనం అయ్యిన తరువాత అందరూ అర్చకుడిచ్చిన కుంకుమ
పెట్టు కుని బయటకి వస్తు న్నారు.
“ముసలవ్వా, ఏదడిగినా వద్ద ని అంటావు, నీకు అసలు కోరికలు ఉండవా, నిజంగానే కోరికలుండవా
నీకు?” అడిగింది ఒకతె.
“యెర్రిదానా, నేనూ మనిసినే, నాకు కోరికలుంటాయి. కోరికలకి అడ్ డూ అదుపూ ఉండాల.
ఇరణ్యకశిపుడు అడ్డ మ�ైన కోరికలు కోరితే సామి ఇరిచేసాడు. అర్రులు చాచి కోరికల కోరే మనసే ఇరణ్యకశిపుడు,
సామిని తలుసుకుని అర్రులు చాచే మనసును అదుపులో పెట్టి, కోరికలని ఇరిస్తే ఆ మనిషే నరసింహం”
అన్నది ముసలవ్వ.
“ఓసో సి, జ�ైల్లో యేదాంతం యెక్కింది ముసలవ్వకి” అంటూ నవ్వింది ఇంకొకతే.
“ముసలవ్వకు కోరికలేటి, కొడుకు మిలట్ల రీ ో ఉజ్జో గం, సొ మ్ములంపుతున్నాడు, కోడలు బువ్వెడుతుంది,
మనవడు పనుల్లో కి పో కుండా బడికోతున్నాడు, ఇంకేటి ముసలవ్వకు కోరికలు. ముసలవ్వా, జ�ైలుకి పో తే
పోయినావు, ఇప్పుడు నీకేటి చింత, నీకేటి కోరికలు” అన్నది ఇంకొకతె.
“సింతా ఉన్నాది కోరికా ఉన్నాది. నా గుడిసెకి సేరాల, నా నల్ల గేదె ఈనాల, గేదా దూడా సల్ లంగా
ఉండాల. నా మనవడికి నే జున్నుపాలు వండాల, ఆ పరి నా నల్ల గేదె పాలతో సీరాన్నం సెయ్యాల, సామికి
న�ైయేద్దం పెటటా ్ల” అన్నది ముసలవ్వ.
“ఓసో సి, నీ నల్ల గేద గంగి గోవేటి? నల్ల గేదె పాలతో సామికి న�ైవేద్దమెట్టటానికి!” వేళాకొళం
చెయ్యబో యింది ఇంకొకతె.
“ఒసే నల్ల దానా, నువ్వు మనిసివి కాదేటి? నల్ల గా ఉంటే మాత్రం గేదె దాని బిడ్డ తాగాల్సిన పాలు
మనకి పో స్తా ది. మనుసులందరూ గేదె పాలు తాగుతారు, పూజలు మాత్రం తెల్లగా ఉంటేనే! తెల్లగా ఉంటేనే
గంగి గోవా? మనకు పాలు ఇచ్చేదేద�ైనా గంగి గోవే” అన్నది ముసలవ్వ.
“నీతో మాట గెలవటమే, అన్నిటికన్నీ సెపుతావు” అన్నది ఇంకొకతె.
“పెద్దన్నా ఈ నల్ల దాని సో దెందుకు కానీ, గోయింద కొట్టు “ అన్నది ముసలవ్వ.
“జోగి నరసింహా గోయిందా గోయిందా”
“గోయిందా గోయిందా”
కొండ అడుగు ప్రాంతం, చిట్ట డవి. పక్షులు అహో బిలేశునికి పవళింపు సేవలు పాడుతున్నాయి.
అందరూ వడి వడిగా నడుస్తు న్నారు. రోజంతా కొండలు ఎక్కటం, దిగటంతో గడిచినా ఎవరికీ అలసట
కనబడటంలేదు.
“ముసిలవ్వా, జ�ైలు నుండి రాటం రాటమే మంకు పట్టావ్. నీతోడి వస్తే ఇయ్యాళ అంతా సందడి
సందడిగా గడిసింది. మళ్లీ రేతిరంతా ఆటోలో పో వాల, రేపు పనులకు పో వాల. పోయిన తరవాత కొత్త కస్టాలు

27
ఏటి ఎదుర�ైతాయో” అన్నది ఒకతె.
“ఒసే పిచ్చిదానా, కస్టా లు మనుసులుకు రాక బండ రాళ్ల కు వస్తా యా? సో ద్యం సెపుతున్నావే?
అదుగో ఇంకో దేవళం అగుపడతాంది. కష్టాలొచ్చిన్నప్పుడు ఓర్పు కావాల, సత్తు వ కావాల, ధ�ైర్యం కావాల,
ఉపాయం కావాలని సామిని కోరుకో” అన్నది ముసల్ల వ.
మఱ్ఱి చెట్టు గొడుగు పట్టితే, ఆ క్రింద వెలసిని నరసింహుడి గుడి. అందరూ దండం పెట్టు కుని
బయలుదేరారు.
“పెద్దన్నా, గోయింద కొట్టు ” అన్నది ముసలవ్వ.
“గొడుగు నరసింహా, గోయిందా గోయింద”
“గోయిందా గోయింద”
చీకటి కమ్ముకున్నది. మిణుగురు పురుగుల వెలుగులో చిట్ట డవి దాటి దిగువ అహో బిలానికి
చేరుకున్నారు.
మనిషి నిలబడగలిగినంత ఎత్తు లో ఉన్న గుహలో గర్భాలయం. గుహలో ఒక పక ్ర ్క అరుగులాంటి పెద్ద
బండ రాయి మీద నెలకొన్న ప్రహ్లా ద వరదుడు. ఆ అహో బిలానికి గంభీరంగా కాపలా కాస్తు న్న నిలువెత్తు
జయ విజుయలు విగ్రా హాలు. కాకతీయ రాజులు, విజయనగర రాజులు అహో బిలానికి ఆనుకుని కట్టించిన
ఆలయం, రంగ మండపాలు. స్వాతి నక్షత్రం నాడు అవటము వలన జన సందో హం ఎక్కువగానే ఉంది. ఈ
ఆడవారి గుంపులోని వారందరూ ఓపికగానే నిలబడ్డా రు. గుహ గడప దగ్గ రకు వచ్చారు. ఎవరో దంపతులు
లోపలికి వెళుతున్నారు. వారి వెంట ఉన్న బుడి బుడి నడతల పాప ఎత్ై తన గడప దాటలేక, గడప మీద
కాలు వేసి ఎక్కబో యింది. ముసలవ్వ ఆ పాపను అందుకుని గడపని దాటిసతూ ్ “గడప తొక్కకూడదే సిట్టి
మాలచిమి” అంటూ ఆ పాపను గడప దాటించింది. అహో బిలం గర్భాలయంలో భక్తు లు స్వామి వారికి
కానుకులు అర్పిస్తు న్నారు. అర్చకుడు బాసిపెట్టు కుని కానుకలు అందుకుంటూ అందరికీ శఠగోపం
పెడుతున్నాడు.
“అయ్యోరు, ప�ైని ఓబులేశుని కాడికెళ్లి , ప�ైని దేవళాలన్నీ సూసుకుంటూ వచ్చినాం, సామికియ్యటానికి
మా దగ్గ ర కానుకలు లేవు” అన్నది ముసలవ్వ.
“నవనరసింహులని చూడాలంటే ఏభ�ై కిలోమీటర్ల కొండ దార్లు, అంతా నడిచారేమిటి? మరి ఆప�ైన
ఉగ్రస్థంభం?” సందేహిసతూ ్ ప్రశ్నించారు అర్చకులవారు.
“అన్ని దేవళాలలోనూ సామికి దండమెట్టి, మా చెంచులచిమిని సూసుకుకొని వత్త న్నాము,
అయ్యోరు. ఉక్కు కంభానికి కూడా దండమెట్టు కునొచ్చినా” అన్నది ముసలవ్వ.
“మంచిది, నవనారసింహులందరినీ దర్శించుకుని వచ్చారనమాట, ప్రహ్లదవరదుడు మీకు కూడా
వరాల జల్లు కురిపిస్తా డు, కోరికలు తీరుస్తా డు” అంటూ మంత్రో చ్చారణ చేసతూ ్, అందరికీ శఠగోపం పెట్టి,
కుంకుమ, పూలు ఇచ్చాడు అర్చకుడు.
“అహో బిలే గారుడ శ�ైల మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానమ్
లక్ష్మ్యాత్ సమాలింగిత వామభాగం లక్ష్మీనృసింహ శరణ్యం ప్రపద్యే”
“అయ్యోరు, నువు సదివింది మాకు అగుపడదుగానీ, గోయింద కొట్ట రాదే” అన్నది ముసలవ్వ.
“ప్రహ్లా దవరదా గోవిందా గోవిందా” అన్నాడు అర్చకుడు.
“గోయిందా గోయిందా” అని అందరూ అంటే, అహో బిలం ప్రతిద్వనించింది.

28
ఆటో దగ్గ రకు చేరారందరూ. గూటిలో గువ్వలులాగా అందరూ ఒదిగి ఒదిగి ఆటోలో కూర్చున్నారు.
“పెద్దన్నా, అడిగిందే తడవుగా ఆటో కట్టినావు, సామికాడికి తీసుకొచ్చి కోరిక తీర్సినావు, గోయింద
కొట్టు ” అన్నది ముసలవ్వ.
“మూడు గీతలోడా గోయిందా గోయిందా
“గోయిందా గోయింద”

“నిలూ గీతలోడా గోయిందా గోయింద”


“గోయిందా గోయింద”

“ఓబులేశా గోయిందా గోయిందా”


“గోయిందా గోయిందా

గోల గోలగా బయలుదేరింది ఆటో.

***

29
తూ.గో.జిల్
లా జగ
్ గంపేటలో జన్మించిన డా|| కె.గీత కవయిత్ రి ,
గాయని, భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్
జా ల వనితా మాస పత్ రి క
వ్యవస్
థా పక సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.

్ర ముఖ కథా రచయిత్ రి శ్
రీ మతి   కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి .

ఆంధ ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీ షు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు,


తెలుగు భాషాశాస్ త్ రంలో పిహెచ్.డి, అమెరికాలో ఇంజనీరింగ్
మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు.  పది సం. రాల పాటు మెదక్
జిల్
లా లో ప ్ర భుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు.  2006లో
అప్పటి ఉమ్మడి ఆంధ ్ర ప
్ర దేశ్ ప
్ర భుత్వం నించి “ఉత ్త మ
ఉపాధ్యాయ అవార్ డు ” పొందారు.  ప తు తం అమెరికాలో సాఫ్
్ర స్ ట్
వేర్ ఫీల్
డు లో  “తెలుగు భాషా నిపుణురాలి”గా పనిచేస్ తు న్నారు.  

ద్ర వ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ ది వెన్నెల (2013)


, సెలయేటి దివిటీ (2017)  కవితా సంపుటాలు, సిలికాన్ లోయ
సాక్షిగా(2018) కథా సంపుటి ప ్ర చురింపబడ్డా యి.  ‘గీతా కాలం’,
“అనగనగా అమెరికా” కాలమ్స్,  “నా కళ ్ల తో అమెరికా”, “యాత్రా గీతం”
ట్రా వెలాగ్స్,   “కంప్యూటర్ భాషగా తెలుగు” అనే భాషా పరిశోధనా వ్యాసాలు’
వీరి ఇతర రచనలు. కవిత్వంలో అజంతా, దేవులపల్ లి , రంజనీ కుందుర్తి ,
సమతా రచయితల సంఘం అవార్ డు మొ.న పురస్కారాలు పొందారు.
అమెరికాలో “వీక్షణం” సాహితీ వేదిక, “తెలుగు రచయిత” వెబ ్సైటు
వ్యవస్ థా పక అధ్యక్షులు, నిర్వాహకులు. టోరీ తెలుగు రేడియోలో
“గీతామాధవీయం” పేరుతో సంగీత, సాహిత్య టాక్ షో ని నిర్వహిస్ తు న్నారు.
అమెరికాలోని “తానా” తెలుగు బడి “పాఠశాల»కి కరికులం ై డ రక్ట ర్ గా
సేవలందిస్ తు న్నారు.

8. ఇవాక్యుయేషన్ 
- డా||కె.గీత
 సూట్ కేసులోంచి  నా జీవితంలో అతి ముఖ్యమ�ైన రెండు ఫో టోలు తీసి టేబుల్ లాంప్ బల్ల మీద
పెట్టేను. 

అమ్మ ఫో టో, ఆ పక్కనే మా ఇద్ద రి ఫో టో. హనీమూన్ లో నా భుజం చుట్


టూ చెయ్యి వేసి నాకేసే
చూస్తు న్న శశాంక్ మెరిసే చిలిపి కళ్ల ఫో టో.

శశాంక్ వెల్లకిలా పడుకుని తల మీద చెయ్యి వేసుకుని దీరఘా్లోచనలో మునిగిపోయి ఉన్నాడు.

30
వేడి వేడి నీళ్ల తో తల స్నానం చేసి వచ్చేసరికి ఒంట్లో ఓపిక అయిపోయినట్లయ్యినా ఎడతెరిపిలేని
ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తు న్న మనసు కాస్త తెరిపిన పడ్డ ట్ల య్యింది. 

తల తుడుచుకుంటూ “నువ్వూ వెళ్లరాదూ, కాస్త ఫ్రెష్ గా ఉంటుంది” అన్నాను.

ఇంకా యోగముద్రలో ఉన్నట్టే ఉన్న శశాంక్ ఉలకలేదు, పలకలేదు.

చేత్తో తట్టేను.

“అబ్బబ్బ రాగా, నన్ను విసిగించకు. ఒకసారి నీకు చెప్తే అర్థం కాదా” గట్టిగా అరిచేడు.

“అదేవిటీ అసలెప్పుడు చెప్పేవు?” అన్నాను నేను కూడా మొండిగా.

“ఇదే నీతో వచ్చిన ప్రాబ్ లం. పంతం. ఇప్పుడేంటి? నువ్వు స్నానానికెళతే ్ నేను కూడా వెళ్లా లా? నేను
వెళ్లను.” అని అటు తిరిగి ముసుగు పెట్టు కున్నాడు.

“వెళ్లకపో తే మానెయ్యి. నీ ఖర్మ....” అనాలని నోటి చివరి వరకూ వచ్చింది కానీ గొడవ పెంచడం ఇష్టం
లేక బాల్కనీ లోకి వచ్చి కూచున్నాను.

దుఃఖం తన్నుకు వస్


తూంది.

గత ఆరు నెల్లు గా ఇలాగే ఉంది మా ఇద్ద రి మధ్యా.

మార్చి నుంచి కరోనా తీవత


్ర వల్ల ఆఫీసులు ఇంటి నుంచే పనిచెయ్యమని ఆదేశించాయి.

“హమ్మయ్య” ఇంటి నుంచే పనిచెయ్యడమంటే ఇద్ద రం కలిసి రోజూ టిఫిన్  చేయొచ్చు, లంచ్
చేయొచ్చు అనుకుని పొ ంగిపో యాను నేను.

ఇన్నాళ్
లూ పతీ
్ర రోజూ “సాయంత్రం ఎంత త్వరగా అవుతుందా” అని ఒక్కదాన్నీ ఇంత పెద్ద ఇంట్లో
బిక్కుబిక్కుమని ఎదురుచూసే బాధ తప్పుతుందని ఎంతో సంతోషపడ్డా ను.

అయితే నేనూహించుకున్నదొ కటి, ఇక్కడ జరుగుతున్నది మరొకటి.

ఇల్లు కొనగానే ఇంట్లో తన ఆఫీసు కోసం ఒక గది సెపరేట్ గా పెట్టు కున్నాడు.

కానీ ఇంటి నుంచి ఒంటరిగా పనిచెయ్యడం ఇష్టం ఉండదని క్రమం తప్పకుండా తను ఆఫీసుకి వెళ్లడం
వల్ల ఆ గదికి ఇప్పటివరకు మోక్షం రాలేదు.

ఇక ఇప్పుడు ఇంటి నుంచి పనిచెయ్యడం అంటే పొ ద్దు న్న ఆరుగంటలకే ఆఫీసు పనంటూ అలారం
పెట్టు కుని లేచినవాడు అర్థ రాత్రి వరకూ ఆ గదిలోనే గడుపుతాడు.

ఎప్పుడో కడుపులో నకనకలాడినప్పుడు “తినడానికేవుంది?” అంటూ వస్తా డు.  ఆ కాస్సేపు కూడా


చెవుల్లో ఇయర్ ఫో న్స్ తగిలించుకుని ఏదో మీటింగు మధ్యలో వచ్చి,  గబగబా కానిచ్చి మళ్లీ తన గదిలోకెళ్ళి
తలుపేసుకుంటాడు.

రెండ్రో జులకో, మూడ్రో జులకో గుర్తొచ్చినప్పుడు స్నానం.

మాసిన గెడ్డం, భుజాలదాకా పెరిగిన జుట్టు ... ఆర్నెల్ల లో సన్యాసిలాగా తయారయ్యేడు.

గ్లా స్ డో ర్స్ వెనక పల్చని పరదాలున్నా స్పష్టంగా గదిలోంచి బయటికి, బయటినుంచి గదిలోకి 
కనిపిసతూంది
్ .  

31
శశాంక్ ఇంకా అలాగే తల మీద చెయ్యి వేసుకుని పడుకుని ఉన్నాడు.

లాప్ టాప్ తెరిచి ఎయిర్ బీ ఎన్ బీ స�ైటులో దగ్గ ర్లో అద్దెకి ఏద�ైనా  ఇల్లుందేమో చూడసాగేను.

ఇల్లు జ్ఞాపకం వస్తే నే మనసంతా నీరయిపో సాగింది.

“కాలిఫో ర్నియాలో,  అందునా  శాన్ ఫ్రాన్ సిస్కో బే ఏరియాలో మా అమ్మలు ఇల్లు  కొనుక్కోవడమంటే
మాటలు కాదు” నాతో ఫో న్లో మాట్లా డుతూ పక్కనున్న వాళ్ళతో అమ్మ పదేపదే గొప్పగా చెప్పడం ఎన్నో
సార్లు విని నవ్వుకున్నాను. కానీ లోపల్లో పల గర్వపడ్డా ను.

అమ్మ చెప్పినట్టు  శాన్ ఫ్రాన్ సిస్కో  బే ఏరియాలో సముద్రానికి 50 మ�ైళ్ళ దూరంలో కొండల్లో ఉన్న
ఊరు ఇది.

శశాంక్  ఆఫీసుకి  దూరమే అయినా ఏరికోరి నచ్చిన  ఇంటికోసం ఇంత దూరానికి వచ్చేం.   

అసలింత దూరంలో కొనుక్కుంటామని అనుకోలేదు.

ఇళ్ల  ఏజెంటు “మీ బడ్జెట్టు లో బ్రహ్మాండమ�ైన ఇల్లు చూపిస్తా ను, రండి.” అని తీసుకొచ్చినపుడు ఇల్లు 
చూడగానే మా ఇద్ద రికీ బాగా నచ్చేసింది.  మేం ఎన్నాళ్ళుగానో  కలలుగన్న ఇల్లు ఇది.

హ�ై రూఫ్ లివింగ్ రూమ్, వంటింట్లో ఐలాండ్, విశాలమ�ైన మాస్ట ర్ బెడ్ రూమ్, పెద్ద టబ్బు, వాకిన్
క్లా జెట్… ఒకటేవిటి, బహుశాః స్థ లం కొనుక్కుని కట్టించుకుంటే మా ఇల్లు  ఇలాగే ఉండి ఉండేది. ముఖ్యంగా
బాల్కనీ తెరవగానే చెయ్యి చాస్తే అందేటట్టు దట్ట మ�ైన గడ్డి కొండ.

గాలి వాటుకి అలల్లా గ  కదిలే సుతారమ�ైన గుత్తు లతో  భలే  అందమ�ైన గడ్డి .

ఇంటి చుట్
టూ పెద్ద పెరడు. విరగకాసిన నారింజ, నిమ్మ పళ్ళ చెట్లు .

ఇల్లు చూడ్డా నికొచ్చినపుడు నారింజ చెట్ల దగ్గిరికి పరుగెత్తి వాటి చుట్


టూ మురిపెంగా చూస్
తూ
తిరుగుతున్న నన్ను ఉద్దేశిస్
తూ “మనం ముందు చూడాల్సింది ఇంటిని. చెట్లని కాదు” అని నవ్వుతున్న 
శశాంక్  ముఖం గుర్తుకు వచ్చింది.

ఎప్పుడూ మా మధ్య ఇంత నిశ్శబ్దం లేదు.

ఈ  ఆరు నెల్లు గా మేం ఒకరికొకరం కొత్త మనుషులమయిపో యేం.

నిశ్శబ్దం అగాధంలా ప్రవేశించింది మా మధ్య.

నాకు సాధారణంగా రోజల్లా పెరట్లోనే పొ ద్దు పో తుంది.

ఉయ్యాల పందిటలో ్ బల్ల ఉయ్యాల మీద దిండేసుకుని పుస్త కాలు చదూకుంటూ శెనగలో, బఠాణీలో
తినడమన్నది నా చిన్ననాటి తీరని కోరిక.

ఇప్పుడు ముచ్చటపడి కట్టించుకున్న ఉయ్యాల పందిరి, బల్ల ఉయ్యాల ఉన్నా వెయిట్ వల్లే పిల్లలు
కలగడం లేదన్న అనుమానంతో  శెనగలు, బఠాణీలు తినడం మాత్రం కుదరడం లేదు. 

ఇక మధ్య మధ్యలో ఎప్పుడ�ైనా బో రు కొడితే మొక్కలకి గొప్పతవ్వుతూనో, కాయగూరల మొక్కలకి


సంరక్షణ చేసతూ ్నో, పిచ్చిమొక్క కనబడ్డ ప్పుడల్లా దండయాత్ర చేసతూ ్నో, తియ్యని పళ్ళని నా కళ్ళుగప్పి
దొ ంగతనంగా తినడానికి నిశ్శబ్దంగా నా వెనకే వచ్చి, నేను తల తిప్పగానే పరిగెత్తే ఉడతల్ని చూసి
నవ్వుకుంటూనో గడిచిపో తుంది.

32
ఆర్నెల్ల నుంచి శశాంక్ ఇంట్లో ఉండేసరికి తనకెప్పుడు ఏం అవసరమొస్తుందో అని పెరట్లో కంటే
ఇంట్లోనే ఎక్కువగా ఉండడం అలవాటు చేసుకున్నాను.

అలా గార్డెను సంగతి కొంత�ైనా మరుపున పడడమూ ఒకందుకు మంచిదే అయ్యింది.

ఇప్పుడిలా ఇల్లొ దిలి ఎక్కడో ఉండాల్సి వస్తు న్నందుకు బెంగ మరీ తీవ్రమయ్యేది.

అయినా దిగులుగా ఉంది.

ఇవాక్యుయేషన్ వార్నింగ్  సెల్ ఫో నులో రావడమేవిటి, ఊర్లో నుంచి సహాయార్థం టీములు వచ్చేయి.

ఉన్న పళంగా ఇల్లు ఒదిలి వెళ్ళిపో మని, అవసరమ�ైనవి ఒకటో రెండో   సూట్ కేసుల్లో సర్దుకుని సరిగ్గా
గంటలో ఇవాక్యుయేషన్  చెయ్యమని చెప్పేరు. ఈ గంటలోగా ఎమర్జన్సీ స�ైరన్ వచ్చి వెళ్లా ల్సి వస్తే ఎక్కడి
వాళ్ళక్కడ పరుగెత్తకుండా వాళ్ళే జాగ్రత్తగా తీసుకెళ్లి వేరేచ ోట దించుతామని అగ్నిమాపక దళ సహాయక
టీము వాళ్
లు చెప్పేరు.

నాకు కాళ్
లూ చేతులూ ఆడలేదు.

ముఖ్యమ�ైనవంటే ఏం సర్దుకోవాలి? అదీ ఒకటో రెండో   సూట్ కేసుల్లో .

పాసుపో ర్టులు, వీసా డాక్యుమెంట్లు , సర్టిఫికెట్లు , లాప్టాపులు పెట్టేసరికే ఒకటి సగం నిండిపో యింది.

అసలు ఏం వదిలెయ్యాలి? ఇంట్లో ప్రతివస్తు వూ ప్రీతిపాత్రమ�ైందే.

అద్దె ఇంట్లోని పాత ఫర్నిచర్, పాత వస్తు వులు సొ ంత ఇంటి లోపలికి తీసుకురావద్ద ని శశి నియమం
పెట్టినపుడు మా ఇద్ద రికీ దాదాపు ఒక పెద్ద యుద్ధ మే నడిచింది.

“బంగారం లాంటి ఫర్నిచర్ ఏం చేసింది నిన్ను?” అన్నాను.

“గొప్ప బంగారమే. అన్నీ క్రైక్స్ లిస్టు లో కొన్న సెకండ్ హాండ్ తుక్కు సామాన్లేగా” అన్నాడు
ఈసడింపుగా.

“అమెరికా వచ్చిన కొత్త లో తమరి జీతం ఎంతో గుర్తుంచుకుని మాట్లా డండి సార్. ఇదుగో ఈ సెకండ్
హాండ్ డ�ైనింగ్ టేబులు, ఈ కుర్చీలు, ఈ గ్రైండరు.... ఈ తుక్కు సామాన్లే ఆదుకున్నాయి.”  అన్నాను
ఎక్కడా తగ్గ కుండా.

“చాలా ఆదుకున్నాయి. కొత్త  గ్రైండరు కొనుక్కోలేనపుడు ఇడ్లీలు తినడం మానెయ్యాలి.” అన్నాడు.

శశి వితండవాదం మొదలు పెడితే దానికి అంతూ పొ ంతూ  ఉండదని తెలుసు నాకు.

ఎదుటివాళ్
లు వాగీ  వాగీ అలిసిపోయి నమస్కారం పెటటా ్ల్సిందే కానీ ఎక్కడా తగ్గ డు.

ఇంట్లో ఉన్న పతీ


్ర సామానూ రోజుల తరబడి షాపింగు చేసి, ఎన్నో షాపులు తిరిగి ఏరికోరి కొనుక్కున్నవే.    

గంట..... ఉన్న ఒక్క గంటలో ఏం సర్దుకోవాలి?

మా పెళ్లి ఆల్బం, నా చిన్నప్పటి ఫో టోలు, మేమిద్ద రం పెళ్లి కి ముందు రాసుకున్న ప్రేమలేఖలు, నా


డ�ైరీలు... గబగబా మెదడులో పరుగెత్తు తున్న ఇంపార్టెంట్ లిస్టు సర్ద సాగేను. గాభరాగా సర్దుతుండే సరికి
చెమటలు ధారాపాతంగా కారసాగేయి.

శశి తన ఆఫీసు వస్తు వులు, వారానికి సరిపడా డ్రెస్సులు రెండు నిమిషాల్లో సర్దుకుని హాల్లో కి

33
వెళ్ళిపో యేడు.

క్లా జెట్టు లోకి వచ్చేసరికి నాకు బుర్ర పనిచెయ్యడం మానేసింది.

పెళ్లి పట్టు చీర దగ్గ ర్నించి, మొన్న మొన్న కొనుక్కున్న ఫాషనబుల్ ఈవెనింగ్ డిన్నర్ గౌనుతో సహా
ఏవని వదిలెయ్యను?

కనీసం ఆరేడు పెద్ద సూట్ కేసుల నిండా సర్దుకోవాల్సినవి ఉన్నాయి.

శశి ఫో న్లో ఎవరితోనో అంటున్నాడు.

“ప్లీజ్ గివ్ అజ్ ఫ్యూ మోర్ మినిట్స్, జస్ట్ టెన్ మోర్ మినిట్స్...”

ఇక ఆ ఫో న్ పెట్టేడంటే ఎంత గట్టిగా అరుస్తా డో తెలుసు.

గాభరాగా ఎదురుగా కనబడ్డ నాలుగు ప్యాంట్లు , చొక్కాలతో బాటూ పెళ్లి చీర మడతలు నలిగిపో తున్నా
చూసుకోకుండా సూట్కేసులో కుక్కేసాను.

“ఏం చేస్తు న్నావింతసేపు? ఫో న్ ఛార్జ రలు ్,లాప్ టాప్ ఛార్జ ర్లంటూ పరిగెత్తకుండా అన్నీ పెట్టు కున్నావా?” 
అన్నాడు విసుగ్గా .

ఎంట్రన్సులో ఉన్న అందమ�ైన ఆర్టు పీసుని చేత్తో తడిమి మౌనంగా బయటికి నడిచేను. 

ఒక్క నిమిషం అని వెనక్కి పరుగెత్తి హాల్లోంచి పెరట్లోకి వెళ్లే గ్లా స్ డో ర్ ముయ్యబో తూ ఉయ్యాలకేసి
చూసేను.

కొస మీద కూచుని ఉన్న ఉడుత ఒకటి తల తిప్పి భయంగా చూసింది. అది నాకేసే నిస్సహాయంగా
చూస్తు న్నట్టు అనిపించసాగింది.

బయట భూమి అంతం కాబో తున్నట్టు దట్టంగా దుమ్ము పట్టిన ఆకాశంలో కిరణాలు కోల్పోయి ఎరుపు
రంగు రింగులా కనబడుతున్నాడు సూర్యుడు.

వారం రోజుల ముందే దక్షిణ కాలిఫో ర్నియాలో కార్చిచ్చు రగులుకుని వందల ఇళ్ళు తగలబడిపో వడం
మొదలు పెట్టేయి.

దట్ట మ�ైన పొ గ కొన్ని వందల మ�ైళ్ళ వరకు ఆవరించింది. దానితో బాటూ 101డిగల
రీ్ ఫారన్  హీట్
వేడిమితో హీట్ వేవ్ కాలిఫో ర్నియాని చుట్టు ముట్టింది. ఆ ప్రభావంతో మేమున్న బే ఏరియాలో కొండలున్న
పతీ
్ర చోటా కార్చిచ్చు రాజుకోవడం మొదలుపెట్టి ఆర్పడానికి వీలు లేనంత వేగంగా చుట్టు పక్కల అన్ని
ప్రాంతాలకీ విస్త రించసాగింది.

మాకు 2 మ�ైళ్ల దూరంలో కొండ తగలబడుతుండడం, మా ఇల్లు కూడా రిస్కు జోన్ లో ఉండడం వల్ల
ఇవాక్యుయేషన్ ఆర్డ రలు ్ వచ్చేయి.

ఇళ్
లు తగలబడుతూండడం టీవీ లో చూస్తే నే భయంతో తల మొద్దు బారిపో సాగింది.

అలాంటిది ఇల్లు రిస్కు జోన్ లో ఉందని కబురు తెలియగానే మెలితిరిగే బాధ కలగసాగింది.

“ఇంటికి ఇన్సూరెన్సు ఉందనుకో...కానీ...” ఎవరితోనో ఫో న్లో అంటున్న శశి మాటలు వినబడనంతగా


చెవులు గళ్ళెతిపోయినట్లు గుయ్యిమని ఏదో శబ్దం వినిపించసాగింది.

అగ్నిమాపక దళ హెలీకాప్ట రొకటి ఎగిసిపడ్తు న్న మంటల్ని ఆర్పే మందేదో వెదజల్లు తూ కొండ చుట్
టూ 

34
జుయ్ జుయ్ మని తిరుగుతోంది.

చుట్
టూ ఆ మందు తాలూకు పొ డి లాంటి పదార్థం గాల్లో గులాబీ రంగులో తేలొస్
తూ ఊపిరి సలపనివ్వడం
లేదు.

కారు వీథి మలుపు తిరుగుతుండగా మాస్కు ముఖానికి బిగించుకుని లిండా వాళ్ల ఫ్రంట్ లాన్ దగ్గిర
ఆపమని చప్పున వాళ్ళ గుమ్మం దగ్గిరికి పరుగెత్తేను. ఉహూ..ఇంట్లో లేదు. ఇంటి చుట్
టూ వెతికాను. వాళ్
లు
అప్పటికే వెళ్లిపోయినట్టు న్నారు.

“అయ్యో, వాళ్
లు ఎక్కడికి వెళలే ్రో తెలిస్తే బావుణ్ణు ” నాలో నేను గొణుక్కుంటున్నట్టు అన్నాను తిరిగి
కారెక్కుతూ.

“ఈ దేశంలో ఎంత స్నేహితుల�ైనా గుమ్మం ఇవతలి వరకే. ఇంత ప్రమాదం వచ్చినా కనీసం ఒక మాట
కూడా చెప్పకుండా వెళ్లిపో యింది చూడు నీ వాకింగు స్నేహితురాలు” అన్నాడు ఎద్దేవా చేస్తు న్నట్లు శశి.

మారు మాట్లా డకుండా కారు అద్దా ల్లోంచి బయటికి చూడసాగేను.

నిజానికి లిండా వాళ్ళు ఎక్కడికి వెళ్లా రో తెలిసినా వాళ్ళ కూడా వెళ్లగలిగేటంత స్నేహం లేదు.

ఇద్ద రం వాకింగ్ చేసతూ ్ ఎన్నో విషయాలు మాట్లా డుకుంటాం కానీ ఒకరింట్లోకి ఒకళ్ళం ఇప్పటివరకూ
వెళ్ళింది లేదు.

ఇక మగవాళ్ళిద్ద రూ ఎప్పుడన్నా బయట లాన్ల లోంచి “హలో” లు చెప్పుకోవడం మాత్రమ.ే  

కొండ మలుపు తిరగగానే మా ఇల్లు దట్ట మ�ైన పొ గలో కనుమరుగ�ైపో యింది. అల్లి బిల్లి గా అల్లు కున్న
పొ దరిల్లు లాంటి అందమ�ైన ఇంట్లో ఉండడమే ప్రమాదం అన్న విషయం జీర్ణించుకోలేకపో తున్నాను.

నా వరకు నాకు ఇల్ లంటే వస్తు వులు, వాటితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు.

అద్దె ఇంటి నుంచి సొ ంత ఇంటికి మారినపుడు వదిలేసిన వస్తు వులతో బాటే నా జ్ఞాపకాలన్నీ
పో గొట్టు కున్నాను.

ఇప్పుడు ఇల్లే పో గొట్టు కోవాల్సి వస్తుందంటే విపరీతంగా దుఃఖంగా ఉంది.

రెండు చేతులూ జోడించి మనసులోనే కనబడ్డ దేవుళ్ళందరికీ మొక్కసాగేను.

చిన్నప్పుడు పరీక్షలకి వెళలే ్టపుడు అమ్మ వరండాలోని దేవుడి పటానికి దణ్ణం పెట్టమంటే పెడసరంగా
తిరిగి చూడని నేనేనా ఇప్పుడిలా...

మా ఇంటికి పదిమ�ైళ్ల దూరంలో ఉన్న హో టల్లో ఉన్నాం ప్రస్తు తానికి.

అసలే కరోనా కష్ట కాలం. పుండు మీద కారంలా ఈ వ�ైల్డ్ ఫ�ైర్స్ కష్ట మొకటి. 

లిండాకి ఫో న్ చేసేను. 

నా గొంతులోని బాధే తన కంఠంలోనూ ధ్వనించింది. 

“ఏం చేస్తాం లిండా బాధపడకు” అన్నాను అనునయంగా. 

“బాధే కాదు, నిస్సహాయంగా, చికాగ్గా ఉంది” అంది అవతల్నించి. 

“అవును” అన్నాను. 

35
బదులుగా “కాలిఫో ర్నియాలో ఏటా వందల వేల  ఎకరాలు ఇలా తగలబడిపో తున్నా ప్రభుత్వాలకి
బుద్ధి రావడం లేదు. 2020 వ సంవత్సరమ�ైతే చెప్పనే అక్కరలేదు. ఒక్క ఈ సంవత్సరంలోనే ఇప్పటివరకు
మూడు మిలియన్ల ఎకరాలకి ప�ైగా అడవి తగలబడిపో యింది. ఒక్కసారిగా దాదాపు పదిచ ోట్ల రాజుకున్న
వ�ైల్డ్ ఫ�ైర్స్ వల్ల నాలుగువేలకి ప�ైగా  ఇళ్
లు దగ్ధ మయ్యేయి. ఇలా ఇళ్
లు కాలిపోయి నిరాశ్రయులయ్యిన వాళ్
లు ,
మనలాగా ఇళ్
లు వదిలేసి పరుగుతీయాల్సి వచ్చిన వాళ్
లు వేలమంది ఉన్నారు.” అని 

మళ్లీ తనే “ఇలా హఠాత్తు గా ప్రకృతి వ�ైపరీత్యాల దృష్ట్ యా విరుచుకు పడే కార్చిచ్చుల్ని కూడా అరికట్టే
మార్గం వుందీ  అని ఇప్పుడిప్పుడే కనిపెటటా ్రట.” అంది. 

“మార్గాంతరం ఉందంటావా?” అన్నాను ఆశగా. 

“ఊ. “ ప్రిస్క్రైబ్డ్ ఫ�ైర్ “. ఇది ఎంతవరకు పనిచేస్తుందో తెలియకపోయినా ఏదో ప్లా నయితే రిలీజ్
చేసేమంటున్నారు” అంది నిట్
టూ రుస్
తూ . 

“ప్రిస్క్రైబ్డ్ ఫ�ైర్” అంటే? అన్నాను. 

“అంటే ఇలా ఫ�ైర్ హజార్డ్ ఉన్న అటవీ ప్రాంతాలు, నివాస ప్రాంతాలు మొ.న వాటి చుట్
టూ పెద్ద పెద్ద
ప్రొ క్లెయినర్ల తో  లక్ష్మణ రేఖలు గీసినట్టు సరిహద్దు లు తవ్వుతారన్నమాట. ఆ సరిహద్దు లకటువ�ైపు కొంత
ప్రాంతం మేర అంటించి గడ్డి లేకుండా నేలని చదునుచేస్తా రు. అందువల్ల ఒక చోట వచ్చిన మంట అతి
వేగంగా ఇతర ప్రాంతాలకు విస్త రించకుండా, ముఖ్యంగా కొండల మీద గడ్డి భూములు తగలబడ్డ ప్పుడల్లా
చుట్టు పక్కల ఉన్న ఊళ్
లు తగలబడకుండా అడ్డు కట్ట వెయ్యొచ్చు.” అంది. 

“హమ్మయ్య, మన కాలనీకి అలాంటిది వెంటనే చేస్తే బావుణ్ణు ” అన్నాను ఆశావహంగా.  

“మన ప్రాంతంలో కూడా మొదలుపెట్టేరని విన్నాను. నిజానికి గాలివాటు అనువుగా ఉండే 


వసంతకాలంలో ఇదంతా చెయ్యాలట. ఈ సంవత్సరానికి ఇప్పటికిప్పుడు చెయ్యవచ్చు, చెయ్య లేకపో వచ్చు.
ఏదయినా అగ్ని మన ఇళ్ల వరకూ రాదని ఆశిద్దాం.  మీరెలా ఉన్నారో గానీ మాక�ైతే కంటిమీద కునుకు
ఉండడంలేదు. అగ్నిమాపకదళం మన కాలనీ త్రో వని మూసేసినా మా జార్జి ఇంటి దిక్కుగా దొ ంగతనంగా వెళ్లి
ఇంటి చుట్
టూ లాన్ ని, గోడల్ని నీటితో తడిపి వస్తు న్నాడు. అస్త మాటూ అదే కలవరిసతూ ్ పిచ్చి పట్టినవాడిలా
తిరుగుతున్నాడు.” అంది మరింత బాధగా. 

“నేను అర్థం చేసుకోగలను లిండా, నీకభ్యంతరం లేకపో తే మీరు ఏ హో టల్లో ఉన్నారో తెలుసుకోవచ్చా?”
అన్నాను దుఃఖం ముంచుకొస్తుండగా.

“హో టళ్ళకి రోజుకి వందల కొద్దీ డాలర్లు పొ య్యడం ఎందుకని ఎయిర్ బీ ఎన్ బీ లో ఇల్లొ కటి  అద్దెకి
తీసుకున్నాం. అయినా మనసంతా ఇంటి మీదే ఉందనుకో.” అంది లిండా. 

ఇంకా ఇవాక్యుయేషన్ ఆర్డ రు కొనసాగుతూ ఉండడంతో నేనూ ఎయిర్ బీ ఎన్ బీ లో ఏద�ైనా ఇల్లు కాస్త
చవగ్గా దొ రుకుతుందేమో అని చూడ్డం మొదలు పెట్టేను.

శశితో “ఇలా వచ్చి చూస్తా వా?” అన్నాను  కాస్త సహనం తెచ్చుకుని.

ఎప్పుడు లేచేడో లాప్ టాపు ముందేసుకుని సీరియస్ గా ఆఫీసు పని చేసుకోసాగేడు.

పరమ విసుగ్గా నా చేతిలోని లాప్ టాపు మంచమ్మీద గిరాటేసి “నేను రేపట్నుంచి ఎక్కడ ఉండాలా
అని గాభరా పడుతూ ఉంటే నీకు ఇంత దీక్షగా ఆఫీసు పని ఎలా చేసుకోవాలనిపిసతూ ్ ఉంది?” అని అరిచేను
ఒక చేత్తో తన  లాప్ టాపుని వెనక నుంచి దభీమని మూస్
తూ .

36
“ఆ... ఆ...ఆ... సేవ్ చెయ్యలేదు” ఒక పక్క అరుస్తు న్న శశిని పట్టించుకోకుండా.

చిందులు తొక్కుతూ లేచి గ్లా స్ డో ర్ గట్టిగా చప్పుడు చేసతూ ్ తీసి, దభామని విరిగేటట్లు వేసి వెళ్లి
బాల్కనీలో బయటికి చూస్
తూ కూచున్నాడు.

మంచమ్మీద అడ్డంగా పడుకుని గట్టిగా ఏడుస్తు న్న నన్ను పట్టించుకోకుండా తనక్కడే కూచుని
ఉన్నాడు.

నాకింకా పంతం పెరగసాగింది. తనొచ్చి మాట్లా డితేనే పలకాలని మొండిగా అలాగే బో ర్లా పడుకుని
ఉండిపో యేను. 

ఎంత సేపు అలా ఉండిపో యానో తెలీదు.

ఏడ్చి ఏడ్చి కందిపోయిన బుగ్గ ల్ని తడుముకుంటూ లేచి కింద పడ్డ తన ఆఫీసు లాప్ టాపుని తీసేను.
అంతలోనే కాస్త మెత్తబడి, పాపం ఏం పనిలో ఉన్నాడో ఏమో. సేవ్ చెయ్యనివ్వకుండా మూసేసేను. నన్ను
నేను తిట్టు కుంటూ లాగ్ ఇన్ చేసేను. బ్రౌజర్ లో ఎదురుగా ఎయిర్ బీ ఎన్ బీ స�ైటు కనబడింది.

ఆ వెంటే ఇవేక్యుయేషన్ ఆర్డ ర్ ఎత్తి వేస్తు న్నట్టు వచ్చిన మెసేజీ నోటిఫికేషను కనబడింది నా ఫో నులో.  

ఒక్క ఉదుటున  బాల్కనీలో కి వచ్చి ఇంకా అలాగే కూచుని ఉన్న శశి వెనక్కి వెళ్లి నిలబడి తల మీద 
చెయ్యి వేసి నిమురుతూ “సారీ” అన్నాను.

చిన్నపిల్లా డిలా వెక్కి వెక్కి ఏడుస్


తూ నా నడుం చుట్టు కున్నాడు.

***

37
 తెలుగులో ై స న్స్ ఫిక్షన్ రచనలు చేస్ తు న్న కొద్ది మందిలో అనిల్ ఎస్.
రాయల్ ఒకరు. చదివింది గణితంలో ఎమ్మెస్సీ, ఎం.ఫిల్. వృత్తి పరంగా
సాఫ్ ట్ ‌వేర్ ఆర్కిటెక్
ట్ . నివాసం శాన్ ఫ్
రాన్సిస్కో తీరప్ర ాంతం. అరుదుగా కథలు
రాసే అనిల్ దశాబ ్ద కాలంలో రాసినవి పది నేరు కథలు, రెండు అనువాద
కథలు. 2009లో వచ్చిన తొలికథ ‘నాగరికథ’ అప్పట్లో ఓ సంచలనం.
లిక్ష్ట ై మ న కథ, అతి తక్కువ పాత ్ర లు, ఉత్కంఠభరితమ ై న కథనం, వాక్యాల
వెనుక గూఢార్ధా లు, కొసమెరుపు ముగింపులు - ఇవి అనిల్ కథల్లో
తప్పనిసరిగా కనిపించే లక్షణాలు. అనిల్ ఇంతవరకూ రెండు పుస ్తకాలు

్ర చురించారు. తన కథలన్నిటినీ ఒకే చోట గుదిగుచ్చిన ‘నాగరికథ’
సంకలనం ఒకట ై తే, మరొకటి ఔత్సాహిక రచయితల కోసం ఉద్దే శించిన
‘కథాయణం’.

9. ఆన్నీ
అనిల్ ఎస్. రాయల్
ఆ పాప పెరట్లో ఆడుకుంటోంది.
“చూడు, నీ కోసం ఏం చేశానో,” అంటూ గుప్పిట విప్పి చూపించింది. వేళ్లకి తొడుక్కునే ఫింగర్ పపెట్.
ఫెల్ట్ గుడ్డ ముక్కలతో ముచ్చటగా కుట్ట బడ్డ నల్ల మచ్చల తెల్లా వు బొ మ్మ.
“వీడి పేరు మిస్టర్ మూ. నచ్చాడా?”
పాప బదులు కోసం ఎదురు చూస్తు న్నట్లు ముఖం పెట్టింది. క్షణంలో ఆ ముఖం విప్పారింది.
“ఇంద. తీసుకో,” అంటూ చెయ్యి చాపింది.
అయితే, అందుకోటానికి అక్కడెవరూ లేరు. ఆ పాప ఎదురుగా ఉందల్లా ఓ పాత రాతి అరుగు -
ఖాళీగా.
అంతలో, పాపకో అనుమానమొచ్చింది. మిస్ట ర్ మూని తన మిధ్యాస్నేహితుడికి అప్పగించటం అంత
తెలివ�ైన పని కాదేమోననిపించింది.
“మొన్న మిస్ పిగ్గీని పో గొట్టినట్టు , మిస్ట ర్ మూని కూడా పో గొట్ట వుగా?” అంది, అపనమ్మకం
మోమంతా నింపుకుని. క్షణమాగి, “ఎందుక�ైనా మంచిది. నావద్దే భద్రంగా దాస్తా లే,” అంటూ చెయ్యి వెనక్కి
తీసుకుంది. రెండు చేతుల్లో నూ మిస్టర్ మూని పొ దివిపట్టు కుని గుండెకి హత్తు కుంది.
అప్పుడే - ఇంట్లోంచి అమ్మ పిలుపు వినపడింది, “ఆన్నీ, ఆడుకుంది చాలు, ఇక రా. నీకు చెప్పిన
పని అక్కడే వదిలేశావు.”
***
పాప తల తిప్పి అరచి చెప్పింది, “వచ్చేస్తు న్నా అమ్మా. ఇంకొక్క నిమిషంలో వచ్చేస్తు న్నా.”
కేథరిన్ చాలా హడావిడిగా ఉంది. ఈ సమయంలో పతి
్ర పనిదినమూ ఆమె ఇలా హడావిడిగానే

38
ఉంటుంది. ప్రస్తు తం ఆమె ఓ పక్క దేనికోసమో వెదుకుతూ, మరో పక్క సెల్ ఫో న్లో మాట్లా డుతోంది.
“ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్. అమ్మ పరిసథి ్తి రోజు రోజుకీ దిగజారిపో తోంది.”
“ఎందుకలా అనుకుంటున్నారు?” అవతల నుండి భావరహితమ�ైన గొంతుతో డాక్టర్ పశ
్ర ్న.
“ఎందుకంటే ... మామూలుగాన�ైతే అమ్మకి ఆరేడు తరాల చరితల
్ర ు జ్ఞాపకముంటాయి. కానీ ఈ మధ్య
చాలా విషయాలు మర్చిపో తోంది,” అంటోండగా గదిలో ఓ మూల కుర్చీకి తగిలించున్న హ్యాండ్‌బ్యాగ్‌ కేథరిన్
కళ్ల బడింది. దాన్నందుకుని భుజాన తగిలించుకుని గదిలోంచి బయటికొచ్చింది. అదో చిన్న నడవా. ఇంట్లో
మిగిలిన గదుల్ని కలుపుతుంది.
“అల్జీమర్స్‌తో బాధపడేవారికి అది సహజమే,” ఫో న్లో డాక్టర్ వివరణ.
“ఏదో వేరే లోకంలో ఉన్నట్లుండటం, తనలో తానే మాట్లా డుకోవటం ... అదీ సహజమేనా?” కేథరిన్
విసురుగా అడిగింది.
“ఏం మాట్లా డుతుంది?” డాక్టర్ ఆమె విసురు వినిపించుకోలేదో , విన్నా పట్టించుకోలేదో , మొత్తా నికి
తన ధో రణిలో అభావంగా అడిగాడు.
కేథరిన్ బదులీయకుండా నడవా ఆ చివరనున్న గది వద్ద కి నడిచింది. లోపలంతా చిందరవందరగా
ఉంది. బొ మ్మలు, దుప్పట్లు , దిండ్లు గదంతా గందరగోళంగా విసిరేయబడున్నాయి. తలుపు దగ్గ రో ఊదారంగు
స్కూల్‌బ్యాగ్ సిద్ధంగా ఉంది. దానిప�ై పసుపు రంగులో, చిన్న పిల్లల చేతిరాతతో, పెద్ద పెద్ద అక్షరాలతో
‘ANNIE’ అని రాయబడుంది.
పళ్
లు కరచిపట్టి ముందుకి వంగి స్కూల్‌బ్యాగ్ అందుకుని భుజాన వేసుకుంది కేథరిన్. తర్వాత ఫో న్లో -
“సారీ డాక్టర్. తర్వాత మాట్లా డతాను,” అని చెప్పి బదులు కోసం ఎదురు చూడకుండా ఫో న్ పెట్టేసింది.
***

ఆ వృద్ధు రాలు మంచం అంచున కూర్చుని ఏదో గొణుక్కుంటోంది. ఈ మధ్య ఆమె రోజంతా ఇదే పనిలో
ఉంటోంది - నిద్రించేప్పుడు తప్ప. గత మాసమే ఆమెకి డెబ్భయ్యేళ్
లు నిండాయి, కానీ ఆ తనువులో మరో
దశాబ్ద పు వార్ధక్యం అదనంగా కనిపిసతోం
్ ది. ఆమె వంటి నిండా ముడతలే. తూర్పుదిక్కునున్న కిటికీ నుండి
ఆమె దేహమ్మీద వాలుతోన్న ఉదయ సూర్యుడి కిరణాలు ఆ ముడతల సాయంతో చారలు చారలుగా నీడలు
పరుస్తు న్నాయి. అవి ఎండిపోయిన పంట కాలువలని తలపిస్తు న్నాయి.
ప్రస్తు తం ఆ వృద్ధు రాలు ఒక చిన్న భరిణ ఒడిలో పెట్టు కుని దాని అంచులు తడుముతూ గొణుగుతోంది.
అదో కొయ్యతో చెయ్యబడ్డ భరిణ. దాన్నిండా అందమ�ైన దంతపు నగిషీలు పొ దగబడున్నాయి. ఆ భరిణ ఘన
గతానికి మిగిలిన జ్ఞాపకాలవి. వృద్ధు రాలి ఒంటిమీది నీడలకి, ఈ నగిషీల ధవళ జాడలకి మధ్య పోలికేదో
పొ డగడుతోంది.
గది తలుపు వద్ద నుండి కేథరిన్ లోపలకి తొంగిచూసింది. ఆమె భుజాన హ్యాండ్‌బ్యాగ్‌, స్కూల్‌బ్యాగ్‌
వేలాడుతున్నాయి.
“వెళలొ ్స్తా నమ్మా. జాగ్రత్తగా ఉండేం?” కేథరిన్ కేకేసి చెప్పింది.
వృద్ధు రాలు తన లోకంలో తానుంది.
“అమ్మా?” కేథరిన్ స్వరం పెంచి పిలిచింది.

39
వృద్ధు రాలు మెల్లిగా తలతిప్పి చూసింది. గొణగటం ఆపేసింది.
“ఆఫీస్‌కి వెళతు ్న్నా. మందులు వేసుకున్నావా?” కేథరిన్ అడిగింది.
వృద్ధు రాలు బదులీయకుండా భావరహితంగా చూస్
తూ ఉంది.
కేథరిన్ నిట్ టూ రుస్
తూ గదిలోకి అడుగుపెట్టింది. ఆమె చూపు మంచం పక్కనున్న బల్ల మీద పడింది.
దాని మీద నీటితో నింపిన చిన్న లోటా, ఆ పక్కనే ఒక మాత్రల డబ్బీ కనిపించాయి. అవి రెండూ ఒకే చేత్తో
తీసుకుని తల్లి కేసి చాచిందామె.
“అమ్మా, ఈ రోజుకి నేనిస్తు న్నా తీసుకో, ప్లీజ్. రేపట్నుండీ తప్పకుండా ఆన్నీ ఇచ్చేట్లు చూస్తా గా.”
వృద్ధు రాలు ఉలకలేదు. ఇంకా భావరహితంగానే చూస్తోంది.
కేథరిన్ కళ్ల తో బతిమిలాడింది మరో సారి. మళ్లీ అదే బదులొచ్చింది అట్నుండి. ఇక ప్రయత్నించటం
నిరర్ధ కమని అర్ధ మయిందామెకి.
“సరే, నీ ఇష్టం. నిన్ను బతిమిలాడి ఒప్పించే తీరిక లేదు నాకు,” అంటూ విసుగ్గా లోటా, మాత్రల డబ్బీ
బల్ల మీద పెట్టేసింది. లోటాలోంచి కొన్ని నీళ్
లు తొణికి బల్ల ప�ై పడ్డాయి.
“కనీసం భోజనమన్నా సమయానికి చెయ్యి. అన్నీ డ�ైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్నాయి. లంచ్
ట�ైముకి మోగేలా అలారం పెటటా ్ను,” అని చెబుతూ కేథరిన్ బయటికి నడిచింది.
వెళ్లిపో తున్న కూతుర్ని వెనకనుండి చూస్తూ వృద్ధు రాలు కాసేపలాగే ఉండిపో యింది. తర్వాత ఆమె
ధ్యాస మళ్లీ ఒళ్లోని భరిణ మీదకి మళ్లింది. ఏదో గొణుగుతూ భరిణ అంచుల్ని బొ మికెల్లాంటి వేళ్లతో ఓ సారి
తడిమి, జాగ్రత్తగా దాని మూత తెరిచింది. దాన్లోనుండి నున్నగా తళతళలాడుతోన్ని గోళీలాంటి గుండ్రటి
వస్తు వొకటి రెండు వేళ్లతో భద్రంగా పట్టు కుని బయటికి తీసింది. కళ్ల దగ్గ రికి తెచ్చి కాసేపు పరీక్షగా చూసి
మళ్లీ భరిణలో పెట్టేసింది. తర్వాత నాలుగంగుళాల చెక్క బొ మ్మనొకదాన్ని బయటికి తీసి పరీక్షించింది.
చేతబడుల్లో వాడే దిష్టిబొ మ్మలా ఉందది. అర నిమిషం పాటు దాన్ని అటూ ఇటూ తిప్పి చూశాక లోపల
పెట్టేసింది.
తర్వాత భరిణలోంచి చూపుడు వేలు పొ డవున్న మొండికత్తి ని బయటికి తీసింది.
***
‘ఇంకాసేపట్లో నాకోసం మమ్మీ వచ్చేస్తుంది’ అనిపించింది పెరట్లో ఆడుకుంటోన్న ఆన్నీకి హఠాత్తు గా.
తల్లి కవళికల్నే కాకుండా ఆమె కదలికల్ని కూడా ముందే పసిగట్ట గలిగే అమోఘమ�ైన శక్తి ఆ అమ్మాయికుంది.
తనొస్తే చీవాట్లేసి తీసుకెళ్లి పో తుంది. ఆలోగా చేసేయాల్సిన ముఖ్యమ�ైన పనొకటి మిగిలిపో యింది.
“అది మనిద్ద రి మధ్య రహస్యం. ఒట్టేయ్, ఎవరికీ చెప్పనని?” అంటూ చెయ్యి చాపింది - చిటికెన వేలు
తప్ప అన్ని వేళలూ ్ మడిచి. తర్వాత ఆ చేతిని గాల్లో ప�ైకీ కిందికీ ఆడించింది - పింకీ ప్రామిస్ చేస్తు న్నట్లు
నటిసతూ ్.
అప్పుడే - ఆన్నీ ఊహించినట్లే - కేథరిన్ పెరట్లో అడుగు పెట్టింది. చేతిగడియారంలో సమయం చూస్
తూ ,
“ఆన్నీ,” అని పిలిచింది విసుగ్గా .
ఆ పిలుపు పట్టించుకోకుండా, చిన్న గొంతుతో తన మిధ్యామితృడికి హెచ్చరికి జారీ చేసింది ఆన్నీ,
“ఒట్టు తీసి గట్టు మీద పెటటా ్వంటే చూస్కో ...”
“ఆన్నీ,” తల్లి పిలుపు మళ్లీ వినపడింది - ఈ మారు కాస్త గట్టిగా.
ఆన్నీ త్వరత్వరగా హెచ్చరిక పూర్తిచేసింది, “ ... నిన్ను నమ్మటం మానేస్తా ను. నీమీదొ ట్టు .”

40
“ఆంజెలీనా ... ఉన్న ఫళాన రా ఇక్కడికి,” వెనకనుండి తల్లి ఉరిమింది - ఆన్నీ అసలు పేరు ఒత్తి
పలుకుతూ. అలా పిలిచిందంటే ఆమెకి కోపమొచ్చిందని.
“మళ్లీ రేపొ స్తా . సరేనా? టాటా,” అంటూ ఆన్నీ లేచి తల్లి దగ్గ రికి పరిగెత్తింది.
కూతురు తన దగ్గ రికి చేరేలోపు కేథరిన్ కాస్త చల్ల బడింది.
“పొ ద్దు న్నే అమ్మమ్మ మందులు వేసుకునేలా చూడటం నీ పని కదా ఆన్నీ. ఇలా నిర్లక్ష్యం చేస్తే ఆమెకి
ప్రమాదం కాదూ?” అంది కాస్త శాంతంగా.
“సారీ మమ్మీ,” అంది ఆన్నీ నేలచూపులు చూస్
తూ .
“నువ్వు తప్ప మరెవ్వరు మందులిచ్చినా ఆమె వేసుకోదని మర్చిపో కు,” గుర్తు చేసింది కేథరిన్.
“ఎందుకు మమ్మీ ... అమ్మమ్మ నేనిస్తే నే తీసుకుంటుంది?” అంది ఆన్నీ తలెత్తి తల్లి ని చూస్
తూ .
“నువ్వు అచ్చం తనలానే ఉంటావు కదా. అందుకు.”
తనని, అమ్మమ్మని పక్కపక్కనే ఊహించుకుంది ఆన్నీ. ఇద్ద రి మధ్యా పోలికలు కనిపెట్టటానికి
ప్రయత్నించి విఫలమయింది. కానీ ఆ విషయం తల్లి తో అనలేదు.
“నీకిచ్చిన పని మళ్లీ ఎప్పుడూ మర్చిపో వుగా?” అంది కేథరిన్ ఆన్నీ కళ్ల లోకి సూటిగా చూస్
తూ .
మర్చిపో నన్నట్లు తలూపిందా అమ్మాయి.
“అన్నట్లు - ఆన్నీ ... నీకిప్పుడు పదేళలు ్. ఇమాజినరీ ఫ్రెండ్స్‌తో ఆడుకునే వయసు కాదిది. వాళ్ల ని
వదిలేయాల్సిన సమయమొచ్చింది,” అంది కేథరిన్ - ఇందాకటిదాకా ఆన్నీ ఆడుకున్నవ�ైపుకి తల పంకిసతూ ్.
ఆన్నీ అందమ�ైన ముఖాన్ని విచారపు మబ్బొ కటి కమ్మింది. “అలాంటి ఫ్రెండ్స్ ఉంటే తప్పా మమ్మీ?”
అంది బెంగగా.
చటుక్కున ముందుకొంగి ఆన్నీ భుజం పట్టు కుని, “లేదు … లేదు ఆన్నీ. అది తప్పేం కాదు.
చిన్నప్పుడు నాకూ ఒక ఇమాజినరీ ఫ్రెండ్ ఉండేవాడు. ఒక వయసు దాటాక అలాంటి స్నేహితులతో మనకి
అవసరం ఉండదు. అంతే,“ అంది కేథరిన్ అనునయంగా. కూతుర్ని చూస్తే జాలేసిందామెకి. కానీ తప్పదు,
కొన్ని సార్లు తల్లు లు ధృడంగా ఉండాల్సిందే.
ఆన్నీని వదిలి నిటారుగా నిలబడి మళ్లీ చెప్పింది కేథరిన్, “నేననేదేమంటే ఆన్నీ ... నీకు నిజం ఫ్రెండ్స్
కూడా అవసరమని.”
ఆన్నీ బదులీయకుండా తల్లి ముఖంలోకి చూస్ తూ ఉండిపో యింది. అప్పటికి ఆ విషయం
వదిలేయాలని నిర్ణ యించుకుంది కేథరిన్. “సరే, ఇక వెళ్దాం పద. లేకపో తే నువ్వు స్కూలుకి, నేను ఆఫీసుకి
ఆలస్యమ�ైపో తాం,” అంటూ స్కూల్‌బ్యాగ్ ఆన్నీకి అందించింది.
***
పెరట్లో ఓ మూలనున్న సిమెంట్ అరుగుమీద ఆసీనుల�ైన యువకులిద్ద రూ తల్లీకూతుళ్ల సంభాషణ
సాంతం మౌనంగా వీక్షించారు.
స్కూల్‌బ్యాగ్ వీపున మోసుకుంటూ తల్లి వేలు పట్టు కుని పెరట్లోంచి వెళ్లిపో తోన్న ఆన్నీని చూస్తూ
“ఎంత ముద్దొస్తోందో ... నీ పాప,” అన్నాడు ఆ యువకులిద్ద ర్లో నూ పెద్దవాడిలా కనిపిసతో ్ న్నతను. రఫాయెల్
అని పిలవబడేవాడతడు. పాతికేళ్ల వయసువాడిలా కనిపిస్తు న్నాడు, కానీ అతని అసలు వయసెంతో
చెప్పటం కష్టం. ఆ వయసులోనే పుట్టి అప్పటుండీ అదే వయసులో ఇరుక్కుపోయినట్లు న్నాడు.

41
రెండవ యువకుడు తలూపాడు. అతడూ రఫాయెల్ చూస్తు న్నవ�ైపే చూస్తు న్నాడు. జిమ్మీ అని
పిలవబడతాడతడు. రఫాయెల్ కన్నా చిన్నవాడిలా కనిపిస్తు న్నాడు.
“నాకూ ఒకప్పుడో పాప ఉండేది. నీ పాపంత ముద్దు గానూ ఉండేది,” అన్నాడు రఫాయెల్ మళ్లీ .
జిమ్మీ తలతిప్పి రఫాయెల్ని
‌ చూశాడు. “’ఉండేది’ అంటే ... ఏమయింది?” అన్నాడు.
“పెరిగి పెద్దదయింది. నేనున్నానని నమ్మటం మానేసింది,” అన్నాడు రఫాయెల్.
జిమ్మీ కళ్
లు పెద్దవయ్యాయి. “అదెలా సాధ్యం? నిన్ను సృష్టించిందే ఆమె కదా!” అన్నాడు ఆశ్చర్యంగా.
రఫాయెల్ మెల్లిగా జిమ్మీవ�ైపు తిరిగాడు. “అదంతే సో దరా. వాళ్ల కి మన అవసరం లేని రోజొకటొస్తుంది.
అందరికీ తప్పని రోజు. నీక్కూడా వస్తుందా రోజు, హెచ్చరిక లేకుండా,” అన్నాడు.
ఈ ఊహించని వార్త జిమ్మీని పిడుగులా తాకింది. అతను కాసేపు స్థ బ్దు గా ఉండిపో యాడు. తేరుకున్నాక
నోరుతెరిచాడు, “అలాంటి ఉనికి ఊహించలేకపో తున్నా! అదెంత పరమార్థ రహితమ�ైన పరిసథి ్తి!”
కొద్ది క్షణాల మౌనం తర్వాత మళ్లీ అన్నాడు జిమ్మీ, “నేనేం చెయ్యాలి ... ఆ తర్వాత?”
“పశ
్ర ్న - నువ్వు ఏం చెయ్యాలనేది కాదు; ఏం చెయ్యకూడదనేది,” రఫాయెల్ బదులిచ్చాడు.
జిమ్మీ అర్ధం కానట్లు చూశాడు.
“తను నిన్ను మరచినా, నువ్వామెని విడువకు,” వివరించాడు రఫాయెల్. “తనకి మళ్లీ ఏదో నాడు
నీతో అవసరం పడకపో దు. ఆ రోజు కోసం ఎదురు చూడు. అందాకా ... ఆమె జీవితంలో అడుగడుగునా
నీడగా తోడుండు. అదే నీ ఉనికి పరమార్ధం. అదే నువ్వు చెయ్యాల్సింది ... ఆ తర్వాత.”
***
వృద్ధు రాలు భరిణ నుండి ఏదో బయటికి తీసి పరీక్షించి లోపల పెట్టేయబో తూ ఆగిపో యింది. దానికేసి
కాసేపు దీక్షగా చూసింది. ఆమె నొసలు ముడిపడ్డాయి. శ్వాస భారమయింది. ఊహించని ఉద్వేగమేదో
అలముకొంది. వణుకుతోన్న అరచేతిలో ఆ వస్తు వునుంచుకుని పరికించి చూసింది.
ఆమె గుండెలోతుల్లో ఎక్కడో జ్ఞాపకమొకటి గుచ్చుకుంది. గుంటలు పడ్డ ఆమె కళ్ లు గుండ్రంగా
విచ్చుకున్నాయి. పెదాలు విడిపడి ఆమె ప్రమేయం లేకుండానే ‘ఓహ్’ అనే శబ్దం వెలువడింది.
ఆమె అరచేతిలో పవళించి నవ్వుతున్నట్లు చూస్తు న్నాడు మిస్ట ర్ మూ!
తరాలనాటి ప్రమాణం తన మనసులో మారుమోగింది, “... నా వద్దే భద్రంగా దాస్తా లే.”
వృద్ధు రాలు మిస్టర్ మూని రెండు చేతుల్లో భద్రంగా పొ దివిపట్టు కుని కళ్
లు మూసుకుంది.
***
రఫాయెల్ జిమ్మీతో మాట్లా డటం అర్ధాంతరంగా ఆపేసి చటుక్కున ఇంటివ�ైపు తల తిప్పాడు. అతని
చూపు తూర్పుగది కిటికీ మీద వాలింది. అటు చూస్ తూ అతను నిట్రాటలా నీలుక్కుపో యాడు. ఇదంతా
చూస్
తూ జిమ్మీ కలవరపడ్డా డు. చేత్తో రఫాయెల్‌ని కదిలించబో యాడు. అయితే ఆ అవసరం లేకుండానే
రఫాయెల్ తేరుకున్నాడు. కలలో ఉన్నట్లు , తనతో తాను చెప్పుకుంటున్నట్లు , గొణిగాడు:
“నా పాపకి నా అవసరం వచ్చింది. వెళ్లాలి … వెంటనే వెళ్లాలి.”
మరుక్షణం రఫాయెల్ మాయమ�ైపో యాడు.
పెరట్లో జిమ్మీ ఒక్కడే మిగిలాడు - నోరు తెరుచుకుని చూస్
తూ .

42
వృద్ధు రాలు మిస్టర్ మూని గుండెకి హత్తు కుని మౌనంగా కూర్చుని ఉంది. మూతపడి ఉన్న ఆమె
కనురెప్పల మాటునుండి నీళ్ లు ధారగా కారిపో తున్నాయి.
సప్త స్వరాలు ఏకమ�ైన నిశ్శబ్దం ఆవరించిన ఆ గదిలో పొ గమంచు తెరొకటి రూపం పో సుకుంది. అది
క్షణాల్లో రఫాయెల్ ఆకారం తీసుకుంది.
“ఆన్నీ,” అని పిలిచాడు రఫాయెల్ మంద్రంగా.
వృద్ధు రాల్లో చలనం లేదు.
రఫాయెల్ ముందుకొంగి మళ్లీ పిలిచాడు, ఈ సారి ఆమె పూర్తిపేరుతో.
“ఆన్ మేర”ీ
ఆమె మెల్లిగా కళ్
లు తెరిచింది.
తెరిచి - అతడిని చూసింది ... అరవయ్యేళ్ల తర్వాత మొదటిసారిగా.
అబ్బురం, సంబరం ఆ ముదుసలి ముఖంలో ముద్దు గా ముప్పిరిగొన్నాయి.
ఆన్నీ రెండు చేతులూ ముందుకి చాచి దో సిలితో మిస్ట ర్ మూని రఫాయెల్క
‌ ి అందించింది.
***
రచయిత నోట్: ఈ కథ నా రాబో యే లఘుచిత్రం ‘Annie’ స్క్రీన్-ప్లే ఆధారంగా రాసిన ఆంగ్ల కథకి
తెలుగు అనువాదం. అసలు కథలోని పేరలు ్, నేపథ్యం, స్థా నికత అలాగే ఉంచబడ్డాయి.

***

43
హిమబిందు.ఎస్ కాలిఫోర్నియాలో నివాసం ఉంటారు. వృత్తి రీత్యా జర్నలిస్టు ,
ఉపాధ్యాయిని. అమెరికా స్ రి స్తూ ఎన్నో కథలు రాసేరు.
థా నిక జీవితాన్ని చిత్

10. ప్రవాహం
- హిమబిందు . ఎస్
కొత్త ప్రాజెక్టు , కొత్త ఊరు, కొత్త అపార్టుమెంట్!
“కొత్త “ ల బారిన పడక తప్పని పరిసథి ్తి ! నాలుగేళ్ల కూతురు మహతి తో శాన్ ఫ్రాన్సిస్కో కి దగ్గ ర
లో ఉన్న ఓ ఊరికి ఒచ్చారు వసుంధర దంపతులు.
దేశాలు పట్టు కు రాగా లేనిది, ఊర్లు మారటం గురించి అంతలా ఆందో ళన పడకని భార్గ వ్ పదే
పదే చెప్పినప్పటికీ,
“రోజంతా ఆఫీసులో ఉండొ చ్చే నీకు ఏం తెలుస్తుంది ?! ప�ైగా మన వాళ్ళు తక్కువగా ఉండే ఊరిది
…..“ అనే ధో రణిలో వసుంధర….
కొంచెం కుదుట పడ్దా క, కూతురికో నేస్తాన్ని వెతికే పనిని అన్నిటి కన్నా ముందు పెట్టు కుంది.
అపార్టుమెంటు మేనేజరు పక్క వాటాలోనే ఉండటంతో, ఈ విషయమ�ై మాట కలిపింది.
వాళ్ళ కాంప్లెక్సు లోనే ఓ చిన్నపిల్ల ఉన్నదనీ, వర్కింగ్ పేరెంట్స్… వెరీ స్వీట్ కపుల్ అని చెప్పిందామె.
ఓ రోజు, తలుపు తీసుకుని అల్ల రి గా బయటకు పరుగెత్తింది మహతి . ఆ పరుగుని పసిగట్టి
బయటకి వెళ్ళేటప్పటికి , పాటియో కి దగ్గ రగా మహతితో పాటు ఓ యువతి నిల్చొని ఉంది.
“ హియర్ ఈజ్ యువర్ ప్రిన్సెస్ మామ్ !” అంటూ నవ్వింది.
కూతురి చెయ్యి అందుకుని, ఆమెకు ధ్యాంక్స్ చెపుతూ, తనని “వసు” గా పరిచయం చేసుకుంది.
“నా పేరు లిండా ! నాకూ మీ అమ్మాయి వయసు కూతురుంది, ఇప్పుడే తనని ప్రీ స్కూల్ లో దింపి
వొస్తు న్నాను , మీ అమ్మాయి పూల్ వ�ైపు పరుగు పెడుతుండటం చూసి ఆపాను, ఈ వయసే అంత,
తప్పేది , తగిలేది వాళ్ళకి అర్ధం కాదు “ అంది.
ఆమె మాటలతో ఏకీభవిస్ తూ , మీరు ఫలానా అపార్టుమెంటులో ఉంటారా ?! బహుశా మీ
అమ్మాయి గురించే మేనేజరు చెప్పిందని ఉత్సాహపడిన వసుంధర, తాను కూడా మహతిని ప్రీ స్కూల్ లో
చేర్చాలనుకుంటున్నానని చెప్పి వివరాలు తెలుసుకుంది .
లిండాని ఇంట్లోకి రమ్మనమని అహ్వానించినప్పటికీ , తాను ఫార్మసిస్టు గా పని చేస్తా నని , తన వర్కింగ్
అవర్సు మరి కొద్ది సేపట్లో మొదలవుతాయి కనుక మరెప్పుడయినా వస్తా నని చెప్పి వెళ్ళిపో యింది.

44
లిండా చెప్పిన ప్రీ స్కూలుకి కమ్యూనిటీలో మంచి పేరే ఉందని తెలుసుకున్న వసుంధర, మహతిని
కూడా అక్కడే చేర్పించింది. లిండా కూతురి పేరు ఏప్రిల్ ! భలే ముద్దు గా ఉండటంతో పాటు, స్నేహంగా
కూడా ఉంటుంది. త్వరలోనే ఏప్రిల్ , మహతిలు స్నేహితులయ్యారు!
ప్లే డేట్లు కావాలంటూ మహతి డిమాండ్ లు చేసతూంటే
్ , వీలు చూసుకుని, లిండాతో మాట్లా డితే
బావుండుననని వసుంధర ఎన్నో సార్లు అనుకుంది.
ఏప్రిల్ ని స్కూల్ దగ్గ ర లిండా దింపినా , మధ్య్హా న్నం వేరే ఆమె ఇంటికి తీసుకురావడం
గమనించింది. అపార్టుమెంటు పార్కింగ్ ఏరియా దగ్గ ర ఆ యువతిని చాలా సార్లు చూడటం కూడా జరిగింది,
ఆమె వస్త్ర ధారణ వసుంధరకి ఆసక్తిగా ఉండేది…
స్ప్రింగ్ సీజన్ మొదలయ్యింది….
మూడున్నర గంటల ప్రాంతంలో ఏప్రిల్ స్వ్హిమ్మింగ్ కి వొస్తుంది, అదే ట�ైంలో మనం కూడా వెళ్ళాలని
మహిత పట్టు పట్టిందో రోజు . అప్పటికే మహతి కొంత వరకు బాగానే స్విమ్మింగ్ చేస్తుండటం, అలాగే ఆ పిల్ల
పో రు భరించలేక, జాగ్రత్తలన్నీ తీసుకుని బయలుదేరింది వసుంధర.
వాళ్ళు వెళ్ళేటప్పటికి స్విమ్మింగ్ ఫూల్ లో ఏప్రిల్ , తనని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే యువతి
కూడా కనిపించారు. వాళ్ల ని చూస్ తూ నే మహతి ఉత్సాహంగా ఫూల్ లో దిగింది. మూడు అడుగుల లోతు
వరకే ఉండమని కూతుర్ని హెచ్చరించింది.
“ఇట్స్ ఓకే ! డొంట్ వర్రీ …” అంటూ వసుంధరకి భరోసా ఇచ్చింది ఏప్రిల్ తో ఉన్న యువతి.
పిల్లలతో సమానమ�ైన ఉత్సాహంతో ఆమె వాళ్ళని ప్ రో త్శ హించడంతో , కేరింతల్లో మునిగిన వారి
ముఖాలు వెలిగిపో యాయి.
పూల్ నుంచి బయటికి వొచ్చిన తరువాత,
ఏప్రిల్ తో ఉన్న యువతి,
నా పేరు లిన్ , మీ అమ్మాయి గురించి ఏప్రిల్ కబుర్లు చెపుతుంది. లిండా కూడా మిమ్మల్ని
కలిసానంది. నేను సాయంత్రం ఆరింటికి ఆఫీసుకి వెళ్ళాలి , అందుకే ఈ ట�ైంకి ఏప్రిల్ ని స్విమ్మింగ్
కి తీసుకొస్తా ను. మీకు అభ్యంతరం లేకపో తే , వీలయితే , ఈ సమయానికి రండి, స్నేహితురాళ్లిద్ద రూ
ఎంజాయ్ చేస్తా రు. మీరేం భయపడాల్సిన పనిలేదు, నేను పూల్ లోనే ఉంటాను. ఏప్రిల్ ని చూసుకోవడం
కోసం లిండా డే షిఫ్టు , నేను న�ైట్ షిఫ్ట్ ఎడ్జ స్టు చేసుకున్నాం. కలిసి గడపడానికి ఇద్ద రికీ సమయం
కరవవుతోంది , కానీ వర్కింగ్ పేరెంట్స్ కి ఇలాంటివి తప్పదు కదా ! అంటూ, ఆఫీసుకి ట�ైమవుతోందని
చెప్పి, ఏప్రిల్ ని తీసుకు వెళ్ళిపో యింది.
పిల్లల కేరింతలు, వెలిగిపోయిన వాళ్ళ పసి ముఖాలు ఇంకా కదలాడుతున్నాయి!
ఇంట్లో పనులు చేసుకుంటుందే కానీ, వసుంధర తన ఆలోచనలకి ఎంత అడ్డు కట్ట వెయ్యాలని
ప్రయత్నించినా అగటం లేదు…” స్వీట్ కపుల్ , ఇద్ద రికీ సమయం కరవవుతోంది …. , వర్కింగ్ పేరెంట్స్,
‘’ …అన్నీ కలిపితే ఏదో సూచిస్తు న్నట్టు గా ఉంది. శాన్ ప్ర్ హాన్ సిస్కో చుట్టు పక్కల కొంత లిబరల్
కమ్యూనిటీ అని , గే, లెస్బియన్ , మరితర తరహా జంటలు తారసపడటంలో అశ్చర్యం లేదని తెలుసు
కానీ , అదేదో తన అనుభవంలోకే వొచ్చిందా ….ఏదో సంకోచం….. !? మట్టి బుర్ర…. అని తనని తాను
విసుక్కుంది.
ఏప్రిల్ తో స్నేహం మానెయ్యమని మహతికి చెప్పాలా ? ఏ ముఖం పెట్టు కు చెపుతాను ?!
చెప్పినా అర్ధం చేసుకునే వయసా ? పేరెంట్ గా నా కర్త వ్యం ఏమిటి ? తెలిసీ తెలియని వయసులో ఇలాంటి

45
వ్యక్తు ల తో పరిచయం వల్ల పిల్లలప�ై పడే ప్రభావం ఏమిటి ? భవిష్యత్తు లో ఏం చేసినా, ఎలా ఉన్నా తప్పు
లేదన్నట్టు తయారవుతారా? ఇంతకీ వాళ్ల తో నాకున్న ఇబ్బంది ఏమిటి ? ఆ పసిపిల్ల పట్ల అన్యాయంగా
వ్యవహరించడం అవదా ?! తెలిసిన వాళ్ళు , చుట్టాలు ఇలాంటి స్నేహాలేంటి … అంటారనా ? కూతురిని
సంప్రదాయ వాతావరణంలో , పధ్ద్దతిగా పెంచడంలేదంటారనా ?! ఇటువంటి సంబంధాలకు సమాజంలో
సమ్మతి ఉండదనా ? ఏంటి నా సమస్య ? అని వెతుకులాడింది.
కొంతసేపటికి తనే తెప్పరిల్లి … ఒక వేళ ఈ నా అంచనాయే తప్పయితే ?! లిన్ ని ఏప్రిల్ పేరు పెట్టి
పిలవడం గుర్తు చేసుకుంది… ఒక వేళ అలా కాదేమో ! నేనే తప్పుగా అర్ధం చేసుకుంటున్నానేమో !
విషయం ఏమిటో నిర్ధా రించుకుని కానీ నిర్ణ యం తీసుకోకూడదనుకుంది.
తమ కాంప్లెక్సులోనే ఉండే మరో కుటుంబం ద్వారా , లిన్- లిండాలు లెస్బియన్ కపుల్ అని, సరిగ్గా
వసుంధర వాళ్ల ప�ై ఫ్లో ర్ లో ఉండే అపార్టుమెంటులో కూడా మరో గే కపుల్ ఉంటున్నట్టు తెలుసుకుంది.
ఈ రెండు జంటలూ కూడా తోటి వారితో స్నేహంగా ఉంటారని, ఎవరి జోలికి రారు, ఇబ్బంది పడ్డ పరిసథి ్తులు
తమకు రాలేదని ఆ కుటుంబం చెప్పడం కొంత ఉపశమనాన్నిచ్చింది.
ప్రవాసం అంటేనే ప్రవాహం! ఎన్నో కలుపుకు పో వాలి… ఎన్నిటితోనో కలిసిపో వాలి … భిన్నంగా
ఉన్నంత మాత్రాన ….వాళ్ళని సహించలేకపో వడం లోపమే కదా! మహతి స్నేహ బంధాన్ని విడగొడితే, ఆ
పసితనాన్ని గాయపరుస్తా నేమో అనే బాధ, అపరాధ భావనే నన్ను సమాధాన పరుస్తోందా? అనే ప్రశ్నలూ
వేసుకుంది. నా పిల్లలను కూడా మా “గంప ” లోనే పెంచేస్తా ను, నా ఇల్లే “సర�ైన “ప్రపంచం… అనే
మానసిక స్థితి నుంచి బయటపడి, అన్ని దిక్కులూ చూడటం… ముందు తరానికి మెరుగ�ైన ఆలోచనలు
పంచడానికి ఉపయోగపడుతుంది అనే సానుకూలతను తన ఆలోచనలకు జోడించేందుకు ప్రయత్నించింది.
మరో వ�ైపు …
పరిపరి విధాలుగా పో తున్న తన అలోచనల గురించి భార్గ వ్ కి ఏకరవు పెట్టింది.
అఫీసుల్లో కూడా రకరకాల వ్యక్తు లు తారసపడతారు, వారితో మన సాన్నిహిత్యం ఎంత వరకు
పో వాలి అనేది మనం వారిని అర్ధం చేసుకోగలిగినంత, వారిని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడనంత
మేరకు అని నా ఉద్దేశం! పిల్లల కళ్ల కి అన్ని వేళలా గంతలు కట్టి ఉంచాలంటే సాధ్యం కాదు… వాళ్ళో మిశమ
్ర
సంస్కృ తి లో పెరుగుతున్నారు, సహజమ�ైన వాతావరణం వాళ్ళ చుట్టు పక్కల ఉంచకపో తే, పెద్దవుతున్న
కొద్దీ గందరగోళ పడతారన్నాడు.
ఏది ఏమయినా, సున్నితమయిన విషయం…ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు, మన జాగ్రత్తలో
మనం ఉండాలి అనుకుంది.
మధ్యాన్నం మూడున్నరకి , మళ్ళీ పూల్ దగ్గ ర వసుంధర, మహతి రెడీ!
స్నేహితురాళ్లిద్ద రూ షరా మామూలే , ప్రపంచాన్నే మరచిపోయినట్టు !
రోజులు గడుస్తు న్న కొద్దీ , పిల్లలిద్ద రూ పూల్ లో సురక్షి తంగా ఈత కొట్ట గలరనే నమ్మకం కుదిరిన
తరువాత, కొంతసేపు వసుంధరతో మాటలు కలపడానికి వొచ్చి కూర్చునేది లిన్ .
సర�ైన అవగాహన లేక, వాళ్ళు నొచ్చుకునేట్టు ఎమ�ైనా అడుగుతానేమోనని వసుంధర వ్యక్తిగతమ�ైన
ప్రశ్నలు పెద్దగా వెయ్యకపోయినా , మాటల మధ్యల్లో లిన్ కొన్నిటిని గుర్తుచేసుకునేది.
కొలీగ్ గా లిండా తో పరిచయం, అప్పటికే డ�ైవోర్సు కి అప్లయి చేసి ఉన్న లిండా ! ఇరువురి మధ్య
చిగురించిన ప్రేమ, కుటుంబాల వ్యతిరేకత, వీళ్ళ విషయం తెలిసి , లిండా కూతురి భవిష్యత్తు పట్ల
ఆందో ళన చెందుతూ , ఆ పిల్ల తండ్రి వేసిన ప్రశ్నలు, చ�ైల్డ్ కస్ట డీ కోసం చేసిన యుద్దం… అయినా ఒకరి

46
పట్ల , మరొకరికి చెదరని ఇష్టం ! ఎటువంటి పరిసథి ్తిన�ైనా కలిసి ఎదుర్కోగలమనే గట్టి విశ్వాసం, తమ
అనుబంధానికో రూపం ఇవ్వాలని డొ మెస్టిక్ పార్టనర్ గా రిజిస్ట ర్ అవటం, ఓ కొత్త ఆరంభం కోసం, రెండేళ్ల
క్రితం ఈ ఊరికి రావడం లాంటి వివరాలు నెమ్మది నెమ్మదిగా తెలిసాయి .
ఈ జంట గురించి భార్గ వ్ తో మాట్లా డినప్పుడల్లా … ఇద్ద రికీ ఒకరి పట్ల మరొకరికి ఎంత ప్రేమ లేకపో తే
ఇన్ని సమస్యలకు సిద్దపడతారు? అనేది వసుంధర.
పార్కులో ప్లే డేట్ పెట్టు కున్నప్పుడు, సాధారణంగా లిండా వొస్తుండేది. మీ అమ్మయి చాలా
మర్యాదస్తు రాలు, తన అలవాట్లు , మాట్లా డే తీరు ముచ్చటేస్తుంది , మహతిని కూడా అలవాటు చేసుకోమని
చెబుతుంటానని అన్నప్పుడు, ఏ మాత్రం తేడాగా ఉన్నా, వీళ్ళ పేరెంట్స్ ఎంత అరాచకంగా ఉంటారో అంటూ
తమ లాంటి వారి పిల్లలప�ై అతి సులభంగా ఓ ముద్ర వేస్తా రనే స్ప్ఱహ అనుక్షణం వెంటాడుతుంటుందని
లిండా చెప్పడం వసుంధర మనసుని తాకింది.
లిన్ చెల్లె లు మెలిస్సా కి ఇక్కడే స్కూల్లో అడ్మిషన్ వచ్చింది. లిన్ తల్లి దండ్రు లు మొదట ఒప్పుకోలేదు
కానీ, ఆర్ధిక అవసరాల రీత్యా ఇది తప్పదని మెలిస్సా చెప్పడంతో వాళ్ళు ఏం చెప్ప లేకపో యారు. మెలిస్సా
రాకతో ఏప్రిల్ ని చూసుకోవడంలో కొంత సహాయం లభించినట్ట యింది లిన్ – లిండాలకి.
రోజులు గడుస్తు న్న కొద్దీ, లిన్ – లిండాల కాపురాన్ని సాధారణంగానే తీసుకోవడం మొదలుపెట్టింది
వసుంధర. ఏ పార్కు లోనో , పూల్ దగ్గ రో కలవడం, పిల్లలు ఆడుకుంటుంటే కబుర్లు చెప్పుకోవడం
మామూలయిపో యింది. ఓ సంవత్సరం గడిచిపో యింది. పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ లో జాయిన్
అయిపో యారు.
ఏప్రిల్ కి ఓ బుజ్జి తమ్ముడు పుట్ట బో తున్నాడు, నేను కూడా వాడితో ఆడుకోవచ్చని ఏప్రిల్ చెప్పింది,
ఓ రోజు సంబరంగా ప్రకటించింది మహిత.
పిల్లలు తెలిసీ తెలియక ఏదో మాట్లా డుకుని ఉంటారని వసుంధర అనుకుంది కానీ, లిండా – లిన్
లు కూడా ఈ శుభవార్త ని వసుంధర తో పంచుకున్నారు. అన్ని కుటుంబాల లాగా …పిల్లలు, చదువులు,
పెళ్ళిళ్ళు లు , మనవలు, మనవరాళ్ లు …ఇలా కోలాహలంగా తమ అనుబంధం సాగాలనే కల గురించి
చెప్పారు.
ఇది సాకారం చేసుకోవాలనే ఉద్దేశంతో, ఆధునిక పరిఙానం సహాయం తీసుకున్నామని, ఎటువంటి
డో నర్ నుంచి స్పర్మ్ కావాలో చర్చించుకుని, ఇద్ద రూ ప్రయత్నించినా, లిండా గర్భవతి కావడంతో తమ
ప్రయత్నం ఫలించిందనే అనందంలో మునిగితేలుతూ కనిపించారు.
వాళ్ళ ఆనందంలో పాలు పంచుకోకుండా ఉండలేకపో యింది వసుంధర! పరిచయం పెరుగుతున్న
కొద్దీ , సున్నితంగా ఆలోచించే వాళ్ళ వ్యక్తిత్వాలు కట్టిపడేస్తు న్నాయని భార్గ వ్ తో చెప్పింది. కుటుంబం పట్ల
వాళ్ళకున్న అభిప్రాయం భారవ్గ్ ని కూడా ఆకట్టు కుంది.
లిండా కి “బేబీ షవర్ “ చెయ్యాలని లిన్ ముచ్చట పడుతుంటే, వసుంధర ఉత్సాహంగా సహాయం
చేసింది. అలాగే డెలివరీ అపుడు లిన్ కి సహాయంగా ఉండాలని ఏప్రిల్ బాధ్యతలు కొన్ని తీసుకుంది.
చిన్నారి “లియం” ఇంటికి రాగానే , కుటుంబ సమేతంగా వాళ్ల ఇంటికి వెళ్ళి చూసొ చ్చారు. లిండా‌ –
లిన్ ల తల్లి దండ్రు లు కూడా మనవడిని చూడటానికి వొచ్చారని తెలిసి, అసలు కంటే వడ్డీ ముద్దు అనే లాజిక్
ఇక్కడ కూడా అప్లయి అవుతోందని అనందపడ్డా రు.
“లియం కి ఇద్ద రు మామ్స్ …సో కూల్ “ మహతి అన్నదో రోజు.
“డాడీ ని మిస్సవుతాడంటావా ? “ ఏం చెపుతుందో తెలుసుకోవాలని అడిగాడు భార్గ వ్.

47
“ ఇట్ ఈజ్ ఓకె డాడీ ! సమ్ కిడ్స్ డజంట్ హావ్ మామ్స్ , సమ్ కిడ్స్ డజంట్ హావ్ డాడ్స్ … నథింగ్
టు ఫీల్ అబౌట్ ! “ తేలికగా సమాధానం చెప్పి ఆటలో పడిపో యింది మహతి.
ఓ సారి స్కూల్ కి వెళ్ళి వాలంటీర్ గా పనిచేసి చూడు… స్నాక్ ట�ైం లో , లంచ్ ట�ైం లో టేబుల్ దగ్గ ర
కూర్చొని ఈ పిల్లలు తెగ మాట్లా డుకుంటారు…. అవి విన్న తరువాత, ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ అడగవు
అంటూ నవ్వింది వసుంధర.
మామీ లిండా – మామీ లిన్ లు ఇంకా బిజీ అయిపో యారు. “లియం” తో ఆడుకోవాలనే మహతి
రిక్వెస్టు లూ పెరిగిపో తున్నాయి….
కాలం పరుగెడుతోంది !
“ఈ డస్
్ర లియం కి కొందాం, ఇది వేసుకుంటే క్యూట్ గా ఉంటాడు” వసుంధర కూతురు మహతి చాలా
ఉత్సాహంగా అడిగింది.
“వాడి పుట్టిన రోజుకి ఇంకా నాలుగ�ైదు నెలల ట�ైముందిగా? ఇప్పుడే ఎందుకు ? తన పుట్టిన రోజు
దగ్గ ర పడినప్పుడు మళ్ళీ షాపింగ్ కి వొద్దాం “ కూతురికి సర్ధిచెప్పబో యాడు భార్గ వ్.
“నో.. హి ఈజ్ మ�ై బేబీ బద
్ర ర్ , ఐ నీడ్ టు బ�ై దిస్ ఫర్ హిమ్ ! ప్లీజ్ …ఈ డ్రస్ కి ‘టీతర్ ( TEETHAR)
” కూడా ఉంది. వాడు భలే ఎంజాయ్ చేస్తా డు” తల్లి దండ్రు లకి మరింత నొక్కి చెప్పింది మహతి.
లియం అంటే మహతికి చాలా ఇష్ట మని తెలిసినా, వాడు నా తమ్ముడని పట్టు పట్టేంత ప్రేమని, ఎలా
అనునయించాలో తెలియక, అడిగింది కొని ఇచ్చేసారు వసుంధర, భార్గ వ్ లు…. !
(సారంగ 2014 ప్రచురణ)

***

48
కె. వరలక్ష్మి జన్మస ్థ లం, ప తు త నివాసం తూర్పుగోదావరి జిల్
్ర స్ లా లోని
జగ ్ గంపేట. నాలుగు నవలికలు, 140ై ప గా కథలు, చాలా కవితలు, రేడియో
నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం
(2002), అతడు నేను- (2007), క్షతగాత ్ర (2014), పిట ్ట గూళ్ లు
(2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ,
కథావార్షి క, రంజని, రచన, విశాలాంధ ్ర , కవిత, కవితా వార్షి క, నీలిమేఘాలు
మొ.ల ై న వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్ లి , విమలా
శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా
పురస్కారాలు, పొట్టి శ్ రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం
, రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష ్ణ మూర్తి అవార్ డు లు, అజో విభో విశిష ్ట
సాహితీ మూర్తి పురస్కారం, శ్ రీ మతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ
పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్ డు లు. శ్ రీ
శ్
రీ , దేవుల పల్లి కృష
్ణ శాస్త్రి అవార్ డు మొ.నవి కవితలకు అవార్ డు లు. శాస్త ్రీ య
సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.

11. మలుపు
- కె. వరలక్ష్మి
వర్థనమ్మగారి ప్రవర్త నలో తేడా కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. పెరట్లో మావిడిచెట్టు కొపుకొచ్చి, ఆఖరు
పండుదించే వరకూ కళ్ల ల్లో వత్తు లేసుకుని కాపలాకాసే ఆవిడ సారి చెట్టు ను పట్టించుకోవడం మానేసారు.
ప�ైగా ‘‘అరవిందా! పాపం పిల్లవెధవులు మావిడికాయల కోసం మన పెరటి గోడచుట్ టూ ప్రదక్షిణాలు
చేస్తు న్నట్టు న్నారు. రాలిపడిన కాయనల్లా వాళ్ల కి పంచిపెడుతూ ఉండు‘‘ అన్నారు. సీత ఎప్పుడ�ైనా
’పప్పులోకి ఓ కాయెట్టండమ్మా’ అనడిగితే ఏ కిందపడి పగిలిన కాయో చేతిలో పెట్టే ఆవిడ ‘‘కాయలు
పరువుకొచ్చినట్టు న్నాయే, మీ ఆయన్ని చెటటె ్క్కి కాయలు తెంపమని పట్టు కెళతూం ్ డు, పిల్లలు తింటారు’’
అంది. కరోనా కట్ట డి కాలమంతా సీతకుటుంబానికేం కావాలో ఆవిడే సమకూర్చింది.
ఆ మధ్య పక్కపో ర్షన్లో అద్దెకున్నావిడను పిలిచి ‘‘మీకెన్ని కాయలు కావాలో కోయించుకుని ఊరగాయలు
పెట్టు కోండి’’ అని చెప్పింది.
లాక్ డౌన్ సమయంలో కుర్రా ళ్లొచ్చి పేదలకి ఇంటింటికీ వంట సరుకులు పంచుతున్నాం చందా
ఇవ్వండి అనడిగితే పదివేలు ఇవ్వడమే కాకుండా వారం వారం ఇస్తా నని ఒప్పుకొని అలాగే ఇబ్బంది,
నిన్నటికి నిన్న స్కూల్ టీచర్స్ వచ్చి ’’అమ్మా, మన హ�ైవేలో నడిచివెళతు ్న్న పొ రుగు రాష్ట్ రా ల కూలిజనానికి
ఆహారం చెప్పులు వ�ైగారాలు పేక్ చేసి ఇచ్చి లారీల్లో వాళ్ల రాష్ట్ రా లకి పంపిస్తు న్నాం అంటే లక్ష రూపాయలకి
చెక్కు రాసిచ్చింది.
‘‘మొన్న హ�ైదరాబాదు వెళ్లి వచ్చినప్పటినుంచీ మా వదిన పవ
్ర ర్తన మారిపో యింది కదా సీతా!’’ అంది
అరవింద, వంటగదిలో సీతతో.
‘‘అవునమ్మా నేనూ ఆమాటే అనుకుంటున్నాను’’ అంది సీత బెండకాయలు తరుగుతూ,

49
సాలోచనగా సీతవ�ైపు చూసింది అరవింద, ఆమె దృష్టి సీతమీద ఉన్నా మనసెక్కడో ఉన్నట్టుంది.
‘‘నీకు తెలుసా, ఈ ఇల్లూ వాకిలీ ఇలా నిలబెట్టడం, పిల్లలిద్ద ర్నీ చదివించి ప్రయోజకుల్ని చెయ్యడం
అంతా మావదిన చలవే, మా అన్నయ్య పో యాక ఫేమిలీ పెన్షను తోనే తను అనుకున్నవన్నీ సాధించింది,
తనని అందరూ పిసినిగొట్టు అనుకున్నా లెక్కచేసేదికాదు, పొ దుపు ఒక్కటే తన జీవితధ్యేయం అన్నట్టుండేది.
అత్యవసరాలకి మాత్రమే అతి జాగ్రత్తగా ఖర్చుచేసేది. పిల్లల మీద పంచ ప్రాణాలు, తనకి చెందిన దేద�ైనా
వాల్ల కే చెందాలనే గాఢమ�ైన మమకారం, హఠాత్తు గా ఇప్పుడెందుకిలా మారిందో అని ఆశ్చర్యంగా ఉందినాకు.
అలా అని ఎవరి సొ మ్ముకీ ఆశించేతత్వం కాదు, నేను ప్రవ ై ేటు స్కూల్లో పనిచేసతూ ్ జీతం తెచ్చి ఇవ్వబో తే
‘‘తెలివితక్కువ పిల్లా , బేంకులో దాచుకో అని మందలించేది.’’
‘‘హ�ైద్రాబాదులో ఉండగా అమ్మగారికి గుండెనెప్పి వొచ్చిందన్నారు కదా, దాన్నుంచి బతుకు మీద
ఇరక్తిలాటిదేద�ైనా పుట్టిందంటారా?’’ అంది సీత.
‘‘లేదు లేదు, వదిన అంత పిరికిదేం కాదు, హాస్పిటలుకి నవ్వుతూ వెళ్లి నవ్వుతూ వచ్చిందట, డాక్టరలు ్
కూడా ఏం ఫర్వాలేదు అన్నారట కదా!’’
పక్కగదిలో విశ్రాంతిగా పడుకున్న వర్థ నమ్మకి పరిసరాల నిశ్శబ్ధం వల్ల వాళ్ల మాటలన్నీ స్పష్టంగా
వినిపిసతూ ్నే ఉన్నాయి. ఒక నిట్టూ ర్పు విడిచి అటు ఒత్తి గిల్లింది –
ఈసారి హ�ైదరాబాద్ ప్రయాణం తనలోని మమకారపు పొ రల్ని తొలగించేసింది.
ఆరోజు డాక్టరేమన్నాడు? తనకి గుండెకి సంబంధించి భయపడాల్సినంతగా ప్ రో బ్ల మ్లేదు, ఎందుక�ైనా
మంచిది, ముందు జాగ్రత్తకోసం ఈమందులు వాడండి అంటూ కొన్ని మందులు రాసిచ్చేడు. ’కాని రిపో ర్టులో
హ�ైపట�ైటిస్ సి వెరీ స్మాల్ కౌంట్లో ఉన్నట్టు డౌట్ గా ఉంది. ఎంతస్మాల్ అంటే మరో పదిహేనేళ్లవరకూ అది
బ�ైటపడనంత, మరోసారి వీల�ైనప్పుడు టెస్ట చేయించి కన్ ఫం చేసుకుందాం.’ అని కూడా అన్నాడు.
అంతే, తను తన పిల్లలకి అంటరానిద�ైపో యింది. HC వ�ైరస్ తమ ఇంట్లో నడయాడుతున్నంత
భయపడిపో యారు.
తన కూతుర�ైతే వాళ్ల వదినకి పదేపదే జాగ్రతత్త లు చెప్పి తక్షణం పిల్లల్ని తీసుకుని వెళ్లిపో యింది.
తన కొడుకు, కోడలు, పిల్లలు వరూ తన గదిలోకి తొంగిచూడడం మానేసారు. తన హాల్లో కి వెళ్లకూడదు.
సో ఫాల్లో కూర్చోకూడదు. తన కోసం ఒక ప్లా స్టిక్ కుర్చీని ప్రత్యేకించి దాన్ని ఎవరూ ముట్టు కోవడం మానేసారు.
తనకోసం ఒక కంచం గ్లా సుకేటాయించారు. వాటిని తనేకడుక్కోవాలి, తన బట్ట లు తనే ఉతుక్కోవాలి,
పనమ్మాయి తన గదిలో భోజనం పెట్టి వెళ్లిపో యేద.ి గది బ�ైట నుంచి భయం భయంగా పలకరించేవాళ్ లు .
ఇదంతా తట్టు కో లేక, రాత్రు ళ్
లు దుఃఖంతో నిద్రపట్ట కపదిరోజులకే పదేళలు ్ మీద పడినట్టు అయిపో యింది. ఆ
అంటరానితనం అనుభవిస్తే గాని తెలియదు.
కొన్నాళ్
లు ఉండి వద్దా మని వెళ్లిన తను తిరుగు ప్రయాణమ�ైపో యింది. సామర్ల కోటలో దిగేసరికి
అరవింద, సీత సేటషనుకి వచ్చి ఉన్నారు. తను బేరం డకుండా టేక్సీ ఎక్కడం చూసి ఆశ్చర్యపో యారు.
కారులో ఎవ్వర్నీ తాకకుండా కూర్చుండి.
అంతలో కరోనా వ�ైరస్ ముంచుకొచ్చింది. అదుపు చెయ్యాలని మూడు నెలలకు ప�ైగా ప్రయత్నించి
సాధ్యంకాక ప్రభుత్వాలు తెల్లబో తున్నాయి.
ఆ రోజు తనకి అవగాహన లేక వ�ైరస్ అనేది ఏద�ైనా ఎంత భయంకరమ�ైనదో అర్థం చేసుకోలేకపో యింది.
కోపం తెచ్చుకుంది. ఏది ఏమ�ైనా ఈ సందర్భంగా తనకి మాత్రం జీవితాలు ఎంత అశాశ్వతాలో అర్థ మ�ైంది.
పెంచుకున్న మమకారాలు ఎంత అర్థంలేనివో తెలిసివచ్చింది.  ఈ లోకంలో ఎందరో నిస్సహాయులున్నారనీ,

50
వాళ్ల కి చేయూత అవసరమనీ అర్థ మ�ైంది. తను చేస్తు న్నది పెద్ద సాయం కాకపో వచ్చు. చిన్నపుడక స�ైతం
గూడు నిర్మాణానికి తోడుపడినట్టు ...
***
అకిమి యోషిడ రాసిన ఈ కథ నాకు బాగా నచ్చడానికి కారణాలు క్లు ప్ తంగా చెప్పడానికి ప్రయత్నిస్తా ను.
కథలో ముఖ్యాంశం – స్త్ రీ పురుషుల సంబంధాలు. ఒక మనిషిని ఇష్ట పడ్డ ప్పుడు ఆ మనిషికి
పెళ్ళయిందా, పిల్లలున్నారా లేదా అని ముందే తెలుసు కోవాల్సిందా?
భార్యాభర్త లు విడిపో వడానికి కారణం వారిలో ఒకరికి మరో మనిషి ఇష్టం కావడమా? ఆ విడిపో వడం
ఇష్టం కాకముందే జరిగిందా లేక ఇష్టం కావడం వల్ల జరిగిందా?
ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ ఉన్నవే. ఇక ముందు కూడా ఉంటాయి. ఇంత క్లిష్టమ�ైన సమశ్యనూ,
చిరకాలంగా ఉన్న సమశ్యనూ ఎటువ�ైపూ మొగ్గ కుండా, పాఠాలు చెప్పకుండా, సున్నితంగా చిత్రించారు
యోషిడ.
కథలో క్రమంగా ఉత్కంఠ పెరగాలనీ, అది చివరికి తార స్థాయికి చేరాలనీ, అక్కడ సమాధానమో,
మలుపో , మెరుపో ఉండాలనీ చెప్తా రు. అలాంటి ఉరుములూ, మెరుపులూ ఈ కథలో లేవు. వాటి లేమి వల్ల
ఇందులో కథకు ఎలాంటి హాని జరగలేదు.
తెలుగు కథలకు అలవాటుపడ్డ వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలిగించేవి ఇందులో కొన్ని ఉన్నాయి:
ఒకటి, తల్లి బిడ్డ లను వదిలేసి ఎలా వెళ్లగలిగింది? (తండ్రి వెళ్ళిపో వడంతో పాఠకులు సమాధానపడగలరు.)
మరొకటి, తండ్రీ, తర్వాత తల్లీ, వెళ్ళిపో వడానికి కారణాలేంటో, తల్లి ఇప్పుడు ఎక్కడవుంటుందో చెప్పలేదేంటీ?
ఇంకొకటి, కథలో పాత్రలన్నీ మొదటి పది పంక్తు ల్లో పరిచయం చెయ్యబడాలికదా? ఈ కథలో తల్లి అకస్మాత్తు గా
మధ్యలో వస్తుందేమిటీ? ఇలాంటివి జపాన్ పాఠకులకు విచిత్రంగా కనపడలేదు. ప�ైగా, ఈ కథ ఆధారంగా
వచ్చిన Our Little Sister కి ప్రపంచవ్యాప్ తంగా ఆదరణ లభించింది. వీలయితే మీరు కూడా ఆ సినిమా
చూడండి.
ఇక కథ చదవండి.

51
వృత్తి : ఒక్ల ాండ్ యూనివర్సిటీ (మిషిగన్) లో బయోమెడికల్ ై స న్సెస్
ప్రొ ఫెసర్. 35-40 కథలు రాశాను. రెండు కథా సంపుటాలు వచ్చాయి:
గట్టు తెగిన చెరువు, కేన్యా టు కేన్యా. కొన్ని అనువాదాలు చేశాను:
వోల్ గా , చంద ్ర లత, విమల గారి కథలు.ై స న్స్ గురించి తెలుగులో వ్యాసాలు
రాయడం ఈ మధ్యే మొదలు పెట్టా ను.

12. మా చిన్న చెల్లెలు


-ఆరి సీతారామయ్య
ఉదయాన్నే హాస్పిటల్ కు పో వడానికి తయారవుతున్నగాయత్రికి ఫో నొచ్చింది.
“చిన్నమ్మమ్మా,  ఏంటీ పొ ద్దు టే ఫో న్‌ చేశావు? బాగున్నావా?”
“నేను బాగానే ఉన్నానుగాని, నువ్వు సాయంత్రం హాస్పిటల్నుంచి ఇటే రా. నీతో మాట్లా డాలి.
వచ్చేటప్పుడు దో వలో కూరగాయలేవైన� ా కొనుక్కురా,” అంది ఆమె.
“సరే, ఏం తీసుకురమ్మంటావు?”
“ఏవ�ైనా సరే, నీకు ఇష్ట మ�ైనవి తెచ్చుకో, మాట్లా డుకుంటూ వంట చేసుకుందాం? రాత్రికి ఉండి పొ ద్దు టే
పో దువుగాన్లే. రేపెటూ సెలవేగదా,” అంది చిన్నమ్మమ్మ జయలక్ష్మి.
***
సాయంత్రం బజార్లో దొ ండకాయలూ, తోటకూరా, నాలుగు అరటికాయలూ కొనుక్కుని గాంధీ నగర్
లో ఉన్న జయలక్ష్మి ఇంటికి చేరింది గాయత్రి. వస్తూ నే, “చిన్నమ్మమ్మా, నువ్వెందుకూ ఒక్కదానివే
ఇంతదూరాన ఉండటం, వచ్చి మాతో ఉండరాదూ?” అంది, కూరగాయలు టేబుల్ మీద పెడుతూ. జయలక్ష్మి
నవ్వి వూరుకుంది. ఏడు సంవత్సరాల క్రితం వాళ్ళమ్మమ్మ రాజ్యలక్ష్మి చనిపోయినప్పటనుంచీ ఈ పిల్లలు
తనని వాళ్ళతో వచ్చి ఉండమని అడుగుతూనే ఉన్నారు. కానీ తనకు బాగా అలవాట�ైన తన ఇల్లు వదిలేసి
వెళ్ళాలనిపించడం లేదు.
ఫ్రిజ్ లోంచి మంచినీళ్ళ సీసా తీసుకుని వచ్చి జయలక్ష్మి పక్కనే కూర్చుంది గాయత్రి.  “ఏంటి
చిన్నమ్మమ్మా, ఏదో మాట్లా డాలన్నావు?”
ముందు  దొ ండకాయకూర చేద్దా మా, అరటికాయకూర  చేద్దా మా  అని  ఆలోచిస్ తూ ,  ఆమెవ�ైపు
చూడకుండానే మృదువుగానే అడిగింది జయలక్ష్మి. “నువ్వు హ�ైదరాబాద్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి
ఇంట్లోపెట్టు కున్నావని విన్నాను. నిజమేనా?”
“అవును, నిజమే,” అంది గాయత్రి. ఆ అమ్మాయి గురించి చెప్పడం ఎక్కడ మొదలుపెటటా ్లా  అని
ఆలోచిస్
తూ .
“ఎవరా అమ్మాయి?”
“మా చెల్లె లే. నాన్న రెండో భార్య కూతురు,” అంది గాయత్రి, క్లు ప్ తంగా.

52
“అలాగానా? అతనికి మీరుగాక ఇంకా  బిడ్డ లున్నారని నాకు తెలియదే.”
“మాకూ తెలియదు.  పోయిన ఏడో తేదీన నీకు ఫో న్‌ చేశాం గుర్తుందా? ఎవరో హ�ైదరాబాద్ నుంచి
ఫో న్‌ చేసి మీ నాన్న చనిపో యాడు, అంత్యక్రియలకు రమ్మని చెప్పారని. ఆ ఫో న్‌ చేసింది ఈ అమ్మాయే.
హ�ైదరాబాద్ వెళ్ళిన తర్వాత తెలిసింది,  అమ్మను వదిలేసి నాన్న ఒకావిడతో వెళ్ళిపో యాడే, ఆమె ఒక
బిడ్డ ను కని మూడు సంవత్సరాల తర్వాత చనిపో యిందట. తర్వాత నాన్న మళ్ళా పెళ్ళిచేసుకున్నాడట.
ఆ  మూడో  భార్య  గురించి  నాకు  పెద్దగా  తెలియదు  గాని,  ఆమెకు  ఏవో  సమస్యలున్నట్లు న్నాయి.
చివరి రోజుల్లో నాన్నకు సపర్యలు చేసింది రెండో భార్య కూతురే. చనిపో యాడని మాకు ఫో న్‌ చేసింది కూడా
ఆ అమ్మాయే.”
జయలక్ష్మి ముభావంగా మౌనంగా ఉండిపో యింది కొంతసేపు. అరటి కాయలను సింక్ దగ్గ రకు
తీసుకుపోయి కడుక్కొచ్చి, చిన్న చిన్న ముక్కలుగా తరుగుతూ, “నువ్వు తీసుకొచ్చింది ఆ అమ్మాయినా?”
అని అడిగింది.
“అవును చిన్నమ్మమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవ్వరూలేరు. ఆ అమ్మాయి మమ్మల్ని
ఏమీ అడగలేదు. అంత్యక్రియలు తనే చేసింది. మేం వస్తా మని అనుకోలేదనుకుంటాను. తిరుగు
ప్రయాణం రోజు,  వచ్చినందుకు మాకు కృతజ్నతలు చెప్పి వెళ్ళబో తుంటే, నేనే అడిగాను తన
గురించి. ఆ అమ్మాయికి పదిహేను సంవత్సరాలు. హ�ైస్కూల్లో చదువుతుంది. తనకెవ్వరూ లేరు. ఆ
అమ్మాయి మా చెల్లె లేకదా? పెద్ద కూతురుగా చివరి రోజుల్లో నాన్నకు నేను చెయ్యాల్సిన పనులు ఆ
అమ్మాయి చేసింది. మా ముగ్గు రికీ ఏవో ఉద్యోగాలున్నాయి. తిండికి లోటులేదు. పెద్ద ఇల్లుంది. నేనే
మాతో వచ్చి ఉండమన్నాను. పల్ల వి వెంటనే సమాధానం చెప్పలేదు. ఆ అమ్మాయి పేరు పల్ల వి. మా
అడ్రెస్ ఇచ్చి నీకు ఇష్ట మ�ైనప్పుడు మా దగ్గ రకు రావచ్చు అని చెప్పాను. పోయిన వారం వచ్చింది.”
జయలక్ష్మి  కొంచెంసేపు ఈ విషయాలన్నీ జీర్ణించుకుంటున్నట్లు ఉండిపోయి, “అయితే ఆ అమ్మాయిని
పెంచడం నీ బాధ్యత అనుకుంటున్నావా?” అని అడిగింది.
“అవును. తల్లి లేకుండా పెరిగింది. హాయిగా ఉండాల్సిన  చిన్న వయసులో నాన్నకు సేవలు చేసతూ ్
గడిపింది. ఇప్పుడు వచ్చి వారం రోజులయింది కదా. ఇంటి పన్లన్నీ తనే చేస్తా నంటుంది. ఏదన్నా అడిగితేగాని
మాట్లా డదు. ఆ అమ్మాయిని  చూస్తుంటే పాపం ఎన్ని కష్టాలు పడ్డ దో అనిపిస్తుంది.”
“సరే, అమ్మాయి మంచిదే. కానీ ఆ అమ్మాయిని పెంచడం నీ బాధ్యత అని నువ్వెందుకనుకుంటున్నావు?
ఇద్ద రు చెల్లె ళ్ళను పెంచావు చాలదా?”
“అలా అంటావేం చిన్నమ్మమ్మా? మేము కాకపో తే ఆ అమ్మాయికి ఇంకెవరున్నారు?”
“ఉన్నారా లేరా అని కాదు. నాకేమనిపిస్తుందో చెప్పనా? నీకు లేకుండా  పోయిన బాల్యం ఆ
అమ్మాయికికూడా లేకుండా పో యిందని నువ్వు విచారిస్తు న్నావు. మీ అమ్మా నాన్నలు పనికిమాలిన వాళ్ళు
కావటంతో చిన్నప్పుడే బాధ్యతలు నీ మీద పడ్డాయి. ఆ అమ్మాయిక్కూడా నీలాగే చిన్నతనంలోనే బరువ�ైన
బాధ్యతలు మొయ్యాల్సొచ్చింది. ఆ అమ్మాయిలో నువ్వు నిన్ను చూసుకుంటున్నావు. కానీ పదిహేను
సంవత్సరాల అమ్మాయిని పెంచడం ఎంత బాధ్యతతో కూడిన వ్యవహారమో తెలుసు కదా? నువ్వు ఇంకా
పెళ్ళిచేసుకోలేదు. పెళ్ళికావాల్సిన చెల్లె ళ్ళు ఇంకా ఇద్ద రున్నారు. ఇప్పుడు ఇంకొక చెల్లె లా?” అందామె.
ఈ బాధ్యతల భారం గాయత్రికి తెలియని విషయం కాదు.  కాని, ఎవ్వరూ లేని చెల్లెలిని అలా ఎలా
వదిలేస్తుంది? ప�ైగా ఆ అమ్మాయి ఎంత బాధ్యతగా చివరి రోజుల్లో నాన్నను చూసుకుంది!
గాయత్రి లేచి తోటకూర ఆకుని సింకులో శుభ్రంగా కడుగుతూ అక్కడే కొంచెంసేపు నిలబడింది.
జయలక్ష్మి కూడా అరటికాయ ముక్కల గిన్నెను తీసుకుని స్టౌ దగ్గ రకు వచ్చి గాయత్రి భుజం మీద

53
చెయ్యి వేసి, “వయసుతోపాటు రావాల్సిన తెలివి మీ అమ్మకు రాలేదు. నీకేమే వయసుకు మించిన తెలివీ
మంచితనం ఇచ్చాడు భగవంతుడు,” అంది.
***
పల్ల వి చీరాల వచ్చి దాదాపు మూడు నెల్లయింది. సులభంగానే అక్కలతో కలిసిపో యింది.
హ�ైస్కూలునుంచి రాగానే బట్ట లుతకటమో, వంటచెయ్యడమో, ఇల్లు శుభ్రం చెయ్యడమో, బయట దొ డ్లో
పూలమొక్కలకూ కూరగాయల పాదులకూ నీళ్ళుపొ య్యడమో ఏదో ఒక పని చేసతూ ్ ఉంటుంది. పెద్దక్క
గాయత్రి అంటే గౌరవం, కొంచెం భయం కూడా. గాయత్రి అక్క కంటే, అమ్మలాంటిది అనే అభిప్రాయం
ఏర్పడింది పల్ల వికి. రెండో అక్క శివాని ఒక బాంక్ లో పనిచేస్తుంది. అక్కడ తనతో పనిచేసే ఒకతనంటే ఇష్టం
లాగుంది. వీలు దొ రికినప్పుడల్లా అతని మంచితనం గురించి చెప్తూ ఉంటుంది. చిన్నక్క వాసంతి పల్ల వి
కంటే మూడు సంవత్సరాలు పెద్దది.  వాగుడుకాయ. టౌన్లో ఒక చెప్పులషాపులో పనిచేస్తుంది. తన బాయ్
ఫ్రండ్ కూడా తనలాగే వాగుడుకాయ. సాయంత్రం ఎప్పుడన్నా ఇంటికి వస్తా డు. అందరికీ కబుర్లు చెప్తా డు.
ప్రస్తు తం ఉద్యోగం ఏదీ ఉన్నట్లు లేదు.
వాసంతితో మాట్లా డటం సులభంగా ఉండేది పల్ల వికి. ఇద్ద రి మధ్యా వయసులో పెద్ద తేడా లేదు.
గాయత్రితో మాట్లా డటం అంటే కొంచెం భయంగా ఉండేది. కానీ తొందరలోనే ఇద్ద రి మధ్య మంచి అనుబంధం 
ఏర్పడింది.  తండ్రి ఇల్లు వదలిపో యేటప్పటికి గాయత్రికి ఇప్పుడు పల్ల వికున్న వయసు.  ఆరోజుల్లో ఆయనకు
సాయంత్రం సముద్రపు ఒద్దు న నడవడం అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. తనకు కూడా సముద్రం అంటే
ఇష్టం అవడంవల్ల ఎప్పుడూ నాన్నతో వెళ్ళేది గాయత్రి. హ�ైదరాబాద్ లో ఉన్నప్పుడు  కూడా ఆయనకు
నడవడం అంటే ఇష్టంగా ఉండేదని చెప్పింది పల్ల వి. నాన్న బయటకు వెళ్ళినప్పుడు పల్ల వి వెంటవెళ్ళేది.
తండ్రితో గడిపిన సమయం గురించి మాట్లా డుకుంటూ, ఆ జ్నాపకాలు  పంచుకుంటూ పల్ల వీ గాయత్రీ కొంత
దగ్గ రయ్యారు.
***
ఒక సాయంత్రం తన ఫ్రండ్ తో సినిమాకి వెళ్ళడానికి తొందర తొందరగా రెడీ అయి ఇంట్లోంచి బయటకు
పరుగెట్టిన శివాని రబ్బర్ బంతిలాగా తిరిగి ఇంట్లోకొచ్చి పెద్దగా అరిచింది, “అమ్మా, చిన్నమ్మమ్మా వస్తు న్నారే
గాయత్రీ!”
అక్కా  చెల్లె ళ్ళు ముగ్గు రూ పరుగెత్తు కుంటూ ఇంట్లోంచి బయటకొచ్చారు. పల్ల వి తలుపు వెనక
నిలబడింది. వీళ్ళను ఇదివరకు ఆ అమ్మాయి చూడలేదు.
అమ్మ మూడు సంవత్సరాలప్పుడు వదిలేసివెళ్ళిన వాసంతికి ఆమె రూపురేఖలు ఎలావుంటాయో
తెలియదు. ఇప్పుడు చూస్తుంటే ఆమె ఎంతో అందంగా, హుందాగా కనిపించింది. దాని బుగ్గ లు నిమిరి,
“నువ్వు వాసంతివి కదూ, ముద్దు గా ఉన్నావు,” అంది శారద. శివానిని దగ్గ రకు తీసుకుని తలమీద
ముద్దు పెట్టింది. గాయత్రి ముందుకు రాలేదు. చెల్లె ళ్ళ వెనుక నిలబడి ఉంది. ఆమెకు ఎదురుగా నిలబడి,
“బాగున్నావా?” అంది శారద. గంభీరంగా అలాగే మాట్లా డకుండా నిలబడింది గాయత్రి. ఆమె నడుంచుట్ టూ
చెయ్యివేసి ఇంట్లోకి నడిచింది శారద.
హాల్లో కి  వచ్చి  ఒక్కసారి  చుట్
టూ చూసింది శారద. పదిహేను సంవత్సరాల నాడు వదిలేసి వెళ్ళిన
ఇల్లు . పెద్దగా మారలేదు.
ఐదుగురూ  హాల్లో  కూర్చున్నారు.  అక్కచెల్లె ళ్ళకు ఎన్ని  ప్రశ్నలో.   మమ్మల్ని వదిలేసి
ఎందుకు వెళ్ళావు? ఎక్కడికి పో యావు? ఇప్పుడెక్కడుంటున్నావు? ఇన్నాళ్ళకు గుర్తొ చ్చామా?
ఇప్పుడెందుకొచ్చావు? కానీ, అడిగే ధ�ైర్యం లేదు, చనువూ లేదు. వాళ్ళకి ఇప్పుడామె పరాయి మనిషి.

54
తన పూర్వ చరిత్ర గురించి మాట్లా డే ధ�ైర్యం ఆమెకూ లేదు. ఇప్పుడు సంజాయిషీలు  చెప్పి  ప్రయోజనం
కూడాలేదు.  వాళ్ళకు  తన  అవసరం లేదిప్పుడు.  తను  లేకపోయినా,  ఆమె  బతికున్నన్నాళ్ళూ  అ
మ్మ  మనుమరాళ్ళను  బాగానే  పెంచింది. అదృష్ట వశాత్తూ పిల్లలు బాగానే పెరిగి  పెద్దవాళ్ల య్యారు.
ఏవో ప�ైప�ై మాటలూ, ఉద్యోగాలూ, తోటలో మొక్కలూ ఇలాంటి విషయాల మీద సాగింది వాళ్ళ
సంభాషణ.
సడెన్‌గా ఏవొక్కరివ�ైపూ కాకుండా ఎదురుగా కూర్చున్న కూతుళ్ళ వ�ైపు చూస్
తూ , “ఇల్లు అమ్మేద్దాం 
అనుకుంటున్నాను,” అంది శారద.
“ఏ ఇల్లు ?” అడిగింది గాయత్రి.
“ఈ ఇల్లే.”
“ఈ ఇల్లు అమ్మటానికి నువ్వెవ్వరూ? పదిహేను సంవత్సరాలుగా ఈ ఇంటిని చూసుకుంది మేము.
ఇంటి చుట్ టూ శుభ్రం చేసింది మేము.  దొ డ్లో మొక్కలకు నీళ్ళు పో సింది మేము. ఇప్పుడొ చ్చి  ఇల్లు  నీద�ైన
ట్లు  మాట్లా డ్డా నికి  సిగ్గు లేదూ?
“ముగ్గు రు  బిడ్డ ల్నొదిలేసి  నీ  దో వ నువ్వు పో యావు. అమ్మమ్మ లేకపో తే మేం ఏమ�ైపో యేవాళ్ళం?
పాపం అంత  వయసులో  ఎన్ని  కష్టాలుపడిందామె  మాకోసం!  ఆమె పోయినప్పుడుకూడా రాలేదు
నువ్వు. నీకు తల్లీ అక్కర్లేదు, బిడ్డ లూ అక్కర్లేదు. నువ్వసలు మనిషివేనా?” ఇన్నాళ్ళూ దాచుకున్న
కోపాన్నంతా ఒక్కసారిగా  వెళ్ళగక్కింది గాయత్రి.
తల్లి  చనిపోయిన  విషయం నిన్న  పిన్ని చెప్పిందకా శారదకు తెలియదు.  కొంచెం సేపు
తలవంచుకుని మౌనంగా ఉండిపో యిందామె. ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుని నొక్కింది జయలక్ష్మి.
భావోద్రేకం కొంచెం తగ్గిన తర్వాత, “మీ నాన్న నన్నూ మిమ్మల్నీ వదిలేసి ఆవిడతో లేచిపోయి…..
నాకీ  వూళ్ళో తలెత్తు కు తిరగడం వీలుకాకుండా చేశాడు,” అని మాత్రం అంది శారద.
“ఆయనొక పనికిమాలిన వాడు, నువ్వు అంతకంటే ఏమీ తక్కువ కాదు. ఏదో మీ చావు మీరు
చచ్చారు. ఈ ఇల్లు  మాత్రం నీది కాదు, మాది. ఇల్లు అమ్మే అధికారం నీకు లేదు,” అంది గాయత్రి.
శారద చేతిని మళ్ళా నొక్కిపట్టు కుంది జయలక్ష్మి.
“సరే, నీ ఇష్టం. ఎపార్ట్మెంట్లు కట్టు కునేవాళ్ళు అడిగితే మీక్కూడా ఎపార్ట్మెంట్లయితే సులభంగా
ఉంటుందేమో అనుకున్నాను. కొంత  డబ్బిస్తా మన్నారు.  మూడు ఎపార్ట్మెంట్లు కూడా  ఇస్తా మని అన్నారు.
సరే మీ ఇష్టం,” అంది శారద.
“మాకు వాళ్ళ ఎపార్ట్‌మెంట్లు అవసరం లేదు. ఇక్కడయితే అందరం కలిసుంటాం. ప�ైగా, ఇప్పుడు
మేము ముగ్గు రం కాదు,  నలుగురం,” అని “పల్లవీ” అని పిలిచింది గాయత్రి.
తలుపు వెనుక నుంచి వచ్చి గాయత్రి పక్కన నుంచుంది పల్ల వి.
“ఈ అమ్మాయి నాన్న రెండో భార్య కూతురు,” అని పరిచయం చేసింది.
పల్ల వి రెండుచేతులు జోడించి తల వంచి నమస్కారం చేసింది.
“పిన్ని చెప్పింది నిన్న,” అని, పల్ల విని దగ్గ రకు రమ్మని పిలిచి, ఆ అమ్మాయి తల నిమిరింది శారద.
***
ఒక గంటసేపు ఉండి పిన్నితో వెళ్ళిపో యిందామె. వెళతూ
్ తనకూతుళ్ళకూ పల్ల వికీ తీసుకొచ్చిన
డ్రెస్సులు ఇచ్చిపో యింది.

55
ఆమె వెళ్ళిపో గానే, “నువ్వెప్పుడూ అంతేనే గాయత్రీ, నీకు ఆమంటే ఎప్పుడూ కోపమే. కొంచెం బాగా
మాట్లా డితే నీదేం పో యేది?” అని తప్పుపట్టింది వాసంతి.
“నీకంత ఇష్టంగా ఉంటే ఆమెతో వెళ్ళు, నేనేమీ బలవంతం చెయ్యడం లేదు నిన్ను ఉండమని,” అంది
గాయత్రి.
“ఎందుకే అక్కని అలా అంటావు. ఆమె వదిలేసిపో తే మనల్ని సాకింది అక్కేగదా? అక్కకు ఆమాత్రం
కోపం రాదా? అక్కా అమ్మమ్మా నీకు ఎలాంటి లోటూ రాకుండా పెంచారు. అందువల్ల నీకు తల్లి లేని లోటంటే
ఏంటో తెలియదు. సంతోషంగా ఉండాల్సిన రోజుల్లో అక్కమీద ఎంత బాధ్యత పడిందో నీకేం తెలుసు?” అని
జాడించింది శివాని.
“తెలుసులేవే. కానీ అది అంతా అమ్మ తప్పేనా? ఆ దరిదప
్ర ుది పెళ్ళై, ముగ్గు రు బిడ్డ లున్నవాడిని
వల్లో వేసుకుని తీసుకుపో యింది. మరి అమ్మకు కష్టంకదా? పాపం, ఎంత బాధపడిందో !” అంది వాసంతి.
పల్ల వి తన గదిలో ఉందేమో, అంతా వినపడుతుందేమో అని సంకోచిస్ తూ ,  “తప్పంతా
పరాయివాళ్ళమీద నెడితే ఎలాగే? నాన్నకు బుద్ధుండొ దదూ ్? ముగ్గు రు బిడ్డ లున్నవాడు ఇంకొకావిడతో
సంబంధం పెట్టు కోవడమేంటీ?” అంది శివాని.
“అవును ఆయన బుద్ధిలేనివాడే. అలాంటి వాళ్ళతో పెట్టు కోవడంతప్పే. మరిప్పుడు   అక్క
చేస్తుందేమిటీ? దాని ఫ్రండ్ కి పెళ్ళయింది కదా? మరి ఇన్ని తప్పులుపట్టే అక్క అతనితో స్నేహం చెయ్యటం
తప్పుకదా?” అని గాయత్రి వ�ైపు చూసింది వాసంతి.
గాయత్రి చివాలున అక్కడనుంచి లేచి తన రూమ్‌ కి వెళ్ళిపో యింది. తలుపు వెనకనుంచి అంతా
వింటున్న పల్ల వి తన గదిలోకి వెళ్ళిపో యింది.
***
రెండుమూడు రోజులు ఎవ్వరూ ఈ విషయం గురించి మాట్లా డలేదు. నిజానికి మాట్లా డకుండా
ఉండటానికి ప్రయత్నం చేశారేమో.
ఒక రాత్రి భోజనాల తర్వాత పల్ల వి గదిలోకి వచ్చింది గాయత్రి. మంచం మీద ఎదురెదురుగా
కూర్చున్నారిద్దరూ. శారద వచ్చిపో యింతర్వాత ఇద్ద రూ ఏకాంతంగా కలవడం ఇదే మొదటి సారి.
తలవంచుకుని కూర్చున్న పల్ల వి కళ్ళవెంట నీళ్ళు రావడం గమనించింది గాయత్రి.
“ఎందుకు పల్ల వీ, నువ్వెందుకూ ఏడుస్తు న్నావు?”
“మీ అందరికీ నావల్లే కదక్కా  ఇన్ని కష్టాలు. నేను పుట్ట కపో తే మీరందరూ బాగుండేవాళ్ళు కదూ?”
అంటూ వెక్కి వెక్కి ఏడ్చిందా అమ్మాయి.
“అదేంటి పిచ్చి పిల్లా . ఇందులో నీ తప్పేముందీ. మా నాన్నా, మీ అమ్మా వెళ్ళిపోయినప్పటికి
నువ్వింకా పుట్ట లేదుకదా? ఇందులో నీ తప్పు ఏముందీ?”
“మా అమ్మే కదా అక్కా మీ కుటుంబాన్ని నాశనం చేసింది.”
పల్ల విని దగ్గిరకు తీసుకుని తల  నిమిరింది గాయత్రి.
“చానాళ్ళు  నేనూ  అలాగే అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా అనుకొవడం లేదు.”
తలప�ైకెత్తి గాయత్రి కళ్ళల్లో కి చూసింది పల్ల వి.
పల్ల వి చేతులను తన చేతుల్లో కి తీసుకుని, “మీ అమ్మకు ఆరోజుల్లో ఏవో ఇబ్బందులుండేవి. ఆమెకు
నాన్న సహాయం చేసతూ దగ్గ
్ రయ్యాడు. మా అమ్మ వాళ్ళను అనుమానిస్ తూ నాన్నను దూరం చేసుకుంది.

56
ఇందులో అందరి ప్రవర్త నలో లోపాలున్నయ్. తప్పంతా మీ అమ్మది అనడం సర�ైంది కాదు,” అంది గాయత్రి.
“కానీ, నాన్న అప్పటికే పెళ్ళైనవాడు కదా. మా అమ్మ…..”
“పల్లవీ, మొన్న వాసంతి అన్న మాటలు విన్నావుగా నువ్వు. అక్క చేస్తుంది కూడా తప్పేగదా అంది
గుర్తుందా?”
తల ఊపింది పల్ల వి
“మీ అమ్మను తప్పు పట్ట డం సులభం. కానీ…ఒక మనిషి పరిచయం అవుతాడు. ఆ మనిషి
మంచితనం, పనితనం, సభ్యతా, అందరికీ అతను ఇచ్చే గౌరవం నీకు ఇష్టం అవుతాయి. ఆ మనిషి మీద
గౌరవం ఏర్పడుతుంది. మనసులో అతనితో ఏవో తెలియని సంబంధాలు  బలపడతాయి. కాని అతనికి
పెళ్ళయిందని తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చెయ్యాలి? ముందు పెళ్ళయిందో లేదో కనుక్కుని, కానివారికే
దగ్గిరవాలా? అలా  చేస్తే  అదేదో వ్యాపారం లాగా ఉండదూ?”
పల్ల వి ఏమీ సమాధానం చెప్పలేదు.
“మా హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ భరద్వాజ్ అంటే నాకు చాలా ఇష్టం. మా మధ్య స్నేహం ఏర్పడ్డా క చాలా
కాలానికి నాకు అతని వ్యక్తిగత విషయాలు తెలిశాయి. అతనికి పెళ్ళయి దాదాపు పదేళ్ళయింది.  మొదటి
రెండు మూడేళ్ళు బాగానే ఉండేవాళ్ళట. ఆ తర్వాత క్రమంగా ఒకరికొకరు దూరం అవుతూ వచ్చారు. వాళ్ళ
మనస్త త్వాలు వేరు. ఇద్ద రూ ఒకే ఇంట్లో ఉంటున్నా వాళ్ళ మధ్య సఖ్యత అయితే లేదు. అతనికి పెళ్ళి
అయింది కాబట్టి  నేను అతన్ని దూరంగా ఉంచాలా? స్నేహాన్ని తెంపేసెయ్యాలా? ఏమో, నాకేం అర్థం కావడం
లేదు. మీ అమ్మ కూడా ఇలాంటి సందిగ్ధంలో పడి ఉంటుంది. మనం పెళ్ళిచేసుకుందాం అని చాలా సార్లు
అడిగాడు భరద్వాజ్. నేను ఇంతవరకూ ఒప్పుకోలేదు. నాకు బాధ్యతలున్నాయనీ, నేను పెళ్ళిచేసుకోలేననీ
చెప్తూ వచ్చాను. కానీ పెళ్ళయింది కాబట్టి అతనికి జీవితాంతం సంతోషంగా ప్రశాంతంగా బ్రతికే హక్కు లేదా?
ఇష్టంలేని మనిషితోనే జీవితం గడపాలా? అతనితో స్నేహం చెయ్యడం తప్పా? పెళ్ళికి ఒప్పుకోకపో వడం
తప్పా? ఏమో. అన్నీ ప్రశ్నలే. సంతృప్తికరమ�ైన సమాధానాలే లేవు.”
పల్ల వి ఏమీ మాట్లా డలేదు.
పల్ల వి తల నిమురుతూ, “ప్రశ్నల దగ్గ రే  ఆగిపో యాన్నేను. మీ అమ్మ ధ�ైర్యం చేసి ఒక బాటను
ఎంచుకుంది. ఇంత మంచి అమ్మాయిని మాకిచ్చి వెళ్ళిపో యింది,” అని పల్ల వి తల మీద ముద్దు పెట్టి తన
గదికి వెళ్ళిపో యింది గాయత్రి.
***
సారంగ, అక్టో బర్ 2016
ఈ కథకు ఆధారం ప్రఖ్యాత జపాన్‌ రచయిత్రి అకిమి యోషిడ రాసిన ఉమిమాచి డయరీ. కథను
ప్రఖ్యాత దర్శకుడు హిరొకజు కొరేడ “Our Little Sister” పేరుతో సినిమాగా రూపొ ందించాడు.

57
పేరు: లక్ష్మి రాయవరపు కలం పేరు: ఎన్నెల పుట ్ట ింది పెరిగింది: వరల్
డు
ఫేమస్ ఆల్వాలు , సికందరాబాదు. స్థి రోభవ: టొరాంటో, కెనడా.. చలన
చిత్తం: కాలిఫోర్నియా, అమెరికా వృత్తి : చిత ్ర గుప్తు ల వారిది...అదేనండీ
్ర వృత్తి : “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు ” అనే పెద
చిట్టా పద్దు ల లెక్కలు.. ప ్ద

్ర ణాళికతో ప ్ర తి కథా వ్రా యడం మొదలెట్టినా, “ వ్రా సిపడేద ్ద ాం, కనీసం
దరహాసమ ై నా తెప్పించకపోతామా” అన్న ధీమా !!!

13. ఓ పాలబుగ్గల జీతగాడా…..


-ఎన్నెల
ఏందో నాకు ఏడుద్దా మంటె ఏడ్పొస్త ల్లేదు…యెందుకిట్లనో సమజ�ైతల్లేదు. ఆకలయితాందా అయితలేదా
తెసుస్త ల్లేదు..బాధయితాందా లేదా అస్సలుకె తెల్వదు. మొన్ననంగ తిన్నదే, నోరంత గడ్డి వెట్టు కున్నట్టు
కొడతాంది. నాలుగు దినాల్సంది పానం ఒక్క కాడ నిలుస్త ల్లేదు…బుడ్డొడిని సూసి రెండెండ్లా యె. ఎట్లు న్నడొ
ఏమొ! తల్సుకుంటె ఖుష్ అయితాందో దుఖమయితాందో ఏందో …ఎవలన్న మాట్లా దితె బాగుండు.
ఎవరున్నరీడ? ఉన్న గుడంగ వాల్ల బాస నాకర్థం గాదు…మంచిగ మన బాసల మాట్లా డెట ోల్లు కాన్రాక ఎన్ని
దినాలయ్యె. నోరెండుకపో తున్నట్టుంది ఇంటికాడ ఎట్లుందో అందరు ఏంజేస్తు న్రో ! దేవుడా నా అసొ ంటి బతుకు
పగోల్ల కి గుడ ఇయ్యకు..తాసిలి బతుకు.. ఎందుకొచ్చిందో .
మా యమ్మ ఎంత ఎదురు చూస్తుందో . బుడ్డోనికి ఏమ�ైన తిననీకి పెట్టిన్రో లేదో ..పెట్టే ఉంటరు తియ్యి..ఒక
బొ మ్మ కొందునా ? మీ నాయిన అని చూయిస్తె దగ్గ రికొస్త డో రాడో …వాడు పుట్టిన కొన్ని నెలలకే ఇంట్ల కెంచి
బయటవడ్డ , వానికెట్ల ఎర్కయితది నాయినెవరో! బూలచిమి యేంజెస్తుందో పాపం నన్ను గట్టు కోని ఎంత
బాద బడుతుందో ఏమో! పిలగానికి ఒక బొ మ్మ కొందునా? బొ మ్మ నోట్ల మన్ను వొయ్య, ఏమాలోచన
జేస్తు న్ననో సమజ�ైతల్లే. గిసొ ంటి టయిము దేవుడెందుకిస్తడో ?
నాయిన చిన్నప్పుడే చెప్పిండు..రాజాలూ నిన్ను నా లెక్క చెయ్య బిడ్డా గీ కూలి నాలి పనులు నీకొద్దు
మంచిగ ఇస్కూల్కి బొ య్యి రాజా లెక్క బత్కాలె నువ్వు గందుకె పంతులు నీకు ఆ పేరు ట్టిండని ఎన్నిసార్లు
చెప్పిండు..పేరెవ్వరు పెడితె ఏంది రాత రాసినోడు సక్కంగ రాయకుంటె. నన్ను ఇస్కూల్కి బొ మ్మంటనే
నాయిన మీదికెల్లిపో యిండు. నాకు ఆ నాటికి మీదికెల్లిపో వుడేందో గుడ్క తెల్వదు. గుండు కొట్టించి ,
సల్ల నీల్లల్ల ముంచి, మెడల దండేసిన నన్నెత్తు కోని కుండవట్టు కోని నాయినను మీదికి తోలిన్రు ..జెర్రంత
యాదికొస్తాంది. అమ్మ పానమంత నాయినతోనె బొ ంగ నేనున్ననని జెరంత పానం నిలుపుకున్నట్టుంటుండె.
మూన్నెల్లు మామయ్యోల్ల ఇంటికాడుండి మల్లొచ్చినము. అమ్మ ఊకె ఏడుస్తుండె. మేస్తిరి మామ
ఒచ్చి.’ఊకో కమలమ్మా పిలగాన్ని సూస�ైన నువ్వు లెవ్వాలె..కూలికి టయిమ�ైతాంది నడువు అని గదిరిచ్చి
తోలకబో తుండె. జెర్ర పెద్దగ�ైతుంటె తెలిస్తుండె నాకు అమ్మ పానం జెరంత నా కోసరం ఇడ్సవెట్టి జెరంత
నాయిన కొంచవొయ్యినట్టు న్నడు. గా కొద్ది పానం కూలిపనులల్ల తగ్గు కుంట ఒచ్చింది..
ఒక దినం మాంజా చేస్తు న్న. గాజు పెంకలు నూరి, గోందు, పసుపు కలిపి దారాన్ని దాంట్ల నానబెట్టి
ఎండవెట్టి, చక్రి కి కట్టు కుంటం. ఎన్ని పతంగులు అఫ్ఫా జెయ్యాల్నో అదే లెక్కన్నట్టు . మేస్తిరి మామ రమ్మని
చెప్పంపిండు ఉర్కి బొ య్యిన. ఏందిరా రాజాలు ఇంక గోటీలాడితె ఎట్ల అమ్మకు పానం మంచిగుంటల్లే. ఇగ

58
అమ్మను ఇంటికాడుంచి నువ్వు కూలికి రా పని నేర్పిస్త అన్నడు..అమ్మ చాన ఏడ్చింది. మేస్తిరి మామ,
వనజత్త ఒచ్చిన్రు ….పర్వలే ఒదినే మేము లేమ పో రగాన్ని జూడనీకి, పరాయోల్ల మా అన్నది వనజత్త .
ద�ైర్నం జేసుకో కమలమ్మ నీ పానం పురాగ ఖరాబయెదాంక ఊకుంటవా పొ రగాడు ఆగం గాడా, నువ్వు
గాజుబొ మ్మ లెక్క పానం నిలుపుకోవాలె ఆని మొకం జూసి.ఊకో ఊకో…పిలగాన్ని జెల్దిన తోలియ్యి అన్నడు
మామ. నీ కాల్మొక్కుతన్న పో రగానికి ఎక్కువ పని చెప్పొ ద్ద ని అమ్మ ఒక్క తీరుగ బత్మిలాడింది. అట్ల నే
నువ్వు పికర్ జెయ్యకు అంజెప్పి మామ నన్ను ఎంట తోలకబొ య్యిండు…అమ్మ ఆ దినం సూసిన సూపు
ఎప్పటికి మర్వలేనట్టుండె.
మొగోల్ల కి వంద ఆడొ ల్లకి ఎంబ�ై ..పిల్లో ల్ల కి యాభ�ై ఇస్తుండ్రి..ప�ైసల్ సరిపో తలెవ్వని అమ్మ రెండు
ఇండ్లల్ల బాసన్లు తోమి అడుగు బొ డుగు ఇచ్చింది తీస్కస్తుండె. నాకు పదిగేనేండ్లు రాంగనె అమ్మ పానం
పురాగ ఖరాబయ్యింది. కొన్ని దినాలు మామ ఉష్కె మోపిచ్చిండు..కంకర బెందెడు మొయ్యనీయలే…రాంగ
రాంగ మాల్ కలుపుడు..ఇట్కె పేర్వుడు, అస్త ర్ కొట్టు డు నేర్చిన..అమ్మ నువ్వొండి పెడితే సాలు..పనికి
బో కుమని చెప్పిన. ఇంకొక్క యాడాది గాంగనె, అమ్మకు వండ చాత గుడ అయితల్లే. నేను జెర్రంత వొండి
పనిలకి పో బట్టిన…
ఒక దినం పక్క ఊరి కెంచి గంగయ్య మామ ఒచ్చిండని అమ్మ పిలగాల్ల ని తోలిచ్చింది. మా బూ
లచిమిని మీ రాజాలు కి అడగనీకొచ్చిన యేమంటవు చెల్లే అన్నడు. అమ్మ నా దిక్కు చూసింది. గా పొ ల్ల
ఎవలో, ఎట్లుంటదో నాకు తెల్వది. నాయిన పోయిన సంది యాడికి పొ య్యింది లేదు, ఎవలని చూసింది
లేదు. ఇల్లేందో , అమ్మేందో , నా పనేందో . కట్నమియ్యనీకి నా కాడ యేం లేదు కమలమ్మా. బూ లచిమి
కూలికి పో తది, నీకు జెర వండిపెడతది..ఏమంటవు” అన్నడు గంగయ్య మామ. అమ్మ కండ్లు మెరవంగ
జూసి ఎంత కాలమాయే! అమ్మకి జెర పానం మంచిగయిందో , బల్మీకి తెచ్చుకుంటుందో గాని అమ్మ లేచి
తిఉగవట్టింది.
బూలచిమి పేరుకి తగ్గ ట్టు బూ లచిమే. నా ఎంట కూలికొస్తుండె. ఇంటి పనంత చూస్తుండె. అమ్మ మెల్లగ
అన్నం కూర ఒండుడు షురూ జేసింది. ఇంటికి బో ంగనే అమ్మ ఇద్ద రికి ఉడుకుడుకు బువ్వ పెడుతుండె.
ఇద్ద రి మీద జెరన్ని ప�ైసలు మిలుగుతున్నయి. బూ లచిమి ఏడో నెల వచ్చేదాంక పనికి ఒచ్చింది.. గంగయ్య
మామొచ్చి కానుపుకి తీస్కబొ య్యిండు. దేవుడా నా బిడ్డ ని సల్ లంగ సూడుమని అమ్మ ఒకటే మొక్కింది.
అమ్మ ఎదురు సూపుకు గంగయ్య మామొచ్చి పిల్లా నీలాడింది..పిలగాడు పుట్టిండని చెప్పో యిండు. ఆదర
బాదర పో దామని మనసుకి అనిపిచ్చింది..కానీ పనులతోని కాలే. అమ్మ గుడంగ మనుమని ఎప్పుడు
సూస్త నా అని కాసుకుంది. రెండు నెలలు నిండంగనె బూ లచిమిని , పిలగాన్ని తోలిచ్చి పొ య్యిన్రు . అమ్మ
బుడ్డోడ్ని చూస్తుంటె, బూ లచ్మి పనులు చేస్తుండె.
మల్ల జెర ప�ైసలకి కట కట. పచ్చి బాలెంతను పనికెట్ల తోలిస్ తం బిడ్డా ఉన్నంతల తిందాం తియ్యి
అని అమ్మ అంటుండె. మా ఊరి పంతులయ్య బిడ్డ గీతక్క మగని తోని కిరి కిరి వడి ఇంటికొచ్చింది. ఆ
అక్కకు బుడ్డోడు మస్తు నచ్చిండు. ” బాపనోల్ల పిలగాడు నీకెట్ల పుట్టిండురా రాజయ్యా..నాకిచ్చెయ్యిరా
వీన్ని పెంచుకుంటా” అని అక్క అంటుండె. నీ కన్న ఎక్కువనా అక్కా అట్ల నే తీస్కో అంటుంటి. బూ లచిమి
నవ్వుతుండె. అమ్మ కండ్లు మల్ల మల్ల మెరుస్తు న్నయి. ప�ైసలకి కట కట బో ంగ అంత మంచిదే. బూ
లచిమిని పనికి రమ్మందునా? అమ్మ బుడ్డొడిని చూడ చాతన�ైతదా? గీతక్కకి బుడ్డోడిని సాకనీకి ఇచ్చేద్దు నా?
అమ్మో అమ్మ కండ్ల మిల మిల ని ఏడికి తోలియ్య..ఇట్ల సోంచయిస్తుంటె, మస్త్ బుగులయితాంది. రాత్రి నిద్ర
పడతల్లేదు.
పొ దుగాల గొల్లో ల్ల పద్మి ఒచ్చిండు. రాజాలు నేను దేసం పో తున్న నువ్వొస్త వా అన్నడు. నాకేం దేసమ్రా
పద్మీ, నేనేందో నా లోకమేందో అన్న. డెబ్బై వెయిలు కడితె మాల్దీవులకి తోలిస్త రంట నెలకు ఏడు వెయిలు

59
జీతమంట. ఒక యాడాదిల అప్పు తేరిపో తది. మూడు నాలుగు ఏండ్లుంటె రెండు మూడు లచ్చలు జేస్కొ ని
మర్లి రావొచ్చు. గీ కట కట ఉండదు గదరా అన్నడు. అంత మంచిదే గాని డెబ్బై వెయిలు యాడకెంచొస్తయి
రా అన్న. నేనయితె ఇల్లు గిర్వి పెడుతున్న, నువ్వేమ�ైన ఆలోచన చెయ్యి అన్నడు. నేను ఊగులాడుతున్న.
అమ్మకు బూ లచిమి తోడు, అమ్మ కండ్ల కు బుడ్డోడు తోడు, పో దమా అనుకున్న. బుడ్డోడు అదురుష్టం
తెస్తుండురా పో దాంపా అన్నడు పద్మి. ఎవలి తోనన్న మాటాడి జెల్దిన జెప్పు అన్నడు పద్మి. నాకు
పదారేండ్లు . ఇంటికి నేనే పెద్దోడ్ని. అడగనీకి ఎవరున్నరు? నా గుడిసె మీన ఎంతిస్త డొ అడుగుదాం పా అని
పద్మిని తోల్కోని సేటు కాడికి బొ య్యిన. ఇంటికి పొ య్యిన గానీ ఏం జెప్పలె.
తెచ్చిన ప�ైసలల్ల కొన్ని నాకాడ బెట్టు కున్న. పనికి పో వుడు తక్వ జేసిన. సారు జెప్పిన లెక్క రెండేండ్లు
ఎక్కువేసి పద్దెనిమిదేండ్లు అని రాపిచ్చినం ప�ైసలిచ్చి. ఏందో పో లీస్ తేషన్ల కాగిదాలు చేపిచ్చినం. పో లీసో డు
ఇంటికస్తె ప�ైసలిచ్చినం. పాస్పో రటు కాగిదాలు గిట్ల సారు దగ్గ రుండి చేపిచ్చిండు.. గిసొ ంటి కతలన్ని బానే
తెలుస్తు న్నయ్. పో యే రోజొచ్చింది. బూ లచిమికి చెప్పిన అమ్మ, బుడ్డోడు నా రెండు కండ్లు , వాల్ల ని ప�ైలంగ
చూసుకో..నీ చేతుల పెడుతున్న పొ య్యొస్త మల్ల అన్న. అమ్మ కండ్లల్ల లీల్లు కారుతున్నయ్. నాకు అమ్మ
సరింగ కానొస్తల్లేదు. కండ్లు తుడుసుకోని మల్ల మల్ల సూసిన. అమ్మ మొకం చేతుల దాచుకొని యేడుస్తాంది.
అమ్మ మొకమొక్క పారి కనిపిస్తే  బాగుండు.
సారు, పద్మి వొచ్చిన్రు . ఎయిరుపో ట్ల   ఎవల�ైన అడిగితె, ఆ దేసం ల మా యక్క ఉన్నది సూడబో తున్న
అని చెప్పుమన్నడు. ఆ సారేం మాట్లా డుతుండో నాక�ైతె సమజ్ గాలే. పద్మి ఉన్నడన్న ద�ైర్నానికి పో తున్న.
కేరల బొ యినం. ఆడికెంచి ప్లే ను (గాలిమోటరనొద్దు గిట్లనాలని సారు చెప్పిండు)ఎక్కబో యినం. మాకు
అంగ్రెజి రాదు అని చెప్పినం. ఇందీ ఆయనని తోల్కొచ్చిన్రు .మా నసీబ్ బాగున్నట్టుంది. ఎవ్వలు ఎక్కువ
ఏం అడగలే.సారు చెప్పిన తీరుగ మా యక్క ఉన్నది సూడబో తున్నమని చెప్పినం. చిన్న బుక్క అన్నం
బెట్టిన్రు …నాకు జెర బుగులయ్యింది..ప్లేన్ ల కెంచి కిందికి జూస్తే అన్ని లీల్లు జెర్రైనాంక దూది ఉప్పు లెక్క
కాన్రావట్టె..గదేందిరా పద్మీ అన్న..నాకు గూడ తెల్వదురా అన్నడు. ఒక గంట కాంగనె  మాలే ల ఉన్నం.
ఇషార జేస్కుంట ఏటూ బో వాలె అని తెలుసుకుంటున్నం..తెలుగా మీది అని ఒక సారు మందలిచ్చిండు..
మాకు మస్త్ ఖుష్ అయ్యింది. పేర్లేంది అన్నడు? రాజాలు, పద్మి అయ్యా అన్నం. అగో ఆడ నిలబడ్డోల్లు మీ
కోసరం ఒచ్చిన్రు పోండ్రి అన్నడు..అయ్య నీ కాల్మొక్కుత బాంచన్ అని చెప్పి వాల్ల కాడికి పొ య్యినం..రాజ్,
పాద్ అని మాకు కొత్త పేర్ల తోని పిలిచి షేకాండు జేసిన్రు . మాకు జెర చెక్కరొచ్చినట్టయితాంది. మా పెటటె ల ్ ు
వాల్లే తీస్కున్నరు..చిన్న పడవ్ల కి ఎక్కిచ్చి పది నిమిషాలల్ల మాలే కి కొంచవోయిన్రు .
పెద్ద పెద్ద బవంతులు కడుతుండ్రీడ. మమ్ములను పనిల వెట్టిన్రు . వండుకునుడు గిట్ల ఏంలెవ్వు. షాపలు
లీలల్ల ఉప్పేసి ఉడకవెట్టి..ఆ షారు దొ డ్డు బియ్యం బువ్వ తెస్తుండ్రి.అన్నంల షారు కల్పుకోని షాప ముక్క
అంచుకి వెట్టు కోని తినాల్నంట .మా పెద్ద మేస్తిరి అరవోడు. కారం లేదా అని ఎట్ల అడగాల్నో తెల్వకపాయె.
పొ దుగాల చాయ్ డబల్ రొట్టె ఇస్త రు. వెన్న జాం అంట. మాకెర్కలెవ్వు. మెల్లగ తెలుస్తు న్నయి. ఎనమిది
నెలలు కాంగనే యీడ పని అయిపో యింది..ఇంకో దీవికి పో వాలె అని చెప్పిన్రు ..జెర ఇక్కడో ల్లు మాట్లా డింది
ఎర్కయితాంది…అందరు మందలిస్త రు నవ్వుకుంట..మంచిగ్గొ ట్టింది.
ఈడ మాకేమి కర్సులేవు. ఒక పెద్ద రూముల నలుగురం ఉంటుంటిమి. మా ఎంట బాలాజి ఉంటుండు..
యీడు నెల్లూ రు పిలగాడంట కొంచెం తెలుగు, కొంచెం అరవం మాట్లా డతడు..పెద్ద మేస్తిరి మాటలన్ని యీ
పిలగాడే మాకు తెలుగుల చెప్తడు..మల్ల మేము అడీన దానికి మేస్తిరికి చెప్తడు. పద్మి నేను ఒక తాన్నే
పని చేస్తు న్నం మా తానున్న నలుగురం ఒకొక్క నెల ఒక్కొక్కరింటికి ప�ైసలు పంపినం మూడు నెలల
జీతం జెరన్ని కర్సులకి పట్టు కోని ఇర్వై వెయిలు పంపినం. మల్ల మల్ల  పంపనీకి గాదు. ఎంభ�ై వెయిలల్ల
మిత్తి వట్టు కోని ఇచ్చిండు సేటు. గంగయ్య మామ చిట్టి పాడి పదివెయిలిచ్చిండు. సత్తెమ్మ పెండ్లివరకిస్తె
సాలు బిడ్డా అన్నడు…మూదు షాతం లెక్క తీసుకుంటుండు సేటు. ఐదారు నెలల మిత్తి గట్టి ప�ైలంగ ఇంటి

60
కర్సులకి వాడుకోమని బూ లచిమికి చెప్పుమని సారు ఫో న్ జేసినప్పుడు చెప్పిన. బూ లచిమిని పనిలకు
పో వొద్ద ని చెప్పుమన్న.మేము ఫో న్ చెయ్యనీకి ఎర్కలే మమ్ములని పంపిన సారు యీడి మా మేస్తిరికి
చేసిండు రెండు పార్లు. …
జర తెల్సుకున్నంకా గీతక్కకి ఫో న్ చేసి నేను పద్మి మాట్లా డినం…బూలచిమి ఊకె ఉండె పిల్ల గాదు..
మనెమ్మ పెద్దమ్మ కాడ గుత్త కు జెరన్ని ఆకు కూరలు, కూర గాయలు దెచ్చి ఇంటి కాడ అమ్ముతుందంట.
చుట్టు ముట్టోల్లు కొనుక్కోంగ ఇంట్ల కి ఎల్తు న్నయంట..రోజుకు ఇర్వై ముప్పై మిలుగుతున్నై పికరు చెయ్యొద్ద ని
చెప్పుమన్నదంట..పో నితియ్, కూలి కస్టం కన్న ఇది మేలని ఖుష్ అయిన. గీ పది నెలల్ల రెండు పార్లు
పంపినం , జెర మనుసుకు మంచిగ్గొ డతాంది. మిత్తి కి పోంగ ఇంటి కాడ గడుస్తుంది. అమ్మ మంచిగనే ఉందంట.
అప్పు దేర్పాలె. ఒక్క యాడాదిల తేర్పుతమనుకున్న..ఇంకొక యాడాదే పడతదో తెల్వది. సత్తెమ్మ పండ్లికి
లగ్గా లు పెట్టు కుండ్రంట. గీతక్క నన్ను పరేషాన్ గాకుమని చెప్పింది. బూ లచిమి చిన్న చిన్నగ మిగిలిచ్చిన
ప�ైసలతోని 20 నెలల చిట్టి ఏస్తుందంట. అది ఎత్తు కుని ఇస్తా తియ్ అని చెప్పిందంట. పది నెలలు కాంగనె..
ఈడ పని అయిపొ య్యింది ఇంకొక దీవికి పో వాల్నని చెప్పిండు మేస్తిర.ి .పద్మీ నేను ఒక్క తాన్నేనా అని
బాలాజీ ని అడుగుమన్న…నవ్వుకుంట జెప్పిండు మిమ్ములను ఇడగొట్ట డంటలే..అని…సో పత్తి ల పోయినం.
యీ దీవిల అందరు మందలిస్త రు…ఇషార జేస్కుంట నవ్వుతరు..మాకు భీ జెరంత సమజ్
అయితాంది. ఉన్నవా తిన్నవా అని అడగ నేర్సినము. పురాగ మాట్లా డనీకి రాదు .ఇంటోల్లు అప్పుడప్పుడు
షాపల తోని కవాబులు చేసిస్తరు. యీ దీవి మాలే లెక్క లేదు..సల్లగ మంచిగుంది..పని కాంగనె పొ ద్దు మీకి
జెర సల్లగ తిరుగుతుంటిమి. ఒక నర్సమ్మ కానొచ్చింది ఎవరో చెప్పిన్రంట ఇండియ కెంచి యెవలొ వొచ్చిన్రని.
తెలుగోల్లేనంట . మమ్ములను తిన్నరా అని అరుసుకుంటుండె. గనేస్ పండుగ నాడు మమ్ములను పిలిచి
అన్నం బెట్టింది…ఎన్ని దిన్నలయ్యెనో గిసొ ంటి బువ్వ దినక! అమ్మ కాకరకాయ తోని తొక్కు లెక్క చేస్తుండె
అని చెప్పిన. అమ్మ మస్త్ యాద్కొస్తుందని చెప్పిన. పద్మి కండ్లల్ల లీలు తెచ్చుకుండు. అమ్మ ముచ్చట్లు ,
బుడ్డోని ముచ్చట్లు విన్నది…మాకు మస్త్ ఖుష్ అయ్యింది..చాలమ్మ ఇన్ని దినలకు నువ్వు మాట్లా డినవు
నీ కడుపు సల్ల గుండ అని అన్నం. మల్ల రండ్రి ఎప్పుడ�ైన అన్నది. ఒక నెల కాంగనే ఇంకో ఊరు పంపిన్రు .
ఆడ ఉండంగ మూడొ అంతరం ల సజ్జ మీద నిలబడి అస్త రి కొడుతుండంగ చేతిల మాల్ గంప
జారిందని జెర్రంత ఒంగిన దేవుడా….అట్ల నె కింద వడ్డా !నడ్డి బొ క్క ఇరిగిందని డాక్టరమ్మ చెప్పింది. పురాగ
లేవ చాతన�ైతల్లేదు..ఇక్కడో ల్లు మంచోల్లే. పాపం లెవ్వనియ్యకుంట సేవ చేస్తు న్రు . యీ నెల ప�ైసలు రాలే.
ఇంటికాడ ఎట్ల అనుకున్న .ఒక నెలక�ైతే ఇంటి కాడ పర్వలేగద .నా దాంట్ల చెరిన్ని తీసుకోమందాం, మల్ల
నువ్వు పంపినప్పుడు మల్ల సగం సగం చేసుకోమందారి అన్నడు..దేవుడా..మా పద్మి గాన్ని సల్లగ
సూడుమని మొక్కిన. పద్మీ ఇంటి కాడ తెల్వనియ్యకురా..అమ్మకు దెలుస్తె పానం కల కల అన్న. అట్ల నే
తియ్రా..చెప్పను తియ్ అన్నడు. కానీ అమ్మ బూలచిమి బుడ్డోడు ఊకె యాదికొస్తా న్రు . జెర మంచిగ కాంగనే
పనికి పో దారని  అనుకున్న. యేడ!  నిల్వనీకి రాకపాయె. ఇంటికి పో దమా అని ఎన్నిపార్లు అనుకున్ననో
నాకే తెల్వది. ఇంక పది నెలలన్న గాక పాయె. యీడో ల్లు ఏమనుకున్నరో పనికి బో కున్న జెరన్ని ప�ైసలు
ఇయ్యవట్టిన్రు . ఇంటికి బొ య్యి కుద్త యేం జెయ్యొస్త ది..యీడనన్న మందు మాకు పుకట్కే ఇస్తా న్రు ..యీల్ల
కడుపు సల్ల గుండ. జెర్ర ఓపిక పడితె పనికి పో వొచ్చని స�ైసిన. మల్లొ క్క పారి ఇంటికి ఇర్వై వెయిలు పంపినం.
నా గురించి పద్మి గాని ఇంటికి ప�ైసల్ తక్వ వోతున్నై . పద్మి ఇంటికి సగం , మా ఇంటికి సగం పొ య్యింది.
మిత్తి మందం అయితాంది. అమ్మ గిట్ల మంచిగనే అని చెప్పింది. సత్తెమ్మ పెండ్లికి పొ య్యొచ్చిన్రంట.
అప్పుడప్పుడు ఇంటికి మాట్లా డుతున్నం. ఎప్పుడొ స్తు న్నరని అందరు అడుగుతున్రంట…ఇంకా తెల్వదు
అని చెప్పినం.
ఎనమిది నెలలు కాంగనె జెర లేసి నడవ వట్టిన. నడుము నొస్తుంది మందులు తింటున్న. చిన్న చిన్న
పనులు చెయ్యబో తున్న. ఊకె ప�ైసల్ దీస్కో నీకి సిగ్గయితాంది. ఉష్కె పడుతున్న. అద�ైన మంచిదే అన్నడు

61
మేస్తిర.ి జెర్రంత వీల్లు మాట్లా డేది అర్థం అయితాంది. మేస్తిరి బార్యకు సుస్తీ అయింది. జెర్రంత అన్నం వొండి షాపల
పులుసు చేస్తు న్న. పనోల్లందరు మస్త్ ఖుష్ అయ్యిన్రు . అక్క గుడంగ తమ్మీ నువ్వు మస్త్ పని జేస్తు న్నవని
మెచ్చుకుంది.మీరు చేస్తు న్న దాంట్ల ఇదెంత అన్న. రోజులు మెల్లగ నడుస్తు న్నై. పద్మిని ఇంకొక దీవిల పనికి
పంపిన్రు . నేను గుడంగ పో తా అన్న. రాజాలూ ఇక్కడో ల్లు మంచోల్లు , నిన్ను మంచిగ చూసుకుంటున్రు …
కొత్త జాగాల ఎట్లుంటరో…చిన్న చిన్న పనులు చేసుకోరా ..ఆడ కాంగనే మల్ల కలుద్దా రి అన్నడు..నిజమే
అనిపిచ్చింది..చెట్లకు లీల్లు వడుతున్న. పద్మి లేకుంటె కష్ట మే అయితాంది. మన బాసల మాట్లా డనీకి ఎవ్వలు
లేరు.ఫో ను కారటు కొనుక్కోని గీతక్కకు నెలకొక్కపారి ఫో ను చేస్తు న్న. పో కలు తెస్తరు…వాటిని చితక్కోట్టి
పెడుతున్న. తమలపాకుల తీగల కెంచి ఆకులు తెంపి పెడుతున్న. మేస్తిరి ఇంటికి దుక్నం ఉన్నది..జెర్రంత
సేపు దుక్నం ల సామాన్లు జమాయిస్తు న్న. చెత్త తీస్కపొ యి సముద్రం కాడ పాడేసి వస్తు న్న. షాపలు
ఎండబెట్టి తీస్తు న్న. గిసొ ంటి పనులకి బాంగ్లా దేషం కెల్లి పో రగాల్ల ని తెచ్చుకుంటరంట.రెండు వెయిలిస్తు న్నరు.
కాని తియ్ మంచిదే అనిపిస్తాంది. వాల్లు ఇస్తు న్న జీతానికి ఏదో టి చేస్తు న్ననని పానం నిమ్మలమయింది.
ఇంటికి ప�ైసలు పంపనీకి అయితల్లేదు.  జీతం లెక్క 14 వెయిలు చేతిలున్నై…మల్ల మిత్తి కి ప�ైసలు పంపాలె.
మేస్తిరికి చెప్పిన ఇంకొక్క 3 నెలలయితె 20 వెయిలయితయ్ పంపొ చ్చు. ఖర్సు తక్కువ�ైతదని చెప్పిండు.
ఫో ను చెయ్యలనిపిస్తది గాని ప�ైసల్ జల్ది న తేర్పితె జెల్దిన ఇంటికి బో వొచ్చు. ఇంటికి ఫో ను చేసిన. అమ్మ
పానం జెర బాగలేదని అక్క చెప్పింది…బూలచిమి ని పిలువుమన్న. చాన దినాలకి ఆ పో రి గొంతు ఇనంగనే
మస్త్ ఏడుపొ చ్చింది. యీడ అంత మంచిగనే ఉన్నది. అత్త మ్మను నేను బానే చూసుకుంటున్న, నువ్వు
ఫికర్ చెయ్యకుమని చెప్పింది…ఆ పొ ల్ల మస్త్ ఏడ్చింది. ఎనకసిరికి బుడ్డోడి ముచ్చట్లు చెప్పింది..గీతక్క
నేర్పిచ్చిన చిట్టి చిలకమ్మా అని ముద్దు ముద్దు గ చెప్పిండు..నేను ఎవ్వలని అడిగిన..ఏం మాట్లా డలే….
నాయిన నాయిన అని చెప్పు అని బూలచిమి చెప్పింది..వాడు నాయిన అన్నడు…నాకు పొ య్యి వాడిని
ముద్దా డాలని అనిపిచ్చింది. కొన్ని రోజులు ఆ ముచ్చట్లు తల్చుకుంట ట�ైము తెల్వలే.ఒక దినం నిద్ర లేవంగనే
మేస్తిరి చెప్పిండు. మాలే కెంచి మా పెద్ద మేస్తిరి కాడికెంచి ఫో ను ఒచ్చిందంట. ఇండీ ల మేస్తిరి ఫో ను చేసి
నన్ను అర్జెంటుగ ఇంటికి ఫో ను చెయ్యుమని చెప్పిండంట. జెల్దిన బొ య్యి గీతక్కకి ఫో ను చేసిన. ఎవ్వరు
ఎత్త లే. మల్ల మల్ల జేసిన. పంతులు ఎత్తిండు. రాజాలు నువ్వు గుండె గట్టిగ జేసుకో బిడ్డా … అమ్మ రాత్రి
తేరిపో యింది..నువ్వు జెల్ది రావాలె అన్నడు…నాకు సముద్రం పొ ంగి ఒస్తుందా అనిపిస్తుంది…ఇగ పంతులు
ఏం మాట్లా డుతున్నడొ తెలుస్త ల్లే…ఎట్ల జెయ్యాలే…యీడ మాట్లా దనీకు భీ ఎవ్వలు లేరు…. మా మేస్తిరికి
జెప్పిన. రాత్రి షాపల పడవ పో తాంది దాంట్ల పో తవా అన్నడు…అవునన్న. అందరొచ్చి చూసిపో తున్రు .
రాత్రికి పడవెక్కిన. ఇగ మీ వోల్ల తానికి పో కు..మీ మేస్తిరికి ఫో న్ జేసి చెప్త ఎయిర్పోర్టల నిన్ను కలువుమంట..
నువ్వు ఆడనే ఉండు జెర్రంత టయిము కలిసొ స్త ది అన్నడు. మా అందరి పాస్పో ర్టులు గిట్ల పెద్ద మేస్తిరి కాడ
ఉంటయి..నేను పో వాల్నంటె కాగితాలేంటివో కావాల్నంట. నువ్వు పొ యినాంక ఆడికొచ్చి ఇస్త రుతియ్ నేను
చెప్తా అన్నడు.మనసు ఉర్కుతాంది పడవ మాత్రం యీడనే ఉన్నది. చేతులున్న ప�ైసలు పో నీకి రానీకి
అయితయి. ఫ్ై టుకు ల పో ను రాను 12 వెయిలు అయితదంట. కేరల కెంచి సెకిందరబాదు పొ వ్వాలే. ఆడికెంచి
గజ్వేల్ బస్సెక్కి పో వాలె. యీడనే రెండు దినాలయితాంది. ఎప్పుడు పో తనో తెల్వదు. ప�ైసలు ఎట్ల నో..ఆడికి
పోంగనె ఎవలనడగాలె..మొదాలు ఎవలతోని మాట్లా డాలె. ఇన్ని దిన్నాలయినాంక పొ య్యి ప�ైసల్ లెవ్వంటె
బాగుంటదా…అమ్మనెట్ల తోలియ్యాలె…ఆలోచన జేస్తుంటె పిచ్చి పడతాంది…బూలచిమికి పెండ్లికి కమ్మలు
కాల కడియాలు పెట్టిన్రు . అడుగుదునా…పో ల్ల అడుగుతె ఇస్త ది. దాని అవ్వగారోల్లు ఏమనుకుంటరో…
దేషాలు బట్టి 2 ఏండ్లు పోయినోదు పెండ్లాం కమ్మలు అమ్ముకతిన్నడనుకుంటరో ఏమో.
తెల్లా రి మాలేకి పొ య్యిన. పడవోల్లు మాలేకి కొంచవోకుంట ఎయిర్పోర్ట్ తాన దింపిన్రు . వాల్లు మేస్తిరిని
కలిసి నేను ఈడికి వొచ్చిన అని చెప్తమన్నరు. ఇప్పుడు కండ్లల్ల నీల్లొ స్తు న్నై…అమ్మ అమ్మా అమ్మా….
అమ్మ పో య్యిందని తెలిసినప్పుడు యీ నీల్లు ఏడికి పొ య్యినయ్…అటు పంతులు చెప్పుడేంది..దమాక్
ప�ైసల లెక్కలు పెట్టవట్టె..మేస్తిరికి నేను చెప్పెడిది అర్థం ఐతదో కాదో , యీ రాత్రి పడవలు పో తున్నయొ లేదొ ,

62
పెద్ద మేస్తిరి కలుస్త దో కల్వడొ , టికీటు దొ రుకుతదో దొ ర్కదొ , ప�ైసలు ఎట్ల నొ..ఇదే రంది.ఇన్ని గంటలయినాంక
యీడికొచ్చి నాలుగు గంటలు కూకున్నంక కండ్ల ల్ల కెంచి రెండు సుక్కల లీల్లు బయలెల్లినయ్. కండ్లు
తూడ్సుకుంట అటు సూసిన. పెద్ద మేస్తిర,ి బాలాజీ , పద్మి ఉర్కి వస్తు న్నరు…పద్మి ఈడికెప్పుడొ చ్చిండొ …
వాన్ని చూడంగనే గుండె పలిగింది. పద్మీ అమ్మని తోలియ్యబో తున్నరా అని గట్టిగ ఏడ్వవట్టిన. పద్మి నన్ను 
దగ్గ రికి తీసుకుండు. నాకు దుక్కం ఆగుతల్లె . చిన్న పిలగానిలెక్క లాజిగ ఏడ్వ వట్టిన.వొచ్చిపొ య్యేటోల్ లందరు
మందలిస్తు న్రు ..ఏమయ్యింది అని..యేన మమ్మ మరువె అని పెద్ద మేస్తిరి చెప్తుండు..అవునా అని అందరు
కదిలి పో తున్రు . మనసు ఇంకింత పచ్చిగయింది. పదిమి డబల్రొ ట్టె తెచ్చిండు జెర్రంత తినురా అని…ఒద్దు
అని అన్ననే గానీ పానం పో తున్నట్టుంది. జెర్రంత తినిపిచ్చి నీల్లు తాపిచ్చిండు. నాకు టికీట్ కొనుమని
చెప్పు బాలాజీ అని ప�ైసలు తీసి ఇయ్యబో యిన. రాజాలూ జెర్ర స�ైసు..మేస్తిరి నీతోని మాట్లా డాలంట అన్నదు
పద్మి..మేస్తిరి ఏమో అంటుండు..బాలాజి నన్ను అడిగిండు…రాజా నువ్వు వొచ్చి 2 యేండ్లు అయినాది
కదా…అప్పు ఎంత పూడిసిందీ అని మేస్తిరి అడుగుతున్నారు అన్నడు..అప్పు యేం తేరలే అన్నా. మరి
ఇప్పుడు ఇంటికి పూడిసి ఏం సేస్తు వు, పని శాత కాలేదే నీకు. యీడ కొంజెం కొంజెం ప�ైసలు ఇస్తు నారు
కదప్పా…కొంజెం కొంజెం అప్పు తీరిసి పూడుసు. ఇప్పుడు పొ య్యి ఏం సేస్తు వప్పా! ఆలోచన సెయ్యి
అంటుండు.” కానీ అమ్మ! ” అనుకుంట పరేషాన్ సూపు  చూసిన …రాజాలూ రాత్రి ఫో ను చేసిన అమ్మను
ఇంటికాడ రెండొ ద్దు లుంచి ఇగ వాసనొస్తుందని తీసేసిండ్రంటరా…నువ్వు జూడనీకి అమ్మ లేదురా అన్నడు…
నాకు పానం పొ య్యింది. అమ్మా అమ్మా అమ్మా అని ఏద్వవట్టిన. పద్మి సముదాయిస్తు న్నడు..యీడి కెంచి
పో తె మల్ల రానియ్యరంట..ఆడ పని చేసి అప్పు తేర్పగలనని నమ్మకం ఉంటె పో , పురాగ పని అయినంక
పో తె కాంట్రాక్టో ల్లు టికీటు ఇస్త రంట..నడిమిట్ల బో తె ఇగ నీ ఇష్టం టికీటు కొనమంటె పొ దుమీకి ఉంది కొంట
అని చెప్తు న్నడు….మేస్తిర.ి నాకు సావెందుకొస్త ల్లేదో తెలుస్త ల్లె . జెర్రయినంక బాలాజీ నీల్లు తాపిండు. అయ్యో
బగమంతుడా ఎంత పని చేసినవురా.పద్మీ నన్ను అమ్మ కాడికి తోలియ్యిరా నీకు దండం బెడతా..ఎంత సేపు
ఏడుస్తు న్ననో తెల్వలే పద్మిగాని ఒడిల అట్ల నే తలవెట్టిన. రాజాలు లెవ్వురా ఇంటికి పో దాం అంటుండు. ఏ
ఇంటికి ర…అమ్మ పొ యినాంక అన్ని పొ యినయ్రా..నాకు ఇల్లు ఎక్కడుందిరా అని చెపుదామని ఉంది..
కానీ ఆవాజ్ ఒస్త లె..చెక్కరొస్తాంది. పో దాం పా ట్యాక్సి వొచ్చింది అన్నడు మేస్తిర… ి ఒద్దు ఒద్దు నేను రాను
నేను రాను అమ్మ కాడికి పో తా……పద్మి నన్ను అలగ్గు న ఎత్తి , ట్యాక్సీల కూకోబెట్టిండు…ఇంకేం తెలుస్త ల్లే…
చెక్కరొస్తాంది…పద్మి నా మొకం లకే సూస్తుండు…రాజాలు ఎటున్నవ్రా అని కదుపుతున్నడు…పాపం
వీన్ని పరేషాన్ చేస్తు న్న. వీని పానం సగం పొ య్యినట్టు ఉంది. యీ రోజు పనిలకి రావొద్దు రాజాని చూసుకో
అని చెప్పిన్రంట…గీతక్క మాట్లా డుతుంది మాట్లా డు అన్నడు…నేను ఒద్ద ని చెయ్యి ఊపిన..గిప్పుడు నాకు
మాట్లా డనీకి ఏం లేదు…బూలచిమి ఎట్లుందొ అని అడగాలనిపిచ్చింది..పిచ్చి పొ ల్ల..నా కన్న అమ్మకు
దగ్గ రయింది..తల్లి లేని పిల్ల అమ్మనే సొ ంత అమ్మ లెక్క చూసుకుంది..పాపం ఎంత బాద పడుతుందో ఏమొ.
నాలుగు దినాలు పద్మిగాడు కూకున్న తానికి బువ్వ తెచ్చి పెట్టిండు. వాడే ఇంటి కాడివన్ని అరుసుకుంటుండు..
పాపం గీతక్క జరుగుతున్నవన్ని జరిగినట్టు చెప్తాంది. గండయ్య మామ, మా మేన మామ దగ్గ రుండి అన్ని
చూస్తు న్నరంట..వాల్ల కాడ ఉన్నకాడికి చేసిన్రంట..పదొ ద్దు లకి ఎట్ల అని అనుకుంటున్రంట.. అమ్మ సుకంగ
పో వాలంటే పదొ ద్దు లు మంచిగ చెయ్యాల్నంట.మనసు నలిగి పో తాంది. ఎట్ల పొ వ్వలె, ఏడికెంచి చెయ్యాలె,
ఆడికి పొ యినాంక ఎట్ల, పోంగనె అప్పులెవరిస్తరు ,పని లేకుంట ఎట్ల ఎల్త ది, అప్పు తేర్పేది ఎట్ల , మిత్తి కట్టేది
ఎట్ల…గుడిసె పో తె యాడుంటము….జొవాబు లేని మాటలు..తల పగిలిపో తాంది…మెదడు అలిసిపో తాంది.
పానం పో తదనిపిస్తాంది. అట్లట్ల ఆలోచనలన్ని ఒక తాన నిలిచినయ్.
పద్మీ, అమ్మ పోయినంక ఇప్పుడు నేను పో వుడు అవుసరమా అన్న. పద్మి సిత్రంగ నా కెల్లి చూసిండు.
మేస్తిరి చెప్పింది మంచిదేరా…నేను బొ య్యి ఏంచెయొస్త ది…నేను పొ య్యే ప�ైసలు పంపిస్తె అమ్మ పదొ ద్దు లు
మంచిగ అయితయ్ కదా ” అన్న.

63
పద్మి నా మొకం వింతగ చూస్తు న్నడు.. నమ్మిక లేనట్టు చూస్తు న్నడు. పద్మీ, ఇగ నేను
పో వుడెందుకు…నేను పో ను. ..పదొ ద్దు లకి నా కాడున్న ప�ైసలు పంపేద్దా రి అన్న…అట్ల నే తియ్..మరి మిత్తి కి
ఎట్ల అన్నడు పద్మి…చూద్దా రి..ఇప్పటిక�ైతె కానీ అన్న.
ప�ైసల్ తీస్కో ని పద్మి ఎల్లి పో యిండు..మల్ల నాకు ఆలోచనలు షురువయినయ్…2 వెయిల లెక్క
ఎప్పటికి మిత్తి కట్టేది..ఎప్పటికి అప్పు తేర్పేది..ఎప్పటికి ఇంటికి పొ య్యేది…ఇంటికి పో దునా అంటె ఆడికి
బో యి చెయ్యనీకేమున్నది..పెండ్ లం పని చేస్తుంటె తినాలె. ఏమో, జెర్రంత జెల్దిన నడుము మంచిగయితదేమో..
ఇంకొక్క రెండు ఏండ్లల్ల అప్పు తేర్పి పో తనేమో…అనిపిచ్చింది..ఇప్పటికయితె పని అయిందిగద…కండ్లు
మూసుకున్న..జెర అలసట తగ్గి నిదరొస్తాంది.అమ్మ చెయ్యి చల్లగ తాకినట్ట య్యింది. ఎటొ మబ్బుల పాట
ఇనొస్తాంది….”కొలువు కుదిరీ ఎన్నాల్ల య్యిందో ”

***

64
జననం బొబ్బిలిలో 1933 . కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్
ఇంజనీ రింగ్ చదువు (1949-53) అయ్యాక, ఇండియన్ ై ర ల్వేస్ లో
35 ఏళ్ళు పని చేసి ై ర ల్వే బోర్
డు మెంబరుగా రిటై రయ్యాను. ప తు తం
్ర స్
అమెరికాలో మా ఆవిడతో, పి ్లలలు, మనుమలకు దగ ్గ రగా, వలసి వాసిగా
ఉంటున్నాను.
తెలుగు రచనా ప ై య్యో ఏట ఆరంభించాను. నా తెలుగు
్ర క్రియ అరవ
రచనలు:
3 శతకములు, 2 నాటకములు, 2 నవలలు, దాదాపు 50 విడివిడి
చిన్నకథలు, జతగా దాదాపు 250: ‘జార్జి ్లకబ్బు కథలు’, ‘మాలోకం
నీతికథలు’, ‘కథ కంచికి మనం ఇంటికీ కథలు’, ‘భాగవత కథలు’,
‘హనుమంతరావు కథలు’, అనువాదములు: రవీంద్ రు ని ‘గీతాంజలి’
అన్నవరపు రామారావు గారి ‘భంవర్ నాలా బెబ్బులి’, కొల్ లూ రి రామకృష ్ణ
శర్మ గారి ‘నా జ్
ఞా పకాలు’. ‘న భూతొ న భవిష్యతి’

14. మనసొక చోట మనుగడ మరొక చోట


వేదుల చిన్న వేంకట చయనులు
అందని ద్రాక్ష పళ్ళు పుల్ల ని నక్క వెళ్లిపో యిందట అని మీరు అంటే అనవ చ్ఛు గాని నాకూ ఐ.ఐ.టి.
లో సీటు వచ్ఛేదే అని నా నమ్మకం. అసలు ఇంజ నీరింగ్ చదవడమే ఒక గొప్ప అనవచ్చు. నే పుట్టింది ఒక
లోవర్ మిడిల్ క్లా స్ కుటుంబంలో. వీథిలో అడుక్కుతిని మానాన్న మమ్మల్ని పెంచలేదు, కానీ, ప�ై ఊళ్ళల్లో
హాస్ట లు ఖర్చులు పెట్టి ప�ైచదువులు చెప్పించే స్తొ మత లేదు, పాపం, మానాన్నకి. పిత్రార్జితం ఏమీ లేక
అద్దెకొంపలో ఓ చిన్న తెలుగు మేషటా ్రుగా బ్ర తికేడు. రక్షించి విశాఖపట్ట ణంలో ఉన్నందున మేం ఆరుగురు
పిల్లలమ�ైనా, అందరికీ, ఆడా, మగా, అన్న వ్యత్యాసం లేకుండా ఉన్న ఊళ్ళో చదువులు చెప్పించ గలిగాడు.
ఆఖరివాడ నయిన నే ఇంటరు చదువు తూంటే, రిట�ైరయిపో యాడు. అతను రిట�ైరయ్యే నాటికి నా చదువే
కాకుండా, ఓ అక్క య్య పెళ్లి కూడా మిగిలిపో యింది. ఇద్ద రు అన్నయ్యలూ చిన్నచిన్న న�ైకీరీలే చేసతూ ్న్నా,
ఉద్యోగరీత్యా ఏవో ప�ైప�ై వాటికి అవకాశం ఉండి, నాన్నకు సహాయం గా నెలకి అంతో ఇంతో పంపిసతూ ్
ఉన్నారు కాబట్టి వీథిని పడకుండా కాస్త గౌర వంగానే జీవితం నెట్టు కు వస్తు న్నాం.
‘ఎక్కడనుంచి వస్తుందిరా ఆ చదువులకి’ అని నాన్న అన్నాడు గాని ‘మంచి మార్కులతో జి.ఆర్.ఇ.
నెట్టు కు రాగలిగితే స్కాలర్ షిప్పులు వస్తాయి. రాయ వోయ్’ అని మేషటా ్రు ప్ రో త్సాహించేరు కనుక ఆ
చదువులకి తయారయి రాసే ను. మొదటిసారి మిగతావాటిలో బాగానే వచ్చినా, ఆ ఎనలిటికల్ భాగంలో
తుస్సుమని, అంత మంచి టోటల్ రాలేదు. ‘సీటు వస్తుంది కానీ స్కాలర్షిప్ రాదో య్. మళ్ళీ రాయి. మనకి
అలాంటి పరీక్షలు లేక ఎనలిటికల్ అభ్యాసం లేదు. అదొ క బ్రహ్మవిద్య కాదు. తరిఫీదు పొ ందవచ్చు. మన
సుబ్బారావు మే ష్టారి దగ్గ రకు వెళతే ్ ఆయన నూరి పో సి చెప్పగలరు. మళ్లీ రాయి. బెస్ట్ ఆఫ్ లక్’ అని మేషటా ్రు
చెప్పగా అలాగే చేశాను. ఇదంతా నా ఇంజనీరింగ్ ఫ�ైనల్ యేడా దిలో మాట. దరఖాస్తు పెట్టిన రెండింటి
లోనూ (వాటికే ఎక్కువ దండగ చేస్తు న్నా అని దీవెనలు పడ్డాయి గాని అమ్మ నాకు దన్ను ఉండింది గనుక
సరిపో యింది) స్కాలర్ షిప్ తోసహా సీటు దొ రికింది. ఎవరు ఎక్కువ ఇస్తు న్నారంటే ఆ యూనివర్సిటీలో
జోయినవుతానంటే, మేషటా ్రు, ‘అదేం తెలివితక్కువ? చదువు పర్దూ లో. అది మంచిది. అక్కడ చదివేవంటే
ఏ ప�ైచదువుక�ైనా, ఉద్యోగానిక�ైనా, నీ డిగ్రీకి మంచి విలువ ఉంటుంది’ అన్నారు.

65
దేముడు వరమిచ్చినా, పూజారి ఇవ్వడేమో అంటారే, అలాగ, ఉంది ఒక లొ సుగు. యూనివర్సిటీ వారు
రారా బాబూ అన్నా, అమెరికన్ గవర్నమెంటువారు వీసా ఇవ్వాలి కదా! వాళ్ళ దేశం వెళ్లి అక్కడే పాతుకు
పో తారని వాళ్ళ భయం. దానికి తగ్గ ట్లే ఎంత మందో వెళ్ళి మరి తిరిగి రాలేదు. దగ్గ ర చుట్టాలున్నారంటే
మొదటికే ఇవ్వం ఫో అనేస్తా రు. నాకెవ్వరూ అలా లేరు కనుక అంత భయం లే దనుకొంటే, ‘అదేం కుదరదు.
నువ్వు చదివే ఆ చదువు మీ దేశంలో ఉంది కదా అంటూ సవా లక్ష ప్రశ్నలు వేసి పొ మ్మంటారుట కూడా’
అని శుభం పలుకరా అంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడ ఏడుస్తోంది అన్నట్లు , నా స్నేహితుడు తంబు
గాడన్నాడు.
‘మర�ైత,ే కిందటి యేడాది వాడు, ఆ కిందటి యేడాది అల్ల వాడూ వెళ్లే రురా అంటే’, ‘అది వాళ్ళ లక్కీఛాన్స్’
అని అదర గోట్టేశాడు.
మద్రాసులో వీసాకి పడ్డ పాట్లు తలచుకుంటే అసహ్యమేస్తుంది. పండుగలలో ర�ైల్వేటిక్కెట్లు కోసం
తొమ్మిదింటికి తీస్తా రంటే, ఆరింటినుంచే ల�ైనులో నిల బడడం చూసి ఆశ్చర్యపో యే వాడిని. అలాంటిది
అర్ధరాత్రినుంచే అక్కడ బిచాణా వేస్తే గాని లాభం లేదన్నాడు, నే బస పెట్టిన దూరపు చుట్టం. అలా కాదంటే
అదే పనిగా రోజూ అక్కడ రాత్రి కాపలా కాచి ల�ైనులో వాళ్ళ సీటు ఇ వ్వడానికి ఓ మూడు నాలుగు వందల
రూపాయలు పారేసేవంటే, సావకాశంగా టిఫిన్ కొట్టేసి వెళ్ళవచ్చును అన్న ఓ కిటుకు కూడా చెప్పేడతను.
తిరుపతిలో అంగప్రదక్షణకు తడిబట్ట లతో నిలుచున్న దానికంటేనా అని సొ మ్ము దూబరా చేయకుండా,
తెల్లవారకముందు మూడింటినుంచే నిలుచున్నా. అప్పటికే నాకన్నా ముందు ఓ నలభ�ైమందిదాకా
నిలుచున్నారు.
ఆరుబయట ఉచ్చకంపులు గుప్పుమని కొట్టు తూంటే, ఆ అమెరికన్ కాన్సల్ ఆఫీసు ప్రహారీ
గోడకానుకుని నిలుచున్నా. ఆఫీసు తెరిచాక వచ్చినా అలా వీథిలో, ఎండనక, వాననక, నిలుచోవాల్సిందే.
అదంతా విప్ల వవాదుల బాం బుల భయం వలన వాళ్ళు చేసుకున్న కట్టు దిటటా ్లు అని క్యూలో పక్కన ఉన్న
ఆసామీ తెలియజేశాడు. ఎవరి చలవ వలన ఐతేనేం, మనం లోనికి దర్జా గా వెళ్లగలిగే నోము నోచుకోలేక
పో యామనుకున్నా. అక్కడ క్యూలో నిలబడగా జరిగేది రాయాలంటే మన అసలు కథ వెనుకబడుతుంది
కనుక ఇంతటితో ఊరుకుంటా.
ఒకసారి లోనికి ప్రవేశమయ్యాక ఒక పధ్ధ తి, తీరూ, చక్కగానే ఉండి, లోపలకి వెళ్లిన ఒక గంటలో
నా పని అయిపో యింది. పిలిచి వేసిన పశ ్ర ్న ఒక్కటే. మళ్ళీ తిరిగి వచ్ఛేస్తా వా అనే. ‘ఓ’ తప్పకుండా అని
అలాంటి పశ ్ర ్న అడుగుతారని తెలిసి, లంబా చౌడా సో దితో తయారయేను కాబట్టి, నే చెప్పదలచుకున్నది
లంకించుకున్నాను. ఓ నిముషం చిరునవ్వుతో విని, ‘అట్టే, అట్టే, నాకు తెలు సు నీలాంటి వారు తిరిగి రారు
’ అని వీసాకు డబ్బు కట్టేసి సాయంత్రం వఛ్చి తీసుకో’ అని పంపించేసేడు. పెద్దన్నయ్య సర్దుబాటు చేసిన
సొ మ్ముతో ఆ వీసా కయ్యే ప�ైకం చెల్లించాను.
ఒక పక్కన వెళ్లిన పని విజయవంతంగా అయిందన్న సంతోషము అయింది గాని వాడలా దయాదాల్చి
భిక్షం వేసతూ ్న్నా, అన్నట్లు అన్నది విని మనస్సు చివుక్కు మంది. ఇంతకీ వాళ్ళననడం దేనికి? మనమే
దేవులాడి వెళతు ్న్నాం కనుక పడాల్సినదే అని మరుక్షణమే వాళ్ళమీద కాకుండా మన నిర్భాగ్య స్థితి చూసి
మనకది తగిన శాస్తే నేమో అనిపించింది. అక్కడ ఆ చదువేదో వెలగబెట్టి నాలుగు రాళ్లు సంపాదించి మనదేశం
తప్పక వచ్ఛేద్దాం అని నిశ్చయించుకు న్నాను.
ఇంకా బాకీ మిగతావాటి కయ్యే ఖర్చులు; చిన్నన్నయ్య ‘పరవాలేదురా. నే బాం కునుంచి ఆమాత్రం
అప్పు మాత్రం తేగలను. వెళ్ళేక నువ్వు అక్కడనుంచి తీ ర్చేద్దు వు గాని’ అని అభయహస్ తం వేసి
ఆదుకున్నాడు.
అమెరికా ప్రయాణం అంటే ఊరువారందరికీ హడావిడే! అక్కడ నీకిది కావాల్సి వస్తుందని ఒకరు.
అబ్బే! మన ఫేషన్లు అక్కడ బొ త్తి గా కుదరవు. అక్కడికెళ్లే కొనుకుందువు గాని అని మరొకరూ. పరస్పర

66
విరుద్ధ సలహాలతో చాలామంది సహృదయులు ముందుకు వచ్చారు. ఆవకాయ కారిపో కుండా పక్కాగా
సీలు వేయించి రెండు పాత ఓవల్టీన్ డబ్బాలు, అక్కడ నావంట కని ఓ నాలుగు పొ ట్లా లు దిట్టంగా గుడ్డ లు
చుట్టి మసాళాలు ఇచ్చి, అమ్మ సహాయం చేస్తే, అక్క య్య మాలతీ చందూర్ పుస్త కంలో ఉన్న ఓ పది
టూకీ రెసిపీలు కాపీ చేసి తన ప్రేమ చూపించుకుంది. ఇంకా రేపు బొ ంబాయి ప్రయాణమనగా ఆ ముత్ై తదువ
వచ్చింది; పక్క వీథి సుందరమ్మ గారు.
‘బాబూ, నువ్వు పర్దూ యూనివర్సిటీలో చదువుకని వెళతు ్న్నావని మారామం చె ప్పింది. అక్కడే
చాలాకాలం ప్రొ ఫెసరుగా ఉండి, ఆ దగ్గ రలోనే ఉంటున్నాడు మా అన్నయ్య సో మసుందరం. వాడు మనదేశం
వాళ్ళన్నా, అంతకంటే విశా ఖపట్ట ణం వాళ్ళన్నా ప్రాణం పెడతాడు. ఆ దేశం యాభ�ై ఏళ్ళ కిందట వెళ్లి అ క్కడే
ఉండిపో యేడు. ఇరవ�ై ఏళ్ళయిపో యింది వాడు ఈ దేశం వచ్చి. ఎదో ఇం ట్లోనే కాని ప�ైకి కదిలి వెళ్లలేని స్థితిలో
ఉన్నాడు. నువ్వు వెళ్లి కలుసుకో బాబూ. నీకు శ్రమకాకపో తే, ఈ చిన్నపొ ట్లా ములో, వాడికి ఎంతో ఇష్ట మని
కొయ్య చేగోడీ లు చేసి పెట్టేను. పట్టు కెళ్లి ఇస్తా వా? చాలా సంతోషిస్తా డు’ అన్నారు ఆవిడ.
సామాను సర్దిపెట్టి తయారుచేసే పని పుచ్చుకున్న నాన్న, నాకంటే ముందే, ‘దానికేం భాగ్యం!
వెళ్ళగానే అక్కడ మావాడికి ఓ పెద్ద దిక్కుగా ఉండి బాగుపడు తాడు’ అని అది పుచ్ఛుకుని ఆమెతో కబుర్లు
సాగించేడు. ‘వీళ్ళ చాదస్తా లు గా ని, అక్కడ ఓ ముసలాడెందుకూ నా పీకల మీదకి’ అననుకున్నాను గాని
అది నాలోనే ఉంచుకుని ఆవిడకు నమస్కారం పెట్టి అక్కడనుంచి జారుకున్నాను.
అమెరికా విమాన ప్రయాణం, వెళ్ళగానే యూనివర్సిటీలో జూయినవడం, ఆ తరువాత మనదేశం
వారక్కడ చదువుకుంటున్న వారితో జతగా ఓ ఎపార్టు మెంటులో బస కుదుర్చుకోవడం, అలా అలా కలగా
జరిగిపో యేయి. సో మసుం దరం గారి మాటే మరచిపో యేను. సామాను సర్దుకుంటూంటే ఆ పొ ట్లా ము
కని పించింది. మా రూమ్ మేటుని సో మసుందరంగారిని తెలుసునా అని అడిగేను. ‘అయ్యో! ఆయనా!
చాలా పెద్దవాడు. మీ ఎలక్ట్రికల్ ఇంజనీరే. ఇంజనీర్ల కు నో బెల్ ప్రయిజ్ లేదు కానీ ఉండి ఉంటే, అతనికి
తప్పకుండా వచ్ఛేది అంటా రు. ఇక్కడ ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది. పెద్ద పెద్ద యూనివర్సిటీ వాళ్ళు ఇ చ్చిన
ఆనరరీ డాక్టరేట్లు బో లెడు ఉన్నాయి. నాకు స్వయంగా పరిచయం లేదు కానీ మీ డిపార్ట్ మెంటు వాళ్ళని
అడుగుతే ఆతను చేసిన ఘనకార్యాలు బాగా చెప్పగలరింకా’ అని అతనంటే, అదివరలో సో మసుందరం
గారిని చులకనగా కొట్టి పారేసేనని నొచ్చుకున్నాను.
ఆ వెంటనే అతను, ‘ఏం కథ?’ అని కుతూహలంగా అడిగాడు. ‘ఈ కొయ్య చేగో డీలు అతనికి
అందజేయాలి’ అన్నాను. అంతే! ఆ గురుడు అక్కడెక్కడో హిం దూపూర్ నుంచి వచ్ఛేడేమో, కొయ్య
చేగోడీలంటే తెలియక పకపకా నవ్వు లం కించుకున్నాడు.
మా ఎపార్టుమెంటు ముగ్గు రిలో ఒకతనికి, బొ ళ్ల దే ఐనా, నడిచే కారు ఒకటి ఉ న్నాది. ‘నేను లోపలికి
రాను గాని నిన్ను దింపి మళ్ళీ ఓ గంట పో యాక వచ్చి నిన్ను పికప్ చేసుకుంటా’ అని పుణ్యం కట్టు కున్నాడు.
ఒక సుందరమ�ైన తోటలో వెనకాతలకి ఉంది ఆ భవనం. అమెరికా దేశ పధ్ధ తి ప్రకారం, వెళ్లే ముందుగానే
ఫో న్ చేసి ఫలానా ట�ైముకి వస్తు న్నా అని నే ఫో ను లో పరిచయం చేసుకునే వెళలే ్ను కాబట్టి, నే బెల్ కొట్టి,
జుత్తు ఒక సారి మీదకు తీసుకుంటూండగానే, ఆ మహిళ తలుపు తెరిచింది. ఆ దేశం చేరుకున్నాక తె ల్ల
ఆవిడలను పాశ్చాత్య దుస్తు లలో చూసినా, అలాంటి ఆవిడ ఎదురవుతుం ది అని అనుకో లేదు కనుక ఒక్క
నిముషం ఆమెకు కళ్ల ప్పగిసతూ ్ కొయ్యలా నిలు చుండి పో యేను.
‘లోపలకి రా షెన్క్! సారీ! పూర్తి పేరింకా అలవాటు కాలేదు. కనుక అలా సంబో ధిస్తు న్నా. మన్నించు’
అని ఒక రాజుగారిని ఆహ్వానిస్ తూ న్నట్లు మర్యాదగా తలు పు తెరచి వెనుకకు జరిగ,ి నా ఓవర్ కోటుని
తీసుకుని, ఆవిడ దానిని క్లో జెట్ లో పెట్టి, నేను చిన్న బల్ల మీద కూర్చుని జోళ్ళు విప్పుకునే దాకా, ఆవిడ
శాంతం గా నిలబడి, మళ్ళీ, ‘నీకోసం చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తు న్నారు, దా,’ అని మేడమెటక్కుతూ ్లె
దారి తీసింది.

67
సన్నని గొంతుకతో, ‘రా, భవానీ శంకరం. క్షమించు. నే లేచి ఆహ్వానించ లేను. నా శారీరిక అవస్థ
మూలాన్న’ అన్న ఆయనను చూస్తే , ఆ స్వచ్ఛమ�ైన ఉచ్చా రణ వల్ల తప్ప, మిగతా రూపురేఖల వలన
మన తెలుగు వాడని కాదు కదా మన దేశం వాడని కూడా పో ల్చనే లేం. సన్నగా తెల్లని రంగుతో ఒక ఎనభ�ై
ఏ ళ్ళ ముసలాయనలా అగుపించేరు.
‘ఏం తీసుగుంటావ్? కాఫీవా, టీవా? మనదేశంలో దొ రికే టీ వంటిది ఇక్కడ ఎంతిచ్చి కొందామన్నా
దొ రకదు’ అని మొదలుపెట్టేరు. ‘ఏమీ వద్దు , ఇప్పుడే పుచ్ఛుకు వచ్ఛే’ నంటే, ‘మామూలుగా మా ఆవిడ
నాకు రెండో సారి కాఫీ అంటే, మంచిది కాదంటూ ఇవ్వదు. నువ్వున్నావన్న సాకుతో న�ైనా పుచ్చుకుందా
మ నుకున్నానే? పరవా లేదు, మరోసారి పుచ్చుకోవోయ్, నాకోసం’ అని అంటూం టే, నాతో పాటు ఆవిడ
కూడా నవ్వుతూ, కిందకి వెళ్ళింది. అప్పుడే నే తె చ్చిన పొ ట్లా ము గుర్తుకొచ్చి, ‘మేషటా ్రూ, ఒక్క నిముషం’
అని చెంగుచెంగున కిందకి అ డుగులు వేసేను. ఓవర్ కోటు జేబులో ఉంచిన పొ ట్ లం తీసి, ప�ైకి రాబో తొంటే,
ఆవిడ ఎదురుగా వఛ్చి, ‘ఏం వచ్ఛేసేవ్’ అన్నట్లు ప్రస్నార్థ కంగా నను చూసి, ‘ఏంటా పొ ట్ లం? ఆయనకని
పట్టు కొచ్చేవా మీ దేశం నుంచి?’ అని అడిగితే, సుందరమ్మ గారు ఇచ్చిన విశేషం చెప్పేను.
‘ఐతే ఓ గమ్మత్తు ! నీవు దీని సంగతి ఆయనకు చెప్పకు. సర్ పయ్
్ర జ్ గా పట్టు కొస్తా . నువ్వు వెళ్ళి
కూర్చో’ అని చెప్పి నన్ను ప�ైకి పంపించేసేరు. వేరు వేరు
గా ఒక ట్రేలో కాఫీ, డికాషను, పాలు పంచదార, ఒక ప్లే టులో నాకని బిస్కెట్లు , అతనికి బిస్కెట్లు తో
పాటు మచ్ఛుకి రెండు చేగోడీలు తెచ్చి, ప్లే ట్లు మా పక్కన ఉన్న చిన్న బల్లల మీద ఉంచారు. ట్రేలో మిగిలినవి
సెంటర్ టేబిల్ మీద పెట్టి, పాలు పంచదారతో నాకు, అతనికి ఉత్త నల్ల డికాషను కాఫీలు చేరో క ప్పులోనూ
అందించారు. ఆ తరువాత ఆవిడ శ్రద్ధగా మేషటా ్రు పాఠం చెప్తే విన బో యే కుర్రా డిలా దగ్గ రగా ఉన్న కుర్చీలో
కూర్చున్నారు.
ఆయన, మొదట, పళ్లెం చూడకుండానే, కాఫీ పుచ్చుకుని, ‘మా ఆవిడ మాజీ కా ఫీ చాలా బాగా
చేస్తుంది. చూడు, స్పెషల్ రుచి’ అని చిలిపిగా ఆమె కళ్ళల్లో కి చూశాక, పక్కన పళ్లెం మీదకు దృష్టి
మరలించారు. అప్పుడు చేగోడీలను చూ సి, సో మసుందరం గారు, ‘ఓహో హో ! చేగోడీలు! బాబూ, నువ్వు
తీసుకొచ్ఛేవా నాకోసం?’ అని అడిగి కాఫీ ఆ పక్కన పెట్టి, ఒక చేగోడీని పట్టు కున్నారు.
‘లేదు. నే చెసేను’ అని నవ్వుతూ అన్నారు, ఆవిడ.
కొంచెం రుచి చూసి తలా ఆడిసతూ ్, ‘నో! నో! నువ్వు మిగతావి ఎన్నో బాగా చే స్తా వు కానీ , ఇవి మా
విశాఖపట్ట ణమే కాదు, మరి ఎక్కడా కూడా దొ రకదు. మా సుందరి చేతి మహిమ’ ఔను కదూ అన్నట్లు
నావ�ైపు చూసేరు. నే మౌనంగా చిరునవ్వు పారేసి ఊరుకున్నా. ఆవిడా పకపకా నవ్వు మొదలు పెట్టేరు.
ఆవి డని చూస్ తూ ఆయన కడుపునిండా నవ్వుతూ ఉండిపో యేరు. అలా వారిద్దరినీ చూస్ తూంటే, అప్పుడే
పెళ్లయి కొత్త కాపురం సాగిసతూ ్న్న దంపతులలా కనిపిం చేరు. ఆవిడకు అరవ�ై కన్నా ఎక్కువ ఉండి ఉండవు..
ఆయనకు కూడా డెభ�ైకి ఓ సంవత్సరం ఇటేపే అని, వారిద్దరికీ పెళ్లయి నలభ�ై అవవస్తు న్నాయనీ ఆ తరువాత
తెలిసింది. ఆయన కీళ్ల నొప్పుల వలన కృంగిపోయి ఇంకా ముసలిగా కనిపించారు.
‘మ�ై స్వీట్ సుందరీ! నేనంటే ఎంత ప్రేమో!’ అని మొదలు పెటటా ్రు ఆనాటి సంభాషణ. సంభాషణ
అంటే తప్పే! ఆయన వేసిన సవాలక్ష ప్రశ్నలకు నే టూకీగా జావీబులు ఇచ్చాను. చెంగలరావు పేట
సందుగొందులు అలాగే ఉన్నాయా? లేక వాటిని వెడల్పు చేసి పాడుచేసేసేరా? కుర్ పాం మార్కెట్
గంటస్ తంభాన్ని పగలగొట్టేయ లేదుకదా? ఏవియన్ కాలేజీ దిబ్బని మట్టం చేసేసి పల్ లం చేసేయ లేదు కదా?
బీచిలో తూతుళ్ లు ఎలా ఉన్నాయ్? పూర్ణా మార్కెట్ మాటేంటి? ఆ పక్కన పూర్ణా టాకీస్ నడుస్తోందా? సెలక్ట్
టాకీసో ? యూనివర్సిటీకి సిటీబస్సులు వేశారా? జట్కాలు ఊళ్ళో ఇంకా వాడుతారా? వగ�ైరా .. ప్రశ్నల వర్షం
కురిసింది. లేదండి, పడగొట్టేసేరు అని నెనంటే అ య్యో, అలాగా? అని విచారం, ఓబాగా అలాగే ఉంది అంటే
చప్పట్ల తో, వెరీ గుడ్, వెరీగుడ్, అని సంతొషమూ తెలియ పరచేరు. అలా ఓ అరగంట గడి చింది.

68
అప్పుడు ఆవిడ ‘అంత సేపూ మీరే మాట్లా డుతూ కూర్చుంటే, పాపం, ఆ అబ్బాయి అడుగదలచిన
ప్రశ్నల మాటో?’ మళ్ళీ వస్తా రు మీ విశాఖపట్ట ణం కబుర్లు చెప్పడానికి. అన్నీ ఇవాళ్లే అయిపో తే ఎలా? ఇంక
మీరు కాస్త వి శ్రాన్తి నేను ఆయనని అమెరికాలో ఎక్కడెక్కడ ఏం చేసినదీ, అతని పరిశోధనల గురించీ
అడిగేను. అంత గొప్ప వాడ�ైనా వీసంత�ైనా గర్వం, అహం, చూపించు కోకుండా సాంతంగా తన పనుల గురించి
చెప్పి, వాటి లోతుపాతులు బో ధప రచేరు. అప్పుడు ఆయన ఆవిడకేసి చూసి, ‘విశాఖపట్ట ణం గురించి కాదు
కానీ పిల్లా డి ఆలోచనల మీద అడుగా వచ్చునా’ అని ఆవిడ వ�ైపు కొంటెగా చూస్తే ఆవిడ, ‘సరే మీ ఇష్టం’
అన్నట్లు చేతులతో అభినయించి, నాకు కొంచెం పని ఉంది. మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి’ అని లేచి
ఖాళీ ప్లే ట్లు , ట్రేలు, తీసుకుని వెళ్ళిపో యేరు.
ఆవిడ వెళ్లిన తరువాత ‘ఐతే నువ్వేం చేద్దా మనుకుంటున్నావు?’ అని అడిగి వెనక్కి జరిగ,ి ఈ
చెవులు నీకే అన్నట్లు కూర్చున్నారు. చదువులో నా ఆలోచ నలు చెప్పాక, ‘ఆ తరువాత?’ అని అడిగి
ఊరుకున్నారు. ‘కొంచెం సొ మ్ములు చేసుకుని దేశం వెళ్లి అక్కడ యూనివర్సిటీలో చేరుతా’ అనగానే,
ఆయన చిరునవ్వు నవ్వుతూ, ‘సొ మ్ములు చేసుకోవాలంటే, నువ్విక్కడ ఇండస్ట్రీలో పనిచేయాలి. అయ్యవారి
నౌకిరీ అంటే కుదరదు. ఆ తరువాత యూనివ ర్సిటీలో చేరడమంటే ఇక్కడే అంత సులభం కాదనుకుంటే,
మనదేశంలో అసలు వీలుకాదనుకుంటా. ఈ మధ్య విశాఖపట్నంలో చాలా ఇండస్ట్రీలు వచ్చాయని విన్నా.
ఆంధ్రాయూనివర్సిటీలో కాకపొ తే వాటిలో దొ రుకుతుందిలే’ అన్నారు.
అంతటితో నే ఊరుకోవచ్చ్చునా! అబ్బే. లేదు. ‘ఆంధ్రా యూనివర్సిటీలో చ చ్చినా చేయను. చచ్ఛు
విశాఖపట్ట ణంలో దొ రక్కపోయినా పరవాలేదులెండి’ అని వెంటనే అతనికి అత్యంత ప్రియమ�ైన విశాఖపట్ట ణాన్ని
నిరసించేనే అని నాలుక కరచుకున్నా. కాని ప్రయోజనం లేకపో యింది. ఆయన ముఖం ఎర్ర గడ్డ అయింది.
కళ్ళల్లో అదివరకు చూసిన నవ్వు పోయి, చిచ్చుబుడ్డి నుంచి ప�ైకి వచ్ఛే మెరుగు పూసలలా వెలిగిపో తూ
అగ్నిజ్వాలలు కురిసేయి.
‘చెడపుట్టేవు విశాఖపట్ట ణంలో ఫో . మా యింట్లో నీకు గౌరవం లేదికమీద.’ అని కళ్ళు మూసుకుని
తెరలుతెరలుగా వచ్ఛే కోపాగ్ని చల్లా ర్చుకో ప్రయత్నించేరు. ఇంక అక్కడ ఉండి చెప్పుకునేది ఆ రోజు ఇక
లేదని అతనిని అలా వదిలేసి కిందకు దిగేను. నాముఖం చూడగానే ఏదో అనర్ధం అయిందని ఆవిడకు తెలి
సిపో యింది. ఆతురతతో ఏం జరిగింది అని అడిగితే, చెప్పేను.
‘ఆయనకి కోపం వస్తే పట్ట లేరు బాబూ. విశాఖపట్ట ణాన్ని అంటే మరింకేమ�ైనా ఉందా? మళ్ళీ
వచ్చినప్పుడు చల్ల గానే కబుర్లు చెప్తా రు. అది పట్టించుకోకు నాయనా’ అన్నారు.
ఇంకా అక్కడ ఎక్కువ సేపుండి ఆమెతో ఎం మాట్లా డాలో తెలియక ఇరకాటం పడ అవసరం లేకుండా,
రక్షించి, నా స్నేహితుడు సమయానికి వఛ్చి బెల్లు కొట్టాడు.
‘వస్తాం. మేమిప్పుడు మరో చోటుకి వెళ్లే సమయమయింది కూడా. మీ ఆతిథ్యా నికి ధన్యవాదాలు’
అని నమస్కరించి, ఆమె మాట పూర్తిగాన�ైనా వినకుండా, మరి వెనక్కు తిరక్కుండా, కారు ఎక్కాను.
‘ఎం గురూ? నీ మొహం అలాగుందేమీ? ఆయనగానీ ప్రశ్నలు వేస్తే, బెబ్బెబ్బే అని మన పాండిత్యం
బయట పడలేదు కదా?’ అని అతనంటే, ‘అదేం కాదు. ఇంటికి వెళ్ళేక చెప్తా ’ అని నా ఆలోచనలలోనే
ఉండిపో యేను.
ఆ తరువాత సో మసుందరంగారింటికి వెళ్ళలేదు కానీ ఒక భయం పట్టు కుంది. ఆయనలా
నాకూ మనసొ కచోట, మనుగడ మరొక చోటా రాసి పెట్ట లేదు కదా , ఆ భగవంతుడు అని.

***

69
పేరు: కె.మీరాబాయి (కలం పేరు: తంగిరాల.మీరాసుబ ్ర హ్మణ్యం ) చదువు:
ఎం.ఏ; పి.హెచ్.డి; సిఫెల్ మరియు ఇగ్నౌ నుండి పి.జి.డిప్లొ మాలు.
వుద్యోగం: ఇంగ్లి ష్ ప్రొ ఫ్.గా కె.వి.ఆర్.ప ్ర భుత్వ కళాశాల,కర్నూల్ నుండి
పదవీవిరమణ రచనలు: కథలు:- 1963 నుండి ఇప్పటిదాకా 200ై ప గా
కథలు ఆంధ ్ర ప ్ర దేశ్ లోని అన్ని ప
్ర ముఖ పత్ రి కలలో నవలలు 4 ( ఆంధ ్ర ప ్ర భ,
స్వాతి మాస పత్ రి కలలో) కథాసంకలనాలు:- 1.ఆశలమెట్ లు 2.కలవరమాయె
మదిలో,3.వెన్నెలదీపాలు,4.మంగమ్మగారి అమెరికా కథలు,5.మనసు
పరిమళం,6.ఏదేశమేగినా,7.జగమంతకుటుంబం. ఇంకా:- కవితలు,
ఆంగ ్ల కథలు, ఆంగ ్ల సాహిత్య వ్యాసాలు ప ్ర చురితం. ఆకాశవాణిలో పలు

్ర సంగాలు. ప ్ర శంశలు:జ్యోతి, ఆంధ ్ర భూమి, రచన పత్ రి కలలో నా కథలు
బహుమతి పొందాయి 1995 లో ఆంధ ్ర ప ్ర దేశ్ ప్ర భుత్వం నుండీ ఉత ్త మ
అధ్యాపకురాలి “ పురస్కారం ఈ సంవత్సరం అమెరికా తెలుగు కథానికలో
నా కథ ప ్ర చురితం. తెలుగు కథ శతజయంతి కథా సంకలనం “ నూరు
కథలు- నూరుగురు కథకులు” లో నా కథ చోటుచేసుకుంది .ఇంకా పలు
కథానికా సంకలనాలలో నా కథలు ప ్ర చురితం.

15. మజిలీ
డా.కె.మీరాబాయి (తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం)
మారుతీ కారు గుత్తి బస్ స్టేషన్ లో హొటల్ ముందు ఆగింది. “ఇక్కడ దో సె బావుంటుంది.’’
కారులోనుండి దిగుతూ అన్నాడు మాధవమూర్తి.
మంజుల చిన్నగా నవ్వింది. మాధవమూర్తి భోజన ప్రియుడు. ఎప్పుడో పదేళ్ళ క్రిందట నెల్లూ రు
మనోరమ హొటల్ లో తిన్న పూరీ కూర రుచి ఇప్పటికీ గుర్తు చేసుకుంటాడు.
మంజుల చేతి గడియారం చూసుకుంది. రెండు గంటల సేపు ఎక్కడా ఆపకుండా కారు నడిపిన
అలసట భర్త ముఖంలో కనబడింది. ఎండ ఎక్కక ముందే వూరు చేరుకోవాలని వుదయం ఆరు గంటలకల్లా
కర్నూలులో బయలుదేరారు.
“అంత దూరం మీరెందుకు అవస్థ పడడం. డ్రవ
ై ర్ ని పిలుద్దా ము“ అంది మంజుల. కానీ స్వంత కారు
స్వయంగా నడుపుకుంటూ తన వూరు వెళ్ళాలి అని మాధవమూర్తి ఉత్సాహ పడేసరికి కాదనలేక
వూరుకుంది.
మూడువందల జీతంతో మొదలుపెట్టి ఇద్ద రూ ముప్ఫై ఏళ్ళు పనిచేసి ఇరవ�ై వేల సంపాదనతో
పదవీ విరమణ చేసాక మూడొ పిల్ల పెళ్ళికి ముందు మూడు లక్షల లొపు వున్న మారుతీ కారును అప్పు
చేయకుండా కొనడం గొప్ప లక్ష్యాన్ని సాధించిన అనుభూతిని ఇచ్చింది వాళ్ళిద్ద రిక.ీ
అప్పు లేనివాడు అధిక ధనవంతుడు అన్న సూత్రాని నమ్మిన ఆ ఇద్ద రూ ముగ్గు రు పిల్లలను
పెద్దచదువులు చదివించి, పెళ్ళి చెయడానికి తమ చిన్న చిన్న సరదాలు స�ై తం వదులుకున్నా ఎప్పుడూ
విచారించలేదు.

70
ఎర్రగా కాల్చి ప�ైన వెన్న పూస వేసిన మసాలా దో సె తిని , చిక్కని ఫిల్టర్ కాఫీ తాగి బయటకు వచ్చి
కారెక్కారు ఇద్ద రూ.
మన్రో సత్రం మీదుగా వెళ్ళి పేట రోడ్డు లో ఎడమ వ�ైపు తిరిగి కాస్త దూరం వెళ్ళి కారు ఆపాడు
మాధవమూర్తి.
“నేరుగా అనంతపురం రహదారి పట్టక ఇదేమిటి వూళ్ళొకి వచ్చారు ?’’ ఆశ్చర్యంగా అడిగింది మంజుల.
సమాధానం ఇవ్వకుండా బండి దిగి అక్కడున్న ఇళ్ళ వ�ైపు పరీక్షగా చూస్తు న్న భర్త వాలకం అర్థం
కాక తానూ దిగి అతని వెనుక నడిచింది.
“ఆ. ఇదే ఈ ఇల్లే!’’ మెరిసే కళ్ళతో చూస్
తూ , సంతోషం తొణుకుతున్న గొంతుతో అన్నాడు మాధవమూర్తి.
ఎక్కడో పో యిందనుకున్న ఆటబొ మ్మ మళ్ళీ కనబడినప్పుడు పసి పిల్లవాడి ముఖంలో తొంగిచూసే
ఆనందం వెల్లివిరిసింది అతని వదనంలో.
“ఎవరి ఇల్ లండీ ఇది ?’’ జరుగుతున్న దేమిటో అర్థం కానీ మంజుల అయోమయంగా అడిగింది.
“మాదే మంజూ. ఇదే మా ఇల్లు .” ఒకవిధమ�ైన పరవశత్వంతో అన్నాడు.
మాధవమూర్తి గుత్తి లో పుట్టాడు అని తెలుసుగానీ వాళ్ళకు అక్కడ మేడ వున్నట్టు ఆమెకు
చెప్పలేదు అతను.
ఈ ఇల్లా ? “నమ్మలేనట్టు చూసింది. కొత్త గా రంగులు వేసి కనబడుతున్నది మేడ.
“అంటే ఇక్కడే, ఈ స్థ లం లోనే మా తాతగారిల్లు వుండేది. అక్కడే నేను పుట్టాను’’. అంటునే ఆ
ఇంటి వ�ైపు అడుగులు వేసాడు.
“ఆగండీ. ఇది ఎవరి ఇల్లో ఏమో. ఎప్పుడో యాభ�ై ఏళ్ళ క్రిందట ఇక్కడ మా ఇల్లు వుండేది అంటే
నవ్వి పో తారు. పదండి వెళ్ళిపో దాము. అనవసరంగా అవమానం పాలు కావొద్దు .’’ భర్త ను వారించింది
మంజుల.
రెండేళ్ళ క్రిందట తన స్నేహితురాలు మీనాక్షికి జరిగిన పరాభవం గుర్తుకు వచ్చింది ఆమెకు.
మీనాక్షి వాళ్ళ తాతగారిల్లు అనంతపురం కోర్ట్ రోడ్ లో చివరన వుండేదట. ఏదో అవసరానికి ఆయన ఆ
ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు వాడుకున్నాడు. ఆ తరువాత అసలు మాట అటు వుంచి వడ్డీ కూడా కట్ట లేదు.
దానితో అప్పిచ్చిన అతను ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్నాడు. ఆ బెంగతోనే ముసలాయన కళ్ళు మూసాడు.
తాతగారిల్లు అంటే మీనాక్షి కి ఎంతో ఇష్టం. ఒకసారి అనంతపురం వెళ్ళి నప్పుడు ఆ ఇంటి లోపలికి
వెళ్ళి చూడాలనిపించి తలుపు తట్టిందంట. ఆ ఇంట్లో అద్దెకు వున్న అతను ఈమెను బిచ్చగత్తెను
విదిలించి కొట్టినట్టు కసురుకున్నాడట. ఆ అవమానం గురించి చెప్పి మీనాక్షి కళ్ళ నీళ్ళు పెట్టు కున్న
విషయం మంజుల మనసులో మెదిలింది.
అంతలో ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. నలభ�ై అయిదేళ్ల వయసులో వున్న వ్యక్తి బయటకు
వచ్చాడు. అత్తా కోడలు అంచు జరీ పంచలో హుందాగా వున్నాడు.
“ఎవరు కావాలండి? మర్యాదగా అడిగాడు ఆ ఇద్ద రినీ పరిశీలనగా చూస్
తూ .”
అంతసేపూ ఉత్సాహంగా వున్న మాధవమూర్తి ఒక క్షణం మూగబో యాడు.
మంజుల ముందుకు అడుగు వేసింది. “మేము కర్నూలు నుండి వస్తు న్నామండి. ఇద్ద రము ప్రభుత్వ
ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసాము.’’
“మీ కెవరు కావాలమ్మా ?’’

71
ఈ ఉపో ద్ఘాతం ఎందుకో అర్థంకాని అతను మళ్ళీ అడిగాడు.
అంతలో ఉద్వేగాన్నుండి తేరుకున్న మాధవ మూర్తి అందుకున్నాడు.
“క్షమించండి. నా చిన్నప్పుడు ఇక్కడ మా తాతగారిల్లు వుండేది. నేను పుట్టింది ఇక్కడే. వూరికే
చూసి పో దామని ఆగాము. వస్తా ను.” అంటూ వెనుదిరిగాడు.
“అయ్యో అలా వెళ్ళి పొ తారేమిటి? లోపలికి రండి . చూసి వెళ్ళండి.’’ అంటూ మర్యాదగా ఆహ్వానించాడు
ఆయన.
మొహమాటంగానే ఇద్ద రూ లోపలికి వచ్చారు.
“కూర్చోండి. మంచినీళ్ళు తీసుకు వస్తా ను అంటూ వంటగదిలోకి వెళ్ళాడు.
ఖరీద�ైన సో ఫాలు, తలుపులకు కిటికీలకు సిల్కు తెరలు , గొడ మీద దండలు వేసివున్న పూర్వీకుల
ఫో టోలు;వేంకటేశ్వర స్వామి ,పట్టాభిరాముడు పటాలు - ఆధునికత పాత సంప్రదాయం కలగలిసి నట్టు గా
వుంది ఇంటి అలంకరణ.
లొపలికి నుండి ఆయన భార్య కాబో లు మంచినీళ్ళు తీసుకు వచ్చి అందించింది. వెంకటగిరి జరీ
చీర లో, మెడలో నల్ల పూసల గొలుసు చెవులకు రాళ్ళ కమ్మలు తో ఆ ఇంటి లక్ష్మి లా వుంది ఆమె.
“మేము ఈ ఇల్లు కట్టించి పది ఏళ్ళు అవుతోంది. మీరు ఇటువ�ైపు వచ్చినట్టు లేదు.” అన్నాడు
ఇంటి యజమాని.
“మేము ఉద్యోగరీత్యా ఉత్త రాదిలో వుండిపో యాము. ఈ మధ్యనే వచ్చి కర్నూల్ లో వుంటున్నాము.
ఇక్కడ అనంతపురం లో మా బంధువులు వున్నారు. వాళ్ళను చూడాలనే ఈ ప్రయాణం. “ సమాధానం
చెప్పాక ఇక కుర్చో లేనట్టు లేచాడు మాధవమూర్తి. మనసు నిండి పొ ర్లిపో తున్న ఆనందం అతన్ని నిలువ
నీయడం లేదు.
“ఇదిగో మంజులా ఈ మూలగది లోనే మా అమ్మ నన్ను కన్నది. “అంటూ ఆ గది వ�ైపు వడివడిగా
నడిచాడు.” ఆ పక్కన పూజ గది వుండేది. ఓ మీరూ ఇక్కడే పూజకు ఏర్పాటు చేసారన్నమాట. అటు
ఉత్త రం వ�ైపు నేల మాళిగ ఉండెది. అందులో ధాన్యం నిలవ చేసేవారు. “ఒక విధమ�ైన ఉద్విన్నతతో
అది పరాయి వాళ్ళ ఇల్లు ఆన్న స్ప్రుహ లేకండా ఇల్ లంతా కలయ తిరుగు తున్న భర్త వ�ైపు చిరునవ్వుతో
చూస్తు న్న ఆ ఇంటి దంపతులను చూస్ తూ ఉక్కిరి బిక్కిరి అవుతోంది మంజుల.
“మీరు ఏమీ అనుకోక పో తే ఇంటి వెనుక చెట్లు వుండాలి ఒక సారి చూస్తా ను’’ అని, వాళ్ళ
సమాధానం కోసం ఆగకుండానే వంట గది దాటి ఇంటి వెనుక వ�ైపుకు నడిచాడు మాధవమూర్తి.
భర్త ఉత్సాహానికి అడ్డు కట్ట వేయడం ఇష్టం లేనట్టు అతన్ని వెంబడించింది మంజుల.
మాధవమూర్తి చెప్పినట్టు అక్కడ చెట్లు ఏమీ లేవు. పారిజాతం, మందార, గన్నేరు, మల్లి వంటి
పూల మొక్కలు ఉన్నాయి.
“అయ్యో! చెట్లు అన్నీ కొట్టేసి నట్టు న్నారు. ఇక్కడ ఉసిరి చెట్టు వుండేది. ఒకసారి ఏమయ్యిందనుకున్నావు
మంజూ! ఉసిరి కొమ్మ తలకు తగులుతున్నదని పడేళ్ళ పిల్లవాడ్ని పెద్ద మొనగాడి లాగా గొడ్డలి
తీసుకుని నరకబో యాను. ఆది కాస్తా కాలిమీద పడి ఇంత లోతున గాయ మయ్యింది. తాతకు తెలిస్తే
తంతాడని కుయ్యిమనకుండా ఇంత పసుపు అద్ది కట్టు కట్టేసుకున్నాను. కానీ మా మామ కనిపెటటె ్సాడు.
తిడతా డేమో అనుకుంటే’’ శహబాష్ నా మేనల్లు డివి అనిపించావు “అని వీపు తట్టి మెచ్చుకున్నాదు.”
మాధవమూర్తి కన్నులలో మెరుపు, ముఖంలో ఉద్విగ్నత, పెదవుల మీద దరహాసం చూస్తుంటే మంజులకు
కళ్ళలో నీరు తిరిగింది.

72
“ఇంకో తమాషా చెప్పనా మంజూ ! మా అమ్మమ్మ దసరాకి బొ మ్మల కొలువు పెట్టేది. అందులో సీతా
రామ లక్ష్మణులతో బాటు ఆంజనేయుడి ఇత్త డి బొ మ్మలు వుండేవి. నాకు హనుమంతుడంటే చిన్నప్పటి
నుండీ ఇష్టం. ఒకసారి ఆ హనుమంతుడి బొ మ్మను చాటుగా తీసుకుని ఇక్కడ ఈ మూల మట్టిలో
దాచి పెటటా ్ను. తరువాత దానికోసం వెదికితే దొ రకనే లేదు. అమ్మమ్మ ఆ ఆంజనేయుడి కోసం ఇల్ లంతా
వెదికింది పాపం. నేనేమో తేలు కుట్టిన దొ ంగలా వూరుకున్నాను.’’ ఏదో పూనకం లో వున్నట్టు చెప్పుకు
పో తున్నాడు మాధవమూర్తి.
మాధవమూర్తి వెనకే పెరటి లోకి వచ్చిన ఇంటి యజమాని ముఖంలో ఈ వుదంతం వినగానే
సంభ్రమం తొంగి చూసింది.
“మాస్టారూ! మీ తాతగారి పేరేమిటో చెప్పారు కాదు.” మధ్యలో కల్పించుకుంటూ అడిగాడు ఆయన.
“ఆయన పేరు వెంకట సుబ్బయ్య అండి. అన్నట్టు నా పేరు మాధవమూర్తి. నా భార్య మంజుల.’’
అప్పుడు తమ గురించి పరిచయం చేసుకున్నాడు.
“నా పేరు రత్న స్వామి. నా భార్య కోమలవల్లి .’’ అని చెప్పి ముందుకు వచ్చి సంతోషంతో మాధవమూర్తి
చేతులు పట్టు కుని “ముందు మీరు లోపలికి వచ్చి కూర్చోండి. ఇది మీ ఇల్లే అనుకోండి’’ అంటూ అతిథులు
ఇద్ద రినీ ముందు గదిలోకి నడిపించి సో ఫాలో కూర్చోబెటటా ్డు
“అయ్యగారికి అమ్మగారికి కాస్త పాలు ఫలహారం తీసుకురా వల్లీ” అని భార్యకు పురమాఇంచాడు.
తను వచ్చి మాధవమూర్తి. కాళ్ళ దగ్గ ర కింద కూర్చున్నాడు.
“అయ్యో అదేమిటండీ మీరు నేలమీద కూర్చోవడం ...’’ అంటూ లేవబో యాడు మాధవమూర్తి.
“మీ దగ్గ ర ఇలా కూర్చోవడం వల్ల నాకు ఆంజనేయుడికి రాముడి పాదాల చెంత కూర్చుంటే కలిగే
సంతోషం కలుగుతోంది’’ అని కోమలవల్లి తెచ్చిన పళ్ళూ, పాలు అందించాడు “ముందు మీరు ఫలహారం
కానివ్వండి.” అన్నాడు.
మాధవమూర్తి, మంజుల మరేమీ మాట్లా డకుండా అరటి పండు తిని పాలు తాగారు. “అయ్యా ఇలా
రండి’’ అని వారిద్దరిని ఇంటి ప్రధాన ద్వారం బయటకు తీసుకు వెళ్ళాడు రత్న స్వామి.
“మా ఇంటికి పెట్టిన పేరు చూసారా?’’ అంటూ ఇంటి ముందు వున్న ఫలకం వ�ైపు చూపించాడు.
అక్కడ ‘వెంకట నిలయం’ అన్న పేరు నల్లని ఫాలరాయి మీద చెక్కి వుంది.
“అది మీ తాతగారి పేరే స్వామీ’’ వినయంగ చెప్పి వాళ్ళిద్ద రినీ తిరిగి లోపలికి తీసుకు వచ్చాడు
“మా తాతగారు మీకు తెలుసా ? ఎలా ? నాకేమీ అర్థం కావడం లేదు ఆశ్చర్యంగా చూస్
తూ అన్నాడు
మాధవమూర్తి.
“మీ చిన్నప్పుడు మీ అమ్మమ్మ గారి ఇంట్లో చిన్నమ్మ అనే ఆమె ఇంటి పనీ, వంట పనీ, చూసుకుంటూ
అమ్మమ్మ గారికి తోడుగా వుండేది గుర్తుందా మీకు?
రత్న స్వామి అడిగాడు.
మాధవమూర్తి కి చట్టు న చిన్నమ్మ ముఖం కళ్ళ ముందు తోచింది.
“అవును. నేను పసి పిల్లవాడిగా వున్నప్పుడు నన్ను తన కాళ్ళ మీద వేసుకుని నీళ్ళు పో సేదట.
అమ్మ చెప్పింది. నాకు పదేళ్ళప్పుడు కూడా తలంటి పో సేది. నాకు ఇష్ట మని మురుకులు, నిప్పట్లు చేసి
పెట్టేది. నన్ను ఎతో ఆప్యాయంగా చూసుకునేది.” ప్రేమగా తలచుకున్నాడు మాధవమూర్తి.

73
ఆ చిన్నమ్మ మనవడినే నేను. తాతగారు చిన్నమ్మ కు రాసి ఇచ్చిన ఎకరం చేను మా నాయనకు
వచ్చింది. ఆ చేను అమ్మి ఈ స్థ లం కొన్నాను. నా కష్టార్జితం తో ఈ ఇల్లు కట్టాను. ఆదీ మా నాయనమ్మ
ఆత్మశాంతికోసమే.” రత్న స్వామి కళ్ళు చెమరించాయి.
“మా నాయనకు అన్నం పెటటా ్లని చేని గట్టు కు పోయిన చిన్నమ్మ తాతగారు కన్ను మూసిన
ఘడియ లోనే, అక్కడే గుండె పో టుతో కూలిపో యిందని మా నాయన చెప్పాడు. తాత పో యే ముందు
చిన్నమ్మ ఎక్కడ అని అడిగారట. అన్నం ఇచ్చి వచ్చేదానికి చేనికి పో యింది వచ్చేస్తుంది. ఆని చెప్పినారంట.
అట్ల నే వీధి వాకిలి వ�ైపు చూస్
తూ నే ప్రాణం విడిచి పెట్టినాడంట. ఇరవ�ై అయిదేండ్లు ఈ ఇంట గడిపిన
ఆయమ్మ ఆత్మ ఈ ఇంట్లోనే తిరుగుతుందని అనేవాడు మా నాయన.’’
రత్న స్వామి కళ్ళు తుడుచుకున్నాడు.
“మా అమ్మ చెప్పేది చిన్నమ్మ మా అమ్మమ్మను పండుకోమని పంపించి రాత్రి తెల్లవార్లు తాత
కాళ్ళు పట్టేదంట’’ మాధవమూర్తి గుర్తు చేసుకున్నాడు.
“మీ అమ్మ గారికి మామయ్యకు ఏదో మాట పట్టింపు వచ్చి అమ్మగారు ఇక్కడికి రావడం
మానుకున్నారట . ఆమ్మమ్మ గారిని మాత్రం చివరిదాకా తన దగ్గ రే పెట్టు కున్నారట.” రత్న స్వామి చెప్పుకు
పో తున్నాడు.
“అవును. నాకు గుర్తు వుంది. ఆమ్మమ్మ మరో రెండేళ్ళలో పో యింది. తరువాత కొన్నేళ్ళకే మా
అత్త చనిపో వడంతో మామయ్య ఎటొ వెళ్ళి పో యాడు. మా మామకు సంతానం లేదు. మేము ఇక్కడికి
వచ్చినప్పుడు నన్ను ఎంతో ముద్దు చేసే వాడు. తనకు గుర్తు వున్నది చెప్పాడు మాధవమూర్తి .
“అవునండి. మీ మామయ్య గారే నన్ను చదివించారు . ఇల్లు అమ్మేసి ఆ డబ్బు అన్నదాన సత్రానికి
ఇచ్చి వెళ్ళి పో యారు. ఆయన చలవ వలననే నాకు చదువు అబ్బి, ఉద్యోగం రావడం. మీ మామ మా
నాయనను తమ్ముడిలా చూసుకునేవారు. మా నాయన పో యే ముందు’’ ఒరే నాయన! నువ్వు ఎట్లా గూ
చేని పని చేయ లేవు. ఆ ఎకరం అమ్మేసి అయ్యగారి ఇల్లు కొనుక్కుని అక్కడే వుండు. స్వర్గా న వున్న
మీ నాయనమ్మ ఆత్మ సంతోష పడుతుంది “ అని చెప్పి పోయినాడు.” కళ్ళు ఒత్తు కున్నాడు రత్న స్వామి.
“మీ మామ గుర్తు గా ఈ ఫో టో మిగిలింది నాకు.” ఆంటూ లేచి వెళ్ళి ఒక ఫో టో తీసుకు వచ్చి ప�ై
కండువాతో తుడిచి అందించాడు..
“కుడి వ�ైపున వున్నది మీ మామ గారండి. ఎడమ పక్కన వున్నది మా నాయన.” అ మాటలు
అంటున్నప్పుడు రత్న స్వామి గొంతులో గౌరవం ,అభిమానం తొంగి చూసాయి.
ఆ ఇద్ద రినీ పక్క పక్కన చూస్తుంటే అన్నదమ్ములలా వున్నారు.
చిన్నప్పుడు తనను ఎత్తు కుని తిప్పిన మేన మామ స్పర్శ అనుభవిస్తు న్నట్టు ఆ ఫొ టోను గుండెకు
హత్తు కున్నాడు మాధవమూర్తి.
“రండి స్వామీ. మీ భర్యాభర్త లు మా పూజ గదిలోకి అడుగు పెట్టి ఒక నిముషం కూర్చుంటే మా
ఇల్లు పావనం అవుతుంది’’ లేచి నిలబడి ఆ దంపతులను ఆహ్వానించాడు.
మనసు నిండి పోయి మాటలు రాని మౌనంతో దేవుడి గదిలోకి అడుగు పెటటా ్రు ఇద్ద రూ. కన్నుల
పండుగగా అలంకరించివున్న దేవుని పటాలకు నమస్కరించారు. పటాలకు కుడి వ�ైపు గోడ మీద
మాధవమూర్తి తాత అమ్మమ్మ వున్న ఫో టొ కు కుంకుమ పెట్టి దండ వేసి వుంది.అక్కడ కింది మెట్టు మీద
వున్నఆంజనేయ స్వామి బొ మ్మను చూసిన మాధవమూర్తి తన కళ్ళను తానే నమ్మకం లేక పో యాడు.
“ఈ ఆంజనేయుడు ..’’ అంటూ వుండగానే రత్న స్వామి అందుకున్నాడు

74
“ మీరు భూమిలో దాచుకున్న హనుమంతుడే స్వామీ. ఈ ఇల్లు కట్టించినప్పుడు పునాదులు
తవ్వుతుంటే దొ రికాడు. ఈ రోజు మిమ్మల్ని అనుగ్రహించాడు. తీసుకోండి . “ అంటూ ఆ విగ్రహం మాధవమూర్తి
చేతిలో పెటటా ్డు రత్న స్వామి. “వద్ద నడానికి మనస్కరించక ఇష్టంగా అందుకున్నాడు. భర్త ముఖంలో
కనబడుతున్న ఆనందం చూసి మంజుల కళ్ళు తడిసాయి.
“మా ఇంట దీపం వెలిగించిన తాతగారి వారసులు మీరు మా ఇంటికి వచ్చిన ఈ రోజు మాకు
పండుగ రోజు అయ్యగారూ. మా త్రు ప్తి కోసం ఈ పూట ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి. మా మాట
కాదనకండి.”
ఆంత వరకు జరుగుతున్నవన్నీ ఆశ్చర్యంగా చూస్
తూ వుండిపోయిన కోమలవల్లి వారిద్దరికీ
నమస్కరిసతూ ్ అంది.
“అయ్యగారూ, బాబు గారు అంటూ మమ్మల్ని దూరం పెట్టకండమ్మా. మాకు దేవుడు ఇచ్చిన
ఆత్మ బంధువులు మీరు. ఆలాగే కానివ్వండి.’’ చనువుగా అన్నాడు మాధవమూర్తి.
“మీరు కూడా వీలు చూసుకుని మా ఇంటికి తప్పకుండా వచ్చి వెళ్ళాలి “ మంజుల కోమలవల్లి
భుజాల చుట్టు చేయి వేసి ఆత్మీయం గా అంది.
ఆ పూటకు అక్కడే భోజనం చేసి, వాళ్ళు ఇచ్చిన కొత్త చీర, పంచల చాపు, తాంబూలం అందుకుని
కారెక్కారు మాధవమూర్తి , మంజుల.
“ఇది మీ ఇల్లే అనుకోండి స్వామీ మీరూ రావడం మా భాగ్యం.’’ బయలుదేరే ముందు మరొక సారి
చెప్పాడు రత్న స్వామి.
అనుకోని ఈ మజిలీ ఇచ్చిన అనుభూతులను నెమరు వేసుకుంటూ సంతోషంతో నిండిన మనసులతో
ప్రయాణం కొనసాగించారు మాధవమూర్తి, మంజుల. వాళ్ళిద్ద రి ముందు కారు డెక్ మీద అభయమిస్
తూ
నిలబడి వున్నాడు ఆంజనేయుడు.
(“మజిలీ” కథ జూల�ై మాలిక పత్రికలో ప్రచురితం-)

***

75
ఆకెళ ్ల కృష
్ణ కుమారి బెంగుళూరు నించి వచ్చి, ప తు తం  కాలిఫోర్నియాలో
్ర స్
్తకాలు చదవటమంటే చాలా ఆసక్
ఉంటున్నారు.  చిన్నప్పటినించి పుస తి .
పిల
్ల లు, పుస్తకాలు, లలిత సంగీతం, పూల మొక్కలు అంటే చాలా ఇష ్టం.

16. ఒక తల్లి కోరిక


- ఆకెళ్ల కృష్ణ కుమారి 
“ఇంకా నిద్ర పో లేదా అమ్మా, కాళ్ళు నొప్పి పెడుతున్నాయా, ఉండు కాళ్ళు రాస్తా ను” అంటూ వచ్చాడు
మురళి. కాసేపు అమ్మ దగ్గ ర కూచుని కబుర్లు చెబుతూ కాళ్ళు పట్టాడు.  శాంత కొడుకుతో ఆ కబురు, ఈ
కబురు చెప్పి, కాసేప�ైన తర్వాత, ”పొ ద్దు పో యింది, ఇంక పడుకో నాయనా, నాకు నిద్ర పడుతుందిలే“
అని చెప్పి  పంపేసింది. “పిచ్చి నాన్న. అమ్మ అంటే ఎంత ప్రేమో వీడిక.ి ఇది  ఏనాటి   రుణానుబంధమో”
అనుకుంటే, ఒక్కసారి వెనకటి రోజులు జ్ఞాపకం వచ్చాయి. 
శాంత గుంటూరులో పుట్టి పెరిగింది. అమ్మమ్మ గారి ఊరు కూడా అదే కావటంతో ఎప్పుడూ  పిన్నులు,
మామయ్యలు ఇంటికి వస్ తూ ఉండేవాళ్ళు. చిన్నప్పటినించి శాంతకి పిల్లలంటే చాలా ఇష్టం.   ఏ పిన్నిక�ైనా
పురుడ�ైతే, శాంత  తప్పకుండా  ఆ హాస్పిటల్ కి వెళ్లి  చంటి పిల్లల్ని చూసి వచ్చేది.  అలా వెళ్ళినప్పుడు
ఆ మిషనరీ హాస్పిటల్ లో కొంతమంది  తల్లు లు చంటి పిల్లల్ని వదిలేసి  వెళ్ళటం చూసినప్పుడల్లా ఎంతో
బాధ పడేది.  ఒకరోజు ఇంటికి వచ్చి, “అమ్మా, ఆ హాస్పిటల్ లో ఒక  చిన్న పాపాయిని వాళ్ళమ్మ వదిలేసి
వెళ్ళిపో యిందిట. పాపం, ఆ పాపాయి అమ్మకోసం ఏడుస్తోంది. మనం తెచ్చుకుందాం.  పాపాయిని మనం
పెంచుకుందాం” అని అడిగింది.  కాని వాళ్ళమ్మ “మీ నలుగురిని పెంచేటప్పటికే  నా పని అవుతోంది, ఇంకొక
అనాథ పిల్లని తెచ్చుకోవాలా? నోరు మూసుకో” అని కోప్పడింది. కాని  శాంత మాత్రం “ఎప్పటిక�ైనా అలాంటి
పిల్లలలో ఒకరిని పెంచుకుని, వాళ్ళ కి అమ్మ కావాలి” అనుకుంది. 
శాంత  కాలేజీ చదువు అయిన తర్వాత పెళ్లి అయి అత్త వారింటికి  హ�ైదరాబాద్ వెళ్ళింది . భర్త 
రఘురాం ఇంజనీర్.  శాంత కూడా దగ్గిరలో ఉన్న కాలేజీ లో లెక్చరర్ గా చేరింది.  అత్తా , మామలుకూడా 
ఎంతో మంచివాళ్ళు.  జీవితం హాయిగా గడుస్తోంది. ఇద్ద రు పిల్లలు, అబ్బాయి రవి ,అమ్మాయి  నళిని
పుట్టారు. కానీ శాంత తన చిన్నప్పటి కోరిక, తల్లి వదిలేసి వెళ్లిన పిల్లని పెంచుకోవాలి అన్నది మర్చిపో లేదు.
 తన పిల్లలు కొంచెం పెద్దవాళ్ళైన తర్వాత రఘురాం తో తన కోరిక చెప్పింది. రఘురాం “నాకు మన
ఇద్ద రు పిల్లలు చాలు అనుకున్నాను. కాని  నీ చిన్నప్పటి కోరిక మన పిల్లలు పుట్టిన తర్వాత కూడా
మర్చిపో లేదంటే, నీ కోరిక చాలా గట్టిగా ఉంది అని తెలుస్తోంది. నేను సహాయం చేస్తా ను.” అని చెప్పాడు.
శాంత చాలా సంతోషించింది భర్త ఒప్పుకున్నందుకు. అత్త వారితో చెబితే, వాళ్ళు “మీకు చక్కటి పిల్లలు
ఇద్ద రు ఉన్నారు. ఇప్పడు ఎవరో అనాథ పిల్లవాడిని పెంచుకోవటం ఏమిటి?”అన్నారు  కాని  రఘురాం 
నచ్చచెప్పటంతో  వాళ్ళు కూడా “సరే” నన్నారు అయిష్టంగానే.  
అప్పుడు శాంత, రఘురాం వాళ్ళ స్నేహితులలో ఇలా బ�ైట పిల్లల్ని పెంచుకున్న వాళ్ళు ఎవర�ైనా
ఉన్నారా అని కనుక్కుని,  వాళ్ళని కలుసుకున్నారు. వాళ్ళు అందులో ఉన్న కష్ట సుఖాలు అన్నీ  చెప్పి,

76
వాళ్ళ పిల్లల్ని చూపించి  “మేము పెంచుకోవటం మంచి పని అయింది. మా పిల్లలతో హాయిగా ఉన్నాము”
అని  వాళ్ళ అనుభవాలు చెప్పి, ప్ రో త్సహించారు.  
అప్పుడు శాంత, భర్త కూచుని ఆలోచించి ఆడపిల్ల అయితే పెంచుకున్న పిల్ల  అని పెళ్ళికి కష్టం
అవుతుందేమోనని, అబ్బాయినే పెంచుకోవాలనుకున్నారు. అదికూడా  చంటిపిల్లవాడు అయితే బాగుంటుంది
అనుకున్నారు  వెంటనే వెతకటం మొదలు పెటటా ్రు . మన దేశంలో ఇంతమంది అనాథలు ఉన్నారు, పిల్లలు 
వెంటనే దొ రుకుతారు అనుకుంది శాంత. కాని వెతకటం మొదలు పెట్టిన తర్వాత అర్ధ మ�ైంది, అది  ఎంత
కష్ట మో.  
 అనాథాశ్రమాలకు  వెళ్లి చూస్తే  అక్కడ పిల్లలు 2,3 ఏళ్ళ  వాళ్ళే ఉన్నారు . మగ పిల్లలు, చంటి
పిల్లలు లేరు. ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా కనిపించ లేదు  హాస్పిటల్స్ లోను దొ రకలేదు  ప�ైగా
వాళ్ళందరూ “మగపిల్లలు దొ రకటం కష్టం, ఆడపిల్లల�ైతే  దొ రుకుతారు”  అన్నట్లు మాట్లా డారు.  6 నెలలు
వెతికి, వెతికి, ఇంకా దొ రకక పొ తే చాలా నిరాశ వచ్చేసింది. ఇంక ఇంతేనేమో, పిల్లవాడు  దొ రకడేమో 
అనుకుని ఆశ  వదులుకుంది శాంత.   
అప్పుడు జరిగింది ఒక అద్భుతం! 
ఒకరోజు ప్రొ ద్దు న్నే పనిమనిషి వచ్చి చెప్పింది, “అమ్మా, మన వీధి చివర ఎవరో ఒక చంటి పిల్లవాడిని
ఒక బుట్ట లో పెట్టి వదిలేశారుట. చూడటానికి పెద్ద ఇంటి పిల్లవాడి లాగ ఉన్నాడు. మంచి బట్ట లు వేసి,
మంచి బుట్ట లో పెట్టి వదిలారు. ఇంకా బొ డ్డు  కూడా  ఊడలేదు. పిల్లవాడు అందంగా ఉన్నాడు“  అని. 
తీసుకురమ్మంటే  తీసుకు వచ్చింది. వాడిని చూడగానే అనిపించింది  “వీడు నా పిల్లవాడే.  నా కోసం 
దేవుడే పంపించాడు వీడిని”  అని. వెంటనే వాడిని ఒడిలోకి  తీసుకుంది. ఆ నిమిషంలో శాంతకి  ప్రపంచాన్ని
అంతటినీ  జయించినంత సంతోషం కలిగింది.
పిల్లవాడు దొ రికాడని రఘురాం కూడా చాలా సంతోషించాడు. “మురళీకృష్ణ ” అని పేరు పెట్టి, ప్రేమగా
పెంచుకున్నారు. వాడు కూడా తన ఆట, పాటలతో   ఆనందపర్చేవాడు. ముందు అయిష్టంగా ఉన్నా తాత,
మామ్మ కూడా  మెల్లి, మెల్లిగా వాడిని బాగా దగ్గిరకి తీసుకున్నారు. పెద్దపిల్లలు ఇద్ద రూ వాడిని బాగా
ముద్దు చేసేవారు. 
చిన్నప్పటి నించి శాంత, మురళికి  కృష్ణు డి కధలు చెబుతూ, ఆ కధలో లాగ  తను యశోదనని,
వాడు కృష్ణు డని చెప్పేది. పెద్దవాడ�ైన తర్వాత ఒక్కసారిగా తనని పెంచుకున్నారని తెలిస్తే  బాధ పడతాడేమో
ననుకునేది. మొదట్లో కొన్నాళ్ళయితే వాళ్ళ వాళ్లెవర�ైనా “మా పిల్లవాడు. ఎవరో ఎత్తు కుపోయి పారేశారు” అని
వస్తా రేమో అని భయపడేది. మెల్లి, మెల్లిగా  ఏమీ గొడవలు లేకుండా పెరిగి పెద్దవాడ�ైనాడు. పెద్దవాడ�ైన కొద్దీ
చక్కగా చదువుకుంటూ, స్కూల్లో  కూడా “మంచి తెలివ�ైనవాడు, బుద్ధిమంతుడు” అని పేరు తెచ్చుకున్నాడు.
మురళి హ�ై స్కూల్ లో ఉన్నప్పుడు ఒక రోజు తల్లి , తండ్రి కూచుని మెల్లిగా మురళి తో వాడిని 
పెంచుకున్న కథంతా చెప్పారు.   వాడు ఎవరికి పుట్టినా  తమ కొడుకేనని, వాడి మీద ఎప్పుడూ ప్రేమ
ఉంటుందని, దానిలో ఏమీ తేడా ఉండదని గట్టిగా చెప్పారు. జరిగిన  సంగతి ఎవరి ద్వారానో వినకుండా  తామే
చెబితే మంచిదని  చెబుతున్నామని చెప్పారు. అన్నీ చెప్పి, వాడు ఏమి బాధ పడతాడో నని భయపడ్డా రు.
మురళి   నిదానంగా అన్నీ విని, తనని గురించిన వివరాలు తర్వాత  ఇంకా ఏమ�ైనా తెలిశాయా అని
అడిగాడు.  వాళ్ళు ఏమి తెలియలేదన్న తర్వాత కొంత సేపు  కూచుని వెళ్లి పో యాడు. 
 ఆ తర్వాత కొన్నాళ్ళు మనసులో బాధ పడ్డా డు కాని ప�ైకి చెప్పలెదు. బాగా అభద్రతాభావం వచ్చింది.
చిన్న, చిన్న విషయాలకే కోపం తెచ్చుకునేవాడు. తల్లి తనకు ట�ైం కి ఏమ�ైనా చెయ్యకపో తే పో ట్లా డేవాడు.
చదువులో బాగా వెనక పడ్డా డు. స్కూల్ కి వెళ్ళేవాడు కాదు .  ఇవన్ని చూసి, వాడు  మనస్సులో గొడవ

77
పడుతున్నాడని గ్రహించి,  శాంత ఇంకా ఓపికగా, ప్రేమగా వాడిని చూసుకుంది. దాంతో మురళి కొన్నాళ్ళకి
మెల్లిగా సర్దుకుని మళ్లీ మామూలుగా ఉండటం మొదలు పెటటా ్డు. అంతే కాకుండా ఈ తల్లి తండ్రు లు తనని
ప్రేమగా పెంచారన్న కృతజ్ఞ తతో ఇంకా ఎక్కువ  ప్రేమగా  ఉండేవాడు.
శాంత కూతురు నళిని పెళ్లి అయి అత్త వారింటికి బొ ంబాయి  వెళ్ళిపో యింది. కొడుకు రవి ఇంజనీరింగ్
పూర్తి చేసి, ప�ై చదువులకు అమెరికా వెళ్ళాడు. చదువు కాగానే అక్కడే ఉద్యోగంలో చేరాడు. కొన్నాళ్ళకి
ఇండియా వచ్చి పెళ్లి చేసుకుని, భార్యతో అమెరికా వెళ్ళాడు. 
 మురళి PUC మంచి మార్కులతో పాసయి బిర్లా ఇంజనీరింగ్ కాలేజీ, పిలానీ లో కంప్యూటర్ స�ైన్స్
లో సీట్ తెచ్చుకుని ఇంజనీర్ అయాడు. తర్వాత చదువుకి  “అన్నయ్య అమెరికా వెళ్ళాడు. నువ్వు కూడా
అమెరికా వెడతావా?” అని అడిగాడు రఘురాం. “మీరు కూడా వస్తా రా అమెరికా?”  అని అడిగాడు మురళి. 
“లేదు. నేను రిట�ైర్ అయినతర్వాత  మేము ఇండియా లో నే ఉండాలని నిశ్చయం చేసుకున్నాము” అని
చెప్పాడు తండ్రి.   “అలాగ�ైతే నేను కూడా ఇక్కడే ఉంటాను. నేను ఇన్స్టిట్యూట్  అఫ్ స�ైన్స్ లో M.E  చేస్తా ను”
అని, బెంగుళూరు వెళ్ళాడు. 
M.E పూర్తీ కాగానే బెంగుళూరు లోనే ఇన్ఫోసిస్ లో మంచి ఉద్యోగం వచ్చింది.  అప్పటికి రఘురాం
రిట�ైర్ అయాడు.  మురళి “అమ్మా, నాన్నా ఇంక మీరు నాతోనే ఉండాలి. ఒక్కళ్ళూ   హ�ైదరాబాద్ లో ఉండే
ఆలోచనే  చేయకండి” అని చెప్పి, బెంగుళూరు తీసుకు వచ్చాడు.   
ఉద్యోగంలో బాగా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప�ై స్థాయికి వెళ్ళాడు. తల్లి , తండ్రి కి నచ్చిన
పిల్లని పెళ్లి చేసుకున్నాడు.  ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. అత్త ,మామలని బాగా చూసుకుంటుంది.
ఇద్ద రు పిల్లలు.   ఇప్పుడు శాంత, రఘురాం హాయిగా మనవళ్ళతో ఆడుకుంటూ, నిశ్చింతగా మురళి తో
గడుపు తున్నారు.  
“నేను ఒక తల్లి వదిలేసిన పిల్లవాడికి అమ్మని కావాలని అనుకున్నాను, కాని వాడే మా పెద్దతనం లో
మాకు తోడుగా ఉంటాడని, మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకుంటాడని ఎప్పుడూ అనుకోలేదు.  ఆ తల్లి నా
కోసమే కన్నది వీడిని.   ఇది ఎప్పటి రుణానుబంధం? వాడు, వాడి కుటుంబం పది కాలాల పాటు చల్ల గా
ఉండాలి” అనుకున్నది తల్లి శాంత. 

***

78
వ్యాసాలు

మధు బాబు ప ్త , మా-నవతావాది, కవి


్ర ఖ్యా  రచయిత, జ్యోతిశ్శాస్త్ర వేత
ఇంకా ఎన్నో, కాని అన్నిటికన్నా ముఖ్యం గా “సాధన” అనే రేడియో షో
ద్వారా అందరికి ఒక దశాబ ్దం ై ప గా తోరి రేడియోలో భిన్న ఆధ్యాత్మిక
పంధాలను పరిచయం చేసి, స్ఫూర్తి ని అందించిన వక ్త . సంగీతం,
చిత్ర లేఖనం ఇలా మంచి అభిరుచులతో వసించే నిరంతర విద్యార్ ధి . 30
ై ప గా దేశాలు పయనించి మెడిటేషన్ టీచర్ గా, అధ్యాత్మిక గురువు గా
ఖ్యాతి గాంచి అవార్డు లు అవి అందుకున్న ఒక వినయవిజ్ ఞా న జిజ్ఞా సి,
ఆధునిక సన్యాసి.

17. యండమూరి నవలలు - స్ఫూర్తి


- మధు బాబు ప్రఖ్యా
కొన్ని సాహితీ ప్రక్రియలు జీవితం లో భాగం అవుతాయి. ఒక కవిత చదివాక అది పది సంవత్సరాల
తర్వాత మీరు కారులో వెల్తు న్నప్పుడో , కన్నీళ్ళతో ఉన్నపుడో గుర్తొ స్తే అది అపురూపమ�ైన కవిత అని
చెప్పొ చ్చు. కొన్ని సినిమా పాటలు వాటి సమకాలీన పరిధిని దాటి వ్యోమం లోకి, మన మనో లోక సరస్సులోకి
వెళ్ళి హంసల్లా ఆడుకుంటాయి. అలాంటి ఇంద్రజాలాలన్నిటికన్న పెద్ద అద్భుతం యండమూరి నవలలు.
సినిమాలు, రేడియోలు విరివిగా ఉన్న 1980 - 90 ల్లో ఈ నవలల ప్రభావం ఇంతా అంతా కాదు. ఇంకా
టీవీ అందరికి రాలేదు, ఉందని కూడా తెలీదు. ఇంటర్నెట్ కనిపెట్టలేదు. పల్లె ల్లో పట్నాల్లో ఉన్న యువతకి
తెలుగు మీడియం వల్లో , లేక ఇంగ్లీష్ నవలలు కొనే స్తో మతలేకో అంతర్జా తీయ ఆలోచనా పరిధి, నవీన
ప్రపంచం తెలియక ఉన్నప్పుడు ఆ కాలం లో వచ్చిన నవలలు ప్రపంచానికి (మహా కవి తిలక్ చెప్పిన)
కిటికీలుగా పనిచేశాయి.
ఏమని చెప్పాలి యండమూరి నవలల గురించి? బయట భారిగా వర్షం పడుతూ, ఉరుములు
మెరుపులతో ఆ పల్లె టూళ్ళలో చదుతున్న నాకు కిరోసిన్ లాంప్ తో రాత్రి పూట త్రిల్ల ర్ నవల మొదటి సారి
చదివిన అనుభూతి ఇప్పటికి జ్ఞాపకమే! అనుభూతులని అలవోకగా పొ ట్ లంకట్టి అందించిన, అతిసనాతన
భావాలనీ ఆధునిక ప్రపంచ అర్ధ రహిత జీవన విమర్శనీ, స్పర్శనీ రంగరించి అందించిన భావాభ్యుదయ
సూర్యచంద్రో దయం “ఆనందో బహ ్ర ్మ”! ఎంత రాస్తే అందించగలం అందులో ఆలోచనాంతరంగం!
“వెన్నెల్లో ఆడపిల్ల” గా, ఒక కదానాయకుడికి ఇన్ స్పిరెషన్ ఇచ్చే చదరంగం లో ప్రతిభాశాలి అయిన
అమ్మాయిని చూపించడం అదీ అజ్ఞాతం గా దో బూచులాడుతూ ఉండేలా, ఈ నవల ఉండటం ఒక నూత్న
ప్రక్రియ.
విన్నూత్న శృంగారాన్ని చూపించే యండమూరి “అంతర్ముఖం” నవలలో జీవన సార వేదాంతాన్ని,
విషాదాన్ని చూపిస్తా డు. మరణానికి చేరువగా ఉన్న ఒక వ్యక్తి మనోగతం ఒక నవలగా మారిన ఈ నవల ఒక
అపురూప కధాంశం.
రక్త సింధూరం, రాక్షసుడు, ఛాలెంజ్ లాంటి సినిమాలు యండమూరి నవలలప�ై ఆధారితాలు. “డబ్బు

79
టు ది పవర్ ఆఫ్ డబ్బు” లాంటి తెలుగు ఆంగ్ల శీర్షిక తో ప్రయోగాత్మక నవలలు రాయడం యండమూరికే
చెల్లింది.
తులసి, తులసిదళం గురించి కొంచెం ప్రత్యేకం గా మాట్లా డాలి. కొన్ని నమ్మకాలు పెంచినా, మూఢ
నమ్మకాలు వద్ద ని చెప్పే సాహిత్యాన్ని ఇంకా ఇంకా రాయడం ప్రారంభించారు యండమూరి. అనేక సభలలో,
ఇంటర్వ్యూలలో తను ఆ రెండూ నవలలు రాయకుండా ఉండవలసిందేమో అని కూడా అన్నారు. “విజయానికి
ఐదు మెట్లు ” లాంటి స్ఫూర్తి దాయకమ�ైన సాహిత్యాన్ని తెలుగు వారికి అందించడం మొదలు పెటటా ్రు. ఒక
ఆశ్చర్యకరమ�ైన విషయం ఏంటంటే తెలుగు నవలా ప్రపంచం లొ కమర్షీల్ గా కూడా హిట్ అయిన మల్లా ది
గారు కేవలం ఆధ్యాత్మిక రచనలే చేస్తా అని శపధం పూని అవి మాత్రమే చేయడం, ఇటు యండమూరి
మోటివేషనల్ రచన్నల్లో కి వెల్లడం మంచి మలుపు తెలుగు పాఠకులకు. ఈ ఇద్ద రు రచయితలని వ్యక్తిగతం
గా కలిసి కొంత సమయం చర్చల్లో గడపగలగడం నా అద్రు ష్టం. “డబ్బు టొ ద పవర్ ఆఫ్ డబ్బు”, జీవితం
లో అనేక సందర్భాలలో కనిపించని శక్తిని ఎదుర్కుని, తమలో ప్రతిభని కనుక్కుని, డబ్బుని సంపాదించాలి
అని మంచి కరీర్ లోకి వెళ్ళిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇది “రిచ్ డాడ్ పూర్ డాడ్” అని ఈ మధ్య ఇంగ్లీష్
లో వచిన పుస్త కానికి ఎన్నో ఏళ్ళ ముందే తెలుగు వారికి దొ రికిన కల్పతరువు ఇది అని చెప్పొ చు. ఇలా
స�ైకాలజీ, బిజినెస్ ఇంకా తెలివితేటలు ఇంతలా రంగరించి రాసిన పుస్త కాలు ఈ మధ్యకాలం లోనే లేవు అంటె
అతిశయోక్తి కాదు. ప్రొ ఫెషనల్ గా చర్తెడ్ ఎకౌంటెంట్ అయిన యండమూరి తన ఆర్ధిక విజ్ఞానాన్ని ఈ విధం
గా యువతకి స్పూన్ ఫీడ్ చేయడం ఒక తరానికే ఉపయోగకరమ�ైన ప్రక్రియ.
వెయ్యికి ప�ైగా మోటివేషన్ స్పీచెస్, టీవీ సీరియల్స్ కు, సినిమాలకు నంది లాంటి అవార్డులు,
ప్రపంచవ్యాప్ తంగా ఆయన సినిమాలకు ఖ్యాతి, ఇంకా ఈమధ్యే ఆయన స్థా పించిన ఉచిత విద్య ఆస్రమం
ఇవన్నీ ఆయన పతి ్ర భ కు మచ్చుతునకలు.
ఒక కాల్పనిక జగత్తు నుండి మరో జగత్తు కి పయనింప చేయగల స్ఫూర్తి ఇంద్ర జాలికుడు యండమూరి.
వేటూరి గారు ఒక పాటలో అన్నట్టు “ఒక గుండె అభిలాష పది మందికి బతుక�ైనది”, అన్నమాట యండమూరి
రచనల్లో స్ఫూర్తికి అన్వయించ వచ్చు.
***

80
ై స న్సుని తెలుగులో, జనరంజక ై శ లిలో రాయాలనే కుతూహలం.  ప ై పెచ్
చుతెలుగుని ఆధునిక అవసరాలకి సరిపోయే విధంగా తేలికపరిస్ తే బాగుం
టుందని ఒక  నమ్మక. అందుకని స ై న్సుని  తెలుగులో  రాయడంలో చాల

్ర యత్నాలు, ప ్ర యోగాలు చేసేను. ఇంకా చేస్ తు న్నాను. నేను రాసే రాతలలో
“మానవీయ విలువలు” ప ్ర తిబింబించవు “హృదయానికి హత్ తు కునే”
సంఘటనలు ఉండవు. కళ ్ల ని చెమ్మగిల్లించేవి అసలే ఉండవు. తెలిసిన
ై స న్సుని, నా మాటల్లో , తెలుగులో, వ్యాసాల రూపంలో కాని, కథల రూపంలో
కాని, పుస ్తకాల రూపంలో కాని చెప్పటం. ఇలా తెలుగులో చెప్పేటప్పుడు
తెలుగు నుడికారం కోసం తాపత ్ర య పడతాను. ఇంగ్లీ షు మాటలు మితి మీ
రి వాడకుండా తెలుగులో ఆలోచించి, తెలుగు మాటలతో చెప్పడం. కథలు
రాయడం, కవితలు అల ్ల డం ఎంత కష ్ట మో ఈ ప ్ర క్రియ కూడ కనీసం అంతే
కష ్టం అని నా అభిప్రా యం. 

18. అమెరికా ఆంధ్రులు తెలుగు తల్లికి చేసిన సేవ


వేమూరి వేంకటేశ్వరరావు & కలశపూడి శ్రీనివాసరావు
ప్రవేశిక
సా. శ. 2009 ప్రాంతాలలో మేము ఇరువురము ఇండియాలో ఉన్న సమయంలో, “గత ఏభ�ై ఏళ్ల ల్లో
తెలుగు భాషకీ, తెలుగువారికీ ప్రవాసాంధ్రు లు ఏ విధంగా సేవ చేసేరు” అన్న అంశం మీద ఒక వ్యాసం రాసి
ఇమ్మని ఆంధ్రభూమి సంపాదక వర్గం అడిగేరు. ఈ వ్యాసం హద్దు లు మీరి పొ ంగి పొ ర్ల కుండా ఉండటానికని
భాషకి సంబంధించిన విషయాలకే ప్రాముఖ్యతనిచ్చి, భాష పరిధిలో ఇమడని అంశాలని కొన్నింటిని టూకీగా
స్పర్శించటం జరిగింది. అప్పుడు వ్రాసిన వ్యాసం (ఒకటి, రెండు వాక్యాలలో చిన్ని సవరణలు తప్ప)
యథాతథంగా తిరిగి ఇక్కడ ప్రచురిస్తు న్నాము.
ఈ వ్యాసాన్ని సంధానపరచిన ఇరువురు వ్యక్తు లూ (వే. వే., క. శ్రీ.) అమెరికా సంయుక్త రాష్ట్ రా లలో
స్థి రనివాసాలు ఏర్పరచుకున్నవారు కనుక వీరికి అమెరికాలో ఉన్న ఆంధ్రు ల గురించి తెలిసినంతగా తదితర
దేశాలకి వలస వెళ్లినవారి గురించి తెలియదు. కనుక ఈ వ్యాసం పరిధి ఉత్త ర అమెరికాలో ఉన్న తెలుగువారి
దో హదాలు గురించి మాత్రమే. ప�ైగా ఈ వ్యాసం రాసే సమయంలో వీరిరువురు భారతదేశంలో పర్యాటకులుగా
తిరుగుతూ ఉండటం వల్ల నున్నూ, వారి సొ ంత గ్రంధాలయాలు అమెరికాలో ఉండిపో వటం వల్ల నున్నూ,
పరిశోధనాత్మకంగా ఈ వ్యాసం రాయటానికి సానుకూలపడలేదు. కేవలం జ్ఞాపకాల మీద, స్వానుభవం
మీద ఆధారపడటం, సమయాభావం కారణాలుగా ప్రముఖులనందరినీ పేరుపేరునా ఇక్కడ స్మరించటం
సాధ్యం కాలేదు. ఎందరో మహానుభావులు. వారందరికీ ముందుగానే మా వందనములు.
1. తెరలు తెరలుగా జరిగిన వలస యాత్రల చరిత్ర
యల్లా ప్రగడ సుబ్బారావు వంటి వారిని మినహాయిస్తే తెలుగు వారు అమెరికా వెళ్లటం 1950 లలో
మొదలయిందనవచ్చు. ఈ అంకురార్పణకి ప్రేరణ కారణం అమెరికా ప్రభుత్వం వారు విద్యార్ధులకి ఫుల్‌బ్రట్ ై
వేతనాలు ఇవ్వటం కొంతవరకు కారణం కావచ్చు. ఈ 1950 దశకంలో అమెరికా వెళ్లిన వారిలో దరిదాపుగా
అంతా కేవలం ఉన్నత విద్య కోసం వెళ్లి తిరిగి భారతదేశం తరలి వచ్చేరు. వీసా నిబంధనలవల్ల ఫుల్‌బ్రట్

81
వేతనాలు పుచ్చుకున్న వారు సర్వ సాధారణంగా తిరిగి భారతదేశం రావలసిన పరిసథి ్తే దీనికి కారణం.
ఈ ఫుల్‌బ్రట్
ై కెరటం వెంబడి, 1960 దశకంలో, అమెరికా వెళ్లిన తెలుగు వారు విద్యార్ధి వీసాలతో వెళలే ్రు.
దరిదాపుగా వీరందరూ, “గ్రీన్ కార్డ్‌లు” సంపాదించుకుని అమెరికాలో స్థి రపడిపో యేరు. ఈ మార్పుకి ముఖ్య
కారణం 1965 లో ప్రెసిడెంటు జాన్సన్ “ఇమ్మిగష ్రే న్” నిబంధనలు సడలించటమే. అంతవరకు అమెరికాలో
స్థి రనివాసం ఏర్పరచుకోవాలంటే తెల్లతోలు ఉన్న వారి తరువాతే నల్ల తోలు (లేదా చామనచాయ తోలు)
ఉన్నవారికి అవకాశం ఉండేది. ఈ నిబంధనని సడలించి “ప్రతిభ ఉన్నవారికే ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది”
అనేసరికి భారతీయుల రొట్టె విరిగి నేతిలో పడింది. అంతవరకు బిందుప్రమాణంలో ఉన్న భారతీయుల వలస
పిల్ల కాలువగా మారింది.
వియత్నాంలో జరుగుతూన్న యుద్ధం వల్ల , 1970 దశకం పూర్వార్ధంలో, అమెరికాలో వ�ైద్య నిపుణుల
కొరత ఏర్పడటంతో భారతీయ వ�ైద్యులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ సంఖ్యలలో
అమెరికా వెళలే ్రు. అమెరికాలో చదువుకోకుండా కేవలం ఉద్యోగాలకోసం వెళ్లిన వారిలో వీరు ప్రథములు.
ఇదే దశకపు ఉత్త రార్ధంలో కంటికి కనబడని ప్రభంజనం మరొకటి చెలరేగింది. ఈ కాలంలో మ�ైక్రో ప్ రో సెసర్లు
(చిన్ని చిన్ని కంప్యూటర్లు) వాడుకలోకి రావటంతో కలన యంత్రాల వాడుక విస్త్రుతంగా పెరిగటం ఉత్త రోత్త ర్యా
తెలుగువారి వలసకి ఎంతగానో దో హదపడింది. ఈ చిన్ని చిన్ని కలన యంత్రాలలో పొ దుపు కొరకు
చిన్న చిన్న «మాటలు» వాడేవారు. ఈ చిన్న మాటలో తేదీని ఇరికించి రాయటానికి, ఉదాహరణకి, 15
ఆగస్టు 1978 ని 15 ఆగస్టు 78 అని క్లు ప్త పరచి భద్రపరచేవారు. లోభికి ఖర్చు ఎక్కువట. ఈ లోభత్వపు
అలవాటు శతాబ్దం అంతం అయేవేళకి అమెరికా వ్యాపారస్తు లకి పెద్దపెట్టు న ఖర్చు తెచ్చి పెట్టింది. ఇదే
Y2K అన్న పేరుతో తెలుగు వారికి ఒక వరంగా పరిణమించింది. కలన యంత్రాలని నడపటానికి వాడే
క్రమణిక (ప్ రో గ్రా ము) లలో ఈ అంశాన్ని సరిదిద్దటానికి ఇంగ్లీషు రాయటం, చదవటం వచ్చినవారూ, కాలరు
నలగకుండా కూర్చుని క్రమణికలు రాయగలిగేవారూ, చవకగా «కూలి» పని చెయ్యటానికి ఇష్ట పడేవారూ
అయిన వ్యక్తు లు తొంబతొంబలుగా కావలసి వచ్చింది. తెలుగువారి రొట్టె మరోసారి విరిగి నేతిలో పడింది.
ఈ తరుణంలో తెలుగు వారు అమెరికాకి తొంబతొంబలుగా ప్రయాణం అయేరు. చాల మంది చదువులు
తక్కువ�ైనా డబ్బులు బాగా గణించేరు. డబ్బు గణించటానికి ఇంగ్లీషు భాషే శరణ్యం అనే అపొ హకి గట్టి
పునాదులు పడ్డ ది ఈ రోజులలోనే.
ఇలా రకరకాల సందర్భాలలో రకరకాల కారణాల మూలంగా అమెరికా వెళ్లిన తెలుగువారు
సర్వసాధారణంగా తెలుగు భాషలో ప్రావీణ్యులు కారు. కవులు కారు, పండితులు కారు, పాత్రికేయులు కారు.
అయినప్పటికీ వీరందరూ తెలుగు భాషకీ, తెలుగు సంస్కృతి ఎదుగుదలకి చేసిన సేవ విస్మరించటానికి వీలు
లేనిది. ఉత్త ర అమెరికాలో ఉన్న తెలుగు వారందరూ ఎనిమిది లక్షలకి మించి ఉండరని మా ఉదారమ�ైన
అంచనా. తెలుగు దేశంలో ఉన్న తెలుగు వారు దరిదాపు ఎనిమిది కోట్లు . రాసిలో తక్కువ అయినా వాసిలో
ప్రవాసాంధ్రు ల సృజన ఏమాత్రం తీసిపో దంటే అది స్వో త్కర్ష కాదని సవినయంగా, సో దాహరణంగా మనవి
చేసుకోవటమే ఈ వ్యాసం యొక్క లక్ష్యం. ఉదాహరణకి అమెరికాలో ఉన్న తెలుగువారు నడిపే రెండు తెలుగు
ఈ-పత్రికలు (కె. వి. యస్. రామారావు చేత స్థా పించబడి ప్రస్తు తం వేలూరి వేంకటేశ్వరరావు నడుపుతూన్న
ఈమాట, కిరణ్ ప్రభ నడుపుతూన్న కౌముది) ప్రపంచవ్యాప్ తంగా మన్ననలు అందుకుంటున్నాయి.
అమెరికాలో తెలుగు వారు ప్రచురించిన గ్రంధాల విస్ తృతి నాటకాల నుండి నిఘంటువులవరకు వ్యాపించి
ఉంది. కథావస్తు వుల వ్యాప్తి హాస్యం నుండి వ�ైజఞా ్నిక కట్టు కథల వరకూ ఉంది. పద్యాలు, పద్య మాలికలు,
వ్యాసాలు, స్వీయచరితల ్ర ు, అనువాదాలు, ఇలా ఒకటేమిటి, అమెరికాలో ఉన్న తెలుగు వారి స్పృజించని
తెలుగు సాహిత్య ప్రక్రియ లేదేమో! వే. వే. సంకలించిన నిఘంటువుని చూసి, “ఇక్కడ ఇటువంటి ప్రయత్నం
కొరకు నాలుగేళ్ల క్రితం నాలుగున్నర లక్షలు మంజూరు అయింది. మేము చెయ్యవలసిన పనిని మా కంటె
ముందుగా మీరే చేసిపెట్టేరు” అని తెలుగు విశ్వవిద్యాలయం ఉపాద్యక్షులు జి. వి. సుబ్రహ్మణ్యం (కిడాంబి

82
రఘునాధ్ సమక్షంలో) అన్నారు.
2. కలన యంత్రాల పాత్ర
తెలుగు వారి ప్రగతికి కలన యంత్రాల సాంకేతిక పురోభివృద్ధి అపారంగా తోడ్పడిందనటానికి సందేహం
లేదు. కనుక ముందు కంప్యూటర్ పరమ�ైన ప్రేరకాలని కొన్నిటిని విచారిద్దాం.
కంప్యూటర్ల ప్రతిభ కేవలం లెక్కలు చెయ్యటానికి మాత్రమే పరిమితం కాదని మొదట్లోనే గ్రహింపుకి
వచ్చింది. కంప్యూటరు సహాయంతో మాటలు కూర్చి, వాక్యాలు నిర్మించి అందంగా అచ్చు కొట్ట టానికి
ప్రయత్నాలు జరిగిన మొదటి రోజులలోనే ఇంగ్లీషు అక్షరాలని ప్రమిదల రూపాలలో అమర్చి, కాగితాల
మీద అచ్చుకొట్టి దీపావళి శుభాకాంక్షలు పంపుకున్నారు తెలుగువారు. తరువాత ఇవే శుభాకాంక్షలని
ఈ-టపా ద్వారా పంపటం నేర్చుకున్నారు. ఇటువంటి ప్రయత్నాలే క్రమేపీ పరిణతి చెంది తెలుగు
అక్షరమూర్తులు («ఫాంట్లు ») నిర్మాణానికి దారి తీశాయి. ఇటువంటి ఫాంట్ల ని కుటీరపరిశమ ్ర లా చాలమంది
తయారు చేసేరు. పేరిస్‌లో, 85-1984 ప్రాంతాలలో, దీనా బొ స్సే తో కలసి కలశపూడి శ్రీనివాసరావు ఈ
రకం ప్రయత్నం ఒకటి చేసేరు. అమెరికాలో పెమ్మరాజు శ్రీరామారావు చేసిన ప్రయత్నాన్ని 1986 తానా
జ్ఞాపిక లో వే. వే. ప్రచురించేరు. ఈ రోజుల్లో నే యూనివర్సిటీ అఫ్ కేలిఫో ర్నియాలో ప్రొ ఫెసర్ హార్ట్ తెలుగు,
తమిళం, హిందీ అక్షరమూర్తులని ఒక «డిస్క్» మీద పెట్టి పాతిక డాలర్ల కి అమ్మేవారు. హార్టు నిర్మించిన
ఫాంట్లు వాడకాన్ని సాధకం చెయ్యటానికి వే. వే. తను సేకరించిన అపారమ�ైన పారిభాషిక పదజాలాన్ని
కంప్యూటర్ లోకి ఎక్కించటం మొదలు పెట్టేరు. ఈ అక్షరమూర్తులతో పని జరిగేది కాని పనితనం అందంగా
ఉండేది కాదు. ఈ రోజుల్లో నే విషన్ లేబ్స్ నుండి రాజారావు ఫాంట్లు నిర్మించి వ్యాపారసరళిలో అమ్మకానికి
పెట్టేరు. ఈ సందర్భంలోనే కెనడాలో ఉన్న దేశికాచారి సర్వాంగసుందరంగా ఉన్న పో తన ఫాంట్లు నిర్మించి
పుణ్యం కట్టు కున్నారు. తానా వారి ప్ రో ద్బలంతో పో తన అక్షరమూర్తులని అందరికీ ఉచితంగా అందుబాటులో
ఉండేటట్లు బహిరంగ వేదిక మీద భద్రపరచేరు.
అందమ�ైన అక్షరమూర్తుల కోసం ఇలా ఒక పక్క ప్రయత్నాలు జరుగుతూ ఉండగా మరొక పక్క
ఇంగ్లీషు అక్షరాలు ఉన్న కంప్యూటరు కీబో ర్డు ఉపయోగించి తెలుగు లిపిని ముద్రించే విధానాలలో కొన్ని
ప్రయత్నాలు జరిగేయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసినది ర�ైస్ యూనివర్శిటీ నుండి రామారావు
కన్నెగంటి, ఆనంద కిషో ర్, (తదుపరి రమణ జువ్వాడి) వెలయించిన RIT/RTS వ్యవస్థ . ఈ పద్ధ తి
ఉపయోగించి తెలుగుని ఇంగ్లీషు లిపి లో రాయటంలో ఒక స్థా యీకరణ వచ్చింది. కాని తెలుగుని తెలుగు
లిపిలో చూసుకుంటే ఉన్న ఆనందం ఇంగ్లీషు లిపిలో చూస్తే రాదు కదా. ఈ కొరత తీర్చటానికి నాగార్జున
వెన్న «పద్మ» ని తయారు చేసి అందరికీ ఉచితంగా లభించే విధంగా బహిరంగంగా విడుదల చేసేరు. ఈ
పనిముట్టు వల్ల రచనోత్పత్తి యొక్క సమర్ధత అపారంగా పెరిగింది.
3. ప్రచురణ రంగం
లోకో భిన్న రుచి అన్నట్లు , అమెరికాలో జరిగిన తెలుగు ప్రచురణా ప్రయత్నాలూ అనేక కోణాలలో
జరిగేయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ ముచ్చటిస్తాం.
తమ చుట్ టూ జరుగుతూన్న విషయాలేమిటో తెలుసుకోవాలన్న తృష్ణ మానవ సహజం. ఇటువంటివారి
పిచ్చాపాటీ సంభాషణలకీ, కేవలం కాలక్షేపానికీ, 1990 లలో, ఒక వేదిక కావలసి వచ్చింది. ఈ అవసరం
తీర్చటానికి “తెలుసా” (తెలుగు సాహిత్యం) అనే వేదికని నిర్మించటానికి కృషి చేసినవారిలో పిల్లలమర్రి
రామకృష్ణ , వే. వే., శొంఠి రత్నాకర్ ఆద్యులు. ఈ కంప్యూటర్ వేదిక అందరి అభిప్రాయాలకీ విశృంఖలమ�ైన
ప్రవేశం కల్పించటంతో ఇద్ద రు అనామకులు (గండరగండడు, కత్తు ల రత్త య్య అనే పేర్ల వెనక దాక్కుని)
అశ్లీ లమ�ైన అభిప్రాయాలు వెలిబుచ్చటం ఒకటీ, కుల, మత, రాజకీయ, స్త్ వ రీ ాద చర్చలు ఈ వేదిక మీదకి
దూసుకు రావటం రెండూ కారణాల వల్ల ఈ ప్రయత్నానికి ఆదిలోనే హంసపాదు వచ్చింది. దీని స్థా నంలో

83
రచ్చబండ అనే మరొక వేదిక వెలిసింది. అభిప్రాయాలు వెలిబుచ్చేవారు సభ్యత హద్దు లు మీరి ప్రవర్తిస్తే
వారిని నియంత్రించే హక్కుతో నిర్వాహకులు సమర్ధ వంతంగా నడిపేరు. ఇప్పటికీ రచ్చబండ నడుస్తోంది
కాని, పూర్వపు వ�ైభవం ఇప్పుడు లేదు.
అమెరికాలో ఉన్న తెలుగు వారు తెలుగులో కథలు, కావ్యాలు ఎప్పుడు రాయటం మొదలు పెట్టేరో
మాకు నిక్కచ్చిగా తెలియదు కాని, 1965 లగాయతు అడపా, తడపా వే. వే. వ�ైజఞా ్నిక కల్పనలు, ఆయన
సతీమణి ఉమ అమెరికా జీవితాన్ని ప్రతిబింబించే వ్యాసాలు రాసి భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి మొదల�ైన
పత్రికలలో ప్రచురించేవారు. ఈ సందర్భంలోనే అట్లాంటాలో పెమ్మరాజు వేణుగోపాలరావు, గవరసాన
సత్యనారాయణ ప్రభృతులు “తెలుగు భాషా పత్రిక” అనే రాత పత్రిక మూడు నెలలకొకటి చొప్పున విడుదల
చేసేవారు. స�ైన్సుని తెలుగులో రాయించటం ఈ పత్రిక ధ్యేయం. ఈ పత్రికలో వే. వే. 1968 లో రాసిన
“కంప్యూటర్లు” అనే పుస్త కాన్ని ధారావాహికగా ప్రచురించేరు. కంప్యూటర్ల గురించి తెలుగులో రాయబడ్డ
మొట్ట మొదటి పుస్త కం ఇదేనేమో! ఈ పుస్త కాన్ని ఎమెస్కో వారి ఇంటింటా సొ ంతగ్రంధాలయం ప్రణాళిక
కింద ప్రచురించటానికి మంతనాలు జరుపుతూన్న సమయంలో M. M. రావు అకాలంగా కాలధర్మం
చెయ్యటంతో ఈ పుస్త కం వెలుగు చూడలేదు. నాలుగు సంవత్సరాల ప్రచురణ తరువాత ఈ పత్రిక ప్రచురణ
ఆగిపోయినప్పటికీ వే. వే. మనస్సులో తెలుగులో స�ైన్సు రాయాలనే నిద్రాణంగా ఉన్న కోరికని ఈ పత్రిక
మేల్కొలిపింది. ఆ తరువాతే వే. వే. జీవరహశ్యం, రసగంధాయ రసాయనం, జీవనది అనే పుస్త కాలూ,
కించిత్‌భోగో భవిష్యతి అనే స�ైన్సు కథల సంపుటం ప్రచురించేరు.
తెలుగువారి సృజనకి పత్రిక రూపంలో ఒక వేదిక ఉండాలనే తలంపుతో కిడాంబి రఘునాథ్ «తెలుగు
జ్యోతి» అనే అచ్చు పత్రికని స్థా పించి, అహర్నిశలూ శ్రమించి, జీవితకాలపు చందాలు పో గు చేసి చాల
సమర్ధ వంతంగా నడిపేరు. ఇప్పటికీ నడుస్తోంది. తరువాత ఈ మధ్య జంపాల చౌదరి విశేషంగా ధనం
వెచ్చించి, సర్వాంగసుందరమ�ైన తెలుగునాడిని అయిదేళ్ళు నడిపి, నష్టాలకి తట్టు కోలేక, ఈ మధ్యనే
ఆపేశారు. వ్యాపార దృష్టితో చందూరి మురళి విశేషంగా పెట్టు బడి పెట్టి రచన మాసపత్రిక స్థా పించేరు. ఈ
పత్రిక ప్రచురణకి ముందే జీవిత చందా కట్టిన వారిలో ఈ రచయితలు ఇద్ద రూ ఉన్నారు కనుక వీరికి ఈ
పత్రిక చరితల్ర ోని పూర్వాపరాలు స్వానుభవంతో తెలుసు. కారణాంతరాలవల్ల మురళి ఈ పత్రిక సారధ్యం
నుండి తప్పుకోవలసి వచ్చింది. హ�ైదరాబాదులో ఉన్న శాయి ఈ పత్రికని ప్రస్తు తం నడుపుతూన్నప్పటికీ
దీనికి “అమెరికా ఆంధ్రు ల పత్రిక” అనే పేరొకటి వచ్చేసింది.
ఇవే కాకుండా అమెరికాలో వెలిసిన తానా, ఆటా సంఘాలు రెండేళ్లకొకసారి జరిగే సమావేశాల
సందర్భంలో ప్రచురించే జ్ఞాపికలు కాకుండా «తానా పత్రిక», “అమెరికా భారతి» అనే మాస పత్రికలు
ప్రచురించి వాటిల్లో అప్పుడప్పుడు కథలు, వ్యాసాలూ ప్రచురించేవారు. చందూరి మురళి నేతృత్వంలో
అమెరికా భారతి మంచి మంచి కథలు ప్రచురించింది. మురళి నేతృత్వం లేకపో తే చంద్రలత రేగడి విత్తు లకి
గుర్తింపు వచ్చేది కాదేమో!
ప్రచురణ రంగంలో చెప్పుకోదగ్గ ప్రయత్నం చేసిన మరొక సంస్థ వంగూరి ఫౌండేషన్. చిట్టెన్ర
‌ ాజు
హాస్యం పండించగలిగే సమర్ధుడూ, నటుడూ కూడాను. తెలుగు కోసం నిజంగా తాపత్రయపడుతూన్న సంస్థ
ఏదంటే ఇదే ముందు స్పురణకి వస్తుంది. వీరు ప్రతి ఏటా కథల సంపుటాలు ప్రచురిస్తు న్నారు కాని, ఈ
మధ్య అమెరికాలో ఉంటూ తెలుగువారు రాసిన తెలుగు కథల సంకలనం ఒకటి - ఒక బృహత్‌గ్రంధం -
ప్రచురించేరు. అందాలీనుతూన్న ఈ పుస్త కం అతిథులు వచ్చే గదిలో ప్రదర్శించదగ్గ గ్రంధం.
తెలుగుదేశంలో ఉంటూన్న తెలుగువారికి పరిచయమ�ైన మరొక అమెరికా రచయిత మందపాటి సత్యం.
ఈయన రాసిన ఎన్నార�ై కథలు, అమెరికా భేతాళుడి కథలు భారతదేశంలో విశేషంగా ఆదరణ పొ ందేయి.
జనాదరణ పొ ందకపోయినా వేమూరి రామనాధం రాసిన స్వతంత్రసిదధి ్ అనే పద్యకావ్యం విమర్శకుల

84
మన్ననలు పొ ందింది.
4. ప్రపంచ రంగం మీద తెలుగు
దేశభాషలందు తెలుగు లెస్స» అంటూ మనం ఎంతగా నెత్తీ నోరూ మొత్తు కున్నా తెలుగుకి
అంతర్జా తీయంగా గుర్తింపు రాదనిన్నీ, అటువంటి గుర్తింపు కావాలంటే తెలుగు యొక్క ఉనికిని, తెలుగు
సాహిత్యపు ఔన్నత్యాన్నీ ప్రపంచానికి ఇంగ్లీషు ద్వారా పరిచయం చెయ్యవలసిన బాధ్యత తెలుగు వారి
మీదే ఉందనే నమ్మకంతో అమెరికాలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిడదవోలు మాలతి తూలిక
అనే ఈ-పత్రిక ద్వారా తెలుగు కథలని ఇంగ్లీషులోకి అనువాదాలు చేయించి ప్రచురిస్తు న్నారు. వెల్చేరు
నారాయణరావు తెలుగు కావ్యాలని కొన్నింటిని ప్రశంశాత్మకంగా ఇంగ్లీషులో పరిచయం చేసేరు. ఇదే విధంగా
తెలుగు కథలని, తెలుగు నవలలనీ ప్రపంచానికి పరిచయం చెయ్యవలసిన అవసరం ఎంత�ైనా ఉంది. «స�ైబర్
కూలి» కోసం ఇంగ్లీషుని రెండవ భాషగా నేర్చుకుంటూన్న తెలుగువారు ఈ పని చెయ్యటం కష్టం. ఇదే పనిని
ఇంగ్లీషు మాతృభాషగా ఉన్న దేశాలలో పుట్టి పెరిగిన తెలుగువారి పిల్లలు ఎంతో సమర్ధ తతో చెయ్యగలరని
నారాయణరావు అంటారు.
తెలుగుకి కావలసినది ప్రాచీన హో దా కాదు; తెలుగుకి కావలసినది ఆధునిక హో దా, అంతర్జా తీయ
హో దా. ఇటువంటి హో దా పొ ందాలంటే తెలుగుని ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో బో ధించాలి. ప్రపంచ వేదికల
మీద తెలుగు భాష మీద తెలుగు సంస్కృతి మీద పరిశోధనలు జరగాలి. ప్రపంచంలో పరపతి ఉన్న పరిశోధనా
గ్రంధాలలో తెలుగు భాషప�ై జరిగే పరిశోధనా ఫలితాలని ప్రచురించాలి. ఇవన్నీ జరగాలంటే ప్రపంచ హో దా ఉన్న
విశ్వవిద్యాలయాల్లో తెలుగు బో ధన జరగాలి. ప్రపంచంలో దరిదాపు 250 విశ్వవిద్యాలయాల్లో సంస్కృతం
బో ధిస్తు న్నారు. వంద విద్యాలయాలకి ప�ైబడి హిందీ బో ధన జరుగుతోంది. కనీసం పన్నెండు విద్యాలయాల్లో
తమిళం నేర్పుతున్నారు. బెంగాలీ, పంజాబీ కూడ కొన్ని చోట్ల నేర్పుతున్నారు. విస్‌కాన్సిన్ లో గత ముప్ఫై
ఏళ్ళగా ఉన్న తెలుగు బో ధన, పరిశోధన నారాయణరావు పించ్ఛను పుచ్చుకోగానే ఆగిపో బో తోంది. ఈ
వెలితిని పూడ్చటానికి కేలిఫో ర్నియాలో ఉన్న ఆంధ్రు లు బర్క్లీలో ఉన్న కేలిఫో ర్నియా విశ్వవిద్యాలయంలో
తెలుగు పీఠం స్థా పించటానికి నిధులు పో గు చేస్తు న్నారు. ఇప్పటికి అయిదు లక్షల డాలర్లు పో గయింది.
ఒక తాత్కాలిక తెలుగు ఉపన్యాసకురాలు తెలుగు నేర్పుతున్నారు. ఈ పీఠం చిరస్థాయిగా నిలబడి ప్రపంచ
స్థాయి చేరుకోవాలంటే ఉరమరగా మరొక పది లక్షల డాలర్లు వరకూ కావాలి. ఆ నిధి మీద వచ్చే వడ్డీని
మాత్రమే ఖర్చు పెట్టి తెలుగు బో ధన చెయ్యటం, విద్యార్ధి వేతనాలు కల్పించటం వంటి పనులు చెయ్యాలని
సంకల్పం.
ఈ బృహత్‌పణ ్ర ాళికకి, చంద్రు డికో నూలు పో గులా సహాయం చెయ్యమని తెలుగువారందరినీ ఈ పత్రికా
ముఖంగా అర్ధించటం జరుగుతోంది. సహాయం చెయ్యదలచినవారు Vanguri Foundation of America,
3906 Sweet Hollow Ct, Sugar Land, TX 77498, USA కి చెక్కు పంపండి. ఎంత చిన్న మొత్త మ�ైనా
పరవాలేదు. లేదా, University of California వారి జాలస్థలికి వెళ్లి, నేరుగా పంపవచ్చు. (https://give.
berkeley.edu/fund/FU0831000) అదే ఇంతింత�ై, ఎంతో పెద్దద�ై ఈ ప్రయత్నానికి తోడ్పడుతుంది.
“మనది బీద దేశం. మనం సంపన్నమ�ైన అమెరికాకి సహాయం చెయ్యటం ఏమిటి?” అని జంకవద్దు .
మనది బీద దేశం కాదు. పదిహేడవ శతాబ్దంలోనే పశ్చిమ గోదావరి జిల్లా ర�ైతులు యేల్ యూనివర్శిటీ
నిర్మాణానికి నిధులు విరాళాలుగా పంపేరు. ప�ైగా “బీదరికం” అనేది ఒక మనోసథి ్తి. డొ క్కా సీతమ్మ పుట్టిన
దేశం మనది. మీరంతా కావలిస్తే ఇంగ్లీషు నేర్చుకొండి. మన భాషని అమెరికాలోన�ైనా నిలబెట్టటానికి
సహాయం చెయ్యండి.
***

85
ఊరు.- విశాఖపట్నం. తెలుగు భాషాబోధన.
కథ, కవిత, నాటక, ఆధ్యాత్మిక, సాహిత్య వ్యాస రచనలు. ప
్ర సంగాలు.
బిరుదులు,సన్మానాలు.—“ ప ్ర వచన కళానిధి” రాష ్త మ ఉపాధ్యాయు
్ట ్ర ఉత
నిగా రవీంద్ర భారతి లో ప
్ర భుత్వం చె సన్మానం. సిలికానాంధ ్ర , తానా సభలలో
సన్మానం. ౫. ముద్
రి త గ
్రంథాలు.

19. భాగవత- తరంగాలు


- టి. పి. ఎన్. ఆచార్యులు
“భాగవతం తెలిసిపలకడం శూలికి,(శివునకు) తమ్మిచూలికి (బ్రహ్మకు) కష్ట తరమ�ైనపుడు,
సామాన్యులకు భాగవత తత్త్వం తెలుసుకొనుట సాధ్యమా!?కనుకనే పో తన చాలవినమ్రంగా “విబుధజనుల
వలన విన్నంత, కన్నంత, తెలియవచ్చినంత తేటపరతు” అని చెప్పినట్లు , మనంకూడ పెద్దలుచెప్పిన
భాగవతంలోని కొన్ని విశేషాంశాలను తెలుసుకొందాం. వ్యాసులవారు చెప్పిన పదునెనిమిది పురాణాలలో
“భాగవతపురాణం” కూడ వుంది.అలాగే నారద ( నార అంటే జ్ఞానము ద అనగా ఇచ్చువాడు
నారదుడు.కలహభోజనుడుకాదు) ఉపదేశంతో ద్వాదశ (12) స్కంధాలుగ భాగవతంవ్రాసితరించేడు.
పో తన దానినితెనిగించిధన్యతచెందేడు. ఈరోజు మనం బలికుమార్తె రత్నమాల ‘పూతకి’ ఎలాఅయిందో
తెలుసుకొందాం. “ స్వర్గాన్ని ఆక్రమించిన బలివద్ద కు శ్రీహరి వామనుడ�ైవచ్చి, త్రివిక్రముడ�ై బలినణచిస్వర్గాన్ని
తిరిగి దేవతలకు లభించేట్లు చేస్తా డు. ఈ కథ అందరికి తెలిసినదేకదా!? బలి యజ్ఞ వాటికకు ముద్దు లొలికే
బాలుడిగా బుడిబుడి అడుగులతో వస్తు న్న వామనుని సౌందర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్య
చకితులౌతారు. అక్కడున్న బలి కుమార్తె రత్నమాల ఆ బాలుణ్ణిచూసి, పుత్రప్రేమకలిగి “ ఇలాంటి
పుత్రు డు నా స్త న్యపానముచసిన నాజన్మధన్యతచెందునుకదా।” అని అనుకుంటుంది. ఆ వడుగు అది
గ్రహించి తథాస్తు అని మనసులో దీవిస్తా డు. ఆ కోరిక తీరడానికి ద్వాపరంలో రత్నమాల పూతకిగా పుట్టి,
బాలగోపాలునికి “స్త న్యమిచ్చి” మోక్షాన్ని పొ ందుతుంది. ఆస్వామి కరుణ ఎంతగొప్పదో కదా!!. అందుకే
కామంతోగోపికలు, వ�ైరంతో కంసుడు, శిశుపాలుడు, సఖ్యంతో పాండవులు ఆస్వామినిసేవించి తరించేరు.
ఇంకా భాగవతంలో ప్రహ్లా దుడు చెప్పిన“తనుహృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్”-
అనేపద్యంలోతొమ్మిది భక్తి మార్గా లుమనకికనబడతాయి వాటికిఉదాహరణగా *** శ్రవణానికి - పరీక్షిత్తు
కీర్తనానికి - నారదుడు స్మరణానికి - ప్రహ్లా దుడు, శుకుడు పాదసేవనానికి - లక్మణుడు అర్చనకు. -
అంబరీషుడు,పృధువు వందనానికి - అక్రూ రుడు దాస్యానికి - హనుమ సఖ్యానికి - అర్జునుడు, కుచేలుడ
ఆత్మనివేదనానికి- బలి,గోపికలు కనబడుతారు. అట్లే భాగవతం జన్మకికారణమ�ైన వాయుతత్వాలను
చాలచక్కగా వివరించింది- 1. సమానవాయువు శుక్లాన్నిపురుషుడిలో 2. వ్యానవాయువు స్త్ ల రీ ో శోణితాన్ని
పుట్టిస్తుంది 3. అందులోకి ప్రాణవాయువుప్రవేసిస్తుంది 4. ప్రాణశుక్లా లలో అపానవాయువు నడుస్తుంది
5. ప్రాణాపానాలమధ్య ఉష్ణ రూపంలో (అగ్ని) ఉదానవాయువుప్రవేశిస్తుంది. ఇలా పంచప్రాణాలు (
వాయువులు) మనల్నిరక్షిసతూ ్ఉంటాయి. అగ్ని వాయువు వరుణుడువీటికతీతమ�ైనదే బ్రహ్మతత్త్వం అదే
కృష్ణ తత్త్వం”అని భాగవతం వివరిస్తుంది.
“మంగళం మంగళానాంచ / మంగళం మంగళ పద ్ర ం సమస్త మంగళాధారం / తేజోరూపం
నమామ్యహం “ మంగళ ప్రదుడ�ైన శ్రీకృష్ణ లీలా తరంగాలలో ఒక తరంగాన్ని ఆవిష్కరిద్దాం. “ బాలగోపాల

86
తరంగం “ లీలామానుష విగ్రహుడు, నవనీత చోరుడు, ఆ నందాంగనా డింభకుడు అయిన గోపాలబాలుని
ఆనంద తరంగాలు ఆశ్చర్య జనకాలు. ఒకరోజు గోపకాంతలు యశోద వద్ద కు వచ్చి, “ అమ్మా యశోదా
! నీ చిన్ని కృష్ణు డు మా ఇండ్ల లో వెన్నఅంతా ఆరగించేడు “ అని విన్నవిస్తా రు. యశోద కన్నయ్యను
పిలచి, బెదరించి “ వెన్నదొ ంగలించావా? లేదా? “ అనిఅడుగుతుంది. “ నేను వెన్న తిన్నానా ! లేదే !’ అని
ఆశ్చర్యంగా అడిగి ఆరోజుకి తప్పించు కొంటాడు. ఇంకో రోజు వాళ్ళ యింట్లోనే వెన్నతింటూ తల్లి కి దొ రికి
పో తాడు.నల్ల నయ్య వెన్నతిన్నాడు , తల్లి చూసింది, ఇపుడు ఎలాగ�ైనా తల్లి ని మాయచేసి వెన్న తిన లేదని
నిరూపించాలి. ఇది కన్నయ్య ఎత్తు గడ! వారి మధ్య సంభాషణ ఎంత మనోహరంగా సాగిందో చూడండి! ( ఇది
కల్పితం) తల్లి :- కన్నయ్యా! వెన్న తిన్నావా లేదా? అని అడుగుతుంది. కన్నయ్య: అమ్మా! “ నేను వెన్న
తిన్నానా! ( ఈ పదం గమనించండి) లేదే “ అని అమాయకంగా అంటాడు. “ కన్నయ్యా! నీవు తినడం నేను
చూసాను»అంటుంది తల్లి. ఇక లాభంలేదు గట్టిగా చెప్పాలని అనుకొని, “ ఏంటమ్మా! నేను వెన్నతిన్నానా?
అసలు అంత సమయం నాకెక్కడిది! ఉదయం నీవు పెట్టిన, చద్ద న్నం తిని, గోవులవెంట వెళ్ళి, మురళి
వాయించుకుంటూ సాయంకాలం వరకు తిరిగ,ి యిప్పుడే కదా వచ్చాను,నేనెపుడు వెన్నతిన్నాను? “
అని ఓ కారణం చెపుతాడు. అయినా యశోద కోపంగా చూస్ తూ తర్జ నితో ( చూపుడువేలు) బెదిరిస్తుంది.
అమ్మ తనమాట నమ్మలేదని గ్రహించిన ఆ బాలగోపాలుడు ఇంకో కారణం చెపుతాడు. “ అమ్మా!
నేనువేన్నతిన్నానా!? లేదమ్మా లేదు. చూడు నావి ఎంత బుల్లి ,బుల్లి చేతులో, అంత ఎత్తు ఉట్టిమీద
భాండంలో ఉన్న వెన్నని,అందుకొని ఎలాతినగలను!? ఇపుడు చెప్పూ , నేను వెన్న తిన్నానా!?” అని
అమాయకంగా ముద్దు మోముతో అడుగుతున్న ఆ చిన్ని కన్నయ్యని చూసి ముసి,ముసిగా నవ్వుకొంటూ
యశోద “ ఇదిగో కన్నయ్యా! అసత్యం ఆడకు, నువ్వు వెన్న తినకపో తే నీ మూతికి అంటుకొన్నది ఏమిటి?”
అని గట్టిగా అడుగుతుంది. అయ్యో! దొ రికిపో యానే ! ఇప్పుడు ఎలా? అనిఅనుకొని, ప�ైకి ఘంభీరం
ప్రదర్శిస్
తూ , “ ఓ అదా బ�ైట ఆవులకి పాలుపితుకుతున్నారు, నేను దగ్గ రగా నిలుచున్నాను, ఆ పాలనురుగు
నా మూతికి అంటింది . ఇది వెన్నకాదు. ఇపుడు చెప్పూ నేను వెన్న తిన్నానా?” అని అంటాడు. అయినా
అమ్మ ఒప్పుకోదు. ఈ కారణం కూడా తల్లి నమ్మలేదు, కొంచం అమ్మని పొ గిడి ఒప్పిద్దాం, అనుకొని “ ఓ
అమ్మా! నా బంగారుతల్లి ! ఓ అందమ�ైన అమ్మా! నా ప్రియమ�ైన అమ్మా! నను గన్న నాతల్లీ! మా మంచి
అమ్మ! “ అని ఎంత పొ గడినా తల్లి నమ్మటం లేదని,కొంచం తెచ్చి పెట్టు కొన్న కోపంతో “ ఎంటమ్మా! ఎంత
చెప్పినా వినవు. ఉదయమే నాచేతికి,ఒక కర్రా , కంబళి యిచ్చి పంపుతావు అబ్బో గోవులను కాయడం ఎంత
కష్టం ! ఇక ఈ పని నావల్ల కాదు. ఇదిగో నీకర్రా , కంబళి నీవే తీసుకో రేపటినుంచి ఎక్కడికి వెళ్ళను. ఇపుడు
చెప్పు నేను నిజంగా వెన్న తిన్నానా!? “ అని చివరికి దీనంగా ముఖం పెట్టి అడుగుతున్న కన్నయ్యని
--అక్కున చేర్చుకొని, కళ్ళవెంట భాష్పాలు రాగా గద్గ ద స్వరంతో యశోద “ నా చిన్ని తండ్రీ లేదయ్యా!
లేదు. నువ్వు వెన్న తినలేదు” అని గట్టిగా అంటుంది. అమ్మయ్యా! అమ్మ నమ్మింది ఇక ఈ వినోదం చాలు
అనుకొని ఆ లీలా మానుష విగ్రహుడు తల్లి కన్నీళ్ లు తుడిచి, “ అమ్మా! ఇంతవరకు నేను వెన్న తిన్నానా!?
అనికదా నిన్ను విసిగించేను. ఇపుడు నిజం చెపుతాను విను. నేను వెన్న తిన్నాను.” అని ముద్దు ముద్దు గా
చెపుతున్న i కన్నయ్యను ముద్దిడి, తల్లి యశోద “ నాకు తెలుసు కన్నా! నీవు సత్య స్వరూపుడవు “ అని
అంటుంది.
***

87
అపర ్ణ మునుకుట ్ల గునుపూడి వృత్తి రీత్యా రెవెన్యూ కంట్రో లర్ గా పని
తు న్నా ప
చేస్ ్ర వృత్తికి మాత
్రం కథలు, కవితలు, పాటలు వ్రాస్తారు. ఆవిడ వ్రా సిన
అనేక నృత్య రూపకాలు అమెరికాలో అనేక వేదికల మీదవిజయవంతంగా

్ర దర్శించడం జరిగింది.

20. కృతి - భాషాకృతి - భావనాకృతి - శ్రావ్యాకృతి 


అపర్ణ మునుకుట్ల గునుపూడి 
(గమనిక - నేను సంగీత విద్వాన్సురాలిని కాను.  సాహిత్యంలో ప్రావీణ్యత కూడా లేదు.  నేను
ప్రస్తావించే విషయాలు మీ అందరికి తెలిసినవే అయినా ఎంతో గొప్ప వాగ్గేయకారులు మనకందించిన కొన్ని
వేల కృతుల గురించి మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నా, విన్నా కమనీయంగా ఉంటుంది.  కనక నాకు నచ్చిన
కొన్ని విశేషాలు మీ ముందు ఉంచి, కొన్ని మచ్చుఁ తునకలు మీతో పంచుకుందామన్నదే నా ఆకాంక్ష). 
మన వాగ్గేయకారులలో ముఖ్యులు త్యాగరాజు, ముత్తు స్వామి దీక్షితులు, శ్యామశాస్త్ ,రి పురందరదాసు
నుంచి మొదలుపెట్టి ఈ  తరంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి దాకా మనకి అందించిన కృతుల్లో
ఉన్న భాష, భావన, సంగీత సరళి. 
 ముందుగా భాష చమత్కారాలు చూస్తే , ఈ నెల మంగళప్రదం, లక్ష్మీప్రదమ�ైన శ్రా వణమాసం కనక
ముత్తు స్వామి దీక్షితులు వారు లలిత రాగంలో రచించిన 
హిరణ్మయీమ్ లక్ష్మీమ్ భజామి అన్న కృతిలో
శీత కిరణ నిభ వదనాం స్రిత చింతామణి సదనామ్
పీత వసనామ్ గురుగుహ మాతుల కాంతం లలితాం అని పాడతారు. ఆవిడ మొహం చల్లని కిరణాలను
ప్రసరిసతూ ్ ఉందని, ఆవిడ ఇల్ లంతా చింతామణులతో నిండి ఉందని, (చింతామణి అంటే తలుచుకున్నవన్నీ
ప్రసాదించేటటువంటి మణి)  అంటూ పాటంతా ఆవిడని అత్భుతంగా వర్ణిసతూ ్ వెళతారు , చివరగా తన
ముద్ర గురుగుహ వేయాలికదా అక్కడే ఉంది సొ గసంతాను. అమ్మవార్ లందరూ ఒకటే అని గురుగుహ జనని
అనొచ్చును , అంటే పార్వతీదేవి అవుతుంది ప�ైగా తాళానికి కుదరదు.  ఆయనకి కావాల్సింది లక్ష్మి దేవి
(మనందరికీ కూడాననుకోండి, అదలా పక్కన పెడితే), అక్కడ గురుగుహ మాతుల కాంతామ్ లలితాం
అన్న సమాసం పెడతారు.   గురుగుహ అంటే సుబ్రహమణ్యేశ్వరుడు, అతని తల్లి పార్వతి, ఆవిడకి సో దరుడు
విష్ణు మూర్తి  కనక అతనికి మాతులుడు/ అనగా  మావయ్య అయిన విష్ణు మూర్తికి కాంత లలితంగా
ఉండేటటువంటి లక్ష్మీదేవి.  ఈ  ప్రయోగంతో లక్ష్మి దేవిని అందుకుంటారు. ఇక్కడ లలిత రాగ ముద్ర కూడా
వేస్తా రు.  
ఈ కీర్తనలో ఇంకొక విశేషం ఏమిటంటే పల్ల విలో హిరణ్మయిమ్ లక్ష్మిమ్ భజామి హీన మానవాశ్రయం
త్యజామి అంటారు.  లక్ష్మిని భజించండి - హీన మానవులని వదిలేయండి అని అర్థం కదా.  ఇక్కడ చూస్తే 
కుల, మత, వర్ణ, వర్గ , స్త్ రీ , పురుష తారతమ్యాలు లేకుండా సగటు మానవుణ్ణి ఉద్దేశించి హీన మానవులన్న
ప్రయోగం చేస్తా రు.  అది ఎవర�ైనా కావచ్ఛునన్నమాట. ఇప్పటి రోజుల్లో ఇక్కడా, భారతదేశంలోను కూడా

88
మానవ సమానత్వం కోసం ఎంతో పో రాడవలసి వస్తోంది.  దానివల్ల అలజడులతో, ప్రాణాలు కూడా
కోల్పోతున్నారు. అటువంటిది ఆ రోజుల్లో ఆయన అంతటి ఔన్నత్యం పాటించేరు కనకే వాగ్గేయకారుల్లో
అగ్రగణ్యుల�ైనారు.  ఈ కృతిలో భాష భావన స్వర విధానం అన్ని కూడా మహత్త రంగా ఉండి శ్రవణానందంగా
ఉంటుంది. ఎక్కువ కృతుల్లో రాగముద్ర వేసిన ఘనత కూడా వారిదే.
తరువాత  త్యాగరాజు వారు  పంతువరాళి  రాగంలో శివుడి మీద రచించిన 
శంభోమహాదేవ శంకర గిరిజారమణ అన్న కృతి తీసుకుంటే అందులో  
సురబృంద కిరీటమణి వర విరాజిత పద అని శివుడి పాదాలు వర్ణిస్తా రు. 
సహజంగా కిరీటాలు ఉండేవి తల మీద.  కానీ శివుడి పాదాలు విరాజిల్లు తున్నాయి. రెంటికీ
పొ ంతన లేనట్టు గా ఉంటుంది.  కానీ ఆ సమాసంలో అయన ఉద్దేశ్యం అక్కడ చేరిన సుర బృందం అంతా
శివుడికి పాదాభివందనం చేస్తుంటే వారి కిరీటాల్లో ఉన్న మణులప�ై విరిసిన కాంతుల చేత శివుడి పాదాలు
విరాజిల్లు తున్నాయని.  ఆ ఒక్క సమాసంలో అంత  అందం ఇమిడించారు.  అది వినగానే  మనకి శివుడు,
మోకరిల్లిన సురబృందం  కళ్ళకి కట్టినట్టు గా కనిపిస్తా రు.
అలాగే శుద్ధ సావేరిలో 
దరిని తెలుసుకొంటి , త్రిపుర సుందరిని తెలుసుకొంటి  అంటారు.  
అంత వరకు బాగానే ఉంది.  తర్వాత అనుపల్ల విలో చాలా ఉన్నత పద ప్రయోగం చేస్తా రు. మారుని
జనకుడ�ైన మా దశరథ కుమారుని సో దరి దయా పరి మోక్ష దారిని తెలుసుకొంటి అంటారు.  
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేరో చూడండి. ముందు దరిని (గమ్యం,ఒడ్డు ) తెలుసుకోవడం, తర్వాత
అమ్మవారు త్రిపుర సుందరిని తెలుసుకోవడం ఆ ప�ైని మోక్ష దారిని తెలుసుకోవడం.  ఆ మోక్షదార�ైనా 
ఎలా తెలుసుకున్నారు.  మన్మధుడి తండ్రియ�ైన విష్ణు మూర్తి (ఇక్కడ రాముడు), అతనికి చెల్లె లు అయిన
పార్వతి దయతో. 
ఎంత అత్భుతమ�ైన సమాసం.  చాలా మంది గాయకులు దశరథ కుమారుని సో దరి అన్న సమాసాన్ని
విరిచి దశరథకు మారుని సో దరి దయాపరి మోక్ష దారి అని పాడుతూ ఉంటారు. మారుని సో దరి దయతో
ఎం తెలుస్తుందో మీరు ఊహించవచ్చును.
సరే ఉచ్చారణా దో షాలు పక్కన పెడితే , ఆరభిలో
నాదసుధా రసంబిలను నరాకృతి ఆయె మనసా అన్న కీర్తనలో వేద , ఆగమ, పురాణ శాస్త్రాలకు
అధారమ�ైన నాద సుధారసమే  శ్రీ రాముని ఆకృతి అంటారు.  చరణంలో
స్వరములారునొకటి గంటలు వర రాగము కోదండము అని వర్ణిస్తా రు. కోదండానికి ఏడు గంటలు
ఉన్నాయన్న ఆ మాటకి ఆరున్నొకటి అన్న పదం పెడతారు.  చాలా మందికి తెలిసే ఉంటుంది మన
చిన్నప్పుడు ఒకటి, రెండు, మూడు అంటూ లెఖ్ఖ పెట్టి ఆరు వచ్చేక ఆరున్నొకటి అనడం. ఎందుకంటే ఏడు
అంటే ఇంకో అర్థం వస్తుంది కనక ఆ మాట వాడేవారు కాదు మన పెద్దవాళ్ళు.  అటువంటి ఇబ్బందికరమ�ైన
సందర్భంలో స్వరములారునొకటి అన్నచమత్కారం చాలా చక్కని భాషాకృతి దాల్చింది.
తర్వాత, భ�ైరవి లో శ్రీ రఘువరా సుగుణాలయ అన్న కృతిలో 
కనికరమున నను కని కరమున నిడి చనువున యొక మనవిని బల్కగ రాదా అని వేడుకుంటాడు.
అతి ముచ్చట�ైన సమాసం.   కనికరమున - దయతో, నను కని - నన్ను చూసి, కరముననిడి - నా చెయ్యి
పట్టు కుని నాతొ మాట్లా డరాదా అన్న భావం ఎంత సరళంగా ఉందో చూడండి.

89
ఇలా ఉండగా త్యాగరాజు గారు ఓ మారు తిరుపతి వెళ్ళేరుట.  ఆ రోజుల్లో బస్సులు ర�ైళలు ్ లేవు కనక
కాలి నడకే ప్రధాన మార్గం.  తీరా వీరు వెళ్ళేప్పటికి శ్రీవారి సేవలన్నీ ముగించి తేర వేసేసేరుట.  ఇంత
దూరం వచ్చినా దర్శనం భాగ్యం కలగ లేదే అనుకుని గౌళి పంతు రాగంలో తెర తీయగ రాదా అన్న కృతి
పాడేరు.  మనందరి భాషలో అయితే శ్రీవారికి అడ్డంగా వేసిన తెర తీయాలనుకుంటాం. కానీ ఆ తర్వాత వింటే
తెలుస్తుంది ఏ తెర అన్నది  “తెర తీయగ రాదా, లోని తెర తీయగ రాదా, తిరుపతి వెంకట రమణ మత్సరమనే
తెర తీయగ రాదా.  ఇక్కడ అసలు తెర తేట తెల్లం అవుతుంది, మనసులో అలముకొన్న మత్సరం అని. 
అక్కడ విగ్రహ దర్శనం కన్నా మనసులోని తెరలను తొలగించి పరమాత్మని తెలుసుకోవాలన్న ఉత్కృష్ట మ�ైన
భావనాకృతి వ్యక్ తం చేస్తా రు. 
స్త్ ల
రీ ఔన్నత్యానికి వస్తే .  త్యాగరాజు వారి కీర్తన ఒకటి తప్పక తలుచుకోవాలి. ఇది కాంభోజి రాగంలో
మా జానకి చెట్టపట్ట గా మహారాజువ�ైతివి - త్యాగరాజు వారు గొప్ప రామ భక్తు డ�ైనప్పటికీ  ఈ కృతిలో సీతని
ఉన్నతంగా చూపిస్తా రు. పల్లవి చూస్తే 
మా జానకి చెట్టపట్ట గా మహారాజువ�ైతివి - మా అమ్మాయి చెయ్యి పట్టేక నీకు మహారాజ యోగం
ప్రాప్టించిందంటారు.  
అనుపల్ల విలో రాజరాజవర రాజీవాక్ష విను రావణారియని రాజిల్లు కీరతి య
్ ు 
అంటే, ఓ రాజీవాక్ష , నేను చెప్పేది విను, మా అమ్మాయి వల్లే నువ్వు రావణ శత్రు వు అవడం,
దానివల్ల కీరతి ్ వచ్ఛేయి అంటారు.  అంటే లంకకు వెళ్లడం, రావణ వధ, ఇవన్నీ అన్నమాట.
ఇక చరణంలో 
కానకేగి ఆజ్ఞా మీరక మాయాకారమునిచి శిఖి చెంతనే యుండి
దానవుని వెంటనె చని అశోక తరు మూలనుండి
వాని మాటలకు కోపగించి కంట వధియించకనే యుండి
శ్రీ నాయక యశము నీకే కల్గ జేయలేదా త్యాగరాజ పరిపాల అని పాడతారు. 
అసలు కథేమిటంటే సీతమ్మవారు రావణాసురుడు వచ్చినప్పుడు తన నిజ స్వరూపాన్ని అగ్ని దగ్గ ర
దాచి పెట్టి, మాయాకారం తీసుకుని వెళ్లిందని, ఆ తర్వాత రావణ సంహారం జరిగేక ఆవిడ అగ్ని ప్రవేశం
చేసినప్పుడు అగ్నిదేవుడు ఆవిడ నిజస్వరూపాన్నితెచ్చి ఇచ్ఛేడని. ఆ కథ పక్కన పెడితే.  
అక్కడ అశోక వనంలో రావణుడు పతి ్ర రోజు వచ్చి తనని వరించమని కోరడం, ఆవిడ ఛీత్కారం
చేయడం. అంత జరుగుతున్నా ఆవిడకి అతన్ని కళ్ళతోనే భస్మం చేయగల శక్తి ఉన్నా,  రావణుడిని
వధించిన యశస్సు నీకు/రాముడికి రావాలని ఆవిడ తన కోపాన్ని, బాధని నిగ్రహంతో భరించింది అంటారు,
ఇందులో తన రాముడిని తక్కువ చేస్తు న్నభావం ఉన్నప్పటికి  సీతకి పెద్ద పీట వేస్తా రు.   
ఇది సుమారు రెండువందల ఏళ్ల క్రితం జరిగిన విషయం, అప్పట్లో ఉమెన్స్ లిబరేషన్, ఈక్వల్ ర�ైట్స్
లాంటి స్త్ రీ ఉద్యమాలు లేనటువంటి రోజుల్లో స్త్ రీ శక్తి ప�ై ఆయనకి వచ్చిన ఆలోచన బహు హర్షణీయం.
ఈ కీర్తన స్వర పరచడం  కూడా సాహిత్యానికి అనుగుణంగా ఉండడం అతిశయోక్తి కాదు.  అనుపల్ల వి
రాజ రాజవర …. అన్నది గట్టిగా తారా స్థాయిలో ఒక ధీమాతో అధికారయుతంగా ఉండి, చరణానికి
వచ్ఛేప్పటికి  కానకేగి… మంద్ర స్థాయిలో గుప్ తంగాను, గోప్యంగాను ఉంటుంది.
అలా స్వరకల్పన పరంగా చూస్తే మరో చక్కని ఉదాహరణ బహుధారి రాగంలో
బ్రో వ భారమా రఘురామా .  ఇది కూడా త్యాగరాజ కృతే.

90
శ్రీ వాసుదేవ అండ కోట్ల కుక్షిని యుంచుకోలేదా 
కలశాంబుధిలో దయతోన అమరులక�ై ఆది కూర్మమ�ై
గోపికలక�ై కొండలెత్తలేదా కరుణాకర శ్రీ త్యాగరాజనుత అని. 
దీని భావం చుస్తే అంబుధి నేలకి మట్టంగా ఉండి, అందులో ఆది కూర్మము ఇంకా సముద్రపు
లోతుల్లో కి ఉంటుంది కదా, అందుకు మంద్రంలో మొదలుపెట్టి ఇంకా కిందకి తీసుకువెళతారు. మళ్ళి
రెండో పాదంలో గోపికలక�ై కొండలెత్తలేదా - కొండలు ప�ైకి ఉంటాయి కనక తారాస్థాయికి తీసుకువెళతారు. 
ఇలా సందర్భోచితమ�ైన స్వరాలతో ఈ  కృతి ఏంతో  మధురంగాను శ్రా వ్యాకృతికి చక్కని ఉదాహరణగా
ఉంటుంది. ఈ కృతిలో విష్ణు మూర్తి అవతారాల వివరణకి అనుగుణంగా బహుధారి రాగంలో కట్టేరు. 
బహుధారి అంటే పెక్కుగా ధరించినవాడని.  వాటిని అవతారాలుగా చెప్పుకోవచ్చును.  ఇలా  చెప్పుకుంటూ
పో తే లెక్కపెట్టలేనన్ని అందమ�ైన కృతులు. 
ఇంకా చూస్తే , పురాణాలూ, ఇతిహాసాలు చదవక్కరలేకుండా వేద వేదాంత సారాన్ని కీర్తనల్లో
ఇమిడించేరు.  చంద్రజ్యోతి రాగంలో “బాగాయెనయ్యా నీ మాయలెంతో భ్రహ్మక�ైనా కొనియాడ తరామా”
అన్న కృతిలో గీతాసారం మనకి గోచరిస్తుంది.  అందులో చరణంలో
 అలనాడు కౌరవుల నణచమన అలరి దో షమను నరుని చూసి 
పాప ఫలము నీకు తనకు లేదని చక్కగా పాలనమ్ము సేయ లేదా త్యాగరాజనుత.
కౌరవులనగానే మహా భరతం మన ముందుంటుంది.  కురుక్షేత్రంలో అర్జునుడు 
“న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవిందా కిమ్ భోగ�:ై జీవితేన వా” 
అంటూ కురు యుద్ద్ధం చెయ్యనని వెనుకంజ వేస్తుంటే 
కృష్ణు డు అతన్ని ఆపి 
“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు: మా తే సుగోస్త్వ కర్మాణి”, అని  
యుద్ధం చేసిన పాపం నీది, నాది, ఎవరిదీ కాదు.  నీ కర్మని నీవు ఆచరించడంలో ఎవరి తప్పు లేదు
అని చెప్పే పద్దెనిమిది అధ్యాయాల గీతోపదేశ భావం రెండు వాక్యాల్లో చెప్పి పామరులని ఆకట్టు కున్నారు.
తర్వాత ముఖారిలో చింతిస్తు న్నాడే యముడు అన్న కీర్తనలో భజన, సంకీర్తనల ప్రాముఖ్యత
తెలుపుతూ సమాజానికి సన్మార్గాన్ని చూపుతారు. యముడు ఎందుకు చింతిస్తు న్నాడుట?   సంతతము
సుజనులెల్ల సద్భజన జేయుట జూచి 
అందరు భజన చేయడంతో నరకానికి ఎవరు వెళ్లడం లేదని చింతిస్తు న్నాడుట.
సూల, పాశ, ఘృత భట జాలముల జూచి మరి మీ 
కోలాహలము లుడుగు కాలమాయె ననుచు 
 నరకంలో యమ బాధలు పెట్టే భటులకి ఉద్యోగాలు పో యేకాలం వచ్చిందంటారు  (ఇక్కడి భాషలో
యముడు వాళ్ లందరినీ లే ఆఫ్ చేస్తా ననీ హెచ్చరిక చేస్తు న్నాడన్నమాట)
అంతటితో ఆగకుండా,
దారితెలియలేక తిరుగు వారల�ైన చాలునంటే  -
సారమని  త్యాగరాజు సంకీర్తనము బాడెరనుచు చింతిస్తు న్నాడే. 

91
నాలాటి దారి తెన్నూ లేని పనికిమాలిన వాళ్ల తో  సరిపెట్టు కుందామన్నా, వాళ్ళు కూడా 
సంకీర్తనలు చేస్తు న్నారని చింతట.  మార్కండేయపురాణంలో మార్కండేయుడు, ఘోర తపస్సుతో యమ
బాధల్నితప్పించుకుంటే, త్యాగరాజువారు అవేమీ లేకుండానే యముణ్ణి గడగడలాడించే  అతి సుళువ�ైన
మార్గం భజన అని చెప్పడం గొప్ప భావం!
ఇకపో తే  ఆ రోజుల్లో కూడా ఎప్పటిలాగే ఒకళ్ళతో ఒకళ్ళు పో టీలు, పంతాలు, వ్యంగ్యాలు, హేళనలు,
భగవంతుడికి భక్తు డికి మధ్య వాదనలు కద్దే. 
అప్పట్లో యజ్ఞాలు హో మాలు విరివిగా జరుగుతుండేవి కదా.  వాటికి ప్రతిగా త్యాగరాజు జయమనోహరి
రాగంలో 
యజ్ఞాదులు సుఖమనువారికి సమమజ్ఞానులు గలరే ఓ మనసా అన్న ఈ  కృతిని రాసేరుట.  దాని
అనుపల్ల విలో “సుజ్ఞాన దరిద్ర పరంపరల సుర చిత్తు లు జీవాత్మ హింసగల” అంటారు. అప్పట్లో యాగాలలో
బలి ఇస్
తూండేవారు .  అటువంటి యాగాలు, హింస చేసే వాళ్ళని  సున్నితంగా హేళన చేయడం అన్నమాట.  
అలాగే అభోగి రాగంలో 
మనసు నిల్ప శక్తి లేకపో తె మధుర గంట విరుల పూజేమీ సేయును
ఘనదుర్మతుడ�ై తామునిగితే కావేరి మందాకినీ ఎటు బ్రో చును
సోమిదమ్మ సొ గసుగాండ్ర కోరితే సో మయాజి స్వర్గా ర్హుడౌనో 
కామ క్రో ధుడు తపంబొ నర్చితే  గాచి రక్షించునో త్యాగరాజనుత 
చపల చిత్తు లు, దుర్మతులు, పతితలు, కాముకులు, క్రో ధులు వంటి భోగుల మీద కీర్తన గమ్మత్తు గా  
అభోగిలో రచించారు.  భోగి కాని  వాడు  అభోగి.  వాళ్ళందరిని అభోగులవమని వారి ఉద్దేశ్యమేమో. మరి
అది కావాలని ఎంచుకున్నారో లేక యాదృఛ్చికమో ఆ అంతర్యామికే  తెలియాలి.
ఇవి ఇలా ఉండగా ఓ నాడు వారి శిష్యులు వచ్చి పక్క గురువుగారు అంటే దీక్షితులు వారు
నవగ్రహాలమీద కీర్తనలు పాడేరుట అని చెప్పగానే రేవగుప్తి రాగంలో 
గ్రహ బలమేమి శ్రీ రాముని అనుగ్రహబలమే బలము 
గ్రహ బలమేమి తేజోమయ విగ్రహమును ధ్యానించు వారికి నవ గ్రహ బలమేమి అని సూటిగా
కాకపోయినా పరోక్షంగా జవాబు చెబుతారు. 
అలా చూస్తే ప�ైన తెర తీయగ రాదా లో చెప్పుకున్నట్టు విగ్రహాలు, గ్రహాల మీద కన్నా నిగ్రహానికి
రామనామ జపానికి ప్రాముఖ్యత ఇచ్చారు త్యాగరాజు వారు.
ఇహ శంకరాభరణంలో 
స్వరరాగ సుధా రస యుత భక్తి స్వర్గా పవర్గ మురా ఓ మనసా  అన్న కృతిలో శృతి మించి రాగానికి
అంటే ఓ మెట్టు ప�ైకి వెళతారు.  అందులో ఒక చరణంలో
మద్దెల తాళ గతులు తెలియకనే మర్దించుట సుఖమా 
సుద్ధ మనసు లేక పూజజేయుట సూకర వృత్తి రా  
భక్తి తో కూడిన సుస్వర సంగీతంతో స్వర్గ ము మోక్షము వస్తుందన్నమాట పల్ల విలో చెప్పి, సంగీతం
రానివాళ్ళ పని ఏమిటో చాటి చెబుతూ ఆ ప�ైని ఇంకో చరణంలో 
రజత గిరీశుడు నగజకు తెల్పు స్వరార్ణ వ మర్మములు విజయముగల త్యాగరాజుకెరుకే  

92
అంటారు.
ఇలాగ ఎన్నైనా చెప్పుకుంటూ పో వచ్చును, కానీ  త్యాగరాజు వారిని పక్కన పెడితే భక్త రామదాసు,
ఓ కీర్తనలో రాముడిని చెడా మడా  తూలనాడతారు.
ఇక్ష్వాకు కుల తిలక ఇకన�ైనా పలుకవే రామ చంద్ర
నీవు రక్షింప కున్నను రక్షకులెవరయ్య రామ చంద్ర 
ఇందులో వరసగా నీకు గుడి కట్టించేను , నీకు, నీ భార్యకి, తమ్ముళ్ళకి నగలు చేయించేను, వాహనాలు
పంపించేను అంటూ  
కలికి తురాయి నీకు మెలకువగా చేయిస్తి రామచంద్ర
నీవు  కులుకుచు తిరిగేవు ఎవడబ్బ సొ మ్మని రామచంద్ర, 
నీ తండ్రి దశరథ మహారాజు పెట్టేనా? 
లేక నీ మామ జనక మహారాజు పంపెనా అంటారు  
ఇన్ని మాటలన్నాక మళ్లి 
అబ్బా తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్ర 
ఈ దెబ్బలకోర్వక అబ్బా తిట్టితినయ్యా రామచంద్ర అని బాధపడతారు.  అదే భగవంతుడికి భక్తు డికి
మధ్య ఉన్న చనువు, అధికారం. 
ఇక కృతి, భాషాకృతి, భావనాకృతి అన్నాక బాలమురళి కృష్ణ గారి, స్వరాక్షర కృతి సౌరభం చెప్పుకోక
తప్పదు.  ఇది తోడి రాగంలో, ఆ రాగంలో వచ్చే స్వరాలతో అమ్మవారిమీద రచించిన కృతి. 
తోడి రాగం సంపూర్ణ రాగం కనక ఆరోహణ, అవరోహణంలో అన్ని స్వరాలు ఉంటాయి.
పల్లవి: మా మానిని నీ  ధామ గని నీ దాసరిని గాదా
అనుపల్ల వి: మా మా పాప మద  దమని నీ నిగని గని మరి మరి నిమ్మ 
చరణం: సరి గాని దారి మారి గదాధరి నీ నిగ నిగ గని నీ మగని 
సామ నిగమ గరిమ గని నీపాద దరిని పరిపరి 
మురళిరవళి నిమ్మని సదా కోరితినమ్మా
ఈ కృతిలో స్వరా క్షరాలే కాకుండా స్వరస్థా నం కూడా పాటిస్తా రు. అంటే, నీ దాసరిని గాదా అన్నప్పుడు
ఆ స్వరాలని వాటి స్థా నాల్లో నే  పలుకుతారు.  ఆయనే స్వయంగా పాడిన పాట యూట్యూబ్ లో ఉంది. 
అసలు ఈ కృతులన్నీ ఒక మహాసముద్రం అనుకుంటే, పురాణకాలంలో దేవాసురులు క్షీరసాగర మథనం
చేస్తే అమృతం వచ్చినట్టు ఈ కృతి సాగరాన్ని మధిస్తే మనకి మధురమ�ైన కర్ణామృతం అందుతుంది.
ఇక నేను రాసిన పాటలు, నృత్యరూపకాల గురించి క్లు ప్ తంగా ఓ నాలుగు వాక్యాలు.  నేను రెండు
రకాలుగాను రాసేను. మొదటిది ముందు పాట వరుస ఇస్తే దానికి అనుగుణంగా పాట రాయడం, రెండో ది
పాట రాసిచ్చేస్తే వాళ్ళు సంగీతం కూర్చడం. రెండింటిలోనూ  ఇబ్బందులు, సుళువులూ ఉన్నాయి.  సంగీత
దర్శకుడు మనోహర్ మూర్తి గారి ప్రేమ తరంగిణి లో పాటలకి వారు ముందు స్వరం కట్టేసేరు.  దానికి ప్రేమ
గీతాలు రాయమన్నారు.  అందులో ఒక పాట,
తలపులలోన వలపుల పాటలు పాడగా 

93
కౌగిలిలోన కోరికలూయాల లూగగా 
పెదవులప�ైనా చిలికిన సుధలే పొ ంగగా 
నాకు నువ్వే సరిగా ప దా  ప మా గ 
నీకు నేనే వరుస కుదిరిన జంటగా కలిసేములే 
మొదట తేలిగ్గా “నాకు నువ్వే నీకు నేనే” అని రాసేను కానీ అక్కడ ఇంకా నాలుగు మాత్రలు
మిగిలిపో యేయి. రికార్డు చేసే సమయం దగ్గ ర పడుతోంది.  నాకు రాయడం కొత్త , ఎలా పూరించాలో
తెలియడం లేదు.  ఆ వత్తి డికి అసలే ముక్కలు పడడం లేదు. గాయకుడు రామ్ ప్రసాద్ ఒకనాడు పిలిచి
సాహిత్యం తయారుగా ఉందా అన్నారు.  ఏం చెప్పాలో తెలియక ముందు మీరు ఒక మాటు నేనిచ్చిన
పాదాలు పాడండి అన్నాను.  అతను ఫో న్లో పాడుతూ ఉండగా చటుక్కున ఒక ఊహ వచ్చింది.  ఆ మిగిలిన
ట్యూన్ కి స్వరాలేమిటి రామ్ ప్రసాద్ అన్నాను.  స రి గ ప ద ప మ గ  అని జవాబిచ్చేడు. నా అదృష్టం
బాగుండి నాకు నువ్వే సరిగా అన్న స్వరాక్షర పదం బాగా కుదిరింది. ఆ ప�ైని స్వరం వేసినట్టు  పదాపమగ
నీకు నేనే వరుస అని పూరించి అందులోనుంచి బయటపడ్డా ను. 
ఇంకొకటి, అది ఉషాకళ్యాణం నృత్య రూపకంలో శివుడు సంధ్యా తాండవం చేస్తు న్న ఘట్టం.  పాట
రాయడం మొదలు పెట్టి 
తాండవించెను పరమ శివుడు తరుణి పార్వతి పరవశంబ�ై అన్నాక నాకు అది చాలా నచ్చేసి ఇక
ముందుకి సాగడానికి ముక్కలు ఏవీ సరిగ్గా కుదరలేదు.  వర్ణించాల్సింది శివ పార్వతుల తాండవం. ఏ 
పదాలు పడితే అవి పెట్టదలుచుకోలేదు. సమయం మించిపో తోంది. ప్ రో గ్రాం దగ్గ ర పడుతోంది.  ప�ై అనుభవం
ఉందికదా. వెంటనే జ్యోతి గారిని (నాట్య గురువు) పిలిచేను, కొన్ని జతులు చెప్పమని.  పాట ముగించారా
అన్నారు, ముగిస్తా ను కానీ ముందు జతులివ్వండి అన్నాను.  ఆవిడ ఫో న్లోనే జతులు చెప్పడం మొదలు
పెట్టింది.  వాటిలొ  కొన్నిఎంచి పాట ముగించేను. అది విన్నవారు చక్కగా కుదిరిందని నాట్యానికి కనక ఇలా
పెట్టరా అన్నారు.  దాని వెనకాల ఉన్న చిదంబర  రహస్యం ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఆ పాటకి
నా మిత్రు రాలు శ్రీలక్ష్మి కోలవెన్ను వలజి రాగంలో చాలా శ్రా వ్యంగా స్వరపరిచారు.  
ఇవి నేను ఎదుర్కొన్న కొన్ని సమస్యలు.  కానీ మన భాషలో ఉన్న సరళత, విశాల పద విస్తా రం,
సమాస ప్రక్రియలు, ఇలాంటి ఇబ్బందులు తగిలినప్పుడు బాగా తోడ్పడతాయి.
ముగింపుగా  ప్రసన్న అష్ట లక్ష్మి నృత్య రూపకానికి రాసిన మంగళప్రదమ�ైన అష్ట లక్ష్మి స్తు తి.  ఇది
కూడా శ్రీలక్ష్మి కోలవెన్ను రాగమాలికలో అతి మధురంగా స్వరపరిచారు.
అంబుజవాసిని అమల విలోచని ఆనంద సమ వదని 
అఖిల సంపత్ప్రదాయిని ఆదిలక్ష్మి నమోస్తు తే
సస్య శ్యామల కారిణి అయి కలి కల్మష నాశిని
కేదారంచల వాసిని ధాన్యలక్ష్మి  నమోస్తు తే
భవభయ హారిణి శత్రు వినాశిని 
ధీర మన:స్సంచారిణి ధ�ైర్యలక్ష్మి నమోస్తు తే
క్షీర సముద్భవ రూపిణీ కమల సంభవ స్వరూపిణి 
సురగన పరివృత సేవిని గజలక్ష్మి నమోస్తు తే
సకలలోక జనని విశ్వపరంపర కారిణీ

94
వరశుభదాయిని సంతానలక్ష్మి నమోస్తు తే 
విజయోత్సహ పాలిని వీర వినుత సత్కేళిని
సర్వతాప శమని విజయలక్ష్మి నమోస్తు తే 
వివిధవిద్యా స్వరూపిణి వీణాగాన వినోదిని
వేద సంహితాకారిణి విద్యాలక్ష్మి నమోస్తు తే
మణిమయ భూషణి మంగళ కారిణి విశ్వవిభవ ప్రకాశిని
సుమధుర మంజుల భాషిణి ధనలక్ష్మి నమోస్తు తే
మీ అందరికి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలూ చేకూరాలని కోరుకుంటూ, నా ఈ వ్యాసం 
సహృదయంతో చదివినందుకు, త్యాగరాజు వారి భాషలో,
విదులకు మ్రొ క్కెద
కోవిదులకు మ్రొ క్కెద
సంగీత కోవిదులకు మ్రొ క్కెద
ప�ైని వివరించిన కృతులని మంచి మంచి గాయకులు పాడిన లంకెలు యూట్యూబ్ లో దొ రుకుతాయి.
నేను రాసిన కృతులు రెండింటిని మధుర గాయని, స్వరకర్త అయిన నా మిత్రు రాలు శ్రీలక్ష్మి కోలవెన్ను
సహృదయంతో స్వయంగా పాడిన పాటలు ఈ లంకెలలో వినవచును.

***

95
నా పేరు శ్
రీ ధరరెడ్డి బిల్
లా . గత 10 సంవత్సరాలుగా క్యుపెర్టి నో,
క్యాలిఫోర్నియాలో నివసిస్ తు న్నాను. జన్మస
్థ లం మల
్ల క్కపల్
లి (గ్రా ),
ధర్మసాగరం(మం) వరంగల్ జిల్ లా .
విద్యాభ్యాసం అంతా గురుకులంలో జరగటం వల ్ల శ్లోకాలు, సాహిత్యం
అంటే మక్కువ ఏర్పడింది. వృత్తి రీత్యా సాఫ్
టు వేరు ఇంజినీరును. సంగీత,
సాహిత్య,హాస్య ప్
రి యుణ్ణి .
పౌరాణిక చిత్రా లు, పద్య నాటకాలు చూడటం చాలా ఇష
్టం.
చిన్న పద్యఖండాలు, వచన కవితలు రాస్తూ ఉంటాను.

21. జాషువా సాహిత్యం


-శ్రీధర్ బిల్లా
సుమారు 18వ శతాబ్దం వరకు ఛందో బద్ద మ�ైన సాహిత్యమంతా ద�ైవ స్తు తుల్లో నో, పురాణేతిహాసాల్లో నో
, రాజ మందిర చరితల ్ర ోనో, శృంగారవర్ణ నల బాహుబంధాల్లో నో చిక్కుకుపో యింది. అక్కడక్కడా వేమన
పద్యాల్లో నో, శ్రీనాథుని చాటువుల్లో నో కనిపించినా వాటిని కావ్యాలుగా పరిగణించలేము. సుమారు 17~18
శతాబ్దా లలో సాంఘిక, సామజిక అంశాల పట్ల గురజాడ,కందుకూరి,విశ్వనాథ, దువ్వూరి,దాశరథి,చిలక
మర్తి,జాషువా మొదలగు కవులు వ్రాయటం మొదలెట్టినా ఎక్కువమంది కవులు సాంఘిక అంశాలకు
కథ,నాటక,నవలా రూపాల్ని ఎంచుకున్నారు. జాషువాగారు మాత్రం ప్రాచీన ఛందో బద్ద మ�ైన శ�ైలిలోనే
కొనసాగించారు. జాషువా గారి రచనాశ�ైలి ప్రాచీనం కానీ, వస్తు వు తత్కాల సామాజిక అంశాలు. వీరు
రచించిన కావ్యాల్లో ప్రసిదధి ్గాంచినవి గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత,్ర కాందిశీకుడు, మరెన్నో ఖండకావ్యాలు.
కాళిదాసు మేఘసందేశంలో ఇరువురు ప్రేమికుల మధ్య మేఘం రాయబారం నడుపుతుంది. కానీ గబ్బిలంలో
కథానాయకుడు ఒక నిరుపేద దళిత వర్గా నికి చెందిన కార్మికుడు. తాను అనుభవిస్తు న్న కులవివక్ష,
అస్పృశ్యత, దేవాలయ ప్రవేశ నిషేధం, శ్రమదో పిడీ గురించి మధనపడుతూ, తన ఇంట్లో తిరుగాడుతున్న
ఒక గబ్బిలంతో తనబాధలు వర్ణిసతూ ్ క�ైలాస శిఖరాన ఉన్న పరమేశ్వరుని వద్ద కు రాయబారం పంపుతాడు.
సరళమ�ైన పద్యాలు గల ఈ కావ్యంలో హ�ైందవ సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అత్యంత
హృద్యంగా వర్ణించారు జాషువా గారు.హ�ైందవం నిరంతరం తనను తాను సంస్కరించుకుంటూ, లోపాల్ని
సవరించుకుంటూ పరిణామం చెందుతుందంటే..దానికి కారణం జాషువా లాంటి కవిబ్రహ్మలే..
కావ్యారంభంలో ఆ నిరుపేద అణగారినవర్గ నిర్భాగ్యుణ్ణి వర్ణిసతూ ్ ,
“వాని రెక్కల కష్టంబు లేనినాడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనముబెట్టు వానికి భుక్తిలేదు”
“వాని న�ైవేద్యమున నంటు వడిన నాడు
మూడు మూర్తులకును గూడ కూడు లేదు”
“ఆ యభాగ్యుని రక్ తంబు నాహరించి
ఇనుప గజ్జెల తల్లి జీవనము సేయు

96
కసరి బుసకొట్టు నాతని గాలిసో క
“నాల్గు పడగల హ�ైందవ నాగరాజు”
అతను శ్రమించి పొ లంలో కష్ట పడితేనే పండిన పంట. దానికి “అంటు” ఉన్నదంటే త్రిమూర్తులకు
కూడా న�ైవేద్యం ఉండబో దు కానీ, అతని శ్రమమీద నిర్మితమ�ైన హ�ైందవ సమాజం అతన్ని చూస్తే నే అంటరాని
వాడని బుసకొట్టి వెలివేసిందని తత్కాల సమాజాన్ని వర్ణిసతూ ్ హృదయాన్ని ద్రవింపజేసారు జాషువాగారు.
“కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి
స్వార్థ లోలురు నా భుక్తి ననుభవింత్రు
కర్మమననేమొ దానికీ కక్షయేమొ
ఈశ్వరుని చేత రుజువు చేయింపవమ్మ!”
పూర్వజన్మ కర్మఫలం వల్ల నే ఈ జీవితం ఇలా ఉంది అని అంటున్నారు, ఆవిషయం ఈశ్వరుని వద్ద
నిగ్గు దేల్చమని గబ్బిలంతో అంటున్నాడు.
“నేను నాకను నహము ఖండింపలేక
పదియు నెనిమిది శాస్త్రాలు పదునులుడిగె”
అష్టాదశ అధ్యాయాలతో వర్ధిల్లు తున్న భగవద్గీ తను చదవటం తప్ప పాటించట్లేదని ఆవేదన
పడుతున్నాడు.
“ధర్మసంస్థా ప నార్థంబు ధరణిమీద
నవతరించెద ననె నబ్జ భవుని తండ్రి
మునుపు జన్మించి నెత్తి కెత్తి నది లేదు
నేడు జన్మింపకున్న మునిగినది లేదు”
అద్భుతమ�ైన నిందాస్తు తి పద్యమిది. మునుపు అవతారమెత్తి
మమ్మల్ని ఉద్ధ రించింది లేదు. ఇపుడు రాకున్నా మాకు పో యేది ఏమి లేదు అంటూ.. దేవదేవునిప�ై
నిందాస్తు తి.
“సహగమనాచార దహనదేవతలెన్ని
చిగురుగొమ్మల బూదిచేసెనొక్కొ?
చదువుదాచెడి దురాచరణ మెందరి కళా
భ్యసన చాతురి గొంతు బిసికెనొక్కొ?”
నాటి సమాజంలో సతీసహగమనం పేరుతో మొక్కుబళ్ల పేరుతో ఎందరు ఆడకూతుర్లు బలయ్యారో
అంటూ దురాచారాల్ని ఖండించారు జాషువాగారు

***

97
ఎం .ఏ. తెలుగు, తెలుగు పండిత శిక్షణ (20 ఏళ్ళ బోధనానుభవం),
ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ‘ ఒద్ది రాజు సోదరుల జీవితం-
సాహిత్యం‘ై ప పరిశోధన చేసి , డాక్ట రేట్ పట్టా పొందాను. నిత్యవిద్యార్థి గా
నిరంతర సాహిత్య పఠనం . పెద ్ద ల మాటలను , కొత ్త గొంతుకలను వినడం
ఇష్టం .

22. ఆలోచనాత్మక కథలల్లిన గొప్పరచయిత కారా మాస్టారు


-డా॥కొండపల్లి నీహారిణి
తెలుగు సాహిత్యంలో కథాప్రక్రియకు పెద్దపీట వేసి, గొప్ప కథలను రచించిన కాళీపట్నం రామారావు
గారు 2021 - జూన్ - 4వ తేదీన కన్నుమూశారు. వారికి అక్షరాంజలి ప్రకటిస్తు న్నాను.
“జీవితంలో సమస్యలను, ఆ సమస్యలకు కారణాలను తెలియజేసేదే మంచి కథ” అన్నారు కారా.
ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు ఎట్లా మాస్టారో, సాహితీవేత్తలకు ముఖ్యంగా కథా రచయితలకు కారా
మాస్టారుగా అట్లే ప్రసిదధి ్.
తొలికథ ‘ప్లా టుసారమో’ - చిత్రగుప్త కార్డు కథలు శీర్షికతో 1943లో ప్రచురితమ�ైన కథ.
అదే దశలో ‘పెంపకపు మమకారం’, ‘అశిక్ష-అవిద్య’ కథలు కుటుంబ సంబంధాల నేపథ్యంలో రాసారు.
కాని తర్వాత దాదాపు ఒక దశాబ్దం మౌనంగానే ఉన్నా, సామాజికాంశాలప�ైన, మధ్యతరగతి నుంచి, పీడించే
ప�ై తరగతికి, పీడితుల�ైన కింది తరగతికి మధ్య 1955 ప్రాంతం నుండి కారా గారి దృష్టికోణంలో మార్పు
వచ్చింది.
ఈ దశలోనే యజ్ఞం, తీర్పు, జీవధార, చావు, కుట్ర, హింస, ఆర్తి వంటి కథలను రాస్తా రు.
మొత్ తం 60 కథలు వారివి అయితే, 1972-92ల మధ్యకాలంలో రచనలు చేయలేదు గాని, 92లో
‘సంకల్పం’ కథ రాసారు.
రచయితలకు ఒక ప్రాథమిక, ప్రాపంచిక దృక్పథం ఉండాలనే కారా గారు రాచకొండ విశ్వనాథ శాస్త్ రి
గారితో స్నేహం కలిగి ఉండేవారు.
కొడవటిగంటి కుటుంబరావు రచనలు ఆకట్టు కుంటాయని ఎన్నో సందర్భాల్లో చెప్పేవారు ఆ రోజుల్లో .
కొకు, రావి, రారా, కారా, చేరా వంటి రెండక్షరాలు కోట్ల మెదళ్ళను కదిలించాయన్నది సత్యం. ఏ ఇజాలకూ,
ఏ కులాలకూ ప్రాధాన్యం ఇవ్వని గొప్ప రచయితలు వీరంతా.
దో పిడివర్గా లు పెట్రేగి పో యేందుకు రాజ్య వ్యవస్థ ఎట్లా , ఎంతగా తోడ్పడుతుందో , నయవంచనతో
ప్రజాశక్తు లను ఎట్లా నిర్వీర్యం చేస్తా యో కారా గారి ‘యజ్ఞం’ కథ చూపిస్తుంది. ఈ కథప�ై ఆనాడు ఎంతో చర్చ
జరిగింది. బహుశ ఇంత చర్చ మరే ఇతర కథలప�ైనా జరగలేదేమో!
‘యువ’ దీపావళి ప్రత్యేక సంచికలో వచ్చింది యజ్ఞం కథ.
తెలుగు కథలన్నీ సేకరించి కథానిలయంలో భద్రపరిచిన తెలుగు కథా మేరు శిఖరం కారా గారు. వీరి

98
‘యజ్ఞం’ కథ ఒక గొప్ప సంచలనం. అది సినిమాగానూ తీసారు. ఈ ఒరవడిలో ఎందరో కథారచన చేసారు.
కారా గారు ఎందరికో మార్గ దర్శకులు.
“మూడేళ్ళ కిందట పుట్టి మూడు నెల్లు గా ముడివడి, మూడు రోజుల్నించి నలుగుతున్న తగవు.
ఆవేళ యిటో అటో తేలిపో తుంది. ఆ భానం ఆ వూరి గాలిలో అలా అలా తేలుతోంది.”
మద్రాస్ నుండి కలకత్తా కు - విశాఖపట్నం మీదుగా విజయనగరం కేంద్రంగా పో యే గ్రాండ్ ట్రంక్ రోడ్డు
నుండి ఆరుమ�ైళ్ళు కుడిగా సముద్రానికి ఐదు మ�ైళ్ళకూ ఉందా గ్రా మం.
ఆ ఊరి పరిసరాలన్నీ వర్ణిస్తా రు. సుందరపాలెం-పచ్చగా బతికే సనాధలా కనిపిస్తుంది. పంచాయితీ
అంటే ఏంటో కూడా చెప్తూ నే అప్పట్రాయుణ్ణి గురించే చెప్తా రు. పంచాయితీలో హరిజన మెంబర్.
ఒక మాజీ షావుకారికి రెండువేలు (2 వేలు) బాకీపడి వడ్డీతో సహా 2500 అవుతుంది. గోపన్నకు
చితికిపోయిన పెద్దమనిషి.
“ఈనాటికి పేదతనం వాళ్ళను రచ్చకెక్కించింది.” ఇది అభిప్రాయం అక్కడ. ప్రెసిడెంట్ శ్రీరాములు
నాయుడు ట�ైమివ్వాలంటారు. గడువు దాటిపో తుంది. లక్షుంనాయుడు-ధర్మరాజు, అజాతశత్రు వు
సూర్యంగారూ వచ్చాడని ఊరంతా తెలిసి ఎన్నడు రానంతమంది వచ్చారు.
మహేశం, పాపయ్యలు ఊరూరా అన్ని కులాలవారు రావాల్సిందే పంచాయితీ సభ ప్రారంభమవుతుంది.
ఇటువంటి లడాయిల్లో దేనికి ప్రాధాన్యతనివ్వాలో చెప్పాలి అంటూ నాయుడు మొదలుపెడ్తా డు.
ఆంధ్రభూమిలో నిర్వహించి మేటి కథకులను తయారు చేశారు కారా గారు.
మొదట్లో మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల కథలు రాసినా తర్వాత కథారచనకు ప్రయోజనమనేది
ఉండాలని సమాజాన్ని అధ్యయనం చేసతూ ్ చేసతూ ్ ‘యజ్ఞం’ వంటి కథను రాసారు. సునిశితమ�ైన పరిశీలనా
శక్తి ఉన్నది కాబట్టే గొప్ప కథలు రాసారు. ప్రాపంచిక దృక్పథం అనేది ఉన్నది కాబట్టే, చావు, ఆర్తి, నోరూకు,
భయం, జీవధార, హింస, శాంతి, వీరుడు-మహావీరుడు, కుట్ర వంటి కథలు రాసారు.
మాలపేటల్లో ని కష్ట జీవుల నికృష్ట మ�ైన వ్యథలను తెలిపే కథ ఆర్తి, చావు వంటి కథలు. మనుషుల
జీవితాలలో పేదరికం ఎట్లా మార్పులు తెస్తుంది. అనుబంధాలను ఎట్లా పడగొట్టేస్తుందీ చూపారు. సొ మ్ముగా
రూపం చెందే శ్రమను ఈ కథల్లో చూడొ చ్చు.
ఇలాంటివే బంగారి, ఎర్రెమ్మ కథలు. దారిద్ర్యం వలన కుటుంబాలలో ఘర్షణలు ఎలా జరుగుతుంటాయో
చూస్తాం. అటు కన్నవాళ్ళను ఇటు ఉన్నటువంటి అత్త వాళ్ళను కలపలేక ఆ అగాథంలో స్త్ ల రీ ు ఎలా
పడిపో తారో రాసారు. ఉత్త రాంధ్ర మాండలికానికి పెద్దపీట వేసిన కారా గారి కథలు అట్ట డుగు వర్గా ల బడుగు
జీవితాల్లో ని జీవద్భాషని ప్రపంచానికి తెలియజేసారు.
కథ కంచికి కాదు కథ శ్రీకాకుళానికి అనేంతగా చేసారు కారా.
పరిశోధకులకు గొప్ప సో ర్స్ కథానిలయం.
తెలుగు కథకు దిశానిర్దేశంత కథానిలయం స్థా పించిన మహో న్నత ఆశయ సాధకుడు కారా మాస్టారు.
అణగారిన పజ ్ర ల, బడుగు వర్గా ల పట్ల నిబద్ధ తతోనూ, నిజాయితీగా రచనలు చేసిన కారా గారు నిరాడంబర
జీవి.
కారా గారి కథలు కొన్ని విశ్లేషించుకుందాం - అర్థం కాని మానవ గాథ 1947లో రూపవాణి దీపావళి
సంచికలో వచ్చింది.
నారాయణగారి తత్వం బ్రతికినన్నాళ్ళే కాకుండా చనిపో యాక కూడా ఆశ్చర్యకరాలే అయింది. ఆ

99
గ్రా మవాసులకు అని ప్రారంభించిన ఈ కథ శీర్షికను ప్రతిబింబిస్
తూ నే మొదలయ్యింది. ఏమ�ై ఉంటుంది. ఆ
అర్థంకాని తత్వం అని పాఠకుడు పరుగున చదవాల్సిందే. అట్లా ఎత్తు గడ సాగిన ఈ కథ ధనవంతుడుగా
పేరుమోసిన వ్యక్తి అసలు జీవితమేముండి ఉంటుంది అని!
ఎక్కడినుంచో తరలివచ్చిన నారాయణ గారి భార్య ఒంటిమీద చాలా నగలు మెరిసిపో తూ ఉండడం వల్ల
ఊరివాళ్ళకు ఉత్సుకత కూడా ఎక్కువౌతుంది. కథ ఇక్కడ ఆపేసి, ఎక్కడో వ్యాపారం చేసి, సంపాదించుకొని
ఇక్కడికి వచ్చాడని చెప్తూ అతని భార్య జబ్బుతో బాధపడ్తు న్నా హాస్పిటల్ కు తీసుకుపో డు కాబట్టి. పిసినారి
అని అభిప్రాయం అని అందరిలో ఏర్పడుతుంది. ఇద్ద రు కొడుకులు. కాని వాళ్ళని హ�ైస్కూల్ చదువుతో
మాన్పించి ట�ైపు, షార్టుహ్యాండు నేర్పించగా స్టెనోగ్రా ఫర్ గా కుదిరాడు పెద్దవాడు. అన్నతోపాటే తమ్ముడు. తల్లి
తండ్రీ ఇద్ద రూ చనిపో యాక కొడుకులిద్ద రూ బీరువా తెరచి చూస్ తూ 50 రూపాయలు ఉంటాయి. కర్మకాండకు
వృథా చేయకండి, వీలునామా రాసి పెటటా ్ను. శ్రీరాములునాయుడు దగ్గ రున్నది అని చీటి పెడతాడు. ఇలా
చెప్పిన కథ పాఠకులలో నారాయణ పాత్ర మీద తప్పకుండా కోపమో, జాలో కలిగి తీరుతుంది. ఇప్పుడే
రచయిత అసలు ఉద్దేశం తెలియజేయాలి.
కథ నడపడంలో కారా గారు ఆ తొలిరోజుల్లో నే ఎంత గొప్ప కథాశిల్పంతో నడిపారు కదా అనిపించకపో దు
ఈ కథలు చదువుతుంటే. వీలునామాతో పాటున్న ఉత్త రం చదువుతాడు పెద్దకొడుకు. అతని తండ్రి అతన్ని
ఎట్లా పెంచాడో చెప్తూ ... “నేను వట్టి అదృష్ట హీనుణ్ణి. ఎందుచేతంటే లక్షాధికారి కడుపున పుట్టాను. కాని,
జ్ఞానమున్న మనిష�ైతే బాధలేకపో దు’. లక్ష రూపాయలు ఉండడంతో గర్వం కలిగి అవి చేతిన పడగానే !
సక్రమమ�ైన మార్గా లు నేర్పించలేదు తండ్రి. తల్లి దండ్రు లు పో గానే స్వేచ్ఛ వచ్చింది. భార్య రెండో కాన్పు తర్వాత
జబ్బుపడి అసహ్యంగా, ముసలిదానిలా అగుపించింది. సౌందర్య తృష్ణ బీరువాలోంచి ప్రవాహాన్ని తీసింది.
ఈ లక్షను గుర్రప్పందాలతో తీర్చవచ్చనుకున్నా. అన్నీ పో యాయి. అవమానంతో బ్రతకలేక ఉన్న ఇల్లు
అమ్ముకొని ఈ ఊరు వచ్చేముందు గిట్టు నగలు కొని అమ్మ మెళ్ళో వేసాను. ఇద్ద రమూ బాగుచేయలేని
జబ్బున పడ్డా ము. అందుకే అమ్మను హాస్పిటల్ లో చేర్చలేదు. చనిపో యే ముందు మా తండ్రి చేసిన
పొ రపాటే చేయవద్ద ని మీ అంతట మీరు బ్రతికేలా చేసాను. ఈ డబ్బును సత్కార్యాలకు వినియోగించండి”అని
రాస్తా డు ఉత్త రంలో నారాయణ చివరికొచ్చేసరికి
“ఆ ఉత్త రం పెద్ద కొడుకు తప్ప ఎవ్వరూ చదవలేదు. నారాయణ గారితత్వం గ్రా మీణులకు మాత్రం
నాటికీ, నేటికీ ఊహలాగే మిగిలిపో యింది” అని ముగించారీ కథను.
యవ్వనంలో అనుభవించిన భార్య సంతానం కన్న తర్వాత అందం తగ్గితే పురుషుడ�ైన భర్త కొత్త
అందాల్ని వెతుక్కోవటం చేత రోగగ్రస్తు డయ్యాడు. స్వార్జితం కాని విత్ తం మనిషి పాలిట మహాభయంకరమ�ైనది.
అనే అంశాలు కథకు ఆయువుపట్టు . తాము పెరిగిన వాతావరణంలోని విషయాన్నే కథగా చెప్పినా
అందులోని ఒక గొప్ప సందేశాన్నిచ్చారు కారా గారు.
సాహిత్యంలో సుఖం కనిపించాలి అనేవారికి కాళీపట్నం రామారావు గారి కథలు నచ్చవు.
తీవ్రమ�ైన అశాంతిని కలిగించి నిద్రకు దూరం చేసే కథలు కారావి.
మనం జనంలో ఒకరిగా ఎలా సర్దుకుపో తూ బతుకుతున్నామో చెప్తాయి ఈ కథలు ఇక నిబ్బరంగా
ఉండలేం.
ఈ కథల్లో దూకుడు ఉండదు. అంతా నిదానమే! కథ నిశ్చలంగా ఉంటుంది. పాఠకుడు అలజడి
పడతాడు.
వాస్త వికంగా చిత్రిస్తా రు పాత్రల్ని. కాబట్టి అవి సజీవ పాత్రల్లా ఉంటాయి. చుట్
టూ సమాజం నుంచి
వచ్చినవే!

100
ఆదివారం” ఈ కథ 1968-జూన్-7 నాడు ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో వచ్చింది.
మొదటి ఆదివారం పనిలోకి రాకపో తే - ‘రాతిరి రెండో ఆట సినిమా కెళ్ళేను. ఉదయం తెలివి రాలేదు,
మధ్యాహ్నం నిద్ద రొచ్చింది’ అంటుంది పనిమనిషి. రెండో ఆదివారం ‘ఒంట్లో బాగా లేదంది’. మూడో ఆదివారం
అడిగితే ఆదివారాలు రానంది. “అదేంటి! లోకంలో ఎక్కడాలేని ఆచారం నువ్వు మొదలుబెటటా ్వ్” అని
సూరమ్మ అంటే అంకాలు.
“మీ మొగాళ్ళు ఏ సంకటాలు లేకుండానే శలవు పెట్టి జీతాలు తీసుకోవడం లేదా? ” కాఫీ హో టళ్ళు,
కొట్
లూ కట్టెయ్యాలని గవర్నమెంటు రూలు పాస్టేసింది - పనోళ్ళకు ఒక రోజు శలవుండాలనే కదా?” అంటూ
బారెడు చదివింది - అంటారు రచయిత.
పనిమనిషి మానడంతో ఇంట్లో ఆడవాళ్ళు చర్చ చేసుకుంటారు. ఈ కథనంతా ఆ ఇంటి పెద్దకోడలు
చెబుతున్నట్టు గా రాసేరు! ఎంత గమ్మత్తు గా ఉన్నదో ! కథంతా ఆదివారాన్ని బేస్ చేసుకొని నడిపారు గాని
అంతర్లీనంగా ప్రవహించిందంతా కలిమి లేమి మధ్య. కథకురాలి పాత్రతో - కోడలుతో పనిమనిషిని పిలిచి
రమ్మందామా వద్దా అన్న చర్చ వచ్చినప్పుడు “నేను మా అత్త గారి పార్ల మెంట్ హౌస్లో ఆధారపడతగ్గ కంకర
సభ్యురాలిని” అంచేత. నిర్ణ యానికి వచ్చేముందు పరిష్కారాలను అడుగుతుంటారు” అని చెప్పించడం
చదువుకున్న ఇళ్ల ల్లో భాష, విషయ ప్రస్తా వనలు ఎట్లా తెలుస్తా యో సూచిస్తా రు. ‘పార్ల మెంట్’ అనగలిగేది
ఇంతో అంతో చదువుకున్నవాళ్ళే కాబట్టి!
“గతిలేక కాళ్ళు పట్టు కున్నామనుకుంటుంది” అని ఆడబిడ్డ అనగానే “వశం తప్పినప్పుడు
వసుదేవునంతటివాడే గాడిదకాళ్ళు పట్టు కున్నారట” అంటుంది. ఇంట్లో నలుగురం ఆడవాళ్ళం ఉన్నాం
మనమే తలా ఓ పని చేసుకుందామని ఆ అమ్మాయి అనగానే వచ్చిన చర్చ కూడా చాలా సహజంగా మన
ఇళ్ళలో జరిగినట్టే ఉంటుంది.
తనకు ఎంగిలెత్తడమంటే అసహ్యమనీ, చేతులు అరిగేలా ఊడ్చాలా” అని చిన్న కూతురు. “దేశానికి
స్వాతంత్ర్యం వచ్చి ఇరవ�ై అయిదేళ్ళయిందన్నమాటే గాని, చిన్న సదుపాయాలు అందుబాటులోకి రాలేదు.
ప�ైదేశాల్లో మిషన్లుంటాయి అనగానే తల్లి ఊరకొక మరో నిజాన్ని తెలుస్తుంది. “అక్కడ మగాళ్ళు కూడా
ఆడవాళ్ళతో సమంగా వంటింటి చక్కబాట్లు చేస్తుంటారట. వెళ్ళి మీ అన్నయ్యకో, నాన్న గారికో కూడా మెడకీ,
నడ్డి కీ ఆ గుడ్డ లేవో కట్టించి తీసుకురా . (ఏప్రిన్ కట్టు కుంటారు గదా దాన్ని ఇలా అన్నారు). అప్పుడు నువ్వనట్టు
నలుగురు నాలుగు పనులు చక్కగా చేసుకోవచ్చు” అంటుంది. ఇది ఇప్పటికీ మన కళ్ళముందు కనిపించే
సత్యం, దృశ్యం. ఈ చర్చల్లో ఇంటి కోడులుగా ఆమె తన అనుభవాల్ని, పరిసథి ్తుల్ని చెప్పుకుంటూ “నాకు
ఒళ్ళు దాచుకోవడం ఏనాడూ అలవాటు లేదు కాని మా అత్త గారు నేనొక్కదాన్ని పనంతా చేసుకురావడాన్ని
ఒప్పదు. “ఆడదాని యీసులేని చోట మగాడికుంటుంది. పెళ్ళాం మీద ప్రేమ ఒలకబో సే వారికంటే లేనట్టు
కనిపించే వారి వల్లే కుటుంబాలు చీలుతాయి.” అనేది ఆవిడ సిద్ధాంతం అంటుంది. ఈ కథలో కథ చెప్పే
పెద్ద కోడలు పేరు ఎక్కడా రాదు. సరే! ఎలాగో ఓలాగ పనిమనిషిని పో నివ్వకు అని ఆమె అనడంతో ఈ
కథానాయకురాలు పనిమనిషి ఆంకాలుతో మాట్లా డుతుంది. ఈ సంభాషణ చూడాలి- అద్భుతం !
ఆమె జీతం 8 రూపాయలు. కానీ ఈమె 10 రూపాయల కొత్త నోటు ఇస్తుంది. అంకాలుకు. ఆంకాలు
ఒప్పుకోదు - నాకు వద్దు మీ రెండు రూపాయలెక్కువ అంటుంది. పాత పనిమనిషి లెక్క ఆ లెక్క ఈ లెక్క
చెప్పి పరవాలేదు ఉంచేసుకోమని అంటే కూడా అస్సలు వద్దంటుంది వెళ్ళిపో తూ మీరు చిల్లర ఉన్నప్పుడే
ఇయ్యండమ్మా అని!
అప్పుడు పెద్దా విడ అత్త గారు బయటికి వచ్చి, ఆమెతో చాలా మాటలు మాట్లా డుతుంది. దేనికీ ఆంకాలు
పెదవి విప్పదు. ఆదివారం నాడు సెలవు మాత్రం కావాలంటుంది. దానికి పెద్దా విడ “పది రూపాయలు తీసుకో,
వారానికి ఒక రోజు సెలవు తీసుకో కాని ఆదివారం నాడు మానవద్దు . ఎందుకంటే మా ఇంటికి ఆదివారాలు

101
చుట్టాలు, పక్కాలు వచ్చి పో తుంటారు. ఆనాడు నేను అంట్లు తోముతూ కూర్చుంటే నగుబాటుగా ఉంటుంది,
నా పరువు నిలబెట్టు ” అంటుంది.
“సూడమ్మా యీ యమ్మమాటలు! దాసీముండన్నేనట, యీయమ్మ పరువు నిలబెటటా ్లట” అని
ఇక్కడ రచయిత ఇచ్చిన ముక్తా యింపు ఎంత గొప్పగా ఉన్నదో ఆ పరువేపాటిదో చూడనట్టు . అందుకే ఆ రెండు
రూపాయలు ఎక్కువ ఇస్తా మన్నది అన్నటుడ్ల న్నది ఆ ధో రణి. ఆమె ఒప్పుకున్నట్టే వెళ్ళిపో గానే, అత్త గారు
ఇంట్లోకి వస్తూ “దొ ంగ భడవ! దాని న�ైజబుద్ధి ఎలా బ�ైట పెట్టు కున్నదో చూసేవా? నిన్నపుట్టేనా? ఇవేళ
పుట్టేనా? నా కన్ను కప్పడానికి ఏ యింట్లోనూ లేని ఆదివారం శలవు మా ఇంట్లోయే దానికెందుకు కావలసి
వచ్చిందో తెలుసా? ఆ వేళ ఆదివారం గురించి దెబ్బలాడేమని! అదేమిటో చూద్దా మనే నేనూ ఆదివారం మీద
అంత పట్టు పట్టేను” అంటుంది. ఇలా ఈ కథ చాలా హాస్యస్ఫో రకంగానూ, ఆలోచనాత్మకంగానూ ఉంటుంది.
ఆర్తి కథ - 1969 ఆంధ్రజ్యోతిలో వచ్చింది.
“ధనుర్మాసం, ఉదయం వేళ, మర్నాడే భోగి, నాలుగ�ైదు పెద్దిళ్ళు తప్పితే వూర్లో సున్నాలక్కూడా
కరువ�ైనట్టుంది. వూరికీ, మాలపేటకీ మధ్య పచ్చని వ్యవసాయాలుండేవి. ఈ యేడు ఎండిపోయిన గుమ్మడి
పాదొ క్కడి కనబడుతోంది” అని ప్రారంభిస్తా రీ కథను. ప�ైడయ్య, ఎర్రెమ్మ, బంగారమ్మ, నారాయుడు వంటి
పాత్రలుంటాయి. పెళ్ళైన జంట విడిపో యేలా ఉన్నట్టు న్న సన్నివేశంతో కథలోకి వెళ్తాం. బంగారమ్మ అల్లు డి
దగ్గ రికొచ్చి బ్రతిమిలాడి బంగారమ్మ «ఓ ... ఎల్లె లు! పత్తి త్త ! శాపానాలెటటా ్చ్చేవు! శాపనాలు! నీ శాపనాలకీ,
నా శాపనాలకీ పట్టే వుంటే, యీ బూమ్మజ్జ నం ఎప్పుడో బుగ్గ యిపో దురు!” అంటుంది . ఎర్రెమ్మ గోలకు
బంగారమ్మ “సూన్నారాయణమూర్తి సాచ్చిగా “నువు పురుగులుగారిపో తావు” అని తిట్టిన తిట్ల కే శక్తి
ఉంటుందా? ఇక అప్పుడు కథలోకి వెళ్తా ము. చాలా సాధారణమ�ైన, చెప్పాలంటే చదువు సంధ్యలు లేని
పేద కుటుంబాల్లో నూ పెళ్ళిళ్ళయ్యాక, వియ్యం అందుకున్నాక ఎక్కడలేని అహంభావాన్ని బింకాన్నీ ఎట్లా
ప్రదర్శిస్తా రో ఈ కథలో చెప్తా రు రచయిత.
భాష, సాంఘిక పరిసథి ్తులు, సామాజిక స్థితిగతులు కథల్లో అన్ని స్పష్టంగా వస్తాయి. పూర్వపు
గంజాం జిల్లా తెలుగు ప్రాంతం. అందుకే తెలుగు, ఒరియా కలగాపులగపుగా ఉంటాయి ఆచారాలు. వాళ్ళ
పెళ్ళిళ్ళూ రివాజులు రాస్తూ ఒక సందర్భంలో తన కోడలు తన ఇష్టం అన్న బంగారి మాటలకు - “నా
కూతుర్ని దీని కొడుకుతో మనవాడడానికంపినానా దీనింటి శాకిరికిచ్చినానా?” అని ఎదురడుగుతుంది
ఎర్రెమ్మ. “చుట్
టూ మహాసంద్రంలో ఉన్న నిశ్శబ్దంలో వూపిరాడుతున్నట్టు లేదు” అని వర్ణిస్తా రు ఒక యువతి
అప్పుడే ప�ైటలేసిన యువతి ఫీలింగ్స్ ను రాస్తా రు. సన్నెమ్మా, నీలి, అంకి, దాలిగోడ - నీలిమొగుడు, నీలి-
ప�ైడయ్య పేరును గట్టిగా పిలుస్తుంది. ఊళ్ళోకి విబడుతుందా ఇలా చాలా చాలా సహజసిద్ధంగా పాత్రలు-
పాత్రలు పాత్రలుగా మన ముందు నిలుస్తాయి. జీవితం గురించి కదా కారా గారి కథలు. బ్రతుకు అంటేనే
మనుషులు. నిత్య జీవితంలోని జీవన విధానాన్ని కథగా రాస్తా రు. చాలా నేర్పు ఉండాలి ఇలాంటి కథలు
రాయాలంటే!
“ముందునుయ్యి, వెనుక గొయ్య - నా పని ముందెర్జెగొయ్యా, యనక్కెల్లే నుయ్యా లాగుంది.” అంటూ
ఆ ప్రాంత యాస స్పష్టంగా రాస్తా రు రచయిత. “గొప్పవాళ్ళలో గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళూ, అతి
గొప్పవాళ్ళూ అన్నట్టే పేదవాళ్ళలో కడు పేదలూ, నిరుపేదలూ ఉంటారు. అందులో ఎర్రెమ్మ కడుపేదది.” ఈ
తేడాను బాగా చెప్తా రు కారా గారు.
రచయిత తనంత తానుగా చెప్పేప్పుడు సాంఘిక జీవన స్థితిగతులు చెప్తా రు. “ఎంగిలాకుల కోసం
వీధికుక్కలు ఎందుకు చస్తా యో... ఆ విస్త ళ్ళలో భోజనం చేసిన వారికి అర్థం కాకపో వచ్చు. ఏడాదిపాటు
పేగులు మాడితే యెవరిక�ైన అందులో నీతి కనబడుతుంది. ప�ైడయ్య పట్నంలో కలాపీ పనికిపో తాడు.
మార్కెట్ యార్డ్ లో బస్తా లు మోసేపని” అని రాస్తా రు. “సిరిగల పండుగ, చీకటి రాత్రి వస్తుందంటారు పెద్దలు.

102
ఇది సిరిలేని పండగ - కాబట్టే వెన్నెలరాత్రి తగలడిందట” వంటి మాటలు కథకు సాంస్కృతిక నేపథ్యాన్ని
సామాజిక పరిసథి ్తులను జోడింపచేస్తా రు. ఏ జంట�ైనా విడిపో యేది ఇతర కుటుంబసభ్యుల వల్ల నే అనేది
చూపారు. ఈ కథలో భాష భావాన్ని ప్ రో ది చేస్తుంది.
కారా మాస్టారు తెలుగు కథకు ఒక పర్యాయపదంగా పెద్దలందరిచేత కొనియాడబడ్డా రు. సరళమ�ైన
భాషలో కారాగారి కథలన్నీ సామాజిక పరిసథి ్తులకు అద్దం పడతాయి. అధ్యయన శీలతతో పజ ్ర ా సమూహాల
సత్ సంబంధాలతో ఉండేవారు కాబట్టి వీరి కథలో సహజత్వం ఉట్టిపడుంది. అధ్యయనం నుండి అనుభవం
వస్తుంది. మన చుట్ టూ ఉండే సామాన్యుల జీవితాలను వీరు కథల్లో పాత్రలుగా చూపించారు. పజ ్ర ల కష్టాలు,
వారి సంఘర్షణలు ఎక్కువగా కనిపిస్తాయి. 1995లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ద్వారా వచ్చిన ధనాన్ని
కథానిలయంగా తీర్చిదిద్దా రు. 1993 ఫిబవ్ర రి 22న శ్రీకాకుళంలో స్థా పించారు. మధ్యతరగతి జీవితాలలోని
ఒడిదుడుకులను కథావస్తు వుగా మలిచిన తీరు ప్రశంసనీయం. ఉత్త రాంధ్ర మాండలికం, అక్కడి సంస్కృతిని
ప్రతిబింబించిన కథలు చాలా రాసారు. పూలదండలో దారం కారా గారి కథల్లో మార్క్సిజం ఉంటుంది.
అశిక్ష అవిద్య కథ
1955లో భారతి పత్రికలో ప్రచురితమ�ైన ఈ కథ ఎగువ తరగతి మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలోని
జీవిత సందర్భం. శ్రీరామారావుది పెద్ద కుటుంబం. అక్కచెల్లె ళ్ళు, అన్నదమ్ములు ఉంటారు. లెక్చరర్ గా
చేస్తుంటాడు. తమ్మునికి పల్లె టూరి సంబంధం కట్నకానుకలతో కుదుర్చుకుంటారు, లాంఛనాలు అన్నీ
మాట్లా డుకుంటారు. తమ్ముడు బి.ఏ. తప్పినా, వీరికి భూవసతి, ప�ైకమూ ఉంటాయి. కాబట్టి పెళ్ళికి ఏ అడ్ డూ
లేదు. ఆర్భాటంగా పెళ్ళి జరుగుతూ ఉంటుంది. భోజన బాజనాదులు గొప్పగా జరుగుతాయి. రామారావు
భార్య - శ్రీదేవి తమ్మునికీ అన్నకూ అనేక విషయాల్లో తేడా ఉంటుంది. శ్రీదేవి నగపో యిందని పెళ్ళిలో
గుంభనంగా ఉన్నా, ఆడపడుచు విశాలాక్షి ప�ైన అనుమానం పెంచుకుంటుంది. కారణం ఆమె ఆస్తిపరురాలే
ఒకప్పుడు కాని భర్త తాగుడు, జూదం వంటి వ్యసనాల వల్ల ఆస్తి పో తుంది. ఇదీ శ్రీదేవి అనుమానానికి కారణం.
పెళ్ళికి విశాలాక్షి భర్త రాకపో వడం రాత్రివేళ పెరట్లో తచ్చాడటం వంటివన్నీ అనుమానాన్ని పెంచాయి.
శ్రీదేవి జీవితం పాడయ్యిందనే అక్కసుతో మనసును శరీరాన్ని పాడు చేసుకుంటున్న లక్షణాలు
ఆమెలో లీలగా కనిపిస్తు న్నది. తన పెళ్ళయిన ఆరు ఏళ్ళయినా భర్త తో తప్ప ఎవ్వరితోనూ సన్నిహిత
బంధువుగా చేసుకోలేక పో యింది. ఈ పల్లె టూరి వారికి సరిపడని దాననుకుంటుంది.
అది చిలికి చిలికి గాలివాన అయి విశాలాక్షి మరణానికి కారణమవుతుంది. ఆ తర్వాత శ్రీరామారావు
తల ఎత్తు కోలేకపో యాడు. “లోకం వాళ్ళ దో షాలన్నింటినీ ద్విగుణీకరించి, త్రిగుణీకరించి మళ్ళా మళ్ళా
చెప్పుకున్నది’ అంటారు కారా గారు!
మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలే ఎక్కువ తారసపడుతుంటాయి అని చూపారీ కథలో!
“ఎవరికీ చెప్పొ ద్ద ని పెళ్ళి ఇంట్లో రభస చెయ్యొద్ద ని చెప్పిన భర్త మాటను పెడచెవిన బెట్టి శ్రీదేవి పోయిన
తన నగ కోసం ఆలోచిస్తుందే తప్ప, ఆమె ఆడపడుచు మీద అనుమానం వచ్చినా ఆమె పరువుపో తే తన
పరువు కూడా పో తుంది అని వివేచన లేకుండా పెళ్ళింట్లోనే గొడవ చేయడం ఆర్థిక సంబంధాలే ముఖ్యమ�ైనవని
తెలియజేస్తుంది. ఇందులో స్త్ ల రీ లో అంతర్లీనంగా ఉండే ద్వేషం (శ్రీదేవి), అసూయ, పెత్తనం చేసే స్వభావం
(తల్లి) వంటివి చెప్తూ నే, భర్త వల్ల కలిగే బాధలు (విశాలాక్షి) వంటి పాత్రలతో చూపించారు.
అత్యంత అల్పమ�ైన విషయాలకు అనల్పమ�ైన ప్రాధాన్యతను ఇచ్చే మానవ న�ైజాన్ని బయట పెటటా ్రీ
కథ ద్వారా. తల్లి తన వయసురీత్యాన�ైనా కోడలికి నచ్చచెప్పకపో వడమే కాక ఆమె తన బిడ్డ మీద అపవాదు
మోపిందన్న కోపంతో కొట్ట డం శ్రీదేవి అనుమానానికి అగ్నికి ఆజ్యం పో సినట్ైంది
ల . కథ మొదలు పెటటా ్మంటే
పూర్త య్యేదాక ఆపనీయని కథా కథనశ�ైలి కారా గారి రచనాశ�ైలి. కథ గానీ, పాత్రలు గాని మనం ఎక్కడో

103
చూసామో అనిపించేలా ఉంటాయి.
అదృశ్యము
ఇరవ�ై మూడేళ్ళ ఆరోగ్యవంతుడ�ైన యువకుడు, నవమన్మధుడు కాక పోయినా చాలామందికి
తీసిపో డు. ఇంటర్ పాస్ చేశాడు. గవర్నమెంటు ఆఫీసులో యాభ�ై రూపాయలు జీతం తెచ్చుకుంటున్నాడు.
కుర్రవాడు మంచివాడే అని చెప్పుకుంటారు.
సంబంధం అన్ని విధాలా అందరికీ నచ్చింది. అటువంటి సంబంధాన్ని పెళ్ళికూతురు తోసి పారేసతోం
్ ది.
పెళ్లి కూతురు పేరు లలిత. పదిహేనవ యేడు నడుస్తోంది. రూపసే - కాని రూపమే వర్త్ గా తీసుకుంటే
బాబూరావుని తృణీకరించగలిగే అంత రూపసి కాదు. చదువు పల్లె టూరిలో అయిదవ తరగతి మాత్రమే
చదువుకుంది.
-అయినా యేమి చూసుకునో పెళ్లి కూతురు యీ సంబంధాన్ని త్రో సి పారేసతోం
్ ది. యెందరు యెన్ని
విధాలు చెప్పినా, ‘పో నీ కారణం చెప్పు’ అన్నా లలిత మాటాడదు.
ఆమె ఆ కారణాన్ని వెల్లడించక పో వడం వల్ల మూర్ఖురాలు అనిపించుకుంది. అంటూ ప్రారంభమ�ైన
ఈ కథ సగటు జీవుల ఆలోచనలను ప్రస్ఫుటిస్తుంది. ఆడపిల్లలూ ఆలోచనత్మాక నిర్ణ యాలు ఆనాడే
తీసుకునేవారు అనేది తెల్పుతుంది.
లలిత పెద్ద బావగారికి విశాఖపట్నం ట్రాన్సుఫరు అయిన దగ్గ ర నుంచీ ప్రయాణమవుతుండెను.
యింకేవూరూ చూచి యెరుగని లలితకు - విన్న దానిని పట్టి విశాఖపట్నం యందు చాలా గొప్ప అభిప్రాయం
వుండెను. రోజులు కులాసాగా గడుస్తా యని నమ్మకం.
అక్క లలితను తనతో విశాఖపట్నం తీసుకవచ్చింది.
తీరా వచ్చాక లలితకు అక్కడ జీవితం దుర్భరంగా తోచింది. పెరుగుకు బదులు మజ్జి గ కలిపిన నీళ్ళూ,
ఆవు నేతికి బదులు ఆముదం వాసన వేసే నేయి, వుప్పుడు బియ్యం, మందు కలిపిన కొళాయి నీళ్ళూ రుచి
చూడవలసి వచ్చేసరికి లలిత కళ్ళు తెరిచింది. ముఖ్యంగా పొ ద్దు గడవడం ఒకటి లలితకు బ్రహ్మాండంగా
వుంది. వచ్చిన మర్నాడు విశాఖపట్నం చూపించమని బావను అడిగింది. బావ కొంతసేపు వేళాకోళం ఆడి
చూడ్డా నికి ఏమీ లేదని చెప్పాడు. పో నీ బజారు చూపించమంది. పట్టు కెళ్ళాడు. రెండు లారీలూ, ఒక మిలటరీ
వాడూ లలితను ఢీకొన్నంత పని అయేసరికి లలిత చీత్కారం చేసింది. మర్నాడు బీచ్ కి తీసుకెళ్ళమంది.
“శీతాకాలం బీచేమిటి, ఎవర�ైనా నవ్వుతారు. అదిగాక కూర్చోడానిక�ైనా స్థ లం లేదు. సముద్రం రోడ్డు ను సగం
కోసి పారేసింది” అన్నాడు. “అక్కడ కూర్చోవద్దు , ఒక్కసారి చూసి వచ్చేద్దాం” పద అంది. వెళ్లా రు. బావ ఏమీ
అబద్ధం ఆడలేదనుకుంది లలిత. చలిగాలి అక్కడ వుందనిచ్చింది. కాదు. యింటికి వచ్చేశారు. అంతలో
విశాఖపట్నంలో లలితకు చూడవలసినవి అయిపో యాయి. యింక యింట్లో తోచక బయటపడేసిన చేపలా
కొట్టు కోవడం ఆరంభించింది. యిల్లు పెద్దదే. యింట్లో వీళ్ళదికాక యింకా నాలుగు కుటుంబాలున్నాయ్.
కాని లలిత యీడు ఆడపిల్లలు ఒకరూ లేరు. పదేళ్ళకు ప�ైన ముప్పైకి లోపు వయసు వాళ్ళు అక్క
తప్పిస్తే అనూరాధ యింకొక్కర్తి వుంది. అనూరాధకు పాతిక సంవత్సరాలు ప�ైబడ్డాయి. చాలా వుత్సాహంగా
వుంటుంది. లలితతో సమంగా నవ్వి ఆడగలదు.
వయసులో పెద్దదయి కూడా కులాసాగా చిన్నపిల్లలా పేలుతూ వుంటే లలితకు ఆశ్చర్యమయింది.
“ఈవిడ యెవరే?” అంది అక్కతో, అక్క చెప్పిన జవాబు విని నిచ్చరపో యింది లలిత. అనూరాధ బి.ఎ.
చదివిందట. కొన్ని వందల ర�ైల్వే సారస్వత గ్రంథాలు చదివిన లలితకు బి.ఎ. అంటే సుమారు అయిన
అభిప్రాయమే వుంది. “బి.ఎ.నా!” అంటూ యించుమించులో నిశ్చేష్ట అయింది. తేరుకొన్నాక వందన్నర
ప్రశ్నలు వేసింది. అక్క చాలావాటికి సమాధానాలు తెలియవంది.

104
బి.ఎ. చదివిన ఆడది తమ పొ రుగింటి వాటాలో వుండటం. తక్కిన ఆడవాళ్ళలాగే యింట్లో పనులు
చేయటం, వంట వండటం, గదులు పూడ్చటం, అవసరమ�ైనపుడు అంట్లు కూడా తోమటం!, భర్త ను
గౌరవించడం, అభిమానించటం!!!
యీ కథంతా లలిత పాలిట యెంత ఆశ్చర్యజనకంగా వున్నా ప్రత్యక్షాన్ని నమ్మక విధిలేక నమ్మింది.
వాళ్ళ అక్క అనూరాధకూ తనకు పరిచయం చేసింది. ఆ పరిచయం మూడు రోజుల్లో ఏకవచన ప్రయోగానికి
తావు కలిగించగలంత స్నేహమయి పో యింది. లలితకు అనూరాధ యందు చాలా గొప్ప అభిప్రాయం
యేర్పడింది.
సహజంగా ఇటువంటి స్నేహమెంతో కాలం సాగదు. కొంతమంది ఏ చిన్న విషయానిక�ైనా చప్పున
కరిగిపో తారు. కరిగి పక్కనున్న వారితో అతుక్కుపో తారు. మళ్ళా ఆ చప్పున కరిగే స్వభాగం వల్లే యే
మాత్రం కాస్త కాస్త హీట్ తగిలినా మళ్ళా కలియరానట్టు గా విడిపో తారు. వీరి స్నేహం కూడా యీ విధంగానే
పరిణమించింది. అంటూ ఇందుకు గల కారణానికి కథలో చక్కగా ఇమిడ్చారు.
ఇది 50వ దశకంలోని సాంఘిక పరిసథి ్తులను అద్దం పట్టే కథ. కథా నాయకురాలు లలిత. ఆమెకు
పెళ్ళి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంటివాళ్ళకు బాగా నచ్చిన సంబంధం లలితకు నచ్చదు. అందరికీ ఆశ్చర్యం
ఎందుకు వద్ద న్నదని. అయిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నా వ్యక్తు ల్ని అంచనా వేసే శక్తి బాగా
ఉన్న పడుచు. అందుకే ఇంటర్ పాస�ై, గవర్నమెంట్ ఆఫీస్ లో 50 రూపాయల జీతం తెచ్చుకుంటున్న
బాబూరావుని వద్ద న్నది. “లలిత రూపనే కాని రూపమే వర్త్ గా తీసుకునే బాబూరావుని తృణీకరించగలిగే
అంత రూపసి కాదు” అంటారు రచయిత. మరి ఎందుకు కాదన్నది? ఇక్కడే గొప్ప ట్విస్ట్ ను చూస్తా రు.
వ�ైజాగ్ లో ఉన్న అక్క తనతో తీసుకెళ్ళి సంబంధం చూస్తుంది. వాళ్ళ ఎదురింటి వాటాలోని అనురాధతో
పరిచయమౌతుంది. ఆమె బి.ఏ. చదివింది. అయినా ఇంట్లో పనులన్నీ చేస్తుంది. భర్త ను గౌరవిస్తుంది. బి.ఏ.
చదవాలంటే తండ్రి కనీసం లక్షాధికారి అయి ఉండాలనీ అలాంటి వారిని పెళ్ళాడే వాడు లండన్ రిటర్న్ డో ,
జమీందారో, కోటీశ్వరుడో అయి వుండాలి. అనుకున్న లలిత ఆశ్చర్య పడిపో తుంది. లవ్ మ్యారేజి యేమో
అనుకుంది. కాదని తెలిసింది. ఆమెకు లలితకు వయస్సులో తేడా వున్నా ఏకవచన ప్రయోగం చేసేంత
దగ్గ రయ్యారు. ఇలా కథ ఇంతవరకే అయితే ఇంకేముంటుంది!
ఒకసారి అనూరాధా త్రుళ్ళిపడేటట్టు చేద్దా మని మధ్యాహ్నం ఒంటిగంటకు ఆమె ఇంట్లోకెళతుం ్ ది.
కిటికీ దగ్గ ర నిలుచుని ఎదురింటి అబ్బాయికి యేవేవో సంజ్ఞ లు చేస్తు న్నది. లలిత అనురాధను చూసి
తత్త రపడింది. ఏమి చూడనట్లే ఉండి కాసేపటికి వెళ్ళిపో యింది. కాని మనసాగక మళ్ళీ వెళతుం
్ ది. అనురాధ
చలం మ్యూజింగు చదువుతుంది లలిత ఆమెను ఆ స�ైగల అంతర్యం ప్రశ్నిస్తుంది. ఊరిగే సరదాగా అలా
స�ైగలతో మాటాడుకుందామంటే లలితకి నచ్చదు.
‘శరీరాలు దూరంగా ఉన్నంత మాత్రాన పవిత్రు లవుతారా? అని నిలదీస్తుంది.
“ఏం నువ్వు చేయడం లేదా మానసిక వ్యభిచారం. కథల్లో యువకుల విషయాన్నో పెళ్ళిచూపులకని
వచ్చిన పెళ్ళికొడుకుల విషయంలో అది డెసిమెల్స్ తో సహా అందరూ మానసికంగా ఆయనే చరించినవారే
ఉంటారని అంటుంది. అనురాధ వరస నచ్చదు లలితకు. లలితకు వద్ద న్న సంబంధం ఇదే! అదే అబ్బాయి!!
బాబూరావే!!!
కథలో చలం మ్యూజింగ్ ప్రస్తా వనా, లలిత ఆ అబ్బాయిని నిరాకరించడమూ ఏదో తెలియని సంధి
కాలాన్ని ప్రత్యక్షపరిచినట్లు అనిపించకమానదు. అందుకేనేమో తనకు అదృశ్యము అని పేరు పెటటా ్రు.
ఈ కథలో కారా గారు మనుషుల మానసిక స్థి తిని చూపుతూనే అంతర్మథనంలో పడేస్తా డు. ఇంట్లో
ఎవ్వరికీ అర్థం కాదు లలిత బావ తెచ్చిన అంత మంచి సంబంధాన్ని ఎందుకు వద్ద న్నదో ! గుణశీలానికి

105
ప్రాధాన్యత యిచ్చే భారతనారి లలిత’ అంటూ ముగింపునిస్తా రు.
పవిత్రత అనేది మనస్సులకూ ఉండాలన్నది చెప్పడం ఈ కథ ఉద్దేశ్యం. వ�ైజాగ్ ఎలా జీవితాన్ని
చూపిసతూ ్ స్త్ రీ అస్తిత్వాన్ని కథాత్మకంగా చెప్పారు.
అన్నెమ్మ నాయురాలు
అన్నమ్మ నాయురాల్ని, మొట్ట మొదటి సారి. నేను బడిఈడు పిల్లవాడిగా వున్నప్పుడు చూసేను.
అంటూ మొదల�ైన ఈ కథ బడి నుండి వస్తు న్న పిల్లవాడి మనోఫలకంప�ై చెరగని ముద్ర ఎలా వేసిందో
చెప్తుంది. “ఆ తరువాత పాతిక ముప్పయి ఏళ్ల కుగాని ఆవిడ్ని దగ్గ రగా చూడ్డం పడలేదు.” ఆ క్రమంలోనే
అన్నెమ్మ నాయురాలి గతం కొంత తెలిసింది. “ఆమె నలుగురు తోడికోడళ్ల మధ్య ఆ యింటి పెద్ద కోడలుట,
అత్తింటి వారికన్నా పుట్టింటివారు సంపన్నులుట. పదమూడో ఏట మేనత్త ఇంట పెద్దకోడలిగా పాదం పెట్టింది.
కాపురానికొచ్చిన మొదటి ఇరవ�ై ఏళ్ లూ ఏమి సుఖపడిందో సుఖపడింది. తర్వాత అత్తింటి కుటుంబంతోపాటూ
ఆమె కష్టాలూ ఆరంభమయినాయి.” అంటూ ఆమె వ్యక్తిత్వంతో బాటు ఆమెకు వచ్చిన బాధలు చర్చించుకునే
ఈ యువకుడు. వాళ్ళ కుటుంబంలో కలిగిన అనేక మార్పులను చెప్తూ - రెండూళ్ల వాళ్ లు కర్రలు, కత్తు లు,
బరిసెలు, బల్లె లు సిద్ధం చేసుకున్నారు. అక్కడ విదేళ్ళు సాగిన మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి
ఇక్కడ మారుమూల రెండూళ్ల మధ్య కొట్లా ట ఐదు గంటల్లో ముగిసింది.
అన్నెమ్మనాయురాలి ఇంట్లో మగవాళ్ళంతా చనిపో యారు. ఒక్క కొడుకు మినహా. తర్వాత నడిచిన
క్రిమినల్ కేసులో ఏడుగురితోపాటు అతనికి జీవితఖ�ైదు పడింది. ఆ దొ మ్మీలో - అన్నెమ్మనాయురాలు
తక్కిన తోడికోడళ్ల పుట్టింటోళ్
లు - చాలా డబ్బు ఖర్చుచేసి తక్కువ శిక్షలతో బయటపడ్డా రు. అంటూ ఆమె
తనవారి కోసం నిలిచి కొట్లా డిన విధానాన్ని చెప్తూ అంత పెద్ద కుటుంబానికి జ�ైల్లో ఉన్న కొడుకు అతని
భార్య పదేళ్ల మనవడు మాత్రం అన్నెమ్మకు మిగిలారు. అవతలిపక్షం అంగబలంతోపాటు అర్థ బలం కూడా
నశించగా క్రమక్రమంగా వలసలు పో యారట.
అచంచలమ�ైన ఆత్మవిశ్వాసంతో, పట్టు దలతో, కృషితో ఏ మగవాడికీ తీసిపో ని కార్యదీక్షతతో,
మాటనేర్చుతో, సూటి వ్యవహారంతో తను చెమటోడ్చి కోడలికి మనవడికి శ్రమపట్ల గౌరవం పెంచి చిరిగిన
సంసారాన్ని మూడు పూవులు ఆరు కాయలుగా లేవనెత్తింది. అన్నమ్మనాయురాలు, ఆ వూరివారిదే గాక
చుట్టు పక్కల పూళ్ల వారందరి మన్నన పొ ందింది. సౌశీల్యానికి అన్నెమ్మది పెట్టింది పేరని ఒక్క చూపుతో
దుష్టు లను దూరంగా వుంచడం, మరో చల్లని చూపుతో మంచివారిని ఆత్మీయులను చేసుకోవడం ఆమె
ప్రత్యేకతలు అంటారు. తెలిసినవారు.
ఆమె పతి
్ర శనివారం మావూరి జగన్నాధ స్వామి దేవాలయానికి అర్చనకు వచ్చేది. అంటూ ఎన్ని
అవరోధాలు కలిగినా జీవితాన్ని సర�ైన పద్ధ తిలో మలుచుకోవడంతో స్త్ ల
రీ ు ఇళ్ళల్లో ఎంత, ఎన్ని ప్రయత్నాలు
చేస్తా రో కథనంలో నడిపారు.
నెహరూ ్ హయాంలో గ్రా మీణ జీవితంలో క్రమక్రమంగా చాల మార్పులు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రదేశం ఉతర కోస్తా , ప్రాంతాల్లో కూడా ఆ మార్పులు స్పష్టం కాసాగాయి. కథ చెప్తు న్న వ్యక్తి రచయితనే
అని అనిపించేలా అల్లిన తీరు చదివించేదిగా ఉంటుంది. ఒక కథ రాస్తు న్నాం అంటే ఆనాటి కాలాన్ని
ప్రతిబింబించాలి, సమాజం ఏం కోరుకుంటున్నది, ఫలితాలు ఏవీ చెప్పాలి. కారా గారు ఇందులో దిట్ట.
“జనంలోంచి అప్రసన్నపు ముఖంతో కోకచెంగు భుజాన కప్పుకుంటూ వినవినగా ముందుకు కదుల్తోంది
అన్నెమ్మనాయురాలు. ఆవిడిది ఒక్కసారి చూస్తే మరపురాని మూర్తి. నేనూ వాసిలి దారిచ్చేను. మా అమ్మ
కుశల ప్రశ్నలకి జవాబులిస్తూ వీధి వరండాలో జనాల మాటలు వింటూవుంటే కొన్ని అర్థ మయ్యేయి. కొన్ని
అర్థం కాలేదు.

106
నెహరూ ్ ప్రభుత్వం దేశ ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు చేపట్టింది. రెండు ప్రణాళికలు అమలయ్యిన తర్వాతి
రోజులవి. సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వ సౌకర్యం మృత్తి కా క్రమక్షయం జరక్కుండా (వర్షా లకి, వరదలకి,
భూసారం కొట్టు కుపో కుండా) గట్టు ఎతించడానికి లోన్లు - లాంటివి పులగం మీద పప్పులా ఆ తరగతికే
అందేవి.
రెవిన్యూ ఉద్యోగులు తమ సంతృప్తికి ఇచ్చే తాంబులాల ఖర్చులు అప్పు తీసుకునేవారి సంఖ్య
పెరిగిన కొద్దీ పర్సెంటేజీలగా రూపాంతరం చెందింది. తాంబూలం ఖర్చు పర్సెంటేజీలుగా మారినా అభ్యంతరం
ని ఉండేది కాదు. ఆ పర్సంటేజీల మొత్ తం పెరిగితే దానివలన తో ర�ైతులు నష్ట పో కుండా ఉద్యోగులే వాళ్ళకి
దారులు సూచించేవారు. బండీ బక్కల లోను తీసుకున్నవాడికి - వాడికంతకుముందే లోను వున్నా
లేనట్టు ధృవీకరించడానికి ఒక వేళ గ్రా మోద్యోగులకు అభ్యంతరాలున్నా రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు, తాసిల్దా ర్ల కు
అభ్యంతరం ఉండేది కాదు. నూతుల్నే నాలుగు రాళ్ల తో చుట్ టూ గోడ కట్టించడానికిగాని, అసలు నూతులు
తవ్వకపోయినా తవ్వినటుగా ధృవీకరించడానికి గాని అభ్యంతరాలుండేవిగావు. అలాగే జరగని అభివృద్ధి
కంతటినీ జరిగినట్టు భావిస్ తూ ర�ైతులకు అప్పులమీద అప్పులు అందే బినామీ అప్పులు ఏర్పాట్లు
జరిగిపో తుండేవి. వ్యవసాయదారుల పరిసథి ్తి అద్దంలో చూపారు. అన్నెమ్మ నాయురాలు వాళ్ళు అహర్నిశలు
కష్ట పడి పంటలు పండించేవారు.
అన్నెమ్మనాయురాలు, ఆ తరం ర�ైతులు - అప్పన్నా నిప్పున్నా శత్రు వుతో సమానంగా చూసేవారు.
‘మిక్సడ్!ఎకానమీ’ పేరుతో వచ్చిన మార్పులను చెప్తూ నే వాణిజ్య పంటలను వేయలేదు. అయితే ఆమె
మునిమనుమడు ఎదురుతిరిగి ఈ పంటలనేస్తే అతని ధాటికి నిలువలేకపో యింది అని కథను ప్రపంచీకరణ
ప్రమాదాలు క్రమంగా ఎట్లా వచ్చిపడ్డా యో అద్భుతంగా నడిపారు కారా గారు. ఈ ప్రమాదాన్ని గ్రహించే
జాగ్రత్త పడిందో , జీవ లక్షణమ�ైన అపాయశంక, ఆ ర�ైతుబిడ్డ ను కాపాడిందో - ఆదినుండి ఈ పంటలకు తాను
దూరంగానే వుంటూ వచ్చింది.
మానసిక చితణ
్ర కోణం నుండి రాశానని ‘సంకల్పం’ కథను గురించి కారా గారు అన్నట్టు మానవ
జీవనం ఎంతటి మార్పుచేర్పులకు ఎట్లా లోనవుతుందో వారి కథలన్నీ చెబుతాయి.
‘అభిమానాలు’ కథలో సాధారణంగా సగటు కుటుంబాలలో ఎట్లా జీవిస్తా రో చెప్పిన విధానం చూస్తే
దుఃఖితులూ, దురదృష్ట వంతులూ బ్రతుకుతూనే ఉంటారు, దుఃఖ రహితులూ, అదృష్ట వంతులూ కూడా
బ్రతుకుతూనే ఉంటారు. ఈ బ్రతుకులెట్లా ఉంటాయో చెప్పాల్సిన ఒక బాధ్యత కథారచయిత మీద ఉంటుంది.
సమస్యల వలయంలోంచి బయటపడే విషయాలను సూచనప్రాయంగా చెప్పడం చేయి తిరిగిన కథకుల
లక్షణం.
కారా గారి కథల్లో భాష, వాక్యాలు
చావు కథ - బలబల తెల్లవారే సరికి చితి కుమిలింది. కారా గారి కథలో ఒక్కరోజు విషయాన్ని కథలాగా
మలిచారు.
1. లేత ఎండలో ఊరు నిద్ర లేచింది.
2. సీతాకాలం పేరు సెబితే మా సెడ్డ బయం.
కన్నయ్య మనసు ఆముతిన్న పసరంలా కిందమీదు ఔతోంది.
ఎరకయ్య తల్లి ముసల్ది చచ్చింది - ఆరోజు “సారా కొద్దు నేనీయేల సార తాగను” అంటాడు దహనం
చేయడానికి, బతికిన బతుకు సరే! సచ్చినసావు కాడా - మమసులికి పదం అక్కర్నేదా?
బతికున్న మనిస�ైతే నీదీ నాదీ సచ్చిన శవం ఊరందరిదీనూ. అందుకే గదా ఈ ఏలప్పుడు ఇక్కడో టు
ఇంతమంది

107
పేర్నాం - కాలం సమయం చెప్పాలి. అర్ధ రాత్రి చలికాలం.
ఎరకయ్య పెద్దకొడుకు - నాయనమ్మ శవాన్ని కాల్చాలంటాడు.
సూరయ్య సుబ్బరాయుడు- కొందరక్కడన్నరు రచయితగా “ఎప్పుడూ ఏం జరిగినా, కనిపించని
ఒక అనిర్వచనీయమయిన ఆనందం. ఆ మనిషి ముఖం మీద వెల్లివిరుస్తోంది. అతనిలో నలుపంత చెదిరి
అతని వెనక నీడగా వడబో తలేది. మంటల వెలుగులు ఆ నీడను కూడా చెల్లా చెదురు చేస్తు న్నాయి. కట్టెల
మోపులు ఎత్తు కురావడం – దీనికి ధ�ైర్యం గురించి చెప్పడం - తగినోళ్ళకి ఇది ఎక్కువ అనడం.
బాష
“ఈ కలికాలంలోనూ బగవంతుడు అవుతారం ఎత్తు తాట. ఐతే యీపాలి ఈ బాణాలు గీణాలు, ఆ
శక్రా లు, గిత్రాలు అన్నీ ఒగ్గేసి కత్రో టుకు నెగుస్తా ట్ట , నెగిసి, యినాగ ఊరూరు ఎళ్ళి; ఎనాగని గుర్రం మీన, యీ
పాపాలు సేసినోళ్ళందర్నీ నరికి పో గులెడతా.
రామాయణం, భారతం కూడా చర్చలోకి వస్తాయి. సీత, రావణుడు ఆ కథంతా నాలుగు మాటల్లో
చెప్తా డు.
“ఆడదానికాడా, ఆస్తికాడా మంచి మంచోళ్ళే మంచి కినుకోరు” - దేవుని గురించి.
పెద్దలేటంటారంటే - కాలం సందీమంది కొచ్చినప్పుడల్లా ఆడునానడూ లేదా అన్నకాడికొస్తా దట.
అనాటప్పుడు ఆడింక ప�ైన ఉండట్ట . ఏ అవుతారవో ఎత్తి బూమ్మీనకే దిగతాట.
అయితే నాగ! ఈ శంకూ శక్రం గదా గిద యియ్యేటుండువు. దేవునాగరాడు మనిసినాగ. మనిసి
కడుపున పుట్టే మనిసి సెయ్యగలిగిన పన్డే సేస్తా డంట. మరలాగ ఆడొ చ్చినప్పుడు ఆడెంట సావు కూడా
బూమ్మీన్నకొస్తా దట సూరయ్య.
నారెమ్మ, అప్పారావు : ముసల్దా ని చావు కర్చు లెక్క కట్టు కోగానే “గోయిందా పీడ వెడి కడియాలు
గోయిందా!” అంటుంది నారెమ్మ. పో లమ్మకు కోపం వస్తుందీమాటతో.
1. కథా సామాగ్రిగా వర్ణ నలు.
2. కథకు అవసరమున్న చోట అవసరమున్నంతనే వర్ణించాలి.
3. కథ చెప్పడం రెండువిధాలు
1. నేరుగా చెప్పడం.
2 కళా సామాగ్రిని రమ్యంగా అమర్చడం ద్వారా కథను చెప్పడం సన్నివేశాలు, పాత్రలు, సంభాషణలు,
సంఘటనలూ వర్ణ నలు- హావభావ చిత్రణలు ఇవి సామాగ్రి కథకు..
విలక్షణమ�ైన కథా రచయిత కారా గారు, కాళీపట్నం రామారావుగారి రచనలే గాదు వారి జీవితమూ
ఆదర్శప్రాయమ�ైనవి. నేటి తరం వారి రచనా శిల్పాన్ని అందిపుచ్చుకుని సమాజం పక్షానా నిలవాలి.

***

108

You might also like