You are on page 1of 51

ఖ రచన

యశసివ్ ‘సేత’

ఇసుక-నురగ

 [1] ఇ క- రగ 
ఖ రచన

ఇసుక-నురగ

నేను ఈ తీరాల మీద నిరంతరాయంగా నడుసుత్నాన్ను

ఇసుక నురగల నడుమ

పోటెతిత్న అలలు నా అడుగుజాడలను చెరిపేసాత్యి.

గాలి నురగను విసిరేసుత్ంది

ఈ సముదర్ం ఈ తీరం ఉండిపోతాయి

ఇలానే..

 
నా చేతిని తుహినజలంతో నింపుకునాన్ను.

చెయియ్ తెరిసేత్ ఆశచ్రయ్ం, నీరు పురుగయింది.

నా చేతిని మూసి తెరిచాను, ఇపుప్డు అందులో ఒక పకిష్ ఉంది.

మరోమారు మూసి తెరిచాను ఒక మనిషి ఏడుపుముఖంతో

నిలుచునాన్డు, నావైపు తిరిగి

మరో సారి మూసి తెరిచినపుప్డు అందులో ఉనన్ది నీరే!

అందులోంచి

 [2] ఇ క- రగ 
ఖ రచన
అతిమధురమైన పాట వినబడింది.

 
నినన్ ననున్నేను, జీవనచకర్ంలో లయలేకుండా కదులుతునన్ శకలం

అనుకునాన్.

ఇపుప్డు నాకు నేనే జీవితగోళానిన్ అని కనుగొనాన్.

జీవమంతా శకలాలుగా లయబదధ్ంగా నాలోనే కదులుతుందనీ తెలుసు.

 
వాళల్ంతా మెలుకువలో చెపుతారు, నీవు, నీ పర్పంచం, అంతులేని

సముదర్పు అంతంలేని తీరం మీద ఒకక్ రేణుపరిమాణమని

నేను కలలో వారికి చెపుతాను, నేనే అంతులేని సముదార్నన్ని, ఈ

పర్పంచాలనీన్ నా తీరం మీద ఇసుకరేణువులనీ.

ఒక మనిషి నీవెవరు అని అడిగినపుప్డు.. నేను అవాకక్యాయ్ను.

దేవుని సృషిట్ మొదటి ఊహ దేవదూత.

దేవుని మొదటి పలుకు మనిషి.

మనమంతా, వేలాది ఏళుల్గా, సముదర్ం, గాలీ, అడవి మనకు మాటలు

నేరప్క ముందు కోరికలునన్ జీవాలం

 [3] ఇ క- రగ 
ఖ రచన
మనం ఇపుప్డు, మనలోని పాతదనానిన్, నినన్టి మాటలతో ఎటాల్

తెలుపగలం!

సింహిక రాకాసి అనన్ది గదా, ఒకక్ ఇసుకరేణువే ఎడారి,

ఎడారి అంటే ఒకక్ ఇసుకరేణువు మాతర్మే, ఇపుప్డు మనం మళాల్

మౌనంగా ఉందాం అని అనడంనేను వినాన్, కానీ అరథ్ంకాలేదు.

నిశశ్బద్ంగా, కాలం గతి తెలియకుండా ఈజిపుట్ దుముమ్లో యుగాలుగా

ఉనాన్ను, అపుప్డు సూరుయ్డునాకు జనమ్నిచాచ్డు,

పగలు పాడుతూ, రాతుర్లు కలలుగంటూ నేను

నైలు గటల్మీద నడకసాగించాను

మళీల్ ఈజిపుట్ దుముమ్లో పడుకోబెటాట్లని సూరుయ్డు ననున్

చుటుట్కుంటాడు.

కానీ వింతను గమనించండి..

ననున్ ఒకటిచేసిన సూరుయ్డు ననున్ చెదరగొటట్లేడు.

నేనింకా నిటారుగా నిలుచునాన్ను, నైలు గటల్మీద ధీమాగా నడుసుత్నాన్

 [4] ఇ క- రగ 
ఖ రచన
గురుత్ండడమంటే మరో కలయిక

గురుత్ండకపోవడం సవ్తంతార్నికి మరో రూపం.

మనం కాలానిన్ అంతులేని సూరయ్కదలికలను బటిట్ లెకక్గడతాం

వాళుల్మాతర్ం కాలానిన్ వాళల్ చినిన్ జేబులోల్ ఉనన్ ఒక చినిన్యంతర్ంతో

కొలుసాత్రు. అలాంటపుప్డు..మనం ఒకేచోట, ఒకే సమయానికి కలవడం

ఎలా వీలవుతుంది

పాలపుంత కిటికీలోంచి గమనించే వారికి, అంతరిక్షం భూమికి

సూరుయ్నికీ నడుమ శూనయ్ం కాదు.

మానవత అనంతానంతంనుంచి అనంతానికి పర్వహించే నది.

పైన తిరుగాడే ఆతమ్లు మనిషి బాధను చూచి బాధ పడవూ!

పవితర్ నగరానికి దారిలో మరో పర్యాణికుణిన్ కలిసి నేనడిగానూ,

పవితర్ నగరానికి అసలు దారి ఇదేనా అని

 [5] ఇ క- రగ 
ఖ రచన
నావెంటే నడు ఓ రోజులో పవితర్నగరం చేరుకుంటావు అనాన్డతను.

నేను అతనివెంటే నడిచాను. మేం ఎనోన్ రాతుర్లు ఎనోన్ పగళుల్

నడిచాము, కానీ పవితర్నగరం చేరనే లేదు.

ఆశచ్రయ్ం! ననున్ దారి తపిప్ంచినందుకు అతనికి నా మీద కోపం

వచిచ్ంది.

ఓ దేవుడా ననున్ సింహానికి ఎరగా చెయియ్. ..

కుందేటిని నాకు ఎరగా చెయియ్.

రాతిర్ బాటన నడిచి తపప్ ఉషసుస్ను చేరడానికి వీలులేదు.

నా ఇలుల్ నాతో వదలొదద్ంటుంది నా గతమంతా ఇకక్డే ఉంది.

నా వెంటరా, ముందునన్ది నేనే, అంటుంది రహదారి నాతో.

ఇంటికీ రహదారికీ కలిపి చెపుతాను. నాకు గతం లేదు, భవిత లేదు. నే

ఉండిపోతే నా నిలకడలో ఒక పోవడముంది. నేను బయలుదేరితే నా

నడకలో నిలకడ ఉంది. పేర్మ, మరణం మాతర్మే దేనినైనా

మారుచ్తాయి

 [6] ఇ క- రగ 
ఖ రచన
హంసతూలికల పై పవళించిన వారి కలలు నేల మీద పడుకునన్వారి

కలలకనాన్ గొపప్వి కానపుప్డు, నేను జీవన నాయ్యం మీద నమమ్కానిన్

ఎలా వదులుకుంటాను. ఆనందాలకై నా తపన, నా దుఃఖానిన్

పంచుకుంటుంది చితర్ంగా.

నేను నా ఆతమ్ను ఏడుమారుల్ మభయ్పెటాట్ను

మొదటిసారి, అది ఎదుగుతుందనుకుని వినయంతో ఉంటే.

రెండవసారి, అది అవిటి ముందు కుంటుతుంటే

మూడోసారి, అది కషట్ సుఖాల ఎంపికలో సుఖం వేపు మొగిగ్నందుకు.

నాలుగోసారి, చేసిన తపుప్ను కపిప్పుచేచ్ందుకు అందరూ తపుప్చేసే

వారేనని, తిరగబడడ్పుప్డు

అయిదవసారి, అది బలహీనతకు తలవంచి, ఇంత ఓపిక బలం వలల్

వచిచ్ందనన్ందుకు.

ఆరవసారి, అది తన ముసుగే తెలియక ఒక వికారతావ్నిన్

చీదరించుకునన్ందుకు.

ఏడవసారి, అది సుత్తిగీతం పాడి అదొక గొపప్గా భావించినపుప్డు

 [7] ఇ క- రగ 
ఖ రచన

నాకు పరిపూరణ్ సతయ్ం ఏమిటో తెలియదు కానీ నా అజాఞ్నం ముందు

తల వంచుతాను. అందులోనే నా గౌరవమూ, బహుమానమూ

ఉనాన్యి.

మనిషి అనుకునన్దానికీ అందుకునన్దానికీ మధయ్ ఖాళీ . ఆ ఖాళీని

దాటడం కోరికతోనే సాధయ్ం.

సవ్రగ్ం, పకక్గదిలో ఆ తలుపు ఆవలే.

కానీ నేను తాళంచెవి పోగొటుట్కునాన్ను.

బహుశ పొరపాటున ఎకక్డో పెటిట్నటుట్నాన్ను.

నీవు గుడిడ్. మరి నేను చెవిటి, మూగ. మన చేతులతో ఒకరినొకరం

తెలుసుకుందాం.

మనిషి ఏం సాధించాడనన్ది ముఖయ్ంకాదు. ఏం

సాధించాలనుకునాన్డనన్దే పర్ధానం.

 [8] ఇ క- రగ 
ఖ రచన
మనలో కొందరం సిరాలాంటి వాళల్ం. కొందరం కాగితాలం

మనలో కొందరికి ఆ నలుపే లేకుంటే మిగిలినవారు మూగవాళుల్గా

మిగిలేవారు.

మనలో కొందరి తెలల్దనమే లేకుంటే కొందరు గుడిడ్వాళుల్గా మిగిలేవారు.

నాకొక చెవినివవ్ండి. నేను మీకొక మాటనిసాత్ను.

మన మెదడు సాప్ంజి-పీలుసుత్ంది. మన మనసు ఏరు- పర్వహిసుత్ంది.

మనలో చాలా మంది పాలకై వెతుకులాడేవారే, పరుగెతత్డం

ఇషట్పడకపోవడం చితర్ం కదూ.

తెలియని ఆశీసుస్ల కొరకు నీవు తపన పడుతునాన్వంటే, .. తెలియని

కారణంగా దుఖంలో మునుగుతునాన్వంటే,

సహజంగా పెరిగేవాటితో నీవూ పెరుగుతునన్టుల్, నీ ఆతమ్ ఉనన్తి

చెందుతునన్టుట్

 [9] ఇ క- రగ 
ఖ రచన
ఓ ఆలోచనతో తాగినవాడు తన చేషట్ల తపొప్పుప్లను మందుకు

ఆపాదిసాత్డు

మతుత్ కలగాలని మదిరపుచుచ్కుంటావు నువువ్. నేను మాతర్ం మరో

మదిరపానపు మతుత్ దిగాలని తాగుతాను..

నా చషకం అడుగంటితే, ఆ ఖాళీని నేను అంగీకరిసాత్ను. అది సగం

నిండి ఉనన్పుప్డు మాతర్ం ఆ ఖాళీని ఆకేష్పిసాత్ను

ఎదుటి మనిషి నీతో పంచుకునన్వే అతని వాసత్వాలు కావు. అతను

చెపప్లేని వాటిలో వాసత్వం దాగి ఉంది.

అందుకే, అతడిని అరథ్ం చేసుకోగలిగితే, అతను చెపేప్ మాటలు కాక

చెపప్నిదేదో విను.

నేను చెపేప్ మాటలోల్ సగం వాటికి అరథ్ంలేదు. అయినా చెపుతా. మిగతా

సగం మీకందాలని.

హాసయ్ చతురత గలగడమంటే, అనిన్ విషయాలలో చతురుడవవ్డమే

 [10] ఇ క- రగ 
ఖ రచన
తోటివారు నా మాటకారితనపు తపుప్లను పొగిడి, నా మౌనంలో

మంచిని తెగడినపుప్డే నా ఒంటరితనం మొదలయింది.

తన మనసుపాట పాడే పాటగాడు దొరకకపోతే, జీవితం, తన మెదడును

విపిప్చెపేప్ తాతివ్కుడిని తయారు చేసుత్ంది.

ఏది సతయ్మోతెలిసి ఉండాలి. సందరభ్ం వచిచ్నపుప్డే పలకాలి.

మనలోని అసలు సతయ్ం మౌనంగా ఉంటుంది. అరువు తెచుచ్కునన్దేదో

మాటాల్డుతుంది.

నాలోని గొంతుక నీ జీవితం చెవి దాకా చేరదు. అయినా ఒంటరితనం

ఉండగూడదు గనుక మనం మాటాల్డుదాం.

ఇదద్రాడవాళుల్ మాటాల్డుకుంటే అందులో ఏమీ ఉండదు. ఒకక్ మనిషి

మాటాల్డితే, ఆమె జీవితానన్ంతా విపిప్చెపుతుంది.

కపప్లు ఎదుద్లకనాన్ గటిట్గా అరవగలుగుతాయేమో, అవిపొలం

దునన్లేవు, గానుగ తిపప్లేవు, వాటి చరమ్ంతో చెపుప్లు తయారవవ్వు

 [11] ఇ క- రగ 
ఖ రచన
మూగవాళుల్ మాతర్మే, మాటాల్డే వాళల్ను చూచి అసూయ పడతారు.

వసంతం నా మనసులో ఉందని చలికాలం చెపితే, దానెన్వరు

నముమ్తారు

పర్తి వితత్నమూ ఒక వాంఛ.

నీవు కళుల్విపిప్ చూడగలిగితే, అనిన్ంటా నీరూపానిన్ చూడగలగాలి.

నీవు చెవులు విపిప్ వినగలిగితే, అనిన్ గొంతుకలోల్ నీ గొంతుకనే

వినగలగాలి.

సతయ్ం తెలుసుకోవడానికి ఇదద్రు అవసరం. ఒకరు సతయ్ం పలకడానికి,

మరొకరం దానిన్ అరథ్ం చేసుకోవడానికి.

నిరంతరాయంగా మాటల తరంగాలు మనతో ఉనాన్, మన

అంతరంగాలు ఎపుప్డూ మౌనంగానే ఉంటాయి.

చాలా సిదాధ్ంతాలు కిటికీ అదద్ంలాంటివి. అందులోనుంచి మనం సతయ్ం

చూడగలుగుతాం. అయినా దానున్ంచి మనలనది వేరు చేసుత్ంది.

ఇపుప్డు మనం దాగుడు మూతలాడదాం. నీవు నా మనసులో దాగుంటే

తెలుసుకోవడం కషట్ం కాదు. కానీ . ఒక సతరీ తన ముఖానిన్ చిరునవువ్తో

కపుప్కునన్టుట్.. నీవు నీలోనే దాగుంటే, ఎవరయినా నీ గురించి

 [12] ఇ క- రగ 
ఖ రచన
పర్యతిన్ంచడం దండగ

బాధాతపత్ హృదయం ఆనంద హృదయంతో కలిసి పాడగలిగితే, అదెంత

గొపప్!.

ఒక సతరీని అరథ్ం చేసుకో గలిగినా, మేధను ఛేదించ గలిగినా,

నిశస్బద్రహసాయ్నిన్ విపిప్చెపప్గలిగినా ఆ మనిషి అందమయిన కలనుండి

లేచి హాయిగా ఫలహారం తింటునన్టేట్

నేను నడిచే అందరితో కలిసి నడుసాత్ను. నడిచే ఊరేగింపును ఊరికే

చూసూత్ నిలబడలేను.

నీకు సేవలందించిన వానికి బంగారం కనాన్ ఎకుక్వే బాకీ పడిపోతావు.

అతనికి నీ మనసయినా ఇవువ్, లేదంటే అతని సేవ చెయియ్.

మన బతుకు దండగ కాదు. మన ఎముకలతో బురుజులు కటట్లేదా!

మనమేదీ అంతగా పటిట్ంచుకోగూడదు. కవి మనసు తేలు తోక ఒకే

మటిట్నుంచి గొపప్గా పుటిట్నవి మరి.

డార్గన సెయింట జారజ్ ను పుటిట్ంచుకునన్టుట్ మృగం తనను చంపే

వాడిని తానే పుటిట్ంచుకుంటుంది..

భూమి ఆకాశం మీద రాసే కవితలే చెటుల్. మనం వాటిని పడగొటిట్

 [13] ఇ క- రగ 
ఖ రచన
కాయితం తయారు చేసుకుంటాం. మన ఖాళీలు పూరించుకుంటాం

రాయాలనిపిసేత్ (ఎందుకు రాయాలో పెదెద్లెరుగు) నీకు విజాఞ్నం, కళ,

సంగీతం తెలిసి ఉండాలి. మాటలలోని సంగీతం, కళ లేకుండా

ఉండడమనే కళ, నీ చదువరులను పేర్మించడమనే ఇందర్జాలం నీకు

తెలిసి ఉండాలి.

వారు తమ కలానిన్ మన మనసులోల్ ముంచి, పేర్రణ

పొందామనుకుంటారు.

ఒక చెటుట్ గనుక తన ఆతమ్కథ రాయగలిగితే, అది ఒక జాతి చరితర్

కనాన్ వేరుగా ఉండదు.

కవిత రాయడంలో ఉనన్ శకిత్, రాయబడని కవితలోని తాదాతమ్య్త ఏది

ఎంచుకుంటావంటే నేను రెండోదే కావాలంటాను. ఆదే మంచి కవిత.

కానీ నీవూ నా పకక్నుండే వాళల్ందరూ, నా ఎంపిక బాగుండదని

ఒపుప్కుంటారు.

కవితంటే భావాల పర్కటన కాదు. అది రకత్ం కారే గాయం నుంచి,

 [14] ఇ క- రగ 
ఖ రచన
లేదంటే నవేవ్ నోటినుంచి పుటేట్ పాట.

మాటలు సరవ్కాలాలవి వాటి శాశవ్తతతవ్ం గమనించి వాడుకోవాలి.

కవి రాజయ్ంకోలోప్యిన రాజు. అతను ఆ భసమ్ంలో కూచుని,

అందులోనుంచి ఒక రూపం సిదధ్ం చేయాలని పర్యతిన్సుత్ంటాడు.

కవితవ్ం సంతోషం, బాధ, ఆశచ్రాయ్ల కలగలుపు. కొంచెం నిఘంటువు

కూడా ఉంటుందందులో.

వయ్ధలో తన హృదయగీతాల తలిల్ని కవి ఆశర్యిసాత్డు.

నీవు చచేచ్దాకా నీ విలువ మాకు తెలియదు – అనాన్ను నేనొక కవితో.

అతననాన్డుగదా – అవును, మరణం అనిన్ంటినీ బయట పెడుతుంది.

నిజంగా నీకు నా విలువ తెలిసేత్, నా నాలుక మీదకనాన్ మనసులో, నా

చేతిలో కనాన్ కోరికలో ఎకుక్వ సంగతి ఉందని అరథ్ం చేసుకో.

ఎడారిలాంటి మనసులో నీవు అందం గురించి ఒంటరిగా గానం చేయి,

అయినపప్టికీ నీకు శోర్తలుంటారు.

కవితంటే మనసును మంతిర్ంచే ఎరుక.

తెలివంటే మనసు గానం చేసే కవితవ్ం.

 [15] ఇ క- రగ 
ఖ రచన
మనం గనుక మనిషి మనసుకు ఆనందం కలిగిసూత్, అదే సమయంలో

అతని గీతాలు పాడగలిగితే,

వాసత్వంగా అతను దేవుని నీడలో జీవిసాత్డు.

పేర్రణ ఏనాడూ వివరించదు. అది గానం చేసుత్ంది

మనం పిలల్లకు జోలపాటలు పాడతాం కానీ మనమే నిదర్ పోతాం

మాటలంటే మనసు విందులోంచి జారి పడే శకలం

కవితకు ఆలోచన రాయిలా అడుడ్ తగులుతుంది.

నిశశ్బాద్లను పాడ గలిగిన వాడే గొపప్ గాయకుడు.

నోటినిండా తిండి ఉంటే పాట ఎలా పాడగలవు?

చేతినిండా ధనముంటే, ఆశీరవ్దించడం ఎలా కుదురుతుంది?

నైటింగేల పకిష్ పేర్మ పాట పాడే ముందు తన ఎదను ములుల్తో

గుచుచ్కుంటుందంటారు. మనమూ అంతే. లేకుంటే పాట ఎటాల్

తెలివంటే, నెమమ్దిగా వచేచ్ వసంతానికి ముందు పిటట్ పాట తపప్ మరోటి

కాదు.

రెకక్లదేవతయినా అవసరాలనుండి తపిప్ంచుకోలేదు.

 [16] ఇ క- రగ 
ఖ రచన
ఒక పిచిచ్ మనిషి మనకంటే తకుక్వ విదావ్ంసుడేమీ కాదు. అతని

వాయిదయ్ం కొంచెం శృతి తపిప్ ఉంటుందంతే.

తలిల్ మనసులో నిశశ్బద్ంగా ఉండే గీతం, బిడడ్ పెదవుల మీద

పలుకుతుంది.

ఏ కోరికా తీరకుండా మిగిలి పోదు.

నేను నా వయ్కిత్తవ్పు మరో పారశ్ం అభిపార్యాలతో ఏనాడూ పూరిత్గా

అంగీకరించలేదు. అసలు నిజం ఆ ఇదద్రి నడుమనే ఉంటుంది.

నీ మరో పారశ్వ్ం నినున్ చూచి ఎపుప్డూ బాధ పడుతుంది. కానీ దుఃఖమే

దానికి బలం. కనుక పరవాలేదు.

ఎవరి ఆతమ్లు నిదురించి ఉనాన్యో, ఎవరి శరీరాలు శృతి తపిప్

ఉనాన్యో, ఆతమ్కు శరీరానికి మధయ్ ఘరష్ణ లేదు. వారి మెదళల్లోనే

యుదధ్ం,

నీవు జీవిత హృదయంలోకి చేరుకునన్పుప్డు, అనిన్ంటిలోనూ అందానిన్

చూడలేని ఆకళల్లో సైతం అందానిన్ చూడగలుగుతావు

మనం అందానిన్ కనుగొనడానికే బతికి ఉంటాం. మిగతాదంతా

ఓలాంటి నిరీక్షణ.

 [17] ఇ క- రగ 
ఖ రచన
ఒక వితత్నం నాటితే, భూమి నీకొక పువువ్నిసుత్ంది.

ఆకాశమంత ఎతుత్ కలలు గను,

నీకు ఆతీమ్యమైనది అందుతుంది

నీవు పుటిట్నపుప్డే దెయయ్ం వదిలిపోయింది

ఇపుప్డు నీవు దేవదూతను కలవడానికి నరకం దావ్రా నడవనవసరం

లేదు.

చాలా మంది ఆడవాళుల్ మగవారి మనసులను అరువు తీసుకుంటారు.

కొందరు మాతర్మే దానిన్ సవ్ంతం చేసుకో గలరు.

నీకు సవ్ంతమయిన దానిన్ నీది అనగూడదు.

ఒక పురుషుని చెయియ్ ఒక సతరీ చేతిని తాకితే, వారిదద్రూ ఆదయ్ంత

రహితమైన హృదయానిన్ అందుకుంటారు.

పేర్మ ఇదద్రు పేర్మికుల మధయ్నుండే తెర

పర్తి మనిషి ఇదద్రాడవాళల్ను పేర్మిసాత్డు. ఒకరు అతని ఊహలో

పుడతారు, మరొకరు ఇంకా పుటిట్ ఉండరు.

ఆడవాళల్ పొరపాటల్ను క్షమించలేని మగవారు, వారి గొపప్ గుణాలను

 [18] ఇ క- రగ 
ఖ రచన
గురిత్ంచలేరు.

పర్తి నితయ్ం పునరుదద్రించుకోలేని పేర్మ అలవాటు అవుతుంది. ఆపై

బానిసతవ్ంగా మారుతుంది.

పేర్మికులు తమ మధయ్న ఉనన్ మరి దేనోన్ కౌగిలించుకుంటారు తపప్

ఒకరినొకరు కాదు.

పేర్మకూ అనుమానానికీ నడుమ ఏనాడూ మాటలుండవు

పేర్మ అనన్ది కాంతి భాష. అది కాంతి అనే పుట మీద కాంతి అనే చేతితో

వార్యబడుతుంది.

సేన్హం సదా ఒక తీయని బాధయ్త, అది ఎపుప్డూ అవకాశం అవవ్దు.

నీవు నీ సేన్హితుడిని అనిన్ పరిసిథ్తులలోనూ అరథ్ం చేసుకోగలగాలి,

లేకుంటే ఎపప్డూఅరథ్ం చేసుకోలేవు.

నీ దుసుత్లోల్ అనిన్టికనాన్ వెలుగుతుండేది మరొక మనిషి నేసినదే.

నీ అనిన్టికనాన్ రుచిగల భోజనం మరొకరి బలల్ మీద తినన్దే.

నీవు అనిన్టికనాన్ సుఖంగా పడుకునన్ పడక మరొకరి ఇంటిలోది.

 [19] ఇ క- రగ 
ఖ రచన
ఇపుప్డు చెపుప్, మరి నినున్ నీవు ఆ మరొక మనిషి నుంచి ఎలా వేరు

చేసుకుంటావు?

నీ మెదడూ, నా మనసూ ఎపుప్డూ ఏకాభిపార్యానికి రావు, నీ మెదడు

అంకెలోల్, నా మనసు మసకలో బతకడం మానితే తపప్.

భాషను మనం ఏడు మాటలకు కుదించితే తపప్ మనం ఒకరినొకరు

అరథ్ం చేసుకోలేము. నా హృదయానిన్ పగలగొటట్కుండా దాని

తెరవడమెటాల్?

కేవలం గొపప్ దుఃఖం, గొపప్ సంతోషం మాతర్మే నీలోని సతాయ్నిన్

బయటపెటట్గలవు.

నీవు బయట పడాలంటే, నీవు ఎండలో దిసమొలతో చిందులేయాలి.

లేదా శిలువ మోయాలి.

సంతృపిత్ గురించి మనమంటుండే మాటలను పర్కృతి పటిట్ంచుకుని

ఉంటే, నదులేవీ సముదార్నికి తరలవు, చలికాలం వసంతంగా మారదు

మనం పొదుపు గురించి అనే మాటలను అది పటిట్ంచుకుని ఉంటే, ఈ

గాలిని మనలో ఎందరు పీలచ్గలిగేవారు?

 [20] ఇ క- రగ 
ఖ రచన
నీవు సూరుయ్నికి వెనున్ చూపితే, చూడగలిగేది నీ నీడను మాతర్మే!

నీవు ఆనాటి సూరుయ్డు రాకముందు సేవ్చాఛ్జీవివి, ఆ రాతిర్ నక్షతార్లు

రాకముందు కూడా.

సూరుయ్డూ, చందుర్డూ, నక్షతార్లు లేనపుప్డూ . ఉనన్దంతా పటిట్ంచుకోక

కళుల్ మూసుకునాన్ అంతే.

అయితే, నీవు ఎవరినయితే పేర్మిసాత్వో అతనికి మాతర్ం బానిసవు,

ఎందుకంటే నీవు అతనిని పేర్మిసాత్వు గనుక!

నినున్ పేర్మించేవానికి నీవు బానిసవే, ఎందుకంటే అతను నినున్

పేర్మిసాత్డు గనుక!

మనమంతా గుడి ముందు బిచచ్గాళల్ం, రాజు గుడికి వచిచ్నపుప్డు అతని

సంపదలో మనమన వంతు మనకు అందుతుంది. అతను బయటికి

వెళిల్నపుప్డూ అంతే .అయితే మనకు ఒకరి మీద మరొకరికి అసూయ.

అది రాజును చినన్బుచచ్డానికి మరో మారగ్ం.

 [21] ఇ క- రగ 
ఖ రచన
నీ ఆకలికి మించి నీవు తినలేవు. రొటెట్లో మిగిలినసగం, మరో మనిషికి

చెందుతుంది. అనుకోకుండా వచేచ్ అతిథికీ కొంత మిగిలిఉండాలి మరి.

అతిథులొసుత్నాన్రు గనుక సరిపోయింది, లేకుంటే ఇళల్నీన్ సమ్శానాల

సాటి.

దయగల తోడేలు గొఱెఱ్తో అనన్ది గదా, “మా ఇంటిని పావనం

చెయయ్రాదా?” అని,

గొఱెఱ్ జవాబిచిచ్ంది గదా, “నీ ఇలుల్ నీ కడుపులో గాక మరో చోట ఉండి

ఉంటే తపప్క వచేచ్ పనే!” అని

అతిథిని కడప వదేద్ ఆపి అనాన్ను గదా, “అయాయ్! మీరు లోనికి

వచేచ్టపుప్డు కాదు, బయటికి వెళేల్పుప్డు కాళుల్ తుడుచుకోండి!” అని

దాతృతవ్మంటే, నీకనాన్ నాకెకుక్వ అవసరమయిన దానిన్ ఇవవ్డం

కాదు. నాకనాన్ నీకెకుక్వ అవసరమయిన దానిన్ నాకు ఇచేచ్యడం

అసలు దానం

దానం చేసుత్నన్పుప్డు నువువ్ నిజంగా గొపప్వాడివే. కానీ దానం

అందుకుంటునన్ వారి లోని సిగుగ్ను గమనించకుండా ముఖం తిపుప్కో.

ధనికునికీ, పేదకూ తేడా, ఒకరికిఆకలిగొనన్ ఒక దినం,మరొకరికి

 [22] ఇ క- రగ 
ఖ రచన
దపిప్గొనన్ ఒక గంట మాతర్మే.

నినన్నుండి చేసిన అపుప్లను తీరచ్డానికి మనం తరుచుగా రేపటి దగగ్ర

అపుప్ తెచుచ్కుంటాం.

నా దగగ్రికి కూడా దేవతలూ రకక్సులూ వసాత్రు. నేను వాళల్ను

వదిలించుకుంటాను.

దేవత వసేత్ పాత పార్రథ్న పాడతాను. అతనికి విసుగు పుడుతుంది.

రకక్సి వసేత్ ఒక పాత తపుప్ చేసాత్ను. అతనే ననున్ తపిప్ంచుకుపోతాడు.

ఈ లోకం జైలు అంత చెడడ్దేం కాదు. కానీ నా గదికీ పకక్ ఖైదీ గదికీ

మధయ్నునన్ గోడ మాతర్ం నాకు నచచ్దు. అయినా అధికారినీ భవనం

కటిట్న వారినీ కారణం అడగను

చేప అడిగితే పామునిచేచ్ వారి దగగ్ర పాము తపప్ మరేమీ లేకపోవచుచ్.

అది వారి పకాష్న దాతృతవ్మే అవుతుంది.

కిటుకులు కొంత కాలం పని చేసాత్యి. తరువాత తమని తాము అంతం

చేసుకుంటాయి

రకత్ం కళళ్జూడని హంతకులనూ, దొంగతనం చేయని దొంగలనూ,

 [23] ఇ క- రగ 
ఖ రచన
అబదధ్మాడని అసతయ్వాదులనూ క్షమిసుత్నాన్వంటే, నీవు నిజంగా

క్షమాగుణం గలవాడివి.

మంచిని చెడు నుంచి వేరు చేసే దానిని పటిట్ంచుకునన్వాడే, దేవుని వసత్రపు

అంచును తగలగలిగిన వాడు.

నీ మనసు అగిన్పరవ్తమయితే, మరి నీ చేతిలో పూలు విచుచ్కుంటాయి

ఇది ఒక వింత ఆతమ్ పర్భావం. నా పటల్ తపుప్లు మోసాలు జరిగిన

సందరాభ్లునాన్యి. ఆ సంగతి నాకు తెలియదనుకునే వారిని చూచి నేను

నవువ్కుంటాను.

అతను వెంటబడుతునన్వాడు, వెంట ఎవరో పడుతునన్టుట్ నటిసాత్డు.

అతని గురించి ఏమంటాను!

తన మటిట్ చేతులను నీ గుడడ్కు తుడిచిన వాడిని ఆ గుడడ్ను తీసుకెళల్నీ.

ఆతనికి తిరిగి అవసరం పడొచుచ్. నీకు మాతర్ం దాని అవసరం రాదు.

డబుబ్లతో వాయ్పారం చేసేవారు మంచి తోటలను

పెంచలేకపోవడం,సహజం.

సహజంగా ఉనన్ లోపాలను, నేరిచ్న మంచితో రంగరించాలని

 [24] ఇ క- రగ 
ఖ రచన
యతిన్ంచకు. నా తపుప్లను నేనే దాచుకుంటాను. అవి నా సవ్ంతం కదా.

నేను చేయని నేరాలను నేనెనిన్ సారుల్ ఒపుప్కోలేదు. ఆ మరో మనిషి మరి

నాముందు హాయిగా ఉండేందుకు.

జీవితం ముసుగులు కూడా, లోతయిన రహసాయ్ల ముసుగులే.

నీ తెలివి ఆధారంగా నీవు ఇతరులను అంచనా వేసాత్వు. ఇపుప్డు చెపుప్

మరి, మనలో దోషులెవరు, నిరోద్షులెవరు

నీ పొరపాటల్కు సగం తాను బాధపడే మనిషి నిజంగా సనామ్రిగ్.

పిచిచ్వాడు, మేధావి మాతర్మే చటాట్లను ఉలల్ంఘిసాత్రు. వారు దేవునికి

దగగ్రివారు మరి.

నీ వెంట ఎవరేనా పడితేగాని, నీవు వేగం అందుకోవు.

దైవమా, నాకే శతృవు తలిగితే, అతని శకిత్ నాతో సమంగా ఉండనీ. ఒకక్

నిజం మాతర్మే గెలుసుత్ంది.

ఇదద్రూ చచిచ్న తరావ్త నీవు, నీ శతృవుతో సఖయ్ంగా ఉంటావు.

బహుశః ఒక మనిషి ఆతమ్హతయ్కు పాలప్డేది తనని తాను

 [25] ఇ క- రగ 
ఖ రచన
రకిష్ంచుకోడానికే

పేర్మిసూత్, పేర్మ పాతుర్డయినందున ఏనాడో ఒకతనిన్

శిలువనెకిక్ంచారు.

చెపితే చితర్ంగా ఉంటుంది గాని నేనతడిని నినన్ మూడు మారుల్

కలిశాను.

మొదటి సారి అతను ఒక వేశయ్ను జైలు పాలు చేయ వదద్ని పోలీసును

అడుగుతునాన్డు. రెండవసారి అతను సంఘం వెలివేసిన వయ్కిత్తో బాటు

మదయ్ం తాగుతునాన్డు. .. మూడవసారి అతను మందిరంలో పూజారితో

ముషిఠ్యుదధ్ం చేసుత్నాన్డు.

మంచిచెడులను గురింటి అందరూ చెపేప్ది నిజమయితే, నా బతుకు ఒక

సుదీరఘ్మయిన నేరం.

దయ అంటే సగం నాయ్యం మాతర్మే

నా పటల్ అనాయ్యంగా ఉనన్ వాడెవరంటే, నా వలల్ నషట్పోయిన వాని

తోడపుటిట్నవాడే

 [26] ఇ క- రగ 
ఖ రచన
బందిఖానాకు వెడుతునన్ మనిషి కనబడితే, బహుశః అతనంతకనాన్

ఇరుకయిన జైలునుంచి తపిప్ంచుకుంటునాన్డేమో ననుకో.

ఒక తాగి తూలుతునన్ మనిషి కనబడితే, బహుశః అంతకనాన్

వికారమయిన పరిసిథ్తి నుంచి తపిప్ంచుకుంటునాన్డేమో ననుకో.

ననున్ నేను కాపాడుకోవడం తరుచుగా నాకిషట్ముండదు. కానీ నేనింకా

బలవంతుణిణ్ అయుయ్ంటే అలాంటి ఆయుధం వాడి ఉండే వాడిని కాదు.

పెదాల మీది చిరునవువ్తో కంటోల్ని ఏవగింపును కపిప్పుచాచ్లనుకునే

వాడు, ఎంతటి మూరుఖ్డై ఉండాలి. .

నాకంటే కింద ఉనన్వాళేల్ ననున్ చూచి అసూయ పడతారు,

ఏవగించుకుంటారు.

నాకెపుప్డూ అలాంటి పరిసిథ్తి ఎదురు రాలేదు. నేనెవరికీ పైన లేను.

నాకనాన్పైన ఉనన్వాళేల్ ననున్ పొగడగలరు, తెగడనూగలరు.

ననున్ పొగడిన వారు లేరు, చినన్బుచిచ్న వారు లేరు. నేనెవరికీ దిగువన

లేను.

 [27] ఇ క- రగ 
ఖ రచన
నేను నినున్ అరథ్ం చేసుకోలేనని నీవు నాతో అనడం, నా విలువకు

మించినమాట, నీకు తగని అవమానం.

జీవితం నాకు బంగారానిన్సేత్, నేను నీకు వెండినిచిచ్, ఎంతో ఉదారుడిని

అని నేననుకుంటే, నేనెంతటి అలుప్డిన్!

నీ జీవితావగాహన మనసును చేరినపుప్డు, నీకు నీవు అపరాధికనన్

గొపప్కాదని, పర్వకత్కనన్ తకుక్వ కాదని తెలుసుత్ంది.

మందబుదిధ్ ని గాక మందగమనానిన్, మనసుగుడిడ్ వారిని గాక గుడిడ్కళల్

నూ, నీవు దయతో చూచావంటే, అది విపరీత నైజం

కుంటివాడు తన ఊతకరర్ను, శతృవు తలమీద కొటిట్ విరగొగ్టుట్కోవడం

తెలివిమాలినపని.

నీ హృదయంలోంచి తీసుకునే బదులు, తన జేబులోంచి ఇచేచ్వాడు,

ఎంత గుడిడ్వాడు

 [28] ఇ క- రగ 
ఖ రచన
జీవితం ఒక ఊరేగింపు. నడవలేనివాడు వేగానికి తూగలేక

తపుప్కుంటాడు.

వేగంగలవాడు, మరీ నెమమ్దిగా కదులుతునన్దని తపుప్కుంటాడు.

పాపం అంటూ ఒకటి ఉంటే, మన పెదద్ల దారిలో వెనకుక్ నడిచీ

కొందరం, ముందుకు కదిలే చినన్వాళల్ను అడద్గించి కొందరం, ఆ పాపం

చేసాత్ం.

చెడడ్వాళల్నుకునన్ వాళల్ందరితోనూ కలిసి ఉండేవాడు, నిజమయిన

మంచివాడు.

మనమందరమూ బందీలమే. కొందరు కిటికీలునన్ గదులోల్ కొందరు

కిటికీలు లేని గదులోల్ ఉనాన్మంతే.

మనం మన ఒపుప్లకనాన్ తపుప్లను మరింత బలంగా

సమరిథ్ంచుకుంటాం

 [29] ఇ క- రగ 
ఖ రచన
మనమందరమూ ఒకరి పాపాలొకరికి చెపుప్కుంటే, ఎవరికీ కొతత్గా

చేసినవి ఏమీ లేవని నవువ్కుంటాం.

మనమందరమూ ఒకరి గొపప్ గుణాలొకరికి చెపుప్కునాన్ అలానే

నవువ్కుంటాము.

మనిషి తన చటాట్లకు అతీతంగాగా నేరం చేయనంత కాలం అతీతుడు.

నేరం చేసేత్ మాతర్ం, ఎవరికీ తకుక్వాకాడు, ఎకుక్వా కాడు.

పర్భుతవ్మంటే నీకూ నాకూ మధయ్ ఒపప్ందం. నీవూ నేనూ ఎపుప్డూ

సరికాదు

నేరమంటే అవసరానికి మరో పేరు, లేదా జబుబ్ లక్షణం.

ఎపుప్డూ ఎదుటి మనిషి తపుప్లను గురిత్ంచ గలగడంకనాన్ గొపప్ తపుప్

ఉందా

ఎదుటి మనిషి నినున్ చూచి నవివ్తే నువువ్ జాలి పడవచుచ్. కానీ నీవూ

అలా నవివ్నటల్యితే నినున్ నీవు ఏనాడూ క్షమించలేవు.

మరో మనిషి నినున్ గాయపరిసేత్, నీవా గాయానిన్ మరచిపోవచుచ్. కానీ

నీవూ అతడిని గాయ పరచావనుకో, ఏనాడూ మరవలేవు.

 [30] ఇ క- రగ 
ఖ రచన
నిజానికి ఎదుటి మనిషంటే, మరో శరీరంలో అతి సునిన్తమయిన నీ

అసిత్తవ్మే.

మనుషులు నీ రెకక్లతో ఎగరాలంటావు కానీ వారికి ఈకలు కూడా

ఇవవ్లేవు! ఎంత లెకక్లేని మనిషివి!!

ఒకపుప్డొక మనిషి నా బలల్ దగగ్ర కూచుని నా రొటెట్ తినాన్డు, నా వైన

తాగాడు, ననున్ చూచి నవువ్తూ వెళిల్పోయాడు.

మళీల్ రొటెట్, మదయ్ం కోసం వసేత్, నేను లేదనాన్ను. అపుప్డు దేవతలు ననున్

చూచి నవావ్రు..

అసహయ్ం మరణసదృశం. మీలో ఎవరు దానికి సమాధి అవుతారు?

హతుడు తాను హంతకుడు కాకపోవడం ఒక గౌరవం.

మానవత పార్తినిధయ్ం పర్శాంత హృదయంలో ఉంటుంది.

మాటకారితనపు మనసులో కాదు

నేను నా రోజులను ధనం కోసం అమమ్డంలేదని పిచిచ్వాడ

నుకుంటునాన్రు. నా రోజులకు వెలకడుతునన్ందుకు నాకు వారు

పిచిచ్వారు అనిపిసుత్నాన్రు.

 [31] ఇ క- రగ 
ఖ రచన
వారు తమ ధన కనక, దంత, కలప సంపదలను పరిచారు, మేము మా

హృదయాలను, ఆతమ్ని సమరిప్ంచాం. తీరా వారు మమమ్లిన్ అతిధులు

వారిని అతిధేయులూ అనుకుంటునాన్రు.

నాకు కలలు కోరికలూ లేని గొపప్వారి కంటే అవి ఉనన్ సామానుయ్డిగా

ఉంటాను

కలలిన్ ధన కనకాలుగా మారుచ్కోవడమే మనుషుల దీనతవ్ం

మనోకామనను శిఖరారోహణ చేయించానుకుంటాం మనమంతా.

మనలిన్ దోచుకునేవాడిమీద జాలిచూపాలి. ఎందుకంటే కొలల్గొటిట్నవనీన్

మోసుకెళళ్డానికి అతడు చాల కషట్పడాలి.

నీ బకక్తనం లోంచి అతని కషాట్నిన్ చూడు, అడుగేయడానికి సాయపడు,

అది నీ చురుకుదనానిన్ పెంచుతుంది.

నీ జాఞ్న పరిధిలోనే ఎదుటివారిని అంచనా వేసాత్ము. అంత

పరిమితమైనదో కదా మన తెలివి!

విజేత పరాజితులకు చేసే ఉపదేశాలు నేను వినను

 [32] ఇ క- రగ 
ఖ రచన
సహనంగా వెటిట్చాకిరీ చేసేవాడే నిజమైన సేవ్చఛ్ గలవాడు

వేలఏళళ్ కింద నా పొరుగువాడు జీవితానిన్ ఏవగించుకునాన్డు, బాధకు

తపప్ ఎందుకూ పనికిరానిదనాన్డు. నినన్ అటు వెళుళ్తుంటే తన సమాధి

మీద జీవితం నాటయ్మాడడం చూశాను. పర్కృతితో జగడం అంటే

అపసవయ్తను సరిచేయడమే.

ఏకాంతం జీవితపు ఎండిన కొమమ్లిన్ విరిచేసే నిశశ్బద్కలోల్లం. అది

మనవేళళ్ను సజీవంగా నేల హృదయ కుహరంలోకి పాతుకునేటుట్

చేసుత్ంది.

ఓసారి ఏరు తో సముదర్ం గురించి మాటాల్డాను, అందులో 13

ఊహాతిశయాలిన్ తెలిపింది. సముదర్ంతో సెలయేరు గురించి

మాటాల్డాను, అవమానకర రీతిన నిందించింది

గొలల్భామ పాట ను మించి పొగిడే చీమ శర్మ సుత్తి ఎంత చినన్ చూపు!

ఒక పర్పంచపు గొపప్ పని మరో లోకపు అలప్కారయ్ం . ఎతుత్పలాల్లు

సరళరేఖలోల్ తారుమారౌవుతాయి. విశాలంగా ఉనన్దే వలయంలో

తిరుగుతుంది

 [33] ఇ క- రగ 
ఖ రచన

ఏదనాన్ ఒకటి మన తూనికలు కొలతలకు అందకపోతే సూరోయ్దయానికి

ముందు మిణుగురులా ఆశచ్రయ్ం లో నిలబడిపోవలసిందే.

ఊహాశాలీనత లేని శాసత్రజుఞ్డు పదును కతుత్లు లేని, పాడైనతూకంగల

కసాయివాడు. ఏం చేసాత్ం అందరం శాకాహారులం కాదే!

నువువ్పాడినపుప్డు ఆకలి కడుపుతో వింటుంది

చావు పెదద్లకి దగగ్రా కాదూ, పిలల్లకి దూరం కాదు, రెండూ జీవితం

కాదు

నైరమ్లయ్ంగా ఉండాలనుకుంటే, అందమైననిరమ్లతావ్నిన్ సాధించు లేదా

నా పొరుగున మరణించేవానికోసమైనా మౌనంగా ఉండు,

మనుషులకు అంతయ్ కరమ్లు దేవతలకు విందు నైవేదాయ్లు.

ఏడువేల పరిసిథ్తులు కారణాల నడుమ ఏరాప్టు చేసిన అంతయ్కిర్యలోల్

ఓ మరచిన వాసత్వం శాశవ్తంగా అంతమౌతుంది. !!!

మనతో మనం నిజం మాటాల్డుకుంటాం. ఒకోక్సారి ఇతరులు వినేటూట్

మాటాల్డతాం

 [34] ఇ క- రగ 
ఖ రచన
ఎవరోచాల సరళంగా చెపేప్వరకూ దానిని గమనించం

పాలపుంత నాలో లేనపుప్డు నేనెలా చూసి తెలుసుకునాన్ను!

వైదుయ్లోల్ వైదుయ్నిగా ఉండనపుప్డు ననొన్క ఖగోళకునిగా ఒపుప్కోరు

ఆలిచ్పప్కు సముదర్ నిరవ్చనం ముతయ్మనుకుంటా.

బొగుగ్కు కాల నిరవ్చనం వజర్మేమో

కీరిత్ అనేది వెలుగులో నిలుచునన్ ఉదేవ్గపు నీడ

చెటుట్ వేళుళ్ కీరిత్ని తృణీకరించిన పూలే

అందానిన్ మించిన ధరమ్ం గానీ శాసత్రం కానీ లేదు

నాకు తెలిసిన పర్తి గొపప్వయ్కిత్ తనలో కొంత అలప్తావ్నిన్ పొంది ఉనాన్డు

అదే అకరమ్ణయ్త, మనో పర్కోపం, ఆతమ్హననం నుంచి కాపాడుతుంది,

ఎవరికీ గురువు కానివాడు, ఎవరూ గురువుగా లేనివాడే ధనుయ్డు

ఒకరు నేరసుత్లీన్ దైవజుఞ్లీన్ చంపడంలో అంతరం పాటించనంతమాతార్న

అతడిని సగటు మనిషి అని అనుకోలేను

 [35] ఇ క- రగ 
ఖ రచన
సహనం గరవ్పు బలహీనతకు లొంగిన పేర్మరోగి

పాములు మెలితిరగడం సహజం, ఏనుగులు మాటవినడమూ

వింతకాదు

అనంగీకారం అనేది రెండు మనసులమధయ్ అతి చినన్ చీలిక

జావ్లనూ ఎండిన పొద నేనే, నా భాగాలే ఒకదానినికటి మింగేసాత్యి.

మనం పవితర్ శిఖరానిన్ అధిరోహించాలనుకుంటాం. గతం

దారశ్నికుడుకాదు దారిగురుత్ అనుకుంటే తేలికగా చేరుకోగలం

జాఞ్నం సాథ్యి నిలబెటుట్కోవాలంటే ఏడవలేనంత గరవ్ంగానూ,

నవవ్లేనంత గంభీరంగానూ, ఇతరులను పటిట్ంచుకోలేనంత సావ్రధ్ం

తోనూ ఉండకూడదు.

నీకు తెలిసినదంతా నాలో నింపేసుకుంటే, నీకు తెలియని దానిన్ నేనెకక్డ

ఉంచాలి?

మాటకారులనుంచి మౌనానిన్, అసమమ్తులనుంచి సహనానిన్,

కూర్రులనుంచి దయను నేరుచ్కునాన్, అయినా ఆ గురువుల పటల్

కృతఘున్డిన్.

 [36] ఇ క- రగ 
ఖ రచన
ఉనామ్ది శిలాసదృశం- ఆకు వకత్

ఓరవ్లేనితనపు మౌనానికి ఘోష ఎకుక్వ

నేను తెలుసుకోవాలిస్న దాని చివరకు చేరుకుంటే, గమనించాలిస్న దాని

మొదలు చేరినటుట్

పదను పోగొటుట్కునన్ సతాయ్నిన్ అతిశయం అంటారు

కాంతి చూపించేదే చూసూత్, శబద్ం వినిప్ంచిందే ఆలకిసుత్ంటే సతయ్ం నీకు

కనపడదు వినపడదు

వాసత్వం నిజం యొకక్ పటిమ

ఏకకాలాన ఆనందంగానూ నిరద్యగానూ ఉండలేం

రాజయ్ం లేని రాజు యాచించలేని పేదవాడు నా మనసుకు దగగ్రివారు

సిగుగ్మాలిన విజయం కనాన్ ఓడి చింతించడం మేలు

రైతునమిమ్నంత నమమ్కంతో తవివ్తే ఈ భూమిని ఎకక్డ తవివ్నా నిధి

దొరుకుతుంది,

 [37] ఇ క- రగ 
ఖ రచన
ఇరవై గురర్పు రౌతులు ఇరవై వేటకుకక్లు తరుముతుంటే తనను

ఎలానూ చంపేసాత్రని తెలిసినా మనుషులెంత అవివేకులో అని నకక్

అనుకుందంట.. ఎందుకంటే 20 నకక్లు 20 గాడిదలెకిక్ 20 తోడేళళ్

సాయంతో ఒక మనిషిని వేటాడడం లాభసాటి కాని పని అని.

మన మెదడు ఆలోచనలతో చటాట్లు తయారవుతాయి కానీ మనో

చైతనయ్ం తో కాదు

నా ఆతమ్చేతనలో కొతత్ పార్ంతాలు కనుగునే యాతికుడిన్ నావికుడిన్

అది ధరమ్యుదద్మైనపుప్డు నా బిడడ్ ఎలా పడిపోయాడని ఓ తలిల్

పర్శిన్ంచింది

మరణం మాటాల్డితే వింటానని నేను జీవితం తో అనాన్ను. ఇపుప్డు

వినైతే.. కాసత్ గొంతెతిత్ జీవితం నాతో అనన్ది

జీవితమరామ్లను అనిన్ంటినీ పరిషక్రిసేత్ ఇక మరణానిన్ కోరుతాం

ఎందుకంటే అది మరో జీవితమరమ్మే కాబటిట్

జననమరణాలు గొపప్ ధైరయ్ నిరవ్చనాలు

 [38] ఇ క- రగ 
ఖ రచన
మితర్మా! నీ ముందు నే అదద్ంలా నిలబడే వరకూ నీ భావన నా భావన

ఒకటే నని నువువ్ చెపేప్మాట నేను వినేంతవరకూ మనకి మనం, మనం

ఇతరులకీ, జీవితానికీ ఎపప్టికీ పరాయిగానే మిగిలిపోతాం.

నీగురించి తెలుసుకుంటే అందరిగురించీ తెలుసుత్ందా అని

వాళళ్డుగుతారు.

అందిఅగురించీ తెలుసుకుంటేనే నా గురించీ తెలుసుత్ందని.. నేనంటాను

మనిషిలో ఇదద్రుంటారు- ఒకడు అజాఞ్నంలో మెలకువగానూ,

మరొకడు జాఞ్నకాంతిలో నిదుద్రలోనూ ఉంటాడు

సనాయ్సి ముకక్లుగా ఉనన్ లోకానిన్ తయ్జించి ఆటంకాలు లేని లోకానిన్

ఆసావ్దిసాత్డు

పండితుడికీ, కవికీ నడుమ ఓ పచచ్ని బయలుంది, పండితుడు దానిన్

దాటితే జాఞ్ని అవుతాడు, కవి అటు దాటితే పర్వకత్ అవుతాడు

నినన్టి సాయంకాలం వేదాంతులు తమ తలలిన్ సంచిలో మోసుకుంటూ

విజాఞ్నం అముమ్తామంటూ అరుసుత్నాన్రు. పాపం వారు హృదయం

కోసం తలలు అముమ్కోవాలిస్ వసుత్ంది. వారిలో ఒకరు వీధులు తుడిచే

 [39] ఇ క- రగ 
ఖ రచన
అతనితో అనాన్డు.. మీ మురికిపని చాల కఠినమైనది అని. జాలి

పడినందుకు ధనయ్వాదాలు చెపిప్ వేదాంతిని అడిగాడు మీరే చేసాత్రు అని.

“మనిషి మనసు చదువుతాం, అతని పనులూ, కోరికలూ” వేదాంతి

సమాధానం. అయోయ్! అనాన్డు అతడు, వారి కఠినమైన పని చాల

మురికిది.

నిజానిన్ వినడం చెపప్డం కనాన్ తకుక్వేం కాదు.

అవసరాలకూ, భోగాలకూ నడుమ గీతను ఎవరు గీయగలరు!

దేవదూతలు తపప్, వారు తెలివైనవారూ, కోరికలలోతు తెలిసినవారు

గగనాల దేవతలంతా మన సదాలోచనలే

విరాగి హృదయ సింహాసనానిన్ అధిషిట్ంచినవాడే ఆసలురాజు

సామరాధ్య్నిన్ మించి ఇవవ్డం దయ అవసరానిన్ మించి తీసుకోకపోవడం

గౌరవం

నిజానికి ఏ ఒకక్రికీ రుణపడి ఉండం. సమాజం అంతటికీ రుణపడి

ఉంటాం

గతం కాలపు సహచరులు మనతోనే నివసిసాత్రు. మనలో ఎవరమూ

 [40] ఇ క- రగ 
ఖ రచన
వారిని వెళళ్గొటేట్ంత నిరద్యులం కాదు

మహతావ్కాంకిష్ ఎకుక్వ కాలం జీవిసాత్డు.

చేతిలో పకిష్ పొదలోని పదింటికనాన్ విలువగలదని వారనాన్రు.

నేననాన్ను- పొదలోనిపకేష్ కాదు, ఈక కూడా పదిరెటుట్ల్ విలువైనది అని

నువువ్ దాని జీవితం లోంచి ఎగరడానిన్ దోచేసుకుంటునాన్వు నిజానికి

అదే దాని జీవితం.

ఈ లోకం అందం, సతయ్ం లో రెండే మూల దర్వాయ్లు, పేర్మికుల

హృదయాలలో పేర్మ, శర్మజీవుల చేతులోల్ సతయ్ం

గొపప్ అందం ననున్ వశం చేసుకుంటుంది, దానిన్ మించిన అందం దాని

నుంచి కూడా విముకుత్డిన్ చేసుత్ంది

సౌందరయ్ం కళళ్తో చూసేవాడిలో కనాన్ హృదయంలో కోరుకునేవాడి

దగగ్రే భాసిసుత్ంది

నేను కలలు పంచుకునన్ వానినీ మనసు పరచిన వానిని గౌరవిసాత్ను.

నాకు సేవచేసేవానిపటల్ బదులు చూపేందుకు నేనెందుకు సిగుగ్పడతాను,

తలవంపులుగా తలుసాత్ను!

భాగయ్శాలురు రాజుల కొలువు గొపప్నుకునేవారు, ఇపుప్డు బీదలిన్

 [41] ఇ క- రగ 
ఖ రచన
సాకడం గౌరవం అంటునాన్రు.

చాలమంది మహానుభావుల ఆహారం సావ్పిన్కుల శేవ్దం నుంచి పుటిట్నదే

అని దేవతలకు తెలుసు

చరురత ఓ ముసుగు, ఆ తెర చించితే మేధావి పర్కోపానిన్ లేదా గారడీ

తెలివిని కంటాం

The understanding attributes to me understanding

and the dull, dullness. I think they are both right.

!!!

హృదయరహసాయ్లునన్వారే హృదయ రహసాయ్లను పంచగలగలరు

నీ ఆనందాలు తపప్ బాధను పంచుకోని వాడికి ఏడు సవ్రగ్దావ్రాలలో ఒక

తాళ చెవి దొరకదు

మోక్షమంటే గొరెర్కు మేత దొరకడం, పాపకు నిదర్, కవికి కవిత

ఆఖరిపాదం

అనుభవం లోకి రాకముందే మనం ఆనందాలనూ విషాదాలనూ

ఎంచుకుంటాం

 [42] ఇ క- రగ 
ఖ రచన
బాధంటే రెండు తోటల మధయ్ దడి

నీ ఆనందం బాధ ఎంత ఎకుక్వైతే, ఈ పర్పంచం అంత చినన్దిగా

కనిపిసుత్ంది

ఆకాంక్ష సగం జీవితం తో సమానమైతే ఉదాశీనత సగం చావు.

ఈనాటి బాధ నినన్టి ఆనందపు జాఞ్పకాల వలల్ అనన్ది చేదు నిజం

ఈరోజు పార్పంచిక సుఖానిన్ లేదా రేపటి పరలోక శాంతిని ఏదైనా ఒకటే

కోరుకోవాలని వారు నాతో అనాన్రు, నేను ఈ లోకపు సుఖానిన్ ఆ పై

శాంతిని రెండూ కావాలనాన్ను, సరోవ్తక్ృషట్కవి నా మనసులో కవిత

రాశాడు. దానిలో పాద విభజన, లయ రెండూ కచిచ్తంగా ఉంటాయి

నమమ్కం అనేది ఆలోచనల బిడారు ఎనన్టికీ దరిచేరని ఏడారి నీటి

చెలమ

నీ గమయ్ం చేరాక, కోరిక కోసమే కోరిక ఉండాలి. ఆకలి కోసమే ఆకలి,

దాహం కోసమే దాహమవావ్లి

నీ రహసాయ్లను గాలికి తెరిచి చెటుట్కి చేరవేసిందని నిందమోపకు

 [43] ఇ క- రగ 
ఖ రచన
వసంతకుసుమాలు దేవతల ఫలహార బలల్పై ఉనన్ శరతాక్ల కలల

కలశానికి చెందినవి

నేను చూడు ఎలా పరిగెడుతునాన్నో, నువేవ్మో నడవలేవు కనీసం

పాకలేవు అని పొగడపువువ్తో ఉడుము అనన్ది. పరుగుల గొపోప్డా మరి

పరిగెతుత్.. జవాబిచిచ్ంది పువువ్

కుందేళళ్ కనాన్ తాబేళేళ్ రహదారుల కథలు చెబుతాయి

వెనెన్ముక లేని జంతువులకు డిపప్లుండడం ఎంత వింత!

గొపప్ మాటకారి అందరికనాన్ తెలివితకుక్వవాడు. వేలంపాడే వాడికీ,

వకత్కీ పెదద్ తేడాలేదు

పేరునన్ తండిర్ కోసమో, డబుబ్నన్ మామకోసమే బర్తకనకక్రలేని తనానికి

సంతోషపడు. అంతకనాన్ ఎకక్వగా నే పేరుకోసమో ధనం కోసమో

ఎవరూ బర్తకనకక్రలేదని తృపిత్పడు.

గారడీ వాడి బంతి చేజారితేనే నేను గమనిసాత్ను

అసూయాపరుడు తెలియకుండానే ననున్ పొగుడుతాడు

తలిల్ నిదర్లో నువోవ్ దీరఘ్ కలవు. ఆమె నిను కనడానికి లేపుతుంది

ఒక జాతి బీజం తలిల్ కోరిక లో ఉంటుంది.

 [44] ఇ క- రగ 
ఖ రచన
అమామ్ నానాన్ బిడడ్ను కోరుకునాన్రు ; ననున్ కనాన్రు. నేను అమామ్

నానన్లిన్ కోరుకునాన్ను, రాతిర్నీ, సముదార్నిన్ కనాన్ను

మన పిలల్లు కొందరు పుటుట్క ఆంతరాయ్లు మరికొందరు పరితాపాలు

రాతిరి కమిమ్తే మనమూ నలల్గానే ఉంటాం. హాయిగా పడుకుని

నలల్దనానిన్ కోరుకో

ఉదయమైనా నువువ్ ఇంకా నలుపే; లేచి రోజుతో సిథ్రంగా చెపుప్-

నేనింకా చీకటిలోనే ఉనాన్నని.. పగలు రాతుర్ళళ్తో ఆటలాడడం

అవివేకం, రెండూ నినున్ చూసి నవువ్తాయి.

మంచు పరవ్తాలను కపుప్తుంది కొండలిన్ కాదు. వరష్ంలో మహా వృక్షం

తడిచినా చెటుట్ ఏడుపును తలపింపజేయదు

ఈ విరోధాభాస చూడు మధయ్భాగం కనాన్ ఎతుత్, లోతులు ఒకదానికి

ఒకటి దగగ్ర

నేనొక అదద్ంలా నీ ముందు నిలిచుంటే నాలోకి సావధానంగా చూశావు,

నేను నీ రూపానిన్ చూశాను పేర్మిసుత్నాన్ను అనాన్వు.

నిజానికి నువువ్ నాలోని నినున్ పేర్మిసుత్నాన్వు

 [45] ఇ క- రగ 
ఖ రచన
పొరుగువాణిన్ పేర్మించడం ఆసావ్దిసుత్ంటే ఆ అలవాటు

సదాచారమవుతుంది.

నిరంతరం మొలకెతత్ని పేర్మ అంతరించిపోతుంది.

యవవ్నం దాని ఎరుక మనిషి ఏక కాలంలో కలుగవు

వయసుకి జాఞ్నంతోబతకాలని తొందర, జాఞ్నానికి బతకాలని ఆతర్ం.

కూరుచ్ని కిటికీలోంచి చూసుత్ంటే నీ కుడివైపు సనాయ్సిని, ఎడమవైపు

వెలయాలి రావడం గమనించొచుచ్

నీ అమాయకతవ్ం ఒకటి ఉచఛ్ం మరొకటి నీచం అనిపించొచుచ్. కాసేపు

కళుళ్ మూసుకుని వినడానికి పర్యతిన్ంచు. ఒకరు ననున్ పార్రధ్నలో

తలచుకుంటారు మరొకరు బాధలో పొందుతారు. ఇదద్రి ఉదేద్శంలోనూ

నాకో మందిరముంటుంది అనన్ మాటలు ఆకాశం లోంచి వినిపించొచుచ్

బాల ఏసు, ఏసు కీర్సుత్ వెయేయ్ళళ్కొకక్సారి లెబనాన కొండలమీద

తోటలో కూరుచ్ని దీరఘ్కాలం సంభాషిసాత్రు, ఇదద్రూ వెటిట్పోయేటపుప్డు

ఇదద్రం ఏనాడూ ఏకాభిపార్యానికి రాలేమని బాలఏసు కీర్సుత్తో

అంటుంటాడు.

అతి సంవృదిధ్ ఉనన్వానిని దేవుడే పోషించాలి

 [46] ఇ క- రగ 
ఖ రచన
గొపప్ మనిషికు రెండు హృదయాలు, ఒకటి సర్విసుత్ంది, ఇంకోటి

సహిసుత్ంది

ఒకవేళ ఒకరెవరో ఎవరినీ నొపిప్ంచనిదైనా సరే అబదధ్ం చెపిప్నపుప్డు.

నీ మదిలో వారి నిజాల ఇలుల్ కనీసం వారి అభిపార్యాలు కూడా

పటట్నంత ఇరుకుగా వునన్దని దానిన్ విశాలం చెయాయ్లిస్న అవసరం

ఎంతైనా ఉందని మదిలోనైనా అనుకోరాదూ!!

పర్తి మూసిన తలుపు వెనుకా ఏడుతాళాలేసిన రహసయ్ం ఉంటుంది

ఎదురుచూపు కాలం తనేన్ కాలి గిటట్లు

ఇంటి తూరుప్ గోడలో సంకటం కొతత్ కిటికీగా అమరితే

సంకటమేముంది!

కలిసి నవువ్కునన్వారిని మరవగలమేమో కలసి ఏడిచ్నవారిని కాదు

ఉపుప్లో ఏదో దైవికమైనది ఉంది, అది మన కనీన్టిలోనూ,

సముదర్ంలోనూ కలిసి ఉంది.

దయాళువైన దైవం కృపా దాహారిత్తో మనలిన్ తాగేసాత్డు, తుషారానిన్,

విషాదానిన్ కలగలిపి

 [47] ఇ క- రగ 
ఖ రచన
నువువ్ నీ విరాట రూపానికి చెందిన చినిన్ శకలానివి, ఆహారంతినే నోరూ

నువేవ్, దాహపు నోటికి పాతర్ను అందించే చేయి నువేవ్.

నువువ్ నీ నేను నుంచి, జాతి నుంచి, దేశానిన్ మించి మూరెడు ఎతుత్

ఎదిగితే దైవతావ్నిన్ పొందుతావు

నేను నువైవ్యుయ్ంటే వెనకిక్ తగిగ్న సముదార్నిన్ చూసి చింతించను

మంచి నౌక, సమరుధ్డైన నావికుడు ఉనన్పుప్డు బాధ అనేది కేవలం

కడుపులో వికారం

మేఘం మీంచి చూసేత్, దేశాల నడుమ సరిహదుద్ రేఖలు కనిపించవు,

పొలాల మధయ్ గటుల్ కూడా. కానీ మేఘాలమీద కూరోచ్లేము

ఏడు శతాబాద్ల కిందట ఏడు తెలల్ పావురాలు లోయలోంచి మంచు

శిఖరం వైపు ఎగరసాగాయి. ఏడో పావురం రెకక్మీద నలల్మచచ్ ఒకటి

ఉందని పకుష్ల ఆకాశయానం చూసుత్నన్ ఏడుగురిలో ఒకడనాన్డు. ఈ

రోజు ఆ లోయలో వారు ఆనాడు ఎగిరినవనీన్ నలల్ పావురాలు

అంటునాన్రు.

ఆకురాలేకాలంలో నా కషాట్లనీన్ తోటలో కపెప్డతాను. వసంతం నేలను

మనువాడేనాటికి అవి మిగతా పూలకంటే అందమైన పువువ్లుగా

 [48] ఇ క- రగ 
ఖ రచన
మారతాయి. నా పకక్వారు వాటిని చూసి వచేచ్ ఆకురాలుకాలం లో వారి

వారి తోటలోల్ నాటుకునేందుకు వాటి వితత్నాలను అడుగుతారు.

చేయిచాచి ఏమీ పొందలేకపోవడం ఎంత దౌరాభ్గయ్ం! నిండు చేతిని

చాచినా ఎవరూ అందుకోలేకపోవడం నిజంగా విషాదం

నేను శాశవ్తతావ్నిన్ ఆకాంకిష్సుత్నాన్ను, అకక్డే నే రాయని కవితలనూ,

వేయని బొమమ్లనూ పొందుతాను

కళ పర్కృతి నుంచి అనంతతావ్నికి వేసే అడుగు

మంచును తొలిచి బొమమ్ చెకిక్తే కళాఖండం అవుతుంది.

పని లేని చేతులకనాన్ ముళళ్ కిరీటాలిన్ తయారుచేసే చేతులు నయం

మన అతి పవితర్మైన కనీన్రు మన కళళ్కు చెందదు

ఈ భూమి మీద పుటిట్న పర్తి రాజూ బానిసా వారసులమే మనమంతా

జీసస ముతాత్తతలో దాగింది ఏమిటో ముందే తెలిసిఉంటే తన పటల్

మరింత భకిత్ పర్పతుత్లు కనపరుచ్కునేవారేమో!

జీసన ను పటిట్చిచ్న జూడాస తలిల్ పేర్మ మదర మేరి కి జీసస పై

 [49] ఇ క- రగ 
ఖ రచన
పేర్మకనాన్ తకుక్వేమైనా ఉంటుందా!

ఏసనన్ మూడు మహిమలు ఎవరూ పర్సాత్వించలేదు. మొదటిది అతడు

అందరిలాంటి మానవుడే, రెండు హాసయ్చతురత కలిగినవాడు, మూడు

పరాజితుడైన విజేత

శిలువ ఎకిక్నవాడా! నా హృదయం పై శిలువఎకాక్వు, నీ చేతిని దిగిన

చీలలు నా హృదయానిన్ గుచుచ్కునాన్యి. ఈ కలవ్రి కొండను

దాటేవాడికి ఇకక్డ చిమిమ్ంది ఇదద్రి రకత్మని తెలియదు, ఒకక్రిదే

అనుకునేడు

పావనగిరి గురించి వినాన్రా, అది పర్పంచంలో అతి ఎతైత్నది

శిఖరారోహణం చెయాయ్లంటే లోయవాసులతో కలిసి జీవించాలి.

అందుకే దానిన్ దివయ్పరవ్తం అంటారు.

 [50] ఇ క- రగ 
ఖ రచన
అభివయ్కిత్లో బంధించిన పర్తి ఆలోచననూ నా పనుల వలల్ సేవ్చఛ్ను

పర్సాదించాలి

 [51] ఇ క- రగ 

You might also like