You are on page 1of 3

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అద్భుత వైజ్ఞా నిక సత్యాలకు సాక్షీభూతాలు.

విశ్వజనీనమైన ప్రేమ తత్వంతో

అద్భుతమైన వైజ్ఞా నిక సత్యాలను ఆవిష్కరించడం భారతీయ ధర్మము యొక్క ప్రత్యేకత. ఈ ధర్మాన్ని పరిరక్షించి,

విశ్వమానవ సౌభ్రా తృత్వమును స్థా పించుటయే మన భారతీయ సంస్కృతి. ఇట్టి మన పండుగలు మన సంస్కృతికి

దర్పణాలు . ఈ పండుగలు హైందవ సంస్కృతికి చిహ్నాలు. ఇందులో ముఖ్యమైనది ఉగాది. ప్రకృతితో ముడిపడిన ఈ

పండుగ ప్రతి జీవికి చైతన్యంతో కూడిన ఆనందాన్ని, ఉల్లా సాన్ని కల్గించుతుంది. క్రొ త్త మార్పులను, నూతన ఆనందాన్ని

తెస్తు ంది ఉగాది. ప్రతి మానవుడు ఎదురు చూచే మంచి మార్పు కలిగించే సమయమే 'ఉగాది'.

ఉగస్య ఆది: ఉగాది: - "ఉగ" అనగా నక్షత్ర గమనము - జన్మ - ఆయుష్షు అని అర్థా లు. వీటికి 'ఆది' 'ఉగాది'. అనగా

ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షు లకు మొదటిరోజు కనుక ఉగాది అయినది.

'యుగము' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. ఉత్త రాయణ, దక్షిణాయనము లనబడే ఆయన ద్వయ

సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది.

ఉగాది - వసంతములకు గల అవినాభావ సంబంధము, మరియు సూర్యునికి సకల ఋతువులకు ప్రా తః సాయం

కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపము, అని విశదీకరిస్తూ ,

''వసంతే కపిల స్సూర్యో గ్రీష్మే కాంచన సుప్రభః


శ్వేతో వర్షా సువర్ణేన పాండుశ్శధి భాస్కరః
హేమంతే తామ్ర వర్ణస్తు శిశిరే లోహితో రవిః
ఇతి వర్ణా సమాఖ్యా తాసూర్యసనతు సముద్భవా!
అని వక్కాణింప బడింది.

విష్ణు కిరణ ప్రభావితమైన వసంతం పసుపువర్ణంగాను - గోధుమ వర్ణంలోను ఉంటుంది. ఈ కిరణములు ఉత్త రాయణంలో

వికాసం చెందుతాయి. గ్రీష్మమునకు కాంతులు హేతువు. అవి దక్షిణాయనంలో క్షీణత చెందును అని పై శ్లో కమునకు

అర్థము.

భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని నారద పురాణం

చెప్పుచున్నది.

''చైతమ
్ర ాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని
శుక్ల పక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి
వత్సరాదౌ వసంతా రపి రాజ్యే తదైవచ
ప్రవర్త యామాస తదా కాల సగణనామపి
గ్రహన్నాగే నృతూన్మాసానేవత్సరానృత్యరాధిపాన్‌.

వసంతం ప్రా రంభమైనపుడు చైతశు


్ర క్ల పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా ప్రజాపతి బ్రహ్మ ఈ రస జగత్తు ను

సృష్టించాడట. కాల గణన, గ్రహ నక్షత్ర, ఋతు, మాస వర్షా లను, వర్షా ధిపులను ప్రవర్తింప చేసాడట.

ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ పండగ ఒక్క

తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తా ండు అనే పేరుతో, మలయాళీలు విషు

అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొ య్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.

ఉగాది పుట్టు పూర్వోత్త రాలు.

'బ్రహ్మ ప్రళయం' పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రా రంభించు సమయాన్ని 'బ్రహ్మకల్పం' అంటారు. చైత్ర శుక్ల

పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుప

బడుచున్నదని కూడా చెప్ప బడుచున్నది.

మానవాళిలో చైతన్యాన్ని రగుల్కొల్పి నూతనాశయాలను అంకురింపచేసే శుభ దినం 'ఉగాది'. ఇలా ప్రతి కల్పంలోను

మొదట వచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రా రంభ సమయమును "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే

ఈ 'ఉగాది' పర్వదినం మనకు చైతమ


్ర ాసంలో ప్రా రంభ మవడం వల్ల ఆ రోజునుండి మన తెలుగు సంవత్సర ఆరంభ

దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.

వేదాలను హరించిన సో మకుని వధించి మత్స్యావతార ధారియైన విష్ణు వు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభ తరుణ

పురస్కారంగా విష్ణు వు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణ ప్రతీతి.

విక్రమార్కుడు పట్టా భిషిక్తు డైన శుభదినం చైత్ర శుద్ధ పాడ్యమి. ఆనాడే విక్రమార్క శకం ప్రా రంభమైంది.

శకులపై శాలివాహనులు సాధించిన ఘన విజయం ఉగాది పచ్చడిలోని తీపికి, యుద్ధ ంలో కలిగిన కష్ట నష్టా లు చేదుకు,

శత్రు వులను తమలో ఒకరుగా కలుపుకోవడంలో వచ్చిన మంచిచెడ్డలు పులుపునకు చిహ్నంగా మన పూర్వీకులు

భావించి స్వీకరించారు. ఈ మూడింటి కలయికకు గుర్తు గా ఆనవాలుగా విక్రమాదిత్యుని కాలంలో శాలివాహన శకారంభం

నుండి ఉగాది పచ్చడి ఆస్వాదించడం ఆచారమైందని చారితక


్ర ుల నిర్ణయం.

లక్ష్మీప్రా ప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం

గఘడియలు, రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, ఋతువులు, ప్రా ణులు కాలస్వరూపమైన సంవత్సరంలో

నివసిస్తు న్నాయి.
బ్రహ్మదేవుడు ఈ జగత్తు ను చైత్ర మాస శుక్ల పక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే

కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షా ధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన.

అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తు గా ఉగాది

పండుగను జరుపుకుంటారు.

ఉగాది పచ్చడి: ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం ఉగాది పచ్చడి. ఉగాదినాడు షడ్రు చుల సమ్మేళనం.

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరురుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవంత్సరం పొ డుగునా

ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తు ంది.

ఈపచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రా లు చెబుతున్నాయి. మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని

శాస్త్రా లు చెబుతున్నాయి. ఈపచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్టమని ఆయుర్వేద శాస్త ం్ర పేర్కొంటుంది.

ఈపచ్చడిని కాలిపొ ట్ట తో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు.

త్వామష్ఠ శోక నరాభీష్ట - మధుమాస సముద్భవ


నిబామి శోక సంతప్తా ం - మమశోకం సదా కురు.
మధుమాసమున ఉద్భవించునట్టి,శోక బాధలను పారద్రో లునటువంటి, ఓ నింబ కుసుమమా! నన్ను ఎల్ల ప్పుడూ శోక

రహితునిగా చేయుము.

శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌కరాయచ


సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం.
శతాయుప్రదమైనదియు, వజ్ర దేహమును కలుగ జేయునదియు, సమస్త సంపదలు కలిగించునట్టిదియు,

సర్వారిష్టములను నశింప జేయునదియునగు నింబ కుసుమ భక్షణము ఉగాదినాడు చేయవలెను.

పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్త రాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రా యం.

మనకు తెలుగు సంవత్సరాలు ‘ప్రభవ‘తో మొదలుపెట్టి ‘అక్షయ‘నామ సంవత్సరము వరకు గల 60 సంవత్సరములలో

మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో,

రెండుసార్లో చుస్తూ ంటారు! అందువల్ల నే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం

వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి ‘షష్టిపూర్తి‘ ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.

సర్వ శుభముల కాది ఉగాది.ఇంతటి విశిష్ట త కల్గిన ఉగాది మానవాళి జీవితాలను చైతన్యవంతం చేసి, ఆహ్లా దాన్ని,

ఆనందాన్ని, కలిగించి, తృప్తిని నింపి, భవిష్యత్తు కు బంగారుబాటలు దిద్దే శక్తి గలది కనుక, ఈ ఉగాదిని సంతోషముతో

శాంతి యుతంగా జరుపుకుని, సుఖాన్ని పొ ందగలరు గాక!

You might also like