You are on page 1of 14

“ఎంత బావుందీ వెన్నెల”అన్నాడు మధు.

ప్రక్కన కూర్చుని కునికిపాట్లు పడుతున్న శైలజ ఆవులిస్తూ “బాహనే వుంది ల్హెండి” అంది
కళ్ళు తెరవకుండానే.
ఫ్రీ వే మీద కారు డెబ్భై మైళ్ళ వేగంతో వెళుతోంది.
“అబ్బ లెద్దూ …నాకు బో రు కొడుతోంది. లేచి ఒక్కసారలా ఆకాశం వంక చూడు ఎంత
బావుందో” అంటూ, కుడి చేత్తో మూన్రూ ఫ్‌ఓపెన్‌చేసాడు.
పున్నమిలా వుంది. చంద్రు డు నిండుగా నవ్వుతున్నాడు.
వెన్నెల నవ్వుల వరదలో కొట్టు కు పో యినన్ని చుక్కలు కొట్టు కుపో గా, మిగిలినవి ఒక దానితో
ఒకటి పో టీ పడుతూ, చందమామను ఇంప్రెస్‌చేయడానికన్నట్లు రోజూ కంటే బాగా
మెరుస్తు న్నాయి. దూరం నుంచీ ఓ తారక తన ఓణీని విసిరింది చందమామను వలలో
వేసుకోవాలని.
“బాగా అలసటగా వుందండి” అంది శైలజ కళ్ళు తెరుస్తూ .
“కళ్ళు మూసుకుంటే అలాగే వుంటుంది. లే…లేచి పాటలేమైనా ప్లే చెయ్యి” అన్నాడు మధు,
లేన్‌ఛేంజ్‌చేస్తూ .
“మంచి పాటలేమున్నాయబ్బా …” అని కెస్సెట్లు , సీడీ లు వెదుకుతూ
“పాత పాటలా… కొత్త పాటలా ” అడిగింది శైలజ.

లాస్‌వేగస్‌లో వీకెండు గడిపి, ఆదివారం రాత్రి ఫీనిక్స్‌కు బయల్దే రారు .


“ఏ వైనా పర్లేదు. కొంచెం శ్రా వ్యంగా వుండేవి పెట్టు …పాత వేమైనా వున్నాయా?”
“ఇదేదో బాగా పాతపడినట్లుంది. ఇది ప్లే చేయనా… “అంటూ, బాగా పాతగా కనిపిస్తు న్న
కెస్సెట్టు ను తీసి, ప్లే యర్‌లో పెట్టింది.
మనసున మల్లె ల మాలలూగెను… పాట మొదలయింది.
“శైలూ, మన పెళ్ళైన కొత్త ల్లో … మనమిక్కడకు రాబో యే ముందు, ఓ రోజు మీ మేడ మీద
వెన్నెలలో…”
“అబ్బ ఇప్పుడవన్నీ ఎందుకు గుర్తు చేస్తా రు…”అంది సిగ్గు నభినయిస్తూ .
శైలజ మత్తు కొంచెం తగ్గింది.
“ముందు మల్లె పూల గుబాళింపు, ఆ వెనక తెల్ల చీరలో, బరువుగా వాలబో తూన్న
కనురెప్పల వెనుక గమ్మత్తు గా మెరిసే కళ్ళతో…అప్పుడే ఆకాశంలోంచి జారిన వెన్నెల
ముద్ద లా … అప్సరసలా…”
నిద్ర మత్తు పూర్తిగా ఎగిరిపో యింది.
“అబ్బాయిగారికి లాస్‌వేగస్‌దెబ్బ బాగానే తగిలినట్లుంది…అన్నట్లు మన మిక్కడికి వచ్చేక
ఎప్పుడైనా ఓ మూరెడు మల్లె పూలు తెచ్చారా?”
“మల్లె పూలా? ఇక్కడ దొరుకుతాయా?” అడిగేడు ఆశ్చర్యంగా.
“ఎందుకు దొరకవ్‌. మీకు తేవాలనే ఇంట్రెస్టు వుండాలేగానీ…” అంది శైలు.
” నిజంగా దొరుకుతాయా?”
“నిజమేనండీ బాబు…అయినా భార్య మీద ప్రేముంటే అడవిలో వున్నా మల్లె లు తేవొచ్చు”
“నీకు పుణ్యముంటుంది గానీ, ప్రేమకు ఈ మల్లె పూలకు లింకు పెట్టొ ద్దు డియర్‌… కొన్ని
విషయాల్లో అమెరికా అడవికంటే ఘోరం “అన్నాడు మధు.
“నాకవేమీ తెలియవు. మీగ్గా నీ నామీద నిజంగా ప్రేముంటే … రేపు సాయంత్రా నికల్లా నాకో
మూరెడు మల్లె పూలు తేవాలి” చెప్పింది ఇక అదే ఫైనలన్నట్లు .
“అబ్బ ఎప్పుడూ నువ్వింతే! ఒకవేళ దొరక్క పో తే?”
“సింపుల్‌… నామీద నీకు ప్రేమ లేనట్లే ”
“మరోసారి ఆలోచించవూ?” ప్రా ధేయపడుతూ అడిగేడు.
“ఇక ఆలోచించడానికేమీ లేదు. రేపు సాయంత్రం మల్లె పూలు తేకపో యారో అప్పుడు చెబుతా
మీపని!”అంది శైలజ బెదిరిస్తు న్నట్లు .
“పో నీ నాలుగైదు రోజులు గడువివ్వరాదూ?”
“నాలుగైదు రోజులా …సరే… అలాగే కానీండి” అంది శైలజ వుదారంగా.
ఇదంతా గమనిస్తు న్న చందమామ మబ్బు చాటుకు వెళ్ళి పక పకా నవ్వాడు. చుట్టూ వున్న
చుక్కలు దేనికది, తమను చూసే మామ నవ్వేడని, ఆనందంగా మెరిసే కళ్ళతో నవ్వడం
మొదలెట్టా యి.

000000000000000000000000000000000000000000000000000000000000000000
0000000000్‌
మర్నాడు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఫ్లో రిస్ట్‌దగ్గర ఆగి “జాస్మిన్‌లున్నాయా?”
అనడిగేడు మధు.
“ఏ జాస్మిన్‌లూ?”అడిగేడు పూల షాపతను, ఇంగ్లీషులో మెక్సికన్‌ యాసతో.
ఓహో వాటిలో వెరైటీలు కూడా వుంటాయా అనుకుని, “ఏ జాస్మిన్లు న్నాయి మీ దగ్గర”
అడిగేడు.
“ప్రస్తు తానికైతే ఏరకమూ లేవు. మీకే రకం కావాలో చెబితే తెప్పిస్తా నికి ప్రయత్నిస్తాం”
చెప్పాడు వినయంగా.
“ఎన్ని రోజుల్లో అందిస్తా రు?” అడిగేడు.
“మీక్కావలసిన వెరైటీ బట్టి ఎంత టైము పడుతుందో చెప్పగలను”అన్నాడు షాపతను,
కంప్యూటర్‌కీ బో ర్డు మీద వేళ్ళతో నొక్కుతూ, స్క్రీను మీద చూస్తూ .
మళ్ళీ మొదటికొచ్చాడు వీడు. లాభంలేదు వీడ్నే అడిగేద్దాం అనుకుని,”ఇంతకీ జాస్మిన్ల లో
ఏమేం రకాలున్నాయి” అడిగాడు మధు.
“స్పానిష్‌, ఇటాలియన్‌, యేషియన్‌స్టా ర్‌, వైట్‌జాస్మిన్‌, వింటర్‌ జాస్మిన్‌, ఇండియన్‌,
షో వీ జాస్మిన్‌…” స్పీడుగా, గుంటూరు శంకర్‌విలాస్‌హో టెల్లో సర్వరు వేడిగా ఏమున్నాయో
ఏకరువు పెట్టినట్లూ .
ఇండియన్‌అన్న శబ్దం వినగానే, కావలసింది దొరికినట్లు ఫీలై, “అద్గ దీ… నాకు ఇండియన్‌
జాస్మిన్లు కావాలి” అన్నాడు మధు.
“అవి దొరకడం బాగా కష్టమనుకుంటాను” అని వాచీ చూసుకుని, “మీ నంబరు ఇస్తే , వాటి
గురించి కనుక్కుని మీకు ఫో ను చేస్తా ను” అన్నాడు షాపతను.
నంబరిచ్చి, ధాంక్స్‌చెప్పి, తప్పకుండా కనుక్కుని ఫో ను చేయమని చెప్పి బయట పడ్డా డు
మధు.

ఇంటికి వెళ్ళగానే “ఏమండీ తెచ్చారా మల్లె పూలు?” అడిగింది శైలజ.


షాపులో దొరకలేదని చెప్పటానికి మనసొ ప్పక, “ఈ రోజు వర్కు దగ్గర లేటైంది శైలూ. రేపు
తెస్తా ను” అన్నాడు అలసట నటిస్తూ .
“అయ్యో… మీరు పూలు తెస్తా రని గంపెడు ఆశతో ఎదురు చూస్తు న్నా” అందామె
డిసప్పాయింటుగా.
“రేపుతప్పకుండా తెస్తా గా…” అన్నాడు మధు, కొంచెం విసుగ్గా .
రేపు తేకపో యినా పర్లేదుగానీ, ఎల్లుండు కూడా చేతులూపుకుంటూ ఇంటికి వస్తే , అప్పుడు
చూపిస్తా నా తఢాకా, అనుకుంది శైలజ మనసులో.

000000000000000000000000000000000000000000000000000000000000000000
0000000000్‌

మరుసటి రోజు ఇంటర్నెట్‌లో వెదికాడు మల్లె పూల గురించి.


సమాచారమైతే పో గయిందిగానీ, మధుకు వుపయోగపడే వివరాలు దొరకలేదు. కొన్ని పూల
షాపుల సైటు అడ్రెస్‌లను బుక్‌మార్కుల్లో దాచుకుని, లంచ్‌టైం లో, చుట్టూ ఎవరూ లేకుండా
చూసుకుని, కొలీగ్‌ ఏంజెలా దగ్గరకు వెళ్ళాడు మధు.
నవ్వుతూ ఆమెను విష్‌చేసి, “మల్లె పూలు ఎక్కడ దొరుకుతాయో నీకు తెలుసా?” అని
అడిగేడు.
“మల్లె పూలా ఎందుకు” అడిగిందామె.
“వూరికే …” అన్నాడు మధు, ఆలోచిస్తూ .
“అలాగా. అయితే నాకు తెలియదు” చెప్పిందామె సాలోచనగా.
ఓహో అలా వచ్చావా అనుకుని, “వూరికే అంటే వూరికే కాదుగానీ, ఓ చిన్న పనుండి”
అన్నాడు.
“ఏం పనీ ” అడిగింది ఏంజెలా, కొంచెం దీర్ఘం తీస్తూ .
ఏ విషయాన్నైనా మనకెందుకులెమ్మని వదిలిపెట్టే రకం కాదు ఏంజెలా.
పెళ్ళాం జడలోకని చెబుదామనుకుని, ఆ కాన్సెప్ట్‌ఆమె కర్ధమయ్యేలా చెప్పేంత ఓర్పూ, నేర్పూ
లేక పూజ కోసమని చెబుదా మనుకున్నాడు. కానీ, “ఏం పూజ, ఏ దేవుడికి పూజ,ఆ దేవుడి
పేరును మీ భాషలో ఎలా రాస్తా రు, సంస్కృతంలో అయితే ఎలా రాస్తా రు, ఆ దేవుడి
మహత్తు లేమిటి, పుట్టు పూర్వోత్త రాలేమిటి” అంటూ నాన్‌స్టా పుగా ఆమె అడగబో యే
ప్రశ్నావళి గుర్తొ చ్చి భయమేసి ఇంట్లో ఫ్ల వర్‌వేజ్‌లోకని చప్పున చెప్పేడు మధు.
“ఫ్ల వర్‌వేజ్‌లోకి మల్లె పూలా?” అంటూ ఓ రకంగా చూసి, కుర్చీలో రిలాక్స్డ్‌గా కూర్చుని, “ఇక
ఇప్పుడు చెప్పు … మల్లె పూలను వేజ్‌లో ఎలా వుంచుతావో” అడిగింది.
అంటే విషయం సమగ్రంగా తనకర్ధమయ్యేంత వరకు వదలదన్న మాట.
మధు మాట్లా డకపో యేసరికి, మళ్ళీ తనే అంది “గులాబి పూలో, బంతి పూలో పెట్టు కోవచ్చు
కదా? ప్రత్యేకంగా మల్లె పూలే ఎందుకు పెట్టా లనుకుంటున్నారు” అనడిగింది.
తిక్క పుట్టి అందామనుకున్నాడు కానీ బాగోదని, ఓ వెర్రి నవ్వొకటి నవ్వి “మల్లె పూలైతే
మంచి వాసనొస్తా యని” చెప్పేడు.
“అలాగా … అయిడియా బాగానే వుంది. వాసన కోసమే అయితే, మామూలు పూలేమైనా
పెట్టి జాస్మీన్‌స్ప్రే చల్లితే సరిపో తుందికదా?” ఎలావుంది ఈ అయిడియా అన్నట్లు చూసింది.
“సరిపో దు. గులాబీలు మల్లె ల వాసనేస్తే ఎబ్బెట్టు గా వుండదూ?” అన్నాడు మధు.
“అలాగైతే ప్లా స్టిక్‌పూలు లతలతో సహా వాల్‌మార్టు స్టో రులో దొరుకుతాయి. వాటిలోంచి
పూలున్న మల్లె తీగొకటి కొని, దాన్ని వేజ్‌లో వుంచి పైన దట్టంగా జాస్మీన్‌స్ప్రే కొట్టెయ్‌”
అందామె.
ఒప్పుకోక పో తే ఇంకెంత సేపు వాయిస్తుందోనని, “అబ్బ ఎంత గొప్ప సొ ల్యూషన్‌. అద్భుతం .
ఆహా…ఓహో … చాలా ధాంక్స్‌ఏంజెలా” అంటూ మొహంలో సంభ్రమాశ్చర్యాలను ప్రకటించేడు
మధు.
” ఈ విషయంలో ఇంకేమైనా డౌట్సు వుంటే మొహమాట పడకుండా అడుగు”అందామె
నవ్వుతూ.
“తప్పకుండా… మళ్ళీ కలుస్తా ను” అంటూ తన సీటు దగ్గరకొచ్చేడు.
ఛా … ఇల్లాంటి వాళ్ళతో లాభం లేదనుకున్నాడు.
మన వాళ్ళనెవరినైనా అడిగితే కాస్తో కూస్తో ముందుకు వెళ్ళొచ్చనుకున్నాడు.
సాయంత్రం ఆఫీసునుంచి రాబో యే ముందు, ఈస్టు కోస్టు లో వున్న ఫ్రెండు చలపతికి కాల్‌
చేసేడు, అతనేమైనా ఐడియా ఇస్తా డేమోనని.
చలపతి వాళ్ళావిడ సీత ఫో నెత్తింది. “ఆయన బయటకు వెళ్ళారన్నయ్యగారు. ఓ గంటలో
వస్తా రు. ఏమైనా అర్జంటు పనా” అడిగింది.
పూల గురించి చలపతి కంటే వాళ్ళావిడకే ఎక్కువ నాలెడ్జి వుంటుందని, ఆమెనే అడిగేడు
“మల్లె పూలు అమెరికా లో దొరుకుతాయా” అని.
“ఏమో నండి. నేనైతే ఎక్కడా చూళ్ళేదు. ఇంతకీ వదినేమైనా కావాలని అడుగుతోందా” అంది
నవ్వుతూ.
“అబ్బే తనకు కాదు. ఈ వీకెండు చిన్న పూజ చేయిస్తు న్నాం. దాని కోసం” కాజ్యువల్‌గానే
అబద్ద మాడేడు.
“ఏం పూజన్నయ్య గారూ? నేనిందాక మాట్లా డినప్పుడు వదిన పూజ గురించి నాతో ఏమీ
చెప్పలేదే… నేను మళ్ళీ
శైలజకు ఫో ను చేసి కనుక్కుంటాను లెండి. ఈయన వచ్చేక మీకు ఫో ను చేయమని
చెబుతాను” అంటూ ఫో ను పెట్టేసింది.
మల్లె పూల గురించి ఎన్ని అబద్దా లాడాల్సి వస్తోంది? ఎవరిగొయ్యి వాళ్ళు తీసుకోడమంటే ఇదే
కాబో లు నను కున్నాడు మధు. నిద్ర పో తున్న భార్యను లేపి, అప్పుడెప్పుడో జరిగిన
విషయాల్ని ఆవేశంతో గుర్తు చేసి… పైగా మల్లె పూలను గురించిన పాటల్ని వినిపించి… ఛా
ఇంకెప్పుడూ ఇల్లాంటి పనులు చేయకూడదు …శబ్ద మయ్యేలా చెంపలేసుకున్నాడు మధు.
సమయానికి బద్రి వాళ్ళు కూడా లేరాయె ఏదైనా ఉపాయం చెప్పడానికి.
ఇంకెవరున్నా రబ్బా కనుక్కోడానికి ఆలోచనలో పడ్డా డు మధు.

ఓసారి ఇండియన్‌గ్రో సరీ స్టో రులో కూడా ప్రయత్నిద్దా మని బయల్దే రాడు.
స్టో రులో వాళ్ళు పూలెందుకని అడిగితే ఏమని చెప్పాలి? పూజ అని చెప్పాలా, లేక ఏదో
వైద్యానికని చెప్పాలా? పూజంటే మళ్ళీ ఏం పూజ, ఎక్కడ చేయిస్తు న్నారు లాంటి ప్రశ్నలు
రావచ్చు. పైపెచ్చు అక్కడ ఏవైనా తెలిసిన మొహాలు కనిపించి, పూజ గురించి విన్నాయంటే
… సవాలక్ష ఆరాలు! వైద్య మన్నా చిక్కే. ఏం వైద్యం? ఎవరికి రోగం… ఈ పూల ఖర్చు కూడా
ఇన్సూరెన్సు కవర్‌చేస్తుందా అంటూ ఇంటర్వ్యూలు మొదలెడతారు. కాబట్టి మరేదైనా కారణం
ఆలోచించాలి అనుకున్నాడు మధు.
అలా ఆలోచిస్తూండగానే స్టో రు వచ్చేసింది.
కారు పార్క్‌చేసి, లోపలికి వెళ్ళాడు.
షాపంతా, ఓ సారి తిరిగి చూసేడు ఎవరైనా మల్లె పూలు పెట్టు కుని కనిపిస్తా రేమోనని.
నో లక్‌…
అయినా వీళ్ళ దగ్గర కధలెందుకు. పూలు తలలో పెట్టు కుంటారని వీళ్ళకీ తెలుసు కదా. హు…
ఇందాకటి నుంచీ, వీళ్ళకే అబద్దం చెప్పాలా అని ఆలోచించి అనవసరంగా బుర్ర బద్ద లు
కొట్టు కున్నానే అనుకున్నాడు. రిజిస్టరు దగ్గర కష్టమర్‌లెవరూ లేరు.
వెంటనే వెళ్ళి అడిగేడు “మల్లె పూలు ఎక్కడ దొరుకుతాయ”ని.
ఎక్కడ దొరుకుతాయో తనకు తెలియదనీ,కాకపో తే అప్పుడప్పుడు ఒకరిద్ద రు మల్లె పూలు
పెట్టు కొని షాపు కొస్తుంటారనీ చెప్పింది షాపావిడ.
హమ్మయ్య. మొత్తా నికి తీగ దొరికిందనుకున్నాడు.
“వారెవరో మీకు తెలుసా” అనడిగేడు చాలా ఉత్కంఠతో.
చూస్తే గుర్తు పట్టగలనని చెప్పింది.
“పో నీ…వాళ్ళు ఎక్కడుంటారు, ఎప్పుడెప్పుడు షాపు కొస్తుంటారు లాంటి వివరాలేమైనా
తెలుసా మీకు?” అడిగేడు.
వాళ్ళు మొన్ననే ఓ సారి వచ్చారు. వారం పది రోజులకోసారి వస్తూంటారు. సారీ, మిగిలిన
వివరాలు నాకు తెలియవు.
తెలిస్తే చెప్పే దాన్ని అందామె.
తెలిసినా చెప్పదేమోననిపించింది మధుకు.
ఇంటికి వెళ్ళి, మిగిలిన ఫ్రెండ్సును అడిగితే వుపయోగం వుండొచ్చనిపించింది.

“చలపతన్నయ్య ఫో ను చేసాడు” అంది శైలజ, లోపలికి వస్తు న్న భర్తతో.


“ఎంత సేపయింది” అడిగేడు.
“పావు గంట అవుతోంది. మీరేమిటి మనమేదో పూజో, వ్రతమో చేస్తు న్నా మని చెప్పేరట సీత
తో”
“అదా…వుట్టినే…” అన్నాడు నవ్వుతూ.
“నేనూ అదే చెప్పాను తనతో… పూజా లేదూ గాడిద గుడ్డూ లేదని. మరి మల్లె పూలెందుకూ
అనడిగింది. ఎందుకేమిటే పిచ్చి మొహమా… నేను తలలో పెట్టు కోడానికని చెప్పా. తనూ
వాళ్ళ ఆయన్ని అడుగుతానని చెప్పింది”
“అరే… నువ్వెందుకలా చెప్పేవు. నేను చెప్పినట్లే పూజకని చెప్పక పో యావా?”
అంటూండగానే ఫో ను మ్రో గింది.
శైలజ కాల్‌రిసీవ్‌చేసుకుని, “చలపతన్నయ్య” అంటూ మధు చేతికిచ్చింది ఫో ను.
“ఏరా బాగున్నావా?”
“గంట క్రితం వరకు బాగానే వున్నా. అయినా ఈ మల్లె పూల గోలేమిట్రా ”
“మల్లె పూల గోలా”
“మరే… మా ఆవిడ తనకు మల్లె పూలు తెచ్చే వరకు నన్ను గుమ్మం తొక్కొద్దంటోంది.
అసల్నిన్నూ…” అంటూ పూర్తి సంస్కృతం లోకి వెళ్ళే దారిలో వాడుండగానే, తర్వాత
మాట్లా డతానంటూ ఫో ను కట్‌చేసాడు మధు.
లాభం లేదు…ఫ్రెండ్సు సలహా దొరకడం కూడా కష్టమే!
పెళ్ళాం తోనే రాజీ పడితే బెటర్‌కాంపన్సేషన్‌గా మరేదైనా తనకిష్టమైంది కొనిస్తా నంటే
ఒప్పుకుంటుందేమో!
అయినా చూద్దాం, తను మరీ గొడవ చేస్తే అప్పుడు చూడొచ్చు అనుకున్నాడు మధు.

000000000000000000000000000000000000000000000000000000000000000000
0000000000్‌

పో నీ ఇండియా ఫో ను చేసి లక్కు బాగుండి రెండు మూడు రోజుల్లో వచ్చే వాళ్ళున్నారేమో


కనుక్కుంటే ఆలోచన రాగానే ఆలస్యం చేయకుండా ఫో నందుకున్నాడు.
కుశల ప్రశ్న లయ్యేక, “తెలిసిన వాళ్ళెవరన్నా ఇక్కడకు వస్తు న్నారా?” అనడిగేడు.
“రేపు రాత్రికి సుధ ఆంటీ బయల్దే రుతోంది, కూతురు దగ్గరకి… ఏమైనా పంపాలా?”
“అలాగా… ఆంటీ గారి తో కాసిని మల్లె పూలు పంపిస్తా రా ”
“ఇక్కడనుంచీ మల్లె పూలెందుకురా? అక్కడ దొరకవూ? అయినా మన వూరి నుంచీ విమానం
దాకా, అక్కడ నుంచీ మీ వూరు దాకా వచ్చే సరికి వాడి పో వూ?” అనడిగేరు.
అదీ నిజమేనని పించింది.
“తడి గుడ్డ లో చుట్టి తెస్తే వాడవు కదా?”సలహా ఇచ్చేడు.
“ఏమో దూరా భారం కష్టమేమో. అయినా అంత అర్జంటుగా నీకు మల్లె పూలెందుకురా”
అడిగేరు.
“అదీ… మరే … శనివారం ఓ పూజ చేయ్యాలనుకొంటున్నాం అందుకు”
“అక్కడ అసలు పూలే దొరకవా?”
“అన్నీ దొరుకుతాయి గాని, మల్లె పూలు దొరకడంలేదు”
“మల్లె పూలతోనే పూజ చెయ్యాలా?”
“అవును… ఇక్కడికీమధ్యనే మల్లే నంద స్వామి అని ఒక కొత్త స్వామి వచ్చాడు. ఆయనకు
మల్లె పూలతో పూజ చేస్తే చాలా మంచిదట. అందుకని…”
“అంతేనా లేక మీ ఆవిడకా”
“అబ్బ పూజకే … ఇంతకీ పంపిస్తు న్నారా?” అడిగేడు విసుగు ధ్వనిస్తూ .
“కష్టమనుకుంటారా. ఇది సీజను కాదుగా … అయినా పో యిన సారి మీ ఆవిడ కరివేపాకు
పాక్‌చేసుకుంటే ఆకులూ, కాయలూ అమెరికాలోకి తీసుకెళ్ళకూడదన్నావుగా? మరి పూలైతే
ఓకేనా?”అడిగేరు.
“పూలైనా కష్టమే. పైగా పెద్దా విడ ఆవిడకెందుకులే ట్రబులు. ఇక్కడే నేను ట్రై చేస్తా ను. మళ్ళీ
మాట్లా డతాను …” అని ఫో ను పెట్టేసాడు మధు.
“పంపిస్తా మన్నారా?”అడిగింది శైలజ.
“ఇప్పుడక్కడ దొరకవట. ఇదసలు మల్లె పూల సీజను కాదని చెప్పారు. పైగా పూల లాంటివి
బయట దేశాలనుంచీ ఇక్కడకు తేకూడదు కదా! ఇక ఆ గొడవ వదిలెయ్య కూడదూ”
అన్నాడు శైలజ ప్రక్కనే కూర్చుని, గాజులతో ఆడుకుంటూ.
“అక్కడ సీజను కాదేమో గానీ ఇక్కడిప్పుడు సీజనే” అంది శైలజ.

“నీకెలా తెలుసు?” ఆశ్చర్యంతో అడిగేడు.


“పో యిన వారం సినిమాకు వెళ్ళినప్పుడు చూసా”
“ఏదీ సినిమా లో పూలనా?”
“కాదు, సినిమా కొచ్చిన ఓ అమ్మాయి పెట్టు కుంటే”
మొత్తా నికి మరో క్లూ దొరికింది …అంటే … ఈ వూళ్లో నో, ప్రక్క వూళ్లో నో మల్లె పూలు
దొరుకుతాయి.
“ఆమె ఎవరో నీకు తెలుసా?”
“తెలియదు. వాళ్ళు మనకంటే బాగా లేటుగా వచ్చారు. సినిమా అయిపో యాక
అడుగుదామంటే, ముందే వెళ్ళి పో యారు”
“అంతకు ముందు ఆమెను చూసిన గుర్తేమన్నా వుందా? ఏ దైనా పార్టీ లో గాని, స్టో రులో
గానీ”
“చెప్పానుకదా! వాళ్ళు సినిమా మొదలెట్టా క వచ్చారని. ఎలా కనిపిస్తా రు?” విసుగ్గా అంది,
ఆవులిస్తూ .
“మరి చీకట్లో ఆమె పెట్టు కుంది మల్లె పూలని అంత ఖచ్చితంగా నీకెలా తెలుసు?” లాజిక్కు
అదిరిందనుకున్నాడు.
“ఖచ్చితంగా తెలీదనుకో. తలలో చీకట్లో తెల్ల గా కనిపిస్తే మల్లె పూలనుకున్నా. అదీగాక
మల్లె పూల వాసన కూడా వచ్చింది ధియేటర్‌లో ”
“వాళ్ళు ఏవో పిచ్చి ప్లా స్టిక్‌పూలను తలలో పెట్టు కుని, జాస్మిన్‌ సెంటు స్ప్రే చేసుకుని
వుండొచ్చుకదా”
“వుండొచ్చు…”
“నాలుగు రోజులనుంచీ చూస్తు న్నావుగా… కళ్ళు తెరిచినా, కళ్ళు మూసినా మల్లె పూల
గురించే ఆలోచిస్తు న్నా”
“తెలుసు … రాత్రి నిద్రలో కూడా వాటి గురించే కలవరిస్తు న్నారు”
“చూడు ఇంత తీవ్రంగా వెదుకుతున్నా నాకు దొరకడం లేదు. పో నీ మల్లె పూలకు బదులు ఓ
గోల్డ్ ‌కాయిన్‌కొనివ్వనా?”
“ఒకటా… నేను రెండు జడలు వేసుకుని పూలు పెట్టు కుందామనుకున్నా”
“అబ్బ… నీకు రెండు జడలు బాగోవు శైలూ”
“వూహూ… ఐతే నాకు మల్లె …”
“సర్లే రెండు కాయిన్స్‌… సరేనా?!”
“ఓకే ” అంది శైలజ వెలిగిపో తున్న మొహంతో.
ఆ రాత్రికి ప్రశాంతంగా కలవరింతలు లేకుండా నిద్ర పో యాడు మధు.

000000000000000000000000000000000000000000000000000000000000000000
0000000000్‌

రెండ్రోజుల తర్వాత ఓ సాయంత్రం శైలజ కోసం ఫో ను చేసింది సీత.


“శైలజ స్నానం చేస్తోంది” చెప్పాడు ఫో ను లిఫ్ట్‌చేసిన మధు.
“సర్లే అన్నయ్యా… నేను తర్వాత కాల్‌చేస్తా ను… ఇంతకీ మీకు మల్లె పూలు దొరికాయా?”
అడిగింది సీత.
“లేదమ్మా నాకెక్కడా దొరకలేదు. మీకెక్కడన్నా దొరికాయా?”
“పూలైతే దొరకలేదు గానీ పూల చెట్టు దొరికింది. ఇంకో నాలుగైదు రోజుల్లో పూలు
పూయొచ్చు”
“మల్లె పూల చెట్టా ? ఎక్కడ దొరికింది? ఎలా పెంచుతున్నారు?” అడిగాడు మధు.
వివరాలు చెప్పింది సీత.
“చాలా ధాంక్స్‌సీతా. ఈ విషయం శైలూకు చెప్పకు…ప్లీ జ్‌”
“అలాగే అన్నయ్యా … చెప్పంలే” అంది సీత.
ఫో ను పెట్టేసి, “శైలూ ఆఫీసు నుంచీ కాల్‌. ఏదో ప్రో సెస్‌ ఫెయిలయిందట. అర్జంటుగా వెళ్ళాలి.
ఓ గంటలో వస్తా ను” అని కేకేసి చెప్పి… బయటకు బయల్దే రాడు మధు.

్‌00000000000000000000000000000000000000000000000000000000000000000
00000000000్‌
మరో వారం రోజులు గడిచేయి.
శైలజ మల్లె పూల వూసు మరచిపో యింది.
“ఎప్పటినుంచో పో ట్రైయిట్స్‌తీయించుకుందామంటున్నావుగా. సాయంత్రం వెళ్దాం రెడీ అవ్వు.
మా ఫ్రెండొకతను క్యూపనొకటి ఇచ్చాడు. ఈ రోజు తీయించుకుంటే హాఫ్‌ప్రైసే” అన్నాడు మధు
ఆఫీసుకు బయల్దే రుతూ.
“ఇప్పుడెందుకండీ … మన మేరేజ్‌డేకి తీయించుకుందాం” అంది శైలజ.
“ఆరునెళ్ళ దాకా ఈ క్యూపన్‌పనిచెయ్యదు. నేనాల్రెడీ అప్పాయింట్మెంటు తీసుకున్నా.
ఇవ్వాళే తీయించుకుందాం” చెప్పాడు మధు.
“ప్చ్‌మీరెప్పుడూ ఇంతే. ఏమి కట్టు కోను చీరా లేక డ్రెస్సా?”
“మన సంప్రదాయం ప్రకారం చీర కట్టు కుంటే బాగుంటుంది”
“ఏ చీర కట్టు కోను?”
“తెల్ల పట్టు చీర … ఎర్ర బో ర్డరుదుందే అది కట్టు కో”
“ఫో టోకు తెల్ల చీరె బాగుంటుందా?”
“మన శోభనం రోజు శైలులా … తెల్ల చీర ఎర్ర బో ర్డరులో మెరిసిపో తావు”
“మరి మీరు పంచె కట్టు కోరూ ”
“పంచె నాకులేదుగా?”
“మరి శోభనం రోజు కట్టా రుగా. పైగా మన సంప్రదాయం కూడాను” అంది వుడికిస్తూ .
“అది వేరు. అయినా ఇంట్లో ఒకళ్ళు సంప్రదాయం పాటిస్తే సరిపో ద్ది లెద్దూ … నాకు
టైమవుతోంది. ఆరున్నరకల్లా రెడీ గావుండు” చెప్పి, వర్కుకు బయల్దే రాడు మధు.

000000000000000000000000000000000000000000000000000000000000000000
0000000000్‌

వర్కు నుంచీ మధు ఇంటి కొచ్చేసరికి ముచ్చటగా ముస్తా బై ఎదురు చూస్తోంది శైలజ.
“అబ్బ … ఎవరీ అందాల తార?” అన్నాడు మధు శైలజను చూడగానే.
సిగ్గు పడుతూ నవ్వింది శైలజ శోభనం రోజులా.
“శైలూ నీ కోసం ఏమి తెచ్చానో చూడు …” అంటూ, చేతిలోని పాకెట్‌ ఓపెన్‌చేసి … మల్లె
చెండునందించాడు మధు.
“మల్లె పూలా … నిజంగా మల్లె పూలే..” శైలజ కళ్ళు ఆశ్చర్యంతో పెద్ద వయ్యాయి. గొంతు
లోంచి ఆనందం చూపుల్లో అనురాగం … “ఎక్కడ దొరికాయండీ?” అడిగింది మల్లె చెండును
అపురూపంగా అందుకుంటూ.
“ఎక్కడో దొరకడమేమిటి డాళింగ్‌నీ కోసం మల్లె మొక్కను పెంచి, పూలు పూయించి నా
స్వహస్తా లతో మాలగా చుట్టి తెస్తే …”
“అబ్బ మీరెంత మంచివారో…” అంటూ భర్త కళ్ళలోకి ప్రేమగా చూస్తూ పూలను ఒకసారి గట్టిగా
వాసన పీల్చింది శైలు.

నుదుట ఎర్ర బొ ట్టు ,


అరమోడ్పులౌతూన్న కళ్ళకు మరి కాస్త అందాన్నిస్తూ కాటుక రేఖ,
పసిమి చాయలో మెరుస్తూ న్న నున్నని చెక్కిలిని తాకి, పరావర్తనం చెందలేక ఇంకి పో తున్న
వెలుతురు,
పూల స్పర్శతో పులకించబో తున్న కురుల సంకేతాలననువదిస్తూ కదులుతూన్న చెవి
రింగులు…
మల్లె ల సువాసననాస్వాదిస్తూ మరింత బారైన ముక్కు,
ముచ్చట తీర్చిన మొగుడిపై అనురాగాన్ని అద్ద డానికి నేనంటే నేనని పో టీ పడుతున్న ఎర్రటి
పెదవులూ…
రెప్ప వాల్చకుండా చూస్తు న్న భర్త వైపు ఓ చిరునవ్వు విసిరి, మల్లె చెండును చేతికిచ్చి, అద్దం
వైపు ఓ అడుగేసింది శైలజ.
పడగ్గది దిగ్గు న లేచింది పట్టు చీర మెరుపులో.
సన్నగా కంపిస్తూ న్న చేతులతో, అప్పుడప్పుడే రెండు వూపిరుల వేడిమికి వాడబో తూన్న
మల్లె చెండును శైలజ జడలో అలంకరించాడు మధు.
జడను ముందుకు వేసుకుని, మధు వైపు తిరిగి, భర్తను మల్లె దండలా చుట్టేసి, మెడను అరవై
డిగ్రీలు కుడి పక్కకు వాల్చి…తలను నెమ్మదిగా ముప్పై డిగ్రీలు పైకెత్తి , అక్కడ ఆల్రెడీ
నిరీక్షిస్తూ సన్నగా వణకుతున్న పెదాలతో… ఆమె అధరాలు “ఐ లవ్‌యూ” చెప్పేయి.
ఆకాశంలో జాబిలి అగుపించకపో యినా, ఆ జంట గుండెల్లో వెన్నెల జల్లు కురిసింది.
శైలజ కళ్ళ నుంచి జారిన నీటి బొ ట్ల ను చూసి ఆనంద బాష్పాలనుకుని “శైలూ…” పిలిచేడు
మధు మంద్ర స్వరంతో.
కళ్ళను తుడుచుకుంటూ … “హాచ్‌..” తుమ్మింది శైలజ, ఒకచేత్తో అప్పటికే ఎర్రబడ్డ ముక్కును
నలుపుకుంటూ.
“ఏమైంది…” అడిగేడు మధు ఆదుర్దా గా.
“ఏమో … కళ్ళు మండుతున్నాయి. ముక్కు…” అంటూ మరోసారి తుమ్మింది.
“ప్రొ ద్దు టి నుంచీ ఇలాగే వుందా?”
“లేదు … ఇప్పుడే సడన్‌గా… ఒక టిస్యూ ఇవ్వరూ…” అంటూ కళ్ళ వెంట కారుతున్న
నీటిని ఒకచేత్తో … ముక్కుల నుంచీ జారుతున్న నీటిని మరో చేత్తో తుడుచుకుంటూ.
“కొంప తీసి పూల వల్ల ఎలర్జీ లాంటిది రాలేదు గా…” అంటూ టిస్యూ కోసం పరుగెత్తా డు
మధు.

“మీరేమీ బాధ పడకండి. నాకే పూలు పెట్టు కొనే ప్రా ప్తం లేదు. మీకు నా మీద ఎంత ప్రేమ
వుంటే ఇంత కష్టపడి మొక్కను సంపాదించి, ఫ్రెండింట్లో పెంచి, పూలు పూయించి … నా కోసం
మీరెంత శ్రమపడ్డా రండీ” అంది శైలజ.
అప్పుడే డాక్టర్‌దగ్గరకు వెళ్ళి వచ్చారిద్ద రూ.
“శ్రమ ఏముంది శైలు… నీ ముచ్చట తీర్చడం నా బాధ్యత కాదూ? అయినా బాధ పడకుండా
ఎలావుండను. నీకు మల్లె పూలంటే ఎంత ప్రేమో నాకు తెలియదూ. పూలు దొరక్క పో యినా
బావుండేది దొరకలేదన్న బాధ ఒక్కటే వుండేది. ఇప్పుడు చూడు ఈ ఎలర్జీ బాధొకటి… ఐ
యాం సారీ శైలు” నొచ్చుకున్నాడు మధు .
కిటికీ లోంచి చూస్తు న్న చందమామ మనస్సు కూడా చివుక్కుమంది మొహం చిన్న
బో యింది.
“అన్ని బాధలూ తీరడానికి మందేమిటో చెప్పనా?” అంది శైలు మధు వంక కొంటెగా చూస్తూ .
చెప్పకుండానే అర్ధమైంది శైలజకు మరి కాస్త దగ్గరగా జరిగేడు మధు.

You might also like