You are on page 1of 7

పాహి పాహి గజానన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

రాగం: సింధుభైరవి
తాళం: ఆది
పల్లవి:
పాహి పాహి గజానన
పార్వతినంద గజానన

చరణం:
ఏకదంత గజానన
అనేకదం తం విద్యానన …1

లంబోదర హే గజానన
 లంబ ఉరగధర గజానన …2

గజానన గజానన
గజానన గజానన …3

సూక్ష్మనేత్ర గజానన
అనంతకర్ణ విచారణ …4

చిన్మయముద్ర బోధన చతుర


యోగ ముద్ర సమాధిపాల … 5
సచ్చిదానంద గజానన
నిత్యానంద నిరంజన … 6

 రాగం : భైరవి తాళం : ఆది

పల్లవి:
దత్తా త్రేయ త్రిమూర్తిరూప
త్రిభువన లోక రక్షక

చరణం:
కామధేను కల్పవృక్ష
కామిత ఫలద దాయక .....1

దండకమండలు శూలడమరుక
శంఖచక్ర శోభిత .....2

ఉత్తమ ఉత్తమ పురుషోత్తమ


పూర్ణచంద్ర ప్రకటిత ....3

భావబంధన భవభయ దూర


భక్త కరుణాసాగర ....4

కృత్తికాతారా సిద్ధా నుసార


సిద్ధదూత మనోహర ...5

సహ్యాద్రివాస సచ్చిదానంద
శ్రీ గురుదత్త స్వరూప ....6
వినాయకా వినాయకా విఘ్న వినాశక వినాశక వినాయకా
సౌఖ్య విధాయక వినాయకా

విఘ్న వినాశక సౌఖ్య విధాయక విశ్వ విభావక వినాయకా

గౌరీ తనయా వినాయకా శంకర పాలిత వినాయకా


గజవదనా హే వినాయకా మూషిక వాహన వినాయకా

పితృ సద్భక్తా వినాయకా సూక్ష్మ సుబుద్ధీ వినాయకా


విఘ్నాధీశ్వర వినాయకా విశ్వారాధ్యా వినాయకా

మోదక హస్తా వినాయకా మోదవిధాయా వినాయకా


చంద్రోల్లా సక వినాయకా శాసిత చంద్రా వినాయకా

పునరుజ్జీవిత వినాయకా పూర్ణకృపాలయ వినాయకా


దానవ సంహార వినాయకా దైవత రక్షక వినాయకా

భాహుచతుష్కా వినాయకా భావమనోజ్ఙా వినాయకా


పాశాంకుశధర వినాయకా రదవరదాఢ్యా వినాయకా

చందన రంజిత వినాయకా రక్తాంబర ధర వినాయకా


లంభోధర హే వినాయకా వామన రూపా వినాయకా

నాగాలాంకృత వినాయకా నానా రూపా వినాయకా


గురు సద్రూపా వినాయకా శిష్యావన హే వినాయకా

గం బీజాక్షర వినాయకా గంభీరార్థా వినాయకా


ఓంకారాఖ్యా వినాయకా వక్రసుతుండా వినాయకా
సర్వాదే శ్రీ వినాయకా సచ్చిదానందా వినాయకా

పల్లవి :
జ్యోతి వెలిగింది సద్గురు జ్యోతి వెలిగింది
జ్యోతి వెలిగింది జీవుడి చీకటి తొలగింది

చరణం :
ఆకలి అవుతుంది ఆత్మ జ్ఞానం అడిగింది
జ్ఞానం అడిగింది గురు భోధలు నడిచింది

దాహం అవుతుంది మనసున మోహం వదిలింది


మోహం వదిలింది మనసున దప్పి తీరింది

చక్రం నడిచింది జన్మ ఎత్తు కొచ్చింది


ఎత్తు కొచ్చింది జన్మ నడచిపోతూంది

భయం పోయింది బుద్ధికి బుద్ధి వచ్చింది


బుద్ధి వచ్చింది తెలివికి తెలుపబడింది

పుట్టు కొచ్చింది శాంతము కరుణ నిండింది


కరుణ నిండింది దత్తు డి కృప కలిగింది

:
పల్లవి
భజ భజ దత్తం భజ భజ దత్తం భజ భజ దత్తం భజ దత్తం

చరణం :
సద్గురుదేవం సకరుణ భావం సంసృతి నావం భజదత్తం
సజ్జన పాలం సమధికలోలం సన్ముని బాలం భజదత్తం

చిన్మయ రూపం చిరసుఖగోపం చేతసి దీపం భజదత్తం


చిత్సుఖసారం స్థిర మవికారం చిత్రప్రకారం భజ దత్తం

వాంఛసి యది తత్ పదమ వినాశం నాశవిదూరం భజ దత్తం


సంసృతి బాధా శమ మిచ్చసి చేత్ శమదమధీరం భజ దత్తం

సంశయ కంటక సంతత దష్టో యది గురురూపం భజ దత్తం


అవమతి దళితో యది లోకేస్మిన్ త్రిభువనరాజం భజ దత్తం

సంపది యది తే వాంఛా లగతే అష్టైశ్వర్యం భజ దత్తం


వాంఛసి విద్యా ధనమధికం చేత్ మాలాపాణిం భజ దత్తం

అసమృద్ధిశ్చే దావృణుతే త్వాం సిద్ధి తనూజం భజ దత్తం


సంసది విజయం సంతతి వినయం ప్రాప్స్యసి నూనం భజ దత్తం

కిం కిం న లభేత్ కించిత్ స్మరణాత్ యది భక్తిస్తే భజ దత్తం


అథ సర్వాశాతీత పదాప్త్యై సచ్చిదానందం భజ దత్తం
:
పల్లవి
మంత్ర ప్రమాణం మంత్రైక వేద్యం మంత్ర స్వరూపం భజ దత్తం
మంత్రార్ణరూపం మంత్రార్థ గోపం మంత్ర ప్రదీపం భజ దత్తం

చరణం :
ద్రాంబీజవాసం దారిద్ర నాశం దయా నివేశం భజ దత్తం
షడక్షరేశం సంపత్ప్ర కాశం యోగోపదేశం భజ దత్తం

అష్టా ర్ణ వేద్యం భవరోగ వైద్యం ఆనందహృద్యం భజ దత్తం


ద్వాదశ వర్ణం ఆనంద పూర్ణం యోగోత్తీర్ణం భజ దత్తం

షోడశ బీజం గురురాజ రాజం కైవల్యభాజం భజ దత్తం


దత్తా త్రేయం కృష్ణం హరిం తం ఉన్మత్త రూపం భజ దత్తం

ఆనందదాయకం మునిబాల రూపం పిశాచ వేషం భజ దత్తం


విశుద్ధ జ్ఞాన సాగరమీశం సచ్చిదానందం భజ దత్తం
చరణం :
మానసంబె నీ మందిరమ్మురా మంచి నేస్తు డా మరచిపోకురా
నీవులేనిచో గుండె కుదురులో తెరలు తేరలు గా దిగులు గుబులురా

గుండె కోనలో కోర్కె సింహము మాటు వేశరా దూకుతుందిరా


వేటకాడా నేస్తకాడా ఆదుకోరా ఊతమీరా

గుండె బాటలో కోపమేనుగు దండు పైబడి తొక్కుతుందిరా


దౌడూతీయగా శక్తి లేదురా దండి వీరుడా రావిదేమీరా

గుండె కోనలో కారుచిచ్చుదే కమ్ముకొచ్చెరా మోహమున్నది


నేర్పుకాడా నీవే దిక్కురా నీళ్ళు చల్లి నన్నీడ్చు కెళ్ళరా

దారిదోపిడీ దండు పడ్డది మత్సరమ్మనే మారు పేరున


పోటుగాడా ప్రోవవేమిరా నిన్నే నమ్మి నే నడచుచుంటిరా

మదము లోభము జంట పాములై వెంటనంటెరా పగబట్టెరా


పరుగు తీసీ నే డస్సిపోతిరా ప్రాణభిక్షయే పెట్టు రమ్మురా

శూలమెత్తితే సంహముండునా ఢక్క మ్రోగితే గజము పారదా


శంఖమూదితే దొంగలేరిరా చక్రమేసితే పాము చచ్చురా

తెల్ల పూసల పేరు చేతిలో త్రిప్పుచుండిన సోకుగాడా


నేస్తకాడా నీ నెమ్మి చేత నే బ్రతుక గల్గితీ బట్ట కట్టితీ

తెల్లపూసల పేరు లోపల గల్గు కిటుకు నాకెరుక చెప్పరా


స్నేహమందునా చాటులుండునా సచ్చిదానందా జన్మమిత్రమా

You might also like