You are on page 1of 3

నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎక్కడైతే, అవమానమును పొ ందియున్నారో, అక్కడ దేవుడు మీ

యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తా డని ఆయన మీ పట్ల వాగ్దా నము చేయుచున్నాడు. నేడు మీరు
జీవితంలో ఎంతో అవమానం, ఎన్నో నిందలు మరియు ఆందో ళనలను ఎదుర్కొంటుండవచ్చును? గుర్తు ంచుకోండి, ఇది మీ
కథకు ముగింపు కాదు. దేవుడు మీ కొరకు ఎదురుచూడటం మరియు ప్రతి దానిని మరల మీకు అనుగ్రహించుటకు ఇదొ క
నూతన మార్గ ము. అంతమాత్రమే కాదు, ఆయన " మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు ''
(యెషయా 61:7) అన్న వచనము ప్రకారము ఆలాగున రెట్టింపు ఘనతను ఇస్తా డు. మన జీవితములో కొన్ని సమస్యల
ద్వారా గడిచి వెళ్లు చున్నప్పుడు, మన యొక్క శోధనలను చూచినప్పుడు, ఇదంతయు దేవుడు అనుమతించే శోధనలని,
మనము ఆయనను ప్రశ్నిస్తా ము. మరి కొన్నిసార్లు మన బాధ మనం భరించగలిగే దానికంటే ఎక్కువగా ఉన్నట్లు
అనిపిస్తు ంది. మరికొన్ని సార్లు మనం నిందను మరియు అవమానాన్ని ఎదుర్కొంటాము. ప్రజలు మన తలలపై నడిచే
పరిస్థితులను దేవుడు అనుమతించినట్లు గా ఉంటుంది. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ఇశ్రా యేలు దేవా, రక్షకా,
నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరచుకొను దేవుడవై యున్నావు '' (యెషయా 45:15) అన్న వచనము ప్రకారము,
ఇటువంటి సమయములో దేవుడు మన నుండి తనను తాను మరుగుపరచుకున్నాడని మనము భావిస్తు ంటాము. అది,
నిజమే! కానీ, పై చెప్పబడిన వచనము ప్రకారము ఇశ్రా యేలు దేవుడు, రక్షకుడైన ఆయన నిశ్చయముగా తనలో మనలను
మరుగుపరుచుకొను దేవుడై యున్నాడు. అయితే, పై చెప్పబడిన వాక్యము ప్రకారము, దేవుడు మన రక్షకుడుగా ఉన్నాడని
స్పష్ట ంగా తెలియజేస్తు ంది. ఎందుకంటే ఆయనపై నమ్మకం ఉన్నవారిని ఆయన తప్పకుండా రక్షిస్తా డు. ఆయన మన
ముందు వెళ్తా డు మరియు మన పరిస్థితులలో మనతో కూడ ఉంటాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నీ ముందర
నడుచువాడు యెహో వా, ఆయన నీకు తోడై యుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయపడకుము
విస్మయ మొందకుమని ఇశ్రా యేలీయు లందరి యెదుట అతనితో చెప్పెను '' (ద్వితీయోపదేశకాండము 31: 8) అన్న
వచనము ప్రకారము మనకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆయనను ఆశ్చర్యపరచలేవు. భవిష్యత్తు లో తన బిడ్డ లను
ఉన్నత స్థా నమునకు హెచ్చించడానికి ఇలాంటి శ్రమల ద్వారా వెళ్ళడానికి ఆయన అనుమతిస్తా డు.

ఇటీవల నేను తిరునల్వేలికి వెళ్లా ను. నా తల్లిదండ్రు ల సమాధిపై నేను పూల దండను ఉంచి, ప్రా ర్థించాను. నేను నా తల్లి
సమాధి పక్కన నిలబడి, నేను గట్టిగా ప్రా ర్థిస్తు న్నప్పుడు, ప్రభువు నా తల్లిని గుర్తు చేశాడు. ఆమె నన్ను తన గర్భంలో
మోసినప్పుడు, ఆమె అత్త గారు మా అమ్మ తినడానికి కూడ ఆహారం ఇచ్చేవారు కాదు. ఆమె అందరికి వడ్డించేవారు. మా
అమ్మ ఉమ్మడి కుటుంబములో ఉండెను. కానీ, ఆమె అందరికి ఆహారాన్ని వడ్టించిన తరువాత, వండిన భోజనం అంతయు
ముగిసిపో తుంది. ఆమెకు కొంచెము కూడ ఆహారం ఉండదు. ' నీవు తిన్నావా?' అని ఆమెను అడగడానికి ఎవరు కూడ
ఉండరు. నా తల్లి, నేను త్రా గడానికి నీరు లేకుండా కూడ వంట చేసేదాన్ని అని చెప్పెను. ఆమెకు ఆహారం మరియు నీళ్లు
లేకుండా, ఆమె, నేను నిన్ను నా గర్భంలో మోశాను. ప్రసవ నొప్పులు వచ్చినప్పుడు, వారు ఆమెను ఇంటి బయట పెట్టి,
తలుపు మూసివేశారు. నేను బురద మట్టి మీద జన్మించానని చెప్పేవారు. చూడండి, ఆమె నా కోసం ఇన్ని బాధలు
అనుభవించినది. ఆలాగున ఆమె చేదు అనుభవము గుండా వెళ్లవలసి వచ్చినది. ఆమె అనుభవించిన బాధల ద్వారా ఈ
రోజు ఎంతగానో నేను ఆశీర్వదించబడ్డా ను. ఎందుకంటే, నాకు జన్మనివ్వడానికి నా తల్లి ఇన్ని బాధలు అనుభవించినది.
కాబట్టి, దేవుడు ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని మరియు మంచి భవిష్యత్తు ను నాకు అనుగ్రహించి, దేవుడు నన్ను
ఎంతగానో హెచ్చించాడు.
నా ప్రియులారా, ఆలాగుననే, యేసు ప్రభువు ఈ లోకములో జీవించినప్పుడు కూడ ఇటువంటి చేదు అనుభవము ద్వారా
వెళ్లు చు, ఆయన అనేక బాధలను అనుభవించాడు. అందుకే ఆయన ఇలా అన్నాడు, " నా పిల్లలు శోధనలను
ఎదుర్కొనకూడదు. వారు సౌఖ్యముగా ఉండాలి. ఘనత మరియు ఆనందం యొక్క రెట్టింపు భాగమును ఇచ్చుట కొరకే,
ఆయన మన అవమానము, నిందను మరియు మన బాధలు, చేదును తన మీద భరించాడు. మన కష్టా ల్లో కృశించిపో వుట
ఆయన మనలను ఎన్నడు కూడ అనుమతించడు. ఆలాంటి సమయములో దేవుని వాక్యము తగిన సమయానికి మనకు
సహాయపడుతుంది. అందుకే బైబిల్‌లో చూచినట్ల యితే, " తన నిత్యమహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన
సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణు లనుగా చేసి స్థిరపరచి
బలపరచును '' (1 పేతురు 5:10) అన్న వచనము ప్రకారము, ఈ శ్రమలు కొంచెము కాలము మాత్రమే ఉంటాయి. ధైర్యం
తెచ్చుకొనండి, రాబో వు దినములలో ఆయన మీకు చక్కటి భవిష్యత్తు ను మీ ముందుంచియున్నాడని మీరు మరువకండి.
ధైర్యముగా ఉండండి. ఒకవేళ నేడు ఈ సందేశము చదువుచున్న మీకు విరోధముగా అనేకులు మాట్లా డుచున్నారని
చింతించుచున్నారా? లేక మీరు అనవసరముగా నిందించబడి, అందరి యెదుట అవమానమును పొ ందియున్నారని
దిగులుపడుచున్నారా? మీ హృదయమును కలవరపడనీయకండి. మీరు కీడు అనుభవించిన యేండ్లు దేవుడు మీ యొక్క
పరిస్థితిని మారుస్తా డు. అదియుగాక, ఆయన మిమ్మును ఆశీర్వదిస్తా డు. మీరు ఎదుర్కొనుచున్న అవమాన మార్గ ములలో
కూడ, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, పట్టు దలతో ప్రా ర్థించండి, నిశ్చయముగా మీ యవమానమునకు ప్రతిగా దేవుడు
మీకు రెట్టింపు ఘనతను అనుగ్రహించి, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ఆయన తన యొక్క అపారమైన
ప్రేమతో సంతృప్తిపరుస్తా డు, అప్పుడు మీ దినములన్నియు మీరు రెట్టింపు ఘనతను పొ ందుకొని, ఆనందిస్తా రు. దేవుడు
మిమ్మల్ని దీవించును గాక. Prayer: మహో న్నతుడవైన మాప్రియపరలోకపు తండ్రీ,
ప్రభువా, మేము మంచి పేరును ఖ్యాతిని పొ ందాలని నీవు మా కొరకు సిలువలో అవపమానమును పొ ందినందుకై నీకు
వందనములు చెల్లి ంచుచున్నాము. మా కొరకు నీ ప్రా ణము పెట్టినందుకై నీకు స్తు తులు చెల్లి ంచుచున్నాము. ఈ లోకములో
బాధలు, శోధనల చేత తపించిపో యే మా జీవితాలను ఒక్కసారి చూడుము. దేవా, నీవు మా మీద కనికరపడి, మాకు
కలుగు సకల విధములైన శోధనల నుండి మమ్మును విడిపించి, మా జీవితములో ఖ్యాతిని మంచి పేరును
సంపాదించుకొనుటకు మాకు సహాయము చేయుము. మేము అవమానము పొ ందిన ప్రతి స్థ లములలోను ఘనతను
మరియు మంచి పేరును మాకు అనుగ్రహించుము. మా జీవితాలలో అలుముకొనియున్న అంధకారమును తొలగించి
మమ్మును నీ వెలుగుతో నింపుమని యేసుక్రీస్తు నామమున ప్రా ర్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

ప్రభువగు యెహో వా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్త మానము ప్రకటించుటకు యెహో వా నన్ను
అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి
విముక్తినిప్రకటించుటకును2. యెహో వా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును
దుఃఖాక్రా ంతులందరినిఓదార్చుటకును3. సీయోనులో దుఃఖించువారికి ఉల్లా స వస్త మ
్ర ులు ధరింపజేయుటకును బూడిదెకు
ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తు తివస్త మ
్ర ును
వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహో వా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను
మస్త కివృక్షములనియుయెహో వానాటినట్ల నియువారికిపేరుపెట్టబడును.4. చాలకాలమునుండి పాడుగానున్న స్థ లములను
వారు కట్టు దురు పూర్వమున పాడైన స్థ లములను కట్టు దురు పాడైన పట్ట ణములను నూతనముగా స్థా పింతురు
తరతరములనుండిశిథిలములైయున్నపురములనుబాగుచేయుదురు.5. అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు
పరదేశులుమీకువ్యవసాయకులునుమీద్రా క్షతోటకాపరులునుఅగుదురు6. మీరు యెహో వాకు యాజకులనబడుదురు వారు
మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు
వారిపభ
్ర ావమునుపొ ందిఅతిశయింతురు
7. మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందు దురు నిందకు ప్రతిగా తాము పొ ందిన భాగము ననుభవించి వారు
సంతోషింతురు వారు తమ దేశములోరెట్టింపుభాగమునకు కర్త లగుదురు నిత్యానందము వారికి కలుగును.
8. ఏలయనగా న్యాయముచేయుట యెహో వానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొ త్తు పట్టు కొనుట
నాకసహ్యము. సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్యనిబంధన చేయుదును.
9. జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధినొందును వారు యెహో వా
ఆశీర్వదించినజనమనివారినిచూచినవారందరుఒప్పుకొందురు10. శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని
రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్త మ
్ర ులను నాకు ధరింపజేసి
యున్నాడు నీతి అను పైబట్ట ను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహో వానుబట్టి మహానందముతో నేను
ఆనందించుచున్నానుదేవునిబట్టినాఆత్మఉల్ల సించుచున్నది11. భూమి మొలకను మొలిపించునట్లు గాను తోటలో
విత్త బడినవాటిని అది మొలిపించునట్లు గాను నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహో వా నీతిని
స్తో త్రమును ఉజ్జీవింప జేయును.

You might also like