You are on page 1of 6

21 జనవరి 2023-ధన్యకరమైన నిమ్మళము

1 రాజులు 19:11-12: అందుకాయన–నీవు పో యి పర్వతముమీద యెహో వా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చెను.

అంతట యెహో వా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహో వా భయమునకు పర్వతములు బద్ద లాయెను;

శిలలు ఛిన్నాభిన్నములాయెనుగాని యెహో వా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పో యిన తరువాత భూకంపము

కలిగెనుగాని ఆ భూకంపమునందు యెహో వా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెనుగాని ఆ

మెరుపునందు యెహో వా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపో గా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను.

చాలా సంవత్సరాల క్రితం, రెఫ్రిజిరేటర్ల కు బదులు ప్రజల దగ్గ ర ఐస్ బాక్స్ లు ఉన్న కాలంలో, ఓ ఐస్ ప్లా ంటులో పని చేసే ఓ వ్యక్తి

ఒక విలువైన గడియారాన్ని మంచును నిల్వ చేసే రంపపు పొ ట్టు లో పో గొట్టు కున్నాడు. అతని సహా పనివారు అతనితో పాటు

వెతికారు గాని అది దొ రకలేదు.

వారు మధ్యాహ్న భోజనానికి ప్లా ంట్ నుండి వెళ్ళిపో యి తిరిగొచ్చే సరికి ఓ కుర్రా డు ఆ గడియారంతో ఉండడం చూసారు. వారు

అతనికి అది ఎలా దొ రికిందని అడిగినప్పుడు, ఆ అబ్బాయి, "నేను ఊరికే అలా రంపపు పొ ట్టు లో పడుకొని ఉన్నాను, అప్పుడు

అది టిక్ టిక్ అనడం వినబడింది" అని జవాబిచ్చాడు. గోల చేసే యంత్రా లన్నీ ఆగిపో యి ఉండగా, ఆ వ్యక్తి వినడానికి

ఆయత్త పడి ఉండగా, ఆ గడియారాన్ని కనుగొనడం ఏ మాత్రం కష్ట ం కాదు.

ఏలీయా హో రేబు పర్వతంపై నిలిచి ఉండగా, అతని ఎదుట దేవుని శక్తి అద్భుతంగా ప్రదర్శించబడింది. బలమైన పెనుగాలి

బండరాళ్ల ను గులకరాళ్లు గా మార్చేసింది.

ఓ భూకంపం భూమిని దద్ద రిల్లజేసింది. ఆ పర్వతం అగ్నిమయమైంది. ఈ ప్రతి ఒక్కటీ దేవుని శక్తి యొక్క ప్రత్యక్షతే, కానీ అవి

దేవుడు కాదు. ఆ ధ్వని అంతా ఆగిపో యినప్పుడు మాత్రమే, మిక్కిలి నిమ్మళమైన స్వరంలో, ఏలీయా సాక్షాత్తూ దేవున్ని

కనుగొనగలిగాడు.

ఈరోజుల్లో గోలకు దూరంగా వెళ్లడం కష్ట ం. నగరంలోని సందడి, కర్మాగారం యొక్క గోల, పిల్లల అరుపులు, రేడియో, టీవీల

మోత, అన్నీ కలిసి ఓ అశ్రా వ్యతకు దో హదం చేస్తు న్నాయి. వీటన్నిటి మధ్య, దేవునితో అన్యోన్య సంభాషణ దాదాపు అసాధ్యం.

అందుకే మనం దేవుని మిక్కిలి నిమ్మళమైన స్వరం వినగలిగే ప్రశాంతతను వెతుక్కోవడం తప్పనిసరి.

నేడు ప్రపంచపు గోలను బయటే ఉంచే ఓ స్థ లాన్ని కనుగొనండి. మీ మనసును నిమ్మళపర్చమని, చాలా సార్లు దానిలో

నిండిపో యే గగ్గో లును తొలగించమని దేవున్ని అడగండి. మీ హృదయాన్ని ఆయన స్వరం వినడానికి, ఆయన సాన్నిహిత్యాన్ని

కనుగొనడానికి శ్రు తి చేసుకోండి. ఏకాంతం లోకి వెళ్ళండి. ఊరకుండండి. నిమ్మళించండి. దేవున్ని వినండి.

దేవునితో సాన్నిహిత్యం గుసగుసగా వస్తు ంది, అరుపులతో కాదు

22 జనవరి 2023 -మీ భయాలను ఎదుర్కొండి

1 రాజులు 19:15-16: అప్పుడు యెహో వా అతనికి సెలవిచ్చిన దేమనగా–నీవు మరలి అరణ్యమార్గ మున దమస్కునకు పో యి దానిలో
ప్రవేశించి సిరియ దేశముమీద హజాయేలునకు పట్టా భిషేకము చేయుము; ఇశ్రా యేలు వారిమీద నింషీకుమారుడైన యెహూకు పట్టా భి

షేకము చేయుము; నీకు మారుగా ప్రవక్త యైయుండుటకు ఆబేల్మె హో లావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము.
జీవశాస్త జ్ఞు
్ర లు చెప్పేదేమంటే భయం అనేది సార్వజనీన భావోద్రేకం మాత్రమే కాదు, అది మనిషిలోనూ మృగంలోనూ మొదట

వృద్ధియైన భావోద్రేకం కూడా. మీరెప్పుడైనా గూటినుండి క్రింద పడ్డ పిల్లపక్షిని పైకెత్తి ఉంటే, భయకంపితమైన దాని గుండె వేగంగా

కొట్టు కోవడం మీకనుభవమై ఉంటుంది. అంతకు ముందు దానికి మీతోనో, లేక మరెవరితోనో అనుభవమేమీ లేకున్నా, అది

భయపడుతుంది.

సృష్టి యావత్తూ భయం ఏలుబడి క్రింద ఉంది. మానవుడు తాను పుట్ట క మునుపే భయంచే ముద్రింపబడి జన్మిస్తా డు, ఆపైన

తన జ్ఞా నం, అనుభవం పెరిగే కొద్దీ అతని భయాలు ఎన్నో రెట్లవుతాయి. కానీ భయంపై ఆధారపడి నిర్ణయాలు చేయడం

తప్పిదమవుతుంది.

ఏలీయా తన భయాలకు లొంగిపో వడమనే తప్పు చేసి తన స్వదేశం నుండి, బాధ్యతల నుండి పారిపో యాడు. కానీ హో రేబు

పర్వతంపై దేవునికి తన సమర్పణను అతడు నూతన పర్చుకున్నపుడు, దేవుడు అతన్ని త్రిప్పి, దేనిని అతడు విడిచి వచ్చాడో

దానిని ఎదుర్కోడానికి తిరిగి పంపాడు. ఏలీయా తన భయాలను జయించే ఏకైక మార్గ ం వాటిని ఎదుర్కోవడమేనని దేవునికి

తెలుసు. వాటికి దూరంగా పరుగెత్తడం ఎప్పుడూ పనికి రాదు.

చాలా మంది క్రైస్తవులు భయాల కారణంగా వారి విధుల నుండి పారిపో యారు. సంఘకాపరులు సంఘాలను వదిలేశారు, మిషన్

పొ లం నుండి మిషనరీలు ఇంటికొచ్చేశారు, కేవలం వారి భయాలను బట్టి తల్లు లు, తండ్రు లు తమ కుటుంబాలను వదిలేశారు:

ఓటమి గూర్చిన భయం, బాధను గూర్చిన భయం, శ్రమలను గూర్చిన భయం. కానీ, మనం వాటి నుండి దూరం పరుగెడుతూ,

మన వీపు వాటి వైపుంటే, మన భయాలను మనమెప్పటికీ అధిగమించలేం. మనం వాటిని ఎదుర్కోవాల్సిందే.

మీరు దాన్ని చేయాలని మీకు తెలిసిందాని నుండి మీ భయం మిమ్మల్ని పారిపో యేలా చేయనిచ్చి ఉంటే, వెనక్కు తిరుగండి,

దానిని ఎదుర్కోండి. దేవుని శక్తితో, ఆయన చిత్త ం వల్ల , మీరు మీ భయాలపై విజయం పొ ందగలరు.

మీ భయాలకెప్పుడూ వెన్ను చూపకండి

24 జనవరి-వెనుతిరిగద
ే ి లేదు
1 రాజులు 19:19-21: ఏలీయా అచ్చటనుండి పో యిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన

ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను. ఏలీయా అతని చేరబో యి తన

దుప్పటి అతనిమీద వేయగా అతడు ఎడ్ల ను విడిచి ఏలీయావెంట పరుగెత్తి –నేను పో యి నా తలి దండ్రు లను ముద్దు పెట్టు కొని తిరిగి వచ్చి

నిన్ను వెంబ డించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు–పో యి రమ్ము, నావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకతడు

అతనిని విడిచి వెళ్లి కాడియెడ్లను తీసి, వధించి వాటిమాంసమును గొర్తినొగల చేత వంటచేసి జనులకు వడ్డించెను. వారు భోజనముచేసిన

తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను.

డిసెంబర్ 21, 1620 న మేఫ్లవర్ ఓడ ప్లిమత్ బే లో లంగరు వేసింది. అట్లా ంటిక్ సముద్రా న్ని దాటడానికి ఆ చిన్న ఓడకు 66

రోజులు పట్టిన కఠిన ప్రయాణం అది.

ధైర్యవంతులైన ఆ 102 మంది ప్రయాణీకుల్లో జబ్బుపడ్డ వారు, ఆందో ళనకు గురైన వారు, ప్రసవించినవారు కూడా ఉన్నారు. అదీ

గాక, వారు నిస్తేజమైన ఆ న్యూ ఇంగ్ల ండ్ తీరానికి వారిలో దాదాపు సగం మంది జీవితాలను బలిగొన్న తీవ్రమైన శీతాకాలంలో

చేరు కున్నారు.
కానీ వసంతం వచ్చినపుడు మే ఫ్ల వర్ కెప్టెన్ తిరిగి వెళ్లా లనుకుంటున్న వారిని ఉచితంగా తీసుకెళ్తా నని అన్నప్పుడు, ఒక్కరు

కూడా ముందుకు రాలేదు. వీరంతా ఓ సమర్పణ చేసుకున్నారు, ఇక వారు వెనుతిరిగేది లేదు.

ఎలీషాకు ఏలీయా ఇచ్చిన పిలుపుకు అలాంటి స్పందనే వచ్చింది. ఓ రైతుగా, ఎలీషా 12 జతల ఎడ్ల తో దున్నుతూ ఉన్నాడు.

ఏలీయా తన దుప్పటి ఈ కష్టించిదున్నేవాడిపై వేసినప్పుడు, తన స్నేహితులకు వీడ్కోలు విందు ఇవ్వడానికి ఎలీషా తన

జీవనాధారమైన దానినే, అనగా ఒక జత ఎడ్ల ను వధించాడు. అలా చేయడం ద్వారా అతడు తన పాత జీవితంతో ఉన్న

బంధాలను తెంచుకోవడమే గాక, తన ముందున్న పరిచర్యకు తన సమర్పణను ప్రదర్శించాడు.

క్రైస్తవులు కూడా సమర్పణ విషయంలో ఇలాంటి అడుగు వేయాల్సి ఉంది. ఒక అడుగు విశ్వాసంతో, మరో అడుగు లోకంలో ఉంటే

మనం క్రీస్తు కోసం ప్రభావవంతంగా జీవించలేం. మనం గతంతో చక్కగా తెగతెంపులు చేసుకొని ప్రభువు కోసం జీవించాలి.

దేవుడు మిమ్మల్ని ఓ ప్రత్యేక విధమైన పరిచర్యకు పిలిచి ఉంటే, ఎలాంటి సంశయాలు లేకుండా మిమ్మల్ని ఆ పరిచర్యకు

అంకితం చేసుకోండి. మీ గతం గతం గానే ఉండనివ్వండి. దాన్ని మీ వెనుక ఉంచి దేవునితో ముందుకు నడవండి. దేవుని

సేవించడంలో విజయానికి అంతకంటే గొప్పదేదీ అవసరం లేదు.

25 జనవరి 2023 -ధన్యుడైన శత్రు వు

1 రాజులు 21 :20-22: అంతట అహాబు ఏలీయాను చూచి–నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా? అని పలుకగా ఏలీయా ఇట్ల నెను–

యెహో వా దృష్టికి కీడుచేయుటకు నిన్ను నీవే అమ్ముకొని యున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహో వా ఈలాగు

సెలవిచ్చెను–నేను నీ మీదికి అపాయము రప్పించెదను; నీ సంతతివారిని నాశముచేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రా యేలువారిలో

అహాబు పక్షమున ఎవరునులేకుండ పురుషులనందరిని నిర్మూలముచేతును. ఇశ్రా యేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు

కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమున కును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును

నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహో వా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజెబెలునుగూర్చి యెహో వా సెలవిచ్చున

దేమనగా – యెజ్రెయేలు ప్రా కారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును.

మన శత్రు వులని పిలువబడేవారు నిజానికి మనకు గొప్ప సేవ చేయవచ్చు. ప్రతి మనిషికి ఓ నమ్మకమైన స్నేహితుడు, ఒక

చేదైన శిష్యుడు, అంటే తనకు సలహా ఇచ్చేవారు ఒకరు, మరొకరు తన చుట్టు ప్రక్కల చూసుకునేలా చేసేవారు కావాలని సో క్రటీస్

అన్నాడు. బెంజమిన్ ఫ్రా ంక్లిన్ ఇలా అన్నాడు," మీ శత్రు వులను ప్రేమించండి, ఎందుకంటే వారు మీకు మీ లోపాల గురించి

చెబుతారు. గ్రీకు తత్వవేత్త ఆంటిస్థనీజ్ ఇలా బుద్ధిచెప్పాడు," మీ శత్రు వులను గమనించండి, ఎందుకంటే మీ తప్పిదాలు మొదట

కనుగొనేది వారే."

ఏలీయా అహాబు రాజు తన తప్పిదాల్ని తెలుసుకోవడంలో సహాయపడి ఉండేవాడే, ఒకవేళ రాజు అలా చేయడానికి అతన్ని

అనుమతించి ఉంటే. అహాబు చుట్టూ ఆయన ఏం వినాలనుకుంటున్నాడని వారు భావించారో అదే చెప్పే అబద్ధ ప్రవక్త లు

ఉన్నారు.

అతని భార్యయైన యెజెబెలు, ఇశ్రా యేలు లో బయలు ఆరాధనను స్థా పించాలనే పట్టు దలతో కూడిన తన ప్రయత్నం ద్వారా,

అతన్ని వినాశనానికి పో యే మార్గ ంలో నడిపింది. తనకుండిన ఒకే ఆశాకిరణం ఏలీయా మాత్రమే, కానీ రాజు అతన్ని

త్రో సివేశాడు, ఎందుకంటే అతడు 'శత్రు వు' కాబట్టి.


ఓ క్రైస్తవుడు ప్రభువు కోసం జీవిస్తు న్నట్లైతే, అతనికి శత్రు వులుంటారు. ఇది అతడు వారిని పెంచి పో షించి నందువల్ల కాదు; ఇది

కేవలం సువార్త కు ప్రపంచం యొక్క సహజ స్పందన మాత్రమే. కానీ అటువంటి పరిస్థితిని మనకు అనుకూలంగా

మలచుకోవచ్చు. తన చిత్తా న్ని మన జీవితాల్లో నెరవేర్చడానికి ప్రభువు మన శత్రు వులను కూడా వాడుకోగలడు.

మీకు శత్రు వు ఉంటే, శ్రద్దగా అతడు లేక ఆమె చెప్పేది వినండి. ఒకవేళ వారి మనసాయాసం లేక ఆగ్రహం మాటున మీ గురించి

వారికున్న ఫిర్యాదులో కాస్త యినా సత్యం ఉండకపో దా అని చూడండి. శత్రు వులు తరచూ మన లోపాలను మన స్నేహితుల

కంటే ఎంతో బాగా గుర్తిస్తా రు. ఎందుకు వారు చెప్పేది వినే ప్రయత్నం చేయకూడదు? అది దీర్ఘకాలంలో మిమ్మల్ని మరెక్కువగా

క్రీస్తు లా మారుస్తు ంది.

మీ శత్రు వులను మనసులో ఉంచుకోండి; వారు మారువేషంలో ఉన్న దీవెనలేమో?

26 జనవరి 2023 దేవుడన్నవాడు లేడా?

2 రాజులు 1:2-3: అహజ్యా షో మ్రో నులోనున్న తన మేడగది కిటక


ి ీలోనుండి క్రిందపడి రోగియై–మీరు ఎక్రో ను దేవతయగు

బయల్జె బూబు నొద్దకు పో యి–ఈ వ్యాధి పో గొట్టు కొని నేను స్వస్థ పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా

యెహో వాదూత తిష్బీయుడైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెను–నీవులేచి షో మ్రో నురాజు పంపిన దూతలను ఎదుర్కొనబో యి

యిట్ల నుము–ఇశ్రా యేలువారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రో ను దేవతయైన బయల్జె బూబునొద్ద మీరు

విచారించబో వుచున్నారా?

నిష్కపటంగా మాట్లా డే నాస్తికుడైన రాబర్ట్ జి ఇంగిర్సాల్ ఇల్లినాయ్ రాష్ట ్ర గవర్నర్ పదవికి పో టీపడి ఓడిపో యిన కొద్దీ కాలం

తర్వాత, షికాగో నుండి ప్యుఆరియ కు వెళ్లే ట్రెయిన్ లో తన నాస్తికత్వం గురించి గొప్పలుపో తూ మాట్లా డుతున్నాడు. అతడు తన

సమీపాన ఉన్న ఓ పెద్దమనిషి వైపు తిరిగి, "క్రైస్తవ్యం ఎప్పుడైనా సాధించిన ఒక్క గొప్ప ఫలితం చెప్పండి" అన్నాడు.

గొప్పలుపో తున్న ఆ వ్యక్తితో వాదానికి దిగడం ఇష్ట ం లేని ఆ వ్యక్తి, జవాబివ్వడానికి తటపటాయించాడు.

ఒక నిమిషం ఆ బో గీలో నిశ్శబ్ద ం ఆవరించింది. తర్వాత, సరిగ్గా అతని వెనుక కూర్చొని ఉన్న ఓ పెద్దా విడ వణుకుతున్న చేత్తో

అతని చేతిని తాకి, "అయ్యా, మీరెవరో నాకు తెలియదు, కానీ

నేను మీకు క్రైస్తవ్యం చేసిన ఒక గొప్ప సంగతి చెప్పగలననుకుంటున్నాను" అన్నది. "ఏమిటది మేడమ్?" అని అడిగాడు

ఇంగిర్సాల్. ఆమె జవాబిస్తూ ,

"అది రాబర్ట్ జి ఇంగిర్సాల్ ను ఇల్లినాయ్ రాష్ట్రా నికి గవర్నర్ కాకుండా కాపాడింది" అని అన్నది.

దేవున్ని నిరాకరించే వారందరూ ఎప్పుడూ ఓ గొప్ప వెల చెల్లి స్తా రు. రాజైన అహజ్యా గాయపడి, ఎక్రో ను దేవత వద్ద తాను

బాగుపడతాడో లేదో తెలుసుకోడానికి ఓ దూతను పంపినపుడు, జవాబివ్వడానికి దేవుడు ఏలియాను పంపాడు. ఏలీయా "నీవు

యెహో వాను నమ్మలేదు గనుక నీవు మరణమగుదువు" అని ప్రకటించాడు. అలాగే అతడు మరణించాడు(17 వ). అహజ్యా

యొక్క అవిశ్వాసానికి అతడు అతని ప్రా ణాన్ని వెలగా చెల్లి ంచాడు.

అవిశ్వాస కారణంగా నష్ట పో యే స్థితిలో ఉండేవారు అవిశ్వాసులు మాత్రమే కాదు. కొన్నిసార్లు క్రైస్తవులు క్రీస్తు లో విశ్వాసం

ఉన్నట్టు మాట్లా డుతారు గాని, వారి క్రియలు వారు నిజంగా ఆయనను నమ్ముతున్నారని చూపించవు. అటువంటి అసంబద్ధ తను
బట్టి వారు సమాధానం, ఆనందం విషయంలో ఎంతో వెల చెల్లి స్తా రు. అది వారు వారి పరలోక ప్రతిఫలాలలో కొన్నిటిని

పో గొట్టు కొనేలా కూడా చేయగలదు.

మీ నడక మీ మాటకు తగినట్టు గా ఉండనివ్వండి. మీరు రక్షణకై ప్రభువును నమ్మినట్లైతే, మీ జీవితపు మిగతా విషయాల్లో కూడా

ఆయనను నమ్మండి. మీరు దేవుని ఆలోచన పొ ందగలిగినపుడు, మీరు పొ ందగలిగిన అత్యుత్త మ ఆలోచన పొ ందుతారు.

అవిశ్వాసం ఎప్పుడూ చౌకైనది కాదు; అది చెల్లి ంచే దాని కంటే, దానికై చెల్లి ంచబడేదే ఎక్కువ

27 జనవరి 2023-దేవుడు తనవారి సంగతి చూసుకుంటాడు

2 రాజులు 1:10-12: అందుకు ఏలీయా– నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగవ


ి చ్చి నిన్ను నీ యేబదిమందిని

దహించునుగాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండిదగ


ి ి వానిని వాని యేబదిమందిని

దహించెను. మరల రాజు ఏబదిమందిమీద అధిపతియైన మరియొకనిని వాని యేబదిమందితోకూడ పంపగా వీడువచ్చి–

దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞా పించుచున్నాడనెను. అందుకు ఏలీయా–నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము

నుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశమునుండి దేవుని అగ్ని దిగి వానిని వాని

యేబదిమందిని దహించెను.

చాలా సంవత్సరాల క్రితం చాలా చలిగాఉన్న ఓ జనవరి రాత్రి, జర్మనీలోని స్లేస్విక్ పట్ట ణ కాపురస్థు లు ఓ గొప్ప దుస్థితిలో

ఉన్నారు. శత్రు సేన వారిమీదకు దండెత్తి వస్తో ంది, ఈ అరాచక సైనికుల ప్రవర్త ననుగురించిన వార్త లు ప్రతి నివాసిగుండెల్లో గుబు

లు పుట్టించాయి. అయితే, ఇదే పట్ట ణంలో ఓ బామ్మ విధవరాలైన తన కూతురు మరియు తన మనుమడితో జీవిస్తూ ఉంది.

వారు వేచిచూస్తూ ఉండగా, ఈ వయసుడిగిన స్త్రీ "తమ చుట్టూ ఓ కాపాడే గోడ"ను కట్ట మని దేవుణ్ణి ప్రా ర్థించింది. మధ్యరాత్రి

శత్రు వులు ఆ గ్రా మంలోకి ఇళ్ల తలుపుల్ని పగులగొడుతూ పొ ర్లివచ్చారు. కానీ ఈ స్త్రీ ఇంటి తలుపుపై కనీసం తట్టిన శబ్ద ం కూడా

రాలేదు. ఎందుకన్నది వారికి ఉదయమైనపుడు తెలిసింది.

ఆ రాత్రి కురిసిన మంచు ఆమె ఇంటితలుపు ముందుకు కొట్టు కుపో యి, వారిని సమీపించడం అసాధ్యం చేసిన భారీ గోడను

సృష్టించింది."అదిగో చూడండి, దేవుడు నా ప్రా ర్థనలకు జవాబిచ్చాడు. ఆయన మన చుట్టూ ఓ గోడ నిర్మించాడు!" అన్నది

బామ్మ.

దేవుడు తప్పక తన వారి యెడల శ్రద్ధ తీసుకుంటాడు. రాజైన అహజ్యా బలిమితో ఏలియాను బంధించడానికి, 50 మంది

సైనికులను వారి అధిపతిని పంపినపుడు, వారిని దహించివేసే అగ్నిని పంపి దేవుడు ఏలీయా యొక్క దరవస్థ కు జవాబిచ్చాడు.

రెండో గుంపుకు చెందిన 50 మందికి కూడా అదే జరిగింది. మూడో గుంపు యెహో వా యందలి భయముతో ఏలియాను

సమీపించినపుడు మాత్రమే వారి ప్రా ణాలు పో లేదు.

ప్రతి క్రైస్తవుడు సర్వశక్తు డైన దేవుని యొక్క కాపాడే, శ్రద్దా పూర్వక దృష్టి యందు నడుస్తా డు. ఒక ఘడియైనా ఆయన దృష్టి మన

మీద లేకుండా ఉండదు. ధైర్యం తెచ్చుకోండి. ఈ భూమ్మీద మీ పట్ల దేవుని ఉద్దేశ్యం పూర్త యే వరకు, నిజంగా ఏ ప్రమాదం

మిమ్మల్ని భయపెట్టదు.మీ గురించి దేవుడే శ్రద్ధ వహిస్తా డు.

దేవునికి భయపడండి, అపుడు మీరిక దేనికీ భయపడే అవసరముండదు

You might also like