You are on page 1of 217

’శ్యామా మాతాజీ ‘’కీర్తనలకు

తెలుగు అనువాదం

శ్యామ కృష్ణా !నాకోసం నువ్వేం చేశావు చెప్పు!

నన్ను నీప్రేమలో పడేసి పిచ్చిదాన్నిగా చేసే శావు

నువ్వు నా హృదయం లో ఉంటున్నావు

ప్రతి చోటా నీ కోసం వెదికే పనిఎందుకు  కల్పిస్తా వు నాకు ?

నాకెందుకు ఈ బాధ??

నువ్వు లేకుండా నా మనస్సు రెపరెపలాడి పో తుంది.

నిన్ను నేను పొ ందాను

అయినా నీకోసం చూస్తూ నే ఉన్నాను

నాతో ఎందుకీ దొ ంగాటలాడుతున్నావ్ ? 

నాకు నీప్రేమామృతాన్నిచ్చి మురిపించి మరపించావు

నువ్వు నన్ను నీ ప్రేమ గీతం గా మారుస్తు న్నావు

 ఈ’’శ్యామ’’ నీ గురించే కలవరిస్తో ంది, నీపిచ్చిలో పడి కొట్టు కొంటోంది 

2
శ్యామ కృష్ణా ! నా మాట కొంచెం విను

నువ్వు హాయిగా మెత్తని పరుపు మీద పడుకొంటావ్

 నేను మాత్రం నిద్ర లేని ఏకాంత దారుణ రాత్రు లను గడుపుతున్నాను

నేను ఎవరికి ఫిర్యాదు చేయాలో నీకు చెప్పను

ప్రేమించిన నువ్వు నన్ను గెలిచావ్, నేనే ఓడిపో యాను దారుణం గా

ఇప్పుడే నాకనుల ముందు ప్రత్యక్షం కావాలి నువ్వు

నీ నేత్రా మ్రు తాన్ని తనివార గ్రో లాలి నేను

ఈ ‘’శ్యామ’’ మనో వాక్కాయ కర్మలా నీకు వశమై పో యింది ,

శ్యామ కృష్ణా !దయచేసి బదులివ్వు

 వియోగి యోగి కంటే ఎలా తక్కువ వాడవుతాడు ?

యోగి శరీరం యోగాగ్నిలో కాలి బూడిదవుతుంది

నిన్ను ప్రేమించే వియోగి హృదయం నీ ప్రేమలో రగిలి బూడిద అవుతుంది

యోగి కాషాయం కడతాడు

వియోగి  నీ ప్రేమనే తనువూ మనసులకు కట్టు కొంటాడు

యోగి సమాధి లోకి వెళ్ళటానికిఎంతో  కష్ట పడతాడు

వియోగి ప్రతి  కదలికతో తేలిగ్గా   భావనాసమాధి చెందుతాడు

యోగి  గుడిసె లో  నివశిస్తా డు


నిన్ను ప్రేమించే వారి హృదయమే ఒక దివ్యమైన గుడిసె, దేవాలయం

యోగి  శారీరక బాధలనుభవిస్తా డు

నిన్ను కోరిన వియోగి మానసిక క్షోభ అనుభవిస్తు తట్టు కొంటాడు

యోగి మంత్రా లను జపిస్తా డు

నిన్ను ప్రేమించే యోగి స్మృతి అంతా ప్రేమలో నిమగ్నమై ఉంటుంది

యోగి శాశ్వత దివ్య జ్యోతి ని చూడాలని ఆశిస్తా డు

ప్రేమికుడు నీతో శాశ్వత కలయిక లో పరవశిస్తా డు 

ఈ ‘’శ్యామ ‘’కు వేరే బంధువులెవరూ లేరు

శ్యాముడో క్కడే ఆమె ఏకైక దిక్కు, గతి.

నీకు నా మీద దయ అనేది ఉంటె

శ్యామ కృష్ణా

నా కోసం రావటానికి ఇక ఆలస్యం చేయద్దు . .

       ఈ  రెండవ  కీర్తన ‘’శ్యామా మాతాజీ ‘’బొ ంబాయి లో రెండు వేరు వేరు చోట్ల అంటే
‘’అంధేరీ’’ లోను, ’’మలాద్ ‘’లోను  ఒకే సారి భౌతికం గా కనీపించి గానం చేసి అందర్నీ
ఆశ్చర్య పరచింది., తాను బొ ంబాయి లోని మలాద్ లో మాత్రమె కీర్తన లను గానం చేశానని,
అంధేరీ లో చేయ లేదని ఆమె చెప్పింది. కాని అంధేరీ లో ఆమె పాడినట్లు ఫో టోలు, పేపర్
వార్త లను మర్నాడు ఆమె కు చూపించారు. అలా ''ఆ లీలా కృష్ణు డే'' రెండో చోట తన రూపం
లో వచ్చి పాడి ఉంటాడని ఆమె అందరకు చెప్పింది.

        24-10-1916 లో ఉత్త ర ప్రదేశ్ లోని మధుర లో అంటే శ్రీ కృష్ణ జనం స్తా నం లో
జన్మించింది శ్యామా మాతాజీ. పెళ్లి అయి ఎనిమిది మంది సంతానాన్ని కన్నది. ఒకఆడపిల్ల
మాత్రమె బతికింది. , అత్త గారు వంశాంకుర మైన మగ పిల్ల వాడికోసం ఆమెను’బృందావనం
లోని ’ 108 శ్రీ బాబా రాదా స్వామీజీ మహారాజ్’’దగ్గ రకు ఆశీర్వాదం పొ ందటానికి
తీసుకెళ్ళింది. ఆయన అనుగ్రహించి ‘’హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ
హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ‘’మంత్రా న్ని ‘’రోజుకు లక్ష సార్లు ’’ఆరు నెలల కాలం 
జపించమని ఉపదేశించాడు. ప్రతి రోజు ఉదయం మూడు గంటలకు లేచి జపం ప్రా రంభించేది.
మళ్ళీ రాత్రి రెండింటి దాకా చేసేది లక్ష పూర్తీ కావటానికి. అంత నియమం గా ఆమె జపించి శ్రీ
కృష్ణు ని దివ్య దర్శనం పొ ందింది మగ సంతానం సంగతే ఆమెకు గుర్తు లేదు. దీనితో అత్త గారి
ఆరళ్ళు పెరిగాయి. తట్టు కోలేక  బృందావనం కు, ఆ తర్వాతా కాశి కి ఎవరికి చెప్పకుండా వెళ్లి
పో యింది., అనుక్షణ సమాధి లో గడిపేది. .ఎన్నో అద్భుతాలను చూపేద.ి పై సంఘటన
అలాంటి దివ్య శక్తు లలో ఒకటి. శ్రీ కృష్ణ దివ్య విభూతిని అనుక్షణం అనుభవించేది. ఆమె
కీర్తనలు అద్భుతం గా ఉన్నందున ఈ అనువాదం చేసి మీకు అందిస్తు స్తా ను.

జ్ఞా నదుడు నారదుడు

 జ్ఞా నదుడు మహర్షి నారదుడు -1

     దేవ ,దానవ మానవులలో అజ్ఞా నం ప్రబలి ,అహంకార బలగార్వాలతో మెలగి ప్రజలను ,లోకాలను పీడించి ,హాని కల్గ జేసేసమయం లో
వారి అజ్నానాంధ కారాన్ని పో గొట్టి ,జ్ఞా న జ్యోతిస్సును వెలిగించి గర్వం ఖర్వం చేసి ,లోకోపకారం చేసే మహర్షి పుంగవుల వల్ల నే ఈ విశ్వానికి
శుభం శ్రేయస్సులు కలుగుతున్నాయి .తను ఒక మహర్షియై ,సాక్షాత్తు బ్రహ్మ మానస పుత్రు డై భక్తీ విధానానికి ఆచరణ లో ఆదర్శమూర్తియై
,నవవిధ భక్తీ మార్గా లను ఉపదేశించి ,తాను తరించి ,లోకాలను తరింప జేసేన మహో పకారి నారద మహర్షి .’’నారం దదాతీతి నారదః ‘’అని
–అంటే జ్ఞా నాన్నిచ్చే వాడే నారదుడు అని అర్ధ ం చెప్పారు .అంతే కాదు –నీటి నుండి జన్మించిన వాడు అని కూడా అర్ధ ం .గాన విద్య లో మేటి
నారదుడు .నిరంతర హరి స్మరణ పారాయణుడు .శ్రీ హరి భక్తిని సకల లోక వ్యాప్తి చేసిన పరమ భాగవతోత్త ముడు .లోకోపకారం కోసం ఎన్నో
నిందలు భరించినా , చలించని ఆత్మ స్థైర్యం తో తన మార్గా న్ని విడువని వాడు .మంచికి పో తే చెడు ఎదురైనట్లు –లోకోపకారం కోసం ఆయన
పడిన పాట్ల కు ‘’కలహా భోజనుడు ‘’గా లోకం చేత ముద్ర వేయిం చుకోన్నవాడు .’’నారాయణ –నారాయణ ‘’అంటూ ,తాను పొ ందిన
పరాభవాన్ని కూడా దిగమింగుకొంటు ,నింద అనే హాలాహలాన్ని అమృతం గా ఆరగించిన అపర బో ళా శంకరుడు నారద ముని  .దేవర్షి గా
కీర్తింప బడ్డ వాడు  .అలాంటి పరమోత్త మ మహర్షి జ్ఞా నదుడు అయిన మహర్షి  నారదునిజీవిత సంగ్రహం తెలుసుకోవటం రమణీయం
,.అందుకే వారి చిద్విలాసాలు ,ఏ సందర్భం లో ఎలా ఉన్నాయో వివరించటం ,భక్తీకి  పరాకాష్ట అయిన ఆంద్ర మహా భాగవతోత్త ములలో భక్త
పో తన ,తీర్చి దిద్దిన నారద మహర్షిని ,మీ ముందుంచటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం .

జనన వృత్తా ంతం


       బ్రహ్మ వైవర్త పురాణం లో నారదుడు విష్ణు మూర్తి కంఠం నుంచి  జన్మించి నట్లు ఉన్నది .విష్ణు మూర్తి యేనారదుడు అనే దేవర్షి యై
,కర్మ నిర్మోచనం చేసే వైష్ణవ తంత్రా న్ని బో ధించినట్లు భాగవతం చెబుతోంది .బ్రహ్మ తొడ నుండి నారదుడు జన్మించి నట్లు భాగవత కధనం .

        దక్షప్రజాపతి ‘’ప్రియ ‘’అనే తన పుత్రికను బ్రహ్మ దేవుడికి ఇస్తే ,ఆమె యందు నారదుడు జన్మించి నట్లు బ్రహ్మ వైవర్త పురాణం లో
ఉంది .పూర్వ మహా కల్పం లో ‘’ఉప బర్హణుడు ‘’అనే గంధర్వుడే నారదుడు .బ్రా హ్మలు దేవ సత్రం అనే యాగం చేస్తూ శ్రీమన్నారాయణుని
కధలను గానం చేయటానికి అప్సరసలను ,గంధర్వులను పిలిపించారు .ఉప బర్హనుడు కూడా వెళ్లి గంధర్వులతో కలిసి పాడుకొంటూ ఉండటం
తో విశ్వ స్రస్టలు’’శూద్ర యోని ‘’లో జన్మించ మని శాపం ఇచ్చారు ఆ శాపం వల్ల ఒక బ్రా హ్మణుని ఇంట దాసీ కడుపున పుత్రు డి గా
జన్మించి నట్లు భాగవత పురాణ కధనం .చాతుర్మాస్య దీక్షలో ఉన్న మునులకు  పరి చర్య చేస్తూ ఉండేవాడు .వారిని అనుసరించటం వల్ల  
గొప్ప జ్ఞా నం కలిగింది .అతని తల్లి పాలు పితుకుతు పాము కరిచి చని పో యింది .ఇలా సంసార బంధ విముక్తు డైనాడు .ఆ సంతోషం తో
ఉత్త రాభిముఖం గా వెళ్లి మహారణ్యం లో ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు .ఈశ్వరుని రూపు ఎలా ఉంటుందో మనసులో
నిలుపుకోలేక పో యాడు .అప్పుడతనికి’’ ఈశ్వర వాక్యం ‘’వినిపించింది .’’ముని ముఖ్యులు చూసే మా రూపాన్ని నువ్వు చూడ లేవు .ఈ
సృష్టి లయం చెందినపుడు నీ శరీరం నశించి ,మళ్ళీ జన్మించి ,నా అనుగ్రహం తో నా రూపాన్ని దర్శిస్తా వు ‘’అలానే ప్రళయం వచ్చింది నారద
జన్మలయం చెంది ,శ్రీహరి దయతో శుద్ధ సత్వమైన దేహం లో ప్రవేశించాడు .నారాయణ మూర్తిలో నిద్ర పో వాలని నిశ్చయించి ,బ్రహ్మ
విశ్వాసము వెంబడి అతని లో ప్రవేశించి బ్రహ్మ ప్రా ణం వల్ల మరీచి మొదలైన ముఖ్యులతో జన్మించి నట్లు భాగవత పురాణ గాధ తెలియ
జేస్తో ంది.

జ్ఞా నదుడు మహర్షి నారదుడు –2

      వరాహ పురాణాన్ని అనుసరించి నారదుడు సారస్వతుడు అనే బ్రా హ్మణుడు .సంసార భారం అంతా పుత్రు ని పై పడేసి వనం లో తపస్సు
చేశాడు ..విష్ణు మూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు .’’విష్ణు సాయుజ్యం కావాలి ‘’అని కోరాడు .తన తర్వాతవాడు బ్రహ్మ అనీ ,ఆ
బ్రహ్మకు జన్మించి ,ఆ తర్వాత సాయుజ్యాన్ని పొ ందమని విష్ణు వు చెప్పాడు .ఇతరులకు నీరు (జ్ఞా నం )ఇస్టూ ఉంటావుకనుక ‘’నారదుడు
‘’గా ప్రసిద్ధి చెందు తావని అనుగ్రహిస్తా డు .ఈ విధం గా నారదుని జన్మ పరి పరి విధాలుగా పలుచోట్ల కన్పిస్తు ంది .

              నారద జీవిత విశేషాలు

        బ్రహ్మ ,ప్రియల సుపుత్రు డైన నారదుడు బ్రహ్మ గారి ఆజ్ఞ పక


్ర ారం సృష్టి పెంపు చేయటానికి ఇష్ట పడడు..సంసార పంకిలం లో దిగననీ
,మోహ బంధనం వద్ద ని ,కనుక తాను సృష్టి చేయ లేనని చెప్పుకొన్నాడు .బ్రహ్మ కు కోపం వచ్చి ‘’కాముకుడ వై  స్త్ర్ర్ లోలడవై ,శూద్ర యోని
లో జన్మించమని శాపం ఇస్తా డు .అయితే బ్ర్రా హ్మణ సంపర్కం లో విష్ణు భక్తీ మాత్రం వెంట ఉంటుందని ఊరడిస్తా డు .నారదుడు కూడా కోపం
తో తండ్రి బ్రహ్మ కు ‘’పూజా ,కవచాలు లేకుండా పో తాయని ‘’ప్రతి శాపం ఇస్తా డు .ఇది బ్రహ్మ వైవర్త ్త పురాణ కద .

          నారద నారది

    వరాహ పురాణం.దేవీ భాగవతం  ప్రకారం ఒక సారి నారదుడు శ్వేత ద్వీపం ‘’వెళ్తా డు .అక్కడ మన్మధా కారులైన వాళ్ళు చాలా మంది
కన్పిస్తా రు .వారిలో విష్ణు మూర్తి ఎవరో తెలుసుకోలేక ఆయన్నే ప్రా ర్ధిస్తా డు .ఆయన ప్రత్యక్షమై వరం కోరుకో మంటే తనకు ‘’విష్ణు మాయలు
‘’తెలియ జేయమని ప్రా ర్ధిస్తా డు .సరేనని దగ్గ రలో ఉన్న కొలువు లో స్నానం చేసి రమ్మంటాడు .మునిగి లేవగానే స్త్రీ గా మారి పో తాడు
.చారుమతి అనే పేరు తో కాశీ రాజు కుమార్తె గా జన్మిస్తా డు .’’శిబి ‘’అనే వాడిని పెళ్లి చేసుకొన్నాడు నగ్న జిత్తి ,విప్రజిత్తి ,విచిత్తి ,చారు
వక్త్రు డు ,చిత్తు డు అనే కొడుకులు పుట్టా రు .తండ్రీ కొడుకులు దేశాలను జయిస్తూ కాశీ రాజు చేత చంప బడుతారు .చారుమతి భర్త్రు ,పుత్ర
శోకం తో చితి పేర్చుకొని చని పో వటానికి సిద్ధమవుతుంటే ,పూర్వ రూపం పొ ంది నారడుదయ్యాడు .ఇది కలా /వైష్ణవ మాయా /అని
చింతించి విష్ణు మహిమను తెలుసుకొన్నాడు .
       నారదుడు రావటం చూసి శ్రీ లక్ష్మి ,విష్ణు వు దగ్గ ర నుంచి బయటకు వెళ్ళింది .తనేమో వృద్ధ తాపసి తనను చూసి తొలగటం ఏమిటి
అని ప్రశ్నిస్తా డు .’’పర పురుషులను చూసి తొలగాలి కదా ‘’అంటాడు స్వామి .మాయ ఎంతటి పనైనా చేస్తు న్ద ంటాడు విష్ణు మూర్తి .తన
మాయా ప్రభావం చూపించమని కోరగా ,గరుడుని పై ఎక్కించి ,కన్యా కుబ్జ ం దగ్గ ర కొలను దగ్గ ర దింపి అందులో స్నానం చేసి రమ్మంటాడు .

           కొలను నుంచి బయట పడగానే అందమైన స్త్రీ గా మారి పో తాడు .విష్ణు వు నెమ్మదిగా జారుకుంటాడు .తాళధ్వజుడనే రాజు
మోహించి ,తన నగరానికి తీసుకు వెళ్తా డు .వివాహమాడి రాణి ని చేస్తా డు .పుత్ర సంతానం కలిగింది .కొంత కాలానికి శత్రు వులు దండెత్తి
కుమారులను సంహరిస్తా రు .నారది విలపిస్తు ంది .విష్ణు వు వృద్ధ బ్రా హ్మణ రూపం లో వచ్చి ,పుత్రా దులు నిత్యం కాదని చెప్పి ,తన వెంట
తీసుకొని వెళ్లి ,కొలను లో స్నానం చేయిస్తా డు .పూర్వరూపం వచ్చేస్తు ంది .శ్రీ కృష్ణ మాయ స్త్రీ రూపం లో అనుభవించి రెండు సార్లు
తెలుసుకొన్నాడు .అంటే విష్ణు భక్తీ గాఢం చేయటానికి ఆ విష్ణు మూర్తి యే పరీక్షలు చేసి నిగ్గు తేల్చాడు .నారదుడిని జ్ఞా న సార సంపన్నుని
చేశాడు .

జ్ఞా నదుడు మహర్షి నారదుడు -3

         లింగ ,శివ పురాణాలలో నారదీయం

     ఒకప్పుడు నారదుడు హిమాలయం పై తపస్సు చేస్తు న్నాడు .ఇంద్రు డు విఘ్నం చేయమని దేవకన్యల్ని పంపాడు నారదుడు
శివారాధకుడు కూడా కనుక శివ ప్రభావం వల్ల మనసు చలించలేదు .దీనితో గర్వం వచ్చింది .తపస్సు ముగించి ,బ్రహ్మ విష్ణు వు లను
చూడటానికి వెళ్ళాడు .తన ప్రభావం వల్ల నే శివుడు కాముడిని జయించాడని విష్ణు మూర్తి తో అంటాడు .పరీక్షించే నెపం తో విష్ణు మూర్తి
మార్గ మద్యం లో ఒక నగరాన్ని నిర్మించి ,అందులో అతి లోక సౌందర్య రాశి ని సృష్టించి ఉంచుతాడు .ఆమెను చూడగానే ప్రేమలో పడ్డ
నారదుడు ఆమె ను వివాహమాడే నిమిత్త ం విష్ణు రూపాన్ని తనకిమ్మని కోరుకొంటాడు .

   , నారదుడు ,అతని మేనల్లు డు పర్వతుడు అంబరీషుని నగరానికి వచ్చి అతని కుమార్తె శ్రీమతిని చూస్తా రు ఇద్ద రు  ఆమె పై మనసు
పదడి పో టీ పడతారు .ఇద్ద రిలో ఒక్కరికే తన కుమార్తె నిస్తా నంటాడు తండ్రి .ఇంతలో ఒకరికి తెలియ కుండా ఇంకొకరు విష్ణు వు ను చేరి
అవతలి వాడి ముఖం కోతి ముఖం చేయమని కోరుకొంటారు .స్వయం వరం లో శ్రీమతి విష్ణు వునే వరిస్తు ంది .ఆమెతో వైకుంఠానికి విష్ణు వు
చేరుకొంటాడు .వీరిద్దరికీ కోపమొచ్చింది .అమ్బరీషునితో తగాదా పడతారు .అతడిని ‘’తమో మయుడవు కావలసినది ‘’అని శపిస్తా రు
.ఇంతలో విష్ణు చక్రం వీరిద్దరిని తరుము కొం.టు వచ్చింది .పారి పో యి విష్ణు లోకం చేరారు .’’వానర ముఖాలు మాకు ఇచ్చి నువ్వు కన్య
ను కొట్టేశావు ‘’కనుక నరుడి వై వియోగ దుఖం అనుభవించమని విష్ణు వు ను శపించారు .చివరికి ఆ వానరుల సహాయంవల్ల నే భార్యను
మళ్ళీ పొ ందుతావు అని చెప్పారు .ఇదంతా శివుని ప్రభావమే నని వీరిద్దరికీ తెలియ జెప్పి విష్ణు వు అంతర్ధా న మయ్యాడు .ఇదే శ్రీ
రామావతారానికి ప్రా తి పాదిక అయింది

                                                              మహా భారత కదా విధానం

                   నారద పర్వతులు లోక సంచారం చేస్తూ ఒకరి హృదయం లో ఉన్నది వేరొకరికి  దాచకుండా చెప్పుకోవాలని ,అలా చెప్పుకోక
పో తే అవతల వాడిని శపించాలని ఒక ఒడంబడిక చేసుకొన్నారు .ఇద్ద రు సృన్జ యుడు అనే రాజు దగ్గ రకు వచ్చారు .వీరి పరిచర్యలకు తన
కుమార్తె ‘’సుమాలిని ‘’ని నియమించాడు .నారదుడు ఆమె పై మనసు పారేసుకొన్నాడు కాని ఆ సంగతి పర్వతుడికి చెప్పలేదు .పర్వతుడు
ఇది గ్రహించి నారదుడి ని కోతి ముఖం తో ఉండమని శపించాడు .నారదుడు పర్వతునికి లోక సంచారం లేకుండా ఉండే శాపం ఇచ్చాడు
.నారద సుకుమారిల పరిణయం జరిగింది .కొంతకాలానికి మామా అల్లు డు కలుసుకొన్నారు .శాప విమోచనం చేసుకొన్నారు .ఇంటికి తిరిగి
వచ్చిన నారదుడిని భార్య గుర్తించలేదు అప్పుడు పర్వతుడే ఆమె కు అతనే ఆమె భర్త అని నిజాన్ని చెప్పాడు .

             నారదుడు మామ సృన్జ యునికి  దేవతలను మించిపో యే పుత్రు దు కలిగే వరం ఇచ్చాడు అక్కడే ఉన్న పర్వతుడు ఆ పుట్ట బో యే
వాడు అల్పాయుష్కుడు ‘’అన్నాడు . .రాజు దుఖిస్తే ‘’ఇంద్రు డు నీ పుత్రు డిని సంహరిస్తా డు .అప్పుడు నన్ను తలచుకో.నేనే బ్రతికిస్తా ను
‘’అని అభయమిస్తా డు నారదుడు .సృన్జ యుడికి పుత్రు డు కలిగాడు అతని నిస్టేవనం(ఉమ్మి, విసర్జ నం మొదలైనవి ) బంగారు అవటం వల్ల
అతనికి  ‘’సువర్ణ స్టేవి ‘’అని పేరు పెట్టా రు .అతని శరీరం అంతా బంగారుమయమే నని భ్రమించి దొ ంగలు అతన్ని చంపేశారు .నారడుకి ఈ
విషయం తెలిసి పునర్జీవితుడిని చేశాడు కాని  .ఇంద్రు డు కోపం తో చంపమని వజ్రా యుధం పంపాడు  .రాజు తన అల్లు డైన నారదుడిని
తలచుకొన్నాడు .మళ్ళీ బ్రతికించి తన మాట నిల బెట్టు కొన్నాడు నారదుడు ఇలా మామ గారి వంశాన్ని నిల బెట్టి పుణ్యం కట్టు కొన్నాడు
అల్లు డైన నారదుడు

జ్ఞా నదుడు మహర్షి నారదుడు -4

                       గాన విద్యా పరీక్షకుడు  నారదుడు

   మార్కండేయ పురాణం లో ఒక అద్భుత మైన కధ ఉంది .ఒక నాడు ఇంద్ర సభ లో

రంభాదులు నృత్యం చేస్తు న్నారు .నారదుడు ఆ సమయం లో అక్కడికి వెళ్ళాడు .వీరిలో ఎవరి
గానం ఇంపు గ ఉందో పరీక్షించి తేల్చమని ఇంద్రు డు నారదుడిని అడిగాడు .ఎవరు
హావభావాలతో విర్రవీగుతారో వారి గానం గొప్పది అంటాడు మహర్షి .ఎవరికి వారు తామే
ఎక్కువ అని వాదు లాడుకొంటారు .అప్పుడు నారదుడు ‘’ఎవరు దుర్వాస మహర్షి ని చలింప
జేస్తా రో వాళ్ళే గొప్ప ‘’అంటాడు .అప్పుడు ‘’వపువు ‘’అనే అప్సరస తాను ఆ పని
చేయగలనని బయల్దే రి వెళ్ళింది .దుర్వాసుడు ఆమె ప్రయత్నానికి కోపం చెంది ‘’పక్షి ‘’గా
మారి పొ మ్మని శపిస్తా డు .పిల్లల్ని కనీ ,ఖడ్గ ం చేత నరక బడి మళ్ళీ దేవలోకం చేరుతావని
ఆమె ప్రా ధేయ పడితే చెప్పాడు .ఆమెయే ‘’తార్క్షి ‘’అనే పేరు తో భూలోకం లో జన్మించి
,ద్రణాచార్యులను వివాహ మాడుతుంది .గర్భవతి యై ,భారత యుద్ధ ం లో భూమి పై
ఎగురుతు ఉండేది .భగాదత్తు ని పై అర్జు నుడు వేసే బాణాలు ఈమె కు తగిలి గర్భం చీలి గ్రు డ్లు
కిందపడి పో గా శాప విమోచనమై మళ్ళీ దేవలోకం చేరుతుంది .శమీకుడు ఈ గ్రు డ్ల ను
పెంచుతాడు .ఈ శమీక మహర్షి యే పరీక్షిత్తు మహా రాజుకు శాపం ఇచ్చిన వాడు .

                   గాన విద్యా విశారదుడు నారదుడు

   అద్భుత రామాయణం కధనం ప్రకారం  కౌశికుడు అనే వాడు స్వర్గ లోకం లో గానం
చేస్తు న్నాడు .లక్ష్మి నారదాదులు అక్కడికి వచ్చారు .లక్ష్మీ దేవి తుమ్బురుని పిలిచి కౌశికుని
తో కలిసి గానం చేయమని కోరింది .నారదుడు దీన్ని తనకు జరిగిన అవమానం గా
భావించాడు .నారదుడు కోపం తో లక్ష్మీ దేవిని ‘’దనుజ గర్భం లో పుడతావని ‘’శపించాడు
.పాపం విష్ణు మూర్తి నారదుడిని ఊరడించాడు .భక్తిజ్ఞా నం తో తుంబురుడు పాడుతాడు కనుక
అతనికి అంతటి ప్రభావం వచ్చిందని తెలియ జేస్తా డు .నారదునికి అంతటి ప్రభావం రావాలంటే
‘’మానసో త్త ర పర్వతం ‘’పై ఉన్న ‘’గాన బంధుడు ‘’అనే గుడ్ల గూబ ఉందని ,దాని దగ్గ ర
గాన విద్య నేర్చుకోమని సలహా ఇస్తా డు .నారదుడు అలానే నేర్చి సుశిక్షితుడైనా,
తుమ్బురునితో సమానం కాలేక పో తాడు .అసూయ తో మళ్ళీ విష్ణు మూర్తిని చేరి సంగీతం
నేర్ప మంటాడు .శ్రీకృష్ణా వతారం లో తాను నారదునికి సంగీతం నేర్పగలనని శ్రీహరి చెప్పి
ఊరట కల్గించాడు .

       శ్రీ కృష్ణా వతారం లో నారదుడు స్వామిని చేరి సంగీతం నేర్పమంటాడు .జాంబవతి
మొదలైన అష్ట భార్యల వద్దా ఒక్కొక్క సంవత్సరం గానం నేర్చుకోమంటాడు .అంత చేసినా
గాన విద్య అబ్బలేదు .చివరికి శ్రీ కృష్ణు డే స్వయం గా నారదునికి సంగీత విద్య నేర్పి గాన
విశారడుడిని చేశాడు .అప్పటి నుంచే ఈర్ష్య పూర్తిగా పో యింది నారదునికి .

                    త్రిలోక సంచారి

       తండ్రి ఆజ్ఞ వల్ల దక్షులు సృష్టి చేయటం ప్రా రంభించారు .’’ముక్తి సాధన ‘’చూసుకో
కుండా ఈ సంసార లంపటంమయేమిటని వారిచేత నారదుడు ఆ పని మాన్పించాడు .దక్షునికి
తెలిసి బ్రహ్మ తో మొరపెట్టు కొన్నాడు .దక్షుని పుత్రికకు నారదుడు మళ్ళీ జన్మిస్తా డని బ్రహ్మ
శపిస్తా డు .ఒక్క చోట కూడా కాలు నిలువ కుండా తిరుగుతూనే ఉంటావని ,సంతానం కూడా
లేకుండా పో తుందని దక్షుడు శపిస్తా డు .బ్రహ్మ వైవర్త పురాణం లో ఈ కధ ఉంది . .

                     కలహా భోజనుడు నారదుడు

    తాను విన్న ,తెలుసుకొన్న విషయాలను ఇంకొకరికి చెప్పక పో తే నారదుడి కి నిద్ర


పట్ట దు, .తోచదు కూడా .అదే కలహా కారణం అయింది .దానివల్ల అపో హలు
ముసురుకొన్నాయి .చివరికి ఆనందం ,శాంతి సంతృప్తి .అయితే నారదునికి మాత్రం తిట్లు
,అక్షింతలూను .విష్ణు వు రామావతారం దాలుస్తా డని వాల్మీకికి చెప్పిన వాడు నారదుడే
.జలన్ధ రాసురుని వధకు నారదుని నేర్పే కారణం .అలాగే గరుత్మంతునికి పాముల పై కోపం
నారదుని వల్ల నే కలిగింది .కాలయవనుని వధ  కూడా నారద నిర్వాకమే .ఇలా తంపుల
మారిగా మారాడు ఇదంతా లోక హితం కోసమే. ఇందులో ఆయన స్వార్ధం ఇసుమంత కూడా
లేదు .

             వరాహ పురాణం లో నారదుడు రావణుని దగ్గ రకు వెళ్లి ‘’నరులను జయించానని
గర్వ పడుతున్నావు .దేవతలు ,యముడు మదించి ఉన్నారు .వాళ్ళను ఓడించు ‘’అని
ఎక్కేశాడు .యముడి దగ్గ రకు వెల్లి ‘’రావణ గర్వం పెరిగి పో యింది .నీ పైకే వస్తు న్నాడు
చూసుకో కాసుకో ‘’అని ఉసి గోల్పాడు

             మహిషాసురుని వల్ల లోకం బాధ పడుతోందని ‘’నారాయణి ‘’కి తెలిపి, మళ్ళీ
వాడిని చేరి ‘’మలయసానువుఅలలో అందమైన నారాయణి ఉంది .చే బట్ట మని
‘’ప్రో త్సహించాడు .చివరికి మహిషాసుర మర్దని ఆమె అయినా ప్రో త్సాహం అంతా నారదునిదే
.ఈ విధం గా అసుర సంహారానికి తగిన ప్రా తి పదిక లేర్పరచి ,మానవ లోకానికి మహత్త ర
సౌభాగ్యాన్ని కల్పించాడు .కలహభోజనుడైన నారదుడు .లోక హితమే నారదుని  మతం .

జ్ఞా నదుడు మహర్షి నారదుడు -5

                    విజ్ఞా న ప్రదాత నారదుడు

   ఆపదలో ఉన్న వారికి భగవద్ విలాసం తెలిపి చిత్తా నికి శాంతి కల్గిస్తా డు నారద మహర్షి.అకంపనుడు పుత్రశోకం తో విలపిస్తు ంటే ‘’మృత్యు
స్వభావం ‘’తెలియ జేసి ఊరట కల్గిస్తా డు .సృన్జ యునికి పదహారు రాజుల చరిత్ర చెప్పి దుఖోప శమనం కల్గించాడు .అతని పుత్రు ని కూడా
రెండు సార్లు తానే బ్రతికించి మామ గారి వంశాన్ని నిలబెట్టా డు .హిరణ్య కశిపుని భార్య లీలావతి ని దేవేంద్రు డు సంహరింప బో తే ,ఆమె గర్భం
లో పెరుగుతున్నది పరమ భాగవతోత్త ముడైన ప్రహ్లా దుడు అని తెలిపి ఆమె ను కాపాడాడు .గర్భం లోనే ఉన్న ప్రహ్లా ద శిశువుకు భగవద్
భక్తిని నేర్పాడు .ధర్మరాజాదులకు అవసర మైన నీతి బో ధ చేశాడు .రామ లక్ష్మణులు నాగాస్త ం్ర చేత బంధింప బడితే గరుత్మంతుని
స్మరించమని హితవు చెప్పి అపాయం నుండి కాపాడిన వాడు నారద మహర్షి .

                         మార్గ దర్శి మహర్షి నారదుడు

    శ్రీ మద్రా మాయణం లో వాల్మీకి మహర్షికి సందేహం కలిగింది .తన సందేహాలను తీర్చగలిగేది నారద మహర్షి యేనని గ్రహించాడు
‘’తపస్వాధ్యాయ నిరతం –తపస్వీ వాగ్విదాం వరాం

 నారదం పరి ప్రపచ


్ర ్చ –వాల్మీకిర్ముని పుంగవం ‘’-తపస్సు ,వేదాధ్యనలలో నిరంతరం నిరతుడైన నారద మహర్షిని ,వాక్య వేత్తలలో శ్రేష్టు డైన
వాడిని, తపస్వి వాల్మీకి ప్రశ్నించాడని అర్ధ ం .ఇందులో వాల్మీకి కి నారదుని లో ఎన్ని విశేషణాలుకనిపించాయో చూశారు కదా .
  ‘’కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ ,కస్చ వీర్యవాన్ –ధర్మజ్నస్చ క్రు తజ్ఞ స్చ –సత్య వాక్యో దృఢవ్రతః –చారిత్రేనా చ కో యుక్త సర్వ
భూతేషు కొ హితః –విద్వాన్ కః కస్య మర్ధ శ్చ ,కశ్చైవ ప్రియ దర్శనః –ఆత్మవాన్ జిత క్రో ధో ద్యుతిమాన్ కోనసూయకః –కస్య బిజ్యతి దేవాశ్చ –
జాత రోష స్య సంయుగే ‘’

       అని వాల్మీకి అడిగిన ఈ ప్రశ్నలకు మహర్షి నారదుడు సూత్రప్రా యం గా శ్రీ రామ చరిత్ర ను చెప్పి ,జ్ఞా నాన్ని కలిగిస్తా డు .వ్యాస మహర్షి
వచ్చి ‘’అన్నీ నీకే తెలుస్తా యి ‘’అని ప్రో త్సహించాడు వాల్మీకిని .ఈ విధం గా అవసర సమయం లో వచ్చి కర్త వ్య బో ధ చేసి ,జ్ఞా న భిక్ష పెట్టి
మార్గ దర్శనం చేసిన మహాను భావుడు నారదుడు .ఆదికవినీ ,ఆది కావ్యాన్ని ప్రపంచానికి అందజేసిన మహర్షి .’’సా తరతి –లోకాన్
తారాయతి ‘’అన్న దాన్ననుసరించి తాను తరించి లోకాన్ని తరింపజేసే వారే మహాత్ములని పించుకొంటారు .ఆ కోవకు చెందిన వాడే
నారదుడు .ధన్య జీవి సందిగ్ధా వస్త లో ఉన్న జీవులకు తగిన మార్గ నిర్దేశం చేసి ,వారి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి వారిచే ఉత్త మ ఫలితాన్ని
లోకాలకు అందజేసే మహానేర్పు నారదునిది .అందుకే పధ నిర్దేశకుడు అని పించుకొన్నాడు .సూక్ష్మం గా రామ చరితను వాల్మీకి మనస్సు
లో ఆవిష్కరింప జేశాడు .మహర్షి ప్రేరితుడైన కవి వాల్మీకి మహాద్భుత కావ్య గానం చేసి ,మహో న్నత ఆదర్శ దాంపత్యాన్ని ఇలలో సీతా
రాములుగా తీర్చి దిద్దా డు .

జ్ఞా నదుడు మహర్షి నారదుడు -6

          వ్యాసునికి కర్త వ్య బో ధ

         వ్యాస భట్టా రకుడు వేద విభజన చేశాడు .వేదాంత రచనా పూర్తీ చేశాడు .అష్టా దశ పురాణాలు ,బ్రహ్మ సూత్రా లు రచించాడు .పంచమ
వేదమైన మహా భారతాన్నీ రాసి ,ఐతిహాసికత ను సాధించాడు .అయినా మహర్షి మనసు వ్యాకులం గానే ఉంది .’’హరికి యోగి వరుల
కభిలషితంబైన భాగవతంబు బలుక నైతి ,మోసమయ్యే దెలివి ,మొనయాడు మరచితి ‘’అని చింతిస్తు న్న సమయం లో నారద మహర్షియే
కదా జ్ఞా న ప్రదాతా మార్గ దర్శి వెంటనే ప్రత్యక్షమయ్యాడు .ఆయన మూర్తి మత్వాన్ని పో తన గారు అద్భుతం గా వర్ణించి కళ్ళకు కట్టి నట్లు
చూపించాడు .

‘’తన చేతి వల్ల కీ తంత్రీ చయంబున ,సతత నారాయణ శబ్ద మొప్ప

  నానన సంభూత హరి గీత ,రవ సుధా ధారల యోగీంద్ర తతులు సో క్క

  కపిల జటా భార కాంతిపుంజంబుల దిశలు ప్రభాత దీధితి వహింప

  దనులగ్న తులసికా దామ గంధంబులు గగనాంత రాళంబు గప్పి కొనగ

  వచ్చే మింత నుండి వాసవీ నందను –కడకుమాటలాడ గడక తోడ

  భద్ర విమల కీర్తి పారగుడారూఢ-నాయన విశారదుండు నారదుండు ‘’

         వచ్చిన నారదుడి ని ‘’వినయైక విలాస ,నిగమ విభజన విద్యా జనితోల్లా సున్ భవ దుఃఖ నిరాసున్ గురు మనో వికాసుడు ‘’అయిన
వ్యాసుడు సాదరం గా ఆహ్వానించాడు .విషయం తెలుసుకోవాలని ‘’విపంచి ‘’మీటుతూ నవ్వు ముఖం తో అడిగాడు .

’’దాతవు ,భారత శృతి విధాతవు ,వేద పదార్ధ జాల ,వి

 జ్ఞా తవు ,కామ ముఖ్య రిపు షట్కవిజేతవు ,బ్రహ్మ తత్వ ని


 ర్నేతవు ,యోగి నేతవు ,వినీతుడవీవు ,చలించి ,చెల్లరే ‘

కాతురు కైవడిన్ ,వగవ ,గారణ మేమి బరాశారాత్మజా ?’’అని ప్రశ్నిస్తే

 ‘’అజు తనూజుడివి ,పురాణ పురుష భవనము పదములు మెట్టిన వాడివి మహా ప్రబధాలన్నీ తుద ముట్టా వు .త్రిలోక సంచారివి
సర్వజ్నుడివి ,నీకు తెలియని ధర్మం ఉండదు .నాయీ కొరతకు ధర్మోపదేశం చేయి మహాత్మా ‘’అని బావురు మన్నాడు వ్యాసర్షి .అప్పుడు
నారద సంయమీన్ద్రు డు

‘’అంచిత మైన ధర్మ చయమంతయు జెప్పితి ,వందులోన నిం

 చించుక గాని విష్ణు కధ లేర్పడ జెప్పవు ,ధర్మముల్ ,ప్రపం

 చించిన మెచ్చునే మగున విశేష లేన్నిన గాక ,నీకునీ

కొంచెము వచ్చు టేల్ల ,హరిగోరి ,నుతింపమి నార్య పూజితా ?’’అంటూనే శ్రీ హరి నామ స్మరణ లేని కావ్యం యోగ్య మైనడి కాదు అని
తెలియ జేస్తా డు .

‘’హరి నామ స్తు తి సేయు కావ్యము ,సువర్నామ్భోజ హంసావళీ

  సురుచి భ్రా జిత మైన మానస సరస్పూర్తిన్ వెలుగొందు ,శ్రీ

 హరి నామ స్తు తి లేని కావ్యము ,విచిత్రా ర్దా న్వితమయ్యు ,శ్రీ

 కరమై యుండద యోగ్య దుర్మలిన వత్కాకోల గర్తా క్రు తిన్ ‘’

  నిరుపాధిక మైన జ్ఞా న మైనా హరి భక్తి లేక పో తే విశేషం గా శోభించదు .ఫలం కోరకుండా ఈశ్వరునికి సమర్పణ చేయక పో తేప్రా స్త ్యం కాదు
.భక్తీ హీన జ్ఞా న ,వాచా కర్మ కౌశాలాలన్నీ నిరర్ధకం .కనుక యదార్ధ దర్శనుడవు ,సత్య రాతుడవు ,ద్రు త వ్రతుడవు కనుక వాసు దేవు లీలా
విశేషాలు భక్తితో వర్ణించు ‘’అని విష్ణు మహిమ వర్ణించి కర్త వ్య బో ధ చేస్తా డు మహర్షి నారదుడు వ్యాస మహర్షికి

  ‘’వినుతి సేయుమీవు ,వినికి యు,జదువును –దాన మతుల  నయము ,దాపము ద్రు తియు

    గలిమి లెల్ల ఫలము గాదె పుణ్య శ్లో కు –గమల నాదు బొ గడ గలిగే నేని ‘’అని చెప్పి తన పూర్వ వృత్తా ంతాన్ని అంతటిని వివరిస్తా డు
.తాను దాసికొడుకు గా పుట్టి విష్ణు సాయుజ్యాన్ని పొ ందటం కోసం ఎలా ప్రయత్నించాడో వివరించాడు .

జ్ఞా నదుడు మహర్షి నారదుడు -7

 వ్యాసుని సందేహం తీర్చి ఇంకా ఇలా అంటున్నాడు మహర్షి నారదుడు ‘’తీర్ధ పాదుడైన దేవుండు విష్ణు ండు –దన చరిత్ర మేన దవిలి పాడ-
జీరబడ్డ వాని చెలువున నే తెంచి –ఘనుడు నా మనమున గాన వచ్చు ‘’

   అంతే కాదు –‘’వినుమీ సంసారంబను –వననిధి లో మునిగి కర్మ వాంఛల చే వేదన బొ ందెడు వానికి –విష్ణు గుణ వర్ణ నము తెప్ప
సుమ్ము మునీంద్రా ‘’అని భక్తి తోనే అన్నీ సాధించగలం అన్న విశ్వాసాన్ని కలిగించి వెళ్ళాడు .

                 బ్రహ్మ దేవుని ద్వారా ప్రపంచ ప్రకారం తెలుపుట


        భాగవత ద్వితీయ స్కంధం లో జనమేజయ మహా రాజు శుక యోగీన్ద్రు ని –అసలు సృష్టి ఎలా జరిగిందో వివరించమని అడుగుతాడు
.అప్పుడు నారదుడు ఇదే ప్రశ్న ను బ్రహ్మ దేవుని అడుగుతాడు .అయన చెప్పిన సమాధానమే తాను జనమేజయునికి చెబుతానని
వినమని చెప్పాడు .

‘’ప్రా రంభాది వివేక మెవ్వ డో సగుం –బ్రా రంభ సంపత్తి కాధారం బెయ్యది ?-ఏమి హేతువు యదార్ధ ంబే స్వరూపంబు –సంసారానుక్రమ మూర్ణ
నాభి పగిదిన్ సాగించే దో క్కప్పుడుం –భారం బెన్నడునీమనువు దుష్ప్రాపంబు వాణీశ్వారా ‘’అని తండ్రి అయిన బ్రహ్మ దేవుని కొడుకు
నారదుడు ప్రశ్నించాడు .’’

   ‘’నువ్వే రాజువి అని నేను అనుకొంటున్నాను నీకంటే ఘనుడు ఉన్నాడా ?ఏ లాభం తో ఈ సృష్టి చేశావు ?ఎక్కడ ఈ చేతన అంతా
జన్మిస్తు ంది ,నిలిచి ఉంటుంది ,అంతమవుతుంది ?వివరించు అంతే కాదు నీపైన కూడా ఈశుడు అనే వాడుంటే ,ఆతని వివరణ కూడా చెప్పు
.నాకు ఈ వివరాలన్నీ తెలిస్తే మిగిలిన వారందరికీ యదార్ధ ం వివరించి చెప్పగలను ‘’అని సవినయం గా అడిగాడు .బ్రహ్మ చాలా సంతోషించి
‘’పూర్వం నుండి ఎవరూ ఇలా నన్ను అడిగిన వారు లేరు .’’నా విభుని మర్మ మడిగితి వి –వత్సా ‘’అని పొ ంగిపో యాడు సృష్టికర్త .,అయిన
వాణీ నాధుడు .సవివరం గా తెలుపుతానని హామీ ఇచ్చి వివరించాడు నారద మహర్షికి

      ‘’నేను ఇంత సృష్టి ని చేయగలనా ?ఇదంతా శ్రీహరి మాయ .అతడే మనందరికీ ఈశ్వరుడు .

‘’ఆ ఈశుడు అనంతుడు హరి –నాయకుడే భువనములకు నాకున్ ,నీకున్

 మాయకు ,బ్రా ణివ్రా తము –కీయెడలన్ లేద ఈశ్వరేతరము సుతా ‘’

 ‘’భువనాత్మకు డాఈశుడు –భవనాక్రు తి తోడ నుండు బ్రహ్మాన్డ ంబున్

   వివరముతో ,బదునాలుగు –వివరంబులు గా నోనర్చే విశాడంబుగన్ ‘’

‘’పరమాత్ముండజు డే జగంబు బ్రతి కల్పంబందు గల్పించు ,దా

బరి రక్షించును ,ద్రు ంచు ,నట్టి యనఘున్ ,బ్రహ్మాత్ము ,నిత్యున్ ,జగ

ద్భరితుం ,గేవలు నద్వితీయుని ,విశుద్ధ జ్ఞా ను ,సర్వాత్ము ,నీ

శ్వరు ,నాద్యంత విహీను ,నిర్గు ణుని ,శశ్వ న్మూర్తి జింతించెదన్ ‘’

అని ఈశ్వర తత్వాన్ని స్పష్ట ం గా కమ్మగా వర్ణించాడు భక్తి ప్రపత్తు లతో .అంతేకాదు –ఎంత వారి కైనా అజ్ఞా నం లో ఉంటె ఈశ్వర దర్శనం కాదు
.అన్న పరమ సత్యాన్ని ఎరుక పరచాడు  

 .నారదుని జీవితం లో ఇది అనేక సార్లు అనుభవమయిన పరమ సత్యమే

 ‘’సరసగతిన్ ,మునీంద్రు లు ప్రసన్న శరీర హృషీక మానస

 స్ఫురణ గలప్పు డవ్విభుని ,భూరి కళా కలిత స్వరూపముం

 దర మిడిచూతురేప్పుడు ,గుతర్క తమోహతి చేత ,నజ్ఞ తం


  బొ రసిన యప్పుడవ్విభుని మూర్తి గనుంగొన లేరు నారదా “”

   అని మొదలు పెట్టి నారాయణ ,దశావతారాలన్నీ వివరించి చెప్పాడు ఈ విధం గా గడుసుగా నారదుడు అసలు సృష్టి కర్త చేతనే ఆ సృష్టికి
ఆద్యుడు అయిన పరమాత్మ విశేషాలను  ,జగదుత్పత్తి ని , ,అవతారాల పరంపరా అన్నీ అడిగి చెప్పించుకొని మనకు తెలియ జేసిన మొదటి
శ్రో త నారద సంయమీన్ద్రు డు .

జ్ఞా నదుడు మహర్షి నారదుడు –8

             ద్రు వునికి ఉపదేశం

     తల్లి మాట మీద ‘’నిజ ధర్మ పరిశోధన ‘’కోసం రాజధాని ని వదిలి వస్తు న్న ధ్రు వ బాలకునిసంగతి నారదుడు తెలుసుకొన్నాడు
.ఆయన్ను ఎవరూ పిలువనక్కరలేదు .స్వయం గా వచ్చి కర్త వ్య బో ధ చేస్తా డు .అగణితమైన కీర్తిని సంపాదించ బో యే ద్రు వునికి తగిన
మార్గ ం సూచింప గలవాడు నారదుడు కాక వేరొకరు సమర్ధు లు కారు .ధ్రు వుడిని చూసి ఇలా అనుకొన్నాడు మహర్షి .’’మాన భంగం
సహించని క్షత్రియ ప్రభావం అద్భుతం కదా !బాలకుడైనా పిన తల్లి దురోక్తు లకు మనసు వికలమై సత్యాన్వేషణ కోసం బయల్దే రాడు .’’అని
ఆనందించి ,ఆ బాలకుని శిరాన్ని తాకి ‘’హస్త మస్త క ‘’జ్ఞా నం అందించాడు .అతనికి కర్త వ్యమ్ తెలుపుతూ ఇలా అంటాడు నారదుడు
‘’నాయనా !వివేకం గలవాడు సుఖ దుఖాలను దైవ వశం గా భావిస్తా డు .దైవ వశం చేత లభించిన దానితో సంతుష్టి చెందాలి .వాడే విమల
జ్ఞా ని ‘’అన్నాడు .

    ధ్రు వుడు ‘’మహానుభావా ! నాకు మనశ్శాంతి లేకుండా పో యింది..త్రిభువనోత్క్రుస్ట మైనదీ ,అనన్యాధీష్టిత మైనదీ అయిన పదవి
పొ ందటానికి నాకు మంచి మార్గ ం సూచించండి .’’అని విన్న విన్చుకొన్నాడు .ధ్రు వుడిని ప్రేరేపించింది ‘’ధీర జనోత్తముడు వాసుదేవుడే
‘’కనుక ఆయన్నే ‘’అజగ్ర ధ్యాన ప్రణవ చిత్త ం తో ‘’భజించమని ఉపదేశిస్తా డు నారద మహర్షి ..బాలడు కనుక వేదాధ్యయనానికి అనర్హు డని
,స్వస్తిక ఆసనం పై కూర్చుని ప్రా ణా యామం  చేత స్తిర సంకల్పం తో శ్రీ హరి ని ప్రా ర్ధించమని చెప్పాడు .అతని లేత మనసులో అద్భుత
సుందర శ్రీ మహా విష్ణు వు రూపం అచ్చు పడేట్లు వర్ణించి చెబుతాడు .దాని ప్రభావం అత్యధికం .ఆ రూపాన్నే ధ్యానించి వాసుదేవ మంత్రా న్ని
ఉపదేశించి ఆర్చించమని బో ధ చేశాడు .

‘’ఆశ్రిత సత్ప్రసాదాభి ముఖున్డు ను ,విద్ధ ప్రసన్నాననేక్ష ణుండు

 సురుచిర వాసుండు ,సుభ్రూ యుగుండును సుకపో ల తలుడును సుందరుండు

హరి నీల సంశోభితాంగుండు ,దరుణుండు,నరుణావలోక నోష్టా ధరుడు

గరుణా సముద్రు ండు,బురుషార్ధనిధీయు ,బ్రణతాశ్రయుండు ,శోభన కరుడు

లలిత శ్రీవత్స లక్షణ లక్షితుండు ,సర్వ లోక శరణ్యుండు ,గర్మ సాక్షి

పురుష లక్షణ యుక్తు ండు ,బుణ్య శాలి యసిత మేఘ నిభ శ్యాము డవ్య యుండు ‘’

    ‘’హార కిరీట ,కేయూర కంకణ ఘన భూషనుండాశ్రిత పో షకుండు

     లలిత కాంచీ కలాప శోభిత కటి మండలుండంచిత కుండలుండు

     మహనీయ కౌస్తు భ మణి  ఘ్రు ణి,చారు గ్రైవేయ కుందానంద దాయకుండు


   సలలిత ఘన శంఖ చక్రగదాపద్మ హస్తు ండు భువన ప్రశసస్తు ,డజుడు

   గమ్ర సౌరభ వనమాలికా ధరుండు ,హత విమోహుండు ,నవ్య పీతాంబరుండు

   లలిత కాంచన నూపురాలన్క్రుతుండు ,నిరతిశయ సద్గు ణుడు దర్శనీయ తముడు ‘’

    సరస లోచన ముత్కరడును –హ్రు త్పద్మ కర్ణికా నివాసిత వి

    స్ఫుర దురు ,నఖ మణిశోభిత చరణ –సరోజాతు దతుల శాంతుడనఘున్ ‘’

             అని నఖ  శిఖ పర్యంతం ఆ శ్రీహరిని ,పరంధాముడిని నోరారా వర్ణించి ,అతని చిత్తా న్ని సుముఖం చేశాడు .అది అమోఘం గా పని
చేసింది .దూర్వారాన్కారాలతో ,నీటితో తులసీ దళాలతో మాలల తో ,పత్రా లతో వన మాలలతో వస్త్రా లతో భక్తిగా పూజించమని ,దృఢ మైన
శాంత చిత్త ం తో ,మంచి ఆచారం తో మంగళ గుణాలతో ,మిత భోజనం తో మెలగాలని హెచ్చరించాడు .అంతే కాక విష్ణు వు
మాయావతారాలలో అచింత్యం గా ఏం చేస్తా డో అది అంతా హృదయ గతం చేసుకొని తన పనిని అంతా మనో వాక్కాయ కర్మ లతో భక్తితో ,ఆ
సర్వేశ్వరునికి సమర్పించమని వివరం గా చెప్పాడు .భక్తితోనే మోక్షం సాధించాలని బో ధించాడు .ఆ విధి విధానాన్ని అంతటిని ధ్రు వుడు
పాటించి ,హరి సాక్షాత్కారం పొ ంది ,ద్రవ తార గా మిగిలి, తన మనో భీష్ట మైన శాశ్వత పదం పొ ంది కృత మనోధుడయ్యాడు . .

జ్ఞా నదుడు మహర్షి నారదుడు -9

      ఇంత చేసి నారదుడు ఊర్కొంటాడా ?వెంటనే ఉత్తా న పాద మహా రాజుదగ్గ రకు  వెళ్ళాడు ఆయన పూర్వం జరిగిన దంతా మహర్షికి విన్న
విన్చుకొన్నాడు అప్పుడు నారద మహర్షి రాజా ! నీకుమారుడు

‘’దేవకిరీట రత్న రుచి దీపిత పాద సరోజుడైన ,రా

 జీవ దళాక్షరక్షితు ,డశేష జగత్పరికీర్తనీయ ,కీ

 ర్తి విభవ ప్రశస్త సుచరిత్రు డు ,వానికి దుఖమేటికిన్ ‘’ అని ఊరడించి అతడు సుకర్మ చేత

‘’సమస్త లోక పాలావలి కందరాని సముదంచిత ,నిత్య పదంబు

నం బ్రభుశ్రీ విలసిల్ల జెందు ,దులసీ ళదాము ,భజించి

యా జగత్పావనుడైన ,నీ సుతు ప్రభావ మేరున్గ వు నీవు భూవరా “’అని ధ్రు వ కుమారుడు పొ ంద బో యే మహో త్క్రుస్ట స్థితిని వివరించి తండ్రి
మనసుకు శాంతి చేకూరుస్తా డు నారదమహర్షి

‘’నీ కీర్తియు జగముల యంద-దా కల్పము నొంద జేయు ,నంచిత గుణ ర

   త్నాకరుడట కేతేన్చును –శోకిమ్పకు మాతని గూర్చి సుభగా చరిత్రా ‘’అని కూడా తెలిపి ఊరట కల్గిస్తా డు .ఇలా ధ్రు వో పాఖ్యానం లో భక్తీ
మార్గా న్ని ,తండ్రికి మనశ్శాంతి ని ఉపదేశించి తన ధర్మాన్ని నేర వేరుస్తా డు .ధ్రు వుడు ఆదర్శ భక్తీ ధ్రు వ తార గా వేలుగొండటానికి తగిన
మార్గ ం చూపించాడు .భక్తికి పరా కాస్ట గా నిలిచి ,తగిన శిష్యుడని పించుకొన్నాడు .

           ప్రా చీన బర్హి కి జ్ఞా న బో ధ


హవిర్దా ననుడి కుమారుడు బర్హిష్మంతుడు .ఎప్పుడు యాగం చేస్తూ ,ప్రా చీనాగ్రం కల దర్భల చేత భూమి అంతటిని కప్పివేసే శాడు .అందుకని
ప్రా చీన బర్హి అని పేరొచ్చింది యజ్న యాగాలపై అమితా శక్తి ఉన్న ఇతనిని కర్మ మార్గ ం నుంచి జ్ఞా నమార్గ ం వైపు మరలించాలని నారదుడే
రంగ ప్రవేశం చేశాడు .ఈ కర్మల వల్ల శ్రేయస్సు లభించదని చెప్పాడు .బర్హి మహర్షిని తనకుమోక్ష మార్గ ం చూపించమని,జ్ఞా నోపదేశం
చేయమని కోరాడు .ఇది భాగవతం లో చతుర్దా స్కంధం లో ఉంది

   నారదుడు ‘’పురంజనుడు ‘’అనే వాని కదా ను వివరించి చెప్పాడు .పురంజనుడు హిమవత్పర్వత ప్రా ంతం లో తొమ్మిది ద్వారాలు కల
పురం తనకు అనుకూలం గా ఉందని భావించి ప్రవేశించాడు .అక్కడ అందమైన ‘’ప్రమదో త్తమ ‘’అనే కోరిక పై ఆ పురాదీశ్వరుడైనాడు
.ఆమెతో కొంతకాలం ఉండి ,చెప్పకుండా ఒక రోజు వేటకు వెళ్ళితిరిగి వచ్చాడు ..ఆమె దుఖాన్ని చూసి ఉపశమింప జేశాడు .ఇక ఎప్పుడూ
వెళ్ళనని ఆమెతోనే కలిసి ఉంటానని మాట ఇచ్చాడు .సంతానం కలిగినా భార్యే పరమావధి గా జీవించాడు

         ఇంతలో ‘’చండవేగుడు ‘’ .అనే గంధర్వుడు డాడి చేశాడు .పరాధ్యక్షుడు ‘’ప్రజా గరుడు ‘’గంధర్వుని ఓడించాడు .ఆ తర్వాత
‘’భయుడు ‘’,కాల పుత్రిక పురంజన నగరం చేరాడు .కాల పుత్రికి పురంజనుడు లొంగి పో యాడు .చివరికి ఆ పురాన్ని వదల లేక వదిలి
వెళ్ళాడు .ప్రజాగరుడుడనే మయుని సో దరుడు నగరాన్ని తగుల బెట్టా డు .పురంజనుడు భార్యనే స్మరిస్తూ ప్రా ణాలు విడిచాడు .పూర్వం
ఇతని చే హిమ్సింప బడ్డ యజ్న పశువులు నరక లోకానికి వచ్చిన పురంజనుడిని గొడ్డ ళ్ళతో నరికి పారేశాయి .ప్రా ణాలు పో తున్నా ,భార్యనే
తలచు కోవటం వాళ్ళ తర్వాత జన్మ లో విదర్భ రాజ గృహం లో స్త్రీ గా పుట్టా డు .అప్పుడు మలయకేతువు అనే వాడు ఈమెను వివాహం
చేసుకొన్నాడు

        ఈ కధలో దేహం పై మొహం పో వాలని శాశ్వత సత్యాన్ని తెలుసుకొని చేరాలని ,మధ్యలో వచ్చేవన్నీ ,మిధ్యే నని చక్కని కదా
సంవిధానం తో వివరించాడు నారదుడు .కధలోని గూడార్దా లనూ వివరించాడు .ప్రా చీన బర్హికి .పంచారామాలు అంటే పంచెంద్రియాలని
,నవద్వారాలు అంటే శరీరం లోని నవ రంద్రా లని ,ఏక పాలన అంటే ప్రా ణ పాలనం అని ,త్రికోస్టా లు అంటే తేజో విశేషాలని ,విపనాలు అంటే
కర్మేన్ద్రియాలే నని ,పంచ ప్రకృతి అంటే పంచ భూతాలని చెబుతూ ,ప్రకృతి యే‘’కామిని ‘’అని ఇలాంటి దేహ పురం లో నివశించే వాడే
పురుషుడని ,అజ్ఞా నం వల్ల దీని పై మొహం పెంచుకొని మానవులు ఉత్త మ గతిని చేర లేక పో తున్నారని చక్కగా వివరం గా చెప్పి దేహ
భ్రా ంతి తొలగింప జేశాడు ‘’వైదర్భీ జనిత సంభావిత సుఖా భావం ,దుఖం చేత ‘’పాపిష్టి దశ లో ఉన్నావని హెచ్చరించాడు .చివరగా సత్య
జ్ఞా న దర్శనం చేస్తూ హంసి –హంస తో చెప్పి నట్లు గా ‘’నీవు వై దర్భివి కావు –వీరు డితడు వివరింప గా గాడువిభుడు నీకు నొగి మున్ను
పురమున నుప రద్ధు జేసినా యా పుర జనపతి వరయు గావు మరియు నీ వన్య సీమంతిని యని యును జర్చింప గా బూర్వ జన్మ
మందు బురుషుండ వనియు బుద్ధి దలంచుట యరయంగ నీ యు భయము ,నీ సత్య మింక యు ,మామ కీన మై ఎసగు మాయ జేసి
,కల్పిత మయ్యే జర్చింప మనము –పూర్వమున హంసలమ యని పూరి ఎరుమ్గ –బలికితి దెలియ మనల రూపంబు జూడు ‘’అని
భగవంతుడే జీవుడే జీవుడే పరమేశ్వరడనీ రెండూ ఒకటేనని ఆ సంగతి తెలియక అజ్ఞా నం తో అలమటిస్తు న్నామని అద్భుతం గా కధనం
నారదుడు చెప్పి బర్హి మనసును జ్ఞా నం వైపుకు మళ్ళిస్తా డు  .

జ్ఞా నదుడు మహర్షి నారదుడు -10

 ప్రా చీన బరక


్హి ి ఇంకా వివరాలు చెబుతూ నారద మహర్షి ‘’హరి పాద యుగాళాలే అన్నిటికి శరణ్యం

‘’ఘన పురుషార్ధ భూతమనగా దగు నాత్మకు ,నే నిమిత్త మై

   యొనర ,ననర్ధ హేతువన నూల్కును సంస్కృతి సంభవించు,న

   నట్లే నయము ,దన్నిమిత్త ము పరిహారకు మర్ది జగద్గు రుండు ,

    నా దనరిన వాసుదేవ పరితామర స్ఫుట భక్తీ యారయన్’’


  కనుక ‘’చిర వైరాగ్య జ్ఞా న జనక మైన భక్తి నిదానం గోవింద వర కధాశ్రయమే ‘’అవుతుంది .విష్ణు గుణ గానం చేసి తరించమని
‘’బో ధిస్తా డు .

‘’సరసో దార మహాత్మము –ఖరితము లగు మధు విరోధి కమనీయ గుణో

  త్కర ,సురుచిర చరితామృత –పరి పూరిత వాహినులను బరమ ప్రీతిన్

  మన మలరగ శ్రో త్రా న్జ లు –లను బాణము సేయు పుణ్యులకు క్షుత్రు ష్నా

  ఘనభయ శోక విమోహము –లనయంబును సో కకుండు నవనీ నాధా ‘’

అని వివరిస్తూ ‘’సర్వేశ్వర కదా మృత వాహిని యందు రతి ‘’ని కలిగి ముక్తి పొ ందమని ఉపదేశిస్తా డు .

            మహా వేదాంతులు తపో దనులైన మహర్షు లు కూడా ‘’ఈశ్వరుని వెదకియు గానరు ‘’అని తెలియ జేస్తూ

‘’ఘన విస్తా ర ,మపార,మద్వయ ,మనంగా ,నొప్పు వేదంబు ,దా

  మను వర్తించుచు ,మంత్ర యుక్త వివిధం బై నట్టి దేవాఖ్య ,శో

  భన ,సామర్ధ ్యము చేత ,నింద్ర ముఖ రూపం ,బిస్ట దైవంబుగా

  గని వేడ్కన్ ,భజియించువారలు ,గనంగా ,నేర్తు రే ఈశ్వరున్’’అంతేకాదు

  ‘’విను మాత్మ భావితుండన –నెనసిన భగవంతు దెప్పు దేవ్వని గరుణం

     దనరుచు ,ననుగ్రహించును –మనుజేశ్వర యపుడ వాడు మహితాత్మకుడై

ధీరత నీ లోక వ్యవహారంబును –వైదికంబు నన దగు కర్మా

 చారము లందు వినిష్టిత –మై రూఢి దనర్చు బుద్ధి నర్దిన్ వీడుచున్ ‘’

సర్వేశ్వర పరి తోషకమేదో అదే కర్మ .ఆ సర్వేశ్వరుని యందు బుద్ధిని ఉంచటమే విద్య .అతడే అన్నిటికి పరమాత్మ .ఆ పద పద్మాలే
క్షేమకరం .,మోక్షకరం .అని స్పష్ట ం చేస్తా డు .జ్ఞా నం ఒంట బట్టిన బర్హి  నారద మహర్షికి మనసారా కృతజ్ఞ తలు చెప్పుకొంటాడు

‘’ముని వర భగవంతుండవు –ననుపమ విజ్ఞా న నిదివి ,ననదగు నీచేత ను

వివరింపంగా దగి –యెనసిన ఈ యాత్మ తత్వమిత నా చేతన్ ‘’అని అంటూ

 ‘’లోకాంతర ,దేహాంతర భావి యయిన ఫలం ఎలా లభిస్తు ందో తెలియ జేయమని వేడుకొంటాడు

లింగమయ శరీరానికి కర్త ృత్వ భోక్త ృత్వ ములు స్తూ ల దేహం ద్వారా సంక్రమిస్తా యని అయితే జీవుని లో ‘’బుద్ధి ,మనో మోక్షార్ధ గుణ వ్యూహ
రూపాదులు లింగ శరీరం నశించే దాకా అంటే ఉంటాయి ‘’‘’’’చెప్పాడు మహర్షి కనుక ఇవన్నీ పో వాలంటే మనస్సును జయించాలని అదే
వీటన్నిటికి ముఖ్య కారణమి చెప్పాడు .అవిద్య వల్లే అనేక జన్మలు జీవి పొ ందుతాడు .కనుక అవిద్య నశిస్తే మోక్షమే .దానికోసం ‘’ఘన
జనన స్తితి ,ప్రళయ కారణ భూతుని ,పద్మ లోచనుని ,పరమేశుడైన ఈశుని ,రమా పతి ని ,సర్వ జగము ఆయన ఆత్మ గా భావించి
,ఆయన పద పంకజాలను ఆర్తి తో భజించాలి అని .విశదీకరించాడు

‘’అని యీగతి భగవంతుం డనఘు,భాగవత ముఖ్యుడు ‘’అయిన నారదుడు జీవేశ్వర గతిని గృపతో చక్కగా ఎరిగించాడు ‘’

            ఈ విధం గా నారదుడు ఎవరికి మనసులో దుఖం ఉన్నా ,సందేహం ఉన్నా మార్గ ం తోచక విచారిస్తు న్నా  అశాంతితో రగిలి
పో తున్నా ,ఆ హృదయం తో చక్కగా’’ ట్యూన్ ‘’చేసుకొని పిలువకుండానే అక్కడికి చేరి సందేహ నివృత్తి చేసి ,శాంతి మార్గ ం చూపి
,ఉపశాంతి కల్గించి మనసులోని చీకట్ల ను పో గొట్టి జ్ఞా న కాంతులతో నింపి ప్రవ్రు త్తి మార్గ ం నుంచి నివృత్తి మార్గ ం వైపు కు మల్లిస్తా డు ఎవరికి ఏ
రక మైన బో ధ కావాలో బాగా తెలిసిన వాడు మహర్షి .చిత్త వృత్తి ని బట్టి ఆధ్యాత్మిక చికిత్స చేయగల భవరోగ వైద్యుడు .పూర్వాపరాలను
సమన్వయిస్తా డు భగవత్ చరణమే సర్వ శ్రేయోదాయకమని మోక్ష దాయకమని వివరంగా చెప్పి వారిని ఆ మార్గ ం లోకి ఉన్ముఖీ కారణం
చెందిస్తా డు ఒక జీవిని తరింప జేశాననన్న పరమా నందాన్ని పొ ందుతాడు .తన పని అయిపో గానే ‘’నారాయణ నారాయణ ‘’అంటూ అక్కడి
నుంచి నిష్క్ర మిస్తా డు .రంగ ప్రవేశమూ అదే ‘’నారాయణ ‘’‘’స్మరణతోనే చేయటం నారదుని ప్రత్యేకత .అందుకే పరమ
భాగవతోతముడైనాడు మహర్షి నారదుడు

జ్ఞా నదుడు మహర్షి నారదుడు -11

                 శబళాశ్వు లకు నివృత్తి మార్గ బో ధన

     భాగవతం లోని ఆరవ స్కంధం లో నారద మహర్షి ఒక మహా గడుసైన పని చేస్తా డు .దక్ష ప్రజాపతికి ఆసిక్ని అనే భార్య వల్ల శబళాశ్వులు
అనే కుమారులు జన్మిస్తా రు .తండ్రి వారిని సృష్టి చేయమని కోరగా వారు నారాయణ సరస్సు దగ్గ ర తీవ్ర తపస్సు చేస్తు న్నారు .ఆ సమయం
లో తనను ఎవరో బొ ట్టు పెట్టి పిలిచి నట్లు గా పరిగెత్తు కొచ్చాడు మహతీ వీణా వాదనా నిపుణుడు నారదుడు ..ఆ పిల్లలను చూసి ‘’మీరు
మూఢ మతుల్లా ఉన్నారు .పసి బిడ్డ లు .సృష్టించటం లో ఏమి గొప్ప వుంది ?మీ అన్నలు హర్యశ్వులు సృష్టి చేయకుండానే నా మాటవిని
‘’తిరిగి ఎన్నడూ రానిలోకాలకు చేరారు .మీరు మీ అన్నలు నడిచిన మార్గ ం లో నడవరా ?బంధాన్ని వదిలి మోక్షం పొ ందండి .’’అని నివృత్తి
మార్గ ం తెలియ జేశాడు .వీరూ అన్నల దారిలో పడి ‘’పూర్వజు లేగి నట్టియా చొప్పున ,నేన్నడుం దిరగ
ి ి చూడని త్రో వ విశేష పద్ధ తిం దప్పక
‘’పో యి నాట .ఇలా దక్షుని పుత్రు లందర్నీ ‘’అద్ద రికి ‘’చేర్చి సృష్టి కార్యం కొంత కాలం నిలువరించాడు నారదుడు .అయితే దక్షుని కోపానికి
గురై పో యాడు పాపం .’’భగావతోత్త ములలో లజ్జా హీనుండవై ,యశో హానిం బొ ందు‘’తావని సకల భూతానుగ్రహం లేకుండా పో తుందని
,నిరంతరం లోక సంచారమే గతి అని శాపం పొ ందాడు దక్షుని చేత మహర్షి చంద్రు డు నారదుడు .

             దక్షుని చేతిలో ‘’పీటీ దెబ్బ ‘’తిన్న నారదుడు జితేంద్రియుడు ,సర్వ లోకైక హితైషీ కనుక ‘’ఆ క్రో ధ వాక్యాలకు  అలుక చెందక
,’’అలాగే కానీ ‘’అని సమ్మతించాడు .దొ డ్డ మనసే చూపాడు మహర్షి .లేక పో తే దక్షునికి ఏ తీవ్ర శాపమో ఇచ్చి ఉండేవాడు .అందుకనేనేమో
మన నాటక కర్త లంతా నారదుడిని విదూషకుడిగా ,తార్పుడు గాడుగా అగ్గిపుల్ల గా ,తంపుల మారిగా మార్చేసి ఆ శాపాన్ని తమ కలాలకు
వరం గా మార్చుకొన్నారు .నారదుడు అంటే ‘’అగ్గి పెట్టె –ఫెయిర్ బ్రా ండ్ ‘’అని పించేశారు .పాపం మంచికి పో తే చెడు ఎదు రైంది అంటే
ఇదేనేమో ?ఇక మగపిల్లల వాళ్ళ సృష్టి ఎలాగూ జరగదని తెలిసి ఆసక్ని వాళ్ళ ఆడపిల్లల్ని కనీ ధర్మ ,కశ్యప ,చంద్ర భూత ,ఆంగీరస
,క్రు శాశ్వులకు (10+13+27+2+2+2==56)’ఇచ్చి పెళ్లి చేశాడు .తార్కష్యుడు అనే పేరుగల కష్యపునికే ఇంకో ఆరుగురు ఆడపిల్లలను ఇచ్చి
వివాహం జరిపించాడు దక్షుడు .పుట్టించటం లోను దక్షుడే ,శపించటం లోను దక్షుడే ,అల్లు డు శివుని అవమానించటంలోను దక్షుడే అని
పించుకొన్నాడు .అల్లు ళ్ళకే పెత్తనం ఇచ్చి సృష్టి చేయించాడు .ఇలా దక్షుని సృష్టి దక్షత్వం కుమారుల నుండి కుమార్తెలకు అంటే అల్లు ళ్ళకు
సంక్రమిమ జేసిన ఘనత మన ఘనత వహించిన నారద మునీన్ద్రు లదే .తాను శాపం పొ ందినా కొడుకుల తో పాటు కూతుళ్ళకూ సమాన
వాటా దక్కింప జేశాడు మన ‘’అన్న యెన్ టి .రామా రావు’’ కు మార్గ దర్శీ అయాడు .ఘనా ఘన సుందరుని ఘనం గా కీర్తించే ఈ
ఘనుడు నారదుడు సర్వ విశారదుడు .ముందు చూపు ఉన్న .వాడు అందర్నీ సమానం గా చూసే తత్త ్వం ఉన్న వాడు గా మనకు అని
పిస్తా డు .ఒక చోట నిలిచి ఉంటె ‘’జ్ఞా న ప్రవాహం ‘’ఆగి పో తుంది కనుక ఆయనకు వచ్చిన శాపమూ మనకు వరమే అయింది అన్ని లోకాలు
తిరుగుతూ క్షేమ సమాచారాలు తెలుసు కొంటు ఆపన్నులను దరికి చేరుస్తూ నిత్య హరి నామ స్మరణ తో తరించాడు .

జ్ఞా నదుడు మహర్షి నారదుడు -12

             భక్త ప్రహ్లా ద రక్షకుడు నారదుడు

   భాగవతం సప్త మ స్కంధం లో ప్రహ్లా ద బాలకుని చెలి కాళ్ళందరికి విష్ణు భక్తి అతనికి ఎలా అబ్బిందో అర్ధ ం కాక బుర్రలు బద్ద లు కొట్టు కొని
చివరికి అతనినే అడిగశ
ే ారు .ఆశ్చర్యం గా ‘’మంటిమి గూడి ,భార్గ వ కుమారులొద్ద ననేక శాస్త మ
్ర ుల్

వింటిమి ,లేడుసద్గు రుడు వేరొక డేన్నడు ,రాజ శాల ,ము

 క్కంటికి నైన రాదు చోరగా ,వెలికిం జన రాదు ,నీకు ,ని

ష్కంటక వృత్తి ,నెవ్వడు ప్రగల్భుడు సెప్పె గుణాధ్య చెప్పుమా ?’’అడిగారు

    అప్పుడు ఆ పరమ భాగవోతోత్త ముడు ‘’నేను పూర్వం దివ్య ద్రు ష్టి గల నారద మహా ముని వల్ల సవిశేష మైన ఈ జ్ఞా నాన్ని ,పరమ
భాగవతోత్త మ ధర్మాన్ని తెలుసుకొన్నాను .’’అని సవినయం గా చెప్పాడు .తన తండ్రి తపస్సు కోసం అరణ్యాలకు వెళ్ళగా గర్భవతి అయిన
తన తల్లి లీలావతీ దేవిని ఇంద్రు డు చేర బట్టి తీసుకొని వెళ్తు ంటే దైవ యోగం గా నారద మహర్షి వచ్చి ,ఆమె గర్భం లోని శిశువు మహా భక్తు
డౌతాడని రాక్షసామ్ష ఉండదని నచ్చ చెప్పటానికి ప్రయత్నించాడట

‘’స్వర్భువనాది నాద !సురసత్త మ ,వేల్పులలోన మిక్కిలిన్

  నిర్భర పుణ్య మూర్తివి ,సునీతివి ,మానిని బట్ట నేల ?ఈ

  గర్భిణినాతురాన్ విడువు ,కల్మష మానసురాలు గాదు ,నీ

  దుర్భర రోషమున్ నిలుపు ,,దుర్జ యుడైన నిలింప వైరిపై ‘’అని నచ్చ జెప్పే ప్రయత్నం చేశాడు

 కాని ‘’వేయి కన్నుల ఠవర’’ఒప్పుకోకుండా ‘’వేల్పు దపసి ‘’తో

  ‘’అంత నిధాన మైన దివిజాదిపు వీర్యము ,దీని కుక్షి న

   త్యంత సమృద్ధి నోందెడి మహాత్మా ,కావున ,తత్ప్రసూతి ప

   ర్యన్త ము బద్ధ జేసి ,జనితార్భకు ,వజ్ర ధార ద్రు ంచి ,ని

   శ్చింతడ నై ,తుదిన్ విడంతు,సిద్ధము దానవ రాజ వల్ల భన్ ‘’అని ఇంద్రు డు తన మనసు లోని మాటను భయాన్ని వెలువరించాడు
.మహర్షి అంత మాత్రం గా వదిలే రకమా ?తన ప్రయత్నాన్ని అర్ధ ంతరం గా ముగిస్తా డా ?వేల్పు రేని తో మళ్ళీ అంటున్నాడు

‘’నిర్భీకుడు ప్రశస్త భాగవతుడున్ ,జన్మాంతరా

 విర్భతాచ్యుత పాదభక్తి మహిమా విస్టు ండు,దైత్యాంగనా


 గర్భస్తు ం డగు బాలకుండు,బహు సంగ్రా మాద్యుపాయంబులన్

 దుర్భావంబున నొంది చావడు ,భవ దో ర్దర్ప విభ్రా న్తు డై’’ అనినువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా చావడు .అతను కారణ జన్ముడు  అని
దేవముని చెప్పగా ,మన్నిన్చాడని ,తన ఆశ్రమానికి తీసుకొని వెళ్లి తన తల్లిని పుత్రికా భావం తో సంరక్షిన్చాడని తెలియ జేశాడు .ఆమె గర్భం
లో పరమ భాగవతుడైన ప్రా ణి ఉన్నాడని ,ఆమె భర్త వచ్చే వరకు తన ఆశ్రమం లోనే ఉండవలసినదని కోరాడు మహర్షి .ఆమె భక్తీ తో నారద
మునిని సేవిస్తూ భర్త రాక కై ఎదురు చూసేది .’’ఆశ్రిత శిక్షా విశారడుడైన నారదుడు ‘’గర్భం లో ఉన్న తనకు ధర్మ తత్వాన్ని ,నిర్మల
జ్ఞా నాన్ని ఉపదేశించాడు .దాని ఫలితమే తనకు లభించిందని ప్రహ్లా దుడు స్నేహితులకు చెప్పాడు .ఇదంతా చెప్పి తాను నమ్మి చరిస్తు న్న
బాట లో వారినీ సాగి పొ మ్మని హితవు చెప్పాడు .

‘’దానవ దైత్య భుజంగమ ,మానవ గంధర్వ సుర సమాజాము లో –

 లక్ష్మీ నాధుని చరణకమల –ధ్యానంబున ,నేవ్వ డైన ధన్యత నొందున్ ‘’అని చెప్పి విష్ణు వు ఏ విధం గా తమకు దక్కుతాడో వివరించి
చెప్పాడు ‘’

‘’చిక్కడు వ్రతముల ,గ్రతువుల ,జిక్కడు దానముల ,శౌచ శీల,తపములం

 జిక్కడు యుక్తిని భక్తిని ,జిక్కిన క్రియ నత్యుతుం డుసిద్ధము సుండీ ‘’అంటూ చండా మార్క గురువులు ‘’బాధ గురువులే ‘’కాని ‘’నిజ
బో ధ గురువులు కారని ‘’స్పష్ట ం చేశాడు .

 ‘’గురువులు దమకును లోబడు –తెరువులు సేప్పెదరు ,విష్ణు దివ్య

   పదవికిం ,దెరువులు సెప్పరు ,చీకటి బరువులు పెట్టంగ నేల బాలకులారా ?’అని తనతో బాటు మోక్ష ధ గాములై ,కైవల్య పదాన్ని
పొ ందమని వేడుకొంటాడు బాల ప్రహ్లా దుడు చెలి కాళ్ళతో .ఇంకేముంది ?తా చెడ్డ కోతి వనమెల్లా చేర్చి నట్ల యింది .రాక్షస వనాన్నే హరి నామ
బీజం తో చెడగోట్టా డు .శిష్యులంతా చదువు మానేసి ‘’నారాయణ భక్తి చిత్త ముల గీలించారు ‘’’ఇంత గాఢ మైన భక్తీ భావాన్ని తల్లి గర్భం లో
ఉండగానే ముద్ర వేసిన నారద మహర్షి మహత్తు మాటలకుఅంద రానిది

జ్ఞా నదుడు మహర్షి నారదుడు -13

                ధర్మ రాజు కు వర్ణా శ్రమ ధర్మ బో ధ

భాగవత సప్త మ స్కంధం లోనే ధర్మ రాజు నారద మహర్షి ని సకల వర్నాశ్రమ ధర్మాలను తెలియ జేయమని ప్రా ర్ధిస్తా డు .పరమ ధర్మ
మేమిటో కూడా తెలియ జేయమంటాడు .అప్పుడు మహర్షి తాను పూర్వం బదరికాశ్రమం లో సాక్షాత్తు శ్రీ మన్నారయణుని వలన విన్న
ధర్మాలను తెలియ జేస్తా నని చెప్పటం ప్రా రంభించాడు .

‘’అన్ని వర్ణా ల వారికి  దయ ముఖ్యం .’’తరుణి తన ప్రా ణ వల్ల భు –హరి భావము గా భజించి యతడును దానున్ –సిరి కైవడి వర్తించును –
హరి లోకము నందు సంత తానందమునన్ ‘’భర్త యేదైవం గా భావిస్తే ఉపవాస, వ్రత, తపస్సు లక్కరలేదు .అన్ని వర్ణా ల వారికీ ఉచిత మైన
విధులున్నాయి .అవి తప్పక చేయాలి .అంటూ అన్ని ఆశ్రమ ధర్మాలను వివరించి చెప్పాడు .చివరగా సన్య సించి సర్వ భూత నిర పెక్షుడై
,భిక్ష తో నిరాశ్రయం తో ఆత్మా రాముడి సర్వ భూత సముడై ,శాంత సమ చిత్త ం తో నారాయణ పరాయణుడు కావాలి .శాస్త ్ర జ్ఞా నం ఉండ
రాదు .గ్రహ నక్షత్రా ది విద్యలన్నీ వదిలేయాలి .ఒక చోట ఉండ రాదు .పరమాత్మలో విశ్వాన్ని దర్శించాలి విశ్వం లో పరమాత్మను చూడాలి
.మృత్యువు ను ద్రు వమైనది గా భావించాలి .పరమ హంస యై అంతరంగ ఆత్మాను సంధానంతో మనీషియై ఇతరులకు తానొక ‘’పిచ్చి వాడు
‘’అని నిరూపించాలి .ఈ సందర్భం గా ‘’అజాగరకద‘’వివరించాడు .
    ‘’రధము మేనెల్ల, సారధి బుద్ధి ,ఇంద్రియ –గణము గుర్రములు ,పగ్గ ములు మనము

      ప్రా ణాది దశ విధ పదీనంబు లిరుసు ,ధ –రమా ధర్మ గతులు రధాంగ కములు

      బహు ళ తరంబైన బంధంబు చిత్త ంబు –శబ్దా దికములు సంచార భూము

      లభిమాన సంయుతుం డయినయిన జీవుడు రది –ఘన తర ప్రణవంబు కార్ముకంబు

      శుద్ధ జీవుండు బాణంబు,పరులు ,రాగ –భయ మద ద్వేష శోక లోభ ప్రమోహ

      మానమత్సర్స ముఖములు మాన వేంద్ర‘’

     అని పరమోత్క్రుస్ట మైన జీవాత్మ పరమాత్మ విధానం తెలిపాడు

‘’వాదములు వేయు నేటికి ?-వేదో క్త విధిం జరించు బుధుడు గృహమం

దాదరమున ,నారాయణ –పాదంబులు గొలిచి ముక్తి పదమున కేగున్ ‘’

      ఈ విధం గా సకల ధర్మ సారం శ్రీహరి భజనమే శరణమే ,ప్రపత్తి యేనని వివరించాడు .ఆ తర్వాతా తాను ‘’ఉప బర్హణుడు ‘’గా పూర్వం
జన్మించి ఆ తర్వాత జన్మ పరంపర దాల్చి చివరకు ఈ కల్పం లో బ్రహ్మ పుత్రు నిగా జన్మించానని నారదుడు చెప్పాడు .గృహస్తు డు ఏ ధర్మం
చేస్తే మోక్షానికి వెళ్తా రో ఆ ధర్మా లన్ని పాండవావాగ్గ్రేసరుడికి వివరించి చెప్పాడు .చివరిగా ఏమి చేస్తే అభీప్సితం నేర ఉతుందో స్పష్ట పరచాడు
.నరుడుగా ఉన్న శ్రీ కృష్ణు డే ఆది నారాయణడని ,ఆయన సేవయే సకలార్ధ సిద్ధి అని ప్రకటించాడు .

 ‘’అఖిలాడజాది దుర్ల భుడు బ్రహ్మం బైన విష్ణు ండు ,నీ

  మఖమందర్చితుడై ,నివాస గతుడై ,మర్త్యాక్రు తిన్ సేవ్యుడై

సఖియై ,చారకుడై ,మనో దయితుడై ,సంబందియై ,మంత్రి యై

సుఖుడుం డయ్యె ,భవన్మహిమ దా జోద్యంబు ధాత్రీశ్వరా ‘’

 ఇలా పూస గ్రు చ్చి నట్లు సకల ధర్మ సారాన్ని ,మందార మకరందం గా పో తన కవీశ్వరుడు నారద మహాముని చేత అందం గా చెప్పించాడు
.గహన మైన విషయా లన్నీ అతి సులభం గా అర్ధ మయ్యే మాటల తో వీనుల కింపైన పద ప్రయోగం తో అద్వైతానికి ఆయువు పట్టు గా
మనసుకు సుస్పష్ట ం గా అందించి న వారు పో తనకవీ ,మహామునీ

జ్ఞా నదుడు మహర్షి నారదుడు -14


   దశమ స్కంధం లో నారద లీలలు

అనిరుద్ధు డు అంటే శ్రీకృష్ణు ని మనుమడు బాణాసురు ని ఇంట్లో గృహ నిర్బంధం లో ఉన్నాడు ఈ సంగతి తాత శ్రీకృష్ణ పరమాత్మకే తెలియదు

.ఆ ఎరుక చెప్పటానికి ‘’మనవడు ‘’నారదుడే స్వయం గా వచ్చాడు .’’శారద కోమల నీరద –పారాడ రుచి దేహుదతుల భాగ్యోదయుడా

నారద ముని ఏతెంచే –నపార దయా మతి మురారి భజన ప్రీతిన్ ‘’


అలాంటి మహర్షికి శ్రీ కృష్ణు డే స్వయం గా స్వాగతం పలికి అర్ఘ్య పాద్యాదులిచ్చి ఉచితాసనం పై ఉపవిస్టు డిని చేసి మహర్షి  యెడ భక్తీ ని

చాటుకొన్నాడు .అప్పుడు నారదుడు అనివ్రు ద్ధ వృత్తా ంతమంతా తెలియ జేసి రక్షించు కోవటానికి తగిన మార్గ ం యుద్ధ మే అని నిశ్చయ

పరచాడు .మనుమడిని సంరక్షిన్చుకోమని సలహా నిచ్చాడు .

                 శ్రీ కృష్ణ మహిమ సందర్శనం

  శ్రీకృష్ణ సత్యలు నరకాసుర వధ చేశారు కన్న తల్లి కొడుకు ను చంపింది .లోక కంటకుడైనా వాడేవ్వడైనా ఒక్కటే అని నిరూపించింది ఆ

మాత్రు మూర్తి .అతని అధీనం లో ఉన్న 16,000 మంది స్త్రీలకూ ఒకే సారి అందరికి అన్ని రూపాలుగా కన్పించి ,వివాహం చేసుకొన్నాడు

దక్షిణ నాయకుడు శ్రీ కృష్ణు డు .ఆ విషయం తెలిసి దానిలోని విశేషమేమిటో స్వయం గా చూసి తెలుసుకోవాలని ఉబలాట పడ్డా డు

మనుమడు నారదుడు . వెంటనే ద్వారక కు బయల్దే రి వెళ్ళాడు .ఒక స్త్రీ ఇంటికి చేరాడు ..

‘’నరవర యొక్క నాడువిను నారద సంయమి ,మాధవుండు ,దా

  నరకుని ద్రు ంచి ,వాని భవనంబున నున్న పదారు వేల సుం

దరులనోక్క మాటు ప్రమదంబున నందర కన్ని రూపులై

పరమయ్యే నావిని ,శుభస్తితి దద్విభవంబు జూడగన్ ‘

విచ్చేసిన నారదుడిని ప్రత్యుత్థా నం తో స్వాగతించి ‘’మునివరు పాద జలంబులు తన చారు కిరీట మణి వితానము సో కన్ వినమితుడై ,నిజ

సింహాసనమున గూర్చుండ బెట్టి సద్వినయమునన్ ‘వంగి నమస్కరించి తన సింహాసనం పై కూర్చో బెదటాడ .భగవంతుడు భక్త పరదీనుదని

పించాడు వాసుదేవుడు .భక్తు నికి భగవంతునికి అభేదం అని నిరూపించాడు ఆయనే ఆచరించి ఆదర్శం గా నిలిచాడు .భక్తీ లో ఇదొ క అద్భుత

దర్శనం .

‘’తమ పాద కమల తీర్ధ ం-బున లోకములం బవిత్రముగా జేయు పురా

  తన మౌని లోక గురుడమ్ముని పాద తీర్థ ంబు మస్త కమున ధరి యించెన్ ‘’

   ఈ విధం గా ‘’బ్రహ్మణ్య దేవుడు నరసఖుడు అయిన నారాయణుడు అశేష తీర్దో ప మానంబున మునీంద్ర పాద తీర్ధా న్ని ధరించాడు

‘’సుదాసారాలైన మిత భాషణలు పలికాడు .ఉచితానుచితజ్నుడు కధా యదు వల్ల భుడు ?’’ఏ పని చెబితే అది చేస్తా ను ‘ఆనతివ్వమని

అడిగాడు పరమాత్మ .ఆయనకు నారదుని ఆంతర్యం తెలీదా ?ఆయనతోనే చెప్పించాలని కాకపో తే ?

‘’ఏపని పంచిన చేయుదు –దాపస వర యనుడు నతడు దామోదర చి –ద్రూ పక భవదవతార వ్యాపారము దుస్ట నిగ్రహార్ధ ము గాదె ?’’అని

విన్న వించాడు విశ్వ శాసన కర్త .నారద ముని గడుసుగా ఆంతర్యం తెలీకుండా

‘’అఖిల లోకైక పతివి ,దయార్ద్ర మతివి ,విశ్వ సంరక్షకుడవు ,శాశ్వతుడవు

 వెలయ నేపని యైన గావింతు వనుట –యార్త బంధుడ విది నీకు నద్భుతంబే ?’’అన్నాడు .ఏదైనా చేయగల సమర్దు డివి .అంటూనే నర్మ

గర్భం గా

‘’అబ్జ సంభవ హరదేవ ,దేవతార్చనీయ భూరి సంసార సాగారోత్త రణంబు

  నవ్యయా నంద మోక్ష దాయక ము నైన –నీ పదధ్యాన మాత్మ లో నిలువనీవే ‘’

అని తప్పుకొన్నాడు .ఆంతర్యం బయట పెట్ట లేదు .ఆ దేవుని వల్ల ప్రసన్నత పొ ంది వేరొక స్త్రీ ఇంటికి వెళ్ళాడు .అక్కడా స్వామి ఉన్నాడు .

‘’ముని వరుండు కాంచే నొండొ క –వనజాయత నేత్ర నిజ నివాశంబున


  దానయుతు జిష్ణు సహిష్ణు న్ –వినుత గుణాలంక రిష్ణు విష్ణు ం గ్రు ష్ణు న్ ‘’

  ‘’నారడుదట చని కనే నొక –వారిజముఖి ఇంట నున్న వాని మురారిన్

   హారిన్ ,దానవ కుల సంహారిన్ –హరిన్ గమలా మనో విహారిన్ శౌరిన్ ‘’

ఇలా అనంతం గా సాగి పో తూనే ఉంది .ఒక చోట మాత్రం మాధవుడు మునీన్ద్రు నితో ‘’సంపూర్ణ కాములైన మిమ్ము అపూర్ణ కాముల మైన

మేము ఎలా తృప్తి చెందిన్చగలం ?మీ దర్శనమే నిఖిల శోభనం ‘’అని తమాషా గా పలికాడు ఆనంద నందనుడైన ఆ నంద నందనుని

మాటలు కు ఆనంద కందళిత హృదయార విందుడై మందస్మిత సుందర వదనార వవిందుడై నారదుడు ఇంకో స్త్రీ గృహం చేరుకొన్నాడు

.ఎక్కడ చూసినా శ్రీ హరి వేర్వేల రూపాలతో ప్రత్యక్ష మావుతూనే ఉన్నాడు .ఒక్కో చోట ఒక్కో పని చేస్తూ కూడా కన్పించాడు .ఆ మహా

విభవాన్ని పో తన గారు నారదుని మాటలతో కమనీయం గా రమణీయం గా సుందరతరం గా ,విలాసంగా ,విభ్రమం కలిగేట్లు వర్ణించాడు

.బహుశా కవి, ముని తాదాత్మ్యం చెంది న మహా పరమ సమాధి స్తితి లో ఆ పబ్రహ్మ అనంత లీలా వైశిష్ట్యాన్నిదర్శించి తరించి మనకూ ఆ

భాగ్యం కలిగించారు .తాను మనో నేతం్ర తో దర్శించిన దాన్ని నారదుని ప్రత్యక్ష దర్శనం తో మన ముందు నిలిపాడు ‘ఆ వైభవాన్ని తర్వాత

అనుభ విద్దా ం

ఞానదుడు మహర్షి నారదుడు –15

           నారద మహర్షి దర్శించిన శ్రీకృష్ణ లీల ను పో తన గారు ఇలా వర్ణిస్తు న్నారు

‘’ఒకచోట నుచిత సంద్యోపాసక్తు ,నొకచోట బౌరాణికోక్తిలలితు

నొకచోట బంచ యజ్నోచిత కరముని ,నొకచోట దివ్య భూషో జ్వలును

నొకచోట దేనుదానోత్కలితాత్ముని ,నొకచోట నిజ సుత ప్రకార యుక్తు

నొక్క చోటను సంగీత యుక్త చిత్తు ,నొక్కచోటను జలకేళీయుత విహారు

నొక్క చోటను సంమంచ కోప యుక్తు ,నొక్క చోటను బలభద్ర యుక్త చరితు ‘’

ఇలా ఎందెందు వెదకి జూచిన అందందే అందగత్తెల తో హరి ప్రత్యక్ష మయ్యాడు .ఆ విభవాన్ని ఎంత వర్ణించినా తనివి తీరదు .

‘’చతురానన నందనుడం –చిత మతి జని కాంచే ,నొక్క చెలి గేహమునన్

క్రతు కర్మాచరణుని నా-శ్రిత భయ హర నున్,సురేంద్ర సేవిత చరణున్ ‘’

‘’వ్రు త్రా రి వినుతు ని బరమ ప-విత్రు ని నారదుండు గాంచె వేరొక ఇంటన్

బుత్రు క పౌత్రక దుహిత్రు కళత్రు సమేతు ననంతు లక్షణ వంతున్ ‘’

 మతి పో యింది మహర్షికి .ఆ మాయా మోహనుని చిత్రా లు విచిత్రం గా గోచరించి అచ్చేరువందించాయి ..

‘’ఒక ఇంట గజవాజి రోహాకుడు నయి ,యొక్కింత భంజనుడై


సకలాత్ముడు ,పరుండు ,షో డశ సహస్ర స్త్రీ నివాసంబులం

దొ క బో టింటను దప్పకుండ నిజ మాయోత్సాహుడై యుండ ,న

య్యకలంకున్ ,వరదున్ ,మహా పురుషు ,బ్రహ్మణ్యున్ నతాబ్జా సనున్ ‘’

ఆ పరబ్రహ్మకే అర్ధ ం కాని వాడు అంటే ఆయన కొడుకైన నారదుడికేం అర్ధ మవుతాడు? ఆ మహా లీలా విలాసం అత్యంత సుందరం ,పరమ
రమణీయం, మనోహరం ,అత్యంత పవిత్రం .ఎంత వర్ణించినా తనివి తీరటం లేనే లేదు .అటు బ్రహ్మ మానస పుత్రు డైన నారద మునికి, ఇటు
భక్త కవి బ్రహ్మ పో తనకు ఇద్ద రూ ఆ భక్త పరాదీనులే . ఆ నారాయణ చణ చారణ చక్ర వర్తు లే ఇద్ద రూ.’’హరినామం ‘’విన్నా ,పలికినా
భవహరమవుతుందనే భావించి ,స్మరించి, స్మరించి తన్మయత్వంతో పరవశించిన వారే .అందుకే ‘’మావాంగనాలీలా విలాసం అనంతం అని
పించింది ‘’

‘’అస్తో క చరితు నమిత శ-మస్త సుధా హారు వేద మస్త క తల వి

 న్యస్త పదాంబుజ యుగ ళు న-పాస్తా శ్రిత నిఖిల పాపు బరము ననంతున్ ‘’

‘’పరమ భాగవతుండు పరమేస్టి తనయుండు ,మనుజ లీల జెంది మహిత సౌఖ్య

చిత్తు డైన హృషీకేశు యోగ మాయా ప్రభావమునకు నాత్మ నలరి ‘’

‘’మాయురే ,హరిహరి వరద ,య –మేయ గుణా యనుచు నాత్మ మెచ్చి మునీన్ద్రు ం

దా యదునాయకు,సుజన వి-దేయుని నిట్ల నయే ,దేవా!త్రిజగము లందున్ ‘’

తన వల్ల కాలేదు ఇక ఎవరి వల్లా కాదు అనే నిశ్చయానికి వచ్చాడు ముని .ఆ మయావినోదుని తోనే గాన వినోది నారద మౌని

‘’నీ మాయ దెలియ వారలే –తామరస సురేంద్ర తాపసులైనన్

ధీ మంతులు నీ భక్తీ సు-ధా మాధుర్యమున బొ దలు ధన్యులు దక్కన్ ‘’

అని చేతులెత్తేశాడు హర్షించి,పులకించి పరమంద భరితుడయ్యాడు .తానిక వెళ్లి వస్తా నని ‘’ఏది తెలుసు కొందామని వచ్చాడో దాన్ని కనుల
పండువు గా దర్శించి జన్మ చరితార్ధ త ను సాధించుకొన్నాడు మనవడు నారదసంయమి . .

జ్ఞా నదుడు మహర్షి నారదుడు -16

   ధర్మ రాజు రాజ సూయం లో నారదుని మార్గ దర్శ కత్వం

ధరిత్రి లో ధర్మ హాని జరుగుతోందని మాట విన బడ్డా ,మనసులో కదిలినా ధర్మ రక్షణార్ధ ం తగిన వారిని పురమాయించి ఆ పని నేర వేర్చటం
నారదుని అలవాటు .ఒక రోజు శ్రీ కృష్ణ స్వామి ద్వారకలో కొలువై ఉన్న సమయం లో ఒక వృద్ధ బ్రా హ్మణుడు వచ్చి తన మొర విని పించాడు
.జరాసంధుడు బల మద గర్వం తో ‘’తనకు మొక్కని రాజులను ‘’20,000 మందిని గిరివజ
్ర పట్ట ణం లో బందీలుగా చేశాడని ,వారందరి
పంపున తాను వచ్చానని ఆ ఘోర రాక్షసుని బారి నుండి భూమిని ,భూదేవుల్ని ,భూ పాలకులను సంరక్షించ మని విన్న విస్తూ ంటాడు
ఇంతలో అకస్మాత్తు గా నారద మహర్షి అక్కడ ప్రత్యక్షం .

‘’శారద చంద్రికా సారంగు రుచి తోడ ,జడముడి కెంపు చే జరచి ,నవ్య

  శరదంబు దావ్రు త సౌదామనీ లతా శోభ ,గాంచన కటి సూత్ర మలర

  లలిత పూర్ణేందు మండలకము గతి ,మృదు మ్రు గాజిన రుచి మించు చూప

  గల్ప శాఖాగ్ర సంగత పుష్ప గుచ్చంబు లీల ,గేలను నక్షమాల యమర

  భూరి పుణ్య నదీ తోయ పూణమున –దాగు కమడలునోక్క హస్త మున తనర

  వెల్ల జన్నిదమ రుత శోభిల్ల వచ్చే –నారదుండు వివేక విశారడుండు ‘’

                  యదా ప్రకారం శ్రీ కృష్ణు డు మహర్షికి గౌరవం గా అతిధి మర్యాదలు చేశాడు వినయం తో నారదుని తో ‘’ఇప్పు దేన్డు ండి
వచ్చితి విన్డు లకును –నఖిల లోకైక సంచారి వగుచు

నీ యెరుంగని యర్ధ ంబునిఖిల మందు –నరయ లేదండ్రు మిమ్మొకడడుగా వలయు ‘’

ద్రు ష్టి పాండవుల మీదికి పో యింది యదు వంశ మౌలికి .వారి యోగ క్షేమాలు తెలుసుకోవాలని పించింది

‘’పాండు నందను లిప్పుడేపగిది నెచట –నున్న వారలో ఎరిగింపు మన్న

మౌని కర సరోజాతములు మోడ్చి –కడక తోడ బలికె –గమలాక్షు జూచి సద్భక్తి మెరసి ‘’

పరమాత్ముడైన వాసుదేవునికి తెలియని విశేషాలేముంటాయి అయినా అడిగాడు కనుక చెప్పుతున్నాడు ..ధర్మ రాజు  రాజ సూయ యాగం
చేస్తు న్నాడని తన ఆత్మ బందుడైన భక్త వత్సలుడైన పరమ పూరుషుడైన ,యజ్న రక్షకుడైన, యజ్న భోక్త అయిన శ్రీ కృష్ణు ని ఆహ్వానించి
తీసుకొని రమ్మన్నాడని ఆ యాగాన్ని రక్షించే భారం స్వీకరిచమని కోరాడని తెలియ జేశాడు .అంటే బావ శిశు పాలుని వధకు సిద్ధం
కావలసింది అని భావం .ఆయన పేరు విన్నా తలచినా పాపాలు హరిస్తా యి అలాంటి  యజ్న నారాయణ మూర్తి ని అవమానించినా ,
అపహసిన్చినా వాడి చావు మూడిందేదే .నన్న ఆంతర్యం నారద వచనాలలో స్పష్ట మవుతుంది .

‘’నీపేరు వినిన ,నొడివిన బాపంబులు దూలి పో వు పద్మాక్ష ,జగ

ద్దీపక ,నీ దర్శనమున –నేపారవె భక్త జనుల కిహ పర సుఖముల్ ‘’

‘’భావదీయోజ్వల కీర్తి దిగ్వితతుల్ భాసిల్లు యుష్మత్పదో

ద్భవ నైర్మల్య జలంబు లుత్కలిక బతాళంబులంబునన్  బారు భో

గవతీ నామ మునం దనర్చి ధరణి గంగా నదీ రూపమై

దివి మందాకినీ యై ,జగత్రయమునం దీపించు గా దే హరీ ‘’


‘’ ఆ మఖ వళ సమస్త ధ –రా మండలిల్గు మేటి రాజులు   మౌని

  స్తో మంబును భవదీయ మ –హా మహిమము జూచి సత్క్రుతార్ధ త బొ ందన్ కలరు ‘’

అని చెప్పాడు .ఎల నవ్వు మొగం తో ఉద్ద వుని ఆలోచించి ,ధర్మ రాజు రాజ సూయ యాగానికి తరలి వెళ్ళాడు యదు వంశ విభుడు .ఇలా
లోక రక్షకునికి కూడా ప్రేరేపణ కల్గించాల్సిన సమయం లో తన వంతు ధర్మాన్ని నెర వేర్చి ,అధర్మ పద గాముల పీచాన్ని అడంచ టానికి
ముందుకు వచ్చే ధర్మ పద దర్శనుడు మార్గ దర్శీ మహర్షి నారదుడు .అంతటి మాయావీ మహర్షి చెప్పిన మాటలు విని శిశు పాలుని ద్రు ంచి
,జరా సంధుని చీల్పించి లోక రక్షణ చేశాడు

జ్ఞా నదుడు మహర్షి నారదుడు -17

             శ్రీ కృష్ణా వతార సమాప్తి

ద్వాపర యుగాంతం వచ్చేసి యాదవ కులం లో ముసలం పుట్టింది .అక్కడ హస్తిన లో కురు సంగ్రా మం లో రాజాది రాజులు
,ప్రజలులక్షలాదిగా పరి సమాప్తి చెందారు .ఇంకో 48 ఏళ్ళలో కలి  ప్రవేశింప బో తున్నాడు .అంతా లయం ,విలయమే కావాలి .ఇదంతా
ఆయన ఇచ్చ .,సంకల్పం .ఆ మార్గ ం గా లోకం కదిలి పో తోంది .తమ అవతార సమాప్తి దగ్గ రకు వచ్చిందని పరమాత్మకు తెలుసు .అందుకే
అందరు కలిసి గ్రహణ స్నానం కోసం సముద్ర తీరానికి చేరారు .మహర్షు లందరికి శ్రీ రామ కృష్ణు ల ను దర్శించాలనే ఇచ్చ కలిగింది .

‘బలవదరాతి మర్ద నుల బాన్డు నల నిభ ప్రభాగులం

గలిత నిజాననాంబుజ వికాస జితాంచిత పూర్ణ చంద్ర మం

డలుల ,బరేశులన్ ,నర విడంబినులన్ ,గరుణా పయోదులన్

విశాదలంకరిష్ణు ల ,నవీన సహిష్ణు ల రామ కృష్ణు లన్ ‘’

నారద ,సాత్యవతేయ ,గౌతమ ,వ్యాసాదులంతా తరలి వచ్చారు .అర్ఘ్య పాద్యాలు నమస్కృతులు అందుకొన్నారు అప్పుడు శ్రీ కృష్ణు డు వారిని
అడిగాడు

‘’సమ్మునీశ్వరు లారా జన్మ భాక్కుల మైన మాకు నిచ్చోట సమ్మతిని దేవ

నికర దుష్ప్రాపులు ,నిరుపమ యోగీన్ద్రు లైన మీ దర్శనం బబ్బే గాదె

ధృతి మంద భాగ్యు లింద్రియ పరతంత్రు లు నైన మూఢాత్ముల ,కనఘులార

భవదీయ దర్శన ,స్పర్శన ,చింతన ,పాదార్చనలు దుర్ల భంబు లయ్యు

నేడు మాకిట సులభమై నెగడే గాదె –జాగృతి పై దీర్ఘ భూతులు ,సాధుమతులు

మిమ్ము దర్శించు టయ చాలు నెమ్మి తోడ –వేర తీర్థ ంబు లవని పై వెదక నేల ?’’
అని చాలా సద్భక్తి పురస్సరం గా గౌరవం నేరుపుతాడు పరమాత్మ .ఇదీ మర్యాదా పురుష లక్షణం .వారిని దర్శిస్తేనే సర్వ పాపహరం వారు
సర్వ తీర్ధ రాజుల కంటే పరమ పవిత్రు లు .ఉదకాలతో కూడిన తీర్దా లు ,మ్రు చ్చికతో కూడిన దేవా గణాలు తీర్ధ దేవతా రూపకాలు కావు
.అయితే అవన్నీ చిరకాల సేవనార్చనల వల్ల నే పవిత్రం అవుతాయి .కాని సత్పురషులున్నారే వీరు మాత్రం దర్శన మాత్రం చేతనే పవిత్రత
కల్గిస్తా రు .సకలార్ధ గోచర జ్ఞా నం గల నారదాది మహర్షు లు ముహూర్త మాత్రం చేత పావనం చేయగలరు .ఆత్మబుద్ధి లేనివారికి తీర్ధ స్నానం
పుణ్యాన్ని ,పవిత్రతను ఇవ్వలేదు .అని శ్రీ హరి వివరిస్తా డు .దేవముని గణంశ్రీ కృష్ణ ముఖరిత పవిత్ర వాగ్మకరందం చేత ఆనంద పరవశం
చెందింది .

‘’నీకంటే పవిత్రు లేవరు ?కర్త భోక్త భర్త హర్త నీవు .ఎందరి కోసమో ఎన్నో చేశావు .ఇందులో హింస ఉంది ,వధ ఉంది .బాధ ఉంది .నిఖిల
యజ్నశుడవైనా యాగం తో దుష్కర్మఅంతా  నశిస్తు ంది ఇదే ధర్మం

‘’దేవర్షి పితృ ఋణంబులు –భూవర మఖ వేద పాత పుత్రు ల చేతన్

వావిరి నీగని పురుషుడు –పో వునదో లోకమునకు బుణ్య చ్యుతుడై ‘’అంతే కాదు

‘’వర తనయధ్యయనంబుల –ధరియించితి రుణ యుగంబు దడయక ధరణీ

వరదేవ ఋణము సవనా –చరణడవై ఈగుటోప్పు సమ్మతి తోడన్ ‘’

‘’బ్రా హ్మణ ,దేవ ఋణం తీర్చుకోవటానికి యాగం యజ్న కర్త కూ తప్పదు’’ అన్నారు ఇంకేముంది .మహర్షు లనే యాజకులు గా చేసి ఆ తీర్ధ
ప్రా ంతం లోనే అష్టా దశ భార్యా యుతుడై యాగం పూర్తీ చేసి దక్షినాదులతో సంతృప్తి చెందించాడు. సంతుస్తు లైన ముని గణం స్వస్థా నం చేరింది
.

                బలభద్రు ని ప్రేరేపించటం

శ్రీ కృష్ణు ని కుమారుడు సాంబుడు దుర్యోధనుని కూతురు లక్ష్మణ ను ఎత్తు కొచ్చాడు కౌరవులు సామ్బుని చెర బట్టా రు .ఈ విషయం
నారదుడు హలాయుధ ధారి అయిన బలరాముని చెవిన పడేశాడు .ఆ కోపం తో ఊగిపో యిన కృష్ణు ని అన్న నాగ నగరానికి వెళ్ళాడు .అక్కడ
కౌరవులు అతన్ని నీచం గా మాట్లా డారు .ఆ కోపం తో నాగలితో హస్తినా పురాన్ని ఎత్తి యమునా నదిలో కలుపబో యాడు భయపడిన
కౌరవులు లక్ష్మణ సహిత సామ్బుల్ని అప్పగించారు .ఇలా కరువంశం తో వియ్యమూ జరిపించాడు మహర్షి నారదుడు సుభద్రకూ లక్ష్మణ
కుమారునికి జరగాల్సిన వివాహం ‘’మాయా బజార్ ‘’తో విచ్చిన్న మైంది .ఇప్పుడు ఒక రకం గా మంచే జరిగింది కొత్త బంధం సంబంధం
చేకూరింది నారద మహర్షి ఏది చేసినా ఇలా మంచికే దారి తీస్తు ంది..మళ్ళీ  వీరి అబ్బాయి వారి అల్లు డైనాడు .ఇదంతా బలరాముని అవక్ర
పరాక్రమానికి భయపడే జరిగింది

జ్ఞా నదుడు మహర్షి నారదుడు -18

                 ఏకాదశ స్కంధం

‘’నిరుపమ సుందర శరీరం ధరించి సమస్త కర్మ తత్పరుడైన పరమేశ్వరుడు యాదవులను అడగింప దలచు కొన్నాడు ‘’.ఆ సమయం లో
విశ్వామిత్ర అసిత దుర్వాస భ్రు ంగి అంగీరస కశ్యప వామదేవ వాలఖిల్య అత్రి వసిష్ట నారదాది మునివరులు ద్వారకా నగరానికి విచ్చేశారు
.ఆయనను స్తు తించారు .ఆయనా చక్కగా మర్యాదలు జరిపాడు .

‘’తరణంబులు భవ జలధికి హరణంబులు దురిత లతల కాగమ మూల కా


  భారణంబులార్త జనులకు శరణం బులు నీదు దివ్య చరణంబులిలన్ ‘’

మత్త కోకిల –‘’ఒక్క వేళను సూక్ష్మ రూపము నొందుదీవణు మాత్రమై

               యొక్క వేళను స్తూ ల రూపము నొందు దంతయు నీవయై

               పెక్కు రూపులు దాల్తు నీదగు పెంపు మాకు నుతిమ్పగా

               నక్కజంబగుచున్న దే మానసంబుజాక్ష రమాపతీ ‘’

‘’శ్రీ నాయక నీ నామము –నానా భవ రోగ కర్మ నాశము నకు ,వి

న్నాణంబగు ,నౌషధమిది –కానరు దుస్టా త్ములకట కంజ దళాక్షా ‘’

అని ముక్త కం ఠం గా ప్రస్తు తించారు .యదునాయకుడు సంతోషించి ‘’మదీయ ధ్యాన నామ స్మరణంబులు భవ రోగ హరణాలు .బ్రహ్మ
రుద్రా ది శరణాలు .మంగళ కరాలు అయినా నా రూపం గల వారైన బ్రా హ్మణుల పరితాపాలను పరిహరించు .పురుషు నైశ్వర్య సమేతులు గా
చేస్తా ను ‘’అని యోగీశ్వరేశ్వరుడు ఆనతిచ్చాడు .’’ఇక్కడికి మీరంతా వచ్చిన కారణ మేమిటి ?’’అని ప్రశ్నించాడు .వాళ్ళు ‘’భవదీయ
పదార విందదర్శనం కంటే మిక్కిలి విశేషమేమున్తు ంది ‘’అని వాసుదేవ వదన చంద్రా మ్రు తాన్ని నిజ నేత్ర చకోరాలతో గ్రో లారు
‘’యధేచ్చగావాసుదేవుని అనుమతితో

 బయల్దే రి ద్వారకకు దగ్గ రలో ఉన్న ‘’పిడారకం ‘’అనే పుణ్య తీర్దా నికి వెళ్ళారు .

            అక్కడ యాదవులు సామ్బునికి గర్భిణీ స్త్రీ వేషం వేయించి ఈ మునులను దర్పం తో కన్నూ మిన్నూ కానకుండా ‘’ఆడ పిల్ల
పుడుతుందా మగపిల్లా డా ?’’అని అడిగారు .రోషం తో కనుగోనల్లో నిప్పులు రాలగా

‘’వాలాయము యదుకుల ని –ర్మూలనకరంబైనట్టి ముసలంబొ కటి

 బాలిక కుదయిన్చును బొ ం—డాలస్యము లేదటంచు నట బల్కటయున్ ‘’

ముసలం అంటే రోకలి పుట్ట టం దాన్ని అరగదీసి సముద్రం లో కలపటం ,యాదవులంతా ఒకరి నొకరు కొట్టు కొని చావటం అందరికీ తెలిసిన
కధే .ఇదే ‘’యాదవ కులం లో ముసలం పుట్ట టం ‘’అనే సామెత కు దారి తీసింది .పరస్పర హననం తో యాదవ వంశం నిర్వంశ మయింది
.’

               వసుదేవుడికి నారద మహర్షి చెప్పిన ‘’విదేహర్షభ సంవాదం ‘’

శ్రీ కృష్ణు ని దర్శించి మునులంతా వెళ్ళారు .కాని నారద మహర్షి చేయవలసిన పని ఇంకా మిగిలి ఉంది కనుక దేవకీ వసుదేవులను
దర్శించాడు .వారు సమాదరించారు .’’ఏ నరుడు నారాయణ చరణ సరసీరుహ భజన పరాయణత్వం నిరంతరం పొ ందడో అలాంటి వాడికి
మృత్యువు ఎప్పుడూ అతి సమీపం లోనే ఉంటుంది .మీ దర్శనం సుభప్రదం . భాగవత కధల్లో ధర్మ సందేహాలున్నాయి .అవి తీర్చండి
మహాత్మా .గోవిందుని పుత్రు నిగా పొ ందాలనుకొని నెరవేరక దేవతా మాయలో చిక్కి చిత్త వ్యసనాన్ధ కారం లో ఉన్నాను .హరి
కదామృతంఅందివ్వండి .అలాగైతే సుఖం కలుగుతుంది ‘’అని కృష్ణు ని తండ్రి వాసుదేవుడు మహర్షిని వేడుకొన్నాడు ..

‘’పరమేశ్వర భక్తీ జనకమై ,కైవల్య పద ప్రా ప్తికర మైన విదేహర్షభ సంవాదం అనే పురాతనపుణ్య కద‘’చెప్తా నని నారదుడు కదా విధానం
వివరించాడు .పూర్వం విదేహుడు అనే రాజు యజ్ఞ ం చేశాడు .యజ్ఞ ం చివర ‘’కవి ,హర్యంత రిక్షా ప్రబుద్ధ పిప్పలాయనవిర్హో త్ర ద్రమీల చమస
కరభాజను ‘’లు అనే తొమ్మిది మంది ఊర్ధ ్వ రేతస్కులైన బ్రహ్మ విద్యా విశారదులు అక్కడికియేతేన్చారు .రాజు యధావిధి వారిని
పూజించాడు .వారితో ‘’మీరు విష్ణు వును దర్శించిన మహా భూరితపో ధన వర్యులు ‘’కనుక ‘’క్రూ రులు ,బహుడుఖ రోగ కుత్సిత బుద్ధు లు
నీరసులు నరులు కనుక సుజ్ఞా న బుద్ధిని నాకు అందించండి ‘’అని వేడుకొన్నాడు .’’పరమేశ్వరుడు ప్రపత్తి నిసస్ట లకు సారూప్యాన్ని ఎలా
ఇస్తా డు ?’’అని వివరించమని కోరాడు .

   అప్పుడు కవి అనే ముని ‘’కరణ త్రయాలతో చేసే ప్రతి పని హరి సమర్పణం అని పలికి చేయాలి .శ్రీహరిని ఉత్త మోత్త ముని గా మనసులో
నిలపాలి .నిరంతర హరి నామ స్మరణ చేయాలి .అలాంటి వానికి కైవల్యం సులభం గా లభిస్తు ంది .

‘’సంతసంబు గృష్ణ సంకీర్తనంబులు వీనుల విందుగా వినగా వలయు

   హర్షంబు తోడుత హరినామ కధనంబు పాటల నాటల బరగ వలయు

   నారాయణుని దివ్య నామాక్షరంబులు హృద్వీది సతతంబు నిలుప వలయు

   గంజాక్షు లీలలు కాన్తా రముల నైన భక్తీ యుక్త ంబుగా బాడవలయు

   వెర్రి మాడ్కిని లీలతో విశ్వ మయుని –నోడువుచు లోక బాహ్యత నొంద వలయు

నింతయు విష్ణు మయమని ఎరున్గ వలయు –భేద మొనరింప వలదు మేదినీశ ‘’

అని చెప్పాడు విదేహ రాజుకూ సందేహం తీరలేదు ‘’భాగవత ధర్మం అంటే ఏమిటి ??’’వివరించమన్నాడు భాగవతుడేవాడు ?ఆతని
లక్షణాలులే-యేమిటి ?తెలుపమని అర్ధించాడు దీనికి హరి అనే ముని సమాధానం ఏమి చెప్పాడో తర్వాత తెలుసు కొందాం .

జ్ఞా నదుడు మహర్షి నారదుడు -19

    విదేహ రాజు కు హరి అనే ముని ఇలా వివరించాడు ‘’సర్వ భూత మయుడైన సరసిజాక్షు –డాతడే ,తన యాత్మ యందుండు ననేడు
వాడు –శంఖ చక్ర ధరుమ్డంచు జానెడు వాడు –భక్తీ భావాభి రతుండు  వో భాగవతుండు ‘’

‘’వర్ణా శ్రమ ధర్మంబుల –నిర్ణ య కర్మల జెడక నిఖిల జగత్సం

  పూర్ణు డు హరి యను నాతడే –వర్ణింపగ భాగవతుడు వసుధాధీశా !’’

విదేహుని సందేహం తీరింది ..కాని హరి నామ స్మరణం ,ఆ కదామృతత సేవనం కావాలని పించి మళ్ళీ అడిగాడు

‘’గజరాజ వరదు గుణములు –త్రిజత్పావనములగుట దేట డంగా

సుజన మనో రంజనముగా –విజితేన్ద్రియ వినగనాకు వేడుక పుట్టెన్ ‘’.

అప్పుడు ‘’అంత రిక్షుడు’’ అనే మౌని వర్యుడు

‘’పరమ బ్రహ్మ మనంగా –బర తత్వమనంగా బరమ దమనగను నీ

శ్వరుడన ,గ్రు ష్ణు దన జగ –ద్భరితుడు నారాయణుండు దా వెలుగొందున్ ‘’


అవ్యక్త నిర్గు ణ పర బ్రహ్మం లో తనకు విపర్యయం గా జన్మించిన జ్ఞా నమే ‘’మాయ’’.ఆ మాయ చేతనే ఆయన ఈ జగత్తు ను నిర్మిస్తా డు
.ఆయన మాత్రం నిశ్చిమ్తు డే .మాయ కూడా ఆత్మ లో లీన మవుతుంది .పంచ భూతాదిక జీవులను సృష్టించేది ఆ మాయయే .లయిన్చేదీ
అదే ‘’అన్నాడు మహర్షి .మరి ఆ మాయను దాటే ఉపాయం చెప్పమన్నాడు రాజు

‘’ప్రబుధుడు ‘’అనే మహర్షి ‘’శరీరమే నిత్యం అనుకోని జీవులు దుఖం లో మునిగి పో తారు .తాని తాము తెలుసుకోరు.విరక్తి మార్గ ం
అవలంబించరు .సద్గు రువును పొ ంది భూతదయ ,హరికదామృత పానం ,బ్రహ్మ చర్య ,సాదు సంగమమం ,సజ్జ న మైత్రి ,వినయ ,శుచిత్వ
,క్షమా ,మౌనం ,వేదార్ధ వివేచనం ,అహింస ,ద్వంద్వ విసర్జ నం చేసి ఈశ్వరుని సర్వ గతుని గా భావించాలీ .గ్రు హారామ క్షేత్ర కళత్ర పుత్రా
విత్తా దులను శ్రీ హరికి అర్పణ చేయాలి .పరమాత్మను తప్ప దేనినీ చూడ రాదు .’’అని వివరించాడు .

‘’హరిదాసుల మిత్రత్వము –మురరిపు కద లేన్నికోనుచు మోదము తోడన్

భారితాశ్రు పులకితుండై –పురుషుడు హరి మాయ గెల్చు భూప వరేన్యా ‘’

ఇందరు ఇన్ని రకాలుఆ చెప్పినా రాజు గారి కి మనశ్శాంతి లభించలేదు .’’పరమాత్మ ప్రభావం ‘’గురించి చెప్పమని అడిగాడు .అప్పుడు
‘’పిప్పలాయనుడు ‘’అనే మహర్షి ఇలా చెప్పాడు

‘’పరమాత్మకు వృద్ధి క్షయాలు ఉండవు .హరి భక్తీ చేత సుజ్ఞా ని భాగవత్సదనం చేరుకొంటాడు .’’అని చెప్పాడు

‘’ఏ కర్మలు చేస్తే హరిని చేర గలమో ‘’వివరించమని మళ్ళీ రాజుగారి అభ్యర్ధ నం .’’విర్హో త్రు డు’’ అనే ముని ‘’కర్మలన్నీ బంధనాలే
.మోక్షానికి నారాయణ భజనమే పరమ పావనమైనది .ఫలితం ఆశించకుండా హరినిస్మరించాలి .షో డశోప చారాలతో ,ధూప దీప నైవేద్యాలతో
సాష్టా ంగ నమస్కారం చేస్తు ంటే హరిని చేరగలరు ‘’అన్నాడు

‘’అసలు ఈశ్వరుడు ఏయే కర్మల్ని చేశాడు ?’’వాటి వివరం చెప్పమని రాజు ప్రశ్నించాడు

‘’ద్రమీలుడు ‘’అనే ముని పుంగవుడు –‘

‘’తారల నెన్నగ వచ్చును –భూరేణువుల లెక్క వెట్టబో లును ,ధాత్రిన్

 నారాయణ గుణ కదనము –లారయ వర్ణింప లేరు పరబ్రహ్మాదుల్ ‘’అని తేల్చి చెప్పి ధర్ముడు అనే వాడు దక్షుని పుత్రిక ను పెళ్ళాడి
బదరికా వనం లో నారాయణ ఋషిని కన్నాడు .ఆయన తపస్సు చేస్తూ ఉండగా మన్మధుడిని పంపాడు బలభేది .చలించలేదీయన
.వారందరూ స్తు తిస్తే మూడు కోట్ల మంది స్త్రీలను తన శరీరం నుండి పుట్టించాడు .ఊరువుల నుండి ఊర్వశి జన్మించి దేవలోకం చేరింది .ఈ
కద విన్న వారంతా ముక్తు లే .ఆ తర్వాతమత్స ,కూర్మ వరాహ ,నారసింహ ,వామన ,రామ రఘురామ కృష్ణ బుద్ధ కల్క్యాది అవతారాలు
ధరించాడు అని ఆ కధలన్నీ సవివరం గా తెలియ జేశాడు .

      రాజు ‘’హరిపూజ చేయక పో తే ఏమవుతుంది ?’’అని ప్రశ్నించాడు .’’చమసుడు ‘’అనే మహర్షి ‘’హరి నుతింపక స్త్రీలోలుడైన వాడు
నరకం చేరుతాడు .ముక్తి మార్గ ం అప్రత్యక్షం అని భావించేవాడు దుర్గ తి చెందుతాడు .’’అన్నాడు .రాజు ‘’ఏ యుగంబున నే రీతి వర్తించు –
నెట్టి రూపాదు నేవ్విధమున—మును నుతింప బడెను –ముని దేవ గణంబుచే విష్ణు డవ్యయుండు విశ్వ విభుడు ‘’అని ప్రశ్నించాడు .దీనికి
‘’కరభాజన ముని ‘’‘’చాలా అవతారాలలో జన్మించి రాక్షస సంహారం చేశాడు హరి కృత యుగం లో శుక్ల వర్ణు డై ,చతుర్బాహుడై జటా
వల్కల క్రిష్ణా జినోత్తరీయ జప మాలికా దండ కమండల దరుడై నిర్మల ధ్యాన గరిస్టు లైన పురుష శ్రేష్టం చేత హంసుడు ,సుపర్ణు డు ,వైకుమ్తు డు
,ధర్ముడు ,అమలుడు ,యోగీశ్వరుడు ,ఈశ్వరుడు ,పురుషుడు ,అవ్యక్తు డు పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రసిద్ధి చెందాడు .
       త్రేతా యుగం లోపృశ్ని గర్భ ,సర్వతో దేవ ,ఉరుక్రమ ,వృషాకపి ,జయంత పేర్లతో స్తు తింప బడ్డా డు . రక్త వర్ణ ం తో నాలుగు చేతులతో
హిరణ్య కేశుడు ,వేద త్రయ స్వరూపుడు సృక్ ,సృవాది ఉప లక్షణ శోభితుడు అయి విష్ణు ,యజ్న , లోపృశ్ని గర్భ ,సర్వతో దేవా ,ఉరుక్రమ
,వృషాకపి ,జయంత పేర్లతో స్తు తింప బడ్డా డు.

           ద్వాపరయుగం లో రెండు చేతులతో శ్రీ వత్స కౌస్తు భ వనమాలికా విరాజ మానుడై జనార్ద న ,వాసుదేవ ,సంకర్షణ ,ప్రద్యుమ్న
,అనిరుద్ధ ,నారాయణ ,విశ్వ రూప ,సర్వ భూతాత్మక నామాలతో పిలువా బడ్డా డు .

    కలియుగం లో కృష్ణ వర్ణ ం తో కృష్ణ నామం తో భక్త సంరక్షణార్ధ ం యజ్న సంకీర్తనల చేత ప్రస్తు తింప బాడుతాడు .హరి రామ ,నారాయణ
,నృసింహ ,కంసారి శాలినోదర ‘’పేర్లతో మునుల చే స్తు తింప బాదుతాడు అంతే కాదు –

‘’ద్రా విడ దేశంబు నందుల దామ్ర పర్ని–సహ్యజక్రు త మాలాది సకల నదుల

కేవ్వడేనిని ,భక్తీ తో నేగి యచట –బొ దిలి తర్పణ మొగి జేయ ,పుణ్య మొదవు ‘’అని’’ రుభ కుమారులైన ‘’మునులు ‘’విష్ణు ధ్యాన కదా
సుదారసాను భావం ‘’అంతటిని విదేహ మహా రాజు కు విశదీకరించారు అని నారద మహర్షి వసుదేవునికి వివరం గా చెప్పాడు .

‘’కమలాక్షు పద భక్తి కధనముల్ ,వాసుదేవ విని యఘంబుల బాసి వెలసితీవు

 భువన ప్రసిద్దిగా బొ లుపొ ందు సత్కీర్తి కైవల్య లక్ష్మి యు గలుగు మీద

నారాయనుమ్డు నీ నందనుమ్డను మోహ మెదలించి ,విష్ణు గా నెరగ


ి ి కొలువు

మతడు ,నీ తనయుడై యవతరించుట జేసి సిధించే దేహ సంశుద్ధి నీకు

సరస సల్లా ప సౌహార్ద సౌస్తా వమున –బావనంబైతి ,శిశుపాల ,పౌండ్ర ,నరక

ముర ,జరా సంద ,యవనులు ముదము తోడ –వాసుదేవుని జేరిరి వైరిలయ్యు ‘’

‘’దుస్ట జన నిగ్రహంబును –శిస్ట ప్రతి పాదనంబు సేయన ,హరి దా

సృష్టి నవతారమొందేను –స్రష్ట ముఖానిక దివిజ సంఘము వొగడన్ ‘’

లోక రక్షా ణార్ధ మే శ్రీ కృష్ణు డు అవతరించాడు ‘’అని నారద మహర్షి చెప్పగానే ,విస్మిత చిత్తు డై దేవకీ వసుదేవులు శ్రీ కృష్ణు ని పరమాత్మ గా
భావించారు .ఇదే దేవారహస్యం ఈ రహస్యాన్ని ఆ దేవ దేవునే గర్భాన మోసి కన్న తలిదంద్రు లైన దేవకీ వసుదేవులకు ఎరుక కల్గించి
వ్యామోహ దూరుల్ని చేసిన వాడు మహర్షి నారదుడు .

జ్ఞా నడుడు మహర్షి నారదుడు -20(చివరి భాగం )


    ఈ విధం గా నారదుడు దేవకీ వసుదేవులకు శ్రీహరి దివ్య కదామృత పానం చేయించి ,స్వస్వరూప జ్ఞా నం

కల్గించాడు .అవతార పురుషుని అవతారం సమాప్త మయ్యే స్తితి దగ్గ రకు వచ్చింది కనుక ,వారి కోసం మనసు లో

ఉండే బాధను అణచుకోవటానికి ఉన్ముఖీ కరణం చేశాడు మహర్షి .యాదవ వంశ వినాశామూ శ్రీ హరి సంకల్పమే

కనుక ,యాదవ కులం లో మిగిలి ఉండేవారేవ్వరు ఉండరని అర్ధం చేసుకొనే మానషిక ధైర్యం తట్టు కొనే శక్తి ఆ

తలిదండ్రు లకు కల్పించగాలిగాడు .ఈ జీవిత మంతా ఒక పద్ధ తి ప్రకారం ,విధి విధానం గా నడుస్తు ంది అన్న
సత్యాన్ని ఆవిష్కరించాడు .కర్మల వల్ల  ఉత్త మ లోకాలు కలిగినా ,శాశ్వతానందం ముక్తి మాత్రమె నని ,అదీ శ్రీ హరి

చింతనం వల్ల మాత్రమె సాధ్యమని ఎరుక పరచాడు .బంధం మోక్షానికి అడ్డ ం కనుక సర్వ బంధనాలను విచ్చిన్నం

చేసుకొని ‘’నీవే తప్ప ఇతః పరంబెరుగా‘’ననే ప్రపత్తి మార్గా న్ని చేబట్టా లని అప్పుడే ఆయన సామీప్య, సారూప్య

,,సాయుజ్య, ప్రదమైన మోక్షం కలుగుతుందని మహర్షి నారదుడు ఆయా సందర్భాలలో ససవివరం గా తెలియ

బర్చాడు .నవవిధ భక్తు లనూ బో ధించిన నారదుడు చెప్పని విషయమే లేదు .

    ఇంతటి మహో న్నత భక్తీ సామ్రా జ్యాన్ని దర్శింప జేసిన  శ్రీ మద్భాగవతం చరితార్ధ మైంది .పుణ్య ఫల ప్రదమైంది

‘’లలిత స్కంధము కృష్ణ మూలము ,శుకా లాపాభి రామంబు ,మం

 జులతాభి శోభితమున్ ,సువర్ణ సుమనస్సుజ్నేయ మున్ ,సుందరో

జ్జ ్వల వృత్త ంబు ,మహా ఫలంబు ,విమల వ్యాసాల వాలంబు నై

వెలయున్ ,భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజ శ్రేయమై .’’

‘’సత్యం పరం ధీమహి ‘’అని గాయత్రీ ప్రా రంభం లో ,గాయత్రీ నామ బ్రహ్మ స్వరూపమై ,మత్స పురాణం లో

గాయత్రిని అధికరించి ,ధర్మ విస్తా రాన్ని వృత్రా సుర వధను చెప్పబడేది మాత్రమె భాగవతం అనడం వల్ల ఇది మహా

భాగవతం అయింది, అనిపించు కొన్నది

   ‘’శ్రీ మంతమై ముని శ్రేష్ట కృతంబైన భాగవతంబు సద్భక్తి తోడ

     వినగోరు వారల విమల చిత్త ంబుల ,జెచ్చెర నీశుడు చిక్కుగాక  


     ఇతర శాస్త ం్ర బుల ,నీశుండు చిక్కునే ,మంచి వారలకు నిర్మత్సరులకు

     గపట నిర్ముక్తు లై ,కాంక్ష సేయకయును దగిలి యుండుట మహా తత్వ బుద్ధి

     బరగానా ధ్యాత్మికాడి తాపత్రయంబు నడచి ,పరమార్ధ భూతమై యధిక సుఖదా

     మై సమస్త ంబుబు గాకయు ,నయ్యు నుండ –వస్తు వేరుగంగ దగు భాగవతము నందు ‘’

‘’వేద కల్ప వృక్ష విగలితమై ,శుఖ ముఖ సుదాద్రవమున మొనసి యున్న

భాగవత పురాణ ఫల రసాస్వాదన –పదవి గనుడు రసిక భావ విదులు ‘’

    శ్రీ హరి నామామృతం తప్ప ఏదీ దరి చేర్చదు.

‘’వర గోవింద కదా సుధారస మహా వర్షో రు ధారా పరం

పర లంగాక ,బుదేంద్ర చంద్ర ఇతరోపాయాను రక్తిం ,బ్రవి

స్త ర దుర్దా ంత ,దురంత ,దుస్సహాజ ,సుస్సంభావితానేక దు

స్త ర గంభీర ,కఠోర ,కల్మష ,కనద్దా వానలంబారునే ‘’ అని మహర్షి మహా రాజుతో అంటాడు .భాగవత కదా ప్రా రంభం

లో

‘’హరినామ కదన దావానల జ్వాలచే గాలవే ఘోరాఘకాననములు

వైకుంఠదర్శన వాయు సంఘంబుచే దో లగవే ,భవ దుఃఖ తోయదములు కమల నాభ ధ్యాన కంఠీరవము చే గూలవే

సంతాప కుంజరములు

నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి చే దీరవే షడ్వర్గ తిమిరములు

నలిన నయన సద్భక్తి నావ చే గాకసం –సార జలధి దాటి చనగ రాదు

వేయు నేల ,మాకు విష్ణు ప్రభావంబు –దేలుపవయ్య సుత ధీసమేత ‘’

‘’చారుతర ధర్మ రాశికి –భారకుడగు కృష్ణు డాత్మ పదమున కేగన్

భారకుడు లేని ఎవ్వని –జేరును ధర్మంబు బలుపు సెడి మునీంద్రా ‘’అన్నది భాగవత పరమార్ధం విన్నా చదివినా

చెప్పినా ఇహ  పరదాయకం .మోక్ష ప్రదం .నారద భక్తీ సూత్ర పరి పుష్ట ం .అమలం ,దివ్యం ,
భక్త కవి పో తన                                                        వేద వ్యాస మహర్షి             వ్యాసుడు

చెబుతుంటే వినాయకుడు రాయటం 

వ్యాస పూర్ణిమ -గురు పూర్ణిమ                                                                 వ్యాస భాఘ్ 

         సర్వ లఘు సీసం (దశమ స్కంధం )

‘’నవ వికచ ,సరసిరుహ నయన ,యుగ నిజ చణ ,గగన చర నది జనిత ,నిగమ వినుత

 జలధి సుత కుచకలష ,లలిత మృగ మద రుచి పరిమళ నిజ హృదయ ధరణి భరణ

ద్రు హిణ ముఖ సురనికర ,విహితను తి కలిత ,గుణ కటి ఘటిత ,రుచిర తర కనక వసన

భుజగ రిపు వరగమన ,రజతగిరి పతి వినుత ,నతత జపరత ,నియమ సరణి చరిత

తిమి ,కమఠ కిటి నృహరి ,ముదిత బలినిహి –త దపరశుధర ,దశ వదన విళన

మురదమన ,కలికలుష సుముదపహరణ –కరివరద ,ముని ,నర సుర ,గరుడ వినుత ‘’

సంగీత సద్గు రు
సంగీత సద్గు రు త్యాగ రాజ స్వామి --1

             సంగీత త్రేతాగ్నులుగా ,దాక్షిణాత్య సంగీత మూర్తి త్రయం గా పేరొందిన వారు శ్యామ   శాస్త్రి
,ముత్తు స్వామి దీక్షితులు ,త్యాగ రాజు .వీరు ప్రసిద్ధవాగ్గేయ కారులు .  .ముగ్గు రు సమకాలికులవటం
ఆశ్చర్యం . వీరితో  టైరు వాన్కూర్ మహా  రాజా స్వాతి తిరునాళ్ళు చేరితే'' సంగీత మూర్తి చతుష్ట యం''
ఏర్పడుతుంది .స్వాతి తిరుణాల్ ఆస్థా నం లో అన్ని ప్రా ంతాల సంగీత విద్వాంసులు సన్మానం పొ ందిన వారే
.శ్యామ శాస్త్రి తెలుగు ,సంస్కృతం ,దీక్షితులు సంస్కృతం ,త్యాగయ్య తెలుగు లోను ఎక్కువ గా కీర్తనలు
రాశారు .మూర్తితయ
్ర ం లో ముగ్గు రూ,తిరువాన్కూర్ పరిసరాలలో ''తిరు ఆరూర్ ''(ఆరు పల్లెల కూడలి
)లోనే జన్మించారు .ముగ్గు రు ,దగ్గ ర లోని ''తిరువయ్యార్ ''(అయిదు నదుల కూడలి )అంటే పంచ నదీ
తీరం చేరారు .కావేరి నదిని ''సహ్యజ ''అంటారు .ఆ నీటిలో అవ్యక్త మాధుర్యం వీరి కవితలలో పొ ంగి
పొ ర్లింది .సంగీతం లో నాయక స్థా నం పొ ందింది .అంతకు ముందు  700 ఏళ్ళ క్రితం ,పురందర దాసు ,
,అన్నమయ్య ,క్షేత్రయ్య ,నారాయణ తీర్ధు లు వున్నా ,సంగీత కళకు పునర్వికాసం ఈ మూర్తి త్రయం
వల్ల నే కల్గింది .ఆ కళ  రసానందాన్ని ,ప్రజాదరాన్ని పొ ందింది ఈ ముగ్గు రి వల్ల నే .ఇప్పుడు  మన 
త్యాగయ్య  గారి  జీవిత  విశేషాలను  తెలుసు  కొందాం .
                                 త్యాగ రాజు జననం 
         త్యాగరాజు గారి పూర్వీకులు ప్రకాశం జిల్లా ''కంభం ''తాలూకా ''కాకర్ల ''అనే గ్రా మానికి చెందిన వారు
.తండ్రి రామ బ్రహ్మం .తల్లి సీతమ్మ .వారే త్యాగయ్య గారి ''సీతా రాములు ''.అందుకే ఆయన ''సీతమ్మ
మా యమ్మ ,శ్రీ రాముడు మాకు తండ్రి ''అని సభక్తి కం గా గానం చేశారు .తల్లి తంజావూర్  ఆస్థా న
విద్వాంశులు'' వీణ  కాళ హస్తీశ్వర అయ్యర్ ''గారి కుమార్తె .కాకర్ల వారు ములికి నాటి బ్రా హ్మణులు
.భారద్వాజస గోత్రీకులు .ఆపస్థ ంభ సూత్రు లు .ప్రముఖ ఇంజినీర్ ,భారత రత్న మోక్ష గుండం
విశ్వేశ్వరయ్య గారు ఈ ప్రా ంతం వారే .త్యాగ రాజు గారి కుటుంబం ,కాకర్ల నుంచి తిరువారూర్ చేరి స్థిర
పడింది .త్యాగయ్య తాత గారు ''గిరి రాజ బ్రహ్మ '',తంజావూర్ మహా రాజు ''శాహజి ''ఆస్థా న కవి .యక్ష
గానాలు ,వేదాంత గ్రంధాలను రాశారు .సీతమ్మ ,రామ బ్రహ్మం దంపతులకు ,తిరువారూర్ లోని'' శ్రీ త్యాగ
రాజ స్వామి'' అంటే అక్కడి శివుని భక్తు లు .ఆయన దయ వల్ల నే మన త్యాగయ్య 1767 వ సంవత్సరం
మే నెల నాలుగవ తేదన
ీ జన్మించారు .అదే శ్రీ సర్వజిత్ నామ సంవత్సర ,వైశాఖ శుద్ధ షష్టి సో మ వారం
ఆయన జన్మ దినం .సంగీతం లో సర్వులను జయించి నట్లు గా ,''సర్వ జిత్ ''లో జన్మించారన్న
మాట.స్వరాలను జయించటం వల్ల ''స్వర జిత్ ''అయ్యారు .అక్కడి అమ్మ వారి పేరు ''కమల
''.తిరువారూర్ లో జన్మించటమే ,ముక్తి గా భావిస్తా రు .అక్కడి నుంచి ,త్యాగయ్య గారి అయిదవ ఏట
,''తిరువైయార్ ''చేరంి ది త్యాగయ్య గారి కుటుంబం .
                                  బాల్యం 
           త్యాగయ్య గారి తండ్రి రామ బ్రహ్మం గారు తంజావూర్ రాజాస్థా నం లో రామాయణ ప్రవచనం చేసే
వారు .తల్లి సీతమ్మ గారు వందలాది భక్తి కీర్తనలు ,గానం చేస్తు ండే వారు .ఆ దంపతులు ''శ్రీ రామ
పంచాయతనం ''ను భక్తీ తో పూజించే వారు .ఈ వాతావరణం లో పెరిగిన త్యాగయ్య గారికి ,సంగీతా
,సాహిత్య విద్యలు వెన్నతో బెట్టినవి అయాయి .రాజాస్తా నం లో త్యాగయ్య ,వాల్మీకి శ్లో కాలు చదువుతుంటే
,తండ్రి ప్రవచనం చేసే వారు .భక్తీ ,రక్తి ,కావ్యసౌందర్యం   ,సంస్కారం ఆయనకు అబ్బిన సద్గు ణాలు
.సంగీత  ,సాహిత్య కిశోరమైనారు .బాల త్యాగ రాజు నోట ,గానం ,కవిత్వం ,ఆశువుగా జాలు వారుతున్దేవి
.వాటిని గోడలపై బొ గ్గు తో రాసే వారు .''నమో రాఘ వాయ అనిశం -నమో నమో రాఘ వాయ --శుక
నుతాయ ,దీన బాన్ధ వే --సకల లోక దయా సిన్ధవే  త్యాగ రాజ పాల కాయ -నాగ రాజ సేవితాయ ''అనే
కీర్తన ను  తోడి రాగం లో రాశారు .అందులోని సమాస రచన ,అను ప్రా స ,భావ గాంభీర్యం ,ధారా శుద్ధి
,తలి దండ్రు లకు ఆశ్చర్యం వేసింది .ఎనిమిదవ ఏట త్యాగయ్య కు ఉపనయం చేసి ,వెద శాస్త ్ర  పాథ  శాల
లో చేర్పించారు .
           ఆ నాటి తంజావూర్ ఆస్థా న ప్రధాన ,సంగీతవిద్వాంసుడు   ,అర్ధా సనం అలంకరించిన వాడు
అయిన ''శోం ఠి  వెంకట రమణయ్య ''గారి వద్ద సంగీత శిక్షణ పొ ందాడు .గురు సన్నిధి లో సంగీత సభ
చేశాడు .త్యాగయ్య విద్వత్తు కు మెచ్చి ,పొ ంగి పో యి ,తన స్వర్ణ కంకణాన్ని శిష్యుని చేతికి తొడిగి ఉప్పొంగి
పో యారు గురువు శోం ఠి వెంకట రమణయ్య గారు .తంజావూర్ సరస్వతి మహల్ లో త్యాగ రాజు సంగీత
కచేరి చేశారు .''మరి మరి నిన్నే మొరలిడ -నీ మనసు దయ రాదు ''అనే కాంభోజ రాజ కీర్తనను విసువు
పుట్టించకుండా ,పాడి దిగ్దంతులైన సంగీత పండితుల్ని ,ఆనందాబ్ధి లో ఓల లాడించారు .బాల మేధావి
త్యాగయ్య'' child prodigy '' అయాడు .ఆ సంగీత పాండిత్యం తో వాగ్గేయ కారుడై కీర్తి పొ ందాడు .శరభోజి
మహా రాజు త్యాగయ్య ప్రతిభను తెలుసుకొని ,తన ఆస్థా న సంగీతవిద్వాంసుని గా   చేయాలని భావించారు
.అందుకే త్యాగాయను ''పుట్టు కవి ''అన్నారు విశ్లేషకులు .

సంగీత సద్గు రు శ్రీ త్యాగ రాజ స్వామి --2

                                         యవ్వనం -వివాహం 
--            త్యాగయ్య గారి 14 వ ఏటే తండ్రి గారు కాలం చేశారు .త్యాగ రాజు గారి అన్న జపేశం కుటిల
స్వభావం కల వాడు .తమ్ముడితో తగాదా పడ్డా డు .డబ్బు మీద ఆశ అన్న గారిది .''అమర గానం -
రామార్పణం ''అనే భావం ఈ తమ్మయ్య త్యాగయ్యది .18 వ ఏట నే ''పార్వతమ్మ ''తో త్యాగ రాజు వివాహం
జరిగింది .త్యాగయ్య గారి తల్లి త్యాగయ్య వద్దే వుండేది .రాజాశ్రయానికి రమ్మని శరభోజ మహా రాజు
కబురు పంపాడు విలువైన  కానుకలను పంపుతూ .అప్పుడు ఆయనకు ఒక విచికిత్చ వచ్చింది ''నిధి
చాల సుఖమా ?రాముని సన్నిధి చాల సుఖమా ?అని వితర్కిన్చుకొని ,''ధర్మ కోపం ''చూపించాడు .
సహజం గానే రాజుకు కోపం వచ్చింది .త్యాగయ్యను ''కట్టి తెండి ''అని ఆజ్ఞా పించి ,సైనికులను పంపాడు
.అంతే రాజు గారికి విప రీట మైన కడుపు నొప్పి వచ్చి తట్టు కో లేక దొ ర్లు తున్నాడు .త్యాగయ్యకు జరిగిన
పరాభవం పుట్టించిన ''అనలమే 'తన నొప్పి అని అర్ధ ం చేసు కున్నాడు .వెంటనే త్యాగయ్య కట్ల ను విప్పించే
శాడు .. నొప్పి మటుమాయం అయింది .ఇద్ద రు మంచి మిత్రు లైనారు .త్యాగ రాజు ప్రతిభకు మహా రాజ
ఆమోద ముద్ర లభించింది ..
           అన్న జపేశం ,తమ్ముడి మీద కోపం తో ,''రామ పంచాయతనం ''ను దొ ంగతనం గా ఎత్తు కోని
పో యి కావేరి నదిలో పడేశాడు .దాని కోసం వెదకని చోటు లేదు .రామ విరహం తో పాటలూ ,పరిగెత్తా యి
''ఎందు డాగి నాడో -ఈడకు రానెన్నడు దయ వచ్చునో మనసా ?''అని ఆవేదనతో ,కరుణ రస తరంగితం
గా కీర్తించాడు .భక్తు ని పరి వేదన ''జీవన రూపమై పారింది ''.కావేరి నీటి పాయ ,విగ్రహాన్ని  ,తనలో
వుంచుకోలేక బయట పడేశింది .ఆనంద   పారవశ్యం తో ''కను గొంటిని శ్రీ రాముని నేడు ''అంటూ ఆనంద
బాష్పాలు కీర్తనలో జాలు వార్చాడు .''రారా ,మా యింటి దాక ,సుకుమార ,మ్రొ క్కేరా''అని వినయ
పూర్వక స్వాగతాంజలి ఘటిస్తూ ,ఊరేగింపు గా ఇంటికి తెచ్చుకొన్నాడు .అప్పటికే త్యాగయ్యకు శిష్య గణం
ఏర్పడింది .
         '' ఉంచ వ్రు త్తి '' అంటే ఇంటింటికీ తిరిగి అన్నం   అడుక్కోవటం చేస్తూ ,తన గాన సుధను వారికి పంచి
పెడుతూ ,భక్తి మార్గ ం లో జీవించాడు .నగలు ,నాణాలు ఏవ రైనా  వేస్తె  పట్టే వాడు కాదు .వారానికి
ఒకగ్రా మం   వంతున శిష్యులతో సంచారం చేసే వాడు .త్య్గాయ గారికి ఈ రకమైన ఆతిధ్యం ఇచ్చి ఆ
గ్రా మాల పౌరులు ధన్యమయారు .త్యాగయ్య దృష్టిలో ఇలా ఇంటింటికీ తిరిగి యాచించటం వల్ల మనసు లో
ఏమూలైనా అహంకారం వుంటే అది పటా పంచలై పో తుంది .శుద్ధ నిష్కల్మషమనసు ఏర్పడుతుంది .వీత
రాగులకు మన దేశం లో మొదటి నుంచి ఇది పరమ తృప్తి ని ఇచ్చింది .త్యాగయ్య అలానే పరమ సంతృప్తి
పొ ందాడు .ఉంచ వ్రు త్తి తో జీవించినా ,ప్రపంచానికి ''సంగీత ,సాహిత్య భిక్ష ''ప్రసాదించిన వాడు  త్యాగ రాజ
పరబ్రహ్మ .
                               ఉపదేశం-సంతానం -సాధన 
       కాంచీ పుర నివాసి ,శ్రీ రామ కృష్ణా నంద యతీంద్రు లు ''రామ షడ క్షరీ  మంత్రం ''ఉపదేశించారు .ఆ
నామాన్ని 21 సంవత్సరాల పదిహేను రోజుల్లో ,రోజుకు ఒక లక్షా ఇరవై యైదు  వేలచొప్పున 96 కోట్ల
''రామ జపం చేసిన ధన్యాత్ముడు త్యాగ రాజ భక్త   శిఖామణి . ఇంత తీవ్రం గా ఇని సార్లు జపించిన వారు 
చరితల
్ర ో ఎవరు లేరు .అది త్యాగయ్య గారి రికార్డు .దాని వల్ల బ్రా హ్మీ భూతుడై ,అలౌకిక మహా శక్తి
సంపన్ను లైనారు త్యాగయ్య గారు . అందుకే ఆయన వాణి ,సంగీత ,సాహిత్య పరం గా ''ఆనంద
సాగరాన్ని ''సృష్టించింది .నారద మహర్షి స్వయం గా వచ్చి ,ఇచ్చిన ''స్వరార్నవం ''అనే సంగీత మహా
గ్రంధాన్నిమధించారు త్యాగయ్య గారు .దానినే ''రజత గిరీశుదు ,నగ జాత కు   ,తెల్పు స్వరార్నవ
మర్మములు ,విజయము గల్గు ,త్యాగ రాజు ఎరుగు -విశ్వశించి   తెలుసుకో ''అని ''స్వర రాగ సుధా ''అనే
కీర్తన లో స్తు తించారు .నారద మహర్షికి కృతజ్ఞ త తెలుపు కొంటు ''శ్రీ నారద ,నాద సరసీ రుహ భ్రు న్గా
,శుభాంగ ,వేద జనిత ,వర వీణా ,వాదన తత్వజ్ఞా ''అంటూ కీర్తించారు . 
            త్యాగయ్య గారి భార్య పార్వతమ్మ అయిదేళ్ళు  కాపురం చేసి మరణించింది .ఆమె చెల్లెలు
''కమల''ను ద్వితీయ వివాహం చేసుకున్నాడు త్యాగయ్య .సీతా లక్ష్మి అనే కుమార్తె జన్మించింది వీరికి
.ఆమెను అఖిలాండ పురం కుప్పుసామయ్యర్ కు ఇచ్చి వివాహం చేశారు .ఆమెకు ఒక కొడుకు .అతనే
''పంచాప కేశయ్య ''.ఇతడు గొప్ప సంగీత విద్వాంసుడు గా పేరు పొ ందాడు .అయితె సంతానం లేకుండా
అకాల మరణంపొ ందాడు .  .ఇతని భార్య ''గురవమ్మ ''త్యాగయ్య గారి ''రామ పంచాయతనం ''ను తన
పుట్టిల్లు తంజా వూర్ తీసుకొని వెళ్ళింది .వారసులు లేకుండానే త్యాగయ్య జీవితం గడిచి పో యింది
.అయితే సంగీత విద్వాల్లో కం అంతా ,త్యాగరాజ వారసత్వాన్ని ,అవిచ్చిన్నం గా ,అనుభవిస్తు న్నారు
.వారందరి త్యాగ ఫలమే ఆ దివ్య గానామృతం .యావత్ భారత దేశం ,,ప్రపంచం త్యాగయ్య గారి కీర్తనల తో
మురిసి పో తోంది .ఇంతకంటే ''సంతాన లక్ష్మి ''ఎక్కడుంది ?
                72 మేళ కర్త లలో 52 మేళ కర్త లను ప్రయోగించిన వాడు త్యాగయ్య .205 రాగాలను
ప్రస్తా వించాడు .7111 కృతులు రాశారు . 100 కొత్త రాగాలను సృష్టించారు .బహుదారి ,నళినీ కాంతి
,జయంతశ్రీ ,బిందు మాలిని ,రాగాలు త్యాగ బ్రహ్మ సృష్టించినవే .ఆయన ముఖ్య శిష్యుడు ''వాలాజ పేట
వెంకట రమణ భాగవతార్ ''సంస్క్రుతాన్ద్రా ల్లో గట్టి పండితుడు .త్యాగయ్య కీర్తనలను చేతితో రాసి పెట్టి ,భావి
తరానికి అంద జేసిన మహనీయుడు .త్యాగయ్య ,ఇతరులలో వున్న ప్రతిభను గుర్తించి గౌరవించిన మహా
మతి .''బో ద్ధ లగు వారు -మత్సర    పూర్ణు లు ''అనే అపవాదం త్యాగయ్యకు లేదు .
           త్యాగయ్య రచనలలో ,1-దివ్య నామ సంకీర్తనలు 2-ఉత్సవ సంప్రదాయ కీర్తనలు అంటే సీతా
కల్యాణం ,గౌరీ కల్యాణం అప్పుడు పాడేవి --27 .ఊరేగింపు ,పవళింపు ,మేలు కొలుపు ,హారతి లకు
అనుగుణం గా రచించినవి .ఉదాహరణకు --''కొలువై యున్నాడే కోదండ పాణి '',-''హెచ్చరిక గా రారా
''.నగుమోము గల వాని-నా మనోహరునీ '',''సీతా కళ్యాణ వైభోగమే 'మొదలైనవి .3-కృతులు 4-ప్రహ్లా ద
భక్తి విజయం 5-నౌకా చరితం్ర ,యక్ష గాన గేయ నాటికలు --వున్నాయి 
          ఆనంద భైరవి రాగం లో త్యాగరాజు కీర్తన  రాయలేదు .దీనికి ఒక కధ వుంది .ఆ రోజుల్లో
''త్రిభువనం స్వామి నాదయ్యర్ ''అనే మహా గాయకుడు వుండే వాడు .ఆయన  ఆనంద భైరవి రాగం లో
సాటి లేని మేటి గా నిరూపించుకొన్నాడు .తోలుబొ మ్మలాటలు లో ఆయన పాడే వాడు .ఒక సారి
తిరువైయుర్ లో ఆ ఆట జరుగు తోంది .''మధురా నగరిలో ''అనే పాటను ఆనంద భైరవి రాగం  లో
అద్భుతం గా ఆలా పించి పాడాడు .ఆ దారినే వెళ్తు న్న త్యాగయ్య విని ,పార వశ్యం తో పులకించి
పో యాడట .అయ్యర్ ను మెచ్చి కౌగాలిన్చుకోన్నాదట .అంటే ''గుణ గౌరవం ''చూపాడన్న మాట త్యాగయ్య
.ఈ అద్భుత సన్ని వేశాన్ని చూసిన ప్రేక్షకులు మురిసి పో యారట .అప్పుడు అయ్యరు ,త్యాగ రాజు గారితో
''అయ్యా !మీరు ఇక నున్చిఆనంద భైరవి రాగం జోలికి దయ చేసి పో వద్దు .నాకున్నఖ్యాతిని   నిల బెట్టండి
''అని చేతులు పట్టు కొని వేడుకోన్నాదట .త్యాగి అయిన త్యాగయ్య ,మాట ఇచ్చి ''బాస ''తప్పలేదు .ఇలా
ఆ రాగం త్యాగయ్య గారి త్యాగానికి గురి అయింది .

 సంగీత సద్గు రు   శ్రీ త్యాగ రాజ స్వామి --3

                                         కీర్తి -సందర్శనం -పరంపర 


        
 త్యాగ రాజు గారు ఏ వినూత్న కీర్తన విని పిస్తా రో నని ,ఎదురు చూసే వారట ఆ రోజుల్లో బాగా తెలివి గల
వారికిఉన్నత మైన సంగీతం ,సామాన్యులకు ప్రా ధమిక రీతులు,స్వర జ్ఞా నం లేని వారికి దివ్య నామ
సంకీర్తన ల తో శిక్షణ నిచ్చే వారట త్యాగయ్య గారు .శిష్య బృందాన్ని వెంట వేసుకొని ,దేశం లోని దివ్య
క్షేత్రా లన్నీ సందర్శించారు .ఆయా దేవతలపై చక్కని కీర్తనలు రచించి ,వారి సన్ని దానం లో పాడే వారు
.ఆ కాలమ్ లో కాశీ నగరం లో ''గోపీ నాద భట్టా చార్య ''గొప్ప హిందుస్తా నీ సంగీత విద్వాంసులు .త్యాగయ్య
కీర్తి విని చూడ టానికి వచ్చారు .అంతటి వ్యాప్తి కలిగింది ఆయన సంగీతానికి .రామేశ్వరం లో రామ
లింగేశ్వరుని దర్శించి , తిరు వైయుర్ చేరారు .త్యాగయ్య అద్భుత గానాన్ని విని ,పులకరింత తో తాను
ధన్యుడనయానని భట్ట చార్య ,త్యాగయ్య తో అన్నారట .ఉత్త ర దేశం లోత్యాగయ్య  కీర్తనలు  ఎంత
ప్రా చుర్యం పొ ందాయోఆనందం   వివరించి చెప్పారట.వినయవిభూషణుడు అయిన   త్యాగ రాజు ''దాశరధీ
!నీ ఋణము తీర్ప నా తరమా,పరమ పావన నామ -ఆశ ,దీర దూర దేశములకు ,ప్రకాశింప జేసిన రశిక
శిరోమణీ ''అంటూ ,రామానుగ్రహాన్ని ప్రస్తు తించాడు .త్యాగయ్య కు ,మంత్ర ,జ్యోతిష ,శాస్త్రా లలో మంచి
ప్రవేశం వుంది .గుంటూరు జిల్లా పొ న్నూరు నివాసి ,రెవిన్యూ ఉద్యోగి ,శ్రీ రామ మంత్రో పాసకులు ,కమ్మటి
కీర్తనల రచయిత ,మహా భక్తు డు అయిన తూము నరసింహ దాసు గారు 1821  లో త్యాగ రాజు గారిని
దర్శించి ,అతిధి గా కొన్నాళ్ళు శ్రీ వారి సన్ని దానం లో గడి పారు .త్యాగయ్య గారి పూజా విధానం ,సంగీత
వైభవం స్వయం గా చూసి ముచ్చట పడ్డా రు .భక్తి పులకాకితం గా దాసు గారు ,త్యాగయ్యను ఇలా
ప్రశంశించారు ఒక కీర్తనలో --
         ''కేశవానంద సంకీర్తనావళి వింటి ,--భావసిద్ధియు శుద్ధ భక్తీ గంటి 
          భక్తు లు ,శిష్యులు బలసి కొల్వగా గంటి ,--వాగ్మాదురీ వైభవంబు గంటి 
          వినయ ,సత్సంపద్వివేకంబు గంటి -శ్రీ రామ పదభక్తి చెలువు గంటి 
          అజు కంద రాని అనుభవమును గంటి --తన్మయత్వంబాత్మ తనరగ గంటి 
          అరసి ,కనుగొంటి త్యాగ రాయార్యు నందు ''-ఇద్ధ సద్గు ణ పుంజ మింకేన్ని యైన 
          దివ్య మహిమాతి శాయములుతేజరిలుట -కంటి హర్షా బ్ది నోలాడుచుంటి మదిని 
               తే.గీ.'' రామ పద భక్త త్యాగయార్య వరునికిని--సమము గా నేర రేవ్వారీ క్ష్మాతలమున   
                       ప్రేమ నా ఘనుడొ క సారి పిలిచే నేని --రాముడు ''ఓహో '' యనుచును మార్పలుకు
నంట''.
అని ప్రత్యక్ష సాక్షం గా నరసింహ దాసు గారు త్యాగ రాజు గారి భక్తీ సామ్రా జ్య వైభవాన్ని మనకు
అందించారు .త్యాగయ్య గారు కూడా ''తూము నరసింహ దాసు ''గారి కీర్తనలను ,అడిగి మరీ పాడించుకొని
,శ్లా ఘించారు .
       తిరు వాన్కూర్ రాజ్యం లోని ''గోవింద మారార్ ''అనే సుప్రసిద్ధ గాయకుడు ,స్వర ,లయ జ్ఞా నం కలిగి
,''ఆరు కాలాల్లో '' 
పాడ గల ప్రజ్న వున్న వారట .''షట్కాల ''అనే అరుదైన బిరుదు పొ ందిన వాడాయన .ఆయనే స్వయం గా
త్యాగ రాజు గారిని సందర్శించి ,''చందన చర్చిత నీల కళేబర ''అనే జయ దేవుని అష్ట పది ని ఆరు
కాలాల్లో (అతి విలంబ ,విలంబ ,మధ్యమ ,ద్రు త ,అతిద్రు త )పాండిత్య ప్రతిభతో ,గాన మాధుర్యం తో ,పాడి
త్యాగయ్య గారికే ఆశ్చర్యం  కల్గిన్చారట .కృతజ్ఞ తా పూర్వకం గా త్యాగ రాజు గారు ''ఎందరో మహాను
భావులు -అందరికీ వందనములు ''అనే కీర్తనను ,శిష్యులతో కలిసి పాడి వందనాలు సమర్పించారట
.అంతటి సహృదయత త్యాగ రాజు గారిది .
          తమిళం లో ''భక్త నంద నారు ''చరిత్ర రాసిన ''గోపాల కృష్ణ భారతి ''అనే సంగీత విద్వాన్మని కూడా
త్యాగయ్యను ,దర్శించి ,''ఆభోగి ''రాగం లో త్యాగయ రాసిన ''మనసు నిల్ప శక్తి లేక ''అనే కృతి పాడి
,ఆనందింప జేశారట .ఆ రాత్రికి రాత్రే ఆయన ''ఆభోగి ''రాగం లో ''సభాపతికి వేరు దైవం ''అనే కీర్తన రాసి
త్యాగ రాజు గారికి పాడి విని పించారట .కర్ణా టక సంగీత విద్వాంసులు ఎక్కువగా ఈ కీర్తన పాడుతూ
వుంటారు కచేరీ లలో .
           అలాగే తిరు వాన్కూర్మః రాజు స్వాతి తిరుణాల్ ఎలాగైనా త్యాగ రాజును దర్శించాలని విశ్వ
ప్రయత్నం చేశారట .స్వయం గా తన ఆస్థా న గాయకుడు ''వడివేల్ ''గారిని ,త్యాగ రాజు గారికోసం
పంపారట .ఆయన ,చాలా రోజులు త్యాగయ్య గారితో సన్నిహితం గా మసలుతూ ఒక రోజున త్యాగయ
గారితో ,అసలు విషయం చెప్పారట .''అల్లా గే -మీ రాజును తప్పక కలుస్తా ను .మేమిద్ద రం త్వరలోనే ఎక్కడో
కలుసు కొంటాం .ఇప్పుడు కాదు ''అని మర్యాదగా చెప్పి పంపించేశారు వడివేల్ గారిని .స్వాతి
తిరుణాల్ 26 -12 -1846 లో మరణిస్తే  త్యాగ రాజు గారు 06 -01 -1847 లోఅంటే పదకొండు రోజులకు  శ్రీ
రామైక్యం చెందారు .వీరిద్దరూ అద్ద రిని అంటే ''అక్కడ ''కలుసు కొని వుంటారు .ఆయన మాట లో   అంత
దూరపు చూపు ఉందన్న మాట .
         తిక్కయ్య కలం లోని తియ్యందనాలు ,పో తన గారి శయ్యా సౌభాగ్యం లయ ,అనుప్రా స ,శైలి
,త్యాగయ్య కవిత్వం లో కన్పిస్తా యి .పో తన రాసిన భాగవతాన్ని ,స్వయం గా రాసుకొని త్యాగయ్య ,నిత్యం
పారాయణ చేసే వారట .
           భద్రా చల రామదాసు గారు అంటే త్యాగయ్యకు భక్తీ తత్పరత మిక్కుటం .ఆయన్ను కీర్తిస్తూ చెప్పిన
కీర్తన --
  ''కలియుగమున వరభాద్రా -చలమున నెల కొన రామ చంద్రు ని --పద భక్తు ల కెల్లా వరుడనం దగి --
వెలసిన శ్రీ రామ దాసు వినుతింతు మదిన్ ''అని'' ప్రహ్లా ద భక్తి విజయం'' లో కీర్తించారు .అంతే కాదు
''నారద ,ప్రహ్లా ద ,పరాశర వరుల సరసన''శ్రీ  రామ దాసు'' గారికి స్థా నం కల్పించారు . .
 ''నారీ మణికి చీరే లిచ్చినది నాడే విన్నానురా ,ధీరుడౌ రామ దాసు బంధనము తీర్చినది విన్నానురా
''అని భక్తు ల మహిమలను వివరించాడు త్యాగయ్య .భక్త జయదేవ ,నారాయణ తీర్ధు ల ప్రభావం త్యాగరాజు
మీద మిక్కుటం గానే వుంది .ఆ అష్ట పదుల ,తరంగాల లోని అద్భుత అనుభూతులను తన కీర్తనలలో
పొ ందు పరిచారు రాజు గారు .
          1845 లో భార్య కమల మరణించింది .ఆయన లోని వైరాగ్యం పతాక స్తా యి చేరంి ది .ఆత్మానందం
అనుభవించారు .భవ బంధ విమోచన కోసం ''దయ జూచుట కిది వేళ రా దాశరధీ !మును నీ వాన
తిచ్చిన పనులు ఆస గొని ,నే ,మనసారగ నిదానముగా సల్పినాను ,-వర త్యాగ రాజాప్త నను దయ
చూచుట కిదే వేళరా ,దాశరధీ ''అని ఆర్తి గా పాడారు .ఆ రాముడు స్వప్నం లో కని పించి ,''పది పూటల
లో కాచెదను ''అని అభయ మిచ్చాడు ''.ఆపత్ సన్యాస దీక్ష'' పొ ందారు .''నాద బ్రహ్మా నంద ''అనే దీక్షా
నామం ధరించారు .అఖండ దివ్య నామ సంకీర్తన చేస్తూ ''శ్యామ సుందరంగా ''అనే కీర్తన పాడుతూ -
పరాభవ నామ సంవత్సర పుష్య బహుళ పంచమి నాడు అనగా 06 -01 -1847 న త్యాగరాజు గారు
పంచత్వం చెందారు .ఆ నాటి నుంచి పుష్య బహుళ పంచమి నాడు ''త్యాగ రాజ ఆరాధనోత్సవం
''తిరువైయార్ లో జరుగు తోంది . ఈ రోజూ త్యాగ బ్రహ్మ గారి 165 వ వర్ధ ంతి .
           బెంగళూర్ నాగ రత్నమ్మ అనే సంగీత శిరోమణి ,భక్తు రాలు ,తన యావదాస్తినీ త్యాగ రాజు గారి
స్మ్రుతి చిహ్నం నెల కోల్ప టానికిసమాధి , నిర్మాణానికి ,భవన నిర్మాణానికిధార పో సి  ,సంగీత జగత్తు లో
కీరి శిఖ రాన్ని అధిరోహించింది .ఆమె ఈ విధం గా తన జీవితాన్ని ధన్యం చేసుకొన్నది .ఆమెపూనుకోక
పొ తే త్యాగ రాజు గారి చిరునామా ఆంధ్రు లకు తెలిసేదే కాదు .త్యాగయ్య పాడిన ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క
గుడి .ఆ గుడి లో కావ్య గాన సరస్వతీ దేవి దర్శనం లభిస్తు ంది .
''ఎటులైన భక్తీ వచుతకే యత్నము సేయవే మానస ''అన్నది త్యాగయ గారి సందేశం .ఆయన ఒక
జ్వలిత సంగీత జ్వాల .ఆయన ''అఖండ సంగీత జ్యోతి ''నిరంతరం గా ప్రకాశిస్తూ నే వుంది .
         ఉత్త ర భారత దేశం లో ''తాన్సేన్ సమారొహ్ ''ఎంత ప్రశాస్తో దక్షిణ దేశాన త్యాగ రాధ ఆరాధనోత్సవం
అంత ప్రసిద్ధి చెందింది .అదొ క ''గౌరవ విభూతి ''గా అందరు భావిస్తా రు .1984 లో జరిగిన ఆరాధనో దక్షిణ
దేశ సంగీత పాత్కులంతా చేరి ఘన నివాళి నిచ్చారు .అది నభూతో న భవిష్యతి గా జరిగింది .త్యాగయ్య
గారి ముఖ్య శిష్యుడు వాలాజి పేట వెంకట రమణ భాగవతార్  ,ఒక శ్లో కం లో భక్తిలో ప్రహ్లా దుని ,వైరాగ్యం
లో శుకుని ,గానం లో నారదుని ,సాహిత్యం లో విద్యా వతికి త్యాగయ్య సమానుడు అని కీర్తించాడు  . 
        ''వ్యాసో నైగమ చర్చయా ,మృదు గిరా వాల్మీక జనా మునిహ్ --వైరాగ్య శుక ఏవ ,భక్తీ విషయే
,ప్రహ్లా ద ఏవ స్వయం 
         బ్రహ్మా ,నారద ఏవచా ,ప్రతిమాయో స్సాహిత్యసంగీత యొహ్   -యో రామామ్రు త పాన నిర్జిత శివః
తం త్యాగ రాజం భజే ''                  
       పండిత ,పామర జన రంజకం గా ,సంగీతామ్రు తాన్ని అందించిన నాద బ్రహ్మ -త్యాగ బ్రహ్మ .ఆయన
సంగీత వారసులు -వెంకట రమణ భాగవతార్ ,లాల్గు డి రామయ్యర్ ,ఉమయాల్ పురం కృష్ణ ,సుందర
భాగవతార్ ముఖ్యులు .ఆంద్ర దేశం లో సర్వశ్రీ సుసర్ల దక్షిణా మూర్తి ,పారుపల్లి రామ క్రిష్నయ్య పంతులు
,ద్వారం వెంకట స్వామి నాయుడు ,హరి నాగభూషణం ,మంగళం పల్లి బాల మురళీ కృష ,త్యాగ రాజ
సంప్రదాయాన్ని నిలిపి ,పో షించి పెంపు చేస్తు న్నారు .శ్రీ బాల మురళి'' అపర త్యాగ రాజు'' గా కీర్తి పొ ందిన
ప్రముఖ వాగ్గేయ కారుడు .శ్రీ దాలి పర్తి పిచ్చిహరి షేక్ చిన  మౌలా ,ఓలేటి వెంకటేశ్వర్లు ,నేదునూరి కృష్ణ
మూర్తి ,డాక్టర్ శ్రీ పాద పినాక పాణి ,నల్లా న్ చక్రవర్తు ల రామ కృష్ణ మా చార్యులు ,నూకల చిన సత్య
నారాయణ మున్నగు  ఎందరో విద్వాంసులు కర్ణా టక సంగీతం లో లబ్ధ ప్రతిస్తు లై అవిచ్చిన్నం గా
సంప్రదాయ ధారను ప్రవహింప జేస్తు న్నారు .త్యాగ రాజు గార  న్నట్లు ''ఎందరో మహాను భావులు -
అందరికి వందనాలు ''

సంగీత సద్గు రు త్యాగ రాజ స్వామి --4

                                            కృతులలో  భాష భావం 


         త్యాగయ్య కృతుల్లో వున్న భాష ,భావ గాంభీర్యాన్ని తెలుసు కొనే ముందు ,ఆ నాటి రాజుల సంగీత
కళా పో షణ ఎలా వుందో ఒక సారి గుర్తు కు చేసు కొందాం .
         భారతీయ సంగీతం కర్ణా టక సంగీతం అని ,హిందూ స్తా ని సంగీతం అని రెండు రకాలు .కర్ణా టక
సంగీతాన్ని ''నారదీయ సంగీతం ''అనీ ,హిందుస్తా నీ ని ''హనుమదీయ సంగీతమ్ ''అనీ పేరు
.హనుమంతుడు గొప్ప గాయకుడు ,సంగీత స్రష్ట .మహా రాజులు ఎందరో ,సంగీత విద్వాంసులను
ఆదరించి ,పో షించారు .సంగీతానికి గొప్ప ప్రచారం కల్గించారు .త్యాగయ్య గారి శిష్యుడు సుబ్బయ్య అనే
ఆయన కుమారుడు ఎనిమిది గంటల పాటు ''సావేరి ''రాగాన్ని పాడిన ఘనుడట .నారాయణ తీర్ధు ల
వారు సాక్షాత్తు శ్రీకృష్ణు డినే  మెప్పించిన మహా భక్త వరేన్యుడు .సదాశివ బ్రహ్మేన్ద్రు లు మహిమలను
ఎన్నోచూపిన  మహిమాన్వితుడు .క్రిష్నయ్య అనే విద్వాంసుడు ఎండ బాధ నుంచి తప్పించుకోవటానికి
''మలయ మారుత రాగాన్ని ''పాడి చల్ల బరచుకోన్నాదట .శీలం నరసయ్య అనే సంగీత విద్వాంసునికి 40
వేల రాగాల మీద మంచి పట్టు ఉండేదట
ి .పైడాల గురు మూర్తి అనే విద్వాంసుడు ,1000 గీతాలను
రాశాడట .తంజావూర్ నాయక  రాజు ''చెవ్వప్ప ''సంగీత మహల్ నే కట్టించిన సంగీత ప్రియుడు .ఆ
మహల్ లో గాయకుడు ఎంత తక్కువ శ్రు తి లో పాడినా కనీసం 1500 మందికి విని పించే ఏర్పాటు
ఉందట . చత్రపతి శివాజీ మహారాజు వంశానికి చెందిన ''షాహాజీ ''మహా రాజు ఆస్థా నం లో త్యాగయ్య గారి
తాత గారు ;;గిరిరాజ కవి ''ఆస్థా న గాయకుడు గా వుండే వారు .శరభోజి మహా రాజు ఆస్థా నం లో 360
మంది సంగీత విద్వాంసులు వుండే వారట .రోజుకు ఒక విద్వాంసునితో పాడించే వారట . తిరువాన్కూర్
మహారాజు స్వాతి తిరుణాల్ గొప్ప వాగ్గేయ కారుడు .సంగీత స్రష్ట .ఆయన ఆస్థా నం లో వున్న ఫిడేల్
విద్వాంసుడు ''వడివేల్ ''  ప్రతిభకు మెచ్చి ,బంగారు ఫిడేల్ తయారు చేయించి ,బహూక రించాడట
.గద్వాల్ రాజు సీతా రామి రెడ్డి సంగీత విద్వాంసులను ఆదరించి ,ఏటా వార్షికాలు ఇచ్చే వాడు .
భోజనం సమయం లో ''చిన్న గుమ్మడి కాయ ''అంత లడ్డు లు వడ్డించే వాడట .ఎన్ని తింటే అన్ని
రూపాయలు కానుకగా అంద జేశే వాడట .కృష్ణా జిల్లా లో చల్ల పల్లి ,నూజివీడు ,మైలవరం ,ముక్త్యాల ,తోట్ల
వల్లూ ర్ జమీందారులు సంగీత కళను బాగా పో షించారు .గరిక పాటి కోటయ్య దేవర లాంటి మహా
విద్వాంసులను ఆస్థా న విద్వాంసులను చేశారు .ఇలా ,వివిధ రాజులు ,జమీందార్లు సంగీత కళకు మంచి
ప్రో త్సాహమిచ్చి పో షించారు .
         ''సంగీత సాహిత్య రాసాను భూత్యై-కర్ణ ద్వయం కల్పిత వాన్ విధాతా --ఏకేన హీనః పున రేక కర్ణో
,ద్వాభ్యాం విహీనో బదిరస్య ఏవ''అంటే బరహ మనకు రెండు చెవులను ఇచ్చాడు అవి సంగీర్హా
,సాహిత్యాలను విని ఆస్వాదిన్చాతానికే .అందులో ఒక దాని మీదైనా ఇష్ట ం లేక పొ తే ఒక చెవి వున్న వాడి
కింద లెక్క .రెండిటి మీదా ఆసక్తి లేక పొ తే చెవిటి వాడి గానే భావించాలి .మన వాళ్ళు మనో రంజనం చేసే
సంగీత ,సాహిత్యాలకు అంత ప్రా ధాన్యత నిచ్చారు .తెలిసిన శ్రో త దొ రికితే శ్లో కం శ్లో కత్వం పొ ందు తుంది
.తెలియని శ్రో త దొ రికితే శ్లో కం శోకం అవుతుంది అన్నారు పెద్దలు .రసికత్వం లేని విద్య రాణించదు
.ఇప్పుడు త్యాగయ్య గారి కృతుల్లో వున్న ,భాష,భావ సౌందర్యాన్ని వివ రం గా తెలుసు కొందాం .
          ''ఏలా దయ రాదు ,పరాకు చేసే వేలా సమయము కాదు -''ఏలా '
          ''బాల కనక మయ చేల సుజన పరిపాల ,శ్రీ రమా లోల విధృత శర జాల -శుభద కరుణాల వాల -
ఘన నీల నవ్య వన మాలికా భరణా 'ఏలా ''అనే ''ఆథనా ''రాగం లో మొదటి కీర్తన రాశారు త్యాగయ్య
.ఆయన శ్రీ రాముడు నారాయణుడే .దశావతారాలు ,ఆయన ప్రతీకలే .త్యాగ బ్రహ్మ అపర వాల్మీకి
అవతారం అని భక్తు ల విశ్వాసం .ఈ కీర్తన లో నామ ,రూప వర్ణనా వైభవం వుంది .లలిత పద విన్యాసం
,రుచికర మైన అను ప్రా సలు ,వున్న కీర్తన ఇది .సంస్కృత భాషా ప్రయోగం ప్రౌ ధం గా వుంది .సంగీత కళా
విన్యాసము కన్పిస్తు ంది .తెలుగు కూడా  అంత అందం గానే నడిచింది .
        '' మరవకే  నవ మన్మధ రూపుని -నీటో ,మెల్లని మాటొ కన్నుల తేట ో ,మరి వలె వాటో ,మనసా --
కులుకో ,పావలా గిలుకో ,కపురపు బలుకో ,చెక్కుల తాళుకో ''అనే దేవ గాంధారి రాగం లోని కీర్తన లో
శ్రీరాముని రూపము ,అలంకారము లను తేట తెలుగు లో వర్ణిస్తూ రామునికి తెలుగుదనం అబ్బ జేశాడు
త్యాగయ్య .శ్రీ రామునికి తెలుగు వారి ''వల్లే వాటు ''వేశాడు చిత్రా తిచిత్రం గా .
         కొన్ని పదాలను తమాషా గా వాడు తాడు త్యాగ్యా భాస్కర కవి ని ''కవీనా ''అంటాడు .కవి +ఇన
అని విడగొట్టు కొంటె కాని అర్ధ ం కాదు .వాల్మీకిని ''బిలజ మౌని ''అని చక్కని తెనుగు పేరు తో పిలిచాడు
.అట్లా గే శ్రీ రాముడు ఆయన చేతిలో ''పాప గజ నృసింహుడు  ''అయి పో యాడు .
 శ్రీరాగం లో రాసిన ''ఎందరో మహాను భావులు ''కీర్తన హై లైట్  గా భావిస్తా రు అదొ క నానుడి గా జనం లో
నిల్చి పో యింది .అందులోని నడక సౌభాగ్యం ఎంత అద్భుతం గా వుందో గమనిద్దా ం .. 
      ''మానస వన సంచారము నిలిపి --మూర్తి బాగుగా పొ డ గనే  వారెందరో మహాను భావులు 
      సరగున పాదములకు ,స్వాంతమను -సరోజమును సమర్పణము సేయు వారెందరో --
      హరి గు  మ  ణు  లగు సరముల గళమున --శోభిల్లు భక్త కోటులిలలో ,తెలివితో 
      కరుణ కల్గిజగామేల్లను సుధా ద్రు ష్టి చే బ్రో చు వారెందరో మహాను భావులు 
      హొయలు మీరి ,నడలు గల్గు -సరసుని సదా కనుల చూచుచు పులక శరీరులై 
      యానంద పయోధి నిమగ్నులయి ముదంబును ,యశము గల వారెందరో --''
           ఈ కీర్తన లో త్యాగయ్య గారి సంస్కార హృదయం ఆవిష్కృత మైంది . ఈ గీతం తో సంగీత రాసికులే
కాక భక్తు లు కూడా ముగ్ధు లై పరవశించి పో తున్నారు .అంత ప్రా చుర్యం పొ ందిక కృతి ఇది .
-- అల్లా గే ''దుర్జ న జలద సమీర '',''నయన నిందిత సరోజ ''అనే అద్భుత ప్రయోగాలు చేశారు .ఇందులో

మిగిలిన వారి కంటే భిన్నం గా ఆలోచించి కొత్త పద ప్రయోగం చేయాలనే ఆలోచన మనకు స్పష్ట ం గా కని

పిస్తు ంది .ఆయన ది అగాధ సంగీత సాహిత్య రస జలధి .అందులో మునిగితే తేలటం కష్ట ం .మరోసారి

మరిన్ని వివరాలు తెలుసు కొందాం 

 సంగీత సద్గు రు శ్రీ  త్యాగ రాజ స్వామి ---5

                                             కృతుల్లో భాషా భావం 


                    తంజావూర్ కు తూర్పున  నాగ పట్నం లో ''నీలాయ తాక్షి దేవి ''అమ్మ వారు వెలిసింది
.ఆమెను తన తోడ బుట్టిన , తోడి రాగం లో అందం గా కీర్తిస్తా డు త్యాగ రాజు .ఆమెకు తెలుగు అందం
,షో కు చేశాడు . ఆ కీర్తన ,నడక ,సొ గసు చాలా ఇంపు గా వుంటాయి .కనుల పండువు గా వర్ణిస్తా డు
.దృశ్యానికి చక్కని పద బంధాన్ని కూరుస్తా డు .అలౌకికానందం లో వున్న వారికే అలా వర్ణించటం సాధ్యం
..త్యాగయ్య త్యాగ రాజేశ్వరుడనే  శివుని వర ప్రభావం వల్ల జన్మించాడని చెప్పు కొన్నాం . .ఆ స్వామి
అమ్మ వారి పేరు కమలా దేవి అని కూడా మనకు తెలుసు .త్యాగయ్య గారి రెండవ భార్య పేరు కూడా
కమల అవటం తమాషా గా వుంటుంది ,కుదిరింది ,అదిరిందీ .ఇప్పుడు కీర్తన సొ గసు చూద్దా ం 
  ''కరకు బంగారు వల్వగట్టి ,  ,సొ గసు మీర -కరమున చిలుకను బట్టి ,నిర్జ ర తరు  
   విరులనుకోప్పు నిండ జుట్టి ,అదియు గాక --హరుని అట్ట ట్టా డించిన  నీ లీలను ''
చేతి లో చిలుక పెండ్లి ఊరేగింపు దృశ్యం .హరుని అట్ట ట్టా డించటం అనే దానిలో ఫ్లా ష్ బాక్ కధ
వుంది.పార్వతి శివునికై తపస్సు చేసి ప్రా ణార్పణ చేస్తే ,ఆమె కళేబరాన్ని ,శివుడు భుజం మీద మోస్తూ
,ఊగి పో తున్న దృశ్యం ఇది .కన్నుల పండువు గా శివ దర్శనం చేయిస్తా డు .అదే త్యాగయ్య గారి రచనా
వైభోగం . ఇదే ఆయన కధక చాతుర్యం కూడా . 
        ''రాజ శేఖర ,సన్ను తంగ -త్యాగ రాజ హృదబ్జ సుభ్రు ంగ --రాజిత కరుణా పాంగ -రతి రాజ జనక
,''పాప ధ్వాంత పతంగ'' '',ఈ చివరి మాటలో'' పాపం అనే చీకటికి సూర్యుడు'' అని చక్కని మాట వాడాడు
త్యాగయ్య .
        కల్యాణి రాగ కీర్తన ''నిధి చాల సుఖమా ,రాముని సన్నిధి సేవ సుఖమో ,నిజముగా బల్కు మనసా
?''
                              దధి ,నవనీత ,క్షీరములు రుచో ,-దాశరధి ధ్యాన భజన సుధా రసము రుచో ?
                              శమ ,దమమను గంగా స్నానము సుఖమో _కర్ద మ దుర్విషయ కూప స్నానము 
సుఖమో ?
                              మమత బంధన యుత ,నరస్తు తి సుఖమో ?--సుమతి త్యాగ రాజ నుతుని కీర్తన
సుఖమో ?''
ఇది ''యోగాన్ని సంపూర్ణం గా అనుభవించిన త్యాగ బ్రహ్మ చేసిన ఆధ్యాత్మిక జాగృతి శంఖా రావం ''గా
చక్కని విశ్లేషణ చేశారు విబుధ వరులు .ఈ కీర్తన లో భాషా ,భావం ఒక దానితో ఒకటి పెన వేసుకొని ,అతి
వేగంగా పరి గెత్తె మాధుర్య విలసిత స్వర రచన .ఈ కీర్తన ,నిత్యం జనం నోట నినదించే ప్రణవ మంత్రం
అయింది .
 ''బంటు రీతి కోలు వియ్య మని ''వేడ గలడు ,ఆ బంటు వేషం ఎలా వుంటుందో రూపు కట్టి నట్లు చెప్పనూ
గలడు .'''రోమాన్చామనే కంచుకం ''అనేది రామ భక్తు డు అనటానికి ముద్ర బిళ్ళ అట .''రామ నామం అనే
వీర ఖడ్గ ం ధరించే బంటు వేషం ''కావాలి త్యాగయ్యకు .ఇలాంటి కోరికా ఏ భక్త కవీ వెలి బుచ్చిన దాఖలాలు
లేవు .ఇది త్యాగయ్య స్వంతం .అలాంటి భక్తు నికే సాలోక్య ,సారూప్య ,సామీప్య ,సాయుజ్య భాగ్యం  కలుగు
తుంది .ఈ కోరిక లో చాలా గొప్ప ఆలోచన బయట పెడుతాడు .సాయుజ్యానికి-'' సాన్నిధ్యం'' ఆఖరి మెట్టు
గా భక్తీ యోగం చెబుతుంది .
        త్యాగ రాజు గారికి ''ర''వర్ణ ం మీద మోజేక్కువ .అది సంగీతానికి సౌలభ్యాన్ని ఇచ్చేది కనుక
ఆయనకు బాగా నచ్చి ఉండ వచ్చు .అందుకే ''రాగ పంజరం ''అనే రాగం లో ''ద్విరదాద్భుత గమనం 
(ఏనుగు నడక )తోగోపా కీర్తన రాసాడు .ఇందులో సంస్కృత భాష  ,మత్తేభం లా దౌడు తీస్తు ంది .ఈ కీర్తన
లో భాష ,భావం జోడు గుర్రా ల స్వారి లా వుంటాయి . 
 '' వరదా !నవనీతాశా ,పాహి --వరదా ,నవ మదనాశా ,ఏహి (రా)--శరదాభ ,కార విధృత శారాశర -
శరదాశుగా ,సుమ శరదా ,శర హిత --ద్విరదాద్భుత గమనా -పుర దహన నుత -స్ఫురదా భరణా 
,జరావన పర -గరదా శన  ,తురగ రధా -
ద్యుతి జిత వరదాన జనాగ్రేసర ,త్యాగ రాజ '''.
           రకార విక్రీడితం తో కంచి వరద రాజ స్వామి పై చెప్పిన కృతి ఇది .శరద +అభ -నల్ల ని  మేఘం
లాంటి కాంతి కల వాడా -కవి విద్రు త శర అంటే -చేతిలో విల్లు ,బాణం ధరించిన వాడా -ఆశర శరద
,ఆశుగా-అంటే రాక్షసులు అనే మేఘాలను పార ద్రో లె వాయువా -సుమ శరద -అంటే మన్మధునికి పుష్ప
బాణాలను ఇచ్చిన వాడా --ద్విరదాద్భుత గమనా -ఏనుగు నడక వంటి చిత్రమైన గమనం కల వాడా -
అజర ,ఆవన పరా -ముసలి తనం లేని దేవతలను రక్షించే వాడా --గరద ,ఆశన తురగ రధ -అంటే విషం
వున్న పాముల్ని తినే గరుత్మంతుడు రధం గా వున్న వాడా --కాంతి జిత -అంటే కాంతి చేత జయం
పొ ందే వాడా . ఇలా చిక్కని ,చక్కని భావాలను మనోహరం గా సంస్కృత పద భూయిష్ట ం గా ఆవిష్కరించే
నేర్పు త్యాగయ్యకు వుంది .భాష ఆయనకు దాశ్యం చేసి నట్లు కని పిస్తు ంది .ఎక్కడా కీర్తన కుంటు పడదు
వేగం తగ్గ దు ఆలోచన పదాల వెంట పరి  గెత్తు తుంది .ఒక అద్భుత శివ చిత్రం మన కళ్ళ ముందు
సాక్షాత్కరిస్తు ంది.అలౌకిక ఆనందం  అనుభవం లోకి వస్తు ంది . మధు మధుర భావాలను అత్యంత
నేర్పుగా వ్యక్తీకరించే కవిత్వం  సహజం గా వున్న వాడు త్యాగయ్య .
                        ''నిరు పేద భక్తు ల కరి కోత బడ లేక గిరి పై నెక్కు కుంటివో ?- అంగలార్పు జూచి ,రంగ
పురంబున  ,పండితివో ?
  కాచిన భక్తు ల జూచి ,ఆ ,బలినే యాచించ ,వెడలితివో -?జాలితో వచ్చు ,కుచేలుని గని ,గోపీ చేలము
లెత్తి తివో ?
  నీ గుణముల గుట్టు ,బాగుగ దెలిసెను త్యాగ రాజ వినుత ''
          ఈ కీర్తన అంతా కొత్త పో కడ లో వుంటుంది .సో ంపు తో బాటు ,మనోహర భావం   ,చెణుకులు
,బెళుకులు తో తీర్చాడు .మహా కవుల సరసన నిలబెట్టే రచన గా దీన్ని గుర్తించారు .''భావ సంపదను
, ,సహజ భాషా లాలిత్యాలను , ,తేనే వంటి జాను తెలుగును  ,జాలు వార్చే రచన .''
              భాషలో ,భావం లో తెలుగు అందాలతో వర్ధిల్లి న ఈ కీర్తన ఆల కించండి 
  ''ఇనాళ్ళు దయ రాకున్న వైన మేమి ?ఇపుడైనా తెలుప వయ్యా ?-
    అలనాడు ,తరణి సుతార్తిని(సూర్య పుత్రు డు సుగ్రీవుని బాధను )దీర్పను వెలసి నిల్వగ లేదా ? 
   అదియును గాక ,బలము చూపగ లేదా ?వాని నేరములు తాలు కోని ,చెలిమి చేసి,  పదముల
భక్తీయగా లేదా ?''
-- అంతే కాదు -''మనసున ,నిను కుల ధనము గా ,సంరక్షణ చేసతి
ి ని గాని ,మరచితినా ?'' అని పాత

కధను జ్ఞా పకం చేసి ,

 ఐహిక ధనం కాదు ,భక్తి ధనం ఇవ్వ మని ఆర్తి గా వేడు కొంటాడు త్యాగ రాజ సుకవి .

       ''అలరుచు వచ్చు ,అర్భకుని ,తల్లి రీతి ,ఆదుకో ధర్మాంబికే ''

అంటూ పసి పిల్లా డు తల్లిని వేడు కొంటున్నట్లు ,వేడుకొంటాడు .''సర్వ విద్యా ప్రవీణుడు అయిన  జ్ఞా ని శిశు

ప్రవ్రు త్తి లో ఆనందిస్తా డు ''అని విజ్ఞు ల భావన కు త్యాగయ్య ఈ కీర్తన లో సాక్షీ భూతం గా నిలుస్తా డు

.క్రైస్తవ బో ధ Sermon on mount లో కూడా శిశువు అయితేనే స్వర్గా నికి ప్రవేశార్హత వుంటుంది అని

చెప్పినట్లు అనుభవజ్ఞు ల ఉవాచ .

            మరో రకార రమ్యతను తిలకిద్దా ం .ఇందులోని గమకం అనితర సాధ్యం అని పిస్తు ంది 

    ''ఎలా నీ దయా రాదూ -పరాకు చేసే వేలా సమయమూ గాదూ 


     బాల కనక ఆయ చేల ,సుజన పరి పాల ,శ్రీ రమా లోల ,-విధృత శర జాల ,శుభద   కరుణాల వాల 

     నవ నీల నవ మాలికా భరణ ,-రారా దేవాది దేవ,రారా మహాను భావ 

     రారా ,రాజీవ నేత్ర ,రఘు వర పుత్ర -సార తర సుధా పూర హృదయ  పరివార 

     జలధిగంభీర ,దనుజ సంహార ,దశరధ కుమార ,బుధ జన విహార 

     సకల శ్రు తి సార ,నాదు పై ఏలా దయా రాదూ ''

ఇందులో ''రారా''అనటం లో ఆర్తి ప్రతిధ్వనించి నట్లు వుంటుంది .ఆ నడక లో అతి వేగం కని పిస్తు ంది

.అత్యంత వేగం గా వచ్చి ఆదుకోమనే ధ్వని విన్పిస్తు ంది .ఇన్నిటిని సాధించాడు ఈ కీర్తనలో .ఇదేదో

రాయాలని రాసిన ది గా అని పించదు .తదేక ధ్యానం లో ,మహా సమాధిలో వున్నప్పుడు రాసిన అవ్యక్త

మాధుర్యం కని పిస్తు ంది ,విని పిస్తు ంది .

         ఇంకో కీర్తన లోకి ప్రవేశిద్దా ం .''గ్రహ ''అనే పదాన్ని అనేక విధాల ఉపయోగించి తన పాండిత్య

ప్రకర్షను చాటుకొన్నాడు త్యాగయ్య .భాషా ప్రయోగం మీద మంచి ఆవ గాహన ,అధికారం వున్న వాడు గా

ప్రత్యక్ష మౌతాడు .ప్రా ర్ధ న తో గ్రహ బలాల నన్నిటినీదూరం   చేయ వచ్చు అంటాడు .స్వానుభవం ను

జోడించి చెప్పిన కీర్తన .అందుకే పెద్దలు ''తక్దీర్ (తల వ్రా త )ను ''తత్ బీర్ '' (పురుష ప్రయత్నం )తో పో గొట్ట

వచ్చును అని చెబుతారు .రామానుగ్రహ బలం వుంటే ,ఏ గ్రహమూ ,ఏమీ చేయ లేదు .నిగ్రహం వుండాలి
.
         ''గ్రహ బల మేమి ?శ్రీ రామానుగ్రహ బలమే బలము -గ్రహ బలమేమి?తేజోమయ విగ్రహమును

ధ్యానించే వారికి ?

          నవ గ్రహ పీడల పంచ పాపముల ,-నాగ్రహములు  ,కలకామాది -రిపుల నిగ్రహము సేయు హరిని

భజించే త్యాగ రాజు నికి ,రాసికాగ్రేసరులకు ''అని భరోసా ఇస్తా డు .అనవసర కలవరం తో గ్రహాలకు

శాంతులు ,జప తపాలు చేసి ,ఒళ్ళు గుల్ల చేసుకో వద్దు .రామానుగ్రహాన్ని పొ ందితే అన్నీ ఆయనే చూసు

కుంటాడు .సర్వగ్రహాలూ ,ఆయన అనుగ్రహం మీదే పని చేస్తా యి అన్నది సారాంశం .

                    కీర్తన నడక లో రాజసం ,అందం ఒలక బో స్తు సాగే ఇంకో రచన చవి చూద్దా ం 

       ''మెరుగు బంగారందెలు బెట్టి ,మేటియౌ ,సరిగ వల్వలు గట్టి -సుర తరు సుమముల సిగ నిండ జుట్టి ,

        సుందర మగు మోమున ముద్దు బెట్టి ''అంటూ శ్రీ రాముని దివ్య విభూతిని ప్రత్యక్షం చేస్తా డు .శ్రీ

రామునికి సమాన మెవరు ?అని ప్రశ్నిస్తా డు .ఆయన భావం మరువంపు మొలక -ఆయనో -భక్తు ల

పంజరంపు చిలక .-పలుకు ,పలుకులకు తేనే లొలుకు మాట లాడు -సో దరుల హరి కి -సమాన మెవరు

?శ్రీ రాముడు భక్తు ల మనో పంజరం లో చిక్కిన రామ చిలుక అట .చక్కని భావం .భక్తితో భావం , తో పరా
కాష్ట    చెందిన కీర్తన .

             మరిన్ని విశేషాలు మరో సారి 

 సంగీత సద్గు రు శ్రీ త్యాగ రాజ స్వామి --6

                                      భాష భావం మరియు జాతీయాలు నుడి కారం 


          ''క్ష'కారం తో నూ ,అక్షర రమ్యత సాధింప గల నేర్పున్న వాడు త్యాగయ్య .మంచి బాణీ తో శ్రీ
రాముని లోని 32 దివ్య గుణాలను ,ప్రౌ ఢ కవిత్వం తో ఆవిష్కరించిన కీర్తన వినండి .
        ''ముప్పది రెండు లక్షణములు గల -ప్రదక్షిణ మొనరింతాము రారే -కుక్షిని బ్రహ్మాన్ద ములున్న వట 
         విచక్షనుదట ,దీక్షా గురుడట ,శుభ లక్షణ లక్ష్యముగల కృతులకు ప్రత్యక్షం బౌనట ''
        అక్షరస్తూ లైన భజన పరులకే అంత రంగ డౌ నట. . ఈ కృతి వేద భాష లో రాసి నట్లు ంటుంది
.కనుక పరమాత్మ రాక ఏం చేస్తా డు ?ఆ పరబ్రహ్మమే అక్షరుడు .''విదులకు ,కోవిదులకు మ్రొ క్కే  ''
సంస్కారి త్యాగ రాజు .
          సంసారం మోక్షానికి దూరం కాదు .గృహస్తా శ్రమ ధర్మం గొప్పదని చాటి చెప్పే ఆశ్రమ రహశ్యం
తెలిసిన జ్ఞా ని .దాని ప్రయోజనాన్ని ,గొప్ప గా చెప్పాడు .
      ''సంసారు లైతే నేమయ్యా ,శిఖి పించావసంతు డెదుట నుండగ 
       హింసా దు  లెల్ల రోసి ,హంసాదుల గూడి ,-ప్రశంస చేయుచు ,నే ప్రొ ద్దు కంసారిని నమ్ము వారు ''అని
బో ధిస్తా రు .
       ''దార పుత్రు ల పరి చారకుల జేసి -సార రూపుని ,పద సారస యుగముల -సారే సారెకు మనసార
పూజించు వారు '' 
అని ,సంఘ మర్యాద పాటిస్తూ పరాత్పరుని సేవించాలనే ఉద్బోధ ఇందులో వుంది .
         శ్రీ రాముని అతీత గుణ సౌభాగ్యాన్ని  వర్ణిస్తూ ,మురళీ గాన లోలుని లో శ్రీ రాముని దర్శిస్తూ ,ఆ
మోహన రూపాన్ని ,''హిందో ళ  రాగం ''లో అద్భుతం గా పలికిస్తు న్నాడు అద్వైతి  త్యాగ రాజు .
       ''సామజ వర గమనా ,సాదు హృత్సార సాబ్జ పాల -కాలా తీత విఖ్యాత 
        సామ నిగమ జ ,సుధామయ ,గాన విచక్షణ --గుణ శీల దయాల వాల 
        యాదవ కుల మురళీ వాదన వినోద ,-మోహన కర ,త్యాగ రాజ వర నందన ''
           సామజం అంటే సామ వేదం లో సంగీతం పుట్టిందని భావం .అలాగే ఏనుగు అని కూడా  అర్ధ ం
.రాముని నడక -సామజ గమనం .సంగీత స్వ ర స్వరూపుడు శ్రీ రాముడు .అందుకని ఈ ప్రద ప్రయోగం
ఔచితీ యుతం గా వుంది .ఇలాంటి ప్రయోగాన్ని ''రుచి మత్వం   ''అంటారు .సత్పురుషులనే మానస
తామరాలకు సూర్యుడట .మాటలను విడదీయటం ,కలపటం ,పండిత కవి అయిన త్యాగ రాజుకు
సులభమే .సామ వేదం లో స్వరాలు నాలుగు .ఉచ్చ శృతి -గాంధారం (గ )నాల్గ వది చివరిది ''ని ''(గరిసని
)నిషాదం .ఆరోహణ లో నిషాదం మొదటిది .నిషాదం ఏనుగు ఘీంకారం నుండి జనించిందని సంగీతజ్ఞు ల
విశ్లేషణ .ఇది సామ గానం మొదటిది .అందుకే ఏనుగు ''సామజం ''అయిందట .ఇంత అర్ధం తో ,పద
ప్రయోగమ్ చేయ గల సత్తా త్యాగ రాజుది .''మహా కవి గాకేమి త్యాగ రాజు ''? అని పిస్తు ంది మనకు .
                             జాతీయాలు -నుడి కారం 
       ''కల్ల లాడి కడుపు పల్ల ము నింపుట ''అనేది కుక్షిమ్భారత్వానికి చక్కని తెలుగు .''మంచు వలె ప్రతి
ఫలించే సంపద అనేది చక్కని ఉప మానం .ఇంద్రు ణ్ణి ''వారి వాహ వాహనుడని ''అందం గా అంటాడు .''నీ
అబ్బ !నీ సొ మ్మేం పో యింది ?అనటానికి ''కరు ణించితే  నీదు తండ్రి సొ మ్ము వెరవక పో నేరదు ''భక్తీ తో
కూడిన చదువు వల్ల వచ్చిన జాను తెనుగు నుడి కారం ఇది .మాటలను అతి పొ దుపు గా వాడటం
త్యాగయ్య కు ఇష్ట ం .''శ్రీ పతి ''అనడు త్యాగ రాజు ''శ్రీ ప ''అని లేక పొ తే ''మా ప '' అని  తేలిగ్గా అనేస్తా డు
.అల్పార్ధా లలో అనల్పార్ధ త సాధిస్తా డు .''కలిగి యుంటే కదా కల్గు ను ''అన్నది చేసు కొన్న వారికి
చేసుకోన్నంత అని అర్ధ ం లో వాడాడు .''చుట్టి చుట్టి ,పక్షు లెల్ల చెట్టు వెదకు రీతి ''-గా శ్రీరాముని పదం
పట్టా డట త్యాగయ్య..
          తనను తాను పొ గడు కోవటం అన టానికి ''పొ డవున ఎంతాడు కొన్న ''అనే జాతీయం
ప్రయోగిస్తా డు .భక్తీ ,ప్రేమలు బేరం ఆడే ,అంగడి దినుసులు  కావు ''అనటానికి బలే గా ''కొని యాడె నా
ఎద ,దయ ,వెలకు కొని  యాడేవు సుమీ రామా !
-అని వెక్కి రింపు గా శ్లేష తో ప్రయోగించాడు .తన వారు దగ్గ ర చేర్చటం అనే అర్ధం లో''తన వారితనం

లేదా ?''అంటాడు .మధుర పద బంధం తో కూడిన మాటల సో ంపు ఇది .-భాష ఆయనకు లొంగి

నడుస్తు ందేమో నని పిస్తు ంది .''తలకు వచ్చిన బాధ కు తల పాగా కు చికిత్స చేస్తే పో తుందా'' ?అంటాడు

.ఇదో చాటువు గా మిగిలి పో యింది .చెవికి ఇంపైన మాట అనటానికి 'మృదు వార్త ''అంటాడు .వార్త కు

,మృదుత్వం కూర్చటం త్యాగయ్య గారి మంచి పనితనం .తిక్కన కూడా ''మృదు ద్యూతం ''అని

ప్రయోగించాడు .

          రూపము ,ప్రతాపము ,శర చాపము ,సల్లా పము ,''అంటూ ''పము ''తో అలంకరిస్తా డు .శ్రీ రామున్ని

''వర త్యాగ రాజ వాక్చేలావ్రు త ''అని ,తన కీర్తనా వస్త్రా లతో ,అలంకరిస్తా డు .అహల్యను ''తాను తాప

మొర్వ లేని చాప రాయి ''అన్నాడు .ఇందులో జాను తెనుగు నుడికారం కని పిస్తు ంది ''.జ్యావర నుత ,జ్యా

జ్యావర ,బిడౌజావర జాశ్రిత ,త్యాగ రాజ ,జ్యావర రాజ రుద్రా వనీసుర భావనీయ ,ముని జీవన ''అని ద్వ్యర్ధి

కావ్యం లా అన గల సామర్ధ ్యం ,శక్తి వున్న కవి త్యాగయ్య .జ్యావర నుత అంటే -భూ భర్త చేత కొని యాడ

బడ్డ వాడు .జ్యాజ -అంటే -భూమి యందు పుట్టిన సీతా దేవి -వర భర్త అయిన శ్రీ రాముడు .బిడౌజ -

ఇంద్రు నికిఅవరాజ -అటే తమ్ముడా అంటే ఉపెంద్రు డైన శ్రీ రాముడు .జ్యావర -అంటే రాజ శ్రేస్తు లకు ,అజ

అంటే బ్రహ్మకు ,భవ దీయుడు -ద్యానింప దగిన వాడు ఇందులో అర్ధ శ్లేష ,గాంభీర్యం ,ప్రా స మాధుర్యం
చూపిస్తా డు మహా కవి .

''పుట్టి న నాదే ,నిజ భక్తీ ,మెడకు గట్టి ,గుట్టు చెదరక , చేయి పట్టి ,గుట్టు చెదరక ,చేయి పట్టి విడువ రాదు

''అంటాడు .ఇదొ క శక్తి వున్న జాతీయం .

       ''యజ్ఞా దులు సుఖ మను వారికి సముల జ్ఞా నులు గలరా మనసా ''--''సుజ్ఞా న దరిద్రు లు పరం

పరలు ,అసుర చిత్తు లు అంటాడు .ఒక విప్ల వ వాదిగా, కత్తి తో తెగేసి నట్లు ,జ్ఞా నం లేని దరిద్రు లు ,సుజ్ఞా న

దరిద్రు లు .ఔచిత్య వంత మైన పద ప్రయోగం .లక్ష్మణుడిని ''నిద్దు ర జితుడు ''అంటూ ,అతని సేవా

ధర్మాన్ని జ్ఞా పకం చేస్తా డు .ఆ కధ  మన వూహ కు వదిలేస్తా డు .ఇదో సర్వ త్వంతంత్ర ప్రయోగం .కొంత

మంది అనటానికి ''కేచన ''అనే సంస్కృత పదాన్ని ప్రయోగిస్తా డు .భాష పై అంతటి అది కారం

వుందాయనకు .

   ''యోచనా ,కమల లోచనా ,నను బ్రో వ -సూచన తెలియక నొరుల ,యాచన చేటు ననుచు నీకు తోచెనా

?''అని తెలుగు పదాలతో ప్రా రంభించి ,వెంటనే సంస్కృతం లోకి దూకి ''ద్యుతి విజితాయుత విరోచన -

నన్ను బ్రో వ నింక'' కేచన'',నిజ భక్తి  

నిచయ పాప విమోచన ,కల బిరుదేల్ల గొని ,నన్నేచనా ?కృత విపిన చర వరాభి షేచనా ,త్యాగ రాజ

పూజిత ''    

అన్న కీర్తన లో ప్రౌ ఢ శబ్ద ప్రయోగం చేసి ,పండితుడు అని ముద్ర వేయించు కొన్నాడు త్యాగయ్య .ఇది

మరో కొత్త మార్గ ం లో బాణీ లో శ్రీ రాముడికి నివేదంి చిన ''వేడి కోలు ''.భావం లోకి తొంగి చూస్తె -కాంతి చేత

జయింప బడ్డ 10 వేల సూర్యులు కల వాడా అనే అర్ధ ం కోసం 'ద్యుతి విజితాయుత విరోచన ''అన్నాడు

.''చానా ''అనే శబ్దా న్ని చక్క గా ప్రయోగించి ,చెవులకు విందు చేకూర్చటం ఇందు లోని ప్రత్యేకత .

          ''రామ సుధా రస పాన మొక రాజ్యము చేసునే ?''అని రామ నామ ఫలానికి విలువ నిర్ణ యిస్తా డు

.రాజ్యం కంటే గొప్పదని ధంకా బజాయిస్తా డు .ఇదీ మంచి నుడికారమే .''రూకలు పది వేలున్నా ,చేరెడు

నూకలు గతి గాని ,కోకలు వెయ్యున్నా ,కట్టు కొనుట కొకటే గాని వో  మనసా --ఊరేలి తా,బండుట మూడు

మూర తావు  గాని  

 యేరు నిండా బారిన పాత్రకు ,తగు నీరు వచ్చు గాని ''అనేకీర్తన   లో ప్రతి పాదం ఒక సామెతే .సామెతల

,ఆమెతలు త్యాగయ్య కు వెన్న తో బెట్టిన విద్యే .

  ''నీ మనసు ,నీ సొ గసు ,నీ దినుసు ,వేరే --తామస మత దైన్య మేల ''అనటం లో ఆయన దినుసు

,రాముని దినుసు అంటే సత్తా తెలుస్తు న్నాయి .

         ఈ సారి త్యాగయ్య కృతుల్లో ఆలంకారికత్వాన్ని తెలుసు కొందాం 


సంగీత సద్గు రు శ్రీత్యాగ రాజ స్వామి --7

                                        కృతులలో ఆలంకారికత 
ఇప్పటి వరకు శ్రీ త్యాగ రాజ స్వామి జీవితం బాల్యం ,యవ్వనం క్షేర్త ్ర దర్శనం ,కైవల్యం ,పరంపర ,ఆయన
కృతుల్లో వున్న సామాజికాంశాలు ,సర్వమత సహనం ,సంస్కరణ భావాలు ,భాష ,భావం ,జాతీయాలు
,నుడికారాలను గురించి వివరం గానే తెలుసు కొన్నాం .ఇప్పుడు త్యాగయ్య కృతుల్లో పొ దిగిన అలంకార
విలువలను గురించి తెలుసు కుందాం 
              త్యాగయ్య మంచి అలంకార ప్రియుడు -వేషం లో కాదు .కవిత్వ రచనలో .శ్లేష ,విరుపులతో
భావాన్ని పరి పాకం చేసే నేర్పున్న వాడు .యమ ,అనుప్రా సాలన్కారాల్లో పో తన్న కు సమ ఉజ్జీ గా కని
పిస్తా డు .అందుకే కృతుల్లో అంత కలకండ మాధుర్యం .
'   ''కుశ లవ జనక శ్రీ రామా ,కుశ లద    చతుర శ్రీ రామా -''అంటాడు చతురం గా .కుశాలదా అంటే
క్షేమాన్ని ఇచ్చే వాడా అని అర్ధం .దీన్నే అర్ధ శ్లేష అంటారు .అలాగే మాటలపై లలిత శ్లేషకు ఉదాహరణ
-''పాహి రామ యనుచు ,నీదు పదము నమ్మితి -పాహి రామ యనుచు నీదు పదము పాడితి ''
        యమకాలన్కారం ఆయనకు గమకమే . అందులో -శ్లేష యమక చక్ర వర్తి త్యాగయ్య . ఆ సొ గసు
చూడండి 
 '' కువలయ దళ నేత్ర ,పాలిత కువలయ దళితామిత్ర (శత్రు న్జ యుడు )-కమలాహిత గుణ భరిత రామా
,కమలాహిత ధర వినుత ( కమలానికి   శత్రు వైన చంద్రు ని ధరించిన శివుని చేత పొ గడ బడే వాడా )త్యాగ
రాజ నుత చరణ ,నిత్యాగ రాజ ధర సుగుణా (గోవర్ధ న గిరి ని ధరించిన వాడా )
  ''పరమ  దయాళు వని ,పాలన సేతు వని ,సరగునదేవ రాయా  కొలచిన నాపై కరుణ లేదని
,కన్నీరాయె --చూచి నీ మనసు కరుగ దెందుకు రాయా ?''అని గట్టి గా అడిగే ధైర్యం కూడా ఆ భక్తు డైన
త్యాగయ్యకు వుంది .''రాయ ''శబ్దా న్ని సాభిప్రా యం గా ప్రయోగించి,మధుర శ్లేష వైభవాన్ని ,ప్రదర్శించాడు
.భాష శిష్ట వ్యావ హారికం కావటం మరీ అందాన్నిచ్చింది .  
            ''మావర ,ఉమా వర ,సన్నుత ''అనేది మంచి ప్రయోగం గా కని పిస్తు ంది .లక్ష్మీ దేవి భర్త అనీ
,ఉమా దేవి భర్త శివునిచే ఆరాధింప బడే వాడా అనీ చక్కని అర్ధా లతో సాభిప్రా యం గా ప్రయోగించాడు''
శ్లేషయ్య అయిన త్యాగయ్య '.
 ''ఖిలా చిత్త లౌకిక ,మనే శ్రు మ్ఖ ల మందు దగలకనే -ఉలూఖల బద్ధు ని కి ,నిజ దాసుడై ,విలసిల్లు త్యాగ
రాజు మాట ''
అనే కీర్తన లో శృంఖల అంటే గొలుసు -లౌకిక విషయాలనే గొలుసు తో బందీ కాకుండా -రెండవ ఉలూఖల
బద్ధు డు అంటే రాతికి కట్ట బడిన బాల కృష్ణు డు అని అర్ధ ం .అద్భుత ప్రయోగాలివి .చెవులకు ఇంపు
,మనసుకు సో ంపు ,ఆనందానికి దరి దాపు .ఇందులో  యమకం అనే అలంకారాన్ని ''యమహా ''గా
వాడటమే కాదు ,కన్నయ్య బాల్య గాధ నూ జ్ఞ ప్తికి తేవటం గడుసు దనం .
     ''కనికరంముతో కని ,కరమిడి ,చిర కాలముసుఖ మను భవింప వేగము ''  అంటాడు త్యాగయ్య
.దయతో చూసి ,చెయ్యి పట్టు కొని అనే అర్ధా లతో ''కని కర ''అనే మాటను మాంచి ప్రా స తో భక్తి ప్రసాదం
గా అందించాడు .అర్ధ గాంభీర్యం తో కీర్తన వన్నె కెక్కింది .   
       ''నానార్ధ ం ,విరుద్దా ర్ధం తో శబ్దా లను ప్రయోగించే నేర్పు భలేగా వుంది త్యాగయ్య లో .భాష ,అర్ధ జ్ఞా నం
లతో యోగ విధానం గా నామ జప మార్గా న్ని ,అర్ధ వంతం చేయాలి అనే భావం తో చెప్పిన కృతిని  కని,
సుకృతిపొ ందుదాం .
       ''రామా యన చపలాక్షుల పేరు ,కామాదుల కోరు వారు వీరు 
        రామా యన బ్రహ్మమునకు పేరు ,ఆ మానవ జనార్తు ల తీరు 
        అర్క మనుచు జిల్లేడు తరు పేరు ,మర్కట బుద్దు లెట్లు తీరు ?
        అర్కుడన భాస్కరునకు పేరు ,కుతర్కమనే అంధ కారము  తీరు 
        అజ మన ,మేషమునకు పేరు ,అజుడని వాగీశ్వరునికి పేరు 
        కనుక తెలిసి ,రామ చింతన తో,నామము సేయవే వో మనసా ''అని బో ధిస్తా డు .
మొత్త ం మీద తెలుసు కావాల్సింది ఏమిటి అంటే -తర్కం ,కుతర్కం వదిలేసి ,చేసే జప నామానికి పూర్తీ గా
అర్ధ ం తెలుసు కొని ,ఆత్మ శుద్ధి తో ,జపించి ,తపించి ,ముక్తి ని పొ ందమని సద్బోధ చేశాడు త్యాగ రాజ
సద్గు రువు .ఇందులో ఎన్నో తత్వ విషయాలు వున్నా ,అతి తేలిక మాటలతో తేట తెల్లం గా చెప్పటం
త్యాగయ్య ప్రతిభకు నిదర్శనం .
        రచన ను వివిధ గతులలో నడి పించి ,పాండిత్య జ్యోతిని చూపించి ,ప్రకాశ వంతం చేస్తా డు త్యాగ
రాజు .
    ''దాంత ,సరి రక్షణాగ మాంత చర ,భాగవతాంత రంగ చర ,శ్రీ కాంత కమనీయ -గుణాంత కాంతక  
     హితాంత రహిత ,ముని చింత నీయ ,వేదాంత వేద్య --సా మంత రాజ నుత ,యాంత భాంత 
     నిశాంత ,శాంత కరుణా స్వాంత --నీ కిది సమయమురా -బ్రో వరా ,నా పాలి దైవమా !'
          ఈ కీర్తన  శ్రీ రామ చంద్రు ని గుణ నామాల అందాల మాల .సొ గసైన ,మనోరంజనం చేసే వాన జల్లు
.కుంటు పడని పద ధార.అన్వయ కాఠిన్యం లేని పద బంధం .యాన్త ః -అంటే య అనే అక్ష రానికి తర్వాతి
అక్షరం అయిన'' ర ''అనే అక్షరం .భాంత అంటే భ అనే అక్ష రానికి తర్వాత ఉన్న''మ'' అనే అక్షరం  .ఈ
రెండు కలిస్తే ''రామ ''అంటే భవ్యుడు అయిన వాడు .చిన్న మాట లో అనంతార్ధం   పొ ది గాడు భక్త కవి
.సరదా చేసి మాటల మాయ చూపి అందులో పడి పో కుండా తెర తీసి మాయ ను తొలగించి రామ
దర్శనం చేయించాడు .రామ గుణ నామ సంకీర్తన చేసి.. ఈ కీర్తనను  చిరస్మరణీయం చేశాడు ..
 ఆ కీర్తన లోనే ''చందనారి హర ,నందనాయుధ ,సనందనాది నుత -కుందరదన వర 
  మందార ధర ,గోవింద ముకుంద ,సందేహము నీకెందుకు నాపై ?''అని నడక మార్చినా పట్టు చెడ లేదు
.అదే త్యాగయ్య కవిత్వ  మహిమ .భాషను ఎలా గైనా త్రిప్ప గల నేర్పున్న వాడు .''మల్లె మొగ్గ ల వంటి
పలు వరుస ''అంటే త్యాగయ్య గారికి మహా ఇష్ట ం .అందుకే చాలా సార్లు శ్రీ రాముణ్ని'' కుందరదన'' అని
ఆప్యాయం గా పిల్చుకొంటాడు .ఆ సొ గసు చూసి మురిసి పో తాడు .అలాగే శివుడిని ''అమ్భోరుహ నయన
''అనటం ఆయన ప్రత్యేకత .''నీటి లో పుట్టిన అగ్ని నేత్రు డా "'అని భావం . 
          చక్కని ఉపమాలన్కారాలతో భాషకు ,భావానికి పుష్టి ,తుష్టి కల్గిస్తా డు త్యాగ రాజ సత్కవి .
         ''అహమను జడత్వ మణఛి   ,బ్రో వ ,సహజమౌ నీ చేతి శరము లేవా?
--        జనన మరణము లను సూదిని నిల్ప ,ఘన మైన నీ యాజ్న గాదను వడిని 

          మద మత్సరములను గజములకు ,నీ కమలాంకుశ రేఖ అంకుశము ''  అంటూ గొప్ప భావాన్ని

చక్కని ఉప మానం తో రక్తి కట్టించాడు .

       ''తనయుని ఏ జాతి యైన బ్రో వని తల్లి ,భూమిని గలదా ?ఓ రామ 

         ఇలను ,నిశ్చయము గా నీవు లేని తావు ఎందైన గలదా ?''అని భగవంతుని సర్వ వ్యాప కత్వాన్ని

మంచి పో లికతో వివ రించాడు .మాన వత్వానికి ప్రేమ మయ రూపం తల్లి మాత్రమె నని స్పష్టీ కరణ

ఇందులో తళుక్కున మెరుస్తు ంది .

       ''ముల్లో కము లల్లా డిన ,ఇల్లే గతి గాని ,--ఇల నంతట  గల వాన కు, జలధే గతి గాని 

         గుణములలో నని గుంటే ,గుణియే గతి గాని ''అన్న నిత్య సత్యాన్ని ,చక్కని ఉప మానం తో

బో ధించాడు .భావుకుడైన మనో భావ కవి లా త్యాగయ్య భాసిస్తా డు .ఎన్ని రూపాలు దాల్చినా ,చివరికి పర

బ్రహ్మ లో లయం పొ ందటమే జీవిత గమ్యం .అద్భుత మైన భావాన్ని ,అలతి ,అలతి పదాలో పొ దిగి

అలంకరాయుక్త ం గా అభిషేకంి చాడు .ఆయన మనసు ''ఉరగములు పెనగి నట్లు ''ఉందట .''కల్ప

భూజమున ,తీగ గట్టు రీతి మనసు ,కల్పము లేన్నైనా ,విడిచి కదలదు శ్రీ రామా !''అంటాడు .

''అద్వైత సామ్రా జ్యంము లు అబ్బి నట్లు రామా ,సద్వైరాగ్యము నిదియు సాయుజ్యమే రామా ''అని మంచి

వైరాగ్య బుద్ధి సాయుజ్యానికి సమానమే అని సమర్ధించాడు .ఇందులో జాను తెనుగు ,నుడి కారం

,ఉపమల  విన్యాసం ,అద్వైతంసద్వై రాగ్యం తోనే వస్తు ందనే బో ధ ,అదే సాయుజ్యమనే ధీమా తో

ఆనందాబ్ధి లో ఓల లాడుతూ ,మనల్ని అందులో ముంచి తేలుస్తు న్నాడు అద్వైత గాన బ్రహ్మ త్యాగ బ్రహ్మ
.,
            ఈ అలంకార శోభను ఇంకో సారి మళ్ళీ దర్శిద్దా ం 

సంగీత సద్గు రు శ్రీ త్యాగ రాజ స్వామి --8

                                కృతుల లో ఆలన్కారికత -2
--              త్యాగ రాజ స్వామి తన కృతులకు ముస్తా బు చేసిన అలంకారాలను కొంత వరకు చూశాం
మిగిలిన అలంకార శోభ తిలకిద్దా ం .
         పంచ నదీ తీరాన్ని ,నిసర్గ రమణీయం గా వర్ణించాడు త్యాగయ్య .భౌగోళికం గా ఒక travelogue లా
వుంటుంది .
  ''ఈడు లేని మలయ మారుతము చే ,కూడిన కావేరి తటమందు 
   వేడుచు ,భూసురు లగ్ని హో త్రు లై ,వేద ఘోషముల చే,నుతింప 
   ఈ మహిలో సొ గసైన చోళ సీమ యందు ,వరమైన ఈ పంచ నద పుర 
   ధాముని చెంతను ,వసించుటకై ,నీ మది నెంచగ ''        ఇంత ఆనందాన్నిచ్చే పరి సరాల్లో సీతా
రాములు వెలసి ఉన్నారట.అదీ ఆయనకు కలిగిన ఆనందం .
          త్రిమూర్తు లు ,శ్రీ రామ కధ విన్నారు .ఒక సామాన్య రాజుకు ,ఇన్ని మంచి గుణాలా ?అని
సందేహించారట .ఈ గుణాలకు ,వెల కట్టా లి అను కొన్నారట .తమ గుణాలను అన్నిటిని   త్రా సుకు వుండే
ఒక సిబ్బెలో ,శ్రీ రాముని గుణాలను రెండవ సిబ్బే లో వేసి తూచారట.వారి పళ్ళెం కిందకు జారి
పో యిందట .వారి మత్సరం యెగిరి పో యిందట .ఈ ఘట్టా న్ని ,అత్యంత భావ గర్భితం గా ,ఆనంద పార
వశ్యం తో వర్ణిస్తా డు భక్త కవి .ఒక రమణీయ కల్పనా శక్తి త్యాగయ్యలో ఆవిష్కృత మైన సందర్భం . 
        ఇంకొక చోట ,కావేరి నదిని సౌందర్య కన్యా మణి గా ఉత్ప్రేక్షిస్తా డు .కల నినాదం తో ,సుందర గమకం
తో ,కమ్మని ,ఆ కావేరి జలమంతటి మాధుర్యం తో ,పవిత్రత తో ,కవితా శైలి తో  వర్ణిస్తా డు .
    ''సారి వెడలిన ,ఈ కావేరి చూడవే -వారు ,వీరనుచు జూడక ,తా
     నవ్వారిగా ,భీష్ట ముల నొసగు చు --సావేరి చూడవే ''
     దూరమున నొక తావున ,గర్జ న భీకరమొక తావున ,నిండు కరుణ తో 
     నిరతము నొక తావున ,నడచుచు ,వర కావేరి కన్యకా మణి ''    అంటూ ,ఆ కావేరి కన్య సొ గసు
,అందం ,నిండుదనం ,,ఉద్ధ ృతి ,కరుణా న్త రంగం ,దృశ్య మానం చేస్తా డు .కావేరి నదికి ఒక గొప్ప సుగుణం
వుంది .ఆ నీటిలో ఎనభై శాతం నీరు ఉపయోగానికి పని కొచ్చేదే .చిన్న నది అయినా'' జీవనది'' గా పేరు
పొ ందింది .భావుకు డైన త్యాగయ్య కవిగా చెప్పిన  ''గేయ కధా చరిత్ర ''  గా దీన్ని విజ్ఞు లు భావించారు . 
   త్రిపుర సుందరి దేవి ని వర్ణిస్తూ ,ఆ దేవి లావణ్యాన్ని , అలౌకిక గుణ గౌర వాన్ని ,మనోజ్జ్నం గా
మనసుకుహత్తు  కునేట్లు   మన ముందు నిలబెడ తాడు .రమ్య భావ విలసిత మైన రచన మనం
దర్శిస్తా ం .
 ''సుందరి నిను వర్ణింప ,బ్రహ్మాది సురల కైనా ,తరమా ,త్రిపుర సుందరి 
  కలకలమను ,ముఖ కళలు గని ,కలువల రాజు భువికి ,రాడాయె 
  చెలగు నీ లావణ్యము గని ,యల నాడె ,వల రాజు కానక (భస్మమై )పో యే 
  నిలువరమగు ,నీ గంభీరము గని ,జల రాజు జడ వేషు డాయె 
  బలమైన ధీరత్వమును గని ,కనకాచలుడు తా శిల రూపు (స్థా ణువు )డాయె 
  కనులను గని ,సిగ్గు పడి ,గండు మీనులు ,వనధి వాసము చేయ నాయె 
  జనని ,నీ చిరు నవ్వు కాంతి సో కి  ,శివుడనుపమౌ శుభ్రు డాయె 
  కనకాంగి నీ స్వరమును విని ,వాణి ,మగని జిహ్వకు దా పూనికాయే (నాలుక పైన చేరింది )
  పావనము సేయు ,బిరుదు గని ,భర్త ,పాపము పారి పో యే 
  భావించి ,నీ పాదమున ,త్యాగ రాజు భావుక మను కో నాయె --త్రిపుర సుందరి ''
      ఇది ప్రబంధ రచనా ప్రక్రియ గా కని పిస్తు ంది .ఇందులో ''అన్యాప దేశం ''వుంది ,అవహేళన వుంది
,అర్దా ంతరం వుంది ,శ్లేష ,వ్యంగ్య వైభవం అన్నీ కలిపి అల్లిన సుగంధ సుమ మాల గా వుంది .అందుకని
దీన్ని త్రిపుర సుందరి మెడకు  ఆ  భరణం చేశాడు .భక్తీ ,తాత్పర్యం ,అలౌకిక అను భూతి అన్నీ మేళ
వించి రాసిన సర్వాలంకార శోభిత కృతి .ఆ పద చాతుర్యానికి అబ్బుర పడతాం .ఒక కవి సార్వ భౌముడు
రాసిన ,అందం ,చందం ,మూర్తీ భ వించిన ,కవితా విన్యాసం లా సాహిత్య పరీమళాలు వెద జల్లిన
సుమనోహర సుందర రచనా విన్యాసం .ఎంత చెప్పినా ఇంకా తక్కువే అని పిస్తు ంది . త్యాగయ్య మాటల
సృష్టికర్త .వేద వాగ్మయాన్ని ''మినుకు చదువులు ''అంటాడు .ఒక్క ఈ కృతే ''సరస శ్లేష కావ్యం 'గా
భాసిస్తు ంది .అంతటి కావ్య గౌరవం కల్గించాడు ఒక్క కృతి లో .ధన్యుడు త్యాగయ్య .ధన్య తెలుగు కవితా
సరస్వతి ,సంగీత సరస్వతి .
త్యాగ బ్రహ్మను ''కవి బ్రహ్మ ''అనటానికి ఈ ఒక్క కృతి చాలు అని పండిత విశ్లేషకుల ఏకాభి ప్రా యం .
ఆయన రచనా పాట వానికి జోహార్లు అర్పించారు అందరు .ఏ కోణం లో చూసినా ఈ కృతి లోని కవిత్వం
అమృత తుల్యం గా భాసిస్తు ంది .అజరామరం గా అందుకే నిలిచి పో తుంది .ఇహ ,పర సాధక  మైన రచన 
.అద్వైతామృత వర్షం తో మనల్ని తరింప జేశాడు ..
గాన లహరీ శీతల గంధ వాహనమే .హిమాలయోత్తు ంగా కమనీయ భావనా  చాతుర్యమే ,మనకు కని
పిస్తు ంది .ప్రతి పదాన్ని ,సార్ధ కం గా ప్రయోగించే శబ్ద బ్రహ్మ ,త్యాగ బ్రహ్మ .
                తరు వాత త్యాగయ్య కృతుల్లో ''పద చిత్రా లు .''గురించి తెలుసు కొందాం 

సంగీత సద్గు రు శ్రీ త్యాగ రాజ స్వామి --9

                                       కృతులలో పద చిత్రా లు 


      పరమ భక్తా గ్రేసరుడు త్యాగయ్య శ్రీ రాముని కొలువు సన్నిధానం గా చేసుకొని, చూసి ,పాడి
,తన్మయుడై  ,ఒక దృశ్య చిత్రం లా మన ముందు వుంచుతాడు .,
  ''పాహి రామ యనుచు ,భజన సేయవే -మనసు రంజిల్ల బల్కె మదన జనకుడు 
   కలువల రేకుల ను గేరు కనుల జూచెను -భారతుడా వేళ కరిగి కరిగి నిలవగా 
   కరము బట్టి కౌగిలించే వరదు డప్పుడు -మనసు దెలిసి ,కలిసి హనుమంతు డుండగా 
   చనువు మాట లాడు ,చుండే సార్వ భౌముడు ''
   ఊహలో అద్భుత పదచిత్రం గీశాడు .మనసుకు హత్తు కొనే హృద్య మైన రచన ఆ భావుక కవి కి వరం
గా లభించింది .
         అలాగే ''సౌరాష్ట ్ర రాగం ''లో ''వినయము కౌశికు వెంట జను ,నంఘ్రు లను ,చూచే దెన్నటికో
''అంటూరామ కధా విధానాన్ని రూపు కట్టిస్తా డు .చిత్ర కారుడిగా మన ముందు నిలుస్తా డు . ,
   ''ఘన మైన ,పుష్పక మున ,రాజిల్లిన సొ గసును -చూచే దెన్నటికో                 
    భరతుని గని చేయి బట్టు కోని ,వచ్చిన వేడుక ను చూచే దెన్నటికో 
    కనక సింహాసనమున ,నెల కొన్న ఠీవి ని ,చూచే దెన్నటికో ''        అని శ్రీ రామ పట్టా భిషేక మహో త్స
వాణ్ని ,కళ్ళ ముందు ప్రదర్శిస్తా డు .హృదయాలను ,ఆర్ద్రం గా మారుస్తా డు .ఇక్కడ త్యాగయ్య లోని
భక్తు డు ,కవి ,చిత్రకారుడు ,కొత్త రీతుల్లో కని పిస్తా రు .ఆలన్కారికం గా రచన అందం పొ ందింది
.అవయవాలకు ,ఉదాత్త మహిమ కల్పిస్తా డు 
     ''వెనుక ,రాతిని ,నాతి చేసన
ి చరణము చూసే దెన్నటికో  
      ఘనమైన శివుని చాపము ను ,ద్రు ంచిన ,పాదమును చూచే దెన్నటికో 
      ఆగమ నుతుని ,ఆనంద కందుని ,బాగ చూచే దెన్నడో   
      పరమ భాగవత ప్రియుని ,నిర్వి కారు ,నిరాకారుని  రాగ చూచే దెన్నడో ''ఈ కీర్తన లో ,బావం ,భాష
,కల  కండ పలుకే .
    పలుకు పలుకున తేనే అంటే ఇదే .ఒక్కొక్క సంఘటన ఒక ''రవి వర్మ చిత్రమే నని పిస్తు ంది''అన్న
విజ్ఞు ల భావన నూటికి నూరు శాతం నిజం .   
    ఈ చిత్రా లు ,విచిత్రా లే కాదు ,కళా మర్మాలకు ఆల  వాలు . త్యాగయ్య కీర్తనలు రస నిష్యంద నాలు
.సౌందర్య స్ఫోరకాలు .గాన కవితా చాతుర్యాలు .
మారీచుని మదం అణచే వేళ ,శివుని ధనువు విరిచే వేళ ,శ్రీ రాముని ముంగురుల కదలిక ఆయనకు
,విశ్వా మిత్రు నికి అద్భుత ఆనందాన్ని ,గగుర్పాటును కలుగ జేశా యట  .ఆ శిరో సౌందర్యం ఏమిటో 
మనమూ దర్శిద్దా ం .
     ''అలక లల్ల లాడగ  ,,గని ,ఆ రాణ్ముని ఎటు పొ ంగెనో ?
--    చెలువు మారగను ,మారీచుని మద మణి చే వేళ 

       ముని సైగ దెలిసి ,శివ ధనువును విరిచే ,

       సమయమున ,త్యాగ రాజ వినతుని ,మోమున రంజిల్ల  --అలకలల్ల లాడ 


త్యాగ రాజ సత్కవి కి అంతా సుందరం ,శివం .

         శ్రీ రాముని కొలువు లో ,త్యాగయ్య ప్రతి క్షణం తన్మయ స్తితి లో ఉంటాడు .గోష్టి ,సంకీర్తన ,సేవింపు

,మేలు కొలుపు ,పవ ళింపు దిన చర్య .

    ''చనవున ,పన్నీట స్నానము గావించి ,-ఘను నికి ,దివ్య భోజనమును ,బెట్టి 

     కమ్మని విడే మొసగుచు ,మరవక సేవించే --భాగవతులు ,బాగుగా ,ఘన ,నయ రాగ ములచే ,దీపా

రాదన మొన రించి 

     వేగమే ,శ్రీ హరి విరుల పై ,పవళించి ,జోకొట్టి ,-త్యాగ రాజు సుముఖుని లేపే -''

ఇది సంపూర్ణ పరిచర్య స్వరూపం .కళ్ళకు కట్టి నట్లు వ్యక్తీకరించటం త్యాగయ నేర్పు .

         శ్రీ రాముని కొలువులో ,వార కాంత ల ,రమణీయ లాశ్య విన్యాసం చూసి పక్కనున్న త్యాగయ్య తో

రామయ్య  మెచ్చు కోలు మాటలు చెప్పి నట్లు భావిస్తా డు .ఆ దివ్య దృశ్యం మన కళ్ళ కు కట్టి నట్లు

వర్ణిస్తా డు ,కాదు ,కాదు చిత్రిస్తా డు మహా భక్తా గ్ర గణ్యు డైన  త్యాగరాజ  కవి చిత్ర కారుడు .

      ''సుర కామినీ ,మణుల గాన -మాదరణ నాల కిన్చుచు 

       శృంగార ,రస యుక్త ,వారమ ణుల ల జూచి ,సరస త్యాగ రాజ వరుని తో బొ గ డే  

       పలుకు కండ చక్కర ను గేరునే -పణ తు  లార చూడరే ''పటిక బెల్లం పలుకు మెల్ల ,మెల్ల గా కరుగు

తూ రుచి నిస్తు ంది .అంటే ఆ వాక్యాల మాధుర్యం క్షణికం కాదు ,శాశ్వతం ,ఆత్మాను భవం ,దివ్యాను భవం

కవిత్వానికే ప్రా ణం .

          ఇంకొన్ని పద చిత్రా లు మరో సారి చూద్దా ం 

సంగీత సద్గు రు శ్రీ త్యాగ రాజ స్వామి --10

                                         పద చిత్రా లు --2


           ఇంకొన్ని పద చిత్రా ల సో ంపు చూద్దా ం .శ్రీ రామునికి ఇరు వైపులా సీతమ్మ ,లక్ష్మణుడు నిల బడి
సేవ చేస్తు న్న వైనాన్ని , ,ఖర హరుడైన శ్రీ రామునికి ''ఖర హర ప్రియ ''రాగం లో ,త్యాగయ్య ఔచితీ వంతం
గా చేసిన రచన తిల కించండి . .
     ''ప్రక్కనా నిలబడి ,కొలిచే ముచ్చట  బాగా తెలప రాదా --చుక్కల రాయని ,గేరు మోము గల ,
      సుదతి సీతమ్మ ,సౌమిత్రియు ,ఇరు ప్రక్కలా నిలబడి --
      తనువు చే వందన మొనరించు చున్న -రాచనవున,, రామ కీర్తన చేయు చున్న రా
      మనసున దలచి ,మై మరచి వున్న ,-రా నేనరుంచి ,త్యాగ రాజుని తో హరి హరి ,మీ కిరు  ప్రక్కలా
'' ,
ఇదొ క అలౌకిక చిత్రం .మాటల చిత్రం ,మనసు కు పట్టే చిత్రం .ఆ దృశ్యం ,మనో వీధి లో చూచి ,మై
మరపించే పులకింపు .తానూ ,మైమరుపు తో  సేవిస్తు న్న భావన .విశ్వాస  పూర్వక మైన ఆకాంక్ష.
           త్యాగయ్య శ్రీ రాముడు కేళీ వినోదుడు .తెలుగు వారి ''ఓమన గుంటలు ''ఆడతాడు .విశ్వ రూపుని
కేళీ విన్యాసం .ఆది దంపతుల మధుర ప్రణయ లీలను దివ్య చిత్రం గా మలుస్తా డు .పద బంధం తో ప్రేమ
జ్యోత్న పరుస్తా డు .పో తన్న గారు ''అల వై కుమ్థ  పురంబు లో '',అన్న పద్యానికి అనుకరణ ,చాతుర్యం
చూపిస్తా డు త్యాగయ్య . 
  ''మధుర మైన పల్కులసీతా రమణి తో ,''ఓమన గుంట గెలుచుట '' '' ,
   చేత ,నొకరి నొకరు చూచుచు ,సాకేతాధిప ,నిజ మగు ప్రేమతో ,
   బల్కు కొన్న ముచ్చట ,వాతాత్మజ ,భరతులు విన్నతుల .త్యాగ రాజ సన్నుత 
    విన నాస గోన్నానురా ,విశ్వ రూపు డనే ,మనసార ,వీనుల విందుగా ''
         లలిత లావణ్య మూర్తి శ్రీ రాముని ముద్దు లోలికే మోము ను భక్తి మీర త్యాగ రాజు వర్ణిస్తా డు
.సౌందర్యో పాసన తో ఆ స్వామి తను వంతా ,సౌందర్య సుకు మారం గా ,కాంతి వంతంగా ,కన్పిస్తు ంది
మనో వీధిలో 
     ''సొ గసు చూడ తరమా ?నీ సొ గసు చూడ తరమా ?
       నిగ నిగ మనుచు ,కపో ల యుగము చే మెరయు మోము --అమరార్చిత పదయుగామో ,
       కమ నీయ ,తను ,నిందిత కామ ,కామ రిపు నుత ,నీ -సొ గసు చూడ తరమా ?
       వర బింబ సమాధరమో ,వకుళ సురంబుల యుగమో--కర ద్రు త శర కోదండ ,మరక తాంగ వర
మైన  
       చిరు నవ్వు ,ముంగురు లతో ,మరి కన్ను ల తెట ో -వర త్యాగ రాజార్చిత ,వంద నీయ -ఇటు వంటి -
సొ గసు చూడ తరమా'' 
          పంచ నదీ తీరం లో త్యాగయ్య స్వయం గా ,జరి పించిన నిత్య భజనో త్సవంకన్నుల   ముందు
నిల బెట్టు తాడు .సుందర పద బంధాలు తాళ నృత్య గతులతో వెంట నర్తిస్తా యి .అదీ త్యాగయ్య కృతి
వైభవం .
         ''హరి దాసులు వెడలె -ముచ్చట ఆనంద మాయే -దయాళో 
          హరి గోవింద ,నరహరి ,రామ కృష్ణ యని ,వరుసగ నామము కరుణ తో జేయుచు 
          సంగతి గాను ,,మృదంగ ఘోష ములచే ,పొ ంగుచు ,వీధుల కేగుచు ,మెరయుచు 
         చక్కని హరి చే జిక్కితి మని ,మది సొ క్కుచు నామమే ,దిక్కని పొ గడుచు --హరి గోవింద 
          దిట్ట ముగా నడు కట్టు తో నడుగులు ,బెట్టు చు ,తాళ ముల్  బట్టి,గల్ గల్ల న  
          జ్ఞా న ముతో ,రామ ధ్యానముతో ,మంచి గానము తో ,'మేను దాన'' మొస గుచు 
          రాజ ,రాజుని పై ,జాజులు ,చల్లు చు ,రాజిల్లు చు త్యాగ రాజు ని తో గూడి --హరి ,గోవింద'' --
     భక్తు ల ఆనంద పార వశ్యం నృత్య గాన భంగి మలు ,మనో ఫలకం పై ,ముద్ర వేసి నట్లు గా పదాల
పరుగు ,నాట్యం చేసి నట్లు ండే నడక ,మనో హర పద బంధం .అర్ధ వంతం ,మధుర శబ్ద ప్రయోగం
.వారందరికీ శ్రీ రామ నామమే దిక్కు .''మేను దానం ''అనటం లో శరణా గత తత్పరత కని పిస్తు ంది . ఈ
విధం గా తాను మనసు లో ఊహించుకొన ,తాను సమాధి స్తితి లో దర్శించిన ,శ్రీ రామ కుటుంబ సపరి
వార చిత్రా లను చక్కని పద బంధాలతో మృదు మధుర పద సౌందర్యం తో వర్ణ చిత్రా లు గా వేసి ,చూసి
తరించ మని తెలియ జేశాడు త్యాగ రాజ మహా పద చిత్ర కారుడు .
         దీని తర్వాత ''కృతుల లో -వ్యాజ నిందా స్తు తి ,అధిక్షేపణ ''లను తారు వాతి భాగాలలో  తెలుసు
కొందాం 

సంగీత సద్గు రు శ్రీ త్యాగ రాజ స్వామి ---11

                              కృతులలో వ్యాజ నిందలు నిందా స్తు తులు అధిక్షేపణ 


       తాను నమ్మిన దైవాన్నో ,రాజునో ,ఇష్ట మైన వాడినో ,తిడుతూ పొ గడటటం ,పొ గడుతూ తిట్ట టం ,అధిక్షే
పించటం ఒక రకమైన కవితా మర్యాద. చనువున్న కవి చేసే విచిత్ర ప్రక్రియ .భగ వంతుని లో
,ఆనందామృతం పంచుకొనే వారు చేసే రస రమ్య వినోదం .ఇందు లోను ,త్యాగయ్య ది పెద్ద పీటే .''నాకు
ఇతర మతాలు తెలీవు .మది కరిగెట్లు భజన చేశాను .నేను భువిని మాని --నీవు కనికరం లేని హీనుడని
పించుకోవటం మర్యాదా ?''అంటారు త్యాగ రాజ స్వామి రామ స్వామి తో .నింద  మోపి ,భయ పెడ్తు న్నాడు
.
          శ్రీ రాముడు చేసిన వింత పనులకు గుట్టు తెలిసి కోని ,మంచి ఉద్దేశ్యం తోనే కీర్తిని ఆపాదిస్తా డు .కొత్త
పో కడ ,సో ంపు తో వున ఈ కృతిని తిలకించండి .
        ''నిరు పేద భక్తు ల ,కారి కోత బడ  లేక గిరి పై ఎక్కావా ?రాలేరు అని శ్రీ రంగం లో దాగావా ?ఎప్పుడో
వచ్చే ,జీర్ణ కుచేలుడి కోసం ,గోపీ వస్త్రా పహరణం చేశావా ?//అని ఎద్దేవా చేస్తా డు భక్త త్యాగయ్య.''నిన్ను
ఆశ్రయిస్తే ,అన్నీ కష్టా లే .ఎవరేం బావుకొన్నారు ?''అని అధిక్షే పిస్తూ ప్రతి చోట ,ఒక కధకు ఊహ
కల్పిస్తా డు .రసికత గల ఈ కృతి చూడండి -
      ''అడిగి ,సుఖము లెవరు అనుభవించిరి రా ,ఆది మూలమా రామా 
       ఆశ్రయించి ,వరమడిగిన ,సీత అడివికి బో నాయె -
       ఆశ హరణా ,రక్కసి ఇష్ట మడగ ,అపుడే ముక్కు పో యేగా రామా 
       వాసిగా నారదముని ,వర మడుగ ,వనిత రూపు డాయే 
       ఆశించి దుర్వాసు డన్న మడుగ ,అపుడే మంద మాయే (కడుపు నిండి పో యింది )
       సుతుని వేడుక జూడ దేవకి ,యడుగ ,యశోద సూడ నాయె 
       సతు లెల్ల ''రతి భిక్ష ''మడుగ ,వారి ,వారి పతుల వీడ నాయె ఓరామా 
       నీకే దయ బుట్టి ,బ్రో తువో ,బ్రో వవో నీ గుట్టు బయ లాయే 
       సాకేత ధామ ,శ్రీ త్యాగ రాజ నుత స్వామి -ఏటి ఈ మాయ ఓరామా  ''
''ఈ కృతి లో లలిత ,నిశిత అధిక్షే పణ వుంది ''అన్న విశ్లేషకుల మాట అక్షర సత్యం .అడిగిన వారికి 'ఎగ
నామం పెడ తావు నువ్వు ''అని శ్రీ రామునికే నామాలు పెట్టా డు గడుసు త్యాగయ్య.గురువుకే పంగ
నామం అంటే ఇలాంటిదేనే మో ?
         భక్తి పుట్టించిన అలౌకిక శక్తి తో త్యాగయ్య ''ఎన్నాల్లూ రకే వుందువో  చూతాము .ఎవరడిగే వారు
లేరా శ్రీ రామా ?''అని వాడుక భాష లోనే బెదిరిస్తా డు .ఇలాంటి దాన్ని ''ఉపద్రవ భక్తి ''అన్నారు .అంతే
కాదు ,''అన్నీ ,తానను మార్గ మునను ,చనితే ,నన్ను వీడెను ?అంటావు ,భార మంటావు .''అని
నిందిస్తా డు .''తన్ను బ్రో వరా సదా అంటె ,ద్వైతుడనేవు ?''అని దిగ్భ్రమ చెందు తాడు .''ఏ దారి సంచ రించ
మంటావు ?నువ్వే చెప్పు ?''అని నిల దీస్తా డు .ఇందులో ఆత్మానందం ,తన్మ యత్వం ,ఆత్మ విశ్వాసం
,అకలంక భక్తి వినమ్ర, వినీత ప్రా ర్ధ న కన్పిస్తా యి త్యాగయ్య లో .
      ''దేహ బుధ్యాతు దాసో హం ,జీవి బుద్ధ్యా తు త్వదంశః   -ఆత్మ బుద్ధ్యాత్వమే వాహం ''అన్న శంకరా
ద్వైతాన్ని ,భక్తి పూర్వక నిర్వచనం  ఇస్తా డు త్యాగ య్య భక్త శిఖామణి .
       ''నన్ను దగ్గ రకు తీయ వద్ద ని ,నీ పరి వారం లో ఏవ రైనా అన్నారా నీతో ?లేక గరుత్మంతుడు
''సమ్మె చేశాడా ""/అని స్మిత పూర్వాభి లాషి (నవ్వి ,మాట్లా డే వాడు )మందస్మిత వదనారవిన్దు డు
అయిన   రామ ప్రభువును ,అవహేళన చేస్తా డు ,ఆర్తి గా .''నగు మోము గన లేని ,నా జాలి తెలిసి ,నను
బ్రో వగ రాదా శ్రీ రఘు వర -నీ నగు మోము  
 నగ రాజ ధర ,నీడు పరి వారు లెల్ల ,-ఒగి బో ధ న చేసే వారలు గారే -ఇటులున్డు దురా ?
 ఖగ రాజు నీ యానతి విని వేగ చానా లేదో ?గగనానికి ఇలకు బహుదూరంబని నాడో ? 
 జగ మేలే పర మాత్మా !ఎవరితో మొర లిడుదు -వగ జూపకు ,తాళను ,నన్నేలు కోరా -త్యాగ రాజ నుత''
-
         ఒక వేళ లంచాలేమైనా పని చేశాయా ?ఇకా ఎక్కువ ఎవరైనా ముట్ట జెప్పారా ?''అంటూ పాత
కధలు మనోజ్ఞం గా జ్ఞా పకం చేశారు త్యాగయ్య .
   ''ఇభ రాజేంద్రు డు ఎక్కు వైన లంచమిచ్చినా డేమిరా ?-సభలో మానము బో సమయంబున సతి
ఎమిచ్చేనురా ?
    భాగవతాగ్రేసర ,రాసికావన ,జాగ రూకుండని  పేరే ?--రాగ స్వర యుత ,ప్రేమ భక్త ,జన రక్షక ,త్యాగ
రాజ పండిత ''
      భక్తు డిని ,ఉపెక్షిస్తు ంటే నిల దీసే భక్తి ,శక్తి ,యుక్తి ,అను రక్తి వున్న వాడు త్యాగయ్య .అందుకే అంత
ఘాటు మాటల పో ట్లు పొ డిచాడు తన రామయ్యను .సంగీత భక్తు ల యెడ ,శ్రీ రామునికి పక్ష పాఠం
వుందని ,పాత భక్తి  సంగీత సార్వ భౌముల కధలు ,గాధలు విన్న వాడు ,వారి వ్యధలన్నీ తెలిసిన వాడు
అయిన త్యాగయ్య .
         భక్తు డు దీనా వస్తా లో వుంటే దేవి తో సరస సల్లా పాలా ?అని ''కోలా హల ''రాగం లో కోలా హలం
,హల్చల్ సృష్టించాడు .లలిత నిందా స్తు తి తో ,తళుకు బెళుకు తో మనసును ఆకర్షిస్తా డు .అవతారాలు
పది వున్నా ,అందులో ''రామా వతారమే ,రామ వేషమే మిన్న ''అని ఉబ్బి పో యే ఉబ్బు లింగం త్యాగ
బ్రహ్మం .
      ''పది వేసములలో ,రామ వేసమే -బహు బాగనుచు గోరు నన్ను ,బ్రో వ 
       ఇట్టి వేళ నీ కెట్లు తోచు నని ,-ఇల్లా లితో ముచ్చట లాడేదు ?
       రట్టు నీ మనసు కెట్టు తోచెనో ,రక్షించుటకు ,శ్రీ త్యాగ రాజ నుత 
       మది లో యోచన పుట్ట లేదా ?మహా రాజ రాజేశ్వరా ?''
              ఇటు కాక పొ తే ,అటు నుంచి నరుక్కు రామ్మన్నారన్న నానుడి త్యాగయ్య కూ తెలుసు
.అందుకే అయ్య వారిని వదిలి అమ్మ వారి శీలాన్ని పొ గడటం ప్రా రంభించాడు ..సీతమ్మ ను పెండ్లా డ బట్టే
నీ వైభోగం అంటాడు కాంభోజి రాగ కృతిలో 
       ''మా జానకి,చట్ట బెట్టగా ,మహా రాజు వైతివి -రాజ రాజ వర రాజీవాక్ష విను 
         రావా నారి యని రాజిల్లు కీర్తియు ,కాన కేగి యాజ్న మీరక 
         మాయా కారమునిచే ,శిఖి చెంతనే యుండి -దానవుని వెంట చని అశోక తరు మూల నుండి 
         వాని మాటలకు కోపగించి ,-కంట ,వధి ఇమ్పక నే యుండి 
         శ్రీ నాయక ,యశము ,నీకే కలగా -జేయ లేదా ?త్యాగ రాజ నుత '' 
                      అక్క యైన శ్రీ మహా లక్ష్మి భర్త శ్రీ రాముని ,బావగా భావించి పెడు తున్న చీవాట్లు ,ఎత్తి
పొ డుపుల్లో చాతుర్యం ,మంచి పాకం లో సాగుతాయి ''.వైకున్థ ం లో వున్నా ,నా దగ్గ రకు వచ్చి ,నా
హృదయ పీఠం అధివ శించి  ,నన్ను సంతోషింప జేస్తు న్నావు .మారు పలకవు .నేనేమైనా జార ,చొర
భజన చేశానా'' ?అని నిందా,స్తు తి అధిక్షేపణ పెన వేసి నిల దీస్తా డు .ఆ హక్కు తనకే వున్నట్లు భావితాడు
.నిజం గా జారుడు చోరుడే కదా శ్రీ కృష్ణు డు .''తులసీ దాస సంప్రదాయం'' లో శ్రీ కృష్ణ భజన చేయరట
.శుద్దా త్వైతం లో అంటె'' వల్ల భా చార్యుల మతం'' లో రామ భజన చేయరట .ఇదో వింత భక్తి .
--     '' ప్రా ప్తి గల్గు చోట ఫల మిచ్చు దైవంబు-ప్రా ప్తి లేని చోట ఫలము లేదు 
         ప్రా ప్తి లేక పసిడి ,పరమాత్ము డిచ్చునా ?''అన్నాడు ప్రజా కవి వేమన .అలాగే త్యాగయ్య కూడా 
                ''రానిది రాదు ,సురాసురులకైనా ,-పో నిది పో దు భూసురలకైనా ''అంటూనే 
                  దేవేంద్రు నికి సుదేహము ,పూర్వ దేవుళ్ళకు అమృతం అభావం కాలేదా ?''అంటాడు .
                  ''ఆ వన చర బాధలు ఆ మునులకే గానీ ,''అన్న మాట సర్వ జీవులకు ఆనవా యించే
సూత్రమే .రాక్షసులను '' పూర్వ  దేవుళ్ళు ''అనటం సరదా అయిన మాట .వాళ్ళూ ఒకప్పుడు  దేవుళ్ళే
నని గుర్తు చేయటమే .మునులకు అరణ్య వాసం పాపం వారి నుదిటి వ్రా త గా అభి వర్ణించటం తమాషా
.దీన్ని ఎవరు తప్పించ లేరు అని ధ్వని .విధి బలీయం అనటాన్ని సమర్ధించటం ..
         దొ ంగ దారు లు తొక్క కుండా ,మాట మీద నిల బడ మని ఘాటుగా నిందా స్తు తి చేస్తా డుతమాషాగా
.''ఇల్లు బంగారం అయిందా ?''అనీ ,''రంగాడా విభీషణునికి ,పంగ నామ మిడిన రీతిని ''పూర్వ కధ గా అభి
వర్ణిస్తా డు .విభీషణుని తో లంకకు వస్తా నని ఎగ గొట్టిన రాముడి మాట ను ఇక్కడ గుర్తు చేశాడన్న మాట .
 ''వెన్న తా   భుజించి ,గోప కన్య ముఖమున -తిన్న  గా నలది నట్లు ;''అన్న కృతి లో ఆలా కృష్ణ లీలలు
వర్ణిస్తూ చెప్పటం గొప్ప గా వుంది .ఇందు లో శ్లేష ను కూడా జోడించి చెప్పాడు .విభీష నుడి రాజ్యానికి 
పో వ టానికి ఇష్ట పడని రాముడు ''సహ్యజ ''తీరం లో కొల్ల డం ,కావేరి నదులు గా చీలిన అంతర్వేది తోనే
తృప్తి పడ్డా డని  చమత్కారం .
     ''సారమౌ కవితల ,విని వెర్రి వాడు -సంతోష పడి ఏమి పడ కేమి ?
      చేరెడేసి గుడ్డి కనులు  బాగా ,తెరచి ఏమి తెరవ కున్న వేమి ?
      ఎదను శ్రీ రామ భక్తియు లేని ,నర జన్మ   -మెత్తి ఏమి ,మృగ మైతే నేమి ?
       పదము ,త్యాగ రాజ నుతు ని పై ,గానిది -పాడితే ఏమి ?ఏడ్చి తే నేమి ''?
          అని రసవత్త రం గా అధిక్షే పించే సత్తా త్యాగయ్య భక్తు నిది .త్యాగ రాజ వినతుని ,కడిగి ఎందేయ గల
సామర్ధ ్యం చాతుర్యం ,చేవ ఆయనకే వుందని పిస్తా డు .ఎగ తాళి చేసినా ,సమయం తెలిసి పుణ్యాన్ని
,ఆర్జించాలని త్యాగయ్య హావం .సొ ంపైన నడ వాది ,మనసుకు పట్టే లోకోక్తు లు ,లోక రీతి ,కాల గతి
,చూపిస్తా డు త్యాగయ్య .శ్రీ రామ భక్తి ఏ పరమ తారకం అనే పూర్తి విశ్వాసం తో వున్న భక్త శిరోమణి
,రామ పాద సేవా దురంధరుడు త్యాగ బ్రహ్మ .
            వ్యాజ నిన్దా స్తు తులు ,అధిక్షేపణ లకు ఇంతటి తో స్వస్తి పలుకు దాం .
             త్యాగ రాజ కృతుల్లో '' భక్తి ,శరణా గతి ''గురించి తరువాత వివరంగా తెలుసు కొందాం 

సంగీత సద్గు రు శ్రీ త్యాగ రాజ స్వామి --12

                                   కృతుల్లో భక్తి ,శరణా గతి ,ఆర్తి --1


         నవ విధ భక్తిని తన కవితా కృతుల్లో వికశింప జేశాడు త్యాగ రాజు .తన ఆరాధ్య మూర్తి రామ మూర్తి
కి ఆర్తి గా విన్న విన్చుకొంటాడు .సర్వ సమర్పణ   భావం తో శరణా  గతు డౌతాడు .సామీప్య
,సాన్నిధ్యాలతో సాయుజ్యం పొ ందే మహో న్నత ఆత్మ పరతత్వ వేడి ఆయన .ఆలోకం లో ఆనంద
సామ్రా జ్యం ఎలి ,మనల్ని కూడా ఆ విందు లో పాలు పంచు కోనేట్లు చేస్తా డు .ఆత్మ వేది త్యాగ బ్రహ్మ .
     ''యెంతని రాల్తు కన్నీరు ?జాలి ఎవరితో తెలిపితే తీరు ?అని ఆవేదన తెల్పి ,''పూలమ్మ బతికిన వారు
రామా ,పుల్ల లమ్మ బిల్వ రాదు -ఆ చులకన నీకు కాదా ?అంటాడు ఆ రామున్నే .''భక్తి వేలుగుచే
,వెతలు తీరు ననే విశ్వాసం జ్ఞా న తేజం కలి గిస్తా డు .పరమ సుందరు డైన స్వామిని సేవించే వారి
లక్షణాలేవో తాను సాధించి ,తెల్పే రచన చూద్దా ం .
 ''అనృతంబాడాడు ,అల్పుల వేడడు ,సునృపుల గోలవడు ,సూర్యుని మరువడు -మాంసము ముట్ట డు
,మధువును త్రా గడు ,పర హింస చేయడు ,ఎరుకను మరు వడు ''అని ,ఉత్త మ భక్తు దిన తన లక్షణాలను
ఏకరువు పెడ తాడు .మూడు ఈషనాలను వాడనని ,వంచన చేయ నని ,బొ ంకనని ,చంచల చిత్తు డై 
,సౌఖ్యాన్ని వదలనని వేడు కొంటాడు .అంటే భక్తికి శీలం ఎంత ముఖ్యమో అందరికి తెలియ జేస్తా డు
.''ఎందెందు జూచిన అందందే కలదు హరి ''అని ప్రహ్లా దునితో పో తన్న గా ఋ చెప్పించి నట్లు త్యాగయ్య
గారు 'నీకే తెలియక పొ తే నేనేమి సేయుదురా ?లోకాదారుదవై ,నాలోని ప్రజ్వ లించే జాలి నీ కే తెలియక
పొ తే ''--''ఎందెందు చూచినా ,బలికిన ,సేవించిన ,పూజించిన ,అందందు నీవు అని తోచే తందరు 
,నీ పాడార విన్ద మును ,ధ్యానించిన డిందు కానీ ?/అని ప్రశ్నిస్తా డు .జాలి తన లో ప్రజ్వ లిస్తో ందని ,అనటం
కొత్త ప్రయోగం .అది కాల్చి తపన చేస్తో ందని భావన .
        ఆహ్లా ద కర మైన భావాలతో ,తనపై మోపిన నింద శ్రీ పతి పద చిన్త నమే నట .తమాషా అయిన
నింద ఇది .
 ''వారిజ నాయన ,నీ వాడను నేను ,వారము నను బ్రో వు -స్వల్ప ఫలదు లగు వేల్పుల ఏచిన అల్పు
దనుచు నన్నందరూ బల్కిన ''కాస్త మైనా ,ఇస్తా మైనా దుస్తు దాని దూరినా పాపులు నాపై మోపిన
నేరము -శ్రీ పతీ నీ పద చిన్త నమే ''ఇతర దేవతలు క్షుద్ర ఫలితాల నిస్తా రు సజ్జ నుల బలం అలాంటిది .
       క్షమా భిక్ష వెడుతూ ,అనుతాపం గా గీతాన్ని పాడుతాడు .పశ్చాత్తా పం పొ ందిన అశ్రు జాల ముచేత
హృదయాన్ని క్షాలనం చేసి హృదయం పవిత్రం ఆవు తుందని అంటాడు త్యాగయ్య .అందుకే తానా పూర్వ
లోపాలన్నీ ,వరుసగా వివరిస్తా డు .  ''సకల భూతము లందు నీవై యుండ గా ,మది లేక బో యినా -
చిరుత ప్రా యము నాడే భజనామృత రస విహీన కుతర్కు డైన , -పర ధనము కొరకు ,నొరుల మది
కరగబల్కి ,-కడుపు నింపి తిరిగి నత్తి ,దుడుకు గలా నన్నే దొ ర కొడుకు బ్రో చురా 
అంటూ ,మానవతకు దుర్ల భ మనుచు ,నెంచి ,పరమానందమొండ లేక ,-మద మత్సర,కామ లోభ
,మోహములకు ,దాసుడై మోస బో తిని ''అని పశ్చాత్తా ప హృదయం తో ఆత్మ క్షాళన చేసు కొంటాడు .
 'సతులకు కొన్నాళ్ళు ,ఆస్తికి ,సుతులకై కొన్నాళ్ళు ,ధన తతు లకి తిరిగితి నయ్యా -''ఇదీ త్యాగ రాజు
ఆత్మా విచారం .నిజాయితీ .''పాప గణ ములన్నియు ,పురుషుని రూప మై ,బాధించి నాయత .అంటే
పురుషుడైన తన రూపం లో .అంటే ఇదంతా ,స్వయం క్రు తాప రాదం .చక్కని ప్రయోగం ''పురుషుని
రూపం ''అనటం .
        ''ఎటుల బ్రో తువో తెలియ  -ఏకాంత రామయ్య ''అని తన చరిత్ర అంతా కర్ణ కథో రం అని చెపు
కొచ్చాడు 
'' వట్టి గొడ్డు రీతి భక్షించి తిరిగితి ,పుట్టు లోభుల నెల్ల పొ ట్ట కై పో గిడతి
ి ,-దుస్టు లతో గూడి
,దుష్కృత్యములు సల్పి రట్టు జేసిన  త్యాగ రాజు ని దయతో 'అని సిగ్గు విడిచి చెప్పే స్తా డు .తన గుట్టు
రట్టు చేసు కొన్నాడు .ఈ ఆర్తి ని ఏకాంత రాముడే తీర్చాలని విశ్వాసం .
 ''సిగ్గు మాలి ,నా వలె ధర నెవ్వరు ,తిరుగ జాలరయ్య ముగ్గు రి లో మేలైన రామ --మా ముఖాబ్జ దిన
రమణ రామా -''వ్యర్ధ ం గా ఒక్క అక్షరం కూడా ప్రయో గిన్చడు  త్యాగయ్య .ఇక్కడ కూడా తన సిగ్గు
మాలిన పను లన్నీ నిస్సిగ్గు గా బట్ట బయలు చేశాడు .
        ''ముందర దయతో బల్కిన దింక ముందు రాక పో యే -దద్ద నాలతో దినములు గడిపే దారి తెలిసి
పో యే 
          అందరి చేతను న బ్రతుకు అపుడు నిందల కెడ మాయే--మందరధర ,నా జీవుడు జీవ మిందు
సేయ నాయె అని దెలిసి '' ఈ కీర్తా న్ లో అన్న జపేశం పెట్టిన బాధలు ధ్వనిస్తా యి .ఆశ వుంది .జీవ
,పరమాత్మల ఇక్యతే సర్వ అనీన ప్రేమ .సర్వ యాతనలకు దివ్యౌషధం ,సద్ధ ర్మ పధం .''
        ''కన్నా తండ్రి త్యాగ రాజు నింక -కరుణ జూడ లేదు అని తెలిసి ''అందుకే మనశ్శాంతి అవసరం .అది
ఇహ పర సాధనం కూడా .''సామ రాగం ''లో సామ వేద సారాన్ని ఈ కృతి లో అద్భుతం గా నిక్షిప్త ం
చేశాడు .ఆ రహశ్యం చూద్దా ం .
        ''శాంతము లేక సౌఖ్యము లేదు -సారస దళ నయానా 
         దాన్తు ని కైనా ,వేదాంతుని కైనా --దార సుతులు ధన ధాన్యము లుండిన 
         సారెకు ,జప తప సంపద కల్గిన - యాగాది  కర్మము లన్నియు చేసిన 
         బాగుగా సకల హృద్భావము తెలిసిన -ఆగమ శాస్త మ
్ర ు లన్నియు జదివిన 
         భాగ వతులనుచు ,బాగుగా పేరైన -శాంతము లేక సౌఖ్యము లేదు ''

 సంగీత సద్గు రు శ్రీ త్యాగ రాజ స్వామి ---13

                                కృతుల్లో భక్తి ,శరణా గతి ,ఆర్తి --2


--        ''భక్తి లేని కవి జాల వారెన్యులు ,భావ మెరుగ లేరు ,కనుక భక్తి ,ముక్తి కల్గు నని కీర్తనముల

బో ధించి తి ''అని చెప్పు కొన్నాడు త్యాగయ్య ''.మేను మోసం చేస్తు ంది .హీన మైన ,మల మూత్ర

రక్త ముల కిరవు.మాయ మయం''కనుక నమ్మ వద్దు అంటాడు .సరసాంగి రాగం లో'' అంగ  భూత శరీరం

పై మొహం వదులు కో'' అని అంటే ,మోహన రాగం లో ''మోహము నీపై మొనసి యున్నది రా ''అని

రాముని స్తు తిస్తా డు .సందర్భోచితం గా ఆ రాగాలను ఎన్ను కోని ,కృతులను చెప్పటం ఎంతో ఔచిత్యం

,ప్రత్యేకత ..
          జయంతి శ్రీ రాగం లో ''మరు గేలరా ఓరాఘవా ''అని సంబో ధిస్తూ --

        ''మరుగేల ,చరాచర రూప పరాత్పర ,సూర్య సుధాకర లోచన --అన్ని నీవనుచు ,అంత రంగమున 

        తిన్నగా వెదకి తెలిసి కొంటి నయ్య -నిన్నె గాని మదినేన్న జాల నొరుల -నన్ను బ్రో వు మయ్య

,త్యాగ రాజ నుత ''

 అంతర్ముఖుడైన ఒక మహా భక్తు డు శోధించిన సత్యాన్ని ,ప్రకాశింప జేసే మహాద్భుత మైన సంఘటన

.అండ మైన పదాల పొ ందు ,వీనులకు విందు .భాష ,దానికి తగ్గ ట్టు భావం సుందరాతి సుందరం గా జత

కూడిన అపూర్వ రాగ భావ సమ్మీలనం .

              జగన్మోహిని రాగం లో జగన్మొహనం గా సంగీత మహాత్మ్యాన్ని తెలు పుటూ ,భక్తి

సంగీతందైవాంశం అని   జ్ఞ ప్తికి తెస్తా డు .నాడో పాసనే తరించే మార్గ మని సూచించిన ధన్య పురుషుడు

త్యాగ రాజు .ఆ కీర్తనా వైభవం చూడండి -

    ''శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనసా --నాభి హృ త్కంత(kantha )    ,రసన ,నాసాదుల

యందు 

     ధర ,రుక్సామాదులలో ,వర గాయత్రీ హృదయమున -సుర భూసురుల మానసమున,శుభ త్యాగ

రాజా దులతో -శోభిల్లు ''  

            గాయత్రి ఉపాసన రుక్ ఛందస్సు లలో ఒకటి అందుకే అదీ'' త్రయి'' లాగే అత్యంత పవిత్రమైనది

అని చెప్పాడు .

         ''నీవె దైవ మని నమ్మి నాను దేవ ,-నీకు నాదు మేనమ్మినాను  

          మానము నీదే సుమ్ము ,అభిమానము నేలు కొమ్ము -చక్కని నీ రూపమును గని సో క్కితి ,నా

హృదయమున ''

      అని ,తన దేహం ,ఆ శ్రీ రాముని సొ మ్మే అంటాడు .ఇదే ప్రతి పత్తి స్వరూపం అన్నారు పెద్దలు ,భక్తి

విదులు .    

  రాదా దేవి ,ఎలా మధుర భక్తి తో ఆరాదిస్తు ందో ,అలాగే తానూ రాముణ్ణి ,ఆరాధిస్తా డు .తన సేవాను భూతి

ని చూపిస్తూ పులకలన్ది స్తా డు చూడండి ఆ భక్తి సామ్రా జ్య వైభోగం -

    ''సత తంబు పదముల నర్పింతు ,-ఏకాంతమున నిన్నారాదింతు సీతా రామా !

     తనివి దీర నిన్ను కౌగిలింతు ,దాహ మెల్ల దీర్చ సేవింతు 

     కనుల చల్ల గాను ,నిన్ను గందు ,-నాదు ,తనువు పులకరించ మెచ్చు కొందు 

     అడుగులకును మడుగు లం దిత్తు    -నిన్నస  రించి ,మెల్ల బల్క నిత్తు '' 

 అని తనకు ,శ్రీ రాముడికి భేదం లేదని అంటున్నాడు .'' నీవే  నేనైన నీ వాడు గాక త్యాగ రాజు వేరా ''
అన గల సత్తా దమ్ము అద్వైతి కి మాత్రమే   సాధ్యం .అలాటి వాడే త్యాగయ్య .తనలో పరమాత్మను

,పరబ్రహ్మం లో తనను చూసు కొన్న ,భక్తి వైరాగ్య ,సాధనా  ,శరణాగతి ,ఆర్తి  లను కల బో సు కోని పండిన

త్యాగ జీవి .భగ వంతుని కి భక్త త్యాగ రాజు ''పరచిన red carpet welcome ''అన్నారు విద్వాద్వ రేన్యులు

.''నీదు పలుకే పలుకురా ,నీదు కులుకే కులుకురా -నీదు తళుకే తళుకు రా ''అని మధుర ప్రేమ తో

ఆరాట పడుతాడు త్యాగయ్య .ఒక్క క్షణం కూడా ఆ రామున్ని విడిచి ఉండలేని పచ్చి  భక్తి .

 భక్తి తో త్యాగయ్య కు ''తలచి తే మేనెల్ల పులకరించేని రామ -కను గొన్న నందమై కన్నీరు నిన్దేడిని  

                           ఆలసించు వేళ జగ మంత తరుణ మయ్యేని -చరణ కౌగిలి వేళ చేలగమై మర చేని 

                           చెంత నుండ గ నాదు చింతలు తొల గేని -''అని అనటం లో త్యాగ్యా కున్న అత్యంత

విశ్వాసం జ్యోతకం ఆవు తుంది .ఉన్మత్తు డై తేనే భక్తి కి పరా కాస్త .ఒక రామ కృష్ణ పరమ హంస లా

,స్సదా శివ బ్రహ్మేన్ద్రు ని లా కని పిస్తా డు .పరమ హంసత్వం పూర్తి గా పొ ందిన దివ్య పురుషుడు గా త్యాగ్యా

మనకు కన్పిస్తా డు .ఆ తనమయత్వం చైతన్య ప్రభువు ను జ్ఞా పకం చేస్తు ంది .ఈ కృతి లో కవితా సౌభాగ్యం

,శోభ ,శ్రీ రామ రూప సౌందర్య చిద్విలాసం దర్శనమిస్తు ంది .''ఇంద్రియాలకు ఆహ్లా దం ఇచ్చే రూపం -

నెమ్మది లేని జనన మరణమ్ముల తొల గించే నట రాజ వినతుడిని దర్శించి మనకూ ,ఆ భాగ్యాన్ని

కల్పించాడు త్యాగయ్య .

సంగీత సద్గు రు శ్రీ త్యాగ రాజ స్వామి --14 (చివరిది )

                                     భక్తి శరణా గతి ఆర్తి --౩


         ''మహిత రీతి నన్ను మన్నించిన ,నీడు మహిమ కేమి తక్కువ ?అని నిష్టు రం వేస్తా డు రాముడి
మీద .''సమయానికి తగు మాట లాడు తాడు రంగేశుడు ''అంటాడు త్యాగయ్య .అంటే పూల రంగడు అని
ఎద్దేవా చేయటమే ''.సద్గ ంగా జనకుడు ,సంగీత సంప్ర  దాయకుడు ,.గోపీ మనో రధ మొసగ లేకనే గేలి
చేసే వాడు .వనితలను సదా సొ క్కు చేస్తా డు మ్రొ క్క జేస్తా డు.''అదీ ఆ దేవుడి సత్తా .యశోద తనయుడు
అని ముద్దు పెట్టు కొంటె లీల గా నవ్వు తాడు .ఆయనే రామ ,కృష్ణ ,రంగానాదుల త్రి మూర్తి మత్వం
.''హరే రామ చంద్ర ,రఘు కులేష ,మృదు భాష ,శేష శయన ,పర నారీ సో దరారాజ విరాజుడు ''  
        తాను భక్తు డు అన టానికి సాక్ష్యాన్ని తన ఇష్ట దైవం అయిన శ్రీ రాముడికి తెల్పుకొంటాడు
.పూర్వపు వారంతా మహా భక్తు లానే నమ్మకం వుంది తన స్వామికి .తన దగ్గ ర కు వచ్చే సరికి చెలగాటం
,సాచి వెత ,తాత్సారం .అందుకే బాధ పడతాడు .
         ''కామించి ప్రేమ మీర ,కరముల నీడు ,పాద కమ లముల  బట్టు కొను వాడు సాక్షి 
          రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి -మరీ --నారద ,శుక శౌనక ,పురందర ,నాగ జాధర
ముఖ్యులు సాక్షి ''
అని ,ఇతిహాసాలఞానాన్ని తినీ ఒక చోటే చేర్చాడు రామ నామ రసికుడు త్యాగ రాజు .కవితా శిల్పం లో
''పైకి ''తీసుకొని వెళ్ళే నేర్పు త్యాగయ్యది .
     అందరు భక్తి పారు లైతే ఇంక యమ ధర్మ రాజు కు పనేమీ వుంటుంది ?పెడ మార్గ ం పట్టి అయినా బక్తి
తో ముక్తి పొ ందు తాము అంటే ''యముడికి ''వ్యాధే కదా .?మంచి కవితా రీతి తో సాగిన ఆ సంగీత
దేశికుని భావనా బలానికి మరో ఉదాహరణ .''చిన్తి స్తు న్నాడే యముడు ,సతతము సుజను లెల్ల సద్భజన
చేయుట చూసి 
  శూల పాశ ధర భట జాలము జూచి -మరి మా ,కోలాహలములు  డిగే  ,కాల మాయెనే యమునికి 
  దారి తెలియ లేక ,తిరిగే వార లైన ,చాలు నంటే సారమని తాగ రాజు సంకీర్తనము పాడే రనుచు ''.
          భక్తి విశ్వాసానికి ఇది పరా కాష్ట .''మద మ్మాత్సర్యమనే తెర దీస్తే ''అంతా ,జ్ఞా న ప్రకాశమే నంటాడు
త్యాగయ్య .త్రిగునాత్మక మైన ఆత్మ ఆవరణ లను  చేదించి చూస్తె ,నిర్మల మనసు నిలి పితే ,జ్ఞా న
చక్షువు ను తెరిస్తే ,నిశ్చలానందమేకదా. అదే ఎవరు కోరుకొన్నా.
         ''భజన పరులకు ,దండ పాణి భయం లేదు ''అని అభయ మిస్తా డు ఈ ''వేదండ పాలు దాసుడు
''దండ పాణి ని ఎదిరించా టానికి ,కోదండ పాణి వున్నా డని భావం .ధర్మ సంస్థా పన కోసం ''సరస సామ
దాన భేద దండ చతురుడు -సాటి దైవ మెవరే  బ్రో వవే ''అని కీర్తిస్తా డు .''పరమ శామ్భావాగ్రేసరున్ద నుచు
,పల్కు రావణుడు తెలియ లేక పో యే -
హితము మాట లెంతో ,బాగా బల్కితివి -సతతము గా అయోధ్య నిచ్చే నంటివి 
నాథ సహో దరుని రాజు  జేసి ,రాక హతము చేసితివి ''అని అన్న పై పగ వున్నా తమ్ముడికి రాజ్యం
ఇచ్చాడు .అందుకే శ్రీ రాముని దయ కావాలి అంటాడు .అది లేకుంటే యేఎ పని జరుగదు .
     ''నీ కటాక్షం చాలు ,దానం లంకను దయ చూసి నట్లు -దినము దురాశ దీరిన యట్లు  
       బ్రహ్మేంద్ర పట్టా ను భవ మందిన యట్లు -నాలు గొక్క పది భువన మేలి నట్లు  
        కలుగు కులము లెల్ల కదా తేరి నట్లు -రాజీవ భవ నుత ,రమణీయ చరిత 
        రాజిల్లు త్యాగ రాజ వినుత ''అని పొ ంగి పో తాడు అల్ప సంతోషి త్యాగయ్య.రాముని దయతో సకల
కోర్కెలు తీరు తాయి .ఇహ ,పర భాగ్య లక్ష్మి చే పట్టి నంతటి  విశ్వాసం త్యాగయ్య గారికి .
         భ్కక్తికి ,సేవకు ,శరనాగాతికి చివరి మెట్టు స్వామిలో లీనం ఆవ తామే .ఈ తపన అంతా దాని
కోసమే .సాయుజ్యం కంటే వేరే కోరిక ఏ భక్తు నికీ వుండదు .ఆ భక్తి తో తన ఆత్మకు ,విశ్వాత్మకు అభేదం
.అదే అద్వైతం .ఆ దివ్య సన్ని దానాన్ని ,మనసు లో కల్పించు కోని ,స్వామి లో లీన మై పో తూ
,జీవన్ముక్తు డైన ,గాన బ్రహ్మ ,నాద బ్రహ్మ ,కవి బ్రహ్మ ,జ్ఞా న బ్రహ్మ ,బ్రహ్మొహం అంతు పాడిన చివరి కృతి
ధనాసి రాగం లో ''శ్యామ సుంద రాంగ ''అనే కృతి .ఎదురు గా పర మాత్మ తో మాట్లా డుతూ తనువు
చాలించిన ధన్యుడు .ఆ దివ్య పురుషుని దివ్యాను భూతిని పంచ కొందాం .ఇదే ఆయన చరమ గీతం .--
swan song  .తాను ధన్యుడు అయినందుకు సరైన ధన్యాసి రాగం లో కృతి ని చేయటం ఔచిత్యానికి పరా
కాష్ట .
''హంస ఎలా ఆడుతూ ,పాడుతూ ,ప్రా ణాలు విడుస్తు ందో ,''త్యాగ రాజ హంస 'కూడా ,పరమ హంస యై
,గాన జ్ఞా నం తో పాంచ భౌతిక శరీరాన్ని వదిలి ,నిత్యా సత్య ,శాస్వతా నందాని పొ ందారు .అదొ క అలౌకిక
శోభాన్విత మైన వూహ .
        ''శ్యామ సుంద రాంగ ,సకల శక్తియును నీవెరా -తామస రహిత ,గుణ సాంద్ర ,
         ధరను వెలయు శ్రీ రామ చంద్ర ,-దుష్ట దనుజ విహార -ఇష్త దైవమును నీవెరా -ఇలను త్యాగ రాజు
వేరా ''
ఆధ్యాత్మిక జ్యోతి ,పరంజ్యోతి లో లీన మైంది .వాగ్గేయ కారునిగా ,నాద బ్రహ్మో పాసకుడు శ్రీ కాకర్ల త్యాగ
బ్రహ్మ మనందరికీ నిత్య ప్రా తస్మర ణీయులు .
                        త్యాగ రాజ మంగళా ష్ట కం ---     రచన --శ్రీ వాలాజ పేట వెంకట రమణ భాగ వతార్ 
 01 -రామ బ్రహ్మ సుపుత్రా య ,రామ నామ సుఖాత్మనే -రామ చంద్ర స్వరూపాయ త్యాగ రాజయ
మంగళం 
 02 -శ్రీ కాకర్ల వంశాబ్ధి చంద్రా యామిత తేజసే --పూర్నాయ పుణ్య రూపాయ త్యాగ రాజయ మంగళం 
 03 -నారదా చార్య కరుణా పాత్రా యాద్భుట కీర్తయే -ధీరాయ నిర్వి కారాయ త్యాగ రాజయ మంగళం 
 04 -కావేరీ తీర వాసాయ కారున్యామృత ,వర్షినే  -అవీసుర రాజాయ త్యాగ రాజాయ మంగళం 
 05 -శ్రీ కారుణ్య సముద్రా య లోకానుగ్రహ కారిణే --సాకేతాదిప భక్తా య ,త్యాగ రాజాయ మంగళం 
 06 -యోగి పుంగవ మిత్రా య ,యోగానంద స్వరూపినే -రాగ లోభ విముక్తా య త్యాగ రాజాయ మంగళం 
 07 -గాన శాస్త ్ర ప్రవీనాయ ,కలి కల్మష నాశినే -శరణా గత పో షాయ త్యాగ రాజాయ మంగళం 
 08 -దీన మానవ పో షాయ ,దివ్య నామ సంబో దినే --జ్ఞా న భక్తి ప్రదానాయ త్యాగ రాజాయ మంగళం .
                           త్యాగ రాజ ప్రశంశ -- పద్య  రచన --  శతావధాని ఎస్.రాజన్న కవి 
 01 -     ''అలకలు నుదిటి పై ,నలవోకగా తూగు -నొరపుల బాలు  డొ క్కొక సారి   
       కోదండ ,తనకార ఘూర్నితాంభో రాశి  -హుమ్కార కాంతు(kanthu ) దొ క్కొక్క సారి 
       జానకీ స్మిత మధు శ్యండి మాలా రోచి -రుత్సిక్త హృదయు డొ క్కొక్క సారి 
       పావన నందన భక్తి బాష్ప దారాప్ల వ -నోత్సుఖ చరణు డొ క్కొక్క సారి 
              ఎన్ని రూపుల దర్శనం బిదేనో నీకు -రామ చంద్రు ండు ముని జన ప్రణయ మూర్తి 
              లలిత వీణా కలస్వాన తులిత మొర్తి --త్యాగ రాజ గృహీత లీలావతార.
02 -''నాద సుధా రసంబే దళి తేంద్రనీలమ్ము ,పానమ్ము దేహమ్ము చేసి  
       సకల లోకా నంద సంధాయి దివ్య రాగంమునే ,చేతి చాపంము జేసి 
       వివిధ భావా వేష ,విజ్ఞా త్రు స్వర కన్య కాలనే చాపమ్ము ,గంటలుగ జేసి 
       చిర తపస్సంజాత శీతలా లాపనా ద్రవమునే వింటి శరమ్ము జేసి 
              ఎంత చక్కని రాముని సృష్టించు కొంటి -వయ్య ,జప యోగ కూలంకశా వ తార 
              గాన మందార ,స్వర కన్యకా విహార --తత్పదాదీన హృదయ -ఓ  త్యాగ రాయ ''.
                                   సర్వం సంపూర్ణ ం 
            ''త్యాగ రాజు కృతులలో సామాజిక ఆకృతులు'' అనేశీర్షిక తో రాసిన  నాలుగు వ్యాసాలు ,'సంగీత
సద్గ్రు శ్రీ త్యాగ రాజ స్వామి ''శీర్షిక తో రాసిన పద్నాలుగు వ్యాసాలు ,వెరసి 18  వ్యాసాల పరంపరను ''శ్రీ
త్యాగ రాజ ఆత్మ విచారం ''   అనే పుస్త కం రాసి , అందులో కొత్త కోణం లో  త్యాగయ్యను ఆవిష్కరించిన''
హాస్య  బ్రహ్మ ''  స్వర్గీయ భమిడి పాటికామేశ్వర రావు  (భ'కా'రా')మాస్టా రు గారికి సవినయం గా ,సభక్తి
కం గా  అంకితమిస్తు న్నాను .              
          ఈ వ్యాస పరంపర కు ముఖ్య ఆధారం శ్రీ మరుపూరి కోదండ రామి రెడ్డి గారి ''త్యాగ రాజు భక్తి
సుదార్ణ వం ''అనే ఉద్గ ం్ర దం .దీనితో పాటు తిరుపతి దేవస్థా నం ,తెలుగు అకాడెమి వారు త్యాగయ్య పై 
ప్రచురించిన చిరు పుస్త కాలు ,అనేక పత్రికలలో నేను చదివిన వ్యాసాలు ఆధారం .
           ఈ వ్యాసాలను నేను 01 -05 -93 న మొదలు పెట్టి ,05 -05 -93  వరకు  నాకోసం రాసుకొని పూర్తి
చేశాను .అంటే  దాదాపు 18   సంవత్సరాల క్రితం రాసినవి అన్న  మాట . ఇప్పుడు మీ కోసం వెలుగు
చూశాయి .ఇదంతా ఆ త్యాగ బ్రహ్మ అనుగ్రహమే .
   

నాద బ్రహ్మ ద్వయం


                  నాద బ్రహ్మ ద్వయం

నాద బ్రహ్మ ,సంగీత సద్గు రు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని ,అపర త్యాగ బ్రహ్మ ,నాదో పాసకుడు ,మహా

వాగ్గేయకారుడు స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభను స్వర  నివాళిగా సరసభారతి

,ఉయ్యూరు రోటరీ క్ల బ్ సంయుక్త ంగా పుష్య బహుళ పంచమి 17-1-17 మంగళవారం సాయంత్రం 6-30 గం.లకు

ఉయ్యూరు లో శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లోనిర్వ హిస్తూ ,బాలమురళీ కృష్ణ   మరణించిన నెల

రోజుల లోపునే బహుశా ప్రపంచం లోనే మొట్ట మొదటి సారిగా ఏ సాహితీ సంస్థ ఏర్పాటు చేయని ‘’స్వర్గీయ

మంగళంపల్లి బాల మురళీ  కృష్ణ   స్మారక నగదు పురస్కారం ‘’ను సరసభారతి ఏర్పాటు చేసి  ,మా అమ్మాయి

శ్రీమతి కోమలి విజయ లక్ష్మి ,శ్రీ సాంబావధాని (అమెరికా )దంపతుల సౌజన్యం తో ,రోటరీ క్ల బ్ అధ్యక్షురాలు శ్రీమతి

జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లోగాన౦ చేస్తు న్న గాయనీ మణులకు అందజేస్తు న్న సందర్భంగా ,ఆ ‘’నాద

బ్రహ్మ ద్వయం ‘’జీవిత విశేషాలను సంక్షిప్త ం గా అంద జేస్తు న్నాను .

                              నాద  బ్రహ్మ త్యాగ రాజ స్వామి

శ్రీ సర్వ జిత్ నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్టి సో మవారం ప్రకాశం జిల్లా కంభం తాలూకా కాకర్ల గ్రా మం లో శ్రీ

కాకర్ల   రామబ్రహ్మం ,శ్రీమతి సీతమ్మ దంపతులకు శ్రీ త్యాగరాజ స్వామి ఆ త్యాగరాజ శివుని అనుగ్రహం తో

జన్మించారు .వీరిది వైదక


ి బ్రా హ్మణ కుటుంబం ,మురికి నాడు శాఖ .తండ్రి తంజావూర్ రాజు శరభోజి ఆస్థా న ఉద్యోగి

.తాత గిరర
ి ాజకవి .అందుకే త్యాగయ్య ‘’గిరిరాజ సుతా తనయా ‘’అనే కృతి బంగాళా రాగం లో రాశారు .కుటుంబం 

ఆంధ్ర దేశం నుండి తమిళనాడుకు మొదట ఆరు పల్లెల కూడలి ‘’తిరువారూర్ ‘’కు తర్వాత పంచ నదీ సంగమం
‘’తిరువయ్యూర్ ‘’కు చేరింది .ఇక్కడే త్యాగయ్య సంస్కృతం వేద,వేదాంగాలు నేర్చారు .వీరి సంగీత గురువు శ్రీ శొంఠి

వెంకట రమణయ్య .

  త్యాగయ్యగారు 96 కోట్ల శ్రీ రామనామం జపించి శ్రీ రామ దర్శనం పొ ందిన మహానుభావులు .త్యాగ బ్రహ్మ మహా

వైణికులు కూడా .మొదటి భార్య శ్రీమతి పార్వతి చనిపో తే ,ఆమె చెల్లెలు శ్రీమతి  కమలను ద్వితీయం

చేసుకొన్నారు .కూతురు సేతామహలక్ష్మి .ఆమెకు ఒక కుమారుడు జన్మించి చనిపో యాడు .త్యాగయ్య గారు 13 వ

ఏటనే తోడి రాగం లో ‘’నమో రాఘవా ‘’కీర్తన రాశారు .నారద మహర్షి త్యాగయ్యగారికి ‘’స్వరార్ణవం ‘’అనే సంగీత

గ్రంధం అనుగ్రహించాడు ఈ విషయాన్ని ‘’సాధించెనే మనసా ‘’ లోను ‘’స్వరరాగ సుధా రసము ‘’కృతిలోను చెప్పారు

.జీవిత కాలం లో 24 వేల  రచనలు చేసినట్లు తెలుస్తు ంది .కాని వారివి తెలుగు కృతులు 711 కృతులు .సంస్కృతం

లోనూ రచించారు  .ప్రహ్లా ద భక్త విజయం ,నౌకా చరిత్ర అనే రెండు సంగీత నాటకాలు రాశారు . అందరు దేవుళ్ళను

తన శ్రీరామునిలోనే దర్శించుకొన్న పుణ్యాత్ములు త్యాగయ్య .చివరి దశలో ‘’నాద బ్రహ్మానంద ‘’దీక్షానామం ధరించి

రామగానం లోనే గడిపారు .శ్రీ పరాభవ నామ సంవత్సర పుష్య బహుళ పంచమి నాడు 80 వ ఏట త్యాగ బ్రహ్మ

నాదైక్యమయ్యారు .కనుక ఆయన కు ఇది 250 వ జయంతి .170 వ వర్ధంతి . వర్ధ౦తి రోజునే  త్యాగ రాజ

ఆరాధనోత్సవాలు తిరువయ్యూర్ లోను, దేశమంతటా ఘనం గా జరుగుతాయి .త్యాగబ్రహ్మ౦గారి శిష్యులలో

మూడవ తరం వారు శ్రీ సుసర్ల దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,నాల్గ వ తరం  వారు శ్రీ పారుపల్లి రామకృష్ణ య్య

పంతులుగారు.

  శ్రీమతి బెంగుళూరు నాగరత్నమ్మ అనే సంగీత విద్వాంసురాలు, చెన్నపట్నం నివాసి త్యాగరాజ స్వామికి మహా

భక్తు రాలు .ఆమె ఒకసారి తిరువయ్యూర్ వచ్చి శిధిలమై పో తున్న త్యాగరాజస్వామి సమాధిని చూసి చలించి పో యి

,తంజావూర్ రాజుద్వారా ,రెవిన్యు అధికారుల ద్వారా స్థ లాన్ని కొని ,శుభ్రం చేయించి మద్రా స్ లోని తన ఖరీదైన

మేడను అమ్మి ఆ డబ్బుతో  త్యాగరాజస్వామికి గుడి, చుట్టూ గోడలుకట్టించింది .27-10-19 21 లో శంకుస్థా పన

చేసి నాలుగేళ్ళలో నిర్మించి 7-1-19 25 న కుంభాభి షేకం చేయించింది .మండపం ,పాకశాల నిర్మించటానికి

ధనంలేక తన నగలు,సంపద అన్నీ అమ్మేసింది.మహానటుడు చిత్తూ రు నాగయ్యగారిని కలిసి సత్రం నిర్మించమని

కోరగా ఆయన మహా వితరణ శీలికనుక వెంటనే సత్రం నిర్మించి అందజేశారు .

  త్యాగ రాజ కీర్తనలు 1-తాత్వికం 2-కీర్తనం 3-నిత్యానుస్టా నం అని మూడు రాకాలు అని విశ్లేషకులు భావించారు

.నలిని కాంతి ,జయంతి శ్రీ వంటి 100 కొత్త రాగాలను త్యాగబ్రహ్మ సృష్టించారు .త్యాగరాజ పంచరత్న కీర్తనలను

సామూహికంగా ఆరాధనోత్సవం నాడు గానం చేస్తా రు .ఇవి అన్నమయ ,ప్రా ణమయ ,మనోమయ ,విజ్ఞా నమయ

,ఆనందమయ కోశాలను మెట్లు గా ఎక్కే భావ పరంపర గా భావిస్తా రు .ఉత్సవ సంప్రదాయ కీర్తనలు 

ఉత్సవాలనాడు గానం చేస్తా రు.జీవన్ముక్తు డైన నాద బ్రహ్మ ,గానబ్రహ్మ ,కవిబ్రహ్మ ,జ్ఞా న బ్రహ్మ అయిన త్యాగ బ్రహ్మ

గారు’’బ్రహ్మొహం ‘’ అంటూ పాడిన చివరి కృతి ధన్యాసి రాగం లోని ‘’శ్యామసు౦దరాంగ-సకల శక్తియు నీవేరా-

తామస రహిత ,గుణ సాంద్ర –ధరను వెలయు శ్రీరామ చంద్ర –దుస్ట దనుజ విహార ,శిష్ట జన హృదయ విహార –ఇష్ట
దైవము నీవేరా ,ఇలను త్యాగ రాజు వేరా ‘’.ఇదే ఆయన చరమగీతం –(శ్వాన్ సాంగ్) ‘’.త్యాగరాజహంస

పరమహంసలో చేరిపో యింది .

 తెలుగునాట పుట్టి ,తమిళదేశం చేరి అక్కడ శ్యామాశాస్త్రి ,ముత్తు స్వామి దీక్షితులవంటి సంగీత దిగ్గజాలతో

కర్నాటక సంగీత త్రయం అనిపించి , వారిలో శిఖరాయమానం గా ప్రకాశించి తమిళనాట తెలుగు భాషా వైభవాన్ని

చాటి, కీర్తి పతాకను ఎగరవేసిన నాద బ్రహ్మ త్యాగరాజ స్వామి .

               మరో  నాద బ్రహ్మ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ

                మురళీ కృష్ణ బాలమురళి అవటం

తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా శంకర గుప్త ం గ్రా మం లో శ్రీ మంగళం పల్లి పట్టా భి రామయ్య ,శ్రీ మతి

సూర్య కాంతం దంపతులకు శ్రీ బాలమురళీ కృష్ణ 6-7-1930 న జన్మించారు .పుట్టిన 15 రోజులలోనే తల్లిని

పో గొట్టు కొన్న దురదృస్ట వంతులాయన ..తండ్రిగారు తల్లీ గురువు  సర్వమూ అయి కంటికి రెప్పలా పెంచారు

.రాత్రిళ్ళు తండ్రి పక్కలో పడుకొని ఆయన దగ్గ రే సరళస్వరాలు ,జ౦ట స్వరాలు ,వర్ణా లు కీర్తనలు నేర్చారు .1939

జులై 6 న  9 వ ఏట లోబెజవాడలో దుర్గా పురం లోని శరభయ్య గుడులలో మందిర ప్రా రంభోత్సవ సందర్భం గాశ్రీ

పారుపల్లి రామకృష్ణ య్య పంతులుగారి గురువు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారి సద్గు రు ఆరాధనోత్సవాలలో శ్రీ

ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ గారి హరికధ ఏర్పాటు చేశారు .ఆయన రాక ఆలస్యమైతే ఒక అరగంట

కచేరి చేయమని తండ్రి గారు ఆశీర్వ దించి  వేదిక ఎక్కి౦చారు .కచేరీ సాగింది .భాగవతార్ వచ్చి

మూడుగంటలపాటు ఈ మురళీ కృష్ణ గానం తన్మయంగా వింటూనే ఉండిపో యారు .శ్రో తలు తన్మయత్వం చెందారు.

మంత్ర ముగ్ధు లయ్యారు .దాసుగారు ‘’ఇంక నేను హరి కధలు చెప్పను .ఈ కుర్రా డిని  ఈ నాటినుంచి బాలమురళీ

కృష్ణ అని పిలుద్దా ం ‘’అని దీవించారు అప్పటినుంచి మురళీ కృష్ణ బాలమురళీ కృష్ణ అయ్యారు .  బహుశా

ఇప్పుడేనేమోశ్రో తగా ఉన్న  శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు తటాలున వేదిక ఎక్కి బాలమురళి ని ప్రశంసిస్తూ

మూడు పద్యాలు చెప్పి ఆశీర్వది౦చారట .అందులో ఒక పద్యం ‘’నా వలెనే వృద్దు డవై –నావలెనే కీర్తిగాంచి –

నావలెనే శ్రీ దేవి పద భక్తు డవై –భూ వలయము తిరుగు మోయి ‘’  .

                              త్యాగరాజస్వామి ఆశీర్వాదం

 11 వ ఏట తిరువయ్యూరు లో శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవాలకు గురువు పారుపల్లి వారితో బాలమురళి

వెళ్ళారు .అక్కడ తాను పాడాల్సిన సమయాన్ని శిష్యుడికిచ్చారు గురువుపారుపల్లి .అంతే జంకూ గొంకూ లేకుండా
అనాయాసంగా కచేరీ చేసి అందరి నుంచి అపూర్వ స్పందన అందుకొన్నారు .ఆ సభలో ఉన్న శ్రీమతి బెంగుళూరు

నాగ రత్నమ్మగారు బాలమురళి చేయి పట్టు కొని అక్కడేఉన్న శ్రీ త్యాగరాజస్వామి  విగ్రహం పాదాల వద్ద కు

తీసుకొని వెళ్లి నమస్కారం చేయించి ‘’ఏ నర దృష్టీ సో కకుండా ,జనఘోష లేకుండా ఈ పిల్లవాడిని కాపాడు స్వామీ

‘’అని ప్రా ర్ధించారు.

                         కృతి రచనకు శ్రీకారం

14 వ ఏట బెజవాడ సత్యనారాయణ పురం లోని వీరింటి ఎదురుగా ఉన్న దూబ గుంట వారి సత్రం లో కుర్తా లం

పీఠాధిపతి శ్రీ శ్రీ విమలానంద భారతీ స్వామి విడిది చేసి ఉన్నారు .బాలమురళి వారిని దర్శించి ఆశీస్సుల౦దు కొని

4 30 బాణీలలో 72 మేళకర్త రాగాలకుఒక్కొక్క కృతి చొప్పున కీర్తన రచనకు శ్రీకారం చుట్టి ,రచించి ‘’జనకరాజ

కృతి ‘’అని ఆ గ్రంధానికి పేరు పెట్టా రు .యతి ,ప్రా స ,కవితా లక్షణాలను కృతి కీర్తన ,పాట ,పదం జావళీ లలోని

భేదాలను ,సృజన రహస్యాలను నేర్పిన తొలిగురువు శరభయ్య గుడుల లో దేవీ ఉపాసకులు పండితులు శ్రీ

అప్పయ్య శాస్త్రిగారు .

                      ఆకాశవాణి ఆర్టిస్ట్

14 వ ఏటనే తమ అపూర్వ సంగీత వైదుష్యం తో ఆకాశవాణి ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అయ్యారు .1940  నుండి రేడియో

ప్రస్థా నం కొన సాగించారు . 22 వ ఏట విజయవాడ కేంద్రం లో సంగీత పర్య వేక్షణ శాఖ లో  చేరారు .శ్రీ బాలాంత్రపు

రజనీకాంత రావు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు శ్రీ బాలమురళి ఆనాటి రేడియో సంగీత త్రయం .ఉదయం పూట

కార్యక్రమం లో భక్తికి సంబంధించిన ది ఉండాలని చెప్పి మొట్ట మొదటి సారిగా ‘’భక్తి రంజని ‘’ప్రవేశ పెట్టింది

బాలమురళీయే .సంగీతం నాటకం,స్పోకెన్ వర్డ్ లాంటి వివిధ శాఖలు ప్రొ డ్యూసర్ పో స్ట్ లు ఏర్పాటు చేయించి

,సమర్ధు లను నియమింప జేసిన ఘనత బాలమురళి దే.ఎంకిపాటలు ,రామదాసు ,అన్నమయ్య ,త్యాగరాజు

,సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలకు రాగాలు కూర్చి గానం చేసి చేయించి  శ్రో తలకు పరిచయం చేసి వినిపించారు .’’ఎక్కడి

మానుష జన్మం బెత్తి న ఫలమేమున్నది ‘’అనే అన్నమయ్య కీర్తనకు మొదటి సారిగా స్వర పరచి గానం చేశారు

.ఎన్నో తత్వాలకు స్వరకర్త బాలమురళి .’’ఏమీ సేతురా లింగా ‘’వంటివెన్నో ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు

.ప్రయాగ రంగ దాసు కీర్తన-‘’రాముడుద్భవించినాడు రఘుకులమ్మున ‘’అనేది ఆయన నోట అపురూప గీతమైంది

‘’పిబరే రామ రసం రసనే ‘’,’’స్థిరసా నహి నహిరే ‘’వంటి సదాశివ బ్రా హ్మేంద్ర కీర్తనలకు స్వర రాగ స్పర్శ కల్పించి

చిరస్మరణీయం చేశారు .జయ దేవుని అష్ట పదులు స్వాతి తిరుణాల్ కీర్తనలు ,శ్యామ శాస్త్రి, ముత్తు స్వామి దీక్షితుల

కృతులు ఆయన గానం లో అమృతమయమయ్యాయి .గాయత్రీ రామాయణం ,అమర నారాయణ కీర్తనలను

స్వరపరచి ,పాడి, జీవం పో సిన నాదానంద మూర్తి బాలమురళి .ఆయన కాలం లో వచ్చిన యక్షగానాలు ,సంగీత

రూపకాలు రసరమ్యాలు .కబీర్ గానటించి సమర్పించిన సంగీత రూపకం శ్రీ  బందా కనకలింగేశ్వర రావు గారి
ప్రశంసలను పొ ందింది .ఆకాశ వాణిలో 9 విభాగాలలో అత్యుత్త మ శ్రేణి సాధించి పెట్టిన ఘనత బాలమురళి

దే.అందుకే ఆయన ఆకాశవాణిలో పని చేసిన కాలం ‘’స్వర్ణ యుగం ‘’అన్నారు .

                    సంగీత కళాశాల స్థా పన –ప్రిన్సిపాల్

విజయవాడలో సంగీత కళాశాల  స్థా పించ వలసిన  అవసరాన్ని గుర్తించి  ప్రభుత్వాన్ని ఒప్పించి అన్ని విధాలా

ప్రయత్నం చేసి శ్రీ అన్నవరపు రామస్వామి వంటి వారి సహకారం తో కళాశాల స్థా పనను చేయి౦చ గలిగారు

బాలమురళి.  29 ఏళ్ళకే మొట్ట మొదటి ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలు చేబట్టా రు .విద్వత్తు కు తగిన ప్రతిఫలం ఇది

.అయితే ఒక్క ఏడాది మాత్రమే పని చేసి 30 వ ఏట రాజీనామా చేసి మద్రా స్ వెళ్ళిపో యారు .విజయవాడలో

సత్యనారాయణ పురం లో ‘’మంగళం పల్లి వారి వీధి ‘’ని పురపాలక సంఘం ఏర్పరచి గౌరవించింది .

                           తమిళనాట విరిసిన తెలుగు తేజం

సర్వశ్రీ సెమ్మంగుడి ,జి యెన్ బాలసుబ్రహ్మణ్యం ,ఎం ఎస్ సుబ్బు లక్ష్మి పట్ట మ్మాళ్ వంటి తమిళ సంగీత

దిగ్గజాలున్న మద్రా స్ మహా నగరం లో ప్రవేశించిన బాలమురళి అందరినీ మించి స్వీయ ప్రతిభా పాటవాలతో

,అసలు త్యాగరాజ కృతి ని ఎలా పాడి భావాన్ని వెలువరించాలో చూపి అందరి హృదయాలను గెలిచి నిలబడి జయ

కేతనం ఎగర వేశారు .ఆనాటి త్యాగ రాజుగారిలా   ఈ నాటి అపర త్యాగబ్రహ్మ తెలుగుకు పట్టా భి షేకం చేశారు .దేశ

విదేశాలలో 25 వేల కచేరీలు చేశారంటే మానవ మాత్రు నికి సాధ్యమా అని పిస్తు ంది .’’వేదక
ి ఎక్కే దాకా నేను బాల

మురళీ నే ‘’కచేరీ ప్రా రంభించగానే నేను నేనుకాను .అమ్మ వారు నన్ను నడిపిస్తు ంది ‘’అన్నారు ఆయన  మాతో

మూడేళ్లక్రితం మద్రా స్ లో వారింటికి వెళ్లి కలిసి మాట్లా డినప్పుడు .అది సత్యమే ..

                           రాగ సృష్టి

త్రిశక్తి ,ఓంకారి ,లవంగి ,రోహిణి ,కాళిదాస,తరణి ,సర్వశ్రీ ,మనోహర  సుముఖ ,వల్ల భి ,ప్రతి మధ్యమావతి, మహతి

వంటిఅపూర్వ రాగాల సృష్టికర్త బాలమురళి .అంతే కాదు అవతలివాడిలో ఉన్న ప్రతిభను గుర్తించి అతడిని పైకి

తెచ్చే సృష్టికర్త కూడా .శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ మాటలలో  ‘’ఈలపాటలో సిద్ధహస్తు డనని నన్ను గుర్తించి

పిలిపించి ఇంట్లో ఉంచుకొని ,తనతో కచేరల


ీ కుతీసుకు వెళ్లి అన్నీ నేర్చు కోనేట్లు   చేసి,కన్నకోడుకులా చూసి నాకు

సంగీత భిక్ష పెట్టి నన్ను తీర్చిదిద్దినది బాలమురళీ కృష్ణ గారే ‘’అని పొ ంగిపో యి చెప్పారు .అందుకే బాలమురళి ని

‘’సృష్టి కర్త ‘’అన్నారాయన .   అలాగే శ్రీ డి .వి ,మోహన కృష్ణ ప్రతిభకూ తగిన ప్రతిఫలం కలిపించారు .

                                 రచన
  7 2 మేళ కర్త రాగాలకు 430 బాణీలలో ఒక్కొక్క కృతిని కూర్చి ‘’జనక రాజ కృతి మంజరి ‘’గ్గ ్రంథంగా

వెలువరించారు బాలమురళి .తన స్వీయ కృతులను ‘’సూర్య కాంతి ‘’పుస్త క౦ గా  తెచ్చారు .ఎన్నో తిల్లా నాలకు

ప్రా ణం పో శారు బాలమురళి అంటే తిల్లా నా అని ‘’అల్లా నా ‘’అని ఆశ్చర్య పో తాం .

  
.        పురస్కారాలు

 బాలమురళీకృష్ణ కి ఎన్నో బిరుదులు మరియు పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:

సంగీత కళానిధి, గాన కౌస్తు భ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞా న శిఖామణి, జ్ఞా న చక్రవర్తి,
గాన పద్మం, నాద జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రా ట్, జ్ఞా న సాగర,
మొదలైనవి.కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ,పద్మ భూషణ్ ,పద్మవిభూషణ్ పురస్కారాలు అందజేసింది .ఆయన 75 వ
జన్మ దినోత్సవం లో   తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత పాల్గొ ని బాలమురళి కి ‘’భారత రత్న
‘’ఇవ్వాలని కోరింది .ఆవిడ పేరుమీద ‘’జయజయలలితే ‘’అనే కొత్త రాగాన్ని సృష్టించి పాటరాసి పాడి ఆమెకు
అంకితమిచ్చారు  బాలమురళి .ఉత్త మ శాస్త్రీయ ,ఉత్త మ నేపధ్యగాయక ,ఉత్త మ సంగీత దర్శక పురస్కారాలు అంటే
మూడు జాతీయ పురస్కారాలు అందుకొన్న ఏకైక వ్యక్తి బాలమురళి  ‘.

                        సినీ వినీలాకాశం లో

 1957 లో బాలమురళి ఎస్ వరలక్ష్మి నిర్మించిన సతీ సావిత్రి చిత్రా నికి గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పని
చేశారు .భక్త ప్రహ్లా దలో నారద పాత్ర పో షించారు .నర్త న శాలలో ‘’సలలిత రాగ సుధారస సారం ‘’గుప్పెడు మనసులు
లో ‘’మౌనమే నీ బాస ఓ మూగమనసా’మేఘ సందేశం లో ‘’పాడనా వాణికల్యాణి రాణిగా’’ ముత్యాలముగ్గు
అందాలరాముడు ,రామాంజనేయ యుద్ధ ం  కర్ణ మొదలైన వాటిలో కమ్మని పాటలు పాడారు .కన్నడ చిత్రం
‘’మధ్వా చార్య  ‘’,కు సంగీత దర్శకత్వం వహింఛి ఉత్త మ సంగీత దర్శక అవార్డ్ పొ ందారు .హంసగీతే కన్నడ చిత్రం
లో పాడిన పాటకు  ఉత్త మ నేపధ్యగాయక జాతీయ స్థా యి బహుమతి అందుకున్నారు .సంస్కృతం లో జి .వి.
అయ్యర్ తీసిన శంకరాచార్య చిత్రా నికి సంగీతం కూర్చారు .’’సందేని సిందూరం ‘’మళయాళ చిత్రం లో కూడా
నటించారు . బాల మురళి పాడిన చివరి సినిమాపాట ‘’ప్రభ ‘’అనే తమిళ చిత్రం లో శ్రీదేవి అనే యువ రచయిత్రి
రాసి,ఎస్ జే .జనని స్వరపరచిన ‘’పూవే పేసుం –పూవే పూవిన్ ,వాసం నాలం వీనుం వానం ,మరైత్తమేగం
తూలియాగ కరైందు పో గుం’’అన్న పాట . ఇది ఆయన చనిపో యేనాటికి ఇంకా రిలీజ్ కాలేదు .,

                                      ప్రత్యేకతలు

మృదంగం వీణ వయోలిన్ వయోలా కంజీర మొదలైన 9 వాయిద్యాలలో బాలమురళి టాప్.తనగాత్రా నికి తానే
ఏకకాలం లో వయోలిన్ ,మృదంగం వాయిస్తూ రికార్డ్ చేశారు .జి .యెన్. బి .కచేరి కి వయోలిన్ తో
సహకారంఅందించారు బాలమురళి . భీమ సేన్ జోషి ,చోరాసియా ,కిశోరీ అమో౦కర్ వంటి ఉత్త రాది
సంగీతదిగ్గజాలతో సమానంగా ధాటీగా జుగల్ బందీ నిర్వహించి రికార్డ్ సృష్టించారు .ప్రయోగాలు చేయటం లోనూ
అగ్రేసరులే ఆయన . ఫ్రెంచి పాట విని రాసుకొని 10 నిమిషాల్లో పాడి ఆశ్చర్య పరచిన మేధావి .దాన్ని వయోలిన్ పై
వాయించమంటే వాయించిన ప్రతిభాశాలి .కలకత్తా లో బెంగాలీ పాటపాడితే విని  75 ఏళ్ళ ఆవిడ వచ్చి ఆనందంగా
కౌగిలించుకొని గంతులేస్తూ ‘’గురుదేవ్ టాగూర్ బ్రతికి వచ్చి పాడినట్లు ఉంది ‘’అని మెచ్చుకొన్నది .రవీంద్రు ని వద్ద
ఆ పాట నేర్చుకొన్న వారిలో బ్రతికి ఉన్నది ఆమె ఒక్కరే నట ,రవీంద్ర సంగీతం భద్రం చేసుకోవటానికి బాలమురళి
చేత 30 పాటలు పాడించి రికార్డ్ చేసుకొన్నారు .టాగూర్ తానే సంగీతం కూర్చాడు .ఎవరూ మార్చటానికి వీలు
లేదు .రవీంద్రు ని శాంతి నికేతన్ బాల మురళి కి మొట్ట మొదటిసారిగా ‘’డాక్ట రేట్ ‘’బిరుదు ఇచ్చి సత్కరించింది 
.సంగీతం వ్యాధినివారకం అని అనేక ప్రయోగాలు చేసి మ్యూజిక్ ధేరపి కి మార్గ దర్శి అయ్యారు .తమిళనాడు
ముఖ్యమంత్రి ఎం .జి .రామ చంద్రన్ జబ్బు పడి కోమాలో ఉంటె వైద్యులు ఇక లాభం లేదని పెదవి విరిస్తే, వెళ్లి
చూసి 9 నిమిషాలు మ్యూజిక్ రికార్డ్ చేసి ఇచ్చి దాన్ని వినిపిస్తే హాయిగా ప్రా ణం విడుస్తా రని చెప్పి బాలమురళి
వెళ్ళిపో యారు .మర్నాడు వచ్చి చూస్తే ఎం .జి. ఆర్. కొమాలోంచి బయటపడి హాయిగా కనిపించారట
.అవాక్కయ్యారు మురళి .

  డా నేడునూరిగంగాధారం గారికి అన్నమయ్య పదాల రాగి రేకులు దొ రక


ి ితే తీసుకొని వచ్చి బాలమురళి కి
ఇచ్చారు అప్పటికి అన్నమయ్య పదాలున్నాయికాని సంగీతం లేదు .బాలమురళి వాటికి సంగీతం కూర్చి
మొదటిసారిగా ఆకాశవాణి భక్తీ రంజని కార్యక్రమం లో పాడి వినిపించారు .మద్రా స్ లో  హెచ్. ఏ. ఎల్ .మాజీ
ఎలక్ట్రికల్ ఇంజనీర్ రూపొ ందించిన పో ర్టబుల్ ఎలెక్ట్రా నిక్ తంబురా ను కచేరీలో వాడిన మొదటి గాయకుడు
బాలమురళీ యే .

      ఒక సారితిరునల్వేలి లో కచేరీ చేసి కన్యాకుమారికి వెడుతూ ఉంటె దారిలో ఒక పవిత్ర నదికనిపిస్తే నెత్తి న జలం
చల్లు కొందామని నీటిలో దిగితే షాక్ కొట్టినట్లు అయిందట. మరో సారి ప్రయత్నం చేసినా అలానే జరిగిందట .ఆయన
తో వచ్చినవారికి ఎవరికీ ఏమీ కాలేదు .ఆ విషయం గ్రా మస్తు లకు తెలియ జేశారు. వారు అక్కడ త్రవ్వితే శ్రీ
దుర్గా ౦బిక విగ్రహం దొ రికింది .దాన్ని ప్రతిష్టించి గుడి కట్టించటానికి బాలమురళి ఉచితంగా కచేరీలు చేసి ధనం
సమకూర్చి ఇచ్చారు బాల మురళి పేర ఆడిట ోరియం కట్టి ,రాజ గోపురం లో బాలమురళి విగ్రహం ప్రతిష్టించి
కృతజ్ఞ త తెలియ జేశారట .మద్రా స్ ఆకాశవాణి లో మ్యూజిక్ ప్రొ డ్యూసర్ గా  ఉంటూనే సంగీతకచేరల
ీ ు చేశారు
బాలమురళి .తిరుమల తిరుపతి దేవస్థా న ఆస్థా న సంగీత విద్వాంసులు, తమిళనాడు ప్రభుత్వ కలైమణి గౌరవం
పొ ందారు .ఆయన జీవితం పై పుస్త కాలు వచ్చాయి .

         బాలమురళీయం

శ్రీ బాలమురళి గాత్రం ,శ్రీ అన్నవరపు  రామస్వామి వయోలిన్ ,శ్రీ దండమూడి రామమోహనరావు మృదంగం
త్రివేణీ సంగమమై శ్రో తలను రసగంగలో స్నానం చేయిస్తు ంది .ముగ్గు రూ ఎన్నో వేలకచేరీలు కలిసి చేసి రికార్డ్
సృష్టించారు .ఈ త్రయానికి సాటి లేదు అనిపించారు .’’త్యాగరాజ ఆరాధనోత్సవాలను ఎందుకు వ్యతిరేకిస్తా రు మీరు’’
?అని అడిగితే ‘’’’ఆరాధన అంటే మృతి చెందిన రోజు చేసేది .కొత్త చీరలతో సింగారించుకొని ,ఒంటినిండా నగలు
దిగేసుకొని వెళ్లి పాడటం సబబుకాదు .కావాలంటే త్యాగయ్య గారు పుట్టిన రోజున ఇంత హడావిడిగా చేసుకోండి
పాడండి .’’అన్నారు .అందుకేనేమో అమెరికాలో ఒహాయు రాష్ట ం్ర లో ప్రతి ఏడాది ఎప్రిల్ నెలలో దేశం లోని అన్ని
రాష్ట్రా లనుండి గాయకులూ వచ్చి భక్తిగా త్యాగరాజ సభపెద్ద ఎత్తు న నిర్వహించి  గానం చేసి తరిస్తా రట .అందులో
పాల్గొ నటానికి మూడు ,నాలుగు రౌండ్ల ప్రిలిమినరీలు జరుగుతాయట. అందులో క్వాలిఫై అయిన వారే వెళ్లి పాడాట
.

‘’  ‘’పంచ ప్రా ణాలూ సప్త స్వరాలే ‘’అన్నట్లు గా జీవించారు బాలమురళి .పాట అనుకోవటం,రాగం కూర్చటం ,పాడటం
అప్పటికప్పుడు చేసే ‘’సంగీత సర్వజ్ఞు డు ‘’బాలమురళి .ఆయన ‘’తిల్లా న ‘’ఒక తుళ్ళింత ఒక ద్రిల్లి ంత
.ఊగిపో వాల్సిందే .సంగతులు ,సరిగమలు సహజంగా అమరిపో తాయి .సంగీతం పాడుతూ తాను
ఆనందిస్తూ ,రసజ్నులను ఆనందింప జేయటం, నవ్వుతూ పాడటం బాలమురళి ప్రత్యేకత .ఏ స్థా యిలోనైనా గీర
రాకుండా పాడగలిగే దమ్ము ఆయనది. పర్వీన్ సుల్తా న్ తో సరిసాటి .’’అమ్మా !పుట్ట గానే మురళీగానమిచ్చి
‘’అంటూ కన్నతల్లిని, పుట్టిన ఊరు శంకర గుప్త ం ను గుర్తు ఉండి పో యేట్లు ‘’సూర్య కాంతి ‘’రాగాన్ని సృష్టించి దాన్ని
‘’విడువ విడువ నింక ‘’అన్న అన్నమయ్య కీర్తనతో ప్రకాశింప జేసిన సంగీత భానుడు బాలమురళి .

  ‘’నా కీర్తనలో రాగం భోగం ,మొహం ,స్నేహం ,దో బూచులాడుతాయి .ఆర్తి ,ఆవేదన ,ఆరాటం ,ఆకాంక్ష ,తపన
మిళితమై ఉంటాయి ‘’అన్న వాగ్గేయకారుడు బాలమురళి .నాదం లో ఆనందాన్ని పొ ంది ,పొ ందించిన నాద బ్రహ్మ.
బ్రహ్మానందాన్ని అందించినవారు .అందుకే ఆయన్ను ‘’స్టా ర్ వాల్యు ఉన్న సంగీత విద్వాంసుడు ‘’అన్నారు ఆచార్య
ముదిగొండ వీరభద్రయ్య .సంకుచిత పరిధిలో ఉన్న సంగీత సరస్వతిని ‘’భారతీయ సంగీతం ‘’గా మార్చి కొత్త మార్గ ం
తొక్కించిన మార్గ దర్శి బాలమురళి .’’సంగీతం నాకు రాదు ,తెలియదు .కాని సంగీతానికి నేను తెలుసు .అది
నన్ను వెతుక్కుంటూ వచ్చినంతకాలం  నేను వాహిక గా ఉంటాను .పాట నా నోట పలుకు తుంది  .నేనొక సంగీత
పరికరాన్ని (instrument ) ‘అన్నారాయన .

  ఇంత గొప్ప వాగ్గేయకారుడు ,అపర త్యాగబ్రహ్మ, నాదో పాసకులు, గాన గాంధర్వ శ్రీ మంగళం పల్లి బాలమురళీ
కృష్ణ 22-12-16-న 86 వ ఏట  ఏనాడూ ఇంటిదగ్గ ర కచేరక
ీ ి సాధన చేయనివారు మూడు రోజులుగా నెమ్మదిగా
సంగీత సాధన చేస్తూ ,అందరినీ చూసుకొంటూ తనకిస్టు లైనశ్రీ అన్నవరపు రామస్వామి గారి చేతులను తన
చేతులతోపట్టు కొని తుది శ్వాస విడిచారు .హంస పరమహంసలో చేరింది .అందుకే  ఆంధ్ర జ్యోతి దినపత్రిక  ఆయన
మరణం పై ‘’ఆధార షడ్జ మం అంతర్ధా నమైంది .తేనెలు కురిపించే తెలుగు పంచమం మూగ బో యింది . నిషాదం
విషాదమైంది .సప్త స్వరాలూ అశ్రు సాగరాలయ్యాయి .మూడు స్వరాల మహతీ రాగం సృస్టికర్త నే కోల్పోయి
,విలపించింది త్రు ళ్ళిపడేతిల్లా నా ఊపిరి పో యింది .ప్రతిమధ్యమావతి తుది జోలపాడింది .వయోలిన్ ,వయోలా ,వీణ
,మృదంగం అనాధలైనాయి .కర్నాటక సంగీత సామ్రా జ్యం సామ్రా ట్టు లేని రాజ్యమైంది .సరిగమలు నివ్వెర పో గా
,గమకాలు తడబడగా, మధుర మంజుల బాలమురళీ గానం మూగబో యింది ‘’అని గొప్పగా ఆయన వ్యక్తిత్వాన్ని
ఆవిష్కరించింది .

   పుష్యబహుళపంచమి శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం సందర్భంగా

దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులు


దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులు-1
1-సంగీత సద్గు రు శ్రీ త్యాగరాజ స్వామి

దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులలో ప్రథములు శ్రీ త్యాగరాజస్వామి , ఆంద్ర వాగ్గేయకార చక్రవర్తి .’’సత్క్రియా చరణం ,భక్తితత్వ విచారణ

,యోగాభ్యాసాలలో ఒక దానిఎంచుకొని సాధన చేయమని చెప్పిన భగవద్గీ తాను సారం గా త్యాగరాజు గారు భగవత్  సామ్రా జ్యం సాధించారు

.తన్మయత్వంతో శ్రీరామ చంద్ర గుణగానం చేసి ,గానానికి ఆత్మ సామ్రా జ్యం సాధించే శక్తి ఉందని నిరూపించారు .సాంఖ్యులు ,యోగులు పొ ందే

నిర్వాణ స్థా యిని  నాదో పాసన తో పొ ందవచ్చునని తెలియ జేసిన గాయక  బ్రహ్మ  త్యాగయ్య.’’సంగీతజ్ఞా నము, భక్తి వినా సన్మార్గ ము కలదే

మనసా ‘’?అని లోకోత్త ర సందేశమిచ్ఛి తరి౦ప జేశారు .తెలుగు భాషామదుర్యం ,కావ్య రసామృతం,గానానందం  త్రివేణీ సంగమం గా

ఏకస్థా యిలో తనకృ తులలో మేళవించి బ్రహ్మానంద రసాను భూతి సిద్ధింప జేశారు త్యాగయ్య .

   రాగాలకు జీవకళ ఉట్టిపడేట్లు గంభీర భావపూరితంగా కృతులను కూర్చ టానికి తెలుగు భాష మాత్రమే సరైనదని  నిరూపించారు

వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి.వేద, వేదాంగాల  సారాన్ని మంచి నుడికారంతో తెలుగు వారికి అందించిన మహానీయుడాయన .నిగమాల

నిస్ట లో వ్యాసుడు కవితా గోష్టి లో వాల్మీకి .వైరాగ్యం లోశుకమహర్షి .భక్తిలో ప్రహ్లా దుడు.సాహిత్యం లోచతుర్ముఖ బ్రహ్మ. గానం లో

నారదమహర్షి అనిపించిన సర్వజ్ఞ మూర్తి త్యాగబ్రహ్మసకల వేదో పనిషత్ సారాన్ని 24 వేల దివ్య సంకీర్తనలలో వ్యక్త ం చేసిన పు౦భావ

సరస్వతి ,సంగీత సద్గు రువు త్యాగరాజస్వామి ..’’దేశభాషలందు తెలుగు లెస్స’’అని రుజువుచేసిన క్రా ంత దర్శి ..96 కోట్ల రామనామం జపించి

తరించి తరి౦పమజేసినశ్రీరామభక్తు డు,త్యాగమూర్తి త్యాగబ్రహ్మ .    త్యాగబ్రహ్మగారి కృతులన్నీ నాద బ్రహ్మ సాక్షాత్కారం లో నుండి

ఆవిర్భవి౦చినవే ..ప్రతికీర్తనా  రాగ సుధారస పాన మత్త త కలిగించే అమృత గుళిక.  ‘’Tyagaraja ;s songs breathe the wisdom of
S0crates,the tenderness and nathos Buddha ,the love of Christ for suffering humanity ,the quintessence of Upanishads and
with all an in effable sweetness of music for which there is no parallel in the ancient and modern world ‘’ ఇలాంటి

దివ్యామృతాన్ని తనివి దీరా గ్రో లేట్లు వేలాది కీర్తనలు రచించి దాక్షిణాత్యగాయకులకు భక్తిమార్గ ం చూపిన నాదబ్రహ్మ సద్గు రుమూర్తి

త్యాగరాజస్వామి .

    శ్రీ శొంఠి  రమణయ్య  సద్గు రువుల వద్ద గానవిద్య నభ్యసించి అసమాన పాండిత్య ధనుడై ,రామభక్తితో ఆయన కల్యాగుణా లను  24 వేల

కృతులతో గానం చేసి ‘’శ్రీ గిరర


ి ాజ సుతా ‘’అనే విఘ్నేశ్వర ప్రా ర్ధ నతో ఆరంభించారు త్యాగయ్య .నిరంతర రామనామ పద రాజీవ ధ్యానం తో

తన్మయత్వం లో వెలువడిన దివ్యనామ సంకీర్తనలు కర్ణ రసాయనంగా గానం చేస్తూ శ్రీరామ సేవలో గడిపిన ధన్యమూర్తి .తల్లి సీతమ్మ .తండ్రి

రామ బ్రహ్మ .వీరిద్దరి పేర్లు వచ్చేట్లు ద్వంద్వార్ధ ంగా ‘’సీతమ్మమాయమ్మ ,శ్రీరాముడు మాకు తండ్రి ‘’కృతి రాశారు .పెన్నూ ,పేపరు లేని

ఆకాలం లో కృతులను బొ గ్గు తో గోడలపై  రాసేవారు త్యాగయ్య .ఇవన్నీ తంజావూరు ,తిరువయ్యారు లలో విశేష వ్యాప్తి చెందాయి .

    ఆకాలం లో తంజావూరు రాజదర్బారు లో 360 మంది మహా గాయకులుడేవారు .వీరికి సంవత్సరం లో ఒక్క రోజు మాత్రమె పాడే

అవకాశం కలిగేది .అందుకని ప్రతివారు ఒక్కొక్కరాగం లో విశేష కృషి చేసేవారు .వారు సాధన చేసిన రాగాన్ని బట్టి వారికి పేర్లు వచ్చాయి

.శంకరాభరణం నర్సయ్య ,అఠాణా అప్పయ్య ,తోడి సీతారామయ్య వగైరా .ఇంతమంది సంగీత విద్వాంసులలో క్రొ త్త విద్వాంసుడిగా

త్యాగరాజుగారికి పేరు రావటానికి కారణం ఆయన అలౌకిక ప్రతిభ .అప్పటికే దేశ దేశాంతర కీర్తి పొ ందిన త్యాగయ్య గారిని  గురువు గారు

పిలిపించి తిరువాయార్ గాయక సమావేశం లో త్యాగయ్యగారితో పాడించారు.అద్బుతంగా గానం చేసి సుభాష్ అనిపించుకొన్నారు ‘’దొ రకునా

ఇటు వంటి సేవ ‘’కీర్తన మహా రంజుగా పాడిఅందర్నీ ఆశ్చర్య చకితులను చేశారు .వెంకట రమణయ్యగారు శిష్యుని గాన పాండిత్యాన్ని

మనసారా అభినందించి ,ఆస్థా న గాయకుడైన తన తండ్రి వెంకట సుబ్బయ్య మొదలైన ఆస్థా న విద్వాంసుల సమక్షం లో పాడమనగా

కాంభోజి రాగం లో ‘’మరిమరి మొరలిడి నానే ‘’  కీర్తన రసరమ్యంగా పాడి పరవశులను చేశారు .ఈ వార్త శరభోజీ మహారాజుకు చేరి

సగౌరవంగా ఆహ్వానించగా ‘’నిధి చాల సుఖమా ,రాముని సన్నిధి చాల సుఖమా నిజముగదెలుపు  మనసా ‘’  అనే కృతి రాసి ,దర్బారుకు
వెళ్ళటానికి విముఖత చూపారు .ఆజ్ఞా ధిక్కారంగా భావంచి బంధించి భటులను తీసుకొని రమ్మని ఆజ్ఞా పించగా ,’’కడుపు శూల ‘’వ్యాధి తో

గిలగిలలాడాడు .సిరర
ి ా మోకాలు  అడ్డినందుకు అన్న జపేశం కోపగించి ‘’నీ భజన బట్ట కాయెనా,పొ ట్ట కాయెనా’’అని ని౦దించాడు .

  గురు ముఖంగా నేర్వని విద్య వ్యర్ధ ం అని భావించి ‘’గురువు లేక ఎటు వంటి గుణి కి తెలియగబో దు’’కీర్తన రాశారు .మాతామహుడు వీణ

కాళహస్త య్య చనిపో యాక’’నారదీయ ‘’గ్రంథం లభించగా అర్ధ ంకాక పొ తే రామాన౦ద యతి ‘’నారదో పాస్తి ‘’మంత్రో పదేశం చేయగా

,నారదమహర్షి దర్శనమిచ్చి పంచనదీశ్వరాలయానికి తీసుకు వెళ్లి ,’’స్వరార్ణ వం’’గ్రంథం ఇచ్చి ,సకలశాస్త్రా ర్ధ ం  అవగతం అవుతుందని

ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు

  ‘’ ఆత్మమధ్యగతః ప్రా ణః ప్రా ణ మధ్యగతో ధ్వనిః-ధ్వని మధ్యగతో నాదః నాదమధ్యే సదాశివః ‘’ అనే శ్లో కభావంగా ‘’రాగ సుధారస పానము

‘’అనే కీర్తనరాశారు త్యాగయ్య .స్వరార్ణ వం లోని మూర్చనలపేర్లకు ఇప్పుడు ,ప్రచారం లో ఉన్న వాటి పేర్లకు చాలా తేడాలున్నాయి

.తననారద భక్తి ప్రకటనకు ‘’శ్రీనారద సరసీ రుహ భ్రు ౦గ’’,’’నారద గురుగుహ ‘’,నారద గురు స్వామి ‘’మొదలైన కీర్తనలు రాసి నారదాంకితం

చేశారు   త్యాగబ్రహ్మ .తనమాయరూపాన్ని త్యాగయ్య పసికట్టా డని గ్రహించి త్యాగయ్యకు ‘’రామ తారక మంత్రం ‘’నారదుడు ఉపదేశి౦చగా

‘’ఎంత భాగ్యమో ‘’,’’సందేహమును దీర్పుమయ్య ‘’కృతులురాసి కృతజ్ఞ త తెలుపుకొన్నారు నారద గురువుకు శిష్య త్యాగబ్రహ్మ .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ

శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’,

    సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-19-ఉయ్యూరు

‘’

--
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -2
1-సంగీత సద్గు రు శ్రీ త్యాగరాజ స్వామి -2(1759-1847)

ఒక రోజు రామకోటి జపంచేశాక సంధ్యావందనాదులు పూర్తిచేసి ,పట్టా భిషేకసమయం లో శ్రీరాముడు ప్రత్యక్షం కాకపొ తే ఆర్తిగా

త్యాగరాజస్వామి ‘’ఏల నీ దయ రాదు ‘’కృతి రచించారు .రెండు సార్లు రామకోటి జపం చేశాక సపరివారంగా దర్శనమిచ్చిన స్వామిని

‘’కనుగొంటిని శ్రీరాముని ‘’.’’ఎంతముద్దు యెంత సొ గసు ‘’,నాద సుధా రసంబిలను నరాకృతిఆయెరా’’అంటూ కీర్తనలతో స్తు తించారు

.ఈవిషయం గురువుగారికి తెలిసి పాడమని కోరగా ‘’దొ రకునా ఇటు వంటి సేవ ‘’కృతిలో ‘’కామిత ఫలనాయకి యగుసీత ‘’అనే చోట సాహిత్య

స్వరాలు వేయగా ,పరమానందం తో వేంకటరమణయ్య గారు రాజు తమకు బహూకరించిన ‘’మకర కంఠి’’మొదలైన ఆభరణాలను తీసి

శిష్యుని మెడలో వేసి ఆప్యాయంగా ఆలింగనం చేసికొని’’దీర్ఘా యురస్తు ‘’అని దీవించగా త్యాగరాజస్వామి ‘’జయ జానకీ రామ ‘’కృతి పాడి

ఆశీర్వాదం పొ ందారు ..గురువుగారి కుమార్తె వివాహానికి ఈ ఆభరణాలను  నూతన వస్త్రా లతో సహా ఆయనకే కానుకగా అందజేసిన

త్యాగమూర్తి త్యాగయ్యగారు .

   స్వార్ధ పరుడైన అన్న జపేశం ఆస్తి విభాగం లో మొత్త ం ఆయనే దక్కించుకోగా త్యాగరాజస్వామికి నిత్యం తాను  పూజించే ‘’శ్రీరామ

పంచాయతనం ‘’దక్కింది .వీటికి అలంకరణ చేసి ‘’కొలువై యున్నాడే’’,కొలువమరెగదా’’మొదలైన కీర్తనలు రచించి పాడుతూ కాలం గడిపారు

.ప్రతిఏడాది ఈ విగ్రహాలకు సమారాధన చేసి సంగీత రసికులను ఆహ్వానించి తన కీర్తనలతో బ్రహ్మానందం కలిగించటం జపేశుని ఈర్ష్యకు

కారణమై ,వాటిని దొ ంగిలించి కావేరిలో పారేశాడు .ఈ సంఘటనకు మనసు వ్యాకులమై ‘’ఎందు దాగినాడో ‘’మొదలైన కృతులు రాసి

పాడుకొంటూ నిద్రా హారాలు లేకుండా గడుపుతుంటే స్వామి కలలో సాక్షాత్కరించి తానున్న చోటు తెలియజేశారు .అక్కడికి వెళ్లి వెతుకగా అవి

దొ రకగా పట్ట రాని ఆనందం తో ‘’రారా మా ఇంటి దాక ‘’కీర్తనపాడి సంప్రో క్షణ చేసి ,అన్నకు సద్బుద్ధి ప్రసాది౦ప మని వేడుకొన్నారు.భార్య

పార్వతి ఒకరోజు ధర్మ సంవర్ధినీ దేవితో మాట్లా డటం విని త్రిపురసు౦దరిపై  ‘’దారిని తెలుసుకొంటి ‘’కీర్తన రచించి పాడారు .భార్య మరణాన్ని

తట్టు కోలేక ‘’తొలి జన్మమున జేయు’’, ‘’ఏ పాపము జేసితినో ‘’కృతులు రాశారు .ఆమె చెల్లెలు కమలను ద్వితీయం చేసుకొని ‘’సీతమ్మ ‘’అనే

కూతురిని పొ ందారు .

    దక్షిణాదిన ఉన్న సకల శైవ వైష్ణవ క్షేత్రా లన్నీ దర్శించి అ స్వాములపై కీర్తనలు రచించారు త్యాగ బ్రహ్మ .తిరుమలేశుని దర్శనం లో

‘’తెరతీయగ రావే ‘’కోవూరు సుందరేశ్వరునిపై ‘’శంభో మహాదేవ ‘’కృతులు రాశారు .ఇక్కడి సుందరేశ మొదలియార్ త్యాగయ్యగారి నిర్లిప్తత

గమనించి రహస్యంగా పల్ల కీలో వరహాల మూట పెట్టించాడు .అడవి దొ ంగలు అపహరిస్తే ,ఇస్ట దేవతా స్మరణ చేస్తే రామ సో దరులు
విల్ల ంబులతో దొ ంగలను భయపెడితే‘’ఎవరిచ్చిరిరా ఈ శరచాపం ‘’అని కీర్తిస్తే వరహాలమూట అర్పించి క్షమాపణ కోరి, వారే పల్ల కీ బో యీలై

ఒక అగ్రహారానికి గౌరవంగా చేర్చారు .

   ఆవూరిలో కాశీ యాత్రకు వెడుతున్న  దంపతులను పెద్దపులి భయపెడితే పాడుపడిన దేవాలయంలో ప్రా ణ రక్షణ చేసుకోగా, భర్త అక్కడి

పాడు నూతిలో పడి చనిపో తే ‘’అయ్యవారికి ‘’తెలిసి ,’’నా జీవనాధారా ‘’కృతి రచించి శ్రీరామ కృపతో బ్రతికించారు .ఉపనిషద్ బ్రహ్మంగారి

ఆహ్వానం పై కంచి వెళ్లి కామాక్షి అమ్మవారిపై ,కీర్తన రాశారు .మద్రా స్ పార్ధ సారధి కోవెలలో దేవ గాంధారి రాగాన్ని వరుసగా వారం రోజులు

దీక్షగా గానం చేశారు .పుదుక్కొట మహా రాజు దర్బారులో ‘’జ్యోతిస్వరూపిణి’’రాగాలాపన చేసి దీపాన్ని వెలిగించారు .తీర్ధ యాత్రలు ముగించి

స్వగ్రా మం పంచనదం చేరగా ,అక్కడ గోవింద మరార్ అనే తిరువాన్కూర్ సంగీత విద్వాంసుడు ఎదురు చూస్తు న్నాడు .మరార్ గానప్రతిభకు

మెచ్చి సత్కరించి ‘’గోవింద దాసు ‘’బిరుదు ప్రదానం చేసి ‘’ఎందరో మహాను భావులు ‘’అనే విశిష్ట కృతి రాశారు .కృతులతోపాటు నౌకాచరితం

,ప్రహ్లా ద విజయం మొదలైన యక్షగానాలూ రాశారు .

  ఇలా 88 ఏళ్ళు రామనామ కీర్తనలు రాస్తూ ,గానం చేస్తూ సార్ధ క జేవితం గడిపిన సంగీత సద్గు రు త్యాగరాజస్వామి ‘’జ్ఞా నమొసగ రాదా

‘’,’’ఇదే సమయమురా ‘’,’’దయ జూచుటకిది వేళరా ‘’మొదలైన కీర్తనలతో మోక్షాన్ని ప్రసాది౦పమని తన ఇస్ట దైవాన్ని వేడుకొంటూ కాలం

గడిపారు .ఒక ఏకాదశి నాటిరాత్రి త్వరలో భగవత్ సందేశం రాబో తోందని కలగన్నారు .కలలో రామచ౦ద్ర ప్రభువు దర్శనమిచ్చి ‘’నువ్వు

త్వరలో సన్యాసం స్వీకరించు .ఇవాల్టికి అయిదవ రోజు నా పదవి నీకిస్తా ను ‘’అని అని  చెప్పి అంతర్ధా నమయ్యాడు .చివరి కీర్తనగా ‘’గిరిపై

నెలకొన్న రాముడు ‘’పాడి ఆనాడే వేద విదుల సమక్షం లో బ్రహ్మానంద తీర్దు లవారి వద్ద సన్యాసాశ్రమం పొ ందారు .1847 ప్ల వంగ నామ

సంవత్సర పుష్యబహుళ పంచమి నాడు త్యాగబ్రహ్మ కపాలం విచ్చేదమై త్యాగ జ్యోతి అంతరిక్షం చేరింది .రామభజనలతో త్యాగరాజ కీర్తనలతో

శిష్యులు వారి పార్ధివ దేహాన్ని కావేరీ తీరం చేర్చి ,అభిషేకం చేసి బృందవానం నిర్మించారు .

   తంజావూర్ దగ్గ ర త్యాగరాజ శివుడు కొలువై యున్న తిరువారూర్  లో ఆంద్ర ములికి నాటి బ్రా హ్మణులు కాకర్ల వంశీకులు .వేద శాస్త ్ర

పురాణ వేత్తలైన పంచనద బ్రహ్మ౦  గారికి సదాశివ,సదానంద ,,సచ్చిదానంద, బాలానంద, గిరిరాజ అనే అయిదుగురు కుమారులు

.గిరిరాజును సుబ్రహ్మణ్య భారతి అని పిలిచేవారు .తెలుగు సంస్కృతాలలో ప్రజ్ఞా వంతుడు ,గానవిద్యా సంపన్నుడు ,వేదాంత గేయ

రచయిత.తంజావూర్ రాజులైన షాహాజీ శంభాజీ లపై 100 సంగీత పదాలు,యక్షగానాలు  రాసినకవి .ఇవి అలభ్యం .గిరిరాజ కుమారుడు

త్యాగయ్యగారి తండ్రి రామ బ్రహ్మం భారత రామాయణాదులను ప్రసంగాలుగా చెప్పే నేర్పున్నవాడు .తులజాజి రాజు ఆస్థా నం లో రామాయణ

ప్రవచనం చేసి ,శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపి గొప్ప సన్మానాలు పొ ందాడు .ఈయన సో దరులు పంచనదం ,పంచాపకేశిలకు విద్య

అబ్బలేదు దుష్ట  స్వభావులవటంతో తలిదండ్రు లు కాశే యాత్రకు బయల్దే రారు .

  ఒక రోజు స్వప్నం లో రామబ్రహ్మ౦ గారికి ‘’నారద వాల్మీకి సరస్వతి భారద్వాజ అంశ సంభూతుడు కుమారుడుగా జన్మిస్తా డని ,త్యాగరాజు

పేరుతో ప్రసిద్దు డౌతాడ’’ని  కల వచ్చింది.భార్యతో శ్రీ త్యాగారాజాలయానికి వెళ్లి దర్శించి పూజించి స్వప్న ఫలం కోసం ఎదురుచూస్తు ండగా

అయిదవ రోజున 1759 బహుధాన్య సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠి సో మవారం శ్రీ త్యాగరాజ స్వామి జన్మించారు .కొంతకాలానికి పుత్రసమేత౦

గా దంపతులు కాశీ యాత్రకు పో తూ పంచనదం లో విడిది చేస్తే శ్రీ పంచనదీశ్వర స్వామి కలలో కన్పి౦చి ,కాశీ కంటే తిరువయ్యూరు గొప్ప

క్షేత్రమని ,అక్కడ సిద్ధి పొ ందినవారు లింగరూపం పొ ందుతారని చెప్పాడు ..ఈ వార్త తెలిసిన తులజాజి రాజు వీరికి తిరుమంజన వీధిలో ఒక

ఇల్లు ,కొంత పొ లం ఏర్పాటు చేశాడు .అప్పటినుంచి అక్కడే ఉంటూ అయిదవ ఏట త్యాగయ్యకు ఉపనయనం చేసి ,సంస్కృతం నేర్పించి

సూత్రసహితరామమంత్రో పదేశం చేశారు .

   బాల్యం లో తోటిపిల్లలతో గోలీలాడుతూ గడుపుతుంటే శ్రీ రామ కృష్ణా నంద యతి ‘’గమనించి శ్రీరామ షడక్షరీ మంత్రో పదేశం చేసి ,శ్రీరాముని

భక్తితో కొలుస్తూ ,కీర్తనలు రాయమని హితవు చెప్పాడు .అలానే చేస్తూ తోడి రాగం లో ‘’ నమో రాఘవాయ ‘’ అనే మొదటి కృతి రాసి
పాడుతుంటే తండ్రి విని ,సంగీత విద్వాంసులకు వినిపిస్తే, అందులోని మధురభావ భక్తితత్పరత కు ముగ్ధు లయ్యారు .వేదాధ్యయనం

సాంగోపాంగంగా నేర్చి , శ్రీ శొంఠి వేంకట రమణయ్య గారి వద్ద గానవిద్య అభ్యసించారు .ఆతర్వాత కథ అంతా ముందే చెప్పుకొన్నాం .

  మరో  సంగీత కళా తపస్సంపంన్నుడి గురించి ఈసారి తెలుసుకొందాం .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ

శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’,

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -3


1-సంగీత సద్గు రు శ్రీ త్యాగరాజ స్వామి -3(1759-1847)

   అ౦దరి  వాడైన త్యాగయ్య

త్యాగరాజస్వామి ఉదార హృదయ౦ తెల్సి ఎందరెందరో శిష్యులయ్యారు .ఆయనకు శివ కేశవ భేదం లేకపో వటం తో సంసారులు విరాగులు

భక్తు లు అన్ని వర్ణా లవారు త్యాగరాజ స్వామిని సేవించారు .పండిత పామర భేదం మిత్రత్వ శత్రు త్వాలు లేకపో వటం తో ఆయన కీర్తనలు

సర్వజన అంగీకారం పొ ందాయి .విమర్శించాలని వచ్చే వారి ఆయన శాంత హృదయం చూసి నోరు మెదపక వెళ్ళిపో యేవారు .పరిశుద్ధ త

,ఆత్మ స్వాతంత్ర్యం ,మనో నిశ్చయం ఆయనకు సహజాలంకారాలు .దేశమంతా త్యాగబ్రహ్మ కీర్తనలకు బ్రహ్మ రధం పట్టింది .కాశీ నుంచి

గోపీనాథ భట్టా చార్యవచ్చి దర్శించి తరించాడు . షట్కాలగోవి౦ద మరార్ స్వామిని దర్శించి పునీతుడై మెప్పు గౌరవం పొ ందాడు .అరవలు

అపరానారదునిగా భావించి త్యాగయ్యగారి కృతులను నేర్చుకొని పాడారు .వాటిలోని అర్ధ గా౦భీర్యం ,భాషా పా౦డిదత్యం, కవితా మాధుర్యం

అర్ధ ం కాకపో యినా తమిళులకు త్యాగారాజస్వామి  ఆరాధనీయుడయ్యారు.తెలుగుభాషా  మాధుర్యం కవితా పాటవం రుచి చూసిన మహా

వైద్యనాధయ్యర్  ,పట్నం సుబ్రహ్మణ్యం ,పూచయ్య౦ గార్, శ్యామ శాస్త్రి తెలుగు కీర్తనలు రాసి పేరుపొ ందారు .ఎందరో త్యాగయ్య  కీర్తనలుపాడి

,ఆయనపై ప్రశంసాపద్యాలు రాశారు .కొందరైతే పిల్లలకు త్యాగయ్యగారి పేరు పెట్టు కొన్నారు .శ్రీమతి బెంగుళూరు నాగరత్నమ్మచలువ ,పూనిక

తో ప్రా రంభమైన త్యాగరాజ ఆరాధన నేడు దేశం లోని ప్రముఖగాయకులు త్యాగయ్య వర్ధ ంతి పుష్యబహుళ పంచమినాడు తిరువయ్యార్   లో

పాల్గొ ని భక్తీ తాత్పర్యాలతో త్యాగరాజ పంచరత్న కీర్తనలను ఆలాపనచేసిస్మరించి , కృతజ్ఞ తలు తెలుపుకొంటున్నారు.

              శిష్య పరంపర

1-వీణ కుప్పయ్య –సామవేద బ్రా హ్మణుడు భారద్వాజ గోత్రీకుడు .’’నారాయణ గౌళ’’ రాగ ప్రవీణుడవటం వలన ‘’నారాయణ గౌళ కుప్పయ్య

‘’గా ప్రసిద్ధు డు .కోవూరి సుందరేశ మొదలి ఆస్థా నగాయకుడు .వినాయకచవితి ,చిత్ర పౌర్ణ మిలను ఘనంగా నిర్వహించి ఘనవిద్వామ్సులచేత

కచేరీలు చేయించి సన్మాని౦చేవాడు  .రాదారుక్మిణీ సమేత  శ్రీ వేణు గోపాలస్వామి పూజాదికాలు మహా భక్తితో చేసేవాడు .త్యాగయ్యగారిని

కోవూరు  పిలిపించి త్రిపురసుందరీ సుందరేశ్వరులపై కృతులు రచి౦పజేశాడు .మద్రా స్ లో మరణించాడు .ఇతనికోడుకులు కృష్ణ స్వామి

,రామస్వజ్మి ,త్యాగయ్య ,శిష్యులు కొత్త వాసాల్ వెంకటరామయ్య ,ఫిడేలు పొ న్ను స్వామి గానప్రవీణులే .చివరికొడుకు త్యాగయ్య ‘’పల్ల వి

స్వరకల్పవల్లి ‘’,సంకీర్తన రత్నావళి ‘’లను ముద్రించాడు .కుప్పయ్య తండ్రి సాంబయ్య గొప్ప వైణికుడు’’’ఎ సాంబడు వాయించాలి .ఆ సాంబడు

(శివుడు )విని ఆనదించాలి అనే సామెత ప్రచారం లో ఉంది .వీణ కుప్పయ్య వల్ల నే మద్రా స్ కు ‘’సంగీత నిలయం ‘’అనే పేరొచ్చింది .

                2-వాలాజి పేట వెంకట రమణయ్య


మధురవాసి ,సౌరాష్ట ్ర బ్రా హ్మణుడు వాలాజిపేట వెంకటరమణయ్య .త్యాగారాజస్వామిపై ధ్యానశ్లో క ,మంగళాస్ట కాలు రాశాడు .గురుపుత్రి

సీతమ్మ వివాహ సందర్భంలో శ్రీ కోదండరామ స్వామి తైల చిత్రపటాన్ని రచించి కానుకగా ఇచ్చాడు .అప్పుడు భావోద్రేకానికి లోనైనా

త్యాగరాజు ‘’నను పాలి౦ప ‘’అను కీర్తన ఆశువుగా చెప్పారు .ఇప్పటికీ ఈచిత్రం త్యాగయ్య గారి వంశీకుల వద్ద భద్రం గా ఉండటం విశేషం

   ఈయనకొడుకు మైసూర్ సదాశివరావు .శిష్యుడు కృష్ణ భాగవతార్ .రమణయ్య భావ సంవత్సర మార్గ శిర శుద్ధ సప్త మినాడు మరణించాడు

        3-తిరువాడి సుబ్రా మయ్య

   ఇతడుత్యాగరాజ కృతులకు మొదటి స్వర రచయిత.త్యాగరాజ కృతి గాన పద్ధ తిని కొడుకుకు నేర్పాడు

              4-నేమం సుబ్రహ్మణ్యం

పల్ల వి ప్రవీణుడు నేమం సుబ్రహ్మణ్యం క్రు తులగానం లో మహా నేర్పరి .కొడుకు నటేశయ్య కూడా గాయకుడే .

       5-ఉమయాల్పురం సో దరులు

కృష్ణ భాగవతార్ ,సుందరభాగావతార్ లను ఉమయాల్పురం సో దరులుఅంటారు .త్యాగయ్యగారి ఆదేశం తో   ఆదుత్తు రై నివాసి జగద్రక్ష

భాగవతార్ వద్ద గాన విద్య ప్రా రంభించి రాటు దేలాక త్యాగయ్యగారి వద్ద చేరి ‘’జానకీ మనోహరం ‘’కృతి ప్రా రంభించారు

6-టి.శివరామయ్య

సుబ్రా మభాగవతార్ కొడుకు .మానంబు చావడి వెంకటసుబ్బయ్యవద్ద త్యాగరాజ కృతులు నేర్చి ఫిడేలుపై వాయించాడు  .పంచాప కేశవ

భాగవతార్ తో కలిసి మైసూర్ బరోడా కాశీలకు వెళ్లి కచేరీలు చేశాడు. దేశీయ రాగ తాళాలతో ‘’చతు ష్ష ష్టి మాలిక ,నవరత్నరాగామాలిక

రచించాడు

7-మువ్వనల్లూ రు గోవిందన్ సభాపతి సో దరులు

శాలీయ మంగళం నివాసులు .తండ్రి మధ్యార్జ నం దొ రస్వామి .పదకర్త లు సంస్కృత కృతులు రాశారు .

8-మానంబు చావడి వెంకటసుబ్బయ్య

 త్యాగయ్యగారి బందువు .ములికినాటి బ్రా హ్మణుడు .ఫిడేలు వాద్యగాడు.వేంకటేశ ముద్రతో చాలా కృతులు రాశాడు .దేవా గాంధారి రాగం లో

‘’స్వామికి సరియెవరు’’కృతి రాసి గురుభక్తి చాటుకొన్నాడు .

  ఈయన శిష్యులు –మహా వైద్యనాధయ్యర్ ,పట్నం సుబ్రహ్మణ్యం ,శరభ శాస్త్రి ఫిడేలు వెంకోబారావు పంచాపకేషన్ ,శివరామయ్య ,సుసర్ల

దక్షిణామూర్తి శాస్త్రి (బందరు )

9-తంజావూరు రామారావు

1757 లో పుట్టిన రామారావు త్యాగయ్యగారి శిష్యుడు , కార్యదర్శి .గురువుగారితో దక్షిణ యాత్ర చేశాడు .’’చిన్న త్యాగయ్య ‘’అనిఅందరూ

అనేవారు  .పెద్దపెద్ద పనులకు త్యాగయ్యగారు ఈయనను నియమించేవారు .’’అయ్యర్ వాళ్’’అని త్యాగయ్యగారు రామారావు ను పిలిచేవారు
10-సుబ్రా య శాస్త్రి (1803-62)

శ్యామాశాస్త్రి రెండవకొడుకు .గానవిద్య తండ్రివద్ద ప్రా రంభించి త్యాగయ్యగారి వద్ద పూర్తీ చేశాడు .తెలుగు సంస్కృతం ద్రా విడ భాషాలలో

కోవిదుడు ‘’కుమారా ముద్ర ‘’తో కృతులు స్వరజతులు రాశాడు .మధ్యమకాల స్వర సాహిత్య చిట్ట స్వరాలతో ఉండే ఇతని కృతులను

త్యాగయ్యగారు విని మెచ్చేవారు .ఫిడేలు వాదనలో మహా ఘటికుడు .ఉదయార్పాలెం రాజు ఇతని కోరిక ఏమిటి అని అడిగితె ‘’నాపై అంబ

కటాక్షం ఉంది అంతే చాలు ‘’అన్నాడు.1862 చైత్ర కృష్ణ దశమి ఉదయం సంధ్యవార్చి ‘’దత్త ం ‘’అంటూ నీళ్ళు వదలి తనకు ఇంకా రెండు

గంటలు మాత్రమె ఆయుః పరిమాణం  అని చెప్పి అలాగే చనిపో యాడు .ఇతని శిష్యులు అన్నాస్వామి ,తాళపారంగత కంచి కాశీ శాస్త్రి ,ఫిడేలు

చంద్రగిరి రంగా చార్యులు,గీతాల శోభనాద్రి ,పొ న్నుస్వామి బాలు ,తిరుజ్ఞా నముదలి , చిన్మఠం రాఘవులు చెట్టి .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ

శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’,

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -4


1-సంగీత సద్గు రు శ్రీ త్యాగరాజ స్వామి –4 (1759-1847)

              శిష్య పరంపర -2

11-కన్నయ్య భాగవతార్ –త్యాగరాజ కృతులను తంజావూర్ మహారాజు,వాగ్గేయకారుడు  స్వాతి తిరుణాల్ ఆస్థా నంలో పాడి వినిపించాడు

12-ముత్యాల్పేట  త్యాగయ్య

వీణ కుప్పయ్య కొడుకు .108 కీర్తనలు వర్ణా లు, రాగమాలికలు  రాశాడు .ఈతని ఇల్లు గాయకులకు యాత్రా స్థ లంగా ఉండేది .నారుమంచి

సీతారామయ్య ,పిరాట్ల శంకరయ్య ,సుబ్రా య శాస్త్రి,దుడ్డు సీతారామయ్య ఇతని ముఖ్య శిష్యులు .1917 లో చనిపో యాడు .

13-  ఝంఝా మారుతం సుబ్బయ్య ,

తంజావూర్ కన్నయ్య శిష్యుడైన వడ్డి సుబ్బయ్యకు స్వాధ్యాయి .త్రిస్థా యి గాత్రం లో ఘనుడు .మైసూర్ మహారాజు ‘’ఝంఝా

మారుతం’’బిరుదు ఇచ్చాడు .

14-మైసూరు సదాశివరావు

వాలాజాబాద్ వెంకటరామయ్య శిష్యుడు .సర్వతో ముఖ ప్రజ్ఞతో కృతులు, తిల్లా నాలు స్వరజతులు ,తానవ ర్ణా లు ,పదవర్ణా లు రాసిన

ఘనుడు .మధురగాత్రం తో మైసూర్ మహారాజా మూడవ కృష్ణ రాయల ఆస్థా నగాయకుడయ్యాడు.మహా నారసి౦హో పాసకుడు .ఒకరోజు

సాయంత్రం మిత్రు లు ‘’కమలామనోహరి రాగం’’ లో ‘’నరసింహు డుదయించె’’కృతి పాడమని పట్టు బట్టా రు .చాలా పవిత్రంగా పాడే కృతి

ఆది.బలవంతం మీద పాడాడు. ‘సరసి జానందము పగుల ‘’అనే వాక్యాన్ని ముగించగానే నరసింహస్వామిఫో టోకి ఉన్న గ్లా సుపగిలి పో యింది

.అందరికీ భయం ఆశ్చర్యం కలిగింది. దీపాలు ఆరిపో యాయి .వెంటనే పాట ఆపేస ి హారతిచ్చాడు.తీర్ధ యాత్రలు చేస్తూ అక్కడి దేవుళ్ళపై 

కీర్తనలు భారవి, మోహన, కాంభోజి, ,తోడి, హరి కాంభోజి, బలహంస ,అఠాణా రాగాలలో కూర్చాడు.గజానన, ఆంజనేయ త్యాగారాజుల పైనా

కీర్తనలు రాశాడు .తనప్రభువుపై పదవర్ణ నలు,తిల్లా నాలు అల్లా డు. ఇతని స్వర ,తాళజ్ఞా నం అపూర్వం .రాగ భావ అర్ధ పుస్టి,గణ యతి

ప్రా సలతో ఈతని కీర్తనలు బహుజనాభిమానం పొ ందాయి


15-వాలజి పేట కృష్ణ య్య

అనేక కృతులు స్వరజతులు రాశాడు .

16-అన్నాస్వామి

1827 లో పుట్టి సుబ్బరాయ శాస్త్రికి దత్తు డయ్యాడు .కావ్యాలంకార నాటక వ్యాకరణ సంగీత శాస్త ం్ర ఫిడేలు వాద్యంలో ప్రవీణుడు

.’’పాలించుకామాక్షి ‘’,’’పాహి శ్రీ గిరిరాజ ‘’  కృతులకు స్వరాలు కూర్చాడు ఇతని శిష్యులు తచ్చూరి సి౦గరాచారి సో దరులు గ్రంథ కర్త లు .

17-తిరువాయూరి పంచాపకేశన్

త్యాగయ్య గారి సో దరుని మనవడు.మానంబు చావడి శిష్యుడు .అపార సంగీతజ్ఞా నమున్నవాడు .22 ఏట చనిపో యాడు .కొడుకు రాముడు

భాగవతార్ మహా గాయకుడు .

18-సాదు గణపతి శాస్త్రి (1893-1945)

జలతరంగ వాద్యం లో మాహా విద్వాంసుడు. తండ్రి నాగరత్నం మానంబు చావడి మేనల్లు డు .రామనాడు ,పిఠాపురం ,త్రిపు

నా౦డాల్,స్వాధీనం జమీందార్లు ఇతన్ని ఆహ్వానించి కచేరీలు జరిపించి సత్కరించారు .సో దరుడు సుబ్రహ్మణ్యం మంచి గాత్ర జ్ఞు డు  ..లార్డ్

సైమన్ ,లివింగ్టన్ల నుంచి ప్రశంసా పత్రా లు పొ ందాడు’

19-ఆలగుంట సీతారామయ్య (1806-86)

తిన్నవెల్లి జిల్లా ఎలవర్స నొండల్ గ్రా మస్తు డు .ఎట్టియా పురం ఆస్థా నగాయకుడైన కృతికర్త .ఇతని గానవైదు ష్యానికి శివాజీ భోంసలే మెచ్చి

అనేక బిరుదాలు, అశ్వాలు ,గజాలు ఇచ్చి  సన్మాని౦చాడు .వాటిని మధుర మీనాక్షి అమ్మవారికి సమర్పించాడు.ఎల్వరస నొండల్ రాజా

ఆదిపట్టి గ్రా మం ఈనాం గా ఇచ్చాడు .భజనపద్ధ తిపై ‘’రామ మహో త్సవ ప్రా క్తిక’’రచించాడు .

20-పుదుక్కొట సుబ్రహ్మణ్య భాగవతార్ (1823-96 )

పుదుక్కోటరాజు  తొండమాన్ రఘునాథ రామ చందర్ ఆస్థా నగాయకుడు .తండ్రి వెంకటరామయ్య .తిరువయ్యార్ లో త్యాగరాజస్వామిని

సేవించిన అదృష్ట వంతుడు.శివానంద నౌక  ,ప్రహ్లా ద చరిత్ర ,గద్య పద్య కీర్తనావళి రాశాడు .కొడుకు నాగరత్నం ఆస్థా న విద్వా౦

సుడే.తిరువాన్కూర్ రాజు చే గౌరవి౦పబడ్డా డు .’’ఇతని మరణంతో కర్ణా టక గానం అంతరించింది ‘’అన్నాడు రాజా రామ చందర్ .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ

శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’,

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -5


1-సంగీత సద్గు రు శ్రీ త్యాగరాజ స్వామి –5 (1759-1847)

              త్యాగరాజ శిష్య పరంపర -3

21-వైద్య కవీశ్వరన్ (1825-86)


తొండమాన్ రాజుల ఆస్థా న విద్వాంసుడు .గీర్వాణకవి ,గాయకుడు .తిరు గోకర్ణ పుబృహదంబాళ్ భక్తు డు .ఇతని ప్రతిభను మెచ్చి రామచంద్ర

రాజు ‘’వరపురి ‘’ఈనాము ,’’కవీశ్వర్ ‘’బిరుదు ఇచ్చాడు .భక్తి భరితంగా ఇతని సంస్కృత గేయాలుంటాయి .

22-చల్ల గాలి కృష్ణ య్య (1825-65)

పచ్చిమిరియం ఆదెప్ప శిష్యుడు పల్ల వి గోపాలయ్య  కొడుకు .తంజావూర్ ఆస్థా న విద్వాంసుడు .వీణా ,గాత్ర సంగీత నిపుణుడు ‘’శ్రు తి తంత్రిని

వాయించకుండా వీణను మీటటం ఇతని ప్రత్యేకత .వీణ మానవ గాత్రం లాగా పలికేది.దక్షిణానిలం లాగా చల్ల గా ఉండేది కనుక ‘’చల్ల గాలి’’

బిరుదు వచ్చింది .తిరు నెలంగాడు,త్యాగయ్య ,మాయవరం వైద్య నాథన్ శిష్యులు .

23-స్వరకాడు వెంకట సుబ్బయ్య (1825-64)

ఆరం తంగి దగ్గ రున్న వల్ల వాడి నివాసి .శేషాచలయ్యవద్ద గానం నేర్చి ,పల్ల వి స్వరకల్పనలో సిద్ధహస్తు డయ్యాడు .నిడమంగళ గ్రా మంలో

ఉంటూ బయట  ఏకాంత ప్రదేశం లో నాదో పాసన చేసేవాడు .చనిపో యే దాకా గాత్ర గాంభీర్యం తగ్గ నే లేదు .శిష్యుడు పల్ల వి సో మభాగవతార్

.శ్రీ రాజగోపాల స్వామికి తనగాత్రం నివేదించే వాడు .స్వరకల్పనా చాతుర్యాన్ని మెచ్చిన శివాజీ మహారాజ్ ఇతనికి ‘’స్వరకాడు

‘’బిరుదప్రదానం చేసి గౌరవించాడు .

24-కాళిదాసు నారాయణ స్వామి (1858-1926)

రామయ్య కొడుకైన యితడు త్యాగరాజు  వంశీకుడు. మానంబు చావడి శిష్యుడు .ఫిడేలు ప్రవీణుడు .నిడమంగళం వెళ్లి స్వరకాడు

సుబ్బయ్యవద్ద స్వర రహస్యం,పల్ల వి ప్రస్తా వన స్వరకూర్పు  నేర్చాడు .తెల్ల దొ రలనుంచి గిటార్ ,పియానో ,బాన్జో వాద్య లక్షణాలు తెలుసుకొని

భారతీయ రాగాలు నేర్పాడు .అబ్రహం పండితర్ జరిపిన గానపరిషత్తు లో పాల్గొ ని అనేక విషయాలు చర్చించాడు .కొడుకు నీలకంఠన్ గొప్ప

సంగీత విద్వాంసుడు .

25-నీలకంఠన్

 తండ్రివద్ద సంగీతం నేర్చాడు. ఇతని ఇల్లు సఖా రామారావు ,పూచయ్య౦గార్ ,కోనేరి రాజాపురం సంగీత ధ్వనులతో మారు మోగేది .7 వ ఏట

స్వరజ్ఞా నమబ్బిన బాలమేధావి .అపార సంగీతజ్ఞా నం ,దర్పంగల గాత్రం ఇతని సహజ ఆభరణాలు .రామ స్వామి శివన్ 100 రచనలకు అనేక

రాగ తాళగతులతో వర్ణ మెట్లు కట్టా డు .1936-నుంచి 43 వరకు మద్రా స్ అడయారు కళాక్షేత్ర పండితుడిగా ,సంగీతకాలేజి ఆచార్యుడుగా

ఉన్నాడు .

26-రామస్వామయ్య అనే రామానంద యోగి

వాలాజి పేట కృష్ణ స్వామి శిష్యుడు .శ్రీత్యాగరాజ  స్వామి కృతులను మొదటిసారిగా ముద్రించి లోకానికి అందించిన మహానుభావుడు

27-తిల్ల స్థా నం పంజు ,నృసింహ భాగవతార్ సో దరులు

త్యాగరాజస్వామి జీవిత చరిత్ర ,కీర్తనలను అచ్చు వేసిన అదృష్ట వంతులు .నృసింహ హరికథ భాగవతార్ .

28-పల్ల వి శేషయ్య (1832-1909)

నెయ్యకార్పట్టి సుబ్బయ్య కొడుకు .ఆంద్ర ములికినాటి బ్రా హ్మణుడు .సో దరుడు కోదండరామయ్య ‘’కొనగోలు పాటగాడు’’..మనోధర్మ సంగీతం

లో దిట్ట. కల్పనా స్వరాలను క్లిష్టమైన చిత్ర విచిత్ర తాళగతులలోబంధింపబడిన ఎలాంటి జాతులలోని పల్ల వులనైనా చాలాఅవలీలగా పాడే
నైపుణ్యం ఉండేది.వెయ్యి త్యాగరాజస్వామి కృతులు కంఠస్థ ం చేసి ,శ్రీరామునికి  సహస్రా ర్చన చేసిన  మహా భక్తు డు .మల్లికా వసంత

,శుభపంతు వరాళి లలో ఇతని కృతులు రచనాపాటవానికి ఉదాహరణలు .ముత్యాలప్పేట సుబ్బయ్య ఇంట్లో సావేరి రాగం 18 గంటలు పాడి

రికార్డ్ సృస్టించాడు. మేళ క్రమపద్ధ తిలో వెయ్యి రాగాలను అమర్చి వాటికి ఆరోహణ ,అవరోహణ స్వరాలు కూర్చిన ప్రజ్ఞా వంతుడు .గొప్ప లక్ష్య

,లక్షణ విద్వాంసుడు .అనేక కృతులు వర్ణా లు తిల్లా నాలు రాసిన ప్రతిభుడు .మైసూరు రాజా సన్మానం పొ ంది, బందరు మొదలైన పట్నాలలో

కచేరీలు చేసి కీర్తి పొ ందాడు .ఇతని కీర్తనలకు ‘’శేషముద్ర ‘’ఉండటం విశేషం .

29-కరూరి చిన దేవుడు (1860-1900)

దక్షిణామూర్తి, ఈయన పినతండ్రి ,పెత్తండ్రి బిడ్డ లు .దేవుడయ్య కరూరి నరసయ్య కొడుకు .ఆబాల్య

సంగీతజ్ఞా నసంపన్నుడు.గాత్రజ్ఞు డు.ఫిడలర్ కూడా .పట్నం సుబ్రహ్మణ్యం ,శరభ శాస్త్రి వంటి దిగ్దంతులకు ఫిడేల్ సహకారమందించిన ప్రతిభ

ఆయనది .ఉరయార్పురం రాజా పో షణలో మద్రా స్ లో సంగీత శాల స్థా పించి విద్యార్ధు లకు నేర్పాడు .గర్భపురి ముద్రలో ఉన్న దక్షిణామూర్తి

కృతులకు వర్ణ మెట్లు తయారు చేశాడు .సో దరుడు చిన్నస్వామి .శిష్యుడు నీలకంఠయ్య.’’చిన దేవుడు’’ 40 ఏళ్ళకే ఉచ్ఛ స్థితి లో ఉండగా’’

ఆదేవుని’’ సన్నిధానం చేరాడు .30-సి.యస్. కృష్ణ స్వామి (1865-1925)

తిరుచునాపల్లి నివాసి అయినా తూగోజి కాకినాడలో చాలాకాలమున్నాడు .అందుకే ‘’కాకినాడ కృష్ణ య్య’’ అంటారు.పట్నం సుబ్రహ్మణ్యమ

వద్ద గాత్ర ధర్మాలు నేర్చాడు .త్యాగరాజ శతకీర్తన స్వరావళి ,వేంకటేశ తానవర్ణా లు,,ప్రథమగాన శిక్ష  రచించాడు .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ

శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’,

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -6


1-సంగీత సద్గు రు శ్రీ త్యాగరాజ స్వామి –6(1759-1847)

              త్యాగరాజ శిష్య పరంపర -4

31-శ్రీ కంఠయ్య(1870-1914)

కరూర్ భాస్కర పండిత వంశీకుడు.చిన దేవుని శిష్యుడు .మద్రా స్ లో ఫిడేల్ స్కూల్ నడిపాడు .కొడుకు పాప వెంకట్రా మయ ఫిడేల్ లో దిట్ట

32-చిన్నాస్వామి –

దేవుడయ్య శిష్యుడు  .ఫిడలర్ .త్యాగరాజ భక్తి సంగీతః పో షకుడు .ఘన గాత్ర విద్వాంసులు పుష్పవనం ,కోనేరు రాజాపురం ,వైద్యనాధం

,పూచయ్య౦ గార్,ప ల్ల డం ,సి౦గ పట్టిఆచార్యులకు ఫిడేల్ సహకారం అందించాడు.

             33-పాప వేంకటరామన్


తిరువాన్కూర్ రాజాస్థా నగాయకుడు .తండ్రివద్ద గానం నేర్చి గోవిందస్వామి పిళ్ళై దగ్గ ర ఫిడేల్ అభ్యసించాడు .స్వంత బాణీ కూర్చాడు .కచేరీ

అయిపో యాకకూడా ఇతని వాద్యం ప్రతిధ్వనిస్తు ంది .మద్రా స్  రేడియో ఆర్టిస్ట్

34-వెంకటరామ శాస్త్రి (1870)

వైణికుడు.చాలాకృతులు , ‘’సంగీత స్వయం బో ధిని ‘’గ్రంథం రచింఛి ముద్రించాడు

35-పట్టు కోట శ్యామ భాగవతార్ (1872-1924)

గురువు శయ్యం వెంకటస్వామి .గొప్ప హరికథకుడు.భక్త రామదాస్ హరికధ స్పెషలిస్ట్ .త్యాగరాజ కృతులను సభాపతయ్య ప్రవచనాలను

బాగా చెప్పేవాడు .వేంకటేశ్వరుని భక్తు డుకనుక శ్రా వణమాస ఉత్సవాలు ఘనంగా చేసేవాడు

36-పుదుచ్చేరి రంగస్వామి (1888-1920)

ప్రవేశ పరీక్ష దాకా ఫ్రెంచి భాషలో చదివి ,ఎట్టియాపురం రామ చంద్ర భాగవతార్ వద్ద గాన విద్య నేర్చి ,ప్రవీణుడై పిఠాపురం ,విజయనగరం,

కాకినాడ ఆస్థా నాలలో పాడి,వెంకటగిరిమహారాజు చేత స్వర్ణ కంకణం అందుకొన్నాడు .తిరుక్కోడి కావాల్ కృష్ణ య్య ,గోపాలకృష్ణ య్యలు ఫిడేల్

పై ,అలగానంబి మాముండియపిళ్లే ,దక్షిణామూర్తి మృదంగ సహకారం అందించేవారు .కంచిలోని నైన పిళ్లే ఇతనితో తరచూ సంప్రదింపులు

జరిపేవాడు .కుంభ కోణం వాసి అయ్యాక పంచాపకేశి తో పరిచయమైంది .పంచాప కీర్తనలకు చిట్ట స్వరాలు రాశాడు .ఎన్నో త్యాగారాజ

కృతులు గానం చేసేవాడు .శుద్ధ బాణీలో సాహిత్యభావం తో పాడేవాడు .విశిష్ట స్వర నిర్మాత .త్యాగరాజ వర్ధ ంతి సంబరాల్లో పాల్గొ నేవాడు

.శిష్యుడు సాకోట రంగయ్య .

37-ప్రతాపం గోపాలకృష్ణ య్య (1886-1944)

కారూరు వాసి టైగర్ వరదా చారి శిష్యుడు .అభినయం ,గాత్రం, వీణ, ఫిడేల్ కన్జీరాలలో నిపుణుడు .పూనా బొ ంబాయి మొదలైన పట్ట ణాలలో

కచేరీలు చేశాడు .12 గ్రహరాసులకు 12 స్వరాలు కూర్చివీటి ఆధారంగా  జాతకం చెప్పటం ఇతని ప్రత్యేకత .త్యాగరాజ కీర్తనలలో

బీజాక్షరాలున్నాయని కనుక సాహిత్య దో షం తోపాడితే కీడు వాటిల్లు తుందనిసాహిత్య ప్రయోజనాన్ని  చెప్పాడు .

38-ప్రతాపం నటేశయ్య

గోపాలకృష్ణ య్య శిష్యుడు .వానమామల్ తోటాద్రి,అరియకుడి శిష్యరికం చేసి గానం నేర్చాడు .రసికరంజని సభ గాన పాఠశాలలో

అధ్యాపకుడుగా ఉన్నాడు

39-చల్ల గాలి ఆదిమూర్త య్య

కృష్ణ య్య సో దరుడు తంజావూర్ ఆస్థా నగాయకుడు .

40-స్వరగత్తు నారాయణ స్వామి

పుదుక్కొట నివాసి .చిట్టినారాయణస్వామి శిష్యుడు .స్వరకాడు సుబ్బయ్య వంశీకుడు ‘’స్వరగత్తు ‘’వాద్య నిపుణుడు . అగాధ

సంగీతజ్ఞా నమున్నవాడు .మహావైద్యనాథన్ ,శరభశాస్త్రిలకు ప్రక్కవాద్యం వాయించేవాడు.తంజావూర్ ఆస్థా న విద్వాంసుడు .


ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ

శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’,

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు 7


1-సంగీత సద్గు రు శ్రీ త్యాగరాజ స్వామి -7(1759-1847)

              త్యాగరాజ శిష్య పరంపర -5

41-గీతాల శేషయ్య

కంచినివాసి .పైడాల గురుమూర్తి శాస్త్రి శిష్యుడు .కృతికర్త .గాత్రజ్ఞు డు .శిష్యులు నాగోజీరావు ,గీతాల సుబ్బయ్య .

42-అడ్డ గంటి వీరాస్వామి

మద్రా స్ వాసి. తిల్లా నాలు రాగమాలికలు స్వరజతులు రాశాడు

43—అక్కన్న

వైణికుడు.వెంకట గిరి ఆస్థా న విద్వాంసుడు .

44-షట్కాలం నరసయ్య

ఆరు కాలాలో కీర్తనలు పాడే సమర్ధు డు, వైణికుడు. వేంకటగిరి ఆస్థా న విద్వాంసుడు .వర్ణా ల ,కృతుల రచయిత.

45-స్వరం కొండయ్య

కృష్ణా జిల్లా బందరు వాసి. గానప్రతిభ, శైలి ,స్వరకూర్పు, శబ్ద సొ గసు ,మనోధర్మ స్వరం ,పక్కా తాళపొ ందిక ఉన్న

గాయకుడు.త్యాగరాజస్వామి వారి విగ్రహాలను పూజించిన అదృష్ట వంతుడు

46-మధుర సుబ్రహ్మణ్యం

త్యాగయ్య వంశీకుడు .నైషధం శేషయ్య ,కరూరు చిన్నస్వామి శిష్యుడు .లక్ష్య లక్షణ పరిజ్ఞా నంతో గాయకప్రపంచ లోసుస్థిరస్థా నం పొ ందాడు

.ప్రముఖ గాయకులకు ఫిడేలు సహకారం అందించాడు .అన్నామలై సంగీతకళాశాల అధ్యాపకుడు .అడయారు కళాక్షేత్రం లోనూ ఫిడేలు

ఆచార్యుడు .శిష్యులు జిఎన్ బాలసుబ్రహ్మణ్యం ,తంజావూరు లక్ష్మీనారాయణ

47-భుజంగ రామస్వామి

వీణ ,మృదంగ, కంజిర, ప్రవీణుడైన గాయకుడు .హరి కథకుడు.గోవిందస్వామి సంజీవరావు లకు మృదంగ సహకారమందించాడు.
48-చల్ల గాలి వీర రాఘవయ్య ,అప్పయ్య సో దరులు

తంజావూరు చిక్క ఒత్త ప్పయ్య వంశీకుడు .అప్పయ్యమనవడు. వరాహప్పయ్య ఆంగ్ల హిందూ గాన సంపన్నుడు .’’అభినవ నారద

‘’బిరుదు.వీరరాఘవయ్యకు తంజావూరు రాజులు ‘’చల్ల గాలి ‘’బిరుదిచ్చారు .శిష్యులు-లక్ష్మణ గోసాయి పరమేశ్వర భాగవతార్ ,వడివేలు

,వీరరాఘవయ్య ,నీలక౦ఠ శాస్త్రి అఖిలా౦డపురం వీణ ధర్మ దీక్షితులు ,కొడుకు గోపాలయ్య ,మనవడు కృష్ణ య్య.

49-తిరుకుండ్రం రామయ్య

షట్కాల పల్ల వి ప్రవీణుడు

50-నాగపట్నం వెంకటస్వామి

గాత్రం ,ఈల ప్రవీణుడు. ఫ్లూ టు వాద్య౦ లో ఘటికుడు .

51-చిదంబరం గురుస్వామి

గురువు ముదిగొండ సభాపతి .శిష్యుడు కృష్ణ మూర్తి

52-కృష్ణ మూర్తి అయ్యంగార్

రంగస్వామి బంధువు గురుస్వామి శిష్యుడు గంభీర శాస్త ్ర సమ్మత శుద్ధ కర్ణా టక గాన ప్రవీణుడు .

53-పట్ట మంగళం ఈశ్వరన్ –సా౦బశివన్

పుదుక్కొట వాసి .వైణికుడు. హరిదాస్ రామచంద్రరావు శిష్యుడు .మద్రా స్ కళాక్షేత్రం లో, రేడియోలో పని చేశాడు

54-ఎల్.సుబ్రహ్మణ్య శాస్త్రి (శర్మాదేవి )

వీణ శేషన్న శిష్యుడు .గానాన్ని ‘’కళకళకోసమే ‘’అనే దృష్టిలో చూశాడు ,మద్రా స్ గాన పరిషత్తు లో చాలాకచేరీలు చేశాడు.

55-తాడిచర్ల లక్ష్మీనారాయణ శాస్త్రి (1916)

కడప జిల్లా సిద్ధవటం వాసి .తండ్రి వెంకట శాస్త్రి .అన్నామలై పట్ట భద్రు డైన వైణికుడు.గోమతి శంకరన్ ,మధుర సుబ్రహ్మణ్య౦ ల శిష్యుడు .

56-కొల్లా పురం ముద్దు కృష్ణ య్య

దండపాణయ్యర్  శిష్యుడు .వైణికుడు. సో దరుడు రాముడు మంచి మార్ద ంగికుడు .

57-పంచాపకేశన్ ,రాముడు సో దరులు

పంచాపకేశన్1936 లో అన్నామలై నుంచి ‘’సంగీతభూషణ ‘’పొ ందాడు .ఢిల్లీ ,కర్నాటక సంగీత  పాఠ శాలల్లో 1928 నుంచి 43 వరకు

ఆచార్యుడు .ఢిల్లీ ఆకాశవాణి నిలయ విద్వాంసుడు .మాయవరం లక్ష్మణస్వామివద్ద రాముడు మృదంగం నేర్చాడు

58-అలత్తూ రు సో దరులు
వీరిలో వెంకటేశయ్య మహాగాయకుడు ,హార్మనిస్ట్ .శివ సుబ్రహ్మణ్యం తిరువాన్కూర్ ఆస్థా న విద్వాంసుడు .’’వీరిద్దరి యుగళగానం’’ ప్రపంచ

ప్రసిద్ధి పొ ందింది .ఈ జంట రాగాలాపన ,స్వరకల్పన చిత్రతాళగతులు తిరువాన్కూర్ రాజా ను బాగా ఆకర్షించాయి .మద్రా స్ సంగీతపరి

షత్తు లో వీరిద్దరి స్థా నం ప్రముఖం .

                      భరత నాట్య ప్రవీణులు

59-మెరటూరి  వెంకటరామ శాస్త్రి

మెరటూరి వంశం వారు భారత శాస్త ్ర నిష్ణా తులు .మూలపురుషుడు మెరటూరి వెంకట రామ శాస్త్రి సంగీత భరతనాట్యాలలో సుప్రసిద్ధు డు

.త్యాగరాజ సమకాలికుడు .

60-మెరటూరిఅరుణాచలం (1831-95)

త్యాగరాజ శిష్యపర౦పరలోని వాడు .’’స్వరకళానిధి ‘’పట్టా భి అరుణాచలం అసలుపేరు .తాత శివరామన్.అచ్యుతసముద్రం లేక మెరటూరు

గ్రా మ ఈనాం దారులు .తండ్రిపట్టా భిరామయ్య ఉషాకల్యాణ,కంసవధ యక్షగాన కర్త .గొప్ప భరతనాట్య ప్రవీణుడు .తంజావూరు

వరదరాజస్వామి సన్నిధిలో చాలా నృత్యనాటికలు ప్రదర్శించాడు .ప్రహ్లా ద చరిత్ర ఫేమస్ .సంగీతజ్ఞా నంతో వేలాది ప్రదర్శకులను ఆకర్షించి

అలరి౦చే వాడు  .ధనార్జ నకోసం విద్యను  ప్రదర్శించని నిజభక్తు డు .చాలావర్ణా లకర్త .రసవాదం, ఆయుర్వేదం లో నిష్ణా తుడు .ఇతని ఇల్లు

ప్రఖ్యాతులైన ఉమయాల్పురం కృష్ణ య్య ,సుందరరామయ్య ,వీణ సా౦బ య్యలతోకళకళ లాడేది .నిర్మోగామాటి .నాగస్వర విద్వాన్

శివకొలందు నిర్భయంగా విమర్శించాడు .శిష్యులు శివగంగ వైద్యనాధన్ ,తంజావూరు సుబ్రహ్మణ్యం .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ

శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’,

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -8

1-సంగీత సద్గు రు శ్రీ త్యాగరాజ స్వామి -8(1759-1847)

              త్యాగరాజ శిష్య పరంపర -6

61-ఎం.వెంకటరామ జోషి (1858-1924)

బొ మ్మలాట ప్రదర్శన,చంద్రమతి వేషం లో ప్రసిద్ధు డు .నాట్యం ఫిడేల్ స్వరబత్,కంజీరా ,మృదంగం సితార్ ,వీణలలో దిట్ట .మంచి హరికథకుడు

.పీతాంబర్, గారడీ  ఆయుర్వేదం రసవాదం లలో ప్రవీణుడైన ఏక సంధగ్రా హి .శిష్యుడు నల్లూ రి నారాయణ .

62-మువ్వలూరి సభాపతి

త్యాగయ్యగారి సమకాలికుడు .మానంబు చావడి శిష్యుడు భరత శాస్త ్ర ప్రవీణుడు .ఇతనిభక్తి శృంగార పదాలను నేటి నట్టు వరులు

పాడుతున్నారు .వీటిని మన్నారు గుడి రాజగోపాల స్వామికి అ౦కిత మివ్వటం చేత ‘’రాజగోపాల ముద్ర ‘’ఉంటుంది .కొన్ని చరిత్ర

నిరుపానాలు రాశాడు .సీతాకల్యాణం లో వానప్రస్థఘట్ట ం జాలి గొలుపుతుంది .

     హరికథా ప్రవీణులు


63-సూత్రం నారాయణ శాస్త్రి (1849-1909)

గాన, తర్క శాస్త ్ర ,హరికథ కోవిదుడు .సంస్కృతంలో ‘’ఘటికాచల మాహాత్మ్యం ‘’రాశాడు .హా థీ రాం బాబా ,మార్కండేయ, చంద్ర హాస

హరికధలు రాసిన అష్టా వధాని .

64-రాధా కృష్ణ శాస్త్రి (1858-1907

సంస్కృతపండితుడు ,కవి హరికధలు చాలారాసి వాటిలో గీర్వాణ ద్రా విడ ,మణిపవ


్ర ాళ భాషాకీర్తనలు జోడించాడు .దివాన్ శేష శాస్త్రి చే

సన్మానితుడు.

65-గోవింద స్వామి భాగవతార్ (1861-1921)

తంజాపురి కృష్ణ భాగవతార్ శిష్యుడై 18 ఏళ్ళు కథలు నేర్చాడు .తెలుగు, అరవ,కన్నడ, మరాటీ భాషలలోని గీతాలు చేర్చి మిశ్రకథాగానం

చేసేవాడు .పురాణహరికథలలో మేటి .వేంకటేశ మీనాక్షి కళ్యాణాలు, లవకుశ, గౌరీ చరిత్ర హరికథలు రాశాడు .గాయక ,ఫిడలర్  .

ఉదయార్పురం ఆస్థా నగాయకుడు .త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రా రంభించినవారిలో ప్రథముడు .శిష్యులు –మనుమడు ఆత్మనాద

భాగవతార్, నారాయణ భాగవతార్ ,రామసామి కన్నయ్య నాయుడు .

  వీరి తర్వాత త్యాగరాజస్వామి సమకాలిక దాక్షిణాత్య  సంగీత తపస్సంపన్నుల గురించి తెలుసుకొందాం .

.ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ

శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’.

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -9

త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు  


1-శ్యామ శాస్త్రి (1763-1827)

‘’నాదో పాసన చే శంకర ,నారాయణ విధులు  వెలసిరి ‘’అని త్యాగరాజ స్వామి చెప్పినట్లు ముగ్గు రు వాగ్గేయకారులు త్రిమూర్తు లుగా గానమే

ముక్తిమార్గ ంగా తెలియ జేసినవారు శ్రీ త్యాగరాజు, శ్రీ శ్యామ శాస్త్రి, శ్రీ ముత్తు స్వామి దీక్షితులుగార్లు   ఒకే చోట తిరువయ్యార్ లో జన్మించటం

విశేషం  .ఈ కాలం లోనే జర్మనీలో సంగీతజ్ఞు లు బీథో వెన్,మొజార్ట్ లు కూడా జన్మించారు .అందుకే 1750-1850 కాలం ప్రపంచానికి

‘’సంగీతానికి స్వర్ణ యుగం ‘’

    శ్రీనగరం అనబడే తిరువయ్యార్ లో గౌతమస గోత్రం లో బో ధాయనసూత్రా నికిచెందిన వడమ  బ్రా హ్మణ కుటుంబం లో 1763 లో శ్యామ

శాస్త్రి జన్మించాడు .తండ్రి విశ్వనాథయ్యర్ .వీరిది పూర్వ ఆంద్ర దేశం లోని కంభం జిల్లా .అసలు పేరు సుబ్రహ్మణ్యం .’’శ్యామకృష్ణ ‘’ముద్దు పేరు

.బ్రహ్మ ఒకప్పుడు కంచిలో తపస్సు చేస్తు ంటే  శ్రీ దేవి  దివ్య జ్యోతి చే కళ్ళకు అవరోధమయింది .దీన్ని ధృవ పరచటానికి బంగారుకామాక్షి

విగ్రహం చేయించి దేవాలయం లో ప్రతిస్టించాడు .ఆది శంకరాచార్యులు ఇక్కడికి వచ్చినప్పుడు ఆలయంలో పూజా పునస్కారాలు లేకపాడు

పడి ఉండటం  చూసి,సంప్రో క్షణ చేయించి  ,నిత్యపూజాదికాలు చేయటానికి స్మార్త బ్రా హ్మణులను నియమిప జేశారు .అలా శ్యామశాస్త్రి

వంశీకులు పూజారులయ్యారు .1565 లో తురకలదాడికి తాళలేక ‘’జింజి ‘’కి పో యి ,1594 లో  అనేక బాధలు పడుతూ ఉదయార్పాలెం
,నాగూరు మొదలైన గ్రా మాలు దాటి తిరువాడి చేరారు ..శ్యామశాస్త్రి తండ్రి తులజాజి రాజు  రక్షణకోరగా తంజావూర్ లో ఆశ్రయమిచ్చాడు

.అప్పటినుంచి అక్కడే శ్యామశాస్త్రి మరణం వరకు   స్థిరపడ్డా రు .శాస్త్రి మరణం తర్వాత వంశీకులు అక్కడే ఉంటూ స్వర్ణ కామాక్షి విగ్రహాన్ని

కాపాడుతూ ఉన్నారు .

  చిన్నతనం లోనే శ్యామశాస్త్రి సంస్కృత తెలుగు ద్రా విడ భాషలు నేర్చాడు .శ్రీవిద్య ను సంగీతస్వామి అనే యతీశ్వరుని చే ఉపదేశం పొ ంది

,పచ్చిమిరియం ఆదెప్ప ,వీరభద్రయ్యలవద్ద ప్రౌ ఢ గాన రీతులు నేర్చి ,శ్రీ కామాక్షీ ప్రసాదంగా అనేక కీర్తనలు ,స్వరజతులు ‘’శ్యామ కృష్ణ

‘’ముద్రతో రచించి కీర్తి పొ ందాడు ఆదెప్పయ్య ‘’కామాక్షీ ‘’అని గౌరవంగా శ్యామ శాస్త్రి ని పిలిచేవాడు .తండ్రి అర్చకత్వం లభించి దేవమాన్యాలతో

కుటుంబ పో షణ జరిగేది .

  శ్యామశాస్త్రి కృతుల విశిష్ట త –కాలం రీతులు ,కదళీపాకం లాంటి రాగ శయ్య ,క్లిష్ట తాళగతులతో ‘’అతీత అనాగత గ్రహాలతో ‘’కలిసి

పాడటానికి కొంచెం కష్ట మని పించేవి .స్వర సాహిత్య ప్రకర్ష ఉండటం చేతే అందులో నిష్ణా తులు మాత్రమెజనరంజకంగా  పాడగలిగేట్లు ఉండేవి

.అందుకే ‘’తాళప్రస్తా ర శ్యామయ్య ‘’అన్నారాయనను .దేవీ భక్తి పొ ంగిపో రలుతాయి కీర్తనలలో .రాసిన 300 కీర్తనలు ఇప్పుడు ప్రచారం లో

లేవు .మీనాక్షీ నవరత్నాలు ,ధర్మ సంవర్ధిని ,కామాక్షి, బృహన్నాయకి పై రాసిన కీర్తనలు బాగా ప్రచారమయ్యాయి.ఇవి ఆంద్ర గీర్వాణ

తమిళభాషలలో  మనోహరంగా మధురంగా ఉంటాయి .అఖండ మనశ్శాంతి ఆత్మ సంతృప్తినిస్తా యి .

   త్యాగారాజకీర్తనలలో మానసిక వ్యధ సంసారబాధలు ఉంటె, శ్యామశాస్త్రి రచనలలో బిడ్డ ఆర్తి తల్లికి చెబుతున్నట్లు ఉంటాయి .ఈయన

ఆనంద భైరవి కీర్తనలు  ప్రత్యేకం .మాంజి ,కలగడ ,చింతామణి అనే అపూర్వరాగాలలో కూడా రాశాడు .’’చాపు తాళం ‘’పై అభిమానం జాస్తి

.తాళవర్ణా లు ,స్వరజతులు విద్యార్ధు లకు బాగా ఉపయోగకరంగా రాశాడు .త్యాగరాజ ,దీక్షితార్ లతో తరచూ కలసి మాట్లా డేవాడు

.దీక్షితులకు ‘’పాదుకాంత దీక్ష ‘’ఇచ్చాడు .ఊరు దాటి యాత్ర అనేది చేయనే లేదు .కొడుకు సుబ్రా య శాస్త్రి  త్యాగయ్యగారి శిష్యుడు

.నిగ్రహానుగ్రహ శక్తు లున్నమహా దేవీ భక్తు డు .ఒకకోమటి ‘’అర్చకుడు ‘’అని హేళన చేస్తే శాపగ్రస్తు డై చచ్చాడు .తనమరణం ఇంకా అయిదు

రోజులున్నదని ముందే చెప్పి1827 వ్యయసంవత్సర మకర మాస శుక్ల దశమి నాడు గానజ్యోతి వెలిగించి దేహం చాలించిన  దేవీ భక్తు డు

శ్యామశాస్త్రి64 వ ఏట  శ్రీ దేవిలో ఐక్యమయ్యాడు .

  శ్యామ శాస్త్రి చింతామణి రాగం లో ‘’దేవీ బ్రో వ సమయమిదే ‘’కృతి రచించి దేవి ఆశీస్సు పొ ంది బొ బ్బిలి కేశవయ్య అనే విద్వాంసుని

,నాగపట్నం లో అప్పుకుట్టి ని ఓడించాడు .

  1926 లో మైసూర్ రాజా ఆహ్వానించి సత్కరిస్తా నంటే వద్ద న్నాడు .జ్యోతిశ్శాస్త ్ర ప్రవీణుడు కూడా .

 వారసులు –పంజు శాస్త్రి ,సుబ్రా య శాస్త్రి కొడుకులు .పంజు దేవాలయం అర్చకుడు .ఇతడి మొదటిభార్యకొడుకులు రామకృష్ణ ,సా౦బశివం

,అన్నాస్వామి .రామకృష్ణ పెద్ద కొడుకు నటేశం పూజారి .ఇతనివద్ద శ్యామశాస్త్రి రాసిన లక్ష్యలక్షణ ప్రతులున్నాయి .వీటిలో తాళప్రస్తా రాలు

చిత్రా లు ఉన్నాయి .సా౦బశివం బ్రహ్మజ్ఞా ని, వేదాంతి .అన్నాస్వామిని సుబ్రా య శాస్త్రి దత్త త చేసుకొన్నాడు .

   అన్నాస్వామి (1827-1900)-అసలుపేరు శ్యామకృష్ణ .తండ్రి వద్ద కావ్య నాటకాలంకారగాన శాస్త్రా లు  నేర్చాడు .రచయిత, ఫిడలర్

.’’పాలించుకామాక్షీ ‘’’’పాహి శ్రీ గిరిరాజసుతే ‘’అనే ఆనందభైరవి కీర్తనలకు స్వరసాహిత్యం రాశాడు .72 మేళ కర్త ల రాగ లక్షణాలు రాశాడు

వీణకుప్పయ్యతో కలిసి అపూర్వ పల్ల వులకు స్వరకల్పన చేసి ,పాడాడు .

శిష్యులు –మేలకార్ గోవిందన్ ,కామాక్షి .కొడుకు శ్యామశాస్త్రి .చిత్రలేఖకుడు ఫిడలర్ .73 ఏళ్ళు జీవించి 1900 లో చనిపో యాడు .

   శ్యామశాస్త్రి శిష్యులు –
అలసూరి కృష్ణ య్య  మైసూర్ ఆస్థా న విద్వాన్ ,పల్ల వి ప్రవీణుడు .

దాసరి –నాగస్వర కోవిద ,.ఒకసారి తిరువయ్యార్ స్వామి ఊరేగింపులో  శుద్ధ సావేరి రాగాలాపన పల్ల వి పాడి ‘’దారి తెలుసుకొంటి ‘’కృతితో

ముగించగా త్యాగరాజస్వామి అతని ప్రతిభను మెచ్చి ఆప్యాయంగా ఆలింగనం చేసుకొన్నారు.

పుదుకోట శేషాచలం -  1741 జననం .పుదుకోట సంస్థా న విద్వాన్ .కొడుకు మాతృ భూషయ్య .సో దరుడు రాం దాస్ రామముద్రతో కృతులు

రాశాడు .శిష్యులు -స్వరకాడు సుబ్బయ్య .మనవడు గోపాలస్వామి కృతికర్త .

.ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ

శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’.

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -10

  త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు  -3


2- విద్యా వాచస్పతి ముత్తు స్వామి దీక్షితులు (దీక్షితార్ )(1775-1835)

‘’నాద సముద్ధ రణార్ధ ం  సంభవామి యుగే యుగే ‘’అన్నట్లు భగవంతుడు జ్ఞా న త్రిమూర్తు ల రూపం లో అవతరించాడు అని చెప్పటానికి

త్యాగయ్య ,శ్యామా శాస్త్రి ,దీక్షితార్ గార్లు భూమిపై అవతరించారు .శ్యామ శాస్త్రి లయబ్రహ్మ ,సర్వాంతర్యామి ,అద్వితీయుడు వేలాది  రాగాల

సృష్టికర్త రాగ స్థితికర్త అయిన త్యాగరాజుగారు విష్ణు మూర్తి . ,లయకర్తా ప్రళయ భయంకరుడు ,నియమాలను పాటించే ఈశ్వర రూపుడు

దీక్షితులు .కర్నాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తు లు వీరు .త్యాగయ్య దీక్షితులు విష్ణు మహేశ్వరులులాగా సదా పూజ్యులు

.నాదమూర్తి రెండు నేత్రా లవంటివారు  .ప్రా చీన సంప్రదాయ బద్ధు లై నాద విద్యను  మోక్షసాధనంగా చేసుకొన్న మహా నాదో పాసకులు .

   ముత్తు స్వామి దీక్షితులు 1775 లో రామస్వామి ,సుబ్బమా౦బలకు జన్మించాడు .సో దరులు బాలాస్వామి ,బాలస్వామికూడా గానకళా

ప్రవీణులే అని ముందే చెప్పుకొన్నాం .ముత్తు (ద్దు )స్వామి బాలంబికా వరప్రసాద లబ్ధు డు .తండ్రివద్దె సంగీత సాహిత్యాలు నేర్చాడు

.జ్యోతిశ్శాస్త ్ర ప్రవీణుడుకూడా .ఏక సంధ గ్రా హి .తండ్రి సృష్టించిన హంసధ్వని రాగంలో ‘’వాతాపిగణపతిం భజే ‘’కీర్తన రాసి తండ్రికి అంకితం చేసి

రచనప్రా రంభించాడు . ఈకీర్తన వినని వారు లేరు .

   మణలి జమీందారు ఆశ్రయం లో ఉన్నప్పుడు శ్రీ విద్యోపాసకుడు చిడంబరనాథ యోగి వచ్చిశ్రీవిద్యా మంత్రో పదేశం చేసి ,తనతో కాశీకి

తీసుకువెళ్ళి గానవిద్యలో ప్రవీణుడిని చేశాడు  .అక్కడే అంతర్యాగ,  బహిర్యాగాలు  చేసి ‘’శ్రీ గురుగుహమూర్తి ‘’ఐన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ని

తిరుత్త నిలో దర్శించి ,ఒక రోజుండగా రాత్రి స్వామి ప్రత్యక్షమై నోట్లో పటికబెల్లం పెట్టి ఆశీర్వదింఛి అదృశ్యమవగా,పులకిత శరీరం తో ధ్యానిస్తే

జ్ఞా నోదయమై,వెంటనే ‘’శ్రీ గుహో జయతి ‘’అంటూ 20 కీర్తనలు రాశాడు .ఇవి జగత్ప్రసిద్దా లైనాయి .మాలలుగా కీర్తనలు రాయటం లో

ప్రసిద్ధు డైనాడు ‘’గురుగుహ ‘’ముద్ర కీర్తనలలో ఉంటుంది .తర్వాత కంచి చేరాడు  .అక్కడే శ్రీ విద్యోపాసనలో మంత్రం ద్రస్టలైన త్యాగయ్య

,శ్యామ శాస్త్రి గార్లు ఉపనిషద్ బ్రహ్మాన్ని సేవిస్తు న్నారు .త్యాగయ్యగారి రామ అష్ట పదులకు రాగ తాల వర్ణ న మెట్టు లు కూర్చాడు .
          కొన్నేళ్ళ తర్వాత తిరువయ్యార్ వచ్చి ,శ్రీ త్యాగేశుని సేవిస్తూ ,నదీ తీరంలో నిత్య సచ్చాస్త ్ర పఠనం తో ‘’ప్రా ణారామం మన ఆనందం

,శాంతి సంరుద్ధ మమృతం’’అన్నట్లు శాంత చిత్త ంతోకాలం గడిపాడు .ఇక్కడే త్యాగేశ ,ఆనందేశ ,అచలేశ ,హాటకేశ ,వల్మీకేశ లపై కీర్తనలు

రాశాడు .అన్ని శివ ,విష్ణు క్షేత్ర సందర్శనం చేసి ,శ్రీ వేంకటేశ,కాశీ  విశ్వేశ,పంచలింగ క్షేత్రా లపై ‘’ప్రబంధాలు ‘’అనబడే పెద్ద కీర్తనలు రచించాడు

.నవగ్రహాలపై నవరత్న కీర్తనలు రాశాడు .క్షేత్రయ్య విజయ రాఘవ పంచకం, త్యాగయ్య ఘనరాగ పంచకం ,స్వాతి తిరునాళ్ళ మణి ప్రవాళ

కీర్తనలను పో లిన నవగ్రహ ,నవావరణ కీర్తనలు రాశాడు .నవగ్రహ కీర్తనలలో దీక్షితుల జ్యోతిశ్శాస్త ్ర పాండిత్యం వ్యక్త మౌతుంది

.నీలోత్పలా౦బిక ,మీనాక్షి దేవి లపై కృతులల్లా డు .ఇవి గీర్వాణ భాషలో ఉదాత్త స్తో త్ర వాజ్మయంగా  ప్రసిద్ధి చెందాయి .ఈయన మంత్రశాస్త ్ర

,యోగ శాస్త ్ర వైదుష్యానికివి అద్ద ం పడుతాయి .

    దీక్షితుల సో దరులు చిన్నస్వామి బాలస్వాములు రాజాస్థా నాలలో అన్నగారి కీర్తనలు గానం చేసి బహుళప్రచారం చేశారు .మధురకు

ఆహ్వాని౦ప బడి అక్కడే ఉండగా తమ్ముడు చిన్నస్వామి చనిపో గా  సో దరుని మరణం భరించలేక బాలస్వామి శిష్యుడు హరితోకలిసి

రామేశ్వరం తీర్ధ యాత్ర చేసి ,ఎట్టియార్పురం రాగా రాజు దీక్షితార్ కృతులు అతని నుంచి విని అతన్ని ఆస్థా న విద్వాంసుని చేసి అక్కడే

ఉ౦చేశాడు  .ఈ విషయాలన్నీ తెలిసిన దీక్షితులు ‘’సుఖ దుఖే సమౌ కృత్వా ‘’అన్నట్లు మనసుదిట్టపరచుకొన్నా,బాలాస్వామిని చూడాలనే

కోరిక మాత్రం పో లేదు .

   ఇద్ద రు భార్యలతో ,శిష్యుడు తేపూరు సుబ్రహ్మణ్యం తో కలిసి ఆవూరి దేవాలయ అర్చన చేశాడు .అప్పుడు బాలాస్వామి వివాహ విషయం

తెలిసి ,ఎట్టియా పురం వెడుతూ దారిలో నీరు లేక పొ లాలు ఎండిపో వటం చూసి ‘’ అమృతవర్షిణి ‘’రాగం లో ‘’ఆన౦దామృత  కర్షిణి

వర్షిణి’’కీర్తనరాసి పాడగా ,ముసురుపట్టి ధారాపాతంగా వర్షా లు కురిసి రైతులు ఎంతో సంతోషించారు .ఎట్టియాపురం దర్బారులో కీర్తనలు

పాడగా రాజు ఆనందించి ఆస్థా నం లో ఉండిపొ మ్మని కోరగా నిర్లిప్తంగా ,తిరువయ్యార్ చేరి మళ్ళీ తన సంగీత పాఠాలు చెప్పటం

మొదలుపెట్టా డు .

  ఒక సారి కివలూరు లో దైవ దర్శనానికి వెళ్ళగా పూజారులు ఆలయం తలుపులు మూసేశారు .అక్కడే నిలబడి శంకరాభరణ రాగం లో

‘’అక్షయ లింగ విభో ‘’కీర్తన ఆశువుగా పాడగా ఆలయ తలుపులు తెరుచుకొన్నాయి .త్యాగయ్య శామశాస్త్రు లపై అమితభక్తి .వారి కీర్తనలు

తరచుగా  వింటూ ఆన౦ది౦చేవాడు దీక్షితార్ .త్యాగయ్యగారింట జరిగిన శ్రీ రామ పట్టా భిషేకం సందర్భంగా మణిరంగు రాగం లో ‘’ మామవ

పట్టా భిరామ ‘’కీర్తన రాశాడు .పుత్రు లు లేకపో వటం తో సుబ్బరామ దీక్షితులను దత్త త చేసుకొన్నాడు .

   1885 లో ఎట్టియాపురం రాజు యువరాజు వివాహానికి రమ్మని ఆహ్వానించగా ,తనకు మరణం ఆసన్నమైందని గ్రహించి ,శిష్యులతో

వెళ్ళాడు .ఆరోజు దీపావళి ఊరంతా మహా

 సందడిగా ఉంది .పట్ట పు తెనుగు మదమెక్కి  ,తొండం ఆకాశం వైపు పైకెత్తి భీభత్సం చేస్తు ంటే,ఏదో కీడు రానున్నదని గ్రహించి

,దీక్షుతులవారికి విన్నవిస్తే ,కన్నులు తెరచి ‘’మీనాక్షి కుముదం ‘’అనే తన కిష్టమైనకీర్తన అన్నారు .శిష్యులు అందుకొని’’మీనలోచనీ పాప

మోచనీ ‘’ పల్ల విని పాడుతుండగా ముత్తు స్వామి దీక్షితులవారి కపాల విచ్చేదనం జరిగి 60 వ ఏట ప్రా ణాలు కోల్పోయారు .రాజు ,ప్రజల

దుఖం వర్ణ నాతీతం .

   దీక్షితార్ శిష్యవర్గ ం

శిష్యులలో నాట్యం చేసేవారు మార్ద ంగికులు ,నాదస్వరం వారు గాయకులు,వాజ్మయ నిర్మాతలున్నారు .శుద్ధ మద్దెల త౦బి యప్ప

,తిరుక్కడయార్ భారతి , అవడయార్వీణ వెంకట్రా మయ్య ,తేవూరు సుబ్రహ్మణ్యం ,కోర్నాడ రామస్వామి ,అయ్యస్వామి బిల్వ వనం ,వడివేలు

చిన్నయ్య ,పొ న్నయ్య ,శివానందం ,నర్త కి అమ్మాణి,కమలం .


త౦బియప్ప –శ్రు తిపర్వమైన మద్దెల వాయించి ‘’శుద్ధ మద్దెల ‘’బిరుదు పొ ందాడు .మహా వైద్యనాధయ్యర్ ‘’చింతయామి కందమూలకందం’’

కీర్తన పాడుతుంటే సరిగ్గా లేదని ఆక్షేపించిన రసజ్ఞు డు.

భారతి, వెంకట్రా మయ్య, సుబ్రహ్మణ్యం –గురువుతో తీర్ధ యాత్ర చేశారు

రామస్వామి –భరతనాట్యం లో దిట్ట .సంగీత మార్గ దర్శి .

బిల్వవనం –నాదస్వర వాద్య నిపుణుడు

అయ్యస్వామి –తాన ,పద వర్ణ రచయిత.

పొ న్నస్వామి –భరతనాట్య ,ఫిడేలు ప్రవీణుడు .గురుభక్తి తెలియజేస్తూ ‘’భిన్న షడ్జ ‘’రాగం లో గురుగుహమూర్తికి శిష్యుడనని చెప్పాడు

.స్వరజతులు ,పద వర్ణ లరచనలో సిద్ధహస్తు డు

కమల –గాన ,నాట్య కోవిదురాలు .గురువు ఆర్దికకస్టా లలో ఉన్నప్పుడు తన ఆభరణాలు అమ్మి సహాయం చేసి ఆదుకొన్న ఉత్త మ

శిష్యురాలు ,త్యాగి .

  ముత్తు స్వామి దీక్షితులు అమరజీవి , సన్మార్గు డు విరాగి ,ముముక్షువు  అద్వైతి ,సో హత్వం పొ ందిన మహాజ్ఞా ని మధురవాక్కులు

,గేయకల్పనలు ,రాగ విన్యాసం ,ఆత్మతత్వం దీక్షితార్ కీర్తనల ప్రత్యేకత .నాదో పాసనతో త్యాగబ్రహ్మ భక్తిని అనన్య సామాన్య ప్రతిభతో

తీర్చిదిద్దితే ,దీక్షితులు రాగ గమకాది లక్ష్యలక్షణ సమన్వయం చేశాడు .తాళగతులతోరాగవిన్యాస క్రమాన్ని పో షించి ,లక్షణ యుక్త గానాన్ని

శ్యామ శాస్త్రి  నిర్మించాడు .ఈ త్రయం సందేశం ఒక్కటే ‘గానం ఆముష్మిక సాధనం అనిచెప్పి , యుగ కర్త లని పించారు .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ

శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’.

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -11

త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -3

2- విద్యా వాచస్పతి ముత్తు స్వామి దీక్షితులు (దీక్షితార్ )(1775-1835)

‘’నాద సముద్ధ రణార్ధం సంభవామి యుగే యుగే ‘’అన్నట్లు భగవంతుడు జ్ఞా న త్రిమూర్తు ల రూపం లో

అవతరించాడు అని చెప్పటానికి త్యాగయ్య ,శ్యామా శాస్త్రి ,దీక్షితార్ గార్లు భూమిపై అవతరించారు .శ్యామ శాస్త్రి

లయబ్రహ్మ ,సర్వాంతర్యామి ,అద్వితీయుడు వేలాది రాగాల సృష్టికర్త రాగ స్థితికర్త అయిన త్యాగరాజుగారు

విష్ణు మూర్తి . ,లయకర్తా ప్రళయ భయంకరుడు ,నియమాలను పాటించే ఈశ్వర రూపుడు దీక్షితులు .కర్నాటక

సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తు లు వీరు .త్యాగయ్య దీక్షితులు విష్ణు మహేశ్వరులులాగా సదా పూజ్యులు
.నాదమూర్తి రెండు నేత్రా లవంటివారు .ప్రా చీన సంప్రదాయ బద్ధు లై నాద విద్యను మోక్షసాధనంగా చేసుకొన్న

మహా నాదో పాసకులు .

ముత్తు స్వామి దీక్షితులు 1775 లో రామస్వామి ,సుబ్బమా౦బలకు జన్మించాడు .సో దరులు బాలాస్వామి

,బాలస్వామికూడా గానకళా ప్రవీణులే అని ముందే చెప్పుకొన్నాం .ముత్తు (ద్దు )స్వామి బాలంబికా వరప్రసాద

లబ్ధు డు .తండ్రివద్దె సంగీత సాహిత్యాలు నేర్చాడు .జ్యోతిశ్శాస్త ్ర ప్రవీణుడుకూడా .ఏక సంధ గ్రా హి .తండ్రి సృష్టించిన

హంసధ్వని రాగంలో ‘’వాతాపిగణపతిం భజే ‘’కీర్తన రాసి తండ్రికి అంకితం చేసి రచనప్రా రంభించాడు . ఈకీర్తన వినని

వారు లేరు .

మణలి జమీందారు ఆశ్రయం లో ఉన్నప్పుడు శ్రీ విద్యోపాసకుడు చిడంబరనాథ యోగి వచ్చిశ్రీవిద్యా మంత్రో పదేశం

చేసి ,తనతో కాశీకి తీసుకువెళ్ళి గానవిద్యలో ప్రవీణుడిని చేశాడు .అక్కడే అంతర్యాగ, బహిర్యాగాలు చేసి ‘’శ్రీ

గురుగుహమూర్తి ‘’ఐన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ని తిరుత్త నిలో దర్శించి ,ఒక రోజుండగా రాత్రి స్వామి ప్రత్యక్షమై నోట్లో

పటికబెల్లం పెట్టి ఆశీర్వదింఛి అదృశ్యమవగా,పులకిత శరీరం తో ధ్యానిస్తే జ్ఞా నోదయమై,వెంటనే ‘’శ్రీ గుహో జయతి

‘’అంటూ 20 కీర్తనలు రాశాడు .ఇవి జగత్ప్రసిద్దా లైనాయి .మాలలుగా కీర్తనలు రాయటం లో ప్రసిద్ధు డైనాడు

‘’గురుగుహ ‘’ముద్ర కీర్తనలలో ఉంటుంది .తర్వాత కంచి చేరాడు .అక్కడే శ్రీ విద్యోపాసనలో మంత్రం ద్రస్టలైన

త్యాగయ్య ,శ్యామ శాస్త్రి గార్లు ఉపనిషద్ బ్రహ్మాన్ని సేవిస్తు న్నారు .త్యాగయ్యగారి రామ అష్ట పదులకు రాగ తాల

వర్ణన మెట్టు లు కూర్చాడు .

కొన్నేళ్ళ తర్వాత తిరువయ్యార్ వచ్చి ,శ్రీ త్యాగేశుని సేవిస్తూ ,నదీ తీరంలో నిత్య సచ్చాస్త ్ర పఠనం తో

‘’ప్రా ణారామం మన ఆనందం ,శాంతి సంరుద్ధ మమృతం’’అన్నట్లు శాంత చిత్త ంతోకాలం గడిపాడు .ఇక్కడే త్యాగేశ

,ఆనందేశ ,అచలేశ ,హాటకేశ ,వల్మీకేశ లపై కీర్తనలు రాశాడు .అన్ని శివ ,విష్ణు క్షేత్ర సందర్శనం చేసి ,శ్రీ

వేంకటేశ,కాశీ విశ్వేశ,పంచలింగ క్షేత్రా లపై ‘’ప్రబంధాలు ‘’అనబడే పెద్ద కీర్తనలు రచించాడు .నవగ్రహాలపై నవరత్న

కీర్తనలు రాశాడు .క్షేత్రయ్య విజయ రాఘవ పంచకం, త్యాగయ్య ఘనరాగ పంచకం ,స్వాతి తిరునాళ్ళ మణి ప్రవాళ

కీర్తనలను పో లిన నవగ్రహ ,నవావరణ కీర్తనలు రాశాడు .నవగ్రహ కీర్తనలలో దీక్షితుల జ్యోతిశ్శాస్త ్ర పాండిత్యం

వ్యక్త మౌతుంది .నీలోత్పలా౦బిక ,మీనాక్షి దేవి లపై కృతులల్లా డు .ఇవి గీర్వాణ భాషలో ఉదాత్త స్తో త్ర వాజ్మయంగా

ప్రసిద్ధి చెందాయి .ఈయన మంత్రశాస్త ్ర ,యోగ శాస్త ్ర వైదుష్యానికివి అద్ద ం పడుతాయి .

దీక్షితుల సో దరులు చిన్నస్వామి బాలస్వాములు రాజాస్థా నాలలో అన్నగారి కీర్తనలు గానం చేసి బహుళప్రచారం

చేశారు .మధురకు ఆహ్వాని౦ప బడి అక్కడే ఉండగా తమ్ముడు చిన్నస్వామి చనిపో గా సో దరుని మరణం
భరించలేక బాలస్వామి శిష్యుడు హరితోకలిసి రామేశ్వరం తీర్ధయాత్ర చేసి ,ఎట్టియార్పురం రాగా రాజు దీక్షితార్

కృతులు అతని నుంచి విని అతన్ని ఆస్థా న విద్వాంసుని చేసి అక్కడే ఉ౦చేశాడు .ఈ విషయాలన్నీ తెలిసిన

దీక్షితులు ‘’సుఖ దుఖే సమౌ కృత్వా ‘’అన్నట్లు మనసుదిట్టపరచుకొన్నా,బాలాస్వామిని చూడాలనే కోరిక మాత్రం

పో లేదు .

ఇద్ద రు భార్యలతో ,శిష్యుడు తేపూరు సుబ్రహ్మణ్యం తో కలిసి ఆవూరి దేవాలయ అర్చన చేశాడు .అప్పుడు

బాలాస్వామి వివాహ విషయం తెలిసి ,ఎట్టియా పురం వెడుతూ దారిలో నీరు లేక పొ లాలు ఎండిపో వటం చూసి ‘’

అమృతవర్షిణి ‘’రాగం లో ‘’ఆన౦దామృత కర్షిణి వర్షిణి’’కీర్తనరాసి పాడగా ,ముసురుపట్టి ధారాపాతంగా వర్షా లు

కురిసి రైతులు ఎంతో సంతోషించారు .ఎట్టియాపురం దర్బారులో కీర్తనలు పాడగా రాజు ఆనందించి ఆస్థా నం లో

ఉండిపొ మ్మని కోరగా నిర్లిప్తంగా ,తిరువయ్యార్ చేరి మళ్ళీ తన సంగీత పాఠాలు చెప్పటం మొదలుపెట్టా డు .

ఒక సారి కివలూరు లో దైవ దర్శనానికి వెళ్ళగా పూజారులు ఆలయం తలుపులు మూసేశారు .అక్కడే నిలబడి

శంకరాభరణ రాగం లో ‘’అక్షయ లింగ విభో ‘’కీర్తన ఆశువుగా పాడగా ఆలయ తలుపులు తెరుచుకొన్నాయి

.త్యాగయ్య శామశాస్త్రు లపై అమితభక్తి .వారి కీర్తనలు తరచుగా వింటూ ఆన౦ది౦చేవాడు దీక్షితార్

.త్యాగయ్యగారింట జరిగిన శ్రీ రామ పట్టా భిషేకం సందర్భంగా మణిరంగు రాగం లో ‘’ మామవ పట్టా భిరామ ‘’కీర్తన

రాశాడు .పుత్రు లు లేకపో వటం తో సుబ్బరామ దీక్షితులను దత్త త చేసుకొన్నాడు .

1885 లో ఎట్టియాపురం రాజు యువరాజు వివాహానికి రమ్మని ఆహ్వానించగా ,తనకు మరణం ఆసన్నమైందని

గ్రహించి ,శిష్యులతో వెళ్ళాడు .ఆరోజు దీపావళి ఊరంతా మహా

సందడిగా ఉంది .పట్ట పు తెనుగు మదమెక్కి ,తొండం ఆకాశం వైపు పైకత్తి


ె భీభత్సం చేస్తు ంటే,ఏదో కీడు

రానున్నదని గ్రహించి ,దీక్షుతులవారికి విన్నవిస్తే ,కన్నులు తెరచి ‘’మీనాక్షి కుముదం ‘’అనే తన కిష్టమన
ై కీర్తన

అన్నారు .శిష్యులు అందుకొని’’మీనలోచనీ పాప మోచనీ ‘’ పల్ల విని పాడుతుండగా ముత్తు స్వామి దీక్షితులవారి

కపాల విచ్చేదనం జరిగి 60 వ ఏట ప్రా ణాలు కోల్పోయారు .రాజు ,ప్రజల దుఖం వర్ణనాతీతం .

దీక్షితార్ శిష్యవర్గ ం
శిష్యులలో నాట్యం చేసేవారు మార్దంగికులు ,నాదస్వరం వారు గాయకులు,వాజ్మయ నిర్మాతలున్నారు .శుద్ధ మద్దెల

త౦బి యప్ప ,తిరుక్కడయార్ భారతి , అవడయార్వీణ వెంకట్రా మయ్య ,తేవూరు సుబ్రహ్మణ్యం ,కోర్నాడ

రామస్వామి ,అయ్యస్వామి బిల్వ వనం ,వడివేలు చిన్నయ్య ,పొ న్నయ్య ,శివానందం ,నర్త కి అమ్మాణి,కమలం .

త౦బియప్ప –శ్రు తిపర్వమైన మద్దెల వాయించి ‘’శుద్ధ మద్దెల ‘’బిరుదు పొ ందాడు .మహా వైద్యనాధయ్యర్

‘’చింతయామి కందమూలకందం’’ కీర్తన పాడుతుంటే సరిగ్గా లేదని ఆక్షేపించిన రసజ్ఞు డు.

భారతి, వెంకట్రా మయ్య, సుబ్రహ్మణ్యం –గురువుతో తీర్ధ యాత్ర చేశారు

రామస్వామి –భరతనాట్యం లో దిట్ట .సంగీత మార్గ దర్శి .

బిల్వవనం –నాదస్వర వాద్య నిపుణుడు

అయ్యస్వామి –తాన ,పద వర్ణ రచయిత.

పొ న్నస్వామి –భరతనాట్య ,ఫిడేలు ప్రవీణుడు .గురుభక్తి తెలియజేస్తూ ‘’భిన్న షడ్జ ‘’రాగం లో గురుగుహమూర్తికి

శిష్యుడనని చెప్పాడు .స్వరజతులు ,పద వర్ణలరచనలో సిద్ధహస్తు డు

కమల –గాన ,నాట్య కోవిదురాలు .గురువు ఆర్దికకస్టా లలో ఉన్నప్పుడు తన ఆభరణాలు అమ్మి సహాయం చేసి

ఆదుకొన్న ఉత్త మ శిష్యురాలు ,త్యాగి .

ముత్తు స్వామి దీక్షితులు అమరజీవి , సన్మార్గు డు విరాగి ,ముముక్షువు అద్వైతి ,సో హత్వం పొ ందిన మహాజ్ఞా ని

మధురవాక్కులు ,గేయకల్పనలు ,రాగ విన్యాసం ,ఆత్మతత్వం దీక్షితార్ కీర్తనల ప్రత్యేకత .నాదో పాసనతో త్యాగబ్రహ్మ

భక్తిని అనన్య సామాన్య ప్రతిభతో తీర్చిదిద్దితే ,దీక్షితులు రాగ గమకాది లక్ష్యలక్షణ సమన్వయం చేశాడు

.తాళగతులతోరాగవిన్యాస క్రమాన్ని పో షించి ,లక్షణ యుక్త గానాన్ని శ్యామ శాస్త్రి నిర్మించాడు .ఈ త్రయం సందేశం

ఒక్కటే ‘గానం ఆముష్మిక సాధనం అనిచెప్పి , యుగ కర్త లని పించారు .


ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ

మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’.

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -12

    త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు  -4


మలబారు రాజ గాయకులు

ప్రా చీన ద్రా విడ గానపద్ధ తిని తిరువాన్కూర్ లో ‘’సో పానం ‘’అంటారు .ఇది ఆర్య సంగీతం తోపాటు ప్రచారం లో ఉంది .పాటలు ,పదాలు కధకళి

నృత్యం,’’ పట్టు ’’అనే జాతీయ గీతాలలో ఉన్జా ల్ ,తుల్లా ల్ ,వంజి ,తిరువత్తు ర,భద్రకాళి   అనే  గీతాలలో బాగా వాడబడింది .చాలా ద్రవిడ

రాగాలు పది ,ఇందాశ,ఇందాళ౦,పురాణి,కన్న కురంజి పేర్లతో ఉన్నాయి .’’తేవార భక్తి గీతాల’’లో 20 రాగాలు వాడారు .అవే –నాటపదై-

నాటరాగం ,పజం పంజరం –శంకరాభరణం ,సాదారి-పంతువరాళి ,కౌశిక్-భైరవి పేర్లతో 11 వ శతాబ్ద ం లో వాడబడ్డా యి .మన వీణ కు

సమానమైన ‘’యాళి’’అనే తంత్రీ వాద్యం అక్కడ ఉంది .

   తమిళం లో సప్త స్వరాలకు పేర్లు –స-కురల్,రి-తుట్ట ం ,,గ –కై క లై ,మా-ఉజాయ్ ,ప-ఈశం ,ధ-విలారి ,ని-తారం .ఆర్యులగమక చిహ్నాలు

తమిళులకు ఉత్తేజమిచ్చాయి ,మలబారు లేక కేరళలో  ఆర్య, ద్రా విడ సంపర్కం ఉండివిచార గీతాలు, దీర్ఘపు చుట్లు కనిపిస్తా యి .18 శతాబ్ది

కార్తిక తిరునాళ్,స్వాతి  తిరునాళ్ రాజులు ఈ శైలిలోగీతాలు  రాశారు.క్రమంగా త్యాగరాజ ,దీక్షితార్ లప్రభావం వలన కొత్త గాన

రీతులేర్పడ్డా యి  

 1-స్వాతి తురునాళ్((1820-47)

తిరువాన్ కూరు మహారాజా స్వాతి తిరుణాల్ త్యాగరాజస్వామి సమ కాలికుడు .గానవిద్యా కౌశలం తో కళాపో షణ చేశాడు .కులశేఖరాల్వార్

అనుయాయి .రాజులలో గాన సామ్రా ట్ ,సమ్రా ట్టు లలో గాన చక్రవర్తి .ఈఘనత మొత్త ం ఆ రాజవంశానికి కూడా చెందుతుంది .స్వరాక్షరాలైన

సరిగమ లను సముచితంగా ఇమిడ్చి అర్ధ గౌరవం చెడకుండా రాయటం ఈయన ప్రత్యేకత .నేర్చుకోనేవారికి సులభశైలిలో కొన్ని రాశాడు

.కొన్ని గాయకుల గాత్ర పటిమకు పరీక్షలాగా చాలా కఠినం గా ఉంటాయి .భక్తిగీతాలు సో పానవిధానం లో మృదు మధుర శైలిలో రాశాడు .ఈ

రెండుతరగతుల పద్ధ తులలోని లోపాలను సవరించి ఆర్య ,ద్రా విడ గానాన్ని మిళితం చేశాడు .ప్రఖ్యాత ఆంగ్ల కవి చాసర్ సులభ శైలి, శ్రా వ్యత

స్వాతి తిరుణాల్ లో భణుతులలో కనిపిస్తు ంది .ఒకరకంగా పల్లెటూరి పదాలను గుర్తు చేస్తా యి .కీర్తనలలో ఉత్కృష్ట రసస్పూర్తి ఉంటుంది

.నిరుపమానమైన భాషా పా౦డిత్యమున్న గాయక రాజు .ఆస్థా నగాయకుడు పరమేశ్వర భాగవతార్ కఠినస్వర కల్పనా చేయగా

,వాటికనువైన గీతాలు రాసిన విద్వత్తు న్నవాడు .

 27 సంవత్సరాల అల్పాయుష్కు డైనా అనేక రకాల కీర్తనలు రాశాడు .ఈయనరాసిన ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఇప్పటికీ దసరా

పండుగలో  పాడుతూనే ఉన్నారు .రాజవంశం లో వైష్ణవమతస్తు డు స్వాతి తిరుణాల్ ఒక్కడే .నృత్యం ,కథాకళి లోకూడా గొప్ప

ప్రవేశమున్నవాడు.హిందూస్థా నీ గానాభి    వృద్ధికోసం ఉత్త ర ప్రదేశ్ నుంచి హలావతి, సులేమాన్ లను రప్పించాడు .ఆగర్భ

శ్రీమంతుడైన౦దువల్ల ‘’శాక్త న్ రాజా ‘’అంటారు   .తానురాసినవి త్యాగయ్యగారికి పంపి ,అభిప్రా యం కోరిన సహృదయుడు .శ్రీ అనంత

పద్మనాభ స్వామియే తన కులదైవం అని పూజించి శాసించి ప్రజలనమ్మకం కోసం ‘’పద్మనాభ దాస వంచిపాల ‘’బిరుదుపొ ందాడు .స్వామి

తరఫుననే తనరాజవంశం పాలించాలనేది అభిప్రా యం .

  సంగీత  ప్రత్యేకతలు  -శ్రా వ్యత ,మాధుర్యం భావగర్భిత ఈయన ప్రత్యేకతలు .కృతులు మనోహరత్వం తో మనసును దో చుకొంటాయి

.పద్మనాభ స్వామికి అంకితమిచ్చిన కృతులన్నీ ఉత్త మ భక్తిభావ౦ ఉత్కృష్ట శైలిలో ఉంటాయి .ఈయనరాసిన హిందూస్థా నీ కృతులు తాన్
సేన్ సదారంగ్ వంటి గాయక కృతులనే మరపిస్తా యిని బుధజనాభి ప్రా యం .’’స్వాతి తిరుణాల్ సంగీతోత్సవం ప్రతిఏడాది జనవరి 4 నుంచి

13 వరకు మహావైభవంగా తిరువాన్కూర్ లో నిర్వహిస్తా రు .ఆయన రాసినవి, హిందూస్థా నీ గీతాలే పడాలి .ఆయనపేర పురస్కారం

అందిస్తా రు .

ఈయన ఆస్థా న గాయకులంతా గొప్ప పేరున్నవారే .వారిని గురించి వివరగా తర్వాత తెలుసుకొందాం .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ

శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’.

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -13

త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు  -5


మలబారు రాజ గాయకులు-2

స్వాతి తిరుణాల్  ఆస్థా న విద్వాంసులు

1-పరమేశ్వర భాగవతార్ –తిరువాన్కూర్ గాయకులలో అగ్రగణ్యుడు .అక్కడి సంగీత ప్రా రంభ అంత్య దశను చూసినవాడు .క్లిష్టంగా ఉండే

ఇతని కీర్తనలు పాడటం కష్ట ం .

2-గోవింద మరార్ –మొవ్వత్తు పురం తాలూకా రామమంగళం నివాసి .షట్కాలపల్ల వి ప్రవీణుడు కనుక ‘’షట్కాల మరార్ ‘’అంటారు .1831 లో

తిరువాన్ కూర్ వచ్చి స్థిరంగా ఉన్నవారిలో మొదటివాడు .ఒక చేతిలో సప్త త౦త్రి తంబురా వేరొక చేతిలో మంజీరా తో దేశాటనం చేస్తూ

పండరీపురంలో మరణించాడు .ఆ  తంబుర ఆ దేవాలయం లో ఇప్పటికి ఉన్నట్లు చెబుతారు .1843 లో తిరువయ్యార్ లో త్యాగరాజ స్వామిని

దర్శించి ,గానం తో మెప్పించి ‘’గోవిందదాస్ ‘’బిరుదు పొ ందాడు .ధనాశ లేదు.

3-కృష్ణ మరార్ –అసమాన ప్రతిభతో వర్ణా లు కృతులు పల్ల వులు పాడగల మేధావి .సప్త స్వరాలు పలికే ‘’ఎడక్కు ‘’అనే చర్మ వాద్యం తయారు

చేసి ఎప్పుడూ పాడుకొంటూ ఉండేవాడు .తన సామర్ధ్యాన్ని ప్రకటిస్తూ తంబురకు ఒక ధ్వజాన్ని పైన కట్టేవాడు .రాజు స్వర్ణ కంకణం ఇచ్చి

గౌరవించాడు .

4-మేరు స్వామి (1833-70)-తంజావూర్ నుంచి వచ్చిన మహారాష్ట ్ర బ్రా హ్మణ గాయకుడు .కోకిల కంఠ స్వరం ఉండటం వలన ‘’రాజా

కోకిలకంఠ’’బిరుదు రాజు ప్రదానం చేశాడు .ఇతని చిత్రం స్వాతి తిరుణాల భోజన శాలలో ఉండటం విశేషం .నెలకు వందరూపాయల

పారితోషికం .మంచి కథకుడు కూడా .

5-లక్ష్మణ గోసాయి -1860 లో అయిల్ల ం తిరుణాల్ రాజు దర్బార్ గాయకుని చేశాడు .మేరుస్వామికి వ్యతిరేకి.’’మహామేరుస్వామి

‘’బిరుదుపొ ందాడు.నాల్గు స్థా యిల్లో అవలీలగా పాడగల సమర్ధు డు .


6-వడివేలు –గోవి౦ద మరార్ తో త్యాగరాజ స్వామి దర్శనం చేయించి ,ఆయనతో తిరువాన్ కూర దర్బార్ కు రాజాహ్వానం తెలియ జేయగా

త్యాగబ్రహ్మ తిరస్కరించి ‘’మేమిద్ద రం ఒక చోట కలుసు కొంటాం ‘’అని నర్మ గర్భంగా తెలియ జేశారు .తానవర్ణా లు అనన్య సామాన్యంగా

ఉంటాయి .తిరువాన్ కూర్ సంస్థా నం లో మొదటి సారిగా ఫిడేల్ ను ప్రవేశ పెట్టిన ఘనత వడి వేలుదే.మెల్లకన్ను, బక్క శరీరం, ఒంటికన్నుతో

వికృతంగా ఉండేవాడు .శ్రా వ్య కంఠ స్వరం తో అందర్నీ ఆకర్షించేవాడు .హరిపద క్షేత్రం లో పాడటానికి కీర్తనలు రాశాడు .ఇతని వర్ణా లు

ప్రసిద్ధా లు .రాజు  దంతపు ఫిడేలు అందజేసి సత్కరించాడు .

7-శివరాం ఉరుదాస్ ఉరఫ్ క్షీరాబ్ధి శాస్త్రి -  వేదాంత గీత రచయిత ,మంత్ర వేత్త .

8-ఇర్వన్ వర్మ తంపి(1783-1856)-స్వాతి తిరునాళ్ బంధువు .500 గీతాలురాసిన కవి .రాసి రాజు కు పంపి ఆమోదం పొ ందేవాడు .స్వాతి

తిరుణాల్ తో సమాన ప్రతిభ ఉన్నగాయకుడు.కూతురు కుట్టి కుంజ తంగాచి కవయిత్రి .ఈమె మనుమడు పద్మనాభ తంపి గొప్ప

చిత్రకారుడు .

9-నారుమంచి జానకి రామయ్య (1823-1902)-ఆంధ్రు డు .ఈ కుటుంబం గాన ప్రశస్తికి చాలా ఈనాములు పొ ందింది .1823 లో పుట్టి ,18 వ

ఏట తంజావూరు లో త్యాగరాజస్వామిని దర్శించి ,గానబో ధ చేయమంటే వీణకుప్పన్న వద్ద నేర్వమని చెప్పారు .14 ఏళ్ళు గురు శుశ్రూ ష

చేసి 300 గీతాలు ,100 వర్ణా లు 100 కీర్తనలు  పాఠం చెప్పుకొని ,పల్ల వి పాడటం లో మహా ప్రా వీణ్యం సాధించాడు .1855 లో స్వగ్రా మం వెళ్లి

,తర్వాత మద్రా స్ చేరి కుప్పన్నవద్ద మరో రెండేళ్ళు సంగీతం నేర్చి ,దక్షిణాదిలో చాలాకచేరీలు చేసి ,ఆంద్ర దేశం లో ‘’చోళ దేశపు కర్ణా టక

బాణీ’’మొట్ట మొదట ప్రవేశపెట్టిన కీర్తి పొ ందాడు .ఈయనపాట నాద భూయిష్ట ంగా ,భావప్రదానంగా సకల లక్షణ సమన్వయంగా ఉంటుంది .శ్రీ

త్యాగారాజ స్వామి దైవం ఊరేగింపులో కీర్తనలు తరంగాలు మైమరచి పాడేవాడు .ఫిడేలును ప్రక్కవాద్యంగా ఎప్పుడూ పెట్టు కొనే వాడు కాదు

.తొట్ల వల్లూ రు చల్ల పల్లి ఉల్లిపాలెం ,నరసరావు పేట జమీందార్ లచేత ఆహ్వాని౦పబడి కచేరీలు చేసి సత్కారాలు పొ ందాడు .

  శిష్యులు –నారుమంచి సీతారామయ్య ,ఉప్పుటూ(లూ)రి శ్రీరాములు ,జవంగుల శ్రీహరి ,రాఘవులు శ్రీమతి రాం భాయి రంగనాయకి

,చిన్నమ్మి అందరూ పల్ల విలో దిట్ట లే .

10-నారుమంచి చినసీతారామయ్య –(1877-1943)-గుంటూరు జిల్లా పెదరావూరు వాసి జానకిరామయ్య శిష్యుడు .గురు సేవలో సంగీతం

నేర్చాడు .100 వర్ణా లు 100 కీర్తనలు 200 లక్షణ గీతాలు ,అనేక స్వర జతులు అభ్యసించాడు సీతారామయ్య శ్రీరాములను గురువుగారు

కుప్పయ్య పుత్రు డు ముత్యాలప్పేట త్యాగయ్యకు అప్పగించాడు .రెండేళ్లలో అన్నీ సాధన చేశారు .వృద్ధు లబాణీ మార్చి కొత్త బాణీలో పాడిన

వారిలో సీతారామయ్య ఒకడు .  .ఇదే  ఈయన  ప్రత్యేకత వర్ణ ం పాడటం లో పెట్టిందిపేరు .నాదాన్ని పూరించి విలంబనకాలం లో ,ఆర్తిలో

,భావప్రకటన తో గమకయుక్త ంగా పాడటం లో ఘనుడు .వర్ణ ం ,స్వరకల్పన ప్రత్యేకత .స్వరప్రస్తా రం రాగభావ పూరితమై గజగమనాన్ని పో లి

ఉంటుంది.ఎవరినీ ఆశ్రయించని స్వతంత్రు డు, ఉదారుడు .పరోపకారులు. ఎ౦దరో దాక్షిణాత్య గాయకుల కచేరీలు ఏర్పాటు చేశాడు .గాన

శిక్షణలో సర్వ సమర్ధు డు .ఈయనవద్ద సంగీతం నేర్వటానికి 10 ఏళ్ళు పట్టేది .సెమ్మ౦ గుడి,చౌడయ్య రోజుకు 10 గంటలు సాధన చేసేవారు

.ఈయన వర్ణ ం స్వర ప్రస్థా నాలు మెచ్చి తిరుమలస్వామి అయ్యంగార్ ఖరీదైన తంబురా బహూకరించారు .కొడుకు సాంబశివరావు

బియె.బిఎడ్ మంచి గాత్రజ్ఞు డు .

రాజులలో స్వాతి తిరుణాల్ రాజా(1756-88) –అంటే స్వాతి తిరుణాల్ తండ్రి సంస్కృత భాషా కోవిదుడు .ఇతనికీర్తనాలు ఇప్పటికీ అనంత

పద్మనాభ స్వామి దేవాలయంలో గానం చేస్తా రు . మలబారు సంగీత ప్రా రంభ దశ ఇది  .గోవి౦ద మరార్ ఎక్కువగా అష్ట పదులు పాడేవాడు .

   రాణీ రుక్మిణి బాయి (1800-37)-స్వాతి తిరుణాల్ సో దరి .రాసిన గీతాలను శాంతి భావగర్భితంగా శ్రా వ్యంగా గానం చేసేది .
ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ

శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’.

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -14

ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు

రాయలసీమ వారు

1-పక్కా హనుమంతాచారి –(1849-1939)

పంచ కావ్యాలు ముగించి ,కరూర్ లో కరూర్ రామస్వామి వద్ద సంగీతం నేర్చాడు సహాధ్యాయులు శ్రీమతి

కోయంబత్తూ రు తాయి ,పల్ల డం సంజీవరావు గార్లు .వీరి వివాహం ఖర్చు తాయి భరించిందట .శిష్యులు చింతపల్లి

వెంకటరావు ,రామచంద్రరావు వగైరా .

2-చింతపల్లి వెంకటరావు –కంచుమోతగాత్రం మంచి బాణీ లయలో దిట్ట .భావగాంభీర్యం రాగరసం సమ్మోహితులను

చేస్తు ంది .నేక్కార్పట్టు శేషన్నవద్ద గాన మెళకువలు నేర్చాడు .అసాధారణ కల్పనా చిత్ర ధురీణుడు.శరపరంపరగా

అపూర్వ రాగాలలో పాడగల ప్రజ్ఞఉన్నవాడు .పాండిత్యం సాధనతో అందరినీ ఆకర్షించాడు .మరో గురువు

తిరువయ్యార్ సుబ్రహ్మణ్యం .రాయల సీమవారికి ఇతని సంగీతం ఆదర్శం .1944 లో చనిపో యాడు .

3-కురుగోడు వెంకటాచలం –కర్నూలు వాడు .నామకల్లు నరసింహయ్య శిష్యుడు .కల్పనా వైచిత్ర్యం స్వరాల అల్లిక

జిగి బిగి ఇతని సొ త్తు .తమ్ముడు వెంకట నరసయ్య ఫిడలర్ .

4-చలమత్తూ రు రామయ్య –పక్కా హనుమంతాచారి శిష్యుడు .శ్రీవిద్యోపాసకుడు .హఠయోగి.ఫిడలర్.అలంకారాలు

షట్కాలాల లోను,వర్ణా లను త్రికాలాల్లో నూ గమకబద్ధ ం గా పాడేవాడు .పావు ,అర్ధ జాగా ఇచ్చి వర్ణ సాధన చేసేవాడు

.గతిభేద రహస్యవేది.నాటకురంజి ,కురట,వసంత ,శహన రాగాలను విస్త రించి విసుగు పుట్ట కుండా పాడే నేర్పరి

.హిందూపురం వాసి .
5-ఆమదాల వెంకటస్వామి –అనంతపురవాసి ఫిడలర్.శిష్యురాలు గుండాసాని .బో ధన నిరుపమానం .ప్రక్కవాద్యం

నైపుణ్యమున్నవాడు .శిష్యులు నరసింహాచారి ,,భీమసేనాచారి .

ఒంగోలు సీమ వారు

6-దేనుకొండ చిన్నయ్య –అద్ద ంకి వాసి 1869-1920 కాలం .ఒంగోలుతాలూకా గార్ల పాడు గ్రా మం లో ఆరువేల

నియోగి కుటుంబం లో పుట్టా డు తండ్రి పిచ్చయ్య నృసి౦ హో పాసకుడు,పారిజాతాపహరణం వామన చరిత్ర

యక్షగాన కర్త .నిరతాన్న ప్రదాత.శ్రీరామ ,నృసింహ ఉత్సవాలు ఘనంగా చేసేవాడు .

,.14 వ ఏట నెల్లూ రు తర్వాత మద్రా స్ చేరాడు .పెదకూర సి౦గరాచార్యవద్ద గానం నేర్ఛి తిరువయ్యార్ లో పట్నం

సుబ్రహ్మణ్యం వద్ద రెండేళ్ళు సాధన చేశాడు .తర్వాత ఉమయాల్పురం వెళ్లి మహా వైద్యనాధన్ శిష్యుడైన స్వామి

నాధయ్య వద్ద 6 ఏళ్ళు గానవిద్య అభ్యసింఛి కచేరీ చేసే సామర్ధ్యం సాధించాడు .అయ్యరు గారి 72 మేళకర్త లు

వల్లించి ,గానరహస్య వేత్తయై ఇంటికి వస్తూ మద్రా స్ లో కచేరి చేసి గానవిదుల మన్నాన పొ ంది స్వగృహం చేరాడు

.ఈయనతోపాటు పై ప్రదేశాలలో విద్యాభ్యాసం చేసిన పరమాత్మునినారాయణ విద్యావినయసంపన్నుడు,రంజక

గాత్రజ్ఞు డు కొద్దికాలానికే చనిపో యాడు .కొత్త పల్లి లో పెళ్లి చేసుకొని గానకచేరీలు చేస్తూ మెప్పు పొ ందాడు .లక్ష్య

లక్షణాలతో విద్యార్ధు లకు బో ధించాడు .ఒంగోలు సీమ పరిసర ప్రా ంతాలలో బుద్దా ం ,పరుచూరు కావలి దేనుకొండ

గ్రా మాలలో పాఠశాలలు పెట్టి విద్యాదానం చేశాడు .

శిష్యులు –కుందుర్తి రామమూర్తి రామాయణం సీతాపతి ,ఫణిహారం వెంకట సుబ్బయ్య ,ములుకుదురు వెంకట

కృష్ణ య్య ,పో తుమర్రి కృష్ణ య్య ,పరమాత్ముని సుబ్బయ్య ,పమిడి ఘంటం సుబ్బయ్య ,ఓగిరాల రామమూర్తి

,ఓరుగంటి వరదయ్య ,పరిమి భద్రయ్య ,దాసరి రత్నం ,గంధం మురహరి షేక్ నబీ ముగాలాయి ,భూసురపల్లి

రత్నం,చదలవాడ అచ్చయ్య ,రావినూతుల వరదయ్య ,అమనబ్రో లు దాసు ,విస్సా రామారావు ,కొడుకు

సుబ్బారావు మొదలైనవారు.పెదపూడిలో ఇతని గానవిద్యా నైపుణ్యానికి సింహతలాపు మురుగులు

చేయిన్చిసత్కారి౦ చారు గద్వాల్ తిరువాన్ కూర మైసూర్ సంస్థా నాలలో గానవిద్య ప్రదర్శించి ‘’లయ బ్రహ్మ

‘’బిరుదు పొ ందాడు .స్వరకల్పనా చాతుర్య మేటి .స్వరాలను అనర్గ ళం గా అల్ల గల సమర్ధు డు పల్ల వి ప్రస్తరణ

ప్రవీణుడు .సంగీత శాస్త ్ర నిధి .సో దరుడు వెంకయామాత్యుడు యక్షగాన రచయిత శ్రీ రంగనాధ భట్టా ర్ ఉపదేశం తో

విశిష్టా ద్వైతం స్వీకరించి తాడిపత్రిలో ఆశ్రమ స్వీకారం చేసి నియమబద్ద జీవితం గడిపి సిద్దు డై1929 లో

మరణించాడు .
కృష్ణా తీర గాయకులు

7-సుసర్ల దక్షిణామూర్తి –(1860-1917 )-గానవిద్యా కులపతి బిరుదు పొ ందిన శాస్త్రిగారు కృష్ణా జిల్లా పెద కళ్ళేపల్లిలో

రౌద్రి సంవత్సర ఆషాఢ శద్ధ త్రయోదశి జన్మించాడు తండ్రి గంగాధర శాస్త్రి .గానవిద్యకు సంస్కృతం అవసరం అని

గ్రహించి వ్యాకరణ మీమాంస ఛందో ఉపనిషత్ కావ్య అధ్యయనం చేశారు .సంగీత సాధనమేమోక్షం అని భావించి

తంజావూర్ దగ్గ ర పంచనద క్షేత్రా నికి వెళ్లి ,గాన వరిస్టు డు ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య వద్ద ,ఆయన శిష్యుడు

వీణా ధర్మ దీక్షితార్ వద్దా గురుకులవాసం చేసగ


ి ానవిద్య అభ్యసించారు .కొంత లక్షణ గ్రంధాలు కొన్ని గీత వర్ణ

కీర్తనలు గ్రహించి తిరిగి వచ్చారు .వాటిలో పైడాల గురుమూర్తి శాస్త్రి 72 మేళకర్త లలోని లక్షణ గీతాలు ,ప్రబంధాలు

ఘనరాగ గీతాలు తానవర్ణా లు కీర్తనలు మాత్రకాల పద్ధ తినింసరించి స్వరపరచి రాశాడు .

‘’ లక్ష్య లక్షణ సమన్వితుడైన నాదో పాసకుడైనవాడు రసికుడు .ఉదాహరణ కోనేరు నాగభూషణం .రాగ రూప

కాలాలను అనన్య సాదారణంగా చేయగలవాడు భావుకుడు ఉదాహరణ పాల్ఘా టు అనంతరామ భాగవతార్ ,టైగర్

వరదాచారి ..సభికులను ఏదో విధంగా రంజింప జేసేవాడు రంజకుడుఉదాహరణ రామానుజయ్య౦ గారు . .

గాయకుల పో కడలను అనుసరించేవాడు ఉదాహరణ సీతారామా చారి .రసిక గాయకులను తయారు చేసేవాడు

శిక్షాకారుడుఉదాహరణ –సుసర్ల దక్షిణామూర్తి ‘’అని హరి నాగభూషణం గారు చెప్పారు వీరిలో పితృస్థా నం

శిక్షాకారునిది . అంతటి స్థా యి ఉన్న మహానుభావులు సుసర్ల వారు .అనేకమంది విద్యార్ధు లకు భోజనం వసతి

తనింట కల్పించి గాన విద్య నేర్పారు. కనుకనే ‘’కులపతి ‘’అయ్యారు .వీరి సవయస్కులు సతీర్ధు లు ఫ్లూ టు శరభ

శాస్త్రి సద్గు రు కటాక్షం పొ ందాడు .గురు శ్రేణికి చెందినవారు పట్నం సుబ్రహ్మణ్యం మహా వైద్యనాధన్

,పంచాపకేశన్,వీణ ధర్మ దీక్షితులు .

శాస్త్రిగారు ఆజనుబాహువులు .బ్రహ్మ తేజో విరాజితులు ,అగ్రహారీకులు అవటం చేత కచేరీలు చేసే విద్యార్ధు లను

తయారు చేశారు .కుమారులు కృష్ణ బహ


్ర ్మం ,నాగేశ్వర శాస్త్రి ,విశ్వపతి శాస్త్రి జంత్ర గాతజ్ఞు లు .రాజనాల

వెంకటప్పయ్య ,ద్వివేదుల లక్ష్మణ శాస్త్రి నరసింహం సో దరులు ,దుడ్డు సీతారామయ్య ,సింహాద్రి అప్పలాచారి

,చల్ల పల్లి పురుషో త్త ం ,పంచనాదం సో దరులు, చల్ల పల్లి సీతారామయ్య సుబ్బయ్య సో దరులు ,పారుపల్లి

రామకృష్ణ య్య ,పెనుమత్స లక్ష్మీ పతిరాజు, కందా రాఘవయ్య ,సుసర్ల గంగాధర శాస్త్రి మొదలైన వారు మెరక
ి ల్లా ంటి

గాన శిష్యులు .శాస్రిగారు 57 వ ఏట సాయుజ్యం పొ ందారు .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ

మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’.
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -15

ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 2

8-రాజనాల వెంకటప్పయ్య (1860-1930)గురువుకు తగిన శిష్యుడు .పల్ల వి పాడటం లో నేర్పరి .అనేకులకు భోజన

వసతులు కల్పించి గానవిద్య నేర్పిన కులపతి .శిష్యుడు పొ న్నూరు రామ సుబ్బయ్య .

9-ద్వివేదుల లక్ష్మన్న సో దరులు-బొ బ్బిలి వారు. గాత్రం త్రిస్థా యిలో పలికించే నేర్పున్నవారు .మృదువుగా

మనోహరంగా తంబురా శ్రు తిలాగా స్నిగ్ధంగా గానం చేసి, మహావైద్యనాధన్ వంటి వారినే మెప్పించిన వాడు

.లయపట్టు తెలిసి పల్ల వి ప్రస్తా రం లో అమోఘ శక్తి సంపాదించి కల్యాణి ,కారుబారు బిల్హ రి లో ‘’నా జీవనాధార

‘’కృతులు పాడటం లో సమర్ధు లు .భావుక శ్రేణక


ి ి చెందిన గాయకోత్త ముడు .

10-చల్ల పల్లి పురుషో త్త ం,పంచానాదం -అన్న గాత్రజ్ఞు డు.తమ్ముడు జంత్ర గాత్రజ్ఞు డు.

11-చల్ల పల్లి సీతారామయ్య -సుబ్బయ్య – అన్న గంభీర గాత్రజ్ఞు డు,ఫిడలర్.తమ్ముడు వీణానాదం వంటి జీవం కల

శ్రు తి రంజక గాయకుడు .తిరువత్తూ రు కుప్పయ్య ,ముత్యాల్పేటత్యాగయ్యలవద్ద సంగీతం నేర్చాడు .గాత్రం లాగానే

హృదయమూ మెత్తనిదే .నిర్మల ,నిరాడంబర జీవనం గడిపాడు .తానపద్ధ తిసత్స౦ప్రదాయ బద్ధ ం ,శ్లిస్ట గుణోపేతం

.బాణీలో చోళదేశపు ఛాయలుంటాయి .గౌరీ మనోహరిలో ‘’బ్రో వ సమయం ‘’,ముఖారి లో ‘’క్షీణమై తిరిగి జన్మించెనో

‘’కృతులు అతని ప్రత్యేక సొ మ్ములు .’’నిర్దో షో మధ్యమో మతః ‘’అన్నట్లు రంజక,అనుకార సంజ్ఞా ర్హా లు .

12-కందా రాఘవయ్య –హరికథా పితామహుడు కందా రాజన్న దత్త పుత్రు డు .స్వయంగా గాన విద్య నేర్చిన వాడు

.గుంటూరు సీమలో ప్రసిద్ధు డు .

13-పెనుమత్స లక్ష్మీ పతిరాజు –క్షత్రియ కుల గాయకుడు .

14-గబ్బిట యగ్గ న్న శాస్త్రి (1875-1921)


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గ ర దెందులూరు మండలం లోని గబ్బిట వారి ‘’రామారావు గూడెం అగ్రహారం

‘’వాస్త వ్యుడు .గౌతమస గోత్రీకుడు .తెలగాణ్యబ్రా హ్మణుడు .ఆజన్మ బ్రహ్మ చారి . గానగురువు కట్టు సూరన్న.శాస్త్రి

గొప్ప పదకర్త ,భక్త రచయిత,గాయకుడు .తండ్రి సూర్యనారాయణ. శాస్త్రి రాసిన జావళీలు ఆంద్ర దేశం లోనేకాక

కర్ణా టక,మహారాష్ట ్ర నాటకాలలో వీటి నకళ్ళు ప్రవేశించి మెప్పు పొ ందాయి .అనితర సాధ్యమైన గాన ప్రతిభ

యగ్గ న్న సొ త్తు .ఒకరకంగా గానయజ్ఞ ం చేశాడు యగ్గ (జ్ఞ )న్న శాస్త్రి .పండితాదరం పొ ందినమహాగాయకుడు

.సుప్రసిద్ధ ఫిడలర్ గొర్తి లక్ష్మీ నారాయణ తో కలిసి ఎన్నో చోట్ల కచేరల


ీ ు చేసి సత్కారాల౦దు కొన్న శేముషీ

దురంధరుడు ..శిష్యులు –ఇరుగంటి బుచ్చిరామ శాస్త్రి ,దంపూరి సుబ్బారావు ,తిరువయ్యార్ కు చెందిన పల్ల వి

సుబ్బారావు,కాకినాడకు చెందిన సత్యరాజు బ్రహ్మేశ్వరరావు .నాట్యాభినయ శిష్యురాండ్రు –చేటపర్రు సుందరి ,

పువ్వులపాపాచలం మొదలైనవారు .యగ్గ న్న శాస్త్రి చాలా కృతులు ,జావళీలు ,వేంకటేశ ,భద్రా ద్రి రామ శతకాలు

రచించాడు. అతి తక్కువవయసు 46 ఏళ్ళకే చనిపో వటం దురదృష్ట ం .

స్వవిషయం –యగ్గ న్న శాస్త్రి మా రామారావు గూడెం అగ్రహారం వాడు మా ఇంటి పేరు వాడు కావటం మా

అదృష్ట ం,మాకు గర్వ కారణం .1980 ఫిబవ


్ర రిలోమొదటివారం లో నేను మద్రా స్ వెళ్ళినప్పుడు శ్రీ దేవులపల్లి కృష్ణ

శాస్త్రి గారింటికి వెళ్లి కలిసి ఆయన స్క్రిబ్లి ంగ్ పాడ్ పై ముచ్చటిస్తు ంటే ‘’గబ్బిట వారిలో గొప్ప గాయక ,పదకర్త

ఉన్నారు మీకు తెలుసా ‘’?అని ఆయన ప్రశ్నించి ,రాస్తే ‘’నాకు తెలియదు ‘’అని నా అజ్ఞా నం ప్రదర్శించి రాస్తే,

ఆయన ‘’గబ్బిట యగ్గ య్యశాస్త్రి గారుఅనుకొంటా గొప్ప గాయకుడు పదకర్త ‘’అని నాకు రాసి చెప్పిన జ్ఞా పకం

.అప్పటికి నా తెలివి తేటల దృశ్యం ‘’అంతే’’.ఐతే ఆపేరు మర్చే పో యాను .’’గబ్బిటవారిలో గొప్ప గాయకుడున్నాడు

అనికృష్ణ శాస్త్రి గారునాతో చెప్పారు’’ అని మాత్రం అందరికీ చాటి౦ పేస్తూ చెప్పేవాడిని .

మా రామారావు గూడెం లో మానాన్నగారిచ్చిన స్థ లం లో శ్రీ భక్తా ంజనేయ దేవాలయం నిర్మించిన చందో లు

సుబ్బారావు గారి అల్లు డు శ్రీ కొలచిన ప్రసాదరావు గారికి ‘’యగ్గ న్న శాస్త్రి గారి ఆర్టికల్ సుమారు నెలక్రిందటపంపించి

శాస్త్రిగారి గురించి మరిన్ని విషయాలు తెలిస్తే నాకు తెలియజేయమని కోరాను. నేటి వరకు జవాబు రాలేదు .నాటక

,సినీ రచయిత ‘’శ్రీరామాంజనేయ యద్ధ ం ‘’ఫేం మాకు దగ్గ రిజ్ఞా తి స్వర్గీయ గబ్బిట వెంకటరావు(మద్రా స్ )

గారబ్బాయి ,సినీ నిర్మాత గబ్బిట మధు కు అదే ఆర్టికల్ పంపి అతనికేమైనా తెలుసునేమో అని ఫో న్ చేసి అడిగితే

తెలియదన్నాడు .వెంకటరావు గారిదీ రామారావు గూడెమే.

జావళీలు
వాల్‌గంటి... రాగం: ముఖారి తాళం: రూపక వాల్‌గంటి సో యగంబునెన్న వశముగాదురా

ఘల్ ఘల్ రవంపు నడలు హంసగతుల గేరురా

తొగవిందునకు నెమ్మోమునకతి దూరము గదరా


వరకుందనంపు జాయ ముద్దు గుల్కు మేనురా

ప్రో యాలు తళ్కుమేల్ పాలిండ్లు పూలచెండ్లు రా

ప్రా యంపుటింతి మధ్యము గన్పట్ట దు గదరా

అర చందమామ నేలు నెన్నుదురు గల చెలిరా

మరువంపు మొల్ల మొగ్గ ల పల్వరుస పొ లతిరా

జలజాతనేత్ర గబ్బిట యజ్ఞ న్న కవినుతా

వలరేని గన్న మేల్పుమిన్న వనిత నేలరా

వాల్‌గంటి సో యగంబుల

ఇంత వేగపడిన రాగం కమాచి తాళం రూపక

ఇంత వేగపడిన కార్యమెట్టు లౌనురా

రవంతవేళజూచి ముద్దు లాడ దగునురా

మెత్తని పానుపున మగని మెల్లనె నిద్రింపజేసి

యత్త మామ లెఱుగకుండ వత్తు ను పో రా

మరదులు గ్రా మాంతరమ్ములరిగి రాడబిడ్డ లింక

పొ రుగిండ్ల కు నాటలాడబో దురు గదరా

దాపున మా పూలదో ట లోపల నీవుండుము

గడెసేపులోనె బాగాల్ గొని చేరవత్తు రా

చెన్ను మీర గబ్బిట యజ్ఞ న్న కవి నేలినట్టి

చిన్ని కృష్ణ మదిని నేర మెన్నబో కురా

చాలు చాలు రాగం బ్యాగ్ తాళం రూపక

చాలు చాలు నీదు చెల్మి జాడదెలిసె మానినీ

వ్రా లబో కు కాళ్ళపైని లేలే హంసగామినీ

గులాబి పువ్వు విడచి మోదుగు విరి గొన్నరీతిగా


బలారె వాని గూడితిగ భామా నే నీకేటికే

అల్ల వయసు ఠీపులు నీయందె మొల్చినవటే

యెల్ల చానలకు లేవే యీ గోటు నీకేటక


ి ే

ఇందిరశ
ే ్వరుండ నీ నా పొ ందు నీకు గల్గు నే

అందులకే యేగు యజ్ఞ నాప్తు నకు తగుదువే

చంచలాక్షి రాగం: బ్యాగ్ తాళం: ఆది

చంచలాక్షి నిన్వరించి నన్ను బంచెర

యెంచగ గ్రొ మ్మించు మించు జెలి మంచి మేను

అంచలు భ్రమించు నడలంచు వచియించవచ్చు

కాంచనాంబర దాని గాంచిన మోహించె ఔర

పంచశర రూపశర పంచకముల బల్మరు

పంచబాణుదించు బో డి బొ ంచి యేసి ముంచెనుర

చంచరీక వేణి దొ డ్డి పంచాది గదిలో పట్టి

మంచమున శయనించి తపించెను రకింతచేత

అంచితముగ నిన్ను బూజించు యజ్ఞ న్నకవి

గాంచి పో షించు కృష్ణ వేంచేసి కరంచుమిక

అయ్యయో రాగంహిందూస్తా నీ కాఫీ తాళం చాపు

అయ్యయో సైపగలేనే

చయ్యన నేగి రమాసఖునిటు రమ్మనే

మదిరాక్షి వినవే మకరాంకుడురువడి

పదునగు శరముల నెదపై గ్రు చ్చెనే

అల్ల జాబిల్లి వేడి మంతకంతకు నొడలెల్ల గ్రా గుచు విస్త రిల్లు చు నుండెనే

వరగబ్బిట యజ్ఞ న వంద్యుని బాయజాల


హరినిటు దేవే మణీహారమిచ్చెదనే

చిన్న ముద్దీరా రాగం హిందూస్తా ని కాఫీ తాళం ఆది

చిన్నముద్దీరా నాసామి

కన్నుల పండువుగా నిను గనగనె

వెన్నవలెను మది వేగ గరగురా

సరసత నీవొకసారి మాటాడిన

బొ రి బొ రి మేన బులక లెచ్చురా

అమ్మకచెల్ల నిన్నంటిన మాత్రనె

కమ్మని కోర్కెలు గలుగుచుండురా

కమలా ప్రియ శ్రీ గబ్బిట యజ్ఞ ననమిత చరణ విడనాడజాలరా

కోమలాంగి రాగం కేదారగౌళ తాళం ఆది

కోమలాంగి తాళకున్నదిరా

తామరస విలోచన

సామిరాగదర కామినిక గనగ నా

మనోజుని శరానలంబునకు

చందనగంధి నీయందనురాగము జెందియున్నదిర

సుందర శరీర యెందరైన నిన్ను బో లరంచు నీ

యందంబు చందంబు డెందంబునందలచి

కూరిమి మీరగ వారిజముఖిని జేరి

సుఖింపర శ్రీ రుక్మిణీలోల వేరు

సేయ మేరగాదు వేవగ


ే మే రార

సారెకు నీ రాక నారయుచు

వావిగ గబ్బిట వంశజ యజ్ఞ న సేవిత


నీకై యాసించి యున్నదిర యే

విధాననైన దాని గ్రీడింపు

భావింప మీవేళ శ్రీవేణుగోపాలక

హాయికల్గెనురా రాగం బిలహరి తాళం రూపక

హాయికల్గెనురా చాలగ ||హా||

నామది ||హా||

నీయొయ్యారంపు పాటల

నీయెడ బాళిని నేను రాగానెరా

వేయని ముద్దిడి యెదను జేర్చి

వేయి మోరీలు జేయు బిగికౌగిలీయ నీవెంతో

మారశతోజ్వలాకార నేనయ్యెడ కోరి

సుగంధము కూర్మిబూయ గారామున

నీ తీరౌ మోవిసుధారసమీయ

మక్కువ నేను నీ చెక్కిలి గొట్ట గ

చక్కలిగింతలు చాలగొల్పి

చొక్కింపు గోట నొక్కుచు

బాలిండ్లెక్కుడు బెనగ

ఆరసి గబ్బిట యజ్ఞ న సత్కవి వారక

బ్రో చెడి శౌరి నేడు చారు నానా

బంధో చాతురీ మారునికేళి

ఏమి పల్కెనే రాగం తోడి తాళం రూపక

ఏమి పల్కెనే శ్రీ సఖు ||డేమి ||అల్ల వా||డేమి ||

మోమాటమేమిలేక తెల్పగదె చెలి


నేవ్రా యుచీటి జూచెనా నిరసించి పాఱవైచెనా

యేవైన నుల్ల సమ్ములాడెనా చెలిఆ కాంత యింటనుండెనా అన్యాలయమున నుండెనా

నీకేమియైన భూషలిచ్చెనా చెలి

ననుబాయనంచు జెప్పెనా నినుజూచి వేఱేడాగెనా

మనసిచ్చి మారుజాబు వ్రా సెనా చెలి

ఇటు నేవత్తు ననియెనా అటు నన్ను రమ్మనియెనాపటు గబ్బిట శ్రీ యజ్ఞ నార్చితుడు హరి

వినవే సామి చేసిన రాగంతోడి తాళం రూపక

వినవే సామి చేసిన పనులన్ దెలిపెద చెలి

కనుల నిండ నే నిదురగొని

నటులుండిన వేళను

చనవున గడపినవన్నియ

నిన్న రేయి పాన్పు నిండు వెన్నెలలో వైచి

పండి యున్న వేళ నాదుపైని వన్నెకాడు

సన్నజాజులిన్ని చల్లె నెలనవ్వున

మేలైన గదంబు రోజ పాళి నలది

పెదవి తేనె గ్రో లి ముద్దు బెట్టి గోపాలుడు

సుఖలీలల ననుదేలించెనె నీలవేణి

ఇల గబ్బిట యజ్ఞ నాఖ్యు గృపమీర నేలినట్టి

నలికాక్షుడిట్లు జేసి వెలలేనివి గల మానికముల

హారము నెలమి నొసగె

వానిజూడు మెందున్నాడో రాగం నాటకురంజి తాళం ఆది


వానిజూడు మెందున్నాడో సఖియ

నాణెంపు బల్కుల దేనెలొల్కువాడే

నిద్ద మైన చెక్కుతద్ద ముల సౌరు

ముద్దు గారు మోము మోవికెంపు వాడే

బంగారు దువ్వలువ వల్లెవాటు వైచి

సంగీతమ్ము జేయు చహలు గల్గు వాడే

చల్ల ని చూపుల సత్కవిత్కముల

పెల్లైన యీవుల పేరు బొ ందువాడే

అనయము గబ్బిట యజ్ఞ న్న కవీంద్ర

వినుతుడైన రంగ విభుడింక రాడాయె

వనజాక్షుని బాయలే నే రాగం హిందుస్తా నీ కాఫీ తాళం ఆది

వనజాక్షుని బాయలేనే సఖీ

వెనుకనె వచ్చి నా కనుదో యిని మూసి

తను నన్నెఱుంగమన్నాడే

కడు ముద్దు పాటల గరగించి నన్ను

తన తొడపైని నుంచుకొన్నాడే

మమతమీర నాతో మనసిచ్చి మాటాడుచు

తమలంబు నొసంగినాడే

ఘన సన్నిభాంగుడే గబ్బిట యజ్ఞ న్న

హృద్వనజ ప్రపూజితాంగుడే

ఈ మోహమెట్టో ర్తు రా రాగం తోడి తాళం ఆది

ఈ మోహమెట్టో ర్తు రా

వేగ ప్రేమ జూచి యేలుకోర


నీ మీదను నా మానసమేమారక చిక్కెగదరా మేనున గరుపాటులు వేమారును గల్గెనుర

పిక్కటాలు వక్షోజము లెక్కుడుగ పొ ంగారెర

మక్కువగ నీ కౌగిలి యొక్కపరి నీగదర

దట్ట మగు చెమ్మటలు బుట్టి మదిగట్టి చెడి

గుట్టు విడి వెచ్చనగు నిట్టూ ర్పులు వచ్చెనుర

ఇంతంతనని కోర్కెలు స్వాంతమున గంతులిడె

వింతలుగ శ్రీ గబ్బిట యజ్ఞేశనుత

చాలు పో పో రా రాగం బ్యాగ్ తాళం ఆది

చాలు పో పో రా యేరా నీ

చందమెల్ల దెలిసెరా

జాడలెల్ల దెలిసెరా

నీ నయ వినయమెల్ల నేడు దెలిసె

మ్రొ క్కకు నీకే నిష్ట మటరా

ఎందుకు నన్నంటెదు నా డెందము

పరిశోధింప నిందు వచ్చితే యేరా

ఆ లతాంగి మైత్రి సౌఖ్య లీలలిందు

జూపింప గోపాల వచ్చితే యేరా

బిసరుహలోచన గబ్బిట యజ్ఞ నాప్త

దాని బసకె వేంచేయరా

మారుబారి కోర్వజాలరా రాగం బ్యాగ్ తాళం ఆది

మారుబారి కోర్వజాలరా

శ్రీమానినీ మనోహరా

నీరేజు సూన కఠోర బాణమ్ములురోరుహముం దాకెరా


ఇందీవరాప్తు ని యెండ వేడిమికి

కందుచు మేనెల్ల గ్రా గుటె కాకయా

మందానిలుడు పల్మారు గగుర్పాటు

లొందింప సాగించెరా

శారికా కీర మయూర మధు వ్రత

పారావతనిక రారావములకు

తోరంబుగా మది తృళ్ళిపడుచు మహారాటమున్ జెందెరా

చయ్యన గబ్బిట సత్కుల జని యజ్ఞ య్యను బ్రో చెడి జలజనయన యా గయ్యాళి జేరి నన్నెయ్యడ నేచుట

లయ్యయ్యొ యిది మేరా

నేను అనుకోనేదేమిటంటే- మా తాతగారు కీ.శే .గబ్బిట దుర్గా పతి శాస్త్రి గారికి సో దరులు 9 మంది అని మా అమ్మ

చెప్పేది .కనుక వారిలో ఎవరో ఒకరి కుమారులై ఉంటారు గబ్బిటయగ్గ న్న శాస్త్రి గారు అని అనుకొంటున్నాను .వారి

వివరాలేవీ మాకు తెలీదు .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ

మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’.

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -16

ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 3

15-లయబ్రహ్మ పాపట్ల లక్ష్మీకాంత కవి (1877-1921)

జగ్గ య్య పేట వాసి .సంగీత విద్వన్మణులలో ఒకడు .దిగంత యశోవిశాలుడు సహజ ప్రతిభ స్వతంత్ర

రాగాతాళప్రస్తా రాలతో ,అనేక గీతికా పాఠ్యఅనుభవం గాన్ధ ర్వగానం లతో ఆంధ్రనాటకానికి కొత్త జవ, జీవాలు తెచ్చాడు

.గాన స్వతంత్రు డు .వివిధ గీతికా నిర్మాత అధ్యాపకుడు వాద్యకారుడు .భావజ్ఞ శ్రో తలకు ఆనందం చేకూర్చే
నైపుణ్యమున్నవాడు .మైలవరం థియేటర్ కు గొప్ప ‘’ఎస్సెట్’’ గా ఉన్నవాడు .సహచర వాద్యకారులు –తబలా

వాద్య ప్రకా౦ డుడున బగ్గ న్న ,పేటక


ి ా వాద్యకారుడు రామానుజులు. అమృత సో నలూరేట్లు వాయిస్తు ంటే నాటక

రంగం దేవేంద్ర సభలా భాసి౦చేది.ఆయనవద్ద తర్ఫీదు పొ ందని నటుడు అనుకరించని పాటపద్ద తి ,నాటక సమాజం

లేదు అంటే అతిశయోక్తికాదు ముమ్మారు యదార్ధమే .

అన్నరామయ్యవద్ద సంగీత శిక్షణ పొ ంది ,సికందరాబాద్ వెళ్లి ,చిన్నన్న సో దరులతోపో టీ చేసగ


ి ెల్చి కీర్తి పొ ందాడు

.ఫిడేలు ,హార్మనిలలో అనితర ప్రజ్ఞ చూపి ‘’లయబ్రహ్మ ‘’బిరుదు పొ ందాడు .రాజమండ్రి గున్నేశ్వరాయ కంపెనీ

,మైలవరం నాటకకంపెనీలో సంగీత దర్శకునిగా రాణించాడు .విద్వత్ పరీక్షలో పల్ల వి స్పెషలిస్ట్ .సంకీర్ణ ఖండజాతి

తాళాల లో విషమ జాగాలు కల్పించి పల్ల వి ప్రస్తా రం తో ఆశ్చర్య చకితులను చేసేవాడు .గోపీ చంద్,కనకతార

,ప్రహ్లా ద సావిత్రి ద్రౌ పది ,కృష్ణ లీల తులాభారం పాదుకా పట్టా భి షేకం నాటకాలకు భావగర్భిత కీర్తనలు రచించి నాట్య

పట్టా భి షేకమేచేశాడు .రసస్పూర్తి ,పదలాలిత్యం అతీతం .నాట్యరంగం లో మొదటగా హిందూస్థా నీ రాగాలు

వినిపించిన ప్రయోగ శీలి .ఈయన తర్వాత అంతటి ప్రతిభాశాలి రాలేదు .శిష్యులు పురాణం కనకయ్య ,పిరాట్ల

శంకర శాస్త్రి మొదలైనవారు .యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ సంగీత పరీక్షాదికారిగా చాలాకాలం

పని చేశాడు .గద్వాల ,అనపర్తి సంస్థా నాలనుండి వార్షిక పారితోషికాలు బిరుదులూ సత్కారాలు అనేకం పొ ందాడు

.ఇంతటి ప్రతిభామూర్తి 44 ఏళ్ళకే మరణించటం బాధాకరం .

16-ప్రయాగ తిర్మలయ్య (1861-1918)-గుంటూరు జిల్లా వాసి .త్యాగారాజశిష్యపరంపరకు చెందిన కోయంబత్తూ రు

రాఘవయ్య శిష్యుడు .మహావైద్యనాథయ్యర్ సమకాలికుడు .కాకినాడ లో కచేరి చేసిఖ్యాతి పొ ందాడు శిష్యుడు

బలిజేపల్లి సీతారామ శాస్త్రి .

17-చేబ్రో లు సో దరులు –చేబ్రో లువెంకటరత్నం ,పాపయ్య సో దరులు బందరు వారు .చాలాగీతాలు రాశారు .శిష్యులు

–కొచ్చెర్ల కోట రామరాజు కంభంపాటి సత్యనారాయణ ,కంచర్ల సుబ్బారావు ,పాపట్ల లక్ష్మీకాంతకవి .వెంకటరత్నం

అమరవాది శేషయ్య శిష్యుడు .1926 లో చనిపో యాడు .

18-మునుగంటి శ్రీరాములు –పానకాలు సో దరులు –కాకినాడ వారు.జంత్ర గాత్ర నిపుణులు .సంగీత కృతి దర్పణం

స్వరవర్ణ సుధానిధి గ్రంథాలు రాశారు .శ్రీరామమందిరం నిర్మించి చాలా సభలు చేయించి దానధర్మాలు చేశారు

శ్రీరాములుగారి దత్త పుత్రు డు మునుగంటి వెంకటరావు .


19-రావినేని వీరయ్య చౌదరి –రాజనాల వెంకటప్పయ్య శిష్యుడు .కంజీవరం నైన పిళ్ళేవద్ద సంగీతం నేర్చాడు .పల్ల వి

ప్రవీణుడు .

20-వెంపటి సూర్యనారాయణ-ఒంగోలు తాలూకా తమ్మవరం వాసి .రాగం పల్ల వి లోనైపుణ్యం పొ న్నూరి రామ

సుబ్బయ్య వద్ద నేర్చాడు .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ

మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’.

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -17

ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 4

21-తూములూరి హనుమచ్చాస్త్రి-రామ సుబ్బయ్య శిష్యుడు. ఏక సంధగ్రా హి. హరిభక్తు డు శిష్యులు –తాడిగడప

శేషయ్య ,నిరాఘాటం కోటయ్య .

22-నిరాఘాటం రామకోటయ్య –పేటర


ే ు వాడు .మద్రా స్ సంగీత పరిషత్ సభ్యుడు .తోడి కృష్ణ య్యకు బంధువు

.తమ్ముడు ఆంజనేయశాస్త్రి తరంగ గానం లోఅనుభవజ్ఞు డు .

23-వైణిక శేఖర్ హరి రామయ్య –హరి వంశ మూలపురుషుడు .నిత్యహరి స్మరణ చేసే వంశంకనుక ఇంటిపేరు

‘’హరి ‘’అయింది .ఆపస్త ంభ సూత్ర యుజుశ్శాఖ వాధూలస గోత్రం మైసూర్ ఆస్థా న గాయకుడు

.’’పున్నాగరాగ’’మాలపిస్తే ,‘’పన్నగాలు ‘’వచ్చి నాట్యం చేసవి


ే .

24-హరి అచ్యుతరామయ్య –వెల్లటూరు జమీందారుల ఆస్థా న గాయకుడు .ఒకరోజు బంగారు నాణాల పళ్ళెం

నెత్తి మీద పెట్టు కొని గానం చేస్తు ంటే,రాజ దృష్టి సో కి మరణించాడు .శిష్యులు కాశీభట్ల రామయ్య ,వేమూరి

నరసింహం ,అప్పన్న .

25-హరి నరసయ్య –పట్నం సుబ్రహ్మణ్యం వద్ద గాత్రం ,తచ్చూరి పెదసిగరాచారివద్ద ఫిడేలు నేర్చి 500 కృతులు

,50 తానవర్ణా లు సాధన చేశాడు .పిడికిలిపట్టు వాద్యం లో ఘనుడు .తిరుక్కోడి కవల్ కృష్ణ య్యర్ సహాధ్యాయి
.సమకాలీనులు -, కోయంబత్తూ రు రాఘవయ్య ,పెదవైది వడివేలు ,వైద్యనాథయ్యర్ ,చిరియాల నారాయణస్వామి

వగైరా .నెల్లూ రి రాఘవ రాజు ,,పల్ల వి శేషయ్య ,నంజుండయ్యలకు సహకార వాద్యం వాయించాడు .10 ఏళ్ళు

మానేపల్లి లో నే ఉన్నాడు .కుమారుడు హరినాగభూషణ శాస్త్రి .1920 లో నరసయ్య చనిపో యాడు

26- కొచ్చర్ల కోట రామరాజు (1878-1946)-కాకినాడ దగ్గ ర ఉప్పాడలో వెంకటనారాయణ జానకమ్మలకు

జన్మించాడు .15 వ ఏట చేబ్రో లు వెంకటరత్నం వద్ద పల్ల వి వరకు గానం నేర్చాడు .పట్నం సుబ్రహ్మణ్యం, సి ఎస్

కృష్ణ స్వామివద్ద జ౦త్రగాత్రా లు అభి వృద్ధిచేసుకొన్నాడు .సహాధ్యాయి కంచర్ల సుబ్బారావు .1914 కొచ్చర్ల కోట

జమీందార్ రాజా కొచ్చర్ల కోట కృష్ణా రావు సమక్షం లో కచేరీ చేసి మంచి పేరు పొ ందాడు .కస్తూ రి శివ శంకర కవి వద్ద

సాహిత్య శిక్షణపొ ంది స్వరజతులు, తానవర్ణా లు, కీర్తనలు, తిల్లా నాలు అష్టో త్త ర కీర్తనలు రాశాడు .గాయక మనో

రంజని ,సరళీ స్వరాలనుండి పల్ల వి వరకు పంచరాగమాలికలు ,పదాలు ,ఘనరాగ గీతాలు రాసి ఘనుడనిపించాడు

.తిరుపతి వెంకటేశ్వర దర్బారులో బిలహరి స్వరజతి కూర్చాడు .తమ్ముడు లక్ష్మణరాజు అన్నకు సహగానం

చేసేవాడు.మాతృ గురు దైవపూజలంటే బాగా ఇష్ట ం .నిరాడంబరుడు. ఎందరో గాయకులకు సత్కారం చేశాడు

.1896 నుండి భోజన నవసతులు కల్పించి విద్యార్ధు లకు గానం నేర్పిన సంపన్నుడు .శిక్షణకార స్థా యి వాడు .

శిష్యులు- నడింపల్లి నరసరాజు ,అడబాల నరసింహం ,షేక్ బాబా ,లచ్చిరాజు ,పిన్నెల మల్ల య్య ,వేనపల్లి నరసింహం

,దేశముఖ్ ,కొప్పోలు జమీన్దా ర్ల సన్మానం పొ ందాడు .షష్ఠి పూర్తినాడు గజారోహణ సత్కారం ,మంగళవాద్యాలు

ద్వారం వెంకటస్వామినాయుడు, హరినాగభూషణం గార్ల కచేరల


ీ తో జయజయ ధ్వానాలు మిన్ను ముట్టేట్లు గా

అత్యంత అట్ట హాసంగా నిర్వహించారు ,

27-పారుపూడి చలమయ్య శాస్త్రి(1878-1954)-సకలకళలలో,తర్క వేదా౦తాది శాస్త్రా లలో మహాప్రవీణుడు .గాంధర్వ

విద్యోపాసకుడు. చలమయ్య శాస్త్రి అమలాపురం తాలూకా మాగాం నివాసి .అచ్చయ్య కామమ్మ తలిదండ్రు లు

.ఉత్త మపందడిత అవార్డ్ హైదరాబాద్ నుండి పొ ందాడు .తండ్రివద్ద తర్క వేదాంతాలు ,అప్పాతులసి అనే మహారాష్ట ్ర

బ్రా హ్మణ లక్షణ వేత్త వద్ద గానం నేర్చాడు .శాస్త్రి కర్ణా టక సంగీతంలో రాసిన కృతులు ,తాలవర్ణా లు ,మునుగంటి

పానకాలరావు ‘’సంగీత దర్పణం ‘’లో చోటు చేసుకొన్నాయి .కాకినాడసరస్వతిసభ ,రాజమండ్రి గానసభలలో గానం

పై చాలా ప్రసంగాలు చేశాడు .ఆంద్ర, సంస్కృత ,హిందీ, మరాటీ భాషలలో గొప్ప పాండిత్యం సాధించాడు .అష్ట

పదులు ,పంచపదులు, ఖ్యాలు ,టుమ్రీలు,ద్రు పద్ పదాలలో మహా ప్రవీణుడు .గీర్వాణ ఆంధ్రభాషలలో కీర్తనలురాసి

‘’గానమంజూష’’ గా ప్రచురించాడు .

సన్నని శ్రా వ్య కంఠం.హిందీ కీర్తనలూ రాసి పూనా గాంధర్వ మహా విద్యాలయం లో పాడి వినిపించి శహభాష్ అని

పించుకొన్నాడు .భిన్న సంప్రదాయాలలో కీర్తనలు రాసిన ఏకైక ఆంద్ర ఘన వాగ్గేయకారుడు .వేదాంత శాస్త ్ర
సంపన్నుడు ,ప్రస్థా న త్రయ నిపుణుడు ,గీతావ్యాఖ్యానకర్త ,ఉభయగాన లక్షణ వేత్త, వాగ్గేయకారుడు పారుపూడి

చలమయ్య శాస్త్రి వంటి వాడు మరెవరూ లేరు ఆంద్ర దేశం లో .66 వ ఏట మరణించాడు .

28-పురాణం కనకయ్య శాస్త్రి –గుంటూరు జిల్లా కు చెందిన ఈయన 16-4-1878 లో జన్మించాడు .జంత్ర,గాత్ర

మర్మజ్ఞు డు.వెలనాటి వైదక


ి యజుశ్శాఖ .గౌతమగోత్రీకుడు .తల్లిదండ్రు లు -మంగమాంబా పురుషో త్త ం.తండ్రి మహాని

స్టా పరుడైభక్తితో మహానందిలో గడిపాడు .పూర్వీకులు నిజాం సంస్థా నం పరిటాల గ్రా మ ఇనాం దార్లు .బ్రహ్మజ్ఞా న

సంపన్నులు.తాత లక్ష్మీనారాయణ సో దరుడు కనకాద్రి శాస్త్రి గొప్పతపో ధనులు .మాతామహుడు ఘనాంత

స్వాధ్యాయి వేదాంతం కూచావధానులు’.

తండ్రివద్ద సంగీతం నేర్చి ,లక్ష్మీకాంతం వద్ద నిష్ణా తుడయ్యాడు .మద్రా స్ వెళ్లి తచ్చూరి సింగరాచార్య వద్ద జంత్ర

గాత్రా లభ్యసి౦మ్చి ,రెంటాల వెంకట సుబ్బారావు దృష్టిలోపడి ఆదరణ పొ ందాడు .1903 మల్లీగుంటూరు వచ్చి

విద్యార్ధు లకు సంగీతం నేర్పాడు .కుడితిపూడి శ్రీరాములు చౌదరి నమ్మయ్య స్థా పించిన గాన విద్యాలయం లో

10 ఏళ్ళు అధ్యాపకునిగా ఉన్నాడు .ఇతని గాన ప్రతిభగుర్తించి గుంటూరు పౌరులు ఆహ్వానించి ఘన

సత్కారాలు,స్వర్ణపతకాలు ఇచ్చి గౌరవించారు .హైదరాబాద్ గద్వాల వనపర్తి ఆత్మకూరు బేతవోలు జమీందార్ల

సత్కారమూ పొ ందాడు .గద్వాల ,నవాబుపేట యాదగిరి విద్వత్ సభలకు పరీక్షాధికారిగా ఉన్నాడు .1921 లో

మైసూర్ వెళ్లి బిడారం కృష్ణ ప్ప,తిరువయ్యారు సుబ్రహ్మణ్యం నాట్యశిరోమణి వరదాచారి ,మైసూర్ మాహారాజులచేత

గొప్ప సత్కారాలు పొ ందాడు .12 ఏళ్ళు గుంటూరు శారదానికేతన్ లో అధ్యాపకుడు .జంత్ర గాత్రా లలో అద్వితీయుడు

.నిరాడంబర జీవి .స్వర విజ్రు ౦భణ ,నిశ్చల లయపటిమ,స్వరపల్ల వులలో నిరంకుశ పాండిత్యం ,జంత్రగాత్రనిపుణత

ప్రత్యేకతలు .బ్రహ్మశ్రీ కాశీ కృష్ణా చార్యులు ,తిరుపతి వేంకట కవుల ప్రశంసలు అందుకొన్న అదృష్ట వంతుడు

.76 ఏళ్ళు జీవించి 1951 లో చనిపో యాడు

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ

మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’.

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -18

ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 5

29-వారణాసి రామసుబ్బయ్య(1882 -1912)-


గుంటూరు జిల్లా పొ న్నూరు వాసి .తండ్రి కోటయ్య .తల్లి లక్ష్మీ దేవి .భార్య రోశమ్మ ..30 ఏళ్ళు మాత్రమె జీవించినా

చిర యశస్సు నార్జిం చాడు .స్పురద్రూ పి ఆజానుబాహు ,విశాలనేత్రు డు .సహజ సుస్వర గాత్రు డు .ఆకార సదృశ

ప్రజ్ఞ ఉన్నవాడు .రాజులను సైతం ధిక్కరించాడు .కౌశిక గోత్రు డు .తండ్రి భరత శాస్త ్ర ,నాటక కళా ప్రవీణుడు .తండ్రి

వద్ద నే అన్నీ నేర్చాడు .15 వ ఏటనే కచేరీ చేసిన బాల మేధావి .చనిపో యేదాకా కచేరీలు చేశాడు .ప్రకృతి

ధ్వనులను అనుకరిస్తూ బాల్యం లోనే కంఠం మేళవించి కమ్మగా పాడుతూ పరవశం కలిగించేవాడు .సరళీలు

,గీతాలు అలంకారాలు తండ్రివద్ద నేర్చి ,రాజనాల వెంకటప్పయ్య వద్ద 30 కృతులు ,30 తానవర్ణా లు ,,పల్ల వి

అభ్యసించాడు .ఇతని స్వరజ్ఞా నం ,లయ పటిమ చూసి గంధర్వా౦శ సంభూతుడు అనే వారు 1906 లో

కాకినాడలో పూచయ్య౦గార్ సమక్షం లో కదన కుతూహలరాగం లో విషమపల్ల వి పాడి అందర్నీ ఆశ్చర్యపరచాడు

.పూచయ్య తనతో తీసుకొనిపో యి గానపాఠాలు చెప్పి తీర్చి దిద్దా డు .అక్కడపాడే మహా విద్వాంసుల గానం

లోనిగుణ దో షాలను విమర్శిస్తూ ,వాటిని తన హృదయం లో భద్రం చేసుకొని శ్రో తలకు వినిపిస్తూ వారే పాడారేమో

ననే భ్రమకలిగించేవాడు .1906 లో ఎట్టియార్ పురం వెళ్లి సుబ్రహ్మణ్య దీక్షితుల తరఫున నవగ్రహస్వరం

పాడి,మెప్పించి ‘’సంగీత సంప్రదాయ గ్రంథం’’ బహుమానంగా పొ ందాడు.1909 లో రామనాథపురం జమీలో

సన్మానం పొ ంది దేనుకొండ చిన్నయ్య ,నారుమంచి జానకిరామయ్య ,ప్రయాగ తిర్మలయ్య ల సమక్షం లో పూర్వ

,ఆధునిక లక్షణ గతి గమక భేదాలగురించి విమర్శించి చెప్పాడు .కాట్రా వులపల్లి రాణీ గారిగారి కుమార్తె వివాహ

సమయంలో పండిత సభలో నందిగామ వెంకన్న ,సంగమేశ్వర శాస్త్రి ,నారాయణ దాసు మొదలైన పండిత దిగ్గజాల

సమక్షం లో నిరుపమానమైన పల్ల వి పాడి ‘’పల్ల వి కోకిల ‘’బిరుదు పొ ందాడు .శేకూరు లో విషమ పల్ల వి పూర్తి చేసి

మాదయి వెంకటరాయుడిని పరాభావి౦ చాడు .బుచ్చి రెడి పాలెం లో భైరవి రాగాపల్ల వి లో అపూర్వ గ్రహస్వరాలు

వినిపించి గావిన్ద గోవిందస్వామి అనే నాగస్వర విద్వాంసుని మెప్పించాడు.

1907 లో కలకత్తా వెళ్లి హిందూస్థా నీ గాత్రం నేర్చి గోహర్జా న్ ,శరథ్ చంద్ర మోహన్ , రవీంద్రనాధ టాగూర్ లను

మెప్పింఛి సర్టిఫికేట్ ,సువర్ణ పతకం పొ ందాడు .చేబ్రో లు బంగాళాలో జరిగిన కచేరీలో ‘’ఋషభ గ్రా మం ‘’లో

పాడుతుంటే దారిన పో తున్న జోడెడ్ల బండీ ఆగిపో యింది .ఆదిభట్ల నారాయణదాసు ,సుసర్ల దక్షిణా మూర్తి గార్లు

రామసుబ్బయ్యగానం విని గంధర్వగానం అన్నారు .గాత్ర వరిస్టు లలో ప్రధమ శ్రేణక


ి ి చెందిన గాయకుడుగా గుర్తింపు

పొ ందాడు .’’ హృద్య శబ్ద ః సుశారీరః ‘’అన్నట్లు మృదు మధుర గంభీర ,త్రిస్థా న గమక ప్రౌ ఢిమగల ఇతని గాత్రం నుంచి

వెలువడే ప్రసారాలు గవ్వలగుత్తు ల ధ్వని యుతాలు అని మెచ్చుకొనేవారు.రాగ రూప కాలాప్తు లకు మేటి .ఎవ్వరికీ

ఇంతటి గాన శైలి అబ్బలేదని విమర్శకాభిప్రా యం .శరీరం స్నిగ్ధం గానం అనుద్వాన యుక్త మై అనాయాస

లద్గ తికమై అన౦త రామ భాగవతార్ ,బిడారం కిట్టప్ప లను మరిపించేది .అందుకే ‘’స్వరజ్ఞా న ‘’.’’స్వరకల్ప వల్ల రీ

‘’,’’అర్వాచీన ఆంద్ర గాయన వాచస్పతి ‘’వంటి సార్ధక బిరుదులూ పొ ందాడు .జంత్ర గాత్రా లలో అశేష శేముషి

ఉన్నవాడు .స్వరకల్పవల్లి ,సంగీత సర్వార్ధ సార సంగ్రహం ,సంగీత ప్రదర్శిని మొదలైన అపూర్వ గ్రంథాలలోతులు

తరచిన వైదుష్యం ఉన్నవాడు .అందుకే ఎవరు ఏ రాగం లో ఎలాంటి పల్ల విని విషమజాగాలలో ఇచ్చినా అవలీలగా
పాడే నేర్పున్నవాడు .ఏ రాగం లోనైనా వర్ణా న్ని ఆశువుగా రచించి పాడే ధీశాలి .స్వరప్రస్తా ర ప్రతిభావంతుడు

.తానవితానం తాలుగతమై శోభించేది .విలంబ ,మధ్యకాలాలపై ఆసక్తి ఎక్కువ . భరత శాస్త ్ర ప్రకా౦డుడు .గాత్ర

పాటలో’’ పాథే ఫో న్ ‘’కిచ్చిన నౌరోజ్ రాగపల్ల వి ,కల్యాణి కాంభోజి, ఖరహరప్రియ, రాగాలాపనలు ,మోహన

,రామప్రియ రాగ కృతుల రికార్డు లు రామసుబ్బయ్య అసదృశ ప్రతిభా చాతురికి నిదర్శనాలు .తన ఆంద్ర గీర్వాణ

పాండిత్యం చాటటానికి పొ న్నూరు శ్రీ భావనారాయణ స్వామిపై చెప్పిన శ్రీరాగ రుద్రప్రియ ,ఆభోగి ,చారు కేశి

,వీణాధరి జగన్మోహిని కల్యాణి ఆదితాళ,ఆటతాల వర్ణా లు ,గీతాలు ,ఖడ్గ బంధాలు ,నాగబందాలు, సంగీత విమర్శక

వ్యాసాలూ ఇతనిని అత్యున్నతస్థా యి వాగ్గేయకారుడని ఎలుగెత్తి చాటుతున్నాయి .ఈయనతో ఆనాటి

సమానులు- కోనేరి రాజ పురం ,గొర్తి లక్ష్మీ నారాయణ ,చల్ల పల్లి సుబ్బయ్య ,పాపట్ల లక్ష్మీకాంతం ,నందిగామ

వెంకన్నలు .ఇతనికి పొ న్నూరు శ్రీ భావనారాయణ స్వామి కోవెలలో స్వస్తి వాచకం నౌఖరి ఉండేది .

ఒకసారి వాసిరెడ్డి ప్రసాదరావు జమీందారు చివుకుల వెంకటప్పావధానిఘానాపాఠితో కలిసిరాగా సుబ్బయ్య

ఫిడేలుపై పనస చెబుతూ వాయిస్తు ంటే గురువు ,రాజు మురిసిపో యారు .గ్రహణ శక్తివల్ల నే అంతటి

విద్వా౦సుడవటానికి కారణం .దీనికి అతని విజయనగర ,తంజావూర్ మద్రా స్ యాత్రలు తరచుగా చేయటమే

కారణం .అఖండ కీర్తి సాధించిన గాయక మణులలో అగ్రగణ్యుడు .పొ న్నూరులో గాన విద్యాలయం పెట్టా లని

చందాలు వసూలు చేశాడు కాని కార్యరూపం దాల్చలేదు .జార్జిరాజు పట్టా భి షేకానికి ఢిల్లీ లో పాటకచేరి చేయాలని

ముఖమల్ అంగరఖా కుట్టి౦చు కొన్నాడు. పుచ్చా సీతారామయ్య జమీన్ దారు ద్వారా ప్రయాణపత్రం

తెప్పించుకొన్నాడు .కాని జయపుర సంస్థా నం నుంచి తిరిగి వస్తూ ,చలిజ్వర పీడితుడై మద్రా స్ ఆస్పత్రిలో

చనిపో యాడు .ఇతని ఆశయం ‘’ఆంధ్రు లు చేతకాని వారు ‘’అన్న అపప్రదను తొలగించటమే .దక్షిణ దేశయాత్ర చేసి

అరవగాయకులను ఓడించాలనే కోరిక గాఢంగా ఉండేది .దీన్ని శ్రీ హరినాగాభూషణం కు ఉపదేశించాడు .సుబ్బయ్య

సంగీతం ఆజన్మ సిద్ధం .కారణమాత్ర గురు ప్రవర్ధితం . ఇంతటి గాయక శిరోమణి గురించి తెలుగు వారంతా మరచి

పో వటం దురదృష్ట ం .పొ న్నూరులో నైనాఆయన స్మారకం ఉందొ లేదో ? పొ న్నూరు వాస్త వ్యులు,సంస్కృత కాలేజి

రిటర్డ్
ై ప్రిన్సిపాల్ డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,అక్కడే సంస్కృత లెక్చరర్ చేసి రిటైర్ అయిన

డా నిష్ఠ లసుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారణాసి రామసుబ్బయ్య మహాగాయకుని కి స్మృతి చిహ్నం అందరి తోడ్పాటుతో

ఏర్పాటు చేసి నవతరానికి స్పూర్తి కలిగించమని వేడుతున్నాను .

శిష్యులు –తూములూరి హనుమచ్చాస్త్రి ,నిరాఘాటం రామకోటయ్య ,వెంపటి సూర్యనారాయణ ,తాడిగడప శేషయ్య

,రావు సూరయ్య ,మాధవరావు ,లంకా లింగయ్య ,కోడూరి హుళక్కి ,అమ్బతిపూడి సుబ్బయ్య ,పొ న్నూరి

ముసలయ్య ,,రావు వెంకటరావు ,చల్లా పిచ్చయ్య శాస్త్రి .శేషయ్య గానరచన.స్వరప్రస్తరణ అమోఘం సంగీత

రహ్స్యబో ధిని గ్రంధం రాశాడు .


ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ

మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’.

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -19

ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 6

30-కాశీ భట్ల లక్ష్మణ శాస్త్రి –గరికపర్తి కోటయ్య దేవర శిష్యుడు .కస్తూ రివారి సావరం నివాసి .చిన్నప్పుడే ఫిడేలు,

గాత్రం నేర్చి తోడి ,శుద్ధ సావేరి రాగాలలో వర్ణా లు రచించి చాలామందికి నేర్పాడు .1944 లో చనిపో యాడు

.కొడుకులు కామేశ్వరావు గణపతి కాశీపతి తబలా హర్మని నిపుణులు .

31-చంద్రా భట్ల కనకయ్య –మార్టేరుదగ్గ ర తామరాడ అగ్రహార వాసి .కల్యాణి ఖమాచి ,బిలహరి వసంత

శంకరాభరణం ,భైరవి రాగాలలో స్వరజతులు రాశాడు .

32-పారు పల్లి రామకృష్ణ య్య పంతులు (1883-1951)-1883 స్వభాను సంవత్సర౦లో కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో

జన్మించారు .శేషాచలం ,మంగమాంబ తలిదండ్రు లు .శ్రీ వత్స గోత్రం .1902 లో తెలుగురాయలపాలెం కు కరణీక౦

చేసి ,నాలుగేళ్ళకే రిజైన్ చేశారు .గానకళ హృదయం లో మెరుపులాగా మెరిసింది .ఆ తళుకులో సుసర్ల దక్షిణా

మూర్తి శాస్త్రిగారి పాదపద్మాలు మనోహరాలై కనిపించి స్పూర్తి నిచ్చి ,ఆ చరణకమల దాసులు ,సన్నిహితులై

జ్ఞా నదీప్తి పొ ందారు .శాస్త్రిగారి వద్ద పెదకళ్ళేపల్లి లో 12 ఏళ్ళు గురుకులవాసం చేసి నమ్రత సూక్ష్మబుద్ధి తో

గురుమనసు రంజింపజేసి ,గురువే దైవంగా భావించి ,గురూపదేశం పొ ంది చరితార్ధు లయ్యారు .

కాకినాడ గాన సభలో తన సత్తా చాటి ,అనేక సార్లు దక్షిణ యాత్రలు చేసి గాన కళారహస్యాలు ఆమూలాగ్రం

నేర్చారు .తిరువయ్యారు శ్రీ త్యాగారజారాధనోత్సవాలు చూసి ,బూదలూరి కృష్ణ మూర్తి శాస్త్రి గారి గోటు వాద్యకచేరీలో

ఫిడేలు నైపుణ్యం చూపి మామ్గు డి చిదంబర భాగవతార్ ,పంచాపకేశన్ మున్నగు విద్వత్ ప్రముఖులమన్ననలు

పొ ందారు .పంతులుగారి గాన కళా వైభవాన్ని వార౦తా ఎంతగానో మెచ్చుకొన్నారు .వాయులీన నిపుణత సున్నిత

గాత్రం తో అందరినీ ఆకర్షించేవారు .శాంత దమాది సద్గు ణ గరిస్టు లు.శుద్ధ వాణి ,శుద్ధ ముద్ర పారుపల్లివారి ప్రత్యేకత

.శాస్త్రిగారి శిష్యులలోమేటి .40 ఏళ్ళు ఆంద్ర దేశాన్ని గానంతో ఉర్రూ తలూగించి దాక్షిణాత్య గానాన్ని బంగారుపల్ల కీలో

ఊరేగించారు .1916 లో గురువుగారితో బరోడా పరిషత్తు కు వెళ్లి ,ఆంద్ర సమాజం చేత సన్మానం .
1931 లో నరసరావు పేటలో పిరాట్ల శంకర శాస్త్రి అధ్యక్షత న జరిగిన సారస్వత పరిషత్తు లో ‘’గాయక సార్వ భౌమ

‘’బిరుదప్రదానం చేసి ఘన సత్కారం చేశారు .1933 లో మద్రా స్ సంగీత పరిషత్ విద్యాప్రవీణ సలహా సభ్యులయ్యారు

.1943 లో పంతులుగారి షష్టిపూర్తి మహో త్సవం నభూతో గా జరిగింది .1917 లో విజయవాడలో త్యాగరాజ శత

వార్షికోత్సవం ఘనంగా చేశారు .విజయవాడలో ‘’త్యాగరాజ సంగీత పరిషత్ ‘’ను స్థా పించి ,ప్రతియేటా పండిత

సభలు వాగ్గేయకారులవార్షికోత్సవాలు జరుపుతూ సత్కరిస్తూ ప్రో త్సహించారు .’’రాగ తాళ భావ ప్రవృత్తు లు ప్రజ్ఞా న

సమన్వితాలు ‘’అని చెప్పేవారు .చాలా గాయక సభలకు అధ్యక్షులు తిరువయ్యార్ ,పూనా ,మద్రా స్ మొదలైన

పట్ట ణాలలో కచేరీలు చేసి మహాసత్కారాలు పొ ందారు .పంతులుగారి శిష్యులు ప్రస్తు తం ‘’రామకృష్ణ గాంధర్వ విద్యా

పీఠం’’స్థా పించి బెజవాడలో నిర్వహిస్తు న్నారు .సహపాఠులు-వెంపటి వెంకట కృష్ణ య్య,చల్ల పల్లి పంచానదేశ్వరం

,ద్వివేదుల లక్ష్మన్న ,దుడ్డు సీతారామయ్య ,చల్ల పల్లి సుబ్బయ్య ,దాలిపర్తి రామస్వామి .

శిష్యులు –చిలకలపూడి వెంకటేశ్వర శర్మ ,మంగళం పల్లి బాల మురళీ కృష్ణ ,వంకదారి వెంకట సుబ్బయ్య

,దాలిపర్తి పిచ్చిహరి , ధూళిపాల సో దరీమణులు ,వంగల వాణీ బాయమ్మ ,యశోదమ్మ ,లక్ష్మీ నరసింహ శాస్త్రి ,శిష్ట్లా

రాజశేఖర శాస్త్రి మొదలైనవారు .

33-దుడ్డు సీతారామయ్య –(1853-1951)-తండ్రి దుడ్డు కామశాస్త్రి అధ్యాత్మరామాయణ ,అష్ట పదులు ,తరంగ

ప్రవీణుడు .తల్లి సుబ్బమ్మ .తండ్రివద్ద సంగీతం నేర్చి ,స్వయంగా తనూ కొంత నేర్చి తృప్తిపడక దేశాటనం చేసి

,అనేక గురువులవద్ద విద్య అభ్యసించి గానరహస్యాలు నేర్చిన ఏక సంద గ్రా హి .చివరకు సుసర్ల వారి ని చేరి

4 నెలలలో సకల గాన రహస్యాలు అవగతం చేసుకొన్నాడు .మద్రా స్ లో తిరువత్తూ ర్ త్యాగయ్యవద్ద కొత్త గాన

విషయాలు నేర్చి జంత్ర గాత్రా లలో అసమాన ప్రజ్ఞా ధురీణుడయ్యాడు .’’మూడు సంగీత అవధానాలు’’ చేసిన

మహాగాయక మణి.వేదమూల అష్టా వధానం ,గణితావధానం ,సంగీత అవధానం చేసిన ఘనుడు .సంగీత అవధానం

అంటే –రాగ తాళ,కాల జాగా గతి జాతి భేదాలు చేసి గాత్రం తోపాడుతూ ఫిడేలుపై వాయి౦చటం. గణితావధానం

అంటే –కోరిన జాగాలలో షట్కాలాలలో రెండు చేతులతో తాళాలు వేస్తూ ,కాలాలు మార్చి వ్యస్తా క్షరీ ఘంటనాదాలతో

కలిసి అవధానం చేయటం .పద్యకవిత్వం లో పూర ణాలు అసాధారణంగా చేసేవాడు .

పిఠాపురం సంస్థా నం లో గణిత అష్టా వధానం చేస్తు ంటే ,మద్రా స్ గవర్నర్ 24 అక్షరాల న్యస్తా క్షరి నివ్వగా

సునాయాసంగా చేసి మెప్పు పొ ంది రాజాగారు తమ ఆస్థా న విద్వాంసులుగా ఉండమని కోరారు .అప్పటికే

10 ఆస్థా నాలనుండి గౌరవ వార్షి కాలు పొ ండుతు౦డటంతో సున్నితంగా తిరస్కరించాడు ,కాకినాడలో చల్లా

సుబ్బారావు సింహతలాట మురుగులు ,పత్రి రామచంద్ర రావు స్వర్ణ మాల చేయించి గౌరవించారు .అక్కడి
పామర్రు లో సంగీత పో టీలో వెయ్యినూటపదహారు రూపాయలు పందెం గెలిచాడు .జంగారెడ్డి గూడెం లో మాడుగుల

సుబ్బారావు అరఎకరం పొ లం రాసిచ్చాడు .గోడే వారి ఎస్టేట్ లో ఆహిరి, రీతి గౌళ రాగాలు అద్భుతంగా పాడగా

ఓలేటి కామరాజు పంతులు గారు 200 ఎకరాల భూమిని శాశ్వత దానపత్రంగా రాసిచ్చాడు .నూజివీడులో

మీర్జా పురం రాజా కల్యాణం సందర్భంగా అష్టా వధానం లో హుసేని రాగాలాపన చేసి మెప్పించి

‘’మహామహో పాధ్యాయ ‘’బిరుదు పొ ందాడు .ప్రా చీన గీతాల లక్షణ ప్రబంధాలు ఇతనివద్ద చాలాఉన్నాయి .నిశిత

ప్రజ్ఞా దురంధరుడు,ప్రజ్ఞా శీలి దుడ్డు మహాదొ డ్డ గాయకుడు కూతుళ్ళుకూడా మాహా గాయనీమణులే

.ముఖ్యశిష్యుడు వింజరం గ్రా మానికి చెందిన మహేంద్రవాడ బాపన్న శాస్త్రి .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ

మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’.

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -20(చివరిభాగం )

ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 7(చివరిభాగం )

34-పిరాట్ల శంకర శాస్త్రి (1884-1950)-తారణ సంవత్సర భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు శ్రీశైల శాస్త్రి ,పిచ్చమా౦బ

లకు కృష్ణా జిల్లా నందిగామ తాలూకా జయంతిపురం లో జన్మించాడు తండ్రి ఆంధ్రగీర్వాణ భాషాపండితుడు, దేవీ

ఉపాసకుడు .సో దరులు మృత్యుంజయశాస్త్రి ,శివరామ శాస్త్రి, సదాశివ శాస్త్రి .పెద్దా యన సాహిత్య నాటకాలంకార

విమర్శకుడు .చివరాయన చిన్నప్పుడే చనిపో యాడు .

శంకర శాస్త్రి నిస్టా గరిస్టు డు,శివపూజా దురంధరుడు ,సంగీత సాహిత్యవేత్త .శ్రీ వామ దేవ తీర్ధ స్వామి శిష్యరికం చేసి

వేదాంత శాస్త ్ర పాండిత్యం సాధించాడు .పద్యరచనా అలవాటు చేసుకొని శంకర శతకం రాశాడు .మొదట్లో పాపట్ల

లక్ష్మీ కాంతం వద్ద తర్వాత వీణ కుప్పయ్యకొడుకు ముత్యాల్పేట త్యాగయ్యవద్దా గాన పాండిత్యం సాధించాడు

.విజయనగరం గద్వాల అనపర్తి ఆత్మకూరు ముత్యాల సంస్థా నాలలో విద్యా ప్రదర్శన చేసి గొప్ప బహుమతులు

పొ ందాడు .కొంతకాలం గుంటూరులో ఉండి తర్వాత ముత్యాల రాజాస్థా న సంగీత విద్వా౦సుడయ్యాడు మద్రా స్

సంగీత పరిషత్ సభ్యుడు .కామవర్ధని, షణ్ముఖ ప్రియ ,భైరవి ,సింహేంద్రమధ్యమ రాగాలలో కీర్తనలు రాసి ,పాడి

సంగీత రత్నాకరం లోని విషయాలు విశదీకరించాడు .ఆంద్ర విశ్వకళాపరిషత్ సభ్యుడుగా ఎన్నుకోబడిన

మొట్ట మొదటి వాడైనాడు .గాత్రం లోనేకాక వీణ, ఫిడేలు ,మృదంగాలలో కూడా నిపుణుడు .రెండవ సంగీత పరిషత్

అధ్యక్షుడయ్యాడు .కొడుకులు మహాదేవ శాస్త్రి ,శ్రీగిరి శాస్త్రి .


35-పిరాట్ల శివరామ శాస్త్రి –బాల్యం లో వేదాధ్యయనం చేసి తర్వాత పాపట్ల వారివద్ద సంగీతం నేర్చి అసదృశ

ప్రజ్ఞా పాటవాలతో ,ఫిడేలు మృదంగాలపై జాతిపల్ల వులను అడిగిన రీతిలో వాయించే నేర్పరుడయ్యాడు .హైదరాబాద్

మద్రా స్ లలో కూడా కీర్తి గడించాడు .

36-బలిజేపల్లి సీతారామ శాస్త్రి 2-9-1885 న జన్మించాడు వీరివంశం సహజగానకళకు పెట్టిందిపర


ే ు .తలిదండ్రు లు

ఆదిలక్ష్మమ్మ ,నరసింహ శాస్త్రి .తండ్రి సంగీత సాహిత్య విద్యా సంపన్నుడు .తల్లి అధ్యాత్మరామాయణ కీర్తనలు,

తరంగాలు ,అష్ట పదులు పాడటం లో నేర్పరి .నాట్య వేదక


ి పై హృద్యమైన సంగీతం తో గుంటూరు బాణీనిర్మించి

రక్తికట్టించిన బహుళనాటకకర్త బలిజేపల్లి లక్ష్మీకాంతకవి ఈయన సో దరుడు . అన్నవద్ద సంగీతం నేర్చి,గానవిద్యా

దురంధరుడనిపించాడు.గానప్రతిభా దురంధరుడు కోయంబత్తూ రు రాఘవయ్య శిష్యుడు ప్రయాగ తిరుమలయ్య

గాన మెళకువలు గ్రహించాడు .పూచయ్య౦గార్, కోనేరి రాజాపురం గానాన్ని విని స్వంత ధో రణిలో గానం చేసి

మెప్పించాడు .ఇతనిది శుద్ధ తంజావూరు సంప్రదాయం .రాగభావం ,మనోహర సంగతులు సహజ స్వర పో కడలు

,సంచారాలు సద్య స్పురణ ఇతని ప్రత్యేకతలు .ఎప్పటికప్పుడు నూతన ప్రస్తా రాలతోపాడి ఇంపు గూర్చేవాడు .గాన

సంస్కార ప్రా బల్యం ,ప్రతిభ అసామాన్యమైనవి .అందుచేత అరవదేశం లోనూ సంగీతం తో దున్నేశాడు .

1917 లో కాశీనాధునినాగేశ్వరరావు పంతులుగారు మద్రా స్ కు ఆహ్వానించి కచేరి చేయించి ‘’స్వర్ణకంకణం

‘’ప్రదానం చేసి సత్కరించారు .శ్రీనివాస అయ్యంగార్ ‘’గానవిద్యాదురంధర’’ఆంద్ర గోష్టి సంస్థ ‘’గానకళాప్రపూర్ణ

‘’బిరుదప్రదానం చేసి సన్మానించారు .ఆదిభట్ల నారాయణ దాసుగారు ‘’స్వరసింహ ‘’బిరుదునిచ్చి పూజించారు

.కవిత్వం, జ్యోతిషం లలోకూడా పాండిత్యం ఉన్నది .1944 లో ‘’భక్త కల్పద్రు మ ‘’శతకం రాశాడు ఆ యేడాదే షష్ఠి

పూర్తి మహావైభవంగా జరిపారు ,.శిష్యులు –మహావాది వెంకటప్పయ్య శాస్త్రి దెందుకూరిశివరామ శాస్త్రి ,పన్నాల

వెంకటప్పయ్య లు .

37 –తాడిగడప శేషయ్య -1888-1950)-‘’సంగీత విద్వత్ జనరంజక స్వరనిది ‘’బిరుదాంకితుడు. ఒంగోలుతాలూకా

రావూరులో జన్మించాడు .పొ న్నూరులో పతూరిరామయ్యవద్ద కాళిదాసత్రయం పూర్తి చేసి ,సహజగానం తో పద్యాలు

జనరంజకంగా పాడేవాడు .మాతామహుడు, తల్లి సంగీతపాటకులు .ఇతడు గర్భంలో ఉండగా తల్లి ఒక రోజున

తెల్లవారుజామున మేలుకోలుపులపాటలు పూర్వరాగ సంచారం లో పాడుతుంటే ఈర్ష్య తో ఒక గాయకుడు ‘’చిత్త

చాంచల్య ప్రయోగం ‘’చేశాడు.దానిఫలిత౦ గా తల్లికి ,పిల్లా డికి కూడా మతి స్థిమితం తప్పింది .
పొ న్నూరులో తూములూరి హనుమచ్చాస్త్రి వద్ద కొన్ని గీతాలునేర్చి ఏక సంధగ్రా హి అవటం వలన వారణాసి

రామసుబ్బయ్యవద్ద కృతులు ,గానమర్మాలు నేర్చాడు .ఒకరోజు గురువుగారింటి పెరటిలో స్నానం చేస్తూ శేషయ్య

తోడి రాగాలాపన చేస్తు ంటే అతడే తన భవిష్యత్కర్త అని స్నేహితులకు చెప్పాడు .అప్పటిను౦చి శేషయ్య అనేక

కచేరీలు చేసి ,చల్ల పల్లి, మీర్జా పురం రాజాలచే సన్మానాలు పొ ందాడు .భావపూరితంగా త్యాగారాజకృతులను గానం

చేయగలగాయకుడు శేషయ్య ఒక్కడే అనే గొప్ప పేరు సంపాదించుకొన్నాడు .స్వరరాగ తాళజ్ఞా నం తో ,బహుచతుర

రాగాలాపన చేసేవాడు .ఎప్పుడూ పిచ్చివాడిలాగా తిరిగే మహాగాయకుడు గాన అవధూత తాడిగడప శేషయ్య

1950 లో 62 వ ఏట చనిపో యాడు .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ

మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరితల


్ర ు ‘’.

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు ‘’ఇంతటితో సమాప్త ం

సంగీత  పాణి నీయం

సంగీతం పాడటం ఒక ఎత్తు .అందులోని మెళకువలు గ్రహించటం మరో ఎత్తు .ఆ సంగీత రసజ్ఞ త ను శ్రో తలకే కాక,

కాక కాకలు దీరిని సంగీత  విద్వాంసులకు కర దీపక


ి గా మార్చి వెలుగు దారి చూపించటం మరో ఎత్తు .దీనినే

ఆయన సాధించి గురువులకు గురువు గుగ్గు రువు అని పించు కొన్నారు .శాస్త ్ర బద్ధ త కు కొల మానం గా నిలిచారు

.వ్రు త్తి వైద్యమే అయినా ప్రవ్రు త్తి సంగీతమై దాని వ్యాధులకు చికిత్చ చేసి ఆరోగ్యాన్నిచ్చారు .ఆ నాటి వ్యాకరణానికి

పాణిని ఎంతటి లబ్ధ ప్రతిష్టు డో ఈ నాటి కర్ణా టక సంగీతానికి పినాక పాణి అంతటి తేజో విరాన్మూర్తి .సంగీతానికి

ఆధునిక పాణిని పినాక పాణి .ఆయన పదవీ విరమణ  తరువాత జీవితాన్ని అనుక్షణం సంగీతానికే ధార పో సిన

మహాను భావుడు .ఎనిమిదేళ్ళు గా మంచం లోనే ఉంటున్నా వారి సంగీత విశ్లేషణా గమనం ఆగి పో లేదు .నోటిలోనే

మననం చేసుకొంటూ శిష్యుల చేత వ్రా యిస్తూ గ్రంధస్త ం చేస్తు న్న కారణ జన్ములు .దిగ్దంతు లైన సంగీత

విద్వాంసులకు ఆచార్యత్వం వహించిన ఘనత వారిది .సంగీత రస గుళికలను ఆంద్ర సంగీత ఆభిమానులకు

కరతలా మలకం చేసిన సంగీత శంకర భగవత్పాదులు .ఖగోళ రహస్యాలను కుర్చీలోనే కూర్చుని శరీరం

సహకరించక పో యినా విశ్వ నిర్మాణ రాహస్యాలను అవగాహన చేసి కోని ,అందరికి అర్ధ మయ్యే భాష లో అతి

గహన శాస్త్రీయ విజ్ఞా నాన్ని అందించిన స్టీఫెన్ హాక్ శాస్త జ్ఞు


్ర డు ఆయన లో కని పిస్తా డు .''సంగీతం ధ్వని నాట్యం

.దాన్ని పరిగెత్తు తూ నువ్వు ఎలా నృత్యం చేస్తా వు ''?అని ప్రశ్నించిన సంగీత శ్రీ పాదులు పినాక పాణి గారు .వారి
విద్వత్తు ను పద్మ భూషణ తో సరి పెట్టిన మన అల్పజ్నత కు తల వంచు కోవాలి .ఏ.వి.కే.రంగారావు గారు అన్నట్లు

ఆయన మనకు ''సంగీత స్వర నిఘంటువు ''.సంగీతానికి సరికొత్త పాత దారిని వెలుగుల తో నింపి చూపిన మార్గ

దర్శి .

                    బహుశా ముప్ఫై ఏళ్ళు పైగా  అయి ఉంటుంది -శ్రీ పాద వారిని విజయవాడ లబ్బీ పేట లోని శ్రీ

వెంకటేశ్వర దేవాలయం లో కంచి జగద్గు రువుల సన్నిధి లో కచేరి చేస్తు ండగా చూశాను .పట్టు పంచె కట్ట్టు కోని

పట్టు పై పంచె వేసుకొని నుదుట వీభూతి రేఖల తో '' అపర సంగీత 'పినాక పాణి ''(శివుడు )గా దర్శన మిచ్చారు

..అద్భుత మైన గానం తో శ్రో తలను అలరించారు .జగద్గు రు ల కు పరమ ప్రీతిని కల్గించి వారి చేత సత్కారం

అందుకొన్నారు .నాకు జ్ఞా పకం ఉన్నంత వరకు వారు కంచి పీఠం లో ఆస్థా న విద్వాంశులు అను కొంటాను

.అరుదైన గౌరవం పొ ందారు .ఆ సంగీత సరస్వతికి శత వసంతాల ఈ శుభ సమయం లో వారికి ద్వి శతాధికా

యుర్దా యం, ఆరోగ్యం కలిగించాలని భగ వంతుని ప్రా ర్ధిస్తు న్నాను .

తమిళనాడు తొలి సూపర్ స్టా ర్- త్యాగరాజ  భాగవతార్


మాయవరం కృష్ణ స్వామి త్యాగ రాజ భాగవతార్ అంటే తమిళనాడు తొలితరం వెండి తెర వేలుపు .అందరూ గౌరవంగా ,  ఆప్యాయంగా

M.K.T.అని పిలిచేవారు .నటుడు నిర్మాత ,కర్నాటక సంగీత గాయకుడు గా  మహా వితరణ శీలిగా ,అనన్యమైన కీర్తి సాధించి ఘనతకెక్కాడు

త్యాగరాజ భాగవతార్ .

  తమిళనాడు తంజావూర్ జిల్లా మాయిల్ల దుత్తూ ర్ లో 1-3-1910 లో విశ్వబ్రా హ్మణ కుటుంబం లో  జన్మించాడు భాగవతార్ .తండ్రి కృష్ణ

స్వామి ఆచారి .కొంతకాలానికి కుటుంబం తిరుచునాపల్లికి చేరింది .బాల్యం లోనే చదువుమీద శ్రద్ధ చూపక గాయకుడు కావాలని కలలు

కన్నాడు .కాని తలిదండ్రు లు అది గౌరవమైన  వృత్తి కాదని ప్రో త్సహించలేదు .కాని ఒకసారి ఆంద్ర దేశం లోని కడపలో కొడుకు  వందలాది

అభిమానుల సమక్షం లో పాటలు పాడుతూ ప్రశంసలు పొ ందటం చూసి తండ్రి సంగీతానికి ప్రో త్సహించాడు .  తర్వాత భజనలు భక్తి గీతాలు

పాడి జనాలను అలరించాడు .

  తిరుచ్చి లో’’ రసిక  రంజన సభ  ‘’అనే ఔత్సాహిక సంస్థ నిర్వాహకుడు ఎఫ్.జి .నటేశ అయ్యర్ భాగవతార్ లో ఉన్న ‘’ఫైర్’’ గమనించి

మొదటిసారి స్టేజిపై పాడే అవకాశం కలిగించాడు.తర్వాత తండ్రిని ఒప్పించి తన నాటకం హరిశ్చ౦ద్రలో ‘’లోహితాస్య ‘’పాత్రనిచ్చి నటి౦పజేశాడు

.పది ఏళ్ళు మాత్రమె ఉన్న  భాగవతార్ గొప్పగా నటించి అందరి అభిమానం పొ ందాడు .అక్కడి అనుభవమున్న నటులు ,దర్శకుల  వద్ద

శిక్షణ  పొ ందాడు ,కర్నాటక సంగీతాన్ని మదురై పొ న్ను అయ్యంగార్ అనే గొప్ప  వయోలిన్  విద్వాంసుని వద్ద  ఆరేళ్ళు కఠోరశ్రమ  చేసి

అభ్యసింఛి నిష్ణా తుడయ్యాడు .

  1934 లో వ్యాపార వేత్తలు లక్షణ చెట్టియార్ ,అలగప్ప చెట్టియార్ ,సినీ దర్శకుడు కే సుబ్రహ్మణ్యం లు భాగవతార్ అర్జు నుడుగా నటించిన

‘’పావలక్కోడి ‘’పౌరాణిక నాటకం చూడటం జరిగింది .అతని నటనకు ముగ్ధు డై చెట్టియార్ ,భాగవతార్ ను అదే కధాంశం కల సినిమాలో హీరో

పాత్రకు ఎంపిక చేసి మద్రా స్ అడయార్ లో చిత్రించి ,విడుదల చేయగా గొప్ప విజయం సాధించింది .దర్శకుడు సుబ్రహ్మణ్యం .భాగవతార్

రెండవ సినిమా  ఆ డై రెక్టర్ 1935 లో తీసిన నవీన సారంగధర .మూడవ సినిమా భాగవతార్ స్వయంగా’’ట్రిచి త్యాగరాజ ఫిలిమ్స్ ‘’బానర్ పై

1936 లో నటించి ,సమర్పించిన ‘’సత్య శీలం ‘’..ఇందులో మొదటిసారిగా ద్విపాత్రా భినయం కూడా చేసి ప్రేక్షకులకు బాగా దగ్గ రయ్యాడు

.అంటే సత్య శీలన్ పాత్రతో పాటు ,రాజ దర్బార్ లో ఆస్థా న గాయకపాత్ర కూడా ధరించాడు అన్నమాట .ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన

అవసరం కలగలేదు .వరుసగా చిత్రా లు వచ్చి వరించాయి .


   1937 లో దర్శకుడు వై వి రావు తీసిన ‘’చింతామణి ‘’సినిమాలో’’ బిల్వమంగళుడు’’గా నటించాడు .ఈ సినిమా  అత్యద్భుత విజయం

సాధించి  ఒక ఏడాది  నాన్ స్టా ప్ గా ప్రదర్శింప బడి  కనక వర్షం కురిపించి తమిళలో  తొలి రికార్డ్ బ్రేక్ సినిమా అయింది .సినిమాలో

భాగవతార్ పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి .ఆ గానామృతానికి జేజేలు పలికారు ప్రేక్షక జనం .అందులోని

’’మాయాప్రపంచత్తి ’’  పాటను ప్రతి గృహిణి ఇంట్లో కాఫీ చేస్తూ పాడేది ,భర్త ‘’రాధే ఉనక్కు  కోబం’’అనే పాటపాడేవాడు అని  తమిళ రచయిత

కల్కి కృష్ణ మూర్తి రాశాడు ,అంటే భాగవతార్ సినిమా అంతటి ప్రభావం చూపిందన్నమాట .అయితే ఈ పాటలను సరస్వతి స్టో ర్స్ వాళ్ళు

గ్రా మ ఫో న్ రికార్డ్ లు తెచ్చినా   దురదృష్ట వశాత్తు   వ్యాపార రహస్యాలు తెలియని భాగవతార్ పాడలేదు .ఈ సినిమా తీసిన ప్రొ డ్యూసర్ లు

రాయల్ టాకీస్ వారు  సినిమాపై వచ్చిన డబ్బుతో మదురై లో సినిమా హాల్ కట్టి ‘’చింతామణి ‘’పేరు పెట్టా రు  .

  అమెరికా దర్శకుడు ఎల్లిస్ ఆర్ డంకన్ భాగవతార్ నటుడుగా తీసిన ‘’అంబికా పతి ‘’సినిమా కూడా సక్సేస్ సాధించి రెండవ భారీ విజయం

ఆయనఖాతాలో జమ చేసి,చింతామణి రికార్డ్ బ్రద్దలు చేసింది .1938 లో శైవ మహాభక్తు డు శివ నీలకంఠ నయనార్ పాత్రను ‘’తిరు నీల

కంఠార్   ‘’చిత్రం లో ధరించాడు .ఇలా 1937 నుంచి 1944 వరకు 7 ఏళ్ళు తమిళ సినీ రంగాన్ని ఏలాడు భాగవతార్ .విలాసవంతమైన

భవనం నౌకర్లు చాకర్లు దానాలు ధర్మాలు తో ఇల్లు ఎప్పుడూ నిత్య కల్యాణం పచ్చ తోరణంగా ఉండేదని ,గుప్త దానాలు ఎన్నో చేశాడని

ఎందరెందరికో సాయపడ్డా డని ,’’రోజూ పన్నీరు తో మాత్రమె స్నానం చేసేవాడని’’ ప్రముఖ సినీ విశ్లేషకుడు శ్రీ ఇమంది రామారావు చెప్పారు

.అదొ క స్వర్ణ యుగం .

  గాయకుడుగా ఆయన భక్తి సంగీతానికే అధిక ప్రముఖ్యమిచ్చాడు .పాపనాశం శివన్ తో కలిసి ‘’ఉనయ్ అలై’’,నీలకంఠ,అంబా మనం

కన్నిదు,జ్ఞా నకాన్,సత్వ గుణ బో ధన,రాజన్ మహారాజన్ ,కృష్ణా ముకుందా మురారి ,రాదే ఉనక్కు కొబం ఆగాదది,వసంత ఋతు వంటి

ఎన్నో పాటలు రాసి పాడాడు .మొత్త ం 14 సినిమాలలో నటిస్తే దాదాపు అన్నీ రికార్డ్ బ్రేకర్స్ అయ్యాయి .అందుకే తమిళ తొలి సూపర్ స్టా ర్

అయ్యాడు త్యాగరాజ భాగవతార్ .1944 లో విడుదలైన ఆయన సినిమా ‘’హరిదాస్ ‘’మద్రా స్ బ్రా డ్వే దియేటర్ లో మూడేళ్ళు ప్రదర్శింప బడి

అన్ని రికార్డ్ లను బద్ద లు చేసింది .తమిళ సినీ రంగం లో తొలిద్విపాత్రా భినయనం చేసిన వారిలో మొదటివాడు భాగవతార్ కాగా,

రెండవవాడు చెన్నప్ప గా  రికార్డ్ సృష్టించారు .

  1944 లో భాగవతార్ ,కోయంబత్తూ ర్  స్టూ డియోయజమాని శ్రీరాములు నాయుడు లపై లక్ష్మీ కాంతన్ హత్య కేసు విషయం లో అభి

యోగం మోపబడి,అరెస్ట్ అయి , ప్రీవీ కౌన్సిల్ దాకా వెళ్లి మూడేళ్ళ తర్వాత 1947 ఏప్రిల్ లో భాగవతార్ విడుదలయ్యాడు .తర్వాత నటించిన

సినిమాలుఅపజయం పాలైనాయి .ఆ నాటి ముఖ్యమంత్రి అన్నాదురై ,భాగవతార్ ను D.M.K. పార్టీలో చేరమని ఎన్ని ఒత్తి ళ్ళు తెచ్చినా

జీవితాంతం భక్తు డుగానే ఉండిపో యాడు .భాగవతార్ సినిమాలకు కచేరీలకు దూరమైనకాలం  అన్నాదురైకి బాగా కలిసొ చ్చి తనపార్టీ ని

విపరీతంగా పెంచుకొనే అవకాశం వచ్చింది .

  జీవిత చరమాంకం లో దేవుడు ,గుళ్ళు పై ఆసక్తికలిగి దేశవ్యాప్త ంగా  తీర్ధ యాత్రలు చేసి జీవితం  సార్ధ కం చేసుకొన్నాడు .డబ్బుపైనా కీర్తిపైనా

వ్యామోహం వదుల్చుకొని అసలైన భాగవతార్ అని పించుకొన్నాడు .డయాబెటిస్ వ్యాధికి గురై ,ఇన్సులిన్ తప్పని సరి చివరి రోజులు

గడిపాడు .దీనికి బ్ల డ్ ప్రెజర్ కూడా తోడైంది .చనిపో వటానికి 10 రోజుల ముందు పో ల్లా చిలో కచేరి చేశాడు .అక్కడున్న ఒకాయన

డయాబెటిస్ కు ఆయుర్వేద మందు ఇస్తే వేసుకోగా ,తగ్గ క పో గా  వికటించి ప్రా ణాపాయం రాగా ,మద్రా స్ తీసుకు వెళ్లి జనరల్ హాస్పిటల్ లో

1959 అక్టో బర్ 22 న చేర్ఛి చికిత్స చేయించారు .ఒక వారం గడిచింది .అకస్మాత్తు గా నవంబర్ 1 సాయంత్రం 6-20 కి త్యాగరాజ భాగవతార్

59 వ ఏట మరణింఛి త్యాగరాజ శివ సన్నిధి చేరుకొన్నాడు .

  సహాయం చేయటం లో ముందు ఉండే భాగవతార్ బంధువుల ఇళ్ళల్లో వివాహాలకు ఉచితంగా సంగీత కచేరి చేసేవాడు  .సహాయ నిధులకు

ప్రతిఫలం ఆశించకుండా కచేరీ చేసేవాడు .రెండవ ప్రపంచ యుద్ధ ం ప్రా రంభమైనప్పుడు భాగవతార్ ను నాటకాలు ప్రదర్శించి వచ్చిన డబ్బును
రెడ్ క్రా స్ సంఘానికి ఇమ్మని బ్రిటిష్ ప్రభుత్వం కోరగా వెంటనే స్పందించి ,నాటకాలు ఆడి వచ్చిన డబ్బును  రెడ్ క్రా స్ కు అందించాడు

.యుద్ధ సమయం లో మద్రా స్ గవర్నర్ ఆర్ధ ర్ ఆస్వాల్డ్ జేమ్స్ హో ప్ యుద్ధ  నిధికి సహకరించమని కోరగా కచేరీలు చేసి నాటకాలు ప్రదర్శించి

వసూలైన ధనాన్ని యుద్ధ నిదిగా ప్రభుత్వానికి అందజేశాడు .యుద్ధ ం అయిపో యాక ప్రభుత్వం కృతజ్ఞ తగా ఆయనకు ‘’దివాన్  బహదూర్

‘’బిరుదు ప్రదానం చేయాలని  భావించి తెలియబరచగా తాను మానవత్వ కార్యానికి సాయం చేశానే కాని అవార్డ్ కోసం కాదని సున్నితంగా

తిరస్కరించిన త్యాగ ధనుడు .  తన పేరు త్యాగరాజును ,భాగవాతార్ ను సార్ధకం చేసుకొన్నా మహానుభావుడు త్యాగరాజ భాగవతార్ .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-19 –ఉయ్యూరు 

--

ఇది విన్నారా ,కన్నారా


ఇది విన్నారా ,కన్నారా !-1

1.’’గాయక సర్వ భౌమ ‘’బిరుదు పొ ందిన పారుపల్లి రామ కృష్ణ య్య  పంతులు గారు కృష్ణా జిల్లా శ్రీకాకుళ
క్షేత్రం లో 1882 డిసెంబర్ 5 న శ్రీ శేషాచలం పంతులు శ్రీమతి మంగమ్మ దంపతులకు జన్మించారు
2-పంతులు గారి షష్టి పూర్తీ నాడు వారికి విజయవాడ నగర వీధులలో గాజా రోహణ సన్మానం చేశారు
..ఏ సంగీతకారుడికీ ఇంతటి ఘన సన్మానం జరగ లేదు అదొ క రికార్డ్ .

3-శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ  పారుపల్లి వారి శిష్యులు .రామునికి సీత కృష్ణు నికి గీత ఎలాగో
అలాగే శిష్యులకొరకు పారుపల్లి వారు అన్నారు బాలమురళి .

4-పారు పల్లి యనెడి పావన నామంబు –విజయవాడ లోన వెలయ కున్న

  ఏ స్థితి ని గనెదమో ?ఏ గతి నుందుమో-మాద్రు శులగు మంద మతులు నేడు ‘’అన్నారు మహా
విద్వాంసులు శ్రీ నల్లా న్ చక్ర వర్తు ల కృష్ణ మాచారి గారు.

4-ఫిడేలు నాయుడు గారు అనే శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అంటే ఈశ్వరుడు తనదైన
సంగీతాన్ని నాయుడు గారి ‘’ద్వారా ‘’వెదజల్లి ఇంటిపెరైన ద్వారం ను సార్ధ కం చేశారని శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట
శాస్త్రి గారు పద్యం లో కొనియాడారు.

5-రాజాజీ ‘’కళాసరస్వతి నాయుడు గారి వేళ్ళతో ఆడుకొంటుంది ‘’అన్నారు .

6-మృదంగ మహా విద్వాంసుడు  శ్రీ దక్షిణా మూర్తి పిళ్లే ,నాయుడుగారి ఫిడేలు కచేరి చూసి వారి వ్రేళ్ళను
కళ్ళకు అద్దు కొన్నారు .

7-వయోలిన్ కు గౌరవం తెచ్చిన వారు ద్వారం వారే .

8-నాయుడుగారికి అయిదారేళ్ళ వయసులో చూపు మందగించి క్షీణిస్తే ,స్కూల్ టీచర్ వీరి అంధత్వాన్ని
పరిహసిస్తే చదువు మానేసి సంగీతం లో ప్రవశి
ే ంచారు .ఈ మేస్టా రే ఆ తర్వాత నాయుడుగారు కాకినాడ
సరస్వతీ గాన సభలో కచేరీ చేయగా విని ‘’నన్ను క్షమించరా –నిన్ను చిన్నప్పుడు అవమానించాను
‘’అని క్షమాపణ చెప్పారు .

9-విజయనగర సంగీత కళా శాలలో చదవాల్సిన నాయుడు గారు అక్కడ చదవకుండానే ప్రొ ఫెసర్ గా
మహా రాజా వారి చే నియమింప బడ్డ్డారు . విద్యార్దికాకుండానే సరాసరి ప్రొ ఫెసర్ అయిన ఆయన
గొప్పతనం ఎన్నదగినది .

10-సంగీత సరస్వతి శ్రీమతి వీణ ధనమ్మాళ్ రోజూ వీణ పై సాధన చేస్తూ చివరగా ‘’కృష్ణా ‘’అని వీణను
కింద పెట్టేసేది మళ్ళీ ఎవరు అడిగినా వాయించే ది కాదు .కాని ఒక సారి ద్వారం వారు ఈమె ఇంటికి రాగా
వారిపై గౌరవంతో కింద పెట్టిన వీణ తీసి మళ్ళీ వాయించి వారి గౌరవానికి తగినట్లు ప్రవర్తించింది .
11-పాశ్చాత్య వాద్యం అయిన వయోలిన్ ను మొదటగా భారతీయీకరణ చేసి మన సంగీతానికి
అనుగుణంగా మార్చినవారు సంగీత త్రిమూర్తు లలో ఒకరైన ముత్తు స్వామి దీక్షితులవారి తమ్ముడైన
బాల స్వామి దీక్షితులు .

12-పాశ్చాత్య సంగీత మర్మాలను అవగాహన చేసుకొని ,యే పాశ్చాత్య సంగీత పాఠం ఎదురుగా
లేకుండానే ,ఆ సంగీత రచనలను అతి తేలికగా వాయించే వారట ద్వారం వారు ..

13-నాయుడు గారిని మద్రా స్ లో ఉంచాలని శిష్యులు భావించి ఆహ్వానించారు .రెండుషరతులపైన వారు


అంగీకరించారు .ఒకటి తన విద్యా గురువు అన్నగారైన శ్రీ వెంకట క్రిష్నయ్య నాయుడు గారికి కొంత పారి
తోషికం తో  సన్మానించటం .రెండవది జబ్బు పడిన ఒక సంగీత విద్వా౦సు నికి ఆర్ధిక సాయం చేయటం
.అలాగే శిష్యులు స్పందించారు .ఆ జబ్బు పడిన సంగీత విద్వాంసుడు ఎవరో కాదు ఒకప్పుడు నాయుడు
గారు కచేరీ చేస్తు ంటే నాయుడుగారిని నిందిస్తూ ,అక్కడ తానూ రాసిన కరపత్రా లను ముద్రించి పంచి
పెట్టిన వారు ..ఎంతటి దయార్ద్ర హృదయులో నాయుడు గారు దీన్ని బట్టి తెలుస్తు ంది .

14-నాయుడుగారి కళ్ళకు ఆపరేషన్ చేయిస్తా మని చాలా ముందుకు వచ్చారు .వారికి అది ఇష్ట ం లేదు
దానికి కారణం గా ‘’సంగీతానికి మనో నేతం్ర అవసరం .నాకుబాహ్య నేత్రా లు లేవు కనుక నా మనో నేత్రా న్ని
వికసింప జేసుకో గలిగాను .అందుకే నా సంగీతం పరి పక్వ దశకు వస్తో ంది .మన సంగీతం ఏకత్వాన్ని
సూచిస్తు ందికనుక  ఇది ఏక స్వర సంగీతం .దీనికి ఏకాగ్రత, తపస్సుకావాలి .కళ్ళు ఉంటె చూపు బుద్ధి
చాంచల్యం పొ ంది ఏకాగ్రత కుదరదు .అందుకే నా సంగీతానికి నా బాహ్య నేత్రా లను సమర్పించుకొన్నాను
‘’అని ఒక యోగిలాగా చెప్పారు .

15-‘’సంగీతం వినబడే ఒక తపస్సు .కర్నాటక సంగీతం శ్రా వ్య స్వరాల ద్వారా మోక్షాన్ని పొ ందే అతి తేలిక
మార్గ ం .ఇది నాద బ్రహ్మోపాసన .ఒక యోగాభ్యాసం ‘’అన్నారు నాయుడుగారు .

16-‘’నాయుడుగారి చేతి వ్రేళ్ళకు కన్నులున్నాయి .అలాగే మృదంగ విద్వాంసులు శ్రీ కోలంక వెంకట రాజు
గారి వ్రేళ్ళలో వీణ లున్నాయి’’అన్నారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

17-‘’ఈ వాయులీన సాహిత్య మాదుర్యముల్ –దేవతా స్త్రీ కంఠ దీప్త రావమ్ములో –


పారిజాతామోదభావమ్ములో –సురనదీ జీవమ్ములో!’’అన్నారు విశ్వనాధ

18’’నీ గాన నిర్ఝరి మోక్ష ద్వారమునకుమార్గ ం బని ‘’ద్వారం ‘’నీ ఇంటి పేరు దనరె’’అన్నారు .
ఆధారం –ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య రచించిన ‘’మన గాత్ర ,తంత్రీ వాద్య సంగీతవిద్యానిధులు
‘’గ్రంధం

ఇది విన్నారా ,కన్నారా !-2

19-శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ అసలు పేరు మురళీ కృష్ణ .కాని బాల్యం లోనే 9 వ ఏట  మొదటి
సంగీత కచేరీలు చేయటం తో ‘’బాల’’ మురళీ కృష్ణ అని పిలవటం తో అదే స్థిరపడి పో యింది .

20-బాల్యం లో బాలమురళి విజయ వాడలో చేస్తు న్న  సంగీత కచేరీ లో ప్రేక్షక స్థా నం లో కూర్చున్న
తిరుపతి కవులలో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు ‘’ఆగు ‘’అని కిందనుంచే అని ,వేదిక నెక్కి ‘’నా
వలెనే వృద్దు డవై-నా వలెనే కీర్తి కాంచి –నా వలెనే శ్రీ దేవి పద భక్తు డవై –భూ వలయము తిరుగు మోయి
‘’అని మూడు పద్యాలలో ఆశీర్వదించారు .అది పూర్తిగా ఫలించిందన్న సంగతి మనకు తెలిసిందే ..

21-బాలమురళి 12 వ ఏట తిరువయ్యూర్ లో సంగీత సద్గు రు శ్రీ  త్యాగ రాజ స్వామి వారి ఆరాధనోత్సవం
లో కచేరీ చేసి ‘’బాల గ౦ధర్వ ‘’బిరుదు పొ ందారు .

22-‘’చాలా మంది కర్నాటక సంగీత విద్వాంసులు ఒప్పు కోలేని ఒక గొప్ప అంశం ఒకటి ఉంది .అది
కర్నాటక సంగీతం కన్నా హిందూ స్థా నీ  సంగీతం లో శ్రో తలు ఎక్కువగా రక్తిని అనుభ విస్తా రు అన్నది
.అయితే  కర్ణా టకలోని ప్రౌ ఢత్వాన్నిహిందూ స్తా నీలోని రక్తిమను జోడించి పాడగల మేటి గాయకుడు శ్రీ
బాల మురళీ ఒక్కరే ‘’అన్నారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .
23-‘’ఆచార్య వీరభ్ద య
్ర ్యగారికి వీణ అన్నా వీణ విద్వా౦సులన్నా మహాప్రేమాభిమానాలున్నాయి .అందుకే
శ్రీ పుదుక్కోటై వీరిని ‘’వీణ ‘’భద్రయ్య అన్నారు .శ్రీ ఎస్ .బాల చందర్ గారిలో ఉండే బరువైన ‘’మీటు ‘’వీరి
వాయిద్యం లో కనిపిస్తు ంది ‘’అన్నారు వరంగల్ ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ దుడ్డు
సీతారామయ్య .

24-‘’సాహిత్యం స్పష్ట ంగా పాడితే లలిత సంగీతమని వెక్కిరిస్తా రు .స్వర స్థా నం మీద నిలిపి పాడితే
హిందూ స్థా నీ అని వేళాకోళం చేస్తా రు .హిందూ స్తా నీని మిక్స్ చేసి  పాడుతున్నాను అంటారు నన్ను
.అసలు మిక్స్ చేయటం ఏమిటి ?హిందూ స్థా నీ మన పిల్లల్లో ఒక పిల్ల సుమా ‘’అంటారు బాలమురళి .

25-‘’దాక్షిణాత్య సంగీతాన్ని కర్నాటక సంగీతం అని యే శాస్త ం్ర లో ఉంది ?సంగీత రత్నాకరం లో ఉందా ?
త్యాగ బ్రహ్మ చెప్పారా ?’’అని ప్రశ్నిస్తా రు బాలమురళి .దీనికి వీరభద్రయ్యగారు వివరణ ఇస్తూ
‘’వాగ్గేయకారులైన ముత్తు స్వామి దీక్షితులవారి కీర్తనలలో హిందూ స్థా నీ బాణీలు లేవా ,ఆ బాణీలలోని
రాగాలను వారు తీసుకోలేదా ?స్వాతి తిరుణాల్ రచనలలోను ఈ లక్షణం లేదా అంటూ ‘’వాతాపి గణపతిం
భజే ‘’అన్న కీర్తన రచింప బడిన ‘’హంసధ్వని రాగం ‘’హిందూ స్థా నీ నుంచే వచ్చిందని ఒక సంగీత మహా
మహో పాధ్యాయులు అనలేదా ?అని చెప్పారు .అంతేకాదు దీక్షితులవారి ‘’నీరజాక్షి కామాక్షి ‘’ని పూర్తిగా
హిందూ స్థా నీ పద్ధ తిలో ఒక విద్వాంసుడు పాడగా వీణ పై వాయించగా  తానూ విన్నానని మరి
అలాంటప్పుడు బాల మురళిని ఎందుకు తప్పు పడుతున్నారో అర్ధ ం కావటం లేదని ఆచార్య వీణ(ర
)భద్రయ్య అన్నారు .

26-‘’మనకున్న మంత్రా ల సంఖ్య 7 లక్షలట..అందులో తొంభై తొమ్మిది శాతం మృత మంత్రా లే నట .అంటే
జీవన్మంత్రా లు కొన్ని వందలే నన్నమాట .అవతార పురుషులు అవతరించి అనేక మృత మంత్రా లకు
ప్రా ణం పో స్తా రట .అలాగే రాగాలన్నీ ప్రా ణప్రదాలు కావు .గాయకుని ప్రతిభా విశేషం వలన నే వాటిల్లో జీవం
కలుగుతుంది .ఈ విధంగా బాలమురళి అనేకానేక రాగాలకు నూతన ప్రా ణ దానం చేశారు .అంతేకాక
72 మేళ కర్త రాగాలలోను కీర్తనలను సంగీత యుక్త ం గా కట్టి వాగ్గేయ కార చరితల
్ర ో సుస్థిర స్థా నం
సంపాదించుకొన్నారు బాల మురళి ‘’అని బాలమురలిలోని వైశిస్ట్యాన్ని  ఆవిష్కరించారు ఆచార్య .

27-‘’ఆయనను  మహా గాయకునిగానే చూస్తా ం కాని ఆయన తనను ‘’వాగ్గేయ కారుని ‘’గా
చూడమంటారు బాల మురళి .నిజమే వారు 400 దాకా రచనలు చేశారు. వర్ణా లు ,కృతులు జావళీలు
తిల్లా నాలు రచించారు .బాలమురళి తిల్లా నా వంటిది’’ నభూతో న భవిష్యతి’’ .గ్రహ భేదం తో వారొక
తిల్లా నాలో సాధించిన అందం అంతాఇంతా కాదంటారు ఆచార్యులవారు .ఏ పాఠశాల విద్యా లేకుండా
ఎవరివద్దా సంస్కృతాంద్రా లు  నేర్వకుండా శతాధిక కృతులు రాశారు .సంగీతాన్ని మాత్రం త్యాగ రాజ
స్వామి ప్రశిష్యులైన శ్రీ పారుపల్లి రామ కృష్ణ య్య పంతులుగారి వద్ద నేర్చారు దట్ ఈజ్ బాలమురళి
.సంగీత సాహిత్యాలు రెండూ బాలమురలికి దైవ దత్తా లే .

28-త్యాగ బ్రహ్మ నుంచిగురు పరంపరలో  నాలుగవ తరం వారు పారు పల్లివారు .త్యాగయ్య గారి
పాఠమే,పారుపల్లి వారు పాడినది దానినే బాలమురళి అనుసరించారు .

29-‘’మీరు ముందుగా సాహిత్య రచన చేసి దానికి సంగీతం కూరుస్తా రా “”?అని అడిగితే ‘’సాహిత్య ,సంగీత
రచనలు రెండూ ఏకకాలం లోనే చేస్తా ను .పాట పాడాక అది యే రాగం లో వచ్చిందో చూసుకొంటాను
‘’అన్నారు స్వరబ్రహ్మ బాలమురళి .

30-‘’ఏ పర్వీన్ సుల్తా నా ‘’లాంటి మధుర గాయనీ మణులో తప్ప ఇతరులు పాడలేని ‘’అతి తార షడ్జ మ
స్థా యి ‘’ని అలవోకగా అది రోహించి రాగల నేర్పు బాలమురళీ కృష్ణ గారికి వెన్నతో పెట్టిన విద్య .ఇతర
గాయకులు  తార పంచమం చేరటానికే విపరీతంగా రొప్పుతారు ‘’అన్నారు ఆచార్య వీర భద్రయ్యగారు.

31-‘’సంప్రదాయమొక బ్లూ ప్రింట్ మాత్రమే .బ్లూ ప్రింట్ రాగానే ఇల్లు దొ రికినట్లు కాదు .అందులో ఎవరూ
నివసించ లేరుకదా .బ్లూ ప్రింట్ ప్రకారం ఇల్లు కట్టు కొని అందులో ఉండాలి .కళాకారులు కావటం అంటే అదే
.కేవలం సంగీత పుస్త కాలు చదవటం కాదు .సంగీతాన్ని తెలుసుకోవటం వేరు .సంగీతానికి నీవు
తెలియటం వేరు .’’అన్నారు పద్మ విభూషణ్ బాలమురళి .

32-సాధారణం గా అయిదు స్వరాలైనా లేనిది రాగం విశదం కాదు .కాని బాలమురళి ప్రయోగాత్మకంగా
నాలుగు స్వరాలతోనే రాగం సృష్టించారు .లవంగి ,మహతి ,మనోరమ ,ఓంకారి ,ప్రతి మధ్యావతి ,రోహిణి,
సర్వశ్రీ  ,సుముఖం సుషమ వంటి కొత్త రాగాలు సృష్టించి ప్రా ణం పో శారు .

33-గాత్రం తో పాటు బాలమురళి వీణ వయోలిన్ ,వయోలా మృదంగం వాయించటం లోనూ ప్రసిద్ధు లు .

34-‘’సంగీతసరస్వతిని సంకుచిత పరిధుల లో నుంచి విముక్త ం చేసి ‘’భారతీయ సంగీతం ‘’అనే వినూత్న
పంధానేర్పరచిన మార్గ దర్శి శ్రీ బాలమురళీ కృష్ణ ‘’అన్న ఆచార్యుల వారి విశ్లేషణ నూటికి వెయ్యి శాత 0
యదార్ధ ం .

 
 ఇది విన్నారా ,కన్నారా !-3

35-సంగీత శాస్త్రీయతా పరిరక్షకులైన విద్వన్మణి శ్రీ శ్రీపాద పినాక పాణి గారి అన్నగారు శ్రీపాద గోపాల
కృష్ణ మూర్తి తెలుగు సాహిత్య విమర్శకులుగా బహు ప్రఖ్యాతులు .

36-పాణి గారు ద్వారం వారి శిష్యులు .పినాక గారు మద్రా స్ వెళ్ళేటప్పుడు అక్కడి నాదస్వర వాద్యాలూ
,శ్రీ అరియక్కూడి రామానుజయ్యర్ గారి కచేరీలు వింటూ ఉండమని హితవు చెప్పారు .దీన్ని గౌరవిస్తూ శ్రీ
పాణి వర్ణ ం కృతి రాగం ,నేరవు స్వర కల్పనా లను పరిశుద్ధ స్వరం తోతంజావూరు బాణీలో ప్రతిభా
వంతంగా పాడే అరియక్కూడి రామానుజయ్యర్ గారి ఒక్కరి సంగీతమే విని ,ఇతర బాణీలకు వశమై
పో వద్దు అని నాయుడుగారి సలహా గా భావించి ఔదల దాల్చారు .

37-‘’కర్నాటక సంగీతమే ఒక బాణీ .దీన్ని కల్తీ చేయకూడదు ‘’అని పాణిగారి నిశ్చితాభిప్రా యం .

38-చిన్నప్పటి నుంచి ఎవరి గానం విన్నా వాటిలోవిశేష సంగతులు సంచారాలను నోటు పుస్త కంలో
రాసుకోనేవారు .అందుకే వారి దగ్గ ర ఉన్న సంగీత పాఠం మరెవ్వరి దగ్గ రా లభించదు .దీని సాయం తోనే
నాలుగు సంపుటాల ‘’సంగీత సౌరభం ‘’రాశారు .

39-1947 లో శ్రీ రామానుజ అయ్యంగార్ ‘’కృతి మణి మాల ‘’గ్రంధాన్ని5 సంపుటాలుగా  తమిళం లో
వేడ్డా మనుకొంటే,శ్రీ పినాక పాణి గారి స్నేహం, సలహాతో తెలుగులోనూ ప్రచురిస్తూ పాణిని గారితో
సాహిత్యాన్ని రాయించారు .

40-తన స్వర పాఠంకన్నా ,ఏగాయకుడి పాఠమైనాబాగా ఉంటె దానినే సాధన చేయాలని శిష్యులకు చెప్పే
సౌజన్యం పాణిని గారిది .

41-మనో ధర్మ సంగీతాన్ని సాధన చేసి చూపించినవారు పాణి గారు .ఆయనది కల్తీ లేని శుద్ధ సంగీతం
.వారు సంగీత కులపతి.

42-పల్ల వి గాన సుధ ,మనోధర్మ సంగీతం అనే రెండు విశిష్ట రచనలు చేసి మార్గ దర్శకులయ్యారు పాణి
గారు

43-1100 కు పైగా కీర్తనలను స్వర పరచి రచించారు .ఇంత భారీగా సంగీత సేవ చేసన
ి వారు అరుదు .

44-దక్షిణాది సంగీతానికి సంరక్షకులుగా నిలిచిన అభేద్య దుర్గ ం డా .శ్రీపాద పినాక పాణి .


45-‘’సంగీత మహా మహో పాధ్యాయ ,సంగీత విద్వన్మణి ,నాద నిధి ,రాగ హృదయజ్న ,నాద సుధార్ణ వ
,సంగీత సార్వ భౌమ ,సంగీత క్షీర సాగర ,గానకళా గంధర్వ ,లక్ష్య లక్షణ మార్తా ండ ,సంగీత సుధాకర
,అన్నమాచార్య విద్వన్మణి’’వంటి అనేక బిరుదులు  అందుకొన్నవారు శ్రీ నూకల చిన సత్యనారాయణ
గారు .

46-250 రాగాల లక్షణాలను వివరంగా తెలుపుతూ ఉదాహరణలతో సహా ‘’రాగ లక్షణ సంగ్రహం
‘’గ్రంధాన్ని రచించిన  విద్వాద్వరేణ్యులు నూకల వారు .

47-త్యాగ రాజ స్వామి వారి పంచ రత్న కీర్తనలలో ఉన్న సంగీత సాహిత్య విశేషాలను తెలియ జేస్తూ
ఇంగ్లీష్ లో నూకలవారు ‘’Monograph of Tyagaraja;s  Pancha  Ratna krutis ‘’ అనే వ్యాఖ్యాన గ్రంధం
రాశారు .

48-శ్రీ ముత్తు స్వామి దీక్షితులవారి ప్రసిద్ధ ‘’నవావరణ కీర్తనలకు ,నవ గ్రహ కీర్తనలకు స్వరం సాహిత్యార్ధ ం
తోవిశేష గ్రంధం రాశారు .

49-‘’సంగీత సుధ’’అనే పాఠ్య గ్రంధం తోపాటు ,త్యాగరాజ క్రు తులన్నిటి పైనా వ్యాఖ్యాన రచన చేశారు .

50-అంతర్జా ల విప్ల వాన్ని గ్రహించి ,సంగీత విద్యకు దాన్ని అన్వయిస్తూ ‘’Listen and Learn ‘’పేరుతొ
40 ఆడియో కేసెట్లు తయారు చేశారు .

51-శ్రీ బాలమురళి తో కలిసి నూకలవారు ఒక ఏడాది జంట గాన కచేరీ చేశారు .ఇద్ద రూ కలిసి  కాంభోజి
,కానడ రాగాలలో పాడిన వాటిని 45R.P.M.రికార్డ్ గా విడుదల చేశారు .

52-నూకలవారు గానం తో పాటు వయోలిన్ ,వయోలా వాయిద్యాలలోనూ నిష్ణా తులే .

53-పవిత్ర హృదయాలు సినిమాలో నూకల .బాలమురళి  జంట ‘’నారాయణ రెడ్డి గారి ‘’కరుణామయి
శారద ‘’పాట పాడారు.

54-శ్రీ సత్య సాయిబాబా  స్థా పించిన సంగీత కళాశాల మొదటి ప్రిన్సిపాల్ ను అధ్యాపకులను  నూకలవారి
తోనే సెలెక్ట్ చేయించారు బాబా .

55-నూకల వారిగాననికి మెచ్చి సత్య సాయిబాబా ఒక ఎమరాల్డ్ ఉంగరం సృష్టించి బహూకరించి


ఆశీర్వదించారు .
56-శ్రీ కంచి పరమాచార్యులు ‘’నూకలవారిది దివ్య సంగీతం ‘’అని మెచ్చారు .

57-షట్కాలపల్ల వి పాడే శ్రీమతి మండా సుధారాణి ని నూకలవారు బహుదా మెచ్చుకొంటారు .

58- గాయత్రి,పంచాక్షరి ,వెంకటేశ్వరోపాసన ,లక్ష్మీ గణపతి ,సరస్వతీ మంత్రా లను నిత్యానుస్టా నంగా
పాటిస్తా రు .

59-‘’ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవత్యైః-వీం వీణాయైః మమ  సంగీత విద్యాం ప్రయచ్చ స్వాహా ‘’అనే’’
వీణా౦బ జపం నిత్యం ‘’చేస్తా రు .

60-‘’సంగీత క్షేత్రం లో ఎవరెస్ట్ శిఖరం శ్రీ నూకల చిన సత్యనారాయణ గారు ‘’అన్న ఆచార్య ముదిగొండ
వీరభద్రయ్య గారి పలుకు అతిశయోక్తి కాదు.
  ఇది విన్నారా ,కన్నారా !-5

8-వాయులీన విద్యా విశారద శ్రీ అన్నవరపు రామ స్వామి

76-వాయు లీన విద్యా విశారదులైన శ్రీ అన్నవరపు రామస్వామి శ్రీ బాల మురళీ కృష్ణ కు అనేక వేల
కచేరీలలో వయోలిన్ సహకారం అందించారు .

77-విజయవాడ ఆకాశ వాణి కేంద్రం లో వయోలిన్ విద్వాంసులుగా చేరి అక్కడే పదవీ విరమణ చేశారు .

78-స్వామి గారు ఇంటి దగ్గ రే సంగీత విద్యార్ధు లకు గాత్రం వీణ వయోలిన్ లను ఒక్క పైసా కూడా
తీసుకోకుండా ఉచితం గా నేర్పిన ఉదారులు .

79-శ్రీ పారుపల్లి రామ కృష్ణ య్య పంతులుగారి వద్ద గురుకుల పద్ధ తిలో వారి౦ట్లో నే ఉండి 1941 నుండి
48 వరకు ఉచితంగా సంగీతం అభ్యసించారు .వీరితండ్రి శ్రీ పెద్దయ్య గారుకూడా ప్రముఖ విద్వాంసులే .8
రకాల తాళ వాద్యవాదనలో నిపుణులు .
80-రెండవ క్లా సు వరకే చదివిన స్వామిగారు 1948 నుండి 1986 వరకు విజయవాడ ఆకాశ వాణి లో
ఉద్యోగించారు .

81-నాద సుధార్ణ వ ,గాన కళానిధి రామస్వామిగారు తామ గురువులు రామ కృష్ణ య్య గారు
విజయవాడలో సంగీత కళా శాల స్థా పనకోసం కొంత భూమి నిచ్చి ,పునాది వేసి   చనిపో తే ,స్వామిగారు
ఆనాటి పార్ల మెంట్ సభ్యురాలు శ్రీమతి  మోతే వేదకుమారి గారి   తో ఈ విషయం  ప్రస్తా వించగా ఆమె
వెంటనే ఆనాటి మంత్రి శ్రీ ఎస్ .పి.పట్టా భిరామా రావు గారితో చెప్పి విజయవాడలో సంగీత కళాశాల
మంజూరు చేయించగా నిర్మింపజేసి  గురు ఋణం తీర్చుకొన్నారు .పునాది గురువుగారిది భవన నిర్మాణం
శిష్యునిది .

82-రామస్వామిగారు విజయవాడ  గాంధి నగర్ లో  గురువులు గాయక సార్వ భౌమ శ్రీ పారుపల్లి రామ
క్రిష్నయ్య గారి కాంశ్య విగ్రహ ప్రతిస్టా పనం చేయించారు.అంతటి గురు భక్తి వారిది .

83-‘’సప్త గిరి సంగీత విద్వన్మణి ‘’స్వామిగారు చడువేమీ లేక పో యినా ఛందో భంగం లేకుండా పాంచాలీ
రీతిలో రస గుళికలలాంటి రచనలు చేసిన వాగ్గేయ కారులు .

84-వయోలిన్ సో లో వాయించటం లో రామ స్వామి గారు ఎంత నిష్ణా తులో సహకార వాద్యం లోనూ
అంతే చతురులు .వారు సహకార వాద్యం వాయిస్తే ‘’పట్టు పరుపు మీద పడుకొన్నట్లు ఉంటుంద’’న్నారు
ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు .

85-ప్రక్క వాయిద్యం వాయిస్తు ంటే ‘’కూరలో సరిపడా ఉప్పు ఉన్నట్లు గా ఉండాలి .ముఖ్య కళాకారుడు
,వయోలిన్ కలిసి పాడినట్లు ౦డాలి’’అంటారు’’ స్వామీ’’జీ .

86-హంస పురస్కార గ్రహీత ,ఆకాశ వాణి ఆడిషన్ కమిటీ సభ్యులు అయిన స్వామిగారు అనేక దేశాలలో
సో లో కచేరీలుచేశారు  సహకార వాద్యమూ  వాయించారు .అయినా రవ్వంత గర్వం కాని ఈర్ష్యా
అసూయలు కాని లేని పూర్ణ పురుషులు .

87-‘’నేను దేనికీ భయపడను –ఒక్కశ్రు తి,లయలకు తప్ప ‘’అంటారునిర్భీకులైన  పండిన వాయులీన


ఘనులు శ్రీ అన్నవరపు రామ స్వామి .
     ఇది విన్నారా ,కన్నారా !-4

6-శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి

61-సంగీత కళానిధి సంగీత విద్యానిధి శ్రీ నేదునూరి కృష్ణ మూర్తిగారికి భారత ,అమెరికాలలోని 24 సంగీత
సభలు 24 బిరుడులిచ్చి సత్కరించాయి .అందులో అన్నమాచార్య సంకీర్తన కిరీటి ,సంగీత సామ్రా ట్
వంటివి ఉన్నాయి .ఈ సంఖ్య గాయత్రీ మంత్రా క్షరాల సంఖ్యకు సమానం అంటారు ఆచార్య వీరభద్రయ్య .

62-నేదునూరి వారికి సంగీత విద్యలో తెలియని రహస్యం లేదు .సంగీత విషయం లో వారి
అభిప్రా యాలను బహు నాగరికంగా తెలియ జేయటం వారి సంస్కారం .

63-60 ఏళ్ళు శాస్స్త్రీ య సంగీతన సాధనం లో జీవితాన్ని ధన్యం చేసుకొన్న శ్రీ శాస్త్రి గారు అన్నమయ్య 
60 సంకీర్తనలను రెండు సంపుటాలుగా స్వర పరచి ప్రచురించారు .అన్నమయ్య కృతులను పాడి 3
కాసెట్లు వెలువరించారు .64-‘’జిరాక్స్ కాపీ లాగా ఎవరూ పాడలేరు .ఎవరి మనోధర్మం వారిదే
.మాడ్యులేషన్ లో తేడా ఉంటుంది .దాని వలన  వ్యక్తిగత అందం పెరుగుతుంది .సంగతులు వేరే అయినా
పాడటం లో ఏదో మార్పు ఉంటుంది .అందుకే ఎవరి గాత్రం వారికి ప్రత్యేకంగా ఉంటుంది ‘’అంటారు
నేదునూరి వారు .

65-‘’సంగీతం ఆత్మజ్ఞా నాన్ని కూడా కలిగించాలి దానికి సాహిత్యం ఒక వెహికిల్ .సంగీత పరిపూర్ణ తకు
సాహిత్యం చాలా అవసరం .’’అన్నారు .

66-కీర్తన పాఠానికి నేదునూరివారు ఎంతో విలువ నిస్తా రు .ఈ నాటి కళాకారులు ఆర్ట్ నే ప్రదర్శిస్తు న్నారు
కాని  కీర్తన ,లయ,స్వర,కల్పనమొదలైన శాస్త ్ర విషయాలను బలహీనంగా చూపిస్తు న్నారని బాధ పడ్డా రు
.’’ఆర్ట్ ను శాక్రి ఫైస్  చేసేంత క్రిటికల్ పొ జిషన్ లోకి పో వద్దు ‘’అని సంగీత కళాకారులకు హితవు చెప్పారు .

67-కర్నాటక సంగీత వృక్షానికి శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి గారు ఒక తురాయి పువ్వు .సంప్రదాయజ్నుడు
,విద్వచ్చిఖామణి,సంగీతమే తప్ప మరొక జీవితాంశం లేనివారు ‘’ .

7-సంగీత భీష్మ శ్రీ పురాణం పురుషో త్త మ శాస్త్రి

68-కర్నాటక సంగీత విద్వాంసులలో భీష్మా చార్యులుగా గుర్తింపుపొ ందిన శ్రీ పురాణం పురుషో త్త మ శాస్త్రి
గారు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం చేత నెలకు వెయ్యి రూపాయల గౌరవ పారితోషికం అందుకున్నారు .
69-ఆడిషన్ పరీక్ష లేకుండానే ఆకాశ వాణి లో ప్రసారాలు సాధించారు .సంగీత సరస్వతి ,గాన ధీర
,సంగీత చక్రవర్తి ,గాన రసార్నవ బిరుదులూ పొ ందారు .

70-తాన్సేన్ విశేష రాగం తో జ్యోతిని వెలిగించాడని ,దీక్షితులవారు అమృత వర్షిని రాగం పాడి వాన
కురిపించారని మనకు తెలుసు .ఆ రాగం  కీర్తనలోనే ‘’వర్షయ వర్షయ సలిలం ‘’అన్న మాటలున్నాయి.
పురుషో త్త మ శాస్త్రిగారు ఇతర రాగాలతో కూడా వర్షం కురిపించవచ్చని రుజువు చేశారు .’’ఖర హర ప్రియ
‘’రాగాన్ని మండు వేసవికాలం లో 9 రోజులు దీక్షగా పాడి వాన కురిపించిన ఘటికులు శాస్స్త్రి గారు
.వర్షా లకు పంతువరాళి శంకరాభరణ రాగాలూ పనికి వస్తా యని ,తెలియ జేశారు .సుమారు 30 ఏళ్ళ క్రితం
సన్నాయి పై చారు కేసి రాగాన్ని వాయించి పంట దిగుబడిని 60 శాతం పెంచారు మనవాళ్ళు .మోహన
రాగ ప్రస్తా రం చేస్తే వంద దిగ్రీలలోపు జ్వరాలు తగ్గిపో తాయని శ్రీ బాల మురళి అన్నారు .నవీనకాలం లో
గానం తో వర్షా వృద్ధి ని సాధించిన ఘనత పురుషో త్త మ శాస్త్రి గారిదే.

71-అక్బర్ పాదుషా ముందు గోపాల నాయక్ అనే సంగీతా విద్వాంసుడు యమునా నది నీటిలో గొంతు
వరకు మునిగి దీపక్ రాగం ఆలపించాడని దాని వలన నీళ్ళలోనే అగ్ని పుట్టి ఆ సంగీత విద్వాంసుడు
కాలిపో యి పిడికెడు బూడిద గా మారాడని ఒక ఐతిహ్యం ప్రచారం లో ఉంది .

72-‘’I am sure that turbulent lunatics could ,to a very large extent ,be made amenable and to
some extent quieted by Neelambari or ydukula Kambhoji ‘’అని ‘’ఫాసేట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్
‘’పుస్త కం లో శ్రీ శ్రీనివాసన్ రాశారు .

73-పిరికి తనాన్ని పో గొడుతూ ,తమ సమస్యలను తామే పరిష్కరించుకొనే శక్తి నీ ధైర్యాన్ని ‘’శుభ పంతు
వరాళి రాగం ‘’ఇస్తు ందని శాస్త్రిగారి నిశ్చితాభిప్రా యం .అకాల మృత్యువు ,బొ మికల లోపాలు చర్మ
వ్యాధులను శంకరాభరణం నయం చేస్తు ందని భరోసా ఇచ్చారు .

74-శాస్త్రి గారిని భారత ప్రభుత్వం ‘’కల్చరల్ స్కాలర్ ‘’గా సంగీతం లో నియమించింది .నాద యోగి
పరంపరలోని వారాయన .

75-వరంగల్లు నగరం లో  శ్రీ పురాణం పురుషో త్త మ శాస్స్త్రి గారికి 1980 లో స్వర్ణ గండ పెండేరం తొడిగి ఆ
సంగీత సరస్వతిని సన్మానించారు .
  

9-మహా మహో పాధ్యాయ శ్రీ ఆకెళ్ళ మల్లికార్జు న శర్మ

88-‘’ప్రతి వారిలో’’ లయ ‘’ఉంటుంది .దాన్ని వెలికి తీసే బాధ్యత అధ్యాపకునిది ‘’అన్నారు మహా
మహో పాధ్యాయ ఆకెళ్ళ మల్లికార్జు న శర్మ గారు .

89-లయ ప్రా ధాన్యతతో ఆకెళ్ళ వారు విద్యార్ధు ల కిచ్చే శిక్షణ మహత్త ర మైనది .తెలుగు లోను ఇంగ్లీష్
లోను వీరు ‘’తాళ ప్రస్తా ర రత్నాకరం ‘’రాశారు .Indian genius in Talaprastar ‘ Tala prastara of
Nihamka Saranga deva’s Sangita ratnakara ‘’అనే వీరి రెండు ఉత్త మ గ్రంధాలు చరితల
్ర ో చిరస్థా నం
పొ ందాయి .

90-36 రాగాలకు ఒక్కొక్కటి అయిదారు నిమిషాల కు సరిపడా రాగాలాపనలను స్వర లిపి లో రచించి
‘’స్వరరాగ సుధ’’అనే మహో త్కృష్ట గ్రంధం రాశారు .

90-శ్రీ నేదునూరి వారిని ఆకెళ్ళ వారు తమ గురుదేవులుగా భావిస్తా రు .

91-సంగీత కళాశాలలలో నేడు బో ధిస్తు న్న సర్టి ఫికేట్ కోర్సుకు ఆకెళ్ళ వారు సిలబస్ తయారు
చేసిచ్చారు .అలాగే డిప్లొ మా కోర్సుకు ఆరేళ్ళ శిక్షణ కూ వారిచ్చిన సిలబస్ నే అందరూ అనుసరిస్తు న్నారు
ఇంతకంటే ఘనత ఇంకేమి ఉంది ? వీటిని సి.డి .లుగా కూడా రూపొ ందించి మహో పకారం చేశారు
ఆకెళ్ళవారు .

92-ఆకెళ్ళ వారి ‘’తాళ ప్రస్తా ర సాగరం ‘’గ్రంధం 1985 లో తెలుగు విశ్వ విద్యాలయం చేత స్సర్వ శ్రేష్ట
గ్రంధంగా ఎంపిక కాబడి౦ది .

93-భారత ప్రభుత్వం ఆకెళ్ళ వారికి సీనియర్ ఫెలోషిప్ అందించి  నిశ్శంక శా౦ర్గ ్య దేవుని ‘’సంగీత
రత్నాకర ‘’గ్రంధానికి వ్యాఖ్య రాయించింది .

94-లయ విన్యాసాలపైనా ,వర్ణా లపైనా ఆకెళ్ళ వారు 481’’ఆడియో ట్రా క్స్ ‘’లను సి డిలుగా
వెలువరించారంటే వారి విద్వత్తు యే స్థా యిదో అర్ధ మవుతుంది .అందుకే వీరికి మద్రా స్ మ్యూజిక్
అకాడెమీ అవార్డ్ ,టి టి.కె .అవార్డ్ లభించాయి

  

  
 

     

ఇది విన్నారా ,కన్నారా !-6

10-గాత్ర వాయులీన విద్వన్మణి-శ్రీ నేతి శ్రీరామ శర్మ

95-అతి సామాన్యంగా కనిపించే శ్రీ నేతి శ్రీరామ మూర్తి గారు సంగీతం లో విద్వన్మణి . వీరికి తల్లీ తండ్రీ
,గురువు ,మనసెరిగిన మిత్రు డు ప్రత్యక్ష దైవాలు .వీరి వాయులీనవిమల గాంధర్వం .గుంటూరు జిల్లా
నూతక్కి గ్రా మస్తు లు .తండ్రి శ్రీ నేతి లక్ష్మీనారాయణ భాగవతార్ శ్రీ ఆది భట్ల నారాయణ దాసు గారి
ద్వితీయ శిష్యులు .దాసుగారి మొదటి శిష్యులు శ్రీ వాజ పేయాజుల  సుబ్బయ్య గారు .ఏఇద్ద రు
శిష్యులను లవ కుశులు అనేవారు .

96-నేతివారు 1958 నుండి -88 దాకా రేడియోలో నిలయ విద్వాంసులు .’’మనకు విద్య ఉందికదా అని 
దాన్నంతా ప్రదర్శించ కూడదు .ముఖ్య కళాకారునికి లోబడి వాయించాలి .కచేరీ రక్తి కట్టించాలి ‘’అనే
సహృదయులు

97-నేతి వారి విద్వత్తు కు తగ్గ ట్లు సువర్ణ ఘంటా కంకణం ,కనకాభి షేకం పొ ందారు .శ్రీపారుపల్లి పంతులు
గారు పాడుతుంటే ‘’జీవం తో ఉన్న తంబూరా తంత్రు లు మోగిస్తు న్నట్లు ఉంటుంది ‘’అని మెచ్చిన రస
హృదయులు సరస హృదయులు .
98-ఒక సారి హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ టి ఆర్ .మహా లింగం గారి గాన కచేరీ కి శ్రీ మతి ద్వారం
మంగతాయారు గారు పక్క వాద్యం వాయించటం మొదలు పెట్టి అనారోగ్యం తో మూర్చ పో గా నేతివారు
అనుకోకుండా అంతటి దిగ్దంతునికి వయోలిన్ వాద్యం వాయించి రక్తి కట్టించారు

99-పుంభావ సరస్వతీ మూర్తు లైన శ్రీరామ శర్మగారు సంగీత సభలకోసం ఎన్నో వేల రూపాయలు దానం
చేసిన వితరణ శీలి .

100-గాయక సార్వ భౌమ పారుపల్లి రామ క్రిష్నయ్య పంతులు ‘’సంగీత సభ ‘’ఏర్పరచి సంగీత సరస్వతికి
సేవ చేసిన మహనీయులు నేతి శ్రీరామ శర్మ గారు.

11-సంగీత సాహిత్య విద్వాంసులు శ్రీ యెన్ సి హెచ్ ,కృష్ణ మాచార్యులు

101-కృష్ణా జిల్లా జగ్గ య్య పేటలో జన్మించిన శ్రీ నల్లా న్ చక్ర వర్తు ల కృష్ణ మాచారి గారు ఎన్నో ప్రౌ ఢ మైన
హరికధాలను సంస్కృతాంధ్రా లలో రచించారు ..పారుపల్లి వారి శిష్యరికం లో ఎదిగిన వారు .

102-త్యాగరాజ స్వామి వారి ‘’నౌకా చరితం ‘’ను సంస్కృతం లోకి అనువదించిన గీర్వాణ వైదుష్యం వీరిది .

103-ఈ రోజుల్లో భారత దేశం లో సంస్కృతం లో హరికధ కాలక్షేపం ఉత్త మ స్థా యిలో చేస్తు న్న శ్రీ ఉమా
మహేశ్వర రావు గారికి ఆచార్యులవారు గురువు .తామూ ఎన్నో సంస్కృత హరికధలు దేశమంతటా
చెప్పారు .

104-కవిత్వం భావుకత లలో నిష్ణా తులు .’’త్యాగ రాజ గేయార్ధ కుంచిక ‘’అనే ఉద్గ ం్ర ధం రాసి శ్రీ కల్లూ రి
వీరభాద్రశాస్త్రి గారికి అంకితమిచ్చారు

105-‘’మనం బాణీ ణి ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు .ముర శ్రీరంగం అయ్యంగారు అనే
మహానుభావుడు ఏర్పాటు చేసిన బాణీయే ‘’ఆంధ్రదేశపు బాణీ ‘’అన్నారు .

106-సంగీతం మోక్షమిస్తు ందని ఒక గొప్ప వ్యాసాన్ని సంస్కృత భాషలో రాస్తూ ‘’గీతి గానేన యోగస్స్యాత్-
యోగాదేవ శివైక్యతా-‘’ఇత్యుక్త ప్రకారేణ త్యాగ రాజః గానేన యోగం ,యోగేన శివైక్యం ప్రా ప్యతే ఇతి
నిశ్చనుమః –శివైక్యం నామ జీవన్ముక్తి రేవ ‘’అని ముగించారు  .

12-శ్రీ కొమాండూరి శేషాద్రి


107-పాడుతున్నది వాయిస్తు న్నది ఏమిటో ,అందులోని మర్మమేమిటో సో పత్తి కంగా వివరించి చెప్పగల
విద్వాంసులు శ్రీ కొమాండూరి శేషాద్రి గారు .వీరిది సంగీత వంశం .

108-2008 లాయింగ్లా ండ్ లో పర్యటిస్తూ సంగీత కచేరీలు సో దాహరణ ప్రసంగాలు చేసి శ్రో తల
హృదయాలను ఉర్రూ త లూగించారు .

109-లండన్ దగ్గ ర ఒక చోట సద్గు రు శ్రీ శివానంద మూర్తి గారి ఆదేశం తో 108 మంది చేత 18 కృతులను
ఏక కంఠం గా పాడించి సేబాష్ అనిపించారు .

110-అమెరికాలోని పిట్స్ బర్గ్శ్రీ వేంకటేశ్వరాలయం ఆహ్వానంతో  ఒక ఏడాదిలో ఆరు నెలలకోసారి గా


రెండు సార్లు విజిటింగ్ అధ్యాపకులుగా ఉంటూ ,నిత్య బో ధనా జరిగాక సాయంవేళ రాగ ,కృతి ,భావ
,త్రిపుటి లపై మహా వాగ్గేయ కారుల రచనలపై చర్చాగోస్తు లు జరిపారు .దీనితో వారు ప్రా మాణికమైన
ప్రసంగా కర్త గా ,వ్యాఖ్యాతగా ,విశ్లేషకునిగా ,తులనాత్మక వివరణ కర్త గా రాణించి వినుతి కెక్కారు .

111-శిష్యులు కోరిన రాగం లో అప్పటికప్పుడే కృతి రాసి గోష్టిలో నేర్పటమూ చేశారు.

112-రాగం ‘’ఆఠాణా’’అంటే బందీ నుంచి విముక్తి చేసేది అని అర్ధ ం చెప్పారు కొమాండూరి వారు
.’’ఠాణా’’అంటే పో లీస్ స్టేషన్ .అ అంటే లేనిది అంటే బందీ కానిది అని వివరణ ఇచ్చారు  .

113-వాక్యం రసాత్మకం కావ్యం అన్నట్లు గానే ఆచార్యులవారు ‘’నాదం రసాత్మకం కీర్తనాని ‘’అన్నారు
రాగానికి స్వరం ఆధారం .అ కారా ఉకారాదుల చేత అది నూతనత్వాన్ని పొ ంది ,సంచారులచేత అనుష్టా నం
అవుతుంది .లక్ష్య సిద్ధికలిగి లక్షణ భావం నేర్చిన నేర్పరికి మాత్రమే ‘’రాగాత్మను స్థా పన చేయటం
తెలుస్తు ంది ‘’అంటారు .

114-‘’భరత,శార్న్గ్య దేవ,రఘునాధ నాయకుల అఖండ వీణ పరిశోధనలు లోకానికి శ్రు తి రూపం లో


బయట పడి తర్వాత నాద మూర్తు లైన త్యాగ రాజాదుల కృతుల చేత  మర్యాద పొ ందాయి .నిశ్చయంగా
వీణా వాదన నైపుణ్యం రాగ వికాస క్రమానికి పెద్ద పీట వేసింది ‘’అని ఖండితంగా చెప్పారు శ్రీకోమా౦డూరి.

115-‘’రాగం నాదా౦తర్భాగం .రాగం స్వర వర్ణ రూపంగా బహిర్గతమై దానిలోనే నాదం అంతర్వాహినిగా
ప్రసరిస్తు ంది .మూలమే నాదం మిగిలినవి అంగాలు ‘’అన్నారు .

116-హిందూస్తా నీ ,కర్నాటక విద్వాంసుల లో భేదాన్ని వివరిస్తూ ‘’హిందూ స్థా నీ  గాయకులు రాగాన్ని
గ్రహన్యాస మూలకంగా నాద పూర్ణ ంగా కూర్చటం వాళ్ళ రీతి .కర్నాటక గాయకులూ స్వర ప్రా ధాన్యం టో
వాగ్గేయ కారుల కృతుల రూపంగా నాదాన్ని ప్రకటిస్తా రు .వీరిలో స్వర కల్పనమార్గ ం తో ,లయ బంధం తో
కల్పనలు చేయటంద్వారా వీళ్ళ శైలిలో విలక్షణత కనిపిస్తు ంది ‘’అని విశ్లేషించారు .

117-‘’హిందూస్తా ని నాద సంబంది .కర్నాటకం స్వరసంబంది .నాదాన్ని రసాత్మకం గా వాళ్ళు చూపిస్తే


మనం మరింత చాతుర్యం తో అంతర్లీన స్వర సౌందర్యాన్వేషణలో నాదాన్ని ప్రబల పరుస్తూ సాహిత్యాన్ని
ప్రదర్శిస్తా ం ‘’అంటారు .

118- శీ శేషాద్రిగారి కి పెద్దకుమార్డు శ్రీ రాజన్ ,చిన్నకుమారుడు వెంకట కృష్ణ చెరొక ప్రక్కన కూర్చుని వీరు
మధ్యలో కూర్చుని వయోలిన్ వాయిస్తు ంటే శ్రో తలకు గాంధర్వ లోకం లో ఉన్న అనుభూతి
కలుగుతుందన్నారు ఆచార్య వీరభద్రయ్య .

119-‘’అర్ధ వంతం రుచి మంతమైన ‘’సాహిత్యపు పలుకుబడి ‘’నేర్చిన కృతి ఆత్మ దర్శితం అవటం అని
వార్యం .’’అని వారి అభిప్రా యం .

120-శేషాద్రి వారి ఆరు నీతి సూత్రా లు –నీకు రాదు అని ఎవరితోనూ అనరాదు ,మనం కష్ట పడినా
విద్యార్ధు లకు అవగాహన కల్పించాలి ,భావావేశం తో పాఠం చెప్పాలి ,ప్రేమతో బో ధించాలి ,పదిసార్లు వాళ్ల కు
చెబితే మనకు అది క్షుణ్ణ ంగా తెలుస్తు ంది ,నిస్పృహా ,నైరాశ్యాలు అధ్యాపకుడికి పనికి రావు

 
 ఇది విన్నారా ,కన్నారా !-7

13-మధుర గాయకులు శ్రీ కొల్లెగళ్ ఆర్ .సుబ్రహ్మణ్యం

121-  తమిళం మాతృభాష .పెరిగింది కన్నడ దేశం లో కానీ స్థిరనివాసం గా హైదరాబాద్ లో


1953 నుంచి  ఉంటున్న మధుర గాయకులు  కొల్లెగళ్ ఆర్ .సుబ్రహ్మణ్యం  మైసూర్ లో సంగీత సాధన
చేసి ఇక్కడికొచ్చారు

122-శ్రీమతి డి కె పట్ట మ్మాళ్ వంటి అగ్ర శ్రేణి గాయకులకు తంబూరా మీటి సంగీత మర్యాదలు గ్రహించారు
.సంగీతం తోపాటు ఎస్ ఎస్ ఎల్ సి చదివి  సంస్కృతం,జ్యోతిషం  నేర్చి ఒక దిన పత్రికలో వారం వారం
జ్యోతిష కాలం నిర్వహించారు .

123-శ్రీ సుబ్రహ్మణ్యం పాడుతూ ఉంటె అమృతం స్రవిస్తు న్నట్లు ఉంటుందట .సృజన శీలి ,ముత్త య్య
భాగవతార్ ప్రశిష్యులు అవటం చేత వందకు పైగాతెలుగులో  కీర్తనలు  రాశారు . సంస్కృతం ,హిందీ
,తమిళం ,మలయాళీ భాషల్లో నూ కీర్తనలు  రాసి స్వర పరచారు .దీనికి మించి 72 మేళ కర్త రాగాలలోనూ
వాగ్గేయాలు రచించారు .వీరి విద్వత్తు కు అఖిల భారత గాంధర్వ మహా విద్యాలయం ‘’మహా
మహో పాధ్యాయ ‘’బిరుదు నిచ్చి సత్కరించింది .

124-వీరు తెలుగును ఉచ్చరించటం లో ఎంతో  నిర్దు స్ట త,స్పష్ట త ఉంటుంది .రాగం లో వేగం వద్దు
అంటారు .

125-ప్రా ణాయామ యోగిలాగా వీరు గానం చేసేటప్పుడు శరీరాన్ని అసలు కదల్చనే కదల్చకపో వటం వీరి
విశేషం .సంగీత సాధనను ఒక దేవతార్చనగా చేస్తా రు .వీరి అభిమానగాయకులు శ్రీ నేదునూరివారూ
రెండవ వారు శ్రీ బూరుగు గడ్డ సీతారామాచార్యులు గారు .ఎక్కడో వరంగల్ జిల్లా మారు మూల గ్రా మం
లో ,దేవాలయ అర్చకత్వం చేస్తూ గాయకుడుగా ఉన్న సీతారామ చర్యులుగారిని గుర్తు ంచుకొన్నారు అంటే
సుబ్రహ్మణ్యం గారి సౌజన్యం విశద మవుతుంది .సీతారామాచార్యులుగారు పాడుతుంటే ‘’అమృత కలశం
నుంచి అమృతాన్ని ధార కట్టించి నట్లు ఉంటుంది ‘’అని మెచ్చుకొన్నారు సుబ్రహ్మణ్యం గారు .అదీ వారి
సంస్కారం .

126-సద్గు రు శ్రీ త్యాగ రాజ స్వామివారి మహా భక్తు లైన సుబ్రహ్మణ్యంగారు తిరువయ్యూర్ లో త్యాగ బ్రహ్మ
బ్రహ్మైక్యమైన చోటున శ్రీవారి  సమాధి నుంచి మృత్తి కను ,కావేరీ తీర్ధా న్ని ,పాదుకలను ,దండాన్ని
తెప్పించి 1986 నవంబర్ 14 న హైదరాబాద్ విద్యానగర్ లో త్య్గారాజ మూర్తిని ప్రతిష్టించారు .అప్పటినుంచి
ప్రతి ఏడాది ఆరాధనోత్సవాలు నిర్వహిస్తు న్నారు .
127-శ్రీ లలితా నవ రత్నమాల ,శ్రీ త్యాగ రాజ సహస్ర నామావళి ,శ్రీ పురందర దాస నక్షత్ర కృతి మాల
మొదలైన రచనలు చేశారు .

128-మోహినీ భస్మాసుర ,జటాయు మోక్షం ,ఆది పరాశక్తి నృత్య రూపకాలు రాసి సంగీత రచన చేస్తే
దూర దర్శన్ ప్రసారం చేసింది .

14-శ్రీ ద్వారం దుర్గా ప్రసాద రావు

129-ద్వారం వారి అన్నగారు శ్రీ వెంకట కృష్ణ య్య గారి కుమారులే శ్రీ ద్వారం దుర్గా ప్రసాద రావు శ్రీ
సత్యనారాయణ గార్లు కుమార్తె శ్రీమతి మనోరమ .ఈ ముగ్గు రూ కలిసి వయోలిన్ త్రయ కార్యక్రమం
ఇచ్చారు .ఆ ఇంటివారే అయిన శ్రీ ద్వారం సత్యనారాయణ రావు  శ్రీమతి ద్వారం మంగ తాయారు కలిసి
వయోలిన్ పంచక కార్యక్రమం చేశారు .

13 ౦-1960 లోశ్రీ ద్వారం నరసింగ రావు గారు మరణిస్తే ,18 ఏళ్ళు నిండని దుర్గా ప్రసాద రావు గారు
‘’బాయ్ సర్వీస్ ‘’లో సంగీత కళాశాలలో ఆచార్యులుగా చేరటం గొప్ప విశేషం .వీరి వాద్యం లో ద్వారం వారి
వంశ బాణీ సజీవంగా కనిపిస్తు ంది

131-విజయనగర సంగీత కళాశాలలో శ్రీ దుర్గా గారు 1967 నుంచి ఈ మధ్యవరకూ ప్రిన్సిపాల్ గా  చేసి
రిటైర్ అయ్యారు .15-గాన సరస్వతి శ్రీమతి మాలతీ పద్మనాభ రావు

132-గృహిణి గా ఉంటూ సంగీతం లో ఉన్నత శిఖరారోహణం చేసినవారు శ్రీమతి మాలతీ పద్మనాభ రావు
గారు .మద్రా స్ లో  శ్రీమతి డి కె పట్ట మ్మాళ్ గారింటి ఎదురుగా ఉండేవారు .అక్కడే దీక్షితులవారి కృతి 
భాండారాన్ని అంతా దో చుకొన్నారు .పట్ట మ్మాళ్ గారి సో దరుడు జయ రామన్ గారి నుంచి కృతి పాఠాన్ని
నేర్చారు .ఏం ఎల్ వసంత కుమారి గారి నుండి సంగతి తప్పకూడదని ,పాట కడుపు లోంచి రావాలని
,అనుభ వించి పాడాలని గ్రహించారు .

133-కళా ప్రవీణ ,గానకోకిల ,గాన సరస్వతి వంటివి వీరి ప్రతిభకు దర్పణాలు .గురువుల నుంచి యెంత
నేర్చారో వినికిడి వలనా అంతే నేర్చుకొన్నారు ‘

134-ఆంద్ర ప్రదేశ్ లో సంగీతానికి ఆదరణ పెరుగుతోందని సంతృప్తి చెందారు శ్రీమతి మాలతి .దీక్షితుల
వారి కృతులలో ఎంతో విద్వత్తు ,ప్రౌ ఢిమఉంటాయని త్యాగ బ్రహ్మ పామరుడికీ అందుబాటులో ఉంటారని
ఇద్ద రూ మహానుభావులే అంటారు .
135-త్యాగ రాజ స్వామి కీర్తనలను కొందరు కొంత మార్చి పాడుతున్నారు .కాని దీక్షితార్ కృతులను అలా
పాడ లేక పో యారు అని అభిప్రా యపడ్డా రు శ్రీమతి మాలతీ పద్మనాభ రావు గారు .

    

 ఇది విన్నారా ,కన్నారా !-8

15-వైదుష్యం మూర్తీభవించిన శ్రీమతి అరుంధతీ సర్కార్

136-78 ఏళ్ళవయసులో ప్రతి రోజూ బ్రా హ్మీ ముహూర్త ం లో లేచి 3-30 నుంచి 5-30 దాకా సంగీత
సాధన చేసే ఆదర్శ విద్వాంసురాలు శ్రీమతి అరుంధతీ సర్కార్ .

137-సర్కార్ మొదటి గురువు పారుపల్లివారే .పట్ట మ్మాళ్ గారిదగ్గ రా విద్య నేర్చారు.ఏక సందా గ్రా హి
.స్వరం తో రాసుకో కుండా వేల కీర్తనలను అలవోకగా పాడగలగటం అరుంధతి గారి ప్రత్యేకత .
138-పట్ట మ్మాళ్ వైదుష్యం అంతా ఇంతాకాదని ఏది అడిగినా అనర్గ ళంగా గంటల కొలది చెప్పే ఓర్పూ
నేర్పూ ఆమెకున్నాయని ,విద్యార్ధు ల్ని చంటి పిల్లల్లా గా ధన ద్రు ష్టి లేకుండా చూస్తా రని తన అనుభవాన్ని
చెప్పారు .తొమ్మిదవ ఏటనే డి.కె గారి 78 ఆర్ పి.ఏం రికార్డు లు విని ఆమె సంగీత ప్రభావం లో పడ్డా రు
అరుంధతి .

139-ప్రతి ఏడు త్యాగ రాజ ఉత్సవాలకు తిరువయ్యూర్ వెళ్లి వస్తా రు సర్కార్ .దీక్షితులవారు ఏయే
క్షేత్రా లపై కీర్తనలు రాశారో ఆయా క్షేత్రా లను యాత్రగాకూడా  వెళ్లి సందర్శిస్తా రు .

140-తొమ్మిది శైవ క్షేత్రా లలోని తొమ్మిది మంది లింగ మూర్తు లపై ఉన్న కృతులను అరు౦ధతి గారు
పాడగా ఆకాశవాణి రికార్డ్ చేసింది .

141-ఉత్త రాంధ్ర శ్రీకాకుళం లో సర్కార్ నాలుగు గంటలు కచేరీ చేసి గ్రా మీణ ప్రజలను తాదాత్మ్యం లో
ముంచారు .స్వరకల్పన ,రాగాలాపనలో రాగాలాపనకే మొగ్గు చూపుతారు .

142-బంగారు కామాక్షి పేరుతొ శ్యామ శాస్త్రిగారి కృతులు పాడితే కళా వారధి వారు క్యాసెట్లు సి డిలుగా
తెచ్చారు .

143-ఆకాశవాణి ప్రో గ్రా ం ఎక్సి క్యూటివ్ గా 1971 వరకు పనిచేసి గొప్ప ఫీచర్స్ చేసి అందించారు అందులో
‘’ఆరిజిన్స్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ విజయనగరం ‘’మంచి ఫీచర్ గా పేరు పొ ందింది ..వీరు రచించి ప్రసారం
చేసినవి –మంత్రా లయ మహాన్ ,గురు గుహో దయం ,శ్రీ కమలాంబా జయంతి ,గురు గుహాంత రంగం .

144-‘’ఆనందం కోసం పాడుకొంటాను .పాడు కొంటూ ఉండాగా మనసు శూన్యం తో నిండుతుంది


‘’అంటారు శ్రీమతి అరుంధతీ సర్కార్ .శూన్యం అంటే ద్వంద్వాతీత స్థితి అని అదే పూర్నత్వానికి పర్యాయ
పదమని ఆచార్య ముదిగొండ వీర భద్రయ్య గారు వివరణ ఇచ్చారు .

16-వాయులీన విద్యాదరి శ్రీమతి అవసరాల  కన్యాకుమారి

145-మైసూర్ చౌదయ్యగారి వయోలిన్ వాదన ‘’గుర్రా లు పరిగెత్తి నట్లు ఉంటుంది ‘’అన్నారు సరస్వతీ పుత్ర
పుట్ట పర్తి వారు .ద్వారం వారి వాదన ‘’మలయపవనం వీచి నట్లు ఉంటుంది ‘’అన్నారు ఆచార్య .

146-కాకినాడలో పుట్టి మద్రా స్ లో పెరిగిన కన్యాకుమారిగారు శ్రీమతి ఏం ఎల్ వసంతకుమారిగారికి


19 ఏళ్ళు వాయులీన సహకారమందించారు .అది తనకు సువర్ణ అధ్యాయం అంటారు కన్యా కుమారిగారు
.మరెందరికో వాయి0 చారామే .
147-మద్రా స్ లో 100 వాద్య కళాకారులతో రెడుగంటల  సేపు వాద్య బృంద ప్రదర్శన చేశారు .మరో సారి
75 వయోలిన్ లతో ముప్పావుగంట ప్రదర్శన ఇచ్చారు .భారతస్వాతంత్ర్య స్వర్ణో త్సవాల సమయం లో 50
వయోలిన్ లతో తానే సృష్టించిన ‘’భారత్ ‘’(శంకరాభరణ జన్య ఔడవ షాడవం)అనే కొత్త రాగాన్ని పాడించి
రక్తి  కట్టించారు.ఒక వైకు౦ఠ   ఏకాదశినాడు 29 గంటల సేపు నిర్విరామంగా వాయులీన కచేరీ చేసిన
సామర్ధ ్యం కన్యాకుమారిగారిది .

17-గాంభీర్య మాధుర్యాల శ్రీ మల్లా ది సూరిబాబు

148-మల్లా ది సూరిబాబు గారి తండ్రి శ్రీ శ్రీరామ మూర్తి గారు శాస్త్రీయ సంగీతాన్ని ,హరికధా గానాన్నీ
మద్రా స్ ఆకాశ వాణిలో 1945 నుండి 53 వరకు వినిపించారు .

149- సూరిబాబుగారు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి శిష్యులు .పినాకపాణి గారి వద్దా కొంత నేర్చారు .పిట్స్
బర్గ్ శ్రీ వేంకటేశ్వరాలయం లో ఆరునెలలు విద్యార్ధు లకు సంగీతం నేర్పారు .

150-సూరిబాబు గారి భార్య శ్రీమతి సుకన్యా ,కుమారులు శ్రీ రాం ప్రసాద్ ,శ్రీ రవికుమార్ లు సంగీతజ్నులే
కాక ప్రతిభా పాటవ సంపన్నులు .అంటే తాత  దగ్గ రనుఛి మనవళ్ళ దాకా అందరూ సంగీత విద్వాంసులే .

151-శ్రు తి మీద ద్రు ష్టి ఉన్న సూరిబాబు గారు అన్ని శ్రు తులకూ తంబూరా శ్రు తి చేసి సి .డి.లు తెచ్చారు
.ఆకాశవాణి గ్రేడ్ వన్ ఆర్టిస్ట్ మల్లా ది .

152-మల్లా ది సో దరులు నేదునూరి వారికీ  ,పినాక పాణి  గారికీ శిష్యులు .కర్నూలు వెళ్లి శ్రీపాద వారి వద్ద
వందలాది కృతులకు పాఠం నేర్చారు .సంగీతం తో దేశ విదేశాలలో పర్యటించారు

153-‘’ఆంధ్రదేశం లో సంగీతానికి ఆదరణ తక్కువే అయినా అభిరుచి తగ్గ లేదు ‘’అంటారు సో దరులు
.’’వేడుక కోసం కచేరీ చేయరాదు .ధర్మ దృష్టితో చేయాలి .’’అంటారు సంగీతాన్ని కళగా కంటే శాస్త ం్ర గా
,విద్యగా నమ్ముతాము అని చెప్పారు .

154-‘గాయకుడు భగ వంతునితో చేసే సంభాషణ యే సంగీతం ‘’అన్నారు .

155-‘’బాగుగా వింత రాగములు ఆలాపము చేయగ మేను పులకరింపు గ ‘’మల్లా ది సో దరులు వేలకు
వేలు కచేరీలు చేస్తూ సంగీత సరస్వతిని ప్రపంచమంతా ఊరేగిస్తు న్నారు .
 

 
 ఇది విన్నారా ,కన్నారా !-9

18-మాధుర్య వైదుష్య కలబో త శ్రీమతి మండా సుధారాణి

156-ఈ తర౦ అగ్ర గాయకులలో అగ్రశ్రేణిలో ఉన్నవారు శ్రీమతి మండా సుధారాణి .ఒకే సమయం లో
రెండు చేతులతో రెండు వేరు వేరు తాళాలనువేసి ‘’తాళావధానం’’చేసన
ి విద్వాంసురాలు .విశాఖ కళా
సమితి లో ఈ విన్యాసం చేసిఅబ్బుర పరచారు .

157-గతి ,తాళాలపై మహాదికారం ఉన్నందు వలననే సుదారాణిగారిని 18 ఏళ్ళ చిన్నవయసులో మద్రా స్


సంగీత అకాడెమి నిర్వహించిన పల్ల వి పో టీలలో బహుమతి పొ ందారు .

158-‘’మనో ధర్మ సంగీతానికి కల్పిత సంగీతం ఆధారం ‘’గ్రంధం రాసి భారత ప్రభుత్వం చేత ఫెలోషిప్
అందుకున్నారు .అనేక సభలలో ,సెమినార్ల లో సంగీత విషయ పరిశోధన పత్రా లను సమర్పించారు
,సో దాహరణ ప్రసంగాలూ చేశారు .ముత్తు స్వామి దీక్షితుల విలక్షణత పై ప్రత్యేక పత్రం సమర్పించారు
.’’షట్ కాల పల్ల వి ‘’పై సో దాహరణ ప్రసంగం చేశారు .ఆమెకు వచ్చిన అవార్డు లు ,రివార్డు లు లెక్కలేనన్ని
.ప్రతిభకు పట్టా భిషేకమే అవన్నీ .

159-అమెరికాలో చాలా రాస్ట్రా లలో కచేరీలు చేశారు .1984 లో సంగీతం లో డిప్లమో ,1993 లో మాస్ట ర్స్
చేసి సర్వ ప్రధమంగా నిలిచారు .

160-‘’వాగ్గేయ కారుల సంగీత ,సాహిత్య సౌరభాన్ని గాయకుడు తానుస్వయంగా  అనుభవించి గానం


చేస్తే ఆ వాగ్గేయకారుని అనుభూతి శ్రో తలకు చేరుతుంది ,కచేరీ అప్పుడే రక్తి కడుతుంది ‘’అంటారు సుధా
రాణి .

161-అగ్రశ్రేణి గాయకులైన అరియ కుడి ,శెమ్మంగుడి వంటివారు రస ద్రు ష్టి తో చేసిన కృషి వలన సంగీతం
తరతరాలుగా వ్యాపిస్తూ ,భాషా ,ప్రా ంతీయ తత్వాలకు అతీతంగా దక్షిణ దేశమంతా ‘’ఒకే సంగీత కుటుంబం
‘’గా నిలబడింది ‘’అన్నారు .బౌద్ధిక సంగీతం కంటే హార్దిక సంగీతం వైపు మొగ్గు తారు

19-ప్రయోగ శీలి శ్రీ వైజర్స్ సుబ్రహ్మణ్య౦

162-  వైజర్స్ జానకీ, శేషగిరిరావు దంపతుల కుమారుడే శ్రీ బాల సుబ్రహ్మణ్యం .ఎన్నో ఏళ్ళ క్రితం శ్రీ
నారు మంచి సుబ్బారావు గారు రచించిన పుస్త కం తప్ప ఆంద్ర సంగీతకారుల చరిత్ర మనకు లేదు. ఆ
లోటు తీరుస్తూ బాల గారు ‘’తెలుగు సంగీత విద్వాంసులు ‘’పేరుతొ 200 మంది కి పైగా వయోలిన్
,గాత్ర,వీణవిద్వాంసుల చరిత్ర రాసి లోటు తీర్చారు  .భార్య శ్రీమతి పావని తోకలిసి ‘’ప్రణవం ‘’పత్రికను
నడుపుతూ మహో పకారం చేస్తు న్నారు .

163-‘’భైరవి సంగీత అకాడెమి ‘’స్థా పించినెలకు వందమందికి పైగా సంగీత శిక్షణ నిస్తు న్నారు .ఆడియో
స్టూ డియో తోపాటు విద్యార్ధు ల కచేరికి వీలుగా చిన్న ఆడిట ోరియం  కూడా నిర్మించి ప్రో త్సహిస్తు న్నారు .

164-సంగీతం లో ఎంత దక్షులో ,పరిశోధనలోనూ అంతే.’’సంగీత౦-భౌతిక శాస్త ం్ర ‘’అనే మోనోగ్రా ఫ్ రాశారు
.తిరు వెంకట కవి సంగీత సార సంగ్రహం ‘’పరిశోధన గ్రంధం రాసి ఏం .ఫిల్.పొ ందారు .’’అజ్ఞా త వాగ్గేయ
కారులు ‘’పేరుతొ పరిశోధాత్మక డాక్యుమెంటరి శ్రీ వెంకటేశ్వర భక్తీ చానల్ కు చేసిచ్చారు .

20-బహుభాషా గాయని –శ్రీమతి ద్వారం లక్ష్మి

 165-భగవద్ద త్తమధురాతి మధుర కంఠ స్వరం తో ద్వారం భావనారాయణ ,వెంకట లక్ష్మి దంపతులకు
జన్మించిన శ్రీమతి ద్వారం లక్ష్మి యెన్ సి ఇ ఆర్ టి లో శిక్షణ పొ ంది 14 భాషలలో పాడిన ఘనత
సాధించారు .

166-ఏం ఎల్ వసంత కుమారి లక్ష్మిగారిని ఆవహించారా అన్నట్లు లక్ష్మిగారి గాత్రం ఉంటుంది .నేషనల్
టీచర్స్ కోర్ కు నాయకత్వం వహించి పార్ల మెంట్ భవనం లో ప్రధాని సమ్ముఖం లో కార్య క్రమం చేశారు
.భారత స్వాతంత్ర్య స్వర్ణో త్సవాల సందర్భంగా 20 వేల మంది గాయకులతో కార్యక్రమాన్ని చేశారు .

మండా సుధా రాణి                               ద్వారం లక్ష్మి 


  

ఇది విన్నారా ,కన్నారా !-11

22-వీణ పెదగురాచార్యులు

176-18,19 శతాబ్దా లలో జీవించిన పెద గురాచార్యులు తమిళనాడులోనూ గొప్ప వైణిక విద్వాంసులుగా
పేరుపొ ందారు .పాశ్చాత్యులను కూడా మెప్పించిన మహా విద్వాంసులు .షట్కాల వీణ వెంకట రమణ
దాసుగారికి తాతగారు కూడా .

177-మైసూర్ ప్రా ంతం నుంచి విజయనగరానికి వలసవెళ్లి , గాన విద్యా పీఠాన్ని ,వీణ సంప్రదాయాన్ని
నెలకొల్పారు .అప్పటికి త్యాగరాజ కీర్తనలు ఆంద్ర దేశం లో ప్రచారం లోలేవు .అప్పటికి కృష్ణ లీలా
తరంగాలు ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు ,మువ్వ గోపాల పదాలు ,దరువులే బాగా వ్యాప్తిలో ఉండేవి .

178-గురాచార్యులుగారు సంగీత జ్ఞా నం తో రచించిన గీతాలు ,తానవర్ణా లు ,తిల్లా నాలు ,స్వర పల్ల వులు
,శృంగార పదాలు ,కొణుగు శబ్దా లు ,జక్కిణ దరువులు ,సల౦దర్వులు వారి ప్రతిభకు గీటు రాళ్ళు .కొన్ని
కాశీ రాజుపైనా ,నారాయణ గజపతి పైనా ,మాడుగుల కృష్ణ భూపతి పైనా రాసి తిరువాన్కూర్ మహా
రాజుకు అంకిత మిచ్చారు .

179-పచ్చి మిరియం ఆది అప్పయ్య అనే ప్రసిద్ధ వైణికుని వంశంలో మరో సుప్రసిద్ధ వైణికుడు వీణ శేషన్న
గారితాత గారికి సహో దరుడే పెద గురాచార్యులు .

180-పెద గురాచార్యులా వీణ సంప్రదాయమే శాఖోపశాఖలై ఆంద్ర దేశం లో విస్త రించింది .ఈ సంప్రదాయం
లోని వారే పట్రా యని నరసింహ శాస్త్రి దూర్వాసుల సూర్యనారాయణ సో మయాజులు ,కట్టు సూరన్న
,పొ డుగు రామ మూర్తి ,రంగడు ,సర్వప్ప మొదలైన వారు .

23-శ్రీ దూర్వాసుల సూర్యనారాయణ సో మయాజులు

181-శ్రీ దూర్వాసుల సూర్యనారాయణ సో మయాజులుగారు (1842-1896)శ్రీ వీణ వెంకట రమణ దాసు


,శ్రీ ములుగు శివానంద శాస్త్రి గారి తండ్రి శ్రీ ములుగు సుందరయ్య ,శ్రీ ఆనంద గజపతి గార్ల కు గురువు
.వీరితండ్రిగారు విజయనగరాస్థా న విద్వాంసులు .

182-సంగీత త్రయ రచనలు ఆంధ్ర దేశం లో వ్యాప్తి చెందటానికి ముఖ్య కారకులు సో మయాజులుగారే .వీర్రి
దగ్గ ర వీణ నేర్చుకోమని ఆనంద గజపతిని తండ్రి విజయ రామ గజపతి కోరగా ఆయనకు సితార్ పై
మోజేక్కువ అవటం తో  నేర్వలేదు .సితార్ పై పలికించే ప్రతిదీ వీణపై పలికించవచ్చని చెప్పినా కొడుకు
వినలేదు .అప్పుడు తండ్రి తమ ఆస్థా నం లోని మహాబత్ ఖాన్,కొడుకు మనవర్ ఖాన్ లను పిలిపించి
సితార్ వాదన చేయించి వాటిని దూర్వాసులవారిని వీణపై పలికించమంటే పలికించారు. కాని వీరు వీణ పై
పలికి౦చినవాటిని ఖాన్ సో దరులు సితార్ పై పలికించ లేక పో యారు .అప్పటికి జ్ఞా నోదయమై ఆనంద
గజపతి దూర్వాసుల వారి వద్ద వీణనేర్వటం ప్రా రంభించారు

183-ఒక సారి1931 లో  మద్రా స్ లో మైసూర్ ,పుదుక్కొట వంటి 7 సంస్థా న వీణగాయకుల మధ్య పో టీ


జరిగింది .విజయనగరం సంస్థా నం చిన్నది కనుక ఏడవ స్థా నం ఇచ్చారు .అదిఅవమాన౦ గా భావించి
గజపతికి కోపం వచ్చింది .దూర్వాసుల వారు నచ్చచెప్పి పో టీలో పాల్గొ న్నారు .పో టీలో ఒక్కొక్కరికి
ఇచ్చిన సమయం 20 నిమిషాలు మాత్రమే . .దూర్వాసులవారు కల్యాణి ,వసంతరాగాలను అనేక ఇతర
సంప్రదాయాలతోను ,పాశ్చాత్య సంప్రదాయం తోనూ  మేళవించి గంటన్నర సేపు వాయించారు .సభలోని
తెల్ల దొ రలూ దొ రసానులు ఆనందం తో లేచి నిల్చుని డాన్స్ చేశారు .సో మయాజులుగారు గెలిచినట్లు
ప్రకటించి సత్కరించి గౌరవించారు .వైస్రా య్ ఎల్జిన్ ఆప్పుడిచ్చిన సర్టి ఫికేట్ ఆయన మునిమనవ రాలి
ఇంట్లో ఇంకా భద్రంగా ఉంది .

184-సో మయాజులు గారు  72 మేళ కర్త రాగాలలో పూసపాటి  వంశస్థు ల దిగ్విజయాలను క్రు తులుగా
రాశారు .అందులో ఒక్కటే లభ్యం గా ఉంది .ఆనంద గజోపతి పై కాంభోజి రాగం లో ‘’ఎందుకీ తొందర
‘’,మోహన రాగం లో ‘’నెరనమ్మినాను’’కృతులు రాసి ఆయనకే అంకితమిచ్చారు .

185-దూర్వాసులవారు స్వర్గ స్తు లైనప్పుడు  శ్రీ దూర్వాసుల రామూర్తి చెప్పిన పద్యం –

‘’వీణయుం జేత బూని కడు విస్మయ ముప్పతిలంగ భైరవిన్ –తానము మేళవించి ,అమృతంబును
జిల్కెడు మిమ్ము జూచుచున్

‘’గాణలు హూణు లొక్క గతిగా నుతి జేసిరి గాని ,యంతలో –వీనుల పుణ్యమీ కరణి వీడెను గానము
నస్త మించగా’’.

 
 ఇది విన్నారా ,కన్నారా !-10

21-వీణ వైభవం

167-‘’వీణా వాదన తత్వజ్ఞ ః శ్రు తి జాతి విశారదః –తాళజ్ఞ శ్చా ప్రయాసేన మోక్ష మార్గ ం స గచ్చతి ‘’

అని యాజ్న్య వల్క్య స్మృతిలో ఉంది .వీణా వాదన తెలిసి శ్రు తి జాతులలో విశారడుడై తాళం
తెలిసినవాడు  మోక్షానికి తేలికగా వెడతారు  అని భావం .వీణ వేదకాలం నాటిదని ‘’రుక్కుల వలన
తెలుస్తో ంది .ఆ నాడు తంత్రు లున్న యే వాయిద్యానయినా  వీణ అని అనిఉంటారు .ఇప్పుడు మనం వాడే
‘’సరస్వతి వీణ ‘’ఆ నాడు లేదు.24 సారికలతో (మెట్లు ) తో మైనపు మేళం తో అన్ని రాగాలను వాయించే
వీలున్నదే సరస్వతి వీణ ) .ఇదే తంజావూరు రఘునాధ నాయక భూపాలుని ‘’స్వర రాగ మేళ వీణ
‘’.దీనిపై మునులు ,మేధావులు ఎన్నో ప్రయోగాలు చేశారు . దీనికి ముందున్న వీణలు వాదనకు
అనుకూలంగా ఉండేవికావు .’’అనురాగము లేని మనసున సుజ్ఞా నం రాదు ‘’అన్నాడు త్యాగ బ్రహ్మ
.భ్రు ంగి ,నటేశ ,సమీరజ ఘటజ ,మతంగ నారదాదులు పాసించే సంగీత జ్ఞా నము ,భక్తీ వినా సన్మార్గ ము
కలదే మనసా ‘’అన్నారు త్యాగరాజ స్వామి .చివరగా ‘’వీణా వాదన లోలుడౌ-శివ మనోవిధ మెరుగరు
‘’అన్నారు త్యాగయ్య చివరగా .శివుని మనసు ఎలా ఉంటుందో ముక్తు డైన వాడి మనసూ అంత శుద్ధ ంగా
ఉంటుంది అని చెప్పారు .

168-వీణకు 24 మెట్లు ,వాటిపై నలుగు తంత్రు లు ,ప్రక్కన మూడు తంత్రు లు ఉంటాయి .పైనున్న
నాలుగు తంత్రు లు సారిణి-ఋగ్వేదాన్ని ,మంద్ర త౦త్రి సామ వేదాన్ని ,అను మంద్ర త౦త్రి అధర్వణ
వేదాన్ని సూచిస్తా యి .ఈ నాలుగు తంత్రు లు శుద్ధ సాత్విక గుణాన్ని కలిగి ఉంటాయి .ఈ 24 మెట్లకు
ప్రా ధాన్యం కలిగేది వాటిల్లో ంచి జనించే నాదం వల్ల నే తప్ప ప్రా ణం లేని లోహం వలన కాదు .ఈ
24 తంత్రు లు 24 అక్షరాల గాయత్రి మహా మంత్రా న్నిచూపిస్తా యి .

169-మానవ శరీరాన్ని వీణ గా పో ల్చారు .మూలాధారం నుంచి శిరస్సు ఊర్ధ ్వ భాగం వరకు మానవ
శరీరం లోని వెన్ను పూస దీరం్ఘ గా నిలిచి ఉంది .శిరస్సు పైభాగమే బ్రహ్మ రంధ్రం .వీణకు 24 మెట్లు న్నట్లే
వెన్నుపూసకూ 24 పూసలున్నాయి .వెన్నెముకలో పై నుంచి కింది వరకు 7 సెర్వికల్ ,12 దో రాసిక్
,5 లు౦బర్ వేర్తిబ్రే లున్నాయి వీణలో పై మెట్లకు వెడుతుంటే దూరం తక్కువగా ఉంటుంది .అలాగే
మూలాధారం వైపు వెన్ను పూసలు దట్ట ంగా  బ్రహ్మ రంధ్రం వైపు సన్నగా ఉంటాయి .మంద్రస్థా యి స్వరం
శరీరం అడుగు భాగాన చివరలో జనిస్తు ంది ..బ్రహ్మ రంధ్రం వైపు వెళ్ళే కొద్దీ శ్రు తి పెరుగుతుంది .బ్రహ్మ
రంధ్రం సహస్రా రం లో ఉంటుంది .అక్కడే సంగీతం యొక్క జీవం ఉంటుంది .
170-ప్రా ణాగ్ని సంయోగం చేత నాదో త్పత్తి జరుగుతుంది .తక్కువ శ్రు తిలోమూలాధారం లో అది మొదలై
పైకి పో యే కొద్దీ స్వాదిస్టా న,మణిపూర,అనాహత ,విశుద్ధ ,ఆజ్న అనే ఆరు చక్రా లను దాటి సహస్రా న్ని
చేరేతంతవరకు శ్రు తి పెరుగుతుంది .

171-‘’సర్వ దేవా మయీ తస్మాద్వీణేయం సర్వ మంగళా –పునాతి విప్రహత్యాది పాథకైః పతితాన్ జనాన్ ‘’

    భయంకర పాతకాలను పో గొట్టే వీణలో సర్వ దేవతలూ ఉండటం చేత వీణ ‘’సర్వ మంగళ ‘’అయిందని
భావం .

172-వీణ అనే ఆంగ్ల గ్రంధం లో శ్రీ జి యెన్ సుబ్రహ్మణ్యం వీణను అనేక దేవతలు స్వాధీన
పరుచుకోన్నారని –దండిలో శంభువు ,త౦త్రి లో ఉమా ,కుండ (కకుభం )లో కమలాపతి ,పత్రిక లో
లక్ష్మి, తుంబ లో బ్రహ్మ ,నాభి లో సరస్వతి ,దో రికలో వాసుకి ,జీవల లో చంద్రు డు ,మెట్లు (శారికలు )లో
సూర్యుడు ఉంటారని తెలియ జేశారు .ఇంతటి దైవ భావం మరే వాద్యనికీ చెప్పలేదు .దేవతలు ఏదైనా
వాయిద్యాన్ని వాయించి ఉండచ్చుకాని వాద్యమే దైవం కావటం వీణ విశేషం .

173-120 గంటలు వీణ వాయిస్తే,అది మన శరీరం లో భాగమై పో తుందని సద్గు రు శ్రీ శివానంద మూర్తి
గారన్నారు .ముత్తు స్వామి దీక్షితులుగారు ‘’మీనాక్షీ ముదం దేహి ‘’కీర్తనను వీణ పై వాయిస్తూ
,నాదైక్యమయ్యారు .’’నాదతనుమనిశం శంకరం ‘’అనేది త్యాగయ్య గొప్ప సాధనా రహస్యాన్ని తెలిపే
ఉపనిషద్వాక్యం .

174-‘’మూలాదారజ  నాద మెరుగుటే –ముదమగు మోక్షమురా –కోలాహల సప్త స్వర గృహముల –


గురుతే మోక్షమురా ఓ మనసా ‘’అన్న త్యాగరాజ స్వామి కీర్తనలో బ్రహ్మ సూత్ర భాష్యం ఉంది .అంటూ
వీణపై విశేషాలనన్నిటినీ తెలియ జేశారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

175-పూర్వం  వీణను నిలబెట్టేవాయి౦చేవారు .శ్రీ సంగమేశ్వర శాస్త్రి గారి వరకూ ఇలాగే జరిగింది
.తరువాత శయన వీణా విధానం వచ్చి నిలిచిపో యింది .అయినా శ్రీ అక్కాజీ రావు గారు నిలబెట్టే
వాయించేవారు ..శిరసుపై నిమ్మకాయ ఉంచుకొని ఘన రాగ పంచక తానాన్ని  నిమ్మకాయ పడిపో కుండా
గంటల తరబడి వాయించేవారు శ్రీ వాసా పెదకామయ్య .
 

--
ఇది విన్నారా ,కన్నారా !-12

24-వీణ వాయిస్తూ గానం చేసే నందిగాన వెంకయ్య

186-1852-1916 కు చెందినా నందిగాన వెంకయ్య గారు విశాఖ జిల్లా బిటువాడ అగ్రహారీకులు .వాసా
అప్పయ్య గుమ్మలూరి వెంకట శాస్స్త్రి గారలవద్ద వీణ నేర్చారు .వీణ వాయిస్తూ పాడటం వీరి ప్రత్యేకత
.అనుమంద్ర స్థా యిలో పాడేవారు .ఇలా పాడగలిగే వారు బహు అరుదు .

187-నాభి స్థా నం నుంచి నాదాన్ని పూరించిపాడగలిగే వీరి నేర్పు అద్వితీయం .తెల్లవారుజామునననే లేచి
గొంతు వరకు నీటి  ప్రవాహం లో మునిగి ఉండి మంద్రస్థా యిలో సాధన చేసేవారు .వీరి ముఖ్య శిష్యులే
కాక బావ మరిది  వీణ విద్యా సార్వ భౌమ శ్రీ తుమురాడ సంగమేశ్వర శాస్త్రి గారు .

25-వీణ విద్యా సర్వ భౌమ శ్రీ తుమురాడ సంగమేశ్వర శాస్త్రి

188-‘’పిఠాపురం సంగమేశ్వర శాస్త్రి’’ గా ప్రసద


ి ్ధు లైన శ్రీ తుమురాడ సంగమేశ్వర శాస్త్రిగారు ‘’మెలకువ తో
ఉన్నంత కాలం వీణ సాధన’’ చేస్తూ ండేవారు .పిఠాపుర సంస్థా న ఆస్థా న విద్వాంసులుగా ఉన్న వీరు రాగం
,తానం ,పల్ల వి వాయించటం లో దిట్ట ‘’.His music was profound and magnificient ,though not
inspired ‘’అన్నారు శ్రీ రంగ రామానుజ అయ్యంగార్ .కాని ఇన్స్పైర్ చేయలేదు అన్నది మాత్రం  శుద్ధ
అబద్ధ ం అంటారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

189-శాస్త్రిగారి గూర్చిన ఘనత ఒకటిఉంది .ఒకే మెట్టు పై సప్త స్వరాలనూ (ఒకే స్థా యి మొత్తా న్ని
)పలికి౦చ గలగటం-He  specialized in producing a whole octave on a fret .తీగను వెనక్కి లాగి
రెండు మూడు స్వరాలు పలికించ వచ్చు కాని ఒకస్థా యికి స్థా యినే పలికించటం దుస్సాధ్యం
.దుస్సాధ్యాన్ని శాస్త్రిగారు సుసాధ్యం చేశారు .వీరి తర్వాత బాలచందర్ గారు చేశారు ..అందుకే ‘’గా౦ధర్వం
అంటే సంగమేశునిదే ‘’అనే మాట లోకం లో ప్రచారమైంది .వీరికి వాయులీనం లోనూ మంచి ప్రవేశం ఉంది
.

190-‘’వీణ గోముఖ వ్యాఘ్రం లాంటిది .ప్రవేశం తేలికే కాని పో ను పో ను అందాలు పట్టించటం లో కస్టా లు
ఎదురవుతాయి .ఒకరకం గా ‘డంబుల్స్ కసరత్తు ‘’లాంటిది ‘’.

191-శాస్త్రి గారు ఒక రాగం వాయించటం మొదలు పెడితే గంటలకొద్దీ వాయించేవారు .ఒక వేళ రాత్రి గడిచి
తెల్లా రితే ,మళ్ళీ దాన్నే విని పించే వారు .రాత్రి 10 గంటలనుండి తెల్లవారుజామున 4 గంటల వరకు
సాధన చేసేవారు .విపరీతమైన త్రిస్థా యి సాధన చేసేవారు .శిష్యులు కూడా అలాగే ఉండి పో యేవారు .

182-‘’రాముని మరువకే మనసా ‘’అనే శంకరాభరణ పల్ల వి తరచుగా వాయించేవారు .ప్రా ణం


పో యేవరకూ  కూడా శాస్త్రిగారు ఆనంద భైరవి రాగం వీణపై వాయిస్తూ ప్రా ణోత్క్ర్మమణం చేశారు .

183-దక్షిణాదిలోనే కాక కాశీ ,కలకత్తా బరోడా లలోనూ కచేరీ చేశారు .ప్రసిద్ధ హిందూస్తా నీ గాయకులను
,సితార్ ,దిల్ రుబా ,ఇస్రా జ్ ,సారంగి వాద్యకారులను కలిసి మెళకువలు గ్రహించి వీణ పై వాటిని వారికంటే
గొప్పగా వాయించే వారు .

184-ఒక సారి దర్భంగా మహారాజు పాద గయా క్షేత్రమైన పిఠాపురం వచ్చి ,రాజాగారికి మూడు రోజులు
అతిధిగా ఉండి,,శాస్త్రి గారి హిందూస్తా నీవీణ  కచేరీ విని ‘’ఉత్త రాది గవయాలును అంత మనోహరంగా
బింకంగా ,దురితంగా ,నాద పూరితం గా పాడటం అరుదు ‘’అని ప్రశంసించారు .

185 –శాస్త్రి గారి శత జయంతినాడు’’ గానకళ’’ పత్రికలో శిష్యుడు శ్రీ ఆకొండి రాజా రావు ‘’వీణా చార్య సంగ
మేశ్వరులు ‘’అనే వ్యాసం రాస్తూ ‘’శాస్త్రిగారి చేతిలో వీణ వీణ కాదు కీలు బొ మ్మ .వెన్నవలె కరిగి మధురస
మొలికిస్తు ంది .నారదుని మహతి వీణ అప్రయత్నంగా పాడినట్లు ,వీరి వీణ కూడా అంతే .

186-పిఠాపురం మహా రాజా ఆహ్వానాన్ని అందుకొని రవీంద్ర నాద టాగూర్ వారి ఆస్థా నానికి అతిధిగా
వచ్చాడు ఆయనా సంగీత రసజ్ఞు డే .ఆయన పేర’’ రవీంద్ర సంగీతం’’ ఉన్నది .కొందరు
దాక్షిణాత్యగాయకుల చేత రాజావారు కచేరీలు ఏర్పాటు చేయించారు .ఒక రోజు సంగమేశ్వర శాస్త్రి గారు
కూడా వీణ కచేరీ చేశారు .ఆ కచేరీకి పరవశించిన రవి కవి ‘’దయ చేసి మేము కోరినపుడల్లా శాస్త్రిగారిని
శాంతినికేతన్ కు పంపించండి ‘’’అనికోరాడు .అలాగే అన్నారు రాజావారు .

187-‘’శాస్త్రి గారు నా గురు దేవులు .ఆయన గానం నాకు అపూర్వ అలౌకికానందాన్ని అందించింది
‘’అన్నాడు గీతా౦జ లికర్త .,దక్షిణాది వాయులీన విద్వాంసుడు శ్రీ తిరుక్కోటి కావలి కృష్ణ య్య శాస్త్రిగారి
వీణావాదన విని ఆనంద బాష్పాలు రాలుస్తూ కౌగిలించుకొని ‘’శాస్త్రీజీ !నేను వీణ నేర్చుకొని ఉంటె ,నా
ప్రతిభ మరింత రాణిందేమో ? ‘’అని శ్లా ఘించాడు .

188-శ్రీ వీణ శేషన్నగారు ‘’శాస్త్రి గారి ప్రతిభ దేవతలకు మాత్రమే సాధ్యం .మానవ మాత్రు లు అలా
వాయించ లేరు ‘’అన్నారు .ప్రముఖ నాద స్వర విద్వాంసుడు ‘’శాస్త్రి గారిలాగా సన్నాయి పై కల్యాణి
రాగాన్ని వాయించటం నా జీవిత లక్ష్యం ‘’అన్నాడు .కృష్ణా జిల్లా కి చెందిన ప్రఖ్యాత సన్నాయి విద్వాంసుడు
శ్రీ దాలి పర్తి పిచ్చి హరి ‘’శాస్త్రి గారు తోడి రాగాలాపన  చేయగా విని ముగ్దు డనయ్యాను .గంటలకాలాన్ని
నిమిషాలుగా మార్చే సమర్ధ త వారిది .ఆ మాధుర్యం లో పిసరంతైనా మేము సన్నాయి పై
వాయి౦చగలిగితే ధన్యులం ‘’అన్నాడు .

189-శాస్త్రిగారు పాశ్చాత్య సంగీతం వాయించటం లోనూ దిట్టలే.గురువు వెంకన్నగారు ,వీణ వెంకట రమణ
దాసు గారు సంగమేశ్వర శాస్త్రిగారల సాధనా పద్ధ తిలో ఒక గొప్ప విశేషం ఉంది .అది ‘’త్రిస్థా యిలో వెయ్యి
సార్లు స్వరాలను వాయించటం .మూడు కాలాలలోనేకాకుండా ఇంకా పై కాలాల్లో నూ ఈ ముగ్గు రూ వీణ
సాధన చేసేవారు .

190-శాస్త్రి గారి వీణకు 6 వ మెట్టు శ్రు తి గా  పెట్టు కొనేవారు .అంత హెచ్చు శ్రు తికి తీగను బిగిస్తే వేళ్లకీ
గమకాలకూ బాదే .అయినా అంత శ్రు తి లోనూ అతి సునాయాసంగా వాయించటం శాస్త్రి గారి ప్రత్యేకత .
మైకులు ,సౌండ్ ట్రా కులూ లేని ఆ కాలం లో స్పష్ట తా మాధుర్యం యే మాత్రం తగ్గేవికావు .ప్రతి సంగతి
గుండెకు పట్టినట్లు ,రస నిష్య౦దమై ,భావ యుతంగా ఉండటం వారి ప్రత్యేకత .

191-శ్రీ లలితోపాసకులైన శాస్త్రి గారు సన్మానాల్లో కప్పిన శాలువాలను ఎప్పుడూ కచేరీలో పైన
వేసుకోలేదు .వచ్చిన పారితోషికాలు ,నగదు కూడా ,ఆభరణాలు వాడుకోలేదు ‘’ఇవన్నీ శ్రీ తిరుపతి
వెంకన్న సొ మ్ములు .నేను ఉపయోగించ రాదు .మొక్కు బడి సొ మ్ములు వాడుకో వచ్చా ?’’అని
ప్రశ్నించేవారు .

192-ఆశించకుండా వచ్చే ధనాన్ని మాత్రమే తీసుకొనేవారు .గాయకులకు శిష్యులకు తృప్తి కలిగేట్లు


దానితో వారికి విందులు ఇచ్చేవారు .తాను ధన్యులై ఆంద్ర లోకాన్ని ధన్యులను చేసిన వారు శ్రీ
తుమురాడ సంగమేశ్వరశాస్త్రి గారు .
 ఇది విన్నారా ,కన్నారా !-13

26-షట్కాల వీణ వెంకట రమణ దాసు

193-రమణయ్య గారి పూర్వీకులు 7 తరాలవారూ వైణికులే.దాసుగారు 1864-లో జన్మించి 1948 లో


మరణించారు .వీరు వాయించే వీణకుండే కకుభం (కుండ )చాలా చిన్నది .దండం కూడా చాలా ఇరుకైనది
.కాని సొ రకాయ బుర్ర మాత్రంచాలా పెద్దది .ఇదీ వీరి వీణ ప్రత్యేకత .వీణను నిలబెట్టి వాయించటం దాసు
గారి ప్రత్యేకత .ఒక్క బొ టన వ్రేలును తప్ప అన్ని వ్రేళ్ళ తోనూ రోజుకు 10 గంటలు  సాధన చేసేవారు
.మహా వేగంగా వాయించటం మరో విశేషం .

194-ఆనంద గజపతి దాసుగారిని ఆస్థా న విద్వాంసునిగా నియమించి గౌరవి౦చటమే కాక తన


సింహాసనం లో సగ భాగం లో వారిని కూర్చో పెట్టు కొనేవారు ..వీరితండ్రి చిన గురాచార్యులుగారు .దాసు
గారు విజయనగర ఆనంద గజపతి మహా రాజుకు శిష్యులు అవటం మరో ప్రత్యేకత .గజపతి వీణా ,సితార్
లలో ప్రవీణులు .

195-దాసు గారి వీణా వాదనలో ప్రత్యేకతలు మరిన్ని తెలుసు కొందాం .భైరవి రాగ ద్రు త తాళ గీతాన్ని
మూడవ స్వరాన్ని అదిమి పట్టి పంచమ తంత్రిని మీటుతూ శ్రో తలను ఉర్రూ త లూగించేవారు .సితార్
లోనూ ప్రా వీణ్యం సాధించి వీణపై ‘’ఝాలా ‘’ను తానం లో కలిపి వాయించేవారు .మృదంగ సహకారం
లేకుండానే కచేరీ చేసేవారు .

196-దాసుగారి వద్ద ఆనంద గజపతి వాయించిన దంతపు వీణ ఉండేది .మాయవరం వీణ వైద్య నాద
అయ్యర్ ఒక సారి దాసు గారిని ఆహ్వానించి అయ్యర్ గారి వీణ పై వాయించమని కోరారు. అలా వద్దు అని
దాసుగారు చెప్పినా వినక పట్టు బట్టా రు .తాను  ఆ వీణ వాయిస్తే అది పగిలి పో తుంది అని కూడా
చెప్పారు .కాని అయ్యర్ వినక వాయించమంటే వాయించారు .అది విరిగి పో యింది .’’నా వీణ మొగ వీణ
.మీది ఆడ వీణ ‘’అన్నారట .

197-ఒక సారి మద్రా స్ సెనేట్ హాల్ లో వీణ వాయిస్తు ంటే బయట ఉరుములు ,మెరుపులతో కుంభ వృష్టి
కురుస్తో ంది .నిర్వాహకులు తలుపులు కిటికీలు మూసేస్తు ంటే ,వద్ద ని దాసు గారు వారించి ,తన
వాయిద్యం అందరికీ వినబడుతుందని చెప్పి ,వర్ష ధ్వనికి ఏమాత్రం తీసి పో కుండా వీణ వాయించి వర్షా నికే
ఆశ్చర్యం హర్షం కలిగించారు .ఘన రాగ పంచకం లో తానం వాయి౦చేసరికి వర్ష ఘోషను మించిన ధ్వని
ఆ భవనం అంతా వ్యాపించింది .వర్షా న్ని  దాసుగారి వీణా స్వనంను ఓడించింది .అంత గొప్ప ధ్వని ఎలా
సృస్టించ గలిగారని అడిగితే వీణ’’ తుంబ’’ లలో గడియారపు స్ప్రింగ్ లాంటి స్ప్రింగ్ లను బిగించానని
చెప్పారు . ఆస్ప్రింగులు కుడి తుంబ లో ఉండేవి .ఆ తుంబ ను కొట్టి వీణ కు శ్రు తిపెట్టేవారట .ఇలాంటి
వీణను మైసూర్ మహా రాజు  దాసు గారికి బహూకరించారు .

198-రమణయ్య గారు పొ ట్టిగా ఉండేవారు .ఆది భట్ల నారాయణ దాసుగారి కంటే పెద్దవారు .కాషాయ
బట్ట లు కట్టు కొనేవారు .పిలక ఉండేది .వారికి మంత్రం పీఠం ఉండేది దానిలో వేద పాఠ శాల ఏర్పాటు
చేశారు .పీఠాది పతులు ఎవరొచ్చినా అక్కడే వారి విడిది .

199-దాసు గారు వాయి౦చి నంత  స్పీడుగా ఎవరూ వాయించ గలిగే వారు కాదు ..1888 లో మద్రా స్
సభలో మైసూర్ మహా రాజును మెప్పించి పారితోషికం పొ ందారు .మద్రా స్ పౌరులు రత్న ఖచిత స్వర్ణ
కంకణాన్ని తొడిగి గౌరవించారు .లార్డ్ కర్జ న్ బంగారు తోడా బహూక రించాడు .బరోడా వెళ్లి  ఆ మహా రాజ
ఆస్థా నం లో వీణ వాయించి ప్రశంసలు పొ ందారు .ఆ కచేరీలో ‘’స్కాచ్ ట్యూన్ ‘’వాయిస్తే సభలోని
యూరోపియన్లు మహదానందం పొ ందారు .సహాజీ విహార్ క్ల బ్ వీరి కచేరీ ఏర్పాటు చేసి మెచ్చి  సువర్ణ
పతకం ,వెయ్యి నూటపదహారు రూపాయలు అందించారు .కలకత్తా ,కాశీలలో నూ ప్రశంసల౦దు కొన్నారు
.

200-వీణ వెంకట రమణ దాసుగారు సంగీతానికి మరొక అమోఘ కానుక అందించారు .అదే వారు
రచించిన ‘’వీణా రహస్య ప్రకాశిక ‘’గ్రంధం .అందులో 16 శ్లో కాలలో గుచ్చ ,నాగబంధ ,తాన విశేషాలను
వివరించారు .1926 దాసుగారికి జర్మన్ సింఫనీ మాంత్రికుడు బీదో వెన్ కు వచ్చినట్లు మహా చెవుడు వ్యాధి
వచ్చింది .భార్యా వియోగామూ కలిగి 8-2-1948 న 84 వ ఏట దాసుగారు మరణించారు .

 
 

ఇది విన్నారా ,కన్నారా !-14

27-వైణిక సార్వ భౌమ –పొ డుగు రామ మూర్తి

201-1871 లో జన్మించి విజయనగరం లో నివాసమున్న పొ డుగు రామ మూర్తిగారు విజయనగర


సంస్థా న ఆస్థా న విద్వాంసులైన శ్రీ సాలగ్రా మం గోపాలం గారి వద్దా ,కట్టు వీరన్న గారి వద్దా వీణ నేర్చారు
.దక్షిణ దేశానికి వెళ్లి కొనే రాజాపురం వైద్యనాధయ్యర్ ,తిరుకోడి కావాల్ కృష్ణ య్యర్ లతో స్నేహం
సాధించారు .మద్రా స్ వచ్చి సంగీత కచేరీ చేశారు .సభలో శ్రో తలైన బెంగుళూరు నాగ రత్నమ్మ
,తిరువత్తూ ర్ త్యాగయ్య ,సుమతి కృష్ణా రావు వీరి వీణా వైదుష్యాన్ని బాగా మెచ్చుకొన్నారు .

202-విజయనగర ఆనంద గజపతి ఆస్థా న విద్వాంసులై ,రాజావారితో మైసూర్ ,నిజాం తిరువాన్


కూర్,సింధియా మొదలైన సంస్థా నాలు సందర్శించి కచేరీలు చేసి మెప్పు పొ ందారు .

203-విజయ నగర ఆస్థా న పదవి వదిలేసి శ్రీకాకుళం జిల్లా లో నరసన్న పేట లో కాపురముండి,ఒక
గురుకులాన్ని స్థా పించి అనేక విద్యార్ధు లకు వసతి భోజనాలు ఏర్పాటు చేసి  వీణ నేర్పారు .వీరి ఖ్యాతి విని
ఉర్లా ం ,పో లాకి ,బరంపురం ప్రజలు గాన సభలు ,సంగీతోత్సవాలుజరిపారు ..టెక్కలి ,పర్లా కిమిడి ,మందసా
,చీకటి ,జరతా ,సురంగి మొదలైన సంస్థా నాలు దర్శించి సన్మానాలు పొ ంది వారిచ్చిన ధనం తో శిష్యులకు
ఉచితంగా విద్య నేర్పించారు .

204-ఉర్లా ం జమీన్దా రిణి ,ఆదిభట్ల నారాయణ దాసు గారి ఆధ్వర్యం లో వీరికి సత్కారం చేసి బంగారు
కంకణాన్ని తొడిగారు .1911 లో దివాన్ బహద్ద ర్ కొమ్మారెడ్డి సూర్యనారాయణ మూర్తిగారు వీరని మహా
ఆదరంగా నాలుగైదు ఏళ్ళు సకల సౌకర్యాలు కలిపించి తమ ఇంట్లో నే ఉంచుకొన్నారు .1912 లో రామ
మూర్తిగారిచే సరస్వతీ గాన సభ లోఏర్పరచిన  కచేరీ కి హరినాగ భూషణం ,మహారాజ పురం
విశ్వనాధయ్యర్ శ్రో తలుగా ఉన్నారు .ఆ సభలో శ్రో తలు మైమరచేట్లు వీణ వాయించగా ‘’వైణిక సార్వ భౌమ
‘’బిరుదు ప్రదానం చేశారు .1942 వృష నామ సంవత్సరం పుష్య బహుళ పాడ్యమినాడు పొ డుగు
రామమూర్తి గారు నిర్యాణం చెందారు .

28-శ్రీ ములుగు శివానంద శాస్త్రి

205-ములుగు  నంద్యయ్య గారి కుమారుడు ములుగు  శివానంద శాస్త్రి .పెదగురాచార్యుల వారి శిష్యులు
వేన పై ప్రతి రోజు నమక చమకాలను వాయించుకొని ఆనంద పడేవారు .రాగం వాయించటం లో
అద్వితీయులు .వాద్యం లో ఠీవి వీరి ప్రత్యేకత .నిత్య రోగం దరిదం్ర తో బాధ పడుతూ అవసాన కాలం లో
తన వీణకు ప్రణమిల్లి శాస్త్రి గారు తనువు  చాలించారు .

206-ఆరభి రాగం లో త్యాగ బ్రహ్మ పై ‘’త్యాగ రాజ గురుదేవా ‘’అనే అందమైన కీర్తన రాశారు శాస్త్రి గారు .

పల్ల వి -‘’త్యాగ రాజ గురుదేవ సాత్విక స్వభావ దేవ

అనుపల్ల వి –భాగవతులలో నెల్ల త్యాగ రూపుడై వెలసిన

చరణం –అందముగా వేద శాస్త ్ర మంత గూర్చి గాన ఫణితి

         సుందరుడగు శ్రీ రాముని స్తో త్రముల నిల్పినారు

        వందారు సమస్త జన బృంద శివానంద వినుత .

207-శాస్త్రి గారు వార్ వీణ కు వారే మేళం కట్టు కొనేవారు .కచేరీలలో కూడా వీణ మైనాన్ని కొవ్వొత్తి
వెలిగించి వేడి చేసి మేళాన్ని సరి చూసుకోనేవారు.

29-వైణిక రత్న –కంభం పాటి అక్కాజీ రావు

208-కంభం పాటి ఆది నారాయణ రావు ,అనంత లక్ష్మి గారల కుమారుడే అక్కాజీ రావు గారు
.తూ.గో.జి.అంతర్వేది పాలెం లో .కర్నాటక ,హిందూ స్తా నీసంగీతాలలో ఎటు వంటి అపూర్వరాగాలైనా
అవలీలగా వాయించేవారు .స్వర కల్పనా  కీర్తన లలో కర్నాటక సంప్రదాయాన్ని పాటించేవారు
.రాగాలాపనలో ఔత్త రాహులైన పండిట్ రవిశంకర్ మొదలైన వారి పట్టు జాతులను ,వాటి లోని మృదు
మధుర కంపితాలను ప్రత్యేకంగా వాయించే వారు .

209-రావు గారు శాస్త్రీయ సంగీతం లోనే కాక లలిత సంగీతం లో కూడా ప్రసద
ి ్ధు లు .విజయ వాడ ఆకాశ
వాణి కేంద్రం లలిత సంగీత విభాగం లో పని చేశారు

210-రావు గారు బాలమురళీ కృష్ణ గారి తండ్రిగారు పట్టా భి రామయ్య గారి శిష్యులై తుదిమెరుగులు
దిద్దు కొన్నారు .నూకల వారివద్దా శిష్యరికం చేశారు .

211-అనేక పట్ట ణాలలో సంగీత కచేరీలు చేసి సన్మానాలు పొ ందారు .విజయవాడలో జరిగిన
సంగీతవిద్వాత్ సభ లో అక్కాజీ రావు గారికి ‘’వైణిక రత్న ‘’బిరుద ప్రదానం చేశారు .
212-అనేక బాల గేయాలకూ ,ప్రచార గీతాలకూ స్వర రచన చేశారు .వాటిని శ్రీ ఏం వి రమణ మూర్తి
,శ్రీమతి శ్రీరంగం గోపాల రత్నం ,వింజమూరి లక్ష్మి వంటి వారు  పాడారు .

30-వీణాచార్య తిరుమల నల్లా న్ చక్ర వర్తు ల వెంకట నారాయణా చార్యులు

213-1902 లో శ్రీనివాస రాఘవాచార్య ,లక్ష్మమ్మ ఫంపతులకు జన్మించారు .మద్రా స్ లో ఎన్నో కచేరీలు


చేసి పేరు తెచ్చుకొన్నారు .

214-మద్రా స్ లోని తిరువల్లి క్కేణిదేవాలయం లో వీణ కచేరీ చేయమని కోరి స్వామి సన్నిధిలో చేయటం
మర్యాదకాదని పూజారులు రెండు ఎత్తైన బల్ల లపై రెండు బుర్రలను నిలిపి వాయి౦చమన్నారు
.ఆచార్యులవారు వీణ ను బుజానికి కట్టు కొని అద్భుతంగా వాయించి ,ఆక్రిష్ణ లీలకు సమానమైన లీలా
ప్రదర్శన చేశారు .

215-తిరుపతి దేవస్థా న ఆస్థా న విద్వాంసులైన ఆచార్యుల వారు అనేక గౌరవ సత్కారాలు పొ ందారు
.అద్భుత సంగీత రచనా చేశారు వారి రచనలలో ముఖ్యమైనవి –జాతి భేద సప్త తాళ సహిత రాగ శతరాగ
రత్నమాలిక ,అన్నమాచార్య సంకీర్తన స్వర కుసుమాంజలి ,గాంధర్వ వేదామృతం,పద్మావతీ రాగ
నక్షత్రమాలిక ,శ్రీ వెంకటేశ్వర స్తో త్ర సహిత బంధ స్వరావళి .

ఇది విన్నారా కన్నారా !  15

31-కీర్తన పాఠ ఘనాపాటీ-శ్రీమంచాల జగన్నాధ రావు

216-సంగీతం పై సాధికారికంగా మాట్లా డ గలిగిన వారిలోఅగ్రేసరులు  శ్రీ మంచాల జగన్నాధ రావు


.హైదరాబాద్ ఆకాశ వాణి లో ప్రయోక్త గా ఉన్నారు .పట్ట మ్మాళ్ ఆహ్వానం పై మద్రా స్ సంగీత అకాడెమీలో
1970 లో తమిళం లో సో దాహరణ ప్రసంగం చేశారు .

217-మంచాల వారు కీర్తన పాఠాలకు పెట్టింది పేరు .రాగాలను అన్నికోణాలలో వాయించే సామర్ధ ్యం
వారిది .సేలం పట్ట ణం లో పదాలు పాడే వారితో పరిచయమేర్పడి ,ఆయన్ను పాదాలపై అధికారిని చేసింది
.ఎన్నో విద్యా౦శాలను  సేకరించి సంగీత సాహిత్యానికి యఎన లేని సేవ చేశారు .తంజావూర్ సరస్వతి
మహల్ నుంచి ఎన్నో గ్రంధాలను ,విషయాలను సేకరించారు

218-ఆంద్ర ప్రదేశ్ సంగీత నాటక  అకాడెమి కి 134 పదాలను ,130 రామ దాసు కీర్తనలను –పదాలు –
అవతారిక –రాగ లక్షణాలతో సేకరించి ముద్రణకిచ్చారు .వీరి దగ్గ ర 24 తరంగాలు ,550 త్యాగ రాజ
కీర్తనలు స్వర పరచి ఉన్నాయి .
219-1938 లో విశాఖ లో మొదటి కచేరి చేశారు .1956 లో హైదరాబాద్ ఆకాశ వాణిలో సంగీత ప్రయోక్త
గా చేరి 1960 నుంచి లలిత శాస్త్రీయ విభాగాలను చూస్తూ 1967 లో శాస్త్రీయ సంగీత ప్రయోక్త అయ్యారు
.వీరు తయారు చేసి సమర్పించిన ‘’మువ్వ గోపాల చూడామణి  ‘’కార్యక్రమం అన్ని కేంద్రా లనుండి
ప్రసారమై కీర్తి తెచ్చింది ..ఈ కేంద్రం లో వీరు సమర్పించిన మొదటి కార్యక్రమం ‘’కృష్ణ లీలా తరంగిణి ‘’.’’గీత
శంకరం ‘’కూడా మంచి పేరు తెచ్చింది .

220-వీణపై హిందూస్తా నీనీ బాగా వాయించేవారు ..వీరి వాదనలో ‘’ఆందో ళితానికి’’ప్రా ధాన్యం లేదు .ఎడమ
చేతిని దండం మీద ముందు వెనుకలకు నడిపేవారు .దండం అవతలి అంచు వైపుకి వ్రేళ్ళతో తంత్రిని లాగే
వారు కాదు .

221-హెరిటేజ్ ఆఫ్ వరల్డ్ మ్యూజిక్ వారు మంచాల వారితో క్షేత్రయ్య పదాలను పాడించి రికార్డ్ చేసుకొని
జర్మనీ లోని బాన్ నగర గ్రంధాలయం లో ఉంచారట .అలహాబాద్ లో భైరవి రాగం వాయించగా
సంతోషించిన విశ్వ విఖ్యాత హిందూ స్థా నీ గాయకురాలు  బేగం ఆఖ్త ర్ ‘’బేటాఅని సంబో ధించి నుదుట
ముద్దు పెట్టు కొన్నది ‘

222-మంచాలవారికి 5 వ ఏట నేవిపరీతంగా స్పోటకం పో సి ఒక కన్ను పూర్తీ గా పో యింది .50 వ ఏట


రెండవ కన్ను కూడా బాగా క్షీణించింది .వీణ పై వాయిస్తూ అప్పుడప్పుడు పాడేవారు .వారి గొంతు
కమనీయ స్త్రీ స్వరం లా ఉండేది .పదాలు పాడటం లో దిట్ట .

223-మంచాల వారివి 16 కర్నాటక కచేరీలు ,6 హిందూస్తా నికచేరీలు  సి .డి.లు గా వచ్చాయి .వారి కీర్తి
కిరీటానికి కలికితురాయిల్లా ఉన్నాయి  వారి రచనలు.అవి-రామ దాసు కృతులు ,క్షేత్రయ్య పదాలు ,త్యాగ
రాజ కీర్తనలు 711 ,అన్నమాచార్య ఆధ్యాత్మిక శృంగార కీర్తనలు ,ఆధునిక సంగీతం .కేంద్ర సంగీత నాటక
అకాడెమి వీరి 7 గంటల వీణా వాదనను రికార్డ్ చేసి భద్ర పరచింది .

224-మద్రా స్ లో  బాల చందర్ తో కలిసి ‘’కళావాహిని ‘’అనే ఆర్కెస్ట్రా నడిపారు .వీరి వీణా వాదనను  ఆలీ
అక్బర్ ,రవి శంకర్ లు బాగా మెచ్చేవారు .

225-లలిత రాగాలైన పీలు బెహాగ్ ,కాపీ ,జ౦ఝూటీ,ఆలోపనలోగొప్ప ప్రా వీణ్యం చూపేవారు .మహా
వైణికులు.మహావ్యక్తీ  ,మహా విద్వాంసులు మంచాల జగన్నాధ రావు గారు .
  

 ఇది విన్నారా కన్నారా !  16

32-వీణకు అంతర్జా తీయ వైభవం కల్పించిన –శ్రీ మొక్కపాటి నాగేశ్వర రావు

226-1926 లో శ్రీ మొక్కపాటి సత్యనారాయణ ,శ్రీమతి అన్నపూర్ణ మ్మ గార్ల కు జన్మించి ఏలూరులో వీణ
నేర్చి ,మద్రా స్ లో సంగీత విద్వాన్ పాసై నిలువుగా నిలబెట్టి వీణ వాయించే వైదుష్యం శ్రీ నాగేశ్వర రావు
గారిది .1956 నుండి పదేళ్ళు మద్రా స్ లో వీణ బో ధించి అనేక శిష్యులకు గురువయ్యారు .వీరి శిష్యులలో
విదేశీయులు ఎక్కువ మంది ఉండటం విశేషం

227 -1966 లో ఫ్రెంచ్ ప్రభుత్వమిచ్చిన స్కాలర్షిప్ పై ‘’గ్రిగోరియన్ బాండ్ ‘’వారి చర్చి మ్యూజిక్ పై
పరిశోధనకు ఆహ్వానింప బడి ,పూర్తీ చేశారు అమెరికా వెళ్లి ‘’వేసిలీనియన్ ‘’విశ్వ విద్యాలయం లో
ఆచార్యులుగా పని చేశారు .1969 లో ఇండియాకు తిరిగొచ్చి అనేక కచ్చేరీలు చేస్తూ శిష్యుల చేతా
చేయించారు .1970 లో మద్రా స్ లో స్థిరపడ్డా రు .1974 లో శ్రీ దండమూడి రామమోహన రావు గారితో
కలిసి యూరప్ దేశాలలో పర్యటించి పలు సంగీత కచేరీలు చేసి మెప్పించారు .1976 లో పారిస్ విశ్వ
విద్యాలయం లో కర్నాటక సంగీత ఆచార్యులుగా నియమింపబడి సేవలు అంద జేశారు .
33-వైణిక బాల భాస్కర –శ్రీ అయ్యగారి సో మేశ్వర రావు

228—చరిత్ర సృష్టించిన మహా వైణికులు శ్రీ అయ్యగారి సో మేశ్వర రావు .వీణ గురువరాచార్యులు ,వారి
పౌత్రు లైన వీణ వెంకట రమణ దాసు గార్ల ను బాల్యం లోనే మెప్పించినవారు సో మేశ్వర రావు గారు
.’’వాగ్గేయ కార రత్న ‘’శ్రీ హరి నాగ భూషణం గారు మచిలీపట్నం లో సో మేశ్వరావుగారు 19 వ ఏట చేసిన
కచేరీకి ముగ్ధు లై ‘’వయసులో చిన్నవాడే అయినా కళ లో వ్రు ద్ధు డే .కళలో పూర్తీ సిద్ధ హస్తు డు .’’వీణా
కోవిద’’అని విజయనగర సంస్థ ‘’భారతీ తీర్ధ ‘’అందజేసిన బిరుదు కు అన్నివిధాలా తగినవాడు .అంతకంటే
‘’వైణిక బాల భాస్కర ‘’బిరుదం అత్యుత్త మంగా ఉంటుంది ‘’అన్నారు .మార్చి 25 న ఈ బిరుదప్రదానం
హరి వారి చేతులమీదుగా అందుకొన్న చైల్డ్ ప్రా జేడి సో మేశ్వర రావు గారు .

229-17-5-1951 న కోయంబత్తూ ర్ లో ,ఆ తర్వాత తంజావూర్ లో వీణ కచేరీచస


ే ి మెప్పించారు .15-2-
1952  న మచిలీపట్నం ‘’ఆంద్ర సారస్వత సమితి ‘’వారు ‘’వైణికరత్న’’బిరుదునిచ్చి సత్కరించింది .శ్రీ
సో మేశ్వర రావు విజయనగరం జిల్లా వేగేశ అగ్రహారం లో 1920 లో జన్మించారు .విజయనగర సంగీత
కళాశాలలో చదివి ‘’డిప్లొ మా ‘’అందుకొన్నారు .చిన్న తనం లోనే స్నేహితులను చుట్టూ కూర్చో బెట్టు కొని
‘’సంగీత ఆట ‘’ఆడేవారు .ప్రతిమాటకూ సమాధానాన్ని సంగీతం లో చెప్పటం అప్పటి వీరి ప్రత్యేకత గ్రా మ.
ఫో న్ రికార్డ్ లను బహు శ్రద్ధగా వినేవారు .ఆది భట్ల నాయన దాసుగారు వీరి బాల్య సంగీత ప్రతిభ గుర్తించి
,విజయ నగర సంగీత పండితులకు పరిచయం చేసి శ్రీ పేరి శ్రీరామ మూర్తి గారి వద్ద గాత్ర విద్యకు
కుదిర్చారు

230 –శ్రీ వాసా కృష్ణ మూర్తి తో కలిసి వారింట వీణ సాధన చేస్తూ ,నిలబెట్టి వీణ వాయించేవారు
.దేశమంతా పర్యటించి అనేక కచేరీలు చేసి చాలా.సువర్ణ ఘంటా కంకణాలతో  సన్మానింప బడ్డా రు .వీరి
ధర్మపత్నికూడా వీరి శిష్యురాలే .వీరి సంగీతారాధనకు అచ్చెరువొందిన బాపట్ల ప్రజలు సగౌరవంగా
ఆహ్వానించి అక్కడే ఉండే ఏర్పాటు చేసి గౌరవించారు .14-7-1973 న సో మేశ్వరరావు గారు 53 వ ఏటనే
సో మేశ్వర సాన్నిధ్యం చేరుకున్నారు .
 

  ఇది విన్నారా కన్నారా !  17

34-వైణిక సార్వ భౌమ –శ్రీ పప్పు సో మేశ్వర రావు

231 –వీణా ,జ్యోతిష సంస్కృతాలలో ఉద్ద ండులు శ్రీ పప్పు సో మేశ్వర రావు .’’సో మేశ్వర కృతి కదంబం
‘’పేరిట వాగ్గేయ కారుల చరిత్ర రాసి 199 7 లో ప్రచురించటమేకాక వాగ్గేయ కారులు కూడా అయ్యారు
.’’కృతి కదంబం ‘’పేరుతో సంస్కృత భాషా కృతులను రాశారు .నవగ్రహాలపై రాసిన కృతులు వీరి సంస్కృత
భాషా  సంగీత పాండిత్యానికిప్రా తీకలు .

232-పప్పు వారు విజయనగర పద్ధ తిలో తానం వాయించి ప్రత్యేకత సృష్టించారు .విజయవాడ రేడియోలో
14 వ ఏట మొదటి కచేరీ చేశారు బావగారు అయ్యగారి సో మేశ్వర రావు గారే గురువు .ఎన్నో రేడియో
కేంద్రా లలో కచేరీ చేశారు .వీరి రాగం,తానం పల్ల వి లకు ప్రత్యేకత ఉంది .100 పల్ల వులను విభిన్న
తాళాలలో వాయించే అరుదైన నేర్పున్నవారు అలా హైదరాబాద్ కేంద్రం లో వాయించి చూపారుకూడా .

233  -ఇంగ్లీష్ టీచర్ గా ఉద్యోగం ప్రా రంభించి హైదరాబాద్ సికందరాబాద్ ప్రభుత్వ సంగీత కళాశాలలలో
వీణా చార్యులయ్యారు .వైణికుని కి పరీక్ష పెట్టె తోడి ,ఆనంద భైరవి ,శహన ,కేదార గౌళ ,కాపీ ,నీలాంబర
రాగాలను సాధికారంగా వాయించే నైపుణ్యం వారిది .

234 –మరీ చిన్నతనం లో వాయించిన కచేరీలకు పారితోషిక ధనాన్ని తండ్రిగారి పేర చెక్ ఇచ్చేవారట
.వీరికుమారుడు పప్పు చంద్ర శేఖర్ కూడా తండ్రికి తగ్గ వారే –‘’వీణానాద సుధార్ణ వ ‘’,వైణిక సార్వ భౌమ
‘’బిరుదాంకితులు .12-9-2002 వైణిక సార్వభౌమ ,వైణికశిరోమణి  పప్పు సో మేశ్వర రావు గారు పరలోక
గతులయ్యారు .
35-వైణిక శిరోమణి –శ్రీ వాసా కృష్ణ మూర్తి

235 –వాసా వారి కుటుంబమంతావీణా వాదన  సంగీతం లో ధన్యమైనవారే .వాసా పెద జగ్గ న్న గారి
నుంచి రామ దాసు ,దాసన్న ,చిన జగ్గ న్న,పెద కామయ్య ,నర్సయ్య ,అప్పయ్య ,చిన కామయ్య
,సాంబయ్య ,కృష్ణ మూర్తి ,వెంకటరావు సాంబ మూర్తి ,కృష్ణ మూర్తి గారి దాకా   పది తరాల వరకూ
అందరూ వైణిక విద్వాంసులే అవటం అబ్బుర పరచే విషయం.

236- వాసా కృష్ణ మూర్తిగారు తయారు చేసిన శిష్యులు అనేకులున్నారు వీరి బాణీకి విశిష్ట త ఉంది
.హిందూ స్థా నీ రీతిని కూడా మేళవించి వాయించే సామర్ధ ్యం వారిది .వీరికుమారుడు వెంకటరావు
గారుకూడా గొప్ప విద్వాంసులే .రెండు చేతులతోనూ వీణ మీటే ప్రత్యేకత కృష్ణ మూర్తిగారిది .కుడి చేతి
వ్రేళ్ళతో మీటు ,ఎడమ చేతి వ్రేళ్ళతో వాదనమూచేసేవారు .రోజుకు కనీసం 10 గంటల సాధన చేసేవారు .

237 –తానం విషయం లో గొప్ప ప్రయోగ శీలి .తాళం తీగలను మీట కుండానే కృష్ణ మూర్తిగారు
అప్పుడప్పుడు కొంతకాలం తానం వాయించి ,ఆ వెంటనే తాళం తీగల్ని మీటి దానితో కలిపేవారు .ఇదీ
ప్రత్యేకత .ఆయన తానం పరవళ్ళు తొక్కే ప్రవాహం లాగా స్రవించేది .ఈవిధంగా స్పురిత ,ప్రత్యాహత
,సుళువులతో కూడిన మేళ రాగ పంచక తానం దురితం లో విజ్రు ౦భించి వాయిస్తు ంటే ‘’నాసామిరంగా’’-
వినే వాళ్ల కు సితార్ ,సరోద్ లు విన్నంతమదురాను భూతి కలిగేది

238 –నిర్మొహమాటి కృష్ణ మూర్తిగారు .ఎంత గొప్ప సంగీత విద్వా౦సుడైనా తనకు నచ్చకపో తే
నిర్మొహమాటంగా   విమర్శించేవారు .1944 లో శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారు కృష్ణ మూర్తిగారి వీణా
వాదన విని ‘’శిరోమణి ‘’బిరుదునిచ్చారు .తర్వాత ‘’వైణిక శిరోమణి ‘’అయ్యారు .వీరి శిష్యులలో
ప్రముఖులు –శ్రీ మంగు వెంకట రావు ,శ్రీ బి జగన్నాధం ,శ్రీ మతులు వసు౦ధరాదేవి,జోగులాంబ
,అ౦బుజవల్లి ,సుభాషిణి శాస్త్రి .కృష్ణ మూర్తిగారిని ‘’వీణా వాదన పధ నిర్దేశికులు’’గా భావిస్తా రు .
 

ఇది విన్నారా కన్నారా !  18

36-ఆమని కోయిల సంగీతం మహా మహో పాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం

239 ఈమని శంకర శాస్త్రి గారు ముత్తు స్వామి దీక్షితులవారి వీణా ముఖం లో దర్శనమిస్తా రని ఆచార్య
ముదిగొండ వీర భద్రయ్య అంటారు .దీక్షితులవారు కాశీలో గంగా స్నానం చేస్తు ంటే జగన్మాత వారి
చేతులలో వీణ ను ప్రసాది౦చి౦దట .వారి వారసుల వద్ద ఆ వీణ ఇప్పటికీ ఉందట .ఆ వీణకు ‘’యాళి’’అదో
ముఖంగా కాక ఊర్ధ ్వ ముఖంగా ఉండటం విశేషం .అంటే వీణ శిరస్సు కిందికి కాక పైకి ఉంటుందన్నమాట
.

240-మైకుల్లేనికాలం లో  దూరంగా ఉండేవారికీ వినబడాలని వైణికులు తంత్రు లను బలంగా మీటేవారు


.దీనివలన నాదం లోని అందం పో యేది .శివ మహా దేవుడు వీణ వాయించినట్లు త్యాగ బ్రహ్మ కీర్తనలో
ఉంది .చాలామంది వీణ వాయించినా వారికే కీర్తి వచ్చిందికాని వీణకు రాలేదు .ఈమని వారు జన్మించి
పరమేశ్వర వీణకు ఘనతను సాధించి పెట్టా రు .వారు జన్మించి ఉండక పో తే ఇది సాధ్యమై
ఉ౦డేదికాదంటారు ముదిగొండవారు .’’అన్ని వాద్యాల స్థా యిలో వీణను నిలబెట్టి ,కొత్త ఊపిరులూది
,నూతన జన్మ నిచ్చి ,సర్వ స్వతంత్ర ,సంపూర్ణ ,సమగ్ర ఘన వాద్యం గా నిలిపిన ఘనత మహా
మహో పాధ్యాయ ఈమని శంకరశాస్త్రి మహో దయులదే’’అన్నారు ఆచార్య ముదిగొండ .

241-‘’ఆర్కెస్ట్రా లో వెనక ఉండే దుర్ద శ నుంచి తప్పించి దాన్ని ఉచ్చ స్థా యికి తెచ్చి ,గాత్ర ధర్మాల
నన్నిటిలోను వీణను నిలిపి  ,గాత్రం కంటే ఎక్కువగా వీణ మాధుర్యాన్ని నింపి ,సంగీత ప్రపంచాన్ని
అమృత పానం చేయించిన సంగీత జగన్మోహిని యొక్క పుంభావ మూర్తి శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు
‘’అని విశ్లేషించి చెప్పారు ముదిగొండజీ .వీణ ను బయటి వస్తు వుగా భావించక ,తన ‘’దేహాత్మ’’ లలో
ఒకదానిగా ,తన ఆత్మగా ,అంతరాత్మ గా  భావించి,దానితో లయించిన నాద యోగి ఈమని శాస్త్రీజీ
.గాయకుని గొంతు కంఠంలో ఉంటే ,శాస్త్రి గారు తన గొంతును బయట ఉన్న వీణకు ఇచ్చి ప్రదర్శించారు
.ఆయనలోని గొంతుకూ ఆయన ఒడి లోని వీణకూ భేదం లేనే లేదు .దీక్షితులవారు ‘’మీనాక్షి మేముదం
దేహి ‘’అని పాడుతూ జగన్మాతలో లీనమైతే శంకర శాస్త్రిగారు నాలుగున్నర గంటల సేపు గుంటూరు లో
వీణ కచేరి చేసి ,ఆజ్ఞా పక  లహరీ ప్రవాహం మనసు నిండా నింపుకొని అదే రోజు రైలులో ప్రయాణం చేస్తూ
అనంత వాయువులలో తన ప్రా ణ వాయువును లయింప జేసుకొన్నారు .వారి ప్రక్కనే వారి వీణ కూడా
ఉంది .ప్రా ణోత్క్రమణ  కు ముందు చాలా కాలంగా వారు తమ వీణ తో మాట్లా డుతూ ఉండేవారట .ఆ
మాటల్లో సారాంశం ‘’నేను ఎప్పుడు చెబితే అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళు ‘’అని .వీణ వారికి
జడపదార్ధం కాదు .అది ఆయనలోని సరస్వతీ మాత .వీణలో ఆవాహనమైన ఆ దేవతా మూర్తినే
దర్శించేవారాయన  .పేరుకే కాక నిజంగానే భోళా శంకరులే శంకర శాస్త్రి గారు .వీణ మీద  ఈషణ్మాత్ర
తిరస్కృతి  కూడా వారు సహించేవారు కాదు .ఒక సంగీత విమర్శకుడు ఒక సారి ఆయనతో
చమత్కారంగా ‘’అయ్యా !ఇప్పుడు సరస్వతీ దేవి వీణ ను వదిలేసి ,అంతకన్నా సౌఖ్యమూ ,ఎక్కువ
సౌలభ్యమూ ,వేగ సిద్ధీ ఉన్న వయోలిన్ ను పట్టు కోన్నట్లు ంది ‘’అంటే శాస్త్రిగారు ఆయన వైపు ‘’గుడ్లు రిమి
‘’చూశారట .వీణ అంటే వారికి అంతటి నిబద్ధ త .శాస్త్రిగారికి ముందుకాలం లో  వీణను విద్వాంసులు కష్ట ం
అనుకోని వేగంగా వాయించేవారు కాదు .ఆ లోటును పూడ్చి శాస్త్రిగారు మహా వేగంగా వాయించి యెంత
తేలికో రుజువు చేశారు .సరోద్ వాయించే అమ్జా ద్ ఆలీఖాన్ కు వేగంగా వాయించటం మహా ఇష్ట ం
.అలాంటి ఖాన్ సాబ్ తో శాస్త్రి గారు వీణతో యుగళం  వాయించి ప్రపంచ శ్రో తలనే మెప్పించారు .వారి
సాధన ,ప్రయోగం అంతటివి.
 

ఇది విన్నారా కన్నారా !  19

36-ఆమని కోయిల సంగీతం మహా మహో పాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -2

242-‘’హాలులో నాలుగు గోడలమధ్యబందీ అయిన వీణా వాద్యాన్ని ,ఆధునికకాలపు అభి రుచులకు


అనుగుణంగా ,మైదానం లోకి తెచ్చి ,ప్రపంచ వ్యాప్త సంగీత రసికులను’’ శాంత రసం ‘’లోము౦చినవారు
ఈమనివారు .ఇదివారి సంకల్ప శక్తీ ,నిరంతర అభ్యసనం ,సాధనారక్తీ ,వాద్యం పైనిబద్ధ త ,నిరంతర కృషి
,పరిశోధనాసక్తీ,పరిశీలా దృష్టి వల్ల నే సాధ్యమైంది .త్రిలింగ క్షేత్రమైన ద్రా క్షారామం లో పుట్టి,ఆనాటి తెలుగు
దేశపు అగ్రశ్రేణి వైణిక విద్వాంసులైన పితృపాదులు శ్రీ అచ్యుత రామ శాస్త్రి గారి వద్ద నే వీణా వాదనా
సామార్ధ్యాన్ని పొ ంది ,వీణను ’’తెలుగు వీణ ‘’గా అవతార మెత్తి ంచి  అంతర్జా తీయ కీర్తిని తెచ్చిపెట్టా రు.
వీణను తెలుగు వీణగా ప్రతిష్టించిన ఘనత శాస్త్రి గారిదే .వీణ అంటే తెలుగు వాళ్ళది ,అనే గౌరవం సత్కీర్తి
ఈమని వారే కలిగించారు .సంగీత వ్యాప్తికి తమిళులు ఎంతగా కృషి చేశారో వీణ వ్యాప్తికి ఈమని శంకర
శాస్త్రి గారు అంతటి కృషి చేశారు’’అని విశ్లేషించిన ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారి పలుకులు
‘’ప్రా బలుకులే ‘’.
243-ఈమని వీణావాదనం  ఎవరి వాద్యాన్నీ పో లి ఉండదు .అందులో వారి వ్యక్తిత్వమే ప్రతిధ్వనిస్తు ంది
.వాద్య రీతు లో వారి వాద్య రీతి కల్తీ చేయబడలేదు .అతి సున్నితమైన గులాబీ రెక్కల రెపరరెపలను
చూపారు .మేఘ గంభీర నాదంతో ధను౦జయుని ధనుస్ట ౦ కారాన్నీ చూపుతూ ,ఒక్కో రసానికి ఒక్కొక్క
రీతిని ప్రయోగించిన విశేష నేర్పు వారిది .

244-ఈమని వారి వీణా నాద వైవిధ్యం అనితర సాధ్యం .ఒక్కొక్క సారి సితారా లాగా ,మరోసారి సరోద్
వలె ,మరికొన్ని సార్లు గిటార్ మెరుపులతో ,వేరొక సారి గోటు వాయిద్యంగా తంత్రీ వాయిద్యాల విభిన్న
వ్యక్తిత్వాలనన్నిటినీ తమ వీణ లోనే పలికించి మెరిపించి మురిపించ గల నాద యోగ సిద్ధు లు శంకర శాస్త్రి
గారు .హృదయం లో మోగే ‘’అనాహతాన్ని ‘’తమ మీటుల నడుమ ‘’నిశ్శబ్ద ం’’ లో ‘’మ్రో గించే ‘’ఘనత శాస్త్రి
గారిది .దీనినే వారు ‘’మ్యూజికల్ సైలెన్స్ ‘’అన్నారు .’’దీన్ని అనుభవించి ఆలాపనలో ఈ నిశ్శబ్ద స్థితి ని
చూపలేని సంగీత కళాకారుడు ఎవ్వరికీ యే అనుభవాన్నీ ఇవ్వలేడు’’అన్న ఆచార్య ముదిగొండవారి
మాటలు వారి అనుభవానికి చిరునామాలు .

245-భారత దేశం లో ‘’కాంటాక్ట్ మైక్’’(పికప్ )ను మొట్ట మొదటగా వాడిన వారు ఈమని వారే .పికప్
వాడి వీణా నాదం లో ,మీటు లో ,నాజూకులు ,నయగారాలు తెచ్చిన ప్రపధ
్ర మ వైణికులు శంకర శాస్త్రి గారు
.లలిత సంగీతం లో శాస్త్రీయ వాసనలను ,శాస్త్రీయ సంగీతంలో  లలిత సంగీత ‘’లే పరిమళాలను ఘుమ
ఘుమలను  ‘’అద్దిన ప్రయోగ శీలి శాస్త్రి గారు . ఈప్రయోగ శీలత యే వారిని ఢిల్లీ ఆకాశ వాణి కేంద్ర వాద్య
బృంద సంగీత దర్శకుని ,మద్రా స్ జెమనీ సినీ స్టూ డియో లో కొన్ని హిందీ ,తెలుగు సినిమాలకు సంగీత
దర్శకుని చేసింది .

246 –లోకాన్ని ,లోకపు సంఘటనలను వీణా నాదం లోకి అనువదించటం అంతకు ముందు ఎన్నడూ
లేనిది .శాస్తి గార ఈ పని చేసి చూపి ఆశ్చర్య పరచారు .టెన్సింగ్ నార్కే ఎవ రెస్ట్ శిఖా రాన్ని అది
రోహించిన వార్త విని స్వయంగా స్పందించి ‘’ఆదర్శ శిఖరా రోహణ౦ ‘’అనే గొప్ప వాద్య బృంద సంగీతాన్ని
సృష్టించి ప్రసారం చేయించారు .దీన్ని విన్న శ్రో తలందరూ తామే అధిరోహిస్తు న్న అనుభూతికి లోనయ్యారు
.అంటే వీణా వాదనతో ఇతర వాద్యాలను జోడించి సంగీతాన్ని ఎవరెస్ట్ శిఖరా రోహణ౦  చేయి౦చా
రన్నమాట ఈమని వారు .టెన్సింగ్ ఎక్కి చరిత్ర సృష్టిస్తే సంగీతం తో ఎవరెస్ట్ నెక్కించి  శంకర శాస్త్రి గారు
మరో చరిత్ర సృష్టించారు .అలాగే ‘’భ్రమర విలాసం ‘’అనే రసమయ సంగీత రచన చేసి వినేవారికి ‘’భ్రమర
ఝంకారాన్ని ‘’అను భూతిలోకి తెచ్చారు .దీనిలోని సంగీత విశేషాలను తెలుసుకోనేట్లు కూడా  చేశారు
.ఇలా తమ సంగీత యాత్రలో శాస్త్రి గారు వందలాది ప్రయోగాలు చేసి భేష్  సెహభాష్ అని పించుకొన్నారు
.ఇలాశాస్త్రి గారి గురించి  యెంత రాసినా ,యెంత చెప్పినా తనివి తీరదు ..అద్భుత రసానందమే
అనుభవైక వేద్యం అవుతుంది .ఒళ్ళు పులకించి పో తుంది .
  

ఇది విన్నారా కన్నారా !  20

36-ఆమని కోయిల సంగీతం మహా మహో పాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -3

 ‘’మోక్షము కలదా భువిలో జీవన్ముక్తు లు కాని వారలకు ‘’అనే కీర్తన ఎప్పుడూ పాడుకోనేవారట .శంకర
శాస్స్త్రి గారు కూడా చివరి కచేరీలలో ఈ కీర్తనే వాయి౦చేవారట .వారు ముక్త పురుషులు .నాదం లో
లయించేవారు .1987 డిసెంబర్ 23 న ఈమని వారు ‘’ఈమనికి ‘కి ’స్వస్తి చెప్పి శంకర గళ నిగళం లో
చేరుకొన్నారు .వారు తూర్పు గోదావరిజిల్లా ద్రా క్షా రామపుణ్య క్షేత్రం లో  1922 సెప్టెంబర్ 23 న
జన్మించారు  .ఇక్కడే అశ్వత్ధ నారాయణుడూ వెలసి ఉన్నాడు. అంటే శివ కేశవ క్షేత్రం అన్నమాట
.65 ఏళ్ళు మాత్రమే  జీవించి ప్రతిక్షణాన్నీ సార్ధ కం చేసుకొన్నారు  .తండ్రి అచ్యుతరామ శాస్త్రి
తాతగారుసుబ్బా రాయ శాస్స్త్రి గార్లు ఇద్ద రూ మహా వైణికులే .శాస్త్రిగారికి నలుగురు అక్కయ్యలు .తల్లి
మగపిల్లా డికోసం తపన చెంది అశ్వత్ధ నారాయణుడికి మొక్కుకొంటే ఆ స్వామి అనుగ్రహం తో శంకర శాస్త్రి
గారు జన్మించారు .బాలసార నాడు వీరికి పెట్టిన పేరు ‘’శంకర సూర్య మాణిక్యాల రావు ‘’.
248 –అంత ధనిక కుటుంబం కాకపో యినా భుక్తికి లోటు లేనిదే .కొడుకు సంగీత వృత్తి లో స్థిరపడటం
తండ్రిగారికి ఇష్ట ం ఉండేది కాదు .కాని శంకర శాస్త్రి గారికి నర నరానా ,ప్రతి రక్త బి౦దువులోనూ సంగీతమే
ఉంది. ఏమీ తెలియని వారి శైశవ బాల్యాలలోనూ సంగీతమే ప్రవహి౦చింది వారిలో   .తండ్రిగారు ఇది
విన్నారా కన్నారా !  20

36-ఆమని కోయిల సంగీతం మహా మహో పాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -3

247-‘’సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా ‘’.త్యాగరాజస్వామి వారు జీవితపు చివరి రోజులలో నాద
లోలురై వీణ వాయించు కొంటూ ఉంటె వీరు నోటితోనే మృదంగ జతులను పలికే వారట .అంటే తాళ
వాద్యం లేకుండానే తాళ ధ్వనులను పలికే వారన్నమాట .లయ ,తాళాలు అలా వారికి ఆజన్మ సిద్ధంగా
లభించిన వరాలయ్యాయి .  తాళం తో పాటు మధురంగా పాడటం కూడా యే శిక్షణా లేకుండానే
వచ్చేసింది .ఈ చైల్డ్ ప్రా జేడీ ప్రతిభ గుర్తించి తండ్రిగారు కొన్ని వర్ణా లు నేర్పారు .కాని సంప్రదాయ శిక్షణ
కొడుకుకు అవసరం లేదని కొద్ది రోజుల్లో నే గ్రహించారు .కుమార సంభావ కావ్యం లో మహా కవి కాళిదాసు
పార్వతీ దేవికి ప్రా క్త న విద్య తో సకల శాస్త్రా లు లభించినట్లు చెప్పాడు .అలాగే శాస్త్రిగారివిద్యఅంతా  కూడా
ప్రా క్త న విద్య యే.ఉపదేశాకాలం లో ఈ ప్రా క్త న విద్య సహజంగా దానంతటికి అదే బయటికి వచ్చేది
.అంతటి చిన్న వయసులోనే వీణ పై ప్రయోగాలు చేసవ
ే ారు .కొత్త ధ్వనులు సృష్టించేవారు ప్రకృతిలో విన్న
ప్రతి ధ్వనినీ వీణ పై పలికించి అబ్బుర పరచేవారు .ఒక్క ఏడాది కాలం లోనే కచేరీ కి కావాల్సినంత పాఠం
నేర్చుకొని ,ప్రయోగ శీలత తో దాన్ని గుబాళింప జేసేవారని ఆచార్య ముదిగొండ అన్నారు .

249-దాక్షారామం లో మూడవ ఫారం చదివి ,కాకినాడ వెళ్లి పెద్దక్క సరస్వతమ్మ గారింట ఉండి,పి ఆర్
కాలేజీలో ప్రిసిపాల్ పెద్దా డ రామ స్వామిగారిని పాట తో మెప్పించి సీటు సంపాదించారు .ప్రిన్సిపాల్ గారే
వీరి పేరును ‘’ఈమని శంకర శాస్త్రి ‘’గా మార్చారు .ఇది ఆయనకు రెండవ బారసాల అయి ఆ పేరే స్థిర పడి
విశ్వ వ్యాప్త మై పో యింది ‘’.పేరులోన పెన్నిధి కలదు ‘’అని రుజువైంది .’’సూర్య మాణిక్యాల రావు’’నోటితో
మృదంగమే వినిపిస్తే ,శంకర శాస్త్రి జీవితమంతా వీణ నే వినిపించాడు .వీణ పై పాశ్చాత్య సంగీతాన్ని
వినిపిస్తు న్నప్పుడు వ్రేళ్ళతో ఆ పాట లయను వీణ బుర్ర మీద కొట్టి వినిపించేవారు .వీరి కాలేజి చదువుకు
రెండు సార్లు విఘ్నం కలిగింది .1930 లోని చదువు ,1945 కు కాని బి యే .పట్టా ను ఇవ్వలేక పో యింది

 
 ఇది విన్నారా కన్నారా !  21

36-ఆమని కోయిల సంగీతం మహా మహో పాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -4

250-రేడియోలు గ్రా మ ఫో న్లు ఇంకా జనం కొనుక్కోలేని రోజులవి .సంగీత విద్వాంసులు రికార్డు లను
తెస్తూ నే ఉన్నా ప్రతి ఇంట్లో వినే అవకాశం లేని రోజులు .మోజున్నవారు డబ్బున్నవారు మాత్రమేకొని,
విని ఆనది౦చ గలిగే రోజులవి .అలా౦టికాలం లో ఈమనివారు  1943 తిరుచినాపల్లి ఆలిండియా రేడియో
స్టేషన్ నుంచి మొదటి వీణ సంగీత కచేరీ ఒక గంట సేపు  చేశారు .ఆ కచేరత
ీ ో కాకినాడ సరస్వతీమహళ్
సభాధ్యక్షులు శ్రీ దివాన్ బహదూర్ కొమ్మిరెడ్డి సూర్య నారాయణ మూర్తి నాయుడు గారితో పాటు
,అట్ట డుగు వర్గ ం దాకా ఈమని వారి అభిమాను లయ్యారు .ఈ నాయుడు గారి వద్ద నే శాస్త్రిగారు
హిందూస్తా నీ ,పాశ్చాత్య సంగీత మర్మాలను తెలిసికొన్నారు .వీటివలన శాస్త్రి గారి వీణా వాదన సామర్ధ ్యం
కొత్త అవతారమెత్తి అందరి అభిమానానికి పాత్రమైంది .

251-ఆ నాటి ఉమ్మడి మద్రా స్ రాష్ట ్ర శాసన సభాపతి శ్రీ సాంబ మూర్తి గారి సలహా మేరకు శాస్త్రి గారి
తండ్రిగారు కుటుంబాన్ని మద్రా స్ కు 1940 లో మార్చారు .ఇంటర్ పూర్తీ చేసి వాసన్ గారు నిర్మించిన
జెమిని స్టూ డియో లో పాప నాశన౦ శివన్ ,దండపాణి దేశికర్ ,సాలూరి రాజేశ్వర రావు వంటి దిగ్దంతుల
సరసన 18 ఏళ్ళ శాస్త్రిగారు సంగీత బృందం లో చేరటానికి వీణను వాయించమంటే మూడు గంటలసేపు
శాస్త్రిగారు కచేరీ చేయగా ముగ్ధు లై వాసన్ గారు బృందం లో చేర్చుకున్నారు .తండ్రి పిల్లా డు
పాడైపో తాడేమోనని బాధ పడ్డా రు .శాస్త్రిగారికి చిన్నప్పటి నుంచి ఇతరులలో మేలిమి గ్రహించటం ,దాన్ని
తనబాణీలోఒదిగేట్లు చేయటం రివాజు .చతురత సాధించాక వీణపై పాశ్చాత్య సంగీతాన్ని వాయించి మెప్పు
పొ ందారు .దీని మీటు ,పధ్ధ తి వేరు .కుడి ,ఎడమ చేతుల రెండింటి పని కర్నాటక సంగీతానికి బహు
దూరం .సినిమాలకు వీణ వాయించినా ,సగీతదర్శకత్వం వహించినా వారి సృజన శక్తియే అగ్ర శ్రేణిలో
నిలబెట్టింది .సినిమాలకు వాయించి ఉండక పొ తే జాతీయ వాద్య బృందానికి నాయకత్వం వహించటానికి
అవకాశం వచ్చి ఉండేదికాదు .శాస్త్రి గారి వాద్య బృంద రచనలు తర్వాత కాలం లో ప్రా ంతీయ రేడియో
స్టేషన్ లలోని వాద్య బృందాలకు ఒరవడి పెట్టా యి .

252 –జెమినీలో ఉండగా రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో సంగీత సంరంభం కొంత కాలం ఆగి పో యింది
.దాక్షారామం వెళ్లి కచేరీలు చేయటం మళ్ళీ మొదలు పెట్టా రు .జెమినీ నుంచి మళ్ళీ పిలుపు వచ్చి వెళ్లి
చేరారు .జెమినీ సినిమా ‘’దాసీ అపరంజి ‘’సినిమాకు రెండుపాటలు శాస్త్రి గారే కట్టా రు .’’శ్రీ జయ
పరమేశ’’పాట బాగా జన రంజక మయింది .సంగీత దర్శకులు కాకుండానే ఇలా ఎన్నో పాటలకు స్వరాలు
కూర్చారు .బి యే పూర్తిచేయటానికి కాకినాడ వెళ్లి పాసై తిరిగి వచ్చారు .వాసన్ గారి దగ్గ ర మళ్ళీ చేరి
,తాము తీస్తు న్న ‘’మంగళ ‘’హిందీ సినిమాకుట్యూన్లు కట్ట మని కోరగా మాంచి బాణీలు కట్టా రు   తెలుగు
సినిమా ‘’సంసారం ‘’కు శాస్స్త్రి గారు కట్టిన ట్యూన్లు ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపాయి .ఇవికాక ‘’బహుత్
దిన్ హుయే ‘’,మిస్ట ర్ సంపత్ ‘’,నిషాన్ ,’’చంద్రలేఖ ‘’సినిమాలు శాస్త్రి గారి బాణీల ఓణీల తోనే జనాన్ని
మెప్పించి దిగ్విజయమయ్యాయి  .చంద్ర లేఖ సినీ సంగీతం రికార్డ్ లను సృష్టించింది

253 –జెమినీలో ఉండగానే శాస్త్రిగారు వీణా వాద్యానికి ఎన లేనిసేవ చేశారు .వాద్య బృందం లో అప్పటి
దాకా వీణ వెనక వరుసలో ఉండేది .ఎవరికీ దాని స్వారస్యం ఆనేదికాదు. ‘’అగస్త ్య భ్రా త ‘’అయింది
అప్పుడు వీణ .జెమినీలోని పాశ్చాత్య సౌండ్ ఇంజనీర్ ఏడాదికోసారి తన దేశానికి సెలవు మీద వెళ్లి
వచ్చేవాడు .ఒకసారి అలాగే వెళ్లి వచ్చి అక్కడ గిటార్ కు కాంటాక్ట్ మైక్ అంటే పికప్ పెడుతున్నారని చెప్పి
తెచ్చిచ్చాడు .ఈ పికప్ ను వీణకు అమర్చి తమ సంగీతాన్ని బాగా పికప్ చేశారు శాస్త్రీజీ .సున్నిత
గమకాలను  నాజూకు మీట్ల ను పట్టు కొని శ్రో తలకు వాటిని వీణపై అందించి పరవశులను చేసేవారు .దీనితో
వీణకు మళ్ళీ నాజూకుల నగలు ఆభరణాలుగా భాసి౦చాయి వీటికన్నిటికీ ఆద్యులు శంకర శాస్త్రి గారే .ఆ
తర్వాత పికప్ అందరికీ ఆరాధ్యమై, మాంచి పికప్ సాధించింది

254 -1959 డిసెంబర్ 1 న శాస్త్రి గారు మద్రా స్ రేడియో స్టేషన్ లో మ్యూజిక్ ప్రొ డ్యూసర్ గా చేరారు
.1961 లో ఢిల్లీ లో నేషనల్ ఆర్కెస్ట్రా కు కంపో జర్ గా ,కండక్టర్ గా ,డైరెక్టర్ గా పని చేశారు .అంతకు
ముందే కొన్ని వాద్య బృంద రచనలు చేసి శ్రో తలను మంత్రం ముగ్ధు లను చేశారు .

255-1940 నుండి -76 వరకు శంకర శాస్త్రి గారి సంగీత జీవితం విశిష్ట ంగా పాతికేళ్ళు సాగింది .అనుక్షణ
సంప్రదాయ ,ప్రయోగాలు సాగాయి .వీణా వాదాన్నిశర వేగంగా ముందుకు తీసుకు వెళ్ళారు .శాస్త్రీయ
సంగీతం తోపాటు లలిత ,వాద్య సంగీతాలకూ సత్పరిణామాలు సాధించి చూపారు .

256 –వీణ కర్నాటక సంగీతానికి ,సితార్ ,సరోద్ లు హిందూ స్తా నీకి ప్రత్యేకత అని భావించే రోజులవి
.ప్రపంచ సంగీత చరితల
్ర ో మొదటి సారిగా శాస్త్రిగారు శ్రీ రవి శంకర్ తో సితారా తో కలిసి వీణ వాయించారు
ఆధార శ్రు తి నుంచి రెండు రీతుల బాణీలవరకుఅన్నీ సమస్యలే .వీటినన్నిటినీ పరిష్కరించు కొంటూ
శాస్త్రిగారు సరి కొత్త ప్రయోగం చేసి రెండు వాద్యాలనుంచి రెండు బాణీల సంగీతం నుంచి మేలిమి ని ఈ
కచేరీలో రాబట్టా రు .దీన్ని ఆకాశ వాణి ప్రసారం చేసింది .భారతీయ సంగీత చరితల
్ర ో’’ తొలిజుగళ్ బందీ
‘’ఇదే .దీనికి ఆద్యుడుతెలుగు బిడ్డ  శాస్త్రి గారే కావటం మన అదృష్ట ం .వీణ వాయిస్తూ ఒక భజన పాడి
వినిపించిన శాస్త్రి గారిని భారత ఉప రాష్ట ్ర పతి, శాస్త్రి గారిని ‘’ఇంటే గ్రేటర్ ‘’అని ప్రశంసించారు .సితారా
,వీణా ,సరోద్ బాణీలను ఇంటేగ్రేట్ చేసన
ి ఘనత శాస్త్రి గారిదే .
257  -సినీ సంగీత ప్రపంచానికి పి బి శ్రీనివాస్ ను ,ఎ.ఏం రాజా ను గాయకులుగా పరిచయం చేసి
కానుకగా ఇచ్చిన వారు శాస్త్రి గారే .ఇక వీణకు కానుకగా శ్రీ చిట్టి బాబు ‘’ను ,శ్రీమతి వి యెన్ సరస్వతిని
వారసులుగా అందించారు శాస్త్రి గారు.

 ఇది విన్నారా కన్నారా !  22

36-ఆమని కోయిల సంగీతం మహా మహో పాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -5

258-గాత్రా నికి గాత్రత్వం ఎలాంటిదో వీణ కు ‘’వీణత్వం’’ అలాంటిది .చాలామంది వైణికులలో ఈ  వీణత్వం
లోపిస్తు ంది .7 తంత్రు లను వీణ మీద మీటి నప్పుడు కలిగే నాద సౌభాగ్యం ఇతర వాద్యాలలోకాని గాత్రం
లో కాని రాదు అంటారు ఆచార్య వీరభద్రయ్య .ప్రతి వాద్యానికీ ఒక పరిమితి ఉంటుంది .ఆ పరిమితి లోనే
వీణ వృద్ధి చేశారు శంకర శాస్త్రి గారు .త౦త్రి మీద కంపిత గమకాన్ని సాధించటం కుదరదు .కాని ప్రయోగ
శీలి అయిన శాస్త్రిగారు అనుమంద్ర తంత్రిని పరాన్ముఖంగా కాకుండా ,అభి ముఖంగా లాగి గమకాన్ని
సాధించిన నేర్పు ఈమని వారిది అంటారు శ్రీ వీరభద్రయ్య .మంద్ర ,అనుమంద్ర తంత్రు ల మీటులో
సాధించిన మరో విశేషం ఉంది .వీణ బ్రిడ్జికి మేళాంతానికిమధ్య మీటటం కాక ,తార స్వరాలు పలికే మెట్ల
మీద ఆ తంత్రు లను బొ టన వ్రేలితో మీటటం .మామూలు చోట మీటితే వచ్చే ధ్వనికి ,దండం పై తారస్థ లం
లో మీటితే వచ్చే ధ్వనికీ ఎంతో భేదం ఉంది అని విశ్లేషంి చి చెప్పారు ఆచార్య వీరభద్రయ్య .ఇక్కడే రసికులు
,సంగీత ప్రియులు గమనించాల్సిన అంశం ఒకటి ఉందంటారు ఆచార్య వర్యులు .తీగపై మీటు ఎక్కడ
మీటాలి ?ఇది ఒక్కొక్క త౦త్రి పై ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది .సందర్భాన్ని బట్టికాకుండా
అన్నిటికీ మేళాంతంనుంచి బ్రిడ్జి వరకు తీగలోని మధ్య బిందువు మీద కాని ,మేళాంతం లో కాని మీటటం
సాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు .కాని శాస్త్రి గారు మీటే స్థ లాన్ని అక్కడక్కడ మారుస్తూ నాదం లో
గొప్ప వైవిధ్యాన్ని సాధించారు .మీటును బ్రిడ్జి కి ఆనుకొన్న స్థ లం లో మీటి రాగానికి ,స్వరానికీ ఎంతో
భేదాన్ని చూపారు శాస్త్రి గారు మూడు చోట్ల మీటు ను మీటడం వలన వాద్యధ్వనిలో ఉండే యాంత్రికత
ను తొలగించి’’ సజీవత్వం ‘’కల్గించటం శాస్త్రి గారి అద్భుత కృషి అన్నారు వీణ విమర్శకులైన
ముదిగొ౦డవారు .

259-శాస్త్రి గారు సాధించిన మాధుర్యం మీటే స్థ లాన్ని బట్టి తెప్పించారు . ఆ తంత్రు లకు ‘’జీవం ‘’పెట్టా రు
.అంటే బ్రిడ్జి మీద ఈ రెండు తంత్రు లకు ఒక ‘’గరుకైన ఉన్ని పో గు’’ను పెట్టి ,దానితో ఆ తంత్రు లను
మీటినప్పుడు ఒక విచిత్ర ,విశిష్ట మధుర ధ్వని కలుగుతుంది ఈ పధ్ధ తి త౦బూరాలో ఉంది .దీన్ని
వీణలోనూ తెచ్చారు శాస్స్త్రి గారు .వాయి౦పు లో మంద్ర తంత్రీ నాదానికి అనూహ్యమైన మాధుర్యాన్ని ఈ
‘’జీవం ‘’వలన సాధించేవారు శాస్త్రి గారు అని కనిపెట్టి చెప్పారు ముదిగొండ అయ్యవారు.అంతవరకూ
మీటు విషయం లో ఇలాపరిశోధించిన వారు లేరని ముదిగొండ ఉవాచ .వీణా వాదనా మాధుర్యం లో సగం
ఈ మీటు లోనే ఉంది  .

260-సారణి మీద పంచమాన్ని మీటి నప్పుడు పంచమ తంత్రిని కూడా జోడించటం సాధారణ వైణికులు
చేసేపని .కాని శాస్త్రి గారు సారణి మీద వాయిస్తు న్నప్పుడు, కేవలం స-ప-స- లను వాయిస్తు న్నప్పుడు
మాత్రమే కాక ,తక్కిన స్వరాలను మీటు తున్నప్పుడు కూడా ఇతర తంత్రు లను అక్కడక్కడ మీటి
‘’అనితర సాధ్యమైన మాధుర్యాన్ని ‘’సృష్టించేవారు .వీటి గురించి తెలియాలంటే వారి ప్రయోగాలే శరణ్యం
అన్నారుఆచార్య  వీరభద్రయ్య  .

261-తాళం తీగల విషయ౦ లో కూడా శాస్త్రి గారి వాదన లో ప్రత్యేకత ఉంది .పూర్వ సంప్రదాయం లో
తాళాన్ని చూపేటప్పుడు మాత్రమే తాళం తీగలను మీటేవారు .తాళాన్ని చూపేటప్పుడు ‘’ఘాత ‘’ఎక్కడ
చూపితే అక్కడ మాత్రమే తాళం తీగలను చిటికెన వ్రేలి గోరు తో పైకి మీటేవారు .తరువాత తర్వాత ఈ
విధానం మారింది .అప్పుడు శాస్త్రిగారు తాళం తీగలను మాధుర్యం సృస్టించటానికి మాత్రమే వాడారు
.ఇప్పుడు ఎవరూ వారి నైపుణ్యాన్ని అనుకరించ లేక పో తున్నారు శ్రు తికి ప్రత్యామ్నాయం గానిలపడమే
కాక ,సారణి మీద వాయింపు కు మాధుర్యపు గుబాళింపు ,రోచిస్సు లను జోడించి ఘనత తెచ్చారు అని
విశ్లేషించారు డాక్టర్ వీరభద్రయ్య .
 

ఇది విన్నారా కన్నారా !  23

36-ఆమని కోయిల సంగీతం మహా మహో పాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -6

262-తానం లయ బద్ధ మైన రాగాలాపనమే .ఆ లయకూ వీణ వాద్యం లో నాద మాధుర్యం లో ని౦ప గలిగే
అవకాశం ఉంది .దీన్ని సంపూర్ణ ంగా వినియోగించుకున్న మహానుభావులు ఈమని శంకర శాస్త్రి గారు
.రాగాలాపన చేయటం లోనూ శాస్త్రి గారు వీణ లో ప్రత్యేకత సాధించారు .రాగాలాపనలో మీట్లు తక్కువ గా
ఉంటాయి .ఐతే శాస్త్రి గారు తక్కువ మీట్ల తో రాగాలాపన చేస్తూ నే స్వరకల్పనలో లాగానే స్వర
సమూహాలను వెంట వెంటనే మీటి రాగాలాపనలో భాగం గా వాటిని మెరిపించేవారు .వీరి తరవాతి
వైణికులు కూడా దీన్ని బాగా అంది పుచ్చుకున్నారు అంటే శాస్త్రిగారి ప్రయోగం యెంత ఔన్నత్యాన్ని
సాధించిందో అర్ధ మవుతుంది .తానం మీట్ల తో ,తాళం తీగలను మీట కుండా ,రాగా లాపనలో ఇమిడించటం
కూడా శాస్త్రి గారి మరో విశిష్ట పద్ధ తియే అంటారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

263 –గాయకుని గొంతులో వంపు సొ ంపులు ఇచ్చా మాత్రం తో తేగలగడం ఎలాంటిదో ,వీణ లో మీటు
అలాంటిది .అందరూ వీణ బాగానే వాయిస్తా రు .కాని వాదన కళ ఈ వంపు సొ ంపులను సృష్టించటం లోనే
ఉంది .వీటినేసంగీత శాస్త ం్ర ‘’గమకాలు’’ అన్నది .మీటులో నైపుణ్యమే  లేక పొ తే గమకం సిద్ధి౦చనే
సిద్ది౦చదు .మీటులో నైపుణ్యం కుదిరాక ఎడమ చేతితో దండం మీద తీగలను సాధించాలి .ఈ రెండూ
ఒకదానితో ఒకటి కలిస్తే ‘’వాదనం ‘’అవుతుంది లేకపో తే మిగిలేది ‘’రోదనమే ‘’అని చమత్కరించారు
ఆచార్య జీ..శంకర శాస్త్రి గారికి  అటు కుడి చేతి మీటు లోను ,ఇటు ఎడమ చేతి వాయింపు లోను
ఉన్నంత అధికారం మరే వైణికుడికి లేదని ఆచార్య ముదిగొండ ఘంటా పదంగా చెప్పారు .రెండిటికి
సమప్రా దాన్యమిచ్చినప్పుడే ప్రేక్షక శ్రో త్రు జనం సంతోషిస్తా రు .ఈ రెంటినీ సాధించినప్పుడే వైణికుడు కూడా
తన ‘’కళలో రమిస్తా డు ‘’.ఒక రకం గా ఇది ‘’వైణిక సవ్య సాచిత్వం ‘’అని తేల్చారు వీరభద్రయ్య గారు .ఈ
విద్యకు శంకర శాస్త్రిగారు పెట్టింది పేరు అని తీర్పునిచ్చారుకూడా .గతించి పో యిన వీణా వైభవాన్ని శాస్త్రి
గారి ఈ సవ్య సాచిత్వం తోనే పునరుద్ధ రంి చారు అని నిర్ద ్వంద్వంగా ముదిగొండ వీరభద్రయ్య గారు
ఆచార్యానుభవం తో నిర్ణ యించి చెప్పారు .

264-వీణ పై తోడి రాగం వాయించటం కష్ట మని ,మరీ ,’’హనుమత్తో డి’’లో సాధారణ గా౦ధారాన్నీ ,కైశిక
నిషాదాన్నీ మెట్టు మీద చూపటం కుదరనే కుదరదని ,దీనికి దగ్గ ర గా ఉండే ఆనంద భైరవిలో సాధారణ
గా౦ధారాన్ని పైనే చూప వచ్చని ,చూపాలి కూడా నని అన్నారు ఆచార్య శ్రీ .కాని కర్నాటక తోడి లో ఇది
కుదరదు .దాన్ని ఖచ్చితంగా ఎప్పుడైనా చతుశ్రు తి రిషభం లోనే ,కంపిత గమకం తో చూపాలి
.ఆరోహణలోనూ అంతే .అలాగే శుద్ధ దైవతం లోనే కైశిక నిషాదాన్ని చూపాలి .  దీనివలన స్వర కల్పనలో
వేగ సాధనకు కొంచెం ఇబ్బంది కలుగుతుందని, కాని శాస్త్రి గారు సంప్రదాయాన్ని పాటిస్తూ నే మధ్య
మధ్యలో కైశిక నిషాదాన్నిమెట్టు పైననే చూపేవారని ,చాలా కొద్ది సార్లు సాధారణ గా౦ ధారాన్ని మెట్టు
మీదే చూపేవారని  కాని అది ఏమాత్రం ఎబ్బెట్టు గా ఉ౦డేదికాదని,పైగా గొప్ప అందంగా ఉండేదని స్వర
రాగ కషాయాన్ని కాచి వడబో సిన  ఆచార్య వర్యుల ఉవాచ .నాట రాగం లో షట్ శ్రు తి రిషభం ,షట్ శ్రు తి
దైవతం లను వెనక స్వరాలలో లాగి చూపాల్సిందే తప్ప మెట్టు మీద వాయించటానికి వీలు లేదని
,అవరోహణలో మాత్రమప్పుడప్పుడు అలా వాయించినా ఓర్చు కొంటు౦దని  శాస్త్రిగారి వాదనలో ఈ
మెలకువలన్నీ ఇమిడిపో యి ఎంతో రామణీయకం సృష్టింప బడేది అని వీణా వాదనా సామర్ధ ్యమున్న
ఆచార్య ముదిగొండ వీర భద్రయ్యగారు . విశ్లేషించి వెలికి తీసి చెప్పిన ‘’మహా వాక్యా’’లివి .

265-శాస్త ం్ర లో గమకాలూ’’ పది’’ అని, వాటిలో ఆరోహరణ అవరోహణ, మూర్చనలు విశేషం లేనివని
,ఢాలు,స్పురితం ,కంపితం ,ఆహతం ,ప్రత్యాహతం ,త్రిపుచ్చం ,ఆందో ళనం అనే ఎనిమిది గమకాలూ వీణ
మీద వాయిస్తే విశేష మాదుర్యాన్నిస్తా యని ,శంకర శాస్త్రి గారు వీటి నన్నిటినీ’’ నిర్దు స్ట ం’’గాను ‘’నిర్దిష్టం
‘’గాను పలికి౦చేవారని ,కాంటాక్ట్ మైక్ వీటికి ఎంతగానో తోడ్పడిందని ,ఈ ‘’దశ విధ గమకాలు  ‘’కాకుండా
శాస్త్రి గారు మరొక ‘’12 గమకాలు ‘’వీణా వాదన లో సృష్టించారని ,వాటికి పేర్లు లేవని ,ఇప్పుడు వాటిని
వాయి౦చేవరూ లేరని ,శాస్త్రిగారి కుమార్తె మాత్రం కొన్నిటిని వాయిస్తు ందని తేల్చి చెప్పారు ఆచార్య
వర్యులు .

266-వీణా తంత్రు లను కృత్రిమ గోళ్ళను తొడుక్కొని వాయిస్తా రు చాలామంది .వీటిని తీగలతోనే చేస్తా రు
.వీటిని మధ్య వ్రేలికి దాని ప్రక్క వ్రేలికి తొడుక్కుంటారు .అయితే శాస్త్రిగారు వీటిని అసలు వాడేవారు కాదు
.అంతాసహజమైన గోళ్ళ ద్వారానే సాధించారు .నాదం లో హెచ్చు తగ్గు లు కలిగేట్లు మీటడం వలన గొప్ప
శ్రు తి సుభగాత్వాన్ని శాస్త్రిగారు సాధించే వారు అంటారు ఆచార్య ముదిగొండ శ్రీ .
 

                                 చంద్ర లేఖ సినిమా లో  మూడు  దృశ్యాలు  

ఇది విన్నారా కన్నారా !  24

36-ఆమని కోయిల సంగీతం మహా మహో పాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -7

267-కేవలం వాద్యాలమీదనే కొన్ని స్వరాలతో సంగీత రచన చేసి ,దానిలో సంఘటనల వలన కలిగే అను
భూతులను శ్రో తలలో కలిగించాలి అనే మహా విద్యలో శంకర శాస్త్రి గారు అద్వితీయులు .ఈఅనుభవం తో
80 కి పైగా ‘’వాద్య బృంద రచనలు ‘’చేసి వినిపించారు .ఇందులో కొన్ని సంఘటనా నేపధ్యం లో ఉంటె
,మరికొన్ని మహా పురుష జీవిత ఘటనా నేపధ్యం తో ఉన్నాయి .’’సౌమ్య పురుష ‘’అనే పేరుతొ మహాత్మా
గాంధీ శత జయంతి ఉత్సవాలకు రచించారు .అలాగే ‘’భారత జ్యోతి ‘’,’’జవహర్ జ్యోతి ‘’దేనికది ప్రత్యేకం గా
చేశారు .వీటిలో వీరి కీర్తిని ఎవరెస్ట్ శిఖరం పై అత్యున్నతంగా నిలిపినవి రెండు –ఒకటి ‘’ఆదర్శ శిఖరా
రోహణ’’,రెండవది ‘’భ్రమర విన్యాసం ‘’అని ముందే చెప్పుకున్నాం .టేన్జి ంగ్ నార్కే ఎవరెస్ట్ ను ఎక్కటాన్ని 
‘’ఆదర్శం ‘’గా భావించి ఆ పేరు పెట్టా రు ధ్వన్యాత్మకంగా .వాక్కు లేని హృదయ భాషను వారి వాద్య
బృందం పలికించి ఆ సంఘటనను ‘’చిరస్మరణీయం ‘’చేశారు శాస్త్రి గారు .అలాగే తుమ్మెద అంటే భ్రమరం
జీవితం లోని ఒక్క రోజు జీవితాన్ని సంగీతంగా అనువదించి మాటలకందని భావ వ్యక్తీకరణ చేసి తమ
వీణానాదం లోని ఝ౦కా రాలను సహస్రదళ పద్మంగా వికసింప జేసి మహా మధురాను భూతి
కలిగించారు .’’రస తేనే పట్టు ‘’ను నిర్మించి జుమ్మనే నాదం తో ,అమృతమయమైన కమ్మని జుంటి తేనె
తాగించారు .

268 –ఈమని వారి ప్రతిభను యే కొంతకో పరిమితం చేయలేము .వారి ప్రయోగ వైవిధ్యం ఎల్ల లు లేని
సముద్రమే .సంప్రదాయ శాస్త్రీయ ,లలిత ,సినీ ,పాశ్చాత్య ,ఆర్కెస్ట్రా   హిందూ స్థా నీ సంగీతాలలో ఎన్నో
ఎన్నెన్నో మూలాలు , కిటుకులు  తెలిసిన మహా విద్వా౦సులాయన .అందుకే ఆర్కెస్ట్రా సంగీతం లో తోడి
రాగ ఆలాపన ,తానం ,పల్ల వులను రచించి లక్షలాది శ్రో తలకు సంతోషాన్ని, సంతృప్తిని కలిగించారు .శుద్ధ
కర్నాటక శాస్త్రీయతను రంగరించుకొన్న తోడి రాగాన్ని వాద్య బృందానికి శాస్త్రి గారు తీసుకోన్నారంటే వారి
గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి .సాహసం, గుండె ధైర్యం ఉన్న వారు కనుకనే ఈపని చేశారు సార్ధ కత నూ
చేకూర్చారు .

269 -50 దేశాలు పాల్గొ న్న ‘’ఏషియా రోష్ట ం్ర ఫైల్’’లో శంకర శాస్త్రిగారు ‘’స్వర రాగ సుధా రస ‘’అనే
శంకరాభరణ కీర్తనను రాగ ,తాన ,స్వర కల్పన లతో మద్రా స్ ఆకాశ వాణి కేంద్రం లో రికార్డ్ చేసి ఆ పో టీకి
పంపగా, దానికి న్యాయ నిర్ణేతలు ప్రధమ బహుమతినిచ్చి వారి సృజనకు నీరాజనాలు అందించారు .ఆ
కాలం లో రష్యా దేశం లో శాస్త్రి గారి వీణా వాదన చాతుర్యాన్ని మెచ్చుకొని వారు లేనేలేరు అంటే
అతిశయోక్తి కాదు అంటారు ఆచార్య ముదిగొండ వారు .’’యహూదీమెనుహిన్ ‘’ఈ పో టీ కి న్యాయ నిర్ణేత.
శుద్ధ శాస్త్రీమైనా , సుందర లలిత సంగీతమైనా శాస్త్రి గారు దేనికి దానికే కట్టు బడి శ్రో తలను ముగ్ధు లను
చేయగలరు అన్నది శుద్ధ సత్యం అంటారు వీరభద్రయ్య జీ .

270-శాస్త్రి గారి ప్రయోగాలలో శిఖరారోహణం అయినది వారు రచించిన ‘’ఇందు ‘’.దీన్నే శ్రీ బి వి కె
శాస్త్రిగారు ‘’మాగ్నం ఓపస్ ‘’అన్నారట .’’ఇందు ‘’వాద్య బృందం రచన లో కొన్ని ముఖ్యమైన సంగీత పర
అంశాలున్నాయి .72 మేళ కర్త లు ,అందులో 6 రాగాలు .వీటిని ఒక్కొక్క సమూహంగా ,చేసి 12
సమూహాలుగా ఏర్పరచి ,ఒక్కో సమూహాన్ని ‘’చక్రం ‘’అనే పేరు పెట్టి ,మొత్త ం 12 చక్రా ల ఆవర్త నాన్ని
సృష్టించారు .వీటికి 1-ఇందు 2 నేత్ర 3-అగ్ని 4 వేద 5-బాణ ,6-ఋతు7-ఋషి 8-వసు ,9-బ్రహ్మ ,10-
దిశి ,11-రుద్ర 12 –ఆదిత్య అని నామకరణ౦  చేశారు .ఈ 12 చక్రా లలో మొదటి చక్రం ఇందు .

271 –ఇందుచక్రం లో 6 రాగాలు –కనకాంగి ,రత్నా౦గి ,గాన మూర్తి ,వనస్పతి ,మానవతి ,తాన రూపి
లను పొ ందుపరచారు .ఈ ఆరు రాగాలలోనూ రిషభం శుద్ధ రిషభమే .అలాగే గాంధార మధ్యమాలు కూడా
అంటే రి ,గ లు ప్రక్క ప్రక్కనే ఉంటాయి .ఇంకా తేలికగా అర్ధ మవ్వాలంటే చతుశ్రు తి రిషభమే శుద్ధ
గాంధారం .మధ్యమమూ శుద్ధ మే .మరి ఈ ఆరు రాగాలకు ప్రత్యేకత దేనివలన వచ్చింది ?అంటే దైవత
,నిషాదాల వల్ల నే వచ్చింది. కనకా౦గి లో అన్నీ శుద్ధ స్వరాలు ,రాత్నా౦గి లో కైశికి నిషాదం ,గాన మూర్తి
లో కాకలి నిషాదం ఏర్పడింది .ఈ ఆరు రాగాలతో ‘’ఇందు ‘’పేరు తో స్వర రచన చేసిన స్వర బ్రహ్మ
శాస్త్రిగారు .అసలు ఈ ఊహ రావటమే మహా గొప్ప విషయం ,దాన్నిసవాలుగా  సాధించి నిరూపించి తమ
ఉపజ్నను వెలుగులోకి తెచ్చారు .’’గాన మూర్తి ‘’రాగం పై శాస్త్రి గారికి –మహా గొప్పఅంటే అపారమైన
సాధికారత ఉంది  .ఒక్క ఎం .ఎల్. వసంత కుమారి తప్ప వేరెవ్వరూ ఈ రాగాన్ని ఇంతగా స్వాధీనం
చేసుకో లేదు .గమకం లో స్పష్ట త సాధించుకోలేని  వైణికునికి ఇందు చక్ర రాగాలను పలికించటం
అసాధ్యమైన పని .అంతటి తపనా తపస్సు శాస్త్రి గారిది .సంగీత వైడుష్యాన్నీ ,మాధుర్యాన్నీ రెండిటినీ
ద్రు ష్టి లో పెట్టు కొని వాద్య బృంద రచన చేసి చిర యశస్సు సాధించిన ‘’మకుటం లేని మహావీణా  సంగీత
చక్ర వర్తి’’ శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు అని సామాన్యులకు అర్ధ ం కాని ఈ విషయాలను అలవోకగా
కరతలామలకం చేసి చెప్పారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గురు మూర్తు లు .

  

ఇది విన్నారా కన్నారా !  25

36-ఆమని కోయిల సంగీతం మహా మహో పాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -8(చివరి భాగం )

272-శంకర శాస్త్రి గారి ప్రతిభ సాంప్రదాయ శాస్త్రీయ సంగీతం లో ఎంత ఉందో ,ఆధునిక శాస్త్రీయ సంగీతం
లోనూ అంతే ఉంది .ఆర్కెస్ట్రా సంగీతం భారతీయం కాదు .మన సంగీతం లో ఒక్క కళాకారుడే సంగీత
విద్యా ప్రదర్శన చేస్స్తాడు.తాళ ,మృదంగాలు కేవలం సహకారాలే .కాని ఆర్కెస్ట్రా లో అనేక వాద్యాలు ఒకే
స్వరాన్ని పలికించటం విశేషం .అంటే గాత్రం లో బృంద గానం లాంటిది ఆర్కెస్ట్రా   అన్నమాట . అదుకే
దీన్ని’’ వాద్య బృందం’’ అన్నారు .వాద్యబృందం లో శాస్త్రీయ సంగీతాన్ని వినిపింప జేయటం ,అందులో
కూడా రాగం ,తానం ,పల్ల వులను వినిపింప జేయటం ,అందులో మరీ ముఖ్యంగా తోడి రాగ౦ తానం
,పల్ల వి కట్ట టం అన్నీ  శాస్త్రి గారు చేసిన అద్భుతాలే .అద్భుతాలకే అద్భుతం .అద్భుతాలకే అద్భుతం అని
పించారు .వీణపై తోడి రాగాన్ని వాయించటం లో శాస్త్రి గారు అద్వితీయులు ..తోడి రాగం లో ఇతర
వాద్యాల తోడు గా వాద్య సమ్మేళన రచన గా తీర్చి దిద్ది కొత్త దారి వేసి మార్గ దర్శకులయ్యారు ..వాద్య
సంగీతం అంటే సినిమాలో రీ రికార్డింగ్ సంగీతం లా ,లలిత సంగీతంలాఅని పిస్తు ంది .శాస్త్రి గారు దీని ట్రా క్
లోంచి తప్పించి శాస్త్రీయ సంగీతాన్ని కూడా ,అందులోనూ రాగం ,తానం ,పల్ల వి ని వాద్య సమ్మేళన
రచనగా రూపొ ందించి దివ్యానుభూతిని కలిగించారు అంటారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు .శాస్త్రి
గారి వాద్య బృంద సంగీతం వింటుంటే ‘’ఆధునిక కర్నాటక వర్ణా లా !’’అని పిస్తా యన్నారు ఆచార్య శ్రీ
.’’మనో ధర్మ సంగీతం శంకర శాస్త్రి గారి లో కొత్త రూపు ఎత్తి ంది .వీరి వాద్య బృంద సంగీత రచనలన్నీ వారి
సృజనాత్మక ప్రతిభకు ఎత్తి న పతాకలు అని ముదిగొండ వారు అన్నమాట అక్షర లక్షలు చేసే సత్య వాక్యం
.

273  -సంగీతం లో ఎన్ని ప్రయోగాలు చేసినా శాస్త్రిగారు శాస్త్రీయ సంగీతాన్ని వదిలి పెట్టలేదు .సంగీత
శాఖలన్నిటిపైనా వారికి గౌరవమున్నా శాస్త్రీయ సంగీతాన్ని వీణ కచేరీలను వదలలేదు .తనకు అన్ని
రాగాలు ఇష్ట మే నని ముదిగొండవారి తో జరిగిన ఇష్టా గోష్టి లో చెప్పారు .కాని ‘’శంకర శాస్త్రి తనాన్ని’’
వాయించిన రాగాలలో శంకరాభరణం ,కల్యాణి ,తోడి ,గానమూర్తి ,కీర వాణి రాగాలున్నాయని’’ పసిగట్టా రు
ఆచార్య వర్యులు .’’శివ దీక్షా పరు రాలనురా ‘’అనే కురువంజి రాగ జావళి వారి వలన కొత్త ప్రా ణం
పో సుకొన్నదని ,ఆ రాగాలకు ’ పేటెంట్  ‘’శాస్త్రి గారిదే నని ముదిగొండ ఉవాచ .

275-దీర్ఘ ,లఘు కంపితాలతో,మంద్ర ,అనుమంద్ర తంత్రు ల విని యోగం లో శాస్త్రి గారు మలయ మారుత
వీచికలనే కాక ,ప్రళయ కాల ఝ౦ఝామారుతాలవరకు సృష్టించేవారు .రాగాలాపనలో అనవసర
ప్రయోగాలు ,పునరుక్తు లు ఉండేవికావు .స్వర ప్రస్తా రం లో తాళం తీగెల మీద మీటు శాస్త్రి గారి మరో
ప్రత్యేకత .కీర్తన పాఠం శంకర శాస్త్రి గారు వాయించి నంత స్పష్ట ంగా వాయించ గల వైణికులు ఒకరో ఇద్ద రో
ఉన్నారేమో నంటారు వీరభద్రయ్య గారు .తానం శాస్త్రి గారి చేతిలో కొత్త అందాలు సంతరించు కొన్నదని
,కచేరీలలో యే రాగం తర్వాత యే రాగం వాయించాలి ,యే రాగాలకీర్తనలకు రాగాలాపన ,స్వర ప్రస్తా రం
చేయాలి మొదలైన వాటికి శాస్త్రిగారు పెట్టిందే ఒరవడి గా నిలిచింది అన్నారు ముదిగొండ వారు .

276-ప్రతి కచేరీ చివర వీణ పై ‘’మంత్రం పుష్పం ‘’వాయించటం శాస్త్రి గారి ప్రత్యేకత .దీనికి ముందు ‘’కం
సెప్టెంబర్ ‘’లోని పాశ్చాత్య సంగీతాన్ని వినిపించేవారు .దీన్ని ఎందుకు వాయించేవారు ?అనే ప్రశ్నకు
‘’ఇందులో ఒక రహస్యం ఉంది .దీని మీటు ‘’స్ట క్కాటో’’ పద్ధ తిది .తీగ మీద కలిగే’’ అనురణ నాన్ని ‘’ అంటే
నిరంతర ప్రవాహాన్ని ఆపే పధ్ధ తి అది అన్నమాట .వీణ మీద అన్నీ సాధ్యమేనన్న
‘’ధిషణాహంకారంప్రదర్శనం ‘’‘’శాస్త్రి గారిది అని మనకు తెలియ జెప్పారు ఆచార్య ముదిగొండ .విశ్వనాధ
కున్న’’ ధిషణాహంకారమూ’’ ఇలాంటిదే .అది వారిద్దరి గర్వానికి చిహ్నాలు కావు. ప్రతిభ ఉత్పత్తి
లకుదర్పణాలు.,పట్టా భి షేకాలు .వీణ లో మమైకం అయి శాస్త్రి గారు చేస్తే భారతీయ సాహిత్యం లో
మమేకమై విశ్వనాధ చేశారు .కచేరీ చివరలో శాస్త్రి గారు ప్రవేశ పెట్టిన ఈ రెండు అంశాలు  వారిముఖ్య
శిష్యుడైన చిట్టిబాబు గారి లో వృద్ధి పొ ంది ‘’వెడ్డింగ్ బెల్స్ ‘’అనే పాశ్చాత్య సంగీత క్యాసెట్ ఆవిష్కారమైంది
.వేదమంత్రా లను చిట్టిబాబు గారు కూడా కచేరీ చివరలోనే వాయించి గురు సంప్రదాయాన్ని కొన
సాగించారు

278 –శంకర శాస్స్త్రి గారు కచేరీలలో విద్వత్ ను ఎంతగా ప్రదర్శించేవారో ,అంతగానూ మాధుర్యాన్ని
ఒలికి౦చేవారు . ఈ లక్షణం తోనే  వారి వాయిద్యం వీణ చిరస్మరణీయ మైంది .లాలిత్య ,మాధుర్యాలే లేక
పో తే ఈమని శంకర శాస్త్రి లేరు .మాధుర్యానికి అడ్డ ం వచ్చేదాన్ని దేనినీ వారు అంగీకరించ లేదు
.శాస్త్రిగారు అంటే  నిరహం కారులు , నిగర్వులు .తమ విద్య విషయం లో అహంకరించారు .’’సరస్వతీ
మాత నా గుప్పిటి లో ఉంది ‘’అని చాటి చెప్పిన రోజూ ఉంది .అయితే ఇది విద్యాబలం వలన చేకూరిన శక్తి
అని విస్పష్ట ంగా ప్రకటించారు ఆచార్య ముదిగొండ .

279-తిరుమల తిరుపతి దేవస్థా న ఆస్థా న విద్వాంసులుగా నియమింపబడి శాస్త్రి గారు గౌరవం పొ ందారు
.యూని వర్సిటి  గ్రా ంట్స్ కమిషన్  సభ్యులుగా నియమింప బడ్డా రు .మద్రా స్ మ్యూజిక్ అకాడెమి లో
ఎక్స్ పర్ట్ కమిటీ సభ్యులైనారు .కేంద్ర సంగీత నాటక అకాడెమీ గౌరవ సలహాదారుగా ఉండి,ప్రతిభకల
విద్వాంసులనుజాతీయ స్థా యి లో  ఎంపిక చేసే బాధ్యతను స్వీకరించారు  .విద్యా మంత్రిత్వ శాఖకు
చెందినా .కర్నాటక సంగీతానికి ఫౌండర్ చైర్మన్ గా  ,ఫిలిం అవార్డ్ కమిటీ  సభ్యులుగాఉన్నారు .

280 –‘’వైణిక శిరోమణి ,వీణా గాన గాంధర్వ ,గాన రూప కళా సరస్వతి ,వీణా వాదన తత్వజ్ఞ ,,గాంధర్వ
కళానిధి ,గాన కలాధర ,వీణా చక్ర వర్తి ,వల్ల కీ వల్ల భ’’ మొదలైన బిరుదాలు  శాస్త్రి గారి కీర్తి కిరీటం లో
కలికితురాయిల వలె ధగ ధగ లాడాయి వారి ప్రతిభకు తార్కాణాలయ్యాయి .దక్షిణ భారత దేశ సంగీత
విద్వాంసులలో  ప్రపధ
్ర మంగా  వారికి ‘’మహా మహో పాధ్యాయ ‘’బిరుదు లభించింది .సంగీత నాటక
అకాడెమి ,సాహిత్య కళా పరిషత్ లు అవార్డు లనిస్తే ,,ఆంద్ర విశ్వ విద్యాలయాలు గౌరవ డాక్టరేట్
ప్రదానంచేసింది . సంగీత సరస్వతికి చేసిన సేవను గుర్తించి భారత ఉప రాష్ట ్ర పతి శాస్త్రి గారికి ‘’చతుర్దండి
పండితః ‘’అని బిరుదునిస్తే భారత ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారాన్ని ప్రదానం చేసి ఈ సంగీత సరస్వతిని
సన్మానించి ధన్యమైంది .
   శాస్త్రిగారి కుమార్తె శ్రీమతి కళ్యాణీ నారాయణ రావు దూర దర్శన్ ,ఆకాశ వాణి లలో వీణ పై గొప్ప
ప్రదర్శనలు చేసి తండ్రిగారి కీర్తి పతాకను ధరించి ముందుకు దూసుకు పో యింది .

  

ఇది విన్నారా కన్నారా !  26

37-వీణా పాణి విశ్వేశ్వరన్

281-తెలుగు మాతృ భాష అయినా  విశ్వేశ్వరయ్య ఎప్పుడో మైసూర్ రాష్ట్రా నికి తరలి వెళ్లి పో యారు
.అందుకే ఇంటి పేరు తండ్రి పేరే అయింది .తల్లి వరలక్ష్మి ,తండ్రి రామయ్య గార్లు .కనుక రామయ్య గారి
విశ్వేశ్వరయ్య ఆర్ .విశ్వేశ్వరయ్య అయ్యారు .కుటుంబం లో అందరికి సంగీతాభిమానం ఉంది .విశ్వేశ్వరన్
ఎవ్వరి వద్దా వీణ నేర్చుకోలేదు వీనావాదనం ఆయన లోంచి విచిత్రంగా ఆవిష్కారమైంది .అన్న సీతారాం
ఆ నాడు ఆస్థా న విద్వాంసుడు .ఒక రోజు అన్నగారు ‘’సామి నిన్నే ‘’అనే శంకరాభరణ రాగం గురు
పద్ధ తిలో వాయిస్తూ ఉంటే ,అది తమ్ముడు విశ్వేశ్వరన్ కు కర్ణ కఠోరం  అనిపించి ,అలా వాయించ రాదు
అని వెక్కిరించారు .’’వాయిస్తు ంటే పాడి నట్లు ఉండా’’ అని తమ్ముడు అన్నకు సలహా ఇచ్చాడు ‘.పౌరుషం
పొ డుచుకొచ్చిన అన్న ‘’మరెట్లా వాయించాలో వాయించి ఏడు ‘’అన్నాడు కోపంగా .ఇది చాలెంజ్ అనిపించి
అ౦తకు ముందు ఎన్నడూ వీణను ముట్టు కొని సాధన చేయని  విశ్వేశ్వరన్  వీణ దగ్గ రకు వెళ్లి తీసుకొని
‘’దేవుడు పూనిన వాడి ‘’లాగా నిండు గమకం తో పాట పాడినట్లు అని పించేలా శంకరా భరణ  వర్ణా న్ని
వాయించాడు .ఇది అటు ‘’అన్నాయి’’ కే కాక ఇటు ‘’తమ్మాయి’’కీ అద్భుతం అని పించింది .దైవానుగ్రహం
వలన ఆ రోజు వాయించిన వైనమే ఆయన్ను అగ్రశణ
్రే ి విద్వాంసుని చేసంి ది .

282 –బాల్య దశలో జరిగిన పై సంఘటన తర్వాత విశ్వేశ్వరన్ యే రాగాన్ని పట్టు కొంటే ఆ’’ రాగ దేవత’’
ఆయన్ను రెండు ,మూడు గంటలు ఆవహించి ఉండేది .ఇలా చిన్ననాటి నుంచి నాద సుఖాన్ని
,నాదానందాన్ని ఆయన అనుభవించారు .గురువు లేకుండా వీణా సాధన అసాధ్యం .గురుముఖతా
నేరిస్తేనే ఎడమ చేతి వ్రేళ్ళతో వాయించే నేర్పు అలవడుతుంది కాని వీటికి అతీతుడైన విశ్వేశ్వరన్ అన్నీ
గురువు లేకుండానే దైవ కృప వలన నేర్చుకొన్నారు ఇదొ క అద్భుతం

283 –విశ్వేశ్వరన్ వ్రేళ్ళను వీణ మీద సాధించటం తో పాటు తన గొంతునే వీణ మీదకు దింపారు అన్నారు
ఆచార్య ముదిగొండ .అందరూ ఇలా చేయగలరా అంటే లేదనే చెప్పాలి .కొందరికే ఇది సాధ్యమయింది
.ఆయన వ్రేళ్ళను వినియోగించేవిధానం పరమ నూతనం అని ,దాన్ని చూసి అనుభవించాల్సిందే తప్ప
రాతలో వర్ణించి చెప్పలేమని ఆచార్య వీరభద్రయ్య గారి అభిప్రా యం .అందుకే వీణపై ‘’విశ్వేశ్వరన్ రీతి
‘’ఏర్పడింది అన్నారు. విద్యలతల్లి సరస్వతీ మాత మాత్రమె ఆయన గురువు .వేరే గురువెవ్వరూ
లేరాయనకు. ఒక నాడు నాదానందం లో లయించి ఉండగా నాద దేవత వాణీ దేవి దర్శన మిచ్చి ,రెండు
రోజులు వీరికి విద్యా బో ధన చేసింది .వాద్యం లో లీనమయిన వానికి అమ్మ అనుగ్రహం తప్పక ఉంటుంది
.అందుకే వీనావాదనం మోక్ష విద్యకు మార్గ ం అయింది అన్నారు ఆచార్య శ్రీ .గాత్ర ధర్మం లో లేని ఒక్క
అంశమూ వారి వీణా వాదనలో వినిపించక పో వటం ప్రత్యేకత .నిష్ణా త్రు త్వం తో విశ్వేశ్వరన్ ‘’స్వయంభు
‘’అయ్యారన్నారు ముదిగొండ వారు .మానుష గురువు లేకుండా ఇంతటి పూర్ణ ప్రజ్న
సాధించినవారెవ్వరూ లేరు అని వీరభద్రయ్య గారు వాక్రు చ్చిన మాట యదార్ధ ం .వీణ చేత బట్టిన ఆరు
నెలలకే మైసూరు చుట్టు ప్రక్కల వైణికుడు గా విశ్వేశ్వరన్ పరిచయమయ్యారు. వైదుష్య సంపాదనలో
ఆయన ఇంకా శిఖరారోహణం చేస్తూ నే ఉన్నారు .

284 –నూనూగు మీసాల నూత్న యవ్వనం లో 16 వ ఏట మైసూర్ కు 18 మైళ్ళ దూరం లోని టి


.నరసీపూర్ లో రామోత్సవాలలో ఆహ్వానం పై  1947 .ఏప్రిల్ లో 3 ½ గంటలు వీణ కచేరీ చేసి అందరినీ
తల ఊపేట్లు చేశారు .ఈ తొలి కచేరీకి మృదంగం వాయించిన వారు  మహా మార్ద ంగికులైన విద్వాన్ శ్రీ
చౌడయ్య.వయోలిన్ చౌడయ్యగారికి ,ఈ చౌడయ్య గారు చాలా కచేరల
ీ లో మృదంగం వాయించారు

285 –విశ్వేశ్వరన్ ఎంతటి వైణికులు అంటే వీణ మాస్ట్రో బాలచందర్ నిండు గుండెలతో మెచ్చుకొన్న
వైణికులు .విశ్వేశ్వరన్ కంటే వీణ బాలచందర్ నాలుగు ఏళ్ళు మాత్రమే పెద్దవారు .మీటులో ఇద్ద రికీ చాలా
తేడా ఉంది అన్నారు ఆచార్య శ్రీ .సంగీత సామ్రా జ్యం లో బాలచందర్ మకుటం  లేని చక్ర వర్తి .ఆయన
పంధా ఎవరూ అనుసరి౦చ లేరు .ఒక సారి బాల చందర్ ఇంటి పూజా గదిలో విశ్వేశ్వరన్ వీణ కచేరీ
ఏర్పాటు చేశారు .ప్రసిద్ధ సంగీత విద్వా౦ సులందర్నీ ఆహ్వాని౦చారు .విశ్వేశ్వరన్ వీణ వాయిస్తు న్నత
సేపు బాల చందర్ ‘’సెహ బాష్ ,’’భేష్ ‘’అని చాలా సార్లు అని పొ ంగిపో యి కచేరీ అనంతరం కాశ్మీర్ జరీ
శాలువా తో సన్మానించి ,ప్రశంసించారు బాలచందర్ .
286 –ఒక సారి ‘’ఇడయం ‘పత్రిక బాల చందర్ ను ఇంటర్వ్యు చేస్తూ ‘’మిమ్మల్ని మెప్పించిన వైణికులు
ఎవరు ?’’’’అని ప్రశ్నిస్తే ‘’వాగ్గేయకారుడు ,అత్యంత ప్రతిభావంతుడు ,మైసూర్ విశ్వేశ్వరన్ నా
హృదయాన్ని దో చుకొన్న వాడు ‘’అని చెప్పారు ,1988 లో మైసూర్ లో బాలచందర్ ‘’విశ్వేశ్వరన్ నాకన్నా
గొప్ప సంగీత విద్వాంసుడు .నేను కేవలం వైణికుడినిమాత్రమే .ఆయన వైణికుడేకాక వాగ్గేయ కారుడు
కూడా ‘’అన్నారు హిమాలయోత్తు ౦గ  సదృశ పద్మభూషణ్ డా బాలచందర్ .1990 లో మద్రా స్ లో
‘’సరస్వతీ వాగ్గేయ ట్రస్ట్ ‘’విశ్వేశ్వరన్ స్వీయ రచనల కచేరీ ఏర్పాటు చేయగా బాలచందర్ వచ్చి
ఆశీర్వదించి ‘’నా కన్నా కొన్ని సంవత్సరాలు చిన్నవాడే అయిన విశ్వేశ్వరన్ బుద్ధీ ,పాండిత్యం ,సంగీతసార
అవగాహన లో ,మేధావిలసనం లో ఎంతో పెద్దవాడు గొప్పవాడు విశ్వేశ్వరన్ లాంటి వారి వలననే మనం
సంగీతం లో అసలైన శాస్త్రీయత (క్లా సిజం )ను అవగాహన చేసుకో గలుగుతున్నాం .ఆయన సంగీతాన్ని
,వారు చెప్పే మాటల్ని ,వారి రచనల్లో నిక్షిప్త మైన విలువలను శ్రద్ధగా వినటం వలన మనకు భగవంతుని
చేరే మార్గ ం చాలా సులభతరం అవుతుంది ‘’అని నిండుమనసుతో మెచ్చుకొన్నారు

287 –వీణ పై మొదటి కచేరీచేసిన కొద్ది రోజులకే మైసూర్ రేడియో వారు విశ్వేశ్వరన్ గారిని 1949 లో
వీణ కచేరీకి ఆహ్వానించారు .అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 60  సంవత్సరాలు ఆకాశ  వాణి
కేంద్రా లలో వాయిస్తూ నే ఉన్నారు .మద్రా స్ సంగీత అకాడెమి వీరి కచేరీ ఏర్పాటు చేసి గౌరవించింది .వీరికి
ప్రక్క వాద్యాలు వాయించిన మహా మార్ద ంగికులలో పాల్ఘా ట్ రఘు ,ఉమయాళ పురం శివరామన్
,గురువాయూర్ దొ రై ,ఉపేంద్రన్ ,ఎల్లా వెంకటేశ్వర రావు మొదలైన వారున్నారు.
 

  ఇది విన్నారా కన్నారా !  27

 37-వీణా పాణి విశ్వేశ్వరన్ -2(చివరి భాగం )

288—వాగ్గేయ కారుడైన విశ్వేశ్వరన్ వందకు పైగా కృతులు ,తిల్లా నాలు ,పదాలు ,వర్ణా లు ,కొన్ని లఘు
సంగీత రచనలు చేశారు తెలుగు కన్నడ సంస్కృతాలలో ఈ రచనలున్నాయి .దర్బారు ,నాయకి ,ఆరభి
,దేవ గాంధారి ,రీతి గౌళ ,ఆనంద భైరవి ,వరాళి ,శుభ పంతు వరాళి, భైరవి ,శ్రీ ,మనిరంగు ,మధ్యమావతి
వంటి గొప్పరాగాలలోనూ రచన చేశారు కొన్ని హిందుస్తా నీ లో  చేశారు .కర్నాటక సంగీతం గొప్పతనాన్ని
గురించి వీరభద్రయ్య గారితో ‘’Ours is enormously Evolved –ours best chiselled  one ‘’అన్నారట
.దీక్షితులవారి హిందో ళ రాగ కృతి ‘’నీరజాక్షి కామాక్షి ‘’హిందూ స్థా నీ  బాణీ లో మాల్కోస్ రాగం
అనిపించేట్లు పాడేవారట .

289 –వీణా వాదనకు గాత్రా నికి భేదం లేకుండా వాయించిన ఆమహా వైణికులు విశ్వేశ్వరన్ .యాజ్న
వల్క్య మహర్షి చెప్పిన –
‘’వీణా వాదన తత్వజ్ఞ ః శ్రు తి జాతి విశారదః –తాలజ్నశ్చ ప్రయాసేన మోక్ష మార్గ ం స గచ్చతి ‘’అన్న శ్లో కం
సంగీతోపాసకులందరికి గీతోపదేశం లాంటిది అన్నారు ముదిగొండవారు .

290-మహో న్నతులని వైణికులు తంత్రు లపై వాయిస్తు ంటే అది వారి గొంతుకలోని స్వర తంత్రు లను
అనునాదం లో కదిలిస్తా యి .ఏ ధ్వని వోకల్ కార్డ్ లను కదలించ లేక పో తుందో అది గాత్ర హీనమైనదని
ఆచార్య ఉవాచ .బహుశా యే వైణికునికీ లభి౦చనిఅరుదైన అదృష్ట ం విశ్వేశ్వరన్ గారికి దక్కింది
.దీక్షితులవారు ఒక సారి కాశీలో గంగా స్నానం చేస్తు ండగా వారికి మంత్రం దీక్ష నిచ్చిన చిదంబర యోగి
‘’నీకు మంత్రం సిద్ధి అయింది ‘’అని చెప్పబో యే తరుణం లో దీక్షితులవారి కర కమలాలలోకి వీణ వచ్చి
నిలిచింది .నాద జ్యోతి ముత్తు స్వామి దీక్షితులు వాయించిన వీణపై వాయించే అరుదైన అవకాశం
విశ్వేశ్వరన్ గారికి కలిగింది .దీక్షితులవారు నిత్యమూ అర్చించుకొనే శ్రీ చక్ర యంత్రం ,గణపతి విగ్రహం
,సుబ్రహ్మణ్య స్వామి పటాలకు రెండు రోజులు పూజించే అదృష్ట మూ కలిగింది .దీక్షితులవారి వీణకు యాళి
ఊర్ధ ్వ ముఖంగా ఉన్నట్లే విశ్వేశ్వరన్ గారు తమ వీణలకూ అలాగే ఉండేట్లు తయారు చేయి౦చు కొన్నారు
.దక్షిణాది శిల్పాలన్నిటిలో వీణ యాళి ఊర్ధ ్వ ముఖం గా ఉంటుంది అని ఆచార్య శ్రీ పరిశీలించి చెప్పారు.

291-Never has Lakshana  is in the leading position ,and it is only Lakshya that has always
hearled ,only  followed Lakshana’’

‘’Lakshya and lakshana should be inseparable .It is only when this tribe grows that there is a
meaningful progress in the art and benefit to the recipients of the experience from music be it
in the musicians or the listeners ‘’అన్నది విశ్వేశ్వర సంగీత తీర్ధ సారాంశం .

  ఆయన లక్ష్య ,లక్షణ సమన్వయానికి ముఖారి రాగం లో విశ్వేశ్వరన్ గారు కట్టిన గీతం గొప్ప
ఉదాహరణ

పల్ల వి –‘’లక్ష్య లక్షణ సమన్వయ ముఖ్యత నెంతని తెలప నా తరమా ‘’

అనుపల్ల వి –‘’లక్ష్యమే ముందుండి రాజిల్లు సంగీతములో

              స్వర మేల,కళానిధిని రామామాత్యుడు వ్రా సినది ఈ

             సమన్వయ స్తా పనకే నని వినలేదా ?

            స్వర లయా౦ కార  గమక రాగ భావ రసములతో

           పరమునకు ,ఇహమునకు ఏక సాధనమని చెప్పిన


          వర  నిశ్శంకునికి యశము నిచ్చిన అంతక ప్రముఖారి

          విశ్వేశ్వరుని వర ప్రసాదమైన సంగీతములో ‘’  .

292 –విశ్వేశ్వరన్ గారికి దేశ ,విదేశాలలో ఎన్నో గౌరవ పురస్కారాలు లభించాయి .చెన్నై శ్రీ కృష్ణ గాన
సభ ‘’సంగీత చూడామణి ‘’బెంగుళూర్ వారు ‘’పలని సుబ్రహ్మణ్య పిళ్లే ‘’పురస్కారాన్ని ,కర్నాటక గాన
కళా పరిషత్ ‘గాన కళా భూషణ ‘’బిరుదు తోపాటు ‘’ఆలిండియా మ్యుజీషియన్స్ సిల్వర్ జూబిలీ కాన్ఫ
రెన్స్ ‘’కు అధ్యక్షునిగా ఎన్నుకొన్నది .వ్యాస రాజ ధర్మ సంస్థా నం పరివ్రా జకాచార్యులు ‘’సంగీత సార్వ
భౌమ ‘’ను ,ప్రపంచ సంగీత దినోత్సవం నాడు ఆకాశ వాణి ‘’జాతీయ పురస్కారాన్నిఅందించగా   
,అమెరికాలో కాలిఫో ర్నియా ‘’ధియోడో ర్ ధామస్ విశ్వేశ్వరన్ గారిపై ఒక  డాక్యు మెంటరిని తీశారు .20
02 లో కర్నాటక ప్రభుత్వం ‘’రాజ్య సంగీత విద్వాన్ ‘’ప్రదానం చేసంి ది

293 –ఇంగ్లా ండ్ ,ఐర్లా ండ్ లకు మూడు సార్లు వెళ్ళారు .బి బి సి  వీరి కచేరీ రికార్డ్ చేసింది కేంబ్రిడ్జ్ ,డబ్లి న్
,బర్మింగ్ హాం బెల్ ఫాస్ట్ మొదలైన రేడియో కేంద్రా లు టి వి కేంద్రా లు వీరి సంగీతాన్ని ప్రసారం చేశాయి
.వీరి వీణా వాదన ను సంగీత కంపెని –సంగీత వీణా వైభవ ,గ్రేట్ రాగాస్ ,సో ల్ స్ట రం్రి గ్ రాగాస్ మొదలైన
కేసెట్లు గా తెచ్చింది .’’ఏకత లో భిన్నత ‘’సర్వం ఖల్విదం బ్రహ్మ ,వాది రాజు మొత్త ం రచనలకు ‘’భ్రమర
గీతం ‘’రచన చేసి రికార్డ్ చేశారు

294 –విశ్వేశ్వరన్ గారి భార్య ఉషాదేవి .కూతుళ్ళు విద్యా నటరాజ్ ,వీణా జయంత్ లు .కుమారుడు కార్తీక్
అందరూ వైణికులే .ఆయన చదువు ఏం యే –ఇండాలజీ .1965 లో మైసూర్ విశ్వ విద్యాలయం సంగీత
నృత్య కళాశాల స్థా పించి విశ్వేశ్వరన్ ను మ్యూజికాలజిస్ట్ గా నియమించింది .1973 లో వీణ అధ్యాపకులై
78 లో వాద్య సంగీతాఆచార్యులుగా పదో న్నతి పొ ంది ఎందరెందరికో వీణ విద్యనూ నేర్పారు

295 –‘’ధన్యుడనైతి ని సంగీతమును నేర్చి నందువలన ‘’అని కీర్తనలో తన మనో ప్రవ్రు త్తి చాటారు
.కన్నడదేశం లో తెలుగు మర్చి పో తున్న తెలుగు కుటుంబీకుడు అయిన విశ్వేశ్వరన్ దేవ గాంధారి రాగం
కీర్తన ఆయన ఎంతటి వినీతులో తెలియ జేస్తు ంది –

‘’అంతరంగము తెలిసి పాడిన –సంగీతమునకు మాత్రమే  పూర్ణా ర్ధ ము

చింతన ,మనన ,సాధన జత గూర్చి –మన కెంతో చక్కని మార్గ ము జూపిన పెద్దల ‘’.ఒక్కటి చాలు
ఆయన అంత రంగ ఆవిష్కారానికి.  సితార్ విద్వాంసుడు పండిట్ శివ కుమార్ శర్మ వద్ద సితార్
అభ్యసించిన విశ్వేశ్వరన్ ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు జి .యెన్ .బాల సుబ్రహ్మణ్య౦ గారికి’’
నెవ్యు’’.   2007 లో 63 వ ఏట వీణా పాణి విశ్వేశ్వరన్ తన తల్లి సంగీత సరస్వతీమాత సంగీత
సామ్రా జ్యం లో ఆస్థా న విద్వాంసుడు గా  చేరటానికి ఇహలోకం వీడారు .

  

g.n bala subramanyam 

       

   ఇది విన్నారా కన్నారా !  29

 నేటి వైణికులు

    39-పుదుక్కోటై కృష్ణ మూర్తి

308 –నేటి అగ్రశ్రేణి వైణికులలో పుదుక్కోటై కృష్ణ మూర్తి ఒకరు .అయన లో అనేక వాదనల శైలి
మిశ్రమితమై ఉంది .అందరి లోని మేలిమిని గుర్తిస్తూ తనదైన శైలి ఏర్పరచుకొన్నారు .7-10-19 39 లో
మీనా౦ బాళ్ ,రామస్వామి దంపతులకు కొడైకెనాల్ లో జన్మించారు ..తండ్రి పుదుక్కొట రాజావారి కార్
డ్రైవర్ .9 వ ఏటనే పుదుక్కోటై శ్రీనివాసన్ దగ్గ ర సంగీత శిక్షణలో చేరి 13 వ ఏట గాత్ర కచేరీ చేశారు
.అన్నామలై విశ్వ విద్యాలయం లో సంగీతం లో బాచిలర్ డిగ్రీ పొ ంది ,20 వ ఏటతిరుచ్చి,,మద్రా స్
ఆకాశవాణి లనుంచి కచేరీలు చేశారు.22 వ ఏట 1961 లో తిరుపతి దేవస్థా నం సంగీత కళాశాలలో చేరి
1997 వరకు అధ్యాపకులుగా చేసి ,ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ పొ ందారు  .విరమణ తర్వాత శ్రీ సత్య
సాయి మీర్ పూరి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ ప్రిన్సిపాల్ అయి సర్టిఫికేట్ ,డిప్లొ మా కోర్స్ లకు రూప కల్పన
చేసి ,బాబా నుండి ప్రశంసలు పొ ందారు .

309- .’’వైణిక పంచానన ‘’ ,వైణిక గాయక ‘’బిరుదులు  పొ ంది గాత్ర వాద్య మాదుర్యాలతో మెప్పించారు
.పరమనాజూకైన తమగాత్రం తో పాత పాడుతూ వీణ వాయించి సవ్య సాచి అనిపించారు .రెండిటిని
సమాన ప్రతిభతో వ్యక్త ం చేయటం వారి ప్రత్యేకత .వారికి అపారమైన కీర్తన పాఠం ఉన్నదని,తానం లో
అందే వేసిన చేయి అని ,సప్త విధ తానాలు అలవోకగా వాయించ గలరని హామీరు ,కల్యాణి రాగాలను
వాయించేటప్పుడు అచ్చంగా హిందూస్థా నీ పద్ధ తిలోనే వాయిస్తా రని ముదిగొండవారంటారు .

310- సాధారణం గా వైణికులు తమ వీణకు మేళం కట్టు కోరని ,కాని కృష్ణ మూర్తిగారు తామే కట్టు కొని ,కొత్త
పద్ధ తులను కూడా కనుక్కోన్నారని చెక్కతో మేళం కట్టు కోవటాన్ని సాధించారని వీణ కుండ సైజు ను
తగ్గించి స్థా యిని 1 ½ స్థా యిగా మార్చి అంటే’’ మానవుడికంఠం పలికే స్థా యి’’కి చెక్కమేళం కట్టి ,యాళి
ముఖాన్ని పై వైపుకు మార్చి ‘’కృష్ణ వీణ ‘’అని పేరు పెట్టా రని ఆచార్య శ్రీ తెలిపారు .భార్య పద్మా కృష్ణ
మూర్తి గారితోకలిసి సంగీత కేసెట్ తెచ్చారు .

311-5-2-2003 న విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలలో గురు పూజోత్సవ సమయం లో శ్రీ


అన్నవరపు రామస్వామి గారు కృష్ణ మూర్తిగారిని  సన్మానించి ,వెండి వీణ బహూకరించి ‘’వీణా వాద్య
విద్వద్మణి’’బిరుద ప్రదానం చేశారు .పదవి విరమించాక తిరుపతిలో స్థిరపడి వీణ మీటు ,సరలీస్వరాల
నుంచి రాగం తానం ,పల్ల వి దాకా నేర్పటం పై 32 డి,వి.డి.లను సిద్ధం చేసి కొత్త రీతిలో గురుత్వం
వహిస్తు న్నారు .ఇవి 38 గంటల నిడివి ఉన్నవి .ప్రభుత్వం వారు ఏర్పాటు చేసన
ి 4 సంవత్సరాల సర్టి
ఫికేట్ కోర్స్ కు దృశ్య శ్రవ్య మాధ్యమాలలో వాయించి చూపారు .స్పెయిన్ కెనడా దేశాలు భార్యతో
పర్యటించి వీణ కచేరల
ీ ు చేసి మెప్పు పొ ందారు .
40 –అయ్యగారి శ్యామ సుందర్

312-అయ్యగారి సో మేశ్వర రావు గారికుమారులైన శ్యామ సుందర్ తండ్రికి మించిన తనయులు .తండ్రి
‘’వైణిక రత్న ‘’అయితే కుమారుడు ‘’వీణా వాద్య విశారద ‘’.19 48 లో విజయనగరం లో జన్మించి 8
ఏళ్ళకే మొదటికచేరీ చేసిన ఉద్ద ండ పిండం .4 వ ఏటనే కీర్తనలు వాయించిన ఈచిన్నారికి 5 న
చేయాల్సిన అక్షరాభ్యాసం 4 వ ఏటనే చేసి స్పీడ్ పెంచారు తలిదండ్రు లు .30 వ ఏట ఆకాశవాణి ఎ గ్రేడ్
ఆర్టిస్ట్ అయ్యారు. అదే వయసులో మద్రా స్ సంగీత అకాడెమి ‘’ఉత్త మోత్త మ వీణా వాదకుని ‘’గా గుర్తిస్తే
,1978 లో శ్రీ కృష్ణ గాన సభ వీరిపతి
్ర భను గుర్తించి సత్కరించింది

313-త్యాగ రాజ పంచరత్న ఊహా స్వర తరంగిణి ,భ్రమ ,విశ్వ సంగీత పరిణామం అనే వాద్య బృంద
రచనలు చేసి ,అనేక యక్షగానాలకు సంగీతం కూర్చి సామర్ధ ్యం రుజువు చేసుకొన్నారు .వీరి ‘’నాగ బంధం
‘’రచనకు జాతీయ పురస్కారం లభించింది .17 ఏళ్ళుగా ప్రభుత్వ సంగీత కళాశాలలో పని చేశారు
.విజయవాడ కాలేజి ప్రిన్సిపాల్ గా పని చేశారు వీరి వీణ తరగతి లో 200 కు పైగా విద్యార్ధు లు
ఉ౦డేవారంటే వారి సామర్ధ ్యం ఎంతటిదో తెలుస్తు ంది .ఆహ్వానం పై అమెరికా వెళ్లి అనేక చోట్ల కచేరీలు
చేశారు .’’నాకు అనుభవం అంతా నాన్నగారితో కచేరీలు చేయటం వల్ల నే వచ్చింది ‘’అని చెప్పుకొన్నారు
.3 గంటల కచేరీలో 20 ఐటమ్స్ వాయించే నేర్పు వారిది .’’వీణ మీద గిమ్మిక్స్ చేయ కూడదు . ,అది
సంగీతం కాదు . వీణ పాడాలి ‘’అంటారు .
41- –రామ వరపు విజయ  లక్ష్మి

314-కొన్ని వేలమందికి వీణ నేర్పిన విజయలక్ష్మి విశాఖ వాసి .ఆమె పుట్టినిల్లు మెట్టి నిల్లు  రెండూ
సంగీత నిలయాలే పట్రా యని నారాయణ మూర్తిగారి వద్ద పదేళ్ళు నేర్చారు .ఓలేటి వెంక టేశ్వర్లు గారి
కర్నాటక హిందూ స్థా నీ బాణీల సమ్మేళన పధ్ధ తి బాగా నచ్చి దానిలో సాధన చేసి అగ్రభాగాన నిలిచింది
.కుమార్తె మాధురి వైణికురాలు ,కుమారుడు తేజస్వి మార్ద ంగికుడు .సంగీతం లో డాక్టరట్
ే పొ ందాడు
.ఉక్కు విశాఖ ను సంగీత విశాఖ గా తీర్చి దిద్దిన ఘనత రామ వరపు విజయ లక్ష్మిగారిదే .ఆమె
శిష్యురాళ్ళు డా పద్మిని ,మాధురి లు అంతర్జా తీయంగా ఎదిగిన విద్వాంసులు.

42-దుడ్డు సీతా రామయ్య

 315-20-2-1956 న జన్మించిన సీతారామయ్య 1994 నుంచి హైదరాబాద్ త్యాగరాజ ప్రభుత్వ సంగీత


కళాశాలలో వీణా చార్యులుగా పని చేస్తు న్నారు .9 వ ఏటనే వీణ మీటిన ఈ చిరుత 1973 లో
చిట్టిబాబుగారి వీణ కచేరి చూసి ప్రేరణ పొ ంది సాధన చేశారు .కౌశల్యం వచ్చాక నేపాల్ ప్రధాని కొయిరాల
,మెక్సికో గవర్నర్ ఆల్బర్టో కార్దినాస్ సమక్షం లో కచేరీలు చేశారు .

316-వీణ లో దొ డ్డ వారైన దుడ్డు వారు శయన వీణా విధానాన్ని మార్చి ఊర్ధ ్వ వీణగా వాయించటం
మొదలు పెట్టా రు .తాళానికి ‘’మెట్రో నిం ‘’(తాళయంత్రం ) ఉపయోగిస్తా రు .’’చిట్టిబాబు గారి వాదనలో
మెలోడి ఉంటుంది .అదే పండితుడిని ,పామరుడిని కట్టి పడేసంి ది .చిట్టిబాబు గారే నా ఇన్ స్పి రేషన్
‘’అన్నారు దుడ్డు వారు .’’పుదుక్కోటై క్రిష్ణమూర్తిగారిలో ఒక టెంపో ఉంది .అది హుషారెత్తి స్తు ంది .గమకం
,అలవోకతనం గాత్ర ధర్మం వాద్య ధర్మం ఉంటాయి .స్వర కల్పనలో నిర్దు ష్ట మైన మాద మేటిక్స్ ఉంటాయి
‘’అని అభిప్రా యపడ్డా రు .

317 –‘’వీణ మీద తానం ప్రత్యేక అంశం .తానానికి ఎక్సేర్ సైజు లుంటాయి .ఇవన్నీ చెప్పి ,కలిపేస్తే
సామాన్యంగా సులభం గా ఉండే రాగాలలో తానం వాయి౦చేట్లు విద్యార్ధిని సిద్ధం చేయ వచ్చు. తానం లో
లయ ఉంది .జాగాకి రావాలన్న టెన్షన్ ఉండదు ‘’అన్నది దుడ్డు వారి దొ డ్డ అభిప్రా యం .మంచి ప్రయోగశీలి
ఉత్త మ అధ్యాపకులు మేధా సంపత్తి ఉన్నవారు సీతారామయ్యగారు అని వీరభద్రయ్యగారి విశ్లేషణ .

43-కాజా సుభాషిణీ శాస్త్రి

318-వాసా కృష్ణ మూర్తిగారి శిష్యులలో ఇప్పుడు వీణ బాగా వాయించేముగ్గు రిలో శ్రీమతి కాజా సుభాషిణీ
శాస్త్రి ,శ్రీమతి ఆనంద రాజ్య లక్ష్మి శ్రీమతి అంబుజ వల్లి గారు అని ముదిగొండ ఉవాచ .ముగ్గు రూ ముగ్గు రే
.సంగీత అమ్బోనిది ని చిలికి అమృతం తెచ్చినవారే నంటారు .కచేరీలు చేస్తూ గాన సభలు నిర్వహిస్తూ
విద్య నేర్పుతూ మూడింటిలోనూ అసామాన్య ప్రతిభ చూపినవారు సుభాషిణీ శాస్త్రి .1958 మే నెలలో
కందుకూరులో రాజేశ్వరి నరసింహం దంపతులకు జన్మించారు .విశాఖలో వాసావారి శిష్యురాలై వీణ
అభ్యసించారు .వాసావారికి లలిత ,సినీ సంగీతం ఇష్ట ం లేదని ఆమె చెప్పారు .

319- అరుణాచల శాస్త్రిగారిని వివాహం చేసుకొని హైదరాబాద్ లో ఉంటూ మంచాల వారి వద్ద వీణాభ్యాసం
కొన సాగించారు .1987 లో ఎ గ్రేడ్ ఆర్టిస్ట్ అయి మనరాస్ట ్ర , కొచ్చిన్ రేడియో కేంద్రా లనుంచి ,దూరదర్శన్
లలో కచేరీలు చేశారు .ప్రస్తు తం హైదారాబాద్ తెలుగు విశ్వ విద్యాలయం లో బో ధిస్తు న్నారు .మనో ధర్మ
సంగీతాన్ని ఆదరించారు .’’తుమురాడ ,వాసా ,ఈమని త్రయం  తెలుగు వీణకు కొత్త జీవం పో శారు
.శాస్త్రిగారి శిష్యుడు చిట్టిబాబుగారు వీణకు హత్తి న మాధుర్యం అంతా ఇంతా కాదు ‘’అన్నారు సుభాషిత౦
గా  సుభాషిణి గారు .1986 డిసెంబర్ లో ముదిగొండవారికి  నిజామాబాద్ లో మామిడి పూడి ఆనంద్
గారి అబ్బాయి సింహాచలం గారింట్లో ఈమని వారితో రెండు మూడు గంటలు మాట్లా డే సదవకాశం
లభించిందట .అప్పుడు ముదిగొండ వారు ఈమనివారిని ‘’వీణా వాదనలో బాల చందర్ గారిది ఒక పంధా
,మీది ఒక పంధా గా ఉన్నాయి కదా ఈ రెండిటల
ి ో ఏది శ్రేష్టమైనది ?’’అని అడిగితే తడుముకోకుండా ‘’నా
మార్గ మే ‘’అని నిర్ద ్వంద్వంగా శాస్త్రి గారు చెప్పారట ‘’అది నిజమే .పద నిర్దేశకుడై ఒక రీతికి ప్రవక్త అయిన
మహా వైణికుడు తనమార్గ ం తక్కువదనో ,ఇతరుల మార్గ ం తనదానికంటే గోప్పదనో అంటాడా ?’’అన్నారు
ఆచార్య ముదిగొండ .

320-శ్రీ సంజీవ రెడ్డి తర్వాత హైదరాబాద్ లోని గ్రీన్ లాండ్ సౌధాన్ని యే ముఖ్యమంత్రీ
ఉపయోగించలేదని శ్రీ టంగుటూరి అ౦జయ్యగారు ముఖ్యమంత్రి అయి ఆ సౌధానికి మరమ్మత్తు లు
చేయించి గృహ ప్రవేశం చేసే సందర్భం లో ముఖ ద్వారం ముందు శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి వీణ సంగీత
కచేరీ  ఏర్పాటు చేయించారని ,అ౦జ య్యగారు గృహప్రవేశం చేయాలంటే శాస్త్రిగారు తమ వాయిద్యాలతో
సహా వేదిక వదిలి వెళ్ళాల్సిందే నని ,గంట సేపు జరిగిన ఆ కచేరీని అ౦జయ్యగారు ఆస్వాదించి వేదిక
ముందుకు వచ్చి శాస్త్రిగారికి  వారి వీణకు వంగి నమస్కరించి ,వేదికదాటి సకుటుంబం గా గ్రీన్ లాండ్స్
సౌద ప్రవేశం చేశారని అ౦జయ్య గారి సంస్కారం అది అని ,శాస్త్రిగారి వీణ వైదిక మంత్రో చ్చారణ తో
సమానమని ,అది సామవేద గానమని ,కచేరీలలో మంత్రం పుష్పాన్ని ,ఘన పాఠాన్ని వాయించటం శాస్త్రి
గారి ప్రత్యేకత అని ముదిగొండ వారు ముదిత మనస్కులై వివరించారు .

321-సంగీతం లో పండిపో యిన శాస్త్రిగారు 16 ఏళ్ళ వర్దిష్ణు వు అయిన సుభాషిణి శాస్త్రి కి తనతో పాటు
కొన్ని కచేరల
ీ లో సహకార వాద్య కారిణిగా అవకాశం కల్పించారని ,కొంత కాలం ఆ శాస్త్రి గారు ఈ శాస్త్రికి
వీణ కూడా నేర్పారని ,ఆయనతో చేసిన కచేరీల విషయాలెన్నో తనకు తెలియ జేశారని
ఆచార్యులవారన్నారు .శాస్త్రిగారి అరుదైన ‘’లైటర్ మూడ్స్ ‘’అంటే తేలిక లక్షణాలను సుభాషిణి రికార్డ్ చేసి
భద్రపరచారు .ఆయన వద్ద సంగీతం నేర్చుకోవటానికి తన రెండున్నర ఏళ్ళ కొడుకు రామ కృష్ణ తో  సహా
వెళ్ళేదాన్ని అని వాడుఏడవవకుండా  ఆటబొ మ్మలు బిస్కెట్లు తీసుకు  వెళ్ళేదాన్నని కాని ,వాడు శాస్త్రి
గారి శాస్త్రిగారి ‘’పాన్ పరాగ్ ‘’డబ్బా తీసుకొని పారి పో యేవాడని ,గురువుగారు వెంటపడి ‘’ఒరే దాన్ని
తినకురా ‘’అని అరుస్తూ వెంబడించేఈ చిన్న విషయాలను కూడా తాను  రికార్డ్ చేశానని సుభాషిణి శాస్త్రి
గారు చెప్పారు .పెద్దవారి జీవితం లో చిన్న తంతు ఇది .ఇదంతా ‘’జీవన సంగీతమే ‘’అంటారు సుభాషిణి .

322-ఒక సారి శ్రీకాకుళం లో శాస్త్రిగారి కచేరీకి సుభాషిణీ శాస్త్రి గారి కుటుంబాన్ని శాస్త్రిగారు కారులో
తీసుకు వెళ్లా రట .కచేరీ మొదలవ్వటానికి ముందు సుభాషిణి కొడుకు రామ కృష్ణ శాస్త్రిగారిని ‘’కచేరీ
ఎప్పటికి పూర్తీ అవుతుంది తాతగారూ ?అని అడిగితె ‘’బిగ్ ముల్లు 12 ,స్మాల్ ముల్లు 9 మీదకు వస్తే
ప్రో గ్రా ం అయి పో తుందిరా ‘’అన్నారట .పిల్లా డు వాచీ మాటిమాటికీ చూసుకొంటూ9 కాగానే స్టేజి దగ్గ రకెళ్ళి
గట్టిగా ‘’తాతగారూ ! 9 అయి పో యింది ‘’అన్నాడు .కోపం తెచ్చు కోకుండా’’ తాత శాస్త్రిగారు -‘’అయి
పో యి౦ది నాన్నా కచేరీ ‘’అని కొన సాగించారని సుభాషిణిగారు తెలియ బర్చారు .’’జీవితానికి సంగీతం
మాధుర్యం తెస్తే ,సంగీతానికి జీవితమూ మాధుర్యం తెస్తు ంది .విద్య విషయం లో  శాస్త్రి గారు ఎంతటి రసిక
మూర్తి యో ,జీవితం లోనూ వారి శిష్య వాత్సల్యం లోనూ ఆయన పరమ సహృదయ రసమూర్తి ‘’అని
చెప్పారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

సంగీత పరమాచార్య

అటు సంగీతంలోనూ, ఇటు వైద్య రంగంలోనూ ఆయనొక అద్భుతం. ఏక కాలంలో రెండు వృత్తు ల్లో కీర్తి
ప్రతిష్ఠ లను ఆర్జించిన మహామహులు చాలామందే ఉండవచ్చు కానీ, డాక్టర్ శ్రీపాద పినాకపాణి 'బాణి'
మాత్రం న భూతో న భవిష్యతి. తెలుగు సంగీతాభిమానుల కోసం కర్నాటక సంగీతాన్ని తిరగ రాశారు. ఈ
సంగీతానికి మకుటాయమానమైన తంజావూర్ బాణీలో వేలాది మంది విద్యార్థు లకు శిక్షణనిచ్చారు.
సంగీతంపై తెలుగులోనే కాక, ఇంగ్లీషులో కూడా ప్రా మాణికమైన గ్రంథాలు రాశారు. ఒకపక్క సంగీత
ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తూ నే మరో పక్క వైద్యంలో ప్రొ ఫెసర్‌గా విద్యాసంస్థ ల్లో అసంఖ్యాకంగా
శిష్యులను తయారు చేశారు.

1913 ఆగస్టు 3 న శ్రీకాకుళం జిల్లా ప్రియా అగ్రహారంలో జన్మించిన పినాకపాణి 2013 మార్చి 11 న తన
100 వ ఏట పరమపదించే వరకూ సంగీత, వైద్య రంగాలకు దిక్సూచిగా వ్యవహరిస్తూ నే ఉన్నారు.
రాజమండ్రిలో ఎంబీబీఎస్ చేసిన తరువాత విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో ఎండీ పూర్తి చేశారు.
ఒకపక్క వైద్యం చదువుతూనే ఆయన బీఎస్ లక్ష్మణ రావు దగ్గ ర, ఆ తరువాత వయొలిన్ విద్వాంసుడు
ద్వారం వెంకటస్వామి నాయుడు, సంగీతజ్ఞు డు శ్రీరంగ రామానుజ అయ్యంగార్‌ల వద్ద శిష్యరికం చేశారు.
1938 ల మొదటిసారిగా ఆకాశవాణి ద్వారా సంగీతంలో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. వివిధ
నగరాల్లో పాట కచ్చేరీలు నిర్వహించడంతో ఆయన కీర్తి ప్రతిష్ఠ లు దేశవ్యాప్త మైపో యాయి. సంగీతం పట్ల
అభిమానంతో ఆయన సంగీత విద్వాంసురాలు బాలాంబను వివాహం చేసుకున్నారు.
ఒకపక్క వైద్యుడుగా, అసిస్టెంట్ సివిల్ సర్జ న్‌గా, వైద్య అధ్యాపకుడుగా, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, ఆ
తరువాత ఆస్పత్రి పర్యవేక్షకుడుగా ఎదుగుతూనే పినాకపాణి మరోపక్క సంగీత విద్వాంసుడుగా, సంగీత
అధ్యాపకుడుగా, సంగీత గ్రంథకర్త గా గుర్తింపు పొ ందడం ప్రా రంభించారు. మూడు దశాబ్దా ల పాటు వైద్య
సేవలందించి 1968 లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు. సో నియా
గాంధీకి చికిత్స చేసిన డాక్టర్ నోరి దత్తా త్రేయుడు, అమితాబ్ బచ్చన్‌కు చికిత్స చేసిన డాక్టర్ జగన్నాథ్‌లు
ఆయన శిష్యులే. సంగీతంలో నూకల చిన సత్యనారాయణ, నేదునూరి కృష్ణ మూర్తి, పెమ్మరాజు
సూర్యారావు, శ్రీరంగం గోపాలరత్నం, ఓలేటి వెంకటేశ్వర్లు , మల్లా ది సూరిబాబు, మల్లా ది సో దరులు వంటి
హేమాహేమీలు ఆయన శిష్యులే. 1978 లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆయన సంగీతాన్ని రికార్డు
చేసి భద్రపరచింది.

మనోధర్మ సంగీతం, పల్ల వి గాన సుధ, గానకళా సర్వస్వము, మేళ రాగమాలిక వంటి గ్రంథాలు ఆయన
సంగీతానికి అందించిన విలువైన కానుకలు. ఆయన రచనలను టీటీడీ 'సంగీత సౌరభం' పేరుతో నాలుగు
సంపుటాలుగా ముద్రించింది. అం దులో పినాకపాణి స్వరపరచిన అన్నమాచార్య, త్యాగరాజ స్వామి,
ముత్తు స్వామి దీక్షితార్ వంటి వాగ్గేయకారుల కృతులున్నాయి. ఆయన రాసిన 18 సంపుటాల 'గానకళా
సర్వస్వము'లో సంగీతానికి సంబంధించిన ప్రతి వివరణా లభ్యమవుతుంది. 1973 లో ఆయన టీటీడీ
ఆస్థా న విద్వాంసుడిగా పనిచేశారు. ఆంధ్రపద
్ర ేశ్ సంగీత నాటక అకాడమీ అవార్డు , సంగీత శిఖామణి, గాన
కళా సాగర, సప్త గిరి సం గీత విద్వన్మణి, సంగీత కళానిధి, గాన కళా వారధి, కళాప్రపూర్ణ పురస్కారాలు
ఆయనకు లభించాయి. కాగా, 1984 లో ఆయనను 'పద్మభూషణ' బిరుదు వరించింది.

పక్షవాతం, ఊపిరితిత్తు ల ఇన్ఫెక్షన్‌తో బాధపడిన పినాకపాణి తన చివరి క్షణం వరకూ లోలోపల ఏదో ఒక
కీర్తనను ఆలపిస్తూ కనిపించేవారు. ఆయన 98 వ ఏట ఒకసారి వందలాది మంది శిష్యులు ఆయనను
చూడడానికి వచ్చారు. వారిని చూసి కుటుంబ సభ్యులు కలవరపడ్డా రు. కానీ, ఆయన ఒక్కసారిగా 'నాదా
తనుమనిశం' అంటూ కీర్తనను ఆలపించడం, దాన్ని శిష్యులు అందుకోవడం అక్కడున్నవారందరినీ
సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. 'సంగీతమే నా ప్రా ణం, నా జీవం' అని ఆయన అనేవారు. చివరి రోజుల్లో
కూడా ఆయనలో సంగీత సాధన కనిపిస్తు ండేది.

ఆయన గురు శిష్య సంప్రదాయాన్ని అభిమానించేవారు. శిష్యులు ఆయన ఇంట ఉండి, శుశ్రూ ష చేస్తూ
ఉచితంగా సంగీతాన్ని అభ్యసించేవారు. ఆయన ఇంట్లో సంగీత సాధనకు ప్రత్యేక సమయమంటూ ఉండేది
కాదు. ఎప్పుడు తోస్తే అప్పుడే సంగీత సాధన. ఆయన తన కుమార్తె, ముగ్గు రు కుమారుల పట్ల ఎంత
ఆప్యాయంగా వ్యవహరించారో శిష్యుల పట్ల కూడా అంతే ఆప్యాయంగా ఉండేవారు. ఆయన సంగీత, వైద్య
రంగాల్లో నే కాక సంస్కృతంలో కూడా ప్రజ్ఞా శాలి. ఆయనకు సంగీతం తప్ప సంపాదన గురించి ఏనాడూ
పట్ట లేదు. ఆయన తనకు వచ్చిన స్వర్ణ పతకాలతో భద్రా చలంలో సీతాదేవికి కిరీటం చేయించారు.
'సంగీతమే జీవితం, జీవితమే సంగీతం' అన్నంతగా ఆయన సంగీతానికి అంకితమైపో యారు. కర్నూలులో
'గాయక వైద్యుడు'గా ఆయన స్థిరపడ్డా రు. ఓ ఉత్త మ సంగీత విద్వాంసుడు కావాలంటే, ఉత్త మ
సాంప్రదాయిక గురువుల నుంచి సంగీతాన్ని నేర్చుకోవడంతో పాటు, విద్యార్థు లకు సంగీతం నేర్పగలిగే
స్థా యిని కూడా సంపాదించగలగాలని, కచ్చేరీల ద్వారా సంగీతానికి ప్రా చుర్యం కల్పించాలని, చివరికి తన
సంగీత పరిజ్ఞా నాన్ని గ్రంథస్త ం చేసి భావి తరాలకు అందించాలని ఆయన తన శిష్యులకు చెబుతుండేవారు.
శిష్యులు ఆయన వారసత్వాన్ని పదిలంగా భావి తరాలకు అందించగలిగితే అదే ఆయనకు నివాళి కూడా.

అన్నమాచార్య

అన్నమాచార్య జయంతి
       క్రీ.శ.1424 లో జన్మించి 79 ఏళ్ళు జీవించి  1503 లో శ్రీ వెంకటేశ్వర సాయుజ్యాన్ని పొ ందిన మహా
భక్త శిఖామణి అన్నమాచార్యుల వారు .కడప జిల్లా తాళ్ళ పాకలో జన్మించిన కారణ జన్ముడు.
అన్నమయ్య జయంతి వైశాఖ పౌర్ణ మి నాడు దేశ వ్యాప్త ం గా జరుపు కోవటం పరం పర  గా వస్తో ంది .
ఎల్లు ండి ఆరవ తేది ఆదివారమే అన్నమయ్య  588 వ జయంతి .అన్నమయ్య గా అందరి మనస్సు లను
ఆకర్షించిన వాడు .అన్న మయ్య పదాలతో ,సంకీర్తనల తో ఆ పరమ పాదుడుడైన శ్రీ వెంకటేశ్వర  కళ్యాణ
వైభవాన్ని కనులారా చూసి ,మనసారా పాడి ఆయనకే పారవశ్యాన్ని కలిగించిన భక్త కవి .ముప్ఫై రెండు
వేళ సంకీర్తనలను రచించినా  ,కాల గర్భం లో అవి చేరి ఇప్పటికి పద్నాలుగు వేలు మాత్రమే దక్కాయి,
నిలిచాయి .తాళ్ళ పాక నుండి బయల్దే రి తిరుమల చేరి స్వామి వారి భక్తు డై నాడు .తలి దండ్రు లు ఇక్కడ
ఉన్నాడని తెలుసు కొని ఇంటికి తీసుకొని వెళ్లి వివాహం చేశారు .వైవాహిక జీవితం ఆయన భగవద్భక్తికి
ఏమీ ఆటంకం కల్గించ లేదు .పైగా దో హద పడి శృంగార కీర్తనలు రాయటానికి మార్గ ం సుగమం అయింది
.రాసిన వన్నీ శ్రీ వెంకటేశ్వర పాదాలకు అర్పించిన పుష్పాలే  అని భావించాడు అన్న మయ్య .ఇతర
దేవతల పైన రాసినా అందరి లో ఆ కలియుగ వైకుంఠ వాసుడి నే దర్శించాడు .

                 భక్తీ తో పదకవితా వర్షమే కురిపించాడు అన్నమయ్య .తనతో ఆ శ్రీనివాసుడు


మాట్లా డినట్లు ,పాట పాడి నట్లు ,ఆడినట్లు పరవశించి పదాలు కూర్చాడు .స్వీయ అనుభవం లో రాసినవి
కనుక పరమ పవిత్రం గా భావ స్పోరకం గా నిలిచాయి .పదాలలో తన లోని లోపాలను ఎత్తి చూపు
కున్నాడు .అంటే తనను తాను ప్రక్షాళనం చేసు కొన్నాడు అన్న మాట.  పుఠం పెడితేనే బంగారం
స్వచ్చమైనది గామారదు .అలా పరమ భాగవతోత్త ముడు గా మారాడు .స్వామికీ తనకు అభేద్యం లా
వ్యవహరించాడు . తానే శ్రీనివాసునిగా ,ఆయనే తానుగా భావించి లీన మై తరించిన కవి వరేణ్యుడు అన్న
మయ్య .ఆ దేవ దేవుడే తన సర్వస్వం గా భావించి ,ఆ లీలా విభూతి ని వేనోళ్ళ ఆదిశేషుని లా పొ గడి
ధన్యమైన వాడు .తనకు మిత్రు డు, బంధువు ,మంత్రి ,మార్గ దర్శి .భవ సాగరాన్ని దాటే నావా అన్నీ ఆ
బాలాజీ ఏ.ఆయనే తనకు శరణాగత రక్షకుడని తలచాడు తలపో శాడు పదాల్లో .అడుగడుగునా ఆ స్వామి
పరమ విభూతిని గానం చేసి తరించాడు

                        అన్నమయ్య రాసిన పదాలను పదాలని ,సంకీర్తనలని అంటారు .అందు లో భక్తిని


రంగారించినవీ ,శృంగారాన్ని ఆర బో సినవీ రెండు రకాలు .భక్తీ సంకీర్తనలలో భౌతిక విషయాల కంటే
ఆధ్యాత్మిక భావ ఉన్నతిని చాటి చెప్పాడు .భక్తీ ,ఇహజీవితం పై విరక్తీ రెండిటి ఆవ సరాన్ని పదాల్లో
నిక్షిప్త ం చేశాడు .’’భక్తీ కొలది వాడే పరమాత్ముడు ‘’అని పాడాడు .ఎంత భక్తీ కి అంతటి ఫలం .ఎన్నో
భావాలకు ,లోనైనాడు .దారి తెలియక తిరిగానని చెప్పు కొన్నాడు .ఎప్పుడు జ్ఞా నోదయం కలిగి జ్ఞా న
భాస్కర ప్రకాశాన్ని పొ ందు తానో నని ఆవేదన చెందాడు .సర్వ సంగ పరిత్యాగం చేయాలని అనుకొంటే ఈ
బంధనాలేమిటి ,ఈ ఐహిక వాంచలు ఏమిటి  ,ఈ సంసారఝాన్జ్హాటం ఏమిటి అని వితర్కించు కొన్నాడు
.’’కలకాలము నిట్టే కాపురపు బతుకాయే’’అని మధన పడ్డా డు .తిరుమల లో స్వామి వారికి జరిగే
నిత్యోత్సవ ,వారోత్సవ ,పక్షోత్సవ మాసో త్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవాలు అన్నమయ్యకు గొప్ప
అవకాశం కల్పించాయి .వాటిని ప్రా తి పదిక గా తీసుకొని స్వామి మహాద్వైభావాన్ని కన్ను లారా దర్శించి
పాడి మనకు ఆ ఆనంద భాగ్యాన్ని కల్పించాడు .భౌతికా నందం తో పాటు మానసికా నందం కల్గించాడు
.ఆలయ ఉత్స వాలు తన భావ పరం పరాకు చిహ్నాలుగా వాడు కొన్నాడు .ప్రతిదీ పరవశించి రాశాడు .ఆ
అనుభూతి ని మనకూ కల్పించాడు .’’అలర చంచల మైన ‘’అన్న పదం లో డో లోత్సవం వర్ణింప బడింది
.ఆ రచనా ,సంగీతం వింటే ఉయ్యాలా లూగు తున్నట్లే ఉంటుంది .అది స్వామి వారి ఉయ్యాల కాదు
మనమే ఊగుతున్న భావం .అది మానసిక దో లాన్దో లనమే అని స్పురిస్తు ంది .

          అన్నమా చార్య శృంగార కీర్తనలు భగవంతుని పై ప్రేమ ,భక్తీ ,భగవద్రతి  కోరుకోవటం తో పరి
పుష్ట మైనాయి .అందులో తన తరఫునా ,ఇతర భక్తు ల తరఫునా ఆ భావనా పరం పర ను పంచాడు
.అనుభవైక వేద్యం చేశాడు .రక్తి లోని ఉత్క్రుష్ట త మనకు కన్పిస్తు ంది .’’అలరులు కురియగా ఆడే నదే
‘’అన్న కీర్త న లో అలివేలు మంగమ్మ సౌందర్యో పాసన దర్శనం కన్పిస్తు ంది .’’పలుకు తేనల
ె తల్లి ‘’లో
అమ్మ తనకు ఇచ్చిన లాలన ,ప్రేమ ,వాత్సల్య ప్రో త్సాహాలు కన్పిస్తా యి .సర్వ సమర్పణ భావం జ్యోతక
మవుతుంది .

                 సంకీర్త న లలో పల్ల వి అను పల్ల వి నాలుగు చరణాలు సాధారణం గా ఉంటాయి .అందులో
ఉత్కృష్ట సాహిత్య సుగంధం  వ్యాపించి గుబాళిస్తు ంది  .చిన్న తిరుమలా చార్యులు అన్నమయ్యను ‘’పద
కవితా పితామహుడు ‘’అన్నాడు .అన్నమయ్యకు ముందే ఇతర భాషల్లో పదాలున్నాయి .శ్రీ పాద రాయ
స్వామి ,ఆయన ముందు తరం వారు కన్నడం లో పదాలు రచించారు .ఆ ప్రభావం అన్నమయ్య పై
పడింది .అందుకే పద కవితను తన భక్తీ భావ ప్రకటనకు ఎన్ను కొని ,కూర్చి ‘’ తెలుగు పద కవితా రచన
కు ఆద్యుడు ‘’అని పించు కొన్నాడు .నిజం గా ఎన్నో ప్రతి బంధకాలు నియమాలు ఉన్న పదాలను
రాయటం చాలా కష్ట మైన పనే .దాన్నే ఇష్ట ం గా ,నల్లేరు మీద బండి లా

కదం తొక్కించి తెనుగు మాగాణం లో పదాల పంటను పుష్కలం గా పండించాడు. అందులో కవిత్వాన్ని
పాటను పొ ందు పరచి విశిష్ట త ను చేకూర్చాడు . .సెహభాష్ అని పించుకొన్నాడు .అనితర సాధ్యం గా
రచించి పద కవితా పితా మహుడనే బిరుదు ను సార్ధ కం చేసు కొన్నాడు .మనకు పున్నేపు వెలుగు ను
అందించాడు .అచ్చ తెనుగును అర్ధ వంతం గా ప్రయోగించి ,మాటల సృష్టి కర్తా అయాడు .ఆయన
పో నిపో కడ లేదు .పలు భంగుల పద కవితను కదను తోక్కిమ్చాడు .

   అన్నమయ్య సంగీత జ్ఞా నం గురించి మనకు తెలిసింది చాలా తక్కువే .ఆయన సాహిత్యాన్ని ఏదో విధం
గా కాపాడు కొన్నా ,ఆయన సంగీతాన్ని  కాపాడు కొ లేక పో యిన దురదృష్ట   వంతులం.ఆయన
సంగీతానికి వ్రా త పూర్వక ఆధారాలేమీ లేవని విజ్ఞు లు చెబుతున్నారు .తర తరాలుగా సాంప్రదాయ బద్ధ ం
గా నిలిచి నదే మనం ఇప్పుడు పాడు కొంటున్నది .సాల్వ నరసింహుడు పదాలను రాగి రేకుల మీద
చెక్కించిన వాటిల్లో రాగం గురించి ప్రస్తా వన ఉండి .కాని తాళం సంగతి అది ఏ సంగీత స్వభావానికి చెందిది
అన్న విషయాలు లేవు అని దాని పై పరిశోధన చేసిన వారు చెప్పుతున్నారు .దాస కుటుంబ సాహిత్యం
లాగా అన్నమయ్య సంగీతం నిక్షిప్త ం చేయ బడక పో వటం విచారకరం అంటారు వాళ్ళు .అయితే
అన్నమయ్య సంగీత సర్వస్వాన్ని ,సారస్వత సర్వస్వాన్ని మధిస్తే అన్నమయ్య కు  అన్నీ తెలుసు ననే
నిర్ధా రణ కు  వచ్చారు. పదాలు భగవారాధనకే అని ,దానికి సంగీతం అను సంధానం అని అన్నాడు
అన్నమయ్య .ఆయన పదాల్లో సంగీతం కంటే సాహిత్యం విప రీతం గా ఆకర్షిస్తు న్ద ంటారు విశ్లేషకులు
..ఆయనవి వంద రాగాలున్నాయట ..అందులో సౌరాష్ట ్ర గుర్జ రి ,అబలి ,అమర సింధు అనే రాగాలు చాలా
అరుదైనవి .ఇప్పుడు అవి వాడకం లో లేవట .ముఖారి ,శంకరాభరణం ,దేవ గాంధారి ,ఆయన తర్వాతా
చాలా మార్పులకు లోనయ్యాయట .

అన్నమయ్య పదాలను  రేడియో ద్వారా బహుళ వ్యాప్తి కల్గించిన వారు స్వర్గీయ మల్లిక్ .ఆ తరువాతే
మిగిలిన వారు .మల్లిక్ తో పాటు వారందరికి  వినయాంజలి .

              ఇలా వైశాఖ పౌర్ణ మి నాడు అన్నమయ్య జయంతి ,బుద్ధ జయంతి లను జరుపు కోవటం
తెలుగు వారి అదృష్ట ం . ఈ రెండిటి పై రాసే భాగ్యం కలగటం నా అదృష్ట ం .

 
ఇది విన్నారా కన్నారా !  30

    నేటి వైణికులు

44-బో నాల శంకర ప్రసాద్

323-వీణావాదన విద్యను  ఒక శతాబ్ది కాలంముందుకు తీసుకు వెళ్ళిన ,వెళ్తు న్న మహా వైణికులు శ్రీ
బో నాల శంకర ప్రసాద్ రాగ జీవాన్ని ,ప్రా ణాన్ని పట్టు కొని వాయిద్యానికి ప్రా ణం పో సినవారు  .వాసా
,ఈమని ఇత్యాదుల సంగీత రహస్యాలను ఆపో శనపట్టి ‘’మన కర్నాటక సంగీతానికి మంచి రోజులొచ్చాయి
‘’అని ఆనందం పొ ందేట్లు చేశారు .1966 లోవిశాఖ  జిల్లా పెనుగోల్లు గ్రా మం లో జగన్నాధం ,రమణి
దంపతులకు జన్మించారు .మంచి ఆధ్యాత్మిక వంశం వారిది తండ్రిగారితోకలిసి రమణ మహర్షి శిష్యులైన
‘’బాబు గారు’’ అని పిలువబడే స్వామీజీ విశాఖలో లలితానగర్ లో స్థా పించిన ఆశ్రమం లో వీణ
వాయించేవారు .తండ్రి జగన్నాధంగారు ఈ ఆశ్రమం లో తప్ప ఇంకెక్కడా కచేరీ చేసేవారు కాదు .

324 –తొమ్మిదవ ఏట కచేరీ ప్రా రంభించిన ప్రసాద్ ,సంగీత డిప్లమా సాధించి ,కడప రేడియో నిలయ
విద్వాంసులై ,తర్వాత విశాఖ కేంద్రం లో చేరి పదేళ్ళు పనిచేసి, చెన్నై వెళ్లి పనిచేశారు శ్రీ జయేంద్ర
సరస్వతి వీరిని కంచి పీఠ ఆస్థా న విద్వాంసులను చేశారు .,వీణ కచ్చేరీలకు ప్రో త్సాహం తక్కువ అని
భావించారు ప్రసాద్ .

45 –అంబుజ వల్లి

325-వాసా వారి  శిష్యులలో మొదటివారు శ్రీమతి అ౦బుజవల్లి .కానుకుర్తి వెంకట్రా వు లచ్చన్నమ్మ


దంపతులకు జన్మించారు జమీందారి వంశం .తండ్రి చిన్నప్పుడే చనిపో గా శ్రీకాకుళం చేరి ఆర్
కాళిదాసుగారి వద్ద వీణ నేర్చారు .హరిడేహళ్ వెంకట రావు  గారితో వివాహమయ్యాక నెర్లిమర్ల చేరి
,సుదర్శనం అప్పలాచార్యులవద్ద నేర్చారు .వాసావారు రోజూ వీరింటికి వచ్చేవారు .రాజనీతి శాస్త ం్ర
ప్రజాపాలన లలో ఏం యే తో పాటు బి ఎడ్ చేసిన  అ౦బు జవల్లి విజయనగరం రాజా వారికాలేజిలో
1965 నుంచి 1993 వరకు వీణ లెక్చరర్ గా, శాఖాధిపతి గా  పని చేసి ,పదవీ విరమణ తర్వాత తెలుగు
విశ్వ విద్యాలయం లో వీణ లెక్చరర్ అయ్యారు .సంగీతం పైనా వాసా వారిపైనా ,గాన కళ మీద ఎన్నో
వ్యాసాలూ రాశారు .

46 –ఆనంద రాజ్య లక్ష్మి

326 –మాధుర్యం వైదుష్యం రెండూ ఉన్న వైణికులు ఆనంద రాజ్య లక్ష్మిగారు .వీణ తప్ప వేరే ప్రపంచం
లేదీమెకు .16 వ ఏట చిట్టిబాబుగారు వాసా వారింటికి రాగా తన శిష్యురాలి ప్రతిభను ఆయనముందు
ప్రదర్శింప జేశారు .కష్ట మైన తోడి రాగం వాయించి మెప్పు పొ ందారు .వాసావారి నుంచి అనేక రహస్యాలు
గ్రహించారు .’’లాహిరి లాహిరి ‘’సినిమాకు ,టి వి సీరియల్స్ కు వీణ వాయించారు సినీ నటి జయప్రద
వీరివద్ద నాలుగేళ్ళు  వీణ నేర్చుకొన్నారు .వీరి వీణ కృషికి యునేస్కో సర్టిఫికేట్ ఇచ్చింది .

47 –ఇ .గాయత్రి

327 –వీణకు మహా గౌరవం తెచ్చినవారిలో గాయత్రి గారొకరు .వీణ పై గజల్స్ వాయించి రికార్డ్ చేశారు
‘’పంచ సూక్తా లను’’ వీణ పై వాయించే నేర్పు ఈమెది .పంజాబీ భాంగ్రా ,గుజరాతీ డాండియా పాటల్ని
వీణపై వాయిస్తా రు .వీణకు పరిమితులు లేవని భోపాల్ లో జరిగిన సెమినార్ లో పత్రం రాసి
సమర్పించారు .అవసరం ఉంటేనే గమకం వేస్తా రు .వాసా వారి శిష్యరత్నం .దేశ విదేశాలలో అనేక
అవార్డు లు పొ ందారు .ఆమె కేసెట్లు అమెరికాలోని పిట్స్ బర్గ్ దేవాలయందాకా వ్యాపించాయి .
48-ఈమని కల్యాణి

328 –ఈమని శంకర  శాస్త్రిగారమ్మాయి  కల్యాణి .తండ్రికి కచేరీలలో సహకరించారు .భర్త లక్ష్మీనారాయణ
.ఈమె వీణ తండ్రిని గుర్తు చేస్తు ంది .చిట్టిబాబు వీణ ఈమనిని మరి పిస్తు ంది .గమక ప్రా ధాన్యం ,మీటు
వైశిష్ట ్యం ,కీర్తన వాయించటం లో స్పష్ట త కల్యాణిగారి ప్రత్యేకత .ఆవేశం తోపాటు నిగ్రహమూ ఉన్న
కళాకారిణి .భౌతికంగా ఈమని వారు మనమధ్య లేక పో యినా కుమార్తె కల్యాణిగారు సృజిస్తు న్న ‘’నాద
దేహదారణ చేస్తు న్నారు ‘’ అంటే అతిశయొక్తికాదు’’ అన్నారు ముదిగొండశ్రీ .’’మధుర స్మృతి-ఇతర
కీర్తనలు ‘’అనే పేరుతొ కేసెట్ గా రికార్డ్ చేశారు .1975 లో ‘’మొదటి ప్రపంచ తెలుగు మహా సభలలో తండ్రి
ఈమని శంకర శాస్త్రి గారితో వేదికపై సహకార వాద్యం వాయించిన ఘనత కల్యాణి గారిది 

.49  –టి పద్మిని

329 –మంచి ప్రయోగ శీలి పద్మినిగారు రామవరపు విజయ లక్ష్మి తిరుపతి రామానుజ సూరి గార్ల వద్ద
వీణ నేర్చారు .తుమ్మల వేణు గోపాలరావు కృష్ణా బాయ్ దంపతులకు జన్మించి ,రచయితా ,ఆంద్ర విశ్వ
విద్యాలయ తెలుగు శాఖలో ఆచార్యులు అయిన అత్త లూరి నరసింహారావు గారిని పెళ్లి చేసుకొని ,1956
లో బెజవాడలో గాత్రం వీణలలో డిప్లొ మా పొ ంది ,ఏం యే ఇంగ్లీష్ చేసి ,పి హెచ్ డి.సాధించారు .ఆకాశవాణి
,దూరదర్శన్ లోకచేరీలు చేశారు .1979 లో ‘’మ్యూజిక్ –పెయింటింగ్ ఫీస్ట్ ‘’వాయించారు వీరు వీణ
వాయిస్తు ంటే ఇద్ద రు చిత్రకారులు చిత్రా లు వేయటం అనేది ఇక్కడ చేసిన ప్రయోగం .భరతుడు నాట్య
శాస్త ం్ర లో యే రసానికి యే రంగు ఉంటుందో తెలియజేశాడు .సన్నాయి వాయిద్యం తో కలిసి పద్మిని
గారు’’ ద్వివాద్య ‘’కచేరీ చేయటం మరో ప్రయోగం .1993 ,99 లలో రెండు సార్లు అమెరికా వెళ్లి పాడుతూ
వాయించమంటే అలాగే కచేరీలు చేసి వచ్చారు .

50 –జయ లక్ష్మీ శ్యామ సుందర్

330-వాసా ,అయ్యగారి ,పప్పు వంశాలు వైణిక వంశాలు .పప్పు సో మేశ్వరరావు గారమ్మాయి


,అయ్యగారి సో మేశ్వర రాగారబ్బాయి శ్యామ సుందర్ గారి భార్య శ్రీమతి జయలక్ష్మి ..1955 లో జన్మించి
తండ్రి ,మామగార్ల భర్త  సాన్నిధ్యం లో సాధన చేసి ,అగ్రశ్రేణి వైణికురాలై భర్త కు  సహకార వాద్యం
వాయిస్తూ ,ఆకాశవాణిలో  టి .వి .లో సో లోగా జంటగా వాయిస్తూ 2001 అమెరికా తానా సభలకు వెళ్లి
జంటగా వాయించి డెట్రా యిట్ ,న్యు జేర్సీలలో విడిగా కచేరీలు చేశారు జయలక్ష్మి .విజయవాడ రేడియో
కేంద్రం నుంచి ‘’రండి చేయి చేయి కలుపుదాం ‘’’’పచ్చలహారం ‘’,తుంగ భద్ర ‘’వంటి రూపకాలను ప్రసారం
చేశారు .

51 –రామవరపు మాధురీ దేవి

331 –ఒరాకిల్ డెవలపర్ 2000 ,,మైక్రో సాఫ్ట్ అప్లికేషన్స్ నాలెడ్జ్ తో అప్లికేషన్ లో డిప్లొ మా పొ ందిన
రామవరపు మాదురీదేవి ,ఆంధ్రా యూని వర్సిటి నుంచి వీణ డిప్లొ మా ,ఢిల్లీ  విశ్వ విద్యాలయం నుంచి
కర్నాటక గాత్ర సంగీతం లో ‘’సంగీతశిరోమణి ‘’వీణలో ఏం.ఎ గోల్డ్ మెడల్ ,కర్నాటక సంగీతం లో అదే
యూని వర్సిటీ నుంచి ఏం. ఫిల్ .పొ ందిన ఘనత మాదురీదేవిగారిది .15-1-1969 లో విశాఖ లో
రామవరపు విజయలక్ష్మి ,శరత్ బాబు దంపతులకు జన్మించిన మాధురి చిన్నతనం లోనే పెద్ద పేరు
పొ ందింది .రేడియోలో ఎ గ్రేడ్ వీణా ఆర్టిస్ట్ ,లలిత సంగీతం లలిత వాద్య సంగీతం లో బి గ్రేడ్ ఆర్టిస్ట్
.’’కర్నాటక సంగీతం లో వర్ణ ముల పాత్ర ‘’,జావళి అన్న సంగీత ప్రక్రియా పరిశీలనం ‘’అనే రెండు అంశాలపై
గొప్ప పరిశోధన చేసి పత్రా లను సమర్పించారు .చిట్టిబాబుగారి ‘’టెంపుల్ బెల్స్ ‘’,’’సేరేనాడే ‘’అనే ఎల్ .పి
రికార్డ్ లలో వాయించిన అదృష్ట వంతురాలు .కర్నాటక ,లలిత ,పాశ్చాత్య సంగీతాలు మూడింటి లోను
నిష్ణా తురాలు .1989 -90 లలో అమెరికాలో అనేక రాష్ట్రా లలో పర్యటించి అనేక ప్రముఖ పట్ట ణాలలో
కచేరీలు చేసి మెప్పు పొ ందారు .’’అంకిత భావం ఉంటేనే ఏదైనా సాధ్యం ‘’అంటారు ఆమె .ఆమె వీణ విద్యా
రహస్యాన్ని ఒక పత్రిక ‘’స్వర వీణా మాధురి ‘’అని మెచ్చింది .

52- మేడూరి శ్రీనివాస్

332  -వృద్ధ సంగీత విద్వాంసులు శ్రీ మేడూరి శ్రీనివాస్ గారు .పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు దగ్గ ర
దొ మ్మేరులో 19 13 జనవరిలో జన్మించి ,1923 నుంచి రెండేళ్ళు శ్రీ తుమురాడ సంగమేశ్వర శాస్త్రిగారి వద్ద
వీణ నేర్చిన శ్రీనివాస్ గారి తలిదండ్రు లు లక్ష్మీ సూరమ్మ ,కామ దాసు గార్లు .విజయనగరం లో వాసా
వెంకట రావు గారి వద్ద వీణ అభ్యసించి ,హైదరాబాద్ కింగ్ కోఠీ ప్రభుత్వ సంగీత కళాశాలలో 16 ఏళ్ళు వీణ
అధ్యాపకులుగా పని చేశారు .10 వ ఏట నుండే వీణ వాయించిన వీరి భార్య కుమార్తెలు అందరూ వీణా
వాదన నిపుణులే .
53 –మేడూరి నరసింహా రావు ,సుబ్బలక్ష్మి

333 –మేడూరి నరసింహారావు నిలబెట్టి  వాయించేవారు వీణను .సంగమేశ్వర శాస్త్రిగారి శిష్యులు


.నరసింహా రాగారమ్మాయి సుబ్బలక్ష్మి .తండ్రివద్దేవిద్య నేర్చ శ్రీపాద పినాక పాణిగారివద్ద మెళకువలు
గ్రహించి వేగంగా వీణ వాయించే నేర్పు సాధించారు .బెంగుళూరులో ఉంటున్నారు .

54- మేడూరి శ్రీనివాస్

334 -1969 ఆగస్ట్ లో దొ మ్మేరులో పుట్టి తండ్రివద్దే విద్య నేర్చి ,వీణ టెక్నిక్ లను అక్క సుబ్బలక్ష్మి
దాగ్గ ర గ్రహించి అగ్ర స్థా యి వైణికులుగా ఉంటూ యెంత వేగంగా వాయించినా స్పష్ట త తగ్గ కుండా ,శ్రో తలను
కదల కుండా కూర్చేపెట్టే సామర్ధ ్యం పొ ంది బాగా రాణిస్తు న్నారు .వాద్యం పై గొప్ప అధికారం నైపుణ్యం
ఉన్నవారు .ఇన్సూరెన్స్ ఉద్యోగి అయినా శ్రో తల మానసిక ఇన్సూరెన్స్ కు వీణ ద్వారా హామీ ఇస్తు న్నారు
.చిట్టిబాబుగారు ఒకే వీణపై 10 వీణల పెట్టు గా ఎలా వాయి౦చ గలరో శ్రీనివాస్ కూడా అంతేసులభంగా
శంకరాభరణం, తోడి రాగాలను ‘’తోడి పారేయ ‘’గలరు .

55- అయ్యగారి సత్య ప్రసాద్

335-అయ్యగారి శ్యామసుందర్ గారి తమ్ముడు ,సో మేశ్వరరావుగారబ్బాయి సత్య ప్రసాద్ .తండ్రేగురువు


.వీణలో డిప్లో మాపొ ంది విశాఖ రేయోకేంద్రం నుండి వీణ వాయించేవారు 28-10-1955 లో గుంటూరు
జిల్లా బాపట్ల లో జన్మించిన వీరు  ,గాత్రధర్మానికే ప్రా ధాన్యమిస్తా రు .ఎవరూ ఎదురుగా  తాళం వేయాల్సిన
అవసరం లేకుండా మనసులోనే తాళం నడుపుకొనే ప్రత్యేకత వీరిది .సప్త తంత్రు లను సద్వినియోగం
చేస్తా రు. రాజమండ్రి ప్రభుత్వ సంగీత కళాశాలలో వీణ అధ్యాపకులుగా ఉన్నారు .
56 –యోగ వందన

336 –ఉస్మానియా నుంచి ఏం. ఎస్ సి ,,త్యాగరాజ ప్రభుత్వ కళాశాలనుంచి వీణ డిప్లొ మా ,మీరజ్ లోని
అఖిల భారత గాంధర్వ విద్యాలయ నుంచి ప్రధమ శ్రేణి లో ‘’అలంకార్ ‘’ను పొ ందిన విదుషీమణి
యోగవందన .దేశ విదేశాలలో గొప్ప కీర్తి పొ ందిన వందన భాగ్య నగరం లో పుట్టి పెరిగింది  భర్త శ్రీ కామేశ్
ను పెళ్ళాడి బెంగుళూరు లో స్థిరపడ్డా రు .వీరి తలిదండ్రు లు శ్రీ వేటూరి ఆనందమూర్తి శ్రీమతి చంద్ర కళ
.తల్లి గొప్ప గాయని. తండ్రి మహా పండితులు ,కవి రచయితా విఖ్యాత విమర్శకులు,పరిశోధకులు
. .తాతగారు జగత్ ప్రసిద్ధకవిపండిత పరిశోధకులు మాస్ట ర్ సి వి గారి శిష్యులు  వేటూరి ప్రభాకర శాస్త్రిగారు
.

337-శ్రీమతి కాజ శుభాషిణి ,శ్రీ ఎ.అనంత రావు గార్ల వద్ద విద్య నేర్చి వాసావారి వాదనా పద్ధ తికి
అలవటై, కుసుమ కోమల మార్దా వాన్ని సాధించారు. మహారాజపురం విశ్వనాధయ్యర్ గోల్డ్ మెడల్
పొ ందారు .మన రాష్ట ం్ర లోని అన్నినగరాలలో కచేరీలు చేశారు .తిరువయ్యూర్ త్యాగ రాజ
ఆరాధనోత్సవాలలో భక్తీ శ్రద్ధలతో పాల్గొ ంటారు .

338-2011 మే నెలలో మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో ‘’టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ‘’లో,ఇండియన్
కల్చరల్ సెంటర్ ,లలో వీణ కచేరి చేశారు  ఐ సి సి ఆర్ ద్వారా సైపస్
్ర ,చైనాలకు ఆహ్వానాలన౦దు కొని
సింగ పూర్ లో మన ఎ౦బసిలో వీణ వాయించారు. దుబాయ్ జర్మనీ డెన్మార్క్ లలో ఆహ్వానాల మేరకు
వెళ్లి కచేరీలు చేసి ఘన సన్మానాలు అందుకొన్నారు .

339-‘’వాయి౦చ గానే శ్రో తలకు యిట్టె తెలిసి పో యే ప్రముఖ కృతులను ఎన్నుకొని వాయిస్తా ను .రాగం
వెంట రాగం వాయిస్తు న్నప్పుడు రెండు రాగాలలో స్వర సామ్యం లేకుండా చూసుకొంటాను .భిన్న
వాగ్గేయ కారుల రచనలనూ వేర్వేరు తాళాలను ఎన్ను కొంటాను .కచేరీ చివర హిందూస్తా నీ రాగాలు
వాయిస్తా ను ‘’ అని యోగ వందన తన విజయ రహస్యం చెప్పారు .
340 –‘’జనం వీణకచేరీలకంటే గాత్రకచేరీలను ఎక్కువగా ఆదరిస్తు న్నారని ‘’అనటాన్ని యోగవందన
ఒప్పుకోవటం లేదు .కన్నైకుడి వైద్యనాదంగారి వయోలిన్ సో లో  కచేరీ ఎంతటి ప్రసిద్ధి చెందిందో అందరికి
తెలుసు .ఇప్పుడు శాస్త్రీయ సంగీతానికి ఆదరణ బాగా ఉందని ,వాద్య కళాకారులు కూడా శ్రో తల్ని
రంజింప చేయటం ముఖ్యంగా భావించాలన్నారు ..సంగీత విద్యాభి వృద్ధికి విశ్వ  విద్యాలయాలు బాగా
తోడ్పడుతున్నాయని ,అయితే ప్రభుత్వ సాయం, ప్రో త్సాహం ఇంకా ఎక్కువగా ఉండాలని ,తలిదండ్రు లు
తమ పిల్లలను సంగీతం పై ప్రో త్సాహం కలిగించాలని ,గురువుల బాధ్యతా కూడా ఎక్కువగా ఉందని వీణ
నేర్చుకోవ టానికి గాత్ర సాధన కూడా అవసరమని ,సాధనకన్నా సంగీతం  వినటం ఎక్కువ అవసరమని
,కచేరీముందు అదనపు సాధన విజయాన్నిస్తు ందని తన కుమార్తె యోగ కీర్తన కూడా ఇదే కోవ లోకి
చెందుతుందని వీణా ‘’యోగం’’ లో అందరి ప్రో త్సాహ’’ వందనాలు’’ అందుకొంటున్న ‘’యోగ వందన ‘’గారి

లోచింప దగినవే .

                 ‘’ఇది విన్నారా ,కన్నారా ‘’అనే ఈ సంగీత ధారావాహిక ఇంతటితో సమాప్త ం .

  మొదట్లో నే చెప్పినట్లు ఈ బృహత్ రచనకు ఆధారం –తెలుగు అకాడెమి వారు ప్రచురించిన ఆచార్య శ్రీ
ముది గొండ వీరభద్రయ్య గారి రచన ‘’మన గాత్ర,తంత్రీ వాద్య సంగీత విద్యా నిధులు ‘’అని వినయ
పూర్వకం గామళ్ళీ  తెలియ జేస్తూ ,ఇంత మంది సంగీత సరస్వతులను ,వారి గురు మహో దయులను
,శిష్య ప్రముఖులను పరిచయం చేసే మహా అదృష్ట ం నాకు దక్కిందని పొ ంగిపో తూ ,ఆచార్య ముదిగొండ
వీరభద్రయ్యగారి కీ ,వారి విశేష కృషికి నమస్కరిస్తూ   సెలవు తీసుకొంటున్నాను .
 

  

 ఇది విన్నారా ,కన్నారా !-2

గాన గ౦ధర్వ  శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ

-శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ అసలు పేరు మురళీ కృష్ణ .కాని బాల్యం లోనే 9 వ ఏట  మొదటి
సంగీత కచేరీలు చేయటం తో ‘’బాల’’ మురళీ కృష్ణ అని పిలవటం తో అదే స్థిరపడి పో యింది .-బాల్యం
లో బాలమురళి విజయ వాడలో చేస్తు న్న  సంగీత కచేరీ లో ప్రేక్షక స్థా నం లో కూర్చున్న తిరుపతి
కవులలో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు ‘’ఆగు ‘’అని కిందనుంచే అని ,వేదిక నెక్కి ‘’నా వలెనే
వృద్దు డవై-నా వలెనే కీర్తి కాంచి –నా వలెనే శ్రీ దేవి పద భక్తు డవై –భూ వలయము తిరుగు మోయి ‘’అని
మూడు పద్యాలలో ఆశీర్వదించారు .అది పూర్తిగా ఫలించిందన్న సంగతి మనకు తెలిసిందే ..

-బాలమురళి 12 వ ఏట తిరువయ్యూర్ లో సంగీత సద్గు రు శ్రీ  త్యాగ రాజ స్వామి వారి ఆరాధనోత్సవం లో
కచేరీ చేసి ‘’బాల గ౦ధర్వ ‘’బిరుదు పొ ందారు .

-‘’చాలా మంది కర్నాటక సంగీత విద్వాంసులు ఒప్పు కోలేని ఒక గొప్ప అంశం ఒకటి ఉంది .అది
కర్నాటక సంగీతం కన్నా హిందూ స్థా నీ  సంగీతం లో శ్రో తలు ఎక్కువగా రక్తిని అనుభ విస్తా రు అన్నది
.అయితే  కర్ణా టకలోని ప్రౌ ఢత్వాన్నిహిందూ స్తా నీలోని రక్తిమను జోడించి పాడగల మేటి గాయకుడు శ్రీ
బాల మురళీ ఒక్కరే ‘’అన్నారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .
-‘’ఆచార్య వీరభ్ద య
్ర ్యగారికి వీణ అన్నా వీణ విద్వా౦సులన్నా మహాప్రేమాభిమానాలున్నాయి .అందుకే శ్రీ
పుదుక్కోటై వీరిని ‘’వీణ ‘’భద్రయ్య అన్నారు .శ్రీ ఎస్ .బాల చందర్ గారిలో ఉండే బరువైన ‘’మీటు ‘’వీరి
వాయిద్యం లో కనిపిస్తు ంది ‘’అన్నారు వరంగల్ ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ దుడ్డు
సీతారామయ్య .-‘’సాహిత్యం స్పష్ట ంగా పాడితే లలిత సంగీతమని వెక్కిరిస్తా రు .స్వర స్థా నం మీద నిలిపి
పాడితే హిందూ స్థా నీ అని వేళాకోళం చేస్తా రు .హిందూ స్తా నీని మిక్స్ చేసి  పాడుతున్నాను అంటారు
నన్ను .అసలు మిక్స్ చేయటం ఏమిటి ?హిందూ స్థా నీ మన పిల్లల్లో ఒక పిల్ల సుమా ‘’అంటారు
బాలమురళి .

-‘’దాక్షిణాత్య సంగీతాన్ని కర్నాటక సంగీతం అని యే శాస్త ం్ర లో ఉంది ?సంగీత రత్నాకరం లో ఉందా ?
త్యాగ బ్రహ్మ చెప్పారా ?’’అని ప్రశ్నిస్తా రు బాలమురళి .దీనికి వీరభద్రయ్యగారు వివరణ ఇస్తూ
‘’వాగ్గేయకారులైన ముత్తు స్వామి దీక్షితులవారి కీర్తనలలో హిందూ స్థా నీ బాణీలు లేవా ,ఆ బాణీలలోని
రాగాలను వారు తీసుకోలేదా ?స్వాతి తిరుణాల్ రచనలలోను ఈ లక్షణం లేదా అంటూ ‘’వాతాపి గణపతిం
భజే ‘’అన్న కీర్తన రచింప బడిన ‘’హంసధ్వని రాగం ‘’హిందూ స్థా నీ నుంచే వచ్చిందని ఒక సంగీత
మహా మహో పాధ్యాయులు అనలేదా ?అని చెప్పారు .అంతేకాదు దీక్షితులవారి ‘’నీరజాక్షి కామాక్షి ‘’ని
పూర్తిగా హిందూ స్థా నీ పద్ధ తిలో ఒక విద్వాంసుడు పాడగా వీణ పై వాయించగా  తానూ విన్నానని మరి
అలాంటప్పుడు బాల మురళిని ఎందుకు తప్పు పడుతున్నారో అర్ధ ం కావటం లేదని ఆచార్య వీణ(ర
)భద్రయ్య అన్నారు .

-‘’మనకున్న మంత్రా ల సంఖ్య 7 లక్షలట..అందులో తొంభై తొమ్మిది శాతం మృత మంత్రా లే నట .అంటే
జీవన్మంత్రా లు కొన్ని వందలే నన్నమాట .అవతార పురుషులు అవతరించి అనేక మృత మంత్రా లకు
ప్రా ణం పో స్తా రట .అలాగే రాగాలన్నీ ప్రా ణప్రదాలు కావు .గాయకుని ప్రతిభా విశేషం వలన నే వాటిల్లో జీవం
కలుగుతుంది .ఈ విధంగా బాలమురళి అనేకానేక రాగాలకు నూతన ప్రా ణ దానం చేశారు .అంతేకాక
72 మేళ కర్త రాగాలలోను కీర్తనలను సంగీత యుక్త ం గా కట్టి వాగ్గేయ కార చరితల
్ర ో సుస్థిర స్థా నం
సంపాదించుకొన్నారు బాల మురళి ‘’అని బాలమురళిలోని వైశిస్ట్యాన్ని  ఆవిష్కరించారు ఆచార్య .

-‘’ఆయనను  మహా గాయకునిగానే చూస్తా ం కాని ఆయన తనను ‘’వాగ్గేయ కారుని ‘’గా
చూడమంటారు బాల మురళి .నిజమే వారు 400 దాకా రచనలు చేశారు. వర్ణా లు ,కృతులు జావళీలు
తిల్లా నాలు రచించారు .బాలమురళి తిల్లా నా వంటిది’’ నభూతో న భవిష్యతి’’ .గ్రహ భేదం తో వారొక
తిల్లా నాలో సాధించిన అందం అంతాఇంతా కాదంటారు ఆచార్యులవారు .ఏ పాఠశాల విద్యా లేకుండా
ఎవరివద్దా సంస్కృతాంద్రా లు  నేర్వకుండా శతాధిక కృతులు రాశారు .సంగీతాన్ని మాత్రం త్యాగ రాజ
స్వామి ప్రశిష్యులైన శ్రీ పారుపల్లి రామ కృష్ణ య్య పంతులుగారి వద్ద నేర్చారు దట్ ఈజ్ బాలమురళి
.సంగీత సాహిత్యాలు రెండూ బాలమురళికి దైవ దత్తా లే .

-త్యాగ బ్రహ్మ నుంచి గురు పరంపరలో  నాలుగవ తరం వారు పారు పల్లివారు .త్యాగయ్య గారి
పాఠమే,పారుపల్లి వారు పాడినది దానినే బాలమురళి అనుసరించారు .

-‘’మీరు ముందుగా సాహిత్య రచన చేసి దానికి సంగీతం కూరుస్తా రా “”?అని అడిగత
ి ే ‘’సాహిత్య ,సంగీత
రచనలు రెండూ ఏకకాలం లోనే చేస్తా ను .పాట పాడాక అది యే రాగం లో వచ్చిందో చూసుకొంటాను
‘’అన్నారు స్వరబ్రహ్మ బాలమురళి .

-‘’ఏ పర్వీన్ సుల్తా నా ‘’లాంటి మధుర గాయనీ మణులో తప్ప ఇతరులు పాడలేని ‘’అతి తార షడ్జ మ
స్థా యి ‘’ని అలవోకగా అధి రోహించి రాగల నేర్పు బాలమురళీ కృష్ణ గారికి వెన్నతో పెట్టిన విద్య .ఇతర
గాయకులు  తార పంచమం చేరటానికే విపరీతంగా రొప్పుతారు ‘’అన్నారు ఆచార్య వీర భద్రయ్యగారు.

-‘’సంప్రదాయమొక బ్లూ ప్రింట్ మాత్రమే .బ్లూ ప్రింట్ రాగానే ఇల్లు దొ రికినట్లు కాదు .అందులో ఎవరూ
నివసించ లేరుకదా .బ్లూ ప్రింట్ ప్రకారం ఇల్లు కట్టు కొని అందులో ఉండాలి .కళాకారులు కావటం అంటే అదే
.కేవలం సంగీత పుస్త కాలు చదవటం కాదు .సంగీతాన్ని తెలుసుకోవటం వేరు .సంగీతానికి నీవు
తెలియటం వేరు .’’అన్నారు పద్మ విభూషణ్ బాలమురళి .

-సాధారణం గా అయిదు స్వరాలైనా లేనిది రాగం విశదం కాదు .కాని బాలమురళి ప్రయోగాత్మకంగా
నాలుగు స్వరాలతోనే రాగం సృష్టించారు .లవంగి ,మహతి ,మనోరమ ,ఓంకారి ,ప్రతి మధ్యావతి ,రోహిణి,
సర్వశ్రీ  ,సుముఖం సుషమ వంటి కొత్త రాగాలు సృష్టించి ప్రా ణం పో శారు .

-గాత్రం తో పాటు బాలమురళి వీణ వయోలిన్ ,వయోలా మృదంగం వాయించటం లోనూ ప్రసిద్ధు లు .

-‘’సంగీతసరస్వతిని సంకుచిత పరిధుల లో నుంచి విముక్త ం చేసి ‘’భారతీయ సంగీతం ‘’అనే వినూత్న
పంధానేర్పరచిన మార్గ దర్శి శ్రీ బాలమురళీ కృష్ణ ‘’అన్న ఆచార్యుల వారి విశ్లేషణ నూటికి వెయ్యి శాత 0
య దార్ధ ం .

ఆధారం –ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య రచించిన ‘’మన గాత్ర ,తంత్రీ వాద్య సంగీతవిద్యానిధులు

 
 

You might also like