You are on page 1of 2

6/22/2021 కేతువు జ్యో తిషం - వికీపీడియా

కేతువు జ్యో తిషం


వికీపీడియా నుండి

కేతువు రాశి చక్రంలో అపసవ్య దిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుండి మీనానికి ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్న ర సంవత్స రకాలం ఉంటాడు.
సూర్యు డిని ప్రదిక్షిణం చేయడానికి పద్దెనిమిది సంవత్స రాల కాలం పడుతుంది. రాహువు కేతువులు ఎప్పు డూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని ఏడవ స్థా నంలో
సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం ఏడు సంవత్స రాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్వి ని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తా డు. ఈ మూడు
నక్షత్రాలలో వారికి పుట్టిన ఆరంభ దశ కేతు దశ. కేతువుకు అవల, శిఖి, ధూమ, ధ్వ జ, మృత్యు పుత్ర అనే ఇతర నామాలు ఉన్నా యి. కేతువు పురుష గ్రహము. గ్రహ
స్వ భావం పాప గ్రహం, తత్వం వైరాగ్య ము, స్వ భావం క్రూర స్వ భావం, గుణం తమోగుణం, దిక్కు వాయవ్య ము, ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. ఆత్మా ధికారం
మోక్షం, పాలనా శక్తి భటుడు, లోహము ఇనుము, కుటుంబ సభ్యు డు తాత, వర్ణం ధూమ్ర వర్ణం, గ్రహ పీడ అతి తెలివి, గ్రహ వర్గం గురువు, గృహంలోని ఖాళీ
ప్రదేశాలను సూచిస్తా డు, కాల బలము పగలు, కాల బలం పగలు, శత్రు క్షేత్రం కటకం, సమ క్షేత్రం మీనము, ఉచ్ఛ క్షేత్రము వృశ్చి కము, నీచ క్షేత్రము వృషభము,
మిత్రులు సూర్యు డు, చంద్రుడు, కుజుడు, శత్రువులు శని, శుక్రుడు, సములు గురువు, బుధుడు. వయసు ముసలి వయసు, చెట్లు ముళ్ళ చెట్లు, ధాన్యం ఉలవలు,
పండ్లు సీతా ఫల, ప్రదేశములు గుహలు, బిలములు. దేశంలో కేతువు ఆధిక్య త ఉన్న ప్రదేశం అంతర్వే ధి.ధాన్య ము ఉలవలు, పక్షులు రాబందు, గద్ద, కోడి.
జంతువులు కుక్క , పంది, గాడిద. మూలికలు తెల్ల జిల్లేడు, పున్నే రు వేరు, సమిధలు దర్భ . దైవ వర్గం వైష్ణవ, గోత్రము పైఠీనస. అవతారం మీనావతారం. గ్రహారూఢ
వాహనం గ్రద్ద, రత్న ము వైఢూర్యం, రుద్రాక్ష నవ ముఖ రుద్రాక్ష, లోహము కంచు, శుభ సమయం ఉదయ కాలం. వారము ఆదివారం. స్వ భావం చంచల స్వ భావం.
దృష్టి అధోదృష్టి.

విషయ సూచిక
కారకత్వ ము
రూపము
పరిహారం
కేతువు స్థా నములు
వెలుపలి లింకులు

కారకత్వ ము

కేతువు కుటుంబ సభ్యు లలో తాత (తల్లికి తండ్రి) ను సూచిస్తా డు. కేతువు దైవోపాసన, వేదాంతం, తపస్సు , మోక్షము, మంత్ర శాస్త్రము, భక్తి, నదీస్నా నం, మౌన
వ్రతం, పుణ్య క్షేత్ర దర్శ నం, మోసము, పరుల సొమ్ము తో సుఖించుట, దత్తత మొదలైన వాటిని సూచిస్తా డు.

వ్యా ధులు :- అజీర్ణం, స్పో టకము, రక్తపోటు, చెముడు, నత్తి, దురదలు, గ్యా స్, అసిడిటీ, వైద్య ము, జ్వ రము, వ్రణములను సూచిస్తా డు కేతువు ఏగ్రహముతో
కలిసిన ఆ అవయవమునందు బాధలు కలిగిస్తా డు. రోగ నిర్దా రణ సాగదు కనుక చికిత్స జరుగుటలో సమస్య లు సృష్టిస్తా డు. ఇతడు మృత్యు కారకుడు,
భయాన్ని కలిగిస్తా డు, రక్తపోటు, అలర్జీ, మతి స్థిమితం లేక పోవుట మొదలైన వ్యా ధులకు కారకుడౌతాడు.

రూపము

కేతువు పార్ధివ నామసంవత్స రం ఫాల్గుణమాసం శుక్ల పౌర్ణమి అభిజిత్ నక్షత్రంలో బుధవారం జన్మించాడు. కేతువు గోత్రం జైమినీ పైఠీనస. కేతువు బూడిద (బూడిద)
వర్ణంలో రెండు భుజములతో ఉంటాడు. కేతువు వాహనం గ్రద్ద. బ్రహ్మ దేవుడికి తాను సృష్టించి జనం అపారంగా పెరగడంతో వారిని తగ్గించడానికి మృత్యు వు అనే
కన్య ను సృష్టించాడు. మానవులకు మరణం ఇచ్చే బాధ్య తను అప్ప గించాడు. తనకు మరణం ఇచ్చి నందుకు ఆ కన్య దుఃఖించింది. ఆమె కన్నీ టి నుండి అనేక
వ్యా ధులు ఉద్భ వించాయి. అప్పు డు తెల్లని పొగ రూపంలో ఒక పురుషుడు జన్మించాడు. కీలక నామ సంవత్స రం మార్గశిర కృష్ణ అమావాస్య నాడు మంగళ వారం
మూలా నక్షత్రంలో కేతువు జననం జరిగింది. బ్రహ్మ ఆజ్ఞా నువర్తి అయి కేతువు ధూమ్ర కేతువుగా సంచరించ సాగాడు. క్షీరసాగర మధన సమయంలో మోహినీ చేతి
అమృతం తాగిన తరువాత విష్ణు వుకేతువు తల నరికి ఆస్థా నమలోపాము తలను ధరింప చేసాడు. అప్ప టి నుండి కేతువుగా నామధేయం చేయబడి విష్ణు అనుగ్రహం
చేత గ్రహస్థితి పొందాడు. కేతువు పత్ని చిత్ర రేఖ. సాధారణంగా కేతువు ఒంటరిగా కుజ ఫలితాలను ఇచ్చి నా ఏగ్రహంతో చేరి ఉంటే ఆ ఫలితాలను ఇస్తా డు.
గ్రహస్థా నం పొందిన కేతువు విష్ణు వుకు అంజలి ఘటిస్తూ ఉంటాడు.

పరిహారం

కేతుగ్రహ పరిహార పూజార్ధంగా కంచు ప్రతిమ శ్రేష్టం. అధి దేవత బ్రహ్మ . నైవేధ్యం చిత్రాన్నం, కుడుములు, ఉలవ గుగ్గిళ్ళు . ప్రీతికరమైన తిథి చైత్ర శుద్ధ చవితి.
ఆచరించ వలసిన వ్రతం పుత్ర గణపతి వ్రతం, పారాయణం చేయవలసినది శ్రీ గణేశ పురాణం, కేతు అష్టోత్తర శతనామావళి, గణేశ శతనామావళి. దక్షిణగా ఇవ్వ
వలసిన జంతువు మేక, ధరించ వలసిన రతజ్ఞం వైడూర్యం, ధరించ వలసిన మాల రుద్రాక్ష మాల, ధరించ వలసిన రుద్రాక్ష నవముఖి రుద్రాక్ష. ఆచరించ వలసిన
దీక్ష గణేశ దీక్ష. చేయ వలసిన పూజ విజ్ఞేశ్వ ర పూజ, సూర్యా రాధన, దానం చేయవలసిన ఆహార పదార్ధా లు ఖర్జూ రం, ఉలవలు. గ్రహస్థితిని పొందిన వారం
బుధవారం. మండపం జెండా ఆకారం. గ్రహం బలంగా ఉంటే ఆధ్యా త్మి క చింతన బలహీనమైన అతి భయం కలుగుతుంది.

కేతువు స్థా నములు


లగ్నంలో కేతువు ఉన్న జాతకుడు అవయవములు కలవాడు సుఖహీనుడు, స్థా నభ్రష్టు డు, మాయావులతో మాటాడు వాడు ఔతాడు. అధికంగా స్వే దం
స్రవించువాడు, చక్క ని ప్రజా సంబంధాలు కలిగిన వాడు, కృతఘ్ను డు, చాడీలు చెప్పు వాడు, జాతిభ్రష్టు డు, స్థా నభ్రష్టు డు, అసంపూర్ణమైన అవయవములు
కలవాడు, మాయావులతో కలసి ఉండు వాడు ఔతాడు.
ద్వి తీయ స్థా నంలో కేతువు ఉన్న జాతకుడు విద్య లేని వాడు, విద్యా హీనుడు, ధనం లేనివాడు, అల్ప పదములు పలుకువాడు, దుష్టబుద్ధి కలిగిన వాడు, పరుల
మీద ఆధారపడి జీవించువాడు, శాంతస్వ భావులు, ముక్తసరిగా మాటాడు వాడు ఔతాడు.
తృతీయ స్థా నంలో కేతువు ఉన్న జాతకుడు చిరంజీవి, శక్తి సంపన్ను డు, ఆస్తి కలవాడు, కీర్తికలవాడు, భార్యా సమేతంగా జీవితం సాగించువాడు, సుఖంగా
భుజించు వాడు, సోదరుని కోల్పో వు వాడు ఔతాడు.

https://te.wikipedia.org/wiki/కేతువు_జ్యో తిషం 1/2


6/22/2021 కేతువు జ్యో తిషం - వికీపీడియా
చతుర్ధ స్థా నంలో కేతువు ఉన్న జాతకుడు భూమిని, తల్లిని, వాహనములను, సుఖములను కోల్పో వును. స్వ స్థలమును వదిలి అన్య ప్రదేశంలో జీవించు వాడు.
పరధనముతో జీవించు వాడు, గొడవలు పెట్టుకునే స్వ భావం కలవాడు ఔతాడు.
పంచమ స్థా నంలో కేతువు ఉన్న జాతకుడు గర్భ కోశ వ్యా ధి పీడితుడు ఔతాడు, సంతతిని నష్టం కలుగు వాడు, పిశాచపీడచేత బాధపొందు వాడు, దుర్బు ద్ధి
కలవాడు, మోసగాడు ఔతాడు.
షష్టమ స్థా నంలో కేతువు ఉన్న

ఉపశీర్షిక1 ఉపశీర్షిక2

జాతకుడు మాటకారి, ఉదారుడు, ఉత్తమగుణ సంపన్ను డు, దృఢచిత్తుడు, మిగుల కీర్తివంతుడు, ఉన్న తోద్యో గి, శతృనాశనాపరుడు, కోరికలు సిద్ధించు వాడు ఔతాడు.

సప్తమ స్థా నమున కేతువు ఉన్న జాతకుడు అగౌరవం పొందు వాడు, దుష్టస్త్రీ సమేతుడు, అంతర్గత రోగపీడితుడు, కళత్రనష్టం పొందు వాడు, శక్తి హీనుడు,
అష్టమ స్థా నంలో కేతువు ఉన్న జాతకుడు అల్పా యుష్మంతుడు, ప్రాణమిత్రులను విడిచిన వాడు, కలహములతో జీవించువాడు, ప్రాణమిత్రులను విడిచిన
వాడు, ఆయుధముల చేత గాయపడిన వాడు, నిరాశా నిస్పృహలతో కార్య ములు చేయువాడు, కళత్రముతో పేచీలు పడువాడు ఔతాడు.
నవమ స్థా నంలో కేతువు ఉన్న జాతకుడు పాపచింతన కలిగిన వాడు, అశుభవంతుడు, పితృదేవతలను అణచివేయు వాడు, దురదృష్ట వంతుడు, ప్రసిద్ధులను
దూషించు వాడు, చత్వా రం, మంచి కళత్రం కలిగినవాడు ఔతాడు.
దశమ స్థా నంలో కేతువు ఉన్న జాతకుడు కార్య ములలో విజ్ఞములు కలుగు వాడు, మలినుడు, నీచమైన కార్య ములు చేయువాడు, శక్తిమంతుడు,
బహుకీర్తిమంతుడు, తాత్వి క చింతన కలవాడు ఔతాడు.
ఏకాదశ స్థా నంలో కేతువు ఉన్న జాతకుడు ధనవంతుడు, బహుగుణవంతుడు, భోగి, మంచి వస్తువులు పొందు వాడు, ప్రతి కార్య మునందూ విజయం సాధించు
వాడు, హాస్య చతురత కలిగిన వాడు ఔతాడు.
ద్వా దశ స్థా నంలో కేతువు ఉన్న జాతకుడు రహస్యంగా దురాచారములు చేయువాడు, అధమ కార్యా లు చేయువాడు, ధననాశనం పొందిన వాడు, ఆస్తిని నాశనం
చేయువాడు, విరుద్ధమైన ప్రవర్తజ్ఞ కలిగిన వాడు, నేత్రరోగి, విదేశీయానం చేసేవాడు ఔతాడు.

వెలుపలి లింకులు

v · t · e (https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8:%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%82_%E0%B0%

నవగ్రహాలు
v · t · e (https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8:%E0%B0%A8%E0%B0%B5%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%

తెలుగు పంచాంగం
v · t · e (https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8:%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%8

"https://te.wikipedia.org/w/index.php?title=కేతువు_జ్యో తిషం&oldid=3078895" నుండి వెలికితీశారు

ఈ పేజీలో చివరి మార్పు 23 డిసెంబరు 2020న 01:48కు జరిగింది.

పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూ షన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం;


అదనపు షరతులు వర్తించవచ్చు .
మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.

https://te.wikipedia.org/wiki/కేతువు_జ్యో తిషం 2/2

You might also like