You are on page 1of 34

నేను చూసిన కాశ్మీర్

ఈ ఏడు ( 2018 ) ఎండలు చాలా బాగా కాస్తు న్నాయి. బయటకి వెళదామంటె భయం వేస్తో ంది. ఒక రోజు ఎండ

వేడిలోనుండి చల్ల టి ఆలోచన వచ్చింది అదే కాశ్మీర్ టూర్. ఏప్రిల్ చివరి వారంలో లలితావాళ్ళ పెద్దమ్మ

కూతురు రాజమండ్రి లో కొత్త ఇల్లు కట్టు కుంటే గృహప్రవేశానికి సిద్ధూ ని తీసుకుని ముగ్గు రం వెళ్ళాము. నేను

రెండు రోజులు ఉండి వచ్చేసాను. లాలిత వాళ్ళ అన్నయ్య వదినాలతో కలిసి విశాఖపట్నం వెళ్ళింది. కొన్ని

రోజులు అక్కడ ఉండి అటునుండి విజయవాడ లో తన అమ్మానాన్నల దగ్గ రకు వెళ్ళింది.

నేను ఈ లోపుగా ఇంటర్నెట్ లో కాశ్మీర్ టూరిజం గురించి చూసాను. సరైనవి ఏమీ దొ రకలేదు. కొన్ని

ట్రా వెల్స్ కాశ్మీర్ ప్యాకేజ్ లో ఒక వరం లేదా 10 రోజులు అని ఇంకా చాలా ఆఫర్స్ పెట్టా రు. ముందుగా అడ్వాన్స్

కట్టా లని కూడా ఉండి ఆ వెబ్ సైట్లలో. నాకు వాటిని నమ్మబుద్ది కాలేదు. ఒకరోజు పంజాగుట్ట లో ఉన్న టూరిస్ట్

ప్లా జా కి వెళ్లి హైదరాబాద్ లో కాశ్మీర్ టూరిజం ఆఫీస్ నెంబర్ తీసుకున్నాను. నాంపల్లి లో ఉంది ఆ ఆఫీస్.

వెంటనే ఫో న్ చేసి మాట్లా డాను. వాళ్ళు టూర్ వివరాలు చెప్తా రుట కానీ ప్యాకేజ్, హో టల్ బుకింగ్స్ లాంటివి

ఏమిలేవు. ఇక్కడ ఈ కాశ్మీర్ టూరిజం ఆఫీస్ ఉన్నాకూడా దండగే అనిపించింది. కాకపో తే ఇంకా వివరాలు

కావాలంటే ఒక రిటైర్డ్ ఉద్యోగి సెల్ నెంబర్ ఇచ్చి ఆయనతో మాట్లా డండి అన్నారు. ఆయన పేరు రాములు.

ఇక్కడి ఆఫీస్ లో 30 ఏళ్ళు పని చేసాడుట. వివరాలు చెప్పటానికి నన్ను కోటి ఉమెన్స్ కాలేజీ దగ్గ రికి

రమ్మన్నాడు. నేను వీలు చూసుకుని ఒకరోజు మధ్యాహ్నం వెళ్లి కలిసాను.

రాములుగారు నాకు శ్రీనగర్ లో ఉన్న మజ్దా ట్రా వెల్స్ వివరాలు ఇచ్చారు. ఇది వరకు చాలామందిని

ఇక్కడి నుండి కాశ్మీర్ ట్రిప్ కి పంపారుట. వీళ్ళ సర్వీస్ బాగుంటుంది అని చెప్పారు. తరువాత నాకు ఒక వారం

రోజుల ప్యాకేజ్ రాసి ఇచ్చారు. వివరాలు ఇచ్చినందుకు నా సంగతి కొంచెం చూడండి అన్నారు. టూర్ నుండి

వచ్చాక చూద్దా ము అన్నాను. ఇంటికి వచ్చి మజ్దా ట్రా వెల్స్ కి ఫో న్ చేశాను. ట్రా వెల్స్ ప్రొ ప్రైటర్ అన్వర్ అని

ఆయనతో మాట్లా డాను. నాకు ప్యాకేజ్ వివరాలు మెయిల్ చేస్తా ను అన్నాడు. మొత్త ం 8 రోజుల టూర్ ప్యాకేజ్

సెట్ చేసి పంపాడు. ప్యాకేజ్ విలువ 35 ,౦౦౦.


ప్యాకేజ్ బాగానే ఉంది ఒక్క తిండి ఖర్చు మినహాయించి. కాశ్మీర్ లో దాదాపు చూడదగ్గ ప్రదేశాలు అన్నీ

ఉన్నాయి. నేను ప్యాకేజ్ ని ఓకే చేశాను. 10 ,౦౦౦ అడ్వాన్స్ కట్ట మన్నారు. రానూపో నూ తేదీలు నన్నే

చూసుకోమన్నారు. 8 రోజులకి మాకు ఒక వెహికల్ ఇస్తా రట. ఎక్కడికైనా దానిలో వెళ్ళవచ్చు, మేము

వచ్చేవరకు వెయిట్ చేస్తా డు. శ్రీనగర్ నుండి పికప్ మళ్ళీ శ్రీనగర్లో డ్రా ప్. నాలుగు హో టల్స్ లో అకామడేషన్

ఇచ్చాడు. శ్రీనగర్, పహల్గా మ్, గుల్మార్గ్ , సో నామార్గ్, యుష్మార్గ్ లిస్ట్ లో ఉన్నాయి.

ఎప్పటికప్పుడు అన్ని వివరాలు అమ్మానాన్నకి , లలితకి చెప్తు న్నాను. నాన్న కాశ్మీర్ అనగానే టెన్షన్

పడ్డా రు. కాశ్మీర్ లో ఎప్పుడూ గొడవలే అక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అన్నారు. అక్కకి చెప్పారు.

అక్క కులూ-మనాలీ కి వెళ్ళండి అంది. నాకేమో కాశ్మీర్ చూడాలని. మేము చిన్నప్పుడు చూసిన ప్రదేశాలు

లాలిత కి సిద్ధూ కి చూపించాలని నా కోరిక. నాన్నకి ధైర్యం చెప్పాను.

ఒక ఆదివారం పార్ధు మావయ్య ఇంట్లో మేము ఇంకా విజయలక్ష్మి అక్కవాళ్ళు కలుసుకున్నాము.

నాన్న విజయలక్ష్మి అక్కని కాశ్మీర్ కి వెళ్లవచ్చా అని అడిగారు. అక్క ఫర్వాలేదు వాళ్ళని వెళ్లనివ్వండి అక్కడ

అంతా బాగానే ఉంది అని చెప్పింది. విజయలక్ష్మి అక్క రమేష్ గారు 2004 లో కాశ్మీర్ కి వెళ్లా రుట. మళ్ళీ 2014

లో అమర్నాథ్ యాత్రకి వెళ్ళివచ్చారుట. కాశ్మీర్ లో సెక్యూరిటీ చాల బాగా ఉంటుంది అని టూరిస్టు లకు

ఏమాత్రం అసౌకర్యం ఉండదని చెప్పింది. నాన్న కొంచెం తృప్తి పడ్డా రు.

మే 4 న ఇంటినుండి ఆన్లైన్ లో ట్రైన్ టికెట్స్ బుక్ చేశాను. 23 మే మంగళవారం ఉదయం 7.20 కి జట్

హంసఫర్ అనే ట్రైన్ కి. సికంి ద్రా బాద్ స్టేషన్ నుండే బయలుజేరుతుంది. మా ఇద్ద రికీ కలిపి 8,790 అయ్యింది.

సిద్ధూ కి టికెట్ తీసుకోలేదు. సికింద్రా బాద్ నుండి చివరి స్టేషన్ జమ్మూ చేరటానికి 36 గంటలు పడుతుంది.

అంటే మంగళవారం ప్రొ ద్దు న్నే ఎక్కితే బుధవారం రాత్రి 10 గంటలకు జమ్మూ కి చేరతాము. ఈ ట్రైన్ రేణిగుంట

లో సో మవారం బయలుజేరుతుందిట. టికెట్ ప్రింట్ తీసాను.

తిరుగు ప్రయాణం విమానంలో వద్దా మని అనుకున్నాను. మరుసటి రోజు నెట్ లో ఫ్లైట్ వివరాలు

చూసాను. మా కాశ్మీర్ టూర్ మొత్త ం 8 రోజులు 9 వ రోజు తిరుగు ప్రయాణం. అంటే 23 , 24 రైలు ప్రయాణానికి

పొ తే 25 నుండి 8 రోజులు టూర్ ఉంది. నేను జూన్ 2 వ తారీకు ఉదయంకి వెతికాను. ఇండిగో వాళ్ళ విమానం

శ్రీనగర్ నుండి జమ్మూ కి 12.10 కి ఉంది. జమ్మూ లో రెండున్నర గంటలు వెయిట్ చేసాక 3.30 కి జమ్మూ
నుండి రాజస్థా న్ లోని జైపూర్ కి అటునుండి హైదరాబాద్ కి ఇంకొక విమానం ఉంది. నేను లలిత కి చెప్పి ఇద్ద రం

సరే అనుకున్నాక ఇదే విమానానికి టికెట్ బుక్ చేశాను. ముగ్గు రికి కలిపి 30, 201 అయ్యింది. శ్రీనగర్ లో ఎక్కితే

జమ్మూ లో దిగి ఇంకొక విమానం మారాలి. హైదరాబాద్ కి రాత్రి 7.45 కి చేరతాము. రాను పో ను టిక్కెట్లు బుక్

చెయ్యటం అయ్యింది. మర్నాడు శ్రీనగర్ లో అన్వర్ కి కాల్ చేసి మాట్లా డాను. నేను బుక్ చేసిన తేదీలు చెప్పను.

అతను టూర్ ప్లా న్ సరిచూసుకుని సరే అన్నాడు. ముందుగా 10,000 అడ్వాన్స్ కట్ట మని బ్యాంకు అకౌంట్

వివరాలు మెయిల్ లో పంపుతానని చెప్పాడు. ఇండియా లో శ్రీనగర్ మరియు జమ్మూ ఎయిర్ పో ర్ట్ లు

మిలటరీ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. అందుకని అక్కడ సెక్యూరిటీ చెకంి గ్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను

మా ముగ్గు రి ఆధార్ కాపీలు ప్రింట్ తీసుకున్నాను.

మే 9 న 'మహా నటి' సినిమా రిలీజ్ అయ్యింది. సావిత్రి జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది. సెకండ్

షో కి నేను అమ్మ నాన్న కలిసి అర్ టి సి క్రా స్ రోడ్స్ దగ్గ ర శ్రీ మయూరి కి వెళ్ళాము. సినిమా చాల బాగుంది.

అమ్మ నాన్న రిలీజ్ అయిన మొదటి రోజే సినిమా చూడటం ఇదే మొదటిసారి. ముందుగా లలిత కి చెప్పాను

కాబట్టి తాను కూడా వాళ్ళ అమ్మవాళ్ల ని తీసుకుని కొన్ని రోజుల తరువాత సినిమా కి వెళ్ళింది విజయవాడలో.

నేను నా వీలు చూసుకొని ఒకరోజు 10000 అడ్వాన్స్ మజ్డా ట్రా వెల్స్ అకౌంట్ లో వేసాను. నాకు డబ్బు

అందినట్టు మెయిల్ చేసారు. లలితని వీలైనంత త్వరగా హైదరాబాద్ కి రమ్మని చెప్పాను. తాను మే 16 కి ట్రైన్

లో వచ్చింది. నేను ఈలోగా టూర్ కి తీసుకువెళ్లా ల్సిన లిస్ట్ అంతా రాసి పెట్టా ను. బావగారికి ఫో న్ చేసి టూర్

గురించి వివరంగా చెప్పాను. జాగ్రత్తగా వెళ్లి రండి అన్నారు. 10 రోజుల పైగా ఉండను కాబట్టి అన్ని బ్రా ంచెస్ లో

స్టా క్ ఎక్కువగా ఇస్తు న్నాను. అందరికి నేను కాశ్మీర్ ట్రిప్ కి వెళ్తు న్నాను అని చెప్పాను. ఏదైనా అవసరం వస్తే

హెడ్ ఆఫీస్ లో తీసుకోమని చెప్పాను. నాకు రావాల్సిన పేమెంట్ కాల్స్ చేసి అడిగి తొందర పెట్టి తీసుకున్నాను.

అక్క మాకు ఒక అమెరికన్ టూరిస్టర్ వీల్ బాగ్ కొని ఇచ్చింది. ఈ బాగ్ ఇంకా రెండు పెద్ద సూట్ కేసులు నా

షో ల్డ ర్ బాగ్ మొత్త ం 4 లగేజ్ లు అయ్యాయి. అమ్మ కి నడుము నొప్పి ఎక్కువగా ఉంది. ఇంటి పనులన్నీ

చేసుకోలేదు అందుకే అమ్మ నాన్నని మేము టూర్ నుండి వచ్చే వరకు అక్క ఇంట్లో ఉండమని చెప్పాము.

లలిత పేటియమ్ లో నాకు సిద్ధూ కి షూస్ ఆర్డ ర్ చేసింది. 4 రోజులలో ఇంటికి వచ్చాయి. చాల బాగున్నాయి.

టూర్ కి వేసుకుని వెళ్ళాలి అని అనుకున్నాము. శ్రీనగర్ మరియు కాశ్మీర్ మొత్త ంలో రీఛార్జ్ చేసుకునే సిమ్ లు

పనిచేయవు. ఒక్క నెలవారీ బిల్ కట్టే సిమ్ లు మాత్రమే వాడుకలో ఉంటాయి. అందుకే నా ఎయిర్ టెల్ నెంబర్
కి ఇంటర్నెట్ డేటా ఒక నెల ప్లా న్ వేయిన్చుకున్నాను. విజయలక్ష్మి అక్క శాఫ్రా న్ - కుంకుమ పువ్వు తెమ్మని

మెసేజ్ పెట్టింది. కాశ్మీర్ లో కుంకుమ పువ్వు పండిస్తా రు. మంచి సువాసనతో తక్కువ ధరలో దొ రుకుతుంది.

మొదటిసారి నేనే సొ ంతగా ఇంతపెద్ద కాశ్మీర్ టూర్ పక్కాగా ప్లా న్ చేశాను. టూర్ కి వెళ్లే రోజు దగ్గ ర

పడుతున్నకొద్దీ ఉత్సాహం పెరిగప


ి ో తోంది. నా కెమెరా, హ్యాండీక్యామ్, హార్డ్ డిస్క్ మొదలైనవన్నీ ఛార్జింగ్ పెట్టి

రెడీ చేసుకున్నాను. సిద్ధూ విజయవాడ నుండి చిన్న ల్యాప్టా ప్ తెచ్చాడు. సందీప్ తాను వాడటంలేదని సిద్ధూ కి

ఇచ్చాడట. నేను అది కూడా బ్యాగ్ లో పెట్టు కున్నాను. ఏరోజుకారోజు తీసిన ఫో టోలు వీడియోలు ల్యాప్టా ప్

ద్వారా హార్డ్ డిస్క్ లోకి ఎక్కించటానికి. హో టల్ గదులలో ఒకే ఒక్క ప్ల గ్ ఉంటుంది. కెమెరా, హ్యాండీ కామ్,

పవర్ బ్యాంక్, ఇద్ద రి సెల్ ఫో న్లు ఇవన్నీ ఛార్జింగ్ పెట్టడానికి కుదరదు అందుకని ఒక స్పైక్ కొన్నాను. అన్నీ

ఒకేసారి ఛార్జ్ అవుతాయి. వెళ్ళేది బాగా చలి ఉన్న ప్రదేశానికి కాబట్టి స్వట్ట ర్లు , చేతికి గ్లౌ జులు, మందపాటి

బట్ట లు, శాలువాలు పెట్టు కున్నాము. నేను నాదగ్గ ర ఉన్న పట్టా న్ డ్రెస్ కూడా పెట్టు కున్నాను. మే 22 న మళ్ళీ

అన్వర్ కి కాల్ చేసి వివరంగా చెప్పాను. 25 న శ్రీనగర్ కి రాగానే తనకి కాల్ చెయ్యమని చెప్పాడు. నేను 60000

డబ్బు డ్రా చేసి సగం సగం మా ఇద్ద రి సూట్ కేసులలో దాచాను. లలిత పేపర్ వాడికి పాల వాడికి 10

రోజులపాటు వద్దు అని చెప్పింది. రేణుక కి కూడా చెప్పింది. విజయలక్ష్మి అక్క కాశ్మీర్ లో చూడ దగ్గ ప్రదేశాలు

వాళ్ళు చూసినవి ఫో టోలు నాకు పంపింది. నాన్న రోజు ట్యాబు లో కాశ్మీర్ వీడియోలు చూస్తు న్నారు. ఒక రోజు

అక్క ఇంటికి వచ్చినపుడు మేము 1985 కాశ్మీర్ కి వెళ్లి న ఫో టోలు తీసి చూసాము.

మే 23 వ తారీకు వచ్చింది. మేము తెల్లవారుఝామునే లేచి రెడీ అయ్యాము. లగేజీ సర్దేసి క్యాబ్ ని

పిలిచాము. అమ్మ నాన్నల కాళ్ళకి నమస్కారం చేసి క్యాబ్ లో స్టేషన్ కి వెళ్ళాము. 4 వ ప్లా ట్ఫారం కి వెళ్లి C9

కంపార్ట్మెంట్ ఎక్కాము. మా సీట్లలో కూర్చున్నాము. ట్రైన్ మొత్త ం ఏసీ నే. జనం బాగా ఉన్నారు. ట్రైన్ కదలగానే

నాన్నకి కాల్ చేసి చెప్పాను. మా కోచ్ B13 సైడ్ అప్పర్, లోయర్ వచ్చాయి. 71,72 సీట్లు . 3 కోచ్ లు దాటితే

పాంట్రీ కార్ ఉంది. ఈ రైలు మొత్త ం 8 స్టేట్స్ దాటి జమ్మూ కి చేరుకుంటుంది. అవి ఆంధ్ర , కర్ణా టక , తెలంగాణ ,

మహారాష్ట ్ర , మధ్య ప్రదేశ్, ఉత్త ర్ ప్రదేశ్, ఢిల్లీ , హర్యానా, పంజాబ్.


మాకు ఎదురుగా హైదెరాబాదీ గుజరాతీ కుటుంబం ఉంది. మొత్త ం ఒక 25 మంది ఉన్నారు.

కంపార్ట్మెంట్ మొత్త ం తిరుగుతూ చిరాకు తెప్పించారు. రైలు లో ఫో టోలు వీడియోలు తీసాను. టిఫిన్ కి లలిత

ఇంట్లో నుండి ఇడ్లీలు చేసి తెచ్చింది. మధ్యాహ్నం లంచ్ కి బిర్యానీ, కర్డ్ రైస్ చేసింది. కంపార్ట్మెంట్ లో ఉండే

హెల్పర్ అందరికి దిండు దుప్పట్లు ఇచ్చాడు. చల్ల దనం వల్ల బయటి ఎండ వేడి తెలియటంలేదు. నేను 80

రోజుల్లో భూ ప్రదక్షిణం పుస్త కం తెచ్చుకున్నాను చదవటానికి. రైలు మధ్య మధ్య లో క్రా సింగ్ ల కోసం చిన్న

చిన్న స్టేషన్స్ లో ఆగుతూ వెళ్ళింది. సెల్ ఫో న్ లు చూస్తూ , పుస్త కాలూ చదువుతూ , అమ్మ నాన్నతో

మాట్లా డుతూ గడిపస


ే ాము. ప్రొ ద్దు న్న 9 కి అశోక్ వచ్చి మా కార్ లో అమ్మావాళ్ళని అక్క ఇంటికి

తీసుకువెళ్ళాడుట. గుజరాతీ ఫ్యామిలీ అంతా కలిసి వైష్ణో దేవి కి వెళ్తు న్నారుట. రాత్రికి డిన్నర్ ఆర్డ ర్ చేశాను

ముగ్గు రికి. సాయంత్రం ప్యాంట్రీ కార్ కి వెళ్లి చూసాను బాగుంది. టీ తాగాను. రాత్రి కి డిన్నర్ కోసం చపాతీలు

కూర తయారు చేస్తు న్నారు. డిన్నర్ మహా రుచిగా లేకపో యినా ఫరవాలేదు. రాత్రి మా కంపార్ట్మెంట్ లో

కొన్ని చోట్ల బెర్త్ లు ఖాళీగా ఉన్నాయి. నేను ఒక బెర్త్ లో పడుకున్నాను.

రెండో రోజు ప్రొ ద్దు న్న లేచేసరికి 8 దాటింది. సిద్ధూ , లలిత అప్పటికే లేచి కూర్చున్నారు. నేను ముఖం

కడుక్కుని ప్యాంట్రీ కార్ దగ్గ రికి వెళ్లి టీ త్రా గాను. రైలు మహారాష్ట ,్ర మధ్యప్రదేశ్,ఝాన్సీ స్టేషన్లు దాటి ఢిల్లీ కి

దగ్గ రలో ఉంది. మరొక గంటలో ఢిల్లీ కి 14 నిముషాల దూరంలో ఉన్న సఫ్ దర్జంగ్ అనే స్టేషన్ లో ఆగింది. స్టేషన్

బైట ఆగటంవల్ల ఏమి కొనటానికి కుదరలేదు. 10 నిముషాలలో మళ్ళీ కదిలింది. చేసేదిలేక ప్యాంట్రీ కార్ లోనే

బ్రెడ్ ఆమ్లెట్ కొన్నాను. కంపార్ట్మెంట్ అంతా గోల గోల గా ఉంది. రైలు ప్రతి చిన్న స్టేషన్ల లో ఆగుతూ వెళ్తో ంది.

మధ్యాహ్నం 2 ప్రా ంతాల్లో హర్యానాలోని అంబాలా స్టేషన్ లో ఆగింది. అందరూ పొ లోమంటూ దిగారు. నేను ఆలు

పరాఠాలు మంచినీళ్లు కొన్నాను..ట్రైన్ లో ఒక బిర్యానీ కొన్నాను. సాయంత్రా నికి రైలు పంజాబ్ లోని

లూథియానా దాటి జలంధర్ స్టేషన్ లో ఆగింది. దాదాపు ఒక గంట ముప్ఫయి నిముషాలు పైగా ఆపేసారు. రైలు

లోనుండి చాల మంది క్రిందికి దిగారు. మేమూ దిగి ఫో టోలు తీసుకున్నాము. ఎప్పటికో రైలు కదిలింది. ఇంకా

ఎక్కడా ఆపాడు అనుకుంటే ప్రతి స్టేషన్ లోనూ ఆపాడు. పో నీ రైలు కదిలితే నెమ్మదిగా వెళ్ళటం. విసుగు

పుట్టింది. 30 గంటలు అవుతోంది ఈ రైలు ఎక్కి... రైలు లో కొన్నిచోట్ల నీళ్లు రావటంలేదు. వాష్ బేసిన్ల నిండా

చెత్త పో శారు. ట్రైన్ 6 గంటలు లేటుగా నడుస్తో ంది. డిన్నర్ కి రెండు బిర్యానీ ప్యాక్ లు చెప్పాను. బాగా చీకటి

పడింది. అందరం పడుకున్నాము. అర్ధ రాత్రి 3 గంటలకి ఎట్ట కేలకు జమ్మూ స్టేషన్ కి చేరుకున్నాము. రావలసిన
సమయం రాత్రి 9.10 కి. అప్పుడు వస్తే రాత్రంతా ఎక్కడ ఉండాలి అని ఎక్కడ పడుకోవాలి అని తెగ

ఆలోచించాము. అయినా మార్గ ం దొ రకలేదు. స్టేషన్ లోనే వెయిటింగ్ రూమ్ లో కూర్చుందాములే అని

అనుకున్నాము. కానీ ట్రైన్ లేట్ వల్ల ఈ విధంగా నిద్రా భంగం కలగలేదు.

రైలు దిగి సామాను దించి ముందుకు కదిలాము. నేను ముందుగా టీ తాగాను. స్టేషన్ లో చేపల్లా గా

జనాలు ఇష్ట ంవచ్చినట్టు పడుకుని ఉన్నారు.ముందుగా పే & యూజ్ లో ముఖాలు కడుక్కుని ఫ్రెష్

అయ్యాము. ఇద్ద రినీ స్టేషన్ లో ఒకచోట కూర్చోపెట్టి నేను స్టేషన్ బైటికి వచ్చాను. బైట జనాలు బాగానే ఉన్నారు.

ఆర్మీ పో లీస్ లు కూడా బాగానే ఉన్నారు. నేను ఒక పో లీస్ ని అడిగి శ్రీనగర్ కి వెళ్లే టాక్సీలు ఎక్కడ ఉంటాయో

తెలుసుకున్నాను. మేము ట్రిప్ కి వచ్చిన సంగతులు అన్నీ చెప్పాను. ఆర్మీ జవాన్ బాగా మాట్లా డాడు. స్టేషన్

దగ్గ రలోని బస్టా ండ్ లో రాత్రి 12.30 కి ఆర్మీ జీప్ మీదకి ఒకడు గ్రా నైట్ విసిరాడుట. చాలామందికి దెబ్బలు

తగిలాయిట. ఆర్మీ వాళ్ళు వెంటనే పరిస్థితిని అదుపు చేశారట. మాకు ట్రైన్ లేట్ అవ్వటం మంచిదే అయ్యింది

అనుకున్నాను.

జమ్మూ స్టేషన్ బైట కొంత దూరంలో శ్రీనగర్ కి వెళ్లే టాక్సీ స్టా ండ్ ఉంది. మరి కొంత దూరంలో వైష్ణో దేవి

కి వెళ్లే టాక్సీ స్టా ండ్ ఉంది. శ్రీనగర్ కి 2500 కి ఒక షేరంి గ్ టాక్సీ కుదిరింది. టవేరా బండి. మేము ముగ్గు రం

వెనుక వైపు కూర్చున్నాము. ముందు వైపు ముగ్గు రు మగవారు ఉన్నారు. జమ్మూ నుండి శ్రీనగర్ కి 7 గంటల

ప్రయాణంట. 295 కిలోమీటర్ల దూరం. మేము తెల్లవారుఝామున 4 గంటలకి బయలుజేరము. ఇంకా

చీకటిగానే ఉంది. స్టేషన్ దాటి మెయిన్ రోడ్ ఎక్కాము. వాతావరణం మామూలుగానే ఉంది. ఎక్కువ చలి లేదు.

జమ్మూ కి చేరగానే మా సెల్ ఫో న్ సిగ్నల్స్ అన్నీ పడుకున్నాయి. నాకు జియో తో పాటు ఎయిర్టెల్ కూడా

ఉంది. అదికూడా పో స్ట్ పెయిడ్ కాబట్టి సిగ్నల్ ఉంది. జమ్మూ కాశ్మీర్ లో ప్రీ పెయిడ్ పని చేయదుకదా. మేము

చాల దూరం వచ్చాము. మెల్లగా తెల్లవారుతోంది. వైష్ణో దేవి కి కూడా ఇదే దారిట. ముందుగా తెలిస్తే బాగుండేది

అనుకున్నాము. బాగా వెలుగు వచ్చాక నేను హ్యాండీ కామ్ మొదలుపెట్టా ను. రోడ్ మీద అక్కడక్కడా ఆర్మీ

వాళ్ళు కాపలా ఉన్నారు. ప్రకృతి దృశ్యాలు మారుతున్నాయి. కొండలు మొదలయ్యాయి… కొంతసేపటికి

దూరంగా వైష్ణో దేవి గుడి కొండమీద కనిపించింది. కట్రా అనే చోట ఉంది ఈ కొండ. చూడటానికి దగ్గ రగా ఉన్నా

గుడి దగ్గ రికి వెళ్ళటానికి సగం రోజు పైగానే పడుతుందిట. కుదిరితే మళ్ళీ ఇంకోసారి వస్తా ము అని

అనుకున్నాను. మార్గ ం మధ్యలో ఆర్మీ వాళ్ళు చెకంి గ్ ఎక్కువ గా ఉంది. నేను వైష్ణో దేవి గుడిని వీడియో తీస్తే
అది కూడా డిలీట్ చేయమన్నాడు ఒకడు. కొంతసేపటికి ఉధంపూర్ అనే ఊరు వచ్చింది. పచ్చటి కొండలు,

చెట్ల మధ్య తక్కువ జనాభాతో చాలా అందంగా ఉంది. ఇక్కడినుండి కాశ్మీర్ కి రైల్వే లైన్ వేస్తు న్నారు. ఊళ్ళో

చిన్న చిన్న సెలయేరులు పారుతున్నాయి. వాటిమీద చిన్న వంతెనలు చూడటానికి ఆహ్లా దకరంగా ఉంది.

ఊరినిండా చిన్న చిన్న గుళ్ళు చాలానే ఉన్నాయి. కొంతసేపటికి మా దారి ప్రక్కగా చీనాబ్ నది ప్రవహిస్తూ

కనబడింది. ఈ నది ఇండియా నుండి పాకిస్తా న్ వైపుకి ప్రవహిస్తో ందిట. ఉదయం 7.30 కి డ్రైవర్ ఒక హో టల్

దగ్గ ర ఆపాడు. హో టల్ మేడ పైన ఉంది. సిద్ధూ కి మ్యాగి, లలిత నూడిల్స్, నేను బ్రెడ్ బజ్జి తిన్నాము.

శ్రీనగర్ కి వెళ్లే దారిలో చిన్న చిన్న ఊళ్ళు చాలా కనిపించాయి. చీనాబ్ నది రోడ్ కి దగ్గ రగా, మరొకసారి

దూరంగా కనబడుతూ వెంట వస్తో ంది. సమయం గడుస్తు న్నకొద్దీ కొండలు,లోయలు నది ఎక్కడో లోయలో

చిన్నగా ప్రవహిస్తూ కనబడింది. ఘాట్ రోడ్ మీదనుండి ప్రయాణం. రోడ్ కి ఒకవైపున కొండ మరొకవైపు లోయ..

అందంగానూ, భయంగాను సాగుతోంది ప్రయాణం. లారీల ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది ఈ చిన్న రోడ్డు లో.

మధ్య మధ్య లో నదిమీద వంతెనల నిర్మాణం జరుగుతోంది. వేడి గాలి పో యి చల్ల గాలి వీస్తో ంది. కొండలు

లోయల మధ్య ప్రయాణం బాగుంది. కానీ ఇంతవరకు హిమాలయాలు కనబడలేదు.

కొంతసేపటికి ఒకచోట ఆపితే మేము రోడ్ ప్రక్కగా వెళ్లి ఫో టోలు తీసుకున్నాము. మరొక గంటకి టోల్

గేట్ వచ్చింది. చెకంి గ్ చేసారు. ఆ వెంటనే పెద్ద టన్నెల్ కనిపించింది. దాని పేరు 'చెనాని నశ్రీ' టన్నెల్. ఇది

మొత్త ం ఇండియా లోనే అతి పొ డవైన గుహాట. దీని పొ డవు 9 .2 కిలోమీటర్లు . ఈ టన్నెల్ వల్ల జమ్మూ నుండి

కాశ్మీర్ కి 30 కిలోమీటర్ల దూరం లేదా 2 గంటలు ప్రయాణ సమయం తగ్గు తుందిట. ఈ టన్నెల్ ని ఏప్రిల్ 2

2017 న ప్రా రంభించారుట. సముద్రమట్టా నికి 1200 మీటర్ల ఎత్తు లో ఉందిట. టన్నెల్ లోపల ఫో న్ సిగ్నల్స్

యధావిధిగా పనిచేస్తా యి. టన్నెల్ మొదలు నుండి చివరివరకు మొత్త ం 124 సీసీ కెమెరాలు నిరంతరం పని

చేస్తూ ఉంటాయి. ఈ టన్నెల్ కి ప్రత్యేక కంట్రో ల్ రూమ్ మరియు ప్రత్యేక సాఫ్ట్ వేర్ కూడా ఉన్నాయిట. ఈ

టన్నెల్ యొక్క నిర్మాణ ఖర్చు మొత్త ం 3720 కోట్ల రూపాయలట. టన్నెల్ లోపలికి ప్రవేశించగానే గాలి మరీ

చల్ల గా వీచింది. టన్నెల్ మొత్త ం పెద్ద కాంతితో లైట్లు వెలుగుతున్నాయి. టన్నెల్ చాలా విశాలంగా చల్ల గా

ఉంది. టన్నెల్ లో ఒకవైపున వెళ్లే వాహనాలు ప్రక్కనే వచ్చే వాహనాలు. అయినా ఏమాత్రం ఇరుకుగా లేదు.

దాదాపు 13 నిముషాల పైనే సమయం పట్టింది బైటకు రావటానికి. టన్నెల్ కి రెండు వైపులా ఆర్మీ వాళ్ల
గుడారాలు ఆఫీసులు ఉన్నాయి. టన్నెల్ దాటాక మళ్ళీ ఘాట్ రోడ్లు , కొండలు , లోయలు , రైల్వే లైన్ నిర్మాణ

పనులు, లారీల హో రు.. వీటిని దాటుకుంటూ మా ప్రయాణం సాగింది.

మరొక రెండు గంటలు గడిచాక మరొక పెద్ద టన్నెల్ వచ్చింది. దీని పేరు నెహ్రు టన్నెల్. మేము 1985

లో కాశ్మీర్ కి వచ్చినప్పుడు చాలా కొత్త దిగా అనిపించింది. అప్పుడు నేను దాదాపు సిద్ధూ అంత ఉన్నాను. ఈ

టన్నెల్ని రెండేళ్లలో నిర్మించారుట. 1954 మొదలుపెట్టా రట.1956 డిసెంబర్ నుండి రాకపో కలు

మొదలయ్యాయిట. చూడగానే చాలా పాతది అని అనిపించింది. టన్నెల్ కొంచెం చిన్నగా ఉంది. లోపల లైట్ల

వెలుతురూ తక్కువే. ఈ టన్నెల్ పొ డవు 285 కిలోమీటర్లు . వెళ్లే వాటికీ వచ్చే వాటికీ విడిగా రెండు టన్నెల్స్

ఉన్నాయి. ఈ టన్నెల్ బనిహాల్ - ఖ్వాజి గుo డ్ అనే ఊళ్ళ మధ్యలో ఉంది. నెహ్రు టన్నెల్ దాటిన వెంటనే

సిద్ధూ ఒక్కసారిగా 'అదిగో హిమాలయాస్' అని పెద్దగా అరిచాడు. అందరి మొహాలు ఒక్కసారిగా

వెలిగిపో యాయి. దూరంగా హిమాలయాలు ఠీవీగా నిలబడి రండి రండి మీకోసమే ఎదురుచూస్తు న్నాము

అన్నట్టు గా కనిపించాయి. కొంత దూరం వెళ్ళాక శ్రీనగర్ పట్ట ణం చిన్నగా లోయకి అవతలవైపున కనబడింది.

కానీ ఇంకొక గంట పైగానే ప్రయాణం చెయ్యాలి. నేను టన్నెల్స్ వచ్చినప్పటినుండి ముందు డ్రైవర్ పక్కన సీట్

లో కూర్చుని ఫో టోలు, వీడియోలు తీస్తు న్నాను. కొంతసేపటికి ఘాట్ రోడ్ పూర్తి అయ్యి పీఠభూమి మీద

ప్రయాణం చేస్తు న్నాము. చుట్టూ పచ్చని పొ లాలు దూరంగా పొ డవాటి పైన్ వృక్షాలు వాటికంటే ఇంకా

దూరంగా తెల్లటి రంగులో నిగ నిగ మెరిసిపో తున్న మంచు పర్వతాలు కనిపించాయి. అక్కడక్కడా చిన్న

చిన్న నదీపాయల్లో బో ట్ హౌసులు ఉన్నాయి. డ్రైవర్ చెప్పాడు ఇక్కడ కొన్ని పొ లాల్లో సాఫ్రా న్ అంటే

కుంకుమ పువ్వు పండిస్తా రుట. శ్రీనగర్ కి మరొక గంట లోపుగానే చేరతాము అనగా అన్వార్ కి ఫో న్ చేసి

చెప్పాను. అతను టూరిస్ట్ సెంటర్ దగ్గ రికి వచ్చాక మళ్ళీ ఫో న్ చెయ్యమన్నాడు. చాలా దూరం ప్రయాణించాక

శ్రీనగర్ మెయిన్ రోడ్ ఎక్కాము. మాతోపాటు వచ్చిన ఇద్ద రు ఇక్కడ దిగిపో యారు. వాళ్ళు దగ్గ రలోనే ఉన్న

బారాముల్లా అనే ఊరుకి వెళ్ళాలిట.

మరొక 20 నిముషాలలో శ్రీనగర్ కి చేరుకున్నాము. సమయం దాదాపుగా ఉదయం 11 దాటింది.

నగరంలో ఆన్ని రోడ్ల లో కొద్ది కొద్ది దూరాలలో ఆర్మీ బటాలియాన్ పో స్ట్ లు ఉన్నాయి. పెద్ద గోడలు ముందు వైపు

ఇనుప కంచెలు పెట్టి ఉన్నాయి. ముఖద్వారాలకి ప్రక్కన చిన్న పో స్ట్ లు ఉన్నాయి. ఆర్మీ వాళ్ళు తుపాకీలు

పట్టు కుని సిద్ధంగా ఉన్నారు. శ్రీనగర్ లో ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియదు. ట్రా ఫిక్ బాగానే ఉంది. ఎండ
కూడా బాగా ఉండి ఉక్క పో సింది. మా వెహికల్ టూరిస్ట్ సెంటర్ దగ్గ ర ఆగింది. వెంటనే నాకు కాల్ వచ్చింది.

మేము ఉన్న స్థ లం మా బండి నెంబర్ వాడికి చెప్పాను. డ్రైవర్ మా లగేజీ దించాడు. వాడికి డబ్బులు ఇచ్చి

పంపేసాము. కొంతసేపటికి ఒక కుర్రా డు వచ్చి పరిచయం చేసుకున్నాడు. మజ్దా ట్రా వెల్స్ నుండి వచ్చాడుట.

ఒక ఆటోలో లగేజీ పెట్టి వాడి వెనకాలే రమ్మన్నాడు. మా టూర్ వెహికల్ రేపటి నుండి వస్తు ందిట. ఒక 20

నిముషాలలో ఒక హో టల్ రాయల్ స్టా ర్ అనే చోట ఆపాడు. అది 3 స్టా ర్ హో టల్. చాలా బాగుంది. హో టల్ తో

పాటు అందమైన గార్డెన్ లు కూడా ఉన్నాయి. గార్డెన్ లో రంగు రంగుల పువ్వులు, పడ్డ పెద్ద గులాబీలు

ఉన్నాయి. మాకు వెల్కమ్ చెప్పి రెండవ అంతస్తు లో మా గదికి తీసుకు వెళ్లా రు. రేపటినుండి మాతో పాటే ఉండే

డ్రైవర్ నెంబర్ ఇచ్చారు. గది పెద్దగా విశాలంగా ఉంది. మేము స్నానాలు చేసి బట్ట లు మార్చుకొని క్రిందికి వచ్చి

డైనింగ్ హాల్ కి వెళ్ళాము. మాకు లంచ్ బైటనుండి ఆర్డ ర్ చేసి తెచ్చారు. రైస్, పప్పు, మిక్స్ డ్ వెజ్ కూర,

పెరుగు. కడుపునిండా తిన్నాము. రూమ్ కి వెళ్ళాక లలిత ఇంటికి వీడియో కాల్ చేసి అమ్మావాళ్ల కి హో టల్

గది, బయట గార్డెన్ లు చూపించింది. తరువాత అక్కకి కూడా.. ప్రయాణ బడలిక లేకపో యినా కడుపు

నిండేసరికి నిద్ర ముంచుకువచ్చింది. గదిలో ఒక పెద్ద మంచము, ఒక చిన్న మంచము ఉన్నాయి. ముగ్గు రం

మత్తు గా సాయంత్రం వరకు నిద్రపో యాము.

సాయంత్రం లేచేసరికి 5.30 దాటింది. రెడీ అయ్యి క్రిందికి వచ్చి టీ తాగాము. అలా బైటికి వెళదాము

అనుకుని హో టల్ లో వాళ్ళకి చెప్పి బైటికి వచ్చి సన్నటి సందుల్లో నుండి నడిచి విశాలమైన వీధుల్లో కి

వచ్చాము. రోడ్ల మీద జనసంచారం ఎక్కువగా లేదు. కొంచెం నిశ్శబ్ద ంగా ఉన్నా మసీదుల పైన ఉండే మైక్ ల

నుండి ఖ్హు రాన్ బాగా వినబడుతోంది. చాలా దూరం నడిచి ఒక పెద్ద రోడ్ లో ఆ చివరకు వెళ్ళాము. అక్కడ

జీలం లేక్ దానిమీద ఒక ఫుట్ బ్రిడ్జి కనిపించాయి. లేక్ లో కొన్ని బో ట్ హౌస్ లు ఉన్నాయి. అప్పటికి సమయం

సాయంత్రం 7.30 అయ్యింది. అయినా చక్కటి వెలుగు ఉంది. అక్కడ షాపింగ్ కి ఏమీ లేవు. డిన్నర్ చేసి రూమ్

కి వెళదాము అనుకున్నాము. దగ్గ రలో హో టల్స్ ఏమీ లేవు. ఇంతలో ఫుట్ బ్రిడ్జి నుండి ఒక ఫ్యామిలీ అటుగా

వచ్చింది వాళ్ళని పలకరించాను. భార్య భర్త ఇద్ద రు మగ పిల్లలు. ఆయన పేరు కపూర్ అని చెప్పాడు. ఇక్కడ

శ్రీనగర్ లో ఆర్మీ లో పనిచేస్తు న్నాడుట.ఆయన కుటుంబం సెలవులకి కలకత్తా నుండి వచ్చారుట. దగ్గ రలో

ఆయన ఎప్పుడూ వెళ్లే ఒక చిన్న ఢాబా ఉంది వెళదాము అన్నాడు. అందరం నడుచుకుంటూ చాలాదూరం

వెళ్ళాము. దారిలో ఆయనతో కాశ్మీర్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఢాబా ఉన్న చోటు అంతా
సిక్ఖు ల ఏరియా. గురుద్వారా కి ఎదురుగానే ఉంది ఆ ఢాబా.. పేరు లక్కీ వైష్ణో ఢాబా. ఆలు పరాఠా, రాజ్మా తో

తిన్నాము. చాలా రుచిగా ఉంది ధరకూడా తక్కువే. రోజూ ఇక్కడికే వచ్చి తిందాము అనుకున్నాము. నేను

కపూర్ గారి నెంబర్ తీసుకున్నాను. మమ్మల్ని ఆటో ఎక్కించారు. మేము ఆయనకీ ధన్యవాదాలు తెలిపాము.

రూమ్ కి వచ్చి మధ్యాహ్నం నాకు ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి డ్రైవర్ తో మాట్లా డాను. అతని పేరు సల్మాన్.

రేపు ఉదయం 8 గంటలకి రమ్మని చెప్పాను. పడుకునే ముందు ఈరోజు తీసిన ఫో టోలు వీడియోలు ఆన్ని నా

హార్డ్ డిస్క్ లోకి ఎక్కించి బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టి పడుకున్నాను.సిద్ధూ పాపం చాలా దూరం నడిచి

అలసిపో యాడు. తొందరగానే పడుకున్నాడు.

DAY 1

మేము ఉదయం 6 గంటలకు లేచి రెడీ అయ్యి క్రిందికి వచ్చాము. 8 గంటలకి మా డ్రైవర్ సల్మాన్ టవేరా

వెహికల్ తీసుకుని వచ్చాడు. సల్మాన్ 25 28 మధ్య వయసువాడు. మమ్మల్ని విష్ చేసి ట్రిప్ గురించి

చెప్పాడు. ముందుగా నిన్న రాత్రి వెళ్లి న వైష్ణో ఢాబా కి వెళ్ళాము. టిఫిన్ తిన్నాక రోజంతా శ్రీనగర్ సిటీ లోకల్ లో

ఉన్న ప్రదేశాలు చూపిస్తా ను అని చెప్పాడు సల్మాన్. ముందుగా శంకరాచార్య కి వెళదాము అన్నాడు.

శంకరాచార్య గుడి డాల్ లేక్ కి ఎదురుగా 1000 అడుగుల ఎత్తైన కొండమీద ఉంది. శ్రీనగర్ లో అన్నిటికంటే

ఎంతో ప్రా ముఖ్యత ఉన్న ఈ చోటు ఎంతో పాతది. దాదాపుగా 200 Bc నాటిదిగా చెప్పబడుతున్నది. ప్రస్తు తం

ఉన్న గుడి మాత్రం 9 వ శతాబ్ద ం లో నిర్మించారుట. ఆది శంకరాచార్యులవారు ఈ ప్రదేశానికి వచ్చారుట. ఈ

కొండమీదే 'సౌందర్య లహరి' అనే సంస్కృత రచనని పుష్పదంతా మరియు శంకరాచార్యులవారు కలసి

రచించారుట. 6 నెలలపాటు ఈ కొండమీదే తపస్సు చేశారట. 19 వ శతాబ్ద ంలో సిఖ్ ల పరిపాలనలో ఇక్కడి

గుడిలో శివలింగం ప్రతిష్టింపబడిందిట. ముందుగా బౌద్దు ల కాలంలో బౌద్దు ల గుడిగా ఆరాధింపబడిందిట.

తరువాత పర్షియన్లు , జ్యూయిష్ లు 'బాగ్-ఎ-సులేమాన్' అని పిలిచేవారట. ఈ కొండకి ‘గోపాద్రి పర్వతం’ అని

మరొక పేరుంది. కొండ క్రింద దారి మొదట్లో ఆర్మీ వాళ్ళు అందరి వాహనాలు తనిఖీ చేసి పంపిస్తా రు. దారిఅంతా

ఘాట్ రోడ్ పైనే. వంపులు తిరుగుతూ వెళ్తు ంది. కొండ పైకి వెళ్తు న్నకొద్దీ డాల్ లేక్ మరియు పరిసర ప్రా ంతాల

అందాలు చూస్తూ కళ్ళు తిప్పలేము. పైకి వెళ్ళాక వాహనాలు దిగి మన తనిఖీలు పూర్తి అయ్యాక మెట్లదారిలో

పైకి ఎక్కాలి. సుమారు 245 మెట్లు ఎక్కాక గుడి ప్రా ంతం వచ్చింది. నాపరాళ్ల తో చదును చేసిన నేల సేద

తీరడానికి కుర్చీలు, మంచినీరు, వాష్ రూంలు మొదలైన సదుపాయాలు ఉన్నాయి. అక్కడినుండి చూస్తే 10
కిలోమీటర్ల దూరంవరకు ఒకవైపు శ్రీనగర్ నగరం విస్త రించి మహా అద్భుతంగా ఉంది. ఇంకొకవైపు కొండలు వాటి

వెనుక మంచు కొండలు చూడటానికి రెండు కళ్ళు చాలవు. గుడిలోకి మరొక 10 మెట్లు ఎక్కి చిన్న

ద్వారంగుండా లోపలికి వెళ్ళాలి. లోపల శివలింగం ఉంది. ప్రదక్షిణ చేసి బైటికి వచ్చాము.గోపురం నలువైపులా

తిరగటానికి స్థ లం ఉంది. గుడికి కొంచెం క్రిందవైపున ఒక చిన్న చీకటి గుహ ఉంది. దానిలో శంకరాచార్యులవారు

6 మాసాలు తపస్సు చేశారట. లోపల ఫో టోలు పెట్టి ఉన్నాయి. తీర్ధం ఇస్తు న్నారు. మెట్లదారిలో పుస్త కాలూ,

ఫో టోలు అమ్ముతున్నారు. నేను కొన్ని కొన్నాను. వచ్చిన దారినే మళ్ళీ కొండ దిగి వచ్చాము.

తరువాత ముఘల్ గార్డెన్స్ చూడటానికి ప్రయాణమయ్యాము. శ్రీనగర్ లో ముఖ్యమైన ముఘల్

గార్డెన్స్ 3 అవి చష్మే షాహీ, నిషాత్ మరియు షాలిమార్. ఇంకా కొన్ని గార్డెన్స్ ఉన్నాకూడా ఈ మూడింటికే

ఎక్కువ ప్రా ధాన్యత. ముఘల్ గార్డెన్స్ అన్నీ దాదాపుగా కొద్ది మార్పులతో ఒకే రకంగా ఉంటాయి. కొండ క్రింది

దిగువభాగంలో వనాలు విస్త రించి ఉంటాయి. గార్డెన్లో మొక్కలన్నిటికి నీళ్లు సహజంగా కొండలనుండి పారి

క్రిందికి వచ్చే నీటిని తమ మేధాశక్తితో వాడుపుగా దారి మళ్లించి మొత్త ం వనమంతా నీరు విస్త రించేలాగా

నిర్మించారు ఆనాటి ముఘల్స్. కొండల నుండి వచ్చిన నీరు ఒక పెద్ద బావిలాంటి నిర్మాణంలో నిల్వ ఉండి

అక్కడినుండి పాయలుగా చీలి మొత్త ం గార్డెన్ అంతా ప్రవహిస్తా యి. గార్డెన్ పైనుండి క్రిందివరకు మధ్య భాగంలో

చిన్న చిన్న మెట్లవరుసలు కట్టి వాటినుండి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అదే నీటిని ఇప్పుడు పంపులు,

పైపులు, గొట్టా లు, ట్యూబ్ ల ద్వారా అన్నీ చెట్లకి, మొక్కలకి నీరు అందిస్తు న్నారు. ఇక్కడ అన్నిగార్డెన్స్ కి ఎంట్రీ

ఫీజు వసూలు చేస్తు న్నారు.

ముందుగా మేము చష్మే షాహీ గార్డెన్ కి వెళ్ళాము. చాలా అందంగా ఉంది. ఈ గార్డెన్ ని 1632 లో అలీ

మర్దా న్ ఖాన్ అనే అతడు ముఘల్ రాజు షాజహాన్ ఆజ్ఞ మేరకు నిర్మించాడుట. గార్డెన్ కి వెనుక వైపున ఉన్న

కొండలని జబర్వన్ హిల్స్ అంటారు. మొత్త ం వనం 1.73 ఎకరాల్లో విస్త రించి ఉంది. గార్డెన్ లో ముఘల్స్

పనితనం బాగా కనబడుతుంది. ఎంతో కళాత్మకంగా నిర్మించిన గోడలు, పిల్లర్లు , ఫౌంటెన్లు మొదలైనవి చూపుల్తో

కట్టిపడేస్తా యి. కాశ్మీరీలు వేసుకునే సాంప్రదాయ వస్త్రా లు ఇక్కడికి వచ్చే యాత్రికులకు వేసి ఫో టోలు

తీసి..ఫో టో సైజులను బట్టి డబ్బు వసూలు చేస్తు న్నారు. మేము కూడా కొన్ని ఫో టోలు దిగాము. నా

చిన్నతనంలో దిగిన ఫో టోలు గుర్తు కువచ్చాయి. గార్డెన్లో అన్నీచోట్లు తిరిగి ఫో టోలు వీడియోలు తీసుకున్నాము.
బైటకి వచ్చి కౌంటర్ లో మా కాశ్మీరీ డ్రెస్ ఫో టోలు తీసుకుని నిషాత్ గార్డెన్స్ కి పయనమయ్యాము. ఇక్కడ

అన్ని గార్డెన్స్ నుండి డాల్ లేక్ కనబడుతూనే ఉంటుంది.

నిషాత్ గార్డెన్ బైటనుండి ఒక కోటలాగా కనబడుతుంది. మెట్లు ఎక్కి పైకి వెళ్ళాక కళ్ళు చెదిరే

పూలవనం చూడవచ్చు. ఈ వనాన్ని 1634 లో మీర్జా అబుల్ హస్సన్ అనే అతను నిర్మించాడుట.గార్డెన్ మొత్త ం

౧౧౬౭౦ ఎకరాల్లో విస్త రించి ఉంది. ఈ గార్డెన్ కూడా జబర్వన్ పర్వత శ్రేణి పాదాల చెంతనే పురుడుపో సుకుంది.

అన్ని గార్డెన్స్ లోలాగానే ఇక్కడ కూడా వింటర్ ప్యాలస్ వంటి చిన్న చిన్న డాబా కట్ట డాలు ఉన్నాయి. వాటి

చివర్ల లో చిన్న మినార్లు ఉన్నాయి. ఈ కట్ట డాలు నేటికీ ఎంతో అందంగా, ధృడంగా నిలిచి ఉన్నాయి. గార్డెన్

నుండి శంకరాచార్య, హరిపర్బత్, హజ్రత్ బల్ దర్గా అన్నీ చక్కగా కనబడుతున్నాయి. గార్డెన్ లో ఎక్కువగా

ఉన్న నీటిని ముఖద్వారం దగ్గ ర చిన్న జలపాతంలాగా క్రిందికి పడేలా నిర్మించారు. ఆ నీరు బైటవైపు మెయిన్

రోడ్ క్రిందినుండి ఎదురుగా ఉన్న డాల్ లేక్ లోకి వెళ్లి కలుస్తు న్నాయి. ఆ నిషత్ మరియు దగ్గ రలోని షాలిమార్

గార్డెన్స్ ని ముఘల్స్ కాశ్మీర్ కి వచ్చినపుడు ఆంతరంగిక విడిదిగా ఉపయోగించేవారట. ఇక్కడ దర్బార్లు కూడా

నిర్వహించేవారట. మేము గార్డెన్ మొత్త ం తిరిగినా అస్సలు అలసట అనిపించలేదు. ఫో టోలు, వీడియోలు

తీసుకుని బైటికి వచ్చాము. అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. రోడ్ కి అవతలవైపున చాలా హో టల్స్

ఉన్నాయి. మేము ఒక సౌత్ ఇండియన్ ఫుడ్ దొ రికే హో టల్ కి వెళ్లి భోజనం చేసాము. తరువాత మూడవ గార్డెన్

షాలిమార్ కి పయనమైనాము.

2 వ శతాబ్ద ం లో ప్రవరసేన II ఆ షాలిమార్ గార్డెన్ ఉన్న స్థ లంలో ఒక విల్లా కట్టించాడుట. ఈయన

కాశ్మీర్ ని 79 AD to 139 యాడ్ వరకు పరిపాలించాడుట. కాలగమనంలో ఆ స్థ లంలో షాలిమార్ అనే పేరు

తప్ప ఇంకేమి ఆనవాళ్లు లేకుండాపో యాయిట. తరువాతి కాలంలో ముఘల్ చక్రవర్తు ల పరిపాలనలో

షాలిమార్ గార్డెన్ ని 1619 లో ముఘల్ రాజు జహంగీర్ తన పట్ట పురాణి నూర్జ హాన్ కోసం కట్టించాడుట. 1630

లో షాజహాన్ ఆజ్ఞ మేరకు అప్పటి కాశ్మీర్ గవర్నర్ జఫర్ ఖాన్ ఈ పూల వనాన్ని మరింతగా విస్త రించాడుట. ఈ

గార్డెన్ 31 ఎకరాల్లో విస్త రించివుంది. గార్డెన్ మొత్త ం మూడు భాగాలుగా ఉండి విశ్రా ంతి కోసం, దర్బారు

నిర్వహించటానికి విలాసవంతమైన హాల్స్ నిర్మించబడ్డా యి. గార్డెన్లో అనేకరకాల పూలమొక్కలు కనువిందు

చేస్తా యి. కొన్ని పువ్వులు దేశంలో మరెక్కడా చూడలేముకూడా. ముఘల్ ల కళాత్మకమైన నిర్మాణశైలి ఈ

తోటలో మనకి బాగా కనిపిస్తు ంది. మిగిలిన వనాలకంటే ఎక్కువ స్థ లంలో విస్త రించివుండటంవల్ల ఇక్కడ పూల
మొక్కలు, వృక్షాలతోపాటు కొన్ని పండ్ల చెట్లు కూడా విరివిగా ఉన్నాయి. నేలమీద పరిచినట్లు గా కనబడే పచ్చని

తివాచీలాంటి గడ్డి..అందులోనుండి తొంగి చూసే చిన్న చిన్న రంగు రంగుల మొక్కలు..వీటికి తోడు చల్ల ని పిల్ల

గాలులు వీస్తూ ఊగే చెట్ల ఆకులు, దూరాన హిమగిరులు...ఎంతసేపు ఉన్నా తనివి తీరదు.

షాలిమార్ నుండి బైటకి వచ్చేసరికి సాయంత్రం 4 దాటింది. గార్డెన్లో చల్ల గా ఉన్నాబైట కొంచెం ఎండ వేడి

ఉంది. తరువాత సల్మాన్ మమ్మల్ని డాల్ లేక్ కి ఎడమవైపున ఉన్న'హజ్రత్ బల్ దర్గా 'కి తీసుకువెళ్లా డు. ఈ

దర్గా శ్రీనగర్ లో చాలా ముఖ్యమైనదిట. దర్గా పై కప్పు ( డో మ్ ) చాలా పెద్దది. దర్గా పై డో మ్ ఉన్న మసీదు

కాశ్మీర్ లోయలో ఇది ఒక్కటే.దర్గా మొత్త ం పాలరాయితో నిర్మితమైంది. ఈ దర్గా కి మాత్రమే ఉన్న ప్రత్యేకత

ముస్లిం మత స్థా పకుడు మొహమ్మద్ ప్రవక్త యొక్క పవిత్రమైన గడ్డ ంలోని కొన్ని వెంట్రు కలు ఈ దర్గా లో

అతిజాగ్రత్తగా సంరక్షింపబడుతున్నాయి. పర్వదినాలలో మాత్రమే ఈ వెంట్రు కలను భక్తు లకి చూపిస్తా రుట.

17 వ శతాబ్ద ంలో షాజహాన్ కి సుబేదారుగా ఉన్న సాదిఖ్ ఖాన్ దర్గా ఉన్న ప్రదేశంలో ఒక పెద్ద విలాస

భవనాన్ని దాని ప్రక్కగా ఒక ఉద్యానవనాన్ని 1623 లో నిర్మించాడుట. 1634 లో షాజహాన్ కాశ్మీర్ కి

వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని చూసి భవనాన్ని ఒక ప్రా ర్ధ నా స్థ లంగా మార్చమని ఆజ్ఞ చేసాడుట. కానీ పూర్తిగా

ప్రా ర్థ నాస్థ లంగా 1700 వ సంవత్సారం లోగాని సాధ్యపడలేదుట. ఆ సమయంలో ఔరంగజేబ్ పరిపాలనలో

ఉన్నాడు. చారితక
్ర ఆధారాలనుబట్టి 1635 లో సయ్యద్ అబ్దు ల్లా అనే అతను బీజాపూర్ లో ముహమ్మద్ ప్రవక్త

యొక్క వారసుడిగా చెప్పుకొనేవాడుట. అతని వద్ద ప్రవక్త యొక్క వెంట్రు కలు ఉండేవిట. అతని మరణానంతరం

అవి అతని కొడుకు సయ్యద్ హమీద్ కి వారసత్వంగా లభించాయి. అదే సమయంలో ముఘల్ ల

దండయాత్రలు జరుగుతుండగా తనవద్ద ఉన్న వెంట్రు కలకి ఆపద కలగకుండా వాటిని క్వాజా నూరుద్దీన్

ఇసాయి అనే ఒక ధనవంతుడైన కాశ్మీరీ వర్త కుడికి అమ్మేసాడుట. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ ఆ

వెంట్రు కలని అజ్మీర్ లోని క్వాజా మొయినుద్దీన్ చిష్టి దర్గా కి పంపివేసాడుట. అక్రమంగా పవిత్రమైన వెంట్రు కలు

కలిగివున్నందున క్వాజా నూరుద్దీన్ ఇసాయిని ఢిల్లీ లో చెరసాలలో బంధించాడుట. కొంతకాలం తరువాత తన

తప్పు తెలుసుకున్న ఔరంగజేబ్ క్వాజా నూరుద్దీన్ ఇసాయిని చెరసాల నుండి విడిపించగా అప్పటికే అతడు

చనిపో యాడుట. అతని దేహంతోపాటు వెంట్రు కలని కూడా కాశ్మీర్ కి పంపివేసాడుట ఔరంగజేబ్. 1700 లో

కాశ్మీర్ కి చేరుకున్న ఆ వెంట్రు కలకు సంరక్షణగా క్వాజా నూరుద్దీన్ ఇసాయి కూతురు ఇనాయత్ బేగం తన

బాధ్యతగా అక్కడ ఒక దర్గా నిర్మించి ముహమ్మద్ ప్రవక్త యొక్క వెంట్రు కలకు శాశ్వతంగా పవిత్రత
చేకూర్చిందిట. ఇప్పటికీ ఆమె యొక్క వంశీయులే ఈ వెంట్రు కలను జాగ్రత్తగా ఒక గాజు గొట్ట ంలో పెట్టి

సంరక్షిస్తూ వస్తు న్నారట. ప్రస్తు తం ఇక్కడ ఉన్న పాలరాతి మసీదు 1968 లో మొదలుపెట్టి 1979 లో పూర్తి

చేశారట. మేము మసీదు లోపలికి వెళ్లి ప్రా ర్ధ న చేసాము. ఆడవారికి విడిగా ముఖ్య మందిరానికి వెనుకవైపున

కూర్చోవటానికి పెద్ద స్థ లం ఉంది. లోపల చాలా ప్రశాంతంగా లైట్ల వెలుగులో కాంతులు విరజిమ్ముతూ పెద్ద

ప్రా ర్ధ న మందిరం ఉంది. నేను నావద్ద ఉన్న నీలం రంగు పఠాన్ బట్ట లు వేసుకుని పైన ముస్లిం టోపీ

పెట్టు కున్నాను. చాలా ఫో టోలు దిగాము. మసీదు బయట కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఒకవైపున డాల్

సరస్సు అందాలు కనువిందు చేసాయి.

హజ్రత్ బల్ నుండి మేము డాల్ లేక్ కి వెళ్ళాము. లేక్ లో వరుసగా అందమైన బో ట్ హౌస్ లు

బొ మ్మలు పేర్చినట్టు నీటి మీద కదలకుండా ఉన్నాయి. ఒకొక్క బో ట్ హౌస్ కి ఒకొక్క పేరు ఉంది. లేక్ కి

ఎదురుగా పొ డవాటి రోడ్డు మన హుస్సేన్ సాగర్ కి నెక్లెస్ రోడ్డు ఉన్నట్టు గా ఉంటుంది. రోడ్డు కి ఒక వైపున

హో టళ్లు , జనసంచారం, వచ్చే పో యే వాహనాలు, ఫుట్ పాత్ ల మీద రకరకాల బట్ట లు, కాశ్మీరీలు చేతులతో

నేసిన వస్త్రా లు, కాశ్మీరీ చెక్కతో చేసిన బొ మ్మలు మొదలైనవి అమ్ముతున్నారు. డాల్ లేక్ లో ఒకటి నుండి

మొదలుపెట్టి వరుసగా ఘాట్లు ఉంటాయి. సల్మాన్ మమ్మల్ని ఒక ఘాట్ వద్ద దింపి రెండు గంటల్లో మళ్ళీ

వస్తా ను అని వెళ్ళాడు. మేము ఒక చిన్న పడవకి బేరం కుదుర్చుకొని ఎక్కాము. కాశ్మీర్ లో బేరమాడకపో తే

వాళ్ళ ఇష్ట ం వచ్చినట్లు రేట్లు చెప్తా రు. చిన్న పడవల్ని ఇక్కడ ‘శిఖారా’ అని అంటారు. పడవ మధ్య భాగంలో

ఎదురెదురుగా రెండు పొ డవైన సీట్లు ఉంటాయి. మనం కాళ్ళు చాపుకుని కూర్చోవచ్చు.సీట్ల మీద మెత్తటి

తీవాచీలాంటి దుప్పటి కప్పి వివిధ రంగులతో ఆకర్షణీయంగా ఉంటుంది. పడవ వెనుక భాగంలో పడవ

నడిపేవాడు నీటిలో తెడ్లు వేస్తూ పడవని ముందుకు నడిపిస్తా డు. కాశ్మీర్ కి వచ్చి శిఖారాలో ప్రయాణం

చెయ్యకపో తే కాశ్మీర్ ప్రయాణం పూర్తి కానట్లే లెక్క. శిఖారాలు ఇక్కడి కాశ్మీరీ సాంప్రదాయ జీవన విధానాల్లో ఒక

భాగం. శిఖారా లేకపో తే జీవనం సాగదు. డాల్ లేక్ ని నమ్ముకుని కొన్ని వేలమంది కాశ్మీరీలు జీవితాన్ని

గడుపుతున్నారు. మేము లేక్ మధ్యలోకి వెళ్ళగానే ఎక్కడి నుండి వచ్చారోగాని ఒక పడవలో కెమేరావాళ్ళు

ఫో టోలు తీస్తా ం అంటూ వచ్చారు. ఇంకో పడవలో చిరుతిళ్ళు అమ్మేవాళ్ళు, ఇంకో పడవలో పువ్వులు

అమ్మేవాళ్ళు, ఐస్క్రీమ్ అమ్మేవాళ్ళు, బట్ట లు అమ్మేవాళ్ళు, డ్రై ఫ్రూ ట్స్ అమ్మేవాళ్ళు ఇలా ఒక పదిమందిదాకా

వచ్చేసారు. మేము ఫో టోలు మాత్రం తీయించుకున్నాము. లేక్ లో చిన్న దీవిలాంటిది నెహ్రు పార్క్ కి వెళ్లి
చూసాము. అటునుండి డాల్ లేక్ బజార్ కి వెళ్ళాము. బట్ట ల షాపులు, ఫ్రూ ట్స్ షాపులు, చెప్పుల షాపులు,

పచారీ షాపులు ఇలా అన్నిరకాల షాపులు ఇక్కడ నీటిమీద తేలుతూ ఉంటాయి. ఇవికూడా బో ట్ హౌస్

మాదిరిగానే కదలకుండా ఒకే చోట ఉంటాయి.మనమే పడవలో వెళ్లి జాగ్రత్తగా షాపులాంటి పెద్ద బో ట్లో కి ఎక్కి

షాపింగ్ చేసుకోవాలి. ఇదొ కరకం అనుభూతి. ఒక చోట మా పడవ దగ్గ రికి హో టల్ తేలుతూ వచ్చింది..టీ

తాగాము. పడవ నుండి రకరకాలుగా ఫో టోలు తీసాను,వీడియోలు తీసాను. లేక్ లోపలికి వెళ్తే పాడుబడ్డ

పడవలు చాలానే ఉన్నాయి. కొన్ని బో ట్ హౌసులు కూడా సగం నీట మునిగి చెక్కలు విరిగి అలా

దిక్కులేకుండా ఉన్నాయి. లేక్ లో చాలామంది పడవల్లో విహరిస్తు న్నారు. డిసెంబర్ లో మంచు కురుస్తు న్న

సమయంలో ఇలా డాల్ లేక్ లో విహరిస్తు ంటే ఆ అనుభవమే వేరు అని అనిపించింది. సాయంత్రం 7 గంటలకి

కొంచెం వెలుగు తగ్గినట్లు అనిపించింది. మేము ఎక్కిన ఘాట్ దగ్గ రకి వచ్చి రోడ్డు ఎక్కాము. సల్మాన్ మాకోసం

ఎదురు చూస్తు న్నాడు. జీప్ ఎక్కి మా హో టల్ రాయల్ స్టా ర్ కి బయలుజేరాము. ముందుగా హో టల్ కి

వెళ్లకుండా మాకు అలవాటైన పంజాబీ ధాబాకి వెళ్ళాము. రాత్రికి టిఫిన్లు పార్సెల్ కట్టించుకున్నాము. ఈలోగా

ఎదురుగా ఉన్న గురుద్వారాకి వెళ్ళాము. లోపల అప్పుడే ఏదో ప్రా ర్ధ న ముగుస్తో ంది. మేము వెళ్లి పంజాబీలతో

కలిసి వెనుక నిలబడ్డా ము. తరువాత ప్రసాదం ఇస్తే తిని వచ్చాము. రూమ్ కి వచ్చాక లలిత చెప్పింది ఈరోజు

గుడికి, మసీదుకు, గురుద్వారాకి వెళ్ళాము అని. దారిలో ఎక్కడా చర్చి కనబడలేదు. ఈరోజు చూసిన విశేషాలు

అన్నీ అమ్మవాళ్ల కి చెప్పాము. లలిత వాళ్ళ అమ్మవాళ్ల కి చెప్పింది. ఈరోజు తీసిన ఫో టోలు,వీడియోలు హార్డ్

డిస్క్ లో పెట్టి పడుకున్నాను.

DAY 2

ఉదయాన్నే లేచి స్నానాదికాలు కానిచ్చి మొత్త ం లగేజ్ తీసుకుని క్రిందికి దిగి వచ్చాము. 8 గంటలకి

సల్మాన్ వచ్చాడు. ఈరోజు పహల్గా మ్ కి వెళ్తు న్నాము. అందుకని హో టల్ రూమ్ చెక్ అవుట్ చెయ్యాలి. సరాసరి

పంజాబీ ధాబాకి వెళ్ళాము. టిఫిన్లు అయ్యాక పహల్గా మ్ కి పయనమయ్యాము. దారిలో కొన్ని చూడాల్సినవి

ఉన్నా మళ్ళీ వెనుకకి వచ్చేటప్పుడు చూద్దా ం అని సల్మాన్ చెప్పాడు. శ్రీనగర్ సిటీ ఔటర్ రొడ్డు లో ఒక దారి

గుల్మార్గ్ కి ఇంకొక దారి పహల్గా మ్ కి వెళ్తు ంది. హైవే రొడ్డు బాగుంది. పచ్చని పొ లాలు, కొండలు, దూరంగా

హిమ పర్వతాలు..సాఫ్రా న్ పొ లాలని చూపించాడు సల్మాన్. శ్రీనగర్ లో బైట నుండి తెచ్చే సాఫ్రా న్ ఎక్కువగా

అమ్ముతారట. అసలు సిసలు కాశ్మీరీ సాఫ్రా న్ కావాలంటే పహల్గా మ్ వెళ్లే లేదా వచ్చే దారిలోనే తక్కువ ధరలో
దొ రుకుతుందిట. దారిలో అక్కడక్కడా ఆర్మీ వాళ్ళ పహారా ఉన్నారు. సల్మాన్ చెప్పాడు వాళ్ళు ప్రజలకోసం

కాదుట అక్కడ ఉన్నది. ఒక సమయం సందర్భం లేకుండా అటుఇటు తిరిగే మిలటరీ పెద్దల కోసం, రాజకీయ

నాయకుల కోసం ప్రొ టెక్షన్ ఇవ్వడానికిట. దీనిని రోడ్ ఆన్ ప్రొ టెక్షన్ (ROP ) అని అంటారుట.

స్వామికార్యం..స్వకార్యం అన్నట్లు గా వీరివల్ల శాంతి భద్రతలకు ఏమాత్రం ఆటంకం కలగదు. ప్రజలకి కూడా

రక్షణగా ఉంటారు. పహల్గా మ్ కి వెళ్లే దారిలో చిన్న చిన్న ఊళ్ళు,కాలువలు,వంతెనలు,పొ లాలు దాటుకుంటూ

వెళ్ళాము. ఒకచోట ఆపిల్ వాలీ రెస్టా రెంట్ అని ఉంది అక్కడ కొంతసేపు ఆగాము. కాశ్మీర్ అంటే వెంటనే

గుర్తు కువచ్చేది మంచి కొండలు..ఇంకా ఎర్రటి ఆపిల్స్. కానీ ఆపిల్స్ ని చూడాలంటే ఆగష్టు నుండి కాశ్మీర్ కి

రావాలి. అప్పుడు గుత్తు లు గుత్తు లుగా ఎర్రటి ఆపిల్స్ ఆకుపచ్చని చెట్లమీద చూస్తు ంటే వింతగా అనిపిస్తు ంది.

రెస్టా రెంట్ కి ఎదురుగా చిన్న ఆపిల్ తోట ఉంది. దానిలోకి వెళ్లి చూసాము. చెట్లనిండా ఆకుపచ్చ రంగులో చిన్న

చిన్న ఆపిల్స్ వ్రేలాడుతున్నాయి. ఫో టోలు దిగాము. అక్కడ ఆపిల్ తో చేసిన జామ్, ఆపిల్ చిప్స్, ఆపిల్ జ్యూస్

అమ్ముతున్నారు. జ్యూస్ తాగాము జామ్ కొన్నాము.

ఊళ్ళు వదిలి ఘాట్ రోడ్డు మీదకు వచ్చాము. రోడ్ల మీద గుంపులుగా కాశ్మీరీ గొర్రెల మందలు వెళ్తూ

కనిపించాయి చాల చోట్ల. గొర్రెల ఒంటిమీద బొ చ్చు తీసి చాలా రకాలుగా ఉపయోగిస్తా రు. పహల్గా మ్

దగ్గ రపడుతున్నకొద్దీ చలి పెరుగుతోంది. మంచు కొండలు దగ్గ రగా కనిపిస్తు న్నాయి. రోడ్డు కి ప్రక్కగా లిడ్డ ర్ నది

హో రుగా జోరుగా ప్రవహిస్తో ంది. ఈ లిడ్డ ర్ రివర్ 73 కిలోమీటర్ల దూరం వరకు ప్రవహిస్తు ందిట. సో నామర్గ్ దగ్గ ర

కోలాహాయి గ్లేసియర్ నుండి ప్రవాహం మొదలుపెట్టి 30 కిలోమీటర్లు అరు అనే లోయల నుండి ప్రవహిస్తూ

అనంతనాగ్ జిల్లా లోని పహల్గా మ్ చేరి అటునుండి దారి మళ్లించి మీర్ గుండ్ ఖనబల్ అనే చోట జెహాలుం

నదిలో కలుస్తు ంది. లిడ్డ ర్ నదిలోని నీళ్లు నీలం రంగులో ఉండి ఆకాశం భూమికి వచ్చిందా అన్నట్లు గా

ఉంటుంది. పెహల్గా మ్ అరూ వాలీ కి మధ్యలో ఉంది. పహల్గా మ్ దగ్గ రలో ఒకచోట ఘాట్ రోడ్డు కి ప్రక్కగా ఆపి

దిగాము. రోడ్డు కి అటువైపున లిడ్డ ర్ నది ప్రవహిస్తో ంది. చాలామంది ఇక్కడ ఆగి కొంతసేపు ప్రకృతిని

ఆస్వాదించి వెళతారు. మేము రోడ్డు దిగి క్రిందివైపుకి ఉన్న చిన్న చిన్న గుట్ట లు దాటి నది దగ్గ రికి వచ్చాము.

నదిలో కాళ్ళు పెట్టగానే కరెంటు షాక్ తగిలినట్టు అనిపించింది. చాలా చల్ల గా, స్వచ్చంగా ఉన్నాయి నీళ్లు . నీరు

ముఖం మీద చల్లు కోగానే బడలిక మొత్త ం పో యింది. ఈ నీటిలో స్నానం చేస్తే వొంటి నెప్పులు కూడా

పో తాయేమో. ఆ ప్రదేశం నుండి కదలబుద్ది కాలేదు. లలితా, సిద్ధూ అక్కడ కొన్ని గులక రాళ్లు ఏరారు. మరొక
అరగంటలో పహల్గా మ్ చేరాము. పర్వతాల మధ్య కాలుష్యం లేని చిన్న ఊరు పహల్గా మ్. ఇక్కడ స్థా నిక

జనాభా 10000 లోపే ఉంటారుట. వచ్చిపో యే జనాభానే ఎక్కువ. అందునా అమర్నాథ్ యాత్ర కి వచ్చే వాళ్ళు

అందరూ ఇటునుండే వెళతారు. ఇక్కడి జనాభా మొత్త ం ముస్లింలే.

చిన్న చిన్న సందులు దాటుతూ మేము ఉండవలసిన రిసార్ట్స్ కి వచ్చాము పేరు ‘మంటూ కాటేజ్ &

రిసార్ట్స్’. అప్పటికి సమయం మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. రిసార్ట్స్ ఉన్న ప్రదేశం స్వర్గ ంలా ఉంది. కాటేజ్

కి రెండు వైపులా దూరంగా మంచు పర్వతాలు, గేటు దాటి బైటకి వస్తే రోడ్డు ప్రక్కనే చిన్న సెలయేరు కొంత

దూరంలో లిడ్డ ర్ నది, పచ్చిక మేస్తు న్న గుర్రా లు శీతల వాతావరణం అబ్బా ఇలాంటి చోట శాశ్వతంగా ఉండే

అదృష్ట ం కలిగితే బాగుంటుంది అని అనిపించింది. మొదటి అంతస్తు లో మాకు గది ఇచ్చారు. మా గది నుండి

బయటి అందమైన ప్రకృతి అంతా చక్కగా కనిపిస్తు ంది. మేము కొంచెం సేద తీరాక క్రిందికి వచ్చాము.

పహల్గా మ్ లో ముఖ్యంగా చూడవలసినవి బైసరన్..(దీనిని మినీ స్విట్జా ర్లా ండ్ అని కూడా అంటారు),

చందన్వారి, అరూ వ్యాలీ, బేతాబ్ వ్యాలీ. ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి కానీ చాలా దూరాలు వెళ్ళాలి. ఈ

పూటకి మినీ స్విట్జా ర్లా ండ్ కి వెళదాము అని అనుకున్నాము. అక్కడికి గుర్రా లమీదే వెళ్ళాలి. కొండ గుట్ట లు

ఎక్కాలి మాములు వాహనాలు వెళ్ళలేవు. మా కాటేజ్ బయటనే గుర్రా లవాళ్ళు ఉన్నారు. వాళ్ల తో బేరమాడి

ముగ్గు రం మూడు గుర్రా లు ఎక్కాము. రోడ్డు కి దగ్గ రే లిడ్డ ర్ నది మీద చెక్క వంతెన దాటుతుంటే సిద్ధూ కి

భయమేసి గాట్టిగా అరిచి గోలచేసాడు. తరువాత ధైర్యంగా గుర్రపుస్వారీ చేసాడు. కొంత దూరం తారు రోడ్డు

మరికొంత దూరం మట్టి రోడ్డు మీద ప్రయాణం సాగింది. వీడియో కాల్ చేసి అమ్మావాళ్ళకి చూపించాము. రాను

రాను కొండలు, గుట్ట లు, అడవి ప్రా ంతం వచ్చింది. హిమాలయాలు ఇప్పుడు చాలా దగ్గ రగా కనబడుతున్నాయి.

గుర్రా లు నెమ్మదిగా మలుపులు తిరుగుతూ కొండ ఎక్కుతున్నాయి. కొంచెం భయం వేసింది. నేను అలాగే

చేతిలో సెల్ ఫో న్, హ్యాండీకామ్ పట్టు కుని ఫో టోలు, వీడియోలు తీసాను. అంతకంతకు కొండ ఎత్తు పెరుగుతోంది.

గుర్రా లు కొంచెం రొప్పుతూ ఎక్కుతున్నాయి. నాకేమో వీపు మీద షో ల్డ ర్ బ్యాగ్ బరువు కూడా ఉంది.

భయపడుతూనే కూర్చున్నాము. కొంతసేపటికి చేరవలసిన చోటు వచ్చింది.

గుర్రా లు దిగి టికెట్ తీసుకుని ఒక పెద్ద దుంగ దాటి వెళ్ళాము. ఎదురుగా చాలా పెద్ద పచ్చని పీఠభూమి.

ఆ విశాలమైన ప్రదేశం దాటి మూడువైపులా పొ డవాటి చీనార్ చెట్లు . చెట్ల వెనుక కొంత దూరంలో

హిమాలయాలు. ఆ ప్రదేశం నిజంగానే స్విట్జా ర్లా ండ్ ని తలపిస్తో ంది. జనాలు చాలామంది ఉన్నారు. ఎండ
కాస్తు న్నాకూడా చలి బాగా ఉంది. ఒకవైపున వరుసగా డేరాలు వేసిన హో టళ్లు ఉన్నాయి. వెంటనే ఆకలి

గుర్తు కువచ్చింది. కాశ్మీరీ పులావ్ తిన్నాము. రకరకాల పప్పులు వేసి చాలా రుచిగా ఉంది. కడుపు నిండాక

ఇంక తిరగటం మొదలుపెట్టా ము. ఆ విశాల ప్రదేశమంతా తిరిగాము. అక్కడ పెద్ద గాలితో నింపే బంతులు

ఉన్నాయి. పిల్లల్ని వాటిలోపల ఎక్కించి గుండ్రంగా గడ్డి మీద తిప్పుతున్నారు. ఎండ పో యి సన్నని చినుకులు

మొదలయ్యాయి. అలా చినుకుల్లో తడుస్తు ంటే హృదయం పరవసించిపో యింది. ఆ ప్రదేశంలోనే దాదాపు 2

గంటలకు పైగా గడిపాము. సాయంత్రం 5 దాటాక మళ్ళీ గుర్రా లు ఎక్కి బయలుజేరము. ఈసారి కొండ దిగాలి.

గుర్రా లు క్రిందికి అడుగులు వేస్తు ంటే ఊపిరి బిగబట్టి కూర్చున్నాము. ముందుకు పడిపో తామేమో అని

భయంవేసింది. గుర్రం కాలు కొంచెం బెణికినా అంతే సంగతులు. కొంతసేపటికి రోడ్డు వచ్చింది..మాకు ప్రా ణం

లేచివచ్చింది. గుర్రా లు సరాసరి మా రిసార్ట్స్ ముందుకు వచ్చి ఆగాయి. గుర్రా లతో ఫో టోలు దిగాము.

మా రిసార్ట్స్ ప్రక్కనే ఒక పెద్ద హో టల్ ఉంది. అక్కడ చిన్న గార్డెన్ ఉంటే ముగ్గు రం వెళ్లి ఆడాము.

ఎదురుగా ఇంకొక హో టల్ ఉంది. ఆ హో టల్ వెనుకకి వెళ్తే పెద్ద గార్డెన్ దాని ప్రక్కగా లిడ్డ ర్ నది ప్రవాహం... చాలా

బాగుంది. అక్కడే చాలాసేపు గడిపి రూమ్ కి వచ్చాం. చీకటి పడితే ఆ ప్రా ంతంలో బయటకి వెళ్లలేము. చలి

విపరీతంగా ఉంటుంది. ఇంకొకటి చీకటి. పహాల్గ మ్ ఊరుకి కొంచెం దూరంగా ఉన్నందువల్ల జనసంచారం

తక్కువ, లైటింగ్ కూడా తక్కువే. రూంలోనే ఉండి బట్ట లు సర్దు కున్నాము. విజయలక్ష్మి అక్క ఫో న్ చేసి క్షేమ

సమాచారం అడిగింది. సో నామర్గ్ కి వెళ్ళాక అక్కడినుండి అమర్నాథ్ కి వెళ్లవచ్చా అని అక్కడి గుర్రా లవాళ్ళని

ఆడగమంది. 2004 లో వాళ్ళు వచ్చినపుడు అలానే అడిగారట ఒక్క రోజులో వెళ్లి రావచ్చుట. కానీ అక్కవాళ్ళకి

సమయం లేక వెళ్ళలేదుట. ఈ విషయం తెలిసాక చాలా సంబరపడ్డా ను. రాత్రికి సల్మాన్ ని పిలిచి మెయిన్ రోడ్డు

లో ఉన్న సౌత్ ఇండియన్ హో టల్ కి వెళ్లి డిన్నర్ చేసాము. వాహనం లేకపో తే ఆ సమయంలో బయటకి

అడుగు పెట్టలేము. కాశ్మీర్ కి వచ్చినప్పటి నుండి మా ముఖాలలో మార్పు వచ్చింది. చర్మం

నల్ల బడింది..మొద్దు బారిపో యి పెదాలు బాగా చిట్లిపో యాయి. ఎప్పుడూ క్రీమ్ రాసుకుంటూ ఉండటమే. ఈ

ప్రా ంతాల్లో ఎప్పుడు కరెంటు పో తుందో తెలియదు. ఒక సమయం అంటూ ఉండదు. వేడి నీళ్ల స్నానం చెయ్యాలి

అంటే ముందు రోజు సాయంత్రం నుండి గీజర్ ఆన్ చేసి ఉంచాలి. లేకపో తే నీళ్లు వేడిగా ఉండవు. చిన్నపాటి

వర్షా లు రోజు మొత్త ంలో చాలాసార్లు వచ్చి పలకరించి వెళ్తూ ఉంటాయి. వెన్నెల్లో మంచు కొండలని చూస్తే వెండి
కొండలులాగా మెరుస్తూ కనిపించాయి. ఈ చలి వాతావరణం చూస్తు ంటే నాకు నా లండన్ లో గడిపన
ి రోజులు

గుర్తు కువచ్చాయి.

DAY 3

ఈ రోజు ఉదయాన్నే రెడీ అయ్యి టిఫిన్లు తిన్నాక టూరిస్ట్ టాక్సీ స్టా ండ్ కి వెళ్ళాము. బయట

ఊళ్ళనుండి వచ్చిన వాహనాలు ఇక్కడ లోకల్ లో ఉన్న ప్రా ంతాలకి వెళ్లకూడదుట. పహాల్గ మ్ చుట్టూ ప్రక్కల

ప్రా ంతాలు చూడాలి అంటే ఇక్కడి వాహనాలలోనే వెళ్ళాలి. వాహనాన్ని, మనం ఎంచుకున్న ప్రదేశాలనిబట్టి

రేట్ ఉంటుంది. మేము మారుతి వాన్ తీసుకున్నాము. చందన్వాడి, అరూ వ్యాలీ, బేతాబ్ వ్యాలీలకి వెళదాము

అని అనుకున్నాము. సల్మాన్ మమ్మల్ని దించి వెళ్ళిపో యాడు. ముందుగా పహాల్గ మ్ కి 16 కిలోమీటర్ల

దూరంలో ఉన్న చందన్వాడికి పయనమయ్యాము. ఘాట్ రోడ్డు లో కొండలు లోయలు మధ్య ప్రయాణం

చాలా బాగుంది. దారిలో వచ్చే నెల (జూన్) 28 నుండి ప్రా రంభమయ్యే అమర్నాథ్ యాత్రకి వసతి సౌకర్యాల

పనులు జరుగుతున్నాయి. చందన్వాడి యాత్రకి మొదటి స్థా వరం. ఇక్కడి నుండే యాత్ర ప్రా రంభం

అవుతుంది. దారి మధ్యలో కొండా దిగువున ఒక పెద్ద పార్క్ ఉంది. దానిని బేతాబ్ వ్యాలీ అంటారు. తిరిగి

వచ్చేటప్పుడు చూద్దా ం అన్నాడు డ్రైవర్. మరికొంతసేపటికి చందన్వాడికి చేరుకున్నాము. ఇది గ్రా మమూ

కాదు పల్లెటూరు కాదు. ఇది ఒక మార్కెట్ ప్రా ంతం. ఇక్కడ కొన్ని వసతికి గదులు, యాత్రకి కావలసిన

వస్తు వులు దొ రికే దుకాణాలు, కొన్ని కాకా హో టళ్లు మాత్రమే ఉంటాయి. ఇవికూడా యాత్ర జరిగే నెలలలోనే

ఉంటాయి.

చందన్వాడికి చేరాక రోడ్డు ఇక్కడితో ఆగిపో తుంది. రోడ్డు కి ఎదురుగా పర్వతాలు..మధ్యలో అంత

ఎత్తు కొండా మీదినుండి క్రిందివరకు పెద్ద తివాచీ పరిచినట్లు గా తెల్లటి మంచు దిబ్బ. దీనిని ఇంగ్లీష్ లో

'గ్లేషియర్' అని అంటారు. ఫ్రస్లా న్ గ్లేషియర్ దీని పేరు. ఈ గ్లేషియర్ కి పది అడుగుల దూరంలో పెద్ద కొండా

ఉంది. ఆ కొండ ఎక్కడానికి చక్కగా మెట్లు ఉన్నాయి. అమర్నాథ్ యాత్ర ఈ మెట్ల నుండే మొదలవుతుంది.

గ్లేషియర్ మీద నడవటానికి పొ డవైన కర్రలు అద్దెకి ఇస్తు న్నారు.మంచులో జారీ పడకుండా పొ డవైన బూట్లు

కూడా ఉన్నాయి. మేము కర్రలే తీసుకున్నాము అవి పట్టు కుని మేము నెమ్మదిగా అడుగులో అడుగు

వేసుకుంటూ ఆ మంచు దిబ్బల మీద నడిచాము. జారీ పడినా పెద్దగా దెబ్బలు తగలవు. చల్ల టి దెబ్బలు
బాగుంటాయి. కాకపో తే గ్లేషియర్ ఎక్కే ప్రా ంతమంతా బురదతో ఉంది అందుకని మన వొళ్ళు మాత్రం బురద

అవుతుంది అంతే. మేము సగం దూరం వరకు వెళ్ళాము. సిద్ధూ బాగా ఆడాడు మంచుతో. కొంతమంది ఇంకా

పైకి ఎక్కి అక్కడినుండి స్లెడ్జ్ మీద వేగంగా క్రిందికి వస్తు న్నారు. మేము చాలా ఫో టోలు తీసుకున్నాము.

గ్లేషియర్ కి ఒక ప్రక్కగా పెద్ద రంధ్రం ఉంది. దానిలోపలి నుండి అతి వేగంగా సుడులు తిరుగుతూ గ్లేషియర్

నీరు ప్రవహిస్తో ంది. ఆ నీరు క్రిందకి వెళ్లి నదిలో కలుస్తు న్నాయి. ఈ మంచు గుంట మాత్రం చూడటానికి

అందంగానూ అతి భయంకరంగాను ఉంది. మంచులో ఆడుతుంటే మా డ్రైవర్ వచ్చి ఒక గంట అయ్యింది ఇంక

వెనక్కి రండి అన్నాడు. వాడు తీసుకువెళ్లే ప్రదేశాలలో ఒక గంట మాత్రమే గడిపి రావాలిట. గంట దాటితే 300

కట్టి మరొక గంట ఉండవచ్చు. ఈ పద్ధ తి నాకు అస్సలు నచ్చలేదు. చందన్వాడిలో అస్సలు ఉన్నట్టే లేదు.

డ్రైవర్ ని తిట్టు కుంటూ వచ్చేసాము. తిరుగు ప్రయాణంలో బేతాబ్ వ్యాలీ కి వెళ్ళాము. పెహల్గా మ్ కి 15

కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పార్క్. ఈ వ్యాలీ ని హగూన్ అని పిలిచేవారట కానీ 1983 లో వచ్చిన బేతాబ్

అనే హిందీ సినిమా షూటింగ్ ఇక్కడ జరగటంతో అప్పటినుండి బేతాబ్ వ్యాలీ అనే పేరు స్థిరపడిపో యింది.

ఇక్కడ పెద్దగా చూడటానికి ఏమి లేదు కానీ లిడ్డ ర్ నదికి ప్రక్కనే ప్రశాంతమైన లోయ ప్రదేశం, చుట్టూ

కొండలు, చిన్న పిల్లలు ఆడుకోవటానికి సదుపాయాలు, హో టళ్లు వగైరా ఉన్నాయి. ఈ ప్రా ంతం వింటర్

సీజన్లో చాలా బాగుంటుంది.

బేతాబ్ వ్యాలీలో చూడటానికి ఏమీ లేక అరగంట ముందే వచ్చేసాము. అటునుండి 12 కిలోమీటర్ల

దూరంలో ఉన్న అరూ వ్యాలీకి వెళ్ళాము. ఈ వ్యాలీ ఎత్తైన కొండ ప్రా ంతంలో ఉండటంవలన ఒంపులు

తిరుగుతూ వెళ్లే ఘాట్ రోడ్లు , లోతైన లోయలు, లోయల మధ్య నుండి ప్రవహించే లిడ్డ ర్ నది, చుట్టూ మంచు

కొండలు..ప్రక్రు తి ఒడిలోకి వెళుతున్నట్టు గా ఉంది. చిన్న చిన్న జలపాతాలు కూడా ఉన్నాయి. కొంతసేపు

వర్షపు చినుకులు కూడా పడ్డా యి. కొంతసేపటికి సెల్ ఫో న్ సిగ్నల్స్ పో యాయి. అరూ వ్యాలీ ఒక చిన్న

పల్లెటూరుకంటే చిన్నగా ఉంది. అక్కడ ఉండేవాళ్ళు అందరూ ఉన్న నాలుగు ఐదు సందులలో వ్యాపారస్తు లే.

చిన్న చిన్న హో టళ్లు ఉన్నాయి. ఒక స్కూల్ కూడా ఉంది. పచ్చని గడ్డి లో ఆడాము. ఇక్కడ కూడా ఒక

వైపు రోడ్ ఆగిపో యి కొండ గుట్ట లు మొదలవుతాయి. చాలామంది గుర్రా లమీద ఆ గుట్ట ల నుండి ఇంకా పైకి

వెళ్తు న్నారు.అరూకంటే ఇంకా పైకి వెళ్లే మార్గ ం వేరే వైపున ఉంది. రోడ్డు ప్రక్కగా సన్నని స్వచ్ఛమైన మంచు

నీరు ప్రవహిస్తో ంది మేము అందులో నడిచి చిన్న బండలమీద కూర్చున్నాము. ఆ ప్రా ంతం వదిలి
వెళ్ళబుద్ధికాలేదు. మాకు మిగిలిన అరగంటని ఇక్కడ వాడుకున్నాము. అరూ వ్యాలీ నుండి క్రిందికి వస్తు ంటే

దారిలో ఒకచోట రివర్ ర్యాఫ్టింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ రోడ్డు ప్రక్కన లిడ్డ ర్ నది ఉరకలు వేస్తూ సుడులు

తిరుగుతూ పల్లా నికి ప్రవహిస్తూ ఉంటుంది. గాలి నింపిన తేలికపాటి బో టులు వొడ్డు న ఉన్నాయి. ఇక్కడి

నుండి మూడు నాలుగు మైళ్ళ దూరంలో పహాల్గ మ్ ఊరు వరకు ర్యాఫ్టింగ్ చేస్తా రు. నేను చేద్దా మని

ముచ్చటపడితే సిద్ధూ భయపడ్డా డు వద్దు అన్నాడు.

మధ్యాహ్నం లంచ్ టైం కి సౌత్ ఇండియన్ హో టల్ దగ్గ ర దిగాము. నేను హో టల్ పక్కనే ఉన్న sbi

ఎటిఎం లోకి వెళ్లి 3000 తీయటానికి ప్రయత్నిస్తే అంతా సవ్యంగా జరిగి చివర్లో డబ్బులు రాలేదు. నాకేమో

అకౌంట్ లో డబ్బు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. రేపు ఇదే సమయానికి క్రెడిట్ అవుతుందిలే అనుకుని

హో టల్లో కి వెళ్ళాను. లంచ్ అయ్యాక సల్మాన్ ని పిలిచాను. రేపు ప్రొ ద్దు న్న టిఫిన్ కి బదులు బ్రెడ్ తిందాము

అని లలిత బ్రెడ్,టమోటా,చీజ్,ఆనియన్ కొన్నది. హో టల్ కి వెళ్లి సాయంత్రం వరకు పడుకున్నాము. కాళ్ళకి

చెప్పులు లేక చాలా ఇబ్బందిగా ఉంది ప్రతిదానికి షూ వేసుకోవాలి మళ్ళీ విప్పాలి. అందుకని మార్కెట్ వరకు

వెళదాము అనుకుని ముగ్గు రం బయలుదేరాము. మాకు తెలిసిన దారివెంబడి నడిచి పరిసరాలని ఆస్వాదిస్తూ

చిన్న మార్కెట్ ప్రదేశానికి చేరాము. అక్కడ ఒక చెప్పుల దుకాణంలో రబ్బర్ చెప్పులు కొన్నాను. అక్కడ

ఇళ్ళు అన్నీదాబాలు లేకుండా పైకప్పు రేకులు, చెక్కలతో పిరమిడ్ ఆకారంలో ఉన్నాయి. వర్షం,మంచు

పడినప్పుడు వెంటనే జారీపో తాయి. లలిత అమ్మావాళ్ళతో మాట్లా డుతూ ఇక్కడి కబుర్లు చెప్పింది. సమయం

సాయంత్రం 6 దాటింది. చలి బాగా పెరిగింది.ఇళ్ల లో లైట్స్ వెలిగాయి. కొంచెం చీకటిపడింది. దూరంగా వెండి

రంగులో మంచు కొండలు నిగనిగలాడుతున్నాయి. ఫో టోలు తీసాను. ఇక్కడే ఉండిపో తే బాగుంటుంది

అనిపించింది. బాగా చీకటిపడ్డా క రూమ్ కి వచ్చాము. ఇంక బయట హో టల్ కి వెళ్లే ఓపిక లేక ఇక్కడే డిన్నర్

ఆర్డ ర్ చేసాము. రోటీలు, సబ్జీ . ఈ పూట హో టల్ కి ఒక పాతికమంది బస్సు లో వస్తు న్నారట. నిన్న మేము

వచ్చినప్పుడు మేము తప్ప ఇంకెవరు లేరు. విజయలక్ష్మి అక్క మళ్ళీ ఫో న్ చేసి చాలాసేపు మాట్లా డింది.

డిన్నర్ కి హో టల్ పక్కన డైనింగ్ రూమ్ కి వెళ్లి తిన్నాము. చాలా రుచిగా ఉన్నాయి. రేపు రూమ్ ఖాళీ

చెయ్యాలి అందుకే అన్నీ సర్దేసి రెడీగా పెట్టా ము.


DAY 4

ఈరోజు పహాల్గ మ్ నుండి గుల్మార్గ్ కి వెళ్ళాలి. సల్మాన్ ని ఉదయం 7.30 కి రమ్మని చెప్తే తీరికగా

8.30 దాటాక వచ్చాడు. కొంతసేపు వాడితో ఏమీ మాట్లా డలేదు. లగేజ్ వాహనంలో పెట్టి ముందుగా హో టల్

కి వెళ్ళాము. టిఫిన్స్ తిన్నాక పహాల్గ మ్ కి చివరిసారి టాటా చెప్పి గుల్మార్గ్ కి బయలుజేరము.

తెల్లవారుజామున చలి బాగా ఉన్నా 9 దాటేసరికి ఎండ వచ్చింది. గుల్మార్గ్ కి దాదాపు 150 కిలోమీటర్లు 4

గంటలు పడుతుంది. కొండలు, లోయలు దిగేసరికి ఎండవేడి ఎక్కువైంది. చిన్న చిన్న ఊళ్ళు దాటుకుంటూ

వెళ్ళాము. ఒక 20 కిలోమీటర్లు వెళ్ళాక రోడ్డు కి ప్రక్కగా ఆపి దూరంగా 100 మీటర్ల ఎత్తు లో ఉన్న చిన్న

కొండమీద ఒక దర్గా ని చూపించాడు సల్మాన్. ఆ దర్గా పేరు 'హజరత్ జైన్ ఉద్ దిన్ వాలి'. 2015 లో రిలీజ్

అయిన సల్మాన్ ఖాన్ హిందీ సినిమా 'భజ్రంగీ భాయిజాన్' లోని దర్గా లోని పాట ఇక్కడ తీసిందే అని

చెప్పాడు. ఈ దర్గా అనంతనాగ్-పహాల్గ మ్ రూట్ లో అష్ముఖం అనే గ్రా మంలో ఉంది. నాకు దర్గా చూడాలని

ఉన్నా వెళ్లి వచ్చేసరికి గంట పైగానే సమయం అవుతుంది. బిక్కమొహంతో ఉన్న చోటునుండే ఫో టో

తీసుకుని ముందుకు కదిలాము.

మరికొంత దూరంలో అనంతనాగ్ ఊరు వచ్చింది. రోడ్ల నిండా జనాలు, విపరీతంగా ట్రా ఫిక్ ఉంది.

ఊరు దాటినకొంతసేపటికి ఒక ఢాబా దగ్గ ర ఆగి టిఫిన్ తిన్నాము. దారిలో క్రికెట్ బ్యాట్లు తయారు చేసి అమ్మే

షాపులు చాలా ఉన్నాయి. ఒక షాప్ దగ్గ ర ఆగాము. లోపలికి వెళ్తే కాశ్మీరీ చెక్క నుండి క్రికెట్ బ్యాట్ తయారు

చేసే వర్క్ షాప్ ఉంది. చెక్క ఒకొక్క చోట ఒకొక్క రూపం మారుతూ చక్కని బ్యాట్ తయారు అయ్యే

విధానాన్ని నిశితంగా పరిశీలించాను.. వీడియోలో బంధించాను. సిద్ధు కి నచ్చిన చక్కని బ్యాట్ ఒకటి

కొన్నాను. వాడు ఆ బ్యాట్ పట్టు కుని తెగ మురిసిపో యాడు. లలిత ప్రక్క షాపులో కాశ్మీరీ శాలువా కొన్నది.

మళ్ళీ ప్రయాణం మొదలు. ఇప్పుడు మేము పుల్వామా జిల్లా లోని అవంతీపుర అనే టౌన్ దగ్గ రలో

ఉన్నాము. ఇది శ్రీనగర్ కి అనంతనాగ్ కి మధ్య దారిలో ఉంది. ఇక్కడ అవన్తి స్వామి గుడి శిధిలాలు

చూడతగ్గ వి. వాహనం అటువైపు మళ్ళించాడు సల్మాన్. అవన్తి వర్మన్ అనే రాజు (AD 853- 883)లో ఈ

గుడిని నిర్మించాడుట. ఇది మహా విష్ణు వు గుడి. పూర్తిగా నేలమట్ట మై ప్రస్తు తం శిధిలాలు మాత్రమే

మిగిలాయి. ఒక కిలోమీటర్ దూరంలో ఇలాంటిదే ఇంకో గుడి ఉందిట అది శివుడి గుడిట. అక్కడికి మేము

వెళ్ళలేదు. రోడ్ కి ప్రక్కగా ఉన్న ఈ గుడిని చూస్తే చాలా బాధ అనిపించింది. విరిగిన ముక్కలమీద
అద్భుతమైన శిల్పకళ చెక్కి ఉంది. ఒకప్పుడు బ్రహ్మాండముగా వైభవముగా పూజలు అందుకున్న ఈ

గుడులు సొ ంత గడ్డ మీద ఆఫ్ఘ న్ నుండి ముస్లింల దండ యాత్రలలో పూర్తిగా నామరూపాలు లేకుండా

పో యాయి. శిధిలాల మధ్య కొన్ని ఫో టోలు దిగాము.

మరొక గంటకి డ్రై ఫ్రూ ప్ట్స్ అమ్మే షాప్ దగ్గ ర ఆగాము. షాప్ నిండా రకరకాల డ్రై ఫ్రూ ప్ట్స్ అందంగా పెట్టి

ఉన్నాయి. డ్రై ఫ్రూ ప్ట్స్ నుండి తయారు చేసిన నూనెలు కూడా సీసాలలో పెట్టి అమ్ముతున్నారు. మేము

ముందుగా అనుకున్న లిస్ట్ ప్రకారం డ్రై ఫ్రూ ప్ట్స్ కొన్నాము. కాశ్మీర్ లో మంచి క్వాలిటీ తో కొంచెం చౌకలో

దొ రుకుతాయి. తరువాత ప్రక్కన టీ షాపులో కాశ్మీరీ కావా అనే పానీయం తాగాము చాలాబాగుంది. ఒక

డబ్బా కొన్నాము. కావా గురించి సల్మాన్ చెప్పాడు ఆరోగ్యానికి చాలా మంచిదిట. మధ్యాహ్నం లంచ్ టైం కి

తంగ్ మార్గ్ అనే చిన్న టౌన్ కి చేరాము. ఇది బారాముల్లా అనే జిల్లా లో ఉంది. ఇక్కడినుండి గుల్మార్గ్

దాదాపుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక హో టల్ దగ్గ ర ఆగాము లలిత ఫ్రైడ్ రైస్ తింటే నేను

సిద్ధూ ఫుల్ మీల్స్ తిన్నాము. అక్కడి నుండి మరొక అరగంటలో ఘాట్ రోడ్డు మొదలయింది. ఈపాటికి నేను

సల్మాన్ చాలా విషయాలగురించి మాట్లా డుకున్నాము. అతని ఫ్యామిలీ గురించి చెప్పాడు. కాశ్మీర్ హిస్టరీ

చెప్పాడు. సల్మాన్ తో మాటల్లో పడి వెనుక సీట్ లో ఉన్న లలిత ని సిద్ధూ ని పట్టించుకోలేదు. పాపం లలిత

ఫీల్ అయ్యింది.

ఘాట్ రోడ్డు ఎక్కుతున్నకొద్దీ వాతావరణం చల్ల బడుతోంది. కొంతసేపటికి సన్నగా వర్షం కూడా

పడింది. కొండలు లోయల మధ్య నుండి సాగింది ప్రయాణం. ఒక గంటలో గుల్మార్గ్ కి చేరాము. సముద్ర

మట్టా నికి 8,694 అడుగుల ఎత్తు లో బారాముల్లా అనే జిల్లా లో ఉంది గుల్మార్గ్. ముందుగా చిన్న చిన్న

హో టళ్లు , బట్ట ల షాపులు, గుర్రా లవాళ్ళు కనిపించారు. ఇంకొకవైపున మైదానంలో చిన్న గుట్ట మీద ఒక

శివుడి గుడి ఉంది. 1974 లో వచ్చిన హిందీ సినిమా 'ఆప్ కీ కసమ్' లోని 'జై జై శివ్ శంకర్' అనే పాటని ఈ

గుడి దగ్గ రలోనే తీసారట. ఇవన్నీ దాటి రెండు మూడు మైళ్ళు ముందుకి వెళ్ళాము. మాకు నైట్ హల్ట్ కీ

ఇచ్చిన హో టల్ 'గ్రీన్ పార్క్' దగ్గ ర దిగాము. రూమ్ బాగుంది. కొంచెం బడలిక తీర్చుకుని మళ్ళీ సల్మాన్ తో

కలిసి షాపులు ఉండే ప్రదేశానికి వచ్చాము. తిరగటం పూర్తి అయ్యాక ఫో న్ చెయ్యమని చెప్పి సల్మాన్

వెళ్ళిపో యాడు.
గుల్మార్గ్ లో ఎక్కడా కాలుష్యం లేదు. ప్రతిచోటా పరిసరాలు చాలా శుభ్రంగా ఉన్నాయి. చాలా చోట్ల

కొండల నుండి ప్రవహించే నీటిని పైపుల ద్వారా దారి మళ్లించి హో టళ్ల దగ్గ ర పంపులు పెట్టి వాడుతున్నారు.

గుల్మార్గ్ లో ప్రపంచ ప్రసద


ి ్ధి చెందిన ఎత్తైన గోల్ఫ్ కోర్స్ ఉంది. ఇది చారితక
్ర ప్రా ధాన్యమైనదికూడా. ఈ గోల్ఫ్

కోర్స్ సముద్ర మట్టా నికి 2,650 అడుగుల ఎత్తు లో ఉంది. బ్రిటిష్ వాళ్ళు వేసవి తాపాన్ని తప్పించుకోవటానికి

ఎక్కువగా గుల్మార్గ్ కి వచ్చేవారుట. సరదాగా గోల్ఫ్ ఆడేవారట. అలా 1890-91 లో కల్నల్ నెవిల్ల్

చాంబర్లిన్ అనే బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ ఇక్కడ గోల్ఫ్ కోర్స్ మొదలు పెట్టా రుట. తరువాత కాలంలో గోల్ఫ్ క్ల బ్

1911 లో స్థా పించబడిందిట. మొదటి గోల్ఫ్ ఛాంపియన్షిప్ 1922 లో జరిగిందిట. ఇంకా గుల్మార్గ్ లో 1902 లో

నిర్మించబడిన సెయింట్ మేరీ చర్చి చూడతగ్గ ది.

టీ తాగి గుట్ట మీద గుడి వైపుకి నడిచాము. 1915 వరకు పరిపాలనలో ఉన్న మహారాజ హరి

సిసో డియా ఈ గుడిని నిర్మించాడుట. గుల్మార్గ్ లో ఏ ప్రదేశంనుండైనా ఈ గుడిని చూడవచ్చు. పైకి ఎక్కడానికి

దాదాపు 20 మెట్లు ఉన్నాయి. గుడి దగ్గ ర నుండి గుట్ట కీ అన్ని వైపులా పచ్చటి గడ్డి మొలిచి ఎత్తు పల్లా లుగా

ఉన్న భూమిని చూడవచ్చు. అమ్మావాళ్ళకి వీడియో కాల్ చేసి ప్రకృతి అందాలని చూపించాను. తివాచిలాంటి

గడ్డి మీది నుండి నడిచి దూరాన ఉన్న మరొక పెద్ద గుట్ట మీదకు వెళ్ళాము. అక్కడి నుండి గుల్మార్గ్ అందాలు

మొత్త ం కనిపిస్తా యి. సన్నని వర్షం పడింది. దూరాన మంచుకొండలు రమ్మని పిలుస్తు న్నాయి. నేను మా

ఆఫీస్ లో అరుణ్ కి కాల్ చేశాను తీయలేదు. రాము కి వీడియో కాల్ చేసి గుల్మార్గ్ ని చూపించాను.

అకౌంటెంట్ వెంకటేశ్వరరావు కూడా చూసాడు. లలిత తన ఫ్రెండ్ తో మాట్లా డింది. తాను ఎంత ఆనందంగా

ఉత్సాహంగా ఉందో తన మాటల్లో తెలుస్తో ంది. ఆ గుట్ట మీద చాలాసేపు గడిపాము సమయం తెలియలేదు.

చాలా ఫో టోలు తీసుకున్నాము వీడియో తీసాను. తరువాత షాపులు ఉన్న చోటుకి వచ్చాము. ఒక హో టల్

లో రాత్రి డిన్నర్ కి రోటీలు ఆర్డ ర్ ఇచ్చి హో టల్ పేరు చెప్పాము. 8 గంటలకి తెచ్చి ఇస్తా ను అన్నాడు. లలిత

ఏదో షాపింగ్ చేసింది. చలి బాగా పెరిగింది..సన్నగా వణుకు పుట్టింది. పెహల్గా మ్ కి మించి ఇక్కడ చలి బాగా

ఉంది. సల్మాన్ కి కాల్ చేశాను 5 నిముషాలలో వచ్చాడు వెంటనే రూమ్ కి వెళ్ళాము. రూమ్ లో కూడా చలి

బాగా ఉంది. కొంతసేపటికి రూమ్ చుట్టు పక్కల చూడటానికి మళ్ళీ బయటికి వచ్చాము. మా హో టల్ రోడ్డు కి

దూరంగా చిన్న చిన్న గుట్ట లకి దగ్గ రగా ఉంది. హో టల్ వెనకాల ఆకుపచ్చని గడ్డి పరుచుకుని ఉన్న గుట్ట లు

చెట్లు ఉన్నాయి. మేము గుట్ట లమీదకి ఎక్కి ఫో టోలు దిగాము. గుట్ట కింద ఒక తెల్లటి గుర్రం గడ్డి మేస్తు ంటే
దగ్గ రికి వెళ్లి చూసాము. గుర్రం చాల అందంగా ఉంది. చీకటి పడ్డా క బైటికి వచ్చి చూస్తే హో టల్ ప్రక్కనే

గుర్రా లవల్ల పెంకుటిళ్ళు తప్ప ఇంకేమీ కనపడలేదు అంత చీకటిగా ఉంది. డిన్నర్ ఆర్డ ర్ తీసుకున్న

ధాబావాడు వచ్చి పార్సెల్ ఇచ్చాడు. రోటీలు చాలా రుచిగా ఉన్నాయి. ఇప్పుడు చలి ఇంకా పెరిగింది.

సాయంత్రం నుండే గీజర్ వేసి ఉంచాను. ఏ వస్తు వు పట్టు కున్నా మంచుని పట్టు కున్నట్టు గా ఉంది. ఇక్కడ

మంచాలకి పరుపుల మీద కరెంటు దుప్పట్లు ఉన్నాయి. స్విచ్ ఆన్ చేస్తే పరుపులో కొంతమేర వేడెక్కుతుంది.

వేడిని ఎక్కువ తక్కువ చేసుకునే వీలు ఉంది. ఈ వేడి దుప్పట్లు ఉన్నాకూడా మళ్ళీ పైన మందమైన దుప్పటి

కప్పుకుని పడుకున్నాము.

DAY 5

ఈరోజు ఒక అద్భుతమైన సాహసాన్ని చూడబో తున్నాము..చేయబో తున్నాము..అదే కాశ్మీర్ లో

ఇంకా చెప్పాలంటే భారతదేశంలో మరెక్కడా లేని ఒక అద్భుతం. అదే మంచు పర్వతం పైకి ఎక్కటం. గుల్మార్గ్

లో 'గండో లా' అని పిలువబడే ఒక రోప్వే లేదా కేబుల్ కార్ సర్వీస్ ని నిర్వహిస్తు న్నారు. మనం ఇనుప బెల్ట్ కి

కట్టి ఉన్న ఒక పెట్టెలో కూర్చుంటే అది నెమ్మదిగా ఎత్త యిన మంచు పర్వతం మీదకి తీసుకువెళుతుంది.

దీనిని గండో లా రైడ్ అని అంటారు. సల్మాన్ 7 గంటలకల్లా వచ్చాడు. మేము హో టల్ రూమ్ చెక్ అవుట్ చేసి

లగేజ్ అంతా మా వాహనంలో పెట్టి షాపులు హో టళ్లు ఉన్న ప్రా ంతానికి వచ్చాము. ఒక హో టల్ లో దో స ఆర్డ ర్

చేసాము. పెనం మీద దో స వేస్తు ంటే వెంటనే గట్టి పడిపో తోంది అక్కడి చలికి. నూనె వేసినా పెనం వదిలి

రావటంలేదు. ఒక నలుదైదు దో శలు వేసి ఇంకేమైనా తినండి అనేశాడు. మేము ఆలు పరోటా తిన్నాము.

సల్మాన్ మేము గండో లా కి వెళ్లి వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అన్నాడు.

గండో లా కి ఫేస్ 1 మరియు ఫేస్ 11 అని ఉన్నాయి. మొదటిది 8,500 అడుగుల ఎత్తు లో ఉన్న

గుల్మార్గ్ నుండి కాంగ్డూ రి అనే 10,100 అడుగుల ఎత్తు లో ఉన్న కొండ ప్రా ంతం వరకు ఉంటుంది. అక్కడ

నుండి 12,960 అడుగుల ఎత్తు లో ఉన్న అఫర్వాట్ అనే మంచు కొండ వరకు వెళ్లే కేబుల్ స్టేషన్ ఉంటుంది.

అఫర్వాట్ కొండ పైన మంచులో రాళ్ల గుట్ట లు దాటుకుని పర్వత శిఖర ప్రా ంతానికి వెళితే 13,800 ల అడుగుల

ఎత్తు కి చేరవచ్చు. మేము వెళ్ళినప్పుడు మొదటి ఫేస్ కి మరమ్మత్తు లు చేస్తు న్నారు. అందుకని క్రింది
నుండి మొదటి జంక్షన్ వరకు గుర్రా లమీదే వెళ్ళాలి. లలిత కి రబ్బర్ బూట్లు అద్దెకి తీసుకున్నాము మంచులో

జారిపడకుండా. హో టళ్ల దగ్గ ర చాలామంది గుర్రా లవాళ్ళు ఉన్నారు. మేము మూడు గుర్రా లని కుదుర్చుకొని

ఎక్కాము. సగం దూరం సిమెంట్ రోడ్డు మీద మరికొంత దూరం ఘాట్ రోడ్డు మీద ప్రయాణం సాగింది. ఆ

తరువాత కొండ ఎక్కటం మొదలుపెట్టా యి గుర్రా లు. కొండరాళ్ళు నిండిన మట్టి రోడ్డు లో రొప్పుతూ పై పైకి

ఎక్కాయి గుర్రా లు. అదే దారిలో ఇద్ద రు కూర్చునే వీలున్న వెడల్పాటి నాలుగు చక్రా ల బండి కూడా ఉంది.

మోటారు సైకిల్ లాంటి ఈ వాహనం చిన్న చిన్న గుట్ట లు ఎత్త యిన రోడ్లు సునాయాసంగా ఎక్కేస్తు ంది. కానీ

అది ఖరీదు ఎక్కువ. మా గుర్రా లని సన్నని చెట్ల మధ్య నుండి గుట్ట లనుండి తీసుకువెళ్లా డు మా

గుర్రా లవాడు. గంటాముప్పై నిముషాల పైగానే పట్టింది మొదటి ఫేస్ కి చేరటానికి. దారి మధ్యలో పెద్ద పెద్ద

టవర్లు ఉన్నాయి. వాటికీ ఇనుప కేబుల్స్ కట్టి ఉన్నాయి. అక్కడక్కడా పీఠభూమి కూడా ఉంది. మంచు

కురిసే సీజన్లో వస్తే ఈ దారి మొత్త ం కొండ మొత్త ం మంచుతో కప్పేసి ఉంటుంది.

స్టేషన్ ఒక పెద్ద షెడ్ లాగా ఉంది. వెనుక వైపుకి వెళ్లి టికెట్స్ తీసుకున్నాను. ముందువైపుకి వచ్చి

రెస్టవురెంట్ ఉంటే వెళ్లి టీ తాగాను. బైట నలువైపులా ప్రకృతి సౌందర్యం కనువిందు చేస్తో ంది. మేము చాలా

ముందుగా వచ్చాము కాబట్టి టికెట్స్ దొ రికాయి లేకపో తే కిలోమీటర్ దూరం వరకు వరుసలో నిలబడాలిట.

ముగ్గు రం పైన అంతస్తు లోకి వెళ్ళాము. అక్కడ కేబుల్ కార్లు నెమ్మదిగా వరుసలో ఇంజిన్ రూమ్ లోకి

వస్తు న్నాయి. ప్లా ట్ ఫారం మీదకి వచ్చాక తలుపులు తెరుచుకుంటున్నాయి. అప్పుడు లోపలి ఎక్కాము.

ఒక కార్ లో ఆరుగురు సరిపో తారు. ఎక్కగానే తలుపులు మూసుకుంటూ కదిలింది. నేను కెమెరా వీడియో

రెడీగా పెట్టు కున్నాను. పై పైకి వెళుతున్నకొద్దీ ఏదో తెలియని ఆవేశం వచ్చింది. స్టేషన్ షెడ్, వందలాది

గుర్రా లు, చుట్టు ప్రక్కల ప్రకృతి అన్నీ క్షణాల్లో చిన్న చిన్న బొ మ్మల్లా గా కనిపించాయి. కొంతసేపటికి ఎటు

చూసినా తెల్లటి మబ్బులు..స్వర్గ లోకానికి వెళుతున్నామా అని అనిపించింది. మరికొంతసేపటికి మబ్బులను

చీల్చుతూ తెల్లని మంచుకొండ అఫర్వాట్ కంటపడింది. మాకు గాలిలో తేలుతున్నట్లు గా అనిపించింది.

సుమారు పావుగంట తర్వాత 5 కిలోమీటర్లు దూరం ప్రయాణించి మా చిన్ని విమానంలో నుండి ఫేస్ 11 దగ్గ ర

దిగాము. మెట్లు దిగి క్రిందికి వచ్చాము. ఒక వైపున అంతా సూన్యమే. తెల్లని మబ్బులు, కొండలు. మరొక

వైపున అఫర్వాట్ పర్వతం. ఈ పర్వతానికి ముందు ఉన్న కొండ మీద BSF (Border Security Force)

వాళ్ళ స్థా వరాలు ఉన్నాయి. ఈ అఫర్వాట్ కొండ ప్రక్కనే మనదేశం, పాకిస్థా న్ దేశం యొక్క సరిహద్దు ఉంది.
కాశ్మీర్ లోని అనేక సరిహద్దు ప్రా ంతాలలో ఇదికూడా ఒకటి. ఇక్కడ కూడా జవాన్లు 365 రోజులు రాత్రీ పగలు,

ఎండా వానా తేడాలేకుండా గస్తీ తిరుగుతూ ఉంటారు. మనం చేతులు ఊపితే వాళ్ళు కూడా చెయ్యి

ఊపుతారు..అంతా దగ్గ రగా ఉంది మన దేశ స్థా వరం. ఫది అడుగులు వేసాక దట్ట ంగా మంచుతో నిండిన కొండ

మొదలయింది. కొంత ఎత్తు వరకు ఒక వైపు రాతి గుట్ట లు పక్కనే మంచు కలిసి ఉన్నాయి. గుట్ట ల మీది

నుండి మంచులో నడుస్తూ కొండ పైకి వెళ్ళాము. మధ్య మధ్యలో మన మోకాలి లోతు గుంటలు ఉన్నాయి.

సగం వరకు మంచులో దిగబడిపో తాము. భయం అస్సలు ఉండదు. ఆ గుంటలు మంచు కి రాళ్ళకి మధ్య

ఉన్న ఖాళీలు అంతే. ఒకచోట లలిత కాళ్ళు కూడా గుంటలో దిగప


ి ో యాయి. కష్ట ం మీద పైకి వచ్చింది.

ఇంక కాళ్ళ నెప్పులు మొదలయ్యాయి తనకి. ముందుగా పైకి వెళ్ళినవాళ్ళు స్లెడ్జ్ బండ్ల మీద వేగంగా క్రిందికి

వస్తు న్నారు. చాలామంది జనాలు కొండకి ఒకవైపున పరుచుకొని ఉన్నారు. ఇక్కడి కొండ మీది మంచు

ఇసుకలాగా మెత్తగా కొంచెం పిండిలాగా ఉంటుంది. అందుకే ఇంత పైకి ఎక్కటానికి అనువుగా ఉంటుంది.

మేము ముగ్గు రం మంచులో విపరీతంగా ఆడాము. ఇక్కడ కూడా బూట్లు అద్దెకి ఇచ్చేవాళ్ళు, స్లెడ్జి వాళ్ళు ,

స్కీయిo గ్ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు.

ఒక స్కీయిo గ్ వాడు వెంటపడుతుంటే సిద్ధూ చేత కొంత దూరం స్కీయిo గ్ చేయించాను బాగా

చేసాడు. సిద్ధూ కి మంచు అంటే అస్సలు భయం లేదు. మంచుని బాల్ లాగా చేసి మామీద విసిరాడు.

ఇద్ద రం మంచులో పడుకుని దొ ర్లా ము. అలసిపో యాక ఒక దిబ్బ మీద కూర్చుని చిరుతిండ్లు తిన్నాము. ఎటు

చూసినా ఒక్క చెట్టు కూడా లేదు. సిగ్నల్స్ అస్సలు ఉండవు అనుకుంటే నాన్న ఫో న్ వచ్చింది. మేము

ఆశ్చర్యపో యాము. నాన్నతో ఉద్వేగంతో మేము ఉన్న చోటుని వర్ణించాను. గుల్మార్గ్ కి వచ్చాక ఫో న్ చేస్తా ను

అని చెప్పాను. నాకు ఇంకా ముందుకి వెళ్లి చూడాలనిపించింది. ఇద్ద రినీ ఇక్కడే కూర్చోమని చెప్పి నేను

కెమెరా తీసుకుని మంచులో నడుచుకుంటూ ఇంకా ముందుకి వెళ్ళాను. ఒక చోట కొండ అంచున ఒక పెద్ద

రతి దిబ్బ ఉంది. అక్కడ ఇద్ద రు మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కెమెరా ఇచ్చి నేను ఆ దిబ్బ మీద నిలబడి

ఫో టోలు తీయించుకున్నాను. ఫొ టోలో వెనుకవైపున ఉన్న కొండలు పాకిస్థా న్ లోనివి. కొంతదూరం వెళ్ళాక

కొండకి ఎడమప్రక్కకి వచ్చాను ఇక్కడ మంచు లేదు పూర్తిగా రాళ్ల దిబ్బలు, చిన్న చిన్న మొక్కలు

ఉన్నాయి. ఇక్కడినుండి కొండ క్రిందివప


ై ునకు ఉంది. కొంతదూరం క్రిందికి దిగి వెళ్లి మళ్ళీ ఎక్కాను. కొండ

క్రింద అంతా ఖాళీ ప్రదేశమే. ఆ లోయ దాటితే అక్కడే సరిహద్దు రేఖ ఉంది. అక్కడిదాకా వెళ్ళాలి అని
అనిపించింది కానీ పాకిస్థా న్ సైనికులు చూస్తే ప్రమాదం..అందుకని వెళ్ళలేదు. ఆ నిశ్శబ్ద ప్రదేశంలో నేను

తప్ప ఇంకెవరు లేరు. చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్ద ం. కొంచెం భయం కూడా వేసింది. నేను

నిలబడిన కొండ ప్రక్కనే ఇంకొక కొండ ఉంది. అక్కడ సగం దాక రాళ్ళూ రప్పలు ఉన్నాయి. కొంచెం పైనుండి

మంచు కప్పి ఉంది. ఈ ప్రదేశంలో కొండలు తేలికగా ఎక్కి దిగవచ్చు. కానీ ఏ మూలనుండి బుల్లెట్ వచ్చి

తగులుతుందో చెప్పలేము. కొంతసేపు భారతదేశపు సరిహద్దు ల్లో ఉన్నందుకు గర్వంగా అనిపించింది.

సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నాను. వెనుదిరిగి కొండ ఎక్కి మంచులో నడిచి ఇవతలికి వచ్చాను.

జనసంచారం కనపడింది. లలిత, సిద్ధూ గుట్ట మీదనే ఉన్నారు. నేను లేటుగా వచ్చినందుకు నామీద కోపం

వచ్చింది. సరే అసలు మళ్ళీ వెనక్కి వచ్చినందుకు సంతోషించు అని మనసులో అనుకున్నాను. లలితకి

కాళ్ళ నెప్పులు ఎక్కువగా ఉన్నాయి. పాపం నడవలేకపో తోంది. నేను వెళ్లి ఒక స్లెడ్జి వాడిని పిలిచాను. లలిత

సిద్ధూ ఇద్ద రూ స్లెడ్జి మీద క్రిందికి వెళ్లా రు. నేను పైనుండి క్రిందికి మంచులో గెంతులు వేస్తూ , కూర్చుని,

పరిగెడుతూ, జారుతూ క్రిందికి వచ్చాను. భలేగా అనిపించింది. అప్పటికి సమయం మధ్యాహ్నం 3 దాటింది.

ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. చలి బాగా పెరిగింది. వరుసలో నిలబడి రోప్వే స్టేషన్ లోకి వచ్చి

ఒక పెట్టెలో కూర్చున్నాము. నెమ్మదిగా క్రిందికి కదిలింది. రెండుమూడు నిముషాలు మబ్బులలో పయనించి

ఒక్కసారిగా ఆగాధంలాగా ఉన్న నేలని చూస్తే కళ్ళు తిరిగాయి. కొంతసేపటికి చెట్లు , పచ్చికబయళ్ళు

కనిపించాయి. ఇందాక సమాంతరంగా ఉన్న కొన్ని మంచు కొండలు ఇప్పుడు చాలా ఎత్తు లో ఉన్నాయి. గడ్డి

మేస్తు న్న గొర్రెలు, గుర్రా లు కనిపించాయి. మరికొంతసేపటికి నేల చాలా దగ్గ రగా వచ్చింది. స్టేషన్ లో దిగి

బయటికి వచ్చాము. స్వర్గ లోకం నుండి భూలోకం వచ్చినట్లు గా అనిపించింది. అంతమంది గుంపులో

మమ్మల్ని చూసి మా గుర్రా లవాళ్ళు పరిగెత్తు కు వచ్చారు. ఇంత లేట్ చేసినందుకు వాడి భాషలో ఏదో

గొణుక్కున్నాడు. వచ్చిన దారిలో మళ్ళీ కొండ మెల్లి గా దిగాయి గుర్రా లు. 4 దాటాక గుల్మార్గ్ కి చేరాము.

లలిత వేసుకున్న బూట్లు ఇచ్చేసి ఒక హో టల్ లో కాశ్మీరీ పలావ్ తిన్నాము. ఇక్కడ కొంచెం ఎండ ఉంది.

సల్మాన్ కి ఫో న్ చేసాము. దూరంగా ఇందాక మేము ఎక్కిన అఫర్వాట్ కొండ కనిపించింది. కొండ మీద ఉన్న

రోప్వే స్టేషన్ కూడా చాలా చక్కగా కనిపించింది. సల్మాన్ వచ్చాక వాహనంలో ఎక్కి గుల్మార్గ్ కి టాటా చెప్తూ

బయలుజేరము.
ఇప్పుడు మా ప్రయాణం సరాసరి శ్రీనగర్ కి. ఈపూట అక్కడే ఉండి రేపు సో నామర్గ్ కి వెళతాము. ప్రక్రు తి

అందాలని చూస్తూ ఘాట్ రోడ్ దిగి క్రిందికి రాగానే వాతావరణం వేడిగా మారిపో యింది. అక్క ఫో న్ చేసి అక్రో ట్

ఇంకొక కేజీ తీసుకోమంది. మేము ఒక డ్రై ఫ్రూ ట్స్ షాప్ దగ్గ ర ఆగి మళ్ళీ కొన్ని సరుకులు కొన్నాము. కావా

ఇంకొక డబ్బా కొన్నాము. అమ్మవాళ్ల తో మాట్లా డాము వివరాలు చెప్పాము. శ్రీదేవి ఆమ్మ కాల్ చేసింది

మద్రా స్ నుండి. నాకు ఫో టోలు పంపింది వాటి గురించి వివరాలు కూడా మెయిల్ చేసాక గ్రూ ప్ లో పెట్టమంది.

నేను కాశ్మీర్ వచ్చిన రోజు నుండి ఎప్పటికప్పుడు ఫో టోలు వీడియో క్లిప్స్ మా ఆరుగొలను గ్రూ ప్ లో

పెడుతున్నాను. వాటికీ బ్రహ్మాండమైన స్పందన కూడా వస్తో ంది. శ్రీలత ఐతే కాశ్మీర్ మొత్త ం ఇంటి దగ్గ రినుండి

చూస్తు న్నట్టు గా ఉంది అని పెట్టింది. శ్రీనగర్ చేరేసరికి సాయంత్రం 530 దాటింది. సల్మాన్ రేపు 8 వస్తా ను అని

చెప్పాడు. మళ్ళీ మొదట దిగిన రిసార్ట్స్ రాయల్ స్టా ర్ లోనే మా విడిది. మేము రాగానే అక్కడి స్టా ఫ్

మమ్మల్ని ఆప్యాయంగా పలకరించి మా టూర్ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఈసారి రెండవ అంతస్తు లో

గది ఇచ్చారు. మాకు పెహల్గా మ్ లో కలిసిన బొ ంబాయి నుండి వచ్చిన వాళ్లే ఇక్కడికి వచ్చారు. మేము

రూంలో చాలాసేపు విశ్రా ంతి తీసుకున్నాము. నేను నా ఫో టోల మార్పిడి పని చేసుకున్నాను. ఈ పూట బైటికి

వెళ్ళలేదు. హో టల్లో నే డిన్నర్ చేసి పడుకున్నాము.

DAY 6

ఈరోజు ఉదయం నిద్రలేచి క్రిందికి వచ్చి టీ తాగాము. బాగా చలిగా ఉంది. అప్పుడే బొ ంబాయి గ్రూ ప్ వాళ్ళు

రెడీ అయ్యి బస్సు ఎక్కుతున్నారు. వాళ్ళు కూడా మేము వెళ్లే ప్రదేశం సో నామార్గ్ కి వెళ్తు న్నారుట. మేము

స్నానాదికాలు కానిచ్చి క్రిందికి వచ్చాము. 8 కి సల్మాన్ వచ్చాడు. పంజాబీ ఢాబా కి వెళ్లి టిఫిన్స్ తిని

సో నామార్గ్ కి బయలుజేరము. శ్రీనగర్ ఊరులోనుండి సందులు తిరుగుతూ డాల్ లేక్ పక్కనుండి ఊరి

బయటకి వచ్చాము.ఇప్పుడు ఎండ బాగానే కాస్తో ంది..కాస్త వేడిగా ఉంది వాతావరణం. రోడ్డు చాల ఇరుకుగా

ఉంది కానీ ట్రా ఫిక్ బాగా ఉంది. చిన్న చిన్న గ్రా మాలూ దాటుకుంటూ వెళ్తు న్నాము. సుమారు 11 గంటలకు

రోడ్డు పక్కన ఒక హో టల్ దగ్గ ర ఆగాము. హో టల్ పక్కనే సింధ్ నది ప్రవహిస్తో ంది. ఇది పాకిస్తా న్ నుండి

వస్తో ందిట. నది దగ్గ ర ఫో టోలు దిగాము. నీళ్లు చాలా చల్ల గా ఉన్నాయి. నది చాలా ప్రశాంతముగా, నిశ్శబ్ద ంగా

ప్రవహిస్తో ంది. కొంచెం ఫలహారం తిని బండి ఎక్కాము. శ్రీనగర్ నుండి 87 కిలోమీటర్ల దూరంలో ఉంది

సో నామార్గ్. సముద్ర మట్టా నికి 2800 అడుగుల ఎత్తు లో ఉంది. అక్కడక్కడా రోడ్ల మీద పెద్ద పెద్ద హో ర్డింగ్స్
పెట్టి వాటిమీద ముందు రాబో యే ప్రదేశాల పేర్లు వాటి దూరం వివరంగా రాసి ఉన్నాయి. ఇక్కడినుండి

సో నామార్గ్ 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఇండియన్ ఆర్మీ కి అతి ముఖ్యమైన ప్రదేశం కార్గిల్ 174

కిలోమీటర్లు , లేహ్ 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.మార్గ ం మధ్యలో ఆర్మీ వాళ్ళు చాలా చోట్ల

కనిపించారు. కాశ్మీర్ లోని అనేక సరిహద్దు లలో సో నామార్గ్ కూడా ఒకటి. కానీ సో నామార్గ్ నుండి లడఖ్ కి

వెళ్లే దరి ఉంది. అలాగే అమర్నాథ్ యాత్ర కి ముఖ్య ప్రదేశం ఇదే. అందుకే ఈ దారిలో ఎక్కువగా ఆర్మీ

పో స్టు లు ఉంటాయి.

కొంతసేపటికి వాతావరణం చల్ల బడింది. అక్కడక్కడా దూరంగా మంచు కొండలు కనిపిస్తు న్నాయి.

ఆర్మీ వాళ్ళ ట్రక్కులు వరుసగా వెళ్తు న్నాయి. నేను అన్నీ ఓపికగా ఫో టోలు వీడియోలు తీసాను. సల్మాన్

చెప్పాడు రేపు టూర్ లిస్ట్ లో యుష్మార్గ్ ఉందిట. అదికూడా కొండల్లో ప్రక్రు తి వొడిలో ఉన్న ప్రదేశం అని.

ఎక్కువ రోజులు ట్రిప్ ఉన్న వాళ్ళకి ఈ యుష్మార్గ్ చివర్లో చూపిస్తా రుట. నాకు ఒక ఆలోచన వచ్చింది.

యుష్మార్గ్ కి బదులు పాత శ్రీనగర్ ఊరు చూపించు అని అడిగాను. సల్మాన్ కొంచెం వింతగా చూసి ఇలా

ఇంతవరకు ఎవరు నన్ను అడగలేదు అని.. సరే మీ ఇష్ట ం అన్నాడు. ఒక చోట కొండ పక్కన ఆర్మీ వాళ్ళు

పెద్ద పెద్ద తాళ్ల తో కొండ ఎక్కటం ప్రా క్టీస్ చేస్తు న్నారు. ఆర్మీ వాళ్ళ డ్యూటీ లో ఇది కూడా ఒక భాగమే.

సుధాకర్ అన్నయ్య ఫో న్ చేసాడు. నేను పెట్టిన ఫో టోలు, వీడియోలు అన్నీ వాట్స్ యాప్ లో చుస్తు న్నాడుట

చాలా బాగున్నాయి అన్నాడు. ఇంకా వివరాలు అడిగాడు. నేను క్లు ప్త ంగా అన్ని సంగతులు చెప్పాను. తాను

ఇప్పటివరకు పేస్ బుక్ లో రాసిన ఆర్టికల్స్ అన్ని కలిపి 'సుదాంతరంగం' అనే పుస్త కాన్ని అచ్చు వేసారుట.

ఇంటికి కొరియర్ చెయ్యటానికి అడ్రస్ అడిగాడు. నేను మెసేజ్ చేస్తా ను అని చెప్పాను. బాగా ఎంజాయ్

చెయ్యండి అన్నాడు.

ఘాట్ రోడ్డు మీద ప్రయాణిస్తు న్నాము. ఇప్పుడు మంచు కొండలు చాలా దగ్గ రగా ఉన్నాయి. ఒక

వైపు కొండచరియలు మరొకవైపు లోయ..చాలా అద్భుతంగా ఉంది ప్రక్రు తి. కొంతసేపటికి సో నామార్గ్ మరొక 4

కిలోమీటర్ల దూరంలో ఉంది అని సైన్ కనబడింది. అక్కడే నది మీద ఒక బ్రిడ్జి ఉంది. బ్రిడ్జి పైన సో నామార్గ్ కి

స్వాగతం అని (ఇంగ్లీష్ లోనే) ఉంది. ఇలాంటి ఖాళీ ప్రదేశంలో నది మీద బ్రిడ్జి ని చాలా సినిమాల్లో చూసాను.

మరికొంతసేపటికి సో నామార్గ్ చేరాము. ఇక్కడకూడా గుల్మార్గ్ లాగా కొన్ని హో టళ్లు , టూరిస్ట్ హో టళ్లు

ఉన్నాయి. ఒక అరకిలోమీటరు ఇవతలే రోడ్డు కి పక్కగా టాక్సీ స్టా ండ్ లో ఆపాడు సల్మాన్. అక్కడే గుర్రా ల
స్టా ండ్ కూడా ఉంది. మేము మూడు గుర్రా లని బేరమాడి కుదుర్చుకున్నాము. లలిత కి గమ్ బూట్లు

తీసుకున్నాము. గుర్రా లవాడిని అమర్నాథ్ గురించి అడిగితే వాడు దూరంగా ఒక మంచు కొండ చూపించి ఆ

కొండ కి వెనుకవైపున అమర్నాథ్ కొండ ఉంది..ఒక రోజులో వెళ్లి రావచ్చు కానీ ఇప్పుడు అక్కడ దారిలో

మంచు ఎక్కువగా ఉంది ఇంకా ఆర్మీ వాళ్ళు మంచుని తొలిగించలేదు అని కావాలంటే బాల్తా ల్ అనే బేస్

క్యాంపు వరకు తీసుకువెళ్లా ము అన్నారు. నేను వద్దు అని చెప్పాను. సో నామార్గ్ నుండి అమర్నాథ్ గుహకి

22 కిలోమీటర్లు లేదా 13 . 8 మైళ్ళ దూరం. అమర్నాథ్ గుహ కి పడమటి వైపున సో నామార్గ్ ఉంది.

అమర్నాథ్ చాలా దగ్గ ర అని అనిపించినా దారి చాలా ప్రమాదకరమైనది. కొండ కి లోయ కి మధ్య అతి

సన్నని దో వలో కాలినడకన లేదా గుర్రం ఎక్కి ప్రయాణించాలి. ఏమాత్రం అదుపు కుదుపు తప్పినా.. అదే

ఆఖరి రోజు అవుతుంది.

ఒక్కడినే ఐతే సాహసించి ధైర్యంగా అమర్నాథ్ గుహ వరకు వెళ్ళేవాడిని..కానీ నాతో కూడా నన్ను

నమ్ముకుని న భార్య పిల్లా డు ఉన్నారు అందుకే ఆ కోరికను అణుచుకున్నాను. రోడ్డు ఎక్కి అవతలివైపుకి

వచ్చాము. ఆర్మీ బళ్ళు చాలానే అటు ఇటు తిరుగుతున్నాయి. గుర్రా లు నెమ్మదిగా ముందుకు కదిలాయి.

రోడ్డు ను విడిచి కొండ గుట్ట లు ఎక్కాము. ప్రక్రు తి చాలా నిశ్శబ్ద ంగా ఉంది. మాతోపాటు ఆరుగురు కూడా

వస్తు న్నారు. నాకు అనుమానం వచ్చి అడిగాను. ఒక్కడు మాత్రం గుర్రా లవాడు మిగిలిన వాళ్ళు స్లెడ్జి

బండ్ల వాళ్ళుట. దారి పొ డవునా ఈ ప్రా ంతంలో షూటింగులు జరిగన


ి సినిమాల గురించి చెప్పారు.ఆ

ప్రా ంతాలన్నీ మేము వెళ్తు న్న దారి పక్కన పరిసరాల్లో ఉన్నాయి. విన్న వెంటనే అబ్బా !! అవునా!!

అనిపించింది. ఎప్పుడో చూసిన 'రామ్ తేరి గంగ మైలీ' సినిమా నుండి ఈమధ్య సల్మాన్ ఖాన్ 'భజరంగీ

భాయ్ జాన్' వరకు చూపించారు. గుర్రా లు ఎత్తైన పెద్ద గుట్ట మీదకి ఎక్కి ఘాట్ రోడ్డు లాంటి రాళ్ళూ మట్టి

ఉన్న రోడ్డు లో నడిచి మళ్ళీ అంత క్రిందికీ దిగి కొంత దూరం మైదానం లో నడిచి అటునుండి చిన్న చిన్న

కాలువలు దాటి చివరకు మైదానంలాంటి నేల మీదకి వచ్చాము. కొంత దూరంలో ఠీవీగా నిలబడి ఉన్న

మంచు కొండల్ని చూసి మనసు చల్ల బడిపో యింది. గుర్రా లు దిగిన ప్రదేశంలో కొన్ని గుడారాలు కట్టి

ఉన్నాయి. వీటిల్లో చిన్న చిన్న హో టళ్ళు బూట్లు , చేతి కర్రలు అద్దెకి ఇచ్చే స్టా ల్ల్స్ ఉన్నాయి.

ఎదురుగా ఉన్న గ్లేసియర్ మీదకి నెమ్మదిగా ఎక్కటం మొదలుపెట్టా ము. ఇక్కడి మంచు నిన్న

చూసిన గుల్మార్గ్ లో మంచుకంటే కొంచెం గట్టిగా, నునుపుగా ఉంది. ఇక్కడ మంచులో ఎక్కువ పైకి
ఎక్కలేకపో యాము. వెడల్పు ఎక్కువ ఉండటం చేత మంచు వ్యాపించి ఉన్న ఎడమ వైపునకు నడిచాము.

బూట్లు వేసుకున్నా కాళ్ళు జారుతున్నాయి. ఒక గంటన్నర పైగానే మంచులో ఆడాము. స్లెడ్జి వాళ్ళు మా

వెనకాలే వచ్చారు. తరువాత సిద్ధూ , స్పందన ఒక స్లెడ్జిలో, నేను ఒక స్లెడ్జిలో కూర్చుని జర్రు న జారుతూ

క్రిందికి వచ్చాము. నేను చేతిలో కెమెరా పట్టు కుని అంతా వీడియో తీసాను. స్లెడ్జి వాడు సిద్ధూ ని మళ్ళీ కొంత

పైకి తీసుకు వెళ్ళి స్లెడ్జిలో తీసుకువచ్చాడు. క్రింద ఒక గుడారంలో వేడి వేడి టీ తాగాము. అక్కడ ముసలి

వాళ్ళు హుక్కా పీలుస్తు న్నారు. చలి ప్రదేశంలో హుక్కా కూడా బాగుంటుంది.

మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ తిరిగి ముగ్గు రం మూడు గుర్రా లు ఎక్కి వెనక్కి బయలుజేరము.

వచ్చేటప్పుడు ఆరుగురు మాతో ఉంటే ఇప్పుడు ఒక్కడు మాత్రంమే ఉన్నాడు. ఈ గుర్రా లు వాడివేట.

You might also like