You are on page 1of 65

08 కొన్ని జ్ఞాపకాలు

హాస్యమాధురి 12

23 సహచరి (డు) తో- నా సమస్య కళామాధురి 30

33 బాలల కథ ప్రణయ మాధురి 40

37 పుస్తక సమీక్ష చిత్ర మాధురి 47

51 తొలిరేయి - తొలి పలుకు ముఖచిత్ర కథనం 59

26 మేఘమా
అమ్మాయిలు
06
కళ్ళు తెరవండి
53 ఆత్మ బంధువు
నాలో నేను 20

సత్యం - అసత్యం 39
ఆర్తి - అనుభూతి 05 ఎవడు వీడు 50
కొన్ని అంతే 11
సశేషం 19
సాహితీ స్రష్టలు
ఒంటరి మహిళ 25 ఏమన్నారంటే... 60
నల్ల కాంతి వర్ణ పటం 32 జోక్స్ జోక్స్.... 61
పురుష వేది 36 ఉత్తరాలు.... 62

2
నవంబర్ - 2022
సంపాదకీయం
మాధురి ప్రారంభ సంచికను పెద్దమనసుతో స్వాగతించి,
తమ అభినందనలు అందచేసిన ప్రముఖులకు, రచయితలకు,
వివిధ గ్రూప్స్ అడ్మిన్స్ కు, పాఠకులకు హృదయ పూర్వక
ధన్యవాదాలు తెలియచేస్తోంది స్నేహా సాహితి.
తొలి ప్రయత్నంలో కాస్తా తడబాటు, తొందరపాటు
వల్ల కొన్ని పొరపాట్లు ప్రచురణలో దొర్లాయి. అందుకు
క్షమించమని అడగటానికి మేము సిగ్గు పడటంలేదు.
మీ అందరి ఆద రణలో అలాంటి బాలారిష్టాలను
అధిగమించగలమని విశ్వసిస్తున్నాము.

అయితే..... మన గురించి మనకూ తెలిసిన


దానికంటే.., మన సన్నిహితులకే ఎక్కువగా తెలుస్తుంది.
ఆ తెలిసిన విషయాన్ని నిష్కర్షగా చెప్పి, తమ భావాలను
నిర్వాహాణ : పంచుకునే వారికోసం ఆహర్నిశం ఎదురుచూస్తోంది స్నేహా
సాహితి.
స్నేహా సాహితి
“సాహిత్యం మనడానికి మంచి పాఠకులుండటం
కూడా అవసరం. కేవలం రచయిత వల్లనే.., పాఠకుల
ట్ ై బ :
కవర్ పేజ్ ఆర్ ప్రమేయం లేకుండా సాహిత్యం ఉద్భవించదు. సమకాలీనం
పి. ధనుంజయ ప్రసాద్ కూడా కాదు.

సాహిత్యం సర్వకాలీనం అయేందుకు


రచయితల శ్రమ కన్నా పాఠకుల చైతన్యమే
ప్రదానం.” అన్న సాహితీ ప్రముఖుల వాఖ్యలను
విశ్వసిస్తూ..... పాఠకుల చైతన్యాన్ని ఆహ్వానిస్తున్నాం..

మాధురి పత్రికలోని ... అన్ని శీర్షికల్లో పాఠకులూ


రచయిత( త్రు) లు విరివిగా పాలు పంచుకోవచ్చు..
మీ స్నేహహస్తాన్ని అందుకోవడానికి మాధురి అంతర్జాల
Designed మాస పత్రిక ఎపుడూ సిద్ధమే
by
వినమ్రత తో...
కండెల్లి అనిల్ కుమార్
స్నేహ సాహితి

పత్రికలో ప్రచురించిన రచయిత(త్రి)ల అభిప్రాయాలతో....


పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు అని మనవి.

నవంబర్ - 2022
3
మల్లాది వారి స్ పందన
Congratulations.
Madhuri monthly magazine layout is very good.
I Forwarded many groups.
I will send an article shortly.

- Malladi venkata krishna murthy.

మాధురి మాసపత్రిక పట్ల ప్రముఖ రచయిత


శ్రీ మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి స్పందనకు
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

నవంబర్ 13 న వారి
పుట్టినరోజు సందర్భంగా
శుభాకాంక్షలు.
- స్నేహ సాహితి టీమ్
4
నవంబర్ - 2022
ఆర్తి - అనుభూతి

ఇల్లు ఎలా ఉన్నా... ఇల్లు ఎలా ఉన్నా...


దాని ఓ మూల దాని ఓ మూల
మనస్సు విప్పి నవ్వుకోవడానికి కాస్త మనస్సు విప్పి నవ్వుకోవడానికి కాస్త
చోటుండాలి... చోటుండాలి...

సూర్యుడు ఎంత దూరంలో ఉన్నా నువ్వు ఎటువ�ైపు వెళతు ్న్నా


మన ఇంటికి రావడానికి దారివ్వాలి... ఓ తియ్యని అలజడి తప్పక సృష్టించాలి...

అప్పుడప్పుడు ఇంటి డాబా ప�ైకి ఎక్కి వయస్సు ప్రతి మజిలీ


విశాల ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెటటు ్... ఆహ్లాదకరమ�ైనది
చంద్రుని స్పర్శించడానికి ప్రయత్నించు... మీ వయస్సులో ఉల్లా సంగా కొనసాగండి...

మనుష్యులతో కలవాలనుకుంటున్నావా? నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండండి


చుట్టు ప్రక్కల సహవాసుల్ని తప్పక పెటటు ్కో... ఉదాసీన ముఖమెందుకు?
కాలం గడిచిపో తోంది మిత్రమా...
వర్షంలో తడవనీ...గంతులేయనీ వయస్సు...తస్సాదియ్యా!
వదిలేయ్ , పిల్లలు ఓ కాగితపు నావ
నడుపుకోనీ...
- మాన్యశ్రీ అటల్ బిహారీ బాజ్ పేయి
చేతిలో కాస్త సమయముంటే
ప్రశాంత నిర్మల ఆకాశంలో
ఓ గాలిపటాన్ని ఎగురవెయ్యి
వీలయితే మరో పతంగుతో పందెం కాయ్...

- అనువాదం :
ఇంటి ముందు ఓ చెటటు ్ని పెంచు
గుండాన జోగారావు
దానిప�ై వాలిన పక్షుల కిచకిచల్ని
తప్పక విను...

నవంబర్ - 2022
5
అమ్మాయిలూ
కళ్ళుతెరవండి
- కరణం శైలజ

“వైష్ణవీ...
‘ఉందా!’ అన్నాడు.
  ఈ ఎస్ రోజు మా ఇంట్లో జరిగిన విషయం
నీకు చెప్పాలనిపించింది. నువ్వింకా పెళ్ళి
నాదే. బాలన్స్ ఏడువేలు వుంది. 
కావలసిన పిల్లవు. కొంచెం తెలివిగా మసులుకొని
నిదానంగా బుక్ చూస్తే.  ఎన్నో చాలా డిపాజిట్లు,
జాగర్త పడతావని చెప్తున్నాను.
విత్ డ్రా లు లక్షల్లో కూడా వున్నాయి.  ‘ఇంత
డబ్బు ఎందుకువేశా సారిక్కడ,’ అంటే, 
పవన్ ఈ రోజు ‘ నీ సెంట్రల్ బ్యాంక్ పాస్
కొద్దిసేపటికి చెప్పాడు.. ‘ఎఫ్. డి లు మెచ్యూర్
బుక్ నీ దగ్గర వుంది తియ్యి’ అన్నాడు, నాతో. 
అయివుంటాయి,’ అoని. మరాడబ్బంతా తన
‘నా దగ్గరలేదు. అయినా నాకు అక్కడ
పేరున వేరే చోట దాచుకున్నాడన్నమాట. 
నాకు అకౌంట్  లేదు కదా?’ అంటే,
‘ఏ.టీ.ఎం. కార్డ్ వుందా?’ అంటే ‘దీనికి లేదు’
 ‘ఉందీ’ అన్నాడు గట్టిగా. నాకేం గుర్తులేదు.
అన్నాడు. ‘మరి విత్ డ్రా లకు నేను రాలేదు.
అక్కడ లాకర్ వుంది. అప్పుడప్పుడూ వెళ్తుంటాం.
లాకర్ కు మాత్రమే వచ్చాను.  డబ్బు ఎలా విత్
నాకు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. అదీ
డ్రా అయ్యింది?’ అంటే  ‘విత్ డ్రాల్ ఫారం
శాలరీ కోసం. ‘చూడొకసారి’ అన్నాడు. స్టేట్
మీద నువ్వు సంతకం చేసుంటావు’ అన్నాడు.  
బ్యాంక్ వి కూడా నా దగ్గర  వుండవు. ఈ మధ్య
కొంచెం విసుగ్గా. అడుగుతున్నానని కోపం.
చాలా రోజుల నుంచీ వాడనందువల్ల అకౌంట్
నిజమే. నేను అప్పుడప్పుడూ ఏవో ఫార్మ్స్ మీద
వాడటానికి మళ్ళీ కొన్ని పేపర్స్ సబ్మిట్ చేసి
సంతకాలు పెట్టమంటే పెడ్తుంటాను.  కానీ ఇన్ని
వచ్చాం నిన్న. అందువల్ల అవి టేబుల్ మీద కవర్
సంవత్సరాలు, ఇన్ని సార్లు పెట్టలేదనిపించింది.
లో ఉన్నాయి.  మళ్ళీఇంట్లో బీరువా లో తన
దగ్గరే వెతికి ఒక కవర్ ఇచ్చి ‘ఇవి నీదగ్గర పెట్టుకో’
అప్పుడు ఇంకో  విషయం గుర్తొచ్చింది.
అన్నాడు. రెండు చెక్ బుక్స్ ఇంకా ఏమిటో
ఒకసారి నేను పెళ్లికి చెన్నై వెళ్ళినప్పుడు ఒక బ్యాంక్
పేపర్స్ ఉన్నాయందులో.   ‘ నాకెందుకు ఇవీ’
ఆఫీసర్ ఫోన్ చేసి, ‘మీరు ఎంత అమౌంట్ విత్
అంటే  ‘నీవే అవీ’ అన్నాడు.  ‘సరే ఇదుగో ఈ కప్
డ్రా చెయ్యడానికి  సంతకం చేశారు?’ అన్నారు.
బోర్డ్ లో పెడ్తున్నాను ,’ అంటూ అవి సర్ది పెట్టే
ఆమె ఎందుకు అడుగుతున్నారో తెలియక,
లోపల అందులో పాస్ బుక్  కనపడిందప్పుడు.
‘  తెలీదండి.  కనుక్కొని చెప్తాను,’ అన్నాను.
‘అరె పాస్ బుక్ ఇక్కడే వుందే’ అన్నాను తీస్తూ.

నవంబర్ - 2022
6
అంతా తియ్యడం’ అని  అడిగాను. ‘తీస్తే ఏం’
అన్నాడు. కనీసం నా కార్డ్ కూడా నా దగ్గర లేదు.
ఇప్పుడు  ‘నీడబ్బు ఏమీ లేదు. అంతా
అయిపోయింది,’ అంటున్నాడు. ‘చూశావా?
ఎంత మోసం చేశాడో. నా పాస్ బుక్ లో డబ్బు
లేదు. నేను చేసింది ప్రైవేట్ స్కూల్ లో టీచర్
ఉద్యోగం. పెన్షన్ రాదు.

ఇదంతా నా తెలివి తక్కువ. మీ తరమైనా


తెలుసుకోండి. జాగర్త. వుంటాను.’
ప్రేమతో, నీ అక్క
-- జాహ్నవి.
‘లక్షా ఇరవైఐదు వేలు డ్రా చెయ్యడానికి వచ్చారు
పవన్ గారు.’ అంది. ‘ ఫరవాలేదు,  మా వారే. --*--
ఇచ్చేయండి,’ అన్నాను.  ‘ఇంత అమౌంట్ అని
మీకు తెలుసో లేదో అని అడుగుతున్నామండీ.
కథలు, కార్టూన్లు, కవితలతో పాటు,
అది మా కర్తవ్యం,’ అందామె. ‘ఇచ్చేయండి,’ అందరిని నవ్వించే జోక్స్, ఇతర రచనలను
అన్నాను.  ఈ బ్యాంక్ వాళ్ళు ఎంత మంచి వారు ఆహ్వానిస్తుంది మాధురి.
వీళ్ళు అనుకున్నాను.
మాధురి మాసపత్రిక కు ఎటువంటి
ఇప్పుడు ఆలోచిస్తే అర్థమయ్యింది.  రుసుము చెల్లించనవసరం లేదు.
బ్యాంక్ లో తన ఫ్రెండ్ ఉండబట్టి ఏపనైనా అభిరుచి కలిగిన పాఠకుల సాహితీ
దాహం తీర్చడానికి ఉచితంగా లభించే అంతర్జాల
నిముషాల్లో జరిపించుకునేవాడు. అలాగే చాలా మాస పత్రిక ఇది.
విత్ డ్రా ఫార్మ్స్ లో  తానే సంతకాలు పెట్టీ చక్కని సాహిత్యంతో పాఠకులను
రంజింప చేయడమే పత్రిక ముఖ్య ఉద్దేశం...
డబ్బు తీసుకున్నట్లున్నాడు. నేనేదో ఐదారు
సార్లు పెట్టినట్లు గుర్తు…. ఈమె కొత్తగా
వచ్చినట్లుంది.  కస్టమర్ కే ఫోన్ చేసింది. ఈ సాదరంగా ఆహ్వానిస్తూ ఆదరించండి...
సాహితి అభిరుచితో చదివి ఆస్వాదించండి...
బ్యాంక్  లొ కనీసం నాకు అకౌంట్ ఉన్న విషయం
పెద్ద మనసుతో పత్రికను ఆశీర్వదించండి....
కూడా నాకు తెలియదు. మర్చిపోయాను. డబ్బు మీ నుండి మాధురి కోరుకునేది ఇదే...
విషయం పట్టించుకోకుండా ఉండటం స్వంత
రచనలు పంపవలసిన మెయిల్ ఐడి
ఇంట్లో పొరపాటా? నా జీతం ఒక్కరోజు లేట్
snehasahithi2022@gmail.com
అయితే ఇంకా ఎందుకు  జీతం రాలేదనేవాడు.
వచ్చిన రోజు సాయంత్రమే డ్రా చేసేవాడు.
ఒకరోజు ఏ.టీ.ఎం లో తీస్తుంటే ‘ఎందుకు

నవంబర్ - 2022
7
- కాండ్రేగుల శ్రీనివాసరావు

నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి నేను కూడా వెళ్లాను. ఆడిటోరియంలో


కూర్చున్నాను. జానకమ్మ, సుశీలమ్మ,
జానకమ్మ పాట అంటే చాలా చాలా ఇష్టం...
జయసుధ, జయప్రద,మోహన్ బాబు, బ్రహ్మా
ఆమె పాటలో తియ్యదనం... ఆ గొంతులో
నందం లాంటి ఇంకా ఎందరెందరో సెలబ్రిటీలు
మాధుర్యం... ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా
వేదిక మీద ఆశీనులై ఉన్నారు. వారి ప్రసంగాలు
వినాలని అనిపిస్తూనే ఉండటం ఆమె ప్రతిభకి
కొనసాగుతూనే ఉన్నాయి.
నిదర్శనం.

కాసేపటికి సభ మధ్యలోనే జానకమ్మ


జానకమ్మ పాట కోసం ఆనాటి రేడియో,
గారు వెళ్ళటానికని లేచారు. సుబ్బిరామిరెడ్డి గారి
ట్రాన్సిస్టర్ , టేప్ రికార్డర్, వాక్ మేన్, హోమ్
దగ్గర అనుమతి తీసుకుంటూ సుశీలమ్మకి మరో
థియేటర్, ఇప్పటి బ్లూటూత్ సౌండ్ సిస్టమ్
ఇద్దరు ముగ్గురికి వెళ్లి వస్తానని చెప్పడంతో ఆ
బార్ లు లాంటి వాటిలో ఆమె గొంతు ఈనాటికి
దృశ్యాన్ని చూసిన నాలో టక్కున ఓ ఆలోచన
వింటూనే ఉన్నాను. అలా వింటున్నప్పుడు ఎన్నో
స్ఫురించింది. ఎందరెందరో వీఐపీల వివాహాలు,
ఎన్నెన్నో ఆలోచనలు. అంతటి ప్రతిభామూర్తి
పుట్టినరోజులు, నిశ్చితార్థాలు ,లాంటి ఫంక్షన్లు
అయినటువంటి ఆ మహాతల్లి పాదాలకి
అదే ఆడిటోరియంలో జరగటం,వాటికి నేను
నమస్కరించాలని నిగూఢమైన చిత్రాతి చిత్రమైన
తరచూ హాజరు కావడం వలన ఆ ఆడిటోరియం
కోరిక...
డిజైన్ మొత్తం నాకు బాగా పరిచయం.
ఆమెను మూడు నాలుగు సందర్భాల్లో
వేరు వేరు చోటల్లో చూసినప్పటికీ కూడా
వేదిక మీదనుంచి నిష్క్రమిస్తున్న
ఆమె చెంతకు వెళ్లే అవకాశం లేకపోవడంతో
జానకమ్మ , ఏ గేటులో నుంచి బయటకు
చాన్నాళ్లుగా ఆ కోరిక మనసులో అలాగే
వస్తారో ఊహించాను. నిర్మానుష్యంగా ఉన్న
ఉండిపోయింది.
ఆ ప్రదేశంలోనికి ఎవరురారు. జానకమ్మ
పాదాల మీద పడి నా కోరిక తీర్చుకునే
విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో
అవకాశం ఆసన్నమైనందుకు సంతోషించి,
కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి గారి జన్మదిన
అంత మంచి ఆలోచన చేసినందుకు నన్ను నేనే
వేడుకలు జరుగుతున్నాయి. చూడటానికని

నవంబర్ - 2022
8
ఆగటం లేదు. అతడు జానకమ్మ కొడుకు. ఆ
కేకలకు సెక్యూరిటీ అప్రమత్తమయి ఆమె దగ్గరికి
ఎవరిని రానివ్వకుండా కంట్రోల్ చేస్తున్నారు.
ఉన్న అవకాశం కూడా పోయి, నా కోరిక అలా
కూడా తీరే అవకాశం లేకుండాపోయింది.

ఉట్టి కేగలేనివాడు స్వర్గానికేగి నట్లు...


సెలబ్రిటీని చూడడమే పెద్ద సాహసం...
అటువంటిది ఆమె పాదాలకు నమస్కారం,
అంటే ఇంకెంత సాహసమో కదా...

అభినందించుకుంటూ ఆడిటోరియం నుంచి లేచి


జానకమ్మ గారి కొడుకు కారు గురించి
ప్రధాన ద్వారం గుండా బయటకు వచ్చి, జానకమ్మ
ఫోన్ చేశాడు. డ్రైవరు కారు తీసుకువచ్చేసాడు.
వచ్చే గేటు దగ్గరికి వడివడిగా నడిచాను. తీరా
కారు నేరుగా మేమున్న ప్రదేశానికి వచ్చింది.
అక్కడికి వెళ్లి చూశాక నా ఊహ తప్పయింది.
కారు ఎక్కినప్పుడైనా సరే ఆ మహాతల్లి
ఇంత తక్కువ సమయంలో ఎవరూ అక్కడకి
పాదనమస్కారం దొరుకుతోందేమోనని ఎదురు
రారు , ఎవరూ అక్కడ ఉండరు,అనుకుని వచ్చిన
చూస్తున్నాను. కానీ అక్కడ కూడా అవకాశం
నాకు నాలాగే ఆలోచిస్తూ జానకమ్మ కోసం అదే
ఇవ్వలేదు సెక్యూరిటీ వాళ్ళు. ఆమె గబగబా నడిచి
గేటు దగ్గరకు దాదాపు నలబై ఏబై మంది వచ్చి
కార్ డోర్ తీసుకుని ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు.
ఉండటం, వాళ్లంతా ఆమె గురించే ఎదురు
దాంతో కాస్త జనాలు రద్దీ తగ్గుముఖం పట్టింది.
చూస్తూ ఉండటం,నన్ను నిర్ఘాంతపోయేలా
చేసింది.
ఆ ప్రదేశం గురించి కార్ డ్రైవర్ కి అంతగా
తెలియకపోవటం వల్ల తిన్నగా వచ్చేసాడు. కారు
ఇక చేసేది ఏమీ లేక నేను కూడా
టర్న్ అవ్వదు. ఆడిటోరియం ఎంట్రన్స్ దాకా
వాళ్ళలో ఒకడినై జానకమ్మ గారి గురించి ఎదురు
రివర్స్ లో వెనక్కి వెళ్లాల్సిందే! డ్రైవరు రివర్స్
చూడ సాగేను. అప్పటికి ఇంకా ఆమె రాలేదు.
చేస్తున్నాడు. జనం అంతా ఎక్కడ వారు అక్కడే
కాసేపటకి వచ్చారు. అత్యంత సమీపంగా ఆమెను
చూడటం ఆనందం అనిపించింది. ఆటోగ్రాఫ్
కోసం ఆమె మీద జనం పడిపోతున్నారు.
ఎక్కువ జుట్టుతో ఉన్న ఓ అబ్బాయి “ ఏమిటీ
న్యూసెన్స్... ఏయ్ సెక్యూరిటీ ఏమిటిది?
జనాలను కంట్రోల్ చేయరా మీరు? “ అంటూ
చిరాకు పడుతూ కేకలు పెడుతున్నాడు. అతన్ని
జానకమ్మ కాస్త వారిస్తున్నారు. అయినా అతడు

నవంబర్ - 2022
9
నిలుచుండిపోయారు. ఇదే కాస్త అవకాశం గా ప్రతి నమస్కారం చేస్తూ నా రెండు చేతుల్ని
తీసుకొని మెల్లగా రివర్స్ అవుతున్న కారుతో పట్టుకున్నారు... పాదాలకి నమస్కరించాలని
పాటు జానకమ్మ గారి విండో దగ్గర నేను ఆమెకు తపించే నాకు ఆమె చేతి స్పర్శ లభ్యమవటం
అత్యంత సమీపంగా నడుస్తున్నాను. బిచ్చం కోసం అదృష్టం... అంతటి మహా వ్యక్తి , అంతటి
పరి తపించే బిచ్చగాడిలా ఆమెనే ఆరాధనగా నా అభిమాన గాయినీ మణి, అంతటి విద్వత్తు
పూజ్యభావంతో చూస్తూ నడుస్తూనే ఉన్నాను కలిగిన ఆమె నుంచి, ఆ చేతి స్పర్శ ద్వారా,
ఫ్రంట్ సీట్లో కూర్చున్న ఆమె నన్ను చూశారు. కళ ,వాహిని అయి, ప్రవహిస్తూ ఇసుమంతైనా
వంగి ఆర్తిగా వినయంగా రెండు చేతులతో నాకు ప్రాప్తించదా ? అనిపించింది.ఈ జ్ఞాపకం
నమస్కరించాను. ఏ దేవుడు కరుణించాడో? ఎప్పటికీ పదిలం...
ఆమె విండో దించారు. నన్ను దగ్గరకు రమ్మనమని
పిలిచారు. నేను ఆమెకు అత్యంత సమీపంగా చేరి --*--
రెండు చేతులతో మళ్ళీ నమస్కరించాను. ఆమె

కథలు, కార్టూన్లు, కవితలతో పాటు, అందరిని నవ్వించే


జోక్స్, ఇతర రచనలను ఆహ్వానిస్తుంది మాధురి.

రచనలు పంపవలసిన మెయిల్ ఐడి


snehasahithi2022@gmail.com
నవంబర్ - 2022
10
కొన్ని అంతే!!
నీ ముఖంలో విరియాల్సిన నవ్వులు కోరిన దాన్ని వెంటాడి
వేరెవ్వరి ఆననం మీదో పువ్వుల�ై పూస్తుంటాయి. వేటాడే సమయానికి
నీలో ఆకలి చచ్చిపో యి ఉంటుంది.
నీక�ై స్పందించాల్సిన హృదయం
ఇంకొక్కరి తనువుకోసం నీ వేవో నిర్దేశాలను చూసి
తహ తహలతో తపిస్తూ ఉంటుంది. ఊరనుకొని బయలుదేరి
వల్ల కాటికి చేరుతావు.
నీవు పుట్టాల్సిన చోటు కాక
మరేదో ప్రాంతంలో కళ్ళు తెరిచి నీవు ఎందరినో ఆశ్చర్య పరచాలని
అక్కున చేర్చుకొనే వారు లేక కొత్త స్వరాల రాగాలు ఆలపిస్తే
గుక్కపట్టి ఏడుస్తూ ఉంటావు. చుట్ టూ కాకుల మంద మూగి
అన్నం మెతుకులు ఎక్కడని అడుగుతాయి.
నీ వెవ్వరో నీకే తెలియక
ఇక్కడి కెందుకొచ్చావో అర్ థం కాక నీవు పచ్చని చెట్టయి
ఆలోచన్ల తోనే అలిసి పో తుంటావు. ఎదుగుదామని అనుకొనే సమయానికి
మొక్కలంటేనే సహించని
నీ వెళ్లి పో తానని బయలు దేరితే మరో సమాజం తయార�ై ఉంటుంది.
ఉండమని చెప్పేవారులేక
ఉసూరు మంటావు. ఎదురుగా అడ్డ మొచ్చే దుర్మార్గ ముఖాన్ని
పగుల గొట్ట మని చేతులకు ఆజ్ఞ జారీ చేస్తే
రక్షణకోసం ఏర్పరచుకొన్న ఆవాసం అవి నిటారుగా లేచి దండం పెట్టి
నీ మీదే పడి గువ్వను దిగమింగిన నీ భావాలకు పిండం పెడుతూ ఉంటాయి.
గుడ్ల గుబలా మిటకరిసతుంది
్ .
నీ బతుకు కుటీరంలో
కాపలాగా పెంచుకొన్న జాగిలం తన వేరెవ్వరో చేరి సుఖించడానికి
అధిక ప్రేమను వ్యక్తం చేయడానికి నీకే తెలియకుండా
నిన్ను తరచు కాట్లు పడేలా కరుస్తూ నే తలుపుల్ని బార్లా తీస్తుంటావు.
ఉంటుంది.
అవి వింతగా..... తెచ్చుకొన్న
నీవు చేసే కొత్త పని చింతల్లా అనిపించవచ్చు!!
నీవు బతికి ఉండగా కొన్ని అంతే
మెచ్చేవారే ఉండరు. అని భరించడమే బతుకంటే!!

నీవు గర్వంగా ఊరేగే కాలానికి - సడ్లపల్లి చిదంబర రెడ్డి


నీ వాడంతా నిద్రలో మునిగి ఉంటుంది. “రాయలసీమ మాండలిక పద పరిమళాన్ని
రవళిస్తోన్న కవి, రచయిత ”
11
నవంబర్ - 2022
పిశాచి ప్రేమలు
- P. రాజేంద్ర ప్రసాద్

“అబ్బ! యమ బోరు కొడుతోంది.


ఒంటరిగా ఉన్నాను. తోడు ఎవరూ లేరు.
తలుపులన్నీ వేసేసి ఉన్నాయి. లైట్లన్నీ
ఆఫ్ చేసేసి, ఫాన్లన్నీ కట్టేసి, ఆర్నెల్లబట్టీ
ఈ రూములోకి ఎవరూ రాకుండా
బయట గడియవేసి, తాళం పెట్టి పైగా ఆ
తాళం చెవి పూజ గదిలో ఆంజనేయుడి
దగ్గర పెట్టేరు. నాకూ తెలిసేది కాదు.
తాళం వేసేసే ముందర వాళ్ళల్లో వాళ్ళు
మాట్లాడుకున్నారు కాబట్టి తెలిసింది.
మామూలుగా తలుపులూ,తాళాలూ
మనకో లెక్క కాదనుకోండి. వాటిల్లోంచి
ఈజీ గా బయటికెళిపోతాను. కానీ
సొంతిల్లు కదా. వదిలిపెట్టి వెళ్ళ బుద్ధి
కావటం లేదు. పోనీలే కరోనా వల్ల లాక్ డౌన్
లో ఉన్నాలే అని సరిపెట్టుకుంటున్నాను.

ఆర్నెల్ల క్రితం  వరకూ నాకు


ఇక్కడ బాగానే కాలక్షేపమయ్యేది.
రూములో ఎవళ్ళో ఒకళ్లు ఉండేవాళ్లు.
నేరకపోయి కోపం తెచ్చుకొని  వాడ్ని
బెదిరించాక ఇలాగ ఈ రూములో ఒక్కడినీ
ఉండిపోవాల్సి వచ్చింది. అయినా వెధవకి
బాగా అయ్యిందిలే. వాడికి కావాల్సిన
శాస్తే జరిగింది. అదెలాగో  చెప్పాలి కదూ.
చెప్తాను మరి .

12
నవంబర్ - 2022
కనబడను కదా! అందుకని నేనక్కడున్నట్టూ...
నేను చాలా సంవత్సరాలబట్టీ ఇక్కడే నేనే ఆవిడ కాలికి కర్ర అడ్డం పెట్టి మెట్ల మీంచి
ఉంటున్నాను. ఇక్కడే అంటే, ఇది మా పడిపోయేలాగ ప్లాన్ చేసినట్టూ అస్సలు తెలీలేదు.
సొంతిల్లన్న మాట. మా అమ్మేమో నేను పాపం చచ్చిపోయాక ఆవిడకి జ్ఞానోదయం
పుట్టగానే పోయిందంట. అందుకని నేనూ,మా అయినట్టుంది. ప్రేమగా పలకరిస్తుంది. ఇంకా
పిన్నీ ఉండేవాళ్ళం. మా నాన్న పోతూ పోతూ ప్రేమగా మాట్లాడుతుంది.
ఆస్తంతా నా పేరునే రాసి పోయాడు. ఇంకేం?
మా పిన్నికి దాని మీద కన్ను పడింది.  పిన్నంటే నేనొక్కణ్ణే సింగిల్ గా  ఈ రూములో
మా సవత్తల్లన్న మాట. ఉండడానికి ఒక కారణం ఉంది.  ఇది మేడ
మీద సింగిల్ గా ఉన్న ఒకే రూము. ఈ కాలపు
నాకు నవలలూ, కథలూ ఇళ్లలో లాగా కాకుండా ఈ రూములో పైన
చదువుకోవడమంటే మహా ఇష్టం. ఒక రోజు అటక ఒకటుంది. అటకంటే నాకు చాలా ఇష్టం.
పాత సామాన్లన్నీ అటక మీద వేసేస్తారు. పాత
సామాన్ల వాసన చాలా బాగుంటుంది. అటక మీద
కూర్చున్నా పడుకున్నా ఇంకా బాగుంటుంది.

నేను చాలా సంవత్సరాల బట్టీ ఇక్కడే


ఉంటున్నానని చెప్పాను కదా. నేనిక్కడే
ఉంటున్నట్టు ఇంటి ఓనర్సుకి  కొంచెం తెలుసు
గానీ నేనెవరో ఏమిటో వాళ్ళకి ఏమీ పూర్తిగా తెలీదు.
అందుకని వాళ్లు నన్నేమీ చేయలేకపోయారు.
నన్ను బయటకు పంపడానికైతే వాళ్ళు  రకరకాల
ప్రయత్నాలు చేశారు గానీ,  అవేవీ నా మీద పని
చేయలేదు. అయినా నేను పైకెళ్లక ముందునించీ
నేను సీరియస్ గా నవల చదువుకుంటూంటే ఉంటుంటే మధ్యలో వచ్చిన  వీళ్ళెవరు నన్ను
వెనకనించి  నెత్తి మీద కిరసనాయిలు పోసి నేను బయటకు పంపడానికి?
అటు తిరిగేలోపు అగ్గిపుల్ల గీసి మీద పడేసింది.
నేను వొళ్ళంతా కాలిపోయి చచ్చిపోయాను. ముందునించీ ఇది మా ఇల్లే కదా!
అందుకని నేనేమన్నా చేస్తానని భయపడిపోయి నేనుపోయి ఇప్పటికి ముప్ఫయి ఏళ్ళయ్యిందేమో! 
చింతతోపు కెళ్లిపోయి అక్కడే ఉంటోంది. అంతకుముందు ఇంట్లో తిరిగే వాణ్ణి. ఇప్పుడు 
అటక మీద నివాసం. అంతే తేడా. చాలా మందికి
మన్లో మన మాట ... ఆవిడ్ని మెట్ల నేనిక్కడున్నానని అనుమానం ఉంది. మా పిన్ని
మీంచి తోసేసింది నేనే! ఆవిడకి ఆ విషయం కూడా చచ్చిపోయింతర్వాత మా మామయ్య,
తెలీలేదనుకోండి. దెయ్యమైపోయాక నేను ఆవిడకి అంటే మా పిన్నీ వాళ్ళ అన్నయ్యన్నమాట,
13
నవంబర్ - 2022
దర్జాగా ఈ ఇల్లు తీసేసుకున్నాడు. తీసుకుంటే “ఇక్కడ చింతతోపు కాలనీలో నాతోపాటు
తీసుకున్నాడుగాని నన్ను బయటకు పంపించాలని ఉండరా... ఇక్కడేదో ఆంజనేయస్వామి
వెధవ ప్రయత్నాలెందుకు? మా ఇంట్లో ఆలయం కడతానంటున్నారూ నాకు భయంగా
నన్నుండద్దూ అనడానికి వాడికి ఎంత ధైర్యం? ఉంది, తోడుందువి గానీ.” అని. నేనే దాటేస్తున్నా.
అందుకే వాణ్ణి నేను రకరకాలుగా ఏడిపిస్తూ ఆంజనేయస్వామి గుడి కడితే ఆవిడొక్కద్దానికేనా
ఉంటా. వాడికేమో నేను మగ వాణ్ణనీ ‘ఉన్నాడు’ భయం!? నాకైతే కాళ్ళే వణికిపోతాయి. మగాళ్లం
అనాలనీ కూడా తెలీదు. ‘దెయ్యముందీ కదా. అలా అని చెప్పకూడదు. పైగా అక్కడ
‘అంటాడు.’ ఒరేయ్ నేను మగ దెయ్యాన్నిరా! వేసవి కాలం అయితే చల్లగా బాగుంటుందేమో
ఉన్నాడు అనాలి ‘ అని ఎంత మొత్తుకున్నా గానీ, వర్షాకాలం ఏం చెయ్యాలి? ఇక్కడ ఇంట్లో
ఎవడూ పట్టించుకోడు. ఒక్కోడేమో’ భూతం అటక మీద ఉన్నాం కాబట్టి ఫర్వాలేదు. అక్కడైతే
‘అంటాడు. వాడూ అదే వరస’ ఉంది ‘ అంటాడు. వర్షానికి తడిచి పోవాలి. జలుబూ గట్రా చేస్తే 
అరిచి గీపెట్టినా  ‘ఉన్నాడూ ‘అనడు. ఇంకోడు’ డాక్టర్లుండరు. భూమ్మీద ఉన్నప్పుడే మల్టీ
పిశాచం, పిశాచీ’ అంటాడు గానీ రెండింటికీ ‘ స్పెషాలిటీ హాస్పిటళ్లు పెట్టి జనాల్ని టెస్టులనీ
ఉందనే ‘ అంటాడు. వీళ్ళకి తెలుగు పాఠాలు ఏ అవనీ ఇవనీ వేధించుకు తిని ఉంటారు కదా ! ఆ
పంతులు నేర్పేడో మరి. పాపానికి వాళ్ళు డైరెక్టుగా నరకానికే పోతారు.
మాకులాగా దయ్యాల జన్మ ఉండదన్న మాట. 
పైగా అక్కడైతే చెట్టు కొమ్మల మీదే పడుకోవాలి. 
సౌకర్యంగా ఉండదు. మంచినిద్రలో ఉన్నప్పుడు
పెద్ద గాలొచ్చి  కొమ్మలు ఊగిపోతే కిందపడతాం.
రూములో అయితే ఏడిపించడానికి పెర్మనెంటుగా
మనుషులు దొరుకుతారు. చింతతోపులో
మనుషులే కనపడరు. పైగా అక్కడ ఆడ
దెయ్యాలెక్కువ. ఊరికే అచ్చమ్మ బుచ్చమ్మ
కబుర్లు. నాకు నచ్చదు. అన్నట్టు సాయంత్రం
ఏడున్నరైతే రూములో ఉండేవాళ్ళు ఎవరైనా
అందరూ ఠంచనుగా టీ వీ లో ‘కార్తీక దీపం’
మా ఫ్రెండు దయ్యాలూ,  కొంచెం పరిచయం సీరియల్ పెడతారు. పాపం వంటలక్క కష్టాలు
ఉన్న దయ్యాలూ,  మా పిన్ని దెయ్యమూ వాళ్ళూ చూసి గుండె నీరైపోతుందనుకో. చింత తోపులో
బయట వేరే వేరే కాలనీల్లో ఉంటారు. కొంతమంది అయితే టీ వీలూ కార్తీకదీపాలూ ఉండవు కదా.
స్మశానం కాలనీలో, కొంతమంది చింతతోపు
కాలనీ లో మరికొంతమంది కూలిపోయిన ఒక్కో రోజు అస్సలు గాలి ఉండదు కదా.
కోటకాలనీలో. నాకేమో అక్కడెక్కడా అలాంటప్పుడు చింతతోపులో ఉన్నామనుకోండి.
ఉండబుద్ధి కాదు. మా పిన్నేమో అప్పుడప్పుడూ చల్లగానే ఉంటుంది. కానీ గాలాడక  చాలా
ఇక్కడికొస్తుంది. వచ్చినప్పుడల్లా పోరుతుంది. ఇబ్బంది పడాలి.  ఇక్కడైతే ఫానుంటుంది. రెక్కల
14
నవంబర్ - 2022
పైన హాయిగా పడుకోవచ్చు. ఎవరైనా ఫాను మాకూ తెలియదనుకోండి.   కనెక్ట్ అవ్వడం అంటే
స్విచ్చి వేశారనుకోండి. ఇంకా బాగుంటుంది. గుర్తొచ్చింది. కొంచెం సిగ్గేసినా చెప్పక తప్పదు.
రంగులరాట్నంలా తిరగొచ్చు. మామూలుగా
అయితే నేను అటక మీదే కూర్చోవడం,
పడుకోవడం అన్నీనూ.

రూము పగటి పూట తలుపులేసేసి


ఉంటుంది. సాయంత్రమైతే రూములో ఉండే
కుర్రాళ్ళు వచ్చేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు వచ్చీ
రాగానే  ఒకణ్ణి డిప్ప మీద కొట్టాను. వాడు 
వెనకాతల ఉన్న వాడి ఫ్రెండే కొట్టాడనుకొని వాణ్ణి
ఒక్కటి పీకాడు. ఇంక చూడండీ  పైటింగ్ సీన్.
నవ్వీ నవ్వీ చచ్చాననుకోండి. ఓ అమ్మాయి దెయ్యానికి ఈ మధ్య బాగా కనెక్ట్
అయిపోయాను.  ఒంటరి దెయ్యాన్ని కదా
చెప్పడం మర్చిపోయాను. మావి అని మా పిన్నీ వాళ్ళ ఫ్రెండు దయ్యం ఒకావిడ
అమెరికన్ టైమింగ్సన్న మాట. మీకు పగలైతే ఓ సంబంధం తీసుకొచ్చింది.  ఓ అమ్మాయి,
మాకు రాత్రి. మీకు రాత్రైతే మాకుపగలు. నేను రైలు కింద పడి చచ్చిపోయిందంట. ఒక
మంచి ఉత్సాహంగా ఉన్నప్పుడు కుర్రాళ్ళు గాఢ చెయ్యి వేలాడుతూ కొద్దిగా వికృతంగా ఉంటూ,
నిద్రలో ఉండేవాళ్ళు. ఫాను తిరుగుతూ ఉండేది. వంకరగా ఎగురుతూ చాలా బాగుంది. ఈడూ
ఫాను మీద కాసేపు రంగుల రాట్నం ఆడుకుని జోడూ బాగుంటుందీ చూడమని అందావిడ.
బోరు కొట్టినప్పుడు కుర్రాళ్లతో ఆడుకునే వాణ్ణి. నా ముఖం చాలా బాగుంటుందని మా వాళ్లంతా
వాళ్ళకి తెలీదనుకోండి. వాళ్ళ వంటగిన్నెలు అంటారు. మా పిన్ని పైనుంచి కిరసనాయిలు
కింద పడేసీ, పుస్తకాలు దాచేసీ....... వాళ్ళు పోసి కాల్చిందేమో జుట్టంతా కాలిపోయింది.
తెలీక ఒకళ్ళలో ఒకళ్ళు కొట్టుకునే వాళ్ళు. భలే ఒక కన్నేమో పేలిపోయింది. కనుబొమ్మలూ
సరదాగా ఉండేది. లేవు. కుడి వైపుముఖమంతా కాలిపోయి చీ
ము నెత్తురుతో కండలు వేలాడుతూ చాలా
అన్నట్టు మేము అందరికీ కనిపించం. బావుంటానని మా వాళ్లంతా అంటారు.
కొంతమందికే, అదీ కొన్నిసార్లే కనిపిస్తామన్న
మాట. సెల్ ఫోన్లో బ్లూ టూత్ ఉంటుంది అయినా మగాడికి అందం ఎందుకూ
కదా........ అలాగ మా దగ్గర కూడా బ్లూ టూత్ అంటుంది మా పిన్ని. ఆవిడది అదో టైపు.
లాంటి ఒక పవర్ ఉంటుందన్న మాట. అందరూ  నేను పెళ్లి కాకుండా చచ్చిపోయాను
బ్లూ టూత్ ఆన్ చేస్తే కొన్ని డివైజులు మాత్రమే కదా! సంబంధాలు చాలా వస్తున్నాయి. 
కనెక్ట్ అయ్యినట్టు అందరూ కనెక్ట్ అవ్వరు. కొంత డిమాండెక్కువ. నాకున్నదల్లా మా పిన్నే కదా!
మందే మాకు దొరికిపోతారు. అలా ఎందుకో ఆమెనే మాట్లాడమని చెప్పాను.
15
నవంబర్ - 2022
రాసేదేమిటో చూద్దామని ఎన్ని సార్లు
మీకో విషయం చెప్పాలి. మా గురించి ప్రయత్నించినా అదేంటో మా బ్లూ టూత్
మీకందరికీ చాలా దురభిప్రాయాలున్నాయి. ఎప్పుడూ కనెక్ట్ అయ్యేది కాదు.
మాకు పాదాలు వెనక్కి తిరిగిఉంటాయనీ,
పాటలూ అవీ పాడతామనీ. ఏడుస్తామనీనూ. డాక్టర్లకి లాగా కవులూ, రచయితలూ
అయినా చోద్యం గానీ, పాదాలు వెనక్కుంటే జనాల్ని పీక్కు తిన్న పాపానికి డైరెక్టు నరకానికీ,
బాలన్సు ఎలా ఉంటుంది? మాకు అసలు కాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్లేమో స్వర్గానికీ పోతారు గాని
ఉండవు. చందమామ పుస్తకంలో చూడండి.. మాకు లాగా దయ్యం జన్మంటూ ఉండదు.
మా బొమ్మలు ఎంత అందంగా వేస్తారో   పొట్ట అందుకని వాళ్ళు రాసేదేమిటో మాకు తెలిసే
కిందినించీ చక్కగా చేపలాగా సన్నగా ఉంటుందన్న ఛాన్సే లేదు.
మాట! ఇంకా పాటలూ ఏడవడాలూ అంటారా!
అవన్నీ సినిమా వాళ్ళు పెట్టేవే! ఏడవడం కొన్నాళ్ల తరువాత ఒక కొత్తగా  పెళ్ళైన
అయితే మానేజ్  చెయ్యచ్చేమో గానీ పాటలంటే జంట వచ్చేరు. వాళ్ళు రాత్రిళ్ళు పడుకున్నప్పుడు
వెనకాతల  ప్లే బాకూ, మ్యూజిక్కూ ఎవడు చూడాలంటే నాకే సిగ్గేసేది. మగ దయ్యాన్ని కదా..
కొడతాడు? నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్లెవరూ అలా చూడ్డం తప్పు అని నేనే బయటికెళ్లిపోయి  
దెయ్యాలవలేదు. ఏ చింతచెట్టు మీదో ఆ రాత్రికి ఆడుకుంటూ
గడిపేవాణ్ణి. అయినా నా మంచితనం ఎవరూ
పాటలంటే గుర్తొచ్చింది. మా గుర్తించలేదు. మొగుడు ఆఫీసుకెళ్లిపోయి ఈ
రూములో కొన్నాళ్ళు ఓ కవో రచయితో అమ్మాయి ఒక్కతీ ఉన్నప్పుడు పాపం ఒక్కత్తే
ఒకాయన ఉండేవాడు. అతను కాళ్ళెప్పుడూ వంట చేసుకుంటోంది కదా! అని అవీ ఇవీ అన్నీ
టేబులు మీద పెట్టుకొని చేతిలో పెన్ను తీసికెళ్లి పొయ్యి దగ్గర పెట్టేవాణ్ణి. ఆ అమ్మాయికి
పెట్టుకొని ఆలోచిస్తూ ఉండేవాడు. అతను అస్సలు కృతజ్ఞత లేదు. కెవ్వు కెవ్వు మని అరిచేది.
కింద నించీ మా ఓనరత్త  వచ్చి ‘ఈ పాడు
ముండా దెయ్యం ఎప్పుడు పోతుందో ‘ అని
శాపనార్ధాలు పెట్టేది. నేను ఆడ దెయ్యాన్ని కాదు
బాబోయ్ అంటే వినిపించుకోరే!

అసలు సినిమా వాళ్ళననాలి. అన్నీ


ఆడ దెయ్యాల్నే చూపిస్తారు. ఎప్పుడో ఓ సారి
మగవాళ్ళని చూపిస్తే వాళ్ళని దెయ్యాలనరు.
ఆత్మలంట. పైగా ఇవి ఓన్లీ పగ తీర్చుకోవడానికే
పుడతాయి. పగ తీరగానే వెళ్లిపోయి ఎక్కడో
అక్కడ ఉండొచ్చు కదా! అలా కాదంట.
గాలిలో గాలిగా కలిసిపోవాలంట. వీళ్ళ శ్రాద్ధం
16
నవంబర్ - 2022
పెట్ట. పగ తీర్చుకోడం తప్ప మగ దెయ్యాలకి
వేరే పనిలేనట్టూ, ఎవడినో ఒకణ్ణి ప్రేమించి
చచ్చిపోయి వాడి గురించి ఏడవడమే ఆడ
దెయ్యాల పనైనట్టూ తప్పితే ఇంకోలా సినిమాలు
తియ్యరు కదా! పైగా అన్ని ఆడ దెయ్యాలూ
హీరోయిన్లలాగా, వాంపుల లాగా సెక్సీగా
డాన్సులొకటీ. మళ్లీ ఆ డాన్సులు చేసేటప్పుడు
మాత్రం పాదాలు ముందుకేఉంటాయి. వీళ్ళ
ఆ మట్టున భూతవైద్యుడంట, ఒకణ్ణి
తెలివి తగలెయ్య! అసలు మాకు కాళ్ళే ఉండవు
పిలిపించారు. వాడొచ్చి ఒకటే హడావుడి.
మొగుడో అంటే విని చావరు.
ముగ్గులేశాడు.... నిమ్మకాయలు పెట్టాడు.
మధ్యలో ఏదో ఓ బొమ్మా, ఓ సీసా పెట్టాడు.”
కొత్త జంటా, కవీ  ఖాళీ చేసి వెళ్ళిపోయాక
హ్రాం.... హ్రీం... ఓం...ఫట్ స్వాహా “
మా గదిలోకి ఓ  సింగిల్ కుర్రాడు వచ్చి చేరాడు.
అంటూ ఒకటే అరుపులు. నాకు చిరాకేసి
నాకు నవలలూ, కథలూ చదవడం అంటే ఇష్టం.
“ ఏయ్! ఏంటీ గోల! పుస్తకాలు చదువుకోనివ్వవా?
మరి మాకేమో పిశాచభాషలో ఒకటే పుస్తకం.
“ అన్నాను. గురుడు ఖంగారు పడ్డాడు.అటూ
అదీ ఎప్పుడో తాతల కాలంలో గుణాఢ్యుడు
ఇటూ వెర్రి చూపులు చూసాడు మొదట.
అనే ఆయన రాసేట్ట. ఎన్ని సార్లని చదువుతాం?
భయపడుతూనే ఇంకా మంత్రాలు ఎక్కువ
మామూలు భాషల్లో పుస్తకాలు చదవాలంటే
చేశాడు.  సీసా చేతిలో పెట్టుకుని “రా! ఇందులోకి
ఎవరినో ఒకర్ని ఆవహించాలి కదా. అందుకని
రా... నీ సంగతేంటో చూస్తా!”అంటూ ఒకటే
ఆ కుర్రాణ్ణి ఆవహించి చక్కగా అన్ని పుస్తకాలూ
అరుపులు. సరదాగా సీసాలోకి వెళదామనుకున్నా,
చదువుకుంటూ ఉండేవాణ్ణి. ఆ కుర్రాడు అన్నమూ
గాని పిన్ని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
పానమూ మానేసీ, కాలేజీ కెళ్లడం మానేసీ
పుస్తకాలు చదువుకుంటూ కూర్చుండిపోతే మా
ఇలాంటి సీసాల్లోకి వెళితే మామూలుగా
ఓనరు మామయ్యకి  అనుమానం వచ్చి వాళ్ళ
అయితే బయటకి రావచ్చు గానీ వీడు గానీ నిజం
అమ్మానాన్నల్ని పిలిపించాడు. వాళ్ళ అమ్మా
గానే  సముద్రంలో పడేస్తే మనకి ఈత రాదు
నాన్నా వచ్చి ఒకటే ఏడుపు.
కదా. అన్యాయంగా మునిగిపోయి
ఇంకోసారి చచ్చిపోవాలి. ఒక సారి
నాకు చిరాకేసి “ఇదిగో! ఊరికే ఆ
చస్తే దయ్యమయ్యాను. మళ్లీ
శోకాలేంటి? నేను మీ వాణ్ణేమన్నా కొరుక్కొని
చచ్చిపోతే ఏమవుతానో ఏంటో..
తింటున్నానా? ఏదో నా మానాన నేను పుస్తకాలు
??? ఎందుకొచ్చిన గోల! వీడు
చదువుకుంటుంటే ఏంటి మీ గోల! ఇలాంటి 
ఎలాగూ  నన్ను చదువుకోనిచ్చేటట్టు
పుస్తకాలు  వందో యాభయ్యో చదివేసి
లేడని చెప్పి నేను వెళ్లి అటక మీద
వెళ్లిపోతాలే!” అన్నాను. వాళ్ళమ్మా నాన్నా
కూర్చున్నా. 
నిర్ఘాంతపోయి ఢామ్మని కింద పడ్డారు.
17
నవంబర్ - 2022
నేను వదిలేసిన వెంటనే ఆ కుర్రాడు
లేచి “అమ్మా! నాన్నా! మీరెప్పుడొచ్చారు?
ఎందుకొచ్చారు? “ అన్నాడు. ఇంకచూసుకోండి..
భూతవైద్యుడి వీరంగం... “చూశారా! ఒక్క
దెబ్బతో ఎలాంటి దయ్యమైనా దిగిపోవాల్సిందే!
ఈ వీర్రాజు దెబ్బా........గోల్కొండ అబ్బా
అనాల్సిందే .... చూడండి  ఈ దెయ్యాన్ని ఈ
సీసాలో బంధించాను. ఇక దీని ఆటకట్టు.. నవ్వీ నవ్వీ పొట్టంతా నెప్పెట్టేసింది. ఆ
ఇప్పుడే వెళ్లి దీన్ని సముద్రంలో విసిరేస్తా!” దెబ్బతో మా  ఓనరు మామయ్య చాలా
అంటూ హడావుడి చేశాడు. భయపడిపోయి ఈ రూముని దాదాపు ఆర్నెల్ల
బట్టి ఎవరికీ అద్దెకివ్వటం లేదు. బాగా బోరు
పాపం కుర్రాడి తల్లిదండ్రులు కూడా కొట్టి ఏమీ చెయ్యడానికి లేక ఇంక నా ఆత్మ కథ
చాలా సంతోషించి, వాడికి చాలా డబ్బులు రాయడం మొదలు పెట్టాను.
ఇచ్చారు. వాడు అన్నీ సర్దుకుని వెళిపోతూ
తిన్నగా ఉండకుండా పైకి చూస్తూ “దీన్నే కాదు ఇంక లాభం లేదు..కష్టమో నష్టమో మా
దీని బాబునైనా సరే వంచుతా! దీని వేషాలు నా పిన్నీ వాళ్ళ కాలనీకే వెళిపోతాను. మా పిన్నీ వాళ్ళ
దగ్గర కాదు..” అంటూ గప్పాలు కొట్టాడు. ఫ్రెండు నాకు సంబంధాలు చూస్తోంది కదా. 
ఆ ట్రైన్ ఆక్సిడెంట్
ఇంక నాకు ఒళ్ళు మండింది.  నేనెవరో అమ్మాయి లాగ ఎవళ్ళో
ఆడో మగో కూడా తెలీకుండా దీన్నీ దాన్నీ ఒకళ్ళని చేసేసుకుంటే
అంటాడా అంచెప్పి ఒక్కసారి ఆ కుర్రాడి బాధలన్నీ తీరి నాకూ
లోకి వెళ్లి భూతవైద్యుడి నడ్డి మీద ఒకటే ఓ తోడు దొరికి సింగిల్
తన్నుతన్నాను. పాపం బొక్క బోర్లా పడి “అయ్య దెయ్యాన్ని కాస్తా  జంట
బాబోయ్! ఎవరు నన్ను తన్నిందీ!” అంటూ దెయ్యాలమౌతాం.
వెనక్కి చూసాడు. ఇదే సందని చెప్పి నేను
ఒక్కసారి  నా ఒరిజినల్ ముఖం చూపించి ఇదిగో ఈ మామయ్య గాణ్ణి తాట
నా మామూలు టైపులో  “హ్హా...హ్హా...హ్హా...” తియ్యచ్చు. అప్పటి దాకా కొద్ది రోజులు
అంటూ నవ్వాను. అంతే....” వామ్మో ఇది చాలా విరామం అన్న మాట. ఉంటాను మరి.
పెద్ద దయ్యం... నావల్ల కాదు...కామిని, పిశాచి ,
డాకిని “ అంటూ గురుడు మళ్లీ వెనక్కి తిరిగి --*--
చూడకుండా బ్రతుకు జీవుడా అనుకుంటూ
పరుగో పరుగు.....

18
నవంబర్ - 2022
నీవు లేవు
కళ్ల లో నీటి దీపాలు వెలిగించుకొని
ఎన్ని కాలాలు నిరీక్షించినా
మళ్లీ రావు..

ఈ ఒంటరి జీవితం
దిగులుగా వుంది
సశేషం నన్ను వొదలనని
నువ్వు వాగ్ధానించినంత
చేదుగా వుంది

మనసుతో .. మాటలతో
నా చుట్ టూ మెదిలిన అలికిడి
ఇదిగో..
నా చీకటి సమాధిప�ై
ఆశల మొక్కలు మొలిపిసతుంది ్
ఇష్టంగా చూసే నీ కళ్ల కోసం
ఆకాశంలో వెతుకుతోంది

మన చెలిమి సమక్షాన
నీవు విత్తి న ఊసులు
నాకు రోజూ కవిత్వాన్ని
నేర్పుతున్నాయి
అదుపుచేయలేని ఆర్ద్ర తను
గుండెకు కలిపి కుడుతున్నాయి

నీకు చెప్పాల్సింది
ఇంకా ఎంతో వుంది
ఎంత చెప్పినా
తరగనంత దుఃఖం
నావ�ైపు జాలిగా చూస్తుంది

నీవు లేవు..
ఎన్నిసార్లు తడుముకున్నా
ఈ నొప్పికి ఉపశమనమూ లేదు

- సునీత గంగవరపు

19
నవంబర్ - 2022
నాలో… నేను
- K. నరసింహమూర్తి

నిశ్శబ్ధ నిశీధిలో డాబాపై ఒంటరిగా “ఆ మాటని గుండెలపై చేయి వేసుకు


చెప్పు, పోనీ నేను అడిగిన వాటిలో ఒక్కదానికైనా
కూర్చొని శూన్యాకాశంలోకి చూస్తున్ననాకు
సరైన సమాధానం చెప్పగలవా?” యీసారి
నాలుగు తారలు తళుక్కున మెరిసి
అంతరాత్మ గొంతు గంభీరంగా మారింది.
మాయమయ్యాయి, మేఘాలు వాటిని
అడుగు అన్నట్లు తల ఉపాను;
మూసాయా లేక మేఘాల చాటుకు అవి
వెళ్ళాయా అర్ధం కాలేదు.
“తల్లితండ్రులకు కొడుకుగా ఏంచేసావ్,
అన్నలకి, అక్కలకి తమ్ముడిగా ఏంచేసావ్,
ప్రక్కనే నవ్వు వినిపించింది,
కట్టుకున్న భార్యని ఎంత లక్షణంగా చూసు
ఎవరన్నట్లుగా ప్రక్కకి తిరిగి చూశాను, ఓ
కున్నావ్, ఎన్ని నగలు కొనిచ్చావ్, కన్నబిడ్డలకైనా
ఆకారం కనబడుతోంది, కానీ ఎవరో స్పస్టంగా
కనబడలేదు, ఇంతలో రోడ్డు మీద తిరుగుతున్న
వాహనాల వెలుతురులో ఆ ఆకారం స్పస్టంగా
కనబడింది, అది నా అంతరాత్మే;
“ఏం నన్ను చూస్తే నవ్వు వస్తుందా?”
కోపంగా అడిగాను.
“కాదు జాలేస్తుంది” ఇంకా నవ్వుతూనే
చెప్పింది.
“ఎందుకంత జాలి, నేనేమీ కష్టాలలో
ఉన్నానని?” లేని దర్పం తెచ్చుకు అడిగా;

“ఇంకా ఎందుకు ముసుగులో


బ్రతుకుతావ్, అయిదున్నర పుష్కరాలు
చూశావ్, ఏం వెనకేసావ్, ఏం సంపాదించావ్?”
“అలాగని నేనేం దీనస్థితిలో లేనే” నన్ను
నేను సమర్ధించుకున్నా;

20
నవంబర్ - 2022
వారు కోరుకున్న చదువులు చెప్పించ గలిగావా? నడుస్తోంది, భవిష్యత్తు ఒకరికి భారంగా,
సరైన జీవితాలని అందించ గలిగావా?” శ్వాస సంపాదన లేక, జవసత్వాలుడిగి చీదరింపులు,
పీల్చుకునేందుకు ఆగినట్లు ఉన్నది. ఛీత్కారాల మధ్య తెల్లారుతుందేమేనని,
భయానకంగా కనిపిస్తోంది.
“నా స్థితికి తగ్గట్లు చూసుకున్నాను, ఏం
తక్కువ చేశాను” తప్పు ఒప్పుకోవటానికి నా “చూడు నువ్వు చిన్నప్పటి నుంచి
మనస్సు అంగీకరించలేదు. ఊహల్లో బ్రతికావ్, వాస్తవాన్ని విస్మరించావ్, నీ
తెలివితేటలని యితరులకి పెట్టుబడిగా పెట్టావ్,
“ఆగు ఇంకా నేను అడిగేది పూర్తి వ్యాపారం అన్నావ్, భాగస్వామ్యంలో దిగావ్,
కాలేదు, స్థితి గురుంచి మాట్లాడు తున్నావ్ కుటుంబాన్ని నడిరోడ్డు మీదకు లాగావ్, అవునా,
అంతా నీస్వయంకృత అపరాధం కాదా, స్థిరపడే కాదా?” చాలా కఠినంగా ఉంది అంతరాత్మ
అవకాశాలెన్నో వదులుకున్నావ్, అరకొర జీతంతో గొంతు;
పిల్లల ఆశలపై, వారి అభివృద్ధి పై నీరు చల్లావ్,
జీవశ్చవంలా బ్రతికేస్తున్నావ్”, ఛీత్కారంగా “నీ జీవితం ఎన్నిమలుపులు తిరిగిందో
పలికింది అంతరాత్మ గొంతు; మర్చిపోయావా, టీచర్, ట్యూటర్, పేపర్ బాయ్,
సేల్స్ మేన్, మార్కెటింగ్ ఏజెంట్, ఇలా ఎన్నో
“అవును నిజమే అంతా నాతప్పిదమే, అవతారాలెత్తావ్, ఎందులోనూ స్థిరం లేకుండా
చాలీచాలని సంపాదనతో, సంసారాన్ని పోయింది, కాలాన్ని వృధా చేసి జీవితాన్ని
లాక్కొచ్చాను, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు సర్వనాశనం చేసుకున్నావు” అంతరాత్మకి కోపం
వచ్చినట్టే వచ్చి చేజారిపోయేవి” స్వగతంగా ఎక్కువై పోయింది.
అనుకున్నాను.

“ఏం మాట్లాడవేం, గొంతు పెగలటం


లేదా, లేక ఎలా సమర్దించు కోవాలా అని
చూస్తున్నావా?” అంతరాత్మ ప్రశ్నిచింది.

“ప్లీజ్ ఇంక ఆపు, చచ్చిన పాముని ఇంకా


చంపకు, ఇప్పటికే సగం చచ్చి బ్రతుకుతున్నా”
అంతరాత్మనే వేడుకున్నాను.

గతం భారంగా వారూ, వీరు అందించిన


సహాయ సహకారాలతో గడిచింది, వర్తమానం
దిన దిన గండం నూరేళ్ళాయుశ్సుగా నత్తనడక

21
నవంబర్ - 2022
పశ్చాత్తాప హృదయంతో దీనంగా అంతరాత్మ “అవును నన్ను క్షమించు, ఇప్పటినుంచి
వైపు చూశాను. నీకు కష్టం కలిగించే లా నడచుకోను, శక్తి
ఉన్నంతవరకు కష్టపడతా” అంతరాత్మకి మాట
“ఎన్నో అవమానాలు పొందావు, అన్నిటిని ఇచ్చాను.
దిగమింగు కున్నావు, నువు తీసుకునే నిర్ణయాలేవీ
సరైనవి కాదని గుర్తించలేక పోయావు, చేతులు కన్నీరింకిన నా కళ్ళ నుంచి రెండుకన్నీటి
కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు బొట్లు నేలమీద పడ్డాయి.
కదా, నీవల్ల నేనెంత నరకం అనుభవించానో “ఏమండీ ఏం చేస్తున్నారు, చంటాడ్ని
తెలుసా, ఒక్కొక్కసారి బలవన్మరణం యిలా ఒదిలేశారేమిటి పని చేసుకోనివట్లేదు”,
పొందాలనుకొనే వాడిని.” అంతరాత్మ గొంతు మా మనవడి మీద పిర్యాదుతో మా
భాధగా మూలిగింది. ఆవిడ గావు కేక పెట్టింది క్రింద నుంచి;
ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చిన నాకు,
“నువ్వా ఎందుకని” అమాయకంగా నా ప్రక్కన అంతరాత్మ కనబడలేదు. బహుశా
అడిగాను. మాఆవిడ గావు కేకకి భయపడి పారిపోయి
ఉంటాడు లోపలికి.
“దెబ్బ కొడితే శరీరానికే తగులుతుంది,
హేళనలు, వెటకారాలు చీదరింపులు, “ఓహ్ ఇదంతా నాఊహేనా, లేక బ్రతుకు
ఛీత్కారాలు, అవమానాలు నీలో ఉన్న నాకు కాక భయమా” అనుకున్నాను.
యింకెవరికి తగులుతాయి” చాలా భాధ పడింది
అంతరాత్మ. ఊహే అయినా కూడా అది నిజమే కదా,
నాలో ఉన్న నేనుని భాధ పెట్టే అధికారం నాకెక్కడిది.
కష్టపడి బ్రతకాలనుకున్నాను చివరిశ్వాస
వరకు;

--*--

22
నవంబర్ - 2022
నేను ఇంటికి చేరేదాక మా ఆవిడ మా వారు గతంలో ఎప్పుడో జరిగిన
ఎదురుచూపులతో విరహం... పొరపాటు విషయాలు తవ్వుతూ....
తీరా ఇంటికి చేరేక ఏదో నెపంతో ఈరోజు మూడ్ పాడు చేయడం ఆయన
కలహం... ఇదేనండి నా సమస్య. అలవాటు. ఆయనతో వేగలేక ఛస్తున్నాను... ఇదే
-- పి. నాగేశ్వరరావు నా సమస్య.
విజయనగరం. -- K. సూర్య కుమారి
ఆముదాలవలస.
___ ____

మా ఆవిడ వద్దన్నా, పొద్దున్న నా ముఖమే ఇప్పుడు కాదు కానీ.... ఓ ఇరవై ఏళ్ళ


చూస్తుంది.. క్రితం మా పెళ్ళైన కొత్తల్లో మా వారు నన్ను
తరువాత వంటపనుల్లో గ్లాసు క్రింద తన సైకిల్ మీద ముందు కూర్చో బెట్టుకుని
పడినా, గిన్నె క్రింద పడినా........ ఎక్కడికైనా తీసుకు వెళుతుండే వారు..
‘ఈ రోజు ఏ వెధవ ముఖం చూశానో, ‘ అప్పుడు నా సమస్య ఏమిటంటే....
అని గొణుక్కుంటుంది.... తోవలో చాలా చిన్న చిన్న గుడులుండేవి..
ఆ వెధవ మొఖం నాదే కదా మరి! ఇదే నా మా ఆయన గుడి కనబడిన వెంటనే తన
సమస్య. కుడి చేతిని గుండెకు ఆనించి నమస్కారం
-- B. రామారావు. చేసేవాడు.. ఎడమ చేతితో హ్యాండిల్ బాలన్స్
చిత్తూరు. తప్పి ఇద్దరమూ క్రింద పడేవాళ్ళం..
అప్పుడు ఆలయాలు మా వారికి
_____ కనబడటమే నా సమస్యగా ఉండేది మరి..
- వి. అచ్యుతాంబ
దొండపాడు
_ _ _ _ _ _ _ _

23
నవంబర్ - 2022
నా సమస్య... మా చిన్నాడు ఏడ్చినప్పుడల్లా.. బెడ్ మీద నా కోసం మా శ్రీమతి ఎదురు
వాడిని సముదాయించడానికి మా ఆవిడ “నిన్ను చూడాలని ఎన్నో కలలు కని పెళ్లి చేసుకున్నానా...
గాడిదో... గుర్రమో ఎక్కిస్తాను ఊరుకోరా.. మా ఆవిడ నన్ను పట్టించుకోకుండా....
మీ డాడీ వస్తున్నారు “అంటుంది. ఆ ఒక పంది లాంటి బార్బీ బొమ్మను కౌగలించుకునే
గాడి ధో గుర్రమో నేనే అని మీకు తెలుసు కదా... పడుకుంటుంది ఎప్పుడూ...
అదే నా సమస్య.... --పైడిపతి రావు
--G.సుబ్బారావు. గుంటూరు
కొత్త వలస
________
________

కాస్తా సిల్లీగా అనిపించే మీ సమస్యలు మీరు కూడా


రాయండి. చదవగానే ఫక్కున నవ్వగలిగే సమస్యకు
బహుమతి గా రూ 100/- ఫోన్ ఫే చేయబడుతుంది.

24
నవంబర్ - 2022
ఒంటరి మహిళ
అబలని నేను…. ఆది పరా శక్తిని నేను మోయలేని భారలు.
వితంతువుగా మారిన ఒంటరి మహిళని నేను.

అన్ని భరిస్తూ పెదాలప�ై చిరునవ్వు


మూడు ముళ్ళ బంధం తెగిపో యిన పులుముకుని..
దానిని… సమాజంలో గుర్తింపు కోసం
ముత్ై తదుతనం మాసిపో యిన ముళ్ళ బాటలో పయనించాను.
దానిని.

గమ్యం చేరెలోపే కాలం కన్నేర్ర


అడుగు ముందుకు వేసతుంటే
్ దెప్పి చేసింది…
పొ డిచే సమాజంలో… కన్న కలలన్నిటిని కన్నీటితో
ఆదరించి ఆదుకునే వారు లేని నింపేసింది.
ఒంటరి మహిళని.

నడిరోడ్డు నే మీద పడి కోరిక


ముళ్ళ బాట అని తెలిసి అడుగు తీర్చుకునే
ముందు కేసాను.. కామాంధుల క్
రూ రత్వానికి కదిలే
మాటే బరువవుతున్న బొ మ్మనయ్యను.
మనసుకి చిరునవ్వులు
అద్దాను. కామంతో క�ైపెక్కిన
మగ మృగాల చేతిలో
కన్న కలలను నిజం బలిపశువునయ్యాను.
చేసుకోవడానికి … చేతకాని నిత్సహాయురాలినయ్యాను.
సమస్యలతో సాగిపో తున్నాను
ముందుకు.

కలకలలాడే కళ్ళలో కన్నీటిని నింపుకుని..


కదిలిపో తున్నాను జీవితం అనే చదరంగంలో.

నా ప్రయాణంలో ఎన్నో అంతులేని వ్యథలు… - అఖిల తొగరి


అడుగడుగున అవమానాలు..,

25
నవంబర్ - 2022
మేఘమా
- కోడూరి రవి

కూలర్ లో నీళ్ళు పోసుకుని ఇక


చల్లగా నిదుర పోదామని ఆన్ చేయబోతుండగా
కరెంటు పోయింది. దిక్కు మాలిన కరెంట్
ఇప్పుడే పోవాలా అని తిట్టుకుంటూ మంచం
వాకిట్లో వేసుకున్నాడు. నాన్న కూడా
బయటే పడుకుంటానంటే తన మంచమూ
ఇక తప్పుతుందా అనుకుంటూ పిల్లల
మంచమూ చివరగా తన శ్రీమతి మంచమూ
తీసుకువచ్చి ఆరు బయట పడుకున్నారు.

ఎండాకాలం వచ్చిందంటే ఇదే తంతు సరిగ్గా


కరెంటుండదు.మామూలే గదా అనుకుంటూ
మంచం మీద పడుకుని ఆకాశం వైపు
చూసాడు. హాఁ ఇక మొదలైంది. చుక్కలన్నీ
చక్కగా దాక్కున్నాయి.మబ్బులు గుంపులు షాపింగ్‌ చేసి బయటకు వచ్చి చూస్తే లోపల ఎ.సి.
గుంపులుగా వచ్చేస్తున్నాయి. కొద్దిగా కునుకు వల్ల తెలియలేదు. మిట్ట మధ్యాహ్నమయింది.
పడుతుందనుకున్న సమయం చూసి ఏ ఎండ మండిపోతోంది.అయినా తప్పదు గనుక
అర్దరాత్రో అపరాత్రో ఈ మబ్బులు ఉన్న పలంగా చిరాకు పడుతూనే ఇంటికి బయలుదేరాడు.
ఇంట్లో కి పరుగులు తీయిస్తాయి.దొంగ లాగా ఎండను తిట్టుకుంటూ ఈ మేఘాలు
వస్తుంది వాన అనుకుంటూ విసుక్కున్నాడు. ఎక్కడకు వెళ్లాయి అని మండిపడుతూ ఇల్లు
చేరుకున్నాడు. వడదెబ్బ తాకినంత పనయింది.
మధ్యాహ్నం ఎండగా ఉంటే కాస్త మబ్బులు కూల్ డ్రింక్ తాగినా చల్లని లస్సీ తాగినా ఫలితం
కమ్మితే బాగుండుననుకున్నాడు.ఉగాది కి కొత్త లేకపోయింది. ప్రాణం బేజారయిపోయింది.
బట్టలు తెచ్చుకుందామని సిటీకి బయలుదేరాడు.
విపరీతమైన ఎండ....ఎలాగోలా వెళ్ళి షాపింగ్ అప్పుడు మబ్బులను కోరిన మనస్సు ఇప్పుడు
మాల్ లో దూరిపోయాడు. రెండు గంటల పాటు వాటినే కసురుకుంటున్నది.ఇప్పుడు కళ్ళు

26
నవంబర్ - 2022
మూసుకుంటే చాలు హాయిగా నిద్ర పడుతుంది. మీకు అవసరముంటే ఒకలా లేకపోతే ఇంకొక
ఇక నడి రాత్రిలో నిద్రాభంగం చేస్తూ ఉరుములు లాగా వ్యవహరించే మీ మానవ తప్పిదాలకు
మెరుపులతో ఈ మబ్బులు పరుగులు పెట్టిస్తాయి. సమస్త జీవకోటి ఎలా తల్లడిల్లి పోతుందో నీకు
* * ** చూపిస్తాను రా “ అంటూ తీసుకు పోతోంది.
ఎక్కడినుంచో ఒక మేఘం ఉరుముతూ
వచ్చి ఉగ్ర రూపం దాల్చి తన చొక్కా కాలరు కాలర్ వదిలేసి జుట్టు పట్టుకుని కుదుపుతూ
పుచ్చుకొని ఆకాశం వైపు ఈడ్చుకుపోతోంది. “ చూడు నీళ్ళు లేక ఎండిన చెరువులను,
ఊపిరాడక ప్రాణం ఉక్కిరిబిక్కిరి అయిపోతోంటే తడారిపోయిన వాగులనూ నదులనూ, బీడువారి
“ కాపాడండి కాపాడండి “ అని గట్టిగా చెక్కలవుతున్న పొలాలను....” అంటూ
అరుస్తూ_ అసలు ఈ మేఘమేమిటి తననిలా కోపగించుకుంటున్న మేఘంతో “ ఇందులో
లాక్కుపోవడమేమిటని గాబరా పడిపోతోంటే... నా తప్పేముంది “ అని నీళ్ళు నమిలాడు.

ఎందుకు లేదు. సమృద్ధిగా నీళ్లున్న నాడు


ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసావు.లోక కళ్యాణం
కోసం కురిపించిన వర్షపు ధారలు నీ ఒక్కడికే
సొంతమనుకున్నావు.పశుపక్ష్యాదులు అడవులు
చెరువులు వాగులూ ఏవీ నీకు పట్టలేదు. సరే
ఆ నీటినయినా సరిగా వినియోగించుకున్నావా
అంటే అదీ లేదు. ఇంకుడు గుంతలు తవ్వండి.
ఉన్న నీటిని పొదుపుగా వాడుకొండి నాయనా అని
ప్రభుత్వాలు ఎంత జెప్పినా వినబడదు.ఎండాకాలం
వచ్చిందంటే చాలు బోర్లు వేసి వేసి భూమాతను
కుల్ల బొడుస్తున్నారు.ఇంకుడు గుంతలు
ఓరీ మూర్ఖ మానవా నోరు మూసుకుని నా తవ్వితే ఇంత ప్రమాదం ఉండేది కాదు గదా.
వెంట వచ్చెయ్.లేదా మధ్యలోనే ఇలా వదిలేసానా
ఊపిరాడక భూమి మీదకు చేరుకునే లోపే చచ్చి అదిగో అలా చూడు ఆ అడవిని
ఊరుకుంటావు. “ అని గద్దించింది మేఘం. చూసావా ఎలా అల్లాడి పోతున్నదో.ఆ ఏనుగును
చూడు ఎంత తల్లడిల్లి పోతుందో. పరుగులు తీసి
“ సరే సరే తల్లి...మేఘమా! ఏమిటి ఉరకలు వేసే ఉల్లాసం తో గడిపే ఆ జింకను
నన్నెందుకు ఇలా ఈడ్చుకు పోతున్నావు? నేను చూడు.ఎండ వేడి తట్టుకోలేక తాగేందుకు
చేసిన తప్పేమిటి? “ అంటూ రెండు చేతులు ఒక్క చుక్క నీరు లేక ఎండి ఎడారయిపోయిన
జోడించి వినయంగా నమస్కరించాడు. నదులను చెరువులను చూసి ఎంతగా
విలవిలలాడిపోతున్నదో. రాజసం ఉట్టిపడే ఠీవితో
“ అలా రా దారికి..... చెప్తాను ... అడవికే అందం తెచ్చే ఆ సింహం చూసావా గుహలో
27
నవంబర్ - 2022
ఉండలేదు బయటకు వచ్చి ఈ పరిస్తితులలో ప్రభుత్వాలను చూసి కూడా నీలో మార్పు రాకపోతే
ఇమడలేదు.ఇవన్నీ మానవ తప్పిదాలు కావా. అది నీ తెలివి తక్కువ తనం కాక మరేమవుతుంది.

నువ్వు ఎంత స్వార్ధపరుడివో నీకు తెలియనిదా. గంటసేపు నీరు రాకపోతే ఇంటికి


బట్టలు బయట ఆరేసుకుంటే వర్షమా ఈ ఒక్క మింటికి ఇంతలా ఎగిరెగిరి పడిపోతూ మబ్బలనూ
రోజు రాకు అంటావు.విపరీతమైన వానల వల్ల కాలాన్ని తిడతావు. పైసా పైసా కూడబెట్టుకున్న
నీ ఇల్లు ఊరుస్తుందని వర్షాన్ని శాపనార్థాలు డబ్బులు కోట్లకు పెంచేసుకుని జాగ్రత్తగా
పెడతావు.అప్పుడు పంట పొలాలకు దాచి పెట్టుకుంటావే.మరి మేము ఇచ్చిన
అత్యవసరమైన వర్షం నీకు మాత్రమే వద్దంటావు. చుక్క చుక్కా నీటిని చక్కగా భద్రపరుచుకునే
అలవాటు ఎప్పుడు చేసుకుంటావు.
నీకు తాగడానికి నీరు లేకపోతే స్నానానికి
వాగులు పారకపోతే వాగులను వర్షాలను ప్రతీవాడికీ కాలాన్ని మబ్బుల్నీ ప్రకృతి
తిడతావు. వాగు మాత్రం ఏమి చేస్తుంది మూర్ఖ ని తిట్టడం ఫ్యాషనయిపోయింది.” అంటూ
మానవా! ఒకసారి అలా చూడు. అక్కడ ఈసారి మెడ పట్టుకుని గట్టిగా నొక్కబోయింది.
చూసావా పారుతున్న వాగును ఎన్ని ఇబ్బందుల కానీ ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్న
పాలు జేస్తున్నారో.ఆ నీటిని ఎంత పొదుపుగా మానవుడి మీద జాలి కలిగి వదిలేసింది.
వాడుకోవాలో నీకు తెలియదా.ఇంతగా బరబరా ఈడ్చుకుంటూ ఇలా రా
వృధా చేసి చివరకు మమ్ములను వాగులనూ ఇక్కడ చూడు అని మేఘం చూపిస్తోంటే..
నదులనూ నిందించడం మీ మూర్ఖత్వం కాదా. “ అయ్యో మా నాన్న మా నాన్న ,ఏమయింది మా
నాన్నకు “ అంటూ దుఃఖితుడయ్యాడు మానవుడు.

ఊఁ...ఊరికే అలా అరవకు


చూడు అని గద్దించింది మేఘం.

నాన్నకు రోజూ వాగుకు వెళ్ళి బట్టలు


ఉతుక్కుని నీటిని వృథా చేయకుండా
హాయిగా స్నానం చేయడం అలవాటు.

ఈరోజు నీళ్లన్నీ మురికిగా ఉన్నాయి.


ధార కూడా పెద్దగా రావడం లేదు. సన్నగా
వస్తున్న నీటిని చూసి పైకి దృష్టి సారించాడు.
మేము ఎంతో ప్రేమగా ఇచ్చిన అంతా నాచు, ముళ్ళకంప అడ్డుగా పడిఉంది.
మెల్లగా నాచును తప్పిస్తూ అడ్డదిడ్డంగా ఉన్న
అమృతధారలను ప్రాజెక్టులు కట్టి పదిలపరచి
చెట్ల తీగలను తొలగిస్తూ కొంచెం ముందుకు
అవసరమయినపుడెల్లా...చూడు ఈ ఎండాకాలం
వెళ్ళి ముళ్ళ పొదల్లో పడిపోయాడు.
కూడా మీ పంటపొలాలకు అందిస్తున్న
28
నవంబర్ - 2022
“ అయ్యో నాన్న నాన్న “ మానవుని ఆవేదన. వదులొద్దు “ అంటూ కిందపడిపోతూ .....
“ ఊఁ ఉండు “ మేఘం గర్జన. నాన్న నాన్న నాన్నా అంటూ అరవసాగాడు.
బాగా దాహంగా ఉంది. తాగడానికి “ రేయ్ ఏమయిందిరా ఏమయింది “ అంటూ
చుట్టూ ఉన్నా ఆ నీరంతా నాన్న వచ్చి, ఇంతపొద్దెక్కేవరకు కలవరిస్తూ
క లు షి త మై పో యిం ది . లే వ లే క పో తు న్ నా డు ఏమిట్రా ఈ నిద్ర లే లే అంటూ కుదుపుతూ
నాన్న. మూలుగుతూ ఉన్నాడు. ఉంటే కళ్ళు నులుముకుంటూ లేస్తున్న తనకు
వాస్తుదోషం లేకుండా ఈశాన్యంలో పెట్టుకున్న
“ అయ్యో మా నాన్న మా నాన్న.. ఇంక నల్లా బలబలా జలధారలు కురిపిస్తూ కనిపించింది.
నాకు బుద్ధి వచ్చింది. అమృతధారలవంటి నీటిని
ఎన్నడూ నేను వృధా చేయను.....నాన్న నాన్న... “ అయ్యయ్యో ఈ నల్లాను ఎవరు ఆన్ చేసి
ఉంచారు అంటూ సాష్టాంగ పడి నమస్కారం
ఉఁ మూర్ఖుడా ఇంక వెళ్లు.. పో.. చేస్తూ .....తల్లీ నీకు వందనం అంటూ లేచి
“ అంటూ చొక్కా కాలరు వదిలేసింది. ఒక్కసారి ఆకాశం వైపు చూస్తూ మేఘమా!
నీకు శతకోటి వందనములు అని గాఢంగా ఊపిరి
“ అయ్యయ్యో నన్ను వదులొద్దు పీల్చుకున్నాడు.

--*--

29
నవంబర్ - 2022
ఈ నెల చిత్రం

బ్రతుకు బండి
చిత్రకారుడు: పి. ధనుంజయ ప్రసాద్
విశాఖపట్నం, సెల్ .7780186837

30
నవంబర్ - 2022
ఉంటే కదా!..
- సుమ కైకాల

అప్పారావు ఉన్నట్లుండి స్పృహ “కావచ్చు డాక్టరు గారూ... నా పెళ్లి అయినప్పటి


కోల్పోయాడు. హడావిడిగా ఆస్పత్రికి నుండి చూస్తున్నాను. ఇంత కాలం లేని తెలివి
తీసుకెళ్ళింది రమణి. ఇప్పుడెలా వస్తుంది?”

పరీక్ష చేసాక బయటకొచ్చిన డాక్టరు “మీ


ఆయనకి  కాసేపట్లో తెలివి వస్తుందమ్మా
ఇక ప్రమాదం లేదు” అన్నాడు.

“నేను నమ్మను డాక్టర్” అంది రమణి.

డాక్టర్ మాటలు మరచిపోయాడు.


“డాక్టర్ గా చెబుతున్నా... అతని
కండిషన్ బాగానే ఉంది”...

31
నవంబర్ - 2022
నల్లకాంతి వర్ణపటం

తుపానొకటి
రాబో తున్నానని చెప్పిన రాత్రి నవ్వీ నవ్వీ
నేన్నా గుడిసెను అలసటతో తూలింది
ఆకాశానికి దట్టించి నిలబడ్డాను ఒంటికి చుట్టుకున్న
ముందే ఉడికించి పెటటు ్కున్న సీతాకోకచిలుకలన్నీ ఎగిరిపో గా
నాలుగు గింజలతో ఆకలికి దిషటి ్ తీసి తుపానిప్పుడు నగ్నంగా నిలబడింది
గాలిహో రు కోసం చెవులు రిక్కించాను
ఆ రాత్రి తుపాను రాలేదు కళ్ళూ కాళ్ళూ
హృదయమూ వెన్నెముకా
పీడకలలతో విరిగిన రాత్రులు అంతటా ఒకటే వర్ణం
తిరిగి ఉదయాలుగా అతుక్కున్నాయి పొ రలుగా విచ్చుకున్న భూమి అడుగున
అప్పుడొ చ్చింది తుపాను మెరిసే జీవం రంగు
నక్కి నక్కి నా గడపలోకి జొరబడింది పెళ్ళలు పెళ్ళలుగా
మనిషి కూలిపో తున్నప్పుడు
నిద్రపొ డిచిన నా కళ్ళలోకి చూస్తూ భుజం మీద వాల్చుకుని వెన్ను నిమిరి
నీ గుండె వర్ణ పటంలో మళ్ళీ నిలబెట్టిన ఆదిమ రంగు
ఎన్ని కాంతులున్నాయని అడిగింది
ఇదిగో ఈ నలుపే నా కాంతిప్రపంచం అన్నాను గుప్పెడు నల్ల మట్టిని చేతికిచ్చాను
వలయాలు వలయాలుగా నవ్వింది ఒంటి నిండా పూసుకుని
నవ్వుతూ పొ లమారింది వెనక్కి వెనక్కి చూసుకుంటూ వెళ్ళిపో యింది
పొ లమారుతున్నా నవ్వింది

రాజ్యం రంగు రాజకీయం రంగు


అభివృద్ధి రంగు సాంకేతికత రంగు
చూడివిగో నాలో ఎన్నెన్ని రంగులున్నాయోనని
సంబరంగా చూపెట్టింది - సాంబమూర్తి లండ
చూపెడుతూనే నవ్వింది
32
నవంబర్ - 2022
అపాయం లో
ఉపాయం
- కొత్తపల్లి రవి

రామాపురం అనే ఊరు చెక్క ఏర్పాటు చేసుకున్నాయి. అన్ని పక్షులకు తమ,


తమ భాషలో దండోరా వేసుకున్నాయి, ఆ
బొమ్మలు, మట్టి బొమ్మలకు ప్రసిద్ధి. ఆ ఊరి
అత్యవసర సమావేశానికి అందరూ తప్పనిసరిగా
జనాలందరూ తరతరాలుగా ఆ బొమ్మలు చేస్తూ,
హాజరవ్వాలని.
పొరుగు ఊళ్లల్లో అమ్ముకుంటూ జీవనోపాధిని
అన్ని రకాల పక్షులూ ఒక పెద్ద చెట్టు
పొందేవారు. ఆ బొమ్మలకు మంచి ప్రాచుర్యం
మీద సమవేశమయ్యాయి. ఆ
రావడంతో ఎక్కడ ఎక్కడినుంచో
పక్షులలో పిల్లా, పెద్దా, ముసలి
జనాలు రామాపురం వచ్చి
అన్ని వయసుల పక్షులున్నాయి.
బొమ్మలు కొనుక్కుని వెళ్లేవారు.
అందులో యుక్త వయస్సులో ఉన్న
ఆ ఊరి పొలిమేరలో
నీలాంబరి అనే పావురం అందరినీ
దట్టమైన చెట్లు ఉండేవి. ఆ చెట్ల
ఉద్దేశించి మాట్లాడింది. “ఈ రోజు
మీద రకరకాల పక్షులు గూళ్లు
ఈ సమావేశానికి మనమందరం
కట్టుకుని జీవించేవి. ఉదయాన్నే
ఎందుకు హాజరయ్యామో
బయలుదేరి ఆ ఊరిలోకి వెళ్ళి
అందరికీ తెలుసు. గత కొన్నాళ్లుగా
ఆహారం సంపాదించుకుని సాయంత్రం తమ
మన పిల్లలను చూడకుండానే, గుడ్లగా ఉండగానే
గూళ్లకు చేరి తమ పిల్లలతో ఆ ఆహారాన్ని
పోగొట్టుకుంటున్నాం. ఆ బాధ వర్ణనాతీతం. ఆ
పంచుకుని ఆనందంగా జీవనం సాగించేవి.
బాధ ఏ ఒక్కరిదో కాదు. అందరం ఏదో ఒక రోజు
కానీ కొన్నాళ్లనుంచీ ఆ పక్షుల్లో ఒక
అనుభవిస్తున్నాం. ఇక ఈ బాధలు పడకుండా
ఆందోళన చోటు చేసుకుంది. అదేమిటంటే
శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. ఎవరికి తోచిన
ఉదయాన్నే మేతకు వెళ్ళి సాయంత్రం గూటికి
సలహా వాళ్లు మొహమాటపడకుండా ఇవ్వండి.
చేరేటప్పటికి తమ గూళ్లల్లోని గుడ్లలో కొన్ని
వాటిల్లో అత్యుత్తమమైన సలహాను
మాయమయిపోవడం. ఇలా
అందరం పాటిద్దాం” అని చెప్పింది
మాయమవడం అన్ని రకాల పక్షులు
నీలాంబరి.
గమనిస్తున్నాయి. కానీ ఎవరు తమ

గుడ్లను మాయం చేస్తున్నారో
ఆ పక్షుల లోంచి చంద్రావతి అనే
అర్ధం కావడం లేదు. అందుకే
పిచ్చుక ముందుకొచ్చింది. “మనం
పక్షులన్నీ అత్యవసర సమావేశం

33
నవంబర్ - 2022
మన గూళ్లను చిన్న చిన్న కొమ్మలు, ఆకులతో అందరి కోరిక మేరకు కాపలాగా ఉండడానికి
కట్టుకుంటున్నాం. కానీ ఆ కొమ్మలు బదులు మిత్రవింద ఒప్పుకుంది.
ముళ్ల కంపలతో కట్టుకుంటే ఎవరైనా మన గూళ్లు తెల్లారింది.. ఎప్పటిలాగే ఆ రోజు కూడా అన్ని
ముట్టుకోవడానికి భయపడతారు” అని చెప్పింది. పక్షులూ ఆహారం సంపాదించడానికి
“అలా ముళ్ల కంపలతో గూళ్లు కట్టుకుంటే గుడ్లు బయల్దేరాయి. ఎవరికీ కనపడకుండా మిత్రవింద
తీసే వాళ్లు భయపడతారు సరే! మన చిన్న ఆకుల చాటున కాపలా కాస్తోంది.
పిల్లలకు కూడా అది ప్రమాదమే కదా!” అని మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ఒక నల్లని
ఆ పక్షులలో ఉన్న శాంకరి అనే గుడ్లగూబ ఆ అడవి పిల్లి చెట్ల పైకి ఎక్కుతోంది. తనకు దొరికిన
సలహాలో ఉన్న ఇబ్బంది విడమర్చి చెప్పింది. గుడ్లు తీసుకుని పారిపోయింది. ఇదంతా దూరం
అన్ని పక్షులూ శాంకరి చెప్పింది కూడా నుంచి బాగా గమనించింది మిత్రవింద.
నిజమే అని వంత పాడాయి. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మరల అన్ని పక్షులూ
చాలా పక్షుల సలహాలు విని ఒక ఒప్పందానికి సమావేశమయ్యాయి. మిత్రవింద తను చూసిన
రాలేకపోయాయి. ఆఖరిగా మిత్రవింద అనే విషయం గురించి, ఆ అడవి పిల్లి గురించి
రామచిలుక వచ్చింది. చెప్పింది. ఇప్పుడు ఆ అడవి పిల్లిని ఏం చేద్దాం
అని ఆలోచనలో పడ్డాయి.
నీలాంబరి ముందుకు వచ్చి “ నాకు
ఒక మంచి ఉపాయం తోచింది. ఇది కొంచెం
కష్టతరమైనా మనం ఈ రాత్రికే అది చేసి తీరాలి.
ముందు మన గుడ్లను దగ్గరలో ఉన్న ఊళ్లో
చెట్ల మీదకు మార్చాలి. ఆ ఊళ్లో అందరూ
దూదితో రకరకాల పక్షుల గుడ్లను తయారుచేసి
అమ్ముతున్నారు. అవి అచ్చుగుద్దినట్టు మనం పెట్టే
“ముందుగా మన గుడ్లు దొంగిలించేది ఎవరో గుడ్లలాగానే ఉంటాయి. మన గుడ్ల స్థానంలో ఆ
కనిపెట్టాలి. ఆ తర్వాత ఆ శత్రువు ఆకారాన్ని, గుడ్లను పేర్చుదాం. రేపు ఆ నల్ల పిల్లి వచ్చి మన
రూపురేఖలను బట్టి ఒక పథకం ఆలోచించాలి. గుడ్లే అని అవి తింటుంది. అవి అరగక గిలగిలా
దాని కోసం రోజూ లాగ అందరం బయటకి కొట్టుకుంటుంది” అని చెప్పింది.
పోకుండా, మనలోనే ఎవరో ఒకరిని కాపలాగా
పెట్టి ఆ శత్రువు ఎవరో కనుక్కుందాం. ఆ
తర్వాత ఆ శత్రువును ఎలా మట్టు పెట్టాలో
ఆలోచిద్దాం” అని సలహా ఇచ్చింది మిత్రవింద.
మిత్రవింద చెప్పిన సలహా అక్కడున్న
పక్షులన్నింటికీ నచ్చింది. అందరూ ఒక మాట
అనుకుని మిత్రవిందనే కాపలాగా ఉండమన్నారు.

34
నవంబర్ - 2022
అన్ని పక్షులూ నీలాంబరి ఉపాయం బాగుందని చెట్టు దిగి గిలగిలా కొట్టుకోవడం మొదలు
మెచ్చుకుని కష్టమైనా నీలాంబరి చెప్పినట్టు పెట్టింది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న
చేసాయి. పక్షులన్నీ ఒక్కసారిగా ఆ పిల్లిని చుట్టుముట్టి తమ
తెల్లవారగానే అన్ని పక్షులూ ఆహారానికి ముక్కులతో పొడిచి, పొడిచి చంపాయి.
బయల్దేరాయి. చెట్ల మీద పక్షులు లేవని ఆ రోజునుంచి ఏ శత్రువుకైనా మంచి
నిర్ధారించుకున్న తర్వాత ఆ అడవి పిల్లి మెల్లగా ఉపాయంతో బుద్ధి చెప్పి అన్ని పక్షులూ
చెట్టెక్కింది. ఆక్కడ దూదితో చేసిన చాలా కలసికట్టుగా, సంతోషంగా జీవిస్తున్నాయి.
గుడ్లు చూసింది. అవి నిజమైన గుడ్లు అనుకుని
అన్నింటినీ ఒకేసారి నోట్లో పెట్టుకుంది. ఆ గుడ్లు --*--
తినేటప్పటికి ఆ పిల్లికి గొంతుక పట్టినట్టయ్యింది.

రచనలు పంపవలసిన మెయిల్ ఐడి


snehasahithi2022@gmail.com
35
నవంబర్ - 2022
పరుసవేది

ఏళ్ళ తరబడి మట్టి లోతుల్లో

ఉడికిన పచ్చదనం,

మరో తరానికి ఇంధనం.

పాత కాగితాల మధ్య ఉన్నా


రంగుల వర్ణ మాలక�ై ధవళ కాంతి

కవి వాక్యం భాస్వరమ�ై మెరిసినట్టు


పగిలినట్టే,

విషాదం మోసేవారే విలువల జెండా


మధనపడ్డ గుండె గోడలు

ప�ైకెత్తే తిన్నన�ైన కర్రలు.


కొత్త రూపు దిదదు ్కుంటాయి.

బాధను మాగనిస్తే పుట్టేదే

పరిపూర్ణ ప్రేమ.
మనసంతా నిండిన భావన

సీతాకోకచిలుక�ై పుట్టిన రోజున,

అదిమిపెట్టిన గాయం
- కాళ్ళకూరి శైలజ
అనుభూతికి కొత్త లిపిని వెతుక్కుని

ముంజేతి మీద పచ్చబొ ట్ై ట

విచ్చుకుంటుంది.

36
నవంబర్ - 2022
స్ఫూర్తి కందివనం

‘ చైత్ర ’
- టి. శ్రీనివాస్ శ్రీ

మహిళ అస్తిత్వ నినాదానికి నవలా తన లక్ష్యాన్ని చేరుకున్న విధానాన్ని గొప్పగా


రూపం.. ఇచ్చిన రచయిత్రి స్ఫూర్తి కందివనం. అక్షరీకరించారు.

చాలా రోజులుగా మిత్రుడు శ్రీ చరణ్ అలా నవల గురించి చెప్పాల్సి వస్తే....
మిత్ర చదవమని చెబుతున్నా... పని వత్తిళ్ళ వల్ల ఒక నిరుపేద యువతి.. అన్నివిధాలుగా
నేను కొంత ఆలస్యంగా చదివిన ఒక గొప్ప నవల కుటుంబంలోనూ, సమాజంలోనూ
చైత్ర. అసమానతలు ఎదుర్కొని తాను కోరుకున్న
గమ్యంను విజయవంతంగా చేరడమే ‘చైత్ర’
ఈ మద్యనే ముల్కనూర్ ప్రజా నవల.
గ్రంధాలయం, తెలంగాణ వారు నిర్వహించిన
కథల పోటీలో బహుమతి సాధించిన రచయిత్రిగా అయితే ఇంత సింపుల్ గా ఈ
స్ఫూర్తి కందివనం పేరు వినిపించి, ఈ రచయిత్రి నవల గురించి చెప్పడం న్యాయం కాదు.
ఏదో కొత్త స్వరంలో కథలు చెబుతున్నారేమో అలా అని ఈ రచయిత్రి చెప్పినంత
అనిపించి చైత్ర నవలను చదివాను. వివరంగా సమీక్షించడం సాధ్యమూ కాదు..
ఆ పనిని నవల ముందు మాటలో శ్రీ చరణ్
తెలంగాణా మాండలికం లో నవల మిత్ర కొంత చేసినా..... కేంద్ర సాహిత్య అకాడెమీ
సాగుతున్నా, ఎక్కడికక్కడ సన్నివేశాలను పురస్కార గ్రహీత అయిన శ్రీ అంపశయ్య నవీన్
మెలిత్రిప్పి పాఠకుల్ని ఆసాంతం నవలను గారు చేసిన అభినందన స్ఫూర్తి కందివనం గారి
చదివించేటట్టుగా చేయడంలో సఫలమయ్యారు రచనా సమర్ధతను చాటి చెప్పింది.
అనిపించింది..
ఒక స్త్రీ భౌతికంగా ఎంత ఎదిగినా...
ఆన్లైన్ వరదల్లో.... కాలక్షేప కథలతో భాధ్యతను నిర్వర్తించడంలో బంధాలకు,
కొట్టుకుపోతున్న ప్రస్తుత తరుణంలో... ఒక అనురాగాలు అతీతురాలు కాదనే విషయాన్ని
యువ రచయిత్రి తానున్న పరిసర ప్రాంతపు నవల చివరలో.... కంటతడి పెట్టించేలా రాసిన
వెనుకబాటు తనాన్ని నేపథ్యం చేసుకుని,,, ఈ రచయిత్రి నవలను ‘మంచి సాహిత్యాన్ని
అందులో పేదమహిళ జీవిత గమనాన్నే కాక, ప్రోత్సహిస్తాం’ అనుకునే ప్రతీవారూ కొని చదివితే..

37
నవంబర్ - 2022
నిరుపేద యువతుల జీవిత చిత్రణను చేయడానికి చివరిగా......
మరో కొత్త నూతన రచయిత్రులు వస్తారు.
అలా రాసేవారికి ప్రొత్సాహం ఇచ్చిన వారు ప్రతీ ఆడపిల్ల తల్లిదండ్రులు తమ ఆడపిల్ల
అవుతారు. అలాంటి ప్రొత్సాహం.. నవలా మదిలో ధైర్యం ప్రోది చేయడానికి,, అంచెలంచెలుగా
రచనను ప్రోత్సహించాలనే సంకల్పంతో ప్రతీ నైనా చైత్ర కథ ఆసాంతం చెబితే చాలు. వారిలో
ఏటా నవీన్ పురస్కారాలు ఇస్తూ తన స్వంత కర్తవ్య దీక్ష పెంపొందుతుందనడంలో ఎలాంటి
ఖర్చుతో పురస్కారాలు అందచేసే అంపశయ్య సందేహం లేదు.
నవీన్ గారు చైత్ర నవలను అభినందించారు.. అందుకోసమైనా ఈ నవల చదవాలి.
ఇక పాఠకులు ఈ నవలను చదివి ఈ యువ
రచయిత్రి ని అభినందించాల్సి ఉంది.. --*--

కాపీల కోసం : స్ఫూర్తి కందివనం


F.No.708, B..Block,
K.Spoorthy20@gmail.com ను Tricolor palm cove apartment,
Back side of adhitya hospital,
uppal, Hyderabad.500039.
లేదా TELANGANA

38
నవంబర్ - 2022
సత్యం - అసత్యం
సెంటు వాసన మద్య పూలకుండీలో అందమ�ైన పూవుని

దాచకూడనివన్నీ దాచేసతు ్న్నావు చూపిసతు ్న్నావు గానీ..,

దాని పునాది అయిన మట్టిని

కష్టంలో కారిన చెమటధారని కప్పెట్టేస్తూ

అందమ�ైన అత్త రు పరిమళంగా ఎంతకాలం నిజందాస్తా వు?

షో కేస్ ల్లో పెట్టి అమ్మేస్తున్నావు.

ఎప్పటిక�ైనా

దొ ంగతనం చేసి దాచిపెట్టినట్


లు సత్యం పూవు నేల రాలాల్సిందే.

ఎంతకాలం సత్యాన్ని అసత్యంగా మట్టి అణువులలో సత్యంగా

వక్రీకరించి రాస్తా వు? మొలవాల్సిందే.

రెండూ తడి చుక్కలే!

ఉప్పగా ఉన్న దాని రుచికి

అందమ�ైన రంగును పులిమి


లు చేసి అమ్మేస్తా వు
రంగునీళ్
- చలపాక ప్రకాష్

ఆత్మ వంచన చేసిన సత్యాన్ని

ఎంత కాలం మట్టిలో

తొక్కేస్తా వు?!!

39
నవంబర్ - 2022
వలపుల
తలపులు - కాండ్రేగుల శ్రీనివాసరావు

“ తూరుపు తెలతెలవారగనే... అద్భుతమైన అరుదైన వ్యక్తి.


తలుపులు తెరిచి తెరవగనే... ఒక్క మాటలో చెప్పాలంటే సకల కళా
చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు... ప్రియుడు.
తెలపాలమ్మ నువ్వు పడ్డ అగచాట్లు... రేడియోలో పాట
శ్రీవారి ముచ్చట్లు.. శ్రీ శ్రీవారి ముచ్చట్లు...” అయిపోయినట్లుంది వరూధిని లేచి రేడియో
ఆపివేసి వచ్చి మళ్లీ పరుంది.
-- రేడియోలోంచి వినిపిస్తున్న పాటని, ఎందుకో హఠాత్తుగా పెళ్లినాటి
వరూధిని మంచం మీద పడుకుని వింటోంది. రోజులు గుర్తుకొచ్చినయి ఆమెకు...
“ శ్రీవారి ముచ్చట్లు... పెళ్లయిన మూడో రోజున, కుండలో పసుపు
శ్రీమతి అగచాట్లు...” నీళ్లలో చేతులు పెట్టి ఉంగరాలు దేవినప్పుడు,
-- చమత్కారమైన పదప్రయోగం. తానేమో ఉంగరం కోసం నీటి అడుగు బాగాన
శృంగారపరమైన భావార్థం. అన్వేషిస్తూ ఉంటే, అతని చేయి క్రమంగా తన
తనలో తానే నవ్వుకున్నది ఆమె. చేతిని చుట్టుముట్టేసింది. ఎవరేం తీస్తారో?
నిజమే! పతి ముచ్చట్లు పదిమందికి చెప్పుకోని అని అందరూ ఆత్రంగా చూస్తున్న ఆ తరుణ
పడతలంటూ ఈ పుడమి మీద ఉంటారా న్న కుండలో తన చేయని ఆయన సుతారంగా
అసలు? స్పర్శించడం...
వరూధిని ఆలోచనలలో చుటుక్కున తన చెక్కిలి మీద సిగ్గులు దోబూచులాడటం...
మాధవ్ మెదిలాడు. ఆ అనుభవం ఆనాటిదైనా,
మాధవ్? తన భర్త! ఈనాటికి కూడా గుర్తుంది తనకు.
చిచ్చరపిడుగు అని పిలిస్తే బాగుంటుందేమో? అతని ఆగడాలు అక్కడ నుంచే
కొంటె కోర్కెలకి అనుభవాలనే అనుభూతుల్ని ఆరంభమైనాయి.
ఇవ్వటంలో అతడికి అతడే సాటి... రాత్రంతా నిద్రపోనిచ్చేవాడు కాదు.
అతని ముచ్చట్లు చెప్పాలంటే పెద్ద గ్రంథమే తెల్లగా తెల్లవారినాక కూడా మారం చేస్తూ
అవుతుంది. మూతి బిగిస్తే, పోనీలే అని మళ్లీ కనికరించేది
భావుకుడు. తను. కాలకృత్యాలు పూర్తి చేయించి అతన్ని
సౌందర్యారధకుడు. ఎలాగో ఆఫీస్ కి పంపించి,” హమ్మయ్య “అని

40
నవంబర్ - 2022
తను నిట్టూర్చేసరికి, అంతలోనే మ్రోగేది
టెలిఫోన్.
“ వరూ... నేనే...” అనేవాడు అట్నుంచి.
“ వెళ్ళింది ఇప్పుడే కదా! మళ్లీ ఇంతలోనే ఫోన్
ఏమిటి? “
“ నాకు జ్వరం వచ్చింది. అందుకని...”
“ అయ్యయ్యో అయితే సెలవు పెట్టి వెంటనే
ఇంటికి వచ్చేయండి...”
“ మామూలు జ్వరం కాదు, ప్రేమ జ్వరం...
వచ్చేయమంటావా మరి? “అనేవాడు.
“ ఆ... ...???” లభ్యమైన ఆణిముత్యానివి. నిన్ను నాకు
“ అవును ముద్దు మాత్ర వేస్తే అదే తగ్గిపోతుంది. ప్రసాదించిన విధాతకు నిత్యం కృతజ్ఞతలు
“ తెలియజేసు కుంటూనే ఉంటాను. పెళ్ళానికి
“ ఏంటండీ.... ఎవరైనా వింటే...? “ ప్రేమలేఖ ఏమిటని నవ్వుకుంటున్నావా? ఇలా
“ వింటే విననీ.. వాళ్లు కోల్పోయింది ఏమిటో ప్రేమించడంలో గల ఆనందం, అనుభూతి
తెలుసుకుంటారు... మరి ముద్దు మాత్ర త్వరగా అనుభవించిన వాడికే తెలుస్తుంది. వీళ్లంతా
ఇచ్చేయ్... టెంపరేచర్ పెరిగిపోతుంది...” నాలాగా పెళ్ళాం గురించి ఎందుకు తపించరు?
అనేవాడు బయట తిరిగినంత సేపు ఉరుకులు, పరుగులు.
“ మచ్ “ ఇల్లు చేరినాక ముభావపు ముఖాలు. ఏమిటీ
ఇవ్వక తప్పేది కాదు. తంతి తీగల మీద చుంభన భావరహిత జీవితాలు? అసలు విషయాన్ని
శబ్దాన్ని పంపే దాకా అతను అట్నుంచి అలా వదిలేసి ఏదేదో రాసేస్తున్నాను. అన్నట్టు ఒక
మాట్లాడుతూనే ఉంటాడని ఆమెకు తెలుసు. సంగతి... గుండెని పిండేసే లాంటి ప్రేమ గీతాన్ని
ఇంటి పని, వంట పని, మన ‘సుకవి’ గారితో వ్రాయించి, జేసుదాసు గళ
ముగించేసరికి మధ్యాహ్నం అయ్యేది. ములో ఆర్ద్రతని జోడించి, నీకు సమర్పించాలని
పోస్ట్ మాన్ వచ్చి ఉత్తరం ఇచ్చేవాడు.’ ఎక్కడి ఉంది. కానీ అయ్యే పనేనా?
నుంచో ? ‘ అనుకుని తను ఆత్రంగా చించేది. వరూ... నా మనసులో భావాల్ని ఎలా చెప్పను?
“ వరూధిని ... చెబితే అపహాస్యంగా ఆగుపిస్తాయేమో?
అక్షరాలని చూసి ఈపాటికి పోల్చేసే ఉంటావు అరుగు మీద కూర్చోని పాదాలకి పారాణి
నీ మాధవుడి నేనని. పూసుకుంటూ ఉంటే నిన్నే తదేకంగా చూస్తూ
మదిలో మెదిలే అక్షర సుమాలుని మాల గడుపుతుంటాను. ఆ పాదాలపై పారాణి నేనే
చేసి నీకు అర్పించాలని అనిపించింది. అయితే ఎంత బాగున్ను అనిపిస్తోంది. ఏమిటో
అందుకే ఈ ఉత్తరం... వివాహాలు స్వర్గంలో పిచ్చిపిచ్చి ఊహలన్నీ మదిలో మెదులుతాయి.
అవుతాయట! అది నిజమో, కాదో, తెలియదు చిలిపి పవనం అయి నీ ముంగురులతో
గానీ నువ్వు మాత్రం జీవనస్రవంతిలో నాకు దోబోచులాడాలని, పిచ్చి కోరిక... అంతేకాదు
41
నవంబర్ - 2022
కోపగించనంటే ఇంకో మాట... విధి నిమగ్నమయి ఉన్నాడు.
నిర్వాహణలో ఉన్న ఎదపై నీ పైటను చూస్తే తను స్నానానికని బాత్రూంలోకి
నాకు ఈర్ష్య... ఇదంతా నా సామ్రాజ్యమేనని టవల్ తీసుకొని నడిచింది. షవర్ కింద కాసేపు
ఎంత టివీ వలకబోస్తుందో కదా వక్షం మీద !? జలకాలాడి, చన్నీళ్ళతో శరీరాన్ని సేద తీర్చి,
మాయదారి పైట... అరే! నీ ముఖంలో చిరు ఒంటికి టవల్ చుట్టుకుని, బట్టల కోసమని బెడ్
కోపం... అయితే ఉంటానిక! రూమ్ లోనికి నడిచింది తను.
అప్పటికి కూడా అతను పుస్తకంలోనే తదేకంగా
-- నీ మాధవ్ “ లీనమై ఉన్నాడు.
తలుపు కాస్త చేరవేసి తను
నిజమే! అతను ఉత్తరం రాసినట్లు దుస్తులు ధరిస్తున్న సమయాన్ని హఠాత్తుగా
ఎప్పుడైనా ఇల్లు ఊడ్చడానికనో, అంట్లు లోపలికి వచ్చేసాడు అతను.
తోమటానికనో, కొంగు నడుముకి బిగించి “ వరూ...” నువ్వు చాలా బాగుంటావు. సవస్త్ర
కుచ్చీలు కాస్త పైకి దోపితే చాలు, పాదాల వైపు గానే కాదు, వివస్త్రగా... పాలరాతి బొమ్మలాంటి
చూస్తూ పసిడి పాదాలని మురిసిపోయేవాడు. నునుపైన శరీరం మీద ఉరోజాలు శిరోజాల
ఆ కాస్త దానికి సంబర పడిపోయే మీద నుంచి జఘనస్థలం మీదుగా నీటి
టంతటి సున్నిత మనస్కుడు అతడు. బిందువులు జాలువారుతూ ఉంటే... ఓహో
మొదట్లో అతని నైజం తనకి విభ్రాంతి అద్భుతమైన ఆ దృశ్యాన్ని ఎలా వర్ణించను ?
కలిగించేది. అంతేకాదు ఒక్కొక్కసారి కమనీయ దృశ్యం కనువిందు చేస్తూ, తిలకించిన
తను చిరాకు పడుతుండేది కూడా... కానీ నా జీవితాన్ని ధన్యం చేసింది...” అంటూ అతను
నిశితంగా ఆలోచిస్తే తన పట్ల అతని ప్రేమకు
తను అర్హురాలేనా అనుకునేది. అంతటి
అతని ఆరాధనకు బదులుగా తను ఏమి
ఇవ్వగలుగుతుంది???
వరూధిని వాస్తవంలోనికి వచ్చి
మంచం మీద అటువైపు నుంచి ఇటువైపుకు
వత్తిగిల్లింది. రేడియో పాట కాదు గానీ ఈరోజు
అంతా భర్త ఆలోచనలే అనుకుంది.
పెదాలపై చెరగని చిరునవ్వు మోముతో మళ్లీ
కలల్లోనికి జారి పోయింది ఆమె.
ఆరోజు...
తనకి బాగా గుర్తుంది
ఇప్పటికి, అతను
వరండాలో కూర్చుని
పేపర్ చదవటంలో
42
నవంబర్ - 2022
చెవిలో గుసగుసలాడినప్పుడు మొదట తనకే అతని ప్రవర్తనకి విసిగి ఓసారి
అర్థం కాలేదు. అంటే తను స్నానం చేస్తున్నంత “ మిస్టర్ మాధవ్...” పిలిచింది తను కోపంగా.
సేపు అతను తలుపు సందులో నుంచి...??? “ ఎస్ మేడమ్మ్. “ అమాయకంగా మొహం
మైగాడ్!!! పెట్టి నిల్చున్నాడు అతను.
అతనికి మొహం చూపించలేక సిగ్గుతో “ మీకు ఆ పేరు ఎవరు పెట్టారు? “
చితికిపోయింది తను. అతను ఎప్పుడూ ఇంతే, “ మా నాయనమ్మ అనుకుంటా...”
ఏదో ఒక చిలిపిపని చేస్తుండటం రివాజు... “ ఆమె పొరపాటు చేసింది. మనిషికి తగ్గా
అమ్మగారి ఇంటి దగ్గర తొలి పేరు మన్మధ అని పెట్టాల్సింది. “
కానుపు కష్టమై నానా అవస్థలుపడి పండంటి “ మీరన్నది కూడా కరెక్టే మేడమ్మ్.. కానీ
బిడ్డని ప్రసవించేక, అతను వచ్చి కొడుకును మన్మధుడు తాలూకా పవర్ అప్పట్లో మా
చూసి మురిసిపోతూ తనకి థాంక్స్ చెప్తాడని నాయనమ్మకి తెలిసి ఉండకపోవచ్చు...”
ఆశించింది తను.. “ అసలు ఏమనుకుంటున్నారు మీరు? “
“ ఏమీ అనుకోవటం లేదండి...”
“ అది కాదు జీవితం అంటే, అంతా శృంగారమే
అనుకుంటున్నారా? “
“ ఎలా అనుకుంటాను మేడమ్? శృంగారం
జీవితంలో ఒక భాగం అనుకుంటున్నాను.”
“ అవును కదా మరి! మీ ప్రవర్తన గురించి మీరు
ఎప్పుడైనా ఆలోచించారా? “
“ ఆలోచించే ప్రవర్తిస్తున్నానండి... ఏ వయసులో
ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలని,
వెనుకటికి పెద్దలు సెలవిచ్చారు కదండి...
అతను హడావిడిగా వచ్చి అందుకే ఈ వయసులో ముచ్చట్లు ఈ
బాబును చూసి కాసేపు ఆనందించాడు.ఆ వయసులోనే తీర్చుకుంటున్నాను...”
తర్వాత క్షేమ సమాచారాలు అడిగి పురిటి “ అబ్బబ్బ...మీతో వేగటం నావల్ల కావడం
మంచం మీద తనకు దగ్గరగా చేరి ముందుకు లేదు....”
వంగి ముంగురులను సవరిస్తూ చెవులో “ పోనీ నేనే మీతో వేగుతానులెండి...”
గుసగుసలాడటం తను ఇవాల్టికి కూడా “ యూ... యూ...?”
మర్చిపోలేదు “ ....................”
“ వరూ కానుపు అయిన నెలలోనే ఇలా సాగింది ఆ రోజు తమ మధ్య సంభాషణ.
దంపతులు కలియవచ్చునని డాక్టర్ సమరం తను మాత్రం తక్కువ? అతన్ని
గారు ఎవరికో చెప్పడాన్ని నేను చదివాను...” ఏడిపించడం కోసమని కురులు మొత్తం అతని
అని ఆయన అన్నప్పుడు నవ్వు ఆపుకోలేక, ఆ మొహం మీద వేసేసేది. ఊపిరాడక అతడు
స్థితిలో నవ్వనూలేక సతమతమయ్యింది తను. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే, “ కురులు
43
నవంబర్ - 2022
వింజామరలు అన్నారుగా ఆస్వాదించండి మరి! వరూధిని మంచం మీద నుంచి లేచి పెన్ను,
“ అనేది. కాయితం తీసుకొని రాయడం ప్రారంభించింది.
ఎప్పుడైనా అతను వచ్చిన వేళకి తను పవళించి
ఉంటే చిన్నపిల్లలా చెంతకి వచ్చి తనని “ జారవిడుచుకున్న నా జీవన నేస్తమా...
అల్లుకుపోయేవాడు. మీరు లేని జీవితం శూన్యం అని తెలిసినా
తన నునుపైన పొట్ట మీద చేతితో సుతారంగా సరే జీవించక తప్పడం లేదు. బ్రతుకు ఎడారి
స్పర్శిస్తూ “ బంగారు ఛాయ మేని... ఓహో అయినాక, గుండె గోదారి అవక మానదు కదా!
ఏ కవి అన్నాడో గానీ అద్భుతమైన వర్ణన...”
అక్కడ మీరు ఎలా ఉన్నారు? ఇక్కడ వెతల
అనేవాడు.
కలత చితిలో నివురు కింద స్మృతులు నిరంతరం
“ ఒక్కొక్కసారి ఉన్నట్టుండి వరూ...
రాజుకుంటూనే ఉన్నాయి విరహంలో కూడా
నాకు కవితలు రాయాలనిపిస్తుంది...” అనేవాడు
మధురభావన ఉంటుందని తెలియజేయడం
“ రాయండి అయితే...” అనేది తను
కోసమే మీరు అలా వెడలిపోయారా ?
మామూలుగా.
తీగ నేనైతే ,వీణ నీవు అనేవారు ఎప్పుడూ...
“ నడుము దగ్గర పడిన మడత మీద నాలుకతో
రాయనా మరి! “ అల్లరిగా అడిగేవాడు. విహీనమైన విపంచిలా మిగిలాను ఇప్పుడు.
సమాధానంగా ఏం చెప్పాలో తెలియక మీ జ్ఞాపకాలే నా జీవనాధారం... పిల్లలు
బిత్తరపోయేది తను. ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న నందివర్ధనపు
కొంటె పనులే కాదు. అతి సున్నిత పువ్వుల్లా ఉన్నారు. మీరు మా కోసం నిర్మించిన
మనస్కుడు కూడా... ఎప్పుడైనా తనకి ఈ ఛత్రం క్రింద సకల సౌఖ్యాలతో జీవిస్తూనే
జ్వరం వచ్చి కాస్త నలతగా ఉంటే విలవిలలాడి ఉన్నాము. అన్నీ ఉన్నాయి. ఒక్క సౌభాగ్యం
పోయేవాడు. పేషెంట్ తానైతే లంఖనాలు తప్ప? మీ వద్దకు త్వరగా చేరాలని, మీ ఎద మీద
అతను చేసేవాడు. తలపెట్టి గుండె చప్పుడు వినాలని, నా గుండె
గొంతు విప్పుకొని విన్నవించాలని ఉంది. విధాత
కరుణించాలిగా మరి ! అంతరంగ నేపథ్యంలో
వయొలిన్ తీగల మీద విషాదం నర్తిస్తున్న
తరుణన కనురెప్పలు పరదాలు మాటున
అనంతమైన కడలిని దాచుకుంటూ మీకు
ఇష్టమైన పదాలతో లేఖ రాస్తున్నాను. మాధవ్
మిమ్మల్ని చేరుతుందా ఇది...

ఇట్లు
మీ వరూధిని.”

44
నవంబర్ - 2022
చెమ్మగిల్లిన కళ్ళను చెంగుతో తుడుచుకుని, వరూధిని ఆ ఉత్తరాన్ని అక్కడున్న అనేక
రాసిన కాగితాన్ని మడిచి ముందు గదిలోనికి ఉత్తరాల్లో ఉంచి భర్త ఫోటో వైపు ఆర్తిగా చూస్తూ
నడిచిందామె. నిలుచుంది.
అక్కడ... మాధవ్ నవ్వుతూ కనిపిస్తున్న ఫోటో గమ్యం చేరని ఉత్తరం, దిగులుతో బిత్తర పోయింది.
పూలదండతో గోడకు వేలాడుతోంది క్రింద
ఉదయం వెలిగించిన అగరోత్తులు ఎప్పుడో --*--
ఆరిపోయి ఉన్నాయి. జ్యోతి మాత్రం మంద్రంగా
వెలుగుతుంది.

మోడరన్ పూజ
- సుమ కైకాల
కొత్త కోడలితో అత్తగారు వరలక్ష్మీ వ్రతం
అత్తమ్మా!”

చేయిస్తోంది.

“కోడలా...కోడలా కొడుకు పెళ్ళామా!


“సుధా, ఇందాకటి నుండి చూస్తున్నా ...
ఇంత వింత నేనెప్పుడూ చూడలేదమ్మా!”...
ఆ తమలపాకు మీద ఎర్రని ముద్ద
ఏంటీ?”
మతి భ్రమించిన అత్తగారు పాట
అందుకున్నారు.

“అదా అత్తమ్మా...
పూజ కోసం ఐదు
రకాల పండ్లు
వెతకడం ఎందుకు
అని మిక్స్డ్ ఫ్రూట్
జామ్ పెట్టాను

45
నవంబర్ - 2022
46
నవంబర్ - 2022
ప్రముఖ హాస్య నటులు పద్మశ్రీ అల్లు ఫ్లయిట్ చాకోలెట్స్ తెచ్చండి తాతయ్యా...
అని అడుగుతుంటాడు
రామలింగయ్య గారు ఒక సారి ఏదో పిక్చర్
నేనూ “ అలాగే లేరా”
యూనిట్ తో కలిసి ఫ్లయిట్ లో ప్రయాణం
అంటూ మాట ఇచ్చేస్తాను.
చేస్తున్నారు.
నేను ఇప్పుడు ఇంటికీ వెళ్లిన వెంటనే.....
ప్రయాణంలో ఎయిర్ హోస్టెస్ ట్రే లో
ఫ్లయిట్ చాకలెట్స్ తెచ్చారా తాతయ్యా” అని
చాక్ లెట్స్ పెట్టుకుని ఒక్కక్కొరికి ఇస్తూ
అడిగే వాడికి నేనేదో బయట కొన్న చాకలెట్స్
వస్తోంది. మర్యాదగా ఒకటో రెండో స్టైల్ గా
ఇచ్చి, ఇవేరా ఫ్లయిట్ చాకలెట్స్ అని చెప్పి
తీసుకుంటున్నారు అందరూ.
వారిని మోసగించలేను. తమ తాతయ్య తమను
అలా అల్లూ రామలింగయ్య గారి వద్దకూ వచ్చి
మోసగించడు అనే వాడి నమ్మకాన్ని నేను
నిలబడ్డారట ఆవిడ.
అబద్ధం చేసుకోలేను”.
“నేను కొన్ని చాక్ లెట్స్ ఎక్కువగా తీసుకోవచ్చా
అమ్మాయ్!” అని అడిగారట ఆమెను అల్లు.
పెద్దలు ఎప్పుడూ చేయకూడని తప్పు ఇదే.
“విత్ ప్లెజర్ సర్!” అందట ఎయిర్ హోస్టెస్.
పిల్లలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని... పెద్దలు
అంతే రామలింగయ్య గారు తన గుప్పెటనిండా
భౌతికంగానూ, మానసికంగానూ కూడా భగ్నం
చాక్ లెట్స్ తీసుకుని తన లాల్చీ జేబులో
చేయకూడదు.
వేసుకున్నారు.
అందుకే నేను అడిగిన ఈ కొద్ది చాకలెట్స్
ఇదంతా అన్ కల్చర్ గా భావించిన పిక్చర్
నే విమానంలో ఇవే ఇచ్చార్రా అని ఇస్తాను.
యూనిట్ లో ఒక వ్యక్తి... అల్లూ గారిని కాస్తా
బయట కొన్నవి షాప్ లో కొన్నట్లే చెబుతాను. “
చీఫ్ గా భావించి....
అని ఆ వ్యక్తికి వివరించారు అల్లు రామలింగయ్య
“పది రూపాయలు పెడితే బోలెడు చాక్ లెట్స్
గారు.
వస్తాయి.ఇంత పెద్ద నటులై ఉండి మీరు ఇలా
నిజమే, మనం పిల్లల కు మనపై నమ్మకాన్ని
తీసుకోవడం ఏమీ బాగులేదు. సినిమా వారంటే
ఇస్తే, వాళ్ళనుండి కూడా మనకూ అలాంటి
చిన్నచూపు కదా” అన్నాడు.
భరోసాయే మనకు లభిస్తుంది
అల్లు రామలింగయ్య గారు ఒకసారి నిశ్చలంగా
“ మన ఇంటి పేరున ఒక హీరో తయారు
చూసి...
కావాలిరా బన్నీ” అని తరచూ అనే
“ నేను షూటింగు కోసం ఫ్లయిట్ లో
రామలింగయ్యతో...
వెళుతున్నానని తెలిసి మా మనవడు బన్నీ
47
నవంబర్ - 2022
“నేను తప్పక హీరో అవుతాను తాతయ్యా !” వచించారేమో అనుకుంది రేఖ.
అనే వాడుట బన్నీ.. పుష్పవల్లి ఆ ముసలామె చేతిలో
ఆ బన్నీయే ఇప్పటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వందరూపాయలు, ఒక పాత చీర, ఏవో స్వీట్లు
తాత తనపై పెట్టుకున్న నమ్మకాన్ని లాంటివి పెట్టింది.
నిలబెట్టుకోవడంలో... “తగ్గేదేలే!” అంటున్నాడు. ఆ ముసలామె అదేపనిగా రెప్పార్ప కుండా
రేఖనే చూస్తోంది. రేఖ అందానికి
💐 💐 💐 ముగ్ధురాలవుతోంది. మెటికలు విరిచి
ముద్దుపెట్టుకుంది. పైట కొంగుతో కళ్ళు
తెలుగులో ప్రసిద్ధ చిత్రంగా పాతాళభైరవి ని ఒత్తుకుంది.
పేర్కొనడం అంద రికీ తెలిసినదే.. సీనియర్ తరువాత “వస్తాను తల్లీ!” అంటూ భారంగా
ఎన్. టి. ఆర్ బైటికి వెళ్లిపోయింది.
ని తిరుగులేని హీరోగా నిలబెడితే, కాలం రేఖకు ఒళ్ళు మండి పోయింది.
అందులో హీరోయిన్ ను వక్ర గతిలోకి “ఈ తెలుగువాళ్ళతో ఇదే తలనొప్పి
మార్చేసింది.. మమ్మీ.... ఆవిడెవరు? అన్ని ఎక్సట్రాలు
అదేమిటో చూద్దాం. చేస్తుందేమిటి?ఆ పంపించేదేదో ఆమె
రాగానే ఇచ్చి పంపేయవచ్చు కదా. నీకు
పాతాళ భైరవి సినిమాలో కథా నాయకి పరిచయముంటే ఉండొచ్చు కానీ నన్ను టచ్
మాలతి రాజ కుమారి..... ఎన్ఠీఆర్ పేదవాడు.. చేస్తోందేమిటి అసహ్యంగా” అంటూ తల్లిపై
ఆ యువరాణి పాత్రలో మాలతిని నిజంగానే విరుచుకుపడింది.
రాణి ల భావించేవారుట అందరూ.. ఆ సంగతి రేఖ కోపం పుష్పవల్లికి తెలుసు.
అలా ఉంచితే....... “పిచ్చి తల్లీ! ఆమె ఎవరనుకుంటున్నావే?
తెలుగులో ఆ సినిమా అఖండ విజయం నువ్వు నటించబోతున్నావు చూడు
సాధించిన పాతాళభైరవి చిత్రంలో మహారాణి
పాతాళ భైరవి సినిమాను ఇంచుమించు పాత్రలో...... ఆ మహారాణి ఆమె.. ఆమె
ముప్పై సంవత్సరాల తరువాత పద్మాలయ పేరు మాలతి. ఒకప్పుడు సూపర్ హీరోయిన్
సంస్థ వారు హిందీలో రీమేక్ తీయడానికి గా ఒక వెలుగు వెలిగింది. సంధ్య మలుపులో
సంకల్పించి., రాజకుమారి గా ప్రముఖ నటి వుంది. ఎదో మనం చేయదగ్గ సహాయం
హిందీ రేఖను నియమించు కొని ఆమెకు చేసిపంపిస్తున్నాం. ఇంకా ముంబై లో ఎవరో
అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. తెలిసినవారున్నారట. వాళ్ళిళ్ళకి కూడా వెళ్లి
సైన్ చేసి అడ్వాన్స్ చెక్ తో ఇంటికి వచ్చిన మద్రాసు వెళ్ళిపోతానంది” అని చెప్పింది
రేఖకి ఎవరో ముసిలావిడ దయనీయంగా రేఖకి స్పృహ తప్పినంత పనైంది.
కనిపించింది. ఆ ముసలామెతో రేఖ తల్లి తర్వాత మాలతి ముంబై అంతా గాలించింది.
పుష్పవల్లి ఆప్యాయంగా మాట్లాడుతోంది. వంద రూపాయలిచ్చి పంపినందుకు ఎంతగానో
ఎవరో తెలిసిన వాళ్ళు సహాయం కోసం నొచ్చుకుంది. మాలతి కూడా లేదు, హైదరా
48
నవంబర్ - 2022
బాదు వెళ్ళిపోయింది అని తెలుసుకుంది. చాలా ఈ విషయాన్ని ప్రముఖ పాత్రి కేయులు
ఎమోషనల్ గా ఫీలయ్యింది. ఏం చేసినా ఇమంది రామారావు గారు ఆనాటి పత్రికల్లో
అరణ్యరోదలాగే మిగిలింది. రాశారు.

ఆ తర్వాత కొంతకాలానికి కాచిగూడ - స్నేహా సాహితి టీమ్


దగ్గర ఓ పాడుబడిన ఇంట్లో ఉంటుండగా .
గోడకూలి దుర్మరణం పాలై మరణించారు.
సినిమా జీవితం అంటే ఇదే. ఓడలు బళ్లు --*--
అవుతాయి. బళ్ళు ఓడలు అవుతాయి. ఇదే
సినీ మాయాజీవం.

మాధురి అంతర్జాల మాస పత్రిక 4. రాసే ప్రతీ రచనకూ హామీ పత్రం


రచయిత (త్రు) లకు సూచనలు. తప్పని సరిగా రాయాలి.. మీ రచన
వేరొక రచనకు కాపీ అని నిర్వాహకులు
1.మాధురి లో ప్రచురణార్ధం పంపే గమనించినట్లయితే... మీ పేరును బ్లాక్
కథలు వర్డ్ ఫైల్ లో 800-900 పదాల లిస్ట్ లో ఉంచడం జరుగుతుంది.. మూల
లోపునే రచనలు ఖచ్చితంగా ఉండాలి.. రచయిత తీసుకునే ఎలాంటి న్యాయ
పరమైన చర్యలకైనా రచయితే బాధ్యత
2. రచనతో పాటు వారి కలర్ వహించాల్సి వస్తుంది. మాధురి పత్రిక
ఫోటోను తప్పక జత చేయాలి. ఫోటో బాధ్యత వహించదు.
వద్దనుకునే వారు ఆ విషయాన్ని తప్పక
తెలియచేయాలి. 6. పత్రికకు సంబంధించిన న్యాయ
పరమైన ఎలాంటి వివాదాలనైనా
3. మీ కథా టైపు చేసి పంపేటప్పుడు అక్షర విశాఖ న్యాయస్థాన పరిధిలోనే
దోషాలు, విరామ చిహ్నాలు,కొటేషన్ పరిష్కరించుకోవాలి.
మార్క్స్.. లైన్ స్పేసెస్, పేరాగ్రాఫ్ లు
సక్రమంగా ఉండేటట్టు చూసుకుని పంపే మీ రచనలు స్నేహా సాహితి మెయిల్ కు
రచనలకు తొందరగా ప్రచురించే పంపించాలి.
అవకాశం ఎక్కువ. మీ రచనా బాగున్నా...
అక్షర దోషాలు ఎక్కువగా ఉన్న రచనలకు పంపించాల్సిన E mail:
ప్రచురణ అవకాశాలు తక్కువ.

snehasahithi2022@gmail.com
49
నవంబర్ - 2022
ఎవడు వీడు
హఠాత్
తు గా...వేదాంతంలోతను
మునిగి పో యి...తనతో పాటు
మనలనూ ముంచేసతుంటాడు
్ !

సడెన్ గా... చిన్నపిల్లా డ�ైపో యి


మనల్ని చిన్నపిల్లల్ని చేసేసి...
మురిపిసతుంటాడు
్ !

ఒక్కసారిగా మండేసూర్యుడిలా
మారిపో యి..,మనచేతతిరుగు
బాటుజెండాలను,ఎగురవేయిస్తుంటాడు !

అమాంతంయవ్వనస్తుడ�ైపో యి
విరహ గీతాలు పాడేస్తూ ...
మనని పారవశ్యంలో ఓల
లాడిసతుంటాడు...
్ !

ఒక్కోమారు... పార్ధ సారధిలా


మనకు సారధ్యం వహించి...
.మనల్ని సన్మార్గంలోకి...
తీసుకుపో తుంటాడు... !

ఇంతకీ... ఎవడీపిచ ్చోడు !?


ఎవడు వీడు... ?!

ఓహ్... వాడా.....
వాడో కవి !

- కోరాడ నరసింహ రావు


50
నవంబర్ - 2022
“ మీ కాలేజ్ కో ఎడ్యుకేషన్ కదా...
అబ్బాయిలతో నీకు బాగా పరిచయం ఉండే పడక గదిలో నాకోసం వెయిట్
ఉంటుంది. నీ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పు ?” నా చేస్తోన్న మా వారు నేను అడుగుపెట్టేసరికి
అనుమానపు మొగుడి తొలిరేయి తొలిపలుకు ముఖం మాడ్చుకునే ఉన్నారు... ఏమైందని
ఇదే బాబూ... నేను బ్రతిమిలాడి అడిగితే.... ఆయన
చెప్పెందేమిటంటే...
K. చంద్రలత.
గజపతినగరం. “ మీ వాళ్లు మంచానికి తలలు ఉత్తరం
______ వైపుకు అమర్చారు.. నిద్ర లేచాక వెంటనే
మనకూ దక్షిణం కనబడుతుంది. వాస్తు
ప్రకారం అది తప్పు కదా.. మన మొదటి
నేను పడక గదిలో అడుగు పెట్టేసరికి.., రోజే వాస్తు దోషంతో మనం నరకలోకం
పళ్ళూ.. పాలతో పాటు ఒక పాతిక పుస్తకాల చూస్తాము” అంటూ సణుక్కుంటున్నాడు.
దొంతరను చూసి ఆశ్చర్య పోయాను.. ఆయనకు వాస్తు పిచ్చి అని
“ ఇవేమిటండీ?” అని అడిగాను.. అర్ధమైంది. చేసేదేముంది?
“అవన్నీ స్వాతి సరస కథలున్న పుస్తకాలు... నేనే సిగ్గు విడిచి... తలగడలు దక్షిణం
ఇందులో కథా నాయకురాళ్ల్లు, తమ పార్టనర్ వైపు మార్చి.... ఉత్తరం వైపు ఫేసింగ్
ను ఎలా ప్రోత్సహిస్తున్నారో చదివి... రోజుకో ఇచ్చి.... ఆయనను సమాయత్తం చేసాను.
సినిమా హీరోయిన్ను నీవు గుర్తుకు తేవాలి... “ ఆయన వాస్తు పిచ్చి తో నాకు నరకం
అన్నాడు మా ఆయన... చూపిస్తున్నాడనుకోండి.. అది వేరే విషయం..

P. స్వప్న కొప్పర్తి లలితకుమారి


పాత పట్నం. డాబాగార్డెన్స్..

______ _____

51
నవంబర్ - 2022
“ మీరు తాళి కట్టేటప్పుడు.. నా మెడ మొదటి రాత్రి నా కోసమే ఎదురు
పై కితకితలు పెడతారనుకున్నాను..మీకు చూస్తాన్నడనుకున్న మావారు నా కోసమే ఎదురు
రొమాన్స్ తెలియదులా వుంది.. ఎన్ని సినిమాల్లో చూస్తున్నారు.. చాలా ఆనందమనిపించింది
చూపించారో...అయినా మీరు నేర్చుకోలేదు. అయితే అక్కడున్న ఆపిల్ పళ్ళు కొన్ని తినేసి
అలాంటివే కదా తీపి జ్ఞాపకాలు” అంటూ నా ఉన్న ఆనవాళ్లు నాకు కనిపించాయి.. పోనీలే..
చేతకాని తనాన్ని ఎత్తిచూపింది పెళ్ళైన కొత్తలో నా లేటు వల్ల బోర్ కొట్టి తినేసాడు అనుకున్న.
నా శ్రీమతి. నా చేతిలో పాల గ్లాస్ అందుకుని.. “ ఫ్రూట్స్
తిన్నాక మిల్క్ త్రాగక పోతే బలం ఉండదట..
J.వెంకటేశ్వరరావు, థాంక్స్... “అంటూ ఆ పాలు గట గటా త్రాగేసి “
వడ్డాది. తెల్లారి అయిదు గంటలకు నన్ను లేపు.. జాగింగ్
కు వెళ్ళాలి “ అంటూ ఆర్డర్ వేసి ముసుగు
______ తన్నేసాడు..

- లక్కవరపు సత్య
పడక గదిలో అడుగు పెట్టిన శ్రీమతి.. నరసింహనగర్.
వరుసకు నాకు అక్కకూతురే.. _____
ఆమె తొలి పలుకు ఏమిటంటే.... “తెల్ల బట్టల
నిండా అలా పసుపు అంటించేసుకుంటే.. ఎలా
మావయ్యా.. ? ఇలా అయితే నేనూ ఉతకలేను”

R.ఉదయబాబు.
అనకాపల్లి.

________

మీ రచనలు స్నేహ సాహితి మెయిల్ కు పంపించాలి.


పంపించాల్సిన E mail:
snehasahithi2022@gmail.com
52
నవంబర్ - 2022
ఆత్మ బంధువు
- టి. శ్రీనివాస శ్రీ

సాయంత్రపు పూట సాగే,  ఆ వారపు ఇంటికొచ్చి కలవమని చెప్పమంది సార్!”  చాలా


సంతతో నాకెంతో అనుబంధం! వారంనాడు క్యాజువల్ గా చెప్పిన అతని మాటలకి నా మనసు
జరిగే సంతకోసం వారంరోజులు నిరీక్షించడం ఎంతగానో విలవిల్లాడిపోయింది.  పెద్దయ్య
మంచి అనుభూతినిస్తోంది.  నేను, ‘సంత’లంటే సాంబడు మరణం గురించి అతన్ని ఎన్నో పశ్నలు
మన సరుకులు అమ్ముకునే, కొనుక్కునే ‘అంగడి’ అడగాలనుకున్నాను. అతను వ్యాపారములతో
అనుకోను.  ఆ ప్రాంతపు మనుషుల సంస్కృతి, చాలా బిజీగా వున్నాడు.  నన్ను అప్పటికే ఒకామె
సంప్రసాదాయాలకు ఒక  కొలమానంగా పక్కకి జరగమంటోంది. అతని వ్యాపారం
భావిస్తుంటాను.  నాకు సంత చేయడమంటే పూర్తి అయిపోయే చివరాఖరు వుండైనా
ఎనలేని మక్కువ! మమకారం!! పెద్దయ్య ఎలా చనిపోయాడో సవివరంగా అడిగి
తెలుసుకోవాలనిపించింది.  కానీ ఉల్లిపాయల
ఎప్పటిలాగే ఆరోజు కూడా సంత వ్యాపారి నన్నో పిచ్చివాడిలా జమ కడతాడోనని
జనంతో కిటకిటలాడిపోతూ చాలా హడావిడిగా మనసుకి సర్దిచెప్పుకుని, అక్కడి నుంచి భారంగా
ఉంది.  వ్యాపారస్తులు తమతమ సరుకుల కదిలాను.
అమ్మకాలు కోసం గట్టిగా అరుస్తున్నారు. 
కాస్త కోలాహలంగానే ఉంది.  అయితే- పెద్దయ్యతో నా అనుబంధం...
అందులోని   ‘అనుభూతులను’  అనుభవించి, కళ్ళముందు కదలాడింది. ఓ సంవత్సర కాలం
ఆస్వాదించాలేగానీ మాటలతో చెప్పలేను! వెనక్కి మళ్లాయి నా ఆలోచనలు.
*       *        * 
నేను యధాలాపంగా ఆకుకూరలు
అమ్మే పెద్దయ్య కోసం ఆత్రంగా చూసాను.  ఎప్పటిలాగే సంత చేసుకుంటున్న నాకు
అక్కడ పెద్దయ్యలేడు.  కాస్త దూరంలో 
ఉల్లిపాయలు, బంగాళాదుంపలు అమ్ముకునే
వాళ్ళ ఊరు మనిషి దుకాణం దగ్గరకి గబగబా
వెళ్ళాను  పెద్దయ్య గురించి వాకబు చేయడానికి. 
అతను నన్ను చూడగానే “సార్, మీకోసమే
చూస్తున్నాను. సాంబడు మామ మొన్ననే
చచ్చిపోయాడు. మా అత్త, మిమ్మల్ని ఓపాలి
53
నవంబర్ - 2022
ఆకుకూరలు అమ్మే, ఓ పెద్దాయన దుకాణం
నన్ను ఆకర్షించించింది.  అతను కొత్తగా కొంతసేపు సంతచేశాక మళ్ళీ అతని
పెట్టునట్టున్నాడు.అతన్ని తేరిపారా చూసాను.  దగ్గరకెళ్లి మరో రెండురకాల ఆకుకూరలు
వయసు పైబడిన వ్యక్తి. సుమారుగా డెబ్బయి తీసుకున్నాను.  మళ్ళీ ఎక్కువేసి కట్టలే
ఏళ్ళు ఉంటాయి.  ఆ మొహంలో ఏదో వెలుగు ఇచ్చాడు.  నాకే కాస్త ఇబ్బందిగా అన్పించి
కనిపించింది.  అది కొందరిలో మాత్రమే “అదేంటి, పెద్దయ్యా! ఇంతేసి ఇచ్చేస్తున్నావు.
కొలువుండే నిజాయితీ కూడిన నిర్మలత్వం! ఆ నీకెలా కిట్టుబాబు అవుతుంది” అడిగాను కాస్త
వైపుగా అడుగులు వేసాను. ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ. దానికి అతను “ఫరవాలేదు
బాబు...కిట్టుబాటు అవుతుంది. వచ్చింది చాలు
నన్ను ఆదరంగా చూస్తూ “రండి బాబు... ...”అంటూ నిర్మలంగా నవ్వేసాడు పెద్దయ్య.  ఈ
మధ్యకాలములో ‘ వచ్చింది చాలు’ అనే మనిషి
కనిపించడం బాగా  అరుదైపోయుంది.  పెద్దయ్య
నాకు చాలా అరుదైన మనిషిలా కన్పించాడు.

తరువాత వారంవారమూ పెద్దయ్య దగ్గర
ఆకుకూరలు కొనడం బాగా అలవాటై పోయింది
అనడం కంటే, ఒక వ్యసనం అయిపోఅయిందని
చెప్పడమే సబబుగా ఉంటుంది.
ఏటీ ఇమ్మంటారు...”అంటూ అడిగాడు ఆ
పెద్దాయన. అతని మాటల్లో ఏదో అయస్కాంత ఒకవారం నేను, క్యాంపుకి వెళ్లాల్సి వచ్చి,
శక్తి ఉంది.  నాకు అతనిపట్ల మాటల్లో చెప్పలేని సంతకి వెళ్లలేకపోయాను. పెద్దయ్యని ఆ వారం
గౌరవభావం కలిగింది. కలవలేకపోయానేనని చాలా బాధపడిపోయాను. 
కానీ ఎవరికీ చెప్పలేకపోయాను.  ఇలాంటి
“పెద్దయ్యా!  తోటకూర ఓ విషయాలు చెప్తే, వింతగా చూస్తారు.  ఆ
పదిరూపాయలది, అలాగే గోంగూర ఓ పది మరుసటి వారం సంతలో పెద్దయ్యని కలిసాను. 
రూపాలయలది ఇవ్వు” అడిగాను అభిమానం పెద్దయ్య కూడా నాలాగే ఫీల్ అయినట్టున్నాడు.
నిండిన స్వరముతో. అతను “అట్టాగే నన్ను చూడగానే “ఏంబాబు..కిందటి వారం
బాబు..”అంటూ నేనడిగిన ఆకుకూరలు చేతిలో రాలేదు? రాత్రి తొమ్మిద్దిన్నర వరకు ఎదురు
పెట్టాడు. చాలా ఎక్కువ కట్టలే ఇచ్చాడు. చూసాను. మీ కోసం ఆకుకూరలు పత్యేకంగా
ఇరవై రూపాయలు చేతిలోపెట్టి వచ్చేశాను. ఉంచాను...” అని అతనన్న మాటలు  నాకెంతో
ఆ పెద్దాయన తక్కువ డబ్బులకి ఎక్కువ ఉపశమనాన్నిచ్చాయి.  నాకో విషయం స్పష్టంగా
ఆకుకూరలు ఇచ్చాడని కాదుగానీ. అతని అర్ధమైంది.  మా ఇద్దరిమధ్య ఏదో ‘ఆత్మ
మాటలోనూ, మొహంలోనూ  ఏదో తెలియని బంధుత్వం’ గాఢంగా పెనవేసుకుపోయిందని!!
ఆత్మీయబంధం  అమితంగా ఆకట్టుకుంది. తరవాత కాలములో మా బంధం మరింత

54
నవంబర్ - 2022
బలపడింది. పెద్దయ్య కూర్చున్న వెనుకే చిన్న ఎదురవకూడదని అనుకున్నానో అదే జరిగింది.
గట్టులాంటి సిమెంట్ దిమ్మమీద నేనూ కూర్చుని, పెద్దయ్య ఆ వారమూ సంతకి రాలేదు. నా గుండెల్ని
ఇరువురం చాలా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఎవరో గుంజేసినట్టుగా విలవిల్లాడిపోయాను.
ఈసారి వేరే దుఖాణంవారిని అడిగాను. పాత
పెద్దయ్యకు ఓ కొడుకూ, కూతురు. సమాధానాలే శరాఘాతల్లా తగిలాయి. అప్పుడే
ఇద్దరకు పెళ్లిళ్లు చేసేసాడు. కొడుక్కి ఇద్దరు ఆలోచన స్ఫురణకు వచ్చి, అక్కడకి  కొద్ది
పిల్లలు. అతనితోపాటు కలిసి ఉంటున్నాడు.  దూరములో ఆకుకూరలు అమ్మే మరొకాయన్ని 
కొడుకు తాపీమేస్త్రిగా పని చేస్తూంటాడని, కొడుకు పెద్దయ్య గురించి అడిగాను. అతను, అక్కడకి
సంపాదించింది చాలా వరకూ తాగేస్తుంటాడని, దగ్గరలో ఉల్లిపాయలు, బంగాళాదుంపలు అమ్మే
పెద్దయ్య సంపాదనతోనే ఆ ఇల్లు నడుస్తుందని  దుకాణందారుని చూపించాడు.
నాకు అర్ధమైంది.  ప్రతిరోజూ రైతులదగ్గర
ఆకుకూరలు కొనుక్కుని సాయంత్రం పరుగులాంటి నడకతో ఆశగా అతని
చుట్టుపక్కల ఊర్లలోని సంతల్లో ఆకుకూరలు
అమ్ముతుంటాడు.  రోజుకి మూడు వందలు
నుంచి నాలుగు వందలు దాకా మిగిలితాయిట
అన్నీ ఖర్చులుపోనూ!

మా ఆత్మీయ బంధుత్వం  ఇలా


సాగిపోతుండగా, పెద్దయ్య ఓ వారం
సంతలో దుకాణం పెట్టలేదు.  నాకు చాలా
వెలితిగా అన్పించింది.  పక్క దుకాణంవారిని దగ్గరకెళ్లి అడిగాను. పెద్దయ్యతో నా అనుబంధం
అడిగాను. వారికి  తెలియదన్నారు. పెద్దయ్య, అతనికి  తెలియదు.  అతని దుకాణంకి,
తనుండేది ఏ ఊరో నాకొకసారి చెప్పాడు. పెద్దయ్య దుకాణంకి చాలా దూరం కావడంతో
కానీ, సరిగ్గా గుర్తుకు రావడంలేదు. ‘బహుశా నన్ను ఎప్పుడూ చూసుండడు.  “మీరెవరు...
ఒంట్లో బాగోలేక రాలేదనుకుని, వచ్చేవారం మా సాంబడుకి   మీరేటిరవుతారు?!”అడిగాడు.
వస్తాడులే...’  అని , మనసుకి నచ్చజెప్పుకుని, పోలీసోడిలా. నాకు ఎక్కడలేని చిరాకువచ్చింది.
ఏదో చేసాననిపించినట్టుగా సంత చేశాను.  అయినా తమాయించుకొని “దగ్గర  బంధువుని”
కానీ మనసుకి  ఏదో బరువు ఆవహించినట్టుగా తొణుకుబెణుకులేని  స్వరముతో దృఢంగా
కష్టంగా అన్పించింది. అన్నాను. 

ఆ వారమంతా అలానే భారంగా గడిసింది.  “మామకి ఒంట్లో బాగోలేదు. అదేదో


ఆ మరుసటి వారం సంతకి తొందరగా వెళ్తే,ఎక్కడ డెంగు  జ్వరమంట.  అందుకే సంత వెయ్యట్లేదు”
నిరాశ ఎదురవుతుందోదని భయపడి, సంత అన్నాడు. నేను ఊరుపేరు అడిగాను.  అతను,
మధ్యస్త సమయానికి వెళ్ళాను. నేను ఏది “మా ఊరేనండీ...”అంటూ  దగ్గర్లోని పెద్దయ్య 

55
నవంబర్ - 2022
వుంటున్న గ్రామం పేరు చెప్పాడు. పెద్దయ్య  కష్టాన్ని చూడ్డం ఇష్టం లేనట్టుగా నా వెంట
ఆచూకీ దొరకడంతో నా గుండెల్లో గుడిగంటలు తెచ్చుకున్న పదివేల రూపాయలను పెద్దయ్య
మోగినట్టుగా ఎంతో స్వాంతన పొందాను. చేతిలో పెట్టాను. ఈ హఠాత్పరిణామానికి
పెద్దయ్య బిత్తరపోతూ “డబ్బు వద్దు బాబు..
మరుసటి రోజు ఉదయాన్నే ఆరింటికల్లా మీ అభిమానం చాలు”అన్నాడు తత్తరపాటుగా 
పెద్దయ్య ఉంటున్న ఊరుకి చేరుకున్నాను. ఆ డబ్బుని నా చేతిలోనే  పెట్టేస్తూ. 
తొందరగానే పెద్దయ్య ఇల్లు పట్టుకోగలిగాను.
నేను వెళ్లేసరికి, పెద్దయ్య  ఇంటి అరుగుమీద “నా మాటవిని ఈ డబ్బుతో మంచి ఆసుపత్రిలో
దుప్పటి కప్పుకొని కూర్చున్నాడు..నన్ను వైద్యం చేయించుకో” అని ఎంత బ్రతిమలాడినా
చూసి ఆశ్చర్యపోయాడు. గభాల్నలేచి నాకు వద్దని  మొండికేశాడు. భార్య, కోడలు ఎంత
ఎదురొచ్చాడు. “ఇలా వచ్చారేంటి బాబు...” చెప్పినా, ససేమిరా మొరాయించాడు.
అడిగాడు చిన్నగా గొంతు పెగుల్చుకొని. నేను
అతన్ని చూస్తూ  “ఇప్పడు నీ ఆరోగ్యం ఎలా “పోనీ అప్పుగానైనా  తీసుకో, వీలయినపుడు
ఉంది, పెద్దయ్యా?!!”అడిగాను ఆసక్తిగా.  తిరిగి ఇచ్చేద్దువు గానీ” అని పెద్దయ్యని
ప్రాధేయపూర్వకంగా చూశాను.  ఈసారి
పెద్దయ్య “బాబు వచ్చారు. కుర్చీ వట్టుకురండి” పెద్దయ్య నన్ను మరీ నొప్పించడం ఇష్టంలేనట్లుగా
‘సరే’నన్నట్టుగా నాకేసి చూసాడు. మా అందరి
మొహాలు ఆనందముతో వెలిగిపోయాయి. 
పెద్దయ్యని అతని  కొడుకు గురించి  ‘ఎక్కడా?!’
అడిగాను. ఇంతలో పెద్దయ్య కోడలు
కలుగజేసుకొని,  “రాత్రి తప్పతాగి లేటుగా
వచ్చినాడు. ఆడు ఇంకా నెగలేదు బాబు...”అంది
బాధపడుతూ.  ఆ డబ్బు వారిచేతిలో  పెట్టి,
ఇంట్లోవాళ్ళకి గట్టిగా కేకేసి చెప్పాడు. నేను వద్దని ఆరోజే ఆసుపత్రికి వెళ్ళమని, ఏ ఆసుపత్రిలో చేరితే
వారించి, ఆ అరుగుమీద కూర్చున్నాను. ఇంతలో బాగుంటుందో చెప్పి మరీ ఇంటికి వచ్చేశాను.
పెద్దయ్య  భార్య, కోడలూ కుర్చీ తీసుకొని
బయటికి వచ్చారు. నాకు నమస్కారంచేసి, ఓ వారంరోజుల అనంతరం పెద్దయ్య
నిల్చున్నారు..వారి మొహాల్లో ఆ జీవితాల్లోని సంతలో దుకాణం వేసాడు.  నాకు చెప్పలేని
నిస్సహాయత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది.  సంతోషమేసింది. కానీ అతని మాటలోనూ,
మొహంలోనూ నీరసమే కనిపిస్తోంది.
“మా ముసలోడికి  డెంగు జ్వరమంట, బాబూ! “పెద్దయ్యా,  ఓ పదిరోజులు రెస్ట్ తీసుకోవాల్సింది
అవేవో పేటులెట్లు పడిపోనాయట బాబు...పెద్ద కదా..”అన్నాను.  దానికి  చిన్నగా నవ్వేస్తూ
వైద్యమే చేయించాలట” అని పెద్దయ్య భార్య “నాకు  బాగానే వున్నాను బాబు...నీరసం కొంచెం
బోరుమంది. నేను ఒక్కక్షణం కూడా వారి ఉన్నాది.  అదే నెమ్మదిస్తాది” అన్నాడు చిన్నగా.

56
నవంబర్ - 2022
నేను బయలుదేరుతుండగా “బాబూ...డబ్బులు చేతిలో పెట్టింది. నాకు ఒక్కసారిగా గుండె
వీలయినంత తొందర్లో ఇచ్చెత్తాను..” అన్న పెద్దయ్య ఆగినంత పనయింది.  “బాబుకి ఇచ్చేయాలి...
మాటలు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురిచేశాయి. ఇచ్చేయాలి...” అని తెగనలిగిపోయాడు బాబు
అతని మీద నాకు మొట్టమొదటిసారిగా మీ పెద్దయ్య...”  అంటూ ఆమె చెప్తోన్న
కోపం వచ్చింది. “పెద్దయ్యా ఆ డబ్బు మాటలు నన్ను చాలాసేపు మూగవాణ్ణి
మాట  మర్చిపో! ముందు ఆరోగ్యాన్ని సరిగ్గా చేసేయి. కొద్దిసేపు స్తబ్దుగా ఉండిపోయాను.
చూసుకో” అన్నాను కాస్త నొచ్చుకున్నట్టుగా.
నేనా డబ్బుని తీసుకుని, “ఉంచండమ్మా, ఏవైనా
పెద్దయ్య సమాధానంగా సరే అన్నట్లుగా అవసరాలకి  పనికొస్తోంది. ఈ డబ్బు గురించి, 
చూసి,  ప్రేమపూర్వకంగా నవ్వేసాడు. ఆ నేను  ఆరోజే మర్చిపోయానమ్మా!” అంటూ
నవ్వుతో ఒక్కసారిగా కూల్ అయిపోయాను. ఆమెకే తిరిగి  అందించబోయాను. ఆమె ఆ
డబ్బుని తీసుకోడానికి నిరాకరించింది. “వద్దయ్యా,
అలా మూడుసార్లు మూడు వారపు ఈ డబ్బు మీకిచ్చేయాలని ఈ నెల దినాలుగా 
సంతల్లోనూ కనిపించాడు. పెద్దయ్య తెగ ఆరాటపడినాడు. అతని ఆఖరుకోరిక
మొహంలో అదే నీరసం! అదే నవ్వు!! తీరాలి కదయ్యా...”అర్ధింపుగా అంది. ఆమె
కళ్లలో నీళ్లు చెంపలమీదుగా జారిపోతున్నాయి.
నాలుగవ వారపు సంతకి పెద్దయ్య రాలేదు! 
కానీ అతని మరణవార్త వచ్చింది!! నేను మరోమాట లేకుండా ఆ డబ్బులని
జేబులోని పెట్టుకున్నాను. అప్పుడామె
*       *        * ముఖం కాంతివంతం అయ్యింది.

ఆ రాత్రి కంటినిండా నిద్రపోలేకపోయాను. “పెద్దయ్యని  ఆసుపత్రిలో చేర్చినా ఎలా


ఉదయాన్నే పెద్దయ్య ఇంటికి వెళ్ళాను. పెద్దయ్య చనిపోయాడమ్మా....?!”దిగాలుగా అడిగాను
భార్య నన్నుచూసి బావురుమంది. నేను ఆమె పెద్దమ్మని చూస్తూ.  ఆమె తన తడిదేరిన కళ్ళను
ధైర్యం చెప్పాను. పెద్దయ్య భార్య లోపలకి తుడుసుకుంటూ “లేదయ్యా మీ పెద్దయ్యని ఏ 
వెళ్లివచ్చి, దారంతో కట్టిన నోట్లకట్టను నా ఆసుపత్రికి పట్టుకుపోలేదు. మీరిచ్చిన  డబ్బుని

57
నవంబర్ - 2022
నా తాగుబోతు కొడుకు గుంజుకుని కొంత లేక  కీడా...?!!” అర్ధంకానీ అయోమయో స్థితిలో
తాగేసి, మిగతాది పేకాటలో ఆర్పేసినాడు. అక్కడ నుంచి నిశ్శబ్దంగా బయటికి నడిచాను. 
అప్పటికీ గవరమెంటు ఆసుపత్రికి వెళ్ళాం బాబు.
అక్కడ బెడ్డులు ఖాళీలు లేవని, మందు బిళ్ళలిచ్చి  సరిగ్గా అప్పుడే,  పెద్దమ్మ గుమ్మం దగ్గరనుంచి
పంపించేశారు. మా  ముసలాడు ఏ వైద్యం గట్టిగా అరచి చెప్తోంది. “బాబూ... ఓ
అందక చచ్చిపోనాడు బాబూ... “అందామె పది దినాలు పోయాక  ఈ పెద్దమ్మ
నోట్లో చీరకొంగుని నోట్లో కుక్కుకుంటూ.  అదే జాగాలో ఆకుకూరలు అమ్ముతాది!
దుకాణంకి రావడం మర్చిపోమాకయ్యా ..”. 
నేను ఒక్కసారిగా హతాశుడనయ్యాను.
అంతే.... నేను చటుక్కున వెనక్కి తిరిగి
“మీ అప్పుని తీర్చెయ్యాలని ఏ సంతని వదలకుండా ఉత్సహంగా పెద్దమ్మవైపు చూసాను. ఆమె
అన్నిటికి ఎల్లి, నానా కట్టం పడ్డాడయ్యా, మీకు వదనంలో విచారమున్నా, ఆ కళ్ళల్లో బతుకు
సెప్పడానికి వీల్లేదన్నాడు. ఈ నెలదినాలూ అప్పు ప్రయాణపు వెలుగులు దేదీప్యమానంగా 
తాపత్రముతోనే చానా నలిగిపోయాడయ్యా...” కాంతిస్తున్నాయి.. పెద్దమ్మ చేయూపుతుంది.
అంటూ పెద్దమ్మ మాటలు నన్ను ఎక్కడికో  నేనూ ప్రతిగా అంతులేని ఆనందముతో 
పాతాళనానికి తొక్కేసినట్టుననిపించింది.  ‘’కొత్త ప్రయాణం మొదలైంది’’  స్వగతంగా
అనుకుంటూ,  పెద్దమ్మ  బతుకుబండికి
‘పదివేలు రూపాయయలు’ అనేవి నాకు చిన్న పచ్చజెండా ఊపినట్టుగా  నా  చేయిని  ఊపుతూ
మొత్తం! నెలవారీ జేబుఖర్చు!!  పెద్దయ్య ఈ ముందుకు కదిలాను.
చిన్న మొత్తం కోసం తన జీవితాన్నే పణంగా --*--
పెట్టాడు. నేను పెద్దయ్యకు చేసింది ‘మేలా...?!

58
నవంబర్ - 2022
తువ్వాయి నేస్తం
మా ముద్దొచ్చే... పాపాయికి...
చెంగు - చెంగున
గంతులువేసే
ఈ తువ్వాయే ... నేస్తం... !

వ్యవసాయమే...
జీవనమైన మాకు...
మాపిల్లలూ...
ఈ లేగదూడలే ప్రాణం !

మాకు వీళ్ళే ప్రపంచం...,


ఇంతకంటే ఆనందం...
ఇంకేమి ఉంటుంది???
- కోరాడ నరసింహా రావు

59
నవంబర్ - 2022
సాహితీ స్రష్టలు ఏమన్నారంటే....
జీవితం చాలా విశాలమైంది. సంఘంలో అనేక వర్గాలవారూ,
వృత్తులవారూ, ప్రాంతాలవారూ ఉన్నారు. వీరందరికీ అనేక వందల
సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించుకునే నేపథ్యంలో వారు
చిత్రవిచిత్రమైన నైతిక, ఆర్ధిక పరిస్థితులకు గురి అవుతున్నారు. వీరి
ఈ జీవితాలను ప్రతిబింబించడానికి ఎన్ని కథలైతే చాలు తాయి?
జీవిత వైవిధ్యంతో పాటు మార్పు కూడా వేగంగా జరుగుతున్నది. రెండేళ్ల
క్రితం ఒక సమస్య ఏ రూపంలో వున్నదో ఈనాడది ఆ రూపంలో
ఉండటం లేదు. దీనిని సాహిత్యంలో చిత్రించ వలసిన ఆవశ్యకత ఉంది..
-- కొడవటిగంటి కుటుంబరావు

“కథలు బాగా మనసుని పిండేసేవిగా ఉండనక్కర్లేదు..


మితిమీరిన త్యాగాలు, శృతిమించిన ధర్మాలతో., ఇలా మనం ఉండగలమా
అని పాఠకులు అనుకోకుండా మనసుని ఆహ్లాద పరిచేట్టు ఉండాలి.
అలాగే సాహిత్యం కలకాలం నిలిచిపోయేదిగా ఉండాలన్నా నాకు
అర్ధం కాదు. నేను రాసే కథలు ఈ తరానికి చెందినవి తరతరాలుగా
నిలబడిపోవాలని ఎలా ఆశిస్తాను?”
- ముళ్ల పూడి వెంకట రమణ

--*--

60
నవంబర్ - 2022
జోక్స్ జోక్స్....
పల్లవి, తన మిత్రు రాలిని అడిగింది ...
“ జయా.. సీత రాముడితో అడవికి ఎందుకెళ్లిందంటావు? “

“ ఒక అత్తనే మనం
భరించలేకపోతున్నాం...
అలాంటిది ముగ్గురత్తల్ని ఎలా
భరిస్తుంది చెప్పు .. అందుకే
అడవే బెస్టు అనుకుని
పెనిమిటితో పయనమై వెళ్లి
ఉంటుంది... “అంది జయ.

అప్పటికే విసిగిస్తున్న తన అత్తను తలుచు కొని.

“ భయపడకండి.... ఆపరేషన్ అయ్యాక


మీరు చక్కగా ఇంటికి నడిచి వెళ్లేలా చేస్తాను”
భరోసాగా అన్నాడు డాక్టర్.

“అంటే ఆటోకి వెళ్లే డబ్బులు కూడా బిల్లుగా


లాగేస్తారా డాక్టర్ “ అడిగాడు....
ఆందోళనగా పేషేంట్

61
నవంబర్ - 2022
ఉత్తరాలు
‘మాధురి ‘అంతర్జాల మాస పత్రిక చాలా అలంకరణతో ప్రథమ సంచిక వచ్చి చేరింది.
బాగుంది. మాధురి మధురంగా ఉంది. ముందు గెలుపు నా కథ లో లాగా ఇతరుల సంతోషానికి
ముందు ఇంకా మంచి సాహిత్యం అందిస్తారని పెద్ద పీట వేయడానికి మీరు ముందుకొచ్చారు.
ఆశిస్తూ మీకు అభినందనలు... స్నేహసాహితి అన్న సాహితీ స్నేహ హస్తాన్ని
రచయితలకు పాఠకులకు అందిస్తున్నారు.
-- చిదంబరం ( చిత్రకారుడు ) అభినందనలు.... నా కథ ఉన్నందుకు నా అదృష్టంగా
విజయవాడ. భావిస్తున్నాను‌‌.
రామశర్మ.
******* బెంగుళూర్
*********
మాధురి అంతర్జాల పత్రికకు,
శుభాకాంక్షలు..... దసరా సందర్భంగా విడుదలైన బావుంది... పత్రికలో పేజీ మేకప్ సూపర్...
మీ తొలిసంచిక చాలా అందంగా రూపు ఇందు రమణ. సింహాచలం.
దిద్దుకుంది. మున్ముందు మరింత సుందరంగా
రూపు దిద్దుకుని విజయం సాధిస్తుంది *********
అనడంలో ఎటువంటి సందేహం లేదు.
నంద చైతన్యగారి ఆలోచనతో రూపు దిద్దుకున్న స్నేహ అభినందనలు..... మాధురి ప్రారంభ సంచిక
సాహితిని... ఈవిధంగా మాధురి అంతర్జాల పత్రికగా చాలా బాగుంది.రంగుల్లో సరికొత్త గెటప్ తో
తీసుకురావడంలో ... ఆయనపై మీ సంస్థకున్న చూడ ముచ్చటగా ఉంది.వర్థమానులు,
గౌరవమెంతో... మీ మాటలే చెబుతున్నాయి. ఔత్సాహికులు తో పాటు లభ్థ ప్రతిష్ఠులైన
సంపాదకీయంలో పాఠకులకు, రచయితలకు మీరు రచయితల రచనల సమాహారం.
రాసిన మాటలు ముత్యాల మూటల్లాగే ఉన్నాయి. తెలుగు సాహితీ జగత్తులో మాధురి మరింత
శీర్షికలు, కథలు చాలా బాగున్నాయి. మరిన్ని మాధుర్యంగా తీపి గురుతుగా మిగలాలని అభిలషిస్తూ..
శీర్షికలతో... అందర్నీ ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాను.... మాధురి సంపాదక వర్గ మహాశయులకు దసరా
- ఏడిద గోపాలకృష్ణ మూర్తి శుభాకాంక్షలు.
కాకినాడ డాక్టర్ ఎమ్. సుగుణరావు.
******* విశాఖపట్నం.
సర్వాంగ సుందరంగా , రంగుల ********
హంగులతో, కవిత, కథ, ముచ్చట్లతో మిత్రమా... మాధురి చాలా చాలా
పాఠకుల మనసులను దోచేస్తోంది మధురంగా ఉంది. కీపిట్ అప్...
అభిమానంగా..... మాధురి అన్న మాధుర్యమైన -- అలెగ్జాండర్. చిత్రకారుడు.
పేరుతో అందరినీ అలరించడానికి చక్కటి విజయవాడ.
********
62
నవంబర్ - 2022
మాధురి ఆరు కథలు పదకొండు కవితలు తో మాధురి’ అంతర్జాల పత్రికకు -  శుభాకాంక్షలు
వచ్చింది. కథల పోటీ పెట్టింది. నెల నెల ఎదుగుతూ స్నేహాసాహితీ సభ్యులకు నమస్కారం...! 
పాఠకుల ఆదరణ పొందాలని ఆశిస్తూ...మీ.. విజయదశమి సందర్భంగా ప్రారంభించిన
మీ(మన) మాధురి అంతర్జాల పత్రిక  తొలి సంచిక
- వాణిశ్రీ . కన్నుల పండుగగా ఉంది. సంపాదకీయం నుంచి ఆఖరి
హైదరాబాద్ . పేజీవరకూ చాలా ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. 
ఇందులో నాకథకు స్థానం ఇస్తూ... ప్రణయ
******** మాధురి శీర్షికలో ‘ఆమె స్థానం’ ప్రచురించినందుకు
సంస్థ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ స్థానాన్ని
చాలా చాలా సంతోషంగా ఉంది సార్. చిరకాలం దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తాను.
ముందుగా స్నేహ సాహితీ సంస్థ సభ్యులందరికి మీరు కూడా నాకథలు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
శుభాభినందనలు మరియు ధన్యవాదములు. నివేదన కవిత చాలా బాగుంది.భగ్న
ఈ మాధురి మాస పత్రిక భాషాభివృద్దికి, ప్రేమికుల హృదయాల్ని కదిలించక మానదు.
సాహిత్యాభివృద్దికి, పదిమందికి మంచిని సురేంద్ర రొడ్డ గారికి అభినందనలు.
పంచేందుకు, వ్యక్తులమధ్య స్నేహ సంబంధాలను గెలుపు కథలో... రమణి ఆటలో ఓడిపోయి
పెంచేందుకు, మరింతమందిని మంచి రచయితలగా శ్రావణిని గెలిపించినా... ఆమె మంచితనం
తయారు చేసేందుకు, గత మరియు వర్దమాన గెలిచి... ఆ ట్రోఫీ అందుకున్నట్లే అనిపించింది.
రచయితలకు వారధిగా నిలబడగలదని ప్రగాఢంగా రచయిత రామశర్మ గారికి అభినందనలు.
విశ్వసిస్తూ మరొక్కసారి మనస్పుర్తిగా అభినందనలు శ్రీ కాళీపట్నం రామారావు గారిని తలుచుకోవటం
తెలియజెస్తున్నాను సార్. బాగుంది. కాండ్రేగుల శ్రీనివాసరావు గారి కొన్ని
జ్ఞాపకాలు  ప్రతి మాసం అందిస్తూ వుంటారని
K.ఆనంద్. ఆశిస్తూ అభినందనలు తెలియచేస్తున్నాను.
SBI ఆఫీసర్. విశాఖపట్నం. నేడు - రేపు కవితలో రేపటి మన జీవితం
******** కళ్ళముందు కనిపించింది. నేస్తానికి లేఖ రాస్తున్న తన
ముసలివయసు దీనావస్థను  కవిత ద్వారా తెలియచేసిన
మాధురి అంతర్జాల మాసపత్రిక సరస్వతీ శ్రీమతి పారనంది నిర్మల గారికి అభినందనలు.
మాత మెడలో మణిమాణిక్యాల మాలలా చాలా ఇందులోని ప్రతి రచనా దేనికవే బాగున్నాయి. 
బాగుంది.సహచరితో సమస్య శీర్షిక మనస్ఫూర్తిగా రచయిత, కవయిత్రులందరికీ పేరుపేరునా
నవ్వుకునేలా ఉంది . ప్రతి కవిత అర్థవంతంగా, అభినందనలు. 
మధురంగా ఉన్నాయి. కథలు కూడా సరికొత్త మరెన్నో శీర్షికలు కలుపుకుంటూ... కొత్త వారి
కథాంశంతో ఉన్నాయి. రచనలను  కూడా తీసుకుని... వాటికి మెరుగులు
-- గౌరి పొన్నాడ. దిద్ది... కారా మాస్టారు అడుగుజాడల్లో నడిస్తే...
శ్రీకాకుళం. మరెందరినో రచయితా రచయిత్రులుగా తయారుచేసే
******** అవకాశం మాధురి ఇస్తుందని నమ్ముతున్నాను.
అద్భుతమైన ప్రారంభ సంచిక సర్.... అభినందనలతో...
అభినందనలు... -- శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
అశోక్ బోగ.చిత్రకారుడు.                   విశాఖపట్నం
జగిత్యాల.
******** ******

63
నవంబర్ - 2022
పత్రిక చాలా బాగుందండి.
అభినందనలు.
- జయంతి ప్రకాష్ శర్మ.
సంపాదకులు. కథామంజిరి.
****** మాధురి
మాధురి మాస పత్రిక చాలా బాగుంది.
మాసపత్రి కకు...
పత్రికలో ప్రచురించిన శీర్షికలు బాగా ఆకట్టుకున్నాయి.
విజయ దశమి నాడు ప్రారంభమైన మాధురి
అభినందనలు తెలియజేసిన
మాసపత్రిక భవిష్యత్తులో మంచి విజయం వారందరికీ
సాధించాలని కోరుకుంటున్నాను.
సంచికలో వచ్చిన రచయితలు దాదాపు అందరూ
తెలిసిన వాళ్లే. అందుకేనేమో ఈ పత్రిక మనదే మా హృదయపూర్వక
కదా అన్న భావన కలిగింది. అమ్మ రాధికా ప్రసాద్
రాసిన ముఖ చిత్ర వ్యాసం బాగా నచ్చింది. పత్రికలో కృతజత
్ఞ లు
రంగుల శోభ కంటికి సొంపుగా ఉంది. కథలకు,
కవితలకు వేసిన చిత్రాలు కూడా చాలా బాగా
ఉన్నాయి.. మాధురి పత్రిక నిర్వాహకులకు మనః
పూర్వక అభినందనలు.

యశస్వి జవ్వాది
హైదరాబాద్.

******

అమల: రేపు మా గృహ ప్రవేశమే లతా...


మీ కుటుంబం అంతా రావాలి... మధ్యాహ్నం
భోజనం అక్కడే... తెలుసా ....

లత : నువ్వు అంతగా చెప్పాలేమిటే.. తప్పక


వస్తాం ఇంతకీ పంక్షన్ ఏ హోటల్ లో ?

అమల:. ఆ..???

64
నవంబర్ - 2022

You might also like