You are on page 1of 7

నువ్వెళ్

లి పోయాక...

చిత్రకావేరి
అరుణ పప్పు
‘యూ.......’
ఆ మాట అనేశాక... కావేరి మొహంలోకి చూశాక... అప్పుడర్థమైంది తానెంత
తప్పు చేశాడో!
తన చెంప మీద తానే గట్టి గా కొట్టుకున్నట్టయ్యిందతనికి.
ఏం చేశాడు తను!
ఆంతరంగిక మందిరంలోకి ప్రవేశమున్న ఒకే ఒక చెలికత్తె రాకుమారిని
ఒడుపుగా పొడిచేసినట్టు కావేరిని తాను పొడిచేశాడు.
ఒంటరి ద్వీపం నుంచి బయటపడటానికి తనకున్న ఒకే ఒక వంతెనను తాను
కూల్చేశాడు!
చిట్ట చివరి ఆసరా జారిపోయి, కొండకొమ్ము నుంచి చీకటి లోయలోకి పడిపోతూ
ఆమె మనసు చేసిన ఆక్రందనాన్ని తాను విన్నాడు!
దెబ్బ తిన్న దూడలా, వలలో చిక్కిన చేపలా కావేరి చూపు – దాన్ని తనెప్పటికీ
మర్చిపోలేడు.
* * *
‘సాయంత్రం ఐదు గంటలికి. మా ఇంట్లోనే... హేమచంద్ర చూస్తుంటాడు...
ఎవరైనా చెప్పిన సమయానికి రాకపోతే కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకీ బయటకీ
తిరుగుతుంటాడు... నీకు తెలుసుగా...’ ప్రసూన గబగబా చెప్పింది.
‘హేమ సంగతి నాకెందుకు తెలీదూ? వస్తానొస్తాను...’ అన్నాడు సోమయాజులు.
అతన్నంటుంది కాని, ఈవిడా అంతే. అంత ఇష్టంతోటే కట్టుకున్న ఇంటికి
‘పాట’ అని పేరు పెట్టుకున్నారు. నెలకోసారయినా స్నేహితులూ కుటుంబసభ్యులూ
కూర్చుని కబుర్లు చెప్పుకోవడం తప్పనిసరి. ‘కబుర్లు’ అని పేరేగాని, అసలు దాన్ని

స్వాతికుమారి బండ్లమూడి 19 అరిపిరాల సత్యప్రసాద్


నువ్వెళ్
లి పోయాక...

కచేరీ అని అనాలేమో. లలిత సంగీతం పాడగలిగినవాళ్లు ఎవరో ఒకరు రావడం,


మామూలు కబుర్లతో మొదలయిన సమావేశం కచేరీలాగా పూర్తవడం – కొన్నేళ్ల
నుంచీ సాగుతున్నదదే.
అన్నాడేగాని, ఆ సాయంత్రం సోమయాజులు హేమచంద్ర ఇంటికి వెళ్లేసరికి
ఐదున్నర అవనే అయింది. మావిడిచెట్టు కింద ఎవరిదో కొత్త గొంతు ఆలాపన
వినిపిస్తోంది.
“చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు
చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా... తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో... ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో... యేమై మిగిలేవో”
సోమయాజులికి సంగీతం పెద్ద లోతు తెలియదు. అసలు దేన్నీ లోతుగా
ఆలోచించని మానుష సంతతిలో ఒకడు. వాళ్లందరిలాగానే తనకూ అన్నీ
తెలుసనుకుంటాడు. ఒంటరి జీవితంలో ఆ మాత్రం మనుషుల్నీ, పాటల్నీ, నవ్వుల్నీ
నింపుకుందామని వెళుతుంటాడు కాని అవేవీ అంటవు. ఈ పాటలో ఉండవలసిన
పశ్చాత్తాపంలాంటిదేదో ఆ గొంతులో పలకలేదనిపించింది అతనికి. పైగా ఎంతోకొంత
నవ్వునాపుకుంటున్నట్టు కూడా అనిపించింది.
శబ్దం కాకుండా కుర్చీ లాక్కుని వెనకాల వరసలో కూర్చున్నాడు.
పాట సాగుతోంది. సౌకర్యంగా మఠం వేసుక్కూర్చుని పాడుతోందావిడ. ఆ
గొంతూ, నవ్వూ కూడా ఎప్పుడో తెలిసినవే అనిపించాయి సోమయాజులికి. మొహం
చూద్దా మనుకుని ముందుకు వంగాడు. కనిపించలేదు.
“మౌనమె నీ భాష ఓ మూగ మనసా.....ఓ మూగ మనసా”
పాట పూర్తవుతూనే అందరూ చప్పట్లు కొట్టారు.
ఆమె లేచి నిల్చున్నప్పుడు చూడగలిగాడు.
కావేరి!!!
గోరింటాకు రంగు కుర్తా, పండిన గోరింట ఎరుపు దుపట్టా, మంగళగిరి కాటన్
వేసుకున్న కావేరి.
కాలేజీలో ఉన్నప్పుడు తనలో కొత్త కలలను రేకెత్తించిన కావేరి. తాను కళ్లెత్తి
చూడ్డా నికి సైతం బిడియపడిన కావేరి.

స్వాతికుమారి బండ్లమూడి 20 అరిపిరాల సత్యప్రసాద్


నువ్వెళ్
లి పోయాక...

చలాకీతనాన్నీ, చదువునూ కలిపి కుట్టించి పంజాబీ డ్రెస్సుగా వేసుకునే కావేరి


అల్లరిని దుపట్టాగా అలంకరించేది.
కావేరి పాడింది గనకనే ఆ పాటలో అల్లరి వినిపించిందేమో తనకు
అనుకున్నాడతను.
ఆ పాటెందుకు పాడిందో మరి.
మాటలూ పాటలూ కబుర్లూ సాగుతుండగానే కావేరి వెనక్కి వచ్చింది.
సోమయాజుల్ని చూసింది. సాయంత్రం చుక్కల కన్నా ముందు ఆకాశంలో మెరిసే
గ్రహంలాగా తన మొహం విప్పారింది. ఆ మెరుపు ఆమె మొహంలో ప్రతిఫలించింది.
పాత పరిచయం స్నేహంగా పల్లవించడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
మొదటి మెసేజ్ ఆమే పెట్టింది.
‘తొట్ల కొండ తీసుకెళతాను, వస్తావా?’
కాదనడానికేముంది?
మెలికలు తిరుగుతున్న బీచ్ రోడ్డు , అక్కణ్నుంచి పైకి చిన్నపాటి ఘాట్ రోడ్డు
– అస్తమిస్తున్న సూర్యుడు నేపథ్యంలో ఉండగా శతాబ్దా ల నాటి తొట్ల కొండ బౌద్ధ
స్థూ పాలను చూడటం అద్భుతంగా అనిపించింది అతనికి. వివరాలు చెబుతూ, సన్నటి
బాటలో నడిపిస్తూ అకస్మాత్తుగా కళ్లు మూసింది కావేరి.
‘సోమా, నీకో అద్భుతాన్ని చూపిస్తాను, ఓ పాతికడుగులు కళ్లు మూసుకుని వేస్తే
చాలు...’
‘పాతికేం ఖర్మ, జీవితమంతా నడవాలనే ఆశ’ మనసులోని మాటను బయటకు
అనలేకపోయాడు సోమా.
కాలేజీలో కళ్లెత్తి చూడలేని అశక్తత కాస్తా, ఇప్పుడు నోరెత్తి చెప్పలేనితనంగా
మారిపోతున్నట్టుంది అనుకున్నాడు.
అన్నట్టు గానే పాతిక అడుగులు నడిపించి అక్కడ కళ్ల మీద నుంచి చేతులు
తీసేసింది కావేరి.
ఎదురుగా చూస్తే దిగంతాల వరకూ వ్యాపించిన నీలం నిప్పులాంటి సముద్రం.
తల మీద పెద్ద కిరీటంలాగా అమరిన ఆకాశం. ఒక గాఢమైన నీలంలో తాను
మునిగిపోతున్నట్టూ, తేలిపోతున్నట్టూ – రెండు రకాల భావాలూ ఏకకాలంలో
కలిగేయి సోమయాజులికి.
‘ప్రేమ పెళ్లే అయినా ప్రేమ ఎటో స్వేచ్ఛగా ఎగిరిపోయింది, పెళ్లి మాత్రం
వాడకంలో లేని జైల్లా గా మిగిలిపోయింది. ఎగిరిపోయిన ప్రేమ పేరేంటో నీకు తెలుసు
కదా...’ అని నవ్వింది కావేరి.

స్వాతికుమారి బండ్లమూడి 21 అరిపిరాల సత్యప్రసాద్


నువ్వెళ్
లి పోయాక...

పురాణాల వెనుకనున్న ఆంత్రోపాలజీ గుట్టు మట్ల ను మంచి ఇంగ్లిషులో కథలు


కథలుగా చెప్పే వేణుగోపాల్‍ను కావేరికి సరిజోడనుకున్నది కాలేజీ. ఇద్దరూ సివిల్
సర్వీసు ‘కొడతార’నీ, ఒకనాడు దినపత్రికల్లో నిలుస్తారనీ, దేశప్రతిష్ఠ ను నిలుపుతారనీ
అనుకున్నారు అధ్యాపకులు.
‘అవకాశాలను అందుకోవడం ఒక కళ సోమా. వేణూకి అది పుష్కలంగా ఉంది.
చదివాడు, సర్వీసులో చేరాడు, పేరుకు నన్ను పెళ్లి చేసుకున్నాడు. విదేశాంగ శాఖలో
చక్రం తిప్పుతున్నాడు. ఢిల్లీ బ్యూరాక్రటిక్ సర్కిల్సన్నీ అతని అనుగ్రహ వీక్షణాల కోసం
పడిచచ్చిపోతుంటాయి... స్టేట్ సర్వీసులో అందునా ఏదో చిన్న మున్సిపల్ కమిషనర్
లాంటి అన్ గ్లా మరస్ ఉద్యోగస్తురాలిని తనకేం ఆనుతాను, ఉపయోగపడతాను
చెప్పు?’ అంటూనే నవ్వింది కావేరి.
వీటన్నితోపాటు, ఒక ఉత్తరాది మాజీ జమీందారు మనవరాలూ మరియూ
సినిమా యాక్టరు అయిన పాతికేళ్ల పిల్లతో వేణుగోపాల్ అఫైరులో ఉన్నాడని ఈమధ్యే
ఇంటర్నెట్ గాసిప్‍లో చదివానన్నది పైకి అనలేదతను.
‘నదుల పేర్లు ఆడపిల్లలకు పెడితే కష్టాలు పడతారట...’ అన్నాడు జనాంతికంగా.
‘ఇటువంటివి నమ్ముతావా నువ్వు?’ కళ్లింతలు చేసుకుని నిలువెత్తు ఆశ్చర్యంగా
నిలబడింది కావేరి.
ఎక్కడో పేరుకుపోయిన చాదస్తం ఇలాంటి మాటలు మాట్లాడిస్తుందేమో?
ఇంటికి వచ్చి లైట్లు వేశాక కూడా చీకట్లో ఉన్నట్ట నిపించింది అతనికి. చీకట్లో నదిని
చూస్తే ఏదీ అర్థమవనట్టు బుర్ర తిరిగింది. ఏ మూడింటికో ఒక ఆలోచన తట్టింది.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా నదులు వెనక్కి వెళ్లవు, ఎండిపోవు. మహా అయితే
పాయలుగా చీలిపోతాయేమో. అవి ప్రవహించినంత మేరా పచ్చదనమే. సమస్త
జీవరాశికీ ప్రకృతికీ మేలు చేసుకుంటూ పోవడమే వాటికి తెలుసు. పేరులోనే కాదు,
ప్రవర్తనలోనూ కావేరి నది లాంటిదే అనుకున్నాడు.
అప్పుడు నిద్ర పట్టింది. ఏదో నది సాగరంలో కలిసే చోటు కలలో వచ్చింది. నది
ముందుకెళుతోందో, సముద్రం వెనక్కెళుతోందో తెలియని అయోమయం. ఉప్పటి
నీరు నోట్లోకి వచ్చేసినట్టు . కలత నిద్రలోంచి లేచిపోయాడు.
మరొకసారి తీసుకెళ్లి సముద్రాన్ని ఆనుకుని ఉన్న శిలాతోరణం చూపించింది
కావేరి.
దగ్గరకు రమ్మంటే భయం వేసిందతనికి. ‘సముద్రాన్ని దూరం నుంచి చూడటం
బాగానే ఉంటుంది, దగ్గరకెళ్లడం ఇష్టం వుండదు. ఎప్పుడూ పాదాల్ని సైతం తడపలేదు
నేను...’ తనలోని భయాన్ని ఇష్టంలేనితనంతో పూరించాడు.

స్వాతికుమారి బండ్లమూడి 22 అరిపిరాల సత్యప్రసాద్


నువ్వెళ్
లి పోయాక...

‘ఆమెకేదో ఆధ్యాత్మిక సాధన అని ఒక ఆశ్రమానికి వెళ్లిపోయింది...’ అని


మాత్రం భార్య గురించి చెప్పగలిగాడు.
కావేరి నవ్వినట్టు అనిపించింది.
ఇద్దరి మధ్యా వాట్సప్ మెసేజులూ, కాల్సూ సముద్రం అలల్లా వచ్చి
విరిగిపోతున్నాయి.
తర్వాత మరికొన్నిసార్లు బీచ్ రోడ్డు డ్రైవులూ, సీ వ్యూ రెస్టారంట్ల లో డిన్నర్లూ
అయ్యాక ‘నువ్వేం అనుకోనంటే ఒక అబ్సర్వేషన్ చెప్తాను సోమా’ అంది కావేరి.
ఊపిరి బిగబట్టాడు.
‘ఎదుటివాళ్లు ఏం చెప్పినా వింటున్నట్టు నటిస్తావు కాని నిజంగా వినవు
కదా?’అడిగింది కళ్లు తిప్పుతూ.‘అంటే ఏదో వృత్తిధర్మంగా వింటావు తప్ప, మనసు
పెట్టి వింటావా చెప్పు...’ అని నిగ్గదీసింది కూడాను.
అమ్మయ్య, అని ఊపిరి వదిలేశాడు.
కొందరు తమలోకి తాము తవ్వుకోగలరు, నిక్కచ్చిగా. తప్పనుకుంటే
మార్చుకోగలరు. తను ఆ కొందరివాడు కాదే, ఆమెకున్న ధైర్యం తనకేదీ?
‘నువ్వు మాత్రం ఒక్కోసారి ఒక్కోలా అనిపిస్తావు...’ అనుకున్నాడు.
కావేరితో ఏం మాట్లాడితే ఏం చిక్కొచ్చిపడుతుందో అని భయంగానే ఉంటుంది
సోమయాజులికి.‘ఎలా అనిపిస్తాను...’ అనడిగితే మాటల్లో చెప్పలేని అశక్తత ఒకటి.
అయినా పైకి అనకుండా ఉండలేకపోయాడు. ఆసరికి పేర్చుకున్నాడు.
‘అంటే ఈ విశాఖపట్నంలోనే ఒకో బీచ్ దగ్గర సముద్రం ఒక్కోలా కనిపిస్తుంది
చూడు, అలాగ’
కావేరి అన్నిటికీ చినుకులాగా నవ్వుతుంది. ఒక్కోసారి తుంపరగా, ఒక్కోసారి
జల్లు గా మరోసారి హోరు వానగా. తాను పూర్తిగా తడిసి ఆస్వాదించలేడు.
అలాగని దూరంగా ఉండలేడు. తనలోని డొల్లవాడొకడు అప్పుడప్పుడు బైటికొచ్చి
వెక్కిరిస్తుంటాడు, అద్దంలోలాగా.
‘అవునూ, ఇంత ప్రేమిస్తావు కదా ఈ విశాఖనీ సముద్రాన్నీ, ఒకవేళ సముద్రం
మాయమైపోతే ఏమవుతుందంటావ్?’
‘ఆ ఊహే భరించలేను సోమా... ఇంత వైల్డ్ ఇమేజినేషనేవిటి నీకు’ అంది.
‘అదెలా ఉంటుందో నాకు తెలుసు’ అంది మళ్లీ.
ఇళ్లకు మళ్లారు.
‘నిజంగా ఏమీ అనుకోలేదు కదూ’ మెసేజ్ వచ్చింది రాత్రి పదిగంటల వేళ.

స్వాతికుమారి బండ్లమూడి 23 అరిపిరాల సత్యప్రసాద్


నువ్వెళ్
లి పోయాక...

‘లేదు లేదు’ అని కొట్టాడు తాను.


‘మనకి ప్రేమించబడటం ఎంత ఇష్ట మో, ప్రేమించడం కూడా అంతే అవసరం
సోమూ, చెప్పు రైటా రాంగా’
‘కరెక్ట్’
‘ఎంత గట్టి కోటయినా, సంరక్షణ లేక ఎంత కాలం నిలబడుతుంది చెప్పు?
ఆంతరికమైన శక్తి నిలబడటానికి ప్రేమ కావాలి సోమా. చిన్న ఆసరా కూడా లేనప్పుడు,
నాకు నేను ఎన్నేళ్లని చేయూతనిచ్చుకోను?’
సోమా దగ్గర సమాధానమేం లేదు.అర్థమయీ కానట్టు గా ఉందతనికి. వయసు
మాత్రమే తెచ్చిన పెద్దరికంతో ఆ మాట బయటికి అనలేడు. ఇంకొంత చెప్పమని
అడగలేడు. అతనికి మానసిక శాస్త్రం తెలుసు. తత్వశాస్త్రమూ చదివాడు. నిత్యజీవితంతో
వాటినెలాసమన్వయం చెయ్యాలో తెలీదు.
ఆ తర్వాత కలిశారు.
కావేరి ఇంట్లో. ఊపిరాడనంతగా మునగడం, ఊపిరి స్థంభించేంతగా తేలడం
ఏమిటో అనుభవానికొచ్చింది సోమాకి. సముద్రం అని పుల్లింగం ఎందుకు వాడతారో,
అది పూర్తి స్త్రీత్వం అయితేనూ అనుకున్నాడు మర్నాడు ఉదయం లేచినప్పుడు.
ఎప్పుడు చూసినా ఆమె నుంచి మెసేజులూ, కాల్సూ చాటింగూను. అంత
ఉద్యోగంలో తీరికెలా దొరుకుతోందో. ఉండబట్టలేదు, ఒకరోజు ఆమె జుట్టు నీడన
తలదాచుకుంటూ అడిగాడు.
‘లవ్ లెస్ పేరెంట్స్, ఇనెక్స్ ప్రెసివ్ సిబ్లింగ్స్ అండ్ ఫ్రెండ్స్... వేణూ చూస్తే
అలాగ... నా లోపల ప్రేమ అంతా గడ్డ కట్టేసి ఉండిపోయింది సోమూ, నీ మీద
ఒక్కసారిగా తన్నుకొచ్చేస్తోంది అనురాగం. టీనేజర్లా గా అనిపిస్తున్నానా నీకు? తప్పేం
లేదులే... స్థలం, సమయం అన్నిటినీ మర్చిపోతున్నా. హోదా, పనులూ ఉన్నాయని
కూడా గుర్తు రావడం లేదు...’ గడగడా చెప్పుకుపోయింది.
వారాలు రోజుల్లా , రోజులు గంటల్లా , గంటలు నిమిషాల్లా గడిచిపోవడం ఏమిటో
ఇద్దరికీ అర్థమవుతోంది.
ఒక శనివారం సాయంత్రం భీమిలీ కొత్త హోటల్‍కు రమ్మంది.
పాతవీ కొత్తవీ పాటలు పాడింది. రెస్టరంట్ కట్టేసే వేళయ్యిందంటే రూమ్
తీసుకుందామంది.
ఆ తర్వాత గదిలోకే సముద్రం వచ్చినట్ట నిపించిందతనికి.
ఎంతసేపయినా దాని హోరు తగ్గదు. అలసిపోదు.

స్వాతికుమారి బండ్లమూడి 24 అరిపిరాల సత్యప్రసాద్


నువ్వెళ్
లి పోయాక...

ఎంతసేపు కావిలించుకుంటే చాలుతుంది?


‘యూ స్టార్వింగ్ వుమన్... నింఫోమానియాక్ దయ్యంలా ఎంతసేపని?’
అదీ తానన్నది.
ఆమె నిశ్చేష్ట మైంది, తెలివి తప్పినట్టు గా వేలాడపడిపోయింది.
అప్పుడర్థమైంది తానెంత తప్పు చేశాడో.
తన ముందున్నది – జీవితంలో అనేక సవాళ్లను అవలీలగా దాటిన సుధీర కాదు,
అన్ని ప్రయత్నాల్లో నూ జీవశక్తిని కొద్దికొద్దిగా పోగొట్టుకుని చివరకు శిధిలమైపోతున్న
ఒక మానవి అని. ఎంత చిదిమేసినా మళ్లీ కూడగట్టుకుని పైకి లేచే దీపం వంటి కావేరికి
తనేం చేశాడు?
స్నేహితుడి మీదా, సైకాలజిస్టు మీదా ఎమోషనల్ డిపెండెన్సీ పెరగడం
మామూలేననుకున్నాడా? తల్లిదండ్రులు, సహోదరులు, స్నేహితులు - ఎన్నో స్థా నాల్ని
ఎన్నో స్థా యుల్లో భర్తీ చేస్తున్నట్టు తెలుసుకోలేకపోయాడా?
దాన్నుంచే ఈ నిర్లక్ష్యపు మాట పుట్టిందా?
ఒక ప్రియమైన వ్యక్తి ఏది మాట్లాడకూడదో ఆ మాట అన్నాడు.
స్నేహితుడూ ప్రొఫెషనల్ – ఇద్దరూ ఒకేసారి అంతరించిపోయారు. మరిక
ప్రత్యక్షం కారు. అవన్నీ కాకపోయినా, సాటి మానవుడిగా కూడా నిలబడలేకపోయాడు
తాను. అసయ్యం గొంతులో ఉండగా చుట్టు కుంది. ఆమె బట్ట లు చుట్టుకుని తలుపు
తీసుకుని వెళ్లిపోయింది.
అప్పటివరకూ తామిద్దరి మధ్యనా ఉన్నది ‘అయిపోయింది’ అని అర్థమైందతనికి.
ఉన్నట్టుండి సముద్రం మాయమైపోతే ఎలా ఉంటుందో అనుభవంలోకి వచ్చింది.
పొడి ఇసకలో కూరుకుపోతున్నట్టూను.

స్వాతికుమారి బండ్లమూడి 25 అరిపిరాల సత్యప్రసాద్

You might also like