You are on page 1of 12

కాలము

సూర్య చంద్ర్రు ల గమనము కాలము ఇది ఒక ప్రా మాణము. పనుల మధ్య జరిగిన కాల భేదమును

చెప్పటానికి వాడుతారు. భౌతికశాస్త మ
్ర ులో మరియు సామాన్యశాస్త మ
్ర ులో కాలమును ఆతి ప్రా థమిక

పరిమాణముగా పరిగణిస్తా రు. కాలమును ఇతర పరిమాణాలను కొలవటానికి కూడా వాడుతారు.

ఉదాహరణకి వేగము. కాలానికి ఆతి చిన్న ప్రమాణము సెకను.

కాల విభాగము

 ఈ సమస్త సృష్టీ కాలంలో పుట్టి కాలంలో గతించేదే. కాలాన్ని బట్టే మన జననం, మరణం,మంచి,చెడూ

మొదైలవన్నీ నిర్ణ యించ బడుతున్నాయి. ఈకాలం గురించి తెలుసుకుంటే మన మార్గ ం సుగమం

అవుతుంది. కాలం గురించి జ్యోతిశ్శాస్త ం్ర లో మన ఋషులు విస్తా రంగా చర్చించారు.

ప్రా తః సంగవః మధ్యాహ్నః అపరాహ్ణః సాయం

అహ్నోయే పంచదశ ముహూర్తా ః

తే ఏకైకస్మిన్ విభాగే త్రయస్త యో


్ర ముహూర్తా ః

సంగవ ఇతితు ఉష ఆరంభస్యాపి సంఙ్ఞా

ఉషానామ రాత్రిః వ్యుషా నామ దివసః – ఇతి మత్సే 123

పగటి కాలము 30 ఘడియలు,

రాత్రి కాలము 30 ఘడియలు.

పగటి కాలపు 30 ఘడియలను 15 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 2 ఘడియల కాలం అవుతుంది. అదే

(2 ఘడియల కాలం ) ఒక ముహూర్త ం. అటువంటి మూడు ముహూర్తా లు కలిపి ( 6 ఘడియలు ) ఒక

పేరుతో పిలువబడుతాయి. (6 x 5 = 30 ఘడియలు)


1. ప్రా త్రః కాలము, 2. సంగవ(ఉషః) కాలము , 3. మధ్యాహ్న కాలము , 4. అపరాహ్ణ కాలము, 5.

సాయం కాలము అని ఇవి పగటి పూట వచ్చే ఒక్కో ఆరు ఘడియలకు ( గం. 2-24 ని.ల సమయానికి)

గల పేర్లు . సంగవమునకు ఉషః కాలము అనికూడా మరో పేరు. ఉషా అనగా రాత్రి అని, వ్యుషా అనగా

పగలు అని మత్స్య పురాణము 123 వ అధ్యాయమున కలదు. సూర్యోదయం నుండి లేదా

సూర్యాస్త మయం నుండి '8' వ ముమూర్త ం “అభిజిత్” ముహుర్త ం.

*A.M. & P.M. అంటే ఏమిటో కాస్త చెప్పండి మేధావులారా?. ఇంగ్లీష్ గొప్పది అనే గొప్ప మేధావులారా?*.. .............
*A.M అనగా ఆన్టీ మెరీడియన్ P.M అనగా పో స్ట్ మెరీడియన్ ఇందులో ఆన్టీ అంటే అర్థం తెలియదు, పో స్టు అన్నా కూడా
ఇప్పటివరకు అర్ధం తెలియదు.క్లా రిఫై కూడా చేయలేదు ఇంగ్లీష్ లో.దాని సబ్జెక్ట్ అనేదే ఇక్కడ దొ రకదు.*

*ఇప్పుడు సంస్కృతం నుండి చూద్దా ం. A.M= ఆరోహణమ్ మార్తా ండస్య P.M= పతన మార్తా ండస్య. ఆరోహణమ్
మార్తా ండస్య అంటే,సూర్యోదయానికి పూర్వం అని,సూర్యుడు వస్తు న్నాడు అని,పైకి ఎదుగుతున్న సమయం అని
చెప్పవచ్చు.అదే, పతనం మార్తా ండస్య అంటే సూర్యుడు అస్త మించడానికి వెళ్లే సమయం అని అర్ధం.*

*ఇది సంస్కృతం గొప్పదనం.*


*A. M. & P. M. ?
All these days, we were made to believe that, the terms A.M. and P.M. stands for:*
▪A.M. = ante meridian
▪P.M. = post meridian*... ...🙏
(ante of what ?) and (post of what ? ) never clarified ... !!!
(what = the subject himself is missing)
Now our *ancient Sanskrit texts have blown off the ambiguity and the things are now Cristal clear*
Just take a look:-
▪A.M. = *Aarohanam Marthandasya*
▪P.M. = *Pathanam Marthandasya*
Explanation:-
The *‘Sun’* who is vital to the calculation remains un-mentioned. This is unthinkable and unjustifiable.
That lacuna arises because it is not realized that the letters *A.M. and P.M. are the initials of the hoary
Sanskrit* expressions (आरोहणम ् मार्तडस्य ्) Arohanam Martandasaya *(i.e. the climbing of the sun)* and
(पतनम ् मार्तडस्य ्) Patanam Martandasaya *(i.e. the falling of the sun).*
Are We Clear at least now ..??

మనం గాలిపీల్చి వదలడానికి పట్టు కాలమును “ప్రా ణము” అంటారు.


6 ప్రా ణములు = 1 విఘడియ

60 విఘడియలు = 1 ఘడియ ( ఘడియ అనగా 24 నిమిషముల కాలము. అనగా 2 ½ ఘడియలు

ఒక గంట )

60 ఘడియలు = ఒక దినము( 24 గంటలు)

2 ఘడియలు = 1 ముహూర్త ము

2 ½ ఘడియలు = 1 గంట

30 రోజులు - 1 నెల

12 నెలలు - 1 సంవత్సరము

60 సంవత్సరాలు - 1 సంవత్సర చక్రము ( షష్టిపూర్తి)

4,32,000 సం.లు - కలి యుగము

8,64,000 సం.లు - ద్వాపర యుగము

12,96,000 సం.లు - త్రేతా యుగము

17,28,000 సం.లు - కృత యుగము

మొత్త ము 43,20,000 సంవత్సరములు - 1 మహా యుగము

71 మహాయుగాలు - ఒక మన్వంతరము

14 మన్వంతరాలు - 1 కల్పం

2 కల్పాలు - బ్రహ్మకు 1 రోజు

2000 కల్పాలు - బ్రహ్మ ఆయుష్షు

విష్ణు వుకు 200 కల్పాలు - శివునికి 1 రోజు

శివునికి 200 కల్పాలు  - ఆది పరాశక్తికి 1 కనురెప్పపాటు


ఝాము

ఝాము ఒక కాలమానము. ఒక ఝాము 3 గంటలు లేదా 7 1/2 ఘడియలకు సమానము. ఎనిమిది

ఝాములు ఒక రోజుగా పరిగణిస్తా రు.

తెలుగు నెలలు (తెలుగు మాసములు) :

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై

అమావాస్యతో ముగుస్తు ంది.

ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:

1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ

చంద్రు డి తో పాటు వెన్నెల పెరిగి రాత్రు ళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని

అర్థ ం).

2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య

వరకు): రోజు రోజుకూ చంద్రు డి తో పాటు వెన్నెల తరిగి రాత్రు ళ్ళు నల్ల గా చీకటితో నిండుతాయి. (కృష్ణ

అంటే నల్ల ని అని అర్థ ం).

తెలుగు నెలలు
1. చైతమ
్ర ు

2. వైశాఖము

3. జ్యేష్ఠ ము

4. ఆషాఢము

5. శ్రా వణము

6. భాద్రపదము

7. ఆశ్వయుజము

8. కార్తీకము

9. మార్గ శిరము

10. పుష్యము

11. మాఘము

12. ఫాల్గు ణము

ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.

* పౌర్ణ మి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రు డు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు) అయితే ఆ నెల చైతమ
్ర ు

* పౌర్ణ మి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రు డు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల

వైశాఖము.

* పౌర్ణ మి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రు డు జ్యేష్ఠా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల జ్యేష్ఠ ము

* పౌర్ణ మి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రు డు పూర్వాషాఢా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ

నెల ఆషాఢము.

* పౌర్ణ మి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రు డు శ్రవణం నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల

శ్రా వణము .

* పౌర్ణ మి రోజున పూర్వాభాద్ర్హ నక్షత్రం (అనగా చంద్రు డు పూర్వాభాద్రా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ

నెల భాద్రపదము.
* పౌర్ణ మి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రు డు అశ్వనీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల

ఆశ్వయుజము.

* పౌర్ణ మి రోజున కృత్తి క నక్షత్రం (అనగా చంద్రు డు కృత్తి కా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల

కార్తీకము.

* పౌర్ణ మి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రు డు మృగశిరా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల

మార్గ శిరము .

* పౌర్ణ మి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రు డు పుష్యమీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల

పుష్యము.

* పౌర్ణ మి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రు డు మఖా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల

మాఘము.

* పౌర్ణ మి రోజున ఉత్త రఫల్గు ణి (ఉత్త ర) నక్షత్రం (అనగా చంద్రు డు ఉత్త రఫల్గు ణీ నక్షత్రం తో కలిసిన

రోజు)అయితే ఆ నెల ఫాల్గు ణము.

భారతీయ కాలగణన

మాసం, పక్షం, రోజు, ఘడియ, విఘడియ, నిమిషం, పగలు, దినం, ఝాము, ఋతువు, క్షణం,

ముహూర్త ం, లగ్నం, సంవత్సరం, దశాబ్ధ ం, శతాబ్ద ం, శకం, వారం, తిథి.

భూతభవిష్యద్వర్త మాన కాలాలనే త్రికాలములు అంటారు.

భూతకాలం - గతించిన కాలం.

వర్త మాన కాలం - జరుగుతున్న కాలం.

భవిష్యత్ కాలం - రాబో వు కాలం.

కాలమానము

కాలము
వివరణ

1 క్రా ంతి -1 సెకనులో 34000 వ వంతు

1 తృటి - 1 సెకనులో 300 వ వంతు

1 తృటి - 1 లవము, లేశము

2 లవాలు - 1 క్షణం

30 క్షణాలు - 1 విపలం

60 విపలాలు- 1 పలం

60 పలములు - 1 చడి (24 నిమిషాలు)

2.5 చడులు- 1 హొర

54 హొరలు- 1 దినం (రోజు)

6 కనురెప్పలపాటు కాలము- 1 సెకండు

60 సెకండ్లు - 1 నిమిషము

60 నిమిషాలు- 1 గంట

24 గంటలు - 1 రోజు

7 రోజులు- 1 వారం

2 వారములు- 1 పక్షం

2 పక్షములు - 1 నెల

2 నెలలు - 1 ఋతువు

2 ఋతువులు- 1 కాలము

4 వారములు - 1 నెల
6 ఋతువులు - 1 సంవత్సరము

12 నెలలు - 1 సంవత్సరము

365 రోజులు - 1 సంవత్సరము

52 వారములు - 1 సంవత్సరము

366 రోజులు - 1 లీపు సంవత్సరము

10 సంవత్సరాలు - 1 దశాబ్ది

12 సంవత్సరాలు - 1 పుష్కరం

40 సవత్సరాలు- 1 రూబీ జూబ్లి

100 సంవత్సరాలు - 1 శతాబ్ది

1000 సంవత్సరాలు - 1 సహస్రా బ్ది

25 సంవత్సరాలు - రజత వర్షము

50 సంవత్సరాలు - స్వర్ణ వర్షము

60 సంవత్సరాలు- వజ్ర వర్షము

75 సంవత్సరాలు- అమృత వర్షము

100 సంవత్సరాలు- శత వర్షము

కాలము - వివరణ

8 ఝాములు - 1 రోజు/24 గంటలు

10 శతాబ్దా లు - 1 సహస్రా బ్ధ ం

432 సహస్రా బ్దా లు- 1 యుగం

10 యుగాలు - 1 మహా యుగం(43 లక్షల 20 వేల సంవత్సరాలు)

100 మహా యుగాలు - 1 కల్పం (43 కోట్ల 23 లక్షల సంవత్సరాలు)


2 కలియుగాలు - 1 ద్వాపరయుగం

3 ద్వాపరయుగాలు- 1 త్రేతాయుగం

4.త్రేతాయుగాలు - 1 కృతయుగం

60 లిప్త లు - 1 విఘడియ/24 సెకన్లు

60 విఘడియలు - 1 ఘడియ/24 నిమిషాలు

2 1/2 విఘడియలు - 1 గంట/60 నిమిషాలు

2 ఘడియలు - ముహుర్త ము/48 నిమిషాలు

7 1/2 ఘడియలు - 2 ఝూము/3 గంటలు

కాలము ఆరు విధాలు – సంవత్సరము, ఆయనము, ఋతువు, మాసము, పక్షము, దినము.

సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అది ఆయనమవుతుంది.... ఆయనము రెండు రకములు:

ఉత్త రాయణం – సూర్యుడు మకరాదిగా ఆరు రాశుల్లో సంచరించే కాలము ఉత్త రాయణము.
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో ప్రవేశించువరకు గల కాలము 6 నెలలు.
అవి చైతం్ర , వైశాఖం, జ్యేష్ట ం, ఆషాఢ మాసాలలో కొంతబాగము, పుష్యం, మాఘ, ఫాల్గు ణ మాసములలో
ఉండును.

దక్షిణాయణం :

సూర్యుడు కర్కాటకాదిగా ఆరు రాశుల్లో సంచరంచే కాలం దక్షిణాయనము.

కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవశి


ే ంచినది మొదలు మకరరాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6 నెలలు.

అవి ఆషాడ, శ్రా వణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గ శిర మాసములలో కొంత భాగము.

సంవత్సరాన్ని ఆరు భాగాలుగా విభజిస్తే అది ఋతువు అవుతుంది...అందుకే ఋతువులు ఆరు...

వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర

సంవత్సరము అయిదు రకాలు – కేంద్రము, సౌరము, సవనము, నాక్షత్రము, బార్హస్పత్యము.


శుక్ల పాడ్యమి ప్రా రంభించి బహుళ అమావాస్య వరకు తిథులు 30. ఆ 30 తిథులలో కూడిన దానిని
మాసము అంటారు. అవి చైతమ
్ర ు మొదలుకొని పన్నెండు మాసములు, 345 రోజులు. అధిక మాసం
వచ్చినపుడు 13 మాసములతో చంద్ర సంవత్సరము ఉంటుంది. ప్రభావ, విభవ మొదలైన 60
సంవత్సరాలు. ఈ చాంద్రమానంలోనే (ఎక్కువగా) ఉపయోగిస్తా రు. మేషాది ద్వాదశ రాశుల్లో రవి
సంచరించడానికి 365 రోజులు పడుతుంది. దాన్ని సౌర సంవత్సరము అంటారు.

360 రోజులు సావనమానం.

324 రోజులతో నాక్షత్రమానము.

మేషాది రాశులలో బృహస్పతి సంచారన్ననుసరించి ఏర్పడేది బారహస్పత్య మానం. ఇది సగటున 361
రోజులు అవుతుంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రా రంభంలో చాంద్రమానాన్నే స్మరించాలి.

ఋతువులు రెండు రకములు:

సౌర ఋతువు – మీనము నుంచి కాని మేషము నుంచి కాని ప్రా రంభించి రెండేసి సూర్య రాశులు
సంచరించే కాలము.
చాంద్ర ఋతువు – చైతమ
్ర ాసాదిగా రెండేసి మాసములు ఒక ఋతువుగా లెక్కించే విధానము.
అధిక మాసము వచ్చినప్పుడు 90 రోజులు లోపు చాంద్ర ఋతువు ఉంటుంది.
శ్రౌ త-స్మార్తా ది క్రియలలో చాంద్ర ఋతు స్మరణమే ప్రశస్త ం.

సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం అవుతుంది...అందుకే

మాసములు 12 :

చైతం్ర , వైశాఖం, జ్యేష్ట ం, ఆషాడం శ్రా వణ, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గ శిరం, పుష్యం, మాఘం,

ఫాల్గు ణం (2 మాసములు ఒక ఋతువు)

మాసములు నాలుగు రకాలు: 1. చాంద్రం 2. సౌరం 3. సావనం, 4. నాక్షత్రం


పక్షములు 2 :
ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. అవి కృష్ణ పక్షం(కృష్ణ అంటే నలుపు అని అర్థ
ం)ఇది అమావాస్య పదిహేను రోజులకు గుర్తు ... శుక్ల పక్షం పౌర్ణ మి పదిహేను రోజులకు గుర్తు ...
పాడ్యమి నుండి పౌర్ణ మి వరకు శుక్ల పక్షం
పౌర్ణ మి మరునాటి పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణ పక్షం.
ఒక్కో పక్షపు పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి.. అవి
పాడ్యమి, విదియ తదియ, చవితి, పంచమి, షష్టి, సప్త మి, అష్ట మి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి,
త్రయోదశి, చతుర్ధ శి, పౌర్ణ మి, అమావాస్య
ఇక ఒక పక్షానికి రెండు వారములు.. ఒక వారమునకు ఏడు రోజులు...
ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు..
ఇలా ప్రతి నిమిషమునకు వచ్చే నక్షత్రం తో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖ చ్చితంగా
ఉంటుంది.. ఎంత ఖచ్చితత్వమంటే భారత యుద్ధ ం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడానమోదు
చేయగలిగినంత... అందుకే మన హిందూ సాంప్రదాయాలు గొప్పవయ్యాయి..

శుక్ల పాడ్యమి ప్రా రంభించి అమావాస్య వరకు ఉండేవి.


అమాంతమాసం. బహుళ పాడ్యమి ప్రా రంభించి పూర్ణిమతో పూర్త య్యేది పూర్ణ మాంత మాసం.
ఈ రెండింటిలో శుక్ల పాడ్యమితో ప్రా రంభమయ్యేదే ముఖ్యము (సహేతుకము). కృష్ణ పాడ్యమితో
ప్రా రంభమయ్యే మాసము విద్యకు ఉత్త రాన వాడుతుంటారు.

ఈ చైత్రా ది చాంద్ర మాసములే ఆధ్యాత్మిక కార్యారంభంలో వాడుతుంటారు. కొంతమంది మీనరాశి


ప్రా రంభించి సౌరమాసాలకు చైత్రా ది సౌంజ్ఞ లు ఉపయోగిస్తు ంటారు. ఒక సూర్య సంక్రమణంతో ప్రా రంభమై
మరో సూర్య సంక్రమణంతో పూర్త య్యే దానిని సౌరమాసము అంటారు.
30 రోజుల వ్యవధి కలిగిన దానిని సావనము అంటారు. చంద్రు డు అశ్విన్యాది 27 నక్షత్రా లలో సంచరించే
కాలాన్ని నక్షత్ర మాసమని అంటారు. పాడ్యమి మొదలు పూర్ణిమ వరకు శుక్ల పక్షము, పాడ్యమి మొదలు
అమావాస్య వరకు కృష్ణ పక్షము. ఒక రోజుకు 60 ఘడియలు. (ఘడియకు 60 విఘడియలు, 24
నిమిషాలు, విఘడియకు 24 సెకన్లు ).

వారములు 7 :

ఆదివారం - భానువాసరే

సో మవారం - ఇందువాసరే

మంగళవారం - భౌమ్యవాసరే
బుధవారం - సౌమ్యవాసరే

గురువారం - గురువాసరే

శుక్రవారం - భృగువాసరే

శనివారం - స్థిరవాసరే / మందవాసర

మనకు నూతన సంవత్సరం.. ఉగాదే.. ఇప్పటినుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది...

పంచాగం మొదలవుతుంది.. సృష్టి మొదలవుతుంది.. అందుకే ఇది యుగ ఆది అయింది.. అదే ఉగాది

అయింది.. ఇంకా వివరంగా చెప్పాలంటే శిశిర ఋతువులో రాలి పో యిన ఆకుల స్థా నంలో క్రొ త్త చిగుళ్ళు

ప్రా రంభమయి.. క్రొ త్త సృష్టి ప్రా రంభమవుతుంది...

You might also like