You are on page 1of 34

ఋతువులు, కాలాలు

రచన: సురేశ్ కొలిచాల

సెప్టెంబర్ 2013

చిన్నప్పుడు మనమంతా ఋతువులు ఆరు అని మన పాఠ్యపుస్త కాలలో చదువుకున్నాం.


రెండేసి నెలల చొప్పున వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు , హేమంతం, శిశిరం అని
సంవత్సరకాలాన్ని ఆరు ఋతువులుగా విభజించవచ్చని మనమంతా కంఠతా పట్టేశాం.
అలంకారశాస్త ం్ర నిర్దేశించిన అష్టా దశ వర్ణనల్లో ఋతువర్ణన ప్రథానమైనది కాబట్టి మన తెలుగు
కావ్యాలలో కూడా సాంప్రదాయికంగా ఈ ఆరు ఋతువుల వర్ణనే కనిపిస్తు ంది. అయితే,
భారతీయ దేశంలో — ముఖ్యంగా దక్షిణ భారతంలో — ప్రధానంగా మనకు అనుభవమయ్యేవి
ఎండకాలం, వానకాలం, చలికాలం అన్న మూడు కాలాలు మాత్రమే.

నిజానికి వేదవాఙ్మయంలో ప్రా చీనమైన ఋగ్వేదంలో ఆరు ఋతువుల ప్రస్తా వన లేదు.


ఋగ్వేదంలోని పదవ మండలంలోని పురుషసూక్త ంలో ఋతువులపేర్లు కనిపించే ఈ శ్లో కం
చూడండి:

యత్ పురుషేణ హవిషా, దేవా యజ్ఞ మతన్వత ।


వసంతో అస్యాసీద్ ఆజ్యం గ్రీష్మ ఇధ్మః శరద్ హవిః ॥ (ఋగ్వేదం 10.90.6)

పురుషుడే హవిస్సుగా దేవతలు చేసే సమస్త సృష్టి అనే యజ్ఞ ంలో వసంతం ఆజ్యం అయితే, గ్రీష్మం ఇంధనం,
శరత్తు హవి.

వసంతం, గ్రీష్మం, శరత్తు ఈ మూడు ఋతువుల పేర్లు తప్ప ఋగ్వేదంలో ఇతర ఋతువుల
ప్రస్తా వన కనిపించదు. భారతదేశానికి అతిముఖ్యమైన వర్షఋతువును ప్రత్యేకంగా
పేర్కొనకపో వడం ఆశ్చర్యకరమైన విషయమే. ఇతర ఇండో -యూరోపియన్ భాషలలో,
సమాజాలలో Spring, Summer, Autumn/Winter మాత్రమే ప్రధానమైన ఋతువులు.
భారతీయ సమాజంలా వారికి వర్ష ఋతువు ప్రత్యేక ఋతువు కాదు. యూరేసియాలోని కొన్ని
ప్రా ంతాల్లో వర్షా లు సంవత్సరం పొ డుగునా దాదాపు సమానంగా కురిస్తే, మరికొన్ని ప్రా ంతాల్లో
వసంతంలోనే మెండుగా వర్షా లు కురుస్తా యి. అమెరికాలోని మా అట్లా ంటా నగరంలో కూడా
సంవత్సరం పొ డుగునా వర్షా లు కురిసినా, అత్యధిక వర్షపాతం మాత్రం వసంతమాసంగా
పరిగణించే ఎప్రిల్ నెలలోనే నమోదవుతుంది.

ఉష్ణ మండల ప్రా ంతానికి చెందిన భారతదేశానికి మూడువైపులా సముద్రము, ఒకవైపు


హిమాలయాలు ఉండే ప్రత్యేక నైసర్గిక స్వరూపం వల్ల భారతదేశంలో వర్షా లు పూర్తిగా
ఋతుపవనాల మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే సంవత్సరంలో ఋతుపవనాల
ప్రభావంతోనే వర్షా లు కురుస్తా యి కాబట్టి అది ఒక ప్రత్యేక ఋతువుగా/కాలంగా గుర్తిస్తా ము.

భారతదేశ ఋతుపవనాలు

ఈ మధ్య ఒక తెలుగు రచయిత ఋతుపవన కాలం, వర్షఋతు కాలం విభిన్నమైనవనీ,


ఋతుపవన మేఘానికి, వర్షఋతు మేఘానికి తేడా ఉంటుందని వివరించడానికి
ప్రయత్నించాడు. కానీ, భారతదేశంలో ఋతుపవన కాలం, వర్షకాలం అంటూ వేర్వేరు కాలాలు
ఉన్నాయని చెప్పడానికి శాస్త ం్ర ఒప్పుకోదు. అయితే, మనదేశంలో రెండు వేర్వేరుకాలాల్లో ,
రెండు వేర్వేరు దిశలనుండి వీచే ఋతుపవనాలు ఉన్నాయి. ఎండకాలంలో దక్షిణ పీఠభూమి
వేడెక్కినప్పుడు, సముద్రం చల్ల గా ఉండడం మూలాన నైరుతి దిశనుండి ఉత్త ర దిశగా వీచే
గాలులు వర్షా న్ని మోసుకొస్తా యి. అలాగే, చలికాలంలో భూమి చల్ల బడి, సముద్రం వేడిగా
ఉండడం వల్ల పీడన వ్యత్యాసం ఏర్పడి ఈశాన్య దిశనుండి దక్షిణ దిశగా ఋతుపవనాలు
డిసెంబర్, జనవరి మాసాల్లో వీస్తా యి. ఈ ఈశాన్య ఋతుపవనాలు భారతదేశంలో దాదాపు
అన్ని ప్రా ంతాల్లో భూమి మీదుగానే పయనిస్తా యి కాబట్టి వీటివల్ల ఆ ప్రా ంతాల్లో వర్షం
సంభవించదు. అయితే, బంగాళాఖాతం మీదుగా వీచే ఈశాన్య ఋతుపవనాలు మాత్రం కోస్తా
జిల్లా ల్లో నూ, తమిళనాడులోనూ కొంత వర్షా న్ని కురిపిస్తా యి.

ఋగ్వేదంలో వర్ష ఋతువును ప్రతేక ఋతువుగా పేర్కొనక పో యినా, ఏడవ మండలంలోని


మండూక సూక్త ంలో వర్షా లు కురిసే కాలాన్ని ఒక ప్రత్యేక కాలవిభాగంగా పరిగణిస్తు న్నట్టు
అనిపిస్తు ంది.

సంవత్సరం శశయానా బ్రా హ్మణా వ్రతచారిణః ।


వాచం పర్జన్యజిన్వితాం ప్ర మండూకా అవాదిషుః ॥ 7-103-1

వ్రతచారులగు బ్రా హ్మణ వర్గ ము సంవత్సరం కాలం పిదప మౌనాన్ని వీడినట్టు పర్జన్యుని గర్జన స్ఫూర్తితో మండూక
గణం తమ గళాలను విప్పుతున్నాయి.

బ్రా హ్మణాసో అతిరాత్రే న సో మే సరో న పూర్ణమ్ అభితో వదన్త ః ।


సంవత్సరస్య తద్ అహః పరి ష్ఠ యన్ మణ్డూ కాః ప్రా వృషీణమ్ బభూవ ॥ 7-103-07

సంవత్సర కాలం అతిరాత్ర యజ్ఞ ము పూర్తిచేసి సో మరస భాండము చుట్టూ చేరే బ్రా హ్మణులవలే, వర్షం రాకతో
పూర్ణ సరోవరమునకు నాలుగు వైపులా చేరి మండూకములు శబ్ద ములను చేస్తూ చెలరేగుతున్నవి.

ఈ మండూక సూక్త ము, ఏడవమండలంలోని చిట్ట చివరి రెండు సూక్తా లలో ఒకటి. ఋగ్వేదపు
చివరి దశలలో దీనిని ఈ వేదసంహితానికి జతచేసి ఉంటారని కొంతమంది పందితుల ఊహ.
ఋగ్వేద ఆర్యులు ఋతుపవనాల ఆధారంగా బ్రతికే భారతీయ సమాజానికి అనుకూలంగా
తమ జీవిత విధానాన్ని మార్చుకున్నట్టు గా ఈ మండూక సూక్త ం మనకు తెలియజేస్తు ందని
గౌతమ వజ్రా చార్య ఒక పరిశోధన పత్రంలో వాదించారు. (Gautama V. Vajracharya The
Adaptation of Monsoonal Culture by Rgvedic Aryans: A Further Study of the Frog
Hymn.).

కృష్ణ యజుర్వేదంలో కనిపించే ఈ కింది శ్లో కంలో పంచభూతాలవలే సంవత్సరంలో


ఋతువులు కూడా అయిదు అన్న వివరణ కనిపిస్తు ంది.
పంచ వా ఋతవః సంవత్సరస్
ఋతుష్వేవ సంవత్సరే ప్రతితిష్ఠ ంతి । (యజుర్వేద 7.3.8)

కృష్ణ యజుర్వేదానికే సంబంధించిన తైత్తి రీయ బ్రా హ్మణంలో అయిదు ఋతువుల వివరాలతో
సంవత్సరాన్ని పక్షితో పో ల్చుతూ చేసిన ఈ అందమైన వర్ణన చూడండి:

తస్య తే వసంతః శిరః; గ్రీష్మో దక్షిణః పక్షః ।


వర్షా ః పుచ్ఛం; శరద్ ఉత్త రః పక్షః; హేమంతో మధ్యం ॥ (తై. బ్రా . 3.10.4.1)

సంవత్సరమనే పక్షికి వసంతం శిరస్సు అయితే, గ్రీష్మం కుడి రెక్క;


వర్షం తోక; శరత్తు ఎడమ రెక్క; హేమంతం మధ్యభాగం.

అంటే, ఋగ్వేదలోని మూడు ఋతువులకు వర్ష ఋతువు, హేమంత ఋతువు ఈ కాలానికి


జతచేయబడ్డా యి. ఆరు ఋతువుల ప్రస్తా వన మనకు తెలిసినంతవరకూ తైత్తి రీయ
సంహితంలో (తైత్తి రీయ సంహితం, తైత్తి రీయ బ్రా హ్మణం తరువాతి కాలంలో వెలువడింది)
మొదటిసారి కనిపిస్తు ంది.

మధుశ్చ మాధవశ్చ వాసంతికావృతూ శుక్రశ్చ శుచిశ్చ గ్రైష్మావృతూ


నభశ్చ నభస్యశ్చ వార్షికావృతూ ఇషశ్చోర్జశ్చ శారదావృతూ
సహశ్చ సహస్యశ్చ హైమంతికావృతూ తపశ్చ తపస్యశ్చ శైశిరావృతూ (తైత్తి రీయ సంహత 4-
4-11)

మధు మాధవ మాసాలు వసంత ఋతువు. శుక్రము శుచి మాసాలు గ్రీష్మర్తు వు. నభము, నభస్యము, వర్షర్తు వు,
ఇషము, ఊర్జము శరదృతువు. సహము, సహస్యము హైమంతిక ఋతువు. తపము, తపస్యము శైశిర
ఋతువు.

అంటే మనం ఇప్పుడు చెప్పుకొనే చైతం్ర , వైశాఖం అన్న 12 మాసాల పేర్లు అప్పటికింకా
ప్రా చుర్యంలోకి రాలేదు. వాటికి మారుగా, మధు, మాధవ, శుక్ర, శుచి, ఇషము, ఊర్జ , సహ,
సహస్య, తప, తపస్య అన్న పేర్లు ఇక్కడ కనిపిస్తా యి.
మనం ఇప్పుడు వాడే చైతం్ర , వైశాఖం అన్న పేర్లు నక్షత్రా లకు సంబంధించినవి. నక్షత్రా ల
ఆధారంగా చంద్రు ని గమనాన్ని పరిశీలిస్తే చంద్రు డు ఒక నక్షత్ర కూటమి నుండి బయలు దేరి
మళ్ళీ అదే నక్షత్ర కూటమిని చేరుకోవడానికి దాదాపు 27 రోజులు పడుతుందని తెలుస్తు ంది.
దీన్ని నాక్షత్రిక మాసం (Sidereal month) అంటారు. ఈ 27 రోజుల్లో చంద్రు డు దాటే ఒక్కొక్క
నక్షత్రకూటమికి ఒక్కో పేరు చొప్పున అశ్వని, భరణి మొదలైన 27 నక్షత్రా ల పేర్లు ఏర్పాటు
చేసారు. ఆపైన, ప్రతి మాసంలో నిండు పున్నమ నాడు చంద్రు డు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ
నక్షత్రపు వృద్ధిరూపమే ఆ మాసానికి పేరుగా ఇవ్వడం మొదలుపెట్టా రు. ఆ రకంగా చిత్త
నక్షత్రంలో పౌర్ణమి వస్తే ఆ మాసం చైత్ర మాసంగా పిలిచారు; అలాగే, విశాఖ నక్షత్రంలో పౌర్ణమి
వస్తే ఆ మాసం వైశాఖంగా పిలువబడింది. మనకు తెలిసిన పన్నెండు మాసాల పేర్లకు,
నక్షత్రా ల పేర్లకు ఉన్న సంబంధాన్ని ఈ కింది పట్టిక వివరిస్తు ంది:

మాసం పౌర్ణ మి రోజున నక్షత్రం

చైతమ
్ర ు చిత్తా నక్షత్రం

వైశాఖము విశాఖ నక్షత్రం

జ్యేష్ఠ ము జ్యేష్ఠ నక్షత్రం

ఆషాఢము పూర్వాషాఢ నక్షత్రం

శ్రా వణము శ్రవణం నక్షత్రం

భాద్రపదము పూర్వాభాద్ర నక్షత్రం

ఆశ్వయుజము అశ్వని నక్షత్రం

కార్తీకము కృత్తి క నక్షత్రం

మార్గ శిరము మృగశిర నక్షత్రం


మాసం పౌర్ణ మి రోజున నక్షత్రం

పుష్యము పుష్యమి నక్షత్రం

మాఘము మఘ నక్షత్రం

ఫాల్గు ణము ఉత్త రఫల్గు ణి (ఉత్త ర) నక్షత్రం

ఇదే విధంగా సూర్యునికి సంబంధించిన సంవత్సర కాలాన్ని 27 భాగాలుగా విభజన చేసి


వాటిని కార్తెలు అని అన్నారు. ఒక్కో నక్షత్ర కూటమిలో సూర్యుడు దాదాపు 2 వారాల పాటు
ఉంటాడు కాబట్టి ఒక్కో కార్తె సుమారుగా 13 రోజులు ఉంటుంది. అశ్వని కార్తె మొదలు రేవతీ
కార్తె వరకూ సాగే ఈ కార్తెల విభజన వ్యవసాయదారులకు చాలా ఉపయోగకరం.
తొల్కాప్పియంలో ఋతువులు/కాలాలు:

అతి ప్రా చీనమైన ఋగ్వేదంలో వర్షఋతువు కనిపించకపో తే, దేశభాషలలో ప్రా చీనమైన
తొల్కాప్పియం అన్న తమిళ వ్యాకరణ గ్రంథంలో పేర్కొన్న కాలాలలో (పెరుంపొ ఴుత్తు = పెద్ద
ప్రొ ద్దు లు) వసంతం కనిపించదు. తొల్కాప్పియంలో ప్రధానంగా కనిపించే కాలాలు మూడు:
వేనిల్ (=వేసవి), కారు (వాన), కూతిర్/పని (చలి). కవిత్వంలోని రసానుభూతులను వివిధ
ప్రదేశాలతో పో ల్చుతూ తొల్కాప్పియంలోని పొ రుళతికారంలో వాటిని అయిదు రకాల
తిన్నెలుగా (తిణై) వర్గీకరించారు. ఈ అయిదు రకాల స్థ లాలకు, కాలంతో సంబంధం వివరించే
సూత్రా ల్లో మాత్రం మనకు మూడు రకాల కాలాలే కనిపిస్తా యి:

కారుమ్ మాలైయుమ్ ముల్లై (పొ రుళతికారం 6)

వానాకాలం, సాయంకాలం అడవి (ముల్లై ) తిన్నెకు అనువైనవి.

కుఱింజి, కూదిర్ యామం ఎన్మనార్ పులవర్ (పొ రుళతికారం 7)

కొండ (కుఱింజి) తిన్నెకు అనువైనవి చలికాలం (కూతిర్), అర్ధరాత్రి సమయం అని


చదువరులు చెప్పుదురు.
నడువునిలైత్ తిణైయే నణ్బగల్ వేనిలొడు
ముడివు నిలై మరుంగిన్ మున్నియ నెఱిత్తే. (పొ రుళతికారం 11)

వేసవి కాలం, పట్ట పగలు నడుమ తిన్నెకు అనువైనవి అని తలంతును.

ఈ మూడు కాలాలకు సంబంధించిన పదాల ధాతువులను పరిశీలిద్దా ం: ద్రా విడ భాషలలో


*వెచ్-/వెయ్- అన్న ధాతువులు వేడికి సంబంధించినవి. తెలుగులో వెచ్చ-, వేఁడి, వెక్క,
వెచ్చు, వెత, వెమ్ము, వెప్పు అన్న పదాలు, కన్నడలో బెచ్చగె, బెన్, బేయు, బెంకి/బెంగె, బిసి,
బిసుపు అన్న పదాలు వేడికి సంబంధించినవే. వేసవి కాలం అన్న అర్థంలో తెలుగులో వేసవి,
కన్నడలో బేసగె, తమిళంలో వేయిల్, వేనిల్ అన్న పదాలు కూడా ఈ ధాతువులనుండి
ఉద్భవించినవే.

తమిళంలో కారుకాలం అంటే వానకాలం. తెలుగులో కారు- అంటే వానకాలం అన్న అర్థమే
కాకుండా ఋతువు (season) అన్న అర్థం కూడా ఉంది. ‘ముక్కారు పంటలు’ అంటే ‘మూడు
కాలాల పంటలు’ అని అర్థం. తొలికారు, నడికారు, ననకారు అని మనకు మూడు రకాల పంట
కాలాలు ఉన్నాయి. ముస్లిమ్ పాలకుల ప్రభావంతో తొలికారు, నడికారు పంటలను ఇప్పుడు
ఖరీఫ్ పంట, రబీపంట అని పిలుస్తు న్నాము.

కారు- అన్న పదానికి మూలార్థం దట్ట మైన నలుపు. తమిళ-మళయాళం వంటి దక్షిణ ద్రా విడ
భాషాల్లో దట్ట మైన నల్ల టి మేఘాన్ని కూడా ‘కారు’ అనే పిలుస్తా రు. నల్ల మట్టితో నిండిన
భూములు కలిగిన ప్రా ంతం కరునాడు- అదే కర్నాటకం అయ్యింది. దీన్ని కర్ణా టక- అని
సంస్కృతీకరించి కర్ణ అంటే చెవులు, అటతి- సంచరించు అంటూ “చెవులు ఎక్కడైతే
సంచరిస్తా యో ఆ ప్రదేశం కర్ణా టక” అని చెప్పే సంస్కృత వ్యుత్పత్తు లు శాస్త ర
్ర ీత్యా అంతగా
పొ సగవని తేలికగానే చెప్పవచ్చు.

ద్రా విడ భాషలలో చళ్-/చణ్- అన్న ధాతువులు చల్ల దనానికి సంబంధించినవి. తెలుగులో చలి,
చలిమిరి, చలువ, చల్ల ఁగాఁ, చలిది అన్న పదాలు ఈ ధాతువుకు సంబంధించినవే. దక్షిణ
ద్రా విడ భాషలలో పదాది చ-కారం కొన్ని పదాల్లో త- కారంగా మారింది. తమిళంలో తణుపు
(చలి), తన్నీరు (చల్ల నీరు), తణ్మై (చల్ల దనము), తణల్ (చల్ల టి నీడ), వంటి పదాలు చణ్- >
తణ్- అన్న ధాతువుకు సంబంధించినవే. తెలుగులో కూడ తడి, తనుపు, తనివి, తనియు
అన్న పదాలు కూడా ఈ ధాతువుల ద్వారా నిష్పాదించవచ్చు.

మరో ద్రవిడ ధాతువు పన్- అన్న పదానికికూడా చల్ల దనానికి సంబంధించ అర్థా లు ఉన్నాయి.
అయితే, పన్నీరు అంటే చల్ల టి పరిమళ ద్రవ్యము అన్న అర్థంలో తప్ప ఈ ధాతుగత పదాలు
తెలుగులో అంతగా కనిపించవు. అయితే, దక్షిణాదిన తమిళం నుండి ఉత్త రాదిన ఉండే
కూరుఖ్, మాల్తో భాషలవరకూ పని-, పన్న-, పేని- అన్న పదాలు చలిని, చలికాలాన్ని
సూచించడానికి ప్రయోగిస్తా రు. తెలుగుతోపాటు దక్షిణ-మధ్య భాషలుగా ఉన్న కొండ, కుయీ,
పెంగో, మండా భాషలలో కూడా పీని-, పెన్ని- అంటే చల్ల , చలికాలం అన్న అర్థా లు ఉండడం ఈ
ధాతువు యొక్క ప్రా చీనతను సూచిస్తు న్నాయి.

ఇప్పుడు తమిళ భాషలో ఆరు ఋతువులను సూచించడానికి వాడే ఆరు తమిళ పేర్లు ఇవి:
ఇళవేనిల్ (లేత వేసవి= వసంతం), ముదువేనిల్ (ముదురు వేసవి, గ్రీష్మం), కార్ (వర్ష
ఋతువు), కుళిర్ (శరత్తు ), మున్-పని (మున్-చలికాలం), పిన్-పని (పిన్-చలికాలం).
అయితే, ఇవి సంస్కృత ప్రభావం వల్ల భాషలో స్వకీయంగా ఏర్పడిన మూడు కాలాలను ఆరు
ఋతువులుగా విస్త రించారని ఊహించడం అంతపెద్ద కష్ట మేమి కాదు కదా.

వచ్చే సంచికలో సంస్కృత, తమిళ, తెలుగు కావ్యాల్లో ఋతుసౌందర్యాన్ని కీర్తించిన కొన్ని


కవితలను పరిశీలిద్దా ం

కాలమానము
రచన: సురేశ్ కొలిచాల

నవంబర్ 2012

సర్వం కాలకృతం మన్యే భవతాం చ యదప్రియం


సపాలో యద్వశే లోకో వాయోరివ ఘనావలిః
(శ్రీమద్భాగవతమ్ 1.9.14)
ఘనమైన మేఘాలను కనిపించని వాయువు నడిపించినట్టు , లోకంలో సర్వ జీవరాశిని కాలం
నడిపిస్తు ంది అని కాలం యొక్క విశిష్ట తను భాగవతం, ప్రథమ స్కంధంలో భీష్ముడు
ధర్మరాజాదులకు వివరిస్తా డు. ఈ శ్లో కాన్నే పో తన ఇలా తెనిగించాడు:

వాయు వశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం


బాయుచు నుండు కైవడిఁ బ్రపంచము సర్వముఁ గాలతంత్రమై
పాయుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదు కాల మన్నియుం
జేయుచునుండుఁ గాలము విచిత్రము దుస్త ర మెట్టివారికి.
(భాగవతం 1. 9. 209)

కాలాన్ని అగ్నిగాను, బలిష్ట మైన శక్తిగానూ వర్ణించడం అథర్వ వేదంలోని కాలసూక్త ం నుండీ
మనకు కనిపిస్తు ంది. “కాలోఽస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో (లోకంలో సర్వశక్తిమంతులను
హరింపజేసే కాలస్వరూపుడను నేనే)” అన్న భగవద్గీతలోని ప్రసిద్ధమైన శ్లో కం అందరికీ
తెలిసిందే. అయితే, ఋగ్వేదంలో కాలప్రస్తా వన అంతగా కనిపించదు.

రాత్రి-పగళ్ళ రాకపో కలను, సూర్యచంద్రు ల గమనాన్ని, ఏటా పునరావృత్త మయ్యే ఋతువుల


క్రమాన్ని పరిశీలించిన ప్రతీ మానవ సమాజం కాలాన్ని కొలవడానికి అనువుగా తమదైన
పదజాలాన్ని ఏర్పాటు చేసుకొన్నది. తెలుగులో మనం వాడుతున్న కాలమాన పదజాలాన్ని,
వాటి వ్యుత్పత్తి చరితల
్ర ను చర్చించడం ఈ విడత పలుకుబడి వ్యాసం ముఖ్యోద్దేశ్యం.

చంద్రు డు, రాత్రి, నెల

సూర్యకాంతి కొంతకాలం ప్రసరించి ఆ తరువాత వెలుగు తొలగిపో వడం, ఆపై చీకటిగా మారటం
అనాదికాలం నుండి మానవుడు గమనించాడు. సహజంగానే, ఈ చీకటి వేళలను ప్రమాదానికి,
భయానికి సూచకమని భావించాడు. ఆ చీకటివేళలో వెలుగు ప్రసరింపజేసే చంద్రు ని రూపం
ప్రతిరోజూ మారిపో తుండడం కూడా మానవుడు గమనించాడు. ఒక్కోసారి నిండుగా కనిపించే
చంద్రు డు, ఆపై పరిణామంలో తగ్గు తూ చివరకు కనిపించకుండా మాయమవ్వడం, ఆ
తరువాత మళ్ళీ పెరుగుతూ నిండుగా రూపు సంతరించుకోవడం ఆదిమ మానవుడు
గమనించే ఉంటాడు. దాదాపు 35,000 సంవత్సరాల క్రితమే చంద్రు ని గమనం ప్రతి 29-30
పగళ్ళు-రాత్రు ళ్ళ తరువాత మళ్ళీ పునరావృత్త మవుతుందని మానవుడు అర్థం
చేసుకున్నాడనడానికి మనకు ఆధారాలు దొ రుకుతున్నాయి. ఆఫ్రికాలో దొ రికిన లెబో ంబో
ఎముకపై వరుసగా 29-గీతలు ఉండడం శాస్త జ్ఞు
్ర లను ఆశ్చర్యపరిచింది. ఇది ఆ కాలంలో
చంద్రు ని గమనానికి, స్త్రీల ఋతుచక్రంలో రోజులను లెక్కించడానికి ఉపయోగించి
ఉండవచ్చునని శాస్త జ్ఞు
్ర ల ఊహ. నమీబియాలో ఆదిమవాసులు రోజులను లెక్క
పెట్టు కోవడానికి ఇప్పటికీ ఇటువంటి ఎముకలనే ఉపయోగించడం ఈ రకమైన ఊహకు
బలాన్నిస్తు ంది. అంటే, చంద్రు ని నెలలో ఇరవైతొమ్మది రోజులుంటాయని అన్ని వేల
సంవత్సరాల క్రితమే మానవుడు ఊహించాడన్నమాట.

నెలకు, చంద్రు ని గమనానికి సంబంధం ఉంది కాబట్టే పలు భాషలలో (పలు భాషా
కుటుంబాలలో) నెలకు సమానార్థ కాలైన పదాలు చంద్రు ని పేరుతోనే కనిపించడం కద్దు .
ఉదాహరణకు, ఇంగ్లీష్ భాషలో moon అంటే చంద్రు డు; moon-th > month అంటే నెల
రోజులు. అలాగే, సంస్కృతంలో మాసం అంటే నెల అన్న అర్థమే కాక, చంద్రు డు అన్న అర్థం
కూడా ఉంది. ద్రా విడ భాషలలో కూడా ‘నెల’ అంటే చంద్రు డు. ఇప్పటికీ తమిళ, కన్నడ
భాషలలో నిల/నెల అన్న పదాలకు చంద్రు డు అన్న అర్థమే ఉంది. తెలుగులో నెలరాజు అన్న
పదబంధంలో ఈ పదాన్ని అదే అర్థంలో వాడడం కూడా గమనించవచ్చు. తమిళ, కన్నడ
భాషలలో ‘నెల రోజులు’ అన్న అర్థంలో వాడే తింగళు- అన్న పదానికి కూడ మొదటి అర్థం
చంద్రు డే.

ద్రా విడ భాషలో ‘రాత్రి’ అన్న అర్థం వచ్చే పదాలు *చిర-వు-/చిరంక- అన్న మూల ధాతువుల
నుండి వచ్చాయి. ఈ ధాతువుకు మూలార్థం చీకటి, అంధకారం. నిజానికి, చీఁకటి అన్న పదం
చిరంకటి- అన్న ధాతువు నుండే వచ్చింది. అయితే, దక్షిణ ద్రా విడ భాషలలో పదాది చ-కారం
లోపించడం తఱచుగా కనిపిస్తు ంది. అందుకే, తమిళాది భాషలలో *చిరవు-, ‘ఇరవు’ గా
‘ఇరళు’ గా మారింది. తెలుగులో కూడా ఇరులు అంటే చీకటి. “అదృష్ట వంతులు మీరు,
వెలుగును ప్రేమిస్తా రు, ఇరులను ద్వేషిస్తా రు […] వెలుగు లేని చీకట్లే, ఇరుల లోని
మిణుగురులే చూస్తా ం [మేము]” అంటూ సాగే శ్రీశ్రీ కవిత చిన్నప్పటి నుండి నాకిష్టమైన
కవితల్లో ఒకటి.

చాలా నిఘంటువులలో రేలు అన్న పదాన్ని రేయి అన్న పదానికి బహువచనంగా, రాత్రి అన్న
సంస్కృత పదానికి వికృతిగా వివరిస్తా రు. కానీ, *ఇరుళు- అన్న పదమే వర్ణవ్యత్యయం వల్ల
రేలు-గా మారిందని, రేయి, రేలు రెండూ పూర్తిగా ద్రా విడ పదాలేనని నా అభిప్రా యం.

సూర్యుడు, పగలు, ప్రొ ద్దు

పగలు అన్న పదానికి, దాని పర్యాయ పదాలలో చాలా వాటికీ మొదటి అర్థం సూర్యుడు.
తెలుగులో బాగా వాడే ప్రొ ద్దు అన్న పదానికి మూల ధాతువు *పొ ఴుత్తు . ఇది వర్ణవ్యత్యయం
వల్ల ప్రొ ద్దు గానూ, ఆపై పొ ద్దు గానూ రూపాంతరం చెందింది. ఈ పదానికి కూడా ప్రా థమికార్థం
సూర్యుడే. ‘ప్రొ ద్దు పొ డుచు-’, ‘ప్రొ ద్దు పొ డుపు’ అంటే సూర్యుడు ఉదయించడం అనే. ఇక్కడ
‘పొ డుచు’ అంటే పొ డచూపు, పొ డకట్టు , కనిపించు అన్న అర్థా లే. ప్రొ ద్దు గూకు, ప్రొ ద్దు గూకులు,
ప్రొ ద్దు గ్రు ంకు, ప్రొ ద్దు పో కడ, ప్రొ ద్దు పో వు, ప్రొ ద్దు గడుచు అన్న పదాలన్నీ సూర్యాస్త మయాన్ని
సూచిస్తా యి. అలాగే, ‘ప్రొ ద్దు జంట’, ‘ప్రొ ద్దు జోడు’ అంటే సూర్యుని జోడి అయిన చంద్రు డు.
‘ప్రొ ద్దు రాయి’, ‘ప్రొ ద్దు కల్లు ’, ‘ప్రొ ద్దు గల్లు ’ అంటే సూర్యశిల. ‘ప్రొ ద్దు పట్టి’, ‘ప్రొ ద్దు గొడుకు’,
‘ప్రొ ద్దు కూన’, ‘ప్రొ ద్దు చూలి’ అంటే సూర్యుని కొడుకు — యముడు, శని, కర్ణు డు, సుగ్రీవుడు
మొదలైన వారిలో ఎవరికైనా వాడవచ్చు. ‘ప్రొ ద్దు పట్టు ’ అంటే సూర్య గ్రహణము.

అయితే, ‘ప్రొ ద్దు లు’ అన్న పదాన్ని ప్రసూతి సమయాన్ని సూచించడానికి కూడా వాడిన
ప్రయోగాలు ఉన్నాయి. ‘ప్రొ ద్దు లుపడు’, ‘ప్రొ ద్దు లవేళ’, ‘ప్రొ ద్దు లనెల’, ‘ప్రొ ద్దు నెల’ మొదలైన
పదాలన్ని కానుపు అయ్యే సమయాన్ని సూచించడానికి వాడుతారు. అయితే, ఈ పదానికి,
సూర్యుడు అన్న అర్థమున్న *పొ ఴుత్తు అన్న ధాతువుకు ఏ సంబంధం లేదు. కానుపుకు
సంబంధించిన ఈ పదాలన్ని *పురుటు- అన్న ధాతువు సంబంధించినవి. ‘పురుడు’ అన్న
పదం కూడా ఈ పదాలకు సో దర (cognate) పదమే.
నేడు, ఱేపు, ఎల్లు ండి, నిన్న, మొన్న

నేడు: ద్రా విడ భాషలలో సమయాన్ని సూచించడానికి ఎక్కువగా వాడే పదాలకు మూల


ధాతువు *ఞాన్ఱు -/నాన్ఱు -. ఈ ధాతువు తెలుగులో మొదట నాండుగా మారి, ఆపై నాఁడుగా
రూపాంతరం చెందింది. ఈనాండు అంటే ప్రస్తు తపు దినం. అది వర్ణవ్యత్యయం చెండి నేండుగా,
నేఁడుగా మారింది. తమిళ కన్నడాదులలో కనిపించే నాళ్- కూడా నాణ్డు -/నాండు-
సంబంధించిందే కావచ్చు. అయితే కాలాన్ని సూచించే ధాతువు*ఞాన్ఱు - ధాతువు నుండి
పుట్ట న నాఁడుకు, ప్రా ంతాన్ని సూచించే ధాతువు *నాట్టు - నుండి పుట్ట న నాడుకు తెలుగులో
అరసున్న మాత్రమే తేడా. ఇప్పుడు అరసున్నాలు రాయటం లేదు కాబట్టి సందర్భాన్ని బట్టి
అది కాలాన్ని సూచిస్తు ందా, ప్రా ంతాన్ని సూచిస్తు ందా తెలుసుకోవాలి. అంటే, తెలుగులో
ప్రముఖ ప్రతిక అయిన ‘ఈనాడు’ పేరును కాలాన్ని సూచిస్తూ ‘ఇవ్వాళ’ అని అర్థం
చేసుకోవచ్చు, లేదా స్థ లాన్ని సూచించే ‘ఈ ప్రా ంతం’ అని కూడా అర్థం చేసుకోవచ్చు.

నిన్న: నిఱ-/నెఱ- అంటే నిండిన. నిఱనాళ్/నిఱనాండు అంటే నిండిన రోజు, అంటే పూర్తి అయిన
రోజు. నిఱనాళ్- అన్న పదమే తెలుగులో నిఱ్నగా నిన్న గా మారింది.

మొన్న: మును- అన్న ధాతువు -నాళ్/-నాఁడు అన్న ధాతువుతో కలిస్తే


మున్నాళ్/మున్నాండు అవుతుంది. మును- అన్న పదానికి కడచిన, అంతకు ముందు
జరిగిన విషయానికి సంబంధించింది అన్న అర్థా లు కూడా ఉన్నాయి కదా.
మున్నాళ్/మున్నాండు నుండే మొన్న వచ్చిందని చెప్పడం అంత కష్ట ం కాదు. మొదటి
అక్షరంలో ఉ-కారం తరువాతి అక్షరంలో అ-కారం ఉంటే తెలుగు, కన్నడ భాషలలో అది ఒ-
కారంగా మారుతుందని నిరూపిస్తూ కృష్ణ మూర్తి గారు రాసిన వ్యాసం ప్రసిద్ధమైనది (నిజానికి,
అది ఆయన రాసిన మొట్ట మొదటి పరిశోధనా పత్రం. అప్పటికి ఆయన వయస్సు 25 ఏళ్ళు
మాత్రమే).

ఱేపు: మూల ద్రా విడ భాషలో పదాలు ర, ల, ఱ, ట, డ లతో మొదలుకావు, కాబట్టి తెలుగులో


వర్ణవ్యత్యయం వల్ల రెండవ అక్షరమైన ఱ మొదటి అక్షరంగా మారి ఱేపు అన్న పదం
ఏర్పడిందని మనం ఊహించవచ్చు. దీని మూలధాతువు *ఏఱు- అంటే (పైకి) లేచు.
ఉదయించు అన్న అర్థంలో కూడా దీన్ని వాడినట్టు తమిళ ప్రయోగాల ద్వారా మనకు
తెలుస్తు ంది. అయితే, మహాభారతంలో ఱేప- అన్న పదం సూర్యోదయమన్న అర్థం లోనే
వాడినట్టు మనకు కనిపిస్తు ంది. ఉదాహరణకు, ఆదిపర్వంలోని ఈ వచనం (2-32) చూడండి:

అని యిట్లిద్దఱు నొండొ రులకు దాసీత్వంబు పణంబుగా నొడివి పన్నిదంబు సఱచిన వినతి
యయ్యశ్వంబు డాసి చూతము రమ్మనినఁ గద్రు వయు నిప్పుడు ప్రొ ద్దు లేదు పతి
పరిచర్యాకాలంబు నయ్యె; ఱేపకడయ చూతమని యిద్ద ఱు మగుడి వచ్చితమ నివాసంబుల
కుం బో యియున్నయప్పుడు.

వినతా కద్రు వులిద్ద రూ తెల్లని గుఱ్ఱ ంపై నల్ల మచ్చ ఉందా, లేదా అన్న విషయంపై పందెం
వేసుకొని, పరీక్షించడానికి ప్రొ ద్దు లేదు, కాబట్టి ఱేపకడ (పెందలకడ) చూద్దా మని
నిర్ణయించుకున్నారట.

ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పదం పెందలకడ. చాలా నిఘంటువులు దీన్ని పెన్ + తల + కడ


అని వర్ణించారు. కానీ, పెన్- తల- కడ- తెల్లవారు సమయం ఎందుకవుతుందో నేను చూసిన ఏ
నిఘంటువులోనూ వివరణ కనిపించలేదు. నా దృష్టిలో ఇది పెన్+ తెఱు + కడ అన్న పదాల
కలయిక. తెఱు(వు) అంటే వేడి, సూర్యుని ఎండ అన్న అర్థా లు తమిళంలో ఉన్నాయి. (తెరువు
అంటే దారి; తెఱువు అంటే వేడి). పెన్- అతిపెద్ద, ముఖ్యమైన అన్న అర్థా లతో అన్వయిస్తే
పెందెఱకడ అన్న అర్థమే సబబని అనిపిస్తు ంది. కొండ భాషలో పెందెఱ అంటే
ఉదయకాలమన్న అర్థం ఈ ఊహకు ఊతమిస్తు ంది.

ఎల్లి: ఱేపు అన్న పదానికి మహాభారత కాలంలో ‘ఆ మరుసటి రోజు’ అన్న అర్థం లేకపో తే,
మరి మరునాడు అన్న అర్థం సూచించడానికి ఏ పదాన్ని వాడారు అన్న ప్రశ్న
ఉదయించవచ్చు. మహాభారతంలో ఱేపు అన్న అర్థా న్ని సూచించడానికి ఎక్కువగా వాడిన
పదం ఎల్లి. ఉదాహరణకు ద్రో ణపర్వంలో అభిమన్యుని మరణవార్త తెలిసిన తరువాత,
అర్జు నుడు కోపంతో ఆ మరుసటిరోజు సైంధవుడిని చంపుతానని ధర్మరాజు, ఇతర రాజుల
ఎదుట ప్రతిజ్ఞ చేసే ఈ పద్యం చూడండి:
వినుఁడీ నాదు ప్రతిజ్ఞ నీవు నిఖిలోర్వీనాథులున్ సింధురా
జు నవశ్యంబును నెల్లి  సంపుదు భయస్థు ండై నినుం జొచ్చినన్
వనజాక్షున్ శరణంబు వేఁడినను గర్వంబేది నన్నుం దగం
గనినం బో రు దొ ఱంగి పో యిన నెఱుంగం గాని సత్యవ్రతా. (ద్రో . ప. 2-277)

‘అవశ్యమునున్ ఎల్లి చంపెదను — తప్పకుండా ఎల్లి (మరుసటి రోజు) చంపుతాను’ అని


అర్జు నుడు ప్రతిజ్ఞ చేస్తా డు. తరువాత, శ్రీకృష్ణు డు ఈ ప్రతిన నేరవేర్చే విషయంలో తన సాయం
తప్పకుండా ఉంటుందని దారకునికి చెప్పే పద్యంలో కూడా ఎల్లి ప్రయోగం కనిపిస్తు ంది.

ఎల్లి సచరాచరములు నెల్ల భూత


ములును నాదగు నేర్పును బలముఁ బాండు
తనయులకు నేను గూర్చుటయును నెఱుంగ
వలయు దారక యేచెదఁ గలని లోన. (ద్రో . ప. 2-351)

రోజుకు సంబంధించిన మిగిలిన పదాలలాగే, ఎల్లి అన్న పదానికి కూడా మూలార్థం సూర్యుడు;
సూర్యుని వెలుగు. అయితే, కవిత్రయ కాలంలో ఇది మరుసటి రోజును సూచించడానికి
ప్రథానంగా వాడేవారని మనకు తెలుస్తు ంది. పాండవోద్యోగ విజయాలు రాసిన తిరుపతి
వేంకటకవులు కూడా ఇదే ఒరవడిని పాటిస్తూ , ఎల్లి అన్న పదాన్ని రేపటి రోజు, తదుపరి వచ్చే
రోజులు అన్న అర్థంలో వాడారు. సుప్రసిద్ధమైన ఈ కింది పద్యంలో ‘ఎల్లి’ ప్రయోగం చూడండి.

చెల్లి యొ చెల్లకో, తమకు చేసిన యెగ్గు లు సైచిరందరున్


తొల్లి గతించె; నేడు నను దూతగ బంపిరి సంధిసేయ; నీ
పిల్లలు పాపలున్ బ్రజలు బెంపువహింపగ సంధి సేసెదో
ఎల్లి రణంబెగూర్చెదవొ ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా!

ఎల్లు ండి: ఎల్లి + నాండు అన్న పదబంధం ‘ఎల్లు ండి’గా మారిందని సులభంగానే


వివరించవచ్చు (అయితే, కొన్ని నిఘంటువులు ఈ పదాన్ని ఎల్లి + ఉండి అని
వివరిస్తు న్నాయి). మఱునాడు అని అర్థం ఉన్న ఎల్లి పదానికి మారుగా, ఱేపు అన్న పదం
వాడడం ఎప్పుడు మొదలైందో మనకు తెలియదు. అలాగే, ఎల్లి, ఎల్లు ండి అన్న పదాలకు
‘ఱేపటికి మఱునాడు’ అన్న అర్థం ఎప్పుడు వాడుకలోకి వచ్చిందో కూడా తెలియదు. అయితే,
వేమన కాలానికి ఈ రెండు మార్పులు పూర్తి అయ్యాయని అనుకోవడానికి ఆస్కారం
కలుగజేస్తు ంది ఈ కింది పద్యం.

ఎల్లి రేపు నేఁడు నేలాగునైనను


మనసునిల్పువాఁడు మంచివాఁడు
శివుఁడు భర్త కర్త చింతింపనేలరా
విశ్వదాభిరామ వినర వేమ!

వారం

ముప్ఫై రోజుల నెల లెక్కలకు ఆధారాలు పాతరాతి యుగం నుండి కనిపిస్తూ ఉంటే, వారానికి
ఏడు రోజుల లెక్క మాత్రం అర్వాచీనంగానే కనిపిస్తు ంది. వేద వాఙ్మయంలో తిథుల ప్రస్తా వన
ఉన్నా, ఏడు రోజుల వారం (వాసరం) ప్రస్తా వన లేదు. వారానికి ఏడు రోజులుగా దినాలను
లెక్కపెట్టే విధానం క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల కాలంలో మెసపొ టోమియాలోని
బాబిలోనియనులు పాటించేవారని మనకు దొ రికిన పురాతత్వ ఆధారాల ద్వారా
తెలుసుకోవచ్చు. సూర్యుడు, చంద్రు డు, ఇతర నక్షత్రా లు మనుష్యుల జీవితాలను
శాసిస్తా యన్న నమ్మకం ఆ రోజుల్లో నే ఉండేది. సూర్యుడు, చంద్రు డు కాక ఆకాశంలో కనిపించే
ఇతర నక్షత్రా లలో కుజుడు, బుధుడు, గురుడు, శుక్రు డు, శని గ్రహాలు మనకు దగ్గ రిగా
ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే కదులుతున్నట్టు గా కనిపిస్తా యి. బాబిలోనియనులు
సూర్యుడు, చంద్రు డు, ఈ కదిలే అయిదు గ్రహాలు కలిపి భూమి చుట్టూ మొత్త ం ఏడు గ్రహాలు
తిరుగుతున్నట్టు గా భావించారు. ఈ ఏడింటిలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క రోజుకి అధిదేవతగా
ఊహించి ఆయా రోజులకు వరుసగా పేర్లు పెట్టడంతో, మనకు ఏడు రోజుల వారాలు
ఏర్పడ్డా యి. ఆనాటి బాబిలోనియనులు ఉపయోగించిన ఏడు రోజుల చక్రా న్నే యూదులు,
గ్రీకులు, రోమనులు, హిందువులు, అరబ్బులు, క్రైస్తవులు యదాతథంగా పరిగ్రహించారని
శాస్త జ్ఞు
్ర ల ఊహ. బాబిలోనియనులు గ్రహాల ఆధారంగా ఏడు రోజులకు పెట్టిన పేర్లు , అదే
క్రమంలో పలు ఆధునిక క్యాలెండర్ల లో కనిపించడం ఆసక్తికరమైన విషయం.
వచ్చే పలుకుబడి సంచికలో కాలాలు, ఋతువులకు సంబంధించిన పదజాలం, రోజులో
కాలాన్ని మరింతగా విభజించే గంటలు, నిమిషాలు, ఘడియలు, విఘడియల గురించి
చర్చిద్దా ం.

 కాలమానము II
రచన: సురేశ్ కొలిచాల

మే 2013

అన్నీ మనవేదాల్లో నే ఉన్నాయిష!

నవంబర్ సంచికలోని పలుకుబడి వ్యాసంపై వ్యాఖ్యానిస్తూ లైలా, భారతీయ ‘కల్పం’ గురించి,


స్విస్ దేశానికి చెందిన పర్మెజానీ సంస్థ తయారుచేసే ‘కల్ప’ చేతిగడియారాల గురించి
ప్రస్తా వించారు. లైలాగారు చెప్పినట్టు బ్రహ్మ జీవితంలో ఒక రోజుకు (ఒక పగలుకు) కల్పం అని
పేరు. ఆ సమయం మానవ కాలమానం ప్రకారం సుమారు 43 కోట్ల 20 లక్షల సంవత్సరాలని
భారతీయుల నమ్మకం. అయితే, వేదకాలం నుంచి మనకు సెకండులో ఒక కోటివంతు (10-
7 సెకండ్లు ) కాలం నుండి 40 లక్షల కోట్ల సంవత్సరాల (1022 సెకండ్లు ) దాకా లెక్క పెట్టగలిగే
కాలమానం ఉండేదని చెప్పే వెబ్‌సైట్లు ఇంటర్నెట్టు లో కోకొల్ల లు. అలాగే, వేదాలలో
(సూర్య)కాంతి వేగాన్ని కూడా విలువకట్టి చెప్పారని, అది నేటి శాస్త వ
్ర ేత్తలు ఆధునిక
పద్ధ తులను ఉపయోగించి కనిపెట్టిన విలువకు ఉరమరగా సరిపో తుందనీ గర్వంగా
చెప్పుకోవడం కూడా కొన్ని సైట్లలో కనిపిస్తు ంది. అయితే, ఇందులోని సత్యాసత్యాల గురించి
కాస్తా విచారిద్దా ం.
చాంద్రమానం, సౌరమానం, సౌర-చాంద్రమానం
‘నెల’ రోజులను ప్రమాణంగా తీసుకొని కాలాన్ని కొలవడం అనాదిగా మానవునికి తెల
ుసని ఇంతకు ముందు విడతలో చర్చించాం కదా! అమావాస్య నుండి అమావాస్య దాకా సుమార
ు ముప్
ఫై రోజుల కొకసారి చం
ద్రకళలు పునరావృత్త మౌతాయని దాదాపు అన్ని నాగరికతలకు
తెలుసు.ఈ రకంగ

ఇదే విధంగా క్రమం తప్పకుండా వచ్చే చెట్లు చిగురించే కాలాన్ని, ఆకురాలే కాలాన్ని
గమనించడం నేర్చుకున్నాడు మానవుడు. వ్యవసాయం అభివృద్ధి చెందిన నాగరికతలలో
వర్షా లు ఎప్పుడు పడతాయో, ఎండాకాలం ఎప్పుడు వస్తు ందో తెలియడం ముఖ్యం.
ఈజిప్టు లోని నైలునదికి దాదాపు 360-370 రోజులకొక సారి వరదలు వచ్చేవట. సూర్యుని
ఎండ తీక్షణతలోనూ, రాత్రి-పగళ్ళ కాలపరిమాణంలోనూ ఇదే 360 రోజుల క్రమంలో మార్పులు
వచ్చేవని వారు గమనించారు. ఈ మార్పుల ననుసరించి కాలాలు, ఋతువులు 360 రోజుల్లో
పునరావృత్త మవుతాయని అనుకునేవారు. ఈ రకంగా సూర్యుని గతిమీద ఆధారపడిన
కాలమానాన్ని సౌరమానం (solar) అంటారు.

నాగరికతలు వెలసిన తొలిరోజుల్ల లోనే, తేలికగా గమనించగలిగే చాంద్రమానాన్ని,


వ్యవసాయానికి అవసరమైన సౌరమానాన్ని అనుసంధానం చేసే సౌర-చాంద్రమానాలు
(lunisolar) కూడా కొన్ని తయారయ్యాయి. ముప్ఫై రోజుల నెల లెక్కను బట్టి ఒక
సౌరసంవత్సరం దాదాపు 12 చాంద్రమాసాలకు సమానమై ఉంటుందని వారు ఊహించారు.
అయితే, ఒక్కో చాంద్రమాసం నిజానికి దాదాపు 29½ రోజులు; కాబట్టి 12 చాంద్రమాసాలు 354
రోజులకు సమానం. కానీ, సుమారు సౌరసంవత్సరంలో 365¼ రోజులు. అంటే ఈ రెండు
పద్ధ తుల కొలతలలో సంవత్సరానికి దాదాపు 11-12 రోజుల తేడా. ఈ రకమైన తేడాను వారు
ఆ రోజుల్లో నే పసికట్టా రు. ఈ వ్యత్యాసాన్ని అధిగమించడానికి రెండున్నర సంవత్సరాలకొకసారి
అధికమాసం అని 13 వ నెలను జతచేసేవారు. ఈ రకమైన అధికమాసపు పద్ధ తి
బాబిలోనియన్, ఈజిప్టు నాగరికతలలోనూ, యూదు, గ్రీకు, భారతదేశాలలో కనిపిస్తు ంది.
వ్యవసాయంతో పాటు ఈ పద్ధ తి తూర్పు ఆసియాలో అభివృద్ధి చెంది మిగితా ప్రా ంతాలకు
పాకిందని కొంతమంది చరితక
్ర ారులు ఊహిస్తే, మరికొంతమంది ఎవరికివారే విడివిడిగా ఈ
పద్ధ తిని కనుక్కొన్నారని వాదిస్తా రు. ప్రకృతిసిద్ధమైన విషయం గురించి భిన్నమైన
నాగరికతలు ఒకరికొకరు తెలియకుండా, ఒకేరకమైన సిద్ధా ంతాన్ని తయారుచేయడం అంత
అసాధ్యమేమీ కాదని వీరి వాదన.

వేదాలలో కాలమానం

యస్యాగ్నిహో త్రం అదార్శం అపౌర్ణమాసం


అచాతుర్మాస్యం అనాగ్రా యణం అతిథివర్జితంచ
అహుతం అవైశ్వదేవం అవిధినాహుతం
ఆసప్త మాంస్ తస్య లోకాన్ హినస్తి (మాండుక్యోపనిషత్తు 1. 2.3)

ఎవరైతే నిత్యాగ్నిహో త్రముతోపాటు పౌర్ణమికి, మాసానికి, చతుర్మాసానికి, ఆగ్ర అయనానికి


తగిన క్రతువులు చేయరో […] వారు సప్త లోకాలలో తమ గతిని నాశనము చేసుకొందురు.

కాలానుగుణంగా క్రతువులు చెయ్యాలని శాసించే వారికి ఆ కాలగమనం గురించి


స్థూ లంగానైనా అవగాహన ఉండేదని మనం ఊహించవచ్చు. వేదాలలో అతిప్రా చీనమైన
ఋగ్వేదం లోని శ్లో కాల ద్వారా వారికి అప్పటికే కచ్చితంగా చంద్రగమనం గురించి,
సూర్యగమనం గురించి స్పష్ట మైన అవగాహన ఉండేదని, క్రమం తప్పకుండా వచ్చే ఋతువుల
గురించి, అధికమాసం గురించే కాక, సంవత్సరానికి రెండు సార్లు వచ్చే విషువత్తు ల (equinox)
గురించి, అయనాల (solstice) గురించి కూడా తెలుసునని మనం గ్రహించవచ్చు.

ఋగ్వేదంలో ఋత(ము) అంటే క్రమము, సత్యము, ధర్మము; అనృతము అంటే క్రమం


తప్పినది, అసత్యమైనది అన్న అర్థా లున్నాయి. ఋగ్వేదంలో ‘ఋత’ అన్న పదం చాలా
ప్రచురంగా కనిపిస్తు ంది. ఇది ఇండో -యూరోపియన్ మూల ధాతువు *హర్-త్- నుండి
వచ్చిందని భాషావేత్తల ఊహ. గ్రీక్ దేవత పేరైన Arete, Harmony మొ., దీనికి సో దర పదాలు
(cognates). విషువత్తు (equinox) రోజున భూమిపైన రాత్రిభాగం, పగటిభాగం సమానంగా
ఉంటాయి. విషు- అంటే రెండు వైపులా (సమానంగా). విషువత్- అంటే సమానమైన భాగాలు
కలది. రాత్రి, పగలు సమాన భాగాలుగా గల రోజును విషువత్తు అంటారు.
ఋగ్వేదంలో ఆయా కాలాలలో నిర్వహించవలసిన క్రతువులను వివరించే శ్లో కాల ద్వారా
ఆనాటి కాలమానం యొక్క వివరాలను అంచనా వేయవచ్చు. ఉదాహరణకు, ఋగ్వేదంలోని
ఏడవ మండలంలో 103 వ సూక్త ంలోని 7-9 శ్లో కాలలో సంవత్సరం చివర బ్రా హ్మణులు జరిపే
సో మ-అతిరాత్ర యజ్ఞా న్ని వివరిస్తూ , 12 మాసాలను (ఋతువులను) చక్కగా కాపాడిన
ఋత్విక్కులు సో మరసం తాగుతూ ఈ యజ్ఞా న్ని వేడుకగా నిర్వహిస్తా రని వర్ణిస్తా రు.

బ్రా హ్మణాసో అతిరాత్రే న సో మే సరో న పూర్ణం అభితో వదంతః


సంవత్సరస్య తదహః పరిష్ఠ యన్ మండూకాః ప్రా వృషీణం బభూవ
బ్రా హ్మణాసః సో మినో వాచం అక్రత బ్రహ్మ కృణ్వంతః పరివత్సరీణం
అధ్వర్యవో ఘర్మిణః సిష్విదానా ఆవిర్ భవంతి గుహ్యా న కే చిత్
దేవహితిం జుగుపుర్ ద్వాదశస్య ఋతుం నరో న ప్ర మినంత్యేతే
సంవత్సరే ప్రా వృష్యాగతాయాం తప్తా ఘర్మా అశ్నువతే విసర్గ ం
(ఋగ్వేదం 7.103.7-7.103.9)

సంవత్సరానికి 12 మాసాలన్నది దైవనిర్ణయమని, వాటిని చక్కగా నిర్వర్తించినందుకు


బ్రా హ్మణులు జరుపుకొనే విజయోత్సవమే సో మ-అతిరాత్ర యజ్ఞ మని ఈ శ్లో కాల ద్వారా
మనకు తెలుస్తు న్నది.

ఋగ్వేదంలోని మొదటి మండలం 25 వ సూక్త ంలోని 8 వ శ్లో కం వరుణుని గురించి చెబుతూ:

వేద మాసో ధృతవ్రతో ద్వాదశ ప్రజావతః


వేదా య ఉపజాయతే (1.25.8)

వరుణ దేవునికి పన్నెండు మాసాల గురించి బాగా తెలుసు; (ఇవి కాక) ఇంకొక మాసం
గురించి కూడా తెలుసు.
ఇక్కడ ఇంకొకమాసం అంటే అధికమాసం గురించే ప్రస్తా విస్తు న్నారని అనుకోవాలి.
యజుర్వేదంలోని 1.4.14 శ్లో కంలో ఈ అధికమాసాల గురించి విపులంగా వివరిస్తూ , ఇది ప్రతి
అయిదు సంవత్సరాలకు రెండు సార్లు వస్తు ందని చెబుతుంది.

ఋగ్వేదంలోనే కాలామానాన్ని చాలా గుహ్యంగా వర్ణించే ఈ కింది శ్లో కాలను గమనించండి:

ద్వాదశారం నహి తజ్జ రాయ వర్వర్తి చక్రం పరి ద్యామృతస్య ।


ఆ పుత్రా అగ్నే మిథునాసో అత్ర సప్త శతాని వింశతిశ్చ తస్థు ః ॥ 1.164.11
పంచపాదం పితరం ద్వాదశాకృతిం దివ ఆహుః పరే అర్ధే పురీషిణం ।
అథేమే అన్య ఉపరే విచక్షణం సప్త చక్రే షళర ఆహురర్పితం ॥ 1.164.12

అగ్నీ, ముసలితనం లేకుండా స్వర్గ ం చుట్టూ నీ చక్రం ద్వాదశ అరములతో (spoke –


బండికంటియాకు) సదా తిరుగుతూ ఉన్నది. నీ 720 జంట కవలల పుత్రు లు కూడా
కనిపిస్తు న్నారు. వారు అయిదు పాదాలు కలిగి, పన్నెండు ఆకృతులు కలిగిన పితరుడిగా
నిన్ను భావిస్తు న్నారు. మరికొంతమంది నిన్ను ఆరు ఆరములతో, సప్త చక్రా లు కలిగిన
విచక్షణునిగా పరిగణిస్తు న్నారు.

ఇక్కడ అగ్నిని సూర్యుడినిగా భావించి సంబో ధించే శ్లో కాలు ఇవి: అతని పుత్రు లు 720 జంట
కవలలు – 360 పగళ్ళు, 360 రాత్రు లు; అంటే వారు ఆ రోజుల్లో సంవత్సరాన్ని 360 రోజులుగా
భావించారని అనుకోవచ్చు. అయిదు పాదాలు అయిదు ఋతువులు. పన్నెండు ఆకృతులు
పన్నెండు నెలలు. మరి కొంతమంది ఆరు ఋతువులు కలిగి ఏడు రోజుల వారానికి ప్రతీకగా
నిన్ను సప్త చక్రా లు ఉన్నవాడిగా పరిగణిస్తు న్నారు.

యజుర్వేదంలో కూడా అహో రాత్రం, అర్ధమాసం, మాసము, ఋతువులు, సంవత్సరాల


వివరాలు ఆనాటి స్థూ ల కాలవిభజనగా మనకు కనిపిస్తా యి.

అర్ధమాసాస్తే కల్పంతాం, మాసాస్తే కల్పంతాం । ఋతవస్తే కల్పతాం సంవత్సరస్తే కల్పతాం ॥


(యజుర్వేద 27.45)
అయితే, ఋతువులు, కాలాల గురించి వేదవాఙ్మయంలో పరస్పర విరుద్ధ మైన భావనలు
కనిపిస్తా యి. ఉదాహరణకు, ఋగ్వేదంలోని పదవ మండలం పురుష సూక్త ంలో వసంతం,
గ్రీష్మం, శరత్తు అన్న మూడు ఋతువుల ప్రస్తా వనే కనిపిస్తు ంది. యజుర్వేదంలో ఒకచోట
(యజుర్వేద 7.3.8) అయిదు ఋతువులను పేర్కొంటే, మరోచోట (యజుర్వేద 4.4.11) ఆరు
ఋతువులను పేర్కొన్నారు. శతపథ బ్రా హ్మణంలో మూడు, అయిదు, ఆరు ఋతువులతో
పాటు ఒకచోట ఏడు ఋతువుల ప్రస్తా వన కూడా కనిపిస్తు ంది. కొన్ని చోట్ల కొత్త సంవత్సరం
దక్షిణాయనంతో (summer solstice) ప్రా రంభమైతే, మరికొన్ని చోట్ల ఉత్త రాయణంతో (winter
solstice) ప్రా రంభమవుతుంది. కొన్ని చోట్ల సంవత్సరాన్ని 360 రోజులుగా వర్ణిస్తే, మరోచోట
చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికి తేడా 12 రోజులుగా వర్ణించడం
కనిపిస్తు ంది. (అంటే సంవత్సరానికి 366 రోజులుగా పరిగణించారిక్కడ). ఇటువంటి పరస్పర
విరుద్ధ మైన భావనల ద్వారా, భారతీయ కాలమాన లక్షణాలు వైదికకాలానికి పూర్తిగా అభివృద్ధి
చెందలేదని మనం చెప్పుకోవచ్చు.

ఆలస్యంగా అభివృద్ధి చెందిన యుగసిద్ధా ంతం

అంతేకాక, వైదిక వాఙ్మయంలో ఎక్కడా కల్ప, మహాకల్పాల గురించి గానీ, యుగ,


మహాయుగాల గురించి గానీ ప్రస్తా వన లేదు. యజుర్వేదంలో నిజానికి యుగం అంటే అయిదు
సంవత్సరాల ఆవర్త నం. “సంవత్సరో౽సి, పరివత్సరో౽సి, ఇదావత్సరో౽సి, ఇడ్వత్సరో౽సి,
వత్సరో౽సి” అన్న యజుర్వేద శ్లో కం(27.45) ప్రకారం “సంవత్సర, పరివత్సర, ఇదావత్సర,
ఇడ్వత్సర, వత్సర” అంటూ ఈ ఆవర్త ంలోని ఒక్కో సంవత్సరాన్ని ఒక్కో పేరుతో పిలిచేవారు.
కౌటిల్యుని అర్థశాస్త ం్ర లో “పంచవత్సరో యుగమితి (అర్థశాస్త ్ర ఈఈ.20)”, వేదాంగమైన
జ్యోతిశ్శాస్త ం్ర లో “యుగం భవేద్ వత్సరపంచకేన,” అన్న నిర్వచనాలే కనిపిస్తా యి.

అయితే, కృత, త్రేత, ద్వాపర, కలి యుగాల ప్రస్తా వన, కల్ప, మహాకల్పాల కాలవిభజన మనకు
మొట్ట మొదటిసారిగా మహాభారతంలో కనిపిస్తు ంది. అయితే, ఈ ప్రస్తా వనలు కూడా
మహాభారతానికి చిట్ట చివర దశలో చేర్చిన భాగాలలో, తరువాత చేర్చిన ప్రక్షిప్తా లలో ఎక్కువగా
కనిపించడం విశేషం. ఉదాహరణకు, 75 వేల శ్లో కాలున్న మహాభారతంలో కలియుగ ప్రస్తా వన
కేవలం తొమ్మిది సార్లు మాత్రమే కనిపిస్తు ంది. ఇవి మహాభారతంలో ప్రక్షిప్తా లుగా చెప్పుకునే
శాంతిపర్వంలోని నారాయణీయంలోనూ, అరణ్యపర్వంలోని మార్కండేయ విభాగంలోనూ
ఎక్కువగా కనిపిస్తా యి కాబట్టి ఇవి మహాభారత మూలకథలో భాగం కాదని పండితుల
వాదన. భగవద్గీతలో కృష్ణు డు “సంభవామి యుగే, యుగే” అంటాడు కాని, ఎక్కడా కృత, త్రేత,
ద్వాపర, కలి యుగాల పేర్లు చెప్పలేదు. దశావతారాల ప్రసక్తి కూడా భగవద్గీతలో లేదు. అలాగే,
‘కల్ప’ ప్రస్తా వన భగవద్గీతలో ఒకే ఒక్క శ్లో కంలో కనిపిస్తు ంది (9.7).

సర్వ భూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం


కల్పక్షయే పునస్తా ని కల్పాదౌ విసృజామ్యహం (భగవద్గీత 9.7)

కౌంతేయా! కల్పక్షయమయ్యే ప్రళయకాలంలో ప్రా ణికోటులన్నీ నా ప్రకృతిలో ప్రవేశిస్తు న్నాయి.


మరల కల్పాదియందు వాటిని మళ్ళీ నేను సృజిస్తు న్నాను.

అదీ గాక, పురాణాల్లో ఒక కృత, త్రేత, ద్వాపర, కలి యుగాల ఆవర్తా నికి మహాయుగమని పేరు.
అటువంటి మహాయుగాలు వెయ్యి అయితే అది ఒక కల్పం అవుతుంది. కానీ,
మహాభారతంలో నాలుగు యుగాల ఒక్క ఆవర్తా నికే కల్పమని పేరు (12.291.14). పురాణాలు
రామాయణ, మహాభారతాది ఇతిహాసాల తరువాతి కాలంలో వెలువడిన కావ్యాలు.
అష్టా దశపురాణాలు సుమారు క్రీస్తు శకం 4 వ శతాబ్ది నుండి 12/15 వ శతాబ్ద ం వరకూ
రాయబడ్డ వని పండితుల ఊహ. గుప్తు ల కాలంలోనూ, ఆ తరువాతి కాలంలోనూ రాయబడ్డ
పురాణాల్లో నే మనకు యుగసిద్ధా ంతము, కల్ప, మహాకల్ప కాలమానాల విభజన మొదలైన
అంశాలను విపులంగా చర్చించారు. విష్ణు పురాణం మొదటి విభాగంలోని మూడవ
అధ్యాయంలో ఈ యుగసిద్ధా ంతపు వివరాలు కనిపిస్తా యి. అలాగే, 4 వ శతాబ్ది కి చెందిందిగా
భావించబడే సూర్య సిద్ధా ంతంలో వివరించిన స్పష్ట మైన కాలవిభజన ఆతరువాతి కాలాలలో
ప్రా మాణిక భారతీయ కాలమానంగా స్థిరపడిపో యింది.

ఈ ఆధారాలను బట్టి యుగసిద్ధా ంతం వైదిక వాఙ్మయంలో ఛాయామాత్రంగానైనా కనిపించదనీ,


ఆపై మహాభారత రచనలో కనిపించినా, అది కథాంశంలో అంతగా ప్రధానమైనది కాదని మనం
కచ్చితంగా చెప్పవచ్చు. తరువాతి రోజుల్లో మహాభారతానికి చేర్చిన ప్రక్షిప్తా ల ద్వారా కురుక్షేత్ర
యుద్ధా నికి కలియుగ ఆరంభానికి లంకె పెట్టే ప్రయత్నం జరిగిందని కూడా మనం చెప్పవచ్చు.
ఈ అంశంపై మరిన్ని వివరాలకు Luis González –Reimann రాసిన పరిశోధనా
పత్రం చదవండి.

సూక్ష్మ కాల విభజన

భారతీయ కాలమానంలో మనకు ఎక్కువగా కనిపించే సూక్ష్మ కాల పరిమాణం నిమేషము.


నిమేషము అంటే రెప్పపాటు కాలం. అయితే, నిమేషము అంటే రెప్పపాటు అన్న అర్థం
ఋగ్వేదకాలం నాటినుండి ఉన్నా, ఆ పదాన్ని ఋగ్వేదంలో కాలపరిమాణానికి వాడిన
గుర్తు లు కనిపించవు. ఋగ్వేదంలో రెప్పపాటు లేనివారు, దేవతలు అన్న అర్థా లలో
‘అనిమిష’, ‘అనిమేష’ అన్న ప్రయోగాలు మాత్రమే మనకు కనిపిస్తా యి.

ఉపనిషత్తు ల కాలంలో మాత్రం కలా, ముహూర్త , కాష్ఠ అన్న సూక్ష్మ కాలవిభజనలు


కనిపిస్తా యి. ఉదాహరణకు మాండుక్యోపనిషత్తు లోని ఈ శ్లో కం చూడండి:

కలా ముహూర్తా ః కాష్ఠా శ్చ అహో రాత్రా శ్చ సర్వశః


అర్ధమాసా మాసా ఋతవస్ సంవత్సరశ్చ కల్పంతాం (మాండుక్యోపనిషత్తు ఈ. 2.3-4)

కలా, ముహూర్త , కాష్ఠ , అహో రాత్రా లు అన్నీ కలిసి అర్ధమాస, మాస, ఋతు, సంవత్సరాలుగా
అయి ఉన్నవి.

క్రీస్తు పూర్వం 6 వ శతాబ్దా నికి చెందిందిగా చెప్పుకునే శతపథబ్రా హ్మణంలో మాత్రం


విభిన్నమైన సూక్ష్మకాల విభజన కనిపిస్తు ంది (శతపథ బ్రా . 12.3.2.5). ఆ విభజన ప్రకారం:

1 ముహూర్త ం = 15 క్షిప్రలు
1 క్షిప్ర = 15 ఏతర్హీలు
1 ఏతర్హి = 15 ఇదానీలు
1 ఇదాని = 15 ప్రా ణాలు
1 ప్రా ణ = 1 నిమేషము (రెప్పపాటు)
అయితే, ఈ విభజన అంతగా ప్రా చుర్యం చెందినట్టు గా కనిపించదు. తరువాతి సాహిత్యంలో
మాండుక్యోపనిషత్తు లో వాడిన కలా, ముహూర్త , కాష్ఠ శబ్దా లే కాని, శతపథబ్రా హ్మణంలో
వాడిన క్షిప్రలు, ఏతర్హీలు, ఇదానీలు కనిపించవు.

సూక్ష్మ కాల పరిమాణాల గురించి విపులంగా వివరించే మహాభారతం లోని శాంతిపర్వంలో


కనిపించే ఈ శ్లో కాలు చూడండి:

కాష్ఠా నిమేషా దశ పంచ చైవ


త్రింశత్తు కాష్ఠా గణయేత్కలాం తాం
త్రింశత్కలాశ్చాపి భవేన్ముహూర్తో
భాగః కలాయా దశమశ్చ యః స్యాత్
త్రింశన్ముహూర్త శ్చ భవేదహశ్చ
రాత్రిశ్చ సంఖ్యా మునిభిః ప్రణీతా
మాసః స్మృతో రాత్ర్యహనీ చ త్రింశ
త్సంవత్సరో ద్వాదశమాస ఉక్త ః
(మహాభారతం శాంతిపర్వం 12.224.12-16)

పై శ్లో కాల ప్రకారం:

1 నిమేషము = రెప్పపాటు కాలం


15 నిమేషములు = 1 కాష్ఠ ం
30 కాష్ఠ ములు = 1 కళ
30 కళలు = 1 ముహుర్త ం
30 ముహుర్తా లు = 1 దివారాత్రి (ఒక రోజు)
30 దివారాత్రు లు = 1 మాసం
12 మాసాలు = 1 సంవత్సరం
మను ధర్మశాస్త ం్ర లో, అర్థశాస్త ం్ర లో కూడా సుమారు ఇదే విభజన ఉంటుంది, కానీ వాటిలో 18
నిమేషాలు ఒక కాష్ఠ ం అవుతాయి. ఈ కాలంలో దాదాపు అన్ని కావ్యాలలో ఒకరోజును 30
భాగాలుగా విభజించడం కనిపిస్తు ంది.

క్రీస్తు శకం నాలుగవ శతాబ్దా నికి చెందినదిగా భావించే సూర్య సిద్ధా ంతంలో మూర్త , అమూర్త అని
రెండు రకాల కాలమానాలు కనిపిస్తా యి. మూర్త కాలమానంలో ‘ప్రా ణ’ (breathing period)
అతి చిన్నదైన ప్రమాణం. దానిననుసరించి మిగిలిన కాల విభాగాలు ఇలా ఉంటాయి:

6 ప్రా ణ కాలాలు = 1 విఘడియ/వినాడి (24 సెకండ్లు )


60 విఘడియలు/ వినాడి = 1 ఘడియ/నాడి (24 నిమిషాలు)
60 ఘడియలు/నాడి = 1 అహో రాత్రము (24 గంటలు) = 1 రోజు

ఒక ‘ప్రా ణం’ అంటే పది గురు (దీర్ఘ) అక్షరాలను పలికే సమయం అన్న నిర్వచనం కూడా ఈ
పుస్త కంలో కనిపిస్తు ంది.

అమూర్త కాలమానంలో ‘త్రు టి’ అతి సూక్షమైన కాలపరిణామం అని మాత్రమే సూర్యసిద్ధా ంత
గ్రంథం చెబుతుంది. ఈ గ్రంథంలో ఇంతకుమించి అమూర్త కాలమానం గురించి ఏ వివరాలు
కనిపించవు. అయితే, 12 వ శతాబ్దా నికి చెందిన భాస్కరుడు రాసిన సిద్ధా ంత శిరోమణి అన్న
గ్రంథంలో అమూర్త కాలమానానికి వివరణ ఇస్తూ ఈ రకమైన కాలవిభజన చూపిస్తా డు:

100 త్రు టి = 1 తత్పర


30 తత్పర = 1 నిమేష
18 నిమేషాలు = 1 కాష్ఠ
30 కాష్ఠా లు = 1 కలా
30 కలలు = 1 ఘటిక
2 ఘటికలు = 1 క్షణ
30 క్షణాలు = 1 అహో రాత్రము
అంటే రోజులో 2916000000 వవంతు త్రు టి. అలాగే, ఆధునిక లెక్కల ప్రకారం త్రు టి సెకండులో
33750 వవంతు.

అయితే, భాస్కరుని 12 వ శతాబ్ద ం దాకా ఈ రకమైన విభజన లేదని మనం అనుకోవడానికి


వీలులేదు. 4 వ శతాబ్ద ం తరువాత వచ్చిన భాగవత పురాణం లోనూ, విష్ణు పురాణం లోనూ ఈ
విధమైన సూక్ష్మ కాలచర్చ కనిపిస్తు ంది. ఉదాహరణకు, భాగవత పురాణంలో విపులంగా
వివరించిన ఈ విభజన చూడండి:

అణుర్ ద్వౌ పరమాణూ స్యాత్ త్రసరేణుస్ త్రయః స్మృతః


జాలార్కరశ్మ్యవగతః ఖం ఏవానుపతన్నగాత్ (3.11.5)

రెండు పరమాణువులు ఒక అణువుగా, మూడు అణువులు ఒక త్రసరేణువుగా భావిస్తా రు. ఈ


త్రసరేణు కిటికీ గుండా ప్రసరించే సూర్యరష్మిలో ఆకాశం (ఖం) వైపు పైకి పయనిస్తూ మనం
గమనించవచ్చు.

త్రసరేణు-త్రికం భుంక్తే యః కాలః స త్రు టిః స్మృతః


శత-భాగస్తు వేధః స్యాత్ తైస్ త్రిభిస్ తు లవః స్మృతః (3.11.6)

మూడు త్రసరేణువుల కలయికకు (భుంక్త ) పట్టే కాలాన్ని త్రు టి అంటారు. ఒక వంద


త్రు టులను వేధ అని, మూడు వేధాలను లవమని అంటారు.

నిమేషస్ త్రిలవో జ్ఞేయ ఆమ్నాతస్తే త్రయః క్షణః


క్షణాన్ పంచ విదుః కాష్ఠా ం లఘు తా దశ పంచ చ (3.11.7)

మూడు లవముల కాలాన్ని ఒక నిమేషము అంటారు. మూడు నిమేషాలు ఒక క్షణమని,


అయిదు క్షణాలు ఒక కాష్ఠ మని పదిహేను కాష్ఠా లు ఒక లఘువని తెలుసుకోవచ్చు.
లఘూని వై సమామ్నాతా దశ పంచ చ నాడికా
తే ద్వే ముహూర్త ః ప్రహరః షడ్ యామః సప్త వా నృణాం (3.11.8)

పదిహేను లఘువులు ఒక నాడిక. రెండు నాడికలు ఒక ముహూర్త ము. ఆరు లేక ఏడు
నాడికలు ఒక ప్రహార (లేదా ఒక యామము/జాము)గా నరులు పరిగణిస్తా రు.

యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానాం అహనీ ఉభే


పక్షః పంచ-దశాహాని శుక్ల ః కృష్ణ శ్చ మానద

నాలుగుజాములు పగలు, నాలుగు జాముల రాత్రి కలసి ఒక మనుష్యుల


అహో రాత్రమౌతుంది. పదిహేను రోజులు శుక్ల పక్షంగా, పదిహేను రోజులు కృష్ణ పక్షంగా
పరిగణిస్తా రు.

తయోః సముచ్చయో మాసః పితౄణాం తద్ అహర్-నిశం


ద్వౌ తావ్ ఋతుః షడ్ అయనం దక్షిణం చ ఉత్త రం దివి

ఒక శుక్ల పక్షము, ఒక కృష్ణ పక్షము కలసి మాసం అవుతుంది. అది పితృ దేవతల కాలమానం
ప్రకారం ఒక పగలు, ఒక రాత్రి. అటువంటి రెండు మాసాలు ఒక ఋతువవుతుంది. ఆరు
ఋతువులు కలిస్తే ఒక దక్షిణాయనం, ఒక ఉత్త రాయణం.

అయనే చాహనీ ప్రా హుర్ వత్సరో ద్వాదశ స్మృతః


సంవత్సర-శతం నౄణాం పరమాయుర్ నిరూపితం

రెండు అయనాలను కలిపి వత్సరమంటారు. ఇది ద్వాదశ పితృ దినాలు అంటే ద్వాదశ
మాసాలకు సమానం. శతసంవత్సరాలు నరుల జీవితకాలమని నిర్ధా రించారు.
దాదాపు ఇదే విధమైన కాలమానం విష్ణు పురాణంలోనూ, జ్యోతిషశాస్త ం్ర లోనూ కనిపిస్తు ంది.
జ్యోతిష శాస్త్రా న్ని వేదాంగంగా భావించినా దాని రచనాకాలం దాదాపు క్రీస్తు శక ఆరంభమని
పండితుల భావన.

ఋగ్వేదం – కాంతి వేగం

మరి అయితే కాంతివేగం మాటేమిటి? దాని విలువను ఋగ్వేదంలో కచ్చితంగా లెక్కించారని


వికీపీడియా ఘోషిస్తో ంది కదా?

వికీపీడియాలో ఎంతో ఉపయోగపడే విలువైన సమాచారం ఉన్నా, అంతే నిరుపయోగమైన


దుష్ప్రాపగాండా కూడా ఉంది. వికీపీడియాలో పండిత పామర భేదం లేకుండా ఏ వ్యాసాన్ని
ఎవరైనా మార్చవచ్చు; ఏ వ్యాసానికి ఏ రకమైన సమాచారానైనా జతచేయవచ్చు.
వినోదప్రా యంగా కొంతమంది వికీపీడియాలో తమకు తోచిన అశాస్త్రీయమైన సమాచారం
జతచేస్తే, తమ వర్గ ం/జాతి ఆధిపత్యాన్ని ప్రచారం చెయ్యడానికి మరికొంతమంది పనిగట్టు కొని
వికీపీడియాను సాధనంగా వాడుకొంటున్నారు. కాబట్టి వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని ఆ
విషయంపై స్థూ లంగా తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించి, లోతైన అవగాహనకు ప్రసిద్ధి
చెందిన పండితుల/ప్రచురణకర్త ల పుస్త కాలను సంప్రదించడం ఎంతైనా శ్రేయస్కరం.

ఇక ఋగ్వేదంలో కాంతివేగాన్ని గురించి తరచుగా ఉటంకించే శ్లో కం ఇది:

తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్కృదసి సూర్య।


విశ్వమా భాసి రోచనం ॥ ఋగ్వేదం 1.050.04

దానికి సాయణాచార్యుడు రాసిన భాష్యం ఇది:

తథా చ స్మర్యతే యోజనానాం సహస్త ం్ర ద్వే ద్వే శతే ద్వే చ యోజనే ఏకేన నిమిషార్ధేన
క్రమమాణ నమోఽస్తు తే॥
ఋగ్వేద శ్లో కానికి అర్థం: ఎంతో వేగంగా పయనిస్తూ అందమైన వెలుగును సృష్టించేవాడా!
విశ్వమంతటా వెలుగును పంచేవాడా! ఓ సూర్యుడా!

సాయణుడు రాసిన భాష్యానికి అర్థం: నిమిషార్ధ సమయయంలో 2,202 యోజనాలు ప్రయాణం


చేసే సూర్యునికి నమస్సులు!

నిజానికి ఋగ్వేదశ్లో కంలో కాంతివేగం గురించి గానీ, దాన్ని విలువకట్టే ప్రయత్నం కానీ
కనిపించదు. అయితే 14 వ శతాబ్ది కి చెందిన సాయణుడు రాసిన భాష్యంలో మాత్రం సూర్యుని
వేగానికి ఒక విలువ ఆపాదించే ప్రయత్నం కనిపిస్తు ంది. ఆయన భాష్యం ప్రకారం సగం
నిమిషంలో 2,202 యోజనాలు సూర్యుడు ప్రయాణం చేస్తా డని చెబుతున్నాడు. నిజానికి
ఇక్కడ ఆయన కాంతి వేగం గురించి చెప్పలేదు. సూర్యకాంతి వేగం అనికూడా చెప్పలేదు;
సూర్యుని వేగం అని మాత్రమే ప్రస్తా వించాడు. కానీ, ఆయన సూర్యుని వేగం అన్నప్పుడు అది
సూర్యకాంతి వేగం అయ్యే అవకాశం ఉందని మనం భావించవచ్చు.

అయితే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు నిమేషమన్న కాలమానానికి, యోజనమన్న


దూరానికి కచ్చితమైన విలువలు లేవు. యోజనం 9.6 కిలోమీటర్ల నుండి 14.4 కిలోమీటర్ల
వరకూ ఉండవచ్చు. నిమేషము వివిధ గ్రంథాలను బట్టి 0.213 సెకండ్లు , 0.457 సెకండ్లు , 0.533
సెకండ్లు గానో లెక్క కట్ట వచ్చు. ఈ విభిన్నమైన విలువలను బట్టి మనం సూర్యుని వేగం
సెకండుకు 118 మిలియన్ల మీటర్లు గానో, 138 మిలియన్లు , 297 మిలియన్ల మీటర్లు గా
నిరూపించవచ్చు. ఈ విలువ లెక్కగట్ట డానికి సాయణుడు కానీ, అతని పూర్వులు గాని
అవలంభించిన విధానమేమిటో బొ త్తి గా బో ధపడదు. అదీగాక ఒకవేళ సాయణుడు
కాంతివేగపు విలువను నేటి ఆధునిక శాస్త వ
్ర ేత్తలు లెక్కగట్టిన 299.792 మిలియన్ల వేగానికి
దగ్గ రిగానే లెక్క కట్టినాడని నమ్మినా అది 600 సంవత్సరాల లెక్కే అవుతుంది గానీ,
ఋగ్వేదపు లెక్క కాదు కదా!

అన్నమయ్య “కంటి శుక్రవారము ఘడియలేడింట” అన్న పాటలో ‘ఘడియలేడింట’


అన్నప్పుడు ఏ సమయాన్ని సూచిస్తు న్నాడు?
అలాగే,

పాడేము నేము పరమాత్మ నిన్నును


వేడుక ముప్పదిరెండువేళల రాగాలను

అన్నప్పుడు ఆయన చెబుతున్న ‘ముప్పదిరెండు వేళల రాగాలు’ ఏమిటి? ఈ ప్రశ్నలకు


తెలిసీ సమాధానం చెప్పకపో యారో …

1. అధిక మాసం ఎలా కనుక్కుంటారో చెప్పగలరా?

2. 5

సురేశ్ కొలిచాల on May 8, 2013 at 9:38 am 

@mohan గారు: భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365+ రోజుల కాలం పడుతుంది.
చంద్రు డు భూమి చుట్టూ తిరగడానికి దాదాపు 29.5 రోజులు పడుతుంది. 12 చాంద్రమాసాలు
354+ రోజులకు పూర్తి అవుతాయి. అంటే సౌర చంద్ర మానాలకు దాదాపు 11 రోజుల తేడా
ఉంది. రెండున్నర సంవత్సరాలలో ఈ తేడా దాదాపు ఒక చాంద్రమాసపు నిడివి
చేరుకుంటుంది. కాబట్టి ఈ తేడా పరిహరించడానికి దాదాపు ప్రతి రెండు సంవత్సరాల ఎనిమిది
నెలలకు ఒక మాసాన్ని అధికమాసంగా జత చేస్తా రు. ఆ సంవత్సరంలో పదమూడు నెలలు
ఉంటాయి. ఉదాహరణకు 2012 లో నందన నామ సంవత్సరంలో భాద్రపద మాసం రెండు
సార్లు వచ్చింది. ఆ సంవత్సరంలో మాసాలు వరుసగా చైతం్ర , వైశాఖం, జ్యేష్ట ం, ఆషాఢం,
శ్రా వణం, (అధిక) భాద్రపదం, (నిజ) భాద్రపదం, ఆశ్వయుజం… ఇలా అన్నమాట.
సూర్య గమనాన్ని, చంద్ర గమనాన్ని శాస్త ్ర పరంగా గమనించి, అధికమాస నిర్ణయానికి చాలా
సులభతరమైన మార్గా న్ని సూర్యసిద్ధా ంతంలో సూచించారు. ఆ పద్ధ తిని స్థూ లంగా వివరిస్తా ను:

సూర్యుడి 365+ రోజుల సంవత్సరపు కాలగమనాన్ని 12 రాశులుగా విభజించవచ్చు. ప్రతి నెల


14-16 వ తేదీల సమయంలో సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి సంక్రమణం చేస్తా డు.
దీనిని మాససంక్రా ంతి అంటారు. (సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు మనం మకర
సంక్రా ంతిని పండగగా జరుపుకుంటాం కదా!) ఈ సౌరమాసంతో సంబంధం లేకుండా 29 న్నర
రోజుల చాంద్రమాసమేమో అమావాస్య నుండి అమావాస్య దాకా సాగుతుంది. అంటే తరచుగా
చంద్రమాసం ఒక సౌరమాసంలో ప్రా రంభమై మరో సౌరమాసంలో అంతమౌతుంది.
ఉదాహరణకు ప్రస్తు తం నడుస్తు న్న చైత్ర మాసం ఏప్రిల్ 11 న ప్రా రంభమై (ఏప్రిల్ 10
అమవాస్య), మే 10 వ తేది అమావాస్యతో ముగుస్తు ంది. అయితే, సూర్యుడు ఏప్రిల్ 14 న
మేషరాశిలో ప్రవేశించాడు. మే 14 న వృషభ రాశిలోకి ప్రవేశిస్తా డు.

అయితే, ఏ కాలంలోనైనా 29 న్నర రోజుల చాంద్రమాసం ఒకే సౌరమాసంలో (అంటే సూర్యుడు


ఒకే రాశిలో ఉన్నప్పుడు) ప్రా రంభమై, అదే సౌరమాసంలో పూర్తి అవుతుందో ఆ మాసాన్ని
అధికమాసంగా పరిగణిస్తా రు. ఉదాహరణకు 2012 లో సూర్యుడు ఆగష్టు 17 న ఉదయం
8:05 కు సింహరాశిలో ప్రవేశించి సెప్టెంబర్ 17 ఉదయం 8:23 వరకూ ఉన్నాడు. అదే
సమయంలో ఆగష్టు 18 న చంద్రు ని భాద్రపద మాసం ప్రా రంభమై, సెప్టెంబర్ 16 ఉదయం 8:05
గంటలకు అమావాస్యతో పూర్త వుతుంది, కాబట్టి ఆ భాద్రపదమాసం అధిక భాద్రపదం.

2012 లో భాద్రపద మాసంతో పాటు, 2010 వికృతి నామ సంవత్సరంలో వైశాఖ మాసం
అధికమాసం. మళ్ళీ ఇంకో అధికమాసం 2015 లో మన్మథ నామ సంవత్సరంలో – అధిక
ఆషాడ మాసంగా రాబో తుంది.

ఇదే కాకుండా ప్రతి 141 సంవత్సరాలకు, ఆపై 19 సంవత్సరాలకు ఒక నెల తక్కువగా


సంవత్సరంలో పదకొండు నెలలుగా లెక్కిస్తా రు. తక్కువగా లెక్కించిన మాసాన్ని క్షయమాసం
అంటారు. ఉదాహరణకు 1964 లో పుష్య మాసం క్షయమాసం, 1983 లో మాఘ మాసం
క్షయమాసం. మళ్ళీ మరో క్షయ మాసం మన జీవితకాలంలో మనం చూడలేము — వచ్చే
క్షయమాసం 141 ఏళ్ళ తరువాత 2124 సంవత్సరంలో వస్తు ంది.

You might also like