You are on page 1of 4

ఓం శ్రీ లక్ష్మీణపతయే నమః

శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు

పుష్కర సమయము లో అన్నదాన మహాయజ్ఞము

తుంగభద్ర నదీ పుష్కరములు

ది.20-11-2020 నుండి ది.1-12-2020 వరకు

తుంగభద్ర పుష్కర స్నానము మహత్యం పరమోత్కృష్టము గురుడు (బృహస్పతి) మకర రాశి లో ప్రవేశించినప్పుడుతుంగభద్ర నదీ
పుష్కరాలు వస్తా యి. ఒక పుష్కర సమయంలో ముల్లోకాలలోని సార్ధత్రికోటి (మూడున్నర కోట్ల) తీర్ధా లు తుంగభద్ర నది లోకి విడిది
చేస్తా యి. అరవై వేల సంవత్సరముల పాటు భాగీరథీ(గంగా)స్నానము చేస్తే ఎంతటి ఫలితము లభిస్తుందో, ఒక్కసారి తుంగభద్ర నదీ
పుష్కర స్నానము అంతటి పుణ్యము లభిస్తుంది. అందువలన ఈ పుష్కర సమయములో పుణ్య స్నానము ఆచరించి పితృదేవతకు
ప్రియమైన కార్యములు (అన్నదానము) వంటివి చేస్తే ఆ వంశము గతించిన (మరణించిన వారికి) సద్గతి కలిగి పుణ్యలోకాలు
ప్రాప్తిస్తా యని వారి వంశము లోని వారు అభివృద్ధి చెంది ధన ధాన్య పుత్ర పోత్రాదులతో సంతోషము గా వుంటారని పురాణ వచనము.

*రండి ఈ అన్నదాన మహాయజ్ఞములో పాల్గొని మీ పితృదేవతల అనుగ్రహమును పొందండి*

ఎవరు ఈ పుష్కరుడు :-

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం
చేసుకున్నాడు. ఈశ్వరుడు తుందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా
ఈశ్వరునిలో స్థా నంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తు లలో ఒకటై న జలమూర్తిలో అతనికి
శాశ్వతంగా స్థా నం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధా లకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని
పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు.
బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి
ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు
అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత
ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్థించాడు .ఆ
కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ,
పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు
రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తా ల
సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి
పుష్కరునితో వస్తా రు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణాలు చెప్తు న్నాయి.ఈ విధంగా పుష్కరుడు పుష్కర
తీర్థంగా మారి స్వర్గలోకమున మందాకిని నది యందు అంతర్భూతమై ఉన్నాడు.బ్రహ్మ స్వయంగా పంపించిన వాడు కావడం చేత
పుష్కరుడు నదులకు వచ్చినప్పుడు సప్త మహా ఋషులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తుంటారని, వారు సూక్ష్మ దేహంతో
నదులకు వస్తా రు కనుక వారు వచ్చిన కాలం పవిత్రమైనదనీ ఒక విశ్వాసం. పుష్కరాలు ప్రారంభ మైనప్పటి మొదటి పన్నెండు రోజులే
చాలా ముఖ్యం. పితృదేవతలను స్మరించుకోవడానికి, తర్పణాదులకు ఇది చాలా మంచి సందర్భమని పూర్వం నుంచి ఒక విశ్వాసం
బలంగా ఉంది. సప్తర్షులేగాక, చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరి
స్తుంటారనీ, పుష్కర స్నానాలు చేసే వారికి శుభాలను కలిగిస్తా రనీ కూడా నమ్మకం.

పితృదేవతలు విశిష్ఠత :-
మనిషి ఎంతగా ఎదిగినా, ఎంత దూరం పయనించినా... తన మూలాలను మర్చిపోకూడదు. ఆ మూలాలే అతని జన్మకి, అతని
సంస్కారానికీ, సంç స్కృతికీ కారణం. అందుకనే మన పెద్దలను తల్చుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు. వాటిలో
ముఖ్యమైనవి ఈ పుష్కరాలు.చనిపోయినవారి ఆత్మ తిరిగి జన్మించాలంటే అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం
చెబుతోంది. శ్రాద్ధకర్మలు సరిగా నిర్వహించకపోతే మనిషికి ప్రేతరూపంలో సంచరిస్తూనే ఉంటాడని చాలా మంది నమ్మకము.

పితృయజ్ఞాలకు అంతరాయం కలిగితే స్త్రీలు చెడునడత కలిగిన వారు అవుతారు. సరిగ్గా ఇదే నేడు జరుగుతోంది. ముఖ్యంగా
కుటుంబనియంత్రణ విధానాల వలన భోగవస్తు వులుగా స్త్రీపురుషులు మారిపోయారు.

పురాణాలు అన్నింటిలోనూ పితృదేవతార్చన ఉంది.

ఈ పితృకార్యాలు చాలా మహిమాన్వితమైనవి. వీటిని ద్వారా పితృదోషాలు, శాపాలు ఉపశమించుతాయి.

అన్ని దోషాలలోకీ పితృదోషాలు చాలాచాలా బలమైనవి. ఇవి పట్టా యి అంటే ఒక పట్టా న వదలవు. ఎందుకు? అంటే ఉదాహరణ
చెప్పవచ్చు.

ఒక వ్యక్తికి సంవత్సరీకాలు చేసి సపిండీకరణం చేసి పెద్దల్లో కలపకపోతే వారికి ప్రేతత్వం శాశ్వతంగా స్థిరపడిపోతుంది. ఈ విధంగా
సరిగ్గా ఏడాది పూర్తిఅయిన రోజున దీన్ని చేసి తీరాలి. ఏ కారణం చేతనయినా ఆ రోజున చేయకపోతే ఆ తరువాత వెయ్యి
అశ్వమేధాలు చేసినా ప్రయోజనం లేదు. ఆ మృతునికి ప్రేతత్వం పోదు. కనుక ఆ వ్యక్తి తన వంశనాశనాన్ని కోరుకుంటాడు. ఈ
విధంగా ప్రేతత్వం స్థిరపడిన వారి నుంచీ ఉపశమనం శాంతి లభించాలంటే మహాతపస్సు చేయాలి. సర్వేశ్వరుని అనుగ్రహం పొందాలి.

ఇంతటి దారుణమైన పితృశాపం, దోషం నివారించుకోవాలంటే అనేక సాధనలు చేయాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి కత్తి పట్టు కొని
చంపేయడానికి సిద్ధమైతే అతని దగ్గరికి వెళ్ళ కూడదు. దూరంగా ఉండాలి. ముందుగా మంచిమాటలతో అనునయించాలి. వారికి
ఇష్టమైన వారిని చూపించి శాంతపరచాలి. మెల్లమెల్లగా వారి చేతనే కత్తి కింద పారేసేలా చేసి తరువాత మెల్లగా మామూలు స్థితికి
తీసుకురావాలి. ఈ విధంగా తన వంశీకుల రక్తం తాగడానికి సిద్ధమైన ప్రేతలు, నిర్లక్ష్యానికి గురైన పితృదేవతలను శాంతం
చేసుకోవడానికి అన్నదానము చేయాలి.

ఇందులో భాగంగా ముందుగా అన్నదానము చేయాలి తరువాత కేవలం గోగ్రాసం వేయడం చేయాలి. దీని వలన గోమాత అనుగ్రహం
వలన దోషతీవ్రత తగ్గుతూ శ్రద్ధ పెరుగుతుంది. ఇప్పుడు బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వడం వంటివి చేయాలి. ఆ తరువాత
కులాచారాల ప్రకారం తిలతర్పణాదులు ఇవ్వడం చేయాలి. ఆ తరువాత పిండప్రదానాదులు చేయాలి. ఆ తరువాత వివిధ దివ్య
క్షేత్రాలకు వెళ్ళి పిండప్రదానాదులు చేయాలి. ఆ తరువాత నారాయణ బలి విధులు చేసుకోవాలి. ఈ విధంగా క్రమసోపానంలో వీటిని
చేసుకోవాలి. వీటి వలన శాంతి పొందుతున్నవారు క్రమక్రమంగా వీటిని చేయనిస్తా రు. ఒకేసారి ఆవకాయ మాదిరిగా
ప్రయత్నించవద్దు . దీని వలన చేసే పనిమీద శ్రద్ధ లేకపోవడం, నవ్వులాటకు చేయడం, విమర్శించడం, ఇతరులను శంకించడం,
చేసేటపుడు కోపం రావడం వంటివి సృష్టించి ఫలం రానివ్వకుండా ప్రేతలు చేస్తా యి. కనుక ఓపికతో ఈ మెట్లు ఎక్కి నెమ్మదిగా
పితృదోషాల నుంచీ తప్పుకోవాలి.
ఇక్కడ అతిముఖ్యమైంది మరొకటి ఉంది.

వంశనాశనాన్ని కోరుకుంటున్న ప్రేతలు ఈ విధమైన సాధనలు చేయనివ్వరు. మహాపురాణాల్లో చెప్పిన పితృకార్యాలు చేయనివ్వరు.
తమ చుట్టు పక్కల ఎవరికీ ఎవరూ పితృకార్యాలు చేయడాన్ని సహించలేరని గరుడపురాణం స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా
కొందరు ప్రేతపీడితులు ఈ పితృకార్యాలు ను తీవ్రంగా విమర్శించడం చేస్తు న్నారు. ఎట్టిపరిస్థితిలో నైనా ప్రేత శాపాలు తీవ్రస్థా యిలో
ఉండి వీటిని విమర్శించి దూషించే వారు వినాశనానికి దగ్గరగా ఉన్నారని తెలుసుకోండి. వారితో మాటలు కలుపవద్దు .
అటువంటివారు, పిశాచగ్రస్తమైన వారు క్రమక్రమంగా బయపడతారు. పితృశాపాలు పొంది పితృకార్యాలను హేళన చేస్తు న్నవారు,
పరాచకాలు ఆడుతున్నవారికి ఉన్న సుఖసంసారం కూడా దూరమవుతుంది. సమస్త సంపదలు హరించుకుపోతాయి. నానా కష్టా లు
పడతారు. ఈ విధంగా ఎవరు పితృకార్యాలను విమర్శించడం, హాస్యమాడడం, అవమానపరచడం చేస్తుంటారో వారు నాశనం
కాకుండా ఈ అన్నదాన మాహాయజ్ఞము ఫర్వార్డు చేసి అందించండి. దీని వలన వారికి ఉపశమనం కలుగుతుంది.దీని వలన
పితృదోషాలు తీరుతాయి. ఏ కారణం చేతనైనా పితృకార్యాలు చేయలేని వారు (విదేశాల్లో ఉన్నవారు) ఈ అన్నదాన మహా
యజ్ఞమునకు తమవంతు సహాయము చేయవచ్చు.

ముఖ్యంగా ఎవరి కుటుంబాలలో ఎవరింటిలో అర్థాంతరంగా, ప్రమాదవశాత్తూ చనిపోయినవారు, జలవాయుఅగ్నికారణాల వలన


చనిపోయినవారు, శస్త్రా స్త్రా ల వలన, దొంగలు క్రూ రమృగాలు విషసర్పాలు, కరోనా వంటి మారకాలు, శవాలు దొరకనివారు, ఇంటి
నుంచీ పత్తా లేకుండా పోయినవారు, విదేశాల్లో చనిపోయి భారతదేశంలో పితృక్రియలు పొందని వారు, పిల్లలు లేనివారు,
పెళ్ళికానివారు, గర్భస్రావాలు అయినవారు, పిల్లలు పుట్టిపోతున్నవారు, పెళ్ళికానివారు, ఇంటిని వైద్యులు దోచుకుంటూ ఉంటే
అటువంటివారు, జాతకరీత్యా పితృదోష, శాపాలున్నవారు, పిల్లలు చెప్పిన మాట విననివారు, బుద్ధిమాంద్యం వచ్చినవారు,
విద్యాబుద్ధు లువృత్తివాణిజ్యాలు రాణించనివారు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నవారు -ఇటువంటి వారు ఉంటే
వీరంతా తప్పని సరిగా ఈ అన్నదాన మహయజ్ఞము లో భాగస్వాములు కావాలి.

అన్నదాన మహిమ :-

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని,
అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తా రు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా
కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తా రు. ఏ దానం ఇచ్చినా
దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా
సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే
ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తా రు. దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా చెప్తా రు. మహాభారత యుద్ధంలో కర్ణుడు
మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది
కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత
తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట
దేవేంద్రు డిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రు డు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా
ఇచ్చే దానకర్ణుడివని చెప్తా రు. మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?’’ అనడిగాడు. దానికి సమాధానంగా లేదు.. నేనెన్నో దానాలు
చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. ‘‘పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?’’ అనడిగాడు
దేవేంద్రు డు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- ‘‘అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు.
అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను’’
అని.నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టు కో’’ అన్నాడు ఇంద్రు డు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టు కున్నాడు
కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది.
ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది.

ఈ అన్నదాన మహాయజ్ఞనమునాకు వస్తు రూపేణ గానీ ధన రూపేణ గానీ దాతలు విరాళాములు ఇవ్వవచ్చును.
మరిన్ని వివరాలకు సంప్రదించండి.

* అందరూ బాగుండాలి అందులో నేనూ వుండాలి " సర్వేజనాసుఖినోభవంతు *

You might also like