Professional Documents
Culture Documents
ముండకోపనిషత్తు
ముండకోపనిషత్తు
ముండక ఉపనిషత్తు లేదా ముండకోపనిషత్తు అత్యంత ప్రా చీన ఉపనిషత్తు లలో ఒకటి. ఈ ఉపనిషత్తు అధర్వణ
వేదమునకు సంబంధించింది. "ముక్తిత" సూత్రా లననుసరించి ఇది 108 ఉపనిషత్తు లలో 5 వ ది.
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
పండుగలు · పుణ్యక్షేత్రా లు
... · ...
ఇంకా చూడండి
శౌనకుడు అనే జిజ్ఞా సువు అంగిరస మహర్షి వద్దకు వచ్చి "ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?"
అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు "పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని
బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞా నం. అపరావిద్య అంటే లౌకికమయిన
ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి
విముక్తు డవుతాడు." అంటూ ఈ ఉపనిషత్తు ను బోధించాడు.
ప్ర థమ ముండకం
ప్రథమ ఖండం
భారద్వాజోంగిరసే పరావరామ్||
బ్రహ్మ అథర్వునకు ఉపదేశించిన బ్రహ్మవిద్యను ప్రా చీన కాలంలో అథర్వుడు అంగిరునకు బోధించాడు. ఆవిద్యనే
భరద్వాజగోత్రు డైన సత్యవహుడు అంగిరునివద్ద గ్రహించాడు. ఇలా పరంపరగా వస్తు న్న అపరావిద్యను
సత్యవాహుడు అంగిరసునికి అందజేశాడు.
విధివదుపసన్న: పప్రచ్చ|
శునక ఋషి కుమారుడూ, ఉత్తమ గృహస్తు డని పేరుపొందినవాడూ అయిన శౌనక మహర్షి శాస్త్రో క్తరీతిగా అంగిరస
మహర్షిని సమీపించి వినమృడై "హే భగవన్, దేనిని తెలుసుకోవడంవలన ఈ ప్రపంచం అంతా తెలుసుకోబడుతుంది?"
అని అడిగాడు.
అంగిరసుడు శౌనకునికి ఇలా బదులు చెప్పాడు. పరావిద్య అపరావిద్య అని తెలుసుకోవలసిన విద్యలు
రెండున్నాయని బ్రహ్మవిదులు చెబుతారు.
ఈ రెండువిద్యల్లో నాలుగు వేదాలు, వేదాంగాలైన శిక్షా, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, చందస్సూ, జ్యోతిషమూ అన్నీ
అపరా విద్యలే. ఇక శాశ్వతమూ, అమరమూ అయిన తత్వాన్ని అందించే విద్య పరావిద్య.
సాలె పురుగు ఎలా తన గూడును నోటినుండే వెలికితీసి తనలోకే తీసుకుంటుందో, భూమినుండి మూలికలన్నీ ఎలా
ఉద్భవిస్తా యో, మానవును తలమీదా శరీరంమీదా ఏ ప్రయత్నం లేకనే వెండ్రు కలు ఎలా పెరుగుతాయో అలాగే ఆ
అక్షరతత్త్వంనుండి ఈ విశ్వం ఉత్పన్నమవుతుంది.
తపస్సువల్ల ధర్మం పెంపొందుతుంది. ఆ బ్రహ్మంనుండి అన్నం పుడుతుంది. ఆ అన్నంనుండి ప్రా ణశక్తి, మనస్సు,
పంచభూతాలు, లోకాలు, కర్మలు, అన్నీ ఉద్భవించాయి.
సృష్టికర్త, సర్వవిదుడు, జ్ఞా నమే తపంగాగల బ్రహ్మ సకల ప్రా ణులు వాటి ఆహారం అన్నీ పరబ్రహ్మంనుంచి
ఉద్భవిస్తు న్నవి.
ద్వితీయ ఖండం
తదేతత్ సత్యం
ఋషులు వేదమంత్రా లలో ఏయే యజ్ఞకర్మలను దర్శించారో అవి అన్నీ కూడా సత్యమే. మూడు వేదాలు వీటిని చాలా
వివరంగా వర్ణిస్తా యి. సత్యప్రియులారా! వాటిని మీరు విధిగా నిరంతరం అనుష్ఠించండి. పుణ్యకర్మల ఫలితాలైన
లోకాలకు మార్గం అదే.
"https://te.wikipedia.org/w/index.php?
title=ముండకోపనిషత్తు &oldid=2458955" నుండి
వెలికితీశారు
Gangulas చివరిసారి 4 సంవత్సరాల క్రితం దిద్దు బాటు చేసారు