You are on page 1of 47

AMRUTHA IAS ACADEMY

Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com


Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

భాగవతం
● భారతదేశంలోని అతి పవిత్రమైన అరణ్యం నైమిశారణ్యం. ఒకసారి విష్ణు లోక ప్రా ప్తి కోసం
మహర్షు లందరూ కలిసి వేయి సంవత్సరాల యాగాన్ని చేసారు. అప్పుడు అక్కడికి వచ్చాడు
సూతమహర్షి. ఆయన పురాణ ప్రవచనాలు చేయడంలో ఆరితేరినవాడు. మహర్షు లందరూ చేరి కృష్ణ
లీలలను, కృష్ణ గాథలను తెలిపే భాగవత పురాణాన్ని తమకు చెప్పమని ప్రా ర్ధించారు.

● ఈ పురాణాన్ని మొదటగా వ్యాస మహర్షి తన సంతానమైన శ్రీ శుక మహర్షికి వినిపించాడు. శుక
మహర్షి తక్షకుని శాపం వల్ల మరణించబో యే భరత వంశీయుడైన పరీక్షిత్తు మహారాజుకు
వినిపించాడు. మహర్షు ల కోరికపై అదే కథను మళ్లీ వినిపించాడు. సూతుడు. అదే శ్రీమత్ భాగవతం.

● సంస్కృతంలో వ్యాస మహర్షి విరచితమైన ఈ మహాపురాణం 12 స్కంధాలలో విస్త రించి ఉంది. దీనిని
ఆపాతమధురంగా భక్తిరస ప్రవాహంగా బమ్మెర పో తన, అతని శిష్యులు తెలుగులో రాశారు. ప్రస్తు తం
వ్యాస భాగవతంలోని ప్రధానాంశాలను ఇక్కడ అందిస్తు న్నాం.

ప్రథమ స్కంధం:

21 అవతారాలు
సూత పౌరాణికుడు నైమిశారణ్యానికి రావడం, మహా భాగవత గాథను వినిపించమని కోరడంతో ప్రథమ స్కంధం
ప్రా రంభమవుతుంది. భాగవతం ప్రకారం విష్ణు వు అవతారాలు 21. ఈ ఏక వింశతి(21) అవతారాలను
పేర్కొంటాడు సూతుడు. అవి:

1. బ్రహ్మ

2. యజ్ఞ వరాహస్వామి

3. నారదుడు

4. నరనారాయణులు

5. కపిల మహర్షి

6. దత్తా త్రేయుడు

7. యజ్ఞ రూపుడు
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
8. ఋషభదేవుడు

9. పృధుమహారాజు

10. మత్స్యావతారం

11. కూర్మావతారం

12. ధన్వంతరి

13. మోహిని

14. వరాహస్వామి

15.నృసింహుడు

16. వామనుడు

17. పరశురాముడు.

18. వ్యాసుడు

19. శ్రీరాముడు

20. బలరామకృష్ణు లు

21. బుద్ధు డు.

22. కల్కి

ఈ అవతారాల చివర 22వ అవతారంగా కల్కి ఆవిర్భవిస్తా డు.

● ఈ మొత్త ం అవతారాలు విరాట్ పురుషుని రూపాలే అయినా భగవానుడు స్వయంగా భూలోకంలో


సంపూర్ణ ంగా అవతరించింది మాత్రం కృష్ణు డిగానే! భాగవతకర్త వ్యాసుని తండ్రి పరాశరుడు, తాత శక్తి,
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
ముత్తా త వశిష్ఠు డు. నారదుని సూచన మేరకు వ్యాసుడు కృష్ణ గాథలను, మహిమలను తెలిపే
భాగవతాన్ని రచించాడు.

అశ్వత్థా మ వృత్తా ంతం - భీష్ముని నిర్యాణం

● మహాభారత యుద్ధ ం పూర్త యిన తర్వాత దుర్యోధనుని సంతోషం కోసం నిద్రపో తున్న పాండవ
సంతానాన్ని నిర్ద యగా సంహరిస్తా డు అశ్వత్థా మ. తన సంతానం అంతా తుడిచిపెట్టు కుని పో వడంతో
కన్నీరు. మున్నీరవుతుంది ద్రౌ పది. ద్రౌ పది శోకాన్ని ఆర్పడం కోసం అశ్వత్థా మపై బ్రహ్మాస్త్రా న్ని
సంధించి లొంగదీసుకుంటాడు అర్జు నుడు. గురు పుత్రు డనే జాలితో చంపకుండానే వదిలేస్తూ
అశ్వత్థా మ శిరోరత్నాన్ని లాగేసుకుంటాడు.

● అంతకుముందే అశ్వత్థా మ ప్రయోగించిన బ్రహ్మాస్త ం్ర పాండవులను ఏమీ చేయలేక, ఉత్త ర గర్భంలో
ఉన్న శిశువును వెంటాడుతుంది. ఉత్త ర మొర విన్న కృష్ణు డు ఆ బ్రహ్మాస్త్రా న్ని తన సుదర్శన చక్రంతో
అడ్డు కుంటాడు.

● ఇంతలో యుద్ధ రంగంలో గాయపడిన భీష్ముడు అస్త మిస్తా డు. కొద్దికాలం హస్తినలోనే కాలం గడిపిన
కృష్ణు డు ఉద్ధ వునితో కలిసి ద్వారకకు తిరిగి వెళతాడు.

పరీక్షితు
● ఉత్త ర గర్భాన్ని బ్రహ్మాస్త ం్ర నుండి కాపాడాడు శ్రీకృష్ణు డు. కృష్ణు ని దయతో శుభ ముహూర్త ంలో మగ
శిశువు జన్మించాడు. విష్ణు మూర్తి దయ వల్ల జన్మించినందున అతనిని 'విష్ణు రాతుడు’ అని
పిలుస్తా రు.

● తల్లి కడుపులో ఉన్నప్పుడే విష్ణు రాతుడు ఒక దివ్యపురుషుడిని పరీక్షగా చూస్తా డు. అందువల్ల
అతనికే 'పరీక్షిత్తు ' అని పేరు కలిగింది.

● (పాండవ వంశం పరిక్షీణిస్తు న్న సమయంలో జన్మించినందున పరీక్షిత్తు అయ్యాడని చెపుతుంది


భారతం)

ధృతరాష్ట్రు ని దేహత్యాగం

● కౌరవులు మరణించిన తర్వాత ధృతరాష్ట్రు డు ధర్మరాజు సమక్షంలోనే కాలం వెళ్లబుచ్చుతాడు.


ఒకనాడు విదురుడు తీర్థ యాత్రలు పూర్తిచేసుకొని ధృతరాష్ట్రు ని దగ్గ రకు వచ్చాడు.

● విదురుని సలహామేరకు ఆదే రోజు రాత్రి ఎవరికీ చెప్పకుండానే గాంధారీ సమేతంగా ఇల్లు వదిలి
అడవులకు వెళతాడు ధృతరాష్ట్రు డు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● హిమాలయాలలో గంగానది ఏడు పాయలుగా చీలి ప్రవహించే “సప్త స్రో త” ప్రా ంతంలో గాంధారి
సమేతంగా దేహత్యాగం చేస్తా డు.

శ్రీకృష్ణ నిర్యాణం - పాండవుల మహాప్రస్థా నం

● శ్రీకృష్ణు డిని కలవాలని ద్వారకకు వెళ్లి న అర్జు నుడు ఏడునెలలయినా తిరిగి రాకపో వడంతో ఆందో ళన
చెందుతాడు ధర్మరాజు, ప్రకృతి వైపరీత్యాలూ దుశ్శకునాలూ చోటు చేసుకోవడంతో మరింత
భీతిల్లు తాడు.

● ఇంతలో హస్తినకు తిరిగి వచ్చిన అర్జు నుడు కృష్ణు డు పరమపదించిన విషయాన్ని తెలుపుతాడు. ఈ
సంగతి తెలియగానే కుంతి ప్రా ణాలు వదిలేస్తు ంది. ధర్మరాజూ పాండవులూ సశరీరంగా స్వర్గా నికి
వెళ్లే ందుకు సుదీర్ఘమైన పాదయాత్ర చేయాలనుకుంటారు. అదే మహా ప్రస్థా నం. వెళ్లే ముందు
పరీక్షిత్తు కు రాజ్యాభిషేకం చేస్తా రు.

● పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు. అర్జు నుని మనుమడు, యాత్ర ప్రా రంభించిన పాండవులు
స్వర్గా న్ని చేరతారు. విదురుడు ప్రభాస తీర్ధ ంలో (నేటి సో మనాథ్- గుజరాత్) కృష్ణు ని పై మనసు నిలిపి
ప్రా ణత్యాగం చేస్తా డు.

పరీక్షిత్తు - ధర్మదేవత

● పరీక్షిత్తు రాజ్యభారాన్ని స్వీకరించాడు. మేనమామ ఉత్త రుని కుమార్తె 'ఇరావతి'ని వివాహం


చేసుకున్నాడు. జనమేజయుడు మొదలైన నలుగురు కుమారులను కన్నాడు.

● ఒకనాడు ఆంబో తు రూపంలో ఉన్న ధర్మదేవత ప్రశ్నలకు సరైన సమాధానాలను ఇస్తా డు. కలి
పురుషుడు పరీక్షిత్తు ను చూసి భయపడిపో తాడు.

● కలి పురుషుడిని తన రాజ్యాన్ని వదిలి వెళ్లమనీ, జూదం, మద్యపానం, స్త్రీ హత్య, జీవహింస ఎక్కడ
ఉంటే అక్కడికి వెళ్లమని ఆదేశిస్తా డు. గో రూపంలో ఉన్న భూదేవిని ఓదారుస్తా డు.

పరీక్షిత్తు కు శాపం

● ఒకనాడు పరీక్షిత్తు వేటలో పూర్తిగా అలసిపో యి శమీకుడు అనే ముని ఆశ్రమానికి వస్తా డు. మునిని
చూసి, మంచినీళ్లు ఇవ్వమని కోరతాడు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● ధ్యానంలో ఉండడం వల్ల ముని దీనిని గమనించడు. దానిని అవమానంగా భావించి కోపిస్తా డు
పరీక్షిత్తు . చనిపో యిన పామును శమీకుని మెడలో వేసి వెళ్లి పో తాడు.

● శమీకుడు ఇంకా ధ్యానంలో ఉన్నందున ఈ విషయాన్ని కూడా గమనించడు. ఐతే, అంతలో అక్కడికి
వచ్చిన శమీకుని కుమారుడు శృంగి దీనిని చూస్తా డు. జరిగిందేమిటో గ్రహిస్తా డు. ప్రశాంతంగా ధ్యానం
చేసుకుంటున్న తన తండ్రిని అవమానించి నందుకు ఆగ్రహిస్తా డు.

● అలా సర్పాన్ని మెడలో వేసిన వాడు తక్షకుడనే మహాసర్పపు కాటు వల్ల వారం రోజుల్లో గా
మరణిస్తా డని శపిస్తా డు. తర్వాత దీనిని తెలుసుకున్న శమీకుడు. శృంగిని మందలిస్తా డు. ఐతే,
అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపో యింది. శృంగి శాపానికి తిరుగులేదు.

● ఈ విషయాన్ని తెలుసుకున్న పరీక్షిత్తు ప్రశాంతంగా ప్రా ణాలు వదులుదామనుకున్నాడు. గంగా నదీ


తీరానికి చేరుకున్నాడు. అక్కడికి అరుదెంచిన శుక మహర్షి పరీక్షిత్తు కు బో ధించిన పురాణమే శ్రీ
మహాభాగవతం.

ద్వితీయ స్కంధం

● "ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని భగవంతుని రూపాన్ని మనస్సులో ధ్యానించడం ద్వారా జీవి


ధారణను సాధిస్తా డు. భగవంతుడిని ఆవరించిన ఏడు ఆవరణలే ఏడు లోకాలు.

● పూర్వం బ్రహ్మ సృష్టి చేయడం మరిచిపో యాడు. ధ్యానం ద్వారా జ్ఞా నాన్ని పొ ంది సృష్టి చేయగలిగాడు.
అందరూ స్వర్గ ంలో సుఖాలుంటాయనుకుంటారు. దానిని కోరుకుంటారు. అది సరైంది కాదు. దేవుడు
నీలోనే ఉన్నాడు. నీలోనే ఉన్న పరమాత్మను రూపసహితంగానైనా రూపరహితంగానైనా
ధ్యానించవచ్చు.

● సాధన తొలి దశలో సరూప ధ్యానం చేయవచ్చు. యోగి అయిన వానికి అంతా బ్రహ్మమయమే. ఏ
కోరికలూ ఉండవు. అలాంటి వాడు ప్రా ణాన్ని బ్రహ్మ రంధ్రంలో ప్రవేశపెట్టి శరీరాన్ని వదులుతాడు.
మోక్షాన్ని పొ ందుతాడు.

● మోక్షం లేదా ముక్తి సద్యో ముక్తి, క్రమముక్తి అనే రెండు విధాలుగా ఉంటుంది. భక్తి ఏ కోరికా లేనిదిగా
ఉండవచ్చు. కోరికలు తీర్చమని కోరే భక్తి కూడా ఉండవచ్చు. మొదటిది నిష్కామ భక్తి. రెండో సకామ
భక్తి".పూజిస్తే కోరికలు తీరతాయి .

● "బ్రహ్మ వర్చస్సు కోసం వేదవతిని, ఇంద్రియ పటుత్వానికి ఇంద్రు ని, సంతానానికి దక్షుడిని,
సౌభాగ్యానికి దుర్గా దేవిని, వీర్యానికి అగ్నిని, వైభవానికి అదితిని, స్వర్గా నికి ఆదిత్యుని, రాజ్యానికి
సాధ్యుని, ఆయుర్దా యానికి అశ్వనిని, పుష్టికి భూమిని సేవించాలి. మోక్షం కోరేవారు విష్ణు మూర్తిని
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
ఆరాధించాలి. ముక్తికి విరక్తే ప్రథమ సో పానం" అంటూ జీవించబో యే ఏడు రోజులలో పరమాత్మపైనే
మనసు నిలపమన్నాడు శుక మహర్షి

● సృష్టి అంతా భగవంతుడే అన్న శుక మహర్షిని, పరమాత్మ సృష్టిలోని వివిధ అంశాలుగా ఎలా
మారుతున్నాడో తెలపమని కోరాడు పరీక్షిత్తు . 'నారాయణుడు ఒకడే దేవుడు. అన్నిటినీ అతడే
సృష్టించాడు. ఆయన గుణాతీతుడు, నిర్గు ణుడు, ఐనా, లోక పాలన కోసం సత్వ, రజో, తమో
గుణాలను స్వీకరిస్తా డు రజో గుణం పెరిగినప్పుడు సృష్టి జరుగుతుంది. తమో గుణం పెరిగితే సృష్టి
అంతమవుతుంది. ఆకాశం నుండి వాయువు, దాని నుండి తేజస్సు, దానినుండి నీరు, దానినుండి
భూమి పుడుతాయి. ఆకాశానికిశబ్ధ ం వాయువుకు స్పర్శ, తేజస్సుకు రూపం, నీటికి రసత్వం,
భూమికి గంధం లక్షణాలు. సాత్విక రాజస అహంకారాలు పరస్పరం కలిసినప్పుడు విశ్వసృష్టి
జరిగింది.

అవతారాలు

● ఈ సందర్భంగా విష్ణు వు యొక్క అవతారాలను కూడా పరీక్షిత్తు కు చెబుతాడు శుక మహర్షి, నీట
మునిగిన భూమిని ఉద్ధ రించడానికి యజ్ఞ వరాహమూర్తిగా, ఆకూతి గర్భంలో సుయజ్ఞు నిగా, దక్షిణాదేవి
గర్భంలో సంయమునిగా జన్మించి దేవతలను సృష్టించాడు.

● స్వాయంభువ మనువు అతనికి 'హరి' అని పేరు పెట్టా డు.. కర్ధ మ ప్రజాపతి, దేవహూతులకు
కపిలుడిగా, అత్రి అనసూయలకు దత్తా త్రేయునిగా, బ్రహ్మకు సనక, సనందన, సనత్కుమార,
సనత్సుజాతులుగా, ధర్ముడి గర్భంలో నరనారాయణులుగా, వేనరాజు శరరీంలో వృధువుగా, నాభి,
సుధర్ముని గర్భంలో పుష్కరుడిగా, బ్రహ్మ యుజ్ఞ ం నుండి హయగ్రీవునిగా, సాగరమధనంలో
మహాకూర్మంగా, స్త ంభం నుండి నరసింహస్వామిగా, అదితి గర్భంలో వామనునిగా, మనువుగా,
ధన్వంతరిగా. పరశురామునిగా వివిధ అవతారాలను ధరించాడు" అంటూ చెప్పాడు శుక మహర్షి (ఈ
అవతారాలకూ ముందుగా చెప్పిన 22 అవతారాలకు కొంత భేదం ఉంది. గమనించాలి).

● 'పురాణం పంచ లక్షణం' అని ప్రసిద్ధి. పురాణానికి సర్గ , ప్రతిసర్గ , మన్వంతరం, వంశం, వంశానుచరితం
లాంటి ఏడు లక్షణాలు ఉండాలి. భాగవతం కూడా పురాణమే ఐనా దీనిలో పురాణానికి 10 లక్షణాలు
చెప్పబడ్డా యి.

1. సర్గ ం: భగవంతుని ప్రేరణతో జరిగే సృష్టి

2. విసర్గ ం: బ్రహ్మ సృష్టి

3. స్థా నం: మహావిష్ణు వుచే ప్రా ణికోటి రక్షించబడడం

4. పో షణ: భగవంతునికి భక్తు లపై ఉండే కరుణ


AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

5. ఊలి: కర్మ బంధాలలో పడడం

6. మన్వంతరం: భగవంతుడు అంగీకరించిన ధర్మాలు

7. ఈశాను కథనం: భగవంతుని కథాకథనం.

8. నిరోధము: భగవంతునిలో భక్తు లు లయం కావడం

9. ముక్తి: ఆత్మ భావాన్ని వదిలి భగవంతునిలో లీనం కావడం

10. ఆశ్రయం: సృష్టి ఉత్పత్తి , సృష్టి లయం కావడం.

● విరాట్ పురుషుడు మొదటగా నీటిని సృష్టించుకున్నాడు. నీరునే ' నారం' అంటారు. నీటిలో
ఉన్నందున ఆయనే నారాయణుడు. సృష్టిలో సర్వమూ భగవంతుడే ఉన్నాడు. శరీరమంతా
దేవతామయమే.

● నోటికి అధిదేవత - అగ్ని

● నాసికకు అధిదేవత - అశ్వినీ దేవతలు.

● చెవులకు అధిదేవత - దిక్కులు

● రోమాల అధిదేవత - వృక్షాలు

● చేతులకు అధిదేవత - ఇంద్రు డు

● పాదాలకు అధిదేవత - విష్ణు వు

● మర్మాంగాలకు అధిదేవత - ప్రజాపతి

● పాయువు అధిపతి - మిత్రు డు.



ఇలా ద్వితీయ స్కంధంలో వివిధ దైవత్వ భావనలను వివరించాడు శుక మహర్షి,

తృతీయ స్కంధం:

విదురుడు - ఉద్ధ వుడు


AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● దేహ త్యాగం చేసేముందు ఉద్ధ వుడిని కలిసాడు విదురుడు. ఉద్ధ వుడు బృహస్పతి శిష్యుడు, శ్రీకృష్ణు ని
ప్రియమిత్రు డు ఉద్ధ వుడే విదురునికి యాదవ వంశంలో ముసలం పుట్టిన సంగతి, శ్రీకృష్ణు డు
పరమపదించిన సంగతి, యాదవ వంశం మొత్త ం నశించిన సంగతి చెప్పాడు. తత్త ్వజ్ఞా నం కోసం
మైత్రేయ మహర్షిని కలవమని సూచించాడు.

విదురుడు - మైత్రేయుడు

● విదురుడు మైత్రేయుడిని గంగా తీరంలో కలుసుకున్నాడు. పరమాత్మ నుండి సృష్టి వికసించిన


విధాన్ని విదురునికి మైత్రేయుడు ఇలా బో ధించాడు. "సృష్టికి పూర్వం జగత్తు లేదు. ఉన్నది
పరమాత్మ ఒకటే. ప్రకృతి కూడా పరమాత్మలో లీనమై ఉండేద.ి అతనిలో ఉన్న మాయ కారణంగా
భగవంతుడు సృష్టిని ప్రా రంభించాడు. మాయ ప్రభావం వల్లే ఈ భగవంతుడు పురుషుడినీ బీజాన్ని
సృష్టించాడు.

● అటు తర్వాత మహత్వం వ్యక్త మైంది. మహత్త ్వంలోంచి పరమాత్మ తనలోని విశ్వాన్ని ప్రకాశింప
చేసాడు. మహత్త ్వం నుండి అహంకారం పుట్టింది. ఈ అహంకారం సాత్విక, రాజస, తామసాలుగా
మూడు రకాలు. సాత్విక అహంకారం నుండి మనసు పుట్టింది.

● రాజసాహంకారం నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి నీరూ పుట్టా యి. నీటి
నుండి భూమి పుట్టింది. ఈ అన్నిటికీ అధిష్టా న దేవతలు పరమాత్మ నుండి ఉద్భవించారు.

● ఈ ప్రకృతిలో, మహత్వంలో, అహంకారంలో, పంచ భూతాలలో, వాటి గుణాలైన శబ్ద , స్పర్శ, రస,
రూప, గంథాలనే అయిదు పంచతన్మాత్రలలో, ఐదు జ్ఞా నేంద్రియాలలో, ఐదు కర్మేంద్రియాలలో ఇరవై
మూడు తత్వాలలో వాటిని అదుపులో ఉంచుకునే మనసులో పరమాత్మ ప్రవేశించాడు. భగవానుడు
ఇవన్నీ పరస్పరం కలిసేలా చేసాడు. (పంచభూతాలు 5, పంచతన్మాత్రలు 5, జ్ఞా నేంద్రియాలు 5.
కర్మేంద్రియాలు 5, ప్రకృతి1, అహంకారం 1, మహత్తు కలిసి మొత్త ం 31 తత్త్వాలు).

● ఇలా చేయడం వల్ల అన్నిటి కలయికతో విరాట్ పురుషుడు ఏర్పడ్డా డు. విరాట్ పురుషునికి
ముందుగా నోరు ఏర్పడింది. అందులో వాగింద్రియంతో అగ్ని ప్రవేశించాడు. తర్వాత తాలువు
ఏర్పడింది.

● వరుణ దేవుడు జిహ్వేంద్రియంలో ప్రవేశించాడు. ముక్కు ఏర్పడగా, ఘ్రా ణేంద్రియంలో అశ్విని దేవతలు
ప్రవేశించారు. కళ్ల లో సూర్యుడు ప్రవేశించాడు. చర్మంలోకి స్పర్షెంద్రియలతో యుక్త ంగా వాయుదేవుడు
ప్రవేశించాడు. రోమాలలో ఓషధులు ప్రవేశించాయి.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● చెవులలో శ్రవణేంద్రియా లతో యుక్త ంగా దిక్కులు ప్రవేశించాయి. మల విసర్జ న స్థా నంలో మిత్రదేవుడు
ప్రవేశించాడు. చేతులలోకి క్రయవిక్రయ శక్తితో ఇంద్రు డు, పాదాలలో చలనశక్తితో విష్ణు వు, బుద్ధిలోకి
బ్రహ్మ, హృదయంలో చంద్రు డు ప్రవేశించాడు. అటు తర్వాత అహంకారం పుట్టింది. అందులో రుద్రు డు
ప్రవేశించాడు. చిత్రంలోకి చిత్త శక్తితో బ్రహ్మదేవుడు ప్రవేశించాడు.

● విరాట్ పురుషుని శిరస్సు నుండి స్వర్గ ం, పాదాల నుండి భూలోకం, నాభి నుండి ఆకాశం పుట్టా యి.
వీటి నుండి వరుసగా సత్త ్వం, రజో, తమో గుణాలు పుట్టా యి. వీటి నుండి దేవతలు, మనుషులు,
పిశాచాలు ఏర్పడ్డా యి.

● విరాట్ పురుషుని ముఖం నుండి బ్రా హ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి
వైశ్యులు, పాదాల నుండి శూద్రు లూ జన్మించారు. విరాట్ పురుషునిలోని ప్రతి అంగమూ
పవిత్రమైనదే.”

బ్రహ్మ జననం

● సృష్టికి పూర్వం అంతా జలమయమే. శేష శయనంపై యోగ నిద్రలో ఉన్నాడు పరమాత్మ. అతనిలోనే
లీనమై ఉన్నాయి సమస్త ప్రా ణులు. ఆ సూక్ష్మ రూపాలు కాలశక్తి ప్రభావం వల్ల ప్రకోపించి, పరమాత్మ
నాభి ప్రా ంతం నుండి పద్మంలా బయటకు వచ్చాయి.

● ఆ పద్మంలో విష్ణు వు ప్రవేశించాడు. అందులోంచే బ్రహ్మ పుట్టు కుని వచ్చాడు. పద్మం నుండి
బయటకు వచ్చిన బ్రహ్మ తానెవరో పద్మమేమిటో తెలుసుకునేందుకు తామర తూడులో ప్రవేశించాడు.

● పరమాత్ముని నాభి ప్రా ంతానికి చేరుకున్నాడు. అక్కడంతా చీకటి ఏమీ తెలుసుకోలేకపో వడంతో వంద
దివ్య సంవత్సరాలు తపస్సు చేసాడు బ్రహ్మ తపఃఫలితంగా తనేమిటో పద్మమేమిటో
తెలుసుకున్నాడు.

● భూమి, నీరు, ఆకాశం, గాలి, తేజస్సులను సృష్టించాడు. ఇవే పంచ భూతాలు. సృష్టికి ఆధారాలు.
విష్ణు వు ఆదేశంపై మళ్లీ తపస్సు చేసాడు బ్రహ్మ, తన కర్త వ్యాన్ని తెలుసుకున్నాడు. సృష్టి చేయడానికి
సంకల్పించాడు.

● మొదటగా తాను కూర్చున్న పద్మాన్ని మూడు లోకాలుగా విభజించాడు. తిరిగి వాటిని 14 లోకాలుగా
విడగొట్టా డు. పది రకాలయిన సృష్టిని చేపట్టా డు. సృష్టికి ప్రా రంభంలో తమస్సు, మోహము,
మహామోహము, తామిస్రము, అంధతామిస్రము అనే జ్ఞా న వృత్తు ల్ని సృష్టించాడు. ఐతే ఈ సృష్టి
బ్రహ్మకు కూడా నచ్చలేదు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● అటు తర్వాత భగవంతునిపై దృష్టి నిలిపి, సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే నలుగురు
కుమారులను సృష్టించి పునఃసృష్టి చేయమన్నాడు. పునఃసృష్టికి కావలసింది రాజస గుణంఅది వారిలో
లేదు. వారు కేవలం సాత్వికులు. అందువల్ల పునఃసృష్టి చేయడానికి ఇష్ట పడక - తపో భూమికి వెళ్లా రు.

● బ్రహ్మ దేవుడు కోపంతో కనుబొ మల నుండి ఒక కుమారుని సృష్టించాడు. రుద్రు డు అని పేరు పెట్టా డు.
సృష్టిని చేపట్ట మన్నాడు. రుద్రు డు రుద్ర గణాలను సృష్టించాడు. ఐతే ఈ రుద్ర గణాలు లోకాలను
భక్షించడంతో రుద్ర గణ సృష్టిని నిలిపేయమన్నాడు బ్రహ్మ.

● అటుతర్వాత మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠు డు,
దక్షుడు, నారదుడు అనే 10 మంది సంతానాన్ని సృష్టించాడు. అటు తర్వాత సరస్వతిని సృష్టించి,
సరస్వతిని చూసి తానే మోహించాడు. మరీచి మొదలైన కుమారులు దానిని తప్పుపట్ట గా, సిగ్గు పడి,
అప్పటి తన శరీరాన్ని వదిలేసాడు.

● అతని శరీరం నుండి పొ గమంచు వ్యాపించింది. అదే తమస్సు, తమస్సును వదిలేసిన బ్రహ్మ మళ్లీ
సృష్టి ప్రా రంభించాడు. అప్పుడు అతని ముఖం నుండి నాలుగు వేదాలు, ఉపవేదాలు, శాస్త్రా లు
మొదలైనవి ఆవిర్భవించాయి.

● మరీచి మొదలైన మహర్షు లు కూడా సృష్టిని ప్రా రంభించక పో వడంతో, తానే సృష్టిని ప్రా రంభించాలని
భావించాడు. అలా ఆలోచిస్తు ండగా, బ్రహ్మ శరీరం రెండు భాగాలయింది. అందులో ఒకటి స్త్రీ శరీరం
మరొకటి పురుష శరీరం. పురుషుడు స్వాయంభువ మనువు, స్త్రీ శతరూప వారిని సృష్టిని
ప్రా రంభించమన్నాడు బ్రహ్మ.

● భూమి అంతా జలమయంగా ఉందనీ, దానిని నీటి నుండి బయటకు తీస్తే సృష్టికార్యం జరుపుతామని
పేర్కొంటాడు మనువు.. భూమిని 'ఏలా బయటకు తీయాలో' అని ఆలోచిస్తూ దానిని గురించి
భగవంతుడిని ధ్యానిస్తు న్నంతలోనే బ్రహ్మ దేవుని ముక్కు పుట్టా ల లోంచి వేలెడంత వరాహం
బయటకు వచ్చింది. చూస్తు ండగానే పర్వత పరిమాణంలో పెరిగిపో యింది. అదే యజ్ఞ వరాహమూర్తి,
హిరణ్యాక్షుడిని సంహరించి. కోరలతో భూమిని బయటకు తెచ్చిన అవతారం.

హిరణ్యకశ్యపుడు - హిరణ్యాక్షుడు

● దక్షుని కూతురు దితి, దైత్యుల తల్లి. కశ్యపుని భార్య దితి కామవాంఛతో, సాయంకాల సంధ్యా
సమయంలో కశ్యపునితో సంగమించడం వల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనే రాక్షసులకు
జన్మనిచ్చింది. వారు కూడా శాపవశాన రాక్షసులుగా జన్మించిన విష్ణు భక్తు లే.

● పూర్వం బ్రహ్మ పుత్రు లైన సనకుడు, సనందుడు విష్ణు మూర్తిని చూడడానికి వైకుంఠానికి వచ్చారు.
వారిద్దరూ విష్ణు మూర్తికి పరమ భక్తు లు, వారిని చూసి ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు
అడ్డ గించారు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

● అందుకు కోపించిన సనక సనందులు జయ విజయులను రాక్షసులుగా జన్మించమని శపించారు.


శాప ఫలితంగా దితి గర్భంలో దానవులుగా జన్మించారు. వారే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు.

● హిరణ్యకశ్యపుడు బ్రహ్మ వరం వల్ల గర్వంతో సంచరిస్తే, అన్న అండ చూసుకుని విజృంభించాడు
హిరణ్యాక్షుడు. తనతో సమానమైన వీరుడు ఎవరూ లేడని అహంకరించాడు.

● ఎన్నో ఏళ్లు సముద్రంలో సంచరించాడు. అటు తర్వాత 'విభావతి' పురానికి చేరుకుని, వరుణుడిని
యుద్ధా నికి ఆహ్వానించాడు. 'నేను నీతో యుద్ధ ం చేయలేననీ, నీకు పో టీ శ్రీమన్నారాయణుడేననీ'
వరుణుడు చెప్పడంతో శ్రీహరిపై కయ్యానికి కాలు దువ్వాడు.

● విష్ణు వు కోసం వెదుకుతున్న హిరణ్యాక్షునికి తన కోరలతో నీట మునిగిన భూమిని ఉద్ధ రిస్తు న్న
వరాహస్వామి కనిపించాడు. వెంటనే వరాహమూర్తిని వెంటాడాడు హిరణ్యకశ్యపుడు. ఆగ్రహించిన
వరాహమూర్తి సుదర్శన చక్రంతో హిరణ్యకశ్యపుడిని సంహరించాడు. భూమిని స్వీకరించి సృష్టి
ప్రా రంభించాడు మనువు. మనువు సంతానమే మానవులు.

కపిలదేవుడు

● కర్ద ముడు ఒక మహర్షి, సరస్వతీ నదీ తీరంలో పదివేల సంవత్సరాలు తపస్సు చేసాడు. ఆయన
స్వాయంభువ మనువు కూతురు దేవహూతిని వివాహం చేసుకున్నాడు.

● కర్థ ముని తపః ఫలితంగా దేవహూతి, కర్థ ముల గర్భంలో సాక్షాత్తూ విష్ణు మూర్తే కపిలమహర్షిగా
జన్మించాడు. కపిల మహర్షి సాంఖ్యతత్వాన్ని ప్రతిపాదించి ఆత్మజ్ఞా నాన్ని ఉపదేశించాడు.

చతుర్థ స్కంధం:

● మైత్రేయుడిని దక్షయజ్ఞ ం గురించి చెప్పమన్నాడు విదురుడు. ఇలా చెప్పాడు మైత్రేయ ఋషి


"పూర్వం ప్రజాపతులు చేస్తు న్న యజ్ఞా నికి దేవతలు, మునులు, మహర్షు లు ఎందరో వచ్చారు. ఆ
యజ్ఞా నికి దక్ష ప్రజాపతి రాగా, అందరూ ఆయనకు నమస్కరించినా శివుడు నమస్కరించలేదు.
దానికి కోపించిన దక్షప్రజాపతి శివుడిని నిందించి, ఇకపై చేసే యజ్ఞా లలో ఆ శివునికి యజ్ఞ భాగం
దక్కదని శాసించాడు.

● ఇది చూసిన నందీశ్వరుడు దక్షుడిని మూర్ఖు డిగా జీవించమని, దక్షుని ముఖం మేకముఖంలా
మారుతుందని శపించాడు. దీనికి కోపించిన భృగు మహర్షి శివానుయాయులు ఉత్త మశాస్త ్ర వ్యతిరేకులై
పాషండులుగా మారతారని శపించాడు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● దక్షుని కూతురు సతీదేవి పరమ శివుని భార్య, సాక్షాత్తూ మామా అల్లు ళ్ల మధ్యే వైరం ప్రా రంభమైంది.
చాలా కాలం తర్వాత దక్షుడు ఒక పెద్ద యజ్ఞా న్ని సంకల్పించాడు. శివునికి ఆహ్వానాన్ని పంపలేదు.
ఈ విషయం తెలిసిన సతి పరమశివుడు వద్ద ంటున్నా దక్షుడు పిలవకున్నా యజ్ఞ ం చేస్తు న్నది
సాక్షాత్తూ కన్న తండ్రి. అయినందువల్ల చూడడానికి వెళ్లి ంది.

● ఈ యజ్ఞా నికి వెతుక్కుంటూ వెళ్లి న సతీదేవిని కన్న తండ్రి దక్షుడు కనీసం కన్నెత్తి చూడలేదు -
పలకరించలేదు. ఈ యజ్ఞ ంలో శివునికి భాగం లేదంటూ అవహేళన చేసింది పినతల్లి. ఈ శివ ద్వేషాన్ని
భరించలేకపో యింది సతీదేవి. యోగాగ్నిలో శరీరాన్ని దగ్ధ ం చేసుకుంది.

● సతీదేవి దేహత్యాగాన్ని గురించి నారదుని ద్వారా తెలుసుకున్న శివుడు ఆగ్రహం కట్ట లు తెంచుకోగా,
ఒక జడను తీసి నేలకు విసిరికొట్టా డు. అందులో నుండి పుట్టా డు వీరభద్రు డు.

● శివాఙ్ఞ ను స్వీకరించి దక్షయజ్ఞా న్ని భగ్నంచేస,ి రుద్ర గణాలతో కలిసి ఆహ్వానితులను తరిమి తరిమి
కొట్టా డు వీరభద్రు డు యజ్ఞ ం చేసిన దక్షుని తలను నరికేసాడు.

● దేవతల కోరిక మేరకు దక్షునికి మేక తలను అతికిస్తా రు వైద్యులు, దక్షుడు క్షమాపణ కోరతాడు.
అగ్నిలో ఆహుతి అయిన సతీదేవి హిమవంతుని భార్య మేనక గర్భంలోంచి ఉమాదేవిగా జన్మించి
శివుడిని వివాహం చేసుకున్నది.

ధృవుడు

● స్వాయంభువ మనువుకు ఇద్ద రు కుమారులు, ఉత్తా నపాదుడు, ప్రియద్రతుడు, ఉత్తా నపాదునికి


సురుచి, సునీతి ఇద్ద రు భార్యలు. ఉత్తా నపాదుడికి వారిలో సురుచిపైనే ప్రేమ.

● అందువల్ల సురుచి కుమారుడైన ఉత్త ముడిని గారాబం చేస,ి సునీతి కుమారుడైన ధ్రు వుడిని నిర్ల క్ష్యం
చేసేవాడు. ఒకనాడు తండ్రి ఒడిలో కూర్చుంటానన్న ధ్రు వుడిని పక్కకు లాగేసింది పినతల్లి. తల్లి
దగ్గ రికెళ్లి మొర పెట్టు కున్నాడు ధ్రు వుడు.

● విష్ణు వు పాదపద్మాలను ఆశ్రయించమని సలహా ఇచ్చింది తల్లి. ఆటలాడుకునే వయస్సులోనే శ్రీహరి


తపస్సుకు బయలుదేరాడు ధ్రు వుడు. మార్గ మధ్యంలోనే కలిసిన నారదుడు ధ్రు వునికి నారాయణ
మంత్రా న్ని ఉపదేశించి ఆశీర్వదించాడు.

● యమునా నదీ తీరంలోని మధువనంలో కఠోర తపస్సు చేసాడు ధ్రు వుడు. విష్ణు మూర్తి అనుగ్రహించి,
ఎవరికీ అందని ధ్రు వలోకాన్ని ప్రసాదించి, ధ్రు వుడిని నక్షత్రంలా నిలబెట్టా డు. వేటలో సవతి తమ్ముడు,
అతని వెతుకుతూ వెళ్లి న సవతి తల్లీ ఇద్ద రూ మరణించడంతో రాజ్యాన్ని చేపట్టా డు ధ్రు వుడు.

వేన రాజు
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● పూర్వం రాజర్షి అయిన అంగరాజు యజ్ఞా న్ని చేయగా, ఏ దేవతా హవిస్సులు స్వీకరించడానికి
రాలేదు. తనకు పుత్రసంతానం లేనందువల్లే ఇలా జరిగిందని తెలుసుకొని, పుత్రకామేష్టి యాగాన్ని
చేసి పుత్రు ని పొ ందాడు అంగరాజు.

● ఆ పుత్రు ని పేరే వేనుడు. వేనుడు పరమ దుర్మార్గు డిగా ఎదిగాడు. తండ్రి ఎంత ప్రయత్నించినా,
వేనుడు మారకపో వడంతో విరక్తి చెందిన అంగరాజు ఎవరికీ చెప్పకుండా అరణ్యాలకు వెళ్లి పో యాడు.

● తండ్రి మరణంతో వేనుడు మరింత విశృంఖలంగా తయారయ్యాడు. ధార్మిక కార్యక్రమాలన్నిటినీ


వేయించి, కేవలం తన ఆరాధన మాత్రమే చేయమన్నాడు. ఇది చూసిన మునీశ్వరులు వేనుడిని
మరణించేలా చేసారు.

పృథు చక్రవర్తి

● వేనుడి మరణం వల్ల రాజ్యం రాజులేనిదైంది. అందువల్ల మహర్షు లు ముందుగా వేనుని తొడను
చిలికారు. దాని నుండి ఒక పొ ట్టి మనిషి ఆవిర్భవించాడు. అతడే నిషాదుడు. అతడే కాకుండా అతని
వారసులు కూడా హింసా ప్రవృత్తి నే అవలంబించారు.

● అటు తర్వాత ఋషులు వేనుని భుజాన్ని చిలికారు. ఆ భుజం నుండి ఒక పురుషుడు, ఒక స్త్రీ
ఆవిర్భవించారు. పురుషుడిని పృధువు అని, స్త్రీని అర్చి అనీ అన్నారు. పృధువు రాజ్య పాలనను
చేపట్టా డు.

● అదే సమయంలో తీవ్రమైన కరువు వచ్చింది. గో రూపం దాల్చిన భూమి నుండి సకల సంపదలనూ
పిండుకున్నాడు పృథు చక్రవర్తి. అందుకే భూమికి 'పృథివి' అని పేరు.

● ఎన్నో అశ్వమేధ యాగాలు చేసిన పృథువు ప్రజలను పరమధార్మికంగా పరిపాలించాడు. ప్రజలను


కన్నబిడ్డ లలా చూసుకున్నాడు. జ్ఞా నిగా మోక్షానికి వెళ్లా డు.(నిత్యం కామసుఖాలను అనుభవించి,
తానెవరో మరిచిపో యిన పురంజనుడు అనే రాజు కథ, సంతానం కోసం తపస్సు చేసుకున్న ప్రా చీన
బర్హి కుమారులైన ప్రచేతసుల కథలతో ఈ స్కందం పరిసమాప్త మవుతుంది)

పంచమ స్కంధం

ప్రియవ్రతుడు

● సృష్టిలో ఒక్కో యుగానికి ఒక్కో మనువు అధిపతిగా ఉంటాడు. మనువు అధిపతిగా ఉండే యుగాన్ని
మన్వంతరం అంటారు. స్వయంభువ మనువు అధిపతిగా ఉండే యుగం స్వావలంభువ మన్వంతరం.
ఒక సృష్టిలో మొత్త ం 14 మున్వంతరాలుంటాయి.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

● స్వాయంభువ మనువు కుమారుడు ప్రియవ్రతుడు. మోక్షం కోసం సన్యాసాన్ని ఆశ్రయించగా,


బ్రహ్మర్షు లు గృహస్థా శ్రమాన్ని చేపట్ట మని సూచించారు. వారి సూచన మేరకు వివాహం చేసుకొని
రాజ్యాధికారాన్ని చేపట్టా డు. ప్రియవ్రతుడు. ప్రియవ్రతుని సంతానమైన ఉత్త ముడు, తామసుడు,
రైవతుడు ఒక్కొక్కరూ ఒక్కో మన్వంతరానికి అధిపతులు.

ఋషభావతారం

● ప్రియవ్రతుని మొదటి భార్య సంతానం అగ్నిధృడు. అగ్నిధృ ని పెద్ద కొడుకు 'నాభి'. పుత్రు ని కోసం
యజ్ఞ ం చేసిన నాభికి విష్ణు మూర్తి కొడుకుగా జన్మిస్తా డు.

● ఆ కొడుకే 'ఋషభుడు'. ప్రజానురంజకంగా పరిపాలించిన ఋషభుడు తన కుమారుడైన భరతునికి


రాజ్యం అప్పగించి- విరక్తు డై, దిగంబరుడై ఇల్లు వదిలి వెళ్లి పో తాడు. కటకాచలం అడవులలో
దావాగ్నిలో దహనమైపో తాడు.

జడ భరతుడు

● ఋషభుడు తన కుమారుడైన భరతునికి రాజ్యం అప్పగించి వెళ్లి న తర్వాత భరతుడు వేయి


సంవత్సరాలు ప్రజానురంజకంగా పాలన చేశాడు. తర్వాత రాజ్యాన్ని సంతానానికి అప్పగించి
పులహాశ్రమానికి వెళ్లి సన్యాస ధర్మాన్ని స్వీకరిస్తా డు.

● కఠినమైన సన్యాసవ్రతాన్ని పాటిస్తు న్నప్పుడు దేనిపై అనురాగం ఉండరాదు. ఐతే, ఒకనాడు ఆశ్రమ
పరిసర ప్రా ంతాలలో ఒక గర్భంతో ఉన్న లేడి కనిపించింది. అటు వెంటనే ఒక సింహ గర్జ న
వినిపించింది. సింహ గర్జ నకు ఒక్కసారిగా భయపడ్డ లేడి నది దాటేందుకు ఒక్క గెంతు గెంతింది. అలా
గెంతడంతో గర్భంలోని లేడికూన నదిలో పడిపో యింది.

● అక్కడే ఉన్న భరతుని వైపు జాలిగా చూసింది. ఆ చూపులకు వివశుడైన భరతుడు ఆ లేడిని రక్షించి,
ప్రేమతో పెంచాడు. లేడి పిల్ల మీద విపరీతమైన ప్రేమను పెంచుకొని యోగభ్రష్టు డైనాడు.

● చివరకు మృత్యువు సమీపించినా, ఆయన మనసంతా లేడిపైనే ఉండడం వల్ల మరుజన్మలో లేడిగా
జన్మించాడు. అటు తర్వాత జన్మలో బ్రా హ్మణునిగా పుట్టినా, కుటుంబంతో సంబంధం లేకుండా
ఒంటరిగా జీవించాడు.

● జడునిగా ఉండడం వల్ల ఆయనను జడభరతుడని పిలిచేవారు. సన్యాసాన్ని స్వీకరించినా


మమకారాన్ని వదలకుంటే మోక్షం లభించదని చెబుతుంది జడభరతుని వృత్తా ంతం.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
షష్ట స్కంధం

అజామీళుని కథ

● పూర్వం కన్యాకుబ్జ దేశంలో అజామిళుడు అనే బ్రా హ్మణుడు ఉండేవాడు. పేరుకు బ్రా హ్మణుడే
అయినా, సదాచారాలు మరిచాడు. నీచస్త్రీ సంగమానికి అలవాటుపడ్డా డు.

● పతితుడై దొ ంగతనాలకు అలవాటుపడ్డా డు. అతనికి పదిమంది సంతానం. చివరివాడు


'నారాయణుడు', నారాయణుడంటే అజామికునికి వల్ల మాలిన ప్రేమ. అగ్నిసాక్షిగా వివాహం
చేసుకున్న భార్యను వదిలేసినా, నీతీ జాతీ అన్నీ మరిచి ప్రవర్తించినా, నేరాలకూ ఘోరాలకు
పాల్పడినా, మరణ సమయంలో చివరి కొడుకును 'నారాయణా, నారాయణా' అంటూ నోరారా
పిలవడంతో విష్ణు లోకం చేరతాడు అజామిళుడు.

● తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా విషం విషమే, అమృతం అమృతమే. నారాయణ స్మరణ
నారాయణ స్మరణే' అని తెలుపుతుంది అజామీళుని వృత్తా ంతం.

విశ్వరూపుడు

● బృహస్పతి దేవ గురువు. అలాంటి బృహస్పతిని అవమానించాడు ఇంద్రు డు. దీంతో బృహస్పతి
సేవలను కోల్పోయాడు. బృహస్పతి లేడని తెలిసి రాక్షసులు స్వర్గ ంపై దండెత్తా రు. ఇంద్రు డు ఓడిపో యి
బ్రహ్మ దేవుని సలహా కోరాడు. బ్రహ్మ సలహా మేరకు త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుడిని
గురువుగా స్వీకరించాడు.

● విశ్వరూపుని అండతో రాక్షసులను జయించాడు. ఇంద్రు డు. అంతా బాగానే ఉన్నా, విశ్వరూపునితో
ఒక ఇబ్బంది వచ్చింది. విశ్వరూపునికి ఉండే మూడు తలలలో ఒకదాని నుండి రాక్షసులకు హవిస్సు
పంచేవాడు.

● దానితో రాక్షసులు మరీ బలవంతులయ్యేవారు. ఇది తెలిసిన ఇంద్రు డు. విశ్వరూపుని మూడు
తలలనూ నరికేసాడు. విశ్వరూపుడిని చంపడం వల్ల ఇంద్రు నికి బ్రహ్మహత్యా పాతకం చుట్టు కుంది. ఆ
పాపాన్ని నాలుగు భాగాలు చేస,ి ఒక భాగాన్ని భూమికి, ఒక భాగాన్ని నీళ్ల కు, ఒక భాగం చెట్లకు, ఒక
భాగం స్త్రీలకూ ఇచ్చాడు.

వృత్రు డు

● తన కుమారుడైన విశ్వరూపుడిని ఇంద్రు డు సంహరించడం త్వష్ట ప్రజాపతికి తెలిసింది. దేవేంద్రు డిని


సంహరించే కుమారుని కోసం యజ్ఞ ం చేసాడు. త్వష్ట చేసిన అబిచార హో ముపు అగ్నినుండి ఒక
పురుషుడు ఆవిర్భవించి మూడు లోకాలనూ ఆక్రమించాడు. అతనే వృత్రు డు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● అలా ఆవిర్భవించిన వృత్రు డు దేవతల పై దాడిచేస,ి దేవతల ఆయుధాలన్నిటినీ నశింపజేసి మూడు
లోకాలనూ ఆక్రమించాడు. మరో మార్గ ం లేకపో వడంతో. నారాయణుడిని ఆశ్రయించారు దేవతలు.

● పూర్వం దధీచి మహర్షి అశ్వినీ దేవతలకు అశ్వముఖంతో బ్రహ్మోపదేశం చేసాడు. అందువల్ల అతనికి
అశ్వశిరుడని పేరు. ఆ దధీచి శరీరంతో ఆయుధాన్ని తయారు చేసుకొని ఆ ఆయుధంతో "వృత్రు డిని
వధించండి" అని సలహా ఇచ్చాడు నారాయణుడు.

● ఇంద్రు డు దేవతలూ దధీచి దగ్గ రకు వెళ్లి శరీరాన్ని ఆర్ధించారు. దేవతల విజయం కోసం తన శరీరాన్ని
వదిలి, భగవంతునిలో లీనమయ్యాడు దధీచి, దధీచి ఎముకలతో వజ్రా యుధాన్ని
రూపొ ందించుకున్నాడు ఇంద్రు డు, నర్మదా నదీ తీరంలో మళ్లీ దేవదానవ యుద్ధ ం ప్రా రంభమైంది.

● ఇంద్రు డు వృత్రు డూ హో రాహో రీ పో రాడారు. వృత్రు డికి కోపం వచ్చి ఇంద్రు డిని అమాంతం మింగేసాడు.
ఇంద్రు నికి మహాపురుష విద్య, యోగమాయ, నారాయణ కవచాలు తెలిసి ఉండడం వల్ల వృత్రు ని
కడుపులో పడ్డా మరణించలేదు.

● వజ్రా యుధంతో కడుపును ఛేదించుకొని బయటికి వచ్చి, వెంటనే వృత్రు ని తల నరికేసాడు. వృత్రు ని
తేజస్సు బహిర్గతమై నారాయణునిలో కలిసిపో యింది.

● వృత్రు నిపై విజయం సాధించినా, వృత్రు ని సంహరించినందున మళ్ళీ బ్రహ్మహత్యాపాతకం చుట్టు కుంది
ఇంద్రు నికి. ఎక్కడికెళ్లి నా అక్కడికి బ్రహ్మ హత్యాపాతకం వెంటాడడంతో మానస సరోవరంలోని ఒక
తామర పుష్పపు తూడులో దాక్కున్నాడు ఇంద్రు డు.

● చివరికి వెయ్యేళ్ల తపస్సుతో, అశ్వమేధయాగంతో ఆ పాపాన్ని పో గొట్టు కున్నాడు. వృత్రు డు


అసురుడిగానే పిలవబడ్డా - ఆయన తేజస్సు నారాయణునిలో లీనమైంది. అందుకు కారణం ఆయన
పూర్వజన్మలో పరమ విష్ణు భక్తు డైన చిత్రకేతు అనే రాజు. శివుడిని విమర్శించి, పార్వతి శాపానికి గురై
వృత్రు నిగా అవతరించి నారాయణునిలో లీనమవుతాడు.

సప్త మ స్కంధం

జయవిజయులు

● జయవిజయులు విష్ణు మూర్తి ద్వారపాలకులు. ఒకనాడు విష్ణు దర్శనానికై వచ్చిన సనకుడు,


సనందుడు. అనే మహర్షు లను అడ్డ గించి శాపానికి గురి అవుతారు. ఆ ఫలితంగా మూడు
జన్మలపాటు రాక్షసులుగా,విష్ణు వ్యతిరేకులుగా జన్మిస్తా రు.

● కృత యుగంలో హిరణ్యాక్షహిరణ్యకశ్యపు లుగా , త్రేతా యుగంలో రావణ కుంభకర్ణు లుగా, ద్వాపర
యుగంలో శిశుపాల దంతవక్త్రు లుగా జన్మించి నిరంతరం విష్ణు ద్వేషంతోనే జీవించి, మరణించిన
తర్వాత విష్ణు పదాన్ని చేరుకుంటారు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

హిరణ్యకశ్యపుడు

● తన సో దరుడైన హిరణ్యాక్షుడిని సంహరించింది విష్ణు వేనని భావించి తీవ్రమైన విష్ణు ద్వేషిగా మారాడు
హిరణ్యకశ్యపుడు. లోకాన్ని జయించే అమరత్వం కోసం మందర పర్వత లోయలోకి వెళ్లి ఘోరమైన
తపస్సును ప్రా రంభించాడు.

● ఆ తపస్సు తీవ్రతకు లోకాలు కంపించడంతో బ్రహ్మదేవుడు వరాలివ్వడానికి ప్రత్యక్షమయ్యాడు.


వరాలు కోరుకోమన్నాడు.

● "మనుష్యుల చేత గానీ, జంతువుల చేత గానీ, ప్రా ణమున్న వాని చేత గానీ, ప్రా ణం లేని వాటి చేత
గానీ, దానవుల చేత గానీ, దేవతల చేత గానీ, నాగుల చేత గానీ మరణం ఉండకూడదు. నీచే
సృష్టించబడ్డ ఏ ప్రా ణి చేతిలోనూ మరణం ఉండకూడదు. ఇంట గానీ, బయట గానీ, పగలు కానీ, రాత్రి
కానీ భూమి మీద కానీ, ఆకాశం పైన గానీ, మరణం సంభవించకూడదు. ఏ ఆయుధం తోనూ మరణం
సంభవించకూడదు. యుద్ధ ంలో నాతో సమానమైన వాడెవడూ ఉండవద్దు " అని వరాలు కోరాడు
హిరణ్యకశ్యపుడు.

● అవి ఎవరూ కోరని వరాలు. ఐనా, ఇచ్చిన మాట ప్రకారం కోరుకున్న వరాలు ఇచ్చేసాడు బ్రహ్మ. వర
గర్వంతో రెచ్చిపో యాడు హిరణ్యకశ్యపుడు, మూడు లోకాలనూ ఆక్రమించాడు. దేవతలను
తరిమికొట్టా డు. సాధువులను చెర బట్టా డు. లోకాలన్నీ తల్ల డిల్లడంతో దేవతలు శ్రీహరిని స్తు తించారు.

నరసింహావతారం

● హిరణ్యకశ్యపుని ఆగడాలు మితిమీరిపో తున్నాయి. ఇంతలో హిరణ్యకశ్యపునికి నలుగురు కుమారులు


జన్మించారు. వారిలో చిన్నవాడు ప్రహ్లా దుడు. ప్రహ్లా దుడు గర్భంలో ఉన్నప్పుడే నారదుడు విష్ణు భక్తిని
బో ధించాడు. అందువల్ల హిరణ్యకశ్యపునికి పూర్తిగా భిన్నంగా తయారయ్యాడు.

● గురువులైన చండామార్కులు హిరణ్యకశ్యపుని భక్తిని నూరిపో యాలనుకుంటే ప్రహ్లా దుడు విష్ణు భక్తిని
జీర్ణ ం చేసుకున్నాడు. తనే కాకుండా తన సహాధ్యాయులకు కూడా ఇదే భక్తిని నూరిపో సాడు. చదివిన
చదువు గురించి చెప్పమని హిరణ్యకశ్యపుడు కోరిత,ే అన్ని చదువుల సారమైన విష్ణు భక్తిని
చదువుకున్నానని చెప్పాడు ప్రహ్లా దుడు. దీనితో ఆందో ళన చెందాడు హిరణ్యకశ్యపుడు.

● మంచి చదువులు చెప్పమని గురువులను గద్దించాడు. గురువులు మళ్లీ చదువు చెప్పే ప్రయత్నం
చేసినా, గురువుల తోవ గురువులదే- ప్రహ్లా దుని తోవ ప్రహ్లా దునిదే! కొత్త గా నేర్చుకున్నదేదైనా ఉంటే
చెప్పమని తండ్రి ప్రశ్నిస్తే, - శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, వందనం, దాస్యం, సఖ్యం,
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
ఆత్మనివేదనం, భగవతర్పణం' అనే నవ విధ (తొమ్మిది రకాల) భక్తి విధాలను గురించి చెప్పాడు
ప్రహ్లా దుడు.

● తన గర్భంలోనే తన శత్రు వైన హరి భక్తు డు జన్మించడాన్ని జీర్ణ ం చేసుకోలేని హిరణ్యకశ్యపుడు ఎన్నో
విధాలుగా ప్రహ్లా దుడిని బాధించాడు. బాధను కూడా విష్ణు ప్రసాదంగానే స్వీకరించాడు ప్రహ్లా దుడు.
ప్రహ్లా దుడిని ఎన్నో విధాలుగా సంహరించేందుకు యత్నించాడు హిరణ్యకశ్యపుడు. అలా చేసిన
ప్రతిసారీ రక్షించాడు శ్రీహరి.

● ఇలా జరగడంతో ప్రహ్లా దునిలో ఆత్మవిశ్వాసం, భగవత్ భక్తి ఇనుమడించగా, రాక్షసాధిపతిలో శ్రీహరితో
తాడో పేడో తేల్చుకోవాలనే కసి రెట్టించింది.

● ఒక రోజు శ్రీహరి ఎక్కడా లేదని హుంకరించాడు హిరణ్యకశ్యపుడు. ఎక్కడబడితే అక్కడ అంతటా


ఉన్నాడన్నాడు ప్రహ్లా దుడు. మాటామాటా పెరిగింది. 'ఈ స్త ంభంలో చూపుతావా దేవుడిని"? అంటూ
స్త ంభాన్ని గదతో బలంగా మోదాడు హిరణ్యకశ్యపుడు.

● అంతే ఫెళఫెళార్భాటాలతో, స్త ంభాన్ని చీల్చుకొని వచ్చాడు ఉగ్రనరసింహమూర్తి. పగలూ రాత్రీ కాని
సాయం సమయంలో, ఇంటా బయటా కాకుండా గడప మధ్యలో, ఎలాంటి ఆయుధాలుగా ఎవరూ
చెప్పని గోళ్లూ కోరలతో మహో గ్రంగా విజృంభించి, హిరణ్యకశ్యపుని పొ ట్ట చీల్చి సంహరించాడు
నరసింహుడు.

● తెలివిగా వరాలు కోరాడు హిరణ్యకశ్యపుడు. తీసుకున్న వాడికంటే ఇచ్చేవాడు మరెంతో శక్తిమంతుడు,


తెలివైనవాడు. అందువల్ల ఇచ్చిన వరాలలో ఏ ఒక్కటీ భంగం కాకుండానే నరసింహావతారంలో వచ్చి
రాక్షసుడిని సంహరించాడు.

● ఉగ్రంగా ఊగిపో తున్న నరసింహుడిని శాంతింప చేయడం లక్ష్మీదేవికి కూడా సాధ్యంకాకున్నా పరమ
భక్తు డైన ప్రహ్లా దుడు చేతులు జోడించగానే ప్రసన్నుడైనాడు నరసింహుడు. అడగకుండానే ఎన్నో
వరాలిచ్చి ప్రహ్లా దుడిని దీవించాడు.

అష్ట మ స్కంధం

గజేంద్ర మోక్షం

● తామస మన్వంతరంలో 'త్రిశిఖుడు' ఇంద్రు డైనాడు. ఈ మన్వంతరంలో విధృతి కుమారులు


వైధృతులు వేదాలను పునరుద్ధ రించారు. ఈ మన్వంతరంలోనే మేధారుషి భార్య అయిన హరిణి
గర్భంలో విష్ణు వు 'హరి'గా జన్మించాడు గజేంద్రు డిని రక్షించాడు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● పాలసముద్రంలో ఉన్న త్రికూట పర్వతం మీద ఒక గజరాజు ఉండేవాడు. ఎండలు పెరిగినవేళ ఆ
గజరాజు భార్యలు, పిల్లలతో సరస్సులో స్నానం చేయడానికి వెళ్లా డు. సరదాగా వారంతా
జలకాలాడుతున్న వేళ ఒక మొసలి హటాత్తు గా గజరాజు కాలు పట్టు కుని లాగేసింది.

● గజరాజు గజసమూహమంతా కలిసినా మొసలి పట్టు నుండి తప్పించుకోలేకపో యారు. పాండ్యదేశపు


రాజు, ఇంద్రద్యుమ్నుడు హరి భక్తు డు. అగస్త ్యముని శాపం వల్ల ఏనుగుగా జన్మించాడు.

● పో రాడి పో రాడీ గజరాజు బలమంతా సన్నగిల్లి ఇక మరణం తప్పదనుకున్నవేళ చివరి యత్నంగా,


శ్రీహరిని శరణాగతి వేడాడు. గజరాజు మొరను ఆలకించిన విష్ణు మూర్తి చక్రంతో మొనలిని సంహరించి,
గజరాజును రక్షించాడు.

● మొసలి పూర్వజన్మలో 'హూహుడు' అనే గంధర్వుడు. దేవతల శాపంతో మొసలిగా జన్మించి, శ్రీహరి
చక్రస్పర్శతో శాపవిమోచనాన్ని పొ ందాడు.

సముద్ర మధనం

● దేవదానవుల యుద్ధా లు తరచుగా జరిగేవి. ఆ యుద్ధా లలో తరచుగా దేవతలే ఎక్కువ సంఖ్యలో
మరణించే వారు. దానితోబాటు దుర్వాసుని శాపం కారణంగా దేవతల సంపద నాశనమయ్యింది.

● దీంతో దేవతలందరూ కలిసి మేరు పర్వతంపై ఉన్న బ్రహ్మ దగ్గ రికి వెళ్లా రు. బ్రహ్మ వారిని తీసుకొని
పెను చీకటులకు ఆవలి తీరంలో ఉన్న శ్రీమహావిష్ణు వు వద్ద కు వెళ్లి , మార్గ ం చూపమని ప్రా ర్థించాడు.

● మందర పర్వతాన్ని కవ్వంగా, మహాసర్పమైన వాసుకిని కవ్వంతాడుగా చేసుకొని- దానవులతో కలిసి


పాలసముద్రా న్ని చిలకమని సూచించాడు విష్ణు మూర్తి. ఆయన ఆదేశానుసారం రాక్షస రాజు బలి
దగ్గ రికి వెళ్లి , క్షీరసాగర మథనాన్ని ప్రతిపాదించాడు దేవేంద్రు డు. సరేనన్నాడు రాక్షసేంద్రు డు.

● మందర పర్వతాన్ని క్షీరసాగరానికి తీసుకువచ్చేటప్పుడు దానిని మోసే బాధ దుర్బరం కాగా,


గరుత్మంతుని రెక్కలపై దానిని మోసుకొని పాలసముద్రా నికి చేర్చాడు శ్రీహరి, అమృతంలో వాసుకికి
పాలు ఉంటుందని తెలిపి కవ్వంగా ఉండేందుకు ఒప్పించారు దేవతలు.

● మధనం మొదలైంది. తోకను పట్టు కోవడం చిన్నతనంగా భావించారు రాక్షసులు. వాసుకి తలవైపు
నిలబడ్డా రు. సరేనని దేవతలు తోకవైపు నిలబడ్డా రు. మధనం ప్రా రంభమైంది. మందర పర్వతం
ఒకవైపు ఒరిగిపో గా కూర్మావతారం ఎత్తి వీపున మోసాడుశ్రీహరి.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

● మధనం తీవ్రమైంది. వాసుకి నుండి వెలువడే విషజ్వాలలకు రాక్షసులు బలి అయిపో తున్నారు.
దేవతలదీ అదే పరిస్థితి. మధనం తీవ్రం కాగానే కాలకూటంలాంటి విషం పుట్టింది. లోకాలను
దహించడం ప్రా రంభించింది.

● పరమ శివుడిని శరణు వేడారు దేవతలు. ఒక్క గుక్కలో హాలాహలాన్ని తాగేసి కంఠంలో
నిలుపుకున్న భోళా శంకరుడు 'నీలకంఠుడు' అయ్యాడు. మరింత ఉత్సాహంగా మధనాన్ని
కొనసాగించారు. దేవదానవులు.

● ముందుగా గుర్రం పుట్టింది. దాని పేరు ఉచ్ఛైశ్రవం. దానిని బలి స్వీకరించాడు. తర్వాత ఐరావతం
పుట్టింది. దానిని ఇంద్రు డు స్వీకరించాడు.

● అటు తర్వాత కౌస్తు భం అనే మణి పుట్టింది. శ్రీహరి దానిని వక్షస్థ లంలో ధరించాడు. పారిజాతమూ,
కల్పవృక్షమూ వచ్చాయి, స్వర్గా నికి చేర్చారు. అప్సరలు పుట్టా రు దేవతలు స్వీకరించారు. లక్ష్మీదేవి
పుట్టింది శ్రీహరి స్వీకరించాడు. మధ్య దేవత వారుణి పుట్టింది దేవతలు గ్రహించారు.

● సముద్రా న్ని చిలకగా చిలకగా అమృతభాండంతో ప్రత్యక్షమయ్యాడు ధన్వంతరి. ధన్వంతరి


అమృతభాండంతో ప్రత్యక్షం కాగానే అమృత భాండాన్ని లాక్కెళ్లా రు. రాక్షసులు.

● మళ్లీ శ్రీహరినే ప్రా ర్ధించారు దేవతలు. అంతలో రాక్షసులు అమృతం కోసం తమలో తాము
కలహించుకోవడం ప్రా రంభించారు. ఇది చూసిన శ్రీహరి ఇందీవరం (నల్ల కలువ) లాంటి సౌందర్యంతో
ప్రకాశించే జగన్మోహినిగా అవతరించాడు.

● ఆ సౌందర్యానికి రాక్షసులు దాసో హమన్నారు. గొడవ లేకుండా పంచమని అమృతాన్ని జగన్మోహిని


చేతికందించారు. దేవతలూ, రాక్షసులూ శుచిగా వచ్చి రెండు వరుసలలో కూర్చున్నారు.

● రాక్షసులకు మత్తు చూపులను మాత్రమే పంచి మైమరిపించిన జగన్మోహిని దేవతలకే మొత్త ం


అమృతాన్ని పంచడం ప్రా రంభించింది.

● మాయలో పడ్డ రాక్షసులెవరూ ఇది గ్రహించకున్నా రాహువు, కేతువులు గమనించారు.దేవతల


పంక్తిలో కూర్చుని అమృతపానం చేసారు. ఇది గమనించిన సూర్యచంద్రు లు ఈ విషయాన్ని శ్రీహరికి
తెలియజేయగా శ్రీహరి వారి కంఠాల్ని సుదర్శన చక్రంతో ఖండించాడు. మిగతా అమృతాన్ని
రాక్షసులకు పంచాడు. అమృతపానం చేసినందువల్ల రాహుకేతువులు మరణం లేకుండా అలాగే
గ్రహాల్లా పరిభమి
్ర ంచారు. గ్రహణాలుగా సూర్యచంద్రు లపై తమ పగను వ్యక్త ం చేస్తు న్నారు. రాహువును
గ్రహంగా ఉండేలా అనుగ్రహించాడు. బ్రహ్మ,
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
దేవాసుర సంగ్రా మం

● అమృతాన్ని పంచిపెట్టడం పూర్తికాగానే వైకుంఠానికి వెళ్లి పో యాడు విష్ణు మూర్తి. అన్యాయానికి


రగిలిపో యి దానవులు యుద్ధా నికి సిద్ధమైత,ే అమృతం తాగిన ఉత్సాహంతో దేవతలు సై అన్నారు.
దీంతో పాలసముద్రం ఒడ్డు న భయంకరమైన యుద్ధ ం మొదలైంది.

● శ్రీహరి కాలనేమినీ, మాల్యవంతుడిని సంహరించాడు. బలికీ ఇంద్రు నికి మధ్య ఘోరమైన యుద్ధ ం
జరిగింది. ఇంద్రు డు జంభాసురుడిని, బలాసురుడిని, హింకాసురుడిని సంహరించడంతో, నముచి
ఇంద్రు నితో యుద్ధా నికి కాలు దువ్వాడు.

● వజ్రా యుధాన్ని ప్రయోగించినా నముచి చావలేదు. అతను తడి-పొ డి ఆయుధాలు వేటితో చావడని
ఆకాశవాణి పలుకగా, తడి పొ డి కాని సముద్రపు నురుగును తన వజ్రా యుధానికి పులుముకొని
దానితో నముచిని సంహరిస్తా డు ఇంద్రు డు.

● ఇంతలో నారదుడు వచ్చి- దానవులు కూడా అమృత సాధనలో పాలు పంచుకున్నందువల్ల వారితో
యుద్ధ ం తగదని ఇంద్రు నికి నచ్చచెప్పాడు. దాంతో యుద్ధ ం ఆగిపో యింది. ఇంద్రా దులు స్వర్గా నికి బలి
చక్రవర్తి పాతాళానికి వెళ్లి పో యారు.

బలి గెలుపు

● దేవాసుర సంగ్రా మంలో విజయం సాధించిన ఇంద్రు డు బలిచక్రవర్తి సంపదనంతా దో చుకున్నాడు. ఐతే.
శుక్రా చార్యుడు మృతసంజీవని విద్యతో చనిపో యిన రాక్షసులనందరినీ బతికించడంతో, సంతోషించిన
బలి శుక్రా చార్యునికి మిగిలిన ధనాన్నంతా దానంగా ఇచ్చాడు.

● దాంతో బాటుగా భృగువంశ బ్రా హ్మణులకందరికీ దానధర్మాలు చేసాడు. దీంతో బలికి పూర్వవైభవం
తీసుకురావడానికి అతనితో 'విశ్వజిత్' యాగాన్ని చేయించారు. యజ్ఞ కుండం నుండి అవసరమైన
ఆయుధాలు వచ్చాయి.

● యజ్ఞ ం వల్ల అజేయమైన బలం కలిగింది బలికి. దీంతో అమరావతి పైకి దండెత్తా డు. ఇంద్రు డు
పారిపో యాడు. దేవతలు అనుసరించారు. దేవతలు తలో దిక్కుకు దిక్కుతోచకుండా పారిపో వడంతో
దేవదూత 'ఆదితి' తల్ల డిల్లి ంది.

● కశ్యపుని సూచన మేరకు పాల్గు ణ మాసం శుక్ల పక్ష పాడ్యమి మొదలు పన్నెండు రోజులు
పాలవ్రతాన్ని ఆచరించి వాసుదేవుడిని పూజించింది. ఆమె నిష్ఠ కు మెచ్చిన శ్రీహరి ఆమె సంతానంగా
జన్మిస్తా నని వరమిచ్చాడు.

వామనావతారం
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● ఇచ్చిన మాట ప్రకారం అదితి గర్భంలో జన్మించాడు మహావిష్ణు వు. పుట్టీ పుట్ట గానే మరుగుజ్జు
రూపాన్ని పొ ందాడు. వామనుడు పుట్ట గానే మహర్షు లు సంతోషించారు. తల్లిదండ్రు లు ఉపనయనం
చేసారు. స్వయంగా గాయత్రీ దేవతే అతనికి గాయత్రి మంత్రా న్ని ఉపదేశించింది. బృహస్పతి
యజ్ఞో పవీతాన్ని వేసాడు. కశ్యపుడు మొలతాడు కట్టా డు. భూదేవి లేడి చర్మాన్ని అందించింది.

● ఇలా వివిధ దేవతలు సంతోషంతో పాలు పంచుకోగా వామనుని ఉపనయనం పూర్త యింది. ఆ
సమయం లోనే ఒక పెద్ద యాగం చేస్తు న్నాడు బలి చక్రవర్తి. ఉపనయనం ముగిసిన వెంటనే
యాగశాలకు బయలుదేరాడు వామనుడు.

● సాక్షాత్తూ సూర్యభగవానుడే నడిచి వస్తు న్నంత తేజోమయంగా ఉన్నాడా బాలబ్రహ్మచారి.


ముద్దు లొలికే వామనుడిని చూసి ముచ్చటపడ్డా డు బలిచక్రవర్తి. ఏదడిగినా ఇస్తా నని వాగ్దా నం
చేసాడు.

● మూడడగుల నేల మాత్రమే చాలన్నాడు వామనుడు. ఇదంతా చూస్తు న్నాడు శుక్రా చార్యుడు. వచ్చిన
వాడు మామూలు వటువు కాదనీ నీ వంశ నాశనం చేసే శ్రీమహావిష్ణు వేననీ హెచ్చరిస్తా డు. దానిని
ఇవ్వద్ద ంటాడు.

● అందరికీ అన్నీ ఇచ్చే శ్రీహరే స్వయంగా చేయి చాస్తే ఇవ్వకుండా ఉండలేననీ, ఆడిన మాట తప్పననీ-
ఏది జరిగినా దానం ఇవ్వడం మానలేనని మాటిస్తా డు బలి చక్రవర్తి. తన ఆజ్ఞ ను ధిక్కరించినందువల్ల
సంపద అంతా నశిస్తు ందని శపించాడు శుక్రా చార్యుడు.

● ఇంతలో బలి భార్య వింధ్యావతి బంగారు కలశంతో నీళ్లు పట్టు కురాగా, వామనుని పాదాలు కడిగి
మూడడుగుల నేలను ధారాదత్త ం చేస్తా డు. బలి. చూస్తు ండగానే వామనుడు ఆకాశమంత ఎత్తు కు
ఎదుగుతాడు. ఒక అడుగుతో నేలనూ మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి మూడో అడుగు ఎక్కడ
పెట్టమంటావని అడుగుతాడు. మూడో పాదాన్ని తన తలపై పెట్టమని కోరతాడు బలి చక్రవర్తి. మూడో
పాదంతో బలిని సుతల లోకానికి పంపుతాడు వామనుడు.

● బలి దాతృత్వం లోకోత్త మం. వామనుడు కూడా బలిని ప్రశంసించాడు. బలిని సుతల లోకానికి
వెళ్లమన్నాడు. ఆ లోకంలో బలికి స్వయంగా తనే కాపలా కాస్తా నని, వరం ఇచ్చాడు. సౌవర్ణి
మన్వంతరంలో ఇంద్రు డిగా మారేలా అనుగ్రహించాడు.

మత్స్యావతారం

● బ్రహ్మ దేవుని ముఖం నుండి వెలువద్ద వేదాలను హయగ్రీవుడనే రాక్షసుడు దొ ంగిలించాడు. వాడిని
సంహరించడానికి శ్రీహరి మత్స్యావతారాన్ని స్వీకరించాడు. పూర్వం సత్యవ్రతుడు అనే రాజర్షి
ఉండేవాడు. ఆయన దయామయుడు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

● అతడు ఒకనాడు తర్పణాలు వదులుతుండగా ఒక చేప పిల్ల అంజలిలోకి వచ్చింది. తిరిగి నీటిలోకి
జారవిడిచి దామంటే - అలా విడిచిపెడితే పెద్ద చేపలు. భక్షిస్తా యనీ, వదలవద్ద నీ బతిమాలింది.

● సత్యవ్రతుడు దానిని కమండలంలో జారవిడిచాడు. తెల్లవారేసరికి ఆ చేప పిల్ల కమండలంలో


పట్ట లేదు. అందువల్ల మరింత పెద్ద పాత్రలో జార విడిచాడు. మరుసటి రోజుకు అది కూడా చాలలేదు.

● సరోవరంలో వేస్తే క్షణాల్లో సరోవరంలో పట్ట నంత పెద్దదయింది. దానిని సముద్రంలో


విడిచిపెడదామనుకోగానే మనుష్య భాషలో 'అలా సముద్రంలో వదిలి వేయవద్ద 'ని బతిమిలాడింది.

● చేప ఎదుగుదల, అది మానవ భాషలో మాట్లా డడాలు సత్యవంతుడికి ఆశ్చర్యాన్ని కలిగించాయి.
"ఎవరు నువ్వు?" అని ప్రశ్నించాడు. "సత్యవ్రతా! నేటి నుండి ఐదో రోజు జలప్రళయం వస్తు ంది. మూడు
లోకాలూ సముద్రంలో మునిగిపో తాయి. అలాంటి సమయంలో నీ దగ్గ రికి ఒక నావ వస్తు ంది.
పునఃసృష్టికి ఉపయోగపడే అన్ని రకాల విత్త నాలు, ఔషధులూ అందులో ఉంటాయి. నువ్వు
సప్త రుషులను తీసుకొని ఆ నావలో ఎక్కు అప్పుడు నేను అక్కడికి వస్తా ను. వాసుకిని తాడుగా
చేసుకొని నా కొమ్ముకు ఓడను కట్టివేయు. జలప్రళయం నుండి మిమ్మల్ని కాపాడతాను" అని చెప్పిన
మహామత్స్యం తాను విష్ణు మూర్తిననే విషయం తెలిపింది.

● ఇంతలో మహాప్రళయం రానే వచ్చింది. ఆ ప్రళయం నుండి మహర్షు లను, సత్యవ్రతుడిని బయటకు
చేర్చాడు మహామత్స్యం రూపంలో ఉన్న మహావిష్ణు వు. సత్యవ్రతునికి బ్రహ్మ జ్ఞా నాన్ని బో ధించి,
వేదాలను దొ ంగిలించిన హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరించి, వేదాలను తిరిగి బ్రహ్మకు
అప్పగించాడు.

నవమ స్కంధం

సుద్యుమ్నుడు

● వైవస్వత మనువుకు సంతానం లేనందువల్ల వశిష్ఠు ని సూచన ప్రకారం మనువు భార్య శ్రద్ధా దేవి
కూతురు కావాలని వ్రతం చేయడంతో పుత్రిక జన్మించింది. ఆమె పేరు 'ఇళ'. మనువు ప్రా ర్థించడంతో
రాజ్యపాలన కోసం ఇళను మగవాడిగా మార్చాడు విష్ణు వు. ఆయనే సుద్యుమ్నుడు.

● ఒకనాడు సుద్యుమ్నుడు మేరు పర్వత ప్రా ంతంలోని ఇలా వర్ష ప్రా ంతానికి చేరుకోగానే సుద్యుమ్నుడు
స్త్రీగా అతని గుర్రా లు ఆడ గుర్రా లుగా మారిపో యాయి. ఆ ప్రా ంతంలోకి ఎవరి ప్రవేశించిన పార్వతీదేవి
శాపం వల్ల స్త్రీ రూపాయలు గా మారుతారు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● స్త్రీ రూపంలో ఉన్న సుద్యుమ్నుడు ని బుద్ధు డు మోహిస్తా డు వీరి వివాహ ఫలితంగా జన్మించినవాడే
'పురూరవుడు'. చివరికి సుద్యుమ్నుడు శివుని ప్రా ర్థించి ఒక నెల స్త్రీ గా ఒక నెల పురుషుడు గా ఉండే
పొ ందగలిగాడు.

అంబరీషుడు

● నాభాగుని కుమారుడు అంబరీషుడు జ్ఞా ని, మహాచక్రవర్తి. గొప్ప విష్ణు భక్తు డు. ఒకసారి అంబరీషుడు
సరస్వతీ నదీ తీరంలో యజ్ఞా న్ని చేస,ి భార్య శీలవతితో కలిసి ఒక సంవత్సరం పాటు ద్వాదశి వ్రతం
చేసాడు. ద్వాదశి రోజున ప్రత సమాప్తి చేసుకొని యమునా నదిలో స్నానం చేసి తిరిగి వచ్చాడు. ఇక
'పారణ' (ఉపవాసానంతర భోజనాన్ని) చేస్తే వ్రత పరిసమాప్తి అవుతుంది.

● ద్వాదశి పారణకు సిద్ధం కాగానే అక్కడికి వచ్చాడు దుర్వాస ముని. అగ్రహానుగ్రహ సమర్థు డైన
దుర్వాస మునిని సాదరంగా ఎదురేగి భోజనానికి ఆహ్వానించాడు అంబరీషుడు. సంతోషంగా
అంగీకరించి స్నానాదికాలకు యమునా నదికి వెళ్లా డు దుర్వాసుడు.

● వెళ్లి న దుర్వాసుడు ఎంతకూ తిరిగి రాలేదు. సమయం మించిపో కుండా పారణ చేస్తేనే వ్రత సమాప్తి.
కాలం దాటిపో వడంతో పెద్దల సలహా మేరకు కేవలం మంచినీళ్ల ను మాత్రమే స్వీకరించారు అంబరీష
దంపతులు.

● ఇటు వీరు మంచినీళ్ల ను స్వీకరించగానే వచ్చాడు. దుర్వాసుడు. తనను ఆహ్వానించి, తను


భుజించకముందే అంబరీష దంపతులు పారణ పూర్తిచేయడాన్ని భరించలేకపో యాడు. కోపంతో
ఊగిపో తూ తన జడల నుండి 'కృత్య'ను సృష్టించాడు.

● అంబరీషుడిని సంహరించేందుకు ఉరికి వచ్చింది కృత్య, అంబరీషుడు భయపడలేదు. శ్రీహరిని


ప్రా ర్ధించాడు. వెంటనే చక్రా న్ని ప్రయోగించాడు శ్రీహరి. సుదర్శన చక్రం కృత్యను సంహరించి,
దుర్వాసుడిని వెంబడించింది.

● బ్రహ్మ లోకానికి వెళ్లి బ్రహ్మనీ, కైలాసానికి వెళ్లి శివుడినీ శరణు వేడినా, సుదర్శన చక్రం నుండి
తప్పించుకోలేకపో యాడు. దుర్వాసుడు. చివరకు విష్ణు మూర్తినే శరణు వేడాడు.

● తన చేతుల్లో ఏమీ లేదనీ వెళ్లి . అంబరీషుడినే శరణు వేడమని చెప్తా డు శ్రీహరి. దుర్వాసుని గర్వం
భగ్నమైంది. పశ్చాత్తా పం అంకురించింది. వెళ్లి అంబరీషుడిని శరణు వేడాడు. సుదర్శన చక్రం
శాంతించింది. అంబరీషుని ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆశీర్వదించి వెళ్లా డు దుర్వాసుడు. తాపసుల శక్తి
కంటే భక్తే గొప్పదని నిరూపిస్తు ంది అంబరీషుని వృత్తా ంతం.

హరిశ్చంద్రు డు
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● ఇక్ష్వాకు వంశంలో త్రిశంకువు కుమారుడు హరిశ్చంద్రు డు. సంతానం లేకపో వడంతో వరుణుడిని
ఆశ్రయించాడు. "దేవా! నాకు పుత్రు డిని ప్రసాదిస్తే ఆ పుత్రు డినే యజ్ఞ పశువుగా చేసి నీకు యజ్ఞ ం
చేస్తా ను" అని ప్రా ర్ధించాడు.

● సంతోషించిన వరుణుడు కుమారుడిని ప్రసాదించాడు. ఆ కుమారుడే లోహితుడు. పుత్రు డు కలగగానే


ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలి హరిశ్చంద్రు డు. కానీ పుత్రవ్యామోహం ఆడిన మాటను మళ్లీ మళ్లీ
తప్పేటట్లు చేసింది. కోపించిన వరుణుడు హరిశ్చంద్రు నికి మహో దర వ్యాధిని కలిగించాడు.

● తనను యజ్ఞ పశువుగా చేస్తా రని తెలుసుకొని లోహితుడు భయంతో పారిపో తాడు. తండ్రి
అనారోగ్యాన్ని గురించి తెలుసుకొని, తిరిగి వద్దా మనుకున్నా ఇంద్రు డు మనసు మార్చి వెనకకు
పంపుతాడు.

● చివరకు అజీగర్తు డు అనే బ్రా హ్మణునికి ధనాన్నిచ్చి, ఆయన కుమారుడైన శునశ్శేపుడిని


యజ్ఞ పశువుగా కొనుక్కొని యజ్ఞా న్ని ప్రా రంభిస్తా రు. చివరకు శునశ్శేపుడిని వధించకుండానే యాగం
పూర్త వుతుంది. ఇంద్రు డు జ్ఞా నోపదేశం చేయడంతో హరిశ్చంద్రు డు సంసార వ్యామోహాన్ని వదిలి
భవబంధాలను తెంచుకొని ఆత్మస్వరూపంలో లీనమవుతాడు.

గంగావతరణం

● మను వంశంలోని మహాచక్రవర్తి సగరుడు. ఆయన ఒకసారి అశ్వమేధయాగం చేయబో గా ఇంద్రు డు


యాగాశ్వాన్ని దొ ంగిలించి పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి సమీపంలో వదిలేసాడు.

● అశ్వం కానరాకపో వడంతో సగరుని కుమారులు అరవై వేల మంది అశ్వాన్ని వెతుకుతూ వెతుకుతూ
పాతాళం చేరుకున్నారు. అక్కడ కపిల మహర్షి సమీపంలో అశ్వం ఉండడంతో అతనే అశ్వాన్ని
దొ ంగిలించి దొ ంగ జపం చేస్తు న్నాడని అనుమానించారు.

● కోపంలో మహర్షిని సంహరించేందుకు ముందుకురికారు సగరపుత్రు లు. కపిలుడు ఒక్కసారిగా కళ్లు


తెరవగా అతని నేత్రా గ్నిలో అరవై వేలమంది బూడిదయ్యారు.

● యాగాశ్వం, దానితో బాటుగా యాగాశ్వాన్ని వెతుక్కుంటూ వెళ్లి న పుత్రు లు అంతమందీ


రాకపో వడంతో తన మనుమడైన అంశుమంతుడిని పంపించాడు సగరుడు.

● అంశుమంతుడు వెతుకుతూ వెళ్లి కపిల మహర్షి సమీపంలోనే అశ్వాన్ని చూసాడు. మహర్షిని


ప్రా ర్ధించాడు. జరిగింది గ్రహించాడు. అశ్వాన్ని తీసుకెళ్లా డు. యాగం పూర్త యింది. కానీ సంతానం
బూడిదయ్యింది.

● సగరుడు ఏమీ చేయలేకపో యాడు. అటు తర్వాత అంశుమంతుడు, అటు తర్వాత దిలీపుడూ కూడా
తమ పూర్వీకులకు ఉత్త మగతులు ప్రా ప్తించే ప్రయత్నం మొదలు పెట్టలేదు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● దిలీపుని కుమారుడు భగీరథుడు తన పూర్వీకుల దురవస్థ ను తెలుసుకొన్నాడు. గంగను పాతాళానికి
రప్పిస్తేనే పూర్వికులకు ఉత్త మగతులు లభిస్తా యని గ్రహించి, గంగను రప్పించేందుకు తపస్సు
చేసాడు. గంగను భువికి రప్పించి పాతాళానికి పంపించి - సగర పుత్రు లకు గంగాతర్పణాలు వదిలాడు.

కల్మాషపాదుడు

● మనువు వంశంలోని వాడే సౌదాసుడు. భార్య మదయంతి. ఆయన ఒకనాడు వేటకు వెళ్లి ఒక
రాక్షసుడిని సంహరించాడు. ఆ రాక్షసుని తమ్ముడు సౌదాసునిపై పగబట్టా డు. మారువేషంలో
సౌదాసుని వంటవాడిగా చేరాడు.

● ఒకనాడు వశిష్ఠు డు సౌదాసుని ఇంటికి రాగా సౌదాసుడు ఆతిథ్యం ఇచ్చాడు. వంటవాడు వశిష్ఠు నికి
నరమాంసం వండి పెట్టా డు. ఇది గ్రహించిన వశిష్ఠు డు సౌదాసుడిని రాక్షసుడిగా మారమని శపించాడు.

● ఐనా, అసలు పొ రపాటు రాజుది కాదని గ్రహించి - తన శాపాన్ని పన్నెండేళ్లకే పరిమితం చేసాడు. తన
పొ రపాటు లేకున్నా వశిష్ఠు డు శాపమివ్వడాన్ని తట్టు కోలేని సౌదాసుడు వశిష్ఠు నికి ప్రతిశాపం
ఇవ్వడానికి మంత్ర జలాన్ని చేతుల్లో కి తీసుకున్నాడు. కులగురువుకు ప్రతిశాపం ఇవ్వడం తప్పని
భార్య వారించగా, ఆ మంత్ర జలాన్ని తన పాదాల పైనే పో సుకున్నాడు. దాంతో కాళ్లు నలుపెక్కగా
ఆయన పేరు 'కల్మాషపాదుడు' అయింది.

● రాక్షసుడుగా ఉన్నప్పుడు చేసిన పాపాల వల్ల సంతానం కలుగకుంటే, శాప విమోచన తర్వాత మళ్లీ
వశిష్ఠు డిని ఆశ్రయించాడు. సౌదాసుని భార్య గర్భం దాల్చినా ఎంతకూ ప్రసవించకుంటే, వశిష్ఠు డు ఆ
గర్భాన్ని రాతితో కొట్ట గా శిశువు జన్మించాడు. రాతితో (అశ్మంతో) కొట్ట గా జన్మించిన బాలుడిని
'ఆశ్మకుడు'' గా పిలిచాడు

రామావతారం

● రామావతార ప్రసక్తి భాగవతంలోనూ ఉంది. మను వంశాన్ని ప్రస్తా వించిన సందర్భంలో, ఇక్ష్వాకు
వంశం కూడా మను వంశపు కొనసాగింపే అయినందువల్ల రామకథ ఇక్కడ కూడా ప్రస్తా వించబడ్డ ది.
రావణ వధానంతరం లోకాపవాదు భయం వల్ల . సీతను అడవులలో వదిలిపెడతాడు శ్రీరాముడు.

● ఆ సమయంలో సీతాదేవి గర్భవతి. వాల్మీకి ఆశ్రమంలో ఇద్ద రు కవలలకు జన్మనిస్తు ంది. వారికి
లవకుశులని నామకరణం చేస్తా డు వాల్మీకి. లక్ష్మణునికి అంగదుడు, చిత్రకేతుడు అనే కుమారులు
జన్మించారు. శత్రు ఘ్నునికి సుబాహుడు, శృతసేనుడు జన్మించారు. సీతాదేవి తన కుమారులను
వాల్మీకికి అప్పగిస్తూ శ్రీరాముని ధ్యానిస్తూ పాతాళం చేరింది. ఈ వార్త విన్న శ్రీరాముడు దుఃఖసాగరంలో
మునిగిపో యి, యజ్ఞ యాగాలు చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ దేహత్యాగం చేసాడు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

పరశురాముడు

● పురూరవుని వంశంలోని గాధి కుమార్తె సత్యవతి. సత్యవతిని రుచీకుడు అనే ఋషి వివాహం
చేసుకుంటాడు. వీరి సంతానం జమదగ్ని. జమదగ్ని రేణుకల సంతానం పరశురాముడు.

● ఒకనాడు జమదగ్ని భార్య రేణుక స్నానం చేయడానికి గంగా నదికి వెళ్లి ంది. అక్కడ గంధర్వుల
జలకాలాటను చూస్తూ మైమరిచిపో యి ఆలస్యంగా ఆశ్రమానికి చేరుకుంది. జరిగింది గ్రహించిన
జమదగ్ని రేణుకను చంపేయమని కొడుకులను ఆదేశించాడు.

● పరశురాముడు తప్ప ఏ కొడుకూ ముందుకు రాలేదు. నిష్ట చెడిన తల్లిని, తండ్రి మాట పరిపాలించని
కొడుకులనూ అందరినీ చంపేయమని పరశురాముడిని ఆదేశించాడు జమదగ్ని.

● మారుమాట్లా డకుండా సంహరించాడు. పరశురాముడు. రాముని పితృభక్తికి సంతోషించాడు జమదగ్ని


వరం కోరుకోమన్నాడు. చనిపో యిన తన తల్లినీ సో దరులనూ బతికించమని కోరుకున్నాడు
పరశురాముడు. అలాగే బతికించాడు జమదగ్ని.

● ఆ కాలంలో హైహయ వంశానికి చెందిన కార్త వీర్యార్జు నుడు ఉండేవాడు. దత్తా త్రేయుని అనుగ్రహంతో
వేయి చేతులతో మహావీరుడిగా ఉండేవాడు. రావణుడినే బంధించిన బలం ఆయనది.

● ఒకనాడు జమదగ్ని ఆశ్రమంలో కోరిన వాటినన్నిటినీ ప్రసాదించే కామధేనువును చూసి, బలవంతంగా


దానిని లాక్కెళ్లా డు. ఇది తెలిసిన రాముడు ఆవేశంతో కార్త వీర్యార్జు నుడిని సంహరించాడు.

● రాజ హత్య మహాపాపమని తండ్రి చెప్పగా తీర్థ యాత్రలకు వెళ్లా డు. తీర్థ యాత్రలకు వెళ్లి న సమయంలో
కార్త వీర్యార్జు నుని కొడుకులు జమదగ్నిని సంహరించడంతో, కోపించిన జమదగ్ని 21 సార్లు క్షత్రియ
సంహారం చేసి లోకంలో క్షత్రియుడన్నవాడే లేకుండా చేసేందుకు ఉద్యమించాడు. క్షత్రియుల రక్త ంతో
తండ్రికి తర్పణాలు వదిలాడు. రామావతారం రావడంతో పరశురామావతారం ముగిసిపో యింది.

యయాతి చరిత్ర

● వృషపర్వుడు రాక్షస రాజు. ఆయన కూతురు శర్మిష్ఠ శుక్రా చార్యుడు రాజ గురువు. ఆయన కుమార్తె
దేవయాని. శర్మిష్ట దేవయానిలు స్నేహితులు.

● ఒకనాడు వారిద్దరూ మిగతా స్నేహితురాళ్ల తో కలిసి సరస్సులో స్నానం చేస్తా రు. కంగారులో దేవయాని
దుస్తు లను శర్మిష్ట వేసుకోవడంతో దేవయాని శర్మిష్ట ను నిందించింది. కోపంతో శర్మిష్ట దేవయానిని
అక్కడే ఉన్న నూతిలో తోసేసి అంతఃపురానికి వెళ్లి పో యింది.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● ఆ సమయంలోనే యయాతి అనే చంద్రవంశ చక్రవర్తి వేటాడుతూ అదే పరిసర ప్రా ంతాలకు వచ్చాడు.
బావి నుండి కేకలు వినిపించి, దేవయానికి చేయూతనిచ్చి పైకి లాగాడు. మానప్రా ణాలు
రక్షించినందున, చేయి పట్టు కున్నందున తనను వివాహం చేసుకోమని కోరింది దేవయాని.
సరేనన్నాడు యయాతి.

● దేవయాని ఇంటికి వెళ్లి ంది. జరిగిందంతా తండ్రితో చెప్పి, తండ్రితో కలిసి రాజ్యాన్ని వదిలి వెళ్లే ందుకు
సిద్ధపడ్డ ది. ఇది తెలుసుకున్న వృషపర్వుడు రాజ్యం వదలవద్ద ని శుక్రా చార్యుడిని ప్రా ధేయపడ్డా డు.

● యయాతితో దేవయాని వివాహం జరుగుతుందనీ, యయాతి వెంట శర్మిష్ట నూ చెలికత్తెలనూ


దేవయానికి దాసీలుగా పంపితే రాజ్యంలోనే ఉంటానని తెలిపాడు శుక్రా చార్యుడు.

● వృషపర్వుడు అందుకు అంగీకరించడంతో దేవయాని వెంట దాసీగా శర్మిష్ట వెళ్లి ంది. శర్మిష్ట ను
దేవయాని వెంట పంపుతూ, శర్మిష్ఠ కు కూడా ఎలాంటి లోటు లేకుండా చూడమనీ, శారీరక సుఖం
మాత్రం ఇవ్వకుండా ఇతర సౌకర్యాలన్నిటినీ కల్పించమని యయాతితో చెప్పాడు శుక్రా చార్యుడు.

● యయాతికి దేవయాని వల్ల యదువు, తుర్వసుడు అనే సంతానం కలిగారు. శర్మిష్ఠ కు సంతానవతి
కావాలనే కోరిక కలిగింది. సంతానాన్ని ప్రసాదించమని యయాతిని వేడుకుంది. కాదనలేకపో యాడు
యయాతి.

● శుక్రా చార్యుని ఆదేశాన్ని మరిచిపో యాడు. శర్మిష్ట వల్ల ముగ్గు రు కొడుకులను పొ ందాడు. ఈ
విషయాన్ని గ్రహించింది దేవయాని, యయాతిని నిలదీసింది. జరిగిన దానిని తండ్రితో
మొరపెట్టు కుంది. కోపించాడు శుక్రా చార్యుడు. వృద్ధు నివి కమ్మని యయాతిని శపించాడు.

● కాళ్లా వేళ్లా పడి బతిమాలుకున్నాడు యయాతి. శాపం వల్ల నా సుఖమే కాకుండా నీ కూతురు సుఖం
కూడా చెడుతుందని గుర్తు చేసాడు చల్ల బడ్డా డు శుక్రా చార్యుడు. 'నీ కుమారులలో ఎవరైనా నీ
వార్ధ క్యాన్ని తీసుకుంటే వారి యవ్వనం నీకు లభిస్తు ంది. నీవు యవ్వన భోగాలను అనుభవించిన
తర్వాత నీ వార్ధ క్యాన్ని నువ్వు తీసుకుని, ఆయన యవ్వనాన్ని అతనికి ఇవ్వవచ్చు' అని
అనుమతించాడు.

● యయాతి కొడుకులను పిలిచి, తన వార్ధ క్యాన్ని ఎవరైనా తీసుకుంటారేమో కోరాడు. మొదటి


నలుగురు కొడుకులూ తిరస్కరించగా, చివరివాడైన శర్మిష్ఠ కుమారుడు 'పురువు' అందుకు
అంగీకరించాడు.

● యయాతి కుమారుని యవ్వనంతో ఎన్నో భోగాలను అనుభవించాడు. భోగాలెన్ని అనుభవించినా అవి


అశాశ్వతాలనీ, తీరని దాహాలనీ గ్రహించాడు. తృప్తిగా పురువుకు యవ్వనాన్ని తిరిగి ఇచ్చి, తన
వార్ధ క్యాన్ని తను తీసుకున్నాడు. పురువును రాజుగా చేసాడు. అతనితో ప్రా రంభమైందే పురు వంశం.
దాని కొనసాగింపే కురు వంశం. చిన్నదిగా కనిపించే ఈ కథలో ఒక్కో పాత్రను ఎన్నో రకాలుగా
వ్యాఖ్యానించవచ్చు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

భరతుడు

● యయాతి కుమారుడైన పురువు తర్వాత చంద్ర వంశం వర్ధిల్లి ంది. అదే వరుసలోని ప్రసిద్ధు డు దుష్యంత
మహారాజు. ఆయన ఒకరోజు వేటకు వెళ్లి , సేద దీరడం కోసం కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్లా డు.

● అక్కడ కణ్వుని పెంపుడు కూతురు శకుంతలపై మనసు పడ్డా డు. ఆమె కూడా ప్రేమించడంతో
అక్కడికక్కడే గాంధర్వ వివాహం చేసుకుని, ఆ రాత్రి ఆమెతో గడిపి రాజ్యానికి వెళ్లా డు. వెళ్లి న తర్వాత
శకుంతలను మరిచిపో యాడు.

● శకుంతల ఒక మగబిడ్డ కు జన్మనిచ్చింది. అతడే భరతుడు. దుష్యంతుడు ఎంతకూ రాకపో వడంతో


భరతుడిని వెంటపెట్టు కుని దుష్యంతుని రాజసభకు వెళ్లి ంది శకుంతల.

● అక్కడ దుష్యంతుడు మొదటగా శకుంతలను గ్రహించకున్నా ఆకాశవాణి చెప్పడంతో స్వీకరిస్తా డు.


అటుతర్వాత భరతుడు రాష్ట ్ర విశాల సామ్రా జ్యాన్ని పరిపాలించాడు. అతనికి 'మరుత్ సో మ' యజ్ఞ
ఫలితంగా శిశువు జన్మించాడు. ఆయనే భరద్వాజుడు

రంతిదేవుడు

● పురు వంశంలో భరద్వాజుని తర్వాత తరాల్లో ని వాడు రంతిదేవుడు. రంతిదేవునికి అపారమైన సంపద
ఉన్నా. ఉన్నదానిని ఎప్పుడూ దానం చేసేవాడు. అందువల్ల విశ్యదరిద్రు నిగా బతికేవాడు.

● ఒకసారి రంతిదేవునికీ, అతని పరివారానికి నలభై రోజులు తిండి దొ రకలేదు. నలభై ఒకటవ రోజు
కొద్దిపాటి ఆహారం లభించింది. భుజిద్దా మనుకునేసరికి ఒక బ్రా హ్మడు ఆకలితో వచ్చాడు. ఆయనకు
కొంత పెట్టి మిగతాది తిందామనుకుని ఆయనకు భోజనం పెట్టా డు.

● ఇక భోజనం చేద్దా మనేసరికి ఒక శూద్రు డు వచ్చాడు. మిగిలిన దానిని శూద్రు నికి పెట్టేసాడు.
శూద్రు డు వెళ్లగానే ఒక అతిథి నాలుగు కుక్కలను తీసుకొచ్చారు. మిగిలిన ఆహారాన్నంతా వాటికి
పెట్టి, నీళ్లు తాగుదామనుకునేసరికి ఒక ఛండాలుడు వచ్చాడు. ఉన్న నీళ్లు కూడా అతనికి ఇచ్చేసారు.
వచ్చిన అతిథులందరూ మారువేషాలలో వచ్చిన దేవతలు.

● రంతిదేవుని దాన గుణాన్ని ప్రశంసించారు. ప్రతిగా ఏదైనా వరం కోరుకోమన్నారు. తనకే కోరికా లేదనీ,
ఏ వరమూ వద్ద ని తెలిపాడు రంతిదేవుడు. ప్రతిఫలాన్ని కోరకుండా చేసేదే దానమని తెలుపుతుంది
రంతిదేవుని కథ. (ఈ స్కంధం చివర యదు వంశానికి సంబంధించిన విదర్భ వంశ చరిత్ర ఉంది.
విదర్భ వంశ చరితత
్ర ో ఈ స్కంధం పూర్త వుతుంది).
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

దశమ స్కంధం

శ్రీకృష్ణ జననం

● పూర్వం భూమండలంపై రాక్షసులూ, నరరూప రాక్షసులూ రాజులై జన్మించడంతో భూ భారం


పెరిగిపో యింది. ఈ భారాన్ని మోయడం తన వల్ల కాదంటూ గో రూపం ధరించి వెళ్లి బ్రహ్మదేవుడికి
మొరపెట్టు కుంది భూదేవి. బ్రహ్మదేవుడు శివుడిని వెంటబెట్టు కుని, భూదేవితో సహా విష్ణు మూర్తి
దగ్గ రకు వెళ్ళి తరుణోపాయం చెప్పమని ప్రా ర్థించాడు.

● విష్ణు మూర్తి తాను వసుదేవుని ఇంట్లో జన్మిస్తా ననీ, జగన్మోహిని యోగమాయగా, ఆదిశేషుడు తనకు
అన్నగా అవతరిస్తా డనీ చెప్పాడు. వారందరూ కలిసి భూ భారాన్ని తగ్గిస్తా రని పలికింది ఆకాశవాణి.

● శూరసేనుడు యాదవ వంశ రాజు. అతని రాజధాని మధుర ఆయన కుమారుడు వసుదేవుడు.
ఆయన భార్య దేవకి. ఈమె కంసుని సో దరి. ఒకనాడు దేవకీ వసుదేవులను తీసుకొని సంతోషంగా
రధంలో వెళుతున్నాడు కంనుడు.

● ఆ సంతోష సమయంలో దేవకీ గర్భంలో జన్మించే ఎనిమిదవ కుమారుడు కంసుడిని సంహరిస్తా డని
పలికింది ఆకాశవాణి. ఈ మాటలను వినగానే భయంతో కోపంతో ఊగిపో యాడు కంసుడు. వెంటనే
దేవకిని సంహరించడానికి కత్తి దూసాడు. పుట్టిన బిడ్డ వల్లే ప్రమాదం కానీ దేవకి వల్ల కాదనీ పుట్టిన
శిశువులను పుట్టినట్టు గా నీకు అప్పగిస్తా ననీ దేవకిని వదలమనీ కంసుడిని ప్రా ర్ధించాడు వసుదేవుడు.

● ఈ ప్రా ర్ధ నతో చల్ల బడ్డ కంసుడు వారిని స్వేచ్ఛగా వదిలేసాడు. ఐతే నారదుని సలహా విని మళ్లీ
వారిద్దరినీ కారాగారంలో బంధించాడు. మొదటి ఆరుగురు సంతానాన్ని పుట్టింది పుట్టినట్టు గా
సంహరించాడు. ఇక ఏడవ శిశువుగా జన్మించబో తున్నాడు ఆదిశేషుడు.

● శ్రీహరి ఆదేశం ప్రకారం దేవకి గర్భంలోని ఆదిశేషుని అంశను రేపల్లెలో నందుని ఇంట్లో
తలదాచుకుంటున్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది యోగమాయ. తాను స్వయంగా నందుని భార్య
యశోద గర్భంలో ప్రవేశించింది.

● ఇలా జరగడం వల్ల దేవకి ప్రసవం జరగలేదు. అందరూ దేవకికి గర్భపాతం జరిగిందనుకున్నారు.
దేవకి గర్భంలో ఎనిమిదవ శిశువుగా జన్మించేందుకు సిద్ధమయ్యాడు విష్ణు మూర్తి.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

● ఆయనకు దేవకీ వసుదేవుల గర్భంలో జన్మించడం కొత్త కాదు. స్వాయంభువ మన్వంతరంలో దేవకీ
వసుదేవులు వృశ్ని, సుదీపులుగా ఉన్నప్పుడు వారి గర్భంలో వృశ్నిగర్భుడిగా జన్మించాడు. వారే
అదితి, కశ్యపులుగా ఉన్నప్పుడు వామనుడై జన్మించాడు. ఇప్పుడు దేవకీ వసుదేవులుగా వారు
జన్మించగా వారి కడుపున కృష్ణు డిగా జన్మిస్తు న్నాడు.

● దేవకీ వసుదేవులు ఆందో ళనతోనూ, ఆనందంతోనూ సతమతమౌతుండగా అర్ధ రాత్రి కారు చీకట్ల మధ్య
జన్మించాడు నల్ల నయ్య. వెంటనే తనను నందుని భార్య యశోద పక్కలో పడుకోబెట్టి, అక్కడ ఉన్న
శిశువును కారాగారానికి తీసుకురమ్మన్నాడు.

● అంతటి గాంధకారంలో కారాగారపు తలుపులు అవే తెరుచుకున్నాయ్. అందరినీ మాయ కమ్మేసింది.


కృష్ణు ని తీసుకొని వెళుతున్న వసుదేవునికి యమున దారి ఇచ్చింది. వర్షంలో తడవకుండా శేషుడు
పడగపట్టా డు. కృష్ణు డిని రేపల్లెకు చేర్చి, యశోదకు జన్మించిన యోగమాయను దేవకి పక్కన
చేర్చాడు వసుదేవుడు.

● వసుదేవుడు కారాగారం చేరుకోగానే అందరిని కమ్మేసిన మాయ అంతమైంది. ద్వారపాలకులకు


అప్పుడే పుట్టిన శిశువు ఏడుపు వినిపించింది. పరిగెత్తు కుంటూ వెళ్లి కంసునికి ఈ విషయం తెలిపారు.
పరుగు పరుగున వచ్చి చూసాడు కంసుడు. పుట్టింది ఆడబిడ్డ . ఐనా నేలకేసి కొట్టా డు.

● కంసుని చేతుల నుండి నేల జారిన ఆ శిశువు నేరుగా పైకెగిరింది. 'నిన్ను చంపే శత్రు వు మరోచోట
పెరుగుతున్నాడు' అంటూ ఆకాశంలోకి ఎగిరిపో యింది. అనవసరంగా ఆరుగురు శిశువులను
సంహరించి నందుకు క్షమించమని దేవకీ వసుదేవులను వేడుకున్నాడు కంసుడు. వెంటనే
మంత్రు లతో సమాలోచన చేసి కనబడ్డ చంటి పిల్లలనందరినీ చంపే ప్రయత్నాలు మొదలు
పెట్టమన్నాడు.

పూతన

● కొడుకు పుట్టిన సంతోషంతో పండుగ చేసుకుంటున్నాడు నందుడు. నందుని సంతోషానికి


అంతేలేకుండా. పో యింది. నందుని సంతోషంలో నందుడు ఉంటే పసిపిల్లలను ఎలా సంహరించాలా
అనే ఆలోచనలో ఉన్నాడు కంసుడు.
● పూతన రాక్షసి. కంసుని ఆదేశాన్ని అనుసరించి, పసి పిల్లలకు పాలిచ్చి చంపడానికి నంద
గోకులంలోకి వచ్చింది పూతన, అమాయకంగా ఆడుకుంటున్న బాలకృష్ణు ని దగ్గ రకు వచ్చింది.

● విషపూరితమైన పాలు ఉన్నతన స్త న్యాన్ని పాలు తాగడానికి కృష్ణు నికి అందించింది. ఇది గ్రహించాడు
కృష్ణు డు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● పూతన చనుబాలతో బాటుగా ప్రా ణాలనూ పీల్చివేసాడు. కృష్ణు నికి సంభవించిన ఆపదను చూసి
మొదట తల్ల డిల్లి నా అటు తర్వాత ఊరడిల్లి ంది గోకులం.

శకటాసురుడు

● పూతన తర్వాత 'శకటాసురుడు' అనే రాక్షసుడు కృష్ణు ని చంపాలని బండి రూపంలో వచ్చాడు.
కృష్ణు డు ఒక్క తన్ను తన్నగానే ముక్కలయ్యాడు.

● మరోరోజు తృణావర్తు డు అనే రాక్షసుడు సుడిగాలిలా మారి కృష్ణు ని అపహరించేందుకు యత్నించగా


వాని పీక నులిమి చంపాడు కృష్ణు డు.

నామకరణం

● యశోదకూ, రోహిణికీ జన్మించిన పిల్లలకు నామకరణం చేయడానికి వచ్చాడు గర్గా చార్యుడు. తన


రాకను రహస్యంగా ఉంచమన్నాడు. రోహిణి కుమారుడు అందరికీ ఆనందాన్ని కల్పిస్తా డు కాబట్టి
అతని పేరు రాముడనీ, అధిక బలవంతుడైనందువల్ల బలరాముడనీ పిలవమన్నాడు. అలాగే
యాదవులను సమదృష్టితో చూసి అందరినీ ఆకర్షిస్తా డు కాబట్టి సంకర్షణుడు' అని పేరుపెట్టా డు.
యశోద కుమారునిది నలుపు వర్ణ ం కాబట్టి ఆయనను కృష్ణు డని పిలవమన్నాడు.

విశ్వదర్శనం

● ఒకనాడు మన్ను తిన్నాడు కృష్ణు డు. తల్లి యశోద గద్దించి నోరు చూపమంటే నోటితోబాటుగా
పధ్నాలుగా లోకాలనూ చూపించాడు కృష్ణు డు. కలయో నిజమో తెలియలేదు

యశోద కు శాప విమోచనం

● బాల్య క్రీడలలో శ్రీకృష్ణు ని అల్ల రి అంతా ఇంతా కాదు. కృష్ణు ని అల్ల రికి కోపించిన యశోద ఒకనాడు
రోలుకు కట్టేసి తన పని తాను చేసుకుంటూ వెళ్లి ంది. ఆ రోలును కూడా లాక్కుంటూ అలాగే
ముందుకెళ్లా డు కృష్ణు డు.

● అక్కడ రెండు పెద్ద జంట మద్ది వృక్షాలు చాలా బలంగా వేళ్లూ నుకునిపో యి ఉన్నవి. వాటి మధ్య
నుండి రోలును లాక్కుంటూ వెళితే ఒక్కసారిగా కుప్పకూలిపో యాయి మద్ది చెట్లు , ఫెళఫెళమనే
చప్పుడు మధ్య నుండి
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● చిరునవ్వుతో బయటికొచ్చాడు నల్ల నయ్య ఆ కుప్పకూలిన మద్ది చెట్లు పూర్వజన్మలో కుబేరుని
కుమారులు. -మోహపాశాలలో కూరుకుపో యి నారదుని చేత శపించబడ్డా రు. మోహాతీతుడైన
శ్రీకృష్ణు ని స్పర్శతో శాప విమోచనాన్ని పొ ందారు.

బృందావనానికి తరలివెళ్లి న గోపకులం

● ప్రతి ఆపద నుండి కూడా కృష్ణు డు తప్పించుకుంటున్నా ఈ అవదలు నందునికి ఆందో ళనను
కలిగించాయి. అందువల్ల మరో సురక్షిత ప్రా ంతానికి తరలి వెళదామని ఆలోచించి, పశుగ్రా సానికి
కొరతలేని బృందావనానికి వెళదామన్నాడు నందుడు. మిగతా వారూ సరేననడంతో బృందావనానికి
తరలి వెళ్లా రు.

రాక్షస వధలు

● చోటు మారినా ఆపదలు వస్తూ నే ఉన్నాయి. ఒక రోజు వత్సాసురుడనే రాక్షసుడు లేగ రూపంలో
ఆవుల మందలో చేరాడు. కృష్ణు డు దాని తోక పట్టు కుని గిరగిరా తిప్పి వెలగ చెట్టు కు కొట్టి చంపాడు.

● మరోసారి పూతన తమ్ముడైన బకాసురుడు పెద్ద కొంగ రూపంలో వచ్చాడు. కృష్ణు డిని మింగేసాడు.
దాని ముక్చు చీల్చి చంపేసాడు కృష్ణు డు.

● పూతన, బకాసురుల తమ్ముడు అఘాసురుడు. పెద్ద కొండచిలువలా మారి గోవులను, గోపాలకులను,


కృష్ణు డినీ మింగేసాడు. లోనికెళ్లి న తర్వాత శరీరాన్ని పెంచి అఘాసురుడి దేహాన్ని చీల్చి చంపేసాడు
కృష్ణు డు.

● శ్రీకృష్ణు ని బాల్య క్రీడలను చూసి పరవశించిపో యాడు బ్రహ్మ. ఆ క్రీడలను మరిన్ని


చూడాలనుకున్నాడు. హటాత్తు గా గోవులనూ గోపాలకులను మాయం చేసాడు. ఆశ్చర్యపో యాడు
కృష్ణు డు. జరిగింది గ్రహించాడు.

● తనే స్వయంగా అదృశ్యమైన గోపాలురుగా, గోవులుగా మారాడు. ఎవరూ గుర్తించలేనట్లు గా ఉంది


కృష్ణు ని ప్రతిసృష్టి. ఇలాగే ఒక సంవత్సరం గడిచింది. ఎవరూ గ్రహించుకున్నా ప్రతిచోటా కృష్ణు డే
కనిపించడాన్ని గ్రహించాడు బలరాముడు. కారణమడిగాడు చెప్పాడు కృష్ణు డు.

● బ్రహ్మదేవుడు తిరిగి వచ్చి కృష్ణ మాయను చూసి ఆశ్చర్యపో యాడు. మళ్లీ తను అదృశ్యం చేసిన
గోవులనూ గోపాలురనూ అప్పగించి, కృష్ణు ని కీర్తించాడు.

● బృందావనం సమీపంలోని తాటితోపులో గాడిద రూపంలో ఉండే రాక్షసుడు


ధేనుకాసురుడు.బలరాముడు వాడిని సంహరించాడు.

కాళీయ మర్ద నం
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● కాళీయుడు అనే మహాసర్పం గరుత్మంతునికి భయపడి తన పరివారంతో యమునలో నివసించేద.ి ఆ
మహాసర్పపు ఉనికితో యమునా నది విషపూరితమైపో యింది.

● అందువల్ల కాళీయుడిని యమునా నది నీటి మడుగు నుండి బయటకు పంపాలని నిర్ణ యించుకొని
ఎంతో ఎత్తు నుండి ఎగిరెగిరి యమునలో దూకాడు కృష్ణు డు. కృష్ణు డు యమునలో దూకగానే
కాళీయుడు -పడగలతో చుట్టేసుకున్నాడు.

● కృష్ణు డు శరీరాన్ని పెంచి పడగలపై ఎక్ని పడగలు పగిలేలా తాండవమాడాడు. కాళీయుని ప్రా ణాలు
పో యే స్థితిలో ఆయన భార్యలు ప్రా ణభిక్ష కోసం ప్రా ధేయపడ్డా రు.

● గరుత్మంతుని వల్ల భయం లేకుండా అభయమిచ్చి, కాళీయుడిని రమణ ద్వీపానికి వెళ్లమని


ఆదేశించాడు కృష్ణు డు, కాళీయుడు నాగమాత కద్రు వ సంతానం. గరుత్మంతునికి భయపడి యమునా
నది మడుగులో దాక్కున్నాడు. సౌభరి ముని శాపం వల్ల గరుత్మంతుడు ఆ మడుగులోకి
ప్రవేశించలేదు.

ప్రలంబాసురుడు

● ప్రలంబాసురుడు కృష్ణ బలరాములను చంపే ఉద్దేశంతో గోపబాలుని వేషంలో గోపాలకులతో


కలిసిపో యాడు. ఇది గమనించిన బలరాముడు పిడి గుద్దు లతో వాడిని సంహరించాడు.

● కృష్ణు డే తమకు పతి కావాలనే కోరికతో యాదవ కన్యలు మార్గ శిర మాసంలో కాత్యాయనీ దేవి
వ్రతాన్ని ఆచరించారు. అందులో భాగంగా ఉదయమే యమునా నదిలో నెల రోజుల పాటు స్నానాలు
చేయాలి. ఒకనాడు వస్త్రా లన్నీ ఒడ్డు న విప్పి స్నానం చేస్తు ంటే అందరి చీరలూ ఎత్తు కెళ్లా డు కృష్ణు డు.

● వాళ్ల ప్రా ర్ధ నలను ప్రియవాక్యాలనూ విని వస్త్రా లను తిరిగి ఇచ్చేసాడు. వస్త్రా పహరణమంటే కేవలం
చీరలు ఎత్తు కెళ్లడమే కాదు ఆ సాకుతో వారిపై వారికి ఉన్న దేహ భ్రా ంతులనూ మోహభ్రా ంతులనూ
పటాపంచలు చేయడమే.

● గోకులంలో ఇంద్రో త్సవం చేయడం ఆనవాయితీ. దీనిలో భాగంగా ఇంద్రు డిని ఆరాధిస్తా రు. కృష్ణు డు
ఇంద్రు నికి బదులుగా తమ పశుగణానికి పచ్చని మేతనిచ్చే గోవర్ధ న గిరిని పుజిద్ధా మనడు
గోపకులందరు ఇంద్రో త్సవానికి బదులుగా గోవర్ధ నోత్సవాన్ని ప్రా రంభించారు, ఇది చూసి ఆగ్రహించాడు
ఇంద్రు డు.

● ఇంద్రు డు తగిన శాస్తి చేయాలనుకున్నాడు. సంవర్త క మేఘాలనాదేశించి ఎడతెరిపి లేని కుంభవృష్టిని


రోజుల తరబడి కురిపించాడు. ఇంద్రు ని మనోగతం అర్థ మయింది కృష్ణు నికి గోపాలకులను, గోవులనూ
రమ్మన్నాడు. చిటికెన వేలుతో గోవర్ధ నగిరిని పైకెత్తి గోకులానికంతా గొడుగు పట్టా డు. వర్షా లు కురిసీ
కురిసీ కురవలేక ఆగిపో యాయి. ఇంద్రు ని గర్వమూ అణిగిపో యింది.

సంరక్షకుడు
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

● నందుడిని ఒకసారి వరుణ సేవకుడైన రాక్షసుడు వచ్చి ఎత్తు కెళతాడు. మరోసారి కొండచిలువ
పెనవేసుకుంటుంది. అది పూర్వజన్మలో శాపగ్రస్తు డైన సుదర్శనుడు అనే విద్యాధరుడు. ఈ రెండు
సందర్భాలలోనూ కృష్ణు డు నందుడిని రక్షించాడు.

● శంఖచూడుడు కుబేరుని సేవకుడు. గోపికలను అపహరించుకుపో తే శ్రీకృష్ణు డు వధిస్తా డు. వాని


తలలోని శిరోరత్నాన్ని తీసి బలరామునికిస్తా డు.

● అరిష్టా సురుడు ఆంబో తు రూపంలో రేపల్లెలో ప్రవేశిస్తా డు. కృష్ణు డు దాని కొమ్ములు విరిచి
సంహరిస్తా డు.

● కేశి కంసుని బంటు. గుర్రం ఆకారంతో ఉన్నా సింహంలాంటి పరాక్రమంతో రేపల్లెలోకి దూసుకుని
వచ్చాడు. శ్రీకృష్ణు నిపై విరుచుకు పడ్డా డు. కృష్ణు డు దాని నోట్లో చేయి పెట్టి చంపేసాడు.

● వ్యోమాసురుడు గోపాలకుల వేషంలో గోపాలకులలో చేరి ఒక్కొక్కరినీ అపహరించి గుహలో దాచాడు.


కృష్ణు ని చేతిలో చనిపో యాడు.

అక్రూ రుని ఆహ్వానం

● నారదుడు బలరామకృష్ణు లు రేపల్లెలో పెరిగి పెద్దవుతున్న విషయాన్ని చెప్పగానే మండిపడ్డా డు


కంసుడు. వెంటనే వారిని చంపించే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆక్రూ రుని పిలిచి, స్వయంగా వెళ్లి
బలరామకృష్ణు లను ఆహ్వానించి తీసుకురమ్మని పంపించాడు. ఆ ఆహ్వానాన్ని మన్నించి ఆక్రూ రుని
వెంట మధురకు బయలుదేరారు. తోవలో సర్వం కృష్ణ మయంగానే కనిపించింది ఆక్రూ రునికి.

కుబ్జ

● మధురా నగరంలో ప్రవేశించిన బలరామకృష్ణు లకు శరీరమంతా వంకరలు తిరిగిన (గూనిపో యిన) స్త్రీ
కనిపించింది. ఆమె కంసునికి సుగంధాన్ని తీసుకు వెళుతుంది. ఆ గంధాన్ని బలరామకృష్ణు లకే
ఇవ్వడంతో ఆమె గూనిపో యేలా అనుగ్రహిస్తా డు కృష్ణు డు.

ధనుర్భంగం
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● కంసుని 'యాగశాలలో ఒక ధనుస్సునుంచారు. ఎందరో దానికి కాపలా కాస్తు న్నారు. వారందరినీ
తప్పుకొని, అందరూ వారిస్తు న్నా వినకుండా ధనుస్సు దగ్గ రికి వెళ్లి దానిని విరిచేసాడు శ్రీకృష్ణు డు. ఆ
విరిగిన శబ్దా నికి కంసుడికి గుండె ఆగినంత పనయింది.

కువలయ పీడం

● కంసుడు బలరామకృష్ణు లను మట్టు బెట్టడానికి ఎన్నో ఉపాయాలు పన్నాడు. అందులో కువలయ
పీఠం భయంకరమైన మదపుటేనుగుతో తొక్కించడం ఒకటి. కృష్ణు డు ఆ ఏనుగును సంహరించి, దాని
దంతాలను పెకిలించి చేతితో పట్టు కొని మల్ల యుద్ధా నికి సిద్ధపడ్డా డు.

మల్ల యుద్ధ ం
● చాన్నూర ముష్టికులు మల్ల యుద్ధ ంలో తిరుగులేనివారు. వారు మల్ల యుద్ధా నికి ఆహ్వానించారు.
బలరామకృష్ణు లు సరేనన్నారు. ఎంతో గొప్పగా యుద్ధ ం చేసినప్పటికీ చానూరుడు కృష్ణు ని చేతిలో,
ముష్టికుడు బలరాముని చేతిలో అంతమొందారు. ఈ ఇద్ద రు మల్ల యోధులు నేల కూలగానే ఇతర
మల్లు లు పారిపో యారు.

కంసవధ

● మల్లు లు చనిపో గానే బలరామకృష్ణు లను చంపమని సేనానులను ఆదేశించాడు. కంసుడు. ఇలా
అంటుండగానే కృష్ణు డు ఒక్క ఊపుతో పైకెగిరి కంసుని కిరీటాన్ని నేలపాలుచేస,ి ఒకే వేటుతో కంసుని
వధించాడు. తమ అసలు తల్లిదండ్రు లైన దేవకీ వసుదేవులను కౌగిలించుకొని వారిని
ఆనందపరవశులను చేసాడు కృష్ణు డు.

విద్యాభ్యాసం - గురుదక్షిణ

● ఎన్నో ఘనకార్యాలు చేసిన బలరామకృష్ణు లు అప్పటివరకూ గురువు దగ్గ ర విద్యాభ్యాసం చేయలేదు.


అది లోటుగానే అనిపించింది వారిక.ి వసుదేవుడు గద్దా చార్యుని పిలిచి ఉపనయనాది కర్మలు
చేయించాడు.

● సాందీపుని దగ్గ ర గురుకులంలో చేర్చాడు. విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకున్న బలరామకృష్ణు లు


గురుదక్షిణ కోరమని అభ్యర్థించారు.

● ప్రభాస తీర్థ ంలో మునిగిపో యిన తన కుమారుడిని తెచ్చివ్వమని కోరాడు సందీపుడు. పాంచజన్యుడు
అనే రాక్షసుడు మింగేయడం వల్ల గురుపుత్రు డు చనిపో యి యమపురి చేరతాడు. యముని దగ్గ రి
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
నుండి గురుపుత్రు ని తీసుకునివచ్చి గురుదక్షిణ చెల్లి ంచుకుంటారు బలరామ కృష్ణు లు. ఇలా
కృష్ణా వతారం తొలి దశ పూర్త యింది.

ఏకాదశ స్కంధము

ద్వారక

● కంసునికి ఇద్ద రు భార్యలు. వారిద్దరూ జరాసంధుని కుమార్తెలు. కంసుడిని కృష్ణు డు సంహరించడంతో


కృష్ణు నిపై పగ పెంచుకున్నాడు జరాసంధుడు. జరాసంధుడు మగధ దేశ రాజు. 23 అక్షౌహిణుల
సైన్యంతో మధుర పై దండెత్తా డు.

● కురుక్షేత్ర యుద్ధ ంలో మొత్త ంగా పాల్గొ న్నది 18 అక్షౌహిణులే అంటే జరాసంధుని బలగం ఎంత పెద్దదో
తెలుసుకోవచ్చు. భూ భారాన్నంతా తగ్గించాలనేది కృష్ణు ని ఉద్దేశం. అందువల్ల వచ్చిన 23
అక్షౌహిణుల సైన్యాన్నీ నశింపచేసి జరాసంధుడిని వదిలి వేయాలనుకున్నాడు.

● యుద్ధ ం భయంకరంగా జరిగింది. జరాసంధుని సైన్యం మొత్త ం తుడిచిపెట్టు కుని పో యింది. మళ్లీ మళ్లీ
సైన్యాన్ని పో గుచేసుకుని పదిహేడుసార్లు దండయాత్ర చేసాడు జరాసంధుడు. జరాసంధుడు
పద్దెనిమిదవసారి దండయాత్ర చేసేందుకు వచ్చినప్పుడు అదే సమయంలో మరో వీరుడు
కాలయవనుడు కూడా మధురపై దండయాత్రకు వచ్చాడు. ఇద్ద రినీ ఒకేసారి ఎదుర్కోవడం
తలకుమించిన పనిగా భావించాడు. కృష్ణు డు.

● దీంతో వారి దండయాత్రలకు అందనంత దూరంలో పడమటి సముద్రా నికి ఆనుకొని ద్వారకా నగరాన్ని
నిర్మించి అక్కడికి యాదవులను చేర్చాడు. దానిని దేవశిల్చి విశ్వకర్మ నిర్మించగా ఇంద్రు డు 'సుధర్మ'
సభా భవనాన్ని, పారిజాత వృక్షాన్ని కానుకగా ఇచ్చాడు.

కాలయవనుడు

● జరాసంధునితో బాటుగా కాలయవనుడు కూడా దండెత్తడంతో కొత్త ఆలోచనలు చేసాడు కృష్ణు డు.
పారిపో తున్నట్లు గా నటించి, వేగంగా ముచికుందుడు నిద్రిస్తు న్న గుహ వైపుకు వెళ్ళాడు.

● ముచికుందుడు, మాంధాత కుమారుడు. ఇక్ష్వాకు వంశ రాజు, దేవతలకు యుద్ధ ంలో సేనానిగా
సహాయపడేవాడు. నిరంతరం అలా సహాయపడ్డ ముచికుందునికి కుమారస్వామి దైవగణ
నాయకత్వం వహించడంతో యుద్ధ బాధ్యతల నుండి కొద్దిగా ఉపశమనం లభించింది. ఇక గాఢమైన
నిద్రపో వాలనుకున్నాడు. అతి గాఢమైన నిద్రను వరంగా ప్రసాదించారు దేవతలు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● కాలయవనుడు తరుముతూ రాగా, ఆదమరచి నిద్రిస్తు న్న ముచికుందుని గుహలోకి వెళ్లి
కనిపించకుండా పో యాడు కృష్ణు డు. గుహవరకూ తరుముతూ వచ్చిన కాలయవనుడు
ముచికుందుడినే కృష్ణు డిగా పొ రబడి తట్టి లేపాడు.

● నిద్రా భంగమైన ముచికుందుడు కోపంతో ఒక్క చూపు చూసాడు. ముచికుందుని నేత్రా గ్నిలో
భస్మమయ్యాడు కాలయవనుడు. మెల్లగా ద్వారక చేరుకున్నాడు కృష్ణు డు.

రుక్మిణీ కళ్యాణం

● భీష్మకుడు విదర్భ రాజు. అతని కూతురు రుక్మిణి, కుమారుడు రుక్మి, రుక్మికి తన సో దరిని చేది
రాజైన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని కోరిక.

● రుక్మిణికి శ్రీకృష్ణు డే తన భర్త కావాలనే ఆకాంక్ష. తన ఆకాంక్షను నెరవేర్చుకోవడం కోసం తన


మనసులోని మాటను కృష్ణు నికి తెలపడానికి ఒక బ్రా హ్మణుడిని కృష్ణు ని వద్ద కు రాయబారిగా
పంపిస్తు ంది.

● రుక్మిణి మనసులో మాట తెలియగానే సారథి దారుకుడిని రథం సిద్ధం చేయమని ద్వారకకు
బయలుదేరతాడు కృష్ణు డు.

● గౌరీదేవి పూజకు బయలుదేరిన రుక్మిణిని రథంపై ఎత్తు కొని పో తాడు. అడ్డు వచ్చిన 'రుక్మి'ని
చంపకుండా వదిలేస,ి శిరోముండనం చేసి పంపుతాడు. ఈ కారణం వల్ల ముందే విష్ణు ద్వేషిగా
జన్మించిన శిశుపాలునికి కృష్ణు నిపై పగ మరింత పెరుగుతుంది.

ప్రద్యుమ్నుడు

● ప్రద్యుమ్నుడు రుక్మిణీ కృష్ణు ల సంతానం. పూర్వజన్మలో శివుని నేత్రా గ్నికి బూడిదైపో యిన
మన్మథుడు మరుజన్మలో ప్రద్యుమ్నునిగా జన్మించాడు.

● శ్రీకృష్ణు ని శత్రు వైన శంబరాసురుడు ఒక రోజు ప్రద్యుమ్నుడిని అపహరించి, సముద్రంలో పారేసాడు. ఆ


బాలుడిని ఒక చేప మింగేసింది. ఆ చేప శంబరాసురుని జాలరులకు దొ రకగా, దానిని వండేందుకు
వంటశాలకు తీసుకెళ్లా రు.

● ఆ చేపను కోయగానే ఒక శిశువు బయటకు వచ్చాడు. అతడే ప్రద్యుమ్నుడు. అతనిని తన ఇంటికి


తీసుకెళ్లి ంది వంటమనిషి మాయావతి. మాయావతి పూర్వజన్మలో మన్మథుని భార్య రతీదేవి. ఆమె
ప్రద్యుమ్నునికి మాయా విద్యలు నేరి శంబరాసురుని ప్రద్యుమ్నుడు వధించేలా చేస్తు ంది. ఇద్ద రూ
ద్వారకకు చేరతారు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
శమంతక మణి

● సత్యభామ తండ్రి సత్రా జిత్తు సూర్యోపాసకుడు. అతని భక్తికి మెచ్చి సర్యుడు శమంతక మణిని
ప్రసాదించాడు. దానిని ఇవ్వమని స్వయంగా శ్రీకృష్ణు డే అడిగినా సత్రా జిత్తు నిరాకరించాడు. ఒక రోజు
ఈ మణిని అతని తమ్ముడు ప్రసేనజిత్తు తీసుకుని వేటకెళ్లా డు.

● అక్కడ ఒక సింహం అతనిని చంపేసి మణిని లాక్కొనిపో యింది. ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని
స్వీకరించారు. జాంబవంతుడు. ప్రసేనజిత్తు ఎంతకూ రాకపో యేసరికి మణి కోసం కృష్ణు డే చంపి
ఉంటారని ప్రచారం చేసాడు సత్రా జిత్తు .

● ఈ అపనిందను పో గొట్టు కోవడానికి 'కృష్ణు డు మణి కోసం నలుమూలలా వెతికాడు. చివరకు ఒక


గుహలో మణి కనిపించింది. తీసుకుందామనుకునేసరికి మహావీరుడైన జాంబవంతుడు అడ్డ గించాడు.
పద్దెనిమిది రోజులు ద్వంద్వ యుద్ధ ం చేసిన తర్వాత జాంబవంతుని బలం సన్నగిల్లి ంది. వచ్చినవాడు
శ్రీరామచంద్రు ని మరో అవతారమేనని గుర్తించాడు జాంబవంతుడు.

● మణిని, దాంతోబాటు తన కూతురు జాంబవతిని ఇచ్చి పరిణయం చేసాడు. విషయం తెలుసుకున్న


సత్రా జిత్తు కృష్ణు నిపై అపనిందలు వేసినందుకు పశ్చాత్తా పపడ్డా డు. తన కూతురు సత్యభామను
కృష్ణు నికిచ్చి పెళ్లి చేసాడు. సత్రా జిత్తు కి శమంతక మణిని అందజేసాడు కృష్ణు డు.

● బలరామకృష్ణు లు హస్తినలో లేని సమయం చూసి శతధన్వుడనే రాజు సత్రజిత్తు ను సంహరించి


శమంతకమణిని స్వాధీనం చేసుకున్నాడు.

● ఈ సంగతి తెలిసి కృష్ణు డు శతధన్వుని పైకి దండెత్తి వెళ్లా డు. తనపై కృష్ణు డు దాడికి వస్తు న్నది
తెలుసుకొని మణిని అక్రూ రునికి ఇచ్చి పారిపో యాడు శతధన్వుడు. పారిపో తున్న శతధన్వుడిని
సంహరించాడు శ్రీకృష్ణు డు. తన దగ్గ ర శతధన్వుడు మణిని దాచాడనే విషయం. అక్రూ రుడు
నిండుసభలో తెలియజెప్పడంతో కృష్ణు ని పైన పడ్డ అపవాదు తొలగిపో తుంది.

శ్రీకృష్ణు ని ఇతర భార్యలు

● శ్రీకృష్ణు నికి రుక్మిణి, సత్యభామ, జాంబవతి మాత్రమే కాకుండా ఇంకా అయిదుగురు (మొత్త ం ఎనిమిది
మంది) భార్యలున్నారు.

● కాళింది: సూర్య పుత్రిక. కృష్ణు ని వలచి వివాహం చేసుకుంది.

● మిత్రవింద: అవంతీ దేశ రాకుమారి. ఈమె సో దరులు విందుడు, అనువిందుడు. వారికి ఇష్ట ం
లేకున్నా. మిత్రవిందకు ఇష్ట మైనందున ఎత్తు కెళ్లి వివాహం చేసుకున్నాడు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

● నాగ్నజితి: కోసల దేశపు రాజు నగ్నజిత్తు . ఆమె కుమార్తె నాగ్నజితి. ఆమె దగ్గ ర ఉన్న ఏడు గిత్తలను
లొంగదీసుకొని నాగ్నజితిని పొ ందాడు.

● భద్ర: శ్రు తకీర్తి శ్రీకృష్ణు ని మేనత్త . కేకయ దేశపు రాజమహిషి ఆమె కూతురు భద్ర. వారే ఆమెను
శ్రీకృష్ణు నికి ఇచ్చి వివాహం చేసారు.

● లక్షణ: మద్ర దేశపు రజకుమార్తె, ఎత్తు కొచ్చి వివాహం చేసుకున్నాడు.

నరకాసుర సంహారం

● త్రేతాయుగంలో వరాహస్వామి నీటి నుండి భూమిని ఉద్ద రిస్తు న్నప్పుడు భూదేవికీ వరాహస్వామికీ
జన్మించిన సంతానమే నరకుడు. వారి సంగమం జరిగింది సంధ్యాకాలంలో అయినందు వల్ల దేవతల
గర్భంలో కూడా రాక్షసుడే జన్మించాడు.

● తన కొడుకు కన్నతండ్రి చేతిలోనే చనిపో తాడేమోనని భయపడి వరం కోరుకుంది భూదేవి. 'తన తల్లి
చేతిలో తప్పితే ఇతరుల చేతిలో 'చావడని' వరమిచ్చాడు వరాహ స్వామి.

● నరకుడు మొదట్లో మహాధార్మికుడు. ప్రా గ్జో తిష పురం రాజధానిగా కామరూప సామ్రా జ్యాన్ని
పరిపాలించాడు. కామాఖ్య అమ్మవారి మహా భక్తు డు. ఆ అమ్మవారికి ఆలయాన్ని నిర్మించాడు.
స్త్రీలను అమితంగా గౌరవించేవాడు.

● అయితే, శోణపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తు న్న బాణాసురుని సాంగత్యం వల్ల స్త్రీలను భోగ
వస్తు వుగా చూడడం అలవాటయింది. అందువల్లే 16000 మంది రాచకన్యలను బంధించాడు.

● చివరకు కామాఖ్య అమ్మవారి గుడి తలుపులు కూడా మూసేయించాడు. మూడు లోకాలనూ


వరగర్వంతో అల్ల కల్లో లం చేయడంతో నరకుడిని సంహరించాల్సి వచ్చింది. సుప్రతీకం అనే ఐరావతం
లాంటి ఏనుగు, స్వయంగా శ్రీహరే ప్రసాదించిన వైష్ణవాస్త ం్ర అతనికి అదనపు బలాలయ్యాయి.

● ముందుగా నరకాసురుని స్నేహితులైన మురాసురుడినీ, అతని సంతానాన్ని చంపిన తర్వాత


నరకునితో తలపడ్డా డు కృష్ణు డు. ఈ యుద్ధ ంలో భూదేవి అంశ అయిన సత్యభామ కృష్ణు నితో
యుద్ధ ంలో పాల్గొ ని నరకుడిని సంహరించింది.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● బంధించిన 16000 మంది రాచకన్యలను కృష్ణు డు విడిపించాడు. వారు కృష్ణు డినే వివాహం
చేసుకున్నారు. శ్రీకృష్ణు డు 16000 మంది గోపికలను వివాహం చేసుకున్నాడంటారు. సరికాదు
వారందరూ ఈ నరకాసురుని చేతిలో బందీలయిన రాచకన్యలే.

రుక్మి వధ

● రుక్కి దుష్టు డే అయినా చెల్లెలు రుక్మిణిపై విపరీతమైన ప్రేమ. అందువల్లే తనను అడ్డ గించినా, రుక్మిని
చంపలేదు శ్రీకృష్ణు డు. చివరకు తన మనవరాలైన రుక్మలోచనను శ్రీకృష్ణు డు రుక్మిణిల మనవడైన
అనిరుద్ధు నికి ఇచ్చి పెళ్లి చేసాడు. ఐతే జూదంలో చేసిన మోసం వల్ల బలరాముడు కోపించి రుక్మిని
సంహరించాడు.

ఉషా పరిణయం

● మహా దావవ్రతుడూ తిరుగులేని వీరుడూ అయిన బలి చక్రవర్తి కుమారుడే బాణాసురుడు. మహా
పరాక్రమశాలి శివునికి పరమ భక్తు డు. తన భక్తితో తన రాజధాని శోణపురానికి శివుడిని కాపలాగా
రప్పించుకుంటారు (నేటి అస్సాంలోని గౌహతి ప్రా ంతంలోని తేజ్ పూర్ నాటి శోణపురం) ఈ వేయి
చేతులు -మహాపరాక్రమశాలి ముందు మూడు లోకాలూ వణికిపో యేవి.

● ఈయన ముద్దు ల కూతురు ఉష ఈమె తన కలలో కనిపించిన నవమన్మధునిపై మనసు


పారేసుకుంటుంది. ఈమె చెలికత్తె ఆ నవమన్మథుడిని కృష్ణు ని మనమడైన అనిరుద్ధు నిగా గుర్తించి
తన మాయతో అతనిని ఉష అంతఃపురానికి చేరుస్తు ంది.

● ఉష అనిరుద్ధు లు ప్రణయ సామ్రా జ్యాన్ని ఏలుతుండగా ఉష గర్భం దాలుస్తు ంది. ఈ విషయం తెలిసిన
బాణుడు కారణాన్ని తెలుసుకుంటాడు. అనిరుద్ధు ని పైకి సైన్యాన్ని పంపుతాడు. అనిరుద్ధు డు ఆ
సైన్యాన్ని తరిమికొడతాడు.

● చివరకు విషయం తెలిసిన కృష్ణు డు బాణునిపైకి యుద్ధా నికి వెళతాడు. యుద్ధ ంలో బాణునికి రక్షగా
శివుడు రావడంతో ఆ యుద్ధ ం శివకేశవులు యుద్ధ ంగా పరిణమిస్తు ంది. చివరకు కృష్ణు డు
బాణాసురునికి ఉన్న వేయి చేతుల్లో నాలుగింటిని మాత్రమే మిగిల్చి, మిగతా వాటిని సుదర్శన
చక్రంతో ఖండిస్తా డు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● ప్రహ్లా దుడు, బలి జన్మించిన వంశంలోని వారెవరినీ సంహరించనని గతంలో కృష్ణు డే స్వయంగా మాట
ఇచ్చినందువల్ల బాణుడిని ప్రా ణాలతో వదిలేస్తా డు. బాణుడు కృష్ణు నికి నమస్కరించి ఉష అనిరుద్ధు ల
వివాహం చేస్తా డు.

పౌండ్రక వసుదేవుడు

● పౌండ్రకుడు కరూష దేశం రాజు. తానే అసలైన వాసుదేవుడనంటూ అచ్చం వాసుదేవుడైన


కృష్ణు డిలాంటి వేషధారణతో ఉండేవాడు. తనే అసలైన వాసుదేవుడననీ తనను శరణు వేడమనీ
కృష్ణు నికి చెప్పేవాడు.

● కృష్ణు డు పౌండ్రక వాసుదేవుడిని, అతనికి తోడుగా నిలచిన కాశీ రాజునూ ఇరువురినీ చక్రా యుధంతో
సంహరించాడు.

● ద్వివిదుడు నరకాసురుని స్నేహితుడు. ద్వారకలో ఎన్నో ఉపద్రవాలను కలిగించాడు. బలరాముడు


రైవతక పర్వతంపై స్త్రీ జనాలతో వినోదిస్తు ండగా హేళన చేస,ి బలరాముని చేతిలో చనిపో యాడు.

● సాంబుడు జాంబవతీ శ్రీకృష్ణు ల సంతానం. దుర్యోధనుని కుమార్తె లక్ష్మణను స్వయంవరంలో


ఎత్తు కొచ్చాడు. కౌరవ వీరులు కోపించి సాంబుని బంధించి హస్తినకు తీసుకెళతారు. బలరాముడు
హస్తినకు వెళ్లి కౌరవులకు నచ్చజెప్పాడు. కౌరవులు వినలేదు. బలరాముడు కోపంతో ఊగిపో యి, తన
నాగలితో హస్తినాపురం మొత్తా న్ని పెకిలించుకు వెళ్లే ందుకు సిద్ధపడగా కౌరవులు భయపడి సాంబుని
లక్షణకూ వివాహం జరిపారు.

శిశుపాల వధ

● శిశుపాలుడు శ్రీకృష్ణు ని మేనత్త కుమారుడు. శ్రీకృష్ణు ని చేతిలోనే చావు రాసిపెట్టి ఉన్నా వంద తప్పుల
వరకూ క్షమించి వదిలేస్తా నని మేనత్త కు మాట ఇచ్చాడు కృష్ణు డు. ధర్మరాజు చేసిన రాజసూయ
యాగంలో కృష్ణు డికి అగ్రపూజ చేసాడు ధర్మరాజు. ఇది గమనించిన శిశుపాలుడు, కృష్ణు డిని పరిపరి
విధాలుగా నిందించడంతో శిశుపాలుని నూరు తప్పులు పూర్తి అవుతాయి. సుదర్శన చక్రంతో
శిశుపాలుని శిరసు ఖండిస్తా డు. కృష్ణు డు. పూర్వజన్మలో విష్ణు ద్వారపాలకుడైన జయుడే
శిశుపాలునిగా జన్మించినందున శిశుపాలుని శిరసు నుండి దివ్యజ్యోతి వెలువడి కృష్ణు నిలో కలిసింది.

జరాసంధ వధ

● జరాసంధుడు మగధ దేశపు రాజు. మహా బలశాలి, ధర్మరాజు రాజసూయ యాగం సందర్భంగా
జరాసంధుని అడ్డు తొలగించుకోవలసి వస్తు ంది. భీముడు, అర్జు నులను తోడుగా తీసుకొని బ్రా హ్మణ
వేషంతో వెళ్లి యుద్ధా నికి జరాసంధుడిని యుద్ధా నికి ఆహ్వానిస్తా డు. తనతోనైనా అర్జు నునితోనైనా
భీమునితో నైనా ఈ ముగ్గు రిలో ఎవరితో ఒకరితోనైనా యుద్ధ ం చేయమని కవ్విస్తా డు. జరాసంధుడు
మహా బలవంతుడు. అందువల్ల తనకు సరిసాటి అయిన భీముడితోనే యుద్ధ ం చేస్తా నంటాడు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
దాదాపు పదిహేను రోజులపాటు. మహా భీకరంగా యుద్ధ ం జరుగుతుంది. ఆ యుద్ధ ంలో భీముడు
జరాసంధుడిని రెండుగా చీల్చి సంహరిస్తా డు. జరాసంధుని కుమారుడైన సహదేవుడిని రాజుగా
అభిషేకిస్తా డు కృష్ణు డు.

సాల్వుడు - దంతవక్రు డు - విదూరుడు

● సాల్వుడు శిశుపాలుని స్నేహితుడు. శిశుపాలుని మరణానికి కృష్ణు నిపై పగబట్టా డు. శివుడిని
ఆరాధించి మయుని ద్వారా ఒక అద్భుతమైన విమానాన్ని పొ ందాడు.

● ఆ విమానంలో ద్వారకపై సంచరిస్తూ రాళ్లూ పిడుగుల అస్త ్ర వర్షం కురిపించాడు. ఈ యుద్ధ ంలో
ప్రద్యుమ్నుడు కూడా స్పృహ తప్పడంతో స్వయంగా కృష్ణు డే చక్రా న్ని ప్రయోగించి సాల్వుడిని
వధించాడు.

● వరుసగా పౌండ్రకుడు, శిశుపాలుడు, సాల్వుడూ కృష్ణు ని చేతుల్లో మరణించడంతో వారి మిత్రు డైన
దంతవక్రు డు కృష్ణు ని మీదకు యుద్ధా నికి వచ్చాడు. కృష్ణు డు కౌమోదకీ గదతో అతనిని మోది
చంపాడు. దంతవక్రు డి తమ్ముడు విదురుడు తనపైకి రాగా సుదర్శన చక్రంతో సంహరించాడు.

కుచేలుని కథ

● కుచేలుడు అంటే చిరిగిన దుస్తు లు ధరించినవాడు అని అర్థ ం. కుచేలుడు శ్రీకృష్ణు ని బాల్య
స్నేహితుడు. నిత్య దరిద్రు డు. భార్య సూచన ప్రకారం సంపదల కోసం శ్రీకృష్ణు ని వద్ద కు వెళతాడు.

● తనను గుర్తిస్తా డో లేదో అని అనుమానించిన కుచేలుని అనుమానాన్ని పటాపంచలు చేస్తూ


కనిపించగానే కుచేలుని గాఢాలింగనం చేసుకొని, రాజోపచారాలు చేస,ి కబుర్లు చెపుతాడు.

● కుచేలుడు తన పంచెలో మూటగట్టు కొని వచ్చిన పిడికెడు అటుకులను సంతోషంగా అడిగి మరీ
స్వీకరిస్తా డు. కృష్ణు ని చూసిన ఆనందంలో ఏ కోరికా కోరకుండానే తిరిగి వెళతాడు కుచేలుడు.

● ఆనందంతో ఇంటికి వెళ్ళిన కుచేలునికి తన ఇల్లు అష్టైశ్వర్యాలతో, తులతూగడం ఆశ్చర్యాన్ని


కలిగిస్తు ంది. అడగకున్నా. బాల్యమిత్రు నికి సకల ఐశ్వర్యాలు కలిగేలా అనుగ్రహించాడు కృష్ణు డు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

దేవకి కోరిక

● దేవకి కృష్ణు డి మహత్తు లనన్నిటినీ గమనించింది. సందీపుని కుమారుడిని బతికించిన వృత్తా ంతాన్ని
తెలుసుకున్నది. తన గర్భంలో పుట్టి చనిపో యిన శిశువులను కూడా బతికించమని కోరింది.
సరేనన్నాడు. కృష్ణు డు. అలా దేవకి గర్భాన జన్మించి మరణించిన వారందరూ శాప వశం వల్ల దేవకి
గర్భంలో పుటిన మరీచి మహర్షి సంతానం. వారిని దేవకికి చూపించి శాపవిమోచన కలిగిస్తా రు
బలరామ కృష్ణు లు.

సుభద్రా కల్యాణం

● సుభద్ర బలరామకృష్ణు ల ముద్దు ల చెల్లెలు. అర్జు నుడిని ప్రేమిస్తు ంది. తీర్థ యాత్రల సందర్భంగా రైవతక
పర్వతానికి వచ్చిన అర్జు నుడు కృష్ణు ని ఆమోదంతో సుభద్రను ఎత్తు కెళ్లి వివాహం చేసుకుంటాడు.
ముందుగా బలరాముడు వ్యతిరేకించినా తుదకు అంగీకరిస్తా డు.

ముసలం పుట్టింది.

● శ్రీకృష్ణా వతార పరమోద్దేశం దుష్ట శిక్షణ, సాధురక్షణ. తనే స్వయంగా ఎంతోమంది అసురులను అసుర
స్వభావులను సంహరించిన కృష్ణు డు మహాభారత యుద్ధ ం ద్వారా భూభారాన్ని చాలావరకు
తగ్గించాడు. ఇక తగ్గా ల్సింది యాదవ కులమే.

● ఒకసారి శ్రీకృష్ణు ని సూచనతో విశ్వామిత్రు డు, అసితుడు, కణ్వుడు, దుర్వాసుడు, భృగువు,


అంగిరసుడు మొదలైన మహర్షు లు పిండారిక క్షేత్రా నికి వచ్చారు. అక్కడ వారిని
ఆటపట్టించాలనుకున్నారు యాదవులు.

● సాంబుడిని తీసుకొచ్చారు. ఆడ వేషం వేసారు. మహర్షు లకు ఆయనను చూపించి - ఈమెకు ఆడపిల్ల
పుడుతుందో మగపిల్లవాడు పుడతాడో చెప్పమన్నారు. మహర్షు ల కోపం మిన్నంటింది. 'ఈ గర్భంలో
మగా ఆడా కాదు- ముసలం (రోకలి) పుడుతుంది. ఆ రోకలి మీ వంశాన్ని సర్వనాశనం చేస్తు ంది'
అంటూ శపించారు.

● కొద్దిసేపటి తర్వాత సాంబుని బట్ట లు విప్పిచూడగా అక్కడ ఒక రోకలి ఉంది. భయభ్రా ంతులయినారు
యాదవులు. ఆ ముసలపు చెక్కను పిండిపిండిగా చేసి సముద్రంలో కలిపారు. ముసలపు ఇనుప
ముక్కను సముద్రంలో పారేసారు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012
● పారేసిన ఆ ఇనుప ముక్కను ఒక చేప మింగింది. ఆ చేప ఒక జాలరికి దొ రికింది. చేప కడుపులోని
ఇనుప ముక్కతో బాణపు ములికిని తయారుచేసుకున్నాడు జాలరి. సముద్రంలో పారేసిన రోకలి
పొ ట్టు ఒడ్డు కు కొట్టు కువచ్చింది. ఒక్కో రవ్వా తుంగ గట్టిగా మొలిచింది. శ్రీకృష్ణు నికి అంతా తెలుసు.
ఐనా నిర్లిప్తంగానే ఉన్నాడు.

లోకజ్ఞా నం

● తన అవతార సమాప్తి జరగాలని నిర్ణ యించుకున్నాడు శ్రీకృష్ణు డు. ఉద్ధ వుడిని పిలిచాడు. లోక
సంచారం చేసి జ్ఞా నాన్ని పెంచుకోమన్నాడు. కంటికి కనిపించే ఏ అంశం నుండైనా మంచిని
గ్రహించవచ్చని తెలిపాడు. అందుకు నిదర్శనంగా సృష్టిలోని అల్ప విషయాల నుండి మొదలుకొని
అసాధారణమైన వాటి వరకూ ఉన్న 24 అంశాల నుండి జ్ఞా నాన్ని సంపాదించిన అవధూత
ఇతివృత్తా న్ని చెప్పాడు.

● శ్రీకృష్ణు ని సందేశం తర్వాత ఉద్ధ వుడు బదరికాశ్రమానికి చేరుకున్నాడు.

● ముసలం పుట్ట డం యాదవులను భయభ్రా ంతులకు గురి చేసింది. అందరూ ద్వారకను విడిచి సరస్వతీ
నదీ తీరంలోని ప్రభాసక్షేత్రా నికి చేరుకున్నారు. తాగినంత తాగారు. తిన్నంత తిన్నారు. మద్యం మత్తు
పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. అది చిలికి చిలికి గాలి వానయ్యింది. దొ రికిన ఆయుధాలతో
దొ రికినట్లు వావి వరసలు లేకుండా చిన్నా పెద్దా తెలియకుండా దొ రికిన ఆయుధాలు దొ రికినట్టు గా
యదు వీరులు కొట్టు కోవడం ప్రా రంభమైంది.

● అంతలో సముద్రపు ఒడ్డు న ముసలం నుండి పుట్టిన తుంగ కనిపించింది. దానిని పీకేసి ఒకరినొకరు
కొట్టు కున్నారు. ప్రతి తుంగ ముక్కా మారణా యుధమైంది. ఒక్కరూ మిగలకుండా యదు వీరులంతా
కొట్టు కొని చచ్చారు. ఈ యాదవ కులం నాశనం కాగానే బలరాముడు సముద్రం ఒడ్డు న యోగ
మార్గ ంలో దేహత్యాగం చేసాడు.

శ్రీకృష్ణ నిర్యాణం

● బలరాముని దేహత్యాగం కృష్ణు నికి తెలిసింది. తన అవతార సమాప్తి కాలం ఆసన్నమైంది. నేలపై
అవతరించిన కార్యం పూర్త యింది. నిర్లిప్తంగా ఒక చెట్టు కింద కూర్చున్నాడు కృష్ణు డు.

● అదే సమయంలో 'జరుడు' అనే కిరాతుడు కృష్ణు ని చూసాడు. కృష్ణు ని కాలు లేడి నోటిలా
అనిపించింది. గురి చూసి బాణం వేసాడు. కృష్ణు ని పాదంలో లోతుగా దిగింది బాణం. క్షమించమని
ప్రా ధేయపడ్డా డు బో యవాడు. నేను కోరుకున్నదే నువ్వు చేసావన్నాడు కృష్ణు డు, బో యను
ఆశీర్వదించాడు. ఇంతలో వెతుక్కుంటూ వచ్చాడు దారుకుడు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

● దారుకుడిని ద్వారకలోని స్త్రీ జనాన్ని తీసుకొని ఇంద్రపస ్ర ్థ ం వెళ్లి పో మని, ద్వారకా నగరం ప్రళయంలో
నీట మునిగిపో తుందని చెప్పాడు కృష్ణు డు. శ్రీకృష్ణు డు వైకుంఠం చేరుకున్నాడు. దారుకుడు ద్వారక
చేరాడు. యదు వంశ నాశనం గురించి, బలరామ కృష్ణు ల నిర్యాణం గురించి చెప్పాడు. కుప్పకూలి
పో యారు వృద్ధ జనం. మృతులకు దహన సంస్కారాలు చేసారు. చూస్తు ండగానే ద్వారక నీటిలో
మునిగిపో యింది.

ద్వాదశ స్కంధం

● శ్రీశుకుని ద్వారా కృష్ణ కథామృతాన్ని విన్న పరీక్షిత్తు పరమానందాన్ని పొ ందాడు. శుకుడు


వెళ్లి పో యిన తర్వాత గంగా తీరంలో తూర్పు దిక్కుగా దర్భలు పరుచుకొని పరమాత్మపై దృష్టి
నిలిపాడు.

● శృంగి పెట్టిన శాపం వల్ల తక్షకుడు కాటు వేయబో తున్నాడు. ఇది తెలిసిన కశ్యపుడు అనే మంత్రవేత్త
తక్షకుని బారి నుండి పరీక్షిత్తు ను రక్షించడానికి బయలుదేరాడు. ఇది తెలుసుకున్నాడు తక్షకుడు.

● మార్గ మధ్యంలోనే కశ్యపుని కలిసాడు. కశ్యపుని మంత్ర శక్తికి ఆశ్చర్యపో యి, అపారమైన
ధనరాసులనిచ్చి పరీక్షిత్తు దగ్గ రికి వెళ్లకుండా చేసాడు. స్థిరంగా కూర్చున్న పరీక్షిత్తు ను కాటేసాడు
తక్షకుడు. తక్షకుని విషాగ్ని పరీక్షిత్తు ను కాల్చేసింది.

● తండ్రి మరణానికి కారణమైన తక్షకునిపై కోపాన్ని సమస్త సర్పజాతిపై చూపాడు జనమేజయుడు.


సర్పయాగం ప్రా రంభించాడు. వేల వేల సర్పాలు యజ్ఞ ంలో ఆహుతి అయ్యాయి. నేరం చేసిన తక్షకుడు
తప్ప దాదాపు సర్పజాతి అంతరించే సమయం వచ్చింది. ప్రా ణి హింస తగదంటూ మధ్యలోనే
యాగాన్ని ఆపేయించాడు. బృహస్పతి.

● పురాణాలలో నిరుపమానమైంది భాగవత పురాణం. నారాయణుడు దీనిని బ్రహ్మ రూపంలో


నారదుడికి ఉపదేశించాడు. అటు తర్వాత వ్యాస భగవానుని రూపంలో శ్రీశుకునికి ఉపదేశించాడు.
శ్రీశుకుడు పరీక్షిత్తు కు ఉపదేశించాడు. ఇదే కథను సూతుడు నైమిషారణ్యంలోని మహర్షు లకు
ఉపదేశించాడు.
AMRUTHA IAS ACADEMY
Website : www.amruthaias.com E mail Id: amruthaiasacademy@gmail.com
Mobile No : 7032479589 Reg. No. ALO05/ HYD/339/2012

You might also like