You are on page 1of 3

*గాంధీ చిత్ర నిర్మాణ విశేషాలు*

నవంబర్ 30,1982 న విడుదలైన గాంధీ చిత్రం ప్రపంచ వ్యాప్త ంగా సంచలనాన్ని సృష్టించింది. అపూర్వ

ప్రజాదరణని పొ ందింది. ఈ చిత్ర నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన కొన్ని విషయాలను  తెలుసుకుందాం.

1982 లో రిచర్డ్ అటెన్బరో తన కలల ప్రా జెక్ట్ గాంధీ చిత్రా న్ని నిర్మించాడు. కానీ అంతకు ముందే రెండుసార్లు

గాంధీ చిత్రా న్ని నిర్మించే దిశగా ప్రయత్నాలు జరిగి విరమించుకోవటం జరిగింది. 1952 లో ఎన్నో

చారిత్రా త్మక చిత్రా లు నిర్మించిన గాబ్రియేల్ పాస్కల్ అనే దర్శకుడు నెహ్రు గారిని కలిసి గాంధీ చిత్ర నిర్మాణానికి

సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ 1954 లో చిత్ర నిర్మాణ పనులు పూర్తికాక ముందే ఆయన

మరణించాడు. 1962 లో రిచర్డ్ అటెన్బరో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో మోతిలాల్ 

కొఠారి అనే ఆయన అటెన్బరో ని కలిసి లూయిస్ ఫిషెర్ అనే రచయిత రాసిన లైఫ్ అఫ్ మహాత్మా గాంధీ అనే

పుస్త కాన్ని ఇచ్చి చదవమన్నాడు. అంతే కాకుండా గాంధీ జీవితాన్ని చిత్రంగా నిర్మించాలని ప్రో త్సాహించాడు. కొఠారి

లండన్ లోని ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ లో పనిచేసేవాడు. ఇతనికి గాంధీ అంటే అమితమైన భక్తి. గాంధీగారి ప

ుస్త కం అటెన్బరో జీవితాన్ని మార్చేసింది. ఎలాగైనా గాంధీ చిత్రా న్ని నిర్మించాలని నిర్ణ యించుకున్నాడు. దర్శకత్వ

బాధ్యతలను తగ్గించుకున్నాడు, నటనకి స్వస్తి చెప్పాడు. కానీ తన కలలు నిజమవటానికి 18 ఏళ్ళ పాటు వివిధ

కారణాల వల్ల నిరీక్షించాల్సి వచ్చింది. గాంధీ చిత్ర నిర్మాణ పనులకోసం 40 సార్లు  ఇండియా కి వచ్చానని తాన

స్వయంగా చెప్పుకున్నాడు. ఇండియా కి చివరి  వైస్రా య్ అయిన లార్డ్ మౌంట్ బాట్ట న్ ప్రో త్సాహంతో అటెన్బరొ

నెహ్రు  నిఆయన కూతురు ఇందిరా గాంధీ ని కలుసుకోగలిగాడు. నెహ్రూ గారు చిత్ర నిర్మాణంలో తనవంతు

సహాయం చేస్తా నని మాటిచ్చారు. కానీ 1964 లో నెహ్రూ గారు మరణించారు.

వార్నర్ బ్రదర్స్ తో కలిసి 1976 లో గాంధీ చిత్రనిర్మాణాన్ని మొదలు పెట్టా లని అనుకున్నాడు అటెన్బరో. అదే సమ

యంలో అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఇండియా లో స్టేట్ అఫ్ ఎమర్జెన్సీ

నడుస్తు న్న రోజులు. సినిమా షూటింగ్ కి అనువైన సమయం కాదు. అదే సమయంలో చిత్ర సహా నిర్మాత

రాణి దూబే ఇందిరా గాంధీ ని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్

కార్పొరేషన్ అఫ్ ఇండియా నుండి మొదటి విడతగా 10 మిలియన్లు  ఇవ్వటానికి ఒప్పించారు. 1980 లో మిగిలిన

డబ్బు మొత్త ం అటెన్బరో కి  అందింది. తరువాత జాక్

ఎబెర్ట్స్ అనే ఫైనాన్షియర్ బడ్జెట్ లో రెండింటమూడొంతులు డబ్బుని ఇచ్చాడు. నవంబర్ 26,1980 న

షూటింగ్ ప్రా రంభమై 10 మే 

1981 న ముగిసింది. ఇండియాలోని పలు నగరాల్లో  షూటింగ్ జరిపారు. ఢిల్లీ , గుజరాత్, పూణే, కలకత్తా , పాట్నా,

ఉదయపూర్, పంజాబ్, వెస్ట్  బెంగాల్, మహారాష్ట ,్ర  బొ ంబాయి. లండన్ లోని  బకింగ్హమ్ ప్యాలస్,కింగ్స్లేహాల్ ఇంకా పల

ు చోట్ల షూటింగ్ జరిగింది. 200 మంది ప్రొ డక్షన్ యూనిట్ తో 21 వారాల పాటు


ఆపకుండా షూటింగ్ జరిపారు. సినిమాలోని సెట్టింగ్స్ కి 84 లక్షలు ఖర్చు అయ్యిందిట. అందులో ఒక పావు

వంతు సబర్మతి ఆశ్రమం సెట్ కి ఖర్చు అయ్యిందిట.185 లక్షలు కాస్ట్యూమ్స్ కి  అయ్యిందిట.

గాంధీ సినిమాలో గాంధీగా  నటించిన బ్రిటిష్ యాక్టర్  బెన్కింగ్స్లే సగం భారతీయుడు. కింగ్స్లే ఇంగ్లా ండ్ లోని

యార్క్ షైర్ లో పుట్టా డు. స్టేజి యాక్టర్ కావటం వల్ల కింగ్స్లే  కి నటనలో మెళకువలు బాగా తెలుసు. అందునా

షేక్స్ఫియర్ నాటకాలు వెయ్యటంలో బాగా నైపుణ్యం ఉన్నవాడు.

కింగ్స్లేఅసలు పేరు కృష్ణ  పండిట్ భంజి. తండ్రి రహీంతుల్లా  హరి భంజి. తల్లి బ్రిటిష్ నటి. 

గాంధీపాత్ర కి ఒక విదేశీయుడిని ఎంచుకోవటం వల్ల  అటెన్బరోచాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. చిత్రా నికి పెద్ద

మొత్త ంలో నిధులు ఇచ్చిన ఇందిరా గాంధీ కూడా పేరు మోసిన భారతీయ దర్శకుల, 

రచయితల, రాజకీయనాయకుల ఆగ్రహానికి గురయింది.

గాంధీ పాత్రకి ముగ్గు రిని కస్తూ ర్బా పాత్రకి ముగ్గు రిని ఎంపిక చేసి మళ్ళీ ఆ ముగ్గు రిలో కింగ్స్లేని గాంధీ పాత్రకి

రోహిణి హట్ట ంగడి ని కస్తూ ర్బా పాత్రకి ఖరారు చేసారు. మరొక ఇద్ద రిలో ఒకరు స్మితాపాటిల్. అలాగే కింగ్స్లే

తరువాత  మరొక ఇద్ద రిలో ఒకరు నసీరుద్దీన్ షా. వీరందరికీ ఒకేసారి లండన్ లో స్క్రీన్ టెస్ట్  జరిగింది. గాంధీ 

పాత్రకి సినిమా మొత్త ంలో 11 సార్లు  హెయిర్ స్టైల్ లో మార్పులు జరిగాయి. 

చిత్రం  లో అతి ముఖ్యమైన సన్నివేశం గాంధీగారి హత్య. ఈ సన్నివేశాన్ని గాంధీగారి 

హత్య జరిగిన స్థ లం ఢిల్లీ  లోని బిర్లా  హౌస్ లో అదే స్థ లంలో  తీశారుట.

అలాగే మరొక ముఖ్యమైన సన్నివేశం గాంధీగారి అంతిమయాత్ర. ఈ సన్నివేశం షూటింగ్ లో 300,000 మంది భారీ

జన సందో హం పాల్గొ న్నారుట. వారిలో 200,000 మంది వాలంటీర్లు కాగా 94,560 మందికి కొంత తక్కువ డబ్బుతో

కాంట్రా క్టు కుదుర్చుకున్నారుట. మిగిలిన వారందరు సినిమా ప్రొ డక్షన్ లో సభ్యులు. జనవరి 30,

1981 న గాంధీగారి 33 వ  వర్ధంతినాడు ఈ అంతిమ యాత్ర ఘట్టా న్ని తీసారట.19

కెమర
ె ాలుతో వివిధ ప్రదేశాలు నుండి షూటింగ్ జరిపారుట.  అంతిమయాత్ర సన్నివేశం చిత్రంలో 125 సెకండ్ల  పాటు 

నడుస్తు ంది. ఒకే సన్నివేశంలో

300,000 మంది కనిపించటం ఒక రికార్డు . అందుకే ఈ సన్నివేశం గిన్నిస్ బుక్ లో చోటు

సంపాదించింది. ఇప్పటికీ ఈ  రికార్డు  ని ఏ చిత్రమూ అధిగమించలేకపో యింది. శవయాత్ర ఊరేగింపులో మొదట

గాంధీగారి మైనపు బొ మ్మని ఏర్పాటు చెయ్యాలని అనుకున్నారట. కానీ సహజత్వం కోల్పోతుందని కింగ్స్లే ఆ

సన్నివేశంలో నటించటానికి ఒప్పుకున్నాడట. షూటింగ్ జరిగినంతసేపూ కళ్ళు మూసుకుని పూల రెక్కలు మీద

పడుతున్నా కదలకుండా అలాగే పడుకున్నాడుట. అందుకే ఆ సన్నివేశం అంతగా పండింది.

 1983 లో గాంధీ చిత్రా నికి అనేక అవార్డ్స్ తో పాటు అనేక విభాగాలలో ప్రతిష్టా త్మక ఆస్కార్ అవార్డు కూడా

లభించింది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. మొత్త ం చిత్ర నిర్మాణం గురించి

రాయాలంటే ఒక పుస్త కమే రాయాలి...


 హరి కృష్ణ

You might also like