You are on page 1of 4

TOTAL FREEDOM – THE ESSENTIAL KRISHNAMURTI

PART 1: EARLY WORKS

A DYNAMIC SOCIETY
క్రియాశీల సమాజం
1. Both suppression as well as self-discipline are mere adjustments to environment.
అణచివేయడంగానీ అలాగే ఆత్మ-క్రమశిక్షణగానీ రెండూ కూడా పర్యావరణానికి సంబంధించి (మన

ప్రవర్తనని) సర్దు బాటు చేసుకోవడమే.

2. You will see that the more you discipline the mind, train the mind, the greater its
limitations.
మీరు మనసుని యెంత ఎక్కువగా నియంత్రిద్దా మనుకున్నా, శిక్షణ ఇద్దా మనుకున్నా, అది అంత

ఎక్కువగా పరిమితులలో (సంకుచితమై) వ్యవహరిస్తుంది అన్న విషయం మీరే చూస్తా రు.

3. Intelligence is not born out of self-discipline or suppression. So to me self-discipline


and suppression are both alike – they both deny intelligence.
ప్రజ్ఞ అనేది అణచివేత లేదా స్వీయ-క్రమశిక్షణ నుండి జనించదు. కాబట్టి నాకు స్వీయ-క్రమశిక్షణ,

అణచివేత రెండు సమానమే - ఈ రెండు ప్రజ్ఞని తిరస్కరిస్తా యి.

4. I am telling you something with which I have experimented and which I have found
to be true. Psychologically I think it is true, because self-discipline implies a mind that
is tethered to a particular thought or belief or ideal, a mind that is held by a condition.
Therefore, such a mind is not mind at all.
నేను మీకు చెప్తు న్న విషయం స్వయంగా ప్రయోగం చేసి చెప్తు న్నాను, అది నేను సత్యమని

తెలుసుకున్న విషయం. మానసికంగా గమనిస్తే ఇది నిజమని అనుకుంటున్నాను, ఎందుకంటె,

స్వీయ-క్రమశిక్షణ మనసుని ఒక ఆలోచనకో, లేదా నమ్మకానికో లేదా ఒక ఆదర్శానికో పగ్గం వేసి

బంధించడం లాంటిది, మనసు తానూ ఏర్పరచుకున్న పరిధిలో ఇరుక్కుని కొట్టు మిట్టా డుతూ

ఉండిపో తుంది. అటువంటి మనసు మనసే కాదు మరి.

5. Before you try to change and alter thought and feeling, find out the manner of their
working, and you will see that they are continually adjusting themselves within the
limitations established by that point fixed by desire and the fulfilment of that desire.
మీరు మీలోని ఆలోచనలను, భావోద్వేగాలను మార్చాలనోవడం కంటే ముందు అవి యే విధంగా

పనిచేస్తు న్నాయో తెలుసుకోండి, అప్పుడు మీరు ఏం చూస్తా రంటే, అవి తమకుతామై

ఏర్పరచుకున్న పరిధిలో కేంద్రీకృతమై ఉన్న మీ కోరికలు, వాటిని ఎలా నెరవేర్చుకోవాలో అన్న

విషయమై నిరంతరం సర్దు బాటు చేసుకుంటూ ఉంటాయి.

6. In awareness there is no discipline.


యెఱుక (జాగృదవస్థ) లో క్రమశిక్షణ అనేది ఉండదు.

7. If you begin to inquire into the conditions that create conflict, and thereby awaken
intelligence, then that intelligence itself is so supreme that it is continually in
movement and, therefore, there is never a static point which can create conflict.
సంఘర్షణ యే పరిస్థి తులలో పుడుతుందో అన్న విషయాన్ని మీరు కనక తెలుసుకోవడం

(గహనంగా వివహరణ చేయడం) ప్రా రంభిస్తే , తద్ద్వారా ప్రజ్ఞ జాగృతం అయినప్పుడు, ఆ ప్రజ్ఞ యెంత

మహో త్కృష్టమైనదంటే అది నిరంతరం గతిశీలమై ఉంటుంది, అందువలన దాంట్లో సంఘర్షణ

సృష్టించే స్థి రమైన బిందువు అనేది ఎప్పటికి ఉండదు.

8. Life will not miss you.


జీవితం మిమ్మల్ని వదలదు.

9. Whereas if you are really conscious of that conflict, in that consciousness suffering
will become acute and in that acuteness, in that intensity, you will dissolve the cause
of suffering, which is the lack of understanding of the environment.
మీరుగనక నిజంగా సంఘర్షణ గూర్చి సచేతనంగా ఉంటే, ఆ చైతన్యంలో మీ దుఃఖం తీక్షణమై, ఆ

తీక్ష్ణతలో, తీవ్రతలో, మీ దుఃఖానికి కారణం, ఏదైతే పర్యావరణ అవగాహనారాహిత్యం వలన

కలిగిందో, ఆ హేతువు సమసిపో యేలా (కరిగిపో యేలా / అంతరించేలా) చేసుకుంటారు.

10. You know we have lost all sense of living normally, simply, directly.
మీరు చూడండీ, మనం సాధారణంగా, సరళంగా, సూటిగా/ప్రత్యక్షంగా జీవించడమనేది

కోల్పోయాము.

11. I am afraid most of us are seeking methods because we think that through them we
shall realize fullness, stability, and permanency. To me methods lead to slow
stagnation and decay and they have nothing to do with real spirituality, which is after
all, the summation of intelligence.
నాకేమనిపిస్తోందంటే, మనలో చాలామంది ఒక పద్ధతిని / విధానాన్ని అన్వేషిస్తుంటాం, ఎందుకంటే

తద్ద్వారా మనం పరిపూర్ణతని, స్థి రత్వాన్ని, శాశ్వతత్త్వాన్ని పొందగలుగుతామని అనుకుంటాము.

నాకు మాత్రం పద్ధతులు / విధానాలు నెమ్మదిగా స్త బ్దత, క్షయం వైపు తీసుకుని

పో తాయనిపిస్తుంది, అదీగాక, ఈ పద్ధతులు నిజమైన ఆధ్యాత్మికతకు యే విధంగానూ

సంబంధించినవికావు. మరి నిజమైన ఆధ్యాత్మికత అంటే ప్రజ్ఞా సాకల్యమేగా!

12. You must have this burning desire for a drastic change, drastic revolution, complete
reorientation of thinking.
మీలో భీషణమైన/ప్రబలమైన మార్పు, తీవ్రమైన విప్ల వం కోసం జ్వలంతమైన కోరిక ఉండాలి, మన

ఆలోచనా సరళి లో పూర్తి పరివర్తన (దృక్పథంలో సమగ్రమైన మార్పు) రావాలి.

13. I think we give the rather false excuse that we must not hurt our families and our
friends. You know when you want to do something vital, you do it, irrespective of
your family and friends, don’t you? Then you don’t consider that you are going to hurt
them. It is beyond your control; you feel so intensely, you think so completely that it
carries you beyond the limitation of family circles, classified bondages.
నేనేమనుకుంటున్నానంటే మనందరం మన కుటుంబ సభ్యుల్ని, మన స్నేహితుల్నీ బాధ పెట్టద్దు

అనే ఒక తప్పుడు సాకుని చెప్తూ ఉంటాం. మీకు తెలుసా, మీరు ఏదైనా ప్రా ణప్రదమైనదేదైనా పని

చేద్దా మనుకున్నప్పుడు అది చేసి తీరుతారు, మీ కుటుంబం, మీ స్నేహితులు ఏమనుకున్నా సరే,

ఏం అలా చేయరా? అప్పుడు మాత్రం మీరు వారిని గాయపరుస్తు న్నానని అనుకోరు, అది మీ

వశంలో ఉండదు కాబట్టి, మీరు దాని గురించి యెంత తీవ్రంగా స్పందిస్తా రంటే, యెంత పూర్తిగా

మమేకమై ఆలోచిస్తా రంటే, అది అన్ని అవధుల్ని, కుటుంబ సంబంధాలని, మీకై మీరు

నిర్ధా రించుకున్న బంధాలని, అన్నింటిని అధిగమిస్తుంది.

14. Surely truth, or that Godhead of understanding, is not to be found by clinging either to
family or tradition or habit. It is to be found only when you are completely naked,
stripped of your longings, hopes, securities; and in that direct simplicity is the
richness of life.
నిజం చెప్పాలంటే, సత్యం లేక అవగాహన ద్వారా పొందే దైవత్వం, పరివారం, సంప్రదాయం లేక మీ

అలవాట్ల ను పట్టు కుని వేళ్ళాడితే లభించేది కాదు. అది మీరు పూర్తిగా నగ్నమై (మానసిక ఆవరణ

రహితమై), మీ వాంఛలు, ఆశలు, రక్షణవలయాలు, అన్నింటిని సమగ్రంగా తొలగించినప్పుడు

మీకు లభిస్తుంది, అట్టి ప్రత్యక్షమైన నిరాడంబరత లోనే జీవితం యొక్క ప్రా చుర్యం, వైభవం

ఉంటుంది.
15. That is why I said the other day that if environment is driving you to a certain action,
it is no longer righteous. It is only when there is action born out of the understanding
of that environment that there is righteousness.
అందుకే నేను క్రితం రోజు అన్నాను, మిమ్మల్ని కనక మీ పర్యావరణం ఒక నిర్దిష్టమైన పని

చేయడానికి ప్రేరేపిస్తుందంటే అది ధర్మపరాయణమైనది (సద్వర్తనం / సుకృతం) యే మాత్రం కాదు.

పర్యావరణ అవగాహన నుండి జనించిన పని అయినప్పుడే అది ధర్మపరాయణమౌతుంది.

16. So individually we must become conscious. I assure you, you will then individually
create something immense.
కావున మనం వైయక్తికంగా చైతన్యవంతులం కావాలి. నేను మీకు హామీ ఇస్తు న్నాను, అప్పుడు

మీరు వ్యకిగతంగా ఒక అపారమైనటువంటిది (మహో త్కృష్టమైన) దానిని సృష్టిస్తా రు.

17. You know karma is a Sanskrit word which means to act, to do, to work, and also it
implies cause and effect. Now karma is the bondage, the reaction born out of the
environment, which the mind has not understood.
కర్మ అనేది ఒక సంస్కృత పదం, పని, క్రియ చేయడం లేక వ్యవహరించడం అని అర్థం, అలాగే అది

కార్య-కారణ సంబంధాన్ని కూడా సూచిస్తుంది. మన మనసు యొక్క అవగాహనా లోపం వలన

పర్యావరణానికి ప్రతిక్రియగా పుట్టిన బంధమే కర్మ.

18. It is fatal to meet life with the burden of certainty, with the conceit of knowledge,
because after all, knowledge is merely a thing of the past. So when you come to that
life with a freshness, then you will know what it is to live without conflict, without
this continual straining effort. Then you wander far on the floods of life.
నిశ్చయభావమనే భారంతో జీవితాన్ని ఎదుర్కోవడం (సమ్ముఖమై కలుసుకోవడం) ప్రా ణాంతకం!

నాకు తెలుసునని దురహంకారంతో అలా చేయడం తగదు, ఎందుకంటే, మీ జ్ఞా నమంతా కూడా

కేవలం గతించిన స్మృతి సంబంధమైనది మాత్రమే కాబట్టి! ఎప్పుడైతే మీరు జీవితాన్ని

నూతనత్వంతో చవి చూస్తా రో, అప్పుడే మీరు సంఘర్షణ రహితమైన జీవనాన్ని గడపగలుగుతారు,

నిరంతరం ఒత్తి డికి గురౌతున్న ప్రయాస లేకుండా జీవించగలుగుతారు. అప్పుడు మీరు జీవితమనే

వరదప్రవాహంలో సుదూరంగా సంచరించగలుగుతారు.

You might also like