You are on page 1of 8

తాళం

విజ్ఞా న సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016)
Learn more

తాళం అనేది పాటకు సక్రమమైన చక్రం లాంటిది. ఇది పాటకు వాయిద్య రూపంలో అందే సహకారం. అఖండమైన
కాలాన్ని, ఖండాలుగా చేసి హెచ్చు తగ్గు లు లేకుండా నికరంగా జోడించి, శ్రో తలను తన్మయుల్ని చేయించగలిగేది
తాళము. రాగము, తాళము మన కర్ణా టక సంగీతం యొక్క ప్రా ణములు, ఐరోపా సంగీతములో మన
సంగీతములో కల పలువిధములైన తాళములు ఉన్నాయి.
భారతీయ సంగీతం
వ్యాసముల క్రమము

సాంప్రదాయక సంగీతం

కర్ణా టక సంగీతము  · హిందుస్థా నీ సంగీతము

భారత ఫోక్ సంగీతం  · తుమ్రి · దాద్రా  · గజల్ · ఖవ్వాలీ

చైతీ · కజ్రీ · సూఫీ

ఆధునిక సంగీతము

భాంగ్రా  · చలన చిత్ర సంగీతము

పాప్ సంగీతం · రాక్ సంగీతం · బ్లూ స్ సంగీతం

 · జజ్ సంగీతం · ట్రా న్స్ సంగీతం

వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు

హిందుస్థా నీ సంగీత విద్వాంసులు

కర్ణా టక సంగీత విద్వాంసులు

గాయకులు
హిందుస్థా నీ సంగీత గాయకులు

హిందుస్థా నీ సంగీత గాయకులు

సంగీత వాద్యాలు

సంగీత వాద్యపరికరాల జాబితా

సంగీత వాయిద్యాలు

భావనలు

రాగము · తాళము · పల్లవి

తాళదశ ప్రా ణములు

షడంగములు · స్థా యి · స్వరము

గీతము · కృతి · వర్ణము


రాగమాలిక · పదము · జావళి · తిల్లా న

మేళకర్త రాగాలు · కటపయాది సంఖ్య

జానపదము

సంగీత ధ్వనులు

స్థా యి · తీవ్రత · నాదగుణము


ప్రతిధ్వని · అనునాదము

సహాయక కంపనము
గ్రా మఫోను · రేడియో

సంగీత పద నిఘంటువు

సంగీత పదాల పర్యాయ పదములు

భారతీయ సంగీతము

భారతీయ సాంప్రదాయ సంగీతము

కర్ణా టక సంగీతము

"తాళము" అనగా సంగీతమును కొలుచు కొలతబద్ద . ఒక వస్త్రమును అర్థ గజము, పావుగజము, రెండు, మూడు
గజములు మొదలైన కొలతలతో ఎట్లు మనం కొలబద్ద తో కులుచు చున్నామో, అట్లే సంగీత గానమును కూడా
చాలా విధములైన తాళములచే వాటివాటిని వేరువేరుగా కొలుచుచున్నాము. తాళములు ఏడు, ముప్పదిఐదు,
నూట ఎనిమిది రకములుగా వ్యవహరించుట గలదు. పూర్వీకులు ఎన్ని రకములైన తాళములు కనుగొన్ననూ
ప్రస్తు తం 35 రకాల తాళములు అందుబాటులో ఉన్నాయి.

సప్త తాళములు

సంగీత ప్రపంచమున కంతయు సప్తస్వరము లెట్లు వునాదియో అట్లే తాళ లోకమునకు సప్త తాళములు పునాది.
అవి ధ్రు వతాళము, మఠ్య తాళము, రూపక తాళము, ఝంపె తాళము, త్రిపుట తాళము, ఆట తాళము, ఏక
తాళము. ఈ తాళముల గూర్చి క్రింది శ్లో కములో చూడవచ్చు.

ధృవమఠ్యారూపకశ్చ ఝంపాత్రిపుట యేవచ

“ అటతాళే కతాళేచ సప్త తాళ ప్రకీర్తితః ”


ఈ సప్త తాళములు వారము యొక్క సప్త దినములలో పుట్టినట్లు ను సప్త నక్షత్రములలో సప్త రంగులు కలవి
యైనట్లు ను పూర్వీకులు వ్రా సిన శ్లో కముల వల్ల తెలియుచున్నవి. వీటి వివరణములు విస్తా రముగా
తెలుసుకుందాం.

షడంగములు

తాళమునకు ముఖ్యంగా ఆరు అంగములున్నవి. వాటికి షడంగములు అని పేరు.

1. లఘువు

2. దృతము

3. అనుదృతము

4. గురువు

5. ప్లు తము

6. కాకపాదము

ఈ ఆరు అంగములలో మొదటి అంగములో మొదటి మూడు అంగములు అయిన లఘువు, దృతము,
అనుదృతము అనునవి మాత్రము పై ఏడు తాళములలో ఉపయోగింపబడుచున్నవి.

దృతము యొక్కయు అనుదృతము యొక్కయు అక్షర కాల నిర్ణయము నిర్ణయింపబడింది. అక్షర కాలమనగా
ఒక్క హ్రస్వ అక్షరమును పలుకు కాలపరిమితి. దృతము రెండక్షరాల విలువ, అనుదృతము ఒక అక్షరము విలువ
కలవిగా నిర్ణయించబడినవి. దృతము పూర్ణ సున్నగాను (౦), అనుదృతము అర్థ చంద్రా కృతి గాను (‫)ں‬
సంకేతమున చూపబడుచున్నవి. తాలము వేయునపుడు దృతము, చేతితో ఒక దెబ్బయు, ఒక విసరుతోను,
అనుదృతము చేతితో ఒక్క దెబ్బ మాత్రముతోనూ చూపబడును. చేతివిసరునకు "విసర్జితము" అని పేరు.

లఘువును ఒక చిన్న నిలువు గీతతో సంకేతములో చూపబడును. లఘువులో రెండు భాగములున్నవి.

1. చేతితో ఒక దెబ్బ

2. వ్రేళ్ళను ఎంచుట

తాళమును వేయు పద్ధతి

కూర్చుని తాళమును వేయునపుడు కుడి తొడపై కుడి అరచేతితో తాళము వేయవలెను.

వ్రేళ్ళను ఎంచుట

చిటికెన వ్రేలితో మొదలుపెట్టి బొటన వ్రేలి వైపు ఒక్కొక్క వ్రేలుగా ఎంచవలెను. ఆరు ఏడు తొమ్మిది మొదలైన ఐదు
కంటే ఎక్కువ వ్రేళ్ళు ఎంచవలసినపుడు మరల చిటికెన వ్రేలుతో ప్రా రంభించి బొటన వ్రేలి వైపు ఎంచవలెను.

లఘువు యొక్క అక్షర విలువ, ఆయా లఘువు యొక్క జాతులపై ఆధారపడును. లఘువు అను అంగమునకు
ఐదు జాతులున్నవి. హిందూ అన్న పదములో బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను ఎట్లు నాలుగు జాతులున్నవో అట్లే
లఘువునలు త్రిశ్ర, చతురశ్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ అను ఐదు జాతులున్నవి. కనుక పై జాతులు కల లఘువులు త్రిశ్ర
లఘువు, చరురశ్ర లఘువు, ఖండ లఘువు, మిశ్రలఘువు, సంకీర్ణ లఘువు అని పిలువబడుచున్నవి. త్రిశ్ర అనగా
మూడు కనుక త్రిశ్ర లఘువు అనగా ఆ లఘువునకు 3 అక్షరముల విలువయని అర్థము. ఈ ఐదు జాయుల
లఘువులను సంకేతము వ్రా యునపుడు.

త్రిశ్ర లఘువు I 3 గాను

చతురశ్ర లఘువు I 4 గాను

ఖండ లఘువు I 5 గాను

మిశ్ర లఘువు I 7 గాను

సంకీర్ణ లఘువు I 9 గాను

వాటి వాటి అక్షర కాల విలువ లఘువు సంకేతమైన చిన్న నిలువు గీత భాగమున చిన్న అంకెలుగా వ్రా యవలెను.
పథకము
లఘువు యొక్క జాతి సంకేతము అక్షర విలువ ఎంచవలసిన పద్ధ తి

త్రిశ్ర లఘువు I3 3 అక్షరములు 1 దెబ్బ + 2 వ్రేళ్ళను ఎంచుట

చతురశ్ర లఘువు I4 4 అక్షరములు 1 దెబ్బ + 3 వ్రేళ్ళను ఎంచుట

ఖండ లఘువు I5 5 అక్షరములు 1 దెబ్బ + 4 వ్రేళ్లను ఎంచుట

మిశ్ర లఘువు I7 7 అక్షరములు 1 దెబ్బ + 6 వ్రేళ్ళను ఎంచుట

సంకీర్ణ లఘువు I9 9 అక్షరములు 1 దెబ్బ + 8 వ్రేళ్ళను ఎంచుట

లఘువుపై ఏడు తాళములలో ముఖ్యమైన అంగము. దృతము ఏక తాలములో లేదు. అనుదృతము ఝ్ంపె
తాళములో తప్ప మరి యే తాళము లోనూ లేదు. లఘువు మాత్రము ప్రతి తాలములోను ఉండి తీరవలసిన
అంగము. మిగిలిన మూడు అంగములు అనగా గురువు, ప్లు తము, కాక పాదములు 108 తాలములలో
కాననగును. 108 తాళములు కొన్ని నాట్యములకు ఉపయోగింపబడుచున్నవి. అరుణగిరి నాథర్ అను ఆరవ
వాగ్గేయ కారుడు తన భక్తి గీతములగు తిరుప్పగళ్ అను వాటిని ఈ 108 తాళములతో కూర్చి యున్నాదు. పై
చెప్పిన సప్త తాలములు మాత్రము లఘువు, దృతము, అనుదృతములతోనే తృప్తిపడినవి.

రకాలు

ధ్రు వ తాళం: చతురస్రం - 4+2+4+4 = 14

మఠ్య తాళం: చతురస్రం - 4+2+4 = 10

రూపక తాళం: చతురస్రం - 3+4 = 6

ఏక తాళం: చతురస్రం - 4

త్రిపుట తాళం: త్రిశం - 3+2+2 = 7

ఝంపె తాళం: మిశ్ర జాతి - 7+1+2 = 10

ఆట తాళం: ఖండ జాతి - 5+5+2+2 = 14

పంచత్రింశతి సంగీత తాళములు

1. ధ్రు వ

2. మధ్య

3. రూపక

4. ఝంప
5. త్రిపుట

6. ఆట

7. ఏక

8. మణి

9. సార

10. చక్ర

11. కదంబ

12. శంఖ

13. గుప్త

14. సుధ

15. ప్రమాణ

16. ఉదయ

17. రాజ

18. చణ

19. దుష్కర

20. విదశ

21. రత

22. పూర్ణ

23. ఉదీర్ణ

24. కుల

25. సుర

26. లీల

27. లోయ

28. రాగ

29. బువన

30. రావ
31. బిందు

32. కర

33. భోగ

34. ధీర

35. వసు

విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో తాళంచూడండి.

"https://te.wikipedia.org/w/index.php?
title=తాళం&oldid=2985799" నుండి వెలికితీశారు


Last edited 1 year ago by Arjunaraocbot

వికీపీడియా

అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 3.0 క్రింద


లభ్యం

You might also like