You are on page 1of 6

ఆటగదరా శివ..... ఆటగద కేశవ....... ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు ఆటగదరా శివ.....

ఆటగద
కేశవ... ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద
సొంతాలు ఆటగద పంతాలు ఆట గద అంతాలు ఆట నీకు ఆటగదరా శివ..... ఆటగద కేశవ....... ఆటగదరా శివ ఆటగద కేశవ
ఆటగదరా నీకు అమ్మతోడు ఆటగదరా శివ.....ఆటగద కేశవ... ఆట గదరా నలుపు, ఆట గదరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు
ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా
శివ..... ఆటగద కేశవ....... ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు ఆటగదరా శివ.....ఆటగద కేశవ...
ఆటగదరా శివ.....ఆటగద కేశవ..

మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకొకల పనేం తోచక పరేషానుగ గదబిడ పడకు అల మతోయెంతగ శ్రు తే పెంచగ
విచారల విల విల సరే  చాలిక అల జాలిగ తిక మక పెదితే ఎల కన్నీరై  కురవాల మన చుట్టు ఉండె లోకం తడిసెల ముస్తా బె  చెదరాల
నిను చుడాలంటె అద్దం జడిసెల ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యొ పాపం అంటె ఎదో
లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకోకలా సరే చాలిక అల జాలిగ తిక మక
పెదితే ఎల చరణం1: ఎండలను దండిస్తా మ వానలను నిందిస్తా మ చలినెతో తరమెస్తా మ చీ పొమ్మని కస్సుమని కలహిస్తా మ
ఉస్సురని విలపిస్తా మ రోజులతఒ రాజీ పడమ సర్లేమ్మని సాటి  మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పూటకొక పేచి
పడుతు ఎం సాధిస్తా మంటే ఎం చెప్తాం ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యొ పాపం అంటె
ఎదో లాభం వస్తుందా వ్రుధా ప్రయాస పడాల చరణం 2: చమటలెం చిందించాల శ్రమపడేం పండించాల పెదవిపై చిగురించెల
చిరునవ్వులు కండలను కరిగించాల కొండలను కదిలించాల చచ్చి చెడి సాధించాల  సుఖశాంతులు మనుషులని పించే రుజువు
మమతలను పెంచే రుతువు మనసులను తెరిచే హితవు వందెళ్ళయిన వాడని చిరునవ్వు ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా
కదా మరెందుకు గోల అయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా వ్రుధా ప్రయాస పడాల

నీ ప్రశ్నలు నీవే.. ఎవ్వరో బదులివ్వరుగా..! నీ చిక్కులు నీవే.. ఎవ్వరో విడిపించరుగా..! ఏ గాలో నిన్ను.. తరుముతుంటే అల్లరిగా..
ఆగాలో లేదో.. తెలియదంటే చెల్లదుగా..! పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా.. అపుడో ఇపుడో కననే కననూ
అంటుందా..! ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా.. గుడికో జడకో సాగనంపక వుంటుందా..! బతుకంటే బడి చదువా..
అనుకుంటే అతి సులువా..! పొరపడినా బడినా.. జాలి పడదే కాలం మనలాగా..! ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా..!
అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా.. కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..! గతముందని గమనించని
నడిరేయికి రేపుందా.. గతి తోచని గమనానికి గమ్యం అంటూ వుందా..! వలపేదో వల వేస్తుంది వయసేమో అటు తోస్తుంది..
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే ఋజువేముంది.. సుడిలో పడు ప్రతి నావా.. చెబుతున్నది వినలేవా..! పొరబాటున చేయి
జారిన తరుణం తిరిగొస్తుందా.. ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా..! మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెబుతుందా..! కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని.. అని తిరగేసాయా చరిత
పుటలు వెనుచూడక ఉరికే జతలు.. తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు ఇది కాదే విధి రాతా
అనుకోదేం ఎదురీతా..! పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా.. అపుడో ఇపుడో కననే కననూ అంటుందా..! ప్రతి కుసుమం
తనదే అనదే విరిసే కొమ్మైనా.. గుడికో జడకో సాగానంపక వుంటుందా..! బతుకంటే బడి చదువా.. అనుకుంటే అతి సులువా..!
పొరపడినా బడినా.. జాలి పడదే కాలం మనలాగా..! ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా..!

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదో
తెలియదంటే చెల్లదుగా పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అపుడో ఇపుడో కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే
అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా
జాలిపడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా గతముందని గమనించని నడిరేయికి రేపుందా గతితోచని గమనానికి గమ్యం అంటూ
ఉందా వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది సుడిలోపడు ప్రతి
నావ చెపుతున్నది వినలేవా పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
మనకోసమే తనలో తను రగిలే రవితపనంతా కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెపుతుందా కడతేరిన పయనాలెన్ని పడదోసిన
ప్రణయాలెన్ని అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే వెతలు తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా
ప్రేమికులు ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అపుడో ఇపుడో కననే కనను
అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే
అతి సులువా పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

అర్ధశతాబ్దపు అఙానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దా మా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి
సలాము చేద్దా మా శాంతి కపోతపు కుత్తు క తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం నీ పాపిటలొ భక్తిగదిద్దిన ప్రజలను
చూడమ్మా ఓ పవిత్ర భారతమా ! కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడలేని తెగువను చూపి
తగువుకి లేస్తా రే జనాలు తలలర్పిస్తా రే సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ మొత్తం దేశం
తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి
సాధించాలి ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా
ఓ అనాథ భారతమా! అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం కారడవుల్లో క్రూ రమృగంలా దాక్కుని ఉండాలా
వెలుగుని తప్పుకు తిరగాలా శతృవుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్త్యవ్యం స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా
అన్నల చేతిలొ చావాలా తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టా నికి ఇచ్చి ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురుమిన నెత్తు టి మందారం ఈ సంధ్యాసిందూరం వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా గతి తోచని
భారతమా! తన తలరాతను తానే రాయగల అవకాశాన్నే వదులుకొని తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం ఆ హక్కేదో తనకే
ఉందని శాసిస్తుండట అధికారం కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం చూస్తూ ఇంకా నిదురిస్తా వా
విశాల భారతమా ఓ విషాద భారతమా!

భ్రమ అని తెలుసు… భ్రమ అని తెలుసు… బతుకంటె బొమ్మల ఆట అని తెలుసు… కథ అని తెలుసు… కథ అని తెలుసు…
కథలన్ని కంచికే చేరుననీ తెలుసు… తెలుసు తెర తొలుగుతుందనీ తెలుసు తెల్లా రుతుందనీ తెలుసు ఈ కట్టె పుట్టు క్కుమంటదనీ
… తెలుసు ఈ మట్టి మట్టి లో కలిసిపోతదనీ… ఇన్నీ తెలిసీ ఇరకాటంలొ పడిపోతావు యెందుకనీ మాయా! మాయా!!
మాయా!!! వేదం తెలుసు! తైలమున్నదాకె దీపమను వేదాంతం తెలుసు! శాశ్త్రం తెలుసు! శాశ్వతంగ ఉడేదెవ్వడీఢ లేఢని తెలుసూ!
తెలుసు ఇది నీటి మూటనీ తెలుసులే గాలి మేడనీ తెలుసు ఈ బుడగ ఠఫని పగిలిపోతదనీ… తెలుసు ఉట్టిపై ఉన్నదంత హుష్కాకి
అనీ… అన్నీ తెలిసీ అడుసులొపడి దొర్లు తుంటావు దేనికనీ… మాయా! మాయా!! మాయా!!! తేలి పోయింది...
తెలిసిపోయిందీ... తేలి పోయింది తెలిసిపోయింది తెలియనిదేదొ ఉందని మనస్సా తెలుసని యెందరు చెబుతున్నా... అది ఉందో
లెదో తేలని హంసా... కళ్ళు రెండు మూసెయ్యలట మూడోకంటిని తెరవాలంటా... మిన్ను మన్ను మిట్టా పల్లెం ఒక్కటిగా
కనిపించాలంటా... ఆడేవాడు ఆడించేవాడు ఏకపాత్రలని ఎరగాలంటా... ఆ ఎరుక వచ్చి రాగానే...ఆ ఎరుక వచ్చి రాగానే... ఆ
ఎరుక వచ్చి రాగానే మాయం అయిపొతుందట మాయా మాయ! మాయ!! మాయ!!! మాయా!!!

అనుకుంటే కానిది ఏమ్మున్నది మనిషనుకుంటే కానిది ఎమ్మున్నది.. చలిచ్చీమే ఆదర్శ o పనికాద నీ దైవం ఆయువే నీ ధనం
ఆశయం సాధనం ,చేయరా సాహసం నీ జయం నిశ్చయం ,అనుకుంటే కానిది ఎమ్మున్నది మనిషనుకుంటే కానిది ఎమ్మున్నది....
చిలిపి బాలుడనుకుంటే చిటికేనేలు అనుకుంటే కృష్ణుడేత్తలేడుగా గోవర్ధన భారం సీతగాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు
విరవలేడుగా శ్రీరాముడు సైతం మనసుంటే కనపడదా ఏదో మార్గం కసివుంటే జతపడద నీతో దైర్యం ఓరిమే నీ భలం లోకమే నీ
వశం చేయరా సాహసం నీ జయం నిశ్చయం... రాయిలాగా కూర్చుంటే కాలు కదపలేనంటే ఎప్పటికీ రాదుగా ఊహాలకో రూపం
బతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే భయపడక వెలిగించై నేత్తు రుతో దీపం ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం ఏ
ఓటమి ఆపునురా రాగల విజయం కాలమే నీపదం పోరికే నీరధం చేయరా సాహసం నీ జయం నిశ్చయం అనుకుంటే కానిది
ఎమ్మున్నది మనిషనుకుంటే కానిది ఎమ్మున్నది.......

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే
గుర్తు పట్టే గుండెనడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని
పలకరించుకోవా కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు అడగరేం ఒక్కొక్క అల పేరు మనకిలా ఎదురైన ప్రతివారు
మనిషనే సంద్రాన కెరటాలు పలకరే మనిషీ అంటే ఎవరూ సరిగా చూస్తు న్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది చుట్టు అద్దా లలో
విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే
నువ్వే కాదా కాదా ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా
మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తా యి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే శత్రు వులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న
ఇష్టా లే ఋతువులు నీ భావ చిత్రాలే ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం నీ మకిలి మతికి భాష్యం
పుటక చావు రెండే రెండూ నీకవి సొంతం కావు పోనీ జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తా వో కానియ్యి

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే
గుర్తు పట్టే గుండెనడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని
పలకరించుకోవా కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు అడగరేం ఒక్కొక్క అల పేరు మనకిలా ఎదురైన ప్రతివారు
మనిషనే సంద్రాన కెరటాలు పలకరే మనిషీ అంటే ఎవరూ సరిగా చూస్తు న్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది చుట్టు అద్దా లలో
విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే
నువ్వే కాదా కాదా ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా
మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తా యి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే శత్రు వులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న
ఇష్టా లే ఋతువులు నీ భావ చిత్రాలే ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం నీ మకిలి మతికి భాష్యం
పుటక చావు రెండే రెండూ నీకవి సొంతం కావు పోనీ జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తా వో కానియ్యి

దేవుడు చేసిన మనుషుల్లా రా..


మనుషులు చేసిన దేవుళ్ళారా..
వినండి మనుషుల గోల.. కనండి దేవుడి లీల
వినండి మనుషుల గోల.. కనండి దేవుడి లీల
దేవుడు చేసిన మనుషుల్లా రా..
మనుషులు చేసిన దేవుళ్ళారా..
వినండి మనుషుల గోల.. కనండి దేవుడి లీల
వినండి మనుషుల గోల.. కనండి దేవుడి లీల

గోవిందా హరిగోవిందా.. గోవిందా భజగోవిందా


గోవింద గోవింద హరిగోవిందా.. గోవింద గోవింద భజగోవిందా
గోవింద గోవింద హరిగోవిందా.. గోవింద గోవింద భజగోవిందా

ఆ..ఆ..ఆ..ఆ.. ఓం..

చరణం 1:

వెన్నదొంగ.. ఆ వెన్నదొంగ.. మా.. తొలిగురువు


మా తొలిగురువు..
తొలినుంచీ మా కులగురువు..
మా కులగురువు..
కోరిన కోరిక తీరాలంటే.. కోరక మోక్షం రావాలంటే
గోపాలునే సేవించాలి.. గోవిందునే ధ్యానించాలి

గోవిందా హరిగోవిందా.. గోవిందా భజగోవిందా

వినండి దేవుడి గోల కనండి మనుషుల లీల


దేవుడు చేసిన మనుషుల్లా రా
మనుషులు చేసిన దేవుళ్ళారా
వినండి దేవుడి గోల కనండి మనుషుల లీల...

చరణం 2:

పేదల నెత్తు రు తాల్చిన రూపం


బలిసిన జలగలు దాచిన పాపం
పేదల నెత్తు రు తాల్చిన రూపం
బలిసిన జలగలు దాచిన పాపం

మానవులను పీడించే జబ్బు.. దేవతలను ఆడించే డబ్బు


మానవులను పీడించే జబ్బు.. దేవతలను ఆడించే డబ్బు

తెలుపో నలుపో జాన్ దేవ్.. ఆ తేడాలిక్కడ లేనేలేవ్


తెలుపో నలుపో జానేదేవ్.. ఆ తేడాలిక్కడ లేనేలేవ్
లేనేలేవ్..
వినండి డబ్బుల గోల కనండి మనుషుల లీల
వినండి డబ్బుల గోల కనండి మనుషుల లీల

హే.. యహా..
గాలిబుడగ జీవితం ఓటి పడవ యవ్వనం
గాలిబుడగ జీవితం ఓటి పడవ యవ్వనం
నిన్న మరల రాదు రాదు రాదు.. నేడే నిజం.. నేడే నిజం
నేడే నిజం..
రేపు మనది కాదు కాదు.. నేడే సుఖం.. నేడే సుఖం
సుఖం.. సుఖం.. నేడే సుఖం
కాసే బ్రహ్మానందం..అహా.. ఓ డోసే పరమానందం.. ఒహో..
ఆ.. కాసే బ్రహ్మానందం..అహా.. ఓ డోసే పరమానందం.. ఒహో..
ఆ.. కాసే బ్రహ్మానందం.. హ్మ్.. డోసే పరమానందం
ఆనందం పరమానందం.. ఆనందం బ్రహ్మానందం ఆనందం పరమానందం.. ఆనందం బ్రహ్మానందం ఆనందం
పరమానందం.. ఆనందం బ్రహ్మానందం ఆనందం పరమానందం.. ఆనందం బ్రహ్మానందం 
ఆనందం ఆనందం ఆనందం ఆనందం

వినండి గ్లా సుల గోల.. కనండి మనుషుల లీల


వినండి గ్లా సుల గోల.. కనండి మనుషుల లీల
దేవుడు చేసిన మనుషుల్లా రా
మనుషులు చేసిన దేవుళ్ళారా
వినండి గ్లా సుల గోల.. కనండి మనుషుల లీల..

చరణం 3:

ఆలయాలలో వెలుతురు లేదు.. ఆకాశంలో చీకటి లేదు


ఆలయాలలో వెలుతురు లేదు.. ఆకాశంలో చీకటి లేదు

విమానాలలో విహరిస్తుంటే సముద్రాలనే దాటేస్తుంటే


విమానాలలో విహరిస్తుంటే సముద్రాలనే దాటేస్తుంటే

గుడిలో ఎందుకు రామయ్యా.. నిను విడుదల చేస్తాం రావయ్యా


గుడిలో ఎందుకు రామయ్యా.. నిను విడుదల చేస్తాం రావయ్యా
రామయ్యా.. రామయ్యా..
లేవయ్యా.. లేవయ్యా..

హ్యాండ్సప్..

విధాత తలపున ప్రభవించినది... అనాది జీవన వేదం... ఓం...


ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం... ఓం...

కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వ రూప విన్యాసం


ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం... ఆ...

సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది


సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం... ఈ గీతం...

విరించినై విరచించితిని ఈ కవనం


విపంచినై వినిపించితిని ఈ గీతం... 

చరణం 1 : 
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రు లపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రు లపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన 

పలికిన కిలకిల స్వనముల...  స్వరగతి జగతికి శ్రీకారము కాగా


విశ్వకావ్యమునకిది భాష్యముగా...  

విరించినై విరచించితిని ఈ కవనం


విపంచినై వినిపించితిని ఈ గీతం... 

చరణం 2 :

జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం


చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం

అనాది రాగం.. ఆదితాళమున.. అనంత జీవన వాహినిగా


సాగిన సృష్టి విలాసమునే.. 
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం... 

నా ఉఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం  


నా ఉఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం... ఈ గీతం...

నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్దం లేనట్టి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా
నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్దం లేనట్టి లోకం అడిగా  రక్త తరంగ ప్రవాహం అడిగా  ఉదయం లాంటి హృదయం అడిగా 
నిత్యం ఏకాంత క్షణమే అడిగా  యుద్దం లేనట్టి లోకం అడిగా  రక్త తరంగ ప్రవాహం అడిగా  ఉదయం లాంటి హృదయం అడిగా 
అనుబంధాలకు ఆయుస్సడిగా  ఆనందాశ్రు వులకు ఆశీస్సడిగా  మదినొప్పించని మాటలు అడిగా  ఎద మెప్పించే యవ్వనం అడిగా 
పిడుగులు రాల్చని మేఘం అడిగా  జ్వలించు నూరేళ్ళ పరువం అడిగా  వరించి తరించు వలపే అడిగా  ప్రాణతుల్యమౌ బంధం
అడిగా  పచ్చికలో మంచు ముత్యాలడిగా  పువ్వుల ఒడిలో పడకే అడిగా  తనువోదార్చే ఓర్పుని అడిగా  తలను నిమిరే వ్రేళ్ళను
అడిగా  నెమలి ఆటకు పదమే అడిగా  కోయిల పాటకు పల్లవి అడిగా  గదిలో గుక్కెడు నీళ్ళే అడిగా  మదిలో జానెడు చోటే అడిగా 
మచ్చంటూ లేని జాబిలిని అడిగా  నక్షత్రకాంతి నట్టింటడిగా  దుఃఖం వదించు అస్త్రం అడిగా  అస్త్రం ఫలించు యోగం అడిగా  చీకటి
ఊడ్చే చీపురుని అడిగా  పూలకు నూరేళ్ళ ఆమని అడిగా  మానవ జాతికి ఒక నీతడిగా  వెతల రాత్రికే వేకువనడిగా  ఒకటే వర్ణం
సబబని అడిగా  ఒక అనురాగం గుడిలో అడిగా  వాలని పొద్దు న నెలవంకడిగా  ప్రాణము ఉండగా స్వర్గం అడిగా  న్యాయం ధర్మం
ఇలలో అడిగా  ఎద రగిలించే కవితే అడిగా  కన్నీరెరుగని కన్నే అడిగా  క్షామం నశించు కాలం అడిగా  చుక్కలు దాటే
స్వతంత్రమడిగా  దిక్కులు దాటే విహంగమడిగా  తొలకరి మెరుపుల నిలకడనడిగా  ఎండ మావిలో ఏరును అడిగా  మూగపాటకొక
చరణం అడిగా  మౌనభాష వ్యాకరణమడిగా  నమ్మి చెడని ఓ స్నేహం అడిగా  శాంతిని పెంచే సంపదనడిగా  వస్తే వెళ్ళని వసంతం
అడిగా  ఏడేడు జన్మలకు ఒక తోడడిగా  ఏనాడు వాడని చిరునవ్వడిగా  ముసిరే మంచుల ముత్యాలడిగా  ముసి ముసి నవ్వుల
ముగ్గులు అడిగా  ఆశల మెరుపుల జగమే అడిగా  అంధాకారమా పొమ్మని అడిగా  అందరి ఎదలో హరివిల్లడిగా  మరుగై పోని
మమతను అడిగా  కరువైపోని సమతను అడిగా  రాయలంటి కవి రాజును అడిగా  బమ్మెర పోతన భక్తిని అడిగా  భారతి మెచ్చిన
తెలుగే అడిగా  పాశుపతాస్త్రం నరుడై అడిగా  మోహన కృష్ణుడి మురళే అడిగా  మధుర మీనాక్షి చిలకే అడిగా  ఉన్నది చెప్పే ధైర్యం
అడిగా  ఒడ్డెక్కించే గమ్యం అడిగా  మల్లెలు పూసే వలపే అడిగా  మంచిని పెంచే మనసే అడిగా  పంజా విసిరే దమ్మే అడిగా 
పిడుగుని పట్టే వొడుపే అడిగా  ద్రోహం అణిచే సత్తా నడిగా  చస్తే మిగిలే చరిత్ర అడిగా  విధిని జయించే ఓరిమిని అడిగా  ఓరిమిలో
ఒక కూరిమిని అడిగా  సహనానికి హద్దేదని అడిగా  దహనానికి అంతేదని అడిగా  కాలం వేగం కాళ్ళకు అడిగా  చిన్న చితక
జగడాలడిగా  తియ్యగా ఉండే గాయం అడిగా  గాయానికి ఒక ధ్యేయం అడిగా  పొద్దే వాలని ప్రాయం అడిగా  ఒడిలో శిశువై
చనుబాలడిగా  కంటికి రెప్పగ తల్లిని అడిగా  ఐదో ఏట బడినే అడిగా  ఆరో వేలుగా పెన్నే అడిగా  ఖరీదు కట్టని కరుణే అడిగా 
ఎన్నెని అడగను దొరకనివి  ఎంతని అడగను జరగనివి  ఎవ్వరినడగను నా గతిని  కళ్ళకు లక్ష్యం కలలంటూ  కాళ్ళకు గమ్యం
తాడంటూ  భగవధ్గీత వాక్యం వింటూ  మరణం మరణం శరణం అడిగా

You might also like