You are on page 1of 12

సమాసాలు

 రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడి ఒక కొత్త అర్థా న్ని ఇస్తే దానిని సమాసం
 అని అంటారు.
 ఉదా; రెండు, రోజులు అనే రెండు పదాలు కలిసి ‘రెండురోజులు’ అనే ఒక పదంగా ఏర్పడటం
 విగ్రహవాక్యం; సమాసం యొక్క అర్థా న్ని వివరించేది.
 ఉదా;రెండు రోజులు - రెండు అనే సంఖ్య గల రోజులు
 పూర్వ పదం; సమాసములోని మొదటి పదం
 ఉదా; రెండు రోజులు ఇందులో రెండు పూర్వపదం
 ఉత్తర పదం; సమాసములోని రెండవ పదం
 ఉదా; రెండు రోజులు ఇందులో రోజులు ఉత్తర పదం
ద్వంద్వ సమాసం

 ద్వంద్వ సమాసం; సమాసములోని పూర్వ, ఉత్తర పదాలు నామవాచకాలుగా కలిగినది.


 సమాసములోని రెండు పదాల అర్థా నికి సమప్రాధాన్యం ఉంటుంది
 ఉదా; సీతారాములు
 ఇందులో పూర్వ, ఉత్తర పదాలు రెండు నామవాచకాలు.
 ఈ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు
 నేను బజారుకి వెళ్ళి కూరగాయలు తెచ్చాను
ద్విగు సమాసం
సమాసములో పూర్వపదములో సంఖ్యను, ఉత్తరపదములో నామవాచకాన్ని కలిగినది.
ఉదా; రెండు జడలు
ఇందులో పూర్వపదం సంఖ్య (రెండు) , ఉత్తరపదం నామవాచకం (జడలు)
మరికొన్ని ఉదాహరణలు;
నవరసాలు - నవ సంఖ్య గల రసాలు
దశావతారాలు - దశ సంఖ్య గల అవతారాలు
ఏడు రోజులు - ఏడు సంఖ్య గల రోజులు
నాలుగు వేదాలు - నాలుగు సంఖ్య గల వేదాలు
నవగ్రహాలు - నవ సంఖ్య గల గ్రహాలు
ముల్లొకాలు - మూడు సంఖ్య గల లోకములు
తత్పురుష సమాసాలు

 వివరణ;
 సమాసములోని ఉత్తర పదము యొక్క అర్థా నికి ప్రాధాన్యం ఉన్న సమాసాలు తత్పురుష
సమాసాలు.
 ఇవి రెండు రకాలు
 1 వ్యధికరణ తత్పురుష సమాసాలు
 2 సమానాధికరణ తత్పురుష సమాసాలు
వ్యధికరణ తత్పురుష సమాసాలు

 విభక్తి ప్రత్యయాలను విగ్రహవాక్యములో ఉపయోగించే సమాసాలు వ్యధికరణ తత్పురుష


సమాసాలు.
 పూర్వపదం చివర ఉండే విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఆ తత్పురుష సమాసాన్ని పిలవడం
జరుగుతుంది. ఇవి ప్రథమా విభక్తి నుండి సప్తమీ విభక్తి వరకు ఉంటాయి
ప్రథమా తత్పురుష సమాసం

 మధ్యాహ్నాము - అహ్నము యొక్క మధ్యము


 పూర్వకాలము -కాలము యొక్క పూర్వము
 పై వాటిలో మొదటి పదాలైన మధ్య, పూర్వ అనే పదాలకు ‘ము’ అనే ప్రథమావిభక్తి ప్రత్యయం
 చేరడం వల్ల మధ్యము, పూర్వముగా మారతాయి. ఇలా పూర్వ పదానికి ప్రథమావిభక్తి ప్రత్యయం
 రావడంచేత ప్రథమా తత్పురుష సమాసం అని చెప్పవచ్చు.
ద్వితీయా తత్పురుష సమాసం

 ఉదాహరణలు
 విద్యార్థు లు -విద్యను అర్ధించువారు
 నెలతాల్పు - నెలను తాల్చినవాడు
 గదాధరుడు - గదను ధరించినవాడు
 తిలకధరుడు - తిలకమును ధరించినవాడు
తృతీయా తత్పురుష సమాసం

 ఉదాహరణలు
 రాజ పూజితుడు - రాజుచే పూజితుడు
 మృత్యుపోరాటం - మృత్యువుతో పోరాటం
 గుణహీనుడు - గుణముచేత హీనుడు
 బుద్దిహీనుడు - బుద్ది చేత హీనుడు
 దైవసమానము = దైవముతో సమానము
 శిలాతోరణం - శిలలతో తోరణం
చతుర్థీ తత్పురుష సమాసం

 వంట కట్టెలు - వంట కొరకు కట్టెలు


 తిండి గింజలు -తిండి కొరకు గింజలు
 గురుదక్షిణ -గురువు కొరకు దక్షిణ
 వసతిగృహం - వసతి కొరకు గృహం
 పొట్టకూడు - పొట్ట కొరకు కూడు
 పాలసీసా - పాల కొరకు సీసా
 దూడగడ్డి - దూడ కొరకు గడ్డి
 రాజ్యకాంక్ష - రాజ్యము కొరకు కాంక్ష
 ఆటస్థలం - ఆట కోసం స్థలం
 చేపలవేట - చేపల కోసం వేట
పంచమీ తత్పురుష సమాసం

 ఉదాహరణలు
 దొంగభయం - దొంగ వలన భయం
 అగ్నిభయం - అగ్ని వలన భయం
 పాపభీతి - పాపము వలన భీతి
 విజయగర్వం - విజయం వలన గర్వం
షష్ఠీ తత్పురుష సమాసం
 ఉదాహరణలు
 పరధనం - పరుల యొక్క ధనం
 భరతవంశతిలకుడు - భరతవంశానికి తిలకుడు
 ఆటలమేటి - ఆటలలో మేటి
 హరికథ - హరి యొక్క కథ
 పోతన బాల్యం - పోతన యొక్క బాల్యం
 రామబాణం - రాముని యొక్క బాణం
 రాజకుమారుడు - రాజు యొక్క కుమారుడు
 రాజగృహం - రాజు యొక్క గృహం
 గ్రంథాలయం - గ్రంథముల యొక్క ఆలయం
 భుజబలం - భుజముల యొక్క బలం
సప్తమీ తత్పురుష సమాసం

 ఉదాహరణలు
దేశభక్తి - దేశమునందు భక్తి
ధర్మనిరతి - ధర్మమునందు నిరతి
ధనాశ - ధనమునందు ఆశ
దైవభక్తి - దైవమునందు భక్తి
శ్రవణాభిరతి - శ్రవణమునందు అభిరతి

You might also like