Hanu Math Jayanti

You might also like

You are on page 1of 3

హనుమాన్ జయంతి రోజున పూజ ఎలాచేయాలి?

చైతశు
్ర ద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తు లు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి
దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రా ంతంలో
హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తు లు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి
ఆయుర్దా యం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని
ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపో తాయని విశ్వాసం. అలాగే
గృహంలో పూజచేసే భక్తు లు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో
అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ
ప్రతిమను లేదా ఫో టోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు,
దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు.
పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తో త్రా లతో మారుతిని
స్తు తించుకోవాలి. లేదా “ఓం ఆంజనేయాయ నమః” అనే మంత్రా న్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తు లను నువ్వుల
నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్త యిన తర్వాత ఆంజనేయ ఆలయాలను
సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొ న్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రా లను దర్శించుకునే
వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తు ందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లో కములు, హనుమాన్‌చాలీసా
పుస్త కములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం

హనుమాన్ జయంతి

యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తు తమస్త కాంజలిమ్


భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్

"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై
జోడించి నాట్యం చేస్తూ ఉండును"శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది. ఈ రోజున
హనుమద్భక్తు లు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తా రు.
విశేషాలు:
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక దిನములు - శనివారం, మంగళవారం ఇంకా గురువారం. పురాణకధ
ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని
తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తు లను
యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే యెడున్నర యేళ్ళ శని దో షం ఉన్నవారు
శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దో షం తగ్గు తుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో
ఏ రోజైనా స్వామికి పూజ చేసుకొనవచ్చు.
స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:
తమలపాకుల దండ:
ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు,
అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేసారట, దగ్గ రలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి
తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తా రు.
మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.
పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తా రు.
తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్ట మైనది
కలువలు:
కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్ట మైన పూలు. భరతుని ఉన్న ఒక్క కోవెల ఇరింజలకుడ, కేరళలో
అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడంటే భరతుడు మీద ఉన్నంత
వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తా రు.
పంచముఖ హనుమాన్:
శ్రీ విష్ణు మూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల
వివరం ఇలా చెప్పబడింది.
తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తా డు.
దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పో గొట్టి, విజయాన్ని కలుగజేస్తా డు.
పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి,దుష్ట ప్రభావలను పో గొట్టీ,శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తా డు.
ఉత్త రముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తా డు.
ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞా నాన్ని , జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డ లను ప్రసాదిస్తా డు.

ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో ... ఎక్కడ ఆయన నామం వినిపిస్తు ందో ... అక్కడ హనుమంతుడు ఉంటాడు.
ఆయనను మించిన భక్తు డు లేడంటూ రామచంద్రు డు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న భాగ్యశాలి హనుమంతుడు.
అలాంటి హనుమంతుడి జన్మ వృత్తా ంతంలోకి వెళితే ... ఒకసారి దేవలోకంలో ఇంద్రా ది దేవతలు కొలువుదీరి ఉండగా,
'పుంజికస్థ ల'అనే అప్సరస ... బృహస్పతితో పరిహాసమాడబో యింది. ఆమె చేష్టలకు ఆగ్రహించిన బృహస్పతి, భూలోకాన
'వానర స్త్రీ'గా జన్మించమని శపించాడు.

తీవ్రమైన ఆందో ళనకి లోనైన ఆమె శాపవిమోచనం ఇవ్వమంటూ కన్నీళ్ల తో ప్రా ధేయపడింది. కారణ జన్ముడైన
వానరవీరుడికి జన్మను ఇచ్చిన తరువాత ఆమె తిరిగి దేవలోకానికి చేరుకోవచ్చునంటూ ఆయన అనుగ్రహంి చాడు. దాంతో
'పుంజికస్థ ల'భూలోకాన 'అంజనాదేవి'గా జన్మించి, కాలక్రమంలో 'కేసరి'అనే వానరుడిని వివాహమాడింది.
శాపవిమోచానార్ధం తనకి వీరుడైనటువంటి పుత్రు డిని ప్రసాదించమంటూ ఆమె వాయుదేవుడిని ప్రా ర్ధించింది.
ఈ నేపథ్యంలో రాక్షస సంహారం కష్ట తరంగా మారడంతో, పరమేశ్వరుడి అంశతో జన్మించినవాడి వలనే అది సాధ్యమని
బ్రహ్మ - విష్ణు భావించారు. అయితే పరమశివుడి వీర్య శక్తిని పార్వతీదేవి భరించలేకపో వడంతో , వాయుదేవుడి ద్వారా
దానిని స్వీకరించిన అంజనాదేవి గర్భం దాలుస్తు ంది. అలా శివాంశ సంభూతుడైన హనుమంతుడు 'వైశాఖ బహుళ
దశమి' రోజున అంజనాదేవి గర్భాన జన్మించాడు.

తల్లి ఆలనాపాలనలో పెరుగుతోన్న హనుమంతుడు, ఆకాశంలోని సూర్యుడిని చూసి దానిని తినే పండుగా భావించి
కోసుకురావాలనే ఉద్దేశంతో ఆకాశ మార్గా న బయలుదేరాడు. ఆయన్ని చూసిన ఇంద్రు డు తన వజ్రా యుధాన్ని
విసురుతాడు. దాని ధాటికి తట్టు కోలేక అక్కడి నుంచి కింద పడిపో యిన హనుమంతుడి 'ఎడమ దవడ'కి గాయం
కావడంతో స్పృహ కోల్పోయాడు. దాంతో దేవాధి దేవతలంతా అక్కడికి చేరుకొని హనుమంతుడు చిరంజీవిగా ఉండాలని
ఆశీర్వదించారు.

అలా దేవతల నుంచి వరాలు పొ ందిన హనుమంతుడి అల్ల రి చేష్టలకు అడ్డూ అదుపూ లేకుండా పో యింది. దాంతో ఎవరైనా
గుర్తు చేస్తే తప్ప, అతని శక్తి అతనికి తెలియకుండా ఉండేలా రుషులు శపించారు. సూర్య భగవానుని అనుగ్రహంతో సకల
విద్యలను అభ్యసించిన హనుమంతుడు, రామాయణానికి ఓ నిండుదనాన్ని తీసుకు వచ్చాడు. సుగ్రీవుడిలో కదలిక
తీసుకు వచ్చి అతని సైన్యాన్ని ముందుకు నడిపించడంలోనూ ... లంకలో ఉన్న సీతమ్మవారి ఆచూకీ
తెలుసుకోవడంలోను ... వారధి నిర్మించడంలోను ... యుద్ధ రంగాన లక్ష్మణుడు మూర్చ పో యినప్పుడు 'సంజీవిని'
పర్వతాన్ని పెకిలించి తీసుకు రావడంలోను హనుమంతుడు కీలకమైన పాత్రను పో షించాడు. అందుకే
హనుమంతుడులేని రామాయణాన్ని అస్సలు ఊహించలేం.

'త్రిపురాసుర సంహారం' సమయంలో పరమ శివుడికి శ్రీ మహా విష్ణు వు తన సహాయ సహకారాలను అందించాడు.
అందువల్ల నే లోక కల్యాణం కోసం శ్రీ మహా విష్ణు వు రామావతారం దాల్చినప్పుడు, శివుడు ... ఆంజనేయస్వామిగా
అవతరించి, రావణ సంహారానికి తన సహాయ సహకారాలను అందించినట్టు పురాణాలు చెబుతున్నాయి. దుష్ట గ్రహాలను
తరిమికొట్టి ఆయురారోగ్యాలను ప్రసాదించే హనుమంతుడిని పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఎంతో ఇష్ట పడతారు.

ఇక ప్రతి ఊరిలో రామాలయం వుంటుంది ... ఆయనతో పాటు హనుమంతుడు కూడా అందుబాటులో ఉంటాడు.
అందువలన ఈ హనుమజ్జ యంతి రోజున ప్రతి ఊరిలో ఆయనకు ప్రదక్షిణలు చేయడం ... ఆకు పూజలు చేయించడం ...
ఆయనకి ఇష్ట మైన 'వడ' మాలలు వేయించడం జరుగుతుంటుంది. ఈ రోజున ఆంజనేయ స్వామి దండకం ... హనుమాన్
చాలీసా చదవడం ఉత్త మ ఫలితాలను ఇస్తు ంది.

You might also like