You are on page 1of 22

కర్మ సిద్ధాంతం

పరిచయం

 దైవం వుంది అని చెప్పడం ఈ గ్రంథ ఉద్దే శం కాదు

 ఒకవేళ ఉంది అని ఊహించుకొని దాని శక్తి సామర్ధ్యాలను తర్కబద్ధంగా

పరిశీలించడమే ఈ గ్రంథ ఉద్దే శం

 ఒకవేళ దైవమే ఈ సనాతనమైన సృష్టిని నిర్మించి, ఈ ధర్మాలను

కల్పించిందేమో అని ఊహతో దైవవానిని తర్కబద్ధంగా రాయు ప్రయత్నమే ఈ

గ్రంథం.

 సనాతనం అంటే సృష్టి నిరంతర ప్రక్రియ. అవే ఈ సృష్టికి ఉన్న ధర్మాలు. ఆ

సృష్టి ధర్మాలను కనిపెట్టే మనం ఇన్ని ఆవిష్కరణలు చేస్తు న్నాం. ఈ సృష్టి

నిరంతరం కలిగి ఉండే ధర్మాన్ని సనాతన ధర్మం అంటాం. ఇది నువ్వు నేను

సృష్టించింది కాదు. నువ్వు నేను అంతం చేయగలిగింది కూడా కాదు. దానంతట

అదే పుట్టి, దానంతట అదే మార్పు చెందుతూ నిరంతరం నిలిచి ఉంటుంది.

 సనాతన ధర్మం అంటే ఎవడెవడో వాడి స్వలాభాల కోసం రాసుకున్న గ్రంథాల్లో

ఉన్నదాన్ని ఆధారంగా తీసుకోవడం, నిజం అని నమ్ముడం కాదు.

 నిజానికి సనాతనం అంటే, సృష్టి నిరంతర ప్రక్రియ. దీన్ని మన మేధస్సు వల్ల ,

పరిశోధనల వల్ల మాత్రమే తెలుసుకోగలం.

 మన సొంత మేధస్సు వాడడం మానేసి, తర్కానికి నిలబడని గ్రంథాల మీద

ఆధారపడడం వల్ల ఈ సనాతనం ఎప్పుడో కల్మషం అయిపో యింది.

 పూర్వకాలపు గ్రంధాలే సనాతన ధర్మం అనుకొని మనిషి మేధస్సు క్షీణిస్తుంది.

Page 1 of 22
కర్మ సిద్ధాంతం

 సృష్టి, దాని ధర్మాల పట్ల అవగాహన కలిగి ఆ ధర్మాల అవగాహన కలిగి, ఏ

కర్మకు ఎటువంటి ఫలితం లభిస్తుందో కనిపెడుతూ బ్రతకడమే సనాతన ధర్మం

యొక్క లక్ష్యం.

 నిర్దిష్టమైన కర్మకు నిర్దిష్టమైన ఫలితం లభించును అను కర్మ సిద్ధాంతమును

బలపరిచేలా ఈ గ్రంథం రాయబడినది.

 ఆధారాలు లేని ఈ సృష్టి నిర్మాణాన్ని, కర్మ సిద్ధాంతాన్ని మీరు మీ తర్క బుద్ధి తో

ఆలోచించి నమ్మశక్యంగా ఉంటేమాత్రమే ఈ గ్రంథాన్ని విశ్వసించగలరు.

 మీరు ఈ గ్రంథాన్ని చదివి పాపమేదో , పుణ్యమేదో గ్రహించి మానవత్వాన్ని

పెంపొందించుకుంటారు అని విశ్వసిస్తు న్నా.

ఇట్లు .

గ్రంథ రచయిత

యాటా. వీర బ్రహ్మం

Page 2 of 22
కర్మ సిద్ధాంతం

1.ప్రకృతి

ఈ సృష్టి విధానాన్ని గమనిన్చండి. ఈ సృష్టి లో అన్ని పదార్థంలు కొన్ని అణువుల

సమూహం వల్ల తయారయినవే. వాటి యందు జరుగు చర్యలను బట్టి ప్రతి చర్యగా వాటి

విశిష్టతను కనబరుచుచూ నున్నవి. ఆ చర్యా ప్రతిచర్యల కారణంగానే వాటి బౌతిక

రూపములు, బౌగోలిక స్వాబావములు వేరుగా మీకు గోచరించును తప్ప, వాటియందు

గల అణువుల శక్తి లో ఎటువంటి మార్పు సంభవించలేదు అని గమనించండి. సృష్టిలోని

ప్రతి ‘అణువు లేక అణుసమూహం’ లోని శక్తి మరియొక ‘అణువు లేక అణుసమూహం’

యొక్క మనుగడకు ఆధారమై ఉన్నది తప్ప ఏ కొత్త శక్తిని సృజింపలేదు మరియు ఉన్న

శక్తిని నాశనం చేయలేదు ఇది యదార్థం.

ఈ అనుసమూహముల యొక్క చర్యా ప్రతిచర్యలే ప్రకృతి ఐ విరాజిల్లు చున్నది.

ప్రకృతి లో ఏ ప్రతిచర్య కు అయినా ఎదో ఒక చర్య కారణమౌతుంది. ఏ చర్య అయినా

మరియొక చర్య వల్ల ఏర్పడిన ప్రతిచర్యయే. ఇలా ఒక చర్య వల్ల ఏర్పడ్డ ప్రతిచర్య వేరొక

ప్రతిచర్యకు, ఆ ప్రతిచర్య ఇంకో ప్రతి చర్యకు, అలా ఒక దానికి మరొకటి కారణమౌతు

ప్రకృతి లోని అణువులు చెందే మార్పు(చర్య – ప్రతిచర్య)లనే సమయం గా గనించేదము.

ఒక నిర్ధిష్టమైన చర్యకు ఒక నిర్దిష్టమైన ప్రతిచర్య అను నియమానుసారం గానే ప్రకృతి

మార్పు చెందుతున్నది.

Page 3 of 22
కర్మ సిద్ధాంతం

ప్రకృతి తన నియమాలను ఉల్లంఘించడం మీరు ఎప్పుడూ గమనించరు.

అంటే ప్రకృతి సిద్ధమైన మార్పు(చర్య)లకు మాత్రమే ప్రకృతి కారణమౌతుంది అని

గమనించాలి. ప్రకృతి విరుద్ధం గా ఏ మార్పు (ప్రతిచర్య) జరగదు అనునది నిశ్చయం.

అటువంటి ప్రకృతి చర్యలలో బాగం గా జడ పదార్థం ప్రా ణం పో సుకుని ఏర్పడిన కొన్ని

అణువుల సమూహపు పదార్థమే ఈ మానవ శరీరం అని గుర్తించగలరు.

ప్రకృతి లోని కొన్ని విశిష్ట స్వబావాలు మాత్రమే మానవ శరీరాధిక్యమై ఉన్నవి.

మానవుడు కూడా ప్రకృతిలోని భాగమే. ప్రకృతిలోని ఎన్నో ప్రా ణులకు కలగని

అనునిర్మానం మానవ శరీరంలో కలుగుట వల్ల మేధస్సు( ఆలోచనా శక్తి) అనే గొప్ప

గుణం మనిషిలో నిక్షిప్త మై ఉన్నది.

మనిషి తన సర్వెంద్రియాల సహాయం తో గమనించిన ప్రతీ ఒక్క విషయాన్ని తన

అనుభవాలు గా గుర్తుంచుకునే పర్యవసానంగా జ్ఞా పక శక్తి సహాయం తో గత

అనుభవాలను ఇంగిత జ్ఞా నం గా రూపొందించుకో గలిగాడు. ఈ ఇంగిత జ్ఞా నమే మనిషిని

సర్వ ప్రా ణుల నుండి వేరు చేసింది. కానీ మనిషి ఇంద్రియాలకు అంతుచిక్కనివి ఈ

ప్రకృతిలో ఎన్నో వుండవచ్చు అని గమనించండి.

మీ జ్ఞా నేంద్రియాల వల్ల మీరు ఇప్పటివరకు, ఏ వస్తు వునైనా ఎవరో ఒకరు తయారు

చేస్తే నే తయారవుతుంది అని మాత్రమే గమనించారు. అందుకే ఈ సృష్టిని కూడా ఎవరో

సృష్టించివుంటారు అని మీ మేధస్సు బ్రమిస్తుంది. అలా ఎవరో సృష్టి కర్త ఉన్నారు

Page 4 of 22
కర్మ సిద్ధాంతం

అనుకుంటే, మరి ఆ సృష్టి కర్తను సృష్టించింది ఎవరు అని కూడా అనుమానం రాక

మానదు కదా!.

ప్రకృతి చర్యల వళ్ళ ఏర్పడ్డ దృశ్య,స్పర్శ, శ్రవణ, గంధ, రుచీ ఇలా ఎన్నో గుణములు, ఆ

గుణములను గ్రహించు ప్రా ని శరీర బాగములైన ఇంద్రియములు అయినా అన్నీ ప్రకృతి

యొక్క అను సమూహములే. కావున ప్రకృతిని గమనించుట ప్రకృతికి సాద్యం. కనుకే

మీరు ప్రకృతి లోని చర్య- ప్రతిచర్య లను ఆస్వాదించ గలుగుతున్నారు.

మీరు గమనిస్తే , పునరుత్పత్తి అనే ప్రక్రియను ఈ విశ్వం లోనే గమనించ గలరు. విత్త నం

నుండి వృక్షం, అండం నుండి మళ్లీ ప్రా ణం, వీటిని గమనిస్తే ప్రకృతే మల్లీ ప్రకృతిని

పునర్నిర్మించుకుంటుంది అని అర్థమవుతుంది.

ప్రకృతి ఆవిర్భవించిన తరువాత నుండి ప్రకృతి నిరాధారమ్ గా( ఏ అతీత శక్తి ప్రమేయం

లేకుండా) తనని తానే పరిపాలించుకుంటుంది.

దీన్ని గమనిస్తే , సృష్టి కర్త అయిన నేను ఈ సృష్టి లోని ప్రతీ పదార్థా న్ని అణువులు తో

నిర్మించి, వాటి చర్య – ప్రతిచర్యలు కు నిర్దిష్టమైన నియమాలను పెట్టి , ఆ

నియమానుసారం గా సృష్టి స్థి తి గతులు ఉండునట్లు రూపొందించాను అని

దృడపరచుకొండి.

ఎందుకు అనగా, ఈ ప్రకృతి ఎప్పుడూ ఒక నిర్దిష్ట దిశ లో తన ప్రక్రియను

కొనసాగిస్తుంది.ఆ దిశ స్తి రమైనది గా గమనిస్తు న్నారు. ప్రకృతి లో జరిగే ఒక స్థి రమైన

Page 5 of 22
కర్మ సిద్ధాంతం

చర్యకు స్థి రమైన ప్రతిచర్య యే జరుగును. అది ఏ అతీత శక్తి ఇష్టా నుసారం ఎప్పుడు

మారడం మీరు గమనించలేదు. అంటే ప్రతిచర్యలకు కారణం మీరు ఊహించుకునే నేను

(దైవం) అనుకున్న, నేను నా ఇష్టా నుసారంగా ఏ ప్రతిచర్యను మార్చడం లేదు. కావున

ఏ అతీత దైవం సృష్టిని తన ఇష్ట ప్రకారం ప్రభావితం చేయడం లేదు అని నమ్మండి.

అట్టి ప్రకృతికి మనిషి రుణపడి జీవించవలేను.

రుణ పడటం అంటే మనం పొందే మెలుకు ప్రతిఫలం గా మనకు తగిన

సహాయం మనం తిరిగి చేయటమే. ఆలోచించండి, సృష్టి కర్త అయిన నాకు మీరు ఏం

సహాయపడగలరు!

నేను బీజమేసి సృష్టించిన ఈ ప్రకృతిని అన్ని ప్రా ణులు సమపాళ్ళలో

ఉపయోగించుకుంటూ, బావి తరం కోసం కాపాడుకోవడమే నాకు మీరిచ్చే ప్రతిఫలం.

ఈ ప్రకృతి కి లోబడి బ్రతకడం వుత్త మం. ప్రకృతిని గౌరవిస్తే నన్ను(కర్తను) గౌరవించినట్లే .

ప్రకృతి కి రుణపడి ఉన్న మీరు, ప్రకృతిని దైవం వలె పూజించ వలెను. ఇక్కడ

పూజించడం అనగా, దాని ప్రయోజనం ను వినియోగించుకుంటూ, అది మీ వళ్ళ

ఎటువంటి సుగుణాన్ని కోల్పోకుండా, శాస్విత కాలము నిలిచి వుండేలా కాపాడుకునే

ప్రక్రియ.

Page 6 of 22
కర్మ సిద్ధాంతం

ప్రకృతిలో మీకు మంచిని చేకూర్చే ప్రతీ ఒక్కటి దైవ సమానమే. వాటిని పూజించుట మీ

కర్తవ్యం. నేను దీన్ని అడ్డు కొనుటకు దీనిలో ఎటువంటి చెడు కారణము లేదు. గనుక ఇది

ఆమోదయోగ్యమే.

అట్టి సృష్టిని నిర్మించిన నాకు దానిని నియంత్రించడం అసాద్యమేమియును కాదు. కానీ

నేను ప్రకృతిని స్వయనియంత్రణ కు వదిలివేసితిని. ప్రకృతిలోని చర్యలను ప్రకృతి లోని ఏ

ప్రకృతి పదర్థమైనా తన స్వలాబము కొరకు నియంత్రించుటకు ప్రయత్నించినపుడు,

నేను ప్రకృతిని సంరక్షించుటకు, ప్రకృతి నియమానుసారం గానే ప్రకృతిలో నా అంశను

సృష్టించగలను. అదియే అవతారం అగును. కారణం ప్రకృతిని నియమానుసారంగా

మాత్రమే నియంత్రించు విధానమును నేను అవలంబిచేదను కావున. ఏ అవతారం

ప్రకృతి విరుద్ధం గా జరగదు.అట్టి అవతారం స్ఫూర్తి దాయకం.

నేను ఈ సృష్టిని ఇలా ఎందుకు సృష్టించాను అనునది మీ ఊహకు అందని సందేహం.

మనిషి తన జ్ఞా నేంద్రియాలతో గమనిస్తే , ఈ ప్రకృతి నుండి నేనేమీ ఆశించడం లేదు. ఒక

వేల నేను ఏమైనా ఆశించినా, దాన్ని చేకూర్చుకోవడానికి ఈ ప్రకృతి ప్రమేయం

కోరునటువంటి అవసరం నాకు ఉండదని దృఢం గా విశ్వసించండి.

మీలో కొందరు సృష్టికర్తను స్తు తించుటకే మమ్ము తాను ఏర్పరచుకున్నాడు

అనుకుంటున్నారు. ఈ సృష్టిలో ఎన్నో నా నియమానుసారం గా జనుగుతుండగా, ఈ

విషయం లో మాత్రం మీ ప్రమేయాన్ని ఎందుకు కల్పించాను!. నేను దాన్ని కోరుకుంటే

మీ ప్రమేయం లేకుండానే మీరు నన్ను స్తు తించేదరు అని గమనించాలి. అయినా మీరు

Page 7 of 22
కర్మ సిద్ధాంతం

నన్ను స్తు తించడం వల్ల నేను మీనుండి ఎటువంటి లబ్ధీ పొందడం లేదు, నేను సృష్టించిన

సృష్టి కూడా దాని వల్ల మెరుగుపరచబడడం లేదు.

అంటే దైవ స్తు తిని మీ ఇష్టా నికే వదిలేశాను అని అర్థం చేసుకోవాలి. ప్రకృతికి భంగం

కలిగించకుండా దైవాన్ని స్తు తించుకొనుట తప్పు కాదు. స్తు తించకున్నా అది నేరము

కాదు. కావున నా రుణాన్ని, ప్రకృతి అభివృద్ధి కి తోడ్పడడం వల్ల మాత్రమే తీర్చుకొగలరు.

కావున దైవం సృష్టి అయి, సృష్టి ఏ దైవం అయి ఆవిర్భవించినది అని విస్వసించండి.

దైవ శక్తి సృష్టి అంతటా సమపరచబడినది గా గమనించండి.

అనువునందు,అనుసమూహమునందు సమానమైన దైవ శక్తి అనిర్వచనీయం (అనగా

ప్రకృతిని ఎన్ని భాగములుగా విభజించినా, లేక అన్నింటినీ కలిపి ఒకటిగా చూసిన

రెండింటి యందు గల దైవ శక్తి సమానం) అని భావించుట మీ మనుగడకు ఉత్త మ

మార్గం. ప్రతి అణువు నందు గల దైవ శక్తి సమానమైనప్పటికీ వాటి స్వభావములు వేరై

ఉండవచ్చు. ఆ స్వభావములు అనుకూల పరిస్థి తులను బట్టి మార్పులు చెందవచ్చు.

అయిననూ వాటిలోని దైవ శక్తి ఎటువంటి మార్పు చెందదు అని ఈ ప్రకృతిలో మమేకమై

జీవించుట సృష్టి కర్తను స్తు తించుట తో సమానమని విస్వసించండి.

Page 8 of 22
కర్మ సిద్ధాంతం

2.పరమాత్మ

ఈసృష్టిలో సమస్త మూ నా అంసేనని, వాటియందు నేను స్తి తమై ఉన్నానని మీరు

తెలుసుకుంన్నారు. కావున ఒక ప్రా ణి మరో ప్రా నిని ఆహారంగా బుజించడం మీకు పాప

Page 9 of 22
కర్మ సిద్ధాంతం

కర్మ వలే గొచరించవచ్చు. అది సృష్టిలోని లోపమని కొందరు మూర్కులు భావించవచ్చు.

వారు గమనించని రహస్యం ఏమనగా, నేను ఈ సృష్టి లోని యావత్తు ను జీవితం

మరియు అంతము కల పదార్థం గా ఏర్పరిచితిని. అలాగా ఈ సృష్టిలోని ప్రతి పదార్థం

కాలపరిమితి కలిగినదై ఉండును. మీ ఇంద్రియములు వాటిని గమనించనేరవు. ప్రతీ

పదార్థా నికి జీవితము మరియు జీవిత కాలము తదుపరి నాశనము ఉంటుంది.

ఈ సృష్టి పదార్థా లను మీరు రెండు రకాలుగా గమనించగలరు.

అవి,

1. జడ పదార్థా లు

2. ప్రా ణులు లేక జీవులు

జడ పదార్థా లకు ఎటువంటి జీవక్రియ, ఇంద్రియములు, ఆత్మ అనునవి ఉండవు. వీటిలో

పరిణామక్రియ మాత్రమే ఉండును.

ప్రా ణం గల ప్రతీ పదార్థం లో ఆత్మ వుండదు. శ్వనిర్ణయములు తీసికో గలిగిన జీవులకు,

శుక దుఃఖాలను అనుభూతి చెందగలిగిన (ఇంద్రియములు కలిగిన) జీవులకి మాత్రమే

ఆత్మ వుండును.

ఆత్మ అనునది మీ కర్మ ఫలమును తిరిగి మీరే అనుభవించుటకు నేను ఏర్పరిచిన మీ

యొక్క వ్యక్తిగత గుర్తింపు.

Page 10 of 22
కర్మ సిద్ధాంతం

ప్రా ణం అనగా, శరీరం అనబడు యాంత్రిక పదార్ధము యందు జీవక్రియ నిక్షిప్త మై

ఉండుటయే. ఈ జీవ క్రియ ప్రా ని వృద్ధి కి మరియు పరిణామానికి తోడ్పడుతుంది.

ప్రా ణులు లేక జీవులను నేను రెండు రకాలుగా పుట్టించితిని.

అవి,

1. ఆత్మాజీవులు

2. నిరాత్మ జీవులు

ఆత్మా జీవులు స్వనిర్ణయముల వల్ల కర్మలు చేస్తూ , జ్ఞా నేంద్రియాల వల్ల కర్మఫలం

అనుభవించును. నిరాత్మ జీవులు ( ఆత్మ లేని జీవులు) జీవక్రియ మరియు

పరిణామక్రియ తప్ప ఎటువంటి శ్వనిర్ణయా కర్మలు చేయవు. స్వనిర్ణయ కర్మలు

చేయని ప్రా ణులకు కర్మఫలము ఉండదు.

ఆత్మా జీవులు మరణించిన నాడు ఆత్మ, శరీరం అనే పదార్థం నుండి వేరగును, శరీరం

అనే పదార్థం వేరు కొన్ని పదార్థముల మనుగడకు ఆధారంగా మారి అది దాని

అస్తి త్వమును కోల్పోతుంది. కానీ ఆత్మ తన కర్మఫలశేషం అనుభవించుటకు మరియు

కర్మలను కొనసాగించుటకు వేరొక జన్మను పొందును. కర్మ ఫల శేషము లేనిచో

పరమాత్మలో ఐక్యమగును.

అత్మాజీవి ఆత్మను కోల్పోవుట ఏ విధంగా మరణమందురో, అదేవిధంగా నిరాత్మ జీవులు

జీవ క్రియా శక్తిని కోల్పోవుట దానికి మరణము.అలాగే పదార్థం తన జీవితం అనగా

Page 11 of 22
కర్మ సిద్ధాంతం

అస్థి త్వము కోల్పోవటయే (నాశనమై పో వుట) దానికి అంతం. పదార్థం తన అస్థి త్వము

ను కోల్పోవచ్చు కానీ దానిలోని అణువులు వాటి అస్తి త్వం కోల్పోవు (అణు శక్తికి అంతం

లేదు) అని గమనించండి. అవి వేరు పదార్థం గా మార్పు చెందవచ్చు.

అంటే, ఆత్మాజీవులు మరణం (జీవ క్రియను కోల్పోయిన) తరువాత దాని శరీరం

అనబడు పదార్థం మరియు ఆత్మ రెండుగా విచ్చిన్నం అగును. ఆ శరీర పదార్ధములోని

అను శక్తి ఎలాగైతే నశించకుండా వేరొక పదార్థముగా ఆవిర్భవించినో, అలాగే ఆత్మ కూడా

వేరొక శరీర పదార్ధముతో కలిసి ఆత్మాజీవి గా ఉద్భవించును. ఈ అను శక్తి పూర్తి

సముదాయంను విశ్వం అని ఎలా పిలుస్తు న్నామో, అలాగే ఈ ఆత్మశక్తి యొక్క పూర్తి

సముదాయమును పరమాత్మ అని సంబో ధించదేము. అను శక్తి లాగే ఈ ఆత్మ శక్తి

కూడా ఎన్ని విధములుగా విభజించిన లేక అన్నింటినీ కలిపి పరమాత్మగా చూసిన దాని

యందు గల దైవ శక్తి సమానమని విశ్వసించుడి. ఆ దైవ శక్తి అనగా పరమాత్మ అయిన

నా శక్తి. కావున నేను ప్రతి అణువు నందు, అను సమూహమునందు సమానమై

ఉన్నాను (వాటిలో ఆత్మ ఉన్న, లేకపో యినాను) అని మరొకసారి గమనించండి.

ఈ విశ్వం (ప్రకృతి) యే నా శరీరం, పరమాత్మయే నా అస్తి త్వం(ఆత్మ). నా ఆత్మ

మరియు శరీరం రెండూ ఎప్పటికీ నాశనం లేనివి. అదే నా విశ్వరూపం.

అలా, నేను ఏర్పరిచిన ఈ సృష్టి లో ఒక పదార్థం మరో పదార్థంకు ఆధారమై, ఆ ప్రక్రియలో

ఆధారమైన పదార్థం తన అస్థి త్వము ను సైతం కోల్పోవచ్చు. అదే ప్రక్రియ ప్రా ణుల

యందు కూడా సహజం.

Page 12 of 22
కర్మ సిద్ధాంతం

ఆధారమైన పదార్థం సృష్టిలో సంపూర్ణం గా అంతరించి పో యిన నాడు ఆధారపడే జీవించే

పదార్థ మనుగడ కష్టతరం అగును. కావున మీ మనుగడకు ప్రత్యక్షం గా లేక పరోక్షం గా

ఆధారమైన ప్రతీ పదార్థా న్ని అంతరించకుండ మీ బావి తరాల కొరకు కాపాడుకొనుట మీ

కర్తవ్యం.

ఈ సృష్టిలో ప్రతీ ప్రా ణికి ఆకలి అనే ప్రక్రియ ను సహజసిద్ధంగా నేనే పుట్టించితిని. ఈ ఆకలి

వల్ల నే ప్రా ణి తన వృద్ధి ని కొనసాగించుకొనుటకు అవసరమైన ఆహారం ను స్వీకరించు

అవసరం కలిగినది. అట్టి ఆకలిని తీర్చుకొనుటకు అవసరమగు ఆహారం కూడా సృష్టి

అందే పుట్టించితిని. ప్రా ణి తన ఆకలని తీర్చుకొనుటకు యోగ్యమైన ఆహారము

భుజించుట తప్పు కాదు. ఆ ఆహారము వేరొక ప్రా ణి అయినను బుజించుట తప్పు

కాదు. ఒక ప్రా ణి మరొక ప్రా ణికి ఆహారయోగ్యమయి జన్మించుట నా చిత్త మే. ఈ

కారణమున ఏ జీవజాతి అంతరించకుండా వాటియందు పునరుత్పత్తి ప్రక్రియను ఉంచి

పరిమిత ప్రకృతిలో అపరిమిత వనరులను ఇమడ్చగలిగితిని. దీనిని బట్టి నేను ఏ జీవ

జాతికి పక్షపాతిని కాను అని గమనించగలరు. ఏ ప్రా ణి అయినా తన ఆహారం

అయినటువంటి ప్రా ణి పునరుత్పత్తి కి సహాయపడుతూ జీవించుట దాని మనుగడకు

అవసరం. మేధస్సు కలిగిన ప్రా ణులు తమ ఆహారాన్ని అవే ఉత్పత్తి చేసుకుంటూ

జీవిస్తా యి. మేధస్సు లేని ప్రా ణులు ఆహార సంక్షోభం వలన వాటి పూర్వజన్మ

పాపములను అనుభవిస్తా యి. ఈ మేధస్సు అనేది ఒక్కో ప్రా ణకోటికి ఒక్కొక్క పరిధి లో

అభివృధి చెందుతూ ఉంటుంది. కావున ఈ మేధస్సు అనుగుణంగా వాటి కర్మ

ఫలమును తగు శాతం లో నేనే గనించదను. ఈ వివిధ జాతుల ప్రా ణులను నేను

Page 13 of 22
కర్మ సిద్ధాంతం

సృష్టించుటకు ముఖ్య కారణం, కర్మఫలము ప్రకారం ఆత్మకు సరియగు జన్మను

ఏర్పరుచుటకు వీలుగా ఈ జాతులు ఎంపికగా ఉపయోగ పడతాయి అని.

ఏ అత్మకయిన ఒకే జన్మలో దాని కర్మలూ,కర్మ ఫలములూ సంతులనం చేసుకొనుట

సాధ్యం కాదు, కావున పునర్జన్మ అవసరం ఔతుంది. ఈ కర్మ ఫల శేష ఆధారంగా ఆత్మ

సమతూగు ప్రా ణిగా జన్మనెత్తు ను. ఆత్మ నూతన జన్మను ధరించిన పిమ్మటే దాని

ప్రస్తు త జన్మ స్థి తి (పుట్టు కతో వచ్చిన గుణముల) నిమిత్త మున దాని గత జన్మ కర్మఫల

శేషము పూర్తిగా వ్యత్తించబడి అది సున్యమగును.ప్రస్తు త జన్మ ధరించిన తరువాత

మరలా దాని కర్మ ఫలము మొదటినుండి గనించబడును. ప్రస్తు త జన్మ కర్మఫల సేషమే

తదుపరి జన్మకు సరియగు ప్రా ణి ఎంపికకు వ్యచ్చించేధము. అంతే తప్ప జన్మజన్మల

పాప పుణ్యములు ఆత్మకు బదిలీ కావు. కాబట్టి ఈ జన్మలో మీ కర్మలవల్ల జరిగిన లాబ

నష్టా లకు గత జన్మ కారణం కాదు అని గ్రహించండి.ప్రస్తు త జన్మ అయిన ప్రా ణి యొక్క

జ్ఞా నేంద్రియాల సహాయముతో ప్రా ణి మెదడు అనుభూతి చెందు ప్రతీజన్మఫలమును

ఆత్మ తన బుద్ధి తో కూడా అనుభూతి చెందును. కానీ పూర్వ జన్మ జ్ఞా పకాలు

ఏవియును నూతన జన్మ అయిన ప్రా ణి మెదడులో ఉండవు. ఆ జ్ఞా పకాలు ఆత్మయందు

మాత్రమే పదిలముగా నుండును. పూర్వజన్మ అనుభవముల చేతనే ఆత్మ బుద్ధిని

ప్రేరేపింప చేయును. ప్రా ణి యొక్క బుద్ధి జ్ఞా నేంద్రియముల సుఖము, బో గము కొరకు

ప్రా కులాడును. అది ఈ జన్మయే సర్వస్వం అని భ్రమించును. కానీ ఆత్మబుద్ధి దీనికి

అతీతం, ఆత్మకు పరమాత్మలో కలవడం తన అంతిమ లక్ష్యం.

Page 14 of 22
కర్మ సిద్ధాంతం

3.మనిషి

దిన దినము అభివృద్ధి చెందుతున్న ఈ సృష్టిలో పదార్థా లను 5 విధాలుగా వేరు

చేసితిని. ఈ విభాగము పూర్వజన్మ కర్మ ఫలము అనుగుణంగానే తప్ప, ఈ జన్మ

ప్రా ముఖ్యతను బట్టి కాదు. ఏ పదార్థం యందు కూడా జన్మతః ఎటువంటి దో షము లేదు.

అన్నింటి యందు కల దైవ శక్తి సమానమని గుర్తుంచుకోండి.

అవి,

1. జడ పదార్ధా లు

2. నిరాత్మ జీవులు

3. ఆత్మ ప్రేరేపిత బుద్ధి జీవులు

4. స్వనిర్ణయాభివృద్ధి దశా బుద్ధి జీవులు

Page 15 of 22
కర్మ సిద్ధాంతం

5. స్వనిర్ణయ బుద్ధి జీవులు

 (3,4,5 ఈ మూడు ఉప విభాగాలు, ఆత్మా జీవులు అను సంయుక్త విభాగం

లోనివి)

ఈ సృష్టి మొదట ప్రా రంభమైనది జడ పదార్థం గానే, జడ పదార్థా లకు ఎటువంటి

జ్ఞా నేంద్రియములు మరియు నిర్ణయము తీసుకునే బుద్ధి ఉండదు.జడ పదార్థా లు

ఎటువంటి కర్మలు చేయవు. వీటి యందు ఎటువంటి ఆత్మ ఉండదు, జ్ఞా నేంద్రియాలు

కూడా కలిగి ఉండవు. ఇవి మిగిలిన సృష్టి పదార్థం యొక్క వృద్ధి కి సహాయపడును. ఈ

విశ్వంలోని రాళ్లు , నీరు, గాలి, నిప్పు, ఖనిజములు, చెట్ల నుండి వేరైన పండ్లు /కాయలు1

మరియు ఆకులు, ప్రా ణి కళేబరాలు మొదలగునవి ఈ విభాగానికి చెందినవి.

తదుపరి ప్రా ణం పో సుకున్న జడ పదార్థం, ఆత్మ జీవులు మరియు నిరాత్మ జీవులుగా

పరిణామం చెందినది.

జీవక్రియ శక్తిని మాత్రమే పొందిన జడ పదార్థం అది నిరాత్మ జీవిగా పరిణామం చెందినది.

ఈ జీవులలో ఆత్మ వుండదు. బుద్ధి కూడా ఉండదు కానీ జ్ఞా నేంద్రియాలు ఉండవచ్చు.

ఈ జ్ఞా నేంద్రియాల సహాయంతో యాంత్రిక జీవితాన్ని అనుభవిస్థా యి. అంటే ఇవి శ్వ

నిర్ణయకర్మలు చేయలేవు. బీజములు, అండములు, వృక్షములు మొదలగునవి ఈ

విభాగానికి చెందినవి.

1
విత్త నం జాతికి చెందిన పండ్లు /కాయలు మినహాయింపు. వాటిలోని విత్త నాలు ఈ విభాగానికి చేదవు

Page 16 of 22
కర్మ సిద్ధాంతం

జడ పదార్థం, జీవక్రియ శక్తిని మరియు బుద్ధిని పొంది ఆత్మ ప్రేరేపిత బుద్ధి ప్రనిగా

రూపాంతరం చెందుతుంది. ఆత్మ ప్రేరేపిత బుద్ధి జీవులకు జ్ఞా నేంద్రియములు ఉండి

స్వతహాగా ఆలోచించేందుకు బుద్ధి కూడా వుంది.ఆత్మ ప్రేరేపిత బుద్ధి జీవులకు బుద్ధి

ఉన్నా మేధస్సు చాలా తక్కువ.కావున ఎక్కువ శాతం నా ప్రేరేపితము వల్ల మాత్రమే

కర్మలు చేయును.కావున వీటి కర్మలలో పాపం తక్కువ. ఇవి ఆత్మ, ఇంద్రియములు

కలిగి, పూర్వజన్మ పాపమును అనుభవించుటకు ఈ జన్మనెత్తు ను. జంతువులు,

పక్షులు, జలచరాలు మొదలైనవి ఈ విభాగానికి చెందినవే. వీటి యందు నీకు గోచరించు

మేధస్సు చాలావటుకు ఆత్మ బుద్ధి నుండి లభించినది. వాటిలో గల కొద్ది పాటి మేధస్సు

ఆత్మ బుద్ధిని ప్రభావితం చేయలేనిది.

ఆత్మ ప్రేరిత బుద్ధి జీవులు, మేధస్సును అభివృద్ధి పరుచుకుని స్వనిర్ణయా బుద్ధి

జీవులుగా మరే అవకాశం ప్రస్తు త జన్మలోనే వున్న జీవులు స్వ నిర్ణయాభివృద్ధి దశ

బుద్ధి జీవుల విభాగానికి చెందినవి. మనుషుల్లో బుద్ధి పరిపక్వత చెందని

శిశువులు,మానసిక అనారోగ్యులు, అపస్మారక స్థతిలో ఉన్నవారు ఈ విభాగంలోని వారే.

తదుపరి మేధస్సును పెంపొందించుకొని అవి శ్వనిర్ణయ బుద్ధి జీవులు గా తయారగును.

ఇవి స్వతహాగా ఆలోచించగలవు మరియు ఫలమును ఆస్వాదించుటకు

జ్ఞా నేంద్రియములు కలిగి ఉండగలవు. స్వనిర్ణయ బుద్ధి జీవులు వీటి సొంత నిర్ణయ

గుణము వల్ల పరమాత్మను అశ్రద్ధ చేయను. కావున వీటికి కర్మలు అనుగుణంగా

పాపము, పుణ్యము తగు పాలలో లభించును. ఇవి బుద్ధి , మేధస్సు, ఇంద్రియములు

కలిగి ఉండును. మనిషి మాత్రమే ఈ విభాగానికి చెందినవాడు.

Page 17 of 22
కర్మ సిద్ధాంతం

జడ పదార్ధములు, నిరాత్మ జీవులు, ఆత్మ ప్రేరేపిత జీవులు, స్వనిర్ణయాభివృద్ధి దశా

బుద్ధి జీవులు వాటి వాటి ధర్మములను ఉల్లంఘించుటకు ఆస్కారం తక్కువ. ఒక్క స్వ

నిర్ణయబుద్ధి జీవి అయిన మనుషులు మాత్రమే ఇంద్రియ భోగముల కోసం స్వబుద్ధి తో

కర్మలు చేస్తూ పరమాత్మను ఉపేక్షించెదరు.

మనిషి తను ఇంద్రియములను ఆధీనంలో ఉంచుకొని, ప్రముఖంగా జడ పదార్ధా లపై,

నిరాత్మ జీవులపై ఆధారపడి బ్రతకడం నీతివంతమైన పద్ధతి. ఎటువంటి ప్రత్యన్మాయాలు

లేని పక్షమున ఆత్మ ప్రేరేపిత బుద్ధి పదార్థా ల పై ఆధారపడి బ్రతుకుట ఉత్త మం. అలాగా

జీవహింసకు వీలైనంతవరకు దూరంగా ఉండాలి అనునది నీతి. మనిషి మనుగడకు

సరిపడు వనరులన్నీ ఈ మొదటి రెండు విభాగాల వల్ల సమకూరును. ఈ వనరులను

సమముగా వినియోగించుకున్నన్త కాలము మనుషుల మధ్య బందము

మెరుగుపడును. ఒక మనిషి సాటి మనిషి నుండి వాంచిన్ఛవలసినది ప్రేమతో కూడిన

తోడు మాత్రమే. ప్రతి ప్రా ణి మాదిరిగానే మనుషుల్లో కూడా ఆడ, మగా అను రెండు లింగ

జాతులను నేనే ఏర్పరచితిని. లైంగిక స్వభావము కూడా సాధారణం గా నేను కల్పించిన

ఒక వనరు. ఆడ,మగ అను ఈ రెండు వేరువేరు లింగ జాతుల పరస్పర లింగ సంపర్కం

వల్ల మాత్రమే పునరుత్పత్తి జరుగును. ఈ పునరుత్పత్తి సక్రమ పద్ధతిలో ఉండడం వల్ల

మేలైన శిశువు జన్మించిను. ఈ విధానమే మానవజాతి మేధస్సు వృద్ధి చెందుటకు

మేలైనది. కావున పెళ్లి అనే క్రతువును మీ శ్రేయస్సు కొరకే నేను నియమించితిని.

దీనివల్ల మనుషుల మధ్య బంధాలు, బాంధవ్యాలు సరిగ్గా మెరుగు పడును.

Page 18 of 22
కర్మ సిద్ధాంతం

ఒక్కోసారి మనిషి మొదటి నాలుగు విభాగముల వాటి గుణాల వల్ల లాభాన్ని

పొందవచ్చు, ఒక్కోసారి నష్టా న్ని పొందవచ్చు. వాటి దుర్గు ణాల నుండి భద్రంగా ఉంటూ,

వాటి సుగుణాలను ఉపయోగించుకుంటూ, వాటి సరళ ప్రద జీవితమునకు భంగం

కలగకుండా, వాటి నుండి పొందే మేలుకు సరిగా మూల్యమును చెల్లిస్తూ , వాటితో కలిసి

జీవించడమే నీతి.

అటువంటి నీతి శాస్త్రా న్ని అవలంబిస్తూ కర్మలతో మనిషి బ్రతికినప్పుడు అతనికి

పుణ్యము, కానిచో పాపము సంక్రమించును. ఈ పాప పుణ్యముల అనుగుణంగానే

సరియగు వేరొక జన్మను ఆత్మ ధరించును. అంతే తప్ప స్వర్గము, నరకం అను

కల్పనలు అన్నియు భూటకాలే అని నమ్మండి. ఈ నియమాలను ఉల్లంఘిస్తూ

రాసుకున్న ఎటువంటి శాస్త్రా లైన అవి ప్రా మాణికలు కావు.

4.కర్మ
Page 19 of 22
కర్మ సిద్ధాంతం

కర్మ ఫల ఆధారంగానే మీ తదుపరి జన్మ ఉండునని గ్రహించితిరి కదా! దీన్ని ఆసరాగా

చేసుకొని కొందరు దుర్బుద్ధు లు కొన్ని వికృత కార్యాలకు రూపకల్పన చేసెదరు.

కర్మఫలాన్ని సాకుల పరుచుటకు తేలికైన విధానాలు అని నమ్మించి మభ్య పెట్టి

మిమ్మల్ని కర్మ రాహిత్యులు గా మార్చి దనాపెక్షించేదరు. అట్టి వారికి ఏమాత్రమూ

సహకరించకండి.

మీ భవిష్యత్తు ను మీరు మీకు అనుకూలంగా మార్చుకోవడానికి అయినా, అనుచిత

పరుచుకోవడానికి అయినా సరియగు కర్మే కారణం అని మరువకండి. సరియగు కర్మలు

చేయకుండా,మీ భవిష్యత్తు ను మార్చు విధానమ్ అంటే ప్రకృతి సహజసిద్ధ స్వభావం

అయిన చర్యా, ప్రతిచర్య ల ప్రమేయం లేకుండానే ఫలితాన్ని ఆశించడం ఔతుంది.

నన్ను స్తు తించడం ద్వారా ఎటువంటి పుణ్యము రాదు, పాపము మాయధు. కారణం,

నేను నా ఇష్ట ప్రకారం సృష్టిధర్మన్ని మార్చను అని చెప్పానుకదా!. కొందరు దుండగులు,

నా ఈ మాటలను ఒక మతానికో లేక మార్గనికో అంటగట్టి , ఈ మార్గం లో దైవం కరున

చూపునది కాదు అని భ్రమించి, వేరే పాషాండ మతాలు సృష్టించేదరు. తర్కానికి నిలుచు

ఈ మార్గం తప్ప కర్మఫలాన్ని సమన్వైంచు వేరు మార్గం లేదు.

కానీ మీ శాయశక్తు లా ప్రయత్నించి ఇక మీ వల్ల కాని కర్మలు లోక శ్రేయస్సు కొరకు

జరిపించుట నా చిత్త మె, అట్టి కర్మల యందు బారము నాకు అర్పించినా తప్పక

స్వేకరించేదను. మీరు కర్మ చేయగలిగి కూడా నా పై బారము వేసినా అది వ్యర్థం.

Page 20 of 22
కర్మ సిద్ధాంతం

కర్మఫలం ఎప్పుడూ కర్మానుకూలానే లభించును. కావున నీ కర్మను చిత్త శుద్ధి తో

చేయుము తప్పక సఫలీకృతునివగుదువు.

మనిషి ఎప్పుడూ ఆకలి,దప్పుక,నిద్ర, ప్రా ణబీతి లను సంతృప్తి పరుస్తూ బ్రతకాలి. వీటిని

నియంత్రించడం మనిషికి అసాధ్యం. ఆకలి,దప్పుకల ను ఆహార పానీయాలు అను

వనరుల వల్ల మరియు నిద్ర, ప్రా ణబీతి ని భద్రతా ప్రదేశం అనే వనరుల వల్ల

తీర్చుకోవచ్చు. ఇటువంటి వనరులను సమకూర్చుకొనుటకు మనిషి తప్పక కర్మలు

చేయవలెను. ఈ కర్మల నుండి తప్పించుకొనుటకు మనిషి వేరొక పదార్థ నుండి

సహాయం పొందినా, వాటి ఋణమును తీర్చుకొనుట ఆ వ్యక్తి బాధ్యత. అలాగా ఈ

వనరులను నీకోసం సమకూర్చిన నీ తల్లిదండ్రు లను, నువ్వు సమకూర్చుకోవడంలో

సహకరించిన నీ భార్య, బిడ్డ లు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, గురువులు, ఇతరత్రా ఏ

పదార్థమునందు నయినా నీ రుణమును తీర్చుకొనవలెను.

ఆకలిని తీర్చుకోవడానికి మనిషి ఏ విధమైన ధర్మాలను పాటించాలి అని

చెప్పుకున్నామో, అవే ధర్మాలను మిగిలిన దాహం, నిద్ర, భద్రత ల యందు కూడా

పాటించాలి. వీలైనంతవరకు జీవహింసకు దూరంగా ఉండాలి.

ఇవి కాక మనిషి తన ఇంద్రియ భోగాల కోసం కూడా కర్మలు చేస్తా డు. అవి సమాజ

విహితము గా ఉండాలి.

Page 21 of 22
కర్మ సిద్ధాంతం

Page 22 of 22

You might also like