You are on page 1of 5

కార్తీక స్నానం అంటే ఏంటి? ఎలా చేయాలి?

సనాతన హిందూ మతం ప్రకారం.. స్నానానికి గొప్ప స్థా నం ఉంది. అందులోనూ సముద్ర స్నానానికి, పుణ్యక్షేత్రా ల్లో నదీ

స్నానానికి కూడా ప్రత్యేక రోజులు ఉన్నాయి. ఇవాళ మనం ఆశ్వయుజ మాసం పౌర్ణమి నుండి కార్తీక మాసం చివరి

వరకు చేసే కార్తీక స్నానం గురించి తెలుసుకుందాం. దీపావళి పండుగ రోజున ముగిసే అమావాస్య నుంచి మొదలై కార్తీక

మాసం పౌర్ణమి వరకు ఒక నెల పాటు తీర్థ స్నానం చేయడం వలన ఆధ్యాత్మికత పరంగా చాలా శుభపరిణామాలు చోటు

చేసుకుంటాయి. ఈ మాసంలో, సూర్యోదయానికి ముందు రెండు ఘాటీలు అంటే ఒక సుమారు ఒక గంట ముందు చేసే

తీర్థస్నానాన్ని కార్తీక స్నానం అంటారు. పుణ్యక్షేత్రా లకు వెళ్లడం అసాధ్యమను కుంటే.. పుణ్యక్షేత్రా ల నుంచి

తీసుకువచ్చిన నీటిని ఉపయోగించి స్నానం చేయొచ్చు. అయితే దీనికి ముందు ఒక మంత్ర పఠించాల్సి ఉంటుంది.

‘మహావిష్ణో ః అనుగ్రహ ప్రా ప్త ్యర్థం తీర్థ స్నానం కరిష్యే’ అని జపించి స్నానం చేయాలి. పవిత్ర కార్తీక ప్రా తఃస్నానం కరిష్యే.

అని చెప్పి నీళ్ళు వదలాలి.

కార్తీకస్నానం: ఏ మాసానికి లేని ప్రత్యేకమైన ఆచారం తెల్లవారు ఝామున చల్ల నీటి స్నానం. దీనివెనుక శాస్త్రీయ

కారణాలు ఉన్నాయి. శరత్‌రుతువులో చివరి భాగంలో వచ్చే కార్తీకంలో చంద్రు డు భూమికి దగ్గ రగా ఉంటాడు. వర్ష

రుతుప్రభావం కనుమరుగై శీతాకాలానికి మధ్య సంధికాలంగా ఉండే సమయం ఇది. ఈ కాలంలో మారిన, మారుతున్న

వాతావారణ పరిస్థితులకు అనుగుణంగా శరీరాన్ని మలచడం కోసం పూర్వీకులు ఏర్పాటుచేసిన ఆచారం కార్తీకస్నానం.

నదుల్లో , సరస్సులు, పారే కాలువలు, జలపాతాలు, బావుల వద్ద స్నానం ఆచరిస్తే చాలా మంచిది. ఇది వీలుకాకపో తే

ఇంట్లో నైనా శాస్త ్ర ప్రకారం స్నానం ఆచరిస్తే మంచి ఫలితాలు లభిస్తా యి.

కార్తీక మాసంలో ఈ విధంగా స్నానం చేస్తే సర్వపాపాలు నశించి, శ్రీమహావిష్ణు వు అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి.

నిత్యే నైమిత్తి కే కృష్ణ కార్తికే పాపనాశ అనే మంత్రం శాస్త్రా లలో ఉంది. అలాగే ఏదైనా మతపరమైన పనుల నిమిత్త ం నిత్యం

స్నానం చేస్తే బాహ్య పాపాలు నశిస్తా యి. కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల అంతర్గ త పాపాలు కూడా నశిస్తా యి.

ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత నుదుటిపై తిలకం పెట్టు కోవాలి.

కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి. నదీ స్నానం అన్నప్పుడు ఒక మాట గుర్తు పెట్టు కోవాలిట్టు కోవాలి. కార్తీక

మాసంలో నదీ స్నానం చెయ్యడమంటే పక్కన ఉన్న నదిని వదిలిపెట్టి ఒక్కడో ఉన్న మరో నదిలో స్నానానికి

వెళ్ళకూడదు. ఉదాహరణకు, కార్తీక మాసంలో గంగా స్నానం చేయాలనుకుంటే, ముందు దగ్గ రగా ఉన్న నదీ స్నానం

చేయాలి. ఆ తర్వాతే గంగా స్నానం చేయాలి. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది పక్కన ఉండే నదే! ఎప్పుడైనా

ప్రవహించే నదిని గమనిస్తే- అది రకరకాల శబ్దా లు చేస్తూ , సూక్ష్మంగా తిరుగుతూ రాళ్ళకి గుద్దు కుంటూ, పైనుంచి

పడుతూ, పైకి ఎక్కుతూ వెడుతుంది. ఆ సమయంలో అది చేసే ధ్వనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అలా వెళ్లి పో యే నది

నీరు చంద్రు డి శక్తిని పుచ్చుకుంటుంది.


శాస్త్రా ల ప్రకారం ఈ లోకాన్ని అమ్మవారే ఉద్ధ రిస్తూ ఉంటుంది. ప్రమాదాలు ఎక్కడున్నాయో ముందే హెచ్చరిస్తు ంది.

ఆవిడ కార్తీక మాసంలో చంద్రకర


ి ణ రూపంలోనూ, ఉసిరి చెట్టు రూపంలోనూ ఈ ప్రపంచాన్ని ఆదుకుంటూ ఉంటుంది.

అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవటం

మంచిదంటారు. కార్తీక మాసంలో చంద్ర కిరణాల రూపంలో ఉన్న అమ్మవారు నీటిని అమృతధారగా మారుస్తు ంది.

అందువల్ల అభిముఖంగా నదిలో నిలబడి పరమేశ్వరునికి నమస్కారం చేసి మజ్జ నం చేయాలి. మజ్జ నం అంటే

మూడుమార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరానికంతా చంద్ర కిరణాల వల్ల అమృత స్పర్శ

కలుగుతుంది. చంద్ర కిరణాల వల్ల ఓషధీశక్తి శరీరంలో ప్రవేశిస్తు ంది. అంటే శరీరానికి అనారోగ్యాలు కలగకుండా

కాపాడుతుందన్న మాట.

అంతేకాక, చంద్రస్పర్శ కలిగిన తరువాత మనసు సాత్వికమై, పరమేశ్వరారాధనలో సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై

నిలబడుతుంది. మనసంటే చంద్రు డే. మనసు మీద చంద్ర ప్రభావమే ఉంటుంది. ఈ రెండు సాధనాలను ఏకకాలంలో

పొ ందడానికి కార్త్తీక మాసంలో నదీ స్నానం ఉపయోగపడుతుంది. ఈ నదీ స్నానం చేయటానికి కూడా కొన్ని

నిబంధనలు ఉన్నాయి. నదీ స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్ట తో స్నానం చెయ్యాలి. నదీ స్నానం చేసేటప్పుడు

సంకల్పం లేని స్నానం చెయ్యకూడదు. “నేను ఫలానా చోట ఉండి పూజ చేస్తు న్నాను, ఆ విషయం ఈశ్వరుడికి

తెలియదా? నేను ఎక్కడ ఉండి స్నానం చేస్తు న్నానో తెలుసుకోలేనివాడికి నేను పూజ చేయడమేంటి? వాడు

సర్వజ్ఞు డేంటి? ” అని కొందరు అనుకోవచ్చు. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరెత్తి తే పాపనాశనం అవుతుందో

పరమేశ్వరుడు దానినే పలికిస్తా డు. అందుకే -“గంగా కావేరీ యోః మధ్య దేశస్థే, గంగా గోదావరీ యోః మధ్య దేశస్థే ” అని

సంకల్పం చెప్పిస్తా రు. ఎందుకంటే ఆ నదుల పేరెత్తి తే చాలు పాపాలు నశిస్తా యి. అంత గొప్పదైన నదికి అభిముఖంగా

నిలబడి సంకల్పంతో నదీ స్నానం చేస్తే, అది తప్పకుండా రక్షిస్తు ంది. అయితే స్నానం చేసి వెళ్లి పో తే సరిపో దు. బయటకు

వచ్చిన తర్వాత పుణ్య కర్మాచరణ చెయ్యాలి. అంటే దానమో, ధర్మమో ఏదో ఒకటి తప్పనిసరిగా చెయ్యాలి.

ఈ జగత్తు ను రక్షించే అమ్మవారు ప్రకృతిలో ఒకోసారి ఒకో రూపంలో కనిపిస్తూ ఉంటుంది. చైతమ
్ర ాసం వచ్చేటప్పటికి వేప

పువ్వు రూపంలో, కార్తీక మాసం వచ్చేటప్పటికి ఉసిరక


ి ాయ రూపంలో, ఆషాడ మాసంలో గడ్డిపరక రూపంలో అందరినీ

రక్షిస్తూ ఉంటుంది. అందుకే ఆషాఢ మాసంలో కుక్కలు లేత పచ్చిగడ్డిని కొరుక్కుతింటాయి. దీని వల్ల వాటి కడుపులో

అనారోగ్యాన్ని కలిగించే పదార్థా లు బయటకు వచ్చేస్తా యి.

శ్రా వణ మాసంలో నదులు విశేషమైన వేగంతో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రవాహంలో చాలా సార్లు పాములు కొట్టు కొస్తూ

ఉంటాయి. అందువల్ల శ్రా వణమాసం నదీ స్నానం చేయవద్ద ని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక్కడ ఇంకో విషయాన్ని

కూడా గమనించాలి. శాస్త ్ర ప్రకారం పురుషుడు నదీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. స్త్రీలు వాలుకి చేయాలి.
అభిముఖంగా స్నానం చేస్తే పాములు కొట్టు కు వచ్చి కాటు వేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల

పురుషులను శ్రా వణ మాసంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ను నదీ స్నానం చేయవద్ద ని చెబుతారు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

కార్తీక స్నానాలు – పాప ప్రక్షయాలు


కార్తీకం వచ్చిందంటే ముందుగా గుర్తు కు వచ్చేవి గడ గడ లాడించే చన్నీళ్ళ స్నానాలు.

ఈ రోజు వ్యాస పరంపరలో మనం రెండు చక్కటి విషయాలు గుర్తు చేసుకుందాం. కార్తీక స్నానాల వైశిష్ట ్యం గురించి, నదీ,
సముద్ర స్నానాల ప్రా ముఖ్యత ఇంతే కాక, స్నానాల లో రకాలు, వాటిని చేసే విధానం గురించీ మరియూ స్నానాలు
చేయలేని పరిస్థితిలో ఉన్నవారు ఏ విధమైన ప్రత్యామ్నాయ స్నానాలు చేసి, పూర్తి స్నాన ఫలం ఎలా?

కార్తీక స్నానాలు – పాప ప్రక్షయాలు!

కార్తీకమాసం లో ఆచరించదగ్గ పుణ్య కార్యాల్లో కార్తీక స్నానాలు ప్రధానమైనవి. ఈ మాసం చాలా పవిత్రమైనది.
ఆధ్యాత్మిక సాధనకు ఈ సమయం సర్వశ్రేష్టం! ఆధ్యాత్మిక సేవకు స్నానం ప్రధానం! అందునా కార్తీక మాసంలో తలమీద
స్నానం చేసినంత మాత్రా న మానవుడు తన పూర్వజన్మ పాపాలని అన్నిటిని పటాపంచలు చేసుకుని ఉత్త మ లోకాల
వైపు పయనమవుతాడని పెద్దల వాక్కు. ఈ మాసంలో ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే తలమీద స్నానం చేస్తే
మోక్షదాయకం అని చెపుతారు.
ఇక్కడ మనం ఒక విషయం గుర్తు ంచుకోవాలి. కార్తీకస్నానికి చన్నీళ్ళు ఉపయోగించాలి. ఈ స్నానాలు చేసేటప్పుడు
వంటికి నువ్వుల నూనె కానీ నలుగు కానీ పెట్టరాదు. స్నానం చేసిన తర్వాతే దీపారాధన కానీ దేవతార్చన కానీ
చేసుకోవాలి. రోజూ చేయలేని వారు మొదటి రోజు, నాగుల చవితి రోజు, ఏకాదశులు , క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి
మరియు కార్తీక అమావాస్యనాడు స్నానాలు చేసినా పరమేశ్వరుని అనుగ్రహం పొ ందుతారని పెద్దలు చెపుతారు. ఇంటి
లోని నీటి తోటే స్నానం చేసే వారు, ఆ నీటినే గంగ, యమున, గోదావరి, కృష్ణ , కావేరి, నర్మద, తపతి, సింధు నదుల
పవిత్ర జలాలతో సమానమని భావించి, శ్రద్ధగా స్నానమాచరిస్తే ఆయా నదులలో స్నాన ఫలితం కలుగుతుందని పెద్దల
ఉవాచ!
ఇక పొ తే అదృష్ట ం, అవకాశం ఉన్నవారు కార్తీక మాసం లో పుణ్యనదీ స్నానం కానీ, సముద్రస్నానం కానీ చేయగలిగితే
అంతకు మించిన పుణ్యకార్యం ఉండబో దు! కార్తీక మాసం లో నదీ ప్రవాహం నెమ్మదిగా, స్నానమాచారించడానికి
అనువుగా ఉంటుంది. శ్రా వణ బాధ్రపద మాసాల్లో వానలు, వరదలుతో స్నానం చేయడానికి వీలుగా లేక ప్రమాదకరంగా
ఉంటాయి. అంతే కాకుండా శరత్కాలంలో చంద్రకాంతి లోని శక్తి నదీ జలాలపై, సముద్రజలాల పై ప్రసరించడం తో ఆ
జలాలు ఆ శక్తిని గ్రహించడం వలన ఆ నీటితో స్నానం చేస్తే ఆ శక్తి మన శరీరం లోకి కూడా ప్రవేశిస్తు ందని ఒక నమ్మకం.
అందు వలన నదీ సముద్ర స్నానాలు మనకు పుణ్యప్రదమే కాకుండా ఆరోగ్యదాయకం కూడానూ!
మరి నదీ స్నానం చేయడం ఎలాగో తెలుసు కుందాము. ఇంట్లో ఒక సారి స్నానం చేసి, శుచిగా నదిలో అడుగు పెట్టా లి.
రెండు బొ టన వ్రేళ్ళతో రెండు ముక్కులను మూసుకుని, రెండు మధ్య వ్రేళ్ళతో రెండు చెవులు మూసుకుని, పూర్తిగా
తలతో సహా కనీసం మూడు సార్లు మునగాలి. ఇలా నదీసముద్రస్నానాలు చేస్తు న్నప్పుడు, ఎటువంటి సబ్బు కానీ
షాంపూలు కానీ ఉపయోగించకూడదు. నీటిని ఏ విధం గానూ అపవిత్రం చేయకూడదు.
ఇవండీ కార్తీక స్నాన విధానాలు!

స్నానాలు – రకాలు – ప్రత్యామ్నాయాలు!


స్నానం చేసే వారు, చేయగలిగిన స్థితి లో ఉన్నవారు ఈ మూడు రకాల స్నానాలను ఆచరించవచ్చు.

1. మొదటిగా మంత్రస్నానం:
"అపో హిష్టా మయే భువః, తాన వూర్జే దధాతన, మా హేరణాయ చక్షసే, యే: వశ్శివ తమేరసః ,
తస్య భాజయతే హనః ,యశతీరివ మాతరః, తస్మా అరఃగ మామవః, యస్య క్షయాయ జిన్వధ, ఆపో జన యధా చనః!"
అని మంత్రం చదువుతూ తల పై నుండి చేసే స్నానం మంత్ర స్నానం!

2. రెండవది మానస స్నానం :


శ్రీ హరినో లేక సాంబ శివునో లేక తమకిష్టమైన దైవాన్ని స్మరిస్తూ తల స్నానం చేస్తే అది ఉత్త మ [మానస]స్నానం!

3. మూడవది వారుణ స్నానం:


మంత్రా లు రాక ఏ స్నాన పద్ధ తులు తెలియక కేవలం స్నానం చేయాలనే అభిప్రా యం తో తల స్నానం ముగిస్తే దానిని
వారుణ స్నానం అంటారు. మనందరం నిత్యం చేసే స్నానం అటువంటిదే!

స్నాన ప్రత్యామ్నాయాలు:

ఈ మూడు స్నానాలు మాత్రమే కాక స్నానం చేయలేని అనారోగ్య స్థితిలో వుంటే ఈ క్రింది వివరించిన ఎదో స్నానం,
శారీరిక పరిస్థితిని బట్టి ఆచరించి, అస్నాన దో షం రాకుండా చూసుకోవచ్చు.

1.వాయవ్య స్నానం: ఏ మంత్రా లు రాని వారు ఆవు గిట్టల క్రింద ఉన్న ధూళిని తల పైన వేసుకుంటే చాలు స్నానం
అయినట్లే!

2. ఆగ్నేయ స్నానం: శివాలయం లో లభించే విభూధిని నుదుట ధరించినా, లేక తల మీద జల్లు కున్నా స్నానం
చేసినట్లే!
3. కాపిల స్నానం: నాభి పై భాగం లో గాయమై దానికి నీరు తగలరాని పరిస్తితి ఉంటే నాభి క్రింద భాగాన్ని నీటి తో
పూర్తిగా శుభ్ర పరిచి, పై భాగాన్ని తడి గుడ్డ తో తుడిస్తే చాలు స్నానం పూర్తీ అయినట్లే! కాలకృత్యాల బాధ తరుచూ
ఉన్నవారు దీనిని అనుసరించవచ్చు.

4. ఆతప స్నానం: అనారోగ్య కారణంగా లేవలేని వారు ఉదయపు ఎండలో ఒక్క క్షణం నిలబడితే చాలు ఆ రోజు స్నానం
చేసినట్టే!

అయితే స్నానం చేయగలిగే స్థితి లో వున్న వారు మాత్రం ఈ మాసం లో రోజూ లేక కనీసం ప్రత్యేక రోజులలో నైనా
తలస్నానం చేసి, కార్తీకస్నానాల పుణ్యం పొ ంది, శివకేశవుల అనుగ్రహం పొ ందేదరు గాక!

You might also like