You are on page 1of 1

దానికి అదే ప్రమాణము, అదే అన్నిటికీ ప్రమాణము.మనము ఒకరికి ప్రమాణము అవుతాము. మనకి మనము ప్రమాణము కాదు.

మనకి ఇంకొకడు ప్రమాణము ఉంటాడు కదా! మనకి చదువు చెప్పిన వాడు ఉంటాడు కదా! ఆదర్శముగా
ఒకడు ఉంటాడు. వేదము ఏమిటి అంటే, దానికి అదే ప్రమాణము. అది అన్నింటికీ ప్రమాణము. అందుకని వేదార్థమును తెలుసు కోవాలి. అందుకే ఆ పేరు కూడా వచ్చినది, వేదము అంటే తెలుసుకో తగినది అని అర్థము. బైబిల్ అంటే
పట్టుకో తగినది అని అర్థము. ఖురాన్ అంటే చదువ తగినది అని అర్థము.కానీ వేదము అంటే తెలుసుకో తగినది అని అర్థము. తెలుసు కోవటానికి, చదువురాని వాడు కూడా తెలుసుకోవచ్చు కదా! చదువుకోకపోతే వేద అర్థం తెలియదా!
వేద సిద్ధాంతం తెలియదా! తెలుస్తుంది. వేదము ఏమి చెబుతున్నది? మూడు తత్వములు ఉన్నవి. వీటిని వేదము ప్రతిపాదిస్తున్నది. ఒకటి ప్రకృతి. ఇది జడము. తరువాత రెండు చేతనము. జీవ తత్వము. జీవులు ఉన్నారు. అనేకులైన జీవులు
ఉన్నారు. ప్రకృతి ఉన్నది. జడము. జీవులు ఉన్నారు. సాధారణమైన జ్ఞానము ఉన్నటువంటి వారు. తరువాత విశేష మైన జ్ఞానము ఉన్న భగవంతుడు ఉన్నాడు. విశేష జ్ఞానము, జ్ఞానము, జ్ఞానరహితము. ప్రకృతి కేమో జ్ఞానము లేదు. జీవుని
కేమో జ్ఞానము ఉన్నది.కానీ పూర్ణ జ్ఞానము భగవంతునకు ఉన్నది. ఈ మూడు తత్వములు వేదము చెబుతున్నది. వీటిని మనం తీసుకొని, ఇక్కడ దేనికైనా అప్లై చేసుకొనవచ్చును. దీనిని త్రిరుత్వము అని అంటారు. మూడు తత్వములు
అన్నమాట. మీరు ఒక్కటే ఉంది అని అనుకుంటున్నారు అనుకోండి, ఆ ఒక్కటి ఏమనుకోవాలి? ఒక్కటి ఉన్నది అన్న వాడు మళ్ళీ, ఆ ఒక్కదాని కంటే వేరు అవుతాడా కాదా? నా ఇల్లు అంటే ఇల్లు వేరు, వీడు వేరు కదా? ఇతని ఇల్లే కానీ
ఇతడు ఇల్లు కాదు.శంకరుడు ప్రతిపాదించిన మాయ వాదము ఏదైతే ఉన్నదో, ఆయన అద్వైత వాదము ఏదైతే ఉన్నదో, అంతా భగవంతుడే అని అంటాడు. భగవంతుని కంటే వేరు అయినది ఏదీ లేదు అని అంటాడు.ఆ సిద్ధాంతాన్ని నీవు
అనుసరించి పోతే, దీన్ని అయిన తెలుసుకోవటానికి ప్రమాణము ఎవరు అవుతారు? శంకరుడు అవుతాడు.ఈయన అనేది ఏమిటి అంటే, అన్నింటికీ ప్రమాణము వేదము. వేదాన్ని ప్రమాణముగా తీసుకొని, శంకరుడిని కూడా చూడండి.
సమస్త ప్రపంచాన్ని సమస్త వస్తువులను వేద సిద్ధాంతముతో మీరు పోల్చి చూడండి. జీవుడు పరమాత్మ వేరే. కానీ అద్వైతము లో ఒకటే అని చెబుతారు కదా! ఒకటి కాదు అది. ఒకటి అయితే, కృష్ణుడు ఎందుకు ఇంత చెబుతాడు?
జరామరణములు నుంచి బయటపడటానికి,నన్ను ఆశ్రయించు. నన్ను ఆశ్రయించటం వలన నీకు ఏమి లాభము? పరమాత్మ నీకు తెలియ బడతాడు. అంతే కాదు నీవు కర్మఫలాలను నుండి బయటపడతావు. ఈ జరామరణములు దేని వలన
సిద్ధిస్తాయి? రాగద్వేషముల వలన. రాగద్వేషములు దేని వలన కలుగుతాయి? ప్రకృతి వలన కలుగుతాయి. అంటే సత్వ రజో తమో గుణాలు ఉన్నవి కదా, వాటి వలన. ఈ సత్వ రజో తమో గుణములతో కూడుకున్న ఈ బుద్ధి వల్ల మనకు
రాగద్వేషాలు కలుగుతున్నవి. రాగద్వేషాలు కలవటం వలన ద్వంద ప్రకృతులు ఏర్పడుతాయి. ఎప్పుడైతే నీవు ద్వంద ప్రకృతులు లో మునిగి ఉన్నావో, నీకు ఏమీ తెలియదు ఇక. అనకూడదు కానీ, కొత్తగా పెళ్లయిన వారికి, తల్లిదండ్రులను
మరచిపోయే పరిస్థితి వస్తుంది. అంతేనా కాదా! ఈ వ్యామోహము దేనివలన వచ్చినది? అంటే ప్రకృతి వలన వచ్చినది. అంటే ప్రకృతిని జయించాలి. దాన్ని ఇంద్రియ జయము అని అంటారు. రకరకాలైన వ్యామోహాలు ఉంటాయి.
ఎటువంటి వ్యామోహం లేని వాడు ఉండనే ఉండడు. ఇక వ్యామోహము అంటే ఏమిటి? అజ్ఞానము. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. వాడు వ్యామోహ పడుతున్నాడు అంటే, మోహము లో ఉన్నాడు అన్నమాట. మోహము లో ఉన్నాడు
అంటే, అజ్ఞానంలో ఉన్నాడని లెక్క మోహానికి అర్థం చెబుతున్నది వేదము. మోహాంధకారము అని అన్నాడు.అంటే అజ్ఞానం అనే అందకారం అన్నమాట. మోహము అంటే అజ్ఞానము. జ్ఞాన మనే ఖడ్గము చేత మోహమనే వృక్షాన్ని,
ఖండించు అని అంటాడు. జ్ఞానమును ఖడ్గముతో పోల్చి నారు.

You might also like