You are on page 1of 8

*సేవా* సాహితీ కథా వర్షం

అంశం:సాంఘీకం

ప్రక్రియ:కథ

శీర్షిక:అగ్గి కాల్చేసింది

************************
*అగ్గి కాల్చేసింది*

పడమటి కొండలలోకి సూర్యుడు మెల్ల గా జారుకుంటున్నాడు...మండు వేసవి

కాలం...భగభగమండే సూర్యుడు నిష్క్రమిస్తుంటే సెగల తాకిడికి అప్పటి వరకూ

ఓర్చుకుని గూళ్ళలో దాగిన పక్షులు కిలకిలా రావములు చేసుకుంటూ ఆకాశంలో

రివ్వున ఎగురుతున్నాయి హాయిగా....ఇళ్ళు జేరిన కష్టజీవులు పడిన శ్రమను

మరిచి పో వడానికి స్నానం చేస్తూ ఊపిర్లు పీల్చుకొంటున్నారు. అదో చిన్న గూడెం.

అక్కడ అందరూ పేదవారే...కూలీ నాలీ చేసుకునేవాళ్ళు కొందరైతే...అక్కడే

చుట్టు పక్కల అటవీ ప్రాంతంలోని చింతపండు, విప్పపువ్వు సేకరించుకొని జీవనం

సాగిస్తు న్నారు అంతంతమాత్రపు ఆదాయంతో.

చీకటి పడింది. చిన్నచిన్న దీపాలు ఇళ్ళలో వెలిగించు కున్నారు. కనీసం

కరెంట్ కూడా లేదు. ఒక కిలోమీటర్ దూరంలో జమిందార్ సర్వోత్త మరావు

ఎస్టేటు..మధ్యలో ఓ గెస్టు హౌసు...చాలా అందంగా కట్టు కున్నాడు. ఎంపీ కూడా

కావడంతో ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఒక్కడే కొడుకు...చాలా గారంగా


పెరిగాడు. స్నేహితులతో పార్టీలు...మీటింగులు..వీటికన్నిటికీ ఆ గెస్ట్ హౌసే వేదిక.

ఎప్పుడూ ఏదో ఒక హడావిడి జరుగుతూనే ఉంటుంది.

ఐతే ఆ రోజు ఎక్కువ మంది హడావిడి లేదు. కేవలం ఓ నలుగురు కారులో

చేరుకున్నారు గెస్టు హౌస్ కి. అక్కడ జీవించే వారందరికీ తెలుసు...చీకటి.పడే

సమయానికి వస్తా రు...చీకటి తెరలు విడిపడకుండానే వెళ్ళిపో తారు...పెద్ద వాళ్ళ

వ్యవహారమని దూరంగానే ఉంటారు తప్ప పట్టించుకోరు. ఒకరకంగా చెప్పాలంటే

భయపడతారు అక్కడ జరిగే వ్యవహారాల గురించి తెలిసి.

"తాతా!పెద్దో ల్లొ చ్చీసినారు

....."
"ఓరి మనవడా! సింమాద్రీ! మన కేటి ఆగొడవలు? ఆల్లు

పెద్దో ల్లు ...డబ్బున్నోల్లు ...ఒగ్గెయ్..."

"అదే తాతా! ఏటిసేత్తా రు తాతా?"

"నే సెప్పినానా...ఆల్ల ఊసు మనకొద్దె సె..."

"అంత కోపాలేటి తాతా! నాను ఊరికే అడిగినానంతే"

"ఊరుకో అయ్యా...

ఆడు సిన్న గుంతడు...

ఆడిమీద కోపాలాడెత్తా వ్.."


"ఓసో స్...మా లావు

సెప్పొచ్చీసినావ్! ఊరుకో యసే ముసల్దా నా! ఆడి

కియ్యన్నీ సెప్పకూడదు..

ఆడు బాగా సదూకుని కలకటేరవ్వాల!" అంటూ సింహాద్రి నాయనమ్మని

కోప్నడ్డా డు.

పదేళ్ళ సింహాద్రి తల్లి కడుపులో ఉండగానే తండ్రి పైడితల్లి చనిపో యాడు.

సంవత్సరం క్రితం తల్లి పులివాత పడి చని పో యింది. అప్పట్నించి అన్నీ తామై

మనవడికి ఏ

కష్టం రాకుండా పెంచుతూ చదివిస్తు న్నారు.

"రారా గుంతడా...

తినీసి బేగ నిద్రోవాల..." అవ్వ మాటలకి సింహాద్రి

"అలాగే అవ్వా..." అంటూ గుడిసె లోకి వెళ్ళాడు. మనవడి వెంటే తాత కూడా

వెళ్ళి పో యాడు.

******
గెస్టు హౌసు చుట్టూ పో లీసులు...అంబులెన్సులు...చాలా గందరగోళంగా ఉంది

ఎస్టేటంతా...రకరకాలుగా వార్తలు గుప్పు మంటున్నాయి. మీడియా మొత్తం

అక్కడ చెరిపో యింది. ఎవరి గోలలో వారున్నారు. గెస్టు హౌసు దాదాపు ఆగ్నిలో
కాలిపో యింది. అందులో ముందురోజు రాత్రి వచ్చిన నలుగురు చనిపో యారని

చెప్పుకుంటున్నారు...

"ఈరయ్యా.......

జమిందారు గారబ్బాయి, ఆళ్ళ సేహితులు వచ్చారంట రేత్తి రి... లోపడ సారా

సీసాలకి నిప్పంటుకుందంట...ఆళ్ళు మత్తు లో జోగుతా అగ్గిపెట్టి గీసినారంట...అంతే

అగ్గి కాల్చేసినాదంట..." అంటూ గూడెంలో పెద్ద చెప్పాడు

"అయ్యో! అంతపని జరిగినాదా? చెస్....నిండు

పానాలు గాల్లో కల్సిపో నాయ్! ప్చ్...ప్చ్..."

బాధతో నిట్టూ ర్చాడు సింహాద్రి తాత.

పో లీసులు అక్కడున్న

వాళ్ళని యక్ష ప్రశ్నలు వేస్తు న్నారు...అలా అందరినీ అడుగుతూ వీరయ్యని

బయటికి పిలిచాడు సీ.ఐ.

బక్కచిక్కి ముసలి తనం మీద పడుతున్న వీరయ్య బయటికొచ్చి చేతులు

కట్టు కుని నిల బడ్డా డు.

ఒకసారి ఎగాదిగా చూసిన సీ.ఐ.....

"ఇంకా ఈ ఇంట్లో ఎవరుంటారు?"

"నేనూ, మాయాడది, నా మనవడు ఉంటాం బావ్" వీరయ్య


లోపల్నుంచి వీరయ్య భార్య, పదేళ్ళ సింహాద్రి బయటికొచ్చి

నిలబడ్డా రు...సింహాద్రి పో లీసుల్ని చూసి భయపడుతుంటే..

"భయపడకు...మేం

మామూలు మనుషులమే.

నువ్వేమైనా చూశావా?"

సీ.ఐ. ప్రశ్నకి

"లేదు సర్...ఆళ్ళు ఇలా గెల్లే టప్పుడు చూసినాను సర్" సింహాద్రి

"ఏం చదువు కుంటున్నావ్?"

"నాలుగో తరగతి సర్.."

"ఇంకెవ్వరూ లేరా పెద్దా యనా!"

"లేరుబావ్...ఈళ్ళ నాన్న ఈడు పుట్టక మునుపే సచ్చపో నాడు. ఏడాది

కితం ఈళ్ళమ్మ పులాత పడి సచ్చిపో నాది

బావ్"

"మీకేదైనా తెలిస్తే చెప్పండి...నలుగురూ పో యారు...కాకపో తే

తాగిన మైకంలో అగ్గిపెట్టె వెలిగించి బహుశ సిగరెట్టు వెలిగించుకునే ప్రయత్నంలో


బ్రాందీ సీసాలు అంటు కొన్నట్టు గా అనిపిస్తోంది. అయినా కొట్టి పారేయలేం.

ఎవరైనాకావాలని కూడా చెసుండొ చ్చు.."

"ఆల్లంతా పెద్దో ల్లు బావ్...

ఆల్ల జోలికి పో వాలంటేపే బయం బావ్..."

"ఓకే...ఏదైనా తెలిస్తే

చెప్పు...దాస్తే మీరు కూడా తప్పు చేసినవాళ్ళే అవుతారు..."

"అలాగే బావ్..."

సీ.ఐ. అక్కడ్నించి వెళ్ళి పో యాడు.

"ఏటో పాపం... ఇలాగైపో నాది...

ఎంత దుక్కమొచ్చి పడిపో నాది..పెద్ద దొ రగారికి"

వీరయ్యలోని మానవత్వం కొట్టొ చ్చనట్టు కనపడింది. అవును నిజవే... పేదవాళ్ళకు

కూడూ, గూడూ, గుడ్డా కరువుగానీ మంచి తనానికి కరువే లేదు.

"సింమాద్రీ!సూశావా..

ఎలాగైపో నాదో ..."

"అవును తాతా...

ఆళ్ళ రాత దేవుడు అలా రాసినాడు..."అతని కళ్ళలో


ఏవో తెలియని మెరుపులు..

హృదయస్పందనలో తేడా..అతని కళ్ళ ముందు

నాటి సంఘటన ప్రత్యక్షమైంది...ఆరోజు...

తన తల్లితో విప్ప పువ్వు ఏరడానికి వెళ్ళాడు. అలా చీకటి పడే సమయానికి

ఇల్లు చేరే ప్రయత్నంలో ఉండగా జమిందారు కొడుకు తన తల్లిని లోపలికి

పిలిచాడు. అమాయకురాలైన ఆమె అందంమీద కన్ను వేశాడని గ్రహించ లేక

పో యింది...సింహాద్రిని కూడా లోపలికి రమ్మని ఓ పక్క తాళ్ళతో కట్టేశారు. అతని

కళ్ళముందే... మృగాళ్ళు చెలరేగి పో యారు. ఆ పసి హృదయం తల్ల డిల్లి పో యింది.

అలా ఆమెను చిత్రవధ చేశారు...కలియుగ కీచకులై...ఆమెను పులి చంపినట్టు గా

చెప్పమని లేదంటే నీ అవ్వ తాతలను కూడా చంపేస్తా మని బెదిరించారు. ఆ పసి

హృదయం బేలగా మారిపో యింది. అలా రోజులు గడిచే కొద్దీ అతని

హృదయం ఆవేశపడింది. ఏదో ఒకటి చెయ్యాలని ఆరాట పడింది. బాలపులి అగ్ని

పంజా విసిరింది. అగ్గి కాల్చేసింది. మనసు కుదుట పడింది. అక్కడే నిలబడి అగ్ని

కాహుతైన తోడేళ్ళను తీసుకు వెళుతున్న అంబులెన్సులను అలాగే చూస్తుండి

పో యాడు.

గమనిక: ఇందు పాత్రలూ, సన్నవేశాలూ కేవలం కల్పితములు. ఎవరినీ ఉద్దే శించి

వ్రా సినవి కాదని మనవి.


************************
*సేవ* కై స్వంతముగా వ్రా సినదీ కథ. ఏ మాధ్యమము నందు ప్రచురింప

బడలేదు.

నా గురించి

మేడమ్ నమస్కారం...నాపేరు మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ, గుంటూరు,

న్యాయవాద వృత్తి , ప్రవృత్తి ఆధ్యత్మిక చింతన, తెలుగు సాహిత్యంపై అభిరుచి. నేను

ఇప్పటి వరకూ మూడు పద్యఖండ కావ్యములు, ఒక శతచిత్రబంధ

మాలిక(చిత్రబంధ కవిత్వం), ఒక పద్య ఉదాహరణ కావ్యము, పది శతకములు,

"తారాపథం" అనే కథా సంపుటి, "అమ్మ" వచన కవితా సంపుటి, "హైకూదయం"

హైకూసంపుటి వెలువరించాను. 25 గజల్స్, ఒక వంద నానీలు ఇప్పటి వరకూ

వ్రా శాను. నేను చదువ బో యేకథ "అగ్గి కాల్చేసింది"

ధన్యవాదాలు మేడమ్🙏🙏🙏

మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ, గుంటూరు.

ది.23.10.2021 సేవ నిర్వహించిన కథల పో టీలలో ఈ నా కథ ద్వితీయ

బహుమతి పొందినది.

You might also like