You are on page 1of 11

అంతర్గత మరియు బహిర్గత అదాలు

Dr. K. Swarupa Rani


I BA Lecturer in Economics
II Semester RRDS Govt. Degree College
Bhimavaram
• సంస్థ తాను ఉత్పత్తి చేసే వస్తు పరిమాణాన్ని పెంచడాన్ని తరహా పెంచడం అని
అంటారు.

• ఒక సంస్థ తన ఉత్పత్తి తరహాను పెంచినప్పుడు ఆ సంస్థకు మాత్రమే లభించే ఆదాలు


అంతర్గత ఆదాలు

• సంస్థ తరహాను పెంచినప్పుడు పరిశ్రమ కేంద్రీకృతమై పరిశ్రమ లోని అన్ని సంస్థలకు


లభించే ఆదాలు బహిర్గత ఆదాలు
Power loom

Handloom
అంతర్గత ఆదాలు – రకాలు

సాంకేతిక ఆదాలు (Technological Economies)


నిర్వహణ ఆదాలు (Managerial Economies)
మార్కెటింగ్ ఆదాలు (Marketing Economies)
ఆర్థికపరమైన ఆదాలు (Financial Economies)
పరిశోధన - అభివృద్ధి (Research and Development)
నష్టభయాన్ని భరించే ఆదాలు (Risk bearing Economies)
మార్కెటింగ్ ఆదాలు

 అధిక పరిమాణంలో ముడిపదార్ధా లు కొనుగోలు వలన


తక్కువ ధరలకు లభిస్తా యి.

 తమ వస్తు వును మార్కెట్ లో సులభంగా అమ్ముకోగలవు.

 మార్కెటింగ్ నిపుణులను నియమించుకోగలవు.


సాంకేతిక ఆదాలు

ఆధునిక యంత్రాలు , సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తిలో సమయాన్ని, వ్యయాన్ని


తగ్గించగలుగుతాయి. పెద్ద తరహా సంస్థలు మాత్రమే ఇటువంటి సాంకేతికతను వాడగలుగుతాయి.

నిర్వహణ ఆదాలు

ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన నిర్వాహకులు ఉత్పత్తి కారకాల ఎంపిక నుండి వస్తు మార్కెటింగ్ వరకు
అన్ని దశలను సమర్ధవంతంగా నడిపించగలుగుతారు. పెద్ద తరహా సంస్థలు ఐతే వీరి సేవలను
ఉపయోగించగలుగుతాయి.
ఆర్థికపరమైన ఆదాలు

పెద్ద తరహా సంస్థలకు మార్కెట్లో గుడ్ విల్ వలన , ఆస్తు ల ద్వారా సులభంగా
రుణాలను పొందగలవు. వాటా దారులను ఆకర్షించి పెట్టు బడులను సమకూర్చుకోగలవు.

పరిశోధన – అభివృద్ధి

పెద్ద తరహా సంస్థలు నిరంతరం పరిశోధన మరియు అభివృద్ధి పై వనరులను


కేటాయించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడం , వస్తు నాణ్యతను
పెంచుకోవడం , ట్రెండ్ కు అనుగుణంగా ఉత్పత్తిలో మార్పులు చేయడం వంటివి
చేయగలవు.
నష్టభయాన్ని భరించే ఆదాలు

పెద్ద తరహా సంస్థలు తమ సంస్థను వివిధ వస్తు వులకు విస్తరించగలవు. ఒక వస్తు వు ఉత్పత్తిలో
నష్టా లు వస్తు న్నా వేరొక వస్తూత్పత్తిలో వచ్చే లాభాలు ఈ నష్టా లను భరించగలిగే శక్తిని ఇస్తా యి.
బహిర్గత ఆదాలు

అవస్థా పన ఆదాలు (Infrastructure Economies)


సమాచార ఆదాలు (Communication of Knowledge)
ప్రత్యేకీకరణ వలన లభించే ఆదాలు (Economies with Specialization)
సమాచార ఆదాలు

వస్తు వు ఉత్పత్తికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ పెద్ద తరహా సంస్థ నుండి అన్ని సంస్థలకు
అందుబాటులోకి వస్తా యి.

అవస్థా పన ఆదాలు

ఒక సంస్థ తన తరహాను పెంచినప్పుడు తమకు అవసరమయ్యే వివిధ అవస్థా పనలను


నిర్మించుకుంటాయి. ఉదాహరణకు రవాణా , సమాచారం , విద్యుత్ , నీటి పారుదల మొదలైనవి.
ఇటువంటి సంస్థలు ఉన్నచోట బ్యాంకింగ్ , బీమా మొదలైన సేవలు విస్తరిస్తా యి. ఇవి అక్కడ ఉన్న
అన్ని సంస్థలకు అందుబాటులోకి వస్తా యి.
ప్రత్యేకీకరణ వలన లభించే ఆదాలు

సంస్థ తరహా పెరిగేకొలది వివిధ వస్తు వులకు సంబంధించి మరియు వస్తు వు ఉత్పత్తిలో వివిధ
దశలకు సంబంధించి ప్రత్యేకీకరణకు అవకాశం ఉంటుంది.

Mobile Phone Industry


Horizontal Specialization – Specialization in Different
Phones
Vertical Specialization – Specialization in different parts of
the Phones.

You might also like