You are on page 1of 1

సమాధానము ఉన్న ఇంటిలోనే దేవుడు నివసించును సమాధానము ఉన్న ఇంటిలోనే దేవుడు నివసించును.

1 ప్రభువైన యేసు
బో ధించుటకు తన శిష్యులను అనేక స్థ లములకు పంపినప్పుడు, లూకా 10:5-7 లో ఈలాగు చెప్పెను: ''సమాధానము ఉన్న
ఇంటికొరకు చూడుడి'' మరియు అటువంటి ఇంటిని వారు కనుగొనినప్పుడు వారు అక్కడనే ఉండి మరియు వేరొక ఇంటికొరకు
చూడనవసరము లేదు. ఎందుకు ఆయన అలాగు చెప్పెను? ఎందుకనగా సమాధానము కలిగిన అనేక ఇండ్ల ను వారు కనుగొనలేరని
ఆయనకు తెలియును. 2 పో ట్లా టలు లేని ఇంటిలో దేవుడు నివసించును. ఏది ఏమైనను భార్యాభర్త లు దేనికొరకు పో ట్లా డుదురు?
ఎక్కువగా భూసంబంధమైన వాటి గురించి తప్పు జరిగినప్పుడు పో ట్లా డుదురు. ఈ లోకములో కొన్ని తప్పులు జరుగును. ఏదైనా
తప్పు జరిగినప్పుడు, పాపము మాత్రమే తీవ్రమన
ై దని గుర్తు పెట్టు కొనవలెను. మిగతావన్నియు అంతముఖ్యము కాదు. ప్రతి భార్య
మరియు భర్త దీనిని స్పష్ట ముగా చూచెదరని నేను నిరీక్షించుచున్నాను. అదేమనగా పాపము మాత్రమే తీవ్రమైనది. భూసంబంధమైన
సమస్యలను బట్టి, భర్త మరియు భార్య విరోధము కలిగి మాట్లా డుకొనినయెడల, దేవుని హృదయము దు:ఖపడును. ఈ కొద్ది
జ్ఞా నమును మీతో పంచుకొననివ్వండి: పాపమును ద్వేషించుము-ఎందుకనగా అది మాత్రమే మీ వివాహమును నాశనము చేయును.
మీ ఇల్లు దేవునికి నివాస (పరిశుద్ధ ) స్థ లముగా ఉండవలెనని గుర్తు పెట్టు కొనుడి. మీ ఇంటిలో సమాధానమును చెడగొట్టు నదేదన
ై ను
వచ్చినయెడల, అది ఏ మాత్రమును పరిశుద్ధ స్థలముగా ఉండదు. 3 మీరు చేసే ప్రతిదానిలో ఈలాగు చెప్పగలరని నమ్ముచున్నాను,
''ప్రభువా! మనుష్యులు మా విషయములో సంతోషముగా ఉన్నారా లేదా అను ఆసక్తి మాకు లేదు. నీతో సంతోషముగా ఉన్నామా?
నిన్ను దు:ఖపరచేదేదైనను మా జీవితములలో గాని, మా తలంపులలో గాని, ఒకరి యెడల ఒకరికి మాకున్న వైఖరి విషయములో
గాని ఏదైనా ఉన్నదా?'' మా యింటిలో నీవు సంతోషముగా ఉండవలెనని మేము కోరుచున్నాము. ''ఇది ప్రభువునకు ఇష్ట మన
ే ా?''
అని మా జీవితములలో ప్రతి దానిని పరీక్షించగోరుచున్నాము. అప్పుడు మీ ఇల్లు ఏ విధముగా ఉండునో ఊహించగలరా? ప్రత్యక్ష
గుడారములో ఉన్న దేవుని మహిమయే అక్కడ ఉండును. మీ ఇంటి ద్వారా ప్రజలు జీవముగల దేవుని వద్ద కు ఆకర్షింపబడుదురు.
4 ఎక్కడైతే భార్యా భర్త లు ఇద్ద రు సమాధానము నిమిత్త ము తమ హక్కులను కోల్పోవుదురో అక్కడ దేవుడు నివసించును. ఒకసారి
ఒక యవ్వనజంట రైలు ప్రయాణము చేయబో వుచు నా యొద్ద కు వచ్చి మరియు ఇట్ల నిరి, ''బ్రదర్‌ జాక్‌ రెండు నిమిషములలో
మాకొక హెచ్చరిక ఇవ్వగలరా?'' నేను ఇట్లు చెప్పితిని, ''తప్పకుండా ఇవ్వగలను. అదేమనగా: ఎల్ల ప్పుడు ఒకరిని ఒకరు క్షమాపణ
అడుగుటకు సిద్ధముగా ఉండవలెను మరియు ఎల్ల ప్పుడు ఒకరిని ఒకరు క్షమించుటకు సిద్ధముగా ఉండవలెను''. మీరు తప్పు చేసిన
వెంటనే క్షమాపణ అడుగుటకు సిద్ధముగా ఉన్న యెడల మరియు క్షమాపణ అడిగిన వెంటనే ఒకరిని ఒకరు క్షమించుటకు సిద్ధముగా
ఉన్నయెడల, ప్రతిదినము మీ ఇల్లు సమాధానకరమైన ఇల్లు గా ఉండునని వ్రా సి ఇవ్వగలను. 5 కాని మీరు ఈ విషయములో
సున్నితముగా ఉండవలెను. మీ కాలులో ముల్లు గుచ్చుకొనినయెడల, దానిని తీసి వేయుటకు ఒక క్షణము కూడా వేచి యుండరు.
అదేవిధముగా, మీ హృదయములో మీరు కలత చెందినవెంటనే, ఒక్కసారిగా దానిని తీసివేయవలెను. అది ఒక ముల్లు లాంటిది, అది
మిమ్మును నాశనము చేయును. ముల్లు పాదములో వ్యాపించుటకంటే ఎక్కువగా అది మీ హృదయములో వ్యాపించును. ఎట్టి
పరిస్థితులలోను సమాధానమును వెంటాడుము. డబ్బు గాని మరేదైనను నష్ట పో యినను చింతించవద్దు . ఆ విషయములు
సమాధానము కంటే ముఖ్యమైనవి కాదు. సమాధానము మరియు డబ్బును ఒక త్రా సులో వేసిన యెడల, సమాధానము ఎంతో
ఎక్కువ బరువు ఉన్నట్లు ప్రతి భార్య మరియు భర్త గుర్తించగలరని నేను నిరీక్షించుచున్నాను. 6 ఒకరోజు ఇంటిలో ఏదైనా తప్పు
జరిగినదా? అన్నము మాడినదా? చింతించకుము. అన్నము మాడినందువలన ఒక పూట భోజనము చేయకున్నయెడల
నష్ట మేమిటి? నిజానికి అది నిన్ను యోగ్యముగాను మరియు ఆరోగ్యముగాను ఉంచి మరియు ఎక్కువ ఆత్మీయుడవగుటకు
తోడ్పడును. 7 కాని దానిని బట్టి నీవు తలక్రిందులైనట్ల యితే, అప్పుడు సాతాను జయము పొ ందును. దేవుడు ఏర్పాటు చేసిన
మొదటి యింటికి ఏమి జరిగియున్నదో గుర్తు ంచుకొనుము. ఆదాము మరియు హవ్వల మధ్యకు వచ్చుటకు మార్గ ములను సాతాను
ఎదురుచూచుచుండెను మరియు అతడు జయించెను. యోబు మరియు అతని భార్య మధ్యకు వచ్చుటలో కూడా అతడు
జయించెను. ఇస్సాకు మరియు రిబ్కా అను వారి మధ్యకు వచ్చుటలో కూడా జయము పొ ందెను. 8 భార్య భర్త ల మధ్యకు సాతాను
రావడము అనునది దేవుని చిత్త ము కానేకాదు.

You might also like