You are on page 1of 3

ఒక్కసారి వెన్నెల్లో తడిసి…!

‘అబ్బా!’ మధురాలొలికే ఆమె అధరాలపై నెత్తు టి గాయం.


“ఏమైందీ?” అడుగుతూనే ఆపుకోలేని తమకంతో ఆమె పెదాల్ని మరోసారి బలంగా కొరికాడతడు.
“నీ మునిపంటి గాటుకి నా పెదాలు చిట్లా యి. రక్తం” అంది ఆమె ప్రతిగా ప్రతీకారంతో అతడి చెవిని గట్టిగా కొరుకుతూ.
“అయ్యో… నొప్పి?”
“బాధగా ఉందా?” ఆమె అడిగింది. అంతలోనే… ‘చేదూ ఓ రుచిలా… బాధ కూడా తీయగా ఉంది కదూ” అంటూ అతడిని మరింత
దగ్గరగా లాక్కుంది. ఆ చొరవకి ముగ్దు డవుతూ తనంటూ లేకుండా ఆమెలో లీనమయ్యేందుకు రహస్య దారుల్ని అన్వేషిస్తు న్నాడతడు.
“నిజానికి ఇది హింసే. వయసొచ్చిన ఓ ఆడామగా పదాల్లో నిర్వచించలేని ఒకానొక అద్భుత సౌఖ్యాన్ని వెతుక్కుంటూ సాగించే ఈ క్రీడలో
అడుగడుగునా, అణువణువునా హింసే. శత్రు వైతే సరే… శతసహస్ర వ్యూహాలు రచించి తుదముట్టించొచ్చు. కానీ, మనసుపడ్డ వ్యక్తిని
ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని ఉక్కు కౌగిలిలో బిగించి ఊపిరాడనీయకుండా చేయడం… ఎక్కడ పడితే అక్కడ గోళ్లతో రక్కేయడం,
పళ్లతో కొరికేయడం! ఓహ్! ఇదంతా ఇష్టమేనా?” పైట చాటు పాలపుంతల అంతుచూస్తూ, ఆయాసపడుతూ అడుగుతున్నాడతడు.
అత్యంత పరాక్రమంతో అతడు ఒక్కో శరీరభాగాన్ని ఆక్రమించుకుంటుంటే… తాను ఓడిపోయేందుకు, అతడు గెలిచేందుకు ఒద్దికగా, ఓపిగా
సహకరించే వ్యాపకంలో తలమునకలైన ఆమె అతడి ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు.
“మాట్లా డవేం?” మళ్ళీ అడిగాడతడు.
“ఒక్కోసారి మౌనమే మంచి సమాధానమవుతుంది”.
“అయినా సరే… నా సందేహ నివృత్తి చేయాల్సిందే”. “చేస్తు న్నా కదా.. దేహాల సందేహాల నివృత్తి” గలగలా నవ్వింది. ఆ నవ్వు
అతడిలో రగుల్తు న్న కోరికల్ని రెట్టింపు చేసింది. కనిపించిన ప్రతిచోటా ముద్దు ల ముద్రలేస్తూ పళ్లతో గాటులు చేస్తూ అడిగాడు – “ఇదంతా
హింసే కదా!”
“ఇది హింసని తెలుస్తు న్నా… తరతరాలుగా, యుగయుగాలుగా స్త్రీ పురుషులు అభిలషిస్తు న్నారంటే బాధే సౌఖ్యమనే భావం. ఇంకో రకంగా
చెప్పాలంటే… ముక్కమూసుకుని తపస్సు చేసే మునులు కోరుకునే మోక్షం, స్వర్గం ఇదే. ఔను నిజం. సరస సౌందర్య
అప్సరసాభామినులైన రంభా ఊర్వశి మేనకల కౌగిళ్ల సుఖం అందించే స్వర్గం కోసమే కదా… మునులు తపస్సు చేస్తా రు. కామికానివాడు
మోక్షగామి కాడని తెలుసుకున్న నాడు… స్వర్గం ఎక్కడో కాదు, ఇక్కడే ఉంది. అందుకే… అంటున్నా ప్లీజ్! కదిలించకు ఈ స్వర్గం”
అంటూ ఆమె అతడ్ని మరింతగా కరుచుకుంది.
“ఎస్… నేనూ నిన్నో కోరిక కోరుతున్నా, డియర్… కరిగించకు ఈ స్వప్నం” అన్నాడతడు. అంతలో ఒక్కసారిగా నీటి అక్షింతలు వారిద్దరి
శిరసులపై చల్లగా జాలువారాయి. ఉలిక్కిపడి చుట్టూ చూసారిద్దరు.
పుచ్చపువ్వులా విరగగాస్తు న్న పున్నమివేళలో సముద్ర తీరంలో పడవ చాటున ఇసుక తిన్నెలపై ఒకరిపై ఒకరు. నీలాకాశం పందిరి కింద
చుక్కలన్నీ చూస్తూ పకపకమని నవ్వుతూ సందడి చేస్తుంటే… మంచులో తడిసిన వెన్నెల్లో తడిసి ముద్దవుతూనే తమ శోభన రాత్రికి కొత్త
శోభలద్దు తున్నారు. తెల్లగా నురగలు కక్కుతున్న ఓ కెరటం ఉవ్వెత్తు న ఎగిసిపడుతూ మరోసారి వారిద్దరిపై ప్రతాపం చూపింది.
ఉలికిపడుతూ ఒక్క ఉదుటున లేచింది లహరి. పక్కనే డబుల్ కాట్ బెడ్ పై గుర్రు పెట్టి నిద్రపోతున్న భర్త సాగర్.
మళ్లీ అదే కల. వెన్నెల్లో సముద్రతీరంలో శోభనం కల పెళ్లయి రెండేళ్లు గడిచి మొన్నటికి మొన్నే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్నా…
తాజాగా ఇప్పుడే తన మెడలో తాళిపడినట్లు . కొత్త పెళ్లికూతుర్లా సిగ్గుపడుతూ తొలిరాత్రి అనుభవం కోసం తపించిపోతున్నట్లు పదేపదే వచ్చే
అదే కల మళ్లీ ఇప్పుడూ తనకి ‘హాయ్!’ చెప్పింది.
అసలు కలలెందుకు వస్తా యి? ఆ కల వచ్చినప్పుడల్లా కొడవలిలా గుచ్చుకునే ప్రశ్నే… మళ్లీ లహరి మనసులో మెదిలింది.
“కోరికలు తీరక…” రెడీమేడ్ ఆన్సర్ కూడా ‘నేను’న్నానన్నట్లు పలకరించింది. నిజానికి, తన శోభనం సరికొత్త థీమ్ తో రొమాంటిక్ గా
సాగాలని కోరుకుంది. పెళ్లయిన వెంటనే బంధువుల సాక్షిగా గదిలో నాలుగ్గోడల మధ్య అమ్మమ్మ తాతయ్యలనాటి పాతకాలం
పందిరిమంచం మీద రొటీన్ గా తొలిరాత్రి జరుపుకోకూడదని ఎంతగానో ఆకాంక్షించింది. పెళ్లిచూపుల్లో సాగర్ చూసీచూడగానే మనసుకి
తెగనచ్చేసాడు.
‘తను సాగర్… నువ్వు లహరి. పేర్లు బాగా కుదిరాయి. సంబంధం కుదిరితే ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’లా ఉంటారు మీరిద్దరూ’ అంటూ
స్నేహితులు ఆట పట్టిస్తుండగానే… అతనన్నాడు- “ఓ అయిదు నిముషాలు తనతో మాట్లా డతాను” అని.
“మాట్లా డండి. పెళ్లికిముందే ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకోవడం మంచిదే” అంటూ పెద్దలంతా తప్పుకోవడంతో గదిలో లహరి,
సాగర్ మాత్రమే మిగిలారు.
“ఏం మాట్లా డతాడు? పెళ్లయిన తర్వాత జీవితాంతం ఒకరితో ఒకరు మాట్లా డకోవాల్సిందేగా. ఇప్పుడే… ఈ క్షణమే తనతో మాట్లా డాల్సిన
అత్యవసర అంశాలు ఏముంటాయి?” అతడితో ఏకాంతం అనగానే లహరి వెన్నులో వణుకు. “నెర్వస్ గా ఉన్నారు” అడిగాడతడు.
“నోనో… ఎందుకో నెర్వస్ గానే ఉన్నా” జవాబిచ్చింది లహరి. “ఫ్రీగా ఉండండి. నేనేం కొరుక్కుతినేయను” అన్నాడతడు. “అలాగే”
అన్నట్లు తలూపిందామె. మౌనంలో రెండు క్షణాలు ఖర్చయ్యాయి. తర్వాత అతడే చొరవ తీసుకుని అన్నాడు-“మీరు నాకు నచ్చారు.
ఆ విషయమే మీకే నేరుగా చెప్పాలనిపించి…”
ఆమె పెదవంచున నెలవంకలా చిన్నచిర్నవ్వు. కళ్లలో తళుక్కుమంటూ ఓ మెరుపు. చెక్కిలిపై సిగ్గుతో సన్నని ఎర్రని జీర.
“మరి మీరు చెప్పరేం?”
“ఏం చెప్పను?” నెమ్మదిగా అంది లహరి.
“నేను చెప్పినట్లే….”
“అంటే… నచ్చారనా?” ఆ సమాధానానికి కంగుతిన్నాడతడు. “మీరు నాకు నచ్చారు. నేను మీకు నచ్చాలని లేదు. నచ్చకపోతే అదే
విషయం చెప్పండి” అన్నాడు సాగర్. “ఊహూ….!”
‘ఆ మాటలకు అర్థమేంటీ?”
“నచ్చలేదని కాదు…”
“అంటే….”
“మీరూ నచ్చారు” అంది లహరి చిన్నగా తడబడుతూ. “థాంక్స్…”
“ఎందుకు?”
“మీకు నచ్చినందుకు. కుందనపు బొమ్మలా ఉన్న ఈ అమ్మాయికి నేను నచ్చుతానో లేదోనని తెగ ఇదైపోయాను. మీ జవాబుతో ఎవరెస్ట్
ఎక్కినంత ఆనందంగా ఉంది. అన్నట్లు … నేను ఎం ఎన్ సీ లో పని చేస్తు న్నాను. ఎక్కువగా నైట్ డ్యూటీలుంటాయి…” అంటూ తను
చేస్తు న్న జాబ్ వివరాలొక్కొక్కటిగా చెప్తు న్నాడు సాగర్. ఓపిగ్గా లహరి వింటోంది. జాబ్ నుంచి కాస్త ప్లా ష్ బ్యాక్ లోకి వెళ్లిన అతడు తను
చదివిన కాలేజీ, స్కూల్, ఫ్రెండ్స్ చూసిన సినిమాలు, తిరగేసిన నవలల్ని క్షణాల్లో నవిలేస్తా డు. అయినా, ఇంకా ఏదో చెప్పాలనే
తాపత్రయం. మనసులు ఇచ్చిపుచ్చు కోవాలనే తపనతో అలా అతడు మాట్లా డేస్తుండగానే… గంట గడిచిపోయింది.
“అయిదు నిముషాలంటే అబ్బాయిగారి దృష్టిలో అరవై నిముషాలా? ఆశ్చర్యపోవడం లహరి తండ్రి వంతైంది. సరిగ్గా అప్పుడే… లహరి
వెన్నెల్లో సమద్ర తీరంలో తొలిరాత్రి థీమ్ ని అతడి ముందుంచాలని సమాయత్తమవుతుండగా. ఇక లాభం లేదని సరాసరి ఆ గదిలోకి
వచ్చేసారాయన.
“ఏదో చెప్పాలనుకుంటున్నారు?” అడిగాడు సాగర్ గదిలోకి తండ్రితోపాటు మిగిలిన వాళ్లంతా ఒక్కసారిగా చొచ్చుకు రావడంతో ఆమె
గొంతులోని మాట గొంతులోనే ఉండిపోయింది.

ఆ తర్వాత ఎప్పుడూ ఆ మాట గొంతు దాటి పెదవిగడప మీదుగా బయటికి రానేలేదు. తర్వాత్తర్వాత సముద్ర తీరంలో ఫస్ట్ నైట్ థీమ్
ఓ రకంగా ఫాంటసీ అని తేలిపోయిన తర్వాత కూడా… కన్రేప్పల్ని కాటేసి నిద్రలో అలవోకగా అదే కల… పదేపదే పలకరిస్తోంది లహరిని.
‘ఎంత బాగుందో ఆ కల. వాస్తవం కాకున్నా ఆ స్వప్నం మత్తు గా, గమ్మత్తు గా ఉంది. రొటీన్ గా మొునాటనీలా సాగే దైనందిన
జీవితానికి ఓ ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అందిస్తూ రేపుకి కొత్త ఊపిరులూదుతోంది ఆ కల. అంతశ్చేతనలో ఎక్కడో ఏ మారుమూలో
ప్రాణంతో కొట్టు మిట్టా డుతూ వరించి వస్తు న్న ఆ స్వప్నాన్ని రావొద్దంటూ నిరోధించడమెందుకు? నవ్వుకుంది లహరి. సరిగ్గా అప్పుడే…
ఆమెకు గుర్తోచ్చింది ఆత్రేయ పాటలోని ‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు?’ అనే ఆ వాక్యం.
ఔను… కమ్మని కల అమ్మ లాంటిది. చక్కగా జోలపాడి జోకొడుతుంది… అనుకుంది లహరి.
“ఓసారి మనం విశాఖ వెళ్లా ద్దా మండీ” అడిగింది లహరి.
“అక్కడ మనకెవరున్నారు? ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇక్కడే ఈ ఊళ్లోనే సెటిలయ్యారంతా వీకెండ్స్ లో ఒకర్నొకరం పలకరించుకుంటున్నాం”
అన్నాడు సాగర్ ఒళ్లో ఉన్న లాప్ ట్యాప్ మీద వర్క్ చేస్తూ, ఈ మధ్య కాలంలో ఫ్లా ట్ నుంచి అస్సలు కదలడం లేదతడు. “వర్క్ ప్రం
హోం” చేస్తు న్నాడు. మెగాసిటీలో ఎన్ని ఫ్లయ్ఓవర్లు కట్టి దూరాల్ని దగ్గర చేస్తు న్నా… ట్రాఫిక్ పంజరంలో ఇరుక్కుపోతున్న కాలాన్ని
కాపాడలేక పోతున్నారు. హై టెక్ సిటీకి వెళ్లి రావడమంటే నరకాన్ని తలపిస్తుంటే… సాగర్ పనిచేస్తు న్న ఎం ఎన్ సీ యాజమాన్యం
‘సోహో’… ప్రపోజల్ ని ముందుకు తెచ్చింది.
‘సోహో’. ఎస్.ఓ…హెచ్..ఓ’ అనే ఆంగాక్షరాల్ని క్లు ప్తికరిస్తే వచ్చే సోహో అంటే ‘సెల్స్ ఆపీస్…హోం ఆపీస్’ అనే అర్థం. ఎం ఎన్ సీ
లో పని చేస్తు న్నా… ‘వర్క్ ప్రం హోం’ని ప్రోత్సహిస్తూ ‘సోహో’ భావజాలాన్ని దత్తతకి తీసుకుంది ఎం ఎన్ సీ . అందువల్ల…
ఇంటిదగ్గర్నుంచి కదిలే అవసరం సాగర్ కి రావడం లేదు. దాంతో… పొద్దస్తమానం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ… విసిగేసినప్పుడు
క్రిచెన్ లోకి లహరి దూరితే… ల్యాప్‌ట్యాప్ లోకి ముఖాన్ని దూర్చేస్తూ సాగర్, బ్యాంక్ లావాదేవీలతో సహా… అన్నీ ఆన్‌లై న్ సేవలే రైస్ బ్యాగ్
మొదలుకుని వెజిటబుల్స్ వరకూ ఆర్డర్ చేసిన హాపెనవర్లో ఇంటి ముంగిట్లో వాలే సౌలభ్యం అందుబాటులోకి వచ్చాక… లహరి
‘అసూర్యంపశ్య’లా మారిపోయింది.
“చెప్పు… వైజాగ్ లో ఎవరు ఉన్నారు?” మళ్లీ అడిగాడు సాగర్.
“నీ ఫ్రెండా?.” నాకు తెలీని అక్కడ. నీకెవరున్నారబ్బా?” ఆలోచిస్తు న్నాడు సాగర్. “నాకు తెలిసి… నీ జీవితంలో నువ్వెప్పుడూ
హై దరాబాద్ పొలిమేరలు దాటలేదు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదివి…” అతడు చెప్తుండగా ఆమె అడ్డు తగిలి-“ఇక్కడే పెళ్లిచేసు
కుని… ఇదే ఫ్లా ట్ లోనే చస్తా ను” సడన్ గా లహరి కళ్లలో కన్నీరు చిమ్మింది.
“అంత ఎమోషనల్ గా ఎందుకు ఫీలవుతున్నావు?” అడిగాడు సాగర్ దగ్గరగా వచ్చి ఆమెని హృదయానికి హత్తు కుంటూ.
“ప్లీజ్! ఈ లైఫ్ బోర్ కొడ్తోంది. ఇంకొన్ని రోజులు ఇలాగే గడిస్తే నేనిక్కడుండను”
“ఇక్కడ కాకుండా మరెక్కడుంటావ్?”
“మెంటల్ ఆస్పత్రిలో…”
“పిచ్చిదానా? ఏమైంది నీకు?”
“మీరన్నదే. రోజురోజుకి నాకు పిచ్చిపడుతోంది. ఆకాశ్నాంటే ఈ ఆపార్ట్‌మెంట్‌లో ఆఖరి అంతస్తు లోని ఈ ఫ్లా ట్ లోకి అడుగుపెట్టిన తొలి
క్షణాల్లోని ఆనందమంతా రాన్రానూ ఆవిరైపోగా… ఇప్పుడు క్షణక్షణం బతుకు భరించరానంత భారంగా మారిపోయింది. అసలు ఫ్లా ట్ నుంచి
కిందికొచ్చి ఎన్నాళ్లు . ఎన్నేళ్లయిందో ఒక్క నాకే కాదు. పక్కగదిలో ఇంటర్నెట్ ముందు కూర్చుని ట్వంటీఫోర్ ఇంటూ సెవన్ని అలవోకగా
ఖర్చు చేసేస్తు న్న మీకూ బహుశా గుర్తు లేదేమో? మాటలు లేవు… మాట్లా డు కోవడాలు లేవు. కానీ, రోజులు, వారాలు, నెలలు,
సంవత్సరాలు ఇట్టే ఈదేస్తు న్నాం. చూసిన దృశ్యాలే చూస్తూ… బోర్ కొడ్తోంది ఓ సినిమా లేదు షికారు లేదు చెప్తోంది లహరి.
“కంప్యూటర్ ఉంది. ఇంటర్నెట్ ఉంది. కావాల్సినన్ని సినిమాలు చూడొచ్చు. ఇప్పుడు కంప్యూటర్ శకం. ఒకే ఒక్క క్లిక్ తో అరచేతుల్లో
ప్రపంచం ఉంది. అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకోవడంలోని ఉదాసీనతవల్ల ప్రపంచం దూరమైందన్న బాధతో
మాట్లా డుతున్నావు. ఎలక్ట్రా నిక్ యుగంలో బతకడంలో ఎంతో సుఖం ఉంది. అర్ధం చేసుకోవు” ఊరడిస్తు న్నాడు సాగర్ రాత్రి ఏడుగంటల
సమయం అనుకోకుండా కరెంట్ పోవడంతో నీలాకాశాన్ని తలపిస్తూ రూఫ్. రేడియం కాంతులీనుతూ నక్షత్రాలు. మధ్యలో అతి కృతకంగా
నెలరేడు.
అంత చీకట్లోనూ వెన్నెల్లా నవ్వింది లహరి. “ఆధునిక మానవుడు ఆకాశాన్ని దించాడు. నెలవంకను తుంచాడు. చుక్కల్ని దోసిట్లో
నింపాడు. ఇంట్లోని పైకప్పే ఇన్ని కాంతులీను తుందని ఎన్నడైనా కలగన్నామా?” చెప్తుండగానే… బయట కుండపోతగా వర్షం. “బయట
వర్షం. ఇంట్లో వెన్నెలాకాశం. నక్ష త్రాల గొడుగు. నిజానికి ఒకటొస్తే మరొకటుండదు. కానీ… వెన్నెలనీ అనుభవిస్తూ… వర్షం తెచ్చే హరాన్నీ
అందుకోవడం సూపర్బ్” అంటూ ఆమె భుజాలపై చేతులు వేసాడు సాగర్.

“ఇప్పుడే తెలిసింది పిచ్చి నాక్కాదని” అంది లహరి.


“మరెవరికి?”
“నీకు ఔను. నీకే పిచ్చి కాకుంటే మరేంటి? వైజాగ్ లో ఎవరున్నారని అడిగావు కదూ! నింగి నీలాన్ని తనలో కలిపేసుకుని మెస్మరైజ్ చేసే
నీలాల సముద్రముంది. తెల్లగా నురగలు కక్కే కెరటాలతో అంబరాన్ని తాకే సంబరంతో సముద్రముంది. తనని చూసేందుకు వచ్చే ప్రతి
ఒక్కర్నీ సాదరంగా స్వాగతించి కాళ్లు కడిగి ఆతిధ్యమిచ్చి సత్కరించే సముద్రమది. ఓసారి ఎక్స్‌కర్షన్ కి వెళ్లినప్పుడు అక్కడి సముద్ర
తీరంలోని ఇసుకతిన్నెల్లోనే వదిలి వచ్చిన పాదముద్రల్ని మళ్ళీ ఇప్పుడో సారి తనివితీరా చూసుకోవాలనిపిస్తోంది. అక్కడ నీటితో తడిసిన
గాలిని పలకరించాలనిపిస్తోంది. అలల ఊయలలూగే పడవల్లో వేటకి వెళ్లే గంగ పుత్రు ల్ని చూడాలని ఉంది. అంతేకాదు.. ఓ పున్నమి
రాత్రంతా సముద్రతీరంలో వెన్నెల్లో తడిసి ముద్దవాలనిపిస్తోంది. నేను నీ చేతిలో చేయి ఉంచితే, నువ్వు నీ చేతిని నా నడుం చుట్టూ వేసి
సుదూరతీరాల అంచులదాకా జంటగా నడవాలని ఉంది. నేను నీ భుజం మీద తలాన్చితే నువ్వు నా చెక్కిలిపై మునివేళ్లతో ప్రేమ
సంతకాలు చేస్తుంటే ఆ అనుభూతిని వర్ణించడం ఏ భవభూతికైనా సాధ్యమా? ఈ జీవితంలో ఇవన్నీ తీరని కోరికలా సాగర్” అడిగింది
లహరి.
“ఒకరికొకరం దగ్గరగానే ఉన్నాం. కానీ, కనిపించని దూరం మనిద్దర్నీ వేరు చేస్తోంది. ఏకశయ్యపై ఉన్నా ఎప్పుడో కాని దగ్గరవడం లేదు.
ఆ వైపు తిరిగి నువ్వు పడుకుంటే. ఈ వైపు తిరిగి నేను పడుకుంటున్నాను. పెళ్లిచూపుల్లో ఒకర్నొకరు నచ్చుకున్న మనం అంతలోనే
ఇంత దూరమెందుకవుతున్నాం? ఒక్కసారి ఆలోచించు సాగర్. ఒకరి స్పర్శ ఒకరికి రొటీన్ గా మారిపోయింది. మొదట్లో వేలి చివర్లు
తగిలితేనే మేనంతా విద్యుత్ ప్రకంపనలు. మరి ఇప్పుడో. ముట్టు కున్నా గట్టిగా హత్తు కున్నా మొనాటనీ, అడపాదడపా అర్ధరాత్రి దగ్గరితనం
తప్పనిసరి తంతుగా మారిపోయింది. మన మధ్య మేజిక్ అదృశ్యమైందా? వయసైపోయిందా? ముసలితనం మీద పడిందా? ఇవేవీ
కానేకావు. మన లైఫ్ స్టైలే మన పై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఆధునికత పేరుతో ఎంత హై న్యంగా బతుకుతున్నాం. హై దరాబాద్ లో
ఉంటూ మనమూ సముద్రాన్ని చూస్తు న్నాం. టీవీల్లో సినిమాల్లో సముద్ర ఉత్తుంగ తరంగాల్ని వీక్షిస్తు న్నాం. అంతేకాని, అనుభవించడం
లేదు. తడిపొడి ఇసుకల్లో నడుస్తూ ఉరికొచ్చే కెరటాలతో పాదాల్ని తడుపుకోవడం లేదు. నీడల్ని మాత్రమే చూస్తు న్నాం. అదే అనుభవం
అనుకుంటున్నాం. అలాగే, ఆకుపచ్చని ప్రకృతి అందాల్ని చూడడం లేదు. ఎంతసేపూ ఆపార్ట్‌మెంట్‌లో కూచుని బతుకీడుస్తు న్నాం.
బతకడం వేరు. జీవించడం వేరని ఎప్పటికి తెలుసుకుంటాం మనం. వెంటనే వైజాగ్ కి టికెట్లు బుక్ చేయి. ఓసారి వెళ్లివద్దాం” బలవంత
పెట్టింది లహరి.
“ఏం చూస్తు న్నావు?”
“నిన్ను… నీ అందాన్నీ తడిసి ముద్దయిన పల్చటి ఈ తెల్లచీరలో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా?”
“ఔనా?”
“ఔను.ఉవ్వెత్తు న లేచి మనపై విరిగిపడిన ఆ కెరటానికి థాంక్స్. నీటి ఉలితో నిన్నూ నిలువు నా చెక్కింది. తడిచీర అతుక్కోవడంతో జల
శిల్పంలా చూడ ముచ్చటగా ఉన్నావు. శరీరంలో ఏ వంపులెక్కడెక్కడున్నాయో స్పష్టంగా తెలిసిపోయింది. పయ్యెదచాటు పరువాలు
నేత్రపర్వంగా ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఎంత పనిచేసాడో? నిన్నిలా చూస్తుంటే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తోంది నాకు” అంటున్నాడు సాగర్.
వైజాగ్ చేరుకున్న వెంటనే ఓ లాడ్జిలో దిగారు. ఫ్రెష్ అయి ఉదయాన్నే రామకృష్ణ బీచ్ కి చేరుకున్నారు. సముద్రాన్ని చూడగానే
తప్పిపోయిన బిడ్డ తల్లి దగ్గరికి చేరుకున్నట్లు లహరి పరుగుపరుగున కెరటాల మధ్యకి చేరుకుంది. ఒక్కో కెరటం విరుచుకు పడుతుంటే…
చిక్కకుండా, దొరక్కుండా కాసేపు తప్పించుకు తిరిగింది. అంతలో ఓ పెద్ద కెరటం వచ్చి ఆమె కాళ్లను, చీర కుచ్చిళ్ళను తడి పేసింది.
నీళ్లు చల్లగా తాకుతుంటే ఆమె ప్రాణం లేచివచ్చినట్లయింది. ఒక్కో అల అభిషేకించి వెనక్కి వెళ్తుంటే… కాళ్ల కింద ఇసుక తరిగిపోతూ తడి
లోయలోకి పడిపోతున్న అనుభూతి. కొంచెం కొంచెంగా ముందుకు మున్ముందుకు వెళ్తుంటే ఆమె చేతిని వెనక్కి లాగుతూ సాగర్.
“లహరీ… ఇంకా ముందుకు వద్దు ” జాగ్రత్త చెప్తు న్నాడతడు.
“మరేం ఫర్వాలేదు. సముద్రం చుట్టం. మన లేమీ చేయదు” అంటూ వెళ్తుంటే ఓ కెరటం ఆమెని నిలువునా తడిపేసింది. ఒక్కసారిగా
వంద బిందెల నీళ్లు గుమ్మరించినట్లయి ఆమె ఉక్కిరిబిక్కిరైంది. అప్పుడామె సాగర్ దృష్టిలో సాగరకన్యలా భాసించింది. తడుస్తూ ఒంటి
మీదే బట్టలారబెటుకుంటూ మళ్లీ మళ్లీ తడుస్తూ లహరి, సాగర్ లు గంటలు గంటలు గడిపేసారక్కడే. దగ్గర్లోని హోటల్లో లంచ్ ఫినిష్
చేసి మళ్లీ సముద్రు డితో ఆటల్లో మునిగిపోయారు.
సాయంత్రమైంది. రాత్రయింది.
“రూంకి వెళ్దా మా? మళ్లీ రేపు ఇక్కడికి వద్దాం” అన్నాడు సాగర్.
“రూంకి వెళ్లోద్దు ” చిన్నపిల్లలా మారాం చేసింది లహరి.
“మరి…”

“రాత్రి ఇక్కడే గడిపేద్దాం. అన్నట్లు ఇవాళ కార్తీక పున్నమి” అంది లహరి. ఎం ఎన్ సీ జాబ్ కావడంతో… కార్తీక శ్రావణాల్ని ఎప్పుడో
మరిచి పోయాడు సాగర్.
“సాగర్… ఉన్నచోటునే నిల్వనీరులా ఉండి పోతే ఎలా? అలా అలా అలలా ఎగిసిపడాలి. జీవితాన్ని నిలువునా తడిపి ముద్దచేయాలి.
నిట్టూర్పుల సెగలో ఆరబెట్టు కోవాలి. మధ్య మధ్యలో వెన్నెల్లో స్నానించి ఫ్రెషవ్వాలి. అప్పుడే లైఫ్ బోర్ కొట్టదు. నవ్యోత్సాహంతో మరింత
ముందుకు సాగే శక్తిని సొంతం చేసుకోగలుగుతాం” అంది.
“అన్నట్లు లైఫ్ బోర్ కొడ్తోందంటే ఏంటో తెలుసా?”
“చెప్పు”
“బోర్ కొట్టడమంటే బతుకుపై విరక్తి కలగడం. అంటే బతికున్నా చావుతో సమానం. అలాంటి బతుకు మనకొద్దు . ఎప్పటికప్పుడు
బతుకుని రీచార్జ్ చేసుకోవాల్సిందే. ఇవాళ మనిద్దరం అదే చేద్దాం”.
అంతే! సాగర్ మారుమాట్లా డలేదు. ఆ రాత్రి వారిద్దరూ అక్కడే మకాం వేసారు. సముద్రతీరంలో ఇసుకతిన్నెల్లో పడవచాటున
పక్కవేసారు.
‘అబ్బా! మధురాలొలికే ఆమె అధరాలపై నెత్తు టి గాయం.
“ఏమైందీ?” అడుగుతూనే ఆపుకోలేని తమకంతో ఆమె పెదాల్ని మరోసారి బలంగా కొరికాడతడు. “నీ మునిపంటి గాటుకి నా పెదాలు
చిట్లా యి. రక్తం” అంది ఆమె ప్రతిగా ప్రతీ కారంతో అతడి చెవిని గట్టిగా కొరుకుతూ. “అయ్యో… నొప్పి?”
“బాధగా ఉందా?” ఆమె అడిగింది… అంత లోనే… “చేదూ ఓ రుచిలా… ఆ బాధ కూడా తీయగా ఉంది కదూ” అంటూ అతడిని
మరింత దగ్గరగా లాక్కుంది. ఆ చొరవకి ముగ్దు డవుతూ తనంటూ లేకుండా ఆమెలో లీనమయ్యేందుకు రహస్య దారుల్ని
అన్వేషిస్తు న్నాడతడు. వారిద్దరిపై పున్నమి వెన్నెల వర్షిస్తోంది.

You might also like