You are on page 1of 51

🌹[2/13/21-7:48 AM]T,రామకృష్ణ.

txt
*జీవితంలో అడుగడుగునా..మెప్పు కోసం. ఒప్పు కోసం..మూర్ఖంగా తల పడ్డవాళ్ళమే..
తల ఎత్తు కోవడానికి,తల ను తాకట్టు పెట్టిన వాళ్ళమే..ఇక నిన్ను నీ నుండి, విడిపించు కోవడమే మిగిలింది..
*ఆశలు ఆవిరయిననాడు,నిన్ను కన్ననాడు నీ తల్లి పురిటి నొప్పులు గుర్తు తెచ్చుకో..
నీ జననం కోసం మరణం అంచుల దాకా వెళ్లిన,ఆమె ధైర్యాన్ని  నెమరేసుకో..
*కావలసిన వారిని కష్ట పెట్టినా,లోకం పెద్దగా పట్టించుకోదు..నీ విరోధి పట్ల నీ వైఖరిని....
వేయికళ్ళతో గమనిస్తుంది..నువ్వు తనవైపు నెట్టే సమస్యల‌తీవ్రత,ఒక్కోసారి తన మీద సానుభూతిని పెంచుతుంది..కనుక మిత్రు డి
తో కన్నా శతృవును ఎదుర్కొనే,ప్రతీఅడుగు ఆచి తూచివేయాలి.స్వార్ధా న్నినేర్చుకోఎంతో కొంత...ఒకరిని నాశనం చేసేంతకాదు..నీకో
సం నువ్వు బతికే అంత..
*కళ్ళలో నుండి వచ్చే నీరు ఉప్పగాఉన్నా
కళ్ళు కనే కలలు తియ్యగా ఉండాలి.
*గుoడెల్లో బరువు ఎంతున్నా,చిరునవ్వుతో తేలిక చేసుకోవాలి..
*మదిలో మదించే బాదలెన్నున్నా,మనఅనే మనిషితో పంచుకోవాలి..
*సులభంగా లభించేదిమోసం,కష్టంగా లభిం చేది గౌరవం..
*హృదయంతో లభిoచేది ప్రేమ, అదృష్టం కోద్ది లబించేది అభిమానం..
*జన్మ జన్మలలో చేసుకున్న దుష్కర్మల ఫలి తం వలన నేడు మనంఅనేకదుఃఖములను, జన్మలను పొందుతున్నాము.అయితే ఈ
కర్మల ఫలితాన్ని నశింప జేసుకోవాలంటే భగవన్నామస్మరణ అసలైన,సులువైన ఉపా యమని చెప్పుకోవాలి! వేయించిన విత్తనా లు ఏ
విధముగా అయితే మొలకెత్తే గుణం ను కోల్పోతాయో అలా నామస్మరణ వలన కర్మలు ఫలితము ఇచ్చే గుణమును కోల్పో తాయి.
అయితే ఈ నామస్మరణ ఏదో రేడి యో పాడినట్లు గా కాకుండా శ్రద్ధతో, ఆర్తితో, భగవంతుని యందు స్థిరచిత్తంతో చేయాలి.
రోగము వేగముగా తగ్గడానికి డాక్టర్ రోగికి సూదిమందుతో పాటు పథ్యము కూడా సూచిస్తా డు. అలాగే కర్మల ఫలితాన్ని తొంద రగా
కరిగించుకోవడానికి భగవానుడు మన కు నామస్మరణ అనే సూదిమందుతో పాటు శ్రద్ధ అనే పథ్యమును సూచించాడు. కనుక
నిరంతరం భగవంతుని నామస్మరణ చేస్తుం డాలి. ఆర్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో, ఏక చిత్తంతో స్మరించాలి, భజించాలి. తద్వారా ఈ
జనన మరణచక్రమునుండి తరించాలి..
" ఆస్తు లు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తు లు ఎక్కువ ఉన్నవారే అధిక సంపన్నులు. "    
" అనుభవానికి మించిన పాఠం లేదు గుణపాఠాం మించిన గురువు లేడు. "
*"ఇష్టంగా అనుకున్నదే అదృష్టం. బలంగా కోరుకున్నదే భవిష్యత్తు ."
*"అందంగా ఉన్నవారు ఆనందంగా వుంటా రో లేదో కానీ ఆనందంగా ఉన్నవారు అందం గా
కనిపిస్తా రు.అందుకేఆనందంగాఉండండి. అందంగా కనిపించండి."
*మన జీవితం*పుట్టకతో పూలవనం కాదు. అందరివీ *పడి లేచే* బతుకులే మన ఒక్క రికే కాదు అసలు భూమి పైన సమస్యలు
లేని మనిషిలేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుంది అనే *ఆశతో* నవ్వుతూ జీవిద్దాం...
   మనం ఇతరులకి సాయపడే విషయంలో *పండ్లనిచ్చే చెట్టు లా*ఉండాలి.చెట్టు కి ఇవ్వ డమేతెలుసు.మంచిమనుషులుకూడాఅంతే
ఇతరులకి సాయం చెయ్యడం తప్పవారి స్వార్థంకోసం ఎప్పుడు ఏమిఆశించరు.
   మనం చేసిన మంచిపనులను మరుక్షణం లోనే మరిచిపోవాలి కానీ మనకు మంచి చేసిన వారిని మాత్రం మనం జీవించి ఉన్నం త
వరకు గుర్తుంచుకుకోవాలి.అదృష్టా న్ని నమ్ముకుంటే అపుడపుడు విజయం పలక రించ వచ్చు .అదే మన స్వశక్తిని నమ్ముకుం టే
మొదట పరాజయంపొందినా తర్వాత *విజయం*నీయింటి పేరుగా మారుతుంది.. ఆస్తు లు తరిగి ఆదాయం తగ్గిపోవచ్చు.
ఆత్మీయులు విడిచిపోవచ్చు  కానీ నీవు చేసినమేలు నిన్నువిడిచిపొమ్మన్నాపోదు..  
*మనదగ్గర ఉన్నాలేకున్నా ఎంతమందికైనా పంచగల ఒకేఒక్క వస్తు వు సంతోషం మాత్ర మే,.అందుకే సాధ్యమైనంత వరకూ ఎదుటి
వారిని సంతోషంగా ఉంచుదాం...
  బంధం అంటే అవసరానికి వాడుకుని వది లేయడం కాదు , *బంధం* ఎప్పుడు కూడా నేనున్నాననే *ధైర్యం* ఇవ్వాలి నీకు
నచ్చిన ప్పుడు మాట్లా డడం కాదు సమయం లేకు న్నా సమయం కల్పించుకుని మాట్లా డండి..
  బయటకు వెళ్ళేటప్పుడు మెదడును తీసు కెళ్ళండి ఎందుకంటే లోకం మీకు అడుగడు గునా పరీక్ష పెట్టా లని చూస్తుంది. బయట
నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు హృదయాన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే మీ కుటుంబం మీ కోసం ప్రేమని పంచాలని
ఎదురుచూస్తుంది..
  కొందరుమనల్నిఇష్టపడతారు.మరికొందరు మనల్ని ద్వేషిస్తా రు , ద్వేషించే వారిని క్షమిం చండి ఇష్టపడే వారిని ప్రేమించండి. జీవితం
లో ఇలాంటివి సామాన్యం ప్రశాంత జీవితా నికి ఇదో మార్గం..
2/13/21--4:40 AM]  ♥️ 💘 🧡💛
*సాధనలో* ..అహం పెరగకుండా వినయం పెరగడం ఉత్తీర్ణతకు గుర్తు ....
*గురువు సత్యాన్ని గుర్తు చేస్తా డు.సద్గురువు సత్యాన్నిగుర్తు పట్టేలా,గుర్తుండేలాచూస్తా డు.
మనలో భక్తీ,సాధన పెరుగుతుందంటేశాంతి, వినయం పెరగాలి. మనం సత్యానికి దగ్గర వుతున్నాం అనటానికి అదే గుర్తు . భౌతిక
జీవనంలో డబ్బు, కీర్తి, పాండిత్యం పెరిగితే సాధారణంగా అహంకారం పెరుగుతుంది. అవి పెరిగినా అహంపెరగకపోవడమేఉత్తమ
జీవనం అవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో కూడా సాధన పెరిగే కొద్ది సిద్ధు లు, శక్తు లు, సంకల్ప బలం పెరిగి అహం పెరుగుతుంది.
*సాధన పెరిగేకొద్దీ అహం పెరగకుండాశాంతి మరియు వినయంపెరగడం ఉత్తీర్ణతకుగుర్తు
*దైవసంకల్పం లేకుండా ఒక గడ్డిపోచ అయి నా కదలదు.ఒక జీవుడికి మంచిరోజులు వచ్చినపుడు అతడి ఆలోచనలు అతణ్ణి
ప్రార్థనకు పురికొల్పుతాయి.అదేచెడ్డరోజులు దాపురించినపుడు అతని ఆలోచనలన్నీ చెడుదారిన పడతాయి.గొంగళి పురుగు అని
అసహ్యించుకున్నవారు.సీతాకోకచిలుకలా మారిన తరువాత వర్ణించడానికి మాటలు వెతుకుతుంటారు....మనిషి జీవితం కూడా
అంతే..కష్టపడుతున్నప్పుడు రాని ఎవరూ..
నువ్వు సుఖపడుతున్నప్పుడు వెతుక్కొని మరీ వస్తా రు. మనం చేసే ప్రతి పనిని ధర్మం
కనిపెడుతూనే ఉంటుంది. అన్ని దేవుడు చూస్తూనే ఉంటాడు.అంతరాత్మ పరిశీలిస్తూ నే ఉంటుంది.ఇక పగలు, రాత్రి, సూర్యుడు
చంద్రు డు ఉండనే ఉన్నాయి.ఇన్నిటి ఎదుట మనం ఏదైనా తప్పు చేస్తు న్నామంటే, అది ఆత్మవంచనే అవుతుంది...
*నీ విజయాలను నీకన్నా, చిన్నవారితో పంచుకో..స్ఫూర్తితో వారు నిన్ను అనుసరి స్తా రు..నీ ఓటములను నీకన్నాపెద్దవారితో
పంచుకో..అనుభవంతోవారునీకుబోధిస్తా రు.
*ఎకర ఎకరాలుగా భూమిని కొంటున్న మని షిని చూసి స్మశానం నవ్వింది..."నిన్ను కొన బోయేది నేనేనని..నీకు ఇవ్వబోయేది ఆరు
అడుగులేనని..."
*ఆశ ఉన్నవారు....ఆనందంలో మాత్రమే బ్రతకగలరు..ఆశయం ఉన్నవారు..బాధలో కూడా ఆనందంగా బ్రతకగలరు..
*తెలివికినిదర్శనం తప్పులు వెదకడంకాదు.
పరిష్కారాలను సూచించగలగడం.....
*విలైతే నలుగురు కి సాయం చేయి,.
*గొప్పలుచెప్పకు,ఎవరినీతక్కువచేసిమాట్లా డకు,.*నిజాలుమాట్లా డు,అబద్ధా లతో అంద మైన జీవితం ఊహించుకోకు.
*ఇంకొకరితో పోల్చుకొని, మనశ్శాంతి కోల్పోకు...
మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనల్ని చాలామారుస్తా యి...కొందరిని మౌనంగాను,,మరికొందరిని కఠినంగాను...
[2/14, 6:21 AM]  ♥️ 🧡💛
*మనం వేరొకరికి నచ్చకపోతే, అది మన తప్పు కాదు. ఎందుకంటే, మనం వారి అవ సరానికి ఉపయోగపడే..వస్తు వులం కాము.
మనుషులం",
*అందర్ని మెప్పించాల్సిన అవసరం మనకు లేదు...నీలో మంచి, మానవత్వం కోల్పోనం తవరకు, నువ్వే...రాజువి,గెలుపుదేముంది..
గాడిద కూడా గెలుస్తుంది.. పందెం కడితే..
*నమ్మిన వాడిని కొట్టడానికి,ఆయుధం అవ సరం లేదు...అతని నమ్మకం మీద కొడితే చాలు..కనపడని దెబ్బ,సాక్ష్యం లేని గాయం,
ఈజీగా కొట్టేయవచ్చు,ప్రస్తు తం ఇదే  నడు స్తుంది.ఏమి చేసిన పబ్లిక్ గాచేస్తా రు...మళ్ళీ నీతులు చెప్పి..మూతులు నాకేది మనమే...
*నిన్ను ఎప్పటికీ వేరేవాళ్ళతో పోల్చుకోకు...
ఎందుకంటే..సూర్యుడికి, చంద్రు డికి పోలికే ఉండదు. సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తా యి. నువ్వు కూడా అంతే...
*తప్పు చేసి కూడా తమదే గెలుపని వాదిం చేవారికి, ఎదురు చెప్పకండి..నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకీ తెలుసు
అహం అడ్డు గా ఉండటంవల్ల,ఒప్పుకోలేరు.,
ఒప్పుకోరు!......
*మోసానికి, నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది..మోసం అందరూ చేస్తా రు. నమ్మక ద్రోహం నువ్వు-నమ్మిన వాళ్ళు మాత్రమే
చేస్తా రు..
        ♥️ 🧡💛
ప్రేమకు సందర్భాన్ని బట్టి రకరకాల పేర్లు న్నాయి. తల్లిదండ్రు ల మీద బిడ్డ కున్న ప్రేమ ను 'గౌరవం' అన్నారు.
బిడ్డలపై తల్లిదండ్రు లకు గల ప్రేమను 'వాత్స ల్యం' అన్నారు.
భర్తపై భార్యకు,భార్యపై భర్తకు గల ప్రేమను 'అనురాగం' అన్నారు.
ప్రేయసి పై ప్రియునకు గల ప్రేమను'మోహం' అన్నారు.
గురువుపై శిష్యునకు,భగవంతుని పై భక్తు నకు గల ప్రేమను 'భక్తి' అన్నారు.
కనుక భక్తి అంటే ప్రేమయే.భగవంతునిపై గల ప్రేమయే,గురువుపై గల ప్రేమయే భక్తి.
మనకు ఎవరి మీదనైనా ప్రేమ ఉంటే నిరం తరం వారినే తలచుకుంటూ ఉంటాం.వారిని గురించే మాట్లా డుతూఉంటాం.వారినే స్మరి
స్తూ ఉంటాం. వారి మాట స్ఫురణకు వస్తే ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. వారినే ఆరాధిస్తూ ఉంటాం.
ఇదంతా ప్రేమ కారణం గానే.
అలాగే భగవంతుని గురించి ఆలోచిస్తూ భగ వంతునేస్మరిస్తూ,భగవంతునిగురించేమాట్లా డుతూ, ఆయన మాటతో తన్మయం
చెందు తూ ఉన్నామంటే ఆయనపై ప్రేమ ఉంటేనే.
అందుకే ఆయనను తలచుకోవటం-ఆయనే నేను - నేనే ఆయన
'సోహం' = 'అహ మేవస బ్రహ్మ' = 'అహం బ్రహ్మాస్మి'
అని నిరంతరం ఆత్మతత్వాన్ని అనుసంధా నం చేయటం 'భక్తి'
భగవత్తత్వాన్నిచింతించటం,విచారణచేయ టం,దానితో తాదాత్మ్యం చెందటమే భక్తి...
*నీ స్థా యిని తక్కువ చేసుకునే పనులు చేస్తే చరిత్ర హీనునిగా మిగిలి పోతావ్.నీకెవరు మద్దతు ఇవ్వరు,సరికదా నీ దరిదాపులకు
కూడా ఎవరూరారు.అన్నీ నేనే,అన్నీ నావల్లే, జరుగుతున్నయి అనుకోవడం మంచిది కాదు. పరిశీలించి చూస్తే ఎవరూ ఎవరికి
తక్కువ కాదు.ఎవరి స్థా యి వారికుంటుంది.
         💞🧡💛
*టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలు ఏ తరంగా ల వల్ల వస్తా యి? అవి ఎలా అనుసంధానం అవుతాయి.....
సాధారణంగా అన్ని రకాల టీవీ ప్రసారాలు మైక్రోవేవ్‌తరంగాల ద్వారానే నిస్తంత్రీ (wireless) పద్ధతిలో ఒకచోటనుంచి మరో చోటికి
ప్రసారం అవుతాయి.మనం సెల్‌ఫోన్‌కు వాడే టవర్లను ఉపయోగించి సెల్‌ఫోన్లలో ఫోన్‌ఇన్‌(phone-in) అనే ప్రక్రియ ద్వారా ఓ చోట
విలేకరి చేసే వార్తా సమీక్షల్ని ఆయా టీవీల మాతృస్థా నం (studio) వరకు చేరు స్తా రు. ఏదైనా బాహ్యక్షేత్రం (outdoors) లో జరిగే
క్రీడలు, ఉత్సవాలు,సభలు, సమీక్షలు వంటి వాటిని లైవ్‌టెలికాస్ట్‌చేయాలంటే టీవీ వాళ్ల దగ్గరున్న ప్రత్యేక వాహనానికి అమర్చి న
డిష్‌ల ద్వారా సూక్ష్మతరంగాల ప్రసరణ చేసి ఉపగ్రహాలకు సంధానించుకుంటారు. అక్కణ్నించి ప్రసార తరంగాలు వారి మాతృ
స్థా నానికి చేరతాయి. దృశ్య పసారాలకు (వీడియో) మైక్రోవేవ్‌తరంగాల్ని, శ్రవణ ప్రసారాలకు (ఆడియో) రేడియో తరంగాల ను
వాడటం పరిపాటి. ఈ రెంటి కలయిక (admixturing) సరిగాలేనపుడు టీవీలో మాట్లా డే వ్యక్తి పెదాల కదలికలకు, మాటల కు
పొంతనలేకపోవడాన్ని గమనిస్తా ము.
*మానవుడు తాను దేనినైనా పొందగల్గా లంటే తన ప్రయత్నంతోపాటు దైవ సంకల్ప ము కూడా ఉండి తీరాలి.మనం ప్రయత్నం
చేసినప్పటికీ అంతా దేవుని సంకల్పం ప్రకా రమే జరిగి తీరుతుంది.ఒకవేళ మన ప్రయ త్నంతో దేనినైనా పొందగలిగితే అది కూడా
పూర్తిగా మన ప్రయత్నం వలన కానే కాదు! మన ప్రయత్నం పట్ల దేవుడు సంతుష్టు డై తన అనుగ్రహం కురిపించుట చేతనే మనం
దానిని పొందగలిగాము తప్ప మనమేదో అద్భుతం చేశామని కాదు..దేవుని సంకల్పం లేనిదే గాలికూడావీయదు,గడ్డి కూడా కదల
దు..కనుక నేనేచేశాను,నాదే ఇదంతా,నన్ను మించినవారు లేరు... ఇలాంటి అహంకారం వదిలేసి భగవంతుని యందు భక్తి విశ్వాసా
లతో ఉంటూ ఆయన సంకల్పశక్తిని గుర్తిస్తూ నడుచుకోవాలి.తద్వారా భగవంతుని అను గ్రహ, ఆశీస్సులు సదా మనపై ఉంటాయి.
అపుడు మనం సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు..
[2/14, 4:2   🧡💛
*లేడి, ఏనుగు, చిమట, చేప మరియు నల్ల తుమ్మెదలు పంచతన్మాత్రలు అయిన వాస న, రుచి, కాంతి,స్పర్శ,శబ్దా లకు వశమై వాటి
ప్రాణాలు కొల్పోయినప్పుడు; వాటి వాటి గుణాలకు అనుగుణంగా తిరిగి జన్మలు పొందుతాయి.అలానే మనిషికూడా ఈపంచ
తన్మాత్రు లకు బందీఅయి తదనుసారముగా జన్మలు,కర్మలు,అనుభవించు చుండును.
త్రాచుపాము విషముకంటే పంచతన్నాత్రల వలన పొందే చెడుఫలితములు ఇంకాప్రమా దకమైనవి.పాము విషము అది తీసుకొన్న
ప్పుడే ప్రభావము చూపుతుంది.కాని పంచ తన్నాత్రల వలన వాటిని చూసిన, తాకిన వాటి ఫలితముంటుంది.
జ్ఞానేంద్రియాల భయంకరమైన ఉచ్చునుండి స్వేచ్ఛను పొంది, అతి కష్టముతో వాటిని వదిలించుకున్నవారే చావు పుట్టు కల నుండి
విముక్తి పొందగలరు. ఇతరులు ఎవరు షట్‌శాస్త్రముల జ్ఞానము పొందినప్పటికి ముక్తిని పొందలేరు.
❤️💛💜
         
సూర్యుడు సమస్తమునకు కారణము కాగ శనిదేవతఫలితమగును.శనిదేవతను అంకు శముగ,జ్యోతిషమున సంకేతించుదురు.
యమము,నియమము కలిగిన వారిని శని దేవుడనుగ్రహించును.అవిలేనివారిని అంకు శమై శిక్షించును,అనగా శిక్షణ నిచ్చును.
శనిదేవత దేవాలయమునకు పునాది కాగా, సూర్యుడుదేవాలయమునకుశిఖరమగును. సూర్యుడు
దివ్యలోకమునకు,శనిపృథ్వీలోక మునకు,కుజుడు అంతరిక్షలోకములకు అధి దేవతలు.కుజుడనగా స్కందుడే.అతడు సేన
రౌద్రమూర్తి లేక రుద్రత్వము కలవాడు. రుద్రు లే అంతరిక్ష దేవతలు.
చీకటులను చెండాడి చీకటి పైనుండు వెలు గును ఆవిష్కరించి వ్యాప్తిచేయు ప్రజ్ఞయే స్కందప్రజ్ఞ.ఇతడు కారణముగ దివినుండి
భువి వరకు వెలుగు వ్యాపించి యుండును. ఇది జ్యోతిషపరమైన అవగాహనముపై అవగాహన మేరకు కుజుడు,శని, సూర్యు
పుత్రు లుగ వ్యవహరింప బడుచున్నారు.
💜💛💜
          
అహం ఎప్పుడూ భయం నుంచే బయటప డుతూ ఉంటుంది.నిజంగా,నిర్భయుడై న వ్యక్తికి అహముండదు.అహం ఎప్పుడూ ఒక
రక్షణ కవచం లాంటిది.మీరు భయపడుతు న్నారు కాబట్టి,మీచుట్టూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును మీరు సృష్టించుకుంటారు.అప్పు
డు మీకు హాని చేసేందుకు ఎవరూ సాహసిం చరు. లేకపోతే,మౌలికంగా అది భయమే. అయినా మంచిదే.ఎందుకంటే,మీరు దాని
లోతుల్లోకి సరిగ్గా దృష్టి సారించారు.
ఒకసారి మోలిక కారణాన్ని మీరు తెలుసు కుంటే, అన్ని విషయాలు మీకు సులభమవు తాయి.లేకపోతే,అందరూ అహంతో
యుద్ధం చేస్తూనే ఉంటారు.నిజానికి,అహం ఒక సమ స్య కాదు.మీరు అసలైన రోగంతో కాకుండా, రోగ లక్షణంతో
పోరాడుతున్నారు.భయమే అసలైన రోగం. మీరు అహంతో నిరంతరం పోరాడుతూనే ఉంటారు. అయినా మీరు మీ లక్ష్యాన్ని
కోల్పోతూనే ఉంటారు.
ఒకవేళ ఆ పోరాటంలో మీరు విజయాన్ని సాధించినా,ఏదీ గెలుచుకోలేరు.ఎందుకంటే, అహం మీకు నిజమైన శత్రు వు కాదు. అది
కేవలం నకిలీ. దానిని మీరు జయించలేరు. ఎవరైనా అసలైన శత్రు వును జయించగలరు కానీ, ఉనికిలో లేని నకిలీ శత్రు వును ఎలా
జయించగలరు? దాని ముఖం చాలా వికా రంగా ఉంటుంది. మీరు దానిని నగలతో అలంకరిస్తా రు.
నేను ఒక సినీ నటుడి ఇంట్లో ఉంటున్నప్పు డు నన్ను చూసేందుకు వచ్చిన వారిలో ఒక సినీ నటి కూడా ఉంది.ఆమె చాలా అందమై
న వాచీని ధరించింది.దాని పట్టీ చాలా వెడ ల్పుగా ఉంది. ఆమె పక్కనే కూర్చున్న వ్యక్తి ‘‘మీ వాచీ చాలాబాగుంది.ఒకసారి చూసేం
దుకు ఇస్తా రా?’’ అన్నాడు ఆమెతో.ఆ వాచీ తీసి ఇచ్చేందుకు ఆమె సంకోచిస్తోంది.
‘‘ఏమనుకోకండి. ఒకసారి చూసి ఇచ్చేస్తా ’’ అని అతడు మళ్ళీ అడగడంతో ఆమెకు ఇవ్వక తప్పలేదు.ఆమె వాచీ తీసేటప్పుడు
ఆమెనే గమనిస్తు న్న నాకు ఆమె చేతిపై ‘‘బొల్లిమచ్చ’’కనిపించింది.ఆ మచ్చ కనిపిం చకుండా ఉండేందుకే ఆమె ఆ వాచీ ధరిస్తోం ది.
విషయం నాకు తెలిసిందని ఆమె గ్రహిం చింది. దానితో ఆమెకు చెమటలు పట్టా యి.
అహం కూడా అలాంటిదే. అందరికీ భయం ఉంటుంది. కానీ,అది ఉన్నట్లు ఎవరికీ తెలి యకూడదని
అందరూఅనుకుంటారు.ఎందు కంటే, మీరు భయపడుతున్నట్లు తెలిస్తే, మిమ్మల్ని మరింత భయపెట్టేందుకు బయట ఉన్న
చాలామంది మిమ్మల్ని చితకబాదుతా రు. అలా అవమానించడంద్వారాతమకన్నా బలహీనులున్నారనే భావనతో వారు మిమ్మ ల్ని
చక్కగా దోచుకుంటూ ఆనందిస్తా రు.
అందువల్ల భయపడుతున్న ప్రతి వ్యక్తి తమ భయం చుట్టూ అహం బుడగను సృష్టించు కుని అందులోకి గాలి ఊదుతూ ఉంటారు.
అలా వారిలోని అహం పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. అడాల్ఫ్ హిట్లర్, ఈద్ అమీన్‌లు అలాంటివారే. అందుకే వారు అందరినీ
హింసిస్తూ భయపెట్టా రు.
నిజానికి, లోలోపల భయపడుతున్న వారే- తాము భయపడుతున్నట్లు వారికి తెలుసు కాబట్టి-అందరినీ భయపెట్టేందుకు ప్రయత్ని
స్తా ను.లేకపోతే,వారికి ఆ అవసరమేముం ది? భయంలేని వ్యక్తి ఎప్పుడూఎవరికీ భయ పడడు, ఇతరులను భయపెట్టేందుకు ఎప్పు
డూ ప్రయత్నించడు. ఆ అవసరం అతనికి లేదు.కాబట్టి, భయపడే వ్యక్తు లే అందరినీ భయపెడతారు. అప్పుడే ఎవరూ తమని
తాకరని, ఎదిరించరని వారు భావిస్తూ ఉం టారు. మీరు విషయాన్ని చక్కగా గ్రహించా రు. కాబట్టి, మీరు ఎప్పుడూ అహంతో
పోరాడకండి.
💜💛💜
            
ధ్యాన యోగమును 'ఆత్మ సంయమ' యోగ మని పిలుతురు.శరీరము, యింద్రియము లు, మనస్సు, బుద్ధి ఆత్మతో సంయమము
చెందుటకు వలసిన సూత్రములు ఈ అధ్యా యమున "శ్రీకృష్ణార్జు న సంవాదము"గ వేద వ్యాస మహర్షి పొందుపరచినాడు.
ధ్యానము చేయుటకు పూర్వము సాధకుడు పొంద వలసిన శిక్షణ, ధ్యానము చేయుచు అనుసరించవలసిన ప్రధాన సూత్రములు
ఈ అధ్యాయమున వివరింపబడినవి.ధ్యాన  మును గూర్చిన మోజు,వ్యామోహము ప్రస్తు తమున భౌగోళికముగ నేర్పడినది.
సరాసరి ధ్యానమున కుపక్ష మించుట అవి వేకము, అపాయకరము కూడ. సాధకుడు తన్ను తానుగ కొంత నియంత్రణ పాటించు
చు, ధ్యానము ప్రారంభించిన కాలమునుండి ఈ అధ్యాయమున తెలుపబడిన నియంత్ర ణలను అన్నింటిని పాటించవలసి
యున్నది.
యోగశాస్త్రమైన భగవద్గీత యందలి ఈ సూత్రములను పాటింపక ధ్యానమున కుప క్రమించువారు, వారి అశ్రద్ధ, అహంకారము
కారణముగ కష్టనష్టములకు లోనుకాగలరు.
💜💙💜
           
*ప్రజాపతి అంటే బ్రహ్మ అని అర్థంకూడా ఉంది. అయితే విష్ణునాభికమలంనుండీ పుట్టిన బ్రహ్మ ఇతడు కాదు.ప్రజాపతి కొడు
కులలో ఒకడై న బ్రహ్మ అనేవాడు.ఆ ప్రజాప తికి ప్రభాత అనే భర్య వలన ఒక కొడుకు పుట్టా డు.అతడి పేరు ప్రత్యూషుడు.ఇంతని కి
ఇద్దరు కొడుకులు పుట్టా రు.అందులో మొ దటివాడు దేవలుడు.
అతిథిసేవ సులభంగాలభించే వస్తు వుకాదు అతిథి ఎవరికీ అంత సులభంగా దొరకడు. కోరినా దొరకడు.కోరని వాడికి దొరకనే దొర
కడు. కాబట్టి అతిథి దొరకటమనేది అంత సులభంకాదు.
ఆ సేవలో ఉండే మహాఫలంలో ఎంత శక్తి ఉందో తెలిస్తే.దేశంలో దరిద్రమే ఉండదు. ఇతరుల దారిద్య్రం నిర్మూలించటానికి ఆతిథ్యం
ఇవ్వమని చెప్పటంలేదు.అందులో ని రహస్యం, ఆ శక్తి తెలిసినవాడు ఎవరినీ కూడా అన్నంలేకుండా ఆకలితో ఉంచడు.
కృతజ్ఞత ఆశింప చేసే దానం దానంకాదు. అట్టి సేవ సేవేకాదు.ఎవరైనాఅతిథులువచ్చి తిట్టిపోయినాసరే మరచిపోవాలి. ఎవరైనా
అట్లాంటివాడు మన ఇంటికివచ్చి, “నువ్వు అన్నం పెట్టా వు. కానీ ఏం పెట్టా వు? అది ఏ మంత గొప్పపని? నేను ఇలాంటివాళ్ళకు
చాలామందికి అన్నంపెట్టా ను” అని పోయా డనుకోండి.అప్పుడు మనం,“నువ్వు మహా ను భావుడివి. నీకు ఇంతే పెట్టగలిగాను”
అని అనటం ఉచితం.తిట్టినా మర్చిపోవటం ఆదర్శం. అంతటి నిష్ఠ, ఆదర్శం పెట్టు కొంటే ముందరికి వెళ్ళవచ్చు. ఆర్యుల ఆదర్శం
జ్ఞానమే. అదే ఆ ఋషులచరిత్ర తెలిపేది.
*నమస్కరించినవాడు వృధాగాపోడు.గురు వుకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకువెళి తే ఓ పండు ఇస్తా డు.ఆ పండు అప్పుడే
రెండు నిమిషాల్లోనే అరిగిపోతుంది. దాని ఫలం వాడికి ఆ వెనకాలే ఉంటుంది. శ్రద్ధా భక్తు లతో ఉతాములను ఎవరైతే ఆరాధిస్తా రో
వాళ్ళు కోరకుండానే సిద్ధు లొస్తా యి.సాధు జనసాంగత్యం,పవిత్రజనసేనవ్యర్థంగాపోవు
💜💕💜
           
సద్గురువు పరిపూర్ణుడగునుటచే ,అన్ని పాత్రలను పరిపూర్ణముగా ప్రవర్తించగలడు. సామాన్యులకు ఒక సామాన్యునివలె కనిపిం
చును.యోగీశ్వరులకు యోగివలె ,ఋషీశ్వ
రులకు ఋషీశ్వరునివలె కాన్పించును.అన్ని భూమికలలో,అన్నిస్థా యిలలో అన్నివిధము ల అన్నింటికీ,అదేవిధముగా కనిపించును.
సద్గురువు ఏకకాలమందే ఉత్తమాధమస్థితు ల యందుడును.అతడు అనంత సత్యస్థితి లో ప్రతిష్టితుడయ్యెను,వేరొక వంక మాయ
కు ప్రభువై ఉన్నాడు.ఈ రెండు ఎగుడు దిగు ళ్ళను తాను ఏకకాలమందే అన్ని భూమిక లలో ,అన్ని స్థా యిలలో వ్యవహరించును.
మధ్య స్థితుల ద్వారా వాటిని సమతుల్యం గా కాపాడుతున్నాడు.
💞💟💜
          
ఇతరులతో పోల్చుకున్నావంటే భయం తప్ప దు. ఎలా పోల్చుకున్నా సరే.ఆదర్శప్రాయం గా, మానసికంగా,పోల్చుకున్న రీతిలో వెలు
గొందాలనుకుంటే మాత్రం,నువ్వు ఏమీ కాలే వు, కాలేకపోవడం వలనే భయం పుడుతుం ది. అలా కావాలనుకోవడం ఒక కోరిక;
కోరిక ప్రకారం నెరవేరడం జరుగదు.పోలిక ఉన్న చోట భయం తప్పదు.
సమాజం లో మనం ఏమీకాదు అనే భయం ఒకటి ఉంటుంది. అందుచే ఏదో ఒక హోదా పొందాలనే సంతృప్తి కోసం ఆరాటపడతాం.
పౌరునికి మర్యాద చూపేదిగా సమాజం తయారయ్యింది.ఉన్నతస్థితి లేనివాణ్ణి దగ్గ రకు రానివ్వదు.సమాజంలో లేదాకుటుంబం లో
ఒక గుర్తింపు గల వ్యక్తి గానో దేవుని కుడి ప్రక్క కూర్చునే వ్యక్తిగానో ఇతరుల దృష్టిలో పడాలి.లోపల వేదనలతో కూడిన సుడులు,
చెడుతనం ఉన్నా,గొప్ప వ్యక్తి అని గుర్తింపు పొందడమనేది ఒక తృప్తి. ఏదో ఒక పదవి లేకఅధికారంకలిగి,సమాజంగుర్తింపుపొందా
లనుకోవడమంటె ఇతరుల్ని అదిగమించాల నే కోరిక.అది దౌర్జన్య రూపం.ఒక సాధువు సాధుత్వంలో ఉన్నతి సంపాదించాలనుకోవ
డం కూడా పక్షులు ముక్కుతో పొడిచినంత దౌర్జన్యం.ఈ దౌర్జన్యానికి కారణమేంటి !? భయం !.
నేను ఒకరకమైన జీవితం గడుపుతూన్నా  కొన్ని నమ్మకాలు,సిద్దాంతాలు,విధి విధానా లు ఉన్నాయి.అవి నాకు మూలాలు.వాటి
నుంచి పక్కకు తొలగటానికి ఇష్టం లేదు. ఎందుకు అంటే రాబోయే కొత్తవిధానంఏంటో ఎలా ఉంటుందో తెలియదు.అది అయోమ
యం.అంటే ,ఒక నిర్దిష్ట విధానాన్ని సృష్టించు కున్న మెదడు కణాలు,తమకు నిర్థిష్టం కాని మరో విధానాన్ని సృష్టించడానికి
ఇష్టపడదు. ఒక నిర్థిష్టం నుంచి అనిర్థిష్టం వైపుకు ఉండె చలనమే భయం .
వాస్తవ చలనంలో ,వర్తమాన చలనంలో నాకేమీ భయం లేదు.ఎందుకు అంటే ఇప్పు డు నాకేం జరగటం లేదు,నా నుండి ఎవరూ
ఏమీ తీసుకొని పోవడం లేదు.కానీ మనసు లోని మరింత లోపలపోర తెలిసో,తెలియకో ముందు ముందు ఏం జరగబోతోంది అన్నది
లేదా గతం నుంచి ఏదో నన్ను అధిగమించి పోతుందేమోనన్న చింతనలో పడుతుంది. కనుక నేను గతం గురించి భవిష్యత్తు గురించి
భయపడతాను.
రెండు సంవత్సరాల క్రితం జ్వరం వచ్చింది అనుకుందాం.భాధ పడ్డా ను.అది నా స్మృతి లో ఉంది. ఆ జ్ఞాపకం ఇప్పుడు అంటుంది
జాగ్రత్తగా ఉండు ,మళ్లీ జబ్బుపడొద్దు ,కనుక జ్ఞాపకమే ఇలా భయపెడుతుంది. నిజంగా ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు.
ఎందుకు అంటే ఇప్పుడు నేనుబాగానే ఆరో గ్యంగానే ఉన్నాను.గతానికి చెందిన ఆలోచ న, స్మృతి నుంచి పెల్లు బికిన ఆలోచన భయ
పడే బావన సృష్టించింది. అది నిజం కాదు. నిజం ఏమిటంటే నీవుఇప్పుడుబాగున్నావు. మనసులో నిలిచిన జ్ఞాపకంగా నిలిచిన
గతానుభవం ఆలోచనను మేల్కొలిపి జాగ్ర త్తగా ఉండు అని హెచ్చరిస్తుంది.అదే భయా నికి కారణం.!!!
ఉన్నది భయం అది మొత్తంగావుంది.దాన్ని మొత్తంగా చూడటం సాధ్యమా !? ముక్క చెక్కలైన మనసు చూడగలదా !? అసలు
ఆలోచనా ప్రక్రియే ప్రతిదాన్ని చిన్నాభిన్నం చేస్తుంది.నిన్నుప్రేమిస్తా ను,నిన్నుద్వేషిస్తా ను, నువ్వు మిత్రు డివి,విరోదివి కూడా! నా దేవు డు,
నీ దేవుడు,నా దేశం,నీ దేశం,నా మతం నీ మతం,నా కులం నీ కులం-ఇదీ ఆలోచనా ధోరణి.ఇలాంటి ఆలోచన ఒకటిగా ఉన్నదా న్ని
ముక్కలు ముక్కలుగా తరిగి చూస్తుంది. కనుక ఆలోచనాచలనం ఆగినప్పుడు మాత్ర మే మొత్తం భయరూపాన్ని చూడటం జరు
గుతుంది.
గమనించేటప్పుడు ఒకటి ఆర్థం అవుతుంది. ఈ గమనించేవాడు ఒకఅభిప్రాయాల పుట్ట, జ్ఞాపకాలతుట్ట, కనున విలువలేని వాడు.
అలాంటప్పుడు ఈ చూసేవాడు ,చూడబడే భయానికి వేరైన వాడా !? రెండూ ఒకటే. చూడబడేదీ భయమే ,చూసేవాడూ భయ
స్తు డే. ఇదీ అసలు వాస్తవం.దూరం నుంచి, వేరైయుండి చూసినంత కాలం భయం భయ మే .కానీ భయమే తానైతే ఇద్దరి మధ్యా
ఖాళీలేదు,కాలం లేదు.ఇద్దరూ ఒకటేనన్న అవగాహన కలిగిన మరుక్షణమే భయం మాయమైపోతుంది .భయంలో నీవు భాగ మని,
భయానికి నువ్వు వేరుకాదు అని , భయమే నువ్వు అని తెలిసిన తక్షణమే వెతికేవాడూ లేడు,వెతకాల్సిన వస్తు వులేదు
మనకు భద్రత కావాలి.ఇంట్లోబిడ్డకుమరింత భద్రత కావాలి. తల్లిదండ్రు లు వాళ్ళ కోర్కెల సాధనలో,ఇంక ఇంకాఅనే పెరపెరల్లోమునిగి
ఉంటారు.భవంతుల్లో,రాజభవనాల్లోమరెంతో భద్రత కావాలి. భద్రత లేకపోతే మెదడు సమర్థవంతంగా ఆరోగ్యంగా పని చేయదు .
మానసికంగా భద్రత చెందటం మరీ కష్టం . కనుక భద్రతను నమ్మకంలోనూ,తీర్మానంలో సిద్దాంతంలో,అనుభవంలో, కుటుంబంలో ,
జాతీయతలో పొందాలని కాంక్షిస్తాం.ఆనమ్మ కం ,నిర్ణయం,అనుభవం,కుటుంబం వగైరా లు మరుగవగానే భయం సాక్షాత్కారం
పొందుతుంది.
ఒంటరితనం ఉందే అది ఉన్న స్థితినిపూర్తిగా అర్థంచేసుకోనివ్వదు.గతానుభవానికిసంబం ధించినశబ్దం,పదం ప్రమాదబావంకల్గిస్తుంది.
దాంతో భయం ఏర్పడుతుంది. దాని నుండి పారిపోతాం.అదే మన ప్రయత్నం. ఒకమాట చెప్పగానే ముఖంలో
మార్పువస్తుంది.అద్దం లో చూసుకోవచ్చు.స్వర్గం,నరకం ,దేవుడు, కమ్యూనిజం,కుటుంబం,భార్య,ఒంటరితనం ఇలాంటి పదాలు
మనమీద అసాధారణమై న ప్రభావం చూపుతాయి.మనం ఆ పదాల కు బానిసలైపోయాం.బానిసత్వానికి లోబడ్డ మనసు భయం
నుంచి విముక్తి ఏనాటికి కాలేదు.
ఒంటరితనం ఉన్నంత మాత్రాన, ఆ వాస్తవం వలన భయం కలగడం లేదు. ఒంటరితనం వస్తుందన్న బావనవల్ల భయంకలుగుతోంది.
వాస్తవం వలన గాక వాస్తవం కలిగించభోయే ప్రభావం వల్ల భయం కలుగుతోంది. మనసు జరగభోయేదాన్ని చూసి భయపడుతుంది.
వాస్తవం గురించి కాదు. భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. తెలియని దాన్ని గురించి కాక, తెలిసింది పోతుందేమోనన్న భయం
ఉంది. గతం గురించి కూడాకాదు.గతం కలి గించే ప్రభావం ఎలా ఉంటుందోనని ఆలోచన వలన భయం.లోపల ఒంటరితనం ,లోపల
ఏమీ లేదన్న భావం భయం కలిగిస్తుంది. అప్పుడు దేన్నో ఒక దానిని ఆశ్రయించాలి. అప్పుడు బంధం ఏర్పడుతుంది. ఆ బందం
సిద్దాంతంతో,లేక నమ్మకంతో ఏర్పడుతుంది. అది ఉన్నదాన్నిఅవగాహనకుఅడ్డు వస్తుంది.
పోగు చేసుకోవడంలో,పోగు చేసుకునే ప్రక్రి యకు సంబంధించిన నమ్మకంలో భయం చేరి ఉంది.కుమారుడు చనిపోతే ,పునర్జన్మ లో
నమ్మకం పెట్టు కుంటాం.ఎందుకు అంటే , మానసిక వేదన నుంచిఓదార్పుకోసం.తప్పిం చుకోవడానికి.కానీ నమ్మక ప్రక్రియలోనే సంశ
యం ఉంది.బయట వస్తు వులు పోగు చేసు కుని యుద్దా లు కొని తెస్తు న్నాం,లోన నమ్మ కాలు పోగు చేసుకుంటున్నాం, అలా భాధ
కొని తెస్తు న్నాం.బద్రత,బ్యాంకు ఎకౌంటు, సంతోషాలు,వగైరా వగైరా కావాలని కోరిక ఉన్నంతకాలం ,మానసికంగానో లేక భౌతికం
గానో ఏదో కావాలనుకున్నంత కాలం బాధ ఉండక తప్పదు.భయం నుంచి తప్పించుకో వాలనిచేసేవాటిలోనే భయం,బాధఉన్నాయి
ఒక ప్రత్యేక విధానంలో ఉండాలని కోరుకున్న ప్పుడు భయం ప్రవేశిస్తుంది.భయం లేకుండా ఉండడమంటే ప్రత్యేక పద్ధతి అంటూ
లేకుం డా జీవించడమే.అయితే భయం లేకుండటా నికి ఒక విధానాన్నే విధ్వంసం చేస్తా ననడం కొత్త విధానం కోరుకోవడం
అవుతుంది.అది మరో భయానికి కారణం.భయం పోగొట్టకో వాలని మనం చేసేది ఏదైనా భయానికి కార ణం అవుతుంది. భయం
తన నుంచి తాను తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు చూసు కుంటుంది.సామాన్యమైనది గుర్తింపు పొంద డం- దేశంతో
,సంఘంతో ,అభిప్రాయం తో ఏకం కావడం.మతఊరేగింపు,సైనికకవాతు, దేశంపై దాడి ఇలాంటివి సంభవించినప్పుడు మనం ఏం
చేస్తా మో చూడండి.దేశానికో ఆద ర్సానికో అంకితం అయిపోయినట్టు గుర్తింపు కోరతాం. భార్య బిడ్డలతో లేక గొప్ప క్రియతో గుర్తింపు
పొందాలని కొందరు చూస్తా రు. గుర్తింపు అంటే తనని తాను మర్చిపోవడం
*నేను అనే చింతన నిలిచి ఉన్నంత కాలం బాధ, పోరు, భయం ఉంటాయి.అయితే గొప్ప వాళ్ళతోనో గొప్ప విషయంలోనో, జీవి
తంలోనో సౌందర్యంతోనే సత్యంతోనే ,జ్ఞానం తోనే తాత్కాలికంగా గుర్తింపు చెందితే ,నేను నుంచి తప్పుకోవచ్చు.దేవునికి,
కుటుంబాని కి అంకితమైనా మైమరపు వస్తుంది. తాత్కా లిక తప్పించుకోవడం అవుతుంది.
గతం భద్రతతోనే జరిగింది. అనిశ్చాలున్నా నిన్న గడిచిపోయింది. ఈ రోజు పర్వాలేదు, బాగానే ఉన్నాను.రేపటి గురించి భయపడు
తున్నా. రేపటి అనిశ్చియంతో కూడిన అభ ద్రత ద్వారాఉండే ఉనికే భయం ! భవిష్యత్తు బాగానే ఉండవచ్చు.కానీ దానిని గురించిన
ఆలోచన భయాన్ని కలిగిస్తుంది.రేపుఏమైనా జరగవచ్చు,ఏమీ జరగకపోవచ్చు.ఎప్పుడూ భధ్రతకోరే ఆలోచన,హాఠాత్తు గా భవిష్యత్తు
గురించి అనిశ్చయ భావానికి లోనయిందం టే భయం కలుగుతుంది. భగవంతుడా ఏం జరుగుతుందో
అనుకుంటాం.కనుకఆలోచన భయాన్ని పెంచి పోషిస్తుంది.
ఒక ఆదర్శాన్ని, నమ్మకాన్ని తెచ్చిపెట్టి దాని ద్వారా నిశ్చయత్వం కోరే ఆలోచన భయాని కి కారణం అవుతుంది.ఆ భయం అంతా
ఆలోచనా పనితనం .భయం తెలిసినదాని తోనే సంబంధించి ఉంటుంది.తెలియని దాంతో కాదు.
*Never mind failures; they are quite natural, they are the beauty of life, these failures. What would life be
without them?*
*పరాజయాలను పట్టించుకోకండి.అవి సర్వ సాధారణం,అవే జీవితానికి మెరుగులు దిద్దే వి. ఓటములే లేని జీవితం ఉంటుందా!.
❣️💟💜
        
పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు.... రాజుకో
విషయంనిర్దేశంచేసాడు.‘చెప్పేవాడుగురువు, వినేవాడు శిష్యుడు.గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రిందఉండాలి’అని
షరతుపెట్టా డు.
దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు.
‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు పశువుల కాపరి.
మొదటి ప్రశ్న:-దేవుడు ఏ వైపు చూస్తు ఉంటాడు?
జవాబు గా, ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థా నంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టా రు.
మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది?ఏ దిక్కు వైపు చూస్తుంది చెప్పండి? అని ప్రశ్నిం చాడు. ‘అన్నివైపులకు చూస్తుంది’ అని
జవాబిచ్చాడు రాజు.
ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగి నపుడు.. పరంజ్యోతి స్వరూపమైన భగవం తుడు అన్నివైపులా చూడలేడా? సమస్త
జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మే.
మరి ఇక రెండవ ప్రశ్న.... దేవుడు ఎక్కడ ఉంటాడు? అన్నాడు రాజు.
‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’ అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చారు.
‘మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’అని అడిగాడు.
‘పాలను బాగా మరుగబెట్టా లి.వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధం అవుతుంది.దాన్ని
కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది.తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవు తుంది’ అన్నాడు రాజు.
‘సరిగ్గా చెప్పారు మహారాజా! అలాగే హృద యం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి,మనస్సు అనే తోడు వేసి,
స్థిరంగా ఉంచితే వచ్చేసత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది.ఆ సాధన ‘అంతర్ముఖం’అనే
నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’అన్నాడు కాపరి. సభ లో హర్షధ్వానాలు మిన్నుముట్టా యి.
ఇక చివరి ప్రశ్న:-దేవుడు ఏం చేస్తా డు? అని.
నేను పశువుల కాపరిని, మీరు మహారాజు.
క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబె ట్టా రు. పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశా రు. ఇదే పరమాత్మలీల.సత్కర్మలు చేసే జీవు
లను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థా యికి పంచడమే పరమాత్మ పని....
💖💟💜
          
*జీవుడెప్పుడూ సనాతనుడు,శాశ్వతుడు. అతని కేర్పడిన దేహము వచ్చి, పోతూ ఉంటుంది.వచ్చినపుడు శరీరమును పోషి స్తూ,
నిర్వర్తించవలసిన జీవనప్రయోజనాన్ని నిర్వర్తిస్తూ ఉండడమే తప్ప,ఎప్పటికీ ఉండి పోవాలన్న భావన అజ్ఞానము.
*అష్టాంగ యోగము నిర్వర్తించుకుంటే  దేహము నుంచి వెలుపలికి వెళ్లే దారులు తెరుచుకుంటాయి.
*సమత్వాన్ని, స్థిరత్వాన్ని స్వప్రయతంతో సాధించుకోవాలి.
*జ్ఞానియైనవాడు అవాంతరాలుఎదురైనపు డు పరిస్థితులకు లొంగిపోడు.తాను అధికు డననే భావం అతనిలో ఉండదు,కానీ భగ
వంతునిఎడల తనకుగల విశ్వాసపాత్రతను చూపేందుకు స్థిరంగా నిలిచి ఉంటాడు.
*ఇతరులు మనలను ఉద్దేశించి ఒక కఠిన మైన పదజాలం ఉపయోగిస్తే మనం దానిని పదే పదే తిరిగి గుర్తు తెచ్చుకుంటూ చివరకు
మెదడులో నిక్షిప్తం చేసుకుంటాము.
*కానీ అది సరియైనదికాదు.దానికి పరిష్కా రం ఏమిటంటే ఆలోచనకు ప్రతికూల ఆలో చనను తెచ్చుకునే ప్రయత్నం చేయాలి.దీని
ద్వారా ఆ చెడు ఆలోచన బలహీనపడు తుంది. చెడుని ఎప్పుడూ మంచి ద్వారా ఎదుర్కోవాలి.
💟💚💖💟
          
*మనసు ఆలోచనల సమూహం అంటారు.. మనసే దైవం అంటారు... ఎలా అర్థం చేసు కోవాలి !?"
*పరమాత్మ మనతోనే ఉండి మనకు ప్రతి క్షణం అనుభవంలోనే ఉంటున్నా మనోవేగం వల్ల మనం గుర్తించలేక పోతున్నాము. మన
వద్ద లేని వస్తు వులను కావాలనుకోవడం, వెతకాలనుకోవడం, ప్రయత్నం చేయటం వంటివి మనకుఅలవాటైంది.అదే అలవాటు లో
దైవం విషయంలో కూడా అదేచేస్తు న్నాం. నిత్యజీవితంలో మనోవేగం తగ్గించుకుంటే మనలోనే ఉన్న దైవం మనకు అనుభవంలో కి
వస్తుంది. అప్పుడు మన మనసే దైవంగా ఉంటుంది.ప్రత్యేకించి దైవాన్ని తలచుకోవ టం కూడా తానే దైవంగా ఉండే ఆ స్థితిని,
సాధారణ నిత్యజీవితాన్ని నియంత్రించుకో వడం ద్వారా కూడా పొందవచ్చు !      
*ప్రకృతిని ప్రపంచాన్ని విస్మరించడం అంటే.. దాని పరిధిని తెలుసుకొని మసలుకోవడం !
*సృష్టికార్యం యావత్తు మిథ్యే.అంటే శాశ్వ తత్వం లేనిది.మనో నైర్మల్యాన్నిసాధించుక్ను వ్యక్తికి అహంకారం,అభిమానము,చిత్తము,
స్మరణము, చింతన జరామరణాలు ఏవీ ఉండవు. తానే సత్యం. ఉన్నది తానే అని అర్థమైతే ఇక సర్వమూ అనే భావన కూడా
నశిస్తుంది. తాను కాక సర్వమూ అనేది వేరే లేదు. ఉన్నది ఒక్కటే ఆత్మ.అదిఅవిభాజ్యం. దానిముందు మనం చెప్పుకునే ఏ సర్వము
అయినా అల్పమైనదే అవుతుంది.దృశ్యమా నమైన ప్రకృతిని ప్రపంచాన్ని విస్మరించడం అంటే దాని పరిధిని తెలుసుకొని మసలుకో
వడం. దానికి అవసరానికిమించిన ప్రాధాన్య తను ఇవ్వకపోవడం.శరీరం ప్రకృతిపరమైన ఒక ఉపకరణంమాత్రమేఅనితెలుసుకోవడం
💚💟💚
            
*దేవతలు - అసురులు*వందలైన ఆశలచే త్రాళ్లచేత కట్టబడియుందురు.కామ క్రోధము లు ఆదర్శములుగా యుండును. కోరికలు
తీర్చుకొనుటకు అన్యాయ మార్గములలో సాధన సంపత్తిని కూడబెట్టు కొందురు.
*ఆచరణకన్నాముందు ఫలితమును భావిం చుట ఆశ.ఇది ఆచరించిన కర్మ ఫలముల యందు ఆసక్తి కన్నా ఎక్కువ గట్టిగా బంధిం
చును.దీనివలన కలిగిన కామ క్రోధములు మరియు బలీయములు.అర్థ సంచయము లు అనగా ధనము,పొలము,గృహము,
కామ్య వస్తు వులు కూడబెట్టు ట.
*మావారు నిత్యము ఇట్లు భావించుచుందు రు. "నేడు నేను దీనిని పొందగలిగితిని. ఇక మిగిలిన వానిని కూడా ఇట్లే పొందగలను.
నేడింత కూడినది. రేపింత పెరుగును. నా ధన సంపద ఇన్ని రెట్లు గా పెంచుకొందును. ఈ శత్రు వును చంపితిని. ఇంకెవడై నా నాకు
శత్రు వైనచో ఇట్లే చచ్చును.నాకన్న అధికారం  కలవాడెవడు? నాది భోగి జాతకము. నా సంకల్పమునకు తిరుగులేదు.
*నాకన్న బలవంతుడెవడు? నాది సుఖపడు జన్మ. పుట్టు క చేతనే నేను అధికుడను. అందును గొప్ప వంశమున పుట్టితిని. నాతో
సాటి ఎవడు? కొట్టదలచిన చోట కొట్టెదను. పెట్టదలచిన వానికి పెట్టెదను.ఇచ్ఛను అను సరించి సమ్మోదము పొందెదను." ఇట్లు
అజ్ఞాన ప్రలాపములు చేయుచుందురు.
💜💕💟💜💕
          
ఆనందమయకోశమున సర్వజ్ఞత్వము మొదలైన గుణములున్నవా లేవా అని తర్కింపవలదు.శ్రు తి వాక్యములు తర్కము నకు
విషయములు కావు.గనుకను, మాయ యందు సర్వమును సంభవమే అగుటచేత ను తర్కమునకు అవకాశము లేదు.
ఆనందమయకోశము నుండి సృష్టింపబడు చున్న స్వప్నజాగ్రదవస్థలను మార్చుటకు ఎవరికి గాని శక్తి లేనందున దానిని సర్వేశ్వ
రుడనుట తగియున్నది.
సకల ప్రాణికోటి యొక్క విషయవాసనలు ఆనందమయకోశమున ఉన్నవి. అవి అన్నీ దానియందు క్రోడీకరింపబడుట వలన అది
సర్వజ్ఞుడనబడినది.
జీవుడు జాగ్రదవస్థలో విశ్వుడనీ,స్పప్నావస్థ లో తైజసుడనీ,సుషుప్తా వస్థలో ప్రాజ్ఞుడనీ చెప్పబడుచున్నాడు.
అట్లే ఈశ్వరుడు కూడా క్రమముగా వైశ్వాన రుడు,హిరణ్యగర్భుడు,ఈశ్వరుడు అని చెప్పబడుచున్నాడు.మూడవస్థలయందున్న
జీవుడు మూడు జీవులు కానట్లే ఈశ్వ రుని మూడు భేదములు కూడా ఒక ఈశ్వ రుణ్ణే సూచించును.
కారణావస్థ యగు సుషుప్తా వస్థ యందలి ఈశ్వరునిలో మిగిలిన రెండు అవస్థలును గ్రహింపబడును.ఈవిధముగ సర్వగతుడగు
ఈశ్వరుడు అంతర్యామియై మూలకారణ మై జగన్నియామకుడగుచున్నాడు.
సుషుప్తిలో ఆనందమయకోశమున కారణా వస్థ యందున్న జీవుడు విస్తృతార్థమున ఈశ్వరుడనీ చెప్పవచ్చు.
ఒక నగరము ఫలానా దేశమునకు మాత్రమే గాక అనంత విశ్వమునకు కూడా చెందును.
జీవుని ఆనందమయ కోశము ఈశ్వరుని ఆనందమయకోశములోని అంశమే అగుట చే జీవేశ్వరుల ఐక్యత నిలుచుచున్నది.
తత్త్వమును విస్మరించుట వలననే శ్రు తి వాక్యములు తర్కమునకు విషయములవు ను. సర్వజీవులయొక్క ఆత్మ జాగ్రత్,స్వప్న,
సుషుప్తు లను మూడు అవస్థలను అనుభ వించును.వానికి దేహముతో సంబంధము లేదు.నానాత్వము కేవలము ఆ భాసమే.
శ్రు తిని మాత్రమే ప్రమాణముగా స్వీకరించ వలెను. బ్రహ్మము నామరహితము,రూపర హితమునగు తత్త్వము.
ఆత్మతత్త్వ విచారణ యందు నిమగ్నుడై న ప్పుడు భ్రాంతి జనకమగు ప్రపంచదృశ్యము భ్రాంతి అస్తమించును.సకలావస్థలు అనంత
మగు చైతన్యజ్యోతి ఒక్కటే ఏకైక సత్యము (సత్త) అని గ్రహించిన వ్యక్తి తత్త్వమును తెలిసికొనును.
💙💕💜
        
వేగముగా మథించబడుచూ పైకి లేచుచున్న ఆ మందరపర్వతము - స్థిరముగా తిరుగు టకై, ప్రభూ! నీవు నీ పద్మహస్తమును ఆ
పర్వతముపైనుంచితివి. అప్పుడు బ్రహ్మదే వుడు,శివుడు మొదలగు దేవతలు ప్రభూ! విష్ణుమూర్తీ! నిన్ను స్తు తించుచూ,ఆకాశం
నుండి నీపై పుష్పవర్షము కురిపించిరి.శ్రీమ హా­విష్ణువు  24 అవతారాలెత్తా డని భాగవ తం చెబుతోంది. ఆయన ఎన్ని అవతారాలె
త్తినా వాటిలో పైకి కనిపించే ప్రయోజనంతో బాటు మరెన్నో కూడా ఉన్నట్టు నిశితంగా పరిశీలిస్తే కనబడుతుంది.
విష్ణువు అనే ఒకే ఒక్క నిర్గుణ స్వరూపం నుండి వివిధ అవతారాలను సందర్భాను సారంగా ఆయనే ఎత్తా రని తెలుసుకోవాలి.
అప్పటి వరకు తనను కనీసం తలచని, పిల వని, గుర్తు చేసుకోని వానికి కూడా ఆపద సమయంలో పిలిచిన వెంటనే తనను తాను
అర్పించుకోడానికి సిద్ధమవుతాడు,విశేషమై న సంపదనిస్తా డని అర్థం.దశావతారాలలో ప్రతి అవతారమందు భగవంతునిలో ఆ ఆర్తి
జగద్విదితం. సమస్త సృష్టిని నిర్వహించడా నికి పరిపాలించడానికి తానే స్వయంగా సారథ్యం వహించటాన్ని తెలియజేస్తూ
కూర్మావతారాన్ని ఎత్తా రు శ్రీ మహా విష్ణువు.
పాలసముద్రంలో మంధర పర్వతాన్ని కవ్వం గా చేసి దేవతలు,దానవులు వాసుకిని త్రాడుగా చేసుకుని చిలుకు తుంటే కవ్వానికి
ఆధారం లేక పర్వతం అటు ఇటూ కదులు తున్న సందర్భంలో దేవతల ఆర్తిని అర్థం చేసుకున్న విష్ణువు వారిని గెలిపించడానికి వారి
బాధ్యతను తానుమోయాలనిభావించి ఎంతటి బరువునైనా మోయగలిగే తాబేలు గా మారి తన డిప్పపై మంధర పర్వతాన్ని మోసి
క్షీరసాగరమథనాన్ని జరిపించాడు. 
💕💜💕
      
*శబ్దమంటే ఏమిటి? ఆధునిక విజ్ఞానం ప్రకారం,ప్రకంపనం.అణువిజ్ఞాన శాస్త్రమూ, ఐన్‌స్టైన్‌సిద్ధాంతమూ,అణురూపంలో పదా
ర్థమంతా ఒక్కటేనని నిరూపించాయి (ఇది వేదాంతంలోని అద్వైతం!).కాని వస్తు వుల న్నీ కళ్లకి వేరువేరుగా కనబడుతాయి.దీనికి
కారణం ప్రాథమికశక్తి వివిధప్రదేశాలలో వేరు వేరు వేగాలతోప్రకంపించటం.ప్రకంపనంశబ్దా న్ని కలిగిస్తుంది.దీనినే వేరేవిధంగాచెప్పాలం
టే - శబ్దం రావాలంటే ప్రకంపనాలని సృష్టిం చాలి. ప్రాథమికశక్తియొక్క ప్రకంపనలు వేరు వేరు వేగాలతో సంభవించటంవల్ల విశ్వసృష్టి
జరిగిందన్న శాస్త్రవాదమూ,పరమాత్ముని శ్వాసమూలంగానే విశ్వసృష్టి జరిగిందన్న వేదవాక్యమూ పొంతన కలిగే ఉన్నాయి.
మానవునిలోనూ,మృగాలలోనూ ఆరోగ్యా నికీ,అనుభూతులకీ మూలం ఏమిటి? ఉచ్ఛ్వాసనిశ్వాసాలు - ఊపిరి శరీరంలోని
వివిధనాడులలో ప్రసరిస్తూ ప్రకంపనలను కలిగిస్తుంది - ఇదే ఆరోగ్యానికీ, అనారోగ్యా నికీ కారణం.
*యోగాభ్యాసం వల్ల నాడుల ద్వారా ఊపిరి ప్రసారాన్ని నియమబద్ధం చేస్తే అద్భుతమైన ఆరోగ్యం కలుగుతుంది.అటువంటి
సందర్భా లలో రక్తనాళం తెగినా రక్తస్రావం జరుగదు. యోగులు,గుండెనీ నాడినీ స్తంభింపచేసి
భూమిలోసమాధిస్థితిలోఉండగలరు.పాము విషంగాని,తేలుకుట్టినాగాని వారిని ఏ మాత్ర మూ బాధించవు.వాళ్లు మామూలు
ఉచ్ఛ్వా స నిశ్వాసాలను నియమబద్ధం చేయగలగ టం వల్లనే ఇవన్నీసాధ్యం.దేహం సజీవంగా ఉండటానికి మాత్రమే ఊపిరియొక్క
అవస రం పరిమితం కాదు. మనస్సూ,మానసిక ఆరోగ్యమూకూడా దానిపై కొంతవరకు ఆధా రపడి యున్నాయి. దీనికి కారణమిది:
మన భావాలన్నిటికీ మూలమైన మనస్సూ, జీవ శక్తికి మూలమైన ప్రాణమూ ఒకటే అవటం. నాడుల ప్రకంపనలే
ఆరోగ్యకరమైన(మంచి) ఆలోచనలకి గాని అనారోగ్యకరమైన (చెడు) ఆలోచనలకి గాని మూలం.ఇది మీకూ అను భవమయ్యే
ఉంటుంది. భగవత్సాన్నిద్ధ్యాన్ని అనుభూతికి తెచ్చే ప్రదేశంలోగాని,మానసిక ప్రశాంతిని కలిగించే సత్పురుషుని సమక్షాన గాని ప్రాణం
ఎట్లా ఉంటుంది? కోపంగాని, ఉద్వేగంగాని కలిగినప్పుడు ప్రాణం ఎట్లా ఉంటుంది?ఈరెండు పరిస్థితులలోనూశ్వాస తీరే వేరువేరుగా
ఉంటుంది కదా. రకరకాల ఆనంద సమయాలలో,సంతోషవేళలలో కూడా శ్వాస వివిధరీతులలో ఉంటుంది...
*ధార్మిక అభ్యాసాల వల్లగాని,భజనలవల్ల గాని కలిగే ఆనందానికీ, ఇంద్రియ సంతృప్తి వల్ల కలిగే ఆనందానికీ తేడా ఉంది. సాధార
ణంగా, ఉచ్ఛస్థితికి చెందినఆనందం కలిగిన ప్పుడు నిశ్వాసం కుడి నాసికాపుటం ద్వారా జరుగుతుంది.కేవల ఇంద్రియసుఖంలో ఎడ
మ నాసికాపుటంద్వారా జరుగుతుంది.మన స్సులో ఉన్నతమైన భావాలు కలిగినప్పుడు ఇంద్రియాలన్నీదానిపైకేంద్రీకృతమవుతాయి.
అటువంటుప్పుడు ఊపిరి నెమ్మదిగా,లయ బద్ధంగా రెండు నాసికాపుటాల ద్వారానూ సాగుతుంది.దేని గురించి చింతిస్తోందో,దాని
లో భావం లీనమైపోయినప్పుడు ఊపిరి నిలిచిపోతుంది,మనస్సు ఆలోచించటం మానివేస్తుంది.అయినా ప్రాణి సజీవంగానే
ఉంటుంది.అప్పుడే జ్ఞానం లేక శుద్ధ చైతన్య స్థితి జీవిని ఆవహిస్తుంది.కాబట్టి,జీవుని భౌతిక దేహమూ,ఎరుక కలిగి ఉండటమూ
(చైతన్యమూ) కూడా ఊపిరి యొక్క శక్తి వల్ల సృజింప బడినవే-దానిపైనే అవి ఆధార పడి యున్నాయి.ఊపిరి ఆడటం ఆగగానే అవీ
ఆగిపోతాయి.ఊపిరి ఆడటమంటే మనస్సులోని ప్రకంపాలని నిబద్ధం చేయట మే. అన్ని పదార్థా లూ - చేతనమైనవైనా,
అచేతనమైనవైనా - పరమాత్ముని నుండే ఉత్పన్నమవుతాయి, అనేక రూపాలు ధరి స్తా యి, మార్పు చెందుతాయి, అదృశ్యం కూడా
అవుతాయి.ఇన్ని రకాల మార్పులని కల్పించటానికి అవసరమైన ప్రకంపనలు ''పరమాత్మ'' అనబడే దాని నుండే రావాలి కదా!
బ్రహ్మం - నిర్గుణమూ, అచలమూ, అవ్యయమూ అనే అద్వైత సిద్ధాంతాన్ని కాస్సేపు ప్రక్కకి పెట్టు దాం.అద్వైత మతాను సారం
అనిర్వచనీయమైన మాయా శక్తితో కలిసే బ్రహ్మం దృశ్య మానమైన జగత్తు లో అనేక రూపాలు ధరిస్తుంది.
*అట్లా కనబడటం మిధ్యేఅయినా కాకపోయి నా ఒకే మూల శక్తి సజీవంగానో,జడంగానో
రూపంధరిస్తుందనిఒప్పుకోవాలి.అదిమాయే అయినా దేనిపైనోఆధారపడాలికదా.ఆఆధా రమే ఈశ్వరుడు.అనేక రూపాలను ధరించే
మాయ కూడ పరబ్రహ్మయొక్క ప్రకంపన ఫలితమే.అనేక రూపాలను ధరించే ప్రకంప నలున్నా పరబ్రహ్మ అంతరంలో ఏ కదలికా లేక
నిశ్చలంగా ఉంటుంది.మనకి మాత్రం రూపం ధరించిన ప్రకంపనలు తెలుస్తా యి. ఇవి కూడా ఎంతో క్రమబద్ధంగా ఉంటాయి. కక్ష్యలో
పరిభ్రమించే అసంఖ్యాకమైన సౌర మండలాలుమొదలు ఒకగడ్డిపోచ,ఒకదోమ, సృష్టి వరకూ ఏదోఒక నియమముంది.విశ్వ శ్రేయస్సు
ఈ నియమంపైనేఆధారపడిఉంది. ప్రకృతి శక్తిని పరమాత్మ విశ్వసృష్టికీ, విశ్వ పాలనకీవినియోగించాడు.అయినాఒక్కొక్క సారి
ఈనియమం తప్పుదారిని పట్టినా భగ వంతుడు చూస్తూ ఊరుకొంటాడేమో ననిపి స్తుంది! ఈ కారణం వల్లనే ప్రకృతి శక్తు లు
హద్దు లు మీరటం చూస్తూంటాం.ఒకోసారి వర్షాలు పడవు.ఒకోసారి వరదలు మరీ విప త్కరంగా సంభవిస్తూంటాయి.మానవుని
మనస్సువలె ఏదీ తన నిజప్రకృతికి దూరం కాలేదు.విషయవాంఛలు చాలా బలీయం. ప్రకృతి సిద్ధమైన నియమాలూ,నిబంధనలూ
సంయమనమూ ఏర్పడ్డా అన్ని హద్దు లనూ, ఆంక్షలనూ ప్రక్కకు పెట్టి మనస్సు ఉన్మత్తత తో విశృంఖల మవుతూంటుంది.
*మానవశ్రేయస్సుకు వ్యతిరేకంగా వర్తించే ప్రకృతి శక్తు లను దారిలోపెట్టటంసాధ్యమేనా అనే ప్రశ్న కూడ ఉత్పన్నమవు తూంటుంది.
అట్లా గే వెఱ్ఱితలలువేసే మనస్సుని అదుపు లో పెట్టటం సాధ్యమేనా?దృశ్యమానమైన జగత్తు కి ప్రకంపనలు,శబ్దమూ కారణమని
గ్రహిస్తే, ఆ ప్రకంపనలే -ఆ శబ్దమే-గతితప్పిన ప్రకృతి శక్తు లను సన్మార్గంలో పెట్టగలవనీ, అపవిత్రమైన ఆలోచనలు కల మనస్సుని
క్షాళనం చేయగలవనీ అంగీకరించాలి.వేదా లు అట్టి ప్రకంపనలే,అట్టి శబ్దా లే!యోగంలో ప్రాణాయామం సహాయంతో విశ్వనిశ్వాసం
తో సంధానమేర్పర్చుకొని సమిష్టికీ, వ్యక్తికీ ప్రయోజనకరాలైన పనులు చేయవచ్చు. నాడులూ, నరాలూ చేసే ప్రకంపనలు మనిషి
చెవులకు వినబడవు. ఈ సత్యాన్ని చాలా మంది ఒప్పుకొంటున్నారీ రోజుల్లో.ఈ విధం గా చూచినప్పుడు విజ్ఞాన శాస్త్రం మతానికి
వ్యతిరేకం కాదని గ్రహించవచ్చు. పైపెచ్చు, సమాజంపై మతప్రభావాన్ని పెంచటానికి కూడ దోహదమవుతుంది.
*ఒక శతాబ్దం పూర్వం,అంటే రేడియో,టెలి ఫోన్‌లనుకనుగొనకపూర్వం,వేదోచ్ఛారణకూ శ్వాసకూ గల ప్రభావంపై నమ్మకంలేని వారి
శంకలను నివృత్తి చేయటం కష్టమయేది. కాని వీటిని కనుగొన్న తరువాత మనకి క్రొత్త మద్దతు దొరికింది. నిర్జీవమైన రేడియోకి గల
శక్తిని సజీవమైనవి కూడా పొందవచ్చు.నిజా నికి, అంతకంటె ఎక్కువ శక్తినె సంపాదించ వచ్చు.దీనిని సాధ్యపరచేది,తపస్సు.ఇల్లూ,
సంసారమూ కల్పించే సౌకర్యాలనీ, ఆకలీ దప్పికా కలిగించే అవసరాలనీ,నిద్రావిశ్రాంతి కలిగించే సౌఖ్యాన్నిలెక్కపెట్టకుండా ఏదో ఒక
లక్ష్యంపై మనస్సుని,మానసికశక్తినీకేంద్రీకరిం చటమే తపస్సంటే.ఈ పని చేసేటప్పుడు ''దీనినంతా నేను చేస్తు న్నాను.నేనింత కష్టప
డుతున్నాను కాబట్టి నాకు సత్య స్వరూపం తెలుస్తుంది'' అనేభావానికితావీయకూడదు. అంత శ్రమలోనూ,ఏ ప్రయత్నమైనా సఫలం
కావటానికి భగవంతుని అనుగ్రహం ముఖ్యా వసరమన్న గుర్తింపూ,నమ్రత ఉండాలి.ఋ షులు అటువంటి తపస్సు చేశారు. యోగ
శక్తు ల మహోన్నత శిఖరాల నందుకొన్నారు.
*జగత్సృష్టికి కారణభూతములైన ప్రకంపన లను, అంటే విశ్వనిశ్వాసాన్ని,ఎరుక కలిగి ఉండేవారు ఋషులు.అంతేకాదు,విద్యుత్‌
తరంగాలు శబ్దతరంగాలుగా మారినట్లు గానే వారికికూడ అంతరిక్షంలోని తరంగాలుమారి చెవికి సోకేవి.వీటినే వారు లోకానికి
వేదమం త్రాలుగా అనుగ్రహించారు.ఇంకొక విషయం కూడాస్ఫురిస్తుంది.వేదాలను'శృతి'అంటారు. -అంటే వినబడినది అని
అర్థం.సంస్కృతం లో చెవిని ''శ్రోత్రమ్‌'' అంటారు.పూర్వకాలం గురుశిష్య పరంపరానుసారం వేదాలు ఒక తరం నుండి వేరొకతరానికి
లిఖిత పూర్వకం గా కాక, అనుశ్రు తంగా సంక్రమించాయి. అందువల్లనే వేదాలను 'శృతి'అంటారని కొందరి భావం.అయితే,వేదాలు
చదువుకొని, నేర్చుకోవటానికి వీలుగా లిఖిత రూపంలో ఎందుకులేవు? దానికొక కారణమిది; కొన్ని శబ్దా లు ఉచ్ఛారణ ప్రకారం సరిగ్గా
వ్రాయలేక పోవటం.ఆ ఉచ్ఛారణ ఒకోసారి రెండు అక్ష రాల నడుమ ఉన్నట్లుంటుంది - ఇటువంటి శబ్దా లు వేదాలలో
కోకొల్లలు.ఇటువంటి వాటిని ఉచ్ఛారణ ద్వారానే ప్రచురించ వల సి వస్తుంది.అంతేకాక,వేదమంత్రాలనులయ బద్ధంగా ఉచ్చరించాలి
(అట్లా చేస్తేనే సరియై న ప్రకంపనలు ఉత్పన్నమవుతాయి) కొన్ని శబ్దా లను ఉచ్చస్థా యిలోను,మరి కొన్నిటిని మధ్య స్థా యిలోను
ఇంకాకొన్నిటి అధమ స్థా యిలోనూ పలకాలి.ఇటువంటివ్యత్యాసా లను సూచికల ద్వారా గాని,చుక్కల ద్వారా గాని తెల్పినా కొన్ని
దోషాలు దొర్లు తాయి. అందువల్ల ఉచ్చారణకూడపొరబడుతుంది. తత్ఫలితంగా ఆ మంత్రాల ప్రభావం కూడ
తగ్గుతుంది.మామూలుగాకూడా,హెచ్చుతగ్గులతో వినబడేశబ్దా లకీ,ఒకేమాదిరిగాఉండే శబ్దా లకీ మనపై ఉండే ప్రభావాన్ని చూడండి.
మన ప్రతిస్పందనే కాదు - ప్రకృతి చేతలని క్రమపరిచే దివ్యశక్తి కూడ స్వరభేదం వల్ల ప్రభావిత మవుతుంది...

*త్వష్ట అనే దివ్యశిల్పి ఇంద్రు ని సంహరించ గల కుమారుని కోసం ''ఇంద్ర శత్రు ర్వర్ధస్వ'' అనే ఒక మంత్ర జపం చేశాడు. ఈ జపం
చేసేప్పుడు స్వరాలను తప్పుగా ఉచ్చరించా డు. దీని వల్ల అతని ప్రార్థనకు సరిగ్గా వ్యతిరే కమైన ఫలితాలు లభించాయి. ఇంద్రు ణ్ణి
పరిమార్చే కుమారుణ్ణి గాక,ఇంద్రు నిచే పరి
మార్పబడే కుమారుడు అతనికి కలిగాడు. స్వరభేదం వల్ల, రేడియో ట్యూనింగ్‌కొద్దిగా మారిస్తే మనకి వేరొక కేంద్రం నుంచి వచ్చే
ప్రసారం వినబడుతుంది. మనకి కావలసిన ప్రసార కేంద్రం కోసం సరిగ్గా ట్యూనింగ్‌చేసు కోవాలి. వేదాలను వల్లించేప్పుడూ అంతే.
స్వరము,నిర్దు ష్టంగా ఉండాలి.రేడియో ట్యూ నింగ్‌లో జరిగే మార్పువలెనే -వేద మంత్రాల పఠనంలో మార్పువల్ల కూడా ఫలితాలు
మారుతాయి.ఈ కారణాల వల్లనే,గురు ముఖతః వేద మంత్రాలను అభ్యసించాలన్న నియమమేర్పడింది.వేదాలను 'శృతి'అనటా నికి
అసలు కారణమిది,సామాన్య మానవు లకు వినబడని శబ్దా లను ఋషులు ఆలకిం చి యథాతథంగా శిష్యులకు నేర్పారు. తపో
నిష్ఠలో ఉండి అటువంటి శబ్దా లను గ్రహించే స్థితిలో ఋషులున్నప్పుడు ఆ వేద శబ్దా లు వారికి సాక్షాత్కరించాయి.అందువల్లనే వేదా
లను 'శృతి'అంటారు-'వినబడినది'అనిఅర్థం ఋషులను మంత్ర ద్రష్టలంటారని అన్నాను. అంటే మంత్రాలను దర్శించిన వారని అర్థం.
మంత్రాలను నక్షత్రమండలాల వలెఋషులు దర్శించారని అర్థం చెప్పుకోవచ్చు.వీటన్నిటి లో ఏది సరియైన భావం?వాళ్లు వాటిని
విన్నారా? చూచారా? వాటిని చూచి ఉంటే - ఏ భాషలో,ఏ లిపిలో వ్రాయబడ్డా యి- అప్ప టికి దేవనాగరికీ గ్రంథలిపికీ పునాదియైని
బ్రాహ్మీ లిపి కూడ లేదాయె! వ్రాయబడి యు న్నా,వేదపాఠాలను ఉచ్చారణ కనుగుణంగా సరిగ్గా వ్రాయట మసంభవం.
*ఈ గందరగోళానికి సమాధానమిదిః ఋషులు''చూచారన్నా' 'విన్నారన్నా'యదా ర్థమేమంటే వారు ధ్యానమగ్నులై యున్న ప్పుడు
వాటిని తమలో గుర్తించారు.అంటే ఒక్కసారిగా వారికి స్ఫురణకలిగి,అంత రంగంలో మంత్రాల అవగాహన కలిగింది. వారున్న
ఉచ్ఛస్థితిలో భౌతికంగా కళ్లు చూచి ఉండక పోవచ్చు, చెవులు వినియుండక పోవచ్చు.అయినా వారి అంతరాంతరాలలో వేద శబ్దా లు
వారికి అనుభవసిద్ధమైనాయి వారిపై వాటి ప్రభావాన్ని విడిచాయి.''చూడ'' టమంటే ఎల్లప్పుడూ కంటితో చూడటమనే అర్థంకాదు..
*బాహిర వస్తు జాలం మన ఇంద్రియాలపై కల్పించే ఏ ప్రభావానన్నాఇట్లా వర్ణించవచ్చు. ఫలానా వ్యక్తి ''జీవితంలో ఒడుదుడుకులను
చూచాడ''న్నప్పుడు అతనికి జీవితంలోని సుఖ దుఃఖాలు భౌతికంగా కనబడ్డా యని అర్థం కాదు.అతడు జీవితంలో సుఖదుఃఖా లను
అనుభవించాడనే దాని అర్థం.కాబట్టి మంత్ర ద్రష్టలన్న మాటని ఋషుల ఆధ్యాత్మి కానుభూతి గానే మనం అర్థం చేసుకోవాలి.
వేదాలను గ్రహించటానికి అనువైన,ప్రతిభా సమన్వితమైన చెవులుకల 'దివ్యశ్రోత్రు లు' ఋషులని చెప్పుకోవచ్చు.
*'నీవు నన్ను నీ చర్మచక్షువులతో చూడలేవు -నీకు దివ్యదృష్టినిస్తా న''న్నాడు గీతలో. (దివ్యందదామితే చక్షుః).అర్జు నుడు దివ్య
నేత్రాలు పొందినట్టే ఋషులు కూడ దివ్య కర్ణాలను పొంది అంతరిక్షంలో సదా సంస్థి తమైన మంత్రాలను వినగలిగారు..
*ఇదంతా చెప్పటానికి కారణం -వేదాలు ఎవరి వల్లా రచింపబడలేదనీ చూపటానికే ఋషులు వాటిని రచించలేదు.పరమాత్ము డూ
కూర్చొని వేదాలను వ్రాయలేదు!..
❣️💕
           
*విజయంసాధించిన వ్యక్తిగాకాదు.విలువలు కలిగిన వ్యక్తిగా వుండడానికి ప్రయత్నించు.
*సమయం వచ్చినప్పుడు ఆకాశం ఏడు రంగుల హరివిల్లు నుచూపిస్తుంది.కానీ మని షి తన అవసరాన్ని బట్టి ఒక్కోచోట ఒక్కొక్క
రంగు చూపిస్తా డు.
No one has travelled the road of success Without Crossing the streets of failure..
God never promised us easy journeys.. Only great destinations..
Golden Words By Hitler-
"Think Thousand Times Before u  Take a Decision, But Never Turn Back Even If u Get Thousand
Difficulties After Such Decision"
*మనం జీవితంలో ఎదగాలని..అనుకోవటం లో తప్పులేదు.కానీ...ఎదిగే వాడిని చూసి..
అసూయ పడటం చాలా తప్పు.నీలో సత్తా ఉంటేనువ్వుకూడాఎదగడానికిప్రయత్నించు
గెలిచి చూపించు.....
*ఎవ్వరు ఎంత హేళన చేసినా,నీవు తొందర పడకు...హేళన చేసిన వారితోనే..సలాం కొట్టించే సత్తా ..ఒక్కకాలానికే ఉంది.ఓర్పుతో
ఉండు..నీ ఓర్పు,నేర్పు ప్రపంచానికి తెలిసే రోజు వస్తుంది...
*నువ్వు ఓడిపోతావని అందరూ అనుకుం టున్నప్పుడు లేచి నిలబడు,వాళ్ళ కళ్ళలో భయం కనపడుతుంది.నువ్వు గెలవక ముం దే
అది నీకు తొలివిజయం అవుతుంది...
*క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు. కానీ భవిష్యత్తు మాత్రం తప్పకుండా మారు తుంది.
[2/15, 7:33 AM  💘💞💜💕
*మనిషి వర్తమానంలో నిలిచినప్పుడు మనసు బానిసైపోతుంది.అంటే,మనిషిచెప్పి నట్లు మనసు వింటుంది. అప్పుడు జీవితం వేడుక
అవుతుంది. అలా కాకుండా భూత భవిష్యత్తు ల మధ్య డోలాయమాన స్థితిలో ఊగిసలాడుతుంటే మనిషిని కీలుబొమ్మగా చేసి
ఇష్టా నుసారం ఆడుకుంటుంది. దుఃఖ సాగరంలో ముంచి ఆనందోత్సవం జరగ కుండా చూస్తుంది.
*జీవితం ఎప్పుడూఒకేలాఉండదు.గతంలో ఉన్నట్లు అస్సలు ఉండదు.అది నిత్యంమారి పోతూ కొత్తగా ఉంటుంది.సర్వమూ ఎరిగి,
అంతటా వ్యాపితమైన చైతన్యశక్తి ఎత్తని రూపమంటూ ఉండదు.వర్తమానం అనేకా నేక నూతనావిష్కరణల కర్మాగారం.
*దారి దిక్కు తెలియక,ఎటువైపు వెళ్లా లో తోచక అయోమయస్థితిలో ఉన్నపుడు ఎదు రైన బాటసారికి ఇదీదారిఅని చూపితే కలిగే
ఆనందమే వేరు.దీన్ని బట్టి తెలుస్తోంది ఏమి టంటే- ఆనందానికి జ్ఞానమే మూలం అని. నిజానికి జ్ఞానం,ఆనందం వేరు వేరు కాదు.
ఆ రెండూ ఒకేదాన్ని సూచించే పర్యాయప దాలు.ఈ రెండింటితో ఆరోగ్యమూ సమకూ రుతుంది. ఆరోగ్యవంతుడు మాత్రమే తన
చేతిలోని పనిని సంపూర్ణంగా పూర్తిచేయ
గలడు.నూతన ఆలోచనలతో కొత్త వాటిని కనిపెట్టి ప్రపంచానికి కానుకలుగా సమర్పిం చగలడు.
*బంధాలు నిలవాలంటే..క్షమించే గుణం ఉండాలి!..బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి!.
*ప్రేమలు కావాలనుకుంటే..ఒకరిపై ఒకరికి నమ్మకంఉండాలి!..
*నలుగురితో కలిసుండాలంటే..చిన్ని నవ్వు తో పలకరింపులు ఉండాలి!..ఏది నిర్లక్ష్యం చేసినా..బంధంలో బలంలేకుండా పోతుంది.
*మనం ఒకరిమనసు గాయపరచడానికి ఒక నిమిషంచాలు కానీ!,గాయపడినమనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం
సరిపోదు.. మనంఎదుటివారిని ఒకమాట అనే ముందు ఒకటికినాలుగుసార్లు ఆలోచించిమాట్లా డాలి
నీవు ఇతరులను తక్కువ చేసి మాట్లా డితే నీ స్థా యి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారి
పోతుంది...    
  నేను సాధించిన విషయాల వెనుక రహస్య మేమీ లేదు.కేవలం కష్టించి పని చేయడమే ఉప్పులాగా కటువుగామాట్లా డేవారే నీమేలు
కోరే మిత్రు డు,అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవారు కాదు.ఎందుకంటే చక్కె రకు చీమలుపట్టని రోజు లేదు.అదే ఉప్పుకు
పురుగు పట్టిన దాఖాలాలు నేటికి లేదు !.
   ఎవరినీ నీవు నమ్మకు,మోసపొతావు. ఎవరి కోసమూ ఆలోచించకు,వాళ్ళకే నీవు అలుసైపోతావు ఎక్కువవిలువ వారికి ఇవ్వ కు
గౌరవాన్ని కోల్పోతావు.ఎవరిని ప్రశ్నించ కు శత్రు వు అవుతావు. ముందుగా వీళ్ళు నా వాళ్ళు,వారు నా వాళ్ళు అని ఆలోచించడం
తగ్గించు !.ఎవరి నుంచి ఏం ఆశించకు నీ జీవితం బాగుంటుంది..
*ఈ రోజుల్లో నమ్మినవారికి ప్రాణాలు ఇవ్వ నవసరం లేదు....
*కానీ ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం మాత్రం చేయకుండా...ఉందాం
దారిలో పోవడం,కాదుదారి చేసుకుని వేళ్తేనే నీ ప్రత్యేకత లోకానికి తెలుస్తుంది.ఎవరూ నడవని దారిలో నడవడమంటే రాబోయే
తరాలకు దారి చూపడమే
నీ మాటలు ఏదుటివారికి బాటలు కావాలి,,,
నీ చూపులు ఏదుటివారికిచల్లనినీడకావాలి.
నీ నడక .... పది మందికి మార్గం కావాలి,,,
నీ లక్ష్యం ఇంకొకరికి ప్రేరణ కావాలి..
నీ జీవితం ప్రపంచానికి ఆదర్శం కావాలి......
[2/15, 5:02 AM]   💞💜💕💚
నిజంగా నీవు విముక్తికై కోరుచున్నట్లైన, విషయ సుఖాలను,విషాన్ని దూరంగా ఉంచి నట్లు ఉంచి,అమృతమువంటి సద్గుణాలను
జాగ్రత్తగా అలవాటు చేసుకొని; తృప్తి, ప్రేమ, క్షమా గుణము,ముక్కుకు సూటిగా నడుచు కొనుట మరియు తనకు తాను
అదుపులో ఉంచుకొనుట అను సద్గుణాలనుపెంపొందిం చుకొనవలెను.
    ఎవరైతే తాము ఎప్పుడూ అనుభవించే భౌతిక వాంఛలను పక్కనపెట్టి,అజ్ఞాన బంధ నాల నుండి విముక్తు లై మరల వాటి జోలికి
పోనప్పటికి,శరీరముపై మోహముతో దానిని పోషించి ఇతరుల ఆనందానికై తోడ్పడిన చివరకు ఆత్మహత్య చేసుకొని కుక్కలకు
రాబందులకు ఆహారమవుతారు.అనగా శరీరముపై మోహాన్నితొలగించుకోవాలి.ఎవ రైతే ఆత్మనుతెలుసుకోవాలని కోరుకుంటారో
వారు తమ శరీరపోషణకు ప్రాధాన్యమిచ్చిన అట్టి వ్యక్తి కొయ్యదుంగ అనుకొని మొసలిని పట్టు కుని
నదినిదాటినట్లు ఉంటుంది.అనగా తన వినాశనానికి తానే కారకుడవుతాడు.
💜💕💚
           
బృహస్పతి జీవనమునకు, జ్ఞానమునకు, సమర్థతకు, పవిత్రతకు, సద్గుణ సంపత్తికి, సృజనాత్మక శక్తికి,బ్రహ్మచర్యమునకు ప్రతీక.
ఆకాశ శబ్దమునకు కూడ ప్రతీక. ఆకాశ శబ్దము “ఖం”.
కం, గం,కూడ ఈ శబ్దమునుండి ఉద్భవించి నవే. శుక్రు డు అనుభూతికి,ఆనందమునకు,
గ్రహించుటకు,అందంనకు,సౌకుమార్యము నకు, శీలమునకు,ప్రేమకు,కన్యాత్వమునకు ప్రతీక. పై సంకేతము నందలి ఉత్తరభాగము
సూర్యుడు.
దక్షిణభాగము+సూక్ష్మ ప్రకృతి లేక కన్య శుక్ర సంకేతము సూర్యునిచే ప్రభావితమై వెలు గొందుచున్న సూక్ష్మ ప్రకృతిని లేక కన్యను
సూచించును.
సూర్యోపాసనమున నిలచిన పవిత్రమైన కన్యగ మహాభారతమున కుంతిని పేర్కొను ట, ఈ రహస్యార్థమును వివరించుటయే.
సూర్యుని ఆధారముగ కుంతి అను కన్య కర్ణునిపొందినది.కర్ణమే కర్ణుడు.అనగా వెలు గొందుచున్న సూక్ష్మ ప్రకృతినుండి సూర్యుని
సహకారముతో దిగివచ్చినవాడు. కర్ణము లేని సృష్టి లేదు. రూపాంతరమున ఈ సంకే తము బృహస్పతిగ తెలియ బడుచున్నది.
కర్ణములేని సృష్టి లేదు అనుట, కర్ణుడులేని భారతము లేదు అనుట ఒకే అర్థమును సూచించగలవు. బృహస్పతి లేని జీవనమే లేదు
కదా!
💛💕💚
         ♥️
నిజానికి,ప్రేమానుబంధం మీకు అనేక సమ స్యలు సృష్టిస్తుంది.వాటిని ఎదుర్కోవడం మంచిదే.కానీ,అనుబంధాలకు అతీతులమ ని
చెప్పుకునే తూర్పు దేశాలలోని వ్యక్తు లు తమ ప్రేమను వ్యతిరేకిస్తూ,నిరాకరిస్తూ,అది సృష్టించే సమస్యల నుంచి తప్పించుకుని,
ప్రేమరహితులుగా,నిర్జీవులుగాతయాయ్యా రు.ఆ రకంగా తూర్పుదేశాలలో ప్రేమ దాదా పు అదృశ్యమై కేవలం ధ్యానం మాత్రమే
మిగిలింది.
ధ్యానమంటే మీరుఏకాంతంలో మీతోహాయి గా ఉండడమన్న మాట.అలా మీ వృత్తం మీతో పూర్తవుతుంది.అందులోంచి మీరు
బయటకు వెళ్ళరు.దానివల్ల తొంభై తొమ్మిది శాతంసమస్యలు పరిష్కారమవడంతోమీరు అతితక్కువ సమస్యలోఉంటారు.కానీ,దాని
కోసం మీరు చాలాచెయ్యవలసి ఉంటుంది.
తూర్పు దేశాలలో కళ్ళు మూసుకుని తన అంతరంగ కేంద్రంలో హాయిగా,సురక్షితంగా జీవించే వ్యక్తి తక్కువ ఆందోళన,తక్కువ
ఉద్రిక్తతలతో ఉంటాడు.అతడు తన శక్తిని బయటకు ప్రవహించనివ్వకుండా తనలోనే ఇముడ్చుకుంటాడు. అందుకే అతడు ఆనం
దంగా ఉంటాడు.కానీ,అతనిఆనందం తక్కు వ జీవంతో ఉంటుందే కానీ, పరమానంద పరవశంతో ఉండదు.
మహా అయితే,మీరు చాలాఆరోగ్యంగా, హా యిగా ఉందని,ఎలాంటిరోగం లేదనిచెప్తా రు. కేవలంరోగం లేనంతమాత్రాన పూర్తిఆరోగ్యం
ఉన్నట్లు కాదు.అదే నిజమైతే,ఎలాంటి రోగం లేని శవం కూడా ఆరోగ్యంగా ఉన్నట్లే కదా!
కాబట్టి,తూర్పుదేశాలలో ప్రపంచాన్ని పరిత్య జిస్తూ, ప్రేమరాహిత్యంతోజీవించేప్రయత్నమే జరిగింది.అంటే,స్త్రీని ద్వేషించడం,పురుషు ని
ద్వేషించడం,ప్రేమనుకాదనడం-ఇలాప్రేమ వికసించే అవకాశాలన్నింటినీ పరిత్యజించ డం జరిగింది.
నిజానికి,ఒంటరిగా ఉన్న స్త్రీతో మాట్లా డేం దుకు, ఆమెను తాకేందుకు,చివరికి ఆమెను చూసేందుకుకూడా జైన,హిందూ,బౌద్ధసన్యా
సులకు అనుమతి లేదు.ఒకవేళ ఏదైనా అడిగేందుకు స్త్రీ వచ్చినప్పుడు వాళ్ళు నేల చూపులు చూస్తూ మాట్లా డాలే కానీ, పొరపా
టున కూడా ఆమె ముఖాన్ని చూడకూడదు. ఎవరికి తెలుసు?ఏదైనా జరగచ్చు.ఎందుకం టే, ప్రేమ చేతిలో అందరూ
నిస్సహాయులే. అందుకే వారు ఎవరిఇళ్ళల్లోను నివసించరు ఒకే చోట ఎక్కువ కాలం ఉండరు.
ఎందుకంటే, ప్రేమానుబంధాలు ఏర్పడే అవ కాశముంటుంది. అందుకే వాటిని తప్పించు కునేందుకు వారు ఒకేచోట ఉండకుండా
ఊళ్ళు తిరుగుతూ ఉంటారు. అలా వారు ఎవరినీ ఇబ్బందిపెట్టకుండా,తాము ఇబ్బంది పడకుండా ఒకరకమైన నిశ్చలత్వాన్నిసాధిం
చారు. అయినా వారు సంతోషంగా లేరు, వేడుక చేసుకోలేరు.
పాశ్చాత్య దేశాలలో దీనికి వ్యతిరేకంగా జరిగింది. ప్రేమకలాపాల ద్వారా సంతోషాన్ని సాధించే ప్రయత్నంలో వారు తమకు తాము
దూరమై,ఇంటిదారి తప్పి,వెనక్కి ఎలా రావా లో తెలియక చాలా ఇబ్బందుల్లో పడ్డా రు. దానితో వారు పిచ్చిపిచ్చిగా అన్నిరకాల
ప్రేమకలాపాలలో పాల్గొంటూ స్వలింగ, భిన్న లింగ, యాంత్రిక సంపర్కులుగా తయార య్యారు. అయినా వారిలో శాంతి లేదు.
ఎందుకంటే, ప్రేమకలాపాలు కేవలం శారీరక సుఖాన్నిస్తా యే కానీ,అక్కడ ఎలాంటి నిశ్శ బ్దము ఉండదు.అందువల్ల కావలసిన శారీ
రక సుఖాలు లభించినప్పటికీఏదోకోల్పోయి న భావన మీలో ఒక జ్వరంలా ఇంకా మిగిలే ఉంటుంది. దాని తీవ్రత వల్ల మీరు చాలా
ఉద్రిక్తతకులోనై అనవసరమైన దానికిఅతిగా కంగారుపడుతూ ఉంటారు.అయినా,దానిని వెంటాడుతూ ఆయాసపడడం తప్ప మీకు
దక్కేదేముండదు.
       ❤️💛💕💚
*నిత్య నైమిత్తికకర్మలను,కర్తవ్యకర్మను ఫలా పేక్షను ఆశ్రయింపక నిర్వర్తించువాడు, తన దైన యితర సంకల్పములులేనివాడు యోగి
యగును.కర్తవ్య కర్మలు ప్రారబ్దము నుండి, సంచితము నుండి కాలమురూపమున ఏర్ప డుచుండును. కాలమందించిన కర్మమును
ఫలాపేక్ష రహితముగ నిర్వర్తించుటయే సాధ కునకుప్రధానము.ఋణము,కర్మము తరుగ వలెనన్నచో కర్తవ్య నిర్వహణమే గాని అం
దుండి మరల మొలకలు పుట్టించుకొనుట కాదు.దైవము స్వతంత్రబుద్ధినిచ్చెను.స్వతం త్ర బుద్ధిని బాధ్యతయని ఎరిగి నిర్వర్తింప
వలెనే గాని,హక్కుగ భావించి దుర్వినియోగ ము చేయరాదు....
దేనిని సన్యాసమనిచెప్పుదురోదానినేయోగ మని గూడ నెరుగుము.సంకల్ప సన్యాసము చేయనివాడు యోగి కానేరడు.
(అట్టివాడు సన్యాసియు కాదు.)
నిత్య నైమిత్తిక కర్మలను, కర్తవ్య కర్మను ఫలా పేక్షను ఆశ్రయింపక నిర్వర్తించువాడు, తనదైన యితర సంకల్పములు లేనివాడు యోగి
యగును.సన్యాసియు అగును.పుట్ట గొడుగుల వలె సంకల్పములు గలవారు సన్యాసులు కారు,యోగులు కారు.కోరికలు
గలవారు,యిచ్ఛాద్వేషములు కలవారు యోగమును గూర్చి,సన్యాసమును గూర్చి భావించుట వ్యర్థము.
నిత్య నైమిత్తిక కర్మలనగా దంతధావనము, స్నానము,ఆహార స్వీకరణము,నిద్ర మొదల గునవి.ఇవి ఎవ్వరికైనను తప్పనిసరి.కర్తవ్య
కర్మలు ప్రారబ్దము నుండి,సంచితమునుండి కాలమురూపమున ఏర్పడుచుండును.కాల మందించిన కర్మమును ఫలాపేక్ష
రహితము గ నిర్వర్తించుటయే సాధకునకు ప్రధానము.
నిర్వర్తించు కర్మల నుండి,కర్తవ్యములనుండి రజోగుణము కారణముగ నూతన సంకల్ప ములు, నూతన కర్మలను సాధారణముగ
మానవుడు పెంచుకొను చుండును.బాకీలు తీర్చుచు, క్రొత్త బాకీలు ఏర్పరచు కొనువాడు తెలివిగలవాడను కొనుటకు
వీలులేదు.ఋ ణము,కర్మముతరుగవలెనన్నచో కర్తవ్యనిర్వ హణమే గాని అందుండి మరల మొలకలు పుట్టించు
కొనుటకాదు.పూర్వము చేసిన కామపూరిత సంకల్పముల కారణముగ ఋణము లేర్పడుటచే,ఆ ఋణములే ప్రస్తు త జన్మమున
కర్తవ్యములుగ దరిచేరును.
శ్రద్ధా భక్తు లతో వానిని నిర్వర్తించుటయేగాని నూతన కర్మల నేర్పరచుకొనరాదు.ఏది కర్త  వ్యమో, ఆ కర్తవ్యము నెంతవరకు నిర్వర్తిం
చవలెనో,తెలిసి నిర్వర్తించవలెను.తమది కాని కర్తవ్యము తమదనుకొనుట అవివేకం రజోగుణ దోషమువలన ధనకాంక్ష,కీర్తికాంక్ష,
పదవీ కాంక్ష లేర్పడి,చేయుచున్న కర్తవ్యంల నుండి అనేకానేక కార్యములు పుట్టు చు నుండును.స్వకాంక్షకై నిర్వర్తించుటయుండు
ను. గనుక చేయు పనులయందు అవకతవ కలుండి,వాని నుండి కర్మఫలములు పుట్టి, మరల ఋణ రూపముధరించి,కర్తవ్యములై
కాలము రూపమున సమీపించును.
*తన సంకల్పములే తన బంధనములకు కారణమని తెలియుటకు కొన్ని జన్మలు పట్ట వచ్చును.సృష్టి యందు దివ్య సంకల్పమొక
టి ఆరంభము నుండి నడచుచున్నది.సృష్టి కథ మధ్యమున మానవుడవతరించినాడు. అతడు జరుగుచున్న కథలో తనవంతు కర్త
వ్యమును నిర్వర్తించినచో ఉత్తీర్ణుడగును. కృతకృత్యుడగును.లేనిచో బందీ యగును.
జరుగుచున్న కథలో తనకథను స్వంత సంక ల్పములతో చేర్చుటవలన మానవుడు బద్దు డగుచున్నాడు.అతనికి దైవము స్వతంత్ర
బుద్ధి నిచ్చెను.స్వతంత్ర బుద్ధిని బాధ్యతయ ని ఎరిగి నిర్వర్తింపవలెనేగాని,హక్కుగభావిం చి దుర్వినియోగము చేయరాదు.అట్లు చేసి
నచో రజస్తమస్సులు తనయందుప్రకోపించి, తనను శాశ్వత బందీని చేయును. విమోచ నము కావలెనన్న తపన యున్నచో, స్వంత
ముగ సంకల్పించుటమాని కర్తవ్యము మాత్ర మే ఆచరించుట నేర్వవలెను.
దీర్ఘకాలమట్లు నిర్వర్తించినపుడు,రజస్తమో గుణములు శాంతించి సత్వ మలవడును.  సత్వమున నిలబడుటకు సంకల్ప సన్యాస
ము ముఖ్యము.అట్టివాడే సన్యాసమునకు గాని,యోగమునకు గాని అర్హత గలవాడు. వ్యక్తిగతసంకల్పములున్నవారు యోగమున
సన్యాసమున ప్రవేశింపలేరు.ఇదినిశ్చయం..
💛💕💚
      
వినయశీలునిగా ఉండటము, తనకుతాను నిత్యతృప్తు డుగా ఉండటము,పరద్రవ్యాన్ని స్వప్నంలోకూడా కోరకుండా ఉండటము,
తనను ఎవరైనా గౌరవించినా గౌరవించకపో యినా నిస్పృహతోఉండటము.దీనినేయథా ర్థశీల సంపదకలిగి ఉండట మనవచ్చు...
కొన్ని విషయాలలో శీలము అనే మాటకు అర్థంచెప్పటం సులభమే! అంటే తనకు చెందని వస్తు వు,తనకు ఆధ్యాత్మికమార్గంలో
పొందరానివస్తు వు ఏదయితే ఉన్నదో దాని యొక్కస్మరణంకూడా శీలభ్రష్టత్వానికి హేతు వవుతుంది.
ఆధ్యాత్మికమార్గానికిసంబంధించిఏదయినా ధ్యానంచేయదగని వస్తు వు,ఉంటే దానిని కోరటము,ఏదికోరితేఅది ఈమార్గంలో పనికి
రాదో దానిని కోరటము – శీలభ్రష్టత్వము అవుతుంది.అందువల్లనే విశ్వామిత్రాది మహర్షులుకూడా తపస్సును వ్యయం చేసా రు.
అయితే వారు దుశ్శీలురు అంటానికి వీలులేదు.తమయొక్క తపోనిష్ఠకు,బ్రహ్మలో కప్రాప్తికి హేతువుకానటువంటి వస్తు వు తన నొచ్చి
వరిస్తేకూడా దానిని చూడకూడదు. అదే సూత్రం యథార్థంగా తీసుకున్నారు. కాబట్టి శీలమే గొప్పది.
మానావమానాలగురుంచి భగవద్గీతలో కృష్ణభగవానుడు చెప్పాడు.అవమానము కలిగినపుడు దానిని అమృతంలాగా తీసుకో
వచ్చు.తనలో ఏ దోషం ఉందో,ఏ పాపం ఏ సందర్భంలోనో ఎక్కడచేసిఉన్న కారణంగా ఈ అవమానం తనకులభించిందో అని అత డు
అనుకోవాలి.“బాగుంది.ఈ అవమానం ఇప్పుడు పొందటంవలన ఆపాపంపోయింది కదా! శభాష్ చాలాబాగుంది”అని అట్టివాడు
సంతోషిస్తా డు.
ఎవరయినా ఆదరించి గౌరవించనప్పుడు, “అయ్యో! నా పుణ్యం క్షీణించిపోతున్నది. దీనివల్ల నా మనసు భ్రంశంపొంది నాకు
అహంకారం వస్తుందేమో? ఈ గౌరవం నాకెం దుకు?” దానిని భయంతో విషప్రాయంగా చూడమని చెప్పారు.
         💛💕💚
*సద్గురువు శిష్యునకు పరిపూర్ణతను ప్రసా
దించవలెనన్నచో మెఱపుకాలము చాలును. చెవిలో ఒక్క మాటను చెప్పి,పరిమితుడై యున్నవానిని అనంతుని చేయును.
ఇట్టి మార్పు, ప్రార్థనలపై ఉపవాసములపై ఆధారపడి జరుగదు.
సద్గురువు బ్రహ్మానుభూతిని ఎవరికైనను ఒక సెకనులో ప్రసాదించగలడు.
సద్గురువు వలన సెకనులో పొందబడిన బ్రహ్మానుభూతి, తనకే ఉపకరించును గాని పరులకు ఉపయోగపడదు.
సద్గురువు సేవలో కష్టములకు ఓర్చుకొని ముక్కాకలు తీరిన తరువాత సద్గురువువలె నే పొందినబ్రహ్మానుభూతి ఇతరులనుకూడా
అట్టివారిని చేయుటకు ఉపకరించును.
*Slavery is slavery. The chain of gold is quite as bad as the chain or iron.*
*సుఖ,దుఃఖాలు రెండూ బంధాన్ని, బానిస త్వాన్నే కలిగిస్తా యి. బంధించిన గొలుసు బంగారమైనా,ఇనుమైనా అది బంధనాన్నే
కలిగిస్తుంది కదా!
           💙🧡💕💚
*జ్ఞాని ఈ విధముగా భావన చేస్తా డు.ఈశ్వ రుడు లేకపోతే మనము లేము.ఈశ్వరుడు మనయందు మనవలె
ఉన్నాడు.ఈశ్వరుని ప్రతిబింబముగా తాను ఉన్నాను అని.అంతే తప్ప, తానే ఉన్నాను,ఈశ్వరుడు లేడు అని అనుకోడు.
*ప్రతి కార్యక్రమములో ఈశ్వరుని గుర్తు పెట్టు కోవడము అనేది భక్తి.గుర్తు పెట్టు కోక పోవ డము వలన జ్ఞానము కూడా
ఉండదు.ఇంకే మీ ఉండదు.ఈశ్వరుని ఎంత గుర్తు పెట్టు కుం టే అంత అతను నీయందుబాగాఅవతరించి నీ సమస్తము అతనే
నిర్వర్తిస్తా డు.
*తాళం తెరిచి విలువైనదేదో లోపల ఉందని గుర్తిస్తే గానీ దానిగురించి మనవంతు కృషిని చేయలేం.
*అంతరంగ గుహలోనికి చూడనిదే ఏ మాన వుడూ ఫలవంతమైన కార్యము చేయలేడు. భవిష్యఫలాలను అందించలేడు.ఆరహస్యం
బోధపడనిదే ఏ కార్యమైనా ఆలోచనా రహి తంగానే ఉంటుంది.
*ఆదర్శంకొరకు పాటుపడేందుకు అనేక అవ కాశాలు కలిగించే జన్మ మానవజన్మ.దానిని వదలి
అశాంతి,సందేహం,నిరాశ,దుఃఖాలకు హృదయంలో చోటిస్తే మనం సంతోషంగా ఉండలేము,ఇంకొకరిని సంతోష పెట్టలేము.
మనలో సంతోషం,శాంతి,ఆధ్యాత్మిక విశ్వా సాలు నిలిచి ఉన్నప్పుడే భగవంతుని,ప్రపం చాన్ని సేవించగలం.
*ఈ దేహం అనిత్యమని తెలిసినా,ఈ ప్రపం చంలోని ప్రలోభాలలో పసలేదని తెలిసినా, మృత్యుసమయంలో ‘నావి’ అనుకున్నవేవీ
తనతో రావని తెలిసినా,మోహజాలంలో చిక్కుకుని,నిరంతరం దుఃఖావేశాలతో పరి తపిస్తుండటం ఎంతటిదయనీయా వ్యవస్థ
ఒక్కసారి,ఈ బాహ్య దృష్టిని లోపలికి మర ల్చి, ‘నా నిజతత్త్వమేమిటి’ అని ఆలోచిస్తే, ప్రతి మానవుడికి తన నిజతత్త్వం కొద్దిగనో,
గొప్పగనో అర్థంకాకమానదు.అప్పుడు అత ను తన చుట్టు ప్రక్కలగల ప్రపంచంలో ఏర్పర చుకున్న విలువలలో మార్పురాక మానదు.
*ప్రతి సాధనకు మోక్షం సిద్దించకపోవచ్చు. కాని, ఆ సత్యాన్వేషణా ప్రయత్నంలో,ఎన్నో సూక్ష్మవిషయాలనుతెలుసుకుని,మనసును,
బుద్ధినివికసింపచేసుకుని,ఒకవినూత్నదృక్ప థంతో ఈ ప్రపంచాన్ని చూడటం మొదలవు తుంది. అదే అతని ఆధ్యాత్మ జీవితానికి
ప్రారంభం. ఆ జీవితంలో ఉన్న మనశ్శాంతి, ఆనందం ఈ ప్రాపంచిక జీవితంలో వెతికినా కనపడవు.
*ఆధ్యాత్మ జీవనపథాన్ని అనుసరించిన మనిషి తిరిగి మరలటం ఉండదు.అదే ముక్తి మార్గం. అందుకు స్వప్రయత్నం అవసరం.
🧡💕💚❣️
       
*"మనస్సు గ్రాహ్యంకాదు,వీటన్నింటినీ అదే కల్పిస్తుంది,ఫలితాలనుబట్టి దానిని అనుభ వించుటే గానీ, దానినై దానిని ఎరుగతరం
కాదా !?" కిరణ విశ్లేషణలో రంగులు చూడు. అవన్నీ కలిసి తయారయ్యేది ఒకేఒక్క తెలు పురంగు నుండే.త్రిభుజ స్ఫటికంలో ఏడు
రంగులు కనిపిస్తా యి. అలాగే ఒకే ఆత్మ,.. మనసు,దేహం,జగము అంటూ బహుదశ లందుతుంది.ఆత్మను దేహంగా, మనసుగా,
జగత్తు గా చూస్తా వు.నీవేవిధంగా చూడదలు చుకుంటే నీకది అట్లే కనిపిస్తుంది.దృష్టిని, సృష్టిని తయారుచేసింది ఒకే శక్తి ! సృష్టి
అంటే మనకు కనిపించే ప్రకృతి. 'ప్ర'కృతి అంటే ముందుగా ఏర్పడింది. ఏర్పడింది అంటే ఒకప్పుడు లేనిది అనే అర్థం వస్తుంది.
అంటే ఒకప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది సృష్టి. అద్దం ముందు ఉన్నమనం, అద్దంలో బింబమూ, బింబాన్ని చూసే చూపు ఒకేసారి
ఏర్పడుతున్నాయి.మనదృష్టిని ఆవరించు కున్న మాయచేత ఆత్మశక్తి మనకు సృష్టిగా కనిపిస్తుంది.మాయ అంటే మనకు అర్ధం కాని
గంభీరమైనమాటేమీకాదు.మనంరోజూ అద్దంలోచూసే మన ప్రతిబింబం మాయకు తార్కాణమే.అసత్యంఅయినదిఅనుమానం
లేనంత నిజంగా అనిపించడం మాయ. అదే మనలోని భావాలకు కారణం !.
❣️💚❣️🧡
      
*వ్యవహరంలో వచ్చే సుఖం,శాంతి  శాశ్వ తంగా ఉండదు !.
*అన్ని అధ్యాయాల అంతిమసారం ఒక్కటే అయినా అంచెలంచెలుగా మనం అవగతం చేసుకునేవిధానాన్ని దశలవారీగా ఋభుమ
హర్షి వివరిస్తూ వస్తు న్నారు.జగత్తు ,జీవుడు, ఈశ్వరుడు ఈమూడు వేరువేరుకాదు అన్న ది పరమసత్యం.కానీ కళ్లెదురుగా కనిపించే
దానిలోనిసత్యాన్ని గమనించకుండా పరమ సత్యం గోచరం కాదు.ఈ జగత్తు ను,జీవుడిని నడిపించే ఈశ్వరుడి ఘనతను
గుర్తించడం, ఆశ్రయించడం,క్షేమాన్ని,లాభాన్ని కాంక్షించ డం వంటివి కేవలం భ్రమకాదు.అవన్నీ వ్యవ హారిక సత్యాలే.అవి
వ్యవహారంలో గౌరవిం చాల్సిన విషయాలే.అయితేపరమసత్యాలు కాకపోవడంవల్ల ఎల్లకాలం దాన్నే అనుసరిం చడానికి అవకాశం
ఉండదు.వ్యవహారిక సత్యాలు ఎలాగైతేశాశ్వతంకాదో,వ్యవహ రంలో వచ్చేసుఖం,శాంతికూడా శాశ్వతంగా ఉండవు !.
💜🧡💚
      
*(చేసిన కార్యము ఏదైనను దానికి తగిన ఫలితములను కలుగచేయుటయందు దైవమై ఉండును. కామ క్రోధాత్మకములైన కర్మల
వాసనలు తప్పుకొనరానివిగా పట్టు కొనును. వానివలన అభిరుచి హెచ్చి, వారి ప్రకృతి మరల మరల అట్టిజన్మలనే పొందు చుండును.
దాని వలన దుష్ఫలితములు, భీతి, విపత్తు లు తరచుగాకలుగుచుండును. ఆర్తు డై వాని నుండి తప్పుకొనుటకు ఉపా యము
చేసుకొనుటలో ఇతరుల యందు 'న'న్ను అర్థింతురు. లేదా విపత్తు లయందు తొలిసారిగా నా స్మరణ జరగవచ్చును.అప్ప టి నుండి
అసుర భావము నశించును కనుక వారికి అట్టి జన్మలు కలుగుచుండుట కర్మ ఫల నియమము.)
*దుష్కర్మ వాసనలచే అనేక జన్మలు అసుర ములై మోహమునందు నన్ను స్మరింపకయే చనిపోవుచుందురు.ఇది అధమ గతి.
*వారికికామము,క్రోధము,లోభముఅనబడు మూడు ద్వారములు తెరచియుండి నరకం నకు దారితీయుచు,ఆత్మజ్ఞాన
వినాశకము లగుచుండును.కనుక బుద్ధిమంతుడు ఈ మూడు ద్వారములకు అతీతుడుకావలెను.
ఈ మూడింటి నుండి విముక్తు డై నచో తమో గుణమునకు ద్వారములు తెరువక, తనకు శ్రేయస్కరములైన పనులను
ఆచరించును. వానివలనభగవద్భక్తి,మోక్షములభ్యమగను
💖🧡💚
       
బుద్ధిని తన శరీరముగ జేసికొని ఈశ్వరుడు బుద్ధియందు ఉండుననీ,కాని బుద్ధియతని నెరుగదనీ బుద్ధియే ఈశ్వరునిచే నియమిం
ప బడుచున్నద.
లోకమునందు బుద్ది(విజ్ఞానము) కలవాడే శ్రద్ధా పూర్వకముగా ఆత్మయజ్ఞమును జేయు చున్నాడు.కాన ఈ బుద్ధి యందున్న పరమే
శ్వరుడే సమస్తకర్మలకు కర్తగా నున్నాడు.
ఇట్టి బుద్ధి యందున్న పరమాత్మను తెలుసు కుని అన్నమయాదులయందు ఆత్మభావన ను విడిచి బ్రహ్మభావన చేసినవాడు ఆనంద
మును అనుభవించుచున్నాడు.
అంతరంగమగు ఈఆనందాత్మనందే పరమా త్మ నిండియున్నది.బుద్ధిఅనే ఘటమునందు బ్రహ్మచైతన్యమే
ప్రతిబింబించిందనాలి.సర్వ వ్యవహారాలు,ఇహపరలోకములు, సుఖదుః ఖములు అన్నియును చిదాభాసునకే గాని,అతనితో
కలిసియున్న కూటస్థు నకు లేవు. కాని కలిసి వున్నందు వలన కూటస్థు నకున్నట్లు భ్రాంతిగా కనబడుచున్నవి.
ఆదిత్యుని కిరణములు చంద్రు ని యందు ప్రతిఫలించి వెన్నెల కాంతి ద్వారా రాత్రు ల యందలి చీకటిని పోగొట్టు ను.అలాగే ఆత్మ
చైతన్యము బుద్ధియందు ప్రతిఫలించి సకల వృత్తు లు తెలియబడు చున్నవి.
ఏదో ఒక మహత్తరమయిన శక్తి లేకపోతే మనం ఎదురుగా వున్న వస్తు వును గుర్తించ డం సాధ్యంకాదు.వస్తు వులుండి వాటియెదు
రుగా కళ్ళున్నంతమాత్రాన ఆ వస్తు వును గుర్తించడం సాధ్యం కాదు.
మరణించిన వ్యక్తి కళ్ళు విప్పారి ఉన్నప్పటి కీ యెదురుగా ఉన్న వాటిని గుర్తించలేడు.
ఇంద్రియాలు,బుద్ధియందు చైతన్యం పనిచే యుట ద్వారామాత్రమే సకలం తెలియబడు తుంది.అందువలననే ఉపనిషత్తు లయందు,
బుద్ధి యందు ఈశ్వరుడు వుండుననీ,బుద్ధి ఈశ్వరునిచే నియమింపబడినది.
🧡💚❤️🧡
      
*వేదములలో ఏ చిన్న పొరపాటూ రాకుండా ఉండటానికి మన పూర్వీకులు ఎన్నో పద్ధ తులను అవలంబించారు - ఇవేవీ లిఖిత
రూపంలో కూడాలేవు. వేదమంత్రాల వల్ల పరిపూర్ణమైనలాభం పొందాలంటే ఆమంత్రో చ్చారణలో ఏపొరపాటూ రాకుండా ఉండాలి 
అంటే మంత్రాలనివల్లించేప్పుడు ఏ పదమూ మారకూడదు.నియమానికి వ్యతిరేకంగా ఏ స్వరమూ మారకూడదు.అందువల్లనే
అనేక కట్టు బాట్లు న్నాయి.ఒక్కొక్క పదాన్ని ఎంత కాలంలో పలుకాలో తెలిసేట్టు ''మాత్రలు'' కల్పించారు (మాత్ర అంటే ఒక్కొక్క
హ్రస్వ అచ్చును పలికే కాలం) శరీరంలో ఏ భాగం లో ప్రకంపన కలగాలో, ఏ విధంగా శుద్ధమైన శబ్దం వస్తుందో తెలుపటానికి శ్వాసకి
సంబం ధించిన నియమాలను 'శిక్ష' అనే వేదాంగం లో చెప్పారు.తైత్తిరీయ ఉపనిషత్తు ఈ 'శిక్ష' తో ప్రారంభ మవుతుంది.
*''శీక్షాం వ్యాఖ్యాస్యామః| వర్ణ స్వరః lమాత్రా బలంlసామసన్తా నః|''(శీక్ష,వర్ణము,స్వరము, మాత్ర,బలమూ,సామమూ,సన్తా నములతో
సంబంధము కలది) ఒక్కొక్క మంత్రాన్ని వివి  ధరీతులలో,వివిధగతులలో వల్లించటం నిర్థి ష్టతకి దోహదం కలిగిస్తుంది.ఇవి వాక్య,
పద, క్రమ,జట, మాల,శిఖ,రేఖ,ధ్వజ, దండ, రథ, ఘనవంటివి.కొందరిపండితులని''ఘనపాఠి'అంటాం.అంటే వాళ్లు వాదాల్ని
ఘనమనే పద్ధతిలో వల్లించగల నిష్ణాతులు అని అర్థం. ఘనపాఠి ఎవరైనా''ఘన'' పద్ధ తిలో వేదాన్ని వల్లిస్తూంటే ఆయన పదాలని
రకరకాలుగా ముందుకీ వెనుకకీ మారుస్తు న్నట్లు కనిపెట్ట వచ్చు.ఇది వినటానికి సొంపుగా ఉండటమే కాక,మనస్సుకి
ఆహ్లా దాన్నికూడ కలిగిస్తుంది
*వేదమంత్రాలకి సహజంగానేగలశోభ ఇంకా పెంపొందినట్టు అనిపిస్తుంది.క్రమం,జట,శిఖ, మాల పద్ధతులలో వేదాన్ని వల్లించినా అట్లా
గే అనిపిస్తుంది.వీటి ముఖ్యఉద్దేశమిది:ఆది నుండీ వస్తు న్న పదాలఅర్థంగాని,ఉచ్ఛారణ గాని మారకుండా పొరపడకుండా ఉండట
మే. మంత్రాలని ఒకవాక్యంవలె వల్లెవేయ టాన్ని ''వాక్యపాఠమనో ''సంహిత పాఠమనో అంటారు. ఒక వాక్యరూపంలో మంత్రాలను
వల్లించేప్పుడు కొన్ని కొన్ని పదాలను కలప వలసి వస్తుంది.మంత్రాలలోని ప్రతి పదాన్నీ దేనికదిగా,విడిగా వల్లించటాన్ని ''పదపాఠ
మం''టారు.సంహితపాఠం తరువాతనే పద పాఠం వస్తుంది.పదపాఠంలో వాక్యాలకి పద విభజన జరుగుతుంది.దీని వల్ల వేదాధ్యయ
నం చేసేవారికి ప్రతి పదమూ తెలుస్తుంది. దీని తరువాతిది ''క్రమపాఠం''. ఈ పద్ధతిలో మొదటి పదాన్ని రెండవదానికీ,రెండవ పదా
న్ని మూడవ దానికీ, మూడవపదాన్నినాల్గవ దానికీచేర్చుకొంటూ వాక్యంపూర్తయ్యే వర కూ వల్లిస్తా రు. ఈ పద్ధతి వల్ల విద్యార్థికి ప్రతి
పదమూ అర్థమవటమే కాక, రెండేసి పదా లను కలిపి ఏ విధంగా వల్లించాలో, ఆ కలప టంలో వచ్చే మార్పులేమిటో కూడా తెలుస్తా
యి.కొన్ని ప్రాచీన శాసనాలలో, ముఖ్యంగా దానాలకి సంబంధించిన వాటిలో,ఆ సంబం ధిత వ్యక్తు లపేర్ల చివర ''క్రమవిత్‌''అన్న పద
ముంటుంది.''వేదవిత్‌''వలెనే''క్రమవిత్‌''అంటే ఆ వ్యక్తికి క్రమ పద్ధతిలో వల్లించటం వచ్చని అర్థం.ఇటువంటి శిలాశాసనాలు దక్షిణ
భార తంలో కోకొల్లలు.దీనితరువాతది 'జటాపా ఠం'.ఈ పద్ధతిలో మొదటి పదాన్నీ రెండవ పదాన్నీ కలిపివల్లిస్తా రు. ఆ తరువాత ఆ
రెండు పదాలని తిరగవేసి వల్లెవేస్తా రు.తరు వాత మళ్లీ మామూలువరుసలో చెప్తా రు. 'క్రమపాఠం'లో పదాలక్రమంఇలాఉంటుంది: 1-
2, 2-3, 3-4, 4-5 ఇత్యాది.కాని జటాపా ఠంలో వరుస ఇలాఉంటుంది.1-2-2-1-1-2 ఈక్రమాన్నే ముందుకి వెనుకకీ వల్లె వేస్తా రు.
శిఖాపాఠంలో మూడేసి పదాలని ఈవిధంగా కలుపుతారు.
*''ఘన''పాఠం వీటికంటెకష్టం.ఇవికాక ఇంకొ క అయిదు పద్ధతులు కూడాఉన్నాయి.పదా ల వరుసనుమారుస్తూ రకరకాల జోడింపు
లు చేస్తూ వల్లె వేస్తా రు.'ప్రాణాలను కాపాడే మందుని ప్రయోగశాలలో ఎంత జాగ్రత్తగా భద్రపరుస్తా రో' విశ్వకళ్యాణానికి ఉపయుక్త
మయ్యే వేదాలకు ఏవిధమైనమార్పూ,క్షీణిం పూ కలుగకుండా,లిఖిత పూర్వకంగా కూడా కాకుండా,కేవలం వల్లె వేయించే
పద్ధతులలో మన పూర్వులు భద్రపరచారు. పదాలను ముందుకూ వెనుకకూ వల్లెవేసేప్పుడు విద్యా ర్ధి స్వరాలకేమాత్రమూ
భంగంరానీయకూడ దు. పదాల సమ్మేళనం స్వరాలనే విధంగా ప్రభావితం చేస్తుందో కూడా విద్యార్థి నేర్చు కోవాలి. మంత్రంలోని
పదాలు సహజమైన వరుసలో వస్తా యి.కనుక సంహిత పాఠాన్ని పదపాఠాన్నీ -ప్రకృతి పాఠమంటారు.మిగిలి న వాటిని వికృతి
(అంటే,అసహజం) పాఠ మంటారు.క్రమపాఠంలో పదాలు వరుసగా ఒకటి,రెండు,మూడువలె రావు.కాని రెండు తరువాత
ఒకటి,మూడువెనుక రెండు వలె తిరగేసి వల్లించక్కరలేదు.అందువల్ల దానిని వికృతి(అసహజం లేక కృత్రిమం)అనలేము.
వికృతులు ఎనిమిది రకాలు.
*వేదాలను స్వచ్ఛంగా పరిరక్షించటం కోసమే వల్లె వేయించటంలో ఈ క్లిష్టమైన పద్ధతులు వచ్చాయి.రకరకాలుగా పదాలను పునశ్చర
ణ చేస్తూండటం వల్ల వాటి సంఖ్యనుకూడా కాపాడుకొన్నారు -తద్వారా వాటి నిర్మలత ను కూడా.
*ఎంత క్లిష్టమైన పద్ధతులలో వల్లె వేస్తే అంత పుణ్యమనికూడా నిర్దేశించి,విద్యార్థు లు
వాటిని నేర్చుకొనేట్టు చేశారు.మన పూర్వీకు లు వేదమంత్రాల స్వచ్ఛతను నిలపటానికి అన్ని పద్ధతులనూ అవలంబించారు.
*అందువల్లకాలక్రమేణా వేదమంత్రాలఉచ్ఛా రణలో మార్పులువచ్చాయి -అవి ఎంత కాలంలో వచ్చాయి అంటూ ఆధునికులు
పరిశోధనలుజరుపటం సమర్థనీ యం కాదు. వీటి వల్ల సత్యం ఏ మాత్రమూ అర్థం కాదు. భగవద్వాణి :వేదాలు ఆవిర్భావం చెందాయ
ని ఒప్పుకోవాలి.మన దేశంలోనే కాదు,అన్య మతస్థు లుకూడా వాళ్ల పవిత్రగ్రంథాలు ఆవి ర్భవించాయనే అంటారు.జీసస్‌తన ప్రవచ
నాలు తనవి కావనీ అవి భగవంతుని మాట లే అనీ తాను ప్రచారకుడను మాత్రమేననీ అన్నాడు.అట్లా గే మహమ్మదీయులు కూడా.
అల్లా పల్కులనే మహమ్మదుప్రచారం చేశా డంటారు.'ఆవిర్భావం' గురించి మన అభిప్రా యాలనే వాళ్లు కూడ చెప్తూంటారు. వాళ్ళవి
కూడ ''ఆవిర్భవించిన పాఠాలే'' అంటారు.
*భగవంతుని పలుకులు యోగుల వల్ల మన కి అందాయి. ప్రతిమతంలోనూ భగవంతుని పలుకులు యోగులకూ,మహర్షులకూ
ప్రవ క్తలకూ విశదమయాయి -వాటినే మానవాళి పురోగతికై వాళ్లు అనుగ్రహించారు.ఏ విష యాన్నైనా ఎంతోనిశితంగా,ఏకాగ్రతతో
గమ నిస్తే దానినిజస్వరూపం బయటపడుతుంది. దీనినే సహజ స్ఫురణఅనో,ప్రత్యక్ష జ్ఞానమ నో అంటాం.ఐన్‌స్టైన్‌కి సాపేక్షసిద్ధాంతం
విపు లమైన విశ్లేషణా ఆలోచన వల్ల కాక సహజ స్ఫురణవల్ల తట్టిందంటారు.మనమీవిషయా న్ని నిజమేనని ఒప్పుకుంటే,మానసికంగా
ఉన్నతులు,వినీతులు,ఆధ్యాత్మికంగా ఉన్న తులూ అయిన ఋషులు అంతరాంతరాల లో మంత్రాలను గ్రహించారని అంగీకరించక
తప్పదు!.
[2/15, 5:05 AM]   💚❤️🧡
*మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగాలంటే మనసు నిర్మలంగా ఉండాలి. ఐహిక చింతన ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా
అనిపిస్తుంది....
*మనిషిలో అరిషడ్వర్గాలు ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది. ఎప్పుడై తే మనం వాటిని విడనాడతామో
అప్పుడే మనం ఆధ్యాత్మిక చింతనలోని అఖండ ఆనందాన్ని అనుభవించగలం.
*జీవితం ఆశల పల్లకి... మన మనసుతో ఆ పల్లకిని మోయిస్తూనేఉంటుంది.రోజు మొద లైనప్పటినుండి ఎన్నోఆశలు..అవి నెరవేర్చు
కోవడానికి ఎన్నోప్రణాళికలు అందిపుచ్చుకు నే అవకాశాలకోసం వెతుకుతూనే ఉంటాం. కానీ అందుకున్న ప్రతీ అవకాశం అమృత
ఫలాలను ఇవ్వదుగా ! అలాఇచ్చేస్తే మనసు మనల్ని మనలాగా ఉండనిస్తుందా,సరి లేరు నీకెవ్వరూ...అంటూ ఆకాశానికి ఎత్తేసి మన
లో అహంకారాన్ని పెంచేస్తుంది.
*విజయమనే వెలుగులో విర్రవీగుతున్న
మనల్ని ఆ అహంకారమే అంధకారంలోకి తోసేస్తుంది.అందుకే సృష్టిధర్మంలో భాగంగా ఒక్కోసారి అవకాశాలు చేజారి మనిషిగా మన
వ్యక్తిత్వంజారిపోకుండా కాపాడతాయే మో !! కానీ క్షణికావేశపరులమైన మనం చేజారిన అవకాశం గురించి కృంగిపోతామే గానీ
అందులోనుండి పుట్టు కొచ్చిన మరో అవకాశాన్ని గుర్తించము.
*జీవితం ఎవరికీ పూలపాన్పు కాదు.కష్టసు ఖాల కలబోత..సుఖదుఃఖాల సుడిగుండం ! మన మనసుని, శరీరాన్ని ఒక అనువయిన
స్థితికి అలవాటు చేసేసి..ఒడి దుడుకులు వచ్చినపుడు నిలబడి ముందడుగు వేయ మనకుండా ...చక్కదిద్దు కునే అవకాశమే
లేదంటూ బలహీనపరిచేస్తు న్నాము.
*మనిషికిఊపిరి ఉన్నంతవరకు ప్రాణం ఎలా ఉంటుందో...అవకాశాలు కూడా అంతిమ దశవరకు ఉంటూనే ఉంటాయి.
*గాలి కంటికి కనపడట్లేదని లేదనుకుంటే మూర్ఖత్వమేగా..*అవకాశాలు లేవని ప్రయ త్నాలను విరమించుకోవడమూ అంతే !!
*ఎంతచదివినా మార్కులువచ్చే అవకాశమే లేదని కుంగిపోతుంటారు కొంతమంది... మార్కులు రాకపోయినా చదివిన చదువు,
అది సంపాదించి పెట్టిన విజ్ఞానం మరో అవ కాశం కల్పిస్తూనే ఉంటాయనే సూక్ష్మాన్ని విద్యార్థు లకుతెలియజెప్పి వారి వెన్నుతడితే
మనం నేడు చూస్తు న్న పసిపిల్లలఆత్మహత్య లు ఉండవు. !!
*ఎన్ని అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేక ఉద్యోగం సంపాదించలేకపోతు న్నారని యువతను నిందించేకన్నా... వారి
భవితను మార్చే మరో అవకాశం గుర్తించేం దుకు సహాయపడితే.. నవభారత ప్రగతికి పునాది వేసినట్టేగా !!.
*తల్లి అయిన క్షణంనుండి తన కోసమంటూ క్షణం వెచ్చించే అవకాశంఉండదు ఏతల్లికీ !! అయినా మాతృత్వంలోనే
మరోఅవకాశాన్ని అందిపుచ్చుకుని ఎందరో మహిళలు అద్భు తాలు సృష్టిస్తు న్నారు.
*కుటుంబంలో అందరి అవసరాలు తీర్చడా నికి అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని చేజిక్కించుకుని అహర్నిశలు శ్రమించే తండ్రి
ఒక తపోధనుడు !!.
*గెలుపుతో గర్వం రానీయవద్దు . ఓటమితో ఓడిపోయాననుకోవద్దు .గెలుపే గొప్పమలుప నుకోవద్దు . ఓటమే నిన్ను మలిచే శిల్పి అని
తెలుసుకోవాలి..
*చేజారిన అవకాశంకోసం చింతమానుకోవా లి. యోచించి యత్నించి సృష్టించుకో గల గాలి మరో అవకాశాన్ని !!
*ఎవరైనా అవకాశాలు లేక కాదు, సాధించ లేకపోయేది... గుర్తించక !!.
*మనం గమనిస్తే దేనికైనా సృష్టి-స్థితి -లయ ఈ మూడుఉంటాయి.దేనినైనా సృష్టించగల శక్తి
మనిషికిమాత్రమేఇచ్చాడుభగవంతుడు. అలాగే నాశనం చేసే శక్తి కూడా !ఇచ్చారు. ప్రాణం ఉన్నంతవరకు సృష్టిలో ప్రతీ సవాలు ని
స్వీకరించి సాధించమని ఈ మానవ జన్మ వరంగా ఇచ్చాడు.
*సృష్టిలో నాశనమయినది ఏదయినా తిరిగి సృష్టించబడుతుంది...కానీ దాని స్థితి మారు తుంది. అలాగే చేజారిన
అవకాశమేదయినా మరో అవకాశాన్ని మన ముంగిట నిలుపు తుంది. అందలమెక్కినా అరుగుమీదకూర్చు న్నా అందరం
మనుషులమే !!.
*అంతస్తు లు, స్థితులు ఎవరి అవకాశాలని బట్టి వారు పొందుతారు.
*కానీ మనిషిగా మానవత్వం చాటుకోవాలం టే మాత్రం మరో అవకాశం రాదు...ఈ జన్మ లోనే సాధ్యం అది !!మనిషిగా
పుట్టినందుకు ఈఅవకాశాన్ని సద్వినియోగంచేసుకుందాం.
*జీవితంలోఆరుగురు రాక్షసులను ఎదుర్కొ నాలి.అవి కోరిక. కోపం. దురాశ. మోహం.
మత్తు .అహంకారం.అవి ప్రశాంతమైన మన స్సు లో అలజడిని సృష్టిస్తా యి.జీవిత పర మార్ధా న్నే చెడగొడతాయి.అవి నీ నుండి
ఆనందాన్నితొలగించి బాధను పంచుతాయి. ఈ రాక్షసులు మనపై నిర్విరామంగా దాడి చేస్తూనే ఉంటాయి.వాటికి దేశకాలాలులేవు.
ఎక్కడఉన్నా నిరంతరం దాడిచేస్తూనేఉంటా యి. అవి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తా యి.
విష్ణుపురాణం ప్రకారం భగవంతుడికి ఐశ్వ ర్యం.ధైర్యం.క్రియ.ఖ్యాతి.జ్ఞానం.పరిత్యాగం. (సన్యాసం) అనే ఆరు గుణాలు ఉన్నాయి.
ఈ ఆరూ ఆరు ఇంద్రియాలను ఓడించడం లో సహకరిస్తా యి.
మనం గమనిస్తే ఒక నటుడిగా,రాజుగా.సేవ కుడిగా.బ్రాహ్మణుడిగా.లేక చండాలుడిగా కూడా నటించగలడు.అతడు ఏ పాత్రనైనా
పోషించగలడు కానీ ఆ పాత్రలో నటించేట ప్పుడు దాని నుండి పక్కకు పోడు...
[2/16, 6:14 AM]   ❤️🧡💓
*మనకు ఇష్టంఉన్నచోట..కష్టం ఉంటుంది.
*కష్టం ఉన్నచోట బాధఉంటుంది..కష్టం,బాధ అర్థం..చేసుకున్న చోట...ప్రేమ ఉంటుంది....
*ఇది అర్థం చేసుకునే మంచి మనసుంటే,
జీవితం అద్భుతంగా ఉంటుంది...
*ఒకరిని ఇష్టపడటం అంటే,వాళ్ళు మనల్ని, సంతోష పెడితేనే ఇష్టపడటం కాదు. బాధ పెట్టినా కూడా ఇష్టపడాలి..
*పక్కవాల్ల మాటలు నమ్మి..మనవాళ్ళవ్యక్తి త్వాన్ని నిర్ధా రణచేయకండి.కష్టమోసుఖమో మనం నడిచే మార్గంలో,ఎందరు తారసపడ
తారో, మనల్ని దాటివెళ్ళేవాళ్ళు,మన అడు గులని జాగ్రత్తగా ఒడిసి పట్టు కునేవాళ్ళు,
మన జతగా అడుగులు వేసేవాళ్ళు,లేదా అసలు మన నడకనే ఆపేద్దాం అనుకునే వాళ్ళు, ఇలా ఎంతమందో...కానీ వీళ్లలో ఎందరు
మనకి గుర్తుంటారు..ఎందరి జ్ఞాపకా లు మనల్ని చుట్టు కుని ఉంటాయి.. కొన్ని దూరాలు నడకతో తరిగిపోతాయి.మరికొన్ని
దూరాలు నడవడికతో చెరిగిపోతాయి..
*ఎవరైనామనల్నితిట్టినా,పొగిడినా,నిందిం చినా,చిరునవ్వుని మాత్రం ఎప్పుడూదూరం చేసుకో కూడదు...కాలమే వారి వారి కార్యా
నుసారం తప్పకుండా వారికి సమాధానం చెపుతుంది. ఓర్పు,చిరునవ్వు అన్నిసమస్య లకూ ఆయుధాలు. 
      *పరుల మేలు కోసం చేసిన పని ఎంత చిన్నదైనా అదిమనలోనిఅంతఃశ్శక్తినిమేల్కొ ల్పుతుంది.ఇతరులకు కాస్తసహాయాన్ని చే
యాలి అని ఊహించుకొంటేనే  మన హృద యం ఎంతోఉల్లా సంగా తయారవుతుంది ..
*శత్రు వుకైనా సరే ఎల్లపుడూ మంచి జరగా లనే కోరుకోవాలి. దీని వలన మనిషిలోని  ఈర్ష్యా ,అసూయలు తొలగిపోయి ప్రేమత త్వం
అలవడుతుంది.ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటే కొంచెం ఆలస్యమైనా సరే తప్పక మంచే జరుగుతుంది.కానీ ఇత రులకు
చెడు జరగాలని కోరుకున్నా చెడు జరుగనే జరుగదు. కారణం దేవుడనే వాడు సదా మంచినే చేస్తా డు. ఒకవేళ ఎవరికైనా చెడు
సంభవిస్తే అది వారి కర్మ ఫలం తప్ప మనం చెడు జరగాలని కోరుకోవడం వలన కానేకాదు. ఊరికే పాపము మూట కట్టు కో వడం
ఎందుకు.,.ఇతరుల మంచిని కోరుకు న్నవాడి బాగోగులు స్వయంగా ఆ పరమేశ్వ రుడే చూసుకుంటాడు. కనుక మంచినే చేయాలి.
మంచినే కొేరాలి..
     Our problem is never really our problem. Our reaction to the problem is really our problem...
A person's most valuable asset is not a brain loaded with knowledge. But a heart full of love with an ear
open to listen & a hand willing to help.!
Trees with deep roots can survive in a violent storms Similarly, A person with deep faith on God can face
any problem of life. Stay Blessed.
*నిజాయితీగాఉండు ,కానీ నిశ్శబ్దంగాఉండి పోకు..మౌనంగా ఉండు..కానీ మాట పడకు.
విలువ లేని చోట నోరు విప్పకు.. అవసరం ఉన్నచోట నీకోసం నువ్వు వాదించుకో.మన కోసం ఎప్పుడూ ఎవరూ రారు....
*ఎదుటివారి తప్పొప్పులు, నవ్వుతూ భరిం చినంతకాలం మంచివాళ్ళమే..ఎప్పుడై తే తప్పుని తప్పు అని చెప్పి , సరిచెయ్యాలి అని
చూస్తా మో అప్పుడే.. మనలో మనకు కూడా! తెలియని లోపాలని వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగాపరిచయంచేస్తా రు
అప్పటివరకూ మనం చూపిన,ప్రేమాభిమా నాలు అన్నీ మరుగున పడిపోతాయి..ఇదే నేటి మనుషుల తీరు....
*నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది!* అలాగేనిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడు
తుంది....*ధర్మం అనేది లౌకిక విషయం.
*జ్ఞానం అనేది అలౌకిక విషయం..ముందు జ్ఞానవంతుడివి కా..తర్వాత నీవు నడిచే దారి అంతా ధర్మమే అవుతుంది..
*నీకుకావాలి అనుకున్నప్పుడు ఏది నీ దగ్గర కురాదు ,నీ సొంతం అనుకున్నది ఎప్పటికి నిన్ను విడిచిపెట్టి పోదు ,నీకు రావాలని,నీకే
చెందాలని*రాసిపెట్టింది* రాకుండా ఆగదు. ఇప్పటివరకు జరిగేవన్నీ నీ తలరాతలో నీ కర్మ భాగమేఅంతా నీ మంచికే నేస్తమా.
  మనలో మనం*గొడవ*పడినంత మాత్రాన విడి పోయేంత బలహీనమైందికాదు,బంధం. అంటే మనం ఎదుటి వారితో గొడవ పడిన
ప్రతీసారి ఆ బంధం మరింత గట్టిగా అవు తుంది . బంధానికి అలవాటు పడినవారికే తెలుస్తుంది ఆ బంధం విలువ , ప్రేమించిన వారికే
తెలుస్తుంది ఆ ప్రేమ విలువ .లేనిపోని *అనుమానాలు* లేనిపోని *ఆవేశాలతో* మీ ప్రేమని మిమ్మల్ని ప్రేమగా ప్రేమించేవారి ని
వదులు కోకండి....
    మనం *ఎడుస్తూ* కూర్చుంటే మనలో కన్నీళ్ళు కరిగిపోతాయి .కాలం కదిలిపోతుం ది. కష్టం మిగిలిపోతుంది , అందుకే ఎడుపు
ని గుండెలో దాచిపెట్టు గెలుపు కోసం పరి గెట్టు , అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణం ఐన వాళ్ళే నీ గెలుపునీ చూసి
తలదించుకోవాలి .నీ జీవితం నీవ్వు నిర్ణయించుకో .....
*మనిషికిమరణం విచిత్రమైనది.ఇంటినిండ ఆస్తు లున్న కోటేశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అనిఎడుస్తు న్నాడు ,అదే
ఇంటినిండ కష్టా లుఉన్న పేదోడు చావుఎప్పు డు వస్తుందో అని ఎదురుచూస్తు న్నాడు... మనిషి ఎక్కడ గెలిచిపోతాడో,ఎక్కడ అలిసి
పోతాడోఎవరికితెలియదు.మట్టిలోకిమాత్రం మనశాంతి లేకుండా వెలుతున్నాడు .
   మనం ఎదుటి వారి నుండి ఏమైన ఆశించ టం ఆపింతే ఆనందంమొదలవుతుంది,అదే వారిని*శాశించటం*ఆపితే
మనకుసంతోషం మొదలవుతుంది .
*ఎదుటివారిని క‌లుపుకుపోయేమనస్తత్వం మనలోఉంటే అందరూమనతోనే ఉంటారు . అంతా నాకేతెలుసు నాకెవరిఅవసరం లేదనే
అహం మనకుంటే .సమాజమేమననిదూరం పెడుతుంది .మనకు ఎంత *ఆస్తి* ఉందనేది కాదు మనము ఎంత మంది మనసుల్లో
ఉన్నాము అనేదేముఖ్యం.వారి మనస్సులో మనం ఉండాలనదే ముఖ్యం. .
*నిజంఉన్నతమైనది , కానీ ! నిజాయితీతో జీవించడంఅన్నది అంతకంటే ఉత్తమమైనది మనం కంటితోచూడనివి,చెవులతో విననివి 
ఎప్పుడూనమ్మవద్దు .ఎందుకంటేకొంతమంది చెప్పే మాటలవల్ల కొన్నిస్నేహాలు చెడిపోతా యి ,కుటుంబ బంధాలు తెగి పోతాయి .
❤️🧡💓
        
*నిర్మలమైన మనస్సు*
*ప్రతీ ఒక్కరూ నిర్మలమైన మనస్సు కై కృషి చేస్తుంటాం.అంటే అన్నీమంచిపనులే చేయా లి. అబద్ధా లు చెప్పకూడదు.ఎవరకీ హాని
చేయకూడదు లాంటివి.కానీ ఒక్కసారి ఆలో చించిన ఆ ప్రయత్నంలో మనం ఎంతవరకూ సఫలమయ్యాం? ఎంత మంది
సఫలీకృతు లమయ్యాం? అంటే మాత్రం ఆ లెక్కకి మన చేతి వేళ్ళు సరిపోతాయేమో. కాదంటారా?
*మనస్సనేది ఓ అద్భుతం.నిజానికి, అది నిజంగా మన నియంత్రణలోనే ఉందా?మన మనస్సును మనంనియంత్రిస్తు న్నామా లేదా
మన మనస్సే మనల్ని నియంత్రిస్తుందా? నిజంగా ఆలోచించవల్సిన విషయమే.ఏంటి లోపం? ఎక్కడుంది లోపం?.
*మన బుద్ధి ,మనశ్శక్తి మొండివి,మార్చలేని వి అంటే అద్భుతంకాదుకానీ,ఆధ్యాత్మిక బోధనలు వాటిమధ్యఉంటూ మనంచేసే
పనులు,అవిమంచివా,చెడ్డవా,చెయ్యొచ్చా,చెయ్యకూడదా అనే అలోచనల్లో సహాయం చేస్తూ, కొన్ని సమయాల్లో మన మనస్సును
నియంత్రించడంలో తోడ్పడుతూ, ఏదో ఓ
విశ్వాసం మనల్ని ,మనశ్శక్తిని ముందుకు నడిపిస్తు న్నాయేమో,అదే ఆధ్యాత్మికతేమో అంటేమాత్రం అదోఅద్భుతమే.మన విశ్వా
సాలు కొన్నిసార్లు మారవచ్చు.వాటిని కాపా డుకోవాలి, వాటిని ఎప్పుడూ ఆదరించాలి, వాటితోనే జీవనం సాగించడమంటే కష్టమే
మో గానీ ఎప్పటికీ ఆధ్యాత్మికతంగా ఉంటే మనలోని దుష్టశక్తు లకు,చెడ్డపనులు చేయా లన్న ఆలోచనలకు ఈ ఆధ్యాత్మికతా ధోరణి
అడ్డు పడుతూండడం వల్ల మనలోని దైవ త్వాన్ని పంపొందించుకోగలమేమో, మన మనస్సు మన నియంత్రణలోనే ఉంటుందే
మో.ఏదేమైనా మన ప్రయత్నం మాత్రంతప్ప నిసరిగా ఉండాలి ఎందుకంటే అలాఆధ్యాత్మి కత భావనలనుపెంపొందించుకోవడం
అంత సులభమంటారా?.
*ఒక్కసారి గతాన్ని చూచిన,మనకి ఎందరో గొప్ప గొప్ప మహానుభావులున్నారు. .... ఆధ్యాత్మిక ధోరణి ఎలావచ్చిందో ఎంత ఆలో
చించినా తట్టదు.బహుశా వాళ్ళు అన్నివిలా సాలను,సౌకర్యాలను త్యజించి,త్యాగంచేసి,
ఒక్కదైవంమీదేమనస్సులగ్నంచేయడంవల్ల,లేదా ఆదేవునిపై వారికున్నవిశ్వాసమాలేదా రెండూనా!! అయితే అలా అన్నింటినీ మనం
త్యాగం చేయాల్సినఅవసరంలేదేమో, కానీ మనలోని ఉన్న దుష్ట శక్తు లను,చెడ్డ ఆలోచ నలను త్యాగం చేసి,త్యజించి,దైవత్వంమీద
మనస్సులగ్నంచేసిన నిర్మలమైన మనస్సు ను సాధించవచ్చు..
🌹🌴🌹
*జీవితం ఓక సవాల్..ఏదుర్కోవాలి.
*జీవితం ఓక బహుమతి ..స్వీకరించాలి.
*జీవితం ఒకసాహసయాత్ర..తప్పక ప్రయా ణించాలి. జీవితం ఓక శోకసంద్రం, దాటు కుంటూ జీవించాలి..
*జీవితం ఒక భాధ్యత దాన్ని ..నెరవేర్చాలి.
*జీవితం ఏప్పుడు ఒక ప్రశ్న. సమాధానం వెతకాలి. జీవితం ఏప్పుడు ఆటపాటల వినోదం అస్వాదించాలి..
*జీవితం ఓ అందం అందమైన భావన.అను భవించాలి ఆరాధించాలి..
*జీవితం పోరాటంగా మారితే మాత్రం.. ఏదిరించాలి*.*జీవితం ఒక లక్ష్యం ఏగసి పట్టు కోవాలి...
*నీ జీవితాన్ని నిన్నునీవు తక్కువ చేసుకుని నీకేమి లేదని భాదపడకూడదు,మన కధను సుకాంతం చేసుకోవాల్సి భాధ్యత మనదే..
🧡💓
💲
[2/16, 5:00 AM ) 
సర్వకర్మల యందు నా పైననే ఆధారప డి సదా నా రక్షణమునందే కర్మ నొనరింపు ము.అట్టి భక్తియుతసేవలో సంపూర్ణముగా నా
యందే చిత్తము కలవాడవగుము.
మనుజుడు *శ్రీనివాస* భక్తిభావన యందు వర్తించినపుడు తాను జగమునకు ప్రభువు నన్న భావనలో వర్తించడు.వాస్తవమునకు
ప్రతియొక్కరు సంపూర్ణముగా దేవదేవుడై న శ్రీకృష్ణుని నిర్దేశమునందు సేవకుని వలె వర్తిం చవలసియున్నది.
సేవకుడై నవాడు కర్మ విషయమునస్వతంత్ర తను కలిగియుండక యజమాని ఆజ్ఞానుసా రమే వర్తించవలసివచ్చును.అదే విధముగా
దివ్య యజమానుడై న శ్రీకృష్ణుని తరపున వర్తించు సేవకుడు కర్మ యొక్క లాభనష్టము లతో ప్రభావితుడు గాకుండును.
అతడు కేవలము తన విధ్యుక్తధర్మమును ఆ భగవానుని ఆజ్ఞానుసారము ఒనరించు చుండును.....
  శ్రీకృష్ణుడు లేని సమయమున మనుజడు ఎట్లు వర్తించవలెనని ఎవరైనను వాదించు అవకాశము కలదు.
నిర్దేశానుసారము మరియు ఆ దేవదేవుని ప్రతినిధియైన గురువు యొక్క నేతృత్వము లో మనుజుడు కర్మనొనరించినచో శ్రీకృష్ణుని
ప్రత్యక్ష నిర్దేశంలో వర్తించినఫలమేకలుగును    
🧡💓💚
       
అడవిలో గుడ్లగూబలు,కీచురాళ్ళు రాత్రిపూ ట అరచుచు చెవులకు బాధగా ఉండును. అట్లే సంసార బద్ధు నకు గిట్టనివారి తిట్లు ,
అభూతకల్పనలువినిపించుచుండును.విన్న దానికి ఎల్ల దుఃఖపడుచుండును.ఆకలితో తెలియక అడవిలో తినగూడని చెట్లపండ్లు
తిని బాధపడువారుందురు.అట్లే పాపాత్ము లను ఆశ్రయించి,తెలియక దరిద్రు లను ఆశ్ర యించి దుష్ఫలితములను అనుభవించు
చుందురు.అడవిలో ఆకలి,దప్పులతో బల హీనతచెంది,నీరు ఎండిననదిలో వెదకి కొను చున్నట్లు ఒక్కొక్కప్పుడు ఇహపరములు ఎ
రుగని పాషండులను కొలువవలసివచ్చును.
అడవిలో ఒక ప్రక్క మంటలు చూచి పారిపో వుటకై రెండవ ప్రక్కకు పరుగెత్తి కారుచిచ్చు మధ్య చిక్కుకొనిపోయినట్లు , ఒక్కొక్కడు
పొట్ట గడుచుటకై చుట్టముల కొలువు చేసి దుఃఖపడుచుండును.ఒక్కొక్కడు రాజ్యాదు లపై మోహముచే తండ్రినైనను,అన్ననైనను
కొడుకునైనను,పెద్దలనైననుహత్యచేయును. ఒక్కొక్కడు తన కన్నా సమర్థు ల చేత దెబ్బ తిని సమస్తమును పోగొట్టు కొని దుఃఖించు
చునే దిగులు తీరుటకు సంసార సుఖముల ను అనుభవింపచూచును.కొండలు ఎక్కువా నికి రాళ్ళతోను,ముళ్ళతోను పాదములు
బాధపొందినట్లు అటుపైన విశ్రాంతి సమయ మున పోట్లు మంటలు అనుభవించినట్లు గృహస్థా శ్రమమందలి కార్యక్రమముల నిర్వ
హణకై అనేక బాధలుపడి,ఎండనక వాననక‌నడిచి ఆకలి బాధతో నీరసముతో ఇంటికి చేరి కుటుంబ వ్యక్తు లపైవిరుచుకొనిపడును.
వారిని తిట్టి తానుతిట్టు కొని,మతిపోగొట్టు కొ నును.ఆ కష్టములను మరచిపోవుటకై అల సి గాఢనిద్రలోనికిపోయి అడవిలోకొండచిలు
వచే మ్రింగబడిన వానివలె తన వశమున లేకుండును.
అడవిలో గడ్డి ఎత్తు గా మొలచి మాటుపడి ఉన్న బావిలోపడి అందుపాముకాటు పొంది న వాని వలె ఒక్కొక్కడు దుర్జనులు పెట్టిన
బాధలకు మనస్సు పాడుచేసికొని అజ్ఞానాం ధకారమున పడి ఆత్మ వినాశకరములైన పనులు చేయును.తేనె కోసమై తేనెతుట్టెను
రేపగా తేనెటీగలు మూతిమీద కుట్టినట్లు సంసార సుఖమును కోరి సొత్తు ను హరించు ప్రణాళికలు వేయువాడు ఆఇతరులచేతను,
ప్రభుత్వశిక్షణాదికారులచేతనుగూడా తిట్లు , దెబ్బలు,కారాగారబంధానాది శిక్షలుపొందు ను.ఇదియే నరకలోక జీవితము.యౌవనం
న సంపాదించిన విలువైన వస్తు వులను ఇత రులకు పందెము పెట్టి జూదముఆడి ఓడిపో యిన ముసలివానివలె చలికి,ఎండకుఓర్వక
ప్రయాస పడి గడ్డి తిని ఆర్జించిన ధనమును ఇతరుల మాటలు విని పోగొట్టు కొని దుఃఖ ముతో శేష జీవితమును గడపును.
అడవిలో బోయలు వేటాడబడిన కొంచెము మాంసమునకై ఎక్కువ మంది ఎగబడి కల హించుకొని దెబ్బలు తగిలించుకొనినట్లు
ఎచ్చటనో కొంచెము ద్రవ్యము లభించునని తెలిసి దాని కోసమై వందమందిచేరి పెనుగు లాడుకొని కష్ట నష్టములతో వట్టి చేతులతో
తిరిగి వచ్చుచుందురు.నాయనా! సంసారం అనబడు అరణ్యములోని మహావైభవమిది.

🖤💓💚
[2/16, 5:05 AM]
        
*భగవంతున్నీ చేరాలంటే,జన్మ రాహిత్యం పొందాలంటే - ఆత్మానందం కావాలి....
*అది ఎలా???*ఈ మానవ జన్మ మళ్లీ మళ్లీ వచ్చేటటువంటిదికాదు..ఈ ప్రాణమూ దేహ మూ శాశ్వతంగా ఉండిపోవు కూడా,
ఇది మాయామయమగు లోకము కనుక ఇక్కడ దొరికే సుఖాలుకూడా మాయతో కూడినవే!.
ఇది స్వార్థపూరితమైనప్రపంచం కనుకఇందు లో ఉండే బంధాలన్నీ స్వార్థపూరితమైనవే!.
ఇక్కడ మనదంటూ బయట ఏదీ లేదు,మన దంటూ ఏదైనా ఉందంటే అది మన లోపలే ఉంటుంది.అదియేఆత్మానందము,ఈ
ఆత్మా నందము చిక్కవలెనంటే పరలోకమునందే!.
పరలోకమనగా ఎక్కడో ఆకాశం పైన లేదు!, మనలోనే ఉంటున్నది.కుండలో పాలుపోసి కవ్వముతో బాగుగా చిలికినపుడు వెన్న
రావడం జరుగుతుంది..అదేవిధముగా మన స్సును భగవన్నామమనే కవ్వంతో బాగా చిలకాలి. అపుడే ఆత్మానందమనే వెన్న
లభిస్తుంది...
💓💚
        ♥️
కలియుగంలో బతికుండగానే మరణాను భూతిని పొంది మరణభయాన్ని జయించి మహర్షులమవుదాం....
‘మృత్యువు కూడా జీవితం అంత మనోహర మైనదే. ఎలా జీవించాలో తెలిసినవారికి మరణభయంనుంచి విముక్తిపొందడంఅంతే
సులభం.మనిషి సంపూర్ణ శక్తిమంతుడిగా ఉన్నప్పుడే,మనసులో తిష్ఠవేసుకునే గతా న్ని, అనుక్షణం నేను అనే అహాన్ని గుర్తు చేసే
ఆలోచనల్ని ఎప్పటికప్పుడు మానసికంగా అంతం చేస్తే..వర్తమానంలో జీవించడం బోధ పడుతుంది.అప్పుడు జీవనం,మరణం ఐక్య
మైపోతాయి.మనకు తెలిసిన దాని నుంచి స్వేచ్ఛ పొందడమే మరణం’.
*ఎవరైతే తమ మనసును నిశ్చలంగాఉంచు కుంటూ,సమస్యల ప్రభావాన్ని మనసు మీద పడకుండా చేసుకోగలరో... అలాంటివారికి
బుద్ధు డు చెప్పిన మాటలు తప్పించుకోలేని, జరగకమానని సమస్యలను నిర్భయంగా ఎదుర్కోవడానికి దోహదపడతాయి.
*ఏదో ఒకరోజు నేను అమితంగా ప్రేమించి, నావిగా భావించే వస్తు వులన్నీ నానుంచి దూ రమై నాశనానికి, మార్పునకు లోనయ్యేవే
దాన్ని నేను తప్పించలేను..
*ఏదో ఒకరోజు నాకు అనారోగ్యం వస్తుంది. అలా రాకుండా నేనుతప్పించలేను.ఏదో ఒక రోజు నాకు వృద్ధా ప్యం వస్తుంది. దాన్ని నేను
తిరస్కరించలేను.
*నేను చేసిన కర్మలకు నేనేబాధ్యుణ్ని..వాటి నుంచి తప్పించుకోలేను.ఏదో ఒకరోజునన్ను మృత్యువు కబళిస్తుంది.దాని నుంచి బయ
టపడలేను!’
 ఈ పంచసూత్రాలను గురించి ఆలోచించిన ప్పుడు మనిషి తనఅహాన్ని,దురాశను,దుశ్చే ష్టలనుంచి విముక్తిపొందుతాడు.పారమార్థిక
పథంలో అడుగిడతాడు.తద్వారాజరగకమా నని,తప్పించుకోలేని వాటిని భయరహితం గా ఎదుర్కోగలిగే మనోబలాన్ని పెంపొందిం
చుకోగలుగుతాడు.బాల్యాన్ని ఆస్వాదిస్తూ, కౌమారాన్ని అనుభవిస్తూ,వార్ధక్యంలో ఆ అనుభూతుల్ని నెమరువేసుకుంటూ,అరవై ల్లో
ఇరవైల వ్యామోహాల్ని వదిలి, బంధాల మాయనుంచి బయటపడి, వర్తమానంలో జీవించడం తెలిసినవారికి,‘మరణభయం’
తృణప్రాయం..... 🌹🌴🌴🌹
💓💚
        
మీ ప్రశాంతత,మీ కలవరం మీరు సృజించు కుంటున్నదే. మీ సమయమనం, మీ పిచ్చి మీరు సృజించుకుంటున్నదే. మీ సంతోషం,
దుఃఖం మీరు చేసుకుంటున్నదే. మీలో ఉన్న దైవం లేదా దయ్యం కూడా మీరు చేసుకుం టున్నదే. ఏదో కాకతాళీయంగా కొన్ని విష
యాలు జరగొచ్చు.కానీ మీరు ఇలా అవకా శం కోసం ఎదురుచూస్తుంటే,మీరుసమాధికి వెళ్ళే వరకుమీకుమంచివిషయాలుజరగవు.
ఎందుకంటే వాటంతట అవి జరగాలంటే, అంత సమయం తీసుకుంటాయి మరి.
*దురదృష్టవశాత్తు ,సరైన పరిస్థితులు కల గాలని,ఇంకా ఎదోజరగాలనిఎదురుచూస్తూ, మీరు మీ శక్త్యానుసారం, మీ సామర్థ్యన్ని
ఉపయోగించి,మీ అంతర్ముఖంలోనూ, బహి ర్ముఖం లోనూ మీకు కావలసినది సృజించు కోవడం మానేస్తు న్నారు.
*తెల్లా రింది మొదలు సాయంత్రంవరకు ఒక రోజుని మీరుఎలా అనుభూతి చెందారన్నది పూర్తిగా మీరే చేసుకుంటున్నారు.మీకు 
ప్రజ లతో ఎంత ఘర్షణ ఏర్పడిందన్న విషయం మీరు పరిస్థితులను ఇంకా వారి పరిమితు లను అర్థం చేసుకోవడంలో ఎంత విఫలమ
య్యారన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇది కచ్చి తంగా మీరు అదృష్తం కోసం ధరించే జాతి రాళ్ళ మీద ఆధారపడి ఉండదు. ఇది మీరు
ఎంత సున్నితత్వంతో,ఇంగితంతో,తెలివితో ఎరుకతో మీ చుట్టూరా ఉన్న జీవాన్ని గమ నిస్తూ నడుచుకుంటున్నారనే దాని మీద
ఆధారపడి ఉంటుంది.
*మీకు ఎంతో గొప్ప విషయాలు జరుగుతు న్నా, అవి మీకు ఎందుకుజరుగుతున్నాయో అర్థం కావట్లేదంటే మీరు ఎప్పటిదో
వండుకు న్న ఆహారాన్ని ఇప్పుడు తింటున్నట్లే.
*ఒక రోజున ఒక విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తు లు కలిసారు.ఒకతను ఎంతోనిస్పృహ తో ఉన్నట్లు కనిపిస్తు న్నాడు. మరొకతను, “
మీరు ఎందుకిలా ఉన్నారు? ఏం జరిగింది?” అని అడిగాడు.దానికి మొదటి వ్యక్తి,“నన్ను ఏం చెప్పమంటారు..?నా మొదటి భార్య
క్యాన్సర్ తో మరణించింది.రెండో భార్య పక్కింటి వాడితో లేచిపోయింది.నా కొడుకు జైల్లో ఉన్నాడు,ఎందుకంటే నా మీద హత్యా
ప్రయత్నం చేశాడు.నా పద్నాలుగేళ్లకూతురు గర్భవతి.మా ఇంటి మీద పిడుగు పడింది.
విషయం ఏమిటంటే,మీరుఒకవిధంగాఉంటే కొన్ని పరిస్థితులు మీ పట్ల ఆకర్షితమవుతా యి.మీరు మరో విధంగా ఉంటే, మీ చుట్టూ
జరిగే విషయాలు మరో విధంగా ఉంటాయి. అక్కడొక పూల పొద,ఒకముళ్ళ పొద ఉన్నా యనుకోండి,*తేనెటీగలన్ని పూలవైపుకి
వెళ్తా యి.దీనర్థం పూలపొద అదృష్టవంతురా లని కాదు,దాని సువాసన అటువంటిది. అది ఆకర్షిస్తోందని కనపడకకపోవచ్చు,కాని
ఆకర్షిస్తోంది.ప్రజలు ముళ్ళపొద వైపుకి వెళ్ల డానికి ఇష్టపడరు,ఎందుకంటే అది మరోవిధ మైన పరిస్థితిని సృష్టిస్తోంది
కాబట్టి.ఈరెండు కూడా అవి సృజించే దాన్ని ఎరుక లేకుండా నే చేస్తూ ఉండి ఉండొచ్చు కానీ చుట్టూతా జరిగేవి ఎలాజరగాలో ఆ
విధంగానే జరుగు తాయి.
*మీకు ఎంతో గొప్ప విషయాలు జరుగుతు న్నా, అవి మీకు ఎందుకుజరుగుతున్నాయో అర్థం కావట్లేదంటే మీరు ఎప్పటిదో
వండుకు న్న ఆహారాన్ని ఇప్పుడు తింటున్నట్లే.అది మీరు ఎప్పుడో ఎక్కడో చాలా కాలం క్రితం చేసుకున్నది.దాన్ని మీరు ఇంకా
అనుభవి స్తూనే ఉన్నారు.కానీ అది రోజురోజుకి పాచి పోతుందని తెలుసుకోవాలి.మీకు కొన్ని విష యాలు జరుగుతున్నప్పుడు అవి
ఎందుకలా జరుగుతున్నాయో మీకు తెలుస్తుంటే, దాని అర్థం మీరు స్పృహతో ఆహారాన్ని ఈరోజున వండారన్నమాట.,విషయాలు
జరుగుతూ, అవి ఎందుకు జరుగుతున్నాయో మీకు తెలి యకపోతే, మళ్ళీ మీరు అలా పాచిపోయిన ఆహారాన్నే తింటున్నారని
అర్థం.
*అదృష్టం -  మీరు చూడలేనిది*
*భారత ప్రాంతీయ భాషల్లో అదృష్టం అంటే ఏంటో చూద్దాం. దృష్టి అంటే మనం.. చూడగలిగింది.అదృష్టం అంటే మనం చూడ
లేనిది; మీరు చూడలేకపోతున్నారనమాట. మీరు చూడగలిగితే ఏది ఎందుకు జరుగు తోందో మీకు తెలుస్తుంది కదా, మీరు చూడ
లేనప్పుడే జరుగుతున్న విషయాలు యాదృ చ్చికంగా జరుగుతున్నట్టు మీ కనిపిస్తుంది. అప్పుడు మీరు అది అదృష్టమనో దురదృ
ష్టమనో అనుకుంటారు.
*ఆధ్యాత్మికత అంటే మీరు మీ జీవితాన్ని పూర్తిగా మీ చేతుల్లోకి తీసుకోవటమే.
*ఆధ్యాత్మికత అంటే మీరు మీ జీవితాన్ని పూర్తిగా మీ చేతుల్లోకి తీసుకోవటమే.అలా మీ జీవితాన్ని పూర్తిగా మీ చేతుల్లోకి తీసు
కున్నప్పుడు మాత్రమే,మీరు పూర్తిస్థా యిలో ఎరుక ఉన్న జీవం అవుతారు ఇంకా మీలో దైవత్వం కూడా ఉదయిస్తుంది.
*మీ జీవితాన్ని మీరు స్పృహతో చూడవల సిన సమయం.మీరు అదృష్టం మీద, నక్షత్రా లు లేదా గ్రహాల మీద ఆధారపడకండి; ఇవ
న్నీ జీవం లేని వస్తు వులు.మానవ నైజం ప్రాణంలేనివిషయాల తలరాతనురాయాలా లేదా ప్రాణంలేని వస్తు వులు మానవ నైజాన్ని
నిర్ణయించాలా..? ఏవిధంగా ఉండాలి...? మానవ నైజం ప్రాణంలేని వాటికి ఏం జరగా లన్నది నిర్ణయించాలి కానీ ఒక నక్షత్రం మీ
భవిష్యత్తు ని నిర్ణయిస్తుంది అంటే లేదా ఒక ప్రాణంలేని వస్తు వు మీ తలరాతను నిర్ణయిం చడం ఏంటి?.ఇలాంటివి మిమ్మల్ని ప్రభావి
తం చేసేందుకు మీరు అనుమతినివ్వకండి. ఎందుకంటే ఇలా చేస్తే మీజీవితం ఎంతో పరి మితంగా మారిపోతుంది.మీరు ఒక
చట్రంలో ఉండిపోతారు, దాన్ని దాటి ముందుకు వెళ్ళ లేరు. ఇది మీ ఎదుగుదలను మీ అవకాశా లను తగ్గించి వేస్తుంది.
*మీకు ప్రజలతో ఎంతఘర్షణ ఏర్పడిందన్న విషయం మీరు పరిస్థితులను ఇంకా వారి పరిమితులను అర్థం చేసుకోవడంలో ఎంత
విఫలమయ్యారన్న దాన్ని బట్టి ఉంటుంది.
*ఏదో కాకతాళీయంగా కొన్ని విషయాలు జరగొచ్చు. కానీ మీరు ఇలా అవకాశం కోసం ఎదురుచూస్తుంటే,మీరు సమాధికివెళ్ళే వర
కు మీకుమంచివిషయాలను జరగవు.ఎందు కంటే వాటంతట అవి జరగాలంటే, అంత  సమయం తీసుకుంటాయి మరి.
*కాబట్టి మీరు యాదృచ్చికంగా జీవిస్తేమీరు భయాందోళనల్లో కూడా జీవిస్తా రు. మీరు మీ శక్తి సామర్థ్యాలతో జీవిస్తే, బయిట ఏం
జరిగినా జరగకపోయినా,కనీసం మీలోజరు గుతున్నది మీ అదుపులో ఉంటుంది. ఇది మరింత స్థిరమైన జీవితం.
         💓💚💙 ♥️
*ప్రజలందరూ ధర్మాన్ని రక్షణ కవచంగా ధరించాలి. ప్రజలందరిని ధర్మం ధరిస్తుంది. ఏది సంఘాన్ని కట్టు బాటులో నిలుపుతుందో
అదే ధర్మం. ధర్మ మార్గంలో నడిచిన వాడికి సుఖశాంతులు,శాశ్వతకీర్తి,పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి.‘ధర్మమే సర్వ జగత్తు కూ ఆధా
రం’ అని, నారాయణోపనిషత్తు చెబుతోంది. ధర్మం కంటే బలమైనది ఈ సృష్టిలో మరేదీ లేదని.. ధర్మాన్ని అనుసరించే బలహీనుడు
రాజుకన్నా బలవంతుడని బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతోంది.అట్టి ధర్మాన్ని విస్మ రిస్తే జరిగేది పతనమే.
*చాలాకాలం క్రితమే మన పూర్వీకులు మనిషి చావు, పుట్టు కలగురించి,మరణానం తర పరిణామాల్ని గురించి ప్రశ్నించుకొని
సమాధానాల్ని వెతుక్కునేప్రయత్నంచేశారు. అనేక మంది ఋషులు,మునులు,జ్ఞానులు నిరంతరం సత్యాన్వేషణకై తపస్సు చేశారు.
వాళ్లు తపస్సమాధిలో ఉన్నప్పుడు అత్యు న్నత సత్యాన్ని,ధర్మాన్ని వేదం రూపంలో తెలుసుకున్నారు.తపస్సమాధిలో ఉండగా వాళ్లకు
లభించిన జ్ఞానాన్ని వేదాలుగా వ్యవ హరిస్తు న్నాం.వేదం అంటే జ్ఞానం అని అర్థం. వాళ్లకు అవి పరమాత్ముడి వాణిగా వినిపిం చాయి
కాబట్టి వాటిని శ్రు తులు అన్నారు.
*వేదాల ద్వారా లభించిన జ్ఞానంతో మన ఋషులు ఎంతో కృషి చేసి కొన్ని శాశ్వత సిద్ధాంతాలు ప్రతిపాదించారు.వారు ప్రతిపా దించిన
సిద్ధాంతాలు విశ్వమంతటికీ అన్ని యుగాల్లోనూ వర్తిస్తా యి.మానవులు ఏయే దశలలో ఎటువంటి నియమాలు పాటించా లి?
కుటుంబం,సమాజం,ప్రకృతి, దేశం పట్ల ఎవరి బాధ్యత ఏమిటి?.తదితర విషయాల గురించి అన్ని విధాలా ఆలోచించి..
*ఎలా వ్యవహరిస్తే ధర్మం నిలబడుతుందో ఆ విధంగా మార్గదర్శనం చేయగలిగిన అద్భుత జీవన విధానాన్ని మన ఋషులు,
మునులు రూపొందించారు. సమస్త జగత్తు నూ క్షేమంగా ఉంచగల ఈ శాశ్వత సూత్రాలే ధర్మానికి ఆధారంగా నిలిచాయి.
*మానవులందరికీ శుభం చేకూర్చగల శక్తి ధర్మానికి ఉంది గనుక దీన్ని మానవ ధర్మం అన్నారు. శాశ్వత సిద్ధాంతాల మీద ఆధార పడి
ఉంది గనుక దీన్ని సనాతనధర్మం అన్నారు.అనాదిగా ఉన్న చైతన్యాన్ని దేవు డని, సనాతనుడనీ పిలుచుకున్నారు. కాబ ట్టి దీన్ని దైవ
ధర్మమని, సనాతన ధర్మమని అన్నారు. ఋషులు మనకు అందించింది కాబట్టి దీన్ని ఆర్ష ధర్మం అని కూడాఅన్నారు. అదే విధంగా
మనదేశాన్ని హిందూదేశం అని పిలవడంవల్ల మనంఅనుసరించే ఈధర్మాన్ని హిందూ ధర్మం అన్నారు.మానవజీవితానికి పరమ
ప్రయోజనమైన మోక్షం.. కేవలం ధర్మంతోనే సాధ్యం.
*ధర్మబద్ధమైన ఆర్జన (అర్థం), ధర్మబద్ధమైన కామంతోనే మనిషి నాలుగో పురుషార్థమైన మోక్షాన్ని సాధించగలడు.అందుకే మన
పెద్దలు చతుర్విధ పురుషార్థా ల్లో ధర్మాన్ని ముందుపెట్టా రు.సంపాదన అయినా, కోరిక లైనా ధర్మాన్ని అనుసరించి ఉండాలని దీని
అర్థం. అటువంటి ధర్మాన్ని పాటించి..
మానవ జన్మను సార్థకం చేసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః*
💚💙
          ♥️
*"మన మనసుచేసే సంకల్పాన్ని విగ్రహంగా వున్న దైవం ఏ విధంగా తీరుస్తుంది ?".
*భక్తితో మనంచేసే సంకల్పాలు ఆ విగ్రహం లో (మనలోకూడా) చైతన్యస్థా యిని తాకు తాయి ! కాబట్టి అక్కడ భగవత్-శక్తి వలన
పనులు జరుగుతాయి. నాస్తికుడు తాను దేహం అనుకోవటంచేత ఆ భావన గానీ, అనుభూతిగానీ ఉండదు.దైవం కేవలం చేత నలేని
సత్యవస్తు వే అయితే మన ప్రార్థనకు ప్రయోజనం ఉండదు. కలుషిత మనసుతో మనం అనుకున్న పనులు కావటం లేదు. కానీ ఆ
చైతన్యానికి ఏకరువు పెడితే ఎలా అవుతున్నాయి !?ఎలాగంటే మనం వంద సార్లు అనుకున్నా కానిపనులు పెద్ద అధికా రి ఒకసారి
అనుకుంటే అవుతున్నాయి...... అలాగే మనం భగవంతుని విగ్రహం ముందు మన కోర్కెలను తెలుపుతాం.ఆ భక్తి, విశ్వా సాలతోనే
పనులు, కోరికలు తీరిపోతాయి...
💙
     ♥️
మన జీవితం నుండి బలహీనతలను పార ద్రోలాలి.మనల్ని మనం దుర్భేద్యమైన కోట గా మలుచుకోగలగాలి. మనలో పవిత్ర ఆలో
చనలు,సరియైన విలువలు ఉంటేజీవితంలో ఎన్ని ఒడిదొడుకులెదురైనా చెదిరి పోకుండా ఎదుర్కొనగలం. మన స్థా యిని దిగజార్చు
కుంటే మనకు మనం అపకారం చేసుకున్న వారమవుతాం.మన ప్రవర్తనా నియమావళి లో స్థిరత్వం ఉంటే ప్రపంచంలో ఏం జరిగినా
చలించం.భగవత్ప్ర కాశాన్ని ఆధారంచేసు కుని నడవగలిగితే అంధకారం గోచరించదు.
💙
               ♥️ ♥️
గృహస్థు డు భార్య,బిడ్డలయందు అంతర్యా మిని చూచి కర్తవ్యనిర్వహణం చేయవలెను. అట్లు గాక చూచినచో వారు తోడేళ్ళై తనను
మేకపోతును వలె భక్షింతురు. (వ్యామోహ పడిన వానిని చూచి భార్యయైనను, కొడుకై నను అవకాశము తీసుకొని ఏడిపింతురు.
వారిలో అంతర్యామిని చూచినచో వారు గూడ తగిన మార్గముననే ప్రవర్తింతురు).
చెట్లు పుట్టలు గుట్టలు మున్నగు వానితో నిండియున్న అరణ్యము వంటి సంసారము అభిమానములు,మమకారములు,రాగద్వే
షములతో నిండిఉన్నది.అందు చరించుచు న్న నరులు ఒకరికి ఒకరు దుర్జనులై కందిరీ గల తుట్టెలవలె అడ్డగించి అపకారములు
చేసికొనుచుందురు. దానితో కష్ట పరంపరల పాలగుచుందురు.
ఆకాశమున మబ్బులుఉన్నపుడు వానివంక తదేక దృష్టితో చూచినచో అనేక ఆకారము లు కనిపించును. సౌధములు గోపురములు
మున్నగు వానితో నగరములు కోటలు ఉన్న ట్లు కనిపించును.వానినిచూచుచున్నప్పుడు మబ్బుల ఆకారములే అని
జ్ఞప్తియుండును కనుక వింత పడుచు వినోదము చూచుటకు వీలగును.అట్లే యీ సృష్టిలోని ఆకారముల ను భార్యా పుత్రాదులను
గూడా చూచుచు వింతపడి వినోదించుచు కర్తవ్యము నెరవే ర్చుచు జీవించువాడేతెలివైనవాడు.పరధ్యా నమున ఉండి అడవిలో
రాత్రిపూట కొరవి దయ్యమును చూచి ఒకడు నిప్పువెలిగించు కొనుటకు వెంటబడెనట! వానికి ఎంతనిప్పు దొరుకునో
అంతఫలమే,డబ్బు గోరిసంపన్ను లైన వారి చుట్టు ను తీరుబడి లేక తిరుగు చున్న వారికిని లభించును....
💙
       ♥️ ♥️                 
*నిజాయితీగా ఎవరితో ఉండాలి..?
నిన్ను నమ్ముకున్నవారి పట్ల..అలాగే నువ్వు నమ్ము కున్నవారి పట్ల,నిజాయితీగాఉండు..
వారితో నిజాయితీతో వ్యవహరించు..
*నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకో..,
ఎవరితో ఉండాలి.?,ఎవరితో నడవాలిఅని..
ఆ అవకాశం ఎదుటివారికీ ఇవ్వకు.
*ఒక అబద్ధా న్ని పది సార్లు పది కోణాల్లో చూపెడుతూ,దాన్నే నిజమని భ్రమింపజేసే,
మూర్ఖులతో వాదన అనవసరం..వివరణ ఇచ్చుకోవడం అంతకన్నా అనవసరం...
అటువంటి మానసికస్థితి (సైకో)ఉన్నవారికీ,
ఎంతదూరంలో ఉంటే అంత మంచిది..
*నీముందు మొరిగేవాటిని,నీవెనకాల మొరి గే వాటిని అస్సలుపట్టించుకోకు..నీకునువ్వు గా నీ పని చేసుకుంటూ
పోతుండు..మొరిగే వాటి గురించి పట్టించుకుంటే నువ్వు అక్కడే ఆగిపోతావ్...మొరిగేవి మొరుగుతూనే ఉంటాయి,వాటి పని 
మొరగడమే...
*ప్రతిమనిషి కొన్నిఅలవాట్లకు బానిస అయి నట్టు ,ప్రతి మనసు కొన్నిమనసులకు బానిస అవుతుంది.!ఆ మనసు దూరంగా ఉన్నా.!
కనిపించకపోయినా.!,మాట్లా డకపోయినా.!
ఆ మనసు లోలోనే వేదనచెందుతుంటుంది.
*ఎత్తైన పర్వతాలను ఎక్కేందుకు... కొంచెం వంగి ఎలా నడుస్తా మో,ఉన్నత లక్ష్యాలను సాదించేందుకు కొంత అణుకువతోమెలగాలి
బతకడానికి తినాలి తప్ప.,తినడానికే బత క్కూడదు..
*బుద్దిహీనుడై న స్నేహితుడి కన్నా .బుద్ది మంతుడై నా శత్రు వు మేలు.
*ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించి చూడాలం టే అతనికి అదికారం ఇచ్చి చూడాలి.
*మనసులో మాలిన్యం పెట్టు కునిపైకిమాత్రం తీయగా మాటలాడటంవల్ల మనిషికి ఎంత మాత్రమూ మేలుకలుగదు.అది మంచి నడ
వడి అనిపించుకోదు.మంచి నడవడియే మనిషికి విలువను కలిగిస్తుంది.అది లేక పోతే మనిషి చెల్లని డబ్బువలె విలువను
కోల్పోతాడు.ఇది ముమ్మాటికి సత్యము.
*మనకు కొన్ని పరిచయాలుమొదట్లో ఎంత సంతోషపెడుతాయో చివరికి అంతే బాధ పెడతాయి..మన వల్ల ఎవరు బాధ పడినా, మీ
జీవితాల్లోకి వచ్చిమిమ్ముల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి.ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోదాం....
*మీరు కంటితో చూడని, మీ చెవితో వినని వాటిని నమ్మొద్దు వాటినిఇతరులతో అస్స లు పంచుకోవద్దు ,. ఎందుకంటే అసూయా
పరులు చెప్పే అబద్దా ల వలన అనుబంధా లు చచ్చిపోతాయి..
  నీ నీడనుచూసి నీ బలం అనుకుంటే పొర పాటే,ఎందుకంటే నీడ కూడా వెలుగునుబట్టే తన తీరును మారుస్తుంది .మనుషులు
కూడా అంతే అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరుమారుస్తా రు .
    మన మానవ జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దు కోవడానికి కావాల్సిన ఒకే ఒక ఆయుధం ఆలోచన,.ఆలోచనలు మంచివైతే నీ
పయనం మంచివైపు,.ఆలోచనలు చెడు వైతే నీ దారి చెడువైపు...
*వృత్యర్థం నాతిచేష్టేత....*
వృత్తికొరకు అనగా పొట్టకూటికి అతిగా ఆశ పడవద్దు .అది దైవనిర్మితమై ఉండనేఉన్నది. జీవి గర్భమున పడగానే తల్లి స్తనములు
పాలతో నింపబడటం లేదా?....
*“మనకు రెండు రకాల విద్య అవసరం ఒకటి జీవనోపాధి ఎలాకల్పించుకోవాలో నేర్పేది రెండవది ఎలా జీవించాలో నేర్పేది.
మంచి మనిషితో స్నేహం చేయి.కానీ దూరం చేసుకోకు.స్వార్ధపరుణ్ణి దూరంచేసుకో,.కానీ శత్రు వుగా
మార్చుకోకు.ఆలోచనవెనుకడుగు వేసినపుడు..ఆవేశం ముందుకు తోసుకు వస్తుంది..
మన మనోస్థితిని బట్టి,దృక్పథాన్ని బట్టి,జీవి తం మంచిదిగాకానీ, చెడ్డదిగాకానీ, కనిపి స్తుంది. అగ్ని స్వతః సిద్ధంగా మంచిదీ కాదు.
చెడ్డది కాదు. ఎందుకంటే చలి కాచుకున్న పుడు అగ్ని మంచిది అంటాం.అదే అగ్ని వల్ల చేతులు కాలితే చెడ్డది అంటాం.
పడి లేచి నడిచింది ఎవరు ? 
పడకుండా నిలిచింది ఎవరు ?
ప్రయత్నించి గెలిచింది ఎవరు ?
ఆ ప్రయత్నంలో నీ తోడుంది ఎవరు ?
గెలిచాక నిన్ను పొగడంది ఎవరు ?
నేను ఉన్న అని నీ భుజంతట్టేవారు ఎవరు?
ఇలా జీవితం అనే ప్రయాణంలో ఆఖరి మజిలీ వచ్చేవరకు...నీకు తోడు వుండలసిం ది నువ్వు ఒక్కడివే.
ఈ రోజుల్లో ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది.మనకు నచ్చింది ఇంకొకరికి నచ్చ కపోవచ్చు.ఇంకొకరికి నచ్చింది మనకు
నచ్చ  క పోవచ్చు.ఈ చిరుభేదాభిప్రాయాలే,మను షుల మధ్య దూరాన్ని పెంచుతాయి.
*విషయం మీద విమర్శలు,విశ్లేణలు,చేయొ చ్చు. కానీ వ్యక్తు లు మీద కాదు.వ్యక్తు లపై కేంద్రికరించడం అనేది అహంకార లక్షణమే.
సరైన మనిషి మనకు చేరువ అయ్యేలోపు...
పది మంది పనికిరాని వారిని,మాయ పరిచ యం చేస్తుంది. మనం మొదటివ్యక్తి దగ్గర ఆగిపోతే... మనం కూడా వాళ్లలా పనికిరాని
వారిగా అయిపోతాం.
వ్యామోహ మమకారాలు తగ్గించుకుంటున్న కొద్దీ, మానవుడు సుగుణాలు పెంచుకోగలు గుతాడు.అప్పుడే ఏ కంటకాలూలేని
చక్కటి బాట ఏర్పడుతుంది.
*అడ్డంకులకు కుంగిపోతేనే అపజయం.
వాటిని అనుభవాలుగా మలచుకోగలిగితే విజయం తప్పక వరిస్తుంది...            
*సహజంగా మనసు ప్రశాంతంగా ఉండదు. దాన్ని మనమే సరిచేసుకుంటూ ఉండాలి. లేకపోతే చిక్కులుపడిన తాడులాఉంటుంది.
అర్థం కాని సమస్యలా ప్రతీసారి మన ముందుకు వచ్చి నిలబడుతుంది.
*ఎందుకిలా జరుగుతుంది? మనసుతో ఈ ఇబ్బంది ఏమిటి? చాలాసార్లు ,చాలామందికి అనిపిస్తుంది. మనసుతో ఇలాంటి గొడవ
ఏదో ఒక రోజు రావాలి.అదే నాంది- మనసు ను శోధించడానికి.మనసును సాధించడానికి దాని సంగతి తేల్చుకోవడానికి.
*మనిషికి చాలా సంతోషకరమైన,మేధాపర మైన ఆట ఏది అంటే, మనసుతో నిత్యం ఆడేదేే! మనసుతో ఆడాలి.మనసును పరు
గెత్తించాలి. మనల్ని మనసు పరుగెత్తిస్తుంటే ఆపాలి. మనసుకు ఎదురుతిరగాలి....
*మనసుభయపెడుతుంది.బాధపెడుతుంది. విసిగిస్తుంది. చివరకు కాళ్లబేరానికి వచ్చి బుజ్జగించి,లాలిస్తుంది.రాయిలా మనం కద
లక మెదలక ఉంటే, చివరకు దండం పెడు తుంది- వశమైన మనసే దండం పెట్టేది.!.
*మనసు లేని మనిషి గడ్డకట్టిన సరస్సు లాగా ఉంటాడు.శీతోష్ణ, సుఖ, దుఃఖాలను సమంగా చూస్తా డు...
*ఇలాంటి ప్రశాంతమైన మనసు కలిగిన మనిషే శక్తికి పుట్టినిల్లు అవుతాడు.శక్తి కావా లంటే నిరంతరం ఆలోచనలతో సతమతమ
య్యే మనసును భారంగామొయ్యడంకాదు. ఆలోచనలను నియంత్రించుకుని, సృజనా త్మక భావాల మీద ఏకాగ్రత నిలిపితే అస లైన
శక్తి పుడుతుంది.
*ఆ శక్తి అపారం. దాన్ని అందుకోగలిగిన నాడు, లోకంలో దేన్నయినా సాధించగలం. మనోవిజయమే లోక విజయం.
*ప్రశాంతమైన మనసే అద్భుతాలు సృష్టించ గలదు.ఆలోచనలు తగ్గుతున్న కొలదీ సృజ నాత్మకత పెరుగుతుంది. వందలు,వేల కొద్దీ
క్రమం లేని ఆలోచనలు మనసులోని శక్తిని తగ్గించేస్తా యి. ఒక మంచి, గొప్ప ఆలోచన దివ్య మార్గంలో నడిపిస్తుంది.
*హృదయం మనసుకు అనుసంధానమైన ప్పుడు పుట్టే ప్రతి ఆలోచనా గొప్పది అవు తుంది. హృదయం కలగజేసుకోవాలంటే
మనసు ప్రశాంతంగా ఉండాలి.మనసు ప్రశాంతంగా ఉండాలంటే క్రమబద్ధమైన,శక్తి మంతమైన ఉపయోగకరమైన ఆలోచనలు
చెయ్యాలి..
*ఆలోచనలకు ముందు ధ్యానం చెయ్యాలి. ఆలోచించిన తరవాత ధ్యానం చెయ్యాలి. మరిన్ని మంచి ఆలోచనల కోసం ఆలోచనల
తీరుతెన్నులు తెలుసుకోవాలి. ఆలోచనలకు స్థా వరమైన మనసును ముఖాముఖీ ఎదు ర్కోవాలి. అవసరమైతే పక్కకు తప్పుకొని
మనసుకు సాక్షిగా నిలబడిఉండాలి.ఇదంతా సాధన వల్లనే సాధ్యపడుతుంది.
*మనసుతో వ్యాయామం చెయ్యని మనిషి సాధనలో పరిణతి చెందలేడు. మనసుకు అతీతంగా వెళ్లని మనిషి ఆధ్యాత్మిక రహ
స్యాలు అందిపుచ్చుకోలేడు...
*మనసు మనకు మంచి మిత్రు డు.దారుణ మైన శత్రు వు కూడా.ఉపయోగించు కోవడం లో అంతా ఉంది..
*మనసు గాలిలో దీపంలా ఉంది. దీన్నెలా వశం చేసుకోవాలని దీనంగా ప్రార్థించాడు అర్జు నుడు. అప్పుడు పరమాత్మ చెప్పాడు-
*‘నిస్సందేహంగా మనసు చంచలమైనది. దాన్ని వశపరచుకుందాం...
💘💘🧡💘💘
    
*‘మోక్షం’అందుకోవడంచాలాకష్టం.అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని నియంత్రించడం సాధ్యమే.మనసు వశం చేసుకున్న ప్రయత్న
పరుడై న మనిషికి సాధనద్వారా సహజంగా యోగ సిద్ధి పొందడం సాధ్యమే’.....
టే ‘విడుదల’.సంసారబంధం నుంచి విముక్తి కావడం. స్వస్వరూప జ్ఞానాన్ని పొంది ‘సచ్చి దానంద’ స్థితినిచేరడం.మోక్షాన్ని
పొందడం మానవజన్మలోనే సాధ్యం.ఇంద్రాది దేవతలు కూడా మోక్షాన్ని పొందడానికి మానవజన్మనే కోరుకుంటారని ప్రతీతి.ఎన్నో
జన్మల పుణ్య విశేషంతోనే మానవజన్మలభిస్తుంది.ఈ జన్మ సిద్ధించినా కూడా ‘పరమాత్మ’ను గురించి చెప్పగల ‘సత్పురుషులు’
మనకు దొరకాలి. వారులభించినా ‘జ్ఞానం’ సమకూరాలి. ‘ఆత్మజ్ఞానం’ ఏర్పడినా కూడా ‘మోక్షాన్ని పొందాలన్న’ ప్రబలమైన కోరిక
మనకు కల గాలి. ‘ఇవన్నీ అత్యంతదుర్లభమైనవే.కేవలం దైవానుగ్రహంతోనే కలుగుతాయని’శాస్ర్తా లు చెబుతున్నాయి.
*దుర్లభం త్రయమే వైతద్దెవానుగ్రహ హేతుకమ్‌*

*మనుష్యత్వం ముముక్షుత్వం మహా పురుష సంశ్రయః ॥


‘ *దుర్లభమైన మానవజన్మను పొంది కూడా ప్రధాన పురుషార్థమైన మోక్షాన్ని పొందడాని కి ప్రయత్నించకపోతే తనకుతానే హాని
చేసు కున్నట్లు అవుతుంది’అన్నది పై శ్లోక సారాం శం. ఉత్తమ మానవజన్మను పొందాక మోక్ష సాధనకు అవసరమైన ‘తత్తజ్ఞానం’
కోసం ప్రయత్నించాలి.ఈ జ్ఞానం(బ్రహ్మ విద్య) పొందడానికి శాస్ర్తా లు నాలుగు సాధనాలను పేర్కొన్నాయి.అవి: నిత్యానిత్య
వస్తు వివేకం, ఇహముత్ర ఫలభోగ విరాగం,శమాది షట్క సంపత్తి, మోక్షాపేక్ష. ప్రతి సాధకుడు మొదట ‘నిత్యానిత్య
వస్తు వివేకాన్ని’పొందాలి.అంటే, ‘ఏది శాశ్వతం,ఏది అశాశ్వతమో’తెలుసుకో వాలి. ప్రపంచంలోని భోగాలు,శరీరం,సంపద లూ
అన్నీనశించిపోయేవే.ఇవేవీ శాశ్వతం కావు. ఇదిస్పష్టంగా అవగాహనలోకి వచ్చాకే వాటి పట్ల ‘వ్యామోహం’ పోతుంది.
‘ *ఇహముత్ర ఫలభోగ విరాగం’ అంటే.,‘ఈ లోక,పరలోకాల భోగాలపట్లా వైరాగ్యం’ఏర్ప రచుకోవాలి.సాధారణంగా మానవులంతా
ఇహలోక సుఖాలతో పాటు మరణానంతర స్వర్గసుఖాలనూ కోరుకుంటారు.కానీ, ఈ లోకంలోని సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే.
స్వర్గాది సుఖాలుకూడాశాశ్వతమైనవి కావు. పుణ్యకర్మలవల్లస్వర్గాదిసుఖాలులభించినా, ‘క్షీణే పుణ్యే మర్త్యలోకం ప్రవిశంతి’.అంటే..
‘పుణ్యం క్షీణించగానే మరల భూలోకంలో జన్మించవలసిందే’.అందువల్ల,ఈ అన్నిభోగా ల పట్లా వైరాగ్యం ఏర్పరచుకోవాలి.
*మూడవదైన ‘శమాది షట్క సంపత్తి’ అంటే.. ‘శమం,దమం,ఉపరతి,తితిక్ష,శ్రద్ధ, సమాధానం’ అనే ఆరు గుణాలు.‘మనసు,
బుద్ధి,అహంకారం,చిత్తం..ఈ నాలుగు అంత రింద్రియాల నిగ్రహమే ‘శమం’.అనవసర విషయాల్లోకి ప్రవేశించకుండా వీటిని వశంలో
ఉంచుకోవాలి. ఐదు బాహ్య జ్ఞానేంద్రియాల (చర్మం, కళ్లు , ముక్కు, చెవులు, నాలుక)తో సహా ఐదు కర్మేంద్రియాల (నోరు, చేతులు,
కాళ్లు ,జననేంద్రియాలు,గుదం) నియంత్రణనే ‘దమం’అంటారు.వీటిని వాటి విషయాల పట్ల ఇష్టం వచ్చినట్లు గా ప్రవర్తించకుండా
నియంత్రించుకోగలగాలి. చంచలమైన ఇంద్రి యాలను విషయాల నుంచి మళ్లించి,లక్ష్యం లో నిలపడం ‘ఉపరతి’.అంటే, మనసును
నిశ్చలం చేయడం.‘ఆకలి-దప్పిక,చలి-వేడి, గౌరవం-అవమానం’ వంటి ద్వంద్వాలను సహించడం ‘తితిక్ష’.శాస్త్ర విషయాలు,గురు
వులు, సాధువుల బోధనల పట్ల నమ్మకం, నిశ్చయబుద్ధిని కలిగి ఉండటం ‘శ్రద్ధ’. ‘శ్రద్ధా వాన్‌లభతే జ్ఞానమ్‌'. ‘శ్రద్ధ గలవాడే జ్ఞానం
పొందుతాడు’.ఏకాగ్ర లక్ష్యంతో చిత్తా న్ని సర్వకాల సర్వావస్థలలో పరమాత్మ పట్లే నిలిపి ఉంచడమే ఆఖరిదైన ‘సమాధానం’. ఈ
ఆరింటిసాధన మానవుణ్ణి ‘మహామనిషి' గా మారుస్తుంది.
*ఇక, నాలుగవదైన మోక్షాన్ని పొందాలన్న తీవ్రమైన కోరికే ‘ముముక్షుత్వం’.అంటే, సంసారబంధం నుంచి విముక్తి కావాలన్న వాంఛ.
ఈ నాలుగింటినీ సాధించినవాడే నిజమైన ‘సాధకుడు’.బ్రహ్మజ్ఞానాన్ని పొందే అధికారాన్ని అలాంటివారే సంపాదిస్తా రు. ‘జ్ఞానా
దేవతు కైవల్యమ్‌.జ్ఞానం వల్లనే కైవ ల్యం’ అనికదా ఆర్యోక్తి.ఈ నాలుగింటి సాధ నతోనే ‘ఆత్మజ్ఞానం’,తద్వారా ‘మోక్షం’ సిద్ధి
స్తా యన్న దానిని ప్రతి ఒక్కరూ గ్రహించి, ఆ దిశగా ప్రయత్నించాలి.
కాలం మన చేతిలో లేదు. కానీ! మనం చేసే పని మన చేతుల్లో, చేతల్లో ఉంటుంది.....
మన గురించి పదిమంది గొప్పగాచెప్పుకోవా లంటే ముందు మనంవందమందిగొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి.
💘💘❣️💘💘
      
మాట ఆగితే -మౌనం,మనస్సుఆగితే-జపం.
ఆడంబరం, నిరాడంబరం ఈ రెండింటి స్పృహ లేనివాడే నిజమైన నిరాడంబరుడు.
ఆత్మ పుట్టదు,గిట్టదు.కాబట్టిబంధమూలేదు, మోక్షమూ లేదు.అందువల్ల సాధన లేదు, సిద్ధి లేదు. దీనికే "అజాతవాదం" అని పేరు.
అహం వల్ల ఏర్పడే అందకారం చీకటి కంటే భయంకరంగా ఉంటుంది అందుకే అహంకా రాన్ని వీడి..వెలుగుదిశగా అడుగులువేద్దాం.
💖💘💘💘
        
సృష్టిలోని ఒకే జాతికి చెందిన జీవులన్నీ ఒకే రకమైన లక్షణాలు, అలవాట్లు కలిగి ఉంటాయి._
మనిషి తత్వం విచిత్రం.మనిషిముఖంచూసి సన్మార్గుడో,దుర్మార్గుడో నిర్ణయించడం కష్టం. ఒకే ఆకారంలో కనిపించినా మనుషుల
మధ్య గోముఖ వ్యాఘ్రాలుంటాయి.
జ్ఞానులు,అజ్ఞానులు,మంచివారు,చెడ్డవారు, శాకాహారులు-మాంసాహార్లు ,ధర్మవర్తనులు అధర్మ చింతనులు, అమాయకులు-
అహం కారులు,బుద్ధిమంతులు-బుద్ధిహీనులువంటి వైరుధ్య స్వభావులు కలిసి తిరగగలగడం మానవజాతి ప్రత్యేకత.
మనిషికి పైకి కనిపించే చేతులు,కాళ్లు వంటి అవయవాలు- కంటికి కనిపించని మనసు, బుద్ధి ఆదేశానుసారం పనిచేస్తా యి. మాట
నేర్చిన మనిషి మంచి మాటలు చెప్పగలడు. వితండవాదనా చేయగలడు. మనిషి తన భావనలతో ఏకీభవించినవారిని, మనసుకు
నచ్చినవారినిఆత్మీయులంటాడు.తనమాట కాదన్నవారిని శత్రు వులుగా భావిస్తా డు.
నమ్మించి మోసంచేయడం,ప్రేమించిద్వేషించ డం, అభిమానిస్తూనే అనుమానించడం, మాటలతో కవ్వించడం,ఆవేశంతో కక్ష కట్ట
డం మనిషి నేర్చిన కళ.
మనసు మాయకు లొంగిపోవడం మానవ బలహీనత. ప్రశాంతంగా జీవించగల శక్తియు తుడు అశాంతితో అలమటిస్తుంటాడు.
నిలకడ లేని మనస్తత్వం మనిషి తత్వం. మరుక్షణంలో జరగబోయేది తెలుసుకోలేని వాడు కాలాన్ని శాసించగలనన్న భ్రమలో
బతుకుతాడు.మంచిచెడుల విచక్షణ చేయ గలవాడు చెడుమార్గాన్ని అనుసరించడానికి ఉత్సాహపడతాడు. హానికరమని తెలిసీ
దుర్వ్యసనాలకు బానిసవుతాడు. స్వయం కృతాపరాధాలతో సతమతమవుతాడు. దుష్టు లు,దురాత్ములైనవారి సంఖ్య పరిమిత
మైనందుకే ఈ జగత్తు ఇంకా నిలిచి ఉందని లోకాభిప్రాయం.
యుద్ధ భయంతో నిద్రపట్టక అలమటిస్తు న్న ధృతరాష్ట్రు డికి సకల శాస్త్ర పండితుడు, నీతి కోవిదుడు, ధర్మవేత్త అయిన విదురుడే నీతి
సూత్రాలు బోధించాడు.
మానవ శరీరం ఒక రథం.దానికి ఆత్మ(బుద్ధి) సారథి. ఆ రథానికి అశ్వాలు ఇంద్రియాలు. జాగరూకతతో నిపుణుడై న ధీరుడు తనకు
వశమైన గుర్రాలతో మహారథికుడిలా సుఖం గా జీవన ప్రయాణం సాగిస్తా డని, శిక్షణ పొందని అదుపులోకి రాని గుర్రాలు మార్గ
మధ్యంలో సారథిని కూలదోసినట్లు ,అదుపు కాని ఇంద్రియాలు మానవుణ్ని నాశనం చేస్తా యని విదురుడు బోధించాడు.
మాట్లా డటంకన్నామౌనంమేలని,మాట్లా డితే సత్యం మాట్లా డటం రెట్టింపు మేలని, ఆ సత్యం ప్రియంగా పలకడం మూడు రెట్లు
మేలని, ఆ సత్యం, ప్రియం ధర్మంతో కలిసి ఉంటే నాలుగు రెట్లు మేలని విదురుడు ఉపదేశించాడు.
వ్యక్తికి శీలం (సత్ప్ర వర్తన) ముఖ్యం.శీలంతో ధర్మం తెలుస్తుంది.అసూయ లేనివాడు,ప్రజ్ఞ కలవాడు,సదా సత్కార్యాలు చేసేవాడు.
అందరికీ ఇష్టు డవుతాడని,ఉత్తమ పురుషు డు ఇతరులకు కీడుతలపెట్టక అందరిఅభ్యు న్నతిని
కోరుకుంటాడని,మానవుడుప్రయత్న పూర్వకంగా తన నడవడిని రక్షించుకోవాల న్న విదుర నీతిని అనుసరించి జీవన విధా నాన్ని
తీర్చిదిద్దు కునేవారు శాంతి సౌభాగ్యా లతో విలసిల్లు తారనడంలో సందేహం లేదు.
జ్ఞానుల బోధనలను విని అర్థం చేసుకున్నా ఆచరించకపోతే ఫలితం శూన్యం.....
సత్యం ,పవిత్రత ,నిస్వార్ధం-ఈ సుగుణాలు  ఎవరిలో విరాజిల్లు తాయో వారిని సృష్టిలోని  ఏ శక్తి ప్రతిఘటించలేదు ........
[2/22/21:-4:15 AM]  💘💘💘💘
*సత్యము ఎప్పుడూ మారదు.ధర్మం కాలా ను గుణంగా మారుతుంది.శరీరధర్మం పుట్ట డం వృద్ధి పొందడం,అంతరించడం.ఇవన్నీ
ఆయా కాలాలలో మార్పు చెంది నశిస్తా యి.
*మనకు కనిపించే దృశ్యమాన ప్రపంచం, నక్షత్రాలు,గ్రహాలు,కూడా పుట్టడం,వృద్ధిపొం దడం,లయం అవ్వడం. ఇలా నశించేవాటి
మీద దృష్టి పెట్టకుండా,నిత్యసత్యమైన పర బ్రహ్మంపై దృష్టి పెట్టినచో సమస్తం కోరకుండా నే పాదాల చెంతకు చేరుతుంది..
*జీవితంలోసుఖభోగాలు అనుభవిస్తు న్నంత కాలం పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే. సాధారణంగా ఆపద సమయాల్లో
మాత్రమేభగవంతుడుగుర్తు కొస్తా డు.మానవ జీవితం కష్టసుఖాల సంగమం.
*ఆపదల్లో ఉన్నప్పుడుకూడ,ఈశ్వరచింతన కలిగిఉండని వారున్నారీలోకంలో,అట్టివారు అజ్ఞానాంధకారంలో కొట్టు మిట్టా డుతూ
పశు తుల్యంగా జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి వారిని నాస్తికులనడమే సమంజస ము. వీరు ఎంత కష్టమొచ్చినా ఒక్క
క్షణమై నా భగవన్నామోచ్ఛరణ చేయరు. ‘‘జాతస్య మరణం ధృవమ్’’ అన్నారు.పుట్టినవాడు గిట్టక తప్పదు.ఈ భూమీద పడ్డ ప్రతి
జీవిని మృత్యువు కనిపెట్టు కునే ఉంటుంది. అందు చేత  కాలాన్ని వ్యర్థంగా గడపకుండా దైవ చింతన కలిగి ఉండటం ఎంతైనా
అవసరం.
*హృదయమే శక్తి కేంద్రం.హృదయం నుండి సహస్రారానికి  "అమృతనాడి" ఉంది. ఇది అజ్ఞానిలో మూతపడి ఉంటుంది. జ్ఞానిలో
తెరుచుకుని ఉంటుంది.ఇది తెరుచుకోవడ మే జ్ఞానం. ఇది తెరుచుకోవడమే మోక్షం... 💘💘💘💛❣💚❣💓
*ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పలేని, బుద్ది మంతుడి కంటే...అదే నిజాన్ని ధైర్యంగా చెప్పే, చెడ్డవాడే గొప్పవాడు..
*ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా,
బ్రతకడం అంత సులభంకాదు..
*మనిషి సహజంగాఉండాల్సినచోట,అసహ జంగా ఉండటం వల్ల...తన సహజత్వాన్ని కోల్పోతాడు....
*వాళ్లు మారిపోయారు,.వీళ్ళు మర్చిపోయా రు అని కాదు..వాళ్ళ అవసరాన్ని బట్టి, పరి స్థితిని బట్టి, నీ దగ్గర ప్రవర్తించారు అంతే...
తెలుసుకోవలసింది..నువ్వే..ఒక్కరోజు ఒక్క మెట్టు దిగి చూడు, ఎన్ని నోళ్లు లేస్తా యో....
ఒక నాలుగు మెట్లెక్కి చూడు, అదే నోళ్లు ఎలా వంతపాడతాయో...మెట్లు ,నోట్లు ఇదే ముఖ్యం లోకానికి...
*అన్యాయాన్ని ఇదేమిటి అని ప్రశ్నిస్తే,అంద రూ ఇదేమిటి?అని ఆశ్చర్యంగాచూసే రోజు ల్లో బ్రతుకుతున్నాము..అదే బ్రతుకనుకుం
టున్నాము...
*ఆడంబరం, నిరాడంబరం ఈ రెండింటి స్పృహ లేనివాడే నిజమైన నిరాడంబరుడు.
*ఆత్మ పుట్టదు,గిట్టదు. కాబట్టి బంధమూ లేదు,మోక్షమూలేదు.అందువల్లసాధనలేదు, సిద్ధి లేదు. దీనికే "అజాతవాదం"అని
పేరు...
*సత్యం,పవిత్రత ,నిస్వార్ధం --ఈసుగుణాలు  ఎవరిలో విరాజిల్లు తాయోవారిని సృష్టిలోని  ఏశక్తి ప్రతిఘటించలేదు...
*జ్ఞానం పెరిగేకొద్దీ మనంఎంతఅజ్ఞానులమో తెలుస్తుంది..
*జీవహింస చేయడం పాపం అనడం - నీతి
కరిచే పామును చంపాలనడం - ధర్మం
*మీరు కోల్పోయినదాన్ని ప్రేమించమని జీవితం నేర్పించే ముందు,మీ వద్ద ఉన్నదాన్ని ప్రేమించండి....
*మన మంచితనం మరి ఎక్కువైతే,. మన వాళ్ళే మనకు శత్రు వులు అవుతారు..
*ఎదుటి వ్యక్తిని విమర్మించడం చాలాతేలిక ఈ సమాజానికి,,అదే ఎదుటి వ్యకిని ప్రోత్స హించడం చాలాకష్టం జనానికి..అదేఎదుటి
వ్యక్తిని ఒకసారి ప్రొత్సహించిచూస్తేవారిఎదు గుదలలో మనంఆనందాన్ని పొందుతాం..
*"అద్దం మన ముఖంలో మరకని చూపిస్తే మరకని తుడుచుకుంటాం కానీ , అద్దా న్ని పగలగొట్టం.అలాగే...ఎవరైనా మనలో
లోపాన్ని చూపిస్తే, దాన్ని సరిదిద్దు కోవాలి కానీ,వారిపై కోపం చూపకూడదు."
*బంధంనాది అని మనస్ఫూర్తిగా స్వీకరించి న తర్వాత ఎన్నికష్టా లువచ్చినా ఆబంధాన్ని వదులుకోవద్దు .అది స్నేహమైనా,మరేదైనా..
మితి మీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను దూరం చేస్తుంది మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది మితిమీరిన పొదుపు
కష్టా ల పాలు చేస్తుంది...
[2/23, 4:46 AM]  ❣ ❣ 💛💚💓
అవిధ్య లేక మాయ అనునది పరమాత్మ యొక్కవ్యక్తీకరణమే.సత్వ,రజో,తమో
గుణాల సమత్వ స్థితి బ్రహ్మము. సమత్వ స్థితి లోపించినప్పుడు మాయ వ్యక్తమవు తుంది. విశ్వ సృష్టికి కారణమైన ఈ మాయ
త్రిగుణాతీత స్థితిలో లేదు. త్రిగుణములు సమత్వ స్థితిని కోల్పోయినప్పుడే సృష్టి ఏర్పడినది. అదే ప్రకృతి.
మాయ అనేది వ్యక్తము కాదు. అవ్యక్తము కాదు. లేక రెండు లక్షణాలు ఉన్నదికాదు, లేనిదికాదు. లేక కొన్ని లక్షణాలు విడివిడిగా
లేక కలసి ఉన్నట్లు భావించ రాదు.ఇదిచాలా ఆశ్చర్యకరమైనది. దానిని మాటలతో వర్ణిం చలేము. మాయను జయించాలంటే
కేవలం బ్రహ్మాన్ని తెలుసుకొని ఉండాలి. బ్రహ్మము లాంటిది వేరొకటి లేదు.ఎలా అంటే త్రాడును చూసి పాము అనిభ్రమించి
అదిపాముకాదు తాడని గ్రహించినట్లు ;దానిలక్షణాలైన సత్వ, రజో, తమో గుణాలు వానివాని స్వభావాన్ని బట్టి
నిర్ణయించబడతాయి.
          🧡💚💓
❣ ❣
వైద్యుడు పసికందును తలక్రిందులుగా పట్టు కుని పిర్రలపై గట్టిగాకొడతాడు.వెంటనేవాడు ఏడుస్తూ ఊపిరి పీల్చడం ప్రారంభిస్తా డు.
భలే ప్రారంభం.భలే స్వాగతం.
మీరు భయపడిన వెంటనే మీ శ్వాస లయ చాలా మారుతుంది.మీ గుండె దడ మీకు వినిపిస్తుంది. కానీ,మీలో ఎలాంటి భయం
లేనపుడు మీ శ్వాస చాలా హాయిగా, నిశ్శ బ్దంగా సాగుతుంది. దీనిని మీరెప్పుడై నా గమనించారా?ఇంతవరకు గమనించకపోతే
ఇపుడు గమనించండి.గాఢమైన ధ్యానంలో ఒక్కొక్కప్పుడు మీశ్వాస దాదాపుఆగిపోయి నట్లు మీకనిపిస్తుంది.కానీ అది ఆగదు.
పసికందు పుట్టు కే భయంతో ప్రారంభమవు తుంది. తొమ్మిది నెలలపాటు చీకటిలోవున్న ఆ పసికందు కళ్ళు ఎలాంటి వెలుగును,
కనీసం కొవ్వొత్తి కాంతిని కూడా చూడలేదు.  అందుకే అధునాతన ఆసుపత్రి దీపాల వెలు గులు చూడగానే ఆ కళ్ళు
భయపడతాయి. వెంటనే వైద్యుడు ఏమాత్రంఆలస్యం చెయ్య కుండా మీతల్లితో మీకున్న అనుసంధానాన్ని కత్తిరించేస్తా డు.దానితో
అంతవరకుమీకున్న ఏకైక భద్రత కాస్తపోతుంది.అందుకే మానవ శిశువంత నిస్సహాయ శిశువు ఈ మొత్తం అస్తిత్వంలో ఎక్కడాలేదని
కచ్చితంగా చెప్పొ చ్చు. అది మీకూ తెలుసు.
అందుకే గుర్రాలు కాల్పనిక దేవుణ్ణి కనుక్కో లేదు. ఏనుగులు దేవుడి గురించి ఎప్పుడూ ఆలోచించవు.ఎందుకంటే,వాటికి ఆ అవస
రం లేదు. అప్పుడే పుట్టిన ఏనుగుపిల్ల వెంట నే లేచి నడుస్తూ తన చుట్టూ ఉన్న ప్రపంచా న్ని చక్కగా పరిశీలిస్తుంది. దానికి మానవ
శిశువుకున్నంత నిస్సహాయతలేదు.నిజానికి, మానవ శిశువునిస్సహాయతపై ఆధారపడిన కుటుంబం,సమాజం,సంస్కృతి, సంప్రదా
యాలు, మతాలు,వేదాంతాలను చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. ఇలా ప్రతిదీ మానవ శిశువు నిస్సహాయతపైనే ఆధారపడ్డా యి.
జంతువులలో కుటుంబాలుండవు. అందుకు ముఖ్య కారణం వాటి పిల్లలకు తల్లిదండ్రు ల అవసరం లేదు. కానీ,మనిషి ఒక నిర్దిష్ట
వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. పుట్టిన పిల్లల బాధ్యతను ఆ వ్యవస్థలో తల్లిదండ్రు లే స్వీకరించాలి. ఎందుకంటే, వారి ప్రేమ
కలాపాల ఫలితమే పిల్లలు.జంతువుల మా దిరి పిల్లలను గాలికి వదిలేస్తే,వారు జీవిస్తా రని మీరనుకోలేరు.అదిఅసంభవం.ఎందు
కంటే, వారికిఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు పెడతారు?ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? బహుశా,ఆ పసివాడు
‘‘తొందర పడి ముందుగానే ఇక్కడికి వచ్చాడేమో, తల్లిగర్భంలో ఉన్న ఆ తొమ్మిది నెలల కాలం వాడికి సరిపోలేదేమో’’ అనేది
కొంతమంది జీవశాస్తజ్ఞ్రు ల అభిప్రాయం.
🖤❣💚❣💓
    మీడియం షిప్ అనేది "అకల్ట్ సాధనలు లేదా సాధనలలో"ఒకటి.ఎక్కువగా ఈ మీడి యం షిప్...పాశ్చాత్య తాంత్రిక సాధనలకు
సంబంధించినది. హిందూ తాంత్రిక శాస్త్రా ల రీత్యా...ఇవి తక్కువ స్థా యివి అయినా, వీటికి కూడా ఫలితాలు ఉన్నాయి.
చనిపోయిన వారు ఇంకా ముక్తి చెందనిచో, వారి వారి ప్రేతల లేదా ముక్తి చెందని జీవుల మధ్య సమాచార వారధిగా పనిచేసే ప్రక్రియ నే
"మీడియం షిప్"అంటారు.అంటే బ్రతికు న్న మనుజులను ,చనిపోయి ముక్తి చెందని వారి ఆత్మలను...సమాచార పరంగా అను
సంధానం చేసే ప్రక్రియను "మీడియం షిప్" అంటారు.ఇందులో పాల్గొను వారిని "మీడి యమ్స్"లేదా"స్పిరిట్ మీడియమ్స్"అంటా
రు.అయితే ఈ మీడియం షిప్..అనుభవం లోకి వస్తే,అనేక రకాలుగా ఉంటాయి.ఊజా బోర్డు ప్రయోగం, చానలింగ్...అలాంటివే.
ఈ మీడియం షిప్ అనేది , పందొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ప్రసిద్ధి కెక్కింది. ఊజా బోర్డు లు - వాటి ప్రయోగాలు,ఉన్నత తరగ
తుల్లో ప్రాచుర్యాన్ని పొందాయి.
ఈ మీడియం షిప్ ,సమర్ధవంతంగా నిర్వ హిస్తే, ఆకాశ తత్వము మరియూ వ్యక్తి యొక్క ఆకాశతత్వము నుండి "ఎక్టోప్లా జం" 
ఆవిర్భవిస్తుంది.ఈ ఎక్టోప్లా జం నుండి సమ స్త విషయాలు సృష్టించబడే అవకాశంఉంది. అయితే, మీడియం షిప్లో పాల్గొనే వ్యక్తు లు
పవిత్ర భావం కలిగియుండాలి.
ఒక గొప్ప వ్యక్తిని తీసుకుందాం. జీవితంలో అతని తాత్విక చింతనా ధార,జ్ఞానం,అతని ఆధ్యాత్మిక జీవితం,అతని అనుభవాలు, థాట్
ఫామ్స్...రూపంలో ఈ ఎక్టోప్లా జం ఏర్పడుతుంది.ఎక్టో ప్లా జం రూపంలో ఒక అసాధారణమైన జిగట లాంటి పదార్థం, భౌతిక
శరీరంనుండే ఆవిర్భావంఅవుతుంది. ఒక ఆధ్యాత్మిక భావాతీతస్థితినుండి ఆవి ర్భావం అవుతుంది..ఈ ఎక్టోప్లా జం ఆధ్యా త్మిక
ప్రయోగాలలో,బాహ్యంగా ఆవిర్భవించి న ఒకానొకశక్తిని సూచించడానికి"ఎక్టోప్లా జం" అనే పదం వాడతారు.
సాధకులు, ఒకానొక భావాతీత స్థితిలో ఉన్నప్పుడు ఈ ఎక్టోప్లా జం ఏర్పడే అవకాశం ఉంది. ఒకానొక మాధ్యమం శరీర రంధ్రాల
నుండి,ఆకాశ తత్వం ద్వారా విసర్జించబడే పదార్థం ఈ "ఎక్టోప్లా జం".భౌతికేతర శరీరంపై ఈ ఎక్టోప్లా జం తెరలతో ఆవిష్కరించబడిన
ట్లు ఉంటుంది.కొంతమంది అధ్యాత్మ సాధకు లు ఏం చెబుతారంటే,ఈ ఎక్టోప్లా జం ప్రారం భంలో స్పష్టంగా ఉంటుంది.కానీ
అదృశ్యంగా ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా చీకటి మాత్రం ఈ ఎక్టోప్లా జం కంటే స్పష్టంగా ఉంటుంది. విచిత్రం!అతీంద్రీయశక్తి
శక్తివంతంగాఉన్నట్లు
కొన్ని అసాధారణమైన విషయాల్లో ఈ ఎక్టో ప్లా జం బహిరంగ వాతావరణంలో గాఢమైన సువాసనను ఉదయింపజేస్తుంది.ఏది ఏమై
నా, ఇవన్నీ తీవ్ర ఆధ్యాత్మ సాధనల్లోనే సంభ విస్తా యి.ఒక సాధకుడు గానీ,ఒక వ్యక్తిగానీ తీవ్ర భావాతీత స్థితిలో ఉంటే,ఈ ఎక్టోప్లా జం
ఏర్పడవచ్చు.
ఇక "మీడియంషిప్" విషయానికొద్దాం. ఈ మీడియంగా ఉన్న మనిషి, ఈ ప్రపంచపు మనుజులకు - ఆత్మల ప్రపంచానికి....మధ్య
వారధిలా ఉంటాడు.ఆత్మల యొక్క మనోగ తాన్ని వింటామని,ఆత్మల నుండి వచ్చే అనే క సందేశాలను అందుకుంటామని,"ఆటోరై
టింగ్" అనే పద్ధతి ద్వారా కూడా ఆత్మలు చెప్పే కథలు వింటాము
💓💚💓
         ♥ ❣ ❣
*భగవత్ తత్త్వమంటే అది అంతర్యామి త త్త్వము.బ్రహ్మమేశుద్ధచైతన్యముగావ్యక్తమై, అటుపైన త్రిగుణాత్మకముగా వెలువడి,అటు
పైన పంచభూతాత్మకమైన సృష్టి చేస్తా డు. అందులోకి జీవులు ప్రవేశించడము జరుగు తుంది. అలా ప్రవేశించిన జీవులు అంతటా ఉన్న
'సత్'  'చిత్'ను దర్శించాలి.సత్ అంటే ఉనికి.చిత్ అంటే ఎరుక.ఆ ఉనికినే బ్రహ్మం సత్యము,లేక శివము అంటారు. జీవకోటి అంతటికీ
ఉనికి శాశ్వతముగా ఉంటుంది.  ఒక్కొక్కళ్ళకి ఒకొక్కరకముగాఎరుకఉంటుం ది. ఎరుకలో వ్యత్యాసము ఉంటుంది గాని, ఉనికిలో
ఉండదు.
*ఆత్మ సర్వాంతర్యామి యైనపుడు ఆత్మ కాని వస్తు వు లెట్లుండును? కుండ యందు మొత్తము మట్టియే యున్నది.ఇంకే పదార్థ
మును లేదు.అయినను మన దృష్టిలోకుండ కూడ నున్నది.అంతేకాక దాని వినియోగము కూడ నున్నది.
*ఇచ్చట నిజమైన పదార్థముమట్టిమాత్రమే. దానియందు మనము కల్పించుకొనినది కుండ. ఈ కల్పనము వలన నీళ్ళు తెచ్చుకొ
నుట మున్నగు పనులు సాధ్యపడుచున్నవి.
*మట్టి యన్నది సత్య వస్తు వు.కుండ కల్పిత వస్తు వు. కుండను మాత్రమే గుర్తించినచో అది బ్రద్దలగుట కూడ సత్యమనిపించును.
మట్టి మాత్రము సత్యమని మనకు తెలియు ను గనుక కుండబ్రద్దలైనచో ఇంకొక కుండను కల్పించు కొనుచున్నాము.
*అట్లే అంతర్యామి అన్నిటియందును ఆత్మ, దానితో కల్పింపబడిన సత్యము,అదియే 'తాను' లేక దేహములు,పేర్లు ,చుట్టరికము
లును అనాత్మలు.వానియందు సంగము మాని ఆత్మయందుధ్యానమునిలుపవలెను.
*Have infinite patience, and success is yours.
*సహనం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం పొందలేడు.
💓💚💓
        ❣ ❣
*మనిషికి మరణంవిచిత్రమైనది.ఇంటినిండా ఆస్తు లున్న కోటేశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందోఅని ఏడుస్తు న్నాడు.అదే
ఇంటినిండా కష్టా లుఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తేబాగుండు అని ఎదురు చూస్తు న్నాడు.మనిషి ఎక్కడ గెలిచిపోతాడోఎక్కడ
అలిసిపోతాడో ఎవరికితెలియదు.మట్టిలోకి మాత్రం మనశాంతిలేకుండా వెళుతున్నాడు.
*మనం ఎదుటివారి నుండి ఏమైన ఆశించ టంఆపితే ఆనందం మొదలవుతుంది,అదే వారిని శాశించటం ఆపితే మనకు సంతోషం
మొదలవుతుంది.
*ఎదుటివారిని క‌లుపుకుపోయే మనస్తత్వం మనలోఉంటే అందరూ మనతోనే ఉంటారు. అంతా నాకే తెలుసు నాకెవరి అవసరం లేద
నే *అహం*మనకుంటే సమాజమే మనని దూరం పెడుతుంది.
*మనకు ఎంత ఆస్తిఉందనేది కాదు, మనం  ఎంత మంది మనసుల్లో ఉన్నాము అనేదే ముఖ్యం ! వారి మనస్సులో మనం ఉండా
లన్నదే ముఖ్యం.
*నిజం ఉన్నతమైనది కానీ ! నిజాయితీతో జీవించడంఅన్నది,అంతకంటేఉత్తమమైనదిమనం కంటితో చూడనివి చెవులతో విననివి
ఎప్పుడూ నమ్మకూడదు.ఎందుకంటే కొంత మందిచెప్పే మాటలవల్ల కొన్నిస్నేహాలు చెడి పోతాయి.కుటుంబబంధాలు తెగిపోతాయి.
💘💙 💚 💜
        ❣ ❣
*ఆత్మానుభవం పొందటం ద్వారా జరిగేదే మిటి !?"
*దైవదర్శనమైనా, ఆత్మానుభవం పొందినా జరిగేది మనలోని వెలితితనం పోవటమే. వెలితిపోయిన మరుక్షణం మనని దుఃఖపెట్టే
వస్తు వే ఉండదు. దుఃఖ పెట్టేదేదీ లేనప్పుడు మిగిలి ఉండేదిసంతోషమే.అలాంటి శాశ్వత మైన ఆనందం మనందరికీ అందుబాటులో
నే ఉంది.ఇప్పటికీ అది అందే ఉంది !.
💙💚💜
           ❣ ❣
*అంతా బ్రహ్మమయ మైతే...ఇక జగత్తు లో ఏదీ జడంగా ఉండదు !!..
*ఏది తనను అఖండ సత్యం నుండి వేరు చేయదో అదే బ్రహ్మీస్థితి. అట్టి స్థితిలో అన్నీ బ్రహ్మంగానే గోచరిస్తా యి.సర్వమూ బ్రహ్మమే
అన్న సత్యం అర్థమైతే దృశ్యమానమైన జగత్తు మిథ్య అని తెలుస్తుంది.మిథ్య అంటే లేనిదనికాదు.శాశ్వతత్వం లేనిదని.దానంత
టఅదిగా ఉండలేనిదనిభావం.మన అహం కారమే ఆధారంగా నిలిచిఉండేజగత్తు అహం కారంలేని రోజు అసలు లేకుండాపోదు.మన
కు విడిగా లేకుండాపోతుంది.బ్రహ్మలో భాగం గా, ఒక భ్రమగా ఉండిపోతుంది. ఆ స్థితిలో ఏ చింత ఉండదు. అంతా బ్రహ్మమయమైతే
అప్పుడీ జగత్తు లో ఏదీ జడంగా ఉండదు !.
❤️ 💚 💜
          ❣ ❣
*నిద్ర, భయ,శోకములు,విషాదము,మదం, దుర్బుద్ధి విడువని ధారణ తామసము.
*ఇన్ని గంటలకు నిద్రపోయి తీరవలెనని విశ్వసించుట,ఇతరుల వలన గాని, దైవము వలనగాని భయపడి తీరవలెనని నమ్ముట,
జీవితమున శోక విషాదములు తప్పవని భావించుట,కొందరి యందు మర్యాద చూప రాదని తలచుట,కొందరికి కీడు చేయకతప్ప
దని నమ్ముట దీని లక్షణములు.)
*సుఖ భావన కూడా గుణ భేదములచే త్రివి ధము.ఏదిసుఖమోతెలియుటలోను,పొందు టలోను
సత్యాసత్యములు,దీనిననుసరించి యుండును.మరల మరల ప్రయత్నించి సన్మార్గమవలంబించుట వలన దుఃఖమును
తరింపగలుగుట సాత్త్విక సుఖము. అది తొలుత దుఃఖ కారణములను తొలగించుకొ  నుటలో అసౌకర్యముతో ప్రారంభించి రాను
రాను తరుగని సుఖము కలుగజేయును. ఈ సుఖము వలన ఆత్మయందు బుద్ధి తేట బడును.
*ఫలముల ఆపేక్షలను విడుచుటకు, శరీర వ్యాయామాదులు ఆచరించుటకు, ఔషధ సేవ, పథ్య పానాదులకు వలయు ప్రయత్న
ము అసౌకర్యంగా నుండును.కాని సుఖము గా పరిణమించి ఆరోగ్య తత్త్వ జ్ఞానముల వలన బుద్ధి ఆత్మమోణ్ముఖ న్ముఖమగును.
💚💜💚
             ❣ ❣ ❣ ❣
సకలజగత్తు ఈశ్వరుని యందు వాసనారూ పమున లీనమైఉండును.దానినేఈశ్వరుడు ఆయా ప్రాణుల పూర్వకర్మను అనుసరించి
సృష్టించును,అనగా వ్యక్తమగునట్లు చేయు ను. సృష్టి అనగా చుట్టియుంచిన పటమున విప్పి చూపినట్లే.
ప్రాణుల కర్మ అంతా తీరిన పిదప మరల ఈ అఖిల విశ్వమును తనయందే లీనము చేసి కొనును.ప్రళయమనగా విప్పియుంచిన పట
మును మరల చుట్ట చుట్టినట్లే.
జగత్తు యొక్క సృష్టి ప్రళయంలను పగలు, రాత్రు లతోను జాగృతి,సుషుప్తు లతోను
కన్నులు తెరచుట, మూసికొనుటలతోను
మనస్సు ఊహాప్రపంచములను కల్పించుట,
నిశ్చలముగ ఉండుటతోను పోల్చవచ్చును.
ఆ ప్రజాపతి ఈ సమస్త జగత్తు ను సృజించి రక్షించెను.ఎట్లనగా,నా చేత సృజింపబడిన ఈ జగత్తు నాకు వేరుకానిదగుట వలన నేనే
అగుచున్నాను.ఈ ప్రకారము ప్రజాపతి జగత్తు తానెనని చెప్పెను.అందు వలననే సృష్టి జరుగుచున్నది.
ఈశరీర భేదజాతమంతయు శరీరోత్పత్తి కం టె పూర్వముఆత్మస్వరూపముగానేఉండెను
సకల జగత్తు ఆ ప్రజాపతి యందు వాసనా రూపమున లీనమై ఉండి ఆయా ప్రాణుల పూర్వకర్మను అనుసరించి సృష్టించును, అనగా
వ్యక్తమగునట్లు చేయును.
అగ్నీష్టోమాత్మకమయిన జగత్తు ను ఆత్మస్వ రూపముగా జూచువాడు ఏదోషమును అంటక ప్రజాపతి స్వరూపుడగుచున్నాడు.
ఈ సృష్టి అతిశయమైనది.అట్టి అతిశయమ గు ప్రజాపతి యొక్క సృష్టిని ఆత్మ స్వరూప మైన దానినిగా తెలిసికొనువాడు ఆ ప్రజా
పతి సంబంధమైన సమస్త సృష్టి యందు ప్రజాపతి వలెనే సృష్టికర్త యగుచున్నాడు.
*సాలెపురుగు దేహమునుండి తంతువులు బయటకు వచ్చి మరలా లోపలికి తీసుకొను విధముగానే,ప్రాణులకర్మ అంతా తీరిన పిద
ప మరల ఈఅఖిలవిశ్వమును ఆపరమాత్మ లోనే లీనము చేసికొనును.
సృష్టి అనగా చూట్టియుంచిన పటమును విప్పి చూపినట్లే,ప్రళయమనగావిప్పిఉంచిన పటమును మరల చుట్ట చుట్టినట్లే. బ్రహ్మవే
త్తకాని పురుషుడు, ఉపాసన చేయబడెడి యీ దైవము,ఉపాసించెడి నాకంటె వేరుగా నున్నాననిభావించును.అట్టివాడు పరబ్రహ్మ
తత్త్వమును తెలిసికొనలేడు.
జ్ఞానియైన పురుషుడు ఈవర్తమాన కాలము నందు,సర్వస్వ రూపముగా ఆపరమాత్మ స్వరూపమునే చూచుచు నేను మనువున
యితిని, సూర్యుడనయితిని అని భావించి సర్వస్వరూపమును పొందెను.
అతడు సమస్తమునుఅగుచున్నాడు.ఆ పర బ్రహ్మవేత్త దేవతలకును ఆత్మస్వరూపము గా అగుచున్నాడు.
ఈ సృష్టి,ప్రళయములను జ్ఞాని,అజ్ఞానులతో పోల్చవచ్చును.ఇంకనుపగలురాత్రు లతోను,
జాగృతి సుషుప్తు లతోను,కన్నులు తెరుచుట మూసికొనుటలతోను,మనస్సు ఊహా ప్రపం చములను కల్పించుట నిచ్ఛలముగ
ఉండు టలతో పోల్చవచ్చును.
ఆ పరమాత్మ సర్వదా జ్ఞానఖర్మల విధి ప్రకా రము సృజించుట వలన సమస్తమున ఆ పురుషుడే దేవాత్మ భావము పొంది సర్వ దేవతా
స్వరూపుడగు చున్నాడు.మోక్షము ను పొందుచున్నాడు.
అట్టిపురుషుడు సర్వదా ముక్తు డై పరమాత్మ  గానే ప్రకాశించుచున్నాడు.
💞❣️💚❣️💞
          
లక్ష్మీదేవి వరమాలను చేతబట్టి నడిచివచ్చు చుండెను.అప్పుడు తుమ్మెదలు ఆవరమాల ను చుట్టు ముట్టి ఝంకారము
చేయసాగెను. కాలి అందియలు శ్రావ్యమయిన సున్నిత శబ్దము చేయుచుండగా - కుచభారముతో మందగమనయై ఆ లక్ష్మీదేవి -
వయ్యారము గా నడచుకొని వచ్చి, ప్రభూ! నారాయణ మూర్తీ ! నిన్ను సమీపించెను.
శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మీ దేవి తోడుగానే ఉందని,ఆమె 'నిత్యానపా యిని'. లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని
శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెప్పారు.
సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలిం చడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవీ భాగవతం లో
చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి
తపస్సు చేయగా లక్ష్మి,భృగు వు, ఖ్యాతిల కుమార్తెగాజన్మించింది.ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెండ్లిచేశాడు.కను క లక్ష్మీదేవిని
'భార్గవి' అనికూడా అంటారు.
తరువాత ఒకసారి దూర్వాసునిశాపకారణం గా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదలి పాలసము ద్రంలో నివసించింది. అమృతం పొందాలని
దేవతలు,రాక్షసులుపాలసముద్రాన్ని,మంద ర పర్వతాన్ని కవ్వంగాచేసి వాసుకిని కవ్వ పు త్రాటిగా చేసే చిలకడం ప్రారంభించారు.
ఆ సమయంలో పాలసముద్రం నుండి కామ దేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది.పాలసము
ద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె'సముద్ర రాజకుమార్తెఅయ్యింది.ఆమెతో పాటే జన్మిం చిన చంద్రు డు లక్ష్మీకి
సోదరుడయ్యాడు..
ధనాధి దేవత అయిన ఈ దేవిని శ్రీమహావి ష్ణువు భార్యగా చేసుకున్నాడు.విష్ణువు శక్తికి, మాయకు కారణం.లక్ష్మీదేవి తోడుండడమే
అంటారు. భూదేవి కూడా లక్ష్మీకి మరో అంశ అని చెబుతారు.దేవీమహాత్మ్యంలో మహాశక్తి యే మహాలక్ష్మీగా చెప్పబడింది.ఆమెను
అష్ట భుజ మహాలక్ష్మీగా వర్ణించారు.
విష్ణువు అవతారాలతోపాటు లక్ష్మీదేవికూడా అవతరిస్తుందని చెప్పారు.రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా,కలియు
గంలో వెంకటేశ్వర స్వామికి అలవేలు మంగ గా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది.
చాలామంది దేవతలులాగే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అష్టోత్తర శతనామ స్తోత్రం , సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి.
ఎక్కుగా లక్ష్మీదేవిని పలికే  పేర్లలో కొన్ని - లక్ష్మీ, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి, నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ
తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర.
అలాగే  ఎక్కువగా లక్ష్మీదేవి చతుర్భుజాల తోను, ధన కుంభంతోను,పద్మాసనగా,పద్మా లను చేతబట్టి,సకలాభరణభూషితయైనట్లు
గా చిత్రించబడుతుంది.
❣️💚❣️
          
*''యజుస్‌''అన్న పదం ''యజ్‌''అన్నధాతువు నుంచి వచ్చింది. ''యజ్‌'' అంటే పూజించుట లేక ఆరాధించుట. 'యజ్ఞ' మనే పదం
కూడ ఈ ధాతువు నుంచే వచ్చింది.''ఋక్‌'' అంటే స్తోత్ర మయినట్లు గానే,''యజుస్‌'' అన్న పదం యజ్ఞానికి కావలసిన కర్మకాండని
సూచిస్తుం ది. ఋగ్వేదంలో స్తోత్రరూపంలోఉన్నమంత్రా లకి, యజ్ఞం చేయటానికి వీలయిన రూపా న్ని యజుర్వేదం
కల్పిస్తుంది.అంతేకాక,రక రకాల యజ్ఞాలని కొనసాగించే పద్ధతులని కూడ వచన రూపంలో యజుర్వేదం సూచి స్తుంది. స్తోత్రంతో
ఆరాధించటం నేర్పుతుంది ఋగ్వేదం. ఈ మంత్రాలనే, ఈ స్తోత్రాలనే యజ్ఞం చేయటానికి ఎట్లా ఉపయోగించుకో వాలో
యజుర్వేదం నేర్పుతుంది. మిగిలిన వేదాలకు వలెనే,యజుర్వేదానికికూడాఎన్నో శాఖలున్నాయి కాని వీటిలో ముఖ్యమైనవి రెండే.
వీటికి ఎన్నో పాఠాంతరాలున్నాయి.
*ఈ రెండు శాఖలను - శుక్లయజుర్వేదము, కృష్ణయజుర్వేదము అంటారు. 'శుక్ల' అంటే తెల్లని, 'కృష్ణ' అంటే నల్లని, శుక్ల యజుర్వేద
సంహితని ''వాజసనేయ సంహిత''అంటారు. 'వాజసని' అంటే సూర్యుడు.సూర్య భగవా నుని వద్ద నేర్చుకొని యాజ్ఞవల్క్యముని
లోకానికి ఈసంహితను ఎరుక పరచాడంటా రు. అందువల్లనే దీనిని 'వాజసనేయ సంహి త' అంటారు.సూర్యుని వద్ద యాజ్ఞవల్క్యు
డు వాజసనేయ సంహితను నేర్చుకోవటం గురించి ఒక కథ ఉంది.వ్యాసుడు వేదాలన న్నిటినీ నాలుగుగావిభజించినప్పుడు యజు
ర్వేదానికి ఒక శాఖే ఉండేది.దీనిని వ్యాసమ హర్షి వైశంపాయనునకు భద్రపరచమనీ, తన శిష్యుల ద్వారా ప్రచారం చేయమనీ
యిచ్చాడట.
*యాజ్ఞవల్క్యుడు వైశంపాయనుని వద్ద దీనిని అధ్యయనం చేశాడు. గురుశిష్యుల నడుమ ఒక భేదాభిప్రాయం రావటంతో,
వైశంపాయనుడు యాజ్ఞవల్క్యుని తాను నేర్పిన సంహితను తిరిగి యిచ్చేయమని కోరాడు.ఇది న్యాయమేనని గ్రహించి యాజ్ఞ
వల్క్యుడు ఆ విధంగా చేశాడు.ఆ తరువాత సూర్య భగవానుడిని తనను శిష్యునిగా స్వీకరింపుమని కోరాడు.సూర్యభగవానుడు
అంగీకరించి,యజుర్వేదమనీ పేరు వచ్చింది. దీనికీ పేరు రావటం వల్ల,అంతకు పూర్వం వైశంపాయనుడు నేర్పిన దానిని కృష్ణయజు
ర్వేద మన్నారు. కృష్ణ యజుర్వేదములో సంహిత బ్రాహ్మణ భాగాలు స్పష్టముగా విభ జింప బడిలేవు.యజుర్వేదం యొక్క ఘనత
అంతా వైదిక కర్మలను,కర్మకాండను విశదీక రించటంలోనే ఉన్నది.
*దర్శపూర్ణమాసం,సోమయాగం, వాజపే యం, రాజసూయం, అశ్వమేధం - వంటి యాగాల నిర్వహణాక్రమాన్ని వివరంగా
కృష్ణయజుర్వేదంలోని తైత్తిరీయ సంహిత తెల్పుతుంది. అంతేకాక,ఋగ్వేదంలో కాన రాని కొన్ని స్తోత్రాలు కూడ యజుర్వేదంలో
ఉన్నాయి.ఉదాహరణకి ఇప్పుడు ప్రాచుర్యం లో ఉన్న శ్రీ రుద్రం యజుర్వేదం లోనిది. ఋగ్వేదంలో అయిదు సూక్తా లు ''పంచరు ద్రం'
'గా ఉన్నాయి,నిజమే.కాని యజుర్వేదం లో ఉన్న దానినే శ్రీ రుద్రమంటారు. అందువ ల్లనే అప్పయ్య దీక్షితులవారు అనబడే శివ
భక్తు డు, తాను యజుర్వేదంలో జన్మించి యుంటే పరమశివుడ్ని యజుర్వేదం ద్వారా నే ఆరాధించగలిగేవాణ్ణి కదా అని వాపోయా
రు. ఆయన సామవేదాన్ని అనుసరించే కుటుంబంలో జన్మించారు.ప్రస్తు తం అత్యధి కులు యజుర్వేదాన్నే అనుసరిస్తు న్నారు.
ఉత్తరభారతంలో శుక్ల యజుర్వేదాన్ని ఎక్కు వగా ఉన్నది. దక్షిణ భారతంలో కృష్ణ యజు ర్వేదాన్ని, ఋగ్వేదంలోని పురుషసూక్తం కొద్ది
మార్పులతో యజుర్వేదంలో కూడ ఉంటుంది. కాని ''పురుషసూక్త'' మన్నప్పుడు యజుర్వేదంలోని పురుషసూక్తమనే అర్థం
చేసుకోవాలి.
*అద్వైత సిద్ధాంతావలంబులకు యజుర్వే దం అత్యంత ప్రధానం. ఏ సిద్ధాంతానికైనా ఒక సూత్ర ముండాలి -దానికొక భాష్యముం
డాలి - దానికొక వార్తికముండాలి (అంటే విపులమైన వ్యాఖ్యానం)సిద్ధాంతాన్ని క్లు ప్తం గా చెప్పేది సూత్రం. ఆ సూత్రానికి వివరణ
ఇచ్చేది భాష్యం.భాష్యానికి ఇంకా వివరమైన వ్యాఖ్యానమిచ్చేది వార్తికం.అద్వైత సిద్ధాం తంలో వార్తిక కర్త (అంటే,వార్తికం వ్రాసినవా
డు) ఆది శంకరుల శిష్యుడు సురేశ్వరులే - ఈ పదం ఇంకెవ్వరికీ వర్తించదు. ఆయన ఏ భాష్యానికి వార్తికం వ్రాశాడు?ఉపనిషత్తు లని
సూత్రాలన్నామంటే ఆదిశంకరులు వాటికి భాష్యం వ్రాశారు. ఆయన వేదవ్యాసులు (బాదరాయణుడు) రచించిన బ్రహ్మ సూత్రా లకి
కూడ భాష్యం వ్రాశారు. ఆచార్యుల వారి ప్రత్యక్ష శిష్యులు సురేశ్వరులు.
*ఉపనిషత్‌భాష్యంపై వార్తికం రచించారు. ఆయన తన వ్యాఖ్యానాన్ని ప్రధానమైన పది ఉపనిషత్తు లమీదా కాక రెండింటి మీదే
వ్రాశారు. అవి తైత్తిరీయ, బృహదారణ్యక ఉపనిషత్తు లు.ఈ రెండూ క్రమంగా కృష్ణ యజుర్వేదానికీ శుక్లయజుర్వేదానికీ సంబం
ధించినవి.రెండూ యజుర్వేదానికీ సంబంధిం చినవి కావున అద్వైత సిద్ధాంతావలంబుల కు యజుర్వేదమెంతో ముఖ్యము.
❣️💚❣️
       
  నిరంతర (సతత) యోగ, సాధనల వలన, సాధకునికి "మార్మిక శక్తు లు"(mysterious powers) వస్తా యి. అయితే, ఈ సిద్ధు లు
వైశ్విక నియమాలననుసరించి యే ఉంటాయి. "పిండే పిండే మతిర్భిన్నః"... అన్నట్లు ఒక్కో సాధకుడికి ఒక్కోరకంగా కూడా ఈ
సిద్ధు లు సంప్రాప్తిస్తూ ఉంటాయి.
  ఈ సిద్ధు లు కూడా రెండు వైపులా పదును న్న కత్తు ల లాంటివి.ఈ సిద్ధు లు పొందాలం టే, ఒక జీవించియున్న సద్గురువును ఆశ్ర
యించాలి.లేదా జన్మతః కూడా రావచ్చును.  సతత అభ్యాసాల ద్వారా కూడా సిద్ధు లు సంప్రాప్తిస్తా యి.
*మానవ మనస్సు ప్రదర్శించేశక్తు లు,అనంత శక్తు లకు - అనంత క్రియలకు మూల నిధి అయిన విశ్వ మనస్సు (cosmic mind).
విశ్వ మానసమే,మానవ మనస్సుకు మూలాధారం.వైశ్విక చైతన్యం,అనంతత్వం వైపుకు నిరంతరం పయనిస్తుంది.ఇది జీవా త్మలనే
అలలను సృజిస్తుంది. అది పలు పరిమాణాలలో "సిద్ధు లు" అనే తరంగాలను సృష్టిస్తుంది..   
  శక్తి ప్రదర్శకులు అలౌకికులు,శక్తిమంతులు. వారు సామాన్యులైతే మాత్రంకారు.అయితే అలాంటివారు నిత్య జీవితంలో తరచుగా
కనిపించరు.
  ప్రాచీన యోగశాస్త్రం,శాస్త్రంలోని ఆలోచ నలు,భౌతిక శాస్త్రంలోని ఆధునిక భావనలు ఒకే సత్యాన్ని ఆవిష్కరిస్తు న్నాయి.అయితే మన
ఉనికి కేవలం,ఒకే సత్యంగాలేదు.భిన్న స్థా యిలలో,భిన్న తలాలుగాఉంది.జడత్వం నుండి చైతన్యం యొక్క గాఢత్వం వరకు..
పరస్పరం ఓత ప్రోతాలుగా ....అను ప్రవేశం చెందిన, భౌతిక మరియూ అనేక మనో కోశా లతో లేదా పొరలతో కూడిఉన్నది.ఆత్మవైపు
చేసే ప్రయాణంలో, ఈ మనో కోశాలు లేదా పొరలు, మృధువుగా, మరింత సూక్ష్మంగా మారుతూ ఉంటాయి.ఈ మనోకోశాలు అప
రిమితమైన శక్తి, జ్ఞాన భాండాగారాలు. ఇవి తమ దిగువ కోశాలపై చాలా సూక్ష్మ ప్రభావ శీలతను ప్రదర్శిస్తా యి. ఆయా మనోతలాల
నుండే సిద్ధు లు ప్రకటనమవుతూఉంటాయి. మనోతలం మరల 1.వ్యక్తము.2.అవ్యక్తం. వ్యక్త భాగంలో మనం,మన ఇంద్రియాలు..
కొంతవరకేఅనుభవిస్తా యి.మనోతలంకూడా హెచ్చు భాగం అవ్యక్తం.ఆ అవ్యక్తం యొక్క తలాలను అందుకున్నవాడే పరమ
సిద్ధు డు.
ఒక్కో తలంలో కొన్ని సిద్ధు లు వస్తూంటాయి. తరువాత తలానికి వెళ్ళేకొద్దీ, సిద్ధు ల ప్రక టన శక్తివంతంగా ఉంటుంది.....
సంకల్పం వలననే సిద్ధు లు,మానసిక శక్తు లు ప్రయోగించబడతాయి.
కొన్ని సార్లు మన జీవితాలలో కూడా,అలౌ కిక ఘటనలు జరుగుతూ ఉంటాయి.వీటికి కూడా మనస్సుయొక్క"కలాపమే" కారణం.
    యోగులు అటువంటి "సిద్ధు లు" పొందు తారు. కొందరు జన్మతః సిద్దు లు కలిగి యుంటారు. అవి పరిపక్వంగా ఉంటాయి.
చాలా మందిలో అవి గోప్యంగా ఉంటాయి. ఈ సిద్ధు లు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి, "
   చాలా మంది సామాన్యులలో ఆ సిద్ధు లు, వ్యక్తంకావు.కారణం,వారిలోఆయామార్గాలు మూతపడి ఉండడమే. అయితే సిద్ధు లు
పొందగోరే వారు, కొన్ని ప్రత్యేక సాధనలు చేయాలి. లేదా తాను చేసే సాధనలు పక్వం చేరుతున్న దశలలోకూడా "సిద్ధు లు","మాన
సిక శక్తు లు" వ్యక్తం అవుతాయి. అయితే సిద్ధు ల మోజులో పడితే,అసలు లక్ష్యందెబ్బ తింటుంది.
  ఈ సిద్ధక్షేత్రం అనేతలుపులు తెరచే తాళపు చెవి "మనో ఏకాగ్రతే".మనో ఏకాగ్రత అద్భు తాలు సృష్టిస్తుంది. మనో ఏకాగ్రత, పూర్తిగా
పరి పక్వమైన వారు, సిద్ధ క్షేత్రానికి అధికారి. సిద్ధు లు వాడి చేతిలో కరతలామలకం.
    ఇక "పంచ భూత సిద్ది" అనే సిద్ధి,అనేది ఒకటి ఉంది. పంచ మహాభూతాలు ఇవి. 1. పృథివి 2. జలము 3. అగ్ని 4. వాయువు 5.
ఆకాశము.
  ఇందులో, ప్రతి ఒక్క element మీద కొంత కాలం సాధన చేయాలి. ఉదాహరణకు " పృథ్వి" భూతము మీద 6 మాసాలు సాధన
చేస్తే, ఆయా తత్వాలు, ఆయా అధిష్ఠా న దేవతల మొత్తంమీద మాష్టరీరావచ్చు.అలా  పృథ్వి యొక్క తత్వం ,మొత్తా నికి సంయ
మము చేయడం వల్ల, ఆయా తత్వాలన్నిం టిమీద, స్వామిత్వం వస్తుంది.
       అలాగే జల తత్వం మీద,అగ్ని తత్వం మీద, వాయు తత్వం మీద, ఆకాశ తత్వం మీద....క్రమంగా సంయమము చేయుట
వలన, మీకు ఆయా తత్వాలపై స్వామిత్వం వస్తుంది. తద్వారా ఎన్నో సిద్ధు లు కరతలా మలకము అవుతాయి. ఎలా సంయమము
చేయాలనేదాని విషయంలో...మీరు సద్గు రువు సహకారం తీసుకోవాలి.
సిద్ధు లన్నియూ...చాలావరకు,మనోశక్తు లు. మనస్సును ఏకత్రితం చేసినపుడు,ఈ అనే కానేక సిద్ధు లు ప్రకటితమౌతాయి. అతి
పురాతన కాలం నుండి, భారతీయులకు ఈ సిద్ధు ల గూర్చి తెలుసు. ఇలాంటి సిద్ధు లను, బాగాఅధ్యయనం చేసి శాస్త్రా లుగారూపొం
దించారు. మనో సిద్ధు లు వ్యక్తం కావడానికి ఈ శరీరాలు ఒకమార్గం.సామాన్యులలో ఈ సిద్ధు లు వ్యక్తంకావు.పూర్వ జన్మలలో సాధ
న బట్టి వచ్చిన సిద్ధు లు, తీవ్ర తపో సాధనల వలన వచ్చిన సిద్ధు లు...వ్యక్తం కాగలవు.
      సిద్ధ క్షేత్రం తలుపు తెరచే తాళపు చెవి, మనో ఏకాగ్రతే. సామాన్య మనుజులకు, ఈ మనో ఏకాగ్రతా అభ్యసనంఉండదు.ఎక్కువ
మంది మనుజులు ధనేషణ,దారేషణ, పుత్రే షణల్లోనే...కాలం గడుపుతూ ఉంటారు. ఈ అతీంద్రీయ విషయాలవైపు దృష్టిసారించరు.
    పూర్తి మనో ఏకాగ్రత కలిగిన వారు,సిద్ధ క్షేత్రానికి అధికారి అవుతాడు.ప్రకృతి శక్తు లను నియంత్రిస్తా డు.ఉదాహరణకు ఎందరో
ఋషులు ,పంచ భూతాలను నియంత్రించా రని చెప్పుకుంటాం కదా!..
🌹*నాద బ్రహ్మము....*
ఒక సామాన్య వ్యక్తి, సెకెనుకు 20 నుండి 20000 వరకు,ప్రకంపనాలు కలిగిన శబ్దా లను మాత్రమే వినగలడు.యోగ సాధనలో,
ఉన్నత స్థితులలో ఉన్న ఒక యోగి 20 కంటే తక్కువ, 20000 కంటే ఎక్కువ పౌనఃపున్య ము గల , ప్రకంపనాలను కూడా వినగలడు.
       అందుచేతనే, ఆ యోగ భగవానుడు , భూమిపై రాలే పూలరేకుల శబ్దా న్ని,పుప్పొడి రేణువుల సంగీతాన్ని, సూర్య-చంద్ర-గ్రహ-
నక్షత్ర... నాదాలను కూడా వినగలడు. ఆ యోగ భగవానునికి, విశ్వము నందలి, ప్రతి అస్థిత్వము నందు...నాదము వినబడుతుం ది.
ప్రతి పరమాణువు,తనదైన నాదాన్ని కలిగి ఉంటుంది.అట్టి నాదాన్ని కూడా యోగి వినగలడు.యోగి"నాద బ్రహ్మము"ను విన
గలడు, ఆ నాదంలో లయించగలడు కూడా.
       ఖేచరి ముద్ర, సతత అభ్యాసం వలన యోగి ఆకలి, దప్పికలను జయించే, సిద్ధి వస్తుంది.అంటే ఖేచరిముద్ర ,నిరంతరఅభ్యా సం
వలన,ఆ యోగ భగవానుని అంగిటి నుండి అమృతంవర్షిస్తుంది.ఆ అమృతవర్షం వల్ల , యోగికి,ఆకలి-దప్పికలు తగ్గిపోతాయి
అరుదుగా ఆకాశ గమనం కూడా కలుగు తుంది. ఆహారం లేకుండా జీవించగలిగే సిద్ధిని "బల"అనియూ,నీరు లేకుండా జీవిం
చగలిగే సిద్ధిని"అతిబల"అనియూఅంటారు. ఈ విద్యల యందు పారంగతుడై న వాడు, గాలి-వెలుతుర్ల నుండి ఆహారాన్ని గ్రహించ
గలడు. అయితే అలాంటి సిద్ధు లు పొందా లంటే,"కుండలినీశక్తి జాగరణ"అత్యవసరం.
  అణిమా సిద్ధి అన్నది,అష్ట మహా సిద్ధు లలో ఒకటి. ఈ సిద్ధి ఒక యోగిలో సుదీర్ఘమైన యోగాభ్యాసం ద్వారా,సుదీర్ఘమైన ధ్యానా
భ్యాసాల ద్వారా ప్రకటించబడుతుంది. అణిమా సిద్ధి సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితికి రావడం.అంటే,సామాన్యస్థితిలోఉన్నమనం,
అసామాన్యంగా అతి చిన్న-సూక్ష్మ స్థితిలోకి మారడం.
   ఈ సిద్ధి ద్వారా ఒక యోగి, తన శరీర సాంద్రతను మార్చుకుంటాడు.ఈ స్థితికి రావాలంటే, ఒక సాధకుడు...అనేక సంవత్స రాల
సాధన చేయాల్సి ఉంటుంది.
  ఈ సిద్ధు లుకేవలం నిరంతర యోగాభ్యాసం ద్వారానే కాకుండా,ఒక్కోసారి జన్మతః వస్తూంటాయి.
[2/23/21:-24:09 AM]   ❣️💕❣️
*ఆధ్యాత్మికత అంటే...*
మనం ఉన్నది అమెరికా అయినా,అయోధ్య అయినా మనసుమారకుండా శాంతిసాధ్యం కాదు...మనసు మారితేనే జీవితాలు
మార తాయి. మనసు బాగుంటేనే మన మధ్య సత్సంబంధాలు ఉంటాయి.
అదే శాంతినిస్తుంది.కష్టా ల్లో కూడామనలోని శాంతి చెదరకుండా ఉండొచ్చని ప్రత్యక్షంగా ఆచరించి చూపేవారే మహానుభావులు.మన
లోని భావాలే మాయకు కారణం.మనసు సౌమ్యత పొందే కొద్ది నెమ్మదిస్తుంది. నెమ్మ దించిన మనసు బలంగా మారుతుంది.అదే
స్థితప్రజ్ఞతకు దోహదపడుతుంది.
ఆధ్యాత్మికత అంటే మనసులో స్వచ్ఛత, జీవితంలో స్పష్టతలే....
ఓవర్లు మిగిలి వుండగానే సెంచరీ నో ,,,హాఫ్ సెంచురీనో చేయగలం....
లాస్ట్ బాల్ లో సెంచరీ కొట్టలేము నాయనా..
పంట కోతకొచ్చాక ఎరువేస్తే ఎం లాభం నాయనా..
మంచమెక్కాక హరే కృష్ణ హరే రామ అంటే నేమీ,,,లాయిలాహ ఇల్లల్లా హ్ అంటేనేమీ,,,
ఓం నమో నారాయణ,,,శంభో శివ శంకర అంటేనేమీ,,అంతావ్యర్థమే,,ఏదీకాపాడలేదు
కాబట్టి ఓవర్లు వుండగానే సెంచరీ చెయ్యి,,
దీపముండగానే వుండగానే ఇల్లు చక్కబెట్టు ,
కాయం బలంగా ఉన్నప్పుడే మోక్షం పొందు.
శ్వాసలు మిగిలివుండగానే*జపం* మొదలు పెట్టు ....
❣️💕❣️
       ❣
*జీవన్ముక్తు డు - అంటే....ఈ దేహం తోనే ముక్తిని సాధించటం జీవన్ముక్తి,
శ్రవణ, మనన,నిధి ధ్యాసనల ద్వారా మనో వాసనలను క్షయమొనర్చుట ద్వారా జీవ న్ముక్తి సాధ్యమవుతుంది.
సూర్యుడు చల్లగా భాసించినా,చంద్రు డు చాలా వేడిగా అనిపించినా,జ్వాలలు తల క్రిందులుగా మండుతున్నా జీవన్ముక్తు డు
ఆశ్చర్యపోడు.
*"బ్రహ్మాత్మైక్యానుభవం గల జీవన్ముక్తు డు దేని వలననూ ప్రభావితుడు కాడు ....
జీవన్ముక్తు డు ఏ ప్రాణిని ద్వేషించడు. స్తు తి, నిందలు రెండు ఒక విధంగానే స్వీకరిస్తా డు. మౌనంగా ఉంటూ ఎల్లప్పుడూ సంతుష్టు డై ,
స్థిరమైన నివాసమనేది ఏమిలేకుండ, స్థిర చిత్తంతో భక్తి భావనలో ఉంటాడు.
జన్మనెత్తిన ప్రతి యొక్కరికీ, ముక్తిని పొంద టమే లక్ష్యం, జ్ఞానాన్ని పొందినప్పుడే ఆ స్థితి లభిస్తుంది...
❣️🌴❣️
         
ఈశ్వర వైభవం తెలిస్తే అహంకారం నశిస్తుం ది. తెలియకపోతే, ఈశ్వరుడు మనముందు నిలిచినా,మన అహంకారం,మనల్ని
బాగుప డనివ్వదు సరిగదా మరీ పాడుచేసి కూర్చుం టుంది. భస్మాసురుడు,రావణాసురుడు, దుర్యోధనుడు పరమాత్మను
ముందు పెట్టు కొనే పాడయ్యారు. వస్తు వు ఉంటే లాభం లేదు. వస్తు జ్ఞానం ఉండాలి.
మనలోని వైభవాలుకూడా ఈశ్వర వైభవాలే అని తెలియగనే అహంకారం క్షణంలో నశి స్తుంది. అంతేకాదు, ఈర్ష్యలు నశిస్తా యి.
అసూయలు అదృశ్యమవుతాయి.శతృత్వా లు రూపు లేకుండా పోతాయి.కొందరు వృద్ధి లోకి వస్తే అది చూచి చాలా మంది
ఈర్ష్యలు పెంచుకుంటారు.బాగా ఎత్తు కు ఎదిగిపోయా డని అసూయపడుతూ ఉంటారు.పైకిపోయే వాళ్లను చూచి ఈర్ష్యపడే బుద్ధి
ఉన్నప్పుడు పైకి ఎగిరే పక్షిని చూచి ఈర్ష్యపడరు ఎందు కని? అదేమిటి? పక్షికి నాకుసామ్యమేమిటి? నిజమే.బావుంది.పక్షికి
నీకుసామ్యములేదు. మరి, పరమాత్మకు నీకు సామ్యముందా? చెప్పు. పరమేశ్వరునిపై నీవుఈర్ష్యనుపెంచు కోగలవా?
అసూయపడగలవా?
వేణునాద విద్వాంసుడు తన కన్నా ప్రావీ ణ్యం గల మరొక వేణునాద విద్వాంసునిపై ఈర్ష్యను పెంచుకోవచ్చు. శ్రీకృష్ణుడు కూడా
మురళీనాద విద్వాంసుడే కదా? కృష్ణునిపై అసూయను పెంచుకుంటాడా?వీణా విద్వాం సుడు.,వీణా విద్వాంసులైన మానవులపై
అసూయను పెంచు కోవచ్చునేమో గాని సరస్వతి విషయంలో అసూయపడతాడా? నాట్యాచార్యులు నటరాజుపై ఈర్ష్య పెంచు
కుంటారా? కవులు ఆదికవిపై అసూయపడ తారా? బుద్ధిమంతులు బృహస్పతిపై పోటీ పడతారా? అదేమిటి స్వామీజీ! అదంతా
దైవబలం. ఈశ్వర వైభవం.
ఆ విషయంలో నాకు ఈర్ష్య ఎలాఉంటుంది? అసూయ ఎలా వస్తుంది? అలాగా. అయితే విను. మానవులలో ఉన్నది కూడా పరమా
త్మ వైభవమే. ఏ మానవుడూ తన వైభవం తో శోభించటం లేదు. అందరి వైభవాలూ అచ్యుతునివే. ఎవరిలో, ఎక్కడ, ఎప్పుడు ఏ
వైభవం గోచరించినా అది అంతయూ పరమేశ్వరుని వైభవమే.
ఏయే వస్తు వు ఐశ్వర్యవంతముగాను,కాంతి యుతమైనది గాను, దృఢమైనది గాను, ఉన్నదో అలాంటిది నా తేజస్సు వలన
కలిగినదిగా తెలుసుకో అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలిపాడు. కనుక ఎవరిలో వైభవం గోచరించినా అది ఈశ్వర వైభవమే నని
గుర్తించాలి. దర్శించాలి. ఆనందించాలి. ఇదే జరిగితే, ఆకాశంలో చెట్లు ఉండనట్లు అంతఃకరణలో అసుర గుణాలు నిలువవు.
ఇతరులలోని వైభవాన్ని ఈశ్వర వైభవంగా దర్శించగనే ఈర్ష్యలు,అసూయలు అదృశ్య మగునట్లు , మనలోని వైభవాన్ని కూడా
ఈశ్వర వైభవంగా దర్శించగలిగితే అహం కార దర్పాలు అదృశ్యమవుతాయి. మరి, నాలో ఏ వైభవం లేదు కదా! అని ఆలోచిస్తు
న్నావా? విచారించకు. మనలో ఏ వైభవం లేకపోయినా ఉన్నవారిలోని వైభవాన్నిగుర్తిం చగలిగినా అది వైభవమే. ఎవరిలోయశస్సు
ఉండినా, దానినినీవుగుర్తించగలిగావుఅంటే నీలో ఆజ్ఞానంఉంది.గొప్పతనం ఉంది.యశ స్సు ఉంది.గుర్తించటం చేతకాక గతంలో
ఎన్నో పోగొట్టు కున్నాం. తెలియనివాడు రత్నాన్ని గాజుముక్క అనుకోవచ్చు.తెలియ ని దోషానికి జ్ఞానులకు కూడా దూరం అవు తూ
ఉంటాం.దారిచూపే గురువులకు కూడా దూరమవుతూ ఉంటాము.పరులలోని పర మాత్మ వైభవాన్ని గుర్తించి దర్శించటం సుల
భమైన కార్యం కాదు. అది కూడా యశస్సే.
అలాంటి పవిత్రమైన యశస్సును ఇక్కడే మీరు చూడవచ్చు. ఇప్పుడే చూడవచ్చు. జ్ఞానయజ్ఞం జరిగే స్థలం వేలాదిమంది శ్రోత లతో
దర్శించటం సులభమైన కార్యం కాదు. అదికూడా యశస్సే.అక్కడ శ్రోతలుఅందరూ విద్యావంతులే అని చెప్పగలమా? అందరూ
మేధావులేనా? ఒక్కసారి ఆలోచించండి. అక్కడ నిరక్ష్యరాస్యులు కూడా కొందరు ఉన్నారు. అర్థం చేసుకోలేని ముసలివాళ్లు
ఉన్నారు. ఏదీ అర్థం కాని పిల్లలు ఉన్నారు. అయినా,అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. ఎందుకని? వారిలో
అక్షరజ్ఞానంలేకపోయినా అక్షయ స్వరూపుని గుర్తించే వైభవం వారిలో ఉంది.లేకపోతే వస్తా రా?నిశ్శబ్దంగా వింటా రా? వైభవాన్ని
గుర్తించగలిగే వైభవమే ఒక నాడు వారిలో కూడా శోభిస్తుంది. ప్రయత్న శీలురు పతనమెరుగరు. అహంకారి ప్రగతి ఎరుగడు.....
*మనిషిని బ్రతికి ఉండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు..ఒక్కటి అనుమానం
రెండు ఆవమానం
*ఒక వ్యక్తి మనస్సెంత నిర్మలంగా ఉంటే,
అతని జీవితం అంత అందంగా ఉంటుంది... 🌹🌴🌹🌴🌹🌴🌹  🖤💞♥️
*నీకు విలువ కావాలా..విలువలు కావాలా..
విలువ కావాలంటే, నీకు ఇష్టం వచ్చిన దారి లో, డబ్బు సంపాదించు....విలువలు కావా లంటే, సరైన పద్ధతిలో డబ్బు సంపాదించు..
అంతే కానీ, లోపల డబ్బును వాంచిస్తూ..
పైకి విలువలు ఉన్నట్లు బతుకుతూ,ఆత్మవం చన చేసుకోవద్దు ..
*అదిరిపోయే వాడికి ఆరడుగులేదిక్కయితే,
అందిపుచ్చుకునేవాడికి ఆకాశమే సొంతం..
*జీవితం చాలా చిన్నది.ప్రతి చిన్న విషయం లోనూ..ఆనందాన్ని వెతుక్కో. జ్ఞాపకాలని ఆనందించు..రేపువస్తుందోరాదో తెలియదు.
ఈరోజు,ఈక్షణం,ఆనందించు,ఆస్వాదించు..
*నీ మనసుకి నచ్చిన నిర్ణయంతీసుకో..కానీ, ఆ నిర్ణయానికి భవిష్యత్తు లో ఇంకెప్పుడూ,
బాధ పడకుండా ఉండేలా చూసుకో..
*విజయం సాధించిన వ్యక్తిగాకాదు,విలువ లు కలిగినవ్యక్తిగా ఎదగడానికి ప్రయత్నించు
బాధలు అనేవి గాలిలాంటివి అవిలేని చోటం టూ ఏదీలేదు నీ ఒక్కడికే బాధలు ఉన్నట్టు తెగ బాధ పడకు...చాలా మంది అందులోనే
ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో....
*విద్య నేర్చుకునేటప్పుడు గతంలో తానేమీ నేర్చుకోలేదని భావించి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. గుణపాఠాల విష
యంలో మాత్రం పాత అనుభవాల్ని నిత్యం పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి...
*ధనం సంపాదించాలంటే, ఎలాగైనా సంపా దించవచ్చు.,కానీ ఒక్కరి మనసులో స్థా నం సంపాదించాలంటే ఎదుటివారి మనస్సు
అర్థం చేసుకునే గుణం ఉండాలి..
కళ్ళలో నుండి వచ్చే నీరు ఉప్పగా ఉన్నా కళ్ళు కనే కలలు తియ్యగాఉండాలి. గుండె ల్లో బరువు ఎంతున్నా,చిరునవ్వుతో తేలిక
చేసుకోవాలి...
*దృఢమైన బుద్ధిఅనేది జీవితంలో అలవరు చుకోవలసిన సుగుణాలలో ఒకటి.
*దృఢ నిశ్చయులమై ఉండాలి. ఎప్పుడై తే అలా ఉన్నామో,అప్పుడు మనఅంతరంగం లో పరిపక్వతప్రారంభమౌతుంది.ఎంతకాలం
అలా ఉండగలమో అన్నది మన ప్రతిభకు కొలబద్ధ..
*విశ్వాసం అంటే గంటో, రెండు గంటలో ఉండవలసినది కాదు. సహనముంటేనే భగవదనుగ్రహం లభిస్తుంది.
*ఆధ్యాత్మిక జీవితానికి నిదానము,సహనం అవసరం.భక్తి విశ్వాసాలను కలిగి ఉండాలి..
*వాటి విషయంలో అనుమానం గానీ, బల హీనతగానీ కలిగియుండరాదు...
*మనం ఎప్పుడూ ఓటమిని అంగీకరిస్తూ కుంగిపోకూడదు. పట్టు దలతో గొప్ప గొప్ప ఆటంకాలని అధిగమించగలగాలి.
*మనోస్థైర్యమనే మేళవింపుని మనలో పెంపొందించుకుంటే జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు కలిగినాతట్టు కునినిలబడవచ్చు.
ఆత్మస్థైర్యం లేకపోతే ఎంతటిఅనుకూల పరి స్థితులున్నా ఆపదకలిగినట్లే. ఆధ్యాత్మిక పథంలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి.
అయితే మన జీవనం గాడి తప్పినప్పుడే అవి ఉవ్వెత్తు న ఎగసిపడినట్లు తోస్తుంది. దీనికి పరిష్కారం ఒకటే, మన నిత్యజీవన
కార్యకలాపాలను సరియైన విధంగాఅమలు చేయడమే. ఇది సక్రమంగా ఉంటే సమతు ల్యత ఏర్పడినట్లే...
' *నేను' అనేపదార్థం 'దేహం' లోనికి ప్రవేశిం చడమే "పరకాయ ప్రవేశం"...
    [2/21, 5:17 AM]  🖤💞 ♥️
ఈ స్థూల శరీరాన్ని లింగ శరీరమని,అది పంచభూతాలతో తయారైనదని ఈ భూత ములు విడిపోవుటాలు, కలయికలు అను
విధానము ద్వారా పంచతన్మాత్రు లుగా రూపొంది ఈశరీరము గతజన్మలలోపొందిన అనుభవాలను,అనుభూతులను పొందుట కు
తోడ్పడుచున్నది.అజ్ఞానము వలన అనం తమైన క్రియలు వాటి ఫలితములను జీవా త్మ అనుభవించుచున్నది.
కలలు జీవాత్మ యొక్క ప్రత్యేకమైన స్థితి మెలుకవ స్థితికి భిన్నముగా ఇది ప్రకాశించు చున్నది. కలలలో బుద్ధి లేక మనస్సు వివిధ
పాత్రలను జీవాత్మకు సాక్షిగా పోషిస్తూ మెలు కవ స్థితుల యొక్క జ్ఞాపకాలకు అనుగుణ ముగా జీవాత్మ అనుభవించుచున్నది. అదే
సమయములో ఆత్మ ప్రకాశమును గ్రహించి బుద్ధి అన్ని విషయాలను నడింపించు చున్న ది. ఆత్మ బుద్ధియొక్క చేష్టలకు అతీతము
గా సాక్షిగా గమనించుచున్నది. ఎన్ని కర్మలు చేసినను వాటిఫలితములుఆత్మకుఅంటవు.
🖤💞💞
             ♥️
సృష్టి ప్రణాళిక ననుసరించని జీవుడు సుఖ మును కోల్పోవు చున్నాడు,కాని ప్రయాణం మాత్రము సృష్టి ప్రణాళికననుసరించియే
యుండును. ప్రణాళికననుసరించు వారికి సృష్టి చక్రము నందు సమన్వయమేర్పడి కారణము లేని తృప్తి కల్గియుందురు. వారికి
సర్వముయజ్ఞార్థకర్మయేకాని తమకుసంబం ధించినదేదియు యుండదు. ప్రయాణమున సుఖముండును.
స్వభావము ననుసరించి లోకశ్రేయస్సు కోరి, ఫలాపేక్ష లేక కలవరపాటు లేక ఆచరించిన కర్మ వలన పరిపూర్ణ సిద్ధి కల్గును. ఫలాపేక్ష
లేకపోయిననూ పనులయందు పట్టు దల సడల రాదు. ఇతరులు కూడ ఫలాపేక్ష లేక వర్తింపవలెనను బుద్ధి యుండరాదు. ప్రకృతి
యందు పనులన్నియు గుణముల ప్రేరణచే కల్గునని  గమనించి వ్యక్తు లు కారణము కాదని తెలియవలెను.
ఇట్లు తెలియుట  వలన తనపై కర్తృత్వము నారోపించుకొనుట,యితరుల యందు దోష ములెన్నుట తప్పును.వ్యామోహము నందు
చిక్కుబడుట కూడ తప్పును.కర్మాచరణము నందు ఒకరినొకరు చూచుకొనుటలో అంత ర్యామి దర్శనముచేయవలెను.అట్లు
చేయు టవలన శ్రద్ధ అలవడును.అసూయాదులు సోకవు.
🖤💞💞💖
           
‘‘నాతో విసిగిపోయిన నేను నిస్సారమని తెలుసుకున్నాను... ఇప్పుడేం చెయ్యాలి?’’ అని నన్ను అడిగావు.అది ఒక గొప్ప ఆవిష్క
రణవును,నా భావన అదే.చాలా కొద్దిమంది మాత్రమే తాము చాలా విసిగిపోయామని తెలుసుకుంటారు.అది శుభారంభమే.తమ
గురించి తప్ప,అది అందరికీ తెలుసు. ఇప్పు డు మనం కొన్ని అంతర్భావాలను అర్థం చేసుకోవాలి.
చిరాకుపడుతూ విసుక్కునే ఏకైక జంతువు కేవలం మనిషి మాత్రమే. అది మనిషికున్న ఒక గొప్ప ప్రత్యేకమైన హక్కు, మనుషులు
ప్రదర్శించే దర్జా లో ఒకభాగం.విసుక్కునే గాడిదలను, దున్నపోతులను మీరెప్పుడై నా చూశారా? అవి ఎప్పుడూ విసుక్కోవు.విసు గు
అంటే మీరు జీవించే తీరు సరిగాలేదని అర్థం. ‘‘నాకుచాలా విసుగ్గాఉంది.అది పోవా లంటే ఏదో ఒకటి చెయ్యాలి’’ అనుకుంటూ
మీరు ఏదో ఒకటి చేస్తా రు. చివరికి అది ఒక గొప్ప సంఘటనగా మారవచ్చు.
కాబట్టి, మీ విసుగును తప్పుగా భావించకం డి. చక్కని శుభారంభానికి అది ఒక మంచి సంకేతం. కానీ,అక్కడే ఆగిపోకండి.ఎవరైనా
ఎందుకు విసుక్కుంటారు?ఇతరులు మోపిన మృత విధానాలలో జీవిస్తు న్న ఎవరికైనా విసుగ్గానే ఉంటుంది.వాటిని త్యజించి బయ
టపడి మీకుమీరుగాజీవించడం ప్రారంభిం చండి.
అంతర్గతంగా మీరు చెయ్యాలనుకున్నది ముఖ్యం కానీ,డబ్బు,అధికారం,ప్రతిష్ఠలు ముఖ్యం కాదు. కాబట్టి, ఫలితాల గురించి
ఏమాత్రం పట్టించుకోకుండా మీరు చెయ్యాల నుకున్నది చెయ్యండి. అప్పుడే మీ విసుగు పోతుంది. ఇతరుల అభిప్రాయాల ప్రకారం
మీరుకూడా వారిలాగే అన్నీసరిగాచెయ్యాలి. అదే మీ విసుగుకు మూల కారణం.
మనుషులందరూ చిరాకు పడుతున్నారు. ఎందుకంటే, మార్మికుడుగా ఉండవలసిన వ్యక్తి గణిత శాస్తవ్రేత్తగా,గణిత శాస్తవ్రేత్తగా
ఉండవలసినవ్యక్తి రాజకీయనాయకుడుగా, కవిగా ఉండవలసిన వ్యక్తి వ్యాపారవేత్తగా ఉంటున్నాడు.ఇలాఅందరూ ఎక్కడో ఉంటు
న్నారే కానీ, ఎవరూ తమకు తాముగా లేరు. కాబట్టి,ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం గా ఉన్నప్పుడే మీ చిరాకు అదృశ్యమవు
తుంది.
‘‘నాతో విసిగిపోయిన నేను నిస్సారమని తెలుసుకున్నాను... ఇప్పుడేం చెయ్యాలి?’’ అని నన్ను అడిగావు. నిజమే, నువ్వు నీతో
విసిగిపోయావు. ఎందుకంటే, నీపట్ల నువ్వు గౌరవంతో, చిత్తశుద్ధితో, నిజాయితీగా లేవు. అప్పుడు నీ శక్తి నీకెలా తెలుస్తుంది?  నువ్వు
చెయ్యాలనుకున్నది చేసినప్పుడే-అది ఏదై నా, ఎలాంటిదైనా కావచ్చు- నీలో ఉన్న శక్తి ప్రవహిస్తుంది.
💙💞💖
              
*ఆసక్తి అనాసక్తిగా ఎట్లు మారగలదు?అంత రంగ మాధుర్యము బహిరంగ మాధుర్యము కన్న మిన్నయని జీవునకు తోచినపుడే ఇది
సాధ్యము.సత్సాంగత్యము,సద్గురు బోధ అమిత మధురమగు విషయము నావిష్క రింపగ దానియందు ఆసక్తి కలుగుటకవకాశ
ముండును.దైవమునుగూర్చిన రుచి పెరుగు చుండగ ప్రవృత్తి యందు మార్పునకై కృషి కూడ సమాంతరముగ సాగవలెను. అట్లు
సాగుటకే ప్రవృత్తి కార్యములందు అనగా బాహ్య ప్రవర్తనయందు కర్తవ్యనిర్వహణము మాత్రమే నిర్వర్తించుట నొకదీక్షగ గైకొనవలె ను.
కర్తవ్యేతరసంకల్పములు సాధకుని వీడి నపుడే అతడు యోగమున పురోగతిచెందు అవకాశము కలిగి యుండును. ఈ స్థితినే
భగవంతుడు సంకల్ప సన్యాసమని పలికి నాడు....
హృదయము నుండి ప్రజ్ఞ, యింద్రియముల ద్వారా బహిర్గతమగుచున్నది గనుక,హృద యమును రంజింపజేయు విషయమొక్కటి
తెలిసినచో బాహ్య విషయములందనాసక్తికి అవకాశ మేర్పడును.అంతరంగ మాధుర్యం బహిరంగ మాధుర్యముకన్న మిన్నయని
జీవునకు తోచినపుడేఇదిసాధ్యము.సత్సాం గత్యము,సద్గురు బోధ అమితమధురమగు విషయము నావిష్కరింపగ దానియందు
ఆసక్తి కలుగుటకవకాశ ముండును.
అట్లే సభ్రంథములు కూడ అట్టి ప్రచోదనము కలిగింపగలవు.దైవమునందు రుచికలుగుట దైవానుగ్రహమే.రుచి కలిగినవారు
సత్సాంగ త్యము,సధ్ గ్రంథపఠనముకావించుటవలన రుచి పెరుగగలదు.
దైవమును గూర్చిన రుచి పెరుగుచుండగ ప్రవృత్తియందు మార్పునకై కృషి కూడ సమాంతరముగ సాగవలెను.అట్లు సాగుటకే 
ప్రవృత్తి కార్యములందు అనగా బాహ్య ప్రవ ర్తన యందు కర్తవ్య నిర్వహణము మాత్రమే నిర్వర్తించుట నొక దీక్షగ గైకొనవలెను.చేయ
వలసిన పనులనుమాత్రమేచేయుచు,చేయ దలచిన వన్నియు చేయుటమానవలెను. కర్తవ్య కార్యము లెవ్వరికినితప్పవు.వానిని
నిర్వహింపకపోవుట అవివేకము.కర్తవ్యము నకు మించి కలుగు సంకల్పములు కోరికలే యగును.ఈ కోరికలే కళ్ళెములేని గుఱ్ఱము
లు. వీనిని అదుపున నుంచుకొనినచో ప్రజ్ఞ బాహ్యము నుండి అంతరంగము లోనికి తిరోధానము చెందదు.
కోరికలను నియమించుట, నిగ్రహించుట అనగా, కర్తవ్యము కాని సంకల్పములలో నియమించుట. విచక్షణము లేనిచో కర్తవ్య
మేమో తెలియదు.కానిపనులు కూడ కర్త వ్యమే అనిపించును.అపుడు జీవుడు తీరు బడి లేక తిరుగుచుండును.
కర్తవ్యము నందు తప్ప యితరములగు ఆసక్తి నశించుటకు బాహ్యముగ దీక్షనుగొ నుట, అంతరంగమున నచ్చిన ఒక వెలుగు
రూపమును ఆరాధించుట నేర్వవలెను.కర్త వ్య కర్మను మాత్రమే నిర్వర్తించు జీవుడు యింద్రియార్థముల వెంటబడి ప్రపంచమున
పరుగెత్తడు.
ఆహార వ్యవహారాదులను క్లు ప్తము కావించు కొనును.ఆసక్తి అంతరంగమునుగూర్చి ఏర్ప డుచుండగ బహిరంగమున వ్యాప్తిపై ఆసక్తి
యుండదు.ఇట్లు భగవంతుడు చెప్పిన అనా సక్తత సిద్ధించు చుండును.
సంకల్పములు కూడ కర్తవ్యము మేరకే ఏర్ప డుచుండును గాని, ఊరుట యుండదు. మానవులకు సంకల్పములు ఊటబావిలోని
నీరువలె ఊరుచునే యుండును.అట్టి వారికి ఊరట కలుగదు.వారు ధ్యానమున కర్హులు కారు.ఆత్మసంయమమునకు అర్హులు
కారు.
కర్తవ్యేతర సంకల్పములు సాధకుని వీడిన పుడే అతడు యోగమున పురోగతి చెందు అవకాశము కలిగియుండును.ఈస్థితినే భగ
వంతుడు సంకల్ప సన్యాసమని పలికెను..
ఇంద్రియార్థముల వెంటబడి తీరుతెన్ను లే కుండ, గతి గమ్యము లేకుండ బాహ్యము నకు ప్రసరించు మానవ ప్రజ్ఞను, కర్తవ్యము
మేరకే నిర్వర్తింప జేయుట, కర్తవ్యేతర సంక ల్పములను సన్యసించుట ఆత్మ సంయమ మునకు ప్రధానమగు సూత్రము.
💙💞💓
                  
*ఒకడు ఎంతటి పాపంచేసాడో,ఎలాంటి పాపంచేసాడో,ఆ పాపానికి ఆ లక్షణానికి అనుగుణమైనశరీరాన్ని అతడికి మహర్షులు
ప్రసాదిస్తా రు.దానినే శాపం అంటారు.
*ఎవరైనాబిడ్డలను పరోపకారంకోసంకనాలి. తనకోసం కాదు.మంచి సంతానాన్ని కనడం ఎందుకంటే –వార్ధక్యంలో తనకు వాళ్ళు
సేవచేస్తా రా లేదా అని ఆలోచించటం కంటే, పరోపకారం కోసం మంచి బిడ్డలను కనాలి, అనే సదుద్దేశ్యంతో కనాలి. సంతానాన్ని ఆ
కారణంగా వారికి ఆ ఫలం లభిస్తుంది. మరి వార్ధక్యంలో ఎవరుచూస్తా రుఅంటే,తనజాత కంలో పుణ్యంఉంటే అలా చూచే సంతానం
కలుగుతుంది.పరోపకారార్ధం తన పుణ్యం ఇస్తా ను అంటే,ఆ ఫలంగా అట్టి సంతానం కలుగవచ్చు.ఎవరైనా సంతానంలేక దుఃఖ
పడుతున్నాడంటే అది సామాన్యమే.
కానిసంతానాన్ని పరోపకారంకోసంఅడగాలి. ఆర్యులు అలాఅడిగారు.వారు దానికోసం తపస్సుచేసారు.కాబట్టి భారతీయులందరూ
కూడా సంతానాన్ని, పెద్దలను తరింపచేయ డానికి కోరటంఅని సామాన్యవాక్యంగా చెప్పి నప్పటికీ; ఇందులో పరమార్థం ఏమిటంటే
– దేశానికి సేవచేసేవాళ్ళు, ధర్మాన్ని నిలబేట్టే వాళ్ళు, దేవతలను మెప్పించే వాళ్ళను కోరి పొందమని,అలా పొంది సమాజానికి ఇచ్చి
నవాడు శాశ్వతమైన మోక్షానికి అర్హుడవు తాడని.అది ప్రధానమైన అంశం.అందుకోస మని పుత్రలాభం ఉంటుంది.
సంసారం ఒక విషవృక్షం అని,ఒక వంక మన పెద్దలు చెబుతున్నారు.విషవృక్షమే అయిన ప్పటికీ, దానికి రెండు మధురఫలాలు ఉన్నా
యని అన్నారు.విషవృక్షానికి మధుర ఫలా లు ఉంటాయా అంటే,ఆ సంసారమనే విష వృక్షానికిమాత్రం ఉన్నాయనిచెబుతున్నారు. ఆ
రెండు ఫలాలకోసమే ఈ సంసారవృక్షాన్ని భరించమని చెప్పారు.
అవి రెండూ ఏమిటంటే –ఒకటి, అనుకూల వతియైన భార్య-అంటే ధర్మాచరణలోతనకు అనుకూలంగా,తోడుగాఉండే భార్య; 2,
వది వంశవర్ధనుడై ధర్మాన్ని పాలించే పుత్రు డు. అట్టివాడి ముఖంచూచే భాగ్యం రెండవ మధురఫలం.ఈ రెండు మధురఫలాలు
లభిస్తే సంసారం విషవృక్షం అయితే మాత్రం ఏమవుతుంది? భరిస్తా రు.అలా చెప్పారు మన పెద్దలు.....
పరమ ముక్తు నకు సృష్టిలో కర్తవ్యము (అధి కారము) ఉన్నది. అనంతమందు, సాంత మందు ఏకకాలమందే ఎరుకతోయుండును.
సద్గురువు:-భగవంతుడు ,మానవునిగా ,
తనను ప్రతి వారిలో ప్రతిదానిలో చూచును.
నిజమైన జ్ఞానము:-అటు భగవంతుని యొక్క ఇటు విశ్వం యొక్క సంపూర్ణ జ్ఞాన ము ఆధ్యాత్మిక పరిపూర్ణతను హస్తగతము
చేసికొన్న సద్గురువుల యొక్క అవతార పురుషుని యొక్క దివ్యజ్ఞానము,.. (సత్యానుభూతి యొక్క దివ్యత్వము).
*Do not spend your energy in talking, but meditate in silence. Accumulate power in silence and become a
dynamo of spirituality.*
*మీశక్తిని వ్యర్ధమైన మాటల్లో వృధాచేయక, మౌనంగా ధ్యానంచేయండి.మనశ్శక్తిని సమీ కరించి ఆధ్యాత్మిక శక్తిజనకయంత్రంగా
అవతరించండి..
*Fill the brain with high thoughts, highest ideals, place them day and night before you, and out of that
will come great work.
*బుధ్ధిని ఉన్నతవిషయాలతో,అద్వితీయమై న ఆదర్శాలతో నింపుకోండి. రేయింబవళ్ళు వాటినే స్మరించండి. అప్పుడే అధ్భుతాలు
సాధించగలరు..
🖤💞💓
           
*మన యొక్క ఆలోచనలనీ,భావాలనీ నిర్ల క్ష్యం చేస్తే ఆధ్యాత్మిక జీవితంలో పురోభి వృద్ధిని సాధించలేము.మన ఆంతరిక జీవి తాన్ని
క్రమబద్ధం చేసుకోవాలి. ఇది మనకి మనమే చేసుకోవాలి కానీ ఇంకొకరు చేసేది కాదు.ఎప్పుడై నా ఉత్సాహం తగ్గితే దానిని
రెండింతలు,మూడింతలుచేయడానికి ప్రయ త్నించాలి.అప్పుడప్పుడూ ఆధ్యాత్మిక ప్రమ త్తత ఆవులిస్తూఉంటుంది.దానిని సాహస
హృదయంతో అధిగమించాలి.భగవంతుడు మనకు దూరంగా ఎక్కడోలేదు.మనం ఇలా భావించినందువల్లే
అతడుదూరంగాఉన్నట్లు అగుపిస్తు న్నాడు.పవిత్రత,విశ్వాసాలద్వారా ఆయన సామీప్యాన్ని పొందాలి....     
*"ఆధ్యాత్మిక జీవనం అంత సులభంగా ఉండేట్లు కనిపించడం లేదే !?"
*సత్యాన్ని అర్థం చేసుకోవడం,తేలికైన తెలి సిన మార్గంలోనే అర్థం చేసుకోవటం ఆధ్యా త్మిక జీవనాన్నిసులభతరంచేస్తుంది.ముందు
దేవుడున్నాడని తెలుసుకునేందుకు,ఆయన సమర్థతను గుర్తించేందుకు,ఆయనను ఎలా ఆరాధించాలో తెలియజేసేందుకు, దైవాన్ని
ఎలాదర్శనం చేసుకోవాలో చెప్పేందుకు,చివ రికి తాను ఆ దైవానికి భిన్నంగాలేనని రూఢీ చేసుకునేందుకు..ఇలా అంచలంచలుగా
ప్రతిఒక్కరూ తమలోనిదివ్యత్వాన్ని తెలుసు కోవడం ద్వారా మరింత ఉన్నతమైన, వివేక వంతమైన,నాణ్యమైన జీవనంతో ఆదర్శం గా
నిలుస్తా రు.ప్రార్థనగా మొదలైన భక్తి ఆరా ధనగా పరిణమించి మన స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే ఆధ్యాత్మికతలోని అంతర్యం !..
💜💞💓
             
*పరమశాంతి సొంతమైతే ఇక ప్రత్యేక సాధనలతో పనిలేదు !!.
*లౌకికజీవనం, భౌతికజీవనం అంతా గతా నుభవంపై ఆధారపడి ఉంటుంది. దైవానుభవం అలాంటిది కాదు.దానికి గతా
నుభవంతోపనిలేదు.ఎందుకంటేఅది నిరంత రం ఉంటుంది.నిత్యనూతనంగా ఉంటుంది. అది మరొకదానితో పోల్చదగిందికాదు.ఒక
ప్పుడు ఉండి ఒకప్పుడు లేనిదికాదు.అది నిరంతరాయ వర్తమానం.భూత,భవిష్యత్ లతో సత్యానికి నిమిత్తం లేదు.ఆధ్యాత్మికత
అంటేనే శాంతి సాధన. పవిత్రమైన జీవనం తో పరమశాంతి మనసొంతమైతే,ఇక ప్రత్యే క సాధనతో పనిలేదు !.
💜💞💓
               
*శ్రద్ధలో పోకడలు.....*
తపస్సు రజస్తమోదోషములనుహరించును. తపస్సు మూడువిధములు.1.శరీరము, 2. వాంగ్మయము,3.మానసము.ఈ
మూడింటి యందు గల లక్షణములు తెలియవలెను. అవి1.శారీరతపస్సునందు ఈ లక్షణములు ఉండును:-(1)దేవతాపూజ,
(2)బ్రాహ్మణ పూజ,(3)గురుపూజ, (4)పండిత సన్మానం, (5)స్నానాదిశుచిత్వము,(6)ఋజుప్రవర్తనం
(7)బ్రహ్మచర్యము, (8)అహింస.
(ఈ లక్షణముల వలన దేహము నందలి రజస్తమః ప్రకోపములు నశించును.యోగా భ్యాసమునకు శరీరము అనుకూలమగును.
2.వాంగ్మయ తపస్సున ఈ లక్షణములు ఉండును:-(1)ఇతరులకుక్లేశము,భయము, దుఃఖము మున్నగుఉద్వేగములను కలిగిం
చు వాక్యములను పలక కుండుట, (2)సత్య ము పలుకుట,(3)ప్రియముగా పలుకుట,
(4)హితము కోరి పలుకుట,(5)వేద శాస్త్రా దులు అధ్యయనము చేయుట.
(దీనివలన వాగ్దేవి శుద్ధి అయి వాక్కు శక్తి మంతమగును.వాక్సిద్ధి,కవిత్వ శాస్త్ర స్ఫుర ణము, శబ్దా ర్థ సమన్వయము ఔచిత్యము
అలవడును.)
3.మానస తపస్సు నందీలక్షణములు ఉండును:-
(1)మనస్సున సంతోషము నిలుపు కొనుట,
(2)ఇతరులను గూర్చి సౌమ్యముగా భావిం చుట,(3)మౌనము, (4)ఆత్మనిగ్రహము
(5)భావములు పరిశుద్ధిగా నుంచుకొనుట.
(సౌమ్యత్యమనగా ఇతరులకు కీడు భావిం చుట, తప్పులు పట్ట చూచుట మున్నగు లక్షణములను విడుచుట.మౌనమనగా
ఆవశ్యకము కాని వానిని భావింపకుండుట. దీనినిబట్టి మౌనము వాక్కునకు సంబంధిం చినది కాదనియు, మనస్సునకు
సంబంధిం చినదనియు తెలియుచున్నది.భావనం శుద్ధి అనగా ఇతరులకు చెప్పుటకు వీలు లేనివి ఊహింపకుండుట. దీనివల్ల
రహస్యబుద్ధి, పాప చింత, బుద్ధిసంకోచము తొలగును.
💓 💞💓
          
ఏది ధర్మమో నాకు తెలుసు. కాని దానిని అనుసరించి ప్రవర్తింపను.అధర్మమేదో తెలు సు.కాని దానినుండి విరమింపను.హృదయ
మునందు ఆసీనుడై న ఏ దైవమో ఎట్లు నియమించిన అట్లు
ప్రసన్నగీత యందలి దుర్యోధనుని పలుకు లు,."కేనేపి దేవేన" అనే మార్పుతో భగవం తుడే కర్తయని భావించే జ్ఞాని వాక్కుగా
చెప్పబడినవి.
పరమార్థమందు ఆత్మజ్ఞానికి కర్మలతోసంబం ధమేలేదు.అయినను లోకదృష్టియందు చేయువాడుగానూ,చేయించువాడుగానూ
కనపడుచున్నాడు.
అయినప్పటికి సంపూర్ణ అపరోక్షజ్ఞానము గల మహానుభావుడు నూరుకోట్ల అశ్వమేథ యాగముల నాచరించుగాక,సమస్తదానము
లు సల్పుగాక,అఖిల జీవులకు సుఖకరము లైన సుకర్మములను చేయుగాక,కానీ తత్త త్కృత్యముల వలన,కర్తృత్వ బుద్ధి లేక
పోవుటచే పుణ్యము లేదు పాపము లేదు.
తత్త్వవేత్తయగు కర్మయోగి అన్నియు చేసి యు చేయని వాడు.కనుక వినిన,తినిన, తిరిగిన,తాకిన,గ్రహించిన,మూకొనిన, పరి
హరించిన - ఏమి చేయుచున్ననూ ఆయా ఇంద్రియములు ఆయా విషయములందు ప్రవర్తించు చున్నవే గాని తాను యేమియు
చేయుట లేదని నిశ్చయము.
ఎట్లనగా,ఆయా ఇంద్రియములు దేహము నకే గానీ ఆత్మయైన తనకు కరణములు (కొరముట్లు )కానేరవు.కాన కరణ రహితమ గు
తనకు కర్మయే లేదని జ్ఞాని నిశ్చయమై యున్నది.
💓💞💓
            
*కర్మలవల్ల మూడువిధాలైన ప్రయోజనాలు: 1.ఈ లోకంలో మన మున్నంతకాలం మనకీ మనచుట్టూ ఉన్నవారికీ దేవతల
అనుగ్రహం వల్ల క్షేమంకలగటం.2: చనిపోయిన తరువా త దేవలోకంలో ఆనందంగా గడపగలగటం.
దేవలోకంలోనివాసంశాశ్వతంకాదు. మన పుణ్యాన్నిబట్టే అక్కడ నివాసముంటుంది.
*దేవలోకంలో లభించే సౌఖ్యం భక్తు నికి గాని జ్ఞానికి గాని కలిగే ఆనందంతో పోల్చలేం. ''మనీషా పంచకం''లో ఇంద్రు ని ఆనందంకూ
డా, ఆత్మసాక్షాత్కారం పొందినవాని ఆనం దంలో సహస్రాంశం కూడా ఉంది..అయిన ప్పటికీ, ఈ భూమి మీద జీవితంతో పోలిస్తే
స్వర్గలోకంలోని నివాసం ఎంతో హృద్యం. ఈ సౌఖ్యం లభించటం యజ్ఞాల నిర్వహణ వల్లకలిగే ఫలితాలలో రెండవది. ఇక 3.వది:
ఇది అన్నిటికంటె ముఖ్యమైనది. గీతలో దీని గురించి ఇట్లా ఉంది - ప్రతిఫలాపేక్ష లేకుండా యజ్ఞాన్ని నిర్వహించాలి...
*ఈ లోకంలో గాని, దేవలోకంలో గాని కలిగే సౌఖ్యం - యజ్ఞాలకి ప్రతిఫలమే.దీనిని కోర కుండా, లోక కల్యాణం కోసం, స్వార్థ చింతన
లేకుండా,మమతా రహితంగా యజ్ఞాన్ని నిర్వహిస్తే అది శీఘ్రగతిని మనస్సుని పరి శుద్ధం చేస్తుంది.ఇదే తరువాత జ్ఞానమార్గా న్ని
చూపుతుంది. దానిగమ్యంమోక్షం-అంటే, జన్మ రాహిత్యం సచ్చిదానందం అంటే పర మాత్మలో లీనమవుతాం.అద్వైతానికి సారాంశం
ఆత్మ సాక్షాత్కారమూ, శుద్ధజ్ఞాన మూ...వారే, ''వేదో నిత్య మధీయతాం తదితం కర్మ స్వనుష్ఠీయతాం'' అన్నారు. (వేదాలను నిత్యం
అధ్యయనం చెయ్యి, వాటిలో చెప్పబడిన కర్మలను శ్రద్ధగాచెయ్యి) ఇదే మూడవ ఫలితం. ఈ లోకంలోగాని, స్వర్గలోకంలోగాని
సుఖంగా ఉండగలుగుతా మని వారు చెప్పలేదు.స్వలాభాపేక్ష లేకుండా కర్మలను చేయటం వల్ల చక్కని అవగాహన, చిత్తశుద్ధీ
కలుగుతాయనే వారి ఉద్దేశం.
*మానవులకు, దేవతలకు పరస్పరలాభం: యజ్ఞ యాగాదులను చేయటం వేదాలలోని ముఖ్యాంశం.దీని గురించి కృష్ణ భగవానుడు
గీతలో చెప్పాడు.బ్రహ్మలోకంతోబాటు,మాన వులు చేయవలసిన యజ్ఞాలను కూడ సృష్టించాడు.''యజ్ఞాలను చేస్తూఉండు, వాటి
వల్ల కలిగేఫలితాలతో సుఖంగాఉండు. యజ్ఞాన్ని కామధేనువుగా భావించు'' అంటుంది భగవద్గీత. జగత్సృష్టికి మూలం
వేదమంత్రాలే. కనుకనే, ఆ మంత్రాల పఠనం వల్ల ఉద్భవించే తరంగాలకి దేవతలే ప్రత్యక్ష మవుతారు.యజ్ఞంలో మంత్రాలను పఠించ
టం పోస్టలు కవరుపై చిరునామా వ్రాయ టంతో సమానం.
*ఆ మంత్ర పఠనంతో బాటు ఉపాహారాన్ని సమర్పిస్తేనే సందేశాన్ని దేవతలకు అగ్ని చేర వేస్తా డు. జంతువులలో పిల్లి, కుక్క, గుఱ్ఱం,
ఏనుగు, సింహం - క్రమంగా ఒకదాని కంటె ఒకటి బలాఢ్యం.ఆవిధంగానే సృష్టిలో కూడా మర్త్యుల కంటె ఎక్కువ
శక్తిమంతులున్నారు. వారే దేవతలు.ఈలోకంలో పంచభూతాలతో బాటు ఉన్నా దేవలోకంలో మాత్రం ప్రత్యేక మైన రూపాలతో
ఉంటారు. మంత్రాలను సవ్యంగా పఠించటం వల్ల కలిగే సత్ఫలితా లలో ఒకటి దేవలోకంలోని వారి రూపాలను సృష్టంగా
చూడగలగటం.అంతే కాక,వారను గ్రహించే ప్రసన్నతను కూడ అనుభవించ గలగటం....
*మంత్రజపం కలిగించే తరంగాల వల్లనే పరమాత్మలో వారు దర్శనమిస్తా రు. అంటే మంత్రాలు దేవతల శబ్దరూపాలన్న మాట.
యజ్ఞంలో ఒక్కొక్క దేవతకి సంబంధించిన మంత్రాన్ని పఠించినప్పుడు ఆ దేవతప్రత్యక్ష మవుతాడు.ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందిన
వాళ్లు , వాళ్లని చూడ గలుగుతారు. కంటికి కనబడక పోయినా, వారి ఉనికి స్పష్టంగా తెలుస్తుంది.అయినా,వారికి నేరుగా ఉపహా
రాలివ్వటం నేరం.
*మంత్రోచ్ఛారణ జరుపుతూ అగ్నికి సమ ర్పించటం వల్లనే ఆ ఉపహారాలు దేవతలకు ఆమోద యోగ్యమైన రూపాన్ని పొందుతా
యి. మనమిచ్చిన ఉపహారాలలో చాలా భాగం అగ్నిలో ఆహుతైపోగా మిగిలినది మనం ప్రసాదంగా తీసుకోగా అవి గమ్యాన్ని ఎట్లా
చేరగలుగుతాయని మనమాశ్చర్య పోనక్కరలేదు. మన వలె దేవతలకు పంచ భూతాత్మకమైన(అంటే,భూమి,నీరు,వెలుగు,
గాలి,ఆకాశం కల) దేహాలుఉండవు. మనం తీసుకునే ఆహారం వంటి పదార్థం వారికవ సరం లేదు. మనలో కూడా మనం భుజించే
ఆహారం ఒంట బట్టేలోగా జీర్ణకోశం దానిని అనేక విధాల మారుస్తుంది.ఆ విధంగానే, యజ్ఞంలో అగ్ని మనమిచ్చే ఉపహారాలని
దేవతలకు కొనిపోయేముందు ఎంతో సూక్ష్మ రూపంలోకి మారుస్తుంది.ఈ మార్పు కూడా మంత్రాల ప్రభావంవల్లనే జరుగుతుంది.
*దేవుణ్ణి పొందటం ఎలా......*
*దేవుడు అంటే ఏమిటో అర్థం తెలిస్తే, పొందటం గురించి తర్వాత ఆలోచిద్దాం.
*( దేవుడు అనంతుడు.పొందటం, పోగొట్టు కోవడం అసంభవం అని భావం.).
*సృష్టికి లయం సంగతి తెలియదు. లయా నికి సృష్టి సంగతి తెలియదు. స్థితికి ఈ రెండిటి సంగతి తెలియదు. ఈ మూడింటి
సంగతి ఒక్కదానికే తెలుసునని ఉన్నదే 'మాయ'..
*భూతకాలం అనే 'పెనుభూతం' నుండి బయటపడటమే ఆధ్యాత్మికత.
*భవిష్యత్తు అనే 'గాలిమేడలు'  నుండి బయటపడటమే ఆధ్యాత్మికత.
*వర్తమానంలో ప్రతి అనుభవాన్ని గొప్ప అనుభవంగా స్వీకరిస్తూ, ఆ అనుభవంలో జీవించడమే ఆధ్యాత్మికత.
*ఆధ్యాత్మిక అన్వేషణ...'ఇదంతా నాదే'అని మొదలై, 'ఇదంతా నేనే' అని ముగుస్తుంది.
*సత్యం అర్థమైతే - విద్య. సత్యం అనుభవ మైతే -  పరావిద్య.
*నిరంతరం,అన్నింటినీ,అందరి దగ్గరా నేర్చు కుంటూ వుండడమే 'ప్రజ్ఞ'.నిరంతరం,అన్నిం టినీ,అందరికీ నేర్పిస్తూ వుండడమే
'కరుణ'..
  💓💞💓    
మనసు మొదటి స్పందన కన్నీరే, ఆనందమైన విషాదమైన....
నీ మేలు కోరే వారు ఎప్పుడు నీకు తెలియ కుండానే నిన్ను అనుసరిస్తూవుంటారు,వారి ని వెతికిపట్టు కోవడం విజ్ఞత,నిలుపుకోవడం
బాధ్యత...
*ఏ తప్పుచేయనప్పుడు ఎవరి దగ్గర చేతు లు కట్టు కొని నిలుచోకు ,అలా చేతులు కట్టు కోవడం అలవాటుగా చేసుకున్నామంటే
జీవితాంతం ఎవరో ఒకరి చెప్పుచేతల్లో వుం డి బ్రతకాలిసిందే
*ఎన్ని మతాలు వున్న అసలైనమతం మాన వత్వం.
*ఒడిపోయిన ప్రతిసారీ  అర్థం అయ్యేది  గెలుపు ఎంతో దూరంలో లేదు అని.
*లక్షనక్షత్రాలు అయిన ఒకచంద్రు డుకాలేవు.
*ప్రశాంతతకు మించిన ఆస్తి మరి ఒకటి వుండదు.
*గొంతు పెంచడం కాదు.నీమాట విలువ పెంచుకో.వాన చినులకే తప్ప ఉరుములకి పంటలుంపండవు..
*భయం సుత్తి లాంటిది.గెలుపు ద్వారాలకు మేకులేసి కొట్టేస్తుంది. అసహనం విషం లాంటిది. గెలుపుని చంపేస్తుంది..
*ఇచ్చే బహుమతి విలువకంటే ఇచ్చే విధా నము లోనే గొప్పతనం ఉంటుంది..
*మనం చేసేది తప్పా కాదా అనేది ఎవరో చెప్పనక్కరలేదు. ఒంటరిగా కూర్చొని అంత రాత్మని అడిగితే చాలు!!
*విమర్శలకు అవసరానికి మించి స్పందించ డం ఒకానొక శక్తి విహీనత!!..
*యోగమంటే ఇంకేమి కాదు .నీకర్తవ్యాన్ని నీవు నిర్వర్తించడమే!!
*మనం చేసేది ఎలాంటి ఉద్యోగమైనా సరే, అందులో ఎవరూ చూపించని నైపుణ్యం చూపించు,సరికొత్త పోకడలకు ప్రయత్నించు
అద్భుతాలు చూస్తా వు!!
*మేఘము వెళ్ళిపోయాక సూర్యుడు కని పించినట్లే, అజ్ఞానం అంతరించాక జ్ఞానం గోచరిస్తుంది..
*నీకు నువ్వే ఆప్తు డివి,నీకు నువ్వేశత్రు వువి, నీకు నీవే స్నేహితుడివి,నీకు నీవే ఇచ్చుకుం టే నీకు నీవే అధిపతివి!..
🙏
*మీ‌ తిరునగరి రామకృష్ణ. 🌹

You might also like