You are on page 1of 8

గోల్కొండ

By - S. Satvik
10th prithvi
గోల్కొండకోట, ఒక పురాతన నగరం. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదుకు 10 కి.మీ.
దూరములో ఉంది. గోల్కొండ నగరం, కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద
కట్టా రు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. సా. శ. 1083 నుండి సా. శ.
1323 వరకు కాకతీయులు గోల్కొండను పాలించారు. సా. శ 1336 లో ముసునూరి కమ్మ
నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. సా. శ.
1364 లో కమ్మ మహారాజు ముసునూరి కాపయ నాయకుడు గోల్కొండను సంధిలో భాగముగా
బహమనీ సుల్తా ను మహమ్మదు షా వశము చేశాడు. ఇది బహుమనీ సామ్రా జ్యములో రాజధానిగా
(1365-1512) ఉంది. కానీ సా.శ. సా. శ 1512 తరువాత ముస్లిము సుల్తా నుల రాజ్యములో
రాజధాని అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్
రావు, 2014 ఆగస్టు 15న గోల్కొండ కోటపై తొలిసారిగా భారత స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించి
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు.
"మంగలవరమ్" మరియు"మంగలవరమ్" నుండి"గొల్ల కొండ" నుండి గోల్కొండ కోటగా
రూపాంతరం చెందిన ఈ ప్రా కారం వెనుక ఒక ఆసక్తికరమయిన కథనం ఉంది. అదేమిటంటే
1143లో మానుగల్లు అనే రాళ్ళ గుట్ట పైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహము కనిపించింది. ఈ
వార్త అప్పటి ఆ ప్రాంతమును పాలించే కాకతీయులకు చేరవేయ బడింది. వెంటనే ఆ పవిత్ర
స్థలములో రాజుగారు ఒక మట్టి కట్టడమును నిర్మించారు. కాకతీయులకు, ముసునూరి
కమ్మరాజులకు గోల్కొండ ఓరుగంటి సామ్రా జ్యములో ముఖ్యమైన కోట. గోల్కొండ కోట తొలుతగా
1323లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుఘ్ ఖాన్ వశమయ్యింది. పిదప ముసునూరి
కమ్మరాజుల విప్లవముతో ఓరుగల్లు తో బాటు గోల్కొండ కూడా విముక్తము చేయబడింది. 1347లో
గుల్బర్గా రాజధానిగా వెలసిన బహమనీ రాజ్యమునకు ముసునూరి కమ్మరాజులకి పెక్కు
సంఘర్షణలు జరిగాయి.
మహమ్మద్ షా కాలములో ముసునూరి కాపయ నాయకుడు కౌలాస్ కోటను తిరిగి సాధించుటకు
తన కొడుకు వినాయక దేవ్ ని పంపాడు. కాని వినాయక దేవ్ ఈ ప్రయత్నములో విఫలుడయ్యాడు.
1361లో పారశీక అశ్వముల కొనుగోలు విషయములో వచ్చిన తగాదా ఫలితముగా మహమ్మద్ షా
బేలం పట్టణంపై దాడి చేసి వినాయక దేవ్ ని బంధించి ఆతనిని ఘాతుకముగా వధించాడు.
గుల్బర్గా కు తిరిగిపోవు దారిలో మహమ్మద్ షా సైనికులను ఓరుగంటి వీరులు మట్టు బెట్టా రు.
సుల్తా ను కూడా తీవ్రముగా గాయపడ్డా డు. ప్రతీకారముతో రగిలిన సుల్తా ను పెద్ద సైన్యమును
కూడగట్టి కాపయ నాయకుడుపై యుద్ధమునకు తలపడ్డా డు. ఓరుగంటికి విజయనగర సహాయము
అందలేదు. కాపయ నాయకుడు ఢిల్లీ సుల్తా ను సహాయము కోరాడు. తోటి మహమ్మదీయునిపై
యుద్ధము చేయుటకు ఢిల్లీ సుల్తా ను నిరాకరించాడు. బలహీనపడిన కాపయ నాయకుడు
మహమ్మద్ షాతో సంధిచేసుకున్నాడు.
300ఏనుగులు, 200 గుర్రా లు, 33 లక్షల రూప్యములతో బాటు గోల్కొండ శాశ్వతముగా
వదులుకున్నాడు. గోల్కొండ కోటకు అజీమ్ హుమయూన్ అధిపతిగా చేసి షా గుల్బర్గా కు
మరలాడు. ఈ విధముగా 1364లో గోల్కొండ కోట హిందువులనుండి చేజారి పోయింది. తరువాత
నవాబులు పాలించారు.
1507 నుండి మొదలుకొని ఒక 62 సంవత్సరముల కాలములో గోల్కొండ కోటను కుతుబ్ షాహీ
వంశస్థు లు నల్లరాతి కోటగా తయారు చేశారు. కోట బురుజులతో సహా ఇది 5 కి.మీ. చుట్టు కొలత
కలిగి ఉంది. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్తు ల పాలన 1687లో ఔరంగజేబు విజయముతో
అంతమయినది. ఆసమయములో ఔరంగజేబు కోటను నాశనంచేశాడు. గోల్కొండ కోట వజ్రా ల
వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచప్రసిద్దమైన కోహినూరు వజ్రము, పిట్ వజ్రము,
హోప్ వజ్రము, ఓర్లా ఫ్ వజ్రము ఈ రాజ్యములోని పరిటాల-కొల్లూ రు గనుల నుండి వచ్చాయి.
గోల్కొండ గనుల నుండి వచ్చిన ధనము, వజ్రా లు నిజాము చక్రవర్తు లను సుసంపన్నం చేశాయి.
నిజాములు మొగలు చక్రవర్తు లనుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత హైదరాబాదును 1724
నుండి 1948లో భారత్‌లో విలీనమయ్యేంతవరకు పరిపాలించారు. నిజాం నవాబుల పరిపాలన
కాలంలో 1830 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల
వీరాస్వామయ్య అప్పటి గోల్కొండ స్థితిగతుల గురించి వ్రా సుకున్నారు. వాటి ప్రకారం 1830 నాటికి
గోల్కొండలో నిజాం అంత:పుర స్త్రీలు, నైజాం మూలధనం కట్టు దిట్టమైన భద్రత నడుమ ఉండేవారు.
కోటలో విస్తరించి ప్రజలు ఇళ్ళు కట్టు కుని జీవించేవారు. ఐతే రాజధాని తరలిపోయివుండడంతో
అక్కడ రాజ్యతంత్రా నికి సంబంధించిన, వర్తకవాణిజ్యాలకు సంబంధించిన వ్యవహారాలు జరిగేవి
కాదు.
Thank
you

You might also like