You are on page 1of 5

సుగుణ

ఒకరోజు నేను ఆఫీసుకు బయల్దే రుతుండగా టెలిగ్రాం వచ్చింది. సంతకం పెట్టి చేతిలోకి తీసుకొని
చదువుతుంటే……నా కాళ్ళక్రిందనేల కంపిస్తు న్నట్లు అనిపించింది. ఏం చెయ్యాలో క్షణంపాటు
అర్థంకాలేదు. కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. చుట్టూ ఉన్న వస్తు వులన్నీ బూజరబూజరగా కనిపించాయి. తల
తిరిగిపో తోంది. చిన్నగా కుర్చీలో కూలబడ్డా ను………
నేను ఒక ప్రైవేటు కంపెనీలో గుమాస్తా గా పని చేస్తు న్నాను. తమ్ముడు కృష్ణా రావు. మా తాతగారి పేరే
వీడికి పెట్టా రు. అదే మేంచేసిన తప్పేమో! ఆయనాకాలంలో సంఘసంస్కరణలు చేస్తే , వీడిప్పుడు
ఆయనగారి బాటలోనే సంఘాన్ని సంస్కరించాలని బయల్దే రాడు. పైసా సంపాదించకపో గా సంస్కరణల
పేరుతో ఇంటిచుట్టూ అర్ధరాత్రి అపరాత్రిలేకుండా పో లీసుల్ని తిప్పటం….ఎవరు పడితే వాళ్ళు ఇంటికి
రావటం…. వీటికి తోడు ఇరుగు పొ రుగులు గుసగుసలు….పరువుగా ఇంట్లో ఉంటూ గుట్టు గా కాపురం
చేస్తూ గౌరవంగా బ్రతికే మమ్మల్ని తలెత్తు కోకుండా చేస్తు న్నాడు……అందుకే ఒక రోజు

ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో….. ఆ తర్వాత సంఘంగురించి ఆలోచిద్దాం…. ఎన్నాళ్ళని నేను


పో షించను నిన్నూ నీ పెళ్ళాంపిల్ల ల్ని…. సంఘసంస్కరణకూడు పెట్టదురా….. పనిచేస్తే నే నాలుగు వేళ్ళు
నోటిదాకా వెళ్ళేది….” అంటూ వాణ్ణి మందలించాను. మాటామాటా పెరిగింది. ఆవేశంగా వాడు ఇల్లొ దిలి
సమాజోద్ధరణకు వెళ్ళటానికి సిద్దపడ్డా డు….వాడి వెంటే వాడి భార్య సుగుణ, వాడికూతురు….రోజులపిల్ల
ఇంకా పేరు పెట్టలేదు……
” అమ్మా ! సుగుణ. వాడిని నీకిచ్చి కట్టబెట్టిన పాపానికి, వాణ్ణి నమ్ముకొని వెళుతున్నావా…. ఇది నీ ఇల్లు
…… పెళ్ళి చేస్తే నన్నా మారతాడనుకున్నా….నాకిక నమ్మకం నసించింది…వాణ్ణి వెళ్ళనీమ్మా….”
అంటూ బ్రతిమాలాను. తన భర్తతోడిదే తనజీవనమంటూ వాడితో వెళ్ళిపో యిందా పి ……..
సంసారంకన్నా సమాజ సంస్కరణల పట్ల ఆసక్తి గల కృష్ణా రావు ఇంట్లో పెళ్ళాం పిల్ల ల్తో కన్నా బయటి
వారితోనే ఎక్కువగా గడిపేవాడు. ఎప్పుడింటికి వస్తా డో తెలీదు……అతని మూలాన
పైసాసంపాదనలేదు……కుటుంబపో షణచాలా భారంగా వుంది……అయినా సుగుణఅతన్ని పల్లె త్తు మాట
అనలేదు. మొదట్లో ఒంటిమీద నగలమ్మి ఇల్లు గడిపింది. తన భర్తకు భాద్యత తెలియచెప్పే ప్రయత్నాలు
చేసింది. ప్రయోజనం శూన్యమనిపించింది. అందుకే నాలుగిళ్ళల్లో పనులు చేసి భర్తనీ,కూతుర్నీ
పో షిస్తోంది. వేళకి తిండిదొరుకుతుందనే కానీ, ఆ తిండి ఎక్కడినుండి వస్తోందోనన్న ఆలోచనే వీడికి
కలుగలేదు. ఆలోచించే తీరికా లేదు. ఎప్పుడు చూసిన ఉపన్యాససభలు, ధర్నాలు వండి వాటితోటే అతని
రోజులు గడిచిపో తున్నాయి. ఒకసారి వాడు ఇంటికి రాలేదుట…..సుగుణఖంగారుపడుతూ అందర్నీ
అడుగుతూ కంప్లైంట్ ఇద్దా మని పో లీసు స్టేషన్కు వెళ్తూ , ఆఫీసు పనిమీద బ్యాంకు కెళుతున్న నాకు
ఎదురైంది. విషయం తెలుసుకొని నేనూ ఆమెతో కలిసి స్టేషన్కు వెళ్తే కటకటాలు లెక్కబెడుతూ
కనిపించాడు….. నేనే ఎలాగో విడిపించాను…..సుగుణచేతులెత్తి నమస్కరించబో తే నేనే వద్దన్నాను. ”
ఇంక మీదన్నా బుద్ధి తెచ్చుకొనుండు” అని మందలించాను. కనీసం వాడు నాతో ఏమీ మాట్లా డలేదు….
మాట్లా డాలని వాడికి అనిపించలేదేమో……..అలాగే వెళ్ళిపో యాడు…..
కొన్నిరోజులకి మళ్ళీ ఇదే తంతు…. ఎవరో చెబితే తెలిసింది సుగుణకు… రోడ్డు మీద జనాన్ని పో గుచేసి
విప్ల వగీతాలు పాడినందుకు పో లీసులు అరెస్టు చేశారని. మళ్ళీ సుగుణవాళ్ళకాళ్ళూ వీళ్ళకాళ్ళూ పట్టు కొని
కృష్ణా రావుని విడిపించి తెచ్చిందట… నాకు విషయం తరువాత తెలిసింది…. బంగారమంటి పిల్ల ను
బడుద్దా యిలాంటి వాడికిచ్చి పెళ్ళిచేసి అనవసరంగా ఆమె గొంతుకోశానని నాకు
అనిపించింది….ఇప్పుడిలా బాధపడి ప్రయోజనం శూన్యం
ఇలా ఎన్నోసార్లు వాడిని పో లీసులు అరెస్టు చెయ్యటం, నేనో….సుగుణో విడిపించి తీసుకెళ్ళటం…..కొన్ని
రోజులకు ఇద్దరికీ విసుగు వచ్చింది…….కృష్ణా రావు ఇంటిముఖం చూసి రెండునెలలు. మళ్ళీ ఈరోజు
ఇంటికి వచ్చాడు. ఇన్నాళ్ళూ ఎక్కడున్నావని అడిగే ధైర్యం ఆమెకు లేదు. ఎక్కడున్నాడో చెప్పే ఉద్దే శ్యం
ఇతనికి లేదు. కృష్ణా రావు ఏకాంతంగా గదిలో కూర్చొని వున్నాడు….సమయం పన్నెండు గంటలు……
గదిలో లైటు వెలుగుతోంది……

“నేను నమ్మిన సిద్ధాంతాలు కూటికి, గుడ్డ కి కొరగావని అన్నయ్య అన్న మాటలు ఇప్పుడు అక్షరసత్యాలు
అనిపిస్తు న్నాయి. మహాత్ముల సిద్ధాంతాల్ని ఆచరణలో పెట్టి సంఘసంస్కరణోద్యమం చేపట్టినందుకు,
చివరకా సంఘమే నన్ను దోషిగానూ, విప్ల వవాదిగానూ చిత్రించింది. మహాత్ముల మాటలకు, చూపించిన
బాటలకు కాలమేనాడో చెల్లిపో యి, వాటికి వక్రభాష్యాలు వెతికే రోజులు వచ్చాయి. ఈ విషయం
తెలుసుకునే సరికి సమయం మించిపో యింది…..”అంటూ కాగితం మీద రాసుకుంటుండగా. .ఎవరో
బైటినుండి కృష్ణా రావుగారూ అంటూ పిలిచారు. కాగితం పక్కన పెట్టి బయటకు వెళ్ళిన అతను ఆ రాత్రి
అంతా ఇంటికి రాలేదు….. దూరంగా ఎక్కడో తుపాకీ మోత వినిపించింది…….మరునాటి పొ ద్దు నే
సుగుణకు తెలిసింది తనభర్తనెవరో కాల్చి చంపారని………
“బ్రదర్ డెడ్ స్టా ర్ ఇమ్మీడియట్లీ ”. మెల్లె గా కుర్చీలోంచి లేస్తూ నా భార్య అపర్ణని పిలిచి విషయం చెప్పాను.
వాడి భార్య,కూతురు (పేరు కృష్ణవేణి)ని ఇంటికి తీసుకొద్దా మనుకుంటున్నాను.ఇదే విషయం అపర్ణతో
చెబితే ఆమె ఒప్పుకోలేదు. ” ప్రస్తు తం ఆ పల్లికు మనంతప్ప మరెవరున్నారు” అని బ్రతిమాలి చూశాను.
నా కొడుకు దిలీప్ ని గడపకడ్డంగా పడుకోబెట్టి దాటి వెళ్ళి వారిద్దర్నీ ఇంటికి తెచ్చుకోమంది. నేను తనకు
నచ్చచెప్పాలని చూశాను. ఉరేసుకొని చస్తా నని బెదిరించి తన తమ్ముడికి ఫో న్ చేసి పిలిపించే ఏర్పాట్లు
చేస్తోంది…….
దానిమాట కాదని నిర్ణయం తీసుకొనే ధైర్యంనాకు లేదు. ” చంటి పిల్ల ను పెట్టు కొని బర్తలేని ఆపిల్ల ఎన్ని
పాట్టు పడుతుందో కదా భగవంతుడా!” అనుకుంటుండగా నా బావమరిది రంగనాధం ఉన్నట్లుండి
ఊడిపడ్డా డు. వాడిఅక్క అపర్ణకి అన్యాయం చెయ్యాలని చూస్తే సహించేది లేదన్నాడు. “ సుగుణని, ఆమె
కూతుర్ని ఇంటికి తెచ్చే ప్రయత్నం చేస్తే అక్కమొగుడువని కూడా చూడను….ప్రా ణాలు తీసేస్తా ” అని
వార్నింగ్ ఇచ్చాడు నాకు.

బంగారంలాంటి సుగుణని వాడికిచ్చి పెళ్ళి చేసి ఆ పిల్ల భవిష్యత్తు ని నా చేతులారా నాశనం చేశాను. ఆ
పాపం నన్ను ఊరికే వదలదు. భర్త చచ్చిపో యింతర్వాత ఆ పిల్ల ఎటుపో తుంది. మనం తప్ప ఆపిల్ల కు
ఎవరున్నారు…” అని రంగనాధాన్ని అడిగాను.

మీరన్నది నిజమే….కానీ ఇప్పుడామెను ఇంటికి తీసుకొస్తే మనిళ్ళచుట్టూ పో లీసులు తిరుగుతుంటాడు.


అయినా ఒక విప్ల వవాది పెళ్ళాన్ని ఇంట్లో పెట్టు కుంటే మనపరువేంకావాలి… పైగా వాడు చచ్చింది ఎన్
కౌంటర్లో …..’ అన్నది అపర్ణ.
కాదు…”

చనిపో యినవాడు స్వయానా నాకు తమ్ముడే…..అయినా వాడు చచ్చిపో యింది పో లీసులు ఎన్ కౌంటర్లో
‘ఎలాగోలా చచ్చాడు. అన్న అన్నబంధమేనాడో కాదనుకోని ఇల్లు వదిలెల్లా డుగా……” అన్నాడు
రంగనాధం…. ఎందుకు వెళ్ళాడు….సంఘసంస్కరణలకోసం…. వీడు జనానికి జరుగుతున్న
అన్యాయాన్ని బహిరంగంగా గొంతెత్తి చెప్పి, సంఘంలో సంస్కరణలు తీసుకు వద్దా మని వెళ్ళాడు. వాడికి
మీరిచ్చిన బిరుదు విప్ల వవాది. వాడు చెప్పేదితప్పు కాదు, చెప్పే పద్దతిలో చెప్పలేదు. అందుకే వాడొక
విప్ల వవాదైనాడు.”
“ ఇంతకు నువ్వనేదేంటి బావా….” గంభీరంగా అన్నాడు రంగనాథం…….
“ చెప్పానుగా….సుగుణని, ఆమె కూతుర్ని ఈ ఇంటికి తీసుకు వస్తు న్నా…..” అన్నాను…….
ఆ మాటే వద్దంటున్నా… ఇంతమంది చెపుతున్నా మళ్ళీ వాళ్ళనింటికి తెస్తా నంటారేంటి..” అంటూ అపర్ణ
నామీదకు లేచింది…….

‘వాళ్ళనింటికి తెస్తే నీకు ఇబ్బందేంటి?”


” ఇబ్బంది కాక… మరేంటి? వాడి పెళ్ళాన్నింటికి తెస్తే వాణ్ణి కాల్చిన వాళ్ళు రేపు ఇంట్లో వుంచుకున్నందు
మిమ్మల్ని కాలుస్తా రు….” అంటూ ఒక్క సారిగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది…..

సంతోషంగా బలౌతా…….మీరనే ఈ విప్ల వ వాది కడుపున పుట్టటమేనా వాడికూతురు చేసిన నేరం…


మీరనే ఆ విప్ల వవాదిని పెళ్ళిచేసుకోవటమేనా సుగుణచేసిన నేరం….. పెళ్ళిచేసుకున్న సుగుణ, కడుపున
పుట్టిన కృష్ణవేణి ఇద్దర్నీకూడా నేరస్తు లుగా మీరు భావించినట్లై తే వారికన్నా మొట్టమొదట పెద్దనేరస్తు లం
మనం అవుతాం అపర్ణ……ఎందుకంటే పెళ్ళి చేస్తే మారతాడంటూ పీటలమీద కూర్చొని వారిద్దరి
జీవితాలకి ముడి పెట్టిన

మనిద్దంరంకూడా దో షలమే….! ఎవరో పరాయి వాళ్ళ మాటలు పట్టు కొని అమాయకులైన వారిని
వెలివేయటం మంచిదికాదు….రెడీ అవ్వు వెళ్ళి వాళ్ళను తీసుకు వద్దాం…..” అన్నాను.
నిజమేనన్నట్లు గా తలవూపుతూ బయల్దే రింది. రంగనాధం మమ్మల్ని అనుసరించాడు………

‘ ఇలా ఎందరో సుగుణలాంటి బాదితులీ సమాజంలో వున్నారు. వారివారు ఒక్కసారి ఆలోచించండి……


మనకెందుకులే అని ఊరుకుంటుంటే మాత్రం ఇలాంటి వారి దుస్థి తికి మనమే కారకులం……
మీ శ్రీ చక్రధారి

You might also like