You are on page 1of 10

4/30/23, 10:45 AM శివుని 10 రూపాల వివరణ

తెలుగు

శివుని 10 రూపాల వివరణ


సద్గురు యోగ శాస్త్రంలోని శివుని 10 విభిన్న రూపాల గురించి చూస్తూ , అవి దేనికి
ప్రాతినిధ్యం వహిస్తా యో వివరిస్తున్నా రు. క్రియాశీలమైన నటరాజుని గురించి, భయంకరమైన
కాలభైరవుని గురించి, పిల్లవాడి వంటి భోళాశంకరుడిని గురించి, ఇంకా మరెన్నింటి గురించో
తెలుసుకోండి!

సద్గు రు: శివునికి, మానవ మనస్సు ఊహించగలిగిన ప్రతి గుణాన్నీ ఇంకా ఊహించలేని
గుణాలనీ కుడా కలిగి ఉన్న అనేక రూపాలు ఉన్నా యి. కొన్ని విశృంఖలమైనవి ఇంకా
ప్రచండమైనవి. కొన్ని నిగూఢమైనవి. మిగిలినవి మనోహరమైనవి ఇంకా సుందరమైనవి.
అమాయక భోళాశంకరుడి నుండి భయంకరమైన కాలభైరవుడి వరకు, అందమైన
సోమసుందరుడి నుండి భయంకరమైన అఘోరా వరకు - శివుడు అన్ని రూపాలను
ధరించినా వాటికి వేటికీ ప్రభావితంగాని విధంగా ఉన్నా డు. వీటన్ని టిలో, ఐదు ప్రాథమిక
రూపాలు ఉన్నా యి.

శివుని ఐదు ప్రాథమిక రూపాలు

యోగ యోగ యోగేశ్వ రాయ

భూత భూత భూతేశ్వ రాయ

కాల కాల కాలేశ్వ రాయ

శివ శివ సర్వే శ్వ రాయ

https://isha.sadhguru.org/mahashivratri/te/shiva/10-forms-of-shiva-explained/ 1/10
4/30/23, 10:45 AM శివుని 10 రూపాల వివరణ

శంభో శంభో మహాదేవాయ

యోగేశ్వ ర రూపం

యోగ మార్గంలో ఉండడం అంటే, జీవితంలో మీరు ఏ దశకు చేరుకున్నా రంటే, మీరు ఈ
భౌతిక ఉనికి యొక్క పరిమితులను తెలుసుకున్నా రు, పరాన్ని తెలుసుకోవాలన్న కోరిక మీలో
కలిగింది - ఇంత పెద్ద విశ్వం కూడా మీకు ఒక నిర్బంధంలాగా అనిపిస్తుంది. ఒక చిన్న
సరిహద్దు మిమ్మ ల్ని నిర్బంధించగలిగినప్పు డు, చాలా పెద్ద సరిహద్దు కుడా, ఒకానొక
సమయాన మీకు నిర్బంధమే అవుతుంది. ఈ విషయం తెలుసుకోడానికి మీరు విశ్వా న్నంతా
చుట్టి రానక్క ర్లేదు. మీరు ఇక్క డ కూర్చు నే, ఈ సరిహద్దు మిమ్మ ల్ని నిర్బంధిస్తుంది అంటే,
మీరు విశ్వా న్నంతా చుట్టివస్తే, కొంతకాలానికి అది కూడా నిర్బంధంగానే అవుతుందని అర్థం
చేసుకోవచ్చు - అది కేవలం దూరాలు

ప్రయాణించగల మీ సామర్ధ్యా నికి సంబంధించిన ప్రశ్న మాత్రమే! ఒకసారి దూరాలు


ప్రయాణించగల మీ సామర్ధ్యం గొప్ప గా పెరిగితే, అప్పు డు ఎలాంటి సరిహద్దైనా సరే మీకు ఒక
నిర్బంధంగానే అనిపిస్తుంది. మీరు ఇది తెలుసుకుని అర్థం చేసుకున్న ప్పు డు, ఈ భౌతిక
సృష్టినంతా జయించడం అనేది కూడా తీర్చ లేని ఆ తృష్ణ మీలో కలిగినప్పు డు – అప్పు డు
మీరు “యోగా” మార్గంలో ఉన్న టు. యోగా అంటే, ఈ భౌతికమైన పరిమితులను ఛేదిచడం.
మీ కృషి అంతా, ఈ భౌతిక సృష్టి మీద నియంత్రణ సాధించడం కోసం మాత్రమే కాదు, దాని
పరిమితులను ఛేదించి, భౌతికతకి అతీతమైన పార్శ్వా న్ని స్పృశించడానికి. మీరు ఈ
పరిమితమైన దానిని, అపరిమితమైన దానితో ఐక్యం చేయాలనుకుంటున్నా రు. ఈ పరిమితిని
అపరిమితమైన దానిలో లయం చేయాలనుకుంటున్నా రు.

శివుని భూతేశ్వ ర రూపం

మనం కళ్ళ తో చూడగలిగే, వినగలిగే, రుచి చూడగలిగే, వాసన చూడగలిగే, ఇంకా


స్ప ర్శించగలిగే ఈ భౌతిక సృష్టి అంతా కూడా - ఈ శరీరం, ఈ గ్రహం, ఈ విశ్వం, ఈ సృష్టి
అంతా కూడా, కేవలం పంచభూతాల విన్యా సమే. కేవలం ఐదు పదార్థా లతో ఎంత గొప్ప
సృష్టి! వేళ్ళ మీద లెక్క బెట్టగలిగే ఐదు మూలకాలతో, ఎన్ని సృష్టించబడ్డా యి! ఈ సృష్టి
ఇంతకంటే ఎక్కు వ కారుణ్యం చూపించలేదేమో. ఒకవేళ ఐదు కోట్ల పదార్థా లంటే మీకు ఏం
చేయాలో తెలిసేది కాదు.

పంచ భూతాలు అనబడే ఈ ఐదు మూలకాలపై మీరు ప్రావీణ్యా న్ని పొందితే, ఇక సర్వ మూ
అదే! - మీ ఆరోగ్యం, మీ శ్రేయస్సు , ఈ ప్రపంచంలో మీ శక్తీ, మీకేమి కావాలో అది
సృష్టించుకోగలిగే సామర్థ్యం – ఇవన్నీ కూడా మీ నియంత్రణలో ఉంటాయి. తెలిసో,
తెలియకో, ఎరుకతోనో, ఎరుక లేకుండానో వ్య క్తు లు, వివిధ మూలకాలపై కొంత వరకు
నియంత్రణని లేదా ప్రావీణ్యా న్ని సాధిస్తా రు. వారికి ఎంతవరకు వీటిమీద నియంత్రణ లేదా
ప్రావీణ్యం ఉంది అన్న దాన్ని బట్టి వారి శరీర తత్వం, వారి మానసిక స్వ భావం, వారు
ఎటువంటి పనులు చేస్తా రు, అందులో వారు ఏ మేరకు సఫలత పొందుతారు, వారికి ఎంత
దూర దృష్టి ఉంటుంది – ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి.“భూతేశ్వ రాయ” – అంటే ఈ
పంచ భూతాలమీద పట్టు కలిగి ఉన్న వారు, తమ జీవన గతిని, కనీసం భౌతిక పార్శ్వ పు
గతిని నిర్ణయించగలరు అని అర్థం.
https://isha.sadhguru.org/mahashivratri/te/shiva/10-forms-of-shiva-explained/ 2/10
4/30/23, 10:45 AM శివుని 10 రూపాల వివరణ

కాలేశ్వ ర రూపం

కాల అంటే సమయం. మీరు ఈ పంచభూతాల మీద ఎంత నియంత్రణ సాధించినా, మీరు
ఈ అనంతమైనదానితో ఒక్క టైనా, లయమవ్వ డం మీకు తెలిసినా - మీరిక్క డ
ఉన్నంతవరకు కాలం నడుస్తూ నే ఉంటుంది. కాలంపై పట్టు సాధించండం అనేది పూర్తిగా
మరొక విభిన్న మైన పార్శ్వం. ‘కాల’ అంటే కేవలం సమయం మాత్రమే కాదు. ‘కాల’ అంటే
అంధకారం అని కూడా. ‘కాల’ అంటే అంధకారం. కాలం వెలుగు అవ్వ లేదు. ఎందుకంటే
వెలుగు కాలంలో ప్రయాణం చేస్తుంది. వెలుగు కాలం యొక్క బానిస. మనం వెలుతురు అని
దేనినైతే అంటామో దానికి ఒక మొదలు, ఒక అంతం ఉన్నా యి. కానీ కాలం అలాంటిది
కాదు. హిందూ జీవన విధానంలో, కాలాన్ని ఆరు భిన్న పార్శ్వా లుగా చూసే అధునాతన
అవగాహన ఉంది. మీరు తెలుసుకోవాల్సి న ఒక విషయం ఏమిటంటే, మీరు ఇక్క డ కుర్చు ని
ఉండగా, మీ కాలం సాగిపోతూనే ఉంది. ఎవరైనా చనిపోయినప్పు డు – మరణాన్ని గురించి
తమిళంలో ఒక మంచి పదం ఉంది -“ కాలం ఆయిటాంగ,” అంటే ‘అతని కాలం
అయిపోయింది’ అని అర్థం.

ఇంగ్లీష్ భాషలో కూడా, గతంలో అటువంటి మాట వాడే వాళ్ళం - “He Expired.” అని. ఒక
మందు లేదా మరే ఇతర విషయం మాదిరిగానే, ఒక మానవుడు కూడా ఒక ఎక్స్పై రీ డేట్ తో
వస్తా డు. మీరు ఎన్నో చోట్లకి వెళ్తు న్నాం అని అనుకోవచ్చు . లేదు, మీ దేహానికి
సంబంధించినంతవరకు మీరు నేరుగా శ్మ శానం వద్దకే వెళ్తు న్నా రు. ఒక్క క్షణం కూడా ఆ
దిశను మార్చ డం లేదు. మీరు ఈ ప్రక్రియను కొద్దిగా నిదానించేలా చేయవచ్చు . కానీ మీరు
ఈ దిశని మార్చ లేరు. మీకు వయసు మీద పడుతున్న కొద్దీ ఈ భూమి మిమ్మ ల్ని తనలో
చేర్చు కోవాలని ప్రయత్ని స్తోందని మీరు గమనించవచ్చు . జీవం దాని వృత్తా న్ని పూర్తి
చేస్తుంది.

కాలం అనేది జీవం తాలూకు ఒక విశేషమైన పార్శ్వం. ఇది మిగతా మూడు పార్శ్వా లలో
దేనిలోనూ ఇమడదు. ఈ సృష్టిలో అన్ని టిలోకెల్లా అంతుచిక్క నిది ఇదే. మీరు దానిని
కనుగోనలేరు. ఎందుకంటే అది ఉన్న ది కాదు. అది మీకు తెలిసిన సృష్టి రూపాలలో ఏ
రూపంలోనూ లేదు. అది సృష్టి యొక్క అత్యంత శక్తివంతమైన పార్శ్వం. అది సృష్టినంతా
ఒక్క టిగా పట్టి ఉంచే పార్శ్వం. ఇందువల్లే ఆధునిక భౌతిక శాస్త్రా నికి, గురుత్వా కర్షణ శక్తి ఎలా
పని చేస్తుందో ఏమాత్రం తెలియడం లేదు. ఎందుకంటే గురుత్వా కర్షణ అనేది లేదు.
అన్నింటినీ ఒక్క టిగా పట్టి ఉంచుతున్న ది కాలమే.

శివ – సర్వే శ్వ ర – శంభో

శివ అంటే, “ఏదైతే లేదో అది; ఏదైతే లయం అయిపోయిందో అది.” ఏదైతే లేదో, అదే ఈ
సృష్టి అంతటికీ కూడా ఆధారం. ఆ ఆధారమే అనంతమైన ‘సర్వే శ్వ ర’. ‘శంభో’ అనేది ఒక
తాళం చెవి లాంటిది. ఒక మార్గం. మీరు మీ శరీరం చీలిముక్క లైపోతుందేమో అనే విధంగా
దీనిని ఉచ్చ రించగలిగినప్పు డు, అది ఒక మార్గం అవుతుంది. మీరు ఈ అంశాలన్నింటిపై
పట్టు సాధించి, అప్పు డు అక్క డికి చేరుకోవాలంటే ఎంతో ఎక్కు వ కాలం పడుతుంది. మీరు
నేరుగా దోవ చేసుకుని వెళ్ళా లని మాత్రమే అనుకుంటున్న ట్లైతే, ఈ పార్శ్వా లపై పట్టు
సాధించడం ద్వా రా కాకుండా, మెల్లగా లోపలికి దూరడం ద్వా రా మీరు ఈ అంశాలను

https://isha.sadhguru.org/mahashivratri/te/shiva/10-forms-of-shiva-explained/ 3/10
4/30/23, 10:45 AM శివుని 10 రూపాల వివరణ

అధిగమించవచ్చు .

నా చిన్న ప్పు డు, మైసూరు ‘జూ’లో నాకు స్నే హితులు ఉండేవారు. ప్రతి ఆదివారం ఉదయం,
నా రెండు రూపాయల పాకెట్ మనీతో, నేను చేపల మార్కె ట్ కి వెళ్లేవాడిని. మార్కె ట్లో చాలా
లోపల, సగం కుళ్ళి న చేపలు అమ్మే వారు. రెండు రూపాయలకు ఒక్కో సారి నాకు రెండు,
మూడు కేజీల చేపలు దొరికేవి. నేను వాటిని ఒక ప్లా స్టిక్ సంచీలో పెట్టుకుని, మైసూర్ జూకి
వెళ్ళే వాడిని. నా దగ్గర ఇక వేరే డబ్బు లు ఏమీ ఉండేవి కావు. ఆ కాలంలో, మీరు గేటు గుండా
నిటారుగా నడుచుకుంటూ లోపలికి వెళ్లా లంటే, టికెట్ ఖరీదు ఒక రూపాయి. అక్క డ భూమి
నుండి రెండు అడుగుల ఎత్తులో ఒక అడ్డకమ్మి కూడా ఉండేది. మీరు దాని కిందగా పాకుతూ
వెళ్ళ గలిగితే, మీరు ఫ్రీగా వెళ్ళి పోవచ్చు . అది నాకేమీ సమస్య కాదు - నేను పాకుతూ వెళ్ళే
వాడిని. నేను రోజంతా నా స్నే హితులకు కుళ్ళి పోయిన చేపలు పెడుతూ గడిపేవాడిని.

మీరు నిటారుగా నడవాలంటే, అది చాలా కష్టతరమైనది, ఎంతో శ్రమించాలి. మీరు పాకడానికి
సిద్ధంగా ఉంటే, సులువైన దారులు ఉన్నా యి. పాకుతూ పోయేవారు దేనిపైనా ప్రావీణ్యం
పొందడం గురించి గాబరా పడాల్సి న అవసరం లేదు. మీరు ఎంత కాలం కావాలంటే అంత
కాలం బతకండి. మీరు చనిపోయినప్పు డు వెళ్లి సర్వో న్న తిని చేరుకోవచ్చు .

ఒక చిన్న విషయంపై ప్రావీణ్యం సాధించడంలో కుడా, ఒక విధమైన వర్ణించలేని అందం


ఉంటుంది. ఉదాహరణకి ఒక బంతిని ఒక చిన్న పిల్లవాడు కూడా తన్న గలడు. కానీ దానిపై
ఎవరైనా ప్రావీణ్యం సాదిస్తే, ఉన్న ట్టుండి దానిలో ఒక కళాత్మ కత ఉట్టిపడుతుంది. సగం
చూస్తూ ఉంటుంది. మీరు ప్రావీణ్య తని పొంది దాన్ని
ప్రపంచం కూర్చు ని మిమ్మ ల్ని
ఆస్వా దించాలంటే, కొంత కృషి చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ప్రాకడానికి సిద్ధపడితే, అది
చాలా సులభం - ‘శంభో’.

యోగ సంప్రదాయంలో శివుని రూపాలు


శివుని భోళా శంకరుడి రూపం

శివుడిని ఎల్లప్పు డూ చాలా శక్తివంతమైన జీవిగా, అదే సమయంలో, అంతగా ప్రాపంచిక


లౌక్యం లేని వ్య క్తిగా చూస్తా రు. కాబట్టి, శివుని ఒక రూపాన్ని భోళా శంకరుడు లేదా భోలేనాథ్
అని పిలుస్తా రు, ఎందుకంటే అతను పిల్లవాని వంటివాడు. భోలేనాథ్ అంటే అమాయకమైన
లేదా అజ్ఞా నియైన అని కూడా వస్తుంది. చాలా మంది తెలివైన వ్య క్తు లు చాలా తేలికగా
మోసపోవడాన్ని మీరు చూస్తూ ఉంటారు, ఎందుకంటే వారు వారి మేథాశక్తిని చిన్న చిన్న
విషయాలకు వాడరు. ప్రపంచంలో ఒక మేథావిపైన, జిత్తులమారితనం ఇంకా నేర్ప రి
తనంతో ఉన్న చాలా తక్కు వ స్థా యి తెలివి సులభంగా గెలవగలదు. అది డబ్బు లేదా
సమాజ పరంగా కొంత విలువైనది కావచ్చు , కానీ జీవం దృష్ట్యా దానికి ఏ విలువా లేదు.

మేము మేథాశక్తి అన్న ప్పు డు, మేము మాట్లా డుతున్న ది కేవలం తెలివిగా ఉండండం గురించి
మాత్రమే కాదు. మేము మాట్లా డుతున్న ది, జీవితాన్ని తన పూర్తి స్థా యిలో ప్రవహించేలా చేసే
ఆ పార్శ్వా న్ని గురించి. శివుడు కూడా అలాంటివాడే. అతను తెలివితక్కు వవాడని కాదు, కానీ
అతను, మేథాశక్తిని అల్ప మైన విధానాలలో ఉపయోగించడం గురించి పట్టించుకోడు.

https://isha.sadhguru.org/mahashivratri/te/shiva/10-forms-of-shiva-explained/ 4/10
4/30/23, 10:45 AM శివుని 10 రూపాల వివరణ

శివుని నటరాజ రూపం

నృత్య భగవానుడిగా, నటేశ లేదా నటరాజ రూపం అనేది, శివుని ముఖ్య మైన రూపాలలో
ఒకటి. ఈ గ్రహం మీద అణువులను పగులగొట్టడం వంటివన్నీ జరిగే భౌతిక ప్రయోగశాల
అయిన, స్వి ట్జర్లాండ్‌లోని CERN ని నేను సందర్శించినప్పు డు, ప్రవేశద్వా రం ముందు
నటరాజ విగ్రహం ఉండడాన్ని చూశాను, ఎందుకంటే ప్రస్తుతం వారు చేస్తున్న దానికి, మానవ
సంస్కృతిలో ఇంతకన్నా దగ్గరగా మరేదీ లేదని వారు గమనించారు.

నటరాజ రూపం, శాశ్వ తమైన నిశ్చ లత నుండి తనను తాను సృష్టించుకున్న సృష్టి యొక్క ,
ఉత్సా హాన్నీ ఇంకా నృత్యా న్నీ సూచిస్తుంది. చిదంబర ఆలయంలోని నటరాజు ఒక చక్క ని
సూచిక, ఎందుకంటే మీరు దేనినైతే చిదంబరం అని పిలుస్తా రో, అది ఒక సంపూర్ణ నిశ్చ లత.
అదే ఈ ఆలయ రూపంలో పొందుపరచబడింది. సాంప్రదాయ కళలు అనేవి, ఈ సంపూర్ణ
నిశ్చ లతను మనిషిలోకి తీసుకురావడం కోసమే. నిశ్చ లత లేకుండా నిజమైన కళ ఉండదు.

అర్ధనారీశ్వ ర రూపం

సాధారణంగా, శివుడిని అత్యు త్తమ పురుషుడని అంటారు, కాని అర్ధనారీశ్వ ర రూపంలో,


అతనిలో సగ భాగం, పూర్తిగా అభివృద్ధి చెందిన స్త్రీ. ఇక్క డ చెప్ప బడుతున్న ది ఏమిటంటే,
మీలోని అంతర్గత పురుషత్వం ఇంకా స్త్రీత్వం కలిస్తే, మీరు శాశ్వ తమైన పారవశ్య స్థితిలో
ఉంటారు. మీరు దాన్నే బయట చేయడానికి ప్రయత్ని స్తే, ఎప్పు డూ కూడా అది నిలిచి
ఉండదు, అలాగే దానితో పాటూ వచ్చే ఇబ్బందులు, నిరంతరం కొనసాగే నాటకం వంటివి.
పురుషత్వం ఇంకా స్త్రీత్వం అంటే మగ ఇంకా ఆడ అని కాదు. ఇవి ఒక విధమైన లక్షణాలు.
ప్రాథమికంగా, అది ఇద్దరు వ్య క్తు లు కలవాలనుకోవడం కాదు, అది జీవితం యొక్క రెండు
పార్శ్వా లు కలవాలనుకోవడం - బాహ్యంలో ఇంకా ఆంతరంగికంగా కూడా. మీరు
ఆంతరంగికంగా దాన్ని సాధిస్తే, బాహ్యం 100% మీ ఎంపికని బట్టి జరుగుతుంది. లేదంటే,
బాహ్యం ఒక భయంకరమైన నిర్బంధం అవుతుంది.

“మీరు మీ సర్వో న్న త స్థితికి పరిణామం చెందితే, మీరు సగం పురుషుడు, సగం స్త్రీ అవుతారు
- ఒక నపుంసకుడిగా కాదు, పూర్తి స్థా యి పురుషుడు ఇంకా పూర్తి స్థా యి స్త్రీగా అవుతారు” అని
చూపించడానికి ఇది ఒక ప్రతీక. అప్పు డు మాత్రమే మీరు ఒక పరిపూర్ణమైన మానవుడు
అవుతారు.

కాలభైరవ రూపం

శివుడు సమయాన్ని నాశనం చేసేవాడిగా అయినప్పు డు, అది - కాలభైరవుడు అనే అతని
ప్రచండమైన రూపం. అన్ని భౌతిక వాస్తవికతలు కాల వ్య వధిలోనే ఉంటాయి. నేను మీ
సమయాన్ని నాశనం చేస్తే, అంతా అయిపోతుంది.

శివుడు, భైరవీ యాతనని సృష్టించడానికి తగిన వేషధారణని ధరించి, కాలభైరవ అవతారం


ఎత్తుతాడు. “యాతన” అంటే అత్యంత బాధ. మరణ సమయం (ఆ క్షణంలో)
ఆసన్న మైనప్పు డు, చాలా జీవిత కాలాలు ఎంతో తీక్షణతతో జరిగిపోతాయి, మీకు
https://isha.sadhguru.org/mahashivratri/te/shiva/10-forms-of-shiva-explained/ 5/10
4/30/23, 10:45 AM శివుని 10 రూపాల వివరణ

కలగవలసిన నొప్పి ఇంకా బాధలు అన్నీ , ఒక్క మైక్రో సెకనులో కలుగుతాయి. ఆ తరువాత,
గతం తాలూకూ ఏదీ కూడా మీలో మిగలదు. మీ “సాఫ్ట్‌వేర్” ను రద్దు చేయడం బాధాకరంగానే
ఉంటుంది. కానీ ఇది మరణ సమయంలో జరుగుతుంది, కాబట్టి మీకు వేరే ఎంపిక ఉండదు.
అతను దాన్ని ఎంత తక్కు వ సమయంలో సాధ్య మైతే, అంత తక్కు వ సమయంలో చేస్తా డు,
బాధ అనేది త్వ రగా ముగియాలి. మనం దానిని అత్యంత తీక్షణంగా చేస్తేనే అది
జరుగుతుంది. అది కొంచంగా ఉంటే, అది ఎప్ప టికీ కొనసాగుతూ ఉంటుంది.

ఆదియోగి

యోగ సంప్రదాయంలో, శివుడిని దేవుడిగా ఆరాధించరు. అతను ఆదియోగి, మొదటి యోగి,


ఇంకా ఆది గురువు. ఎవరినుండైతే యోగ శాస్త్రా లు ఉద్భ వించాయో, ఆ మొదటి గురువు
ఆయన. దక్షిణాయనంలోని మొదటి పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు, ఆ సమయంలోనే
ఆదియోగి ఈ శాస్త్రా లను, తన మొదటి ఏడుగురు శిష్యు లైన సప్త-ఋషులకు ప్రసారం
చేయడం ప్రారంభించాడు.

ఇది మతాలనేవి పుట్టకముందే జరిగింది. ప్రజలు మానవాళిని విచ్ఛి న్నం చేసి, విభజించే
మార్గా లను రూపొందించడానికన్నా ముందే, మానవ చైతన్యా న్ని జాగృతం చేయడానికి
అవసరమైన అత్యంత శక్తివంతమైన సాధనాలు గ్రహించబడ్డా యి ఇంకా ప్రచారం
చేయబడ్డా యి. వారికున్న విజ్ఞా నం నమ్మ శఖ్యం కానిది. ఆ సమయంలో ప్రజలు అంత
అధునాతనంగా ఉన్నా రా అనే ప్రశ్న అసంబద్ధమైనది, ఎందుకంటే ఇది ఒక నిర్దిష్ట
నాగరికత, లేదా ఆలోచనా ప్రక్రియ నుండి వచ్చి నది కాదు. ఇది అంతర్గత సాక్షాత్కా రం
నుండి వచ్చింది. అది నేరుగా ఆదియోగి తనని తాను ప్రసరింపజేసారు. ఈ రోజుకీ కూడా
మీరు ఒక్క విషయాన్ని
కూడా మార్చ లేరు ఎందుకంటే అతను చెప్ప గలిగే ప్రతిదాన్ని కూడా
అంత అందమైన ఇంకా తెలివైన విధానాల్లో చెప్పా డు. దాన్ని అవగతం చేసుకోవడంలోనే
మీరు మీ జీవితకాలం అంతటినీ గడపవచ్చు .

శివుని త్రయంబక రూపం

మూడవ కన్ను ఉన్నందున శివుడిని ఎప్పు డూ త్రయంబక అని పిలుస్తా రు. మూడవ కన్ను
అంటే నుదిటిలో పగులు రావడం కాదు. దానర్థం ఏంటంటే, అతని అవగాహనా సామర్ధ్యం
దాని అత్యు త్తమ సంభావ్య తకి చేరుకుందని. మూడవ కన్ను , దృష్టి కలిగిన కన్ను . ఈ రెండు
భౌతిక కళ్ళు , కేవలం ఇంద్రియ అవయవాలు. అవి ఈ మనస్సు కి అన్ని రకాల అర్థంలేని
విషయాలను అందజేస్తూ ఉంటాయి, ఎందుకంటే మీరు చూసేది వాస్తవం కాదు. మీరు ఈ
వ్య క్తిని లేదా ఆ వ్య క్తిని చూస్తా రు, అతని గురించి ఏదో ఆలోచిస్తా రు, కానీ మీరు అతనిలో
శివుడిని చూడలేరు. కాబట్టి, మరొక కన్ను , లోతుగా చొచ్చు కుపోగల కన్ను , తెరవబడాలి.

ఎంత ఆలోచించినా, ఎన్ని తత్త్వా లు అల్లుకున్నా , అది మీ మనస్సు లో స్ప ష్టతను


కలిగించలేదు. మీరు సృష్టించే తార్కి క స్ప ష్టతను ఎవరైనా వక్రీకరించగలుగుతారు; క్లిష్ట
పరిస్థితులు దాన్ని పూర్తిగా గందరగోళంలో పడవేయ గలుగుతాయి. దృష్టి తెరవబడినప్పు డు
మాత్రమే, మీకు అంతర్గత దృష్టి ఉన్న ప్పు డు మాత్రమే, ఖచ్చి తమైన స్ప ష్టత అనేది
ఉంటుంది.

https://isha.sadhguru.org/mahashivratri/te/shiva/10-forms-of-shiva-explained/ 6/10
4/30/23, 10:45 AM శివుని 10 రూపాల వివరణ

మనం శివుడిగా పిలుస్తున్న ది అత్యు త్తమ అవగాహనా సామర్థ్యం యొక్క మూర్తీభవించిన


రూపాన్నే తప్ప మరొకదానిని కాదు. ఈ నేపథ్యంలోనే ఈశా యోగా కేంద్రం మహాశివరాత్రిని
జరుపుకుంటుంది. ప్రతి ఒక్క రూ కూడా తమ అవగాహనా సామర్థ్యా న్ని కనీసం ఒక మెట్టు
పెంచుకోవడానికి ఇది ఒక అవకాశము ఇంకా సంభావ్య త. శివుడు, ఇంకా యోగా అనేవి దీని
గురించే. ఇది ఒక మతం కాదు; ఇది ఆంతరంగిక పరిణామ శాస్త్రం.

Share

Related Tags
శివ తత్వం

Get latest blogs on Shiva

Full Name

Email

Country

I'm not a robot


reCAPTCHA
Privacy - Terms

Subscribe >

https://isha.sadhguru.org/mahashivratri/te/shiva/10-forms-of-shiva-explained/ 7/10
4/30/23, 10:45 AM శివుని 10 రూపాల వివరణ

Related Content

దేవర దాసిమయ్య –
తన సర్వ స్వా న్నీ ...

శివుని అత్యంత
భయానక రూపమైన...

ఆదియో
గి

తరుచుగా అడిగే ప్రశ్న లు

గత వేడుకలు

డౌన్లో డ్స్
శివ - వాల్‍పేపర్స్

మహాశివరాత్రి శుభాకాంక్షలు

శివ ఈ - బుక్స్

శివ - సంగీతం

శివ - వీడియోలు

మమ్మ ల్ని సంప్రదించండి


తెన్‍కైలయ భక్తి పేరవై, వెల్లింగిరి ఫుట్‍హిల్స్ ,
ఈశానా విహార్ పోస్ట్, సెమ్మే డు ,
కోయంబత్తూ రు - 641114

ఫోన్: +91 8300082000

న్లో
https://isha.sadhguru.org/mahashivratri/te/shiva/10-forms-of-shiva-explained/ 8/10
4/30/23, 10:45 AM శివుని 10 రూపాల వివరణ

మా యాప్‍ని డౌన్లో డ్ చేసుకోండి

సోషల్ మీడియా

© 2023
SADHGURU ALL
RIGHTS RESERVED | PRIVACY | TERMS & CONDITIONS

https://isha.sadhguru.org/mahashivratri/te/shiva/10-forms-of-shiva-explained/ 9/10
4/30/23, 10:45 AM శివుని 10 రూపాల వివరణ

https://isha.sadhguru.org/mahashivratri/te/shiva/10-forms-of-shiva-explained/ 10/10

You might also like