You are on page 1of 6

రసశేవధి

(తెలుగు వెలుగు లో ప్రచురితమైన కథ )


టి. శ్రీవల్లీ రాధిక
94416 44644
జీవితంలో సమసయలు వచ్చినప్పుడు వయక్తితవం గురించ్చ ఆలోచ్చస్ిం పరిష్కారానిక్త వికాస ప్పసికాలూ చదువుతం. వాటిలో
అంశాలు ఆచరణీయమా..? చెపులం. ఇవి అందరి గురించ్చ రాసినా అందరికీ అనిివేళలా పనిక్తరావు. మనకు నచ్చిన మారగంలో
చ్చకుాముళ్లీ విప్పుకోవడమే...
‘‘జీవితం నిస్ారంగా ఉంది. చచ్చిపోవాలనిపిస్ింది’’ - మాధవి నోటినంచ్చ వచ్చిన మాటలు విని ఉలిక్తాపడ్డాన.
మాధవి నా మేనకోడలు. అచింగా నా పోలికే. నా దగ్గర బాగా చనవు. వాళ్లీయనకు హైదరాబాదులో ఉద్యయగ్ం. ఒకాడే
కొడుకు. ఇంజినీరింగ చదువుతునాిడు.
దాదాప్ప పాతికేళీ తరావత మాధవి మళ్లీ మా ఊరు వచ్చిందని చాలా సంతోషపడ్డాన. కానీ ఆ సంతోషం ఎంతోసేప్ప
నిలవలదు. వచ్చినపుటినంచీ ఏద్య నిరుతాహం... చ్చరాకు... పరాకు. తరచ్చతరచ్చ అడిగితే చ్చవరిక్త ఇంత పెదదమాట అనేసింది.
నివెవరపోయి చూస్ింటే ‘‘కంగారు పడకతియ్యయ... ఈ వయస్లో ఆడవాళీక్త ఇది సహజమే కదా!’’ అంది.
‘‘ఏంటి సహజం!’’ అని నేన ఇంకాసి ఆశ్ిరయపోతే... స్త్రీలలో శారీరకంగా మానసికంగా ఈ వయస్లో చాలా మారుులు
వస్ియనీ, వాటివలీ ఇలాంటి నిరాశా నిసుృహలు ఏరుడతయనీ వివరించ్చంది మాధవి.
నాకు నవ్వవచ్చింది. ‘‘శ్రీరంలో చ్చనిచ్చని మారుులు వసేి రావచుి... కానీ అది అందరూ చెప్పుకుంటునింత తీవ్రమైనదేమీ
కాదు. మంచ్చ డ్డకటర్లీవరూ అలా చెపురు కూడ్డ’’ అనాిన.
ఒకా నిమిషం ఆలోచ్చస్ినిటుీగా కూరుిండిపోయింది మాధవి. ‘‘స్హితయం అనకుని ఏది పడితే అది చదవకు’’ అనాిన
నవువతూ.
‘‘నవవనిది నిజమే అతియ్యయ... కాసి తీరిక ఎకుావయ్యయసరిక్త ఏవి పడితే అవి చదువుతునాిన. ఇందాక నేన నీతో అని
మాటలు నిజంగా నా మనస్ లోతులోీంచ్చ వచాియ్య? లక నేన చదివిన కథలోీని మాటలిి అనాలోచ్చతంగా నా నోటితో
అనేశానా అనిపిస్ింది ఇప్పుడ్డలోచ్చస్ింటే. ఓ డ్డకటరగారి వాయసం చదివాన ఈమధయ. ఆవిడ కూడ్డ స్త్రీల బాధలనీి
శారీరకం కాదని రాశారందులో. స్త్రీల అనారోగాయనిక్త కారణాలు స్మాజికమైనవని అనాిరావిడ. సమాజం స్త్రీలపటీ చూపే
వివక్ష, వాళీపైన ఉండే ఒతిిడి, కుటుంబ సభ్యయల సహకారం అందకపోవడం, విపరీతమైన శ్రమ, వాళీమీద జరిగే హింస -
ఇవనీి కారణాలనాిరు’’
‘‘అవనీి ఉనాియ్య నీకు!’’ సూటిగా తన కళీలోక్త చూసూి ప్రశ్ించాన.
మాధవి మాట్లీడలదు. ‘‘ఆ వాయస్లలో అనిి తరగ్తుల వాళీనీ, అనిి తరాల వాళీనీ కలిపి రాసేస్ింట్లరు మాధవీ. నిజంగా
అలాంటి సమసయలు ఉనివాళీక్త అవి ఎంతవరకూ చేరతయో, వాళీకు ఎంతగా ఉపయోగ్పడతయో తెలియదు. కానీ అవి
చదివిన మిగ్తవాళ్లీ మాత్రం వీటిలో మనకు వరిించేవి ఎనిి అని ఆలోచ్చంచరు. అవనీి తమకూ ఉనాియని భావనలోక్త
వెళ్లీపోతరు’’ అనాిన.
మాధవి ఒకాక్షణం ఊరుకుని ‘‘నవువ చెపేుది నిజమేనేమో, నా వయక్తితవనేి మారుికోవాలమో! అందుకే ఈమధయ కొనిి
వయక్తితవవికాస ప్పసికాలూ చదివాన’’ అంది తనలో తనే ఆలోచ్చంచుకుంటునిటుీగా.
నాకు నవ్వవచ్చింది. ‘‘అదీ సంగ్తి. ఎప్పుడూ లనిది ఈ అయోమయం మాటలందుకు మాట్లీడుతునాివో అరథమైంది’’
అనాిన పరిహాసంగా. ‘‘ఆదరాానిక్త తయగానీి, ఆచరణకు స్వరాథనీి ఉపదేశ్ంచ్చ తికమక పెడతరు కదా వాళ్లీ!’’
మాధవి ఆశ్ిరయంగా చూసింది. ‘‘ఏంటేంటీ! మళ్లీ చెప్పు!’’ అంది.
‘‘ఓపకా ఉతేిజపరిచే తయగ్ధనల కథలు చెప్తి... మరోపకా ఒకరిక్త ఉపయోగ్పడకపోవడమే విజయ రహసయమని
చెప్పింట్లరు కదా వయక్తితవవికాస నిప్పణులు. ఆ వైరుధయం గ్మనించలదా నవువ?’’ అనాిన.
తన చెపిున ప్రతి విషయ్యనీి నేన కొటిటపారేస్ింటే మాధవిక్త ఉక్రోషం వచ్చినటుీంది. ‘‘మరైతే నవువ చెపుతియ్యయ!
నిసుృహగా అనిపిసేి నవేవం చేస్ివు?...’’ అంది కొంచెం అసహనం ధవనించే గంతుతో.
‘‘నాకంత నిరాశ్ ఎప్పుడూ రాలదమాా... ఎప్పుడైనా కొంచెం అలజడిగా అనిపిసేి అమావారి పట్లనిి చూసూి స్ిత్రం
చదువుకుంటేే...’’
‘‘అబాా...’’ అంది మాధవి నా మాటలిి మధయలోనే ఆప్పతూ. ‘‘ప్తజలూ వ్రతలూ చెపుకతియ్యయ! అలాంటి పలాయనవాదం
నేన పఠంచలన’’ అంది. ఈస్రి విస్గు సుషటంగానే ధవనించ్చంది తన గంతులో.
‘‘మీ రోజులోీ అంటే చ్చనిపుటినంచీ ఇలాంటివనీి అలవాటు చేసి ఉంట్లరు. కానీ మేమలా కాదతియ్యయ! మీకు
పనిక్తవచ్చిన ఆ పరిష్కారాలు మాకు పనిక్తరావు’’, మాధవి నిషారషగా చెపిుంది.
‘‘చ్చనిపుటుించీ ఎకాడమాా! చ్చనిప్పుడు ఎవరూ చెపులదు నాకు. పెదదయ్యయకే... పెళీయ్యయక ఒకావిడ చెపిుంది...
ఒకరకంగా చెపాులంటే ఇప్పుడు నవువ చెపిున వయక్తితవవికాస పాఠం లాగేననకో’’
‘‘అవునా!’’ మాధవి ఆశ్ిరయపోయింది. ‘‘ఎవరావిడ! ఎందుకు చెపిుంది? నవువ కూడ్డ ఇలాగే నిరాశ్లో మునిగిపోతే
చెపిుందా!’’
‘‘హూ...’’ నేన నిట్టటరాిన. ‘‘కొంచెం పెదదకథ మరి! చెపునా!’’ అనాిన ఊరిస్ినిటుీగా.
‘‘చెప్పు... చెప్పు’’ మాధవి కళ్లీ మొహమూ కుతూహలంతో మెరిశాయి.
***
దాదాప్ప నలభయ్యయళీ క్తందట... నా పెళీయిన వెంటనే కాప్పరానిక్త మద్రాస్ వెళ్లీన. అప్పుడు మీ మావయయ అకాడే ఉద్యయగ్ం
చేసేవారు. కొతిప్రదేశ్ం. ఏమీ తోచేదికాదు. మీ మావయయ పొదుదన వెళ్తి స్యంత్రమే రావడం. ఇంట్లీ ఉని సమయంలోనూ
పెదదగా మాట్లీడేవారు కాదు. నా విషయంలో అసలాయన అభిప్రాయమేంట్ల అరథమయ్యయది కాదు.
ఎప్పుడనాి మాట్లీడితే ఒకావిడ గురించ్చ చాలా ఆరాధనగా చెపేువారు. పెళ్లీక్తముందు ఆయన ఒంగోలులో
పనిచేస్ిండేవారు. అకాడ నాలుగు పోరషనీని ఒక ఇంట్లీ అద్దదక్త ఉండేవారట. ఆమె అకాడే ఉండేది. ఆవిడ ఎంత బాగా
మాట్లీడతరో, ఇంటిని ఎంత శుభ్రంగా అందంగా పెటుటకుంట్లరో వివరించేవారు. అది నాక్తంకా బాధ కలిగించేది. అలా మరో
స్త్రీ గురించ్చ ఎందుకు చెపాులి అనిపించేది. రోజులు గ్డిచ్చ మాకు బాబు ప్పటిటనా నా అసంతృపిి పెరిగిందే కానీ తగ్గలదు.
ఒంట్లీ కాసింత నీరసం... మీ మావయయ సవభావం... నా ఎడతెగ్ని ఆలోచనలు... అనీి ఎప్పుడూ ఉండేవే! కానీ ఆ రోజు...
ఆ రోజు ఏ కారణం నని ప్రేరేపించ్చంద్య సుషటంగా తెలియదు... ఆయనతో చెపునైనా చెపుకుండ్డ సేటషనకు వచ్చి
విజయవాడ రైలకేాశాన అమా దగ్గరిక్త వెళ్లీపోదామని... చేతిలో తొమిాది నెలల పిలాీడు.
ఇంట్లీంచ్చ బయలదరినప్పుడే కొదిదగా వరషం ఉంది. ఆ తరావత బాగా పెదదదైపోయింది. ప్రయ్యణంలోనే ఇబాందులు
మొదలయ్యయయి. ఆలసయంగా నడుస్ిని రైలు ఏ వేళకు గ్మయం చేరుస్ింద్య... పసిపిలాీడితో ఏం అవసథలు పడ్డలో అని
భయమూ మొదలంది.
అలా భయపడుతూనే కూరుినాిన... వరషం తగాగలనీ, క్షేమంగా విజయవాడ చేరాలనీ ప్రారథనలు చేస్కుంట్ట. కానీ అలా
జరగ్లదు. మెలీగా నడుసూిని రైలు ఏద్య సేటషనోీ ఆగిపోయింది. ఇక ముందుకు కదిల వీలులదనాిరు. అందరూ గోలగోలగా
మాట్లీడుకుంట్ట రైలు దిగిపోతునాిరు.
నాకేం చేయ్యలో తోచలదు. పసిపిలాీడితో బికుాబికుామంట్ట అందరికనాి చ్చవరగా నేన కూడ్డ క్తందిక్త దిగాన. దిగి
ఏం చేయ్యలో అరథం కాక మళ్లీ అలాగే నిలబడిపోయ్యన.
కొతిప్రదేశ్ంలో అనకోకుండ్డ దిగాలిా వచ్చినా మిగిలిన ప్రయ్యణికులందరూ క్షణాలోీ నిరణయ్యలు తీస్కుని హడ్డవుడిగా
కదిలిపోతునాిరు. మరొకరివైప్ప చూసేవారు కానీ ఇంకొకరి పరిసిథతిని గ్మనించేవారు కానీ ఎవరూ లరు. నేన కాసి
సిథమితపడేలోపే సేటషన ఖాళ్ల అయిపోయింది.
జలుీ కురుసూినే ఉంది. ఒకచేతిలో పిలీవాడితో మరోచేతిలో సంచ్చతో మెలీగా అడుగులు వేయడం మొదలుపెట్లటన.
అవడ్డనిక్త పటటపగ్ల... కానీ అసలు వెలుతురే లదు. అంత మసకమసకగా ఉంది.
అసలిది ఏ సేటషన..! చుట్టట చూశాన. పదడుగుల దూరంలో కనిపించ్చంది బోరుా... పెదద అక్షరాలతో.
ఒంగోలు...
లిక్తాపడ్డాన. ఒంగోలా! ఒంగోలులో ఆగిపోయిందా రైలు!!
అనాలోచ్చతంగా సేటషన బయటిక్త వచాిన. కానీ ఎకాడిక్త వెళ్లిన! ఎవరునాిరు ఇకాడ! నాకు స్యం చేసేవాళ్లీ, నేన
తెలిసినవాళ్లీ..! అసలు ఇప్పుడప్పుడే ఈ దారిలో రైళ్లీ నడిచే అవకాశ్మే లదేమో! బస్టండు ఎంతదూరంలో ఉంద్య!
బస్ాలనా నడుస్ినాియో లద్య! ఎవరిడగాలి? రైలవ ఉద్యయగులవరినైనా అడుగుదామని కదలబోతుంటే వినబడింది
‘‘ఎకాడికెళ్లిరమాా!’’ అనిమాట. తిరిగిచూశాన.
రిక్షా అబాాయి... ‘‘చెపుండమాా తీస్కెళ్లిన’’ అనాిడు నేన అతనివైప్ప చూడగానే. ఆ మాత్రం పలకరించే మనిషి
కనబడగానే ప్రాణం లచొచ్చింది. ‘‘బస్ాలు నడుస్ినాియ్య!’’ బెరుకుబెరుకుగా అడిగాన.
అతన ననూి నా చేతిలోని పిలాీడినీ చూసూి... ‘‘ఈ ఊరోీ తెలిానోళ్లీ ఎవరైనా ఉంటే ఎలిీపోండమాా. ఈ వరషంలో
ప్రయ్యణం చేయలరు’’ అనాిడు.
నేన ఆలోచనలో పడ్డాన. ‘‘ఏమాా ఎవరూ లరా!’’ అతనడిగాడు. ‘‘వరషం పెదదగ్య్యయలా ఉంది. తొరగా ఎలిీపోండి’’
హెచిరిస్ినిటుీగా చెపాుడు. దూరం నంచ్చ ఇంకెవరో ‘‘ఏయ రిక్షా’’ అని పిలుస్ినాిరతణిి. చుట్టట చూశాన. ఇంకావేరే
రిక్షాలు కనిపించలదకాడ.
గ్బుకుాన క్తంద పెటిటన సంచీ తీస్కుని ‘‘సంతపేట మంగ్మా కాలజీ దగ్గరిక్త...’’ అనాిన కంగారుగా.
అతన సంచీ అందుకుని రిక్షాలో పెట్లటడు. ఎక్తా కూరుినాిన కానీ శ్రీరంలో వణుకు మొదలంది. కొంత చలికీ... కొంత
భయ్యనికీ...
ఇలుీ తెలుస్ిందా! సరిగాగ కాలజీక్త ఎదురుగా ఉండే ఇలీనని చెపాురాయన. ఆవిడ పేరొకాటే తెలుస్ నాకు. ఇంకే
వివరాలూ తెలియవు. వాళ్లీయన పేరేంట్ల ఆయన ఏం చేస్ిరో ఏమీ తెలియదు.
రిక్షా ఆగింది... సరిగాగ కాలజీక్త ఎదురుగా ఉని ఇంటిముందు దిగాన. గేటు దగ్గర నిలబడి చూసేి లోపల ఓ పది
పనెిండుమంది- అందరూ ఒకేచోట వస్రాలో నిలబడి మాట్లీడుకుంటునాిరు. నని గ్మనించ్చ మాటలు ఆపారు. నేన
జలుీక్త తడుసూినే... ‘‘లలితమాగారు’’ అనాిన. వాళీలో ఒకావిడ ఒక అడుగు ముందుకువేసి నా వైప్ప వసూిండగా...
మిగిలిన వాళీందరూ ననేి ఆశ్ిరయంగా చూసూిండగా... ‘‘నేన మధుసూదన్రావుగారి భారయని’’ అనాిన.
ఆవిడ ఒకా అంగ్లో నా దగ్గరిక్త వచ్చి... ‘‘మీరా! లోపలిక్త రండి’’ అనాిరు. మరొకర్లవరో నా సంచీ అందుకునాిరు.
ఒకాస్రిగా తనికొచ్చిన దుుఃఖానిి ఎవరికీ కనబడకుండ్డ నిగ్రహించుకుంట్ట నేన లోపలిక్త నడిచాన. అలా వెళ్లీనదానిి
అకాడే ర్లండు రోజులు ఉండిపోవాలిా వచ్చింది. నాలాగే అనకోని పరిసిథతులోీ అకాడిక్త చేరి చ్చకుాకుపోయిన వాళ్లీ
ఇంకొంతమంది ఉనాిరకాడ. కాకపోతే వాళీంత ఒకరికొకరు బాగా పరిచయం ఉనివాళ్లీ. బంధువులు, సేిహితులు.
నేనొకాదానేి ముఖపరిచయమైనా లకుండ్డ వెళ్లీనదానిి. లలితమాగారి ఇదదరు ఆడపడుచులు వారి కుటుంబాలతో తిరుపతి
వెళ్లీ వసూి తెనాలి వెళ్తీ మారగంలక ఒంగోలులో ఆగిపోయ్యరు. పకా పోరషనలో ఉండే కృషణమూరిిగారి కుటుంబానిక్త
సేిహితులన కొతి దంపతులు రమణ, లక్ష్మి- వాళ్లీ కూడ్డ ఎకాడినంచ్చ వచాిరో గురుిలదు కానీ ఒంగోలు దగ్గరలోని ఏద్య
పలీట్టరిక్త వెళ్లీలి. ఇలా మొతిం పాతిక ముపెఫై మందిమి కలిసే గ్డిపాం ఆ ర్లండు రోజులూ ఒకే కుటుంబంలా.
తుపాన బీభతాం కొంత. ఉపెున వస్ిందేమోనని భయం కొంత... ప్పకారూీ ఊహాగానాలూ రేపిన ఆంద్యళన కొంత.
కర్లంటు లదు... బయటిక్త వెళ్తీ మారగం లదు. మిగ్త ప్రపంచంతో సంబంధం లదు. నడిసముద్రంలో ఉనివారిని
ఆవహించేలాంటి దిగులు ఆవహించేసింది అందరినీ. నేనైతే ఒకలాంటి దిగ్ర్రమతో ఓ మూలగా కూరుిండిపోయ్యన. చలికీ
ఆకలికీ గుకాపటిట ఏడుస్ిని పిలాీణిి ఎలా సముదాయించాలో కూడ్డ తెలియనటుీగా ఉండిపోయ్యన. లలితమాగారు వాణిి
ఎతుికుని ఆకలి తీరిి వెచిగా చీరలు కపిు పడుకోబెట్లటరు. వెళ్తీటప్పుడు ఏ భావంతో వెళ్లీనో కానీ... ఆ స్యంత్రం గ్డిచ్చ చీకటి
పడేసరిక్త నా పిలీవాడు భౌతికంగా ఆవిడని ఎలా గ్టిటగా కరచ్చపటుటకునాిడో నేన మనస్లో ఆవిడకు అలాగే
చుటుటకుపోయ్యన...
అసలు గేటుదగ్గర నిలబడినప్పుడే... ఇంకా ఆవిడ లలితమాగారని నాకు, నేన ఫలానా అని ఆవిడకీ తెలియకముందే...
అకాడ నలుగురు ఆడవాళ్లీనాి నా చూప్ప ఆవిడ మీదే నిలిచ్చంది. ఆవిడనంచ్చ కరుణ సూటిగా నా మీదిక్త
ప్రసరించ్చందనిపించ్చంది.
ఆ రాత్రంత ఎవరమూ నిద్రపోలదు... అందరం నడుము వాలింత చోట్ట ఆ చ్చని పెంకుటింట్లీ లదు. తెలీవారింది.
ఎవరిలోనూ ఉతాహం లదు. భయమూ బాధా లనటుీగా తిరుగుతునిది పదేళీలోప్ప చ్చనిపిలీలూ లలితమాగారే.
ఉనిదేద్య ఒకచోటిక్త చేరిి వండుకుని తినే ప్రయతిం చేస్ింటే ఉనిటుీండి ఓ కొతి భయం ఏరుడింది. ఆ ఇంటిక్త
వెనకవైప్పన ఉని పాతభవనం కూలిపోతుందేమోనని భయం. అది గ్నక కూలితే ఈ ఇంటి మీదే పడుతుంది. ప్రమాదం
అరథమై అందరం వణికాం. కానీ, ఎకాడికని వెళ్లిం? చుటుటపకాల ఇళీనీి ఇలాంటివే... కాదంటే ఇంకా చ్చనివి. చ్చవరిక్త
పరిష్కారం కూడ్డ లలితమాగారే సూచ్చంచారు. ఎదురుగా ఉని కాలజీ మిద్దదమీదిక్త చేరిపోయ్యం అందరమూ. కాలజీ అంటే
అది కూడ్డ బ్రహాాండమైన భవనమేమీ కాదు. అవనీి పెంకుటిళ్లీ అయితే అది చ్చని డ్డబా అంతే. నీరస్నీి నిసాతుివనీ
ఉతాహంగా చురుకుదనంగా మారిడం అంటే ఏంట్ల అప్పుడే చూశాన నేన. అది ఎలా జరిగింద్య నాకు తెలియదు. దానిక్త
లలితమాగారు ప్రతేయక్తంచ్చ ఏం చేశారో నాకు అరథం కాలదు. కానీ ఒకాటి మాత్రం అనిపించ్చంది. ఆవిడ లకపోతే అందరమూ
ఇలుీ కూలిపోతూ ఉంటే హాహాకారాలు చేసూి అలాగే కూరుిండిపోయ్య వాళీమేమో! లదంటే చ్చవరి నిమిషంలో లచ్చ
వరషంలో పరుగులు తీసేవాళీమేమో!
ఆవిడ ఏం చేయ్యలో చెబుతోంటే పిలీలూ పెదదలూ అందరూ గారడీ నాయకుని డప్పు శ్బాదనిక్త అనగుణంగా వినాయస్లు
చేసే ఆటగాళీలా అవసరమైన స్మాన తీస్కుని మిద్దదమీదిక్త చేరడం... ఆ దృశ్యం నాక్తపుటికీ కళీముందు ఓ అదు్తంలా
మెదులుతూనే ఉంటుంది.
ర్లండోరోజు రాత్రీ అకాడే గ్డిచ్చంది. కాసి పొడిచోటు చూసి పిలీలిి పడుకోబెటిట పెదదవాళీం జాగారం చేశాం. తెలీవారు
జామున అందరం ఎకాడివాళీం అకాడే కునిక్తపాటుీ పడ్డాం. నేన కళ్లీ తెరిచేటపుటిక్త కొదిదకొదిదగా వెలుతురు వస్ింది. వాన
కొంచెం తెరపినిచ్చినటుీంది కానీ గాల్ల... హోరూ... అలాగే ఉనాియి ఉధృతంగా.
కొతి దంపతులు రమణా లక్ష్మీ ఒక్తంత ఏకాంతనిి ఆశ్ంచ్చ కాబోలు కొంచెం దూరంగా కూరుినాిరు. కానీ ఇదదరి
మొహాలోీనూ అసలు జీవం లదు. లలితమాగారు వాళీని చూసి ధైరయం చెప్పినిటుీగా నవవడం కనిపించ్చంది. వాళ్లీ కూడ్డ
పేలవంగా నవావరు. ‘‘బాగా చలిగా ఉంది’’ మనస్లో దిగులుని మరోలా బయటపెటిటంది లక్ష్మి.
లలితమాగారు చలీగా నవివ ‘‘ఇదదరూ ఒకాచోటే ఉనిప్పుడు చలం చేస్ింది?’’ అనాిరు.
వాళ్లీదదరి మొహాలోీ మొదట ఒక విసాయం... ఆ తరావత చ్చనిహాసరేఖ మెరిశాయి... లక్ష్మి బుగ్గలు ఎర్రబడ్డాయి.
అప్పుడు వాళీవైపే సూటిగా చూసూి లలితమాగారు... ‘‘దిగులందుకయ్యయ, భగ్వంతుని ప్రతిచరాయ అదు్తమే. కలిసి
ఆస్వదించండి’’ అనాిరు. వాళీలోనే కాదు పకానంచ్చ వింటుని నాలోనూ ఆ మాటలు ఏద్య ఉదివగ్ితని నింపాయి. అరగ్ంట
తరావత వాళ్లీదరూ
ద చేయీచేయీ పటుటకుని పిటటగోడ దగ్గర నిలబడి తుపాన బీభతానిి ఉతాహంగా గ్మనిస్ిని దృశ్యం...
అదు్తంగా తోచ్చంది. అది నా మనస్కు గపు శాంతినీ ఇచ్చింది.
ఆ మరాిటిక్త ప్రకృతి శాంతించ్చంది. బస్ాలు తిరగ్డం మొదలయ్యయక నేన బయలదరి వచేిస్ింటే ఆవిడ నాకు బొటుటపెటిట
చేతిలో ఏద్య పెట్లటరు. ‘‘మొదటిస్రి వచాిరు మీరు. సమయ్యనిక్త ఏమీ అందుబాటులో లకుండ్డ అయింది. ఏద్య నా గురుిగా
ఇస్ినాిన...’’ అనాిరు సంజాయిషీగా.
కనీిళ్లీ ఆప్పకోలకపోయ్యన. ఆవిడ చేయిపటుటకుని ‘‘నేన మిమాలిసలు మరిిపోతనాండి! నిరంతరం గురుి
చేస్కుంట్లన’’ అనాిన.
నా చేతిమీద ఓదారుుగా తడుతూ నవావరావిడ. ‘‘జాగ్రతి.. ఎవరినైనా నిరంతరం ధాయనిసేి వాళీలా అయిపోతమట’’
అనాిరు చ్చలిపిగా నవువతూ. చెపుడం ఆపి మాధవి వైప్ప చూశాన. శ్రదధగా స్లోచనగా వింట్లంది.
‘‘ఆవిడని మళ్లీ ఎప్పుడూ కలవలదు మాధవీ. కానీ ఆ రోజునంచ్చ ఆవిణిి గురువుగా భావించాన. ఆవిడ ఇచ్చిన లలితదేవి
పట్లనిి లక్షయంగాన, ఆవిడ నాతో అని చ్చవరివాకాయనిి ఉపదేశ్ంగాన స్వవకరించాన’’, చ్చరునవువతో నేన ముగించగానే
మాధవి కూడ్డ నవివంది.
‘‘భ్రమరకీట నాయయం అంట్లరు కాబోలు దీనిి’’ అంది.
నేన ప్రశాిరథకంగా చూశాన. ‘‘మనందరిలోనూ వాసనా విశేషంగా రసం ఉంటుంది. కాకపోతే నూతిలో నీళీలా ఎకాడో
అడుగున ఉంటుంది. దానిని కషటపడి చేదాలి. అదీ చేతకాకపోతే ఎవరు చేదిపెడతరా అని ఎదురుచూడ్డలి. కానీ
కొంతమంది అలా కాదు. వాళ్తీ ఒక రససముద్రం. వీరం... శ్ృంగారం... కరుణ... అదు్తం... శాంతం- ఆవిడని తలచుకుంటేనే...
నవువ చెపేుది వింటుంటేనే మనస్ ఊగిపోయిందతియ్యయ!’’ మాధవి వివరించ్చంది.
నా చుట్టట చేతులు వేసి నని చుటుటకుంట్ట ‘‘థంక్ా అతియ్యయ... ఆవిడ గురించ్చ చెపుడమే కాదు... ఆవిడలా
ఎలాగ్వావలో కూడ్డ చెపాువు’’, అంది సంతృపిిగా.

You might also like