You are on page 1of 426

  చాళుక్యసింహాసనం

తూర్పుచాళుక్యుల రాష తు ల సంఘర


్ట ్రకూట చక్రవర్ ్ష ణ
మహోజ్వల చారిత్ రా త్మక నవల

కవికొండల చంద్రధరం
పట్ట స్వామి కనకరాజు

i
చాళుక్యసింహాసనం
Chalukya Simhasanam
(Historical Novel of 9th Century)

written by: K.Chandradharam


& by P. Kanakaraju (Honarary Co Author)

C : K.Chandradharam.

Price : Rs.320/-

First Edition : 2019

Copies : 500

Published By : .
K.Chandradharam
Plot. No.29, Chandragiry-II
Trimulgherry, secunderabad-500015
Telangana State, India.
P.No.9959333132
e-mail dharamkavikondala@gmail.com
vijayasree.kavikondala@yahoo.com

Copies Availeble at :
Navodaya Books House, Koti, Hyderabad.
and at Publisher.

Printed at:
Deepthi Printers,
Gandhi Nagar, Hyd-80
9949703224,7075203882

ii
నరేంద్రేశ్వరాలయం పెదపులిపఱ్ఱు
iii
ఒకరికి అక్క బావ, మరొకరికి అమ్మానాన్న
కీర్తిశేషులు పట్టస్వామి మధుసూదనరావు,
(కవికొండల) భారతీదేవి దంపతులకు

ఈ అక్షరమాల అంకితం

కవికొండల చంద్రధరం
పట్టస్వామి కనకరాజు
iv
ఈ రచనపై అభిప్రాయసేకరణ

పఠాని పాపయ్యరాజు.

ఈ నవల చదువుతుంటే నిజంగా మనం 9వ శతాబ్దం లోకి వెళ్ళిపోయినట్లే


వుంటుంది. ఆకాలం మనుషుల ఆభరణాలు ఆయుధాలు నాటి నాణాలు పన్నుల విధానం
సాంఘిక చరిత్ర కథావిథానంలోకి ఇమిడ్చివ్రాయడం చిన్నపనికాదు. అలా అని
కథాగమనానికి ఎక్కడా ఆటంకం రాకుండా వ్రాయడం విశేషం. పూర్వకాలం శ్రీశైలం
కాలినడకన వెళ్ళేవాళ్ళు. అ సన్నివేశంలోకి వెళ్తే మనం కూడ కాలినడకన నడిచినట్లే
వుంటుంది, నాటి దొంగల బాధతోసహా! వర్ణనలు సాహిత్యశైలిలో మనోహరంగా వున్నాయి.
శైలి మృదు గంభీరంగా వుంది. ఈకాలంలో గ్రాంధికంలోను పౌరాణిక శైలిలోను వ్రాస్తే
చదివే పాఠకులు దొరకరు.
ఇలాంటి చరిత్రాత్మక నవలలు ఇదివరకు ఎవరో లల్లాదేవి నోరినరసింహశాస్త్రీ
లాంటి వారు వ్రాసేవారు. ఇన్నాళ్ళతరువాత మళ్ళీ అలాంటినవల చూస్తున్నాం.

ఈ నవల చక్కగా స్క్రీన్ ప్లే వ్రాసుకుని సినిమాతీయడానికి అనుకూలంగావుంది.


`
*****
ఖండవల్లి కౌసల్య. భాషాప్రవీణ,
MA Telugu, MA Eng.Litarature

ఒక నవల బాగుంది అని చెప్పేటప్పుడు ఎందుకు బాగుందో కూడా చెప్పగలగాలి ఈ


నవలలో నాయిక వర్ణన పరికించండి.

అవకుంఠనం తీయకు. దొండ పండనుకుని నీఅధరాలను పలుకాకులు


పొడుస్తాయి. వాటిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి ఆ శ్రీరామచంద్రుడెవరో ఇంకా బయటికి
రాలేదు. నీ కనుబొమల శివధనువు భద్రంగావుంది. ఎలుగెత్తి పలకకు. శంఖానికి నీ
గొంతంత మృదుస్వరం లేదు. వడివడిగా అడుగులు వేయకు. హంసలు అంత తొందరగా
నిన్నుచూసి నేర్చుకోలేవు. నీవు గజయానవే కాని ఊరువులు ఎముకలేని ఏనుగు తొండంలా
అటునిటూ ఊగవు. ఇసుకతిన్నెలపై నత్తగుల్లలు ఆగిచిప్పలు పేరుకుని ఉంటాయి. అందుకని
నీపిరుదులకు అవి పోలికకాదు. నీచరణ కమలాలను మణి మంజీరాలు అలంకరించి

v
వున్నాయి. తామరమొగ్గలకంత ఐశ్వర్యమెక్కడిదీ. నీ జఘనం ఈ ధరాతలాన్ని ఏలేవాడిని
కూడా లొంగదీసుకునేటట్లు వుంది.”

ఈ నవలలో మణిభూషితాదేవి స్త్రీ జాతికే విభూష. మనం పాత సినిమాలలో
చూస్తాం. మొగుడు ఆవేశంలో చెంపదెబ్బ కొడితే నీవు మనిషివా పశువువా అని ఒక మాట
అనేసి పెట్టె సద్దుకొని పుట్టింటికి వెళ్లి పోయేది.

కానీ ఈ విదుషీమణి స్త్రీని కొట్టడం తిట్టడం పూర్వపు స్మృతి ఏమంటుందో ఒక శ్లోకం


చెప్పింది.

స్త్రీయోదేవాః స్త్రీయః పుణ్యాః స్త్రీవ యేవ విభూషణం


స్త్రీద్వేషో నావ కర్తవ్యస్తాసు నిందాం ప్రహారకమ్.
*****
Dr.P. Nagaprasad. MSc. PhD

తెలుగులో సాహిత్య విలువలు సన్నగిల్లుతున్న రోజులలో చక్కని చిక్కని జిగి బిగి


గల నవల ఇది. రణతంత్రాలు సమరాలు రాజకీయపు ఎత్తుగడలు వ్యూహాలు ఎంతో
స్వభావసిద్ధంగా వున్నాయేగాని కృత్రిమంగా లేవు. ఈరోజుల్లో కథలు నవలలు సగానికి సగం
ఇంగ్లీషు పదజాలంతో రాస్తున్నారు. తెలుగు పుస్తకాలలో తెలుగుదనం కరువవుతున్న
రోజులలో ఈ నవల డిగ్రి – పిజి స్తాయిలో ఉపవాచకంగా పెట్టదగిందని ఒక ప్రొఫిసర్ గా
చెప్పగలను.
P. Kanakaraju.

As I kept on reading (this novel) multipletimes I am seeing a


portrait of a great person immencely involved studied with knowl-
edge on interspersing fields like psychology, phylosophy, literature,
history, gramer etc. This is not one day job, may be lifetime achve-
ment.

*****

vi
ఆదుర్తి బాల (రచయిత్రి)

నవల అంటే ముఖ్యంగా తియ్యగా వుండాలి. చారిత్రాత్మక నవల గంభీరంగా కూడ


వుండాలి. ఈ నవల తియ్యటి మామిడిపండులా వుంది. అంతేకాదు. ఈ నవల చదువుతూ
ఆనాటి ప్రపంచంలోకి వెళ్ళిపోతాము. అప్పటికీ ఇప్పటికీ ఎన్నోమారాయి. కాని స్త్రీ, పురుషుడు
వారిమధ్య ప్రేమ మోహము ఆకర్షణ రాగము ద్వేషము స్నేహము వైరము లాంటివేవీ
మారలేదు. ఈ పుస్తకంలో మనం మరచిన చరిత్ర సంస్కృతీ నీతులు ధర్మశాస్త్రాలు
మంత్రసిధ్దులు హిందూమత జైనమత సాంప్రదాయాలు అందమైన వర్ణనలు యుద్ధతంత్రాలు
ఎన్నోఎన్నో వున్నాయి.

ఈ నవలలో నాయికానాయకుల మధ్య ప్రణయం ఎంతో ఉదాత్తంగా


పోషింపబడింది. ఇందులో వైవిధ్యంగల స్త్రీపాత్రలు శరత్ సాహిత్యంలో శ్రీకాంత్ నవలను
గుర్తుచేస్తున్నాయి.
ఒక పుస్తకం మళ్ళిమళ్ళి చదవాలనిపిస్తే అందులో గొప్పతనం ఏదో వున్నట్లే.
ఈనవల మళ్ళిమళ్ళి చదవాలనిపిస్తుంది. అందుకే కొనిదగ్గరుంచుకోవడం మంచిది.
*****

vii
చాళుక్యసింహాసనము చారిత్రాత్మక నవల ఒక పరిశీలన
KANAKARAJU, PATTASWAMY
Associate Project Director
SPP Augmentation Project-SPAG
Satish Dhawan Space centre
Indian Space Research Organisation
Sriharikota, Andhra pradesh, India 524124
LANDLINE: 08623 225853 (O)
CELL: +91 9490271201, +91 9490086608
EMAIL kpattaswamy@gmail.com
pkraju@shar.gov.in (official)

శ్రీగురుభ్యోన్నమః

వాక్యం రసాత్మకం కావ్యం. కేవల పద్యకావ్యాలనే కావ్యం అనక్కరలేదు.


పద్యంగద్యం కలిసిన చంపూకావ్యాలు వచన కావ్యరూపాలు కూడ ప్రసిద్ధాలయినాయి.
చెప్పాలంటే ఈ చాళుక్యసింహాసనమనే నవల కావ్యగౌరవాన్నిపొందింది.

శ్రీ అమోఘవర్షరాజేంద్రుడు క్రీ.శ.8వ శతాబ్దంలో దక్షిణాపథాన్ని ఏలిన రాష్ట్రకూట


చక్రవర్తి. క్రీ.శ.5-6 శతాబ్దాలలో ఆంధ్రశాతవాహనశకం పూర్తి అవుతుండగానే
రాష్ట్రకూటసామ్రాజ్య ప్రాగోదయమై త్రిసముద్రవలయమై గొప్ప రాజవంశమయింది.
కథాకాలానికి అమోఘవర్షుడు బాలకుడవడంవలన అతని పినతండ్రి ఇంద్రవల్లభుడు
రాజ్యమేలుతుండేవాడు.

ఇంతటి మహాసామ్రాజ్యంలోను వేంగిరాజ్యాన్ని పరిపాలించే ఆంధ్ర (తూర్పు)


చాళుక్యులు పరాక్రమవంతులై తమ స్వతంత్రతని నిలుపుకొని తమ వంశ మూలపురుషుడైన
కుబ్జవిష్ణువర్ధనుని పేరు నిలబెట్టారు. ప్రస్తుత కథాకాలంలో నరేంద్రమృగరాజనబడే 2వ
విజయాదిత్యుడు చాళుక్యసింహాసనాధిపతి. తన అన్న భీమసలుఖిని పారద్రోలి సింహాసనం
సాధించాడు. భీమసలుఖి మహారాజు రాష్ట్రకూటుల పంచనజేరి వేంగిపై విపుల దండయాత్రలు
చేస్తున్నకాలం. ఈ దాయాదిపోరువలన ఆంధ్రం ఎంతో నష్టపోయింది. ఈసమయంలో
ఈశ్వరప్రసాదమన్నట్లు సమస్యకు పరిష్కారమొచ్చింది, నరేంద్రమృగరాజు తనయుడైన
విష్ణువర్ధనునిరూపంలో.

viii
విష్ణువర్ధనుడు ఈ కథకు నాయకుడు. ధర్మశీలి. మహర్షి ప్రచలితమైన గురుకులంలో
సామాజిక, ఆర్ధిక న్యాయ, యుద్ధ, రాజనీతి శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు.
వ్యూహనిర్మాణంలో పంచమాంగదళ నిర్వహణలో బందిపోటుతరహా ( నేటి gorilla
యుద్ధం ) యుద్ధవిధానాలలో ప్రత్యేకించి శిక్షణ పొందినవాడు. తమ రాజ్యానికి శత్రువైన
భీమసలుఖిని గెలవాలంటే అతనికి లభిస్తున్నరాష్ట్రకూట వల్లభుడైన ఇంద్రవల్లభుని ఆశిస్సులు
పలచనచేయాలి.

యుద్ధం దేశక్షయకారకం. దేశం ఆర్ధికంగా సామాజికంగా అంటే పురుషులు


అందులోను యువకులు యుద్ధాలలో విరివిగా మరణించడంవలన స్తీపురుష నిష్పత్తిలో
వచ్చేమార్పువలన ఎంతో నష్టపోతుంది. అందుకే రాజులు సాధ్యమైనంతవరకు
పరోక్షయుద్ధాలకు తెరలేపుతారు, తరువాత శత్రువులపై మానసికయుద్ధంచేసి వాళ్ళని
తప్పుడునిర్ణయాలు తీసుకునేటట్లుచేసి తన్మూల్యం చెల్లించుకునేటట్లు చేస్తారు. ఈపద్ధతి
భారత రామాయణాలలో కూడ కద్దు. ఈ నీతివలననే చిన్నరాజ్యాలు తమ స్వాతంత్ర్యం
నిలబెట్టుకుంటాయి. విష్ణువర్ధనుడుకూడ ఈ నీతివల్లే తనరాజ్యాన్ని నిష్కంటకం
చేసుకున్నాడు. తన శత్రువుకు ఆశ్రయమైనవాడికే అల్లుడైనాడు. ఈ అల్లరికపుటెత్తుల జిగిబిగి
రచన పాఠకుని ఆసాంతం చదివిస్తుండనడంలో సందేహమా.

ఈ నవలలో ప్రతినాయకుడంటూ ప్రత్యేకంగా లేడనే చెప్పాలి. చాళుక్యులకు


రాష్ట్రకూటులే ప్రతినాయకులు. ఈ నవలలో సహనాయకుడైన విశాఖదత్తుని పాత్ర
మరువరానిది.

ఈ నవలలో నాయకునికి ఇరువురు నాయికలు. ఒకరు పగవారైన రాష్ట్రకూటుల


ఆడపడుచు శిరీషాకుమారి.

ఈమె ఒకానొకచో వాసకసజ్జిక, తన ప్రియునికోసం నిరీక్షించేది. మరొకచో


విరహోత్కంఠిత. ఈ నాయిక శృంగార వీరరసవనిత. శబ్ధభేదివంటి విలువిద్య
నేర్చినదయ్యునూ శిరీషకోమల కోమలికూడా.

రెండవ నాయికయైన మృదువదన దక్షిణనాయిక. శిరీష కుసుమ సమాన


దేవేరి యైతే మృదువదన విరిమాలలో దవనం వంటిది. అదొక ప్రత్యేకక్రుతి. ఈమెకూడా
యుద్ధకళావిశారద. పంచమాంగ దళనాయకురాలు. పంచమాంగవిధినిర్వహణలో
పరోక్షయుద్ధరీతులలో ద్వంద్వయుద్ధంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది. శరీరం కర్కశ
అసిధారయైనా ఈమె శృంగార రసాధిదేవత. ప్రణయిని . ఈమే ఖండిత. ఆపై విప్రలబ్ద.
విప్రలబ్దశృంగారం పండాలంటే రచయిత కల్పనా చాతుర్యం ఎంతఅవసరమో
రసహ్రుదయులైన పాఠకులు అంతే అవసరం. విప్రలబ్ద శృంగార వర్ణననతో మెప్పించడం
విప్రునికే సాధ్యం.

ix
చారిత్రాత్మక రచనలో కథావైశాల్యం ఎంతగా విస్తృతమౌతుందో చూడండి.
చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్లు వివిధ విన్యాసాలు, యుద్ధవర్ణనలు, ఒకవైపు మతము
ప్రజాజీవనవిధానము, సాంఘికపరిస్ధితులు, రాజకీయాలపై వాటిప్రభావం వివరించే తీరు,
మరోవైపు అనేక స్త్రీపురుష పాత్రల సృష్టి, వాటిద్వారా మానవీయ దృక్పధాలు,
అంతరంగచిత్రణ, శృంగార వీర కరుణారస సృష్టీ, ఇంకోవైపు రచయిత కథాకథన
కౌశలాన్ని అనేకంగా అనేకవిధంగా అనన్యంగా చేయగలుగుతుంది. కథపుటెన్నికలోని
ఎత్తుగడ యిది.

రచయిత కథావర్ణనా కౌశల్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. అదో స్ధాళీపులాక


న్యాయంగా మాత్రమే.

చారిత్రిక నవలలో రెండవ అంగిక కథనం ప్రజాజీవనం. మతం


ప్రజాజీవనస్రవంతిలో అనుషంగికం, ప్రపంచంలోని అన్ని నాగరికతల్లో ప్రజాజీవన
రాజకీయాన్ని మతం శాసించడం గమనించవచ్చు. మతంలో వచ్చే కాలానుసరమార్పులు
యాద్రుచ్చికంగానో ఐచ్చికంగానో రచయితలెంచుకున్న కథాకాలం 8వ శతాబ్ది పూర్వోత్తర
అర్ధభాగాలు. మతజీవనంలో ఒక మైలురాయని రాజకీయాలను కూడ ప్రభావితం చేస్తాయని
చెప్పవచ్చు.

శంకరభగవానుడు మానవరూపందాల్చి శంకర ఆచార్యుడై సనాతనధర్మాన్ని


పునఃనిర్మించి సనాతన వాగ్మయానికి భాష్యముచేసినాడు. మతముపేరిట జరిగే విపరీత
థోరణలకు అడ్డుకట్టవేసిన సంఘ సంస్కర్తా, దార్శనికుడు, జగద్గురువు అయినాడు. ఈనవల
ఈ దార్శనికుని ప్రవచనాన్ని ఊతగొని నాటి తాంత్రిక కాపాలికాది విద్యలను వామాచారాది
మార్గములను నిరసించ ప్రయత్నం చేసింది. అనేక వాదోపవాదాలు సృజించబడినాయి.
అద్వైత సాత్విక సమయాచారమే శిరోధార్యమనే అభిప్రాయం పాఠకులలో కలిగింప
ప్రయత్నించబడింది. ఒక ఉదాహరణతో పాఠకుడికి ఈ విషయ తీవ్రతని వివరిస్తాను.

ఆత్మజ్ఞానము అంటే తానూ పరము ఒకటేనన్న ఎరుక. అప్పుడు జీవ అజీవములకు


అభేదము. రెండునూ పరమాత్మ స్వరూపాలు. ఇప్పుడుండే మనిషి స్థితి నేను, నాది
అనేభావముతో కూడినది. వ్రుద్ధాప్యం వచ్చేవరకు ఈభావన తగ్గుతుంది. ఎందుకూ. నేను
అనేది నేనుకాదు అనే అంతర్గత విచారణ జరుగుతుంది. ప్రతి ఆత్మకు స్థూల సూక్ష్మములుగా
అనేక ఆవరణలు ఉంటాయి. తాంత్రికవిద్యలో ఇవితొమ్మిది. తొమ్మిదిరకాల ఈ ఆవరణాలు
దాటితే అవిద్యతో నిండిన సాధకుడు బిందు రూపస్థితిలో వున్న జ్ఞానుడవుతాడు,
అద్వైతుడవుతాడు.
కానీ కోరికలు పోవాలంటే కోరికలు తీర్చుకోమని కోరికలపై మొహంమొత్తాలని
తాంత్రికం ప్రతిపాదిస్తోంది. దానికై పంచమకారాలు అలవాటుచేసుకోమని సాధకులకు
సూచిస్తుంది. చాలామంది సాధకులు మధ్యలోనే సాధన ఆపేసి విషకీటకాలవుతున్నారు.
రచయిత ఈ విషయాన్ని వ్యంగ్యార్ధంగా ఒక నృత్యసన్నివేశాన్ని సృష్టించాడు.
x
నవావరణములంటే 9 layers లో వస్త్రాలు (dress) గా భావించి striplease
అనే dance form లాగా ఒక్కొక్క ఆవరణను తీసివేసి దిగంబరయై నాట్యం చేయడాన్ని
నవావరణనాట్యంగా భావించుట. ఇదినాకు నచ్చిన కవితాపరమైన కవిసమయం
(రచయితాసమయంఅనాలేమో). అందుకనే ఈనవల ఆద్యంతం నగిషీలు చెక్కిన జిగిబిగి
జిగీషలు కల్గిన నవల. ప్రబంధరచనలో ఒకానొక ప్రక్రియ పుర గిరి వర్ణనలు. నవలలో అదిఒక
అవసరం.

ఈనవలలో రాష్ట్రకూటులు భరతమాతకు ఇచ్చిన వడ్డాణము, ఎల్లోరా


శిల్పతోరణము. అత్యంత రమణీయము. మహాద్భుతమనదగ్గ ఈ శిల్పసంపదను ఇలాపుర
విహారయాత్ర నెపముతో వర్ణించాడు. ఈ శిల్పసృష్టిలో నాగులుకూడా దోహదపడ్డారని
రచయిత కల్పన. నాగసంప్రదాయాన్ని, భౌద్ధమతస్ధుల వామాచార తాంత్రిక సిద్ధులను ఈ
సందర్భంగా స్పృసించడం జరిగింది. నాగులు ఆంధ్రులనేవాదనను ఒప్పుకుంటే ఈ ఎల్లోరా
శృజనలో ఆంధ్రహస్తముందని ఒప్పుకోకతప్పదు. అది నిజంకావచ్చుకదా. అదేకోవలో
చేరింది శ్రీశైలప్రయాణం. సందర్భోచితముగా నాటి ప్రజాజీవనం, దారిద్యం, కులసంఖాల
న్యాయనిర్వహణరీతి వర్ణించబడినాయి. ఏరచనయైనా పాఠకులను కేవలం కథేచదివింప
జేయలేదు. రచయిత కథావిధాన్నాన్ని బట్టీ కథానిర్వహణ శక్తినిబట్టీ, వర్ణనా చాతురినిబట్టీ
నవలా మణి అంగాంగ సోయగాల్ని రచింపచేసుకుంటుంది. (నవలఅంటే స్త్రీ కవితాస్త్రీ).
అందుకే యర్రన ప్రబంధ పరమేశ్వరుడయ్యాడు, పెద్దన కవితాపితామహుడయ్యాడు.
నన్నెచోడుని నుంచి నేటివరకు ఎందరో కవులు ప్రబంధ రచనా విరించులయ్యారు.

ఈ నవలా నవలామణికి ఈ రచయిత ఎన్నో అలంకారాలు చేశాడు. రచయిత


నిర్మాణశక్తికి మచ్చుతునకలుగా 2,3టిని వివరించే ప్రయత్నం చేస్తాను.

మొదటిది విద్యాప్రదర్శన. విష్ణువర్ధనుడు మారువేషధారియై రాష్ట్రకూట రాజధానిని


ద్విరదం సరస్సును చొచ్చినట్లు చొచ్చి టీకప్పులో తుపానులాంటి యుద్ధానికి కారకుడై
తనప్రతిభను చాటడంతోపాటు ప్రభుత్వ వ్యతిరేకవర్గాన్ని నిర్మించే ఆలోచనచేశాడు.

నాయిక శిరీష విద్యాప్రదర్శనకూడా రచయిత పనిలోపనిగా ప్రవేశపెట్టి


నాయికానాయకుల ప్రధమ వీక్షణకూ అనురాగోదయానికి కదనరంగాన్ని మదన
కదనరంగాన్ని నవల పూర్వరంగాన్ని చేశాడు. అద్భుత నిర్మాణకౌశలం కథనవ్యూహం
కదాయిది.

రెండవది విరహాంతర్గత అయిన నాయిక విప్రలంభ


శృంగారం. ప్రబంధాలలో రుతు, వసంతాది వర్ణనలు శృంగార రసోద్దీపకములుగా,
నాయికా నాయకుల ప్రేమని పెంచేవిగా వుంటాయి. ఈకథలో నాయిక శిరీష తన
చెలికత్తెలొకరొకరే అభిసారికలై ప్రియులను చేరగా విరహము పెచ్చై తను ఒంటరిదై
విరహంతో అహరహం పెచ్చై ఉద్దీప్త మైనదని భావనచేశారు. ఒంటరి మనస్సు పోకడలు
xi
వర్ణించడం రచయితకు ఒక సువర్ణావకాశం, అతని (creativity)విస్రుతికి ఆకాశమే
అంచు. అపరిమిత వర్ణనా విశేషాలకు అవకాశం ఉండేట్లు నేపధ్యాన్ని నిర్మించడం
నిర్మాణశక్తికి మరోనిదర్శనం.

ఈనవలకు ప్రత్యేక అనుబంధం astronamy అనబడే ఖగోళ సిద్ధాంతవిద్య.


రచయితకున్న అనేకానేక expertises లో ఈ ఖగోళవిద్య ఒకటని ఈ నవలని చదివినవారి
కెవరికైనా తెలుస్తుంది. పురాతన ప్రపంచ నాగరికతలన్నీ, అది ఈజిప్టు అయినా గ్రీకుయైనా
మామన్ యైనా సింధూవేదమైనా సూర్యచంద్ర, ఖగోళ కదలికలని నక్షత్రగమనాలని
భూమిపైవున్న జీవ అజీవ అనేకానేక రాసులపై వాటిప్రభావాన్ని గుర్తెరిగాయి. తమదైన
విధానంలో అధ్యయనం చేశాయి, రచయిత కథాక్రమంలో నాటి శాస్త్రజ్ఞతను వారి
ప్రయత్నాలను వివరించే యత్నంచేశారు. ఖగోళశాస్త్రాన్ని వివరించే సభకు
ఇంద్రవల్లభుడివంటి రాజవల్లభుడే రావడం ప్రజల్లో శాస్త్రవిషయాసక్తిని తెలియపరుస్తుంది.
కానీ కొద్దిసేపటికే రాజువెళ్ళిపోవడం, ఆతరువాత ముఖ్యోద్యోగులు ఒక్కొక్కరే జారుకోవడం
కొసమెరుపు.

ఈ నవలలోని రసస్పోరకమే పాఠక ప్రియత్వ మంత్రం. ఋషికాక రచన చేయలేరు.


అర్ధం శబ్దం శివపార్వతుల స్వరూపం. అక్షర అర్ధ రమ్యతను సాధించడమే రచయితకి సిద్ధి.
ఒకానొకచో జీవసాఫల్యం. అందుకే రచయిత ఋషి.

నాన్రుషిః కురుతేకావ్యం.

xii
చాళుక్య సింహాసనం రచయితల మాట
తపస్వాధ్యాయ నిరతుడైన వాల్మీకి మహర్షికి, విష్ణువే తానయిన వ్యాసమహర్షికి
గురువందనం. ముందుగా గుంటూరు జిల్లా వెల్లటూరు మండలం పెదపులివఱ్ఱులోని
మాన్యకేతేశ్వరుడికి మొక్కి మామాట చెబుతాము.

ఈనవల రాష్ట్ర్రకూట రాజకుమారికి చాళుక్య రాజకుమారుడికి మధ్య ప్రేణయగాథ


మాత్రమేకాదు. మరెంతో. చారిత్రక నవల అంటేనే అంత.

వేంగినగరం రాజధానిగా పరిపాలించిన తూర్పు చాశుక్య రాజవంశం


సింహాసనానికై సలిపిన పెనుగులాటలో కల్పించుకున్న రాష్ట్రకూట చక్రవర్తులతో అసలైన
యుద్ధం. చిన్నరాజ్యం యుక్తితో రాష్ట్ర్రకూట సార్వభౌమాన్నే ధిక్కరించి నెగ్గడమే అసలైన
ఇతివృత్తం.

వేంగి అంటే నేటి ఆంధ్రప్రదేశ్ లో పశ్ఛిమగోదావరి జిల్లా ఏలూరుకు 16 కిలోమీటర్ల


దూరంలో వున్న పెదవేగి. ఇప్పుడు అక్కడ పెద్దగా కోటలు గోడలు ఏమీలేవు. ఇప్పుడు ఆ
ప్రాంతంలోని రత్నాలమ్మ దేవాలయానికి భక్తులు వెళ్ళి వస్తుంటారు. నేను చూసినపుడు
(1978) చిత్రరధస్వామి అనేపేరుగల సూర్య దేవాలయం ఉంది. ఈ వేంగినే ఏడవ
శతాబ్దంలో భారతావనిని సందర్శించిన హ్యూయాన్ త్సాంగ్ పంగ్-కి-లో అని పేర్కొన్నాడు.

మాన్యకేతదుర్గం ప్రస్తుతం మల్ఖేడ్ అని పిలవబడుతోంది. ఇది హైదరాబాదునుండి


వాడి వెళ్ళే రైలుమార్గంలో సేడం చిత్తాపూరు ష్టేషనుల మధ్యవుంది. ఎన్నో దండయాత్రలు
చూసిన ఈ నాపరాతికోట ప్రస్తుతం శిధిలావస్థలో వుంది.

చరిత్రపుటల్లో ఈ నవల భూమిక కాలం శాలివాహనశకం 730 నుంచి 742


(క్రీ.శ.808-820) గా భావించవచ్చు. చరిత్రపుటల్లో కాలంవిషయంలో కొంచం
అటూయిటూ ఉండవచ్చు. ఈ నవల వ్రాయడానికి మాన్యకేతదుర్గం ఎక్కడున్నదీ
తెలియరాలేదు. ఏ Map లోను ఈ పేరు కనిపించలేదు. దీన్ని గురించి చిన్న కథ చెప్పాలి. అది
సుమారు 1979వ సంవత్సరం. మాన్యకేతనగరం ఎక్కడున్నదో తెలుసుకోవాలనుకున్నాను.
ఒక నవలాకారుడైతే ఎల్లోరా గుహలకు వెళ్ళే దోవలోని దౌలతాబాద్ అనే దేవగిరి దుర్గమే
మాన్యకేతమనుకుని వర్ణించడం జరిగింది. ఇది తప్పు. చివరకు మల్ఖేడ్ అనే పేరు దొరికింది.
ఇదే మాన్యకేతమా కాదా తెలీదు. ఎలాగు? నామిత్రుడు గుంటక సాంబిరెడ్డిగారి నడుగుతే
అక్కడ రైల్వే స్టేషను మాష్టరుకు, పోష్టు మాష్టరుకు ఉత్తరం వ్రాయమన్నారు. అలాగే వ్రాస్తే
స్టేషనుమాష్టరు నుంచి జవాబు వచ్చింది. అలా తెలుసుకుని ఇద్దరం వెళ్ళి ఆ కోట
చూసివచ్చాం.

చరిత్రాత్మక నవల సాంఘికనవలకన్నా కొంచం భిన్నమైంది. మనుషులు భాష


వేషం నగలు నాణ్యాలు పేర్లు ఊర్లు అన్నీ ఈ కాలంవి కావు. ఆధారాలు కొన్నిటికే వుంటాయి.
చారిత్రిక ఆధారాలు లేని చోట ఆకాలానికి సమంజసంగా ఉండేటట్లు సృష్టించాల్సిందే.
పాఠకులను ఆ కాలం వాతావరణంలోకి తీసుకువెళ్ళడం రచయిత నేర్పుపై ఆధారపడి
xiii
వుంటుంది. ఇలాంటి నవలలో కొన్ని పేజీలైనా చదువుతేకాని పాఠకులకు పట్టు చిక్కదు.
పాఠకుల అవగాహన కోసం రాజవంశాలు ఆకాలం దేశపటం అవసరమనిపించి ఇవ్వడం
జరిగింది. ఈ నవలలో ఇప్పుడు మనం వాడుతున్న కిష్టియన్ ఈరా (BC/AD) బదులుగా
శాలివాహన శకం ఇవ్వబడింది. శాలివాహన శకం చరిత్ర పుస్తకాలలో దొరికిన క్రీస్తు
శకంనుంచి 78 సంఖ్య తీసివేసి ఉపయోగించుకున్నాము. అందుచేత కొంచం దోషంవున్నా
వుండవచ్చు. పాఠకులు మన్నింతురుగాక.

నవలని అతిసరళమైన భాషలో వ్రాయాలని ప్రయత్నించినా చారిత్రాత్మక నవలలో


తెలుగులో కనుమరుగైన పదాలు, అక్కడక్కడా సంస్కృత శ్లోకపాదాలు వుంటంకించకపోతే
తగిన నేపధ్యం, గాంభీర్యం రాదు. గంగా యమున నదులలో సరస్వతీనది అంతర్వాహినిగా
ప్రవహించినట్లే మనతెలుగులో, తెలుగులోనేకాదు భారతీయ భాషలన్నిటిలోను సంస్కృతభాష
అంతర్లీనంగా వుంటుంది. అంతమాత్రంచేత అది గ్రాంధికము కాదు, పాఠకులను విబ్బంది
పెట్టదు.

చరిత్రాత్మక నవల వ్రాయాలంటే ఉన్నకష్టం అటుంచి, చదివేవారు కూడా కొంచం


శ్రమ పడవలసి వస్తుంది. అంతేకాక ఆకాలపు పేర్లు మళ్ళీ వచ్చినపుడు పాత జ్ఞాపకం ఉండదు.
అందుచేత ఆయా రాజుల వంశవృక్షం, భారతావనిలో సమకాలీన దేశపటం, ముఖ్య
పాత్రధారుల పట్టిక ఇవ్వడానికి ప్రయత్నించాము.

చారిత్రాత్మకాధారమైన సినిమావంటి దృశ్యకావ్యమైనా నాటకమైనా నవలయైనా


కల్పనా చాతుర్యాన్ని గమనించాల్సిందే కానీ పట్టిపట్టి చూస్తే కుదరదు. చారిత్రికాంశాలను
శాసనాలను గుదిగుచ్చినా పాఠకులు మెచ్చరు. కావ్యమైనా రచనయైనా రసాత్మకంగా
వుండాలి.

ఈ నవలను సుమారుగా 1974వ సంవత్సరంలో చంద్రధరం అనేనేను ఆరంభించి


వ్రాశాను.అప్పుడు పూర్తికాలేదు. వృద్ధాప్యంలో ఇప్పుడుచేసేపనిలేక పాతజ్ఞాపకాలను కొత్త
అనుభవాలతో కలిపి వ్రాశాను. నేను ఇంతకు ముందు రెండు నవలలు వ్రాశాను. ఒకటి
పల్నాటి సామంతరాగోల. ఇది పబ్లిషర్ దొరకక e-books లో పెట్టాను (kinige.com/
kbook.php?id=6186). రెండవది ఆంధ్రశాతవాహనుల అశ్వమేధ యాగం అనే నవల.
దీన్నిప్రచురించి e-books లోకూడ పెట్టాను (kinige.com/kbook.php?id=6980).
ఆంధ్రశాతవాహనుల అశ్వమేధయాగం అనే నవలను ‘విష్ణుర్వై యజ్ఞః’అని ఆరంభించాను.
ఇతివృత్తం కూడ ‘యజ్ఞోవై సూనృతాః’ . ఏం సాధించాననికాదు. ఈ రెండు వాక్యాలు
వ్రాయగలిగినందుకు నాకు చెప్పలేనంత ఆనందం! ఆనాటి నా రచనకు తోడ్పడిన ఇల్లిందుల
రంగారావుగారికీ గుంటగ సాంబిరెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పకపోతే పొరపాటే అవుతుంది.

మా మిత్రుడొకరు ఇందులో వ్రాసిన విషయాలన్నింటికీ ఆధారాలున్నాయా అని


ప్రశ్నించారు. కొంత గ్రంధస్థ మైన చరిత్ర, మరికొంత ఇతరగ్రంధాలు ఆధారం చేసుకుని
చేసిన రసవత్తర కల్పన ఇది.

xiv
ఈనవలలో అనేక శాస్త్రాలను శ్లోకాలను ఉదహరిండం వలన అవి ఎక్కడినుంచి
తీసుకోబడినవో చెప్పడం సమంజసమేకాని సాధ్యంకాలేదు. కానీ ఈ రచనను ప్రభావితం
చేసిన గ్రంధాలు కొన్నిటిలో దాశరథీ రంగాచార్య చతుర్వేదభాష్యము, మీదుమిక్కిలి
యజుర్వేదం అధర్వణవేదం, శ్రీ వేదానందసరస్వతి వారి దయానందసరస్వతి శుక్లయజుర్వేద
(మాధ్యందిన సంహిత) భాష్యం (తెలుగులో), వాల్మీకి రామాయణము, మొల్ల
రామాయణము, పోతన భాగవతము, భగవద్గీత, ఆదిశంకరుల రచనలు, మనుస్మ్రుతి,
విజ్ఞానేశ్వరుడు సంకలనము చేసిన యాజ్ఞవల్క్యస్మ్రుతి, శుక్రనీతి, కౌటిల్యుడి అర్ధశాస్త్రము,
అల్లాడివైదేహి సాహిత్యవ్యాసము, రసగంగాథరము, కాశీమజిలి కధలు, శ్రీనాథుడు
సంకలనము చేసిన పల్నాటివీరచరిత్ర, నటరాజరామకృష్ణ నాట్యశాస్త్ర పరిచయము,
శ్రీవరదగురు ప్రణీతంబైన ప్రతిష్ఠాప్రయోగము, అడవిబాపిరాజు హిమబిందు, తెన్నేటిసూరి
ఛంగిజ్ ఖాన్ మొదలైనవి.

ముఖ్యంగా చరిత్ర ఇతివ్రుత్తము నిచ్చిన గ్రంథం ప్రాచీన దక్షిణభారతదేశచరిత్ర. ఈ


గ్రంథ రచనాచార్యుడెవరో తెలియదు.

ఈ నవల లక్ష్యం అడవి బాపిరాజుగారి హిమబిందు నవల సరసన జేరాలని.

ఈ నవలను Jointly and severally లాగా మామేనల్లుడు పట్టస్వామి


కనకరాజు తో కలిసి వ్రాయడం జరిగింది. అందుచేత మరింత లక్షణలక్షితం అయింది.
పెద్దలు ఈ నవలలో తప్పులు చెబుతే దిద్దుకోడానికి సిగ్గుపడను. కారణం నేను రచయితను
కాను. పండితుడిని కవిని వేదిక లెక్కిన వాడిని కానేకాను. ఇంట్లో కూచుని ఒక్కొక్క అక్షరం
కూడబలుక్కుని వ్రాసిన వాడిని. సామాన్యుడు వ్రాసినదానిలో తప్పులుండకపోతే అదే ఒక
వింత!

ఈ పుస్తకరచనలో నన్నయభ్టుకు నారాయణభట్టులా, తిక్కనసోమయాజికి


గురునాథుడిలా, అల్లసాని పెద్దన్నకు పాఠకోత్తముడిలా (Script Editor) ఉపయోగపడిన
సహరచయిత పట్టస్వామి కనకరాజు.

ఈ నవలపై తమ అభిప్రాయాలు వెలిబుచ్చిన డా.P. నాగప్రసాదుకు గారికి, శ్రీమతి


ఖండవల్లి కౌసల్య గారికి, శ్రీమతి ఆదుర్తి బాల గారికి, శ్రీ పఠాని పాపయ్యరాజు గారికి
ముద్రించిన దీప్తిప్రెస్ వారికి నమస్సులు.

కవికొండల చంద్రధరం.

xv
తూర్పుచాళుక్యులు
అచ్చమైనతెలుగు రాజులు అని చెప్పతగిన రాజవంశం ఈ తూర్పుచాళుక్యులు. ఎందు
కంటే కృష్ణా ఉభయగోదావరి జిల్లాలను నాలుగు వందల ఏభయి సంవత్సరాలు పరి పాలించిన
వారు. ఈ తూర్పుచాళుక్య రాజవంశం బాదామి రాజధానిగా ఏలిన చాళుక్యవంశానికి శాఖ.
నన్నయభట్టును నారాయణభట్టును పోషించి వ్యాసమహాభారతం ఆంధ్రీ కరణకు ఆద్యుడైన
రాజరాజనరేంద్రుడు తూర్పు చాళుక్య వంశంలో కడపటివాడు. కానీ శత్రువుల తాకిడి నుంచి
తప్పించుకోడానికి రాజధానిని వేంగి నుండి రాజమహేంద్ర వరానికి మార్చాడు. తూర్పు చాళుక్య
రాజ్యానికి ఎల్లలు చెప్పడం కష్టం. రాజులకాలంలో తరచూ యుద్ధాలు దండయాత్రలు జరుగుచుండేవి.
అందుచేత దేశాల ఎల్లలు స్ధిరంగా ఉండేవి కాదు. చరిత్ర పుస్తకాలలో కూడా కొంతకొంత బేధం
ఉంటుంది. ముఖ్యంగా తూర్పు పశ్ఛిమ గోదావరి, కృష్ణాజిల్లాలు ఈ రాజ్యంలో ఉండేవి. ఐనా
ఆంధ్రదేశం అంటే ఏమిటనేదానికి మన కొక శ్లోకం ఉంది.

పూర్వాంభోనిధి కాళహస్తి శిఖరీ శ్రీమన్మహేంద్రాచలమ్

శ్రీశైలీర్వలయీకృతాంథ్రవిషయమ్ శ్రీరాజరాజస్వయం.

తూర్పుచాళుక్య రాజవంశం

(కుబ్జ)విష్ణువర్ధనుడు(శా.శ 546-563) చాళుక్య రెండవ పులకేసి చక్రవర్తికి పెద్ద


తమ్ముడు. తూర్పుచాళుక్య రాజవంశానికి ఇతడు ఆది పురుషుడని చెప్పవచ్చు. వేంగి నేలే విష్ణుకుండిన
రాజవంశాన్ని జయించాడు కుబ్జ విష్ణువర్ధనుడు. విష్ణువర్దనుని పులకేసి వేంగీరాజ్యాన్ని స్వతంత్రంగా
పరిపాలించుకోమని ఇచ్చాడు. తరువాత వేంగీ దేశాన్ని జయసింహవల్లభుడు, రెండవ విష్ణువర్ధనుడు,
రెండవ జయసింహ వల్లభుడు, మూడవ విష్ణువర్ధనుడు మొదటి విక్రమాదిత్యుడు ఇలా పరిపాలించారు.
ఈ మొదటి విక్రమాదిత్యునికే నాల్గవ విష్ణువర్ధనుడు అనే పేరుంది. ఈయనకు 1 భీమ సలుఖి
మహారాజు, 2 నరేంద్రమృగరాజనే పౌరుష నామంకల రెండో విజయాదిత్యుడు, 3 రుద్రరాజు అనే
ముగ్గురు కుమారులు, 4 శీలాకుమారి అనే కుమార్తె ఉండేవారు. అగ్రజుడైన భీమసలుఖి మహారాజుకు
పట్టమహిషి కుమారుడైన నరేంద్ర మహారాజుకు మధ్య చాళుక్య సింహాసనం విషయంలో అనేక
యుద్ధాలు జరిగాయి. అదే ఈ కథాంశం.

రాష్ట్రకూటులు

రాష్ట్రకూటుల రాజధాని మాన్యకేతనగరం. ఇది ప్రస్తుతం హైదరాబాదు వాడి రైలు


మార్గంలో సేడం తరువాత చిత్తాపూర్ కు ముందు ఉన్నమల్ఖేడ్ స్టేషనే. భూమార్గం అయితే హైదరా
బాదు నుంచి గుల్బర్గ వెళ్ళే పాత బొంబాయి మార్గంలో ఉంది. ఇది కాగ్న అనే చిన్న నదీ తీరంలో ఉంది.

దక్షిణభారత దేశంలో రాష్ట్రకూటులు గొప్ప చక్రవర్తులైనారు. బాదామి నేలే చాళుక్య


వంశాన్ని పడగొట్టి పైకొచ్చిన రాష్ట్రకూట రాజ్యం ఒక కాలంలో కేరళ మొదలు కావేరి తుంగ భద్ర కృష్ణ
భీమ గోదావరి నర్మద తపతి నదీతీరాలను దాటి గంగానదివరకు విస్తరించింది. వీరి మొదటి రాజధాని

xvi
నూలుపుంజము కాని సంజము కాని లాటూరు కాని కావచ్చు. తరువాత మాన్యకేతం నుంచే రాష్ట్రకూట
వైభవం సంతరించుకుంది.

రాష్ట్ర్రకూట అనే మాట కాలక్రమంలో రెడ్డి అయిందంటారు. ఈ రాజవంశాన్ని దంతిదుర్గ


మహారాజుతో ( శా.శ 676) ప్రారంభించడం సమంజసంగా ఉంటుంది. ఈయన తరువాత
కర్కరాజు, కృష్ణరాజు, గోవింద ప్రభాతవర్ష విక్రమావలోకుడు, ఆ తరువాత ధృవధారా వర్షుడు
పరిపాలించారు. ధృవధారావర్షుడికి నలుగురు కుమారులు.1 స్ధంభరణావలోకుడు, 2 కర్క సువర్ణ
వర్షుడు, 3 గోవింద ప్రభాత వర్షుడు, 4ఇంద్రరాజు. ధృవధారావర్షుడు తన కుమారులలో పెద్దవాడిని
గంగవాడికి రాజప్రతినిధిని, రెండవకుమారుడు కర్కసువర్ణవర్షుడు బాండెతముకు రాజప్రతినిధిని
చేశాడు. మూడవ కుమారుడైన గోవిందప్రభాతవర్షుడిని యువరాజును చేశాడు. చిన్నకుమారుడు
ఇంద్రవల్లభుని ఘుర్జరదేశానికి రాజప్రతినిధిని చేశాడు. చివరకు గోవిందప్రభాతవర్షుడే చక్రవర్తి
యైనాడు.

గోవిందప్రభాతవర్షుని కుమారుడు అమోఘవర్ష రాజేంద్రుడు (శా.శ736-769) ఆరేండ్ల


బాలుడిగా రాష్ట్రకూట సింహాసనం అధీష్టించాడు. కానీ ఇతడు బాలుడు కావడం వలన ఇంద్రవల్లభుడే
పరిపాలన సాగించాడు.

ఇంద్రవల్లభునికి ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడు కర్కవల్లభుడు, కుమార్తె శిరీష


రాష్ట్రకూటులలో ఇంద్రవల్లభుడు, శిరీష, కర్కవల్లభుడే ఈ నవలలో కనిపిస్తారు.

ఈ నవలలోని వ్యక్తులు ప్రదేశాలు

1 నరేంద్రమృగరాజు చాళుక్య (వేంగి) మహారాజు


2 విష్ణువర్ధనుడు చాళుక్యయువరాజు
3 భీమసలుఖి నరేంద్రమృగరాజుతో సింహాసనానికై పోరాడిన అగ్రజుడు
4 విశాఖదత్తుడు చాళుక్య సేనాధిపతి
5 అంగీరసుడు చమరీ గురుకులం కులపతి
6 శవనకుడు ఉపకులపతి

7 అరణి, పూర్వచిత్తి, వాశిష్ఠ, సమంత, షడ్పద, విరిజ, యామిని, రోహిణి


రాజకుమారి శిరీష చెలికత్తెలు
8 శిరీష రాష్ట్ర్రకూట రాజకుమారి
9 అమోఘవర్షుడు రాష్ట్రకూట బాలచక్రవర్తి
10 ఇంద్రవల్లభుడు రాష్ట్ర్రకూటానికి మకుటం లేని మహారాజు
11 అయ్యణమహాదేవి రాజమాత. జైనదీక్షాపరురాలు
12 కర్కవల్లభుడు శిరీష సోదరుడు
13 ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్య ప్రముఖ వ్యాపారవేత్త
14 కమలహితాదేవి లీశోత్తరదీక్షితుని ప్రియురాలు
15 వసుమిత్ర ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్య కుమార్తె
16 కొండమానురుషి రాజకుమారికి గురువు
xvii
17 రసతరంగిణి మాన్యకేతంలో వేశ్య.
18 చిత్రాణి నవావరణ నాట్యకత్తె
19 లీశోత్తరదీక్షితుడు మహాసైన్యాధిపతి
20 రేవాదాసదీక్షితుడు శిరఃప్రధాని
21 బింబాధరి కత్తులు విసరే నాట్యకత్తె
22 అధరసుందరి నరేంద్రమ్రుగరాజును రక్షించిన వేశ్య
23 మణిభూషితాదేవి శిరఃప్రధాని భార్య
24 శతావరి సారథి, వైద్యుడు
25 గోపన్న అనుచరుడు, మంత్రి
26 గొల్లనయ్య ఆంధ్రశ్రేష్ఠి ఇంట్లో గూఢచారి
27 కుంచనభట్టు బహుభాషి
28 మృదువదన రేండవ నాయిక
29 కూష్మాండయోగి మాయగాడు
30 చీమయ్య గూఢచారి
31 గంగాతీర్ధుడు చాళుక్యుల మహామంత్రి
32 సోమసూత్రం శివకేశవయ్య చాళుక్యుల మహామంత్రి
33 నీలవర్ణుడు శిరఃప్రధాని అంగరక్షకుడు
34 కుశధారి శిరఃప్రధాని తమ్ముని కుమారుడు
35 బిందురుషి శివాలయం పూజారి.
36 బంటు బిందురుషి సేవకుడు
37 వ్యాఘ్రపాదుడు పెదపులిపఱ్ఱులో రుషి
38 గండువర్మ గూఢచారి
వాఘిరలోయ అజంత గుహలు. కైలాసనాధాలయుం
ఎల్లోర గుహలు.
ఈలపురము ఎల్లోర గుహలు వాఘిర లోయ
అజంత గుహలు

xviii
మాన్యకేత దుర్గంలో బురుజు

ఈలపురములొ జలపాతస్నానం

xix
ఈజిప్టు సంస్క్రతిలో అర్ధనారీశ్వరి

xx
పెదపులిపఱ్ఱు దేవాలయంలో వ్యాఘ్రపాద మహర్షి ప్రతిష్ఠించిన
కుమారస్వామి

xxi
xxii
అంకములు
1 శ్రీముఖం 1
2 వేట 7
3 మాన్యకేతనగరం 15
4 విడిది కావాలి 18
5 శివాలయం 21
6 శబ్దభేది 23
7 చిత్రపురం 27
8 తండ్రీ కొడుకులు 32
9 ఆత్మకమలం 38
10 బహుభాషి 43
11 రసతరంగిణి విలాసవనం 48
12 రణరంగం. 56
13 స్వదేశయాత్ర 73
14 కుటిలుడు 82
15 అస్త్ర సన్యాసం 85
16 మలయవనం. 88
17 పేదరాశి పెద్దమ్మ. 94
18 ధర్మసూక్ష్మం 100
19 సంచార శ్రేణి 112
20 అడవిదొంగలు. 123
21 శ్రీగిరి 128
22 సారధి శతావరి 135
23 మృదువదన 140
24 కన్యగర్భం 146
25 బేలనురా దేవా 150
26 ఋషులు 159
27 పెళ్ళిసంబంధం 169
28 కమలహితాదేవి 174
29 భ్రూణము 178
30 రాక్షస వివాహం 183
31 ఐదవనెల. 190
32 విమానాలున్నాయా 193
33 నాగదీక్ష 200

xxiii
34 ఇంతి అంతిమ నిర్ణయం. 205
35 మహామంత్రి తొలగింపు 220
36 వాస్తుమార్తాండుడు. 227
37 రాజమాత 234
38 క్రొత్తమంత్రి 239
39 కాలాముఖులు 242
40 దేవతార్చన 245
41 వేంగిలో పండిత సభ 249
42 ఆర్యభట్టీయం 260
43 హత్య 267
44 కూష్మాండయోగి 273
45 మాయాలోకం 276
46 రాధామాధవం 286
47 చిత్రరథస్వామి ఆలయం 294
48 కల్లుపాట 303
49 స.భ.ర.న.మ.య.వ 307
50 కల్లు అమ్మను 311
51 నవావరణ నృత్యం. 315
52 స్త్రీ ఏవ విభూషణం 319
53 కోటకు కన్నం 323
54 రణదుందుభి 325
55 ముట్టడి 327
56 రాకుమారి అంతఃపురం ముట్టడి 333
57 వరాహకేతనం 336
58 విష్ణుయుద్ధం 337
59 విజయానంతరం. 344
60 సంధి 353
61 పెళ్ళిచూపులు 358
62 భయం 370
63 పట్టాభిషేకం 375
64 అడవిపువ్వు 379
65 ప్రతిష్ట 389

xxiv
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

1 శ్రీముఖం

శ్రీగర్భానికి పదును పెడుతున్న విష్ణువర్ధన రాకుమారుడు తల పైకెత్తి చూశాడు


మృదు వదన ముఖంలోకి ఏమిటన్నట్లు.

“కులపతి రమ్మన్నారు” అన్నది కులుకుతూ కమలపత్రాల్లాంటి కనులు పెద్దవిచేసి


మృదువదన. విష్ణువర్ధనుడు తన చేతులోని ఖడ్గాన్ని తుడిచి వరలో పెట్టి ఆ బాల వెంట
కదిలాడు. అది కులపతి పిలుపు కాబట్టి ఎందుకు అని ఎదురు ప్రశ్న వేయలేదు రాకుమారుడు.

అది చమరీ గురుకులం. వింధ్యపర్వతలోయలో వుంది. దానికి అంగీరసుడు కులపతి.


శవనకుడు ఉప కులపతి.అక్కడ యుద్ధవిద్యలన్నీ నేర్పబడతాయి. అది తరతరాలుగా వస్తున్న
గురుకులం కాబట్టి పూర్వం ఎందరో రాకుమారులు అక్కడ చదువుకుని మహా రాజులయ్యారు.
ఎందరో మహావీరులు ఆ గురుకులం నుంచి వచ్చారు. ఇప్పుడున్న విద్యార్ధులలో తూర్పు
చాళుక్య రాకుమారుడు విష్ణువర్ధనుడు ఒకడు.

ఆ ఆశ్రమం చిన్న కొండలాంటి దిబ్బ పైన నిర్మించబడింది. కుటీరానికి దక్షిణ


పశ్చిమాలలో ఎత్తైన రాతి చట్టు ఉంది. ఉత్తరానికి చూస్తే చక్కటి తామరకొలను, దూరంగా
చూస్తే తూర్పు ఈశాన్యంగా ప్రవహించే సెలయేరు ఉన్నాయి. ఆ శాల చుట్టూ చక్కని
పూలతోట వుంది. అందుచేత తేనెటీగలు తుమ్మెదలూ ఝుంకారం చేస్తూ తిరుగుతున్నాయి.
అమా యకమైన లేడికూనలు మాలిమితో ఆచార్యుడి వద్దకు వచ్చికూడా ఆయన ఆసీనుడైన
వ్యాఘ్రాజినం చూసి పులేమోనని భయపడి పారి పోతున్నాయి. ఆచార్యుడికి ఆ లేడి పిల్ల లంటే
చాలా గారాబం.

“విష్ణువర్ధనా!వచ్చి కూర్చో!” అన్నడు అంగీరసుడు. రాకుమారుడు మేడిచెక్క పీట


పైన చేతులు కట్టుకుని కూర్చున్నాడు.

“కుమారా! నీకింతవరకు యుద్ధవిద్యలన్నీ నేర్పాను. చివరగా నేర్పవలసినది బ్రహ్మ


విద్య. ‘ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ’. ఇది మహామంత్రం. బ్రహ్మ విద్యే ఆత్మ విద్య! ఆత్మవిద్య
అసలైన మహావిద్య!పెద్ద వటవృక్షానికి మూలం చిన్న మఱ్ఱిగింజ అయినట్లే ఈ బ్రహ్మాం డాని
కంతటికీ మూలం ఓం బీజం. అకార ఉకార మకార అర్ధానుస్వారలతో కూడిన ఈ మంత్రంలో
నాలుగవ మాత్రే అధర్వణ వేదం. దీని ఆధారంగానే నీకు యుద్ధవిద్యలు రణ తంత్రాలు అన్నీ
నేర్పాను. నీవు పట్టభద్రుడవైనావు. విష్ణువర్ధనా!నీవు వేటలో అధ్భుత మైన ధైర్య సాహసాలు
పరాక్రమం ప్రదర్శించావు. ఇంక నీవు జీవితంలో నిజమైన యుద్ధాలు చేసి దుర్భేద్యమైన
దుర్గాలను జయించవలసి వుంది. అశోక చక్రవర్తికూడా ముందు శత్రువులను జయించి ఆ
తరువాతనే శాంతి, అహింస అన్నాడు. రాకుమారా నేటితో నీ విద్యాభ్యాసం ముగిసింది”
అన్నాడు కులపతి.
1
  చాళుక్యసింహాసనం

విద్యాభ్యాసం ముగిసింది అనగానే ఆచార్యుడి వెనక నిలబడిన మృదువదన వదన


సరోజం రెట్టింపయింది. అప్పటివరకు ఒక శ్రీముఖాన్ని చేతపట్టి కులుకుతూ కుడి యడమలకు
తిరుగుతుంటే ఆ యువతి సుశ్రోణి మజ్జిగ కుండలోని చల్లకవ్వంలా తిరుగు తోంది.
విష్ణువర్ధనుని విద్యాభ్యాసం ముగిసే శుభసమయం కోసమే ఆ తరుణి ఎంతో కాలంగా ఎదురు
చూస్తోంది. ఆచార్యుడికి ఎదురుగా కూర్చునివున్న రాకుమార విష్ణు వర్ధనుడు మృదువదన
మదన తరంగాన్ని గమనించి కూడా చూసీచూడనట్లు ఊరు కున్నాడు.

మళ్ళీ ఆచార్యుడే “విష్ణువర్ధనా! మాన్యకేత మహానగరం నుండీ ఒక శ్రీముఖం వచ్చింది.


నేనింకా ఆ లేఖ విప్పలేదు. నీవు చదువు.” అన్నాడు.

కులపతి మృదువదన చేతిలోని పత్రికను అందుకుని విష్ణువర్ధనుని చేతికిచ్చాడు. ఆ


పత్రికను అందుకుని రాకుమారుడు పరిశీలించాడు. దానిపైన అమోఘవర్ష చక్రవర్తి రాజ
ముద్రిక వుంది. అందులోని సారాంశం శాలివాహనశకం ఏడువందల ముప్పదియైదు
జయనామ సంవత్సరం జేష్ఠ మాసారంభంనుంచి మాన్యకేత మహానగరంలో వీరోత్సవాలు
జరుగుతాయి. దేశవిదేశాల యువకులకు యుద్ధవిద్యలలో పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు
జేష్ఠపూర్ణిమ నాడు రాష్ట్రకూట చక్రవర్తులు బహుమతి ప్రదానం చేస్తారు. అందరిలో
మహావీరుడిని ఎంచి జగదేకవీర బిరుదునిచ్చి బంగారు పూలతో కనకాభిషేకం చేస్తారు.
తలపైన వజ్రకిరీటం పెడతారు. ఈ ఉత్సవం రాష్ట్రకూటులు నాలుగు సంవత్సరాల కొకసారి
నిర్వహిస్తుంటారు. మాన్యకేతచక్రవర్తులిచ్చే జగదేకవీర బిరుదం అంటే సామాన్య విషయం
కాదు.

“కుమారా విష్ణువర్ధనా!” అన్నాడు అంగీరసుడు వాత్సల్యంతో.“నీకు మాన్యకేతం


వెళ్ళాలని వుందా? అక్కడ నాలుగేళ్ళ కొకసారి వీరోత్సవాలు జరుగుతాయి. నిజంగా మహా
వీరులకు అది ఒక స్నాతకోత్సవం! భారతీయులే కాకుండా జంబూద్వీపం ఇళాద్వీపం నుండి
కూడ అనేక మంది యోధులు ఆ ఉత్సవాలకు వస్తారు.”అన్నాడు అంగీరసుడు.

“ఆచార్యా! వీరుడనేవాడికి తన సామర్ధ్యం ప్రదర్శించాలని, పరీక్షించుకోవాలనీ


ఉంటుంది కదా!”అని వూరుకున్నాడు ప్రత్యేకంగా తన కోరికను గురించి చెప్పకుండా
విష్ణువర్ధనుడు.

“రాకుమారా! నీ కోరిక సహజమే! కానీ ఈతరుణంలో నీవు మాన్యకేతం వెళితే


ప్రాణహాని ఉంటుందేమోనని భయపడుతున్నాను. మీ వేంగీచాళుక్యరాజ్యానికి మాన్యకేతం
శతృదేశం. ఇప్పుడు మీ రాజ్యం దాయాదుల పోరుతో అట్టుడికిపోతోంది. మీతండ్రి నరేంద్ర
మృగరాజుకూ మీ పెదతండ్రి భీమసలుఖి మహారాజుకు మధ్య యుద్ధాలు జరుగు తున్నాయి.
భీమసలుఖి మహారాజుకు మాన్యకేతాన్నేలే రాష్ట్రకూటచక్రవర్తుల అండవుంది. మీ తండ్రిని
జయించ డానికి కావలసిన సైనిక సహాయం కూడా ఇస్తున్నారు. పలుమార్లు భీమసలుఖి
మహారాజును వేంగీ సింహాసనంపైన కూర్చుండపెట్టారుకూడా. కానీ ఆయన నిలదొక్కుకో

2
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

లేకపోయాడు. చివరకు నిన్నూ మీ తండ్రి నరేంద్రమృగరాజునూ అంత మొందిస్తే కానీ


యుద్ధం ఆగదని నిశ్ఛయానికి వచ్చారు. అందుచేత నీవు మాన్యకేత నగరం వెళ్ళడం
ప్రమాదకరం.”అన్నాడు అంగీరసుడు.

ఆ మాటలకు విష్మువర్ధనుడు నిరుత్సాహ పడలేదు. “ఆచార్యా! భయపడి దాక్కునే


బదులు ఒకసారి మాన్యకేతం వేళ్ళి వాళ్ళ బలమేమిటో తేల్చుకునివస్తే బాగుంటుందని నా
అభిప్రాయం!”అన్నాడు.

“రాకుమారా! నీవందుకు సమర్ధుడవే! కానీ వేంగీ చాళుక్య రాకుమారుడిగావెళితే


మొదటి దినమే బందీవవుతావు. అందుకే నీవు మారువేషంలో వెళ్ళడం మంచిది. నీ
విక్కడినుంచీ నీ సహాధ్యాయులలో నచ్చినవారిని వెంట తీసుకుని వెళ్ళు!”

“ఆచార్యా! నాకు విశాఖదత్తుడితో జోడీ బాగా కుదురుతుంది. అతడు నా అంతటి


వాడు.”

అంగీరసుడు చిన్న చిరునవ్వు నవ్వి అన్నాడు.“విశాఖదత్తుడు శౌర్యంలో నిన్ను మించిన


వాడు. కానీ పరాశక్తి ధర్మాధర్మ వివర్జిత! ఇతడుకూడా అలాంటివాడే! నీవురాకుమారుడివి.
నీలో శౌర్యంతోపాటు వినయం విధేయత దయ క్షమాగుణం అన్నీ ఉన్నాయి. విశాఖదత్తునిలో
అవిలేవు. చాలా మొరటు మనిషి. తన లక్ష్యసాధన కోసం ఈ బ్రహ్మాండాన్నే బద్దలు
కొడతానంటాడు.”

“ఆచార్యా!” అన్నాడు విష్ణువర్ధన రాకుమారుడు. “మీరనుమతిస్తే ముందు మా


నాన్నగారికి సహాయంగా రాజధాని వేంగీనగరం వెళ్ళాలని వుంది!”

“రాకుమారా! ఇప్పుడు మీ వేంగీ నగరాన్ని రాష్ట్రకూట సేనలు ముట్టడించి ఉన్నాయి.


మీ తండ్రి చిక్కులలో ఉన్నారు. నీవిపుడు వేంగికి ఒంటరిగా వెళ్ళకు. నావద్ద రెండువందల
దాకా అటవిక సైన్యం వుంది. నీ వెంట తీసుకు వెళ్ళు. నీవెలాగైనా మీ దేశంలో శాంతి
నెలకొల్పాలి. నిరంతర యుద్ధాలకు ఒక అంతం కనుగొనాలి. యుద్ధాలతో మీ ప్రజలు
విసిగిపోయి వున్నారు” అన్నాడు అంగీరసుడు జాగ్రత్తలు చెబుతూనే కర్తవ్యం గుర్తు చేస్తూ.

“మహర్షీ! మీరు తలుచుకుంటే రాష్ట్రకూటులకు మా వేంగీచాళుక్యులకు సంధి చేయ


గలరు.” అన్నాడు విష్ణువర్ధనుడు.

“కుమారా! కొన్ని వ్యాధులకు మందులు పనిచేయవు. శస్త్రచికిత్సే మార్గం! చెడి పోయిన


దుష్టాంగాన్ని ఖండించాలి! అది హింస కాదు చికిత్స! కానీ నేడు రాష్ట్రకూటులు మహా
సామ్రాట్టులు. గొప్ప సైన్యం వుంది. మీదేమో చాల చిన్న దేశం. మరి నీవా రాష్ట్ర కూటుల్ని ఎలా
ఎదిరించగలవూ?”

3
  చాళుక్యసింహాసనం

“గురువర్యా! నేను మీ శిష్యుడిని. చమరీ గురుకులం ధాటి ఏమిటో వారికి తెలియదు.


వ్యూహంతో వనమదమాతంగాన్నిసహితం లొంగతీసుకోవచ్చు కదా!”

“రాకుమారా! నీకు జయమగుగాక! సర్వాదిశోవిరాజతి! నేను ఐదారు నెలలపాటు


నర్మదానదీ తీరాన తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను. నేను లేనపుడు ఈ గురుకులాన్ని
ఉపకులపతి శవనకుడు నడుపుతాడు.” అంటూ ఆచార్యుడు కూర్చున్న చోటినుంచి లేచాడు.

విష్ణువర్ధనుడు నమస్కరిస్తుండగా అంగీరసుడు అక్కడనుండి వెడలిపోయాడు. కులపతి


వెళ్ళిపోవడంతోనే మృదువదన విష్ణువర్ధనుని చేయి పట్టుకుంది. “నాకు తెలుసులే నీ చదువు
ఇవాల్టితో ముగిసిందనీ!” అన్నది కనులెత్తి విష్ణువర్ధనుని కన్నుల లోకి ఆశగా చూస్తూ.
పొటకరించిన యవ్వనంతో ఆ బాల వడలు పులకరించి వుంది. ముఖారవిందం వేయిరేకుల
తామరపువ్వులా విప్పారింది. కాకపోతే నీలితామర! మృదువదన నల్లని నలుపు కాకపోయినా
రంగు తక్కువ. పరిశ్రమతో కండలు తేరిన శరీరం, తీర్చిదిద్దినట్లున్న కనుముక్కు తీరు. ఏ
శిల్పో చెక్కిన నల్లరాతి విగ్రహంలా వుంటుంది. ఆ బాల ఖడ్గం చేతపట్టి నిలబడితే శ్యామలాదేవి
లాగే వుంటుంది.

మృదువదన ఒక అడవిపిల్ల. ఎవరుకన్నారో తెలియదు. అడవిలో విడవబడిన మరో


శకుంతల. కులపతి అంగీరసుడు తీసుకువచ్చి పెంచుకున్నాడు. శిష్యులందరు మగపిల్లలే.
వారితో పాటు యుద్ధవిద్యలు నేర్పాడు. మృదువదన ఖడ్గచాలనంలో ఆరితేరింది.

“అయితే?” విష్ణువర్ధనుడు మృదువదన వైపు నిరాసక్తిగా చూశాడు.

“నీ వింక నా అందాల రాకుమారుడివి! బడిపిల్లాడివి కాదు!” ముద్దుముద్దుగా అన్నది


మృదువదన.

వారిద్దరూ ఆశ్రమం నుంచి సెలఏరు వైపు నడిచాడు. “చదువు గురుకులంతో ముగిసేది


కాదు! తెలుసా!”అన్నాడు విష్ణువర్ధనుడు ఒక బండరాతిపై కూర్చుంటూ.

“ఔనౌను! ఇకమీదట నీవు ఆచార్యుడు చెప్పినట్లు దుర్భేద్యమైన దుర్గాలను జయించ


వలసి వుంది!”

“ఆచార్యుడు ఆమాట అన్నారు కానీ ఆ దుర్భేద్యమైన దుర్గాలేవో చెప్పలేదు.”

మృదువదన భావగర్భంగా పరిహాసం చేసింది. “బుజ్జిపాపాయికి తెలిసినంత మాత్రం


కూడా నీకు తలీదు”

“ఈ పిచ్చివాగుడే వాగద్దన్నాను.”చిరుకోపం ప్రదర్శిస్తూ అన్నాడు విష్ణువర్ధనుడు.

4
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“నీవెప్పుడూ ఇంతే!”మృదువదన కోపంతో మూతి ముడుచుకుంది. “గురుకులంలో


అందరూ నాకేసి ఆశగా చూస్తారు. నేనేమో నీకేసి చూస్తాను. నీవేమో అంతరిక్షంకేసి
చూస్తావు. నీవు గగనంలో చందమామని అందుకోడానికి ఇంకా చాలా కాలం పడుతుంది.”
ఏదో జోస్యం చెప్పినట్లు చెప్పింది మృదువదన.

“అంటే?”

“నీవు వేంగీ నగరానికి వెళ్ళగానే నీకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తారు. అక్క డందరూ
యుద్ధాల గొడవలో పడిపోయి వున్నారు. నీ పెళ్ళి విషయం ఎవరూ పట్టించు కోరు. నీకు తగిన
యువరాణిని వెతకడానికి ఇంకా చాలాకాలం పడుతుంది. అప్పటిదాకా నీ చేతికందే
అందమైన నర్తకీమణులూ పరిచారికలు ఉంటారనుకో! కానీ వారికి ఒక్కొక్క పరిష్వంగానికి
ఒక్కొక్క రత్నహారం ఇవ్వాల్సివస్తుంది.”

“మృదూ!ఇప్పుడు నాకు పెళ్ళొక్కటే తక్కువ! అక్కడ వేంగీదేశాన్ని పరిపాలించడం


కత్తి మీద సాములాగా ఉంది.”

“ఉంటే! నీ శౌర్యం ముందు శత్రువులు నిలబడతారా? సూర్యుని తేజస్సును మబ్బులు


ఎంతవరకూ మూయగలవూ? కొంచం మదన సామ్రాజ్యాన్ని కూడా పరిపాలించు!”
కులుకుతూ అన్నది ఆ బాల.“మన్మధబాణాలు ఎక్కడెక్కడ తగులుతున్నాయో చెప్పనా.
ఓర్చుకోలేకుండా ఉన్నాను” విష్మువర్ధనుని చేయి వదలకుండా అన్నది మృదువదన.

“నీవు నా చేయి వదులుతావా?”

“కోరివచ్చిన వనితను కాదనడం భావ్యం కాదు.నేనేమీ మహారాణిని కావాలని కోరు


కోవటం లేదు! అప్పటివరకూ నన్ను ఉపపత్నిగా పరిగ్రహించు. శరణన్నవారిని వలచి వచ్చిన
వనితను విడచిపుచ్చడం క్షాత్రవ ధర్మం కాదు.”

“నీ దగ్గర ధర్మశాస్తాలు నేర్చుకోమంటావా?”

“నేనంతటిదానను కాదు. కానీ ఆ భగవంతుడే ఈ లోకాన్ని రెండు అర్ధభాగాలుగా


సృష్టిం చాడు. సగం స్త్రీ, సగం పురుషుడూ! అంటే ఈ రెండు అర్ధభాగాలకూ కలిసి ఒకట
వ్వాలనే ఆరాటం. ఇది భగవంతునికి వినోదం. స్త్రీ దగ్గర పురుషుడు నేర్చుకోవల సింది చాలా
వుంటుంది.”

“ఓహో అలాగా?ఈ గురుకులంలో అబ్బాయిలు చాలామందే ఉన్నారు. వాళ్ళంతా నీ


దగ్గర సృష్టి రహస్యాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరినీ కూర్చోపెట్టి పాఠం
చెప్పు.”

5
  చాళుక్యసింహాసనం

“నేర్పాలంటే గురువుకు తగ్గ శిష్యుడుండాలి. అలాంటివాడివి నీవే!”

“మృదూ!పిచ్చిదానిలాగా నా వెంటపడతావెందుకూ? ఈ గురుకులంలో ఎందరో వీర


కుమారులున్నారు. అందులో నీకు నచ్చినవాడిని పెండ్లాడు!”

“నాకు నచ్చినవాడివి నీవే!వలపూ ఒక పిచ్చే! నీవు నామనసులోకి వచ్చినప్పటి నుంచీ


ఇంకెవరూ నచ్చటం లేదు. ఇదేమి మాయో తెలీదు. తనువు మనువు వలపు తలపు ఒకటే
అవ్వాలనేద్ నా తపన!అందులోనూ మనది ఆబాల్య స్నేహం. నీవు గురు కులానికి
వచ్చినప్పటినుంచీ ప్రొద్దుతిరుగుడు పూవులా నీవంకే చూస్తున్నాను. అటు సూర్యు డిటు
పొడిచినా నేను వేరేవారిని చేసుకోను.

విష్ణూ! నీవు యువరాజు కాగానే నీచుట్టూ చేరి కీర్తించే వందిమాగధులుంటారు. నీ


వెక్కడికి వెళ్ళినా ముందు పంచ మహాశబ్దాలు మోగించేవారుంటారు. అప్పుడు నాకు నీతో
ఇలా మాట్లాడే సమయమే ఇవ్వవు. నిన్ను ఏకవచనంలో సంబోధించే అవకాశం కూడా నాకు
రాదు. నేనేమీ నీ పట్టపురాణిని కావాలని కోరుకోవటంలేదు. కేవలం నీ ద్వితీయ పత్నిని.
మనిద్దరం గాంధర్వ వివాహం చేసుకుందాం. నేను నీ ఛాతిపైన సహజ కవచంలా ఎల్లపుడూ
నిన్ను కాచుకుని వుంటాను. ఇంకా నన్ను వరిస్తావో వధిస్తావో ఏదో ఒకటి చేయి. మన్మధుని
చేతులొ దశమావస్తకు జేరే బదులు నీ చేతులో ఒరగడం మంచిది.”

అప్రయత్నంగా విష్ణువర్ధనుని చేయి ఖడ్గం పిడి మీదకు చేరింది. “కాదంటే నామీద


పగపడతావా?”అన్నాడు గంభీరంగా.

“వలపు కూడా పగ లాంటిదే! ఒకసారి మనసులో నాటుకుందంటే పోదు. పోనీ ఒకపని


చేయి. నీ వెంట యుద్ధాలకు తీసుకు వెళ్ళు. ఏదైనా యుద్ధంలో నేను మరణిస్తే నీకు అడ్డు
తొలగిపోతుంది.”

“నీవు ఆడదానివి. నిన్నుయుద్ధానికి తీసుకెళితే నిన్నెత్తుకు పోకుండా వందమంది


సైనికులను కాపలా పెట్టాలి. ఆ వందమందిలో నిన్నెవడేంచేస్తాడో చెప్పలేము.”

“ఎవడేనా నామీద చేయివేస్తే నరుకుతాను. మొన్న వేటలో పులి తిరగబడితే ఒక్కడూ


ఆదుకోలేదు. నేనే పులిని పగలకోశాను.”అన్నది మృదువదన ఆవేశంగా. కాసేపాగి “విష్ణూ!
పోనీ ఇవాళ ఈ ముచ్చటైనా తీర్చు!” మృదువదన కూడా సఱ్ఱున వరలోంచి ఖడ్గం లాగింది
ద్వంద్వ యుద్ధం చేద్దామన్నట్లు.

విష్ణువర్ధనుడు కూడా ఖడ్గం దూశాడు. కొంచం సేపు ఇద్దరి మధ్యా యుద్ధం సాగింది.
విష్ణువర్ధనుడి దెబ్బకు మృదువదన ఖడ్గం వెళ్ళి వాగులో పడింది. మృదువదన బుద్ధిగా
రాకుమారుడి ముందు మోకరిల్లి తల వంచింది మెడకాయ నరకమన్నట్లు.

6
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

విష్ణువర్ధనుడు ఖడ్గం పడవేసి మృదువదన జబ్బ పట్టుకుని పైకి లేపాడు. కనుకొలకులలో


నీరు తుడిచాడు. “మిత్రురాలా! నీ సహచర్యం కన్నా నా కర్తవ్యం ముఖ్యమైనది. నన్ను
మన్నించు” అన్నాడు. విష్ణువర్ధనుడు మృదువదన జబ్బ వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

2 వేట
అది పదిరోజులక్రితం మాట.

కులపతి ఆదేశానుసారం చమరీ గురుకులం విద్యార్ధులంతా మహారణ్యంలోకి వేటకు


బయలు దేరారు. అదొక మృగయా సప్తాహం లాగా సాగింది.

ముందుగా అడవిలో వంటలు వార్పులు చేసేవారూ గుడారాలు దింపేవారూ కదలి


వెళ్ళారు. ఆ తరువాత విద్యార్ధులు కులపతితో కలిసి బయలుదేరారు. కులపతి అంగీరసుడికి
కుడిప్రక్కన విష్ణువర్ధనుడు నడుస్తున్నాడు. అతడు వీపుకు ఇరువంకలా అంబులపొదులు
కట్టుకున్నాడు. చేతులో విల్లు శోభిల్లుతోంది. నడుము ధట్టీనుంచీ ఎడమ వైపు కరవాలం
వ్రేలాడుతోంది. చురికను బొడ్డులో దోపుకున్నాడు. కులపతికి ఎడమ ప్రక్కన మృదువదన
ఖడ్గపాణియై నడుస్తోంది.

మిగతా విద్యార్ధులందరూ కులపతికి కాస్త వెనగ్గా పరిహాసాలాడుకుంటూ సాగారు.


కులపతి దగ్గరగావుంటే అల్లరి చేయడానికి గ్రామ్యభాష మాట్లాడడానికీ సరసాలకు అవకాశం
వుండదు.

వారంతా కొండకోనల్లో నడుస్తుంటే ఒక సైన్యమే కదిలినట్లువుంది. వారి పటాలంలో


నాలుగు యుద్ధగజాలున్నాయి. కొన్ని అశ్వాలు ఒంటెలు భారాలు మోయడానికి చాలా
కంచరగాడిదలు ఉన్నాయి. ఇవి కాక కావిళ్లు వేసుకుని మోసే భారవాహకులు వెంట
కదిలారు. చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉండే అటవికులు కూడా వేటమాంసం కోసం
జంతువుల తోళ్ళు చర్మాలు ఏనుగు దంతాలు పులిగోళ్ళు తెచ్చుకోవడానికి వెంట వచ్చారు.
అడవి బాగా పరిచయమున్న ఆటవికులు వారి వేటకుక్కలతో సహా ముందు నడుస్తూ దోవలు
తీస్తున్నారు.

వారి సామగ్రిలో వేటాడడానికి ఈటెలు బరిశలు శూలాలు విల్లంబులు తూణీరాలు కర


వాలాలు మడ్డుకత్తులూ పరశువులు అన్నీ ఉన్నాయి. ఇవికాక జంతువులను పట్టుకునే వలలు
చిక్కాలు పగ్గాలు తాళ్ళు మోకులు గేలాలు ఇనప గొలుసులు ఉన్నాయి.

అడవి మధ్యలో కొంచం చదునైన ప్రదేశం చూచుకుని గుడారాలు దింపారు. అన్ని పట


శాలలు ఒక్క చోట వేయడానికి తగిన చదునైన ప్రదేశం దొరకలేదు. దొరికిన చోటల్లా కొన్ని
గుడారాలు దింపారు. తమ తమ గుడారాలలో సంభారాలు దింపుకున్న తరువాత

7
  చాళుక్యసింహాసనం

విద్యార్ధులందరూ కులపతి అంగీరసుడి చుట్టూ జేరారు. ఆయన ముందుగానే వేటకు కొన్ని


నియమాలు చెప్పాడు.

“విద్యార్ధులారా! వేట ఒక వినోదం కాదు. ఇది ఒక హింస కూడా కారాదు. మానవుల


ఉనికికి భంగం కలిగించే కౄరమృగాలను అట్టి జంతువులను చంపడం హింస కాదు.
రోగాలను కలిగించే దోమలను నల్లులను తలలో పేలను విషపురుగులను చంపడం కూడా
హింస కాదు. ఈ లోయలో పంటలు పండే చదునైన భూమి కొద్దిగా మాత్రమే వుంది.
అదికూడా వర్షాధారం. ఇక్కడి అటవికులకు అదే ఆధారం. వీళ్ళు పండించుకునే పంటని
అడవి పందులు ఎలుగు బంట్లు అడవి ఏనుగులు లేళ్ళు జింకలు దుప్పులు విశేషంగా నాశనం
చేస్తున్నాయి. ఈ అటవికులకు వర్షాధారమైన ఒక్క పంట పోయిందంటే మళ్ళీ సంవత్సరం
వరకూ పంట ఉండదు.

మనం ఇప్పుడు వేటకు బయలుదేరడానికి కారణం ఈ చుట్టుప్రక్కల గూడేలలోను


పల్లెలలోవుండే జనం నాతో అనేకమార్లు మొరపెట్టుకున్నారు. మృగాల బెడద ఎక్కువై
పోయిందని. ఇక్కడి కొన్ని పులులు నరమాంసం మరిగాయి. పొలం వెళ్ళినవారినీ కట్టెలు
కొట్టుకోడానికి అడవికి వెళ్ళినవారినీ కబళిస్తున్నాయి. ఆవుదూడల్ని గొఱ్ఱెలని పొట్టన
పెట్టుకుంటున్నాయి. అడవి ఏనుగులు వచ్చాయంటే అనాస తోటలనూ అరటి తోటలను
బ్రతకనీయవు. అదృష్టం ఏమిటంటే ఈ అరణ్యంలో సింహాలు లేవు. అడవి పంది తడవకు పది
పిల్లలను ఈనుతుంది. పులి నాలుగైదు పిల్లలని పెడుతుంది. తోడేళ్ళుకూడా తడవకు చాలా
పిల్లల్ని పెడతాయి. అందుచేత ఇవి త్వరగా వృద్ధిచెందుతాయి. మన వుద్దేశ్యం వీటిని ఈ
ప్రాంతం నుండి పారద్రోలడం. తప్పని పరిస్థితిలో చంపడానికి వెనుకాడవద్దు. నిజానికి ఈ
వేట ప్రభువులు చేయాల్సిన పని. కానీ ఈ దుర్గమారణ్యం లోకి వచ్చి వేటాడే మహారాజులు
లేరు. మాంసాహారం తినేవారు పక్షులలో గ్రద్దలను చాతకపక్షులను డేగలను తీతువు పిట్టలను
సారసపక్షులను హంసజాతి పక్షులను తినరాదు. క్రౌంచపక్షులను నీటికోళ్లను చక్రవాకాలను
కొంగలను వేటాడి తినవచ్చు. చెవుడు కాకులను పిచ్చుకలను గోరింకలను వలలాంటి
పాదాలున్న పక్షులను ఖంజన పక్షులను తినరాదు. చెవులపిల్లుల్ని ఉడుముల్ని తాబేళ్ళని
ముళ్ళపందుల్ని ఐదుగోళ్లు కల జంతువుల్ని కుక్కమాంసం తినే చుక్కల చిరుతల్ని వేటాడి
తినవచ్చు. గిట్టలు చీలి వుండని గుఱ్ఱం లాంటి జంతువు ఏదైనా తినరాదు.

అడవిలో జీవులన్నీ ఒకదాన్నొకటి పీక్కుతింటాయి. వాటికి హింస సహజం. అసలు


హింస అహింస అనే రెండుమాటలు వాటికి తెలీదు. మానవులకు అహింస పరమ ధర్మము.
కానీ మనమీద తిరగబడిన ఏజంతువునైనా చివరకు మనిషినైనా కూడా చంపవచ్చును. అది
కూడా ధర్మమే!

విద్యార్ధులారా మీరంతా శ్రద్ధతో యుద్ధవిద్యలు నేర్చుకున్నారు. ఇప్పుడీ వేటలో మీ


సాహసాన్నీ నైపుణ్యాన్నీ ప్రదర్శించండి. యుద్ధంలో ఎలాగయితే శత్రువులను చంపడమో
వారి చేతులో చావడమో జరిగినట్లే వేటలోకూడా మనకు గాయాలు కావచ్చు ప్రాణాలు కూడా
8
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

పోవచ్చు. అందుకు అందరూ సిద్ధంగా వున్నారా?” అన్నాడు కులపతి. అందరూ ఏక


కంఠంతో సిద్ధమే నన్నారు.

కులపతి “మృదూ! నీసంగతేమిటీ?” అన్నాడు మృదువదన వైపు చూసి.

“అయ్యా! నేనూ సిద్ధమే!” నన్నది ఆ బాలిక.

ఉపకులపతి శ్రవణకుడు ఆ అడవిలో అగ్నికార్యం నెరవేర్చాడు. అతడు శిష్యులందరికీ


మంత్రించిన తిలకమణి రక్షలు కట్టాడు. తిలకమణి రక్షలు మూడు రాత్రులు తేనెతో రంగ
రించిన పెరుగులో నానబెట్టినవి. మృదువదన స్త్రీ కాబట్టి ఆమెకు ఎడమ భుజపు దండకు
తిలకమణి రక్ష కడితే బాలకులకు కుడి భుజపు దండకు రక్షలు కట్టాడు. తన పాదాలకు
నమస్కరించే విద్యార్ధులను ఆశీర్వదించాడు.

వీరులకు కట్టబడిన తిలకమణి మహిమాన్విత. మహేంద్రుడు వృత్రాసుర సంహారానికి


ఈ మణిని ధరించి వెళ్ళాడు. తిలకమణి శత్రుసంహారక, వీరపుత్ర, అన్నప్రద, సాహసి,
బలవతి, ఉగ్ర!

మర్నాడు వేట ఆరంభమయింది. ముందుగా జంతువుల్ని బెదిరించడానికి కొమ్ము


బూరాలు శంఖాలు డోళ్ళు ఢక్కలు తప్పెటలు పెద్ద కంచుతాళాలు కాహళాలు మ్రోగించారు.
పెద్దపెట్టున కేకలు పెట్టారు. అడవి దద్దరిల్లింది. ఆ కోలాహలానికి పక్షులన్నీ పెద్దగా అరుస్తూ
అడవిలో మిగతా ప్రాణుల్ని హెచ్చరిస్తూ పైకెగిరాయి. కోతులు ఒకచెట్టు మీదనుండీ ఇంకో
చెట్టు మీదికి హడావిడిగా దూకాయి. లేళ్ళూ దుప్పులూ మందలు మందలుగా పరుగులు
తీశాయి. కొన్ని జంతువులు భయంతో పొదలలోకి దూరగా కొన్ని అదేమిటని చూడడానికి
కలుగులలోంచి బయటికి వచ్చాయి. వ్యాఘ్రాలు గండశిలల పైకెక్కి ఏమిటా ఆ రవం అన్నట్లు
పరికిస్తున్నాయి. అడవి పందులు గుంపులుగా చేరి తమ శతృవుల్ని ఎదుర్కోవడానికి
కలిసికట్టుగా నిలబడ్డాయి. కరేణువులు తమ పిల్లల్ని దగ్గరకు తీసుకుని శతృవుల దాడిని
ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాయి. అడవి ప్రాణులన్నీ ఎవరి ప్రయత్నంలో అవి ఉన్నాయి.

భయంతో పరుగెత్తే జంతువులు కొన్నిఅటవికులు పన్నిన వలలలోను చిక్కాలలోను


తగుల్కొన్నాయి. పొదలలో దూరినవాటిని జాగిలాలు వాసనపట్టి వేటగాళ్ళకు దోవలు
చూపించాయి. వీరులు వాటిని ఈటెలతోను బరిశలతోనూ పొడిచారు. కొన్ని జంతువులు
ఎదురు తిరిగి నిలిచాయి.

విష్ణువర్ధనుడు కులపతి వెంట నడుస్తున్నాడు. అక్కడ అడవి చాలా దట్టంగావుంది.


అలిమికాని టేకు మానులూ జీడి చెట్లు కుంకుడు వెలగ చింత ఇప్ప చిన్నబూరుగు కడిమి
మారేడు అర్జున వృక్షాలు జమ్మిచెట్లు ఏగిస మామిడి పనస మద్ది పిప్పల వట తునికి నేరేడు
ఇతర వృక్షాలు ఆకాశం ఎత్తు పెరిగివున్నాయి. ఆకుల సందునుండి పడే సూర్య రశ్మితో

9
  చాళుక్యసింహాసనం

నేలంతా పొడలు పొడలుగా కనిపిస్తోంది. అడవితీగలు చెట్లకు పెనవేసుకుని ఒకమాను


నుండి మరొక మానుకు వంతెనలా ఉన్నాయి.

అడవి వృక్షాలనుండి రాలిన పూలతో ధరణీదేవికి అనంత నామార్చన చేసినట్లుంది.


తేనె పెరలనుండి జారిపడే బిందువులే మధుపర్కం. పర్వత శిఖరాలనుండి జాలువారే
సెలఏళ్ళే అభిషేకం. పుష్ప పరిమళగంధాలే ధూపం. పండిరాలిన ఫలాలే నైవేద్యం. కొండ
వాలులో లేతలేత పచ్చిక మొలిచివుంది. కొన్ని కృష్ణహరిణాలు పచ్చిక మేస్తున్నాయి. గొఱ్ఱెతోక
లాంటి బెత్తెడు బెత్తెడు తోకలను తెగవూపుతున్నాయి. ఆకలిగొన్న పులి ఒకటి నల్లజింకను
కబళించింది. భయంతో జింక ముళ్ళు పొదలు వాగులు గుంటలు ధూకుతూ పరిగెడుతోంది.
పులికూడా అంతేవేగంగా జింకను అందుకోవాలని పరిగిడు తోంది.

ఆచార్యుడు హరిణాన్ని రక్షించమని విష్ణువర్ధనుని ఆదేశించాడు.

విష్ణువర్ధనుడు వింటిన బాణం సంధించి పులివెంటపడ్డాడు. వద్దన్నా మృదువదన


విష్ణువర్ధనుని అనుసరించింది.

జింకా పులీ అమిత వేగంతో పరుగిడుతున్నాయి. కృష్ణహరిణంలా పరుగెత్తడం ఏ


మానవునికీ సాధ్యంకాదు. ఐనా రాకుమారుడు పంతం వీడలేదు. కొండవాలుకు అడ్డంపడి
పరిగెత్తి ఎన్నో చోట్ల జారిపడ్డాడు. అలాకాదని అడ్డదోవలో పులికి ఎదురు వెళ్ళాడు.

నల్లజింక అడవితీగలు కాలికి తగలగా జారిపడింది. మళ్ళీ లేచి పరుగు తీసింది. కానీ
పులిచేతికి అందింది. పులి తన హస్తంతో జింకను కొట్టింది. గోళ్ళు దిగబడలేదు కానీ
కృష్ణహరిణం మూడు గింగిరాలు తిరిగి క్రింద పడింది. విజయం సాధించిన పులి జింక
మెడను కొరకడానికి భయంకరంగా నోరు తెరిచింది. విష్ణువర్ధనుడు సంధించిన బాణం
సరిగ్గా పులి అంగిటిలో నాటుకుంది. బాణంవెంట బాణం ఐదుబాణాలు సంధించాడు విష్ణు
వర్ధనుడు. పులి తెరిచిన నోరు మూయలేక పోయింది.

అదే సమయంలో వెదురు పొదల మధ్యలో పొంచివున్న పెద్దపులి విష్ణువర్ధనునిపైకి


ధూకింది. అది వెనక నుండి రావడంలో విష్ణువర్ధనుడు చూసుకోలేక పోయాడు. వ్యాఘ్ర
నఖాలు చర్మంలో దిగబడకుండా తోలువర్మం అడ్డుకుంది. రాకుమారుడు పులి బరువుకు
బోర్లా పడ్డాడు. చేతిలోని ధను ర్బాణాలు వెళ్ళి అవతల పడ్డాయి. ఆ పులి వంటరిది కాదు. ఆ
మగపులి వెంట మరి రెండు పులులున్నాయి. పులి విష్ణువర్ధనుని మెడ కొరకడానికి
ఆయత్తమైంది.

అప్పటికి అక్కడికి జేరుకున్న మృదువదన పులిపైకి ధూకి ఖడ్గంతో ఒక్కదెబ్బ కొట్టింది.


దెబ్బ సరైన చోట తగలలేదుకానీ పులి తోకతెగి అవతల పడింది. రోషంతో పులి వెనక్కు తిరిగి
మృదువదనపై హస్తం ఎత్తింది. పడిన విష్ణువర్ధనుడు పైకి లేస్తూనే పులి వీపుపైకి లంఖించాడు.

10
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

రెండు చేతులతో రెండు వైపులనుండీ పులి నోటి అంగిళ్ళు పట్టు కుని కాళ్ళతో దాని నడుమును
పెనవేసుకున్నాడు. అందుచేత పులి నోరు మూయ లేక పోయింది. ఇంకొక పులి విష్ణువర్ధనుని
పాదం పట్టుకు లాగింది. పాదరక్ష మాత్రం ఊడి దాని నోటిలోకి వచ్చింది. మృదువదన
ఖడ్గంఎత్తి దాని మూతిపైన కొట్టింది. పైదవడ తెగి పోవడంతో ఆ పులి పారిపోయింది.
మొదటిపులి విష్ణువర్ధనుని విడిపించుకోవడానికి పొర్లి గింతలు పెట్టింది. అదే నరమాంసం
మరిగిన పులి. మిగతా సహ వీరులు కేకలు పెడుతు న్నారే కానీ ఒక్కళ్ళూ పులిని ఎదుర్కో
వడానికి దగ్గరికి రాలేదు.

పులిని వడిసి పట్టుకున్న విష్ణువర్ధనుడు పులిపొట్టను చీరమన్నాడు. వడుపుగా


మృదువదన పిడిబాకును పులి పొట్టలో దించి జానెడు పొడుగు చీరింది. బాగా రక్తం
పోవడంతో పులి డస్సిపోయి పట్టు వదిలేసింది. పైకి లేచిన విష్ణువర్ధనుడు మరికొన్ని బాణాలతో
మిగతా మృగాలను వెంటపడి తరిమి కొట్టాడు.

కులపతి అంగీరసుడి పెదవులపై చిరునవ్వు వెలిసింది.దగ్గరకు వచ్చిన విష్ణువర్ధన


మృదువదనలను ఎంతో అభినందించాడు. “రాకుమారా! నీవెలాగూ ధీరుడివే! ఇంకా
వేటలో మిగతా వారికి కూడా కొంచం అవకాశమివ్వు!” అన్నాడు.

విష్ణువర్ధన మృదువదనలు చేతులు కడుక్కోడానికి సరోవరం వద్దకు వెళ్ళారు. కాళ్ళు


కడుక్కుంటూ మృదువదన కావాలనే జారిపడింది. విష్ణువర్ధనుడు చేతులు కట్టుకుని చూస్తూ
నిలబడ్డాడు. ఒక నిమిషం చూసి మృదువదనే లేచి బయటికి వచ్చింది.
కోపంగా “ఆడపిల్ల జారిపడితే రక్షించాలని తెలీదా?” అన్నది.
“కోరికోరి జారిపడితే జాలి పడాల్సిందేమీ లేదు” అన్నాడు విష్ణువర్ధనుడు.
“నేనేమీ కావాలని జారలేదు. పాకుడురాళ్ళవలన జారాను.”
“తెలిసిందా పాకుడురాళ్ళపై కాలుపెడితే జారతావనీ!”

“నీకు కొంచం కూడా కృతజ్ఞత లేదా? నేనివాళ నిన్ను కాపాడకపోతే పులి నిన్ను భోం
చేసేది!”

“నన్నుకాదు నిన్ను. వద్దంటే వెంటవచ్చినందుకు పులికి మంచి విందు దొరికేది!”

“నీకోసం కదా పులి దూకింది?”

“కానీ నీవు కనపడిన తరువాత నన్నొదిలేసి నిన్ను తినేసేది!”

“ఎందుకూ?”

11
  చాళుక్యసింహాసనం

“పాలుకారె బుగ్గలు తేనెలొలికే వాతెర మధుకలశగ్రీవం వంటి కంధరం ఇంకా......”

“ఆ మ్రుగానికున్న అభిరుచి, రాకుమారా, నీకుంటే ఎంతబాగుండేదో” అన్నది


మ్రుదువదన.

“నేను పంచేంద్రియ జ్ఞానానికి వశుడనైతే నీలాగా మరో శకుంతల పుట్టేది!”

వారలా వాదులాడుకుంటూ వెనక్కు తిరిగి వచ్చారు.

చీకటి పడుతుండడంతో ఆనాటి వేట ముగించి అందరూ గుడారాలకు తిరిగి వచ్చారు.


ఉడుకునీళ్ళతో స్నానాలు చేశారు.వంటవాళ్ళు వేడివేడిగా వడ్డించారు. ఉన్న కొద్ది
గుడారాలలోనే అందరూ సద్దుకోవలసి వచ్చింది.

ఉపకులపతి రాత్రి గస్తీకి బృందాల నేర్పాటు చేశాడు. అందరూ వంతుల వారీగా


కాపలా కాయాలి. క్రూరమృగాలు ఎక్కువగా రాత్రిపూటే సంచరిస్తాయి. దానికి తోడు చచ్చిన
పందుల రక్తం వాసనకు నక్కలూ తోడేళ్ళు గుంపులు గుంపులుగా ఎంత దూరం నుండయినా
వస్తాయి. గుడారాల వద్ద ఎండు కట్టెలతో నెగళ్ళు వేశారు. అడవి జీవులన్నిటికీ అగ్ని అంటే
భయం.

అందరూ నిద్రకుపక్రమిస్తున్న సమయంలో కులపతి నుండి వార్త వచ్చింది. విశాఖ


దత్తుడు తెచ్చాడు. రాత్రి వేటకు ఎవరెవరు వస్తారని. అప్పటికే అందరూ బాగా అలసివున్నారు.
అందరికీ గుడారంలో ముసుకుతన్ని పడుకోవాలనుంది. కోనలో చలికూడా బాగావుంది.
ఒకరి ముఖాలొకరు చూచుకున్నారు. చిన్ని దీపం వెలుగులో ఎవరి ముఖకవళికలు పైకి
కనిపించడంలేదు.

“విష్ణూ! నీవు వస్తావా?” అన్నాడు విశాఖదత్తుడు.

“నాకు గురువుగారి ఆజ్ఞ లేదు! గుడారానికి ఒక్కరి చొప్పునైనా తీసుకు వెళ్ళు” అన్నాడు
రాజకుమారుడు.

రాత్రి వేటకు చిన్నదళం బయలుదేరింది. అందులో విశాఖదత్తుడు మృదువదన కూడా


ఉన్నారు.

“మృదూ! నీవు చీకటిలో కలిసిపోతావ్!” అన్నాడు విశాఖదత్తుడు. మృదు చిన్న


దరహాసం చేసింది. పలువరస ముత్యాల పంక్తిలాగే మెరిసింది. “నీవు నవ్వుతే గుర్తు పడతాలే
నీవెక్కడున్నదీ” అన్నాడు విశాఖదత్తుడు.

అటవికులు కొందరు కాగడాలు వెలిగించుకుని తోడు నడిచారు. అడవిలో నిశాచరులు

12
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

చాలా వున్నాయి. గొప్పగొప్ప సర్పాలు మరుగుల్లోంచీ బయటికి వచ్చి పక్షులకోసం మహా


వృక్షాలకు ఎగబాకుతున్నాయి. గుడ్లగూబలు రివ్వున వచ్చి అడవి మూషికాలను తన్నుకు
పోతున్నాయి. కబోది పక్షులు తమతరంగ జ్ఞానం తోనే చిటారికొమ్మన ఫలాలు
తన్నుకుపోతుంటే కొన్ని జారి క్రింద పడుతున్నాయి. అనుకున్న ప్రకారమే ఊళలు వేసుకుంటూ
తమ బంధుమిత్రులను విందుకాహ్వానిస్తూ నక్కలూ తోడేళ్ళూ సాగాయి. ముళ్ళపందులు
మందలు మందలుగా ఆహారార్జన కోసం బయలుదేరాయి.

చెట్ల కొమ్మల మధ్యనుంచీ రివ్వున వీస్తున్న గాలి అడవి గేయాన్ని ఆలపించగా

కీచురాళ్ళు శృతి నిచ్చాయి. నింగినుంచీ నేలకు రాలిన నక్షత్రాల్లా మిణుగురు పురుగులు


మిణుకు మిణుకు మంటూ మెరుస్తున్నాయి.

ఒక దళం తోడేళ్ళ పనిపట్టింది. బాణాలతో హతమార్చడంలో నిమగ్నమయింది.


ఇంకోదళం ఏదుపందుల వెంట పడింది. కొందరు ఎలుగుబంట్లను ఎదుర్కొన్నారు. రాత్రి
మూడవజామున వేట ముగించి వెనక్కు వెళ్ళారు.

మర్నాడు అందరూ ఆహార పానీయాలు సేవించిన తరువాత ఎవరి ఆయుధాలు వాళ్ళు


తీసుకుని వేటకు బయలుదేరారు. ఉపకులపతి అందరినీ జట్లుజట్లుగా విభజిం చాడు.
అడవిలో దూరంగా వున్న ప్రాంతాలకు వెళ్ళి వేటాడాలి. ఒకవీరుడు సాహసంగా
వేటాడుతుంటే మరొకడు దన్నుగా నిలవాలి. వేటాడడం కన్నా తమని తాము రక్షించు కోవడం
ముఖ్యమని చెప్పాడు ఉపకులపతి శవనకుడు. అడవిలో తప్పిపోతే దోవ ఎలా వెతుక్కోవాలో
కొన్ని మెళుకువలు కూడా బోధించాడు.

ముందురోజు పన్నిన వలలో చిక్కాలలో కొన్ని జంతువులు చిక్కుకున్నాయి. అటవికులు


వాటి పనిపట్టారు. వేటాడిన జంతువుల చర్మాలు తోళ్ళు ఒలుచుకున్నారు. మాంసానికి
పనికివచ్చే జంతువులను వలలలో వేసుకుని మోసుకు పోవడానికి సిద్ధం చేసుకున్నారు.

వాళ్ళలా ఏడురోజుల్లో చాలా క్రూరమృగాలను చంపారు. ఎన్నో భల్లూకాలను ఏదు


పందులను నక్కలను తోడేళ్ళను చిరుత పులులను పెద్దపులులను ఇతర మృగాలనూ
చంపారు. కులపతి కోరికపై రెండు అడవి ఏనుగుల్ని బంధించారు గురుకులానికి తీసుకు
పోవడానికి.సాహసంగా ఆ ఏనుగుల వెనక కాళ్ళకు బందం వేశారు. తొండం విసరకుండా
ఉచ్చుతాడులో ఇరికించారు. తమ పెంపుడు ఏనుగుల సహాయంతో గురుకులానికి తోలుకు
వెళ్ళడానికి సమాయత్తం అయ్యారు.

అడవిలో ఒక దినం ఆటవిడుపు ఇచ్చారు. ఆదినం అందరూ రకరకాల అడవి పండ్లను


రుచిచూచారు. తేనెపెరలు కొల్లగొట్టి కడవలలో నింపుకున్నారు. సెలఏళ్ళలో తనివితీరా
స్నానాలు చేశారు. వంటవారు అరుదైన వేటమాంసాలు వండారు. భోజనం చేసిన కొందరు

13
  చాళుక్యసింహాసనం

పిల్లలు దూరంగా వున్న అటవిక గూడాలకు వెళ్ళి బేరాలు చేశారు. ఒప్పుకున్న వనితలతో
స్వర్గసుఖాలు చూశారు. వాళ్ళలో ముఖ్యుడు విశాఖదత్తుడు. కొంటెకుఱ్ఱాళ్ళు అడవిలో
తామేమి రుచి చూసిందీ చేసిందీ మృదువదనకు వచ్చిచెప్పారు.

ఆటవిడుపు నాటి రాత్రి అడవిలో పెద్ద నెగడి వేశారు. అందరూ చుట్టూ చేరి
ఆటపాటలతో గడపాలనుకున్నారు. విశాఖదత్తుడు మృదువదనను దూరంగా తీసుకు
వెళ్ళాడు.” మృదూ! విద్యాభ్యాసం తరువాత నీ గమ్యం ఏమిటీ?” అడిగాడు విశాఖదత్తుడు.

“నా గమ్యం విష్ణువర్ధన పాదారవింద సేవనం!”

“విష్ణుపాదాలు అందరికీ శరణ్యమే! కానీ అతడు ఆకాశం ఎత్తువాడు. మరీ అంతగా


నెత్తిన పెట్టుకోకు.”
“బలిచక్రవర్తి అంత భాగ్యం నాకు కలుగుతే తప్పకుండా నెత్తినే పెట్టుకుంటాను!”
“అతడు నీకు అందడు.”
“అందేదాకా ఆగుతాను!”
“ఐతే నాపై నీకు మనసు లేదనమాట! నేటినుండి నేను నిన్ను తోబుట్టువులా చూస్తాను.”
“తోబుట్టువు ననుకుంటే నన్ను చంద్రసహోదరిని చేయి!”
“నీవా నీవు నరబలికోరే శ్యామలాదేవివి! పాలకడలితనయ వంటి సౌకుమార్యం
నీకెక్కడిదీ?”
“కదనరంగము వేరు మదనరంగము వేరు!”
“నిరీక్షిస్తానన్నావుగా! చూద్దాం! విష్ణువర్ధనుని ముందున్న లక్ష్యాలు నగోన్నతాలు.”
“ఎప్పటికైనా పర్వతారోహణం చేస్తాడుకదా!”
“సరే కానియి” అన్నాడు విశాఖదత్తుడు.

వనసప్తాహం ముగిసింది. తిరుగు ప్రయాణం ఆరంభించారు. గాయపడినవారికీ


ఎముకలు విరిగినవారికీ వనమూలికలతో ఆకు పసరులతో చికిత్సలు చేశారు ఉపకులపతి
శ్రమణకుడు శతావరి సహాయంతో.

శ్రవణకుడు అధర్వణవేదం పుక్కిటపట్టినవాడు. ఆ వేదంలో ఎన్నోరకాల మంత్రాలు


తంత్రాలు ప్రయోగాలు విరుగుళ్ళు సంపాతనములు ఉన్నాయి. ఆ మంత్రసాధనలోనే ఆతడు
సంపూర్న పలితకేశుడు అయిపోయాడు. ఆయన దగ్గర శిష్యరికం చేసి అన్నీ నేర్చుకున్నవాడు
శతావరి. శతావరి రథచోదకుడే అయినా మంత్రతంత్రాలపైన అభిరుచి అతడిని అంతవాడిని
చేసింది.
14
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

మొత్తానికి మరణాలు మాత్రం లేకుండా అందరూ వెనక్కు తిరిగి వచ్చారు.


విద్య నేర్చుకున్నందుకు విద్యార్ధులకు అదొక సాహస యాత్ర.

అందరూ ఆశ్రమానికి తిరిగి వచ్చేటప్పటికీ ఆచార్యుడికి శరాచి వచ్చి వందనం చేశాడు.


అతడి చేతులో శ్రీముఖం ఒకటి వుంది.

శరాచి రథికుని వెనక నిలబడి అతడి అవసరాన్ని తెలుసుకుని చేతికి ఆయుధాలు


అందిస్తూ వుంటాడు. అంబులపొదిలో బాణాలు నింపుతూ ఉంటాడు.రథం వెనక భాగంలో
అనేకరకాల ఆయుధాలు కూర్పబడి ఉంటాయి.

విష్ణువర్ధనుడు అటవిక సైన్యం తీసుకుని వేంగీనగరానికి పయనమయ్యాడు. మాన్య


కేతం వీరోత్సవాలలో ముందుగా ఏర్పాట్లు చేయడానికి విశాఖదత్తుడు బయలుదేరి వెళ్ళాడు.
అతడివెంట శరాచిని మల్లప్పను పైలుడిని గోపన్నను తీసుకుని వెళ్ళాడు.

3 మాన్యకేతనగరం
మాన్యకేత మహానగరం అత్యద్భుతంగా అలంకరించబడింది.పౌరులందరు తమతమ
గృహాలకు రంగురంగులుగా వెల్లవేయించుకున్నారు. వీధులన్నీ కళకళలాడుతున్నాయి.
వీధులలో నడుస్తుంటే గృహాలలోనుంచి వచ్చే ధూపపరిమళాలు పుష్పవనాలను
తలపిస్తున్నాయి. ఎక్కడ చూచినా ఉత్సవ శోభ!కోట వెలుపల రథ్యలన్నీ దేశదేశాల కచ్చడాలు
రథాల ఘట్టనతో పిండిపిండి అయిపోయాయి. మాన్యకేత దుర్గప్రాకారం బురుజులూ
ముఖద్వారం ఖగరాజపతాక విరాజితమైవున్నాయి. కోటగుమ్మానికి బంగారు కలువపూల
తోరణాలు కట్టారు. కోటముందు సుగంధ జలంతో కళాపి చల్లి రంగవల్లికలు తీర్చారు.
గెలలతో అరటి బోదెలు పోకగెలలు నిలకట్టారు. మొగలిపూల సువాసనలు సర్వదా
వ్యాపించాయి.

మాన్యకేతనగరం కాగ్నా నదీతీరాన ఉన్న నాపరాళ్ళ కోట. కాగ్న చిన్ననది. భీమానదికి


చిన్ని చెల్లెలు. అసలు భీమానదే కృష్ణమ్మకుసఖి. సాగరస్నానం చేయడానికి కృష్ణ తనచెల్లెళ్ళు
తుంగ భద్ర భీమ లాంటివారినెందరినో వెంటపెట్టుకుని వెళుతుంది. సాగరుడు రాజు. కృష్ణ
రాణి. పిల్లనదులు చెలికత్తెలు. రాజూరాణీలు సంగమిస్తుంటే చెలికత్తెలు తోడే వుంటారు.

స్వాగతం పలకడానికై సింహద్వారానికి ఇరువంకలా నిలిపిన ఏనుగులు అరటి గెలల


వైపు తొండం చాచికూడ మావటి అంకుశం భయానికి కోరికను చంపుకుంటున్నాయి.
గణికలు కోటలోంచి బయటకు రాబోయేవారిపై జల్లడానికి తాంబళాలలో రకరకాల
పుష్పాలు సమకూర్చుకుని బారులు తీరి నిలబడ్డారు. వారి సిగలో తురిమిన పుష్ప కదంబాలపై

15
  చాళుక్యసింహాసనం

తుమ్మెదలు వాలుతున్నాయి. అందరికీ పిల్లతెమ్మెరలు పూల పరిమళాల తాంబూలాలు


పంచుతున్నాయి. విటజనం రూపాజీవల అంగసౌందర్యం కేసి చూడాలను కొని కూడా
వేత్రహస్తుల భయానికి దృష్టి మరల్చుకుంటున్నారు.

“ఔరా ఈ రాష్టకూటులు ఎంత ఎదిగారు! అఖండ దక్షిణాపథాన్నే శాసిస్తున్నారు. ఎంత


ఐశ్వర్యం సంపాదించారూ! ఒకప్పుడు బాదామి నేలిన చాళుక్యుల వద్ద పాలెగాళ్ళు!” నడ్డిన
చేతులు పెట్టుకుని కోటగుమ్మానికి ఎదురుగా నిలబడి ఆశ్ఛర్యంగా నోరు తెరుచు కుని
చూస్తున్న గోపన్నను రాజభటులు రెక్కలు పుచ్చుకుని అవతలకు లాక్కువెళ్ళారు.

“నన్ను వదలండి.” అన్నాడు గోపన్న.


“ఓరి పల్లెటూరి బైతూ! కోటగుమ్మానికి ఎదురు నిలబడితే మెడకాయి తెగిపోతాది.”
అన్నాడు ముసలి భటుడు దయతలచి.
“చూస్తేనే చంపుతారా? మరి ఈదిఈదికి వీరోత్సవాలు చూడ్డానికి రండహో అని
దండోరా వేయించడం దేనికీ?”
“చూడ్డమంటే అక్కడ వీరోత్సవాల బరిచుట్టూ పాటకజనానికి పందిళ్ళు వేయించారు.
అక్కడ కూకోని చూడాలి. ఇట్టా కోటగుమ్మం లోంచి దూసుకెళ్ళిపోదామనే!”
“మాకు ఇడిది కావాలి.”
“ఓరోరి! కోటలో ఇడిదే! నీవేమైనా రాజుగారికల్లుడివా బామ్మరిదివా?”
“నాకోసమన్నానా? మా రాజకుమారుడి కోసం!”
“నీయనక రాజకుమారుడుకూడానా? ఏవూరు ఏదేశం మనదీ?”
“పెన్నాతీరం. విక్రమసింహపురం అబ్బాయా.”
“చూడ్డానికి దూడలు కాసుకునేవాడిలా గున్నావ్? ఏ రాజకుమారుడ్ని చంక నేసుకుని
వచ్చావ్! పేరేటీ?”
“భల్లాణ పోతినాయుడు!”
“ఈ రాజు పేరెక్కడా వినలేదే!వీరుల పోటీలు చూడ్డానికొచ్చారా?”
“చూడ్డానికి కాదు. పోరడానికొచ్చాం!”
“పోరడానికంటే?”
“యుద్ధం చేయడానికొచ్చాం!”
“నీవేదో వెఱ్ఱివెంగళాయి లాగున్నావ్. పిచ్చిగా వాగావంటే ఈ వీరోత్సవాల ఆరంభం
లో నరబలి స్తారు. నీవా బలిపశువైపోతావు.”

16
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

అలా అంటుండగానే కోటలోనుండీ రెండు బారులుగా తీరిన అశ్విక భటులు వచ్చారు.


వారిచేతిలో కొరడాలున్నాయి. మొలకు కరవాలాలు వ్రేలాడుతున్నాయి. ఎవరేనా దోవకు
అడ్డం అనిపిస్తే కొరడాతో ఛటేల్ ఛటేల్మనిపిస్తున్నారు.

ఆ వెనుక తొండాలు ఊపుకుంటూ అలంకరించిన మదగజాలు వచ్చాయి. ఆవెనుక


ఐదు అశ్విక రథాలలో మధ్యదానిలో బాలచక్రవర్తి అమోఘవర్షరాజేంద్రుడు ఆసీనుడై
యున్నాడు. అశ్విక దళాలు చక్రవర్తి రథం చుట్టూ ముసురుకుని నడుస్తున్నాయి. బాల చక్రవర్తి
ప్రక్కన ఇంద్రవల్లభుడు ఆసీనుడైయున్నాడు. ఆయన ఆ రాష్ట్రకూట బాలచక్రవర్తికి పినతండ్రి.
దక్షిణాపథాన్నంతా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన గోవింద ప్రభాతవర్షుడు అమర లోకాన్ని
చేరడం వలన ఆరేండ్ల బాలుడు అమోఘవర్షరాజేంద్రుని సింహాసనం ఎక్కించి పినతండ్రి
ఇంద్రవల్లభుడే రాజ్యపరిపాలన చేస్తున్నాడు.
ఛత్ర చామరాది లాంఛనాలతో చక్రవర్తి పరివారం కదలి వెళ్ళడానికి కొంత సమయం
పట్టింది.
“మీ రాజుగారు ఎక్కడికెళుతున్నారు?” అడిగాడు గోపన్న.
“శివుడి గుడికెళుతున్నాడు. నీవు చాల అదృష్టవంతుడివి. నీకింత సులభంగా చక్రవర్తి
దర్శనం లభించింది.”
“అదంత మహాభాగ్యమా?”
“భలేవాడివే! చక్రవర్తి దర్శనం అంటే సామాన్యమా! ఇంతకూ నీవు వచ్చిన పనేమిటీ?”
“అయ్యా మారాకుమారుడికి ఇడిది కావాలి. అది ఎవడిస్తాడో ఎక్కడిస్తారో చెప్పండి.”
“అదిగో అక్కడ స్థానాపతి శాల ఉంది. అక్కడడుగు”అన్నాడా రాజభటుడు.
గోపన్న అటు వెళ్ళబోయాడు. మళ్ళీ ఆ భటుడు ఆపాడు. “ఇప్పుడెందుకు ఆపావూ?”
ప్రశ్నించాడు గోపన్న.
“ఇప్పుడు రాజమాత వచ్చుద్ది గుడికెళ్ళడానికి!”
“తల్లీ కొడుకూ ఒక్కతూరే వెళ్ళచ్చుగాగుడికీ?” అన్నాడు గోపన్న.
“ఈ గుడివేరూ ఆయమ్మ గుడివేరు!” అన్నాడు భటుడు. అంతలోనే కోటలోంచీ ఎవరో
పాటపాడుతూ భజన చేస్తూ వస్తున్నట్లనిపిస్తోంది.
“నీవు వెనక్కి తిరిగి నిలబడు” అన్నాడు భటుడు.
“ఎందుకూ?” అన్నాడు గోపన్న.
“మగాళ్ళెవళ్ళూ ఈ ఆడోళ్ళని చూడకూడదు” అన్నాడు భటుడు. మగవాళ్ళందరూ
వెనకకు తిరిగి నిలబడ్డారు. గోపన్న మాత్రం వెనక్కు దొంగచూపులు చూశాడు.

17
  చాళుక్యసింహాసనం

కొంచెం సేపటికి కొందరు స్త్రీలు గుఱ్ఱాలూ ఏనుగులూ వేసిన లద్ధెలను ఎత్తివేసి మార్గం
శుభ్రం చేశారు. ఇంకొందరు పరిచారికలు వీధుల్ని నూలు కుంచలతో సున్నితంగా ఊడుస్తూ
సాగారు. ఏ వాహనమూ లేకుండా రాజమాత పాదచారియై కదలివస్తోంది. ఆమె చుట్టూ
గుంపుగా యువతులు దిగంబరంగా నడుస్తున్నారు. వారంతా ఎంతో అందంగా పాలరాతి
బొమ్మల్లా ఉన్నారు. చనుకట్టూ పిరుదులూ చాలా ఉన్నతంగా ఉన్నాయి. వారి కురులే వారికి
ఆచ్ఛాదన!ఆ యువతుల మధ్య రాజమాత అయ్యణమహాదేవి తెల్లని రాజహంసలా అడుగులు
వేస్తూ నడుస్తోంది. ఆమె కూడా దిగంబరే!
“వీళ్ళంతా ఎక్కడికెళుతున్నారూ?” అన్నాడు అమాయకంగా గోపన్న.
“పార్శ్వనాధసామి ఆలయానికి” అన్నాడు భటుడు.
“ఇప్పుడు వెళ్ళవచ్చా?”అన్నాడు గోపన్న.
“కాస్త ఆగు. కచ్చడాలు కోటలోపలికి వెళ్ళాలి. ఆ తరువాత వెళుదువు” అన్నాడతడు.

చూస్తుండగానే ముప్పదిరెండు వృషభ శకటాలు బారుగా రావడం ఆరంభించాయి.


ఒక్కొక్క బండికీ జములుజములుగా నాలుగేసి ఎద్దుల్ని పూన్చారు. అప్పటికీ అవి భారంగా
కదులుతున్నాయి. ఆ బండ్లలో ఏముందోకానీ చక్రాలు భారాన్ని మోయలేక కిఱ్ఱు
మంటున్నాయి. వాటిని పర్యవేష్టించి శూలపాణులైన భటులు వందమంది దాక వున్నారు.
“ఏముంది ఈ బళ్ళలో?” అనిఅడిగాడు గోపన్న.
భటుడు చాలా రహస్యంగా చెప్పడు గోపన్న చెవులో. “బంగారు దిమ్మలు వస్తున్నాయి.
ఎవరికీ చెప్పకు. చాలా రహస్యం!”
“బంగారుదిమ్మలా? ఎక్కడనుండీ వస్తున్నాయీ?”
“సామంతదేశాలు ఇచ్చిన కప్పం అంతా కరిగించి దిమ్మలుగా పోతపోయించారు!”
“అమ్మబాబోయి! ఇంత బంగారమా?”
“భలేవాడివే! ఇది ఒక ఏడాది ఆదాయం. ఇంకా రత్నాలు కెంపులూ వేరేవస్తాయి. ఈ
విషయం నీవు వినకూడదు నేను చెప్పకూడదు. నీవిది వెంటనే మర్చిపో!”
“అలాగే! మరి నేను ఇంక ఎంతసేపు ఆగాలీ?”
“ఇప్పుడెళ్ళు స్ధానాపతి కాడికి. నిన్నింక ఎవరూ ఆపరు” అన్నాడు భటుడు.

4 విడిది కావాలి
“అయ్యా మాకొక విడిది కావాలి.” గోపన్న స్థానాపతి ముందు నిలబడి అడిగాడు.

18
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“పాటక జనానికి అక్కడ పందిళ్ళూ పాకలు వేయించాం. వాటికి ఇవ్వడం ఏమీ


ఉండదు. ఉండడమే!”
“మా గుఱ్ఱాలు కచ్చడాలు అక్కడే నిలుపుకోవచ్చా?”
“మీకు తోడు గుఱ్ఱాలు కూడానా?”
“ఏమీ? ఉండకూడదా?”
“గుఱ్ఱాలు గాడిదలేనా ఇంకా ఏమైనా ఉన్నాయా?”
“ఉన్నాయి. విల్లులు అంబులపొదులు, కత్తులూ బల్లెములు గదలు.....”
“ఆపాపు. ఇవన్నీ తీసుకుని ఎందుకొచ్చావు?”
“యుద్ధం చేయడానికి.”
“యుద్ధానికా? ఏంమాట్లాడుతున్నావు?”
“యుద్ధ విద్యల పరీక్షలకోసమేగా ఈ పండగంతా!”
“నీవు పోటీకోసం వచ్చావా?”
“నేను కాదు మా రాకుమారుడు....”

“మీ రాకుమారుడి కోసమా! ముందామాట చెప్పవేమయ్యా మగడా! రాకుమారుల్ని


పందిళ్ళు పాకలకింద ఉంచుతే మా లీశోత్తర దీక్షితులవారు తలకాయకోసి కోటగుమ్మానికి
వేళ్ళాడ కట్టిస్తాడు!”

“లీశోత్తరదీక్షితుడెవరూ? పురోహితుడా?”

“భలేవాడివే! ఆయన మహా సేనాధిపతి. ఆయన ఆధ్వర్యంలోనే ఈ యుద్ధవిద్యల


పోటీలు జరుగుతున్నాయి. ఇంతకూ మీ రాజకుమారుడి పేరేమిటీ?”
“భల్లాణ పోతినాయుడు.”
“ఈ పేరెప్పుడూ వినలేదే!”
“వినిపించడానికే కదా వచ్చాం!”

“పోనీలే!ఎవరి ప్రయత్నం వారిది, ఎవరి ఆశలు వారివి! ఇంతకూ అమావాస్య


నాడటయ్యా మీ గృహప్రవేశం? మీకు తిధులు నక్షత్రాలు మంచి శబ్బరలేమీ అవసరం లేదా?
ఇన్నాళ్ళూ ఏంచేస్తున్నారు. దేశదేశాల రాజకుమారులందరూ ముందుగానే వచ్చి తమతమ
విద్యలకు మెరుగులు దిద్దుకుంటున్నారు.”

19
  చాళుక్యసింహాసనం

“రాగిచెంబులు చిలుం పడతాయికాబట్టి చింతపండేసి తోముకోవాలి. పసిడి పాత్రలకు


అవసరం లేదు. యుద్ధానికి అమ్మావాస్యే మంచి ముహూర్త మనుకుంటాగా? భారత యుద్ధం
అమ్మావాస్య నాడేకదా ఆరంభించిందీ!”

“అట్టాగా!మీ పోతినాయుడు అంతటి మొనగాడా? చూస్తాంగా!సరేలే! ఈభటుడి


వెంట వెళ్ళు. విడిది చూపిస్తాడు. మీ రాకుమారుడు ఏఏవిద్యలలో పోటీ పడ బోతున్నాడు?”
“విలువిద్య, ఖడ్గవిద్య. దండవిద్య.”
“మూడా! కొత్త బిచ్చగాడు పొద్దెరగడని మీకు ఆశ ఎక్కువలాగుందే!”
“ఏమీ మూడు మంచిసంఖ్యకాదా?”

“మూడు ముక్కచక్కలవుతుంది. ఒక్క విద్యలో పొటీ పడడమే గగనం. ఒళ్ళు వాచి


కండెలు తేలతాయి! కర్కరాకుమారుడొక్కడే రెండు విద్యలలో పోటిపడుతున్నాడు.”
“కర్కుడెవరూ?”
“చక్రవర్తి సంరక్షకుడు ఇంద్రవల్లభుడు. ఇంద్రవల్లభుని కుమారుడు కర్కవల్లభుడు.”
“అతడంత మొనగాడా?”
“రేపు జగదేకవీర బిరుదం కూడ ఆయనకే దక్కుతుంది.”
“అవునులే! మీదేశం మీ ఇష్టం! కర్కుడు చక్రవర్తికి చుట్టం కదా! ముందే నిర్ణయం
అయిపోయిందనమాట!”

“నాలుగేళ్ళ కొకసారి జరిగే ఈ పోటీలలో మాయలు మంత్రాలు కుతంత్రాలు


ఏమీవుండవ్. అంతా ధర్మబద్ధంగానే జరుగుతుంది.”

“ధర్మక్షేత్రం అనిచెప్పుకున్న కురుక్షేత్రసంగ్రామం లోనే అధర్మాలెన్నో చోటు


చేసుకున్నాయి. ఈ మాన్యకేతం మాత్రం మడికట్టుకుందా?”

“నీవెవడవో తలతిక్క మనిషివిలాగున్నావే! సరేలే! విడిదికి వెళ్ళగానే సేనాపతులు వచ్చి


మీపేరూ పోటీలు వ్రాసుకుని వెళతారు. రేపటినుంచే పోటీలు మొదలు. మీరు చాల
ఆలస్యంగావచ్చారు. ఎవరెవరు ఎవరితో పోటీ పడాలో జట్లు నిర్ణయంకూడ అయిపోయి
వుంటుంది. అందులోను మూడు విద్యలంటున్నావు. ఒక్కొక్క రోజు రెండేసి విద్యలలో పోటీ
పడాల్సివస్తుందేమో! ఆశకైనా ఒక అంతం ఉండాలి. పిచ్చివాడా!”

“పిచ్చిమీకా మాకా? మీరాకుమారుడు రెండు విద్యలలో బంగారు పతకాలు గెలుస్తే


జగదేకవీరుడవుతాడని ఆశ పెట్టుకున్నట్లున్నారు. ఇప్పుడా పప్పులేమీ ఉడకవ్. మీ అంచనాలు
బోల్తా కొడతాయి. మా వీరుడు మూడు బంగారు పతకాలు గెలుస్తేమీ ఆశలకోటలు
20
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

కూలిపోతాయి. ఆ కిరీటం ఏదో మాకే దక్కుతుంది.అప్పుడు మీ ముఖాలు చూడాలి. ఆముదం


బుడ్డీలాగ జిడ్డుకారతాయి.”
“అలా జరిగే అవకాశం లేదు.”
“ఎందుకులేదూ?”

“కర్కవల్లభుడు శూలయుద్ధంలోను ఖడ్గయుద్ధంలోను పోటి ఇస్తున్నాడు. అందుచేత


మీ రాకుమారుడు మా రాకుమారుడితో ఖడ్గయుద్ధంలో తలపడాల్సివస్తుంది. మా నాయకుడి
దెబ్బలకు తట్టుకోలేక మీ విక్రమసింహం తోకముడిచి గుహలోకి దూరాల్సి వస్తుంది.”

“మా విక్రమసింహం గాండ్రిస్తే చాలు తక్కిన గ్రామసింహాలన్నీ తోకముడవాల్సిందే.


అయితే మా రాకుమారుడు ఖడ్గయుద్ధంలో మీరాకుమారుడిని ఓడిస్తేచాలు జగదేకవీర
కిరీటం మీకు దక్కకండా పోతుంది.”
“పందెమా?”
“పందెం!కోసుపందెం. మా రాకుమారుడు ఓడిపోతే రెండింతలిస్తా!”
“అయితే వంద సువర్ణాలు పందెం. ఈ ఉత్సవాలలో జూదం మనతోనే మొదలైం
దనమాట! రేపటినుంచి ఇక్కడ లక్షలలోను కోట్లలోను పందాలు జూదము నడుస్తుంది.”

5 శివాలయం
రాష్ట్రకూటులు మాన్యకేతనగరం నిర్మించినపుడే శివాలయం నిర్మించారు. ఈశ్వరుడిని
మాన్యకేతేశ్వరుడు అనే పేరుతో ప్రతిష్ఠచేశారు.

చక్రవర్తి అంగరక్షకులు మాన్యకేతేశ్వరాలయానికి వచ్చారు. అక్కడి భక్తులందరినీ


గుడి నుంచీ పంపించివేశారు. ఏ గుడి స్ధంభానికో ఆనుకుని కళ్ళుమూసుకుని శివనామ
స్మరణం చేసుకుంటున్నవారిని కూడా ఇద్దరేసి భటులు జబ్బలు పట్టుకుని లాక్కువెళ్ళి గుడి
బైట దింపుతున్నారు. మడికట్టుకున్న వారికి కూడా మినహాయింపు లేదు.

ఆలయం ప్రధాన అర్చకుడు బిందుఋషి. ఆయన భార్యపోయి విధురుడు ఐనప్పటి


నుంచి స్వయంగా అర్చన చేయడం మానివేశాడు. ఆయనకు మాత్రం శివభక్తులను అలా
తరిమి వేయడం నచ్చదు. పైగా అది మహాపాపం అంటాడు. భగవంతుడికి రాజు పేదా అనే
తారతమ్యం వుండదు. ఆయన సమదర్శి. ఎవరి భక్తిని పట్టి వారిని అనుగ్రహిస్తాడు.
చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత మహాదేవా అన్నారు. అందుకే చక్రవర్తులను ఆహ్వానిం
చడానికి ఎదురు వెళ్ళలేదు.

చక్రవర్తి రథం దిగుతుంటే పురోహితులు ఎదురు వచ్చి పూర్ణకుంభాలతో స్వాగతం


21
  చాళుక్యసింహాసనం

పలికారు. దర్భలకట్టతో పుణ్యాహవాచనజలం కిరీటంపై జల్లారు. గుడిలోకి తోడ్కొని వెళ్ళారు.

అప్పటికి శివాలయంలోరుద్రాభిషేకము అర్చనా అలంకారాలు అయిపోయాయి.


నైవేద్యం అయిన తరువాత రాజకుటుంబం వారికి మంత్రపుష్పానికి పుష్పాలు అక్షతలు
ఇచ్చారు. పూజారులు రెండు వరసలుగా నిలబడి మంత్రం చెబుతున్నారు.
ఓం భవాయ దేవాయ నమః ఓం భవస్య దేవస్య పత్నయే నమః
ఓం శర్వాయ దేవాయ నమః ఓం శర్వస్య దేవస్య పత్నయే నమః
ఓం ఈశానాయ దేవాయ నమః ఓం ఈశానస్య దేవస్య పత్నయే నమః
ఓం పశుపతయే దేవాయ నమః ఓం పశుపతే దేవస్య పత్నయే నమః
ఓం రుద్రాయ దేవాయ నమః ఓం రుద్రస్య దేవస్య పత్నయే నమః
ఓం ఉగ్రాయ దేవాయ నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్నయే నమః
ఓం భీమాయ దేవాయ నమః ఓం భీమస్య దేవస్య పత్నయే నమః
ఓం మహతే దేవాయ నమః ఓం మహతో దేవస్య పత్నయే నమః

తీర్ధప్రసాదాలు స్వీకరించి చక్రవర్తి తన పరివారంతో కదిలి వెల్ళిపోగానే పామర


భక్తుల్ని ఆలయం లోకి అనుమతించారు. ప్రధాన అర్చకుడు బిందుఋషి దీర్ఘంగా
నిట్టూర్చాడు. ‘సర్వలోకాలకూ అధీశ్వరుడైన పరమేశ్వరుడి వద్దకూడా రాజదర్పమేనా! వీరికి
జ్ఞానం ఎప్పుడు వస్తుందో’ అనుకున్నాడు.

చక్రవర్తి వెళ్ళిపోగానే దేవాలయానికి వచ్చిన ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్య దేవదర్శనం


ఐన తరువాత వచ్చి బిందుఋషి పాదాలకు నమస్కరించాడు.అప్పటికే అక్కడ బంటు
కూర్చుని వున్నాడు.

బంటు రాష్ట్రకూట సైన్యంలో కాలిబంటుగా పనిచేసి ముసలితనం చేత విరమించు


కున్నావాడు. బిందుఋషి అంటే మహాభక్తి. రోజూ ఆయనకు కాళ్లొత్తుతాడు. ఆయన అతడికి
వేదాంతం బోధిస్తాడు. బంటు యుద్ధంలో తన అనుభవాలను గురించి కథలు కథలుగా
చెబుతుంటాడు. ఇద్దరి మధ్యా ఎన్నో విషయాలలోతారతమ్యం వున్నా మంచి మిత్రులలాగే
మాట్లాడుకుంటారు.

“మహర్షీ! ఇవాళ అమ్మవారి అలంకారం చాలా వింతగాను వికృతంగానూ ఉందే


మిటీ?” అన్నాడు ఆంధ్రశ్రేష్ఠి.

ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్య కోట్లకు పడగలెత్తిన వ్యాపారి. నగరంలోకెల్లా అత్యంత


ధనవంతుడు.
22
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఈవిడ ఖండశీర్షాదేవి! కాళి, తార, త్రిపురసుందరి, భువనేశ్వరి, భైరవి, ఛిన్నమస్త,


ధూమవతి, భగళాముఖి, మాతంగి, కమల అనే దశమహావిద్యలలో ఒకటి. ఖండశీర్షాదేవినే
ఛిన్నమస్తాదేవి అనికూడా అంటారు. అమ్మవారి తలకాయ ఆమె అరచేతులో ఉంటుంది. ఈ
రాజులు మాలాంటివారు చెబుతే వినరు. ఇలాంటి ఉగ్రరూపాలు తాంత్రిక సాధకులు
దర్శించేవికానీ బహిరంగంగా ప్రదర్శించేవి కావు. నగరంలో వీరవిద్యా ప్రదర్శనలు
జరుగుతున్నాయని అమ్మవారికి రోజుకో అవతారం వేయమన్నారు. మావాళ్ళు
అంగీకరించారు. బహిరంగంగా ఇలాంటి ఉగ్ర రూపాలు ప్రదర్శించ కూడదు. మావాళ్ళకు
కూడా తెలిసి చావదు. రాజుల మెప్పుకోసం ఏ వేషమేయమంటే ఆ వేషం వేస్తారు” అన్నాడా
ప్రధాన అర్చకుడు.

“మహర్షీ!దశమహా విద్యలంటే ఏమిటో అడగవచ్చా? నగరంలో ఈ ప్రదర్శనలు


సజావుగా సాగుతాయంటారా?”అన్నాడు గోమఠేశ్వరయ్య.

“సెట్టీ! ఇవాళ నన్ను మాట్లాడించకు. ఇవాళ నేనేమీ చెప్పను. నా నోటినుంచీ ఏది వస్తే
అది నిజమౌతుంది. ఈ విద్యాప్రదర్శనలు అంతా శాంతంగా జరగాలనే ఈశ్వరుడిని
ప్రార్ధిస్తున్నాను. కానీ అలా జరగదు” అన్నాడు బిందుఋషి.
“అలా జరగదంటే మీ అభిప్రాయం?”
“శాంతంగా జరగదు.”
గోమఠేశ్వరయ్య మహర్షి వద్ద శలవు తీసుకుని వెళ్లిపోయాడు.

6 శబ్దభేది
అది మాన్యకేత నగరం కోటబయట ప్రమదోద్యానం. రాజకుమారి శిరీష తన
చెలికత్తెలతో కూడి ఆతోటలో విలువిద్యాభ్యాసం చేస్తోంది. ఆంధ్రశ్రేష్టి గోమఠేశ్వరయ్యగారి
కుమార్తె వసు మిత్ర. వసుమిత్ర రాకుమారికి ప్రాణమిత్రురాలు. తాను కూడా రాకుమారితో
పాటే ఉద్యాన వనానికి వచ్చింది. శిరీషకు ఎనమండుగురు చెలికత్తెలు. వారంతా రాకుమారికి
అనేక విధాల తోడ్పడుతున్నారు.

రాజకుమారి తెల్లని వస్త్రాలు ధరించింది. అవకుంఠనం తీసి నడుముకు బిగించింది.


ముందే నగలన్నీ ఒలిచి చెలికత్తెల చేతికిచ్చింది. శిరీషకు కళ్ళకు గంతలు కట్టారు. రాజకుమారి
వ్యత్యస్త పాదారవిందయై నిలబడింది. వింటిన బాణం ఆకర్ణాంతము సంధించి నిలబడింది.
అప్పుడా యువతి ప్రమీలాదేవి లాగానే వుంది. ఆమె నిశ్చలత్వం చూస్తే ఆ యువతి పాలరాతి
శిల్పమా అనిపిస్తోంది.

అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఎక్కడా చడిలేదు. ఎక్కడో చెట్టుపైన కాకి మాత్రం


దాని ప్రాణానికి పొంచివున్న ముప్పు తెలీక కావుమంటోంది.
23
  చాళుక్యసింహాసనం

దూరంగా వృక్షశాఖలకు మోగించడానికి అనుకూలంగా కంచుఘంటలు వ్రేలాడ


తీశారు. ఘంట మోగిన దిశనుపట్టి బాణం సంధించాలి. ఒక చెలికత్తె ఘంట మ్రోగించింది.
శిరీష బాణం విడిచింది. బాణం ఘంటకు కొద్ది దూరంలోంచీ దూసుకుపోయింది. మళ్ళీ
శిరీష వింటిని బాణం సంధించింది. ఇంకొక దిశలో ఘంట మ్రోగింది. ఈమాటు శిరీష
బాణం ఘంటను రాసుకుంటూ వెళ్ళింది. శిరీష వెంటనే మరొకబాణం వింటిన తొడిగింది.
ఘంటిక ధ్వనించగానే శిరీష ధనుర్విముక్త శరం వెళ్ళి కంచుఘంటను ఛేదించింది.

అప్పుడే ప్రమదోద్యానంలోకి ప్రవేశించిన చాళుక్యుల రాజకుమారి భీమరధి “భళీ


శిరీషా కుమారీ! భళి!” అన్నది మెచ్చుకోలుగా.

అప్రయత్నంగా శిరీష వింట సంధించివున్నమరొకబాణం విడిచింది.

ప్రమాదాన్ని గమనించిన వసుమిత్ర భీమరథీ కుమారిని అమితవేగంతో ప్రక్కకు


పడతోసింది. ఆమె గుమ్మడిపండులా నేలమీదపడి మూడు పొల్లిగింతలు పెట్టింది. శరం వెళ్ళి
ఆవలనున్న కదళీవృక్షాన్ని మధ్యకు తెగవేసింది.

క్రిందపడిన భీమరథి “అమ్మో చచ్చాను” అంటూ పెద్దకేక పెడుతూ ఏడ్చేసింది.

శిరీష కంగారుపడి కళ్ళగంతలు విప్పేసుకుని పడిపోయిన భీమరధివైపు పరుగెత్తింది.


అప్పటికే చెలికత్తెలు ఆమెను లేవదీసి కూర్చోపెట్టారు.

“రాజకుమారీ! ఈ కోమటిపిల్ల వసుమిత్ర నన్ను పడదోసింది. ఎంత పొగరు దీనికీ?


రాజకుమార్తెలను తాకడానికికూడా పనికిరాని మూడోజాతిది నన్ను అమాంతం పడ దోసింది.
దీని వాయి పడిపోను. దీన్ని దొంగలు నిలువునా దోచుకుపోను. దీని చేతులు నరికించి
పొయిలో పెట్టిస్తాను. ఈ కోమటిదానికి ఇంత పొగరా?”అని తిట్టడం ఆరంభించింది.

భీమరథి తూర్పు చాళుక్యుల ఆడపడుచు. భీమసలుఖి మహారాజు కుమార్తె. ఆయనను


వేంగి సింహాసనం ఎక్కిస్తే నిలుపుకోలేక పారిపోయివచ్చి రాష్ట్రకూటరాజధానిలో ప్రవాసం
గడుపుతున్న మహారాజు. వసుమిత్ర ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్యగారి కుమార్తె. ఆయన
మాన్యకేత నగరంలో కోట్లకు పడగలెత్తిన సహస్ర ఫణాళి. ఆయన వ్యాపారాలు అన్నిదేశాలకు
వ్యాపించి వున్నాయి.

“భీమరధీ కుమారీ!ఊరడిల్లండి! తప్పంతా నాది. ఏకాగ్రతతో బాణం సంధించిన


సమయంలో మీరు సవ్వడి చేశారు. నేనప్పుడు ఘంటానాదానికీ మీ మెచ్చుకోలుకి భేదం
గ్రహించలేక పోయాను.”శిరీష నొచ్చుకుంటూ మాట్లాడే సమయంలో చెలికత్తె వాశిష్ట
“వసుమిత్రే మిమ్ములను పడదోయకపోతే ఆ రంభావృక్షంలా నడిమికి రెండయ్యేవారు!”
అన్నది.

24
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

భీమరధి వెనక్కు తిరిగి సగానికి తెగిపడిన అరటిచెట్టును చూసి భోరున ఏడ్చేసింది.


“ఎంతగండం తప్పిందీ!పొద్దున్నే ఏ పాపిష్టిముండ ముఖం చూశానో ఏమో! ప్రాణం మీది
కొచ్చింది. కొంచెం ఉంటే తెగి రెండయ్యేదానిని!”అన్నది.

“భీమరధీకుమారీ! నన్ను క్షమించండి. శబ్దభేది వేయడానికి ఏకాగ్రత కావాలి. ఆ


సమయంలో ఎవ్వరు సవ్వడిచేసినా ప్రమాదం జరిగే వీలుంది. హెచ్చరిక లేకుండా మీరీ
వనంలోకి వస్తారనుకోలేదు. ఆ ఈశ్వరుడి దయవలన మీకు ప్రమాదమూ నాకు అపకీర్తీ
రాజదండనమూ తప్పాయి. మిమ్ములను వైద్యుని వద్దకు తీసుకువెళతాను. ఎముకలు ఏమైనా
దెబ్బతిన్నాయేమో శల్యచికిత్స చేయిస్తాను. నన్ను మన్నించమని వేడు తున్నాను” అన్నది
మరొకమారు నొచ్చుకుంటూ వినయంగా శిరీష.

చెలికత్తెలలో షడ్పది మొదలైనవారు భీమరధిని లేపి నిలబెట్టి అటూయిటూ నడిపిం


చారు. తేరుకోడానికి ద్రాక్షరసం త్రాగించారు. ఆమెకు పెద్దగా దెబ్బలేమీ తగలక పోవడంతో
కొంచెంసేపటికి తేరుకుంది.

“శబ్దభేదా! మీరా! ఎన్నాళ్ళనుండీ సాధన చేస్తున్నారు? ఏకలవ్యుడు అర్జునుడు


అందరినీ మించిపోయారా! రేపు మిమ్మల్ని చేసుకునేవాడికి దశరధుడికి కైకేయిలా
శ్రీకృష్ణుడికి సత్యభామలా యుద్ధాలలో సహాయపడతారా ఏమిటి! శ్రీకృష్ణుడు అర్జునుడు
మత్స్య యంత్రం కొట్టి పిల్లను గెల్చుకున్నారు. ఆడపిల్లల్లో మీరు మత్స్యయంత్రం కొట్టి వాళ్ళ
గర్వం తగ్గించండి” అన్నది భీమరథి శిరీషను మెచ్చుకుంటూ.

“అంతేమీ లేదులేండి! ఏదో అభ్యాసం చేశాను ఇవాళ సిద్ధించింది. కానీ మీకుకాని తగి
లుంటే ఎంత ప్రమాదం జరిగుండేదో!”

“ఏదో నాకు నూకలు మిగిలాయి కాబట్టి బ్రతికాననమాట! ఇంతకూ నేనొచ్చిన


పనేమిటంటే వీరోత్సవాలు జరుగుతున్నాయా, పున్నమి నాటి ప్రదానోత్సవానికి ఆడంగులు
కూడా రావచ్చట! మనం రాజకుమార్తెలం కదా! అలగాజనంతో కలిసి కూర్చోలేము. మన
ఠీవి రాజసం మర్చిపోకూడదు. మీకూ నాకు ప్రత్యేకంగా పటశాల కేటాయింపచేస్తారా? ఇదే
అడగడానికి మీరు ఇక్కడున్నారని తెలిసి వచ్చాను”అన్నది భీమరథి.

“ఇవాళ పంచమి తిధేకదా! నేనింకా ఏమీ ఆలోచించలేదు. కానీ అదెంతభాగ్యం!


స్ధానాపతికి లేఖ పంపుతాను. ప్రమదలందరం కలిసేకూర్చుందాము.”

“అదిగో అదే రాకుమారీ! మనం మనం రాజకుమార్తెలం!మనది రాజ దర్పం.


అందరితో కలిసిపోతే చులకనైపోతాము. మూడోజాతి వాళ్ళతోను నాలుగో జాతివాళ్ళతోను
కలిసిపోకూడదు. ఔన్నత్యం తగ్గిపోతుంది.”

25
  చాళుక్యసింహాసనం

“అలా కాదుకానీ మీరొకక్షణం ఇక్కడే వుండండి. అవతల వసుమిత్ర ఎంత చిన్న


పుచ్చుకుందో! పలకరించి వస్తాను” అంటూ శిరీష వసుమిత్ర వద్దకు వెళ్ళింది.

“హళా శిరీ! ఏమంటోంది ఆ రాజకుమారి?” అన్నది వసుమిత్ర.

“వసూ నన్ను క్షమించవే!ఆమెపక్షాన క్షమార్పణ, నాపక్షాన కృతజ్ఞత తెలుపు తున్నాను.


నువ్వీనాడు నన్ను రక్షించకపోతే ఒక నరహంతకురాలిగా ప్రాడ్వివాకశాల ముందర
నిలబడవలసివచ్చేది!”

“శిరీ! నీవింకా ఆవిషయం మర్చిపో. ఆవిడనసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు?


కాకపోతే గండం గడిచినందుకు పీడాపరిహారార్ధం మాన్యకేతేశ్వరాలయంలో అర్చన
చేయించి దిగంబర జైనాలయానికి మణిదీపదానం చేద్దాము.”

“అలాగేనే వసూ! ఇంతకూ భీమరధీకుమారి వచ్చి మనకొక విషయం గుర్తుచేసింది.


పున్నమినాటి జగదేకవీర ప్రదానోత్సవానికి యువతులకు ప్రత్యేకంగా వీక్షణాశాల ఏర్పాటు
చేయించమని కోరింది.”

“శిరీ! ఊరంతా ఒకదారీ ఉలిపికట్టె ఒకదారీ అని ఆమహారాణీ మాలాంటివారితో


కలిసి కూచుంటానన్నదా, నీవేదైనా దాస్తున్నావా?”

“ఆ రాకుమారి నీవూహించినట్లే మాట్లాడింది. కానీ ఏర్పాటు చేయించేది నేనుకదా!”


అన్నది శిరీష.

“ఏమీలేని పులిస్తరాకు ఎగిరెగిరి పడిందనీ ఈవిడ తండ్రికే అక్కడ రాజ్యం లేదు. ఈవిడ
మాత్రం మహారాణీలాగా ఇక్కడ పొంకం చూపిస్తుంది. వాళ్ళ దేశంలో దిక్కులేక మీ రాజ్యంలో
చూరు పట్టుకు వ్రేలాడుతున్నారు! ఒకసారి ఆసంగతి గుర్తుచేయి.” అన్నది భీమరధిని
ఈసడించుకుంటూ వసుమిత్ర.

“పోనీలే వసూ!”అన్నది శిరీష ఇద్దరినీ ఓదార్చాలని.

“రాకుమారీ. నేను ఉత్సవానికి మిఠాయిలు పూలచండ్లు పట్టించుకుని వస్తాను. ప్రత్యేక


శాలలో మనందరం వీరకుమారులపైన సరసోక్తు లాడుకుంటూ స్వేచ్ఛగా కూర్చో వచ్చు.
ఈడొచ్చిన పిల్లలం తల్లిదండ్రులతో వెళితే స్వేచ్ఛగా మాట్లాడలేము. పూర్ణిమ దాకా ఆ
వీరపుంగవుల విన్యాసాలు చూడడానికి ప్రమదలకు ప్రవేశం లేదట! మనఅందంకేసి
చూస్తుంటే అబ్బాయిలకు గురితప్పుతుందేమో పాపం!వీరత్వం కారిపోతుందేమో!”

“అదికాదే ఓడిపోయేవారు అతివల్ను చూసి సిగ్గుపడతారనేమోనని అట్లా ఏర్పాటు


చేసుండొచ్చు!”అన్నది శిరీష.
26
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఏడిశారులే! అమ్మాయిలు లేకపోతే అబ్బాయిల్లో ఉత్సాహమే ఉండదు. జడుడైన


శివుడిని మేల్కొలిపేది శివానినే కదా!”

“నర్మగర్భాలు మాట్లాడడంలో నీవు చతురవు! ఇలాంటి రహస్యాలు అతివలు తెలిసి


కూడా పైకి మాట్లాడకూడదు. మనం వ్రీడ మార్ధవం సౌకుమార్యం వీడకూడదు” అన్నది
రాకుమారి శిరీష.

“నేనేమైనా మొగసాల కెక్కి మాట్లాడానా. ఆడపిల్లల మైతే మాత్రం మన శ్వేచ్ఛ మన


కవసరంలేదా? మగపిల్లలు ఎంత ఛం...” శిరీష వసుమిత్ర నోరు మూసింది.

“నీకలవాటేగా నా నోరుమూయడం! ఏమే శిరీ! మనం చిత్రపురం ఎప్పుడు వెళదాం?


అక్కడ ఎన్నోవస్తు ప్రదర్శనశాలలురకరకాల అంగళ్ళు తెరిచారుట. ఒకప్రక్క సాము గరడీలు
విప్రవినోదులు రంగుల రాట్నాలు గారడీవిద్యలు ప్రదర్శించేవాళ్ళు జూదశాలలు అన్నీ
ఏర్పాటు చేశారట!”
“ఐతే మనం ధనం సంచులతో మోసుకు పోవాలనమాట!”
“నీకేమే రాజకుమార్తెవు. నీపేరు చెబుతే అన్నీ ఊరికే వస్తాయి!”
“ఏమే నేను నీకు వీరముష్టిదానిలా కనపడుతున్నానా? అక్కడ మాత్రం నాపేరెత్తకు!
రాకుమారి అనేటప్పటికీ పాటకజనం అంతా మీదపడిపోతారు!”
“సరేలేవే, నీవే అందగత్తెవని భలే బడాయి! అక్కడ బెత్తాలవాళ్ళు లేరా, పద్మం బొడ్డు
చుట్టూ రేకుల్లాగా నీచుట్టూ చెలికత్తెలూ నేనూలేమా! కానీ ఆ భీమరధిని మాత్రం పిలవకే
తల్లీ!”
“ఏమిటే పూర్వజన్మలో మీరిద్దరూ సవతులా ఏమిటి?”
“కాదేతల్లీ కరిమకరులం! ఈ జన్మలో అది నాకు సవతి కాకుండావుంటే
అంతేచాలు!”అన్నది వసుమిత్ర.
శిరీష, భీమరథీకుమారి ఇద్దరు రాజకుమార్తెలు చెలికత్తెలతో కలిసి కోటలోకి
వెళ్ళిపోయారు.

7 చిత్రపురం
సప్తమినాడు వసుమిత్ర శిరీష వద్దకు వచ్చింది. అప్పటికి అంతః పురంలో రాజకుమారి
చీర కుచ్చెళ్ళు దోపుకుంటోంది. ఒక అలంకారిక ఏడుపాయల జడ వేస్తోంది. మరోక చెలికత్తె
గుబ్బలపై కర్పూర పరాగం అద్ది స్ధనవల్కలం బిగిస్తోంది. “అప్పుడే వచ్చేశావా వసుమిత్రా!”
అన్నది రాజకుమారి.

27
  చాళుక్యసింహాసనం

“హళా శిరీష! ఇంకా తయారుకాలేదా? కుచ్చెళ్ళు నేను దోపుతానుండు. ఏమిటే నీబొడ్డు


ఇంత లోతుగావుంది! చాలా సుఖపడతావ్ తెలుసా!” అన్నది వసుమిత్ర.

“బొడ్డుకీ సుఖపడడానికీ ఏమిటీ సంబంధం?”

“నాకేంతెలుసూ! నిన్ను సుఖపెట్టేవాడినడుగు! ఇంత సన్నని నడుము అక్కళించిన


ఉదరము వళిత్రయము విస్తరించిన పిరుదులూ ఎవరికుంటుందే ఇంత అందం. అసలు నీ
బొడ్డుకన్నం వెన్నుపూసను తాకటంలేదుకదా!”
“వసూ! నీకీ మధ్య ఉన్మాదం ఎక్కువై పోయింది.”
“అవును. కాళిదాసు కవిత్వం చదువుతే ఇంకా ఏదోదో అనిపిస్తోంది!”
“అది కాళిదాసు కవిత్వం వలనకాదు. నీ పైత్యం వలన!”
“పైత్యమో సైత్యమో నాకనిపిస్తోంది! నీకు కూడ అనిపిస్తుంది కానీ నీవు దొంగవి! పైకి
చెప్పవు. అంతే వ్యత్యాసం! నీవు మాత్రం అద్దంలోకి చూడకు. ముకురం నీ చెక్కుటద్దాలు
చూసి సిగ్గు పడుతుంది. ఛాతిపై ఉత్తరీయం తొలగనీకు. కులపర్వతాలు దిగులుతో కుంగి
పోతాయి. అవకుంఠనం తీయకు. దొండ పండనుకుని నీఅధరాలను పలుకాకులు
పొడుస్తాయి. వాటిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి ఆ శ్రీరామచంద్రుడెవరో ఇంకా బయటికి
రాలేదు. నీ కనుబొమల శివధనువు భద్రంగావుంది. ఎలుగెత్తి పలకకు. శంఖానికి నీ
గొంతంత మృదుస్వరం లేదు. వడివడిగా అడుగులు వేయకు. హంసలు అంత తొందరగా
నిన్నుచూసి నేర్చుకోలేవు. నీవు గజయానవే కాని ఊరువులు ఎముకలేని ఏనుగు తొండంలా
అటునిటూ ఊగవు. ఇసుకతిన్నెలపై నత్తగుల్లలు ఆగిచిప్పలు పేరుకుని ఉంటాయి. అందుకని
నీపిరుదులకు అవి పోలికకాదు. నీచరణ కమలాలను మణి మంజీరాలు అలంకరించి
వున్నాయి. తామరమొగ్గలకంత ఐశ్వర్యమెక్కడిదీ. నీ జఘనం ఈ ధరాతలాన్ని ఏలేవాడిని
కూడా లొంగదీసుకునేటట్లు వుంది.” వసుమిత్ర అలా మాట్లా డుతుంటే శిరీష తన
మునివేళ్ళతో ఆమె నోరుమూసింది.
వసుమిత్ర శిరీష చేతిని విడిపించుకుంటూ “నీ చిగురుటధరాలని తన అధరంతో
మూసే వాడొస్తాడులే! అప్పుడు నా నోరేం మూయగలవూ?”అన్నది.
“ఓసి పువ్వుబోడీ నీవళ్ళు మదించి వుంది. నీ ముఖమందార కుసుమ మకరందాన్ని
ఆస్వా దించేవాడు వస్తాడులే. ఇప్పుడే వాడిపోకు. సరేపద! మారథమా మీరథమా?”
“నీ చెలికత్తెలతో కలిపి పదిమందిమున్నాము. రెండుమూడు రథాలు కావాలి!”
“రెండు రథాలు చాలు.మా పూర్వచిత్తీ అరణీ గుఱ్ఱాలపై వస్తారు!”
ఉత్సవాల సందర్భంగా మాన్యకేత మహానగరం వెలుపల చూపరులకోసం గొప్ప వస్తు
ప్రదర్శనశాల ఏర్పాటయింది. ఆడపిల్లలు చిత్రపురం ప్రదర్శన శాలలకు చేరేటప్పటికీ జనం
క్రిక్కిరిసివున్నారు. ప్రదర్శన శాలలు చాలా విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేసినా వచ్చిన
28
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

వారు అంతకన్నా ఎక్కువ మంది వున్నారు. అక్కడ ఒకప్రక్క రకరకాల జాతుల ఏనుగుల్ని
విక్రయిస్తున్నారు.

అక్కడ ఐరావత సంతతికి చెందిన మహాపద్మజాతి ఏనుగులు విక్రయిస్తున్నారు. కారు


మేఘాల వంటి వరుణదిగ్గజాలు అంజనీజాతి మత్తేభాలు వామనజాతి మదపుటేనుగులు
అంతేకాక భద్రజాతి ఏనుగుతో మంద్రజాతి ఏనుగును పూన్చడం వలన పుట్టిన భద్రమంద్ర
జాతి ఏనుగులు, అలాగే భద్రమృగజాతి మృగమంద్రజాతి అంతేకాక భద్రమృగమంద్ర
గజములతో సంకరపరచిన ఏనుగుల విక్రయం జరుప బడుతోంది.

మరొక ప్రక్క లొట్టిపిట్టలు విక్రయిస్తున్నారు. ఇంకొకవంక అశ్వవిక్రయశాలలు


ఉన్నాయి. అందులో కాంభోజాలు సైంధవాలు బాహ్లికాలు వనాయుజాలు అనేక మిశ్రమ
జాతులవి సంకర జాతి గుఱ్ఱాలు విక్రయిస్తున్నారు.అక్కడ హయవిద్వాంసులు కూడా చేరారు.
అశ్వాల జ్యోతిష్యులు వాటి సుడులు జన్మనక్షత్రాలే కాక వాటి అమ్మ అబ్బ జాతకాలు గెలిచిన
పందేలు సాధించిన విజయాలు చెప్పి డబ్బు సంపాదిస్తున్నారు.

ముఖ్యంగా స్త్రీలందరూ రాతిపూసలు మొదలు రత్నాభరణాలు అమ్మే దుకాణాలవద్దే


ఎక్కువగా వున్నారు. ముక్కెరలు కర్ణాభరణాలు కంఠాభరణాలు కాలి పట్టాలు చిల్లర సరుకులు
అలాగే రంగుచీరలు రైకలు కంచుకాలు చిన్న పిల్లల బట్టలు విరివిగా కొంటు న్నారు.
అక్కడకూడ చాల వత్తిడిగా వుంది.

ఇంతప్రదేశం తిరగలేమని రాజకుమారి వసుమిత్ర రెండు ఆంధోళికలను కుదుర్చు


కున్నారు. స్ధలాభావం వలన రథాలను అశ్వాలను లోనికి రానీయటం లేదు. వారలా పల్యంకిక
తెరలు పైకిత్తి అంగడులకేసి చూస్తుంటే ఎవరో అదిగో రాజకుమారి అన్నారు. దానితో జనం
తండోపతండాలుగా ఆంధోళికలను చుట్టుముట్టారు.

క్షణంలో గుంపు పెరిగిపోయింది. తోపులాట దాక వచ్చింది. అందరికీ రాజకుమారిని


చూడాలనే అభిలాష. అప్పటికీ వేత్రహస్తులు బెత్తాలతో కొడుతూ జనాన్నిదూరంగా తరమ
డానికి ప్రయత్నిస్తున్నారు. చాకచక్యంగా శిరీష వసుమిత్ర ఆంధోళికలు క్రిందికి దింపించి
ప్రక్కనున్న అంగడిలోకి తప్పుకున్నారు. రాజకుమారి ఆంధోళికలో అరణి, వసుమిత్ర
ఆంధోళికలో వాశిష్ఠ కూర్చున్నారు. ఆంధోళికలు పైకిలేచి ముందుకు వెళ్ళిపోతున్నాయి.
జనం పల్లకీలో రాజకుమారి ఉందని వెంబడి కదిలివెళ్ళారు.

అరణి కూర్చున్న పల్లకి జనం తోపిడికి ప్రక్కకు పడే పరిస్తితి వచ్చింది. ఆంధోళిక ఒక
ప్రక్క ఒరిగిపోయింది. అందులోని అరణి దొర్లి గుమ్మడిపండులా క్రింద పడేదే. ఎవడో
బలాఢ్యుడు అరణి చేయి పట్టుకుని ఆపాడు. ఆమెను లోపలకు తోసి ముందువైపు ఆందోళిక
దూలాన్ని బుజానికెత్తుకుని పోటీకఱ్ఱతో జనాన్ని పడదోసుకుంటూ క్రిందపడ్డవారిని
కర్కశంగా నలగదొక్కుకుంటూ జనసమర్ధానికి దూరంగా తీసుకుపోయాడు. వెనకాలి

29
  చాళుక్యసింహాసనం

బోయీలు పరుగెత్తవలసి వచ్చింది.

అరణి అతడిబలం చూసి నిర్ఘాంతపోయింది. “ఓరబ్బీ! ఇంతింత కండలున్నవాడివి


కూలిపని చేయకపోతే అక్కడ వీరోత్సవాలలో పోటీ పడొచ్చుగా?” అన్నది కొంచం ఆశ్ఛర్యం
తోనూ జాలితోనూ.
“పోటీనా!నా పనిలో నాకు పోటీనే లేదు పడుచూ! కండలు కండలంటావు పనిచేస్తే
కండలు పెరుగుతాయి. కుడిచి కూచుంటే పాసనాలు పట్టుకుంటాయి.”
“పోనీ ఎక్కడైనా కొలువు చేయొచ్చుగా?”
“కొలువా? నీవుంచుకుంటావా నీకాళ్ళకాడ పడుంటా?”
“ఛీ నాకెందుకూ?”
“నాకన్నా పెద్ద మగాడు దొరుకుతాడా నీకు కాళ్ళొత్తడానికి?” అన్నాడతడు
వెటకారంగా.
“నీవు కూలికొచ్చి కూలికొచ్చినట్లుండు” సిగ్గుగా చీదరించుకుంటూ అన్నదిఅరణి.
“ఇంతకూ ఎక్కడికెళ్ళాలే పడుచూ?” అన్నాడతడు.
ఎక్కడికెళ్ళాలో అరణికి అర్ధంకాలేదు. తడబడ్డది. “ఎక్కడికంటే....”నసిగింది.
“ఊరు మర్చిపోయావా? నీపేరయినా గుర్తుందా?”
“ఉంది ఉంది! అరణి!” అప్పుడు నాలుక కరుచుకుంది అపరిచితుడికి తన పేరు చెప్పి
నందుకు.
“బాగా అరగదీయడానికి పనికొస్తావనమాట!” వత్తి పలుకుతూ అన్నాడు విశాఖ
దత్తుడు.
“ఏయ్ అబ్బీ మాటలు మీరకు.కూలికొచ్చినవాడు కూలివాడులాగుండాలి!”
“కూలీనా! నీసేవ చేస్తే కూలీ యిస్తావా? ఏదీ పడేయ్!”అన్నాడు చేయి చాస్తూ అతడు.
అరణి రూకలకోసం తడుముకుంది. రాజకుమారి బయలుదేరితే థనం ఎప్పుడూ సమంత
వద్దే వుంటుంది. తనవద్ద రొక్కంలేదు. అరణి సిగ్గుతో తన బంగారు గాజు తీయబోయింది.
“ఓసోసి దీనికోసం పసిడి మురుగులు తీస్తున్నావా? ఆకుచాటు పిందెవి. అరచేతిలో
చిల్లిగవ్వ లేకుండా ఇక్కడ ఏంకొందామని వచ్చావే?”

అతడి హేళనకు అరణి సిగ్గుతో కుంచించుకుపోయింది.

అతడు తన అంగుళీయకం తీసి తక్కిన బోయీలపైకి విసిరాడు. “పెద్దోళ్ల పనులన్నీ


ఇట్టాగే వుంటాయి. పేరు గొప్ప ఊరు పెంటదిబ్బా! పోండిరా పంచుకోండి !” అన్నాడు.

30
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

బోయీలు తలవంచుకుని ఉంగరం తీసుకుని ఆంథోళిక తీసుకుని అనందంగా వెళ్ళి


పోయారు.
అందరూ వెళ్ళిపోయేటప్పటికీ అరణి ఒంటరిదయిపోయింది. అతడక్కడే నిలబడి
వున్నాడు రాతి ఋరుజులా. “నా ఋణం ఎలా తీర్చుకుంటావో చెపితే నిన్ను నీ రాకుమారి
వద్దకు చేర్చమంటావో కోటలోకి చేర్చమంటావొ చెప్పు.చేరుస్తాను.”అన్నాడతడు.
“నేను నీకు తెలుసా?”
“నీ మొహం చూస్తే తెలీటంలా!నీవేమయినా రాణీవా? ఆడకూలీవి!ముఖం మీదే
తెలుస్తుంది మీగాళ్ళవాపు!”
“ఎక్కువ మాట్లాడకు.మా రాకుమార్తెతో చెప్పి నీకు మూల్యం ఇప్పిస్తాను.”అన్నది
అఱణి రోషంగా.
“నీవేమీ ఇప్పించ నవసరంలేదు ముష్టి! నీ అమూల్యమైనదేదో చూడు ఎప్పుడో నా
వశం చేసుకుంటాను!” అన్నాడతడు ధైర్యంగా.
“ఛీ! అసలు నీవేమంటున్నావు?”
“నీలో అమూల్యమైనదేమిటీ?”
“ఏమో నాకెలా తెలుస్తుందీ?”
“నాకు తెలుసు. ఆలోచించుకో! నేను వెళ్ళివస్తాను.”
“ఈ బంగారు కింకిణి ఉంచుకో!”
“నా వజ్రపుటుంగరం కన్నా నీ బంగారం తక్కువే! పైన ఇంకేమిస్తావూ?”
“వాళ్ళకు ఉంగరం నేనిమ్మన్నానా? ఇచ్చింది తీసుకుని సంతోషించు!”
“ఇచ్చింది తీసుకోడానికి నేను బిచ్చగాడినా? నేనడిగిందిస్తే నీ ఋణం తీరుతుంది!”
“కంకణం తీసుకుంటే సంతోషం! లేకుంటే లేదు!నాగుఱ్ఱం శాలలో వుంది. కొంచెం
అక్కడ వరకు తోడువస్తావా?”
“నీ చేయి పట్టుకోనిస్తే చివరివరకూ తోడుగా వుంటాను!”
“నేను రాణివాసం వనితను తెలుసా? భయం లేకుండా మాట్లాడుతున్నావు.”
“రాణివాసం కాదు. రాజకుమారి వాసం అను. రెక్కలు వచ్చిన చిలుకలు ఇంకా
గూటిలోనే ఉంటాయా? ఎగిరిపోకా! ఎవడినేనా చూసుకుని ఎగిరిపో!”
“ఇంతకూ నీవెవరివీ అన్నీ తెలిసినట్లు మాట్లాడుతున్నావూ?”
“నేనొక మోసగాడిని! దొంగని!సరా!”

31
  చాళుక్యసింహాసనం

“నీ మొహం చూస్తే అట్లాగే వుంది. దొంగకోళ్ళు పట్టేవాడిలా వున్నావు.”


“మరినువ్వు గుడ్డుపెట్టేముందు కోడిపెట్టలా వున్నావు. నిన్ను చేపట్టకపోతే ఎట్లా? నీవు
ఊ అంటే నిన్నుఒక్క చేత్తో ఎత్తి నీగూటిలో పెట్టగలను.”
“నీవు నన్నారడి పెట్టావంటే రాజభటుల్ని పిలుస్తాను!” బెదిరిద్దామనుకుంది అరణి.
“ఇద్దరు ముగ్గుర్ని పిలుస్తే లాభం లేదు. నా బలం పంచవృషో అసి. ఐదు ఆంబోతులకు
సమానం.”
“ఔనౌను! చూస్తేనే తెలుస్తోంది. ఎద్దు లాగా వున్నావు.”
“ఓసోసి కన్నెపిల్లా! ఎద్దుకీ ఆంబోతుకీ వ్యత్యాసం తెలీని చిగురుబోడీ! పద!” అంటూ
ఆమె చేయి పుచ్చుకుని అశ్వాలు విడిసిన శాలవద్దకు లాక్కువెళ్ళాడు అగంతకుడు.

8 తండ్రీ కొడుకులు
మాన్యకేతదుర్గంలో అది చక్రవర్తి సౌధం. రాష్ట్రకూటుల ఐశ్వర్యం చూడాలంటే
ఆసౌధాన్నే చూడాలి.

చక్రవర్తి సౌధము ముందు ఆంధోళిక దిగగానే శిరఃప్రధానికి అక్కడీ రాజభటులందరూ


వీరనమస్కారం చేశారు. కాపువున్న ఏనుగులు తొండాలు పైకెత్తి గౌరవసూచకంగా
ఘీంకరించాయి. నీలవర్ణుడు తప్పించి తక్కిన అంగరక్షకులు అక్కడే ఆగిపోయారు.

రాష్ట్రకూటసామ్రాజ్యానికి రేవాదాసదీక్షీతుడు శిరఃప్రధాని. తెల్లగా మెరిసే


వెండిదారాల్లాంటి కురులు, శిఖ, బవిరిగడ్డము నుదుటన విభూది రేఖలమధ్య చందమామ
లాంటి కుంకుమబొట్టు, వయసు పైబడినా దృఢమైన శరీరము.

రేవాదాసదీక్షితుడు సూర్యోదయానికి ఝాము ముందరే నిద్రలేస్తాడు.


ప్రాతఃకృత్యాలుకాగానే స్నానంచేసి సంధ్యవారుస్తాడు. దేవ, ఋషి, భీష్మ, పితృ తర్పణాలు
చేస్తాడు. గాయత్రి జపిస్తుండగానే ఆయన భార్య మణిభూషితాదేవి భర్తకు పాదపూజ
చేస్తుంది. ఆమె నిత్యాగ్ని హోత్రం చుట్టూ గోమయంతో అలికి ముగ్గులు పెట్టి వుంచుతుంది.
నిత్యపురోహితుడు వేదాయి ప్రాతఃసవనానికి దర్భాసనాలు పరిచి సృక్సృవాలను, చమసాలను
సిద్ధంచేసి అగ్నినలంకరించి ఆజ్యఘృతాలను కరిగించి రేవాదాసదీక్షితునికై వేచివుంటాడు.

రేవాదాసదీక్షితుడు పుండరీకము అనే యజ్ఞము చేసినవాడు. అగ్నిష్టోమ, అతిరాత్ర,


వాజపేయ, పౌండరీక, అశ్వమేథాది దశ క్రతువులలో ఇది ఒకటి. సోమపానము చేసినప్పటి
నుంచి రేవాదాసదీక్షితుడు నిత్యాగ్నిహోత్రుడు.

ప్రధాని వెళ్ళేటప్పటికి అక్కడ మహాసైన్యాద్యక్షుడు లీశోత్తరదీక్షితుడు మొదలైన

32
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ప్రముఖులు జేరివున్నారు. ప్రతీహారులు హెచ్చరిక చేయగా బాలచక్రవర్తి అమోఘవర్షుడు


ఆతడివెంట ఇంద్రవల్లభుడు ప్రవేశించారు.

అంతట ఇంద్రవల్లభుడు మేఘగంభీర స్వనంతో అధికారులనుద్దేసించి ఇలా


ప్రసంగించాడు.

“మహాశయులారా! మనమీ వీరోత్సవాలు ఎంతో ఘనంగా కనులు మిరుమిట్లు


కొలిపేటట్లు ఏర్పాటుచేశాము. ఎందరో మహావీరులు వారిగురువులు శిక్షకులు ఉస్తాదులు
దేశవిదేశి రాయబారులు ప్రముఖులు విచ్చేశారు. ఈ మహావీరులను ఆహ్వానించి తమతమ
సైన్యంలో నియమించుకోవాలని ఆశతో వచ్చారు. ఏసైన్యమైనా వీరులు ధీరులు
సాహసవంతులు కలిగివుండడంవలన రాణిస్తుంది.

మీరుకూడ అత్యంత సాహసోపేతులైన వీరాధివీరులను ధీరాధిధీరులను మన


సైన్యంలోకి ఆహ్వానించండి. అలాంటివారికోసం ఎలాంటి ఎరఆయినా వేయండి. మణులో
మాణిక్యాలో మగువలో ఏదైనా సరే. ధనాన్ని గుమ్మరించండి. మనసైన్యాన్ని యువరక్తంతో
నింపాలి. రాష్ట్ర్ర కూట సైన్యం అంటే దేశవిదేశాలవారికి సామంతులకు సింహస్వప్నంగా
వుండాలి. అశక్తులకు అసమర్ధులకు అలసులకు వయసు మళ్ళినవారిని మనసైన్యంలో
స్థానంలేదు. మనసైన్యం నిరంతరము సమరోత్సాహంతో శత్రుదేశాల గుండెల్లో బాకులాగ
ఉండాలి.

మాన్యకేతం అంటే విజయానికి కేతనంలా విరాజిల్లాలి.”

ఇంద్రవల్లభుడు ప్రసంగం ఆపి చప్పట్లు చరిచాడు. యవనిక తొలగి రాజనర్తకి అమరిక


రాష్ట్రకూట శౌర్యాన్ని కీర్తిస్తూ నాట్యం ఆరంభించింది. చిందిపడిన ఆణిముత్యాల నడుమ ఆమె
నాట్యం సాగింది. ఆనర్తకి ధరించిన ఆభరణాలు చూస్తే రాష్ట్రకూటుల ఐశ్వర్యం ఏమిటో
తెలుస్తుంది.

విందు వినోదాలు కాగానే ప్రముఖులందరు నిష్క్రమించారు. శిరఃప్రధాని మాత్రం


మిగిలాడు.

శిరఃప్రధాని ఇలా అన్నాడు. “ఇంద్రవల్లభ మహారాజా! నేను ఇవాళ రెండుమూడు


విషయాలు చర్చించవచ్చాను. ఒకటి చక్రవర్తి సమక్షంలో మరొకటి పరోక్షంలో.

మొదటిదేమిటంటే ఈమధ్యనే శుక్రనీతి శాస్త్రంలో ఉద్దండ పండితుడొకడు నాదర్శనం


కోరివచ్చాడు. అతడు చర్చించిన విషయం నన్నాకర్షించింది.”

“శుక్రనీతిలో ప్రత్యేకత ఏముందంటారు?” అన్నడు ఇంద్రవల్లభుడు. ఆయన


చర్చించదలచిన విషయం వేరు.
33
  చాళుక్యసింహాసనం

“మహారాజా! శుక్రుడు గొప్ప రాజనీతి శాస్త్రజ్ఞుడు. రాజ్యపరిపాలనను గురించి చాలా


విశదంగా చెప్పడు. ప్రభుత్వ ఆదాయ వ్యయాల గురించి సుంకం దేనికి ఎంత విధించాలనే
విషయంలో ఆదాయంలో సగభాగం మూలనిధికి పంపమంటాడు శుక్రుడు. ఇది
దండయాత్రలు కరువు కాటకాలు మొదలైన విపత్కర పరిస్తితులలో అవసరపడుతుందంటాడు.

పన్ను విధించే విధానం లో ఆయన కొన్ని మార్పులు చెప్పాడు. లోహపు గనుల


విషయంలో వెలికితీసిన బంగారంలో సగం, వెండిలో మూడవ వంతు, రాగిలో నాలుగో
వంతు, ఇనుము తుత్తునాగంలో ఆరోవంతు పన్నుగా గ్రహించమంటాడు. అయితే గనులు
తవ్వడానికయ్యే వ్యయాన్ని తీసివేసిన తరువాత మిగిలిన ఆదాయంపైనే సుంకం లెక్కించా
లంటాడు. అలాగే అన్నిరకాల రత్నాలు వజ్రాలు గాజు సీసముపై కూడా సగం పన్నుగా
గ్రహించ మంటాడు.

వ్యయం విషయంలో ప్రధానంగా ఆరు శాఖలను గుర్తించమన్నాడు. గ్రామపరిపాలన,


సైన్యము, దానధర్మాలు, ప్రజ, ప్రభుత్వోద్యోగులు మరి రాజాంతఃపురాలు. శుక్రుడు సైన్యానికి
ఆదాయంలో నాలగోవంతు, దానధర్మాలకు, ప్రజాదరణకు, ప్రభుత్యోద్యోగులకు నూరింట
నాలుగు భాగాలు, అంతఃపురాలకు నూరింట మూడు భాగాలు, గ్రామాభ్యుదయా నికి
నూరింట ఎనిమిదిన్నర వంతులు ఇవ్వమంటాడు.”

“దీక్షితవర్యా! మీరు చెప్పదలచిన రెండవ విషయం ఏమిటీ?” అన్నాడు ఇంద్రవల్లభుడు.

“మహారాజా బాలచక్రవర్తి సాన్నిధ్యంలో కొన్ని విషయాలు చెప్పడానికి లేదు.” అన్నాడు


రేవాదాసదీక్షితుడు.

మహారాజు సంజ్ఞ చేయగా దాదులు అమోఘవర్షరాజేంద్రుడిని అభ్యంతరంలోకి


తీసుకువెళ్ళారు.

“మహారాజా! ఈ ఉత్సవాలలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని చారులు


చెబుతున్నారు. పోటీలలో తమవారిని గెలిపించుకోవడానిని ఎవరికి వారు శతధా
ప్రయత్నిస్తున్నారు. మాతమ్ముడు లీశోత్తరదీక్షితుడు కూడా అంత బుద్ధిమంతుడు కాదు.
మాళవదేశం నుంచి వచ్చిన ఛస్తాణుడు ప్రతివీరులను చావమోదుతున్నాడు. పోటీకి వచ్చిన
శ్రీకాకుళయ్య ఒక వేశ్య ఇంట్లో మరణించడం కలకలం రేపుతోంది.

రాకుమారుడు కర్కవల్లభుని విషయంలో నాకు ఆంథోళనగా వుంది. పోతినాయుడు


ఎవరోకానీ మహా సాహసి. పరాక్రమవంతుడు. అతడితో ఖడ్గయుద్ధంలో మన రాకుమారుడు
తలపడడం ప్రమాదకరమని గూఢచారులు చెబుతున్నారు. పోటీలో ఇరువురిలో ఎవరికైనా
ప్రాణహాని సంభవించినా ఆశ్ఛర్యం లేదంటున్నారు.”

34
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“దీక్షితవర్యా!మాకూ ఇలాంటి వార్తలే వస్తున్నాయి. యువకులు ఉత్సాహంలో


వుంటారు. వారు తల్లిదండ్రులమాట వింటారనికూడ నమ్మకం లేదు.”

“నిజమే మహారాజా! ఉడుకు రక్తం పొంగేవయసు. కానీ జగదేకవీర బిరుదంకన్న మన


రాకుమారుడు మనకు ముఖ్యం కదా!”

“నిజమే! మందలించి చూస్తాను. మహా సైన్యాధిపతి లీశోత్తరదీక్షితుడు కూడా కొంచం


అదుపు తప్పుతున్నాడనిపిస్తోంది.”

“ఇదికూడా నిజం మహారాజా! అందుకే మన సైన్యంలో అతడి అధికారాలు పరిమితం


చేశాను. అతడు రసతరంగిణిపై చాలా విషయాలలో ఆధారపడివున్నాడు. ఒకరకంగా నాకు
ఈ విద్యాప్రదర్శనలపై ఆసక్తి తక్కువ. నేను దక్షిణదేశం పర్యటనకు వెళ్ళాలనుకుంటున్నాను.”

“పెద్దలు. మీరు విజేతలను ఆశీర్వదించకుండానా!” అన్నాడు ఇంద్రవల్లభుడు.

శిరఃప్రధాని శలవుతీసుకుని వెళ్ళగానే ఇంద్రవల్లభుడు చింతాక్రాంతుడయ్యాడు.


కుమార కర్కవల్లభుని విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదనిపించింది. కంచు
ఘంటపై ఒక్కటి మోదాడు. చేటిక ప్రవేశించి తలవంచి నమస్కరించింది.

“కర్కరాకుమారుని పిలిచామని వార్త పంపమను. అదీ అతడికి విరామం దొరికిన


ప్పుడేనని చెప్పమను” అన్నాడు తను అభ్యంతరం లోకి వెళ్ళిపోతూ.

మాన్యకేత నగరంలో జరుగుతున్న వీరోత్సవాలలో అది పన్నెండవరోజు. చాల వరకూ


పోటీలు ఒక కొల్లిక్కి వచ్చాయి. ఆయా విద్యలలో విజేతలెవరో తేలేదాకా వచ్చింది. ప్రతీహారిణి
ప్రవేశించి ఇంద్రవల్లభునకు జయజయధ్వానాలు చేసి కర్కవల్లభ రాకుమారుని ఆగమ నాన్ని
తెలియజేసింది.

మహారాజు ఇంద్రవల్లభునికి ఇద్దరే సంతానము. కుమారుడు కుమార్తె. కుమార్తె శిరీష


కాగా కుమారుడు కర్కవల్లభుడు. కర్కవల్లభుడు చాలా అందగాడు. ఆడపిల్లలను
ఆకర్షించడంలో నేర్పరి. బలపరాక్రమాలలోనూ అంతటివాడు. శూలంతో యుద్ధం
చేయడంలో అతడిని మించిన వాడు లేడు. కత్తియుద్ధంలోను మహా యోధుడు.

“నాన్నగారూ తమరు పిలిచారట!” అన్నాడు కర్కుడు తండ్రి పాదాలంటి నమస్కరిస్తూ.

“నీకు సదా జయమగుగాక, ఔనునాయనా కర్కరాజా! నీవు క్షేమమేనా? నీ విద్యా


ప్రదర్శనలు ఎంతవరకూ వచ్చాయి?”అన్నాడు మహారాజు కుమారుడిని ప్రక్కన కూర్చుండ
పెట్టుకుని.

35
  చాళుక్యసింహాసనం

“నాన్నగారూ! శూలయుద్ధంలో నా గెలుపు తథ్యం. ఇంక ఒకరిద్దరు ప్రత్యర్ధులున్నారు.


కానీ వారంత లెక్కలోనివారు కారని నామిత్రులు చెబుతున్నారు. ఖడ్గయుద్ధంలో మాత్రం
విక్రమసింహపురి నుంచివచ్చిన ఆ భల్లాణపోతినాయుడు గట్టిపోటీ కాబోతున్నాడు. కానీ నా
కరవాల నైపుణ్యం వలన నేను జయించగలనని నామిత్రులూ గురువులూ చెబు తున్నారు.”

“కానీ నాయనా! శూలయుద్ధంలో నీవెలాగైనా గెలుస్తావు. కానీ నీవు ఖడ్గయుద్ధం


నుంచి తప్పుకోవడం మంచిదని పెద్దలు చెబుతున్నారు.”

“ఎవరా పెద్దలు నాన్నగారూ?”

“గండయ సాహిణి!”

“ఆయనా! ఆయనొక పిరికి మనిషి. నోరు మెదిపి ఎలా యుద్ధం చేయాలో చెప్పడం
చేతకాదుకానీ ఊరికే నిరుత్సాహపరుస్తాడు.”

“నీవలా అనకు రాకుమారా! గండయసాహిణి మనకున్న అత్యంత విశ్వాస పాత్రులైన


సేనాపతులలో ఒకడు. పెద్దమనిషి. మితభాషి. పరాక్రమంతోపాటు ధర్మ బుద్ధికలవాడు.”

“నాన్నగారూ మీకు నామీద నమ్మకం లేకపోతే మన మహాసైన్యాద్యక్షుడు లీశోత్తర


దీక్షితుని అడగండి. ఆయన నేనే అందరిలోకి మెరుగనీ జగదేకవీర బిరుదం నాకే దక్కు
తుందనీ ఘంటాపదంగా చెబుతున్నారు.”

“ఆయన మాటకేమికానీ అదేమాట మన శిరఃప్రధాని రేవాదాసదీక్షితుడు చెబుతే నమ్మ


వచ్చు.”

“రేవాదాస దీక్షితులవారు ఒక మంత్రి. ఆయనకు యుద్ధవిద్యా నైపుణ్యం ఏంతెలుస్తుందీ


నాన్నగారూ!”

“నాయనా కర్కరాజా అలాఅనకు!మన శిరఃప్రధాని ఫాలాక్షుడు. ఆయన కన్ను తెరుస్తే


ఎవరూ ఆగరు. ఎవరిని ఎక్కడ కూర్చోపెట్టాలో బాగా తెలిసినవాడు.”

“నాన్నగారూ! ఆ అన్ మ్ముల‘రకార’ ద్వయానికి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది.


ఒకరు గెలుస్తావంటే ఇంకొకరు తప్పకుండా ఓడిపోతావంటారు!”

“కుమారా! నిన్ను పిలిపించింది ఈ పోటీలలో నీవు పంతాలకు పోవద్దని చెప్పడానికే!


ఈ వీరోత్సవాలలో ఎన్నో కుతంత్రాలు జరుగుతున్నాయని మన గూఢచారులు చెబుతున్నారు.
మొన్నటికిమొన్న అరకాన్ రాజధాని త్రిలింగ నగరం నుంచి వచ్చిన శ్రీకాకుళయ్య ఒక వేశ్య
ఇంట్లో మరణించాడు. వేశ్య సోమగ్రంధి విషప్రయోగం చేసిందని చెబుతున్నారు.తమ వారిని

36
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

గెలిపించుకోవడం కోసం మాయలు మంత్రాలు కుతంత్రాలు పన్నుతున్నారు. వారు హత్యలు


చేయడానికి వెనుకాడరు.”

“తండ్రీ! మీరు నన్ను భయపెడుతున్నారా! మీకు నామీదున్న ప్రేమ వలన అలా


అనిపిస్తుంది. వీరుడనేవాడు కీర్తికోసం ప్రాణత్యాగంచేయాల్సి వచ్చినా భయపడకూడదు!
ఇంతకూ శ్రీకాకుళయ్య మరణానికి కారణం విష ప్రయోగం కాదు నాన్నగారూ! అతడు
సురతాలోలుడు. ఏదో రహస్యవిద్యలో ప్రాణం పోగొట్టుకున్నాడు. సోమగ్రంధి ప్రయోగించిన
కీల అనే ప్రహరణ విశేషం చేత మరణించాడు.”

“కుమారా! నిజాన్ని మనవారు పరిశోధిస్తున్నారు. నాయనా కర్కరాజా! నీకు తెలియని


దేమున్నదీ! ఈ రాష్ట్రకూట సామ్రాజ్యా భారాన్ని నీవు నేను మోయవలసి ఉంది. మా అన్నగారు
గోవిందరాజు మరణించినప్పటినుంచీ ఈ బాధ్యత మనపైన పడింది. బాలచక్రవర్తి
అమోఘవర్ష రాజేంద్రుడు పెరిగి పెద్దవాడై తన రాజ్యాన్ని తాను పరిపాలించుకునే వరకూ
మనం మన కర్తవ్యాన్ని మరువకూడదు. ఈ వీరోత్సవాలు ఇతరులను సన్మానించడానికే గాని
మనను మనం సన్మానించుకోవడానికి కాదు.”

“తండ్రీ! ఎలాగూ మనం చక్రవర్తి కిరీటాన్ని ధరించే అవకాశం లేదు. మన రాజభక్తి


అలాంటిది! కనీసం జగదేకవీరుడనే కీర్తి కిరీటాన్ని కూడా ధరించకూడదంటే ఎలాగూ? ఎంత
కాలమున్నా రాజప్రతినిధులమే కదా!”

“కుమారా! నీమనసులో ఏదైనా అసంత్రుప్తి ఉందా? అలాంటిది మనసులోకి రానీకు.


ఈ వీరోత్సవాలు కాగానే నిన్నులాటదేశాధీశుడిని చేయాలనుకుంటున్నాను. మన లత్తులూరు
రాజధానిగా పరిపాలించుదువు గానివి. ఈ ఉత్సవాలు కాగానే నీ వివాహ ప్రయత్నాలుకూడ
ఆరంభించాలను కుంటున్నాను.”

“తండ్రీ! లాటదేశం ఊసరక్షేత్రం లాంటిది! అక్కడ వర్షాలు పడవు. అంతేకాక నేను


రాజధానికి దూరంగా ఉండాలనుకుంటున్నాను.”

“పోనీ అలాగే! నిన్ను ఘూర్జరము కచ్ఛదేశం పాలకుడిని చేస్తాను. పూర్వం నేను ఆ


ప్రాంతాలకు రాజప్రతినిధిగా ఉండేవాడిని.”

“నాన్నగారూ! నేను ప్రస్తుతం వీరవిద్యా ప్రదర్శనల్లో పాల్గొంటున్నాను. ఇప్పుడీ


అసందర్భపు ప్రసంగం దేనికీ? చిన్న పిల్లలకు బెల్లంముక్క పెట్టి మరిపించినట్లు చూస్తే
ఎలాగూ? నా వివాహమైనా ఘూర్జరదేశం రాజప్రతినిధి ఐనా జగదేకవీర బిరుదం కన్నా
ఎక్కువ కాదు. అది సాధించడం కోసం నా ప్రాణాన్ని కూడా లెక్క చేయదలుచుకోలేదు.
పిత్రుదేవులు మన్నిస్తే నేను శలవు తీసుకోవాలనుకుంటున్నాను.”

37
  చాళుక్యసింహాసనం

“కర్కరాజా! నీవు యువకిశోరం లాగా ఉన్నావు. నిన్ను ఆపడం నాతరమయ్యేటట్లు


లేదు. నిన్నా మాన్యకేతీశ్వరుడు చల్లగా చూడుగాక!”అన్నాడు ఇంద్రవల్లభుడు.

కర్కవల్లభుడు నిష్క్రమించిన తరువాత ఇంద్రవల్లభుడు చింతాక్రాంతుడయ్యాడు.


పరిచారికలు కాళ్ళొత్తుతున్నారు. వింజామరలు కదులుతునేవున్నాయి. ఐనా నుదటన
చమటపట్టింది.

ప్రతీహారిని వచ్చి జయజయధ్వానాలు చేసింది.

9 ఆత్మకమలం
అది రసతరంగిణి ప్రాసాదం. అదొక విలాస వనం. కళాప్రియులకు కళాశాల.
జీవితంలో సమస్యలతో విసిగిపోయినవారికి విశ్రాంతిశాల. జూదరులకు అక్షశాల.
తాగుబోతులకు పానశాల. విటులకు గణికశాల. ఆ ప్రాసాదం దారితప్పిన యువతులకు ఒక
ఘటిక, ఒక ఆస్ధానం!

వీరోత్సవాల నిర్వహణకు అద్యక్షుడైన లీశోత్తరదీక్షితుడు రసతరంగిణి వద్దకు వెళ్ళాడు.


పూర్నిమ నాడు జరగవలసిన బహుమతి ప్రదానోత్సవం దగ్గర పడింది. వీరకుమారులను
సత్కరించడానికి యువతులు అవసరమయ్యారు. ఆనాటి ఏర్పాట్లన్నీ దీక్షితుడు రసతరంగిణికే
ఒప్పచెప్పాడు.

“దీక్షిత మహాశయా! మీరింత కంగారు పడతారేమిటీ?వీరోత్సవాలలో రంగాలంకరణ


మొదలు అన్నీ నాబాధ్యత అని చెప్పాను కదా! అన్నీ సక్రమంగా జరుగుతాయి. మీరు కంగారు
పడకండీ”అన్నది రసతరంగిణి.

“తరంగా! పున్నమినాడు ఉదయాన్నే బహుమతి ప్రదానోత్సవం. అది ఐపోగానే


వీరులందరికీస్నానాలు భోజనాలు విశ్రాంతి. ఆ సాయంత్రం వీరులకు నీ ప్రాసాదంలోనే
విందు వినోదం!మరినీవు ఈ ఆనందోత్సవానికి ఎంతమంది సుందరీమణులను ఏర్పాటు
చేశావు?” అన్నాడు లీశోత్తరదీక్షితుడు.

“ఎంతమంది వీరకుమారులుంటారో మీరు తేల్చి చెప్పలేదు మహాశయా!”అన్నది


రసతరంగిణి.

“ఇక్కడ స్వర్ణపతకాలవారు రజత పతకాలవారు కలిపి పదహారు మందికి మించి


వుండరు. కానీ గెలిచినా గెలవకపోయినా ఉత్సవాలలో పాల్గొన్న వీరులందరికీ విందు
ఇవ్వాలి.”అన్నాడు లీశోత్తరదీక్షితుడు.

38
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“మీరేమీ కంగారిపడకండి. కొందరు రూపాజీవలను కొందరు శైలూషలను


యవనికలను కొందరు నర్తకీమణులను ఏర్పాటుచేస్తాను” అన్నది రసతరంగిణి.

“ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి వీరులు ఎంతో దూరం నుంచి వచ్చారు. ఒక వీరుడు


ఎక్కడనుంచీ వచ్చాడో తెలుసా? అక్కడ జీనమ్ నది ముఖ ద్వారంలో ఓడనెక్కి సముద్రంలో
ఐదునెలలు ప్రయాణంచేసి తాన్ యువాను రాజ్యం చేరాడట! అక్కడ మళ్ళీ వాణిజ్యం నౌక
నెక్కి నాలుగు నెలలు ప్రయాణం చేసి ఐకౌము పట్టణంలోదిగాడు. మళ్ళీ ఇరవై రోజులకు చన్
లీ రాజ్యం చేరాడు. అక్కడ పదిరోజులు భూమార్గంలో ప్రయాణించి పౌకన్ టౌ వౌ చేరాడు.
అక్కడనుంచి రెండు నెలలు ప్రయాణించి భారతావని కాంచీపురం చేరి ఇక్కడకు వచ్చాడు.
ఇలా ప్రయాసపడి వచ్చినవారెందరో! రేపు రాష్ట్రకూట సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచమంతా
చాటేవాళ్ళు వీరే!”

“ఎవరతనూ? అంత కష్టపడి ఈ వీరోత్సవాలకు వచ్చాడా? కాంచీనగరం ఎందుకు


చేరాడూ? నేరుగా ఇక్కడకే రావచ్చుగదా!” అన్నది రసతరంగిణి.

“ఖండాంతర వాసులందరికు మన భారతావనిలో బాగా తెలిసింది ఉత్తరాదిన కాశి


దక్షిణాన కాంచినగరం. పుణ్యానికి రాశి కాశి అందానికి ఆనందానికి వాసి కంచి. అనేక
సముద్ర దీవులలో ద్రవిడభాష ప్రచారంలో వుంది. అందుకని సముద్ర వ్యాపారుల వెంబడి
అతడు ముందు కాంచీ నగరానికి చేరగలిగాడు.”

“ప్రపంచంలో కంచి అంత ప్రఖ్యాత నగరమా?”

“భలేదానివే! భవభూతి మహాకవి లాంటివాళ్ళు నగరేషు కాంచి అన్నారు. కాశీ కూడ


అలాంటిదే. అంతదాక వెళ్ళలేనివారు పదిసార్లు కాశి కాశి అనుకున్నా పుణ్యమట!”

“అవును. అయోధ్య మధుర మాయ ద్వారవతి కాశి గయ అవంతిక సప్తయితే మోక్ష


దాయక అంటారు! ఇంతకూ మీరు ఎంతమంది సుందరాంగనలు కావాలో తేల్చలేదు!”

“ఎలాగయినా ఇన్నూరు యువతులను సిద్ధం చేయడం మంచిది!”

“ఓరిబాబో!రెండువందలెందుకు?”

“మొత్తం పోటీలో పాల్గొన్న వీరులు నూటఎనభై తొమ్మిది మంది. అందులో ఒకడు


హత్య చేయబడ్డాడు.మీలో ఆ సమయానికి కొందరు సిద్ధంగా ఉండక పోవచ్చుకదా!”

“దీక్షిత మహాశయా! మావృత్తి మాకు తెలీదా? మీరు చెప్పాలా? ఇంతకూ ఈ


వీరులంతా పోటీకోసం వచ్చారా మా కౌగిళ్ళలో నిద్రపోవడానికి వచ్చారా?”

39
  చాళుక్యసింహాసనం

“ఎలాగైనా అనుకో తరంగా! వీరులను ఉత్సాహపరిచేది మూడు మకారాలు. మధువు


మానిని మూడవది మొగ్గరము! రోజూ కావలసింది మధువు, అప్పుడప్పుడూ మగువ,
జీవితంలో ఒకటి రెండు సార్లు వచ్చేది యుద్ధం! ఏదేశంలోనైనా ఇంతే!”

“మరి ఇంతమంది నవయువతులు దొరకరు. చాలా కష్టం!”

“మరి నేను ముందునుంచీ మొత్తుకుంటున్నాను కదా? చివరకు పూర్వసువాసినులను


కూరుస్తావా ఏమిటి!”
“కొందరు వేరేవారిని కలపాల్సివస్తుంది!”
“వేరే అంటే అతివలేనా?”
“మగువలే కానీ వేరేవారిని కూడ కలుపు కోవలసి వస్తుంది!”
“నువ్వనే వేరే మాటే నాకర్ధంకాలేదు!”
“మీ కమలహిత లాంటివాళ్ళుండరా? ఈ మాన్యకేత నగరం అంత పవిత్రమైనదేమీ
కాదు!”
“కమలహితను గురించి నీకు తెలుసా?” చాలా కంగారుగా అన్నాడు లీశోత్తరదీక్షితుడు.
“పిల్లి కళ్ళుమూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదనుకుంటుంది!”
“ఈ పేరు అందరికీ తెలియడం నాకు ప్రమాదకరం!” అన్నాడు దీక్షితుడు.
“మా ఆస్ధానానికి వస్తున్నారుగా! మళ్ళీ ఆమె జోలికేందుకు వెళుతున్నారూ? మీరెప్పుడో
గొప్ప ఇరకాటంలో పడతారు.”అన్నది రసతరంగిణి హెచ్చరిస్తున్నట్లు.

“లోకో భిన్నరుచిః నీకర్ధం కాదు! కానీ తరంగా!మీ నాన్న గుటికావిద్య నీకు తెలుసా
నాకు నేర్పగలవా? కమలహిత రాజవంశపు స్త్రీ. మాన్యకేతదుర్గంలో ఉంటుంది. నాతో
ఎలాగో పరిచయం పెంచుకుంది. నాకు ఆమెను చేరాలంటే అసాధ్యంగా వుంది.”

“మహాశయా!మాతండ్రి గుటికా విద్యతో అద్రుశ్యరూపంలో ఆ దేశంలో


అంతఃపురంలోకి వెళ్ళగలిగేవాడు. అంతమాత్రంచేత ఆ విద్య అందరికీ సిద్ధించదు. పైగా మీ
క్షేమం కోరి చెబుతున్నాను. గుటిక విద్య నాకురాదు సరికదా ఈ తంత్రవిద్యలు స్త్రీని చాలా
పవిత్ర భావంతో చూడాలని చెబుతాయి. అక్రమాలకోసం కాదు. ఐనా మీ కమలహిత
బ్రహ్మజాయ!”
“బ్రహ్మజాయ అంటే?”
“ఒక బ్రాహ్మణుని భార్య!”
“ఛా! అది నిజం కాదు. ఆమె జగతీంద్ర వర్మ భార్య.”
40
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“అంతకు ముందు ఆమె బ్రాహ్మణుని బార్య! ఒక బ్రాహ్మణ స్త్రీకి అబ్రాహ్మణ పతులు


పదిమంది వున్నాపాణిగ్రహణం చేసిన బ్రాహ్మణుడే భర్త అవుతాడు. బ్రహ్మజాయ సంగమం
చాలా అనర్ధదాయకం. ఉల్కపడిన గ్రామంలా సర్వం నశింపచేస్తుంది.ఐనా మాలాంటి వార
వనితా జనం ఉండేది దేనికీ? మిమ్మల్ని ఇలాంటి మహా పాపాలనుండి రక్షించడానికేగదా!”

“ఇప్పుడా ప్రసంగం వదిలేయి. కాళిదాస మహాకవి అంతటివాడు వ్యసనాలను మాను


కోలేదు. ఒకనాడు వారవనిత ఒకతె కాళిదాసుతో కుసుమే కుసుమోత్పత్తిః శ్రూయతే నతు
దృశ్యతే అంటే అందుకా కవి బాలే తవ ముఖాంభోజే ద్రుష్ట మిందీవరద్వయమ్ అని
చమత్కరించాడట. మరి నాకోసం ఎవరిని ఏర్పాటు చేశావూ?”
“గంధర్వపాలిత అని కాశ్మీరదేశంనుండి రప్పించాను.”
“ఒకసారి ఆ మోహనాంగిని చూడవచ్చా?”
“ఇప్పటినుంచి చూస్తే అప్పటికి రసపట్టు ఉండదు!”
“అయినా ఫరవాలేదు.”
“ఆమె ఇపుడు సాధనాదశలోవుంది.”
“దీనికి తోడు సాధన కూడానా?”
“మేమంటే మీకు చులకన! కానీ మా ఆస్ధానం గణికలు కావ్యనాటకాలంకార ఛందో
పారంగతులు. నాట్యవిశారదులు. చతుర కవిత్వము పొడుపు కథలు సమస్యా పూరణము
తెలిసినవారు. గంధర్వపాలితకు నాట్యం రాదు. నేర్పిస్తునాను. ప్రస్తుతం అంగమర్దనము
తొక్కాటము స్ధాయిలో వుంది!”
“మీకివన్నీ ఎవరు నేర్పుతారు?”
“సకలశాస్త్రాలను నేర్చిన పండితులే మా గణికాస్ధానానికి వచ్చి నేర్పివెళతారు.”
“సరేకానీ నీ విద్యకు శాస్త్రాలకు ఏమిటి సంబంధం?”అన్నాడు రేవాదాసదీక్షితుడు.
“సామవేదంలో మరి సరిగమపదని అనే సప్తస్వరాలున్నాయా?” మీకు తెలుసా తేలీదా
అన్నట్లు అడిగింది రసతరంగిణి.
“ఉన్నాయి!”
“లేవు. అసలు సంగీతానికి రెండే స్వరాలు!”
“నీవేదో నాకు కొత్త పాఠం చెబుతున్నావు!”
“కాదు. అసలు స్వరాలు రెండే!సా పా. మిగతావన్నీ అంతర స్వరాలు. సామవేదం ఈ
రెండు స్వరాలనే ప్రతిపాదిస్తుంది. ఏదైనా తంత్రీ వాయిద్యాన్ని సృతిచేసేటపుడు సాపా లకు
సరిపోతే మిగతా స్వరస్ధానాలన్నీ పలుకుతాయి. మీరీదినం నాట్యం చూడరా?” అన్నది
41
  చాళుక్యసింహాసనం

రసతరంగిణి.
“ఏదీ ప్రదర్సించితేనా!”
రాష్ట్రకూట మహాసైన్యాధిపతి లీశోత్తరదీక్షితుడు ఆశాలలో తెల్లటి గద్దెపై కాళ్లుజాపుకుని
ఉపధానాలకు ఆనుకుని కూర్చున్నాడు. ఒక తోయ్యలి పాదాలొత్తుతుంటే ఒక జవ్వని ప్రక్కన
కూర్చుని తన అధరామృతంతో పవిత్రం చేసిన మధువును తాగిస్తోంది. కాపిశాయనం
కొంచం కొంచంగా సేవిస్తున్నాడు. ఇంకొక పూబోడి హరిచందనం వడలు పులకరిచేటట్లు
ఛాతిపైన అలదుతోంది.
గానానికి ముందుగా వాద్యాలు మేళం చేసుకున్నారు. రసతరంగిణి పాడగా ఒక నటి
అభినయిస్తోంది.
చెలువము తరిగిన చూడరుజనులు
చెలుల సొగసులూ వడిలేపూలు
వాడనిదొకటే ఆత్మకమలము
అంతర్యామిలో అదిఒకకణము
చెలువము తరిగిన చూడరుజనులు
“తరంగా” ఇదేమి పాటా?” అన్నాడు దీక్షితుడు.

“మా జీవితాలు ఇలాగే వుంటాయి. అందుకే దీపముండగానే ఇల్లు చక్కపెట్టుకో


మంటారు మాపెద్దలు.”

“ఇంతకూ ఈ వీరోత్సవాల ఏర్పాట్లన్నిటికీ నీవు ఎంత మూల్యం అడగబోతున్నావు?”


అన్నాడు దీక్షితుడు.

“ఏభయి వేలనుంచి అరవై వేల సువర్ణాలు దగ్గర పెట్టుకోండి!”

“తరంగా! అంత అవుతుందా?”

“ఒక్కొక్క నర్తకికీ వంద సువర్నాలు వేసుకున్నా నేను చెప్పిన లెక్క తక్కువే! మీగతా
ఏర్పాట్లూ అలంకరణలు వాటికెంతవుతుందో ముందుగా చెప్పలేము కదా!”

“అవునులే! ఒళ్ళు దాచుకోకుండ కష్టపడేవాళ్ళు. సామ్రాజ్యానికేమి ధనం కరవా!


బంగారు దిమ్మలు వెలుగు చూడకుండా నేలమాళిగలలో మూలుగుతున్నాయి. కానీయి.
ఏర్పాట్లు మాత్రం ఘనంగా వుండాలి” అన్నాడు దీక్షితుడు.

42
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

10 బహుభాషి
రాజకుమారి శిరీష వసుమిత్ర చెలికత్తెలతో కలసి ఒక దుకాణంలోకి ప్రవేశించారు.
అక్కడ పాటకజనం కొనే వస్తువులేమీ లేవు.అక్కడ పురాతన నాణాలు వివిధ దేశాలవి
అమ్ముతున్నారు. అంతేకాక అతి పురాతనమైన రాణుల నగలు కూడ విక్రయానికి ఉన్నాయి.

రాజకుమారికి వసుమిత్రకు అంగడి శ్రేష్ఠి ఉచితాసనాలు చూపించాడు.“అమ్మా!


తమరు రాజకుమార్తె లనుకుంటాను!” అన్నాడా శ్రేష్ఠి.

“ఔనండీ! ఈమె ఇంద్రవల్లభుల కుమార్తె శిరీషాకుమారి!” అని పరిచయం చేసింది


చెలి కత్తె షడ్పద.

“మహాప్రభువుల పోలికవలననే రాజకుమారి అని గ్రహించాను. మరి ఈ శ్రీమంతురా


లెవరో పోల్చుకోలేకపోతున్నాను.”అన్నాడు దుకాణదారుడు.

“ఈమె ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్యగారి పుత్రిక! వసుమిత్ర!” అన్నది షడ్ఫద.

“ఓహో! రత్నాకరుడిలాంటి గోమఠేశ్వరయ్యగారి పుత్రికా! ఆయన దయవలననే నాకీ


అంగడి తెరిచే అవకాశం దొరికింది. మీకు ఏమి చూపమంటారూ? మీరు మా అంగడికి
దయచేయడమే మా భాగ్యం!” అన్నాడు శ్రేష్ఠి.

“నగలకేమికానీ చరిత్రకందని నాణాలు చూపండి” అన్నది శిరీష.

“అమ్మా! మీకీ నాణాల విశేషాలు చెప్పడానికి సమర్ధుడైన వాడొకరున్నారు. అయన


పేరు కుంచనభట్టు. ఆయన్ని పిలిపిస్తాను. ఈ లోపున తినుబండారాలు పానీయాలు సేవిం
చండి” అన్నాడాయన. అప్పుడే గుర్తుకువచ్చి వసుమిత్ర “అయ్యో!మా రథంలో క్షీరారామం
పూతరేకులు మంగళాద్రి నూవుజీడులు శిఖాకోళం తాండ్రా మచిలీపట్నం మోదకాలు ఉండి
పోయాయి!” అన్నది.

కొద్దిసేపటి తరువాత కుంచనభట్టు ప్రవేశించాడు. దంతపు సొరుగులు తీసి


అందులోంచి పూర్వకాలపు నాణాలు చూపసాగాడు. అమ్మా! ఇవి అతి పురాతనమైనవి. మట్టి
నాణాలు. తరువాత సీసము రాగి వెండి బంగారము పోటిన్ నాణాలు వాడుకలోకి వచ్చాయి.
ఇవి శాతవాహన నాణాలు. ఈ బంగారు నాణాలను కార్షాపణాలు అనేవారు. చిముక శాత
వాహన, సాతకర్ణి, సాతవాహనా అని పేరుగల నాణాలు వారివే. ఈ నాణాలు చూడండీ
గుఱ్ఱం బొమ్మ ఉన్నవి వారి అశ్వమేధయాగానికి సంకేతం. పడవ బొమ్మలున్నవి సముద్ర
వ్యాపారానికి చిహ్నం. ఇవి వెండి డబ్బులు. ఒక సువర్ణ కార్షాపణానికి ముప్పదియైదు వెండి
డబ్బులు. శాతవాహనుల నాణాలమీద ఏనుగు గుఱ్ఱము తెరచాప ఓడ సింహము లాంటివి

43
  చాళుక్యసింహాసనం

ముద్రించేవారు.

మగధ సామ్రాజ్యాన్నేలిన మౌర్యుల నాణాలపైన ప్రాకృత భాషలో రాజుల పేర్లు చెక్కే


వారు. దీనిపైన రాజో గోభద్ర అని వుంది చూడండీ.

ఇవి రోమకదేశం, గ్రీకుదేశం నాణాలు. ఇంకా ఈ దేశంవని చెప్పలేని నాణాలు అనేకం


ఉన్నాయి. ఇవి బీరగొట్టపు గద్యలు, ఇవి దమ్మలు. ఇవి మీకు తెలిసినవే పందిమాడలు
చాళుక్యులవి.”

“భట్టుగారూ ద్విభాషులైన మీరు ఏదేశంనుంచి వచ్చారూ?”

“నేను ద్విభాషిని కాదమ్మా బహుభాషిని! సంస్కృత ప్రాకృతాలేకాదు, మహాజని,


బ్రాహ్మాణి, మోడి, మారువాడి, మాగధి, వైశాలి, భోజపురి, మైధిలి, తమిళ భాషలేకాక పారశీక
గ్రీకు రోమక హిభ్రు భాషలలో కూడా పండితుడిని!”
“నేను అడిగింది మీ పాండిత్యం గురించికాదు. ఏ దేశవాసులని?”
“నేను చాళుక్యుల వేంగీనగర వాసిని!”
“ఓహో! భీరువుల దేశం నుండి వచ్చారా?”
“ఏమిటమ్మా అలా అన్నావూ? చాళుక్యులంటే బ్రహ్మదేవుడి చుళుకం నుంచి పుట్టిన
సుక్షత్రియులు!”
“ఔను. బ్రాహ్మణులందరూ బ్రహ్మ నోటిలోంచి ఊడిపడ్డారు. క్షత్రియులందరూ బ్రహ్మ
గుప్పెట లోంచీ మొలుచుకొచ్చారు!”

“అమ్మా నీవు చిన్నదానివి! పురుషసూక్తం లోని బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ బాహూ


రాజన్యః కృతః అనే వేదవాక్యాన్నే అనుమానిస్తున్నావా?”

“నేనెవరినీ అనుమానించటం లేదు. అవమానించటం లేదండీ. వేదమంటే నాకు


ఎనలేని గౌరవముంది. కానీ రాజ్యం వీరభోజ్యం! భుజములలో చావ లేనివాడు క్షత్రియుడనని
చెప్పుకోవడం హేయం!”

“వేంగీ చాళుక్యులలో చేవలేదని మీకెందుకనిపించిందీ?”

“మరి చూడండి! ఇక్కడ జరిగే వీరోత్సవాలలో పాలుపంచుకోవడానికి ఎందరో వీరులు


వీరాధివీరులైన రాజకుమారులు వచ్చారు. మహాబలులు ఖండఖండాంతరాల నుండి సముద్ర
యానం చేసివచ్చారు. ఇక్కడకు రాని చాళుక్యులను భీరువులనక ఏమంటారూ?”

“వారికి ఏమి అడ్డంకులు వచ్చాయో?”


44
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ప్రయాణానికి అడ్డంకులు రావడానికి వారేమైనా ఆడపిల్లలా!” అనాలోచితంగా రాజ


కుమారి అన్నమాటకు చెలికత్తెలంతా పగలబడి నవ్వారు.
“అమ్మా! మీరెందుకు పరిహసిస్తున్నారో నాకర్ధం కాలేదు!”
“ఆడపిల్లల కష్ఠాలు మీకర్ధం కావులేండి!”
“చాళుక్యులను మీరెందుకంత చులకనగా చూస్తున్నారు?”
“చాళుక్య నరేంద్రమృగరాజ బిరుదాంకితులైన విజయాదిత్య మహారాజుగారికి ఒక
కొడుకు ఉండాలి!”
“ఉన్నాడు.”
“ఆ సుపుత్ర రత్నం పేరు….”
“విష్ణువర్ధనుడు.”
“అతడేంచేస్తున్నాడూ ఇక్కడ ఇంతటి వీరోత్సవాలు జరుగుతుంటే?”
“అతడీమధ్యనే చమరీ గురుకులం నుండి రణవిద్యా విశారదుడై పట్టభద్రుడైనాడు.”
“పట్టభద్రత పొట్టపోసుకోవడానికే కదా! మమ్మాశ్రయిస్తే మా తమ్ముడి చక్రవర్తిత్వంలో
ఒక పాళెగాడిగా వేయిస్తాము!”
“ఏ చక్రవర్తుల అండలోనో ఎందుకూ? మీవంటి అతిలోక సుందరీమణులు
అనుగ్రహిస్తే మీ చరణచారణ చక్రవర్తి అవుతాడు!”
“మేము వీర్యశుల్కలం!”
“అంటే నాకర్ధంకాలా!”
“పండితులమన్నారుగా!”
“అంటే మత్స్యయంత్రం కొట్టినవారిని పెళ్ళాడుతారా?”
“కాదు. మాతో ధనుర్విద్యలో గెలిచినవారిని!”
“కుసుమ సుకుమారులు. మీకు ధనుర్విద్య కూడా వచ్చా! బొటనవ్రేలు చూపుడు వ్రేలూ
కొంచం కర్కశంగా కనిపిస్తే వీణాపాణులనుకున్నాను!”అన్నడు కుంచనభట్టు.

అప్పుడు చెలికత్తె “మా రాకుమారి అందులోనూ చతుర. అన్నిమేళకర్తల రాగాలు


జనక రాగాలు జన్య రాగాలు ఆలాపన మూర్ఛనములు నెరవు అన్నిటిలోను దిట్ట!” అన్నది.

“అమ్మా! సంగీతానికి మూలం సామవేదం. సామవేదాన్ని నేర్చుకోవడానికి నారదీయ


శిక్ష మొదలైన శాస్త్రాలున్నాయి. నారద స్వరమండలంలో ఏడు స్వరాలు మూడు గ్రామాలు

45
  చాళుక్యసింహాసనం

ఇరవైఒక్క మూర్ఛనలు నలభై తొమ్మిది తానాలు ఉంటాయి. పక్షులు కూడా సామగానం


చేస్తాయి. శకునే సామగాయసి.”
“భట్టుగారూ మీముఖ వర్చస్సును పట్టే మీరు పండితులని తెలుస్తోంది!”
“మీరు గుర్తించినందుకు సంతోషం. అమ్మా! నాకు తెలీక అడుగుతాను. ధనుర్విద్యలో
మీ ప్రత్యేకత ఏమిటీ?”
“ఒకరి ధనుర్విముక్త శరాన్ని గాలిలోనే నా బాణంతో త్రుంచగలను. శబ్దభేది నేర్చాను.
అందులో నన్నోడించిన వాడిని కానీ సరిసమానుడిని కానీ నేను పెళ్ళాడుతాను!”
“అతడెంత ముసలివాడైనా ఫరవాలేదా! స్వరూపము ఈడూజోడు జన్మకుండలినీ ఏమీ
అవసరంలేదా?”
“ఉహూ!”
“బాగా ఆలోచించుకుని చెప్పండి!”
“ఏమీ! మీరే ఆ విద్యలలో మా రాకుమారిని గెలుస్తారా?” అన్నదొక చెలికత్తె.
“నాకంతటి చూపు లేదు. వయసు మళ్ళినవాడిని. చమరీ గురుకులం కులపతి అంగీ
రసుడు తప్పకుండా మిమ్మల్ని జయించగలడు. మరి ఆయన వృద్ధుడు.”
“మరి పూర్వం ఏంచేసేవారూ?”
“పూర్వపు మహారాజులకు ఆడపిల్లలంటే ఆటబంతులు! స్వయంవరంలో ఎవరు
గెలుస్తే వారికే పిల్లనిచ్చేవారు. వయసు ఈడు జోడు జాతకాలు నక్షత్రాలు ఏమీ పట్టించుకునే
వాళ్ళు కాదు!”
“మరి పురాణేతిహాసాలలో అలా ఉండదుకదా! రాజకుమార్తెలకు తగిన వరులే దొరికే
వారు కదా!”
“కావ్యాలలో కథకోసం అలా వ్రాస్తారు! సీతా స్వయంవరానికి రామునికన్నా ముందు
పరశురాముడు వస్తే ఏమయ్యేది?”
“నిజమేనండీ ఏమయ్యేదీ? విష్ణుచాపాన్ని ధరించినవాడు శివచాపాన్ని
ఎక్కుపెట్టలేడా!”

“కానీ రాముడిలాగా పరశురాముడు అల్లరిపిల్లవాడు కాదు!”

“అదేమిటండీ! రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు. రాముడు మంచిబాలుడు. అలాంటి


వాడిని అల్లరి పిల్లవాడంటే ఒప్పుతుందా లోకం?”

“మరి శివచాపాన్ని ఎక్కుపెట్టు బాబూ అంటే విరగ్గొడితే ఏమంటారు?”

46
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“మీరు చమత్కారంగా మాట్లాడుతారు!”

“ఒకడు మత్స్యయంత్రాన్ని కొట్టాడని ఒక్క ఆడపిల్లను ఐదుగురికిచ్చి పెళ్ళిచేశారు!”

“అయ్యో! మీరు ద్రౌపదీ స్వయంవరాన్ని తప్పు పడుతున్నారా? మీరు బౌద్ధులో చార్వా


కులో కాదుకదా?”

“నేనేమీ పాషండుడిని కాదు. మీరేదో స్వయంవరం అంటే అందులోవున్న కష్టాలు


చెప్పాను! మత్స్యయంత్రం కొట్టడం ఒక విద్య. దానికి వయసుతో సంబంధం లేదు. ఆ విద్య
నేర్చినవాడు పిట్టల్ని కొట్టినట్లు చాపల్ని కొట్టి పిల్లను తెచ్చి ఇంటో పడేస్తాడు.”

“ఐతే స్వయంవరం సంగతి మానుకోమంటారా?”

“రాకుమారీ! నేనామాట అనలేదు. మీకు వేంగీ రాకుమారుడిమీద అభిప్రాయం ఉంటే


చెప్పండి. హంస రాయబారం లాగా కాకపోయినా అగ్నిద్యోతనుడిలాగా వేంగికి వెళ్ళి
వస్తాను!”

“ఏమీ అవసరం లేదులేండి! ఆతడిని కూచుని కుండల్లో గుఱ్ఱాలు తోలుకోమనండి!


మీసాలు పిల్లికి కూడవుంటాయి! కానీ పౌరుషముండదు.”

“మీ నాయనమ్మగారు శీలామహాదేవి తూర్పు చాళుక్యుల ఆడపడుచనే విషయం మర్చి


పోయారా? అంతేకాదు. మీ రాష్ట్రకూటుల వంశంలో ఇంద్రరాజు చాళుక్యుల రాజ కుమారి
భావనాగను కైరా వివాహమండపం నుంచి ఎత్తుకువచ్చి రాక్షసవివాహం చేసు కున్నాడు.
చాళుక్యులకు మీకూ వివాహబంధాలు ఉండనేవున్నాయి.”

“అందుకే బాధ పడేది! ఇక్కడ వీరోత్సవాలలో పాల్గొనడానికి ఎక్కడెక్కడినుంచో


సముద్ర యానం చేసికూడా వచ్చారు. రానిది భీరువులైన చాళుక్యులొక్కరే!”

“ఈ మాటకు నేనేమీ సమాధానం చెప్పలేను. చాళుక్యులే చెబుతారు. నేను కేవలం ఒక


బహుభాషిని మాత్రమే!”

“మీకెందుకూ చాళుక్యులనంటే అంతకోపం?”

“నాకు కోపమేమీ లేదు. నేనేమీ చాళుక్యుల ఆస్ధాన పండితుడిని కాదు. కాకపోతే ఇక్కడ
నాలుగు రూకలు దొరుకుతాయని పొట్టకోసం వచ్చాను.”

“ఇంతకూ కుంచన భట్టుగారూ బాణాన్ని బాణంతోనే గాలిలో త్రుంచగలవారిని మీరు


చూశారా?”

47
  చాళుక్యసింహాసనం

“మీరు స్వయంవరం ప్రకటించండి. చేతనైనవాళ్ళే వస్తారు.”


“స్వయంవరంలో వున్న ప్రమాదం తెలిసికూడా అంత బుద్ధిమాలిన పని చేయలేను!”
“పోనీ చమరీగురుకులంలో చదువుకున్న విష్ణువర్ధనుడు గాలిలో బాణాన్ని గాలిలోనే
త్రుంచగలుగుతే అతడిని పెళ్ళాడుతారా?”
“అతని చరణదాసినవుతాను!”
“ఏమోనమ్మా! నందోరాజా భవిష్యసీ లాగా కాలం మారితే ఏమవుతుందో!” అన్నాడు
కుంచనభట్టు.
వనితాబృందం తాము ప్రక్కన పెట్టిన నాణాలకు వెల చెల్లించి వచ్చారు.

11 రసతరంగిణి విలాసవనం
రసతరంగిణి తూలికా తల్పానికి ఆనుకునికూర్చుని రాష్ట్రకూట మహాసైన్యాధిపతి
లీశోత్తరదీక్షితునితో ముచ్చటిస్తోంది. సఖియలు ఆమె పాదాలకు గోరింటాకుపెడుతున్నారు.
పరిచారికలు లీశోత్తరదీక్షితునికి పాదాలొత్తుతున్నారు.

“తరంగా! నీవింత విద్వాంసురాలివి. ఈ పడుపు వృత్తిలో ఎలా ఇరుక్కున్నావూ?”


అన్నాడు లీశోత్తర దీక్షితుడు.

“అదొక పెద్ద కథ!” నిట్టూరుస్తూ అన్నది రసతరంగిణి.

“నీ కథ చెబుతానంటూ ఊరిస్తావేకాని దాటవేస్తావు!” అన్నాడు దీక్షితుడు.

“స్వామీ! దాచడానికి దాటవేయడానికి ఇందులో ఏమీలేదు. కాకపోతే మీరు ప్రతిసారీ


అడగడం శృంగారంలోపడి అలిసి మైమరచి నిద్రపోవడం తటస్ధిస్తోంది. ఇవాళ చెబుతాను.
దగ్గరకు రాకుండ వినండి అని తన కథ మొదలు పెట్టింది.

“నాతండ్రి పేరు శఠుడు. అతడొక మాంత్రికుడు. గురువు ద్వారా కొన్ని తంత్రవిద్యలు


సాధించాడు. అందులో గుటిక ఒకటి. సమ్మోహనము కూడా చేయగలడు. గుటిక విద్య
ద్వారా అదృశ్యరూపంలో ఎక్కడికైనా వెళ్ళగలడు. ఆవిద్య నుపయోగించి అవంతీదేశం
అంతఃపురంలోకి వెళ్ళేవాడు. అప్పటి మహారాజుకు చాలామంది భార్యలుండేవారు. అందులో
ఏడవ భార్య ప్రకామ చాలాచాలా అందగత్తె. ఒకనాడు ఆమెకు వైద్యం చేయడానికి నా తండ్రి
అంతఃపురానికి వెళ్ళాడు. అలా ఆమెతో పరిచయం ఏర్పరచు కున్నాడు. ఆమె మీద
వ్యామోహంతో గుటికావిద్య నుపయోగించి అంతఃపురానికి వెళ్ళి ఆమెను సమ్మో హనం
చేసేవాడు. ఇద్దరూ రహస్యంగా వ్యవహరించేవాళ్ళు. ఫలితంగా నేను పుట్టాను.

48
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

నా తల్లి నన్ను రహస్యంగా కనడంవలన నా తండ్రికి నన్ను యిచ్చివేసింది. నా కన్న


తల్లిని నేను చూడలేదు. మా నాన్న మాత్రం అనేవాడు ‘నీకు నీ అమ్మ అందంలో సగం కూడ
రాలేదే’అని.

నన్ను రసవని అనే ఆమె పెంచింది. ఆమె నాకు రసతరంగిణి అని పేరుకూడ పెట్టింది.
మేమప్పుడు ధారానగరంలో ఉండేవాళ్ళం. కానీ మాతండ్రి నన్ను తరుచూ ఉజ్జయిని
నగరానికి దగ్గరలోనున్న తాంత్రిక గ్రామానికి తీసుకు వెళుతుండేవాడు. అక్కడ చాలా మంది
ఉపాసకులు ఉండేవాళ్ళు. వాళ్ళు నాకు మూడేళ్ళు వచ్చినప్పటినుంచి నన్ను కూర్చోపెట్టి ఏవో
శక్తిపూజలు చేసేవాళ్ళు. నాకు పన్నెండేళ్ళ వయసులో మాతండ్రి నన్ను వామాచారులకు
అమ్మివేశాడు.”

“తరంగా! వామాచారం అంటే ఏమిటీ?” అన్నడు లీశోత్తరదీక్షితుడు.

“మీకు బొత్తిగా మతసాంప్రదాయాలను గురించి తెలీదనుకుంటాను! వామాచారులు


ఎడమచేత్తో పూజచేస్తారు ఎడమచేత్తో భోంచేస్తారు. ధక్షిణాచారానికి వామాచారం పూర్తిగా
భిన్నంగా వుంటుంది.”అన్నది రసతరంగిణి లీశోత్తరదీక్షితుని అవహేళన చేస్తూ.

లీశోత్తరదీక్షితుడు కోపం తెచ్చుకోలేదు. చిన్నచిరునవ్వు నవ్వి “చిన్నప్పట్టినుంచీ నేను


ఖడ్గం పట్టుకు తిరిగాను. మాఅన్నయ్య రేవాదాసదీక్షితుడు మాత్రం వేదము నిగమ ఆగమాలు
నేర్చాడు. నిజంగా నాకు మత సాంప్రదాయాలేమీ తెలీదు.” అన్నాడు.

“వామాచారం ఒక రకంగా భయంకరంగా అనిపిస్తుందికాని చాలా శీఘ్రంగా ఫలిస్తుం


దట! ఇది తాంత్రిక సాధనలలోకి వస్తుంది.”

“నీకు వామాచారంలో ప్రవేశముందా? అదేమిటో నాకు చెప్పగలవా?”

“నేను వామాచారం గురించి ఇంకొకరికి చెప్పేటంత దానిని కాదు. కానీ వామాచార


సాధనలలో స్త్రీ తప్పనిసరి. అదికూడా చాల అందమైన స్త్రీ మంచివయసులోవుండి పురుషులకు
ఉద్రేకం కలిగించే అవయవాలు కలిగి వుండాలి. హొయలొలికించాలి. దేవేంద్రుడు
తపస్యులను పరీక్షించడానికి ఇలాంటి అందమైన అప్సరసలనే ప్రయోగించే వాడు. లోకులు
ఇంద్రుడేదో నీచుడనుకుంటారు. ఇంద్రియములను నియంత్రించినవాడు ఇంద్రుడు. ఇది ఒక
తాంత్రిక రహస్యం. ఐనా సాధకుడు స్త్రీ వ్యామోహంలో పడిపోకుండ నిగ్రహించుకో గలగాలి.
అప్పుడే తపస్సు ఫలిస్తుంది.”

“అంత అందమైన అప్సరస అనుగ్రహం కావాలికానీ నిగ్రహం ఎవరికి కావాలీ?”


అన్నాడు లీశోత్తరదీక్షితుడు.

“అందుకే చాలామంది వామాచారం ప్రారంభించి చివరకు భ్రష్టులవుతారు. కానీ


49
  చాళుక్యసింహాసనం

ఎందరో రాక్షసులు సాధనా కాలంలో స్త్రీ వ్యామోహాన్ని జయించి బ్రహ్మ రుద్రాదులనుంచీ


వరాలు పొందారు. కానీ విశ్వామిత్రుడంతటి తపస్వి మేనక అందాలకు లొంగిపోయి
సంసారంలో పడ్డాడు.

ఈ తంత్రవిద్యలు లెక్కకు అరవైనాలుగుకు మించేవున్నాయి. తాంత్రిక సాధకులు నన్ను


పదమూడవ ఏటనుంచి ఉపయోగించు కున్నారు. ఐదారేళ్ళు నేను ఈ సాధకుల చేతులో
నలిగాను. దానివలన నాకు కూడ సాధన అలవాటయింది.”

“అయితే తాంత్రికులు నిన్ను చాలాకాలం వాడుకున్నారనమాట!” హేళనగా అన్నాడు


లీశోత్తరదీక్షితుడు.

“తంత్రములన్నీ స్త్రీని చాల పూజ్యభావంతో చూడాలని చెబుతున్నాయి. స్త్రీయో దేవాః


స్త్రియః పుణ్యాః స్త్రియ ఏవ విభూషణమ్ అని చెబుతున్నాయి. తంత్రవిద్య ఇంద్రియ నిగ్రహాన్ని
గురించి చెబుతుంది. ఈ సాధనలో మూడు రకాల మార్గాలున్నాయి. అవే పశు భావము
వీరభావము దివ్యభావము అనేవి.”

వారలా మాట్లాడుకుంటున్నసమయంలో చేటిక ప్రవేశించి మహాసేనాధిపతుల కోసం


ఎవరో వచ్చారని చెప్పింది.

రసతరంగిణి కథను ఆపి అభ్యంతరం లోకి వెళ్ళిపోయింది.

లీశోత్తరదీక్షితుడు రసతరంగిణితో వీరోత్సవాల ఏర్పాట్లు చర్చించడానికి వచ్చాడు.


బహుమతి ప్రదానం సందర్భంగా అమోఘవర్ష చక్రవర్తికి సహాయంగా కొందరు సొగసు
కత్తెలు కావాలి.

రసతరంగిణి ప్రాసాదానికి ఒక మేనా వచ్చి ఆగింది. దాన్ని పదిమంది బోయీలు


కష్టపడి మోసుకొచ్చారు. అందులోంచి మహాకాయయైన స్త్రీ దిగింది. నిండా ముసుగు
కప్పుకుని వుంది. మేనాలో మరొక స్త్రీ ఉందికానీ ఆమె మేనా దిగలేదు. ఆ ప్రాసాదం
ద్వారపాలకులు కంగారు పడ్డారు. క్రొత్తవారినీ పరిచయం లేనివారినీ అక్కడకు రానీయరు.

ఆ వచ్చిన స్త్రీ మాట్లాడుతుంటే మగగొంతులా వినిపించింది. లీశోత్తరదీక్షితుడు


ఆవచ్చిన వారిని లోపలకు తీసుకు రమ్మన్నాడు. పరిచారికలు వెళ్ళి మగగొంతు ఆడమనిషిని
లోనికి తీసుకుని వచ్చారు.

ఆ మహాకాయ స్త్రీ దీక్షితుడిని చూడగానే తన ముసుగు తీసివేసింది.

“భీమసలుఖి మహారాజా! మీరా! ఈ వికృత వేషాలేమిటీ? మీరు వేంగిదేశం


మహారాజనే విషయం కూడా మర్చిపోతున్నారు.”అన్నాడు లీశోత్తరదీక్షితుడు వచ్చిన
50
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

మనిషితో. అతడి ఆడవేషానికి రసతరంగిణి తెరచాటు నుంచి ఫక్కున నవ్వింది.

“ఆయ్! నా పరిస్ధితి చూస్తుంటే నాకే కడుపు తరుక్కుపోతోంది. రాజునో బూజునో


అర్ధం కాకుండావుంది. ఎక్కడలేని కష్టాలు నాకే వచ్చిపడ్డాయి. మీ అన్నేమో నామీద లక్ష
మంది గూఢచారుల్ని పెట్టాడు. అందుకే మీదగ్గరికి రావడానికి నానా వెధవ్వేషాలన్నీ
వేస్తున్నా.” అన్నాడు భీమసలుఖి మహారాజు. ఆయన మేనాలో వచ్చినా అలిసిపోయినట్లు
రొప్పు తున్నాడు.

“రాజా! ఇప్పుడు మీకొచ్చిన కష్టమేమిటీ?”

“కష్టమా కష్టంన్నరా! ఆయ్. అటు వేంగీనగరానికెళితే మా తమ్ముడు కుక్కను తరిమి


నట్లు తరుము తున్నాడు. ఇక్కడ చూస్తే పులిస్తరాకుకైనా విలువుంటుంది కానీ నాకు లేదు.
ఇప్పుడేమో నా పెళ్ళాం కూతురు పెళ్ళి.”

“రాజా! మీరు చాలా కంగారు పడుతున్నారు. పెళ్ళాంకూతురు పెళ్ళేంటీ? శరీరాన్ని


ఇలా ఏనుగులాగా పెంచుతే ఆయాసం వస్తుందని అనేకమార్లు చెప్పానా?”

“ఆయ్!అసలు నాకు తిండి సహించక కంటికి నిద్ర రాక ఎండి వరుగునై పోతుంటే
మీరేమో లావైపోతున్నా వంటున్నారు. ఇదేమి న్యాయం! ఇంతకూ మా భీమరథీకుమారి
పెళ్ళి.....”

“ఏమిటీ? నిశ్ఛయమైందా?”

“నాబొంద! నన్ను మీరు చెప్పనిస్తేనా! నాకసలే మార్గాయాసం! కర్కవల్లభునితో మా


అమ్మాయి భీమరథి వివాహం..”

“మహారాజా ఆగండి ఆగండి! రహస్యాలు బహిరంగంగా మాట్లాడకూడదు.


‘రసతరంగిణీ మాకొక రహస్యమాళిగ చూపించూ” అన్నాడు దీక్షితుడు.

రసతరంగిణి కొంచం చీదరించుకుంది.

“ఎందుకంత కోపం తరంగా! ఈయన తూర్పు చాళుక్య మహారాజు!”అన్నాడు


లీశోత్తర దీక్షితుడు.

“మహారాజయితేనేమీ యతిరాజయితేనేమి! కాస్తంత మర్యాద తెలియాలి!”

“అంత కోపమేలనే కొమదా!”అన్నాడు దీక్షీతుడు.

51
  చాళుక్యసింహాసనం

“నేనేమీ నూకలకోసమో రూకలకోసమో ఆడేదాన్ని కాదు. తాగదలుచుకుంటే


పానశాలకు వెళ్ళాలి. వేశ్యలకోసమొస్తే గణికశాల కేగాలి. సభ్యత మరచి ఇద్దరు సరసుల
మధ్యకు రావడం తగదు!”

“అజ్జజ్జో! పొరపాటైపోయిందికదా!” అన్నాడు దీక్షితుడు.

రసతరంగిణి అక్కడనుండీ విసురుగా వెళ్ళిపోయింది. పరిచారిక యొకతె ఆ ఇద్దరినీ


ముచ్చటించుకోవడానికి రహస్యమందిరానికి దోవచూపించింది.

దారిమధ్యలో భీమసలుఖి మహారాజు “అరె! ఆ పడుపుదానికి అంత భయపడతా...”


భీమసలుఖి మాటలను దీక్షితుడు పూర్తి చేయనీయలేదు. నోరు నొక్కేశాడు. తరువాత ఇద్దరూ
వెళ్ళి ఒక రహస్య ప్రదేశంలో కూర్చున్నారు.

“రాజా! రసతరంగిణి సామాన్య గణిక కాదు. నాట్యశాస్త్రంలో అభినయభంగిమ అనే


గ్రంధం వ్రాసింది. ఆమె ఆదాయం మీక్కూడా వుండదు. ఈమె ఎందరో జైనమునులకు
తపస్సు చేసుకోవడానికి గుహలు తొలిపించింది. దానవులపాడు జైనక్షేత్రానికి భూరి విరాళం
ఇచ్చింది. శనిగారంలో జినాలయానికీ రేపాకలోని జినాలయానికీ తోరణ స్ధంభాలు
చెక్కించింది. వసంతవాడ, గుడిమల్లం శివాలయానికి పంచాయతనాలకు సహాయపడింది.
అనాధ స్త్రీలకు దోవతప్పినవారికి ఒక దోవ చూపుతోంది. ఈమె చేసే ధర్మకార్యాలు మీరూ
నేను కూడా చేయం!”

“పడుపు వృత్తిలో ఇంత ఆదాయముందా?”

“ఏమీ మీరుకూడా ప్రారంభిస్తారా?”

“మా కోనసీమలో కొంపలార్పే ఇలాంటి కేంద్రాలు చాలానేవున్నాయి. అన్నట్టు దాని


ఊసే మర్చిపోయా. వెదురుపాక నుంచి మాంచిమల్లెమొగ్గలాంటి పిల్లను తెప్పించా మీకు
బహూకరించడానికి. మేనాలోనే ఉండిపోయింది” అని భీమసలుఖి మహారాజు ఒక చేటికను
పిలిచి మేనాలో పిల్లను తోడ్కొని రమ్మన్నాడు.

“అయ్యా దీక్షితులువారూ! నాకు రెండు చింతలు మిగిలిపోయాయి. ఒకటేమో నాకు


వేంగీ సింహాసనం దక్కడం. రెండోది మాఅమ్మి భీమరధీకుమారిని కర్కవల్లభ రాకుమారు
డికి కట్టబెట్టడం!”

“ రాజా! ఇంకా మావల్లకాదు. ఇప్పటికే మిమ్మల్ని అనేకమార్లు వేంగీసింహాసనం పైన


కూర్చుండపెట్టాం. మా సైన్యాలు ఇటురాగానే వారివెనక పరుగెత్తుకొస్తున్నారు. ఇంత పిరికి
తనంతో రాజ్యమెలా ఏలగలరూ? మీఅంతట మీరు నిలదొక్కుకో లేకపోతే మేమేంచేసేమీ?
అందుకే మీరంటే మా అన్నగారికి కోపం. ఇప్పటికి చాళుక్య సేనలతో డెభ్భయఆరు యుద్ధాలు
52
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

జరిగాయి.”

“ఆ! యుద్ధాలు చేశారు. కాని పాముని కొట్టీ కొట్టనట్లు కొడితే ఛస్తుందా? ఊరికే
తాటాకు చప్పుళ్ళు చేస్తే ఏంలాభం? ఎప్ఫటికైనా ఆ నరేంద్రమృగరాజును చంపకుండ
యుద్ధం ముగుస్తుందా? వాడిని వేసేయండి. అప్పుడు చూడండి నాతఢాకా. అప్పుడు నా పరి
పాలన ఏమిటో చూపిస్తాను!” అన్నాడు భీమసలుఖి.

“మహారాజా! ఇప్పటివరకూ చూస్తునేవున్నాం మీ ప్రతాపం! నరేంద్రమృగరాజును


అంతం చేయడం అంత సులువైనపని కాదు. అతనిచుట్టూ అత్యంత విశ్వాసపాత్రమైన సైన్యం
ఉంది. మరొకయుద్ధానికి ఆజ్ఞాపించడానికి నేనేమీ చక్రవర్తినీ కాను. ఈదేశం శిరః ప్రధానినీ
కాను. వారాజ్ఞాపిస్తే భటుడిలాగా యుద్ధం చేయవలసినవాడిని. మీ అమ్మాయి
పెళ్ళివిషయమంటారా అది మీరూమీరూ చూసుకోవాలి.” అన్నాడు లీశోత్తర దీక్షితుడు.

“బాబ్బాబు కాదనకండి! ఇవి చేతులుకావు కాళ్ళనుకోండి!మీరిలా చేతులు దులిపేసు


కోవడం ఏమీ బాగులేదు!” అన్నాడు భీమసలుఖి మహారాజు.

“మరేంచేయమంటారూ? వేంగిని పడగొట్టడానికి మేము చేయని ప్రయత్నం అంటూ


లేదు.”

“మీరిలాగే చాతకాని మాటలు మాట్లాడుతుండండి! నేనా నరేంద్రమృగరాజును హత్య


చేయించి పారేస్తాను. అందుకు అక్కడ కూష్మాండయోగిని నియమించాను. మహామంత్రి
గంగాతీర్ధుడు నా మనిషి. అక్కడ గండువర్మని ఎక్కాలవారినీ చంద్రభానుడిని నియ
మించాను. చంద్రాదిత్యవర్మ నాపక్షానికి వస్తే ఆ నరేంద్రమృగరాజు పనైపోయినట్లే! మీరు
చేయాల్సిందల్లా ఈ వీరోత్సవాలలో నావలననే కర్కవల్లభుడు జగదేక వీరుడయ్యేటట్లు
చేయాలి.”

“ఇది మరీ వింతగా వుంది! ఈ పోటీలలో ఎవరి శక్తికొద్దీ వారు పతకాలు గెలుస్తారు.”

“అదే సాధ్యమైతే మన తంత్రాలెందుకూ? కర్కవల్లభుడు నావలననే జగదేకవీర


బిరుదం పొందినట్లు ఇంద్ర వల్లభుడు నమ్మాలి! అప్పుడు నామీద కృతజ్ఞతతో ‘మామయ్యా!
ఏం వరం కావాలో కోరుకో’మంటాడు. ‘ఏంలేదు అల్లుడూ మా అమ్మాయిని మీఅబ్బాయికి
చేసుకో’ అంటాను.”

“మహారాజా! కర్కవల్లభుడు తానంతట తాను గెలిచి జగదేకవీరుడు కాలేడంటారా?”

“ఛస్తే కాలేడు! ఆ భల్లాణపోతినాయుడి దెబ్బను ఎవడూ తట్టుకోలేడు. మనవాడు కత్తి


యుద్ధంలో ఓడిపోవడం ఖాయం.”

53
  చాళుక్యసింహాసనం

“మీరింత ఖచ్చితంగా ఎలా చెప్పగలరూ?”

“మాన్యకేతనగరంలో మొదటినుంచీ జూదం బాగా నడుస్తోంది. విద్యాప్రదర్శనలు


మొదలు కాకముందు ఏవిద్యలో ఎవరు బంగారు పతకం గెలుస్తారో పందెం కట్టినవారికి
రెట్టింపు ఇస్తామన్నారు. రెండు విద్యలలో పందెం గెలుస్తే మూడురెట్లు. ఎనిమిది విద్యలలోను
గెలుస్తే పదహారు రెట్లు. ఇలా మొదలైంది జూదం. అప్పుడు భల్లణ పోతినాయుడిమీద ధైర్యం
చేసి పందెం కాసినవాడే లేడు. ఇప్పుడు ఒకటికి ఒకటి పరక!”

“ఒకటి పరక అంటే?”

“వంద సువర్నాలు పందెం కడితే గెలుస్తే నూటపన్నెండున్నర సువర్నాలు. అదే కర్క


వల్లభుడికి ఒకటికి ఒకటిన్నర! జగదేకవిరుడు ఎవరవుతారని పందెం అయితే పోతి
నాయుడికి ఒకటికి ఒకటి పరక. కర్కవల్లభునికి రెట్టింపు. అంటే కర్కవల్లభుడు జగదేక
వీరుడు కాలేడని అందరూ నిశ్ఛయానికి వచ్చారు.”

“అసలు ఈ జూదం ఎవరు నడుపుతున్నారూ?”

“ఎవరేమిటీ! భగవద్గీతలో భగవానుడే ధ్యూతం ఛలయితామస్మి అన్నాడు. ఈ


నగరంలో పందెం కాయనివాడెవడూ? దీనిమీద వ్యాపారం చేస్తున్నవారిలో వప్పయశ్రేష్ఠి
అందరి కన్నా పెద్ద. మరకత శ్రేష్ఠి కూడా ముఖ్యుడు. ఈ రసతరంగిణి కోటీరంలోనే అందరూ
సమావేశమై పందాలు కాస్తున్నారు.”

“మీకు ఈ వివరాలన్నీ ఎలా తెలుసు?”

“నేను మొదటినుంచి ఈ జూదం ఆడుతునే వున్నా! ఎంతలేదన్నా ఇప్పటికి ఏభయివేల


సువర్నాలు పందెం కాశాను. కర్కవల్లభుడు జగదేకవీరుడు కాలేకపోతే నా నెత్తిన చెంగేసుకుని
పోవాల్సిందే!”

“మరి మనమేం చేద్దామంటారూ? కర్కవల్లభుని జగదేకవీరుని చేసితీరాలి! మా రాష్ట్ర


కూట శౌర్యాన్ని ఇనుమడింప చేయాలి!”

“ఏం చేద్దామంటే పోటీల్లో మోసంచేద్దాం! అదీ నావలననే జరిగినట్లు అందువలననే


కర్క రాజు గెలిచినట్లు ఉండాలి. అప్పుడు పెళ్ళికుదురుతుంది మా అమ్మాయికి!”

“రాజా! ఈ వీరోత్సవాలలో మోసం చేయడం అంత చిన్న పనికాదు. తెలిసిందంటే మా


అన్నయ్య రేవాదాసదీక్షితుడే మనని క్షమించడు.”
“మీకు మీ అన్నయ్యంటే ఛచ్చేభయం! ఇంకా నాకేం సహాయం చేస్తారు? మీదేశంలో

54
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

నేనో కుక్కబతుకు బతుకుతున్నాను. మీరు చాతకాదంటే చెప్పండి. ఏ నూతిలోనోపడి


ఛస్తాను!”
“మహారాజా! మీరు పట్టేడంత నూతులు మా దేశంలో లేవు!మధ్యలో ఇరుక్కుపోతారు”
పరిహాసంగా అన్నాడు లీశోత్తర దీక్షితుడు.
“మీకంతా ఎగతాళిగానే ఉంటుంది. నాసరిపడ నూయి నేను తవ్వించుకోలేనా?”
“ఇంతకూ మోసం ఎలా చేద్దామంటారు?”
“ఆ భల్లాణ పోతినాయుడు విలువిద్యలో గెలుస్తాడు. కత్తియుద్ధంలో గెలుస్తాడు. మరి
మల్లయుద్ధంలో కడారా గెలిచినా భల్లాణుడు రెండవస్ధానంలో నిలుస్తాడు. మన
రాజకుమారుడు శూలయుద్ధంలో గెలుస్తాడు. కత్తియుద్ధంలో రెండవస్ధానంలో వుంటాడు.
కానండయ్యా. మనమొక ఎన్నిక పెట్టాలి! ఎన్నుకునేవాళ్ళందరూ మనవాళ్ళై ఉండాలి”
“జగదేకవీర పదవికి ఎన్నికేమిటీ?”
“అదేవుంది మాయ! మనదేశం మన ఇష్ఠం!”
“మహారాజా! ఎన్నిక పెడితే చెల్లుతుందంటారా? వీరులందరూ హర్షిస్తారా?”
“ఆయ్! ఈ వీరవిద్యాప్రదర్శనలు ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి?”
“నా ఆధ్వర్యంలోనే!”
“ఇంకేం! మీదేశం మీఇష్టం!”
“చక్రవర్తుల సంరక్షకులైన ఇంద్రవల్లభుల సమక్షంలో మనయిష్టం వచ్చినట్లు
చేయడానికి కుదరదు.”
“ఆయనకు మాత్రం పుత్రప్రేమ ఉండదా! ఆయన కొడుకును జగదేకవీరుడిని చేస్తుంటే
సంబర పడిపోడా?”
“మా అన్నయ్య రేవాదాసదీక్షితుడు మాత్రం అన్యాయాన్ని సహించడు. మనకు వాతలు
పెట్టిస్తాడు.”
“ఆయనను అసలు వేదికమీదికే ఆహ్వానించవద్దు. ఈ ఉత్సవాల అద్యక్షుడు మీరయి
నపుడు ఆయన ప్రమేయం ఏముంటుందీ?”
“మహారాజా ఆలోచిస్తాను.”
“ఆలోచిస్తానని నీళ్ళునములుతే కాదు. మోసం చేసితీరాలి. ఈ దెబ్బతో నాకూతురు
పెళ్ళి కావాలి!”
“ఇప్పటికి నిష్క్రమిద్దాం పదండి” అన్నాడు దీక్షితుడు.

55
  చాళుక్యసింహాసనం

12 రణరంగం.
తూరుపు దిక్కున ప్రొద్దుతిరుగుడు పూవులా సూర్యుడు ఉదయించాడు. వీరోత్సవాలలో
అది బహుమతి ప్రధానోత్సవ శుభదినం.సందర్శకులకోసం రాష్ట్రకూటులు గొప్ప ప్రాంగణం
ఏర్పాటు చేశారు. రాష్ట్రకూట సామ్రాజ్య వైభవాన్ని చాటేడట్లు ఘనంగా అలంకరించారు.
పౌరులు పామరజనులు తండోపతండాలుగా ముందరేవచ్చి అంచలంచలుగా నిర్మించిన
మంచెలపైన కూర్చున్నారు. విదేశీ వ్యాపారులకు రాయబారులకు ఒక వంక ఉచితా సనాలు
ఏర్పాటు చేశారు.నగర ప్రముఖులంతా మరొకవంక కూర్చున్నారు. రాజకుమారి శిరీష ఆమె
సఖియలు మిత్రురాలు వసుమిత్ర చాళుక్య భీమసలుఖి మహారాజు కుమార్తె భీమరధీ
మొదలైన కొమదలకు ప్రత్యేక ఉటజం ఏర్పాటు చేయబడింది. వీరపురుషల పైకి విసరడానికి
ఆడపిల్లలు విరిమాలలు పూబంతులు బుట్టలతో తెచ్చుకున్నారు. వసుమిత్ర తీపితీపి
మోదకాలు మిఠాయిలు గంపలకొద్దీ తెప్పించి పెట్టుకుంది, తను మెచ్చిన వీరుడు గెలుస్తే
అందరికీ పంచిపెట్టడానికి. పురంధ్రీ మణులకు అంతఃపుర వనితలు వేరే పందిరి క్రింద
కూర్చున్నారు.

విద్యా ప్రదర్శనలలో పాల్గొన్నవీరపుంగవులకు ఒక వంక వారివారి వాహనాలతో


ఆయుధాలతో వేచివుండడానికి ఏర్పాట్లు చేశారు. అంతవరకూ ఏవిద్యలో ఎవరు స్వర్ణ రజత
ఫలకాలు అందుకో బోతున్నారో ఇంకా ప్రకటించలేదు. చాలా రహస్యంగా వుంచారు.
జగదేకవీర బిరుదం ఎవరిని వరించబోతోందో ఇంకా గోప్యంగా ఉంచారు. ఈ విషయం పై
వందలు వేలు సువర్ణాలు పందెం కాసినవారిలో ఉత్ఘంఠ మరీ ఎక్కువగా వుంది.

మొత్తం వేదికలన్నీ కలిపి చక్రాకారంగా నిర్మించబడ్డాయి. అందరూ ఉత్సవం ఎప్పుడు


ఆరంభమవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

అంతలో పెద్ద భేరి మోగించబడింది. అందరూ మాటలు కట్టిపెట్టి నిశ్శబ్దంగా లేచి నిల
బడ్డారు. శంఖాలు పూరిస్తూ బాలచక్రవర్తి అమోఘవర్షరాజేంద్రుని ఆగమనం సూచింప
బడింది. చక్రవర్తి అంగరక్షకులు ఒక్కసారి పరిసరాలను సింహావలోకనం చేశారు. మంగళ
తూర్యారవాలు మ్రోగుతుండగాభట్రాజులు వందిమాగధులు రాష్ట్రకూట వైభవాన్ని చాటుతూ
బరాబరులు చేస్తుండగా బాలచక్రవర్తి సింహకిశోరంలా వేదికపైకి వచ్చాడు. అతడి వెనకనే
ఇంద్రవల్లభుడు వున్నాడు. జనులందరూ చక్రవర్తికి జయజయధ్వానాలు చేశారు. చక్రవర్తి
సింహతలాటాలు చెక్కిన బంగారు సింహాసనం పైన ఆసీనుడయ్యాడు. అందరినీ
కూర్చోమన్నట్లు చేయివూపి సంజ్ఞచేశాడు. చక్రవర్తి ప్రక్కనే ఇంద్రవల్లభుడు ఆసీనుడ య్యాడు.

సభకు ఆరంభం అన్నట్లు చతుర్వేద పండితులు వచ్చి వేదాశీర్వచనం చేశారు. చక్రవర్తి


చేయి వూపడంతో నాటి వీరోత్సవాలు ఆరంభమయ్యాయి.

ఆ మైదానంలోకి నవజవ్వన నవలామణులు నేపథ్యం నుంచి బిలబిలా వచ్చేశారు.


56
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ఎడారి లాంటి మైదానంలో ఒక్కసారి విరిబోణులు విరిసినట్లయింది. వారు ఒకరిద్దరు కాదు.


ఏకంగా రెండువందల చందమామలు. రసతరంగిణి ఏర్పాటు చేసిన దేశీ విదేశీ ఖండాంత
రపు సుందరీమణులు. వీక్షకులందరికి వారి శరీర సౌందర్య సౌరభం అందాలనే వుద్దేశ్యంతో
కొందరు కొందరు ఆహూతులలోకి నడిచి వెళ్ళారు. ఎవరికి వారు దేవదానవులకు సుధ
పంచవచ్చిన నవమోహినీ మణిలాగే సౌందర్యామృతం ఒలకపోస్తున్నారు.

అందులో పెక్కు మంది చక్రవర్తి వేదిక వద్దకు చేరారు.కొందరు రంగస్ధలంపైకి


వచ్చారు. వారి అంగసౌష్టవం ఇనుమడించేటట్లు వలువలు అంగరాగాలు ఆభరణాలు
ధరించారు. ఆ ప్రదేశమంతా అతివల ముఖసరోజాలతో వికసించిన కమలాకరంగా
మారిపోయింది. తారా మండలం అంతా భూమిపైకి దిగివచ్చినట్లు అతివల అందంతో
జిగిజిగేల్ మంటోంది. నవలామణులు ఎక్కడున్న వారక్కడే చక్రవర్తిని కీర్తిస్తూ నాట్యం
చేయసాగారు. వసంతరాగంతో ఆరంభించి రాగమాలిక లల్లసాగారు.
జయహో జయహో అమోఘవర్ష
జయహో జయహో అమోఘవర్ష
రాష్టకూట సాంమ్రాజ్య సురేశా
జయహో జయహో అమోఘవర్షా
అమృత రసధారావర్షా అమోఘవర్షా
ధరణీ తరుణీ తవదాసీమణి
సామంతము సురనర గో భూసురబృందము
జయహో జయహో అమోఘవర్ష
రాష్టకూట సాంమ్రాజ్య సురేశా
గైకొనుమిదె హారతీ గైకొనుమిదె హారతీ
రతిరాజ రమణీమణి హారతి
ఘన జఘన మణుల కుచకుంభ హారతీ
అజస్రం ముకుళిత కరకమల సహస్రం
నితంబిని సముదయం తవ పదాంభోజ సేవన వ్రతం
వీర ధీర ధీమంత సైన్య సమూహ పరివృతం
ఇంద్ర రాజేంద్ర రాజ్యాంగ తంత్ర వైభవం
పాదాక్రాంతం సమస్త వైరిజన ప్రియ వనితా వితానం

57
  చాళుక్యసింహాసనం

స్వాగత మిదిగో అమోఘవర్ష ప్రజల పాలిటి అమృతవర్షా


స్వాగతం ఘన స్వాగతం ముఖసరోజ మణుల స్వాగతం సుస్వాగతం.

ఆ కొమదల నాట్యం కన్నా వారి అందమే గొప్ప కనువిందుగావిస్తోంది. వారి వారి


శిరోజా లంకారములు వేరు. ముఖసౌందర్యము వేరు. వస్త్రాలంకరణము వేరు. సొగసులు
వేరు కొప్పులువేరు కుచోన్నతి వేరు. కమలాక్షులు కలువ కన్నులు మీననయనలు మదిరేక్షణలు
మచ్చకంటులు. వారందరూ ఒక్క దండగా నిలబడితే వదన సరోజాల మందార మాలలా
వుంది. చిగురుటధరాల బారు మావిచిగురు తోరణంలా ఉంది. ఉవిదల చనుయుగళి
లావణ్యం దానిమ్మ కొమ్మ జంటఫలసముదాయంలా వుంది. మహాసేనాధిపతి లీశోత్తర
దీక్షితుని కోరికపై అంతమంది రూపవతులను సమీకరించిన రసతరంగిణి
అభినందనీయురాలు.

అక్కడ మరొక వేదికపైన వీరకుమారులకు పోటీలు నిర్వహించిన పరీక్షాధికారులు


ఆచార్యులు కూర్చున్నారు. వారితోనే మహాసైన్యాద్యక్షుడు లీశోత్తరదీక్షితుడు కూడ
కూర్చున్నాడు. రాష్ట్రకూటుల శిరః ప్రధాని రేవాదాసదీక్షితునికి అక్కడ ప్రత్యేకమైన ఆసనం
లేకపోవడంతో ఆయన తమ్ముడిని తిట్టుకుంటూ వేదికదిగివెళ్ళి పురప్రముఖులకేర్పరచిన
పందిరిలో అందరితోపాటు కూర్చున్నాడు. నిజానికి లీశోత్తరదీక్షితుడు తన అన్నగారికి
ఆహ్వానం పంపలేదు. ఆయన ఆ సభకు రాకుండా వుండాలనే ఆహ్వానం పంపలేదు. అన్నీ
తెలిసిన ఇంద్రవల్లభుడు కూడా శిరః ప్రధానీ మహాసైన్యాద్యక్షుడూ ఏకం కావడం రాజ్యానికి
మంచిదికాదని చూసీ చూడనట్లు ఊరకున్నాడు. చాళుక్య భీమసలుఖి మహారాజు రేవా దాస
దీక్షితుని ప్రక్కనే ఆసీను డయ్యాడు.

స్వాగత నృత్యగానాలు ముగియగానే బాలచక్రవర్తి అమోఘవర్షుడు బహుమతి ప్రదానో


త్సవాన్ని ఆరంభించడానికి అనుజ్ఞనిచ్చాడు.

ఆ బహుమతి ప్రదానోత్సవానికి చంగనార్యుడు సంధానకర్త, వ్యాఖ్యాత. ఆయన శ్రావ్య


కంఠం రెండు ఆమడల దూరంవరకు వినిపిస్తుంది. ఆయన ఎత్తైన మంచెపైన నిలబడి
పతకాలు సాధించిన వీరకుమారులను ఒకరొకరుగా ఆహ్వానిస్తున్నాడు. వారి పేరు దేశం
విద్యలు సాధించిన పతకాలు ప్రకటిస్తున్నాడు.

ముందుగా శూలయుద్ధం ప్రకటించబడింది. ప్రధమస్ధానంలో నిలిచిన కర్కవల్లభ


రాకుమారుని పేరు ప్రకటించబడగానే కరతాళధ్వనులు మిన్నుముట్టాయి.

ఇరువురు వంగదేశం సుందరాంగనలు కర్కవల్లభుని చెంతకు ఆహ్వానించడానికి


వెళ్ళారు. ఆ వీరవరుడు శూలపాణియై జవనాశ్వం అధిరోహించి వుండగా నిండు జవ్వనులు
ఇరువంకల అశ్వం కళ్ళాలు పుచ్చుకుని వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. ఉవిదల కరస్పర్శతో
రాకుమారుడి వడలు పులకరించినా ఆ స్పందన పైకి కనిపించనీయ లేదు.
58
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ఆతడిని సన్మానించడానికి సింహేంద్రమధ్యమలు జేరి ఆతడి వడలికి చందనం


అలదుతూ కన్నులలో కన్నులుంచి కొంటెగాచూశారు. ఆచూపులు చీకటి పడనీయి
రాకుమారా మిమ్ము మేమెలా ఓడిస్తామో మదనాస్త్ర పాటవంతో అన్నట్లున్నాయి. వారిజ
నయనలు అతడిపై పన్నీరు చిలకరించారు. ఒక మదవతి అతడికి మృగమద తిలకం దిద్దింది.
మీకు నేనే జోడి అన్నట్లు మెడలో పూలమాలవేసి వరించింది.

చక్రవర్తి అమోఘవర్షరాజేంద్రుడు కర్కవల్లభుని సువర్ణ పతకంతో సత్కరించాడు.

వీరపూజలందుకున్న కర్కవల్లభ రాకుమారుడు తన జవనాశ్వంపై ప్రాంగణం అంతా


పరిక్రమ చేశాడు. ఉవిదల శాల వద్దకు రాగానే వసుమిత్రా భీమరధీకుమారీ పోటీపడి
రాకుమారుడి పైకి ప్రేమతో పూలచెండ్లు కర్పూరపు ఉండలు విసిరారు. అతనిపై తమకున్న
ఆసక్తిని తెలియజేస్తూ గొప్పగా జయజయధ్వానాలు చేశారు.

తరువాత మల్లయుద్ధం ఫలితాలు ప్రకటించబడ్ఢాయి. హేమవతీనగరం నుంచి వచ్చిన


సింగపోతరాజు సువర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇరువురు పాండ్యదేశ మదగజ గమనలు
అతడి జబ్బలు పట్టి చక్రవర్తి వేదిక వద్దకు తోడ్కొనివెళ్ళారు. ఆ జగజ్జట్టిని చక్రవర్తి తగువిధంగా
సత్కరించాడు. ఒక మోహనాంగి అతడి మెడలో సుగంధాలు చిమ్మే వరమాల వేసింది. అతడు
పరిక్రమ చేస్తుంటే ప్రజలు జయజయధ్వానాలు చేశారు.

తరువాత ధనుర్యుద్థం ప్రకటించబడింది.అందులో ప్రధమస్ధానంలో నిలిచినవాడు


విక్రమ సింహపురం నుంచి వచ్చిన భల్లాణ పోతినాయుడు. అతడి పేరే చాలా భయంకరంగా
వుండడంతో అతడింకెంత భయంకరంగా ఉంటాడో ననుకున్నారు కొమదలు. పెద్దపెద్ద బుఱ్ఱ
మీసాలతో బాన బొజ్జతో నల్లటి మినుములరాశిలాగా వుంటాడనుకున్నారు.

కానీ అతడలా లేడు. నూనూగు మీసాలతో పరచిన అరటిమొవ్వ ఛాయతో నిడుద


కన్నులతో ఎగుభుజములతో నిండైన విగ్రహంతో నిండు పున్నమి చందురుని పోలికతో
విస్తరించిన వక్షస్సుతో మృగేంద్ర మధ్యముతో లోతైన పొక్కిలితో ధనువుపై రెండు గుప్పెడల
నిడివితో ఉన్నాడు.

వీరకుమారులందరిలోకి అతడే అత్యంత సుందరుడు. అతడిని చూడగానే నీరజాక్షులకు


చంద్రదర్శనంలా మదనతాపం చెలరేగింది.ఆనంద మంద మలయానిలాన్ని గుండెలనిండా
నింపుకోడానికా అన్నట్లు భుజములు పైకెత్తగా వక్షస్సులు పాలపొంగులా పైకి లేచాయి.

అతడు అధిరోహించి వచ్చిన రథమే ప్రత్యేకంగావుంది. దానిచక్రాలు బలిష్టంగాను


ఎద్దుల బండి చక్రాలకన్నారెట్టింపు పరిమాణంలో ఉన్నాయి. దానికి నాలుగు మదించిన
అరబ్బీ గుఱ్ఱాలు పూన్చబడి వున్నాయి. రథంపైన శతావరి అనే సారధితోపాటు ఇరువురు చక్ర
రక్షకులు వెనకాల ఆయుధాలు సజ్జీకరించే మరొక నిపుణుడు ఉన్నారు.

59
  చాళుక్యసింహాసనం

కొంకణపు కొమదలు ఆవీరుడిని సాదరంగా ఆహ్వానించడానికి వెళ్ళి తాముకూడ


రథాన్న ధిరోహించి తమితో ఆతడికి ఇరువంకలా వరుసుకుంటూ నిలబడి వేదిక వద్దకు
తీసుకుని వచ్చారు.

కుసుమాస్త్రలు చందన చర్చకోసం ఆతడి మేను తాకుతూ చందన భంజికల్లా నిలబడి


పోయారు. మళ్ళీ తెలివి తెచ్చుకుని వశలై అతడి మేనుకు శ్రీచందనం అలదారు. ఒక వనజాక్షి
ఆతడి మెడలో వరమాల వేయపోతూ వివశయై నిలబడిపోయింది. కామంతో ఎఱ్ఱ వారిన
కన్నులతో ఆతడికేసి కోరచూపు చూసింది. అంతలోనే స్పృహ తెచ్చుకుని తన చనుగవతో
ఆతడి వక్షస్ధలాన్ని ఢీకొంది. అంతటితో ఆమె పగ చల్లారలేదు. మాపటికిచూడు నిన్నెలా
లొంగదీసు కుంటానో అన్నట్లు పెదవులు బిగించి మెడలో వరమాల వేసింది.

చక్రవర్తి ఆ వీరుడిని సాదరంగా సువర్ణ పతకాలంకృతుడిని చేశాడు.

ఆతడు మైదానం చుట్టూ పరిక్రమ చేస్తుంటే జనులు పెద్దపెట్టున జయజయధ్వానాలు


చేశారు. అతడు లేమల పటశాల వద్దకు వచ్చేటప్పటికి అప్రయత్నంగా శిరీష జయజయ
ధ్వానాలు చేసింది. చెలికత్తెలందించిన పూబంతులు అతనిపైకి రువ్వింది. అంతలోనే తన
అసంకల్పిత చర్యకు సిగ్గిలి అరచేతులలో ముఖం దాచుకుంది.‘భల్లాణపోతినాయుడు! ఇంత
సుందరుడికి ఎంత భయంకరమైనపేరూ!’ అనుకుంది.

ఆ తరువాత ముద్గర యుద్ధంలో త్రిగ్లస్టన్ ప్రధమపతాక సాధించాడు. అతడు


బ్రహ్మీదేశం లోని పెగూనదీతీరంలోని కళింగపట్టణం నుంచి వచ్చాడు.బ్రహ్మీదేశం
పూర్వాంభోనిధికి ఆవలి తీరంలో వుంది. ఇరువురు ఘూర్జరీ సుందరీమణులు అతడిని వేదిక
వద్దకు తోడ్కొని వచ్చారు. అపర రాధికలా వున్నవారు మేనిముసుగు సందులోంచే అతడికి
కన్ను కొట్టారు.

తరువాత గదాయుద్ధం ప్రకటించబడింది. ఉజ్జయినీ నగరంనుంచి వచ్చిన చస్తానుడు


ప్రధమ శ్రేణిలో చేరాడు. అతడొక విరిగిపడిన పర్వత శిఖరంలా బలిష్టంగా ఉన్నాడు. మద్ర
దేశం కొమదలు అతడి పాణిగ్రహణం చేసి వేదిక వద్దకు తీసుకు వచ్చారు.

తోమర యుద్ధంలో యవద్వీపంలోని బరోబదూరు నుంచి వచ్చిన ఆదిత్యధర్ముడు


బంగారు పతకం సాధించాడు. అవంతీదేశం రూపవతులు అతడిని చక్రవర్తి వద్దకు తీసుకు
వచ్చారు.

దండ యుద్ధంలో తూర్పుసముద్రములోని మవపిచింగ్ ద్వీపము నుండి వచ్చిన శివ


చరణుడు పసిడిపతకం సాధించాడు. ఛేదిదేశం చకోరాక్షులు అతడిని తొడ్కొనివచ్చి వరమాల
వేశారు.

60
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

తరువాత ఖడ్గయుద్ధవిశారదుడు రంగస్ధలం పైకి వచ్చాడు. అతడెవరోకాదు. భయంకర


నామధేయుడు భల్లాణ పోతినాయుడు. అతడిపేరు ప్రకటించగానే శిరీష తలమోదుకుంది
అతడి పెరులోని కర్కశత్వానికి. ఆ పోటీలలో రెండు బంగారు పతకాలు సాధించినవాడు
అతడొక్కడే. ఈ మారు కూడా కొంకణదేశం కన్యలు అతడి రథావరోహణం చేసి వేదిక వద్దకు
తోడ్కొని వచ్చారు. అతడి మెడలో మరొక మానిని వరమాల వేసింది.

అతడు రెండవసారి రంగస్ధలం చుట్టూ పరిక్రమ చేస్తుంటే అతివలు అతనిపై పూల


గుత్తులు గుమ్మరించారు. అప్పటికే పూలబంతులు నిండుకోవడంతో శిరీష అతడిపైకి
మోదకాలు రువ్వింది.

అక్కడికి సువర్ణ పతక ప్రదానం అయిపోయింది. ద్వితీయ స్ధానంలో నిలబడినవారికి


రత్నాలు పొదిగిన వెండి పతకాలు ప్రకటించారు. రూపవతులు వారిని కూడా ఆకర్షించి
తీసుకువచ్చి పుష్పమాలాలంకృతుల్ని చేశారు.అమోఘవర్ష చక్రవర్తి శూల మల్ల ధనుర్
ముద్గర గదా తోమర దండ ఖడ్గ విద్యలలో ద్వితీయస్ధానంలో నిలిచినవారందరికీ రజత
పతకాలు బహూకరించాడు.

ఆ రణవిద్యాప్రదర్శనలలో కర్కవల్లభుడు ఒక సువర్ణపతకం ఒక రజతపతకం


సాధించగా భల్లాణపోతినాయుడు రెండు సువర్ణ పతకాలు దండ యుద్ధంలో రజతపతకం
సాధించాడు.

అప్పుడు చంగనార్యుడు జగదేకవీర బిరుదం ప్రకటించవలసిన సమయం ఆసన్న


మయింది. అందరూ రెండు బంగారు పతకాలు సాధించినవాడే జగదేకవీరుడనుకున్నారు.
కానీ అలా జరగలేదు.

చంగనార్యుడు సాలోచనగా లీశోత్తరదీక్షితుడివైపు చూశాడు. అప్పటికే భీమసలుఖి


మహారాజు లీశోత్తరదీక్షితుడి రెండుచేతులూ పట్టుకుని ప్రాధేయపడుతూ కనిపించాడు.
ఎలాగైనా కర్కవల్లభ రాకుమారుడిని జగదేకవీరుడిని చేయాలి. అందుకు ఏదైనా మాయో
పాయం పన్నాలి.

లీశోత్తరదీక్షితుడు తను కూర్చున్న చోటినుంచి లేచి చంగనార్యుడు నిలబడిన మంచె


వద్దకు చేరాడు. ఒక చూపు స్త్రీల శాలవైపు చూశాడు. అటువైపు నుంచీ వచ్చిన కమల హితాదేవి
కనుచూపు తగులుకుంది. లీశోత్తరదీక్షితుడు చిరు మందహాసం చేసి ఇలా ప్రసం గించ
సాగాడు.

“రాష్టకూట సామ్రాట్టులకు పాదాభివందనం.

మహాజనులారా! నేడు ఈ వీరోత్సవాలలో ఒక నూతన శకం ఆరంభించ బోతున్నాం.

61
  చాళుక్యసింహాసనం

ఇక్కడ యుద్ధవిద్యలలో ఎందరో రాజకుమారులు వీరపురుషులు పాల్గొన్నారు. ఆనేక దేశాల


నుండి ఖండఖండాంతరాలనుండి వీరులూ వారితోపాటు సందర్శకులు కూడ వచ్చారు.
రాష్ట్రకూట చక్రవర్తుల కీర్తిపరిమళం కూడా అలాగే భువి నవఖండాలకు విస్తరించ బోతోంది.
ఈ వీరోత్సవాలలో ఎంతోమంది కన్యామణులకు ఈ వీరులతోపెళ్ళి సంబంధాలు కుదిరాయి.
ఇంతటి శుభసమయంలో మనంకూడ ఒక నూతన శకం ఆరంభిస్తే బాగుం టుంది. ఇప్పుడు
జగదేకవీరుని పతకాల సంఖ్యతో కాకుండా గుణశీల శౌర్య సంపద ఆధారంగా ఎన్నుకుందాం.
ఎంచుకుందాం.

ఈనాటి తిధి పున్నమి. వీరోత్సవాలలో పతకాలు సాధించిన వీరవరులకు ఈ


సాయంత్రం గొప్ప విందు ఏర్పాటు చేయబడింది. అంతేకాదు, పతకాలతో నిమిత్తం లేకుండా
ఉత్స వాలలో పాల్గొన్న వీరులందరికీ రసతరంగిణి ఉద్యానవనంలో కన్యావీక్షణం
జరగబోతోంది. ఉడురాజబింబ వదనలు పున్నమి పండగ చేయబోతున్నారు.
వీరశిఖామణులకు ఈ నిశీధి మదనవన వీరవిహారమే!

మహాజనులారా! ఇచటకు వేలాదిమంది లక్షలాదిమంది సందర్శకులు విచ్చేశారు.


అందు చేత అందరూ కలిసి ఎన్నుకోవడంకుదిరేపని కాదు. అందుచేత ఒక్కొక్క వర్గంలోంచి
ఒకరిని ప్రతినిధిగా ఎంచుకుందాం. ఇలా ఐదుగురు సభ్యులతో ఒక పంచాయితీ ఏర్పాటు
చేద్దాం. వారే జగదేకవీరుని నిర్ణయిస్తారు. వీరులలో అపోహలు కలుగకుండ ఉండడం కోసం
నేనీ ఎన్నికకు దూరంగావుంటాను. చంగనార్యుడే ఎన్నిక బాధ్యత నిర్వహిస్తారు” అని సభకు
నమస్కరించి కమలహితాదేవి వైపు ఒక చూపు విసరి తన స్థానంలో తాను కూర్చున్నాడు
లీశోత్తరదీక్షితుడు.

ముందుగా రచించిన పథకం ప్రకారం చంగనార్యుని కనుసైగగొని ఒక జవ్వని


మైదానం చుట్టూ తిరుగుతూ పౌరులలోనుంచి ఒక అనామకుని ఎంచుకుని వేదిక వద్దకు
తోడ్కొని వచ్చింది.

“ఈ మాటు పురప్రముఖులనుండి ఒకరిని ఎంచుకుందాం” అన్నాడు చంగనార్యుడు.


అనగానే మరొక కమలేక్షణ వెళ్ళి ఆహూతులలో వప్పయ్యశ్రేష్ఠిని ఎంచుకుని వేదికపైకి
తోడ్కొని వచ్చింది.

“ఇప్పుడు ప్రమదలలోనుండి ఒక యువతిని ఎంచుకందాం.”అన్నాడు చంగనార్యుడు.

మరోక కోమలి శిరీష కూర్చున్న ఉటజంలోకి ప్రవేశించింది. నేనంటే నేనని వసుమిత్ర


భీమరధి తమ ముఖాలను ముందుకు సాగదీశారు. వచ్చిన కోమలి భీమరధీ కుమారిని
ఎంచుకుని చెంగనార్యుడి వద్దకు తీసుకు వెళ్ళింది.
“జనులారా! ఇప్పుడు విదేశీ రాయబారుల నుంచి ఒకరిని ఆహ్వానిద్దాం.”అన్నాడు
చంగనార్యుడు.
62
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ఒక వరవర్ణిని వెళ్ళి మగథ సామాజ్యపు రాయబారి సర్వజ్ఞనారాయణుని వేదికపైకి


ఆహ్వానించింది.
“మాన్యకేత పురజనులారా! ఇప్పుడు వీరోత్సవాలలో పరీక్షాధికారులలోనుంచి ఒకరిని
ఎంచుకందాం.”అన్నాడు చంగనార్యుడు.
ఒక నితంబిని నడిచివెళ్ళి పరీక్షకాధికారులలోంచి గండయసాహిణిని ఎంచుకుని
వచ్చింది.

“వీరోత్సవాలకు విచ్చేసిన మహామహులారా! ఇప్పుడు ఐదుగురు సభ్యుల పంచాయతి


ఆవిష్కారమయింది. వీరు జగదేకవీరుని ఎన్నుకుంటారు” అన్నాడు చంగనార్యుడు.

లీశోత్తరదీక్షితుని ఆదేశం మేరకు చంగనార్యుడు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాడు.

“ప్రముఖులారా!ఇప్పుడీ వీరోత్సవాలలో నూతనాధ్యాయం ఆరంభమయింది. ఈ


ముఖ పంచకం తమ అభీష్టం ద్వారా జగదేకవీరుని ఎంచుకో బోతున్నారు. ఇక్కడ
శూలయుద్ధము మల్లయుద్ధము ధనుర్యుద్ధము ముద్గర యుద్ధము గదాయుద్ధము తోమర
యుద్ధము దండ యుద్ధము ఖడ్గయుద్ధము అనే ఎనిమిది రణవిద్యలలో పోటి నిర్వహించాం.
విజేతలకు బంగారు పతకాలు బహూకరించబడ్డాయి. అందులో శూలవిద్యా విశారదుడు
రాష్ట్రకూటుల రాకుమారుడు కర్కవల్లభుడు. మల్లయుద్ధవిశారదుడు సింగ పోతరాజు. ఇతడు
మహిష్మతీ నగరంనుంచి వచ్చిన రాచబిడ్డ. ధనుర్యుద్ధంలో భల్లాణ పోతినాయుడు
విక్రమసింహపురం నుంచి వచ్చాడు. ముద్గరయుద్ధ విజేత త్రిగ్లష్టన్. ఇతడు పూర్వాంభోనిధికి
ఆవలి తీరం పెగూనదీ తీరంలోవున్న కళింగపట్టణం నుంచి వచ్చాడు. ఇతడు
ఖండాతరవాసియైనా భారత సంతతివాడు. గదాయుద్ధవిశారదుడు ఛస్తాణుడు మాళవదేశం
ఉజ్జయిని నుంచి వచ్చిన వీరుడు. తోమరయుద్ధంలో ఆదిత్యధర్ముడు విజేత. ఇతడు
యవద్వీపంలోని బరోబదూరు నుంచీ వచ్చిన వీరుడు. దండయుద్ధంలో శివ చరణుడు
తూర్పు సముద్రంలోని మవపచింగ్ ద్వీపం నుంచి వచ్చాడు. ఇక ఖడ్గయుద్ధం లో
ఇంతకుముందు చెప్పినట్లు భల్లాణపోతినాయుడు గెలిచాడు .

పౌరులారా! జగదేకవీరుడంటే ఎక్కువ పతకాలు గెలిచినవాడనికాదు. ఈ ఏడుగురు


వీరులలోకెల్లా ఎవరు శ్రేష్ఠుడో అలాంటి వారిని జగదేకవీరునిగా వీరు నిర్ణయిస్తారు.

ముందుగా మాన్యకేత నగర పౌరుడిని అడుగుదాం తానెంచుకునే వీరాధివీరుడెవరో!”


అన్నాడు చంగనార్యుడు.

ఆమాట అనగానే ఆ పౌరుడు గొంతువిప్పి “నిస్సందేహంగా రెండు బంగారు పతకాలు


సాధించిన భల్లణపోతినాయుడే జగదేకవీరుడు” అనేసి తన ఆసనం పైన కూర్చున్నాడు.

63
  చాళుక్యసింహాసనం

తరువాత చంగనార్యుడు వప్పయ్యశ్రేష్ఠినడిగాడు.

“అయ్యలారా!ప్రభువులకు నామీదున్న ఆదరం వలననే నన్నీ వేదికమీదికి ఆహ్వానిం


చారు. అందుకు వారికి శతకోటి వందనాలు. నిజానికి నాకు బేరం తప్పుతే సమరం తెలి
యదు. జగదేకవీరుడిని నన్ను ఎన్నుకోమనడం గుడ్డివాడిని కోమలిని ఎంచుకోమనడం లాగా
వుంది! ఐనా ప్రభువులకు నాపైనున్న అభిమానానికి కృతజ్ఞతగా కర్కరాజ కుమా రుడినే
ఎంచుకుంటా” అన్నాడు.

తరువాత చంగనార్యుడు భీమరధీకుమారినడిగాడు.

ఆ బాల ఒక క్షణం కూడ ఆలస్యం చేయకుండ “కర్కవల్లభ రాకుమారుడే నాప్రియుడు.


నవమన్మధుడు. అతగాడిని తప్పుతే నేనెవరినీ ఎంచుకోను” అనేసి కూర్చుంది.

అప్పుడు చంగనార్యుడు సర్వజ్ఞ నారాయణునివైపు తిరిగి “మీరెవరిని


ఎంచుకుంటారు?” అన్నాడు.

అందుకా రాయబారి “ఆర్యులారా! అసలు జగదేకవీరుని ఎన్నుకోవడమేమిటీ?


ఇదెక్కడి విడ్డూరమో నాకర్ధం కావటం లేదు. ఆ పదవిని ఎవరైనా గెలుచుకుంటారు. ఇంత
అవక తవక సంప్రదాయాన్ని నేనేదేశంలోను చూడలేదు. నేనెవరినీ ఎంచుకోవడానికి?
ఇదేమైనా భామల అందాల పోటీనా, పెళ్ళిచూపులా, స్వయంవరమా? ఇలాంటి దుష్ట
సంప్రదాయం లో నేను పాలు పంచుకోను” అనేసి కూర్చున్నాడు.

అతడి మాటలకు లీశోత్తరదీక్షితుడికి ముచ్చమటలు పోశాయి. తను వేసిన ఎత్తు ఇతడు


చిత్తు చేశాడు. ఇందువలన అసలు పన్నాగం పారుతుందో లేదో. అయినా ఇంతవరకూ
కర్కవల్లభునికి రెండు ప్రశంశలు పోతినాయుడికి ఒక ప్రశంశా వచ్చింది. ఈయన ఎన్నుకోక
పోతే ఏమీ కొంప మునగలేదు. గండయ సాహిణి ఎలాగూ తన చేతిక్రింద బంటు’ అని
ఊరడిల్లాడు.

మళ్ళీ చంగనార్యుడు “రాష్ట్రకూటసామ్రాజ్యం ఒక నూతన సాంప్రదాయాన్ని


ఆవిష్కరించి నపుడు ఈ మార్పును కొందరు సహించరు. అది సహజమే. మార్పు వారికి
గిట్టదు. అందరిదీ ఒకదారయితే ఉలిపి కట్టెది ఒకదారి. ఆయన ఎన్నుకోక పోయినా ఇంతలో
పోయిం దేమీ లేదు. ఇప్పుడు గండయ సాహిణిని అడుగుతున్నాను”అన్నాడు.

గండయ సాహిణి యుద్ధవిద్యలలో మర్మాలెరిగినవాడేకాని వాచాలుడుకాదు. అసలు


మాట్లాడడానికే సిగ్గు పడతాడు. అతడు గుప్పెటలు బిగించి కొంతసేపుదిక్కులు చూస్తూ
నిలబడ్డాడు. లీశోత్తరదీక్షితుడిలోను భీమసలుఖి మహారాజులోను ఆంధోళన పెరిగింది.
చంగనార్యుడు “అయ్యా మీ అభిప్రాయం చెప్పండి” అన్నాడు హెచ్చరిస్తూ.

64
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

గండయసాహిణి ధైర్యం అంతా కూడకట్టుకుని “అసలైన జగదేకవీరుడు భల్లాణ


పోతినాయుడే!” అనేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు.

భీమసలుఖి మహారాజు కళ్ళనీళ్ళపర్యంతం అయ్యాడు. లీశోత్తరదీక్షితుడు


తలపట్టుకున్నాడు. ఇప్పుడు కర్కవల్లభునికి రెండు ప్రశంశలూ పోతినాయుడికి రెండు
ప్రశంశలు వచ్చాయి. ఎన్నిక వ్యూహం ఎటూ తేలకుండా ఆగిపోయింది. విదేశీ రాయబారి
ఎన్నిక తిరస్కరించాడు. అతడి స్ధానంలో భీమసలుఖి మహారాజును ఆహ్వానించి వుంటే
కర్కవల్లభుని నిస్సందేహంగా ఎంచుకుని వుండేవాడు. అప్పుడు కర్కవల్లభుని విజయం
తధ్యమయ్యేది.ఇప్పుడు వ్యవహారం చెరి రెండు ప్రశంశలతో తిరకాసులో పడింది.

లీశోత్తరదీక్షితుడు తదుపరి తరుణోపాయమేమిటా అని ఆలోచిస్తున్న తరుణంలో పుర


ప్రముఖులలో కూర్చున్న శిరః ప్రధాని రేవాదాసదీక్షితుడు లీశోత్తరదీక్షితునివద్దకు వచ్చి “ఓరీ
నీతిబాహ్యుడా! నీ కుతంత్రాలు కట్టిపెట్టి భల్లాణుడిని సత్కరించరా వెధవా!” అనేసి వేదిక దిగి
తన ఆంధోళిక అధిరోహించి కోటలోని తన నివాసానికి వెళ్ళిపోయాడు.

లీశోత్తరదీక్షితునికి గొంతులో వెలక్కాయ పడింది. అన్నగారి మాట వినకపోతే శిరః


ప్రధానిగా తనకు శిక్షవేయిస్తాడు. ఇంక జిత్తులు పారవు అనుకున్నాడు.

భీమసలుఖి మహారాజు వచ్చి లీశోత్తరదీక్షితుని చేతులు పట్టుకున్నాడు. ఎన్నుకునే


అవకాశం తనకిమ్మన్నాడు. కానీ తాను మహాసైన్యాద్యక్షుడైనా శిరః ప్రధానికన్నాతక్కువే.
అన్నగారు తనఉద్యోగం ఊడబెరికించినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే చక్రవర్తి సంరక్షకుడైన
ఇంద్రవల్లభుడు కూడ రేవాదాసదీక్షితునిమాట కాదనడు. శిరః ప్రధానికి రాచకుటుంబం
లోను అటు సైన్యాధికారులలోను ప్రజలలోను కూడ అంత మంచి పేరుంది. పైగా భీమ సలుఖి
మహారాజు పలుమార్లు తనవద్దకు రావడం ఇంద్రవల్లభునితో సహా అందరూ గమ
నిస్తున్నారు. తామిద్దరూ కలసే ఈ కపటనాటకం నడుపుతున్నారని అందరకూ తెలిసి
పోతుంది.

ఇక పరిస్తితి విషమిస్తుందని గమనించాడు లీశోత్తరదీక్షితుడు. ‘భీమసలుఖి మహారాజు


మాటపట్టుకుని ఇంకాముందుకుపోతే రసాభాస అవుతుంది. కుక్కతోక పట్టుకుని
గోదావరిలో దిగినట్లుంటుంది. ఇంద్రవల్లభుడు కూడ తమ పన్నాగాన్ని అర్ధం చేసుకునే
వుంటాడ’ని తలంచాడు.

లీశోత్తర దీక్షితుడు తేరుకుని భల్లాణపోతినాయుడిని జగదేకవీరుడిగా ప్రకటించమని


చంగనార్యుడికి చిన్నలేఖ రాసి పంపించాడు.

చంగనార్యుడు కూడ పరిస్ధితిని అర్ధం చేసుకున్నాడు.“మహాజనులారా! ఇక్కడ జరిగిన


ఎన్నికలో కర్కవల్లభరాకుమారునికి రెండు గుణాలు భల్లాణపోతినాయుడికి రెండు గుణాలు

65
  చాళుక్యసింహాసనం

వచ్చాయి. రాయబారి సర్వజ్ఞనారాయణుడు ఎవరినీ ఎన్నుకోకపోవడంతో ప్రతిష్టంభన


ఏర్పడింది. అందుచేత రెండు బంగారు పతకాలు అందుకున్న భల్లాణపోతినాయుడినే
జగదేకవీరుడుగా ప్రకటిస్తున్నాము. ఆ వీరుడిని వేదికపైకి వచ్చి చక్రవర్తి సన్మానాన్నీ
జగదేకవీర బిరుదాన్నీ కిరీటాన్ని పతాకను స్వీకరించమని కోరుతున్నాము” అని
ప్రకటించాడు.

ఇద్దరు కన్యలు భల్లణపోతినాయుడిని ఆహ్వానించడానికి వెళ్ళారు. కానీ వారక్కడే


నిలబడిపోయారు. కారణం ఏమిటో తెలియరాలేదు. కొంత సమయం గడిచింది.

మరియిద్దరు కన్యలుకూడ పిలుచుకు రావడానికి అతని వద్దకు వెళ్ళారు. ఏమనుకు


న్నాడో ఆ వీరుడు తన రథంపై కదలివచ్చాడు. కానీ కన్యలెవరినీ మునపటిలా తన రథం
అధిరోహించ నీయలేదు.

ఆతడు చక్రవర్తి సింహాసనం వద్దకు రాకుండ చంగనార్యుడు ప్రసంగించే మంచెవద్దకు


జేరాడు. తానుకూడ సభనుద్దేశించి ప్రసంగిస్తానన్నాడు. ఇంద్రవల్లభుడు అనుమతించడంతో
ఆతడు మేఘగంభీర నిస్వనంతో ఇలా ప్రసంగించాడు.

“మాన్యకేత పురప్రముఖులందరికీ నమోవాక్కమలార్చన. సరివీరులందరికీ ఆలింగ


నములు. ప్రమదానివహానికి అభినుతులు.

రాష్టకూట చక్రవర్తులకు, చక్రవర్తి సంరక్షకులకు, ఈ ఉత్సవాలకు అద్యక్షులైన లీశోత్తర


దీక్షితులకు విధి నిర్వహణ చేసిన చంగనార్యునికి నేను అభివాదం చేయటంలేదు. ప్రణామాలు
తెలుపటంలేదు. వారికి శిరసు వంచే ప్రసక్తే లేదు. ఎందుకంటే అధర్మాన్ని తలపెట్టినవారు
సహించినవారు గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్నవారూ కూడా అధర్మ పరులే!
సర్వజ్ఞనారాయణుడు ఈ ఎన్నిక గుట్టు రట్టు చేయకపోతే, ఈ కుతంత్రాన్ని ఎండగట్టక పోతే,
ఈ జగదేకవీరమకుటం కర్కవల్లభ రాకుమారుని తలపైనే ప్రకాశించేది.

మాకు ఇవ్వతలవని పతకం మాకవసరం లేదు. మేము తిరస్కరించే ఆ కరీటమేదో మీ


కర్కవల్లభ రాకుమారుని మూర్ధాన్ని అలంకరించ నీయండి. అందుకోసం ఇంత నీతిబాహ్య
మైన పన్నాగం పన్ననవసరం లేదు.” అన్నాడు.

అందుకు బదులుగా చంగనార్యుడు “ఓ రాకుమారా! అంత అలుక నీకేల? రెండు


బంగారు పతకాలు సాధించిన నీవే జగదేకవీరుడవు! ఎన్నిక అనే ఒక వినూత్న సంప్ర
దాయాన్ని ఆవిష్కరించినపుడు అందులో కొన్ని లోపాలు తలఎత్తవచ్చు! ఇప్పుడా సమస్య
కూడ లేదు. రాష్ట్రకూట చక్రవర్తుల సన్మానాన్ని స్వీకరించు. జగదేకవీర బిరుదాంకి తుడవుకా.
వనజాక్షులకర నీరాజనా లందుకో!చక్రవర్తుల చేతిమీదుగా సువర్ణాభిషేకం పొందు! ఈ
అరుదైన అవకాశం మరొకమారు రాదు. జాగుచేయకు. జారవిడువకు!” అన్నాడు.

66
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

అందుకు బదులుగా భల్లాణపోతినాయుడు“కుతంత్రాలతో కూరుకుపోయిన ఈ


రాష్ట్రకూట మకుటం మమ్ము సన్మానించటానికి అర్హమైనది కాదు. ధర్మగ్లాని జరుగుతున్నా
చక్రవర్తి సంరక్షకుడు మిన్నకుండడం అధర్మాన్ని సమర్ధించడమే! మేమీ పరీక్షలకు
బలనిరూపణం కోసం వచ్చామేకాని మీ సుందరాంగనల వక్షోపద్మాల వత్తిడికోసం రాలేదు!
ఒకసారి తిరస్కరించిన వస్తువును మేమెన్నటికీ స్వీకరించము! మా బలపరాక్రమాలేమిటో
ఎరుగని ఒక అమాయక పౌరుడా మమ్ము ఎన్నుకునేది? ఒక బేహారా మమ్మెన్నుకునేది? కర్క
వల్లభునిపై గంపెడాశతో పులకరించే మాచెల్లెలు భీమరథా మమ్మెన్నుకునేది? ఒక్క గండయ
సాహిణి మాత్రం మా భుజబలమేమిటో చావ ఏమిటో తెలిసినవాడు!అర్హుడైన న్యాయనిర్ణేత!

బంగారుకొండయైన మేరుపర్వతాన్ని చిన్నచిన్న బంగారుపూలతో అభిషేకించ


నవసరం లేదు! అందుకే మీ తీర్పును మీ సన్మానాన్నీ మీ కనకాభిషేకాన్నీ తిరస్కరిస్తున్నాము”
అన్నాడు చాలా గంభీరంగా సాహసంతో.

ఈమారు లీశోత్తరదీక్షితుడు ప్రసంగవేదికపైకి సింహంలా లంఘించాడు. అతడిలా


అన్నాడు. “ఓ భల్లణపోతినాయుడా! నీ తలబిరుసు కొంచం తగ్గించుకో! ఇది రాష్ట్రకూట
సామ్రాట్టుల సమక్షం! చక్రవర్తికి ఆగ్రహం వస్తే ఏమౌతుందో తెలుసా? ఇక్కడ ఎన్ని
కృపాణాలు చుట్టుముట్టివున్నాయో తెలుసా? నీవీ సన్మానం తిరస్కరించి మమ్మ వమానించి
ఇక్కడినుండి వెళ్ళగలవా? ఇంతటితో నీ మారాము మాను. మంకుతనం విడువు. ఇష్టంవున్నా
లేకున్నా చక్రవర్తుల సన్మానాన్ని అంగీకరించు. నీకు కనకాభిషేకం చేస్తారు. ఈ రాత్రికి
ఎలాగూ వీరులందరకు వెన్నెల ఉత్సవం ఉంది. సుమధ్యమలు సరసంగా అధర సుధా మధు
రసాన్ని అందించబోతున్నారు. దేవాంగనల బాహువల్లరిలో బందీవి కాబోతున్నావు!ఆ
మధుర సమయాన్ని ఒక్క సారి ఊహించుకో! వీరులంతా ఎంతోకాలం నుంచి
కఠోరబ్రహ్మచర్యాన్ని పాటిస్తూ యుద్ధ విద్యలు సాధన చేస్తూ వచ్చారు. వారందరికీ నేటి
రేయొక వీర విహారం. నీకేమైనా సమస్యలుంటే అప్పుడు మాట్లాడు కుందాం!” అన్నాడు.

ఆ మాటలకు పోతినాయుడిలో రోషం పెల్లుబికింది. వెంటనే గంభీరంగా ఇలా


అన్నాడు. “మీ ఉంపుడుకత్తెల చనుకట్టు వత్తిళ్ళకు లొంగడానికీ బాహుబంధాలలో
చిక్కుకోడానికి నేనేమీ లీశోత్తరదీక్షితుడిని కాదు! మీ చూరు పట్టుకు వ్రేలాడడానికి నేనేమీ మా
పెదతండ్రి భీమసలుఖి మహారాజును కాను! నేను వేంగీ చాళుక్య రాకుమారుడిని!
నరేంద్రమృగరాజ తనయుడిని! యువకిశోరాన్ని! విష్ణువర్ధన నామధేయుడిని!

నామీద కత్తిదూస్తే మీ కృపాణాలు వంగిపోతాయి. మీ ములుకులు తునకలౌతాయి.


పరువు మర్యాదలు మంట కలుస్తాయి. కీర్తిశిఖరాలు కూలిపోతాయి. తాటాకు చప్పుళ్ళకు
కుందేళ్ళు బెదరవలసిందే! మీ సేనా నివహం మమ్ము బంధించజాలదు!” అన్నాడు.

ఆతడు చాళుక్య విష్ణువర్ధనుడని తెలిసేటప్పటికీ శిరీష ముఖకమలం సూర్యకర స్పర్శ


తగిలిన తామరమొగ్గలా వికసించింది. గుండె నిండుగా ఊపిరి పీల్చుకుంది. పున్నమి
67
  చాళుక్యసింహాసనం

చంద్రదర్శనం పొందిన పాలకడలిలా పాలిండ్లు పైకి పొంగాయి. ఎద పొంగి చిబుకం వైపు


లేచింది.

భీమసలుఖి మహారాజు ముఖం మాడిపోయింది. లీశోత్తరదీక్షితుడు తత్తర పడ్డాడు.


చంగనార్యుడికి నోట మాటరాలేదు. బాలచక్రవర్తి అమోఘవర్షుని వదనం జేవురించింది.
అప్రయత్నంగా ఆ బాలచక్రవర్తి “ఎవరక్కడ? ఆ ధూర్తుడిని బంధించి మా చెరసాలలో పడ
వేయండి!” అన్నాడు గంభీరంగా.

బాలుడైనా చక్రవర్తి చక్రవర్తే! ఆజ్ఞ ఆజ్ఞే! పాలింపక తప్పదు.

విష్ణువర్ధనుడు ఛంగున తన రధంపైకి ధూకాడు.

ఆహూతులలో చాలా మంది ‘అయ్యో ఈ రాకుమారుడు ఎంత సాహసం చేస్తున్నాడు.


తన దుడుకు తనంతో చెరసాలలో పడబోతున్నాడు కదా!’ అని భావించారు. ‘ఏమా పొగరు?’
అనుకున్నవాళ్ళూ లేకపోలేదు.

ఆ వీరోత్సవాలకు కాపుగానున్న కాసానాయకుడు పదిమంది అశ్వికభటులతో


విష్ణువర్ధనుని బంధించడానికి ముందుకు వచ్చాడు.ఎవరైనా అతడిని బంధిస్తే చక్రవర్తినుంచి
గొప్ప బహుమానం పదోన్నతి లభిస్తుంది. అతడి రథానికి అభిముఖంగా నిలబడి లొంగి
పొమ్మని హెచ్చరిక చేశాడు. అశ్వికులు తమ శూలాలను ఎక్కుపెట్టి రథం చుట్టూ
మోహరించారు.

విష్ణువర్ధనుడు తన కుడిచేతిని వెనక్కు చాచాడు. ఆయుధాలనందించే శరాచి విల్లును


అందించాడు. అప్పటికే విష్ణువర్ధనుడు అంబుల పొదిని మూపుకు కట్టుకునివున్నాడు.
విష్ణువర్ధనుడు విల్లును అడ్డంగా తిప్పి రెండు బాణాలను వింటిన సంధించి విడిచాడు. ఆ
బాణాలు రెండూ నేరుగా కాసానాయకుడి కళ్ళలో దిగబడి పుఱ్ఱెను భేదించి ముచ్చల
గుంటలోంచి బయటికి వచ్చాయి. ఆ ద్రుశ్యాన్ని చూసినవారంతా ఏమిటిదీ కలియుగమా
ద్వాపరయుగమా అనుకున్నారు. ఇంతటి వీరాధి వీరుడిని జగదేకవీరుడు చేయకుండా
తంత్రాలు పన్నుతారా అనుకున్నారు విదేశీయులు. క్షణాలలో విష్ణువర్ధనుడు తనను బంధించ
వచ్చిన పదకొండుమందినీ వీరోత్సవాలకు బలియిచ్చాడు. బిగ్గరగా విజయశంఖం
పూరించాడు.

రాష్ట్రకూట దళాలు కంగారు పడ్డాయి. ఇతడిని పడగొట్టడానికి ఏదిమార్గం అను


కున్నారు. కంథరదొర నాయకత్వంలో ముప్పయి మంది యోధులు పదిమంది అశ్వికు లతో
కూడి రథాన్ని చుట్టుముట్టారు. విష్ణువర్ధనుడు రథాన్ని ఆపకుండా నడపమని సారధి
శతావరిని ఆజ్ఞాపించాడు. శతావరి రథచోదనంలో ఆరితేరినవాడు. ఎన్నో పందాలు గెలిచి
యుద్థాలు చూచి వచ్చినవాడు. రథం ఎవ్వరికీ చిక్కకుండా ఏ ఆయుధం తగలకుండ

68
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

లాఘవంగా నడపసాగాడు. శరాచి రాకుమారుడి అంబులపొదిలో ఎప్పటికప్పుడు బాణాలు


నింపుతునే వున్నాడు. విష్ణువర్ధనుడు శరసంధానంతో సైనికులందరినీ చెదరగొట్టాడు.
కొన్నిశరాలు అశ్వముఖాలలోకి చొప్పించాడు. కొందరి కుత్తుకలలో శిలీముఖాలు దిగాయి.
కొందరి వక్షస్సులు చీలాయి. కొందరి చేతులు కొందరి చెవులు ముక్కులు తలలు తెగి అవతల
పడ్డాయి.

కదనరంగం లోకి మరికొన్ని వందల సైన్యం దిగింది. రథం ఒక్కచోటా ఆగకుండా


అనూ హ్యంగా మైదానమంతా కలయతిరుగుతోంది. క్రింద పడినవారిని పడత్రొక్కుకుంటూ
నల్లేరు మీద బండీలా సాగింది. చక్ర రక్షకులు మల్లప్ప పైలుడు అతి నేర్పుగా శత్రువులు
సంధిం చిన ఆయుదాలు విష్ణువర్ధనుని జేరకముందే పడగొడుతున్నారు.

చూస్తుండగానే ఆ మైదానం భయంకరమైన రణరంగంగా మారిపోయింది. వీరోత్సవం


కాస్తా భీకర రణోత్సవంగా మారింది.

ఇలా కాదని కర్కవల్లభుడు అశ్వాన్ని అధిరోహించి శూలపాణియై విష్ణువర్ధనునిపైకి


ఎత్తివచ్చాడు. రథాన్ని వెంబడించాడు. విష్ణువర్ధనుడు సూటిగా ఆతడి అశ్వముఖంలోకి
ఒకేసారి ఐదు బాణాల్ని సంధించాడు. దాని నుదురు పదివక్కలై కూలిపోయింది. ప్రమాదాన్ని
గమనించిన కర్కుడు గుఱ్ఱంపైనుండి క్రిందికిదూకేసి ప్రాణం కాపాడుకున్నాడు.

ఆ యుద్ధం అలా జరుగుచుండగా భయంతో పౌరులు పరుగులు తీశారు. కొన్ని


బాణాలు వారికీ తగిలాయి. కొందరు తొక్కిసలాటలో నలిగి పోయారు. విదేశీ ప్రముఖులూ
వణిజులూ ఎక్కడివారక్కడ తమతమ వాహనాలెక్కి పారిపోయారు. ధైర్యం కలవారు మాత్రం
దూరంనుంచి పొంచి పొంచి చూస్తున్నారు.

విష్ణువర్ధనుడు సంధించే ఒక్క బాణంకూడ వృధా కావటం లేదు. ఒక్కొక్కరుగా


నేలకొరిగి పోతున్నారు.

లీశోత్తరదీక్షితుడు జగతీంద్రవర్మని తన పటాలంతో విష్ణువర్ధనుని బంధించమని ఆజ్ఞా


పించాడు.

కొందరు ఉపసేనాపతులు కూడకట్టుకుని అన్ని వైపులనుండి తమదళాలతో విష్ణువర్ధ


నుని ముట్టడించారు. కానీ వారు ప్రయోగించే ఆయుధాలకు రథగమనం వలన గురి
అందటం లేదు. రథం క్షణం క్షణం దిశలు మారుస్తూ పరుగులు తీస్తోంది. విష్ణువర్ధనుడి
శరాలు పుంఖాను పుంఖాలుగా విడుదలౌతున్నాయి.

రాష్ట్రకూటులకు విష్ణువర్ధనుడు ఎప్పటికి చిక్కుతాడో అర్ధం కాలేదు. సైన్యం మొత్తం


దిగ్భ్రాంతి పాలయ్యింది. జగతీంద్రవర్మ రక్తసిక్తుడై వెనుతిరిగి పోయాడు.

69
  చాళుక్యసింహాసనం

యుద్ధం చేస్తూ చేస్తూ విష్ణువర్ధనుడు చక్రవర్తి అమోఘవర్షునిపైకి ఒక బాణం ప్రయోగిం


చాడు. అది బాలచక్రవర్తి మకుటంపైని తూలికను ఖండించి సింహాసనంలో దిగబడింది. అది
విష్ణువర్ధనుడి గురి తప్పికాదు. అతడు బాల చక్రవర్తిని చంప దలుచుకోలేదు.

చక్రవర్తి పైకి బాణం వచ్చేటప్పటికీ ఇంద్రవల్లభుడు అదిరిపడ్డాడు. అంగరక్షకులందరూ


బాలచక్రవర్తిని చుట్టుముట్టి రక్షణగా నిలబడ్డారు. వెనువెంటనే ఇంద్రవల్లభుడు
అమోఘవర్షుడిని అంగరక్షకుల వెంట కోటలోనికి పంపించివేశాడు. తానే వ్యూహం రచించి
అతడిని బంధించ తలచాడు. గజసాహిణిని పిలిచి మైదానం చుట్టూవున్న ఏనుగులన్నిటినీ
సమీకరించి కంకణ బంధంగా మోహరించమన్నాడు. ఏనుగుల ఉచ్చులో రథాన్ని నిలువ
రించాలని ప్రయత్నం.

లీశోత్తరదీక్షితుడు పట్టరాని ఆవేశంతో విష్ణువర్ధనునిపైకి కరవాలం చేతపట్టి దూకాడు.


విష్ణువర్ధనుడికి ఆ మహావీరుడితో ద్వంద్వ యుద్ధం చేయాలనిపించింది. విల్లును ప్రక్కన పెట్టి
చంద్రహాసంతో రథంపైనుండి అతడిపైకికొదమసింహంలా లంఘించాడు. ఇద్దరు మహా
యోధులూ కలబడ్డారు. లీశోత్తరదీక్షితుడు అమోఘమైన ఖడ్గవిద్యా నైపుణ్యం కలవాడు.
కాకలు తీరిన యోధుడు. కానీ యువకుడైన విష్ణువర్ధనుని బాహుబలం ముందు ఆ వేశ్యా
లోలుడి బలం నిర్వీర్యమైపోయింది. విష్ణువర్ధనుని దెబ్బ ఘనంగావుంది. దానితో ఆయన
తొట్రు పడ్డాడు. ఆయన అంగరక్షకులు మధ్యలో దూరి ఆయనను రక్షించి అవతలకు తీసుకు
పోయారు.

ఆ రక్తపాతం చూసి శిరీషచెలికత్తెలు బెదిరిపోయారు. కొందరికి ఎఱ్ఱటి రక్తం చూస్తేనే


కళ్ళు తిరిగి వాంతులవుతాయి. రాకుమారితో ‘వెళ్ళిపోదామా?’ అన్నారు. ఆ రాచబిడ్డ వారి
కేసి తీక్షణంగా చూసింది. అంత ఘోరమైన సంగ్రామం ప్రత్యక్షంగాచూసే అవకాశం
వనితలకు ఎప్పుడూ రాదు. ఆమె కన్నార్పక అనిమిషాంగనయై విష్ణువర్ధనుని రణవిద్యా
విలువిన్యాసం నిశితంగా గమనిస్తోంది. విష్ణువర్ధనుని రథం మలుపు తిరగడంవలన అతడి
ముఖారవింద సందర్శనానందం కనుమరుగవడంతో కేతుగ్రస్త శశిబింబంలా చిన్నబోతోంది.

గజవ్యూహం రథాన్ని చుట్టుముట్టింది. ఒక్కొక్క ఏనుగుకూ ముగ్గురేసి మావటివారు


న్నారు. అంభారీలో నలుగురేసి ధానుష్కులున్నారు. ఏనుగు చుట్టూ ఎనిమిది మంది
శూలాయుధులున్నారు. అలాంటి యుద్ధగజాలు ఎనభై దాకా ఉన్నాయి. కొన్ని
కారుమేఘాల్లాంటి దంతావళాలు. కొన్నిటి శరీరాలకు ఇనపముళ్ళ కవచాలు తొడిగి
వున్నాయి. అవి ఒక్కసారి రాసుకున్నాచాలు, మనుషులూ గుఱ్ఱాలూ చీరుకు పోతారు. కొన్ని
ఏనుగులు పెద్ద గదలను తొండంతో పట్టుకుని ఊపుతున్నాయి.

మావటి వారి అదిలింపులతో ఏనుగులన్నీ దండలా వలయాకారంగా ఏర్పడి కుదించు


కుంటూ ముందుకు రాసాగాయి. విష్ణువర్ధనుని రథం సహ్యాద్రి పర్వతాల నడుమ లోయలో
ఉన్నట్లుంది. కదలడానికి చోటు ఇరుకైపోతోంది.అంతకంతకూ ఉచ్చుబిగుస్తోంది. అప్పటికీ

70
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

సారధి రథాన్ని నిలవకుండా తోలుతున్నాడు.

విద్యాప్రదర్శనలలో పాల్గొన్న వీరకుమారులకు అదొక ప్రత్యక్ష రామాయణంలా వుంది.


వాళ్ళ కళ్ళముందే భీకర రణరంగం ఏర్పడింది. శరఘాతం తిన్న యోధుల హాహాకారాలు
వినిపిస్తున్నాయి. ఒక్క యోధుడిని ఇంతమంది బంధించలేకపోవడమేమిటీ? అతడు మాత్రం
ఎంత సేపు తప్పించుకుంటాడు? రాష్ఠ్రకూటుల చేతికి చిక్కడమో మడియడమో
జరగబోతోందా? అది కేవలం పోటీ ప్రదర్శన కాదు. యుద్ధం అంటే ఏమిటో తెలిసినవారికి
కూడా అది కలయా నిజమా అనిపిస్తోంది. విష్ణువర్ధనుని విజృంభణానికి అతడి రథమే
కారణమని అనిపిస్తోంది. అంత ఎత్తైన రథం యుద్థాలలో వాడడం ఎవరూ చూడలేదు. సగం
ఆయుధాలను ఆ రథచక్రాలే అడ్డుకుంటున్నాయి. దారితప్పి రథంపైకి దూసుకువచ్చిన
ఆయుధాలను చక్ర రక్షకులు సమర్ధంగా పడగొడుతున్నారు. ఆ రథం తోలే శతావరి
మహేంద్రుడి రథం నడిపే మాతలిని మించి వున్నాడు. వెనక మిలబడిన శరాచి అంబుల
పొదిని నింపుతునే వున్నాడు.

మొత్తానికి విష్ణువర్ధనుడు ఏదో గిల్లికజ్జా పెట్టుకుని యుద్ధం చేయడానికి అన్ని


హంగులూ కూర్చుకుని వచ్చినట్లున్నాడు.

విష్ణువర్ధనుడు ఎప్పుడు ఏంచేయబోతున్నడోనని ఉత్కంఠగా వుంది. అంత సైన్యం


మధ్య ఒక్కడు ఎంతసేపు నిలవగలడు అనుకుంటున్నారు. అదికేవలం ఆవేశంతో చేస్తున్న
దుస్సాహసమనే అనిపిస్తోంది వారికి. ఒకవేళ బంధీకృతుడైతే రాష్ఠ్రకూటులు హింసించరా
అనిపిస్తోంది. వారు మాటిమాటికీ అనువైన ప్రదేశం వెతుక్కుని పొంచి వుండి ఆ యుద్థాన్ని
గమనిస్తున్నారు.

విష్ణువర్ధనుడు బాణాలతో ఏనుగుల్ని భయపెట్టి వెనక్కు తరుముతున్నాడు. కొన్ని


బాణాలు ఏనుగు తొండాలలో దిగబడ్డాయి. కొన్ని కంట్లో కొన్ని మావటుల ముఖాలలో కొన్ని
శూలపాణుల కవచాలలో దిగబడుతున్నాయి. ఒకటి మావటివాని గొంతులో గుచ్చు కుంది.
ఒక నారాచం గజముఖాన్ని ఛేదించింది.

రాష్ట్రకూటులు విలుకాళ్ళను ఎక్కువగా ఉపయోగించలేదు. బరిచుట్టూ ఇంకా జనం


ఉన్నారు. గురి తప్పిన బాణాలు ఎవరికి తగులుతాయో తెలీదు. విష్ణువర్ధనుడు పెక్కు తోడేళ్ల
మధ్య చిక్కుకున్న వనమహిషంలా అందరినీ ఎదుర్కుంటున్నాడు. ఒకప్రక్క యుద్ధం చేస్తూనే
గజకంకణం నుంచి ఎలాఎలా బయటపడాల ఎలా తప్పుకుపోవాలా అని ఆలోచిస్తున్నాడు.

ఇంద్రవల్లభుడు తన అంతరంగికుడైన కుటిలుడికి సైగచేశాడు. అతడు వచ్చి ప్రమదల


పటశాల ప్రక్కన నక్కి కూచున్నాడు. తనవిల్లుతీసి నారి సంధించాడు. వింటిన క్రూరమైన
బాణం సంధించి అదునుకై వేచివున్నాడు.

71
  చాళుక్యసింహాసనం

కుటిలుడు వింటినబాణం సంధించడం శిరీష గమనించింది. కుటిలుడిని తనతండ్రి


గిట్టని వారిని మట్టుపెట్టడానికి ఉపయోగిస్తాడని నగరంలో చెప్పుకుంటారు. ఇప్పుడు
కుటిలుడు ఆ పనికే సిద్ధమయ్యాడు. కుటిలుడిబాణం ఎప్పుడూ గురితప్పదు. ఒక్కవీరుడు
అసహాయ శూరుడై అందరినీ చావమోదుతుంటే గెలవలేక చాటునుండి హత్యచేయడమా?
ఆమె మనసు కలవరపడింది.శిరీష కనులెరుపెక్కాయి.

శిరీష తన చెలికత్తెను విల్లూ అంబులు తీసుకురమ్మని కోరింది. ఆమె “ఎందుకూ?”


అని సందేహంగా ఎదురుప్రశ్న వేయడంతోఆమె చెంపచెళ్లుమనిపించింది. శిరీష చెలికత్తెల
నెప్పుడూ కొట్టి ఎరుగదు. ఆ చెలికత్తె మారుమాట్లాడకుండా పరుగెత్తుకుంటూ వేదిక దిగి వెళ్ళి
ఒక ధానుష్కుడి నుండి విల్లు అంబులు లాక్కుని వచ్చింది. ఆతడు ఆమెను వెంబడించి కూడ
ప్రమదాంతః పురంలోకి వెళ్ళడానికి వీలులేక అక్కడే ఆగిపోయాడు.

శిరీష విల్లందుకుంది. కనులు మాత్రం కుటిలుడినే గమనిస్తున్నాయి. ఎడమపాదం


నేరు గావుంచి కుడిపాదం దానికి భిన్నంగా లంబకోణంలో కుడిప్రక్కకు తిప్పి వ్యత్యస్త పాదార
విందయై స్థిరంగా నిలబడింది.ఆ బాల వింటిన బాణం సంధించేలోపలే కుటిలుడు తన
మొదటి బాణం విడిచాడు. అది వెళ్ళి విష్ణువర్ధన రాకుమారుడి కర్ణతాటంకాన్ని రాసు కుంటూ
వెళ్ళింది. వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పిపోయింది. విష్ణువర్ధనుడు కుటిలుడి ధనుర్విముక్త
శరాన్నిగమనించాడు.

కుటిలుడు రెండవ సారి భస్త్రిక అనే బాణం తీసి ఎక్కుపెట్టాడు. అది చాల చిన్నదైనా
శత్రువు శరీరంలోకి దిగి మెలి తిరుగుతుంది. కుటిలుడి రెండవబాణం గురితప్పదని శిరీషకు
తెలుసు. తనూ ఆకర్ణాంతమూ సంధించిన బాణంతో సిద్ధంగా ఉంది. కుటిలుడు బాణం
విడిచాడు. శిరీష బాణం విడిచింది. కుటిలుడి బాణం విష్ణువర్ధన రాకుమారుడిని తాకే
సమయంలో శీరీష బాణం ఆ బాణాన్ని మధ్యలో తుంచివేసింది. ఆ విషయం ఎవరూ
గమనించలేదు. ఆ వేగం అందరికీ అవగతం కాదుకూడ. కేవలం ఒక తృటిలో జరిగి
పోయింది.

కానీ విష్ణువర్ధనుడు బాణం తగిలినవాడిలా రథంలో కుప్పకూలిపోయాడు.

విష్ణువర్ధన రాకుమారుడు రథంలో పడిపోవడం అందరూ గమనించారు. బాణం తగిలి


పడిపోయాడనుకున్నారు. పెద్దగా గావుకేకలు పెట్టారు. రాష్ట్రకూటుల సైనికులు ఆనందంతో
పెనుబొబ్బలు పెట్టారు. విజయగర్వంతో శంఖాలు పూరించారు. కొమ్ముబూరలు ఒత్తారు.
కాహళ వంకిణిలు పూరించారు. ఢక్కలు ఢమరుకాలు చేగంటలు డప్పులు ఇష్టంవచ్చినట్లు
మోదారు. గుండెలదిరేటట్లు దుందుభులు పెద్ద కంచుతాళాలు మోగించారు. విజయగర్వం
తో కేరింతలు కొడుతూ ఒకరినొకరు ఎగిరి గంతులేస్తూ కౌగలించుకున్నారు.

ఆ ధ్వనికి దిక్కులు పిక్కటిల్లిపోయాయి. ధరణి వణికింది. నభం దద్దరిల్లింది.

72
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

కోటగోడలు ప్రతిధ్వనించాయి.దిగ్గజాలు ఘూర్నిల్లాయి. పసిపిల్లలు కెవ్వున ఏడ్చారు.


ముసలివారి గుండెలు దడదడలాడాయి. ఆడవారు సోలి పడిపోయారు. ఇంద్రవల్లభుడు
సంతోషించాడు. భీమసలుఖి ఎగిరి గంతులు వేస్తూ వచ్చి లీశోత్తరదీక్షితుని నోటిలో
మిఠాయిలు కూరాడు.

కానీ ఆ మహానాదానికి యుద్ధగజాలు కలగుండు పడిపోయాయి. సింహనాదాలకు


అదిరి బెదిరి హడలిపోయాయి. కంఠీరవాలు తమపైకి థూకుతున్నాయని భయపడి ఏనుగులు
పలుదిక్కులకు పరుగులు తీశాయి. మావటీల మాట వినలేదు. అడ్డంవచ్చిన వారిని
పడతొక్కుకుంటు తొండంతో చుట్టి ఎత్తి అవతల పారవేస్తూ ఎటుకంటే అటుకు పరు గెత్తాయి.
పందిళ్ళను పటశాలలను పడతొక్కుకుంటు సాగాయి. ఇంద్రవల్లభుడు పన్నిన గజకంకణం
విశ్ఛిన్నమయింది. వ్యూహం మొత్తం భ్రష్టమైపోయింది. కోపంతో ఇంద్ర వల్లభుడు
మణిమయాలంకృతమైన తన తలపాగాను తీసి నేలకేసి కొట్టాడు.

జరిగిన పొరపాటును కర్కవల్లభుడు అర్ధంచేసుకున్నాడు. శూలంపైకెత్తి పట్టి గుఱ్ఱం


ఎక్కి విష్ణువర్థనుడి పైకి ఉరికి వచ్చాడు. ఒరిగిపోయిన విష్ణువర్ధనుడిని మళ్ళీ లేవకుండా పొడ
వాలనే ఆలోచన. ఆ సమయంలో ధర్మాధర్మాలు ఎన్నే విచక్షణాజ్ఞానం నశించి పోయింది.

ప్రమాదం గమనించిన సారధి శతావరి ఒక్కసారి రథాన్ని పక్కకు తోలాడు.


కర్కవల్లభుని శూలం గురితప్పింది. విష్ణువర్ధనునికి తగలవలసిన శూలం సారధి
ఎడమభుజంలో దిగ బడింది. అతడుడుల్లి రథంపైనుండి క్రిందపడిపోయాడు.

విష్ణువర్ధన రాకుమారుడు రథంపైన లేచి నిలబడి గుఱ్ఱాల కళ్ళాలు తన చేతులోకి తీసు


కున్నాడు. చరణాకోలతో అశ్వాలను తెగమోదాడు. అదేవూపుతో కర్కవల్లభుని మెడపైన
కొరడాతో ఒక్క మోదు మోదాడు. కొరడావెంట చర్మం లేచివచ్చింది. రథం సడలి పోయిన
గజబంధం సందులోంచీ వీరోత్సవశాలలను తొక్కుకుంటూ బయటపడి రథ్యనెక్కి చిత్తా
పురం వైపు పరుగు తీసింది.

ఇన్ని పరిణామాలు ఊపిరి పీల్చుకోవడాని కూడ సమయం లేని క్షణంలో జరగి


పోయాయి. రంగస్ధలం పీనుగులతో నిండిపోయింది. అందరూ బిత్తరపోయారు. రాష్ట్రకూట
రౌతులు కొందరు రథాన్నివెంబడించి తమ అశ్వాలను ఉరికించారు.

13 స్వదేశయాత్ర
వీరోత్సవాలనుండీ మరలిన విష్ణువర్ధనుని రథం రథ్యనుదాటి మైదానాలను పంట
పొలాలను దున్నుకుంటు వెళ్ళిపోతోంది. ముళ్ళు తుప్పలు పొదలు వాగులు వంకలు
లెక్కచేయకుండా వెళ్లి పోతోంది. కానీ వాళ్ళు వెళ్ళే దోవలో అనేకమైన కందకాలు వున్నాయి.
నాపరాళ్ళకోసం తవ్వి వదిలేసిన గనులు అవి. విష్ణువర్ధనుడు అమోఘమైన సారధి అవడం
73
  చాళుక్యసింహాసనం

వలన అంత చతురతతో నడప గలుగుతున్నాడు. ఇంకొకరైతే ఏ గోతిలోనో పడవలసిందే.


రాష్ట్రకూట రౌతులు కొందరు వెంబడించినా ఆ వేగానికి అందుకోలేక పోయారు.

విష్ణువర్ధనుని రథాన్ని ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్య అతిరహస్యంగా తయారు చేయిం


చాడు. దాని చక్రాలు యడ్లబండి చక్రాలకు రెట్టింపు కన్నా ఎక్కువ వ్యాసం కలిగి వుండ డంతో
చిన్నచిన్న వాగులు గుంటలు పొదలు బండలు లెక్కచేయకుండ దాటుకుంటు సునాయాసంగా
పరుగులు తీస్తోంది. దానికి పూన్చిన మొరటు గుఱ్ఱాలను కూడ ఆంధ్రశ్రేష్ఠి అరబ్బు వ్యాపారి
ఇబన్ బతూత వద్ద కొనివుంచాడు.

ముందు అనుకున్నప్రకారం విశాఖదత్తుడు భీమానదీతీరాన వేచివున్నాడు. మాన్య


కేతం వెంబడి ప్రవహించే కాగ్నా నది భీమానదిలో సంగమంచేచోట రథం ఆగగానే విశాఖ
దత్తుడు రథం గుఱ్ఱాల పగ్గాలు అందుకున్నాడు.

విశాఖదత్తుడు అలిసిపోయిన ఆ నాలుగు అశ్వాలను రజ్జువుల నుండి విడుదల చేసి


ఏటిలో నీళ్ళు తాగి పచ్చిక మేయండి అన్నట్లు వెన్నుపైన నిమిరి వదిలివేశాడు.

“మిత్రమా! మన చమరీ గురుకులం ధాటి చూపించావా?” అన్నాడు విశాఖదత్తుడు


ఆసక్తితో.

“ఆ! రాష్ట్రకూట దళాలను నలగతోక్కాను. లీశోత్తరదీక్షితుడి కుతంత్రాలను తుక్కు


చేశాను. అడ్డు పడిన కర్కవల్లభుని మెడ చర్మం చరణాకోల వెంబడి లేచివచ్చింది.” అన్నాడు
విష్ణువర్ధనుడు. “ఇంతకూ మన ప్రయాణానికి గుఱ్ఱాలేవీ?” అన్నాడు విష్ణు వర్ధనుడు చుట్టూ
చూస్తూ.

“అదిగో! ఆ కొండమాటున మేస్తున్నాయి. ఇక్కడ అశ్వాల అడుగులు పడితే వాళ్ళు


మనని అనుసరించి వస్తారని అక్కడ కట్టివేశాను.”అన్నాడు విశాఖదత్తుడు.

రథం పైనుండీ దిగి పైలుడు మల్లప్ప శరాచి చేతులు కట్టుకుని రాకుమారుడి ఆజ్ఞకై
నిలబడివున్నారు.

“విశా! వాళ్ళ రౌతులు నన్ను వెన్నంటారుకానీ అందుకోలేకపోయారు. కొంతసేపటిలో


ఇక్కడకు చేరుకుంటారు. మనం త్వరగా బయలుదేరాలి. నాతోపాటు చక్రరక్షకులు మల్లప్ప,
పైలుడు ఆయుధాలు సజ్జీకరించే శరాచి నావెంట వచ్చారు. ఈ ముగ్గురినీ ఏం చేద్ధాం?”

“బట్టలు విప్పి గోచీలు పెట్టుకుని నదిలో ఈదుకుంటు వెళ్ళమను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క


ధనం మూట ఇద్దాం. మొలకు కట్టుకుని ఈదుతారు. ఆ ధనంతో ఏదేశమైనా వెళ్ళి
బతుకుతారు. లేదు లేదు. వాళ్ళు ఈ మాన్యకేతం పరిసరాల్లోనే అజ్ఞాతంగా వుంటు మన
ఆజ్ఞలకై ఎదురు చూస్తుండాలి.”
74
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“విశా! నాకూ స్నానం చేయాలనుందిరా! వడలు స్వేదజలపూరితమైయుంది. చాలా


దాహంగాకూడ వుంది.”
“ఇంకేం! నీవూ కౌపీనవ్రతం పట్టు!” అన్నాడు విశాఖదత్తుడు.రాజకుమారుడు
మాన్యకేతం పరిసరాలలో బ్రతకండని ఆజ్ఞాపించడంతో పైలుడు శరాచి మల్లప్ప ధనం
సంచులు తీసుకుని ఈదుకుంటూ వెళ్ళపోయారు.
“కౌపీనవ్రతమంటే?”
“గోచీపెట్టుకు తిరగడం!”
“నేను రాకుమారుడినిరా. గోచీతోనే వేంగివరకు రమ్మంటావా? వేరే బట్టలేమైనా
తెచ్చావా?” అని అడిగాడు రాకుమారుడు.
“శ్రీరామచంద్రుడు అడవులకు వెళుతూ పెట్టాబేడ సద్దుకుని వెళ్ళాడా? అంగవస్త్రంతో
సద్దుకో!”
“నీకంటే సిగ్గులేదు. ఐనా శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళేడప్పుడు లక్ష్మణస్వామి
కత్తులు కఠారులతో పాటు గంపా పార గుద్దలి లాంటివన్నీ నెత్తిన పెట్టుకుని వెళ్ళాడు. మరి
నీవేం చేశావ్? నాకు ఉడుపులు కావాలి!”
“ఉడుగవు రాచపోకడలు! అదిగో అక్కడ మడేళ్లు బట్టలారేశారు. నీవక్కడికి ఈదు
కుంటురా. అరవైనాలుగు కళలలో ఏదోఒకటి ఉపయోగించి నీకేదో ఏర్పాటు చేస్తాను”
అన్నాడు విశాఖదత్తుడు.

ఎవరో రజకులు భీమరధిలో బట్టలు ఉతికి ఒడ్డున దణ్ణాలకు ఆరవేశారు. విశాఖదత్తుడు


ఆరవేసిన హంసరెక్కలలాంటి బట్టలను సంగ్రహిస్తుంటే రజకస్త్రీ పొదమాటునుంచి ఇవతలికి
వచ్చింది. చీరకుచ్చెళ్ళు సవరించుకుని రైక ముడివేసుకుని పెదవులు పైటకొంగు కద్దు కుంటు
ఇలా అంది.

“ఓసామే! ఏటది గుడ్డలూడతీసుకు పోతుండావ్. ఇది మరియాదేనా?”

“ఓసి రంగమ్మా! ఇందాకటినుంచి గొంతెట్టుకుని అరుస్తుంటే ఎక్కడ చచ్ఛావ్? నీ


మొగుడేమయ్యాడు. తాగి ఇంటికాడ పండుకున్నాడా. పొదమాటున వాడెవడూ, రంకు
మగడా” అన్నాడు.

రజకుడి భార్య కోపం వదిలి సిగ్గుపడిపోయింది. “చచ్చినోడు ఇక్కడే వున్నాడు. కానీ నీ


వెప్పు డరుచుకున్నావ్? నేనీడనే నీడపట్టున కూకున్నా!” అన్నది.

మడేలు భార్య బదులిచ్చేలోపల పొదమాటునుంచి మగమనిషి బయటికి వచ్చాడు.

75
  చాళుక్యసింహాసనం

“ఏందయ్యా! ఈ దౌర్జన్యం? చూస్తుంటే పెద్దింటోడి లాగున్నవ్. ఈ దొంగబుద్ధులేటీ?”


అన్నాడు.

“ఆర్నీ సిగదరగ! బంగారు మాడిస్తాను బట్టలుతికిపెట్టరా అంటే ఇద్దరూ పొదలోదూరి


ఏంచేస్తున్నారురా పట్టపగలు?”

“సామే! నీవెప్పుడిచ్చావ్ బంగారు మాడా?”

“నీకిద్దామని మాడ పట్టుకు తిరుగుతుంటే యాడా కనపడందే!అరుచుకుని అరుచుకుని


గొంతెండిపోయింది. అక్కడేంచేస్తున్నావురా, పెళ్ళాం తల్లో పేలుతీస్తున్నావా? పగటి పొందు
పాపమని తెలీదురా?”

“తప్పుకాయి దొర! దానికి కల్లు తాపిస్తున్నా! అంతే! అదే కావాలంది.” అన్నాడు


మడేలు సిగ్గుపడుతూ.

విశాఖదత్తుడు అతడిచేతులో ఒక పసిడి వరాహమాడ ఉంచాడు.

మడేలు ఎగిరిగంతేశాడు తేలుకుట్టినట్లు. “ఇంత పందిమాడ నా జనమలో చూడ్లా!


ఇంత రొక్కానికి చిల్లరెక్కడ తెచ్చేది దొరా!” అన్నాడు రజకుడు.

“పెద్దింటోడు ఎప్పుడైనా చిల్లరడుగుతాడ్రా? మూర్ఘుడా! అక్కడ మేము విడిచిపడేసిన


బట్టలున్నాయి. శుభ్రంగా ఉతికి ఆరేసుంచు. మేమిద్దరం ఊళ్ళోకెళ్లి బోంచేసి వస్తాం.
అంతవరకు కొన్ని కోకలియ్యి” అన్నాడు విశాఖదత్తుడు ఆజ్ఞాపిస్తున్నట్లు.

మడేలు ఇద్దరికి తగిన ఉడుపులిచ్చి తాటిమొవ్వలాంటి కుచ్చళ్ళ తలపాగాలు చుట్టి


మరీ ఇచ్చాడు.

మిత్రులు విశాఖదత్తుడు విష్ణువర్ధనుడు అశ్వాలనధిరోహించి రాష్ట్రకూటులు


ఊహించని మార్గంలో పయనమయ్యారు.అప్పటిదాకా పచ్చిక మేసిన గుఱ్ఱాలు జోడుగా
తోకమొదళ్ళు పైకెత్తుకుని పరుగెత్తాయి.

“విష్ణూ! ఎప్పుడైనా ఈ మాన్యకేతదుర్గాన్ని ముట్టడించవలసివస్తే ఆ సైన్యాలకు అద్యక్షత


వహించవలసిన సేనాపతిని నేనే!”అన్నాడు విశాఖదత్తుడు.

“అలాగా! ఈ రాష్ట్రకూటుల దుర్గాన్ని ముట్టడించడానికి ఎంత సైన్యం కావాలంటావ్?”

“బహిరంగంగా ముట్టడించాలంటే లక్షన్నర పదాతులు ఇరవైవేల అశ్వికులు వేయి


ఏనుగులు కూడా తక్కువే! వీటికి తోడు యంత్రసామగ్రి కూడా చాలా కావాలి. రాళ్ళు ఋవ్వే

76
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

యంత్రాలు అగ్నిగోళాలు విసరే యంత్రాలు లగ్గలకెగబాకే ఉడుములు మాష్టీలు కూడ


కావాలి. అప్పటికీ విజయం నమ్మకంలేదు. ఈ దుర్గానికున్న సుగుణ మేమంటే చుట్టూ అగడ్త
లేదు.”

“వీరికింత సైన్యం ఉందంటావా?” అన్నడు విష్ణువర్ధనుడు సందేహంగా.

“లేకేమీ. కానీ మాన్యకేత నగరమంతా నీళ్ళ ఎద్దడి. ఎండాకాలం నీళ్లు దొరకవు. కాగ్నా
నది చాల చిన్నది. వేయి ఏనుగులు ఒక్క గుక్కలో పీల్చేయగలవు. అందుకే వీళ్ళు సైన్యం
అంతా ఒక్కచోట వుంచకుండా అక్కడక్కడా కృష్ణానదీతీరానా భీమానదీ తీరానా ఉంచి
పోషిస్తున్నారు.

అంతేకాక రాష్ట్రకూటులకు విశ్వాసపాత్రులైన మంచి సామంతులున్నారు. సపాదలక్ష


దేశం, నిదూరుభోదన, వేములవాడ చాళుక్యులు వీరికి చాలా విధేయులు . అలాగే వనవాసి
పాలకులు, బాదామి వారు, అటు ఉజ్జయిని సమీపంలోని ఇంద్రపుర సామంతులు, అవంతీ
సామంతులు ముఖ్యులు. వీరిసైన్యం ఘూర్జరదేశంలోను కచ్ఛ దేశంలోను చాల వుంది.
లత్తులూరు లాటదేశంలోను చాలవుంది.” అన్నాడు విశాఖదత్తుడు.

“అయితే మాన్యకేతాన్ని జయించడం అంత సులువు కాదనమాట!” అన్నాడు


విష్ణువర్ధనుడు తేలికపని కాదన్నట్లు.

“అందుకే వీరిని కొడితే గుప్తంగానే కొట్టాలి!”అన్నడు విశాఖదత్తుడు.

“అదిమాత్రం సాధ్యమా? మాన్యకేతాన్ని ముట్టడించడానికి నీకైతే ఎంత


సైన్యంకావాలీ?” భవిష్యత్తు నాలోచిస్తూ అన్నాడు విష్ణువర్ధనుడు. వీరుడెవరూ
ఒక్కవిజయంతో సంత్రుప్తి పడి నిద్రపోడు.

“గుప్తంగా కొట్టాలంటే కావలసింది ఎక్కువ సైన్యంకాదు. గొప్ప వ్యూహంకావాలి.


అప్పటికీ పదివేల కాల్బలం ఒకటి రెండు అశ్విక దళాలు ఆయుధ సామగ్రి అవసరం.”అన్నాడు
విశాఖదత్తుడు.

“అవన్నీ కూర్చుకోవడానికి సమయం ఎంత కావాలో కూడ చెప్పు. మన దేశంపై వీళ్ళ


దండయాత్రలు ఆగాలంటే ఎప్పటికైనా మాన్యకేతాన్ని పడగొట్టక తప్పదు!” నిశ్ఛయించు
కుని అన్నాడు విష్ణువర్ధనుడు.

“పదివేల సైన్యంతో దండయాత్రకెళితే వాళ్ళు మనలని ఊచకోత కోస్తారు.వీళ్ళకు


నగరం చుట్టుప్రక్కల లక్ష సైన్యం ఉంది. ఈ దుర్గాన్ని ముట్టడించాలంటే మనవాళ్లు
పదివేలమంది ఉద్దండుల్ని ఈ నగరంలోకి అజ్ఞాతంగా చేర్చాలి. వీరు మాన్యకేతం ప్రజల్లో
కలిసిపోయి జీవించావలి. వీళ్ళంతా ఒక్కసారిగా కాకుండా పలు ప్రాంతాలనుండి వలస
77
  చాళుక్యసింహాసనం

వచ్చినట్లు చేతి వృత్తులు చేసుకుంటూ అక్కడ ఉండిపోవాలి. దీనంతటకి రెండుమూడు


సంవత్సరాలు పడుతుంది.”

“ఆయుధసామగ్రి సంభారాలు చేర్చడమెలాగు?”

“మనకు స్ధానికంగా ఎవరేనా పెద్దవాడు ఈ నగరంలో ఆశ్రయమివ్వాలి. లేకపోతే


సాధ్యంకాదు. మరి ఆంధ్రశ్రేష్టి గోమఠేశ్వరయ్య ఎలాంటివాడు?”ప్రశ్నించాడు విశాఖదత్తుడు.

“ఆయన ఆశ్రయమివ్వబట్టే మనమీ వీరోత్సవాలలో మారువేషాలతో పాల్గొనగలిగాం!


ఆయన చేసిన సహాయం మరువరానిది. కానీ ఆయనకు రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని
పడగొట్టవలసిన పగ ఏముందీ? ఆయన రాజద్రోహానికి ఎందుకు ఒడికడతాడు?”

“అదీ నిజమే! అతడు మనకు సహాయం చేస్తున్నట్లు తెలుస్తే తలకాయ లేచిపోతుంది


కదా! దేశద్రోహుల్ని ఎవరూ తెగవేయకుండా ముద్దుపెట్టుకోరు!”

“అసలు ఈ యుద్ధానికి నీవే ఆధిపత్యం వహించగలనని నీవు ఎలా చెప్పగలవు?”

“నేనీ నెల రోజులూ ఇక్కడ గాడిదలు కాశాననుకున్నావా?” కొంచం కోపంగా అన్నాడు


విశాఖదత్తుడు.

“పోనీ కంచర గాడిదలు కాశావనుకుందాం?”

“కాదు. రోజుకో వేషం వేశాను. ఒక దినం కోటలో జలవ్యవస్త పాడైపోయింది. నేనొక


కర్మ చారుల ముఠాతో కలిసి శ్రామికుడిగా పనిచేయడానికి కోటలోకి వెళ్ళాను. కోటలో ఒక
పెద్ద బావివుంది. అందలోకి నీరు కాగ్నా నదినుండి వస్తుంది. ఆ నీటిని మానికల యంత్రంతో
తోడి జలనాళికలలో పోస్తారు. ఈ నాళికలు అన్ని అంతఃపురాలలోకి నివాసాల లోకి విస్త
రించి వున్నాయి. నేనవన్నీ పూడికతీసి శుభ్రపరిచాను.”

“మంచి పారిశుధ్యం పనివాడివనమాట! పనికొస్తావు. ఇంక ఏమేమి చూశావు?”

“కోటలో చక్రవర్తుల అంతఃపురం ఇంద్రవల్లభుల విలాసం రాజమాత నివాసం ప్రధాన


సేనాధిపతుల గృహాలు చూశాను. సభామండపం, కోట మధ్యలోనున్న ఆకాశాన్నంటే రాతి
ధ్వజం, రాజకుమారి అంతఃపురం అన్నీ చూశాను.”

“నీకు తోకొక్కటీ తక్కువ కానీ రామాయణం సుందరకాండలోని హనుమంతుడి కేమీ


తక్కువ కాదనమాట!”అన్నాడు విష్ణువర్ధనుడు.
“నీ ఉపమానం సరిగ్గానే వుంది. లంకలో హనుమంతుడు ఏమేంచూశాడో తెలుసా?”

78
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఏమో!”
“బిత్తల వనితలనెందరినో చూసాడు. నేనూ కూడా చూశాను.”
“అసలే నీ కన్నుమంచిదికాదు. అలా చూడడం తప్పురా మిత్రమా!”
“మరి హనుమంతుడు చూడలేదా?”
“నువు కోతివైనంతమాత్రాన నీకూ హనుమంతుడికి పోలికా? ఐనా ఆయన జితేంద్రి
యుడు!”
“అదికాదు సంగతి! ఆయన వానరం, ఒక శాఖామృగం!”
“హనుమంతుడు శాఖామృగమనే మాట రామాయణంలోనే వుంది.”
“జంతువులేవీ బట్టలు కట్టుకోవు. మనం వాటిల్నిచూస్తుంటాం. అలాగే మనని
జంతువులు నగ్నంగా చూడవచ్చు!”
“కానీ నీవనుకున్నట్లు కాదు. రామాయణంలో వానరులు నాగరికులు. వస్త్రాలు
ఆభరణాలు కిరీటాలు ధరించేవారు. హనుమంతుడు ద్విజుడులా యజ్ఞోపవీతం
ధరించేవాడు!”
“విష్ణూ! రామాయణంలోనే ఒకపెద్ద వింతవుంది తెలుసా?”
“ఏమిటదీ?”

“రామాయణంలో సీతాదేవి హనుమంతుడిని చూసి రాక్షసుడేమోనని భయపడింది.


కానీ అసలు కోతి మాట్లాడడమేమిటని ఆలోచించలేదు! అసలు రామాయణంలో వానరులు
అంటే ఏమిటీ అనేది విశదీకరించలేదు నిర్వచించలేదు. వాల్మీకి వానరుల్ని
సమయానుకూలంగా వాడుకున్నాడు. ఒకచోట వాలిని నీవు మృగం కాబట్టి చెట్టుచాటు
నుంచీ వేటాడానంటాడు. ఇంకోచోట హనుమంతుడు చతర్వేద పారంగతుడు నవవ్యాకరణ
పండితుడనీ అంటాడు.”
“ఆకాలంలో కోతులు మాట్లాడేవేమో!”
“తోటకూర కట్టేంకాదూ! ఆ కాలంలో మాట్లాడితే ఈ కాలంలోను మాట్లాడేవి.
రాముడు లక్ష్మణుడు కూడ కోతి మాట్లాడడమేమిటని ఆలోచించలేదు!”
“కిష్కింధాపురం అగ్రహారీకులందరూ ప్రత్యేకమైన జాతికావచ్చుగా!”
“రాముడు మనిషి. సముద్రంమీద ఎగరలేకపోయాడు. హనుమంతుడికి తోకవుంది.
సముద్రంమీద ఎగిరాడు. అంటే వానరమేకదా! మరి మాట్లాడడం ఏమిటీ!”
“ఎవరైనా పండితుల నడుగు.”
“వాళ్లకెప్పుడైనా ఇలాంటి అనుమానాలొస్తేకదా మనకి చెప్పడానికి!”
79
  చాళుక్యసింహాసనం

“నీ వాదన సరేకానీ నాకు కడుపులో ఆకలి దంచేస్తోంది.ఇంక తట్టుకోలేను.” అన్నాడు


విష్ణువర్ధనుడు.
“గుఱ్ఱాలకు గుగ్గెళ్ళ సంచీ కట్టివుంచాను. గుప్పెడుగుప్పెడు తిను.” అన్నాడు విశాఖ
దత్తుడు.
“గుఱ్ఱం గుగ్గెళ్ళా!”
“గుఱ్ఱం పచ్చిగడ్డి దొరక్కపోతే ఎండుగడ్డి మేస్తుంది. మనం చీకటి పడేలోపున ఎక్కడైనా
పేదరాశి పెద్దమ్మ ఇంటికి చేరాలి. అప్పటిదాకా వైశ్వానరుడిని గాలి మేయమను. అవును కాని
కోటలో రాజకుమారి చాలాచాల అందంగా ఉందిరా!”అన్నడు విశాఖదత్తుడు.
“కన్నువేశావూ?”
“లేదురా! నీకు తగిన యువతి! సమయోరేవ శోభతే అని నీకోసం చెబుతున్నా!”
“విశాఖా! ఇవాళ యుద్ధంలో అంతః పుర స్త్రీ ఒకతె గాలిలోనే బాణాన్ని బాణంతో
కొట్టిందిరా! చాలా అధ్భుతం! లేకపోతే ఒక బాణం నాప్రాణాన్ని తీసేదేమో!”
“ఎవరా మగువా?”
“గమనించేటంత అవకాశం లేదు. నన్ను గజకంకణంలో బంధించాలని చూశాడు
ఇంద్రవల్లభుడు. గజముఖాంతస్తాలని నా ములుకులతో చీల్చి ఛండాడాను. కానీ ఎవరో
చాటునుంచి పొంచివుండి శరం సంధించాడు. ఒక్క లిప్తకాలం అటూ యిటూ అయినా
ఏమయ్యేదో! ఆ లేమ ఎవరో, ఆ గూఢచారి బాణాన్ని గాలిలోనే తనబాణం తో తుంచింది.”
“నేనిక్కడ ఆడగూఢచారుల నెవరినీ నియమించలేదే! ఎవరో ఆరాతీయి. లేపుకొచ్చి
రాక్షస వివాహం చేసుకుందువు!”
“బలం వుందికదా యని ఎప్పుడూ ధర్మాన్ని అతిక్రమించకూడదు.”
“అలాగా! పై తరంలో కైరా వివాహ మండపంనుంచి చాళుక్యుల పెళ్ళికూతురు
భావనాగను ఈ రాష్ట్రకూట ఇంద్రరాజు అపహరించుకు పోలా? నీవునేర్పిన విద్యయే అని
అందుకు ఈ తరంలో ప్రతీకారం తీర్చుకుందాం! అప్పుడు రాజులకు రాక్షస వివాహం తప్పు
కాదన్నారు. నీరజాక్షుడైన శ్ర్రీకృష్ణుడు కూడా రుక్మిణీదేవిని రాక్షసంగా ఎత్తుకు పోయాడు.
ఇప్పడు రాష్ట్రకూటులకు ఒక గుణపాఠం నేర్పుదాం!”

“మనువుకు మగువకు మనసుండాలి! వాసుదేవుడు రుక్మిణీ దేవి కోరిన మీదట తీసుకు


వెళ్ళాడు. అది రాక్షసం కాదు! వరించడం!”
“ఓరి పిచ్చివాడా! రణరంగంలో నీప్రతిభ చూసి ఆబాలవృద్ధపర్యంతం అంగనలు
మూర్ఛ పోయివుంటారు! నువు ఊ అంటే పెళ్ళయిన ఆడదికూడ మొగుడినొదిలేసి నిన్ను చేసు
కుంటుంది. తెలుసా!”

80
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“విశాఖదత్తా! నీకిలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టే నీ గురించి మన ఆచార్యుడు


సరిగ్గా చెప్పారు.”
“ఏంచెప్పారు?”
“విశాఖదత్తుడు మహావీరుడేకానీ ధర్మాధర్మ వివర్జితుడని!”
“సరేకానీ నేను చిత్రపురం వస్తు ప్రదర్శనశాలకు వెళ్ళాను. అక్కడొక అమ్మాయి
పరిచయమయింది. అనుకోకుండ ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాను. కొంచం సేపు
మాట్లాడుకున్నాము. కానీ ఆ అమ్మాయి నన్ను కూలివాడనుకుంది!”
“సరిగ్గానే అనుకుందిగా! పారిశుధ్యం పనివాడివి!”
“పోరా! ఆ అమ్మాయి గుర్తుగా ఆమె పిడిబాకును తస్కరించాను!”
“చోరశిఖామణివి కూడానా?”
“విష్ణూ! కాని ఆ అమ్మాయిని తాకగానే అదోలాగ అయిపోయాను. ఒంట్లో విద్యుల్లతలు
ప్రవహించాయి!”
“ఎవరా అమ్మాయి?”
“రాజకుమారి సఖి కావచ్చు! తనపేరు అరణి అనిచెప్పింది.”
“కోటలోనే పాగా వేశావనమాట!”
“ఏమిటలా అంటున్నావు?”
“నీవీ దుర్గాన్ని ముట్టడించగలనన్నావే అప్పుడు నీకు ఇంటి దొంగ లాగ పనికొస్తుంది!”
“ఛా! అలా ఆడవాళ్ళను మన అవసరాలకు వాడుకోకూడదు! మనకు పరాక్రమం లేక
పోతే కదా.”
“ఈ మాటకు మాత్రం బుథ్ధిమంతుడనాల్సిందే! ఇంతకూ ఈ రాష్ట్రకూట సైన్యాన్ని
గురించి నీవేమి తెలుసుకున్నావు?”
“ఎందుకలా అడుగుతున్నావూ?”
“ఎప్పటికైనా ఈ మాన్యకేతాన్ని కొట్టకుండా ఈ కథకు ముగింపు ఉండదు!”

“వీరి సైన్యానికి ఇద్దరు అద్యక్షులు. లీశోత్తరదీక్షితుడు, బంకెయసెల్లకేతుడు. ప్రస్తుతం


బంకెయ వనవాసిలో రాజప్రతినిధిగా ఉన్నాడు. వీరిద్దరిలో ఒకళ్ళు రాజధానిలో వుంటే
మరొకరు బయటవుంటారు. ఎప్పుడూ బంకెయ ఉండగా మాన్యకేతం ముట్టడించ కూడదు.”

“ఎందుచేత?”

81
  చాళుక్యసింహాసనం

“సింహాసనానికి బంకెయ ఎక్కువ విధేయుడు. లీశోత్తరదీక్షితుడు కూడ విధేయుడేకానీ


వేశ్యాలోలుడు. ఎప్పడూ రాసతరంగిణి ఇంట్లోనే వుంటాడు. అందుకే ఇతడిని మనం తేలికగా
పట్టగలం! మాన్యకేతంలో కాల్బలాధిపతులు గజసాహిణులు అశ్వసాహిణులు అందరినీ
లెక్కకట్టాను. వాళ్ళవిలాసాలు అలవాట్లు అన్నీ గమనించాను. ఇంద్రవల్లభుడు గొప్ప
సేనాధిపతేకానీ ఎల్లపుడూ బాలచక్రవర్తిని కనిపెట్టుకునే వుంటాడు.”

“విశాఖా! ఈ దినం రోషంతో బాలచక్రవర్తి నన్ను బంధించమని ఆజ్ఞాపించాడు.


సైన్యం రాజాజ్ఞ పరిపాలించబోయి భంగపడింది. నాకు సారధిగావున్నశతావరి చంకలో
శూలం దిగి రథంపైనుండి పడిపోయాడు. అతని పరిస్థితి ఎలావుందో!”

“అతడు పోతే అదృష్టవంతుడు. లేకపోతే విచారణతో ఎన్ని బాధలు పడతాడో!”

మిత్రులిద్దరూ అలా మాట్లాడుకుంటూ ప్రయాణించి చీకటి పడిన తరువాత ఒక


కుగ్రామా నికి చేరుకున్నారు. ఊరికి చివరగానున్న పూటకూళ్ళమ్మ ఇంటికి చేరారు.

14 కుటిలుడు
కోటలో అది ఇంద్రవల్లభుని అంతరంగిక మందిరం. ఇంద్రవల్లభుడు జగదేకవీర
ప్రదానోత్సవం నుంచీ వచ్చినప్పటినుంచీ దెబ్బతిన్న పులిలా గాండ్రిస్తున్నాడు. పచ్చిగంగ
కూడా ముట్టలేదు. చాళుక్య రాకుమారుడు విష్ణువర్ధనుడు తప్పించుకున్న తీరు ఆయనను
చాలా కలవర పెడుతోంది. ‘మూర్ఘులు! గజ కంకణం మొత్తం భ్రష్టం చేశారు. వచ్చినవాడి
శౌర్యం అంచనా వేయలేక సింహనాదాలు చేస్తారా? ఎంత తెలివి తక్కువా! వీళ్ళీ పిచ్చిచేష్ట
చేయకుంటే ఆ యువకుడు ఈపాటికి చెరసాలలో వుండేవాడు. రాష్ట్రకూటుల పరువు మొత్తం
పోయింది. దేశ విదేశాలవాళ్ళందరూ మన వైఫల్యాన్ని కథలు కథలుగా చెప్పుకుంటారు.
దీనికి బాధ్యులైన వారినందరినీ శిక్షించాలి!’

అప్పటికే అక్కడ మహాసైన్యాధిపతి లీశోత్తర దీక్షితిడు చంగనార్యుడు మొదలైన


వారంతా ఇంద్రవల్లభుని చేతులో తిట్లుతిని నిష్క్రమించారు. కుమారుడు కర్కవల్లభుడు
మాత్రం మిగిలాడు.

“కుమారా! అసలీ జగదేకవీరపదవికి ఎన్నిక ప్రతిపాదన ఎక్కడనుంచి మొదలైందీ?”


అన్నాడు ఇంద్రవల్లభుడు.

“నాన్నగారు. నేను సాము కసరత్తులలో మునిగివున్నాను. గమనించే అవకాశం లేదు.


అసలు ఆ చాళుక్యయోధుడు మారువేషంలో మన నగరంలో ఎలాప్రవేసించాడూ. అతడికి
ఆశ్రయమిచ్చినదెవరు?”

82
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“అదే తెలియకుండవుంది. మన సేనాపతులలోనే ఎవరైనా సహకరించారా అని


అనుమానించ వలసి వస్తోంది. ఈ విద్యాప్రదర్శనలలో ఎన్నో కుతంత్రాలు నడుస్తున్నాయని
శిరఃప్రధాని చెబుతే మనం విస్మరించాము.”

“నాన్నగారు. ఆ రాజద్రోహులను ఉపేక్షించరాదు.”

“అంతేకాదు. మన సార్వభౌమాన్ని నవ్వులపాలు చేసిన ఆ చాళుక్యాధముల్ని


హతమార్చడం కూడ అవస్యకర్తవ్యం. ఆ నరేంద్రమ్రుగరాజును గద్దెదించి భీమసలుఖి
మహారాజును చాళుక్యసింహాసనం ఎక్కించాలి.”

“భీమసలుఖి మామయ్య అసమర్ధుడు. సింహాసనం నిలుపుకోలేడు. కాని ఆయనను


అడ్డంపెట్టుకుని వేంగిని మనరాజ్యంలో కలుపుకోవాలి. నన్ను చరణాకోలతో కొట్టిన ఆ
విష్ణువర్ధనుని జయించి పగతీర్చుకునే అవకాశం నాకు యివ్వండి.”

“కుమారా! అన్నిటికీ యుద్ధం ఒకటే పరిష్కారంకాదు. తొందర పడకు. అంతకు


ముందు పన్నవలసిన చతురోపాయాలు చాలావున్నాయి. నీవు డస్సివున్నావు.
విశ్రాంతితీసుకో” అని కుమారుణ్ణి పంపించివేశాడు ఇంద్రవల్లభుడు.

కొంచం తడవు తరువాత మహారాజు కంచుఘంట మీద బలంగా మోదాడు. ఆ


శబ్దానికి చెవులు గింగిరుమన్నాయి. ప్రతీహారిణి పరుగెత్తుకుని వచ్చింది. ఇంద్రవల్లభుడు
కుటిలుడిని పిలవమని ఆజ్ఞాపించాడు. ఆమె వందనం చేసి వెళ్ళిపోయింది.

ఇంద్రవల్లభుడు ఇలా ఆలోచిస్తున్న తరుణంలో కుటిలుడు వచ్చి ఇంద్రవల్లభునికి


సాగిల పడి నమస్కరించాడు. నిజానికతని పేరు కుటిలుడు కాదు. అతడు తన పేరు చెప్పినా
గుర్తుపెట్టుకుని పలకడం కష్టం. అతడీ దేశమువాడే కాదు. చీకటిఖండం నుంచి వచ్చినవాడు.
గొప్ప వేటగాడు. అతడి తల ముదిరిన తాటికాయలాగా వుంటే జుత్తు గింగిరాలు తిరిగి
ఊలుకత్తిరించిన గొఱ్ఱెబొచ్చులా ఉంది. పెదవులు వెనక్కు తిరిగి ఉమ్మెత్త పువ్వులా విచ్చుకుని
వున్నాయి. పొంచివుండి బాణాలు వేయడంలో అతడు నేర్పరి. బాణం గురితప్పదు.
ఇంద్రవల్లభుడతడిని ఎవరినైనా రహస్యంగా హతమార్చడానికి ఉప యోగిస్తుంటాడని
చెప్పుకుంటారు.

“ఏరా! నీవు చాలా ముదిరిపోయావురా! ఇంకాఎందుకూ పనికిరావు. అందుకే నీ


చేతులు నరికించి వదిలి పెట్టాలనుకుంటున్నాను.”

“దేవరా! ఈ దేహం మీది.నాదికాదు. మీ బానిసను. మీ ఉప్పుతిని పెరిగినవాడను.


మీరేం చేసినా నోరు మెదపను. నా మొదటిబాణం గురి తప్పినమాట నిజమే! అతడి
తాటంకాన్ని తాకుతూ పోయింది. నారెండోబాణం సరిగ్గా అతడి కంఠానికే గురి పెట్టాను.”

83
  చాళుక్యసింహాసనం

“అయినా గురితప్పిందంటావా?”
“కాదుదొరవారూ! ఎవరో నా బాణాన్ని బాణంతో తుంచారు.”
“బాణాన్ని బాణంతో తుంచడమా? అదేమిటీ?”
“గాలిలో పోతున్న నాబాణాన్ని గాలిలోనే విరిచివేశారు.”
“ఏమిరా! నా వద్ద నాటకాలాడుతున్నావా? బాణాన్ని బాణంతో కొట్టడానికి ఇదేమైనా
ద్వాపరయుగమా?”
“దొరవారి బానిసను. నామాట తప్పయితే నా నాలుక కోయించండి. నేను చెప్పేది
నిజం!”
“బాణాన్ని బాణంతో కొట్టడం సాధ్యమా?”
“చాలచాల కష్టం.”
“మనదేశంలో అలాంటి విలుకాళ్ళు ఎవరున్నారు?”
“తెలియదు దేవరా! అలాంటివాళ్ళే లేరు.”
“మరి ఆ బాణం ఎవరు వేసుంటారూ? విదేశీయులా? ఆ బాణం ఎటునుండీ వచ్చిం
దిరా?”
“ఆడంగుల అంతిపురం! రాజకుమారి పందిరినుంచే వచ్చింది.”
“నిజం చెబుతున్నావా?”
“మా అమ్మతోడు.”
“కుటిలా! నీవింకా వెళ్ళవచ్చు.”
కుటిలుడు మరొకసారి సాగిలపడి మొక్కి నెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇంద్రవల్లభుడు కంచు ఘంటమీద మళ్ళీ గట్టిగా కొట్టాడు. ప్రధాన ద్వారపాలిక
ప్రవేశించింది.

“వాడు వెళుతున్నాడు చూశావుగా!వెలుతురు చొరని చీకటికొట్లో పడవేయి.


శాశ్వతంగా!”

“చిత్తం!” అని వెళ్ళిపోయింది ఆ దళవాయి.

ఇంద్రవల్లభుడు మరొకసారి కంచుఘంట నినదింపచేశాడు. మరొక ప్రతీహారిణి


ప్రవేశించి ఆజ్ఞకై నిలబడింది. ‘రాకుమార్తె శిరీషను పిలవమని ఆజ్ఞాపించాడు.

84
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

15 అస్త్ర సన్యాసం
ఇంద్రవల్లభుల అసహనం మరీ పెరిగింది. ‘ఎవరు తప్పు చేశారు? బాణాన్ని బాణంతో
ఎవరు కొట్టుంటారు? అంతః పురం ఉటజాలలో అంతటి నేర్పరు లెవరుంటారు. శిరీష స్నేహి
తులు ఎవరైనా అతిధులుగా వచ్చారా? ఆడవాళ్ళలో అంతటి మొనగాళ్ళుండరు. పరదేశం
గూఢచారులెవరైనా మారువేషాలలో చేరారా.కుమార్తెతో మగవాడెవరైనా ఆడ వేషంలోవచ్చి
స్నేహం చేయటం లేదుకదా! వయసు వచ్చిన పిల్లలు. కామోద్రేకం సహజం. చెలికత్తెలను
పిలిచి విచారించాలి. తల్లిలేని పిల్ల. ఉన్నా దాదుల పెంపకమే కదా. ఏ రాణి పిల్లల్ని పాలిచ్చి
పెంచుతోందీ?’

సమాలోచనా మందిరంలోకి ప్రతీహారిణి ప్రవేశించి రాకుమార్తె శిరీష ఆగమనాన్ని


తెలియ జేసింది. అంతటి విచారంలోనూ కుమార్తె వచ్చిందంటే ఆయన ముఖం పైన సంతోష
చంద్రికలు వెల్లివిరిశాయి.

తను పిలవగా వచ్చిన రాజకుమారిని దగ్గరకు తీసుకుని ముద్దాడి తలనిమిరి శిరం


మూర్కొని గోళ్ళతో ముంగురులు సవరించి తన ప్రక్కన కూర్చుండ బెట్టుకున్నాడు.

“అమ్మా! నీకు కుశలమేనా? రాజ్యభారం నాపైన పడినప్పటినుంచీ నీ యోగక్షేమాలు


విచారించడానికే కుదరటంలేదు. తల్లిలేనిపిల్లవు.”అన్నాడు ఇంద్రవల్లభుడు.

“నాన్నగారూ నేను క్షేమమే! అమ్మ లేని దుఃఖం తీరేదికాదు. తలుచుకున్నపుడల్లా


కళ్ళనీరు తిరుగుతుంది. నా చెలికత్తెలందరూ నాతో స్నేహంగా ఉంటున్నారు. మీరే బహు
కార్యనిమగ్నులై అలిసిపోతున్నారు. మీరు త్వరత్వరగా ముసలివారై పోతున్నట్లు అనిపి స్తోంది.
ఇంతకూ నాన్నగారూ నన్ను పిలిపించిన విశేషమేమైనా ఉందా?” అన్నది శిరీష.

“అమ్మా! ఈ దినం రాష్ట్రకూట మకుటానికి చాలా అవమానం జరిగింది. ఆ చాళుక్య


రాజ కుమారుడు ఎలాతప్పించుకున్నాడో అర్ధం కాకుండావుంది. మనలో ఎవరో
రాజద్రోహులూ దేశద్రోహులూ లేకపోతే అలా జరిగేదికాదు.” అన్నాడు ఇంద్రవల్లభుడు
కుమార్తెను ఎలా మందలించాలో తెలీక.

“నాన్నగారు! ధర్మం భ్రష్టమైన వేళ అవమానం జరగదా! జగదేకవీర పదవికి అసలా


ఎన్నిక ఏమిటీ? విదేశీ రాయబారి ఆక్షేపించేదాకా మన బుఱ్ఱలేవీ పనిచేయవా? ఎవరూ
నిరోధించరా? మిన్నకుంటారా? మనకు సిగ్గనిపించదా? అతడు వీరాధివీరుడు. జగదేకవీర
బిరుదాంకితానికి తగినవాడు. అతడిని సన్మానించడానికి బదులు బంధించడమేమిటీ? ఇది
అన్యాయం కాదా?”చాలా ఆవేశంగా శిరీష తండ్రిని నిలదీసింది.

“అమ్మా!. అతడు ఒక దొంగలాగా మన నగరం ప్రవేసించాడు. అసలు అందుకే

85
  చాళుక్యసింహాసనం

అతడిని బంధించవచ్చు! భల్లాణ పోతినాయుడని పేరు పెట్టుకుని మనందరినీ మోసం


చేశాడు. అప్పటికీ మన సన్మానాన్ని అంగీకరించకుండా ధూర్తుడై ఎంతోమంది రాజన్యుల
సమక్షం లో మన చక్రవర్తిత్వాన్ని ఆక్షేపించాడు. అతడు తప్పక మరణ దండనకు అర్హుడు.”
నిచ్ఛ యంగా అన్నాడు ఇంద్రవల్లభుడు.

“నాన్నగారూ! మనం చేసిన పనిఏమిటీ? అతడు అందరికన్నా శ్రేష్ఠయోధుడు. రెండు


బంగారు పతకాలు ఒక వెండి పతకం సాధించాడు. అతడికి జగదేకవీర బిరుదం ఇవ్వ కుండా
లీశోత్తరదీక్షితుడు పన్నిన కుట్రను మీరెలా సమర్ధిస్తారూ? అన్నగారు కర్క వల్లభుడు రెండవ
స్థానంలోవాడు. అన్నగారికి జగదేకవీర బిరుదం కట్టబెట్టడానికి ఎన్నిక ప్రక్రియ పెట్టాడు. ఇది
అన్యాయం కాదా? జగదేకవీర బిరుదం భుజబలంతో గెలుచుకోవాలి కానీ ఎన్నుకోవటానికి
ఇదేమైనా ప్రపంచ సుందరి పోటీనా?”

“రాకుమారీ! నీకు ధర్మసూక్ష్మాలేమి తెలుసూ? రాజనీతి చాలా జటిలమైనది. అది


సామాన్యులకు అర్ధంకాదు. ముల్లును ముల్లుతో తీయడం దొంగను పొంచివుండి పట్టు
కోవడం తప్పుకాదు. నీలాంటి కోమలులు వాటిలో కల్పించుకోవడం తగదు.”

“నాన్నగారూ? ఏధర్మసూక్ష్మం ప్రకారం ఒక కుటిలుడు పొంచివుండి అతడిపై బాణం


వేశాడూ? అతడినాజ్ఞాపించిన వారి అపకీర్తి సామాన్యమైనదికాదు. శ్రీరామచంద్రుడు వాలిని
చెట్టుచాటునుండీ కొట్టిన పాపానికి ఇప్పటికీ విమర్శలనెదుర్కొంటున్నాడు!

ముందతడు వీరవిద్యాప్రదర్శనలలో తన నిజశక్తితో విజయం సాధించాడు. అతడి ఉత్త


మాంగాన జగదేకవీర కిరీటం పెడితే ఇంత రభస వుండేదికాదు కదా! అధర్మం ఎక్కడి నుండీ
ఆరంభమయిందంటే కర్కవల్లభుని జగదేక వీరుని చేయడానికి కుట్ర పన్నడంతో!”

“కుమారీ! ఒకవిషయం తెలుసా? రాముడు వేసిన బాణం వాలి ఛాతిలో దిగింది.


వీపులో దిగలేదు. వాలిని చెట్టుచాటు నుండీ ఎందుకు కొట్టాడో అర్ధమైతే ఇదికూడా
అర్ధమౌతుంది. వాల్మీకి మహర్షి అలా వ్రాయడానికి ఏమైనా వెఱ్ఱివాడా? లోకానికి ధర్మం
ఎంత సూక్ష్మంగా ఉంటుందో చెప్పడానికే అలా వ్రాశాడు. ఒక దొంగని దొంగలాగా పట్టడం
తప్పుకాదు. ఇంతకూ కుటిలుడి బాణాన్ని బాణంతో తుంచిన ఘనత ఎవరిదో
తెలుసుకోవడానికే నిన్ను పిలిపించాను.”

“నాన్నగారూ! నేనే ఆ కుటిలుడి బాణాన్నిగాలిలోనే తుంచి రాష్టకూట సామ్రాజ్యం అప


కీర్తి పాలు కాకుండా కాపాడాను!”

“కుమారీ నీవు ధనుర్విద్యాభ్యాసం చేస్తున్న విషయమే నాకు తెలీదు. కానీ నీ గురు


వెవడో మూర్ఘుడు కాకపోతే రాజధర్మాలు నేర్పకుండా విలువిద్యా రహస్యాలు నేర్పడం తప్పు.
నీ విలువిద్యా నైపుణ్యాన్ని అభినందించాల్సిన సమయంలో నిన్ను ఒక ప్రభువుగా

86
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

అభిశంసిస్తున్నాను. ఇంతటితో నీవిలువిద్య కట్టిపెట్టు. ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు


చేయకు. కిరాతుడి చేతులో విల్లు ఎలాగో నీ చేతులో ధనుస్సు కూడా అలాంటిదే!”

ఆ మాటలకు రాజకుమారి మనోభావం చాలా దెబ్బతింది. ఆ బాల క్రోధావేశంతో ఊగి


పోయింది. ముఖం ఎఱ్ఱతామర పువ్వులా మారింది. కనులనుండీ నీరు జలజలా రాలింది.

అసలే ఆడపిల్లలకు నీళ్ళకుండ నెత్తిమీదుంటుంది. కొంచం కోప్పడినా కళ్ళవెంట సెల


ఏరులు ప్రవహిస్తాయి. రోషం ఎక్కువ.

“నాన్నగారూ! నేను చేసినది తప్పని ఎలా అంటారూ? ఒక కుటిలుడు ఆ వీరుడిపై


పొంచివుండి బాణము సంధిస్తుంటే ధర్మహాని జరుగుచుంటే చూస్తూ ఊరుకోవడం
ధర్మమా?”

“కుమారీ నీవు ధర్మాధర్మాలను గురించి మాట్లాడతగదు!”

శిరీష వెళ్ళి వేరే ఆసనంమీద ధీమాగా కూర్చుంది ఎదురుగా. వాదనకు సిద్ధమన్నట్లు


ఇలా అంది.“నాన్నగారూ!” అంది గద్గద కంఠంతో శిరీష. “మీరు తగదన్న తరువాత నా
విద్య నిరర్ధకం. ఏకలవ్యుడు గురుకట్నంగా తన బొటనవ్రేలు సమర్పించినట్లు నేను నా
ధనుర్విద్యను శబ్ధభేది సమేతంగా మీ చక్రవర్తిత్వానికి ధారపోస్తున్నాను. నా ప్రాణమానవిత్త
భంగమైనా కూడా నేను విల్లు పట్టను. ఇదే నా శపధం. అత్యంత శ్రద్ధాభక్తులతో అభ్యసించిన
విద్యను త్యజించిన ఈ దినం నాజీవితంలో గొప్ప దుర్దినం.” ఆ మాటలు అంటూ రాజ
కుమారి వలవలా ఏడ్చింది.

అయినా ఇంద్రవల్లభుడు కరగలేదు. బింకంగా కూర్చుండిపోయాడు. ఆయనకు బాల


చక్రవర్తి సంరక్షకునిగా బాధ్యత ఉన్నంతవరకూ రాష్ట్రకూటసామ్రాజ్య ఔన్నత్యమే ముఖ్యం.
కానీ ఆయనకు అర్ధం కానిమాట ఒకటి శిరీష ఉపయో గించింది. అందుకే “ శబ్దభేది
ఏమిటీ?” అన్నాడు.

వెక్కులమధ్య శిరీష కొంతసేపటివరకూ మాట్లాడలేకపోయింది. చివరకు మాట కూడ


దీసుకుని “ఔను నాన్నగారూ! బాణాన్ని బాణంతోనే తుంచడం కాదు శబ్దభేది కూడ నేర్చిన
ధనుర్విద్యా విశారదను!” అన్నది ధీమాగా.

ఇంద్రవల్లభుడు ఒకక్షణం నిర్ఘాంతపోయాడు, నిరుత్తరుడయ్యాడు. “బాలా! నీవింత


విద్యా విశారదవని నాతో ఎప్పుడూ చెప్పలేదే! మన అఖండ రాష్ట్రకూట ధానుష్కులలో ఒక్కడు
కూడా శబ్దభేది నేర్చినవాడు లేడు. కుమారీ నీకీవిద్య ఎలా అబ్బిందీ?” అన్నాడు.

“ఎందుకు నాన్నగారూ! గతజల సేతుబంధనమని నా ధనుర్విద్యా నైపుణ్యాన్ని మీ


సామ్రాజ్యవాదానికి ధారపోసిన తరువాత చెప్పుకోవడం చచ్చిపోయినవాని కన్నులు చారడేసి
87
  చాళుక్యసింహాసనం

అన్నట్లు వుంటుంది!” అన్నది శిరీష ఘాటుగానే.

“తల్లీ! నీమీద నాకున్న వాత్సల్యం అనంతమైనది. కానీ నాకు బాధ్యతలు కూడా


ఉంటాయి కదా! అమ్మా నిన్ను నొప్పించినందుకు నీవు ఏదైనా కోరిక కోరకో!” అన్నాడు
ఇంద్రవల్లభుడు.

రెండు క్షణాలు శిరీష ఏమీ కోరలేదు. తరువాత “నాన్నగారూ! నా వివాహ విషయంలో


మీ సామ్రాజ్యాన్ని ఓడించినవాడికి నన్ను బహుమానంగా ఇవ్వకుండా వుంటే అంతే
చాలు!”అన్నది.

“కుమారీ! ఇదేమి కోరికా?” అన్నాడు విస్తుపోయి ఇంద్రవల్లభుడు.

“అంతేకదా నాన్నగారు! ఆడపిల్లల చదువూముద్దు ముచ్చటలూ పెళ్ళివరకే కదా!ఆ


తరువాత మిమ్ము ఓడించినవాడికి మమ్ము సమర్పించి సంధిచేసుకుంటారు. రాజ్యం
కాపాడుకుంటారు. ప్రాజాపత్య వివాహం అంటే ఇంతేనా!”

“కుమారీ! ఈ రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని ఒకడు జయించడమా! కలకంటున్నావా?”


అన్నాడాయన కొంచం కోపం కొంచం పరిహాసంగా.

“నాన్నగారూ! మీ సేనాపతుల పరాక్రమం ఇవాళ చూసికూడ ఇంకా మేల్కోలేక పోతు


న్నారా? మీసైన్యాన్ని మొత్తం ఒక్కడు జయించాదు. నిజమైన జగదేకవీరుడంటే అలా
వుంటాడు. అతడిని గుర్తించే గౌరవించే సంస్కారం మన రాజమకుటానికి లేకపోయింది”
అన్నది శిరీష.

మహారాజు మనసులో ఒకవంక అన్యాయభావం మరోవంక అవమానభారం మెదులు


తునే వుంది. ఇంక రాకుమారిని రెచ్చగొడితే వాదన ఎంతదూరం పోతుందోనని ఆ సమా
వేశం అక్కడితో ముగించాడు.

16 మలయవనం.
ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్యగారి కుమార్తె వసుమిత్ర. సర్వాలంకార భూషితయై మెరిసి
పోతూ శరీష వద్దకు వచ్చింది ఆ సాయంత్రం. వస్తూనే....

“రాకుమారీ! ఏమిటీ అదోలావున్నావూ?”అన్నది వసుమిత్ర.

శిరీష ఒక్కసారి వసుమిత్రకేసి చూసింది. ఆ పెట్టిన నగలు కట్టిన చీర మేఘమండలం


మధ్యలో మెరిసిన మెరుపులా వుంది. “ఏమీలేదు. అంతా బాగానే వుంది.”అన్నది విషాదంలో
వున్న శిరీష.
88
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఆహా నాకుతెలీదా నీ ముఖచంద్రుడి కళంకం! అకళంక శశివదనం ఈ దినం చెన్ను


తరిగి వుంది. నీ సరసిజాక్షుల చందం నేనెరుగనా! కన్నులు ఆర్ద్రాలై ద్రవించగా నీ చెక్కిళ్ళు
ఇంకిపోయిన సెలఏళ్ళులా వున్నాయి. నయన పక్ష్మాలు ఉబ్బి అధోముఖ కమలపత్రాల్లా
అనిపిస్తున్నాయి. పలుమార్లు కనులు నలుపుకోవడంతో చెదిరిన కాటుక హిమగిరి శకల
ద్వయం లాంటి నీ కపోల యుగళిపై ఆవరించిన నీలమేఘపు నీడా అనిపిస్తోంది. మంచు
కురవడం వలన వెలిసిన తామరపూవులా వుంది నీముఖం. నన్ను చూడగానే ఆనందంగా
ఎగసిపడే నీ వక్షోరుహాలు అవనతమై అశృధారలతో తడిసి మకరికారేఖలు చెదిరి వుండడం
నేను గమనించలేనా!రాకుమారీ నీ విషాదానికి కారణం తెలుసుకోవచ్చా?”

“వసూ! నన్నీ దినం వదిలిపెట్టు. వేధించకు. నన్ను స్వేచ్ఛగా రోదించనీయి. అదికూడా


కరువైతే నాకింకా స్వేచ్ఛఎక్కడా? ఈ బ్రతుకెందుకు.”

“శిరీ! నీకు స్వేచ్ఛ కరువా!”వసుమిత్ర పరిహాసంగా నవ్వింది. “ఈనాటి వీరోత్సవంలో


మనం ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఛలోక్తులు విసురుతూ వీరవన విహారం
చేశాం. ఆ అల్లరి నాకింకా మెదులుతునే వుంది. ఆ భల్లాణ పోతినాయుడిని పూలచండ్లు
అయిపోతే మోదకాలు విసరి సత్కరించావు. నీ వడికి తాళలేక పలాయనం చిత్తగించాడా
అన్నట్లుంది. ఇంతలో ఏమయిందే? నీ వలపులరేడు నిన్ను పలకరించకుండా తృణీకరించి
వెళ్ళి పోయాడనుకుంటున్నావా?”

“ఎవరే నా వలపులరేడు? నీకు పిచ్చిగా వాగడం అలవాటై పోయింది వసూ!”

“ఓహో ఎవడా! ఆ నవమన్మధుడు, రతికిరాజు, తూపు విలుకాడు, నిండు పున్నమి రేడు.


ఘనభుజాదర్పుడు. ధనుర్విద్యా విశారదుడు రణకోవిదుడు. ఆ విశాలమైన ఛాతి
ఎగుభుజములు మెలితిరిగిన కండరాలు. అతడితో రతి.....”

శిరీష తన అరచేతితో వసుమిత్ర నోరుమూసింది.

వసుమిత్ర శిరీష చేతిని ప్రక్కకు తోస్తూ “నన్ను వర్నిం చనీవే! వట్టిమాటలు నావి.
అనుభవించేది నీవు. అతడితో మొదటి అధర చుంబనం అనుభవించేనాడు నాపేరు గుర్తు
పెట్టుకో.

ముందుగా నేను పోతినాయుడంటే ఎంత భయంకరంగానో నల్లగా దున్నపోతులాగా


జిడ్డు వడుతూ ఉంటాడనుకున్నాను. ఆ రేడు నిను క్రీగంట చూడలేదనుకుంటున్నావా? అన్ని
వైపులనుంచీ సంధిస్తున్న ఆయుధ సమూహాలను తన బాణాలతో కొట్టిన మగాడు ఒక నిశిత
శరంతో బాణాన్ని బాణంతో త్రుంచిన తన ఘన ప్రాణవరదాయిని ఎవరో గమనించ
లేడనుకున్నావా? అంతటి కదన కుతూహలుడికి మదన కుతూహలం కూడా అంతేవుంటుంది.
గొప్ప సురత విన్నాణరాయుడై యుంటాడు! ఆ చోర శిఖామణికి నీ కమనీయ

89
  చాళుక్యసింహాసనం

హృదయాపహరణం తెలీదనుకుంటున్నావా! కాకపోతే దొంగ!”

“ఎవరే దొంగ?”

“నీమనోహరుడిని దొంగ కాకపోతే వెన్నెలదొర అనమంటావా? అజ్ఞాతంగా వచ్చి


వనితల హృదయ కుహరాంతరాలు జొచ్చి చిత్తము ముచ్చిలిన వాడి నేమనాలే!”

“ఆపవే నీ ప్రేలాపన! నేనొక ప్రక్క మనో వేదనతో క్రుంగివుంటే నీ సరసోక్తులేమిటీ?”

“మనోవేదనకు కారణం ఏమిటో చెప్పకపోతే నా కవితా స్రవంతి ఇలాగే సాగుతుంది.”

“ఇది కవితాస్రవంతి కాదు. పైత్యం! ఇదినీ వడల తిమ్మిరి. మనోహర మదనవికారం.


మీ నాన్నగారిని నీకు వెంటనే పెళ్ళి చేయమని చెప్పు. అప్పుడుకానీ నీ ప్రణయ ప్రేలాపం
వయసు పొంగు అణగదు.”

“నేనెలాగూ నా వరుణ్ణి ఎంచేసుకున్నాను. కాకపోతే అతడింకా నాకు దూరంగా


వున్నాడు.”

“ఎవడే ఆ అపర కుబేరుడూ!”అన్నది శిరీష.

“కుబేరుడు నాకవసరం లేదు. మానాన్నగారే అపర కుబేరుడు! వేయిమంది ధనికులలో


ధనికుడు. శ్రేష్ఠులలో శ్రేష్టుడు. రత్న రాసులకు పడగలెత్తిన ఫణాళి! నాకు కావలసింది ముద్దుల
రాకుమారుడు. మగటిమి కలవాడు. మదనసామ్రాజ్యాన్ని ఏలగల చతుర చక్రవర్తి!
అంభోదధికి అల్లుడు!”అన్నది వసుమిత్ర.

వాళ్ళలా మాట్లాడుకుంటున్న తరుణంలోనే ప్రతీహారి ప్రవేశించి రాకుమారుడు కర్క


వల్లభుని ఆగమనాన్ని తెలియజేసింది. కర్కవల్లభుని పేరు వినగానే వసుమిత్ర ఎద పొంగడం
స్తన వల్కలం బిగుతు కావడం రాకుమారి శిరీష గమనించింది.

కర్కవల్లభుడు చాలా పొడగరి. అందుకే శూలయుద్ధా విశారదుడైనాడు. చక్కని ముఖ


వర్చస్సు కలవాడు. శిరీషకూ కర్కవల్లభునికీ ముత్తవ్వ ( శీలాకుమారి ) రంగూ పోలికలూ
వచ్చాయి. ఆమె తూర్పు చాళుక్యుల ఆడపడుచు.

“చెల్లీ శిరీ! ఎందుకో ఈ సాయంత్రం నిన్ను చూడాలనిపించింది. నా ఓటమి ముఖం


నాన్నగారికి చూపించలేక ఇటు వచ్చాను. నీ ముఖారవిందం చూస్తేనే నాకు కొంచం అమ్మ
ముఖం కనిపించి ఎంతో ఆనందం కలుగుతుంది.” అలా మాట్లాడుతూ కర్కవల్లభుడు
వసుమిత్ర కేసి చూశాడు.

90
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఓహో! ఇక్కడెవరో రత్నాకరం లాంటి వనితారత్నం ఉన్నారే!” అన్నాడు. వసుమిత్ర


ధరించిన నగలు చూస్తే ఎవరైనా రత్నాకరమనే అనుకుంటారు.

“ఈమె పేరు వసుమిత్ర! నామిత్రురాలు. ఇతడు నా సోదరుడు. కర్కవల్లభ రాకుమా


రుడు.” శిరీష ఒకరికొకరిని పరిచయం చేసింది.

కర్కవల్లభుడు చేతులు ముకుళించి వసుమిత్రకు నమస్కరించాడు. తనకన్నా ముందు


రాకుమారుడు నమస్కరించడంతో వసుమిత్ర తొట్రుపడింది. “అయ్యో నా కర కమలాలు
ముకుళించే లోపలే తమరు చాలా వేగం చూపించారు. తమ వర్చోకిరణాల వేగం
మాబుద్ధికమలాని కుండదుకదా! జాగృతం చేయడానికి ఒక క్షణం జాగు జరిగింది.
క్షంతవ్యురాలను! ఈ దినం ఆర్యపుత్రులను దర్శించడం మాకెంతో ముదావహం. శుభ
దినం.”అన్నది వసుమిత్ర జోడించిన చేతులను అలాగే ఉంచుకుంటూ.

“పోరాటంలోఓడిన నా ముఖాన్ని ఎవరికీ చూపించకూడదనుకుంటే వినూత్న నవలా


మణిమంజరి పరిచయమేమిటీ! మీ వాక్ చతురత్వం నా దుఃఖాగ్నిని చల్లార్చడానికి ఒక
ఊటబావి నీరులా వుంది. తమరి కుముదోదయంతో శుద్ధవిదియ చంద్రుడిలాంటి నా ముఖం
అష్టమీచంద్ర విభ్రాజమానం అయింది.”

“అయ్యో! ఓటమి ఏమిటండీ. ఆర్య పుత్రులు శూలయుద్ధంలో అద్వితీయులు. అఖండ


పరాక్రమవంతులు. కాకపోతే ఖడ్గయుద్ధంలో ఒక అసాధారణుడితో తలపడడంతో ద్వితీ
యులయ్యారు. అశ్వద్ధామ ఒక్క రాత్రి వరప్రసాదుడై విజృంభించినంత మాత్రాన కవ్వడి
పరాక్రమానికి వన్నె తరిగిందా!”

“చాలా పెద్ద ఉపమానం చెప్పారు. నిజానికతడి వడి చూస్తే కవ్వడి లాగే వున్నాడు.
అతడే నిజమైన జగదేకవీరుడు. క్షణికావేశంలో మా రాజమకుటాన్ని అవహేళన చేయడం
తో రోషంతో అతడితో తలపడి భంగపడవలసి వచ్చింది!”

“అంభోనిధి కెరటం పైకెగసి సమసిపోవడం ఉదధికి అవమానమా! ఎలా! పడిన


కెరటమే మళ్ళీ లేవడం లేదా!”

“అన్నయ్యా! మీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ వుండండి. నేను పానీయాలు తిను


బండారాలు పట్టించుకుని వస్తాను” అన్నది శరీష ఇంక అక్కడ తన ఉనికి అవసరం
లేదన్నట్లు.

“అదికాదే చెల్లీ! నామనసు ఏమీ బాగుండలేదు. అందుకని నీతో మలయవనానికి


వాహ్యాళికి వెళదామని వచ్చాను. మీమిత్రురాలేమో మాటలమంత్రాలతో నన్ను ముగ్ధుడిని
చేసివేసింది. అవమానంతో కుంచించుకు పోయిన నాపౌరుషం ఈమె దర్శనంతో పడగ

91
  చాళుక్యసింహాసనం

విప్పు తోంది. ఇంతకూ మీరిరువురూ ముచ్చటించుకుంటూ వుంటారా నాతో వాహ్యాళికి


రాగలరా?” అన్నాడు కర్కవల్లభుడు.

“శిరీ! నీవుకూడా మలయవనానికి బయలుదేరు. నీ మనసుకూడా పిల్లతెమ్మెరలకు


ఊరట చేందుతుందేమో! అన్నా చెల్లెళ్ళు ఆప్యాయంగా కలిసిన ఈవేళ మధుపాత్రలో
మశకంలా నేనెందుకూ! రాకుమారులు కుమార్తెలు మన్నిస్తే నేను చిత్తగిస్తాను” అన్నది
వసుమిత్ర పయ్యెద కొంగు వేలుకుచుట్టుకుంటూ జార్చేస్తూ.

కర్కవల్లభుడు కొన్ని క్షణాలపాటు కన్నార్పకుండా నిగ్గుదేలిన ఆమె వక్షో పద్మాలకేసి


చూస్తూ నిలబడిపోయాడు.

“తమరు కర్కవల్లభులా అనిమిష వల్లభులా! అలా శిలానారాయణమూర్తిలా నిలబడి


పోయారేమిటీ? అయ్యో నా ఉత్తరీయము జారడము కారణమా! క్షమించండి.” పయ్యెద
సవరించుకుంది వసుమిత్ర.

“నీవూ రావే నవలామణీ! మీరిద్దరూ మాటల తూపులతో నాకూ కొంత వినోదాన్ని


కలిగి స్తున్నారుగా” అన్నది శిరీష.

ముగ్గురూ ఆశ్విక రథం అధిరోహించారు. సారధి లేకుండా కర్కవల్లభుడే గుఱ్ఱాల


పగ్గాలు చేతపట్టాడు. వారు కోట దాటి కాగ్నానదీ తీరాన వున్న మలయవనానికి చేరు
కున్నారు.అప్పటికే సంధ్యాసమయం దాటి చాలా సేపయింది. పున్నమి కావడంతో సుధా
కరుడు వెన్నెల పరాగాన్ని భూమిపైన జల్లుచున్నాడు. కాగ్నా నదీతీరంలో పాంధుడెవరో కాళ్లు
జాపుకుని కూర్చుని తోడిరాగం తానం ఆలాపన చేస్తున్నాడు.

మలయవనానికి మూడువైపులా ప్రాకారంలాగా ముళ్ళ చెట్లతో కంచెవుంది. నాల్గవ


వైపు కాగ్నానది ప్రవహిస్తోంది. వనంలో కొంచం దూరం నడిచిన తరువాత శిరీష ఆగి
పోయింది. “నేనింకా ముందుకురాలేను.ఈ చంద్రకాంత శిలావేదికమీద కూర్చుందామా?”
అన్నది. కర్కవల్లభుడు వసుమిత్ర మాత్రం చాలా ఉత్సాహంలోవున్నారు.

“రాకుమారీ! ఇక్కడే ఆగిపోదామా! ఈ వనసందర్శన భాగ్యం ఈ పున్నమి వేళ


కలిగింది. రాత్రిపూట పూసే పుష్ప సౌరభాన్ని ఆస్వాదించే అవకాశం నాకింతకు మున్నె న్నడూ
కలగలేదు. నా ఈ ప్రధమానుభూతిని ఇంకొంతకాలం పొడిగించుకోవాలని ఉంది.
పారిజాతాలు రేరాణులు పున్నాగలు గొజ్జగులు మల్లెలు జాజులు నన్ను మైమరపిస్తు న్నాయి.
పుష్పం వలన వృంతంకూడా సరసిజాక్షుడి పాదకమలాలను జేరుకోగలిగినట్లు నీ సాంగత్యం
వలన కదా నాజీవితంలో ఈ నిశీధి ఇంత పరిమళభరితం అయిందీ!”అన్నది వసుమిత్ర.

“శిరీ! నా అవమానభారం ఇప్పుడిపుడే ఈ పిల్లతెమ్మెర ప్రసారంవలన చల్లబడుతోంది.

92
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

అంతేకాక ఇదిగో నీ స్నేహితురాలి వాక్పరిమళ గంధం వలన నామెడపైని గాయం వేదన


సమసిపోతోంది. మరకమాత్రం నాజీవితమంతా నా మేనిపైన నిలబడిపోతుందేమో.
ఇంకొంచంసేపు సేద తీరనీయి. రమణీయ ప్రకృతి విలాసాలైన పుష్పాలు నన్ను రసా స్వాదన
చేయమంటున్నాయి. మధుకలశం లాంటి ఈ వనం నన్ను పరవశం చేస్తోంది.” అన్నాడు
కర్కవల్లభుడు.

“వీర కుమారులు పలుమార్లు మచ్చను గురించిముచ్చటించకండి! శశాంకుడికి


సహితం మకరాంకం లేదా? అది ఆయనకొక అలంకారమే అయింది!”అన్నది వసుమిత్ర.

శిరీష “ఇంకా నావలన అయితేకాదు. మరి మీ ఇష్టం!” అన్నది.

కర్కవల్లభుడూ వసుమిత్ర రాకుమారిని అక్కడ విడిచి ముందుకు వెళ్ళిపోయారు.


వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ వనం ఊరికి చాలా దూరంగా ఉండటంతో
అప్పు డప్పుడూ ఏ పికమో కలలో పలవరించడం తప్పుతే నిశ్శబ్ధంగా ఉంది. పాంధుడు
ఆలపించే తోడిరాగ తానం కూడా ఆగింది. ఆ పాడిన విద్వాంసుడిపేరు నాదముని. ఆయన
పేరు సరిగా తెలియనివారు నారదముని అనికూడా అంటారు.

శిరీష చంద్రకాంత వితర్ధికపై కూర్చుంది. చిన్నగా గొంతు సవరించుకుని యమునా


కళ్యాణి రాగం స్వరం పాడి సాహిత్యంలో ఒక పదం తీసుకుని నెరవు చేయడం ఆరంభిం
చింది. నాదముని ఇంకా అక్కడే ఉన్నాడో వెడలిపోయాడో తెలీదు. తన ఆలాపన ఆ మునిని
చేరాలనే తన తపన. ఎందుకంటే ఒకప్పుడు ఇంద్రవల్లభుడు శిరీషకు సంగీతం నేర్పమంటే
ఆయన నిరాకరించాడు. సంగీత స్వరోపాసన చేయదలుచుకున్నవారికి తప్పుతే పెళ్ళి
సంగీతాలు నేర్పనన్నాడు.

సమయం చాలా గడిచిపోయింది. వాతావరణం చల్లగా మారింది. పైన మంచు కురు


స్తోందని పించింది. శిరీష తలచుట్టూ ఉత్తరీయం ముసుగుగా కప్పుకుంది. చెలికత్తెలు వెంట
లేకుండా కోటవెడలిరావడం తనకదే ప్రధమం. కొంత తడవు తరువాత వసుమిత్ర కర్క
వల్లభులు అడుగులో అడుగు వేసుకుంటూ నిదానంగా వచ్చారు.

“ఏమే వసూ! మా అన్నయ్య అంటే మగవాడు! నీవింత రాత్రి పున్నమి నాగులు తిరిగే
వేళ ఎక్కడికివెళ్ళావే ఒంటరిగా నన్నొదిలేసి! నేను ఇంత తడవు నిరీక్షించలేక వెళ్ళి పోదామను
కుంటున్నాను”అన్నది శిరీష విసుగ్గా.

“క్షమించవే శిరీ! మేమిద్దరం పూచిన గోరింటల పరిమళగంధంతో మత్తిలి


తెలీకుండానే చాలాదూరం వెళ్ళిపోయాం. మాలీలు కుదుళ్ళకు కుండపోతగా నీళ్ళుపోశారేమో
చిత్తడిలో కాలుజారాము. అంటిన మలయపంకం కడుక్కోవడానికి కాగ్నానది దాకా వెళ్ళాల్సి
వచ్చింది” అన్నది వసుమిత్ర తల అవనతం చేసుకుని.

93
  చాళుక్యసింహాసనం

“ఓసీ నీకు మిన్నాగుల భయం లేదా? చూడక ఏసర్పం పైనైనా కాలువేస్తే కరవక మాను
తుందా?” అన్నది శిరీష.

“నిజమేకానీ నగధారి లాంటి మీ అన్నగారు ప్రక్కనుండగా పన్నగాల భయం తెలియ


రాలేదు.” తలఎత్తకుండానే అన్నది వసుమిత్ర.

17 పేదరాశి పెద్దమ్మ.
విశాఖదత్తుడు గుఱ్ఱందిగి జీర్ణకుటీరం ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. “అమ్మా! ఎవరు
లోపలా?”అన్నాడు.

“ఓరబ్బీ మాతాకబళానికి కూడ వేళలేదురా? రాచ్చిప్పలన్నీ కడిగి బోర్లించాను” అన్న


దొక వృద్ధురాలు విసుక్కుంటూ.

“ఓసినీదుంపతెగా! నేను బిచ్చగాడిని కాదే! కూడొండిపెడతావని వచ్చా?” అన్నాడు


విశాఖదత్తుడు.

“రూకలుగాని నూకలు కాని తెచ్చావా? నేనరువియ్యను!” పాకాలోంచే మాట్లాడింది


ఆ ముసలమ్మ.

“ఓసి గుడ్డిదానా!అసలు నాకేసి చూశావా? నిన్ను కాటాలో కూచోపెట్టి నీ ఎత్తు కాసులు


పోయగలను! ఆకలిగొని వస్తే కాదంటావా?” అన్నాడు విశాఖదత్తుడు.

అంతటి మొనగాడు ఎవడురా వీడు అనుకుంటూ పేదరాసి పెద్దమ్మ దీపం వెలిగించు


కుని పాకలోంచీ పొన్నుకఱ్ఱ పోటువేసుకుంటూ వరండాలోకి వచ్చింది.చాకిరీ చేసిచేసి నడుం
బాగా ఒంగిపోయింది. తల ముగ్గుబుట్టలా నెరిసిపోయింది. నూలుచీర అక్కడక్కడా చినుగు
పడితే మాసికలు వేసుకుంది. ముఖాన చింతగింజంత బొట్టు వుంది. ఒక్కసారి ఇద్దరికేసి
తేరిపారచూసి “కాదురా నాయనా! ఇవాళసలే బేరంలేదు. చమురు చాలా కాలుతోందని
దీపమార్పేశా! పొద్దుటినుంచీ పొయ్యిలో పిల్లి లేవలేదు. నీవు నాలుగు రూకలు పడేస్తే
గూనిసెట్టి కొట్లో నాలుగు గింజలు కొనుక్కొచ్చి వండుతా! మిగులుతే ఏదో నా కడుపు ఆకలి
కూడ తీరుతుంది!”అన్నది.

“ఓసిముసిలీ! నాలుగు రూకలిస్సే నాలుగు గింజలు ఒండుతావా? అందుకే నీకడుపు


మాడుతోంది. కడుపు నిండా కూడు పెట్టకపోతే నేను నిన్ను తింటాను. నాదగ్గర రూకలు లేవు
మరి. పందిమాడ వుంది.”

“నాదగ్గర వరాహలకు కళంజులకు గద్వాణాలకు అన్నిటికీ చిల్లర దొరుకుతుంది.

94
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ముసలి దాన్నయినా ముష్టిదాన్నిమాత్రం కాదు. ఏదో పూటకూళ్ళు నడుపుకుంటున్నా!


పుణ్యంకొద్దీ పురుషుడు విత్తంకొద్దీ విభుడూ అని నేనుపెట్టే తిండి నీవిచ్చే డబ్బును పట్టి
వుంటుంది. చేయి విదిలించే మహరాజు ఉండాలి కానీ పంచభక్ష్య పరమాన్నాలు వందల
మందికి వండగలను. ఆయనున్న రోజుల్లో ఈ చేతులు ఎంతమందికి వండిపెట్టాయో!”

విశాఖదత్తుడు బంగారు వరాహను ఆమె చేతులో పెట్టాడు.

“ఓరి నాయనా ఇది మంచి వరాహేనా పూతపూసుకొచ్చావా? కలికాలంలో ఎవరినీ


నమ్మడానికి లేదు! దొంగడబ్బులిచ్చి కడుపునిండా తినిపోతారు.” అంటూ ముసలిది
గీటురాయిమీద వరాహను అరగదీసి వన్నె చూచుకుంది. బొటనవేలు గోటిమీద ఎగరేసి
చూచుకుంది. అప్పటికికానీ ఆమెకు నమ్మకం కుదరలేదు.“నాయనా పొద్దుపోయి వచ్చావా!
పెసరట్లు తిని పడుకుంటావా పిండివుంది? లేక అన్నం వండమంటావా?” అన్నది.

“ఓసవ్వా! నాకు అకలి దహించేస్తోంది. మేము ఒకళ్ళంకాదు ఇద్దరం! అంతేకాదు.


మా గుఱ్ఱాలు రెండింటికీ మేతా గుగ్గెళ్ళు కూడ ఏర్పాటుచేయి.” అన్నాడు విశాఖదత్తుడు
గుఱ్ఱాలను కుంకుడు చెట్టుకు కట్టివేస్తూ.

“ఓరినాయనా! నీగుఱ్ఱాలు మేపడం నావలన కాదు. క్షణంలో వంటమాత్రం చేస్తాను!


బావిదగ్గర స్నానాలు చేసి నులక మంచం మీద నడుంవాల్చండి. నా బతుకు ఏపూటకా పూటే!
నీ వరాహ తీసుకెళ్ళి గూనిసెట్టి దగ్గర సరుకులు కట్టించుకు వస్తాను. ఆయన నాకంటే
పిసినారి. గూట్లో దీపం నోట్లో ముద్ద! చమురు చాలా అవుతోందని ఇలా వెలిగించి అలా
ఊదేస్తాడు” అన్నది అవ్వ.

అవ్వ అటువెళ్ళగానే విశాఖదత్తుడు పూలచెట్లన్నీ గుఱ్ఱాలకు మేపి బావిదగ్గర చాదతో


నీళ్ళు తోడి వాటి దాహం తీర్చాడు. మిత్రులిద్దరూ స్నానాలు చేసి నులకమంచాలమీద నడుం
వాల్చారు. ముసలమ్మ వచ్చి పొయ్యి వెలిగించింది. కట్టెలు పచ్చివేమో పొగేకాని మంట
రావటం లేదు.

విశాఖదత్తుడు మెల్లిగా ముసలమ్మ దగ్గర జేరాడు. “అవ్వాఅవ్వా! పొయ్యి నేను ఊదు


తానులే!” అన్నాడు. అవ్వ ఎండుమిరపకాయలు ఉప్పు చింతపండు వేసి కారం పొడి చేసింది.
అదేరోలులో చింతకాయపచ్చడి రుబ్బింది.
“నాయనా ఏవూరెళుతూ వచ్చారు?” అన్నది అవ్వ.
“మేము లత్తులూరు వెళుతున్నాం.”
“అబద్దం చెప్పకురా మనవడా! ఇది లత్తులూరు దోవకాదు.”
“మేము శ్రీశైలం వెళ్ళాలని బయలుదేరాం!”

95
  చాళుక్యసింహాసనం

“అలాఅను. శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం! నిజం చెప్పావో అబద్దం


చెప్పావో గాని శ్రీశైలం వెళ్ళు. మాటతప్పకు! ఇక్కడినుండి కందవోలు దోవ అడుగుతూ
వెళ్ళండి. కృష్ణ దాటితే కందవోలు. అక్కడినుండి అనపర్తిఆతరువాత దోర్ణాల జేరండి. అక్కడ
కొండ ఎక్కడం మొదలుపెడితే భీముని కొలను వరకు నీళ్ళు దొరకవు. ఆ పైన హాట కేశ్వరము,
శ్రీగిరి!దోవ చాల అడవి. దొంగలభయం ఎక్కువ. అయినా మీరు వీరులేగా!”
“అవ్వా నీకు శ్రీశైలం గురించి బాగా తెలుసే!”
“మా ఆయనుండగా శ్రీశైలంలో పూటకూళ్ళు నడిపేవాళ్ళం. యాత్రికులు గుంపులు
గుంపులుగా వచ్చినా కడుపునిండా పెట్టేవాళ్ళం. ఆరోజులే వేరు. ఆయనెళ్ళిపోయాడు.”
“వెళ్ళిపోయాడంటే పోడా! నీకన్నా అందమైన ఆడది దొరుకుతే ఎవడుంటాడే?”
“ఓరినీ జిమ్మడా! నా అందం తక్కువై పోలేదురా! ఆ బైరాగి ముండావాళ్ళందరూ తిని
ఊరికే పోకుండా ఏదో బోధ చేసేవాళ్ళు. అదినమ్మి సన్యాసుల్లో కలిసిపోయాడు.”
“మంచిదేకదా అవ్వా! ఆత్మజ్ఞానం పొందుతాడు!”
“ఆత్మజ్ఞానమా నా బొందా! కాషాయం కట్టుకుని బూదిపూసుకోంగానే
అయిపోయిందా? బుద్ధులెక్కడికి పోతాయి! ఆడదాని ఒడి గుర్తురాకుండా వుంటుందా?”
“భలే చెప్పావే అవ్వా! తాతకేం జ్ఞానం వచ్చిందో కాని నీకుమాత్రం బ్రహ్మజ్ఞానం
కలిగింది. ఐనా నీదెబ్బ తట్టుకోలేక తాత సన్నాసుల్లో కలిశాడేమో!”
“నేను నా మగడిని ఆరడి పెట్టలేదు. పువ్వుల్లో పెట్టి చూసుకునేదాన్ని. పెళ్ళాం పక్క
నుంటే సన్యాసం కుదరదని నన్నొగ్గేసి పోయాడు. అదంతా ఇప్పుడెందుకులే! నీకు పిల్ల సంగతి
కావాలా పుణ్యం సంగతి కావాలా?”
“ఎంత ముదురు ప్రశ్న వేశావే అవ్వా! ముందసలు ఈ ఊరు ప్రాంతం రాజు అవిచెప్పు!”
“ఇది ఉడిగి గ్రామం. రాష్ట్ర్రకూటుల పరిపాలనలోనిదే! మీరేదో దోవతప్పి ఇటు
వచ్చినట్లు న్నారు. చూస్తుంటే ఇక్కడివాళ్ళు కారు. ఏం రాచకార్యం మీద వచ్చారు నాయనా?
ఇదేమీ రాచబాటలో ఊరు కాదు. ఎందుకొచ్చారో ఏమో!”
“దొంగతనానికొచ్చామనుకో! నీదగ్గర ఏమాత్రం కూడబెట్టావేం?”

“ముసలిముండను నాదగ్గరేముందీ పీక్కుతినడానికి!”

“ఉంటే నీదగ్గరేవుండాలి! గొయ్యితవ్వి పాతిపెట్టావా? గోడలోనో ముంతలోనో


దాచావా? కళంజులకు గద్వాణాలకు చిల్లరివ్వగల దానివి నీదగ్గర ముల్లె వుండదా?
చెబుతావా కత్తి పీటతో నీగొంతు కోయమంటావా?”

“నీ కొంటెమాటలు కట్టిపెట్టు!నీ తాటాకు చప్పుళ్ళకు నేనేం బెదిరేదాన్ని కాదు!నీలాంటి

96
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

సన్నాసుల్ని ఎంతమందిని చూశానో!చాతనైతే కత్తిపీటకు పదును పెట్టు! గుమ్మడికాయ తెగక


ఛస్తున్నాను!ఇంతకూ నీతోవచ్చిన అతడెవ్వడూ? రూపసి బలాఢ్యుడులాగున్నాడు. నీలాంటి
కొంటెవాడు కాదు!”

“ఏమీ నీకు నచ్చాడా? మారుమనువు చేసుకుంటావా? మాట్లాడనా?”

“నన్నెందుకు చేసుకుంటాడు నాయనా ముసలిముండను. ఏ జవ్వనినో మోహనాంగినో


చేసుకుంటాడు. పెద్దింటివాడు! కాకపోతే రాజధానిలో రాజకుమార్తెవుంది. బంగారు బొమ్మ!
సుగుణాల రాశి! ఏ మహాపురుషుడు చేసుకుంటాడో!”

“అవ్వా? అంత అందంగా ఉంటుందా? ఎవతె ఆ సుందరీ? ఎలా లభిస్తుందీ!”అన్నాడు


విశాఖదత్తుడు.

“ఇంద్రవల్లభుల కుమార్తె! అందమా చందమామ! చిదిమి దీపం పెట్టచ్చు. ముట్టుకుంటే


మాసిపోతుంది. కంటితో చూస్తె దిష్టి తగుల్తుంది. ఎవళ్ళకోసం పుట్టిందో! గంధర్వకన్యో
అప్సరసో ఏ శాపం వలన భూలోకంలో పుట్టిందో!”

“అవ్వా! నీకెట్లా తెలుసూ ఆ అమ్మాయి అందం గురించీ?”

“కోటలో రాజమాత అయ్యణమహాదేవి వద్ద మాచెల్లెలు పరిచారిక. ఒకసారి చుట్టం


చూపుగా అక్కడికి వెళ్ళాను. రాజకుమారి పుట్టినరోజుకు తలంటి పోయాలంటే నేనూ మా
చెల్లెలితో వెళ్ళాను. స్నానాలకొట్లో చూశాను. ఏమిఅందం ఏమిఅందం. ఈ అప్సరసను
దోచుకునే అదృష్టవంతుడు ఎక్కడ పుట్టాడోననుకున్నాను. ఆడదాన్నయినా నాకే మనసు
చెలించిపోయింది. ఏ శాపమో లేకపోతే ఇంద్రసభలో వుండవలసింది ఇంద్రవల్లభుడికి
కూతురై పుట్టింది. తరువాత నగలన్నీ పెట్టుకుని దొడ్డమ్మకు పాదాభివందనం చేయడానికి
వచ్చింది.”

“అవ్వా. ఆ పిల్ల పేరేమన్నావ్?”

“శిరీష! ఇంద్రవల్లభమహారాజుగారి కుమార్తె.”

“ఆపాపు. అసలు ఇంద్రవల్లభుడు రాజేకాదుకదా! ఊరికే నేతిబీరకాయలాగా


వల్లభుడని పెట్టుకున్నాడు. దానికి తోడు నీవు మహారాజు కూడ చేర్చావు!”

“అలా అనుకోకురా నాయనా!మాన్యకేతంలో ఇంద్రుడు మకుటంలేని మహారాజు.


ఆరేళ్ళ బాలుడిని సింహాసనం మీద కూర్చోపెట్టి పరిపాలన చేస్తున్నాడు.”

“అంత చిన్న పిల్లవాడిని సింహాసనం ఎక్కించవలసిన పనేముందీ?”


97
  చాళుక్యసింహాసనం

“అసలు ప్రభువు గోవిందప్రభాతవర్షుడు. మహా చక్రవర్తి! రాష్ట్రకూట రాజ్యాన్ని


పదింతలు చేశాడు. తమ్ముడు ఇంద్రుడు ఆయనకు చాల సహాయం చేశాడు దండయాత్రలలో.
యుద్ధంలో గాయపడిన గోవిందుడు ఇంద్రుడినే రాజ్యం ఏలమన్నాడు. కాని ఆయన అంగీక
రించ లేదు. పట్టమహిషి అయ్యణదేవి కుమారుడు అమోఘవర్షుడిని చక్రవర్తిని చేసి పరి
పాలిస్తానని మాటయిచ్చాడు.”

“ఇదేమంత గొప్పవిషయమా? మకుటంలేని మహారాజన్నావుగా! ఇంతకూ ఆయనకు


ఎంతమంది భార్యలు? శిరీష ఎవరికూతురు?”

“గోవిందవల్లభుడికి చాలామంది భార్యలు. పట్టమహిషి అయ్యణమహాదేవికి


ఎంతోమంది పిల్లలు పుట్టిపోయారు. చివరికి ఒక్కనలుసు అమోఘవర్షుడు మిగిలాడు. తక్కిన
రాణులకు పిల్లలున్నారు కాని గోవిందవల్లభునికి అయ్యణమహాదేవి పైనే మక్కువ. అందుకే
పసి వాడైనా అతడినే రాజును చేశారు.

ఇంద్రునికి ఒక్కతే భార్య! పదిమంది రంభలంత అందం! పాపం శిరీష పుట్టినపుడు


గుఱ్ఱంవాతం కమ్మి పోయింది!”

“అయ్యోపాపం! అంత అంతః పురం వాళ్ళు మనకు లొంగరుకానీ ఈ ఊర్లో ఈ రాత్రికి


ఎవర్ని పిలుస్తావో చెప్పు!”

“అయ్యో సంబడం!తార్చడం ఒక్కటే తక్కువ!కడుపు పండకపోతే తప్పుతే సానిపని


చేయకూడదు. అన్నముడికింది. నీవు దొడ్లో అరిటాకులు కోసుకురా వడ్డిస్తాను. అతగాడిని
లేపి చేతులు కడుక్కోమను!”అన్నది అవ్వ.

ముసలిదైనా ముసలమ్మ చాలా మంచి భోజనం పెట్టింది. గుడ్డిదీపం వెలుగులో కూరేదో


నారేదో కనిపించటం లేదు కానీ మహా రుచిగా వుంది. ఆవురావురు మనే ఆకలితో ఆబగా
తినాలనిపించింది.ముసలమ్మ పేరునెయ్యి వంపింది. ఒక్క చుక్క కూడ విస్తరిలో పడలేదు.
విశాఖదత్తుడది గమనించాడు.“అవ్వా! నాకు ఊరగాయ కావాలి!”అన్నాడు.

“రాత్రిపూట అటకెక్కలేనురా తండ్రీ! ఈ రాత్రికి సద్దుకో!”అన్నది ముసలమ్మ.

విశాఖదత్తుడు కావాలని నీటిముంత వలకపోశాడు. “అవ్వా! మంచినీళ్ళు!” అన్నాడు.


ముసలిది నీళ్ళుతేవడానికి వెనుతిరిగింది.

విశాఖదత్తుడు నేతిగిన్నె కొంచం దీపం శగపైనపెట్టి మళ్ళా యధాస్ధానంలో వుంచాడు.


“అవ్వా! నీవు నూరిన కారంపొడి నోరు మండిపోతోంది. ఒక్క చుక్క నేయి వేయి” అన్నాడు.
అవ్వ నేతిగిన్నె వంచింది. కరిగీ కరగని నేయి మొత్తం జారి విస్తరిలో పడింది.

98
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“అయ్యో అయ్యో! చాలా పడిపోయిందా నాయనా!” అన్నది అవ్వ. విశాఖదత్తుడి చిలిపి


తనానికి విష్ణువర్ధనుడు నవ్వుకున్నాడు.
“ఏం ఫరవాలేదులే అవ్వా! మంచి తాంబూలం వేసుకుంటే అరిగిపోతుంది” అన్నాడు
విశాఖదత్తుడు.
“ఇంత రాత్రివేళ తమలపాకులు ఎక్కడ తెచ్చేదీ? దినుసులన్నీ నిండుకున్నాయి” అన్నది
పూటకూళ్ళమ్మ.
“అవునుకదా! తమలపాకు తీగంతా గుఱ్ఱాలు మేసేశాయి. లవంగం వక్కపలుకుతో
సరిపెట్టుకుంటాలే!” అన్నాడు విశాఖదత్తుడు చేతులు కడుక్కోవడానికి లేవబోతూ.
“వోరోరి! ఉన్నతీగలన్నీ గుఱ్ఱాలకు మేపావా? ఎంతోప్రేమతో నాప్రాణంలాగా
పెంచుకుంటున్నాను.”
“ప్రాణంలాగానా? ఇంకా ఎంతకాలం బతుకుతావే ముసలిదానా! గుఱ్ఱాలకు మాత్రం
కడుపు కాలదా! ఏదో ఫలహారం చేశాయి. ముందు గుగ్గెళ్ళ సంగతి చూడు” అన్నాడు
విశాఖదత్తుడు.
“నేను ముందరే చెప్పాను. గుఱ్ఱాలకు తిండిపెట్టడం నావలన కాదని. రోజూ అడ్డమైన
గాడిదలకీ వండిపెట్టలేక ఛస్తున్నాను. ఇంక గుఱ్ఱాలు మేపడం ఒకటే తక్కువ!” ముసలమ్మ
గొణుక్కుంది.
ఇద్దరిభోజనం ముగియగానే మిగిలింది తినడానికి విస్తరి ముందు కూర్చుంది
మసలమ్మ. అవ్వ రేపటిదినం కోసం నానబెట్టుకున్న మినుములూ పెసలూ విశాఖ దత్తుడు
గుఱ్ఱాలకు మేపేశాడు అవ్వ చూడకుండ.
అవ్వ గిన్నెలు తోముకుంటూ గమనించింది నానబోసుకున్న గింజలు మాయమవడం.
“ఓరి అల్లరోడా!రేపటిదినం అట్లుపోయకపోతే పూట గడవదు. దోశలమ్మకపోతే పొట్ట
నిండదు. నానబోసుకున్న గింజలన్నీ గుఱ్ఱాలకు మేపేశావు!”
“ఏమీ రోగమా! నేనిచ్చిన వరాహకి నీ నాసిరకం భోజనం పెసలు మినుములు రావా?”
“నీవిచ్చిన పందిమాడ గూనిశెట్టి పాత బాకి క్రింద జమకట్టుకున్నాడు. నేను ఎంత
పేదదాన్నో నీకు తెలీదు.. దేవుడా ఈ దరిద్రంలో నేనింకా ఎంతకాలం బతకాలీ! రేపటిదినం
అట్లు పోయకపోతే పూటగడవదు.”ముసలమ్మ ఏడ్చేసింది.
“అవ్వా! నీవంత పేదదానివా?”
“కాక! నాకొంపచూడు! పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు కాపురం చేస్తున్నారు. వాన
దేముడైతే సరేసరి! బైట వర్షం వెలిసినా లోపల వెలవదు. ఇక్కడ పూటకూళ్ళు పెట్టు కున్నా.
ఇదేమీ రహదారికాదు. నీబోటిగాడు దోవతప్పివస్తే అన్నమొండి పెడతా.”
“అవ్వా! నీకెంత డబ్బు కావాలీ?”
99
  చాళుక్యసింహాసనం

“ముసలిదాన్ని! నాకు డబ్బేం అవసరంలేదు. రెండుపూట్లా కడుపు నిండుతే చాలు!


ఒకపూట తింటే ఇంకో పూటకు లేదు. ఆ పొయ్యేవాడు నన్నా క్రిష్ణమ్మలో తోసేసి పోయినా ఈ
బాధుండేది కాదు. నన్నీ కటిక దారిద్యంలోకి తోసి తాను ఏ స్వర్గంలోనో కులుకుదామని
పోయాడు.”
విశాఖదత్తుడు పైకప్పుకేసి చూశాడు. వాసాలు కనిపిస్తున్నాయి తప్పుతే పైన కప్పిన
ఆకులన్నీ చెదిరి పోయాయి. ఇంట్లో చందమామ వెన్నెల వలన చీకటి ఎక్కడో మూల మూలన
దాక్కుంది.
“అవ్వా నీకు పది స్వర్ణ మాడలిస్తాను. మాన్యకేతనగరం వెళ్ళి ఇల్లు కట్టుకో!” అన్నాడు
విశాఖదత్తుడు.
“మాన్యకేతమా? ఐనా డబ్బు నాకెందుకిస్తావు?”
“అక్కడ అన్నసత్రం ప్రారంభించు. నేనక్కడికి వచ్చినపుడల్లా అన్నం వండిపెట్టు. నీకు
కావలసినంత ధనం నేను పంపిస్తుంటాను. నాలుగైదు నివర్తనాల భూమికొను. ఎద్దులు
అరకలు పెట్టి వ్యవసాయం చేయించు. గోశాల కట్టించు. ఆకలిగొని వచ్చిన వాళ్ళందరికీ
అన్నం పెట్టు. అందరిపైన పెత్తనం చెలాయించు!”

“కొడుకా! నీమాటలు నిజమేనా? నన్ను వెఱ్ఱిముండను చేస్తున్నావా?మాటలతో


మేడలు కడుతున్నావా? చివరికి పైనుండీ క్రిందికి తోస్తావా? నాకసలు అర్ధం కావటంలేదు.
అందుకు ఎంత డబ్బు అవుతుందో తెలుసా?”

“అర్ధానికేమీ కొదవలేదు. నేను నిజమే చెబుతున్నా! నీకు కావలసినంత నేను పంపి


స్తుంటాను. కానీ ఏనాడూ నన్ను ఎదురు ప్రశ్న వేయకూడదు. నా పేరు చెప్పుకున్న వాళ్ళందరికీ
వండిపెట్టు. చాలు!”

“నీపేరేమిటో చెప్పలేదు!”

విశాఖదత్తుడి మస్తిష్కం ఒక క్షణం ఆగింది. అర్ధాంతరంగా తనకొక పేరు పెట్టుకోవాల్సి


వచ్చింది. “నాపేరు అళియవెంకడు. నీకింత డబ్బెక్కడిదని ఎవరేనా అడుగుతే మా
అల్లుడిచ్చాడని చెప్పు.” విశాఖదత్తుడు మాన్యకేత నగరంలో తన స్ధావరానికి పునాది రాయి
వేశాడు.

18 ధర్మసూక్ష్మం
పూటకూళ్ళమ్మ ఇంట్లో భోంచేసిన తరువాత మిత్రులిద్దరూ చెరొక నులకమంచంపైనా
నిద్రాగ్రస్తులై యున్నారు. ముసలమ్మ చమురు కాలుతోందని దీపం ఆర్పేసింది. పూర్ణిమ
కావడంతో వెన్నెల మాత్రం కాంతివంతంగా వుంది. ఆ రాత్రివేళ ఎవడో అగంతకుడు

100
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

వచ్చాడు. అవ్వను ఆ సమయంలో అన్నం పెట్టమంటున్నాడు. చాలా వేధిస్తున్నాడు. అదీకాక


నిద్రపోయేవాళ్ళెవరని గుచ్చిగుచ్చి అడుగుతున్నాడు. ఆ గుఱ్ఱం ఒక్కొక్కటీ నాలుగు ఎద్దుల
బలం కలవి. అంత గొప్ప గుఱ్ఱాలపై వచ్చిందెవరని అడుగుతున్నాడు. మాగన్నుగా వున్న
విశాఖదత్తుడు మొదట ఎవడో ఆర్తుడు ఆకలిగొని వచ్చాడను కున్నాడు. కానీ వాడి వాచాలత్వం
చూస్తే అలా అనిపించలేదు. అందుకే నులక మంచం మీద లేచి కూచున్నాడు.

అవ్వ వాడి బాధ పడలేక అటుకులు మజ్జిగలో వేసి ఇచ్చింది. “గిన్నెలు తోమి బోర్లించు
కున్నానురా అబ్బీ!” అని ఎన్నో సార్లు చెప్పింది. వాడసలు ఆకలితో రాలేదు. మాటిమాటికీ ఆ
గుఱ్ఱాలపై వచ్చిన సాములెవరని అడుగుతున్నాడు.

ఒచ్చినవాడు ఆకలిగొని రాలేదనీ గూఢచారని విశాఖదత్తుడికి అర్ధమయింది. “ఏరా


వెధవా! ఇందాకటినుంచీ చూస్తున్నా! జోరీగ చెవులో దూరినట్లు ఒకటే రొద పెడుతు న్నావ్.
నీవెవరి గూఢచారివో చెప్పు. నీకు కావలసిన వివరాలన్నీ నేచెబుతా!” అన్నాడు గద్దిస్తూ.

“నీ బానిసను దొరానేను! నాలుగిళ్ళు తిరిగి చీరలమ్ముకునేవాడిని. కావాలంటే చూడు


తలకట్ట బరువు. ఎన్ని కొంపలు తిరిగినా ఒక్క కోక అమ్మలేకపోయా.”

“చీరలమ్ముకునేవాడివైతే ఆ ముసలమ్మనెందుకు వేధిస్తున్నావ్?”

“ఆకలి! కడుపు కాలిపోతోంది.”

“కడుపు కాలుతుంటే గంజినీళ్ళు తాగాలి! నా గుఱ్ఱం నాలుగు వృషభాల బలం కలదని


నీకెలా తెలుసురా?”

“అనుకున్నా!”

“అంటే దేని బలాన్నయినా వృషభం బలంతో పోలుస్తారని నీకు తెలుసుననమాట!


అంటే నీకు గుఱ్ఱాల గురించి బాగా తెలుసు. ఐనా ఆకలేసేవాడివి వాటిదగ్గర కెందు కెళ్ళావూ?”

“చిన్నప్పుడు గుఱ్ఱాలు కడిగే వాడిని లేండి. గుఱ్ఱం చూడగానే ముచ్చటేసింది!”

“నాగుఱ్ఱం పంచవృషో అసి! ఐదు ఆంబోతుల బలం కలది. తెలుసా?”

“ఊరుకోండి బాబు! ఐదాంబోతుల బలం దేనికీ ఉండదు!”

“చూపించనా? ఒక్కసారి దాని వెనకకాలిదగ్గర నిలబడు. ఎంత గట్టిగా తంతే అంత


బలం కలది!”

101
  చాళుక్యసింహాసనం

“మహప్రభో! ఏదో తెలీక అన్నాను. ఇంక వదిలేయండీ. దొరా పొద్దున్నే నీ వెంబడొస్తా!


ఈ చీరల బేరం చేయలేను. నీ గుఱ్ఱం మేపుతా!”

“నీవన్నీ నాసిరకం చీరలైతే ఎవతె కొంటుందిరా? ఐనా నా గుఱ్ఱాన్ని నీవు మేపేదేమిటీ?


అదేమైనా గుడ్డిదా నీవు పళ్ళు తోమడానికి? నా వెంబడొస్తానంటే రా! కానీ నీ చేతికీ గుఱ్ఱం
కాలికి పగ్గం వేసి కడతా!”
“ఓరి బాబోయ్! నీవేదో రాచబిడ్డలాగున్నావు బాబూ. మీ అన్నగారు పండుకున్నాడా?
మనదేవూరు?”
“మాది యమపట్నం! మేమేమో దూతలం! నీకివాళ నూకలు చెల్లినట్లున్నాయి. వస్తావా
మాతోతీసుకుపోతాం?”
“ఊరకోండి బాబు! తమరు రాచకొడుకులు. రాణిగారికి నాలుగు చీరలు
కొనండయ్యా!”
“కొనచ్చుకానీ యమపట్టణంలో ఆడవాళ్ళు ఎవరూ చీరలు కట్టుకోరు మరి!”
“మీరు మరీ పరాచికం ఆడుతున్నారు. అన్నగారి దేదేశం బాబుగారూ?”
“మాది రాష్ట్ర్రకూటం! ఆయన కర్కవల్లబుడు.”
“పోండి బాబూ! ఒకటే సరసం. కర్కుడు ఇంత అందగాడేమి?”
“నీకు కర్కవల్లభుడు తెలుసా?”
“గుఱ్ఱాలు కడుక్కునేవాడికి పెద్దోళ్ళందరూ తెలుస్తారు!”
“నీకో విషయం తెలుసా? గుఱ్ఱాలను కడగం. కుంచతో రుద్దుతాం!”
“బిచ్చగాడ్ని పట్టుకుని సరసమాడతారు! ఆ రాచబిడ్డ రాణిగారికి రెండు కోకలు
కొంటారేమో!”
“మాన్యకేతనగరంలో నీకోకలు ఇల్లు తుడుచుకోడానికి కూడ పనికిరావు.”
“పో దొరా! అన్నీ అట్టాగే అంటావు. నీ మాటచూస్తే ఈ దేశం కాదు. ఈ చీరలన్నీ
ఉరయూరు నుంచి తెచ్చాను.”

“నీకసలు ఉరయూరు ఎక్కడుందో తెలుసా? మావూరు అదే! ఈయన మణిమంగళం


వాడు.ఈ చీరలు అక్కడివి కాదు.”

“నీది ఉరయూరు మాట కాదు దొరా! నన్నేడిపిస్తున్నావు. నీది గౌతమి యాస


లాగుంది.”

102
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఔనురా! భలే కనిపెట్టావే! మాది ప్రతిష్ఠానం!”

“నీవు అబద్దాలు చెబుతున్నావు దొరా! నీది అక్కడ మాట కాదు.”

“ప్రతిష్టానంలో గోదావరీ నది లేదా చెప్పు?”

“అంటే నీది దిగువ గౌతమి బాష!”

“ఓరీ! మనిద్దరిమధ్యా ఈ ముసుగులో గుద్దులాటెందుకూ? నీవేదేశం గూఢచారివో


చెప్పు? నీకు కాలవలసిన వివరాలన్నీ చెబుతాను. కానీ నీకేం ప్రయోజనం? అన్నీ విన్న
తరువాత నీ పీకమాత్రం కోసేస్తాను.”

“బిచ్చగాడిమీద అంత కోపమా దొరా?”

“నీవు బిచ్చగాడివిరా?” వాడి డొక్కలో ఒక్క తన్ను తన్నాడు విశాఖదత్తుడు. వాడు


కడుపు పట్టుకుని ఉండ చుట్టుకుపోయాడు బాధతో. మళ్ళీ వాడి పీక పట్టుకుని పైకి లేపాడు
విశాఖదత్తుడు. ఈ మాటు ఆయువు పట్టులో పట్టుకున్నాడు. వాడికి ప్రాణం జిల్లార్చుకు
పోతోంది. “ఇప్పుడు చెప్పు నీ వెవడివో?”

“చెబుతానయ్యా! నన్ను విడిచిపెట్టు” అన్నాడతడు. “నేను నేను మాన్యకేతానికి వార్తలు


పంపించేవాడిని. యుద్ధంలో వాడే గుఱ్ఱాలు చూసి వచ్చాను. కానీ నీతన్ను శతవృషో అసి!”

“అయితే విను! నాపేరు అసి! మాతమ్ముడిపేరు ధార! మేమిద్దరం మాన్యకేతాన్ని


ముట్టడించబోతున్నాం! పొయి మీ దేశంలో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో!”

“ఊరుకోండయ్యా! మాన్యకేతాన్ని ముట్టడించడం ఆ బ్రహ్మ తరం కాదు!”

“నీకో విషయం తెలుసా? బ్రహ్మదేముడు కత్తిపట్టి యుద్ధాలు చేయడు. నీలాంటి


నాలాంటి సన్నాసుల్ని పుట్టిస్తాడు. నమ్మినవారికి వరాలిస్తాడు.”

“బాబూ!మాన్యకేతాన్ని రెండులక్షల సైన్యం కూడ ముట్టడించలేదు!”

“పోనీ ఎలా ముట్టడించాలో నీవే చెప్పు. నీ చీరలన్నీ నేనే కొంటా!”

“మాన్యకేతమనే తుమ్మచెట్టుకు నేనొక చిన్న ముల్లుని బాబు. నాకంత తెలివి తేటలే


ఉంటే సేనాపతినే అయ్యేవాడిని.”

“నీ దగ్గర మగవాళ్ళ బట్టలేమీ లేవురా? అన్నీ ఆడంగులవేనా?”

103
  చాళుక్యసింహాసనం

“లేకేం దొరా! ఉప్పాడ ధొవతులు సెల్లాలు ధర్మవరం పట్టుపుట్టాలూ....”

“మగవాళ్ళ బట్టలన్నీ తీసి మూటకట్టి నా గుఱ్ఱం జీనుకు కట్టు. నీకొక శాతవాహన


కళంజు ఇస్తా! సరిపోతుందా?”

“అయ్యో పాతనాణాలా! పందిమాడ ఇప్పించు దొరా!”

“మాదగ్గర వరాహలు లేవు. బీరగొట్టపు గద్యలు ఇవ్వమంటావా?”

“నీ దయదొరా! పొద్దున్న మాత్రం నీతోపాటు నన్నులేపు. నీ బానిసగా నీవెంట వస్తా!”

“సరే ఇప్పటికి పడుకో! నీబతుకు తెల్లారనీ! అప్పుడు నీకో పని చెబుతా.” అన్నాడు
విశాఖదత్తుడు.

వార్తాహరుడు నిద్రపోయేదాక విశాఖదత్తుడు జాగ్రత్తగా ఉన్నాడు. ఆ తరువాత


మిత్రులిద్దరూ లేచి గుఱ్ఱాలు విప్పుకుని రాత్రికి రాత్రి పయనమయ్యారు. కొంచం దూరం
వెళ్ళినతరువాత ముసలమ్మకు పది సువర్ణ వరహాలు ఇవ్వలేదని గుర్తుకు వచ్చింది.
విశాఖదత్తుడు వెనక్కు వెళ్ళి నిద్రపోయే ముసలమ్మ చెంగున పది వరాహ మాడలు ముడివేసి
వచ్చాడు.

గుఱ్ఱాలపై తెల్లవారు ఝాము వెన్నెలలో కొంతదూరం వెళ్ళారు. అదొక చిట్టడవి. పెద్ద


చెట్లేమీ లేవు. నాపరాళ్ళ గనులు తవ్వుకోవడం వలన అక్కడ అన్నీ గోతులు. చూచు కోకపోతే
ఏ కందకంలోనో పడతారు. దూరంగా మాత్రం పెద్దచెట్ల తోపు కనిపించింది. అటు వెళ్ళారు.
అక్కడొక దిగుడు బావికూడా వుంది. మిత్రులు చెట్టుకు గుర్రాలను కట్టివేశారు. తాము కూడా
ఒక చెట్టుక్రింద విశ్రమించారు. “విశాఖా! నేను కొంత నిద్ర పోయాను. కాబట్టి నీవు పడుకో!
నేను మెలుకువగా వుంటాను” అన్నాడు రాకుమారుడు. విశాఖదత్తుడు నిద్ర
ఆపుకోలేకపోయాడు. గుఱ్ఱం జీను తీసి తలక్రింద పెట్టుకుని నిద్రపోయాడు.

లోకమంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. పున్నమి చంద్రుడు నడినెత్తికి రావడంతో


చాందినీ పుంజాలు దట్టంగా ఉన్నాయి. చెట్టుపైన చకోరపక్షులు వెన్నెల నాస్వాదిస్తూ
సృష్టిధర్మాన్ని నెరపుతున్నాయి. కబోది పక్షులు ఆకాశంలో గిరికీలు కొడుతూ చెట్ల పండ్లను
భక్షిస్తు న్నాయి. నేల కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుకను గుడ్లగూబతన్నుకు పోయింది.
పుట్టలోంచీ వెలువడిన పాము ఎండుటాకుల మధ్యనుంచీ పాకుతుంటే గలగలా శబ్దం
అవుతోంది. వెన్నెలలో అడవి పందుల గుంపు పంటపొలాల మీదకు దండయాత్రకు
బయలుదేరింది.

భగవంతుడు జీవరాసులన్నిటికీ ఆహారమూ నిద్ర మైథునము అనే మూడు సమాన


ధర్మాలను ఏర్పరచాడు. మనిషికి జిజ్ఞాస అనే ధర్మాన్ని కూడా అదనంగా ఇచ్చాడు. ఆ జిజ్ఞాసనే
104
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

బ్రహ్మసూత్రాలలో అధః ధర్మ జిజ్ఞాస. ఆ సూత్రానికి ఆదిశంకరుడు విస్తారమైన వ్యాఖ్యానం


వ్రాశాడు. అదే బ్రహ్మసూత్రాలలో మొదటిది.

జిజ్ఞాస వలననే మనిషి పురోగమించేది. జిజ్ఞాస లేని మనుషులు పశువులుగా మిగిలి


పోతారు. విష్ణువర్ధనుని మనసు వేంగి పైకి మళ్ళింది.

తండ్రి నరేంద్రమృగరాజు ఎలావున్నారో. మాత్రుమూర్తి ఎలావుందో. శ్రద్ధాదేవి


ఆరోగ్యం అంత బాగుండదు. తన రాకకై ఎదురు చూస్తూవుంటుంది. ఏ రాత్రీ నిద్ర పట్టదని
చెప్పారు మహారాజు. ఎటు చూసినా శత్రుభయం. నిరంతర యుద్ధాలు. రాజ సేవకులలోనే
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. శాంతి లేని దేశం విశ్రాంతి లేని
ప్రభువులు!‘ఈ యుద్ధాలకు ఒక పరిష్కారం కనుగొనాలి’ అనుకున్నాడు విష్ణువర్ధనుడు.

అంతలో ఎందుకో మనసు మృదువదన వైపు మళ్ళింది. మృదువదన తనతోపాటు


చమరీ గురుకులంలో ఖడ్గవిద్య నేర్చుకుంది. పాపం గురుకులంలో ఒక్కతే విద్యార్ధిని.
మగపిల్లలందరూ ఆమెకేసి ఆశగా చూసేవాళ్ళు. ఆ బేల తనపైన మోజు పడింది. పెళ్ళి
చేసుకోమని అడిగింది. అందులోనూ రెండవతరం భార్యగా నయినా ఫరవాలేదని చెప్పింది.
ఎంత దీనావస్తా! ఏ స్త్రీ తనకొక సవతిని కోరుకోలేదు కదా!

ఆడయినా మగయినా బ్రహ్మచారుల మనసు పెళ్ళివైపు మళ్ళిందంటే మరుల్చుకోవడం


కష్టం. కామం బుఱ్ఱని పురుగు తొలిచినట్లు తొలిచేస్తుంది. శృంగార తరంగాలు ఒక్కొక ప్పుడు
చెలియలికట్టను కూడా దాటుతాయి. కామము తప్పుకాదు అంటారు. కామం పురుషార్ధా
లలో ఒకటి. ధర్మము అర్ధము కామము మోక్షము! ఇదే కామాన్ని మన అంతర శత్రువు లలో
కూడా జేర్చారు పెద్దలు. కామము, క్రోధము, లోభము మోహము మదము మాత్స ర్యము.
అంటే కామం విషయంలో విచక్షణ అవసరమనమాట!

అన్నిదేశాలలో మగజాతి తక్కువై పోతోంది. ముఖ్యంగా యువకులు యుద్ధాలలో


అసంఖ్యాకంగా మరణిస్తున్నారు. వధూజనం తోపాటు విధవా జనం కూడా ఎక్కువగా
వుంది. ఒక్క మగవాడికి ఎంత మందో పెళ్ళాలు. ఆ మగవాడు మరణిస్తే ఎంతోమంది
విధవలు. అందుకే వ్యభిచారం పెరిగిపోతోంది. ధర్మం గతి తప్పుతోంది.

విశాఖదత్తుడు నాటి మాన్యకేత నగరంలో నిశీధిని గురించి చెప్పాడు. నగరవీధులలో


కావలిగాళ్ళ కంటపడకుండా మగడి కన్నుకప్పి, అత్తనీ పిల్లల్ని నిద్రపుచ్చి ఘల్లున మ్రోగే
కింకిణులనూ కాలి కడియాలనూ మ్రోగనీక నిండా ముసుగు కప్పుకుని తార్పుడు కత్తెల
వెంటవెళ్ళి లతాంగులు పరపురుషులతో రమిస్తుంటారట! ఎందరో మహాకవులు ఈ
విషయాన్ని గ్రహించి కూడా పరిష్కారం చూపకుండా సరసంగా శ్లోకాలు అల్లుతూ ఆనందిస్తూ
కూర్చున్నారు. అంటే ఇదికూడా లోకంలో అంతర్ లీనమా?

105
  చాళుక్యసింహాసనం

అలా యోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు విష్ణువర్ధనుడు.

ఇద్దరూ ఉదయం లేచేటప్పటికి కొంచం పొద్దెక్కింది. అటూ ఇటూచూస్తే దూరంగా


కర్షకులు అరకలు బుజాన పెట్టుకుని నోటిలో పందుంపుల్లలు నములుతూ ఎద్దులవెంట
పొలాలకు వెళుతున్నారు. పిడకదాళ్ల పొగచూస్తే దగ్గరలో జనపదం ఏదో ఉందనిపించింది.
ప్రాతః సంధ్యాదికాలు ముగించుకుని ఊరిలోకి వెళ్ళారు మిత్రులిద్దరూ.

ఆ గ్రామంలో పెంకుటిళ్ళు ఒకటో రెండో వున్నాయి. చాలా వరకు ఇళ్ళకప్పులపైన


నాపరాళ్ళు పేర్చుకున్నారు. మట్టిగోడల్నీ ఇంటి అరుగుల్ని చక్కగా అలికి ముగ్గులు
పెట్టుకున్నారు. అవుదూడలు అపుడపుడూ అంబా అంటున్నాయి కానీ మే అనే మేకలు గొఱ్ఱెలే
ఎక్కువ. కొందరు కాపు గరితెలు మేకపాలు పితుకుతున్నారు.

ఆ ఊరికి గ్రామణి ఉన్నాడు. అతడు వారిని చూడగానే

“అయ్యా మీరెవరూ? మహావీరుల్లా వున్నారు. మా గ్రామంనుంచీ మేలావరము కూడి


వరము పన్నులన్నీ సక్రమంగానే చెల్లిస్తున్నాము. మహామంత్రులు ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు
పంపించారు?” అన్నాడు భయం భయంగా. రాజోద్యోగులు పల్లెటూరిలోకి వచ్చారంటే ఏదో
విశేషమేవుంటుంది.

“మేము పన్నులు దండుకునే సుంకరులం కాదు. కేవలం బాటసారులం. ఈ పూట మీ


గ్రామంలో వంట చేసుకుని తిని వెళదామని వచ్చాం” అన్నాడు విశాఖదత్తుడు.

“తమరెవరో రాజకుమారులు లాగా వున్నారు. మీ ముఖం చూస్తే అలాగే అనిపిస్తోంది.


మావూరొచ్చి మీరు వండుకోవడమేమిటీ? మా వూరిలో భోజనానికి ఏ కులంవారిని ఆకులం
వారింటికి పంపుతుంటాం. నేనయితే పంటకాపుని. మీదేకులమో చెబుతే ఆ ఇంటికి
పంపుతాను. మావూరిలో బ్రాహ్మణులు మాత్రం లేరు” అన్నాడా గ్రామణి.

విశాఖదత్తుడు విష్ణువర్ధనుని ముఖం వైపు సాలోచనగా చూచాడు. విష్మువర్ధనుడు


కనురెప్ప వాల్చడం తోటే ‘కానీయి’ అన్నట్లు సంజ్ఞ చేశాడు. “అయ్యా! మేము మీయింటికే
భోజనానికి వస్తాం” అన్నాడు విశాఖదత్తుడు.

“ఇవాళ మా ఇంటికి ఇద్దరు విష్ణుమూర్తులు వస్తున్నారనమాట! ఇంటికొచ్చిన అతిధి


దేవుడు. ఆ దేవుడే ఒకడికి అన్నం పెట్టేమాత్రం భూమి పుట్రా ఇచ్చాడు.” అన్నాడా గ్రామిణి
ఎంతో సంతోషంగా.“మా ప్రాంతంలో అన్నం అమ్ముకోడం లేదు! ఏ బాటసారుల కైనా
మేము తినేదే ఇంత ముద్ద పెడతాం! భగవంతుడు మాకామాత్రం ఇచ్చాడు” అన్నాడు గ్రామణి
భగవంతుడి దయమీద విశ్వాసంతో.

ఆ పంటకాపుల ఇంటిలో బ్రహ్మాండమైన భోజనం చేసి బయట మంచంపైన


106
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

కూర్చున్నారు మిత్రులిద్దరూ.

“మీ ఊరిపేరు అడగలేదు” అన్నాడు విశాఖదత్తుడు తాంబూలం సేవిస్తూ.

“మా ఊరిపేరు గొఱ్ఱెలపెంట. నూరు ముక్కాలు గడప మాత్రం వుంది. తరిభూమి


తక్కువ. వర్షాధారం. మెట్టచేలు ఎక్కువ. సజ్జలు వరిగెలు కొఱ్ఱలు తమిదలు అనుములు
పండుతాయి. కొండవాలు కావడంతో నీరు నిలబడదు. వరిధాన్యం పండదు. మా
ఊరికిప్పుడొక సంకటం వచ్చిపడింది.మీలాంటి చదువుకున్నాళ్ళు ఇవాళ రావడం మా
భాగ్యం. అయ్యా ఇవాళ మా ఊళ్ళో వారగోష్టుంది. కులపెద్దలంతా వస్తారు.”

“ఇంతకూ మీ సమస్య ఏమిటీ?” అన్నాడు విశాఖదత్తుడు.

“మావూరి పడుచు ఒకతె మనువాడింది. ఆరునెలలు కాపురం చేసింది. కడుపు


నిలిచింది. మగడు అడవిలో వేటకెళ్ళి తిరిగిరాలేదు. పాపం ఆడకూతురు చాలా కష్టపడి
బతికేది. కొడుకు పుట్టాడు. ఏడేళ్ళు ఓపిక పట్టి చూచింది. మగడు రాలేదు. కులతప్పు కట్టి
మారుమనువు చేసుకుంది. తన మరిదినే చేసుకుంది. గోష్టి సభ్యులందరం ఆ మనువును
ఆమోదిస్తూ తాంబూలం పుచ్చుకున్నాం. నా తాంబూలంలో అడపగట్టు కూడా పెట్టి
యిచ్చింది. ఇప్పుడు మేమంతా సమయధర్మం పాలించాలి.

ఈ మగడితో మళ్ళీ కడుపుతోవుంది. ఇప్పుడు మొదటి మగడు వెతుక్కుంటూ వచ్చాడు.


తనపెళ్ళాన్నితనకిప్పించమంటాడు.”
“పిల్ల పేరేమిటీ?”
“తరువోజ! మొదటి మగడిపేరు సింగయ్య, రెండవ మగడు కరుణుడు.”
“తరుఓజ ఏమంటుందీ?”
“తనకు ఇద్దరూ ఇష్టమేనంటుంది.”
“ఇన్నాళ్లూ సింగయ్య ఏమైపోయాడు?”
“ఆడేమంటాడో మీరే విందురు.”

గ్రామం మధ్యలో పెద్ద మద్దిచెట్టు వుంది. అక్కడి అరుగు మీద సభాసదులు కూర్చు
న్నారు. గ్రామస్తులందరూ నేలమీద కూర్చున్నారు. విష్ణువర్ధన విశాఖదత్తులకు ప్రత్యేకంగా
నులకమంచం వేసి దానిపై దుప్పటి పరిచారు. సింగయ్య గ్రామ సభముందు చేతులు కట్టుకు
నిలబడ్డాడు. తరువోజ చాటున నిలబడి కళ్ళనీళ్ళు పెట్టుకుంటోంది.

సభ సభ్యులు సింగమయ్యను గద్దించి అడిగారు. “ఏరా ఇన్నాళ్ళూ ఏమయిపోయావు?


ఒక ఆడకూతురును ఎలా వదిలేసి వెళ్ళిపోయావు? నీకు బుధ్ధిలేదా?”
107
  చాళుక్యసింహాసనం

“అయ్యా! నాకథ వినండిబాబు. నేను అడవిలో వేటకోసం వెళ్ళాను. ఏదీ దొరక్క


అడవిలో చాలాదూరం వెళ్ళిపోయాను. ఒక్కసారిగా నామీద ఎవరో వల విసిరారు. పులుల్ని
పట్టుకునే వల అది. చాలా గట్టిగా వుంది. పొరపాటున నామీద వల పడిందేమో అనుకున్నాను.
అరిచాను. కానీ వాళ్ళు మనుషుల్ని వేటాడేవాళ్ళు. వలలోని నా నోట్లో గుడ్డలు కుక్కారు.
వలతో సహా నన్ను ఒక దూలానికి వేలాడదీసి పందిని మోసుకు పోయినట్లు మోసుకు
పోయారు. నన్నొక గూడు బండీలోకి ఎక్కించారు. లోపల ఇనప పంజరం వుంది. అందులో
అప్పటికి నాలాంటివాళ్ళు ఇద్దరూ మగవాళ్ళు ఒక ఆడమనిషి వున్నారు. మమ్మల్ని తిండి
నీళ్ళూ లేకుండా మూడు రోజులు ఎద్దుల బండిలో తరలించారు. ఏంచేయడానికి
తీసుకుపోతున్నారో తెలీదు. ఆకలి దప్పులకు మాడిపోయాం. పూర్తిగా ప్రాణం లేనట్లు
పడివున్నాం. ఆతరువాత బండీని ఒక దొడ్డి లోకి పోనిచ్చారేమో అక్కడ మాకు మెడకు
బలమైన ఇనప కంఠె వేశారు. మనిషికీ మనిషికీ పారిపోకుండా సంకెళ్ళు వేసి కట్టారు.
మామీద వేడివేడి నీళ్ళు పోసి పశువుల్ని కడిగినట్లు తోమి కడిగారు. మా బట్టలు మార్చేశారు.
జుత్తు కత్తిరించారు. కాస్త తిండిపెట్టి నీళ్ళు తాగించారు. అక్కడ మమ్మల్ని పశువుల్ని
అమ్మినట్లు బానిసలుగా అమ్మివేశారు. ఒక ధనికుడు మమ్మల్ని కొనుక్కుపోయి రెండు నెలలు
నడిపించి ఒక ఎడారికి తీసుకుపోయాడు. అక్కడ మళ్ళీ బానిసల సంత వుంది.అక్కడ నల్లజాతి
బానిసలు చాలామందే వున్నారు. అక్కడ ఎఱ్ఱతోలు ఆడమనుషులకి చాలా ధర పలుకుతోంది.
ప్రతివాడూ వచ్చి ఆడమనిషిని అన్నీ చూసి మరీ కొంటున్నాడు. నన్నూ ఆ ఆడమనిషినీ ఒక
గడ్డపాయన కొనుక్కున్నాడు.

ఆడమనిషి పేరు రుంజ. బాగా పుష్టిగా వుంటుంది. ఆ గడ్డపాయన సేవకులు మమ్మల్ని


కొండల్లో నడిపించుకు పోయారు. అది రాతిదేశం. ఎండా ఎక్కువే చలీ ఎక్కువే. అక్కడ కొన్ని
ఖజ్జూరపు తోటలున్నాయి. నీళ్ళు దొరకవు. ఆ దేశంలో ఇంగువ తయారవుతుంది. నన్ను
ఇంగువ తయారుచేయడంలో పెట్టుకున్నాడు. యజమాని రుంజని ఉంచు కున్నాడు. తిండి
పెడతాడు అంతే. అక్కడ ఖర్జూరతోటలో గుడిశె వేసుకోనిచ్చాడు. అక్కడి నుండీ మా బానిస
బతుకు మొదలైంది.”

“మరి ఆ ఆడమనిషి ఏమయిందీ?”

“కొన్నాల్టితరువాత తను చెప్పిన పనల్లా చేయలేదని యజమాని ఆమెను చంపి పూడ్చి


పెట్టాడు.”

“మరి నీవెలాతప్పించుకున్నావు?”

“తప్పించుకోడానికి చూస్తే వాళ్ళకి కూడూ నీళ్ళూ ఇవ్వకుండా మాడ్చి చంపుతారు.


లేకపోతే ఒక కాలి పాదం నరుకుతారు. నేను బుద్ధిగా ఆరేళ్ళు పనిచేయడంతో దొర నన్ను
వదిలేశాడు. వదిలేయడమంటే మెడ కంఠె తీసేసి పొమ్మన్నాడు. ఎన్నో నాళ్ళకు గానీ ఇక్కడికి
జేరలేకపోయాను. నా పెళ్ళాం మీద ప్రేమతో నేనిన్ని కష్టాలు పడి వెతుక్కుంటూ వచ్చాను.

108
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

దొరలందరూ దయచేసి నా పెళ్ళాన్నీ నా కొడుకుని నా ఇల్లునీ నాకిప్పించమని


వేడుకొంటున్నాను.”

గ్రామ సభ మొత్తం విస్తుపోయింది. అతడు అబద్ధం చెప్పటంలేదనడానికి సాక్ష్యంగా


ఇనప కంఠెతో మెడంతా వరుసుకు పోయి కాయకాచి వుంది. గ్రామసభ్యులకు ఏం చెప్ప
డానికీ నోరు రావటం లేదు.

“ఈ మగడి సంగతేమిటీ?” అడిగాడు విశాఖదత్తుడు.

“వీడూ ఆరు నెలలనుంచీ ఇంటో లేడు. ఓడల మీద భారవాహకుడిగా వెళ్ళాడు.”


చెప్పాడు గ్రామణి. విశాఖదత్తుడు ఫక్కున నవ్వాడు.

“అన్నదమ్ములిద్దరూ దొంగాట ఆడటం లేదుకదా? ఈ పిల్ల వయసెంతా?” ప్రశ్నించాడు


విశాఖదత్తుడు.

“ఇరవై నాలుగేళ్ళు.”

“పాపం వయసులో చిన్నది. ఆ భర్త వచ్చేంతవరకూ ఈ భర్తతో కాపురం చేయమనండి”


అందామనుకున్నాడు విశాఖదత్తుడు. విష్ణువర్ధనుడు మిత్రుని వారించాడు. సభలో
గుసగుసలు సంప్రదింపులు నడుస్తున్నాయి.

విష్ణువర్ధనుడు విశాఖదత్తుని సభకు దూరంగా తీసుకువెళ్ళాడు. ఇద్దరూ ఉసిరి


చెట్టునీడన కూర్చున్నారు. “విశా! వీళ్ళ విషయంలో ధర్మం చాలా సూక్ష్మమైనది. పెద్దలైన
స్మృతికారులు పరిష్కరించవలసిన సమస్యలో మనం ఇరుక్కో కూడదు” అన్నాడు.

“బాగుంది. రేపు నీవు రాజయినతరువాత నీ సభకు ఈ సమస్య వస్తే ఏంచేస్తావూ?”

“ధర్మాసనానికి నివేదించమంటాను!”

“వాళ్లు నిర్ణయం ప్రభువుకే వదిలేస్తే?” విష్ణువర్ధనుడు ఆలోచనలో పడ్డాడు.

“విశా! మనం ముందర సమస్యలోని చిక్కుల్ని విప్పడానికి ప్రయత్నిద్దాము. ఒకటి


అతని ఇల్లూ వాకిలీ అతనికి రావలసిందే. రెండు, సంతానం తండ్రి ఆస్తి. అందుచేత అతడి
కొడుకును అతడికి ఇచ్చివేయాలి. కానీ ఇంకో ధర్మం ప్రకారం సంతానం కల స్త్రీని పెళ్ళి
చేసుకున్నవాడు ఆ పిల్లలకు కూడా తండ్రి అవుతాడు. ఇక స్త్రీ పునర్వివాహం చేసుకో వచ్చునా
అని. శాస్త్రంలో ఏముందీ

109
  చాళుక్యసింహాసనం

మృతే జీవతీ వా పత్యౌ యా నాన్యముపగచ్ఛతి

సేహ కీర్తిమవాప్నోతి మోదతే చోమయా సహ

ఏ స్త్రీ తనభర్త మరణించిన తరువాత కానీ జీవించి వుండగా కానీ మరొకని పొందదో
ఆ స్త్రీ లోకంలో కీర్తి ప్రతిష్టలు పొందుతుంది అంటుంది శాస్త్రం. అంటే లోకంలో పునర్వివాహాలు
జరుగుతుంటాయి. కాకపోతే వాళ్ళు గొప్ప పతివ్రతలు కాకపోవచ్చు!

ఆమె మరిదిని పునర్వివాహం చేసుకుంది. మరిదిని చేసుకోవడం కొంతలో కొంత


నయం అంటుంది శాస్త్రం. భర్త స్త్రీని రక్షించాలి, పోషించాలి. అలా మగడు భార్యను విడిచి
వెళ్ళిపోతే కలియుగంలో పన్నెండేళ్ళు, ద్వాపరయుగంలో పదమూడేళ్ళూ, త్రేతాయుగంలో
పదునాలుగేళ్ళు విడిచివుంటే అట్టి భర్త పోయినట్లే. గ్రామిణులలో ఈ నియమం ఏడేళ్ళు
కావచ్చు. కామం అనేది దేవేంద్రుడు స్త్రీలకిచ్చిన వరం. ఆ కోరికను పురుషుడు తీర్చాలి.
సింగయ్య ఏడు సంవత్సరాలు భర్త ధర్మాలు నిర్వర్తించలేకపోయాడు. కాబట్టి అతడు ఆమె
పైన ఆధిపత్యం కోల్పోయాడు.

కానీ కొడుకును మాత్రం అతడికి తిరిగి ఇచ్చివేయాలి. అలాగే తరువోజ పునర్వివాహం


చేసుకోవడం వలన ఆమె అతడి ఆస్తిలో మూడోవంతు భరణంగా పొందే అర్హతను
కోల్పోయింది.

విశాఖదత్తా! ఇప్పుడు అతడినుంచీ ఆలోచిద్దాము. అతడు నిజంగా చెప్పలేనన్ని కష్టాలు


పడ్డాడు. అది విధి అని వదిలేయలేము. మనుషుల్ని ఎత్తుకుపోయేవాళ్ళని శిక్షించలేకపోవడం
పరిపాలకుల తప్పు. అతడు అన్ని కష్టాలు పడి విడుదలై ప్రేమతో తన భార్యా పుత్రులకోసం
వెతుక్కుంటూ వస్తే అతడికి అన్యాయం చేయడం ఏమి ధర్మం?

కాబట్టి మనం ఈ ధర్మ సంకటాన్ని తీర్చతగినవారం కాదు. మెల్లగా తప్పుకుపోవాలి.


ధర్మం దేశ కాల పరిస్థితులను పట్టి కూడా వుంటుంది. దేశాచారము కులాచారము వంశా
చారము పట్టి గ్రామ సభే తీర్పు చెబుతుంది” అన్నాడు విష్ణువర్ధనుడు.

“విష్ణూ! ఇదేమి న్యాయం? తరువోజను గురించి ఆలోచిద్దాం. ఆమె పూర్వ భర్తకు


అధికారం లేదంటున్నాము. రెండవ భర్త సముద్రాలు పట్టుకు పోయాడు. తిరిగి వస్తాడూ
రాడు. ఈమె గతేమిటీ? మొదటి మగడూ కాక రెండవ మగడు లేక అలమటించాల్సిందేనా?
అందుకని తరువోజను ద్విభత్రుకను చేద్దాం!”

“విశా! నీ తెలివితేటలు ఇలా వుంటాయని నాకు తెలుసు. తీర్పు చెప్పేడపుడూ శిక్ష


విధించేడపుడు ముందుగా మనం ఏ శృతి స్మృతులను కానీ పూర్వోక్తమైన ఋషుల
ధర్మశాస్త్రాలను కానీ అనుసరించి చెబుతున్నామో ఉదహరించి చెప్పాలి. అంతేకానీ మనకు

110
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

తోచింది ధర్మంకాదు. అందుకే మన గుఱ్ఱాలను విప్పుకుని మన దోవన మనం పోవడం


మంచిది”అన్నాడు విష్ణువర్ధనుడు.
ఇంతలో అక్కడికి బట్టలమూట నెత్తిన పెట్టుకుని మొదటి గూఢచారి వెతుక్కుంటూ
వచ్చాడు.
“ఓరి నీ దుంపతెగా! రామేశ్వరం పోయినా శెనేశ్వరం పోలేదని ఇక్కడికి కూడా దాపు
రించావా?” అన్నాడు విశాఖదత్తుడు వాడితో.
“దొరా! నన్ను నిద్రపుచ్చి నువ్వు పారిపోతావా?” అన్నాడతడు.
“ఏరా! కుక్కకన్నా బాగా వాసన పట్టి వచ్చావురా?”
“దొరా! కుక్కకాదు చీమ అనండి!”
“చీమేమిటీ?”
“చీమ బెల్లం ఎక్కడున్నా కనుక్కోవడమేకాదు అక్కడికి చేరుకోవడానికి దోవకూడా
వేస్తుంది, జేరుకుంటుంది.”
“నిజమే! నేనాలోచించలేదు. కుక్కకన్నా చీమ గొప్పది. ఇకనుంచీ నీపేరు చీమ
అయ్య...చీమయ్య.”
“దొరా! నన్ను కొలువులో పెట్టుకోవా?”
“నీవు ఒకదేశం గూఢచారివి. నిన్ను కొలువులో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్లే!”

“దొరా! నేను గూఢచారిని కాదు. వార్తలు పంపేవాడిని మాత్రమే. వాళ్ళు నాకు మడులు
మాన్యాలు ఏమీ ఇవ్వలేదు. నాపొట్ట గడవడం కూడా కష్టమే. నా పెళ్ళాం పిల్లల్ని పోషించు
కోవడం కూడ కష్ఠమే. నీ కాళ్ళదగ్గర బానిసగా పడివుంటాను.”

“చీమయ్యా! నిన్ను వేగుశాఖలో వేశాననుకో...” ఇంకేదో చెప్పబోయాడు విశాఖ


దత్తుడు. విష్ణువర్ధనుడు అడ్డుపడ్డాడు. “అట్టు తిరగవేయి” అనిమాత్రమే అన్నాడు.
విశాఖదత్తుడు ఒక క్షణం ఆలోచించాడు. వీడిని వేంగీనగరంలో గూఢచారిగా వేస్తే ఎలా
వుంటుందీ అనుకున్నాడు.

“చీమయ్యా! నీకొక సమస్య ఇస్తాను. అది నువు పరిష్కరిస్తే నిన్ను వేంగీనగరంలో


వేగువాడిగా నియమిస్తాను. చిన్న మాన్యం ఏదేనా ఇస్తాను. అది దున్నుకుంటూ బతకాలి. వేరే
జీతభత్యాలేమీ ఉండవు” అన్నాడు విశాఖదత్తుడు.

“చెప్పుదొరా! ఆ చిక్కు ఏమిటో” అన్నాడు చీమయ్య. విశాఖదత్తుడు ఆ గ్రామసభ


ముందున్న సమస్యను చెప్పాడు. అందుకతడు “ఇదేంకొత్తా దొరా! ఎన్నో గూడాలలో ఇలాగే
జరుగుతుంది! తరువోజను ఇద్దరన్నదమ్ములతోను కాపురం చేయమను. ఆనాడు ద్రౌపదీదేవి
111
  చాళుక్యసింహాసనం

ఐదుగురన్నదమ్ములతో కాపురం చేయలా? అదిపెద్దలు చెప్పిన నీతేకదా?” అన్నాడు


తడుముకోకుండా.

విశాఖదత్తుడికి ఊరట కలిగింది. చీమయ్యను గ్రామసభకు తీసుకు వెళ్ళాడు. అతడి


నోటితోనే తీర్పు చెప్పించాడు. గ్రామ సభతోపాటు సింగయ్యా తరువోజ కూడ తీర్పు
నంగీకరించారు.

విశాఖదత్తుడు చీమయ్యను వేగుదళంలో చేర్చుకుని వేంగీదేశంలో పనిచేయమన్నాడు.

19 సంచార శ్రేణి
మిత్రులిద్దరూ ప్రయాణం చేస్తూ శ్రీశైలం వెళ్ళే దోవలో ఆత్మకూరు దాటారు. ఆ తరువా
తంతా భయంకరమైన నల్లమలారణ్యం. బాట చాలా ఇరుగ్గా ఉంది. పెరిగిన వెదురు పొదలూ
ముళ్ళమొక్కలూ దోవను మూసేస్తున్నాయి. వర్షం పడడం వలన కొండవాగులు
పొర్లుతున్నాయి. చెట్లకొమ్మలనుండీ పాములు వ్రేలాడుతూ కనిపించాయి. అడివంతా ఏదో
మూలికల వాసనగా ఉంది. అది కొంచం మత్తు కూడ కలిగిస్తోంది.

“విష్ణూ మనం భద్రమైన ప్రదేశంలో ఆగాలి. ఈ అడవిని ఒక్క రోజులో దాటలేము”


అన్నాడు విశాఖదత్తుడు.

“ఔను మిత్రమా! ఎక్కడైనా ఆగి వంటచేసుకుందాం” అన్నాడు రాజకుమారుడు.

గుఱ్ఱాలు అలా మెల్లగా నుడుస్తుంటే అక్కడ ఎత్తైన చదునైన ప్రదేశం కనిపించింది.


గుఱ్ఱాలను అటుగా తోలారు మిత్రులిద్దరూ. అక్కడొక సార్ధవాహుల బిడారం విడిసి వుంది.
అక్కడ చాలా వృషభ శకటాలు విడిసివున్నాయి. వ్యాపారులందరూ గుడారాలు దింపు కుని
విడిది చేశారు.

గుఱ్ఱాలపై వస్తున్నవారిని చూసి బిడారంలో వారందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.


అగంతకుల రొంటినుంచి పెద్దపెద్ద ఖడ్గాలు వ్రేలాడుతుండడం అందుకు కారణం. తమను
దండించవచ్చిన ప్రభుత్వాధికారులేమో ననుకున్నారు. సుంకరులైతె ఎంతో కొంత ఇచ్చి
పంపించవచ్చు. వచ్చినవారెవరైనా సరే తమ బిడారంలోకి అనుమతించరు. బయటివారిని
బయటినుంచే పంపించివేస్తారు.

మిత్రులిద్దరూ తమ గుఱ్ఱాలను నిలుపు చేశారు. విశాఖదత్తుడు తనగుఱ్ఱం దిగి బిడారం


వైపు నడిచాడు. ఎదురు వచ్చినవారితో“మహాశయులారా! మేమిద్దరం శ్రీశైలం యాత్రకు
వెళుతున్నాం. చీకటి పడింది. ఈ రాత్రికి మీవద్ద విడిది దొరుకుతుందేమోనని వచ్చాం!”
అన్నాడు.

112
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

సార్ధవాహులందరికీ ఒక నాయకుడున్నాడు. అతడు రత్తంచెట్టి. చంద్రకాంతపూవు


రంగు పంచ కట్టుకుని పైన అంగరఖా వేసుకున్నాడు. మెడలో హారాలు చేతి ఉంగరాలు అతడి
ఐశ్వర్యాన్ని చాటుచున్నాయి. మీసాలు పెంచినా అవి క్రిందికి వంగివున్నాయి. వింతగా
నాముతో విభూదిరేఖలుతీర్చి దానిపైన పంగనామాలు పెట్టుకున్నాడు. శివ కేశవులిద్దరిలో
ఎవరికీ కోపం రాకుండ అలా చేశాడేమో. తలపాగా కూడ ఘనంగా వుంది. అతడి ప్రక్కన
అంగరక్షకులలాగా ఇద్దరు చెంచులు బాణాకఱ్ఱలు చేతపట్టి నిలబడ్డారు. అతడిలా అన్నాడు.

“అయ్యా! తమరెవరో మాకు తెలీదు. మేమేదో ఉప్పూ తింతపండూ అమ్ముకునేవాళ్ళం.


పెద్దగా భాగ్యవంతులం కాదు. ఈ అడవిని దాటేలోపల చీకటి పడిపోతుందని ఇక్కడ విడిది
చేశాం! మేము క్రొత్తవారినెవరినీ మా బిడారం లోకి రానీయలేము. గోమఠులుగా మా భయం
మాది!”

“అయ్యా! మేము శ్రీగిరియాత్రికులం! శివస్మరణం చేసుకునేవారమే కానీ ఒకరికి


అపకారం చేసే వాళ్ళం కాదు” అన్నాడు విశాఖదత్తుడు.

“మీరు పెద్దమనుషులే కావచ్చు! కానీ లోకంలో చంద్రకాంత విత్తనాలు మిరియం


గింజలు ఒకే మాదిరిగా ఉంటాయు. ఒకదాంట్లో ఒకటి కలిసినా గుర్తుపట్టలేము. మీ ముఖాన
విభూది రేఖలు కూడ లేవు. ఎవరో సేనాపతుల్లాగా వున్నారు. మేం ఉప్పు పప్పు అమ్ముకునే
బేహారులం! మాభయం మాది! మన్నించాలి!” అన్నాడు రత్తంచెట్టి.

విశాఖదత్తుడికి కొంచం అభిమానమనిపించింది. వారినింకా బ్రతిమిలాడడం


అనవసర మనిపించింది. వెనుతిరిగాడు. పరిస్తితిని గమనించిన విష్ణువర్ధనుడు తాను కూడా
గుఱ్ఱందిగి బిడారం వైపు కదిలాడు. రాకుమారుడి ముఖారవిందం చూస్తే వ్యాపారుల
ముఖంలో మార్పు కనిపించింది. ఎవరో రాజ పురుషుడు అనిపించింది. వారి భయం ఇంకాస్త
పెరిగింది. వ్యాపారస్తులు వినయంగా దోసిలి యొగ్గి నిలబడ్డారు.

ఆ బిడారంలో ఒక వనిత కూడావుంది. వనిత అంటే పదహారు పదిహేడేళ్ళ నవ జవ్వని.


సూదెంటురాయి ఇనుము నాకర్షించినట్లు విష్ణువర్ధనుడిచేత అకర్షింపబడింది. శ్రేష్ఠి ప్రక్కన
నిలబడి చేతిని గీరింది.

“అయ్యా! తమరెవరో ప్రభువుల తనయులు లాగా ఉన్నారు! మామీద ఆగ్రహించకండి!


ద్రవ్యమూ కానుకలు సమర్పించుకుంటాము. ఏదో ఉప్పూ చింతపండూ అమ్ముకునే వాళ్ళం!
ఈ అడవిలోపొద్దు కూకుతే ప్రయాణం భద్రం కాదని ఇక్కడ ఆగాం. రేపటి ఉదయమే ఖాళీచేసి
వెళ్ళిపోతాం” అన్నాడు శ్రేష్ఠి.

“వణిక్వర్యా! మేము రాజకుమారులుగాను రాజోద్యోగులుగాను ఇక్కడికి రాలేదు.


బాటసారులం! శ్రీగిరి మల్లికార్జున మహాలింగ దర్శనం కోసం వెళుతున్నాం! ఈ నల్లమలా

113
  చాళుక్యసింహాసనం

రణ్యంలో పులుల బాధ చాలా ఉంటుందని రాత్రికి మజిలీ చేయాలని సంకల్పించాం! తమరు
ఆశ్రయమిస్తే సరి! మేమయితే ఏ చెట్టు తొఱ్ఱలోనో తెల్లవారే వరకూ తలదాచుకుంటాం. కానీ
మా గుఱ్ఱాలను దాచలేముకదా! పోనీయండి. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు! విధి ఎలావుంటే
అలా జరుగుతుంది” అన్నడు విష్ణువర్ధనుడు.

“అయ్యా! తమరలా అంటే మాకు కాళ్ళాడడంలేదు! ఉప్పూ చింతపండు అమ్ముకునే


వాళ్ళమయినా అంతో ఇంతో రొక్కం ఉంటుందికదా! ఈ అడవిలో దొంగలు దోచుకు
పోతారేమో నని భయం! క్రొత్తవారినెవరినీ నమ్మం! కానీ మీరు శ్రీశైలం యాత్రికులం
అంటున్నారు. శివభక్తులకు అపకారం జరుగతే ఆ శివయ్య మమ్మల్ని మన్నించడు. మీకు
విడిది ఇవ్వక ఈ రాత్రి మీకేదైనా ప్రమాదం జరుగుతే ఆ దైవానికి కోపం వస్తుందేమో!
వ్యాపారంలో లాభనష్టాలు దైవాధీనాలు.”

“ఆర్యా. మావలన మీకు మేలు జరగక పోవచ్చు! కానీ కీడూ నష్టమూ జరగదు. మా
స్వయంపాకం మాకుంది. మేమే వంట చేసుకుంటాం!”అన్నడు విష్ణువర్ధనుడు.

“అయ్యా! ఇంటికొచ్చిన అతిధి దైవంతో సమానం! మా బిడారంలోకి దయచేయండి!


వంటలు చేస్తున్నారు. మీరు వండుకోవడమేమిటీ? మీరు ఉడుకు నీళ్లు పోసుకుని మా
పనివాళ్ళు బట్టలు ఇస్తారు మార్చుకోండి! పెందరాళే భోంచేద్దాం! ఆ తరువాత ఈ చిత్రాణి
విడెం పంచుతుంది. నాట్యం చేస్తుంది. మా సేవకులు మీకు గుడారం చూపిస్తారు” అన్నాడు
రత్తంచెట్టి దేముడిమీద భారం వేసి.

ఆ యువతి చిత్రాణి. చాలాచిత్రంగా నవ్వింది. విష్ణువర్ధనుని కళ్ళలోకి సూటిగా


చూసింది. సన్నగా రివటలా వున్నా అందంగా వుంది. ముఖం చిత్రకారుడు గీచిన బొమ్మలా
అందంగా వుంది. ఏమనుకున్నదో యేమో మిత్రులిద్దరికీ వేడినీళ్ళు తోడింది. తుడుచు
కోడానికి వలిపం అందించింది.

సేవకులు మిత్రుల గుఱ్ఱాల కళ్ళాలు అందుకుని మేపడానికి తీసుకు పోయారు. ఆ


బిడారంలో ఒక వంక వంటలు సాగుతున్నాయి. ఇంకో వంక గాబులతో స్నానాలకు నీళ్ళు
కాస్తున్నారు. వేడినీళ్ల స్నానం చేసేటప్పటికి బడలిక అంతా తీరిపోయింది.

ఆకాశంనుంచి సూర్యుడనే మణి జారి సముద్రంలో పడిపోయినప్పటినుంచి


అడవిలో చీకట్లు ముసిరాయి. చెట్లపై గూళ్ళకు తిరిగివచ్చిన పక్షులు కేరింతలతో రొద
చేస్తున్నాయి. బహుళచవితి చంద్రుడు ఆలస్యంగా ఉదయించినా కాంతివంతంగా ఉన్నాడు.
గగనం నుంచి రాలిపడుతున్న నక్షత్రాల్లా మిణుగుడు పురుగులు మిళుకు మిళుకు మంటు
న్నాయి.

114
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

భోజనాలకు ఘంట కొట్టారు. అందరూ వచ్చి పంక్తిగా కూర్చున్నారు. పచ్చిఅడ్డాకుల


విస్తళ్లు పరిచారు. శ్రేష్ఠి విష్ణువర్ధనుని తన ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాడు. రాత్రి భోజనంలోకి
వంటవాళ్ళు జొన్నన్నము సజ్జరొట్టెలు, చిట్టింతపొట్టుపప్పు, ఉస్తికాయల వేపుడు పళ్ళకారం
ఏర్పాటు చేశారు. ముంతలతో ఆవు నేయి పెరుగు అమర్చారు.

విష్ణువర్ధనుడు వడ్డించిన విస్తరికి ఋత్వంతు వర్తేన పరిషించామి అని ఔపోసన


పడుతుంటే “మీరేముట్లూ?” అని అడిగాడు శ్రేష్ఠి.

“మేము క్షత్రియులం!” అన్నాడు విష్ణువర్ధనుడు.విశాఖదత్తుడు విననట్లు ఊరు


కున్నాడు.

“నేను సరిగ్గానే అనుకున్నాననమాట! మెరిసే బంగారం రంగుచూసి మొదట బ్రాహ్మణు


లేమో అనుకున్నాను. కానీ ఖడ్గం అదీచూసి రాజకుమారులనుకున్నా! మాలో అందరం
గోమఠులమే కాని కొద్దిమంది ఇతరులు కూడా ఉన్నారు. కొందరం అడ్డబొట్టు కొందరం
నిలువు బొట్టూ! ఐనా మామధ్య ద్వేషమేమీ లేదు. అందరి వర్ణం కఱ్ఱావు రంగే” అన్నాడు శ్రేష్ఠి
నవ్వుతూ.

అందుకు విష్ణువర్ధనుడు “రంగుదేముందిలేండి! ఎండలో తిరిగేవాళ్ళు నల్లగా


ఉంటారు. అంతఃపురాలలో ఎండ కన్నెరుగనివారు ఎఱ్ఱగా ఉంటారు” అన్నాడు.

“అయ్యా!మాది సంచార వర్తకశ్రేణి! నాపేరు రత్తంచెట్టి. నేనేముఖ్యుడ్ని. ఈ బండ్లు


సామాను అంతా నాదికాదు. ఎవరిదివారిదే. నాకూ పది బండ్ల సరుకుంది. మాదగ్గర వుల్లి
పూసలనుంచి రత్నాలు వజ్రాలు అమ్మేవారిదాకా ఉన్నారు. ఎక్కడ సరుకు చవకగావుంటే
అక్కడ కొంటాం. కొంచం ఎక్కువ వేసుకుని అమ్మగలిగిన చోట అమ్ముతాం. ఏది ఎక్కడ
దొరకదో అక్కడ మంచి గిరాకీ ఉంటుంది.కొండల్లో వుండేవాళ్లకు ఉప్పుకల్లు కూడ
బంగారమే! నేను శ్రేణి అంతటికీ రక్షణ విడిది ఏర్పాట్లు చేస్తాను. వంటలూ వార్పులు
సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటాను. అందుకు కొంత పుచ్చుకుంటాలేండి! ఏదైనా పెద్ద
ఊరుచేరి అక్కడ సంత పెడతాం. అక్కడ వ్యాపారం సన్నగిల్లగానే జండా పీకుతాం. ఇంకో
ఊరు! మాలో ఎవళ్ళ ఊరు దగ్గరపడగానే వాళ్లు అక్కడ దిగబడిపోతారు. కొత్తవాళ్ళు వచ్చి
కలుస్తుంటారు. ఇలా దక్షిణాది దేశాలన్నీ తిరుగుతాం.”

“శ్రేష్టిగారూ! మీరీ ఘోరారణ్యంలో బస చేశారేమిటీ? ఇక్కడ కొనేవాళ్ళెవళ్ళుటారు?”

“ఇక్కడ మేం అమ్మేవి తక్కువుంటాయి. రంగుచీరలు రైకలు మగవాళ్ళ పంచలు


శల్లాలు ముఖ్యంగా ఉప్పుగల్లూ అమ్ముతాం. కానీ వాళ్ళనుంచీ పెన్నేరుగడ్డలు, సర్పగంధ
దుంపలు, నాభి, ఎండబెట్టిన వేళ్ళూ మూలికలు కొంటాము. అంతేకాక పులిగోళ్ళూ చర్మాలు
కృష్మాజినాలు కొంటాము. ఇక్కడ శ్రేష్టమైన గరళం పుట్టతేనె దొరుకుతుంది.”

115
  చాళుక్యసింహాసనం

విశాఖదత్తుడు “చెట్టిగారూ! మీరిన్ని దేశాలు తిరిగారు కదా మీకే దేశం బాగా


నచ్చిందీ?” అన్నాడు.

“అట్లా చెప్పడం కష్టమండీ! ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకంగా బాగుంటుంది. తూర్పు


సముద్ర తీరమంతా పాడిపంటలు బాగుంటాయి. కానీ వర్షాకాలం బురద! బండ్లు
దిగబడిపోతాయి. సంప్రదాయానికి గుళ్ళూ గోపురాలకీ అరవదేశం బాగుంటుంది. ఇప్పుడు
దక్షిణాపధంలో భాగ్యవంతులంటే రాష్ట్రకూటులే! కర్ణాటదేశం కూడా బాగుంటుంది.

“మీరు చాళుక్య దేశాన్ని గురించి చెప్పలేదు.” అన్నాడు విష్ణువర్ధనుడు.

“బాదామినేలిన చాళుక్యలు చాలా గొప్పవారు. చాళుక్యవంశంలో ఇద్దరు పులకేశు


లున్నారు. రెండవ పులకేసి వీరాధివీరుడు. ఆయన తమ్ముడు విష్ణువర్ధనుడు. ఆ వంశంలో
ఆయన పొట్టివాడు. అందుచేత కుబ్జవిష్ణువర్ధను డనేవారు. ఇద్దరన్నదమ్ములూ కలిసి
దక్షిణాపధం మొత్తం జయించారు. ఉత్తర భారతాన్నంతా జయించిన హర్షచక్రవర్తిని ఈ
అన్నదమ్ములు ఓడించారు. కుబ్జవిష్మువర్ధనుడు వేంగి నేలే విష్ణుకుండినులను జయించాడు.
అప్పుడు రెండవ పులకేసి తన తమ్ముడికి వేంగీదేశాన్ని స్వతంత్రంగా పరిపాలించుకోమని
ఇచ్చివేశాడు. అప్పటినుంచి తూర్పు చాళుక్యవంశం ఆరంభమయింది.”

“ఇప్పుడు వేంగీదేశం ఎట్లా ఉందంటారూ?” ఈమాట విశాఖదత్తుడడిగాడు.

అందుకు రత్తంచెట్టి “ప్రజలు భాగ్యవంతులే! ఎక్కువగా వ్యవసాయదారులు. పంటలు


బాగాపండిస్తారు. బ్రాహ్మణులు తినికూర్చుని శాస్త్ర చర్చలు చేస్తుంటారు. వేదానికి కృష్ణా
గోదావరీ తీరాలు పెట్టింది పేరు. రాజులే బీదవారు! అన్నదమ్ములిద్దరూ సింహాసనం కోసం
కొట్టుకు ఛస్తున్నారు. దానితో పన్నులు అధికంగా దండుకుంటున్నారు. వ్యవసాయం మీద
మేలావరము కూడివరము అనే పన్నులెలాగో ఉన్నాయి. అవికాక పాడిపంటలమీదా
పశుసంపదమీదా భోగకరి అనే పన్ను తగిలించారు. ఇవన్నీకాక గోరుచుట్టుమీద రోకటి
పోటులా ఛాత్రభట ప్రవేశదండం ఒకటీ!”

“మరి రాజ్యం వ్యయం పెరుగుతే పన్నులు పెంచవద్దాచెప్పండీ! రాష్టకూటదేశంలో


మాత్రం పన్నులు లేవా”అన్నాడు విష్ణువర్ధనుడు.

“వ్యయం ఎందుకు పెరిగిందీ? యుద్ధాలవలన! రోజూ యుద్ధమేనాయే! ప్రజలేమైనా


అన్నదమ్ముల్ని కొట్టుకోమన్నారా? ఉరుమురిమి మంగలం మీద పడినట్లు ఏదొచ్చినా
ప్రజలకు పన్నుబాధ! ఊరిమీద ఊరుపడినా కరణంమీద కాసు పడదని పన్నులు పెంచిన
కొద్దీ రాజోద్యోగులు, వీరింట పీనుగెళ్ళా, వీళ్ళు బాగుపడుతున్నారు. ఇక రాష్ట్రకూట దేశంలో
డేగరపన్ను, పడవాలు పన్ను, పడియేరి పన్ను, దొగరాజపన్ను ఇవి కాక బీరదాయం,
చిట్టవాటం ఇలా మనిషికి ఎన్ని పళ్ళుంటాయో అన్ని పన్నులున్నాయి.”

116
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“శ్రేషిగారూ.మధ్యలో రాజోద్యోగులేంచేశారు?”
“పన్ను పెంచినకొద్దీ రాజోద్యోగులకు పండగ! వీరింట పీనుగెళ్ళా, పరిదానాలు బాగా
గిడతాయి.”
“పరిదానం అంటే లంచమా!”
“అంతేకదా! సానిది ముందు ఇస్తేకానీ మంచమెక్కదు! వీళ్ళింట పీనుగెళ్ళ వీళ్ళూ
అంతే.”
“ఇవ్వడం మీతప్పు కదా?”
“ఇంతింత పన్ను కడితే మా వ్యాపారాలు దివాలా తీయాల్సిందే! అందుకే వీరింట
పీనుగెళ్ళా, అంతోయింతో యిచ్చి కొంతపన్ను ఎగ్గొడతాము.”
“అంటే మీ స్వార్ధం ఉందన మాట!”

“లేకేమీ! లంచగొండ్లు లేకపోతే వ్యాపారం చేయడమే కష్టమైపోతుంది. పోనీ పన్ను


మొత్తం కడదామా అంటే వీళ్ళు ప్రజలకేమైనా చేస్తారా అంటే అదీలేదు. ఎంత సేపటికీ సైన్యం
యుద్ధం! దొంగలేమో పెచ్చుమీరిపోతున్నారు. మమ్మల్ని దోచుకుంటే నష్టమొస్తే వీరేమైనా
ఇస్తారా?”

“శ్రేష్టిగారూ. ఈ లంచగొండితనం నిర్మూలించాలంటే ఏంచేయాలంటారు?”అన్నాడు


విష్ణువర్ధనుడు.

“అది ఆ దేముడి తరంకూడా కాదు. శ్రీకృష్ణుడి పాలనలో కూడ లంచగొండితనం


ఉండేది. కుచేలుడు శ్రీకృష్ముని కలవడానికి ద్వారకానగరానికి వెళ్ళాడు. నగరం ప్రవేశిద్దా
మంటే తన బిచ్చగాడి రూపంచూసి రాజభటులు లోనికి పోనీయరేమోనని భయం. అంతో
ఇంతో ఇచ్చి పోదామంటే తనదగ్గర పిడికిడటుకులు తప్పుతే ఏమీ లేవే అని బాధ పడ్డాడు.

ఈ లంచం కూడా మూడు రకాలుగా ఉంటుంది. కొందరికి రొక్కం కావాలి. కొందరికి


బంగారం రూపంలో కావాలి. కొందరికి ముండ కావాలి!”

అందరూ పులిస్తరాకులు పారవేసి చేతులు కడుక్కున్నారు.

విష్మువర్ధనుడికి విశాఖదత్తుడికి తమదేశాన్ని గురించి బాగా తెలిసివచ్చింది. అందుకే


ప్రభువు మారువేషంలో దేశాటనం చేయాలంటారు.

భోజనాలు ముగిసిన తరువాత వ్యాపారస్తుల ఆనందం కోసం ఆ మహారణ్యంలో నాట్య


ప్రదర్శన ఏర్పాటయింది.చిత్రాణి నాట్యం ఆరంభించింది. ఆ నర్తకి ముందుగా అందరికీ
విడెం పంచింది. తానే స్వయంగా పాట పాడుకుంటూ అభినయించ దొడగింది.అడవిలోని
117
  చాళుక్యసింహాసనం

కీచు రాళ్ళు నిరంతరాయంగా శృతి నిస్తున్నాయి. రంగస్థలానికి తగినన్ని దివిటీలు


ఏర్పాటయ్యాయి.

మొదట విష్ణువర్ధనుడు ఇదేదో అటవిక నృత్యంలే అనుకున్నాడు. కానీ చిత్రాణి గొప్ప


లయజ్ఞానం కలది. అభినయం ఎక్కడా వంక పెట్టలేనంత సొగసుగాను శాస్త్రబద్ధంగాను
ఉంది. ఆమె ఒక్కతే క్షీరసాగర మథనం ఏకపాత్రాభినయనంలా నాట్యం ఆరంభించింది.
తానే గొంతులు మార్చి ఆడ మగగా పాడుతోంది. దేవదానవుల హావభావాలు నవరసాలు
అందులోని వైవిధ్యాన్నీ ప్రదర్శిస్తోంది.

“భక్త మహాశయులారా! నేటిరాత్రి ఈ నల్లమలారణ్య మధ్యంలో క్షీరసాగర మధనమనే


నృత్య కథను అందించబోతున్నాను. సావధానులై వినగోరెదను.దీనికి కథాక్రమం బెట్టిదనినా.

మున్నుకశ్యప ప్రజాపతికి అనేకమంది భార్యలుండేవారు. అందులో దితీదేవి పిల్లలు


దైత్యులు. అదితీదేవి పిల్లలు ఇంద్రాది దేవతలు. వీరంతా అన్నదమ్ములైనా స్వర్గ సింహా సనం
కోసం సతతం కలహించి పోరి మడియు చుండేడివారు.
సుంతైన అంతైన సైపతరమే. దాయాదివైరంబు సైపతరమే
తొడగొట్టి రోషమున మెలిపెట్టి మీసమును దట్టించి నరికేటి దనుజవరులు
మీసాలు లేకున్న మగటిమి ఇంపార కలబడి పోరేటి దివిజవరులు
సతత సోమరస ప్రియులు.

దేవదానవులు విరోధులైనా అన్నదమ్ములైనందున ఒకనాడు అందరూ కలిసి కూడ


పలుక్కుని తమకు పితామహుడైన బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి ఆయనను బహు విధాల
స్తుతించారు.

“తాతా! విధాతా! ఏమిమా తలరాతా. మేమిలా కొట్టుకు చావవలసిందేనా. హే


సృష్టికర్తా. హే కమల సంభవా. నీ మనుమలం కశ్యప ప్రజాపతి తనయులం. దయతోడ
మాకు చావు లేని మందు ఏదైనా ప్రసాదించవయ్యా!” అని ప్రార్ధించారు.

అందుకా చతురాస్యుడు “పౌత్రులారా! మావంతు సృష్టించడం మాత్రమే! సర్వలోకా


లనూ రక్షించవలసినవాడు పోషించవలసినవాడు ఆ శ్రీహరి మాత్రమే! మనందరం కలిసి
శ్రీమన్నారాయణుడి వద్దకు వెళ్ళి ఆ జగన్నాథుడిని ప్రార్ధిద్దాము” అన్నాడు. అందరూ కలిసి
వైకుంఠానికి చేరి అరవిందాక్షుని స్తుతించారు.
ఓ అంబుజనాభ ఆర్తజన బాంధవ భక్తవత్సలా
ఆక్రందన జేయు మాకు దయతో అంబుధి శయనా

118
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

జరామరణ వివర్జితమై విలసిల్ల నెల్లరు


మందో మాకో ద్రావకమో ప్రసాదింపుమా

అట్లడుగగా ఆ కమలనాభుడు,

“ఓ వత్సము లార మీరలు క్షీరోదధి మధింపుడయ్య! అట్లొనరించిన కడలినుండి సుధా


రస కలశము లభించునయ్య! అది ద్రావిన వారికి జరామరణ వివర్జితమౌ అమరత్వము
సిద్ధించునయ్య!” యని నుడివిన ఇరుపక్షములు ఒడంబడి పాలకడలి చిలుకంగా నిశ్చ
యించిరి.

దస్యులలో బలి దైత్యేంద్రుడు, శంబరుడు, అరిష్టనేమి, జంభుడు, హయగ్రీవుడు,


నముచి, తారక బాణుడు, విప్రచిత్తి, శకుని, విరోచనుడు, ప్రహేతుడు, మయుడు, మాలి,
సుమాలి, కుంభుడు, నికుంభుడు, పౌలోముడు, కాలకేయుడు, నివాతకవచుడు, వజ్రదంష్ట్రుడు
మొదలైన ప్రముఖులు వారివారి రాక్షస దైత్య గణంబుల సమకూర్చుకుని వచ్చిరి.

మహేంద్రుండు అష్టదిక్పాలకాది దేవగణంబులతో కూడివచ్చే.

అందరూకలిసి మంధర పర్వతాన్ని చల్లకవ్వముగా చేయనెంచి అయ్యద్రిని పెకలించ


సమకట్టి పర్వతంబు చుట్టుముట్టు పాదపంబుల నరికి ముళ్ళపొదల కాల్చి కోసు మొనల
సవరించి మూలంబును పలుగుల త్రవ్వి గడ్డపారల జొనిపి రోకళ్ళు జొప్పించి బెట్టించి
కదిలించి ఊపి కుదిపి పెకలించి పైకెత్తుకొన ప్రయత్నింప అమ్మంధరగిరి మీదపడ కొందరు
మడిసిరి కొందరు నలిగిరి కొందరు నడిమికి విరిగిరి గిరగిర తిరిగిపడిరి దిమ్మరపోవన్.

అంతట దేవదానవ సంఘంబులు ఆ శ్రీహరిని మరల శరణువేడ కమలాక్షుడు


కరుణించి గదాధరుడై గరుడ వాహనుడై అరుదెంచ ఆయన వాహనంబైన ఖగరాజు ఆ పర్వత
శిఖరంబును తన కాలి గోళ్ళతో పట్టి ఎత్తి క్షీరాబ్ది తీరంబున దిగవిడిచి నిజపురంబు నకుం
జనియే.

మరల కార్యారంభులైన దేవాసురులు వాసుకి అనే సర్పరాజాన్ని ప్రార్ధించి తెచ్చి ఆ నగ


రాజునకు సర్పరాజును కవ్వపు తాడుగా చుట్టి పాలలోకి జార్చి అయ్యహికి పడగలు పట్టి
దానవులు తోకపట్టి దేవతలు పచ్చిపాలు చిలుక ప్రయత్నింప మంధరంబు కుదురు లేక పాల
మునుగసాగే.
శ్రీమద్రమారమణ గోవిందో హరి. అయ్యలారా ఆ శ్రీహరి కరుణా వీక్షణములులేక
సురలైన అ సురులైన దధితరువ తరమా
ఉదధి తరువ తరమా

119
  చాళుక్యసింహాసనం

హరి కరుణ లేక


దధి తరువ తరమా ఉ దధి తరువ తరమా
జలధి దాట తరమా సం సారజలధి దాట తరమా
హరి కరుణ లేక
ఉ దధి తరువ తరమా సం సారజలధి దాట తరమా
హరి కరుణ లేక
మరల సకల జగద్రక్షకుడైన ఆ జగన్నాధుని సురాసురులు ప్రార్ధింప హరి కరుణా
సముద్రుండై కమఠంబై క్షీరవారాసిని ప్రవేశించి చుట్టకుదురై మంధరనగంబును పన్న గంబు
సహితంబుగా పైకెత్తి పట్ట చుట్టకుదురైనట్టి శ్ర్రీమహావిష్ణువు ఎట్టులుండెననగా
విష్ణో ర్విక్రమసి
విష్ణో విక్రాంతమసి
విష్ణోః క్రాన్తమసి.

దేవదానవులు అప్పాలకడలిని చిలుకు అందమెట్లుండె ననగా దధిమధనవేళ గురు


నితంబిని పిరుదుల కదలికను పోలి సుందర మంధర ధరణీధరంబు సవ్యాపసవ్యంబులుగా
పిరుంద తిరుగుచుండె. దేవతలు వాసుకి వాలంబు పట్టి లాగు సమయంబున సవ్యంబుగా
దానవులు ఫణాళి పడగలు పట్టి లాగు సమయంబున అపసవ్యంబుగా తిరుగ చొచ్చే.

సవ్యారాధకులందరూ దేవహితులు. అపసవ్యారాధకులు దైత్యులు. వికాసమును కోరు


వారు దేవతలు విలయమును కోరువారు రాక్షసులు. ప్రకృతి నారాధించువారు పరమ
పురుషులు. విక్రుతి నారాధించువారు దానవులు.

అనంతమైన పరబ్రహ్మము ప్రకృతి తానే విక్రృతీ తానే. సగుణము తానే నిర్గుణము


తానే. సవ్యము తానే అపసవ్యము తానే. దక్షిణాచారము తానే వామాచారము కూడా తానే.
సృష్టీ తానే ప్రళయము తానే. వికాసమూ తానే విలయము తానే.

దైవమనే అనంతబ్రహ్మను ఎవరెలా ఆరాధిస్తే అలాంటి ఫలితాన్ని పొందుతారు.


అందుకే దానవులు సహితం బ్రహ్మము నుండీ అనేక వరాలు పొందకలిగారు.

శ్రీమహావిష్ణువు సగుణారాధన ప్రియుడు. విలయారాధనా విరోధి. దనుజ విరోధి.


నిరోధి.

పాలకడలిని చిలుకగా మున్ముందు ప్రళయభీకరంబైన మహాకాల హాలాహల విషమ్ము

120
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

పుట్టె. ఆ మహోపద్రవంబునకు తాళలేక దేవదానవులందరూ పారి కైలాసము జేరి మహే


శ్వరుణ్ణి ప్రార్ధింపసాగారు.

హే మహాదేవదేవా పశుపతే పార్వతీపతే భూతపతే పాహిమాం పాహిమాంపాహిమాం.

దేవాసురులము అమృతంబుకోరి అంబుధి తరువ హాలాహలంబు పుట్టే. ఆ హాలాహల


జ్వాలలు విస్ఫులింగంబులై అగ్నికీలా నివహంబులై విషతురంగంబులై చెలియలికట్ట నతి
క్రమించి దుముకుచూ ఉరుకుచూ పొంగుచూ పారుచూ పొరలుచూ దొరలుచూ వ్యాపిం
చుచూ ఆక్రమించుచూ అతిక్రమించుచూ కబళించుచూ ఆహుతి యొనర్చుచూ సాగు
చున్నవి. అది మహారణ్యంబులన్ కాల్చుచూ రాళ్ళ కరిగించుచూ నదుల నింకించుచూ
భూతగణంబుల మ్రింగుచూ వనలతాగుల్మముల మాడ్చుచూ కంధరంబుల జొచ్చుచూ
నలుతెరంగుల ప్రాకుచూ దశదిశల కబళించుచూ సూర్యచంద్రుల మసిబారించుచూ
గగనంబు నాక్రమించుచూ తారాపధంబు తాకుచున్నది.

మేము బ్రహ్మేంద్రులం యక్షులం గంధర్వులం కిన్నర కింపురుషులం దైత్యులం దాన


వేంద్రులం విద్యాధరులం నాగులం ఖేచరులం జంగంబులం స్ధావరంబులం నీ పాద
కమలంబులం ముక్కంటి మ్రొక్కువారం హే దయామయా హే కరుణాంతరంగా మా వ్యధన్
ఆలింపుమా హేశూలీ కపాలీ విషసర్పమాలీ చితాభస్మధారీ గజచర్మాంబరీ మా ప్రార్ధనల్
అవధరింపుమా ఈ విషానలజ్వాలలన్ హరింపుమా భరింపుమా అనాధలన్ బ్రోవుమా.

హే శరభావతారా! అగ్ని నీ హస్తకమలంబునందుండదే! ఓ చిచ్చరకంటిజోదా!


నీకంటి మంట కన్న ఘన అనలంబుకలదే? అంత్యేష్టి నీ వంటపోయి కాదే! విషఅహీ
నివహంబు నీ కంఠహారంబుకాదే! నీవుకాక ఈ కాలకూటంబు హరియించు హరుడు కలడే?
హే గౌరీ వల్లభా కరుణించు కరుణించు. పాహిమాం పాహిమాం పాహిమాం.

వారి ప్రార్ధనల ఆలకించిన హరుడు హాలాహలంబును హరించి లోకంబుల కాచి గరళ


కంఠుడయ్యే. అంతట సురాసురులు క్షీరసాగర మధనంబు విడువక కొనసాగించగా.

కామధేనువు పుట్టె కల్పవృక్షము పుట్టె ఉదధి. తా బుట్టె ఉచ్చైశ్శ్రవంబు. వెల్ల ఏనుగు పుట్టె
జాబిల్లి పుట్టె. వారుణీయను వువిద వారాసి బుట్టే ఆమెతో పుట్టిరీ అప్సరోగణము.
అంతట క్షీరాభ్దిలో శ్రీదేవి పుట్టే.
కమలే కమలాక్షీ కల్లోలినీ సంభవే
కుముదే కుముదవాసినీ కోమలీ
ధనదే ధనదా ధనధాన్య ప్రసాదినీ
వరదా వారిజా వైకుంఠవాసినీ
121
  చాళుక్యసింహాసనం

అటువంటి మహాలక్ష్మిని శ్రీమహావిష్ణువు చేకొనగా చావులేని మందు చంకలో పెట్టుకు


ధన్వంతరి యను వెజ్జు కడలి తాబుట్టే! అమృతంబు పుట్టే!

శ్రీ మద్రమారమణ గోవిందో హరి!”

విష్ణువర్ధనుడు ఆ బాల నాట్య చాతుర్యానికి చకితుడయ్యాడు. పట్టుమని ఆ యువతికి


పదిహేడేళ్ళు కూడాలేవు. కానీ ఒక్కతే పాటపాడుకుంటూ నాట్యం చేసింది. దేవతలు
దానవులు శివుడు విష్ణువు లక్ష్మీ దేవీ అన్నీ తానై నర్తించింది. కానీ వణిజులెవరూ ఆ నాట్యాన్ని
సరిగ్గా ఆస్వాదించటంలేదు. రోజూ ఆమె నాట్యమే చూసిచూసి విసిగి ఉండ వచ్చు. అక్కడ
చాలామంది నోరు తెరుచుకుని నిద్ర పోతున్నారు. మశకాలు లోపలకు వెళుతూ వస్తూ
వున్నాయి. వాళ్లు పెట్టే గురకలు క్షీరసాగర మధనంలో సముద్ర కెరటాల హోరు లాగే ఉంది.
అరణ్యంలో హరిగానం ఇలాగే ఉంటుందేమో!

తల్లిదండ్రులు ఉన్నతులు కాకపోతే పిల్లల పరిస్ధితి ఇలాఉంటుందికదా అనిపించింది


రాకుమారుడికి. ఈ పిల్ల ఉన్నతకుటుంబంలో పుడితే ఎంత రాణించునో కదా అను కున్నాడు
విష్ణువర్ధనుడు. చిత్రాణి నాట్యం ఆపి హారతి పళ్లెం పట్టుకువచ్చింది.మంగళం పాడకుండా
నర్తకి అలా రావడం విష్ణువర్ధనుడికి నచ్చలేదు. వణిజులు తమకు తోచిన నాణాలు ఆమె
పళ్ళెంలో వేశారు. ఆ యువతి విష్ణువర్ధనుడి వద్దకు పేరాశతో వచ్చింది. విష్ణు వర్ధనుడు
చేతులు కట్టుకు కూర్చున్నాడు. ఆమె నిరాశ చెందింది. ఇంత పెద్దవీరుడు ఎంత బహుమానం
ఇస్తాడో అనుకుంది. కళ్ళవెంట రెండు అశృబిందువులు రాలి పళ్ళెంలో పడ్డాయి.

విష్ణువర్ధనుడు ఆమె చేయి పట్టుకుని లాగి తన ప్రక్కన కూర్చుండ పెట్టుకున్నాడు. అలా


చేయడంలో కొన్ని నాణాలు దొర్లి నేలమీద గడ్డిలో పడిపోయాయి.
“మంగళం పాడకుండా ముందే పళ్ళెం పట్టుకువచ్చావా?”
“ఇంకా నాట్యం ఉంది!”
“మరెందుకాపావూ? అలసిపోయావా?”
“వీళ్ళంతా నిద్ర పోతారు. పళ్ళెంలో కానుకలు వేయకుండా వెళ్ళిపోతారు!”
“ముందు నాట్యం పూర్తిచేయి!” అన్నాడు రాజకుమారుడు.

చిత్రాణి పళ్ళెం అక్కడ పెట్టి శ్రీ మహావిష్ణువు మోహినీ రూపం ధరించి అమృతం
పంచడం బహు సుందరంగా ప్రదర్శించింది. మంగళం పాడింది. వచ్చి విష్ణువర్ధనుడి
ముందు పళ్ళెంతో నిలబడింది. ఆమెను ఏడిపించడానికి అతడు రెండు మూడు క్షణాలు
ఉలకలేదు పలకలేదు. తరువాత విశాఖదత్తుడికేసి క్రీగంట చూశాడు. విశాఖదత్తుడు ఆ
పళ్ళెంలో ఏబది నాలుగు సువర్ణ వరాహమాడలు ఉంచాడు.

122
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

20 అడవిదొంగలు.
అర్ధరాత్రయింది. లోకమనే బిడ్డను నిశిఅనే తల్లి నిద్ర పుచ్చింది. బిడారం పైన మంట
అంటించిన బాణాలు ఆకాశం నుంచి ఉల్కలు పడినట్లు వచ్చి పడుతున్నాయి. అవి అన్ని
వైపులనుంచి వస్తున్నాయి. నిద్రలేచిన బేహారులు కంగారు పడిపోయారు. భయపడి పోతూనే
ధనం సంచులూ విలువైన వస్తువులూ గడ్డిలోను బండ్లక్రింద ముందే తవ్వి వుంచుకున్న
గుంతల్లో దాచివేస్తున్నారు. వృషభశకటాలు ఆ చదును ప్రదేశం చుట్టూ అర్ధ చంద్రాకారంలో
విడిసివున్నాయి. ఎద్దులు గంటలు గలగలలాడ మేత మేస్తున్నాయి. రాత్రి పూట బిడారాన్ని
కాపలా కాసేందుకు ఎనమండుగురు భటులున్నారు. అందులో నలుగురు బోయలు
నలుగురు చెంచులు. వారిలో నాయకుడు భరతుడు.

భటులు ఎనమండుగురూ “ఏయ్ ఎవరదీ” అని హటం చేస్తూ పెద్దగా కేకలు పెడు
తున్నారు. బిడారంలోకి కొందరు దుండగులు ప్రవేశించారు. కొందరి చేతుల్లో విల్లంబులు
న్నాయి. కొందరి చేతుల్లో కత్తులున్నాయి. వారి నాయకుడొకడున్నాడు. అతడు గుఱ్ఱంపైన
వచ్చాడు. అతని చేతులొ కొరడా వుంది. వాళ్లు ఎడంచేత్తో కాగడాలు పట్టుకుని వచ్చారు.
వస్తూనే దొంగలనాయకుడు దొరికిన వారందరినీ కొరడాతో మోదసాగాడు. దొంగలు చాలా
మంది ఉన్నారు. శ్రేణి భటుల్ని కొరడాలతో బాది పెడరెక్కలు వెనక్కి విరిచి కట్టారు.

దొంగలనాయకుడు మైదానం మధ్యలో ఉంటే తక్కినవారు వ్యాపారస్తుల్ని లాక్కొచ్చి


అక్కడ పడవేస్తున్నారు.ఒక భయానకమైన పరిస్తితి ఏర్పడింది. చిత్రాణి ఆదుర్దాగా
రాకుమారుడి కోసం వెతికింది. అతడు దూరంగా గడ్డిమేట పైన పడుకుని ఆకాశంకేసి
చూస్తున్నాడు.

“అయ్యగారు! ఇక్కడ పవ్వళ్ళించారా క్షీరసాగరంలో విష్ణుమూర్తిలా! అవతలదొంగలు


మావాళ్ళందరినీ చావమోదుతున్నారు. మీరింతపెద్ద కత్తిపట్టుకుని వచ్చారుకదా! ఏదీ ఆ
ప్రతాపం? వెళ్లి యుద్ధం చేయండి. మగాడనిపించుకోండి!” అన్నది చిత్రాణి.

విష్ణువర్ధనుడు ఉలకలేదు పలకలేదు.

“మహాశయా కదలండి! ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టడం ఇంతవరకూ


ఎవరితరమూ కాలేదు! అవతల వాళ్ళ వీపులు చీరుకు పోతున్నాయి. మావాళ్ళను రక్షించండి.
ధనం ఎట్టాగూ దోచుకుపోతారు. నన్నొదిలి పెడతారా దోచుకోకుండా! నే నొక్కదాన్ని!
వాళ్ళెంత మందున్నారో!”

చిత్రాణి వలవలా ఏడ్చేస్తుంటే తాపీగా విష్మువర్ధనుడు “నీవు కాస్త ఏడుపాపుతావా?


వాళ్ళెంతమందున్నారు?” ప్రశ్నించాడు.

123
  చాళుక్యసింహాసనం

“లెక్కపెట్టడానికి అచ్చనగాయలా? పది కుచ్చీలేనా ఉండొచ్చు! ఈ దొంగల ముఠా


మీరే వెంటపెట్టుకుని వచ్చారా ఏమిటి? లోకంలో మేకవన్నె పులులుంటాయి! తిన్నఇంటి
వాసాలు లెక్కపెట్టేవాడెవడూ ఇంతవరకూ బాగుపడలేదు.”

“దొంగలు రెండు వందలకు మించివుంటే నన్ను పిలువు.”

“రెండు వందలు! అదేమైనా నోమా దీక్షా? సంఖ్యాశాస్త్రమా? పిలిచి అన్నం పెట్టినవాళ్ళ


పైనే దయలేకపోతే ఎందుకూ వీరత్వం? ఈనకాచి నక్కల పాలైనట్లు కాదా?”

“నీవు అనవసరంగా మాటమీరుతున్నావు. వెళ్ళి పొంచివుండి చూడు! మావాడి


ప్రతాపం!”

కుతూహలంతో చిత్రాణీ అక్కడినుండీ వెళ్ళిపోయింది. తాను ఒక బండిక్రింద నక్కి


కూర్చుంది.

విశాఖదత్తుడు అప్రమత్తుడు కాగానే ముందర తమ కాగడాలన్నీ ఆర్పించేశాడు.


మేస్తున్నవృషభాల పగ్గాలన్నీ విప్పి తన చేతులోకి తీసుకున్నాడు. వాటన్నిటినీ ఒకే బండికి
కట్టాడు బండీనిండా వసికఱ్ఱలు నింపుకున్నాడు. ఎద్దులను మైదానం మధ్యలోకి అదిలించాడు.
దొంగలు తత్తర పడిపోయారు. లెక్కలేనన్ని పోట్లగిత్తలు తమవైపు పరుగెత్తు కొస్తున్నాయి.
తోలుకొచ్చేవాడెవడో కనిపించటంలేదు.

విశాఖదత్తుడు ఒక క్షణం వృషభాలను నిలుపుచేశాడు. మైదానంలో తమవారు కూడా


ఉన్నారు. దొంగలు కొంతమంది వ్యాపారులను తీసుకువచ్చి కొరడాతో మోదుతూ తక్కిన
వారిని భయపెడుతున్నారు. దొంగలొకరే అయితే విశాఖదత్తుడు దున్నిపారేసేవాడే. దొంగల
చెంత బేహారులు కూడా వున్నారు. విశాఖదత్తుడు బండిలోంచీ వసికఱ్ఱలు అందుకున్నాడు.
గురిపెట్టి విసురుతే ఒక్కొక్క దొంగ తలకాయ టెంకాయలా పగులుతోంది. దొంగలనాయకుడు
ఒక శ్రేష్ఠిని వడిసి పట్టాడు. చురకత్తి తీసి అతడి మెడకాయ కోసేస్తానని బెదిరిస్తున్నాడు.
విశాఖదత్తుడు గురిపెట్టి విసిరిన వసికఱ్ఱ అతని కణతపై తగిలింది. అతడు స్ప్ర్ఱహతప్పి
కూలబడిపోయాడు. దొంగలు పారిపోడానికి నిశ్ఛయించుకున్నారు. వణిజులు ప్రక్కకు
పరిగెత్తారు. విశాఖదత్తుడు వృషభాలను ముందుకు తోలాడు. వసికఱ్ఱ దెబ్బలకు
పారిపోయేవాళ్ళ కాళ్ళకు తగిలి పడిపోతున్నారు. ఎద్దులు దొంగల్ని తొక్కిపారేశాయి. “లొంగి
పోతారా ఛస్తారా?” విశాఖదత్తుడు గద్దిస్తున్నాడు.

కొందరు దొంగలు కూలబడిపోయారు. కొందరు చేతులు నెత్తిన పెట్టుకుని లొంగిపోతా


మని శరణు వేడుతున్నారు. మొత్తం దొంగలందరినీ సమీకరించి ఒక్కచోట చేర్చాడు విశాఖ
దత్తుడు. ముప్పదిఆరుమంది తేలారు.ఎంతమంది పారిపోయారో తెలీదు. దొంగల
నాయకుడు కణత పగిలి చనిపోయాడు. విశాఖదత్తుడు దొంగలనాయకుడి శవాన్నిఅతడి

124
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

గుఱ్ఱంపైనే పడవేసి రజ్జువులతో కట్టాడు. గుఱ్ఱాన్ని రెండు పీకాడు. అది పారిపోయింది.దొంగ


ల్నందరినీ చేతులు వెనక్కు ముడిచి కట్టాడు. కాళ్ళకు బందాలు వేశాడు.

అలా బంధించి చెరసాలకు పంపిస్తాడనుకున్నారు దొంగలు. ప్రాడ్వివాక శాలలో


విచారణ జరుగుతుంది. రెండు మూడేళ్ళు శిక్ష పడుతుంది. విడుదలైతే మళ్ళీ అదేవృత్తి.
సంతోషిం చారు దొంగలు. అందులో కొందరికి గాయాలయ్యాయి.

విశాఖదత్తుడు అలా చేయలేదు. అరబస్తాడు పసుపు తెప్పించాడు. గాయాలకు కట్లు


కట్టడానికి కొన్నివస్త్రాలు తెప్పించాడు. నిజంగానే దొంగలకు తగిలిన గాయాలకు పసుపు వేసి
కట్లు కట్టించాడు. “ఆహా!ఇతడెంత కారుణ్యమూర్తి!” అనుకున్నారందరూ. ఆ తరువాత
విశాఖదత్తుడు పొయ్యిలో పెట్టుకునే కొయ్య దుంగ ఒకటి తెప్పించాడు. అలాగే చెట్లు నరికే
గొడ్డలి తెప్పించాడు. బంధించిన దొంగలొకరొకరినీ పట్టుకుని కుడి ముంజేయి కొయ్య దుంగ
పైన పెట్టి గొడ్డలితో తెగనరికాడు. హస్తం తెగి అవతల పడింది. రక్తం చిమ్మింది. బాధతో
భయంతో ఆ దొంగ పెట్టే అరుపులు ఏడ్పులు అంతా యింతా కాదు. ఆ నల్లమలారణ్యం
దద్దరిల్లింది. కొండగుహలు ప్రతిధ్వనించాయి. విశాఖదత్తుడు అంతటితో వదలలేదు. ఎడమ
కాలి పాదం దుంగపైన పెట్టాడు. గొడ్డలితో ఒకేఒక వేటు. సగంపాదం తెగిపోయింది. మళ్ళీ
ఆ గాయాలకు తానే పసుపు పోసి కట్లు కట్టడు. అతడలా కాళ్ళూ చేతులూ నరుకుతుంటే
మిగతా దొంగలందరూ బెంబేలెత్తిపోయారు.పెద్దగా అరిచి క్షమించమని మొత్తుకుంటు
న్నారు. ఎవరెంత అరిచి గీ పెట్టినా విశాఖదత్తుడు కరగలేదు. కసాయికైనా కనికరం ఉంటుం
దేమో కానీ విశాఖదత్తుడికుండదు. ఓపికగా అందరికీ శిక్ష అమలు చేస్తున్నాడు. తెగిన
పాదాలు అరచేతులు నెత్తురు ఒడుతున్నాయి.

ఆ నరికే హింసాదృశ్యం వణిజులెవరూ చూడలేక దూరంగా వెళ్ళిపోయారు. ఆ


రోదనలు వినలేక విష్మువర్ధనుడు అక్కడికి వచ్చి “మిత్రమా! ఇంత హింస అవసరమా?”
అన్నాడు.

“అవసరమే మిత్రమా! ఇంతకుముందు ఈ వణిజులు ప్రభుత్వాలను ఎంత తూల


నాడారూ? అందుకు కారణం ఏమిటీ? కేవలం దొంగల్ని బంధించి కారాగారంలో పడవేస్తే
ప్రభువు దొంగల్ని పట్టుకున్నారనీ శిక్షించారనీ ప్రజలకు ఎలా తెలుస్తుందీ? రేపు ఈదొంగలు
వాళ్ళవాళ్ళ ఊళ్ళల్లో తిరుగుతుంటే తెలుస్తుంది!” అన్నాడు విశాఖదత్తుడు.

రాకుమారుడు కూడా మిన్నకుండి అక్కడినుండి వెళ్ళిపోయాడు.

చిత్రాణి వచ్చి విష్ణువర్ధనుని కాళ్ళమీద పడింది. “ప్రభూ! మిమ్మల్ని తూలనాడాను!


మీరే రాజపురుషులో దివ్యపురుషులో తెలీదు. మీరే రాకపోతే ఈ దొంగలందరూ బిడారాన్ని
దోచుకునేవాళ్ళు. సొమ్ములతోపాటు క్రూరంగా నన్ను కూడా దోచుకునే వాళ్ళు. మమ్మల్ని
రక్షించడానికి ఆ శ్రీగిరి మల్లికార్జునుడే మిమ్ము పంపిచాడేమో!” నని ప్రణమిల్లింది.

125
  చాళుక్యసింహాసనం

“చిత్రాణీ! నీదేవూరూ? ఈ శ్రేణిలో ఎన్నాళ్ళనుంచీ ఉంటున్నావూ?” అని అడిగాడు


రాకుమారుడు.

“ప్రభూ! నా తల్లిదండ్రులెవరో నాకు తెలీదు. ఒక పెద్దింటి స్త్రీ నన్నుగుడి మెట్లపైన


విడిచిపెట్టి వెళ్ళిపోయిందట!అదిచూసిన పగటి వేషాలు వేసుకునేవాళ్ళు నన్ను చేరదీసి
పెంచారు. కొంత ఆటాపాటా నేర్పారు. ఆ తరువాత నాటకాలలో బాల పాత్రలు వేసేదాన్ని.
అలా పురాణ కథలన్నీ తెలిశాయి. వాళ్లు తిండి మాత్రం పెట్టేవాళ్లు సరిగా బట్టలు కూడ
ఇచ్చేవాళ్ళుకాదు. చివరకు ఎలాగో ఈ శ్రేణిలో కుదురుకున్నాను. వీళ్ళు మాత్రం తిండి
పెడతారు. హారతి పళ్ళెంలో వేసే కానుకలే నా ఆదాయం. ఇవాళ మీరు అర్ధనూటఎనిమిది
మాడలిచ్చారంటే ఏ మహారాజ పోషకులో ఐవుంటారు!”

“చిత్రాణీ! నీకేంకావాలీ? నీకోరికేదైనా ఉంటే కోరుకో!”అన్నాడు విష్ణువర్ధనుడు.

“నాకు నాట్యం అంటే ప్రాణం! పెద్ద నర్తకి నవ్వాలని ఉంది!”

“వేంగీ నగరంలో గొప్ప ఘటికాస్ధానం ఉంది. అక్కడ లలిత కళలన్నీ నేర్పుతారు. నీ


వక్కడ చేరు. మా మిత్రుడు నీకొక ముద్రిక ఇస్తాడు. అది చూపిస్తే నిన్ను చేర్చుకుంటారు.” అని
చెప్పాడు విష్ణువర్ధనుడు.

“ధన్యురాలను ప్రభూ! వేంగీ నగరంలో ఘటిక అంటే సామాన్యం కాదు” అన్నది


చిత్రాణి.

రత్తంచెట్టి విష్ణువర్ధనుని వెతుక్కుంటూ వచ్చాడు. ఆ రాత్రి ఇంకా ఎవరికీ నిద్రలేదు.


దొంగల దాడిని అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాళ్ళూ చేతులు నరక బడిన
వాళ్ళు ఏడ్చిఏడ్చి సొమ్మసిలిపోయారు.

రత్తంచెట్టి అమాంతం విష్మువర్ధనుని కాళ్ళు తాకబోయాడు. రాజకుమారుడు అందుకు


అంగీకరించలేదు. రత్తంచెట్టి తమప్రాణాలు కాపాడిన అతిధిని ఎలా సత్కరించాలో చెప్ప
మని అడిగాడు. అదే సమయంలోఅక్కడికి చేరుకున్న విశాఖదత్తుడు కల్పించు కున్నాడు.

“శ్రేష్టీ! మీ సార్ధవాహులు ఏఏ ఊళ్ళూ దేశాలు తిరుగుతారూ?”అడిగాడు


విశాఖదత్తుడు.

రత్తంచెట్టి మొత్తం దక్షిణ భారతదేశం నగరాల పేర్లన్నీ చెప్పాడు. అందులో మాన్యకేత


నగరం మాత్రం లేదు. విశాఖదత్తుడు నిరుత్సాహపడ్డాడు. మళ్ళీ ఇలా అన్నాడు
“అయితే మీ వ్యాపారం మాన్యకేతనగరంలో లేదనమాట!”
“అయ్యా లేకేమీ! ప్రస్తుతం దక్షిణాపధంలో పెద్ద చక్రవర్తులు రాష్ట్రకూటులే!”
126
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఐతే మీరు మాపై కొంత కృతజ్ఞత చూపగలరా?”

“అయ్యా! నాప్రాణం ఇవ్వమంటే యిస్తాను. నిప్పుల్లో దూకమంటే దూకుతాను. మీరు


చెప్పడం నేను చేయకపోవడమా?”

“అవేమి మాకు అవసరంలేదు. మీకు మాన్యకేత నగరంలో ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్య


తెలుసా?”
“రత్నాకరుడిలాంటి వాడాయన! తెలీకపోవడమేమిటీ.?”
“ఏమీలేదు. మేము ఇచ్చే వస్తువులు మాన్యకేతం చేరుస్తుండాలి!”
“దానికేం భాగ్యం! చెప్పండి చేరుస్తాను.”
“మాకు అవసరం వచ్చినపుడిస్తాం కాని అవి ఏమిటని మీరడగకూడదు!”
“అడగను!”

“అవి బహిరంగంగా ఇతరులకు తెలిసేటట్లు తీసుకుపోయేవి కాకపోవచ్ఛు. మీ సరం


జామాతో అతి రహస్యంగా చేరవేయాలి. ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే మీరవి అమ్ము కోడానికి
తీసుకుపోతున్నట్లు చెప్పాలి. మాపేరు మాత్రం చెప్పకూడదు!”
“అయ్యా! ఇదేదో గూఢచర్యం లాగా వుందే!”
“అలాంటిదే! మీకు ఇష్టం వుంటేనే ఒప్పుకోండి!”
“నాప్రాణం కూడ ఇస్తానన్నతరువాత వెనక్కిపోవడమా?”

“ఇంకా మీరు వెళ్ళవచ్చు. మేమిచ్చిన ఉరుములు అక్కడికి చేరినప్పుడల్లా మీకు గొప్ప


పారితోషికం ఉంటుంది. అది మీరు చేసే వ్యాపారం కన్నా చాలా ఎక్కువ ఆదాయాన్ని
తెచ్చిపెడుతుంది.” అన్నాడు విశాఖదత్తుడు.

రత్తంచెట్టి వెళ్ళిపోయిన తరువాత ఇంకా అక్కడ మిత్రులిద్దరే మిగిలారు.

“విశాఖదత్తా! నేడే నిన్ను మాన్యకేతం ముట్టడికి సర్వసేనాపతిగా నియమిస్తున్నాను.


ఎలా సాధిస్తావో! రాజధానికి వెళ్ళగానే నా యువరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. వెంటనే
నీకు రాజపత్రం యిప్పిస్తాను” అన్నాడు విష్ణువర్ధనుడు.

“మిత్రమా! నీవు రాజపత్రం అదీ ప్రకటించావంటే మీ మంత్రులందరికీ తెలుస్తుంది.


అసలు చాళుక్య సైన్యాలలో విశాఖదత్త సేనాపతి వున్నాడనే విషయం నీకూనాకు తప్పుతే
మహారాజుకు కూడ తెలియకూడదు. నీమాటే ఆజ్ఞ అదే రాజపత్రం! నేటినుండీ మాన్య కేతాన్ని
ఎలా పడగొట్టాలా అనే ఆలోచనలోనే ఉంటాను.”
127
  చాళుక్యసింహాసనం

“విశా! మన ప్రయత్నానికి కూడా ఒక కాలపరిమితి ఉండాలి. మా నాన్నగారు


శాలివాహన శకం ఏడువందల ఇరవై ఎనిమిది వ్యయనామ సంవత్సరంలో వేంగీ సింహాసనం
అధీష్టించారు. అదే సంవత్సరం మా పెదనాన్న భీమసలుఖి మహారాజు కూడా తానే రాజునని
ప్రకటించుకున్నారు. ఇది జయనామ సంవత్సరం. జయ మన్మథ దుర్ముఖి విడిచి పెడితే
హేవిళంబి విళంబినామ సంవత్సరానికల్లా చాళుక్య వరాహకేతనం మాన్యకేతం బురుజుల
పైన ఎగరాలి!”

“అలాగే! మరొక విషయమేమిటంటే నేను నీతో వేంగి దాకా రాను. నేను నాకు తగిన
సైన్యాన్ని నియమించుకుని రాష్ట్రకూటం పంపిస్తుంటాను. వాళ్ళక్కడ అజ్ఞాతంగా ప్రజల్లో
కలిసిపోయి జీవిస్తారు. అవసరం వచ్చినపుడే ఆయుధాలు పట్టి బయటికి వస్తారు. ఈ
రత్తంచెట్టి ఆయుధాలు జేరవేయడానికి పనికివస్తాడు. పూటకూళ్ళమ్మ క్రొత్తగా వచ్చిన వాళ్ళకి
కూడు వండిపెడుతుంది. అక్కడ మన వేగుకు కూడలి ఏర్పడుతుంది. వేగుశాఖకు ఎవరేనా
సమర్ధుల్ని నియమించుకోవాలి.” అన్నాడు విశాఖదత్తుడు.

“సరే! నీకు ఎప్పటికప్పుడు ధనంకానీ ఆయుధాలుకానీ చేరేటట్లు చూస్తాను” అన్నాడు


విష్ణువర్ధనుడు.

21 శ్రీగిరి
విష్ణువర్ధనుడు విశాఖదత్తుడు తమ గుఱ్ఱాలను శ్రీశైలం వైపు ఉరికించారు. శ్రీశైలం
వెళ్ళడం అదే మొదటిసారి. ఆత్మకూరును దాటి వెళ్ళిపోయారు. తినుబండారాలుగానీ ఇతర
వస్తువులు కానీ ఆత్మకూరు నుంచే తీసుకు వెళ్ళాలి. ఆ ముందు ఊర్లున్నాయి కానీ ఏమీ
దొరకవు. ఆ విషయము మిత్రులిద్దరికీ తెలియదు.
అక్కడ కొందరు సుంకరులు వాళ్ళగుఱ్ఱాలను ఆపారు. దోవకు అడ్డంగా తీగలతో పేనిన
వల కట్టివుంది.
“ఎక్కడికి వెళుతున్నారూ?” అని అడిగాడు సుంకరి.
“శ్రీశైలం.”
“కొండపైకి వెళ్ళాలంటే ముందే ఇక్కడ పన్ను చెల్లించాలి!”
“శ్రీగిరి మల్లికార్జున దర్శనానికి పన్నా?” అడిగాడు విశాఖదత్తుడు.
“ఏ పన్నూలేకపోతే ఈ కొండదోవ ఎవడు శుభ్రం చేయిస్తాడు మన తాతా?” అన్నాడు
సుంకరి కోపంగా.
“తాతదాకా ఎందుకులే! ఎంతచెల్లించాలీ?” ప్రశ్నించాడు విశాఖదత్తుడు.
“మనిషి తల ఒక్కింటికి ఏడు డబ్బులు. గుఱ్ఱానికి ఐదు డబ్బులు. అభిషేకం

128
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

చేయించుకోవాలంటే మూడు డబ్బులు” అన్నాడతడు.

“మేమొక వారం రోజులు ఉండాలనుకుంటున్నాం కొండపైన. మరి దానికెంతా?”


అన్నాడు విశాఖదత్తుడు.
“ఎంతకాలమైనా ఉండండి. క్రిందకు దిగడానికేమీ సుంకం ఉండదు.”
“ఔనుకదా! కొండపైనుంచి దూకవచ్చుగదా అందుకే దిగేవాడినుంచి సుంకం దండు
కోలేరు!” అన్నాడు విశాఖదత్తుడు.
“నీకేదో వేళాకోళంగా ఉందేమో! ఉత్సవాలపుడు చెంచులు పొదలు నరికి పులులకు
ఎలుగుబంట్లకు కట్టు కట్టకపోతే తెలుల్తుంది” అన్నాడతడు నీకేం తెలుసు అన్నట్లు.
విశాఖదత్తుడికి అర్ధం కాలేదు. “పులులకు కట్టుకట్టడమేమిటీ? వాటికేమైనా
రోగమా?”అన్నాడు.
సుంకరి నవ్వాడు. “నీవేదో అమాయకుడిలాగున్నావే! కట్టుకట్టడమంటే మంత్రం
వేయడం, మనుషుల్ని మింగకుండా!”
“అలాగా! ఇంతకూఈ సుంకం ఎవరికి చేరుతుందీ?” ప్రశ్నించాడు విశాఖదత్తుడు.

“ఇది కందనూరు ప్రభువులకు చెందుతుంది. నేను మిరాశీదారును.” విశాఖదత్తుడు


అతడితో గొడవ పడకుండా సుంకం చేల్లించాడు. “మీరెవరో కొత్తవారు లాగున్నారే! ఉత్త
చేతులతో వెళుతున్నారు. తినుబండారాల నుంచి అన్నీ ఆత్మకూరునుంచి తీసుకు వెళ్ళాలి.
ముందేమీ దొరకవు. ఒకరిద్దరు చెంచుల్నివెంట తీసుకువెళతారా, మీ సరంజామా
మోయడానికి?” అన్నాడతడు.

విశాఖదత్తుడు ఇద్దరు భారవాహకుల్ని కుదుర్చుకున్నాడు. ఒకడు చెంచురాముడు,


ఇంకొకడు బోయ కిట్టుడు. భటులిద్దరికీ ఏమేమి సంభారాలు కావాలో పట్టిక చెప్పి తగినంత
సొమ్ము ఇచ్చి కొండపైన కలుసుకోమని చెప్పి గుఱ్ఱాలను ముందుకు పోనిచ్చా రిద్దరూ. దోవలో
ఎంతచిన్న కుగ్రామం కనిపించినా గుఱ్ఱాలు ఆపి ఇదేవూరని అడుగు తున్నాడు విశాఖదత్తుడు.
వారలా రాధాపురము, కృష్ణాపురము వేంగడపురము సిద్ధా పురము అనే ఊళ్ళను
దాటుకుంటూ వెళ్ళారు. నాగులోటి చేరారు. వేంగడాపురం నుంచీ నాగులోటి వరకూ
దట్టమైన అరణ్యం వుందికానీ కచ్చడాలు తిరుగుతుండడంతో దండుబాట ఏర్పడింది.

మిత్రులిద్దరూ నాగులోటి వీరభద్రస్వామిని సేవించి అక్కడినుండీ పెద్దచెరువు వరకూ


పయనించారు. అప్పటికి బాగా అలిసిపోయారు. ఆకలి కడుపులో గిలిగింతలు పెడుతోంది.
నాగులోటి దాటిన తరువాత పర్వతం ఎక్కడం దిగటంగా ఉండడంతో చాలా అలసట అని
పించింది. ఆ తరువాత బాట కొంచం సుగమంగా ఉన్నా అది మహా కీకారణ్యం. అప్పు

129
  చాళుక్యసింహాసనం

డప్పుడూ పెద్దపులుల గాండ్రింపు వినిపిస్తోంది. ఎలుగుబంట్లు పిల్లలతో సహా సంచరిస్తు


న్నాయి.

మిత్రులిద్దరూ పెద్దచెరువు చేరారు. పెద్దచెరువు విరిసిన తామరలతో చాలా ఆనంద


కరంగా వుంది. ఆ సరస్సులో అరుదైన నీలితామరలు తెల్లతామరలతో కలగలుపుగా
పూచాయి. నీటి వరవన చెంగల్వలు పూచాయి. అడవి అంతా పుడమితల్లికి రాలినపూలతో
పుష్పార్చన చేసినట్లు వుంది. మిత్రులు గుఱ్ఱాలకు నీళ్ళు పట్టడానికి సరస్సువద్దకు తీసుకు
వెళ్ళారు. ఆవలి ఒడ్డున ఒక పులి నీళ్ళు తాగడానికి వచ్చింది. పులిని చూచి అక్కడి జింకలన్నీ
భయంతో పారిపోయాయి. అదేఒడ్డున ఒక జటావల్కలధారి నిర్భయం గా స్నానం
చేస్తున్నాడు. అతడికి పులిభయం లేదేమో!అడవి పూల సుగంధం కొంచం క్రొత్త గానూ
మొరటుగాను ఉంది. ఆ చెరువులో నీళ్ళు తాగుతే ఏదో సోమపానం చేసిన అను భూతి
కలుగుతోంది. కడుపులో ఆకలి కూడా అధికంగావుంది. అరణ్యంలో పండ్లు తిందా మంటే
తినతగినవేమీ కనుచూపుమేరలో కనిపించలేదు.

పెద్దచెరువు చాలా కుగ్రామం. పందులు కాసుకునేవారి గుడిశెలు ఇరవై ముప్పయి


తప్పుతే మరేమీ లేవు. అడవిలో ఆలోచించకుండా ముందుకువెళితే ఏమవుతుందో అప్పుడు
అర్ధమయింది మిత్రులిద్దరికీ. గుఱ్ఱాలను మేతకు వదిలి చెరువుగట్టుపైన విచారంగా కూర్చు
న్నారు మిత్రులిద్దరూ. దండయాత్రలకు వెళ్ళాలన్నా ముందుగా కొందరు వెళ్ళి మార్గం వెడల్పు
చేయాలి. దండు ఎక్కడ విడియాలో ఎక్కడ నీళ్లుదొరుకుతాయో చూడాలి. అవసర మైతే
క్రొత్తగా బావులూ నూతులు తవ్వించాలి. వరదలు రాని చదునైన ఎత్తైన ప్రదేశంలో గుడారాలు
నిర్మించాలి. వచ్చే దండుకూ పశువులకూ ఆహారం సేకరించి వుంచాలి. ఏమీ చూసుకోకుండా
ముందుకు పోతే ఇలాగే ఆకలికి మాడిపోవాలి.

ఇంతలో ఒక పడుచుపిల్ల చెరువులో నీళ్ళుముంచుకోవడానికి వచ్చింది. విశాఖదత్తుడు


ఆ బాలికను పలకరించాడు. “నీ పేరేమిటీ?” అమ్మాయి సిగ్గు పడిపోయింది. చెప్పలేదు.
“ఈ ప్రసాదం తీసుకో!” అన్నాడు వీరభద్రస్వామి గుడిలో కొట్టిన నారికేళ శకలాలు
అందిస్తూ విశాఖదత్తుడు.
ఆ పిల్ల తీసుకోలేదు. “మానాయన ఊరుకోడు” అన్నది.
“మీ అయ్యఎవరూ?”
“కిరాతమల్లు.”
“మమ్మల్ని కిరాతమల్లు కాడికి కొంచపోతావా?”
“నాయన వేటకెళ్ళిండు. ఒచ్చుండో లేదో!”
“మరి అమ్మా?”

130
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“అమ్మ నాన్న తన్నులు తినలేక ఎవడితోనో లేచిపోయింది.”


“లేచిపోవడమంటే ఏమిటో నీకు తెలుసా?”
“తెల్ధు”
“మరి నీకెవరు చెప్పారూ?”
“నాయన చెప్పిండు.”
“మాకు చాలా ఆకలిగా వుంది. ఇక్కడ తిండి ఏమయినా దొరుకుతుందా ?”
“యాట కూర తప్పుతే ఏందొరకదు. ఆకలికి కోలామిషం తింటాము.
అగ్గిమీదకాల్చుకుని ఉప్పుగల్లు మిరపకాయ నంజుకుని తింటాము.”
“మాకు వండిపెట్టగలవా? మేం పందికూర తినం!” అన్నాడు విశాఖదత్తుడు.
“యాటను తెచ్చుకుంటే కోసిస్తే కాల్చిపెడతా!” అన్నదా పడుచు.
“నీకు వేట కావాలా?”
“నీకు కొట్టడం వచ్చా?”
“నీవు చూపించు. నేను కొడతాను!” ఆ పిల్లను మచ్చిక చేసుకుని ఎలాగైనా ఆహారం
సంపాదించుకోవాలనుకున్నాడు విశాఖదత్తుడు.
“నీకు ఇఱ్ఱిని కొట్టడం వచ్చా?” మహావీరుడని తెలీక అమాయకంగా అడిగింది ఆ పిల్ల.
“నీ దగ్గర విల్లుందా? కొట్టిచూపిస్తా!”
“లేదు. ఇంటికాడుంది.”

విశాఖదత్తుడు ఆమెవెంట గూడానికి వెళ్ళాడు. ఆమె విల్లంబులు ఇచ్చింది. అడవివైపు


తీసుకుపోయి దూరంగా వున్న నల్లజింకను చూపించింది కొట్టమన్నట్లు. శాఖదత్తుడు
బాణాకఱ్ఱను వంచి టెక్కానికి నారిసంధించాడు. ఒక్కసారి శింజిణిని సారించి వదులుతే ఆ
నాదం కొండలలో ప్రతిధ్వనించింది. విశాఖదత్తుడు విల్లెక్కుపెట్టి భాణం విడిచాడు. తగల
లేదు. జింక పారిపోయింది. ఆ పడుచు ఖల్లున నవ్వింది. విశాఖదత్తుడు అక్కడే మేస్తున్న
కణుజును కొట్టాడు. ఆదెబ్బకు కణుజు గిరగిరా తిరిగి క్రింద పడింది. విశాఖదత్తుడు ఇంకో
బాణం వింటిన తొడిగాడు. ఈమాటు ఏమి కొడతాడో ననుకుంది ఆ పిల్ల. విశాఖదత్తుడు
విడిచిన బాణం పనసపండు తొడిమ వద్ద తెగవేసింది.

“గొప్ప గురికాడివే!” ఆ కొండ గరిత మెచ్చుకుంది. ఇంతలో వేట దొరక్క కిరాతమల్లు


నీరసంగా గుడిశెకు తిరిగి వచ్చాడు. కూతురు పగిలిన పనసపండు బుజాన పెట్టుకుని రావడం
కనిపించింది. వెనక విశాఖదత్తుడున్నాడు. ఆ కొమద తండ్రికి బాణం దెబ్బకు నేలకొరిగిన
కణుజును గురించి చెప్పింది. కిరాతమల్లు ఆనందంగా వేటను తెచ్చుకున్నాడు.
131
  చాళుక్యసింహాసనం

“మీరు దొరల్లాగున్నారే! ఇక్కడికొచ్చారు….”అన్నాడు కిరాతమల్లు.

“శ్రీగిరి వెళుతున్నాం. ఆకలేసి ఇక్కడ ఆగాం.”

“మీలాంటోళ్లు తిండానికి ఇక్కడేమీ దొరకవుదొరా. నా గుడిశలోనే ఆకొన్నవాశ్శకు


దాక బియ్యమూ పప్పూ ఇస్తుంటా. మనిషికి మూడు డబ్బులు తీసుకుంటా. యాత్రకొచ్చిన
వాళ్ళు చెరువు వడ్డున వండుకు తిని వెళుతుంటారు. నన్నా కందనూరు రాజావారు ఈ
పనిచేసుకు బతకమన్నారు” అన్నాడా కిరాతుడు. వాల్మీకిమహర్షి ఏదో కోపం వచ్చి కిరా
తుడిని ‘మానిషాద ప్రతిష్ఠాంత్వా!’ అని శపించాడు కానీ కిరాతులలో కూడా దయామయు
లుంటారు.

ఆ పిల్లది పనసతొనలు తీసి అరటి దొప్పలో వేసి విశాఖదత్తుడి కిచ్చింది.

మిత్రులిద్దరూ చెరువు గట్టున వండుకు తిని ఆ రాత్రికి కిరాతమల్లు చూపించిన వెదురు


కుటీరంలో పడుకున్నారు. ఆ కుటీరం వెదురు తడికలతో చిక్కగా అల్లబడివుంది.

ఇద్దరూ ఉదయాన్నే బయలుదేరారు. పెద్దచెరువు నుంచీ కొండ నిటారుగా ఎక్కవలసి


వచ్చింది. ఇరువంకలా అరణ్యం. ఆతరువాత కొంత దూరం సమతలంపై నడక. మళ్ళీ
ఎగుడూ దిగుడూ కొండ. అలా ప్రయాణించి భీమునికొలను చేరుకున్నారు. భీముని కొలను
ఎక్కడో అగాధంలో వుంది. ఎత్తైన కొండపైనుంచీ ధూకే జలపాతం ఆ కొలనును నింపుతోంది.
అక్కడికి దిగి కొంత విశ్రాంతి తీసుకున్నారు. మళ్ళీ కొండ నిలువుగా ఎక్కడం ఆరంభించారు.
అంత బలాఢ్యులకు కూడా చేదుకో మల్లయ్య చేదుకో మనవలసి వచ్చింది. ఆ భగవంతుడు
చేదుకోకపోతే ఎవడూ చేరుకోలేడు. మధ్యలో ఏ మెకమో కబళించినా కైలాసమే గతి.
కొండదోవ కూడా చాలా భయంకరంగా వుంది ఎటుచూసినా పాతాళం కనిపించే లోయలు.
భయంకరమైన క్రూర మృగాలతో కూడుకున్న అడివి.

విష్ణువర్ధన విశాఖదత్తులు శ్రీశైలము చేరేటప్పటికీ చెంచురాముడు బోయకిట్టుడు


అక్కడికి చేరి వేచివున్నారు. వాళ్ళు ఏ అడ్డదోవలో వచ్చారో తెలీదు. అశ్వాలను వాళ్ళకు
వదిలేసి మిత్రులిద్దరు మల్లికార్జునస్వామి ధూళి దర్శనానికి వెళ్ళారు.

శ్రీశైల మల్లన్న నిరాడంబరుడు. ఎంతో దయామయుడు. జీవుడి అంతర చిత్తశుద్ధి


చూస్తాడేకానీ బాహ్యాడంబరాలను పట్టించుకోడు. అందరినీ స్పర్శింపనిస్తాడు. ఎంతో
ప్రయాస పడి చచ్చిచెడి వచ్చిన భక్తులను మడికట్టుకోమనడు. ధూళిపాదాలతో శ్రీగిరి
మల్లికార్జునుని తాకవచ్చు. శౌచాశౌచాలను లెక్కింపడు. స్మశానవాసికి శౌచాశౌచములతో
పని ఏమిటీ! పన్నగభూషణుడు జటావల్కల ధారి. కరిచర్మాంబరి, చితాభస్మ లేపనం.
భూతనాధం. శిగలో పూవురేకలాంటి చంద్రవంక. ఒకచేతిలో లేడి ఇంకొకచేతిలో కుఠారి.

132
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

చిన్ని తుమ్మిపువ్వు సమర్పించినా చెంబెడు నీళ్ళూ పోసినా ఒక బిల్వదళంతో అర్చించినా


మూడు జన్మల పాపాలను హరించే హరుడు ఆ గిరిజావరుడు.

మిత్రులిద్దరూ ఆ క్షేత్రంలో పక్షం దినాలున్నారు. శివభక్తులు గుంపులు గుంపులుగా


వస్తున్నారు. కొన్నిరోజులుండి వెళుతున్నారు. రెండవ రోజున రాకుమారునికి అక్షరబ్రహ్మ
అనే పురోహితుడు కలిశాడు. ముఖానికేసి చూస్తూనే ‘రాకుమారా!’ అన్నాడు పలక రింపుగా!
విష్ణువర్ధనుడు తాను బాటసారినని చెబుదామనుకున్నాడు. అతడా అవకాశ మివ్వలేదు. ‘ఈ
మాత్రం సాముద్రికం తెలియకపోతే నేనీ కొండనాశ్రయించుకుని ఎందు కుంటానయ్యా,
ఇక్కడి ఈగలు దోమలు భరిస్తూ!’ అన్నాడాయన.

అక్షరబ్రహ్మ విష్మువర్ధనుడిచేత పదకొండు రోజులు పాశుపతారాధన చేయించాడు.


“రాకుమారా! మహామృత్యుంజయ మంత్రాన్ని నమక చమక మంత్రాలతో సంపుటీకరిస్తే
అమృత మహా పాశుపతమౌతుందని మేరుతంత్రంలో చెప్పబడింది. నీవు రాజ కుమారుడిగా
జీవితంలో చాలా యుద్ధాలు చేయవలసి వుంటుంది. రాజ్యపాలనలో పాప పుణ్యాలు చాలా
వుంటాయి. అందుచేత రేపటి నుంచీ నీచేత పాశుపత ఉపాసన చేయిస్తాను.

అమృత మహా పాశుపతం లో మృతసంజీవినీ బీజ మహాశక్తి వుంది. పాశుపతాస్త్ర


మంత్రము వలన మనోవాంఛలన్నీ తీరుతాయి. త్రిశూల పాశుపతం వలన అకాలమరణ
ప్రాప్తి వుండదు. అఘోర పాశుపతం వలన కూడా యుద్ధంలో మరణించడం లాంటివి
ఉండవు. నవగ్రహ పాశుపతం వలన గ్రహదోష నివారణ మవుతుంది. కుబేర పాశుపతం
వలన అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మన్యుపాశుపతం వలన శతృబాధానివారణం అవుతుంది.
కన్యా పాశుపతం వలన నిన్ను వలచిన కన్య లభిస్తుంది. సంతాన పాశుపతం వలన చక్కటి
సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇంద్రాక్షీ పాశుపతం వలన జ్వర నివారణం అవు తుంది. వర్ష
పాశుపతం వలన సకాలంలో వర్షాలు పడతాయి. ఇవన్నీ ఋషిప్రోక్తాలు. ఇందులో అక్షరం
కూడా అబద్ధముండదు. ఒక రాకుమారుడిగా మున్ముందు నీకీ ఉపాసన
ఉపయోగపడుతుంది”అన్నాడాయన.

రోజుకొక పాశుపతార్చన వలన విష్ణువర్ధనునికి పదకొండు రోజులు గడిచాయి.

విష్ణువర్ధనుని నిష్ట గమనించిన భ్రమరాంబాదేవి పూజారి రాజశ్రీభట్టు విష్ణువర్ధనుని


చేత శాస్త్రోక్తంగా నవావరణ శ్రీచక్రార్చన చేయించాడు. అచటి భ్రమరాంబాదేవి ఉగ్రదేవత.
శక్తి స్వరూపిణి. పరాభట్టారిక. మూర్తి మాత్రం మూరెడెత్తు కన్నా వుండదు కానీ మహిమ
మాత్రం కొండెత్తు. ఉగ్రతపస్యులకు మహోగ్రదేవత.

విశాఖదత్తుడు మాత్రం పగలంతా శ్రీగిరి విశేషాలను తిలకిస్తూ తిరిగేవాడు. రాత్రయితే


రాచకేళి. విశాఖదత్తుడు పదిహేను రాత్రులూ వృధా చేయలేదు. వారాంగనా విలాసాలలో
గడిపాడు. రాత్రికొక రమణి. అక్కడ మున్నూటఅరవై వేశ్యా గృహాలున్నాయి. యాత్రికులలో

133
  చాళుక్యసింహాసనం

సరసులు అతివల అధరామృతం రుచిచూడకుండా పోయేవారు కాదు. నిజానికి వారేర్ప


డింది గుప్త తాంత్రిక సాధకులకోసం! శివుడూ పార్వతి ఏకమై అర్ధనారీశ్వరులైనట్లు
తాంత్రికులు కూడా స్త్రీ పురుషులు ఏకమై రహస్య సాధన చేసేవారు. శ్రీగిరి అరణ్యాలు
తపస్యులకు కాపాలికులకు వామాచారులకు తాంత్రిక సాధకులకు నిలయంగా వుండేది.

మహేశ్వర దేవాలయానికి రెండు ప్రాకారాలున్నాయి. బయటి ప్రాకార కుడ్యాలపై


చక్కని శిల్పకళ విలసిల్లుతోంది. దేవాలయ ప్రాకారం లోనే పదకొండు నీటికొలనులున్నాయి.

విశాఖదత్తుడు భ్రమరాంబాదేవికి వీరపూజ చేయించి బలిప్రకరణం జరిపించాడు.

మిత్రులిద్దరూ తిరుగుప్రయాణంలో హాటకేశ్వరం దర్శించి శిఖరదర్శనం చేసుకున్నారు.


ఆత్మకూరు దోవలో వచ్చినవారికి శిఖరేశ్వరం తగలదు. ఆత్మకూరు నుండీ బాట రెండూ
మూడుగా చీలిపోతుంది.

శ్రీశైలానికి చేరుకోవడానికి నాలుగు మార్గాలున్నాయి. కృష్ణానది దక్షణతీరంవారు


పడవలలో వచ్చి పాతాళగంగవద్దకు చేరి కొండపైకి వస్తారు. విక్రమసింహపురివారు చుక్కల
పర్వతం ఎక్కి పెద్దచెరువు వద్ద కలుస్తారు. మరొకబాట వినుకొండ, త్రిపురాంతకము, కంభం,
దూపాడు మీదుగా వచ్చి చుక్కల పర్వతం అధిరోహించగా పెద్దచెరువు వద్ద కలు స్తుంది.
నాల్గవది ఆత్మకూరు బాట.

మిత్రులిద్దరూ తిరుగు ప్రయాణంలో పెద్దచెరువు వద్ద విశ్రమించి సమావేశమయ్యారు.

“విష్ణూ! నేను నిన్ను బెజవాడ దాటించేంత వరకూ అనుసరిస్తాను. అక్కడ ఆగి పోతాను.
వేంగిలో నన్ను గుర్తుపట్టే వాళ్ళెవళ్ళూ ఉండకూడదు. మనసైన్యాలలో విశాఖ దత్తుడనే
సేనాపతి ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియకూడదు. నేను మాన్యకేత దుర్గాన్ని పట్టుకునే
ప్రయత్నంలో ఉంటాను. మనవెంట ఈ భారవాహకుల్ని కూడా తీసుకు వెళదాము. నీవు
రాకుమారుడివి. ఒంటరిగా నగరప్రవేశం చేయకూడదు. ఎక్కడైనా విడిది చేసి రాజధానికి
వార్త పంపు. మంత్రి పురోహితులు ప్రజలూ అతివలు మేళతాళాలతో నీకు ఎదురు వచ్చి
పూర్ణకుంభాలతో ఆహ్వానించి నీరాజనాలిచ్చి కోలాహలంగా నగరంలోకి తీసుకు వెళ్ళాలి. ఈ
వేడుక చూసే అవకాశం నాకు వుండదనుకో!

విష్ణూ! నీకు చెప్పనవసరం లేదు కానీ వేంగి చేరినప్పటినుంచీ నీకర్తవ్యం ఆరంభమవు


తుంది. ముందుగా అంతర శత్రువులను లంచగొండి అధికారులనూ ఏరివేయి. ఉపేక్ష
చేయకు. ఎవరికీ మరణదండన కన్నా తక్కువ శిక్ష విధించకు. ఈదేశంలో వారసత్వ
యుద్ధాలకు ఒక చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. అది ఎంత త్వరగా సాధించ
గలుగుతే అంత జనక్షయం తగ్గుతుంది.

134
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

మహారాజు ఎలాగూ నీకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తారు. వెంటనే మహారాజుకు


కొంత విశ్రాంతినివ్వు. సర్వాధికారాలు హస్తగతం చేసుకో! పాత మంత్రుల్ని తొలగించి
క్రొత్తవారినీ నీకు విధేయులనీ యువకులనీ నియమించుకో!”

“విశాఖా! అందరికీ అన్నింటికీ మరణదండన అంటే ఎలాగు? ఇది అన్యాయం కాదా”


అన్నాడు విష్ణఉవర్ధనుడు.

“విష్ణూ! ఒక్కడి తల తెగిందంటే వేయిమందికి బుద్ధివస్తుంది. అదే చెరసాలలో పెడితే


ప్రభుత్వ భారం పెరుగుతుంది. వాళ్ళను మహారాజును కాపలా కాసినట్లు కాపలా కాయాలి.
అదొక దండగ. విడుదలైతే వాడు మళ్ళీ అదేపని చేయడనే నమ్మకమేమిటీ? ఏకాలో చేయో
తెగ్గొట్టి వదిలేస్తే మళ్ళీ ఆపని చేయడు. ప్రభుత్వ వ్యయం తగ్గాలంటే చెరసాలలన్నీ ఖాళీ
చేయించు.ఎవ్వరినీ కూచోపెట్టి మేపవద్దు. నీ పరిపాలన అంటే ప్రజలకు భయము భక్తీ
రెండూ వుండాలి. ప్రజలు నిన్ను ప్రేమించేటట్లు చేస్తే దేశంలో అంతరశత్రువుల ఆగడాలు
తగ్గుతాయి. అదే విజయానికి తొలిమెట్టు అవుతుంది.”

సమావేశం ముగియగానే బాటసారులిద్దరూ అశ్వాల నధిరోహించి ప్రయాణం


బెజవాడ బాట పట్టించారు.

22 సారధి శతావరి
విష్ణువర్ధనుని రథం బహుమతి ప్రదానోత్సవం నుంచి నిష్క్రమించగానే ఇంద్రవల్లభుడు
సేనాధిపతులందరినీ నానా తిట్లు తిట్టి హతశేషాన్ని లెక్కించడానికీ తక్కిన పరిశోధనా బాధ్యత
జాదబ దండనాయకుడికి ఒప్పగించాడు. తాను కోటలోకి వెళ్ళిపోయాడు.

నగరభటులు ప్రేక్షకులందరినీ ఎక్కడివారినక్కడ పంపించివేశారు. చక్కగా


అలంకరించిన రంగస్ధలం అంతా ఇపుడు కుక్కలు చింపిన విస్తరిలా వుంది. గాయపడినవారు
మూలుగు తున్నారు. శవాలపై గద్దలు వాలుతున్నాయి.

రసతరంగిణి తనకర్తవ్యంగా వీరకుమారుల్నిఆహ్వానించి తన కోటీరానికి


తీసుకువెళ్ళింది. సుందర వారవనితావారాన్ని వీరులు పంచుకోసాగారు.

రాజభటులు మరణించిన వారిని లెక్కించగా రాష్ట్రకూటులలో పంతొమ్మిదిమంది


మరణించారు. ముప్పయి ఆరుమంది గాయపడ్డారు. రెండు ఏనుగులు ఏడు గుఱ్ఱాలు
చనిపోయాయి. పౌరులలో కొందరు గాయపడగా ఇద్దరు తొక్కసలాటలో మరణించారు.

వేంగీరాకుమారుడి వైపునుంచి రథసారధి ఒక్కడే రణరంగంలో పడివున్నాడు. ఎడమ


భుజంలో దిగిన శూలంతో గిలగిలా తన్నుకుంటున్నాడు. రాజభటులు శూలం లాగివేసి

135
  చాళుక్యసింహాసనం

అతడిని రణవైద్యులవద్దకు తరలించారు. జాదబదండనాయకుడు అతడిపైన కక్షతో భుజం


పైవరకూ రంపంతో కోయించి కట్టు కట్టించాడు. కుడిచేతికీ ఎడమకాలికీ కలిపి గొలుసు
వేయించి చెరసాలలో పడవేయించాడు.

చెరసాలలో పడిన శతావరి నెప్పితో జ్వరంతో యమలోకం చూశాడు. అప్పుడు గుర్తుకు


వచ్చింది ఉపనిషద్వాక్యమైన అయమాత్మ అనే సిద్ధంతం. నెప్పిని అధిగమించడానికి ధ్యాన
సమాధులే శరణ్యం, శరీరారోగ్యం లేనివాడు ధ్యానంలో నిలబడడం చాలా కష్టం. మనసు
నిలబడదు. ఐనా సాధించాడు. నెప్పి తననేమీ చేయలేదు. గాయాన్ని సూర్యరస్మితో శుద్ధి
చేసుకోసాగాడు.

భల్లాణపోతినాయుడు బసచేసిన విడిది రాజభటులు ముట్టడించారు. అక్కడి సేవకులు


మొదలైనవారంతా రెండురోజుల ముందే పారిపోయినట్లు తెలిసింది. అంతే కాకుండా విష్ణు
వర్ధన రాకుమారుడు అసలు విడిదిలోనే లేడనీ నగరంలో ఎవరో అతడికి ఆశ్రయ మిచ్చా రనీ
తెలిసింది. జాదబదండనాయకుడు పరిశోధిస్తునే వున్నాడు.

శతావరికి కొంచం ఒపిక వచ్చినప్పటినుంచి విచారణ మొదలైంది. వారడిగిన


ప్రశ్నలకు సరైన సమాధానం రాకపోతే గాయం పైన కఱ్ఱతో పొడిచి కారం జల్లేవాళ్ళు.

నెలరోజులు హింసించి శతావరిని విడిచిపెట్టారు. అసలైన రాజకుమారుడు తన


ఊరూ పేరు ప్రకటించుకుని అందరినీ జయించుకుని మరీ వెళ్ళిపోయాడు. అందులో ఇంక
రహస్య మేముందీ? ఒక సారథిని పట్టుకుని అన్నినాళ్ళు కుళ్ళపొడిచారు.

చెరనుంచి విడుదలైన శతావరి మాన్యకేత నగరంలో భిక్షాటనం చేసుకు బ్రతకసాగాడు.


రాజాగ్రహానికి భయపడి ఎవరూ దరిచేరనివ్వలేదు. పని ఇవ్వలేదు. చివరకు పూటకూ ళ్ళమ్మ
ఆదరించింది. రెండుపూటలా కూడు పెట్టేది.

శతావరి నిరక్షరకుక్షి కాదు. అశ్వశాస్త్రం బాగా తెలిసినవాడు. చిన్నప్పుడు అథర్వణ


వేదం చెప్పుకున్నాడు. ఇప్పుడా వేదాన్ని ఆకళించుకుని వినియోగంలో పెట్టాలను కున్నాడు.

అథర్వణ వేదం ప్రయోగాత్మకం. ఆ వేదంలో యుద్ధతంత్రాలున్నాయి, రణచికిత్సవుంది.


ఆయుర్వేదం ధనుర్వేదం అన్నిటికీ మూలం అథర్వణం. అంతేకాదు. వైద్యశాస్త్రంలో క్రిమి
వైద్యము భూతవైద్యము వశీకరణ ప్రకృతి వైపరీత్యాలనుండి ఉపశమనము అన్నీ వున్నాయి.
ఆ జ్ఞానాన్ని ఉపయోగించి శతావరి మాన్యకేతనగరంలో ఒక ఆశ్రమం స్ధాపిం చాడు. దానికి
వాచస్పతి 3 7 21 అని పేరు పెట్టాడు. కానీ ఆ పేరు ఎవరికీ అర్ధం కాలేదు. అందరూ శతావరి
ఆశ్రమం అనే పిలవసాగారు. కొద్దికాలంలోనే అతడు ఘన వైద్యుడిగా పేరు పొందాడు.

ఒకనాడు ధైర్యం చేసి ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్య శతావరి ఆశ్రమానికి వచ్చాడు. శ్రేష్ఠికి

136
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

కొన్నాళ్ళనుంచీ జ్వరం తగులుతోంది. వైద్యులందరూ మందులు ఇచ్చారు. గుణం కనిపించ


లేదు. ఇంకా ఆ జ్వరం తనను అంతమొందిస్తుందనే భయం ఆవరించింది.

ఆంధ్రశ్రేష్ఠి వచ్చేటప్పడికీ ఎంతోమంది రోగులు విధిదష్టులు భిషగ్వరుడి దర్శనం కోరి


వేచివున్నారు. శతావరి ఎవరికోవైద్యం చేస్తున్నట్లు తెలిసింది.

ఆనాడు కమలహిత అనే అంతఃపుర స్త్రీ మలయవనంలో పూలు కోస్తుండగా కట్లపాము


కరిచింది. పాము కరిచినప్పటినుంచీ ఆమె మెలిపెట్టినట్లు మెలికలు తిరిగిపోసాగింది. నోటి
వెంట నురుగు. ఆమె రాజకాంత. ఆమె జగతీంద్ర వర్మ భార్యలలో ఒకతె. పాము విషాన్ని
విరచడానికి వైద్యులు మంత్రగాళ్ళు అందరూ ప్రయత్నించి విఫలమయ్యారు. వెంటనే మరణం
సంభవించలేదుకానీ విషం ఒళ్ళంతా విస్తరించింది. మంత్రగాళ్ళు సహితం పెదవి విరిచారు.

ఆ పరిస్తితిలో ఎవరికో శతావరి గుర్తుకొచ్చాడు. ఆయనను కోటలోకి వచ్చి వైద్యం


చేయ మని కోరారు. శతావరికి దుర్గ ప్రవేశంపై నిషేధం ఉంది. అతడు తనఆశ్రమం దాటి
బయటకు రానన్నాడు. కమలహిత బ్రతికే పరిస్ధితిలో లేదు. ఆ సమయంలో తప్పనిసరై
ఆమెను శతావరి ఆశ్రమానికి తీసుకువచ్చారు.

ఆశ్రమంలో శతావరి జ్వరంతో వేగిపోతున్న రోగులందరికీ చికిత్స చేస్తున్నాడు. ఒక


ఉక్కు గొడ్డలిని కొలిమిలో కాల్చాడు. ఎఱ్ఱగా కాలిన పరశువును చల్లని నీళ్ళతొట్టెలో వేశాడు.
నీళ్ళు ఆ వేడికి చుయ్యిమన్నాయి. ఆ నీటిని అభిమంత్రించి జ్వర రోగులకు తాగిస్తున్నాడు.

ఒకటిరెండు దినాలలో జ్వరాలు నయమవుతున్నాయి.

శతావరి కమలహితను ఒక కుటీరంలో పడుకో పెట్టమన్నాడు. అందరినీ బయటికి


పంపించాడు. ఆమె శరీరమంతా పరిశీలించాడు. ‘రోగిలో నాడి అందటం లేదు. శరీరాంగా
లన్నీ నల్లబారాయి. కొనవూపిరి మాత్రమే వుంది. విషం సర్వాంగాలకు పాకింది. కానీ పాము
కరిచి ఎంతోసేపయినా ఈమె ఇంకా బ్రతికి వుందంటే ఆయుష్షు తీరలేదు. వైద్యం చేస్తే
బ్రతకవచ్చు’ శతావరి మనసులో అనుకున్నాడు. ఎందుకంటే కాలం తీరిన వారికి అతడు
వైద్యం చేయడు. అది అతని నియమం.

శతావరి ఆ స్త్రీ సర్వాంగాలను పేరుపేరునా ఇలా అభిమంత్రించాడు.

“ఓ విషరాజమా! నీవు తక్షకజాతి దానివి. ఘనమైన విషమవు. అయినా నేను అభి


మంత్రిస్తున్నాను. ఈ స్త్రీ నేత్రములనుండి నాసిక నుండి కర్ణములు చుబుకము నుండి శిరస్సు
మేధ జిహ్వలనుండి తొలగిపొమ్ము. ఈమె మెడ,ఉష్ణీహనాడి, కలక, అనూక్యముల నుండి
కండరములనుండి బాహువులనుండి తొలగిపొమ్ము. హృదయము, క్లోమము,
హల్లీక్షణమునుండి డొక్కలనుండి మాంస పిండములనుండి, ప్లీహమునుండి ఉదరము

137
  చాళుక్యసింహాసనం

నుండి తొలగిపొమ్ము. ఆంత్రమునుండి పురీషమునుండి ఉదరమునుండి విషమా తొలగి


పొమ్ము. ఊరువులనుండి తొడలనుండి అరికాళ్ళనుండి కటికి క్రిందిభాగము నుండి గుహ్య
ప్రదేశము నుండి గుహ్యస్ధానమునుండి తొలగిపొమ్ము. ఎముకలనుండి మూలుగు నుండి
ధాతువు నుండి సూక్ష్మ నాడులనుండి వేళ్ళనుండి గోళ్ళనుండి విషమా తొలగి పొమ్ము.

ఓ కమలహితా నీవిపుడు విషగ్రస్తవు కావు. నమ్ము. నీ అంగాంగములనుండి రోమ


రోమము నుండి విషము తొలగించినాను” అన్నాడు శతావరి.

కొంతసేపటికి కమలహిత లేచికూర్చుంది. తొలగించిన వస్త్రాలు ధరించి కుటీరం


బయటికి వచ్చింది. అందరూ ఆశ్ఛర్యపోయారు. ఆతడి కాళ్లపై పడ్డారు. శతావరి ఆమెకు
కొన్ని ఆహార విహార నియమాలు చెప్పాడు. కొంతకాలమయింతరువాత నాగశాంతి
చేయించుకోమని చెప్పాడు.
“ఓ మదవతీ! నీకింతకుముందు ఏమైనా వ్యాధులున్నాయా?” అడిగాడు శతావరి.
కమలహిత “ఉహూ లేవు!”అన్నది.

“సిగ్గు వలన అందరూ లేవనే చెబుతారు. నీ నాడి చూస్తే తెలిసింది. నీ శరీరంలో చెప్ప
లేని గుప్తవ్యాధి వుంది. ఈ గరళం వలన ఇప్పుడు అది సంపూర్నంగా తొలగి పోయింది.
నీవెలా తిరిగినా ఇకముందు నీ దరికి రాదు. ఈ పాము ఎందుకో నీకు మేలే చేసింది.
కొంతకాలం తరువాత నాగదేవతలకు తృప్తి కలిగించు” అన్నాడు శతావరి.

కమలహితాదేవిని కోటలోకి తీసుకు వెళ్ళిపోయారు.

అదేసమయంలో ఒక జ్యోతిశాస్త్ర పండితుడు శతావరి ఆశ్రమానికి వచ్చాడు. “అయ్యా!


మీకీ విద్య ఏశాస్త్రం నుంచి లభించింది?” అని ప్రశ్నించాడు.

అందుకు శతావరి “అధర్వసంహిత నుండి లభించింది” అన్నాడు.

అందుకా పండితుడు “ఆమెకు పాము కరిచిన సమయం మీ ఆశ్రమానికి వచ్చిన


సమయం మంత్రించిన సమయం పరిశీలించాను. ఆమెకు మృత్యుయోగం ఉండగా ఎలా
మంత్రించారూ? జాతక రీత్యా ఈమెకు మారకం జరగవలసి వుంది” అన్నాడు.
అందుకు శతావరి
“న తిధిర్నచ నక్షత్రం నగ్రహో న చంద్రమాః
అథర్వ మంత్ర సంప్రాప్యా సర్వసిద్ధి ర్భవిష్యతి.

అథర్వ మంత్రాలతో అభిమంత్రిస్తే తిధి నక్షత్ర గ్రహ చంద్రులతో సంబంధం లేకుండా

138
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

జాతకంతో సంబంధం లేకుండ సర్వ సిద్ధి కలుగుతుంది” అని చెప్పాడు.

శిష్యులు వచ్చి గోమఠేశ్వరయ్యగారు జ్వరంతో బాధపడుతు వచ్చారని చెప్పారు.


శతావరి వెళ్ళి శ్రేష్ఠికినమస్కరించి నాడిపరిశీలించాడు. “అయ్యా మీకు వచ్చినది క్రిమి జ్వరం.
అందుకే మామూలు వైద్యానికి లొంగలేదు” అన్నాడు శతావరి.“మీరు ఆశ్రమంలో ఐదారు
రోజులు ఉండిపోండి”అన్నాడు.

“క్రిమి జ్వరమా, ఎప్పుడూ వినలేదే!” అన్నాడు శ్రేష్ఠి.

“అయ్యా! ఎందుకులేవూ మన కంటికి కనిపించని సూక్ష్మక్రిములు ఉంటాయి. వాటిని


మందుమాకు ద్వారాను అభిమంత్రించడం ద్వారాను నశింపజేయాలి.”

“శతావరీ! ఇంతకుముందు ఎవరూ సూక్ష్మక్రిముల్ని గురించి మాట్లాడలేదే!”

“అయ్యా! చాలామంది వేదం అంటే బ్రాహ్మలు చదువుకునే మంత్రాలు మాత్రమే అను


కుంటారు. అందులో ఏముందో గ్రహించరు. కంటికి కనిపించే క్రిములనూ కనిపించని
సూక్ష్మ క్రిములను హరించువాడు సూర్యుడు. క్రిములలో ఆడ మగ కూడా వుంటాయి.
క్రిములలో నలుపు ఎరుపు రంగువి బభ్రువర్ణమువి, బభ్రుకర్ణములు కలవి, శితికక్షలు శ్వేత
బాహువులు గృధ్ర కోక అని పిలవబడేవి మూడు తలకాయలవి మూడు మూపురాలు కలవి
సారంగ అర్జున వర్ణము కలవి మందగమనలు వేగగమనలు అనేకం వుంటాయి. ఇవి
రోగకారకాలు” అన్నాడు శతావరి.

ఆంధ్రశ్రేష్ఠి శతావరి ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉండిపోయాడు. జ్వరం ఉపశమించిందికానీ


నీరసం తగ్గలేదు. ఒకనాడు శతావరితో “నీవు చేసేవన్నీ వింతగా వున్నాయే! అసలు నీ
ఆశ్రమం పేరే వింతగావుంది. పేరులో ఎవరైనా సంఖ్యలు పెట్టుకుంటారా? వాచస్పతి 3 7
21 ఈ సంఖ్యలేమిటీ?”అన్నాడు.

అందుకు శతావరి “అయ్యా! వేదజ్ఞానమును ప్రసాదించువాడు వాచస్పతి. సృష్టి


మూడు మీద ఆధారపడివుంది. భూలోక భువర్లోక సువర్లోకాలు, మరియూ అగ్ని, ఆదిత్యుడు,
వాయువు, అలాగే సత్వ రజ స్తమోగుణాలు, బ్రహ్మావిష్ణు మహేశ్వరులు.

ఏడు సంఖ్య సప్తఋషులు, సప్త లోకములు, ఆదిత్యుడు చంద్రుడు అంగారకుడు


బుధుడు బృహస్పతి శుక్రుడు శనీశ్వరుడు అనే ఏడు గ్రహాలనుసూచిస్తుంది.

పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచప్రాణాలు పంచభూతాలు


అంతఃకరణ అనేవి ఇరవైఒకటి.

139
  చాళుక్యసింహాసనం

అందుచేత సృష్టి ఈ 3 7 21 మీద ఆధారపడివుంది. ఇదిఅంతా అర్ధం చేసుకోవడమే


అధర్వ వేదం.”

“అంటే సృష్టి మొత్తాన్నీ నీ ఆశ్రమం పేరులో ఇమిడ్చావనమాట! ఈ వృత్తి ఏమైనా గిడు


తోందా? ఒక శ్రేష్ఠిగా అడుగుతున్నాను!”అన్నాడు శ్రేష్ఠి.

“గిట్టకపోవడమేమిటీ! అధర్వాన్ననుసరించి స్త్రీల తృప్తికోసం ఒక లేపనాన్నీ పురుషుల


తృప్తికోసం ఒక లేపనాన్నీ తయారుచేశాను. అది బాగా పనిచేస్తోంది. ఆ మందులు చాలు
ఆశ్రమం గడవడానికి” అన్నాడు శతావరి.

“మొత్తానికి నీవు చాలా గట్టివాడివయ్యా! శత్రుదేశంలో పీఠంపెట్టి హుందాగా బ్రతుకు


తున్నావు” అన్నాడు గోమఠేశ్వరయ్య.

23 మృదువదన
విష్ణువర్ధనుడిని బెజవాడలో విడిచిపుచ్చిన విశాఖదత్తుడు చెమరీ గురుకులానికి
వెళ్ళాడు. అతడి మనసంతా మాన్యకేతదుర్గాన్ని జయించడానికి ఎవరెవరిని నియమించు
కోవాలా అనే ఆలోచనపైనే వుంది. గురుకులంలో అందరూ విష్ణువర్ధన రాకుమారుని
విజయాన్ని గురించి జగదేకవీర బిరుదాన్ని గురించీ కథలు కథలుగా చెప్పుకుంటు న్నారు.
కానీ ఎవరికీ విశాఖదత్తుడు కూడా మాన్యకేతం వెళ్ళినట్లు తెలీదు.

అంగీరసుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పటినుంచీ ఆశ్రమం కొంచం


పల్చబడింది. కొందరు చదువు మానేసి వెళ్ళిపోయారు. విశాఖదత్తుడు ఉపకులపతి శవనకుని
కలుసుకున్నాడు. ఆయన విశాఖదత్తుడిని ఆశ్రమంలో ఆచార్యుడిగా పనిచేయమని కోరాడు.
యోధులలో కొందరు తమకు ఏదైనా రాజాస్ధానంలో స్ధానం కల్పించమని అడిగారు. అతడు
చూద్దాంలే అవకాశం వచ్చినపుడు అన్నాడు.
గురుకులంలో మృదువదన వచ్చి కలిసింది.
“దత్తూ! అయ్య తపస్సుకు వెళ్ళినప్పటినుంచి నాకీ ఆశ్రమంలో వుండబుద్ధి
కావటంలేదు. నన్ను ఈ కోనదాటించి ఎక్కడైనా నియమించగలవా
నీవు నా అంత యోధురాలివి. ఏ ఆస్ధానంలోనైనా జేరవచ్చుగదా
“నేను వయసులో వున్న ఆడపిల్లని. నీలాగా ఎక్కడపడితే ఆక్కడ కుదురుకోలేనుకదా!
విష్ణువర్ధనుడు యువరాజయ్యాడట?” అన్నది.
“ఔనువిన్నాను. రాజకుమారుడు యువరాజుకాక యువరాణి అవుతాడా?”
వెటకారంగా అన్నాడు విశాఖదత్తుడు.

140
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఔను. బాలుడు బాలిక అవుతాడను కున్నాను.ఔనుకానీ మీ ఇద్దరూకలిసే మాన్యకేతం


వెళ్ళారనే రహస్యం నాకు తెలుసు!” అన్నది మృదువదన.
“రహస్యాన్ని రహస్యంగా ఉంచడం కూడా నేర్చుకో!” కొంచం మందలించినట్లే
అన్నాడు విశాఖదత్తుడు.
“మొదలుపెట్టావా అత్తగారి సాధింపూ!”అన్నది మృదువదన.“విశా! నన్నెలాగైనా
విష్ణువర్ధనునితో చేర్చగలవా?” అన్నది దీనంగా.

“అది అంత సులువైన పనికాదు. అతడు తనరాజ్యాన్ని నిష్కంటకం చేసేవరకు నీవైపు


కన్నెత్తైనా చూడడు.”
“నేనప్పటివరకూ ఆగగలను. దత్తూ! అంతేకాదు. నేనతడికోసం ప్రాణంకూడ విడువ
గలను” విశ్వాసంతో చెప్పింది మృదువదన.
“మరి నీవు మాన్యకేతం వెళ్ళగలవా?”అన్నాడు విశాఖదత్తుడు.
“మాన్యకేతమా! అక్కడేం పనీ?”
“ముందర ఆచ్ఛర్యాలు అనుమానాలు విడిచిపెట్టు. రహస్యాలను రహస్యంగా ఉంచడం
కూడా నేర్చుకో!”
“నీవు నా పై అధికారివయినప్పటినుంచీ అలాగే చేస్తాను. కానీ మా ఆడపిల్లలకు
రోషమూ అభిమానమూ ఎక్కువగా ఉంటుంది. కొంచం కోప్పడినా కళ్ళవెంబడి నీళ్ళు
వస్తాయి. నువు చెప్పినట్లు చేస్తాకానీ కొంచం సున్నితంగా ఆజ్ఞాపించడం నేర్చుకో!”
“నిన్ను నా సేనలో నియమించుకుంటే నన్నే శాసించేటట్లున్నావే! కొరివితో తల గోక్కు
న్నట్లు కాదుకదా!”
“మంచిదేకదా, తలలో చుండ్రువుంటే వదులుతుంది.! మనిద్దరం సహాధ్యాయులం.
అందువలన కొంచం చనువు తీసుకుంటున్నాను. ఒక సేనానిగా ఆజ్ఞాపిస్తే నువు చెప్పినట్లే
చేస్తాను.”

“మేము మాన్యకేతనగరంలో ఒక శిబిరం ఏర్పాటుచేస్తున్నాము. అది అత్యంత


రహస్యం. అది నీకు ఇప్పుడే చెబుదామా వద్దాఅని ఆలోచిస్తున్నాను.”

“నేను రహస్యాన్ని కాపాడలేననుకుంటే చెప్పవద్దు, కానీ నా నాలుక కోసినా రహస్యం


బయటపెట్టను.”

“నీవంతటి సమర్ధురాలివే! నాకు తెలుసు. మేము అక్కడ కొంత సైన్యాన్ని కూర్చ


బోతున్నము. ఒకరొకరే వచ్చి జేరుతారు. నీవు ఆ వ్యవహారాలన్నీ చూచుకోవాలి. నీకు
నానుండీ అప్పుడప్పుడూ వేగు వస్తుంది. ఆ ప్రకారం నడుచుకోవాలి. బహుశా నిన్ను వేగు
141
  చాళుక్యసింహాసనం

శాఖలోనే నియమిస్తానేమో!” అన్నాడు విశాఖదత్తుడు.

“సరే! నేను మాన్యకేత ప్రయాణానికి సిద్ధమే. నేటినుండి నేను నీ బంటుగా పనిచేస్తాను”

“నీవు మాన్యకేతం వెళ్ళడానికి నేను ఏర్పాట్లు చేస్తాను. కాదు. మనిద్దరం కలిసే


వెళదాము. నీవు అక్కడ పేదరాసి పెద్దమ్మ పూటకూళ్ళిల్లు నడుపుతుంటుంది. అక్కడ స్ధావరం
ఏర్పాటు చేసుకో. ఆమె వద్దకు వెళ్ళి అళియ వెంకడు పంపించా డని చెప్పు. ఆమె నీకు
ఆశ్రయమిస్తుంది.

నీవక్కడికి చమరీగురుకులంలో చదువుకున్న ఒక యోధురాలిగా ఒక దళవాయిగా


వెళుతున్నావు. అక్కడ కత్తిలాగ ఉండు. నేను పన్నే వ్యూహాలను అమలుచేయాలి. అవసరమొస్తే
ఎవరినేనా తెగనరకడానికి సిద్ధంగా వుండాలి.”

“ఎవర్ణీ? పూటకూళ్ళమ్మనా?” పరిహాసంగా అంది మృదువదన.


విశాఖదత్తుడు మృదువదన చెవు గట్టిగా పిండాడు.

*****

మాన్యకేతనగరం వీరోత్సవాలనుంచి వచ్చిన విష్ణువర్ధన రాకుమారుడికి ఒక శుభ


ముహూర్తం చూసి యువరాజపట్టాభిషేకం చేశారు. సామంత మంత్రి పురోహితులందరూ
నగరంచేరారు. రాజదంపతులు కుమారుడికి ముందుగా స్నాతకోత్సవం చేశారు. హోమం
నిర్వహించారు. దీక్ష తీసుకున్నవిష్ణువర్ధన రాకుమారుడు ఆరాత్రి ఉపవాసం చేశాడు.
మర్నాడు రాకుమారుడిని మంగళాస్నానం చేయించి చక్కగా అలంకరించారు అంగనలు.
నూతనంగా నియమింపబడిన అంగరక్షకులు వెంటరాగా సభాప్రవేశం చేసిన రాకుమారుడు
ముందు తల్లికీ తరువాత తండ్రికీ రాజగురువుకూ నమస్కరించాడు. కాబోయే యువరాజు ను
వివిధ నదీనద జలాలతో సముద్రాంభువులతో కలశోదకంతో అభిషేకించారు. అలా
పవిత్రమైన రాకుమారుడి మూర్ధంపై రత్నాల తురాయితో కూడిన తలపాగా ఉంచారు. రాజ
గురువు దీవించగా మహామంత్రి గంగాతీర్ధుడు యవరాజ దండం సమర్పించాడు. సేనాపతి
చంద్రాదిత్యవర్మ వీరఖడ్గం బహూకరించాడు. సామంతులంతా కానుకలిచ్చి అక్షతలు
చల్లారు. పట్టాభిషేక సభలో ప్రసంగిస్తూ పెద్దలు ‘యువరాజుతోపాటు మాకు ఒక యవ
రాణీని కూడ ప్రసాదిస్తే బాగుంటుంది’ అన్నారు.

మల్లప్ప అనే సంగీత విద్వాసుడు పాడగా కనకాంబరి నీలాంబరి అనే ఆస్ధాన నర్తకీ
మణులు నాట్యం చేశారు.మహారాజు దేశంలో ఐదురోజులు ఉత్సవాలు ప్రకటించారు.
విప్రులకూ దేవాలయాలకూ భూరిదానాలు ప్రకటించారు.

142
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

యువరాజుకు వేరే అంతఃపురము పరిచారికలు పరివారమూ పంచ మహాశబ్దాలు


ఛత్ర చామరాది లాంఛనాలు ఏర్పడ్డాయి. యువరాజు నివాసం కోసం 106 హస్తముల
పొడుగు 70 హస్తముల వెడల్పు గల గృహం నిర్మింపబడివుంది. మహారాజు మందిరం 135
హస్తముల పొడుగు 108 హస్తముల వెడల్పు కలిగివుంది. మహారాణి అంతఃపురం 33
హస్తముల పొడుగు 30 హస్తముల వెడల్పులో నిర్మించబడింది. ప్రతి గృహం చుట్టూ
ఉద్యానవనాలు శుభ వృక్షాలు విలసిల్లుతున్నాయి.
రాత్రికి యువరాజు అంతఃపురానికి ఇరువురు కన్యలు వచ్చారు. సభలో నాట్యం
చేసింది వారే. చేతులో మథుకలశాలున్నాయి. చూస్తే అరవిచ్చిన పూవు మొగ్గల్లా ఉన్నారు.
“ఎవరు మీరూ? మా నివాసంలోకి మేము పిలవకుండా ఎందుకు ప్రవేశించారు?”
విష్ణువర్ధనుడు కొంచం కఠినంగా ప్రశ్నించాడు.
ఆ బాలలు చిన్నపుచ్చుకోలేదు.ఆ భామలు చిలిపిగా నవ్వారు. వారి చిగురుటధరాలు
సిగ్గుతో కొంచం వణికాయి. విష్ణు వర్ధనుడు ఏమీ అర్ధం కానట్లు ముఖం పెట్టాడు. “అతివలు
అలా చెబుతారా?” అన్నారు వాళ్ళు నేలచూపులు చూస్తూ ఉత్తరీయము కొన వేలికి
చుట్టుకుంటూ. ఇద్దరిలో ఒకరి ఉత్తరీయం అప్రయత్నం గానో ప్రయత్నంగానో జారిపోయింది.
“ఎందుకు చెప్పరూ?” అన్నాడు విష్ణువర్ధనుడు.
కన్యలిరువురిలో నునిసిగ్గు ఇంకొంచం పెరిగింది. అందులో ఒకతె కంఠహారాన్ని పలు
వరస మధ్య ఇరికించుకుని “అమ్మాయిలు చెప్పరు” అన్నది..
“మేము యువరాజవరులకు మూడు నిద్రలు చేయించవచ్చాం!” అన్నారు ముద్దు
ముద్దుగా.
విష్మువర్ధనుడు కంచు ఘంటమీద ఒక్క దెబ్బ కొట్టాడు. శూలపాణియైన ద్వారపాలిక
వచ్చి వందనం చేసింది.
“ఈ ఇద్దరినీ బయటికి పంపించు!నా ఆజ్ఞలేకుండా ఎవరిని మందిరంలోకి అనుమ
తించితే నీ మెడకాయమీద తలకాయ ఉండదు”విష్ణువర్ధనుడు గద్దించి పలికాడు.
“చిత్తం!” అన్నది ద్వారపాలిక.
“ఒక్కనిముషం!” అన్నది నీలాంబరి. “ఒక్కధర్మం చెబుతాను యువరాజా!మేమిద్దరం
చాలా కామంతో మిమ్మల్ని సేవించవచ్చాము. తమరు మమ్మల్ని తిరస్కరించడం ఆర్య
పుత్రులకు శోభ అనిపించుకోదు! అనుగ్రహించండి.”అన్నది కొంచం వేడుకుంటున్నట్లు.

వారలా మాట్లాడుతుండగానే ద్వారపాలిక వారిని బయటికి తీసుకు వెళ్ళిపోయింది.

*****
143
  చాళుక్యసింహాసనం

నిద్రలేచిన పూటకూళ్ళమ్మ తన కొంగున ఏదో బరువుగా వుండడం గమనించింది.


ముడివిప్పి చూస్తే పది బంగారు వరాహలు కనిపించాయి. ముసలమ్మ ముఖం చింకిచాటంత
పెద్దదయింది. గబగబా మాడల్ని దాచిపెట్టేసింది. చుట్టూ చూస్తే అతిధులూ లేరూ, గుఱ్ఱాలు
లేవు. ఐతే అళియ వెంకడు అబద్ధం కాదనిపించింది.

కొద్దిరోజులలోనే పూటకూళ్ళమ్మ మాన్యకేతనగరానికి చేరింది. ఊరికి కొంచం పెడగా


ఒక ఊసరక్షేత్రాన్ని కొన్నది. ఇల్లూ వాకిలి ఏర్పాటు చేసుకుంది. వచ్చినవాళ్ళకు అన్నం
వండిపెడుతోంది. అళియ వెంకడు పేరుచెప్పుకుని ఒకరొకరే రాసాగారు. మూడునాలుగు
రోజులు తన పంచన వుండి నగరంలో ఏవాడలోనో నివాసమేర్పరచుకుంటున్నారు.

ఒకదినం తన గుమ్మం ముందుకు ఒక అమ్మాయి వచ్చింది. “అమ్మా! అన్నంవుంటే


పెడతావా?” అని అడిగింది. పూటకూళ్ళమ్మ ఆ అమ్మాయికేసి తేరిపార చూసింది. పిల్ల
మాత్రం నల్లగావున్నా శిల్పి చెక్కిన రాతిబొమ్మలా వుంది.
“కావాబాలా?” (ఎవరు పిల్లా) అన్నది ముసలమ్మ.
“శిలాజం” (గిరికన్య) అన్నది ఆ అమ్మాయి.
“రూకలు ఏమైనా తెచ్చావా, అన్నం అడుగుతున్నావు?” అన్నది ముసలమ్మ.
“ఓ! మూటలు మూటలు తెచ్చాను” అన్నదా అమ్మాయి.
“నీకంత రొక్కం ఎక్కడిదీ?” అన్నది ముసలమ్మ.
“అళియవెంకడు ఇచ్చాడు” అన్నది ఆ బాల.
“అళియ పంపించాడా! ఇంకేంతల్లీ. లోపలికిరా, కాళ్ళు కడుక్కో” అన్నది ముసలమ్మ.

అలా మాన్యకేతంలో కుదురుకుపోయింది మృదువదన శిలాజం అనే పేరుతో. మాన్య


కేతం చేరుతున్న యోధులందరి లెక్కలు చూసుకోసాగింది.

పూటకూళ్ళమ్మ రకరకాల పిండివంటలు మిఠాయిలు తయారుచేసేది. శిలాజం తిను


బండారాలను గంపలో పెట్టుకుని అమ్ముకువచ్చేది. రోజుకో వాడకు వెళ్ళేది. అందువలన
శిలాజం అంటే అందరికీ తెలియడం కాదు. శిలాజానికి ఊరంతా తెలిసింది. తమ యోధులు
ఏఏవాడలలో ఎంతెంత మంది జేరిందీ లెక్కపెట్టు కునేది. మిఠాయి అమ్మే నెపంతో కోట లోకి
కూడ వెళ్ళేది. అందువలన కోటలో సౌధాలన్నీ పరిచయమయ్యాయి. ఎవరెవరు ఎక్కడవుండేది
గమనించేది. అక్కడి రక్షణవ్యవస్త క్షుణ్ణంగా ఆకళించుకోసాగింది.

కోటలోకి వెళ్ళాలంటే శిముకుడు అనే అధికారి ఆజ్ఞ కావాలి. ఆ నెపం పెట్టుకుని అతడు
తనతో సరసాలాడేవాడు. ఎక్కడేనా ఆయుధాలు దాచావా అని తడిమి చూసే వాడు. అతడి
ఆగడాలు మితిమీరుతుండేవి. ఆ విషయం విశాఖ దత్తుడికి చెబుతే ఇంత చిన్నసమస్యను

144
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

పరిష్కరించుకోలేవా అన్నాడు. తనకు రోషం వచ్చింది.

శిలాజం ఆలోచనలో పడింది. ఒకనాడు శిముకుడికి సంకేతమిచ్చింది. చీకటి అలుము


కున్న తరువాత కాగ్నానదీ తీరాన స్మశానరేవుకు రమ్మని.పగటిపూట కర్మలు చేసుకునే వారు
తప్పుతే పొద్దుకూకితే అటువైపు ఎవరూ రారు. శిముకుడు పొంగిపోయాడు. సమా గమానికి
మంచిచోటే ఎన్నుకున్నది. గొప్ప అభిసారిక అనుకున్నాడు. సుగంధ ద్రవ్యాల పరిమళాల
ఘుమఘుమలతో ముందుగానే అక్కడకు చేరాడు.

శిలాజం బాగా చీకటిపడేవరకూ అక్కడికి రాలేదు. ఆలస్యమైనా తలపైన గంప పెట్టు


కుని కులుకుతూ వచ్చింది. ఆహా తినుబండారాలు కూడా తెచ్చిందా అనుకున్నాడు శిముకుడు.
గంపలో ఒక కంబళం తాడు మత్రమే వున్నాయని అతడికి తెలీదు.

శిముకుడు ఆబగా శిలాజాన్ని కౌగలించుకుని అధరాలనాసించాడు. శిలాజం


సమయంచూసి అతడి తలను రెండుచేతులతోను పట్టుకుని మెలితిప్పింది. అతడి మెడ
బెణికింది. అతడు కౌగిలి విడిచి ఇదేమి సరసం అన్నాడు. శిలాజం మళ్ళీ అతడి మెడమీద
కొట్టపోయింది. అతడు ప్రక్కకు తప్పుకుని శిలాజంతో కలబడ్డాడు. ఇద్దరూ గుద్దుకున్నారు.
ఆడదాన్ని ఎక్కడ కొడితే ఓర్చుకోలేదో అతడికి తెలుసు. శిలాజం ఛాతినెప్పిని
ఓర్చుకోలేకపోయింది. ఆమె బాధపడుతున్న సమయంలో జడ పట్టుకుని గుంజడం వలన
ఆమె క్రింద పడింది. అతడు ఆమె చెంపలపై కాలుపెట్టి నొక్కుతూ జడను పట్టి పీకసాగాడు.
బాధను ఓర్చుకుంటూ శిలాజం తనజుట్టును తానే పట్టుకుని అమిత బలంతో క్రిందికి
గుంజింది. ఆ దెబ్బతో అతడి తల వచ్చి తన తలకు తగిలింది. ఇద్దరికీ చాలా నెప్పే కలిగింది.
శిలాజం తనపైన పడిన అతడిని క్రిందికి తిప్పి ముక్కుపై బలమైన గుద్దు గుద్దింది. అతడామెను
తనకాళ్ళతో పెనవేసుకుని బంధించాడు. ఎలాగైనా శిలాజం తనకు వశమౌతుందనే ఆశతో
పారిపోకుండా పెనుగులాడుతున్నాడు. శిలాజం తన అరచేతులతో ఒకేసారి అతడి చెవులపై
బలంగా మోదింది. ఆ దెబ్బతో అతడి గూబలదిరి మస్తిష్కం స్థంభించిపోయింది. చెవులనుంచి
రక్తపు ధారలు స్రవించసాగాయి.

శిలాజం ఓపిక కూడదీసుకుని పైకిలేచి అతడి మెడపై ఒకకాలు తొక్కిపెట్టి కుడిచేయి


మెలిపెట్టి చంకలో గట్టిగా తన్నింది. అంతటితో గూడ తొలగి భుజం వేలాడింది. ఆదెబ్బకు
మళ్ళీ సృహలోకి వచ్చిన శిముకుడు శిలాజం బలం ఏమిటో అర్ధం చేసుకున్నాడు. శిలాజం
ఒక బండరాయిని ఎత్తి అతడి ఎడమ మోకాలిచిప్ప మీడ మోదింది. అతడు తనను వదిలి
పెట్టమని ఎంత ప్రార్ధిస్తున్నా వినిపించుకోలేదు. అతడిని ఆక్షణమే చంపాలనుకుంటే ఆ
నాపరాతితో తలపైనే కొట్టేది. అతడు పెద్దగా అరుస్తుంటే తన పైటచెంగు చింపి అతడి నోటిలో
కుక్కి కాలితో పళ్లు ఊడేడట్లు ఒక తొక్కు తొక్కింది.

శిలాజం అతడు ఇంకా తననేమీ చేయలేడని తెలిసి నేలమీద చతికిలపడి కాస్త ఊపిరి
పీల్చుకుంది. ఆసమయంలో అతడు పొర్లుతూ దూరంగా జరిగి ఎడమచేత్తో నోటిలో కుక్కిన
145
  చాళుక్యసింహాసనం

గుడ్డ పీకివేసుకున్నాడు. అతడు వస్తూవస్తూ ఒక చురకత్తిని నడుము దట్టీలో దోపుకుని


వచ్చాడు. ఎడమచేత్తో దానిని బయటికిలాగి సమయం చూసి శిలాజాన్ని పొడవాలను
కున్నాడు. చంపదలుచుకున్న శత్రువుని ప్రాణం తీసికాని ఒదలకూడదు. ఆఖరిక్షణంలో
అంతిమ విజయం ఎవరిదేనా కావచ్చు.

మసకచీకటిలో శిలాజం అతడి చేతిలోని చురికను చూడలేదు. కానీ నోటిలో గుడ్డను


పీకివేసుకోటడం గమనించింది. ఇతడికి ఎడమ చేయి మిగిలివుందిగదా అనుకుంది. ఆ
స్మశానంలో ఆరిపోయిన చితినుంచి ఒక కట్టెను తీసుకుని ఎడమ ముంజేతిపైన అదేపని గా
కొట్టింది. అతడు చురకత్తిని ప్రయోగించలేకపోవడం శిలాజం అదృష్ఠం.

శిలాజం కంబళీని పరిచింది. శిముకుడిని తన్నుకుంటూ కంబళీపైకి దొర్లించింది.


అతడు కుడికాలు ఝాడిస్తూ పెనుగులాడుతుంటే ఊరుమూలంలో ఒక తన్ను తన్నింది. అతడి
కాళ్లూచేతులు పొట్టమీదకు మడిచి పగ్గంతో బంధించింది. కంబళి నాలుగు మూలలు మడిచి
చాకలిమూటలా కట్టింది. శిముకుడింకా అరుస్తునే వున్నాడు.

శిలాజం శిముకుడి మూటని కాగ్నానదిలోకి ఈడ్చుకువెళ్ళి చేతనైనంత దూరం


తోసింది. బడిబుడి శబ్దాలతో శిముకుడి అరుపు ఉడిగేదాక కపాలమోక్షం వరకూ వేచిచూచే
బంధువులాగా ఆ స్మశానవాటికలో వేచివుంది.
ముఖం కడుక్కుని దాహం తీర్చుకుని ఇంటిముఖం పట్టిందా ఇంతి.
దూరంనుండి గమనిస్తున్న విశాఖదత్తుడు ‘గట్టిపిండమే!’ అనుకున్నాడు.

24 కన్యగర్భం
“హళా శిరీషా!” అన్నది వస్తూనే వసుమిత్ర.
“హళా వసూ! ఏమిటే బంగారమైపోయావ్” అన్నది శిరీష.
“అందరూ నల్లపూస అంటారు. నీవు బంగారం అంటావేమిటీ! ఔను. నేను రావాలేకానీ
నీవైతే రావుకదా! సార్వభౌముల పిల్లవాయె! రాజసం ఎక్కడికి పోతుందీ!”
“ఉంటేకదా పోయేందుకు! అలాంటి రాజసం ఏమీలేదులే! నేను రాకూడదని ఎక్క
డుందీ? కాకపోతే నిత్యకృత్యాలు అలా సాగిపోతోంది.” శిరీష వసుమిత్రని కొంచం పరికించి
చూచింది.
“నీకు నిత్యకృత్యాల బాధలేమిటే? వండుతున్నావా వారుస్తున్నావా! హాయిగా ఎనిమిది
మంది చెలికత్తెలమధ్య అష్టదళపద్మంలా వున్నావు.” అన్నది వసుమిత్ర.
“బాగుంది పీతకష్టాలు పీతకుండవా! ఇంతకూ ఏమిటే విసేషాలు? కొంచం ఎందుకో
నీలో మార్పు కనిపిస్తోంది.”

146
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఏంకనిపిస్తోందీనీకు? నాలోని దయ్యమా?”

“దయ్యమూలేదు భూతము లేదు! కానీ నీ చెక్కిళ్ళు కొంచం జారినట్లనిపిస్తోంది. కనుల


క్రింద నలుపు రేఖలు, పరిమాణం పెరిగిన వక్షస్సు, కొంచం ఒడిలిన తామరపువ్వులా
వున్నావు. అంతే!”

వసుమిత్ర తనలోని మార్పు రాజకుమారి కనిపెట్టిందిగదా అనుకుంది. ఈ మధ్య తనకు


తనే కొంచం మారినట్లు స్నానం చేస్తున్నపుడు అనిపిస్తోంది. కారణం ఏమిటో తెలీదు. ఇంతకు
ముందు అనుభవమూ లేదు. మనసులో కోరికలు పెరిగినా ఒంట్లో నీరసంగా వుంటోంది.
ఉత్సాహం తరిగింది. పైకిమాత్రం “అదేంలేదు. హాయిగా వున్నాను. నీముఖంలో కూడా ఏదో
మార్పు కనిపిస్తోంది. మనసులో ఎవరైనా దూరాడా? రాత్రులు సరిగా నిద్ర పోవటంలేదా?”
అన్నది వసుమిత్ర రాజకుమారితో.

“అదేంలేదే!”

“అబద్ధాలాడడం మన ఆడపిల్లలందరికీ అలవాటైపోయింది! వీర శూర


అరివీరభయంకర నారీజన మనోహర జగదేకవీర భల్లాణపోతినాయుడు నీ మనసులో
బల్లెంపెట్టి పొడుస్తు న్నాడా?”

“పొడవడంలేదు గిచ్చడం లేదు!”

“పొడవడం అంటే నావుద్దేశ్యం పొద్దుపొడుస్తుందే ఆ పొడుపు! కానీ చక్కటి విష్ణు


వర్ధనుడు అనే పేరుండగా అదేమిటే భయంకరంగా భల్లాణపోతినాయుడు అనే పేరు
పెట్టుకుని వచ్చాడు?”

“అసలా చాళుక్యుడు తన విడిదిలోనే లేడట! విడిదిలోవున్న రాకుమారుడే వేరు! మొత్తం


మాయేచేశాడు. కానీ అతగాడికి మన నగరంలో రహస్యంగా ఆశ్రయమిచ్చిందెవరో ఇంకా
తెలియరాలేదు. మొట్టమొదటగా గోపన్న అనే వ్యక్తి విడిది తీసుకున్నాడు. అతడు కూడా
మాయే! కాకపోతే ఈనగరానికి ఎందుకొచ్చారూ అని అడిగితే యుద్ధం చేయడాని కని
చెప్పాడట! మొత్తం అంతా ముందుగా పధకం వేసుకునే వచ్చారు. ఈ విషయం నగరంలో
కథలుకధలుగా చెప్పుకుంటున్నారు.”

“అందుకే అడుగుతున్నా! దొంగలాగా వచ్చినవాడు నీ హృదయం ఏమైనా చౌర్యం


చేసివెళ్ళాడాయని?”

“అలాంటిదేమీలేదు. పూర్ణిమ ఉత్సవం నుంచీ కొన్నాళ్ళు మనసులో మెదిలాడు.


అయితే అది అతడిమీద సానుభూతీ అతడి శౌర్యం పైన అభిమానం మాత్రమే! ఆతరువాత
మర్చిపోయాను.”
147
  చాళుక్యసింహాసనం

“సానుభూతీ అభిమానం అన్నావే అదే మోహానికి మొదటిమెట్టు! అయితే బీజం లోపల


నాటుకుందనమాట! మనసులో మల్లెల వాన కురవగానే మెల్లగా మొలకై మొక్కై చివరకి
మానై కూచుంటుంది. అప్పుడింకా పీకలేవు. ఇప్పుడే గిల్లుతావో పెంచి పోషించి గోరంతలు
కొండంతలు చేస్తావో నీయిష్టం!”

“తోటకూర కాడేంకాదూ! నేను మా నాన్నగారు చూసినవారినే పెళ్ళాడతాను!”

“బుద్ధిమంతురాలివిలే! ఇంతకూ నీ విలువిద్యా కౌశలం ఎంతవరకూ వచ్చిందీ?”

“నీకు చెప్పనేలేదా! అస్త్రసన్యాసంకూడా అయిపోయింది! ఆనాడు ఆ కుటిలుడి బాణాన్ని


బాణంతో కొట్టినందుకు మా నాన్నగారు నన్నుచాలా మందలించారు, కోప్పడ్డారు. చివరికి
అస్త్రసన్యాసం చేసేశాను.”

“ఎంతపని చేశావే! అనితర సాధ్యమైన నీ అభిమాన విద్యను అలా బూడిదలో పోసిన


పన్నీరు చేశావా? ఆడపిల్లలం మనకు ఆత్మరక్షణ ఉపాయాలు ఉండక్కరలేదా? శబ్దభేది
వరకూ మాత్రమే చ్యాగం చేయాల్సింది. ఆనాడు నీబాణం తగిలి భీమరధీకుమారి మరణిస్తే
చాలా సంకటంలో పడివుండేదానివి. శబ్దభేది ప్రమాదకరమైనవిద్యనే నాకూ అనిపించింది. ”

“మా నాన్నగారికి నా శబ్దబేధి విద్యను గురించి తెలీదు. శబ్దభేది ప్రమాదకరమని


కాబోలు ఏకలవ్యుడినుండి ద్రోణాచార్యుడు ఆ విద్యను లాగేసుకున్నాడు. దశరధమహారాజు
చీకటిలో సలిలధ్వని విని పులి అనుకుని శ్రావణకుమారుని బాణంతో కొట్టినందుకు శాప
గ్రస్తుడైనాడు. శబ్దభేది ప్రమాదకరమైందే! మా నాన్నగారు నన్నుబాణంతో బాణాన్ని కొట్టి
నందుకు చాలా చాలా మందలించారు. రోషంతో శబ్దబేధితో సహా విలువిద్య మొత్తం ధార
పోశాను.”

“పోనీలేవే నీవు విలువిద్య నేర్చుకున్నందుకు సార్ధకమయింది. ఆతడి ప్రాణాలు కాపా


డావు. అతడు నిన్ను క్రీగంట గమనించేవుంటాడు. ఏతూపు ఏచూపు ఏ అతివ విలుబొమ ల
నుంచి వస్తుందో గమనించలేకపోతే రథగజతురగపదాతుల మధ్య ఎప్పుడో హతమై
పోయేవాడు. ఎప్పటికైనా నిన్ను అన్వేషిస్తూ వస్తాడు. నీ మెడలో బంగారపు తాళి కట్టి తన
ప్రాణేశ్వరిని చేసుకుంటాడు.”

“అంత ఆశేమీలేదు. అతడెక్కడో వేంగీనగరంలో వుంటాడు. నేనేమో మాన్యకేత


దుర్గంలో ఉంటాను. మా ఇద్దరికీ లంకెలా కుదురుతుందీ?”

“అదే దైవఘటన! చింతచెట్టు కాయకి సముద్రంలోని ఉప్పుకి లంకె పడటంలా?ఎప్పుడో


ఏ చిలకో తాతగారి పిలకో రాయబారం తెస్తుంది.”

“అంత అవసరం ఏమీ లేదుకాని నన్ను చేసుకునేందుకు కో అంటే కోటిమంది రాజ


148
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

కుమారు లుంటారు!”
“ఒకసారి కో అనుచూద్దాం?”
“మా నాన్నగారు స్వయంవరం ప్రకటించినపుడు కో అంటాను!”

“అప్పుడు ఏ ముసలివాడో వచ్చి మత్యయంత్రాన్ని కొడతాడు. జీవితాంతం ఆ ముసలి


పీనుగుకు నూట ముప్పయ్యో భార్యగా అలమటించాల్సిందే!”

“ముసలివాడే గెలుస్తాడని నీవెలా చెప్పగలవ్?”

“వాడికదే పని! ఎక్కడ యంత్రాలు కట్టినా వేటగాడు పిట్టల్నికొట్టినట్లు కొట్టుకొచ్చి


ఇంట్లో పడేస్తాడు!”
“వసూ! నిజంగా నీవు నన్ను చాల భయపెడుతున్నావే!”
“అందుకే ముందుగా ఒక చిలకనో కాకినో పెంచుకో రాయబారం నెరపడానికి!”
“అవసరం వచ్చినపుడు చూద్దాంకాని నేనిప్పుడు నాదమునిగారి వద్ద సంగీతం నేర్చు
కుంటున్నాను తెలుసా!”
“ఆయన చెప్పనన్నాడుగా! ఇంతలో మనసెలా మారిందీ?”
“నేనానాడు మలయవనంలో ఒంటరిగా కూర్చున్నానా! ఆయన తోడిరాగం పాడడం
ఆపేశారు. అప్పుడు నేను యమునా కళ్యాణి రాగం ఆలాపన చేసి ఒక పదానికి నెరవు చేశాను.
అది ఆయన చెవిన పడింది. ఎవరాఅది అని విచారించి కోటలోకి వచ్చారు.”

“మరింకేం ఆయన మెచ్చేటట్లు పాడగలిగావంటే నీకు సంగీతం వచ్చేసినట్టేకదా!”

“అమ్మో సంగీతం అంటే అదొక అంభోనిధి! సప్తస్వర తరంగాల కల్లోలిని! ఆయన


నాకు మొదటిదినం పాఠం సురటి రాగంతో ఆరంభించారే! తరువాత వసంతరాగం చెప్పారు.
వసంతరాగం గాలి ఒక వైపు వీస్తూనే దిశమార్చి ఎడా పెడా వాయిస్తుందే అలా వుంటుంది.
కానీ ఈ వసంతరాగం పైకి మధురంగా వున్నా విరహిణులను చాలా ఏడిపిస్తుంది.
వసంతరాగం చిలిపి చిలిపిగా గుబులుగుబులుగా ఎదలో ఎక్కడో చేరి గిలిగింతలు పెడు
తుంది. వసంతుడు కమ్మవిలుకాడికి తోడై కొమ్మపైని కోకిలమ్మను వెంటపెట్టుకుని మోడులైన
కోమ్మలకు సహితం కామపు చిగురులు తొడిగిస్తాడు. చందమామా, వెన్నెల పులుగులు,
పూచిన కొమ్మలు కొమ్మలకు విరోధులే!”
“అవునే శిరీ! మీ అన్నగారు మళ్ళీ నీ అంతఃపురానికి వచ్చారా?”
“మా నాయనగారు అన్నయ్యను ఘూర్జరీ దేశం పంపించారు.”
“ఎందుకూ?”
149
  చాళుక్యసింహాసనం

“అక్కడ రాజప్రతినిధిని చేస్తారట! అదీకాక ప్రక్కనేవున్న కఛ్ఛదేశంలో కల్లోలంగా


ఉంది. అక్కడి సాగరాంతం వరకూ పరిపాలించమని పంపారు.”
“అంటే ఇప్పుడపుడే రారా?”
“ఏమే అలా అడిగావు? మొన్ననే కదా వెళ్ళింది! దండయాత్ర అంటే సంవత్సరమైనా
చాలదు.”

వసుమిత్ర తన కనుకొలకులలోని చారికను శిరీషకు కనిపించనీయలేదు. కనులు


నులుపుకుంటూ “ఒక సారి ముఖం కళ్లూ కడుక్కుని వస్తానే” అన్నది. చెలికత్తె షడ్పది ఆమెకు
కేళాకూళి వరకూ దోవ చూపించింది.

వసుమిత్ర స్నానశాలలోకి వెళ్ళి కవాటం మూసి కొంచం సేపు ఏడ్చింది. వెక్కిళ్ళు


బయటకు వినిపించకుండా తన నోరు తానే నొక్కుకుంది. చల్లని నీళ్ళతో ముఖం పలు మార్లు
కడుక్కుంది. తన విషయం శిరీషకు చెప్పాలా మానాలా?.కర్కవల్లభ రాకుమారుడు
ఘూర్జరదేశం వెళ్ళిపోయాడు. తన హృదయాన్ని దోచుకుని వేదనని నింపి విరహాన్ని మిగిల్చి
వెళ్ళిపోయాడు. అతడు తనను గుర్తుపెట్టుకుంటాడా? అక్కడ ఘూర్జరదేశంలో ఎందరో
అందగత్తెలుంటారు. పాలరాతి బొమ్మల్లా చెక్కిన సాలభంజికల్లా ఉంటారు. తను ఎక్కడ
గుర్తుంటుందీ?

ఏమిచేయడం రాజకుమారికి చెప్పడమా మానడమా? తటపటాయిస్తూ వసుమిత్ర


ఇవతలకు వచ్చింది. అలంకారికలు వసుమిత్రను అంగరాగాలతో అలంకరించారు. జడవిప్పి
మళ్ళీ అల్లారు.

రాజకుమారి వసుమిత్ర కలిసి ఫలహారాలు సేవిస్తుండగా తోటలోనుండి కోటలోకి


సంపెంగలు మల్లెమొగ్గలు వచ్చాయి. సంపెంగల పరిమళం అద్భుతంగా వుంటుంది కానీ
కొందరికి పడదు. వసుమిత్ర “శిరీ నాకు సంపెంగలు పడవే! శిరోవేదన కలిగిస్తుంది.
పంపించి వేయవా?” అన్నది. సంపెంగలు వేరే అంతః పురానికి పంపించింది శిరీష.

25 బేలనురా దేవా
భీమసలుఖి మహారాజు వేంగీనగరంలో తనదంటూ ఒక గూఢచార సంస్ధను ఏర్పాటు
చేసుకున్నాడు. ఆ విషయం లీశోత్తరదీక్షితునికి మాత్రమే తెలుసు. తనమనుషుల ద్వారా
వేంగిలో పావులు కదుపుతున్నాడు. వేంగి మహామాత్యుడు గంగాతీర్ధుడు తనమనిషి. కానీ
అతడి చుట్టూవున్న రాజభక్తుల వలన అతడేమీ సహాయం చేయలేకపోతున్నాడు. అందుకే
కూష్మాండయోగిని గండువర్మని తన ప్రధాన వేగుగా నియమించుకున్నాడు.

కూష్మాండయోగి చేసేవి మాయలేయైనా మనిషి సుందరుడు. అతడికి పురుష

150
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

సౌందర్యం పుటకతోనే వచ్చింది. అతడు సంపెంగ తైలంతో కురులు ముడుచుకునేవాడు.


గడ్డం రాచుకోకుండా రోజుకు రెండుసార్లు గీయించుకునేవాడు. కాషాయ వస్త్రాలు కట్టినా
అవి మెత్తగా చినీదేశపు పట్టుపుట్టాలు. అసమర్ధులైన భర్తలపై అలిగిన వనితలను చేరదీసి
అలరించడంలో అతడు బహుసమర్ధుడు. అందుకే స్త్రీ భక్తులు సింగారించుకుని మళ్ళీమళ్ళీ
వచ్చేవారు.

చాకచక్యంగా చీమయ్య కూష్మాండయోగి వద్ద నమ్మకమైన శిష్యుడయ్యాడు. సపర్యలు


చేసేవాడు, యువరాజుకు వేగు పంపిస్తుండేవాడు. కూష్మాండయోగికి జనాన్ని మోసగించ
డానికి కొత్తకొత్త ఉపాయాలు నేర్పేవాడు. బూడిదను మెత్తగా వస్త్రఘాళితం చేసి కొంచం
పులిమజ్జిగ కలిపి చిన్నచిన్న ఉండలు చేసి ఆరపెట్టేవాడు.ఆ వుండలను ఉప్పు శనగలలో
కలిపి పళ్ళెంలో పోసి కూష్మాండయోగి చెంతన ఉంచేవాడు. యోగి శనగలు తింటున్నట్లే
భస్మం ఉండను బొటనవ్రేలుకూ చూపుడు వేలుకూ మధ్య ఇరికించుకునేవాడు.
కూష్మాండయోగి భక్తుడి చేతులో చేయివుంచి ఉండ నలపడం వలన భక్తుడి అరచేతులోకి
విభూతి చేరేది. బంగారు ఆభరణాలను ప్రసాదించడంలో కూష్మాండయోగికి చీమయ్య
సహాయ పడేవాడు.

కూష్మాండయోగి ఒక గురువునాశ్రయించి ఒక పిశాచాన్ని వశం చేసుకున్నాడు. ఆ కర్ణ


పిశాచం యోగి ప్రశ్నలుచెప్పడంలో ఉపయోగపడేది. స్త్రీలను ఆవహించి పూనకం తెప్పించేది.

గండువర్మ కూష్మాండయోగితో రహస్యంగా సమావేశమయ్యాడు. కూష్మాండయోగిని


ఎల్లప్పుడూ స్త్రీ భక్తులు ముసురుకుని ఉండేవాళ్ళు. ప్రేమతో ఆయనపాదాలు తమ ఒడిలో
ఉంచుకుని పిసికేవాళ్ళు. యోగితో ఏకాంత సమావేశం దొరకడం పురుషులకు చాల కష్టం.

“యోగీ! నీవేమీ చురుకుదనం చూపించటంలేదు. హాయిగా కాంతల కౌగిళ్ళలో గడుపు


తున్నావు. అక్కడ నన్ను భీమసలుఖి మహారాజు తిట్టిపోస్తున్నాడు. చాతకాని వాళ్ళ
మంటున్నాడు” అన్నాడు గండువర్మ.

“ఆయనకేం అలానే అంటాడు! డబ్బు గుమ్మరించంగానే అన్నిపనులూఅయిపోతాయా?


అవతలివాడి జాతకం కాస్త బలహీనపడితే గానీ మన ఎత్తులు పారవు” అన్నాడు యోగి
తాపీగా.

“ఎలాగైనా నరేంద్రమృగరాజును లేదా యువరాజు విష్ణువర్ధనుని హత్య చేయించ


మంటాడు భీమసలుఖి.”

“వేంగిలో రాజోద్యోగుల దగ్గరినుండీ పౌరుల వరకూ అందరూ రాజభక్తులు. అంత


పెద్ద మహామాత్యుడే ఏమీ చేయలేక చేతులు చచ్చి కూర్చున్నాడు. దేనికైనా కాలం కలిసి
రావాలి. పుట్టలోవున్న పామును కొట్టడం కష్టం. బయట తిరుగుతున్నపుడే కొట్టాలి.”

151
  చాళుక్యసింహాసనం

“మహారాజుకు వేటకు వెళ్ళే అలవాటు లేదు. జూదమాడే అలవాటు లేదు. నదులలో


ఈతకొట్టే అలవాటు లేదు. ఇంకా మనకు బయట ఎక్కడ దొరుకుతాడూ?”
“ఇప్పుడు నరేంద్రమృగరాజు జాతకంలో వ్యసనార్తుడు అని వుంది.”
“అంటే?”
“వ్యలీకంనందు ఆసక్తికలవాడు. స్త్రీ వ్యసనం వలన ఆపద పొందేవాడు.”

“యోగీ, ఎవత్తెనేనా విషకన్యను తయారు చేశావా?”

“విషకన్యలుంటారనేది ఒక బూటకం! చిన్నప్పటినుంచీ నాభి తినిపిస్తే విషకన్య


అవుతుందనుకుంటారు. ముందర రోగం వచ్చి ఇది ఛస్తుంది.అసలు ఎంత రాజాధిరాజును
కానీ సులభంగా హత్యచేయాలంటే ఎవరిని పట్టుకోవాలో తెలుసా?”అన్నాడు యోగి.

“ఇంకెవరూ?ఆడది! మగువల వలపులో పడనివాడుండడు.”అన్నాడు గండువర్మ.

“నీవు చెప్పింది అర్ధసత్యమే. మగాళ్ళలో చాలామందికి ఆశ ఉంటుందికానీ ఆడదాన్ని


తాకాలంటే చచ్చేటంత భయంకూడా ఉంటుంది.సులభంగా హత్య చేయగలవాడు క్షురకుడు.
ఎంతటి మహారాజునైనా గడ్డం గీసేడపుడు ఇట్టా అన్నాడంటేచాలు పీక తెగిపోతుంది.”

“నీవన్నది నిజమే కానీ యోగీ, మంగలివాళ్ళెపుడూ తమ వృత్తిధర్మాన్నిఅతిక్రమించరు.


లేకపోతే ఈపాటికి చాలామంది పీకలు తెగేవే!”

“గండువర్మా!ఒక మహారాజును హత్యచేయడం అంత చిన్నపనా?ఎంతమంది


పరివారం ఉంటారూ! నేను కొండపడమటి దేశస్తులతో ఒక హంతకదళం ఏర్పాటు చేశాను.
వీళ్ళు హత్యలు చేయడంలో కడు నేర్పరులు. అడిగినంత ధనం ఇస్తేచాలు ఎవరినేనా
అంతమొం దిస్తారు. మనం కాస్త ఓపిక పట్టాలి. మహారాజు మనకు అసహాయుడుగా
దొరకాలికదా!” అన్నాడు కూష్మాండయోగి.

“ఏమో ఏంచేస్తావో యోగీ! భీమసలుఖి మహారాజు మాత్రం మనని చవటలుగా


చూస్తున్నాడు.”

“గండువర్మా! నీవు ఆవేశపడకు. ఆయుష్షు కలవాడిని ఎవడూ చంపలేడు. ఎవడికేనా


మూడేరోజులు రావాలి. అప్పుడు పోతే కిందికి పోతాడు లేదా పైకే పోతాడు!” అన్నాడు యోగి.

రాజధానిలో నరేంద్రమృగరాజు ఆస్ధాన జ్యోతిష్యులు మహారాజు జాతకాన్ని గమనిస్తూ


గ్రహబలం అనుకూలంగా లేదని హెచ్చరించారు. శివదీక్షద్వారా కొంత ఉపశాంతి పొంద
వచ్చనీ చెప్పారు. ఇంతలో కార్తీకమాసం వచ్చింది. నరేంద్రమృగరాజు శివదీక్షలో గడపడా

152
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

నికి బిరుదాంకపురం విచ్చేశాడు. రాజధానిలో యువరాజే పరిపాలన సాగిస్తున్నాడు.


మహారాజు బిరుదాంకపురంలో విజయేశ్వరాలయంలోను గోలింగేశ్వరాలయంలోను ప్రతి
నిత్యం దీక్షగా శివార్చన చేయసాగాడు. రోజూ నక్తాలు. ఒంటిపూట భోజనం. అదీ రాత్రి
అర్చన మంత్రపుష్పం అయినతరువాతే!

కొండపడమటి హంతకుల దళం బిరుదాంకపురం చేరింది. మహారాజు దినచర్యను


గమనిస్తోంది. శివభక్తులలాగా ప్రతి రోజూ దేవాలయానికి వస్తూ పోతూవున్నారు. ఎప్పుడు
దాడిచేయాలా అని ఆలోచిస్తూ కొన్నాళ్ళు గడిపారు.

కూష్మాండయోగి కూడా బిరుదాంకపురంలో తన శిబిరం పెట్టాడు.

పూర్నిమ తరువాత కృష్ణపక్షంలో చంద్రుడు రాత్రి ఆలస్యంగా ఉదయిస్తాడు. బహుళ


నవమికైతే చంద్రోదయం ఆలస్యంగా జరుగుతుంది. అప్పటికి మహారాజు ఉపవాసాలతో
కృశించి వుంటాడు. అంగరక్షకులు కూడా తీర్ధప్రసాదాల భక్తిలోపడి కర్తవ్యంలో అలసులై
ఉంటారు. అందుకని బహుళ నవమికి హత్యాయత్నానికి ముహూర్తం పెట్టారు.

విష్ణువర్ధన రాజకుమారుడికి చీమయ్య నుండి వేగు వచ్చింది. మహారాజుకు ఏదో


ప్రమాదం జరగబోతోందని.

యువరాజ విష్ణువర్ధనుడు పట్టవర్ధనీదేవితో సమాలోచన చేశాడు. పట్టవర్ధనీదేవి అంతః


పురాల రక్షణ చూస్తుంటుంది. బిరుదాంకపురంలో మహారాజు వెంబడి ఎక్కువ పరివారం
లేదు. శత్రువులు ఏమి పన్నాగం పన్నారో తెలియదు. ఆమె ఆలోచన ప్రకారం వెంటనే
కోనహైహయరాజును రణమర్దనుని హుటాహుటిన మహారాజుకు అండగా బిరుదాంకపురం
పంపించాడు.

బహుళ నవమి నాటి ప్రదోషవేళ శివాలయంలో మహాలింగార్చన ఆరంభించారు.


పూర్తయ్యేటప్పటికి పొద్దుపోయింది. తీర్ధప్రసాద వినియోగము అయిన తరవాత మహారాజు
భోజనం చేయడానికి తన విడిదికి వెళుతున్న సమయమది. శివ దీక్షలో వున్న మహారాజు
వాహనాలనధిరోహించడం మానివేశాడు. పాదచారియై బయలు దేరాడు.

మహారాజు ప్రక్కనే కతిశర్మ నడుస్తున్నాడు. ఛత్రచామరాది లాంఛనాలవాళ్ళు దివిటీలు


పట్టి కొందరు ముందూ వెనక నడుస్తున్నారు. మహారాజు నిరాయుధుడై యున్నాడు.

ఖడ్గపాణులైన ముష్కరులు పన్నెండు మంది దాకా ఉన్నారు. దివిటీలు తప్పుతే వీధి


చీకటిగా వుంది. దోవ మలుపు తిరుగుతుండగా ఒక్క సారిగా హంతకులు దాడిచేశారు.
మహారాజుపైన పడ్డారు. అనూహ్యమైన మెరుపు దాడిఅది.

ఇరువైపులనుండీ ఇద్దరు ఖడ్గపాణులు పెద్దగా బొబ్బ పెడుతూ ఖడ్గాలు పైకెత్తి మహా


153
  చాళుక్యసింహాసనం

రాజుపై దూకారు. ఈశ్వరేశ్ఛ ఎలావుందోఏమో, మహారాజు అదేక్షణంలో నేలపైనపడ్డాడు.


కతిశర్మ ప్రక్కకు తప్పుకున్నాడు. పైబడిన హంతకులు ఒకరి ఖడ్గం ఒకరికి తగిలి భుజములు
తెగి క్రిందపడ్డారు. అంగరక్షకులు తేరుకుని వెనక్కు తిరిగి దుండగుల నెదిరించారు.

వెంటవున్న అశనపురం కతిశర్మ మహారాజు చేయిపట్టుకుని ప్రక్క సందులోకి లాక్కు


వెళ్ళాడు. కతిశర్మకు దేవాలయం చుట్టూవున్న ఇళ్ళన్నీ బాగా పరిచయం. ఆ చుట్టుపట్ల ఇళ్లన్నీ
చాలా పెద్ద స్ధలాలు. మండువా లోగిళ్ళ చుట్టూ పశువుల శాలలు గడ్డివాములు వున్నవారే.
కతిశర్మ మహారాజును ఎన్నో ఇళ్ళూ వీధులూ దాటించి ఒక వేశ్య ఇంట్లోకి తోసి తానూ
తప్పుకుపోయాడు.

హత్యాయత్నం చేసిన అగంతకులకూ అంగరక్షక దళానికీ మధ్య సంగ్రామమే


జరిగింది. అంగరక్షకదళం పోరాడి మరణించింది. అగంతకులు కూడా కొందరు
మరణించగా కొందరు తప్పించుకున్నారు. కానీ వారికి మహారాజు దొరకలేదు. దండగులలో
కత్తిపట్టిన వారెంత మంది వున్నారో మారువేషాలలో అజ్ఞాతంగా అంతమంది వున్నారు.
వాళ్ళు మహారాజును కతిశర్మ లాక్కువెళ్ళడం గమనించారు. ఒక కుంటివాడు వెంబడించాడు.

ఊరు ఊరంతా గగ్గోలయిపోయింది. ఊరి ప్రజలెవరూ అలా కత్తులతో నరుక్కోవడం


చూసిన వారు కాదు. హడిలిపోయారు. ఆరాత్రి తెల్లవారేవరకూ ఎవరూ నిద్రపోలేదు.

మారువేషాలలో వున్న అజ్ఞాతులు వెతికివెతికి కతిశర్మను పట్టుకున్నారు. నోట్లో


గుడ్డలుకుక్కి ముసుగు తొడిగి ఎత్తుకుపోయారు. ఊరిబయట ఒక పోకతోటలో ఉన్న
గుడిశలో కతిశర్మను బంధించారు. మహారాజును ఎక్కడ దాచిందీ చెప్పమని నిర్భందించారు.

ప్రభువుపై దాడి జరిగిన సంగతి రాజధానికి వార్తవెళ్ళింది. ఆవార్త జేరకముందే


బిరుదాంక పురానికి రణమర్దనుడు కోనహైహయరాజు చేరుకున్నారు. తాము ఆలస్యంగా
వచ్చినందుకు విచారించారు. ప్రభువు ఎక్కడవున్నదీ తెలియరాలేదు. ఇంకోవంక కతిశర్మ
అనే విప్రుడు మహారాజును ప్రక్కకు లాక్కువెళ్ళడం చూశామని కొందరు చెప్పారు. కతిశర్మ
కూడా కనిపించటంలేదని తెలిసింది.

రాజభటులు మహారాజుకోసం అన్వేషిస్తుంటే హంతకులు కూడా అదేపనిలో ఉన్నారు.

వాడవాడలా దండోరా వినిపిస్తోంది ప్రభువు కానీ కతిశర్మకానీ ఎక్కడవున్నదీ ఆచూకీ


చెప్పినవారికి అమిత బహుమానం. రాజోద్యోగం. తెలిసీ చెప్పనివారికి మరణదండన.

అది అధరసుందరి నివాసం. మహారాజును ఆ ఇంట్లోకి తోసి కతిశర్మ తప్పుకున్నాడు.


లోపలకు వెళ్ళిన నరేంద్రమృగరాజు స్పృహతప్పి పడిపోయాడు. అధరసుందరి ఒక వేశ్య. తన
ఆవరణలోకి వచ్చి పడిపోయిన అతడెవరో తెలియదు. విటుడో అతిధో అని భావించి దాసీల

154
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

సహాయంతో అతడిని తీసుకువెళ్ళి పల్యంకం పైన పడుకోపెట్టింది. అతడిలో చలనం లేడు.


ఊపిరి ఉంది. నాడి ఆడుతోంది. ఛాతిపైన చెవి ఆనిస్తే గుండె కొట్టుకుంటోంది. వంటిపై
నగలు ఆభరణాలు పెద్దగా లేవు. నుదుటన చేరిగిన విభూతి రేఖలు శ్వేదజలంతో తడిసి
ముక్కుమీదకు కారిన కుంకుమ రేఖలు ఉన్నాయి. యజ్ఞోపవీతం ధరించివుండడం వలన
ద్విజుడని గ్రహించింది. మేని చాయ ముఖవర్చస్సు గొప్పగా వున్నాయి. తనకోసం పరి
తపించి వచ్చిన విటుడనే అనుకుంది.

అధరసుందరి అతడు తిండిలేక త్రాణలేక సోలిపోయాడని మాత్రం గ్రహించింది.


ద్రాక్షరసం కొద్దికొద్దిగా పడదామని ప్రయత్నించినా గుటక వేయటం లేదు. ఇలాకాదని
వృద్ధదాది ఒకతె బలవర్ధకమైన వంటకాలను మెత్తగా రుబ్బి ఆపాద మస్తకం మర్దనా
చేయసాగింది. మహారాజుకు స్పృహరాలేదు కానీ ముఖము శరీరము వాడకుండా తేటతేరింది.

వేశ్యాగృహంలోకి వచ్చినవాడు రసికుడై వుంటాడనిఅధరసుందరి తన పెదవులతో


అతడి అధరాలను ముద్దాడింది.కౌగిలిలో పొదువుకుంది.మెళుకువ రాలేదు. తాను వివశ
అయిందేకానీ ప్రయత్నం ఫలించలేదు. అతడు పండితుడేమోనని చెవి వద్ద పెద్దగా శాస్త్రాలు
పురాణాలు పారాయణం చేసింది. ఐనా లాభం లేకపోయింది.

విసిగిపోయిన అధరసుందరి పాటపాడుతూ నాట్యం చేయసాగింది. నట్టువాంగం


సహకరించింది. ముందుగా జావళీ అభినయించింది.
బేలనురా దేవా వేశ్య బాలనురా దేవా
కనుతెరిచి క్రీగంట నను కాంచవదేల
బేలను రా దేవ వేశ్య బాలనురా దేవా
కనుతెరిచి క్రీగంట నను కాంచవదేల
యోగివో తెలియను నిత్య భోగివొ తెలియను
సురుడవో భూసురుడవో రతిరాజ శేఖరుడివో
ఉలుకవు పలకవు పెదవైన కదపవు
అతిధి సేవలు నేను మానగలేనాయె
సొంపైన తనుమధ్య కౌగలించెడివేళ
ఉలుకవు పలుకవు కనుతెరిచి సొగసు కాంచవదేల
బేలను రా దేవా వేశ్య బాలనురా దేవా
రోజులు గడిచిపోతున్నాయి. మహారాజు శరీరం మాత్రం వసివాడలేదు.

మహారాజు కనపడటం లేదనే వార్త రాజధాని దాకా వెళ్ళింది. ప్రజలందరూ కలవర


పడు తున్నారు. మహారాజుకు సప్తభార్యలు. ఆకాలంలో బహుభార్యత్వం సాధారణం.
పట్టమహిషి శ్రద్ధాదేవి పరమ సాధ్వి. పతివ్రత. నిత్యమూ సీతారాములను అర్చించేది. వాల్మీకి
రామాయణ శ్లోకాలు గానం చేసేది. మహర్షే రామాయణ శ్లోకలన్నీ గానానికి అనుకూలంగా
వ్రాశాడు. తాను పతివ్రతే అయితే మహారాజు క్షేమంగా తిరిగివస్తాడని సహపత్నులకు ధైర్యం
155
  చాళుక్యసింహాసనం

చెప్పేది. తాను మాత్రం చాటుగా శోకించేది. భర్త సందర్శనాసక్తితో కృశించిపోసాగింది.

సూర్యబింబోదయానికి ముందు ఉషాసుందరి ఆకాశాన్ని ఊడ్చి ముగ్గువేసినట్లు


వెలుగు రేఖలు చిమ్ముతాయి. అదే సమయంలో మహారాణి మందిరంలో రవికులా న్వయుడి
మందిరం నుంచీ మేలుకొలుపులు వినిపించేవి. ఆమె ఆర్ద్రతతో బౌళిరాగంలో శ్రావ్యంగా
గానంచేసేది.
మేలుకో శ్రీరామ మేలుకోవయ్యా
మేలుకొని భక్తులను ఏలుకోవయ్యా
మేలుకో శ్రీరామ.....
తొలిదిక్కు తొయ్యలి మలికాన్పు బిడ్డగా
పసిడికందువలాఁటి భానుడిని కనియె
ప్రొద్దెక్కి లేతువా ఇనకులా తిలకా
మేలుకో శ్రీరామ మేలుకోవయ్యా
మేలుకొని భక్తులను ఏలుకోవయ్యా
ముద్దాడి కౌసల్య తట్టిలేపంగ
బాలుడవ నీవిపుడు ప్రౌఢ శ్రీరామ
ఉప్పోంగి కౌశికుడు ప్రస్తుతించీ పాడ
కాదిది కారడవి కళ్యాణ రామా
కలలోన రావణుని క్రీనీడ గాంచి
భీతిల్లి భూజాని బిగికౌగలించెనా
ధీరమాజానకి బేలకానేకాదు
సుదతి మేని కాంతి ధీధితులు చెలగ
సిగ్గుపడి హుతవహుడు చల్లబడెనయ్యా.
మేలుకో శ్రీరామ మేలుకోవయ్యా
మేలుకొని నీ భక్తులను ఏలుకోవయ్యా

వారంరోజులు గడిచిపోయింది. బిరుదాంకపురంలోను చుట్టుప్రక్కల గ్రామాల లోను


రాజ భటులు ఇల్లిల్లూ గాలించసాగారు. చెట్లు పుట్టలూ గడ్డివాములు పాడుపడిన బావులు
గాలించ సాగారు. చివరకు అధరసుందరి గృహంలో మహారాజు దొరికాడు. కానీ స్పృహలో
లేడు. మహారాజును విడిదికి చేర్చారు. రాజభటులు మహారాజును దాచివుంచి నందుకు
అధరసుందరికి కడియాలు తొడిగి చెరసాలలోకి తోశారు. ఆమె రోదన ఆ మూర్ఘులు
వినలేదు.

చుట్టుప్రక్కల ఊళ్ళలో ఘనవైద్యులందరూ బిరుదాంకపురం పరుగెత్తుకుని వచ్చారు.


వైద్యం చేయడానికి ప్రయత్నించారు. కానీ స్పృహరాలేదు. ఒక్కరోజులోనే మహారాజు ముఖం
పోషణ లేక వాడిపోయింది. వైద్యులుపెదవి విరిచారు. ఏమిచేయడానికీ తోచలేదు. వారికి
మహారాజును అధరసుందరి ఎనిమిది రోజులు ఎలా పోషించిందో అర్ధం కాలేదు. బుద్ధివచ్చిన
156
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

పరివారం మళ్ళీ మహారాజును అధరసుందరికే అప్పగించారు. అధరసుందరి ఇంటిచుట్టూ


కాపుగా సైన్యం మోహరించింది.

ఎప్పటిలాగే వృద్ధదాది నరేంద్రమృగరాజు గాత్రానికి ఆహారమర్దనం చేయసాగింది.


మహా రాజు ముఖం తేటదేరింది. అధరసుందరి చింతతో మహారాజు మంచంకోడుకు తల
ఆనించి కూర్చునేది. ఒకనాడు అధరసుందరి మహారాజు ముఖం పైకి వంగిచూస్తూ
‘యోగివను కొంటిని పరమ భోగి వనుకుంటిని! విసిగి నిను నా కౌగిలిలో బంధించినందుకు
నను బందీని చేస్తావా రాజా? అతిధివనుకుని సేవించినందుకు అరదండాలు తగిలిస్తావా
రాజా? ఇది న్యాయమా ధర్మమా శాస్త్ర సమ్మతమా? ఉలకవు పలకవు కలకంఠి కన్నీరు
కొనగోట మీటవు!’ అన్నది.

అధరసుందరి ఏడుస్తుంటే వెచ్చవెచ్చని కన్నీరు మహారాజు ముఖంపై పడింది. ఆమె


రోదనకు మహారాజు ఏలోకంలో వున్నాడో చెలించాడు. మెల్లగా కనురెప్పలు తెరిచాడు. కొద్ది
సేపటిలోనే చైతన్యవంతం అయ్యాడు. లేచికూర్చున్నాడు. అధరసుందరి అశ్రు నయనాలతో
చేతులు ముకుళించి నమస్కరించింది.

ఛప్పున మహారాజు ఆమె పాణిగ్రహణం చేశాడు.

అధరసుందరి ఆయనకు పాయసం త్రాగించింది. మహారాజు కోలుకునేవరకూ అధర


సుందరి వద్దనే వుంచడానికి నిశ్ఛయించాడు కోనహైహయరాజు. మహారాజు దొరికాడనే
వార్త తెలియగానే దుండగులు కతిశర్మను విడుదల చేసి పారిపోయారు.

మహారాజు కోలుకునేటప్పటికీ కార్తీకమాసం వెళ్ళిపోయింది. అయినా


నరేంద్రమృగరాజు పట్టు వీడలేదు. కొరబడిన ఆరు రోజులూ అభిషేకార్చనలు యధావిధిగా
కొనసాగించాడు.

ఒకనాడు మహారాజు ఆలయంలో అభిషేక అర్చనలు ముగియకానే వెళ్ళి మారేడు చెట్టు


క్రింద ఒంటరిగా కూర్చున్నాడు. ఎవరూ సాహసించి దగ్గరకు పోవడానికి లేదు. చాలాసేపు
గడిచిపోయింది.

చివరకు కతిశర్మ సాహసించి ప్రభువు వద్దకు వెళ్ళి కూర్చున్నాడు.

“ప్రభూ!తమరేదో చింతాక్రాంతులై యున్నారనిపిస్తోంది. కారణం అడిగే సాహసం


నాకు లేదు” అన్నాడు.

“ఆచార్యా! చిన్నవాడివైనా చాలా యుక్తిగా ప్రవర్తించి నా ప్రాణం కాపాడావు. నా


విచారానికి కారణం ఏమని చెబుదునూ. అన్ని వ్యాధులకన్నా బలమైంది మనోవ్యాధి. దానికి
ముఖ్యకారణం మా రాజ్యం ఎడతెరిపిలేని యుద్ధాలతో అతలాకుతలమై పోతోంది.
157
  చాళుక్యసింహాసనం

ధనాగారాలు వట్టిపోతున్నాయి. పన్నుల భారంతో ప్రజలు నలిగిపోతున్నారు. యుద్ధాల వలన


పురుషజాతి అంతరించిపోతోంది. వథువులకు వరులు దొరకటంలేదు.” అన్నాడు
మహారాజు.

“మహారాజా! ప్రజలు ఛాత్రభట ప్రవేశదండము రాజసేవకుల వసతిపై పన్ను భరించ


లేకుండా వున్నారు.”
“మరేంచేయమంటారూ? మా అన్నదమ్ముల దాయాది పోరు అణగటంలేదు.”
“మహారాజా! అంతః శత్రువులుండగా విజయం ఎలా స్ధిరపడుతుందీ?” ప్రశ్నించాడు
కతిశర్మ.

“నిజమే! ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. కానీ ఇక్కడ దేవాలయంలో


ప్రతినిత్యం ప్రవచనాలు వింటుంటే చింతన మరీ ఎక్కువవుతోంది. పోయేటప్పుడు ఏమి
మూట కట్టుకుని పోతామూ? ఇంతకు ముందు ఈ ధరణిని ఎందరో మహారాజులు
పరిపాలించారు. వారేమి పట్టుకు పోయారూ? అలగ్జాండర్ అంతటి మహా యోధుడు
దండయాత్రలు చేసి చివరికి ఏమీ పట్టుకు పోలేదు.”

“మహారాజా ధరణిని పరిపాలించడం క్షత్రియులకు స్వధర్మం. ఇంతకుముందు


రాముడు, రఘువు, జనకుడు ధర్మరాజు లాంటి మహానుభావులు పరిపాలించలేదా!
స్వధర్మాన్ని విడిచిపెట్టమని ఏ ధర్మశాస్త్రం చెప్పలేదు! కాకపోతే ప్రభువు రాజభోగాలకు
పరిమితం కాకుండా జనకమహారాజులాగా తామరాకు మీద నీటిబొట్టు లాగా వుండాలి!”

“ఆధ్యాత్మిక ఉపన్యాసాలు విన్నతరువాత ఈ యుద్ధాలు రక్తపు కూడు ఎందుకని


పిస్తోంది. ‘న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖానిచ’ అన్న అర్జనుని మాటే ఉత్తమం
అనిపిస్తోంది! రాజ్యాన్ని మా అన్నగారు భీమసలుఖి మహారాజుకు అప్పగిస్తే ఈ యుద్ధా
లుండవుకదా?” అన్నాడు మహారాజు.

“ప్రజలు సుఖపడాలంటే ప్రభువు సమర్ధుడు కావాలి. భీమసలుఖి మహారాజు ధర్మ


భ్రష్టుడు. ఆయన చేతికి రాజ్యం రావడం ప్రజలకు శ్రేయస్సు కాదు. మీకు ఆధ్భుతమైన
యువరాజున్నాడు. ఆతడు మాన్యకేత నగరంలో చేసిన వీరవిహారాన్ని ప్రజలు కథలుగా
చెప్పుకుంటున్నారు. గానం చేస్తున్నారు. నాటకాలు ప్రదర్శిస్తున్నారు. ఇది మంచితరుణం.
యువతీ యువకులందరికీ యువరాజే ఆదర్శం! ఎంతో మంది యువకులు యుద్ధంలో
చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు.”

“మీమాట నిజమే! అందుకే యువరాజుకు పట్టం కట్టి వానప్రస్ధానికి వెళ్ళిపోదామా


అను కుంటున్నాము.”

158
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ప్రభువులకు వానప్రస్ధం తగినదే. కానీ ఇది సమయం కాదు. రాజ్యాన్ని నిష్కంటకం


చేసిన తరువాత ఆలోచించాలి.”
“అందుకు ఏంచేయాలంటారు?”
“అంతః శత్రువులను ఏరిపారేయాలి.”
మహారాజు దీర్ఘాలోచనలో పడ్డాడు.

26 ఋషులు
రాష్ట్ర్రకూటరాజకుమారి శిరీష నిర్వేదంతో సౌధోపరిభాగం పైన కూర్చుంది. విలువిద్య
త్యాగం చేసినప్పటినపంచి మనసు దేనిమీదాలగ్నం కావటంలేదు. ఏదో కోల్పోయున భావన.

కోటలో మరమతులు జరుగుతున్నాయి. అంతఃపురాలకు మణిమయాలంకారాలు


దిద్ధి గోడలకు రత్నాలు తాపడం చేస్తున్నారు. ఈ పనికి రెండుమూడు మాసాలు పడుతుమది.
ఈ కాలంలో తీర్ధవిహారాలు చూసివద్దామన్నారు సఖియలు. వసుమిత్రను కూడ ఆహ్వానిస్తే
తనకు వంట్లోబాగుండలేదని ప్రయాణం చేయలేననీ చెప్పింది.

“హళా! రాజకుమారీ! మన ప్రయాణానుకి ప్రభువుల అనుమతి లభించిందా?”


ప్రశ్నించింది చెలికత్తె అరణి.

అందుకు శిరీష “న్నాన్నగారు అనుమతించలేదు. దక్షారామం చాళుక్యరాజ్యంలోనిది.


మన రెండుదేశామధ్యా వైరము దూరము చాలావుందన్నారు. కావాలంటే ఈలపురంవెళ్ళి
కైలాసనాథాలయం నిర్మాణం చూసిరమ్మన్నారు. నాకైతే ఈ మాన్యకేతంలో అంతిపురం ఒక
రాతిపంజరం అనిపిస్తోంది”అన్నది.

“రాకుమారీ! మనం ఈలపురం నుంచి అటు వేంగి వెళదామూ?” అన్నది సమంత


విష్ణువర్ధనుని గుర్తుచేస్తూ.

“నీకు బొత్తిగా భౌగోళిక జ్ఞానం లేదే. ఈలపురం మనకు ఉత్తరవాయువ్యంగా వుంది.


వేంగియేమో తూర్పుగా వుంది.” అన్నది అరణి.

“నా మనసులో వేంగిరాకుమారుడు మెదులుతున్నాడుకాని అతడెక్కడో, మనమెక్కడో!


అతడిపై ఆశలు పెంచుకోకూడదనుకుంటున్నాను.” అన్నది శిరీష

చివరకు రాజకుమారి శిరీష తన ఎనమండుగురు చెలికత్తెలతోకలిసి ఈలపురం


విహారయాత్ర వెడలింది.

159
  చాళుక్యసింహాసనం

సహ్యాద్రి పర్వతపంక్తులలో చరణాద్రి పర్వతాలు కొన్ని. ఈ పర్వతాలలో ఎలగంగా నది


జలపాతానికి ఇరువంకలా కొండలో గుహలు తొలచబడుతున్నాయి.

ఈలపురంలో మొదటగా ఆంధ్ర శాతవాహన ప్రభువులు బోధిసత్వుని ఆరాధన కోసం


భిక్షుకుల ఆవాసం కోసం ఐదు గుహలు నిర్మించారు. ఆర్యమతానుసారం అశ్వమేధ
యాగాలు చేసిన ఆంధ్ర శాతవాహనులలో కడపటివారు బౌద్ధమతాన్ని బాగా ఆదరించారు..

శాతవాహనుల తరువాత ఈ ప్రాంతం కాలచూరి ప్రభువుల అధీనంలోకి వచ్చింది.


వీరుకూడా ఇదే వరసలో గుహాలయాల నిర్మాణం కొనసాగించారు. కానీ వీరు భారతీయ
పురాణఇతిహాసాల ప్రభావం వలన ఆర్యదేవతల పరంగా నిర్మాణ క్రమాన్ని కొనసాగిస్తూ
గుహలు చెక్కించారు.

తరువాత నూలుపుంజము రాజధానిగా రాష్ట్ర్రకూటుల పరిపాలన వచ్చింది. ఈ


కాలంలో దక్షిణాపథంలో భౌద్ధమతం క్షీణదశకు చేరింది. ఒకప్రక్క కుమారిలభట్టు, తరువాత
ఆదిశంకరుడు బౌద్ధమతాన్ని ఖండిస్తు వచ్చారు. రాష్టకూట దంతిదుర్గ మహారాజు శైవ వైష్ణవ
మతాలను ఆదరించాడు. అందుచేత శివకేశవ భేదం లేదనేటట్లు రాష్ట్రకూటుల గుహానిర్మాణ
శైలి సాగింది. రాష్ట్రకూట ప్రభువులు ఈశ్వరుడికోసం ఈ పర్వతాలలో ఏక శిలగా
కైలాసనాథాలయం నిర్మించాలని తలపెట్టారు. ప్రభువులు మారినా ఆలయ నిర్మాణం
ఆటంకం లేకుండా సాగుతోంది.

శిరీష తన చెలికత్తెలు నూలుపుంజములో విడిది చేసి ఒకరోజూ ఈలపురం గుహలు


సందర్శించడానికి వెళ్ళారు. ఛండభానుడు ఎండ కురిపిస్తున్నాడు. ఎండ కన్నెరుగని బాలికలు
స్వేదజల స్రావితులయ్యారు. జలపాతం నీళ్ళు చల్లగా ఏదో వట్టివేళ్ల పరిమళం కలిపినట్లు
సువాసనలు వెదజల్లు తున్నాయి.

“అబ్బ! ఈ జలపాతం స్నానానికి ఎంతబాగుందో!శీతల తుషారఫేన రజతాచలాన్ని


తలపిస్తోంది!” అన్నది యామిని.

“ఏంలాభం? మనం మారు ఉడుపులు తెచ్చుకోలేదు.”అన్నది పూర్వచిత్తి దిగులుగా.

“ఐతేయేమీ? మన సౌందర్య సమాహారాన్ని తిలకుంచడానికి ఇక్కడెవరున్నారనీ,


వలువలు ఒడ్డునపెట్టి జలకమాడుదాం!”అన్నది వాశిష్ట.
“నగ్నంగానా! ఏ గోపాలుడో భూపాలుడో చీరలెత్తుకుపోతే?” అన్నది విరిజ.
సమంత ఫక్కున నవ్వింది. “ గోపాలుడైతే మేలే. భూపాలుడైతే ఆలోచించాలి!” అన్నది.
“గోపాలుడంటే ఆ నందగోకుల బాలుడు వస్తాడంటావా మనం నోచిన నోములకు! ఏ
గొఱ్ఱెలు కాచుకునేవాడో వచ్చి కోకలెత్తుకుపోతాడు” అన్నది షద్పద.

160
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“నీకు భయమైతే మానేయి. నేను బట్టలు విప్పే స్నానం చేస్తాను. ఇక్కడెవరైనా


నరపుంగవుడు కనిపించాడా?” అన్నది వశిష్ట.
“వాశిష్టా! మాకు చేతకాదా విప్పడం?” అన్నది రోహిణి ధైర్యంగా.
చివరకు అందరూ కూడబలుక్కుని నగ్నంగా జలకేళిలో నిమగ్నమైపోయారు.
శిరీష “రోజూ ఇలా చేస్తే ఏదో ఒకరోజు సంకటంలో పడతాం!” అన్నది బెరుకుగా.

ఆడపిల్లలందరూ ఒకరిపై ఒకరు నీళ్ళు జల్లుకుంటూ ఆనందోత్సాహంలో వున్నారు.


మైమరపులో విరిజ పాకుడుపై కాలుమోపి జారి సెలయేరులో పడి కొట్టుకుపోయింది.
అందరూ ఘొల్లుమన్నారు. ఒడ్డునున్న బట్టలు అరకొరగా వంటికి చుట్టుకుని అస్రుధారలు
మరో జలపాతమా అనేటట్లు ఏరువెంట పరుగెత్తారు. ఏరువెంట దోవ సరిగాలేదు. ముళ్ళు
పొదలు బండరాళ్ళు అన్నీ అడ్డంకులే. వారు భయంతో రక్షించేవారులేరా అని అరుస్తూ
సాగీరు.
“ఈ సెలయేరు ఎక్కడికి పోతుందీ? ఎవరో ప్రశ్నించారు
“శివ్ నదిలో కలుస్తుంది. శివ్ నది గోదావరికి ఉపనది, గోదావరి సముద్రంలో...”

వారి రోదన అరణ్యరోదనం కాలేదు. వెంటనే బౌద్ధ భిక్షుకులు కొందరు అటుగా


వచ్చారు. “బుద్ధం శరణం గచ్ఛామి! అమ్మా ఎందుకు రోదిస్తున్నారు?” అని ప్రశ్నించాడు
అందులోని గురువు. విషయం తెలియగానే అతడి శిష్యులు ఇరువురు ఈదుకుంటూవెళ్ళి
విరిజను కనుగొని తీసుకు వచ్చారు. వెంటనే విరిజ నగ్నశరీరంపై బౌద్ధగురువు తన
బుజంపైని నారింజపండురంగు ఉత్తరీయంతీసి కప్పాడు.

“ఈ బాలిక నేటినుంచి బౌద్ధదీక్ష పొందుతుంది. ఇది తధాగతుని సంకల్పం.


ముందుముందు ఒక సంఘమిత్రలా సుజాతలా బౌద్ధధర్మాన్ని ప్రచారం చేస్కుంది” అన్నాడు
బౌద్ధగురువు.
ఆడపిల్లలందరూ అవాక్కయ్యారు. స్ధంభించిపోయారు.
విరిజ తనకు పునర్జన్మ ప్రసాదించిన గురువు శాక్యానంద పాదాలకు భక్తితో
మోకరిల్లింది.

శాక్యానంద శిరీషతో ఇలా అన్నాడు. “రాకుమారీ! చింతించకు. ఈ బాలిక


కారణజన్మురాలు. తనవునికిని ఇలా తెలుసుకుంది. గత మూడుజన్మలనుండి తధాగతుని
నమ్మినది. ఇకపై ఇక్కడి చైత్యములో క్షేమంగా శిక్షణ పొందుతుంది.” అని. ఆయన వెనక్కు
తిరిగి శిష్యులతోకూడి వెళ్ళిపోతున్నడు.

ఆయన అన్నట్లే విరిజ మంత్రముగ్ధలా గురువు వెంట వెడలిపోయింది.

161
  చాళుక్యసింహాసనం

శిరీషకు చెలికత్తెలకు ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. శోకసముద్రంలో మునిగి తేలారు.


తమ తోటి ఆడపిల్లని కొందరు మగభిక్షుకులకు అప్పగించి రావడం సమంజసం
అనిపించలేదు.

మరునాడు బౌద్ధచైత్యమును వెతుక్కుంటూ గుహలకు వెళ్ళారు. అక్కడ బుద్ధుని చైత్య


గుహ చాలా అద్భుతంగా చెక్కబడి వుంది. దానిని విశ్వకర్మ గుహ అంటారు. ఆడపిల్లలు
లోనికి వెళ్ళారు. అక్కడ శాక్యానంద ఆసీనుడైయున్నాడు. ఆయన ఎదురుగా బౌద్ధ భిక్షుకులు
ధ్యాననిమగ్నులై కూచున్నారు. వారిలో విరిజకూడ వుంది. అర్ధనిమీలిత నేత్రయై పండిన
నారింజ రంగు వస్త్రాలు ధరించి ప్రజ్ఞాపారమితాదేవిలా విలసిల్లుతోంది. అందరికి ప్రాణం
కుదుటపడింది.

శిరీషకు ఇంక ఈలపురం గుహలకు వెళ్ళాలనిపించలేదు. భయం. అందుకే తమ


విహారయాత్రలో మార్పు చేయాలనుకున్నది. అజంత గ్రామం సమీపాన వ్యాఘ్రానదీ
తీరానకూడ లోయలో జగత్ ప్రసిద్ధమైన గుహాలయాలున్నాయి. అవి ఈలపురం కన్నాఇంకా
పురాతనమైనవి. అక్కడ శిల్పాలతో పాటు చిత్రకళ విలసిల్లుతోంది.

పరివారాన్ని సన్నాహం చేయమని చెప్పింది శిరీష.

ప్రయాణంలో కొంతదూరం వెళ్ళిన తరువాత గాలివానలు పట్టుకున్నాయి. బండ్లు


కదలలేదు. కుంభినీ అనే ఒక తోటలో ఆగవలసివచ్చింది.

కుంభిని పూలవనమే యైనా మహారణ్యంలో వుంది. ఆ వనవాసం ఒక


వినూత్నానుభూతిని కలిగిస్తోంది. పరివారం మాత్రం తోట వెలుపలే విడిసింది.

వెచ్చని దుస్తులు ధరించి వర్షాన్ని గమనించడంకూడ ఒక అనుభూతే. ఒక్కొక్క దినం


నీలిమేఘాలు పురివిప్పిన నెమలిపింఛంలా ఆకాశాన్ని కమ్మివేస్తు న్నాయి. రెండు మేఘాలు
ఒరుసుకున్నపుడు మధ్యలో ప్రణయలతలు వెలిగి అంతలోనే మాయమవుతూ ఇది
క్షణికసుఖం సుమా అన్నట్లు హెచ్చరిస్తున్నాయి. గాండ్రించే మేఘాలు అడటిమ్రుగాలను
తలపిస్తున్నాయి. వర్షధారలు దివికి భువికి మద్య దారాలు పేనుతున్నాయి.

వనంలో చలి పులిలా భయపెడుతుంటే మేకయెరువు కుంపటి వెచ్చటి కంబళిలా


ఆదుకుంది.

ఆ వనానికి సొంతదారు భూంకారుడు. అతడు ముసలివాడు కావడంతో అతడి


కుమారుడు అంగారకుడే తోటను పోషిస్తుండేవాడు. రోజూ ఉదయాన్నె వనంలో పూలు
సేకరించి బండి తోలుకుని నూలుపుంజం వెళ్ళి అమ్ముకొచ్చేవాడు.

అంగారకుడు యువకుడు. ఇరవై మూడేండ్ల ప్రాయంవాడు. ఎండలో పనిచేయడం


162
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

వలన నల్లబడినా కాకి నలుపు కాదు. కాయకష్టం చేయడంతో దండలు కండలు తిరిగిన
యువకుడు.

వర్షాలు లేనపుడు అంగారకుడు బావినుంచీ మోటతోలి తోటకు నీళ్ళు పెట్టేవాడు.


కూలీలు కాలవలు చేసి తోటను తడిపేవాళ్ళు.

శిరీష చెలికత్తెలలో రోహిణికి ఏమీ తోచేదికాదు. అంగారకుడు బావివద్ద


మోటతోలుతుంటే ఎద్దులు వెనక్కు నడవడం తనకు వింతగా తోచేది. మెల్లగా అంగారకుడితో
రోహిణికి పరిచయం ఏర్పడింది. తానుకూడా తోటలో మొగ్గలు కోయడం పూల మడులకు
నీరు పెట్టడం చేయసాగింది. ఆ తోటలో ఒక ప్రక్కగా గోశాల వుంది. ఒక దినం అంగారకుడు
ఆంబోతును ఆవుల పైకి వదలడం చూసింది. అమాయకంగా ‘అదేమిటీ ఆంబోతు ఆవులను
పొడవదా?’ అన్నది. అంగారకుడు సమాధానం చెప్పకుండా అదో రకంగా నవ్వాడు. రోహిణి
విస్తుపోయి అక్కడే నిలబడి పోయింది.

ఆ వనంలో పూచిన మాలతీమాధవి పూలు వెండిగిన్నెలలా వున్నాయి . జూకా


మందారాల లోంచి మకరందబిందువులు మంచు కణాల్లా జారేవి. పువ్వుల తేనెలు
జుఱ్ఱుకోడానికి వచ్చిన భృంగాలను తేనెటీగలు తరిమేవి. నీటివరవన చంగల్వలు
విషముంగిలులు విస్తరించి పూశాయి. చంబేలీ, సుగంధిరాజ పుష్పాల సుగంధం ఆమడ
దూరం వరకూ విస్తరించేది.

తోటలో అంగారకుడు ఒక క్షణం కూడా ఊరికే ఉండేవాడు కాదు. ఆతడి పరిశ్రమతో


రోహిణి బాగా ఆకర్షితురాలయింది. అతడితో కలిసి పనులు చేస్తూ చేస్తూ ఒకరినొకరు
తాకడం జరిగేది. ఆ తరువాత ఏ పొదమాటునో చుంబనానికి అలవాటు పడ్డారు.

అంగారకుడు తెల్లవారు ఝామునే లేచి అక్కడికి దగ్గరలోనున్న సరోవరంలో కలువ,


తామర మొగ్గలు కోసుకు రావడానికి వెళ్ళేవాడు. ఆనాడు రోహిణి అంగారకుడితో
బయలుదేరింది.

సరోవరం ఒడ్డున తాడుతో కట్టివేసిన చిన్న నావ ఉంది. అంగారకుడు నావ కట్టుతాడు
విప్పి రోహిణిని వస్తావా అన్నాడు. రోహిణి తల పంకించింది. నావలో ఎక్కికూర్చుంది. అతడు
తామర తంపర మధ్యనుండి నావను సరస్సు మధ్యలోకి నడిపి ఆపాడు. చుట్టూ చూస్తే విరిసిన
తామరలు. అరవిచ్చిన మొగ్గలు. సరస్సు చుట్టూ మంచు తెరకప్పినటు వుంది.

వాతావరణం రోహిణి మనస్సును చెరిచింది. ఆనాటి సరసం చుంబన క్రీడతో ఆగలేదు.


ప్రణయ నావకు మన్మథుడు తెరచాప పైకెత్తాడు.

ఆనాటి పూలబండీ ప్రొద్దెక్కిన తరువాత కానీ కదలలేదు.

163
  చాళుక్యసింహాసనం

ఒకనాడు అంగారకుడు రాజకుమారి దర్శనం కోరివచ్చాడు. అతడు ఎందుకు వచ్చాడో


తెలీక రోహిణి కలవరపడిపోయింది. తమ మధ్య ప్రణయం పెళ్ళి ని గురించి మాట్లాడతాడేమో
నని భయం. రాకుమారి ఏమంటుందోయేమో ననే ఆంధోళన.

రాజకుమారి నేరుగా పరపురుషులతో మాట్లాడదు. సమంత సారధ్యం వహిస్తుంది.

అంగారకుడు శిరీషాకుమారికి అనేక వందనాలు తెలిపి ఇలా అన్నాడు. “రాజకుమారి


మాతకు జయము జయము! మేము కొందరం దండులో జేరి యుద్ధానికి వెళుతున్నాము.
మానాయన మంచం దిగటంలేదు. ఈ తోటలో మీకేకష్టం రాకుండా పనివాళ్ళే
చూచుకుంటారు.”
“ఏ దండులో జేరుతున్నారూ? ఎవరితో యుద్ధము?”
“రాష్ట్రకూటుల సైన్యమే. తూరుపు వెళుతున్నాము.”
“తూరుపు అంటే?”

“తూర్పుచాళుక్యులు. వేంగిని ముట్టడించడానికి. ఈసారి వేంగి పడిపోవడం ఖాయం.


చాల పెద్దదండు వెళుతోంది.”

“మీకు యుద్ధానుభవం ఉందా?”

“మానాయన పెద్ద దళపతి. వీరుడు కావడంవలననే మాకీ మాన్యం ఇచ్చారు.


నేనుకూడా కత్తియుద్ధం నేర్చుకున్నాను. అవసరంపడి ప్రభువు పిలుస్తే వెళ్ళకుండానా!”

“ఎవరు పిలిచారు, బయలుదేరడానికి ఇంక ఎన్నిదినాలుందీ?”

“దండు నాయకుడు, ఆయనపేరు తెవీదు, మాలాంటివారిని సమీకరిస్తున్నాడు.


రెండుమూడు రోజులలో ఇక్కడ దగ్గరవారమంతా ముఠాగా బయలుదేరి వెళుతున్నాం.”

“రేపటిదినం ఖడ్గయుద్ధప్రదర్శన ఇవ్వగలరా?”

“ఓ!” అన్నాడు అంగారకుడు.

మర్నాడు ద్వంద్వయద్ధం చూడడానికి అండరూ చట్టూజేరారు. రాకుమారి ముందుగా


రోహిణిని బరిలోకి దింపింది. అతడి భుజబలం ముందు రోహిణి నిలబడలేకపోయింది.
అప్పుడు అరణి రంగంలోకి దిగింగి. ద్వంద్వ యుద్ధం సాగింది. అరణి ఖడ్గచాలనా చతురత్వం
ప్లుతగతి ముందు అంగారకుడి కండబలం నిర్వీర్యమైంది. అరణి అవలీలగా గాలిలోకి ఎగిరు
ప్రత్యర్ధి తలపై మోదగలదు. ఆదెబ్బకు తల పగిలి రెండువక్కలు కావలసిండే.

164
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

అంగారకుడు ఘంగుతిన్నాడు. తనఓటమి నంగీకరించాడు. ‘అమ్మో. ఈ ఆడపిల్లలు


అబలలు కాదు’ అనుకున్నాడు.

రాజకుమారి చింతాక్రాంత అయింది. తమ రాష్ట్రకూటులు వేంగిపైన పగపట్టారు.


పగపట్టారంటే హతమార్చకుండ విడువరు. వేంగిచూస్తే చాలా చిన్నదేశం. వేంగి యువరాజు
మహాపరాక్రమవంతుడే. కానీ గండభేరుండపక్షిని సింహశాబకం ఎలా ఎదుర్కొనగలదూ.
అంగారకుడు యుద్ధానికి వెళుతున్నాడని రోహిణి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

ఈలపురం వచ్చినప్పటినుంచీ శిరీష మదిలో విరహం ఏర్పడింది. మాన్యకేత దుర్గంలో


ఉండడం వలన మనసుకు ఒక పరిధి ఉండేది. ఇప్పుడదిలేదు. వద్దనుకున్నా విష్ణు వర్ధనుడు
మనసులో వచ్చి కూర్చుంటున్నాడు. వసుమిత్ర చెబుతునేవుంది. మొగ్గలోనే తుంపకపోతే
మానైకూచుంటాడని!

రాష్ట్రకూటసేనానులు మహా క్రూరులు. ఏమైనా చేయగలరు. విష్ణువర్ధనుని బంధించి


మాన్యకేతం తీసుకువస్తే! ఇది స్వప్న వాసవదత్త నాటకం కాదుకదా, ఉదయన మహారాజును
బంధించినట్లు!

నిజానికి అంగారకుడు వేంగిపై దండయాత్రకు వెళ్ళటంలేదు. అతడబద్ధం చెప్పాడు.


నిజమేమిటో అతడికీ తెలీదు. చాళుక్య విశాఖదత్తుడు మాన్యకేతం ముట్టడికోసం వీరులను
సమీకరిస్తున్నాడు. అంగారకుడిని పూటకూళ్ళమ్మ వ్యవసాయ క్షేత్రంలో దాచవచ్చని
దండులోకి తీసుకున్నాడు. తన వ్యూహం ఏమిటో ముందుగా ఎవరికీ వెల్లడి కాకుండా
విశాఖదత్తుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

వర్షాలు వెనక చిక్కి మళ్ళీ కచ్చడాలు నడుస్తున్నాయని చెప్పుకుంటున్నారు. శిరీష


విహారయాత్ర కొనసాగింది.

వ్యాఘ్రాలోయ గుహలు అర్ధచందాకారంగా కొండవాలులో నిర్మించబడ్డాయి. క్రిందగా


వ్యాఘ్రా నది ప్రవహిస్తోంది. చుట్టూ దట్టమైన అడవి.

శిరీష చెలికత్తెలు ఆ గుహలలో శిల్పకళ చిత్రలేఖనం దర్శించసాగారు. నలువరాణి


పద్మపాణి వర్ణచిత్రాలు ఎందరో సుందరీమణుల కేశాలంకరణలు ఆభరణాలు వస్త్రధారణ
అచ్చెరువు గొల్పుతున్నాయి. ఖండఖండాంతరాలనుండి గుహలను సందర్శింప వచ్చిన
వనితల సోయగాలను చిత్రకారులు గ్రహించడంతో వస్త్రధారణలో అలంకరణలలో వైవిధ్యం
ఏర్పడింది.

వారొక గుహలోకి ప్రవేసించారు. ఆ గుహలో అలంకారాలేమీ లేవు. కొంతచెక్కి


వదిలిపెట్టినట్లుగా నిరామయంగా వుంది. శిరీష గుహ తిలకిస్తూ చేతి మణికింకిణి బయటికి

165
  చాళుక్యసింహాసనం

తీసి ఆడుతుంటే జారి దొర్లుకుంటూ ఎండుటాకుల కుప్పలోకి వెళ్ళి ది. ఆ కుప్పలో ఒక ఋషి
తపస్సు చేసుకుంటున్నాడు. శిరీష తెలీకనే తన కంకణం కోసం ఆ ఆకులపొదలో చేయి
పెట్టడంతో ఆమె చేయి ఋషి ఎడమ పాదానికి తగిలింది. అంతటితో ఆయనకు స్పృహ
వచ్చింది.

ఎండుటాకులు తొలగించుకుని ఋషి కొమదా సముదయంకేసి చూశాడు. తన ఎడమ


పాదాన్ని ఎవరో ఆశ్రయించారనుకోవడంతో ఆయన ప్రసన్నుడైనాడు.

“అమ్మా! ఎవరు మీరు. నన్నెందుకు ఆశ్రయించారు?” అని ప్రశ్నించాడు. ఋషి తనకు


తపోభంగం కలిగించినందుకు శపిస్తాడేమో నని భయపడుతున్న తమకు ఊరట కలిగిమది.
అది శిరీష అదృష్టం.

ఋషికి ప్రణమిల్లి “స్వామీ! మేము రాష్ట్రకూట అంతఃపురం వాళ్ళం. విహారయాత్రలకు


బయలుదేరి ఈ వ్యాఘ్రా గుహాలయాలు చూడాలని వచ్చాం. పొరపాటున తమకు తపోభంగం
కలిగించాం” అన్నది శిరీష కరకమలాలు ముకుళించి.

“అలాగా! నాకు ఆకలిగా వుంది. మీరేమైనా అందివ్వగలరా?” ఆన్నాడు ఋషి.

రాజకుమారి అందించిన ఆహారపానీయాలు సేవించిన ఋషి “ఏమిటో తపస్సులో


ఉన్నంతవరకు ఆకలిదప్పులు తెలియవు. గుహలు చూడవచ్చారా. రాజాదరణ లేక ఈ
గుహలు మరుగున పడ్డాయి. ఇప్పుడెవరూ సందర్శకులు రావటంలేదు. మహాయాన
బౌద్ధమతం దక్షిణాపధంలో క్షీణదశకు రావడంతో శ్రమణకులు తీర్ధయాత్రికులు రావడం
లేదు. ఇప్పటి రాజాదరణంతా ఈలపురం గుహలమీదే వుంది. ఇక్కడి శిల్పులు చిత్రకారులు
కూడా ఈలపురం వలసపోయారు. వీళ్ళ సంతతివాళ్ళే అక్కడ గుహలు
తొలుస్తున్నారు.”అన్నాడు మహర్షి.

“మహర్షీ! మేము అక్కడినుంచే వస్తున్నాము. ఈలపురం గుహానిర్మాణం ఒక


అద్భుతంగా కనిపించింది. మానవులు అంతటి బండరాళ్ళను కొండలను ఎలా చెక్కి
పోస్తున్నారో.”
“ఆ శిల్పులకు నాగుల సహాయం వుంది.”
“నాగులెవరూ!”
“దేవదానవ యక్ష రాక్షస గంధర్వ విద్యాధర నాగ కిన్నర కింపురుషులలో నాగులు!”
“నిజంగా మానవులు కాని వీరందరూ ఉన్నారంటారా మహర్షీ?”

“ఏందుకు లేరూ? ఈ నాగులు సర్పములు. కానీ రాత్రిపూట మానవరూపం


ధరించగలరు. గుహలలో చెక్కవలసిన శిల్పాలకు వీళ్ళు నాట్లుపెట్టి, పసరురాసి వెళతారు.
166
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

అందువలన శివ్పంచెక్కడం సులువవుతుంది.”


“మహర్షీ. ఇక్కడ ఇంక తపస్యులున్నారా?”
“మరి నీవు నాతో ఒంటరిగా రాగలవా చూడడానికి? అన్నట్లు నన్ను కొండమానుఋషి
అంటారు.”
శిరీష ఒక క్షణం తటపటాయించింది.

“చూశావా బేలా! నాపైన కూడా నీకు అనుమానం ఉంది. విశ్వాసం లేనివారికి మహ


నీయుల దర్శనం లభించదు.”

“మహర్షీ! క్షంతవ్యురాలను. ఒక కన్యగా ఒక బేలగా ఒంటరిగా మీ వెంట రావడానికి


సంశయించాను. మహర్షుల దర్శనంకన్నా విహారయాత్రకు ఫలం ఏమివుంటుంది!”అన్నది
రాకుమారి.

ఒకదినం కొండమానుఋషి శిరీషను కొండల మధ్య అరణ్యం లోకి చాలాదూరం


తీసుకు వెళ్ళాడు. అంతదూరం కాలినడకన వెళ్ళడం చాలా కష్టమనిపించింది. అదీ ఒక
బాటన నడవడం కాదు. పిచ్చిగా పెరిగిన మొక్కలమధ్య నుంచీ దోవ చేసుకుంటూ నడవాలి.
అలా నడుస్తుంటే ఉత్తరేణి గింజలు పల్లేరుకాయలు బట్టలకు పట్టుకున్నాయి. ఆ నడక చాలా
ప్రయాస కలిగిస్తున్నా ఒక ఋషి మార్గంలో నడవడం తనకెంతో ఆనందంగా వుంది.

అక్కడ కొండలమధ్య ఒక సరోవరం ఉంది. సరోవరం ఒడ్డున మహావృక్షాలు


పెరిగివున్నాయి. ఆకొమ్మలకు కొందరు తల్లక్రిందులు గా వ్రేలాడుతూ కనిపించారు. చేతులు
ముకుళించి తల్లక్రిందులుగా తపస్సు చేసుకుంటున్నారు.

“చూశావా ఇదే వాలఖిల్య సాంప్రదాయం!” అన్నాడు ఋషి.

శిరీష ఆశ్ఛర్యపోయింది. కనులూ చేతులూ ముకుళించి వారికి నమస్కరించింది.

“కుమారీ ఇలాగే ఎంతోమంది తపస్యులు ఇప్పటికీ ఉన్నారు. కేవలం నీళ్ళు తాగి


తపస్సు చేసేవాళ్ళున్నారు. వాళ్ళను సలిలాహారులు అంటారు. అలాగే భూశయ్యులు
అశయ్యులు పర్నాదులు ఎన్నో రకాల తపస్యులు ఇప్పటికీ ఉన్నారు. నీవు నా పాదం స్ప్ర్రు సించే
వరకూ నేనూ నిరాహారంగా తపస్సు చేస్తున్నవాడినే!” అన్నాడు కొండమానుఋషి.

శిరీష అలసిపోవడం గమనించాడు ఋషి. కొంచెంసేపు సేద తీరు అన్నాడు. ఆయన


సరోవరంలో స్నానం చేసి ఒక బండరాతిపైన ధ్యానానికి కూర్చున్నాడు.

శిరీష దాహం తీర్చుకోడానికి సరోవరం ఒడ్డుకు జేరింది. కాళ్ళూచేతులూ ముఖము

167
  చాళుక్యసింహాసనం

కడుక్కుని దోసిలితో నీళ్ళు తీసుకుని త్రాగింది. అమాయకమైన చేపపిల్లలు తన పాదాలను


తాకి గిలిగింతలు పెడుతున్నాయి. తాను వాటిని దోసిలితో పట్టుకోవాలని ప్రయత్నించింది.
చిక్కలేదు. చుట్టూ పరిసరాలను పరిశీలించింది. చాలా నిరామయమైన ప్రదేశం. సరోవరానికి
ఆవలిఒడ్డున ఒకమనిషి సొరకాయ బుఱ్ఱతో చెరువులో నీళ్ళు ముంచుకుంటూ కనిపించాడు.

శిరీషకు పుల్లరేగుపళ్ళ చెట్లు కనిపించాయి. చిన్నపుడెవరో చూపించారు. చాపల్యంతో


పండినవి కోసుకుంటూ తిన్నది. అవతల ఒక పొదరిల్లు కనిపించింది. అటునుంచీ పుష్ప
సుగంధం వ్యాపిస్తోంది. దోవలో కొన్ని తామర తూళ్ళూ పూలు పడివున్నాయి. అటుగా
వెళ్ళింది. పొదరింటిలోకి ఆకుల సందు నుండీ తొంగిచూచింది. నేలంతా తలిరుహాలు పూలు
పరవబడివున్నాయి. ఒక మిధునం మోహభంగిమలో స్ధంభించిపోయి ఉన్నారు. పురుషుడు
పోతపోసిన ఇనప విగ్రహంలా నల్లగా ఉన్నాడు. ఆ యువతి మెరుపు తీగలాగే ఉంది.
శిరీషరెప్ప వాల్చకుండా వారినే చూడసాగింది.

సొరకాయబుఱ్ఱతో నీళ్ళు ముంచుకునే మనిషి సరోవరాన్ని ఎంత వేగంగా ఈదుకుంటూ


వచ్చాడో రొప్పుతూ వచ్చి శిరీష చేయిపట్టుకుని అవతలకు లాగాడు. తను క్రింద పడిపో
యింది. అతడలా లాగకపోతే చెట్టుపైనుంచి దూకిన చిరుతగండొకటి తనమీద పడేదే! ఆకలి
గొన్న చిరుత నోరుతెరిచి అతడిపై గాండ్రించింది. అతడు రాళ్ళతో దానిని తరిమి కొట్టాడు.
“ఏమిటి చూస్తున్నావు మైమరచి?” అన్నాడాయన.
సిగ్గుతో తను మూగబోయింది. తల దించుకుంది.
“అది ఒక యోగం! వామాచారం! వాళ్ళు ధ్యానంలో ఉన్నారు” అన్నాడతడు.

శిరీష తప్పుచేసినట్లు చెంపలు వేసుకుంది. ఆ మనిషి తన చేయి పట్టుకుని కొండమాను


ఋషి వద్దకు తీసుకు వెళ్ళాడు.

ఋషి “ఇంకా వెళదాం” అన్నాడు. శిరీష తల పంకించింది. “చూశావా సత్వరజొ


తమో గుణాలు! మునులు సత్వగుణంతో తపస్సు చేస్తున్నారు. నీవు రజోగుణంతో
పొదరింటిలోకి తొంగిచూశావు. వాళ్ళు తమోగుణంతో యోగసాధన చేస్తున్నారు” అన్నాడు.

శిరీష అవాక్కయింది. ఋషులు త్రికాలవేదులు. కొంచం సేపటికి కూడదీసుకుని


“ఋషీ! కన్నియలు మనస్సును నిగ్రహించుకోవాలంటే ఏంచేయాలీ?” అని అడిగింది.

అందుకు ఋషి “నీవు చాలా గొప్ప ప్రశ్న వేశావు. వేయి వరహాల ప్రశ్న!” అన్నాడు.
“కానీ నేనొక జడదారిని! నన్నడుగుతే శరీరాన్ని ఉతికి ఎండవేయమని చెబుతాను. అది నీకు
తగినది కాదు. నీవు ఒక దేశానికి మహారాణివై సమస్త రాజభోగాలు అనుభవించ వలసిన
దానివి. నీకు ముని వృత్తి తగదు. అసలు స్త్రీ సమస్యలకు పురుషుడు సమాధానం చెప్పడమే
తప్పు. నేను పురుషుడను. నీవు స్త్రీవి. నీ ప్రశ్నకు నీవు సరైన పతివ్రత నుండీ సమాధానం
168
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

పొందడం ఉచితం!” అని ఒకక్షణం ఆగాడు ఋషి.

శిరీష కొంచం నిరాశ చెందింది. ఋషి అది గమనించాడు. “యువతీ! మీ మాన్యకేత


దుర్గంలో రేవాదాసదీక్షితుని భార్య మణిభూషితాదేవి గొప్ప పతివ్రత. సాధ్వీమణి. ఆమెనడుగు.
ఈ లోపున నీకు కొన్ని సూత్రాలు చెబుతాను. మనసును నిగ్రహించాలంటే నీకంటూ ఒక
నియమం ఉండాలి. శీలం ఒక వ్రతంగా భావించాలి. పతివ్రతల ఔన్నత్యాన్ని చాటిచెప్పే
చరిత్రలను వినాలి చదవాలి. భగవంతుడిని ఏదోరూపంలో వేళతప్పక ఆరాధించాలి.
ఉపవాసనియమం పాటించాలి. ఆహార నియమాలుండాలి” అన్నాడు ఋషి.

“మహర్షీ! శీలసంపదను అందరూ కాపాడుకుంటారుకదా?” అన్నది శిరీష.

మహర్షీ పేలవంగా నవ్వాడు. ఆ నవ్వు ఎంతో భావగర్భితంగా వుంది. శిరాష ఇంక


ఎక్కువ ప్రశ్నలు వేయలేదు.

ఇద్దరూ పూర్వస్ధలానికి తిరిగి వచ్చారు.

27 పెళ్ళిసంబంధం
ఆంధ్రశ్రేష్ఠిగోమఠేశ్వరయ్య తన కులపెద్దల్ని ఇద్దరిని వెంట పెట్టుకుని బయలుదేరాడు
పెళ్ళి సంబంధం మాట్లాడడానికి. అందులో ఒకరు వప్పయ్యశ్రేష్ఠి. ఈయన మహారాజు ఇంద్ర
వల్లభునికి చాలా ఆప్తుడు. ఇతడిమాట ఇంద్రవల్లభుడు కాదనడని నమ్మకం. రెండవ ఆయన
మరకత శ్రేష్ఠి. ఈయన చాల పెద్దమనిషి. మాన్యకేత వణిజసంఘాలకు అధ్యక్షుడు. ముగ్గురూ
ముందస్తు సమయం తీసుకుని ఇంద్రవల్లభుని వద్దకు రాయబారం వెళ్ళారు.

రాజుల ఆదాయం అంతా వణిజులనుంచే వస్తుంది. అందుకే ఇంద్రవల్లభుడు వారిని


బాగానే గౌరవించాడు. ఉచితాసనాలు చూపించాడు. తీర్ధప్రసాదాల వితరణ అయింది.
“నగరం పెద్దలు త్రిమూర్తులలాగా వచ్చారు. విషయం తెలుసుకోవచ్చునా!” అన్నాడు
ఇంద్రవల్లభుడు.

ఆంధ్రశ్రేష్ఠికి విషయం ఎలా ఆరంభించాలో అర్ధంకాలేదు. వప్పయ్య వంక సాలోచనగా


చూచాడు.

“అయ్యా! ప్రభువులకు తెలియనిదేమున్నదీ! పిల్లలకు సకాలంలో పెళ్ళి చేయడం


తల్లిదండ్రుల విధి. వాళ్ళను ఒక ఇంటివాళ్ళను చేస్తేమన భారం తగ్గుతుంది. ఆంధ్రశ్రేష్ఠి
గోమఠేశ్వరయ్యగారికి ఒక తనయ వుంది. పాలకడలినుంచి వెడలిన శ్రీదేవిలాగానే
వుంటుంది. తమకేమో వీరాధివీరుడు జగన్మోహనుడు అయిన కర్కవల్లభ రాకుమారు
డున్నాడు. ఇద్దరికీ ముడి పెడితే హిమగిరితనయకు కైలాసనాధునికీ కళ్యాణం జరిపించిన

169
  చాళుక్యసింహాసనం

వాళ్ళ మవుతాము. ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్యగారు మీతో వియ్యమందాలని ముచ్చట


పడుతున్నారు” అన్నాడు వప్పయ్య.

“పిల్లలకు సకాలంలో పెళ్ళిచేయడం ధర్మం. మీరు బాగా గుర్తు చేశారు. నేను మా


అమ్మాయి శిరీషకు సంబంధాలు చూడాలని అనుకుంటున్నాను. మొదట అమ్మాయికి చేసి
అబ్బాయికి చేయడం ధర్మంకదా! రెండవది మాది రెడ్డికులం. వీరిదేమో ఘనమైన వైశ్యకులం.
ఇది అనులోమమో విలోమమో పండితులు చెప్పాలి” అన్నాడు తెలివిగా ఇంద్రవల్లభుడు.

మరకతశ్రేష్ఠి కల్పింపించుకుంటూ “మహారాజా!‘న విష్ణుః పృధ్వీపతిః’ అన్నారు.


రాజ్యా న్నేలే ప్రభువులకు కులం ఎంచకూడదు. వరుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. అందుచేత
ఇందులో కులంసమస్య ఏమీలేదు. అంతేకాక మీరు అఖిల దక్షిణాపథానికిసార్వభౌములు.
ఈయనేమో లక్ష్మీదేవికి పుట్టినిల్లయిన పాల సముద్రం వంటివాడు. అందుచేత మీ ఇరువు
రిలో ఒకరు దేవేంద్రుడు మరొకరు సముద్రుడు. మీ ఇరువురు వియ్యమందుతే మావంటి
బేహారులకు మహదానందం.”అన్నాడు.

“మీరు చెప్పిన సామ్యాలు బాగానే వున్నాయి. మా అబ్బాయికి ఒక క్షత్రియకన్యను చేసు


కోవాలనుకుంటున్నాము.” అన్నాడు ఇంద్రవల్లభుడు.

ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్యకు గుండెలో రాయి పడింది. తమాయించుకోవటానికి


కొంత వ్యవధి పట్టింది. మళ్ళీ వప్పయ్య వైపు చూశాడు బిక్క ముఖంతో.

“ప్రభువులు అలా అంటే ఎలాగు? ఇందాక అనులోమం విలోమం సమస్య వచ్చినపుడు


మేము సద్దుకున్నాంకదా! క్షత్రియకన్యను చేసుకున్నా ఇంతే అవుతుంది! తమరు లాభ
నష్టాలు కూడ ఎంచుతే బాగుంటుంది. తమ సైన్యాలు వింధ్యపర్వతాలు దాటి ఉత్తరాపధం
దండయాత్ర వెడలుతాయని తెలిసింది. మీ రథగజహయపదాలకు అయ్యే భారమంతా
రాకుమారుడికి కట్నంగా ఇస్తారు. అమ్మాయికూడా వజ్రం. ఎవరూ వంక పెట్టక్కరలేదు”
అన్నాడు వప్పయ్య.

“రాజులకు రెండు మాటలుండవు. మీరు శ్రమ తీసుకుని ఇంత దూరం వచ్చేముందు


శిరః ప్రధాని రేవాదాస దీక్షితులవారిని కలిసివుంటే బాగుండేది. మా అభిమతం ఏమిటో
ఆయనే చెప్పివుండేవారు”అన్నాడు రాజసంగా ఇంద్రవల్లభుడు.

మరకతయ్యకు ఇంద్రవల్లభుడు చాల కఠినంగా వున్నాడని అర్ధమయింది. ఒకవేళ


కర్కవల్లభుడు వసుమిత్రల మధ్య ప్రణయం ఆయనకు తెలిసి బిగువు చేస్తున్నాడేమో
ననిపించింది. “ప్రభువులు అంతః పురం వారితో కూడ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది”
అన్నాడు మరకతయ్య.

170
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“మీరు చెప్పింది ధర్మమేకాని రాచకులంలో ఈ పట్టింపు లేదు. ఎందుకంటే రాజులు


బహుప్రియాలోలురు. ఎప్పుడు ఏ దేశంలోఎవరిని పెళ్ళాడతారో తెలీదు. అందుకు అంతః
పురం వారి అభిప్రాయం ఏమీ అవసరం లేదు.”

“రాజులు బహుప్రియాలోలురు అన్నారే అందులో మా అమ్మాయి ఒకతె అనుకుని


ఇంద్రవల్లభ రాజేంద్రులు పెద్ద మనసు చేసుకుని అంగీకరిస్తే బాగుంటుంది” అన్నాడు
ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్య ప్రాధేయపడుతూ.

“చూశారుకదా గోమఠేశ్వరయ్యగారు ఎంత ప్రాధేయపడుతున్నారో! ప్రభువులు అంగీ


కారం తెలుపుతే బాగుంటుంది” అన్నడు మరకతయ్య కొంచం బ్రతిమిలాడి చూద్దామని.

ఇంద్రవల్లభుడు ఏమీ సమాధానం ఇవ్వలేదు.

“దేశాన్ని రక్షించే ప్రభువులు ఎంత ముఖ్యమో పన్నులు కట్టే వణిజులు పంటలు


పండించే కర్షకులు కూడ అంత ముఖ్యం! మా అమ్మాయిని చేసుకోవడం వలన రాకుమారుడికి
అంగబలం అర్ధబలం కూడినట్లుంటుంది కదా! తమరు మా సంబంధం తిర స్కరించకుండా
వుంటే బాగుంటుంది” అన్నాడు ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్య.

ఇంద్రవల్లభునికి కొంచం కోపం కూడ వచ్చింది. శ్రేష్ఠి తనను బెదిరిస్తున్నాడా అనిపిం


చింది. “పెద్దలు చాలా దూరం వచ్చారు. కానీ మా ఆలోచన వేరుగావుంది. జగదేకవీర
ఉత్సవాలు జరిగినప్పటినుంచి మేము ప్రతిదీ చాలా లోతుగా ఆలోచించవలసి వస్తోంది.
నగరంలో మాకు మిత్రులెవరో శత్రువులెవరో తేలేవరకు పెద్ద శుభకార్యాలేవీ తలపెట్ట
తలచటంలేదు. తమరు చిత్తగించగలరు” అన్నాడు ఇంద్రవల్లభుడు.

శ్రేష్ఠులు ముగ్గురూ తలవంచుకుని ఇవతలకు వచ్చారు. వప్పయ్యశ్రేష్ఠి “మన బంగారం


మంచిదైతే ఈయన కాళ్లు పట్టుకోవలసిన పని లేదు. దూరంగా ఏదేశమో తీసుకువెళ్ళి
అమ్మాయికి పెళ్ళిచేయడం మంచిది. తాలు ధాన్యం కన్నా పుచ్చుధాన్యం నయంకదా!”
అన్నాడు.
ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్యకు కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి.
ఇంటికి వెళ్ళాడు. భార్య ఎదురయింది. తలవంచుకుని తన గదిలోకి వెళ్ళి బావురు
మన్నాడు.
“ఏమయిందేమిటి కాయా పండా? ఈ అశౌచమేమిటీ? పెళ్ళిసంబంధానికి వెళ్ళి ఈ
ఏడు పేమిటీ?”
“పిందెకూడ కాదు.పువ్వులోనే పోయింది. ఇంద్రవల్లభుడు చాల
కఠినంగామాట్లాడాడు.”

171
  చాళుక్యసింహాసనం

“ఆయన చిత్తం ఇవాళ బాగులేదేమో. అయినా పెళ్ళిసంబంధానికి ముగ్గురు వెళ్ళకూడ


దని చెబుతే నన్ను వెఱ్ఱిదాననన్నారు. పోనీనాలుగు రోజులాగి మళ్ళీ కదిలిస్తే?”

“మళ్ళీ రావాల్సిన అవసరం లేదన్నట్లు మాట్లాడాడు.”

“ఏం ఆయనకంత మదమా? తనకొడుకు చేసిన తప్పుదిద్దుకోలేడా? ముష్టివెధవ! వాడి


కడుపుమాడ! వాడి కూతురుక్కూడ ఇదేగతి పడుతుంది.”

“పిల్లి శాపనార్ధాలకు ఉట్టి తెగుతుందా? ఐనా నిన్ననాలి! పిల్ల ఏంచేస్తోందో ఎక్కడకెళు


తోందో చూసుకోక్కరలా? ఎంతసేపటికీ నీ నగలు నట్రా!”

“ఉగ్గుమ్! మధ్యలో నామీద పడడమెందుకూ? పిల్లల్ని పెంచడంలో తల్లికెంత బాధ్య


తుందో తండ్రికీ అంత బాధ్యతుంది! ఆ ఇంద్రవల్లభుడికి కూడ అంత బాధ్యతుంది.”

“అతడు రాకుమారుడు. అరటాకు లాంటి పిల్ల జాగ్రత్తగా ఉండక్కర్లా?”

“అందరూ ఆడదాన్ననేవాళ్లే! మగాడికో నీతి ఆడదానికో నీతి. ఈ లోకం మారదు!


ఇదంతా మగ ప్రపంచం.”

“నీవూ నేనూ నీతిశాస్త్రాలు మార్చగలమా? జరగాల్సిందేమిటో చూడు.”

“అయనేం కారణం చెప్పాడూ.మనమ్మాయిని గురించి ఏమయినా అనుమానపడ్డాడా?”

“కారణాలేమీ చెప్పలేదు. క్షత్రియుల పిల్లను చేసుకుంటాడట!”

“ఈయన క్షత్రియుడా? నానా గోత్రాలవాళ్ళందరూ రాజ్యాలేలుతున్నారు. కలికాలం


వచ్చి నప్పుడే వర్ణసంకరం ఆరంభమయింది.”

“వీరోత్సవాలలో అభాసుపాలు అయినప్పటినుంచీ ఎవరినీ నమ్మటంలేదట!”

“వీడిమొహం మండా! తన కూతుర్నీ కొడుకునీ నమ్ముతాడా? పోతేపోయింది


సంబంధం. నాలుగు మాటలూ అడగలేకపోయారా? ఆయన కొడుకొక త్రాష్టుడనే మాట
గుర్తు చేసి రావలసింది. నేను రాజమాత దగ్గరకు పోయి నానామాటలూ తిట్టిరానా?”
“ఆవిడ నిజానికి మహాసాధ్వి. ఆవిడ జైనమతం, ఇంద్రవల్లభుడు శైవ మతం. ఇద్దరి
మధ్యా అంతంత మాత్రమే.”
“కడుపు తీసే మంత్రసానులుంటారు. గుట్టుచప్పుడు కాకుండా తీర్ధయాత్రలు పేరుచెప్పి
ఏదేశమో పోయి పని పూర్తి చేసుకుని వద్దాము.”

172
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“మనం సగం జైనమతం సగం శైవమతం! భ్రూణహత్య చేద్దామంటావా? అది మహా


పాపం!”
“అవును. మనమేమైనా ఆ ఇంద్రవల్లభుడిని హత్య చేయగలమా కర్కవల్లభుడిని చేయ
గలమా. ఉగ్రాణాలు నిండిపోయేటంత ధనం కూడపెట్టాము. ఏంలాభం?”
“నీవేదో నామనసులో గుచ్చుకునేమాట అన్నావు. అమ్మాయి అభిప్రాయం కూడ
తెలుసుకో! ”
“ఏమిటీ కర్కవల్లభుడ్ని హత్యచేయడం విషయంలోనా?”
“నా బొంద! నీ తెలివి తెల్లారినట్లే వుంది.”
“వసు అతగాడిని ఎంతగానో మోహించింది. అవతలివాడు త్రాష్టుడైతే అదేంచేస్తుందీ?
తన ప్రియుడ్ని చంపమని చెబుతుందా?”
“నన్ను చంపమను! పీడాపోతుంది.”
“మీరేమైనా పగతీర్చుకునేటంత మొనగాళ్ళా? ఏదో బాధపడిపోతున్నారు!”
“ఓసీ! నీవు నాలో పగ రేపుతున్నావు కాని ఉపాయం చెప్పటం లేదు. చంపలేకపోయి
నా చంపించడం అంత కష్టమైన పనికాదు. డబ్బుతో కాని పని ఉండదు. ఈ ఆంధ్రశ్రేష్ఠి అంత
చేతకానివాడు కాదు.”
“మీరా శిరః ప్రధాని రేవాదాస దీక్షితుడిని కలుస్తే?”

“ఆయన పెద్ద సాంప్రదాయవాది. గర్భవతిని కోడలిగా తెచ్చుకోమని రాజుగారికి


చెబుతాడా? అంతకన్నా ఎవడో ఒకడు దారినపోయే దానయ్య. మనకులం వాడు దొరక్క
పోతాడా! పెద్ద వ్యాపారం పెట్టిస్తాం! పెట్టుబడిస్తాం!”

“కానీ అదొప్పుకోవద్దూ?”

“ఎద్దునడిగి గంత కట్టాలంటే వ్యవసాయం సాగుతుందా? నీవే ఒప్పించాలి! మెడలు


ఒంచి పెళ్ళిచేయాలి!”

“ముందు చేసుకునేవాడు కనిపిస్తే మెడలు వంచగలమో లేదో తెలుస్తుంది. ఇప్పడి


నుంచే దాన్ని ఏడిపించడం దేనికీ? ఎవరేనా పంతులును సంప్రదించండి.”

“అదే ప్రయత్నంలో వుంటాను. నా తోబుట్టువుల కొడుకులు చాలామందే వున్నారు.


ఎవడేనా చేసుకుంటాడేమో కదిపిచూస్తాను. ఒక్కసారి బిందుఋషిని కలుస్తాను. ఆయన
ఏమంటాడో వింటాను”అన్నాడు గోమఠేశ్వరయ్య.

173
  చాళుక్యసింహాసనం

28 కమలహితాదేవి
పురోహితులు మాన్యకేతేశ్వరాలయంలో అందరికీ జపాలు హోమాలు జరిపిస్తుంటారు.
గోమఠేశ్వరయ్య శివ దర్శనానికి వెళ్ళాడు. అర్చనాదికాలు ముగిసిన తరువాత ప్రధాన
అర్చకుడు బిందుఋషి గోమఠేశ్వరయ్యను దూరంగా తీసుకువెళ్ళాడు. ఇద్దరూ ఆలయ
ప్రాకార మంఢపంలో ఓప్రక్కన కూర్చున్నారు.

“మహాత్మా! మీ ఆరోగ్యం బాగుంటోందా? చాలా బడలిపోయినట్లున్నారు” అన్నాడు


గోమఠేశ్వరయ్య.
“సెట్టీ! వయసు మీదపడుతోందయ్యా. శివుడు కూడా రమ్మంటున్నాడు.” అన్నాడు
బిందుఋషి.
“అయ్యా మీవంటి మహనీయులు నిండా నూరేళ్ళు బ్రతకాలి!”
“అంతకాలం వద్దయ్యా!”
“ఏమిటి మహర్షీ ఇవాళ అలా అంటున్నారు?”
“ప్రతివాడూ ఏవేవో పాపాలు చేస్తాడు. అవి పోవడానికి నన్ను అర్చన అభిషేకాలూ
చేయమంటాడు. అవి పోవు. అక్కడినుంచీ అసంత్రుప్తి!”

“మహాత్మా! నాకు తెలీక అడుగుతాను, అభిషేకాల వలన పాపాలు పోవా?”

“పాపాలు మూడు రకాలుగా ఉంటాయయ్యా! సంచితము ఆగామి ప్రారబ్ధము అని.


అందులో ఏంచేసినా ప్రారబ్ధము పోదు. అది అనుభవించాల్సిందే! ఇవాళ కమలహితాదేవి
ఆలయానికి వచ్చింది. ఏవో జపాలు హోమాలు చేయించమంది. నావలన కాదు వేరేవారిని
చూసుకోమన్నాను. నీకు కమలహితాదేవి తెలుసుకదా?”
“ఏదో గొడవ జరుగుతోందని విన్నాను. కానీ ఆమె నెపుడూ చూడలేదు.”
“అదృష్టవంతుడివి. ఆ ముఖం చూడకుండా వుండడమే మంచిది!”
“ఏమీ అంత భయంకరంగా ఉంటుందా?”

“అందంలో అప్సరస! రతీదేవి! కానీ కొన్ని అడవిపూలు రంగురంగులుగా ఆకర్షణీ


యంగా వుంటాయి. అవి పూజకు మాత్రం పనికిరావు. వాటి పరిమళగంధం భరించలేము.
ఆమెను చూస్తే నీవు కూడా ఆకర్షణలో పడతావు. మగవాళ్ళ మనసు దోచుకునేదిగా
వుంటుంది.”
“ఆవిడ జగతీంద్రవర్మ భార్యకదా?”
“భార్యా నాబొందా! దండయాత్రకు వెళ్ళినపుడు ఎత్తుకు వచ్చాడు. ఆమె బ్రహ్మజాయ!”

174
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“మహాత్మా! బ్రహ్మజాయ అంటే?”


“బ్రాహ్మణుని భార్య!”
“జగతీంద్రవర్మ బలాత్కరించి తీసుకువచ్చాడా?”
“లేదు. ఆమె ఇష్టపడే లేచిపోయి వచ్చింది. ఇప్పుడు లీశోత్తరదీక్షితుని కామిస్తోంది.”
“ఇదేమిటీ?”
“జగతీంద్రవర్మ సేనాపతి. ఈయనేమో మహాసైన్యాధిపతి!”
“ధనం కోసమా?”
“కాదు కామం!ఈమొక పుంశ్ఛలి. జగతీంద్రవర్మ దండయాత్రకు వెళ్ళి తిరిగి
రావడానికి తొమ్మిది నెలలు పట్టింది. ఈలోపున ఊరికే ఉండడం దేనికని లీశోత్తరదీక్షితునితో
జత కట్టింది.”
“ఇది ఘోరం కదా?”

“కామం మోహం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదయ్యా! ఇప్పుడు


జగతీంద్రవర్మను మళ్ళీ వేంగిమీద దండయాత్రకు పంపించాడు లీశోత్తరదీక్షితుడు. కానీ ఈ
దీక్షితుడు ఏమో అనుకుంటున్నాడు. బ్రహ్మజ్ఞుల నాలుక వింటినారి. వాక్కు ధనుస్సు. వాళ్ళ
దంతాలే బాణాలు. అవి రాజుల్నేకాదు దేవతల విరోధుల్ని కూడా వధించగలవు. వాళ్ళ
శాపమనే శరాలు అగ్రేవధాయచ దూరే వధాయచ అని ఎంత ఉన్నతుల్నయినా
ఎంతదూరంలో వున్నవారినైనా వధించగలవు.”

“ఋషీ! నాకు తెలీక అడుగుతాను. మన ఆర్యసంస్కృతి వేశ్యల్ని నిషేధించలేదు. పైగా


ఉత్సవాలలో శుభకార్యాలలో వేశ్యల పాత్ర నంగీకరించింది. మరి స్త్రీ సంగమం పాపమా
పుణ్యమా?”
“సెట్టీ! నేను చెప్పేదేమిటీ ఆ భగవానుడే కృష్ణరూపంలో చెప్పాడు.
‘అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే అశుచౌ’ ”
అన్నాడు బిందుఋషి.

“ఋషీ! పాపమేదో పుణ్యమేదో తెలియక చేసినవారుంటారుకదా! వారి సంగతేమిటీ?”


అన్నాడు శ్రేష్ఠి. బిందుఋషి ఏ అక్రమాన్నీ సహించే మనస్తత్వం కలవాడు కాదనితెలిసింది.
తన కుమార్తె విషయం నేరుగా చెప్పలేక ఈ చివరి ప్రశ్న వేశాడు.

“సెట్టీ! నిప్పును తెలిసి ముట్టుకున్నా తెలీక ముట్టుకున్నా కాలుతుందికదా! అందుకే


175
  చాళుక్యసింహాసనం

మనిషి ఏపనైనా వివేకం ఉపయోగించి చేయాలి. ఎవరైనా నరకంలో ఎందుకు పడతారూ?


త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః
కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్
అన్నాడు పరమాత్మ.”
ఆంధ్రశ్రేష్ఠి ఇంకా ఏమీ మాట్లాడలేక తల వంచుకుని ఇంటికి తిరిగి వచ్చాడు.

*****

లీశోత్తరదీక్షితునికి కమలహితాదేవిపై మోహం పెరిగిపోయింది. ఇరువురూ


సందేశాలు పంపుకుంటున్నారు. కోటలో కలుసుకోవడం కుదరటంలేదు. లీశోత్తరదీక్షితుడు
ఉపాయం ఆలోచించాడు.

ఒకనాడు కమలహితాదేవి రాజమాత అయ్యణమహాదేవితో పార్శ్వనాధాలయానికి


బయలు దేరింది. అందరూ పాదచారులై నడుస్తున్నారు. పరిచారికలు నూలుకుంచలతో
బాట ఊడుస్తున్నారు. కోట దాటారు. దిగంబర జైన వనిత లందరూ పాటలు పాడుకుంటూ
ఒక గుంపుగా వెళుతున్నారు. దిగంబరులతోపాటు అంబరధారులు కూడా వున్నారు.
అందులో కమలహితాదేవి ఒకతె.

కమలహితాదేవి ప్రక్క సందులోకి తప్పుకుంది. నిజం చెప్పాలంటే కుంటెనకత్తె అటు


లాగింది. తలపైగా శాలువా కప్పుకుంది. లీశోత్తరదీక్షితుడు పంపిన గూడు బండీ సిద్ధంగా
వుంది. తెర దించారు. బండీ కదలి వెళ్ళింది.బండి వెంట ఎవరో నీడలా కదిలారు.

బండీ ఒక ఆవరణ లోకి ప్రవేసించింది. అందులో ఆ మందిరం చాలా అందంగా


అలంక రించబడి ఉంది. పందిరి పట్టెమంచాన్ని చాలా పూలతో అలంకరించారు. అగరు
ధూమాలు సువాసనలు చిమ్ముతున్నాయి. అది జాణవాడ.

“ఏమిటీ ఇంత ఆలస్యం? నేను ఎంతసేపటి నుండీ నిరీక్షిస్తున్నానో తెలుసా?” అన్నాడు


దీక్షితుడు కమలహితను దగ్గరకు తీసుకుంటూ.

“మరీ అంత ఆత్రమా! మీకు నిగ్రహం సాధన చేయమని చెప్పానా?”అన్నది కమలహిత


బాహుబంధాలనుండీ విడిపించకుంటూ చిరుకోపంతో.

“నిగ్రహమా! నా వల్లకాదు. నిన్ను చూస్తేనే చలించిపోతాను. ఇంకా తాకిన తవాత....”

“నిగ్రహము అనుగ్రహము రావాలంటే పరమశివుణ్ణి ధ్యానించండి.”

176
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“మనం చేసే ఇంతటి పవిత్ర కార్యాల మధ్య ఆయనెందుకూ?”

“ఈ రెంటిలోనూ ఆయన్ని మించిన దైవం లేడు!”

“నిగ్రహం కోసం ఆయనలాగా భస్మం రాసుకుని స్మశానంలో కూచోమంటావా? మరు


భూమి లో కూచున్నంత మాత్రాన వైరాగ్యం వస్తుందంటావా? నీవు వస్తానని రాకపోతే నేను
పడే బాధ ఆ పరమేశ్వరుడికే తెలుస్తుంది!”

“మీరు పిల్లనగ్రోవి ఊదగానే రావడానికి నేను గోపికనా? నేనొక మానవ కాంతను.


రాజ మాత అయ్యణమహాదేవి ఆరోగ్యం బాగాలేక గుడికి ఆలస్యంగా బయలుదేరారు. నేనేం
చేయనూ?”

“ఎప్పటినుంచో నీకోసం పూలపాన్పు ఎదురుచూస్తోంది. సరోజాలు


వాడిపోతున్నాయి!”

“ఓహో! పురుషులలో కూడా విరహాంతరితలు ఉంటారనమాట!”

“మరి అభిసారిక రావడం ఆలస్యమయితే విరహం అతిశయించదా? మనం కలిసి


మూడు వారాలయింది తెలుసా?”

“మాటలేనా చేతలేమైనా ఉన్నాయా? అవతల నేను వెళ్ళాలి! నేను మాటలకోసం కాదు.


మగాడికోసం వచ్చాను!”

“మాకు తెలీదులే! పేరంటానికి వచ్చావనుకున్నాను. నన్ను నిగ్రహించుకోమన్నావు.


మరి నీవూ? కొంచం కూడా తాళలేనిదానివి ఆ రాతికోటలో ఎలా వుంటున్నావు?”

“నిజం చెప్పాలంటే విరహంతో మగ్గిపోతున్నాను.మధువు చేదవుతోంది. మల్లెలు


ముళ్ళవుతున్నాయి. పంజరంలో చిలుకల గవ నన్ను వెక్కిరిస్తున్నాయి. వాటి స్వేచ్ఛ
నాకెక్కడిదీ? ఇంటిముందు ద్వారపాలకులూ వీధిలో తలవరులూ నాచుట్టూ రాతిగోడలూ నా
పని పంజరంలో చిలకల కన్నా అధ్వాన్నంగా వుంది. పగటి సూర్యుడే నయం. కోరికల
గుఱ్ఱాలను అదుపుచేస్తాడు. రాత్రవుతే చాలు రతిరాజు బాణాలూ రేరాజు కిరణాలు అబలను
చేసి నన్ను ఓడిస్తున్నాయి. చీకటి ముసుగులో ఒళ్ళు వంకరలు తిరిగిపోతోంది.”

“మరి అందుకే ఏదైనా ఉపాయం ఆలోచించు!”

“ఆడదాన్ని! ఏం ఉపాయం చేయగలనూ? మగాళ్ళు మీరే చేయాలి. వేళవుతోంది.


తిరుగు ప్రయాణంలో రాజమాత భక్తబృందంలో కలిసిపోవాలి.”

177
  చాళుక్యసింహాసనం

“ఓహో! మహా భక్తురాలివి! భక్తబృందంతో కలిసిపోతావా? కమలహితా! నీవసలు ఏ


సానికొంపలోనో పుట్టవలసినదానివి. నీమీద మహేంద్రుడి కన్ను పడితే అహల్య జోలికి
పోయేవాడేకాదు తిట్లు తినేవాడూ కాదు.”

“అమరేంద్రుడిలాంటి మీరుండగా మరొకరెందుకూ? కానీ అమరేంద్రుడిని మీరు ఆక్షే


పించారే అది తప్పు. ఆయన దేవ హితార్ధబుద్ధిమై ఆ పనిచేశాడు. లలితాపరమేశ్వరి కూడా
ఎందుకు అవతరించిందీ. చిదగ్ని గుండ సంభూతా దేవకార్య సముద్యత.

ఈ కాలం ఇలాగే ఘనీభవించిపోతే బాగుండును. మనిద్దరం ఈ ఆనందభంగిమలో


ఘనీభవించి శిలలై శాశ్వతమైపోతే బాగుండును. మీ విరహం నాకూ దుస్సహంగా ఉంది.
ప్రతిసారీ కావలివారి కన్నుకప్పి అంతఃపురాంగనల మర్యాదలు మంటకలిపి ఇలా రావడం
కుదరదు! అప్పుడప్పుడూ నన్నెవరో వెన్నంటి గమనిస్తున్నారనిపిస్తోంది.”

“నాకూ అలాగే వుంది కమలా! ఏంచేద్దామంటావ్?”

“ఇద్దరం ఎక్కడైనా దూరతీరాలకు పారిపోదాం.”

“ఈ వయసులోనా! అలా కుదరదు కదా! నేనిక్కడ మహా సేనాధిపతిని. నీవేమో రాజ


కాంతవి. నీ నివాసం కోటలోంచీ మార్చు.”

“ఎలా మార్చమంటారూ? ఆయన ఒప్పుకోవద్దా?”

“నీవు మహా పతివ్రతవు కదా! భర్త మాట జవదాటవు. నీవేమీ భయపడకు. జగతీంద్ర
వర్మని కొంతకాలం దండయాత్రలకు పంపిస్తాను.” అన్నాడు లీశోత్తరదీక్షితుడు.

“నేను పతితనో పతివ్రతనో! మరి నాతో కలిసే మీరేమిటీ? రొంపిలో దిగింతరువాత


బురద మీకైతే అంటదు మాకైతే అంటుతుందా?”

“ఒప్పుకుంటాను చెలీ! ఈ పనిలో మనమిద్దరమూ తోడుదొంగలమే!” అన్నాడు మహా


సైన్యాధిపతి.

కమలహితాదేవి తననుతాను సవరించుకుని కుంటెనకత్తెమదాలస


వెంటవెళ్ళిపోయింది.

29 భ్రూణము
గోమఠేశ్వరయ్య కూతురు విషయం ఏమీ పాలుపోక శతావరి ఆశ్రమానికి వెళ్ళాడు.
అప్పటికి ఆచార్యుడు ఏదో వైద్యం కోసం హోమకార్యక్రమంలో నిమగ్నుడై ఉన్నాడు. శిష్యులు
178
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

శ్రేష్టిని వేచివుండమన్నారు. ఊరికే కూర్చోలేక గోమఠేశ్వరయ్య కాలుకాలిన పిల్లిలా


ఆశ్రమమంతా తిరగసాగాడు.

ఆశ్రమం చాలా పెద్దదయింది. ఆవరణలో ఎన్నో కుటీరాలున్నాయి. ఎక్కడికక్కడ


హోమ గుండాలు తాంత్రిక సామగ్రి వుంది. ఆశ్రమానికి ఒక వంక పొరుగూళ్ళనుంచి
వచ్చినవారికి ఉండడానికి పందిళ్ళు పాకలు వున్నాయి. అందులో దెయ్యం పట్టినవారికి ఒక
విభాగం పిచ్చిపట్టినవారికి ఒక విభాగం రోగాలను పట్టీ విభాగం అన్ని ఏర్పాట్లు ఉన్నాయి.

శతావరి కొందరు దయ్యాలు పిశాచాలు పట్టిన వాళ్ళని అభిమంత్రిస్తున్నాడు. గ్రహ


బాధలు కలవాళ్ళలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రకరకాలుగా ఊగిపోతూ
భయంకరంగా అరుస్తున్నారు. విడిపించుకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. తిరగబడు
తున్నారు. ఆ గోల క్రొత్తవారెవరైనా చూస్తే హడలి ఛస్తారు.

శతావరి జాతవేదాగ్నిలో ఏదో హోమంచేశాడు. ఓ జాతవేదాగ్నీ. నీవు రక్తము తాగు


పిశాచములను మాంసము భక్షించు పిశాచములను మానసికముగా బాధించు దయ్యము
లనూ యాతుధానులను హతమార్చుము. ఈ రోగులను బాధించు పిశాచముల నేత్రము ల
ఊడబెరుకుము. నాలుక పీకివేయుము. గుండెలు బ్రద్దలు చేయుము. బాధితుల ఆరోగ్య
మును పునరుద్ధరించుము. శక్తిసామర్ధ్యములను సోమలత చిగురించినట్లు చిగురింప
జేయుము.

తదాత్మానా ప్రజయా పిశాచా వియాత యన్తా మగదోయమస్తు.

“ఆహా! శతావరీ ఎంత ధైర్యవంతుడవూ! ఎంత ఎదిగావూ! రాష్టకూటుల నెదిరించి


వాళ్ళ నగరంలోనే పీఠం పెట్టావా!” అనుకున్నాడు గోమఠేశ్వరయ్య. ఇంతలో ఆశ్రమవాసి
ఒకడు వచ్చి అయ్యగారు రమ్మంటున్నారు అనిచెప్పాడు.

శతావరి శ్రేష్టికి నమస్కరిస్తూ ఉచితాసనం చూపించాడు.

“శతావరీ! నీవెంత ధైర్యవంతుడివీ! శత్రుదేశంలో ఒంటిచేత్తో ఆశ్రమం నడుపు కొస్తు


న్నావు. వేంగీ నగరానికి పారిపోతావేమో ననుకున్నాను.”

“అయ్యా! విధిని తప్పించుకుని ఎంతదూరం పారిపోగలం? నా జీవనం మాన్యకేతంలో


ఉండగా వేంగీ నగరానికి ఎందుకు వెళతాను? నేను పేదరాశి పెద్దమ్మను చూసి నేర్చు
కున్నాను. అంత ముసలిది ఎంత ధైర్యంగా జీవిస్తోందీ!”

“నీ పరిస్తితి అలాంటిది కాదు. నీవు వీళ్ళకు శత్రువు కదా!”

“అందుకనే నేనిక్కడ ఆశ్రమం పెట్టాను. నేను అధర్వవేదంలో పండితుడిని! పండితుడికి


179
  చాళుక్యసింహాసనం

పరదేశమేమిటీ? నేను వీరికి పక్కలో బల్లెం కాబోతున్నాను. ఇక్కడ నా అవసరం చాలా ఉంది!
మొన్ననే ముఖ్యమైన అంతఃపురస్త్రీకి పాముకరుస్తే వైద్యం చేశాను. చచ్చిపోవల సింది
బ్రతికింది.”

“శతావరీ! వేంగీ విష్ణువర్ధన రాకుమారుడికి వీరవిద్యా ప్రదర్శనలలో సహాయం


చేశానని ఇంద్రవల్లభుడు నాపై కక్ష కట్టాడు. నాకు చాలా కష్టం తెచ్చిపెట్టాడయ్యా.” అన్నాడు
ఆంధ్ర శ్రేష్టి.

వారలా మాట్లాడుతుండగానే ఎవరో స్త్రీ ఖోరంగా రోదిస్తున్న శబ్దం వినిపించసాగింది.


అంతలో ఒక సేవకుడు ప్రవేశించి “అయ్యా! ఎవరో గర్భిణీ స్త్రీ నెప్పులు పడతూ వచ్చింది” అని
తెలియజేశాడు.

శతావరి గోమఠేశ్వరయ్య వద్ద క్షమార్పణ అడిగి ఆ స్త్రీ వచ్చిన చోటికి వెళ్ళాడు. ఆ నిండు
గర్భిణి ప్రసవించలేక రెండు రోజులనుండీ అవస్ధ పడుతోందిట! నెప్పులు భరించలేక గావు
కేకలు పెడుతోంది. బాగా నీరసించిపోయివుంది.

శతావరి ఆ స్త్రీని కుటీరంలో ఆవుపేడతో అలికిన మట్టి అరుగుమీద పడుకో పెట్ట


మన్నాడు.

శతావరి వృద్ధ దాదితో చెప్పి హవనశాలనుండి తెల్లని ఆవాలు పసుపురంగు ఆవాలు


తెప్పించాడు. ఆవాలను మూటకట్టి ఆమె నడుముకు రక్షగా కట్టమన్నాడు. ఆ స్త్రీని తాను ఇలా
అభిమంత్రించాడు.

“ఓ గౌర సర్షపమా! నీవు సగము పుట్టిన బిడ్డను చంపునట్టి గాంధర్వ, రాక్షస,


పిశాచాదులను శూన్యము చేయుము. నీవి బంధమున జేరిన సర్షపమా పాదములు ముఖము
వెనుకకు తిరిగియుండు రాక్షసులను నాశనము చేయుము. పలాల, అనుపలాల, శర్కు,కోక,
మలిమ్లుచ, పలీజక, ఆశ్రేష, వివ్రివాస, ఋక్షగ్రీవ వ్యాధులను దరిజేర నీకుము. ఈమె
ఊరువుల మధ్య సంకోచము కలిగించకుము. లోనికి జేరకుము. ఓ గౌర సర్షపమా. ఈమె
నిరంతర రోదనను, ప్రసవ వేదనను ఉపశమింపజేయుము. సుఖప్రసవను చేయుము.
ఈమెకు పుట్టబోవు ఆడుబిడ్డకు ‘సునామ’ అను పేరు పెట్టు కొనగలదు” అన్నాడు.

శతావరి ఆమెని మంత్రసానులకు అప్పగించి తాను ఈవలకు వచ్చాడు. ఆడుబిడ్డ


జన్మించి కెవ్వున కేక పెట్టినది.

క్షణములలో జరిగిన ఆ వుదంతానికి గోమఠేశ్వరయ్య అప్రతిభుడయ్యాడు. వైద్యంలో


శతావరి ఎంత ఎత్తు ఎదిగాడో అర్ధమయింది. తన సమస్యకు అతడు తప్పక పరిష్కారం
చూపగలడనే నమ్మిక కూడ కలిగింది.

180
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

శతావరి ముఖ హస్తపాద ప్రక్షాళనము చేసుకుని మళ్ళీ శ్రేష్టిని పలకరించ వచ్చాడు.

“శ్రేష్టిగారూ! మీరానాడు సహాయం చేయబట్టే రాకుమారుడు ఈ శత్రుదేశంలో విద్యా


ప్రదర్శనలలో పాల్గొన్నాడు. కానీ భల్లణపోతినాయుడికి మీరే ఆశ్రయమిచ్చినట్లు ఎలా
తెలిసిందీ?”

“శతావరీ! ఏ ఆధారము దొరకలేదు. కానీ వాళ్ళు నామీద అనుమానం తోనే కక్ష


కట్టారు. నేనీనాడు ఒక పనిమీద వచ్చానయ్యా. చెప్పడానికి నాకు బాధగాను వుంది సిగ్గు గాను
వుంది. విషయమేమిటంటే మాఅమ్మాయి వసుమిత్ర రాజకుమారుడు కర్కవల్లభుని
వలచింది. ఇద్దరూ మోహంలో పడ్డారు. కర్కవల్లభుడు ఘూర్జరదేశం వెళ్ళిపోయాడు.

నేను ఇంద్రవల్లభుని వద్దకు సంబంధానికి వెళితే ఆయన తరిమికొట్టాడు. అమ్మాయి


గర్భవతి. నాకేంచేయటానికీ తోచటం లేదు. మా ఆవిడ గర్భవిచ్ఛిత్తి చేయించి వేరేవారికిచ్చి
పెళ్ళిచేద్దామంటుంది. నీదగ్గర అలాంటి ఉపాయం ఏదైనా ఉందా?”

“శ్రేష్ఠిగారూ! మీకు కలిగిన కష్టానికి చాల చింతిస్తున్నాను. ఈ రాష్ట్ర్రకూటులు చాలా


మదించి వున్నారు. గోవింద ప్రభాతవర్ష చక్రవర్తి కాలంలో వీళ్ళ ఆగడాలు అంతాయింతా
కాదు. ఇప్పటికీ అలాగే నడుస్తుందనుకుంటున్నాడు ఇంద్రవల్లభుడు. ఇంద్రవల్లభుడికి సరైన
మగడు సకాలంలో రాబోతున్నాడు. ఇక పోతే నేను భ్రూణహత్యలు చేయను ప్రోత్స హించను
సమర్ధించను.

నేను గౌరీ ఉపాసకుడిని. అందుచేత ఆమె సంకల్పానికి వ్యతిరేకంగా నేనేమీ చేయను.


సంతానానికి సంబంధించి ముగ్గురు దేవతలున్నారు. గౌరి, కాళి,మహాలక్ష్మి! ఇందులో గౌరి,
కాళి ఇద్దరి నివాసము ఒకటే! కానీ ప్రవృత్తులు వేరు. స్త్రీ గర్భస్త శిశువును పెంచి పోషించేది
గౌరీదేవి. సంహారిణి కాళికాదేవి. సంహారిణి అంటే బిడ్డల్ని చంపుతుందని కాదు. స్త్రీ గర్భంలో
ప్రవేసించిన అనేక లక్షల పురుష జీవకణాలు ఆకారం దాల్చాలని ఆరాట పడతాయి.
పాకులాడతాయి. అందులో ఏ ఒక్కటినో కాళికాదేవి అనుగ్రహించి విడిచిపెడితే
జన్మించడానికి అవకాశం లభిస్తుంది. తక్కిన జీవకణాలను నివృత్తి చేసేది కాళి. అందుకే
సంహారిణి. గౌరీదేవే పుట్టే శిశువుకు ఆడ మగ నిర్ణయిస్తుంది. వృద్ధి చేస్తుంది. తన పని పూర్తి
కాగానే బయటికి పంపించి వేస్తుంది. పుట్టిన తరువాత పాలించి పాలిచ్చి పెంచేది పాలకడలి
తనయ లక్ష్మీదేవి!

అలాంటి జీవిని, భ్రూణాన్నీ త్రుంచడానికి మనమెవరిమీ? గర్భవిచ్ఛిత్తికి ఎన్నో


మందులు మాకులు తంత్రాలు ఉంటాయి. కానీ అవి తల్లి ప్రాణాన్ని కాపాడడానికే ఉపయో
గించు కోవాలి. మన స్వార్ధానికి కాదు.

అసలు గర్భవతిని వివాహం చేసుకోవచ్చని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. పుట్టే

181
  చాళుక్యసింహాసనం

శిశువుకు వివాహం చేసుకున్నవాడే తండ్రవుతాడని కూడ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ


తరువాత పుట్టినవాడు నూతన భర్తకు క్షేత్రజుడౌతాడు. అలాంటపుడు గర్భస్రావం అవసరం
లేదు. మీ వైశ్యులలో ఏడువందల పధ్నాలుగు గోత్రాలున్నాయి. మీ శ్రీమతి చెప్పినట్లు ఎవరేనా
యోగ్యుడుకిచ్చి పెళ్ళిచేయండి.

‘అక్షాతాచ క్షతాచైవ పునర్భూః సంస్కృతా పునః’ అని వుంది శాస్రంలో. అందుచేత


అక్షతా క్షత అనేది పెళ్ళికి అభ్యంతరం కాదు. క్షతను కూడ సంస్కారం చేసి పెళ్ళి చేయ
వచ్చు!”

శతావరి ఉపన్యాసం వినేటప్పటికి ఆంధ్రశ్రేష్ఠికి కొండంత ధైర్యం వచ్చింది. వెనుతిరిగి


ఇంటికి వెళ్ళిపోయాడు.

గోమఠేశ్వరయ్యకు కొందరు మేనళ్ళుల్లున్నారు. అందులో తరణిగుప్తుడొకడు.

తరణిగుప్తుడు తన తండ్రీ కలిసి నౌకావ్యాపారం చేసేవారు. కానీ ఒక గాలివానతో కొన్ని


ఓడలు సముద్రంలో మునిగిపోయాయి. దానితో వ్యాపారం కుదేలయింది. అప్పుల
పాలయ్యాడు. తరణిగుప్తునికి తన కూతురునిచ్చి వివాహం చేసి వాళ్ళ వ్యాపారాన్ని
ఆదుకోవచ్చనుకున్నాడు గోమఠేశ్వరయ్య.

వారి మధ్య రాయబారం నడిచింది.

తరణిగుప్తుడు సముద్రయానం ద్వారా దేశదేశాలు తిరిగినవాడు. భరతభూమేకాక


ఇతర భూఖండాలు చూసినవాడు. అందుచేత ఆ వివాహానికి ఒప్పుకున్నాడు. అతడికి అక్షతా
క్షతా పట్టింపు లేదు.

వసుమిత్ర మాత్రం ఒప్పుకోలేదు. తన మనసులోంచి కర్కవల్లభ రాజకుమారుడిని


తొలగించలేనన్నది. మరొకడిని పెళ్ళాడలేనన్నది. చెప్పిచూశారు. వినలేదు.

రాజకుమారి శిరీషకు తన గోడు చెప్పుకోవాలనుకుంది వసుమిత్ర. కానీ రాజకుమారి


తన పరివారంతో ఈలాపురం యాత్రకు వెళ్ళింది. ఆమె తిరిగి రావడానికి ఆరు నెలలు
పడుతుంది.

ఈలోపున కర్కవల్లభుని వివాహం భీమరధీ కుమారితో నిశ్చయం అయింది. భీమరధిని


చేసుకుంటున్నందుకు భీమసలుఖి మహారాజు తన వేంగీ చాళుక్య రాజ్యంలో సగమిస్తా
నన్నాడు.

చివరిసారిగా గోమఠేశ్వరయ్య ఇంద్రవల్లభుని అడిగిచూశాడు. లాభం లేకపోయింది.


రెండవ భార్యగా వసుమిత్రను చేసుకోమని అర్ధించాడు. లాభం లేకపోయింది.
182
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

అంతేకాక ఇంద్రవల్లభుడు తన కుమారుని వివాహం అటు వేంగిలోను కాకుండ ఇటు


మాన్యకేతంలోను కాకుండ వేములవాడ చాళుక్యరాజ్యంలో జరపాలని నిచ్ఛయించాడు.

30 రాక్షస వివాహం
మాన్యకేతనగరంలో నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి. నాటకం దగ్గరనుంచీ
చూడాలని సందర్శకులు ముందే వచ్చి కూర్చున్నారు. దూరంగా కూచుంటే వాచకం సరిగా
వినిపించదని!రాతి సోపానాలతో రంగస్తలం వలయాకారంగా నిర్మించబడింది. స్త్రీలు
పురుషులు వేరువేరుగా వారికేర్పరచిన మెట్లపైన కూర్చుని ముచ్చటించుకుంటున్నారు.
అందువలన గొప్ప గందరగోళం ఏర్పడింది.

జగతీంద్రవర్మ శివమారుడి వేగులతో గట్టిగా చెప్పాడు. ఈమారు లీశోత్తరదీక్షితుడు


కాని కమలహితగాని ఒకరేనా హతమవ్వాలి. లేకపోతే రాజద్రోహంలో ఇరికించి
శిక్షవేయిస్తానని బెదిరించాడు.

నాటి రాక్షసవివాహం అనే నాటకంలో రాష్ట్రకూట ఇంద్రవర్మ పాత్ర మహాసైన్యాద్యక్షుడు


లీశోత్తర దీక్షితుడు పోషిస్తున్నాడు. లీశోత్తరదీక్షితుడు అంత ఉన్నతస్ధానంలో వున్నా
నాటకాలాడడం అంటే ఆయనకు చాలా ఇష్టం. కళాభిమానం అనేది పుట్టుకతోటే వస్తుంది.
రాకుమారి పాత్ర వేయడానికి స్త్రీ ఎవరూ దొరకలేదు. చివరకు రాజకాంతయైన మలహితాదేవి
ఒప్పుకుంది. ఒప్పుకుందంటే నాటకమూ ముందస్తు సాధన పేరు చెప్పి లీశోత్తరదీక్షితుడిని
కలుసుకోడానికి అవకాశం లభిస్తుందని.

కమలహిత అందకత్తేకాక ఆమె వయసు అస్సలు పైకి కనిపించదు. ఆమె మేని సొగసు
చూసినవాళ్ళంతా పరవశించి మన్మధావస్థలోకి వెళ్ళిపోవాల్సిందే. ఆమె హొయలు
ఒలికించడంలో గొప్ప జాణ. .

నాటకం ఎప్పుడూ చెప్పిన సమయానికి ఆరంభంకాదు. ఇది సహజం! జనం పోగు


కావడంకోసం సమయం కాస్త ముందస్తుగానే ప్రకటిస్తారు. మహాజనులంతా నిశ్సబ్దంగా
వుండాలని కొద్ది నిముషాలలో రాక్షస వివాహం అనే నాటకం ప్రారంభమవుతుందని పలు
మార్లు ప్రకటించారు. కానీ ఆరంభం కాలేదు.

అందుకు కారణం అది జానపద నాటకం కావడం వలన కోందరు సైనికులు


రంగస్ధలంపై ప్రదర్శించేందుకు గుఱ్ఱాలు రథము కావాలి. వాటిని సమకూర్చడానికి
ఒప్పుకున్నవారు ఆలస్యంగా వచ్చారు. అసలువారి స్ధానంలో అగంతకులు వచ్చారు.

నాటకం చూడడానికి ఈశ్వరాలయం ప్రధానపూజారి బిందుఋషి ఆయనతోపాటు


బంటు కూడా వచ్చారు. తెరవెనుక నర్తక నర్తకీమణులందరూ ముఖాలకు రంగులు వేసు

183
  చాళుక్యసింహాసనం

కుంటున్నారు. ఆంఖికం రంగాలంకరణ గ్రీకుదేశం శైలూషకులు అధ్భుతంగా రచించారు.

భారతీయులు గ్రీకుదేశీయులు తత్వశాస్త్రము, జ్యోతిషము, శిల్పకళ, నాటకకళ


ఇచ్చుపుచ్చుకున్నారు.

జానపద నాటకం కావడంతో జీలుగుబెండుతో ఆయుధాలు సిద్థంచేశారు. అందులో


నిజమైన ఆయుధాలు ఒకటిరెండు జేరాయి.

ప్రయోక్త నర్తకులకు వాళ్ళవాళ్ళ సంభాషణలు వాచకం గుర్తు చేస్తున్నాడు. స్త్రీ పాత్రలన్నీ


పురుషులే ధరిస్తున్నారు. భుకుంశులకు స్త్రీ పాత్రలు ధరించడం అలవాటు. ఒక్క చాళుక్య
రాజకుమారి భావనాగ పాత్ర మాత్రం కమలహితాదేవి ధరిస్తోంది.

బిందుఋషీ బంటూ కాస్త దూరంగా వెళ్లి కూర్చున్నారు. వారిద్దరిమధ్యా సంభాషణ


ఆరంభమయింది.

“అయ్యగారూ! రాక్షసవివాహం అంటే రాక్షసుల మధ్య వివాహమా?” అన్నాడు బంటు


తెలీక.

“రాక్షస వివాహం అంటే ఇందులో నిజం రాక్షసులు వుండరు. మనుషులే రాక్షసంగా


ప్రవర్తిస్తారు. వివాహమండపంలోంచీ పెళ్ళికుమార్తెను ఆమె ఆమె బంధువుల ఇష్టాయిష్టా
లతో పనిలేకుండా ఎత్తుకెళ్ళి వివాహం చేసుకోవడం!”అన్నాడు బిందుఋషి.

“అంటే శ్రీకృష్ణదేవుడు లాగానా? రుక్మణీదేవిని ఎత్తుకొచ్చి పెళ్ళి చేసుకున్నాడు కదా?”


అన్నాడు బంటు.

“అది రాక్షసవివాహం కాదురా! రుక్మణీదేవి మాధవుడిని వరించి సందేశం పంపుతే


భగవానుడు వచ్చాడు. ఆ తరువాత ధర్మంగానే పెళ్ళిచేసుకున్నాడు. ఇది ఉత్తమమైన బ్రాహ్మణ
వివాహాలలోకే వస్తుంది.” సందేహం తీరిందాన్నట్లు అన్నాడు బిందుఋషి.

“అయ్యా! కృష్ణయ్య బ్రాహ్మడు కాదుకదా బ్రాహ్మణం ఎలా అవుతుందీ?” ప్రశ్నించాడు


బంటు అర్ధం కాక.

ఇది కులానికి సంబంధించింది కాదురా! విధానానికి సంబంధించింది. వివాహాలు


ఎనిమిది రకాలుగా ఉంటాయిరా! అగ్నిసాక్షిగా పెళ్ళాడడం బ్రాహ్మణం అంటారు. ఏదైనా
యాగంలోనో యజ్ఞంలోనో కన్యను దానంగా ఇస్తే దాన్ని దైవికం అంటారు. కన్యతండ్రి పాడి
ఆవులు ఎద్దులు లాంటివాటిని పుచ్చుకుని ఆడపిల్లనివ్వడం ఆర్షము అంటారు. కుమార్తెని
యుద్ధంలో ఓడిపోయి అవతలి మహారాజుకో సేనాపతికో బహూకరించడం ప్రాజాపత్యం
అంటారు. రొక్కం రూపంలో ఓలి పుచ్చుకుని పిల్లనివ్వడం అసురం అంటారు. పిల్ల
184
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలతో పనిలేకుండా యుద్ధంచేసి ఎత్తుకుపోయి పెళ్ళి చేసుకోవడం


రాక్షసం. ఎవళ్ళకీ తెలీకుండా అబ్బాయి అమ్మాయి పూలదండలు మార్చుకుని లేదా
ఉంగరాలు మార్చుకుని పెళ్ళి చేసుకోవడం గాంధర్వం. శకుంతల దుష్యంతులు ఇలాగే
చేశారు. ఎనిమిదవది పైశాచికం. కన్య నిద్రలో వుండగా కానీ మత్తుమందు ఇచ్చిగాని
అనుభవించి ఇప్పుడు నా భార్యగా ఉంటావా ఛస్తావా అనడం పైశాచికం.

మనుధర్మశాస్త్రంలో ఎనిమిది రకాల వివాహాలే చెప్పాడు కానీ లోకంలో చెప్పలేనన్ని


సంసారాలు రంకులు వుంటాయి. ఇలాంటి సంబంధాలని మనువు కాదుకదా ఆ
బ్రహ్మదేముడు కూడా ఇదీ అని నిర్ణయించలేడు.

ఇప్పుడు కమలహితాదేవి లీశోత్తరదీక్షితుడినే చూడు” అన్నాడు బిందుఋషి.

ఇంతలో ప్రయోక్త తెర ముందుకు వచ్చి:

ఆర్యులారా కావ్యేషు నాటకం రమ్యం అన్నారు పెద్దలు. పూర్వం మేము రాజశేఖరుడు


వ్రాసిన కర్పూరమంజరి అనే రూపకం ప్రదర్శించాము. ఒక వేదిక మీద భవభూతి రచించిన
మాలతీమాధవం అనే ప్రకరణం ప్రదర్శించాం. ఒకప్పుడు శూద్రకుడు రచించిన
మృచ్ఛకటికం అనే నాటకం ప్రదర్శించాం. భాసుడి స్వప్నవాసవదత్త ప్రదర్శించాము.

ఈ నాటకకళను బ్రహ్మదేవుడే ఋగ్వేదమునుండీ వాచకాన్నీ సామవేదమునుండి


గానాన్నీ యజుర్వేదమునుండీ నటననీ అధర్వణవేదము నుండీ రక్తినీ గ్రహించి నాట్యవేదాన్ని
మనకు ప్రసాదించాడు.

నాటకాలనే అంకాలనుపట్టీ ప్రకరణం, భాణం, ప్రహసనం, డిమం, వ్యాయోగం,


సమవాకారం, వీథి, ఈహామ్రుగం రూపకం అనే పేర్లతో పిలిచేవారు. ఈ ప్రదర్శనలకు
భరతముని కొన్ని నీతినియమాలను నిర్దేశించాడు. కానీ భాసుడు మొదలైన ప్రముఖులే వాటిని
అతిక్రమించారు. నాటకంలో రంగస్ధలంపైన భోంచేయడం స్నానం చేయడం తాళికట్టడం
సంభోగం చేయడం మరణించడం లాంటివి ప్రదర్శించడం నిషేధం అన్నాడు. భరతుడు
నాటకాల ప్రయోజనం గురించి ఇల చెప్పాడు.
దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినామ్
విశ్రాంతి జననం కాలే నాట్యమేతత్ మయాక్రుతమ్

ఇప్పుడు శూద్రకానాట్యమండలి వారిచే రాక్షస వివాహం అనే నాటకం ప్రారంభం


కాబోతోంది. భరతముని సూత్రాలన్నీ పాటించలేకపోతున్నందుకు పండితులైన ప్రేక్షకులు
మమ్ము మన్నిం తురు గాక. ఈ నాటకానికి కథాక్రమం బెట్టిదనినా........” అంటూ ప్రయోక్త
ప్రక్కకు తప్పుకున్నాడు.

185
  చాళుక్యసింహాసనం

తెరవెనుక నుండి నర్తక నర్తకీ మణులందరూ చేసే దేవతాస్తుతి వినిపిస్తోంది. వారు


పరబ్రహ్మను పరమేశ్వరుడినీ పురుషోత్తముడైన వాసుదేవుడినీ స్తుతించారు. హారతి నిచ్చారు.
తెరలేచింది. రంగం పైకి పదహారు మంది నర్తక నర్తకీమణులు వచ్చారు. లీశోత్తర దీక్షితుడు
శంకరుడి వేషం వేశాడు. కమలహిత ఉమాదేవి పాత్ర ధరించింది. అందరూ కలిసి ద్రవిడ
సంప్రదాయంలో భరతనాట్య యుక్తంగా ఒక శ్లోకం అభినయించారు.
ఆంగికం భువనం యస్యా వాచికం సర్వ వాగ్మయం
ఆహార్యం చంద్ర తారాదీ తం నమః సాత్వికం శివం.

భరతనాట్యం కాగానే తెర పడింది. తెరముందుకు వచ్చారు శంకంభట్టు చారువాకుడు


అనే సూత్రధారులు. ఇద్దరూ కలిసి హాస్యరస ప్రధానంగా కథసూచకంగా నాందీ ప్రస్తావన
చేశారు.
“అరేయ్ పులుసువాకుడా!” అన్నాడు శంకంభట్టు.
“పులుసువాకుడా దప్పళం వాకుడా అంటే మూతి పగుల్తుంది.” హెచ్చరించాడు
చారువాకుడు.

“మరేమనాలిరా? చారువాకుడా బదులు బులుసు వాకుడా అన్నాను. చారుకీ పులుసుకీ


పెద్ద భేదం లేదుకదా! నీళ్ళెక్కువపోస్తే చారు లేకపోతో బులుసు! కాస్తచిక్కగా ఉంటావని
పులుసువాకా అన్నాను.”

“చారు అంటే చారుకాదురా సన్నాసి! చారు అంటే అందమైన అని అర్ధం.”

“మరినీ ముఖంచూస్తే అలాలేదే!”


“నాముఖానికేం చంద్రబింబంలా వుంది!”
“చంద్రబింబంలాగానా? నీళ్ళకాగు బోర్లించినట్లుంటేనూ!”
“అమ్మావాస్య నాటి చంద్రుడు ఎట్టా వుంటాడమ్మా? చెప్పమ్మా!”
“ఓహో అలాంటి చంద్రుడివా! సరేలే! నీ మొహం నా మొహంలావుంది. మనం ఇక్క
డుంది మన మొహలగురించి కాదు. చాళుక్యసింహం ముసలిదై పోయింది....”
“ముసలిదైందా బక్క చిక్కిందా?”
“పోనీ అలాగే అనుకో! ఒకప్పుడు దక్షిణాపధాన్నంతా తన చేతికిందికి తెచ్చుకున్న
రెండవ పులకేశి వంశం ఇప్పుడు చులకనైపోయింది. బాదామినేలే చాళుక్యకీర్తివర్మ బక్క చిక్కి
పోయాడు.”
“అరే శుంఠా, ముందర దేశకాలాలు చెప్పరా. బాదామి అంటే అదెక్కడుందీ. కీర్తివర్మ

186
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ఎవరూ?” అన్నాడు చారువాకుడు.


“అట్టా అంటావా, అమ్మావాస్య చంద్రుడా! పూర్వం శాలివాహనశకం 466లో
బాదామి రాజధానిగా పులకేశిమహారాజు చాళుక్య రాజ్యాన్ని స్ధాపించాడు.”
“పుల్లకేసి తియ్యకేశి ఇదేం పేరురా నాయనా!”
“పుల్లకేశి కాదురా పిచ్చివెధవా! పుల అంటే గొప్ప. కేసి అంటే కేసరి. అంటే సింహం.
ఆయన చాళుక్య సింహమై పరిపాలించాడు.”
“మరినీవు బాదామి ఎక్కడుందో చెప్పలేదురా!”

“నీకన్నీ శంకలే. అసలు నాపేరుకాదు నీపేరు శంకంభొట్లు అని పెట్టాల్సింది! కర్ణాట


భూమిలో మాలప్రభనదీ తీరాన వెలసిన నగరం బాదామి. ఇది గొప్ప పర్వతదుర్గం. దుర్గానికి
తూర్పుదిక్కున మహాకూటపర్వతాలున్నాయి. దగ్గరలో నదికి దిగువన పట్టడ కల్లు ఐహోలు
నగరాలున్నాయి. ఈ వంశంలో రెండవ పులకేసి మహారాజు భరతభూమిలో విజయ
దుందుభులు మోగించాడు. ఉత్తరాన హర్షచక్రవర్తినే తిప్పికొట్టాడు.

ఈ వంశంలో రెండవ విక్రమాదిత్యుని కుమారుడైన కీర్తివర్మ శాలివాహన శకం


675లో సింహాసనమెక్కాడు. కానీ ఒకవంక కాంచీ పల్లవులు మరొక ప్రక్క దక్షిణంలో నూలు
పుంజం రాష్ట్ర్రకూట సామంతులు పక్కలో బల్లెమై కూర్చున్నారు.”

“ఆపాపు. శాలివాహనుడంటే ఆ కుమ్మరివాడేనా?”

“కాదురా పిచ్చవెధవా!ఆంధ్ర శాతవాహన చక్రవర్తుల పేరుమీద ఒక శకం ఆరంభ


మయింది. ఖరనామసంవత్సరంలో బాదామిని పరిపాలించే కీర్తి వర్మ చక్రవర్తి తన కుమార్తె
భావనాగ వివాహం తలపెట్టాడు.”

“ఓహో! అయితే మనకు మృష్టాన్న భోజనమనమాట!”

“పిచ్చవెధవా! ఇది ఇప్పటి సంగతి కాదురా. ఆ పులిస్తరాకులు కూడా ఎప్పుడో కాల


గర్భంలో కలిసి పోయాయి. ఎప్పుడో జరిగిపోయిన కథ. అందాల సుందరి భావనాగను
జయపురమును పాలించు నలమహారాజు పుత్రుడికి ఇవ్వాలనుకున్నాడు కీర్తివర్మ
మహారాజు.”

“అనుకున్నాడు. అంటే ఇవ్వలేదనే కదా!”

“ఆగరా సన్నాసి! నన్ను చెప్పనీయి. కైరా నగరంలో గొప్ప వివాహవేదిక ఏర్పాటు


చేశారు. పెళ్ళికుమార్తె కళ్యాణ మండపంలోకి మేడపైనుండి దిగివస్తోంది. మన రాష్ట్రకూట
రాకుమారుడు కర్కవల్లభుని కుమారుడు ఇంద్రవల్లభుడు ఏంచేశాడో తెరతీయగానే చూడు.”
187
  చాళుక్యసింహాసనం

అన్నాడు శంకంభట్టు.

(సూత్రధారులు చారువాకుడు శంకంభట్టు ప్రక్కకు తప్పుకున్నారు. తెరతొలగింది.


తెరవెనకనుంచి మంగళ తూర్యారవాలు వినిపిస్చున్నాయి.

అది పెళ్ళికుమార్తె అంతఃపురం గది. రాకుమారి భావనాగ మంగళాస్నానం చేసి తెల్లని


వలిపం వంటికి చుట్టుకుని రంగం మీదికి వచ్చింది. ఆమె సౌందర్య ప్రదర్శనకు ప్రేక్షకులు
ఘొల్లున నవ్వారు. చెలికత్తెలు ఆమె కడ్డంనిలబడి ఒళ్ళు తుడిచి బంగారు పట్టుచీర కట్టడం
ఆరంభించారు.

మాటునుండీ గమనిస్తున్న జగతీంద్రవర్మకు ఒళ్లు మండిపోయింది. పళ్ళు పటపటా


కొరికాడు. తాను నియమించిన హంతకులు నాటితో ఆమెను కడతేరుస్తారనే ఆశతో కాస్త
ఊరడిల్లాడు.

రాకుమారి చెలికత్తెలలో ఒకతె బంగారు జడ వేస్తోంది. ఇంకొకతె అంగరాగాలద్ది


మకరికా రేఖలు తీర్చి చను కంచుకం తొడిగి వెనుక దూముడి వేసింది. కొందరు నగలు
ఏరిఏరి అలంకరిస్తున్నారు. ముఖాన కళ్యాణతిలకం దిద్దడంతో అలంకారం ముగిసింది.
రాకుమారికి ముకురం చూపించారు. కొంచం అలంకరణ సరిదిద్దారు. రాకుమారి అద్దంలో
అలంకరణ సరిచూచుకుని ఒక్కసారి ఎదురు రొమ్ము విరుచుకుంది. వెనుక కంచుకం
దూముడి జారిపోయింది. ప్రేక్షకులందరూ మళ్ళీ ఘొల్లున నవ్వారు. రాకుమారిని
అలంకరించిన చెలికత్తెలందరూ ఆడవేషం వేసిన మగవాళ్ళే.

ఆ అంకంలో పాత్రలేవీ మాట్లాడే అవకాశం లేనందున అంతా మూగనాటకం


లాగేసాగింది.

రెండవ అంకంలో వేదిక రెండుగా విభజించబడింది. ఒకప్రక్క చెలికత్తెలతో కూడి


పెళ్ళికుమార్తె నాట్యం, ఇంకోప్రక్క పురోహితుల సూక్తపఠనం, పెళ్ళిహడావిడి ప్రదర్శించారు.

ఒకప్రక్క వివాహవేదికపై పెళ్ళికొడుకు నలపుత్రుడు అందాలరాశి భావనాగను ఎప్పుడు


చూస్తానా అని ఉవ్వెళ్ళూరుతూ కూర్చున్నాడు. అతడంతకుముందు పెళ్ళికూతురును
చూసింది లేదు. వధూవరు లిద్దరికీ చిత్రపటాలు చూపించి పెళ్ళిచేస్తున్నారు.

సదస్యులందరూ గొప్పగొప్ప ఆభరణాలు దుకూలాలు ధరించి తలపాగలు చుట్టుకుని


వచ్చారు. కన్యామణులు వచ్చినవారికి మధుర పానీయాలు ఫలహారాలు అందిస్తున్నారు.
మొగలిరేకుల వింజామరలు వీస్తున్నారు.

ముహూర్తసమయం ఆసన్నమవుతోంది. పురోహితులు తొందరపడుతున్నారు. పెళ్ళి


కూతురు ఆగమనానికై అందరూ నిరీక్షిస్తున్నారు.
188
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

కడలిరేని కన్య పాల నురుగు తరంగాలపై అడుగులు వేసుకుంటూ నడిచివచ్చినట్లు


ఆంతఃపురం నుండి పెళ్ళికూతురు సాలంకృతయై మణిమయ కనకాభరణ భూషితయై
సర్పాకార మార్గం పై నుండి మెల్లమెల్లగా దిగిరావడం ఆరంభించింది. ఒక చెలికత్తె బరువైన
బంగారు జడను వెండి పళ్ళెరంలో పెట్టుకుని వెనక నడుస్తోంది. చెలికత్తెలు పైన ముత్యాల
గొడుగు పట్టారు. నెమలి ఈకల విసనికఱ్ఱలతో విసురుతునేవున్నారు. పెళ్ళికుమార్తె సన్నని
నడుముకు మణిమేఘల మెరుస్తోంది. రాచకన్య భావనాగ చేతులో కొబ్బరి బోండంతో
మదిలో మధురవూహాతరంగంతో పెళ్ళికొడుకు నలపుత్రుని ఓరగానైనా చూడాలనే ఆతృతతో
కదలివస్తోంది. బుగ్గలపై సిగ్గుల దొంతరలు మల్లెమొగ్గల్లా విచ్చు తున్నాయి.

పెళ్ళి సందడిగా వుంది. పురోహితులు లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం అంటు


న్నారు. పెళ్ళి కుమార్తెమాత్రం పురూరవుడిని జేరవచ్చే ఊర్వశిలా వుంది. వింజామరల గాలికి
ఉత్తరీయం అప్పుడపుడు తప్పుకుంటోంది. కన్యమాత్రం కనకధార లాగే ఉంది. నిజంగా
ఆనాటి భావనాగ అందంగా ఉందోలేదో తెలియదు కానీ ఈ కమలహితాదేవి మాత్రం
అంతకన్నా మించేవుంది.

ఒక్కసారిగా కళ్యాణ మంటపంలో కలకలంరేగింది. కూర్చున్న ఆహూతులలో


కొందరు పైకిలేచారు. కత్తులు దూశారు. ముందది నాటకమే ననుకున్నారు.

మారువేషంలో వున్న రాష్ట్ర్రకూట రాజకుమారుడు ఇంద్రుడు ఒక్కసారిగా పైకిలేచాడు.


తలపాగను పీకి అవతలపారేశాడు. ఒరనుండీ అధ్భుత ఖడ్గాన్ని సఱ్ఱున బయటికి లాగాడు.
అందరినీ తోసుకుంటూవెళ్ళి అమాంతం పెళ్ళికూతురు భావనాగను వాటేసుకున్నాడు.
నడుము చుట్టూ చేయివేసి ఒక్కచేత్తో ఎత్తి భుజాన వేసు కున్నాడు.

పెళ్ళికూతురు కెవ్వున కేకవేసింది. రాచకాంతలు అయ్యో అయ్యో దారుణందారుణం


అని ఏడ్చేస్తున్నారు. పెళ్ళికొడుకు నలపుత్రుడుకూడా కత్తిపట్టి పైకిలేచాడు.

నాటకంగా సాగవలసిన యుద్ధం నిజంగానే సన్నద్ధమయింది. అంకం మారింది.


సంకుల సమరం చెలరేగింది. జగతీంద్రవర్మ నియమించిన హంతకులు లీశోత్తరదీక్షితునిపై
విరుచుకు పడ్డారు. లీశోత్తరదీక్షితుడు కుహనా వేషధారుల్ని వెంటాడి తెగనరికాడు.

కళారంగం కళంకితమయింది. రక్తం చిందింది. రణరంగ మయింది. హత్యాయత్నం


విఫలమయింది.

నిజం తెలుసుకున్న ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. జగతీంద్రవర్మ ముఖంలో


కత్తివేటుకు నెత్తురుచుక్క లేదు. ఛా ఈసారిగూడ తప్పించుకున్నాడా అనుకున్నాడు.
నాటినాటకం అర్ధాంతరంగా ముగిసింది.

189
  చాళుక్యసింహాసనం

31 ఐదవనెల.
వసుమిత్రను చేసుకోవడానికి అంగీకరించిన తరణిగుప్తుడు మాన్యకేత నగరంలో మేన
మామ ఇంట్లో దిగాడు. వసుమిత్రకు భయంభయంగా వుంది. ఆమె మనసులో కర్క వల్లభుని
ముద్ర పడిపోయివుంది. కర్కవల్లభ రాకుమారుడికి తను గర్భవతిననే విషయం తెలుసునో
లేదో! అతడు తనను గుర్తుపెట్టుకున్నాడో లేదో! ఇంద్రవల్లభుడు ఈ సంబంధ విషయం
రాకుమారుడికి తెలియజేశాడో తనే తిరస్కరించాడో! అన్నీ సందేహాలే! ఒక్కసార యినా
తాను కర్కవల్లభునికి ఎదురుపడే అవకాశం రాలేదు. ఎదురు పడితే? మనసులో ఏ మూలో
ఆశవుంది.

వీలు చూసుకుని తరణిగుప్తుడు వసుమిత్రతో “మామయ్య నాకన్ని విషయాలు చెప్పారు.


వసుమిత్రా! నిన్ను నేనేమీ జాలితో చేసుకోవటం లేదు. నేను సముద్రయానంతో దేశదేశాలు
తిరిగివచ్చాను. ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు ఆచారాలు చూశాను. మనం ఒకేదేశంలో
పాతుకుపోవడం వలన మనం అనుకునేదే న్యాయం మనం చూసేదే లోకం అనిపిస్తుంది.
నిజానికి ప్రపంచంలో ఎన్నో సంస్కృతులున్నాయి. సంప్రదాయాలు ఉన్నాయి. నాకు క్షత
అక్షత అనే పట్టింపు లేదు. నీవు నాతో సంసారం చేయగలనంటే నిన్నుచేసుకోవడానికి నేను
సిద్ధంగా వున్నాను.”అన్నాడు.

“నావలన కాదు బావా. అనవసరంగా నీ జీవితాన్ని పాడుచేసుకోకు. నా మనసు ఇతరు


లను అంగీకరించలేదు.”

“వసూ! మనసు గాలిపటం లాంటిది. గాలి ఎటువీస్తే అటు ఎగురుతుంది. గాలి దిశ
మారుస్తుంది కూడ!”
“నా మనసు మాత్రం మారదు. అది దిశ మార్చదు.”
“పోనీ నీకేంకావాలో కోరుకో! నీకానందమైనదేదో నేను కలిగిస్తాను.”
“నా ఆనందం కర్కవల్లభ ముఖారవింద దర్శనం!”
“నేను ఏర్పాటు చేయగలను. కానీ అతడు నిన్ను కాదంటే నన్ను చేసుకుంటావా?”
“మాట ఇవ్వలేను.”

తరణిగుప్తుడు వ్యాపారం బాగా తెలిసినవాడు. మాన్యకేతనగరం వెలుపల గుఱ్ఱాల


విక్రయ శాల ఏర్పాటు చేశాడు. అద్భుతమైన విదేసీ గుఱ్ఱాలను కొన్ని తెప్పించాడు. గుఱ్ఱపు
శాలలో ఉన్నవన్నీ చాలా గొప్పవి. సామాన్యులెవరూ కొనలేనివి. తరణిగుప్తుడు రాకుమార
కర్కవల్లభుని గుఱ్ఱాలు చూడడానికి రావలసిందిగా స్వయంగా ఆహ్వానించాడు. అక్కడ
అశ్వాల పొంతనశాల కూడ ఏర్పాటు చేశాడు. గొప్పవైన అరబ్బీ గుఱ్ఱాలతో దేశవాళి గుఱ్ఱాలు
పొంతన చేస్తున్నారు. కర్కవల్లభుడు శాలలన్నీ చూచుకుంటు నడుస్తున్నాడు.
190
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఈ అశ్వం వెల ఎంత?” కర్కవల్లభుడు అడిగాడు. ఆగుఱ్ఱం కారుమేఘం అంత


నల్లగావుంది. గుఱ్ఱం ఎత్తు పొడుగుకూడా సామాన్యం కాదు.
“చెప్పుకోలేనంత!” చాల మందస్వరంతో వసుమిత్ర పలికింది.
కర్కవల్లభుడు తల ఎత్తిచూశాడు.
ఆ శాలలో వసుమిత్ర తలదించుకుని కూర్చునివుంది.
“మీరు వసుమిత్రకదా!”
“మర్చిపోయారా?”
“లేదులేదు. ఆ రాత్త్రి మా చెల్లెలితో చూచానుకదా! చాలా గొప్పగా మాట్లాడుతారు.”
“మాటలేకాదుమనసు కూడ...”
“ఔనౌను! మీవారు తరణిగుప్తుడు చాలా గొప్ప వ్యాపారి. మాకు మంచి గుఱ్ఱాలను
చూపించారు.”
“అతడు నా భర్తకాదు! మా బావ.”
“క్షమించండి అలా అనుకున్నాను. ఈ గుఱ్ఱాల పొంతనశాలలో మీకూ వాటా వుందా?”
“మీ వాటా నాతోనే వుంది!”
“నాకర్ధం కాలేదు!”
“ఇంకో నాలుగు నెలలలో మనకు బిడ్డ పుడతాడు!”
“ఏమిటీ నీవనేది? జీవితం అంటే గుఱ్ఱాల పొంతనశాల అనుకున్నావా?”
“నేనొక రాష్ట్రకూట వంశం బాలికనో బాలుడినో కనబోతున్నాను!”
“నాకు పెళ్ళయింది తెలుసా?”
“నా మానసిక వివాహం అంతకుముందే మీతో జరిగిపోయింది!”
“మానసిక వివాహాలను లోకం హర్షిస్తుందా! ఏదో మిత్రులు లాగా కలుసుకున్నంత
మాత్రాన భార్యవవుతావా?”
“శకుంతల దుష్యంతమహారాజు కేమవుతుందీ? నేనేమీ ఆటబొమ్మనా? మరుపు
రాకుమారులకు సహజమా? అభిజ్ఞలు చూపించాలా?” వసుమిత్ర వలవలా ఏడ్చేసింది.
“నన్నిక్కడికి నీవే రప్పించావా?”
“మగమహారాజులు. మేము కోటలోకి వస్తే అందరిముందూ
అవమానపడతారేమోనని!”

191
  చాళుక్యసింహాసనం

“అవును. అవమానమే! రాజకుమారులు ఎందరితోనో సరసాలాడతారు. వాళ్ళంతా


భార్యలవుతారా?”
“నేనేమీ ఆటగత్తెనా పడుపు గత్తెనా? నేను మీ చరణదాసిని. పురుషులు బహుపత్నీ
వ్రతులు. వనితలు అలాకాదుగా! ఈ జన్మకు మీరే నా భర్త! మీ భార్యలలో ఒకదానిగా
స్వీకరించినా చాలు.”
“కాదంటే?”
“కాగ్నానది వరదలలో వుంది. ఆత్మహత్యతోపాటు భ్రూణహత్య మహాపాపమని
చూస్తున్నాను. రాచరక్తాన్ని నీళ్ళపాలు చేయలేక ఆగాను.”
“బెదిరిస్తున్నావా? పోనీ ఆనాడే మా తండ్రిగారితో మాట్లాడలేకపోయావా?”
“మా తండ్రిగారు అర్ధించారు. మీ తండ్రిగారు తిరస్కరించారు.”

“కచ్ఛదేశంలో ఎందరో నాతో ఆడారు పాడారు ఆనందించారు! వాళ్ళలో కొందరు


గర్భవతు లయ్యారేమో కూడా. నాకు తెలీదు. వారెవరూ నన్ను పెళ్ళిచేసుకోమని అడగలేదు.”

“స్త్రీలను ఎత్తకుపోయి దాసీలుగా అమ్మే కసాయివాళ్ళు కూడ వుంటారు. కొరడా


దెబ్బలకు తాళలేక వాళ్ళు ఆడమన్నట్లు ఆడేవాళ్ళుంటారు. దేశాన్ని పరిపాలించే ప్రభువులు
కూడా అంతేనా?”

“ఏమో! నేను ఆలోచించుకోవాలి.”

“ఆనాడు ఏమాలోచించుకుని ఆనందించాం?”

“అది ఒక ఉద్రేకం!”

“కాదు. స్త్రీ పురుష సహజం! చరాచర జగత్తులో అన్ని జంటలు ఆనందిస్తాయి. ఒక్క
మానవుడే అందుకు కొన్ని కొన్ని అభిజాత్యాలు పెట్టుకున్నాడు.”
“నన్నిప్పుడేమి చేయమంటావు?”
“నన్ను భార్యగా స్వీకరించమంటాను.”
“అది కుదిరే పని కాదు.”
“నేను చేసిన పాపమేమిటీ?”
“పాపం నేను చేయలేదు. ఊరికే అలా ఆనందంగా కలుసుకున్నాము.”
“ఆనందం వెనక బాధ్యత కూడా వుంటుంది.”

192
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“మనమేమైనా ఒప్పందం చేసుకున్నామా? దండలైనా మార్చుకున్నామా?”


“దండలు కావాలంటే ఇప్పుడు తెప్పిస్తాను.”
కర్కవల్లభుడు పరిహాసంగా నవ్వాడు. “ఈ తెలివి అప్పుడే ఉండాల్సింది!”
“తల్లి కావడానికి ఏతెలివీ అవసరంలేదు.”
“ఔనౌను! పశువులు పక్షులూ మృగాలు వాటికే పెళ్ళీ అవసరంలేదు. ఇష్టంవచ్చినట్లు
ఈనుతుంటాయి.”
“నేనొక మనిషిని. పశువును కాను.”
“నిన్ను భార్యగా స్వీకరించడం కుదరని పని. నీ దారి నీవు చూచుకోవడం మంచిది.”
“ఏముందీ కర్పూరహారతి దేవుడికి పాదనీరాజనాలు పట్టి చివరకు తానుఆరిపోతుంది.”
కర్కవల్లభుడు నిర్దాక్షిణ్యంగా అక్కడనుండీ వెళ్ళిపోయాడు.

వసుమిత్ర సోకపరితప్త హ్రుదయాన్ని తరణిగుప్తుడు ఊరడించడానికి ప్రయత్నించాడు.


ఫలితం లేకపోయింది. అంకురించిన విత్తనం కాలంతోపాటు ఎదగసాగింది.

32 విమానాలున్నాయా
కొద్ది కాలంలోనే కమలహితాదేవి మాన్యకేత దుర్గం నుంచీ తన నివాసం వాడీపురానికి
మార్చింది. వాడీపురం మాన్యకేతానికి అట్టే దూరం లేదు. అక్కడయితే మాన్యకేతపు రద్దీ
వుండదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు.

లీశోత్తరదీక్షితుడు ఆ రాత్రి వాడీపురం చేరాడు. కమలహితాదేవి ప్రాసాదం చిన్నది


కాదు. వెంట వచ్చిన అంగరక్షకులు గుఱ్ఱాలను కట్టివేసి విశ్రమించారు. కుంటెనకత్తె మదాలస
అంగరక్షకదళంతో సరసాలాడుతోంది.

“కమలా! ఈరాత్రి నాకేం కొత్త పాఠంచెబుతావు?”అన్నాడు దీక్షితుడు కమలహితను


తన ఒడిలోకి లాక్కుంటూ. అప్పటికి మృష్టాన్న భోజనం అయిపోయింది.

“పాఠం వినాలంటే దూరంగా కూర్చోండి” తమలపాకుల వెండిపళ్ళేం ప్రక్కన పెట్టి


అన్నది కమలహిత. పరిచారిక అరగదీసిన గంధంగిన్నె అక్కడ పెట్టివెళ్ళింది. లీశోత్తర
దీక్షితుడు సుందరాంగుడు. అందుకే కమలహిత జగతీంద్రవర్మను వదిలి దీక్షితుని
పట్టుకుంది.

సరసోక్తులాడుతునే కమలహిత దీక్షితునికి చందనగంధం రాసింది. సరసం ఆపి


కమలహిత కొంతతడవు దూరంగా వెళ్ళి కూర్చుంది.
193
  చాళుక్యసింహాసనం

“కమలా ! అందరూ నేను పిచ్చిపట్టి నీచుట్టూ తిరుగుతున్నాననుకుంటారు. నీ నైపుణ్యం


నీవిద్యారహస్యాలు చాతుర్యాలు సాధారణ గృహిణులకు తెలుస్తాయా? నిస్సారం గానే
మొక్కుబడిగా సంసారం కొనసాగిస్తుంటారు! కమలా! ఈ విద్యలన్నీ నీకెవరు నేర్పారు?”
అన్నాడు దీక్షితుడు.

“అదీ ఒక కథ! స్త్రీలందరూ నన్ను ఒక కులట అనుకుంటారు. కానీ వాళ్ళ మనసులో


ఏముంటుందో బయటికి చెప్పరు. భయం!”
“వాళ్ళ మనసులో ఏముంటుందీ?” ప్రశ్నించాడు దీక్షితుడు కుతూహలంగా.
“నా మనసులో ఏముందో వాళ్ళ మనసులోను అదే వుంటుంది!”
“ఇలా మాట్లాడావంటే పతివ్రతలంతా కలిసి నిన్ను కొడతారు తెలుసా!”

“ఉహూ! రామాయణంలో పిడకల వేట్లాట ఆపి నేను చెప్పేది వినండి. మాది అవంతీ
దేశం. ఒకప్పుడు నాభర్త ఇంటికి ఒక పురోహితుడు వచ్చాడు. అతడిది మనదేశం కాదు మన
భాష కాదు మన మతంకూడా కాదు. ఈజిప్టు దేశం నుంచి వచ్చాడు. అతడు అక్కడి
దేవాలయంలో అర్చకుడు. పేరు పూజారిస్. భారతావని పర్యటనకు వచ్చాడు.”

“ఆయన మీయింటికే ఎందుకు వచ్చాడు?”

“మా పంతులుగారు కూడా పంచాంగకర్త. అందుకనే ఈయన్ని వెతుక్కుంటూ


వచ్చాడు. ఆయన మా ఇంట్లో కొంతకాలం ఉన్నాడు. ఇద్దరిపండితుల మధ్యా సంవాదాలు
జరుగు చుండేవి. ముందు ముందు నాకేమీ అర్ధమయ్యేది కాదు. రానురాను ఆసక్తి ఏర్పడింది.

ప్రస్తుతం నా భర్తతో సహా పలువురు భారతీయ పంచాంగకర్తలూ పండితులూ ఈజిప్టు


దేశం వెళ్ళారు. తిరిగిరావడానికి ఐదారు సంవత్సరాలైనా పడుతుంది.”
“ఈ విశ్రాంతి కాలంలో మాతో జత కట్టావనమాట!”
“మీరేమైనా అనుకోండి. ఒక విషయమేమిటంటే నేనెప్పుడూ మావారిదగ్గర అబద్ధ
మాడను!”

“అబద్ధమాడవా! గొప్పధైర్యవంతురాలివే! ఇంతకూ వీళ్ళు అక్కడికి వెళ్ళడం దేనికీ?


ఇక్కడ కూచుని పంచాంగాలు వ్రాయలేరా?”

“మీరంత సంకుచితంగా ఆలోచించకండి. ఈ మహి అంతా ఒకటే కుటుంబము.


వసుధైవ కుటుంబకమ్. కాలక్రమంలో సముద్రాలు భూమిని విడగొట్టాయి. అందువలన
భూమి నవఖండాలుగా విడిపోయింది. అవి భరత, కేతుముల, హరి, ఇలవ్రిత, కురు,
హిరణ్యక, రమ్యక, కింపురుష, భద్రస్వ అనేవి. ఇందుకు నిదర్శనంగా అన్ని ఖండాలలోను

194
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ఒకేరకం మనుషులు జంతువులు జన్మించారు. వారి వాతావరణం బట్టీ తరువాత కొంత


మార్పు వచ్చి వుండవచ్చు. అందుకే అన్నిదేశాలలోనూ ఒకే రకమైన విజ్ఞానం విస్తరించి
వుండేది.

పూర్వం ఆకాశం నుండి దేవతలు భూగోళం పైకి దిగేవారు. వారు అంతరిక్షంలోని


విజ్ఞానాన్ని భూమిమీద వెదజల్లి వెళ్ళేవారు. పూర్వం వరాహమిహిరుడు ఈజిప్టు దేశం
వెళ్ళివచ్చి మన పంచాంగాన్ని సంస్కరించాడు. ఉత్తర పూర్వ కాలామృతాలు వ్రాసిన
కాళిదాసు మేఘదూతం వ్రాసిన కాళిదాసూ కూడా విహంగమార్గంలో భూమిని దర్శించారు!”

“ఆపాపు! వినే పిచ్చివాడుంటే నువ్వు బోడిగుండుకు జడవేసి పూలు పెట్టెట్టున్నావు.


ఆకాశంలో ఎగరడం మనిషికి సాధ్యమా?”

“మీరేమీ చదవకుండా పెద్దల సాంగత్యం లేకుండా అలా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు


విమానాలుండేవి. ఇది అబద్ధంకాదు. భరద్వాజ మహర్షి విమానశాస్త్రం రచించాడు. పూజారిస్
కూడా చెప్పాడు. ఇందుకు ఆధారాలు ఎన్నో గుహాంతరాలలో లభించాయి. పూర్వ కాలం
పైనుండి దేవతలు భూలోకానికి వచ్చేవారట! స్వర్గాది గ్రహాంతరాలనుండీ వచ్చే విమానాలు
వేరుగా వుండేవి.ఈ నమ్మకం భరతభూమిలోనే కాదు,నవఖండాలలోను ఉంది. అంతేకాదు.
ఋగ్వేదకాలానికే విమానాలున్నాయి. ఋగ్వేదం ప్రధమమండలం 116వ సూక్తం మూడవ
మంత్రంలో విమాన ప్రస్తావన వుంది.

తుగ్రుడనే రాజర్షి భుజ్వుడనే తన కుమారుడికోసం ఒక విమానాన్ని బహూకరించాడు.


ఆ యంత్రాన్ని అశ్వనీదేవతలునడిపేవారు.”

“పైనుంచి దేవతలు దిగివచ్చి ఏంచేసేవారటా?”

“భూమండలం మీద మానవులకు సాధ్యంకాని అనేక దేవాలయాలు నిర్మాణాలు


చేశారు.”

“వీళ్ళ దేవాలయాలు వీళ్ళు కట్టుకోలేరా?”

“నేనూ ఇలాగే మూర్ఘురాలిలాగా మాట్లాడాను. పూజారిస్ ఏమన్నారంటే నీవు ఒకసారి


ప్రపంచం అంతా తిరిగి చూడు. ఎంతేంత బండరాళ్ళని ఆకాశ మార్గంలో తీసుకువచ్చి
పేర్చారో! బావిలో కప్పలాగా ఇంట్లో కూచుంటే ఏంతెలుస్తుందీ? అన్నారు.

దేవతలకు విశేష ఆకర్షణ శక్తి ఉండేదట. వాళ్ళు ఎంతపెద్ద బండరాతినైనా గాలిలో


తేలేడట్లు చేయగలిగేవారట! పూజారిస్ ఏమన్నాడంటే మన హనుమంతుడు సంజీవనీ
పర్వతాన్ని పైకెత్తి ఆకాశమార్గంలో తీసుకురావడం కూడా అలాంటి విద్యే నన్నాడు. శ్రీకృష్ణుడు
గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం కూడా అలాంటి విద్యే నన్నారు.”
195
  చాళుక్యసింహాసనం

“మరి ఇప్పుడు ఆ పర్వతాలను పైకెత్తేవాళ్లు ఏమైపోయారూ?” వెటకారంగా అన్నాడు


లీశోత్తరదీక్షితుడు.

“మీలాంటి పాపాత్ములు పెరిగిపోయినతరువాత వాళ్ళు రావడం మానేశారు!”

“తోటకూర కట్టేంకాదూ! పురాణాలలో ఏవో రాస్తారు. అవన్నీ నిజమంటావా? ఈ


పండితులూ పంచాంగకర్తలు ఈజిప్టు దేశం వెళ్ళి ఏంచేస్తారటా?”

“సూర్యమాన, చాంద్రమాన బార్హస్పత్యమాన పంచాంగంలో కొన్ని లెక్కలకు


సరిపోవటం లేదట! ఒకప్పుడు పన్నెండు పున్నములు ఒక సంవత్సరం అనుకునేవారు.
శరద్రుతువు నుంచీ శరదృతువు ఒక సంవత్సరం. పన్నెండు పున్నములు ఒక సంవత్సరం
అనుకుంటే సూర్యగమనానికి సరిపోవటం లేదు. మనకు అశ్వనీ మొదలు ఇరవై ఏడు
నక్షత్రాలు న్నాయి. ఇరవై ఏడును పన్నెండుతో గుణిస్తే మున్నూరు పైన ఇరవైనాలుగు. ఇది
అసలే సరిపోవటం లేదట. ప్రపంచ శాస్త్రజ్ఞులు సూర్యుడు ఒక చక్రం తిరిగి రావడానికి
మున్నూట అరవైఐదు దినాలు పడుతుందని నిర్ణయించారు.

రామాయణ కాలం నాటికి రవివారము ఇందువారము ఇలా వారాలు వాటికి పేర్లు


వుండేవికావు. ప్రపంచ సమావేశంలో పండితులంతా కలిసి దినాలను వారాలుగా విభజించి
పేర్లు పెట్టారు. ఇవికూడ భూమండలం చుట్టూ వున్న ఏడు ముఖ్యమైన గ్రహాలకు గుర్తింపుగా
ఆ పేర్లు పెట్టారు. ఆదిత్య, సోమ, మంగళ, బుధ, బృహస్పతి, భృగు శని గ్రహాల పేర్లు పెట్టారు.
అందుకే ప్రపంచంలో అన్ని దేశాలలోను ఇవే పేర్లున్నాయి.”

“ఇంతకూ కాళిదాసు ఆకాశంలో ఎగిరాడంటావా? క్రింద పడలా?”

“విహంగమార్గంలో చూడకపోతే ఎక్కడో సహ్యాద్రి పర్వతాలలోని రామగిరిపైని మేఘం


హిమాలయ పర్వతాల అవతల అలకాపురికి ఏ మార్గంలో ప్రయాణించిందో ఎలా
తెలుస్తుందీ?”

“మేఘమేమిటీ ప్రణయ సందేశం ఇవ్వడమేమిటీ? అదొక ఉన్మాదం కాదా? కాళిదాసు


ముందరే చెప్పాడుటకదా! కామంలో మునిగినవాడికి కన్నూ మిన్నూ కానరాదని! కామార్తాహి
ప్రకృతి కృపణా చేతనాచేతనేషు అని.”

“నిజమే! మనిద్దరికీ కనిపిస్తోందా లోకం? నావడిలో ఒరిగినపుడు మీరొక దేశం మహా


సేనాపతులనే మాట గుర్తుంటోందా?

ఇంతకూ మాఆయన ఇజిప్టు దేశం వెళ్ళిన తరువాత పూజారిస్ నాకొక గ్రంధం


చూపించారు. అది మన భాష కాదు. ఆ భాష నాకురాదు. ఐనా అందులో బొమ్మలు గీసి
వున్నాయి. ఈజిప్టు దేశం దేవాలయాలలో గుహలలో రాతిపైన చెక్కిన చిత్రాలవి. గోడల పైన
196
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ఏదో బొమ్మలభాషలో వ్రాయబడి ఉంది. కానీ అది చదవటం సాధ్యం కావటం లేదు. అందులో
పక్షులు ఏవో చిహ్నాలు వింత జంతువులు ముఖ్యంగా పాములు చిత్రించబడి వున్నాయి.
అందులో విమానాల వంటివి కూడా వున్నాయి. మావారు ఈజిప్టు దేశం వెళ్ళిన తరువాతకూడా
పూజారిస్ మాఇంటికి వచ్చి నాతో కొంతకాలం గడిపారు. అప్పుడు నాకు చాలా విషయాలు
చెప్పారు. అక్కడ దేవాలయాలలో దేవతలను ఆనందింప చేయ డానికి స్త్రీ పురుషులు
సమాగమం కూడా చేసేవారట!”

“అన్నిటికన్నా నిన్నీ విషయం ఎక్కువ ఆకర్షించిందికదూ. కానీ మనదేశం ఆచారం


ప్రకారం నీకు తప్పనిపించలేదా?”

“నేను ఆయనను అదే అడిగాను. ఆయన మనదేశం శాస్త్రాలలోంచీ ఒక నీతి చెప్పారు.


యత్ర నారీ పూజ్యంతీ రమంతీ తత్ర దేవతాః అంటే యత్ర నారీ పూజ్యంతీ తత్ర దేవతాః , యత్ర
నారీ రమంతీ తత్ర దేవతాః అని చెప్పారు. అప్పటినుంచీ నాకు భయం పోయింది కోరిక
మొదలైంది.

నిజానికి దేవుడు నిర్గుణుడు. కానీ ఆయనకు అలావుండడం విసుగు పుట్టింది. తన


వినోదం కోసం తననుంచే మాయను సృజించాడు. తాను సృజించిన మాయ తనకే మవు
తుందీ?”

“కూతురవుతుంది!”

“అలా అవలేదు. ప్రకృతి అయింది. ప్రకృతి పురుషుడూ కలిసి ఆనందించసాగారు.


వాళ్ళ కలయిక వలననే ఈ విశ్వం ఏర్పడింది. కొంతకాలానికి ఆ పరబ్రహ్మానికి ఈ ఆట
విసుగు పుట్టింది. ఈ సృష్టి క్రియ చేయడానికి ప్రజాపతుల్ని సృజించాడు. అందులో కశ్యప
ప్రజాపతి ఒకడు.

కశ్యపుడు అదితి అనే ప్రకృతితో ఆడుకున్నాడు. దేవతలు పుట్టారు. ప్రకృతి దితి


అయింది. దైత్యులు పుట్టారు. అలాగే ఆ ప్రకృతి గుఱ్ఱంగా మారి రమిస్తే గుఱ్ఱాలు పుట్టాయి.”

ఆమె మాటకు అడ్డంవస్తూ లీశోత్తరదీక్షితుడు ఇలా అన్నాడు. “కమలా! అసలు గుఱ్ఱాలే


లేని రోజులలో గుఱ్ఱం రూపం ధరించడమేమిటీ?”
“సృష్యాదికి భూమి పైన ప్రాణులేవీ లేవు. నిజమే! కానీ పై లోకాలలో ఉన్నాయి.”
“అసలు పైలోకాలంటూ ఉన్నాయా?”
“తప్పకుండా ఉన్నాయి. మన సూర్య మండలంలోని భూమి లాంటివి పైన నక్షత్ర
మండలాలలో అనంతకోటి బ్రహ్మాండాలున్నాయి.
“నీవు అనంతకోటి అంటున్నావు. ఆ అనంతకోటికి వెలుపల, అంటే నీవు చెప్పే బ్రహ్మాం
197
  చాళుక్యసింహాసనం

డాల కవతల ఏముందీ?”


“ఈశ్వరుడున్నాడు.”
“నీవనుకునే ఈశ్వరుడికవతల ఏముందీ?”

“మీరడిగే ప్రశ్న నాకర్ధమయింది. మీ ఉద్దేశ్యంలో అనంతకోటి కూడా ఒక సంఖ్యే!


ఆసంఖ్య కవతల ఈశ్వరుడు ఆతడి కవతల ఏముందీ అని భౌతికంగా ప్రశ్నిస్తున్నారు. మీ
ప్రశ్న గొప్పదే! కానీ నేను మీ సందేహాన్ని తీర్చగలిగినంత గొప్పదాన్ని కాను. అనంతకోటి
అనేది కూడా ఋషుల తత్వ దర్శనమే కాని ఒక మనిషి అక్కడిదాకా వెళ్ళి చూసివచ్చి
చెప్పిందికాదు.”

“భేష్! నా ప్రశ్నకు మొండిగా సమాధానం చెప్పకుండా విజ్ఞతతో నీకు తెలిసింది


చెప్పావు. అంటే నీవు ఒక జిజ్ఞాసవు. ముందుముందు దార్శనికురాల వవుతావు. ఇంకా ఆ
దేశం బొమ్మలలో నీకేం చూపించాడు...”

“దేవతల విషయంలో మనకు యరాని దేశంవాళ్ళకు చాలా సామ్యాలున్నాయిట.


పూజారిస్ నాకు కొన్ని సామ్యాలు చెప్పాడు. యమ ని యిమ అని యమి ని ఇమి అని హోమాన్ని
హఓమ్ అని అథ్వర్తని ఆథర్వన్ అని పిలుస్తారట. ఆయన నాకొక గ్రంధం ఇచ్చారు. దానిపేరు
జెంద్ అవెస్త. ఆ గ్రంధం కొంతకాలం మాయింట్లో ఉంచమని మళ్ళీ వచ్చి తీసుకుంటాననీ
చెప్పారు.

అలాగే ఈజిప్టు దేశపు దేవతలకు మన దేవతలకు చాలా సామ్యాలున్నాయట. మన


విశ్వాసంలో శివుడు పార్వతి అర్ధనారీశ్వరులు. ఎడంవైపు పార్వతి కుడివైపు శంకరుడు.

వాళ్ళ దేవతలలో కూడ అర్ధనారీశ్వరులున్నారు. అదికూడ ఎడమవైపు స్త్రీ కుడివైపు


పురుషుడు. అందువలన ఆ దేవతా విగ్రహానికి ఎడమవైపు స్తనం ఒకటే వుంటుంది.
కుడిభాగం పురుషుడు కాబట్టి.

అంతేకాదు. వాళ్ళ దేవతలలో కొందరికి జంతువుల తలకాయలు పక్షితలకాయలు


ఉంటాయి. మన పురాణ దేవుళ్ళలోకూడా పందితలకాయి, కోతితలకాయ, సింహం తల
కాయి, గుఱ్ఱంతలకాయి, పక్షితలకాయి, ఏనుగుతలకాయి, కుక్కతలకాయి లాంటి వాళ్ళు
వున్నారు.

ఇంక అక్కడ దేవతలు కూడ తలపైన కిరీటాలలాంటివి పెట్టుకుంటారు. కిరీటం సౌర


మండలం నుంచి నక్షత్ర మండలాలనుంచి శక్తిని గ్రహిస్తుందట. అంతేకాదు. సంతానం
కలగక పోవడానికి సర్పదోషం వుందనుకుంటాము. వాళ్ళకు కూడా సర్పదేవతలున్నారు.
వసుధైవ కుటుంబకం అని అందుకే అన్నారేమో. ఒకప్పుడు అన్ని భూఖండాలలోను ఒకేరకం

198
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

సంప్రదాయం ఉండేది.

అవంతీదేశంలో వుండగా మామిద్దె ఎత్తైన దిబ్బపైన ఉండేది. మేము రాత్రిపూట ఆరు


బయట ఉప్పరిగమీద పడుకునేవారం. రాత్రంతా మావారు ఆకాశంలో నక్షత్ర మండలాలను
గమనిస్తుండేవారు. పూజారిస్ కూడా నాకు లగ్నాలను ఎలా గుర్తుపట్టాలో చూపించారు.
మొదటగా సప్తఋషి మండలం ధృవనక్షత్రం గుర్తుపట్టడం నేర్పారు.”

“ఏదో సప్తఋషి మండలం అని పెళ్ళిలో మిట్టమధ్యాహ్నం అరుంధతీ నక్షత్రాన్ని


చూపిస్తారు. ఆకాశంలో ఏమీ కనిపించదు. నీవు ఆరుంధతీ నక్షత్రాన్నిగుర్తుపట్టకలవా?”

“ఓ! సప్తఋషి మండలంలో నాలుగు నక్షత్రాలు వర్షంలో తడిసి నీల్గిన నులకమంచం


కోళ్ళలాగా వుంటాయి. ఇవి అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. అత్రినుంచీ కొంచం
వంకరగా గీచిన సరళ రేఖలో అంగీరసుడు వశిష్టుడు ఇంకొంచం క్రిందికి మరీచి వుంటారు.
వశిష్టుడికి దగ్గరలో అరుంధతి ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే కనపడుతుంది.”

“ధృవనక్షత్రం ఎక్కడ కనిపిస్తుందీ?”

“ధృవనక్షత్రం భూమికి బాగా ఏటవాలుగా ఉత్తరదిశలో క్రిందికి వుంటుంది. సప్తఋషి


మండలంలో పులహుడు క్రతువు నక్షత్రాలను ఒక సరళరేఖతో కలిపి పొడిగిస్తే వాటిమధ్య
దూరానికి ఐదురెట్ల దూరంలో ధృవనక్షత్రం మిణుకుమిణుకుమంటూ కనిపిస్తుంది.”

“నిన్ను లొంగదీసుకోవడానికి ఆయన చాలా కథలే చెప్పాడనమాట.” లీశోత్తర


దీక్షితుడు దీర్ఘంగా నిట్టూర్చాడు. “ఈరాత్రి మన వాదోపవాదాలతో మనసంతా కలచివేసి
నట్లయింది. ఇంకా సరసం సాగదు. నేను మాన్యకేతం వెళ్ళిపోతాను.”
“ఇంత రాత్రి వేళా?”
“ఏమీ నా అంగరక్షకులున్నారు.”
“ఎందుకో మనని ఎవరో వెంటాడుతున్నారనిపిస్తోంది!”

“నీవేమీ భయపడకు. మొన్న చూశావుగా. నాటకప్రదర్శననాడు కుహనా నటుల్ని


ఒక్కచేత్తో నరికాను. నేను స్వయంగా మహావీరుడిని. వందమంది కలిసి వచ్చినా ఒక్క చేత్తో
నరకగలను!”

లీశోత్తరదీక్షితుడు రాత్రికిరాత్రి మాన్యకేతం వెళ్ళిపోయాడు.

199
  చాళుక్యసింహాసనం

33 నాగదీక్ష
శిరీష చెలికత్తెలతో కలిసి మళ్ళీ ఈలపురం వచ్చింది. వచ్చినప్పటినుంచీ అక్కడి
గుహలు తొలచడానికి సహాయపడేది నాగ జాతి వారా కాదా అనే సందేహం మనసులో
మెదులుతోంది. చెలికత్తె లందరూ అదేదో తేల్చుకోవాలసిందే నన్నారు. రాత్రిపూట కదా
నాగులు వచ్చేది. ఐతే రాత్రిపూటే ఆ గుహలకు వెళ్ళాలి. అందరూ గుఱ్ఱాలపై బయలుదేరారు.
ఎందుకైనా మంచిదని పురుష వేషాలు ధరించారు. కరవాలాలు కూడ మరువలేదు. గుఱ్ఱాలను
లోయలోకి దింపి చెట్లకు కట్టి వేశారు.

కైలాసనాధాలయం గుహకు కొంత దూరంలో ఎత్తైన చెట్టుపైకి ఎక్కి కూర్చున్నారు.

శిల్పులందరూ వెళ్ళిపోయారు. చీకట్లు ముసురుకున్నాయి. లోకం నిశీధి లోకి


వెళ్ళిపోయింది. అష్టమి కావడంతో చందమామ అర్ధభాగం ఆకాశంలో వెలుగుతూ నిశీధి
తలలో నాగరంలా భాసిస్తోంది.కీచురాళ్ళ మోత తప్పుతే అంతా నిశ్శబ్దంగా వుంది. అంతలోనే
హిస్సనే శబ్దం వినిపిస్తోంది. అది పాము బుసేమో ననిపించింది. చూస్తె అనేక సర్పాలు
గుహలవైపు పాకివస్తున్నట్లు కనిపించింది. అన్ని పాములు ఏ పుట్టల లోంచీ వచ్చాయో.
మసక వెలుతురులో అన్ని పాములు పాకిరావడం చూస్తే వళ్ళు జలద రించింది. వెంట్రుకలు
గగురు పొడిచాయి. భయం మొదలైంది.

పాముల్లో చాలా వరకూ ఒక్క తల పాములే. పరికించి చూస్తే మూడు తలలు ఐదు
తలలు ఏడుతలలు పాములున్నాయి. ఒక పాముకు లెక్కిస్తే తొమ్మిది తలలున్నాయి. అతడు
అందరిలోకీ పెద్ద కావచ్చు. పాములలో తెల్లటి పాములు నల్లటి పాములు పసుపు రంగు
పాములు ఎరుపు రంగు పాములు అనేకమైన రంగులు కలపోసిన కలనేత పాములు
పాకుతున్నాయి. చూస్తే ఆడవాళ్ళ చీరలకు సీతాకోక చిలుకలకు కూడా అన్నిరంగుల హంగు
లుండవేమో. కొన్ని పొట్టిపాములు కొన్ని అతి పొడుగు పాములు ఉన్నాయి. పాముల్లో ఆడ
మగ గుర్తించడం తేలిక కాదు.

పాములు పాకుతూ గుహల్లోకి వెళ్ళాయి. అక్కడేంచేస్తున్నాయో చెట్టుమీద నుండీ


కనిపించదు. ధైర్యం చేసి అందరూ గుహల వద్దకు వెళ్ళి లోపలకు తొంగిచూడాలని నిచ్ఛ
యించుకున్నారు.

ఒకరొకరే చెట్టు దిగుతుంటే రెండు నాగుపాములు భుస్సుమన్నాయి. చెట్టుక్రింద తమ


కోసమే కాపు వేసినట్లు పడగలెత్తి తోకపైన నిలబడ్డాయి.వాటిని చూడగానే భయంతో ప్రాణం
పోయినంత పనయింది. గుండెలు ధడధడలాడాయి. అవి చెట్టుపైకి పాకివస్తే ఏంచేయాలీ.
కత్తితో నరకాలా. అంత ధైర్యము లేదు. పామును చంపుతే ఏ నాగదోషం వస్తుందోననే భయం
కూడా వుంది. అందరూ చెట్టు కొమ్మల పైనే కూర్చుని నాగదేవతలకు కైమోడ్పు చేశారు.
రాత్రంతా జాగారమే అయింది. కన్నులు వాచిపోయాయి. పాములు పైకి పాకి వస్తాయేమోననే
200
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

భయంతో రెప్పవాల్చ లేదు. ఎంత ప్రమాదంలో పడ్డామో అనిపించింది. తూర్పుదిక్కున


తెలతెలవారుతుండగా గుహలనుండి పాములు తిరోగమనం ఆరంభించాయి. సూర్యోదయం
అయిన తరువాత చెట్టు క్రింది నాగుపాములు ఎండుటాకుల క్రిందికి జారిపోయాయి.
అప్పటివరకూ అవి తాము చెట్టుదిగకుండా కాపుకాచినట్లు అనిపించింది.

చెట్టుదిగి వారు ఇంక నిద్ర ఆపుకోలేక విడిదికి వెళ్ళిపోవాలని గుఱ్ఱాలవద్దకు వెళ్ళారు.


గుఱ్ఱం ఎక్కబోతుంటే గుఱ్ఱం తోకకు చుట్టుకుని పాము కనిపించింది. తమను చూసి జరజరా
జారిపోయింది. దానితో అన్ని గుఱ్ఱాలను పరిశీలించి మరీ అధిరోహించారు.

విడిదికి వెళ్ళి స్నానాల కొట్టులోకి వెళితే అప్పటిదాకా అక్కడొక పాము పడుకుని ఉంది.
చెలికత్తె కెవ్వున కేకవేసింది. పాము తప్పుకు పోయింది. అప్పటినుంచీ ఎక్కడో అక్కడ పాము
కనపడుతునే వుంది. పాల ఉట్టిపై పాము. మంచము కోడుకు చుట్టుకుని పాము. పూలు
కోయబోతే పాము. పడకగదిలో పాము. అందరికీ అడుగు వేయాలంటే పాము భయం.
పడుకుని కంటినిండా నిద్రపోవాలంటే పాముభయం. ఇంటి చూరు నుంచీ వ్రేలా డుతూ
పాము. ఏదో పాము పగబట్టి వచ్చిందేమోనంటే ఒకే పాము కాదు, వేరువేరు పాములు.

పాములు పట్టేవాళ్ళను పిలిపించారు. ఒక్క పామూ దొరకలేదు. అక్కడఅసలు పాములే


లేవని చెప్పి అతడు వెళ్ళిపోయారు. మళ్ళీ పాములు దర్శనమిచ్చాయి. బొట్టు పెట్టు కోవడానికి
అద్దంలోకి చూస్తుంటే వెనకాల దణ్ణెం పైనుంచీ వ్రేలాడతూ పాము.

మంత్రగాళ్లను పిలిపించారు. వాళ్లు మంత్రించి ఇసుకను ఇల్లు ఆవరణ అంతా చల్లారు.


గడ్డిపోచలను మంత్రించి సింహద్వారానికి కట్టారు. పేడను మంత్రించి కళాపి అంతటా
చల్లించారు. చిన్న పేడముద్దను ద్వారానికి కొట్టారు.ఇంతా చేసినా ఒక శ్వేతనాగు
కనపడుతోంది. అంతలోనే మాయమైపోతోంది.పగలంతా పాముల్ని గురించి ఆలోచించడం
వలన రాత్రికి కలలోకి కూడా పాములు వస్తున్నాయి. పోయిపోయి జీవితం చీమలపుట్టలో
వేలు పెట్టినట్లయింది. ఇంకా ఆ భయానికి తాళలేక కొండమానుఋషిని తలుచుకున్నారు.

కొండమానుఋషి శిరీషతో పాటు వాఖిరా నుంచీ ఈలపురానికి వచ్చాడు. ఆ ప్రయా


ణానికి నెలరోజులు పట్టింది. ఆ కాలంలో ఋషి వారికి పురాణ ఇతిహాసాల కథలన్నీ చెప్పే
వాడు. ఈలపురం రాగానే ఋషి తన దోవన తపస్సు చేసుకోవడానికి కొండలలోకి వెళ్ళి
పోయాడు. ఋషిని శిరీష తన అతిధి గృహానికి ఆతిధ్యానికి రమ్మని అడిగింది. “అమ్మా! నేను
నియమితాహారంలో ఉంటాను. మీలాగా ఉప్పూ కారాలు తింటే నా మనసులో కూడా
రాగద్వేషాలు ఏర్పతాయేమో!” నని వెళ్ళిపోయాడు.

శిరీష ఆవేదన కొండమాను ఋషికి చేరిందేమో, రెండురోజులలో ఆయన వచ్చాడు.


అందరూ ఆయనకు ప్రణమిల్లారు. “ఉవిదలారా! ఏమిటి మీ బాధా?” అన్నాడు ఋషి.
వనితలు తమ భయాలు చెప్పారు. ఋషి ఒక క్షణం ఆలోచించాడు.

201
  చాళుక్యసింహాసనం

“కుమారీ! కొన్ని దేవరహస్యాలుంటాయి. వాటిజోలికి పోకూడదు.మీరు చాలా


సాహసం చేశారు. అలా పోయి రక్తం కక్కుకుని చనిపోయినవారున్నారు.”అన్నాడు ఋషి

“మహర్షీ ఇప్పుడు మా కర్తవ్యమేమిటీ?ఈ సర్పాల భయంతో మేమంతా ఒణికి పోతు


న్నాము. మీరే ఏదైనా మంత్రమో మాకో దురాయిగాని వేయాలి” అన్నది శిరీష వినమ్రంగా.

ఋషి చిరు మందహాసం చేశాడు. “ఈ సర్పాలు మిమ్మల్ని భయపెట్టాయేకానీ


ఇంతవరకూ అపకారం ఏమీ చేయలేదుకదా! మీరేదైనా పామును చంపివుంటే తప్ప కుండా
నాగదోషం తగిలివుండేది.మీరెవరూ భయపడకండి. నాగులకు సంగీతమన్నా నాట్యమన్నా
చాలా ఇష్టం. నాగేంద్రులు సంతానోత్పత్తికి సంబంధించిన దేవతలు. మన శరీరంలో
మూలాధారం నుంచీ మణిపూరకం వరకూ వీరి అధీనంలో ఉంటుంది. అసలు మీరు వీరి
జోలికి ఎందుకు పోయారూ?”

“ఎరక్కపోయి వెళ్ళాము. ఈ గుహానిర్మాణానికి తోడ్పడుతున్నవారు నాగులే నని


మీరన్నారు. అందుకే ఆ నాగుల్ని చూడాలనిపించింది.”

“అదే చాపల్యం. సాధన లేకుండా తాంత్రిక ప్రయోగాలలో అడుగు పెడితే ఇలాగే అవు
తుంది. ఈ నాగులుమీరనుకున్నట్లు అందరికీ కనిపించరు. వీరు చరణాద్రి పర్వతాల
అడుగున నివాసాలు ఏర్పరచుకుని ఉంటున్నారు”అన్నాడు మహర్షి.

“నాగులు అంటే సర్పములు కదా మహర్షీ! నాగలోకం ఎక్కడో పాతాళంలో


ఉంటుందని కథలలో చెబుతారు.” ఆడపిల్లలంతా తలొక ప్రశ్నా వెశారు

“నాగలోకం, పాతాళం అంటే మన కాళ్ళక్రింద ఉన్నదే! అనాదికాలంలో వింధ్యపర్వతా


లకు ఈవల భాగమంతా ఈ నాగజాతివారే పరిపాలించేవారు. జనమేజయుడు పగతో సర్ప
యాగం చేశాడు. ఆ యాగంలో నాగరాజులైన వాసుకి వంశం వారు, తక్షక వంశంవారు,
ఐరావత వంశంవారు, కౌరవ్య వంశంవారు, ధృతరాష్ట్ర వంశంవారు చాలామంది నాశన
మయ్యారు. జరత్కారువు కుమారుడైన ఆస్ధికుని పుణ్యమా అని సర్పయాగం ఆగడం వలన
కొందరు నాగులు మిగిలిపోయారు. వారి వంశం వారే వీరంతా. అప్పటినుంచీ వీరం దరూ
భూమి అడుగున నాగలోకంలోనూ పాతాళ లోకంలోను ఉంటున్నారు. ఇంతకూ మీలో ఈ
నాగుల్ని చూడాలనే కోరిక ఎవరికి ఉందీ?”

“మహర్షీ. నాకు నాగజాతివారిని చూడాలని ఉంది”అన్నది శిరీష. చెలికత్తెలందరూ


కూడా నాగజాతివారిని చూడాలని ఉందన్నారు.

“చూడవచ్చు కానీ నాగదేవతల అనుగ్రహం కలవారే అక్కడ వాళ్ళను చూడగలుగు


తారు” అన్నాడు ఋషి. మళ్ళీ ఆయనే “మీలో ఇద్దరు ముగ్గురు ఈ సాహసం చేయవద్దు”

202
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

అన్నాడు. శిరీష చెలికత్తెలలోంచీ ఋషి రోహిణినీ అరణినీ సమంతను ఏరివేశాడు. ఆ


యువతులు కొంచం చిన్నపుచ్చుకున్నారు.

“మిమ్మల్ని వద్దన్నానని బాధపడకండి. మీ జాతకాలకు సరిపడదు. నక్షత్రాలలో


చందమామకు రోహిణి నక్షత్రం అంటేయిష్టం. కానీ చంద్రుడు దగ్గరగా వచ్చినపుడు రోహిణి
దూరంగా జరుగుతుంది. అంగారకుడు రోహిణి వెంటపడతాడు. కాని అంగారకుడికి రోహిణి
ఎప్పుడూ దక్కదు” అన్నాడు ఋషి.

ఆమాటకు రోహిణికి ముచ్చమటలు పోశాయి. అంగారకుడు తనకు ఎప్పటికీ దక్కడా.


కళ్ళనీళ్ళు కనపడకుండ మాటుకు జరిగింది. ఇంకోవంక ఋషి తన గుట్టు ఎక్కడ బయట
పెడతాడోనని భయం.

“ఈ రోహిణికి నాగదేవతల అనుగ్రహం కలిగిందంటే వెంటనే గర్భవతి అయ్యే


అవకాశముంది” అన్నాడు ఋషి. రోహిణి గుండెలో రాయి పడింది. ఋషులు సర్వదర్శులు.

మళ్ళీ ఋషే ఇలా అన్నాడు. “రోహిణీ. నీవు బాధపడకు. నీ మనోవాంఛ సిద్ధించాలని


ఆశీర్వదిస్తున్నాను” అని. రోహిణి మనసు కాస్త కుదుటపడింది.

“వీరిని చూడాలంటే మీరు నాగదీక్ష తీసుకుని నాట్యం ద్వారా వారిని మెప్పించాలి”


అన్నాడు ఋషి.

“దీక్ష అంటే ఏంచేయాలీ?” ప్రశ్నించారు చెలికత్తెలు.

“గురువు శిష్యుడికి దీక్ష ఇవ్వడంలో అనేక పద్ధతులున్నాయి. నేను బ్రహ్మరంధ్రాన్ని


తాకడం ద్వారా దీక్ష ఇస్తాను. కొందరు కంటిచూపుతోనే దీక్ష ఇస్తారు. మీ ఐదుగురూ నాట్యం
ద్వారా నాగదేవతలను మెప్పించండి. ఆతరవాత మీకే అంతా అవగతమౌతుంది” అన్నాడు
ఋషి.

నాగదర్శనానికి ఒక ముహూర్తం ఖాయమయింది.

సూర్యుడస్తమించి చాలాసేపయింది. గుహాలయాల చుట్టూ చీకట్లు అలుముకున్నాయి.


గుహలు చెక్కే శిల్పులందరూ వెళ్ళిపోయారు. ఆడపిల్లల హృదయంలో భయం భయం
గానేవుంది. ఆకాశం మేఘావృతం కావడంతో నక్షత్ర కాంతి కూడాలేదు.

శిరీషతోపాటు పూర్వచిత్తి, వాశిష్ట, షడ్పద, యామిని నాగదీక్ష తీసుకున్నారు. మార్గశిర


షష్ఠి నాడు కైలాసనాధాలయంలో నాట్యం ఆరంభించారు. కొండమాను ఋషి నాగసొరకాయ
బుఱ్ఱ సంపాదించి దానిని ఊదే బూరాగా తయారు చేశాడు. నాగస్వరానికి అనుగుణంగా
భాషలేని నృత్తం ఆరంభించారు. పామునాట్యంలో శరీరమంతా హూనమై పోతుంది.
203
  చాళుక్యసింహాసనం

పాములా చలించాలి. నేలపై పడి పొర్లాలి.

కైలాసనాధాలయం ఒక గుహ అని చెప్పడానికి లేదు. పర్వతాన్ని పైనుంచి క్రిందికి


తొలుచుకుంటూ వస్తున్నారు. ఆలయం ఇంక పూర్తికాలేదు. అందుకని ఆకాశమే కప్పు.
ఆలయంలో రంభ నాట్యం చేస్తున్నట్లు చెక్కిన కుడ్యశిల్పానికి అభిముఖంగా నాట్యం
ఆరంభించారు. నాట్యమేమో కాని శిరీష సౌందర్యం రంభ కేమీ తీసిపోదు. ఒక ప్రక్క
పదితలల రావణా సురుడు ఇరవై చేతులతో కైలాస పర్వతాన్ని పైకెత్తుతున్న శిల్పం
చెక్కుతున్నారు శిల్పులు. అది ఇంకా అసంపూర్ణంగానే ఉంది.

చిన్న చిరుజల్లు మొదలైంది. రాతినేల తడవడంతో కాళ్లు జారేటట్లున్నాయి. అయనా


అభినయం ఆపలేదు. వర్షంతో పాటు మెరుపులు వచ్చాయి. మెరుపు వెలుగులో చూస్తే ఒక
పాము పడగఎత్తి నిలబడి తమ నాట్యం చూస్తోంది. మెరుపు మెరిసినపుడల్లా ఒక పామే కాదు
అక్కడ చాలా పాములు జేరాయని తెలుస్తోంది.

ఒడలు జలదరిస్తోంది, గుండె ధడధడ లాడుతోంది. నాట్యం ఆపుతే పాములు కాటు


వేస్తాయేమోననే భయం. వర్షపు జల్లు పడుతున్నా భయంవలన బాహుమూలాల నుండీ
చెమటలు కారిపోతున్నాయి. చిబుకం చివరినుండి జారే స్వేదధారతో స్ధనవల్కలాలు
తడిసిపోయాయి. చనుకట్టు మధ్యనుంచీ కొండవూట లాంటి ప్రవాహం సరోవరంలాంటి
బొడ్డు లోకి చేరింది.నేలపైన పొర్లడంతో వస్త్రాలన్నీ తడిసి మట్టికొట్టుకు పోయాయి.మళ్ళీ ఒక
పెద్ద మెరుపు మెరిసింది. తమ చుట్టూతా పాములు. అడుగు వేస్తే ఏ పాము మీద పడుతుందో
అనేటట్లు పాములు. గుండె ధడధడ. అది ఒక పీడకలేమో ననిపిస్తోంది. శిశుర్ వేత్తి పశుర్
వేత్తి వేత్తిగాన రసం ఫణి అంటారు. ఫణాళి తమనాట్యం తిలకిస్తున్నాయి. ఏమి రసమో కానీ
భయానక రసం పరిపూర్ణంగా ప్రవహిస్తోంది.

భయంతో వాశిష్ట సృహతప్పి పడిపోయింది. ఆమెను చూసి పూర్వచిత్తి షడ్పద పడి


పోయారు. ఇంకా యామిని శిరీష మాత్రమే మిగిలారు. వారింకా నాగదేవతలను కొండ
మాను ఋషినీ తలుచుకుంటూ నాట్యం కొనసాగించారు.

వర్షం కుంభవృష్టి అయింది. ఉరుములు పిడుగులతో పర్వతాలు దద్దరిల్లాయి. అప్పుడు


ఐదు శిరస్సుల నాగరాజు మనుష్యరూపంలో వచ్చి ఎదురుగా నిలబడ్డాడు.

అంతటితో నాట్యం ఆపమన్నట్లు ఋషి నాదస్వరం ఆపేశాడు. శిరీష యామిని కూడా


స్ప్ర్రుహతప్పి పడిపోయారు.

కంటిముందు ఏవో దృశ్యాలు. స్ప్ర్రుహ కలిగిన తరువాత అది కలో నిజమో వారికి తెలీ
లేదు. అది గాఢనిద్రా కాదు. అలా అని జాగృతము కాదు. కలలో లాగా స్వయం చలనం లేదు.
చైతన్యము లేదు. కేవలం కనిపిస్తున్న దృశ్యానికి ద్రష్టలు మాత్రమే.

204
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

చీకటి హరించి వెలుగు ప్రసరించింది. సర్పాల ఆకారాలు మారిపోయాయి. ప్రతివారికీ


ఒక తల కనులు ముక్కు చెవులు నోరు అన్నీఉన్నాయి. కరచరణాది అవయవాలు మానవుల
వలెనే ఉన్నాయి. వారంతా స్వయం ప్రకాశంతో ఉన్నారు. అందుకే వారికి దీపాలు దివిటీలు
అవసరం లేదు. వారు వాళ్ళవాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోయారు. వారిలో స్త్రీలు పురుషులు
ఉన్నారు. స్త్రీలు సన్నగా నాజూకుగా వున్నారు. వయసు తారతమ్యం తెలీటంలేదు. కానీ
వారిలో గర్భిణీ స్త్రీలు తెలుస్తున్నారు.

ఋషి చెప్పినట్లు వారంతా మనిషి మోకాలెత్తు మాత్రమే ఉన్నారు. అచేతనమైన స్ధితిలో


అది కలో నిజమో తెలియదు. సాగిపోతునేవుంది. నిశాంతమైందేమో నాగజాతివారు
నిష్క్రమించారు.

తూరుపు దిక్కున రెందు కొండల మధ్యనుంచీ ఉదయించే సుర్యుడు కొండదేవత పెట్టిన


బంగారు గుడ్డులా అనిపిస్తున్నాడు.

కలకాని ఆ దృశ్యం చూసివచ్చిన శిరీష ఆమె చెలికత్తెలు విడిదికి వెళ్ళి రెండు రోజుల
దాకా మైకంగా నిద్రపోయారు. కొండమానుఋషి ఇంకెప్పుడూ కనిపించలేదు.

34 ఇంతి అంతిమ నిర్ణయం.


ఓ శిశువా! నన్ను మన్నించు. నాకు జనని అయ్యె అదృష్టం లేదు. నిన్ను కుంతీ దేవిలా
మరొక కర్ణుడిని చేయలేను. ఇది పరమాత్మ అవతరించిన ద్వాపర యుగం కాదు. కనిపారేసి
పోవడానికి నేను మేనకలా దేవకాంతను కాదు. కని కంసుడి కప్పగించడానికి దేవకీదేవినీ
కాదు. ఏడుగురిని పొట్టన పెట్టుకున్న గంగమ్మనూ కాను. అబలను. నేనింకా లోకమనే కాకుల
మధ్య కన్య కోయిలలా జీవించలేను. మాటల బాణాలు ఎత్తిపొడుపుల శూలపు పోట్లు ఇంక
భరించలేను. ఓడిపోయాను. పూర్తిగా ఓడిపోయాను.

కాలమనే చక్రం ఆగకుండా దొర్లుతోంది. కాలుడనే ధర్మరాజు ఆహ్వానిస్తున్నాడు.

నేను నిన్ను చంపటంలేదు. చంపలేను. నాహం హంతి. నిన్నే ఖడ్గం నరకలేదు. అగ్నీ
దహింపలేదు. నీరు తడపలేదు. గాలి ఎగరకొట్టలేదు. నీవు ఎల్లప్పుడూ ఉండేవాడవు. విశ్వం
అంతా ఏ రశ్మివలన ప్రకాశిస్తోందో అందులో నీవొకకిరణం. తత్- త్వం- అసి.

కావాలంటే ఇంకెవరైనా చల్లని తల్లి కడుపున పుట్టు. ఐనా ఏముందీ లోకంలో! పునరపి
జననం పునరపి మరణం పునరపి మాతా జఠరే శయనం. భజగోవిందం భజగోవిందం
భజగోవిందం భజ.....

వసుమిత్ర పొంగే కాగ్నా నదిలోకి ధూకేసింది.

205
  చాళుక్యసింహాసనం

అది తెల్లవారుఝాము. స్నానం చేయడానికి అప్పుడప్పుడే ద్విజులు వస్తున్నారు. పుణ్య


స్త్రీలు కూడా ఎవరికంటా పడకుండా తెల్లవారుఝామునే నదీ స్నానం చేసేవాళ్ళు. రేవులో
కాలికి తగులుతుంటే ఎవరిదో చీర వరదకు కొట్టుకు వచ్చిందనుకున్నారు. మెల్లగా వెలుగు
వచ్చేసరికీ ఒక్కక్కరికీ అనుమానం రాసాగింది. వసుమిత్ర ముఖానికి కూడా గట్టిగా చీర
చుట్టుకుని ధూకేసింది.

కొంత సేపటితరువాత ఎవరిదో స్త్రీ శవం అని తెలుసుకున్నారు. ఒడ్డుకు చేర్చారు.


గోమఠే శ్వరయ్యగారి అమ్మాయి అని గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
గోమఠేశ్వరయ్య గారింటో పరిచారిక చిన్నమ్మగారు కనిపించటంలేదని చెప్పింది. అంతటా
వెతికే లోపే సానుభూతి తెలుపడానికి కొందరు ఇంటికి వచ్చారు.

ఆ దినం మాన్యకేతంలో వ్యాపారం మొత్తం స్ధంభించిపోయింది. దుకాణాలన్నీ మూసి


వేశారు. వ్యాపారులందరూ ఆంధ్రశ్రేష్టి వెనక నిలబడ్డారు. కడుపుకోతతో రోదించేవారికి
అంతే ముంటుందీ!

ఆడవాళ్ళ సంగతి అటుంచి గోమఠేశ్వరయ్య చలించిపోయాడు. కాకపోతే అమ్మాయి


విషయంలో ఏదో జరపబోతోందని ముందే ఊహించాడు. ఊపాయం ఏమీ దొరక్క దిగులు
పడివున్నాడు. మేనల్లుడిని ససేమిరా చేసుకోనన్నది వసుమిత్ర. ఇప్పుడు ప్రాణత్యాగమే
చేసింది. పరిష్కారం లేని సమస్యలు ఇలాగే ముగుస్తాయి.

చితిచుట్టూ ప్రదక్షణం చేస్తున్న గోమఠేశ్వరయ్య ఇంద్రవల్లభుని తిట్టిపోశాడు. రాష్ట్రకూట


రాజవంశాన్ని గద్దె దించుతానని తనకూతురు మరణానికి కారకులైనవారిని ఊరికే వదిలి
పెట్టననీ కేకలు వేశాడు. పగతీర్చుకుని తన కూతురుకు ఆత్మ శాంతి కలిగిస్తాననీ శపథం
చేశాడు. ఆశపథానికి కోటలోంచి వచ్చిన రాజవంశీకులు భయపడ్డారు. తోటి వ్యాపారస్తులు
ఊరుకోమని ఊరడించారు. అక్కడ వున్నవారిలో గంగారాజ్యాన్ని పరిపాలించిన శివ
మారుడి వేగులు కూడా ఉన్నారు. యుద్ధంలో ఓడిపోయిన శివమారుడు ఎంతో కాలంగా
మాన్యకేతం చెరసాలలో బందీగావున్నాడు. గోమఠేశ్వరయ్య శపథాన్ని కొందరు ఏదో బాధతో
అంటున్నాడులే అని తేలికగా తీసుకున్నారు. గోమఠేశ్వరయ్య శపథంతో వసుమిత్ర
ఆత్మహత్యకు కారణమేమిటో తెలియనివారికి కూడా తెలిసింది.

గొప్పగొప్ప పురోహితులు వచ్చి ఆత్మహత్యాదోషం భ్రూణహత్యా దోషం తొలగడానికి


శాంతులు చేయించారు. నారాయణబలి జరిపించారు. గోమఠేశ్వరయ్య దశదానాలు సోడశ
మహాదానాలు ప్రత్యామ్నాయంగా కాకుండా ప్రత్యక్షంగా జరిపించాడు. పేద బ్రాహ్మణ
కన్యలను తెప్పించి దానం పట్టేవారికి దైవిక వివాహం జరిపించాడు.

ఒక నెల గడిచినతరువాత గోమఠేశ్వరయ్య శతావరి ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళేడపుడు


అందరికీ తన ఆరోగ్యం బాగులేదనీ చేయి చూపించుకోడానికి వెళ్తున్నాననీ చెప్పాడు.

206
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

అంతకుముందు గంగాదేశం శివమారుడి వేగులు పరామర్శించడాని కని వచ్చి


రాజకీయాలు చర్చించారు. శివమార మహారాజును చెరనుండీ విడిపించడానికీ రాష్ట్రకూట
రాజవంశాన్ని కూలదోయటానికి తమతో చేతులు కలపమనీ అడిగారు. గోమఠేశ్వరయ్య
ఆవిషయం క్షణాలలో నిర్ణయం తీసుకోలేననీ కొంతకాలం గడిచిన తరువాత తనను కలుసు
కోమనీ పంపించివేశాడు.

శతావరి ఆశ్రమం చాలా రద్దీగా వుంది. కొద్ది కాలంలోనే శతావరి రణవైద్యము


భూతవైద్యము శల్యచికిత్సాలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. శతావరి గోమఠేశ్వరయ్య
చేయిపట్టుకుని నాడి చూశాడు. “మీమనోవ్యాధి నాకర్ధమయింది! మీరు వైద్యానికి అంగీకరిస్తే
తప్పకుండా నయమవుతుంది” అన్నాడు.

గోమఠేశ్వరయ్య సాలోచనగా శతావరి కళ్ళలోకి చూశాడు.

“నాకు ఎడమచేయి పోయింది. ఒంటిచేత్తో బతుకుతున్నాను. ఐనా ధైర్యంగా ఉన్నాను.


మీరిలా కుమిలిపోతే కుడిచేతికే పక్షవాతం కమ్ముతుంది. మీరు ఆలోచించుకుని
మందుపుచ్చుకుంటే తప్పక మనోవ్యాధి నయమవుతుంది. నన్నుచూడండీ! నాకు పెళ్ళాం
బిడ్డలు ఎవరూ లేరు. రోజూ పూటకూళ్ళమ్మ ఇంటినుంచీ భోజనం వస్తుంది. అది తినే బ్రతుకు
తున్నాను” అన్నాడు శతావరి. లోపలకు వెళ్ళి కొంచం సేపటికి మందు లుంచిన మట్టిపిడత
తీసుకువచ్చి యిచ్చాడు. “ఇది రాత్రికి సేవించండి! మందు సేవించిన తరువాత కుండ
పగలకొట్టడం మర్చిపోకండి!” అన్నాడు.

ఇంటికి తిరిగివచ్చిన గోమఠేశ్వరయ్య ఔషధాన్ని అతిరహస్యంగా సేవించడమేమిటి.


ఇందులో ఏదో రహస్యముంది అనుకున్నాడు. కుండపిడత మూతతీశాడు. అందులో
భూర్జరపత్రం పైన మాన్యకేతదుర్గం చిత్రించబడి వుంది. ఇంకా పరిశీలనగా చూస్తే
బురుజుపైన గరుడపతాకం వుండవలసిన చోట చాళుక్యుల వరాహకేతనం చిత్రించబడి
వుంది. భూర్జరపత్రం ధ్వంసం చేశాడు.

శ్రేష్ఠి ఆలోచనలో పడ్డాడు. శివమారుడి మనుషులేకాక తూర్పుచాళుక్యులు కూడ


మాన్యకేతాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నారా.

గోమఠేశ్వరయ్య ఒక సంవత్సరం ఊరుకున్నాడు. క్రమంగా కాలం అనే చీకటి


జ్ఞాపకాలకు తెరకప్పింది. ఐనా గోమఠేశ్వరయ్య తన శపథాన్ని మర్చిపోలేదు. శతావరి
ఆశ్రమానికి మళ్ళీవెళ్ళాడు.

“శతావరీ! నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నానయ్యా! శివమారుడి మనుషులు


అప్పుడప్పుడు వచ్చి కలుస్తున్నారు. నాకన్నా మాఆవిడ పగతో రగిలిపోతోంది. నన్నొక
చేతకానివానిగా ఎంచి ఈసడించుకుంటోంది.”

207
  చాళుక్యసింహాసనం

“గోమఠేశ్వరయ్యగారు! నన్ను నమ్మండి. మామందు పుచ్చుకున్నతరువాత


ఇంకేమందు అవసరంలేదు. ఆమందు ఈమందు కలిపితింటే చివరికి వికటించి ప్రాణంమీదికి
వస్తుంది.”

“మరి అందుకు నేనేంచేయాలి?”

“ఇప్పటికే మా ఆశ్రమం, పూటకూళ్ళమ్మ నిలయం మా చాళుక్యులకు రహస్య


కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. మీయింటికి ఒక వాస్తుమార్తాండుడు వస్తాడు. ఆయనతో
మంతనాలు సలపండి” అన్నాడు శతావరి.

యువరాజు విష్ణువర్ధనుడితో చేతులు కలుపుతే తన పగ తీరుతుంది. తన శపథం


నెరవేరుతుంది. తనుకూడా విష్ణువర్ధనుని వ్యూహంలో చేరడానికి నిశ్చయించుకున్నాడు
ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్య.

కానీ ఒకప్రక్క పాపభీతి భయపెడుతోంది. తను పుట్టిపెరిగిన దేశం తను జీవిస్తున్న


దేశానికే ఎసరు పెట్టడమా.

ముందుగా పూర్వపు పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు


గోమఠేశ్వరయ్య. మాన్యకేతేశ్వరాలయానికి వెళ్ళి ప్రధానార్చకుడు బిందుఋషిని కలిశాడు.

బిందుఋషిని కలవడానికి వెళ్ళిన సమయానికి బంటు ఆయన పాదాలొత్తుతూ తను


రాష్ట్రకూట సైన్యంలో పనిచేసిన కాలాన్ని గురించి చెబుతున్నాడు.

బిందుఋషికి వీరు పెద్ద వారు వాళ్ళు చిన్నవాళ్ళు అని వుండదు. అందరినీ సమానంగా
ఆదరిస్తాడు. గోమఠే శ్వరయ్యకు ఒక జనపనార పట్టా చూపించి దానిపైన కూర్చోమన్నాడు.

బంటు కథ చెబుతున్నాడు. “అయ్యగారు! అప్పుడు గోవింద ప్రభాతవర్ష చక్రవర్తి సైన్యం


కదులుతోంది. దండయాత్రకు బయలుదేరాం. బతికి వస్తామన్న ఆశ లేదు. అందుకే
మేమంతా అమరజానదిలో పుణ్యస్నానాలు చేసి మాపెద్దలపేరుమీద బాపనాయనలకు
బియ్యమిచ్చాం. సేనాపతులైతే లింగాలు ప్రతిష్ట చేశారు. అప్పుడు చిడిమాను నిల పెట్టాము.
అదే యుద్ధానికి ధ్వజం. ధ్వజానికి పూజలు చేశాం. ఎనుబోతులు బలిచ్చాం. రక్తంతో పూత
పెట్టాం. డమాయీలు వాయించాం. అందరూ గౌడీమద్యం పట్టించామేమో మీసాలు ఎగవేసి
శత్రువులను పొడుస్తాం నరుకుతాం అని ప్రేలాపనలు చేశాము.

అయ్యా, అప్పుడేమీ తెలిసేదికాదు. నరకమంటే నరకడమే....”

బిందుఋషి బంటు మాటలకు అడ్డం వచ్చాడు.“బంటూ! దండు అంటే అలాగే ఉండా


లిరా! భటుడి స్ధాయి వాడికి విద్యాగంధం వివేచనాశక్తి ఉండకూడదు. ఉంటే రణరంగంలో
208
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

అర్జునుడిలాగా వాదోపవాదాలు మొదలుపెడతాడు. అప్పుడు మనిషికొక భగవద్గీత చెప్పాల్సి


వస్తుంది. సేనానులకు వ్యూహరచనా సామర్ధ్యమేకానీ అతితెలివి ఉండకూడదు. ఉంటే
ప్రమాదం. రాజుకన్నా నేనే బలవంతుడిని కదా, రాజు తలకాయ తీసి నేనే ఎందుకు రాజు
కాకూడదూ? అని ఆలోచిస్తాడు. అలా చేసినవాళ్ళున్నారు.

పాటలీపుత్రాన్నేలిన మౌర్యవంశంలో కడపటిరాజు బృహద్రథుడు. ఆయన


సైన్యాద్యక్షుడు పుష్యమిత్రశుంగుడు. సైనిక వందనం సమయంలో రాజు తలనరికి తానే
స్వయంగా రాజయి నాడు.”

“అయ్యా! ఇది మహాపాపం కాదా?” అన్నాడు బంటు.

“పూర్వం మగథదేశాన్ని నందవంశం పరిపాలిస్తుండేది. చాణక్యుడనే బ్రాహ్మణుడు


భారతావనిపైకి అలగ్జ్యాండరనే యవనుడు దండెత్తి వస్తున్నాడని హెచ్చరించడానికి వస్తే
గౌరవించకుండ అవమానించి పంపారు. అతడు కక్షకట్టి అసమర్ధమైన నందవంశాన్ని
గద్దెదింపి సమర్థుడైన చంద్రగుప్తుడిని సింహాసనం ఎక్కించాడు. కుటిలనీతితో పని
సాథించడంవలన ఆయన్ని కౌటిల్యుడన్నారు. కానీ ఆయన అర్ధశాస్త్రం అనే గ్రంథం వ్నాసిన
రాజనీతిజ్ఞుడు!”

అలా చెబుతూ బంటుతో “ఒకక్షణం ఆగరా!” అని బిందుఋషి “ఏమిటి సెట్టీ! ఇలా
వచ్చావ్?” అన్నాడు.

“ఋషీ! మనిషన్న తరువాత పాపాలు చేయకుండా ఉండడు. అవన్నీ పోవడానికి


నాచేత ఏదైనా వ్రతం చేయించండి” అని అడిగాడు.

బిందుఋషి “సెట్టీ! చాంద్రాయణ వ్రతం అని ఒకటుంది. అది ఆహార నియమానికి


సంబంధించింది. నీవు ఆచరిస్తానంటే చెబుతాను” అన్నాడాయన.

“మీరే నా గురుదేవులు! ఋషీ! మీరు ఏ ఆర్భాటము లేకుండా ఆచరించే వ్రతాన్ని నా


చేత ఆచరింప చేయండి. ఎందుకంటే నేనిపుడు మా బంధువుల ముందు తల ఎత్తుకు తిరిగే
పరిస్తితిలో లేను. మీకు విషయం తెలుసుకదా! నేను పండగలు పబ్బాలు చేసుకునే దినాలు
కాదు” అన్నాడు శ్రేష్ఠి దీనంగా.

“అందుకే చెబుతున్నా! ఇందులో ఏ ఆర్భాటమూ లేదు. ఎవరినీ పిలిచి భోజనాలు పెట్ట


నవసరం లేదు! ఇది ఒక స్వీయసాధన!

సెట్టీ. చాంద్రాయణవ్రతంలో యవమధ్యం అనీ పిపీలికామధ్యం అని


రెండురకాలుంటాయి. యవమధ్యం అంటే శుక్ల పాడ్యమి నాడు ప్రారంభించాలి. ముందుగా
శూన్యతిధులు తిధిద్వయం లాంటివి లేని మాసం ఎంచుకోవాలి. మొదటిరోజు అంటే
209
  చాళుక్యసింహాసనం

పాడ్యమి నాడు ఒక్క పిండం అన్నం మాత్రం తిని ఉపవాసముండాలి. విదియనాడు రెండు
తదియనాడు మూడు పిండాలు ఇలా పెంచుతూ పూర్ణిమ నాడు పదిహేను పిండాలు
భక్షించాలి. అలాగే బహుళ పాడ్యమి నాడు పధ్నాలుగు విదియనాడు పడమూడు అలా తగ్గిస్తూ
అమ్మావాస్య నాడు నిరాహారంగా ఉపవాసం చేయాలి. ఈ అన్న పిండానికి కూడా ఒక
ప్రమాణం ఉంది. నెమలి గుడ్డు ప్రమాణం ఉండాలి. దీన్ని యవమధ్యం అంటారు.

రోజూ భోజనం చేసేవాళ్ళు ఒక్కసాకిగా యవమధ్యం చేయడం కష్టం. శుక్లపాడ్యమి


నాడు ఒక్క పిండం తిని ఉండడం కష్టం. అందుచేచ పిపీలిక చాంద్రాయణమే తగినది.
బహుళ పాడ్యమినాడు ప్రారంభించి ఆనాడు పదిహేను పిండాలు బహుళవిదియనాడు
పధ్నాలుగు ఇలా తగ్గిస్తూ అమావాస్యనాడు ఉపవాసముండి శుక్లపాడ్యమి నాడు ఒకపిండం
ఇలా పెంచుకుంటూ పూర్ణిమ నాడు పదిహేను పిండాలు భుజించాలి. ఇది గొప్ప
ప్రాయఃశ్ఛిత్తం. దీనివలన విహిత అవిహిత పాపాలన్నీ తొలగిపోతాయి.”

“మహాత్మా! మీవంటి బ్రాహ్మణోత్తములు దొరకడం కష్టం! మీరే నాచేత ఈ వ్రతం


చేయిం చండి. దక్షిణా తాంబూలాలు సమర్పించుకుంటాను.”అన్నాడు శ్రేష్ఠి.

“దానిదేముందీ! సెట్టీ! ఒక శుభదినం నిర్ణయిస్తాను. ముందు ఇష్ట దైవారాధన


చేయాలి. పంచగవ్యప్రాసన చేయాలి. ఆ దినానికి నల్లఆవు నేయి, నీలంఆవు పెరుగు,
బంగారం రంగు ఆవుపాలు, తెల్లఆవు పేడ, ఎఱ్ఱఆవు మూత్రం లభించేటట్లు చూసుకోవాలి.
ఎనిమిది మినప గింజలెత్తు గోమూత్రం, పదహారు మాషాల గోమయం, పన్నెండు మాషాల
ఆవుపాలు, పది మాషాల పెరుగు, ఎనిమిది మాషాల నేయి నాలుగు మాషాల దర్భజలం
కలిపి సేవించాలి. దీన్నే పంచగవ్యం అంటారు. ఇది శరీర సుద్ధి చేస్తుంది. పంచగవ్యంలో
కుశోదకం లెక్కలోకి రాదు. ఆ మరునాటి నుంచీ పిపీలిక చాంద్రాయణం ఆరంభిద్దాము.

నాకు వెరే దక్షిణ ఏమీ అవసరం లేదు. ప్రభువులిచ్చిన మాన్యం చాలు. కాకపోతే ఈ
నెలరోజులూ మాన్యకేతేశ్వరాలయంలో భాగవత పురాణం చెబుతాను శ్రద్ధగా విను.”
అన్నాడు బిందుఋషి.

చాంద్రాయణవ్రతం నెలరోజులూ బిందుఋషి శివాలయంలో భాగవత పురాణం చెప్ప


దొడిగారు. మొదటిరోజు తక్కువ మంది భక్తులు వచ్చినా రోజురోజుకూ ఆ సంఖ్య పెరగ
సాగింది.
నాడు బిందుఋషి భాగవతపురాణాన్ని ఇలా ప్రారంభించాడు.
‘మహాజనులారా! సర్పదోషంతగిలిన పరీక్షన్మహారాజు భాగవత సప్తాహం చేస్తున్నాడు.
అందులో ఆనాడు పరీక్షన్నరేంద్రునకు శుకయోగ్రీందుడు బలరామజననం
చెప్పదొడిగాడు.

210
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

పూర్వం ఉగ్రసేన మహారాజు యదు భోజ అంధక దేశాలనేలేవాడు. ఆయన పుత్రిక


దేవకి. కంసవల్లభుడికి సోదరి. కంసవల్లభుడికి చెల్లెలంటే అవ్యాజమైన ప్రేమానురాగాలు.
సోదరికోసం ఏమైనా చేస్తాడు.

రాకుమారి దేవకి వసుదేవుడిని వరించింది. వసుదేవుడు శూరసేన మహారాజు కుమా


రుడు. యదువంశంలో పుట్టిన శూరసేనుడు మధురానగరం రాజధానిగా పరిపాలిస్తుండే
వాడు.

కంసవల్లభుడు దేవకికి ఎన్నోవిధాల నచ్చచెప్పాడు, వసుదేవునిమాని ఇంకెవరినైనా


వరించమని. వసుదేవునికి అంతకుముందే రోహిణి, పౌరవి, మదిర, కౌసల్య, రోచన, ఇళ,
ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, అనే భార్యలున్నారు. ఎంత
చెప్పినా దేవకి వినలేదు.

చివరకు దేవకీ వసుదేవుల వివాహం ఘనంగా జరిగింది. నూతన వధూవరులు తమ


రాజధాని మధురానగరానికి పయనమయ్యారు. కంసవల్లభుడే స్వయంగా రథం పగ్గాలు పట్టి
నడుపుతున్నాడు. పెల్ళిరథం వెనుక ధనంతో నిండిన పదునెనిమిది వందల రథాలు, బంగారు
ముఖఫలకాలు అలంకరించిన గజసహస్రం, పదివేల అశ్వాలు రెండువందల మంది
శృంగారమొలికే దాసీజనం అరణంగా వస్తున్నారు.

రథాలు నడుస్తుండగా అంతరిక్షం నుంచి అశరీరవాణి గంభీర ధ్వనితో పెద్దగా


నవ్వింది. ఆ రవానికి రథగజ హయాలన్నీ ఆగిపోయాయి. అంతట ఆకాశదేవత అందరూ
వినేటట్లు “ఓ కంసవల్లభా! నీవు నీ రాబోయే మృత్యువు వెంట ఆనందంగా నడుస్తున్నావా?
వెండియు నీవు ఎంత వెఱ్ఱివాడివీ! నీవు పూర్వం కాలనేమియనే రాక్షసుడివి. ఆమాట
మర్చిపోయావా? నీ ప్రియమైన చెల్లెలు అష్టమ గర్భాన దానవాంతకుడైన శ్రీహరి జన్మి స్తాడు.
నీమదమణుస్తాడు. నిన్ను సంహరిస్తాడు” అని పలికింది.

ఒక్కసారిగా కంసుని హృదయంలో రాక్షసప్రవృత్తి మేల్కొంది. తనని ఎవడో చంపుతా


డనేటప్పటికీ క్రోధము ఆవేశమూ భయము ఆకాశాన్ని తాకింది. ఒక్కసారి తల విది ల్చాడు.
చెల్లెలు కొప్పు పట్టుకుని రథం పైనుండి లాగి క్రింద పడవేశాడు. మెడ నరకడానికి ఖడ్గం
పైకెత్తాడు.

ఆ అబల గడగడా వణికిపోయింది. తన సోదరుడు ఆ సమయంలో నిజంగానే రాక్ష


సుడిలా కనిపించాడు. తల తెగిపడేదే. వసుదేవుడు నేర్పుతో అడ్డం వచ్చాడు. “బావా!”
అన్నాడు ఆర్ద్రత కలిగేటట్లు. “బావా ఒక్క క్షణం ఆగు. నీకంత కోపం వుంటే నన్ను నరుకు.
నాకిప్పటికే చాలా మంది భార్యలున్నారు. పాపం, దేవకి ఇంకా కాలి పారాణికూడా ఆరని
కొత్త పెళ్ళికూతురు. ఇప్పటివరకూ ఆమెపై నీకు అత్యంత వాత్సల్యం వుండేది. ఒక క్షణంలో
అది ఎలా మాయమయిందీ? ఎవరో పలికిన చెప్పుడు మాటల వలననే కదా! ఈ జ్యోతిష్యాలు

211
  చాళుక్యసింహాసనం

నిజమౌతాయో లేదో! కావాలంటే మాకు పుట్టిన పిల్లలందరినీ నీకప్పగిస్తాము. నీవేం


చేసుకుంటావో. ఒక ఆడపడుచుని నరకడం నీవంటి వీరులకు శౌర్యం అనిపించు కోదు”
ఇలా మాట్లాడుతున్నాడు.

కంసుడు ఒక క్షణం ఆగాడు. కొంచం మనసు మారింది. “మీకు పుట్టిన పిల్లలందరినీ


మా కప్పగిస్తారా? మాట తప్పుతారా?” అన్నాడు.

“నేను మాట యిస్తున్నాను. అందులోనూ అష్టమ గర్భం వలన కదా నీ భయానికి


కారణం! సంవత్సరానికి ఒకరిని కంటున్నా ఎనిమిది సంవత్సరాల తరువాతి మాట!
అప్పటివరకూ నీ చెల్లెలు కాపురాన్ని పాడుచేయకు. చెల్లెలును చంపిన అపకీర్తి పాలు కాకు”
అన్నాడు నేర్పుగా వసుదేవుడు.

చెల్లెలు మీద జాలిగుండెతో కంసుడు చల్లబడ్డాడు. పుట్టిన పిల్లలందరినీ తన ఖడ్గానికి


సమర్పించాలని వసుదేవుడితో ఒడంబడిక చేసుకున్నాడు. దేవకీ వసుదేవులు బ్రతుకు జీవుడా
అంటూ తమ రాజధానికి చేరి ఆనందంగా గడుపుతున్నారు. వసుదేవుని భార్య లందరూ
పిల్లల్ని కంటున్నారు.

దేవకీ దేవికి తొలిచూలి కొడుకు పుట్టాడు. ఆర్యపుత్రులు మాట తప్పరు. ఒడంబడిక


ప్రకారం వసుదేవుడు మొదటి కొడుకును కంసుని కర్పించాడు.

అంతట కంసుడు “బావా! అష్టమ గర్భాన పుట్టినవాడు కదా నా ప్రాణానికి అపాయం


కలిగించేదీ? ఈ మేనల్లడుని మీరే పెంచుకోం”డని ఇచ్చివేశాడు. అంతట దేవకీ వసుదేవులు
కుమారుడికి కీర్తిమంతుడు అని నామకరణం చేసి పెంచుకోసాగారు. దేవకీవసుదేవులు
సంవత్సరానికొక కుమారుణ్ణి కంటూనేవున్నారు. రెండవ కుమారునికి సుసేనుడు మూడో
కుమారునికి భద్రసేనుడు నాల్గవ కుమారునికి ఋజువు ఐదవ కుమారునికి సవదనుడు,
ఆరవకుమారునికి భద్రుడు అని పేర్లు పెట్టుకుని పెంచుకుంటు న్నారు.

అంతట శుకయోగీంద్రుని పరీక్షిన్నరేంద్రుడు ఇలా ప్రశ్నించాడు. “వృద్ధపితామహా!


దేవకీ వసుదేవులు నిశ్ఛింతగా పిల్లల్ని కంటున్నారా? కౄరుడైన కంసుడు చెల్లెలి పిల్లల్ని
ఎప్పటికప్పుడు చంపలేదా? ఆ తరువాత ఏంజరిగిందీ? బలరామ కృష్ణులు ఎప్పుడు
పుట్టారూ? ఆకథ వినాలని వుంది” అన్నాడు. అంతట.

“ఓ పరీక్షిన్నరేంద్రా! మున్ను ద్వాపర యుగం నాటిమాట! యుగాంతంలో భూభారం


అధికమైపోయింది. దుష్టులు దుర్మార్గులు అధికం అయిపోయారు. రాజులు మదోన్మత్తులై
పోయారు. ధర్మం గతి తప్పింది. భూమి ఎంతమంది సజ్జనులనైనా భరిస్తుందికానీ దుర్జ
నులను భరించలేదు.

212
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

భూమాత దుష్టులభారం భరించలేక గోరూపం ధరించి సత్యలోకం వెళ్ళి బ్రహ్మదేవుడితో


మొర పెట్టుకుంది. అంతట చతురాననుడు ‘అమ్మా నేను సృష్టికర్తనేకాని సంహార కర్తను
కాను. ఆ పని విష్ణుదేవుడో రుద్రుడో మాత్రమే చేయగలిగిన పని’ అని వచించాడు. అంత
గోమాత శోకించగా కమలజుడు జాలిపడి ‘నిన్ను ఆ శ్రీమహావిష్ణువు వద్దకు తీసుకు వెళతా’
నని చెప్పి వైకుంఠవాసానికి తీసుకు వెళ్లాడు.

అక్కడ శ్రీమహావిష్ణువు దర్శనమీయలేదుకానీ ఆయన వాణి బ్రహ్మదేవునికి వినిపిం


చింది.

“ఓ కమలసంభవా! ఓ వసుంధరా! మీ ఇద్దరూ కాస్త ఓపిక పట్టండి. నేను భూలోకంలో


దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడనుపేర కుమారుడనై జన్మిస్తాను. ధరణీ!నీ భారాన్ని తగ్గించి
సాధువుల్ని రక్షిస్తాను. నాకన్నా ముందు ఆదిశేషుడు దేవకి వసుదేవులకు బలరాముడై
పుడతాడు” అని సెలవిచ్చాడు.

ఒకనాడు త్రిలోక సంచారుడైన దేవముని నారదుడు కంసవల్లభుని సందర్శించడానికి


వచ్చాడు. విష్ణుమాయ, నారద చిత్తము ఎవరికీ అవగతం కాదు.

నారదుడు సంసారమనే బావిలోపడి సత్వరజస్తమో గుణాల వలలో చిక్కుకుని కామ


క్రోధాలనే ఆరు బంధాలతో కట్టబడిన మానవ పశువులను నిరూఢ పశుబంధనం ద్వారా
పశుపాశ విమోచనం చేయించే దేవఋషి. ఆయన నివృత్తి మార్గం ప్రజాపతులకు సహితం
అర్ధం కాదు.

నారదముని కంసుడిలోని రాక్షసుడిని రెచ్చకొట్టాడు. “ఓరి పిచ్చివాడా! నీచెల్లెలు


అష్టమ గర్భంలో పుట్టేవాడు దైత్యాంతకుడైన శ్రీహరి! అతడు పుట్టాడంటే నిన్ను చంపక
మానడు! నీవు అమాయకంగా ఒంట్లు లెక్కపెట్టు కుంటున్నావు. విష్ణుమాయలో నీ లెక్కలు
తప్పుతాయి. ఏది అష్టమగర్భమో ఎవరికెరుకా? ఆయన లెక్కలూ ఎక్కాలు వేరు.

దేనితోనూ చావకూడదని ఎన్నో వరాలు పొందిన హిరణ్యకశిపుని ఆకాశంలోను


భూమి మీద కాకుండా ఒళ్ళో పడవేసుకుని మరీ చంపాడు. ఆయుధాలతో చావనంటే
ప్రాణమున్న వాటితోను ప్రాణం లేనివాటితోను చావనంటే గోళ్ళతో చీల్చి చంపాడు. నరులు
యక్షులు గంధర్వులు దేవతలు ఎవరితోను చావురాకూడదని వరం పొందుతే నరుడు కానీ
మృగము కాని నరసింహ రూపంలో వచ్చి చంపాడు. కంసా నీవు చాలా అమాయకుడివి”
అన్నాడు.

ఆ మాటలకు కంసుడు ఉగ్రుడైపోయాడు. మధుర రాజధానిగా ఉన్న శూరసేన దేశంపై


దండెత్తాడు. దేవకీ వసుదేవులను గృహనిర్బంధంలో పడవేశాడు. దేవకి ఆరుగురు పుత్రు
లను కనికరం లేకుండా వధించాడు. వసుదేవుని భార్యలు అందరూ బందీలయ్యారు కానీ

213
  చాళుక్యసింహాసనం

రోహిణీదేవి మాత్రం తప్పించుకుని గోకులం చేరింది. తను చేస్తున్నది తప్పు అన్నందుకు


కంసుడు తండ్రి ఉగ్రసేనుణ్ణి బంధించి చెరలో పడవేశాడు. బాణుడు, భౌముడు, మాగధుడు,
మహాశనుడు, కేశి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టి
కుడు, అరిష్టుడు, ద్వివుదుడు, పూతన మొదలైన రాక్షసులను కూడగట్టుకున్నాడు. యాదవ
వీరులను ఓడించి పారదోలాడు. వారంతా నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయి,
పాంచాల, సాళువ దేశాల్లో తలదాచుకున్నారు.

కంసుడిలో ఒక మానవుడు ఒక దానవుడు నిల్చివున్నారు. వాళ్ళమధ్య సంఘర్షణ


జరుగుతోంది. అతడిలో ఒకవంక ఆకాశవాణి పై నమ్మకం అంతగా లేదు. ఇంకోవంక ప్రాణ
భయం తనను దానవుణ్ణి చేస్తోంది. ఇంకా కంసుడికి తన చెల్లెలు దేవకీదేవి మీద ప్రేమా
భిమానాలు నిలచేవున్నాయి. తన మంత్రులు దేవకీదేవిని స్త్రీల చెరసాలలో వసుదేవుడిని
పురుషుల చెరసాలలో ఉంచమని చెప్పారు. అప్పుడు వారికి సంతానం కలిగే అవకాశమే
లేదు. ఇంకా అష్టమగర్భం అనేదే వుండదు. కానీ కంసుడి మనసు అందుకు అంగీక రించలేదు.
దేవకీ వసుదేవుల మిథునాన్ని విడదీయకుండా కేవలం గృహనిర్బంధంలో ఉంచాడు.
అంతవరకూ ఒక మానవు డనిపించుకున్నాడు.

దేవకీ వసుదేవుల్లో పంతం పెరిగింది. తమ ఆరుగురు కొడుకుల్నీ వధించినవాడిని


వధించే వాడికి జన్మ నివ్వాలని నిశ్చయించుకున్నారు. ఆ దంపతులు దానవులు కాక పోయినా
రాచపౌరుషం కలవారు. దుఃఖాన్ని దిగమింగుకుని మళ్ళీ సంసారంలో పడ్డారు.

“దేవకీ! ఇప్పుడెన్నో నెలా?” అన్నాడు వసుదేవుడు.

దేవకి తల వంచుకునే హస్తం చూపించింది. ఆమె కనుకొలకులనుండి జారే అశృధార


ధరణిని తడుపుతోంది.

“దేవకీ! గర్భవతులు ఏడవకూడదు. ఆనందంగా ఉల్లాసంగా వుండాలి!” అన్నాడు


వసు దేవుడు.

“ఎలావుండమంటారూ? నా కళ్ళముందే ఆరుగురు పిల్లల్ని మాఅన్నయ్య కంసుడు


గాలి లోకి ఎగరవేసి కత్తితో నరికాడు.”

“దేవీ! నీవు క్షత్రియకాంతవు కాబట్టి ఆ భీభత్సాన్ని చూసికూడ తట్టుకోకలిగావు. అదే


బ్రాహ్మణ కాంతవైతే గుండె పగిలి చచ్చిపోయేదానివి.”

“మీరన్నది నిజమే! నేనా రాక్షసుడికి చెల్లెల్ని. ఆ రాక్షసాంశ నాలోకూడ ఉండి


వుంటుంది. లేకపోతే ఇంత ఘోరాన్ని కళ్ళారా చూసికూడ ఇంకా బ్రతికేవున్నాను. నాది
గుండెకాదు బండరాయి. అంతేకాక సిగ్గుమాలి మరొకసారి నెలతప్పాను.”

214
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“దేవీ! బాధపడకు. భగవంతుడు నిష్కారణంగా ఎవరినీ బాధపెట్టడు. గతజన్మలో


మనం ఏపాపం చేశామో! ఆపాపం ఇప్పుడు కట్టి కుడుపుతోంది.”

“నాకు ఆత్మహత్య చేసుకోవాలనుంది. ఇంత విషం దొరుకుతే బాగుండును. నేను ఈ


ఏడవ సంతానానికి కూడ జన్మనిచ్చి కంసుడి ఖడ్గానికి బలియివ్వలేను.”

“దేవీ! ఆత్మహత్య మహాపాపం. మనం కష్టాన్ని ఓర్చుకోవడం వలన పాపక్షయం అవు


తుంది. వచ్చేజన్మయైనా మంచిజన్మ వస్తుంది. ఆత్మహత్య చేసుకుంటే ఈ పాపశేషం వచ్చే
జన్మకు కూడ మిగులుతుంది. అంతేకాక భ్రూణహత్యా పాపం కూడ దానికి తోడవుతుంది.”

“మరేంచేద్దామంటారు? ఎలాగో అష్టమగర్భాన్ని మా అన్న కంసుడు విడవడు. ఆ పుట్ట


బోయేవాడు కంసుడినే చంపుతాడో కంసుడిచేతులో మరణిస్తాడో మనకు తెలీదు. ఎవరో
చెప్పిన మాటలు పట్టుకుని మా అన్న ఇంత ఘోరానికి ఒడి కడుతున్నాడు.”

“మరి ఏంచేద్దామంటావ్?”

“సప్తమ గర్భాన్ని నాకు వదిలి అష్టమగర్భాన్ని తీసుకోమని మాఅన్న కాళ్ళు పట్టు కుని
ప్రార్ధిస్తాను.”

“పిచ్చిదానా! నీఅన్న మారతాడనుకున్నావా? అతడు పరమ రాక్షసుడు. ఇంతకు


ముందు కాళ్ళా వేళ్ళా పడితే విన్నాడా? కంసుడికాళ్ళు పట్టుకోవడంకన్నా గాడిదకాళ్ళు
పట్టుకోవడం నయం. జంతువుకైనా కాస్త జాలి కనికరం ఉంటుంది.”

“ఏదైనా దారిచూపమని ఆ పన్నగశాయి శ్రీహరిని ప్రార్ధిద్దాం!”

“దేవకీ! మహావిష్ణువు దయాళుడు. ఏమాయయైనా చేయకలడు. మనిద్దరం పరమ


నిష్టతో శ్రీహరిని జపిద్దాం” అన్నాడు వసుదేవుడు.

భార్యా భర్తలిద్దరూ రాత్రికి విశ్రమించారు. శ్రీహరి కలలోకి వచ్చాడు. ఆయనతోపాటు


శేషాహి కూడవున్నాడు.

“దేవకీ వసుదేవులారా! మీ గర్భశోకం తీరిపోయింది. ఈ శేషుడు మీ గర్భాన ప్రవేశి


స్తాడు. ఆపిండాన్ని సేకరించి నందగోకులం చేర్చండి. మీకు శుభమగుగాక!” అని అంత
ర్ధానమయ్యాడు విష్ణుమూర్తి. శేషుడి తేజస్సు చూస్తుండగానే దేవకీ గర్భంలో ప్రవేశించింది.

ఇద్దరికీ మెళుకువ వచ్చింది. ఒకరికల ఒకరికి చెప్పుకున్నారు. ఇద్దరికీ ఒకేకల రావడ


మేమిటీ విష్ణుమాయ కాకపోతే!

215
  చాళుక్యసింహాసనం

వైకుంఠంలో జరిగిన కథ మరొకలాగుంది.

శేషసాయియైన కమలాక్షుడు సంకల్పించాడు. ఎదురుగా యోగమాయాదేవి ప్రత్యక్ష


మయింది. అచ్చం శ్రీమహావిష్ణువు తనను తాను అద్దంలో చూచుకున్నట్లే ఉంది. విష్ణువు
హృదయంలో స్త్రీ!‘భద్రా!’ అన్నాడు ఆప్యాయంగా నారాయణుడు. ఎదురుగా వున్న యోగ
మాయ స్త్రీగా మారిపోయింది.
“నీవు భూలోకానికి వెళ్ళాలి.”
‘ఏమి పనిపడిందీ?”
“లోకరక్షణ!”
“రక్షణా శిక్షణా?”
“శిష్టుల్ని రక్షించాలంటే దుష్టుల్ని శిక్షించాలికదా?”
“ఆజ్ఞ ఐతే భూలోకాన్ని మొత్తం నవదుర్గనై తునుమాడుతాను!”
“ఓసి భద్రకాళీ! నీవలాంటిదానివే! అందుకే ఆపని నామీద వేసుకున్నాను. భూమి మీద
అవతరించబోతున్నాను.”
“ఏమీ నాకు చాతకాదా? ద్వాపరంలో అర్భకుల్ని అంతమొందించడానికి నీవు
కావాలా? వరదలు భూకంపాలు అగ్నిపర్వతాలు ఉప్పెనలు ఎన్ని ఉపాయాలు లేవు భూభారం
తగ్గించడానికి?”
“అదే, నీకు నాకు ఉన్న వ్యత్యాసం! నీవలన సన్మార్గులు దుర్మార్గులు అందరూ కొట్టుకు
పోతారు. నీవు ధర్మాధర్మ వివర్జితవు!”
“మరినీవయితే?”
“చిరునవ్వు చెదరకుండా దుష్టులను అమరలోకాలకు పంపిస్తాను!”
“అవును మరి! వైకుంఠాన్నించి దిగివచ్చిన నీ దివ్యదర్శనం పొందినవాడు ఇంకా పాపి
ఎలా అవుతాడూ?”
“పిచ్చిదానా! నన్ను వైకుంఠవాసుడిగా గుర్తించినవారికే మోక్షం!”
“ఇంతకూ నేను చేయవలసిన పనేమిటీ?”
“నీవు మంత్రసానిగా మారాలి!”
“మంత్రసానా?”
“ఏమీ క్రొత్తగా మాట్లాడుతున్నావ్? ఈ బ్రహ్మాండాలను ప్రసవించింది నీవుకాదా? నీవు
జగజ్జననివి కాదా?”

216
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“అసలుకథ చెప్పకుండా ఈ వాదోపవాదాలేమిటీ?”


“నీవు గోప్యంగా దేవకి గర్భస్త పిండాన్ని బయటికి తీసి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టాలి!”
“అయ్యో ఇదేమిపనీ?” అన్నది యోగమాయ.

“నీవు యోగనిద్రగా మారు. అందరూ చక్కగా నిద్రపోతారు. ముందుగా నీవు రోహిణిని


గమనించు. ఆడదానిగా ఏసమయంలో పిండాన్ని ప్రవేశపెడితే గర్భం నిలుస్తుందో
తెలుసుకో!”

“నేనీ సంకర్షణం చేయలేను!”

“ఒక స్త్రీగర్భంలో పిండాన్ని ఇంకో స్త్రీగర్భంలో ప్రవేశపెడితే పుట్టేవాడు


సంకర్షణుడౌతాడు. నీకీ విద్య క్రొత్త అయితే పురందరుడిని అడుగు. ఆతడు నిద్రిస్తున్న
స్త్రీగర్భంలో ప్రవేశించి పిండాన్ని ఏడుముక్కలు చేశాడు.”

“నాకిప్పుడు కర్తవ్యం అవగతమైనది. కానీ ఇందువలన నాకు అపకీర్తి రాదా?”

“రాదు. ఈ దేవ మానవ కళ్యాణాన్ని నెరపిన నిన్ను జనులు దుర్గ, భద్రకాళి, విజయ,
వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద,
అంబిక అనే పేర్లతో కొలుస్తారు. ఆరాధిస్తారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి గాబు
చెల్లించుకుంటారు. అంతేకాదు. దేవకీదేవి అష్టమ గర్భాన నేను జన్మిస్తాను. నీవు నందుడి
భార్య యశోదకు యోగమాయవై జన్మించు. నేను నీవు అక్కడివారం ఇక్కడా ఇక్కడివారం
అక్కడా మారదాం!”

“మరి ఆరాక్షసుడు నన్ను మాత్రం వదులుతాడా? చంపడా?”

“నిన్నా! నిన్ను ఏఅస్త్రమూ ఛేదించలేదు. అగ్నిదహించలేదు, సుడిగాలి ఎత్తుకుపోలేదు.


నీవు ఉగ్రవై ఆవేశంలో ఆ పాంసుని మింగకుండా వుంటే అదేపదివేలు! వాడిని నాకు వదిలి
పెట్టు. అంతేచాలు!”

“నారాయణా! నీవన్నమాట నిజమే! నేను మహిషాసుర మర్దనినైతే ఎవరూ ఆగలేరు.


కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఈ అర్భకులమీద నాప్రతాపం అవసరమా? ఇది ద్వాపర
యుగాంతం! అల్పాయుష్కులు! మన ప్రతాపం చూపించకుండా ఆ సంకర్షణ ఏదో దేవకి
వసుదేవుల చేతే చేయిద్దాము. వాళ్ళకు ఆ తెలివితేటలు మనం కల్పిద్దాము. కావలసిన మాయ
నేను ప్రసాదిస్తాను.”

యోగమాయ మాట నారాయణుడు అంగీకరించాడు.

217
  చాళుక్యసింహాసనం

“దేవకీ! ఇదేదో భగవంతుడి ఆదేశంలాగ ఉంది. ఇద్దరికీ ఒకేకల రావడమేమిటీ?”

“నాధా! ఆ పన్నగశాయి మన మొర ఆలకించినట్లున్నాడు. మనం ఆయన ఆదేశాన్ని


అనుసరించాలి.”

“ఏంచేద్దామంటావ్?”

“నా గర్భస్తపిండాన్ని బయటికితీసి మరొకరి గర్భంలో ప్రవేశపెట్టండి.”

“ఇది సాధ్యమా? నీవు ఓర్చుకోగలవా దేవకీ? మరొక స్త్రీ నీ గర్భాన్ని ధరించడానికి


అంగీకరిస్తుందా?ఒక్క విషయం! నాభార్యలందరూ కంసుడి చేతికి చిక్కి చెరసాలలో పడ్డారు.
ఒక్క రోహిణి మాత్రం తప్పించుకుంది. ప్రస్తుతం నందగోకులంలో తలదాచు కుంటోంది.
ఆమె అయితే నా భార్య కాబట్టి నీ గర్భాన్ని ధరించడానికి అంగీకరించవచ్చు!”
“ఇంకేమీ! నా గర్భస్త పిండాన్ని సంకర్షణం చేయండి. ఎంత బాధకైనా ఓర్చుకుంటాను.”
“పూర్వం ఆపద్ధర్మంగా వశిష్టమహర్షికూడ మంత్రసాని పని చేశాడు!”
“ఎప్పుడూ?”

“అది వేరే కథలే ఇప్పుడెందుకు.”


“మరి నా భ్రూణాన్ని రోహిణీగర్భంలో ప్రవేశపెట్టండి.”
“మరి చెరసాల బంధనాలు?”
“నారుపోసినవాడే నీరుపోస్తాడు! ఆదిశేషుడే అవతరిస్తుంటే అరదండాలు అడ్డం
వస్తాయా? కానీయండి!”అన్నది దేవకి.
ఒకనాటి రాత్రి శుభముహూర్తం చూసుకుని వసుదేవుడు దేవకి గర్భస్ధ పిండాన్ని
సంకర్షణం చేశాడు. చిగురుటాకుల పొదిలో భద్రపరిచాడు. దాన్ని ఒక గంపలో పెట్టుకుని
తలకెత్తుకున్నాడు.
భూవలయాన్ని తన తలపైన మోసే సహస్రఫణాళిని వసుదేవుడు తన తలపైన మోస్తు
న్నాడు. ఏమి వింతా! ఎంత విచిత్రం!
శృంఖలాలన్నీ తెగిపోయాయి. తాళాలు తలుపులూ తెరుచుకున్నాయి. కాపలావారి
కన్నులు మూసుకుపోయాయి.
వసుదేవుడు నడుస్తూ నడుస్తూ యమునానదీతీరం వరకు వచ్చాడు. అసలే చీకటి.
అందులోను యమున నల్లనిది. ‘ఏదిదోవ!’ అనుకున్నాడు వసుదేవుడు.
‘నాకంతా తెలుసులే!’ అన్నట్లు యమున దోవనిచ్చింది.

218
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

సంసారమనే సముద్రాన్ని దాటించేవాడు శ్రీహరి. యమునాతరంగిణి ఒక నదిమాత్రమే!


వసుదేవుడు నందగోకులం చేరాడు. అందరినీ యోగనిద్ర ఆవరించింది.
వసుదేవుడు రోహిణిని నిద్ర లేపాడు. ఆమె తొలుత భయపడింది. వసుదేవుడు మాట్లాడ
వద్దన్నట్లు పెదవులపైన వేలు వేసుకున్నాడు. ఇద్దరూ దూరంగా వెళ్ళారు.
“రోహిణీ! నీవొక దేవకార్యం చేయాలి!”
“మీరెలా వచ్చారు? చెరసాలనుండి విడుదలయ్యారా?”భయ సంభ్రమాలతో
అడిగింది రోహిణి.
“అంతా విష్ణుమాయ! మళ్ళీ నేను వెనక్కు వెళ్ళిపోవాలి”అన్నాడు వసుదేవుడు
“నన్నుకూడ తీసుకువెళ్ళండి. మీతోపాటే నేనుకూడా చెరసాలలోనే ఉంటాను.”
“రోహిణీ! కాలం కలిసివచ్చేవరకూ మనకీ ఎడబాటు తప్పదు. నేను చెప్పేది జాగ్రత్తగా
విను.”
“ఏమిటదీ?”
“నేను దేవకీదేవి గర్భస్త పిండాన్ని సంకర్షణంచేసి తీసుకు వచ్చాను. దాన్నినీవు
ధరించాలి.”
“ఏమిటి మీరు మాట్లాడేది?”సంకర్షణం అనే విషయం ఆమె అంతకు మున్నెన్నడూ
విననుకూడ లేదు.
“భయపడకు. దేవకి సప్తమ గర్భాన్ని మనం రక్షించాలి. సాక్షాత్తు ఆదిశేషుడే అవత
రించ బోతున్నాడు.”
“మీరు చెప్పేది నాకేమీ అర్ధం కావటంలేదు.”
“సంకర్షణంచేసిన పిండాన్ని తెచ్చాను. దాన్ని నీ గర్భంలో ప్రవేశపెడతాను.”
రోహిణికి ముచ్చమటలు పోశాయి. “అయ్యొ రామా! ఇదేమి అఘాయిత్యం?”
“ఓ రామా! నీకు రాముడే పుట్టబోతున్నాడు! నీవు సహకరించాలి. నీ గర్భంలో ప్రవేశ
పెట్టి నేను వెళ్ళిపోవాలి.”

“నాథా! భర్త చెరసాలలో వుండగా నేనిక్కడ గర్భం ధరిస్తే లోకం ఏమంటుందీ? నేనా
అవమానం భరించలేను. గర్భం ధరించలేను.” రోహిణి ఏడుపు పైకి రాకుండా నోటికి చీర
కొంగు అడ్డం పెట్టుకుంది.

వసుదేవుడు రోహిణిని దగ్గరకు తీసుకుని ఊరడిస్తూ అన్నాడు. “దేవకీ! అలా అనకు.


ఇది దేవకార్యం. మనం నిమిత్తమాత్రులం. పూర్వం స్త్రీలు ఇట్లా ధరించారు. దేవకీపిండానికి

219
  చాళుక్యసింహాసనం

ఐదు నెలలు. నీవింకొక నాలుగు నెలలు ధరిస్తె చాలు ప్రసవిస్తావు.”

“నాథా! నేనీ పని చేయలేను. లోకం దృష్టిలో నేనొక నీచురాలిగా మిగలలేను. నాభర్త
మధురా నగరంలో చెరసాలలో ఉండగా నేనిక్కడ గర్భం ధరిస్తే నన్ను లోకం కులట
అంటుంది.”

“నీకు నిందరాదు సరికదా ఆదిశేషుడి వంటి మహాబలాఢ్యుడికి తల్లివవుతావు.


కంసుడికి తప్పుతే లోకానికి నిజమే చెబుదాము. అబద్ధమాడవద్దు. పుట్టేవాడికి సంకర్షణు డని
పేరు పెడదాము.”
“అంతేనంటారా!”
“కాదా మరీ! నాలుగు నెలలలో ఏ స్త్రీ అయినా ప్రసవిస్తుందా?”
“ఇందుకు నేనేమి చేయాలి?”
“నీవేమీ చేయనవసరం లేదు. కొంచంసేపు ఓర్చుకుంటే చాలు!”
రోహిణీ గర్భంలో దేవకి భ్రూణాన్ని ప్రవేశపెట్టి వసుదేవుడు మళ్ళీ చెరసాలకు వెళ్ళి
పోయాడు.

నాలుగైదు నెలలలోనే రోహిణీదేవి మహా బలవంతుడైన బలరాముడిని ప్రసవించింది.

భక్తులారా రేపటిదినం మరొక కథ చెప్పుకుందాం. శ్రీమద్రమారమణ గోవిందో హరిహి


అన్నాడాయన.

35 మహామంత్రి తొలగింపు
చాళుక్య ఆస్ధాన రాజనర్తకీమణులలో బింబాధరి ఒకతె. ఆమె క్రొత్తగా కత్తుల నాట్యం
నేర్చుకుని వచ్చింది. మహారాజు మహారాణీల వినోదం కోసం ఆ సాయంత్రం నాట్యం
ఏర్పాటు చేయబడింది. రంగాలంకరణ చాలా గొప్పగా చేశారు. కుడ్యస్ధంభాలకు
కూరగాయలు వ్రేలాడకట్టారు. రంగస్ధలం మధ్యలో నడుమెత్తు స్ధంభంపైన పళ్ళెరంలో
రకరకాల పిడిబాకులు చురకత్తులూ అమర్చివున్నాయి. కరండాలలో వెలిగే దీపాలతో
ప్రాంగణం పట్టపగలు లాగేవుంది.

ముందుగా మహామంత్రి గంగాతీర్ధుడు వచ్చి నాట్యశాల అంతా పరిశీలించాడు. నర్తకీ


మణులతో ముచ్చటించాడు. సంతృప్తి చెందాడు. పంచమహాశబ్దాలు నినదిస్తుండగా నరేంద్ర
మృగరాజు సప్తభార్యలతో కూడి రంగస్ధలికి విచ్చేశాడు. పట్టపురాణి శ్రద్ధాదేవి మహారాజు
ప్రక్కనే కూర్చుంది. ఇద్దరు యువతీమణులు నెమలిపింఛం చామరాలతో వీవనలు వీస్తుండగా
వెనకగా ఇరువురు స్త్రీభటులు శూలాలు ధరించి నిలబడ్డారు.
220
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

యలగంగ అనే గాయని నట్టువాంగంతో సిద్ధంగా వుంది. మహారాణి అనుమతి లభింప


గానే బింబాధరి నాట్యం ఆరంభించింది. మొదటి పాటగా
చతురను రా రాజ చతుర రంగములో చతురను రా రాజా
నటనము నేర్చిన శారదనూ వంచన మందు వి శారదను
కత్తులు రువ్వే కొమదనునేను గురితప్పని కోమలినేను
పావును రా రాజా చతుర రంగములో చిన్న పావునురా రాజ
మంత్రినికాను శకటును కాను గుండెలుతీసే బంటునురా
ధనువును కాను ధన్విని కాను ఎక్కిడి విడిచిన బాణమురా
చతురను రా రాజ చతుర రంగములో చతురను రా రాజా
కత్తులు రువ్వే కొమదను నేను గురితప్పని కోమలి నేను
నేరములెంచక రక్తి గ్రహించు
రాజసింహమా రతిరాజ సింహమా
నేరములెంచక రక్తి గ్రహించు
రాజసింహమా రతి రాజ సింహమా
ఇలా నాట్యం చేసిన బింబాధరి అభ్యంతరంలోకి వెళ్ళి కొంచం సేదతీరి ద్రాక్షసారాయం
సేవించి మళ్ళీ రంగస్ధలం పైకి వచ్చింది.
ఈమాటు బింబాధరితోపాటు ఇంక నలుగురు నాట్యకత్తెలు వచ్చారు. అలా నాట్యం
చేస్తూ బింబాధరి ఎవరికీ తగలకుండా బాకులు విసురుతుంది. అది ఆ నాట్యంలో ప్రత్యేకత.
పాట ఇలా సాగుతోంది.
కత్తిలాంటి పిల్లనురా మహారాజ కోరికోరి వచ్చినాను
మదనుడవై కౌగలించు మసికాక ననువరించు
కామునితో కయ్యమున గెలవలేను నేనింక
స్వర్గంలో ఉవిదలెల్ల తమకోసం వలచి వేచి
చేయిజాచి పిలిచినారు జేరుకొనుము వేగిరమే.

అలా నాట్యం చేస్తూ చేస్తూ బింబాధరి ఒక బాకు విసిరింది. అది ఒక ఆనపకాయలో


దిగబడింది. అందరూ ఆనందంగా చప్పట్లు చరిచారు. నాట్యం కొనసాగిస్తూ ఇంకో బాకు
విసిరింది. అది ఒక గుమ్మడికాయను ఛేదించింది. అందరూ ఆశ్ఛర్యపోతుండగానే మరొక

221
  చాళుక్యసింహాసనం

బాకు వెనకకు విసిరింది. ఆశ్ఛర్యంగా అక్కడవున్న వనిత తలపైని అనాసపండులో


దిగబడింది.

మహారాణి ఎందుకో నొసలు చిట్లించింది. ఆమె చప్పట్లు చరచలేదు. మహామంత్రి


గంగా తీర్ధుడు పెద్దగా హాసం చేస్తూ నర్తకిని రెచ్చగొట్టాడు.

బింబాధరి నాట్యం చేస్తూ మహారాజుపైకి కత్తివిసిరింది. అదే సమయంలో రాణి మహా


రాజును తనవైపు లాక్కుంది. శ్రద్ధాదేవి ఏసభలోను అలా ప్రవర్తించలేదు. రాజు రాణి వైపు
ఒరగడంతో ప్రమాదం తప్పింది. బాకు వెళ్ళి మహారాజు ఆనుకుని కూర్చునే దిండులో
దిగబడింది. లేకపోతే అది మహారాజు గొంతులో దిగబడేది.

అందరూ కెవ్వున కేకపెట్టారు. బింబాధరి ఏడుస్తూ నేలమీద పడింది. కోపంతో మహా


మంత్రి గంగాతీర్ధుడు సింహంలా బింబాధరి పైకి లంఘించాడు. నాలుగు పిడిగుద్దులు
గుద్దాడు. జాగుచేయకుండా తన దట్టీలో దోపుకున్న పిడిబాకు దూసి బింబాధరిని బలంగా
పొడిచాడు. ఆ సమయంలో బింబాధరి ప్రక్కకు ఒత్తిగిలడంతో బాకు ఆమె ఎడమ రొమ్ములో
అడ్డంగా దిగబడింది. ఆమె ఒత్తిగిలకపోతే గుండెలో లోతుగా దిగబడేదే.

మహామంత్రి ఆమెను పాతకీ అంటూ పెద్దగా అరుస్తూ ఘోరంగా తిట్టసాగాడు.


మహామంత్రి బింబాధరిని ఈడ్చుకుపోయి చిత్రవధ చేయమని భటుల్ని ఆజ్ఞాపించాడు.

ఏమనుకున్నదో ఏమో మహారాణి శ్రద్ధాదేవి “ఆగండి!” అని పెద్దగా గర్జించింది.


అందరూ నిర్ఘాంత పోయారు. రాజభటులు ఆగిపోయారు.

గంగాతీర్ధుడు “మహారాణీ?” అన్నాడు. ఎందుకు ఆగమంటున్నారు అని ప్రశ్నిస్తున్నట్లు.

శ్రద్ధాదేవి మహామంత్రిని లెక్కచేయకుండా “వెంటనే బింబాధరికి శల్యచికిత్స చేయించి


మా అంతఃపురానికి చేర్చండి” అన్నది

“ఈ రాజహంతకిని మీ అంతఃపురానికా?” అన్నాడు గంగాతీర్ధుడు. ఆయన చాలా


ఆవే దన చెందుతున్నట్లు ముఖం పెట్టి. ఆసమయంలో మహారాజు కల్పించుకుని “మహారాణి
ఆజ్ఞను పరిపాలించండి” అన్నాడు భటులతో. గంగాతీర్ధుడు స్తంభించి పోయాడు. ఇంతలో
ఎవరో వైద్యుల్ని పిలుచుకువచ్చారు. రాణుల చెలికత్తెలందరూ బింబాధరిచుట్టూ దడి కట్టి
నట్లు నిలబడ్డాడరు. వైద్యుడు బాకు లాగివేసి కట్టుకట్టాడు.

గంగాతీర్ధుడు అవమానంతో తన చేతులోని దండాన్ని నేలపైకి విసరికొట్టి అక్కడి


నుంచి వెళ్ళి పోయాడు.

222
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

విషయం తెలిసిన యువరాజు బింబాధరి కోలుకునేవరకూ ఆమెను మహామంత్రితో


సహా ఎవరూ కలవరాదని శాసించాడు.

బింబాధరి స్ధానంలో అధరసుందరి రాజనర్తకిగా నియమించబడింది.

అధరసుందరి విజ్జేశ్వరంలో మహారాజును ఆపదలో కాపాడిన వారకాంత. ఆ


కృతజ్ఞతతో మహారాణి శ్రద్ధాదేవి ఆమెను మహారాజుకు అష్టమభార్య కమ్మని కోరింది. కానీ
అధర సుందరి అందుకు అంగీకరించలేదు. తాను వేశ్యవృత్తి చేసినదై వుండడం వలన పవిత్రు
రాలు కాదని ఒక మహారాజుకు భార్యస్ధానానికి తగనని తిరస్కరించింది. ఐనా మహారాజుకు
ఆమెపై అభిమానం మిగిలి వుంది. వేంగిలో ఆమెకొక నివాసం ఏర్పాటు చేశారు.

ఒకనాడు యువరాజ విష్ణువర్ధనుడు చిన్న పరివారం వెంట తీసుకుని మహామంత్రి


గంగాతీర్ధుడి ఇంటికి వెళ్ళాడు. యువరాజు ఆగమనాన్ని చూసి ఆయన తొట్రుపడ్డాడు.
అప్పడు ఆయన ఇంట్లో గండువర్మ ఏదో మాట్లాడు తున్నాడు. యువరాజును చూసి అతడు
దొడ్డిదోవలో తప్పుకున్నాడు.

మహామంత్రి గంగాతీర్ధుడు ఏబదిఏళ్ళు పైబడిన మనిషి. గొప్ప పండితుడు. రాజనీతి


విశారదుడు. చతురుడేకాదు గొప్పసరసుడు. శృంగారప్రియుడు. అందుకోసం తన అధి
కారాన్ని తెలివిగా వినియోగించుకునేవాడు.

గంగాతీర్ధుడు ఈనాటివాడు కాదు. నరేంద్రమృగరాజు తండ్రి విష్ణువర్ధన మహారాజు


కొలువులోనివాడు. ఆయన అంత్యదశలో మహామంత్రి అయ్యాడు. గంగాతీర్ధుని రాజనీతి
ప్రకారం మహారాజు పెద్దకొడుకైన భీమసలుఖి వేంగీ సింహాసనం అధీష్టించడానికి అర్హుడు.
కానీ పట్టమహిషి కుమారుడైన నరేంద్రమృగరాజనే పౌరుషనామం గల విజయాదిత్యుడు
వేంగీ సింహాసనం అధిష్టించాడు. జేష్టాతిక్రమణం గంగాతీర్ధుడికి నచ్చలేదు. భీమసలుఖి
మహారాజుతో చేతులు కలిపాడు. ఆయనను వేంగీసింహాసనం పైన కూర్చుండ పెడతానని
వాగ్దానం చేశాడు. అప్పటినుంచీ గడ్డమూ మీసము పెంచసాగాడు. తాను ధర్మం పక్షాన
వున్నాననే నమ్మకం ఆయనలో వుంది. అందుకే నరేంద్రమృగరాజు పాలనని సమయం చూసి
కూలదోయడానికి ఎత్తులు వేస్తున్నాడు. బిరుదాంకపురంలో మహారాజుపై హత్యా యత్నం
జరగబోతోందని తెలిసికూడా మిన్నకున్నాడు.

“యువరాజా! తమరే విచ్చేశారు. ఏదైనా ఉపద్రవమా?” అన్నాడు మహామంత్రి గంగా


తీర్ధుడు.

“మనం రహస్యంగా మాట్లాడుకుందాం.” అన్నాడు విష్మువర్ధనుడు. ఇద్దరూ రహస్య


ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నారు.

223
  చాళుక్యసింహాసనం

“మహామాత్యా! మీరు వేంగీచాళుక్య సింహాసనానికి చేసిన సేవలు ప్రశంసనీయం.


మీకు వృద్ధాప్యం మీద పడుతోంది. అందుకని కాశీనగరంలో మీకు ఆశ్రమం ఏర్పాటు
చేశాము. మీరు త్వరలో ప్రయాణమవుతే బాగుంటుంది.”అన్నాడు విష్ణువర్ధనుడు.

“యువరాజా! నాకు వారణాసి వెళ్ళాలని లేదే! ఈ గోదావరి తీరంలోనే కన్ను మూయా


లని సంకల్పించాను.”

“అమాత్యా! కాశీలో మరణిస్తే పునరావృత్తిరహిత పరబ్రహ్మలోకం సిద్ధిస్తుందని


మీరెరు గరా?”

“యువరాజా! నన్ను పదవినుండీ తొలగిస్తున్నారా? నేను చేసిన పాపమేమిటీ? నా


మీద అనుమానమా?”

“మహామాత్యా! మేము మంత్రివర్గంలో మార్పులు చేయాలనుకుంటున్నాము”అన్నాడు


విష్ణువర్ధనుడు.

“ఒక యువరాజుకు మహామంత్రిని తొలగించే అధికారం ఉండదు. ఈ విషయం


తెలుసు కునే వచ్చారా?”

“మహారాజు ఆమోదముద్ర పడినతరువాతనే మీవద్దకు వచ్చాను.”

“మహారాజు మహా మంత్రితో సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు. రాజ్యం


మీదే కావచ్చు! కానీ పరిపాలనకు మహామంత్రి అధికారి. నన్ను తొలగించాలనుకుంటే రాజ
ప్రముఖులతోను పురప్రముఖులతోను పేరోలగం ఏర్పాటు చేయాలి. సభకు నా సేవలు
నచ్చకపోతే నేనే తప్పుకుంటాను.”

“గంగాతీర్ధ మహాశయా! మీరు చెప్పిన ధర్మం మాకు తెలియనిది కాదు. పేరోలగం


ముందు మీ మీద అభియోగాలన్నీ సాక్ష్యాధారాలతో నిరూపిస్తే ప్రజలందరూ మిమ్మల్ని
అసహ్యించుకుంటారు. రాజద్రోహిగా ముద్రవేస్తారు. రాజద్రోహానికి శిక్షఏమిటో
రాజనీతిజ్ఞులైన మీకు బాగా తెలుసు. ఇంతకాలం ఈ సింహాసనానికి సేవచేసిన మిమ్ము
ఉరితీయడం బాగుండదు. అందుకే మీరు వయోభారంతో కాశీవెళ్ళారని అందరినీ
నమ్మించడానికి ఈ ఏర్పాటు చేశాము.”
“యువరాజా! నన్ను ఉరితీయడమా? నేనొక మహామంత్రిని!”
“రాజద్రోహానికి శిక్షఏమిటీ?”
“నేనా రాజద్రోహినా? యువరాజా మీరు మీ పరిధి దాటుతున్నారు.”
“బిరుదాంకపురంలో మహారాజుపై హత్యాయత్నం ముందే తెలిసికూడా
224
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

మిన్నకుండడం రాజద్రోహం కాదా?”


“అవ్వవ్వా! నాకు తెలుస్తే నేను మిన్నకుంటానా?”
“మహారాజును బింబాధరి హత్యచేయబోతే బింబాధరిని మీరు హత్యచేయ ప్రయత్నిం
చారా?”
“ఔను! బింబాధరి చేసిన ఘాతుకాన్ని నేను సహించలేకపోయాను. ఆవేశంలో ఆమెను
పొడిచాను. ఆ పాతకిని ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదు.” గంగాతీర్ధుడు గర్జిం
చాడు.
“ఒక మహామంత్రిగా ఆమెను విచారించి శిక్షించాలి గానీ మీరే హత్య చేయవలసిన
అవ సరం ఏమొచ్చిందీ?”
“ఔను. అలాగే చేయాల్సింది. కానీ నేను ఆమె దుశ్ఛర్యను సహించలేకపోయాను.
క్షణికా వేశంలో ఆమెను వధించాలనుకున్నాను. తొందరపడడం తప్పే!”
“బింబాధరి మరణించిందంటే మీకు మనశ్శాంతిగా వుందా?”
“ఆ దుర్మార్గురాలు మరణించిందా? అటువంటి రాజద్రోహులు బ్రతికి ఉండరాదు.”
“ఆమె సఖియలను విచారిస్తే బింబాధరి మీకు ఉంపుడుగత్తె అని తేలింది.”
“నాకు స్త్రీ వ్యసనం ఉన్నమాట నిజమే. అది నన్ను తొలగించడానికి తగిన కారణమా?
యువరాజును గురించి కూడా పలువురు పలు రకాలుగా అనుకుంటున్నారు. మృదు వదన
పేరు అందరూ చెప్పుకుంటున్నారు! చమరీ గురుకులంలో విద్యాభ్యాసం నుంచే అలవాటని
చెప్పుకుంటున్నారు.”

“మహామాత్యా. ఈ నిజం మీరు కనిపెట్టారంటే మీ వేగుదళం ఎంత బాగా పనిచేస్తోందో


తెలుస్తోంది. మరి అదే వేగులు బిరిదాంకపురంలో మహారాజుపై దాడి జరగబోతోందని
ఎందుకు చెప్పలేదూ?”
“వారికి తెలియదు.”
“అంటే మరి మీ మంత్రాంగం ఈ విషయంలో విఫలమయ్యిందన మాట!”
“అందరూ నూటికి నూరుపాళ్ళూ సఫలం కాలేరు.”
“నిజమే! మీరు రెండుసార్లు విఫలమయ్యారు.”
“రెండవసారెప్పుడూ?”
“బింబాధరి విషయంలో!”
“బింబాధరి మహారాజును హత్యచేసేటంత దుర్మార్గురాలని నాకు తెలీదు.”

225
  చాళుక్యసింహాసనం

“ఎంత దుర్మార్గురాలూ?”
“మా ఇద్దరికీ ఒకటి రెండుసార్లు సమాగమం జరిగిన మాట నిజమే! కానీ అది ఎప్పటి
మాటో!”
“మరి మహారాణివారికెలా తెలిసిందీ!”

“మహారాణీ వారికి తెలిసిందా! ఆశ్ఛర్యంగా వుందే! అలా ఎన్నటికీ జరగదు. మీ తల్లి


గారు మహా పతివ్రత. ఆవిడను నిందిస్తే కళ్ళు పోతాయి.”

“మరి మీకు తెలియనిది మహారాణీవారికి ఎలా తెలిసిందీ?”

“ఏమో! చాలా ఆశ్ఛర్యంగా వుంది. హత్యచేసేవాళ్ళు ముందే అందరికీ చెబుతారా?


ఒకవేళ ఆమె చెవులొ ఏమైనా చెప్పిందా? ఆవిషయం నాకు తెలీదు.”

“ఒకసారి బింబాధరిని విచారిస్తే?”

“ఆ పాతకి చనిపోయిందన్నారుగా! ప్రాణముండగా విచారిస్తే బాగుండేది. ఒకవేళ


చని పోతూ మహారాణీకి ఏమైనా చెప్పిందా?

మరి మీకెప్పుడు తెలిసిందీ? మీరు తెలిసికూడ ఊరకున్నారంటే మహారాజును అంత


మొందించి సింహాసనం అధీష్టించాలనుకుంటున్నారా? రాజనీతిలో అన్నీ సాధ్యమే.”

ఆ మాటలకు విష్ణువర్ధనుడు చిన్న పరిహాసం చేశాడు.చప్పట్లు చరిచాడు. భటులు


బంధించిన బింబాధరిని అక్కడకు తీసుకువచ్చారు. ఆమె అవనత శిరస్సుతో నిలబడింది.
ఆమె ప్రక్కనే సహ నటీమణులు నలగురూ పాటపాడిన యలగంగ కూడా తలలు వంచు కుని
నిలబడ్డారు.

“సభలో పాడిన పాట మరొకసారి పాడండి” అన్నాడు యువరాజు ఆజ్ఞాపిస్తున్నట్లు.


వాళ్ళు పాడారు. ఒక వైపు యువరాజు ఇంకో వైపు మహామంత్రి ఉండడంతో భయపడి గద్గద
స్వరంతో పాడారు.

పాట పూర్తి కాగానే యువరాజు “ఈ పాట ఇలా ఎందుకు పాడారు ఎందుకు వ్రాశారు?”
అన్నాడు.

“మహారాజును హత్య చేయమని మహామంత్రి మమ్మల్ని నిర్భందించాడు. భయం చేత


ఒప్పుకున్నాం. కానీ మామనసు అందుకు అంగీకరించలేదు. మహామంత్రి కుతంత్రం
మహారాజు గ్రహించాలనే మేమలాంటి పాట పాడాము. ప్రభువులు గమనించారో భగవం

226
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

తుడే మహారాజును కాపాడాడో మాకు తెలీదు.” అన్నారందరూ ముక్తకంఠంతో.

“యువరాజా! మీరీ కులటల మాటలు నమ్ముతున్నారా, ఒళ్ళమ్ముకునేవాళ్ళు?”


అన్నాడు గంగాతీర్ధుడు వాళ్ళను అసహ్యించుకుంటున్నట్లు.

“మహారాజును హత్యచేస్తే ఈ స్త్రీలకు కలిగే ప్రయోజనమేమిటి చెప్పండీ మహామంత్రీ?


వీరికి సింహాసనం దక్కుతుందా?”

“ఏమో! ఏధనానికో ఆశపడి చేసుంటారు. నేను హత్యచేయిస్తే నేను మాత్రం రాజునౌ


తానా, మీరు లేరా?”

“చూడండి మహామాత్యా!మిమ్ము చంపదలుచుకుంటే ఒక్క కత్తివేటు చాలు. కానీ


మమ్ము లోకం హంతకులను కుంటుంది. మిమ్ము ధర్మాసనం ముందు నిలబెట్టి మీ దోషాలు
నిరూపించగలను. అప్పుడూ మీకు పడేది ఉరిశిక్షే.ఈ బేలలు హింసించ కుండానే నిజాలన్నీ
చెప్పేశారు. మీరు రాష్ట్రకూటుల సేనాపతులతో కలిసి బింబాధరి సుధారసం పంచుకోవడం
తెలిసినదే కదా! అలాగే మన సైన్యం గుట్టు కూడా!

ఐనా మీకింకొకసారి బుద్ధిగాబ్రతికే అవకాశమిస్తున్నాను. ఈనాటినుంచి


మీరుసామాన్య పౌరులు. మీ అధికారాలన్నీ ఉడిగాయి. కాశీనే వెళతారో మాన్యకేతమే
వెళతారో వెంటనే బయలుదేరండి. ఇంకొకమారు తప్పు చేస్తే మీ తల కోటగుమ్మానికి వ్రేలాడు
తుంది.” గద్దించి పలికాడు యువరాజు.

మహామాత్యుడు తల వంచుకున్నాడు.

గంగాతీర్ధుడి పరివారం అంతా రాజాజ్ఞ ప్రకారం ఆయనను విడిచి వెళ్ళిపోయింది.


గంగా తీర్ధుడు తనకు జరిగిన అవమానానికి రగిలిపోయాడు. మూటాముల్లె సర్దుకుని తన
నివాసం విజయవాటికలో పున్నమ్మ వనానికి దగ్గరలోకిమార్చాడు.

36 వాస్తుమార్తాండుడు.
ఒకనాడు గోమఠేశ్వరయ్య ఇంటికి ఒక వాస్తు మార్తాండుడు వచ్చాడు. అతడు
భోజదేశం నుంచీ వచ్చాడు. అతడు వాస్తుశాస్త్రంలో అనేక పూర్వ గ్రంధాలు పఠించాడట.
వరాహమిహిరుడి బృహత్సంహిత, విశ్వకర్మ, మయుడు మొదలైన వారి గ్రంధాలు,
కాళిదాసు ఉత్తర పూర్వ కాలామృతాలు ఔపోశన పట్టాడట. శ్రేష్టి ఆయనకు తన నివాసగృహం
వ్యాపార ప్రదేశాలు గిడ్డంగులూ అన్నీ చూపించాలని తీసుకువచ్చాడు. శ్రేష్ఠి వెంబడే గొల్లనయ్య
కూడా వున్నాడు. గొల్లనయ్య శ్రేష్టి పశువుల శాల చూసు కునేవాడు.

227
  చాళుక్యసింహాసనం

ఆయన మాట్లాడుతుండగా ఇంటి ఇల్లాలు కల్పించుకుని ధర్మసందేహాలు అడగడం


ఆరంభించింది.

“మరండీ!వాస్తు మార్తాండులవారికి నమస్కారం.”

“నమస్కారమమ్మా!”

“నమస్కారమండీ. మరండీ నాకు వాస్తులో చాలా ధర్మసందేహాలున్నాయండీ. ఈయ


నేమో ఏమీ పట్టించుకోరు. ఎంతసేపటికీ ఆ చింతపండు వ్యాపారానికి అతుక్కుపోయి
కూచుంటారు. మాయింట ఒక ఘోరం జరిగిన విషయం మీతో చెప్పారో లేదో. అప్పటి నుంచీ
మన ఇంటివాస్తు చూపించమని పోరుతునే వున్నాను. ఈయన పట్టించు కుంటేనా?”

“అలా అంటే ఎలాగమ్మా! ఆ వ్యాపారమేకదా ఈయన చేత కోటికి పడగలెత్తించిందీ!”

“అంతా ఈయన ప్రతాపం ఏమీ కాదులేండి. వీళ్ళ వంశం వాళ్ళంతా ముందే గడించి
పెట్టారు. ఈయన కాలంలో కాస్త విస్తరించింది.”

“పోనీలేమ్మా! ఏదైనా మీసొమ్మేగా!”

“మరండీ ఇంటికి ద్వారాలు గవాక్షాలు సరిసంఖ్యలో ఉండాలంటారు గదా! ద్వారాలు


గవాక్షాలు కలిపి లెక్కించాలా విడివిడిగానా?”

“విడివిడిగానే లెక్కించాలి!”

“చివర సున్నా రాకూడదంటారు కదా?”


“వచ్చినా ఫరవాలేదు.”
“ఇంతకు ముందు చూసినవాళ్ళు రాకూడదన్నారు లేండి. మరి దాసీలు రావడానికి
వెలుపల పాణిద్వారం ఉంది కదా. అదికూడా లెక్కలోకి వస్తుందంటారా?”
“వస్తుంది.”
“వంటిల్లు ఇంటి పదంలో ఉండచ్చంటారా పదానికి వెలుపల వుండాలంటారా?”
“వెలుపల ఉండాలి.”
“వంటశాల చుట్టిల్లుగా ఉండాలంటారా అక్కరలేదా?”
“ఉంటేమంచిది.”
“మరి మాయింటి వాటం ఎటుండాలంటారూ? పితామహ వాటం అలా ఏవో

228
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ఉంటాయిట కదా?”
“ఉంటాయి. మీరేమైనా వాస్తు గ్రంధాలు చదివారా?”

“చదువా చట్టుబండలా! మాలో ఆడాళ్ళను బడికి పంపించడం ఉందా?ఇంటో కూచుని


అర్ధ ఎక్కం ముప్పావు ఎక్కం ఒకటింబావు ఎక్కం లాంటివి నేర్చుకుంటే చాలు. భాగవతం లో
రుక్మణీకళ్యాణం చదువుకున్నాను.”

“అబ్బో! ఎక్కాలలో ఒకటింబావు ఎక్కం ఒకటీ ముప్పావు ఎక్కం వచ్చిందంటే అర్ధ


శాస్త్రం అంతా తెలిసినట్టే!”
“మా గోశాల ఆగ్నేయంలో ఉంది. ఫరవాలేదంటారా?”
“మీ ఆవులు పాలిస్తున్నాయా?”
“అంతో ఇంతో యిస్తాయికానీ చాలాసార్లు తన్నాయి!”
“గోశాల అశ్వశాల వాయువ్యంలో ఉండాలి.”
“మరి అక్కడ అసౌచాలయం ఉందికదా?”
“ప్రక్కన పడమటి వాయువ్యం వైపుకానీ ఉత్తరవాయువ్యం వైపు కానీ చోటుంటే
అక్కడకు మార్చండి!”
“పశ్చిమ వాయువ్యంలో శోకశాల ఉండాలంటారుకదా?”
“మరి మీరు తరుచూ అలుగుతుంటారా?”
“ఆడదన్నతరువాత మొగుడిమీద అలగకుండా ఉంటుందా?”
“కోపగృహం కాదుకానీ పశ్ఛిమవాయువ్యం అపరకార్యాలకు
ఉపయోగించాలంటారు.”
“ఇంటికి నూయి ఎక్కడ తవ్వాలంటారూ?”
“తూర్పు ఈశాన్యముల సంధియందుకానీ ఉత్తర ఈశాన్యముల సంధియందుకానీ!”
“మేము పటమట తవ్వించాము. ఎవరో పడమట భాగ్యమని చెప్పారు!”
“నేను చేప్పింది ఇంకా ఎక్కువ భాగ్యాన్నిస్తుంది!”
“బాహ్యానికి వెళ్ళినపుడు ఎటుతిరిగి కూచోవాలంటారూ?”
“ఉత్తరానికి తిరిగి.”
“అలా కుదరకపోతే?”
“దక్షిణానికి తిరిగి.”
“రెండింటిలో ఏదిమంచిదీ?”
229
  చాళుక్యసింహాసనం

“ఎటుతిరిగి కూచుంటే సుఖ విరోచనమైతే అది మంచిది! మీరు చిన్నచిన్న తప్పులన్నీ


ఎంచకండి! ఈ నివాసగృహం ప్రస్తుతం బాగులేదు. మార్చితీరాలి.”

“మావారి పూర్వీకులందరూ ఈ ఇంటోనే ఉండేవారుకదా! వారంతా బాగానే వుండే


వారు!”

గోమఠేశ్వరయ్యకల్పించుకుని “స్వామీ ఏదైనా యంత్రమో మంత్రమో చూడండి. ఇది


మాపూర్వీకులనుంచీ వస్తున్న ఇల్లు. నేను కట్టిందికాదు” అన్నాడు.

“అయ్యా మీరలా అనకండి! మీవంటివారికి ఇలాంటి హీనగృహంలో నివాసముండడం


తగదు. ఇంతకు ముందు జరిగిన అరిష్టాలే మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండ డానికి
ఇలా చెబుతున్నాను. మీరు తలపెట్టిన వ్యాపారం కూడా చిన్నది కాదు. అందుకు తగిన
స్ధానబలం కూడా ఉండాలి. అందుకే రాష్ట్రకూటుల్ని తలదన్నే గృహం కట్టండి” అన్నాడు
వాస్తుమార్తాండుడు.

ఇంటావిడ నిట్టూర్చింది. “నిక్షేపంలాంటి ఇల్లు! మాపిల్లేదో పొరపాటు పడిందికానీ


మా వంశాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు.” ఇంటావిడ ముక్కు చీదుకుంటూ ఏడవసాగింది.

గోమఠేశ్వరయ్యా వాస్తుమార్తాండుడిని రహస్యమందిరంలోకి తీసుకు వెళ్ళాడు.


ఇద్దరూ కూచుని మాట్లాడుకోసాగారు.

“ఇప్పుడు చెప్పండీ ఏంచేయమంటారో?” అన్నాడు ఆంధ్రశ్రేష్ఠి.

“ఈ ఇల్లు లాభం లేదు. ఇది నగరం మధ్యలో ఉంది. వచ్చిపోయే కచ్చడాలకు ఇరుగ్గా
ఉంటుంది. అదీకాక ప్రభుత్వోద్యోగుల కన్ను కూడా ఉంటుంది.”

“అయితే ఏంచేయమంటారు?”

“ఊరికి బయట తూర్పు నుంచీ వచ్చే రహదారికి దగ్గరలో గొప్ప ప్రాకారంతో గృహం
కట్టడం అవసరం. ఇక్కడ అంతమంది యోధుల్ని దాచలేము.”

“నాకూ అదే అనిపిస్తోంది. ఈ గృహం పూర్తిగా నగరం నడిబొడ్డులో ఉంది. మీ రాక


పోకలకు అనుకూలంగా ఉండదు.”

“అంతేకాదండీ! మీరు వుండే ఇల్లూ మన నూతన ప్రయత్నం వేరువారుగా ఉండడం


మంచిది!”

“మరి ఈ నూతన నిర్మాణం బాధ్యత మీరే తీసుకోవాలి.”

230
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“అలాగే. మనదగ్గర పురోచనుడనే గృహ శిల్పి ఉన్నాడు. ఇతడు పూర్వం పాండవుల


కోసం దుష్టచతుష్టయం నిర్మించమన్న లక్కయిల్లు నిర్మించిన పురోచనుడి వంశం వాడట!
మహా అధ్భుతంగా నిర్మించగలడు. ఈ ఇంటికీ క్రొత్త ఇంటికీ మధ్య రహస్య భూమార్గం కూడా
నిర్మిస్తాడు. అందువలన రాకపోకలకు విబ్బంది వుండదు.” అన్నాడు వాస్తు మార్తాండుడు.

“అలాగే కానియ్యండి. ఒక్క విషయం. గంగారాజ్యాన్నేలిన శివమారుడు మాన్యకేతం


చెరసాలలో ఉన్న విషయం మీకు తెలిసిందే. ఆయన గూఢచారులు అప్పుడప్పుడూ వచ్చి
నాతో కలుస్తున్నారు. వారితో చేతులు కలపమంటారు. మీరేమంటారూ?” అన్నాడు
గోమఠేశ్వరయ్య.

“మనశత్రువు శత్రువు మనకు మిత్రుడు. ఇది రాజనీతే! కానీ మేము ఎంచుకున్నది అతి
రహస్యమైన వ్యూహం. ఇది పది నోళ్ళలో పడితే ఎక్కడో ఒకచోట వీధిన పడుతుంది. మా
విజయాన్ని మేము సాధించగలము. మామీద నమ్మకం ఉంచండి. శివమారుడిని విడుదల
చేస్తాము. ఆయనను తీసుకు వెళ్ళడానికి వేయి మంది సైన్యాన్ని సన్నద్ధం చేసుకోమనండి”
అన్నాడు విశాఖదత్తుడు.

గోమఠేశ్వరయ్య ఊరిబయట గొప్ప స్ధలం ఎన్నుకున్నాడు. పురోచనుడు ముందుగా


భూశోధన జరిపపించాడు. నిర్మాణం ఆరంభించేముందు ఉత్తర దక్షిణాలను తూర్పు
పడమరలను నిర్ణయించాలనుకున్నాడు. ఆకాశం నిర్మలంగా వున్నరాత్రి కృత్తికా నక్షత్రంగాని
శ్రవణ నక్షత్రం కాని ఉదయించే దిశ తూర్పు. అలాగే ధృవనక్షత్రం ఆధారంగా ఉత్తరదిశ
నిర్నయించాలి. ధృవనక్షత్రం భూమికి ఏటవాలుగా వుంటూ మిణుకుమిణుకు మంటుంది.
ధృవనక్షత్రాన్ని గుర్తించడానికి సప్తఋషిమండలంలో పులహుడు క్రతువు అనే రెండు
నక్షత్రాలను కలపి పొడిగిస్తే ఆ ఊహారేఖ ధృవతారని సూచిస్తుంది.

ముందుగా చతురస్రాకారమైన ప్రాకారం కట్టడం ఆరంభించారు. దానికి గొప్ప ముఖ


ద్వారం పైన ద్వారగోపురాలు దాని వెంబడే ద్వారపాలకుల నివాసాలు నిర్మించసాగారు.
కొందరేమో ఇల్లు కట్టి ప్రాకారం కట్టాలికానీ ప్రాకారం కట్టి గృహం కట్టకూడదని చెప్పు
కున్నారు.

మాన్యకేత నగర ప్రాంతంలో అందరూ అక్కడ భూమిలో దొరికే నాపరాళ్ళు


ఉపయోగించే నిర్మాణాలు చేసుకుంటారు. మాన్యకేత దుర్గం కూడా నాపరాళ్ళ కోటే. కానీ
పురోచనుడు నాపరాళ్ళు పనికిరావన్నాడు. దూరతీరాన్నుంచీ కాల్చిన ఇటుకలు
ఎద్దుబండ్లమీదా దున్నపోతుల బండ్లమీదా తెప్పించాలన్నాడు. రోజూ కొన్ని వందల కచ్చడాలు
గృహ నిర్మాణ సామగ్రిని మోసుకొచ్చేవి. ఆ ప్రదేశం ఊరి పొలిమేరకు ఆవల ఉండడంవలన
నగర సుంకాలు లేకపోగా సామగ్రిని పరీక్షించేవాళ్ళుకూడా లేరు. నిర్మాణ శిల్పులను
పనివాళ్ళ ను కూడా పురోచనుడు విదేశాలనుండీ రప్పించాడు.

231
  చాళుక్యసింహాసనం

గోమఠేశ్వరయ్య నూతనగృహం పనులు రెండు సంవత్సరాల పాటు నడుస్తునే


వున్నాయి. పూర్తికావడానికి ఇంకెంత సమయం పడుతుందో.

విశాఖదత్తుడు వజ్రాల వ్యాపారిలా వేషం వేసుకున్నాడు. శ్రేష్ఠి నూతన గృహం నుండీ


పురాతన గృహానికి సొరంగమార్గం పూర్తయింది. విశాఖదత్తుడు సోరంగమార్గం ద్వారా
శ్రేష్ఠిని కలుసుకోవడానికి వెళ్ళాడు. ఇద్దరూ రహస్య మందిరంలో సమావేశమయ్యారు.

“అయ్యాశ్రేష్ఠిగారూ! మీకూ మాకూ ఒప్పందం కుదురుతే ఎన్ని రత్నాలను మీరు


మానుండీ తీసుకోగలరూ?”అన్నాడు వజ్రాల వ్యాపారి.

“ఇప్పుడు కొత్తయిల్లు కడుతున్నాం కదండీ! అందులో అయితే రక్షణ బాగా వుంటుంది.


వందా రెండువందల రత్నాలు తీసుకుంటాను.”అన్నాడు శ్రేష్ఠి.

“నగరంలో మీరు చాలా పెద్ద వ్యాపారులని తెలిసి వచ్చాము. కనీసం వేయి రత్నాలు
తీసుకోవాలి! మీమీద చాలా ఆశలు పెట్టుకున్నాము.”

“వేయి అంటే సామాన్యమా. మేము భరించగలమా?”

“మేము మొత్తం ఈ నగరంలో పదివేల రత్నాల వ్యాపారం చేయాలనుకున్నాము. మీరు


అన్ని రత్నాలూ ఒక్కరోజే తీసికోనవసరం లేదు. క్రమక్రమంగా పంపిస్తాము.”

“అయ్యా! ఇంత పెద్ద వ్యాపారం అంటే నాకు చాలా భయంగావుంది. ఇన్ని రత్నాలు
నేను భద్రపరచగలనా?”

“భద్రత బాధ్యత మాకు వదిలేయండి! మేం చూసుకుంటాం! మీరు ఒక్క రోజుకూడా


నూతన గృహం వైపు రానక్కరలేదు. అక్కడ తగిన నేల మాళిగలు వున్నాయి.”

“ఐనా నాకు ధైర్యం చాలటం లేదు!”

“నిజమేనండీ! కానీ మీరేకదా ఇంతపెద్ద వ్యాపారం ఆరంభించాలనుకున్నారు?


శపథాలు చేశారు! మేము మీకు చేయూత నివ్వాలనుకున్నాం! ఇప్పుడు పిరికితనంతో
జారిపోతే ఎలాగూ?”

“సరే నిలబడతాను. కానీ నాపేరు ఎక్కడా బయటికి రాకూడదు. ఎందుకంటే ఆ తరు


వాత కూడా నేను ఈ నగరంలో బ్రతకవలసిన వాడిని.”

“మీకలాంటి భయమేమీ లేదు. మీకూ రత్నాలకు రక్షణ బాధ్యత మాది. మీరు మాత్రం

232
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

క్రొత్తవారిని కానీ బంధువులను కానీ ఈ ఇంటికి రానీయకండి. ఆడవాళ్ళను అసలే


తీసుకురావద్దు. వాళ్ళ నోటిలో నువ్వుగింజ కూడా నానదు. ఎందుకంటే రత్నాల వ్యాపారం
పసికట్టడానికి కొందరు దొంగవేషాలలో మనదగ్గర చేరే అవకాశం ఉంటుంది. ఇకనుంచీ
నేను కూడా మిమ్మల్ని కలవడానికి రాను. అన్నీ శతావరికానీ పూటకూళ్ళమ్మ కానీ
చూచుకుంటారు. ముఖ్యంగా మీరీ వ్యాపారం సింహలగ్నంలో ఆరంభిస్తున్నారు. మీరు
పులిలాగా ధైర్యంగా వుండండి.”
“సరేకానియ్యండి!” అన్నాడు ఆంధ్రశ్రేష్ఠి.
విష్ణువర్ధనుడు పంపిస్తున్న ఆయుధసామగ్రి ముఖ్య యోధులూ గోమఠేశ్వరయ్య క్రొత్త
ఇంటికి చేరసాగారు.
విశాఖదత్తుడు మారువేషంలో కట్టెలబండి తోలుకొచ్చాడు పూటకూళ్ళమ్మ ఇంటికి.
“ఏరా అబ్బీ! వంటచెరుకు అయిపోయి బాధపడుతున్నాం. ఇన్నాళ్ళయిందేమీటీ?”
అన్నది ముసలమ్మ.
“ఏంచేయనూ! ఎండుకట్టెలు దొరకటంలేదు. ఎక్కడ దింపమంటావు?”
“అక్కడ శిలాజం వుంది. దాన్నడుగు” అన్నది ముసలమ్మ.
శిలాజం విశాఖదత్తుడిని రహస్యప్రదేశానికి తీసుకువెళ్ళింది. తళియలో భోజనం
వడ్డించుకు వచ్చింది.
“ఏమిటీ చిన్నపిల్లలాగా బొమ్మరిళ్ళు కడుతున్నావు?” అన్నాడు విశాఖదత్తుడు
అక్కడున్న చిన్నచిన్న ఇళ్ళబొమ్మలను చూసి. విశాఖదత్తుడు ఆత్రంగా భోజనం చేస్తూ
మాట్లాడసాగాడు.
“బొమ్మరిళ్ళుకాదు. మాన్యకేతదుర్గానికి నమూన ప్రతి తయారుచేస్తున్నాను.”
“మంచిపనేకాని అత్యంత రహస్యంగా వుండాలి. ఇంతవరకు ఇక్కడకు ఎంతమంది
యోధులు చేరారూ?”
“సంఖ్య ఏడువేలు దాటింది. ఏడువేలపేర్లూ గడగడా చెప్పనా?”
“నీ మేధస్సు నాకుతెలుసు.”
“కాని విశా, ఏరహస్యాన్నయినా ఎల్లకాలము దాచలేము. ముట్టడికి ముహూర్తం
పెట్టారా?”
“ఇంకాలేదు. సంఖ్య పదివేలు దాటాలి. క్రొత్త రహస్యాలు కనిపెట్టావా?”

“ఆడదానిగా గూఢచర్యం చేయడం చాలా కష్టంగా వుంది. అన్నింటికి తెగించి వుండాలి.


నాచేతులో ఇప్పటికి ఎనమండుగురు కైలాసానికి పోయారు. ఇక్కడి సైన్యాద్యక్షుడు

233
  చాళుక్యసింహాసనం

లీశోత్తరదీక్షితుడు చాలా సమర్ధుడు. ఇతడుండగా ముట్టడించడం ప్రమాదకరమే.


అహోరాత్రులు సైన్యాన్ని నిద్రపోనీయడు.”
“అతడిని తొలగించాలంటావా?”
“సాధ్యమా?”
“అతడికి బలహీనతలు ఏమైనా వున్నాయా?”
“స్త్రీలోలుడు. రసతరంగిణి కోటీరానికి వెళతాడు. మళ్ళీ ఇంకెవరో వున్నారని
చెబుతారు.”
“మగవాడి పతనానికి అదొక్కటిచాలు. మొన్నటిదాకా నేను అలాంటివాడినే. ఈ
ముట్టడికి ఒప్పుకున్నతరువాత మడికట్టుకున్నాను.”
“విశా! యువరాజు గుర్తువచ్చినపుడల్లా రాత్రి నిద్రప్టదు. అతడు నాకు అందుతా
డంటావా? ఏదైనా యుద్ధంలో మరణించాలనివుంది. అక్కడ వేంగిలో పరిస్తితి ఏమిటీ?”
“దినదినగండం నూరేళ్ళు ఆయుష్షు! నగరం మొత్తం గూఢచారులు. హత్యలు
ప్రతిహత్యలు.”
“ఈ సమస్యకు పరిష్కారం లేదంటావా?”
“ఈ మాన్యకేత దుర్గంపై గరుడపతాకం దించి వరాహకేతనం ఎగరవేయడమే
పరిష్కారం!”

37 రాజమాత
మహారాజ ఇంద్రవల్లభుడు అయ్యణ మహాదేవి దర్శనం కోరి ఆమె అంతఃపురానికి
వచ్చాడు. పరిచారికలు చూపించిన ఉచితాసనం పైన కూర్చుని వేచివున్నాడు. ఆమె
అంతఃపురం అన్ని భవనాలకన్నా శుభ్రంగా వుంది. పాలరాళ్ళు పరిచిన ఆ మందిరం తెల్లటి
ఉచితాసనాలతో తెల్లటి ఉపధానాలతో తెల్లటి తెరలతో మంచుపర్వతంలా వుంది. మందిరం
అంతా రుద్రజడ మాలలతో అలంకరింపబడి వుంది.

పార్శ్వనాధ ఆలయాన్నుంచీ వచ్చిన ఆమె ఉదయకాలపు ఆహార సేవనం చేస్తోంది.

అయ్యణమహాదేవి రాజమాత. బాలచక్రవర్తి అమోఘవర్షరాజేంద్రుడికి మాత్రుమూర్తి.


ఆమె భర్త గోవిందప్రభాతవర్ష సార్వభౌముడు కాలధర్మం చెందినప్పటినుంచీ జైనమతం
స్వీకరించింది. జైనసాంప్రదాయం తూచా తప్పకుండ ఆచరిస్తూ గృహతపస్విగా జీవితం
గడుపుతోంది. ఆమె పార్శ్వనాథ పదార్పిత.

రాజమాత చాతుర్మాస్య దీక్షలో ఉంది. ఆషాఢమాసం శయన ఏకాదశి నుండి కార్తీక


234
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

మాసం క్షీరాబ్ది ద్వాదశి వరకు చాతుర్ మాసాలు ఆమె దీక్షాధర్మాలు అతిక్రమించదు.


ఆహారంలో ఉప్పూ కారము పులుపు ఉండవు. తాలింపులో ఆవాలు నిషిద్ధము. ఆర్య ఋషులు
కందమూలాలు భోంచేస్తారు కాని జైనమునులకు నిషేధము. ఉల్లి వెల్లుల్లి ఉర్లగడ్డ రత్నపురిగడ్డ
కంద పెండలం చామదుంప మొదలైన దుంపకూరలన్నీ నిషేధము.

పాలు పెరుగు వెన్న నేయి రాజమాత సేవించదు. ఆవుపాలు దూడ చేపగానే దూడను
తాగనీయకుండా దూరంగా గుంజకు బంధించి పాలుపితుకుతారు. అమాయకమైన గోవు
తనదూడ ముఖం చూసి పాలు చేపుతుంది. ఇదీ ఒకరకం హింసే. తేనెటీగలు తమ పిల్లల
కోసం పూవుపూవు తిరిగి మధువు సేకరించి గూళ్ళలో నిల్వచేసుకుంటాయి. మానవులు
ఈగలకు పొగపెట్టి వెళ్ళకొట్టి తేనె కొల్లకొట్టుకు వస్తారు. తేనె ఒకరి నోటిముందు కూడు
లాంటిది. అందుకని నిషిద్ధము.

రాజమాత సాయం భోజనం కూడా సూర్యాస్తమయం లోపలే. సూర్యాస్తమయం నుంచీ


సూర్యోదయం వరకూ ఆమె పచ్చి గంగ కూడ ముట్టదు.

ఇంతలో ఇద్దరు యువతులు ఫల ఆహారమూ రాగిపాత్రతో మంచితీర్ధము తీసుకుని


వచ్చారు. వారికేసి చూస్తే ఇంద్రవల్లభునికి కన్ను చెదిరిపోయింది. ఒక క్షణం తల విది లించు
కున్నాడు. అయ్యణ మహాదేవికి నలుగురు సఖులున్నారు. అందులో ఇద్దరు ఘూర్జరదేశం
పాలరాతి బొమ్మలు. ఒకరు గాంధారదేశం బాలిక కాగా ఒకరు అవంతీ దేశం యువతి.
అవంతీ యువతి కొంచం శ్యామలవర్ణ అయినా నీలిపాలరాయిలా ఉంటుంది. నలుగురూ
రాజమాతతో పాటు జైన దీక్ష తీసుకున్నవారు. ఆమె ఆహార పానీయాలు పూజాదికాలు వారే
చూస్తారు. ఆ నలుగురు సుందర యువాంగనలూ రాజమాతతోపాటు దిగంబరలు.

‘వీరి నగ్నసౌందర్యం చూడడానికి కదా నగరంలో అందరూ దిగంబర పార్శ్వనాధా


లయానికి ఎగబడి వస్తున్నారూ!’ అనుకున్నాడు ఇంద్రవల్లభుడు.

రాజమాత ప్రతిఉదయం మాన్యకేతదుర్గం నుంచి పాదచారిణియై నగరంలోనున్న


జైనా లయానికి వెళ్ళేది. ఆమె వెంట నలుగురు సఖియలు పర్యవేష్టించి నడిచేవారు. రాజమాత
నడుస్తుంటే పరిచారికాబృందం ముందుండి నూలుదారపు కుంచలతో మార్గాన్ని
శుభ్రంచేసేవారు. జైనులు పరమ అహింసామూర్తులు. చీమకు దోమకు కూడా హాని కలిగిం
చడం వారికి ఇష్టం ఉండదు. సూక్ష్మజీవులు నోటిలోకి ముక్కులోకి దూరకుండా తెల్లటి వస్త్రం
అడ్డం కట్టుకుంటారు.

ఆమె పార్శ్వనాధాలయానికి చేరుకుని కొంతతడవు ధ్యాన నిమగ్నయైయుండేది. రాజ


మాతను సందర్శించ దలుచుకున్నవారందరూ ఆ సమయంలో పార్శ్వనాధాలయానికి
వచ్చేవారు. ఆమెతో తమ కష్ట నష్టాలు చెప్పుకుని ఆశీర్వాదాలు పొందేవారు. అలా వచ్చే
వారందరూ పరమ భక్తులు కాకపోవచ్చు. ఆ ఆలయానికి వయసులో వున్న యువకులు

235
  చాళుక్యసింహాసనం

ఎక్కువగా వచ్చేవారు. కంటికి చూచేగుణం ఉంటుంది. మనసుకు సౌందర్య పిపాస


ఉంటుంది. సౌందర్యంలో రాజమాత గాంధర్వాప్సరస. ఆమె పిరుదులు దాటిన కురులే
ఆమెకు ఆచ్ఛాదన.

రాజమాత తపస్సు చేసినకొద్దీ ఆమె సౌందర్యం పెరుగుతూవచ్చింది. శరీరం


కాంతివంత మైంది, ద్యుతి పెరిగింది. వయసు పైబడినా బిగి సడలలేదు. పైగా
అతిశయించింది.

రాజమాత సందర్శనం కోసం తరచూ కోటలోకి వచ్చేవాళ్ళలో ఆంధ్రశ్రేష్ఠి


గోమఠేశ్వరయ్య ముఖ్యుడు. గోమఠేశ్వరయ్య రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని కూలదోస్తానని ప్రతిజ్ఞ
పట్టినప్పటినుంచీ ఆయన కదలికలు గమనించడానికి ఇంద్రవల్లభుడు గూఢచారి దళంలో
ఒక ఉపసేనాపతిని నియమించాడు. అతడు తనకు ముగ్గురు అనుచరులను నియమించు
కున్నాడు. అందులో ఒకడు ఆంధ్రశ్రేష్ఠి ఇంట్లో పశువుల శాలలో పనిచేయడానికి కుదురు
కున్న గోపాలుడు. ఇంకొకడు శ్రేష్ఠి ఉగ్రాణాలలో భారవాహకుడు. ఇంకొకడు శ్రేష్టి బంధువు.

ఇంద్రవల్లభుడు కూర్చున్న సందర్శకుల శాలలోకి వస్తూ రాజమాత “ఇంద్రా! అందరికీ


క్షేమమేనా? ఏదో పనిపడి వచ్చినట్లున్నావూ?” అన్నది పరిచారికలు పరిచిన మొగలి రేకుల
చాపపైన కూర్చుంటూ. ఆమె తన కబరీబంధాన్ని ఆచ్ఛాదనగా ముందుకు వేసుకుంది.

కొంచం తొట్రు పడిన ఇంద్రవల్లభుడు “రాజమాతకు ప్రణామం! వదినగారూ మీకు


కుశలమేనా? ఏమైనా అసౌకర్యాలున్నాయా?”అని అడిగాడు.

“నీ పరిపాలనలో అసౌకర్యాలు ఏమీ ఉండవు. అందరి కుశలమూ చూసేవాడు ఆ


పార్శ్వనాధుడు!” ఎంతో పూజ్యభావంతో చెప్పింది రాజమాత.

“తల్లీ! ఈ రాజ్యం మీది! మీరు రాజమాత! బాలచక్రవర్తి అమోఘవర్షుడి రక్షణ భారం


కూడ మీరే వహించాలి! నేను ఈ సువిశాల రాష్ట్రకూట సామ్రాజ్యంలో ఒక భటుడిని
మాత్రమే!”

“ఇంద్రా! నేను జైనదీక్ష తీసుకున్నతరువాత అందరు స్త్రీలు నాకు తల్లులు. పురుషు


లంతా నాకుమారులే! అందరినీ రక్షించువాడు అకించనుడే!”

“అలా అంటే లౌకిక ప్రపంచం నడవదు కదా! వర్ధమాన మహావీరుడు బ్రహ్మచర్యం


పాటించ మన్నాడు. ఆయన మాట విని అందరూ బ్రహ్మచారులైతే మానవజాతి అంతరించి
పోదా?”

“ఇంద్రా! జైనమతం అంటే గిట్టనివారు చేసే వక్రభాష్యాలు నీకు ఆధారమా?


జైనధర్మాలు సత్యం అహింస ఆస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం అని చెప్పాయి. ఇందులో
236
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

చెడు ఏమైనా ఉందా? గృహస్తులు పరిమిత బ్రహ్మచర్యం పాటించాలి! పరిమిత బ్రహ్మచర్యం


అంటే ఏమిటో పండితుల నడిగి తెలుసుకో.”

“వదినగారూ! నాకు వేదాంతం తెలీదు. కానీ పరిపాలన మహా భారంగా వుంది.”

“ఇంద్రా! నేను జైనమతం దానిని. నీవు ఆర్షమతాభిమానివి. ఇందులో తప్పేముందీ.


ఎవరిమతం వారిది. పూర్వం కూడా శాతవాహన రాజులూ ఇక్ష్వాకులూ పశుబలితో కూడిన
యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటే రాణులు బౌద్ధారామాలని జైన దేవాలయాలని పోషి
స్తుండేవారు. మతం సంసార జీవనానికి ఆడ్డురాకూడదు!”

“అమ్మా! మీరీదిగంబర జైనమతం నుండి శ్వేతాంబర జైనం లోకి మారమని అర్ధిస్తు


న్నాను!”

“ఇంద్రా! నాఈ నగ్నరూపం నిన్ను కూడా కలవరపెడుతోందా? శరీర సౌందర్యం


అనేది చాల పరిమితమైనది. మొగ్గ వికసించి పూవవుతుంది. పరిమళిస్తుంది. వాడిపోతుంది.
రాలిపోతుంది. ఈ మాంసపు ముద్దలకు అంత ప్రాముఖ్యం ఇవ్వడం అవసరమా! మనిషి
మానసిక సౌందర్యాన్ని గౌరవించాలి. ఇక శ్వేతాంబరులు దిగంబరులు అంటావా! ఆ విభజన
ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు అతుకు పడదు.

జైనమతం అనాదినిధనం. ఒక ఆరంభము అంతము లేనిది. అందులో రిషభుడు


మొదటి తీర్ధంకరుడు. ఆయన మొదటగా కైవల్యజ్ఞానాన్ని పొందినవాడు. మౌర్యపరిపాలనా
కాలంలో జైనమతంలో మార్పులు వచ్చాయి. స్ధూలభద్రుడు భద్రబాహువు అనే మహా
మునులు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిన కాలంలో జైనమతం చీలిపోయింది. లజ్జ సిగ్గు
న్యూనత విడిచిపెట్టలేని అల్పులు జైనమతంలో తపశ్యులకు దిగంబరత్వం అవసరం లేదని
నిర్ణయించారు. తెల్లని వస్త్రాలు ధరించవచ్చని తీర్మానించారు. ఇది మౌలిక ధర్మానికి విరుద్ధం.
లజ్జ సిగ్గు న్యూనత విడిచిపెట్టలేని వారు మునులెలా అవుతారూ? మతం శ్వేతాం బరులు
దిగంబరులు అని రెండు వర్గాలుగా చీలిపోయింది. నేను అనాది ధర్మాన్ని వీడ లేను.”

“రాజమాతా! మీ దర్శనం కోరి అనేకమంది మాన్యకేత దుర్గం లోకి వచ్చి వెళుతు


న్నారు. వారంతా స్నిగ్ధ సౌందర్య శరీరాలను తుచ్ఛ మాంసపు ముద్దలుగా భావించ గలవారా?
ముక్తులా? వారి ఉద్దేశ్యాలు కూడ వేరువేరుగా ఉండవచ్చు! వారిలో అందరూ మీమీద భక్తితో
గౌరవంతో వస్తున్నారనుకోలేము. భక్తి ముసుగులో గూఢచారులు కూడ
కోటలోకివస్తుంటారు!”

“ఇంద్రా! నీవేమంటావూ నేను మాన్యకేత దుర్గంలో వుండడం నీకు కష్టంగా ఉందా?


నన్ను నగరం విడిచి వెళ్ళమంటావా?”

237
  చాళుక్యసింహాసనం

“తల్లీ! ఈ రాజ్యం మీది. మీ ఇష్టం వచ్చినట్లు పరిపాలించుకోండి. బాలచక్రవర్తి భద్రత


బాధ్యత కూడా మీదే. నేను కూడా సన్యాసుల్లో కలుస్తాను. మీరు మీ సింహాసనం పైన ఎలా
కూచుంటారో ఎలా పరిపాలిస్తారో మీ యిష్టం.”

“ఇంద్రా! నీవేదో కోపంలో ఉన్నావు. లేకపోతే ఇలా మాట్లాడవు. నీకు కలిగిన కష్టం
ఏమిటో చెప్పు.”

“బాలచక్రవర్తి పరిపాలన శత్రువులందరికీ చులకనగా వుంది. మీ నగ్నదీక్ష కూడా


అంద రికీ ఆకర్షణగా వుంది. ముఖ్యంగా మీ వెంటవుండే ఆ యువతులపై యువకులకు
ఆకర్షణ ఎక్కువగా వుంది. వారందుకే మీ దర్శనానికి తరుచూ వస్తున్నారు.”

“ఆ బాలికలు స్వచ్ఛందంగా దిగంబర జైనదీక్ష తీసుకున్నారు! చూసేవారిని చూడ


నీయి! ఒక వనంలో పూచిన పుష్ప సౌందర్యాన్ని అందరూ ఆస్వాదిస్తారు. అందు వలన ఆ
లతకు వచ్చే నష్టమేమీ లేదు! తుంచకుండా వుంటే అంతే చాలు! ఆ బాలికలకు కించ ఏమీ
లేదు. నేను జైనముని శరణాగతురాలను. నన్నిపుడు రాజ్యాలేలమంటావా?”

“అమ్మా! మీ మాటలోనే ఆక్షేపణ వుంది! పూవును తుంచాలనీ తన సిగలో ముడవా


లని చాపల్యం ఉండదా? తోటమాలి కన్నుకప్పి పూలుకోసేవా రుండరా? నేను చెప్ప వచ్చింది
సౌందర్యోపాసనని గురించి మాట్లాడడానికి కాదు. మన సంభాషణ ప్రక్కదోవ పట్టింది.
మాన్యకేత దుర్గంలోకి రాకూడనివారు వస్తున్నారు. వారివలన ప్రమాదం ఉందని మన
గూఢచారులు చెబుతున్నారు.”

“నీవు అలాంటి అనుమానస్తుల పేరు ఒకటి చెప్పగలవా?”

“ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్య!”

“ఆయనేంచేశాడూ? ఆయన ఎన్నో జైన ఆలయాలకు దానధర్మాలు చేశాడు. ఇప్పుడు


శ్రావణబెలగోలాలో తీర్ధయాత్రికుల కోసం ఒక సత్రం కడుతున్నాము. అది చర్చించడానికే
ఆయన అప్పుడపుడూ కోటలోకి వస్తుంటాడు.”

“అది పైకి కనిపించే సాకు! ఆయన రాష్ట్ర్రకూట సామ్రాజ్యాన్ని కూలదోస్తానని శపథం


చేసినవాడు. అందుకోసం తన ధనబలం ఉపయోగించి పావులు కదుపుతున్నాడని
గూఢచారులు చెబుతున్నారు.”

“నాకు తెలీకుండా ఆయనకు జరిగిన అన్యాయం అపరిమితం. మన బంగారం మంచి


దైతే ఒకరిని అనాల్సిన పనేముందీ? నీవు కర్కవల్లభుని దండించలేకపోయినావు! ఆ పిల్లని
రాణిగా చేసుకేలేకపోయినావు!”

238
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఇందులో ఎన్నో రాజకీయాలు ఇమిడివున్నాయి. వదినా! గర్భవతిని చేసుకో


మంటారా?”

“ఇప్పుడెందుకూ? ఈ ప్రశ్న నీవు అప్పుడు అడిగి వుండవలసింది!”

“నేను మాత్రం గోమఠేశ్వరయ్యకు దుర్గప్రవేశం నిషేధిస్తున్నాను. అంతే కాకుండా జైన


మునులకు తప్పించి అందరకూ కోట ప్రవేశం నిషేధిస్తున్నాను.”

“నీ పరిపాలన నీది! నేను కూడా సల్లేఖన వ్రతం ద్వారా శరీరాన్ని విడవాలనుకుంటు
న్నాను!”

“వదినా! మీకిప్పుడంత అవమానం ఏంజరిగిందీ? సల్లేఖనవ్రతం అంటే ఏమిటీ?”

“ఉపవాసంతో శరీరాన్ని కృశింపచేసి దేహాన్ని వదలడం ఒక పద్ధతి. ఏదైనా నదీ ప్రవా


హంలో కొట్టుకుపోవడం ఇంకో పద్ధతి.”

“ఇంత కఠోర నిర్ణయం తీసుకునేముందు కాస్త ఆలోచించండి! ఆర్షధర్మంలో


ఆత్మహత్య ఒక మహాపాపం!”

“కోటలో నీకు తెలిసో తెలియకో ఇంకెన్నో మహాపాపాలు జరుగుతున్నాయి!”

“మీరనేదేమిటో నాకర్ధం కాలేదు!”

“కమలహితాదేవి వ్యవహారం!”

“ఆవిడ రాజకాంత. అవిడ వలన ఏం అపరాధం జరుగుతోందీ?”

“సేనాధిపతి లీశోత్తరదీక్షితుడు ఆమెతో సంబంధం పెట్టుకోలేదా?”

“ఇది నాకు తెలియని విషయం! తల్లీ నేను మిమ్మల్ని ఇంకొకమారు కలుసుకుంటాను.


నమస్కారం!” ఇంద్రవల్లభుడు చిరుకోపంతో అక్కడనుండీ వెళ్ళిపోయాడు.

38 క్రొత్తమంత్రి
చాళుక్యదేశంలో మహామాత్యునిగా సోమసూత్రం శివకేశవయ్య నియమితుడయ్యాడు.
ముప్పది తిధులు గడిచాయి. దేశంలో అర్ధాంతరంగా మహామంత్రిని మార్చినందుకు మహా
కల్లోలంగావుంది. గంగాతీర్ధుడు అంతర్గతంగా విప్లవం తీసుకురావాలని అనేకవిధాల
ప్రయత్నిస్తున్నాడు. నూతన మహామాత్యుడు నరేంద్రమృగ రాజుతో సమావేశమయ్యాడు.

239
  చాళుక్యసింహాసనం

“మహారాజా! ఈ మాసంలో నేను తెలుసుకున్నదేమిటంటే ఇక్కడ ప్రభుద్రోహులు


చాలామంది ఉన్నారు. వీరిని సమూలంగా నాశనం చేయాలి. లేకుంటే పరిపాలన సాగదు.”
అన్నాడాయన.

“యుద్ధాలలో మా ఓటమికి ఇదే కారణం. సైన్యంలోకూడా చీలికలున్నాయి. గొప్ప


ప్రముఖులే ఇందులో ఉన్నారు. ఆధారాలు చూపకుండా వీరిని తొలగిస్తే ప్రజలలో తిరుగు
బాటు వస్తుంది.”అన్నాడు నరేంద్రమృగరాజు.
“మహారాజా! మనకు ఇప్పుడు కావలసినది సాత్వికమార్గం కాదు.”
“మరేమార్గం?”
“కాశ్మీరీ యోగినీ సంప్రదాయం.”
“ఇదేమిటీ. మీరు రాజతంత్రం విడిచి మంత్రతంత్రాల నాశ్రయిద్దామంటారా?”

“ప్రభూ! అవసరాన్నిబట్టి మంత్రాంగం ఉండాలికదా! కాశ్మీర దేశంలో అభినవగురుడనే


ఉపాసకుడున్నాడు. అతడు పాశుపత శైవుడైనా ఆయనతోపాటు కాపాలిక శైవులు కూడా
ఉన్నారు. ఆయన వద్ద వీర్యకాళి, కుబ్జిక, త్రిపురసుందరి, గుహ్యకాళి ఉపాసనలున్నాయి.
ఆయన్ని ఆశ్రయిస్తే తప్పక ఈ యుద్ధాలకు ఒక అంతం ఉపదేశించగలడు.”

“మరి అది భయంకరమైన కాపాలిక సంప్రదాయం కదా? వాళ్ళు పచ్చినెత్తురు త్రాగు


తారు.”

“అవును మహారాజా! యుద్ధం భయంకరమైంది కాదా? ఎంత జీవహింస


జరుగుతుందీ! మనుషులు గుఱ్ఱాలు ఏనుగులు ఎన్నింటినో వధించాల్సి వస్తుంది.
కాపాలికులు పుఱ్ఱెలతో రక్తం తాగుతారు. నిజమే. మాంసం తింటారు. మరుభూములలో
నివాసం చేస్తారు. చితా భస్మం వడలంతా పూసుకుంటారు. వారికి జగమే శివస్వరూపం. ఈ
శరీరం తృణప్రాయం. మన సమస్య త్రీవ్రమైనదైనపుడు మన ఆరాధనకూడా తీవ్రంగా
ఉండాలి. ఈ శైవంలో అతి మార్గ శైవం మంత్రమార్గశైవం అని రెండు శాఖలున్నాయి.”అక్కడికి
ఆగాడు శివకేశవయ్య.

“మీరే శైవసాంప్రదాయం వారు?”ప్రశ్నించాడు మహారాజు ఈయనా కాపాలికుడా


అనే అనుమానంతో.

“రాజా. నేను స్మార్తుడిని! శివారాధకుడినే కానీ శైవుడినికాదు! అంతఃశత్పువులను


మట్టుపెట్టాలంటే మనం అభినవగురుడిని కానీ భాస్కరరాయుడిని కాని ఆశ్రయించాలి.”

“మహామాత్యా! అభినవగురుడు ఎక్కడో కాశ్మీరదేశంలో ఉంటాడని విన్నాము.


ఆయనను కలుసుకోవడం ఎలాకుదురుతుందీ?.”
240
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“మనదేశంలో భైరవునికోన కాపాలికులకు కేంద్రం. వీరినాశ్రయిస్తే వారిని రప్పిస్తారు!


తంత్రమార్గ శైవం వలన శత్రువిజయం లభిస్తుంది.”

“కాశ్మీరం చాలా దూరదేశం. ఇక్కడినుండీ అక్కడకు వెళ్ళడం వారిని ఒప్పించి తీసుకు


రావడానికి ఎంతోకాలం పడుతుందికదా మహామాత్యా?”

“వెళ్ళిరావడానికి ఒక సంవత్సరం దాటుతుంది. కానీ ఇక్కడి కాపాలికులు సంకల్పిస్తే


ఖేచరీ విద్య వలన అభినవగురుడు క్షణంలో ఇక్కడికి రాగలడు.”

“ఇది సాధ్యమా శివకేశవయ్యగారు?”

“ఇది సాధ్యమే మహారాజా!ఖగము అంటే ఆకాశం. ఖేచరీ విద్య అంటే గాలిలో ఎగిరి
రావడం. ఆదిశంకరుడు కూడా అవసర సమయంలోఈ విద్యను ప్రదర్శించాడు.
హనుమంతుడు కూడా ఈ విద్యనే ఉపయోగించి సముద్రాన్ని దాటివుంటాడు! ఎలాగూ
ఈయుద్ధాలు ముగియడానికి ఇంకా చాలాకాలం పడుతుందికదా?”

“మహామాత్యా! అలా శలవిచ్చారేమిటీ?”

“ప్రభూ! మీతో రాజకీయాలు చర్చించగలవాడిని కాదు. కానీ ఈ దేశంలో సవతి బిడ్డల


పోరు అంత తొందరగా తేలేదికాదు. ఎందుకంటే భీమసలుఖి మహారాజు మీతండ్రికి జ్యేష్ఠ
పుత్రుడు. మీరు ద్వితీయ పుత్రులైనా పట్టమహిషి కుమారులు. అందుకని ప్రజలలోను
రాజోద్యోగులలోను సైన్యంలోకూడ ఎక్కువమంది మిమ్మల్ని సమర్ధించినా జ్యేష్ఠాతిక్రమణం
కూడదని కొందరు పెద్దలు అటువైపు కూడా వున్నారు. అందుకే మీ విజయం డోలాయ
మానంగా అస్ధిరంగావుంది.”

“అదేకదా సమస్య! మేము జ్యేష్ఠపుత్రులం కాకపోయినా జ్యైష్ఠినేయులం. ఈధర్మం


చాలామందికి తెలియదు. అంతమాత్రంచేత అందరినీ చంపుకుంటూ పోలేముకదా!”
అన్నాడు మహారాజు.

“మహారాజా! కాపాలికులంటే అందరికీ భయం! కాపాలికులతోపాటు మనం కుహనా


కాపాలికులను సృజించాలి. అంతఃశత్రువు లందరినీ అంతం తేయాలి.”

“ఇదిపాపం కాదా?”అన్నడు మహారాజు.

“మహారాజా! రాజ్యమేలాలంటే కొన్ని పాపాలు చేయకతప్పదు. అందుకే ‘రాజ్యాంతే


నరకం ధృవం’ అనేదీ!”

“మహామాత్యా! రాజైనందుకు చివరకు మమ్మల్ని నరకానికి పంపుతారా?”


241
  చాళుక్యసింహాసనం

“ధర్మాన్ని ప్రతిష్టించడానికి కొన్ని యక్తులు పన్నక తప్పదు. శ్రీకృష్ణభగవానుడే మన


కాదర్శం. మనం నిమిత్తమాత్రులం. నూకలు చెల్లినవారంతా ఎలాగైనా అమరలోకాలకు
వెళ్ళిపోకతప్పదు.

పాప పరిహారార్ధం శివప్రతిష్ఠలు చేద్దాము. ఇప్పటికే డెబ్బయి ఎనభై యుద్ధాలు జరిగాయి


కదా. ఐనా మీరు నిలదొక్కుకోగలిగారంటే గొప్పే! ఒక్కొక్క యుద్ధానికి చిహ్నంగా ఒక్కొక్క
శివాలయం నిర్మిద్దాము. హరుడు సమస్త పాపాలనూ హరించువాడు.

నేను మనదేశంలో ఊరూరా సంచరిస్తాను. ప్రజలందరినీ కలుసుకుంటాను. వీరులను


సైన్యంలో జేరుస్తాను. దేశద్రోహులెవరో గమనిస్తాను. దుర్మార్గులు శివైక్యం చెందుతారు.
కుహనా కాపాలికులు తలకొట్టి తీసుకుపోతారు.”

“ఇలా అయితే చాలామందిని కోల్పోవాల్సి వస్తుంది.”

“అవసరంలేదు మహారాజా! ఒక్కతలకాయి తెగిందంటే అందరూ దోవకు వస్తారు.”

“మాకు శివప్రతిష్ఠలు చేయడం సమ్మతమే. రాజనీతియుక్తంగా మీరేమైనా చేయండి.”


అయిష్టంగానే అంగీకరిస్తూ మహారాజు సమావేశాన్ని ముగించాడు.

39 కాలాముఖులు
గండువర్మ పూర్వపు మహామాత్యుడు గంగాతీర్థునితో సమావేశమయ్యాడు.

“మహాశయా! కొంపలు మునిగిపోతున్నాయి. చాళుక్యరాజ్యమంతా కల్లోలంగా


వుంది. రాత్రిపూట మనిషి బయటికి రావాలంటేనే భయం భయంగా ఉంది. కాపాలికులు
విస్త్రుతంగా తిరుగుతున్నారట! మెడనరికి పచ్చి నెత్తురు తాగుతారట! కపాల పాత్రలో
భోంచేస్తారట! శవాల మాంసం తింటారట! ఒకటే వదంతులు.

భైరవకోనలో హోమాలు జరుగుతున్నాయిట! నరబలికూడా జరుగుతోందని చెప్పు


కుంటున్నారు. కానీ అటు వెళ్ళినవాడు చూసినవాడు లేడు. ఇదిగో తోకంటే అదిగో పుల
నేవారే. అందరికీ భయం భయం. ప్రతి వాడలోను మగవాళ్ళంతా జట్లుజట్లుగా ఏర్పడి
కాపలా కాసుకుంటున్నారు” అన్నాడు గండువర్మ చాలా భయంభయంగా.

“కాపాలికులు దండకారణ్యంలోను నల్లమలారణ్యంలోను నందికొండలోను


పల్లవబొగ్గం లోను ఎప్పుడేనా కనిపిస్తారని చెప్పుకుంటారు. కానీ చూసినవాళ్ళులేరు.
ఇప్పుడు వీళ్ళెక్కడనుమచి ఊడిపడ్డారు?”

“అదే మాయగా వుంది. కపాలికులు మనవాడు చంద్రభానుడి తల నరుక్కువెళ్ళారు.


242
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

వేంగీదేశానికి క్రొత్త మహామంత్రి నియమింప బడినప్పటినుంచీ ఈ కలకలం. ఆయనే ఈ


కాపాలికుల్నివెంట తీసుకువచ్చాడని ప్రజలు అనుకుంటున్నారు.”

“ఈ కొత్తమంత్రి మనఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాడా ఏమిటి? ఎందుకైనా మంచిది


నేరుగా ఒకసారి ఆయన్ను కలిసిచూడు” అన్నాడు గంగాతీర్థుడు.

కొందరు పురప్రముఖులు రాజోద్యోగులూ కూడబలుక్కుని గండువర్మ నాయకత్వంలో


మహామంత్రి సోమసూత్రం శివకేశవయ్య ప్రాసాదానికి వెళ్ళారు.శివకేశవయ్య మొహమాటం
లేని మనిషి.“మహామహులంతా కట్ట కట్టుకుని వచ్చారు. ఏమైనా ఉపద్రవమా?”అన్నాడు
ఆయన.

ఆయన మొదటిమాటకే అందరూ నీరుకారిపోయారు. ఐనా “అయ్యా! తమకు


తెలియని విషయముండదు. దేశంలోను నగరంలోను కాపాలికుల బెడద చాలా
భయంకరంగావుంది. నిన్న చంద్రభానుడు మొన్నశాంతయ్య. ఇంతకు ముందు
పోయినవారందరినీ ఏ మృగమో చంపిందనుకున్నాము. మా అందరికీ మహచెడ్డ
భయంగావుంది. ప్రజలకు రక్షణ లేకుండా పోయింది.” అన్నాడు గండువర్మ.

“శివాజ్ఞ! ప్రముఖులారా! చంద్రభానుడు శాంతయ్య ఎలా చనిపోయారంటారు?”


ఏమీ ఎరగనట్లు అడిగాడు శివకేశవయ్య.

“అయ్యా! చంద్రభానుడు చాళుక్యు సైన్యంలో వాడు. సూర్యచంద్ర వంశానికి చెందిన


రాజ పురుషుడు. ఈతడికి భీమసలుఖి మహారాజు భార్య తోబుట్టువు. ఎంతోకాలంగా చాళుక్య
రాజ్యానికి సేవ చేస్తున్నవాడే!”

“అతడెలా చనిపోయాడు?”

“చంద్రభానుడు తన రొక్కం సంచులు తీసుకువెళుతుండగా కాపాలికులు కొందరు


చంద్రభానుడిపై దాడి చేశారు. తలనరికేసి పట్టుకు పోయారు. తలకాయతో పాటు
ధనంసంచులు కూడ మోసుకు పోయి సమీప గ్రామాల వద్ద పడవేసి వెళ్ళిపోయారు.”

“అంటే కాపాలికులకు ధనంతో పని లేదనమాట!”

“మహామాత్యా! అలాగే కొద్ది దినాల క్రితం ఎక్కాల శాంతయ్య గారింటికి పొరుగు


దేశం నుండి చుట్టం వచ్చాడు. ఇద్దరూ కలిసి కొల్లేరు సరస్సులో పడవ ప్రయాణానికి వెళ్ళారు.
కాపాలికులు ఇద్దరి తలకాయలు కోసుకు పోయారు. రాజధాని సవీపంలోనే ఇలావుంటే
దూరప్రాంతాల సంగతేమిటీ? కుగ్రామాలవాసులకు రక్షణ ఏమిటీ? మాకంతా చాలా
భయంగా వుంది.”

243
  చాళుక్యసింహాసనం

“మీరంతా అలా భయపడకండి. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు! కాపాలికులు కాలా


ముఖులు పరమ శివ భక్తులు. శివస్వరూపులు. వీరికి కలవస్తుంది! కలలో శివుడు ఆదే
శిస్తాడు! అలాంటి వారినే ఎక్కడవున్నా తెలుసుకుని శివైక్యం చేస్తారు.”

“అయ్యా! వారికి కలరావడమేమిటీ మాప్రాణాలు పోవడమేమిటీ? ఇదంతా మాయగా


వుంది. ఇదివరకు ఈ దేశంలో కాపాలికులు లేరు. ఉన్నా ఏ శ్రీపర్వతం అడవులలోనో ఉండే
వారు. వీళ్ళంతా ఊళ్ళలోకి వచ్చి పడుతున్నారు.”

“మీరేమీ భయపడకండి. వాళ్ళ కలలోకి రాకుండా చూచుకోండి. వాళ్ళు అందరిజోలికీ


రారు! కాలం తీరి శివాజ్ఞ అయిన వారినే తీసుకుపోతారు!”

“అయ్యా! మాకలలోకి మేమే రాకుండ వుండలేము! వాళ్ళ కలలోకి రాకుండ మేమెట్లా


వుండగలం? ఇదేమీ న్యాయంగా లేదు.”

“మీరంతా నన్నేమి చేయమని కోరుతున్నారూ?”

“మీరే దయచేసి కాపాలికులు భైరవ కోన దాటిరాకుండ చుట్టూ కంచ వేయించాలి!”

“చూద్దాం! ఇప్పటివరకు అరవైనాలుగుమంది కాపాలికుల వలననే చనిపోయారంటు


న్నారు. విచారణ జరిపిస్తే రాష్ట్ర్రకూట గూఢచారులే వీళ్ళను చంపారని తెలిసింది.”

“మహామాత్యా! ఇది విడ్డూరంగా ఉంది. కానీ చనిపోయినవారిలో చాల మంది మన


గూఢచారులు, రాజోద్యోగులు.”

“మీరు సరిగ్గా చెప్పారు. చనిపోయినవారంతా మనదేశంకోసం పనిచేస్తున్నవారే.


గూఢ చారులు కానివ్వండీ రాజోద్యోగులు కానివ్వండి. వీరిలో ఎవరు ఎవరికోసం
పనిచేస్తున్నారో తెలీదు. చనిపోయిన వారిలో సామాన్య పౌరుడు ఒక్కడు కూడా లేడు. పొరుగు
దేశం వాళ్ళే మనవాళ్ళని కాపాలికుల పేరు పెట్టి చంపివుంటారు.”

“అమాత్యవర్యా! ఇది నిజం కాదు. కాపాలికులే వీళ్ళను చంపారు. దూరంనుంచి


కొందరు చూశారుకూడా!”
“నిజమే! తల నరకడం చూశారు. కానీ రక్తం తాగడం చూశారా?”
“లేదు!”
“మరి కాపాలికులు రక్తం తాగుతారు కదా?”
“తలకాయలు తీసుకుపోయి పూజచేసి అప్పుడు తాగుతారు.”
“అప్పటికి రక్తం గడ్డకట్టిపోతుంది! పులి లేడిరక్తం ఎప్పుడు తాగుతుందీ? రెండురోజుల
244
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

తరువాతా?”
“మా అందరికీ చాలా భయంగావుంది.”

“మీరంతా గొప్ప రాజోద్యోగులు. మీరు సన్మార్గంలో నడవండి! మీకేమీ భయం


ఉండదు. శంకరుడు లయకారుడైనా దయామయుడు. అనవసరంగా కాపాలికులకు కలలో
సన్మా ర్గుల పేర్లు చెప్పడు.”

మహామాత్యుడు లేచి మధ్యాహ్న సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.

అందరిగుండెలలోను బండ పడింది. ‘ఇదంతా మహామాత్యులకు తెలిసే జరుగుతోంది.


శివాజ్ఞ అంటే ఏమిటీ? శివకేశవయ్య ఆజ్ఞే! అంటే మనం మహామాత్యుడికి అనుకూలంగా
వుంటే బతుకుతాం!లేకుంటే ఛస్తాం!శివకేశవయ్య ఎంత స్పష్టంగా చెప్పాడూ’అను కున్నారు.

40 దేవతార్చన
మాన్యకేతనగరంలో ఇంకా తెల్లవారలేదు. భీమసలుఖి మహారాజు తెల్లవారక ముందే
లేచి లీశోత్తరదీక్షితుని కలవడానికి రసతరంగిణి కోటీరానికి బయలుదేరాడు. ఆయనను
కలవాలంటే అదే సరైన ప్రదేశం.

అది గ్రీష్మఋతువు. ప్రత్యూషఃకాలం. పూర్వదిశన వెలుగు రేఖలు తామరరేకుల్లా


విచ్చు కుంటున్నాయి. రసతరంగిణి కోటీరం నుంచి భూపాలరాగంలో శ్రావ్యంగా ఒక
శ్లోకగానం విన వస్తోంది.

రసతరంగిణి తన దేవతార్చన ముందు నాట్యం చేస్తోంది. భగవతిని అర్చించే


విధానంలో నాట్యం ఒకటి. భూపాలరాగం చల్లచల్లగాను అప్పుడప్పుడే ఉదయిస్తున్న
సూర్యకర స్పర్శ తో వేడెక్కుతున్న పిల్ల తెమ్మెర లాగా వెలువడుతోంది. ఆమె సహచరులు
ఒకరు వీణ మీటితే ఒకరు శ్లోకం పాడుతున్నారు. ఒకరు మృదంగం చరుస్తే ఒకరు
తాంబూరాతో శృతి నిస్తున్నారు.
శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశలః స్పన్దితు మపి
అత స్త్వా మారాధ్యాం హరిహర విరించాదిభిరపి
ప్రణన్తుం స్తోతుంవా కథ మకృతపుణ్యః ప్రభవతి.
స్త్రీ శక్తిమయం. శక్తి వలననే హరి హరుడు విరించి ఇంద్రాది దేవతలు చైతన్యవంతు
లవు తున్నారు. లేకపోతే స్థాణువు అయిన పరమాత్మకు చలనమేదీ?

245
  చాళుక్యసింహాసనం

రసతరంగిణి దేవతార్చనలో వీర్యకాళి సువర్ణ విగ్రహం ప్రధానంగా వుంది. కాళీదేవితో


పాటు పరివార దేవతల విగ్రహాలు కూడా వున్నాయి. ఆమె చెలికత్తెలు కూడా దేవతార్చనలో
పాల్గొనేవారు. దేవతార్చన చివరలో భజనకూడా చేశారు.

కాళవినాశిని కాళీ జైజై

దుర్గతి నాశిని దుర్గా జైజై

భీమసలుఖి మహారాజుకు ప్రకృతిని పరమాత్మని ఆస్వాదించే ఆరాధించే తత్వమే లేదు.


ఎంతసేపటికీ తను తన రాజ్యము తన కుమార్తె.

నిజానికి సృష్టిలో పూర్తిదుర్మార్గులు పూర్తిసన్మార్గులు ఉండరంటారు పెద్దలు.


భీమసలుఖి మహారాజు విజయవాటికలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి ఆలయానికి
ఎదురుగా చిన్నకొండపైన మల్లికార్జునుని ప్రతిష్టించాడు. అక్కడ ఒక శాసనం కూడా
వేయించాడు. అంతేకాదు. మల్లికార్జునస్వామి ఆలయం నుంచి గుహామార్గం తవ్వించాడు.
తపస్యులు ఆ మార్గం కుండా వచ్చి శివార్చన చేసుకుని వెళుతుండేవారు.

చాలాకాలం తరువాత రసతరంగిణి లీశోత్తరదీక్షితునికి గతరాత్రి విందు ఇచ్చింది.


ఆయన ఇంకా ఆ బడలికనుంచీ తేరుకోలేదు. నిద్ర లేవలేదు. రసతరంగిణి మాత్రం తెల్లవారు
ఝామునే లేచి తలస్నానం చేసి పిడప పెట్టుకుని దేవతార్చన ప్రారంభించింది.

రసతరంగిణి అనుగ్రహం దొరకడమే కష్టం.ఆమె నెలకు మూడు శోభనాలను మించి


అంగీకరించదు. మాన్యకేతం వచ్చే దేశి విదేశి వణిజులు వ్యాపారులు సేనానులు రాయ
బారులు మహారాజులు ఒకరేమిటి ఎందరో ఆమె పదపల్లవ మంజీర చుంబన భాగ్యంకోసం
ఎదురు చూస్తుంటారు. ఆమె దక్కకపోయినా ఆమె కోటీరంలో మరెందరో సుందరీమణు
లుంటారు.

ఈ లోకాన్ని అందంగా సహజంగా అలంకరించేది ఇద్దరే. ఒకటి పూలు రెండు స్త్రీలు.

తన శయన మందిరం ఎక్కడో కనుక్కుని వచ్చిన మహారాజుతో “ఛ! భీమసలుఖి


మహారాజా! మరీయింత తెల్లవారుఝామునే రావాలా. నిద్రకూడా పోనీయరు. ఇప్పుడంత
కొంపలేమంటుకున్నాయనీ?”విసుక్కుంటూ మంచం మీదినుండీ లేస్తూ అన్నాడు లీశోత్తర
దీక్షితుడు.

“అంటుకోడమా అంటుకోడంన్నరా! ఆయ్! మొత్తం తగలపడిపోతోంది. వేంగిలో మా


తమ్ముడు మహామంత్రిని మార్చిపారేశాడా? చంద్రభానుడిని శాంతయ్యని మన
అనుయాయుల్ని ఒక్కొక్కరినే కాపాలికులు భోంచేస్తున్నారా? ఇంకా ఇంతకన్నాఏంకావాలీ
బూడిద!”
246
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“మధ్యలో ఈ కాపాలికులు ఎక్కడినుంచీ వచ్చారు?”

“వాళ్ళకొకవూరా దేశమా! దిమ్మరులు. తిరిపానికి ఆసేతు హిమాచలం వాళ్ళదే.


ఎక్కడి కైనా వెళతారు!”

“కాపాలిక సాంప్రదాయం కృష్ణా గోదావరీ ముఖద్వరాలలోలేదు. కనక ఇది మొత్తం


ఒక కుట్రే అయివుంటుంది.”

“కుట్రోపుట్రో! ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు నా పట్టాభిషేకానికి ఎన్ని


ఇక్కట్లో! నాకూతురు పెళ్ళి కర్కవల్లభునితో జరిపిస్తే సగం రాజ్యం మా అల్లుడికీ సగం రాజ్యం
మీకూ రాసిస్తానని చెప్పానా!”

“మీరాజ్యం గీజ్యం నాకేమీ అవసరంలేదుకానీ ఇంత చిన్న వేంగీరాజ్యాన్ని రాష్ట్ర్రకూటులు


జయించలేకపోతున్నారు. దీనికి కారణమేమిటీ?” చింతిస్తూ అన్నాడు లీశోత్తరదీక్షితుడు.

“మీకు చిత్తశుద్ధి అంటు ఒకటుంటేకదా? పేరుకు మహా సేనాధిపతి. కానీ కత్తిపట్టి


ఎన్నా ళ్ళయిందీ? ఈపాటికి తుప్పుపట్టి వుంటుంది. కాస్త కత్తికీ కొంచం బుద్ధికీ పదును
పెట్టండి. ఎప్పుడూ ఈ సానిదాని అంకసింహాసనం పైన కూర్చోడమేనా!” కోపంతో
పరిహాసంగా అన్నాడు భీమసలుఖి మహారాజు.

“మహారాజా! మీరునాకు కోపం తెప్పిస్తున్నారు. మీరు నన్ను ఏమైనా అనండి. ఈవిడను


మాత్రం ఏమీ అనకండి.”

“ఏమీ అనకండి! దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఈ సానిదాని కొంపలో పొద్దున్నే


శివస్తోత్రాలేమిటీ?”
“ఈమె వీర్యకాళి భక్తురాలు. ఈమె నేమైనా అంటే కళ్ళు పోతాయి!”
“అంత పుణ్యాత్మురాలయితే ఈ సానిపని ఏమిటీ?”

“ఆ మాట ఆవిడ నడుగుతే తెలుస్తుంది. ఆవిడ శివతత్వం ప్రసంగిస్తే మీలాంటివాళ్ళకు


ఒక్క ముక్క కూడ అర్ధంకాదు.”

“అదేమంచిది. లేకపోతే దాని మత్తులో పడి నేనుకూడా నా రాజ్యాన్ని సింహాసనాన్ని


మర్చిపోయేవాడిని. ఆయ్! మనమధ్య కోపాలెంతసేపు లేండి! బావబామ్మరుదులం! ఆయ్.
ఇంతకూ నేను బహుమానం ఇచ్చినపిల్ల బాగుందా?”

“ఓ దానికేం! పందెం కోడిలాగా పిటపిటలాడిపోతోంది.”

247
  చాళుక్యసింహాసనం

“మహానుభావా! మీరింకా నిద్దర పోతే కుదరదు. మీరు కాదంటే మీ జగతీంద్రవర్మను


ఆశ్రయిస్తా. నారాజ్యం రాగానే అతడిని యువరాజును చేస్తానని రాయబారం పంపాను.
నాకెలాగూ మగపిల్లలు లేరు. మీకు సగం రాజ్యమివ్వగా మిగతా సగానికి అతడ్ని యువ
రాజును చేస్తాను.”

“మహారాజా! మీరాజ్యాన్ని ఎంతమందికి పంచుతారూ గుళ్ళో ప్రసాదం లాగా? కర్క


వల్లభుడికి ఏమిస్తారూ?”

“ఊరికే పనయ్యేదాక అలా అంటానుకానీ నిజంగా యిస్తానా?”

“మహారాజా మీబుద్ధి అర్ధమయింది. ఐనా మిమ్ము నమ్మేదెవరూ? కాకపోతే వేంగిని


లొంగదీయడం మాబాధ్యత. ఒకప్పుడు మాసామంతులే. ఇప్పుడు స్వతంత్రులయ్యారు.”

“మీరేమైనా అనండికానీ వేంగీచళుక్యులు సామంతులంటే నేను ఒప్పుకోను. మీ


రాష్ట్రకూటులు పుట్టకుముందే కుబ్జవిష్ణువర్ధనుని కాలం నుంచి వేంగి స్వతంత్రదేశం!”
అన్నాడు పౌరుషంగా భీమసలుఖి మహారాజు.

“మహారాజా! ఇంత ప్రొద్దున్నే మీరు వచ్చిన పనేమిటీ?”

“మీరెలాగైనా కాపాలికుల్ని కాలాముఖుల్ని నిరోధించాలి. లేకపోతే మన గూఢచారులు


ఒక్కళ్ళు కూడా మిగలరు. అంతేకాదు మనవాళ్ళను చంపినందుకు మనం కూడా బదులు
తీర్చుకోవాలి.”

“మనమేంచేస్తాం? ఆ నరేంద్రమృగరాజుకు ఆయుర్దాయం బాగావుంది. ఎన్ని హత్యా


ప్రయత్నాలు చేసినా తప్పించుకున్నాడు. ఈమాటు యువరాజుకే గురిపెట్టాలి.”

“వాడా! వాడొక చిచ్చరపిడుగు. వాడు మనవూరిలోనే దొరకలేదు. కంటో కారం కొట్టి


పోయాడు. అక్కడేం దొరుకుతాడూ నాబొందా?”

“అందుకే మేము వేంగితో ఎందుకు సంధి చేసుకోకూడదా అనుకుంటున్నాము.”

“కొంపతీసి ఆపనిమాత్రం చెయకండి. మీరుకాకపోతె ఇంకొకరు. అడుక్కు తినేవాడికి


అరవై కూరలు. ఎవరికాళ్ళయినా పట్టుకుని సింహాసనం సాధిస్తాను. వసుదేవు డంతటివాడు
అవసరమొస్తే గాడిదకాళ్ళు పట్టుకున్నాడు.”

“నిజానికి వసుదేవుడు గాడిదకాళ్లు పట్టుకున్నట్లు భాగవతంలో ఎక్కడా లేదు.ఇంతకూ


మహారాజా! ఇప్పుడా గంగాతీర్ధుడు ఏంచేస్తున్నాడు? పదవి ఊడిందికదా?”
“ఇంకా నాఆశ ఆ గంగాతీర్ధుడూ కూష్మాండయోగీ మీదే వుంది.”
248
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“నాకుతెలీని కూష్మాండయోగి ఎవరూ?”


“త్వరలోనే తెలుసుకుంటారు.”

“మహారాజా! కొన్ని పనులు కత్తితో సాధించలేము. ముఖ్యంగా గురువులూ తాంత్రికులు


వీళ్ళతో. ఈ కాపాలికులు కాలాముఖుల జోలికి మనం పోలేము. వీళ్ళకు కొన్ని దివ్య శక్తులు
ఉపాయాలు ఉంటాయి. లాఘవంగా పని సాధించుకోవాలి. వీళ్ళతో మాట్లాడడానికి ఈ
రసతరంగిణిని పంపిస్తే?”

“ఈ ముండేంచేస్తుందీ అక్కడా?”

“అలా హీనంగా మాట్లాడకండి. ఈవిడ వీర్యకాళి ఉపాసకురాలు. కాపాలికులతో


కాలా ముఖులతో మాట్లాడడానికి సమర్ధురాలు. చిన్నప్పటినుంచీ ఎందరో
తాంత్రికుల్నిచూసింది. వారిని జనావాసాల జోలికి రాకుండా వరం సంపాదించగలదేమో
చూద్దాం.”

“ఏరులో కొట్టుకుపోయేవాడు గడ్డిపోచ ఆధారం దొరికినా వదలడు. సరేకానీయండి.”

“మహారాజా! రసతరంగిణి గడ్డిపోచకాదు. కల్పభూరుహం! స్త్రీలకు అమాత్యపదవు


లియ్యటం లేదుకాని అత్యంత సమర్ధురాలు.”

“ఆయ్!మగాడు చేయలేనిపని ఆడది చేయగలదు. లోకంలో ఆడదానితో కాని


పనంటూ వుండదు.”

“రసతరంగిణిని వేంగీదేశంలో తీర్ధయాత్రలు చేసిరమ్మని పంపిస్తాను. ఆ నెపంతో


అక్కడ పర్యటించి తాంత్రికులతో మాట్లాడుతుందేమో!”

“ఆశా పద్ధతేలోకే కర్మణా బహుచింతయా అన్నారు. అదికూడా చూద్దాం.”అన్నాడు


భీమసలుఖి మహారాజు.

41 వేంగిలో పండిత సభ
వేంగీ నగరంలో కవి పండిత సమావేశం జరుగుతోంది. నరేంద్రమృగజాజు ఆస్ధానం
అది. ఆ సమావేశానికి వేములవాడ చాళుక్యుల ఆస్ధానకవి సోమదేవసూరి వచ్చాడు. ఆయన
యశశ్తిలక అనే చంపూకావ్యాన్ని రచించాడు. దానితోపాటు నీతివాక్యామృతము అనే
ధర్మశాస్త్రాన్ని కూడా రచించాడు. ఇది కౌటిల్యుడి అర్ధశాస్త్రాన్ని క్రోడీకరించి ఒక ధర్మో
పదేశంగా రచించినది. ఆ సభకు ఉగ్రమూర్తి అనే పేరుగల యాదాద్రి పండితుడు కూడా
వచ్చాడు. అందరితోపాటు త్రామ్రలిప్తి నుండి తిట్టుకవి మల్లయ్యగారు కూడా వచ్చాడు.
249
  చాళుక్యసింహాసనం

సభ వేదప్రవచనంతో ఆరంభమయింది. వేదపండితులు:

‘ఓంసరస్వతీ మనుమతీం భగం యన్తో హవామహే…’

ఈ సభలో గీర్వాణి అనుగ్రహంతో అందరూ తీయని పలుకులు పలుకుదురు గాక.


సోమదేవుడు అందరినీ అమృతాంశువులతో చల్లగా చూచుగాక అని ఆశీర్వదించారు.

నరేంద్రమృగరాజు ఆస్ధానంలో మల్లప్ప అనే ప్రసిద్ధ సంగీత విద్వాంసుడున్నాడు. నాడు


ఆయన సంగీత కచేరీ చేయవలసివుంది. మల్లప్ప తను పెద్దవయసు వలన పాడలేక
పోతున్నాననీ తనబదులు తన కుమార్తె చల్వ పాడుతుందనీ ప్రభువులు మన్నించాలనీ
కోరాడు. మహారాజు అంగీకరించడంతో ఆమె గానరసామృతం కురిపించింది. అదరూ
తండ్రిని మించిన కూతురని ప్రశంసించారు.

మహారాజు ఆమె సంగీత ఝరికి మెచ్చి అత్తిలిగ్రామంలో ఐదునివర్తనాల పోకతోట


మాన్యంగా బహూకరించాడు.

ఆ సభకు ఆహ్వానింపబడినవారిలోదుర్వినీతుడనే శబ్దావతారమను సంస్కృతవ్యాకరణ


కర్త కూడ ఉన్నాడు. కాంచీనగరం సమీపం లోని మణిమంగళ్ నుంచి అభినవదండి అనే
మహాకవి విచ్చేశాడు. ఇంకా ఎందరెందరో కవిపండితులు సభలో ఆసీనులై యున్నారు.

ఆ సభకు వసంతవాడ ఘటికాస్ధానం ఉపకులపతి చీపురుపల్లి మాధవవర్మ అద్యక్షత


వహించాడు. అంతవరకూ ఘటికలలో కులపతి ఉపకులపతి స్ధానాలను బ్రాహ్మణులే
అలంకరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ స్ధానాన్ని ఒక క్షత్రియుడు అలంకరించాడు.

అంతవరకూ సభ బాగానే జరిగింది. అప్పుడే వివాదం ఆరంభమయింది. ఆసభలో


పండితుల సమీపాన కూర్చున్నవారిలో మాన్యకేతం నుండి వచ్చిన రసతరంగిణి కూడ వుంది.
ఆమె ఎవరూ అని ప్రశ్నించాడు తిట్టుకవి మల్లయ్య.

“నేనోక గణికను!” సమాధానం ఇచ్చింది రసతరంగిణి తను కూర్చున్న చోటినుంచి


లేవకుండానే.

పండితులు కవులూ ఒక్కసారిగాకోపంగా లేచి నిలబడ్డారు. ‘ఒక సానిదాని ప్రక్కన


కూర్చోడానికి మేము సిద్ధంగాలేమని’ ప్రకటించారు..

సభాద్యక్షుడు మాధవవర్మకు ఏంచెప్పాలో వెంటనే తోచలేదు. ఆమె మహా పండితు


రాలని ఆహ్వానించాడు. సాంప్రదాయ కవి పండితులు తనను ఆక్షేపిస్తారేమోనని అనుకుం
టూనే వున్నాడు. అంతపనీ అయింది.

250
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఇది పండిత సభేనా?” ఎదురు ప్రశ్నించింది రసతరంగింణి కూర్చున్న చోటినుంచీ


లేవ కుండానే.

“ఇది పండితసభే! కానీ వేశ్యావాటిక కాదు” అన్నాడు కోపంగా అభినవదండి. పండిత


ప్రకాండులందరూ వంత పలికారు.

“మహేంద్రుడి సభలో కూడ అప్సరస్త్రీలుంటారు. మానవులందరికీ ఒక్కొక్క పనికి


యుక్త సమయం ఉంటుంది. ఇది తమతమ పాండిత్యాలను ముచ్చటించవలసిన సభ! తక్కిన
విషయాలు అప్రస్తుతం” అన్నది ధైర్యంగా రసతరంగిణి.

“నీవేమీ పండితురాలవా?” ప్రశ్నించారు పండితులు.

“పరీక్షిస్తే తెలుస్తుంది!” అన్నది రసతరంగిణి అంతే ధైర్యంగా.


“పండితురాలవైతే నీవు చేసే పడుపువృత్తి నీకు నీచమనిపించటంలేదా?”
రసతరంగిణి పరిహాసంగా నవ్వింది. “లేదు!”అని సమాధానమిచ్చింది.
“అంటే పూర్తిగా సిగ్గు విడిచేశావనమాట!”
రసతరంగిణి మందహాసం చేస్తూ“అందరూ ఏదో సమయంలో సిగ్గు
విడిచేవారే!”అన్నది.
“వేశ్యవు కదా బరితెగించి మాట్లాడుతున్నావు సభలో!”
“ముందు పండితురాలిని! ఆ విషయంలో మీకేమైనా సందేహాలుంటే తీర్చుకోండి.
నేను గణికనైతే మీకేమీ? నా వృత్తిని కాదు. నాలోని విద్వత్తును చూడండి.”
“నీకు నీవే పండితురాలవనుకుంటే సరిపోదు!”
“పరీక్షిస్తారా?”
“పరీక్షకు నిలబడతావా?”
“సరస్వతీ మనుమతీం భగం యన్తో హవామహే. ఆ జాతవేద అనుగ్రహిస్తే గెలుస్తాను
కూడా!”
పండితులందరూ కొంతసేపు తమలోతాము వితర్కించుకున్నారు. చివరకు ఆమెను
ముందు పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. అందరూ తలొక ప్రశ్నా వేసి ఆమెను కలవర
పెట్టాలనుకున్నారు.
ప్రశ్న ఆకాశంలో ఒంటరిగా తిరిగే పక్షి ఏది?
ఫ్రత్యుత్తరం. సూర్యుడు!

251
  చాళుక్యసింహాసనం

“సూర్యుడా! ఇందుకు ప్రమాణమేమిటీ?”


“యజుర్వేదం! సూర్యం ఏకాకీ చరతి చంద్రమా జాయతే పునః”
“భూమికి వున్న కొన్ని పేర్లు చెప్పు.”
“భూమికి ఇరవైయొక్క పేర్లున్నాయి.”

“ఇరవైఒకటా? ఏమిటవీ?”

“గౌః, గ్మా,జ్మా,క్ష్మా,క్షా, క్షమా, క్షోణః, క్షితిః, అవని, ఉర్వీ, పృథ్వీ, మహీ, రిపః, అదితిః,
ఇళా, నిఋతిః, భూః, భూమిః, పూషా, గాతుః, గోత్రా .”

“ఇన్ని పేర్లున్నాయని నీవు చెప్పడానికి ప్రమాణమేమిటీ?


“యాస్కాచార్యుని నిరుక్తము. ఇవి కాక భూమికి ధర, వసుధ, వసుంధర అనేపేర్లు
కూడా వున్నాయి.”
“గోత్రము అంటే ఏమిటి?”
“ఆవులమంద!”
“యత్ర నారీ పూజ్యంతి రమంతి తత్ర దేవతాః అనే శ్లోకపాదం ఎక్కడిది?”
“మనుస్మృతిలోనిది.”
“నీకు స్మృతులు కూడా తెలుసాయేమిటి? కొన్ని పేర్లు చెప్పు చూద్దాం!”
“గౌతముడు సంకలనముచేసిన మనుస్మృతికాక బృహస్పతి, వసిష్ట, కశ్యప, భరద్వాజ,
గౌతమ స్మృతులు, విజ్ఞానేశ్వరుడు సంకలనం చేసిన యాజ్ఞవల్క్య స్మృతి, భృగు, నారద,
కపిల, పరాశర, వ్యాస, కాత్యాయన, ఆపస్ధంభ, అశ్వలాయన, కణ్వ, అత్రి, హరీత స్మృతులు
ప్రధానమైనవి.”
“పై మంత్రంలో రమంతి అంటే ఏమిటి?”
“ఇది తాంత్రిక విద్యలను సూచిస్తుంది. అర్ధం బాహ్యంగా చెప్పకూడదు.”
“నీకు తంత్రాలు కూడ తెలుసునా? ఏదీ కొందరు తాంత్రిక ఆచార్యుల పేర్లు చెప్పు
చూద్దాం?”
“శంభునాథుడు, అభినవగుప్తుడు, మత్స్యేంద్రనాధుడు, మహేశ్వరానందుడు, వతుల
నాథుడు, భాస్కరరాయుడు.”
“మంత్రి అంటే ఎవరు?”
“మంత్రమునందు సిద్ధిసాధించినవాడు.”

252
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఇంతకు ముందు తాంత్రిక విద్య అన్నావు. విద్యలెన్నిరకాలు?”


“క్షమించండి. విద్యలెన్నో నాకు తెలియదు. కానీ శ్రీవిద్య, కాదివిద్య, హాదివిద్య, లోపా
ముద్ర విద్య, కామకళావిద్య, అగస్త్యవిద్య అనేవున్నాయని తెలుసు. అందులో కామ కళా విద్య
అభ్యాసం ఉంది.”
“నీవు వేశ్యవుకదా! కామకళావిద్యయందు నేర్పరివైయుంటావు!”
“తమకు తెలిసికూడా నన్ను పరీక్షిస్తున్నారు. కామకళావిద్య అంటే కామశాస్త్రం కానే
కాదు. శ్రీపీఠాసీనుడైన పరమేశ్వరుడు మహాకామేశ్వరీదేవికి ఉపదేశించిన తత్వం!”
“నీకు ఉపాసన వుందా?”
“ఉంది.”
“ఏమిటదీ?”

“వీర్యకాళి! నాకు ఈడు వచ్చినప్పటినుంచి తంత్రవిద్యలు నేర్చుకున్నాను. చర్య క్రియ


యోగము సద్గురువు నుంచి నేర్చుకున్నాను. తంత్రము నుంచి అమితమైన శక్తి ఉద్భ విస్తుంది.
అందుచేత నాకు అలుపు అవమానము ఏమీ వుండదు.”

“ఈ తాంత్రిక విద్యలన్నిటినీ ఆదిశంకరుడు నిరసించాడు. ఖండించాడు తెలుసా?”

“శంకరభగవద్పాదులవారు నిరసించినమాట నిజమే! కాని స్త్రీ పురుషుడు ఇద్దరూ


ఏకమైనపుడు రెండులేవు. అదే అద్వైతము. కొందరు తంత్ర సాధన ఆరంభించి వీర భావంలో
నిలబడలేక భ్రష్టులవుతారు. అలాంటివారిని గురించీ ఆయన నిరసించింది! కత్తి వుంది. అది
మంచి పనికీ పనికివస్తుందీ ఒకరిని హింసించడానికి పనికివస్తుంది.”

“వైదిక ధర్మం తంత్రవిద్యలను అంగీకరించదు!”

“ప్రజలూ ప్రభువులూ వైదికధర్మం నుంచి దూరం జరిగినపుడే శైవతంత్రాలు శాక్తేయ


తంత్రాలు బౌద్ధుల తంత్రాలు మిళితమై విగ్రహారాధానలోకి దేవాలయ సాంప్రదాయంలోకి
ప్రవేశించాయి.”

“నీవు మాట్లాడేదానికి ఆధారం ఉందా?”

“తధాగతుడి నిర్యాణానంతరం ఐదువందల సంవత్సరాలకు బౌద్ధమతంలో తాంత్రిక


సాధనలు పెరిగాయి. ఇప్పుడు బౌద్ధమతం ఇక్కడ అంత్యదశలో వుంది. అంత్యదశ అంటే
ఎక్కడికి పోయిందీ? పాలలో పంచదారలా ఆర్యమతంలో కలిసిపోయింది. మనం పాటించే
ఆరాధనా విధానాలలో బోలెడన్ని మార్పులు వచ్చాయి.”

253
  చాళుక్యసింహాసనం

“నీ భాష్యం నేనర్ధం చేసుకోలేను. నీవు తాంత్రికురాలవా?”


“ఔను! నేను చేసిన సాధనని మీరు అర్ధం చోసుకోలేకపోతున్నారు!”
“బాగుంది. గుడ్డువచ్చి పిల్లను వెక్కిరించిందట!”
“లోకంలో మనం తప్పులనుకునేవన్నీ తప్పులు కావు ఒప్పులనుకునేవన్నీ ఒప్పులు
కావు!”

“కొంచం వివరంగా మాట్లాడుతే చర్చిద్దాము.”

“ఉన్నది శివము శక్తి! శివమే శంకరుడు శక్తి పార్వతి. ఈ కలయిక వలననే సుందర
మైన ఈజగత్తు విలసిల్లుతోంది. వీరే ప్రకృతి పురుషులు. లక్ష్మీనారాయణులు వాణీ
హిరణ్యగర్భులు. శక్తి కూడ శివునికి పరమైనది కాదు. పరమేశ్వరుడి సంకల్పమే శక్తి!”

“ప్రకృతి పురుషులు మాట నేను కూడ అంగీకరిస్తాను. ఆ పేరుతో మీరు చేసే ఈ వికృత
చర్యలేమిటీ?”

“వికృతం అని మీరెందుకనుకుంటున్నారు? ఇది ఒక తంత్రవిద్య! దేవాలయాలపై


బొమ్మలు చెక్కినవారంతా ఉన్మాదులు పిచ్చివాళ్లు అనుకుంటున్నారా? శివము, శక్తి, జీవుడు.
ఇదే త్రికోణము. మీరెప్పుడైనా పరశురామ తంత్రాన్ని పరిశీలించారా?”
“నీకు పరశురామ తంత్రం కూడ తెలుసా?”
“తెలుసును!”
“తాంత్రికులతో చర్చించడానికి మేము తగము. ఈ చర్చ ఇంతటితో ఆపేద్దాము.”

పండితులతో రసతరంగిణి మాటకు మాట సమాధానం చెబుతుంటే ప్రేక్షకులందరూ


నివ్వెర పోయారు. ఆ సభలో కూర్చున్న విదుషీమణులలో విజయభట్టారిక అనే సంస్కృత
కవయిత్రి ఉంది. ఆమె రాజకాంత. చంద్రాదిత్యవర్మ దేవేరి. చర్చ ముగియటంతో విజయ
భట్టారిక వచ్చి అమాంతం రసతరంగిణిని కౌగలించుకుంది.“నీవు పురుషాధిక్యాన్ని
జయించావు సోదరీ!” అన్నది.

మహారాజు సభాసదులందరినీ ఘనంగా సత్కరించాడు.

రసతరంగిణి వేశ్య అనితెలియగానే నగరంలో చాలామంది ఆమెమీద ఆశపడ్డారు.


అందులో చంద్రాదిత్యవర్మ కూడ ఒకడు. దురుద్దేశంతోనే అతడు ఆమెకు గొప్ప వసతి
ఏర్పాటు చేశాడు. మెల్లగా రాత్రికి చెంతచేరాడు.
“నీ వెల ఎంతో తెలుసుకోవచ్చా?”

254
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“నాస్నేహం వెలలేనిది! ఆ విషయం మీకు తెలియక వచ్చుంటారు.”


“మా మహారాజు బహూకరించినదానికి రెట్టింపు ఇస్తాను.”
“మీ మహారాజు బహూకరించిన వేయున్నూట వరాహలు దక్షారామ భీమేశ్వరుడికి
సమర్పించాను.”
“మరేమిస్తే ప్రసన్నురాలవవుతావో చెప్పు?”
“మీ భార్య విజయభట్టారికాదేవితో పల్యంకం పంచుకోనిస్తే!”
“అమ్మో! నన్ను నరికేస్తుంది!”
“అంత చక్కటి కవయిత్రి భార్యయైయుండగా ఈ ఎంగిలికూడెందుకూ?”
“లోకో భిన్నరుచిః”
“అవతల యువరాజ విష్ణువర్ధన రాజకుమారులు రాబోతున్నారు!”
“అదా సంగతీ! అంతటి నవయువకుడు అందగాడి ముందు మేము ఆనలేదన్న
మాట!”
“ఎవరే దృష్టితో చూస్తే లోకం అలాగే కనిపిస్తుంది!”
“మేము ఆయన కంట పడడం మంచిదికాదు. నాకు మరొక రాత్రి ప్రసాదిస్తే నీ స్నేహ
సుఖం ఆస్వాదిస్తాను.”
“అంతటి అవకాశం మీకు రాకపోవచ్చు!”
చంద్రాదిత్యవర్మ నిరుత్సాహంగా వెళ్ళిపోయాడే కాని నిష్క్రమించలేదు. పొంచివున్నాడు.

అర్ధరాత్రి దాటింది. రసతరంగిణి చెప్పినట్లే మారువేషంలో యువరాజు రసతరంగిణి


వద్ద కు వచ్చాడు. ఆమె అంతకు ముందు అతడిని చూడలేదు. పై మారువేషం తీసివేయగానే
ఆశ్చర్య పోయింది. కన్నులు మిలమిలా మెరిశాయి, కనురెప్పలు టపటపా కొట్టు కున్నాయి.

అప్రయత్నంగా ఆమె కూర్చున్న చోటినుంచీ లేచి యువరాజుకు నమస్కరించింది.


యువరాజు వినయంగా ప్రతి నమస్కారం చేయడం ఆమెకు విస్మయం కలిగించింది.

“యువతులలో నేనొక అందకత్తె ననుకుంటాను. కానీ యువకులలో మీ అంత అంద


గాడుండడు.”
యువరాజు చిరునవ్వు నవ్వాడు. “ఈ సమాగమం అందాన్నిగురించి కాదుకదా!”
రసతరంగిణి యువరాజుకు ఉచితాసనం చూపించింది. “తమరు ఆజ్ఞాపించండి!”
“నీవు చాలా గొప్ప శ్రీవిద్యా విశారదవని తెలుసుకుని వచ్చాను.”
255
  చాళుక్యసింహాసనం

“శ్రీవిద్య కాదుకానీ దేవీ సాంప్రదాయ విద్యలు యోగినీ సాంప్రదాయాలు తెలుసును!”


“నవావరణ నృత్యం అని ఉంటుందిట కదా?”

“ఉంటుంది! మీ ముందు అది ప్రదర్శించాలంటే అంతకు ముందు ఉపాసనా సాధనా


కూడ ఉండాలి. మీ అంత అందగాడి ముందు ప్రదర్శించాలంటే కష్టమే! మనసు నిలవదు.
రసభంగమవుతుందేమో!”

“మేమా నృత్యం ప్రదర్శించమని అడగడానికి రాలేదు. నేర్పమని అడగడానికి వచ్చాం!”

“మీకా?” రసతరంగిణి విస్మయంతో నవ్వింది. “అది స్త్రీలు చేసే నృత్యం!”

“మాకని చెప్పామా నవలామణీ!”

“చెప్పండి చెప్పండి! ఏదో తొందరపడి భయపడ్డాను!”

“మా వద్ద ఒక నర్తకి వుంది. ఆమెకు నేర్పించగలరా?”

“యువరాజా! ఈ నృత్యం అందరూ నేర్చుకోతగింది కాదు. ప్రదర్శించడం కూడా రహ


స్యంగా ఏదో పురాతనమైన దేవాలయాలలో మునులు యోగులు సాధకులముందు ప్రదర్శింప
తగినది. సాధనలేని పామరజనుల ముందు ప్రదర్శింపతగింది అసలే కాదు.”

“ఆ విషయం తెలుసుకునే వచ్చాము.”

“నా నివాసం మాన్యకేత నగరంలో! నేనిక్కడ తీర్ధయాత్రలకని వచ్చాను.”

“గురువు ఎక్కడ నేర్పుతానంటే శిష్యురాలు అక్కడకొచ్చి నేర్చుకోవాలి! ఇంతకూ మా


వేంగీదేశం నచ్చిందా?”

“నచ్చకపోవడమా! ఎక్కడచూచినా సరస్సులు కమలాకరాలు, భారతీమాత పచ్చని


చీర కొంగులాంటి వరిచేలు, మనుషుల విశాల హృదయాలు, ఉవిదల వదనసరోజాలు, లేత
తమలపాకు లాంటి చెక్కిళ్ళు, నిండైన వక్షస్సులు, లోతైన పొక్కిళ్ళు, వ్యవసాయ మెరిగిన
పురుషులు, పోకమానులు, నారికేళాలు, కంద, రంభావృక్షాల తోటలు నచ్చక పోవట
మేమిటీ?”

“ఇంతకూ మా నర్తకీమణికి నేర్పేదీ లేనిదీ చెప్పలేదు.”

“ఆమె నేర్చుకోతగినదైతే నేర్పుతాను. నన్నింతవరకూ ఈ నాట్యాన్ని గురించి ఎవరూ


అడగలేదు. ఈ నాట్యాన్ని గురించి తెలిసినవాళ్ళే తక్కువ. నాతోనే అంతరించిపోతుందేమో
256
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ననికూడా అనుకున్నాను. ఈ నాట్యానికి ప్రధాన నర్తకితో పాటు పదహారు మంది సహ


నర్తకీమణులు కూడ కావాలి. మీకు తెలుసుకదా. ఈ నాట్యంలో నవావరణాలుంటాయి.
నర్తకి తొమ్మిది దొంతరల వస్త్రాలు ధరిస్తుంది. ద్వితీయావరణంలో దేవత సర్వ ఆశా పరి
పూరక చక్రవాసిని. గుప్తయోగిని. ఈ దేవత కామాకర్షిణి, బుధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి,
శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి,
స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి.

ఈ నృత్యంలో నర్తకి ప్రేక్షకుల సర్వాంగాలను ఆకర్షిస్తుంది. ప్రదర్శన నాటికి ఆడవారికి


కొన్ని సమస్యలుంటాయి కాబట్టి బృందంలోఇరవైమందైనా యువతులు ఉండాలి. నర్తకి
ఒక్కొక్క ఆవరణ నృత్యం చేస్తూ ఆ దేవత నావిష్కరించి ఆతరువాత ఆవరణ లోకి వెళుతుంది.
ఆవరణకు ఆవరణకూ మధ్య ఆ ఆవరణ వస్త్రములు విప్పివేస్తుంది. అలా నవా వరణ
అయ్యేటప్పటికీ అన్నివస్త్రములు విప్పేసి దిగంబరంగా నాట్యం చేస్తుంది. ఇదీ ఈ నాట్యం
పామరుల ముందు ప్రదర్శించక పోవడానికి కారణం. చివరకు సహ నర్తకీమణులందరూ
వేదిక మీదికి వచ్చి నగ్నంగా నాట్యం చేస్తారు. అందుకే ఈ నాట్యం సిద్ధుల ముందు మాత్రమే
చేయాలి.”

“కొన్ని పరిస్ధితులలో మేమీ నాట్యాన్ని గురించి తెలుసుకున్నాము. ఇంతకూ ప్రధాన


నర్తకితోపాటు కొందరు నాట్యకత్తెలను మేము సమకూరుస్తాము. కొందరిని మీరు ఎంచు
కున్నా సమ్మతమే!”
“యువరాజా ఇంతకూ ఆ నృత్యార్ధి పేరు తెలుసుకోవచ్చా?”
“చిత్రాణి. ఆమెకు నాట్యం అంటే ప్రాణం.”
“ఆమెను నాతో పంపించండి. గుణగణాలు పరిశీలించిన తరువాత కానీ నేర్పేదీ లేనిదీ
చెప్పలేను.”
“గురువు అంటే అలా ఆత్మాభిమానంతో స్ధైర్యంతో ఉండాలి. రాజు యువరాజు
అడిగాడని లొంగిపోకూడదు!”
“యువరాజా నేను లొంగేదానిని కాదు.ఎందరో మహారాజులు సేనాపతులు
శ్రీమంతులు నా పాద మంజీర చుంబనం చేశారు!”
“అదేకదా మీ కళామణుల అదృష్టం! మహారాజుల కిరీటకాంతి నీరాజనం అందుకోవా
లంటే ఏ రాజసూయ యాగమో చేయాలి. అలాంటి మహావీరులంతా మీ పాద దాసులేకదా.
నేను బ్రహ్మచారిని. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు.”
“పెళ్ళి చేసుకుంటే మీకూ తెలుస్తుంది!”
“పోనీయి. గురుకట్నం విషయం...”

257
  చాళుక్యసింహాసనం

“మీరు చమరీ గురుకులంలో చేరేడపుడు ముందుగా గురుకట్నం మాట్లాడుకుని


చేరారా?”

“నిజమే, లేదు! కానీ ముందుగా మాట్లాడుకోకపోతే చివరకది ఉదంకుడిని పౌష్య


మహా దేవి కుండలాలు కావాలని అడిగినట్లు, ద్రోణాచార్యుడు పాండవుల్ని దృపద
మహారాజును పట్టి బంధించి తెమ్మని అడిగినట్లు కావచ్చు. లేదా కుంభసంభవుడు ఏకలవ్యుడి
బొటన వ్రేలు గురుకట్నంగా కోరినట్లు కావచ్చు!”

“నగురో రధికం అన్నారుకదా! శిష్యుడు దేనికైనా సిద్ధంగా వుండాలి! కోరితే


ఇవ్వాల్సిందే.”

“దేనికైనా అంటే ఈ కలియుగంలో కష్టమే!”

“ఏమీ? ఈ కలియుగం ఏం చేసిందీ?”


“యుగాన్ని పట్టీ శక్తిసామర్ధ్యాలు మారుతాయి కదా!”
“మీరు ఇవ్వలేనిదేదీ అడగను లేండి!”
“మంచిది. సంతోషం.”
“యువరాజా! మిమ్మొక వరం అడగాలనుకుంటున్నాను. తమరు అనుగ్రహించక
తప్పదు.”
“వరమా? మేమేమైనా దేవేంద్రుడిమా? అందులోను తప్పదు అని చెబుతే ఎలాగూ.”
“ముందే చెప్పాను. మీరు ఇవ్వలేనిదేమీ అడగనని!”
“తరుణీమణి అడగడం పురుషుడు ఇవ్వకపోవడమూనా?”
“మీదేశంలో కాపాలికులు ప్రజల తలకాయలు కొట్టి తీసుకు పోతున్నారని చెప్పుకుంటు
న్నారు. నేను భైరవకోనకు వెళ్ళి తాంత్రికులందరితోను మాట్లాడి వచ్చాను. వారెవరూ జన
పదాల లోకి రాలేదట. ఎవరో కాపాలికుల పేరుతో తమకు గిట్టనివారిని హతమారుస్తు
న్నారు.”
“నిజమే!”
“అంటే మీకు తెలిసే ఇలా జరుగుతోందా?”
“ఔను.”
“ఇది అన్యాయం కాదా?”
“ఈ దేశంలో వుంటూ ఈప్రభువుల్ని పడగొట్టాలని ప్రయత్నాలు చేయడం

258
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

న్యాయమా?”
“అలాంటివారిని బహిరంగంగా శిక్షించవచ్చుకదా?”
“చెప్పాలంటే అది సాధ్యంకాకే ఇలా చేస్తున్నాము.”
“ఎవరిపైనా కుహనా కాపాలికుల్ని కాలాముఖుల్నీ పాశుపతుల్నీ ప్రయోగించవద్దని
కోరుతున్నాను. మీ చర్య వలన తాంత్రికులపట్ల అసహ్యము అపహాస్యము శివాపరాధము
కూడా జరుగుతోంది.”
“నీవడిగిన వరం ఇస్తున్నాను. మేము ఎందుకు వీరిని ప్రవేశపెట్టామో ఆ అవసరం
తీరిపోయింది. ఇప్పుడింకా కుహనా కాపాలికులుండరు.”
“ఇంకొక ప్రశ్న అడగవచ్చా?”
“అడుగు!”
“చిత్రాణి మీకేమవుతుందీ?”
“ఆడదానివనిపించుకున్నావు! మా రాజ్యంలో నేను నీదగ్గరకు మారువేషంలో ఎందుకు
వచ్చానో తెలుసా?”
“యువరాజు శీలాన్ని గురించి అందరకూ తెలియకూడదని!”
“మనిద్దరినీ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారూ? ఆమెను నన్నూగురించి అందరూ
అదే అనుకుంటారు!”
“అంటే, అది నిజమాకాదా?”
“ఏమీ అంత కుతూహలంగా ఉందా?”

“కొన్నివిషయాలు పైకి చెప్పం. కానీ కుతూహలంగానే వుంటుంది. స్త్రీస్పర్శ కోసం


పురుషులు వేశ్యలవద్దకు వస్తారు. అలా నావద్దకు రాజాధిరాజులంతా వచ్చారు. కానీ దానికి
భిన్నంగా ఈ రాత్రి మీ స్పర్శకోసం నేను వేచివున్నాను. స్త్రీలు ఒంపుసొంపులతో అందంగా
వుంటారు. నిజమే. కాని పురుషులలో మీఅందం అపురూపమైంది. మీ దివ్య సౌందర్య
దర్శనంతో తమిగొని వున్నాను. మిమ్ము ఎదురుగా చూస్తూ నామనసు మన్మధ
వశమైపోతోంది.”
“శీలం స్త్రీలకేకాదు! పురుషులకు కూడా వుండాలి!”
“కానీ ఇదే నేనడిగే రెండవవరమైతే?”
“వరం ఒకటడుగుతేనే బాగుంటుంది. రెండవదడుగుతే రెండోరకంగా వుంటుంది.”
యువరాజు మాటకు రసతరంగిణి విష్ణువర్ధనుని పాదాలముందు మోకరిల్లి అభి
వందనం చేసింది.
259
  చాళుక్యసింహాసనం

వడిలోవాలిన హంసను వదులుకున్నాడేమిటి యువరాజు అనుకున్నాడు


చంద్రాదిత్యవర్మ.

42 ఆర్యభట్టీయం
నాడు మాన్యకేతేశ్వరాలయంలో ఒక ప్రవచనం జరుగుతోంది. భాస్కరభట్టు అనే
పండితుడు ఆర్యభట్టీయం అనే గ్రంధం మీద ప్రసంగం చేయడానికి వచ్చాడు. ఇంద్రవల్లభ
మహారాజు సభను ప్రారంభించాడు. ఆసభకు పట్టుమని ముప్పదిమంది శ్రోతలు కూడా
రాలేదు.

భాస్కరభట్టు ఒక ఖగోళశాస్త్రవేత్త. పాటలీపుత్రం సమీపంలోని కుసుమపురం నుంచీ


వచ్చాడు. కుసుమపురం ఖగోళ భూగోళశాస్త్రాలకు పితామహుడైన ఆర్యభట్టుకు పుట్టినిల్లు.
నాడు భాస్కరభట్టు ప్రసంగించేదికూడా ఆర్యభట్టు రచన ఆర్యభట్టీయాన్ని గురించే.

భాస్కరభట్టు పాపం అందరికీ అర్ధమవ్వాలని గుడి గోడమీద నాము గడ్డతో ఎన్నో


చిత్రాలు గీచాడు. సూర్యుడు చంద్రుడు భూమి రాశులు నక్షత్రమండలాలు. భూమి సూర్యుడి
చుట్టూ తిరగడం అదీ దీర్ఘవృత్తాకారంలో, బొమ్మలుగా గీచాడు. సూర్యగ్రహణం
చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందో వివరించే చిత్రాలు గీచాడు. ఆయన తనవెంట కొన్ని
పరికరాలు సాధనాలు కూడా తెచ్చి ప్రదర్శించాడు.

భాస్కరభట్టు చంద్రుడు స్వయంప్రకాశం కలవాడు కాదనీ సూర్యరశ్మి పడడం వలన


ప్రకాశిస్తాడనీ చెప్పాడు. పున్నమి నాడు ప్రకాశించే చంద్రుడికి భూమి అడ్డం వస్తే చంద్ర
గ్రహణం ఏర్పడుతుందనీ ఎప్పుడెప్పుడు గ్రహణాలు వస్తాయో ఎలా లెక్క కడతారో వివరించి
చెప్పాడు.

ఉపన్యాసం సగం కాకముందే ఇంద్రవల్లభుడు భాస్కరభట్టుని తగు విధంగా సత్కరించి


కోటలోకి వెళ్ళిపోయాడు. ఆతరువాత భాస్కరుడు గోడ వైపుకు తిరిగినపుడల్లా కొందరు లేచి
వెళ్ళిపోసాగారు. ఆయన చెప్పే గణితశాస్త్రము ఖగోళశాస్త్రము ఎవరికీ అర్ధం కాలేదు.

అలా ప్రసంగిస్తూ భాస్కరభట్టు కొద్దిసంవత్సరాలలో ఒక తోకచుక్క కలిపిస్తుందని


చెప్పాడు.

భాస్కరభట్టు భూమి తనచుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ఆర్యభట్టు ఎలా


గుణించాడో వివరించి చెప్పాడు. భూమి చుట్టుకొలతను ఆర్యభట్టు ఎలా గుణించిందీ వివ
రించాడు. భూమికి సూర్యుడికి మధ్య దూరం కూడ ఆర్యభట్టు లెక్కించాడు.

భాస్కరభట్టు తన ప్రసంగంలో పలుమార్లు పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన

260
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

కాణాద మహర్షి రచించిన వైశేషిక దర్శనాన్ని ప్రశంసించాడు. వరాహమిహిరుడనే గొప్ప


శాస్త్రవేత్త పంచసిద్ధాంతిక గ్రంధాన్ని ఉదహరిస్తూ మాట్లాడాడు. ఎంతోమంది గ్రీకు రోమక
తత్వవేత్తలను గురించి వివరించాడు.

సభ ముగించేటప్పటికీ సభలో నలుగురైదుగురు మాత్రమే మిగిలారు. అందులో


ముఖ్యులు బిందుఋషి మరియూ కమలహితాదేవి.

బిందుఋషి భాస్కరభట్టుని తన ఇంటికి భోజనానికి తీసుకువెళ్ళాడు. బిందుఋషి


విధురుడు. ఆయనభార్య కొద్ది సంవత్సరాలు మాత్రమే కాపురంచేసి కాలధర్మం చెందింది.
అప్పటినుండీ ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. బ్రాహ్మణుడు బ్రహ్మచర్యము గృహస్ధా
శ్రమము వానప్రస్తము సన్యాసము అనే ఏదో ఒక ఆశ్రమంలో నిలబడాలి. ఏ ఆశ్రమానికి
చెందకుండా వుండకూడదు. ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా వానప్రస్ధాశ్రమం స్వీకరిం
చాడు. అప్పటినుంచీ గుడిలో అర్చకత్వానికి దూరంగా వుంటుండేవాడు. ఆయన స్వయం
పాకమే గాని ఎవరిచేతి వంటా తినేవాడుకాదు.

భట్టు స్నానంచేసి తన మాధ్యందిన అనుష్ఠానం ముగించుకొని రాగా ఇద్దరూ


భోజనానికి కూర్చున్నారు.

“భట్టుగారు! మీరు తోకచుక్క కనిపిస్కుందని చెప్పారు. దాని ప్రభావం ఈదేశంపైన


ఏమైనా వుంటుందా?” అన్నాడు బిందురుషి.

“ఇప్పుడే చెప్పలేమండి. తోకచుక్క ప్రభావంవలన యుద్ధంరావచ్చు. సామ్రాజ్యాలే


అస్తమించవచ్చు. మహాపురుషులు నిర్యాణం చెందవచ్చు.

ఆర్యా! నేటి సభలో ఆమె ఎవరో నా ఉపన్యాసాన్ని ఆద్యంతము విన్నది. నేను చెప్పే
ఖగోళశాస్త్రం ఆమెకేదో అర్ధమయినట్లే వుంది. నన్ను తన ఇంటికి భోజనానికి కూడా
ఆహ్వానించింది. ఎవరామె?” అన్నాడు భాస్కరభట్టు.

“ఆవిడపేరు కమలహితాదేవి! ఆవిడ చేతి వంట తిన్నారుకాదు!”ఈసడింపుగా


అన్నాడు బిందుఋషి.

“ఏమీ?” అని ప్రశ్నించాడు భట్టు.

“ఆవిడింటో భేజనం చేస్తే రౌరవాది నరకాలు ఇప్పుడే వస్తాయి. మీరు అదృష్టవంతులు”


అన్నాడు బిందుఋషి.

“కారణం అడగవచ్చా?” అన్నాడు భట్టు.

261
  చాళుక్యసింహాసనం

“ఆవిడను గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది! భోజనకాలంలో ఏదో


భగవన్నామస్మరణం చేయాలికానీ ఆవిడ సంగతెందుకు లెండి. ఆవిడొక లయ్య!

ఇంతకూ ఆర్యభట్టు కాలాన్ని ఎలా అంత ఖచ్చితంగా లెక్కించాడంటారూ?” అన్నాడు


బిందుఋషి విషయాన్ని శాస్త్రం వైపు మళ్ళిస్తూ.

“నిజంగా అది ఒక తపస్సేనండీ! కుండమీద కుండ వుంచి పైకుండకి అడుగున చిన్న


చిల్లి పెట్టి అందులో ఇసకపోసి నిండా నీళ్ళు పోసేవాడు. పైకుండలో నీళ్ళు క్రింద కుండలో
బొట్లు బొట్లుగా పడుతుంటే అది ఒక కాల ప్రమాణంగా పెట్టుకునేవాడు.”

“కాణాదమహర్షి పరమాణుసిద్ధాంతం కూడా చాలా గొప్పది. ప్రపంచంలో వుండే ఏ


పదార్ధమైనా పరమాణువులనే వాటి సమ్మేళనమని చెప్పాడు. కానీ ఆయన తన సిద్ధాం తాన్ని
కొనసాగించకుండా ఆత్మవాదం లోకి వెళ్ళిపోయాడు.”

“అదే వచ్చినచిక్కు మనశాస్త్రవేత్తలకు. ఆయన పరిశోధనని ఆయన శిష్యులు అందు


కోలేకపోయారు. మనవాళ్ళు శాస్త్రమును భగవంతుడితో ముడిపెట్టడం వలన అదేదో మత
గ్రంధమని వేరే మతాలవాళ్ళు దేశాలవాళ్ళు ఆ జోలికి రారు.”

“మీరు చెప్పినమాట నిజమే! కానీ మనవారందరూ ఆత్మబలం తపస్సు వలననే కదా


ఈ జగత్తును అర్ధం చేసుకోకలిగిందీ?” అన్నాడు బిందుఋషి.

“భూమి గోళాకారం లో వుంటుందనే ఆవిషయం గ్రహణాన్ని పరిశీలిస్తే తెలుస్తుందనీ


మనవాళ్ళే చెప్పారు. సూర్యుడు భూమిచుట్టూ తిరుగుతున్నట్లు కనిపించడం ఒక భ్రమ అనీ
మనవాళ్ళు చెప్పారు. గ్రీకులనుకున్నట్లు భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్య వృత్తం కాదనీ
దీర్ఘవృత్తమనీ ఆర్యభట్టు చెప్పాడు. కానీ పేరు గ్రీకు తత్వవేత్తలకు వచ్చింది.”

“భాస్కరభట్టుగారూ! ఇవాళ చాలా సుదినం. మీరు నా ఆతిధ్యం స్వీకరించి నన్ను


ధన్యుడిని చేశారు. కానీ మానగరంలో మీ మహోపన్యాసం వినడానికి నలుగురే మిగిలి
నందుకు మాత్రం చాలా సిగ్గనిపించింది” అన్నాడు బిందుఋషి.

“ఆర్యా! నలుగురైనా మిగిలారు. అదేసంతోషం. ఇలాంటి శాస్త్రపాఠాలు అందరకీ


అర్ధం కావుకదా?”

“అదే ఉపన్యాసం చివర ధద్ధోజనం చక్రపొంగలి పులిహోర పెడతారంటే ఒక్కడూ


పోయే వాడు కాదు. ఇంకా వందమంది వచ్చేవాళ్ళు. మొన్న ద్రౌపదీ వస్త్రాపహరణం అనే
నాటకం ప్రదర్శించారు. చూడ్డానికి వేయి రెండువేల మంది వచ్చారు.”

భాస్కరభట్టు చిన్నగా నవ్వాడు.“ఆర్యా! మనం ఇతరుల్ని తప్పు పట్టడం కూడా సరి


262
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

కాదు. వాళ్ళు కావ్యాలు చదువుకుని ఉండవచ్చు. కానీ వారికి గణితము ఖగోళశాస్త్రంలో


పరిచయం అభిరుచి ఉండకపోవచ్చు” అన్నాడు.

“భట్టుగారూ! నాకొక విషయం అవగతం కాలేదు. ఋగ్వేదంలో కాలమనే చక్రానికి


పన్నెండు ఆకులు ఏడువందల ఇరవై మంది కొడుకులు అని వుంది. అది సంవత్సరానికి
సంకేతమని చెబుతారు. పన్నెండాకులంటే పన్నెండు నెలలు.ఏడువందల ఇరవైమంది
పుత్రులంటే మూడువందల అరవై పగళ్ళు మూడువందల అరవై రాత్రులు అని సంకేతం. కానీ
ఇప్పటి పంచాంగకర్తలు భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఇంతకన్నా ఎక్కువకాలం
పడుతుందని చెబుతున్నారు. మరి ఇప్పటి అభిప్రాయానికీ ఋగ్వేదానికి వ్యత్యాసం ఎలా
వచ్చిందంటారూ?” అన్నాడు బిందుఋషి.

“ఋషీ! మీరు చాలాచాలా గొప్ప ప్రశ్న వేశారు. దీనికి నాదగ్గర ఖచ్చితమైన సమాధానం
ఏదీలేదు. సూర్యమానం బార్హస్పత్యమానం చంద్రమానం ఈ గుణించే సిద్ధాంతాలమధ్య
వ్యత్యాసం కావచ్చు.”

“భాస్కరభట్టుగారు!మీరు నా ఆతిధ్యం స్వీకరించి నన్ను ధన్యుడిని చేశారు.


సంతోషం!”అన్నాడు బిందురుషి.

*****

భాస్కరభట్టు మాన్యకేతనగరంలో కొంతకాలమున్నాడు. ఒకనాడు కమలహితాదేవి


ఇంటికి కూడ వెళ్ళాడు. అప్పటికి కమలహితాదేవి తన నివాసాన్ని వాడీపురానికి మార్చింది.
కమలహితాదేవి భాస్కరభట్టుకు అనేక అతిధి సత్కారాలు చేసింది. ఇద్దరూ మాటలలో
పడ్డారు.

“దేవీ! నేను ఆర్యభట్టీయం పై ప్రసంగించినపుడు కడదాకా విన్నవారిలో నీవొకతెవు.


నీకు ఈ ఖగోళశాస్త్రంతో పరిచయం వుందా?” అని అడిగాడు భాస్కరభట్టు.

“భట్టుగారూ! నాకాశాస్త్రంతో పరిచయం లేదుకానీ మావారు పంచాంగకర్త.


అందువలన నాకు కొంచం అభిరుచి కలిగింది. అంతే!”

“మీ శ్రీవారిని కలుసుకోవచ్చా?”

“ప్రస్తుతం వారు ఈజిప్టు దేశం వెళ్ళివున్నారు. లగథుడు రచించిన జ్యోతిషగ్రంధాన్ని ఆ


దేశం గ్రంధాలతో సరిపోల్చడానికి కొంతమంది పంచాంగకర్తలు కలిసి ఆ దేశం వెళ్ళారు.”

“ఐతే ఆయన చాలా గొప్పవారయివుంటారు!”

263
  చాళుక్యసింహాసనం

“గొప్పవారే కానీ ఆయనకన్నా గొప్పవారు పూజారిస్ అనే గ్రీకు శాస్త్రవేత్తతో నాకు


పరిచయ మయింది.”

“పూజారిస్ భారతావనిలో పర్యటిస్తున్నారని తెలిసింది. ఆయనను కలుసుకోవాల


నుంది. ప్రస్తుతం ఆయన ఎక్కడ వుంటున్నారూ?”

“కొంతకాలం నాతోనే వున్నారు. ఆ తరువాత కాంచీనగరము అటునుంచీ తామ్రపర్ణి


దాకా వెళ్ళివస్తానన్నారు. ఎప్పటికైనా ఆయన నాదగ్గరకే వస్తారు. ఎందుకంటే ఆయన నాకొక
అమూల్యమైన గ్రంధం ఇచ్చివెళ్ళారు. మళ్ళీ వాళ్ళ దేశం వెళ్ళేటపుడు తీసుకుంటా నన్నారు.”

“దేవీ. ఆ గ్రంధం పేరేమిటీ.”

“ఆపేరే ఏదో క్రొత్తగా వుంది. జెంద్ అవెస్తా అని చెప్పారు.”

“అలాగా. దేవీ ఆ గ్రంధమేదో ఒకసారి చూడవచ్చా?”

“మరి ఆయన అనుమతి లేకుండా చూపించవచ్చా అని ఆలోచిస్తున్నాను.”

“నేనేమీ ఆ గ్రంధం మింగనుకదా?” అన్నాడు భాస్కరభట్టు.

చివరకు ఆ గ్రంధం చూపించింది కమలహితాదేవి. భాస్కరభట్టు ఆ గ్రంధరాజానికి


నమ స్కరించాడు. నీవనుమతిస్తే నకలుప్రతి వ్రాసుకుంటానన్నాడు. కొంత ఆలోచించిన తరు
వాత కమలహితాదేవి అంగీకరించింది. కానీ గ్రంధం తన ఇంట్లేనే కూర్చుని వ్రాసుకోవాలనీ
బయటకు ఇవ్వననీ చెప్పింది. అలాగేనని భాస్కరభట్టు ఆమె ఇంటి అరుగుమీద కూర్చుని
వ్రాసుకునేవాడు.

భాస్కరభట్టు ఆమె ఇంటికి మహాసేనాద్యక్షుడు లీశోత్తరదీక్షితుడు వచ్చిపోతుండడం


గమనించాడు. ఒకనాడు భాస్కరభట్టు కమలహిత నడిగాడు. “దేవీ! మీయింటికి సైన్యా
ద్యక్షుడు వచ్చిపోవడం వింతగావుంది. కారణం అడగవచ్చా?” అన్నాడు.

“మీరూ గమనించారా? ఆయన నాకోసమే వస్తున్నారు. మీకేమైనా అభ్యంతరమా?”


అన్నది కమలహిత.

“నేనెవరినీ అభ్యంతరాలను గురించి మాట్లాడడానికీ?”

“కొందరు నన్ను గురించి పరోక్షంలో ఏదో అనుకుంటారు. నన్ను ఎదురుపడి అడగరు.


వారి సందేహమూ నివృత్తికాదు”అన్నది కమలహితాదేవి.

264
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“పోనీ నేనడుగుతున్నాను. నీ తత్వమేమిటీ?”అన్నాడు భాస్కరభట్టు.

“నేను కొన్ని మతాచారాలు గమనించాను. శాక్తమతంలో వామాచార పరాయణులు


న్నారు. వారికి మత్స్యము మాంసము మద్యము ముద్ర మైధునము నిషేధముకాదు. అలాగే
ఉచ్చిష్టగణపతి ఆరాధకుల ప్రవచనం విన్నాను. లోకంలో స్త్రీపురుష జాతులనే వీరు
నమ్ముతారు. ప్రతివనితా తన ఇష్టమైన వానితో భోగించవచ్చు. స్త్రీపురుష సంయోగము వలన
ఏ దోషమూ రాదు. ఈ సంయోగము వలన కలిగే అమరానందమే ముక్తి అని నమ్ముతారు.
ఇంకా ఇలాంటి మతసిద్ధాంతాలు చాలా చూశాను. భైరవారాధకులు అందరూ కూడా స్త్రీకి
స్వాతంత్రం ఉండాలన్నవారే! కాబట్టి నాకు తప్పేమీ అనిపించటం లేదు” అన్నది కమలహిత.

“దేవీ! నేను నీతో వాదించలేను. నిజానికి నేను మాగధి వాడిని. మామతాన్ని ఇంద్ర
కుబేర మతం అనికూడా అంటారు.”అన్నాడు భాస్కరభట్టు.

“మీ మతాన్ని గురించి నాకు తెలీదు. కానీ అతిధిని సత్కరించడం నావిథిగా భావిస్తాను.
అతిథి దేముడేకదా. అతిధిని మనసిచ్చి మంచిమాటలతోను తనువుతోను సేవలతోనూ నేను
సేవిస్తాను. ఇది పాపమో పుణ్యమో నాకు తెలీదు.”అన్నది కమలహితాదేవి.
“అతిథి అంటే ఎవరూ?” అన్నాడు భట్టు.
“నాకోసం ఇంటికి వచ్చినవాడు.”
“నీయింటికి పాలుపోసేవాడూ ఇత్యాదులు వస్తారుకదా? వాళ్ళుకూడా అతిథులేనా?”
అన్నట్లు అడిగాడు భట్టు.
“వాళ్ళు అతిథులు కాదు. ఏదో వ్యాపారనిమిత్తం వచ్చినవాళ్ళు!”
“అంటే అతిథి నీకు నచ్చాలి!”
“ఔను.”
“అంటే ఇచ్ఛకలిగినవారితో కులకడం అతిథి సత్కారం అనిపించుకుంటుందా?”
“పోనీ ఇంటికొచ్చిన గౌరవనీయులు అతిథి. శాస్త్రం అతిథిదేవో భవ అన్నదికదా. నా
ఇంటికి వచ్చిన అతిథి నాకు దేముడు. పవళింపు సేవతో సహా అన్ని సేవలూ చేస్తాను. మీరు
కూడా నాకు అతిథే!”

“నీ వాదం విడ్డూరంగా వుంది.”

“ఇందులో విడ్డూరమేమీ లేదు. మీరు ఒకే సాంప్రదాయంగా ఆలోచించడం వలన


అలా అనుకుంటున్నారు. మీరు మీ దేశంలో బయలుదేరి ఎన్ని సంవత్సరాలయిందీ? ఈ
కాలంలో మీకు కోరికలుండవా?”

265
  చాళుక్యసింహాసనం

“అందుకే కదా ధర్మశాస్త్రములు సహితం వేశ్యలను అనుమతించిందీ!”

“ఒక సేవకు ధనం రూపంలోకాని వస్తురూపంలో కానీ నగలు చీరలు రూపంలో కానీ
ప్రతిఫలం తీసుకుంటే ఆమె వేశ్య!”

“నన్ను అతిథిగా చూస్తే మీ మహా సైన్యాద్యక్షుడు ఊరకుంటాడా?”

“ఆయనేమీ నా మగడా? నన్ను ఉంచుకున్నాడా? మాది ఒక స్నేహం మాత్రమే!”

“నేను నీ ఆతిథ్యాన్ని దుర్వినియోగం చేయలేను. పరిమితంగానే వాడుకుంటాను. నేను


మితిమీరే మనిషిని కాదు. కానీ ఈ ఇంటిలో ఒక దోషం వుంది” అన్నాడు భాస్కరభట్టు.

.“ఏముందీ?”

“పశ్ఛిమానికీ నైరుతికి సంధియందు బావి వుంది. ఇక్కడేదో ప్రమాదం జరగవచ్చు!”


అన్నాడు భాస్కరభట్టు.

“స్వామీ! నన్నలా భయపెట్టి బాధించకండి. మరణానంతరం ఏమీ ఉండదని తలచే


దానిని. న నరకం న స్వర్గం. ఉన్న సుఖం ఇక్కడే వుంది. అనుభవిస్తే సుఖం లేకపోతే నిస్స్ప్రు
హ. అంతే!”

“దేవీ! నీవాదాన్ని నేను సమర్ధించనూలేను వ్యతిరేకించలేను. ఎందుకంటే సముద్రంలో


కలిసిన నది మళ్ళీ వెనక్కు వస్తుందా అనేవాళ్ళున్నారు. మరణానంతరం ఏముంటుంద నేది
వారి మతగురువు బోధను పట్టీ నమ్ముతారు. తత్వవేత్తలలో మరణానంతరం ఏదో వుంది
అనేవాళ్ళూ వున్నారు ఏమీ లేదు అనేవాళ్ళు వున్నారు.”

“మరిమీరే మంటారూ? సముద్రంలో కలిసిన నది వెనక్కు వస్తుందా, చచ్చిపోయిన


వాడు మళ్ళీ పుడతాడా?” అపహాస్యంగా అడిగింది కమలహిత.

కమలహిత వెటకారానికి భాస్కరభట్టుకొంచం నొచ్చుకున్నాడు. “దేవీ ఒకమాట!


బాగా ఆలోచించూ! అసలు నదులలోకి నీళ్ళెక్కడినుంచి వచ్చాయీ? ఎక్కడో వర్షాలు
కురవడం వలన! వర్షం ఎక్కడనుండి వచ్చిందీ? ఆకాశంలో మబ్బులనుండి! మబ్బులలోకి
నీళ్ళె క్కడి నుంచి వచ్చాయీ? సముద్రాలలో లేకపోతే భూమిమీద నీరు ఎండవేడికిఆవిరవ్వడం
వలన! భూగోళంలో నేలకన్నా సముద్రమే ఎక్కువ. అంటే నదులలోకి నీరు సముద్రం నుంచే
వచ్చింది!

వడ్లగింజలోని జీవశక్తి మళ్ళీమళ్ళీ పుడుతుంది. అలాగే జీవుడు పునరపి జననం


పునరపి మరణం పొందుతాడు.”

266
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

కమలహితకు భాస్కరభట్టు వాదాన్ని ఒప్పుకోవాలంటే భయం వేసింది. అందుకే మాట


మారుస్తూ “మీ నకలు ప్రతి ఎంతవరకూ వచ్చిందీ?” అన్నది.

“దాదాపు పూర్తయింది. ఇంత గొప్ప గ్రంథం నీ అనుగ్రహం వలన నాకు లభించింది.


ధన్యవాదాలు!”

“ధన్యవాదాలు చెప్పవలసింది పూజారస్ గారికి!”

“ఆయనకు ధన్యవాదాలే కాదు. ఆయన అనుమతి లేకుండా ప్రతి వ్రాసుకున్నందుకు


క్షమార్పణలు కూడా చెప్పాలి. ఈ గ్రంధం భారతీయ తత్వశాస్త్రానికి భిన్నంగా స్వతంత్రంగా
వుంది. ఇది యరాన్ దేశమతగ్రంధమని ఎవరో చెబుతే విన్నాను. ఆ దేశంవాళ్ళు మనం య గ
పలికేది ఇ గా పలుకుతారట. ఇలాంటి మహాగ్రంధాలెన్నో అలగ్జాండ్రియాగ్రంధాలయం లో
వుండేవి. గొఱ్ఱెలు కాసుకునేవాళ్ళకు వాటి విలువ తెలీక తగులపెట్టా

43 హత్య
మహాసైన్యాద్యక్షుడు లీశోత్తరదీక్షితుని ఆజ్ఞపై జగతీంద్రవర్మ వేంగిపై దండయాత్రకు
వెళ్ళి నట్లే వెళ్ళాడు. సైన్యాలు కృష్ణా మూసి సంగమస్ధానమైన వాడపల్లి వద్ద నిలిపాడు. వేంగి
ముట్టడికి ఇంక మూడునాలుగు నెలలు పడుతుంది. సైన్యాలను ఇతర సైన్యాధిపతులకు
ఒప్పగించి తాను అజ్ఞాతంగా మాన్యకేతం తిరిగి వచ్చాడు.

జగతీంద్రవర్మకు కమలహితాదేవియంటె తగనిపిచ్చి. ఆమె సౌందర్యానికి ముగ్థుడై


తీసుకువచ్చి ఉంచుకున్నాడు. ఆమెపై ఇతరుల నీడ పడడం కూడా అతడు సహించలేడు.
ఆమెపై లీశోత్తర దీక్షితుడు కన్నువేశాడని పరిచారిక చెబుతునే వుంది. కానీ తనకెప్పుడూ
పట్టుబడలేదు. కానీ ఆమె తన నివాసాన్ని వాడిపురానికి మార్చుకోవడానికి కారణం
ఇదేననిపిస్తోంది. కోటలో అయితే ఈ రంకులు సాగవు.

తనవద్ద పనిచేసే గూఢచారులలో కొందరు తనంటే ప్రాణం ఇచ్చేవాళ్ళున్నారు. వాళ్ళతో


చిన్నదళం ఏర్పాటుచేశాడు. లీశోత్తరదీక్షితుడి కదలికలను గమనించమని చెప్పాడు. నాటి
రాత్రి లీశోత్తరదీక్షితుడు కమలహితను కలవడానికి వెళుతున్నాడని తెలిసింది. ఆ వార్త వింటే
రక్తం మరిగిపోయింది. వళ్ళు తెలీని క్రోధం కలిగింది. అవతలి వాడు చిన్నవాడు కాదు,
మహాసైన్యాద్యక్షుడు. న్యాయస్ధానానికి వెళదామంటే ఆమె తను పెళ్ళాడిన భార్య కాదు. ఏమి
చేయడానికీ తోచలేదు. చివరికి లీశోత్తరదీక్షితుని హతమార్చడానికి నిర్ణయం తీసుకున్నాడు.
తాను నియమించిన హంతకదళం అనేకమార్లు ప్రయత్నించి విఫలమయింది. ఈమారు
తానే ఆ దళానికి నాయకత్వం వహించాడు.

నిజంగానే లీశోత్తరదీక్షితుడు రాత్రికి కమలహితాదేవి మందిరానికి వాడీపురం

267
  చాళుక్యసింహాసనం

వచ్చాడు. కొత్త పాఠాల కోసం కమలహిత గొప్పగొప్ప ఏర్పాట్లు చేసింది. లీశోత్తరదీక్షితుడు


మురిసి పోయాడు. దీక్షితుడు కొంచం అలిసిపోయి వచ్చాడేమో స్నానం చేస్తానన్నాడు. తన
ఆయు ధాలు ఆభరణాలు తీసి మందసంలో పడవేశాడు.

లీశోత్తరదీక్షితుడు వచ్చేసమయానికి భాస్కరభట్టు వీధిఅరుగు మీద కూర్చుని ఆముదం


దీపం వెలుగులో ప్రతి వ్రాసుకుంటున్నాడు. దీపపు పురుగులు ముసరడంతో విసుగ్గావుంది.
పుస్తకాన్ని భద్రపరచి మందసంలో పెట్టి ఇంటి గూట్లో పెట్టేశాడు. లీశోత్తర దీక్షితుడిని చూసి
భాస్కరభట్టు మూలకు తప్పుకున్నాడు. కానీ అతని మనసులో కమల హిత మెదులుతోంది.
ఆమె భర్త విదేశాలకు వెళ్ళి సంవత్సరాలు గడుస్తోంది. తానుకూడా భర్యాపిల్లల్ని వదిలి
దేశాటనం మొదలుపెట్టి రెండు సంవత్సరాలయింది. కోరికలు ఎంత గాఢంగావుంటాయో
తనకు తెలుసు. అందులోను కమలహిత కామకళా విశారద. తాను ఇంక అక్కడ ఉండడం
భావ్యం కాదనుకుని వెళ్ళి కొంత దూరంలో ఇంకొకరి ఇంటి అరుగు మీద శాలువ కప్పుకుని
పడుకున్నాడు.

పరిచారికలు కేళాకూళిని వేడినీళ్ళతో నింపారు. సుగంధ పుష్పాలన్నీ నీటిపైన తేలు


తున్నాయి. కమలహిత దీక్షితుని జలకాలాడడానికి ఆహ్వానించింది. రేవాదాస దీక్షితుడు ఆమె
చేయి పట్టి నీళ్ళలోకి లాక్కున్నాడు.

“ఇప్పుడే మొదలా! ఈ రాత్రి మీకోసం కేలూనమును పలాశఖడ్గముష్టి అరగదీసి


గంధం చేసి వుంచాను. ఇంకా చాలా ఏర్పాట్లు చేశాను” అన్నది కమలహిత.

“కానీ ఈకల్పితసరోవరంలో ఇప్పుడు నీముఖారవిందం వికసించకపోతే


చిన్నపోతుంది.”

“రాత్రి ఎక్కడైనా తామరలు పూస్తాయా?”

“అదేకదా వింత! ప్రియురాలి ముఖారవిందం పగలు రాత్రి అనే కాలనియమం


లేకుండా వికసిస్తుంది. అసలు నీవు పూవువా! అరవిచ్చిన మొగ్గవి! లేలేత రెమ్మవి. సప్తపర్నివి.
నీ కన్నులనే నీరజాలవలన ఒకే కొలనులో తామరలు కలువలు కలపూచినట్లు లేదా.నీ
కమనీయ భోగమే ఒక పరిమళ వనం. నవ్యపారిజాత తరుసోభిత ప్రమదావనం.

ఇంకెందుకు జాగు? ఈ మదనాగ్నిలో నేనొక సమిధనైతే మాత్రం నష్టమేమిటీ?”


అన్నాడు లీశోత్తరదీక్షీతుడు.

కమలహిత కూడా మన్మధ శరవశ అయిపోయింది. జలకాలాడుతూ ఇద్దరూ ఒకటై


పోయారు.కమలహిత గోముగా “అవతల పందిరి మంచం చిన్నపోతుంది. ఈ జలం మన
అధరామృతంతో కలుషితమైపోతోంది”అన్నది.

268
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“కలుషితం కాదు. పునీతం అవుతోందను. ఈకేళాకూళి ప్రేమసుధాంభోనిధి


అవుతోంది” అన్నాడు దీక్షితుడు.

“నాకెందుకో భయంగావుంది. మననెవరో గమనిస్తున్నారనిపిస్తోంది.”

“నాకూ అనిపిస్తుంది. కానీ ఈ మధుర క్షణాలలో భయమేలనే బేలా! మననెవరైనా


తలగిల్లి మొలవేస్తారా? నేను మహా సైన్యాద్యక్షుడిని. నా పరివారం బయట కాపున్నది.”

“మీ శౌర్యం చూసేకదా నేను మీతో జతకట్టిందీ!”

“భయము విడువు. ప్రేమతరంగాలను ఆపకు. స్వర్గానికి పోయినా నీలాంటి దేవవధూటి


కౌగిలిలో ఒదగడం కోసమేకదా!”

“దేవ వధువులకు నేను సాటా?”

“నీవంతకన్నా మిన్నవు. దేవతలు అశరీరులు. గాలిని కౌగలించుకుంటే ఆనందం


కలుగు తుందా? నిద్రలో నీళ్ళుతాగుతే దాహం తీరుతుందా? అందుకే స్వర్గలోకంలో ఎప్పటికీ
తనివి తీరదు. ఈ సుఖం కోసమే దేవాధిదేవు లందరూ భూమిమీద పుట్టి సశరీర సుఖం
పొందేది!”

“మీ వేదాంతం వినడానికి బానేవుంది. భయం భయంగానే వుంది.”

వాళ్ళలా రసడోలికలలో తేలియాడుతుంటే లీశోత్తరదీక్షితుని అంగరక్షకులు అశ్వాలను


మేతకు విడిచారు. తమ నాయకుడు తెల్లవారుఝాము వరకూ మందిరంలోంచి బయటికి
రాడని వారి నమ్మకం. అందుకే తలొకవంకా ఏ బండరాయికో ఆనుకుని విశ్రాంతి పొందారు.
ఒకరిద్దరు మాత్రం లోపల ఏమిజరుగుతోందో ఊహించుకుని వివసులై నిద్రకు దూర
మయ్యారు.

లీశోత్తరదీక్షితుడు కమలహితతో సరస శృంగారంలో పూర్తిగా అలిసిపోయాడు.

ఆకాశంలో శుద్ధ అష్టమి చంద్రుడు అస్తమించాడు. చీకట్లు దట్టమైనాయి. ఆ తరుణంలో


కొంతమంది ముసుగు వీరులు అన్ని వైపులనుండీ ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించారు.
పరిచారికలు కెవ్వున కేకలుపెట్టారు. దీక్షితుడు అప్రమత్తుడయ్యాడు. అతడు కమలహిత
ఉత్తరీయాన్ని లాగి మొలకుచుట్టుకుని కేళాకూళి ఒడ్డునే పెట్టుకున్న తన ఖడ్గం అందుకోడానికి
చేయి చాచాడు. కానీ తన యజ్ఞోపవీతం కాలపాశంలా కమలహిత కంఠహారాలతో
పెనవేసుకు పోయింది. జాగు చేయకుండా ఎడంచేత్తో దంధ్యం దూసి పారేశాడు. అప్పడికే
అతడి కుడిభుజం పైన కత్తివేటు పడింది. అయినా ధైర్యంగా వామ హస్తంతో ఖడ్గం
అందుకునేలోపల ఎడమ ముంజేయి తెగింది. కమలహితాదేవి అడ్డు పడబోయింది. ఆమెను
269
  చాళుక్యసింహాసనం

వాళ్ళు లాగి అవతల పడవేశారు. అంగరక్షకులు అప్రమత్తులై ఉరికివచ్చారు. దుండగులతో


కలబడ్డారు. లీశోత్తరదీక్షితుడు ఖడ్గం అందుకుని ధైర్యంగా అందినవారిని అందినట్లు
నరికాడు. కానీ వెనకనుండీ మెడమీద దెబ్బ పడింది. రక్తం చిమ్మనగ్రోవి లోంచీ చిమ్మినట్లు
పైకి కొట్టింది. మహాసేనాధిపతి ప్రక్కకు ఒరిగిపోయాడు. దుండగులు కసితీరా లీశోత్తర
దీక్షితుని ఎక్కడంటే అక్కడ పొడిచారు. అంగరక్షకులకు అగంతకులకు మధ్య యుద్ధమే
జరిగింది. ఎవరూ పారిపోడానికి ప్రయత్నించకుండా పోరాడారు. ఇరు పక్షాలా చివరకు
ఒక్కడే అగంతకుడు మిగిలాడు. అతడు పారిపోడానికి ప్రయత్నింస్తుండగా ఎవరో అతడిని
వెనకనుండీ పొడిచివేశారు.

ఈ పరిణామానికి కమలహితస్ప్రుహ తప్పిపోయింది. పరిచారికలు భయంతో తలొక


మూల నక్కి దాక్కున్నారు. కొంతతడవు తరువాత ధైర్యం చేసి ఇవతలకు వచ్చారు. ఇల్లంతా
అనేకశవాలు పడివున్నాయి. కొందరికింకా ప్రాణం పూర్తిగా పోలేదు. కొట్టుకుంటు న్నారు,
మూలుగుతున్నారు. దాసీలు లీశోత్తరదీక్షితుని దేహంపై వస్త్రం కప్పారు. కమల హితకు
ఉపచారాలు చెశారు. తదుపరి కర్తవ్యమేమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అందరూ
బిక్కచచ్చిపోయి వున్నారు. ఉన్నవారంతా ఆడవారు. అప్పటికి అర్ధరాత్రి దాటింది.

ఇద్దరు ముగ్గురు పరిచారికలు కూడబలుక్కుని బిక్కుబిక్కుమంటూ వీధిలోకి వచ్చారు.


అటూ యిటూ చూశారు. ఊరంతా గాఢనిద్రలో ఉంది. కుక్కలు మొరుగుతున్నాయి. ఊరు
కావలికాసే ఎరుకలరామయ్య పొన్నుకఱ్ఱ నేలకేసి కొడుతూ వీధులవెంట తిరుగు తున్నాడు.
పరిచారికలు అతడిని పిలిచి విషయం చెప్పారు. అతడు పరుగెత్తుకుంటూ వెళ్ళి నగర
పాలకుడిని పిలుచుకు వచ్చాడు. మాన్యకేతానికి వార్త వెళ్ళింది.

జగతీంద్రవర్మ లీశోత్తరదీక్షితుడు మరణించాడని నిశ్ఛయించుకోగానే ఎవరి కంటా


పడకుండా అతివేగంగా తన గుఱ్ఱాన్నివాడీపురం వదిలి వాడపల్లి వైపు ఉరికించాడు.

ఒక మహాసైన్యాద్యక్షుడి హత్య అంటే సామాన్యమైంది కాదు. మాన్యకేతం నుంచీ


ఎందరో కదలివచ్చారు. శిరఃప్రధాని రేవాదాసదీక్షితుడు ఇంద్రవల్లభుడు వచ్చారు.
పార్ధివదేహాన్ని మాన్యకేతం తరలించారు. దండపాశికులు హంతకులెవరని పరిశోధన
ఆరంభించారు. హంతకులుకానీ అంగరక్షకులు కానీ అందరూ మాన్యకేతం వారే.
పరదేశీయులెవరూ లేరు.

లీశోత్తరదీక్షితుని మరణానికి ఎక్కువగా బాధపడింది భీమసలుఖి మహారాజు. ఆయన


స్త్రీలకన్నా అన్యాయంగా రోదించాడు. లీశోత్తరదీక్షితుడే తనకు వేంగీ సింహాసనం ఇప్పించ
గలడని నమ్మినవాడు. ఇప్పుడు తననెవరు ఆదుకుంటారో నని రోదించాడు.

పదిహేను రోజులు గడిచిపోయింది. శిరఃప్రధాని రేవాదాసదీక్షితునితో ఇంద్రవల్లభుడు


సమావేశమయ్యాడు.

270
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“దీక్షితులవారూ! మీ సోదరుని మరణంతో మనదేశం గొప్ప సైన్యధిపతిని


కోల్పోయింది. అతడు రాష్ట్ర్రకూట సామ్రాజ్యానికి చాలా విజయాలు సాధించి పెట్టాడు. మీ
అన్నదమ్ము లిద్దరూ మాతండ్రిగారు ధృవధారావర్ష చక్రవర్తి కాలంనుండీ సామ్రాజ్యానికి
సేవచేస్తున్నారు.” అన్నాడు ఇంద్రవల్లభుడు.

“మహారాజా! మా తమ్ముడిని చాలా సార్లు మందలించాను స్త్రీ వ్యసనం కూడదని. కానీ


వాడు తన నైజం మార్చుకోలేదు. రసతరంగిణి కోటీరానికి వెళ్ళేవాడు కమలహిత వెంట
పడ్డాడు. నాశనమైనాడు.”శిరఃప్రధాని ఉత్తరీయంతో కనులొత్తుకున్నాడు.

“స్త్రీ వ్యసనం చాలా ప్రమాదకరమైనది. ఒకసారి అందులో పడితే సామ్రాజ్యాలు సింహా


సనాలు కూడా కనపడవు.

దీక్షితవర్యా! ఒక మహాసైన్యాద్యక్షుని హత్య అంటే సామాన్యవిషయముకాదు.


దోషులెవరైనాసరే ఎంతమందున్న అందరినీ ఖండఖండాలుగా నరికి కాకులకు గద్దలకు
వేయించండి.”

“మహారాజా! ఈ హత్యలో ప్రధాననిందితుడు జగతీంద్రవర్మ. అతడు వాడపల్లి


స్కంధావారం నుంచి దేశందాటి పారిపోయినట్లు తెలుస్తోంది. బహుశా చాళుక్యదేశంలో
తలదాచుకున్నాడని అనుమానం. ”

“మన పంచమాంగదళం వేంగిలో ఏంచేస్తోందీ. ఇంతవరకు వారిప్రయత్నాలు


ఫలించలేదు. అసలు ఆ నరేంద్రమ్రుగరాజు తలతీసి భీమసలుఖిని గద్దె ఎక్కిస్తేకాని
మనవిజయం స్థిరంకాదు” అన్నాడు ఇంద్రవల్లభుడు.

“మహారాజా! మీరన్నది నిజమే!మా తమ్ముడి హత్య కేవలం కమలహితకు


సంబంధించినదే కాదు.”

“మరి జగతీంద్రవర్మను బంధించి విచారించవలెను కదా!”

“మహారాజా! జగతీంద్రవర్మను బంధించాలంటే ముందుగా మనం సైన్యాద్యక్షుని


నియమించవలసివుంది.”

“శిరఃప్రధానిగా మీరు మరొక సైన్యాద్యక్షుని నియమించంచండి.”

“ఔనుమహారాజా! రాజకుమారుడు కర్కవల్లభుని మహాసైన్యాద్యక్షుని చేస్తే ఎట్లా


వుంటుందీ?” అన్నాడు రేవాదాసదీక్షితుడు.

“కర్కుడు ఇంకా అనుభవం లేనివాడు. అనేక యుద్ధాలలో విజయం సాధించినవాడిని


271
  చాళుక్యసింహాసనం

నియమించడం సముచితంగా వుంటుంది.”

“కర్కవల్లభుని తాత్కాలిక అద్యక్షునిగా నియమిద్దాము. అతడు వేంగిపై విజయం


సాధిస్తే శాశ్వత అద్యక్షుని చేద్దాము.”

“దీక్షితులవారూ! బాలచక్రవర్తి విషయంలో మాకు చాలా ఆంధోళనగా వుంది. ఈ


హత్యతో నా భయం మరీ ఎక్కువయింది.నేను కూడా ఎల్లవేళలా చక్రవర్తిని కనిపెట్టుకుని
ఉండలేనుకదా?”

“నిజమే మహారాజా! రాజే శత్రుభయం! కుమారచక్రవర్తి విషయంలో జాగ్రత్తలు


తీసుకో వాలి.”

“శిరఃప్రధానీ! బాలచక్రవర్తిని ఏదైనా గురుకులంలో దాచాలని నేను


అనుకుంటున్నాను.”

“మహారాజా! బాలచక్రవర్తివిషయంలో రాజమాత అభిప్రాయం కూడ తీసుకోవాలి.”

“మా వదినగారు అయ్యణమహాదేవి జినసేనుడనే జైన ముని ఆశ్రమానికి వెళ్లాలని


నిశ్ఛయించుకున్నారు. బాలచక్రవర్తిని కూడ అక్కడే వుంచుతే సముచితంగా వుంటుందేమో!”

“ప్రభూ! చక్రవర్తి ఎక్కడవున్నదీ మీకూ నాకూ తప్పుతే రాజమాతకు కూడ తెలియ


కుండ జాగ్రత్త పడాలి. జినసేనుడు మహాజ్ఞాని. ఆయన ఆదిపురాణము అనే గ్రంధం వ్రాస్తున్నా
రని తెలిసింది. అంతేకాక ఆయన శిష్యుడు మహావీరాచార్యుడు గణితసార సంగ్రహం అనే
గణితం కూడా వ్రాస్తున్నాడు. జినసేనుడి ఆశ్రమంలో వుంటే బాలచక్రవర్తి చక్కటి
విద్యాబుద్ధులు నేర్చుకోగలడు.”

“మీ మాటప్రకారమే చేద్దాము.”

అనుకున్న ప్రకారమే బాలచక్రవర్తి అమోఘవర్ష రాజేంద్రుడు జినసేనుని ఆశ్రమానికి


పంపబడ్డాడు. ఇంద్రవల్లభుడే చక్రవర్తి ప్రతినిధిగా పరిపాలన సాగిస్తున్నాడు. అయ్యణ మహా
దేవి కూడా జినసేనుని ఆశ్రమానికి చేరింది.

కర్కవల్లభుడు మహాసైన్యద్యక్షుడు కాగానే జగతీంద్రవర్మను బంధింపమని


ఆజ్ఞాపించాడు. కానీ అతడు పారిపోయాడు. వాడపల్లి వదలి వేంగీదేశం పారిపోయాడని
గూఢచారులు విన్నవించారు. తూర్పుచాళుక్యదేశాన్ని సామధానభేద దండోపాయాలతో
లొంగదీసుకోవాలని నిర్నయించుకున్నాడు కర్కవల్లభుడు.

కమలహితాదేవికి దేశబహిష్కరణ శిక్షవేశారు. ఆమె తనదేశం వెళ్ళిపోయింది.

272
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

44 కూష్మాండయోగి
వేంగీనగరం ప్రముఖులలో గండువర్మ ఒకడు. నూతన మహామంత్రిని కలిసిన రెండు
రోజుల తరువాత ఒక రాత్రి పూర్వ మహామాత్యుడు గంగాతీర్ధుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన
పదవీచ్యుతి తరువాత విజయవాటికలో ఉంటున్నాడు. ఆయన ఇల్లు పున్నమ్మ వనానికి
దగ్గరగా ఉంది. వారిద్దరూ అతి రహస్యంగా మారువేషాలలో మహారాజపురం కొండ వద్దకు
వెళ్ళారు. అప్పటికే అక్కడ కూష్మాండయోగి వీరి రాకకై ఎదురు చూస్తున్నాడు. ముగ్గురూ
కొండ కొంతవరకు ఎక్కి ఒక చీకటి గుహలోసమా వేశమయ్యారు. కూష్మాండ యోగి
శిష్యుడైన చీమయ్య బయట కాపున్నాడు.

“తీర్ధులవారూ! ఈయనే కూష్మాండయోగి. భీమిసలుఖి మహారాజుకు కుడిభుజం”


పరి చయం చేశాడు గండు వర్మ. కూష్మాండయోగి చిన్న ప్రమిద వెలిగించాడు మరీ ముఖాలు
కనిపించటం లేదని.

“ఇక్కడ రహస్యాలు మాట్లాడవచ్చా?” అన్నాడు గండువర్మ.

“ఇక్కడకు నరమానవుడు రాడు. వస్తే మనలాంటి దేశద్రోహులే!” అన్నాడు కూష్మాండ


యోగి.

“మీరా? విజయవాటికలో మీరొక ప్రసిద్ధ యోగికదా!” ఆశ్ఛర్యంగా అడిగాడు గంగా


తీర్ధుడు.

“యోగమా నా బొందా! ముందు తంత్రయోగం నేర్చుకుందామనే మొదలు పెట్టాను!


వీరభావంతొ భగవంతుడిని ప్రేయసిగా ఎంచి సాధన మొదలు పెట్టాను. వీరభావం
నాకబ్బలేదుకాని చివరికి కామభావంలో పడ్డాను. ప్రతిరాత్రీ కామిని కావాల్సిందే. కామాన్ని
జయించడం ఏ యోగితరము కాదు! రాత్రిపూట నా విశ్వరూపం లోకానికి తెలీదు. ఎందరినో
వంచించాను గాని కొందరి చేతులో తన్నులు తిన్నాను. ఇప్పుడు వనితలను వెలయిచ్చి
కొంటున్నాను. ఈ వేశశ్యలకోసం ఎంత సంపాదించినా సరిపోటం లేదు!కానీ నా జీవితంలో
నాకొక తాంత్రిక మిత్రుడు కలిశాడు. అతడు నాకు పిశాచాలనారాధించడం నేర్పాడు. చివరికి
నాకొక కామినీ పిశాచంవశమయింది. దాన్నుపయోగించి నేను కొన్నిమాయలు
చేయగలుగుతున్నాను.”

“పిశాచాన్నారాధించడమేమిటీ?” అన్నాడు గంగాతీర్ధుడు.

“అదికూడా ఒక విద్యే! భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు. ‘యజంతే సాత్వికా దేవాన్


యక్షరాక్షాంసి రాజసా! ప్రేతాన్ భూతగణాంశ్యాన్యే యజంతే తామసా జనాః!’

273
  చాళుక్యసింహాసనం

ఏశివుణ్ణో గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకోవాలంటే తాతలు దిగివస్తారు.


తల్లక్రిందులుగా వ్రేలాడినా సాధ్యంకాదు. ఒక్కొక్క విద్యతో యక్షుడిని గానీ రాక్షసుడిని కానీ
వశం చేసుకో వచ్చు. వాళ్ళు మనకు గొప్పగొప్ప పనులు చేసిపెడతారు. అంతకన్నా
సులువైనది ఒక ప్రేతాన్నో పిశాచాన్నో వశం చేసుకోవడం. ఈ పిశాచాలు ఘనమైన పనులు
చేయలేరు కానీ చిన్న చిన్న ప్రశ్నలు చెప్పడానికీ మాయలు చేయడానికీ పనికిస్తారు.
నా సాధనలో ఒక ఘోరమైన పిశాచం వశమయింది. అది భయంకరమైన కామ పిశాచి. అదే
స్త్రీలను నా వశం చేస్తుంది.

వేంగీదేశానికి మహామంత్రి చేసిన మీరు నా దగ్గర కెందుకు వచ్చారు?” అడిగాడు


కూష్మాండయోగి.

గంగాతీర్ధుడు చిన్నగా నిట్టూర్చి అన్నాడు. “పగ వలన! నాకు భీమసలుఖి మహా


రాజంటే యిష్టం. ఆయన నేను చెప్పినట్లల్లా వినేవాడు. నరేంద్రమృగరాజు అలాకాదు.
చివరకు నన్నే తొలగించాడు.”

“మీరు చివరివరకు మాతో వుంటారా మధ్యలో ఈప్రభుత్వానికి గూఢచారి గా


మారతారా?” సందేహంగా అడిగాడు కూష్మాండయోగి.

“మీతోనే ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. నరేంద్రమృగరాజును గద్దె దించడమే నా


ముఖ్యోద్దేశం! దానికోసం మీతో చేతులు కలపడానికే వచ్చాను” రోషంగా అన్నాడు గంగా
తీర్ధుడు.

గండువర్మ మాట్లాడుతూ “అయ్యా!మీరు మీరు ఏంచేస్తారో. ఈ కాపాలికులు మనవారి


నందరినీ ఏరిపారేస్తున్నారు. వీరందరూ మహామంత్రి శివకేశవయ్య మనుషులే! సందేహం
లేదు. శివాజ్ఞ అంటే అదే!” అన్నాడు.

“మనం కొంచం ఓపికపట్టాలి. నేనీవిషయం భీమసలుఖి మహారాజుకు వార్త


పంపిస్తాను” అన్నాడు కూష్మాండ యోగి.

“ఆయన మళ్ళీ వేంగీసింహాసనంపైన ఎప్పుడు కూర్చుంటాడో ఎప్పుడు మనకు అధి


కారం చేతికివస్తుందో. ఈలోపున మనందరం పోయేటట్లున్నాం”ని రాశగా అన్నాడు గండు
వర్మ.

“తొందరపడకు బిడ్డా. నరేంద్రమృగరాజుకు యువరాజుకు ఆయువు ముగియనుంది.


మనంకూడ ఇలాగే మన శత్రువులందరినీ నాశనం చేస్తాం!” అన్నాడు కూష్మాండయోగి.

“మీరంతా ఇలా చాలాకాలంనుండి చెప్పుకుంటువస్తున్నారు. మేమింక


గూఢచారులుగా పనిచేయలేము” నిష్కర్షగా అన్నాడు గండువర్మ.
274
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఇప్పుడలాకాదు. చాళుక్య రాజకుమారి భీమరధిని కర్కవల్లభునికి చేసుకున్నాడు


ఇంద్రవల్లభుడు. అందుచేత ఈ మాటు దండయాత్రకు కర్కవల్లభుడే నాయకత్వం వహి
స్తాడు.” అన్నాడు గంగాతీర్ధుడు.

“మనం కూడా ఇదే కాపాలికుల నాటకం ఎందుకు ఆడకూడదూ?”అన్నాడు


గండువర్మ.

“ఈ మాట బాగుంది! మన మొదటి శత్రువు ఎవరు?” ప్రశ్నించాడు కూష్మాండయోగి.

“నరేంద్రమృగరాజే!” అన్నాడు గండువర్మ.

కూష్మాండయోగి చాలాకోపంగా “ఆయన ముసలిపీనుగు. ఆయన్ని కొట్టిఏం


ప్రయోజనం? యువరాజు అతి బలవంతుడు. అతడ్ని చంపినా పట్టిచ్చినా రాష్ట్రకూటులు
ఏభయివేల సువర్ణాల బహుమానం ప్రకటించారు. మన కరువు తీరుతుంది. విష్ణువర్ధను డిని
పైలోకాలకు పంపిస్తే ఆ దిగులుతో ఈ ముసలాడు కూడ ఛస్తాడు.”

“మీకంత శక్తి సామర్ధ్యాలున్నాయా?” సందేహంగా అడిగాడు గంగాతీర్ధుడు.

“నేను వేంగీ ప్రజల కోరికపైన వేంగీ నగరానికి వస్తాను. అక్కడ జనాన్ని ఆకట్టుకుం
టాను. తరువాత కోటలో పాగా వేస్తాను!”అన్నాడు కూష్మాండయోగి.

“అదంత సులువు కాదు.మీరనుకున్నట్లు కోటలోనికి ఎవరినీ రానీయరు. ప్రజలు కూడ


అంత అమాయకులేమీ కాదు.”అన్నాడు గంగాతీర్ధుడు.

“నాసంగతి మీకు తెలీదు. నావద్ద బోలెడంత మంది దొంగభక్తులున్నారు. వారిద్వారానే


అన్నీ సాధిస్తాను. కొందరు నాగుపాము కరిచినవారొస్తారు. పామును చంపి వెంట తీసుకు
వస్తారు కూడ. వాడిని బ్రతికిస్తాను. ఒకఉంగరాన్ని రెండుచేస్తాను. స్త్రీల వ్యాధుల్ని
నయంచేస్తాను. విడిపోయిన భార్యాభర్తల్ని కలుపుతాను. మూగవాళ్ళని మాట్లాడిస్తాను. నేను
చేయలేని దేమీ ఉండదు. ఇంక నమ్మక ఛస్తారా. నా కీర్తి కోటలోకి వ్యాపించడానికి మాత్రం
మీరు కూడ కొంత సహాయం చేయాలి. మీకు కోటలో తెలిసినవారు వారి గృహ సమస్యలు
తెలిసివుంటాయికదా. అవి నాకు చెబుతే చాలు. నేను నేరుగా వాళ్ళ ఇళ్ళ తలుపుతట్టి సమస్య
ఏమిటో చెబుతాను.”

“ఇవన్నీ చేయచ్చుకానీ యువరాజూ?”

“మగవాళ్ళను నమ్మించడం ఆడవాళ్ళను నమ్మించినంత తేలిక కాదు. ఆడవాళ్ళు


మొగుడు దుర్వ్యసనాలు నాలుగు చెబితే చాలు. ఇట్టే బుట్టలో పడిపోతారు. వాళ్ళకు కావ
లసింది సానుభూతి, ఓదార్పు! అది ఒలకపోస్తే చాలు వచ్చి నా ఒడిలో విశ్రాంతి తీసు
275
  చాళుక్యసింహాసనం

కుంటారు. కొందరు స్త్రీలకు తృప్తి ఉండదు. ఆ తృప్తి నేను కలిగిస్తాను.


ఇకపోతే యువరాజు బ్రహ్మచారికదా! మన్మధుడిదగ్గర ఐదు బాణాలే ఉంటాయి. ఆరో
బాణం తెలీదు. నాదగ్గర చాలా బాణాలున్నాయి. ఆడదానికి పడని మగాడుండడు.
మౌర్యచంద్రగుప్తుడిని హతమార్చడానికి రాక్షస మంత్రి విషకన్యను తయారు చేశాడు
కానీ నేను కన్యల అధరామృతంలో కూడ విషం కలపగలను!”
“సరే సరే! మన విశ్వరూపం బయట పడితే మనని జనం కుక్కనుకొట్టినట్లు కొడతారు”
అన్నాడు గండువర్మ.
“మీరు మీ ప్రయత్నంలో ఉండండి. నేను నా మార్గంలో పగ తీర్చుకుంటాను” అన్నాడు
గంగాతీర్ధుడు.
“మహారాజును యువరాజును మనం ఏమీ చేయలేంకానీ సోమసూత్రం శివకేశవయ్య
పని పట్టాలి. ఆయన వచ్చినప్పటినుంచే మనకు గడ్డుకాలం వచ్చింది” అన్నాడు గండువర్మ.
“మన ముగ్గురం ఇదే పనిమీదుందాం! మొదట విజయం సాధించినవారికి పదివేల
వరాహలు బహుమానం!”
ఆ నిర్ణయంతో అందరూ నిష్క్రమించారు.

45 మాయాలోకం
గంగాతీర్ధుడు గండువర్మ వేంగీ నగరంలో రహస్యంగా ఒకచోట చేరారు. గండువర్మ
ఏ సాంప్రదాయాన్నీ నమ్మడు. అసలు దేవుడున్నాడో లేదో అతడికి అనుమానమే. అతడి
ఇల్లాలు మాత్రం పరమ పావని. ఆమె ఆచరించని వ్రతాలు లేవు. చేయని దానాలు లేవు. వేంగీ
నగరంలో చిత్రరథస్వామి ఆలయానికి ప్రాకారం కట్టించింది. అర్చకులకు వసతులు
నిర్మించింది. ఆమె స్వయంగా కవయిత్రి. గండువర్మకు ఇవేవీ నచ్చవు. తాను సంపాదిం
చినదంతా తగలపెడుతోందనుకుంటాడు. కానీ భార్యంటే భయం. ఆమె ఏ వ్రతం చేస్తున్నా
ప్రక్కన కూర్చుని ముక్కు పట్టుకుని మమ అంటాడు. అంతవరకే అతడి భక్తి.

భార్యంటే భయానికి కారణం ఇంటి బయట తన విన్యాసాలు విలాసాలే. అతడు


ప్రభువును పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని కూడ ఆమెకు తెలీదు. రాచకార్యాల మీద
దూరం వెళ్ళుతున్నానని చెబుతాడు. స్వామి కార్యం కొంచం స్వకార్యం అధికం. సాని కొంపల
లోనే నివాసం.

ముందుగా గండువర్మే సంభాషణ ఆరంభించాడు. “అయ్యా గంగాతీర్ధులవారూ! ఈ


నరేంద్రమృగరాజుకు దేవాలయాల పిచ్చిపుట్టింది. ఊరూరా శివాలయాలు నిర్మిస్తున్నాడు.
అయ్య జంగాలకు పెడితే అమ్మ లింగాలకు పెట్టిందట!మన పరిపాలన వచ్చేటప్పటికీ ధనా
గారంలో చిల్లిగవ్వేనా మిగులుస్తాడో లేదో?”
276
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఏముంది నాయనా. పాపాలు చేయడం గుళ్ళు కట్టించడం!”

“మనం చేయటంలేదా పాపాలు! ఐనా పాపాలు చేసి గుళ్ళు కట్టిస్తే పోతుందా? అసలు
మన మరణానంతరం ఏమీ ఉండదు. న స్వర్గం న నరకం. పూర్వం బాదామీ చాళుక్యులు
కూడ అలాగే చేశారు. దేవాలయాల పేరుతో కొండలన్నీ తవ్విపోశారు. సామంతుల దగ్గర
కప్పాలు దండుకోవడం సరసాలకు శిల్పాలకు తగలేయడం!”

“అందుకే రాజులసొమ్ము రాళ్ళపాలు అన్నారు! అయినా బాదామినగరం చాలా


సుందర మైందయ్యా! శిల్పాలు అద్భుతం! ఈ ముద్దుగుమ్మల చర్మసౌందర్యం ఎన్నాళ్ళూ?
ముడ తలు పడుతుంది, ముసలిదైపోతుంది. కానీ శిల్పసుందరీమణుల సౌందర్యం కొన్ని
వందల సంవత్సరాలు నిలబడుతుంది!”

“మీరు కూడ ఈ దేవాలయాల నిర్మాణం సమర్ధిస్తున్నారా? నాలాగా హేతువాదులూ


నిరీశ్వర వాదులు కాదా?”

“గండువర్మా, దేముడంటూ ఉన్నాడయ్యా! నేను పైకి తీర్ధుడనేకానీ లోపల కాదు. నా


ఆలోచనే వేరు. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు జైనుల్ని చూసీ బౌద్ధుల్ని చూసీ శైవులూ
వైష్ణవులూ కూడ విగ్రహారాధన దేవాలయాలు మొదలు పెట్టారు. అసలు విగ్రహా రాధనే వేద
సమ్మతం కాదు. ఆకాశంలో దేవతలంటు స్వర్గమంటు ఏమీ లేదు. ఉన్న దొక్కడే. అతడు
స్త్రీకాదు పురుషుడు కాదు! అనంతుడైన పరమాత్మకు బొమ్మలు చెక్కడ మేమిటీ?
కాళ్ళూచేతులు ముక్కు మొహము పెట్టడమేమిటీ? నైవేద్యాలు సమర్పించడ మేమిటీ? రాయి
ఎక్కడైనా తింటుందా?
రామాయణంలో జాబాలి చెప్పలా
‘అష్టకా పితృదైవత్యం ఇత్యయం ప్రసృతో జనః
అన్నస్యోపద్రవం పశ్య మృతో హి కిమశిష్యతి’

జనం అష్టకాశ్రాద్ధాలు ఆబ్దిక శ్రాద్ధాలు చేస్తుంటారు. ఇక్కడ తద్దినంలో భోక్తలు తింటే


అక్కడ స్వర్గలోకంలో వారి ఆకలి తీరుతుందా వీళ్ళ పిచ్చిగానీ!

మాది ఉత్తరదేశంలో గంగాతీరం గాధిపురం. మావూరి దగ్గరలోనే సరయూనది వచ్చి


గంగలో సంగమిస్తుంది. గాధేయుడైన విశ్వామిత్రుడు మావూరివాడే! అక్కడికి దగ్గరలోనే
గయా క్షేత్రంవుంది. ఈ క్షేత్రమంతా ప్రేతాల్లాంటి గయావళీల అధీనంలో ఉంటుంది.
ఇందులో ప్రేతగయావళీలు వేరు సుద్ధగయావళీలు వేరు. శ్రాద్ధాలలో కూడా రకాలున్నాయి.

అష్ట గయావిధాన శ్రాద్ధం, పంచగయాశ్రాద్ధం, ఏకోద్దిష్టం, ఫల్గుణీశ్రాద్ధం. అక్కడ


ప్రేతాలకు ఒక పర్వతం కూడావుంది. ప్రేతపర్వత శ్రార్ధం, ఉత్తరమానస తీర్ధంలో శ్రాద్ధం
277
  చాళుక్యసింహాసనం

దక్షిణ మానస తీర్ధాలలో శ్రాద్ధం, పంచతీర్ధంలో శ్రాద్ధం, ఇవికాక బ్రహ్మసరస్సు వద్ద శ్రాద్ధం,
విష్ణుపాదం వద్దా, అష్టాదశపాదం వద్దా పిండప్రదానాలు. అక్షయవటశ్రాద్ధం. ఇన్ని రకాల
శ్రాద్ధాలు న్నాయి. ఇవన్నీ ఆచరించేటప్పటికీ తీర్ధయాత్రికులకు చివరకు గోచీకూడా మిగలదు.
గయావళీలు లాగేసుకుంటారు. అందుకే నా శ్రాద్ధం అనే తిట్టు వచ్చిందయ్యా! నాకీ
శ్రాద్ధాలమీద విసుకు పుట్టే మా తల్లిదండ్రులకు శ్రాద్ధం పెట్టడం మానేశాను.”అన్నాడు గుక్క
తిప్పుకోకుండా గంగాతీర్ధుడు.

“వీళ్ళేదో హోమము చేసి మంత్రాలు చదివి దేవుణ్ణి రాతిలోకి ఆహ్వానం చేస్తారట!”

“అట్లా అయితే అతడు పరిమితం అయిపోవడంలేదా? అనంతమైన ఆకాశాన్ని


గుప్పెటలో బంధించగలమా?”

“ఈ చర్చ ఇంతటితో వదిలిపెడదాం కానీ మన కూష్మాండయోగి మాత్రం


గుప్పెటలోంచి విభూది తీస్తున్నాడు. మొన్నబంగారం గొలుసు తీసి ఒకావిడ కిచ్చాడు.
బంగారు గొలుసులు తమకు కూడా ఇస్తాడేమోనని ఆడవాళ్ళంతా అతడి
పాదాలొత్తుతున్నారు.”

“అది దేవుడూ కాదు మహిమా కాదు! మొత్తం ఒక హస్తలాఘవం! కూష్మాండయోగి


కదా, గుప్పెటలోంచి బూడిద తీయడం కాదు పెద్ద బూడిదగుమ్మడికాయను తీయమనూ!
నోట్లోంచీ కుంకుడుకాయంత శివలింగం తీయడం కాదు,రుబ్బురోలంత శివలింగం తీయ
మనూ! వచ్చిన ఆడవాళ్ళందరకీ తలొక బంగారు నగ ఇవ్వమను చూస్తా! మాయచేసి
ఇప్పటికే చాలా మంది ఆడవాళ్ళను లొంగదీసుకున్నాడు.”

“అన్నీ చేస్తున్నాడు కానీ విష్ణువర్ధనుడిని ఏమీ చేయటం లేదేమిటీ?”

“మనం కూడా గమనిస్తుండాలి. భీమసలుఖి మహారాజు ఇచ్చిన సొమ్మంతా వెనకేసు


కుంటున్నాడా ఆయన చెప్పిన పనేమైనా చేస్తాడా? నీవొకసారి హెచ్చరించి చూడు” అన్నాడు
గంగాతీర్ధుడు.

అప్పటినుంచీ గండువర్మ కూష్మాండయోగి వద్దే వుండి గమనిస్తున్నాడు.

వేంగీ నగరంలో కూష్మాండయోగి తిష్టవేశాడు. శిష్యులు ఆయనకన్నా ముందే వేంగీ


నగరం చేరి ఊరిబయట తడికలపూడి ప్రాంతంలో సరైన ప్రదేశం చూచుకుని మనిషిలోతు
గోయి తవ్వారు. అందులో ఎండబెట్టిన శనగల బస్తాలు గుమ్మరించారు. ఆపైన తగినంత
ఇసక పోశారు. ఇసకపైన పాలరాతి పానువట్టము నర్మదానదిలో దొరికే శివలింగము ఉంచి
పైన మట్టి కప్పేశారు. అక్కడొక గుర్తుపెట్టుకున్నారు.

భక్తజనం మేళతాళాలతో కూష్మాడయోగిని వేంగీనగరానికి తీసుకు వచ్చారు. ఆయన


278
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

కోసం సానిగూడెంవద్ద పెద్ద గుడారం పందిళ్ళూ పాకలు నిర్మించారు. శిష్యులు కూష్మాండ


యోగి పేరిట నగరంలో భిక్షాటనం చేస్తున్నారు. భిక్ష పెట్టినవారికి బదులుగా విభూతి రుద్రా
క్షలు పంచుతున్నారు. ఒకరికి బంగారు రుద్రాక్ష వచ్చింది. అతడు అది అందరికీ చూపిం
చాడు. అది నిజంగా బంగారమే.

దానితో చాలా మంది కూష్మాండయోగికి భక్తులైపోయారు. పాదపూజలు పవళింపు


సేవలు సాగుతున్నాయి. భజనలు సప్తాహాలతోపాటు పనిలేని కవులు చేరి ఆయనే దేవు
డన్నట్లు ఆయనే బ్రహ్మావిష్ణు మహేశ్వరులైనట్లు క్రొత్తక్రొత్త చెత్తచెత్త పాటలు రాసి గానం
చేయిస్తున్నారు. పురుషులను కాదని ముందువరసలో పట్టుచీరల హడావిడి ఎక్కువగా వుంది.

కూష్మాండయోగి ఒకదినం భక్తులందరినీ సమావేశపరిచాడు. ఆయన


ఏదోమహాద్భుతం ప్రదర్శిస్తాడని అందరూ అనుకుంటున్నారు. అంతకు ముందతడు ఎందరో
స్త్రీలకు మట్టెలు కాలి పట్టాలు మంగళసూత్రాలు శృష్టించి పంచిపెట్టాడు.

“భక్తజనులారా! మీనగరం, మీకు తెలీదుగానీ అపర కైలాసం! నేను ఎన్నో క్షేత్రాలు


తిరిగానుకానీ నాకెక్కడా పరమశివదర్శనం కాలేదు. మీ ఊరిలో అయింది. రాత్రి నేను జపం
చేసుకుంటూ ఉండిపోయాను. అది కలో నా సమాధిస్తితో నాకు తెలీదు. భూతనాధుడైన
పరమశివుడు కనిపించాడు. ‘నన్నెన్నినాళ్ళు భూగర్భంలో దాచివుంచుతారూ? ఈ ఊళ్ళో
వాళ్ళకు కళ్ళులేవు నీకు కూడా లేవా?’ అని కోప్పడ్డాడు.

మహా జనులారా చింతించకండి. కళ్ళులేవా అంటే జ్ఞాననేత్రాలు లేవా అని అర్ధం. నేను
అపరాధం అపరాధం అంటూ చెంపలు వేసుకున్నాను. అంతట సమాధిస్ధితిలోంచీ ఇహ
లోకంలోకి వచ్చాను.

భక్త మహాశయులారా మీనగరంలో ఎక్కడో భూమిలో స్వయంభూ లింగముంది. అది


ఎక్కడుందో నాకు కూడా తెలీదు. వెతుకుతే తెలుస్తుంది” అని ఊరుకున్నాడు.

జనంలో కలకలం గుసగుసలు మొదలైనాయి. ఒకమగమనిషి లేచి ‘ఇదంతా బూటకం.


మోసం’ అని అరిచాడు. అప్పటికే ఒక స్త్రీకి గంగానమ్మదేవత వంటిమీదికి వచ్చింది. ఒళ్ళు
పెరిగింది. ఒకటే ఊగిపోతోంది. ‘అమ్మా! శాంతించ’ మని ప్రార్ధించారు స్త్రీ భక్తులు. మొహాన
పసుపు కుంకుమలు అద్దారు. వేపమండలతో గాలి విసిరారు. కర్పూర హారతిచ్చి శాంతిం
చమని వేడుకున్నారు. అంతట ఆమె ‘ఒరేయ్ శంభులింగం! నీవు నా మగడిపేరు పెట్టు కుని
నా మగడినే అనుమానిస్తావురా?’ అని గర్జించింది. జనం అంతా ఆ గంభీర స్వనానికి
అదిరిపోయారు. అతడి పేరు శంభులింగమని ఆమెకెలా తెలిసిందీ? అంతా గంగానమ్మ
మహిమే! దిగదుడిచి కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చారు.

అంతట శంభులింగం ‘నీ పూనకం కూడా దొంగదే! నీవు ఆయన మనిషివే!’ అని

279
  చాళుక్యసింహాసనం

అరిచాడు. అంతలో అమ్మవారికి కోపం వచ్చింది. ‘ఓరీ చెనటీ! నేను నీ పేరు చెప్పినా నీకు
నమ్మకం లేదురా? కాళీమాతనై నీ నాలుకలు కోస్తా, దుర్గా మాతనై నీ మెడకాయి కోస్తా!’ నని
బెదిరించింది.

అతడింకా రెచ్చిపోయాడు. గంగానమ్మదేవత అతడిపైకి లంఘించి చంపకాయ


కొట్టింది. ‘ఒరేయ్ నాస్తికుడా! నామొగుడు నీకు కనిపిస్తే నమ్ముతావురా?’ అని
హూంకరించింది. నామొగుడు అంటే గంగానమ్మ మగడు. శివుడు.

అతడు నమ్ముతానన్నాడు. గంగానమ్మదేవత తన చీరచెంగు చింపి అతడి కళ్ళకు


గంతలు కట్టింది. నడవరా అన్నది. వారిద్దరివెంటా జనం అంతా బాజా భజంత్రీలతో సహా
కదిలారు. కూష్మాండయోగి తన శిష్యులతో సహా వెంట నడిచాడు. వాళ్లు అలా ఊరంతా
తిరిగారు. అందరికీ కాళ్ళు నెప్పులు పుడుతున్నాయికానీ ఓర్చుకుంటున్నారు. వాళ్ళలా తిరిగి
తిరిగి తడికలపూడి బయట మైదానానికి చేరారు. ఆ హడావిడిలో గంగానమ్మ దేవత అతడి
కాలు తొక్కింది. అతడు వెంటనే కూలబడిపోయాడు. అతడు ‘ఇక్కడున్నాడు శివుడు’ అంటూ
రెచ్చిపోయి పిచ్చివాడిలా నేలను కోళ్ళతో గోకసాగాడు. అందరూ ఆశ్చర్యపోయారు.
అప్పటివరకూ అంతా బూటకమన్నవాడు ఇప్పుడు శివుడంటున్నాడు.

ఆ సమయంలో కూష్మాండయోగి ముందుకు వచ్చాడు. వాళ్ళిద్దరిపైనా కమండలంలోని


మంత్రజలం చల్లాడు. ఇద్దరికీ పూనిన దేవతలుదిగిపోయారు.యోగి తనశిష్యుడు చీమయ్య
సహాయంతో అక్కడ చతురస్రాకార హద్దు ఏర్పరిచాడు. ‘ఈ చతురస్రాకారంలో అభిషేకాలు
చేయండి. లోపల స్వయంభువు లింగముంటే బయటికి వస్తుంది.’అన్నాడు. ఒక్కరోజులో
అక్కడ పెద్ద పందిరి వేశారు. చాలామంది ఇళ్ళకు పోలేదు. అర్చకులు వచ్చారు. నమక
చమకాలతో అభిషేకాలు ఆరంభించారు. పెద్దపెద్ద బిందెలకు పసుపు గుడ్డతో వాశన కట్టి చిల్లి
పెట్టి దేవుడి హుండీలు ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజులు గడిచిపోయింది. శివుడు
బయటికి రాలేదు.

పరమ భక్తులు కూష్మాండయోగిని ప్రశ్న అడిగారు. అసలు స్వయంభువు అక్కడ


ఉన్నాడా లేడా అని. యోగి ‘అక్కడే వున్నాడు. కానీ మీలో కొంతమంది దేవుడంటే నమ్మని
వాళ్ళున్నారు. అందుకే ఆలస్యమవుతోంది. అందరూ భక్తితో నమ్మకంతో అభి షేకాలు
చేయండి. వస్తాడు. నమ్ముతేనే భగవంతుడు. ఈశ్వరుడు స్మశానవాసి. అందు చేత నేను
స్మశానంలో కూర్చుని తపస్సు చేస్తాను. మీ అందరికోసం పరమశివుని పైకి రమ్మని
వేడుకుంటాను’ అనిచెప్పాడు. దానితో భక్తజనం విశ్వాసంతో పగలు రాత్రీ అభిషేకాలు
చేయసాగారు.

కూష్మాండయోగి గుడారం స్మశానానికి మారింది. చీకటి పడింతరువాత చీమయ్య


మఱ్ఱిచెట్టు ఊడలకు ఆడమనిషి మగమనిషి దిష్ఠిబొమ్మలు కట్టేవాడు. చీకటిలో అవి
దెయ్యాలలాగే కనిపించేవి. ఆ భయానికి సామాన్యులెవరూ అటు వచ్చేవాళ్ళుకాదు. రాత్రంతా

280
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

కూష్మాండయోగి గుడారంలో కాంతాసేవ రాచక్రీడలు యధేశ్ఛగా సాగగుతుండేవి.


రాచక్రీడలు జరిగేవేళ చీమయ్య బయట కాపుండేవాడు. కూష్మాండయోగి చీమయ్యకు పెట్టిన
ముద్దుపేరు శంభో. శంభో అని పెద్దగా అరిస్తే ఆనాటి ఆట ముగిసినట్లే. చీమయ్య వెళ్ళి
విశ్రాంతి తీసుకునేవాడు.

కొన్ని నాళ్ళకు అభిషేకాలు చేస్తున్నచోట భూమి పగిలింది. భక్తులందరూ ఆశ్చర్య


పోయారు. అభిషేకాలు ముమ్మరమయ్యాయి. నేల పైకుబికింది. పుట్టలాగా పైకి తేలు తోంది.
ఏదో పాలరాయి చూచాయగా దర్శనమిచ్చింది. భక్తులు ఆత్రం పట్టలేక మట్టి తొలగించి
చూచారు. పాలరాతి పానువట్టమూ నర్మదనదిలో దొరికే శిలింగమూ బయట పడ్డాయి.
కొందరు భక్తులు ఇంకా తవ్వుతే నందీశ్వరుడు కూడ దొరుకుతాడేమో నన్నారు. కొంప
మునుగుతుందని తెలిసిన వీరభక్తులు అంతటితో ఆపించారు.

శివలింగ సాక్షాత్కారంతో భక్తులందరూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.నగర


జను లందరూ కూష్మాండయోగికి బ్రహ్మరథం పట్టారు. ఊరేగించారు. నగర స్త్రీలంతా
కూష్మాండ యోగి ఏ నందీశ్వరుడోనని నమ్మారు. యోగి రాసక్రీడలు మరింత
అతిశయించాయి.

స్త్రీలకు వేరే దర్శనం, పురుషులకు వేరే దర్శనం ఏర్పాటయింది. యోగి దయ తలుస్తే


అందరి మనసులోని అజ్ఞాతమైన కోరికలు తీరుతున్నాయి. పిల్లలు లేనివారు నెలత ప్పారు.
సేవలు, వాటికి రుసుములు పెరిగాయి.

కూష్మాండయోగి మహిమలు వేంగి కోటలో దాకా వ్యాపించాయి. కోటలోని పరిచారక


జనం కూడా కూష్మాండయోగి చిత్రపటాలు పెట్టుకుని భజనలు ప్రారంభించారు. పరిజనం
యువరాజ విష్ణువర్ధనుడికి మహారాజుకు కూడా కూష్మాండయోగి మహిమలు చెప్పీ చెప్ప
కుండా చెబుతున్నారు. వాళ్ళ ఉద్దేశ్యం ప్రభువులు కూడా కూష్మాండయోగిని దర్శిస్తే
బాగుంటుందని.

ప్రభువు ప్రజల మాట కూడా వినాలి. లేకపోతే మూర్ఖుడనుకుంటారు. విష్ణువర్ధనుడు


కూడ యోగి దర్శనానికి వెళ్ళడం ఆరంభించాడు.

కూష్మాండయోగి అంతరంగిక శిష్యుడు చీమయ్య. సాధనాలన్నీ అతడే సమకూర్చే


వాడు. వెలిబూడిదను వస్త్రఘాళితము చేసి అందులో పులిమజ్జిగ చిలికి చిన్నచిన్న ఉండలు
చేసి ఆరపెట్టేవాడు. ఒక వుండను బొటనవ్రేలికి చూపుడు వేలికి సందులో ఇరికించుకుని
భక్తుల చేతులో నలుపుతే బూడిద రాలేది. చీమయ్య దూరంగా ఉన్న ఊరు వెళ్ళి కంసాలిచేత
తేలికపాటి బంగారు గొలుసులు చేయించుకు వచ్చేవాడు. అలాంటి బంగారు ఆభరణాలు
తన దొంగభక్తులు కొందరికి ఇచ్చేవాడు యోగి. చీమయ్య వెళ్ళి ఆగొలుసులు సేకరించుకు
వచ్చేవాడు. గొలుసు తిరిగి ఇవ్వనన్న వారితో చిన్న చిన్న గొడవలు కూడా జరిగేవి.

281
  చాళుక్యసింహాసనం

కూష్మాండయోగికి విష్ణువర్ధనుడు దేనికి పడతాడో అర్ధం కాలేదు. ఒకటొకటిగా అన్ని


ప్రయోగాలు చేసిచూశాడు. లాభం లేకపోయింది. చివరగా దేవేంద్రుడిలాగానే అప్సరసల్ని
ప్రయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఒక అమావాస్య రాత్రి విష్ణువర్ధనుని ఏకాంత సేవకు
ఆహ్వానించాడు. యువరాజును అక్కడ వదిలేసి తాను బయటికు వెళ్ళిపోయాడు. బయటంతా
చీకటి. ఆ గుడారంలో మాత్రం వెలుగు. గుడారం మొత్తం పరిమళభరితంగా తన్మయం
కొలిపేటట్లు ఉంది. ఏకాంతం. అర్ధరాత్రి దాటింది. లోకం మొత్తం ఏకమై రాత్రి అనే పాన్పుపై
చీకటి ముసుగు కప్పుకుని పడుకుంది. గుడారంలో అగరు ధూపాలు మేఘాలను
తలపిస్తున్నాయి. సుగంధాలు మత్తుగా వున్నాయి. అద్భుతంగా గుడారం పైకప్పులోంచి
గంధర్వ అప్సరస భామినులు దిగసాగారు. కళ్ళు మిరిమిట్లు గొలిపే సౌందర్యం. ఆభరణాలు
అంగరాగాలు. పాము కుబుసంకన్నా సన్ననైన వస్త్రములు. పాటలేని నృత్తం చేస్తూ
మెలమెల్లగా ఒంపులు తిరుగుతూ ఒక తీగ ఆధారంగా పైనుంచి క్రిందికి దిగుతున్నారు.
క్రిందినుండీ పైకి చూస్తే మనసు అదుపు తప్పుతుంది. అసలే దేవతా వస్త్రములు అప్పుడప్పుడూ
మధ్యలో మేమెందుకన్నట్లు తొలగిపోతున్నాయి.

రంభ ఊర్వశి మేనకా లాగా ఒకరొకరుగా ముగ్గురు అప్సరసలు దిగారు పైనుంచి.


చీమయ్య వాళ్ళను గుడారం పైకి ఎక్కించి క్రిందికి దిగే ఏర్పాటు చేశాడు. నాలుగవ నర్తకి పై
నుండీ దిగాలి. ఆసమయంలో చీమయ్య తీగ కత్తిరించాడు. నర్తకి అంత ఎత్తునుండీ కూల
పడింది. వెన్నెముకకు చివరి పూసలు త్రికము అనుత్రికములో చివరి పూస విరిగింది. నర్తకి
కెవ్వున కేకవేసింది బాధతో. తెరచాటునుండీ గమనించిన యోగి శంభో అని పెద్దగా
అరిచాడు.

చీమయ్య వచ్చి నర్తకిని లేవదీయబోయాడు. గిలగిలలాడిపోయింది. చీమయ్య ఆమెను


బలవంతంగా ఎత్తి బుజానవేసుకుని అవతలకు తీసుకుపోయి పడుకో పెట్టాడు.
“ఏమయ్యిందే నీకు?” అన్నాడు చీమయ్య నడుంమీద చేయివేస్తూ.
“అమ్మో చచ్చిపోతున్నాను. ఎవరినేనా పిలువు.”
“ఎవరో ఎందుకూ నేను లేనా? ఎక్కడ తగిలింది దెబ్బా? చూడనా?”
“ఎవరేనా ఆడవాళ్ళను పిలువు.”
“నీవు మగాడికోసమేగా వచ్చిందీ? సిగ్గెందుకూ.”
“చచ్చిపోతున్నా. నీ పరిహాసం ఆపు. ఎక్కడో తగిలింది.”

“కాపుకాచనా కట్టుకట్టనా చెప్పు? యోగికి చెప్పానంటే పీక కోసి స్మశానంలో దహనం


చేయమంటాడు. నీకు వైద్యం చేయిస్తా డనుకున్నావా?”

“చంపుతాడా?”

282
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“లేదు. ముద్దు పెట్టుకుంటాడు. నీలాంటి స్త్రీలు చాలామందిని పనికి రాకపోయినా


పనికి అడ్డం వచ్చినా చంపి తగలేశాడు.”
“నీకెలా తెలుసూ?”
“నేను ఆయన ప్రియశిష్యుడుని కదా!”
“ఇందులో అంత మోసముందా?”
“మగాళ్ళను నువు చేసేది మోసంకాదా?”
“నేనయితే చచ్చిపోతున్నాను. ఎముకలు విరిగాయో యేమో కలుక్కు కలుక్కు
మంటోంది.”
“నన్ను నమ్ముతె చావకుండా చూస్తా! లేదంటే యోగిని పిలుస్తా!”
“నన్ను కాపాడు. నాకు చావంటే భయం.”
“మరి నన్ను పెళ్ళిచేసుకుంటావా?”
“అమ్మో నేను పెళ్ళికి పనికిరాను. వేశ్యని!”
“మగ వేశ్యవా ఆడవేశ్యవా?”
“ఓరినీ జిమ్మడా! ఆడదాన్నే వేశ్యంటారు.”
“మరినీవు మగముండవు కదా?”
“ఏమంటున్నావు నీవు?”
“దొంగవెధవా! నీవు మగవాడవనే నేనే తీగను కత్తిరించా!”
“నీకెలా తెలుసూ?”
“నీవు మోసగాడివైతో నేను మహా మోసగాడిని! నీవిలా ఎందుకు చేశావో చెప్పు?”

“యోగి నన్ను నలుగురు అప్సరసలను ఏర్పాటు చేయమన్నాడు. మనిషికి నూరు


వరాహలిస్తాన్నాడు. ముగ్గురే సరైనవారు దొరికారు. నాకు ఆడవేషాలు వెయడం
నాట్యంచేయడం బాగా వచ్చు. అందుకే నాలుగవ దానిగా నేను దిగాను.”

“నీవు ఆడోమగో నీ మోచేతులు చూసినపుడే నాకర్ధమయింది!”

“మరి నన్ను రక్షించు. బాధ భరించలేకుండా వున్నాను.”

ఈ రసాయనం పీకదాకా తాగి తేలుకుట్టిన దొంగలాగా పడుండు. యోగి శంభో


అనగానే ఈనాటి ఆట అయిపోతుంది. అప్పుడు నిన్ను కాపాడతాను.” చీమయ్య అప్సరసను

283
  చాళుక్యసింహాసనం

మత్తుగా తాగించాడు.

గుడారంలో నేలపైకి దిగిన దేవకన్యలుముగ్గురూ నాట్యం చేయసాగారు. కాలి గజ్జల


మోతలే తాళం. అనిమిషాంగనలు ఒకరొకరుగా సృష్టి రహస్యాన్ని విప్పసాగారు.

విష్ణువర్ధనుడు ఆనంద ముఖారవిందుడై గౌతమబుద్ధుడిలా కూర్చున్నాడు. అరవిందా


క్షులు తెరుచుకునే ఉన్నాయి. కళ్ళు మూసుకోలేదు. ఉవిదల పాలీండ్ల పొంగు ఒకవిధంగా
కలవర పెడుతోంది. అప్పుడు ఇలా శివస్మరణం చేయసాగాడు.

“ఓ కపాల భిక్షుకా శివా! నా మనసనే కోతి మోహమనే అడవిలో ఎగిరి గంతులు


వేయటానికి అలవాటు పడింది. ఇప్పుడీ నారీ స్తనములమీద దృష్టిసారించింది. దీన్నినీవు భక్తి
అనే పాశంతో బంధించి నీచేతులో ఉంచుకో.
సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖా స్వటతి ఝటితి స్వైరమభితః
కపాలి భిక్షోమే హృదయకపిమత్యన్త చపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురువిభో.
అంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు.
తెల్లవారింది. రాకుమారుడు చలించలేదు.
చమరీగురుకులంలో విద్యాభ్యాసం అంటే సామాన్యం కాదు. అక్కడ శిక్షణ
పొందివచ్చిన వీరులు జీవితంలో గొప్ప సైనికాధికారులు, యువరాజులు రాజులు అయ్యే
అవకాశముంది. అటువంటివారిపై శత్రువులు విసిరే వలలలో ముఖ్యమైనది మగువ.
వన్నెలాడులవగలలో పడకుండా ఎలా కాపాడుకోవాలో కూడా చమరీగురుకులంలో శిక్షణ
నిస్తారు.

కూష్మాండయోగికి దిమ్మ తిరిగి పోయింది. విష్ణువర్ధనుడు చలించలేదు సరికదా తాను


ప్రయోగించిన అప్సరసలందరూ అతడి వ్యామోహంలో పడ్డారు. వాళ్ళు అంత సుందరమైన
యువకుడిని ఇంతకు ముందు చూడలేదు. రూకలు చిమ్మేవాడిదగ్గరకల్లా పోవాల్సి వచ్చేది.
లోకాన్ని తాము మోహింపచేస్తే తమనే మోహింప చేసే నవమన్మధుడు తార సిల్లాడు.

పువ్వులు లేలేత రేకలకు రంగులద్దుకుని తియ్యని మకరందం నింపుకుని భృంగం


కోసం కన్నులు తెరచుకుని ఎదురుచూసినట్లు అప్సరసాంగన లందరూ విష్ణువర్ధనుని
పొందుకై అఱ్ఱులు చాస్తున్నారు.

కూష్మాండయోగి తల పట్టుకున్నాడు. విషాధరాలను విష్ణువర్ధనుడు అందుకోలేదు.

284
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ఇలాకాదని యోగి తన పిశాచాన్ని ఆవాహనం చేశాడు. ఆమె ఒక భయంకర రక్త పిశాచి.


రాకుమారులంటే కక్షతో రగిలిపోతుంది. ఒకప్పుడా యువతి పేరు అసమానగర్భ. ఒక
రాకుమారుడు ఆమెను కామించి చెరపట్టి చాలాకాలం హింసించాడు. ఆమె గర్భవతి
అయింది. ఆవిషయం తెలిసి కత్తితో ఆమె పొట్టను కోసి చంపేశాడు. శవాన్ని ఒక కావడిపెట్టెలో
పెట్టి ఒక పాడుపడిన కోష్టంలోకి తోసేసాడు. ఆప్రేతానికి అంతిమ సంస్కారాలు లేక
పిశాచమయింది. ఎక్కడ రాకుమారుడు దొరికినా పట్టిపీడించేది.

యోగి పిశాచాన్ని ఆవాహన చేశాడుకానీ భౌతికంగా ఏదైనా పనిజరగాలంటే


పిశాచానికి ఏదైనా ఉపాధికావాలి. ఎవరిమీదకు ఆవాహన చేద్దామా అను కుంటుంటే
అక్కడొక నిద్రిస్తు న్న ఊరకుక్క కనిపించింది. ధానిమీదకు ఆవాహన చేశాడు. యువరాజుపైకి
ఉసిగొల్పాడు. కుక్క భయంకరంగా మొరుగుతూ గుడారంలోకి దూరింది. విష్మువర్ధనుడి
మీదకు ఎగ బడింది.

యువరాజు శివస్వరూపంలో వున్నాడు. భవుడు భూతప్రేత పిశాచాలన్నిటికీ అధిపతి.


క్షణంలో కుక్క వెనక్కు తిరిగి వచ్చింది. దానిపగ చల్లారలేదు. అక్కడున్న రంభావూర్వశి
మేనకలపై బడింది. వాళ్ళు ఎక్కువ ఉడుపులు ధరించలేదు. ఆ శునకం ఆ అప్సరసల తొడలు
పిక్కలు జబ్బలు నడుము పట్టిపీకింది. వాళ్ళు భయంతో పరుగెత్తి యోగినాశ్రయిం చారు.

యోగి వెంటనే కత్తితో కుక్కడొక్కలో పొడిచాడు. కుక్కరక్తం యోగి చేతివెంట


ప్రవహించి రక్తతర్పణం జరిగింది. ఆవహించిన పిశాచానికి ఆ తర్పణంతో ప్రేతరూపం
పోయి ఉత్తమ గతులకు వెళ్ళిపోయింది.

విష్ణువర్ధనుడు చిన్న చిరునవ్వు నవ్వి కోటలోకి వెళ్ళిపోయాడు.

కూష్మాండయోగి తన చివరి ప్రయత్నంగా విషప్రయోగానికి సిద్ధం చేసుకున్నాడు. కోట


లోకి రోజుకో రకం ప్రసాదం పంపించేవాడు. చిత్రాన్నం చక్రపొంగలి దద్ధోజనం పాయసం.
అందరూ భక్తితో కళ్ళకద్దుకుని తినేవాళ్ళు. యువరాజు వంతు ముందరే తీసి ప్రక్కన పెట్టి
వుంచి వడ్డించేవారు.

చీమయ్య యువరాజ విష్ణువర్ధనునికి రహస్య వేగు పంపాడు ఏదో కొత్త కుట్ర జరుగు
తోందని.

ఒకనాడు విష్ణువర్ధనుడు భోజనానికి కూర్చున్నాడు. రాకుమారుడు భోంచేస్తుంటే దృష్టి


దోషం తగులుతుందని ఒక్క వంటకత్తే వడ్డిస్తుంది. తినినా తినకపోయినా ప్రతిదినం
పదార్ధాలు కొలమానం ప్రకారం వండివడ్డిస్తారు. రాజులు ఇష్టమైనంతవరకూ తిని మిగతావి
వదిలేస్తారు. మిగిలిన పదార్ధాలను దాసీలు వంతువారీగా ఇంటికి తీసుకు పోతారు.

285
  చాళుక్యసింహాసనం

వంటగత్తె రాకుమారుడి ముందు బంగారు తాపడం చేసిన వెండి తళియ పెట్టింది. ఆ


పళ్ళెరానికి నడుమ మరకతమణి పొదగబడి వుంది. విస్తరిలో పదార్ధాలన్నీ వడ్డించింది. ఈగ
వాలడానికి లేదు. విష్ణువర్ధనుడు వడ్డన పూర్తయిందా అన్నట్లు తలపైకెత్తి వంటకత్తె వైపు
చూశాడు. ఆమె కళ్ళు మత్తుమందు సేవించినట్లు మైకంగా ఎఱ్ఱబారి వున్నాయి. ఆమె బంగరు
పళ్ళెరంలో కూష్మాండయోగి పంపిన ప్రసాదం వడ్డించింది. విషానికి మరకతమణి రంగు
మారింది.

భోజనానికి కూర్చున్న విష్ణువర్ధనుడు కోపంతో పైకి లేచాడు. ఇంక ఔపోసన పట్టలేదు.


గోడకు అలంకరించిన కత్తిని సఱ్ఱునలాగి వంటకత్తె తల తెగవేశాడు. పరిచారికలందరూ
భయంతో ఎక్కడివారక్కడ పారిపోయారు.

విష్ణువర్ధనుడు భవంతిలోంచి బయటికి వచ్చాడు. ఖడ్గం వెంట రక్తం బొట్లుబొట్లుగా


కారుతోంది. జవనాశ్వాన్ని అధిరోహించి కాలిమడమతో చిన్నగా తాటించాడు.గుఱ్ఱం
వేగంగా కోటబయటకు పరుగు తీసింది. అశ్వం ఎక్కుపెట్టి విడిచిన బాణంలా సానిగూడెం
చేరింది. కూష్మాండయోగి ఆశ్రమం లోకి ప్రవేశించింది.

ఆ సమయంలో ఆశ్రమంలో భజనసప్తాహం జరుగుతోంది. కొందరు స్త్రీ పురుషులు


అర్ధ నిమీలిత నేత్రులై మైమరచి కూష్మాండయోగే పరమశివుడనే అర్ధం వచ్చేటట్లు పాటలు
పాడుతున్నారు. కొందరు తన్మయత్వంతో ఆడా మగా కలిసి నాట్యం చేస్తున్నారు. కొందరు
ఆవేశంతో జడలు విరబోసుకుని ఊగిపోతున్నారు.

విష్ణువర్ధనుడు అశ్వాన్ని నేరుగా కూష్మాండయోగి కూర్చున్న వేదిక మీదకు పోని


చ్చాడు. యువరాజు హస్తంలోని ఖడ్గంచూసి అందరూ హడలిపోయారు. ముఖ్యశిష్యులు
దూరంగాపరిగెత్తారు. కూష్మాండయోగికూడా వేదికపైనుండి దూకి పారిపోడానికి ప్రయత్నిం
చాడు. విష్ణువర్ధనుడు ఒకేదెబ్బతో అతడి తల తెగిపడేటట్లు నరికాడు. యువరాజు యోగికి
సపర్యలు చేసే శిష్యుల్ని కూడా విడిచిపెట్టలేదు. వెంటపడి వీరభద్రుడిలా చేతికందిన వారి
పైనల్లా నరికాడు. ఎక్కడివారక్కడ ఒకరినొకరు తొక్కుకుంటూ పారిపోసాగారు. దొంగ
భక్తులతో పాటు అమాయక భక్తులు కూడా కొందరు ప్రాణాలు కోల్పోయారు.

ఆ దృశ్యం చూసిన గండువర్మకు పక్షవాతం కమ్మింది. యువరాజు వీరావేశం చూస్తే


చీమయ్యకు కూడా గుండెలు జారిపోయాయి. పనిలో పని వేటు తన పైన కూడా పడుతుం
దేమోననే అనుకున్నాడు.

46 రాధామాధవం
విజ్జేశ్వరంలో కతిశర్మను బంధించి హింసించారనే అనుమానంతో ఐదుగురు
వ్యక్తులను చాళుక్యులు ఎట్టకేలకు బంధించారు. మహారాజుపై దాడిచేసినవారందరూ

286
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

హతమైనారు. ముష్కరులను శిక్షించాలంటే కతిశర్మ వారిని గుర్తించాల్సివుంది.

కతిశర్మ మనశ్శాంతికోసం దేశాటనం చేస్తూ తిరిగి తిరిగి మువ్వ గ్రామానికి జేరి అక్కడి
గోపాలదేవుడిని సేవించుతు అక్కడే ఉండిపోయాడు.

విష్ణువర్ధనిడు చమరీ గురుకులంలో చేరక ముందు కతిశర్మకు సహాధ్యాయి. ఆ


చనువుతోను మహారాజును రక్షించడానికి క్రుతజ్ఞత తెలియజేయడానికి యువరాజు
మువ్వగ్రామానికి వెళ్ళాడు.

కతిశర్మ రెండు వేదాలు పదక్రమ అనుక్రమలతో నేర్చుకున్నవాడు. యువకుడు. బ్రహ్మ


చారి.

విష్మువర్ధనుడు గోపాలదేవుడి ఆలయానికి వెళ్ళేటప్పటికి ఎవరో సుందరాంగన


నాట్యంచేస్తోంది. యువరాజు వినమ్రంగా ముకుళిత కరకమలుడై నిలబడిపోయాడు.
దేవదాసి సాంప్రదాయం కదా అనుకున్నాడు. కొంతసేపటికి ఏదోవ్యత్యాసం కనిపించింది.
ఎంతైనా ఆడవారి లావణ్యం మగవారికి రాదు.

పరికించిచూస్తే నాట్యం చేస్తున్నాది కతిశర్మ. చీరకట్టుకుని రైక ధరించి జడవేసుకుని


పూలు పెట్టుకుని మరీ నాట్యం చేస్తున్నాడు. చుట్టూ జేరి కొందరు పాట పాడుతూ సంఘటిత
వాయిద్యాలు మోగిస్తున్నారు. పాట ఇలా సాగుతోంది.
రాధా.... మాధవా....
రాధా మాధవ చరణ సంచయ రజం
పునీతం భువి దివి అంతరిక్షం
రాధా మాధవ చరణ సంచయ రజం
ధారయామి మమ శిరసి హృదయ స్ధలం
రాధా మాధవ చరణ యుగళ విదళిత రజం.
ధారయామి మమ బాహు భుజ శిరసి లలాటం
రాధా మాధవ రతికేళికా వినోదం
మునిజన మానస విహరిత విహంగం
రాధామాధవ చరణ సంచయ రజం.
కతి శర్మకు ఇంతటి కుచోన్నకి ఎప్పుడు కలిగింది అనుకున్నాడు విష్ణువర్ధనుడు. నాట్యం
చేసిచేసి భక్తి పారవశ్యంలో మునిగిపోయి కతిశర్మక్రిందపడిపోయాడు. అలాగే

287
  చాళుక్యసింహాసనం

సమాధ్యావస్తలోకి వెళ్ళిపోయాడు. కొంతసేపు చూసి భక్తులు అతడిని గట్టిగా తట్టి లేపుతే కానీ
స్పృహలోకి రాలేదు.
తేరుకున్న కతిశర్మ విష్ణువర్ధనుని గుర్తుపట్టాడు. “యువరాజా ఏమిటీరాక! ఎంత
సేపయింది నీవు వచ్చీ?”అన్నాడు లేచి కూచుంటూ.
గోపీచందనము తులసీమణి ధరించిన భక్తులందరూ కతిశర్మకు వందనం చేసి వెళ్ళి
పోయారు.
“మహారాజుకు క్షేమమేకదా! మహారాణీవారు ఆరోగ్యంగా వున్నారా?”అన్నాడు
కతిశర్మ.
“అందరూ కుశలమే! మా నాన్నగారికి నీవు చేసిన సహాయం నిరుపమానం. ఆయన
ప్రాణాలు కాపాడావు. అందుకే కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను.”
“అంతా ఆ రాధే కరుణ! ఎవరిని రక్షించాలో ఎవరిని శిక్షించాలో ఆ మాధవుడే చూచు
కుంటాడు” అన్నాడు కతిశర్మ ఆకాశం కేసి చూస్తూ చేతులు జోడించి.
“అంతా బాగుందికానీ నీ ఈ ఆడవేషమేమిటీ?” అన్నాడు విష్ణువర్ధనుడు.
“అదంతా ఒక కధలే!” అన్నాడు కతిశర్మ. “ముందు నీవు భోజనం చేయి. వేళయింది”
అని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. “నీ పరివారం ఏదీ?” అన్నాడు కతిశర్మ ఆనాటి
మహారాజుపై దాడి గుర్తుకు వచ్చి.
“నా కరవాలమే నా పరివారం! అందరినీ ఊరిబయట విడిది చేయించి వచ్చానులే!
భయపడకు!” అన్నాడు విష్ణువర్ధనుడు.
ఇద్దరూ గోపీకృష్ణులకు నివేదించిన పదార్ధాలే భుజించారు. కతిశర్మ విష్మువర్ధనునికి
కర్పూర తాంబూలం ఇచ్చాడు తన తాంబూలం నోటిలోకి నొక్కుకుంటూ.
“మిత్రమా! ఇవాళ ఏకాదశి. వైష్ణవులు ఉపవాసం ఉండాల్సిందిపోయి తాంబూల
సేవనమా!” అడిగాడు విష్ణువర్ధనుడు.
“తాంబూల సేవనం మా గోపీకృష్ణ సాంప్రదాయంలే! మనం ఆరగించినవి కూడా
సింగాడీల పిండితో వండినవి. ఏకాదశినాడు తినవచ్చు!”
“శర్మా! నీ నాట్యం చాలా అద్భుతంగా వుంది. కానీ ఈ ఆడవేషమేమిటీ? ఏదైనా
నాటకంలో నటించ బోతున్నావా?” అన్నాడు యువరాజు.

“యువరాజా! నేను పూర్వపు కతిశర్మనుకాను. ఇప్పుడు నేను రాధామాధవ సాధనలో


వున్నాను. ఒకనాడు యమునాతీరం గోకులం నుంచీ ఒక మహనీయుడు వచ్చాడు. ఆయన
పేరు రాధాచరణదాస్. ఆయన నామెడలో తులసిమణి వేసి రాధామాధవ సాధన
ఉపదేశించాడు. నిజానికి లోకంలో ఆ మాధవుడొక్కడే నిజమైన పురుషుడు. తక్కిన

288
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

వారందరూ స్త్రీలే. పురుషులు కూడా! ఈ చరాచర జగత్తంతటికీ ఆయనే నాథుడు,


జగన్నాధుడు! ఈ సాధన ఆరంభించి నప్పటినుంచీ నాకేదో అలౌకిక ఆనందం కలుగుతోంది.
చాలా తృప్తిగావుంది. ఇందుకోసం కృతకమైన స్తనయుగ్మము వాల్జడ సంపాదించాను.”

“నీవిలా ఆడవేషాలు వేస్తే నిన్ను ఏ స్త్రీ పెళ్ళి చేసుకుంటుందీ?”

“నాకసలు పెళ్ళి చేసుకోవాలనే అనిపించటం లేదు. మాధవుడి సంకల్పం ఎలావుందో


తెలీదు. విజ్జేశ్వరంలో నన్ను బంధించిన ముష్కరులు నేను సంసారానికి పనికి రాకుండా
హింసించారు. అది నాకు ఒక రకంగా వరమే అయింది.”

“వరమేమిటీ? ఆలస్యంగానైనా నిన్ను హింసించినవారిని బంధించాము. వారిని


శిక్షించాలంటే నీవు వారిని గుర్తించాలి. నేను అందుకే వచ్చాను.”
“ఒకవేళ గుర్తిస్తే ఏమిశిక్ష విధిస్తారు?”
“శిరఃచ్ఛేదం!”
“అమ్మబాబోయి! అంత కఠినమా!”
“అంతకన్నా కఠినము లేకపోవడం వలన!”
“నేనెవరినీ గుర్తుపట్టను. నేను వెనకటి కతిశర్మను కాను.”
“అలా అంటే ఎలాగు? దోషులకు శిక్షపడాలి.”

“వారు నన్ను హింసించకపోతే నేనింత వైరాజ్ఞాన్ని పొందడం అసంభవమే అయ్యేది.


కామక్రోథాది అరిషడ్వర్గాలలో కామాన్ని జయించడం దుస్సాధ్యం. ముందే చెప్పాను కదా.
వాళ్ళు నా జన్మజన్మాంతర దోషాలను హరించారు. ఏదిజరిగినా ఆ రాధామాధవుల నిర్నయం
వలననే జరుగుతుంది.”

“శర్మా! దోషులను శిక్షించడం ప్రభువుల విధి. బాధ్యత.”

“సమశత్రౌచ మిత్రౌచ తధా మానావమానయోః అన్నారు. అలాంటి స్ధితిని


చేరుకోలేకపోతే ఎవరూ ఆథ్యాత్మికోన్నతిని పొందినట్లు కాదు. రాథామాథవుల రాచకేళి
వినోదాన్ని దర్శిస్తున్న నాకు ఇప్పుడెవరు శత్రువులు లేరు.

నీకు నా సాధనా రహస్యాలు కొన్ని చెబుతేకానీ నన్ను అర్ధం చేసుకోలేవు. భగవంతుని


మనం ఆరాధించే ప్రధాన మార్గాలు మూడు రకాలుగా ఉంటాయి. మనం చేసే పూజలు
పురస్కారాలు వీటన్నింటినీ పశుభావము అంటారు. భగవంతుడు తన పతిగా తానాతడి
ప్రియురాలిగా భావించి సాధన చేయడాన్ని వీరభావం అంటారు. బృందావనంలో
గోపికలందరూ ఇదే సాధన చేశారు. అందుకే రాత్రిపూట వేణుగానం వినిపించగానే భర్తల
289
  చాళుక్యసింహాసనం

కౌగిళ్ళనుండీ తప్పించుకుని పసిపిల్లలను నిద్రపుచ్చి అత్తమామల కంట పడకుండా


శ్రీకృష్ణునితో రాసక్రీడలకై యమునాతీరానికి నిశ్శంకగా పుగెత్తుకుని వెళ్ళేవారు. పురు షులు
కూడా గోపికలలాగానే తమను తాము స్త్రీ గా మార్చుకుని ఈ సాధన చేయవచ్చు. ఇందులో
పరమానందం ఉంటుంది. ఇంతకన్నా పైస్ధాయిని దివ్యభావం అంటారు. అది అవధూతలు
అవలంభిస్తారు.
ఇంతకూ మీ ఇరుదేశాలమధ్య యుద్ధాలు ఎలావున్నాయి?”
“పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది!”
“సంధిచేసుకోకూడదా? ఇంత జనక్షయం తగునా”
“సంధా! అదిపొసగే విషయమేనా?”

“మానవ ప్రయత్నమైతే చేయాలికదా! ఆతరువాత రాధే ఇచ్ఛ. మీ పెదతండ్రిగారి


కుమార్తె భీమరథిని రాష్ట్ర్రకూట రాకుమారుడు కర్కవల్లభుడికి చేసుకున్నారని విన్నాను.”

“నిజమే!”

“భీమరథి మీదేశపు ఆడపడుచు. పసుపుకుంకాలకు రమ్మని ఆహ్వానించండి.


నవవథూవరులను మీ దేశంలో విహారయాత్రకు ఆహ్వానించండి. అందువలన
ఇరుదేశాలమధ్యా కొంత సుహ్రుధ్భావం ఏర్పడుతుంది! మీ సందేశాన్ని ఆహ్వానాన్నీ నేనే
తీసుకువెళతాను ”
“శర్మా! నీమాట వినకపోతే చెనటినౌతాను. అలాగే కానీయ్.” అన్నాడు విష్ణువర్ధనుడు.
అనుకున్నట్లే కతిశర్మ మాన్యకేతానికి ఆహ్వానపత్రం తీసుకువెళ్ళాడు.
కర్కవల్లభుడు ఇంద్రవల్లభునితో సమావేశమయ్యాడు.
“ప్రభూ! మేము వేంగిదేశం వెళ్ళాలనుకుంటున్నాము.”
“కుమారా! నీవు తెలిసే మాట్సాడుతున్నావా? నిన్నక్కడ బంధిస్తే?”

“నాన్నగారు నేను అక్కడికి వెళ్ళేది మునుగుడుపుల పెళ్ళికొడుకుగా కాదు. ఇరుదేశాల


బలాబలాలను అంచనా వేయడానికి. మన వేగులలో ధైర్యం నింపడానికి. వేంగీదుర్గం మన
గజయూధం ధాటికి నిలబడగలదో లేదో ఒకవూపు ఊపివస్తాను. జగతీంద్రవర్మ ఆదేశంలో
దాక్కుంటే తప్పక హతమార్చవలసివుంటుంది.”

“నీవుమాత్రం భీమసలుఖి మహారాజును వెంటతీసుకు వెళ్ళకు. ఆయన అవకతవక


మనిషి.”

290
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“భీమసలుఖి మామయ్య వేంగిని పరిపాలించడానికి అసమర్ధుడని నాకు తెలుసు.


నాన్నగారు! నన్ను సైన్యాద్యక్షుని చేసినందుకు వేంగిని జయించి మీ పాదాక్రంతం చేస్తాను.
పర్యటన నుంచి రాగానే దండయాత్ర ప్రకటిస్తాను. ఈ రాష్ట్ర్రకూట సామ్రాజ్యాన్ని

వెంటవెళ్ళింది. చాళుక్యులు నవదంపతులకు ఘనస్వాగతం పలికారు. ఊరూరా


ఉత్సవాలు, వినోదాలు ఏర్పాటుచేశారు.

ప్రయాణం ఖాయమైనప్పటునుంచి శిరీష ప్రణయం తీగసాగి మొగ్గతొడిగింది. అక్కడ


విష్ణు మరింత విస్తరింపచేస్తాను.”

“కుమారా! నీకు జయమగుగాక” అని మహారాజు ఆశీర్వదించి పంపాడు.

సతీసమేతంగా కర్కవల్లభుడు వేంగిదేశంలో వివాహయాత్ర కావించాడు.


శిరీషాకుమారి కూడ అన్నావదినల వెంటకదిలింది. కాని నవ్యవధూవరుల మధ్య తానెందుకని
వేంగీనగరమలోనే పట్టపురాణి శ్రద్ధాదేవి అతిధిగా వుండిపోయింది. తన మనోకుముదం
ప్రియవదన సందర్శనం కోసం వేగిరపడుతోంది. మోహము ఎంత బలమైనదో. మొలకలాంటి
ప్రణయం ఇప్పుడు ముదిరి మానయింది. వసుమిత్ర చెబుతునేవుంది, చింత నాటుకుంటే
వదలదని.

ఆనాడు వసంతపంచమి. వేంగినగరంలో మహారాణి శ్రద్ధాదేవి పుట్టినరోజు. ఆ


వేడుకలలో పాల్గొనడానికి శిరీషాకుమారికి కూడ ఆహ్వానం అందింది. నాడు యువరాజు
విష్ణువర్ధనుడు మాత్రుదేవికి వందనం చేయడానికి వస్తాడు. శిరీషలో ప్రియదర్సనం ఆశ.

మహారాణి ఉషఃకాలంలో దేవతార్చన చేస్తుంది. శిరీష ఆసమయానికల్లా శ్రద్ధాదేవి


అంతఃపురానికి జేరింది. పూజ ముగించి ఈవలకు రాగానే శిరీష ఆమె మెడలో
సరోజకుసుమహారము వేసి పాదాభివందనం చేసింది. అలా చేస్తున్నపుడు రెండు వెచ్చటి
అశ్రుకణాలు ఆమె పాదాలపై జారిపడ్డాయి.

శ్రద్ధాదేవి శిరీష భుజములు పట్టిఎత్తి అక్కున జేర్చుకుంది. చిబుకము పైకెత్తిచూస్తే-


ముఖకాంతి చంద్రజ్యోత్స్నలాగాలేదు, ఇంద్రజ్యోత్స్నలాగా వుంది. మహేంద్రతనయకదా.
ఈ కుందనపు బొమ్మ ఎవరికోడలవుతుందో అనుకుంది ఆవిడ మనసులో.

ఇంతలో యువరాజు ఆగమనాన్ని చేటిక ప్రకటించింది. వ్రీడాభరంతో శిరీష నేపధ్యము


లోకి తప్పుకుంది.
విష్ణువర్ధనుడు మాత్రుదేవికి వందనం చేసి వెంటనే వెళ్ళిపోయాడు. శిరీష నిరాశ
చెందింది. మహారాణి శిరీషను దగ్గరకుపిలిచి ఏదైనా కోరిక కోరుకోమంది. శిరీష ఒకక్షణం
సిగ్గుతో తలదించుకుంది. ప్రక్కనున్న చెలికత్తె యువరాజు రణవిద్యాసాధన అజ్ఞాతంగా
291
  చాళుక్యసింహాసనం

నిలబడి చూడాలని వుందని చెప్పింది.


మహారాణి చిరునవ్వు నవ్వి తన ముద్రికనిచ్చింది.
అపుడపుడే తెల్లవారుతోది. తొలివెలుగులు నింగి మెడవంచి చుంబిస్తున్నాయి.
అధరచుంబనం ఎంతమధురమో.
విష్ణువర్ధనుడు సాధనచేసే బరిచుట్టూ ప్రాకారము గోపురద్వారము వున్నాయి.
ముఖద్వారమువద్ద మహారాణి ముద్రిక చూపించగానే భటులు ప్రక్కకు తప్పుకున్నారు.
తడబడే అడుగులతో శిరీష సోపానాలెక్కి గోపురమండపం లోకి జేరింది. అప్పటికి
మల్లయుద్ధము కత్తిసాము పూర్తయ్యాయి. గుఱ్ఱపుస్వారి విన్యాసం నడుస్తోంది. పరుగిడే
గుఱ్ఱము పైనుండి మదగజంపైకి లంఘించడం కుంభస్థలాన్ని మర్దించి దాని మద మణచడం
తిలకించింది. వడలు పులకించింది.

చివరగా విలువిద్యా సాధన ఆరంభమయింది. శిరీష ఆసక్తిగా కన్నులు ఇంతలు


చేసుకుని చూసింది. విష్ణువర్ధనుడు సంధించిన పన్నెండు బాణాలలో మూడు గురితప్పాయి.

శిరీష చిన్నగా నవ్వింది. ‘ఇంతోటి పాండిత్యానికి బంగారు పతకమా! ఈ రాకుమారుడు


అన్నిటిలోను మిన్నకావచ్చుగాని విలువిద్యలో మాత్రం తనకన్నా తక్కువే’ ననుకుంది.

విష్ణవర్ధనుడు సాధన చాలించి స్నానానికై ధారాగ్రుహంలోకి ప్రవేసించాడు.

ప్రియదర్శనంతో శిరీష మోహం పదింతలైనా ఆ బాల అంతఃపుర మర్యాదల్ని


కట్టుబాట్లను అతిక్రమించలేదు. కన్యాసహజమైన మార్ధవాన్నీలజ్జని వీడి ప్రవర్తించలేదు.

భీమరథీ కర్కవల్లభులకు చాళుక్యదేశంలోని నగరాలలోను జనపదాలలోను


ఘనస్వాగతమే లభించింది. కాని తనను ఆహ్వానించి అందరూ విష్ణువర్ధనుని కీర్తించేవారే.
నాట్యాలు నాటకాలు ప్రహసనాలు వీధిభాగవతాలు అన్నిటా యువరాజు పరాక్రమగాథలు.
కర్కవల్లభునికి వంటికి కారం రాసుకున్నట్లు అనిపించింది.

ఒకదినం పదవీత్యుతుడైన మహామంత్రి గంగాతీర్ధుడు అజ్ఞాతంగా వచ్చికలిశాడు.

“మహామాత్యా! మేము ఈదేశంవచ్చి చాలాదినాలు అయింది. భీమసలుఖిమహారాజు


అభిమానులందరూ మమ్మల్ని వచ్చికలుస్తారనుకున్నాము. ఒక్కరూ రాలేదు. మాకు
అవమానంగా వుంది” అన్నాడు కర్కవల్లభుడు.
“రాజకుమారా! నా మహామంత్రిత్వం ఎప్పుడో ఊడింది. ఇంకా ఎందుకులేండి ఆ
గౌరవం! ఇక్కడ ఇంక భీమసలుఖి మహారాజు అనుయాయులెవరూ లేరు. ఉన్నా బయట
పడ్డారంటే టొపేరం లేచిపోతుంది. ఈ నరేంద్రమ్రుగరాజు మహాపాపి. కాపాలికులు
పేరుచెప్పి మనవారందరినీ హతమార్చాడు. మనకున్న గట్టిబలం కూష్మాండయోగి. అతడిని
292
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

స్వయంగా యువరాజే నరికాడు.”


“నరేంద్రమ్రుగరాజు శివాలయాలు నిర్మిస్తున్నాడని మహాపుణ్యాత్ముడనీ
అనుకుంటున్నారు.”
“పిచ్చిజనం! మతం ఒకపిచ్చి! ఈయనచేసిన పాపాలు ఎన్నిగుళ్ళు కట్టించినా పోదు.”
“పోనీయండి! మేము వేంగిని జయించాలని క్రుతనిచ్ఛయంతో ఉన్నాము. మేము
వచ్చింది మావిధేయులెవరో తెలుసుకోవడానికే గాని వివాహయాత్ర కోసంకాదు. ఈ దేశం
బలహీనతలేమైనా చెప్పగలరా?”
“ఈదేశం పాడిపంటలతో విలసిల్లుతోంది. అందుచేత ప్రజలు దుక్కిదున్నుకు
బ్రతుకుతారేగాని దండులో జేరరు. సైన్యం చాలా పల్చగావుంది. వేంగి ఒక స్థలదుర్గం. చుట్టూ
సహజమైన రక్షణలేమిలేవు. రామిలేరు తమ్మిలేరు కొల్లేరు పొంగే వర్షాకాలం మినహాయించి
ఎప్పుడు ముట్టడించినా సునాయాసంగా జయించవచ్చు.”
“మాదేశం మహాసైన్యాద్యక్షుడు లీశోత్తరదీక్షితుని జగతీంద్రవర్మ హత్యచేయించాడు.
మేమతనికోసం వెతుకుతున్నాము.”
“జగతీంద్రవర్మ కొండపల్లి దుర్గంలో దాక్కున్నాడు.”
“అతడిని బంధించడానికి ఉపాయం చెప్పగలరా?”
“థనం విరజిమ్మితే పనిఅవుతుంది. నేను చేయించిపెట్టగలను.”
“థనానికేమి కొదవలేదు. మీరు కోరిన థనం సమకూరుస్తాము. అంతేకాదు. మధువు
మగువ...మీరు గొప్ప రసికులని విన్నాము. ఎవరిని కోరుకుంటే వారిని రప్పిస్తాము.”

“నా పగంతా ఆ బింబాధరిపైనే! ఆకోమలే నాకొంపతీసింది. నా గుట్టంతా


బయటపెట్టింది. ఆ కులటను నా వశంచేస్తే మీరు ఏమిచేయమన్నా చేస్తాను.”
“బింబాధరి ఎవరో మాకు తెలియదు. ఆమె ఎక్కడవున్నా మీ ఒడిలో వచ్చిపడేటట్లు
చేస్తాము. అంతేకాదు. భవిష్యత్తులో మీరే ఈదేశపు మహామంత్రి! ఈవేంగీనగరం త్వరలోనే
ఖగరాజపతాక విగాజితం కాబోతోంది. శలవు.”
కర్కవల్లభుడు అభ్యంతరంలోకి వెళ్ళిపోయాడు.
గూఢచారులు కొండపల్లిదుర్గంలో దాక్కున్న జగతీంద్రవర్మను బంధించితెచ్చారు.
అంతే రహస్యంగా కర్కవల్లభుని పరివారంతోపాటు మాన్యకేతం తరలించారు.

కర్కవల్లభుడు అదే ఘనవిజయంగా భావించి తిరుగుప్రయాణం సాగించాడు.

293
  చాళుక్యసింహాసనం

47 చిత్రరథస్వామి ఆలయం
వేంగీనగరంలో చిత్రరథస్వామి ఆలయం ఘంటలు మ్రోగుతున్నాయి. ఆది ఏకచక్ర
రథం అధిరోహించి గగనతలంలో ప్రయాణించే వంటరి బాటసారికి భూతలం పైన
నిర్మింపబడిన ఆలయం. సూర్యుడు ఆకాశానికే మణి. చంద్రుడలా కాదు. చంద్రుడు గొప్ప
రసికుడు. తారా మణుల మనసులు దోచి వెంటేసుకు తిరిగే రసిఖశిఖామణి. రాత్రికో రమణి.

చిత్రరథస్వామి ఆలయం చుట్టూ ఎత్తైనదడి కట్టారు. లోనికి ఎవరినీ అనుమతించటం


లేదు. లోపల అభిచార హోమాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. భయంకర మైన
కాలభైరవ సాంప్రదాయంలో హోమాలు జరుగుతున్నాయట! అందుకు ఉజ్జయిని నుంచి
మహాభైరవులు తమతమ శునకరాజులతో కూడివచ్చారని చెప్పుకుంటున్నారు.

సాధారణంగా అయితే మహారాజ నరేంద్రమృగరాజు ప్రతిఉదయం బ్రహ్మీముహూర్తం


లోనే చిత్రరధస్వామి ఆలయాన్ని సందర్శించేవాడు. సంధ్యావందనాదికాలు అన్నీ అక్కడే
జరిగేవి. నరేంద్రమృగరాజు ఉదయించే సూర్యుడికి అభిముఖంగా నిలబడి ‘రశ్మిమంతం
సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయిస్వా వివస్వాంతం భాస్కరం భువనేశ్వరం’ అని
అర్ఘ్యం సమర్పించేవాడు. సూర్యనమస్కారాలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఆఆలయం లో
ప్రతినిత్యం సౌరహోమం అరుణపారాయణం జరిగేవి. మహారాజు పురోహితులు చేస్తున్న
సౌరహోమంలో సమిధలు సమర్పించి వచ్చేసేవాడు. ఆతరువాతే దైనందినం ఆరంభ
మయ్యేది. ఇప్పుడు అందుకు భిన్నంగా అభిచార హోమాలు జరుగుతున్నాయని చెప్పు
కుంటున్నారు.

వేంగిలో చిత్రరథస్వామి ఆలయం చాలా పురాతనమైనది. వేంగినేలిన విష్ణుకుండిన


వంశం ప్రభువులు నిర్మించారు. వేంగీదేశాన్ని కొంతకాలం శాలంకాయన వంశజులు కూడా
పరిపాలించారు. వేంగిలో విష్ణుకుండినుల పరిపాలన అంతమై భాదామి చాళుక్యుల
పరిపాలన ఆరంభమయింది. ఆ విజయం రెండవ పులకేసి తమ్ముడైన విష్ణువర్ధనుని ఘనత.
అతడు కురచవాడు కావడంతో కుబ్జవిష్ణువర్ధనుడనేవారు. కాలక్రమంలో బాదామి నేలిన
మూల వంశంతో తరాలు తెగిపోయాయి. వేంగినేలే వంశం తూర్పు చాళుక్యులుగా చరిత్రలో
స్తిరపడిపోయింది.

నరేంద్రమృగరాజు రాష్ట్రకూటులతో జరిగే యుద్ధాలతో బాగా విసిగిపోయాడు. ఆ


పరిస్ధితిని అధిగమించడానికి ఏదిచేయడానికైనా సిద్ధమయ్యాడు. కాపాలికుల్ని రప్పించి
తనకు వ్యతిరేకులందరినీ మట్టుపెట్టించాడు.ఇప్పుడుభయంకరమైన భైరవసాంప్రదాయాన్ని
అను సరిస్తున్నాడని ప్రజలు చెప్పుకుంటున్నారు.

అసలు లోపల ఏంజరుగుతోందో ఎవరికీ తెలియదు.

294
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

అభిచారహోమాలు శత్రునాశనంకోసం చేసేవి. ఈ హోమాలు క్షుద్రం అంటారుకాని


శాస్త్రవిరుద్ధం అనడానికీ లేదు.

వేదధర్మాన్ని అనుసరించకుండ అన్నసంతర్పణ లేకుండ సంప్రదాయ మంత్రాలు


లేకుండ దక్షిణలివ్వకుండ దేవతలను బ్రాహ్మణులను గురువులను బంధుజనులను
ఆహ్వానించకుండ చేసే యజ్ఞాన్ని తామసయజ్ఞం అంటారు.

మున్నుదక్షప్రజాపతి అహంకారంతోమహేశ్వరుడిని సతీదేవిని ఆహ్వానించకుండ


దేవత లనందరినీ ఆహ్వానించి యజ్ఞం చేశాడు.అది నిరీశ్వర యాగం అయింది. అందులో
సతీదేవి అవమానంతో అగ్నికి ఆహుతి అయింది. కోపగించిన మహాదేవుడు వీరభద్రుడ్ని
సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు అతడి భటులు
యాగాన్ని నాశనం చేస్తుంటే వారినెదిరించడానికి భృగుమహర్షి అభిచార హోమాలు చేసి
భయంకర మైన యోధుల్ని సృష్ఠించాడు. భృగువు ఋషి కాబట్టి ఆపద సమయాలలో
అభిచార హోమం చేయడం తప్పుకాలేదు.

కాలభైరవుడు శివస్వరూపాలలో ఒకడు. కుక్క వాహనంగా కలవాడు. మహాకాలుడు.


కాలాన్ని నియంత్రించగలవాడు. భయంకరాకారుడు. మధుపాన ప్రియుడు.

అభిచార హోమాలకోసం ఆవరణ లోనికి మధువు మాంసము మత్స్యము లాంటి


మకారాలు వెళుతున్నాయని చెప్పుకుంటున్నారు. పంచమకారాలు పూర్తిచేయడానికి
కొందరు మగువలు కూడ లోపలకు వెళ్ళారని వదంతి. లోపల నరబలులు జరిగినా ఆశ్ఛర్యం
లేదని అనుకుంటున్నారు. నరబలి జరుగుతే పురుషులనే బలిస్తారు కాని స్త్రీని బలివ్వరు.
తాంత్రిక సాధనలన్నీ స్త్రీలను గౌరవించాలని చెబుతాయి. ఈ త్రీవమైన తామసా రాధన వలన
నగరంలో ఏ ఉపద్రవం తలెత్తుతుందోనని సాత్వికులు భయపడుతున్నారు.

ఆ ఉదయం మహారాజుకోసం ఆలయం వెలుపల గోపన్న వేచివున్నాడు. ఒకప్పుడు


మాన్యకేతంలో విష్ణువర్ధనునికి విద్యాప్రదర్శనలపుడు సహాయకుడుగా పనిచేసిన గోపన్న
ఇప్పుడు సహాయమంత్రి అయ్యాడు.

“జయతిమహారాజా జయతి! తమకోసం వేగు తెచ్చాను” అన్నాడు గోపన్న


నరేంద్రమృగరాజుతో.

“ఇంత ఉదయాన్నే వచ్చావంటే అది చాలా ముఖ్యమైన విషయమై వుంటుంది”


అన్నాడు మహారాజు, గోపన్న బుజం మీద చేయివేసి ఏకాంత ప్రదేశంలోకి తీసుకు వెళుతూ.

“మహారాజా! కర్కవల్లభుడు చాలా పెద్దసైన్యంతో మనపైకి దండయాత్ర వస్తున్నాడు.”

295
  చాళుక్యసింహాసనం

“తిన్నయింటి వాసాలు లెక్కపెట్టడం సహజమేకదా. దండయాత్ర వస్తాడని ముందే


ఊహించాము.”అన్నాడు మహారాజు ఉదాసీనంగా.

“మహారాజా! ఎప్పటివలె కాదు. వేములవాడ చాళుక్యులు గోదావరీ తీరం వెంట


సాగివచ్చి వేంగిని ముట్టడిస్తారట! కోండపడమటి దేశం పైనుండి గంగాసైన్యాలు రాబోతు
న్నాయి. రాష్ట్రకూటులు దక్షిణాన పల్లవులను రెచ్చకొట్టారు. తూర్పు సముద్రతీరం వెంబడి
పల్లవ సైన్యాలు కదలివస్తాయట. కర్కవల్లభుడు గొప్ప గజయూధంతో కదలివస్తున్నాడు.
ముందుగా మానుకోట సామంతులను జయించి వేంగిమీదికి వస్తాడట. వీరంతా కూడ
పలుక్కుని ఒకేసారిగా అన్ని వైపులనుండీ వేంగిని ముట్టడించాలని వ్యూహం పన్నారు.”

“ఈ విషయం యువరాజుకు చెప్పావా?”అన్నాడు మహారాజు.

“ఇంకా లేదు ప్రభూ!ముందుగా తమకే నివేదిస్తున్నాను.”

“వెళ్ళి యువరాజునుకలువు. నేను దీక్షలో ఉన్నాను. దీక్షాభంగమైతే ఏం ప్రమాదం


సంభవిస్తుందో తెలియదు”అన్నాడు మహారాజు నిబ్బరంగా.

గోపన్న యువరాజ విష్ణువర్ధనుని కలిశాడు. యువరాజు ముఖ్యమైన సేనాపతులతో


సమాలోచన చేశాడు.

కర్కవల్లభుని వేంగి దండయాత్రకు శుభముహూర్తం నిర్ణయమయింది. కర్కవల్లభుడు


అధిరోహించవలసిన భద్ర దంతావళాన్ని చక్కగా అలంకరించారు. రంగురంగుల జనపనార
గంతలు తొడిగారు.ఏనుగు పైకి మందసం లాంటి చౌడోలు ఎక్కించారు. దాన్ని భద్రంగా
మోకులతో బిగించారు. చౌడోలు పైన ఎండతగులకుండా చప్పరం పరిచారు. లోపల మెత్తని
బూరుగుదూది పరుపులు దానిపై రత్నకంబళం పరిచారు. చప్పరం చుట్టూ బంగారు మువ్వల
పట్టీలు కట్టారు. మంచిముత్యాల చేర్లు దిగవేశారు. భద్రగజం మెడచుట్టూ చిరుగంటల
పట్టెడకట్టి మెడలో మంచి కంచు గంట ధరింపజేశారు. తొండం పైకి దిగేటట్లు బంగారు
పూతపెట్టిన ఇత్తడి పతకం ఫాలభాగానికి అలంకరించారు. దంతావళం కొమ్ము లకు
బంగారపు పొన్నులు తొడిగారు. ఆ భద్రగజం పెళ్ళికుమారుడిలా అలంకారాలు
చేయించుకుంది.

మావటివాడు అధిరోహించడానికి మాతంగం తన తొండాన్ని వంచి పట్టుకుంది.


అతడు మెడపట్టెడ పట్టుకుని వంచిన తొండంపై కాలుపెట్టి పైకెక్కి కూర్చున్నాడు. రాకుమార
కర్క వల్లభుడు అధిరోహించడం కోసం ఏనుగు మోకాళ్ళపై కూర్చుంది. సేవకులు
అంబారీలోకి ఎక్కడానికి బంగారు నిచ్చెన వేశారు. పురోహితులు స్వస్తి వచనాలు
పలుకుచుండగా కర్కవల్లభుడు దంతావళాన్నధిరోహించాడు.

296
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

వారవనితలు ఆ సింధురానికి నీరాజనం పట్టారు. దేశీగీతాలు పాడారు.

సైనికులంతా ఒక్క సారిగా కర్కరాకుమారుడికి జయజయధ్వానాలు చేశారు. వాద్య


గాళ్ళు పెద్దపెట్టున డోళ్ళూ డమాయీలు కనకతప్పెటలు కాహళాలు రుంజలు రణఢక్కలు
భేరీలు కంచుతాళాలు మోగించారు. శంఖాలు కొమ్ముబూరలు పూరించారు. వేణువు
లూదారు. మురజలు పోటుధారలు కాలికొమ్ములు ముఖవీణలు వీరణములు మోగిం చారు.
నగారాలు వాయించారు. ఆ భేరీ భాంకృతులకు భూమి దద్దరిల్లింది. పర్వతాలు
ప్రతిధ్వనించాయి.వీరులకు వళ్ళు పెరిగి వీరావేశం వచ్చింది. శత్రువులను నరుకుతా
చంపుతా అని అశ్లీలాలు చేర్చి కేకలు బొబ్బలు పెడుతున్నారు. అంతకు ముందు పట్టించిన
గౌడీమద్యం బాగా ఊపునిచ్చింది.

సైన్యల ఉత్సాహం గ్రహించినట్లు గజయూధం తొండాలు పైకెత్తి ఘీంకరించాయి.


ఏనుగులకు ఆరెపువ్వూ బెల్లంతో తయారుచేసిన మైరేయం అనే మద్యం పట్టించారు. నల్ల
మందు తినిపించారు. నాగముల ఘీంకారాన్ని చూసి గుఱ్ఱాలు ముందుకాళ్ళు పైకెత్తి
సకిలించాయి.

కర్కరాకుమారుడి భద్రగజం చుట్టూ మదపుటేనుగులు గుంపులుగా చేరాయి. ఆచుట్టూ


అశ్విక దళాలు అన్నివైపులా ముసిరి నిలిచాయి. కాలిబంట్ల పటాలాలు సైన్యానికి ముందు
నిలిచాయి. ధానుష్క సైన్యం వెనక నిలిచింది.

సేనాపటాలాలన్నిటికీ వేరువేరు ఎత్తైన పతాకా లున్నాయి. సైన్యంలో ఏదళం ఎక్కడ


ఉన్నదీ ఆ కేతనాలవలననే తెలుస్తుంది.

సైనిక యానము కూడా ఒక విద్యే. సేనాంగాలు మూడురోజుల ముందే కదలివెళ్ళాయి.


భారమైన ఆయుధాలు మోసే వేసడాలు, గొల్లెనబండ్లు, పటాలాలకోసం గుడారాలు డేరాలు
పటశాలలు శిబికలు ఏర్పరచే సామగ్రి డేరామేకులు రాటలు గుంజలు మోసుకు వెళ్ళే
కచ్చడాలు వంటసామగ్రి కదలి వెళ్ళాయి.

సైన్యం వెనకగా రూకలు నాణాలు నింపిన సందుగా పెట్టెలు భోషాణాలు మోసే వృషభ
శకటాలు నిలిచాయి. సైన్యంతో పాటు అంగడులు తెరిచే బేహారులు సుఖపెట్టే వారాంగనలు
వినోదాన్నిచ్చే నట్టువరాళ్ళు కూడా ఎద్దుబండ్లలో సిద్ధమైనారు. దండయాత్ర కొన్ని నెలలో
సంవత్సరాలో సాగే లక్షణాలు కనిపిస్తున్నాయి.

వాహినికి ఆముఖంలో వేటలు వేశారు. మకురు దున్నపోతును బలి ఇచ్చారు. నరబలిగా


ఎవరిని వేస్తారా అనుకున్నారు. వేంగినుంచి బంధించితెచ్చిన జగతీంద్రవర్మను బలియిచ్చారు.
వేడివేడి రక్తంతో రణధ్వజానికి పూతపెట్టారు.

297
  చాళుక్యసింహాసనం

అందరూ జయజయధ్వానాలు చేస్తుండగా ఒక మహానది వరద పారినట్లు సేనావాహిని


కదిలింది.

వారలా నెలదినాలు పయనించి ఆలేరు ఒడ్డున కొలెను పాకలో విడిది చేశారు. అందులో
సగం సైన్యం ముందుకు వెళ్ళి మానుకోట సమీపంలోని పూసపల్లి సరోవరం వద్ద
స్కంధావారాన్ని ఏర్పాటుచేశారు.

చాళుక్య విష్ణువర్ధనుడు తన సైన్యాధికారులతో సమావేశమయ్యాడు.


“సేనాపతులారా!” అన్నాడు యువరాజు. అందరూ సావధానులైనారు. “గోపన్నమంత్రి
తెచ్చిన వేగు విన్నా రుగా. మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి”అన్నాడు.

సేనాపతులు ఒకరిముఖాలొకరు చూచుకున్నారు. ముందుగా పట్టవర్ధనీదేవి మాట్లా


డింది. ఆమె అంతఃపురాల పాలకురాలు. “యువరాజా! ఇప్పుడు మన సైన్యాలు రాష్ట్ర
కూటులకేమీ తీసిపోయిలేవు. వారిసైన్యంలో చాలావరకూ వయసు మళ్ళిన ముదుసళ్ళు.
మన సైన్యం యువకులతో నవనవ లాడుతోంది. పద్ధెనిమిదేండ్ల యువకుడి బలానికి వయసు
పైబడిన యోధులు సమానం కాదు. కర్కవల్లభుడు ఈ సంగతి తెలీక బీరాలు పోతు న్నాడు”
అన్నది.

సేనాపతులలో దామరాజు లేచి నిలబడ్డాడు. అతడు ఏభయి ఏళ్ళు దాటినవాడు. అనేక


యుద్ధాలు చేసి చూచినవాడు. “యువరాజా!యువకుల బలం ఏమిటో వయసు మళ్ళిన వారి
బలం ఏమిటో పట్టవర్ధనీదేవికి బాగా తెలిసినట్లుంది. కానీ అనుభవజ్ఞుల నైపుణ్యం ముందు
యువకుల క్షణికావేశం పనిచేయదు, ఆరంభశూరత్వం తప్పుతే!” అన్నాడు.

అందుకు పట్టవర్ధని “ఎవరి బలం ఎంతో నాకు బాగా తెలుసు. యుద్ధంలో ప్రాణానికి
తెగించి పోరాడిన వారెవరూ ఎక్కువ యుద్ధాలు చూడలేరు!” అన్నది.

ఆ మాటకు దామరాజుకు చాలా కోపంవచ్చింది. “ఓసీ తెంపరీ!అంటే నేను యుద్ధాలలో


ఒళ్ళుదాచుకుని బ్రతికి బట్టకట్టాననా? యుద్ధరంగం అంటే అంతఃపుర పాలనం కాదు.
రణరంగంలో ప్రవేశిస్తే తెలుస్తుంది. ఎంతటివారికీ గుండెలు జారిపోతాయి. శత్రువీరులు
శూలాలతో పొడుస్తుంటే కత్తులతో నరుకుతుంటే కుఠారాలతో తెగవేస్తుంటే గదలతో మొత్తు
తుంటే ధానుష్కులు చుయ్యి చుయ్యిన బాణాలు సంధిస్తుంటే మన ముందువారొకరొకరే
కుప్పకూలుతుంటే అప్పడు పారిపోకుండా ధైర్యంగా నిలబడాలి”అన్నాడు.

దానికి పట్టవర్ధనికి కూడా రోషం వచ్చింది. “యువరాజా! నాకుకూడా వేయి సైన్యం


పంచియివ్వండి. రణం ముఖరంగంలో నిలబడి పోరాడి చూపిస్తాను. అందరూ అంతఃపుర
పాలనం అంటే అదేదో ఆటలో అరటిపండులా అనుకుంటున్నారు” అన్నది.

298
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

వారి వాదనలకు యువరాజు మందహాసం చేశాడు. “మీ ఇద్దరూ అన్నదాంట్లో నిజం


వుంది. ఆలోచించండి. పట్టవర్ధనీదేవీ! నీకు అలాగే వేయి సైన్యం ఇస్తాను.

శత్రువు మనను మూడు వైపులనుంచీ ముట్టడించి భయపెట్టాలనుకుంటున్నాడు.


మనం వెఱ్ఱివాళ్ళలాగా సైన్యాన్నివిభజించి తలొకవైపు పంపుతా మనుకుంటున్నారు. అలా
కాదు. మనమే ఎదురేగి రాష్ట్రకూట సైన్యాలను ఎదిరించి గెలిస్తే వాళ్ళ మిత్రసైన్యాలు
తోకముడుస్తాయి. మనం ఈసారి కర్కవల్లభుడిని చావు దెబ్బ తీయాలి. విజయమో
వీరస్వర్గమో ఈ యుద్ధంతో తేలిపోవాలి. కర్కవల్లభుడిని వధించడమో బంధించడమో చేస్తే
ఇదే వారితో మన చివరియుద్ధం అవుతుంది.వీరులారా అందరూ ప్రాణాలకు తెగించి
పోరాడండి.

మానుకోట రాజధానిగా పరిపాలించే ముదిగొండ చాళుక్యులు మన వేంగికి


సామంతులు. వారికి తోడుగా రణమర్దనుడు కొంత సైన్యం తీసుకుని వెళ్ళాలి. పట్టవర్ధని
సైన్యంకూడా ఇందులోనే వుంటుంది. దామరాజు సైన్యం మరొకమార్గంలో వెళ్ళి పొంచి
వుంటుంది.”అన్నాడు యువరాజు.

అప్పుడు చలమయ్య సేనాని మాట్లాడాడు. “యువరాజా! రాష్ట్రకూట అశ్వికదళాలకు


దీటైన దళాలు మనకున్నాయి. కానీ వారికున్న గజదళం మనకు లేదు. వారి కుంజర యూధమే
వారికి పెట్టని కోట. వాళ్ళ దంతావళాలు తెలికగా మానుకోట దుర్గాన్ని తవ్వి వేయగలవు.
ఆంధ్ర ధానుష్కులకు వాళ్ళ విలుకాళ్ళు సరిపోలరు కాని వారి కాల్బలం కూడ మనకన్నా
అధికంగా ఉంది. అలాంటపుడు మనం కర్కవల్లభుడిని సునాయాసంగా గెలవలేము, మీరు
ఏదైనా అధ్భుతం సృష్టిస్తే తప్పుతే!” అన్నాడు.

అందుకు యువరాజు “చెలమయ్య సేనానీ! మీరు చాల దూరదృష్ఠి కలవారు. కానీ


వారి గజయూధాన్ని మొత్తం నాకు వదిలేయండి. నేను చూచుకుంటాను. అప్పుడైనా మన
విజయం తధ్యమౌతుందా?” అన్నాడు.

అప్పటికీ చలమయ్య సేనాని “మనం గట్టిగా ప్రయత్నించాలి” అని వూరుకున్నాడు.

శుభముహూర్తం చూసుకుని వేంగీసైన్యాలు ముదిగొండ చాళుక్యులకు దన్నుగా


మానుకోట బయలుదేరి వెళ్ళాయి. వేంగిలో చిత్రరథస్వామి ఆలయం నుండి భైరవులు
రాత్రికిరాత్రి మాయమయ్యారు. ఎక్కడికో వెళ్ళిపోయారు.

పూసపల్లి సరోవరం తీరంలో స్కంధావారం ఏర్పాటు చేసుకున్న రాష్ట్రకూటసైన్యాలు


మానుకోట ముట్టడికి ఇంక ముహూర్తం నిర్నయించలేదు. ముందుగా కోట అనుపానులను
అధ్యయనం చేస్తున్నారు. వారింక ప్రయాణబడలికలో వున్నా రనుకున్నారు రణమర్దనుడు
పట్టవర్ధనిదేవి. కొంచం తొందరపడి స్కంధావారాన్ని ముట్టడించారు.

299
  చాళుక్యసింహాసనం

పట్టనర్ధనిదేవి ఎక్కుపెట్టి విడిచిన బాణంలా ముందుకు దూసుకు వెళ్ళింది. అసలే


దామరాజును ఆక్షేపించి వుండడంతో ముందు వెనకలు చూచుకోలేదు. శత్రుసైన్యాలను
ఛేధించుకుంటు వెళ్ళింది. ఇరువైపులా యోధులు తెగిపడుతున్నారు.

రాష్ట్ర్రకూట సైన్యాలలో కాకలుతీరిన యోధులున్నారు. పట్టవర్ధనిని ముందుకు రానిచ్చి


అన్నివైపుల కమ్ముకున్నారు. రణమర్దనుడి దళాలు దూరమయ్యాయి. కొద్దిసేపటిలో పట్టవర్ధని
సైనికులు పలచబడ్డారు. ఒంటరిదయింది. ఎవరో పైన వలవిసిరారు. చరపట్టారు.
తమవిజయానికి సంకేతంగా ఆమెను బుజాలమీద మోసుకుపోయారు.

తమ సైన్యాల విజయవార్త విన్న కర్కవల్లభుడు అమితానందంతో కొలనుపాక నుంచీ


పూసపల్లికి బయలుదేరాడు. తను వచ్చేవరకూ మానుకోట ముట్టడి ఆపుచేయమని రహస్య
వేగు పంపాడు. తన ఆధ్వర్యంలో మానుకోటనేకాక వేంగిని కూడా ముట్టడించాలని
కర్కవల్లభుడు తలంచాడు. ఆ విజయంతో మిత్రసైన్యాల అవసరంలేదనే అనుకున్నాడు.

మానుకోట ముట్టడికి వ్యూహం సన్నద్ధమయింది. పర్వత పంక్తులలాంటి రాష్ట్రకూట


గజ సైన్యం మానుకోటదుర్గాన్ని పడదోయగలదనే నమ్మకంతో ఉన్నారు.

అది శీతాకాలం. హేమంతఋతువు కావడంతో సూర్యోదయానికి ముందర బాగా


పొగ మంచు పడుతోంది. మనిషి ప్రక్కన మనిషి నిలబడినా కనిపించటంలేదు. చుట్టూవున్న
పొలాలలో పంట తరలించుకు వెళ్ళారు. మిగిలిపోయిన గడ్డీగాదం ఆరాత్రి పొలాలలో
తగలపెట్టారు. అందు చేత తెల్లవారుఝనున మూడమంచు మరీ అధికమయింది.

రాష్ట్రకూట స్కంధావారంలో తెల్లవారుఝామునే మావటీలు ఏనుగుల సేవ ప్రారంభిం


చారు. వాటిని కడగడానికి మందలు మందలుగా సరోవరానికి తీసుకు వెళుతున్నారు. కొన్ని
ఏనుగులకు రోజూ ఇచ్చే శిక్షణ ఇస్తున్నారు. ఇంకా కొన్ని మాతంగాలు వెనక కాళ్ళకు వేసిన
సంకెళ్ళవలన ఎటూపోలేక అటునుటూ ఊగుతున్నాయి. ఏనుగు క్షణం కూడ నిలకడగా
వుండలేదు. కొందరు సైనికులు ఒక్కచోట చేరి చలిమంటలు వేసుకుంటున్నారు. కొందరు
ముసుకుతన్ని పడుకోగా కొందరు ప్రాతఃకృత్యాలు తీర్చుకుంటున్నారు.

ఆ సమయంలో కొండల వెనుక నుంచి రెండు వందల భయంకరమైన భైరవసైన్యం


స్కంధావారాన్ని ముట్టడించింది. ఒక్కొక్కరి వెంబడీ నాలుగైదు అడవి జాగిలాలున్నాయి.
వాటిని ఏనుగులపైకి ఉసికొల్పారు. ఆకలిగొన్నరేచుకుక్కలు పెద్దగా మొరుగుతూ రాష్ట్ర కూట
గజదళాలపై పడ్డాయి. విచిత్ర మేమిటంటే ఎంతపెద్ద మదకరీంద్రమైనా కుక్కను చూసి
భయపడి పారిపోతుంది. జాగిలాలు వాటి తొండాలను కరుస్తాయనే భయం. శ్వానానికి
కనుచూపు దూరానికి ప్రసరించదు. అవి వాసనను పట్టీ అలికిడిని పట్టీ పరుగిడతాయి.
అందుచేత వాటికి మూడమంచు బెడదకాదు.

300
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

భైరవాల భౌంకారానికి బెదిరిన ఏనుగులు తనవారినే తొక్కుకుంటూ పరుగులు


తీశాయి. మావటివారు అదుపు చేయబోతే వారిని తొండంతో చుట్టి నేలకేసి కొట్టి కాలితో
తొక్కి మరీ పలాయనం చిత్తగించాయి.

మంచుచేత ఎవరు ముట్టడించిందీ తెలియరాలేదు.

వేటకుక్కలు నిర్భయంగా ఏనుగు తొండాలకెగబాకి కరిచి పట్టుకున్నాయి. అడ్డం


వచ్చిన రాష్ట్రకూట యోధులను పైబడి కండలు ఊడివచ్చేటట్లు కరిచాయి. కుక్కల్ని
విడిపించుకోడానికి ఏనుగులు తొండాలను చెట్లకేసీ బండరాళ్ళకేసీ బాదుకున్నాయి.
సంకెలలు వేసున్న ఏనుగులు సహితం భయంతో గెంతుకుంటూస్కంధావారం లోని
గుడారాలను డేరాలను తొక్కి పారేశాయి. కొన్ని ఏనుగులు అదుపుతప్పి అడవుల్లోకీ
కొండలపైకి పారిపోయాయి. కొన్ని సరోవరంలోకి దిగిపోయాయి. భైరవసైన్యం వడలంతా
భస్మం రాసుకుని మెడలో ఎముకల దండలు ధరించి సంస్కారము లేని విరబోసిన
కేశపాశాలతో పెద్ద శూలం చేత పట్టుకుని రాష్ట్రకూటులపై బడ్డారు. తమ యజమానుల అండ
చూచుకుని రేచుకుక్కలు మరీ రెచ్చిపోయాయి.

రాష్ట్రకూట సైనికులకు కుక్కలను చంపడానికీ భైరవయోధులను హతమార్చడానికీ


చాలా సమయం పట్టింది. భైరవ భటులకు ప్రాణభయం లేదు. తెగించి చివరి రక్తంబొట్టు
క్రింద పడేంత వరకూ పోరాడి మరణించారు. సైనికులు కుక్కలు కరిచిన గాయాలకు కట్లు
కట్టుకుంటున్నారు. రాష్ట్రకూట స్కంధావారం కుక్కలు చింపిన విస్తరి అయింది.

అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు చెన్ను తరిగి జాబిల్లిలా ఉన్నాడు. ముద్దుముద్దుగా


కొమ్మల చిగురుటధరాలను ముద్దుపెట్టుకుంటు పైకి వస్తున్నాడు.

ఆ సమయంలో దామరాజు సైన్యాలు ఒకవైపునండీ రణమర్దనుని దళాలు మరొకవైపు


నుండి రాష్ట్రకూటుల్ని ముట్టడించాయి. అందరూ విజయమో వీరస్వర్గమో అన్నట్లు
పోరాడారు. సంకుల సమరం సాగింది. చమరీ గురుకులం యోధులు శూలవ్యూహం పన్ని
రాష్ట్రకూట స్కంధావారం లోకి చొచ్చుకు వెళ్ళి నేరుగా కర్కవల్లభుని శిబిరాన్ని ముట్టడిం
చారు. అప్పటికే ఆ శిబిక చుట్టూ కాపుకాసే నాలుగు దిగ్గజాలు పారిపోయాయి.

చాళుక్యుల వ్యూహ సామర్ధ్యానికి కర్కవల్లభుడు అప్రతిభుడయ్యాడు. ఆసమయానికి


ఇంకా అతడు వధూపరిష్వంగాన్ని వీడలేదు. బయటి రణగొణధ్వని వినిపించడంతో చప్పున
లేచాడు.

కర్కరాకుమారుడు అందగాడేకాదు.కళాతృష్ణ కలవాడు. గానంచేస్తుంటే ఎదురుగా


కూర్చుని తాళం వేస్తాడు. రాగం పొల్లుపోతే చెబుతాడు. నట్టువరాళ్ళ ఉత్తరీయాలను
సవరిస్తాడు.

301
  చాళుక్యసింహాసనం

కర్కవల్లభుడి గుడారంలో గతరాత్రి మధుమతి నాట్యం చేసింది. మదిరతోపాటు


అధరసుధ కలిపి తాగించింది. రాకుమారుడు ఆమె సేవలకు మెచ్చి నాజూకైన నడుముచుట్టూ
బంగారు మొలనూలు తొడిగాడు.

సీతాకాలం గుడారాలలో నిద్రించడం కష్టమే. రాకుమారుడిని చలి ఒణుకు నుంచి


మధుమతి పరిష్వంగం నులివెచ్చగా చలిమంటలా కాపడింది. అందుచేత బాగా నిద్రపట్టింది.

కర్కవల్లభుడు వస్త్రాలు సవరించుకుని రొంటినఖడ్గం వ్రేలాడగా శూలం పట్టుకుని


శిబిరం లోంచి బయటికి వచ్చాడు. అక్కడ తన అశ్వికదళాలకు శత్రువులకు యుద్ధం జరుగు
తోంది. ప్రతివీరులు తన శిబిక వరకూ వచ్చారంటే పరిస్తితి విషమించినట్లు భావించాడు.
జవనాశ్వాన్నెక్కి కొంతసైన్యాన్ని విడగొట్టుకుని పలాయనం చిత్తగించాడు.

అదేసమయంలో ఆంధ్ర ధానుష్కులు విజృంభించి రాష్ట్రకూట అశ్వికసైన్యాన్ని


నిలువరిం చారు. గజబల సహకారం లేక రాష్ట్రకూట సైన్యాలకు రక్షణ లేకుండా పోయింది.
రాష్ట్రకూట కాలిబంట్లు మాత్రం వేంగివారిని ముక్కలు ముక్కలుగా నరికారు. చాళుక్యుల
కాలిబంట్లు శత్రువుల ధాటికి తట్టుకోలేకపారిపోయారు. కొందరు చచ్చిన గుఱ్ఱాల చాటున
దాగారు. ఆయుధాలు పడవేసి చేతులుజోడించి దణ్ణంపెడుతూ నిలబడ్డారు. కొందరు బట్టలు
విప్పేసి చేతులు నెత్తిన పెట్టుకుని నిలబడ్డారు.

రాష్ట్రకూట సైన్యాధిపతి ఛస్తాణుడు యుద్ధరంగం వదిలిపెట్టి కర్కవల్లభుని రక్షించడానికి


అటు వెళ్ళాడు. దామరాజు పారిపోయే తమ సైన్యాలను మందలించి ధైర్యం చెప్పి సమీ కరించి
ముందుకు నడిపాడు.

ఆప్పటివరకూ అజ్ఞాతంగా దాగివున్న యువరాజ విష్ణువర్ధనుడు కర్కవల్లభునికి ఎదురు


వచ్చి నిలువరించాడు. ఇద్దరు రాజకుమారుల మధ్య ద్వంద్వయుద్ధం సంభవ మయింది.
ఇద్దరి మనసులోను మాన్యకేతంలో రణవిద్యాప్రదర్శనలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు ఓడిన
కర్కవల్లభుడు ఇప్పుడు గెలవాలని అమితోత్సాహంతో విజృంభించాడు.

విష్ణువర్ధనుడు జంకులేకుండా రెట్టించి పైబడి యుద్ధం చేశాడు. ఇద్దరూ తగిలిన


గాయాలను లెక్కచేయటం లేదు. పోరు భీకరమయింది. తమశక్తినంతా కూడదీసుకుని
పోరాడుతున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు మడిసే సమయం ఆసన్నమయింది. విష్ణు
వర్ధనునికి సమర్ధులైన అంగరక్షకులున్నారు. వారు వెనకనుంచి ప్రక్కలనుంచి ఎవరూ
దొంగదెబ్బ తీయకుండా కాపుకాచారు.

విష్ణువర్ధనుని పరాక్రమం ముందు మగత నిద్రలోంచి వచ్చిన కర్కవల్లభుడు నిలబడ


లేకపోయాడు. సాములో వేగం తగ్గిందంటే విష్ణువర్ధనుడు నరికివేస్తాడు.

302
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ఆ సమయంలో రాష్ట్రకూటుల పట్టసాహిణి ఛస్తానుడు తన అశ్వికదళాలతో మధ్యలో


దూరి తమ రాకుమారుడిని విడిపించుకు పోయాడు. పారిపోయే కర్కవల్లభుని విష్మువర్ధనుడు
ఉపేక్షించి వదిలివేశాడు. విష్ణువర్ధనుడు వెనక్కు తగ్గి తన సైన్యాలను ఉపసంహరించు
కున్నాడు.

యువరాజు వ్యూహరచనా సామర్ధ్యానికి మానుకోట సామంతుడు ఆశ్ఛర్యపోయాడు.


అంత పెద్ద గజసైన్యాన్ని కేవలం కుక్కలతో కరిపించి జయించడం అనూహ్యమైన విషయం.
అంతవరకు భైరవ సైన్యాన్ని ఆయత్తం చేసినట్లు ఎవరికీ తెలీదు.నానావిధాల భంగపడిన
పట్టవర్ధనిని దామరాజు విడిపించుకు వెళ్ళాడు.

చెదరిన సైన్యాలను కూడతీసుకోవటానికి కర్కవల్లభునికి పదిరోజులు పట్టుంది. పెద్ద


సైన్యంతో ఛస్తానుడిని మానుకోట ముట్టడికి పంపాడు. చాళుక్యులందరు మానుకోటను
రక్షించుకోవటానికే ప్రయత్నిస్తారనుకున్నాడు. మిగతా సైన్యాన్ని మరోమార్గంలో వేంగివైపు
పంపాడు.

మానుకోటలో బురుజులపై రాళ్ళురువ్వె యంత్రాలు అగ్నిగోళాలు విసరే యంత్రాలు


పనిచేస్తున్నాయికాని ముఖ్యమైన సైన్యమంతా రహస్యమార్గంగుండ బయికి వెళ్ళిపోయింది.
వట్టిపోయిన మానుకోట వశమైంది.

చివరికి వేంగికి సమీపంలోనే మూడురోజులపాటు ఘోరమైన యుద్దం జరిగింది.


జనక్షయమే కాని రాష్ట్ర్రకూటులు పురోగమించలేకపోయారు. చాళుక్యుల వ్యూహాలముందు
కర్కవల్లభుని సైనికబలం పనిచేయలేదు. కర్కవల్లభుడు విష్ణువర్ధనునితో ద్వంద్వ యుద్దానికి
దిగి విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలనుకున్నాడు. ఓడడంకన్నా మరణం
మేలనిపించింది. విష్ణువర్ధనుడు అవకాశం ఇవ్వలేదు. రథం అధిరోహించి ధనుద్థారియై
తనవారిపైకి ఎవరు చేయెత్తినా ఖండిస్తూ సాగాడు. ఇంకా ఎక్కువసేపు పోరాడితే భంగపాటు
తప్పదని కర్కవల్లభుడు వేంగీ దండయాత్రకు తిరోముఖం పట్టించాడు.

మాన్యకేతం తిరిగిరాగానే అవమానంతోకర్కవల్లభుడు తన మహాసైన్యాద్యక్ష పదవిని


త్యజించివేశాడు.ఇంద్రవల్లభుడు కుమారుడిని ఘూర్జరదేశం రాజప్రతినిధిగా పంపించాడు.

48 కల్లుపాట
ఆనాడు త్రయోదశి. బహుళ త్రయోదశి. మాన్యకేత నగరంలో మధువిక్రయానికి ప్రతి
సంవత్సరం వైశాఖబహుళ త్రయోదశినాడు వేలాం పాట జరుగుతుంది. అందులో ఎక్కువ
సుంకానికి పాడినవారికి ఒకసంవత్సరంపాటు కల్లు మద్యము విక్రయించడానికి అనుమతి
లభిస్తుంది.

303
  చాళుక్యసింహాసనం

మధుకరసెట్టి రాష్ట్రకూట దేశానికి వణిజామాత్యుడు. ఆ పదవి దక్కడం అంటే


సామాన్యం కాదు. ధనికులైన వ్యాపారులందరూ ఆయన వద్ద చేతులు నలపవలసిందే.
వ్యాపారం అన్న తరువాత ఎంతో కొంత లొసుగులుంటాయి. ప్రభుత్వం మరీ నిక్కచ్చిగా పోతే
వ్యాపారం సాగదు. ధనిక వ్యాపారులందరూ వేరేదేశానికి వెళ్ళిపోతారు. చివరికి చిల్లర
వర్తకులే మిగులుతారు. దేశం చాలా సుంకం నష్టపోతుంది.

మధుకరసెట్టి ఆసీనుడు కాగానే కల్లుపాటకు వచ్చిన వణిజులందరూ కూర్చున్నారు.


మధుకరసెట్టి సురాపానం పైన పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. దాని సారాంశమేమిటంటే కల్లు
పాటలో నెగ్గినవారు మాన్యకేత నగరంలో జేష్ట పాడ్యమి నుంచీ సంవత్సరం పాటు సురా
విక్రయం చేసే అధికారాన్ని పొందుతారు. వేరెవరైనా విక్రయిస్తే అది నేరం అవుతుంది.

సురలో జేర్చినవి బెల్లం నుంచీ తయారుచేసే గౌడి, బియ్యం నుండి తయారయ్యే పైష్టి,
పనసపండు నుంచీ చేసే పానసం, ద్రాక్షపండ్లనుండీ చేసే సారాయం, తేనె నుండీ చేసే
మధూకం, ఖర్జూర సుర, తాటికల్లు, అన్నిరకాల అరిష్టలు ఆసవాలు, ఆరెపువ్వు నుంచీ చేసే
మైరేయం, కొబ్బరి చెట్లనుండీ తీసే నారికేళం, మైక్షవం, ఇప్పపువ్వు నుండీ తీసే మధూత్ధం
మొదలైనవన్ని అమ్ముకోడానికి అనుమతి లభిస్తుంది.

ఆసంవత్సరం ఎందుకో ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్యకు వప్పయ్యశ్రేష్ఠి ఏకైక ప్రత్యర్ధి


అయ్యాడు. చిల్లర సుర అమ్మకందారులందరూ ఏకమై వప్పయ్య శ్రేష్టిని పోటీకి పెట్టారు.
ఆయన మిగతా శ్రేష్ఠులందరికీ వాటా ఇస్తానన్నంనందుకు అందరూ నోరు మెదపకుండా
కూర్చున్నారు. పాట పెరుగుతూ పోతోంది. ఎవరూ వెనక్కు తగ్గటం లేదు. పాట మేరు
పర్వతం అంత ఎత్తు ఎదిగింది. వెనకటి సంవత్సరం పాటకు మూడింతలైంది. ఎలాగయినా
ఆంధ్రశ్రేష్ఠిని ఓడించాలని రాష్ట్రకూట వణిజసంఘం నిర్ణించుకుంది. నిజంగా కల్లు మద్యం
అమ్మడంలో అంత లాభం ఉండదు. ప్రభుత్వ బొక్కసం మాత్రం బాగా నిండుతుంది.

కౌటిల్యుడి అర్ధశాస్త్రం అనుసరించి మద్యం పానశాలలలో మాత్రమే త్రాగాలి. మద్యం


ఇంటికి తీసుకుపోకూడదు. ఆసవాలు అరిష్టలు మాత్రం ఇంటికి తీసుకుపోయి త్రాగవచ్చు.
వాటిలోకూడ మద్యం ఉంటుందికానీ మరీ మత్తెక్కించేటంత ఉండదు. పానశాలలో
పాంధులను ఆకర్షించడానికి అందగత్తెల అర్ధనగ్న నృత్యాలను సహితము కౌటిల్యుడు
నిషేధించలేదు. అలాగే పానశాలలో ఏఏ పశువుల పక్షుల మాంసపు వంటకాలు విక్రయించ
వచ్చో ఏవి నిషేధమో కూడ నిర్ణయించాడు.

మధుపానం శ్రేష్టమైన బాహ్మణునికే నిషిద్ధం. ‘కామాదపి రాజన్యో వైశ్యో వాపి కథంచన,


మద్యమేవ సురాం పీత్వా న దోషం ప్రతిపద్యతే’. సైన్యంలో పనిచేసేవారికి శ్రమజీవులకు
సురాపానం నిషేధం కాదని ధర్మశాస్త్రం చెబుతోంది.

కానీ ఈ సూత్రాన్ని ఎవరూ పాటించరు. అంతః పురాలు మొదలు ధనికుల ఇళ్ళలో

304
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

కాపిశాయనము మేధకప్రసన్న మొదలైన విదేశీ మద్యాలు తమకోసం ఆహూతులకోసం


నిలువ ఉంచుకుంటారు.

మరకతగుప్తుడు నగరం వణిజులందరిలోకి పెద్దమనిషి. ఆయన మాట సామాన్యంగా


ఎవరూ కాదనరు. ఆయన కలిపించుకుని ఇద్దరు శ్రేష్ఠులమధ్యా పాట చెరిసగం చేయాలని
చూశాడు. పాట అలా పంతానికి పోయి పెంచుకోవడం వలన బచ్చులకు నష్టము ప్రభుత్వానికి
లాభము. పోటీపడుతున్న ఇద్దరూ సంధికి అంగీకరించకపోవడంతో పాట ఆదినానికి నిలుపు
చేసి మరుదినం ఆరంభ మయ్యేటట్లు మాత్రం వణిజామాత్యుడితో మాట్లాడి చేయగలిగాడు.
ఒక రోజు గడుస్తే ఇద్దరి ఆవేశము పంతము తగ్గుతుందని ఆయన భావించాడు.

మరకతగుప్తుడు ఆంధ్రశ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు.

“గోమఠయ్యగారూ! కల్లుపాట విషయంలో మీరంత పంతానికి పోవడం నాకు


నచ్చలేదు. మద్యంధర ఎంతపెంచి అమ్మినా అంత పాట గిట్టుబాటు కాదుకదా! ధర మరీ
పెంచుతే తాగే వాళ్ళు తగ్గిపోతారు.”అన్నాడు మరకతగుప్తుడు.

“పెద్దవారు! మాయింటిదాక వచ్చారుకాబట్టి చెబుతున్నాను. ఎప్పటిలాగే పాట నాకే


వస్తుందనే ధీమాతో దేశవిదేశాలనుండి కపీశ నగరంనుండి విలువైన మద్యం పీపాలకొద్ది
తెప్పించాను. ఇప్పుడు పాట నాకు రాకపోతే ఆ పెట్టుబడంతా ఏంకావాలి?”అన్నాడు
గోమఠేశ్వరయ్య.

“అలాఅని ప్రభుత్వానికి ఇంత సుంకం కడితే మీకు ఏం మిగులుతుందీ?”

“మిగలకపోతే పోనీయండి. దిగుమతి సుంకము అప్పులకు వడ్డీలు గిడితేచాలు.


పెట్టుబడి అంతా రాకపోయినా కొంత నష్టం క్రింద భరిస్తాను”అన్నాడు గోమఠేశ్వరయ్య.

మరకతయ్య తలపాగ తీసి ఒకసారి బుఱ్ఱగోక్కుని మళ్ళా పాగా పెట్టుకున్నాడు. “అట్లా


కాకుండా ఈ ఏటిపాట మీరిద్దరూ చెరిసగం చేసుకుంటే ఏమవుతుంది? ఒకసారి ఆలోచన
చేయండి”అన్నాడు.

“మరకతయ్యగారూ మీకొక విషయం తెలుసా? అసలు వప్పయ్య దగ్గర సరుకేలేదు.


అందరూ ఆయన్ని రెచ్చగొట్టి పాడిస్తున్నారు. నన్ను పడగొట్టడమే వాళ్ళవుద్దేశ్యం!”

“అలాంటపుడు మీరు పాట వదిలేస్తే వప్పయ్యకు కూడ తెలిసివస్తుందికదా?”

“మరకతయ్యగారు! ఆయనకు నష్టం రావడం వలన నాకేమిటి లాభం చెప్పండి?


మనం మనం బేహారులం. వ్యాపారం అంటే లాభమో నష్టమో తేలాలి!”

305
  చాళుక్యసింహాసనం

“మీమాట నాకు నచ్చింది. పోనీ మీ సరుకంతా ఆయనకు అమ్మేస్తే?”

“నేనెందుకు అమ్మలి? చాతకానివాడు ఆయన అసలు రంగంలోకి దిగడమెందుకూ?


నన్ను నష్టపరచడానికే కదా? పాట పెంచి వదిలేయడానికేకదా?”

“మీరుకూడా అదే పని చేస్తే అతడేమయిపోతాడు?”

“మరకతయ్యగారు! నేనుకూడ అంత పంతానికి పోయేవాడినికాదు. ఈ రాష్ట్ర్రకూట


బచ్చులంతా నాపైన కక్షకట్టారు. ప్రభుత్వం కూడ నాకు వ్యతిరేకంగానే వుంది. వప్పయ్యకు
ప్రభుత్వం అండవుంది. మా అమ్మాయికి జరిగిన అన్యాయం మీకు తెలియనిది కాదు.
ముక్కుపచ్చలారని పిల్ల. ఎంత తెలివిగా వుండేదీ. ఆ కర్కవల్లభుని వలలో పడింది. మా
అమ్మాయిని చేసుకోమని ప్రార్దించడానికి మిమ్మల్నీ వప్పయ్యని కూడా వెంటపెట్టుకుని
పోయానే! ఆ ఇంద్రవల్లభుడు మననేమైనా గౌరవించాడా? నాకెంత కడుపుకోత ఉంటుందో
మీరేఆలోచించండి.” గోమఠేశ్వరయ్య భోరున ఏడ్చేశాడు.

“ఊరడిల్లండి. మీకు జరిగిన అన్యాయం అంతా యింతకాదు.”

“ఈ వప్పయ్య అప్పుడేమన్నాడో తెలుసా?‘మనబంగారం మంచిదైతే ఒకరిననవలసిందే


ముందీ!’ అన్నాడు. పిల్ల తెలీక కాలుజారింది. అంతమాత్రం చేత కులాభిమానం కూడ
లేకుండా పుండుమీద కారం చల్లుతాడా?”

“అసలు విషయం ఇంద్రవల్లభునికి మీరు వీరోత్సవాలలో పాల్గొన్న విష్ణువర్ధనునికి


ఆశ్రయమిచ్చారని కోపం. లేకపోతే రాజ్యాలేలే ప్రభువులు వైశ్యకన్యని చేసుకోవచ్చు. విష్ణు
వర్ధనుడు మీ విడిదిలోనే ఉన్నాడని అతడి రథం కూడ మీరే ప్రత్యేకంగా తయారు చేయిం
చారని మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తలంచారు. అందుకే ఇంద్ర
వల్లభుడు మీ సంబంధం కలుపుకోలేదు.”

“మరకతయ్యగారు!ప్రభుత్వానికి అలాంటి ఆధారాలేమైనా దొరికాయా? ఆ అరథం


తయారు చేసిన రథకారులు దొరికారుకదా! వాళ్ళేమైనా నా పేరు చెప్పారా? కేవలం ఒక
అనుమానం పెట్టుకుని ఆడపిల్లకు అన్యాయం చేస్తారా?”

“మీపైన మరొక అభియోగం కూడ వుంది.”

“ఏమిటదీ?”
“అదిచెప్పతగిందికాదు.”
“ఎవరూ చెప్పకపోతే నా తప్పు నాకెలా తెలుస్తుందీ?”

306
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“చెబుతేకూడ బాగుండదు.”
“మీరు చెప్పకపోతే నాకెప్పటికీ తెలీదు.”
“మీరు తరుచూ రాజమాత నగ్నసౌందర్యాన్ని చూడడానికే కోటలోకి వెళ్తున్నారని.”

“పోనీ అలాగే అనుకుందాం! ఆమె స్వచ్ఛందంగా దిగంబరి! అకించన! ఆమెను నేనే


కాదు పార్శ్వనాథ ఆలయానికి వచ్చేవారందరూ చూస్తున్నారు మరి! ఐనా కందకు లేని దురద
కత్తిపీటకెందుకూ? నేను ఆమె మాటమీద జైన దేవాలయాలకు జైనమునుల వసతులకు చేసిన
దానధర్మాలు కూడ చూడండి. ఆలయాలకు చేయవలసిన మర మతులు నూతన శిల్పాలు
చెక్కడాలు విషయంలో ఆమెతో చర్చించడానికే కోటలోకి వెళు తుండే వాడిని.”
“మరి మీరు జైనులా?”
“నేను సగం జైనుడిని సగం వైదిక మతం వాడిని.”
“నేను ఇంద్రవల్లభులతో మరొకసారి మాట్లాడుతాను.”
“నాకుమార్తె చనిపోయిన తరువాత మా మధ్య ఎవరూ సంధిచేయనవసరంలేదు.”
“మరి మీరు రాష్ట్ర్రకూట సామ్రాజ్యాన్ని పడగొడతానని శపధం చేశారుటకదా?”
“దుఃఖంలో కడుపుకోతతో ఏవేవో అంటాం. అవన్నీ జరుగుతాయా?”
“ఒకమాట చెప్పనా? ఇంద్రవల్లభులకు మీరంటే భయమే!”
“ఆ విషయం నాకు తెలుసు. అందుకే నా వ్యాపారాలు ఒకటొకటే పడగొట్టాలని
ఎత్తులు వేస్తున్నాడు.”
“ఇంతకూ కల్లుపాట విషయం ఏంచేద్దాం?”
“ఎవరూ ఏమీ చేయనవసరంలేదు. కాగలకార్యాన్ని గంధర్వులే చేస్తారు. మరకతయ్య
గారు! మధ్యలో మీరేమీ శ్రమతీసుకోకండి.”
“మరి నేను వెళ్ళిరానా?”
“మీరింతదూరం వచ్చినందుకు ధన్యవాదాలు. వ్యాపారంలో వప్పయ్య నాముందు పిల్ల
కాకి!”
మరకతయ్యఒకసారి తల పైకెత్తి ఆంధ్రశ్రేష్ఠి వంక చూశాడు.

49 స.భ.ర.న.మ.య.వ
విశాఖదత్తుడు యువరాజు విష్ణువర్ధనుడు మాన్యకేత నగరంలో రహస్యంగా సమావేశ
మయ్యారు. వేంగి చాళుక్య రాకుమారుడు సార్ధవాహులతో కలిసి అజ్ఞాతంగా మాన్యకేత
నగరం జేరాడు.

307
  చాళుక్యసింహాసనం

“విష్ణూ! ప్రయాణం సుఖంగా జరిగిందా?” అన్నాడు విశాఖదత్తుడు.

మిత్రులిద్దరూ సమావేశమయ్యింది ఆంధ్రశ్రేష్ఠి నూతన గృహం కూడా కాదు.


ఎందుకంటే అక్కడ నిర్మాణ పనివారిగా రెండు వేలమంది సైన్యాన్ని చేర్చారు. అందులో
ఎవరైనా గూఢచారి వుండే అవకాశం వుంది.

“విశా!విజయం సాధించాలంటే ముందర కష్టపడక తప్పదుకదా! వేంగినుంచి


ఇక్కడికి రెండువంతులు వృషభ శకటాలపైన రెండువంతులు కాలినడకనా వచ్చాను.
రత్నంచెట్టి గారి మనుషులు నన్ను చాల జాగ్రత్తగా జేర్చారు. ఇంతకూ ఈ ప్రదేశం
సురక్షితమేనా?” అన్నాడు విష్ణువర్ధనుడు.

“యువరాజా!మనం ఇప్పుడు ఉన్నది ఒక పాడుపెట్టిన భవనం. గృహయజమాని


ఇంటిలోపల మరణించాడనీ నక్షత్రం త్రిపాది అని ఆరు నెలలు పాడు పెట్టారు. ఇందులో
యజమాని దయ్యమై తిరుగున్నాడని వదంతులు కూడా వున్నాయి. అందుకని ఈ దరి
దాపులకు ఎవరూ రారు. అంతేకాక ఇక్కడ ఒక సేనాపతిని కాపు పెట్టాను.” అన్నాడు
విశాఖదత్తుడు.

“ఐతే ఆ యజమాని నీవు నేనే ననమాట!”

“మనం చిన్నదెయ్యాలమా మహాభూతాలం!యువరాజా! రాత్రి నాకు నిద్ర పట్టలేదు.


నీగురించి చాలా ఆలోచించాను. నీవెంత సుకుమారంగా ఉండవలసినవాడివీ! అమృత
తుల్యమైన భోజనం వడ్డిస్తే నీకిష్టమైనది కతికి హంసతూలికా తల్పం పైన పవ్వళిస్తే కాళ్ళొత్తే
కన్యామణులు వీవనలు వీచే నవలామణులు విడెము అందించే వనితా మణులు ఏ నెలతపైన
చేయివేసినా కాదనేవారు లేరు. గ్రోలినంత అతివల అధరామృతం. ఇన్ని సురతా భోగాలు
వదులుకుని కాలినడకన వచ్చావా? దీన్ని విధి అనాలా మన రాజ్యకాంక్ష అనాలా?”

“మిత్రమా! రాజ్యాన్ని నిష్కంటకం చేయడం క్షాత్రవధర్మం. ఏ విథివలన శ్రీమహావిష్ణువు


కృష్ణుడై వృష్ణికుల యింట పెరిగి గొల్లపిల్లలతో కలిసి తిరిగి చద్దన్నం తిని ఆవులు కాచాడో
చూడు!

నీవు చెప్పిన భోగాలన్నీ నాచేతులో ఉన్నాయి. కానీ నేనేవీ ఆస్వాదించలేదు. నాలక్ష్యం


సాధించేవరకూ అలసత్వం కూడదు. బహుస్త్రీలోలురు దుర్బలులైపోతారు. శ్రీరామచంద్రు
డొక్కడే పిత్రువాక్య పరిపాలనా ధురంధరుడు కాదు. నేనుకూడ మాతండ్రికి మాట యిచ్చాను
వేంగీ చాళుక్య రాజ్యాన్ని నిష్కంటకం చేస్తానని!”

“విష్ణూ! మనం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనం మాన్యకేతదుర్గాన్ని ముట్ట


డించడం ఈ అమ్మావాస్య రాత్రికేజరగాలి. ఇది నిశ్ఛయమేకదా?”అన్నాడు విశాఖదత్తుడు.

308
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“అమావాస్యకానీ శుక్ల పాడ్యమి కానీ! శ్రేష్ఠిగారు కూడ సంసిద్ధత తెలియజేయాలి


కదా!”
“ఆయన మన నడిగారు కల్లుపాటను ఎప్పటికి ముగించాలని. మనవారందరినీ
ఆయత్తం చేయాలి.”
“ఆమ్మవాస్య రాత్రికే నిశ్ఛయిద్దాము. విశా! ఇక్కడ ఎంత సైన్యాన్ని సమీకరించావు?”
“కొంచం తక్కువగా పదకొండువేల సైన్యముంది. ఇదిగో నీకు కోట మూస ప్రతి
చూపిస్తాను” అన్నాడు విశాఖదత్తుడు.
అక్కడ ఒక తెరను తొలగించగానే నేలమీద మాన్యకేత దుర్గం నమూనా వుంది.

“విష్ణూ! ఇదే మాన్యకేతదుర్గం. నీవు సింహద్వారాన్ని ముట్టడించాలి. ఇదిగో ఈ


మూలనున్నదే ఈ కోటకు కీలకం. ఇక్కడ కాగ్నానది నుండి కోటలోకి తూము వున్నది. ఈ
జలనాళికలోంచి కోటలో ప్రవేశించేవాళ్ళు మూడు వందలమంది యోధులు. అందులో
మొదటివాడిని నేను.ఈ మూడువందల మందిలో ఎవరైనా బ్రతికి బయటపడే అవకాశం
తక్కువ. అందరూ ప్రాణాలకు తెగిస్తేకానీ జయించలేము. ఈ తూములోంచీ వచ్చిన నీరు
ప్రాకారం లోపల దిగుడుబావిలోకి జేరుతుంది. నీళ్ళు తోడడానికి ఇక్కడ జలరాట్నం ఉంది.
పెద్ద చక్రానికి ఒక పట్టా అమరివుంది. ఆ పట్టాకు మానికలు అమర్చారు. ఒక ఎద్దు
గానుగలాగా ఇరుసు చుట్టూ తిరగడం వలన ఈ చక్రం తిరుగుతుంది. చక్రం పట్టాకున్న కింది
మానికలు నీళ్ళను నింపుకుని చక్రం తిరగడం వలన పైకి వచ్చి నీళ్ళు గుమ్మరించి క్రిందికి
వెళ్తుంటాయి. ఇలా ఒలకపోసిన నీరు దోనెలో పడి జల నాళికలలోకి చేరుతుంది. ఈ
జలనాళికలు అన్ని అంతః పురాలలోకి నివాసాలలోకి విస్తరించి వున్నాయి.

మనం ఇవతల నీటిలో మునిగి తూము ద్వారా కోటలోని జలాశయంలోకి జేరి జల


యంత్రం ద్వారా పైకి ఎక్కాలి. ఇదీ మన పథకం.

ఇదిగో ఇదికోట మధ్యలో ఉన్న బురుజు స్ధంభం. ఇక్కడకు ఎక్కి చూస్తే నగరం మొత్తం
కనపడుతుంది. దీనిపైన రాష్ట్రకూటుల గరుడపతాకం ఎగురుతుంటుంది. మన దళంలో
ఒకడు ఇక్కడకు జేరి వాళ్ళపతాకాన్ని దించి మన వరాహకేతనం ఎగురవేయాలి. ఇది
చూసినవారందరికీ దుర్గం చాళుక్యుల వశమయిందని తెలుస్తుంది. ఈ పని ఎంత త్వరగా
జరుగుతే రాష్ట్రకూట సైన్యం అంత త్వరగా చప్పబడి పోతుంది.

ఇది చక్రవర్తి అంతఃపురం. బాలచక్రవర్తి అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పటినుంచీ ఇంద్ర


వల్లభుడు ఇందులోనే వుంటున్నాడు. ఈ నివాసానికి నాలుగు యుద్ధగజాలు ఇరవై మంది
అశ్వికులు వందమంది పదాతులు కాపు ఉంటారు. చక్రవర్తి సౌధాన్ని ముట్టడించే పని నేనే
తీసుకుంటున్నాను. ఇక్కడ వున్నది అయ్యణ మహాదేవి అంతఃపురం. ఇక్కడికి ఎవరం
పోదల్చుకోలేదు. ఆవిడ ఇప్పుడు ఇందులో లేదు. కోట విడిచి వెళ్ళిపోయారు.

309
  చాళుక్యసింహాసనం

ఇది రాకుమారి శిరీష అంతఃపురం. ఇక్కడ ముట్టడికి పైలుడు చాలనుకుంటున్నాను.

ఈ వరసలన్నీ సైన్యాధికారుల నివాసాలు. ఇటు వైపున వంటశాలలు ఉగ్రాణాలు. ఇది


పేరోలగం తీరే భవనం. ఈ కోటకు నాలుగు వైపులా నాలుగు బురుజులు ఎనిమిది గవనులు
వున్నాయి. ఇవికాక ధనాగారాలు ధాన్యాగారాలు ఎక్కడ వున్నదీ వివరంగా తెలీదు. ఈ
మూలనున్న రాజభవనంలో మీ పెదతండ్రి భీమసలుఖి మహారాజు వుంటు న్నాడు.”

“విశా కోటలోకి చాల క్లిష్టమైన మార్గం ఎంచుకున్నావు. ఇది నాపరాళ్ల కోట! తూముని
పగలకొడితే పైరాళ్ళు కూలిపోతే ఏంచేస్తావూ?”

“ఇలా ఆలోచిస్తే ఎవడూ దండయాత్రలు చేయలేడు. ఏ ధైర్యంతో అలగ్జాండర్ గ్రీకు


దేశంనుంచి భరతఖండానికి దండయాత్ర వచ్చాడూ?

మనవారందరికీ చాల శిక్షణ ఇచ్చాను. ఎవరికి వారు ఒక సేనాపతిలాగా బుద్ధి ఉపయో


గించి పని చేయగలరు. లోపలకు వెళ్ళేవారందరికీ వాళ్ళవాళ్ళ కర్తవ్యాలు బోధించాను. ఈ
నమూనా వలన దుర్గం అందరికీ పరిచయమయింది.”

“విశాఖా! మనం ఈ దాడికి ఒక సంకేత పదం పెట్టుకోవాలి. అంతకన్నాముందు


మనలో నమ్మదగనివారినీ వాళ్ళ గూఢచారులను ఏరివేయాలి. వీరికి సంకేతం తెలిసిందంటే
చాలా ప్రమాదం.” అన్నాడు విష్ణువర్ధనుడు.

“యువరాజా! మనలోకూడా వాళ్ళ గూఢచారులున్నారేమో తెలీదు. గోమఠేశ్వరయ్య


గారి వద్ద నున్న పరివారాన్ని ఎవరినీ నమ్మకూడదు. ఉంటే వాళ్ళ వేగులు అక్కడే వుండి
వుంటారు.”

“విశా! మన సైన్యాన్ని ఎక్కడెక్కడ దాచివుంచావు?”

“కమ్మర వాడలో కొందరు, కుమ్మరవాడలో కొందరు, సాలివాడ కంచరవాడ తెలికుల


వాడ అన్నిచోట్లా సద్దాను. గుణకర్మ విభాగశా అని వారివారి చేతివృత్తులను పట్టీ ఆయా
వాడలలో కలిసి బ్రతుకుతున్నారు. కొందరు ఇటుక ఆమాలలో, రాతి చెక్కడంలో, బేలు దారి
పనిలో కొందరు భారవాహకులుగాను గుఱ్ఱపు శాలలోను గోశాలలలోను కొందరు.
గోమఠేశ్వరయ్యగారి క్రొత్త ఇంట్లో ఆయుధాలను ముఖ్యమైన సేనాపతుల్ని దాచాను.

యువరాజా! నీవు కోట వెలుపల నుంచీ సింహద్వారం గుండా ప్రవేశించాలి. మేము


లోపలనుంచీ కోటద్వారం గడియలు తెరవగల మనుకుంటున్నాము. ఒక వేళ తెరవ
లేకపోయినా నీవు ఉపాయంతో లోపలికి రావాలి. అందుకు తగిన సాముగారడీలు నేర్చిన
వారినీ మాష్టీలనూ నిచ్చెనలు ఉడుములూ సిద్ధం చేశాను. నా వెంటవుండే మున్నూరులో
బ్రతికి బయటపడే వాడుండడు. నీవెంట పదివేల సైన్యం ఉంటుంది. నీ అంగరక్షకులు కాక
310
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ఇక్కడ కడియరాజు, దుగ్గరాజు, చిన్నాప్రగడ అనే ముగ్గురు ఉపసేనానుల్ని నీకు రక్షణగా


ఏర్పాటు చేశాను. వీళ్ళకు ఇక్కడి నగరము దుర్గము వ్యూహము అంతా బాగా తెలుసు. వీరే
నీకు మార్గదర్శకులవుతారు. ఈ ముగ్గురిలో చిన్నాప్రగడ మూగవాడు. అతడిని నీవు ఎక్కువ
వేధించకు!” అన్నాడు విశాఖదత్తుడు.

“మూగవాడా? నీకింకెవరూ దొరకలేదా కుంటివాడు గుడ్డివాడు?” కోపంగా అన్నాడు


విష్ణువర్ధనుడు.
“అతడే నీవంటిపైన ఈగవాలకుండా చూసేది. చివరివరకూ నీతో వుండేది. అతడెంత
సమర్ధుడంటే పదువేలమంది పేర్లు గడగడా చెప్పగలడు.” తెలుసుకో అన్నట్లు అన్నాడు
విశాఖదత్తుడు.
“అతడు మూగవాడన్నావుకదా? పేర్లేలా చెప్పకలడూ?”
“అంటే మొత్తం సైన్యాన్ని అతడు గుర్తుపెట్టుకోగలడు,”
“విశాఖా! మరి నా వెంటవుండే సైన్యంలో ఎవరెవరో నాకు తెలీదు. నేను యువరాజుననీ
వాళ్ళకు తెలీదు. ఇది కష్టంకదా?” అన్నాడు విష్మువర్ధనుడు.

“నీ కష్టం నాకు తెలుసు. అసలు చాలామందికి అందరూ తెలీదు. తెలీకూడదనే అలా
ఏర్పాటు చేశాను. నీ సైన్యంలో పాకనాటి పటాలం, కమ్మనాటి దళం, మున్నూరు దళం,
వెలనాటి పటాలం, వేగినాటి దండు, పల్నాటి జోదులు, రేనాటి పోటరులు, కొండపడమటి
గుంపు, కమ్మరదళం, కంచరదళం, తెలకుల దళం, వడ్డెరముఠా, రజకుల దండు, కుంభ
కారుల దళం, సాలిదళం, వల్మీకపటాలం, బోయదళం చంకుకారుల దండు, వధకుల దళం,
పసకరుల పటాలం, దేవాంగ జోదులు ఉన్నారు.

దుగ్గరాజు చెన్నాప్రగడ కడియరాజు వీరికి అందరూ తెలుసు. అందువలన నీకు అన్ని


విధాల సహాయపడతారు.”

“విశా! నీవు చాల గొప్ప వ్యూహం రచించావు! మెచ్చుకోవాలి! నీఅంత ప్రజ్ఞావంతుడే


లేకపోతే ఈ మాన్యకేత మహాదుర్గాన్ని పదివేల సైన్యంతో ముట్టడించడం హాస్యాస్పదం
అవుతుంది! ఇంతకూ ముట్టడికి సంకేతపదం నేను చెబుతాను. స.భ.ర.న.మ.య.వ ”

50 కల్లు అమ్మను
మర్నాడు చతుర్దశి. కల్లుపాట చూడడానికి బచ్చులందరూ వచ్చారు. అంతంత సుంకం
ప్రభుత్వానికి పోవడం వణిజులెవరికీ ఇష్టంలేదు. ఇద్దరికీ మధ్య సంధిచేయాలని నిశ్ఛయిం
చుకుని వచ్చారు.

311
  చాళుక్యసింహాసనం

గోమఠేశ్వరయ్య ఆనాడు పాటకు రాలేదు. ఆనాడు మాస శివరాత్రని తాను శివార్చన


వలన రాలేనని పాట అమావాస్య మధ్యాహ్నానికి మార్చాలని కోరుతూ విన్నపం పంపాడు.
బచ్చులందరూ నిరాశతో అవాక్కయ్యారు. వణిజామాత్యుడు ఎటూ తేల్చుకోలేక
మరకతయ్యగారి అభిప్రాయం అడిగాడు.

“అయ్యా! నావిన్నపం మీద పాట త్రయోదశినుంచి చతుర్దశికి మార్చారు. గోమఠే


శ్వరయ్య అయితే వాయిదా కోరలేదు. మరి ఇప్పుడు ఆయన కోరితే అమావాస్యకు మార్చడం
సమంజసంగా ఉంటుందనిపిస్తోంది. ఆతరువాత మీ ఇష్టం.” అన్నాడు మరకతయ్య.

“అదికాదండీ. అమావాస్యతో ఈ ఏటి పాట ముగుస్తుంది. జేష్ట పాడ్యమినుంచి కొత్త


సంవత్సరం కదా! మరి మహారాజులకు నేనేమని చెప్పుకోవాలి?”అన్నాడు వణిజా మాత్యుడు.

మరకతయ్య కొంచం ఆవేశపడ్డాడు. “ప్రభువులకు సుంకం రావాలి. అంతేకదా!


ప్రజలు ఎలా తాగిచచ్చినా ఫరవాలేదు. అంతేకదా! పాట ఎవరు పాడినా ప్రభుత్వానికి మూడు
సంవత్సరాల సుంకం ఒక్క సంవత్సరంలో వస్తోంది. సుంకమేకదా మీకు కావలసిందీ? మీరు
ఆమాత్రం ఓపిక పట్టలేరా?”అన్నాడు.

వణిజామాత్యునికి కోపం వచ్చింది. “మరకతయ్యగారూ! మీరొక మంత్రితో


మాట్లాడుతు న్నారు!” అన్నాడు కోపాన్ని దిగమింగుకుంటూ.

“నాకా విషయం తెలుసునయ్యగారు! మీకంత రాజసం అయితే నన్ను అభిప్రాయం


అడగకుండా వుండాల్సింది. నేనేమయినా రాజోద్యోగినా! ఏదో నీరుల్లి అమ్ముకునే వాడిని! నా
అభిప్రాయంతో మీకేం పనీ? అధికారం మీది.” అన్నాడు మరకతయ్య.

మంత్రి అతడంత గట్టి సమాధానం ఇస్తాడనుకోలేదు.“మీరు కోపగించుకుని ప్రయోజన


మేమిటీ? ఒక పెద్దమనిషిగా పరిష్కారం చెబుతారని అడిగాను.”అన్నాడు.

“నా మాట మీద గౌరవముంటే పాట అమావాస్యకు మార్చండి.” మరకతయ్య తన


నిర్ణయం చెప్పాడు.

అక్కడ జేరిన జనానికి ఆంధ్రశ్రేష్ఠీ మరకతయ్యా కూడబలుక్కుని ఏదో నాటకం ఆడుతు


న్నారేమో ననిపించింది. వణిజామాత్యుడు విస్సుక్కుంటూ పాటను అమావాస్యకు మార్చి
వెళ్ళిపోయాడు.

మర్నాటిమధ్యాహ్నానికి వణిజులలో కొద్దిమంది మాత్రమే కల్లుపాట చూడడానికి


వచ్చారు. ‘వీళ్ళ పంతంతో అవతల మాబేరాలు పోతున్నాయి’అని వాపోయారు.
గోమఠేశ్వరయ్య వచ్చి తన స్ధానంలో కూర్చున్నాడు. వణిజామాత్యుడు మధుకరసెట్టి పాట
ప్రారంభించవచ్చునా యని సభ్యులందరినీ అడిగారు.
312
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

అందరూ సావధానులయ్యారు. పాట ఆరంభమయినట్లు ప్రకటించారు.

గోమఠేశ్వరయ్య ముందుగా మాట్లాడుతూ “పెద్దలు మరకతయ్యగారి మీద గౌరవంతో


నేను పాట విరమించుకుంటున్నాను” అన్నాడు. వప్పయ్య గొంతులో వెలక్కాయ పడింది.
పాట తనకే వచ్చింది కానీ మద్యం వ్యాపారానికి తను క్రొత్త.

గోమఠేశ్వరయ్య మళ్ళీ మాట్లాడుతూ “పాట నేను వదులుకున్నాను. కానీ నాదగ్గర


చాలా మద్యం నిలవ ఉండిపోయింది. ఈ రాత్రిలోపల నేను అమ్ముకోవచ్చు. రేపటిదినం
నాదికాదు. అందుచేత ప్రజలందరికీ ఈ రాత్రి సగం ధరకే మద్యం అమ్మివేస్తాను” అన్నాడు.

ఆ మాటకు వప్పయ్య గుండెలో బండ పడింది.

“అలా ఎలా కుదురుతుందీ?అందరూ మద్యం అంతా కొనేసి నిలవ చేసుకుంటారు.


అందువలన నా బేరం దెబ్బ తింటుంది. నేను ప్రభువులకు ఎంత సుంకం కట్టాలో మీకు
తెలుసుకదా? అదేం కుదరదు.” అన్నాడు వప్పయ్యశ్రేష్ఠి బిక్కమొహం వేసుకుని.

“ఈ తెలివి తేటలు ముందే వుండాల్సింది. ఈ రోజు నాది. నేనీనాడు మద్యం అమ్మను.


ఊరికే పంచిపెట్టుకుంటాను.”అన్నాడు ఆంధ్రశ్రేష్ఠి.

వప్పయ్య మరీ కలవరపడిపోయాడు.“అలా ఎలా కుదురుతుందీ? మద్యం పంచి పెట్ట


డానికి అదేమయినా శ్రీరామనవమి పానకమా? తెల్లవార్లూ మీకు చేతనైనంత అమ్ము కోండి.”
అన్నాడు వప్పయ్య. మరకతయ్య ఏదో చెప్పబోయాడు.

“మరకతయ్యగారూ మీ మాటమీద గౌరవముంచి పాట వదులుకున్నాను. ఇప్పుడు నా


దారికి అడ్డురాకండి. ఈ సాయంత్రం చీకటి పడినప్పటినుంచి సూర్యుడు పొడిచేంతవరకూ
వ్యాపారం నాది. ప్రభుత్వానికి సంవత్సరం ముందే సుంకం చెల్లించాను. అందువలన
గౌరవనీయులైన మధుకరసెట్టి అమాత్యులు కూడ అడ్డు చెప్పాల్సిందేమీ లేదు. లాభం వచ్చినా
నష్టం వచ్చినా అది నా సమస్య. నేడు నేను మద్యం యదేచ్ఛగా పంచిపెడతాను. నామద్యం
నాయిష్టం.” అని తను కూర్చున్న చోటినుంచీ లేచి తలపాగా పెట్టుకున్నాడు గోమఠేశ్వరయ్య.

“ఒకక్షణం ఆగండి!” అన్నాడు వాణిజ్యమంత్రి మధుకరసెట్టి. “మీరు మద్యం పంచి


పెట్టడం వలన జనం విపరీతంగా త్రాగేస్తారు. అందువలన నగరంలో అరాచకం చెలరేగు
తుంది” అన్నడు ఆయన.

“గౌరవనీయులైన మంత్రివర్యా!” అన్నాడు ఆంధ్రశ్రేష్ఠి. వెళ్ళిపోబోతున్న శ్రేష్ఠి ఆగి ఏదో


చెప్పబోతుంటే అందరూ సావధానులై విన్నారు.“మద్యం తాగవచ్చని ధర్మశాస్త్రాలే
చెబుతున్నాయి. ఏధర్మశాస్త్రం కూడాఎంత తాగవచ్చో కొలమానం చెప్పలేదు. పంచిపెట్ట
కూడదనీ చెప్పలేదు. ప్రభుత్వాల బొక్కసాలు మాత్రం నిండాలి. ప్రభువులు చేసే దాన ధర్మాల
313
  చాళుక్యసింహాసనం

డబ్బంతా ఎవడబ్బ సొమ్మనీ? అంతా కల్లుముంతలోంచే పుడుతోంది. అందుకే ఈ మద్యం


వలన ఎన్ని కొంపలు కూలుతున్నా ప్రభువులు పట్టించుకోరు. వాళ్ల బొక్కసం నిండాలి కదా!
మధూకమైక్షవం సైరం తాలం ఖార్జూరపానసమ్
మధూత్థం చైవ మాధ్వీకం మైరేయం నారికేళజమ్
అమేధ్యాని దశైతాని మద్యాని బ్రాహ్మణస్య తు

బ్రహ్మవేత్తలు మాత్రమే తాగకూడదు. మిగతావారంతా ఆబాల గోపాలం


తాగవచ్చు. మహానుభావులైన కృష్ణార్జునులు కూడా కూచుని చిత్తుగా తాగేవారు.

ఉభౌ మధ్వాసవక్షీబౌ ఉభౌ చన్దన చర్చితౌ

ఏకపర్యఙ్క రథినౌ దృష్టౌమే కేశవార్జునౌ

అన్నాడు వ్యాసభగవానుడు. నన్ను నిరోధించడానికి మీరుకూడా ఏదైనా ధర్మశాస్త్రం


తెలుస్తే చెప్పండి” అనేసి విసురుగా అశ్విక శకటం అధిరోహించి వెళ్ళిపోయాడు ఆంధ్రశ్రేష్ఠి.

రాబోయే సంవత్సరానికి వప్పయ్య శ్రేష్ఠికి కల్లుపాట ధృవం చేసి వణిజామాత్యుడు


వెళ్ళిపోయాడు.

అందరూ ఉచితంగా మద్యం పంచిపెడతారనే ఆశతో తమవాళ్ళందరికీ చెప్పడానికి


నిష్క్ర మించారు.కల్లు పాట ఎవరికి వస్తుందా అని ఆసక్తిగా చూడడానికి వచ్చినవారంతా
నిరాశ చెందారు. సాయంత్రం నుంచీ మద్యం ఊరికే పంచిపెడతారనే వార్త మాత్రం క్షణాలలో
నగరమంతా పాకింది.

ఆ రాత్రంతా మాన్యకేతనగరంలో మద్యం ఏరులైపారింది. నాటిరాత్రి మాన్యకేత


నగరంలో తాగని వాడులేడు గుడిలో మాన్యకేతేశ్వరుడు, మడి కట్టుకు కూర్చున్న
పార్శ్వనాధుడు తప్పిస్తే! వలకపోసుకున్న మద్యంతో భూమికూడా తడిసి మత్తులో
ఊగుతున్నట్లే వుంది తాగుబోతులకు. రాష్ట్రకూట భటులు సైన్యము కూడ తాగేశారు.
గోమఠేశ్వరయ్య సైన్యాధి కారుల ఇళ్ళకు మర్యాదపూర్వకంగా గొప్పగొప్ప మద్యపు కుప్పెలు
తినుబండారాలు పంపించాడు. మద్యానికి తోడు వీధుల కూడళ్ళలో చర్మచిత్రాల ఆటలు
నాట్యాలు గాన కచేరీలు ప్రహసనాలు అప్పటికప్పుడు ఏర్పాటయ్యాయి. తాగుతూ వినోదాలు
చూస్తూ ఎక్కడ వాడక్కడ పడిపోయారు. చాలామంది ఇళ్ళకు చేరలేదు. అలవాటు లేని
ఆడవాళ్ళు కూడ నాడు ఊరికే వస్తుంటే అదేమిటోనని కొంచం రుచి చూశారు. అసలు
ఆంధ్రశ్రేష్ఠి వద్ద ఎంత మద్యం వుందో ఎవరికీ అర్ధం కాలేదు. కాగ్నానదిలో నీళ్ళకన్నా మద్యం
ప్రవాహం ఎక్కువగా వుంది. నగరం మొత్తం మద్యంమత్తులో ఊగుతోంది తూగుతోంది.

314
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

శిరః ప్రధాని రేవాదాస దీక్షితులవారు రాచకార్యం పైన దూరంవెళ్ళి బాగా ప్రొద్దుపోయిన


తరువాత నగరానికి వచ్చాడు. ఆ సమయానికి సామాన్యంగా నగరం నిద్రపోయేది. కానీ ఆ
రాత్రి మత్తుగా తూగుతోంది. వీధుల కూడళ్ళలో దారికడ్డం కట్టి నాటకాలాడుతున్నారు.
నగరంలో జరుగుతున్న ఉత్సవమేమిటో ఆయనకు అర్ధం కాలేదు.

తాగుబోతొకడు శిరః ప్రధాని రథానికి అడ్డంపడ్డాడు. ప్రధాని అంగరక్షకులు


తొలగమంటే తొలగకపోగా మత్తులో శిరఃప్రధాని వద్దకు వచ్చి “నన్ను తొలగమంటావా
నాలోని ఈశ్వరుణ్ణి తొలగమంటావా?” అన్నాడు.

తాగుతే వీడికి వేదాంతం బాగా తలకెక్కినట్లుందని శిరః ప్రధాని రథం దిగివెళ్లి కొరడాతో
అతడిని చావమోదాడు. అంగరక్షకులు ఆతడిని ఈడ్చి అవతల పడవేశారు. రథం కోటలోకి
సాగిపోయింది.

51 నవావరణ నృత్యం.
అమ్మావాస్య చీకటి ఆకాశమంతా అలుముకుంది. నిశాధిపతి లేని రాత్రి మిణుగురు
పురుగుల లాంటి నక్షత్రాలదే ఆధిపత్యం. ఆ రాత్రి విశాఖదత్తుని నాయకత్వంలో ఎనిమిది
మంది కర్మచారులు ముప్పదిమంది సైనికులు కాగ్ననది తీరానికి వెళ్ళారు. నదిలోనుంచి
కోటలోకి నీరువచ్చే నాళికను మనిషి దూరేటట్లు పెద్దది చేయాలి. అది కర్మచారులపని. వాళ్ళు
పనిచేస్తున్న సమయంలో ఎవరైనా తమని గమనించే అవకాశముంది. సైనికులు అలాంటి
వారిని మట్టుపెట్టాలి.

జలనాళిక లోంచీ కోటలోకి వెళ్ళవలసిన సైనికులు కాగ్నానదీ తీరంలో దూరదూరంగా


నల్లటి గొంగళీలు కప్పుకుని కూర్చున్నారు.

నగరంలో ప్రధాన కూడలివద్ద పెద్ద రంగస్ధలం ఏర్పాటయింది. దివిటీలు


కళ్ళుమిరుమిట్లు కొలిపేటట్లు వెలుగుతున్నాయి. రంగస్ధలంమీద సాయంత్రం నుంచి
రకరకాల నాట్యాలు నాటకాలు నడిచాయి. ఇప్పుడు చిత్రాణి నాట్యం ఆరంభమయింది.

చిత్రాణి నవావరణ నృత్యం చేయబోతోంది.ఈ నాట్యం శ్రీచక్రరాజ సంచారిణియై


మహామాయా స్వరూపిణియైన మహా త్రిపురసుందరి నుద్దేశించిన నాట్యం. ఇందులో
నవావరణలు ఆయా దేవతా స్త్రీలు వారి మహిమ వర్ణించబడుతుంది. నర్తకి ఒకదానిపై
ఒకటిగా తొమ్మిది దొంతరలుగా రంగుల వస్త్రాలు ధరించింది. ఆమెకు తోడు పదహారు మంది
అప్సరో గణమా అన్నట్లు సహ నర్తకీమణులున్నారు. నర్తకి ఒక్కొక్క ఆవరణ దేవతలకు
నాట్యం చేస్తూ పాము కుబుసం విడిచినట్లు ఒక్కొక్క పొర వస్త్రం వదిలివేస్తుంది. నవావరణాలు
తొలగిపోవడం వలన స్నిగ్ధ నగ్న సౌందర్యంతో చివరకు దిగంబరగా నాట్యం చేస్తుంది. అదే
ముఖ్య ఆకర్షణ. అందుకే జనం విపరీతంగా వచ్చారు.
315
  చాళుక్యసింహాసనం

ఇది సాంప్రదాయ నాట్యమే. కాని సామాన్యులముందు ప్రదర్శించే నాట్యం కాదు.


ఎక్కడో అజ్ఞాతమైన దేవాలయాలలో పెద్దలముందు ముక్తుల ముందు ముముక్షువుల ముందు
మాత్రమే ప్రదర్శింపవలసిన నృత్యం. భగవంతుడిని గురించి తెలుసుకోవాలనే తపనలో పశు
భావము దాటి వీరభావములో సాధన చేసేవారికి ఈ నాట్యం ఒక పరీక్ష. వారు ఈ నాట్యం
తిలకించి కూడ చలించకుండా ఇంద్రియనిగ్రహం పాటించగలుగుతే ఒక మెట్టు ఎక్కినట్లే.

ఉపస్థేంద్రియ అధిష్ఠిత మహాకామేశ్వరి మాయలో పడని వారెవరూ ఉండరు. ఆ స్ధితిని


అధిగమించినవారు మనిషిలోని మాయ అనే తొమ్మిది పొరలు తొలగిపోయి అసలైన ఈశ్వర
తత్వం అర్ధం చేసుకోగలుగుతారు.

పురుష దేవతలకన్నా స్త్రీదేవతలు శీఘ్రంగా ప్రసన్నమవుతారంటారు. స్త్రీ దేవతా ఉపా


సనలో సౌందర్యారాధన తప్పనిసరి. ఆ అనంగసుందరి అంగాంగ ప్రత్యంగ సౌందర్యవర్ణనం
ఉంటుంది. అందుచేత కొందరు ఉపాసకులు నిగ్రహించుకోలేక భ్రష్టులవుతారు. కొందరు
ఉన్మాదులైతే కొందరికి పిచ్చిపడుతుంది. చివరికి ఏకొందరో మెరికల్లా పైకి తేలుతారు.

నట్టువాంగం ఒక ప్రక్కన కూర్చుని తమ వాయిద్యాలు శృతిచేసుకుంది.

చిత్రాణి విఘ్ననివారణ వినాయకుని తలుచుకుని తరువాత లలితా పరాభట్టారికను


స్మరించింది. మొదటి ఆవరణ నృత్యం ఆరంభించింది.

నట్టువాంగంలో స్త్రీలు పురుషులు కూడ వున్నారు. మొదటి ఆవరణ కోసం నాట


రాగంలో గానం ఆలపించారు. మొదటి ఆవరణ త్రైలోక్య మోహన చక్రం. దేవత భూపుర
వాసిని యైన చక్రాంబిక. ఈమె త్రిపురవాసిని. ప్రకట యోగిని. హృదయదేవి, శిరోదేవి,
శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ,
వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ,
సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, మహానిత్య, పరమేశ్వర, పరమేశ్వరి, మిత్రేశమయి,
షష్టీశమయి, ఉడ్డీశమయి, చర్యానాథమయి, లోపాముద్రామయి, అగస్త్యమయి, కాస్థ్య
లతాపనమయి, ధర్మాచార్యమయి, ముక్తకేశీశ్వరమయి, దీపకళానాథమయి, విష్ణుదేవ
మయి, ప్రభాకరదేవమయి, తేజోదేవమయి, మనోజదేవమయి, కళ్యాణదేవమయి, వాసుదేవ
మయి, రత్నదేవమయి, శ్రీరామానందమయి.

సహనర్తకీమణులతోకూడి చిత్రాణి ఆయాదేవతా స్వరూపాలను ఆవిష్కరించింది.

నాట్యం చేస్తూ చేస్తూ నర్తకి మొదటిపొర వస్త్రాలు విప్పివేసింది. ప్రేక్షకుల గుండెలు


దడదడలాడాయి.

రెండవ ఆవరణం ఆరంభమయింది. ఈ ఆవరణ దేవత పదహారు రేకుల పద్మం నడుమ

316
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ఉంటుంది. చిత్రాణి చుట్టూ పదహారు మంది సరసిజ నయనలు సరోజముఖులు


గుమిగూడారు. వారంతా నడుములు వెనక్కువంచి వొంగుతే మధ్య చిత్రాణి సోడశదళ
పద్మం మధ్యలో లక్ష్మీదేవిలా శోభిల్లింది. ఈ దేవత సర్వ ఆశాపరిపూరక చక్రవాసిని.
గుప్తయోగిని. ఈ దేవత కామాకర్షిణి, బుధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శా
కర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామా
కర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. ఈ నృత్యంలో నర్తకి ప్రేక్షకుల
సర్వాంగాలను ఆకర్షించింది. ఈ ఆవరణ దేవతను గాయకులు ఖరహరప్రియ రాగంలో
గానం చేశారు.

నర్తకి రెండవపొర వస్త్రాలు విప్పివేసింది.

చిత్రాణి మూడవ ఆవరణంలో ప్రవేసించింది. అష్టదళపద్మ సరోవరమే సర్వ సంక్షోభిణి


చక్రం. ఎనిమిది మంది నర్తకీమణుల వదన సరోజాల మధ్య గుప్తతర యోగిని రూపంలో
అమ్మవారు ఆవిష్కృతమైంది. ఈమె సర్వాకర్షిణి. ఈమె కామ పుష్ప పూజిత. అనంగ కసుమ,
అనంగ మేఖల,అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ విజిని, అనంగ
అంకుశ, అనంగ మాలిని.

ఈ సందర్భంగా వనితలు ఎనభైనాలుగు రతీమన్మధ భంగిమలను ప్రదర్శించారు.


ప్రేక్షకులు వడలు తెలియని మదనావస్తలోకి జారిపోయారు.ఎక్కడో దేవాలయ కుడ్యాలపై
తప్పుతే ఈ భంగిమలను చూసివుండరు. అనంగుడంటే మన్మధుడు. ఇతడు ఒక్క చోటుండే
వాడు కాదు. స్త్రీపురుషుల రహస్య హృదయ కుహరాలలో దూరి విజృంభించి అల్లరిచేసేవాడు.

నాట్యం చేస్తూ చేస్తూ నర్తకి మూడవ పొర వస్త్రం విప్పేసింది. మదన వివసులకు పై
వస్త్రాలు జారిపోయాయి.

నాలుగవదిగా సర్వసౌభాగ్య చక్రరూపం అభినయిస్తోంది చిత్రాణి. గానం వలజి


రాగంలో సాగుతోంది. ఈ దేవత సాంప్రదాయ యోగిని.
ఐదవది సర్వార్ధ సాధక చక్రం. కులోత్తీర్ణ యోగిని.
ఆరవది సర్వరక్షాకర చక్రస్వామిని. నిగర్భయోగిని.
సప్తమ చక్రం సర్వరోగహారిణి. రహస్యయోగిని.

అష్టమం సర్వశిద్ధిప్రద చక్రస్వామిని. అతి రహస్య యోగిని. చిత్రాణి ఈ అష్టమ


ఆవరణంలోకి ప్రవేశించింది. కాని కాళ్ళు తడబడుతున్నాయి. వడలంతా చమటలు పోసింది.
బాహుమూలాలనుండి జారిన శ్వేదం మోచేతుల వెంట నేల రాలుతోంది. నవావరణాలు
విరామం లేకుండా ఏకబిగిని నర్తించడం సామాన్యం కాదు.

317
  చాళుక్యసింహాసనం

చిత్రాణి ఈ విద్య రసతరంగిణి వద్ద నేర్చుకుంది. అప్పుడసలు అలుపు వచ్చేదికాదు.


కారణం అప్పుడు భయంలేదు. శాంతంగా నాట్యం చేసేది. ఇప్పుడు ఎదురుగా ఎంతోమంది
మగవాళ్ళు కామాతురులై కూర్చుని వున్నారు. అందులో చాలా మంది రాష్ట్రకూట యోధులు.
వారంతా తప్పతాగేసి వున్నారు. ఎపుడెపుడు నర్తకి బట్టలు విప్పుతుందా అని ఆతృతతో
ఎదురుచూస్తున్నారు. భీతహరిణ సముదయాన్ని చుట్టుముట్టిన చిరుత పులుల్లా ఉన్నారు.

దానికి తోడు తాంత్రికులు మంత్రగాళ్ళు ఎక్కడనుండి వచ్చారో ముందు వరసలో వచ్చి


కూర్చున్నారు. మంత్రాలతో నర్తకి ముందరికాళ్ళకు బందాలు వేస్తున్నారు. చిత్రాణికి
అడుగులు పడటంలేదు. తడబడుతున్నాయి. దానికి తోడు మూడవ ఆవరణ నృత్యంలో దేవత
సర్వాకర్షిణి. పూర్తిగా కామ పుష్పార్చిత. మూడవ ఆవరణం తిలకించినప్పటినుంచి
అందరిలోను మన్మధ ప్రభావం మితిమీరింది. మరి ఆ అమ్మవారు అనంగ కుసుమ అనంగ
మేఖల అనంగ మదన అనంగ మదనాతుర. మరి సాధకులు కానివారు నిగ్రహాన్ని కోల్పోక
ఏమవుతారు.

రసతరంగిణి తన శిష్యురాలి కార్యక్రమం చూడడానికి వచ్చింది. తాను స్వయంగా


గొప్ప యోగిని. ఆమె ఈ నృత్యం మున్ను ముముక్షువుల ముందు ప్రదర్శించిందే కాని
పామరుల ముందు పోకిరీలముందు కాదు.రసతరంగిణికి తన శిష్యురాలి అవస్త అర్ధ
మయింది. మంత్రగాళ్ళ ఆటకట్టించాలనుకుంది. వెనకటికి మంత్రగత్తెను ‘గంజాయి
కాల్చుకోవడానికి కాస్త అగ్గి పెట్ట’మంటే ‘నా అరచేతులో వుంది తీసుకో’ మందిట! అతడు
‘నా అంగవస్త్రంలో వేయ’మన్నాడట!తాను వేదిక మీదకు వెళ్ళి ప్రేక్షకులకభిముఖంగా
సుఖాఘాసనంలో చిన్ముద్ర దాల్చి కూర్చుంది. మంత్రగాళ్ళు ప్రయోగించే తంత్రాలన్ని తానే
సర్వ మంత్రాత్మిక సర్వ తంత్రాత్మికయై ఆకర్షిస్తూ హుతం చేసివేయసాగింది.

నవమ చక్రం నృత్యం ఆరంభమయింది. ప్రేక్షకులు విస్మయ తన్మయులై తిలకిస్తు


న్నారు. ఈ దేవత సర్వానందమయ చక్రస్వామిని. ఈవిడ పరాపర రహస్య యోగిని. ఈమె
త్రిపుర,త్రిపురేశ్వరి, త్రిపుర సుందరి, త్రిపుర సిద్ధ, త్రిపురాంబ, మహాత్రిపురసుందరి. తన
సహనర్తకీమణులతోకూడి నాట్యం చేస్తుంటే ఒక్కొక్కరుగా త్రిపుర, త్రిపురేశ్వరి, త్రిపుర
సుందరి, మహా త్రిపురసుందరి దేవతలు ఎదురుగా నిలబడినట్లే ఉంది. భక్తులందరూ దణ్ణాలు
పెట్టుకుంటున్నారు. కొందరు అపరాధాలు క్షమించమని చెంపలు వేసుకుంటు న్నారు.
కొందరు ముక్తుల కంటివెంట ఆనంద భాష్పధారలు కురుస్తున్నాయి. కాముకులు
ఎప్పుడెప్పుడు నవావరణం దాటుతుందా ఆమె నగ్నసౌందర్యం ఎప్పుడు చూస్తామా అని
ఉవ్వెళ్ళూరుతున్నారు.

నర్తకి నవావరణ చక్రం అభినయిస్తూ చివరి వస్త్రాలు కూడ విసర్జిస్తూ అష్టబంధాల


నుండి విముక్తయైన యోగినిగా అవధూతగా నర్తించసాగింది. ఆమెతోపాటు ఆమె సహ
నర్తకీమణులు పదహారు మంది కూడ దిగంబరంగా మైమరిచి ఆనందంగా నర్తించసాగారు.
దృశ్యకులు ఈ దశలో కామాతురులైపోయారు.
318
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

కామాంధులందరూ నలువైపులనుండి వేదిక మీదికి ఎక్కేశారు. ఎటూ పారిపోవడానికి


లేదు. వాళ్ళను ఆపేవారెవరూ లేరు. ఏ కొద్దిమందో తప్పించి మగవారందరూ మదో న్మత్తులై
యున్నారు. రాజభటులున్నా వాళ్ళే కీచకులైనారు. ఒక్కొక్క నర్తకి పైన ఎంతో మంది పడ్డారు.
తనదంటే తనదని కొట్టుకున్నారు. జుట్టూ జుట్టూ పట్టుకుని కుస్తీ పట్టారు. కుమ్ములాట
సాగింది. ఆయుధలున్నవారు వాటి నుపయోగించారు. చురికలు బాకులు తీసి అడ్డమొచ్చిన
వారిని పొడుచుకుంటూ సాగారు. కార్యక్రమం చూడవచ్చిన స్త్రీలను కూడా వదలలేదు. స్త్రీల
ఆర్తనాదాల నెవరూ పట్టించుకోలేదు. మంచివాళ్ళు పారిపోడానికి కూడా ఆస్కారం లేకుండా
తొక్కిసలాట జరిగింది. క్రిందపడినవారి గొంతుకలపై కాలువేసి నడిచారు. వేదిక దక్షయజ్ఞం
కన్నా ఘోరంగా తయారయింది. ఏదోరకం మృత్యువు తప్పించి ఎవరూ బావుకున్నదేమీ
లేదు. పుష్పాన్ని సున్నితంగా ఆస్వాదిస్తే పరిమళ భరితంగా ఉంటుంది. కాలికింద వేసి
తోక్కుతే అలా ఉండదు.

52 స్త్రీ ఏవ విభూషణం
ఇంటికి చేరిన శిరః ప్రధాని స్నానానికి వెళుతూ ముఖ్యమైన అధికారులందరిని ఆరాత్రి
తన దర్శనం చేసుకోమని ఆజ్ఞలు పంపాడు. వింత ఏమిటంటే తనఇంటివద్ద పరివారంలో
కూడ అందరూ అంతో ఇంతో మధువు సేవించివున్నారు. మధువు గ్రోలనిది తన అంగ
రక్షకాధికారి నీలవర్ణుడు, వేదాయి మాత్రమే.

రేవాదాసదీక్షితుడు తన భార్య నడిగాడు నాడు నగరంలో ఉత్సవమేమిటని. ఆమెకు


కూడ తెలీదు. కానీ మద్యోత్సవం జరుగుతోందని చెప్పింది. అలాంటి ఉత్సవం ఏమీ లేదే నని
అనుకుంటూ ఆయన భోజనంచేశాడు. ఆరుబైట మంచం వేయించుకుని పడుకున్నాడు. తను
పిలవమన్న అధికారులెవరూ తన దర్శనంకోరి రాలేదు. కొందరు ప్రతీహారులు కూడ తిరిగి
రాలేదు. శిరః ప్రధాని మంచంపైన లేచికూర్చున్నాడు. కోపంతో వళ్ళంతా మంటలు
చెలరేగాయి. వేడి భరించలేకపోయాడు. తన భార్యను తడిగుడ్డతో వీపు తుడవమన్నాడు.
అప్పటికీ శాంతించలేదు. అది మంచి నిద్రవేళ. అయినా ఆ ఇల్లాలు మంచిగంధం అరగతీసి
వంటికి పట్టించింది. కొంచం ఉపశమనం కలిగిందికానీ కడుపులో ఏదో ఆవేదన, మంట
ఆరంభమయ్యాయి. మంచం దిగి అటుయిటు పచార్లు చేయసాగాడు.

“నేను ఈ దేశానికి శిరః ప్రధానిని. నేను పిలవనంపుతే ఒక్కడూ రాలేదు. ఎంత అవ


మానం. ఈ రాజోద్యోగులందరినీ పదవుల్లోంచి తప్పించాలి. వీళ్ళ పదవులకు ఇదే చివరి
రోజు. రేపు ఉదయమే క్రొత్తవారిని విధేయులైనవారిని తీసుకోవాలి. అందరికీ మంచి బుద్ధి
చెప్పాలి. అందరూ తాగి తూగుతున్నారా! కోటద్వారం అయినా సరిగా మూశారా?”

ఆ అనుమానం వచ్చేటప్పటికీ ఆయన వంట్లోంచి ఆవిరులు పొగలు సెగలు రావడం


ఆరంభమయింది.

319
  చాళుక్యసింహాసనం

“సోమిదేవమ్మా!” అని కేకపెట్టాడు భార్యకోసం.

దీక్షితుని భార్యపేరు మణిభూషిత. రేవాదాస దీక్షితుడు స్వయంగా పౌండరీకం అనే


యజ్ఞం చేసినవాడు. సోమపానం చేయడం వలన ఆయన సోమయాజి, ఆవిడ సోమి దేవమ్మా
అయ్యారు. అప్పటినుంచి భార్యను పేరుపెట్టి పిలవడం మాని సోమిదేవమ్మ అనడం మొదలు
పెట్టాడు.

మణిభూషిత విద్వన్మణి. పతివ్రతలలో శిరోమణి. మణిభూషిత ఎప్పుడూ భర్త మాటకు


ఎదురు చెప్పి ఎరుగదు. శిరఃప్రధానికి ఏదైనా ధర్మసందేహం వస్తే ఆమెనే అడిగేవాడు. స్మృతి
శాస్త్ర పురాణ ఇతిహాసాలలోంచీ చక్కటి ఉదాహరణ ఠఖీమని చెప్పేది. ఆయనకు ఆమె
భార్యకాదు, మంత్రి.

మణిభూషిత చందనచర్చ చేసి మంచం కోడుకానుకుని నిద్రపోయింది. ఉలిక్కిపడిన


ఆమె “పిలిచారా?” అన్నది.
“పిలిచానా అరిచాను. వినపడటంలా?”అన్నాడు దీక్షితుడు.
“ఇప్పుడే ఒక్క కునుకు పట్టింది. ఏంకావాలీ?” అడిగిందామె.
“నాకు చాలా ఆవేదనగా ఉంది.”

“ఆవేదన ఈవేదన తగ్గాలంటే కాసేపు నా వడిలో విశ్రాంతి తీసుకోండి. ఆ తరువాత


మంచి నిద్ర పడుతుంది.” అన్నది చమత్కారంగా మణిభూషిత.

“ఇది సరసాలకు సమయం కాదు. కుశధారిని పిలిపించు.”

కుశధారి ఆయన తమ్ముడు లీశోత్తరదీక్షితుని కొడుకులలో ఒకడు. పెదతండ్రి వద్ద ఉప


సేనాపతిగా ఉన్నాడు. “వాడు కొత్తగా పెళ్ళయినవాడు. ఇంకా పదహారురోజుల పండగకూడ
కాలేదు. నవదంపతుల్ని అర్ధరాత్రి పిలవకూడదు” అన్నదావిడ.

“నావేదన నీకర్ధంకాదే పిచ్చదానా! వాడిని కేకవేయి.”

“నేను పిలవను. మీరు రాత్రి ఇంత ఆలస్యంగా ఎప్పుడూ భోంచేయలేదు. అంచేత


అన్నం అరక్క ఏ ఉష్ణమో పైత్యమో చేసింది. ఏదైనా ఇంత అరకో ఆసవమో తాగండి.”

రేవాదాస దీక్షితుడు మణిభూషిత చెంప ఛెళ్ళుమనిపించాడు. “నీవుకూడా ఈ రాత్రి నా


ఆజ్ఞను ధిక్కరిస్తున్నావా? నీవేమైనా కాస్త పుచ్చుకున్నావా?” అన్నాడు.

ఆవిడ చాల రోషపడింది. కోపంగా ఇలా అన్నది. “విషం దొరకలేదు పుచ్చుకుందా


మంటే! పెళ్ళాన్ని కొట్టడం ఎప్పటినుంచీ నేర్చుకున్నారు?
320
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

‘స్త్రీయో దేవాః స్త్రీయః పుణ్యాః స్త్రీవఏవ విభూషణం

స్త్రీ ద్వేషో నావ కర్తవ్య స్తాసు నిందాం ప్రహారకమ్’

ఆడవాళ్ళని అబలలను చేసి కొట్టడం గొప్పకాదు. శాస్త్రాలు ఊరికే వల్లించగానే సరి


పోదు.” గుక్క తిప్పుకోకుండా స్త్రీల ఎడ శాస్త్రం ఏమంటోందో వప్పచెప్పింది ఆవిడ.

దీక్షితుడు మెత్తపడ్డాడు. బతిమాలుతూ“మణిభూషితా! నేను కొట్టాలని కొట్టలేదే! నా


ఆవేదన అలాంటిది. ఈ రాత్రి నగరం మొత్తం తాగేసింది. శిరఃప్రధానినైన నా ఆజ్ఞను ఎవరూ
లెక్క చేయటం లేదు. ఈ రాత్రి నీవుకూడ నా ఆజ్ఞను ధిక్కరిస్తావా?ఈ మధ్య ఆకాశంలో
చూశావా తోకచుక్క కనపడుతోంది. అప్పటినుంచీ నా మనసు కీడును శంకిస్తోంది. బాల
చక్రవర్తికి ఏమయినా జరగబోతోందేమోనని భయంగా కూడా వుంది.”అన్నాడు.

“ఆజ్ఞ అని చెప్పండి చాలు. ఆచరిస్తాను. తప్పయినా వప్పయినా నాకిష్టం లేకపోయినా


సరే! మీరు భయపడడానికి తోకచుక్క కారణమా? ఇదే తోకచుక్క ఎన్నో దేశాలవారికి
కనిపిస్తుంది. మీ ఒక్కరికేనా? వారందరికీ కీడు జరుగుతుందా?” విసురుగా అక్కడినుంచి
వెళ్ళిపోయింది మణిభూషితాదేవి.

మణిభూషితాదేవి కుశధారిని పిలుచుకుని వచ్చింది. అతడు పడక గదిలోంచి నేరుగా


వచ్చాడు. పెదతండ్రిగారికి ఏదో అస్వస్తత కలిగిందేమోననుకున్నాడు. రేవాదాస దీక్షితుడు
ఆతడిని కోటగుమ్మం పర్యవేక్షించమని తెల్లవారేవరకు కోటగుమ్మం వీడవద్దనీ ఆజ్ఞాపిం
చాడు. అతడిచెవులో నాటి దుర్గద్వారం సంకేతపదం ‘నిమ్మచెట్టుకు చింతకాయలు’ అని
చెప్పాడు.

కుశధారి తన పరిష్వంగాన్ని వీడిన భార్యతో కూడ చెప్పకుండ కరవాలం చేతపూని కోట


గుమ్మానికి వెళ్ళిపోయాడు.

అప్పుడు తూలుకుంటు ఒక వార్తాహరుడు గురుమహేశ్వరుడి దర్శనం కోసం వచ్చాడు.


వానిపేరు కుశల.

“కుశలా! ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావురా?” అన్నాడు రేవాదాస దీక్షితుడు చాల


కోపంగా.

“గురుదేవా తప్పైపోనాది. చిత్తుగా తాగీసినాను. కోటలోకి మీ రథంఎంటే


వచ్చినానుకాని ఏడనో పడిపోయినాను. మాచెడ్డ మైకం కమ్మినాది.”

“ఇప్పటికైనా తగలడ్డావుకదా! నగరంలో ఏమైనా విశేషాలు చూశావురా?”

321
  చాళుక్యసింహాసనం

“చూళ్ళేదండి. విశేషమంటు ఏమీ లేదండి. అంతా బాగానే వుంది. నగరం అంతా


చిత్తుగా తాగీసినాది. తాగందా గుళ్ళో దేముడొక్కడే నండి. మొత్తం మాన్యకేతనగరం
ఉయ్యాల ఊగినట్లు ఊగుతోంది. నా పెల్లాం పిల్లలు ఊరికే వస్తోందని మద్యం తాగీసినారు.
ఎక్కడ చూసినా ఆటలు పాటలు నాటకాలు తోలుబొమ్మలాటలు. కూడలి కూడలిలోను ఈది
గానాలు తందనాలు. అదేదో నర్తకంట! మొత్తం గుడ్డలిప్పి ఆడుతుందంట! అందరూ అక్కడికి
పోయినారు. మన సేనాపతులందరూ దాన్ని చూడబోయినారు.”

“ఎవడు తాగబోసేడురా అందరికీ? ఇంత మద్యం ఎక్కడినుంచి వచ్చిందీ?” కోపం


గానూ జుగుప్సతోను అన్నాడు రేవాదాసదీక్షితుడు.

“కోమటయ్య కల్లుపాట ఓడిపోయినాడు కదండీ! తన మద్యం మురిగిపోతుందని


అందరికీ తాగబోసినాడు. ఊరికే పోసినాడు. వప్పయ్యసెట్టి మనుషులు కోమటయ్య
మనుషులూ కలబడి కొట్టుకున్నారు. గుళ్ళో దేవుడొకడేనండి తాగంది. ఆయినకి నోరు లేదు
కదండీ. ఎప్పుడూ తాగని ఆడోళ్ళు కూడ తాగీసినారు. ఆళ్ళకోసం దాక్ష రసం అరవై ఏళ్ళ
పాతదంట తెప్పించి పోసినారు. ఇవాళ నగరంలో తాగుడు పండగనుకోండీ. మద్యం బహు
రుచిగా ఉందండి.”
“కుశలా! ఇందులో ఏదో కుట్రవుందిరా! ఇంకేమైనా వింతలు చూశావా?”
“చూళ్ళేదండిగాని ఇన్నానండి.”
“ఏమి విన్నావూ?”
“అదేదో మాట నోటికి తిరగదు. ఏదో బీజాచ్ఛరాలు అనుకుంటా! ముగ్గురి నలుగురి
నోట విన్నానండి. అది స.భ.ర.న.మ.య.వ.”
“ఏమిటీ మళ్ళీ చెప్పు?”
“స.భ.ర.న.మ.య.వ.”
“ఎక్కడ విన్నావురా?”
“కమ్మరివాడ కంచరివాడ సాలివాడ కిన్నెరవాడ. చాలాచోట్లండి.”
“కుశలా? ఇదేదో సంకేతపదం లాగా లేదూ?”
“అట్టాగేవుందండి. ఒకడికొకడు చెప్పుకుంటున్నారు.ఇదేదో మంత్రం లాగుందండి.
మంత్రోపదేశం అనుకుంటానండి.”
రేవాదాసదీక్షితుడు ఆలోచనలో పడ్డాడు.మంత్రశాస్త్రాలలో ఎక్కడా సభరనమయవ
లేదే. దీనికర్ధంకూడా నిఘంటువులలో ఉన్నట్లు లేదు.“ఒకరికొకరు ఎందుకు చెప్పుకుంటున్నా
రురా?” గద్దించాడు రేవాదాసదీక్షితుడు

322
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఇదేదో తిట్టేమోనండి!”
“మరి ఒకడిని తిడితే వాడు తిరిగి తిట్టడా?”
“ఔనండి. ఎందుకు తిట్టడండీ! తిరిగి అదేతిట్టు తిడుతున్నాడు.”
శిరః ప్రధాని ఆవేదన మరీ ఎక్కువయింది.కుశలుడు శలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

కుశధారి కోటగుమ్మం వద్దకు వెళ్ళి అక్కడి సేనానాయకుడికి సంకేతపదం చెప్పి తనను


శిరఃప్రధాని దుర్గద్వారం పరిశీలించమని పంపించినట్లు చెప్పాడు. అతడు ఆధిపత్యం
కుశధారి కప్పగించాడు. కుశధారి ఒక్కసారి అక్కడ పరిస్ధితి సింహావలోకనం చేశాడు.
కోటగుమ్మం వద్ద ఇన్నూరు సైనికులున్నారు. ఒగ రాగికాగులో చమురు మరుగుతోంది. ఇంక
రెండు గాబులు సిద్ధంగా వున్నాయి. కోటగుమ్మం వెలుపల ఇరువది మంది సైనికులు
కాపున్నారు. మూసివున్న కోట కవాటానికి నాలుగు అడ్డదూలాలు ఎనిమిది ఘడియలు అన్నీ
సరిగానే వున్నాయి. సైనికులందరూ అంతో ఇంతో పుచ్చుకున్నారు. కానీ వారికి తాగుడు
కొత్తేమీ కాదు.

‘అంతా సవ్యంగానే వుందే పెదనాన్నగారు ప్రత్యేకంగా నన్నెందుకు పంపినట్లూ?’ అను


కున్నాడు. మాన్యకేతనగరంలో సంగీత నాటక నాట్య ఉత్సవాల శబ్దం మాత్రం వినిపిస్తోంది.

53 కోటకు కన్నం
విశాఖదత్తుని దళాళాలు కోటవెలుపల కాగ్నానది జలనాళిక వద్దకు చేరారు. కర్మ
చారులు తమ పని ఆరంభించారు. కాగ్నానది నుండీ కోటగోడ వద్దకు ఒక కాలువ తవ్వబడి
వుంది. నదిలో నీరు కోటగోడ వద్దకు జేరడానికి ఆ కాలువ. అక్కడ కోటగోడ పునాదిలో
కుమ్మర తూము వుంది. ఆ తూముద్వారా నదీజలం కోటలోని దిగుడుబావి లోకి చేరుతుంది.
దాన్నే మానికల బావి అంటారు. అక్కడి నీటిరాట్నం ఆ నీరు తోడి జలనాళికలో పోస్తుంది.

నీళ్ళలో దిగి అంతపొడుగునా కుమ్మరి తూమును పగలకొట్టి కన్నం వెడల్పు చేయాలి.


అప్పుడు కానీ మనిషి ఆ కన్నంలోంచీ దూరి కోటలోని బావిలోకి జేరలేడు. నీటిలో మునిగి ఆ
తూమును పగలకొట్టటం అంత సులువైన పనికాదు. మొత్తం చీకటి.

ఈ ద్వారం ద్వారా శత్రువులు కోటలోకి ప్రవేసిస్తారని రాష్ట్రకూటులు కలలో కూడ


ఊహించలేరు. ఈ అద్భుత మార్గాన్ని విశాఖదత్తుడు కనుక్కున్నాడు.

కాలం గడిచిపోతోంది. కర్మచారులు ఊపిరి బిగపట్టి పనిచేస్తున్నారు. అక్కడ కోటగోడ


పునాది చాలా మందం వుంది. తూము కూడా చాలా గట్టిగా వుంది. అట్లాగే తెల్లవారు
తుందేమో. విశాఖదత్తుడి గుండెల్లో గుబులు ఆరంభమయింది. తెల్లవారితే గుట్టు రట్టవు
తుంది. అందులోను కోటలో కొందరు బ్రహ్మీముహూర్తానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు
323
  చాళుక్యసింహాసనం

తీర్చుకుని శుచియై సంధ్యావందనాలు నిత్య తర్పణాలు వామనస్తుతి పఠనం చేసేవారు


న్నారు. వారు మేలుకుంటారు.

బాలచక్రవర్తిని అజ్ఞాతం లోకి పంపించినప్పటినుంచీ చక్రవర్తి మందిరంలో


ఇంద్రవల్లభుడే ఉంటున్నాడు. సూర్యోదయం ముందే భజంత్రీలు చక్రవర్తి నివాసానికి చేరి
భూపాల రాగంలో కాని బౌళి రాగంలో కాని మంగళవాయిద్యాలు మోగిస్తారు.
గాయనీమణులు మేలు కొలు పులు పాడతారు. తరువాత విప్రులు
ఋధ్యాస్మ హవ్యై ర్నమసోప సద్యః
మిత్రం దేవం మిత్రధేయనో అస్తు
అనూరాధాన్ హవిషా వర్థయంతః
శతం జీవేమ శరదస్సవీరాః
త్రీణి త్రీణివై దేవానామృద్ధాని
త్రీణి ఛందాంసి త్రీణి సవనాని
త్రయ ఇమేలోకాః
ఋధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతితిష్ఠతి.

ఒక్కొక్కదినం ఒక్కొక్క వేదాశీర్వచనం చేస్తారు. ఇంద్రవల్లభుడు సామాన్యంగా ఉదయ


కాలపు స్నానాదికాలు కాగానే చిన్న పరివారం తీసుకుని కోటదాటి మాన్యకేతేశ్వరాలయానికి
జేరుతాడు. అప్పటికే అక్కడి అర్చకులు స్వామికి రుద్రాభిషేకం అర్చనా బాలభోగం పూర్తి
చేస్తారు. ఇంద్రవల్లభుడు స్వామిని దర్శించి తీర్ధప్రసాదాలు స్వీకరిస్తాడు. దేవాలయంలో
మూడు కాలాలు సవనం జరుగుతుంది. ఆతరువాతే మహారాజు తన రాజకీయ వ్యవహారా
లలోకి తలదూరుస్తాడు.

ఎంత రణవిద్యా విశారదుడైనా విశాఖదత్తుడికి గుండె దడదడలాడుతోంది. త్వరగా


తూము లోంచి కోటలోకి చేరలేకపోతే వ్యూహం మొత్తం చెడిపోతుంది. పదివేలమందితో
బయటనుంచి కోటద్వారాన్ని తెరవడం అసంభవం. వ్యూహం విఫలమైతే రాష్ట్ర్రకూటులు తమ
పదివేలమందినీ నరుకుతారు. సైన్యం నాశనమైనా ఫరవాలేదు. అందరూ చావుకు తెగించి
దండులో చేరినవారే. యువరాజు విష్ణువర్ధనునికూడ రప్పించడమే పొరపాటు. యువరాజు
బందీయైతే అంతకన్నా పరాభవం ఇంకేమి ఉండదు. అతడినడ్డం పెట్టుకుని రాష్ట్రకూటులు
పగసాధిస్తారు. కానీ యువరాజు భుజబలం తోడులేకుండ ఈ ముట్టడి సాధ్యం కాదు.

విశాఖదత్తుడికి జీవితంలో మొదటిసారిగా భయం పట్టుకుంది. విజయంకోసం ఏ


దేవతకైనా మొక్కుకోవా లనిపించింది. అంతవరకు తను పూజా పురస్కారాలకు దూరంగా

324
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ఉండేవాడు. స్వయంగా తాను దేవతలకు ఒక నారికేళం కూడ సమర్పించి ఎరుగడు.

మనుషులు నాలుగు విధాల భగవంతుని ఆశ్రయిస్తారని కృష్ణభగవానుడు చెప్పాడు.


ఏదో ప్రమాదంలో ఇరుక్కున్నవారు ఏదో స్వలాభం కోసమో ధనసమృద్ధి కోసమో భగవంతుని
స్మరిస్తారు. బ్రహ్మజ్ఞానులు మాత్రం ఏ స్వార్ధం లేకుండా భగవంతుని తత్వాన్ని అర్ధం
చేసుకోవడానికి ధ్యానిస్తారు.

చతుర్విధా భజంతేమాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్ధీ జ్ఞానీ చ భరతర్షభ

విశాఖదత్తునికి ఆ విషమ సమయంలో కార్యసిద్ధికోసం ఏదేవతకు మొక్కుకోవాలో


తెలియదు. తన మిత్రుడొకడు ఒక దేవతను గురించి చాలా సాధన చేశాడు. ఆమె దశ
మహావిద్యలలో ఒకదేవత. భగళాముఖి. భగళాముఖి దేవాలయం ఉజ్జయిని నగరానికి చాలా
దూరంలో గుప్తంగా ఉందని అక్కడ తన గురువు ఆ దేవత ఆరాధనా విధానం నేర్పా డనీ
చెప్పేవాడు. అతడొక వీరఖడ్గానికి పూజలు చేసేవాడు. ఆ ఖడ్గాన్ని ఎవరినీ ముట్టుకో నిచ్చేవాడు
కాదు.

భగళాముఖి అనుగ్రహిస్తే శత్రుసేనల్ని స్ధంభింపచేస్తుంది. దానివలన విజయం సిద్ధి


స్తుంది. భగళాముఖి మహావిష్ణువు చేతా పరశురాముడిచేతా ఆరాధింపబడిన దేవత.
దశమహావిద్యలలో ఎనిమిదవ దేవత.

తెలిసో తెలియకో విశాఖదత్తుడు భగళాముఖి దేవికి మొక్కుకున్నాడు. ఆ యుద్ధంలో


విజయం సిద్ధిస్తే భగళాముఖీదేవికి కొలుపు చేయించి గావు చెల్లించుకుంటానని మొక్కు
కున్నాడు.

దేవి కరుణించిందోయేమో పని పూర్తయింది. కోటలోకి కన్నం పడింది. విశాఖదత్తుడు


కర్మచారుల్ని పంపించివేశాడు. తన సైనికులు నదీతీరంలో గొంగళీలు కప్పుకుని దూర
దూరంగా పొంచి కూచున్నారు. విశాఖదత్తుడు ముందుగా సొరంగం లోంచి దూరి లోపలకు
వెళ్ళాడు. సొరంగం పొడుగునా నీళ్ళలో మునిగి అవతలకు జేరవలసిందే. అంతసేపు ఊపిరి
ఆప గలవారినే ఎంచుకోవలసి వచ్చింది. వారంతా కాగ్నా నదిలో మునిగి ఈదడం అలవరచు
కున్నవారే. విశాఖదత్తుడి వెనక ఒకరొకరే సొరంగం లోంచి దూరి అవతలకు వెళుతున్నారు.
ఎండాకాలం కావడంతో నీట తడిసినా చలిగాలేదు. పైగా లోపలి ఆంధోళనా మద్యం మత్తూ
శరీరాన్ని వేడెక్కిస్తున్నాయి.

54 రణదుందుభి
శిరఃప్రధాని రేవాదాసదీక్షితుడు వేదాయిని పిలిచి శాంతి మంత్ర పఠనం చేయమన్నాడు.
వేదాయి శిరఃప్రధాని ఇంట్లో నిత్యపురోహితుడు. శిరః ప్రధాని పౌండరీకం అనే యజ్ఞం చేసి

325
  చాళుక్యసింహాసనం

నప్పటి నుంచి నిత్యాగ్నిహోత్రుడయ్యాడు. సోమపానం చేసిన యజ్ఞదీక్షితుడు. వేదాయి


గాబులో కాగుతున్న నీటితో అర్ధనిశీధి తలస్నానం చేశాడు. శిగ దులుపుకుని ముడి వేసు
కున్నాడు. నీటి గాబుక్రింద వెలిబూడిదతో ముఖాన త్రిపుండ్రాలు దిద్దుకున్నాడు. ఒంటి కాలిపై
నిలబడ్డాడు. మంత్రోశ్ఛరణం “శంనో మిత్రం వరుణః” అనే మంత్రంతో ఆరంభించాడు.

దీక్షితుడు అంతటితో తృప్తి పడలేదు. మన్యుసూక్త పఠనం ఆపకుండా చేయమన్నాడు.

రేవాదాసదీక్షితుడు తన అంగరక్షకదళపతి నీలవర్ణుని పిలిపించాడు. వెంటనే దన


దళాన్ని సమీకరించమన్నాడు. అతడి సైన్యం డెబ్బది మందిలో ముప్పయి మందే కోటలో
ఉన్నారు. వారందరు వచ్చి శిరః ప్రధాని ఇంటిముందు నిలబడ్డారు.

రేవాదాసదీక్షితుడు నీలవర్ణునితో “నీదళాలను నిద్రమత్తూ తాగిన మత్తూ వదిలేటట్లు


కదను తొక్కించు”అన్నాడు.
నీలవర్ణుడు తనదళాలను ఆజ్ఞాపించసాగాడు.
దళం సావధానః
దళం విశ్రామ
వామదిశే భ్రామ
దక్షిమదిశే భ్రామ
పదఘట్టనం కుర్యాత్
సావధానః

దీక్షితుని ముంగిలి ద్వారంవద్ద ఎప్పుడూ రెండు యుద్ధగజాలు మోహరించివుంటాయి.


“నీలవర్ణా! యుద్ధగజాలకు సంకెలలు విప్పు. ఒకసారి కోట అంతా తిరిగివద్దాం” అన్నాడు
దీక్షితుడు. నీలవర్ణుడు కాదనలేదు. రేవాదసదీక్షితుడు యుద్ధగజాన్ని అధిరోహించాడు. భార్య
భర్త అడగకముందే కరవాలం తీసుకువచ్చి ఇచ్చింది. దీక్షితుని ఏనుగు ముందు ఇంకొక
ఏనుగు ముళ్ళగదను తొండంతో పట్టుకుని నడుస్తోంది. సైనికులు వెంట కదిలారు.

మాన్యకేతం కోటలో ఎనిమిది ఏనుగులున్నాయి. అందులో రెండు శిరఃప్రధాని


ఇంటిముందు కాపు వుంటాయి. నాలుగు ఏనుగులు చక్రవర్తి సౌధం వద్ద కాపుంటాయి.
రెండు ఏనుగులు శాలలో ఉంటాయి. దుర్గంలో ఎప్పుడూ అరవైమంది అశ్వికులు
ఆయుధపాణులై సిద్ధంగా ఉంటారు. అపారమైన అశ్విక దళాలు గజదళాలు కోట వెలుపల
వుంటాయి.

రేవాదసదీక్షితుని గృహం కోటలో దక్షిణ ఆగ్నేయంలోవుంది. దళం తూర్పువీధికి

326
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

తిరిగింది. అంతే. కత్తులరాపిడి ఘనంగా వినిపిస్తోంది. అంతలోనే ఆహాకారాలు అరుపులు


బొబ్బలు ఏడుపులు. అర్ధరాత్రి అది పిశాచఘోష కాదుకదా అనుకున్నారు. కొంచం సేపటి
లోనే అర్ధమయింది ఎవరో కోటను ముట్టడించారని.

అందరూ అప్రమత్తులైనారు. “గురుమహేశ్వరా! ఏదో ప్రమాదం పొంచివుంది. మీరు


వెనక్కి వెళ్ళిపోండి” అన్నాడు నీలవర్ణుడు.

“వెనక్కు కాదురా వెళ్ళవలసింది ముందుకు” అన్నాడు దీక్షితుడు. అందరూ కలిసి


ముందుకు నడిచారు.

ఇంతలో దిక్కులు పిక్కటిల్లేటట్లు గుండెలు అదిరేటట్లూరణదుందుభి వినిపించింది.

55 ముట్టడి
చిత్రాణి నృత్యం ముగిసే సమయానికి యువరాజ విష్ణువర్ధనుని సేనలు మాన్యకేత
దుర్గద్వారం వద్ద సమీకరింపబడుతున్నాయి. విశాఖదత్తుడు అజ్ఞాతంగా దాచిన యోధులంతా
నిర్భయంగా శస్త్రపాణులై కోటగుమ్మంవైపు గుంపులు గుంపులుగా తరలి వచ్చారు.
ముందుగా కోటద్వారం వెలుపల కాపుకాసే భటుల పీకలు నొక్కేశారు, మాటు వేసి గొంతులు
కోసేసారు. పదహారు మంది అంగకక్షకులమధ్య విష్ణువర్ధనుడు అశ్వం అధిరోహించి
వచ్చాడు. ఖడ్గాలు గదలు కుంతాలు భిండివాలాలు పరశువులు విల్లంబులు మొదలైన
ఆయుధాలు నింపిన వృషభ శకటాలు కదిలివచ్చాయి. ఇంత గొడవ జరుగు తున్నా నగరంలో
సంచలనం లేదు. మగవాళ్ళంతా చిత్తుగా తాగేశారు. ఆడవాళ్ళుకూడ భర్త కౌగిళ్ళలో నలిగి
నిద్ర పోయారు లేదా మగవారిరాకకై ఎదురుచూచి కన్నులు కాయలు కాచి గడపమీదే
తలపెట్టుకుని పడుకున్నారు.

విష్ణువర్ధనుడు కోటగుమ్మంకేసి చూశాడు. సంచలనం లేదు. కానీ కొందరు శూలాలు


ధరించి కోటగోడలపై పహరా తిరుగుతున్నారు. వారింకా చాళుక్యులను గమనించలేదు.

విశాఖదత్తుని దళం లోపలనుంచి కోటద్వారం తెరవవలసిన సమయమైంది. కానీ


లోపలినుంచీ ఏ అలికిడి లేదు. విశాఖదత్తుడి దళాలు కోటలోపలకు జొరబడకలిగారో లేదో
తెలీదు. విష్ణువర్ధనునికి గొప్ప నిర్ణయం తీసుకోవలసిన తరుణం అదే. తామనుకున్నట్లు కోట
గుమ్మం తెరవబడకపోతే పరిస్తితి ఏమిటీ? ద్వారాన్ని కుమ్మడానికి తమవద్ద ఏనుగులు లేవు.
గజబలం లేకుండా కోటగుమ్మం పడగొట్టడం సాధ్యంకాదు.

రాష్ట్రకూటుల ఉపసేనాపతి కుశధారి కోటగుమ్మం వద్ద అప్రమత్తమై ఉన్నాడు. ఒక్క


సారి కోట బురుజుపైనుండి క్రిందికి చూచాడు. కోటద్వారం వెలుపల కొందరు వ్యక్తులు

327
  చాళుక్యసింహాసనం

గుమికూడి వుండడం గమనించాడు. వెంటనే ‘ఎవరక్కడ?’ అని గద్దించి పలికాడు.


సమాధానం మేమంతా చిత్రాణి నాట్యం చూసి వస్తున్నాం. కోటలోకి వెళ్ళాలి అన్నారు. కోట
గుమ్మం వెలుపల ఉండవలసిన తన భటుల్ని పేరుపెట్టి పిలిచాడు. ఒక్కడూ పలకలేదు.
దానితో అనుమానం వచ్చింది. తన భటుల్ని అప్రమత్తం చేశాడు. అప్పుడే కోటలో కత్తుల
రాపిడి శబ్దం వినిపించింది.

వెంటనే కుశధారి రణఢక్కా మోగించమని ఆజ్ఞాపించాడు. కోటద్వారం బురుజులపై


రెండు భేరీలున్నాయి. అందులో కంచుఢక్కపై ఇనప గదతో ఒక్కదెబ్బ కొడితే ఆ రణతరంగాలు
కోట మొత్తాన్ని కంపింపచేస్తాయి. చర్మభేరి మ్రోగిస్తే గుండెలమీద మోదినట్లే ఉంటుంది.
సైనికులకు వళ్ళు పెరిగిపోతుంది. అప్రయత్నంగానే మీసాలు పైకిలేస్తాయి. రోమాలు నిక్క
పొడుస్తాయి.

చర్మభేరి చెవులు చిల్లులు పడేడట్లు దిక్కులు పిక్కటిల్లేటట్లు మోగసాగింది.

చాళుక్య యోధులు కలవరపడ్డారు. కోటను రహస్యంగా ముట్టడిద్దామంటే ముందరే


రణభేరి మ్రోగింది.

రాష్ట్రకూట సైనికులు ఎక్కడవున్నా అప్రమత్తులైనారు. సైనికులకు తాగుడు ఒక క్రొత్త


కాదు. రోజు తాగేదే. మద్యం మాంసం మగువ కొత్తేమీకాదు. తాగుతేనే భీతివదిలి ధైర్యంగా
పోరాడగలుగుతారు. అందులోను రణభేరి శబ్దంతో మత్తు వదిలిపోయింది. అందరూ తమ
తమ ఆయుధాల కోసం ఇళ్ళవైపు పరుగెత్తారు. కాని వారికిశత్రువెవరో తెలీదు. ఎవరితో
పోరాడాలో నిర్దేశించే నాధుడు లేడు. వ్యూహం అంతకన్నాలేదు. అందరూ కోటద్వారం వైపు
కదలి వెళ్ళారు.

చాళుక్యులు కోటద్వారానికి చేరే మార్గాలన్నిటికీ అసంఖ్యాకంగా ఎద్దుల భండ్లు అడ్డం


పెట్టారు. అందువలన ఎవరూ మూకుమ్మడిగా తోసుకుని రాలేరు. గజదళాలు అశ్విక దళాలు
నేరుగా రాలేవు. వస్తూవస్తూ వీధికూడళ్ళలోని దివిటీలను ఆర్పివేశారు. అమ్మావాస్య అయినా
ఆకాశం నిర్మలంగా వుండడం వలన నక్షత్రకాంతి భువిపై మసక వెలుతురు ప్రసరింప
చేస్తోంది.

రణభేరి మ్రోగగానే విష్ణువర్ధనునికి అర్ధమయింది. విశాఖదత్తుడి దళాలు రహస్యంగా


కోటద్వారాలు తెరవలేక పోయాయని. కోటలోపల మాత్రం ఘర్షణ జరుగుతున్న ధ్వని
ఆర్తనాదాలు పెనుబొబ్బలు వినిపిస్తున్నాయి. ఇంక చాళుక్య యువరాజు కాలం వృధా
చేయకూడదనుకున్నాడు. రాకుమారుడు తన సైన్యాలను కోటగుమ్మాన్ని ముట్టడించ మని
ఆజ్ఞాపించాడు. కొందరు పగ్గంకట్టిన ఉడుముల మూతికి తేనె రాశి కోటగోడపైకి వదిలారు.
అవి ముందు తేనె పెర ఉందనుకుని పైకి పాకసాగాయి. ఉడుములకు కట్టిన తాళ్ళు ఆధారంగా

328
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

లగ్గలపైకెక్కాలి. మేదర దళం తాము తెచ్చిన వెదురుబొంగులతో కోటకు నిచ్చెనలల్లారు.


వెదురు గడలతోనే క్షణాలలో కోటబురుజులెత్తు మంచకట్టారు.

యువరాజు ధానుష్కులతోకూడి మంచపైకెక్కి కోటబురుజుపైవారిమీద విల్లు లెక్కు


బెట్టాడు. కోట ప్రాకారంపై మొలతాడెత్తు పిట్టగోడ వుంది. దానికి దిడ్డికంతలున్నాయి.
అందులోంచీ సంధిస్తే బాణాలు క్రందివారికి తగులుతాయి. కానీ క్రిందివారు సంధిస్తే
పైవారికి తగలడం బహు అరుదు.

చాళుక్యయోధులు కొందరు దుర్గద్వారాన్ని తాముమోసుకొచ్చిన వృక్షం మొదలుతో


కుమ్మనారంభించారు. తమ వద్ద ఏనుగులు లేకపోవడం ఒక వెలితి అయింది.

కుశధారి తనసైన్యాన్ని కోటగోడ ఎక్కేవారిపైకి మరిగే నూనె పోయమని ఆజ్ఞాపించాడు.


అక్కడ ఒకే రాగి భాండంలో చమురు మరుగుతోంది. ముట్టడి ముందే తెలుస్తే ఎన్నో
గంగాళాల నూనె మరిగించి పోసేవాళ్ళు. మరొక గంగాళం పొయ్యి ఎక్కించి క్రింద నెగడి
ముట్టించారు. కానీ అది మరగడానికి కొంత సమయం పడుతుంది. తనవద్ద తగినంత మంది
యోధులూ సేవకులు లేరు. ఉగ్రాణాలనిండా లెక్కలేనంత యుద్ధసామగ్రి మూలుగు తోంది.
రాళ్ళురువ్వే భిసుండి యంత్రాలున్నాయి. అగ్నిగోళాలు రువ్వే యంత్రాలున్నాయి. శత్రువులను
అప్పడాల్లా వత్తగల పెద్దపెద్ద గుండ్రాళున్నాయి. విస్ఫోటన సామగ్రి వుంది. కానీ తగిన
మనుషులేలేరు.

చాళుక్యులలో పైనుంచి పోసే నూనె వలన నిచ్చెన లెక్కేవారు వళ్ళుకాలి క్రింద


పడిపోయారు. మంటలవలన ఉడుములు మూతికాలి పట్టువదిలేసి క్రిందపడ్డాయి.
మంటలవేడికి లెక్కచేయకుండా కమ్మరదళాలు నిచ్చెనలెక్కి పైకి చేరాయి.ఒక దుర్గాన్ని
ముట్టడించినపుడు ఇవన్నీ సర్వసాధారణమే.

చాళుక్యయోధులలో కొందరు దూరంగా ఉన్న బురుజులపైకి నిచ్చెనలు వేసి పైకెక్కారు.


అక్కడ నూనె గుమ్మరించేవాళ్ళు లేరు. కోటగోడ పైభాగాన గుఱ్ఱాలు పరిగెత్తేటంత విశాలంగా
వుంది. కోటకు ఎనిమిది మూలలా ఎనిమిది ఋరుజులు కొన్ని గవనులు ఉన్నాయి.

కుశధారికి అర్ధమయింది, కోటమొత్తం కాపుకాయడం తనవలనకాదని. ప్రాకారం పైకి


కొందరు శత్రువులు చేరుకున్నారు. అప్పటికే తనవారు కొందరు నష్టమయ్యారు. ఐనా ధైర్యం
వీడలేదు. తనప్రయత్నం తాను చేస్తున్నాడు.తనవారు కోటక్రిందికి కొరువులు కాగడాలు
ఋవ్వుతున్నారు. నిప్పంటించిన గడ్డివుండలు దొర్లిస్తున్నారు.

విశాఖదత్తుడు తన యోధులు పదివేలమందినీ సేనాపతులుగా తీర్చిదిద్దాడు. వారికి


ఎవరి ఆదేశమూ అవసరం లేదు. ఒకసారి ముట్టడి ఆరంభమయిన తరువాత అందరూ
విజయం కోసం శతధా ప్రయత్నించగలవారే. పైకెక్కినవారు వేగంగా కోటద్వారం వైపు పరి

329
  చాళుక్యసింహాసనం

గెత్తి వచ్చారు. వాళ్ళు జయహో నరేంద్రమృగరాజా అని కేకలు పెట్టడంతో విష్మువర్ధనునికి


ధైర్యం వచ్చింది.వాళ్ళు కుశధారి యోధులతో తలపడ్డారు. చమురు భాండం ఒలక పోయ
గలిగారు.

కుశధారి ఒక్కసారి నలువైపుల సింహావలోకనం చేశాడు. శత్రువులు కోట లోపల వెలు


పలా జేరారు.కత్తుల రాపిడులు ఆహాకారాలు వినిపిస్తున్నాయి.కోటలో కూడ కలకలం చెల
రేగిందంటే కోటను వేరే వైపునుంచి కూడ ముట్టడించారు. కొందరు యోధులు సింహద్వారం
వైపే పరుగెత్తి రావడం కనిపించింది. తాను జై రాష్ట్రకూట పతాక అని పెనుబొబ్బ పెట్టాడు.
అవతలివారు జై చాళుక్య నరేంద్రమృగరాజ అన్నారు. దానితో ముట్టడించినవారు వేంగి
చాళుక్యులని తెలిసిపోయింది. ఒకప్రక్క కోటద్వారం దద్దరిల్లేటట్లు పెద్ద దూలంతో కుమ్ము
తున్నారు. కొంతసేపటికైనా అడ్డగడియలు బందులు వదులుకాక మానవు.

కుశధారి తన ధానుష్కులను దిడ్డికంతలలోనుండి బాణాలు సంధించమని ఆజ్ఞాపిం


చాడు. కంతలోనుంచి బాణం సంధిస్తే బాణానికొకరు మరణించక తప్పదు.

చాళుక్యసైన్యం తాము వెంట తెచ్చిన గడలతో కోటగోడెత్తు మంచె విర్మించారు.


ధానుష్కులు మంచపై నెక్కి ఋరుజులపై వారి మీదకు బాణాలు సంధించ నారంభించారు.
కోటవెలుపల ఉన్న రాష్ట్రకూటదళాలు గుంపులు గుంపులుగా వస్తున్నాయి. ఏనుగుల
ఘీంకారాలు గుఱ్ఱపుదళాల సకిలింపులూ సైనికుల అట్టహాసాలు దగ్గరవుతున్నాయి.

విష్ణువర్ధను డాలోచించాడు. ముట్టడి ఇప్పుడు వేగవంతం చేయాలి. సింహద్వారం


భేదించుకుని లోపలకు వెళ్ళాలి. లేకపోతే రాష్ట్రకూటులు వెనకనుంచీ ముట్టడిస్తారు. తమపని
అడకత్తెరలో పోకచెక్క అవుతుంది. విశాఖదత్తుడి యోధులు కోటగుమ్మం తెరవ
లేకపోయారు. వారిని ఎవరు అడ్డుకున్నారో తెలియదు.

దుగ్గరాజు కొండపడమటి దళాలను వెనక్కు పెట్టాడు. వాళ్ళు గొప్ప సాహసం కల


వాళ్ళు. కోటబయటినుంచి వచ్చే రాష్ట్రకూటదళాలను పైబడి నరకగలరు. వ్యూహాలు పెద్దగా
అర్ధం చేసుకోలేరు.వేగంగా కోటగోడల్ని అధిరోహించడానికి కడియరాజు తన మాష్టీలదళాన్ని
ముందుకు పంపాడు. వాళ్ళు సాముగరడీలు బాగా నేర్చినవాళ్ళు. సునాయాసంగా కోట
గోడలపైకి పాకగలరు. కోటపైనుంచి మరిగే నూనె చిమ్మడం ఆగిపోయింది. కానీ రాళ్లు రువ్వే
యంత్రాలు అగ్నిగోళాలు విసరే యంత్రాలు ఆరంభమయ్యాయి.

విశాఖదత్తుడి వీరభటులు జలయంత్రం నుండి పైకెక్కి వివిధ దళాలుగా విడిపోయారు.


ఎవరికివారు వారి లక్ష్యం వైపు పరుగులు తీశారు.

ఒక దళంలో ఇద్దరే వున్నారు. అందులో మాచానాయకుడొకడు. తన సహచరుడితో


కలిసి కోట మధ్యలోనున్నరాతిస్ధంభం వైపు కదిలాడు. ఆ రాతిబురుజు వద్ద ఒక భటుడు

330
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

కునికి పాట్లు పడుతున్నాడు. చాకచక్యంగా అతడి నోరునొక్కి పీక కోసేశాడు. సోపానాల మీది
నుంచి పైకి వెళ్ళారు ఇద్దరూ. ఆ బురుజుపైన రాష్ట్రకూట గరుడపతాక విరాజితమై వుంది. పైన
రణఢక్క మోదేవాడొకడు శూలం పట్టుకున్న సైనికుడొకడు ఉన్నారు. మెట్లవైపు ఏదో అలికిడి
కావడంతో వారు అప్రమత్తమై పొంచివున్నారు. మాచానాయకుడి అనుచరుడు
పైకిజేరుతుండగానే వాళ్ళు శూలంతో గిరిపెట్టి గుండెల్లో పొడిచివేశారు. మాచానాయకుడు
ఒక్కడే వాళ్ళతో తలపడ్డాడు. ఒక్కసారిగా ఇద్దరి నెదిరించడం కష్టమే అయింది. వడలంతా
లోతైన గాయాలయ్యాయి. రక్తం కారిపోతోంది.ఇంక ఎక్కువ సేపు పోరాటం ఉండదు. రక్త
స్రావం వలన ఎవరైనా డస్సిపోవలసిందే. ముగ్గురిలో ఓర్పు ఎక్కువ కలవాడే చివరకు
మిగిలేది. మాచానాయకుడు రణఢక్క మోగించేవాడికి ముందరే పెద్ద గాయం చేయగలి
గాడు. కానీ వాడు ఒంటిచేత్తోనే ఢంకామీద నాలుగు దెబ్బలు వేశాడు. ఐదోదెబ్బ పడకుండా
మాచానాయకుడు అతడి చేయి నరికివేశాడు. ఆసమయంలో రెండవ యోధుడు తనను కూడ
చాలా గాయపరచాడు. కానీ మాచానాయకుడి దెబ్బతో అతడి తల తెగి బురుజుక్రింద పడింది.
ఆలస్యం చేయకుండ మాచానాయకుడు ఓపిక కూడదీసుకుని తాను నడుముకు కట్టుకున్న
చాళుక్య పతాకం విప్పి రాష్ట్రకూటుల గరుడపతాకం దింపి ఆ స్ధానంలో తమపతాకం
ఆవిష్కరించగలిడాడు. తమ వరాహధ్వజానికి నమస్కరిస్తూ ఒరిగిపోయాడు.

కుశధారికి తానింక ఎక్కువ కాలం సింహద్వారాన్ని కాయలేనని అర్ధమయింది. తనను


ఆదుకోవడానికి కోటలో సైన్యమేది తోడురాలేదు. తాను వంటరివాడయిపోయాడు.
కోటద్వారానికి ఎనిమిది ఘడియలున్నాయి. నాలుగు అడ్డదూలాలున్నాయి. కానీ
బయటనుంచీ కుమ్మడంతో ఉతకలు బందులు వదులయ్యాయి. మాన్యకేతదుర్గం కోట
తలుపులు తెరవడం మూయడం సరిచూసే అధికారి వీరదుర్గడు. అతడి గృహం కూడా అక్కడే
వుంది. అతడు ఎలాంటి పరిస్తితిలోను కోటగుమ్మం వీడడు. కుశధారి “వీరదుర్గా!” అనికేక
పెట్టాడు. అప్పటికే వీరదుర్గడు సేనాపతి ఆజ్ఞలకై ఎదురు చూస్తున్నాడు.

మాన్యకేతదుర్గంలో కోటద్వారానికి ఒక ఏర్పాటుంది. కోటద్వారాన్ని శత్రువులు


ఛేదించే సమయంలో ద్వారబంధానికి లోపలివైపు ఎత్తైన అటక వుంది. అటక గుంజలు
తాత్కాలికమైన ఆధారం పైన మోపబడివుంటాయి. ఈ అటక కోసం దూలాలపై దంతెలు
ఆపైన వెదురు చాపలు పరిచి ఆపైన రాళ్ళు బండలు చెక్కదూలాలు మట్టి మొరుము నింపబడి
వుంటుంది. అటక ఆధారమైన పోటీలను కూల్చివేస్తే మంచ కూలడం వలన కోట తలుపులు
తెరుచుకోకుండ రాళ్ళు బండలు మట్టి ద్వారాల ఎత్తు రాశిపడుతుంది. దీనివలన సింహద్వారం
తెరుచుకోకుండ నివారించబడుతుంది.

వీరదుర్గడు అటక పోటీలను కూల్చివేశాడు. దుమ్మురేపుకుంటూ అటక కూలిపోయింది.


బండలు రాళ్లూరప్పలూ చెక్కదూలాలు కవాటం ఎత్తు రాశిపడింది. దుర్గద్వారం
బిగిసిపోయింది.

విష్ణువర్ధనునికి పరిస్తితి అర్ధమయింది. వారనుకున్నట్లు కోట తలుపులు తెరుచుకునే


331
  చాళుక్యసింహాసనం

అవకాశం లేనేలేదు. ఇంకా ఆ ప్రయత్నం వృదా. విశాఖదత్తుడు లోనుండీ దుర్గద్వారం


తెరవగల ననుకున్నాడు. కానీ ఆ విషయంలో విఫలమైనాడు. తమ సైన్యం ఎలాగైనా కోటలోకి
చేరాలి. తెల్లవారిందంటే రాష్ట్రకూట సైన్యం అంతా కూడతీసుకుని వచ్చి తమను వెనక నుంచీ
ముట్టడిస్తారు. అప్పుడు అంత సైన్యాన్ని ఎదిరించడానికి తమ బలం సరిపోదు.

విశాఖదత్తుడు పదిమంది యోధులతో చక్రవర్తి సౌధాన్ని ముట్టడించాడు. నాలుగు


ఏనుగులకు వెనకకాళ్ళకు సంకెళ్ళు వేసివున్నాయి. కానీ వాటిచెంత గుండ్రాళ్ళు గుట్ట పోసి
వున్నాయి. అవి రాళ్ళను గురిపెట్టి విసరగలవు. ఏనుగు నిద్రపోదు. అక్కడే ఎనిమిది మంది
యోధులు అశ్వారూఢులై శూలాలు పుచ్చికుని వున్నారు. కాలిబంట్లు కాపలా తిరుగుతున్నారు.
ఇంకొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు.

విశాఖదత్తుడు కాపలావారిపైకి తన అనుచరులను ఉసిగొల్పాడు. ఆ సమయంలో


తాను సౌధంలోకి చేరుకున్నాడు. అడ్డగించినవారిని ఒంటిచేత్తో నరుకుతున్నాడు. అనేక
కక్ష్యలు ఛేదించుకుంటు ఇంద్రవల్లభుడి శయనమందిరంలో ప్రవేశించాడు.

తన అనుచరులలో ఒక్కడే తనతో ఉన్నాడు. అప్పుడు కోటపై రణదుందుభి నినదిం


చింది. ఇంద్రవల్లభుడు మేలుకునేటప్పటికే ద్వారపాలకులు చనిపోయారు. ఇంద్రవల్లభుడు
తడబడుతూ తన ఖడ్గం అందుకోబోయాడు. విశాఖదత్తుడే ఆయనకు ఖడ్గం అందించాడు.
ఇద్దరూ కత్తీకత్తీ కలిపారు. కత్తులు నిప్పురవ్వలు చిమ్మాయి. విశాఖదత్తుడి దెబ్బ చాలా
బలంగావుంది. నిజంగానే అతడు పంచవృషో అసి. ఐదు ఆంబోతుల బలం ప్రదర్శించాడు.
ఇంద్రవల్లభుడు నిలదొక్కుకోలేకపోయాడు.

“మహారాజా! కత్తి కిందపడవేయండి” విశాఖదత్తుడు ఆజ్ఞాపిస్తున్నట్లు గర్జించాడు.

ఇంద్రవల్లభుడు ఇంకా ప్రయత్నించబోయాడు. విశాఖదత్తుడు ఆయన ఖడ్గం పట్టుకున్న


చేయి అందుకుని గట్టిగా పిండాడు. రక్తం కారింది. వెంటనే తన మొలకు చుట్టుకున్న తాడును
విప్పి ఆయన చేతులు వెనక్కు విరిచి కట్టాడు. ఖడ్గం మెడమీద పెట్టి బయటికి నడిపించుకు
వెళ్ళాడు. ఆ దృశ్యం చూసిన పరిచారిక పరిచారకులు రాష్ట్ర్రకూటభటులు బిక్క చచ్చిపోయారు.
విశాఖదత్తుని వెనకనుంచి పొడవాలని చూశారు. విశాఖదత్తుడి అంగరక్షకులు ఆ అవకాశం
ఇవ్వలేదు.

విశఖదత్తుడు ఇంద్రవల్లభుని తన అనుయాయులకప్పగించి తాను వేరే ముట్టడికి


కదిలాడు.

332
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

56 రాకుమారి అంతఃపురం ముట్టడి


అది శిరీషాకుమారి అంతఃపురం. అక్కడ రెండు పడకగదులున్నాయి. అందులో ఒకటి
రాజకుమారి శయనించేది. రెండవ గదిలో తక్కిన చెలికత్తెలందరూ కలిసి పడుకునేవారు.
అందుకోసం చాలా పెద్ద పల్యంకం వుంది. రాత్రి ఆహారసేవనం అయినతరువాత కొంతసేపు
సంగీత సాధన వుండేది. వాయిద్యాలు కానీ గాత్రం కాని సాధన చేసేవాళ్ళు. లేదా గ్రంథ
పఠనం కథా కథనం లాంటివి జరిగేవి. నిద్ర వచ్చినవారు వాయిద్యాల నడుమే ఒరిగి పోయి
నిద్రించేవాళ్ళు.

ముట్టడి జరిగే సమయానికి అందరూ గాఢనిద్రలోవున్నారు. ఒకరినొకరు


కౌగలించుకుని పడుకోవడంతో కంఠహారాలు ఒకదానితో ఒకటి ముడిపడ్డాయి. నగలు
ఒలిచి పడుకున్న వారి కుచకలశాలపై పగటిపూట ధరించే ఆభరణాల వత్తిళ్ళు
సంతరించుకున్నాయి. బయటనుంచి రణగొణ ధ్వనులు వినిపించాయి. అంతః
పురంలోవారందరూ కళ్ళు నులుముకుంటూ భయాందోళనలతో నిద్ర లేచారు. తొలగిన
వస్త్రాలను సవరించుకున్నారు. రేవతి ఉప్పరిగ మీదికెక్కి బయటికి చూచింది. ఏదో విప్లవం.
మసక చీకటి వలన ఏమీ తెలీటం లేదు. అందరినీ హెచ్చరించింది. “ఏదో కల్లోలం. కోటలో
సంకుల సమరం జరుగుతోంది!”

బాలికలందరూ జాగరూకులయ్యారు. పరిచారికలు ఒణికిపోతున్నారు.


చెలికత్తెలలోనూ శిరీషలోనూ ఆంధోళన. గుండె దడదడ.“త్వరత్వరగా అందరూ
కాలకృత్యాలు తీర్చుకోండి. ప్రయాణానికి సన్నద్ధం కండి” అన్నది అరణి. అరణి రాష్ట్రకూట
సైన్యంలో ఉపసేనాపతి స్ధాయి కలది. రేవతి పైనుంచీ తను చూస్తున్న దృశ్యం చెబుతోంది.
అందరూ కేడెము ముంజేతి రక్షలు తొడుక్కున్నారు. కరవాలాలు ధరించారు. వడ్ఢాణం చుట్టూ
చురకత్తులు దోపుకున్నారు. శిరస్త్రాణాలు సిద్ధంగా ఉన్నాయి. క్షణాలలో చెలికత్తెలందరూ
ముఖ్యమైన తినుబండారాలు నీళ్ళ తిత్తులుంచిన సంచులను వీపుకు కట్టుకున్నారు.
విలువిద్యవారు వీపున అంబుల పొదులు కట్టుకుని ధనుస్సులు చేతపట్టారు. శిరీష
ధనుర్బాణాలు ముట్టుకోడానికి తటపటాయించింది. తను తన ధనుర్విద్యను తండ్రికి
ధారపోయడం తన శపథం గుర్తుకు వచ్చింది.

ఎవరో అంతఃపురద్వారం బ్రద్దలుకొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వారంతపనీ చేయ


గలరు. చెలికత్తెలు ద్వారానికి కొన్ని పోటీలు పెట్టారు. ద్వారబంధం ఇవతల నేలంతా నున్నటి
రాయి పరవబడి వుంది.ఆ నేలపై చెలికత్తెలు నూనె ఆముదం గుమ్మరించారు. పైన రాగులు
ఆవాలు ఒలకపోశారు. ఎవరైనా తెలియక కాలు వేస్తే తలకాయ పగిలేటట్లు పడాల్సిందే.
అంతః పురం లోంచి కోట వెలుపలకు రహస్య మార్గముంది. అందులోంచి పారిపోవచ్చు.
అందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి.

అరణి రాకుమారిని మందలించింది. “కనీసం ధనుర్బాణాలను ధరించు రాకుమారీ!


333
  చాళుక్యసింహాసనం

సమరం ఎటుపోయి ఎటువస్తుందో తెలియదు.”

“నా శపథం?” తన అస్త్రసన్యాసం గుర్తుచేసింది శిరీష.

“శపథం సంగతి దేవుడెరుగు. ధనమాన ప్రాణాలు పోతున్నపుడు ఒట్టుతీసి గట్టుమీద


పెట్టచ్చు. పాపమేమీ రాదు. మన మానప్రాణాలు మనం రక్షించుకోవాలి. ఆట్టే సమయం
లేదు.”అన్నది షడ్పద.
“కోటలో ఏం జరుగుతోందీ?”
“తెలీదు. సైనిక తిరుగుబాటు కావచ్చు!”రోహిణి పైనుంచీ క్రిందికి దిగివచ్చి అన్నది.
“మనం ఎదురు తిరగలేమా?”

శిరీష మాటకు అందరూ ఒక్కసారి స్ధంభించిపోయారు. రోమాలు నిక్కపొడిచాయి.


ఎంతైనా పౌరుషంకల రాచబిడ్డ.

“నీవు ధనుర్బాణాలు ధరిస్తే ఎదిరించగలం. ద్వారం లోంచి వచ్చినవారిని వచ్చినట్లు


సంధించు. నీకు శబ్దభేది కూడా వచ్చుకదా!”అన్నది పూర్వచిత్తి.

“నేను విల్లుపట్టను.”మొండిగా అన్నది శరీష.

“అలా అయితే త్వరగా కాలికి బుద్ధిచెప్పి రహస్యమార్గంగుండ పారిపోవడం మంచిది.


మేము పది బాణాలు సంధిస్తే ఒకటి రెండు తగులుతే ఎక్కువ. నీవు సంధిస్తే పదికి పదీ
శత్రువుల ముఖాంతస్తంలో దిగబడతాయి.అదీ వ్యత్యాసం” అన్నది సమంత.
“వారు మననేంచేస్తారు?”
“చెరపడతారు. మా....... చేస్తారు.”అన్నది వాశిష్ట చాలా ఆంధోళనగా.
“అలా ఎందుకు చేస్తారూ? వాళ్ళకు నీతి ఉండదా?”
“ఏ యుద్ధంలోను నీతి వుండదు. జయించడమే ముఖ్యం! జయించిన తరువాత
అతివల్ని ఎవరూ వదిలిపెట్టరు” అన్నది యమున.
“జయించడం సంగతి కాదు నేనడిగింది.”

“ఏ యుద్ధమైనా అధికారం కోసం కాంతాకనకాల కోసమే జరుగుతుంది.”యమున


మళ్ళీ హెచ్చరించింది.
“కాంతల జోలికి రావడం నేరం కాదా?”
“సైనిక విజయంలో చట్టము న్యాయము ఏమీ పనిచేయవు. అంతా దౌర్జన్యమే!” అన్నది

334
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

పూర్వచిత్తి.
“వాళ్ళకు స్త్రీలుండరా?”
“ఉంటారు ఇంట్లో నాలుగు గోడలమధ్యా! వీళ్ళు సంవత్సరాల తరబడి దండయాత్రలకు
వెళుతుంటారు. ఇళ్ళకూ పెళ్ళాలకు దూరంగా వుంటారు” అన్నది సమంత.
“అలా జరగకూడదు.”
“పూర్వం కూడా వేలాదిమంది స్త్రీలను చెరపట్టేవాళ్ళు. వాళ్ళకు పుట్టే సంతానంతో వాళ్ళ
జాతిని పెంచుకుని సైన్యాన్ని నింపుకునే వాళ్ళు.” చరిత్ర తెలిసునట్లు అన్నది షడ్పద.
“ఇది వాదోపవాదాలకు సమయమా రాకుమారీ? పారిపోదామా ఎదిరిద్దామా? నీ ఆజ్ఞ
కోసం నిరీక్షిస్తున్నాం” అన్నది అరణి సహనం నశించగా.

“మనం వారినెదిరిద్దాం. పిరికి పందలలాగా పారిపోవడమేమిటీ? మనం అబలలం


కాదు సబలులం అని నిరూపిద్దాం. ప్రాణాలకు తెగించి పోరాడదాం. ఒక వేళ ఓడిపోయే
పరిస్తితే వస్తే అందరం కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకందాం”అన్నది శిరీష.

“పరిస్తితి విషమిస్తే మనకు ఆత్మహత్య చేసుకునే సమయం కూడా దొరక్కపోవచ్చు!”


చాలా భయంగా అన్నది సమంత.

“అందరూ సావధానులు కండి. వ్యూహంతో వారినెదిరిద్దాం. లోపలకు


చొచ్చుకురాకుండా మార్గానికి పెద్దపెద్ద వస్తువులు అడ్డం పెట్టండి. ముందర ధనుష్కులు వారి
ప్రతాపం చూపించాలి. బాణాలు నిండుకుంటే కత్తుల యుద్ధం. శత్రువునునరికే సమయంలో
పెద్దగా బొబ్బలు పెట్టాలి. ఆ భయానికే వాడు చావాలి. ఎవరినేనా శత్రువు వాటేసుకుంటే
వృధాగా గింజుకోవడం కాదు చేయవలసింది. వాడి ఆయువుపట్లమీద దెబ్బతీయాలి.
అవకాశం చూసి గొంతు స్వరపేటికవద్ద కొరికి పట్టుకోవాలి. కొంతసేపు అలాగే వుండాలి.
పట్టు సడలించకూడదు. పులి లేడిగొంతు కొరికినట్లు కొరకాలి. వాడు మననేంచేస్తున్నాడనేది
ముఖ్యం కాదు. మనం వాడినేం చేయగలమనేది ముఖ్యం. చివరగా ఓడిపోయే సమ యంలో
వెనక్కు నడుస్తూ రహస్యమార్గంలోకి వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్తితిలోను రాజ కుమారిని
రక్షించాలి. సావధానా భవ!” అన్నది అరణి ఆజ్ఞాపిస్తున్నట్లు..

అందరిలోనూ వీరోత్సాహం అతిశయించింది. “అంతే అంతే! ఎదిరిద్దాం!”


అన్నారందరూ ధైర్యంగా.

335
  చాళుక్యసింహాసనం

57 వరాహకేతనం
ఐదుగురు చాళుక్య యోధులు పైలుడి ఆధ్వర్యంలో రాజకుమారి అంతఃపురం ముట్టడిం
చడానికి వెళ్ళారు. దారువుతో చెక్కిన ద్వారబంధం ఘనంగా ఉంది. ఇరువంకలా ఇద్దరు
మహల్లులు శూలపాణులైయున్నారు. పైలుడి యోధులు వారిని మట్టుపెట్టారు. వారు పెద్దగా
పోరాడలేకపోయినా అందరూ మేల్కొనేటట్లు పెద్దగా బొబ్బలు పెడుతూ పడి పోయారు.
పైలుడు చుట్టూ చూసి ఒక అరుగుకున్న బండరాయిని పెకలించుకు వచ్చి ద్వారాన్ని
గుద్దించాడు. తలుపులు తెరుచుకోకపోగా నాపరాయి పొరలు పొరలుగా చిట్లి నేల రాలింది.
కానీ బందులు ఉతకలు వదులయ్యాయి. మొలకు కట్టుకుని వచ్చిన ఉలితో బందులున్న
ప్రాంతంలో కొయ్యను తెగనరికారు. అందువలన ఒక్కసారిగా తంతే తలుపులు
తెరుచుకున్నాయి. చకచకా ఇద్దరు సాయుధపాణులు లోపలకు ప్రవేశించారు. రాగులపై
కాలువేసి తలకాయ పగిలేటట్లు జారిపడ్డారు. జలనాళిక లోంచి ప్రవేశించిన యోధులకు
మొలకు కట్టుకున్న కాశ, తోలు పట్టీ తప్పుతే వర్మాలు శిరస్త్రాణాలు లేవు. అదేసమయంలో
శర పరంపర దూసుకువచ్చి వాళ్ళ శరీరాల్ని తూట్లు పొడిచింది.

పైలుడు తనవారిని ఒక్క క్షణం ఆగమన్నాడు. లోపల అంతటి యోధులుంటారని


అతడు తలంచలేదు. రేవతి ఇంటిపైకెక్కి రుబ్బురోలు రాయి సరిగ్గా ఒక భటుడి నెత్తిన
పడేటట్లు విడిచింది. శిరస్త్రాణం లేకపోవడంతో అతడి తలపండు పగిలింది.

ఆ దృశ్యానికి పైలుడుకి దిమ్మతిరిగింది. తమాయించుకుని గంభీరంగా “ఎవరక్కడా?


రాజకుమారి శిరీష వెంటనే లొంగిపోవాలి. ఇది మొదటి హెచ్చరిక” అన్నాడు గద్దిస్తున్నట్లు.
రెండు బాణాలు చయ్యన వచ్చాయి. తగులుతే ప్రాణం పోయేదే.

మళ్ళీ పైలుడు కొంచం ఓపిక పట్టి “ప్రమదలారా! లొంగిపోండి. మేము మీకేహాని తల


పెట్టము. ఇంక బాణాలు సంధించవద్దు. మాతో మాట్లాడండి” అన్నాడు.

రాకుమారి చెలికత్తెలు ఒకరి ముఖాలొకరు చూచుకున్నారు. వారు దీపకళికలు ఆర్పి


వేసి ఉంచటంతో ఎవరూ ఎవరికీ కనిపించటం లేదు. “అసలు మీరెవరు? మా కోటపై మీ
అఘాయిత్యం ఏమిటి?” అన్నది రేవతి.

అందుకు బదులుగా పైలుడు “అమ్మా! మేము చాళుక్య సైన్యం. మాకు కోట వశమైంది.
మీరు లోంగిపోయినట్లు ఒప్పుకుంటే మాకు శస్త్ర ప్రయోగం చేయవలసిన అవసరం లేదు.
మీరు అంతఃపురం బయటికి మాత్రం రాకూడదు.”అన్నాడు.

“చాళుక్యులంటే ఎవరు? బాదామివారా? మానుకోటవారా? వేములవాడవారా?


కళ్యాణి వారా?” షడ్పద ప్రశ్నించింది.

336
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“వీరెవరిమీ కాదు. మేము వేంగీ చాళుక్యులం. మహారాజ నరేంద్రమృగరాజు


బంటులం!” సమాధానం చెప్పాడు పైలుడు.

“మమ్ము శాసించడానికి మీరెవరు? మేము లొంగేదిలేదు. అడుగు ముందుకు వేస్తే


కంఠంలో ప్రాణముండదు” అరిచింది అరణి.

“అబలలు......”పైలుడు ఏదో అనబోయేటంతలో మళ్ళీ బాణాలు వచ్చిపడ్డాయి.


మరొక బంటు దెబ్బ తిన్నాడు. రాకుమారి అంతఃపురమే కదాయని విశాఖదత్తుడు తనకు
ఐదుగురు సైనికుల్నే ఇచ్చాడు. అందులో ఇంకా ఒక బంటు మాత్రం మిగిలాడు.“అమ్మా
మీరు సబలలే! కోపగించుకోకండి నాపేరు పైలుడు.”అన్నాడు మెత్తబడుతూ.

“పైలుడో గైలుడో అడుగు ముందుకు వేస్తే తెగనరుకుతాం.”రోహిణి నుంచి హెచ్చరిక


వచ్చింది.

ఒక సైనికుడు రాళ్ళు రప్పలు పూలకుండీలు లోపలకు విసిరాడు. నూనెపైన మట్టిపోస్తే


కాళ్ళు జారవని అతడి ఆలోచన. లోపలనుండీ బాణాలు సంధిస్తునే ఉన్నారు. బాణాల వర్షం
ఆగగానే ఆసైనికుడు లోపలకు దూసుకు వెళ్ళాడు. కత్తియుద్ధం నడిచింది. అరణి
అతనినెదిరించింది. అతడిని ఖంగుతినిపించింది. తట్టుకోలేకపోయాడు. పైలుడు కూడా తన
సైనికుడికి అండగా లోపలకు వెళ్ళి ఖడ్గం ఝుళిపించాడు.

“పైలుడా మరియాదగా చేతులు పైకెత్తు.” పెద్దకేక వినిపించింది. ఒక చెలికత్తె అతడిపైకి


ఉచ్చుతాడు విసిరిలాగింది. ఉచ్చులో చిక్కుకున్న పైలుడు క్రింద పడ్డాడు. చెలికత్తెలు
మూకుమ్మడిగా అతడిపై బడి మూర్ఛ పోయేటట్టు పిడిగుద్దులు గుద్దారు. కాళ్ళూచేతులూ
బిగించి కట్టారు.అతడు అరవకుండ నోట్లో గుడ్డలు కుక్కారు. లోపలకు ఈడ్చుకువెళ్ళి ఒక
గదిలో పడేసి బయట గొళ్ళెం పెట్టారు. మిగిలిన ఒక్క సైనికుడు ముందరే బయటికి
పారిపోయాడు.

58 విష్ణుయుద్ధం
కోటద్వారం బిగిసిపోవడం తెలిసింది విష్ణువర్ధనుడికి. ఇప్పుడు వేరే ప్రయత్నం చేయాలి.
తను ఆజ్ఞాపించకుముందే తమ సైన్యంలోని మాష్టీలు జట్టీలు జట్లుగా విడిపోయారు. ఒకరిపై
ఒకరు ఎక్కి కోటగోడ ఎత్తు మంచలా నిలబడ్డారు. వారినాధారం చేసుకుని సైని కులు వేగంగా
బురుజులపైకెక్కసాగారు. కొందరు మాస్టీలు వేరు వేరు ప్రాంతాలనుండీ ఉడుముల
సహాయంతో పగ్గం వేసుకుని లగ్గలకెక్కారు.

అదృష్టవశాత్తు మాన్యకేతదుర్గానికి అగడ్త ఏమీలేదు.

337
  చాళుక్యసింహాసనం

శత్రువులు కోట ముట్టడించారని తెలుసుకున్న రాష్ట్రకూట యోధులు ఎవరికి వారు


కోట గుమ్మంవైపు తరలివచ్చారు. కానీ వారికి వ్యూహము నాయకత్వము లేకుండా పోయింది.
గజసాహిణులు అశ్వికదళాధిపతులు ఎవరికివారు కోటవైపు కదలివచ్చాయి. ఏనుగుల
ఘీంకారాలతో అశ్వాల సకిలింపుతో సైనికుల వీరాలాపాలతో గొప్ప గందరగోళం ఏర్పడింది.

రాష్ట్రకూట నాయకులు తమ పతాకాలతో రాకపోవడంతో ఎవరెక్కడున్నదీ ఒకరికొకరు


తెలియరావడం లేదు. ఆ సమూహంలో తన ముందువాడు తప్పుతే తరువాతివాడెవరో
తెలియటం లేదు. ముందువరసలో వారుమాత్రం చాళుక్య సైన్యాలను గమనించి
ఎదిరించారు.

విష్ణువర్ధనుడు అసంఖ్యాకంగా తరలివస్తున్న రాష్ట్రకూట యోధుల్ని చూశాడు. తమ


వారందరూ కోటగోడనెక్కడానికి ఇంక కొంత సమయం పడుతుంది. ఈలోపు కోటవెలుపల
యుద్ధం తప్పనిసరి అయింది. తాను ధనుస్సుతో యుద్ధం చేయాలంటే శత్రువులకన్నా
ఎత్తులో వుండాలి. ఆ విషయం చెప్పగానే జట్టీలు ఒకరిపై ఒకరు నిలబడి లాఘవంగా
మనిషెత్తు మంచ నిర్మించారు. విష్ణువర్ధనుడు మంచపైకెక్కి స్థిరంగా ఎడమకాలు
ముందుకుపెట్టి కుడికాలు వెనక్కు వుంచి ధనుస్సు సారించాడు. శరాచి యవరాజు వెనకాల
నిలబడి అంబులు అందిస్తున్నాడు. ఒక్కబాణంకూడా వృధా పోవటంలేదు. అలా
తమసైన్యంపైకి ఉరికివచ్చే ప్రముఖుల్ని నేలకొరగ చేయసాగాడు. కొంచం సమయానికి
రెండు మూడు యుద్ధగజాలు దోవచేసుకుని ముందుకు చొచ్చుకువచ్చి భీభత్సం సృష్టిం
చాయి. ఎదుటివారిని చుట్టచుట్టి విసరికొడుతున్నాయి.ఆయుధాలు లాగి అవతల
పడేస్తున్నాయి. కాళ్ళక్రింద వేసి పడత్రొక్కుతున్నాయి. వాటి మాటున దాగిన రాష్ట్రకూట
విలుకాండ్లు విష్ణువర్ధనునిపై బాణాలు సంధించసాగారు. తన చుట్టూ పదహారుమంది అంగ
రక్షకులు ముగ్గురు ఉపసేనాపతులు ఉన్నారు. కానీ బాణాలకు తరతమభేదాలుండవు.
ఎవరికి తగులుతే వారు నేలకొరగ వలసిందే. తన అంగరక్షకులు నేలరాలసాగారు.

తమయువరాజును రక్షించడం కోసం కడియరాజు చాళుక్యసైన్యంలో కొంత వెనక్కు


నడిపాడు. శత్రుధానుష్కులపే కత్తులతో దాడి చేశారు. ఏనుగు తొండాలను తెగనరికారు.
మావటీలను పొడిచారు. అలా కూలిపోయిన ఏనుగులే క్రొత్తవారు దరిచేరకుండా
అడ్డుపడ్డాయి. ఐనా అశ్వికులు చోటు చేసుకుని ముందుకు వచ్చారు. వారివెంబడి శిరస్ధ్రాణాలు
డాళ్ళు ధరించిన భటులు ప్రాణానికి తెగించి పోరాడుతూ వచ్చారు. అక్కడ యుద్ధంలో
మాత్రం చాళుక్యసైన్యం బాగా నలిగిపోయింది. కడియరాజు పడిపోయాడు.

కొందరు మాన్యకేత యోధులు పెద్దపెద్ద నిచ్చనలు తెచ్చుకుని ఏదో ఒక దిశనుండీ


కోటపైకి జేరనారంభించారు.

విష్మువర్ధనుడు బయటియుద్ధం ప్రక్కనపెట్టి తానుకూడ కోటపైకిజేరాడు. చిన్నాప్రగడ


యువరాజును అంటిపెటుకునే వున్నాడు.

338
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

కోటలోని సైన్యం రెండువందలదాకా కుశధారికి సహాయం వచ్చారు. కోటపైన విష్ణు


వర్ధనుని ముందుగా ఎదిరించినవాడు కుశధారి. అతడు యువరాజుతో కత్తి కలిపే లోపే
అంగ రక్షకులు ఆతడిని ఒక్క దెబ్భలో మెడ నరికి వేశారు. విష్ణువర్ధనుడు తన ఖడ్గ చాలనంతో
కోటగోడపైనివారిని తరిమికొట్టాడు. ఆ వేగానికి తట్టుకోలేక కొందరు కోటగోడపై నుండి
క్రిందికి ధూకివేశారు. విష్ణువర్ధనుడు కోటపై రాళ్ళురువ్వే యంత్రాన్ని ఉప యోగంలో
పెట్టించాడు. దానివలన కోటవైపు తరలివచ్చే రాష్టకూటులపైన రాళ్ళవర్షం కురిసింది.
కొంతసేపు కోటగుమ్మంవద్ద ఉన్న చాళుక్యయోధులపై వత్తిడి తగ్గింది. ఈ సమయంలో
చాలావరకూ చాళుక్యులు కోటపైకి ఎక్కేశారు. మిగిలినవారూ, క్షతగాత్రులు రాష్ట్రకూటుల
ఆగ్రహానికి గురయ్యారు.

కోటగోడ పైనుండి క్రిందికి దిగడానికి గోడ మందంలోనే మెట్లు వున్నాయి. అవికూడ


చాలా ఇరుకుగా ఉండడం వలన ఒకరివెనక ఒకరు దిగాలి. అలాదిగేవారిని కోటలోని
రాష్ట్రకూటులు పొంచివుండి తెగనరకసాగారు. ఆ పరిస్ధితి అధిగమించడానికి కోటకొమ్మలకు
పగ్గం బిగించి ఒకేసారి అనేకమంది క్రిందికి జారిన చాళుక్యులు రాష్ట్రకూటులను చెదర
గొట్టారు.

విశాఖదత్తుడు మార్గమధ్యంలో అడ్డంవచ్చినవారిని నరుక్కుంటూ భీమసలుఖి మహా


రాజు నివాసం వెతుక్కుంటూ వెళ్ళాడు. భీమసలుఖి రహస్యమైన నేలమాళిగలో నిద్రిస్తుం
టాడు. విశాఖదత్తుడు ద్వారపాలకుల్ని ఒక్కదెబ్బలో మట్టుపెట్టాడు. అడ్డు వచ్చిన పరిచారిక
లపై కత్తి దూశాడు. ఎవ్వరిమీదా దయా ఉపేక్ష చూపించలేదు. భయంతో వారే రహస్య
మార్గాన్ని చూపించారు.

ఆ మాళిగలో చాలా ప్రశాంతంగా వుంది. బయటి రణగొణధ్వనులు ఏమీ వినిపించటం


లేదు. మధుపానం మత్తులో ఆదమరచి నిద్రపోతున్నాడా రాజు. విశాఖదత్తుడు భీమ సలుఖి
మహారాజును కుదిపి నిద్ర లేపాడు. అదే పల్యంకంపైన ఇరువంకలా ముసుగు పెట్టుకుని
నిద్రిస్తున్న ఉంపుడుకత్తెలు కంగారుగా తమ దుప్పటీలు తొలగించడంతో వారి
నగ్నస్వరూపాలు బయటపడ్డాయి.వారు విశాఖదత్తుని చేతులో ఖడ్గం చూసి ఘోల్లున
ఏడుపులు మొదలుపెట్టారు. విశాఖదత్తుడు వారిపైకి ఎడంచేత్తో బట్టలు విసిరేశాడు.

మేల్కాంచిన భీమసలుఖి ముందు అది తనకలేనేమో ననుకున్నాడు. కళ్ళు నులుము


కున్నాడు. ఎదురుగా ఒకకాలు మంచంపై పెట్టి ఖడ్గం ధరించి నిలబడిన యోధుడిని చూసి
అప్పుడు ఒణకసాగాడు. మాటకూడదీసుకుని “తమరెవరూ? ఏంకావాలి?” అన్నాడు.

అందుకు విశాఖదత్తుడు “ఓ రాజా! మేము నరేంద్రమృరాజ భటులం. మాన్యకేతం


మా వశమయింది. ధైర్యంవుంటే ఎదిరించండి!” అన్నాడు.

మహారాజుకు క్షణంలో ముచ్చమటలు పోశాయి. “దాహందాహం” అన్నాడు. విశాఖ

339
  చాళుక్యసింహాసనం

దత్తుడు మధుపాత్ర నింపి అందించపోయాడు. ఆ క్షణంలో తప్పించుకుని పారిపోవాలని


చశాడు భీమసలుఖి.

ఆ పరిస్ధితి వస్తుందని విశాఖదత్తుడికి తెలుసు. అక్కడ అరలో అమర్చిన ఆయుధాల


లోంచి శూలం తీసుకుని భీమసలుఖిపైకి విసురుగా వేశాడు. అది అతడి వెన్నులో బలంగా
దిగపడింది. ప్రక్కకు పడిపోయాడు. విశాఖదత్తుడు అతడి నోటికి మద్యం అందించాలని
చూశాడు. మద్యం లోపలకు పోలేదుకానీ రక్తం ప్రవాహంలా బయటికి వచ్చింది.

విష్ణువర్ధనుడు పగ్గం పట్టుకుని సఱ్ఱున కోటగోడపైనుండి క్రిందికి జారాడు. అతడివెంట


అంగరక్షకులు కూడా జారారు. కోటలోని రాష్ట్రకూటులపై విష్మువర్ధనుడు విజృంభించాడు.
ఒక యంత్రంలా శత్రువులను నరుక్కుంటూ సాగాడు. యువరాజుకు రక్షణ ఇవ్వడం చాలా
కష్టమయింది. ఉపసేనాపతులలో ఒకడు ఒరిగిపోయాడు. కోటవెలుపలే మరొకడు భాణ
ఘాతానికి నేలకొరిగాడు. మిగిలింది మూగసేనాని ఒక్కడే. అంగరక్షకులలో ఒకళ్ళిద్దకన్నా
మిగలలేదు.

కొంతసేపు భీకరయుద్ధం సాగేటప్పటికీ రాష్ట్రకూట యోధులు పల్చబడ్డారు.

ఆ సమయంలో చాళుక్య సైనికులు ఇంద్రవల్లభుని కోటగోడ వైపు నడిపించుకు


వెళ్ళారు. విష్ణువర్ధనుడు వారికి అండగా నిలిచాడు. శత్రువులను దరిచేరనియ్యలేదు. భటులు
ఇంద్రవల్లభుని సోపానాల మీదినుంచీ కోట ప్రాకారం పైకి ఎక్కించి సింహద్వారం పైభాగంలో
అందరికీ కనిపించేటట్లు నిలబెట్టి రాటకు కట్టివేశారు. అది మరీ అన్యాయ మనుకుని ఒక
యోధుడు ఒక ఆసనం తెచ్చి దానిపై ఆయనను కూర్చుండబెట్టి కాపు న్నాడు.

అప్పటికి తూరుపు దిక్కున వెలుగు వస్తుండడంతో ఋరుజు స్ధంభంపై గరుడపతాక


స్థానంలో వరాహకేతనం అందరికీ కనిపిస్తోంది. బంధింపబడిన మహారాజు కోటగుమ్మం
పైభాగంలో కనిపిస్తున్నాడు. మహారాజును గుర్తించిన రాష్ట్రకూట యోధులందరూ ఓటమి
నంగీకరిస్తూ నిలబడిపోయారు. కొందరు భోరున ఏడ్చేసారు. కొందరు తల నేలకేసి బాదు
కున్నారు. కొందరు తమ వైఫల్యానికి గొంతుకలు కోసుకున్నారు. మొత్తానికి ఆయుధాలు
క్రింద పడవేసి నెత్తిన చేతులు పెట్టుకుని నిలబడ్డారు.

విష్ణువర్ధనుడు యుద్ధం ముగిసిందనే అనుకున్నాడు.

కానీ కోటలోపల ఇంకొక సైన్యం తనవైపే కదలివస్తోంది. చెదురుమదురు


సైనికులందరూ ఆ దండులో జేరిపోతున్నారు.అంతకంతకూ ఆ సైన్యం ఉరుములు
మెరుపులతో భయపెట్టే కారుమేఘంలా వుంది. ధానికి నాయకత్వం వహిస్తున్న సేనాపతి
ఎవరో తెలియరావడం లేదు.విశాఖదత్తుడు లెక్కించిన సేనానులలో ఇతడు ఉన్నట్లు లేదు.

340
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

శిరఃప్రధాని రేవాదాసదీక్షితుడు తన రక్షక దళాలన్నిటినీ ముందుకు నడుపుతున్నాడు.


రాష్ట్రకూట యోధులందరూ ఆయన చుట్టూచేరి ఆయన ప్రోత్సహంతోనే యుద్ధం చేస్తు న్నారు.
అప్పటికి తెలతెల్లవారుతోంది. ఎక్కడ చూసినా శవాల గుట్టలు. తెగిపడిన అవయవాలు.
మాంసఖండాలు. నేలంతా రక్తంతో తడిసి బురద అయింది. కోట నడిబొడ్డున రాతిమానుపై
ఎగిరే కాంచన గరుడపతాక అవనతమైపోయింది. చాళుక్య వరాహం లగ్గల కెక్కింది. ఐనా
ఆయన పట్టువీడలేదు.

శిరఃప్రధాని అంగరక్షకుడు నీలవర్ణుడు పరిస్తితిని అర్ధంచేసుకున్నాడు. దుర్గం పర


వశమై పోయింది. పరిస్ధితి చేయిదాటిపోయింది. ఇంక శిరఃప్రధానిని రహస్యమార్గంగుండా
కోట దాటించాలని తలంచాడు.“దేవదేవా! రండి తప్పుకుపోదాం. మీరు రహస్యమార్గంలో
ప్రవేశించండి. జాగుచేయవద్దు” అన్నాడు.

అందుకు బదులుగా శిరఃప్రధాని “నీలవర్ణా!పారిపోవడం కాదురా. నరకరా


అరివీరులను. నీ శక్తి సామర్ధ్యాలను నీ స్వామిముందు ప్రదర్శించు. నీ పరాక్రమం కనులారా
చూడనీయి. అరివీరులను దట్టించి నరుకు. ఆత్మబలాన్ని మించిన బలం లేదు. విజృంభించు.
ధనుర్వి ముక్త శరంలా దూసుకుపో. దూసుకుపో ఆదిత్యమండలాన్ని సహితం. నీవెనక
నేనున్నా. వెనకాడకు కదనానికి. కత్తికొక కండ, దెబ్బకొక తల నేలరాలాలి. నరుకు నీలవర్ణా!”
అన్నాడు.

అందుకు నీలవర్ణుడు“స్వామీ! నేను మీ అంగరక్షకుడిని. మిమ్మల్ని రక్షించడమే నాపని.


ఇది సమయంకాదు సమరం సాగించడానికి. మోసం జరిగిపోయింది. ఇప్పటికే మహా
యోధులందరూ నేలకొరిగారు. గరుడ పతాకం దిగిపోయింది. దేవదేవా ఇదితప్పుకు
పోవలసిన సమయం. రండి మనం కోటదాటే ఉపాయం వుంది. జాగుచేయకండి”అన్నాడు.

“నీలవర్ణా! నీవింత పిరికివాడివా? నన్ను నీవెవడవురా రక్షించడానికి? నీవలన నేను


బ్రతుకుతున్నా ననుకున్నావా? అయమాత్మా! పిచ్చివాడా! ఆ మహాకాలుడి ఆజ్ఞయితే తప్పుతే
నన్నెవడూ చంపలేడు. నైనం ఛిందంతు శస్త్రాణి నైనం దహతి పావకాః!

ఈ కండలు ఈ ప్రభువుల ఉప్పుతినడం వలన పెరిగినవిరా! షిమోగలో ఋగ్వేదం


సంత చెప్పుకుంటు ఉపాదానం అడుక్కుంటు బతికేవాడిని గోవిందప్రభాతవర్ష విక్రమావలోక
చక్రవర్తి ఆదరించి ఒక రాజ్యానికి శిరఃప్రధానిని చేశాడు. ఇప్పుడు ఎదిరించి పోరాడకుండా
పారిపోవడమా?

ఈ దేహం మనదా? ఇదొక అద్దెకొంప! మనసొంతమా? ఉన్నంతకాలం ఉన్నాం.


ఇంకా మమకారం దేనికీ? పోతే పోనీయ్! యశఃకాయం ఇంతకన్నా ముఖ్యంరా! మన
ప్రయత్నం మనం చేద్దాం. ఆపైన దైవమున్నాడు. పురుషకారం లేకుండ అజుడైనా
కరుణించడు.” అన్నాడు శిరఃప్రధాని.

341
  చాళుక్యసింహాసనం

“దేవదేవా! నామాట వినండి. ఇది వేదాంతానికి సమయం కాదు. అసలు సమయం


చేయి దాటిపోయింది. కోట లోపలవుండి మీరు చేసేదానికన్నా కోట బయటవుండి చేయ
గలిగింది చాలావుంటుంది. త్వరగా తప్పుకు వెళ్ళిపోదాము.రహస్య మార్గాలున్నాయి.”

“నీలవర్ణా!నేను పారిపోయే సమస్యేలేదు. నన్నా కాలుడు తప్పుతే ఎవడూ ఏమీ చేయ


లేడు. నేనెవడనుకుంటున్నావురా? శివోహం!శివోహం! శివోహం!”

ఆ సమయంలో ఆయన ముఖంచూస్తే రుద్రుడిలాగే వున్నాడు.

“నాకులేని భయం నీకెందుకూరా నీలవర్ణా? ఉన్నదళాలను ముందుకు నడుపు.


నేనుకూడా కత్తి దూస్తున్నా. నా చేతులో యమపురికి జేరేవారెందరో నీవే చూద్దువు.”

“స్వామీ! దేవదేవా మహాదేవా! నామాట వినండి. మీరొక్కరైనా వెనక్కి వెళ్లిపోండి.


రహస్యమార్గం గుండా వెళ్ళిపోండి. మీరు యుద్ధ అనుభవం కలవారు కాదు. చేతులెత్తి
మొక్కుతున్నా. ఒక రక్షణాధికారిగా మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను” అన్నాడు నీలవర్ణుడు
ఆవేదనతో.

అందుకు శిరఃప్రధాని “నీలవర్నా! నన్నీ ముష్కరులు చంపగలరను కుంటున్నావా?


నాకు లేని పిరికితనం నీకెందుకురా? సైన్యాన్ని ముందుకు నడుపు. ఈ శత్రుసైన్యాన్ని
అర్ధముహూర్తకాలం స్ధంభింపచేస్తా చూడు” అన్నాడు రేవాదాసదీక్షితుడు.

రేవాదాసదీక్షితుదు ఏనుగుపైనుండీ కిందికి దిగి కత్తిదూసి ముందుకు ధూకాడు. ఇక


నీలవర్ణుడు ఆగలేదు. తన దళాలను సమీకరించి ముందుకు నడిపాడు.విష్ణువర్ధనుని
నిలువరించి పోరాడాడు. చాళుక్యయోధులు ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేక
పోయారు. విష్ణువర్ధనునివెంట అంగరక్షకులలో మూగసేనాని ఒకడే మిగిలాడు. మిగతా
వారంతా సమసిపోయారు.

నీలవర్ణుడు ఒక బరిశ అందుకుని గాలిలోకి పైకెగిరి విష్ణువర్ధనునిపైకి గురిపెట్టి


విశిరాడు. ప్రమాదం గ్రహించిన చిన్నాప్రగడ శూలన్ని అడ్డుకుని చేతపుచ్చుకుని నీలవర్ణునిపైకి
ఉరికి అతడి ఎదురురొమ్ములో దిగవేశాడు. కానీ ఒక అంగరక్షకుడు అలా తన స్వామిని
విడిచి ముందుకు పోవడం తప్పే. ఆసమయంలో విష్ణువర్ధనునికి కూడ కొన్ని
గాయాలయ్యాయి. కొంచం డస్సినట్లు కనిపించాడు. అప్పుడు చిన్నాప్రగడ విజ్రుంభించాడు.
ఎవరూ యువరాజు దరిరాకుండ నిరోధించాడు. అతడి ఖడ్గచాలనా నైపుణ్యానికి యువరాజు
ఆచ్ఛర్యపోయాడు. ఎవడీతడు అనుకోక తప్పలేదు.

నీలవర్ణుడు పడిపోవడం చూసిన శిరఃప్రధాని మహాకాలుడిలా విజృంభించాడు. ఖడ్గం


తిప్పుతూ నిర్వాణస్త్రోత్రం చేస్తూ నిర్భయంగా ముందుకుసాగాడు.

342
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

మనోభుద్యహంకార చిత్తాని నాహం


నచాసోత్ర జిహ్వో న చాగ్రహణ నేత్రే
శిరఃప్రధాని దెబ్బకు చాళుక్యయోధుడి తలకాయి తెగిపడింది.
నచావ్యోమ భూమే నతేజో నవాయు
నచాప్రాణ సంధ్యో నవై పంచ వాయుః
శిరఃప్రధాని కొట్టిన దెబ్బకు శత్రువు భుజస్కంధం గొడ్డలితో నరికినట్లు తెగిపడింది.
ర్నవా సప్త ధాతుర్నవా పంచకోశా
నవాపాణి పాదౌ నచోపస్త పాయుః
ఒకయోధుడి మస్తిష్కం తెగి నేలరాలింది.
నమే ద్వేషరాగం నమేలోభ మోహం
నతోనైవ మేనైవ మాత్సర్య భావః
అవతలివాడి ఖడ్గం పట్టిన ముంజేయి తెగింది.
నధర్మో న చాతుర్ నకాయో న మోక్షః
నపుణ్యం నపాపం న సౌఖ్యం నదుఃఖం
ఒక బంటు గుండెలో కత్తి దిగవేసి బయటికి లాగాడు శిరఃప్రధాని.
నమంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞం
అహం భోజనం నైవ భోజ్యం నభోక్తా
కత్తి దెబ్బకుఒకరి నడుము తెగిపోయింది.
నమృత్యుర్నశంకా నమే జాతి భేదాః
సుతానైవ మే నైవ మాతా నజన్మః
ఆవతలవాడి తలపండు రెండుగా చీలగా కపాళమోక్షం పొందాడు.
నబంధుర్న మిత్రా నగుర్నైన శిష్యా
చిదానంద రూపం శివోహం శివోహం.
చిదానంద రూపం శివోహం శివోహం.

343
  చాళుక్యసింహాసనం

చాళుక్యయోధులు పుంజుకున్నారు. ముందుముందుకు తోసుకు వెళ్ళారు. అప్పుడు


విష్ణువర్ధనునికి ఎదురయ్యాడు శిరఃప్రధాని రేవాదాసదీక్షితుడు.

విష్ణువర్ధనునికి తనముందున్న సేనాని ఎవరో తెలీదు. ‘ఈతడివలననే ఇరుపక్షాలా


చాలా సైన్యం మడిసింది. బురుజులపై రాష్ట్రకూట పతాక అవనతమైనా కోట పరవశమైనా
తన ప్రయత్నం మానని ఈ సేనాపతి ఎవరూ? ఈతడి వలనకదా విజయం ఆలస్య మయిందీ!
విశాఖదత్తుడు ఈతడిని గురించి చెప్పలేదే!ఇతడిని ఒకేఒక దెబ్బతో తల తెగి పడేడట్లు
నరకా’లనుకున్నాడు. కానీ ఆతడి నెరిసిన గడ్డము నుదుటన గంధాక్షతలు కళంజంత రక్తవర్ణ
తిలకము చూస్తే ఒక క్షణం చేయి ఆగింది. అందులోను అతడు వయసు మళ్ళినవాడు.
దేహపరిశ్రమ కలవాడుకాదు. అసలు సైనికుడే కాదనిపించింది.

విష్ణువర్ధన రాకుమారుడు ఏమనుకున్నాడో ఏమో ఖడ్గం వెనక్కి తిప్పి పిడితో ఆయన


నుదిటిపై మోదాడు. శిరఃప్రధాని రేవాదీక్షితుడు మొదలునరికిన వృక్షంలా వెనక్కు పడి
పోయాడు. తక్కిన రాష్ట్రకూట యోధులంతా ఆయుధాలు క్రింద పడవేసి మోకాళ్ళపై ఒరిగి
చాళుక్య విష్ణువర్ధనుని ముందు మోకరిల్లారు.

59 విజయానంతరం.
ఉదయం పొద్దెక్కక ముందే మాన్యకేత దుర్గంలో యుద్ధం ముగిసింది. అందరికీ
కనిపించే టట్లు బురుజు స్తంభంపై చాళుక్య వరహకేతనం ఎగురుతోంది. సింహద్వారం వద్ద
ఇంద్ర వల్లభ మహారాజును బంధించిన దృశ్యం కనపడుతోంది. రాష్ట్రకూటుల గరుడపతాకం
నేల రాలింది. రాష్ట్రకూట యోధులందరూ ఆయుధాలు క్రిందపెట్టి మోకాళ్ళపై కూర్చుని మోక
రిల్లారు.

ఆకాశంలో గద్దలూ రాబందులూ ఎగురుతున్నాయి. ఎక్కడ చూసినా శవాలు గుట్టలు


గుట్టలుగా పడివున్నాయి. తెగిన కాళ్లూ చేతులు మాంసఖండాలు వాయసాలు ఎత్తుకు పోయి
నగర గోపురాలపై పెట్టుకుని తింటూ కొన్ని క్రిందికి జారవిడుస్తున్నాయి. ప్రాణం పోని
వికలాంగులు బాధతో మూలుగుతూ రాబందులను తోలుకుంటున్నారు. ఓపిక వున్న వారు
దాహందాహం అంటున్నారు. మంగళ తూర్యారవాలతో తెల్లవారవలసిన దుర్గం స్త్రీల
ఆర్తనాదాలతో దద్దరిల్లుతోంది.

యువరాజ విష్ణువర్ధనుడు విశాఖదత్తుడిని దుర్గాద్యక్షుడుగా ప్రకటించాడు.

విశాఖదత్తుడు ముందుగా మహారాజ ఇంద్రవల్లభుని బంధవిముక్తుని చేయించాడు.


ఆయనను అజ్ఞాతంగా ఎక్కడ వుంచాలా అని ఆలోచించాడు. భీమసలుఖి మహారాజు
నిద్రించిన నేలమాళిగే సరైనదనిపించింది. అక్కడకు తీసుకువెళ్ళి ఒక్కగదిలో వుంచాడు.
ఆహార పానీయాలు విశ్రమించేందుకు మంచము ఏర్పాటు చేయించాడు. దగ్గర ఏ

344
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ఆయుధము లేకుండా జాగ్రత్త పడ్డు. కానీ మహారాజు పచ్చి గంగైనా ముట్టడానికి


అంగీకరించలేదు.

వారూ వీరనీ లేకుండా బ్రతికున్నవారిని ఆకలి దప్పులు వేధిస్తున్నాయి. ఎవరికీ ఓపిక


లేదు. ఇరుపక్షాల సైన్యాలు బాగా అలిసిపోయివున్నాయి.

ఆ సమయంలో పూటకూళ్ళమ్మ దళం బయలుదేరింది. అందులో చాలా వరకూ స్త్రీలే.


బండ్లకొద్దీ వండిన పదార్ధాల గుండిగలు అన్ని వీధులలోకీ వెళ్ళాయి. అవసరపడుతుందని
రాత్రంతా వండుతునేవున్నారు. ఆకలి గొన్నవారందరికీ ఆహారం. ముంతలతో మంచినీళ్ళు.
కోటలోకి పదార్ధాలు పంపించడానికి కోట తలుపులు తెవడానికి వీలులేకుండా ద్వారం వెనుక
మట్టిరాసులు పేరుకు పోయాయి.

శతావరి దళం బయలుదేరింది. క్షతగాత్రులందరికీ ఒంటిచేత్తో వైద్యం. తమ పర భేదం


లేదు. అక్కడికక్కడే గాయాలను శుభ్రంచేసి కట్టు కట్టడం. మందుమాకు వేయడం. అతుకు
పడని దుష్టాంగాలను ఛేదించి మరీ కట్లు కడుతున్నాడు.

విశాఖదత్తుడు లొంగిపోయిన రాష్ట్రకూట సైనికులను ఆయుధాలన్నీ ఒక్కచోట గుట్టగా


పడవేయమన్నాడు. వారందరినీ బంధించడానికి తగన ఏర్పాట్లేమీ లేవు. అందరినీ కోటగోడ
వెంబడి గొంతుకు కూర్చోమన్నాడు.

కోటలో కూడా వంటలు వార్పులూ చేయడానికి ఆజ్ఞాపించాడు. కోటలో


భాండాగారాలలో ఆహార పదార్ధాలు సమృద్ధిగా ఉన్నాయు. వంటశాలలున్నాయి.
విశాఖదత్తుడు కోటలోని స్త్రీలందరూ శీఘ్రమే వంటలో పాల్గొనాలని శాసించాడు. స్త్రీలు ఆ
హట్టాత్తు ముట్టడితో భయ భ్రాంతులై పోయారు. కొందరు శవాలపై పడి తమవారికోసం
హృదయ విదారకంగా ఏడుస్తు న్నారు. విశాఖదత్తుడికి కనికరం లేదు. అంగరక్షకుల్ని వెంట
పెట్టుకుని కోట అంతా తిరుగుతూ సైనిక శాసనాన్ని అమలయ్యేటట్లు చూస్తున్నాడు.
ఒకచోట శవంపై పడి ఏడ్చే స్త్రీ వద్దకు వచ్చాడు.
“నీవు వంటలో ఎందుకు పాల్గొనవూ?” గద్దించాడు.
“నాభర్తను పొట్టనపెట్టుకుని నన్ను బెబిరిస్తున్నావా?నీవు మనిషివేనా?నీకు హృదయం
లేదా?” అన్నదా స్త్రీ.
“నీ భర్త ఎవరూ?”
“నీలవర్ణుడు. సేనాపతి!”

“సేనాపతా? అమ్మా నాపైన కోపం తెచ్చుకోకుండా అలోచించు. నీ భర్త


మావాళ్ళెందరినో చంపి చచ్చిపోయాడు. అవతల మాయోధుల భార్యలు కూడా నీలాగే
345
  చాళుక్యసింహాసనం

ఏడుస్తున్నారు. వాళ్ళను ఊరడించడానికిరా. సోదరీ నీభర్త సైన్యంలో చేరినపుడు నీకు


తెలియదా అతడు చంపడానికైనా చావడానికైనా సమర్ధుడనీ సిద్ధుడనీ? ఏ యుద్ధం అయినా
ఇలాగే వుంటుంది. లే ఊరడిల్లు! యుద్ధంలో మరణించిన వారందరికీ వీరస్వర్గం తధ్యం.
మహా మునులకు కూడా దుర్గమమైన ఆదిత్య మండలాన్ని దూసుకుని పైకి వెళ్ళిపోయాడు.
ప్రతి ప్రాణీ పుట్టినతరుత గిట్టవలసినదే! ముసలితనంతో మంచాన పడి మరణించడం కన్న
ఇది మెరుగైనది. వీరమరణం పొందినవారిని కూర్చి చింతింప తగదు” అన్నాడు.

విశాఖదత్తుడు ఇంకొంచం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక మహానుభావుడు


పడివున్నాడు. తెల్లటి గడ్డము పెరిగిన జుట్టూ విశాలమైన ఛాతీ చూస్తుంటే యోధుడులాగా
లేడు. పండితుడు లాగా వున్నాయి. కేడెము కవచము శిరస్త్రాణమూ ముంజేతి రక్షలు ఏమీలేవు.
క్రింద పడిపోయినా చేతులో గొప్ప ఖడ్గం ఉంది.

విశాఖదత్తుడు క్రిందకు ఒంగి అతడి శ్వాసను పరిశీలించాడు. అతడు దిమ్మర పోయాడు


కానీ మరణించలేదు. విశాఖదత్తుడు ఆయనను తీసుకు వెళ్ళి చక్రవర్తి అంతఃపురంలో పడుకో
పెట్టమన్నాడు.

విశాఖదత్తుడు కోటగుమ్మం వద్దకు వెళ్ళాడు. బురుజు పైకి ఎక్కి చుట్టూ కలయ


చూచాడు. కోటగుమ్మానికి ఇరువంకలా జరిగినంత నరమేధం మరెక్కడా జరగలేదు.
శవాలపై శవాలు దొంతరలుగా పడివున్నాయి. అక్కడొక పదహైదేళ్ళ బాలిక ‘పదహారు
రోజుల పండగైనా కాకముందే వెళ్ళిపోయావా’ అనిరోదిస్తోంది. తెగి అవతల పడిన భర్త
తలను మొండానికి చేర్చి పైన ఈగలు వాలకుండా తన పైటచెంగు కప్పి ఏడుస్తోంది.
“నీ భర్తఎవరూ?” అడిగాడు విశాఖదత్తుడు.
ఆమె ఎంతో కూడతీసుకున్నతరువాత “కుశధారి” అన్నది ఏడుస్తూనే.
“కుశధారి ఎవరూ?” మళ్ళీ ప్రశ్నించాడు.
“నేను శిరఃప్రధానికి కోడలిని” బదులుగా అన్నది ఆమె.

ఒక క్షణం విశాఖదత్తుడు నిర్ఘాంతపోయాడు. “యువతీ! వీరులకు వీరమరణం శ్రేష్టం!


నీవు చాలా చిన్నవయసులో వున్నావు. సైనికుల భార్యలకు పునర్వివాహం తప్పుకాదు”
అన్నాడు ఊరడించడానికి. ఆయువతి కూర్చున్న చోటినుంచీ లేచి విశాఖదత్తుడి చంప ఛెళ్ళు
మనిపించింది.

విశాఖదత్తుడు దుర్గాద్యక్షుడు కాగానే కఠోర శాసనాలు ప్రకటించాడు. వేంగీచాళుక్య


సైన్యాలకు అధికారులకు ఎవరు ఏవిధంగా ఎదురు చెప్పినా శిరఃచ్ఛేదనమే శిక్ష. సైనిక
శాసనం ముందు ఎవరైనా తలవంచవలసిందే. అందరూ తమవద్ద నిలువ ఉంచుకున్న
ఆహారధాన్యాలను ఆయుధాలనూ చాళుక్య శాసనానికి వప్పచెప్పాలి. అలా చేస్తే సైన్యం వాళ్ళ

346
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

స్త్రీల జోలికీ ధనం జోలికి రాదు. ప్రభుత్వమే ప్రతినిత్యం అందరికీ ఆహార ధాన్యాలు
పంచిపెడుతుంది. చాళుక్య శాసనాన్ని ధిక్కరించినవారికి పౌర హక్కులు ఉండవు.

ఈ శాసనం రాష్ట్రకూట పౌరులకు చాల కఠినం అనిపించింది. ఎంతటివారయినా


ధాన్యం కోసం కొంగు జాచాల్సిందే.

మొదటిరోజు గడిచింది. విశాఖదత్తుడు ఎంతమంది మరణించింది ఎవరెవరు బ్రతికి


వుంది లెక్కలు తీయించాడు.

రాకుమారి అంతఃపురం ముట్టడించడానికి పంపిన పైలుడి లెక్కతేలలేదు. పైలుడేమై


నట్లూ.

రాజకుమారి అంతఃపురం వారందరికీ మొదటిరోజు మధ్యాహ్నానికి రాష్ట్రకూటులు


ఓడిపోయి లొంగిపోయారనీ వేంగీచాళుక్యులు కోట వశం చేసుకున్నారని తెలిసింది. తమవద్ద
బందీగా వున్న పైలుడి సంగతి గుర్తుకు వచ్చింది.

తలవాకిలివద్ద చచ్చిపడిన మగపీనుగులను బయటికి ఈడ్చారు. పరిచారికలు ఒలక


పోసిన ఆముదము నూనె మొదలైనవి శుభ్రం చేశారు. విరిగిపోయిన తలుపు స్ధానంలో
దట్టమైన తెర కట్టారు. అప్పుడు పైలుడిమీద దయకలిగింది. అన్యాయంగా చచ్చిపోతాడేమో
ననిపించింది. కట్లువిప్పుతే తిరగపడతాడేమోనని భయం. ఐనా ధైర్యం చేసి నోటిలో కుక్కిన
గుడ్డలు తీశారు. ముఖాన నీళ్ళుకొట్టారు. కూచోపెట్టి దాహం తీర్చారు.
“మీరసలు మాపై ఎందుకు దాడిచేశారు?”పైలుడిని ప్రశ్నించారు చెలికత్తెలు.
“ఎప్పటినుంచో మీ రాష్ట్రకూటులు మాపై దాడిచేస్తున్నారు. ఇది నూటఎనిమిదవ
యుద్ధం” పైలుడు సమాధానమిచ్చాడు.
“ఈ ముట్టడికి సారధ్యం వహించిన ఆ ఘనుడెవరూ?”అరణి ప్రశ్నించింది.
“విశాఖ దత్తుడు.”
“అతడొక్కడే ఇంతపెద్ద దాడి చేశాడా?”
“మా యువరాజు తోడున్నాడు.”
“మీ యువరాజెవరూ?”
“రాకుమారుడు విష్ణువర్ధనుడు!”

“విష్ణువర్ధనుడంటే ఆ భల్లాణపోతినాయుడేనా?” సందేహంగా అడిగింది రోహిణి.

“అతడెవరూ?”ఎదురు ప్రశ్న వేశాడు పైలుడు.


347
  చాళుక్యసింహాసనం

“తెలీదా, నాలుగేళ్ళక్రితం వీరవిద్యాప్రదర్శనలలో మారుపేరుతో దొంగలాగ


ప్రవేశించిన వాడు.”

“అతడు దొంగేమిటీ!అందరిముందూ తనపుట్టుపూర్వోత్తరాలు ప్రకటించి మరీ అంత


మందిని చావకొట్టి స్వయంగా రథం తోలుకుంటూ వెళ్ళాడు.”

“ఆ విషయం మీకెలా తెలుసూ?”

“ఆ రథంపైన నేనుకూడ ఉన్నాను.”

“మా రాకుమారి బాణాన్ని బాణంతో తుంచకపోతే కథ ఆనాడే ముగిసేది! అసలు ఈ


ముట్టడికూడా వుండేదికాదు! ఆవిషయంకూడ తెలుసా?”అడిగింది రోహిణి చెంప తడుము
కుంటూ.

“ఆ బాణం వేసింది మీ రాకుమారా! ఆశ్ఛర్యం! అధ్భుతం!నన్నింకా బంధించి వుంచ


వలసిన అవసరమే లేదు. నేను ఆదేవత పాదారవిందాలకు నమస్కారం చేసి శాస్వతంగా
ఇక్కడే వుండిపోతాను దాసుడిగా.” పైలుడు ఎంతో ఆనందంగా అన్నాడు.

“ఇంతకూ ఆ దొంగవాడు ఎక్కడున్నాడు?” అన్నది అరణి.

“దొంగ ఏమిటే? మర్యాద లేకుండా!” అన్నది అభ్యంతరం లోంచి ఆమాట విన్న శిరీష.

“ఆ!” అంటు చెలికత్తెలందరూ ఫక్కున నవ్వేశారు. “హృదయం దొంగిలించివాడిని


కూడా దొర అనాలా?” అన్నది సమంత.

“ఇంతకూ ఇప్పుడతడెక్కడున్నాడూ?” అడిగింది యమున కుతూహలంగా. నిజానికి


ఆ కుతూహలం శిరీషది..

“ఈ నగరంలోనే. నేనిక్కడ బంధింపబడిన తరువాత మాత్రం ఏంజరిగిందో నాకు


తెలీదు.”

“మీ సైన్యాలు ఓడిపోయాయని చెబుతే మీ గుండె పగిలిపోతుందేమో?” చమత్కారంగా


అన్నది రోహిణి.

“మా ఓటమా! అసంభవం.” పైలుడు పగలపడి నవ్వాడు ఎంతో ధీమాగా. “మా


విశాఖ దత్త సేనాపతి వ్యూహం ఎప్పటికీ వమ్ముకాదు. మా యువరాజు పరాక్రమం ముందు
ఇలాంటి కోటలు వందైనా పాదాక్రాంతం కావలసిందే! వారిద్దరి పరాక్రమం వరాహ గురు
కులం నుంచి చూస్తున్నాను.” అన్నాడు పైలుడు ధీమాగా

348
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

మర్నాడు విష్ణువర్ధనుడు చక్రవర్తి అంతఃపురంలో విడిది చేశాడు. త్వరగా స్నానాదికాలు


కానిచ్చుకుని సూక్ష్మంగా ధ్యానం ముగించుకుని అత్యవసరంగా కొలువు తీరాడు.

“విశాఖదత్తా! ఆహారము నీరు గాలి. ఇవి అందరకూ కావలసినవే. ఆహార ధాన్యాలపైన


ఇంత కఠినమైన శాసనం ఎందుకు పెట్టావు?” అన్నాడు విష్ణువర్ధనుడు.

“యువరాజా! మాన్యకేతం కోట బయటా వెలుపలా ఎంతమంది ఉన్నదీ ఎవరెవరు


ఉన్నదీ మనకు తెలియాలి. అందుకు ఇది సులువైన మార్గం. తిండి లేకుండా ఎవరూ
బ్రతకలేరు. ఎవరూ ఎవరికీ అజ్ఞాతంగా ఆశ్రయమివ్వలేరు.”

“మరి శ్రీమంతులు రాచకుటుంబంవారు కూడ నీదగ్గర కొంగు చాచాలంటే ఎలా?


వారికి ఆత్మాభిమానం ఉండదా?”

“యువరాజా! ఈ శాసనం మెత్తని కత్తి! పైకి కనిపించదుకాని అభిమానానికి పోతే


డొక్క మాడుతుంది. ఇలా చేయకపోతే సైనిక శాసనానికి అందరూ తల ఒగ్గేడట్లు చేయడం
ఎలా? శత్రువుల్నీ వీధికూడళ్ళలో ఉరితీయాలా? దుకాణాలు దోచుకోవాలా? వేశ్యల్ని తక్కువ
రకం స్త్రీలను జుట్టు పట్టుకుని నడి వీధుల్లోకి లాక్కువచ్చి కొరడాలతో కొట్టాలా? ఎవరి దగ్గర
ఆయుధాలున్నా వారిని అక్కడికక్కడే పొడిచేయాలా? పౌరులు వీథుల్లోకి రావడానికి భయ
పడాలంటే ఏంచేయాలీ? నువ్వే చెప్పు!” అన్నాడు ఆవేశంగా విశాఖ దత్తుడు.

“విశా! తక్కువ రకం స్త్రీలన్నావు. ఇది తప్పుమాట. ఎవరి మాన ప్రాణాలు వారికి
ముఖ్యం కాదా? పేదరికానికీ శీలానికి ఏవిధమైన సంబంధం లేదు. అదీకాక మనం జయించిన
దెవరినీ? ఇక్కడి ప్రజలనా? ఇక్కడి సైన్యాన్ని ఇక్కడి ప్రభుత్వాన్ని జయించాం! అంతే! ప్రభువు
యొక్క అధికారం ప్రజలపై ఎంతవరకూ? సుంకం దండుకునేంతవరకే! ప్రత్యామ్నాయంగా
వారికి భద్రత కలిపించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రజల ధనమాన ప్రాణాల బాధ్యత
వహించని ప్రభుత్వం మరొకరకం దోపిడీ దొంగ.

నీరు గాలి ఆహారము భూమిపై నిలబడే అవకాశము భగవంతుడిచ్చినవి. ఎంతటి


బందీలైనా వారికి తిండి నీరు గాలి ఆవాసము కల్పించవలసివుంది.

నీకింతకు ముందే చెప్పాను. ప్రభువు నిరంకుశుడు కాదు. ఒక శాసనం చేసేడపుడు అది


ఋషిప్రోక్తమై ఉండాలి. ధర్మశాస్త్ర సమ్మతమై ఉండాలి.” అన్నాడు విష్ణువర్ధనుడు.

అందుకు విశాఖదత్తునికి కొంచం రోషం వచ్చింది.“యువరాజా! మనం ఏదో మాయో


పాయంతో ఈ కోటను జయించాం. కానీ ఈ గెలుపును సుస్ధిరం చేసుకోవడం అవసరం
కాదా? ఎందుకంటే మాన్యకేత పతనం వార్త తెలియగానే కర్కవల్లభుడు ఊరుకోడు. ఘూర్జర
దేశం నుంచి సైన్యం సమీకరించుకుని వస్తాడు. అలాగే వనవాసినుంచి బంకెయశెల్లకేతుడు

349
  చాళుక్యసింహాసనం

అపారమైన సైన్యంతో ఎత్తివస్తాడు. వీరికి లాటదేశంలో మూలబలం చాల వుంది. సంజము


సైనిక స్కంధావారం సైన్యాధిపతి పాటలమల్లుడు సామాన్యుడు కాదు.అదికాక వేముల వాడ
చాళుక్యులు వీళ్ళకు విధేయులు. వీరంతా ఒక్కమాటుగా దండెత్తి మాన్యకేతాన్ని తిరిగి
ముట్టడిస్తే మన ఐదారువేల సైన్యం ఎందుకూ పనికిరాదు.

పోనీ నీవు చెప్పినట్లే ఆహారం పైన ఆంక్షలు వెనక్కు తీసుకుంటాను.” అన్నాడు.

“మన సైన్యం చాలా అల్పమనే మాట నిజమే విశా! నేను మన విజయం వార్త మా
నాన్నగారికి పంపాను. అక్కడినుండి ఆజ్ఞలు రావడానికి కొంతకాలం పడుతుంది.”

“యువరాజా! మనవద్దనున్న మూడువేలమంది బందీలను ఏంచేద్దామో చెప్పు.”

“ఏంచేద్దాం? పోషిద్దాం!”

“అప్పుడు మనది పరిపాలనకాదు ధర్మసత్రం అవుతుంది. ఇప్పటికే నగరం అంతా


వికలాంగుల మయం అయిపోయింది. వాళ్ళందరికీ వైద్యం చేయడానికి ఒక చరకుడు
ఉద్భటుడు శుశ్రుతుడు సరిపోరు. ఈ కోట ఒక అనాథ శరణాలయంగా మారుతుంది. నీవు
అనుమతిస్తే మూడువేలమంది పీకలు కోసి కోట బయట పడేసి సామూహికంగా అంత్య
క్రియలు జరిపిస్తాను.”

“విశా! నీవింత కౄరంగా ఆలోచించకు. మనిషన్నతరువాత కనీస మానవత్వం


ఉండాలి. బందీలను నిరాయుధులను గొంతుకోస్తావా?”

“యువరాజా! నన్ను మాన్యకేత దుర్గాద్యక్షుని చేసిన తరువాత నాకూ కొంత స్వేచ్ఛ


నివ్వాలి. పోనీ నువ్వుచెప్పు ఆరువేలమందితో బయటినుంచి వచ్చే దండయాత్ర నెలా
ఎదుర్కొంటామో? కోట వెలుపల వీరికి ఇంకా చాలా సైన్యం వుంది. వారినెలా ఎదుర్కొం
టామూ? పౌరులు తిరుగుబాటు చేస్తే ఎలా నియంత్రిస్తామూ?”

“మన సైన్యం ఎంత మిగిలిందీ? లెక్కలు తేలాయా?”అడిగాడు విష్ణువర్ధనుడు.

“గట్టివారు ఐదువేలమంది. గాయాలు తగిలినా యుద్ధం చేయగలవారు ఇంకో వేయి


మంది. చనిపోయినవారు ఇప్పటి వరకూ నాలుగు వేలమంది.”

“వాళ్ళ పక్షానా?”

“ఏడువేలమందిని నరికాము. బందీలు మూడువేలు. క్షతగాత్రులు ఏడువేలు.”

“రాష్ట్రకూట సైన్యం ఇంతేనా?”అన్నాడు విష్ణువర్ధనుడు సందేహంగా.

350
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“అదే లెక్క తేలటం లేదు. కనీసం డెబ్బయి వేలసైన్యమైనా ఉంటుందని ఆంధ్రశ్రేష్టి


అన్నారు.”

“నీవు మా పెదతండ్రి భీమసలుఖి మహారాజును పొడవకుండ ఉండవలసింది. ఆయన


ఆ గాయాలతో చనిపోయారు. ఆయన భౌతిక కాయాన్ని నూనెజాడీలోవుంచి మాచెల్లెలు
భీమరధితో పాటు వేంగికి పంపించాను. వాళ్ళు జేరడానికి మూడునాలుగు రోజలు పట్ట
వచ్చు. నేను కూడ అశౌచం పాటించాలి.”

“అయితే నీకు నిన్నటినుంచి మైల అనమాట! ఎప్పటివరకు ఉంటుందీ?”

“రాజులకు సద్యో అశౌచం! అంటే మైల బంధువులు పోయినప్పటినుంచి కాకుండ


మేము అనుకున్నపటి నుంచి నెలరోజులు అంటే నెలపట్టడం అనమాట అశౌచం పాటిం
చాలి.”

“ఇది వింతగావుందే!”

“అవును మరి. ఒక ప్రభువు పోగానే అతడికొడుకు రాజ్యాభిషిక్తుడు కావాలికదా! ఏ


రాజ్యము ఒక్క దినమైనా రాజు లేకుండ ఉండకూడదు. అందుకే శౌచాశౌచాలను ఇచ్ఛను
పట్టి ఏర్పాటు చేసుంటారు!”

“యువరాజా! మనం భీమసలఖి మహారాజును పొడవకుండ వుండవలసిందన్నావు.


ఆయన బ్రతికుంటే ఈ యుద్ధాలు ఇంతటితో ఆగవు. ఇప్పుడు ఆయనే లేకపోయే ఈ రాష్ట్ర
కూటులు మనతో ఎవరికోసం కయ్యం పెట్టుకుంటారు?”

“కానీ ఒక నిరాయుధుడిని నిద్రిస్తున్నవాడిని చంపడం న్యాయంకాదు విశాఖదత్తా!”

“యువరాజా! నేనాయనను నిద్ర లేపే పొడిచాను. ఆ నిరాయుధుడి వలననే మనం ఈ


దండయాత్ర చేయవలసి వచ్చింది. చనిపోయిన మూడు నాలుగు వేలమంది కన్నా ఆయన
ప్రాణం ఎక్కువా?”

“సైన్యం ఎవరికోసం యుద్ధం చేస్తుందీ? తమ ప్రభువుకోసమే కదా! అంటే ప్రభువు


ప్రాణం ఎక్కువనేకదా!”

“ఎక్కువో తక్కువో నాకు తెలీదు. ఇంతమందిని చంపి ఆయనను వదిలేయడం నాకు


సమంజసం అనిపించలేదు. యువరాజా! మనం ఇప్పడు రాజనీతి ఉపయోగించాలి. కొద్ది
సైన్యంతో మనం ఈ దుర్గాన్ని నిలుపుకోలేము. మనం ఇంద్రవల్లభునీ రేవాదాసదీక్షితునీ అడ్డం
పెట్టుకుని రాజకీయం నడపాలి.”

351
  చాళుక్యసింహాసనం

“రేవాదాస దీక్షుతుడెవరూ?”

“నీ ఖడ్గంపిడితో భ్రూమధ్యంలో పొడవబడినవాడు. రాష్ట్రకూటుల శిరఃప్రధాని!


శరీరానికి కవచము రక్షలు లేకుండా నిన్నెదిరించినవాడు.”

“అతడా! నాతో చాలాసేపు యుద్ధం చేసినవాడు. ఆయన కవచం కేడెం శిరస్త్రాణం ఏదీ
ధరించకుండా నిర్భయంగా పోరాడాడు. అతడే సేనాపతో నాకు అర్ధం కాలేదు. అతడి సైన్యం
మొత్తం వీరోచితంగా పోరాడి మరణించింది. ఆయన తలకాయి ఒక్క దెబ్బలో నరికివేద్దా
మనుకున్నాను. కానీ ఎందుకో అలా చేయబుద్ధి కాలేదు. ఆయన కేశపాశాలు పెరిగినగడ్డం
నుదిటన బంగారు కాసంత బొట్టూ చూస్తే ఈ పండితుడు యుద్దానికి ఎందుకు వచ్చాడు
అనిపించింది. ఖడ్గం వెనక్క తిప్పి భ్రుకుటీమధ్యంలో పొడిచాను. ఇప్పుడాయన ఎలా
వున్నాడూ?”

“క్షేమంగానే ఉన్నాడు. ఎందుకో ఆయన్ను చూస్తే నాకూ చెరసాలలో ఉంచ బుద్ధి


కాలేదు. గృహనిర్భందంలో వుంచాను. మన బందీగా ఉన్నాడు.”

“సరే! మన సమావేశం ముగించేముందు మరణించిన వీరులందరికీ దహన సంస్కా


రాలు ఏర్పాటు చేయి. భార్యా బిడ్డలు దగ్గర లేనివారికి సామూహికంగా సంస్కారం చేయించు.

మనకు లొంగిపోయిన సైనికులకు కాలి సంకెళ్ళు మాత్రం వేసి పనులు చేయించుకో.


కోటగోడలపై అగ్నిగోళాలు రువ్వే యంత్రాలు నూనె మరిగించిపోసే సదుపాయం ఏర్పాటు
చేయి. దుర్గద్వారం కొత్తది చేయించు. ఆయుధాగారాలన్నీ వశం చేసుకో. బయటినుంచి
ముట్టడి వచ్చినా ఆరునెలలపాటు కోటను నిలుపుకోగల ఏర్పాటు చేయి” అన్నాడు
విష్ణువర్ధనుడు.

మళ్ళీ విష్ణువర్ధనుడే “విశా! ఆ మూగసేనాని నన్నుబాగా కాపాడాడు. నా అంగరక్షకు


లందరూ నేలకొరిగినా నన్ను చివరిదాకా కాపుకాశాడు.”

“అతడెవరో తెలుసా? నీ ప్రాణం కాపాడినవాడిని ఒక్కసారి కౌగలించుకుని కృతజ్ఞత


చెప్పాల్సింది!” అన్నాడు విశాఖదత్తుడు.

“అతడు నాముందుకు వస్తే అలాగేచేస్తాను. మనకోసం ప్రాణాలొడ్డినవారిని మనం


గౌర వించాలి” అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా విష్ణువర్ధనుడు.

విశాఖదత్తుడు చప్పట్లు చరిచాడు. అంతట మృదువదన అక్కడికి ప్రవేశించింది. యువ


రాజు ఆశ్చర్యపోతూ “మృదూ! నీవెప్పుడు వచ్చావూ?” అన్నాడు.

మృదువదన మాట్లాడకుండా నిలబడింది. “మృదువదన మూగది! నీవన్న మాట


352
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ప్రకారం కౌగలించుకో!” అన్నాడు విశాఖదత్తుడు.

అందుకు బదులుగా విష్ణువర్ధనుడు “ఒక్కసారేనా! పెళ్ళిచేసుకుని లక్షసార్లు కౌగలించు


కుంటాను” అన్నాడు. మృదువదన కన్నులనుండీ ఆనంద భాష్పాలు రాలుతుండగా విష్ణు
వర్ధనుడి పాదాలంటి నమస్కరించింది. విష్ణువర్ధనుడు ఆమె బుజాలుపట్టి లేవనెత్తి అక్కున
జేర్చుకున్నాడు.

60 సంధి
విశాఖదత్తుడు పైలుడి విషయం తెలుసుకోవడానికి నేరుగా రాజకుమారి అంతః
పురానికి వెళ్ళాడు. లోనికి వార్తాహరుడిని పంపాడు తన రాక తెలియజేయడానికి.

ముందర వనితలందరూ కంగారు పడ్డారు. వచ్చిన సైనికాధికారితో మాటిలాడడానికి


అరణిని నియమించారు. అరణి ఆతడిని ముఖమండపంలోకి ఆహ్వానించి ఉచితాసనం
చూపించింది. ఆమెకు విశాఖదత్తుడిని చూడగానే ఎక్కడో చూసినట్లు అనిపించింది.
విశాఖదత్తుడు ఈబాల ఆనాటి చిత్రప్రదర్శనశాలలో చూసిన కొమదగా గుర్తించాడు.
కాకపోతే ఇంకాస్త లావయినట్లు అనిపించింది. అంతేకాదు. వక్షస్దలంకూడా అప్పటికన్నా
విస్తరించినట్లు కనిపించింది.
“మీలో అరణి ఎవరూ?” అన్నాడు విశాఖదత్తుడు. ఆ నాటి అరణిపేరు ఇంకా గుర్తుంది.
“ఆవిడతో మీకేంపనీ?”
“ఆవిడను విచారించాలి.”
“ఆవిడ ఏం తప్పుచేసిందీ?”
“మా పైలుడిని మాయం చేసింది.”
“అతడు దుస్సాహసానికి తగిన మూల్యం చెల్లించాడు.”
“అతడు చాలా మంచివాడు. మీలాంటివాళ్ళు ఇప్పటికీ ముల్యం చెల్లించకుండా తిరుగు
తున్నారు.”
“మేమా! మీరేం మాట్లాడుతున్నారూ?”
“ఈ చురకత్తిని తీసుకుని ఇప్పటికి ఎంతోకొంత మూల్యం చెల్లించండి.” విశాఖదత్తుడు
ఆనాడు చిత్ర ప్రదర్శన శాలలవద్ద దొంగిలించిన చురకత్తిని ఆమెకందించాడు.

ఆ కత్తిని చూస్తూనే అరణి ఆశ్ఛర్యపోయింది. వస్తుప్రదర్శనశాలలో ఆంధోళిక ఒరిగి


పోయి నపుడు పడిపోయిందనుకుంది. ఇతడికెలా దొరికిందీ. ఆ చెంపప్రక్కన గాయంకల
కూలివాడు....అరణి అరచేతులలో తన ముఖం దాచుకుంది సిగ్గుతో.
353
  చాళుక్యసింహాసనం

“తమరెవరో తెలుపలేదు” అన్నది ఒక్కొక్క అక్షరం విడివిడిగా.


“ప్రస్తుతం ఈ దుర్గాద్యక్షుడిని. విశాఖదత్తుడిని.”
“తెలీక ఆనాడు కూలీ అన్నాను. క్షమించండి” అన్నది అరణి అతడి పాదాలకు నమస్క
రిస్తూ.
“ఈ పొలిదణ్ణాలతో సంతోషించేవాడిని కాదు. మూల్యం చెల్లించాల్సిందే!”
“ఏ మిమ్మంటారూ?” బెరుకుగా అడిగింది అరణి.
“ఏమిస్తావూ?”
“మీరేచెప్పండి.”
“అడిగిందిస్తావా?”
సమాధానంగా మాటలతో కాకుండా బుఱ్ఱ ఊపింది.
“దగ్గరకు వస్తే చెబుతాను!”అన్నాడు విశాఖదత్తుడు.

అరణి అడుగులో అడుగు వేసుకుంటూ అటూ ఇటూ చూసి దగ్గరకు వచ్చింది. విశాఖ
దత్తుడు ఆ బాలను గాఢంగా కౌగలించుకుని చిగిరుటధరాలపై మొరటుగా ముద్దుపెట్టాడు.

ఆ స్పర్శకు అరణి తనువులో విద్యుల్లతలు విరిశాయి. ఏదో తెలియని అగ్ని రగిలింది.


అతడి కౌగిలి విడిపించుకోవాలనే స్పృహ కూడ కోల్పోయింది. ఆ దృశ్యాన్ని చాటుగా చూసిన
శిరీష చెలికత్తెలు చిన్నగా దగ్గారు. అప్పుడు స్పృలోకి వచ్చిన అరణి అతడినుంచీ దూరంగా
జరిగింది.

“మాపైలుడేడీ?”

“మీ పైలుడిని సగౌరవంగా పంపిస్తాము.” పైలుడిని విడుదల చేసే అధికారం తనకు


లేదు. కానీ ఏదో మైకంలో తన అధికారం హద్దులు దాటింది.

“పంపిస్తానంటే కాదు. స్వయంగా వెంటపెట్టుకుని రావాలి. రాకపోతే దండన తప్పదు.


వస్తే బహుమానం కూడ తప్పదు.”

విశాఖదత్తుడు ఆమె సమాధానంకోసం ఎదురు చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు.

భగవంతుడు అందరికి ఏదోవిధమైన చింతకల్పిస్తాడు. నిర్భంధంలో పడిన శిరఃప్రధాని


రేవాదాసదీక్షితుడు వలలో చిక్కిన సింహంలా గర్జించేవాడు. తన వైఫల్యానికి చింతిస్తూ
అనేకమార్లు తల గోడకేసి బాదుకునేవాడు. పగిలిన భృకుటి నుంచీ రక్తం స్రవించినా
లెక్కచేసేవాడు కాదు.
354
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ప్రతి మనిషికీ కనుబొమల మధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. దానికధిపతి గురువు.


అక్కడ తగిలింది దెబ్బ.

‘నా వేగులందరూ ఏమయిపోయారు? నా తెలివితేటలు ఏమయిపోయాయి?


రాష్ట్ర్రకూట సామ్రాజ్యం నా మంత్రాంగంలో నాశనమయింది. ఇందరు చాళుక్యులు ఎక్కడి
నుంచీ వచ్చారు? శతృదుర్భేద్యమైన ఈ మాన్యకేత దుర్గాన్ని ఎలా పడగొట్టారు? కోట
తలుపులు తెరవకుండా లోపలకు ఎలా చేరారూ.

కల్లుపాటే కొంప ముంచిందా? దీనంతటికీ కారణం గోమఠేశ్వరయ్యే! ఆయన


కోపానికి కారణం వాళ్ళ అమ్మాయికి జరిగిన అన్యాయమే! ఆ అన్యాయానికి కారణం
ఇంద్రవల్లభుని అహంకారమే! ఆ పిల్ల శాపం తగిలిందేమో! గోమఠేశ్వరయ్య శపధం
నెరవేరింది. నా వైఫల్యానికి నేను ప్రాయఃచిత్తం చేసుకోవాలి. ప్రాయోపవేశం చేయాలి. ఇంకా
ఈ సిగ్గుమాలిన శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండకూడదు. ప్రాయోపవేశమే శరణ్యం.’ పగలు
రాత్రి ఇదేచింత.

‘చితి పేర్చుకుని అగ్నికి ఆహుతి అవ్వడం ఉత్తమమైన ప్రాయోపవేశం! కానీ ఇక్కడ


తగినన్ని కట్టెలు లేవే! నదిలో ధూకుదామంటే నదిదాకా నన్ను పోనీయరే!

అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ


బ్రహ్మవిదో జనాః

ఈ శరీరాన్ని ఉత్తరాయణంలో శుక్లపక్షంలో పగటికాలంలో అగ్నికాహుతి చేసేయాలి.

తోకచుక్క ఎంతపనిచేసిందీ! ఈ మహాసామ్రాజ్యాన్నే కూలదోసిందా?

ఈ ముట్టడిలో రాష్ట్రకూటుల పక్షాన ఎవరెవరు మిగిలారో ఎవరు పోయారో తెలీదు.


విష యాలేవీ తెలీకుండా చాళుక్యులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. మహారాజు ఇంద్ర
వల్లభుడు శిరీషాకుమారి ఏమయ్యారో. కుమారుడు కుశధారి ఏమయ్యాడో.

కానీ ఈ దేహాన్ని విడిచేముందు కర్తవ్యాలను కర్మబంధాలను ఒదిలించుకోవాలి. నా


మంత్రాంగం తోనే మళ్ళీ అమోఘవర్షరాజేంద్రుడిని రాష్ట్రకూట సింహాసనంపై కూర్చుండ
పెట్టాలి. అజ్ఞాతంలో బాలచక్రవర్తి అయితే బ్రతికుంటాడుగదా! అతడిని అజ్ఞాతం లోకి
పంపడం దైవనిర్ణయం. ఏదైనా సంధితోనే సాధించాలి. అప్పటివరకూ విశ్రమించ కూడదు.

రేవాదాసదీక్షితుడు తనకు భోజనసదుపాయాలు చేసేవారితో లేఖలు పంపిస్తునే


వున్నాడు. చాళుక్యులతో సమావేశం కోరుతున్నాడు. కానీ చాళుక్యులనుండీ ఏ సమాధానం
లేదు. నిర్బంధంలోని ఇంద్రవల్లభుడు కూడా సమావేశంకోసం విజ్ఞాపనలు పంపు తున్నాడు.

355
  చాళుక్యసింహాసనం

యువరాజ విష్ణువర్ధనునికి ఏమీ పాలుపోలేదు. ఇంద్రవల్లభునితోను గత శిరఃప్రధాని


తోను సమావేశం అవ్వడం చిన్నపని కాదు. వారితో ఏమాత్రం పోరపాటు మాట్లాడినా వాళ్ళ
చతురత ఉపయోగించి అవకాశం తీసుకుంటారు. వాళ్ళిద్దరూ అనుభవజ్ఞులు. రాజనీతి
దురంధరులు. విశాఖదత్తుడు చూస్తే శస్త్రజీవి. విగ్రహానికేగానీ సంధికి పనికిరాడు.

ఇలా ఆలోచిస్తూ విష్ణువర్ధనుడు కొద్దికాలం గడిపాడు.

వేంగి నుండీ మహామంత్రి సోమశూత్రం శివకేశవయ్య మాన్యకేతనగరం విచ్చేశాడు.


ఆయనతో పాటు ముప్పయివేల చాళుక్య సైన్యం మాన్యకేతానికి బయలుదేరింది. శివ
కేశవయ్య బందీగా వున్నరాష్ట్రకూట శిరఃప్రధాని రేవాదాసదీక్షితుడితో సమావేశ మయ్యాడు.
సమావేశానికి ఇంద్రవల్లభుడు ఆహ్వానించబడలేదు. యోగక్షేమాలు పూర్తయిన తరువాత
ఇద్దరు విషయంలోకి వచ్చారు.

ఇరుదేశాల మంత్రులూ సంధిచేసుకోవాలని నిర్ణయానికి వచ్చాయి. రాజకుమారి


శిరీషను యువరాజ విష్ణువర్ధనుని కిచ్చి వివాహం చేస్తే మైత్రి మరింత బలపడుతుందని
అభిప్రాయపడ్డారు.

రేవాదాసదీక్షితుడు తన ప్రభువు ఇంద్రవల్లభునితో సమావేశం కోరాడు. ఈ విషయం


లోనే శివకేశవయ్య యువరాజు విష్ణువర్ధనుని అభిప్రాయం కోరాడు. విష్ణువర్ధనుడు
విశాఖదత్తుని అభిప్రాయం కోరాడు.

విశాఖదత్తుని చింతవేరు. అహోరాత్రాలు అప్రమత్తుడై యున్నాడు. రాష్ట్ర్రకూట


విధేయసైన్యాలు ఎక్కడ మాన్యకేత దుర్గాన్ని తిరిగి ముట్టడిస్తాయేమోనని భయం.
బురుజుస్ధంభం పైకెక్కి దూరతీరాలను పరిశీలించేవాడు. వేగులను కూడ నమ్మేవాడుకాదు.
దానితో మనసులో అలజడి ఏర్పడిపోయింది.

అలజడిని అధిగమించాలంటే ఏదోఒక వినోదంకావాలి. యువరాజు తనకు మాన్యకేత


ముట్టడి బాధ్యత అప్పగించినప్పటినుంచి స్త్రీ వ్యసనానికి దూరమైనాడు. అరణిని చూడగానే
మళ్ళీ అలజడి మొదలయింది. అగ్ని రగిలింది. రాకుమారి అంతఃపురానికి మళ్ళీ వెళితే
బాగుండదేమో ననిపించింది.

అంగారకుడిని పిలిచాడు. అంగారకుడు విశాఖదత్తుని ముఖ్యఅనుచరుడైనాడు.


తూముద్వారా కోటలో ప్రవేసించి బ్రతికినవారిలో అతడొకడు. అరణికి జేరాలని లేఖఒకటి
అతడి చేతికిచ్చి పంపించాడు.

అంతఃపురం తలుపు తడితే ఏవరది అని గద్దించి పలికారు.

అందుకు “నేను అంగారకుడను. విశాఖదత్త రణపతి దూతను” బదులిచ్చాడు.


356
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

లోపలవున్నది రోహిణి. అంగారకుడనగానే గుండె దడదడలాడింది. దిడ్డికంతలోనుంచి


తొంగిచూచింది. అంగారకుడే! ఆనాటి ప్రణయవీచికలు కెరటాలైనాయి. కానీ ఎక్కడి
కుంభినీవనము ఎక్కడి మాన్యకేతము? మళ్ళీ అతడిని చూడగలుగుతాననుకోలేదు. ఆనాటి
ప్రణయసమాగమమే చివరిదనుకుంది. నాడు రాకుమారి కనుగప్పింది. ఇప్పుడు రహస్యం
బయటపడితే!
మదనకుతూహలం భయాన్ని అధిగమించింది, కవాటం తెరిచింది.
“నాపేరు రోహిణి!”
“అలనాటి రోహిణేనా, కొత్తరోహిణా.”
“మగువలు మరువరు. మగవారిసంగతి....తెలీదు. వచ్చినపనేమిటో?”
“ఈ లేఖను అరణికి మాత్రమే అందజేయీలి. ఇది రణపతి ఆజ్ఞ!”
“తమ ఆజ్ఞ అనుజ్ఞ ఏమీలేదా?” తల అవనతం చేసుకుని సిగ్గుగా అన్నది రోహిణి.
“రణపతి ఆజ్ఞ పాటించడం వరకే భటుడి స్వాతంత్ర్యము!”
లేఖ అందుకుని రుసరుసలాడుతూ రోహిణి తలుపు వేసుకుంది.
విశాఖదత్తుడి అరణి ప్రణయసీమకు తలుపు తెరుచుకుంది.
విష్ణువర్ధనునితో విశాఖదత్తుడు ఇలాఅన్నాడు. “యువరాజా! సంధి మంచిదే! కానీ
ముందు నీతో రాజకుమారి వివాహం జరగాలి. ఆ తరువాతే అమోఘవర్షుని పునఃప్రతిష్ఠ.”

“విశాఖా! నీవు వీళ్ళను ఇంకా అనుమానిస్తున్నావా?”అన్నాడు విష్ణువర్ధనుడు.

“యువరాజా, తప్పదు మరి! మనం మాయోపాయంతో ఇంత పెద్ద దేశాన్ని


జయించాం. వాళ్ళకా కడుపుమంట ఉండదా? రోషం ఉండదా! వాళ్ళు కూడా మనని మోసం
చేయరనే మిటీ? దెబ్బకు దెబ్బ తీయరనేమిటీ. నేనయితే రాజకుమారిని కూడా
అనుమానిస్తాను.”

“విశా! నేను మాత్రం రాజకుమారి అభిప్రాయం తెలుసుకోకుండా బలవంతంగా పెళ్ళి


చేసుకోలేను.”అన్నాడు విష్ణువర్ధనుడు.
“ఓహో మిత్రమా! నీకు పెళ్ళిచూపులు కావాలా?”పరిహాసంగా అన్నాడు విశాఖదత్తుడు.
“సమావేశం కావాలి. నీకు తెలుసుకదా నేను మృదువదనను పెళ్ళాడతానన్నాను.”
“రాజులకు, రాజులకేమిటీ మగవాళ్ళందరికీ బహుభార్యత్వం సహజమేకదా!”
“అందుకామె అంగీకరించాలికదా? ఆమె రాచకన్య! ఆమె ఇష్టం ఆమెకుండదా!”

357
  చాళుక్యసింహాసనం

“అలాగే! మీ ఇద్దరికీ సమావేశం నేను ఏర్పాటు చేయగలను.”


“మహామంత్రి సంధినియమాలపై నన్ను తొందర పెడుతున్నారు.”
“తొందర ఆయనకు కాదు. రాకుమారిని చూడాలని నీకు తొందర!”
“ఏదైనా ఒకటేకదా! ఆ బేల అభిప్రాయం తెలుసుకోకుండా మహామంత్రికి నా అభి
ప్రాయం చెప్పలేనుకదా!”
“ఆబాల బేల ఏమీకాదు. అంతఃపురం వారు మన సైనికులైదుగురిని చావకొట్టారు.
వాళ్ళు చాలా గడుసు పిండాలు. నాప్రకారమైతే వాళ్ళను దండించాలి.”
“అలాగా! మరి అరణిని కూడా దండిస్తావా?”అన్నాడు విష్మువర్ధనుడు.

“ఈ విశాఖదత్తుడి శాసనం అంటే సుగ్రీవాజ్ఞ లాంటిది. అరణిని ఎప్పుడో లొంగ దీసు


కున్నాను. తను పూర్వఅరణి అయితే నేను ఉత్తరఅరణి. తను ఉత్తరఅరణి అయితే నేను
పూర్వఅరణి!” ధీమాగా చెప్పాడు విశాఖదత్తుడు.

“ఓయి దుర్మార్గుడా!”అన్నాడు విష్ణువర్ధనుడు.

61 పెళ్ళిచూపులు
అది శిరీష అంతఃపురం. రాకుమారి శిరీషను చెలికత్తెలు తీర్చి దిద్దాలనుకున్నారు.
సంపంగి నూనెతో తలంటాకు. సురభిచందనం నలుగు పెట్టారు. బంగారు కలశాలతో
పన్నీటి అభ్యంగనం చేయించారు. కురులార్చి అగరు ధూమం వేశారు. కురులు దువ్వి
బంగారు మొగలిరేకుల జడ వేశారు. పరిమళభరితమౌ పులచెండ్లు తురిమారు. పాపట
పిందిరీ అమర్చారు. పాపట కిరువంకలా మణిమయమైన సూర్యచంద్రుల ఆభరణాలు
అలంకరించారు. కంటికి కాటుక తీర్చారు. మరుని వింటి తునలలాంటి కనుబొమలమధ్య
సువాసనల తిలకం తీర్చారు. కర్ణద్వయానికి నవరత్నాలు కూర్చిన పంజరాలవంటి జూకాలు
అలంకరించారు. వాటి భారానికి చెవితమ్మి సాగకుండా పట్టీలు కొప్పు గొలుసులు
అమర్చారు. కంఠాభరణాలతోపాటు మకరికారేఖలు దిద్దారు. చనుగవకు కస్తూరి పచ్చ
కర్పూరము కలిపిన చందనం రాశి పైన ముత్యాలు బంగారు పూలు కుట్టిన కంచుకం తొడిగి
వెన్నువైపు దూముడి వేశారు. శంఖంలాంటి మెడచుట్టూ ఆణిముత్యాల పట్టెడ
అలంకరించారు. చేతులకు మణిమయాంగదాలు బాహు పురులూ ముంచేతులకు
మణికింకిణులు అంగుళీయకాలు అలంకరించారు, బంగారంచుల పరికిణీపై సరిగంచు
వల్లెవేశారు. పారదర్శకమైన ఆ వలిపం శాస్త్రానికి మాత్రమే. పాలీండ్ల బిగువును దృశ్యా
దృశ్యంగా చూపుతోంది. పాదాలకు పారాణితోపాటు బంగారు మువ్వల పట్టీలు పెట్టారు.
పలుచటి అవకుంఠనం సిగపై నుండి కప్పారు. అప్పటికీ వారికీ తృప్తి కలుగలేదు. అవతల
వేంగి యువరాజు వేచివున్నాడని అంతటితో అలంకరణలు ఆపుచేశారు.

358
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

రాజకుమారినీ యువరాజునూ తూర్పు ముఖంగా కూర్చోపెట్టారు. ఇంత చేసినా ఏమి


లాభం. రాకుమారికీ యువరాజుకు మధ్య తెరకట్టారు. ఒకవైపు రాకుమారి ఇంకోవైపు
రాకుమారుడు. వారి సంభాషణమేకాని ముఖాలు కనిపించవు.
రాజకుమారి వ్రీడాభరంతో నేరుగా మాట్లాడదు. చెలికత్తె సారధ్యం వహిస్తుంది.
రాకుమారి: విజేతలకు అభివాదములు.
యువరాజు: కనిపించని కరకమలాల అభివాదాన్ని మేము స్వీకరించలేము.
రాకుమారి: పుష్పాన్నిచూడకపోయినా తావి వ్యాప్తమవుతుంది కదా!
యువరాజు: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. పంచేంద్రియ జ్ఞానంతోనే
కదా మనసు ఆనందించేదీ! మాతో సమావేశం కోరడానికి హేతువేదో తెలుసుకోవచ్చా?
రాకుమారి: తమరు వీరోత్సవాలలో గెలుస్తే బంగారుకొండ అనుకున్నాము కాని ఇంత
రక్తదాహం ఉందని ఊహించలేదు.
యువరాజు: చంద్రిక చందమామకందం చందిర చంద్రహాసానికందం!
రాకుమారి: క్షతగాత్రుల ఆర్తనాదాలు ఆలకించారా? ఇంతమందిని హింసించటం
తమకు తగునా?
యువరాజు: యుద్ధం హింస అంటే ఇంక చరిత్రలు ఇతిహాసాలు తిరగ రాయాల్సిందే!
రాకుమారి: ఇది హింస కాదా? కాళ్లు నరకడం చేతులు నరకడం హింసకాదా? కొంద
రికి చెవులు కొందరికి ముక్కు కొందరికి భుజాలు ఇలా నరకడం హింస కాదా? వారంతా
బాధతో నెప్పితో జ్వరంతో ఎంత బాధ పడుతున్నారో తమరు కాంచగలిగారా?

యువరాజు: యుద్ధం అంటేనే అంత! మేమెవర్నీ అమాయకుల్ని వధించలేదే! మాతో


కత్తి కత్తీ కలిపినవారితోనే యుద్ధం చేశాం.

రాకుమారి: ఇంతమంది మరణం తమకు విషాదం అనిపించలేదా?

యువరాజు: మేమొక సైనికులం. ఇందులో విషాదమేముందీ! శస్త్రజీవులకు యుద్ధం


ఒక పండుగ! నాడు కురుక్షేత్ర సంగ్రామానికి దాయాదుల వైరంతో ఏ సంబంధము లేని
రాజులంతా తరలిరాలేదా! యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు,శిశుపాలనందనుడు,
కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైభ్యుడు, యుథామన్యుడు, ఉత్తమౌజుడు, శిఖండి,
అభిమన్యుడు, ప్రతివింధ్యుడు మొదలైన ఉపపాండవులు, భూరిశ్రవుడు, జయద్రధుడు
మొదలైన వారంతా తరలివచ్చారు.వారంతా ఎంతోఆనందంగా శంఖాలు పూరిస్తూ, ఢక్కలు
మృదంగాలు రణశృంగాలు మోగించుకుంటూ పెళ్ళికి తరలివచ్చినట్లు తరలివచ్చారు.
వారం దరికీ తెలియదా యుద్ధంలో కాళ్ళుచేతులు తెగుతాయనీ ప్రాణం పోయినా పోతుందనీ?

359
  చాళుక్యసింహాసనం

రాకుమారి: నిజమే కదా ఆర్యపుత్రా! వైరం నూరుగురు కౌరవులు ఐదుగురు పాండవుల


మధ్య కదా! ఆ నూరుగురూ ఈ ఐదుగురు యుద్ధం చేసుకుని అందులో ఎవరు గెలుస్తే వారు
రాజ్యం ఏలుకోవచ్చుకదా?

యువరాజు: ఎవరు గెలుస్తే కాదు ఎవరు మిగులుతే అంటే బాగుంటుంది. అలాంటి


రాయబారాలు అన్నీ ముగిసిన తరువాతనే యుద్ధం సన్నద్ధమయింది. ఐనా కృష్ణుడుం డగా
సంధి ఎలా పొసగుతుందీ.

రాకుమారి: శ్రీకృష్ణదేవుడు ప్రేమరసామృత సాగరుడు. మానినీ మనోహరుడు.


జగదభినుతుడు. గురువు. అట్లాంటివాడు రక్తపాతాన్నీ యుద్ధాన్ని ప్రోత్సహిస్తాడా?

యువరాజు: కృష్ణుడంటేనే యుద్ధం. వథ! కృష్ణుడు పుట్టడానికి పదేళ్ళముందే అతడిని


హతమార్చడానికి పథకాలు రూపుదిద్దుకున్నాయి. అందుకే దేవకీవసుదేవులు పుట్టుగుడ్డును
నందగోకులం పంపించివేశారు. పాలుతాగే పిల్లవాడిపైనే పూతన హత్యా యత్నం చేసింది.
అందుకే ఉగ్గుపాలతోనే పోరాటం నేర్చుకున్నాడు. ఎక్కడెక్కడ మూలనున్నవారినందరినీ
ఏరిఏరి స్వర్గానికి పంపించాడు.

అబలలైన అతివలు రాసక్రీడలను తలుచుకుంటూ మదనాభిరామలై అంతరంగంలో


రమిస్తుంటారు. అబలులైన పురుషులు ముండనం చేయించుకుని మెడలో తులసి పూసలు
వేసుకుని కృష్ణవిగ్రహం చుట్టూ గంతులు వేస్తూ భజన చేస్తుంటారు. కృష్ణుడలా
చేయమన్నాడా? రామునికి అగస్త్యమహర్షి ఉపదేసించింది కూడా యుద్థమే కదా! యుద్ధాయ
సముపస్థితం.

రాకుమారి: తమవాదన జనామోదమైనదికాదు.

యువరాజు: భగవద్గీత సారాంశమేమిటీ? జీవితంతో యుద్ధం చేయక తప్పదు.


తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యద్థాయ కృతనిశ్ఛయః. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ
పరంతప. యుద్థము చేయనని రథముపై కూలబడి ఖిన్నుడై యుద్ధపరాన్ముఖుడై ధను
ర్బాణాలు పడవేసిన అర్జునుడు గీతోపదేశము విని లేచి నిలబడి యుద్ధం చేశాడు. అంతే కాని
కృష్ణుడిచుట్టూ నాట్యం చేయలేదు.

రాకుమారి: ఆర్యపుత్రులతో వాదనకు మేము సమర్థులము కాకపోవచ్చు. యుద్థో


న్మాదులకు భగవానుడు కూడా యుద్థోన్మాదిగా కనిపించవచ్చు! కానీ సర్వదర్శియైన
సంజయుడు చెప్పినమాట కృష్ణుడనగా యోగీశ్వరుడు.

యువరాజు: ఒకరివాదనకు లొంగిపోక స్వయంగా ఆలోచించగల అతివకు అభినం


దనలు.

360
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

రాకుమారి: ఆర్యపుత్రులకు ధన్యవాదములు. మాకు క్షతగాత్రులకు సేవచేయడానికి


అవకాశం కల్పించాలని కోరుతున్నాం.

యువరాజు: ఈ విన్నపం దుర్గాద్యక్షుడు విశాఖదత్తునికి పంపండి.


రాకుమారి: తమకు స్వాతంత్ర్యము లేదా?
యువరాజు: ఒకరికి ఒక పదవి అప్పగించినతరువాత వారిని స్వతంత్రంగా పనిచేయ
నివ్వాలి!
రాకుమారి: మాతండ్రిగారినీ శిరఃప్రధాని రేవాదాసదీక్షితులవారినీ చూడాలనివుంది.
యువరాజు: కొంతకాలం వరకు ఇలాంటి అనుమతులు ఇవ్వబడవు.
రాకుమారి: కారణం అరయవచ్చునా?
యువరాజు: ఇప్పుడు ఉన్నది సైనిక పరిపాలన. అత్యవసర పరిస్తితులలో ఎందుకు
ఏమిటి ప్రశ్నలు వుండవు.
రాకుమారి: తమరి శాసనం చాల కఠినం.
యువరాజు: తమరు గ్రహించినందుకు ధన్యవాదాలు.
రాకుమారి: కానీ ద్వేషించలేకపోతున్నాము.
యువరాజు: ఎందుచేత?
రాకుమారి: అదిమా బలహీనత. తమకు మేము గొప్ప అభిమానులం. ఒక్కసారిగా
మనోజ వీరుని ద్వేషించడం అంత సులువుకాదు.

వారిమధ్య సంభాషణ అసమగ్రంగా ఆగిపోయింది. శిరీష తన రాజసం వీడి తన


ఎదలోని ప్రేమానురాగాలు వక్తం చేయలేకపోయింది.

తెర అటునుంచీ ఇటుకు ఒక చెలికత్తె వచ్చింది. “ఆంధ్ర చాళుక్య యువరాజులకు మా


రాజకుమార్తె నచ్చిందా?” అని అడిగింది. అందుకు విష్ణువర్ధనుడు “మీ రాకుమారి కొమ్ములు
వాడిగా వున్నాయి” అన్నాడు.

అప్పుడు చెలికత్తెలు వారిద్దరికీ ఎదురుగా వున్న ముకురానికి కట్టిన తెర తొలగించారు.


ఎదురు అద్దంలో రాజకుమారీ రాకుమారులూ ఒకరికొకరు కనిపించారు. శిరీషాకుమారి
వీరోత్సవాలపుడు, వేంగిలోను రాజకుమారుడిని చూచింది. అప్పుడు వివ్వచ్చుడిలా
కనిపించాడు. సుభద్రలా వరించింది. ఇప్పుడు ముఖం చూస్తే మహేంద్రుడిలా ఉన్నాడు.
సిగ్గుతో కొంచం తల దించుకుంది.

361
  చాళుక్యసింహాసనం

విష్ణువర్ధనుడు మాత్రం సర్వాలంకార భూషితయైన రాజకుమారిని చూడడం అదే


ప్రధమం. పైగా తనను చూడగానే ఆమె ఎదురు రొమ్ములు ప్రేమతో పైకి లేవడం గమనించాడు.
ఒక క్షణం కుడిపైట వేసుకుందేమిటీ అనుకున్నాడు. ఒహో. అద్దంవలన ఎడమ కుడి
అయితేనేమీ, అందంగా వుందిగా అనుకున్నాడు. ప్రధమ వీక్షణంలోనే అతడి మేను
పులకించింది.

కొద్దిసేపు తరువాత మళ్ళీ చెలికత్తె “మా రాజకుమారి నచ్చిందా?” అని అడిగింది.


అందుకు విష్ణువర్ధనుడు “ఇంతకు ముందు కొమ్ముల వాడి చూశాము ఇప్పుడు ఆభరణాల
అంగడి చూశాము. ఇంతకూ మీ రాకుమారి ఎక్కడా?” అన్నాడు.

రాకుమారి శిరీష రోషంతో అక్కడినుండీ వెళ్ళిపోయింది.

తెరచాటు నుంచీ విశాఖదత్తుడు ఇవతలకు వచ్చాడు. మిత్రులిద్దరూ కలిసి అంతఃపురం


నుంచీ బయటికి వచ్చారు. “విశా నీవెప్పుడు వచ్చావూ?” అన్నాడు విష్ణువర్ధనుడు.

“నేను చెప్పానుకదా, నేను రాజకుమారిని కూడా నమ్మననీ! నిన్ను ఒంటరిగా వదిలి


పెడతానా?”
“నేనంత అసమర్ధుడి ననుకున్నావా?”
“ఇవాళ చూశాను, ఆడపిల్లలను ఏడిపించడంలో నీవు సమర్ధుడవని!”
“నేనేడిపించానా?”
“పాపం నీ కరుకు హృదయానికి ఆమె ఎంతగా నొచ్చుకుందొ!”
“తను మాత్రం ఏదో ప్రేమగా మాట్లాడుతుందనుకుంటే రాచరికాలు మాట్లాడుతుందా?”
“తొలిప్రేమ అలాగే వుంటుంది. ఎలా పలకరించుకోవాలో తెలీదు. పోనీలే మీ ఇద్దరికీ
మలి సమాగమం ఏర్పాటు చేస్తాను, అదీ ఏకాంతంగా.”
“ఏమిటీ అంతఃపురంలో నీకు అంత చొరవ వుందా?”
“చెప్పానుకదా, అరణి నాచేతులో కీలుబొమ్మ.”
“పాపం ఆ పిల్లను ఆరడి పెడుతున్నావా?”
“ఏమీలేదులే! రాజకుమారి తో నీపెళ్ళి కాగానే మాపెళ్ళి!”
రాకుమారి తన శయన మందిరంలోకి వెళ్ళి పల్యంకంపై పడి వెక్కివెక్కి ఏడ్చింది.
చెలికత్తెలలో పూర్వచిత్తి రాకుమార్తె వద్దకు వెళ్ళింది ఊరడించడానికి. “ఆనందించాల్సిన
సమయంలో ఈ అశృవర్షం ఏమిటీ?” అంది.
“ఎంతో మృదుమధురంగా వుంటుందనుకున్న తొలిసమావేశం విరసంగా మారింది.”
362
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“మరి నీవు రాజకీయాలు మాట్లాడడం దేనికీ?”


“నాకా సమయంలో ఏంమాట్లాడాలో తెలీలేదు. కంగారు పడ్డాను. నేను కూడా యుద్ధ
ప్రస్తావన తేకుండా వుండాల్సింది.”
“అవును మరి! ఇది వారికీ మనకీ మధ్య నూటఎనిమిదవ యుద్ధం!”
“అలా అని నీకెవరు చెప్పారూ. నీకు కలవచ్చిందా?”
“అరణి చెప్పింది.”
“అరణికెలా తెలుసూ?”
“అరణికెలా తెలుసో నాకు తెలీదు.”
“కానీ అతడికి నేను నచ్చినట్లు లేదు.”
“భలేదానివే! నేనాతడి కన్నులలో కోరికనీ పొట్టలో ఆకలినీ గమనించాను.”
“మధ్యలో ఆకలేమిటీ? మనం మూర్ఘంగా కతుకుతే అతకదని మంచినీళ్ళు కూడా
ఇవ్వలేదు.”
“ఆ ఆకలి ఈఆకలికాదు. అతడు నరమాంసం కోరే పులిలా ఉన్నాడు. ఈమాటు కంట
పడ్డావంటే కొరుక్కు తినేస్తాడు. పోనీ అప్పుడు అధరామృతంతో తృప్తిపరుద్దువు గానివిలే.”
“అంతదాకా వస్తుందంటావా? అతడు కోపగించుకోలేదుకదా? నేనతడి కంటికి ఆన
లేదేమో!”
“ఓహో అదా! అతడికి నీ చుట్టూ ఆభరణాలలాగా మేమందరం ఉండడం ఇష్టం లేదు.
నీతో ఏకాంతం కోరుతున్నాడు.”
“నాకు కొమ్ములున్నాయన్నాడు. అంటే నేను బిరుసుగా మాట్లాడానని కదా!”
“అదికాదు. గేదెని చెరువులో దింపి కొమ్ములు చూసి బేరమాడమంటే ఎలా అని.”
“అంటే నేను గేదెననా?”
“మరి మనం కూడా నీ ముఖారవిందాన్ని చూపకుండా ‘బాగుందా?’ అంటే
ఏమంటారూ?”
“మనలో ఎవరికీ పెళ్ళికాలేదు. పెళ్ళిచూపులెలా వుంటాయో తెలీదు.”
“ప్రేమభాష అలాగే వుంటుంది. ప్రక్కవాళ్లకు అర్ధంకాకుండా మాట్లాడాలి.”
“అంతేనంటావా?”
“పోనీ మనసు విప్పి ఒక లేఖ వ్రాయి!”

363
  చాళుక్యసింహాసనం

“ప్రణయలేఖ ఎలావ్రాయాలో నాకు తెలీదు!”


“ఇదేమీ విద్యాలయాలలో బోధించే అంశంకాదు. అందరం కలిసి వ్రాద్దాము.”
అందరూ ప్రేమలేఖలో తలొక వాక్యం చెప్పసాగారు.

ఓ చాళుక్య శార్ధూలమా! మత్తేభ పంక్తిలాంటి మీకీర్తి పర్వతాల సరసన మమ్మొక మేఘ


శకలంలా పరిగ్రహింప కోరుచూ ఈ లేఖ వ్రాస్తున్నాము. మీ పవిత్ర చరణాలపై ఉత్పలమాల
వుంచి మీ గళసీమలో చంపకమాల అలంకరించాలని కోరిక. నెరవేరునో లేదో! మన మొదటి
సమాగమం రసకందం అవుతుందనుకుంటే మా మూర్ఖత్వం వలన తేటగీతిలో అపస్వరంలా
ధ్వనించింది. మన్నించగలరు.

మాకు నాట్యం వచ్చు. యువరాజులు దక్షిణ నాయకులైనా మా కభ్యంతరం లేదు.


మణిమంజరి వంటి మీ భార్యా మణుల సరసన మీ నృత్యాంగనల నడుమ ఆటవెలదిగా
నియమించుకున్నా మాకదే పదివేలు. వేయి రాత్రులైన అభిసారికలా వేచిచూడగలనే కానీ
కలహాంతరితను కాను. ఒక్క సమాగమమైనా గ్రీష్మాతపంలోనైనా హిమాంసు పాతంలోనైనా
వరవర్ణినినై తమ సేవ చేసుకోగలను.

మావిరహాగ్నిని మంచుతునకలు ఆర్పజాలక అగ్నిపుష్పాలవుతున్నాయి. మత్తకోకిలలు


మమ్ము వెక్కిరిస్తున్నాయి. పంచచామరాలైనా మా విరహాగ్నితాపానికి దోహదం చేస్తున్నాయే
కానీ శమింప చేయటం లేదు. విరహంతో గురువు లన్నీ లఘువులై పోతున్నాయి. చివరికి
అర్ధానుస్వారగా లేక సరళరేఖగా మిగిలిపోతానేమో.

తమ చరణ సన్నిధి కోరే అశృకణాల మంజరి. రాజకుమారి శిరీష.

లేఖ తయారయింది. చక్కటి దంతపు బరిణలో పెట్టారు. కానీ ఎలా పంపించాలో అర్ధం
కాలేదు. భూసురుడి ద్వారా పంపిస్తే బాగుంటుందేమో! కానీ ఎవరు దొరుకుతారూ? బయటికి
వెళ్ళడానికి లేదు. యమకింకరుల్లాంటి భటులు కాపున్నారు.

అంతలో ఒక వార్తాహరుడు వచ్చాడు. లేఖ అతడికిస్తే సరిపోతుందనుకున్నారు.


అతడూ ఒక శ్రీముఖం తెచ్చాడు. అది అందుకుని సమంత రాజకుమారి ముందు చదవ
సాగింది.

రాష్ట్రకూటరమణికి సౌందర్య స్రవంతికి దివ్యాంగనామణికి సాహసధునికి ధనుర్విద్యా


విశాదకు పుప్పొడికన్నా సున్నితమైన శిరీషాపుష్పరజ శిల్పానికి యువరాజ విష్మువర్ధనులు
పంపుకున్న శ్రీలేఖాంశములు.

మాకు దక్షిణ నాయకుడు కావాలని లేదు. శ్రీరామచంద్రుడిలా ఏకపత్నీవ్రతుడు కావా


లను కున్నాము. కాని ఒకమారు వేటలో మరొకమారు సమరాంగణములో మాప్రాణాలకు
364
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

తన ప్రాణం అడ్డంవేసిన అడవిపువ్వు మృదువదనకు పతి కావడం మావిద్యుక్త ధర్మం. అంగన


ఎవరూ సపత్నిని కోరుకోదని మాకు తెలుసు. సరస శృంగారవనంలో అనుమతులేకానీ
అహంకారాలు దౌర్జన్యాలు సమ్మతం కాదని మాకు తెలుసు.

శలవు. ఇట్లు యువరాజ విష్ణువర్ధనుడు.

లేఖ చదివిన చెలికత్తెలందరూ ఎగిరి గంతేశారు. ఇంకా నయం పిచ్చివాళ్ళం లాగా


మన లేఖ పంపాం కాదు. ఇప్పుడు కాళ్ళ బేరం అవసరం లేదు. అతడి పిలక మన చేతులో
వుంది. ఊ అనడం ఉగ్గూ అనడం మనచేతులో వుంది అన్నారు చెలికత్తెలు.

శిరీష మాత్రం ఒక క్షణం ఆగలేదు. ఒక పత్రిక నందుకుంది. దానిపై ‘గాంధర్వమైనా


రాక్షసమైనా మాకు సమ్మతమే!’ అని వ్రాసి హస్తాక్షరి ఉంచింది. లేఖను చుట్టచుట్టి మొదటి
లేఖ స్తానంలో దంతపు బరిణలో వుంచి పేటికను వార్తాహరుడి కందించి తన గళసీమలో
సువర్ణహారం దూసి అతడికి కానుకగా ఇచ్చింది.

చెలికత్తెలందరూ ‘ఓమ్మో!’ అన్నారు బుగ్గలు నొక్కుకుంటూ.

మాన్యకేతదుర్గంలో యుద్ధం జరిగి రెండు నెలలు గడిచింది. సౌచాసౌచాలన్నీ తీరాయి.


యుద్ధం చేసిన గాయాలు నెమ్మదిగా మానుతున్నాయి. పెద్ద గాలివానవచ్చి అన్నీ కొట్టుకు
పోయిన తరువాత కాస్త ఎండపొడ వస్తే ఎలావుంటుందో రాజకీయ వాతావరణం అలావుంది.
మాన్యకేత నగర ప్రజలు కాస్త స్వేచ్ఛగా మెసలుతున్నారు.

రాజకీయవాతావరణం మారింది. నగరంలో ఒక ప్రక్క పెళ్ళి సందడీ ఇంకోప్రక్క


అమోఘవర్షరాజేంద్రుడి పునఃప్రతిష్టా మహోత్సవం, పట్టాభిషేకము.నగరాన్ని మునుపటి
వీరోత్సవాలకన్నా ఘనంగా అలంకరించారు.

రేవాదాసదీక్షితుడు విడుదలై ఇంట్లోనే వుంటున్నాడు. ఒకనాడు భార్య మణిభూషితాదేవి


అడిగింది సంధియేమని.

“ఇకపై వేంగీచాళుక్యదేశం స్వతంత్ర రాజ్యంగా విలసిల్లుతుంది. చాళుక్య


రాజకీయాలలో రాష్ట్రకూటులు తలదూర్చరు. ఇరు దేశాలమధ్యా ఇక దండయాత్రలుండవు.
సంధి ప్రకారం ప్రవాసంలో ఉన్న బాలచక్రవర్తి అమోఘవర్ష రాజేంద్రుడిని నరేంద్రమృగరాజు
మాన్యకేత సింహాసనంపై పునఃప్రతిష్ఠ చేస్తారు. రాజకుమారి శిరీషను యువరాజ విష్ణువర్ధ
నుని కిచ్చి వివాహం చేస్తారు.”
“ఇన్నాల్టికి మీప్రభుత్వం దోవకొచ్చిందనమాట!”
“ఏమిటీ అలాఅన్నావూ?”

365
  చాళుక్యసింహాసనం

“ఏమీలేదులేండి. ఇంతకూ శిరీషకు కన్యధార ఎవరుపోస్తున్నారు?”


“ఇంకెవరు? తండ్రి ఇంద్రవల్లభమహారాజు.”
“గొప్పగొప్ప శిరఃప్రధానులకు కూడ అప్పుడపుడు బుఱ్ఱపనిచేయదు!”
“మంత్రాంగంలో ఓడిపోయానుకదా అని నీకుకూడ చులకనయ్యానా!”
“మరి ఇంద్రవల్లభుడు విథురుడు. కన్యధార ఎలాపోస్తాడు?”
“అవునే! నేనాలోచించలేదు. అందుకే ఎంతటి మంత్రికైనా ఇంట్లో ఒకమంత్రి
ఉండాలి!”
“ఏమగాడికీ ఇల్లాలిని మించిన మిత్రుడు మంత్రి వుండరు. కాకపోతే జీతంవాతం
లేకపోగా చెంపదెబ్బల సన్మానం!”
“ఏదో తమలపాకుతో ఇలాఅంటే పీటచెక్కతో అలాఅన్న్లుట్లు బాధపడతావెందుకు.
ఇంతకు తరుణోపాయం కూడ నీవేచేప్పు.”
“ఏముందీ! కర్కవల్లభుని భీమరథిని కన్యధార పోయమనండి.”
శిరఃప్రధాని ఆలోచనలో పడ్డాడు.

అమోఘవర్షరాజంద్రుడు జినసేనుడి ఆశ్రమం నుండీ రాజధానికి చేరుకున్నాడు.


రాకుమారుడికి బాల్యము కౌమారము దాటింది. పధ్నాలుగేళ్ళ వయసు వచ్చింది. నూనూగు
మీసాలు మొలిచాయి. కంఠంలో మగపిల్లలకు వచ్చే జీర వచ్చింది. దుర్గము నగరము అంతా
కలయతిరిగాడు. ఆహ్వానముమీద జినసేనుడు, మహావీరాచార్యుడు, కొండమానుఋషి
కూడా పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేశారు. వారికి ప్రత్యేక విడుదులు ఏర్పాటు చేశారు.

అమోఘవర్షరాజేంద్రుడు జైన మతాచార్యుడు జినసేనుని శిక్షణలో వీరుడు, విద్యా


వంతుడు, గుణశీలవంతుడూ అయ్యాడు. అంత చిన్న వయసులోనే ప్రశ్నోత్తరమాలిక అనే
గ్రంధ రచన ప్రారంభించాడు. అంతేకాదు. ఆరునెలలు సహవాసం చేస్తే వారు వీరవుతా
రంటారు. శైవ వైష్ణవ మతాలకన్నా జైనమతం పైన ప్రేమ పెంచుకున్నాడు.

ఘూర్జరదేశం నుంచీ కర్కవల్లభుడు రప్పించబడ్డాడు.

పెళ్ళి సందడిగా వుంది. పురోహితులు పెళ్ళికుమార్తెను కళ్యాణ మండపంలోకి తీసుకు


రావాలని చెబుతున్నారు. పురోహితులు వరుడు వధువు వంశవృక్షాన్ని వర్నిస్తున్నరు.

పెళ్ళికుమారుడైన విష్ణువర్ధనుడు బ్రహ్మదేవుని అరచేతి పులిసిలి లోంచీ పుట్టిన తూర్పు


చాళుక్య వంశంలో వృద్ధ విజయాదిత్య మహారాజుకు నప్త్రి. వృద్ధ విష్ణువర్ధన మహా రాజుకు
మనుమడు. చాళుక్యరామ, విక్రమధవళ నరేంద్రమృగరాజ బిరుదాంకితుడైన విజయాదిత్య

366
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

మహారాజుకు కుమారుడు. కలివిష్ణువర్ధనుడు వరుడు.

కన్య యదుకులంలో సాత్యకి వంశజులైన రాష్ట్రకూట కృష్ణరాజేంద్రుడి ముని మనుమ


రాలు. ధృవధారావర్ష చక్రవర్తి మనుమరాలు. ఇంద్రవల్లభ మహారాజు పుత్రిక. సాక్షాత్తు లక్ష్మీ
స్వరూపిణియైన శిరీష అను పేరుగల వధువు.

మాంగళ్యధారణ శుభముహూర్తం ఆసన్నమయింది. కల్యాణ మండపంలో శిరీషా


కుమారికి పెళ్ళికుమారుడు మాంగళ్యధారణ చేస్తుంటే మృదువదన రాకుమారి వెనుక నిల
బడి బంగారుజడ పైకెత్తి పట్టుకుంది. మూడుముళ్ళు వేసే మిషతో. వరుడు మునివేళ్ళతో
మెడను తడుముతుంటే వధువు కనులు పైకెత్తి చూసింది.

కర్కవల్లభుడు విష్ణువర్ధనునికి కన్యాదానం చేస్తున్నాడు. ఇంద్రవల్లభుడు ప్రక్కన


నిలబడ్డాడు. పెళ్ళికుమార్తె ఎలాంటిదో పురోహితులు చెబుతున్నారు.

ఇయం కన్యాం, అనన్యపూర్వికాం, కాన్తాం, అసపిండాం, యవీయసీమ్, అరోగిణీమ్,


భ్రాత్రుమతీం, అసమానార్ష గోత్రజాం, సుశీలాం, కనకసంపన్నాం, సాలంకృతాం,
కనకాభరణై ర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా....

ఈకన్య వివాహానికై కోరతగినది. ఈ ఉవిదఇంతకు ముందు ఎవరికీ ఇస్తామని మాట


యివ్వనిది. ఈ కొదమ సర్వాంగ సుందరి. ఈ కోమలి వరుని బంధువర్గంలోనిది కానిది. ఈ
లతాంగి వయస్సులోను పొడుగులోను వరుడికన్నా చిన్నది. ఈ నితంబిని ఆరోగ్యవంతు
రాలు. ఈ మానిని సోదరుడు కలది. ఈవధూటి వరుని గోత్ర ఋషులతో కలవని ఋషులు
కలది. ఈ చెలువ చెప్పుకోదగిన శీలసంపద కలది. ఈ కుందరదన బంగారు బొమ్మ. ఈ
మగువ మంగళసూత్రముతో అలంకరింపబడిన గళము కలది. ఈ చెలియ రత్నాభరణా
లతో విరాజిల్లుతున్నది. ఇలాంటి నవవధువును ఓ మహావిష్ణువా శాశ్వత పరబ్రహ్మలోక నిత్య
నివాస కాంక్షతో నీకు సమర్పిస్తున్నాము. దయచేసి పరిగ్రహించు.

వివాహం జరుగుచున్న సమయంలో పండితులలో కొంచం వాగ్వివాదం చెలరేగింది.


కన్యాదానం చేసిన తరువాత తాళి కట్టాలా? మంగళసూత్రంతో అలంకృతమైన కన్యను దాన
మివ్వాలా? ఏది ముందు? పండితులందరూ రెండు వర్గాలుగా విడిపోయి పిలకా పిలకా
పట్టుకు కొట్టుకున్నారు. బ్రాహ్మణేన అనేకత్వం. ఒక పండితుడొప్పుకున్నది ఒకపండితుడు
ఒప్పుకోడు. సాలంకృతకన్యా దానమంటే ఏమిటి?

పెళ్ళితరువాత నాడు రాకుమారి శిరీషకు యౌనముహూర్తం. రాకుమారి ఇప్పుడు నవ


వధువు. చాళుక్య సామ్రాజ్యానికి యువరాణి కూడ. నవవధువులకు యౌనోత్సవం అంటే
మనసులో ఉత్కంఠ ఇసుమంత భయం కొండంత సిగ్గు సహజం.

367
  చాళుక్యసింహాసనం

అంతఃపురం పైభాగంలో పల్యంకం ఏర్పాటు చేశారు.ఉప్పరిగచుట్టూ పూలతో


దడికట్టారు. ధూపకరండాలు సువాసనల మేఘాలు సృష్టిస్తున్నాయి. తీపి వంటకాలు
రసఫలాలు ఘమఘమలాడుతున్నాయి. రాష్ట్ర్రకూట రాకుమార్తెకు నగలకేమి తక్కువా.
గుచ్చుకునే నగలన్నీఒలిచి రాశిపోసింది శిరీష. సరిగంచు చీనాంబరం మెత్తగా హంసతూలిక
కన్నా మృదువుగా వుంది. కంచుకం పీటముడి పడకుండా దూముడి వేశారు చెలికత్తెలు.

ఆకాశంలో సప్తమీతిధి యామీరుడు మబ్బుల చాటున దాగుతూ నూతన వధూవరుల


సమాగమం దొంగచాటుగా చూడలనుకుంటున్నాడు. యువరాజ విష్ణువర్ధనుడు మేడపైకి
వచ్చాడు. శిరీష సిగ్గుతో అధోముఖయై నిలబడింది. విష్ణువర్ధనుడు ఆమె చిబుకాన్ని చూపుడు
వ్రేలితో పైకెత్తాడు. శరీష కనురెప్పలు వాల్చేసింది. కాటుక రేఖలు తుమ్మెద రెక్కల్ని
తలపిస్తున్నాయి.

శిరీష అధరాలపై వేలితో రాశాడు విష్ణువర్ధనుడు. శిరీష తనువంతా కంపించిపోయింది.


“ఈ మధురాధరాలనుంచీ ఒక్క ప్రేమగీతం పలికించవా!” అన్నాడతడు.

మొహమాటంతో శిరీష కుదరదన్నట్లు తల అడ్డంగా ఊపింది. కానీ ఒక పూల ఆస్తరణం


పై కూర్చుని వీణ ఒడిలోకి తీసుకుంది. వీణను మీటి శ్రుతి సరిచేసుకుంది. చెలికత్తెలు ఇలా
పాడారు.
మొగ్గ తొడిగిననాడె
ఈకొమ్మ మొగ్గతొడిగిననాడె
శ్రీపదార్చనకై సిద్ధమైయుండెగా
రేకరేకన వలపు నెత్తావి పొలుపు
ప్రణయపరాగము పాన్పు
మధుర మకరందమే విందు
కూర్చివేచినదీ కొమద
కందర్ప నయనా
మొగ్గ తొడిగిననాడె
ఈకొమ్మ మొగ్గతొడిగిననాడె
నీపదార్చనకై సిద్ధమైయుండెగా

“ప్రభువులు పాడితే మా నెచ్చెలి వీణమీటుతుంది” అన్నారు చెలికత్తెలు.
368
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

విష్ణువర్ధనుడు కొంచం సేపు తడుముకున్నాడు. “మేమేమైనా వాగ్గేయకారులమా


ఆసువుగా గేయరచన చేయడానికి? ఐనా వీణాపాణిని నిరుత్సాహపరచలేము కదా!”
అన్నాడు. ప్రెమికులకు పాడాలనే వుంటుంది. అప్పటికప్పుడు గేయమల్లడం తక్కువపని
కాదు. అక్షర రమ్యత కుదరాలి. తాళానికి సరిపోవాలి.
“నెనొక కవిత చెబుతాను” అన్నాడు విష్ష్ణువర్ధనుడు. “ఓ” అన్నారు చెలికత్తెలు.
విష్ణు: పరువాల విరులతోటి పెళ్ళికూతురా
సొగసైన నీమేనె పుష్పవాటిక
“అలాగా!” అన్నారు చెలికత్తెలు.
విష్ణు: జవరాలి పలువరస జాజిమొగ్గలూ
అరవిచ్చిన కన్నులేమొ కలువరేకులు.
“ఇంకా” అన్నది సమంత ఆసక్తిగా.
విష్ణు: ప్రియురాలి దరహాసమె వెన్నెలాయెను
సిగ్గుపడి మొగిచాటై చంద్రబింబము
“అలాగా!” అన్నది అరణి
విష్ణు: కంచుకము వీడలేని పూలబంతులూ
తుమ్మెదలు దూరకుండ కంచవేసెను.
“ఓమ్మో!” అన్నారు చెలికత్తెలు
విష్ణు: తారకలు చూసేరని సిగ్గుపడెదవా
నీలినీలి ముంగురుల మాటులేదటే.

చెలికత్తెలందరూ పగలపడి నవ్వారు. శిరీషకూడా నవ్వాపుకోలేకపోయింది.“మా


కవిత చూసి నవ్వడంకాదు. మీరొకపాట పాడండిచూద్దాం!” అన్నాడు చెలికత్తెలనుద్దేశించి
విష్ణు వర్ధనుడు. యువరాజు సరసం చూసి మత్తిల్లి వున్నారు చెలికత్తెలు. తలొక చరణం
పాడుతూ అభినయించారు కూడ.
సమంత అయ్యగారి ఆగడాలు మాటలతోనే
వరుణ చేతలేమొ తెలియవాయె చిన్నవాడికీ
అరణి ఈ వన్నెగాడి అసలురూపు తెలిసేదేలా
షడ్పద వలపేమో ఆగదాయె కన్నెదానికి

369
  చాళుక్యసింహాసనం

వాశిష్ఠ సరసాలతొ గడిచిపోవ కోడికూయును


పూర్వచిత్తి మొక్కబడీ వ్యవహారమె మొదటిరాతిరీ
ఇంక మొక్కబడీ వ్యవహారమె మొదటిరాతిరీ మొదటిరాత్తిరీ.

62 భయం
రాజకుమారి శిరీష వివాహం జరిగిన ఐదవరోజున నగరంలో నూతన వధూరుల ఊరే
గింపు జరపాలనుకున్నారు. కానీ విశాఖదత్తుడు దుర్గాద్యక్షుడిగా అనుమతీ నీయలేదు.
చక్రవర్తి పునఃప్రతిష్ఠ జరిగేంతవరకూ మాన్యకేతనగరంలో తాను దుర్గాద్యక్షపదవి నుండి
తప్పుకునేది లేదని తేల్చిచెప్పాడు.

మాన్యకేతదుర్గము నగరము విశాఖదత్తుడి శాసనానికి లోబడి నడుస్తోంది. అంతకు


ముందయితే అసలు ఇంద్రరాజును రేవాదాసదీక్షితునీ విశాఖదత్తుడు కలవనీయలేదు.
ఇప్పడు వారు సమావేశమయినా మధ్యలో విశాఖదత్తుడి దూత ఒకరు ఉండాల్సిందే. అందు
వలన అంతటి రాజాధిరాజులు శిరఃప్రధానులు గా పని చేసిన వారికి మహాకష్టం గానూ
ఉక్రోషంగాను వుంది.

ఈ విషయమై యువరాజ విష్ణువర్ధనునికి విశాఖదత్తునికీ చిన్న వాగ్వివాదం జరిగింది.

“విశాఖదత్తా! మన ఇరురాజ్యాలమధ్యా సంధి కుదిరింది. ఒప్పందం జరిగింది.


ఆప్రకారం నాతో వీరి రాజకుమారి వివాహం కూడా జరిగింది. బాలచక్రవర్తి కూడా ఇప్పుడు
నాకు బావ మరది అయ్యాడు. ఇంకా నీవు దుర్గాద్యక్షపదవి నుండి దిగనంటా వేమిటీ?”
అన్నాడు విష్ణువర్ధనుడు కొంచం కోపంగానే.

“యువరాజా! నన్నర్ధం చేసుకో. మనం ఇంకా జాగ్రత్తగా ఉండవలసిందే. నువ్వు వీరికి


అల్లుడవైనందున నీ భద్రతకేమీ భయం లేదు. కానీ మన మహారాజు మాన్యకేత నగరంలో
వున్నంతవరకూ నేను దుర్గాద్యక్షుడిగా వుండాల్సిందే.”

“విశాఖా! నీభయం నిరాధారమనిపిస్తోంది.”

“యువరాజా నీవీవిషయం తేలికగా తీసికోకు! మనం అధికారాన్ని వారిచేతులో పెట్టిన


మరుక్షణమే నరేంద్రమృగరాజును బంధించవచ్చు! ఇంకా నిన్ను బంధించమని ఆనాడు
విద్యా ప్రదర్శనలలో బాలచక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞ ఇంతవరకూ ఉపసంహరించుకోలేదు.
అంతేకాదు. మనం శతావరి, పూటకూళ్ళమ్మ, ఆంధ్రశ్రేష్ఠి మొదలైనవారి భద్రతను గురించి
కూడా ఆలోచించాలి. గోపన్న చిత్రాణి భద్రతను గురించి కూడా ఆలోచించాలి. ఈ నగరం
దరిదాపుల్లో రాష్ట్ర కూటుల సైన్యం ఎంత పొంచివుందో నేను నీకు చెప్పలేదు. నీవు

370
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

పెళ్ళికుమారుడివి. నిన్ను కలవర పెట్ట కూడదని నీతో చెప్పలేదు.”

“ఎవరెవరు ఉన్నారూ?”

“ఘూర్జరదేశం కర్కవల్లభుడి సైన్యం ఐదువేలమంది నగరంలో విన్నారు. సంజము


స్కంధావారం నుండి పాటలమల్లుడు అరవైవేల సైన్యంతో వచ్చాడు. బంకెయశల్లకేతుడు
వనవాసినుండి ఇరవైవేల సైన్యంతో నగరాన్నుంచీ బయటకు వెళ్ళే రహదారులన్నిటినీ
ఆక్రమించాడు. వింధ్యపర్వతాలలోని శ్రీభువనం నుంచి శర్వరాజు సైన్యాలను కదిలించాడు.
వేములవాడ చాళుక్యులు వేంగికి వెళ్ళే దారికాశారు. ఇక్కడ నగరంలో పారిపోయిన
సైన్యమంతా గండయ సాహిణి నేత్రు త్వంలో సమాయత్తమై వుంది.”

“విశాఖా! మరి వాళ్ళు ఈ మాన్యకేత నగరాన్ని తిరిగి ముట్టడిస్తా రంటావా?”

“ఇంద్రవల్లభుడు, రేవాదాసదీక్షితుడు ఆజ్ఞ ఇస్తే ముట్టడించడానికి సిద్ధంగావున్నారు.


అసలైన యుద్ధం ఇప్పుడేవుంది. మన బలం చూస్తే నామమాత్రంగా వుంది. ఇక్కడ వీళ్ళ
పౌరులు సైన్యము ఎంత కసిగా వున్నారంటే గోమఠేశ్వరయ్యగారి క్రొత్తఇల్లు ప్రాకారాలన్నీ
వీరి గజదళాలతో కూలదోయించారు. గోమఠేశ్వరయ్య ఇంటిని తగులపెట్టడానికి ప్రయత్నిస్తే
మన దళాలు అడ్డుకున్నాయి.”

“మరి నీవు గోమఠేశ్వరయ్యగారికి కోటలో రక్షణ కల్పించాల్సింది.”

“నేను అదే అనుకున్నాను. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. గోమఠేశ్వరయ్యపై


ఇంద్రవల్లభుడు దుర్గప్రవేశానికి నిషేధం విధించాడు. అది ఎత్తివేస్తే కానీ ఆయన కోటలో
ప్రవేశించనన్నాడు.”

“ఇప్పుడు ఇంద్రవల్లభుడు కోరలు తీసిన పాము. ఆయనే ఒక బందీ. నిషేధం నీవే ఎత్తి
వేయాల్సింది!”

“విష్ణూ! ఎవరి పౌరుషాలు వారికుంటాయి. ఇంద్రవల్లభుని మీద ఆగ్రహం తోనే కదా


ఆయన మనతో చేతులు కలిపిందీ. ఇంద్రవల్లభుడు స్వయంగా ఆంధ్రశ్రేష్ఠికి క్షమార్పణ చెప్పే
వరకూ ఆ స్పర్ధ అలాగే కొనసాగుతుంది.”

“నాకిన్ని విషయాలు తెలియదు. మాన్యకేతాన్నితిరిగిముట్టడించడానికి ఇంద్రవల్లభుడు


ఆజ్ఞ ఇస్తాడంటావా? మనం ఈవిషయంలో రేవాదాసదీక్షితునితో మాట్లాడుదాము.”

“విష్ణూ! నీకొక విషయం తెలుసా? నేను ఈ పదవినుండీ దిగిన మరుక్షణం నన్నెవరైనా


హత్య చేయవచ్చు! ఎవరిమీదా లేని కక్ష నామీద వుంది!”

371
  చాళుక్యసింహాసనం

“విశాఖా!నీమాట వింటాను. నిన్ను వేంగీనగరం వరకూ క్షేమంగాజేర్చడం నా


బాధ్యతగా తీసుకుంటాను. ఇప్పుడు చెప్పూ మన తదుపరి కార్యక్రమం ఏమిటో?” అన్నాడు
విష్ణు వర్ధనుడు.

“విష్ణూ! మృదువదన సంగతేమిటీ?” అన్నాడు విశాఖదత్తుడు.

“మా యువరాణి చాలా సహృదయ! పదహారురోజుల పండుగ కాగానే మృదువదన


నేను నీవు అరణి సముచిత పరివారంతో మనదేశానికి వెళుతున్నాము. యువరాణి తన
చెలికత్తెలందరనూ తమకు నచ్చినవారిని వివాహమాడి సంసారజీవితం గడపమని అనుజ్ఞ
ఇచ్చింది.”

“అంటే యువరాణి ఇప్పుడు నీతో రావటం లేదా?”

“లేదు. తరువాత సారెతో అరణము ఇచ్చి కాపురానికి పంపిస్తారట!”

“ఐతే విష్ణూ! మన మహారాజు కోడలితోపాటు వచ్చే ఏర్పాటు చేద్దాము. ఇంద్రవల్లభుడు


మన మహారాజుతో కలిసి పెళ్ళికూతురును దిగపెట్టడానికి వేంగి వరకూ రావాలని నిబంధన
పెడదాము. ఇంతకూ నీకు అరణంగా ఎంత ధనం ఇస్తున్నారటా?”

“విశాఖా! ఆడదానిలాగా నీవీ విషయాలన్నీ ఎందుకు పట్టించుకుంటావూ? పిల్లను


చేసుకున్న అత్తమామలే కట్నకానుకలు అడగలేదు!”అన్నాడు విష్ణువర్ధనుడు.

“యువరాజా! పూర్వం నీ యువరాణీకి ముత్తాతగారయిన గోవిందప్రభాతవర్ష


విక్రమావ లోకుడు వేంగిని జయించాడు. అప్పుడు మనదేశంనుండి అనంతమైన సంపదను
కప్పంగా పరిగ్రహించాడు. అలాగే ఈ అమోఘవర్షుని తండ్రియైన గోవిందరాజు కూడా వేంగి
పైన పడ్డాడు. అప్పడు కృష్ణా మూసీ సంగమస్ధానం విజయస్కంధావారం వద్ద అపార ధన
రాసులను గజబలమును భటులను కప్పంగా పుచ్చుకున్నాడు. అంతేకాదు. యువరాణీకి
తాతగారయిన ధృవధారావర్షునకు మీ మేనత్త శీలమహాదేవినిచ్చి సంధి చేసుకున్నారు.
అప్పుడు కూడా మాన్యకేతనగర నిర్మాణ వ్యయం అంతా కప్పం క్రింద ఇచ్చారు. అందు చేత
మనం వడ్డీతో సహా వీరి ముక్కుపిండి తీసుకోవలసిందే!”

“విశాఖా! వీళ్ళదగ్గర అంత ధనం ఉందంటావా?”

“ధనమా!కరిగించి పోసిన పెద్దపెద్ద బంగారు దిమ్మలున్నాయి. నేలమాళిగలలో


ఎందరో రాజులను కొల్లకొట్టితెచ్చిన ఆభరణాలు కిరీటాలు కోకొల్లలుగా వున్నాయి.
రత్నమాణిక్యా లతో మాళిగలు వజ్రాల గనుల్లాగే వున్నాయి.”

“వీళ్ళు ఇంత ధనం ఎప్పుడు సంపాదించారు? నేను వీరి చరిత్ర తెలుసుకోలేదు”


372
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

అన్నాడు యువరాజు.

“రాష్ట్రకూటులలో కృష్ణరాజేంద్రుడితరువాత గోవింద ప్రభాతవర్షవిక్రమావలోకుడు


యువ రాజుగా ఉండగానే వేంగిని జయించాడు. నాశికా త్రయంబకం సమీపంలోని గోవర్ధన
నగరాన్ని ముట్టడించి పారిజాత రాజును సర్వనాశనం చేశాడు. సైనికులు దేశాన్ని అన్ని
విధాలా దోచుకున్నారు. గోవిందుడు స్త్రీలోలుడు. ఏదేశం జయించినా వివాహితులు అవివా
హితులు అని విచక్షణ లేకుండా అందమైన స్త్రీలందరినీ తనసొంతం చేసుకునేవాడు. తమ్ముడు
ధృవధారావర్షుడు స్త్రీలను బలాత్కారం చేయరాదనీ వివాహిత స్త్రీల జోలికి పోరాదనీ నీతులు
చెప్పినా వినేవాడు కాదు.

చివరికి ఈగోవిందుడి తమ్ముడు ధృవధారావర్షుడు అన్నగారిని ఓడించి చక్రవర్తయినా


డు. ముందుగా గంగారాజ్యంపై దండెత్తి శ్రీపురుషరాజు కుమారుడైన శివమారుని ఓడించి
కారాగారంలో పడవేశాడు.శివమారుడు వృద్ధుడై ఇప్పటికీ ఇక్కడి కారాగారంలోవున్నాడు.”
“అలాగా! మరి మనం శివమార మహారాజును విడుదల చేద్దామా” అన్నాడు యువ
రాజు.
“శివమారుడిని విడుదల చేయాలి. అతడి సైన్యం నగరంలో వేయిదాకా వుంది.
ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్యగారు కూడా ఆయనను విడుదల చేయిస్తానని మాట యిచ్చారు.”
“మరి విడుదల చేయి.”
“యువరాజా! ఇప్పుడు ఇతడి గంగారాజ్యాన్ని చాకిరాజు పరిపాలిస్తున్నాడు. విడుదల
చేస్తే ఇతడు ఎక్కడకు వెళతాడూ?”
“నిజమే! ఇతడికి చాళుక్యాంధ్ర దేశంలో ఆశ్రయమిద్దాము. ఇందుకు రాజపత్రం ఇప్పి
స్తాను” అన్నాడు విష్ణువర్ధనుడు.
“అలాగే చేద్దాం. ఇంతకూ ధృవుడు పల్లవరాజును రథనపురం యుద్ధంలో ఓడించి
అపా రమైన గజబలం కప్పంగా పుచ్చుకున్నాడు.
ధృవుడు ఉత్తరానికి మళ్ళి ఉజ్జయిని రాజధానిగా గల మాళవ దేశాన్ని జయించి వత్స
రాజు నుంచి కప్పం పొందాడు. అలాగే గౌడరాజ్యాన్ని జయించాడు. గంగా యమునా మధ్య
దేశాన్నంతా జయించి అక్కడ తన పితృదేవతలకు తర్పణాలు చేశాడు.

ధృవరాజు ఘూర్జరదేశాన్ని జయించి ఇప్పటి ఇంద్రవల్లభుని పరిపాలించమన్నాడు.


రెండవ కుమారుడు కర్కసువర్ణవర్షుడి కోసం బాండెతు రాజ్యాన్ని జయించి రాజప్రతినిధిని
చేశాడు. శివమారుడి గంగారాజ్యాన్ని లాక్కుని తన పెద్దకుమారుడు స్ధంభరణావలోకుడిని
గంగవాడి రాజ్యానికి ప్రతినిధిని చేశాడు.

ఈ ఇంద్రరాజు చక్రవర్తి గోవిందవల్లభుడు కలిసి పన్నెండు దేశాలను జయించారు. మీ


373
  చాళుక్యసింహాసనం

తండ్రి నరేంద్రమృగరాజును కూడా ఓడించారు. ఉత్తరభారతం లోని వత్సరాజునూ, నాగ


భట్టునూ, చక్రాయుధునీ ధర్మపాలుని జయించారు. వింధ్యపర్వతాలలోని శ్రీభువన రాజ్యాన్ని
జయించి శర్వరాజు నుంచీ కప్పంగొన్నారు. గోవిందవల్లభుడు శ్రీభువనంలో వుండగానే ఈ
మోఘవర్షరాజేంద్రుడు పుట్టాడు.

అంతేకాదు. దక్షిణ భారతంలో రాజులు తిరుగుబాటు చేయగా గంగవాడి, కేరళ,


పాండ్య, చోళ, కాంచీ దేశాధీశుల్ని మళ్ళీ జయించాడు. సముద్రందాటి వీళ్ళ ఏనుగులు
రామేశ్వర క్షేత్రంలో నీళ్ళుతాగుతుంటే ఆ రవానికి భయపడి సింహళ లంకాధీశుడు తమపైకి
దండయాత్ర వస్తున్నారని తలచి తన శిలాప్రతిమను పంపి సంధి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ
లంకాధీశుడి శిలావిగ్రహమే మాన్యకేతేశ్వరాలయం ధ్వజస్ధంభం వద్ద వున్నది.

ఇప్పుడు చెప్పు యువరాజా వీళ్ళవద్ద నాకు కూడా తెలియని నేలమాళిగలు ఎన్ని వుండి
వుంటాయో!”

“పిచ్చిధనం సంగతి వదిలేయి. విశాఖదత్తా ! ఇంతటి రాజాధిరాజ రాజపరమేశ్వరుల్ని


జయించిన నీకు ఎన్ని కనకాభిషేకాలుచేసి జగదేకవీర బిరుదాలిచ్చినా తక్కువే!”అన్నాడు
చాలా ఆనందంగా విష్ణువర్ధనుడు.

“యవరాజా! ఇంతటివారిని నీవు పట్టపగలే కొట్టి జగదేకవీరు డనిపించుకున్నావు.


అంతే కాదు. అంతటి ఇంద్రవల్లభుడి కూతురికి మొగుడివైనావు. నిన్నెంత అభినందిం చాలీ!”
అన్నాడు విశాఖదత్తుడు.

“ఇన్ని యుద్ధాలు జయించారంటే అది కేవలం శౌర్యం కాకపోవచ్చు. సామదాన భేద


దండోపాయాలలో వీరెంతో చతురులైవుంటారు. రాజనీతి బాగా వంటబట్టిన వీరు ఎంతకైనా
సమర్ధులై వుంటారు. మనం తక్కువగా అంచనా వేయకూడదు. సరే నీమాట ప్రకారమే
కానిద్దాము. నేను మృదువదననీ నీవు అరణినీ ఎక్కడ పెళ్ళిచేసుకుందామో చెప్పు.” అన్నాడు
విష్ణువర్ధనుడు.

“యువరాజా! బెజవాడలో దుర్గామల్లికార్జునస్వామి వేంచేసిన ఇంద్రకీలాద్రి పర్వత


పంక్తిలోనే మహాసేనుడి దేవాలయం వుంది.”

“ఔను వుంది. చేబ్రోలునుంచీ ప్రతిసంవత్సరం ఈ రెండు పట్టణాలమధ్యా


కుమారస్వామి రథయాత్ర జరుగుతుంది.”

“ఔను. మన రెండు వివాహాలూ వళ్ళీ దేవసేనా సహితుడైన స్కంధుడి ఆలయంలో


చేసుకుందాం” అన్నాడు విశాఖదత్తుడు.

374
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

63 పట్టాభిషేకం
మాన్యకేత మహానగరంలో శిరీష వివాహోత్సవాలలోనే పట్టాభిషేక ముహూర్తం కూడ
దొరికింది.శాలివాహన శకాబ్ది 738 దుర్ముఖీనామ సంవత్సరం వైశాఖశుద్ధ సప్తమి గురు
వారం పుష్యమీ నక్షత్రంలో పట్టాభిషేకం. ఉత్సవాలలో ఉత్సవం. పెళ్ళికి వచ్చినవారందరూ
అమోఘవర్షచక్రవర్తి పట్టాభిషేక మహోత్సవానికి ఉండిపోయారు. ఇరుదేశాల మధ్య సంధికి
చిహ్నంగా చాళుక్య నరేంద్రమృగరాజు అమోఘవర్ష రాజేంద్రుని శిరస్సుపై రాజమకుటాన్ని
ప్రతిష్ఠించాడు.

కోటలోని బురుజులన్నీ మళ్ళీ ఘగరాజ పతాక విరాజితమైనాయి. ప్రజలం దరూ


జయజయధ్వానాలు చేశారు.

విశాఖదత్తుడు మాత్రం ఏమరలేదు. రాష్ట్రకూటుల యోధులందరి ప్రక్కనా తన


యోధుల్ని నియమించాడు. ఏ మాత్రం అనుమానం కలిగినా పొడిచి పారేయమని ఆజ్ఞ కూడా
ఇచ్చాడు.

అమోఘవర్ష రాజేంద్రుని పునఃప్రతిష్టకు కారణమైన రేవాదాసదీక్షితునీ పాటలమల్లునీ


వనవాసిరాజ్యం పాలకుడైన బంకెయశెల్లకేతునీ కృతజ్ఞతా పూర్వకంగా అమోఘవర్ష చక్రవర్తి
సన్మానించాడు.

పట్టాభిషేకం సందర్భంగా నగరంలో ఉత్సవాలు ప్రకటించారు.

పట్టాభిషేకం కాగానే శిరఃప్రధాని రేవాదాసదీక్షితుడు తన నివాసానికి చేరాడు.


మధ్యాహ్న స్నానం చేసి అనుష్టానానికి ఎండలో కూర్చున్నాడు. భృకుటి గాయం నుంచీ
ఏకధారగా రక్తం చిమ్మింది. ప్రక్కకు ఒరిగిపోయాడు. చిలక ఎగిరిపోయింది. పట్టాభిషేకం
అయ్యేదాకా ప్రాణాన్ని ఉగ్గబట్టుకున్నాడేమో ననిపించింది. మాన్యకేతదుర్గంపై దాడిలో
విష్ణువర్ధనుడు కొట్టిన దెబ్బ మానలేదు. గాయంకన్నా మనోవ్యాధే ఎక్కువ బాధించింది.
అప్పటినుంచీ ఆయన సరిగా నిద్ర పోయినదే లేదు.

కుశధారి తన తమ్ముడి కుమారుడు తనవలననే యుద్ధంలో మరణించాడు. పెళ్ళయి


పదహారురోజుల పండుగ కూడా గడవని వాడిని నిద్రమంచం మీదినుండీ లేపి కోటగుమ్మం
కాయడానికి పంపించాడు.

కోడలు రోదించి రోదించి పుట్టింటికి వెళ్ళిపోయింది.

మహాత్ముల పార్ధివదేహాన్ని పాసిపోయేదాక ఉంచరాదు. చూడవలసినవారంతా


నగరం లోనే వున్నారు. బ్రహ్మలోకానికి వెళ్ళే వాహనం సిద్ధమయింది. భార్య మణిభూషితాదేవి

375
  చాళుక్యసింహాసనం

చివరిసారిగా భర్త దేహానికి మూడు ప్రదక్షిణాలు చేసింది. కుప్పలా కూలిపోయింది. భిష


గ్వరులు పరీక్షించారు. మగచిలకతో పాటు ఆడచిలక కూడ ఎగిరిపోయింది.

ఎవరూ చింతించలేదు. ఆవిడ భర్తతోపాటు బ్రహ్మరధాన్ని పంచుకుంది.

ఒక పతివ్రతగా శిరఃప్రధాని రేవాదాస దీక్షితునితో జీవితం పంచుకుంది. మంచం


పంచు కుంది. శవవాహనం కూడా పంచుకుంది. కడకు చితిగూడ పంచుకుంది.

అదే సమయానికి బిందుసరస్వతి స్వామి బ్రహ్మైక్యాన్ని చెందాడు. అమోఘవర్షుని


పట్టాభిషేకం కాగానే ఇద్దరు మహానుభావులు అస్తమించారు.

బిందుసరస్వతీ స్వామి పూర్వాశ్రమంలో బిందుఋషి. మాన్యకేతేశ్వరాలయంలో


ప్రధాన అర్చకుడు. టీకారాయుడనే మహాస్వామి నుంచీ సన్యాశాశ్రమం స్వీకరించి సరిగ్గా
నలభై ఎనిమిది రోజులయింది. దీక్ష తీసుకున్నప్పటినుంచీ నిరంతర ధ్యాననిష్టలో గడిపేవాడు.
మొదటి ముప్పయి రోజులూ చాంద్రాయణ వ్రతం పాటించాడు. అదీ యవమధ్యం. అది
పూర్తికాగానే రసోపవాసం ఆరంభించాడు. ఏ పండో ఫలమో తిని ఉండేవాడు. ఇలా పది
రోజులు గడిచింది. తరువాతి ఐదురోజులూ జలోపవాసంతో గడిపాడు. దాహమేసినపుడు
నీళ్ళు మాత్రమే తాగేవాడు. అప్పటికి నలభై ఐదురోజులయింది. ఆతరువాత నిర్జలోపవాసం
ఆరంభించాడు. మూడురోజులు గడుస్తుండగా ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది.

బిందుఋషి గోమఠేశ్వరయ్యను ఒక మిత్రుడిగా చూచేవాడు. తురీయాశ్రమం స్వీకరిం


చిన తరువాత కూడా గోమఠేశ్వరయ్య స్వామి సేవకు వెళ్ళేవాడు. బంటు రాత్రింబగళ్ళూ
భిందుసరస్వతీస్వామిని కనిపెట్టుకునే వుండేవాడు. నలభయ్యవ రోజున బిందుసరస్వతీ
స్వామి ధ్యానాన్ని ప్రక్కన పెట్టి గోమఠేశ్వరయ్యతో చాలాసేపు మాట్లాడాడు.

“సెట్టీ! నేను పదేళ్ళముందే ఈ సన్యాసం తీసుకుని ఉండవలసినది. ఎంత ప్రయత్ని


స్తున్నా జపానికీ ధ్యానానికి కూర్చుంటే పూర్వ జ్ఞాపకాలు అడ్డు వస్తున్నాయయ్యా! గుండు
చేయించుకున్నాను. శిఖ వదిలేశాను. దంధ్యం తెంపుకున్నాను. కాషాయవస్త్రాలు ధరించాను.
దండం పుచ్చుకున్నాను. కానీ లోపల వున్న మనసును త్యజించ లేక పోతున్నాను.
పూర్వవాసనలు కుడ్యశిల్పాలలాగా శిలాక్షరాలలాగా చెరగనంటున్నాయి. వాటిని
అల్పకాలంలో చెరపలేము. చాలా సాధన కావాలి. ముందునుంచే అలాటి ముద్రలు మనసులో
పడకుండా చూచూకోవాలి. అందుకే మహర్షులు అడవులలోకి వెళ్ళేదీ గుహ లలో కూర్చునేది.
లోపలకు ఒకప్పుడు వెళ్ళిన విషయాసక్తీ, స్మృతీ చెరగమంటే చెరగదు.” అన్నాడు

“స్వామీ! మీలాంటివారే అలా అంటే మాలాంటివారి సంగతేఏమిటీ?” అన్నాడు శ్రేష్ఠి.

“పూర్వాశ్రమంలో నేను అనవసరంగా రాజకీయాలను గురించి ఆలోచించేవాడిని.

376
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

గొప్ప యోగి కాదలుచుకున్నవాడు రాజకీయాలను గురించి ఆలోచించకూడదు.


రాజ్యపరిపాలన ఒక చదరంగం. చంపుకోవడం సర్వ సాధారణం. మనం చంపకపోతే
అవతలివాడు మనల్ని చంపుతాడు. కాలమే అసలైన హంతకుడు. కబంధహస్తాలతో
అందరినీ దగ్గరకు లాక్కుని నమిలి మింగివేస్తుంది. ఆ దంష్ట్రాకరాళుడి వక్రంలోనే అందరి
తలలూ పిండి పిండి అయి పోతాయి. ఆనాటి నా ఆలోచనలే నాకిప్పుడు శత్రువులయ్యాయి.
సెట్టీ!ఈప్రపంచం మొత్తం భగవంతుడి ప్రణాళిక ప్రకారం నడుస్తుందయ్యా! దాన్ని
మానవమాత్రులం ప్రక్కకు మరల్చ లేము. రోజూ అనుకుంటుంటాను ‘దేహో నా అహం,
జీవో నా అహం, బ్రహ్మఇవా అహం’ అని. కానీ పాతజిడ్డు వదులుతేకానీ కొత్తపూత
అతుక్కోదయ్యా!

ఈలోకాన్ని మనం శ్రవణ రూప రస గంధ స్పర్శల ద్వారా తెలుసుకుంటాం. నేనా


పంచేం ద్రియ జ్ఞానాన్నీదాటాను. ఆ పంచేంద్రియ జ్ఞానాన్ని ఆస్వాదించే
జీవుడు,జీవభ్రాంతినికూడా దాటాను. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే అంతా చీకటి. అది
భౌతికమైన చీకటి కాదు.ఏమీ అర్ధంకాని అంధకారం. అక్కడదాకా చేరుకున్నాను. ఇంకా
ముందుకు వెళ్ళలేక పోతు న్నాను. ఒక్క వెలుగు కిరణం కూడ దర్శనమివ్వలేదు. తేజోపుంజం
అవతరించి చివరకు పూర్ణచంద్రోదయం అవుతుందంటారు. అంతదాకా నేనీజన్మలో
చేరుకోలేననుకుంటాను.

నేను ఇంకా ఎక్కువ కాలం ఉండను. నేను పరిపూర్ణుడనైతే పోయేనాడు మాడు పగిలి
బ్రహ్మరంధ్రం నుంచీ జీవుడు బయటికి పోతాడు. ఆ స్ధితికి జేరుకున్నవాళ్ళకు అది సాధ్యమే!
స్త్రీలైనా పురుషులైనా! వితంతువులను గుండు గీయించి ఇంట్లో కూచోపెడతారు. దాని అర్ధం
అన్నీ వదిలిపెట్టి గృహతపస్యులు కమ్మని! అలా అయినవాళ్ళున్నారు. వారికి ప్రత్యేకంగా దీక్ష
సన్యాసము అవసరం లేదు. వారికి కూడా తలపండుతే ప్రాణం బ్రహ్మరంధ్రం నుంచే
పోతుంది. అది సాధన ద్వారా సాధ్యమే.”అన్నాడు బిందుసరస్వతీస్వామి.

“స్వామీ! మాలాంటి పామరులకు ఏదైనా ఉపదేశించండి” అన్నాడు శ్రేష్ఠి వినయంగా.

“బోధించడం చాలా సులువయ్యా సెట్టీ! నాకే ఇంతవరకూ ఏమీ అర్ధంకాలేదు. భగవా


నుడు శ్రీకృష్ణుడై అర్జునుడికి గీతోపదేశం చేశాడు. అది రణరంగమధ్యంలో రెండు వైపులా
సేనలు మోహరించినపుడు జరిగింది. కానీ ఆ తరువాత భీష్మపర్వం మొదలు ఐదు
యుద్ధపర్వాలు శాంతి త్రయం, అశ్వమేధపంచకం పదమూడు పర్వాలు నడిచాయి. ఇందులో
అర్జునుడు భగవాన్ ఉవాచా ప్రకారం నడుచుకున్నాడా? నాకైతే అర్ధం కాలేదు.

సెట్టీ! ఎవరికైనా చేరువులో జీవగురువు ఉండాలయ్యా! సందేహాలు జనిస్తుంటాయి.


అవి తీర్చే మహానుభావుడిని మనం ఆచార్యోపాసనంగా సేవించి సందేహ నివృత్తి చేసుకోవాలి.
ఇంకా సందేహాలు మిగిలివున్న వాడెవడూ ముక్తిని పొందలేడు. నాతోసహా!” అన్నాడు
బిందుసరస్వతి.
377
  చాళుక్యసింహాసనం

“అయ్యా దానధర్మాలు చేయాలంటారుకదా! చేయలేనివాడి సంగతేమిటీ?” అన్నాడు


ప్రక్కనే కూర్చున్నబంటు.

“ధర్మం అందరూ ఆచరించగలిగింది బంటూ! దానం శక్తిని పట్టి చేయవలసింది. ధన


దానం చేయలేనివాడు ద్రవ్యదానం చేయాలి. అదికూడా చేయలేనివాడు శ్రమదానం చేయాలి.
ఊరికే వాగ్దానాలు చేసిపారేయకూడదు.శంకరభగవద్పాదుడికి ఒక్క ఉసిరికాయ భిక్ష
ఇచ్చినందుకు ఆమెకు బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది సాగర తనయ.”

“అయ్యా! కొందరు దేముడినే నమ్మరుకదా? వాళ్ళసంగతేమిటీ? వాళ్ళు ఏలోకాలకు


పోతారూ? వాళ్ళను దేవుడు శిక్షించడా?” సందేహం వెలిపుచ్చాడు బంటు.

“దేవుడేమీ చేయడు. బుద్ధిమంతులకుమాత్రం ఋషులద్వారా సందేశాలిస్తాడు.”

“మరి దేవుడిని నమ్మనివాళ్ళేమయిపోతారు? వాళ్ళకు పునర్జన్మ వుండదా?”

“బంటూ! భగవంతుడనేది ఒక ప్రణాళిక. క్షణం క్షణం భగవంతుడు ఎవరికీ ఏమీ


చెప్పడు. చేయమనడు. ఆయన మన భవిష్యత్తును మనమే నిర్మించుకునేటట్లు చేశాడు.
మనిషికి ఒక వయసు వచ్చినప్పటినుంచీ అతడికి రాబోయే జన్మ గురించి విత్తనం
తయారవడం ఆరంభిస్తుంది. మన ప్రవృత్తిని పట్టీ మన విత్తనం తయారవుతుంది. టెంక
బాగా ముదిరగానే మనం ఈ శరీరాన్ని విడిచిపెడతాము. మళ్ళీ అనువైన క్షేత్రం దొరకగానే
మన విత్తనం మొలకెత్తుతుంది. మనవిత్తనం మఱ్ఱిగింజయితే మఱ్ఱిచెట్టొస్తుంది వేపగింజ
యితే వేపచెట్టొస్తుంది. కందిగింజయితే కందిచెట్టొస్తుంది.

చింతగింజ లోంచీ మామిడిచెట్టు రమ్మంటే రాదు. ఇదే కృష్ణభగవానుడు చెప్పిన


‘సుకృతి దుష్కృతినోర్జునా’అంటే! మన భవిష్యత్తుకు మనమే బాధ్యులం!”

“ఋషీ! భగవంతుడు అంత నిర్దయగా ఎందుకుండాలీ? అందరినీ తన మహిమతో


మంచివాళ్ళుగా మార్చవచ్చుగా?”అన్నాడు బంటు.

అందుకు బిందుసరస్వతి చక్కగా నవ్వాడు. “బంటూ నీవు మహాజ్ఞానులు అడగ వల


సిన ప్రశ్న అడిగావు. ఈ లోకం అంతా ఒక మాయ! భగవంతుడాడే నాటకం! ఆయనకిదొక
వినోదం. ఈ నాటకంలో మనమంతా పాత్రధారులం. నాటకంలో ఒకళ్ళు రాజుపాత్ర వేస్తే
ఒకళ్ళు బంటుపాత్ర వేయాలి. ఒకళ్ళు రాణిపాత్ర వేస్తే ఇంకొకరు దాసిపాత్ర వేయాలి.
అందరూ రాజుపాత్ర రాణిపాత్ర వేస్తానంటే నాటకం ఎలా రక్తికడుతుందీ?

భగవంతుడాడించే నాటకానికి రకరకాల పాత్రధారులు కావాలి. కుంటివాడు


గుడ్డివాడు ముష్టివాడు పల్లకీ మోసే బోయీ అందరూ మననుంచే రావాలి. అందుకే
భగవంతుడు మనఖర్మకి మననే పాత్రులను చేశాడు. ఈ జన్మలో ఉండికూడా దానధర్మాలు
378
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

చేయని వాడే వచ్చేజన్మలో ముష్టివానిపాత్ర వేస్తాడు. ఇది మొత్తం భగవంతుడు రచించి వదిలి
వేసిన ప్రణాలిక! వచ్చేజన్మకు మన తలరాత మనమే రాసుకుంటాం! వేరేఎవరో రాయరు.”
అన్నాడు బిందుసరస్వతి.

అప్పటికే ఆయన చాలా అలిసిపోయి వున్నాడు. మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు.

తండోపతండాలుగా జనం బిందుసరస్వతీ స్వామి పార్ధివదేహాన్ని దర్శించుకోవడానికి


వచ్చారు. పెద్దలందరూ జేరి ఆయన భౌతికదేహాన్ని భూసమాధి చేయకుండా జలసమాధి
చేయాలని నిర్ణయించారు. కాగ్నానదిలో ఆట్టే నీళ్ళులేవు. అందుకే కృష్ణా భీమా సంగమ
స్ధానానికి తీసుకు వెళ్ళారు. ఒడ్డున చేయవలిసిన కర్మకాండంతా చేశారు. ఆ తరువాత
కూరలగంప పెద్దది తీసుకువచ్చారు. దేహాన్ని అందులో కూర్చోపెట్టారు. నీళ్ళలో తేలకుండా
కొన్ని బండరాళ్ళను ఒళ్ళో పెట్టారు. తాళ్ళతో కట్టారు. ఆ తట్టను పడవలో ఉంచారు. పడవలో
కొబ్బరికాయలను కూడా నింపుకున్నారు. పడవ నదీమధ్యంకు వెళ్ళింది. చూడడానికి వచ్చిన
వాళ్ళు కూడా పడవలు కుదుర్చుకుని నదిలోకి వెళ్ళారు.

బిందుసరస్వతీస్వామి పార్ధివదేహం తలపైన మాడు పగిలేంతవరకూ కొబ్బరికాయలు


కొట్టాలి. పరమ సాత్వికులైన బ్రాహ్మలకు అది కష్టమైన పనే. చేతులు రావు. కళ్ళవెంట
అశ్రుధారలు కారిపోతున్నాయి. కాని తప్పదు. ఒక కొబ్బరికాయ కొట్టినవాళ్ళు వెనక్కు
పడిపోతున్నారు దుఃఖంతో. గుండె రాయిచేసుకుని ఇంకొకరు ముందుకు వస్తారు. చివరకు
బంటు ముందుకు వచ్చాడు. పార్ధివదేహం మాడుపై గట్టిగా ఒక్క టెంకాయ కొట్టాడు.
బ్రహ్మరంధ్రం పండిన దానిమ్మపండులా విచ్చుకుంది. అంతటితో అందరూ తోడుపట్టి
గంపను నీళ్ళలో జారవిడిచారు. ఒడ్డుకు చేరి స్నానాలు చేసి నక్షత్ర దర్శనం అయిన తరు వాత
ఇళ్ళకు వెళ్ళారు.

64 అడవిపువ్వు
మాన్యకేతనగరంలో మనుగుడుపుల పెళ్ళికుమారుడైన విష్ణువర్ధనుని శిరీష దూరంగా
వుంచడంతో యువరాజు వేరే మందిరంలో విశ్రమిస్తున్నాడు. మృదువదన కార్యము నాటి
పెళ్ళికూతురులా లోపలకు వెళదామా వద్దా అన్నట్లు బయట తచ్ఛాడుతోంది. సిగ్గు వద్దం
టోంది. కోరిక లోపలకు వెళ్ళమంటోంది.ఆమె యువరాజుకు అంగరక్షక సేనాపతి
కావడంతో అడ్డగించే ద్వారపాలకులు లేరు.

వేంగికి విష్ణువర్ధనుని ప్రయాణం మర్నాడే. సన్నాహాలు పూర్తయ్యాయి. యువరాణి


శిరీష కాపురానికి రావడానికి ఇంక కొంతకాలం పడుతుంది. సంసారపు తలపులతో పచార్లు
చేస్తున్న విష్మువర్ధనుడు ఎవరో లోపలకు రావడానికి తటపటాయిస్తున్నారని గమనించి
‘ఎవరక్కడా?’అన్నాడు గంభీరంగా. మృదువదన లోపలకు వస్తూ వందనం చేసింది.
విష్ణువర్ధనుడు ఆమె చేయిపట్టి తీసుకు వెళ్ళి ఒక ఆసనం మీద కూర్చోపెట్టాడు. “మగువా
379
  చాళుక్యసింహాసనం

నీఆగమనానికి హేతువేదో మేమెరుగుదుము.” అన్నాడు విష్ణువర్ధనుడు బుగ్గమీద చిటిక


వేస్తూ.
“ఎందుకు వచ్చానూ?”అన్నది మృదువదన చెప్పుచూద్దాం అన్నట్లు.
“ఎందుకు వచ్చావో మర్చిపోయి అడుగుతున్నావా? నాచేత చెప్పించాలని అడుగు
తున్నావా?”
“మరుపా. రాకుమారుల ముఖారవింద మకరంద రసాస్వాదనానానందం కోసం ఈ
చంచరీకాక్షులు ఎదురుచూస్తున్నాయి.”
“పెళ్ళిచేసుకున్న తరువాత కూడా యువరాజుని ఏకవచనంలో సంబోధిస్తావా
గడుగ్గాయీ?”
“ఎవళ్ళూ గమనించనపుడు ఏకవచనం ఎవరేనా ఉంటే బహువచనం!”
“అదేమిటీ?”
“చిన్నప్పటినుంచీ నీవునీవు అంటూ ఇప్పడు మీరు తమరు అనడం ఎబ్బెట్టుగా
వుంటుంది.”
“నేనిప్పుడు యువరాజును తెలుసా? వంధిమాగధులు వింటే ఏమనుకుంటారూ?”
“అందుకే ఎవరూ లేనపుడు నీవు ఎవరేనా వుంటే తమరు! ఏకాంతంలో నీ అర్ధాంగినై
పాలు పంచదారలా కలిసిపోతాను. అప్పుడింకా రెండుంటేగా బహువచనానికి?”
“మనలో పాలెవరూ పంచదారెవరూ?”
“తెలీదు పాపం! నాపాలు నీ పంచదార!”
“బ్రతికించావు. నీవు పంచదార వౌతావేమోనని భయపడ్డాను!”
“అదేమీ?”
“పంచదార అంటే ఐదుగురు మగాళ్ళకు ఒకత్తే పెళ్ళాం!”
“నేనే నీకు ఐదుగురు పెళ్ళాలపెట్టు. యువరాజా నాతో ఎలా వేగుతావో ఏమో!”
“మీ సవతు లిద్దరూ కొట్టుకుంటారేమోనని భయంగావుంది”అన్నాడు విష్ణువర్ధనుడు.
“భయమేమీ వలదు. మూడోది రాకుండా మేమిద్దరం చూసుకుంటాం!”
“నీ పేరు మృదువదనే కానీ ముట్టుకుంటే గుచ్చుకుంటావు!మొగలిపువ్వు!”
“అక్కసంగతి నీకు తెలీదు. వింటిన బాణం సంధించిందంటే చీకటిలో కూడా వరుడు
సమరుడైపోవాల్సిందే!”
“సమరుడా! ఇదేమి ప్రయోగం?”
380
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“సమరుడంటే మన్మధుణ్ణి వెంటపెట్టుకుని వచ్చినవాడు. వధువే ఒక సమరాంగణం.


కోటలు బురుజులు కవాటాలు అధిగమించడం అంతసులువుకాదు!”
“నీవున్నావుగా కోటమర్మాలు విశదీకరించడానికీ! ఇంతకూ శిరీష అస్త్రసన్యాసం
చేసిందట! తెలుసా?”
“అందుకే యుద్ధంలో తమరు గెలవగలిగింది!”
“విలువిద్యలో ఆమె అంతమేటా?”
“ఆ ఉవిద చేతులో విల్లుండగా మీ విజయం కల్ల అయ్యేది!”
“నిజమేకదా! ఆనాడు వీరవిద్యా ప్రదర్శనలలో బాణాన్ని బాణంతో కొట్టడంవలననే
నేను బ్రతికాను. నిజంగా ఆ జగదేకవీరమకుటం ఆ ఉవిద ఉత్తమాంగాన
అలంకరించవలసిందే!”
“అక్క తమరు చేసిన మదనాభిషేకాలన్నీ చెప్పింది నాతో!”
“ఛీ నీకు సిగ్గులేదూ? ఐనా అక్క అంటున్నావు. నీవెప్పుడు పుట్టావో నీకు తెలుసా
అసలు?”
“అందకే నావయసు పెరగదు. నువు ముందు పెళ్ళిచేసుకుంది అక్క... తరువాత
చేసుకునేది చెల్లి!”
“గొప్ప సిద్ధాంతమే కనిపెట్టావు. సృష్టిలో సవతులందరూ కొట్టుకు చచ్చినవాళ్లే!”
“అందకే మేమొక నవ్య శకాన్ని ఆవిష్కరిస్తాము!”

“నీవంత గట్టిగా ఎలా చెప్పగలవూ?”

“ఆజన్మాంతం అక్క ఎప్పుడూ నన్ను మెచ్చుకునేటట్లు ప్రవర్తిస్తాను. నేను ఎంతైనా


మొరటుదాన్ని. సున్నితమెరుగను. అడవిపువ్వును!”

“కొన్ని విషయాలలో సున్నితం పనికిరాదు. ఊరికే నలిగిపోతుంది. నీవయితే


రాటదేలిన దానివి. తట్టుకుంటావు.”

“ఆమాట నిజమే!అసలు శిరీష హృదయం నీకర్పించిందని తెలిసినపుడు నేనునీ ప్రేమ


రంగం లోంచీ నిష్క్రమించాలనే అనుకున్నాను. ఆమె కోసం నా ప్రేమను చంపు కోవాలను
కున్నాను. కానీ అక్కే వారించింది.

మేమిద్దరం మంచి మిత్రురాళ్ళమైనాము. అక్క నిన్ను వీరోత్సవాలపుడే వరించింది.


ఇన్ని నాళ్ళు నీ విరహాగ్నిలో ఎలా ఒడిలిపోయిందో చెప్పింది. తను నీకోసం వ్రాసిన ప్రేమ లేఖ
చూపించింది. తన విలువిద్యా సాధనా శబ్దభేదీ గురించి చెప్పింది. ఆ నాడు కుటిలుడు
381
  చాళుక్యసింహాసనం

సంధించిన బాణాన్ని మధ్యలోనే నడిమికి విరిచిన సంగతేకాదు తన అస్త్ర సన్యాసం కూడా


చెప్పింది. ఆమె అమరప్రేమను నీవు జారవిడువకు.

విశాఖదత్తుడు నన్ను మగవేషం వేసుకుని నీకు అంగరక్షకుడిగా ఉండమన్నపుడు నా


ఆనందానికి అవధులు లేవు. మాన్యకేతాన్ని ముట్టడించినపుడు నీ అంగరక్షకులు ఒక రొకరే
ఓరిగిపోవడం కళ్ళారా చూశాను. కానీ ఆ భగవంతుడు నీకోసమే నాకు ఆయుష్షు
నిచ్చాడనిపించింది. నా జీవితాంతం నీకు అంగరక్షకురాలిగా ఉండడం అవసరమనిపిం
చింది. నీ భీకర యుద్ధం చూస్తే శౌర్యంలో నేను నీ కాలిగోటికి కూడా పోలనని తెలిసింది.”

“ఓ!”
“యువరాజా! క్షత్రియులకు బహుభార్యత్వం తప్పుకాదనిపించింది.”
“పోనీలే ఇద్దరుండడం మంచిదే. ఆడవాళ్ళకు అలక సహజం! ఆవిడ అలిగినపుడు
నీవు, నీవలిగినపుడు ఆమె!”
“ఇద్దరం అలుగుతే?”
“మంచం వీధిలోవేసుకు పడుకుంటాను!”
“అయ్యవారిసేవలో అలక ఒక పులకరింత!”
“అలాగా మాకు తెలీదులే!”

“స్త్రీలకు శుక్లపక్షం కృష్ణపక్షం అని ఉంటుంది. మదవతి పదిహేనుమెట్లుగల


వీణలాంటిది. శుక్లపక్షంలో ఆరోహణ కృష్ణపక్షంలో అవరోహణ పలుకుతుంది. శాస్త్రజ్ఞానం
లేని మగడు అది తెలుసుకోలేక ఆలి అలిగిందనుకుంటాడు!”

“ఓ కేతకీకుసుమమా! ఏదో శాస్త్రం చెబుతున్నావు?”

“అవును. వరవర్ణిని మేనిలో పాదం చిటికన వ్రేలినుంచీ శిరోపర్యంతం శ్రద్ధ, ప్రీతి, రతి,
ధృతి, కీర్తి,మనోభవ, విమల, మోదిని, ఘోర, మదనోత్పాదిని, మద, మోహిని, దీసిని,
వశకరి, రంజని అనే పదిహేను మదనస్ధానాలుంటాయి. మర్మం ఎరిగి అక్కడ మీటితే విపంచి
ఆ నవరాగం పలుకుతుంది.”

“ఓ మదన గాంధర్వ కళానిధీ ఊర్వశీ! నీదగ్గర పాఠాలు నేర్చుకోడానికైనా నిన్ను పెళ్ళి


చేసుకోవాలి!”అన్నాడు విష్ణువర్ధనుడు.

“ఆనాడు చమరీ గురుకులంలోనే చెప్పాను, నీవు నాఒడిలో నేర్చుకోవలసిన పాఠాలు


చాలా ఉన్నాయని!అప్పుడు మీసాలు మెలివేశావు. ఇప్పటికైనా బండబ్బాయి ఓనమా లైనా
దిద్దుకోకపోతే రేపు రాజకుమారి నవ్వుతుంది.”
382
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ఆవిడకూడా ఇందులో పండితురాలా? నీవే పాఠాలు చెప్పావా?”


“అతివ అంటేనే సృష్టీ స్ధితి ఎరిగినది. పిల్లల్ని కనడం పోషించడం అనమాట!”
“ఇంతవరకూ ఆపావు ధన్యవాదాలు. లయకారిణి అనలేదు!”
“ఆ! అదికూడా ఉంది. ఆగ్రహిస్తే మహాకాళియై తాట తీస్తుంది.”
65 నరేంద్రేశ్వరాలయం.

కృష్ణాతీరం శ్రీకాకుళం వద్ద నదినిదాటి నరేంద్రమృగరాజు సపరివారంగా వెలనాటి


వెల్లటూరు జేరాడు. మహారాజుకు అక్కడి గ్రామిణులందరూ పూర్ణకుంభాలతో ఎదురొచ్చి
స్వాగతం పలికారు. అక్కడినుండి అందరూ కాలినడకన ముందుకు సాగారు.
శివనామస్మరణంతో పరిజనం నడుస్తున్నారు. పెద్దపెట్టున భజనలు పాడుతున్నరు. కొందరు
రుంజల చరుపులకు అనుగుణంగా వీరంగం వేస్తున్నారు. కొంతసేపటికి వారొక ప్రదేశానికి
చేరారు. ఇంతకు ముందది ఊరుకాదు. ఇప్పుడది పెద్దపులిపఱ్ఱు అని పిలవ బడుతోంది.
అక్కడ శివాలయ నిర్మాణం దగ్గరదగ్గరగా పూర్తికావస్తోంది. ఐనా ప్రభువులింకా ప్రతిష్టా
కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించలేదు. కారణం తెలియదు.

దేవాలయం నిర్మిస్తున్న పెద్దపులిపఱ్ఱుకు ఒక కథవుంది.

ఒకప్పుడు పెద్దపులి ఒకటి దోవతప్పి వెల్లటూరుపై పడింది. గ్రామ ప్రజలందరూ భయ


పడి పోయారు. పులిని ఊరినుంచీ తరమాలని బయలుదేరారు. డప్పులతోను వాద్యాల తోను
గొప్ప రవం చేస్తూ పులిని తరమడం ఆరంభించారు. ఆ పులి వారిని నానా తిప్పలూ పెట్టింది.
ఒకసారి కనిపిస్తుందీ అంతలోనే ఏ పొదలో దూరిందో అర్ధం కాదు. కృష్ణాతీరం కావడంతో
రేగడి బురద అడ్డం పడితే గడ్డంలోతు దిగుతోంది.ఆ రోజుకు చీకటి పడడంతో అందరూ
ఇళ్ళకు వెళ్ళిపోయారు.

మర్నాడు గోవులు కాసుకునేవారికి మళ్ళీ పులి కనిపించింది. గ్రామస్తులందరూ పెద్ద


కోలాహలంగా బరిశలు పుచ్చుకుని పులిని తరమడానికి బయలుదేరారు. వాళ్ళు వెతికే
టప్పటికీ పులి తన హస్తంతో ములువెలగ చెట్టు క్రింద ఒక గోయితవ్వుతూ కనిపించింది.
గ్రామస్తులను చూసి పులి పారిపోయింది. చెప్పాలంటే అదృశ్యమయింది.

పులి ఏమితవ్విందా అని అందరూ అక్కడకు వెళ్ళి చూశారు. అక్కడ చెట్టుక్రింద ఒక


పుట్ట కనిపించింది. ఆ వల్మీకం సగం భగ్నమైవుంది. వెళ్ళిచూస్తే ఆ పుట్టలో ఒకముని
తపస్సుచేసుకుంటూ కనిపించాడు. అందరూ సాగిలపడి ఆయనకు నమస్కరించారు.
కొన్నాల్టికి ఆయన సమాధి చాలించి వల్మీకం నుండి బయటకువచ్చాడు.

ఆయన పేరేమిటో ఆయనకే తెలీదు. ఆ మహాముని ఎంతకాలం నుండీ అక్కడ తపస్సు

383
  చాళుక్యసింహాసనం

చేసుకుంటున్నాడో చుట్టూపుట్టకట్టిపోయింది. పండితులందరూ జేరి ఆయనకు వ్యాఘ్రపాద


మహర్షి అనిపేరుపెట్టారు. పులి పాదం వలన ఆయన ఉనికి బయట పడడం వలన వ్యాఘ్ర
పాద మహర్షి అన్నారు. ఆ పులి కూడా మళ్ళీ కనిపించకుండా అదృశ్యమవడం ఆశ్ఛర్యం.

చుట్టుప్రక్కల గ్రామస్తులందరూ జేరి ఋషికొక ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఆ


ప్రాంతాన్ని పెద్దపులిపఱ్ఱు అనడం ఆరంభించారు. అదొక నూతన గ్రామం అయింది.

పెదపులిపఱ్ఱు వృత్తాంతం మహారాజ నరేంద్రమృగరాజు వరకూ వెళ్ళింది. మహారాజు


సముచిత పరివారంతో కదిలి వెళ్ళాడు. కొన్నాళ్ళు వెల్లటూరులో విడిది చేశాడు. ప్రతి నిత్యం
మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనకు సేవచేయడం ఆరంభించాడు. కొన్నాల్టికి వ్యాఘ్రపాద
మహర్షి కరుణించాడు. మహారాజును ‘రాజా యుష్మత్ క్షత్రమజరం తే అస్తు’అని దీవించాడు.
మహేంద్రుడే నిన్ను సాటి రాజులలోకెల్లా తేజోవంతుని చేయుగాక!’ అని ఆశీర్వదించాడు.
వ్యాఘ్రపాదమహర్షి ఆశీర్వాద బలం వలననేమో మాన్యకేతంపై వేంగి విజయం సాధించింది.
దేశంలో శాంతి నెలకొంది.

వ్యాఘ్రపాదమహర్షి నరేంద్రమృగరాజును పెదపులిపఱ్ఱులో శివాలయం నిర్మించమని


ఆదేశించాడు. “రాజా. యుద్ధంలో హింస తప్పదు. రాజనీతిలో కుతంత్రాలు తప్పవు.అందు
వలనే రాజ్యాంతే నరకం ధృవం అంటారు పెద్దలు.అందుచేత ఇక్కడ ఒక శివాలయం
నిర్మించు. హరుడు సర్వపాపహరుడు”అన్నాడు.ఋషి మాట ప్రకారమే మహారాజు
శివాలయం నిర్మించ తలపెట్టాడు. అది నూట ఎనిమిదవ శివాలయం. రాష్ట్రకూటులతో
కడపటి యుద్ధం కూడ నూట ఎనిమిదవది.

శివాలయానికి కావలసిన లింగాన్ని నర్మదానదీ తీరం నుండి తెప్పించారు. పార్వతీదేవి


విగ్రహానికి తగిన రాయిని వెతకడానికి శిల్పులు కొండవీడు వెళ్ళారు. అక్కడ దక్షిణ శిరస్సుగా
నిద్రిస్తున్న శిల కనిపించింది. ఆశిల చూడడానికి అందంగా పరిచిన అరిటాకులా వుంది.
ఇంద్రధనుస్సువంటి రంగులు కలిగి సుత్తెతో మ్రోగించి చూస్తే సంగీత నాదమువంటి
మధురమైన ధ్వని కలిగివుంది. ఆశిల మరీ పెద్దదిగాలేదు. అమ్మవారి విగ్రహాన్ని చెక్కడా నికి
శ్రేష్టంగా తోచింది.

ప్రధానశిల్పి మల్లన్న శిల్పాన్నిచెక్కే దీక్షతీసుకున్నాడు.పనిపూర్తయ్యేంతవరకు భూ


శయనం బ్రహ్మచర్యం ఒంటిపూట భోజనం. అదీ అమ్మవారికి నివేదించిన హవిరన్నమునే
భుజించాలి. శిలను గంధపుష్పాక్షతలతో పూజించారు. ఆలయము క్షత్రియనిర్మాణము
కనుక జేష్ఠానక్షత్రం నడుస్తుండగా శుభసమయంలో శిలను సేకరించారు.

అలాగే నందిని చెక్కడానికి నపుంసకశిలను ఎంచుకున్నారు. ఆరుముఖములు కలిగిన


కుమారస్వామి విగ్రహం చెక్కడానికి చాలా పెళుసుగావుండి కప్పఅరుపువంటి ధ్వని కలిగిన
వృద్ధశిలను ఎంచుకున్నారు. ఈ వృద్ధశిలకు అతి సూక్ష్మమైన రంధ్రములుండడం వలన క్రింది

384
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

నీటివూటను అందుకుని ఎప్పుడూ స్వేదమూర్తిగా వుంటుంది. మహర్షి తపస్సు చేసుకున్న


పుట్టలోంచి ఎల్లకాలం నీటి ఊట వస్తుంది. ఈ స్కంధుడి విగ్రహం పుట్ట వున్నచోట ప్రతిష్ఠిస్తే ఆ
మూర్తి నిరంతరం స్వేదాన్ని స్రవిస్తూ భక్తులకు ఒక మహిమగా కనిపిస్తుంది.

శివాలయనిర్మాణం పూర్తయింది. కానీ బాదామీచాళుక్యులంత వైభవంగా కాదు.


బాదామి చాళుక్యులు పర్వతాలకు పర్వతాలే చెక్కిపోశారు. అధ్భుత శిల్పకళను పోషించారు.
పెద పులి పఱ్ఱు కృష్ణాతీరం రేగడినేల. గొప్పగొప్ప గాలిగోపురాలను మోయలేదు. గుడి ఎంత
పెద్దదనేది కాదు. ఎంత మహిమాన్వితం అనేది ముఖ్యం. మానవ ప్రతిష్టితాలకన్నా ఋషి
ప్రతిష్టించిన దేవతామూర్తులు వందల సంవత్సరాలు గడిచినా గొప్ప క్షేత్రాలుగా విలసిల్లు
తాయి.

మాన్యకేత నగరంలో అమోఘవర్ష చక్రవర్తి పట్టాభిషేకం జరిగిందికానీ పరిపాలన


ఇంకా ఇంద్రవల్లభుడే చూస్తున్నాడు. శిరీష వివాహానికి వచ్చినవారంతా వెళ్ళిపోయారు. పెళ్ళి
కూతురును ఇంక కాపురానికి పంపలేదు. ఇంద్రవల్లభుడు తొందరపడలేదు. మనసులో
ఇంకా వేంగిపై పగ రగులుతునేవుంది. తను కూతురును తీసుకుని వేంగీనగరానికి వెళ్ళితే
తనను కోటగుమ్మంపైన రాటకు కట్టివేసిన విశాఖదత్తుడి ముఖం చూడవలసి వస్తుంది. అది
తన కిష్టం లేదు.

విశాఖదత్తుడు గొప్ప యోధుడేకాదు. గొప్ప వ్యూధకర్త. చివరికి రణపతి అనే బిరుదును


కూడ పొందాడు.అతడిని బంధించడంకాని చంపించడంకాని సాధ్యపడలేదు. తనకు జరిగిన
అవమానం ఇంకా మనసులో ముల్లులా గుచ్చుకునే వుంది. ఒక సామ్రాజ్యాన్ని నడిపే వారికి
గొప్ప పౌరుషం క్రోధం రాజసం క్రౌర్యం కూడ అవసరమే. లేకపోతే తనప్రజలే తనను
చులకనగా చూస్తారు.

ఇంద్రవల్లభుడు అలా ఆలోచిస్తున్న సమయంలో ప్రతీహారి ప్రవేశించి జయజయ


ధ్వానాలు చేసింది. మహారాజు అనుమతితో కుటిలుడిని మందిరంలోకి ప్రవేశపెట్టింది
ప్రతీహారి.

వీరోత్సవాలనాటి కుటిలుడి రూపురేఖలు ఇప్పుడు మారిపోయాయి. చెరసాలలో కొన్ని


సంవత్సరాలు బందీగా మగ్గాడేమో క్షవరం చేయించుకోలేదు. మీసము గడ్డము బాగా పెరి
గాయి. వెంట్రుకలు కూడా అరకొరగా నెరిశాయి. కళ్ళు లోతుకుపోయాయి. వీరవిద్యా
ప్రదర్శనలలో విష్మువర్ధనుని మట్టుపెట్టలేకపోయాడనే కోపంతో చెరసాలలో పడవేయిం
చాడు ఇంద్రవల్లభుడు.

“నిన్ను చెర నుండీ విడుదల చేస్తే ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్యను నీవు మట్టుపెట్ట


కలవా?” అన్నాడు ఇంద్రవల్లబుడు.

385
  చాళుక్యసింహాసనం

“దేవరవారి సేవకులకు స్వాతంత్రం ఉంటుందా?” అన్నాడు కుటిలుడు సమాధానంగా.

ఇంద్రవల్లభుడు ఒకక్షణం ఆలోచించాడు. కుటిలుడి మాటలో ఏమూలనో వ్యంగ్యం


ధ్వనిం చింది. ఇప్పుడు కుటిలుడు నమ్మదగినవాడేనా అనిపించింది. ఐనా విడుదల
చేయించాడు. అతడి వెనుక ఇంకొందరు కింకరుల్ని నియమించాడు.

మాన్యకేతనగరంలో సైనిక న్యాయస్ధానం ఏర్పాటయింది. మాన్యకేతం ముట్టడినాడు


తప్పతాగి కర్తవ్యం విస్మరించిన సేనానులందరినీ శిక్షించడానికి ఇంద్రవల్లభుడు నిర్ణయిం
చాడు. ఆ బాధ్యత పాటలమల్లుడికి అప్పగించాడు మహారాజు.

పాటలమల్లుడు దోషులందరి చిట్టా తయారుచేయించాడు. వారందరికీ ఆడవేషం


వేశారు. చీరలు కట్టారు. కాళ్ళకు పసుపు రాశారు. చేతులకు గాజులు తొడిగారు. గాడిదలపై
ఊరంతా ఊరేగించారు. పౌరులు వాళ్ళపై రాళ్ళు విసిరారు. ఆడవాళ్ళు పాత చీపురుకట్ట లకు
పని కలిపించారు. ఊరేగింపు మరుభూమికి చేరింది. వధ్యశిలపై ఒకరొకరూ తల వంచారు.
కళ్ళకు గంతలు కట్టుకున్న తలవరులు చేతులు నొప్పులు పెట్టేడట్లు మెడలు నరికారు. ఒక్కొక్క
తల మేకతలకాయలా తెగి అవతల పడుతోంది. మొండాన్ని తలని మూటకట్టి బంధువుల
కప్పగిస్తున్నారు సేవకులు. ఏడుపులతో ఆహాకారాలతో మరు భూమి దద్దరిల్లుతోంది.
యుద్ధంలో యోధుడంటే అవతలివారిని చంపనైనా చంపాలి వారి చేతులో చావనైనా చావాలి.
పారిపోయి వస్తే జరిగే అవమానం చావుకన్నా మిన్న.

ఇంద్రవల్లభుడు ఇంకా ఎవరెవరిని శిక్షించాలా అని చింతిస్తున్న సమయంలో పాటల


మల్లుడు రాజదర్శనం కోరి వచ్చాడు. పాటలమల్లుడు సంజము సైనిక స్కంధావారానికి
సైన్యాధిపతి. మాన్యకేతాన్ని ముట్టడించారని తెలియగానే గొప్ప సైన్యంతో నగరానికి వచ్చిన
వాడు.

“ప్రభువులకు అభివందనం!” అన్నాడు మల్లుడు శిరసు వంచి నమస్కరిస్తూ.

క్రోధంతో ఉన్న ఇంద్రవల్లభుడు ఆ నమస్కారాన్ని అందుకోలేదు. “పాటలమల్లా!


మాకున్న సేనానులలో నీవు ముఖ్యుడివి. మా పగ అవమానము ఇంకా చల్లారలేదు. అందుకు
నీవేమైనా సహాయపడగలవా?”అన్నాడు.

“ప్రభూ! ఈ దేహము మీది. నిప్పులలోకి ఉరకమంటే ఉరుకుతాను.” అన్నాడు పాటల


మల్లుడు వినమ్రంగా.

“మమ్ము చాళుక్యులు కోట గుమ్మంపైన రాటకు కట్టివేశారు. ఆ ముట్టడికి ముఖ్యంగా


ముగ్గురు కారకులు. మొదటివాడు విశాఖదత్తుడు. రెండు విష్ణువర్ధనుడు. మూడవవాడు
ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్య!”

386
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

“ప్రభూ! మీమాటకు అడ్డం వస్తున్నందుకు క్షమించండి. యుద్ధాలు దండయాత్రలు


రాజులకు సహజం. ఆ క్రోధం ఇంకా మిగుల్చుకుంటే ఎలాగూ? మనసులో శాంతి ఉండదు.
అందులోను యువరాజ విష్ణువర్ధనుడు ఇప్పుడు మీకు అల్లుడైనాడు.”పాటలమల్లుడు ప్రభువు
ఆవేదనని తగ్గించాలని అలా అన్నాడు.

“మా చేతగానితనం వలన రాజకీయ నిస్సహాయత వలన అల్లుడిని చేసుకోవలసి


వచ్చింది!”ఇంద్రవల్లభుడు పాములా బుసకొడుతూ పలికాడు.

“కారణం ఏదైనా సంధిచేసుకున్నతరువాత బంధుత్వం కలుపుకున్న తరువాతా ఇంకా


విరోధం అవసరమా ప్రభూ?”

“ఆ విశాఖదత్తుడు నన్ను పెడరెక్కలువిరిచికట్టి రాటకు బంధించాడు. పురజనులందరూ


చూశారు. ఆ అవమానంతో నాలోని మానవత్వం మమత మమకారాలు బంధుత్వాలు
చచ్చిపోయాయి”అన్నాడు ఇంద్రవల్లభుడు.

“ప్రభూ!విశాఖదత్తుడంటారా, అతడు చాలా గొప్ప సేనాని. రణపతి అని బిరుదు


పొందాడు. ఇప్పుడు మన నగరంలో గోమఠేశ్వరయ్య ఒక్కడే మిగిలాడు. ఐనా ఆయనకు
విశాఖదత్తుడు గొప్ప పరివారాన్ని కాపలా పెట్టి వెళ్ళాడు.”

“పాటలమల్లా! నీవు సమర్ధుడవైతే ఏదైనా చేసి చూపించు. మాటలు వద్దు” అనేసి


అభ్యం తరంలోకి వెళుతూ ఇంద్రవల్లభుడు “గోమఠేశ్వరయ్య వద్ద పనిచేస్తున్న గొల్లనయ్య
మన గూఢచారి. కానీ ఇప్పటివరకూ ఎందుకూ పనికిరాలేదు. ఇప్పుడైనా ఉపయోగపడతా
డేమో చూడు” అన్నాడు.

పాటలమల్లుడు శలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

మాన్యకేతనగరం నిద్రలో జోగుతోంది. వీధి కావలివారు నగరం చుట్టు తిరిగి వచ్చి ఒక


చోట కూడి చలిమంట వేసుకుంటున్నారు. అంతకు ఒకరోజు ముందరే నగరంలో వీధి కుక్క
లన్నిటినీ పట్టుకుపోయారు. అభిసారికలు ప్రియుల కౌగిలికై భర్తను నిద్రపుచ్చి కుంటెన కత్తెల
సాయంతో రహస్యంగా వీధులు దాటుతున్నారు.

కొందరగంతకులు ముసుగులు ధరించి గోమఠేశ్వరయ్య ఇంటికి చేరుకున్నారు.


సంకేతం ప్రకారం గొల్లనయ్య పెరటివైపు దొడ్డిగుమ్మం తెరిచాడు. ముసుగువీరులు
గోమఠేశ్వరయ్య ప్రసాదంలోకి ప్రవేశించారు. పెంపుడు కుక్కలను గొల్లనయ్య వేరేవైపుకు
తీసుకుపోయి కట్టి వేశాడు. ఇంటిగుట్టు తెలియడం వలన ముందే కొందరు ఇంటిలోపలకు
ప్రవేశించారు. కొందరు కునికి పాట్లు పడుతున్న కాపలావారిని మట్టుపెట్టారు.

లోపలకు వెళ్ళినవారు నేర్పుగా అడ్డుగడియలను తొలగించుకుంటూ గోమఠేశ్వరయ్య


387
  చాళుక్యసింహాసనం

శయనమందిరంలోకి ప్రవేశించారు. గోమఠేశ్వరయ్య దంపతులిద్దరూ మంచానికి చెరోవైపు


తిరిగి నిండా ముసుకు పెట్టుకుని పడుకుని నిద్రిస్తున్నారు. ఎవరు శ్రేష్ఠో తెలియరాలేదు.
అగంతకులు ఒక్క క్షణం కూడా వృధాచేయకుండఏకకాలంలో ఇద్దరిపైనా చురకత్తులు
దిగవేశారు. ఎఱ్ఱటి ద్రవం చిమ్మికొట్టింది. పొడిచే సమయానికి గొంతు పెగలకుండా తలగడ
లతో ముఖాలు నొక్కిపట్టారు ఇద్దరు. చడీ చప్పుడూ లేకుండా ఇద్దరూ హత మయ్యారని
నిశ్ఛయించుకున్నారు.

ఐనా తృప్తి కలగలేదు. హత్య చేసినట్లు పాటలమల్లునికి చూపించడానికి ఏదైనా


ఆనవాలు కావాలి. ముఖంపైన ముసుగుతీశారు. అవి మైనపు బొమ్మలు. మతి పోయింది.
కంగారు పుట్టింది. మర్మం ఏమిటో అర్ధంకాలేదు.

అప్పటికే ప్రాసాదంలోని దాసదాసీలతో సహా అందరూ మరణించడంతో ధైర్యం


వచ్చింది. శయనాగారంలో ఏదైనా రహస్యమార్గం ఉండివుంటుందని భావించారు. శోధిస్తే
బయట పడింది. రహస్యమార్గం చాలా శుభ్రంగా వుంది. రోజూ వాడుతున్నరేమో
ననిపించింది. లోనికి ప్రవేశించారు హంతకులు.

ఆ మార్గం ఇంకొ భవంతి లోకి దారితీసింది. అది పూర్వపు వణిజామాత్యుడి నివాసం.


ఆయన దాన్ని ఒక పరదేశీకి విక్రయించాడు. ఆ భవనం వనవాసి పాలకుడు శివమారుడి
అనుచరులు కొన్నారు. శివమారుడు చెరనుండీ విడుదలై వేంగీ దేశం ప్రవాసం వెళ్ళి
పోవడంతో ఆ భవనం ఆంధ్రశ్రేష్ఠి అధీనంలోకి వచ్చింది.శ్రేష్ఠి రాత్రిపూట ఆ భవనంలో
నిద్రిస్తున్నాడు. ఆ విషయం బయటి ప్రపంచానికి తెలీదు.ఆంధ్రశ్రేష్ఠికి కాపుకాయడానికి
విశాఖదత్తుడు శివమారుడి అనుచరులతో వప్పందం చేసుకున్నాడు. వారు నిరంతరం
జాగరూకులై ఉండడం వలన అగంతకులతో తలపడి నలుగురినీ బంధించగలిగారు.

ఆంధ్రశ్రేష్టి మర్నాడు హంతకులను న్యాయాధికారి కప్పగించాడు. వారిపై హత్యానేరం


మోపబడింది. గోమఠేశ్వరయ్య పలుకుబడి కల మనిషి కావడంతో విచారణ త్వరితగతిని
సాగింది. తీగలాగుతేడొంకంతా కదిలినట్లు చివరకు అది మహారాజు ఇంద్రవల్లభుడే
చేయించి నట్లు ఋజువైంది.ఆచ్ఛర్యంగా కుటిలుడు ప్రభువుకు వ్యతిరేకంగా సాక్ష్యం
చెప్పాడు.

కానీ మహారాజుపై ఎలాంటి నేరారోపణలు చేయడానికి ధర్మశాస్త్రాలు ఒప్పుకోవు.


రాజు నిరంకుశుడు. శిక్షాస్మృతికి అతీతుడు. అందుచేత న్యాయస్ధానం విచారణను అంతటితో
ముగించింది. హంతకులకు స్వల్పంగా కారాగార శిక్షవేసి వదిలివేసింది. కుటిలుడు మాత్రం
హంతకులకు తగిన శిక్ష అమలుచేశాడు. వాళ్ళను చెరసాలకు తీసుకు వెళుతున్న తరుణంలో
నాలుగు నిశితమైన బాణాలు సంధించాడు. ఒక్క బాణం కూడా గురితప్పలేదు. రాజభటుల
సమక్షంలోనే హంతకులు హతమారారు. తనను బంధించే లోపునే చురికతో పీక కోసుకుని
మరణించాడు కుటిలుడు.

388
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

ఆంధ్రశ్రేష్టి గోమఠేశ్వరయ్య తనకింక మాన్యకేతనగరంలో భద్రత లేదని


తెలుసుకున్నాడు. సముచిత పరివారం తీసుకుని తూర్పు చాళుక్యదేశానికి వలస
వెళ్ళిపోయాడు. సప్త గోదావరీ తీరం పెనుగొండలో తన వర్తకశ్రేణి ఆరంభించాడు. ఆయన
ఎక్కడనుంచైనా చక్రం తిప్పగలడు.

66 ప్రతిష్ట
తూర్పుచాళుక్యదేశం ప్రజలంతా మాన్యకేత విజయంతో ఆనందోత్సవాలలో మునిగి
తేలుతున్నారు.

పెద్దపులిపఱ్ఱులో దేవతాప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడింది. పదకొండురోజుల


యాగం. ప్రతిష్టా మహోత్సవానికి జనం తండోపతండాలుగా బండ్లు కట్టుకుని వస్తున్నారు.
ఎండా కాలం కావడంతో ఎక్కడికక్కడ పచ్చితాటాకులతో చలువ పందిళ్ళు వేయించారు.
ఏరోజుకా రోజు తామర మొగ్గలతోనూ కలువపూలతోను చూతపత్ర గుచ్ఛాలతోను తోరణాలు
కడు తున్నారు. పుష్పవతులైన రంభావృక్షాలను పందిరి గుంజలకు నిలకడుతున్నారు. పోక
గెలలు ముత్యాల చేరుల్లా వ్రేలాడుతున్నాయి. బాటలవెంబడి అన్నసత్రాలలో సంతర్పణ
సాగుతోంది.

ప్రతిష్ఠ జరిపించడానికి శృంగేరి శంకరపీఠం నుంచి నలుగురు ఆచార్యులు వచ్చారు.


పరమ నిష్టాగరిష్టులైన వారిరాకతో ఆదిశంకరుడి ప్రధాన శిష్యులైన సురేశ్వరాచార్యుడు
పద్మపాదాచార్యుడు హస్తామలకుడు తోటకాచార్యుడు వచ్చినట్లే వుంది.

మహారాజ నరేంద్రమృగరాజు మాత్రం చాలా ఆవేదన చెందుతున్నాడు. ఆయనకు


మావసిక విశ్రాంతి లేదు. మాన్యకేత నగరంనుంచీ కొత్తకోడలు శిరీష కాపురానికి రాలేదు.
మాన్యకేత పతనం ఇంద్రవల్లభునికి తీవ్ర పరాభవంగా తోచింది. నిజంగా ఆయనకు శిరీషను
విష్ణువర్ధనునికిచ్చి వివాహం చేయడం ఇష్టంలేదు.ఇప్పుడు కూతురును అత్తవారింటికి
పంపకపోవడంలో ఎత్తుగడ ఏమైనా ఉందేమో అర్ధం కాలేదు. అతడు తానే స్వయంగా
యారణాలతో అరణంతో కూతురును కాపురానికి తీసుకువస్తానని చెప్పాడు. ఆ మహారాజు
మాట తప్పాడా అనిపిస్తోంది.

విశాఖదత్త రణపతి నవవధువు అరణిని మాళవదేశం తీసుకువెళ్ళాడు.అక్కడ భగళా


ముఖీ దేవికి మొక్కువుంది. కొలుపు చేయించి భూతబలి చెల్లించుకోవాలని వెళ్ళాడు.

యాగం సందర్భంగా చాళుక్య నరేంద్రమృగరాజు వెల్లటూరులో సర్వమత సమ్మేళనం


ఏర్పాటు చేయించాడు. అందులో పాల్గొనడానికి మతాధికారులు పీఠాధిపతులు వారివారి
పరివారంతో తరలివచ్చారు. కొందరు మఠాధిపతులకు ఏనుగులు గుఱ్ఱాలు ఉన్నాయి.
వీరభటులున్నారు. గొప్పగొప్ప పల్లకీలు ఆంధోళికలు ఉన్నాయి.వారందరికీ వారి సంప్ర
389
  చాళుక్యసింహాసనం

దాయానుసారం విడిది ఏర్పాట్లు చేశారు.

భారతావనిలోఅన్ని మతాలున్నాయని అంతమంది వస్తారనీ మహామంత్రి


శివకేశవయ్య ఊహించలేదు. వెలనాటిసీమంతా నేలయీనినట్లుంది.ఏమతానికా
మతంవారు పులులూ సింహాలే! వీరంతా ఢీకొనడంలో గొఱ్ఱెపొటేళ్ళకేమీ తీసిపోరు!ఈ
మహానుభావులందరికీ ఆగ్రహాలు రాకుండా ఎలా నిభాయించుకు రావాలా అని మహామంత్రి
చింతించసాగాడు.

చాళుక్య నరేంద్రమృగరాజు పట్టమహిషి శ్రద్ధాదేవి కోడలు శిరీషను చూడాలని


కోరికతో ఉంది. క్షత్రియులలో పెళ్ళికి ఆడవారిని తీసుకువెళ్ళే సాంప్రదాయం లేదు. అందుచేత
రాణు లెవరూ మాన్యకేతం పెళ్ళికి వెళ్ళలేదు.

ఏమీపాలుపోక నరేంద్రమృగరాజు ఒకదినం వ్యాఘ్రపాదమహర్షి ఆశ్రమానికి వెళ్ళి


కూర్చు న్నాడు. మహర్షి అనుష్ఠానం ముగించుకోగానే మహారాజుకు దర్శనమిచ్చాడు.

“మహర్షీ ధర్మపత్ని అంటే ఎవరూ?” ప్రశ్నించాడు మహారాజు.

ఒకక్షణం నివ్వెరపోయాడు మహర్షి. పూజలలో ధర్మపత్నీసమేత అని చెప్పేస్తుంటారు


పురోహితులు. ధర్మపత్నికాక ఉంపుడుకత్తెలు ఉండే అవకాశం ఉంటుందని అలా చెబుతారు.
కానీ అందరు మగవాళ్ళకూ అంత అదృష్టం ఉండదు. మంత్రం అలా అనాలో చితంగా
నడిచిపోతుంటుంది.మహారాజు ఏ విషయం అడుగుతున్నదీ అర్ధంకాలేదు
మహర్షికి.“రాజా!మీ ముఖం చూస్తే చాలా ఆంధోళన కనిపిస్తోంది. మీకీ అనుమానం
ఎందుకు వచ్చిందీ?” అన్నాడు ఋషి.

“మహర్షీ. మా ధర్మపత్నిని గురించికాదు. మాకోడలు యువరాణి శిరీషాకుమారిని


వాళ్ళు కాపురానికి పంపించలేదు. ఈ ప్రతిష్టామహోత్సవాలలో మాకుమారుడి రెండవ భార్య
మృదువదన పీటలమీద కూర్చునవచ్చా అని?”సందేహం బహిర్గతం చేశాడు మహారాజు.

“ఆమె ధర్మంగా వివాహమాడినది కాదా?” ఎదురు ప్రశ్నించాడు ఋషి.

“ధర్మంగా వివాహమాడినదే!మాకుమారుడు శాస్త్రోక్తంగా విజయవాటికలో స్కంధుడి


ఆలయంలో వివాహమాడాడు.” బదులిచ్చాడు మహారాజు.

“మరింకేమీ! పెద్దభార్యకు ఆటంకం వచ్చినపుడు రెండవ భార్య ఆ స్ధానంలో కూర్చుండ


వచ్చు.” ఋషి తన నిర్ణయం చెప్పాడు.

“యువరాణి లేకుండా యాగమేమిటా అనిపిస్తోంది. రాజుల వివాహాలన్నీ రాజకీయా


లతో ముడిపడి వుంటాయిగా మహర్షీ! అక్కడ మా వియ్యంకుడు ఏమాలోచిస్తున్నాడో!”
390
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

అన్నాడు మహారాజు

“మహారాజా మీ వేదన నాకర్ధమయింది. అయినా అంజనం వేయిద్దామా?”

“అంజనమా?”

“ఔను. ఇక్కడకెందరో మాంత్రికులు తాంత్రికులు వచ్చారు. అందులో కాలవేదులు


న్నారు. ఎవరైనా అంజనం వేస్తే యువరాణి వస్తున్నదీ లేనిదీ తెలుస్తుంది.”అన్నాడు మహర్షి.

ఆమాట విన్న మహారాజు ఆ విషయం మహామంత్రి శివకేశవయ్యకు చెప్పాడు.

కాలడి గ్రామంలో ఉద్భవించిన ఆదిశంకరుడు భారతావనిలోవున్న మతాలన్నిటినీ


సమన్వయం చేసి ఒకటేమతం చేయాలని చాలా ప్రయత్నించాడు. ఆసేతు హిమాచలం
అద్వైతమత ప్రచారం చేశాడు. ఎంతోమంది ఆ కాలడి బ్రాహ్మడితో వాదనలో ఓడిపోయి
అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించి స్వీకరించారు. దాదాపు డెబ్భయి విభిన్న మతాలను ఆయన
అద్వైతంలో విలీనం చేశాడని చెబుతారు. కానీ పూర్వపు మతాలలోని మిగిలి పోయిన
రాలుగింజలు అనుకూల వాతావరణం రాగానే మొలకరించాయి. పూర్వపు మతాలన్నీ
అంతో యింతో విస్తరించాయి.

ఎవరిమతం ఎవరికులం ఎవరు ఒదులుకుంటారూ?

శ్రీకృష్ణ నిర్యాణానంతరం భరతావని నిర్వీర్యమైపోయింది. కవ్వడి గాండీవం కూడా


పని చేయకుండా పోయింది. ఒకనాటి ఆగ్నేయాస్త్రం మొదలు బ్రహ్మాస్త్రం వరకూ అన్నీ అంత
ర్ధాన మయ్యాయి. ఉత్తర భారతంలో కొంతభాగం కిరాతుల వశమయింది. కలిప్రవేశించాడని
తెలుసుకున్న పాండవులు ఇక ఉండకూడదని స్వర్గారోహణం చేశారు. భరతవర్షంలో సమ
ర్ధుడైన పరిపాలకుడే లేకుండా పోయాడు.

కృష్ణపరమాత్మ చేసిన గీతోపదేశం ఎవరికీ వంటబట్టలేదు. అర్జునుడు భారతయుద్ధం


ఆరంభంలో ఎందుకు గాండీవం క్రింద పడేసి సమరం అనర్ధదాయకం అన్నాడో అదే
నిజమయింది. సరైన నాయకుడు లేడు. మతపరంగా కూడా జనం కకావికలైపోయారు.
ఎవరికి వారే ఒక మతం స్ధాపించారు. చాలామంది ఆర్షమతాన్నీ బ్రాహ్మణ సాంప్రదాయాన్నీ
ధిక్కరించారు. శోత్రీయులు కూడ తక్కువేమీ కాదు. సోమయాజిననిపించుకోవడం కోసం
నిష్ఠలేకుండానే పశుబలితో యజ్ఞ యాగాలు విరివిగా చేయసాగారు. ఇది మరొకరకం హింస
అయింది. ఇది నచ్చనివారు జీవహింసని గర్హించే మతాలు ఆవిష్కరించారు. ఇన్ని మతాలూ
వారి అనుయాయులూవారిమధ్య విభేదాలు ఉండడం వలన ఇన్ని కులాలు ఏర్పడ్డాయి. ఈ
విషయం ఎవరూ గమనించరు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనే చాతుర్ వర్ణవ్యవస్ధ
ద్వాపరయుగంతోనే పోయింది. కులనిర్ణయంలో గుణకర్మవిభాగశా అనే మాటకు విలువ

391
  చాళుక్యసింహాసనం

లేకుండా పోయింది. అందువలన కులవ్యవస్ధ బ్రాహ్మలు పెట్టారు శ్రీకృష్ణుడు పెట్టాడు అని


తిట్టడం మాత్రం మిగిలింది.

నాకులం పుట్టుపూర్వోత్తరాలేమిటి ఎవరు పెట్టారూ చాతుర్వర్ణాలలో లేదుగదా అని


ఆలోచించగల విజ్ఞులే కరువయ్యారు.

వెల్లటూరులో బోధారో మత్సరగ్రస్తః అని మతగురువుల మధ్య వాదోపవాదాలు చెల


రేగాయి. పరిస్ధితి సృతిమించి రాగాన పడింది. అందరినీ శమింపజేయడమే కాకుండా
మహామంత్రికి ఆ సభకుఎవరు అద్యక్షత వహించాలనేది మరొక సమస్య అయింది.
మహారాజుతో సంప్రదిస్తే వ్యాఘ్రపాదమహర్షి కన్నాతగినవారెవరున్నారూ అన్నాడు.

సర్వమత సమ్మేళన సభలు ఆరంభమయ్యాయి.

సమ్మేళనానికి భౌద్ధమతం పక్షాన ఈలపురంనుంచి శాక్యానంద శ్రమణకులు నచ్చారు.


ఆయనతోపాటు విరిజ కూడవచ్చింది. తాను ఇప్పుడు భౌద్ధమత ప్రవచనకర్త. శ్రమణకదీక్ష
తీసుకుంది. కాని వచ్చినదగ్గరినుంచి కన్నులు శిరీషకోసమే వెతుకుతున్నాయి. ఒకప్పటి
రాజకుమారి ఇప్పుడు చాళుక్యయువరాణి. తనతోటి చెలికత్తెలందరూ ఎక్కడున్నారో. ఎన్ని
దీక్షలు తీసుకున్నా బాల్యము పూర్వాశ్రమము మరపురాదు.

ఆ సభకు స్త్రీశక్తిని ఆరాధించే శాక్తేయులు వచ్చారు. వీరిలో లక్ష్మీదేవిని మాత్రమే ఆరా


ధించే వారు, భగవతి భవానీని ఆరాధించేవారు, వేదమాత సరస్వతే లోకానికి మూలమని
నమ్మే సారస్వతులు వచ్చారు.

స్త్రీ శక్తిని ఆరాధించేవారిలో వామాచార పరాయణులు,శాక్తేయులు ఉన్నారు. వీరిలో స్త్రీ


శక్తిలేక పరమేశ్వరుడైనా గడ్డిపోచను కూడ కదల్చలేడని నమ్మకం ఉంది. త్రిగుణాతీతమైన
ఈ మార్గంలో పయనించేవారికి విధినిషేధాలేమీ లేవని వీరు నమ్ముతారు. ఇందుకు భృగు
మహర్షుల ప్రవృత్తే ప్రమాణం అంటారు. వీరి ఆరాధనకు మత్స్యం, మాంసం, మద్యం, ముద్ర,
మైధునం కావాలి. మైధునానికి రూపవతియైన స్త్రీ కావాలి.

పాషండులది ఒకమతం. వీరు వ్యక్తావ్యక్త స్వరూపుడగు రుద్రుని అర్చించిన వారికి


మోక్షం కరతలామలకమని శివుడు దుర్వాసునికి ఆనతిచ్చాడని శివసేవా పరాయణు లకు
పంచాదశ కర్మలతో పనిలేదని నమ్ముతారు. కానీ మనిషి చనిపోయిన తరువాత ఏదో రకమైన
సోడశ కర్మ చేయక తప్పదని గ్రహించరు.

లింగధారులు బ్రాహ్మణ్యం కన్నా వైష్ణవులు గొప్పని వానికన్నా శైవులు గొప్పని ఈమాట


బ్రహ్మదేవుడు నారదునితో చెప్పాడని నమ్ముతారు.

వైష్ణవ మతంలోభక్తులు, భాగవతులు,వైష్ణవులు, పాంచరాత్రులు, వైఖానసులు, కర్మ


392
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

హీనులు అని ఆరు రకాలవారు వచ్చారు.

వీరుకాక వహ్ని మతస్తులు అగ్నిని మాత్రమే ఆరాధిస్తారు.

బ్రహ్మ మతస్తులు త్రిమూర్తులలో చతురాననుడే అందరికన్నా అధికుడని అతడే


విష్ణువును రుద్రుని సృష్టించాడని నమ్మి ఆరాధిస్తారు

సౌర మతస్తులు సూర్యారాధనాపరులు

గాణాపత్యులలో ఆరు రకాల విధానాల వారున్నారు. మహాగణపతి, హరిద్రగణపతి,


ఉచ్ఛిష్ఠగణపతి, నవనీతగణపతి, సువర్ణగణపతి సంతానగణపతి అని ఆరురకాలు. ఉచ్ఛిష్ఠ
గణపతి ఆరాధకులు వారికి ఏ ఇష్టమొచ్చిన కర్మలు చేసినా దోషం లేదని భావిస్తారు. వారి
మతంలో స్త్రీపురుష జాతులేతప్ప ఇతర జాతి భేదములు లేవు. స్త్రీ పురుష సంయోగము వలన
ధోషము రాదు. ప్రతివనితా ఇష్టమైన మగాడితో భోగించవచ్చు. ఈమెకుఇతడే పతి అని
దేముడు నిర్ణయించలేదు అని నమ్ముతారు. స్త్రీపురుష సంయోగము వలన కలిగే ఆనందమే
ముక్తి అని వారి సిద్ధాంతము. ఆ ఆనంద స్వరూపమే గణపతి. బ్రహ్మాదులు కూడా అలా
పుట్టినవారే. పాపం పుణ్యం ఒకటే. సుఖపడాలంటే వారి మతం తీసుకోవాలని బోధిస్తారు.

భైరవులు ఒకచేతిలో కపాలం ఒక చేతులో పెద్ద శూలం పట్టుకు తిరుగుతారు. కుల


జాతి అహంకారాలని వీళ్ళు సహించరు. స్త్రీపురుష జాతులే సత్యం. దేని సంసర్గం వలన
ఎక్కువ ఆనందం కలుగుతుందో ఆ స్త్రీజాతి పురుషజాతికన్నా అధికం. ఈవిడతో కూడ వచ్చు
ఈవిడతో కూడరాదు అనే భేదం వీరి మతంలో లేదు. సంతోషంతో చేసే స్త్రీ పురుష సంయోగం
కంటే మోక్షం మరొకటుందా అంటారు.

చార్వాకులు అంతరిక్షంలో స్వర్గనరకాలున్నాయని నమ్మరు. సుఖాలు దుఃఖాలు ఈ


లోకంలోనే ఉన్నాయి. దేహాన్ని విడిచిపెట్టడమే జీవుడికి ముక్తి. చనిపోయినవారికి శ్రాద్ధాది
కర్మలు చేయడం ఆరిపోయిన దీపానికి చమురు పోయడం లాంటి దంటారు. లవణాంభుది
లో కలిసిన నది మళ్ళీ వెనక్కు వస్తుందా! అంటారు.

సౌగత మతం సంగతుడు చెప్పిన మతం. వీరు అహింసే పరమధర్మమని నమ్ముతారు.


బ్రాహ్మణులు ఆచరించే కర్మకాండ ఒక బూటకం అంటారు. పశుబలితో చేసే యజ్ఞయాగాది
కర్మలను నిరసిస్తారు. శరీరాన్ని ఉపవాసాలతో నియమనిష్ఠలతో బాధించకూడదు. శరీరాన్ని
పుష్టిగా సుందరంగా పెంచాలి. దేహాన్ని విసర్జించిన తరువాత ఏమీ లేదు. నిరంతరం బ్రహ్మాన్ని
ధ్యానిస్తు సర్వభూత దయ కలిగివుండడమే వీరిమతం.

పరమాత్మ కాలస్వరూపుడు. కాలమే పరమాత్మ అని నమ్మే మతస్తులు నిరంతరం


ఒకచేత్తో కొలయంత్రం తిప్పుతూ ఒక చేత్తో రాట్నం పట్టుకు తిరుగుతారు. గోచీమాత్రమే

393
  చాళుక్యసింహాసనం

ధరించే వీరు సూర్యుడిని కొలయంత్రంతో నియంత్రించి ముల్లోకాలకు శుభాశుభాలు చెప్ప


గల మంటారు.

జైనులు మలపిండ సదృశమైన ఈ దేహాన్ని స్నానం శుద్ధిచేయలేదనీ జినదేవుడి కరుణ


మాత్రమే శుద్ధిచేస్తుందనీ నమ్ముతారు.

బౌద్ధులు హృదయ ప్రేరకులై సుఖాత్మలై నేనే కర్తను నేనే పరమానంద స్వరూపుడను


అని తలుస్తూ నిత్యముక్తుడవుతాడని తలుస్తారు. జీవుడు ఎంతకాలం ఈ దేహక్రీడ ఆనం
దాన్నిస్తుందో అంతకాలం క్రీడిస్తూ తరువాత శరీరాన్ని విడిచి వెళతాడు. అదేముక్తని
నమ్ముతారు.

శూన్యమతం కూడా ఒక మతమే! సర్వభూతాలలో ఆకాశమే బ్రహ్మ. అన్నిటి ఉనికికి


అవకాశమిచ్చేదే ఆకాశం. అదేశూన్యం. శూన్యాన్ని ఆరాధించేవారిది శూన్యమతం.

అనుమల్లము అనే ఊరిలోగల మల్లారి దేవుడిని ఆరాధించేవారిదొక మతం. వీరు


కుక్కలను ఆరాధిస్తారు. గవ్వలపేరులు మెడలోధరించి త్రికాలాలలోను నాట్యవినోదాలు
సలుపుతూ మల్లారిదేవుడిని ఆరాధిస్తారు.

ఇంకా ఎందరో మతస్తులు వచ్చారు. వీరు తమ మతాన్ని ఎవరేనా అవహేళన చేస్తే


యుద్ధం చేయడానికి సిద్ధమై శూలాలు త్రిశూలాలు ధరించి వచ్చారు.

ఇవన్నీ చూసి మహామంత్రి శివకేశవయ్యకు మతి పోయింది.

వెల్లటూరి పరిసరాల బ్రాహ్మలంతా వెలనాట్లు. వీరంతా మళ్ళీ ఒకటికాదు. వేదాన్ని


పట్టీ భేదాలు, ప్రతి వేదంలోనూ శాఖలు, శాఖలలో సూత్రాలు అన్నీ కలిపి బ్రాహ్మణులు వంద
రకాలయ్యారు. కాకపోతే వీరంతా స్మార్తులు.

స్మార్తులంటే శృతి ననుసరించేవారు. శృతి అంటే వేదం. ఆదిశంకరుడి పుణ్యమా అని


వీరు శివకేశవ భేదాన్ని విడనాడారు. అన్ని మతాలలోంచీ కొంత సారాన్ని తీసుకున్నారు.
యజ్ఞయాగాది కర్మలలో పశుబలికి ప్రత్యామ్నాయంగా బూడిదగుమ్మడికాయ, తీపి గుమ్మడి
నిమ్మపండ్లు ఛిద్రముచేసి పశుబలికి ప్రత్యామ్నాయంగా భావించసాగారు. పిండి, పసుపు
గజకందము పిసికి చేసిన జంతువుల బొమ్మలు సత్తుపిండితో చేసిన రొట్టె మొద లైనవి
యజ్ఞంలో పశుమాంసానికి బదులుగా ఉపయోగించసాగారు. నుదుటన విభూతి రేఖల
మధ్య దేవీ చిహ్నంగా కుంకుమ రేఖలు ధరించారు. కాలక్రమంలో పంచద్రావిడ బ్రాహ్మలు
మాంసం మీనము విసర్జించి శాకాహారులయ్యారు. శ్రాద్ధాలలో పలపైత్రుకం మానేసి
ప్రత్యామ్నాయంగా మినప గారెలు ఉపయోగించసాగారు.

ఈ మార్పు అందరికీ ఆమోదయోగ్యమయింది. స్మార్తుల సంఖ్య పెరిగింది.


394
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

మాన్యకేతదుర్గంలో శిరీష అంతఃపురంలో పల్యంకంపై అటునిటు దొర్లుతోంది.


విరహం వేడికి తామరమొగ్గలు మాడిపోతున్నాయి. గొజ్జగిపూలు నలిగిపోతున్నాయి. నిద్ర
రావటం లేదు. లోపలిమెట్లు ఎక్కి మేడపైకి జేరింది. చిన్న పిల్లతెమ్మెర వీచింది. అది మనసుకు
ఆహ్లాదాన్నివ్వలేదు. ఒడలు చల్లబడుతుందేమోనని పైవసనం జార్చేసింది. సెగ తగ్గలేదు.
బహుళతదియ నెలవంక తెలవారుజామున దక్షిణాగ్నేయంలో తళుక్కుమన్నది.

పెళ్లికాకనప్పుడు విరహం వేరు. పెళ్ళైనా విరహం వేరు. శిరీష దీర్ఘంగా నిట్టూర్చింది.

తెల్లవారు ఝామునే చేటిక తనను వెతుక్కుంటూ వచ్చింది.

“ఏమిటే వార్త?” జయజయధ్వానాలు విని ప్రశ్నించింది శిరీష.

ఉత్తరీయం తొలగిన యువరాణిని చూడగానే విరహం ఎంత దుస్సహమో అర్ధమయింది


చేటికకు.“యువరాణీ మిమ్మల్ని కాపురానికి పంపించే శుభదినం వచ్చింది!”అన్నది.

ఆ మాటవినగానే శిరీష ఎదపొగింది. ముఖం సూర్యరశ్మి సోకిన పద్మంలా వికసించింది.


“ఎలా చెప్పగలవే?” అనిమాత్రం అన్నది చేటికతో.

“అమ్మా! వేంగిలో విశాఖదత్తుడు మాళవదేశం వెళ్ళాడట!”

“ఎందుకూ? ఐతే?”అర్ధంకాక అడిగింది శిరీష.

“వేంగి వెళితే విశాఖదత్తుడి ముఖం చూడవలసి వస్తుందనే కదా మహారాజావారు


నిన్ను కాపురానికి తీసుకు వెళ్ళనిదీ!”

“అంతమాత్రం చేత మన ప్రయాణం నిశ్ఛయమా?”

“అరణంగా పంపే ద్రవ్యాలన్నీ సిద్ధంగా వుంచారు. ఐతే మన ప్రయాణం వేంగికి కాదు.


పెదపులిపఱ్ఱు!”

“అదేమిటీ? క్రొత్త కోడలిని వేంగిలో అప్పగించుకోరా?”

“అక్కడ శివాలయ ప్రతిష్టామహోత్సవాలు జురుగుతున్నాయి. మీరు కూడ పీటలమీద


కూర్చోవాలట!”

శిరీష తన ముత్యాల పట్టెడ తీసి చేటిక గళసీమలో అలంకరించింది. “మంద మలయా


నిలంలా చల్లనివార్త తెచ్చావే! చాలా సంతోషంగా వుంది.”అన్నది శిరీష బిగ్గన కౌగలించు
కుంటూ.

395
  చాళుక్యసింహాసనం

“ఈ నిసర్గ సుందర సౌందర్యం ప్రదర్శించవలసింది అక్కడ!”అన్నది చేటిక.

అప్పుడు పైట సవరించుకుంది శిరీష. చేటిక మాటకు సిగ్గుపడుతూ ఆమె చెంప మీద
కొట్టింది సుతారంగా శిరీష.

“ఈప్రహరణలు ప్రణయవిలాసాలు ప్రదర్శించే సమయంవచ్చే దాకా గుప్పెట


మూయండి” అన్నది చేటిక.

శిరీష మనసు ఒక క్షణం విరిజ పైకి మళ్ళింది. ఆ బాల ఈలపురం బుద్ధారామంలో


ఉండిపోయింది. అక్కడ విరిజ సుఖపడుతోందో చింతిస్తోందో తెలియదు. శ్రమణకదీక్ష అంటే
సామాన్యం కాదు. ఆవేశంలో సన్యాసం తీసుకున్నవాళ్ళు ఆతరువాత చింతిస్తారు.
చిన్నవయసులో సన్యాసమేమిటీ. తనువు మనసు అందుకు అనుకూలంగా ఉంటాయా.

మహారాజు చెప్పిన మీదట శివకేశవయ్య అంజనం వేయిస్తే ఎవరో సుందరాంగన


వస్తున్నట్లు కనిపించింది.

మాన్యకేతం నుండీ వచ్చిన ఆంధ్రశ్రేష్ఠి గోమఠేశ్వరయ్య శివాలయానికి ధ్వజస్ధంభం


సమ ర్పించుకున్నాడు.

పెదపులిపఱ్ఱులో శివప్రతిష్ట కార్యక్రమం ఆరంభమయింది. ప్రతిష్ట జరిపించడానికి


ఋత్వి జులను ఎంచుకున్నారు.

వ్యాఘ్రపాదమహర్షి వేదికపైన పరచిన పులిచర్మంపై ఆసీనుడై కార్యక్రమాన్ని గమనిస్తు


న్నాడు.

ప్రధాన యాగశాలలో తూర్పుదిక్కున చతురస్రాకార హోమగుండం ఏర్పాటు చేశారు.


దానికి మూడు అంతస్తులుగా ఇటుకలు పేర్చారు. అంటే అది త్రిమేఖల. దక్షిణ దిశన
రావిచిగురులా కొసదేలున యోనిఆకారపు హోమగుండం ఏర్పాటు చేశారు. పశ్ఛిమదిశన
పూర్నచంద్రుడిలాంటి గుండ్రటి హోమగుండం ఏర్పాటు చేశారు. ఆ హోమగుండానికి కూడా
మూడు వడ్డాణాలు. ఉత్తరభాగంలో ఎనిమిది తామరరేకులవంటి హోమగుండానికి మధ్యలో
మాత్రం వృత్తాకారం వుండి త్రిమేఖలయై విరాజిల్లుతోంది.

యాగమునకు ముందుగా అంకురారోహణము చేశారు. పాలికలలో పుట్టమట్టి దానిపై


ఇసుక దానిపై ఎండిన పేడ నింపారు. యవలు పెసలు నువ్వులు వ్రీహీ మినుములు
పప్పుధాన్యాలు ఉలవలు కొఱ్ఱలు ఆవాలు చామలు అలచందలు కందులు మొదలైన
నవ్యధాన్యాన్ని ఆవుపాలతో నానపెట్టి పాలికలలో ఉంచి పైన మట్టికప్పి నీటితో తడిపారు.

ఋత్విజులు అరణి మధించి జాతవేదాగ్నిని రగిలించారు. బాగా ఎండిన దారువుతో


396
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

తయారుచేసిన యంత్రం అరణి. రంభలాంటి క్రిందిభాగం పూర్వఅరణి. పూర్వఅరణిపైకి


భూదేవతను ఆవాహనం చేశారు. పైనవుండే ఉత్తరఅరణి నలకూబరుడు. ఉత్తరఅరణిపైకి
అగ్నిదేవతను, మధ్యలోవుండే దారువుకు విష్ణుదేవుడిని మధించే కవ్వపుతాడుకు వాసుకిని
ఆవాహన చేశారు. చల్లచిలికినట్లు మధించగామధించగా నిప్పుపుట్టింది.

ఋత్విజులు అరణి నుంచి జనించిన అగ్నితో హోమం ఆరంభించారు.

అకార ఉకార మకారాలతో కూడుకున్న ఓంకారానికి, భూ భువర్ సువర్లోకాలకు


హోమం చేశారు. అక్షరహోమం ఆరంభించారు. అకారము మొదలు అచ్చులకు క కారము
మొదలు హల్లులకు హోమం చేశారు. ఇరవై ఏడు నక్షత్రాలకు అష్టదిక్పాలకులకు తృటి
మొదలు యుగాలవరకు విస్తరించే కాలస్వరూపానికి హోమం చేశారు. సమస్త వర్ణాలకు
వేదము మొదలు సకల శాస్త్రాలకు హోమం చేశారు.

హిరణ్యగర్భుడు రుద్రుడు యముడు అశ్వినీదేవతలు వైశ్వానరుడు రుద్రగణాలు


సరస్వతి ఇంద్రుడు బలదేవుడు ప్రహ్లాదుడు విశ్వకర్మ నారదుడు వాసుకి వరుణుడు మొద లైన
దేవతలనుద్దేసించి హోమం చేశారు.

పిత్రుదేవతలను ఋషులను ఆహా ఊహూ మొదలైన యక్షులను రాక్షసులను


ఆవాహనము చేసి హవిస్సులర్పించి పంపించారు. పిశాచములను ఆప్సరోభామినులను
విద్యాధరులను గ్రహములను జృంభకములను పూతనాది గ్రహములను వినాయకుని
మహాసేనుని గంధర్వులను ఆహ్వానించి హవిస్సులర్పించి సాగనంపారు. వైరాజన్యాసము
క్రతున్యాసము గుణన్యాసము దశావతార హోమము చేశారు. శక్తిన్యాసము అతల వితల
సుతలాది పద్నాలుగు లోకాలను ఉద్దేసించి హోమం చేశారు.

అంగహోమము, ప్రత్యంగ హోమము చేశారు. అందువలన విగ్రహమూర్తికి మానవా


వయవాలన్నీ ఏర్పడతాయి. బ్రహ్మాండములోని సకల శక్తులను దేవతలను అరవైనాలుగు
కళలను ఒక ప్రతిమలోకి ఆవాహనముచేసి ప్రతిష్టించినదే దేవాలయం. అలా ప్రతిష్టించిన
రుద్రుడు చరాచర జగత్తుకంతకూ అధిపతి. అందుకే శివుడు ఒక్క శిష్టులనే కాదు వనచరులను
గిరిచరులను కర్షకులను కర్మచారులను కడకు చోరులను జారిణులను వంచకులను పరమ
లోభులను వేటగాళ్ళనుకూడ అనుగ్రహించగలడు. సమస్త భూత గణములు వ్యాధులు
జ్వరములు పిశాచములు పరమశివుని అధీనములోనే వుంటాయి. అందుకే ఎవరు ఏ కోరిక
కోరినా తీర్చగల శక్తి దేవాలయములోని మూర్తికి ఉంటుంది.

ఋత్విజులు ఋతుస్నాతయై కురులార్చుకుని అరుణారుణ వర్ణములీనే వస్త్రములు


ధరించి సర్వాలంకార సుభూషితయైన లక్ష్మీదేవిని, చతుర్భుజుడై శంఖచక్రగదాపద్మ ధరుడై
తామరమొగ్గల వంటి పాదములు కలిగి శ్రీవత్సమనే పుట్టుమచ్చతో శ్యామలవర్ణుడై
చందమామవంటి ముఖవర్చస్సు కలిగి ప్రశాంత వదనుడైన శ్రీమన్నారాయణుడు అగ్నిగుండ

397
  చాళుక్యసింహాసనం

మధ్యంలో సిరితో ఏకసెయ్యాగతుడై రమిస్తున్నట్లు భావిస్తూ హోమంచేశారు.

శివాగమమైనా వైష్ణవాగమమైనా వేదమంత్రము ఒకటే.

సుముహూర్తం ఆసన్నమయింది. శివాలయములో యోనిరూపములో వుండే


పానువట్టమే పార్వతీస్వరూపం. లింగము శిస్వరూపం.

పానువట్టం మధ్యలో వుండే కన్నాన్ని గర్తం అంటారు.అందులో ముందుగా పాదరసం


ఉంచారు. ఆపైన నవరత్నాలు బంగారు తునకలు ఉంచారు. యవలు, మాషములు
(మినుములు), వ్రీహి, కుళుత్ధ(ఉలవలు), ప్రియంగువలు(కొఱ్ఱలు), చామలు, పెసలు,
నువ్వులు, రాజమాషాలు(అలచందలు), అఢకములు(కందులు), మొదలైన నవ్య ధాన్యాలు
జల్లారు. ఆపైన వ్యాఘ్రపాద మహర్షి బంగారు పూతపూసిన పంచలోహాల యంత్రం
ప్రతిష్ఠించారు. ఆ రేకుపై బీజాక్షరయుతమైన యంత్రం లిఖించబడి వుంది. ఋత్వి జులు
అంతకు ముందే మూలమంత్రాన్ని అక్షరలక్షలు జపించి యంత్రానికి ధారపోశారు. ఆపైన
నరేంద్రమృగరాజు నూట ఎనిమిదవ శివలింగ ప్రతిష్ఠ చేశాడు. శివలింగం స్ధిరంగా
నాటుకునేటట్లు వజ్రం అనబడే ద్రావకం నింపారు.

దేవతాప్రతిష్ఠలో తంత్రము యంత్రము మంత్రము కూడివుంటుంది.

సుముహూర్తం నాలుగు ఘడియలుందనగా వజ్రం అనే రసాయనం తయారుచేశారు.


తైలం మరిగించి అందులో బెల్లం వేశారు. అది పాకానికి రాగానే తేనెమైనం వేశారు. అది
కరగగానే గురువింద గింజల పొడి జేగురుమట్టి, వేసి అది కలిసిన తరువాత అందులో లక్క
సామ్రాణి గుగ్గిలం వేసి పాకం చేశారు. అది వేడివేడిగా ఉన్నంతవరకు గరిటజారుగా
వుంటుంది. ఆద్రవం పానువట్టం కన్నంలో పోసి దానిపై శివలింగం ప్రతిష్టించారు. ఈ
మిశ్రమం పూర్తిగా గట్టిపడడానికి నెలరోజులు పడుతుంది. ఇలాగే మిగతా మూర్తులు కూడా
ప్రతిష్టించారు.

ఆ దేవాలయానికి నరేంద్రేశ్వరాలయం అని పేరు పెట్టారు.

స్ధాపిత విగ్రహాలన్నింటికీ వ్యాఘ్రపాదమహర్షి ప్రాణప్రతిష్ఠ చేశాడు. కలశాలలోని


మంత్ర జలంతో అభిషేకించారు. దేవాలయ గోపురానికి కుంభాభిషేకంతో పాటు పూర్ణపు
బూరెలు అభిషేకించారు. నేత్రోన్మీలనం చేసేముందు గర్భగుడికీ ధ్వజస్ధంభానికీ నడుమ
పోసిన కుంభ రాశి ఆకాశంలో కుంభరాశిని తాకుతోంది. కళాన్యాసము నేత్రోన్మీలనము
అయిన తరువాత హారతిచ్చి భక్తులందరికీ దర్శనం అనుగ్రహించారు.

ఋషి ప్రతిష్టితమైన దేవాలయం ఎల్లకాలం ప్రసిద్ధమై వుంటుంది. అహంకారంతో


అరకొర విశ్వాసంతో ఆగమశాస్త్ర దోషాలతో వాస్తుదోషాలతో నిర్మించిన దేవాలయాలు

398
కవికొండల చంద్రధరం, పట్టస్వామి కనకరాజు(గౌరవ సహరచయిత)

అంతంత మాత్రంగానే వుంటాయి.

పూర్ణాహుతి అయింతరువాత సంతర్పణ ఆరంభమయింది.

యువరాజు విష్ణువర్ధనుడు యువరాణి శిరీష వేదికపై కూర్చుని శివపార్వతులకు


శాంతి కల్యాణం నిర్వహించారు. మృదువదన యువరాణీకి చెలికత్తెకన్నా ఎక్కువగా సహాయ
పడు తోంది. ప్రతిష్టామహోత్సవానికి వచ్చిన ఇంద్రవల్లభుడు కూతురుకూ అల్లుడికీ నూతన
వస్త్రాలు వెలలేని కానుకలూ అరణము చదివించాడు. ఇంద్రవల్లభుడు మృదువదనను కూడా
తనకూతురులా భావించి తుల్యాభరణాలతో నూతన వస్త్రాలతో సంభావించాడు.

శాంతి కళ్యానానికి చివరగా వేద పండితులు నరేంద్రేశ్వరుడి ముందు చతుర్వేద పారా


యణం చేశారు. ముందుగా ఋగ్వేద మవధారయా అన్నారు.

ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతమం

ఓ అగ్నిదేవా నీవు యజ్ఞములకు పురోహితుడవు. దేవతలకు ఋత్విజుడవు, హోతవు


కూడా నీవే. నిన్ను యజించిన వారికి సమస్త సంపదలూ ప్రసాదింతువు.

శుక్ల యజుర్వేద మవధారయా.


ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుజ్జీథా మాగృధః కస్య స్విద్ధనం

విశ్వమంతా ఈశ్వరమయం. ఈశ్వరుడు ప్రసాదించినదానితో ఆనందించు.


తృప్తిపడు. పర ధనము కోసం ఆశపడకు.

కృష్ణ యజుర్వేద మవధారయా

ఓజోఅసి సహూఅసి బలమసి భ్రాజో అసి దేవానాం ధామ నామాసి విశ్వమసి విశ్వాయు
రభిభూః

నీవే ఓజస్సువు సాహసము నీవే. బలము నీవే తేజస్సువూ నీవే. దేవతల స్వర్గ ధామము
నీవే. సమస్త విశ్వమూ నీవే. ఓ పరమాత్మా విశ్వముకు ఊపిరీ నీవే.
ఓం సామవేద మవధారయా
అభిప్ర గోపతిం గిరేన్ద్రమర్చ యధావిదే
సూనుం సత్యస్య సత్పతిం
ఇంద్రుడు సత్యపుత్రుడు సజ్జన పాలకుడు గోవులకు ప్రభువు. అతడిని యధావిధిగా
అర్చించండి కీర్తించండి.
ఓం అధర్వ వేద మవధారయా
399
  చాళుక్యసింహాసనం

ఓం యే త్రిషస్తాః పరియన్తి విశ్వరూపాణి బిభ్రతః


వాచస్పతిర్బలా తేషాం తన్వో ఆద్యదదాతుమే.

సప్త ఋషులూ సప్త గ్రహములు సప్త మరుత్తులూ సప్త లోకములూ సప్త ఛందస్సులూ
దేహానికి ఆధారభూతమైన పన్నెండు నెలలూ ఐదుఋతువులూ మూడు లోకములూ
సూర్యుడూ, పంచభూతములూ పంచ ప్రాణములూ పంచ జ్ఞానేంద్రియములూ పంచ కర్మేం
ద్రియములూ అంతఃకరణము తో కూడుకున్న బలమును ఓ వాచస్పతీదేవీ మాయందు ప్రవేశ
పెట్టుము.
ఓం నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః
పృధివ్యై నమ ఓషధేభ్యః నమో వాచే వాచస్పతయే
నమో విష్ణవేబృహతే కరోమి
ఓం శాన్తి శాన్తి శాన్తిః

400

You might also like