You are on page 1of 10

నవ్య రాత్రు లు

పండుగలు అందరూ చేసుకుంటాం. కాని కొన్ని ప్రా ంతాల్లో మాత్రమే ఆ పండుగలు మహో త్సవంలా,
కన్నుల పండుగగా జరుగుతాయి. ముఖ్యంగా దసరా.
దసరా.. అంటూనే మనందరికీ గుర్తు కు వచ్చేవి తొమ్మిది రోజులపాటు అతి వైభవంగా ఉత్సవాలు జరిగే
నవరాత్రు లు. శరదృతువులో రావడం వల్ల ఈ నవరాత్రు లను శరన్నవ రాత్రు లని అంటారు. ఒక్కోరోజు
దుర్గ ఒక్కో విశిష్ట మైన అవతారంలో భక్తు లకు దర్శనమిచ్చి అనేక ఆధ్యాత్మిక అనుభూతులను
ఇస్తు ంది. ఉగాది సమయంలో అంటే వసంత ఋతువులో వచ్చే నవరాత్రు లను వసంత నవరాత్రు లని
అంటారు. దశ హర అంటే పది రోజుల పండుగ అనే అర్థంలో చెబుతారు. ఈ దశ హరయే దసరా అని
వ్యవహారంలోకి వచ్చింది. దశ హర అంటే పది పాపాలను నాశనం చేసేది అనే మరో అర్థం కూడా ఉంది.
ముంబై, హైదరాబాద్ నగర వాసులు వినాయక చవితి ఎంత ఉల్లా సంగా, ఉత్సాహంగా, భక్తితో
చేసుకుంటారో, కోల్‌కతా, మైసూర్ వాసులు దసరా పండుగని అంతకన్నా ఘనంగా జరుపుకుంటారు.
పలు రాష్ట్రా ల్లో తొమ్మిది రోజులపాటు వివిధ రకాల బొ మ్మలతో కొలువు ఏర్పాటు చేసి పేరంటాలు
నిర్వహించడం ఈ పండుగ మరో ప్రత్యేకత. భారతీయులంతా ఈ నవరాత్రు లను అత్యంత భక్తి శ్రద్ధలతో
జరుపుకుంటారు. ఈ నవరాత్రు ల్లో శక్తి పూజే ప్రధానం. నవ అంటే నవ్యతను కలిగింది. అంతేకాదు. ఈ
తొమ్మిది రోజులూ శక్తిని పూజించి మన దేహంలో ఉండే మహాశక్తిని గుర్తించి నవ విధ భక్తు లను
పెంపొ ందించుకుని ఆధ్యాత్మికంగా ముందుకు సాగడమే ఈ నవరాత్రి ఉత్సవాల ప్రా ముఖ్యత.
నవరాత్రి ఉత్సవాలెలా ఆరంభమయ్యాయి...
పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేసి ఎవరివల్లా చావులేని వరం
పొ ందాడు. ఆ వరంతో మహిషాసురుడు అహంకారపూరితుడై దేవతలనూ, మునులనూ బాధించ
నారంభించాడు. మహిషుని బాధలు తాళలేని దేవతలు విష్ణు వు వద్ద కు వెళ్లి మొరపెట్టు కోగా, అతని
వరం గురించి తెలిసిన విష్ణు మూర్తి దుర్గా మాత వానిని సంహరిస్తు ందని చెప్పాడు. మహిషాసురుడు
దేవతలతో ఘోరమైన యుద్ధ ం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టా డు. పదవి పో యిన దేవేంద్రు డు
త్రిమూర్తు లతో మొరపెట్టు కొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రో దాగ్ని ప్రకాశవంతమైన తేజంగా
మారింది. త్రిమూర్తు ల తేజమంతా కేంద్రీకృతమై ఒక స్ర్తి రూపంగా అవతరించింది. శివుని తేజమే
ముఖంగా, విష్ణు తేజమే చేతులుగా, బ్రహ్మ తేజమే పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన
ఆమె 18 చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలాన్నీ, విష్ణు వు చక్రా న్నీ, బ్రహ్మదేవుడు
అక్షమాలనీ, కమాండలాన్నీ ఇచ్చారు. ఇంద్రు డు వజ్రా యుధాన్ని, వరుణుడు పాశాన్నీ ఇవ్వగా,
హిమవంతుడు ఆమెకు వాహనంగా ఒక సింహాన్ని ఇచ్చాడు. ఇలా దేవతలంతా ఇచ్చిన ఆయుధాలను
సమకూర్చుకొన్న దుర్గా దేవి మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పో రు సల్పి మొత్త ం పది
రోజులపాటు యుద్ధ ం చేసింది. యుద్ధ కాలంలో తొమ్మిది రోజులు ఒక్కో అవతారమెత్తి చివరి రోజు
మహిషాసురుని సంహరించింది. పదో రోజు దుర్గా దేవి విజయం సాధించినందుకు గుర్తు గా భూలోక
వాసులు ఆనందంతో విజయ దశమి వేడుకలు జరుపుకున్నారు. అలా అనాదిగా ఆ రోజు నుంచి
విజయ దశమి వేడుకలను మనం జరుపుకుంటున్నాం. ఇదీ వాడుకలో అందరూ చెప్పుకునే కథ.
ఇంకో కథ ఏమిటంటే, మనందరికీ తెలిసిన రావణాసుర వధ కథ. మరో కథ ప్రకారం పార్వతీదేవి పది
రోజులు పది రకాల అవతారాలను ఎత్తి ఒక్కో అవతారంలో ఒక్కో రాక్షసుని చంపింది. అలాగే
మధుకైటభుల వధ గురించి కూడా మరో కథ ఉంది.
మహాభారతంలో విజయదశమి పరంగా పాండవులు శమీ వృక్షాన్ని పూజించి విజయాన్ని సాధించిన
కథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
భవిష్యత్ పురాణంలో దసరా గురించి ఒక వర్ణ న ఉంది. ఇందులో నవరూపాల వర్ణ న లేదు గానీ ఈ
తొమ్మిది రోజులూ అస్త ్ర శస్త్రా లనూ పూజించి పదవ రోజున అమ్మవారిని ఏనుగుపై పల్ల కిలో ఉంచి
ఊరేగించాలని వివరించి ఉంది. అంటే అమ్మవారి ఊరేగింపు సరిగ్గా ఆశ్వయుజ శుక్ల దశమి రోజు
జరగాలన్నమాట.
నవరాత్రు లు - నవరూపాలు
ఆది శక్తి పరాశక్తి. సాక్షాత్తూ ఆ సూర్య భగవానుడే ఆదిశక్తి ‘మహాశక్తి అనీ, విద్య అనీ, అన్ని లోకాలూ
ఆమెనే ఆశ్రయించి ఉన్నాయనీ, అసలు సృష్టి, స్థితి, లయలకు మూలం ఆమేననీ, ఆమె ప్రేరణ వల్లే
త్రిమూర్తు లు తమ కర్త వ్యాన్ని నిర్వహిస్తు న్నారని వర్ణించాడు.
ఆమెయే ఇంద్రు డిలో ఉండే శక్తి. ఆకాశంలో కనిపించే మెరుపులో ఉండే విద్యుత్ శక్తి. ఈ విషయాన్ని
గుర్తించిన మహాముని కావ్యకంఠ గణపతి ఆ శక్తినే ఇంద్రా ణీ శక్తిగా గుర్తించాడు. ఆ శక్తిని పూజిస్తూ ,
ప్రా ర్థిస్తూ ఇంద్రా ణీ సప్త శతి పేరుతో ఏడువందల శ్లో కాలను రాసిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఆమె
ఆదిశక్తి కాబట్టి ఆమెకు పరాజయం లేదు. అందుకే ఆమెకు అపరాజిత అని పేరు.
నవరాత్రు ల సందర్భంగా దేశంలో కొన్ని ప్రా ంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున
బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గ వ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున
స్కందమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవ రోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి,
తొమ్మిదవ రోజున సిద్ద్ధిత్రిదేవిగా పూజిస్తా రు. కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గ గా,
మహాలక్ష్మిగా, అన్నపూర్ణ గా, గాయత్రిగా, బాలాత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర
మర్దినిగా ఆరాధిస్తా రు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాలలో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకరణలో కనిపిస్తు ంది.
నవదుర్గ లు
సప్త శతీ మహా మంత్రా నికి అంగభూతమైన దేవీ కవచంలో నవదుర్గ లు అనే పదం స్పష్ట ంగా కనిపిస్తో ంది.
ప్రథమం శైల పుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్ర ఘంటేతి, కూష్మాండేతి చతుర్థ కం/
పంచమం స్కందమాతేతి, షష్ఠ ం కాత్యాయనీతి చ, సప్త మం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్ట మం/
నవమం సిద్దిదా ప్రో క్తా , నవదుర్గా ప్రకీర్తితా ఇక్తా నే్యతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా
ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని ఉంది. అయితే, సప్త శతీ గ్రంథంలో మాత్రం వీరి
చరితల
్ర ను ప్రస్తా వించలేదు. సప్త శతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరీ
(శతాక్షి), భీమ, రక్త దంతిక, దుర్గా , భ్రా మరీ గురించి చెప్పారు. కానీ, వీరిని నవదుర్గ లని ప్రత్యేకంగా
వ్యవహరించలేదు.
అన్నట్టు , సప్త సతీ దేవతలని మరో సంప్రదాయం ఉంది. దీనిలో నందా, శతాక్షీ, శాకంబరీ, భీమా,
రక్త దంతికా, దుర్గా , భ్రా మరీ అనే ఏడుగురు సప్త సతుల గురించి సప్త శతీ గ్రంథంలో ఉంది. దీనివల్లే ఈ
గ్రంథానికి సప్త సతి అని మరో పేరు వచ్చిందంటారు.
తొమ్మిది అంకె విశిష్ట త
నవ నాడులు, నవరంధ్రా లు, నవ చక్రా లూ వీటన్నిటికీ నవ రాత్రు లతో ఆధ్యాత్మిక పరమైన సంబంధం
ఉందని చెప్పుకోవచ్చు. తల్లి గర్భంలో శిశువు ఉండేది 9 నెలలు. కాశీ క్షేత్రంలో 9 నెలలు కానీ, 9
రోజులు కానీ, 9 గడియలు గానీ ఉంటే చాలట. పితృపాపాలన్నీ ఇట్టే తొలగిపో తాయట.
సాయిబాబా తన భక్తు డైన పాట్‌కర్‌కు నవ విధమైన భక్తి మార్గా ల గురించి బో ధించాడు కూడా. శ్రవణం,
కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చన, నమస్కారం, దాస్యం, సఖ్యత, ఆత్మ నివేదన - ఇవీ నవ విధ
భక్తిమార్గా లు. భక్తిలేని సాధనలు దండగ.
ఐతే అన్నిటిలోనూ నవ అంటే 9 అంకెనే ఎందుకు చెప్పుకుంటున్నారనేది ప్రశ్న.
తొమ్మిది అంకె మార్పులకు లోను కాని బ్రహ్మ తత్వాన్ని సూచిస్తు ంది. 9 విచిత్ర సంఖ్య. 9 ని 1 తో
గుణిస్తే 9 వస్తు ంది. అదే 9 ని 2 తో గుణిస్తే, 18 (అంటే తొమ్మిదే), 3 తో గుణిస్తే 27 (అంటే మళ్లీ తొమ్మిదే)
- ఇలా 9 ని ఏ అంకెతో గుణించినా 9 మాత్రమే వస్తు ంది. అంటే శక్తి నిశ్చలంగా ఉండటమే. ఇదే బ్రహ్మ
తత్వ రహస్యం.
అదే 8 అనే అంకెను తీసుకోండి. అది మాయను సూచిస్తు ంది. 8 ని 1 తో గుణిస్తే 8 వస్తు ంది. 2 తో గుణిస్తే
16 (అంటే 7,8 కన్నా 1 తక్కువ), 3 తో గుణిస్తే 24 (అంటే 6,8 కన్నా 2 తక్కువ) - ఇలా మాయా శక్తి
జీవుడిలో ఉండే శక్తిని హరించి వేస్తు ంది.
అంటే సన్మార్గ ంలో ఉంటే మనకు అంతులేని శక్తిని (అంటే పాజిటివ్ ఎనర్జీ అన్నమాట) ఇస్తు ంది. అంటే
దుష్ట బుద్ధి కలిగిన వాడికి మాయ కమ్మి (అది నెగెటవ్
ి ఎనర్జీ అన్నమాట) ఆ జీవుడి పాపం పండాక ఆ
జీవునిలో ఉండే శక్తిని హరించి వేస్తు ంది.
యజ్ఞా ది కర్మల్లో సాధారణంగా 16, 116, 1116 - ఇలా దక్షిణలిస్తా రు కదా. అవి అలా ఎందుకుంటాయో
జాగ్రత్తగా గమనిస్తే, అవి 7,8,9 అనే అంకెలను సూచిస్తా యి.
కాల, కుల, నామ, జ్ఞా న, చిత్త , నాద, బిందు, కళా, జీవమనే 9 వ్యూహాలే రూపంగా కలిగిన పరశంభుని
దేహమే శ్రీమాత. ఆ భగవతి దేహమే పరానంద సంజ్ఞ కల శంభువు.
మన దేహంలోని 9 స్థా నాలకూ, 9 చక్రా లకూ ఎలా సంబంధం ఉందో , అదే రీతిలో శ్రీ చక్రంలోని 9
చక్రా లతోనూ సంబంధం కలిగి ఉంది. అంటే, శ్రీవిద్యోపాసన అంటే, ఆత్మోపాసనే కానీ వేరే కాదు. దేవీ
అర్చన అంటే, ఆత్మను అర్పించడమే కానీ వేరే ఏదో కాదు.
నవరాత్రు లు - నవ రూపాలు
దసరా నవరాత్రు ల ఉత్సవాల్లో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరిస్తు ంది. తొలి రోజు
దుర్గా దేవిగా, రెండో రోజు బాలాత్రిపుర సుందరిగా, మూడో రోజు గాయత్రీదేవిగా, నాలుగో రోజు
అన్నపూర్ణ గా, ఐదో రోజు లలితా త్రిపురసుందరిగా, ఆరో రోజు శ్రీమహాలక్ష్మిగా, ఏడో రోజు సరస్వతీదేవిగా,
ఎనిమిదో రోజు దుర్గా దేవిగా, తొమ్మిదో రోజు మహిషాసుర మర్దినిగా, పదో రోజు రాజరాజేశ్వరిగా
దర్శనమిస్తు ంది. ఆయా రోజుల్లో అమ్మవారిని ఆయా రూప సంబంధ స్తో త్రా లను భక్తిశద
్ర ్ధ లతో పఠిస్తే
ఎంతో మంచిది.
దుర్గా దేవి రూపంలో అమ్మ దారిద్య్ర బాధలను తొలగిస్తు ంది. బాలాత్రిపుర సుందరిగా అందరి కోర్కెలను
తీరుస్తు ంది. లలితగా కార్య విజయాన్నీ, సంకల్ప సిద్ధినీ కలుగజేస్తే, అన్నపూర్ణ గా అన్నపానాదుల
కొరతే లేకుండా చేస్తు ంది. సకల జ్ఞా నాలను సరస్వతీదేవి రూపంలో ఇస్తు ంది. మహాలక్ష్మి రూపంలో
సకల సంపదలనూ ఇస్తు ంది. అష్ట మినాటి దుర్గ అన్ని రకాల దుర్గు ణాలనీ పారద్రో లుతుంది.
విజయదశమి నాటి రాజరాజేశ్వరీ దేవి సకల కార్యసిద్ధిని కలుగజేస్తు ంది.
శక్తి పీఠాలు
దేశ విదేశాల్లో ఆది పరాశక్తి ఆరాధన ఇప్పటికీ జరుగుతోందనడానికి ఆసియా ఖండంలో ఉండే 52 శక్తి
పీఠాలే సాక్ష్యాలు. ఈ 52 శక్తిపీఠాలను గుర్తించడానికి ఎలాటి ఐతిహాసిక ఆధారాలు మనకు
లభించకపో యినా పురాణాలూ, శాసనాలూ ఆయా పీఠాలను గుర్తించడానికి తోడ్పడ్డా యి.
భారతదేశంలో ఈ శక్తిపీఠాలు ఆంధ్రపద
్ర ేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణా టక, మహారాష్ట ,్ర
హర్యానా, చత్తీ స్‌గఢ్, ఉత్త రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థా న్, జమ్మూ కాశ్మీర్, త్రిపుర, అసో ం
రాష్ట్రా ల్లో ఉన్నాయి.
అలాగే విదేశాల సంగతికి వస్తే, ఈ శక్తి పీఠాలు నేపాల్, బంగ్లా దేశ్, పాకిస్తా న్, టిబెట్, శ్రీలంకలలో
ఉన్నాయి.
అష్టా దశ శక్తిపీఠాల్లో 17 మన దేశంలోనే ఉండటం ఒక విశేషం. అవే కంచి (కామాక్షి), ప్రద్యమ్న -
బెంగాల్ (శృంఖలాదేవి), మైసూర్ (చాముండేశ్వరి), అలంపురం (జోగులాంబ), శ్రీశైలం (భ్రమరాంబ),
కొల్హా పూర్ (మహాలక్ష్మి), మాహో ర్ (ఏకవీర), ఉజ్జ యిని (మహాకాళి), పీఠికపురం (పురుహూతిక),
ఒరిస్సా (గిరిజా), ద్రా క్షారామం (మాణిక్యాంబ), గౌహతి (కామరూపిణి), అలహాబాద్ (మాధవేశ్వరి),
జ్వాలాముఖి - జమ్మూ (వైష్ణవీదేవి), కాశి (విశాలాక్షి), కాశ్మీర్ (సరస్వతి - శారికా) అనేవి. 18 వది
శ్రీలంకలో (శాంకరీదేవి)లో ఉంది.
అన్నట్టు ద్వాదశ శక్తి పీఠాలనే మరో జాబితా కూడా ప్రచారంలో ఉంది. అవి శ్రీశైలం (భ్రమరాంబ), కంతి
(కామాక్షి), కేరళ (కుమారి), ఆన్త రం (అంబిక), కొల్హా పూర్ (మహాలక్ష్మి), మాళవ (కాళిక), ప్రయాగ
(లలిత), వింద్యాద్రి (వింధ్యవాసిని), కాశి (విశాలాక్షి), గయ (మంగళ గౌరి), బెంగాల్ (సుందరీ దేవి),
నేపాల్ (గుహ్యకేశ్వరి)
ఇలా అష్టా దశ పీఠాలనీ, ద్వాదశ పీఠాలనీ అలనాడు మహర్షు లే నిర్ణ యించినందువల్ల , ఈ ఎంపికంతా
కేవలం అలనాడు వారి ప్రా ధాన్యతలోని తేడాలవల్ల ఏర్పడిందే. ఇందువల్ల ఏ క్షేత్రమూ తక్కువైంది
కాదని మనం ఇక్కడ అర్థ ం చేసుకోవాలి. ఏ క్షేత్ర మహాత్మ్యం దానిదే.
మన దేశంలో వివిధ ప్రదేశాలలో దసరా
దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరుపుకుంటారు. మైసూర్, కలకత్తా , ఒరిస్సా,
తెలంగాణ, విజయవాడలలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని
ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు.
ఉత్త ర భారతదేశంలో దసరాల తొమ్మిది రోజులు దేవిని ఆరాధించి చివరి రోజున రావణ కుంభకర్ణ
బొ మ్మలను దగ్ధం చేస్తా రు. ఈ బొ మ్మలను వారు బాణాసంచాతో తయారుచేస్తా రు. రామ లక్ష్మణ
వేషధారులు బాణాలను సంధిస్తా రు. తమ అగ్ని బాణాలతో దగ్ధం చేస్తా రు.
మైసూర్ - దేశమంతటా దసరా పండుగ చేసుకుంటున్నా దసరా వేడుకలని చూసి తరించాలంటే మాత్రం
మైసూర్ వెళ్లి తీరాల్సిందే. అదే మైసూర్ దసరా ప్రత్యేకత. మైసూర్ మహారాజు పాలన కాలం నుండి
వైభవంగా దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. మహారాజు వారి కుల దైవం అయిన
చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా రావడం అలవాటు. ఆ సమయంలో
వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడటానికి దేశం నలుమూలల నుండి ప్రజలు
వస్తు ంటారు. రైతుల దసరా, మహిళా దసరా, యువ దసరా, పిల్లల దసరా.. ఇలా అక్కడ ఎవరి దసరా
వారిదే. ఆటల పో టీలు, పాటల పో టీలు, ప్రదర్శనలూ.. వెరసి ఊరు ఊరంతా తిరునాళ్లే . అందుకే ఆ
పదిరోజుల పండుగకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలైపో తాయి. మైసూర్ దసరా
పండుగని కర్ణా టక ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది. ఆ వేడుకల్ని తిలకించడానికి, వాటిలో
భాగమై పో వడానికి దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా పర్యాటకులు మైసూర్‌లో
వాలిపో తారు. ఎప్పుడో రాజుల కాలంలో మొదలైన ఈ దసరా సంబరాలకి నేటికి నాలుగొందల రెండేళ్లు .
ఆనాటి సంప్రదాయాన్ని, వైభవాన్ని ఓవైపు కొనసాగిస్తూ నే మరోవైపు ఆధునికత ఉట్టిపడే సంబరాలకి
వేదికైన మైసూర్ దసరా.
కలకత్తా : దసరాను దుర్గా పూజ పర్వదినంగా బెంగాలీయులు జరుపుకుంటారు. సప్త మి, అష్ట మి, నవమి
తిథులలో దుర్గా మాతకు పూజ చేసి తొమ్మిదవ రోజున కాళికామాతను దర్శిస్తా రు. ఆ రోజు
కాళీమాతను లక్షల మంది దర్శించడం విశేషం. తొమ్మిది రోజులూ రాష్ట మ్రంతా హరికథలు, పురాణ
శ్రవణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తా రు. చివరి రోజున దుర్గా మాతను హుగ్లీ నదిలో నిమజ్జ నం
చేస్తా రు. ఆ రోజున నదీ తీరంలో కుమారీ పూజలు చేయడం బెంగాలీల ప్రత్యేకత.
ఒరిస్సా: ఒరిస్సా పౌరులు దసరా సమయంలో దుర్గా మాతను ఆరాధిస్తా రు. కటక్ కళాకారులు
రూపొ ందించిన దుర్గా మాత విగ్రహాలను వీధివీధిన ప్రతిష్టిస్తా రు. సల
్ర్తి ు మానికలో వడ్లు నింపి లక్ష్మీదేవిగా
భావించి పూజలు నిర్వహిస్తా రు. మార్గ శిర మాసంలో కూడా ఈ చిహ్నంతో వారు లక్ష్మీదేవిని
ఆరాధించడం అలవాటు. దీనిని వారు మాన బాన అంటారు. ఒరిస్సా ప్రజలు విజయదశమి నాడు
విజయ దుర్గ ను ఆరాధిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తు ందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. చివరి రోజున 15
అడుగుల రావణ విగ్రహాన్ని బాణాసంచాతో తయారుచేసి మైదానంలో కాలుస్తా రు. ఈ రావణ దహనాన్ని
చూడటానికి ప్రజలు తండో పతండాలుగా వస్తా రు.
గుజరాత్: దసరా సమయంలో గుజరాతీయులు పార్వతీదేవి ఆరాధన చేస్తా రు. ఇంటింటా శక్తి పూజ
చేయడం గుజరాతీయుల ఆచారం. ఇంటి గోడల మీద శ్రీచక్రా న్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని
పసుపుతో చిత్రించి పూజిస్తా రు. ఆ గుర్తు ల సమీపంలో పొ లం నుండి తీసుకు వచ్చిన మట్టితో వేదిక
తయారుచేసి దానిపై బార్లీ, గోధుమ విత్త నాలను చల్లి దానిపై మట్టి ఉండ పెట్టి దానిని నీటితో నింపి
పో కచెక్క వెండి లేక రాగి నాణెం వేసి, ఆ మట్టికుండను వారు దేవిగా భావిస్తా రు. దానిని వారు
కుంభీప్రతిష్ట అంటారు. అష్ట మి రోజున యజ్ఞ ం నిర్వహించి దశమి రోజున నిమజ్జ నం చేస్తా రు. అమ్మవారి
వద్ద పెట్టిన ప్రమిదను గుడిలో సమర్పిస్తా రు. తరువాత పౌర్ణ మి వరకూ జరిగే గర్భా అనే ఉత్సవాలలో
స్ర్తిలు ఉత్సాహంగా పాల్గొ ంటారు.
తమిళనాడు - తమిళనాడులో అన్ని అమ్మవార్ల దేవాలయాల్లో దసరా ఉత్సవాలు బాగానే
జరుగుతాయి. ముఖ్యంగా మధుర మీనాక్షి అమ్మ దేవాలయం గురించి చెప్పుకోవాలి. మీనాక్షి
దేవాలయంలో ఉండే సువిశాల స్థ లంలో పెట్టే బొ మ్మల కొలువు చూడాలంటే రెండు కళ్లూ చాలవు. అతి
పెద్దదైన ఆ ఆలయ ప్రా ంగణంలో నాలుగు వేపులా అద్భుతమైన బొ మ్మల కొలువు కన్నుల విందుగా
ఉంటుంది.
ఆంధ్రపద
్ర ేశ్ - ఏటాటే బెజవాడ కనక దుర్గ మ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించి
విజయదశమి నాటికి కృష్ణా నదిలో తెప్పోత్సవం చేస్తా రు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై
మూడుసార్లు ఊరేగి భక్తు లకు దర్శనమిస్తు ంది. తర్వాత అమ్మవారిని పాతబస్తీలో ఊరేగిస్తా రు. 1 వ
టౌన్ పో లీస్‌స్టేషన్ వద్ద కు వచ్చి ఊరేగింపు ముగుస్తు ంది. దసరా చివరి రోజు ప్రభలు ఊరేగింపుగా
వస్తా యి. ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శిస్తా రు. ఈ భేతాళ నృత్య ప్రదర్శన విజయవాడ ప్రత్యేకత.
విజయనగరంలో దసరా సందర్భంగా సిరిమాను ఊరేగింపు విశేషంగా చెప్పుకోవాలి. దసరా
సమయంలో గజపతుల ఆడపడుచైన పైడితల్లికి పూజలు చేస్తా రు. ఈ దేవికి దసరా వెళ్లి న తరువాత
మొదటి మంగళవారంనాడు జాతర జరుపుతారు. ఈ ఉత్సవంలో భాగంగా పూజారిని సిరిమాను
ఎక్కించి అమ్మవారి గుడి ఉన్న మూడు లాంతర్ల సెంటర్ నుండి కోట వరకు మూడుసార్లు ఊరేగిస్తా రు.
ఈ ఉత్సవం చూసేందుకు చుట్టు పక్కల పల్లెల నుండి ప్రజలు ఎడ్ల బండిలో మూడు రోజుల ముందుగా
వచ్చి రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని ఉత్సవం చూసి ఆనందిస్తా రు. కృష్ణా జిల్లా లో ఉన్న
రేవుపట్ట ణం మచిలీపట్ట ణంలో దసరాల్లో శక్తి పీఠాల ఊరేగింపు నిర్వహిస్తా రు. దాదాపు నూరు
సంవత్సరాల క్రితం కలకత్తా నుండి బొ ందిలీలకు చెందిన ఒక సైనికుడు మచిలీపట్నం ఈడేపల్లిలో
కాళీమాత ప్రతిష్ట చేశాడు. అప్పటి నుండి దసరా సమయంలో శక్తి ఆలయం నుండి శక్తి పీఠాన్ని
పట్టు కుని పురవీధులలో ఊరేగింపుగా తీసుకురావడం మొదలైంది.
ప్రకాశం జిల్లా ఒంగోలులో దసరా ఉత్సవాలలో భాగంగా కళారాలను ఊరేగిస్తా రు. కళారాలంటే పెద్ద
ముఖాకృతి (మాస్క్‌లనొచ్చు) కాళికాదేవి, మహిషాసుర మర్దిని, నరసింహ స్వామి కళారాలను దసరా
సమయానికి చక్కగా అలంకరించి సిద్ధం చేస్తా రు. వీటికి ఈ తొమ్మిది రోజులు విశేషంగా పూజలు చేసి
తొమ్మిది పది రోజులలో ఒక్కోరోజు కొన్ని కళారాలకు ఊరేగింపు చేస్తా రు. ఇలా కళారాన్ని ఊరి
నడిబొ డ్డు కు తెచ్చాక అక్కడ రాక్షస సంహారం ఘట్టా న్ని ప్రదర్శిస్తా రు. పశ్చిమ గోదావరి జిల్లా వీర
వాసరంలో దసరా సమయంలో సుమారు వంద సంవత్సరాల నుండి ఏనుగు సంబరాలు జరపడం
ఆనవాయితీగా వస్తో ంది.
ఐతే, దసరా సమయంలో కర్నూలు జిల్లా లోని వీపనగండ్ల లో ప్రజలు రాళ్ల యుద్ధ ం చేస్తా రు. దసరా
రోజున సాయం వేళలో ప్రజలు కాలువ ఒడ్డు న కాలువకు అటూ ఇటూ చేరి కంకర రాళ్ల ను గుట్ట గా
పో సుకొని ఒకవైపు రామసేన ఒకవైపు రావణ సేనగా ఊహించి రాళ్ల ను విసురుతూ యుద్ధ ం
చేసుకుంటారు. దీనే్న రామరావణ యుద్ధ ంగా అభివర్ణిస్తా రు. అధర్మంపై ధర్మం యుద్ధ ం చేసి విజయం
పొ ందినట్లు భావిస్తా రు. ఈ రాళ్ల యుద్ధ ంలో దెబ్బలు ఎంత ఎక్కువ తగిలితే ఉత్సవం అంత బాగా
జరిగినట్లు అక్కడి ప్రజల లెక్క. తెలంగాణ ప్రా ంతంలో దసరా సమయంలో బతుకమ్మ పండుగ
ఉత్సవాలు చేస్తా రు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దు ల పండుగ దసరాకి రెండు రోజుల
ముందు వస్తు ంది. నవరాత్రి మొదట రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు
ఒకచోట సల
్ర్తి ంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తా రు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జ నం చేసిన
తరువాత పండుగ చేసుకుంటారు.
ముక్తా యింపు:
మానవత్వాన్ని పెంచేదే మతం. అందులో శక్తి పూజలూ, దేవతారాధనలూ - ఇవన్నీ సంకేతప్రా యాలే.
ప్రతిదానికి ఒక రహస్యం ఉంది. అదేమిటంటే, మనలోని చెడును గుర్తించు. దాన్ని తొలగించు. అదే భక్తి
భావం. ముక్తి మార్గ ం. దేవుడెక్కడో లేడు. నీలోనూ ఉన్నాడు. నాలోనూ ఉన్నాడు. సత్యం, ధర్మం,
శాంత, ప్రేమ - ఇవే మన మానవ జన్మ సార్థ కం కావడానికి సాధనాలు. అదే మన భారతీయ పండుగల
వెనుక ఉన్న పరమార్థ ం. ఈ విషయం తెలుసుకున్న రోజున, ఒక్క దసరాయే కాదు. ఏ పండుగనైనా
ఆనందంగా, సంతోషంగా గడుపుకోగలం.
యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా, నమస్త స్యై నమస్త స్యై నమస్త స్యై నమో నమః. *

మైసూర్ దసరా వేడుకలు సామరస్యానికి ప్రతీక


‘తాతల కాలం నుంచి మైసూర్ దసరా వేడుకలను అత్యంత దగ్గ రి నుంచి తిలకించే భాగ్యం నాకు
లభించింది. కుటుంబ సభ్యుల మందరం ఉత్సాహంగా ఈ సంప్రదాయ దసరా వేడుకల్లో పాల్గొ నేవాళ్ల ం.
అప్పట్లో మా తాతగారు బంగారు సింహాసనంపై కూర్చొని దర్బార్ నిర్వహిస్తు ంటే ఆ ఠీవి
చూడముచ్చటగా ఉండేది. కాలక్రమంలో రాజ వంశస్థు డిగా నాకు కూడా ఈ బంగారు సింహాసనాన్ని
అధిష్టించే అపురూప అవకాశం లభించింది. దీనిని పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తు ంటాను.
మైసూర్ దసరా కర్ణా టక ప్రజల జీవితంలో ఓ భాగంగా మారింది. అన్ని వర్గా ల ప్రజల మధ్య
సామరస్యానికి బలమైన పునాదులు వేసింది. అందుకే ఈ ఉత్సవాల్లో అన్ని వర్గా ల ప్రజలు ఎంతో
సంతోషంగా పాల్గొ ంటుంటారు.
అసలు ఇలాంటి ఉత్సవాల నిర్వహణ ఉద్దేశం కూడా అదే. గణేష్ ఉత్సవాల నిర్వహణలో కనిపించే
సామరస్యం మైసూర్ దసరా ఉత్సవాల్లో కూడా కొట్టొ చ్చినట్టు కనిపిస్తు ంటుంది. రాజుల కాలం నుంచి
తరాలు మారి ఉత్సవాలు కొత్త రూపం సంతరించుకున్నా ఆ సందడి మాత్రం తగ్గ నే లేదు. పైగా ఏటా
దాని వైభవం పెరుగుతూనే ఉంది. దసరా ఉత్సవాలను ప్రజలు, ప్రభుత్వం సంయుక్త ంగా కలిసి
నిర్వహించడం అనేది బహుశా దేశంలో మరెక్కడా లేదనుకుంటాను. ఈ చారిత్రా త్మక దసరా మరిన్ని
వందల వసంతాలను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలన్నదే నా ఆకాంక్ష. నాటి తరం దసరా వైభవాన్ని
నేటి తరానికి చాటి చెప్పే ప్రయత్నం మరింతగా జరగాలని కోరుకుంటున్నాను.’
-శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్, మాజీ యువరాజు 400 మైసూర్ దసరా వేడుకల సందర్భంగా
అన్న మాటలివి.

శక్తి స్వరూపిణి - శ్రీవిద్య

శ్రీదేవీ లీలా విగ్రహ స్వరూప మహాత్మ్యం అనేది అనిర్వచనీయమైంది. ఇతర దేవతల ధ్యాన
స్వరూపంలో వరాభయ ముద్రలుంటాయి. ఐతే పరాదేవత సర్వజగత్కల్యాణదాయిని కావడంవల్ల ఆమె
ఎలాటి ముద్రలూ, అభినయాలూ లేకుండానే భక్తు లకు వరప్రదాయినిగా అయింది.
శక్తిశే్చచ్ఛాది రూపా, సర్వకార్యానుకూలా - అయిన ఆ శక్తి మహా త్రిపురసుందరి. ఆమె భర్తే త్రిపురుడు.
ఆ శక్తి దశ మహా విద్యలుగా ఇలా పరిణమించింది.
శ్లో .కాళీ, తారా, మహావిద్యా, షో డశీ, భువనేశ్వరీ
భైరవీ, ఛిన్నమస్తా చ, విద్యా దూమావతీ తథా
బగళా, సిద్ధ విద్యాచ, మాతంగీ, కమలాత్మికా
ఏతా దశ మహావిద్ సిద్ధ విద్యః ప్రకీర్తితాః
అసలు మంత్రా లన్నీ శ్రీవిద్య నుంచే వచ్చాయి. ఆ విషయాన్ని గుర్తించిన ఉపాసకులు శ్రీవిద్యను
ప్రధానంగా ఉపాసిస్తా రు. ఆమె సర్వ మంత్ర స్వరూపిణి. సప్త కోటి మంత్ర స్వరూపాలూ ఆమెవే. అలాగే
శ్రీయంత్రం నుంచే సకల దేవతల యంత్రా లూ ఉత్పన్నమవుతాయి గనుక ఆమెను అందరూ సర్వ
తంత్ర స్వరూపా అని కీర్తిస్తు న్నాం. ఈ ఆత్మ విద్యనే షో డశి, భువనేశ్వరి, కాళి - అని మూడు భాగాలై
కాలాంతరంలో మార్పులు చెంది దశ మహా విద్యలుగా రూపొ ందాయి.
భూతాని దుర్గా భువనానిన దుర్గా
స్ర్తీయో నరశ్చాపి పశుశ్చ దుర్గా
యద్యద్ధి దృశ్యం ఖలు సైవ దుర్గా
దుర్గా స్వరూపా దపరం న కించిత్
నమః శ్రీవిద్యా పాదుకాభ్యః

దుర్గా దేవి - వాగ్దేవి


దుర్గా దేవి వాగ్దేవిగా ప్రశంసలను అందుకుంది. అందరికీ వాక్కునిచ్చే దేవత ఆమె. ఆమెనే మెరుపుల్లో
కనిపించే విద్యుత్ శక్తి. ఆమెయే ఇంద్రా ణి. జ్యోతిర్మయి. మనలోని వాక్కు కూడా ఆమెనే. మేఘాలను
వర్షింపజేసే రీతిలో, ఆకాశంలో ఉండటం వల్ల ఏకపదిగా, అంతరిక్షంతో కూడి ఉండటం వల్ల
ద్విపదియైంది. నాలుగు దిక్కులా వ్యాపించి ఉండటం వల్ల చతుష్పదిగానూ, మిగిలిన నాలుగు
దిక్కులా కన్పించి అష్ట పదిగానూ, ఊర్థ ్వ దిశతో కలిసి నవపదిగానూ ఉంది. ఆమెనే శబ్ద బ్రహ్మమయిగా
వెలుగొందుతోంది. తొలుత ఓంకారమై ప్రణవ స్వరూపిగా ఉంది. వేదవేదాంగాదుల స్వరూపాలను
అందుకున్నది. వివిధ భాషా రూప పరివర్త నాలను చెంది సహస్రా క్షరిగా మారింది. అపరిమిత శక్తి
కలిగింది. వాగ్దేవిగానూ, సరస్వతిగానూ విరాజిల్లిందా పరమశక్తి. అందుకే ఈ నవరాత్రు ల్లో యాదేవీ
సర్వభూతేషు.. అంటూ విద్యాగీత పారాయణ చేసి అశేష ఫలితాన్ని పొ ందవచ్చు.

ఏ స్తో త్రా లు పారాయణ చేయాలి


లోకానికి రమణ మహర్షిని పరిచయం చేసిన వాశిష్ఠ గణపతి ముని ఉమా సహస్రం, ‘ఇంద్రా ణీ సప్త శతి’
వంటి మహా గ్రంథాలను మనకు అందించారు. దేశంలోని అనిశ్చితి, అల్ల కల్లో ల పరిస్థితులు, అశాంతి,
అరాచకాల నుంచి దేశాన్ని రక్షించమని ఆ అమ్మవారిని వేడిన శ్రీ వాశిష్ఠ గణపతి ముని రాసిన ఈ
ఇంద్రా ణీ సప్త శతి భారతదేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా దసరాల సందర్భంగా
భారతీయులందరూ పఠించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే, దసరా 9 రోజులూ నిత్యమూ దుర్గ
సప్త శ్లో కి, దుర్గా సప్త శతి, విద్యా గీత, మహిషాసుర మర్దిని స్తో త్రం, సౌందర్య లహరి, అపరాజితా స్తో త్రం,
అర్గ ళా స్తో త్రం, దేవీ ఖడ్గ మాలా స్తో త్రం, అర్జు న కృత రణదుర్గా స్తో త్రం, లలితా త్రిశతి, కనకధారా స్తో త్రం,
అన్నపూర్ణా స్తో త్రం, దుర్గా అష్టో త్త ర శతనామావళి, బాలాత్రిపుర సుందరి అష్టో త్త ర శత నామావళి,
సౌందర్య లహరి, రాజరాజేశ్వరీ అష్టో త్త ర శత నామావళి, విద్యాగీత, లలితా సహస్ర నామం వంటి వాటిని
పారాయణ చేయడం అందరికీ శ్రేయోదాయకం. వీటిలో కనీసం ఒక్కటన్నా పారాయణ చేయడం
శుభాన్నిస్తు ంది.

You might also like