You are on page 1of 2

క్షీరాబ్ధి కన్యకకు (రాగం:) (తాళం:)

Pallavi
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం … నీరాజనం || 2||
Charanam 1:
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం … నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం … నీరాజనం
Charanam 2:
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం … నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం … నీరాజనం
Charanam 3:
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం … నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం … నీరాజనం

Ksheeraabdhi kanyakaku (Ragam:) (Taalam:)


Pallavi
Ksheerabdi Kanyakaku Sree Maha Lakshmi kini
Neerajalayakunu Neerajanam Neerajanam - 2

Charanam 1
Jalajaakshi Momunaku Jakkava kuchambulaku
Nelakonna Kappurapu Neerajanam .. Neerajanam
Aliveni Turumunaku Hasta Kamalambulaku
Niluvu Manikyamula  Neerajanam .. Neerajanam

Charanam 2
Charana Kisalayamulaku Sakhiyarambhorulaku
Niratamagu Mutela   Neerajanam .. Neerajanam
Aridhi Jaghanambunaku ativa Nijanaabhikini
Nirati Nanavarna   Neerajanam .. Neerajanam

Charanam 3
Pagatu Sree Venkatesu PattapuRaniwai
Negadu SatiKaralakunu  Neerajanam .. Neerajanam
Jagati AlameluManga Chakkadanamulakella
Nigudu Nija Sobhanapu   Neerajanam .. Neerajanam

You might also like