You are on page 1of 13

చంద్రు డు జ్యోతిషం

ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రా సారో తెలపలేదు.
Learn more

చంద్రు డు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు.


చంద్రు డు స్త్రీ గ్రహం, వైశ్య జాతి, శ్వేత వర్ణం,
పరిమాణం పొట్టి , వయస్సు డెబ్బై సంవత్సరాలను
సూచించును. దిక్కు వాయవ్యం, తత్వం జల తత్వం,
ప్రకృతి వాత, శ్లేష్మములు. ఋతువులలో వర్ష
ఋతువును, లోహములలో వెండిని, రత్నములలో
ముత్యమును సూచించును. చంద్రు డు చతుర్ధ
భావంలో దిక్బలం కలిగి ఉంటాడు. గ్రహములలో
చంద్రు డు ఏడవ వాడు. సత్వగుణ సంపన్నుడైన
చంద్రు డు కృష్ణ పక్ష దశమి నుండి శుక్ల పక్ష పంచమి
వరకు పూర్ణ చంద్రు డు. శుక్ల పంచమి నుండి
అమావాస్య వరకు క్షీణ చంద్రు డు, అమావాస్య
నుండి కృష్ణ పక్ష దశమి వరకు మధ్యమ చంద్రు డు
అని శాస్త్రం చెప్తుంది. చంద్రు డు రోహిణి, హస్త, శ్రా వణ
నక్షత్రా లకు అధిపతి. శరీరావయవములలో మగవారి
ఎడమ కన్ను, స్త్రీల కుడి కన్ను శరీర మధ్య
భాగమును సూచించును. చంద్రు డు కర్కాటక రాశికి
ఆధిపత్యం వహిస్తా డు. చంద్రు డు వృషభంలో
మూడు డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిలో ఉంటాడు.
వృషభంలో మూడు నుండి ఇరవై ఏడు డిగ్రీల వరకు
మూల త్రికోణంలో ఉంటాడు. వృశ్చికంలో మూడు
డిగ్రీల వరకు పరమ నీచ స్థితిలో ఉంటాడు. బుధుడు,
సూర్యుడు మిత్రు లు. చంద్రు డికి శత్రు వులు లేరు.
చంద్రు డు

చంద్రకళలకు కారణం ఏమిటి? చాలా మందికి ఈ


విషయంలో గందరగోళం ఉంది. సూర్యుని కాంతి
చంద్రు ని ఉపరితలం (lunar surface) మీద పడడం
వల్లే వెన్నెల వస్తుందని, వెన్నెల ద్వారానే చంద్రు డు
కనిపిస్తా డని అందరూ ఏకీభవిస్తా రు. అంతవరకు
కరెక్టే. కానీ చంద్రు నిపై పడే కాంతిని సరిగా
పడనీయకుండా భూమి అడ్డు రావడం వల్లే
చంద్రకళలు ఏర్పడతాయని కొందరి భావం. ఇది
పూర్తిగా తప్పు. అలా జరిగితే ఆ స్థితిని
చంద్రగ్రహణం (Lunar eclipse) అంటారు గాని
చంద్రకళలు అనరు.

మరి కొందరు మరో భావం చంద్రు డు తన చుట్టూ


తాను తిరుగుతున్న క్రమంలో వివిధ ప్రాంతాల్లో
వివిధ తీవ్రతల్లో (intensity), వివిధ వైశాల్యాలలో
సౌరకాంతి పడడం వల్ల చందకళలు
వస్తా యనుకుంటారు. ఇదికూడా తప్పు. మరో వాదన
కూడా ఉంది. చంద్రు డు తను చుట్టూ తాను ఒకేసారి
నెలలో తిరుగుతాడు కాబట్టి చంద్రు డి ఒక సగభాగం
మీదే సౌరకాంతి పడుతుందని మన భూమి కూడా
సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఆ వెలుగే
చంద్రభాగాన్ని వివిధ కోణాల్లో చూస్తాం కాబట్టి
చంద్రకళలు వస్తా యనుకుంటారు. ఇది కూడా తప్పే.
అసలు విషయం ఏమిటంటే చంద్రు డు నెలకు ఒ
మారు భూమి చుట్టూ తిరగడం, తన చుట్టూ తాను
తిరగడం చేస్తా డు. కాబట్టి చంద్రు ని ఒ అర్థభాగమే
దాదాపు లక్షలాది సంవత్సరాలుగా భూమివైపు
ఉంటోంది. భూమి చంద్రు ని సాపేక్షస్థితిలో సూర్యుని
పరంగా వివిద భంగిమల్లో ఉండడం వల్ల సౌరకాంతి
చంద్రు ని ఒ అర్థభాగం మీద పడినా మన వైపున్న
అర్థభాగంలో అమావాస్య తర్వాత పెరిగే
క్రమంలోనూ, పౌర్ణమి తర్వాత క్రమంలోనూ
కమబడుతుంది. మిగిలిన భాగం మనకు కనిపించని
భాగంలో ఉంది.

చంద్రు ని ప్రభావం
చంద్ర ప్రభావిత వ్యక్తు లు శ్లేష్మమ వ్యాధి పీడితులుగా
ఉంటారు. వీరు కొంత సమయం ఉత్సాహంతోనూ
మరి కొంత సమయం నిరుత్సాహంగానూ ఉంటారు.
కొంత కాలం ధైర్యము మరి కొంత కాలం భయం కలిగి
ఉంటారు. కొంత కాలం ధనవంతులుగా మరి
కొంతకాలం ధనహీనులుగా ఉంటారు. స్థూ లంగా
మానసిక స్థితి, సందలు అస్థిరంగా ఉంటాయి.
అభిప్రా యాలూ తరచూమార్చుకుంటారు.
మిత్రు లనూ తరచూ మార్చుకుంటారు. భోజన
ప్రియులుగా ఉంటారు. ఆ కారణంగా యుక్త వయసు
దాటే సమయానికి పొట్ట పెద్దది అయ్యే అవకాశం
ఎక్కువ. స్వతంత్రించి ఏకార్యం చెయ్య లేరు. నీటి
పారుదల, జల విద్యుత్, ప్రజా ప్రా తినిధ్యం,
బియ్యము, వస్త్రములకు సంబంధించిన వృత్తు లలో
రాణిస్తా రు. పాండు రోగం, క్షయ, మధుమేహం,
శ్వాశకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.
చంద్రు ని కారకత్వాలు
చంద్రు డు తల్లికి, జలరాంతాలు, జలం, పూలు,
సముద్రం, నదులు, ముఖము, ఉదరం, మహిళా
సంఘాలకు, స్త్రీ సంక్షేమ సంఘాలకు చందుడు
కాకత్వం వహిస్తా డు. వృత్తి సంబంధంగా నౌకా
వ్యాపారం, ఓడ రేవులు, వంతెనలు, ఆనకట్టలు,
చేపల పెంపకం, వెండి, మత్యములకు కారకత్వం
వహిస్తా డు. వ్యాధులలో రక్త హీనత, అతి మూత్రం,
గర్భ సంబంధిత వ్యాధులు, వరబీజము, బేదులు,
మానసిక వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు,
కేన్సర్ (రాచ పుండు) మొదలైన వాటికి కారకుడు,
ఆహార సంబంధంగా చెరకు, తేనె, పాలు, పెరుగు,
భోజనము, గోధుమలు, జొన్నలు, రొట్టెలు,
గోధుమలు, చేపలు, పంచదార, అరటి పండు, నెయ్యి,
దోసకాయలు, తమలపాకులు, గుమ్మడి, క్యాబేజి,
కర్బూజా ఫలం, కుక్కగొడుగులు, ఆవులు, గుడ్లు
తాబేలు, గుడ్లగూబ, బాతు, గబ్బిలం, పిల్లి , నీటి
గుర్రం, సొర చేపల వంటి ప్రా ణులకు కారకత్వం
వహిస్తా డు., తిమింగలం మొదలైన ప్రా ణులకు
కారకత్వం వహిస్తా డు. గుడ్లు , క్కర్పూరం, నికెల్,
జర్మన్ సిల్వర్ లాంటి వస్తు వులకు కారకత్వం
వహిస్తా డు. సంగీతం, నాటం, కవిత్వం లాంటి లలిత
కళలకు కారకత్వం వహిస్తా డు. మనస్తత్వ శాస్త్రం
పఠనం, వ్యవసాయం, విద్యా సంబంధిత వృత్తు లు,
జల వనరులవంటి వృత్తు లకు కారకత్వం వహిస్తా డు.
మూలికలు, స్త్రీలు, జీర్ణ వ్యవస్థ , జున్ను చంద్రు డు
కారకత్వం వహించే ఇతరాలు.

రూపురేఖలు
పురాణ కథనం అనుసరించి చంద్రు డు గౌరవర్ణం
కలిగిన వాడు. శ్వేత వస్త్ర ధారణ చేయువాడు. శ్వేత
వర్ణ ఆభరణములతో అలంకరించబడిన వాడు.
రెండు భుజములతో, శిరస్సున బంగారు కిరీటము
ధరించి మెడలో ముత్యాల మాలను ధరించి ఒక చేత
గద, ఒకచేత వరద ముద్రతో దర్శనం ఇస్తా డు.
దశాశ్వములను పూన్చిన రథమును అధిరోహించి
సంచరిస్తా డు.

చంద్రు డు రాశులు
చంద్రు డు కర్కాటకంలో స్వక్షేత్రంలోనూ వృషభంలో
మూడు డిగ్రీల వద్ద ఉచ్ఛ స్థితిలోనూ, వృశ్చికంలోని
మూడు డిగ్రీల వద్ద నీచస్థితిలోనూ ఉంటాడు.
చంద్రు డికి శత్రు వులు లేరు అలాగే శత్రు క్షేత్రం లేదు.
చంద్రు డికి మిధునం, కన్య, సింహములు మిత్ర
క్షేత్రములు. వృషభం త్రికోణ స్థా నం. శుక్ర, శనులు
సములు. కుంభం, మకరం, తులా రాశులు సమ
రాశులు.
ద్వాదశస్థా నములు, చంద్రు డు
లగ్నంలో చంద్రు డు ఉన్న జాతకుడు దృఢశరీరము
కలిగిన వాడు, చిరంజీవి, నిర్భయుడు,
ధనవంతుడు ఔతాడు. క్షీణచంద్రు డు ఉన్నప్పుడు
ఫలితాలు తారుమారుగా ఉంటాయి.
చంద్రు డు ద్వితీయంలో ఉన్న వాడు ధనవంతుడు,
విద్యావంతుడు, మృదుభాషి, అంగలోపం
కలవాడుగా ఉంటాడు.
తృతీయ స్థా నంలో చంద్రు డు కలిగి ఉన్న
జాతకుడు సోదరులు కలవాడు, బలవంతుడు,
శౌర్యవంతుడు, స్త్రీలను ఆకర్షించు వాడు ఔతాడు.
బహుకష్టములను పొందుతాడు.
చతుర్ధస్థా నమున ఉన్న జాతకుడు సుఖజీవి,
భోగముల యందు ఆసక్తు డు, మిత్రు లు కలవాడు,
వాహనములు కలవాడు, కీర్తివంతుడు ఔతాడు.
పంచమ స్థా నమున చంద్రు డు ఉన్న జాతకుడు
మేధాసంపద, సుపుత్రు లు కలవాడు, ఠీవి
కలవాడు, మంత్రిపదవి అలంకరించు వాడు
ఔతాడు.
షష్టమ స్థా నమున చంద్రు డు ఉన్న జాతకుడు
అల్పజీవి, అమాయకుడు, ఉదరశూల (కడుపు
నొప్పి) కలిగిన వాడు, దీనుడు ఔతాడు.
సప్తమ స్థా నమున చంద్రు డు ఉన్న జాతకుడు
సౌమ్యవంతుడు, అందమైన యువతుల
హృదయమున స్థా నము కలిగిన వాడు,
సుందరుడు అయి సుంర కళత్రము కలిగి
ఉంటాడు.
అష్టమ స్థా నమున చంద్రు డు కలిగిన జాతకుడు
రోగపీడితుడు, అల్పాయుష్మంతుడు ఔతాడు.
క్షీణ చంద్రు డు అయిన ఫలితములలో మార్పులు
ఉంటాయి.
నవమ భావమున చంద్రు డు ఉన్న జాతకుడు
అభివృద్ధి , పవిత్రు డు, పుత్ర సంతానం కలిగిన
వాడు, విజయము, కార్యం ఆరంభించగానే
శుభఫలితములను కలిగి ఉంటాడు.
వీశాలహృదయము సహాయగుణము కలిగి
ఉంటాడు.
దశమస్థా నమున చంద్రు డు ఉన్న జాతకుడు
ఔషధ సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిగిన
వాడు ఔతాడు.
ఏకాశ స్థా నమున చంద్రు డు ఉన్న జాతకుడు
విశాలహృదయం, చిరంజివి, ధనవంతుడు
ఔతాడు.
ద్వాదశ స్థా నమున చంద్రు డు ఉన్న జాతకుడు
ద్వేషము కలవాడు, దుఃఖములు, క్లేశం,
అవమానం, నిరుత్సాహం పొందుతూ ఉంటాడు.

మూలాలు
వెలుపలి లింకులు
"https://te.wikipedia.org/w/index.php?
title=చంద్రు డు_ జ్యోతిషం&oldid=3882608" నుండి
వెలికితీశారు

ఈ పేజీలో చివరి మార్పు 9 ఏప్రిల్ 2023న 15:07కు


జరిగింది. •
అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 3.0 క్రింద
లభ్యం

You might also like