You are on page 1of 3

రా..మ.. అంటే కేవలం రెండు అక్షరాలు కాదు.. అదో మహాశక్తి మంత్రం.

ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ

భక్త జనం పండుగ జరుపుకొంటున్న శుభ తరుణమిది. చైతమ


్ర ాసం శుక్ల పక్షం నవమి శ్రీరామనవమి. శ్రీ మహా విష్ణు వు

త్రేతాయుగంలో ధర్మస్థా పన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్ల పక్ష నవమి శ్రీరామ నవమి. ఈ రోజున

ప్రధానంగా మూడు ఘట్టా లు నిర్వహిస్తా రు. శ్రీరామ జననం, సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టా భిషేకం. మన సనాతన

ధర్మం, పురాణాలు, జ్యోతిషశాస్త ం్ర ప్రకారం మహా విష్ణు వు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రా మాణికంగా ఉంటుంది.

ఉదాహరణకు.. నారసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తు ంది. కృష్ణా వతారం చంద్రగ్రహాన్ని సూచిస్తు ంది. వామన

అవతారం గురుగ్రహం; అలాగే, శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడిని సూచిస్తు ంది.

రామాయణం, జ్యోతిషశాస్త ం్ర ప్రకారం.. శ్రీరాముడు త్రేతాయుగంలోని గురువారం రోజున చైత్ర శుక్ల నవమినందు కర్కాటక

లగ్నంలో జన్మించినట్టు గా పురాణాలు చెబుతున్నాయి.

శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించడం.. ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్ఛక్షేత్రంలో

ఉండటం.. ఇవన్నీ ధర్మస్థా పన కోసం రామావతారం ప్రా ధాన్యతను తెలుపుతున్నాయి. మనిషి జీవితంలో ఎలా

నడుచుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా ఉండాలనే అంశాలు రామాయణం ద్వారా తెలుసుకుంటారు.

శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన, ఉత్త మ రాజు లక్షణం, ఉత్త మ సో దరుడి కర్త వ్యం.. ఇలా అనేక విషయాలన్నీ

రామ అవతారంలో చూసి నేర్చుకోవాల్సిన గొప్ప సుగుణాలు. ఇంతటి ప్రా ధాన్యత కలిగిన శ్రీరాముడిని సనాతన ధర్మంలో

పూజించడం వల్ల విజయాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీరామనవమి రోజు ఏ వ్రతం చేసినా

ఫలించదని, కేవలం శ్రీరామవ్రతం మాత్రమే ఫలిస్తు ందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల వాక్కు.

రామ నామం అర్థమేంటి?

రామాయణంలో రామచంద్రమూర్తికి వశిష్ట మహర్షి పేరు పెట్టా రు. రామాయణం ప్రకారం.. రామ రహస్యోపనిషత్తు ప్రకారం

రామ నామానికి అనేక రకాలైన అర్థా లు ఉన్నాయి. అందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం. అనగా..

యోగీశ్వరులు ఏ భగవంతుని యందు ఆస్వాదన చెందుతారో అతనే రాముడు అని అర్థం; రామ అనే దానికి అర్థం

రాక్షస యేన మరణం యాంతి -రామ. అంటే ఎవరిచే రాక్షసులు మరణించెదురో అతడే రాముడు అని.శ్రీరామ నవమి

రోజు రామనామస్మరణం చేయడం అనేక రెట్ల పుణ్యఫలం. రామ నామమును తారకమంత్రమని, తారకమంత్రమంటే

తేలికగా దాటించేది అని అర్థం. ఏ మంత్రము చెప్పినా దానిముందు ఓం అని.. తర్వాత నమః అని కచ్చితంగా వాడాలి.

కానీ రామ నామానికి రామ అనే మంత్రా నికి ఇవి వాడాల్సిన అవసరం లేదు. శ్రీరామ, శ్రీరామ అనుకుంటూనే

విష్ణు లోకాన్ని పొ ందవచ్చని పురాణాలు తెలుపుతున్నాయి. పూర్వం శివుడు పార్వతీదేవికి శ్రీరామ నామ గొప్పతానాన్ని

తెలియజేస్తూ శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తు ల్యం రామ నామ వరాననే అనే శ్లో కాన్ని

పార్వతీదేవికి తెలియజేశాడు. విష్ణు సహస్రనామం పారాయణం తర్వాత ఈ శ్లో కంతోనే దాన్ని ముగిస్తా రు. శ్రీరామ..
శ్రీరామ.. శ్రీరామ అని మూడు సార్లు అంటే ఇందులోనే వెయ్యి నామాలు ఉన్నాయని.. సకలదేవతలూ ఇందులోనే

ఉన్నారని శివుడు పార్వతికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.

శ్రీరామ నవమి పండుగ ఉగాది పండుగ తరువాత వచ్చే అత్యంత ప్రా ముఖ్యమైన పండుగ. ఉగాదితో నూతన సంవత్సరం

ఆరంభం అయితే శ్రీరామనవమి పండుగ ఉగాది పండుగ తరువాత వచ్చే అత్యంత ప్రా ముఖ్యమైన హిందువుల

పండుగ..శ్రీరామ నవమి విశిష్ట త .. రామయ్య జన్మించిన అభిజిత్ ముహూర్త ం అంటే..

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామ తత్తు ల్యం రామ నామ వరాననే’’.. ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో

ఉండగా, చైతమ
్ర ాసం శుక్ల పక్షం నవమి తిథినాడు మధ్యాహ్నం వేళ రాముడు జన్మించాడు. దశరథ రాముడు, సకల కళా

గుణాభిరాముడు అయిన శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో

సరిగ్గా అభిజిత్ ముహూర్త ంలో అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో అంటే మిట్ట మధ్యాహ్నాం త్రేతాయుగంలో

జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు శ్రీ మహా విష్ణు వు అవతారం. ఒకే బాణం, ఒకే భార్య అనేది

శ్రీరాముడి సుగుణం. రామబాణానికి ఉన్న శక్తి అటువంటిది. ‘నవమి’ శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టా లన్నీ నవమి

రోజునే జరిగాయి. నవ అంటే తొమ్మిది. సాధారణంగా సామాన్యకలు నవమి అంటే భయపడతారు. కానీ శ్రీరాముడికి

నవమితోనే ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టా లు జరిగాయి. శ్రీమహా విష్ణు వు ఏడో అవతారంగా శ్రీరాముడిని

భావిస్తా రు.

శ్రీరామాయణం ఆది కావ్యం. మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్త గా అనిపిస్తు ంది.

రామాయణం చదువుతున్నప్పుడు ఆ వ్యక్తు లందరూ సజీవంగా కదులుతున్నట్లు అనిపించే అద్భుతరచన.

శ్రీరామాయణం ఇతిహాసం. యథార్థమైన గాథ. రామచంద్రమూర్తి అవతారం పరమసత్యం. రామ స్పర్శలేని విషయం

ఉండదు. ఏదైనా రాస్తే ‘శ్రీరామా’ అని రాసి మొదలు పెడతాం. చంటి పిల్లా డికి స్నానం చేయిస్తే, పాత్రలో మిగిలిన నీళ్ల తో

‘శ్రీరామరక్ష.. నూరేళ్ల ఆయుష్షు ’ అని తల్లి అంటుంది. గోరుముద్ద లు తినిపిస్తూ రామకథ చెబుతుంది. ఇంట్లో ఎవరైనా

వృద్ధిలోకి రావాలనుకుంటే రామచంద్రమూర్తి అంతటి వాడివి కావాలని ఆశీర్వదిస్తా రు. ఎవరైనా అసూయతో ప్రవర్తిస్తే

‘శూర్పణఖ’ బుద్ధి అంటారు. అహంకారంతో ప్రవర్తిస్తే, ‘రావణ అహంకారం పనికిరాదు’ అంటారు. ఎక్కువగా నిద్రపో తే

‘కుంభకర్ణు డిలా ఆ నిద్ర ఏంటి’ అంటారు. ఇలా సమాజం నుంచి విడదీయరాని బంధం శ్రీరామాయణంతో ఏర్పడింది.

ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు? అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న

వేసినప్పుడు ‘పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి’ అని నిర్ధా రించాడు. మనుష్య

జీవితంతో శ్రీరాముడి జీవితం మమేకమైపో యింది. ఆయన మానవుడిగా పుట్టా డు.. మానవుడిగా పెరిగాడు.. మానవుడు

పడిన కష్టా లను పడ్డా డు. మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యముతో లోకాలను, ధర్మంతో
సమస్తా న్ని, శుశ్రూ షలతో గురువులను, దాన గుణముతో దీనులను గెలిచాడు. అలాగే, తన పౌరుష పరాక్రమములతో

శత్రు వులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం.

ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా

కలిగి ఉన్నవాడు రాముడు. అవే.. 1. గుణవంతుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మాత్ముడు, 4. కృతజ్ఞ తాభావం కలిగినవాడు,

5. సత్యం పలికేవాడు, 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7. చారితమ


్ర ు కలిగినవాడు, 8. అన్ని ప్రా ణుల మంచి

కోరేవాడు, 9. విద్యావంతుడు, 10. సమర్థు డు, 11.ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము

కలిగినవాడు, 12. ధైర్యవంతుడు, 13. క్రో ధాన్ని జయించినవాడు, 14. తేజస్సు కలిగినవాడు, 15.ఎదుటివారిలో మంచిని

చూసేవాడు. 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు.

You might also like