You are on page 1of 1

కృష్ణమూర్తి గారూ గొల్లలు యాదవులు ఒకటే అనుకోవడం వల్ల మీరు చాల పొరపాట్లను చవి చూస్తు న్నారు.

వాస్తవానికి చరిత్రలో గొల్లలు వేరు యాదవులు వేరు. మొదట ఈ విషయాన్ని మీరు జీర్ణం చేసుకోవాలి. సంస్కృత
గ్రంధాలను తెలుగులోనికి తర్జు మా చేసేటప్పుడు తెలుగు కవులు యాదవులను గొల్లలుగా పరిచయం చేశారు.
వాస్తవానికి "యాదవ" శబ్దం కుల సూచకం కాదు. అది వంశ సూచకం మాత్రమే. యదు వంశీకులను యాదవులు
అంటారు. వీరు గొర్రెలు కానీ ఆవులు కానీ మేపుకునే గొల్లలు కాదు. వీరు క్షత్రియ ధర్మాన్ని పాటించే వారు. వీరు
చంద్రవంశ క్షత్రియులు. వీరి దగ్గరి బంధువులే కురు వంశీయులైన పాండవులు, కౌరవులు. వీరిని
కురువంశీకులైనందువల్ల కౌరవులు అని యదు వంశీకులైన వారిని యాదవులు అని పిలిచారు.
యాదవ అనేది వంశ సూచకమే కానీ కుల సూచకం కాదు.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వసుదేవుడు యదు వంశీయుడు. ఈయన ఎప్పుడు కూడా ఆవులను మేపలేదు. శ్రి
కృష్ణుడు వసుదేవుని మిత్రు డైన నందుని ఇంట పెరిగాడు. నందుడు గొల్ల పల్లె అయిన వ్రేపల్లె కు పెద్ద. అంతే కానీ
వసుదేవునికి కానీ పాండవులకు కాని బంధువు కాదు. కౄష్ణుడు యాదవ వంశీకుడే కానీ నందుడు యాదవ
వంశీకుడు కాడు అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. గొల్ల పల్లెలో కృష్ణుడు పెరిగాడు, గొల్ల బాలకులతో
ఆటలాడుకున్నాడు అంత మాత్రాన గొల్లవాడెలా అవుతాడు?
ఈ ఒక్క విషయం లో మీరు సరైన క్లా రిటీ కి వస్తే అసలైన చరిత్ర మీ కళ్ళకు సాక్షత్కరిస్తుంది.
ఉత్తర భారతం లో వున్న యాదవులు అంధ్రప్రదెశ్ లో వున్న గొల్ల యాదవులు ఒక్కటి కాదు అన్న విషయం ముందుగా
తెలుసుకోవాలి. ఉత్తర భారత యాదవులు మిమ్ములను యాదవులుగా ఒప్పుకోరు ??? ఎందుకు.

శ్రీకృష్ణ దేవరాయల విషయం లో కూడా పారిజాతపహరణం లో

యాదవత్వమున సిం హాసనస్తు డుగామి


సిం హానస్తు డై చెన్నుమెరయ
నాడునూ నేడునూ యాదవాన్వయమునందు
జననమందెను వసుదేవ
మనుజ విభుని కృష్ణుడను పేర
నరసేంద్రు దు కృష్ణరాయలుగా నాది నారాయణుండు.

ఈ పద్యాన్ని ఆసరా చేసుకుని రాయలు గొల్ల వాడని మీరు క్లైం చేస్తు న్నారు.

ఈ పద్యం లొని మొదటి పాదం లో యాదవత్వమున కృష్ణుడు సిం హాసనము అధిష్టించలేకపోయాడు అని అర్థం.
యదువంశీకులు చంద్రవంశ క్షత్రియులైనప్పుడు రాజ్యాధికారం దక్కక పొవడం ఏంటి? ఇక్కడ తిమ్మన గారి
ఆంతర్యం గమనించండి. కృష్ణుడు పసుపాలకుల ఇంట పెరిగినందువల్ల రాజ్యాధికారానికి అర్హత కోల్పోయాడు. అని
అర్ధం.
రెండవపాదానికి అర్ధం రాజ్యం చేయాలనే కోరికతో
మళ్ళీ యదువు సోదరుని(తుర్వసుని) వంశమందు వసుదేవుడు నరసేంద్రు నిగా(నరసిం
హరాయలుగా)కృష్ణరాయలుగా ఆదినారాయణుండు (శ్రీ మహా విష్ణువు)
అని అర్థం. అంటే పశుపాలకుల ఇంట పెరిగితేనే రాజ్యాధికారార్హత కృష్ణుడే కోల్పోయాడు. ఇది నంది తిమ్మన
చమత్కారం మాత్రమే. పశుపాలకుల ఇంట పెరిగితేనే కృష్ణుడు రాజ్యార్హత కోల్పోయాడు. మరి పశుపాలకులెలా
రాజులవుతారు?

ఈక రాయల వారు బలిజ కులస్తు డు అనడానికి చాలా ఆధారాలు వున్నాయి. ఈ బ్లా గును ఫాలో అవుతుండండి
మీకు అన్ని విషయాలు తెలుస్తా యి.

https://balijavani.blogspot.com/2013/05/blog-post_20.html?m=0

You might also like