You are on page 1of 3

*ఓం శ్రీ గురుభ్యో నమః - హరిః ఓం*

సూర్యభగవానుని ప్రార్థన శ్లోకము


యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః !
ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహమ్ !!

*గ్రహముల శత్రు మిత్ర సమత్వములు*


శ్లో॥
అర్క మందస్తధా వైరమ్ కుజ మందస్తధైవచ।
గురు భార్గవ యోర్వైరం వైరంతు బుధ సోమయో।

శ్లో॥
ఆదిత్య సోమ గురు మంగళ యోస్సఖిత్వం, అత్యంత మైత్రి బుధ శుక్ర శనైశ్చరాణాం
వైరం రవే రవి సుతస్య బుధస్య సోమా। శుక్ర ప్రకోప కురుతే రవి జీవ భౌమౌ॥

పై శ్లోకముల ఆధారముగా మిత్రులు శత్రువులు


శత్రువులు
రవి - శని
కుజ - శని
గురు - శుక్ర
బుధ - సోమ
శుక్ర - రవి , గురు , కుజ
మిత్రులు
రవి - సోమ - గురు - కుజ
బుధ - శుక్ర - శని

మిత్రుత్వ శత్రుత్వములు తెలుసుకునే విధము


ద్విపంచ నవదష్ట చతుర్థోచ్చ వ్యయం గ్రహానాం మిత్రేన యాంతి

మిత్ర స్థానములు
ఒక రాశ్యాధిపతికి ఆ రాశి నుండి 2 4 5 8 9 12 ఉచ్చ స్థానాధిపతులు మిత్రులు
మిత్ర స్థానములు కానివి
ఒక రాశ్యాధిపతికి ఆ రాశి నుండి 3 6 7 10 11 స్థానాధిపతులు మిత్ర స్థానములు కావు

పై స్థానముల అధారముగా ఒక రాశ్యాధిపతికి మరొక గ్రహము అధిపతిగా ఉన్న స్థానముల


సంఖ్యలో మిత్ర స్థానములు కానివి ఎక్కువ ఉంటే శత్రు గ్రహముగా మిత్ర స్థానములు ఎక్కువ ఉంటే
మిత్ర గ్రహముగా సమానముగా ఉంటే సమముగా గ్రహించాలి.
రాశ్యాధిపతులు

మినము - గురు మేషము - కుజ వృషభము - శుక్ర మిథునము - బుధ

కుంభము - శని కర్కాటకము - చంద్ర

మకరము - శని రాశ్యాధిపతులు సింహము - రవి

ధనుస్సు - గురు వృశ్చికము - కుజ తుల - శుక్ర కన్య - బుధ


గ్రహముల ఉచ్చస్థానములు

మినము - శుక్ర మేషము - రవి వృషభము - చంద్ర మిథునము

కుంభము కర్కాటకము - గురు

మకరము - కుజ గ్రహముల ఉచ్చ స్థానములు సింహము

ధనుస్సు వృశ్చికము తుల - శని కన్య - బుధ

*స్వస్తి*

You might also like