You are on page 1of 2

బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది అంటే

బతుకమ్మ పండుగ వెనుక ఒక కథ వున్నది. తెలంగాణ ప్రా ంతాన్ని రాష్ట క


్ర ూట రాజులు
పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులు
మరియు రాష్ట క
్ర ూటుల మధ్య జరిగిన యుద్ధ ంలో ఈ చాళుక్యులు రాష్ట క
్ర ూటులకు మద్ద తు
ఇచ్చారు.

క్రి. శ. 973 లో, చాళుక్య రాజైన తైలపాడు రాష్ట క


్ర ూటుల చివరి రాజైన కర్కుడిని హతం చేసి
కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థా పించాడు. ప్రస్తు త తెలంగాణ ప్రా ంతం తైలపాడు రాజు
పరిపాలనలో ఉండేది.

క్రీ.శ 997 లో తైలపాడు మరణించడం వలన అతని కుమారుడు సత్యస్రా యుడు


సింహాసనాన్ని అధిష్టించాడు. ఆ సమయంలో వేములవాడ (ఇప్పుడు కరీంనగర్ జిల్లా ) లో ఒక
ప్రసిద్ధ రాజరాజేశ్వర ఆలయం ఉండేద.ి ఆపదలో ఉన్నవారికి రాజరాజేశ్వరి అమ్మవారు
అండగా ఉంటుందని అప్పటి ప్రజల నమ్మకం. ప్రజలే కాకుండా చోళ రాజు పరాంతక
సుందరాచోళ కూడా రాష్ట క
్ర ూటుల నుండి ప్రమాదం తలెత్తి నప్పుడు రాజరాజేశ్వరి అమ్మవారికి
భక్తు డిగా మారిపో యారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి తనను రక్షించిందని విశ్వసించిన
పరాంతకసుందర చోళుడు తన కుమారుడికి రాజరాజ అని పేరు పెట్టా డు.

క్రీస్తు శకం 985 నుండి 1014 వరకు రాజరాజ చోళుడు రాజ్యాన్ని పాలించాడని చరిత్ర
చెబుతున్నది. అతని కుమారుడు రాజేంద్రచ ోళ సత్యస్రా యుడిపై యుద్ధ ంలో సేనాధిపతిగా
వ్యవహరించి విజయం గెలుపొ ందాడు. ఈ విజయానికి గుర్తు గా రాజేశ్వరి దేవాలయాన్ని
కూల్చివేసి అందులో ఉన్న భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. రాజరాజ
చోళుడు తన కుమారుడు తనకు ఇచ్చిన శివలింగం కొరకు క్రీ.శ 1006 లో ఆలయ నిర్మాణాన్ని
చేపట్టా డు.
క్రీస్తు శకం 1010 లో నిర్మాణం పూర్తియ్యాక ఆ శివలింగమును బృహదీశ్వర ఆలయంలో
ప్రతిష్టించాడు. చోళ రాజులు తమ రాజ్యంపై దాడి చేసి వారు దో చుకున్న సొ మ్ముతోనే
బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించారని తమిళ శాసనాలలో చోళరాజుల కూడా చెప్పారు.
వేములవాడలోని భీమేశ్వర శివలింగ దేవాలయం మరియు బృహదీశ్వర ఆలయంలోని
శివలింగాల మధ్య ఇప్పటికీ సారూప్యతలు కనిపిస్తా యి. వేములవాడ నుండి పార్వతి నుండి
శివలింగం వేరు చేసి ఆ శివ లింగాన్ని తంజావూరుకు తరలించడం వలన తెలంగాణ ప్రజలు
కలవరపడ్డా రు.

బృహదమ్మ (పార్వతి) నుండి శివలింగాన్ని వేరు చేసినందుకు తెలంగాణ ప్రజలు తమ బాధను


చోళులకు తెలియజేయడానికి మేరు పర్వతం వంటి పూలను పేర్చి బతుకమ్మను
నిర్వహించడం ప్రా రంభించారు తెలంగాణవాసులు. అందువల్ల ప్రతి సంవత్సరం బతుకమ్మను
జరుపుకోవడం సంప్రదాయంగా మారింది.

దాదాపు 1000 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు బతుకమ్మను జరుపుకుంటున్నారు.


బతుకమ్మ అనే పేరు కూడా బృహదమ్మ నుండి వచ్చింది. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను
పసుపు పువ్వులతో అలంకరిస్తా రు మరియు తొమ్మిది రోజులు ఆడిన తర్వాత పువ్వులు
నీటిలోకి వదులుతారు. పరమేశ్వరుడు లేని పార్వతి దేవి గురించి పాటలు పాడుతూ తెలంగాణ
ప్రజలు బతుకమ్మను జరుపుకుంటారు.

You might also like