You are on page 1of 12

శ్రీ నారాయణ కవచం ( తాత్పర్యముతో)

తెలుగు అనువాదం -డా.తాడేపల్లి పతంజలి

--------------------------------------------------------------------------------------------------------------------
-----

సంస్కృత మహాభాగవతంలో ఎనిమిదవ అధ్యాయము ఆరవ స్కందములో శ్రీ నారాయణ కవచం ఉన్నది
.దాని యొక్క పూర్వాపరాలను , తాత్పర్యమును స్వామి దయతో తెలుసుకునే ప్రయత్నం చేద్దా ం.

దుష్ట శక్తు లనుంచి మనల్ని రక్షించే మంత్రా న్ని కవచం అంటారు.. గణపతి, గాయత్రీ, సుదర్శన
మొదలైన కవచ మంత్రా లలో నారాయణ కవచం ఒకటి.

ఒకరోజు ఇంద్రు డు గర్వంతో సింహాసనంపై కూర్చొని గురువైన బృహస్పతి సభలోకి వచ్చినా


గౌరవించలేదు. గురువు కోపించి సభలో దేవతలను విడిచి వెళ్లి పో యాడు. అదే సమయంలో రాక్షసులు
దేవతలపై దాడి చేసారు. తట్టు కోలేని దేవతలు బ్రహ్మను శరణు వేడగా ‘గురువును పూజించనందువలన
వారికి ఈ దుర్గ తి వచ్చిందని త్వష్ట మనువు కుమారుడైన విశ్వరూపుడిని ఆశ్రయిస్తే కష్టా లు తీరతాయని
చెప్పారు. దేవతలు విశ్వరూపుని ఆశ్రయించగా ఆ సమయంలో విశ్వరూపుడు వారికి నారాయణ
కవచాన్ని ఉపదేశించాడు.

యయా గుప్త ః సహస్రా క్షః సవాహాన్ రిపుసైనికాన్ |

క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యం బుభుజే శ్రియమ్ || ౧ ||

భగవంస్త న్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకమ్ |

యథాఽఽతతాయినః శత్రూ న్ యేన గుప్తో ఽజయన్మృధే || ౨ ||

ఓ భగవాన్ ! శుక మహర్షీ ! నారాయణ కవచం అని ఒక వైష్ణవ విద్య ఉన్నదట కదా! ఆ నారాయణ
కవచం సాక్షాత్తు విష్ణు మూర్తి యొక్క స్వరూపం. దాని చేత ఇంద్రు డు ఒక ఆట ఆడుకున్న పద్ధ తిలో
యుద్ధ ములు శత్రు వులను జయించాడు. మూడు లోకముల యొక్క సంపదను పొ ందాడు. అటువంటి
గొప్పదైన నారాయణ కవచ విద్యను నాకు చెప్పవలసినది. ఆ కవచం రక్షిస్తు ండగా యుద్ధ ములో
శత్రు వులను ఆ ఇంద్రు డు జయించిన విధానమును కూడా చెప్పవలసినది.

శ్రీ శుక ఉవాచ |


వృతః పురోహితస్త్వాష్ట్రో మహేన్ద్రా యానుపృచ్ఛతే |

నారాయణాఖ్యం వర్మాహ తదిహైకమనాః శ్రు ణు || ౩ ||

శ్రీ శుక మహర్షి ఈ విధముగా చెప్పెను. పూర్వం త్వష్ట ్ర అను వాని యొక్క కుమారుడు విశ్వరూపుడు
అను వాడు కలడు . అతడు ఇంద్రు డు అడుగగా ఈ నారాయణ కవచము వివరించాడు .అటువంటి
గొప్పదైన ఆ కవచమును ఇప్పుడు శ్రద్ధతో ఏకాగ్రమైన హృదయముతో వినుము.

శ్రీ విశ్వరూప ఉవాచ |

ధౌతాంఘ్రిపాణిరాచమ్య సపవిత్ర ఉదఙ్ముఖః |

కృతస్వాంగకరన్యాసో మన్త్రా భ్యాం వాగ్యతః శుచిః || ౪ |

· కాళ్లు చేతులు కడుక్కొని పవిత్రము ధరించి ఉత్త ర దిక్కుగా కూర్చుని ఆచమనము చేసి ఒక మౌనియై,
శుచియై రెండు మంత్రముల చేత అష్టా క్షర,( 'ఓం, న, మో, నా, రా, య, ణా, య'

) ద్వాదశాక్షరీ (ఓం నమో భగవతే వాసుదేవాయ.)మంత్రముల చేత అంగన్యాసము కరన్యాసము చేసాడు

నారాయణమయం వర్మ సన్నహ్యేద్భయ ఆగతే |

పాదయోర్జా నునోరూర్వోరుదరే హృద్యథో రసి || ౫ ||

ముఖే శిరస్యానుపూర్వ్యాదో ంకారాదీని విన్యసేత్ |

ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా || ౬ ||

భయము కలిగిన సందర్భములో సాధకుడు నారాయణ మయమైన ఈ వైష్ణవ విద్యను ధరించాలి అనగా
చదవాలి. కాళ్లు మోకాళ్లు తొడలు ఉదరము హృదయము రొమ్ము ముఖం తల అను అవయవముల లో
ఓం నమో నారాయణాయ అను మంత్రా న్ని తలతో ఆరంభించి పాదము చివరి వరకు మరలా పాదముతో
ఆరంభించి తన చివరి వరకు తాకుతూ జపించాలి.

కరన్యాసం తతః కుర్యాద్ద్వాదశాక్షరవిద్యయా |

ప్రణవాదియకారాన్త మంగుల్యంగుష్ఠ పర్వసు || ౭ ||


తరువాత ద్వాదశాక్షరీ మంత్రా న్ని ఒక్కొక్క అక్షరాన్ని కుడి చూపుడు వేలుతో ఆరంభించి ఎడమచేతి
చూపుడు వేలు వరకు న్యాసము చేయాలి. తరువాత మంత్రము లో మిగిలిన నాలుగు అక్షరాలను
బొ టనవేలు యొక్క మొదటి చివరి కణుపులలో న్యాసము చేయాలి .

న్యసేద్దృదయ ఓంకారం వికారమను మూర్ధ నీ |

షకారం తు భ్రు వోర్మధ్యే ణకారం శిఖయాదిశేత్ || ౮ ||

హృదయములో ఓంకారము ఉంచాలి. వికారము తలపై, ష కారమును భ్రూ మధ్యమున, ణ కారమును


శిఖలో న్యాసము చేయాలి( ఓం విష్ణ వే నమః అను మంత్రము)

వేకారం నేతయో
్ర ర్యుంజ్యాన్నకారం సర్వసంధిషు |

మకారమస్త మ
్ర ుద్దిశ్య మన్త మ
్ర ూర్తిర్భవేద్బుధః || ౯ ||

వే కారమును కన్నుల యందు, న కారమును అన్ని కీళ్ల యందు న్యాసము చేయాలి. మ కారము
అస్త మ
్ర ు గా ఉద్దేశించిన విద్వాంసుడు మంత్ర మూర్తి అవుతాడు.

సవిసర్గ ం ఫడన్త ం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్ |

ఓం విష్ణ వే నమః || ౧౦ ||

విసర్గ తో కలిపి ఫట్ చివరగా ( మః అస్త్రా య ఫట్) అన్ని దిక్కులను ఓం విష్ణ వే నమః అను మంత్రముచే
దిక్కులను నిర్దేశించాలి.

ఆత్మానం పరం ధ్యాయేద్ధ్యేయం షట్ఛక్తిభిర్యుతమ్ |

విద్యాతేజస్త పో మూర్తి మిమం మన్త మ


్ర ుదాహరేత్ || ౧౧ ||

ఈ ప్రకృతికి అతీతుడైన ఆరు శక్తు లు కలిగిన ( ఐశ్వర్యము వీర్యము ,యశస్సు, శ్రీ , జ్ఞా నము,
వైరాగ్యం)అందరి చేత ధ్యానము చేయదగిన వాడైన ఆ పరమాత్మను ఆత్మ రూపముగా ధ్యానించాలి. .
విద్య ,తేజస్సు , తపస్సు ఈ మూడింటి సమ్మేళనమైన ఈ చెప్పబో వు నారాయణ కవచము అను
మంత్రముచే కీర్తించాలి.

ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం

న్యస్తా ంఘ్రిపద్మః పతగేంద్రపృష్ఠే |


దరారిచర్మాసిగదేషుచాప-

పాశాందధానోఽష్ట గుణోఽష్ట బాహుః || ౧౨ ||

ఓం

పక్షిరాజు వీపు పైన ఉంచిన పాదపద్మములు కలిగిన, శంఖం, చక్రము, డాలు, కత్తి , గద, ధనస్సు, బాణం ,
పాశం అను 8 ఆయుధములను తన ఎనిమిది చేతులయందు ధరించిన ఎనిమిది గుణములు కలిగిన(
అణిమ,లఘిమ, గరిమ , మహిమ, ఈశత్వ, వశిత్వము, ప్రా ప్తి ప్రా కామ్యము) ఆ శ్రీహరి నన్ను అన్ని
విధములుగా రక్షింప చేయుగాక!

జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి-

ర్యాదో గణేభ్యో వరుణస్య పాశాత్ |

స్థ లేషు మాయావటువామనోఽవ్యా

త్రివిక్రమః సో ఽవతు విశ్వరూపః || ౧౩ ||

జ ల జంతువుల గణము లైన వరుణ పాశముల నుంచి మత్స్య రూపమును ధరించిన శ్రీహరి, స్థ లముల
లో మాయ చేత బ్రహ్మచారి అయిన వామనమూర్తి, ఆకాశములో విశ్వరూపం ధరించిన త్రివిక్రముడు
నన్ను రక్షించు గాక!

దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః

పాయాన్నృసింహో ఽసురయూథపారిః |

విముంచతో యస్య మహాట్ట హాసం

దిశో వినేదుర్న్యపతంశ్చ గర్భాః || ౧౪ ||

అడవులు, యుద్ధ భూములు మొదలైన సంకట స్థా నములలో శ్రీ నరసింహ స్వామి యొక్క అట్ట హాసం
దిక్కులందు ప్రతిధ్వనించింది. రాక్షస సేనానాయకులకు శత్రు వైన నరసింహ స్వామి గర్జిస్తే శత్రు వు కాంతల
యొక్క గర్భములు కూడా జారి పడతాయి. అటువంటి నరసింహ స్వామి నన్ను రక్షించుగాక!

రక్షత్వసౌ మా౽ ధ్వని యజ్ఞ కల్పః


స్వదంష్ట యో
్ర న్నీతధరో వరాహః |

రామోఽద్రికూటేష్వథ విప్రవాసే

సలక్ష్మణోఽవ్యాద్భరతాగ్రజోమామ్ || ౧౫ ||

యజ్ఞ ముల చే నిర్దేశించబడిన వాడు ,తన కోరల చే భూమిని ఉద్ధ రించిన వరాహ మూర్తి నన్ను మార్గ ంలో
కాపాడుగాక! పర్వత కూటములలో పరశురాముడు కాపాడుగాక! పరదేశములలో భరతుడు లక్ష్మణునితో
కలిసిన శ్రీరాముడు కాపాడుగాక!

మాముగ్రధర్మాదఖిలాత్ప్రమాదా-

న్నారాయణః పాతు నరశ్చ హాసాత్ |

దత్త స్త ్వయోగాదథ యోగనాథః

పాయాద్గు ణేశః కపిలః కర్మబంధాత్ || ౧౬ ||

చేతబడులు మొదలైన ఉగ్ర ధర్మముల నుంచి నారాయణుడు నన్ను కాపాడు గాక! గర్వమునుండి నన్ను
నరుడు కాపాడుగాక! యోగాన్ని అభ్యసిస్తూ సిద్ధిని పొ ందక మరణించే యోగము నుండి యోగ నాధుడైన
దత్తా త్రేయుడు కాపాడుగాక! కర్మబంధముల నుండి గుణములకు ప్రభువైన కపిలుడు కాపాడుగాక!.

సనత్కుమారోఽవతు కామదేవాత్

హయాననో మాం పథి దేవహేలనాత్ |

దేవర్షివర్యః పురుషార్చనాంతరాత్

కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్ || ౧౭ ||

కామ దేవుడైన మన్మధుని నుండి సనత్కుమారుడు కాపాడుగాక !నడిచే దారిలో దేవతలకు నమస్కరించ
కుండా వెళ్లే దేవహేళన దో షం నుంచి హయగ్రీవుడు కాపాడుగాక !పురుషో త్త ముని పూజలో చేసే
లోపాలనుంచి దేవముని నారదుడు కాపాడుగాక! అన్ని రకాల నరకాల నుండి కూర్మ రూపుడై న శ్రీహరి
కాపాడుగాక!

ధన్వంతరిర్భగవాన్పాత్వపథ్యా-
ద్ద ్వంద్వాద్భయాదృషభో నిర్జితాత్మా |

యజ్ఞ శ్చ లోకాదవతాజ్జ నాంతా-

ద్బలో గణాత్క్రోధవశాదహీంద్రః || ౧౮ ||

కష్ట ముల నుండి ధన్వంతరి, ద్వంద్వ భయముల నుంచి మనస్సును జయించిన ఋషభ దేవుడు, లోకం
నుంచి యజ్ఞ స్వరూపుడైన శ్రీహరి, ప్రజల వలన ఏర్పడు అపకారముల నుంచి బలభద్రు డు, కోపంతో
ఉన్న పాముల సమూహము నుంచి ఆదిశేషుడు నన్ను కాపాడు గాక!

ద్వైపాయనో భగవానప్రబో ధా-

ద్బుద్ధ స్తు పాషండగణాత్ప్రమాదాత్ |

కల్కిః కలేః కాలమలాత్ప్రపాతు

ధర్మావనాయోరుకృతావతారః || ౧౯ ||

అజ్ఞా నము నుండి వ్యాసభగవానుడు ,వేద విరుద్ధ ము గల మతమును అనుసరించు వారి నుండి బుద్ధ
భగవానుడు, ధర్మాచరణలో మతిమరుపు రాకుండా ఉండుటకు కల్కి భగవానుడు నన్ను రక్షించెదరు
గాక!

మాం కేశవో గదయా ప్రా తరవ్యా-

ద్గోవింద ఆసంగవమాత్త వేణుః |

నారాయణః ప్రా హ్ణ ఉదాత్త శక్తి-

ర్మధ్యందినే విష్ణు రరీంద్రపాణిః || ౨౦ ||

ఉదయమందు గద పట్టు కొని కేశవుడు, పగలు యొక్క రెండవ జాము నందు ఆవులను పాలించు
గోవిందుడు ,మూడవ జాము నందు గొప్ప శక్తి కలిగిన నారాయణుడు, మధ్యాహ్న సమయంలో
చక్రమును ధరించిన విష్ణు వు నన్ను రక్షించెదరు గాక!

దేవోఽపరాహ్ణే మధుహో గ్రధన్వా

సాయం త్రిధామా౽వతు మాధవో మామ్ |


దో షే హృషీకేశ ఉతార్ధ రాత్రే

నిశీథ ఏకోఽవతు పద్మనాభః || ౨౧ ||

అపరాహ్ణములో (దినము మూడు భాగములైనప్పుడు కడపటి భాగము. అయిదు భాగములైనప్పుడు


నాల్గ వభాగము. )భయంకరమైన ధనుస్సును ధరించిన మధుసూదనుడు ,సాయంకాలమున ప్రదో ష
సమయం వరకు త్రిమూర్తి స్వరూపుడైన హృషీకేసుడు, అర్ధ రాత్రి వరకు మాధవుడు ,అర్థ రాత్రి తరువాత
పద్మనాభుడు నన్ను కాపాడు గాక!

శ్రీవత్సధామా౽పరరాత్ర ఈశః

ప్రత్యుష ఈశోఽసిధరో జనార్దనః |

దామోదరోఽవ్యాదనుసంధ్యం ప్రభాతే

విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తిః || ౨౨ ||

రాత్రి యొక్క చివరి కాలములో శ్రీవత్సమను పుట్టు మచ్చ కలిగిన ఈశ్వరుడు వేకువజాము లో
ఖడ్గ మును ధరించిన జనార్ద నుడు ,ప్రతి సంధ్యలో దామోదరుడు, తెల్లవారుజామున కాల స్వరూపుడైన
జగన్నాథుడు నన్ను కాపాడుగాక!

చక్రం యుగాంతానలతిగ్మనేమి

భ్రమత్సమంతాద్భగవత్ప్రయుక్త మ్ |

దందగ్ధి దందగ్ధ ్యరిసైన్యమాశు

కక్షం యథా వాతసఖో హుతాశః || ౨౩ ||

వాడి అయిన అంచులు కలిగి ప్రళయకాలాగ్ని లాగా భగవంతునిచే ప్రయోగించబడి అంతట తిరుగు
చక్రము - వాయు దేవుని యొక్క స్నేహితుడైన అగ్ని గడ్డిని తగలబెట్టినట్లు గా- నా శత్రు సైన్యమును
వెంటనే నాశనము చేయు గాక!

గదేఽశనిస్పర్శనవిస్ఫులింగే

నిష్పింఢి నిష్పింఢ్యజితప్రియాసి |
కూష్మాండవైనాయకయక్షరక్షో-

భూతగ్రహాంశ్చూర్ణ య చూర్ణ యారీన్ || ౨౪ ||

పిడుగు వలె స్పర్శ కలిగిన నిప్పు కణములు కలిగిన గదా! నువ్వు పరాజయము అనునది లేని
విష్ణు మూర్తి యొక్క ప్రియురాలవు. నువ్వు కుష్మాండ ,వై నాయక, రాక్షస, భూత గణములను పిండి
పిండి చేయుము .నా శత్రు వులందరిని నాశనము చేయుము.

త్వం యాతుధానప్రమథప్రేతమాతృ-

పిశాచవిప్రగ్రహఘోరదృష్టీన్ |

దరేంద్ర విద్రా వయ కృష్ణ పూరితో

భీమస్వనోఽరేర్హృదయాని కంపయన్ || ౨౫ ||

పాంచజన్యము అను శంఖమా! నువ్వు శ్రీకృష్ణు ని పూరించబడి భయంకర ధ్వనితో శత్రు వు యొక్క
హృదయములను వణుకునట్లు చేసెదవు .నువ్వు రాక్షసులను, ప్రమధ గణాలను, ప్రేతములను, మాతృ
గణములను ,పిశాచములను, బ్రహ్మ రాక్షసులను,క్రూ ర దృష్టికలవారిని పారద్రో లుము.

త్వం తిగ్మధారాసివరారిసైన్య-

మీశప్రయుక్తో మమ ఛింధి ఛింధి |

చక్షూంషి చర్మన్ శతచంద్ర ఛాదయ

ద్విషామఘోనాం హర పాప చక్షుషామ్ || ౨౬ ||

పదును కలిగిన ఓ గొప్ప ఖడ్గ మా! నువ్వు నా శత్రు సైన్యమును వెంటనే ఛేదించుము. 100 చంద్రు ల
ఆకారం కలిగిన శత చర్మమా!నువ్వు పాపపు చూపు కలిగిన నా శత్రు వుల యొక్క కన్నులను తీసి
వేయుము.

యన్నో భయం గ్రహేభ్యోఽభూత్కేతుభ్యో నృభ్య ఏవ చ |

సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యోఘేభ్య ఏవ చ || ౨౭ ||

సర్వాణ్యేతాని భగవన్నామరూపాస్త క
్ర ీర్తనాత్ |
ప్రయాంతు సంక్షయం సద్యో యే మే శ్రేయఃప్రతీపకాః || ౨౮ ||

భగవంతుని యొక్క నామ రూపములను అస్త మ


్ర ులను కీర్తించుట వలన గ్రహములు, తోకచుక్కలు,
మనుష్యులు, సరీసృపాలు(పాములు), కోరలు కలిగిన జంతువులు, భూతములు, పాపాత్ములు
మొదలయిన వాటి నుండి మాకు కలిగిన భయం తొలగిపో వు గాక !మా శ్రేయో మార్గ మునకు ఆటంకం
కలిగించే వారు పూర్తిగా నశించిపో వుదురుగాక!

గరుడో భగవాన్ స్తో త్రస్తో భశ్ఛందో మయః ప్రభుః |

రక్షత్వశేషకృచ్ఛ్రేభ్యో విష్వక్సేనః స్వ నామభిః || ౨౯ ||

వేద రూపుడైన గరుత్మంతుడు భగవానుడు. ప్రభువు. సామముల( వేదసంబంధమైన మంత్రములు


సామములు.సామములకు ఆధారమైన ఋక్కుల సముదాయము స్తో మము) చేత కీర్తించబడిన వాడు
.అటువంటి గరుత్మంతుడు నన్ను కష్ట ముల నుండి రక్షించుగాక! విష్వక్సేనుడు తన నామముల చేత
రక్షించుగాక!

సర్వాపద్భ్యో హరేర్నామరూపయానాయుధాని నః |

బుద్ధీంద్రియమనఃప్రా ణాన్పాంతు పార్షదభూషణాః || ౩౦ ||

శ్రీహరి యొక్క నామ రూపములు ,వాహనములు, ఆయుధములు ,అతని సేవకులు మా యొక్క


బుద్ధు లను ,ఇంద్రియములను, మనసులను, ప్రా ణములను అన్ని ఆపదల నుంచి రక్షించుగాక!

యథా హి భగవానేవ వస్తు తః సదసచ్చ యత్ |

సత్యేనానేన నః సర్వే యాంతు నాశముపద్రవాః || ౩౧ ||

రూపము కలిగినవాడు మరియు రూపము లేని సర్వస్వం కలిగినవాడు అయిన ఆ భగవంతుని యొక్క
సత్యము చేత మా ఉపద్రవము లన్నియు నశించు గాక !

యథైకాత్మ్యానుభావానాం వికల్పరహితః స్వయమ్ |

భూషణాయుధలింగాఖ్యా ధత్తే శక్తీః స్వమాయయా || ౩౨ ||

ఆత్మ అనుభవం కలిగిన వారికి భేదము లేనివాడు అయినప్పటికీ ఆ శ్రీహరి తన మాయ చేత
ఆభరణములు ఆయుధములను నామములను శక్తు లను ధరించి ఉన్నాడు
తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరిః |

పాతు సర్వైః స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః || ౩౩ ||

ఆ సత్య ప్రమాణముచే సర్వజ్ఞు డు సర్వవ్యాపి భగవానుడు అయిన ఆ శ్రీహరి తన అన్ని రూపముల చేత
అంతట మమ్ములను కాపాడు గాక!

విదిక్షు దిక్షూర్ధ ్వమధః సమంతా-

దంతర్బహిర్భగవాన్నారసింహః |

ప్రహాపయన్ లోకభయం స్వనేన

స్వతేజసాగ్రస్తసమస్త తేజాః || ౩౪ ||

అన్ని రకాల తేజస్సులను తన తేజస్సు చేత మ్రింగిన నరసింహ స్వామి అన్ని మూలల యందు, దిక్కుల
యందు, పైన, కింద ,అన్నివైపుల యందు, లోపల బయట ఉన్న జనుల యొక్క భయముల నుండి
ప్రహ్లా దుని రక్షించిన విధముగా నన్ను రక్షించు గాక!

మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకమ్ |

విజేష్యస్యంజసా యేన దంశితోఽసురయూథపాన్ || ౩౫ ||

ఓఇంద్రు డా !నారాయణ రూపమైన ఈ కవచము నీకు చెప్పబడినది. దీనిని ధరించి నువ్వు రాక్షస సేనా
నాయకులను చాలా సులువుగా జయించగలవు.

ఏతద్ధా రయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా |

పదా వా సంస్పృశేత్సద్యః సాధ్వసాత్స విముచ్యతే || ౩౬ ||

ఈ నారాయణ కవచమును ధరించిన వాడు -ఎవరిని తన కంటి తో చూచునో లేదా పాదముతో తాకునో
అతని యొక్క భయములు వెంటనే తొలగిపో వును.

న కుతశ్చిద్భయం తస్య విద్యాం ధారయతో భవేత్ |

రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాఘ్రా దిభ్యశ్చ కర్హిచిత్ || ౩౭ ||


ఈ నారాయణ కవచ విద్యను ధరించిన వానికి రాజులు, బందిపో ట్లు ,గ్రహములు ,పెద్ద పులులు మొదలైన
వాటి నుండి ఎక్కడైనా ఏ కాలంలోనైనా భయము కలుగదు.

ఇమాం విద్యాం పురా కశ్చిత్కౌశికో ధారయన్ ద్విజః |

యోగధారణయా స్వాంగం జహౌ స మరుధన్వని || ౩౮ ||

ఈ నారాయణ కవచవిద్యను పూర్వము కౌశికుడను ఒకానొక బ్రా హ్మణుడు ధారణ చేసి యోగాభ్యాసము
తో తన శరీరమును నీరు లేని ప్రదేశంలో విడిచిపెట్టెను.

తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా |

యయౌ చిత్రరథః స్త్రీభిర్వృతో యత్ర ద్విజక్షయః || ౩౯ ||

గగనాన్న్యపతత్సద్యః సవిమానో హ్యవాక్షిరాః |

స వాలఖిల్యవచనాదస్థీన్యాదాయ విస్మితః |

ప్రా స్య ప్రా చీ సరస్వత్యాం స్నాత్వా ధామ స్వమన్వగాత్ || ౪౦ ||

కౌశికుడు తన శరీరమును విడిచిపెట్టిన ప్రదేశము పైన ఆకాశ మార్గ మున ఒకసారి గంధర్వరాజు
చిత్రరధుడు తన భార్యలతో కలిసి విమాన మార్గ ములోవెళ్ళుచుండగా -ఆకాశమునుండి విమానము తో
సహా తలకిందులుగా పడి ఆశ్చర్య పో యెను. వాలఖిల్యుడు మొదలైన మునులు చెప్పిన మాటను
అనుసరించి ఆ బ్రా హ్మణుని అస్థికలను తీసుకుని తూర్పు వైపుగా ప్రవహించు సరస్వతీ నదిలో కలిపి
స్నానము చేసి ఆ చిత్రరథుడు తనవారితో తన లోకమునకు తిరిగి వెళ్ళి పో యెను.

య ఇదం శృణుయాత్కాలే యో ధారయతి చాదృతః |

తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్ || ౪౧ ||

శ్రీ శుకమహర్షి ఇట్లు చెప్పిరి :ఎవడైతే ఈ నారాయణ కవచమును భయమును పొ ందిన సమయములో
వినునోమరియు ఎవడు ఆదరణతో ధారణ చేయునో అతనికి అందరూ నమస్కరించెద రు.అన్ని
విధములైన భయములు తొలగిపో వును.

శ్రీశుక ఉవాచ |

ఏతాం విద్యామధిగతో విశ్వరూపాచ్ఛతక్రతుః |


త్రైలోక్యలక్ష్మీం బుభుజే వినిర్జిత్య మృధేఽసురాన్ || ౪౨ ||

ఇతి శ్రీ నారాయణ కవచం ||

ఈ నారాయణ కవచ విద్యను విశ్వరూపుని నుండి ఇంద్రు డు పొ ంది, యుద్ధ ములో రాక్షసులను జయించి
,మూడు లోకములు సంపదలను పొ ందినాడు. స్వస్తి

ఇది శ్రీ నారాయణ కవచము ( ప్రతిపదార్థ ములతో సంపూర్ణ ం)

You might also like