You are on page 1of 4

--1--

కోరిన కోర్కెలు తీర్చే.. సంకష్టహర చతుర్థి ప్రత్యేక ఏమిటి?

హైదరాబాద్: గణపతిని పూజించి పూజల్లో చవితి పూజ విశేషమైనది. పౌర్ణమి తర్వాత వచ్చే

చవితికి వరదచతుర్థి అని, అమావాస్య తర్వాత వచ్చే చవితికి సంకష్ట హర చతుర్థి అని పేరు. ఈ

రోజున వినాయకుడిని భక్తిశద


్ర ్ధ లతో పూజిస్తా రు కోరుకున్న కోరికలు నెరవేరడానికి సంకష్ట హర

చతుర్థి నాడు వినాయక వ్రతాన్ని దీక్షని ఆచరించడం విశేషమని చెబుతారు.

వినాయకుడి విశిష్ట త భారతీయ ఋషులు సమాజాన్ని సంఘాన్ని లోతుగా పరిశీలించి జీవన

విధానంలో అధ్యాత్మ ప్రా తిపదికలుగా కొన్ని ఆచారాలను నిర్దేశించారు. అందులో ప్రతి పూజలోనూ

ప్రా రంభంలో విఘ్నేశ్వరుడిపూజ చేయడంవల్ల ఘన బాధలు తొలగుతాయని ఎందరో దేవతలు

ఉన్నా ఆది పూజ్యుడు గా వినాయకుని పూజించడం అవసరమని అన్ని మతములు

ఘోషిస్తు న్నాయి. శ్రీ వైష్ణవులు కూడా విశ్వక్సేనుడు అనే పేరుతో వినాయకుడిని పూజిస్తా రు.

శాక్తేయ మతస్థు లు వినాయకుని గణాధిపతి అనే పేరుతో పూజిస్తా రు.

సంకష్ట చతుర్థి విధానము సంకష్ట హర చతుర్థి నాడు ప్రత్యేకంగా ఏమీ పాటించరు కానీ

ఉపవాసముండి, సాయంకాలం చంద్రదర్శనం చేసిన తర్వాత భోజనం చేస్తా రు. వినాయకుడిని

పూజించడం రాత్రి నెలవంక చూడటం ఈ రోజు విశేషాలు. వినాయకుడి పూజా విధానం. ఈ

మాసంలో 23 వ తేది తేదీన సంకష్ట హర చతుర్థి జరుగుతుంది. భక్తి శ్రద్ధలు యధాశక్తిగా

పదార్థములు ఏర్పాటు చేసుకుని వినాయకుడిని పూజిస్తా రు. వినాయకుడికి ప్రీతిగా ఎర్రని వస్త ం్ర ,

ఎర్రని చందనం, ఎర్రని పూలు, ధూపం దీపం నైవేద్యం ప్రత్యేకంగా వినాయకుడికి అవసరమైనవి.
--2--

మందార పువ్వులు వినాయకుడికి అర్చనలో విశేషంగా సమర్పిస్తా రు. శక్తి కొలదీ విగ్రహంలో గాని

లేదా పటములో కానీ వినాయకుడిని పూజించవచ్చు. జిల్లేడు గణపతి దీనినే అర్క గణపతి అని

కూడా పిలుస్తా రు. ఈ మూర్తిని పూజించినా కోరుకున్న కోరికలు తొందరగా తీరడానికి ఒక

సాధనం. దూర్వా పూజ ఒక్కొక్క దేవతకు ఒక పదార్థం ఒక్కొక్క ఆకు ఒక పువ్వుని విశేషంగా

చెబుతారు. ఆ దేవత నివేదించినప్పుడు దైవం ప్రసన్నమై ప్రీతి చెందుతుందని కొందరు దేవుళ్ళకి

కొన్ని పదార్థా లను విశేషించి చెప్పారు. అదేవిధంగా వినాయకుడికి దూర్వా లేదా గరిక అని

ఆకుని నివేదించడం విశేషం. లేతగా ఉండే గరికపో చలు 3 అంగుళాలకు మించకుండా

ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడికి నామాలు చెబుతూ నివేదిస్తా రు. కుడుములు మొదలయిన

పదార్థా లను వినాయకుడికి ఇష్ట ంగా నివేదిస్తా రు. సంకటహర చతుర్ధినాడు చదివే సంకటనాశన

గణేశ స్తో త్రం

నారద ఉవాచ –

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్

భక్తా వాసం స్మరేనిత్యం, ఆయుష్కామార్థ సిద్ధయే

ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్

తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త ్రం చతుర్థ కమ్

లంబో దరం పంచమం చ షష్ఠం వికటమేవ చ

సప్త మం విఘ్నరాజం చ ధూమ్రవర్ణ ం తథాష్టమమ్


--3--

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్

ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః

న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో!

విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనమ్

పుత్రా ర్థీ లభతే పుత్రా న్, మోక్షార్థీ లభతే గతిమ్

జపేద్గణపతిస్తో త్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్

సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః

అష్టేభ్యో బ్రా హ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్

తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః

ఇతి శ్రీ నారద పురాణే సంకట నాశన గణేశా స్తో త్రం సంపూర్ణ ం

గణపతి హో మం గణపతి హో మం చేయడం వల్ల నిద్ర బాధను తొలగడమే కాకుండా నరదృష్టి


నివృత్తి జరుగుతుంది.అందుకోసం గా వినాయక హో మాన్ని సంకష్ట హర చతుర్థి రోజున
జరుపుతారు. ఈ రోజున బియ్యము అప్పాలు నువ్వులు చెరకు కొబ్బరి శనగలు పేలాలు వంటి
ద్రవ్యాలు ఓం లో వేసి నవగ్రహాల మంత్రా లతో కలిపి సమంగా ఆహుతులు గా సమర్పిస్తా రు.
ఇందులో మరొక విశేషమేమిటంటే సూర్యుడు చంద్రు డు కుజుడు బుధుడు గురువు శుక్రు డు శని
అనబడే9 గ్రహాలు, ఇంద్రు డు అగ్ని యముడు నిరృతి వరుణ వాయు కుబేర ఈశాన అనే
ఎనిమిదిమంది దిక్పాలకులు,గణపతి దుర్గ ఆభయంకర, మృత్యుంజయ వాస్తు అనబడే 5 మంది
పంచలోక పాలకులుమొదలైనవారికి పాలివ్వడం వల్ల హో మం చేసే వారికి ఉండే అన్ని రకముల
దో షములు నివృత్తి చేయబడతాయి. వినాయకుడు హో మం చేయడం వల్ల ఇందులో చెప్పబడే
కొన్ని మంత్ర ప్రభావమున వల్ల ఇంటికి వ్యక్తు లకు ఉండే నరదృష్టి పో గొడుతుంది. ఇలాగా
వినాయక ప్రీతిగా సంకష్ట చతుర్ధి నియమాలను పాటిస్తూ వ్రతాన్ని ఆచరించిన వారికి
విద్యార్థు లకు కళాకారులకు వ్యాపారస్తు లకు వారివారి అభివృద్ధి చేయడమే కాకుండా
అపూర్వమైన పుణ్యఫలం సంప్రదించ బడుతుంది. అచంచలమైన విశ్వాసంతో భక్తీతో శ్రీ మహా
గణపతిని పూజించి ఉపవాసాలు నిర్వర్తించు కున్న తర్వాత రాత్రి వినాయకుడికి విభజన నామ
జపంతో గడపాలి ఈ విధంగా 3, 5, 7, 9, 11, 16, లేదా 21 చవితిలో ఆచరించాలి. సంకట హర
చతుర్థి వ్రత కథ ఒకానొకప్పుడు ఇంద్రు డు పుష్పక విమానంలో వెళుతుండగా ఒక రాజ్యం
దాటుతున్న సమయంలో పుష్పకం ఒక్కసారిగా ఆగిపో యిందట. దానికి కారణమేమిటి అని
పరిశీలించి చూడగా ఎక్కువ పాపములు చేసిన ఒక వ్యక్తి ఒక్క చూపు కారణంగా పుష్పకం
ఆగిందని వాలిన దని తెలుసుకున్నాడు. మహారాజుకు చెబుతున్న సందర్భం లో వారిద్దరి
ముందునుంచి పుష్పక విమానంలో ఒక పుణ్య స్త్రీ ఆకాశం లోకి తీసుకువెడుతున్నారు. అలా

తీసుకువెళుతున్న దూతలను కారణం అడుగగా... ఆ దూతలు ఈ విధంగా సమాధానం


చెప్పారు. ఈమె తన జీవితంలో ఎన్నో పాపములు చేసింది కానీ నిన్నటి రోజు వినాయకుడికి
ప్రీతిగా సంకష్ట హర చతుర్ధి వ్రతాన్ని ఆచరించి ఉంది చంద్ర దర్శనం చేసి మరణించింది కాబట్టి
ఆమెకు ఉత్త మ గతులు రావాలి అని శ్రీ మహాగణపతి వారి ఆజ్ఞ ప్రకారం ఆమెను గణపతి
లోకానికి తీసుకువెళుతున్నాం అన్నారు. ఈ విధంగా వ్రత విధానాన్ని తెలుసుకునే ప్రయత్నంలో
ఆ మహారాజు వినాయకుడి యొక్క మహిమ అని తెలుసుకుని అందరికీ ప్రచారం చేయించాడు.

అప్పటినుండి సంకష్ట హర చతుర్థి ఖ్యాతిని పొ ందడమే కాకుండా ఆ వ్రతాన్ని ఆచరించిన వారికి


కథను విన్న వాళ్ళకి చూసిన వారికి కూడా శ్రీ మహా గణపతి అనుగ్రహం పొ ంది సంఘటనలు
నివృత్తి సుఖశాంతులను పొ ందుతారు.

You might also like