You are on page 1of 18

వికీసోర్స్

కందుకూరి వీరేశలింగం
కృత గ్రంథములు/శుద్ధాంధ్ర
నిరోష్ఠ్య నిర్వచన
నైషధము-
ద్వితీయాశ్వాసము
< కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు

ద్వితీయాశ్వాసము.

క. చుక్కలఱేనిని దాలిచి
యెక్కుడుగన్నునను నగ్గియెగయఁగఁగొటికల్

చక్కడఁచి సిరులఁజెలఁగెడు

జక్కులరాయనియనుంగు సంగడికాఁడా.

గీ. అల్లజడదారి యాక్రీడియనాతో

నిట్టు లనెనట్టు దొరనేలయెల్లనోడి

కట్టు గుడ్డలతోలేచికదలినంత

జరిగినదియెల్ల నెఱిఁగింతు జాలిగదుర.

ఉ. అంతనలుండునాగడియ నచ్చటనుండక యూరుదాఁటియొ

క్కింతయునళ్కు లేక నగరెల్లఁగనందిగ నాళులుండియా

చెంతకు నేరునుందఱియఁజేరకయుండుట చూచి కానకా

యింతిని దోడుకొంచుఁజనియెంగల చుట్టలు గుందుచుండఁగన్.

గీ. ఊరిదరికాననింతితో నుండియతఁడు

తాళఁగారాని యాకఁటఁదలఁకుచుండి

కనుఁగొనెఁగడాలు ఱెక్కలజెలంగు

ఱెక్కదారుల రెంటిని నొక్కచోట.

గీ. అట్లు గనియాతఁడెదలోన నాసఁజెంది

కలిక తననెలుక ఁదొరంగికట్టు చీర

ఱెక్కదారులుతన చేతఁజిక్కననుచు

నెగర వేసిన నదిగొంచునెగసెఁ జదల.

క.కోరిక నింగినిజనుచుం

దారేనేలయును సిరియుఁ దరలనఁడచియీ

తీరుననిట కేతెంచిన

సారెలగుటతెలియఁజేసి చయ్యనసరిగెన్. ​

శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

చ. ఇటుతనచీరయెత్తు కొని యేగనలుండును లోఁదలంకియం

     తటనెదలోనఁదేఱిచెలిదాల్చినచీరచెఱంగుతానునుం

     దటుకుననట్టె చుట్టు కొనితద్దయుఁగుందుచునుండికొంతచెం

      గటనలుతెన్నులున్నఁగనికల్కిరొచూచితె యంచునిట్లనున్.

క. అరుగుగుదెదారిదెసకిది

     యరుగున్నీతండ్రి యూరికల్లదికలికీ

      యరుగునదియునుజ్జయనికి

     నరుగుంగొసలకు నద్దియన్నిటిలోనన్.

ఉ. ఎద్దియొతెన్నునాకుఁజననిత్తఱిఁజానలుకారుకానలం

      దద్దయూనంగదల్ గుడిచితాళ్ఁగఁజాలరుకాననింటిలో

      నొద్దికఁజుట్టలంగలసియుయుండుటలెస్సగఁదోచెనాకునేఁ

       డెద్దియునడ్డు గానక యేగఁదగుందలిదండ్రు లొద్దకున్.

మ. అనినంగన్నులనీరుగాఱఁజెలియొయ్యన్ ఱేనికై చూచియ

       ల్లవఁదానిట్లనుఁగాననీకరణినేలాకుందఁగాఁగోరికల్

       దనరన్నాదగుతండ్రిసంతసిల నాతండేలునన్నేలకుం

       జనియందుండఁగఁజెల్లదేకలిసియిచ్చన్నీకునున్నాకునున్.

సీ. అనిననలుండునునౌకలయెక్కింత

యొరగించియించుకయూరకుండి

నీయాడినట్టు లనీదినాదియుఁగాదె

నీతండ్రియేలెడు నేలయెల్ల

నేఁదొల్లిసిరులచే నెసఁగుచునట కేగి

యీలాగునేలాగు నేగనేర్తు

నేలయులచ్చియు నెఱిఁదూలియటఁజేర

నాతిరోననుఁజూచి వగరె యొరులు

ద్వితీయాశ్వాసము

ఉసురులైనను దొఱఁగంగనోర్తుఁగాని

    యిట్టినడినొందఁగలనైననింతిచాలఁ

    గావనిదితక్క నొక్కటికలిగెనేని

    చేయఁదగునన్నతనితోఁజేడెయనుయె.

గీ. ఎన్నికడగండ్లు తొడగియు నెల్లరకును

    నన్నుఁటినిదోలికాచెడి దాలుగాదె

    యాలుతోఁగూడియుండెడునాతండెన్ని

    ఇక్కటుల్ గుడియును దానెఱుఁగకుండు.

క. అలయునెడల దగయునునాఁ

     కలియునునగుతఱినినాలుగాదేనేగుల్

     తొలఁచునుదననెయ్యునికిం

     గలఁగుచునిక్కరణి జాలిఁగైకొననేలా.

గీ. ఎట్టు లైనను నన్నునునెచటికేగఁ

     దలఁచితటకును నీతోడఁదనరఁగొంచు

     నేగఁదగుఁగాక నన్నొంటినిచటడించి

      యఱుకఁదలఁచిన నుసుఱులు తొఱఁగుదాన.

చ. అనిననలుండు చానఁగనుయల్లన నుట్లనునొంటినిన్నుఁగా

      ననునెనరేదిడించియెలనాగరొయేగుదునేకడిందికీ

      డెనయఁగనీడ నిన్నునిచియేగఁదలంచినఁదొల్లినిన్నుఁనేఁ

       గొనిచనుదెంతునేయిటకుఁగుందకు నేయెదనించుకేనియున్.

క. అనియూరార్చునొక్కటఁ

      జనిఁయాతఁడుకానను నడుచక్కనినొకచోఁ

      దనరెడిలోఁలోగిలి యొక్కటి

      కనుఁగొనిచేరంగఁజనియెఁగలికియుఁదానున్.

శూద్దాంధ్రనిరోష్ట్యనిర్వచననైషిధము

<poem>గీ. చేరఁజనియందు నిద్దు రఁజెందఁదలచి


కటికినేలను నొడలల్లఁగదియఁజేర్చి
కన్నుదోయికినిద్దు రసున్న యైన
లేచినలు కెలంకులు నట్టెచూచియంత.

క.కాలిదరినిదురఁజెందిన
యాలింగనికన్నుగొనలనతనీరొలుకన్
జాలఁదలంకుచుఁదనలో
జాలిగొనియతండు
సారెసారెకుననియొ

ఉ. ఓడితినేలయంతయును నోడీతిలచ్చిని గీడులొందితిం జేడెలు కాళులొత్తఁగనుజెన్నుగుజెందలి రాకు సెజ్జనీ


చేడియయుండఁదొల్లికని చిక్కని నల్లనిఱాలనుండఁగాఁ
జూడఁగ జాలనొండేడకు స్రు క్కకయేగెద నింకఁ జెచ్చిరన్.
గీ. నన్నుఁగై కొనికాదె యిన్నతియిట్టి
యెడరులకు నెల్లలోననియయ్యనింక నిచట
దీనిదిగ వాడి యెందేనినేనుఁజనినఁ
దవదుచూట్టా లకడఁజేరి తనరుచుండ.

గీ. అనుచుఁజెలి చీర నడచక్కి కల్లజించి కట్టు కొనిలేచిచయ్యనఁ గదలికొంత


దారినడయాడీ చెలిడింతచిరల లేక
తిరిగియరుదెంచి యెద్దియుఁ దెలియలెక.

ఉ. అయ్యెలనాగడించిచన నక్కలి రేచగ లేచు లేచి యా తొయ్యలినొంటిఁజేసి చనఁదోచక క్రన్ననఁగూరుచుండ ఁ దా


నుయ్యెలతీరుగా నెడఁదయాఁగఁగ నాఁగకయెట్టికేలకుం జయ్యనఁగానడించిననెఁ జాననుఇలోనెనరేది యొక్కతెన్. ​
ద్వితీయాశ్వాసము

గీ. ఇట్టు లచేతఁడేగఁ గ్రా ల్గు టి గట్టినిదుర


తెలసిలేచి నలుఁగడలుకలయఁజూచి
ఱేనిఁగానంగ నేరక లోనఁగలఁగి
చించియుఁడినతనచీర చెఱఁగుజూచి.

క. గుండెను ఱాయిడినట్లయి దండనున్నట్టి చెట్లతట్టు నఱాలం గొండలనారసికనకా


యండనునెలుఁగెత్తి
యిట్టు లడలదొడఁగెన్.

గీ. ఱేఁదతగునయ్య తొల్లినా తోడనోడ


కనుచునటులాడినెనరేది యక్కటకట
కల్లలాడంగ నెనొంటిఁగానలోన
నేట్టు లుంండును నిన్ను నేనెచటఁగందు.

గీ. ఉమఱులూడిన నిక్కటలొందుచున్నఁ


జుట్టలెల్లను నొక్కటగిట్టు చున్న దొసఁగులడరిన నాఁకటఁదూగుచున్నఁ
గల్లలాడకయుండుటగాదె లెస్స.

క. ఆలయుచుఁగాకులకూఁతల

కులుకుచుఁ గడునెండ సెగల నుడుకుచుఱాలం దలఁకుచుఁ జెట్టు లనీడల


నిలుచుచు నెలుఁగులకదరుచు నెలఁతుక
యడలన్.

క. ఇట్టు లు తూలుచుఁ ద్రెళ్ళుచు నెట్టనలేచుచునుగాననెఱిఁదిరుగంగాఁ


గట్టు లుకతోడఁద్రా చుల దిట్టయొకడు
నెలఁతకాలుదిగ్గనఁగఱిచెను. ​శుద్ధంధ్రనిరొష్ట్యనిర్వచన నైషదము

 క. కాలూడఁదీసికొనఁగాఁ

జాలకయికనైన నిచటఁజయ్యనదీనదీనిం

గూలిచి యోయొడయఁడ నను

నేలఁగదయ్యయని కలికియేడ్చునుండెన్.

క. ఏటీకి నొంటిఁగనేఁడీ

కాటికి నరుదెంచితచటఁ గడునాడలంగా

నేటికి నీ తెఱుగెల్లను

బోటికొ యెఱుగంగఁజేయు సూటిగ నాకున్.

గీ. అనినలు తోడగానల కరుగుదెంచి

యొడ లెఱం గక నిధురించి యుండుతయును

నచట దనుదించి యేలికయరుగుటయును

నిచటరోయుచుంటయు నింతియెఱుఁగఁజేయ.

క.నెలయల్లుఁడు కడుఁగ్రొ న్నన

చిలుకులెదంగాఁడనేసి చిక్కించింనలోఁ

గలఁగకతనకోరికయా

కలికికి నెఱిఁచె నెఱుఁగించె నెఱుకుకట్టిఁడియగుచున్.

ద్వితియాశ్వసము

చ. ఎలుగులు ఱేఁచులేనుగులు వేదులుగోతులుఁగారుదన్నులున్

సలుగులు నక్కలుంగలిగి సారెకు డాయఁగరానికానలొఁ

గలయఁగ నెల్లడం దిరిగి గాసిలియార్చుచును డస్సియేడ్చుచుం

దలఁకుచుఱేనిఁజీరుచును దాళఁగలలేక నెలుతయిట్టనున్.

నంచలార కడింది కొంచలార

కనుఁగొనరేయీరు కానలోనొడయని

జింకలార యలరుదొంకలార

చూడరేయీరలు సొగసుకానిని నెందుఁ

గొలఁకులార తుటారిచిలుకలార

తిలకించరేయీరు నలుని నెందునఁజెంచు

చేడెలారా చిఱుతయీడెలార

 తిన్నెలరా యేగేదఁగిగున్నలార

తేఁటులార మోజడదారిజోటులార

హత్తు లార యోక్రొ న్ననగుత్తు లార

చెట్టు లార యోచదలంటుగట్టు లార.

గీ. అనుచుఁ జెట్టు చెట్టు కరుగునరిగియెండ

నడుగుదోయికాల నడలు నడలి

నీడనీడనిలుచు నిలిచినూతులుగాంచి

తొంగితొంగిచూచుఁ దొడరినాతి.

గీ. ఇట్టు లెచ్చటనలుఁగాన కింతియెంటిఁ

గాననరుచునొకయేటి కడనుగాంచె

గాలినీరునాకులుఁదిండిగాఁగఁగొనుచు

నుండుకొందఱుజడదారులుండుచోటు.

<poem>శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

గీ. కాంచిసంతసించి గ్రక్కునఁగదియంగ


నేగిజోతచేసియిట్టు లనియెఁ
గనులనిందఱ నిటుగంటినోజదదారు
లారనేనునలునియాలి నతఁడు.

క. వన్నెదసి చనిననాతనిఁ
గన్నారంగానలేక కలఁగుదునిటకుం
గన్నారో యనియతుగఁగ
నెన్నుచునేతెంచి
తతనినెచ్చటనైన౯.

గీ. కనిననెఱుఁగంగఁ జేయుండింక నునతందు


కానరాకున్న ఁగోన్నాళ్ళలోననోడల
నుమరులెడలింతు
ననియేడ్చుచున్నఁగనిక
రించిదానికాజడిదారులిట్టు లనిరి.

క. తలఁకకుసియేలికనలుఁ
గలసెదుగొన్నాళ్ళలొయాతం
డలరుచుఁ దొల్లిఁటియట్టు ల
కలనేలయు నేలునిన్ను
ఁగలసినెలంతా.

చ. అనిజడదారులాడుచుచె యండఱుఁగానఁ రాకయేగఁగాఁ


గను@ఁగొని కల్లయోకలయొకాకని లోనఁదలంచుచేగిచ
య్యననడుకానదారిఁ జనునట్తిరిఁగొంఱిఁగాంచినేనుగ్ర
క్కున నగరొండుచేరెనను గొరికనీజతతోడనొక్కటన్,

చ. అనుచుఁదలంచు చున్నతఱినందలి యయ్యలుకాంచిరెంతయుం


దనరుచుఱేని లోఁదలఁచుదానిని గూడునునీరు
లేక కా
నేనుఁదోరగానకూరకమే నల్గ డలారయుచున్న దానిఁదాఁ జినిఁగీనగుడ్ద కట్తు కొని చిటికినేడ్చెడు దానిఁజేడియ ౯. ​
<poem>ద్వితీయాశ్వాసము

క. కనుఁగొని కానలఁగోరిక

లెనయుట కుంగాయగనురు లేఱుకొనితగఁ


దినియెడి జదదారికలిగి
యనుచుఁదలఁచినొక్క కొండఱందలిదిట్తల్.

ఉ. కొందఱుగాలిగాఁదలఁచి కుందిరి నక్కిరిచేట్టు నం


గొందఱు తద్దయున్న గిరి కొందఱు కేకనగొట్టి నొక్కటం
గొండఱు
రోసెదెద్దియని కొందఱుచేరిరి చెంతకొయ్యనం
గొండఱు కన్న తల్లితని కూడి జొహారులొనర్చిరింతికిన్.

గీ. అట్టియెడనాతికయంగ నరుగుదెంచి


యన్నలార నన్నిట్తు చూచియళుక నేల నిలిచిచూడుఁడు రాచచకన్నియనుగాని
నేనుజడియంగ గాలినిగానుజుండు.

క. నలునాలిని వతనిం
గానకనీతీరుగాఁగఁ గను నలనటతో
నేనడయాడెన నలునిఁగానలలోనన్, గానరెయెందైన
నలునిఁగానలలోనన్,

క. అనియడిగిననాసాతున
కునుదొరయైనట్టి శుచియ గునగునఁడఱియం
జనుదెంచి కాంచియిట్ళని
యె నెలఁతతోఁ
గన్నుఁగోనల నించుకనగుచు౯,
క. నలుఁగననెచ్చటనిందుల నెలుఁగులదున్నల నేనుఁగులను ని
చ్చలుఁగనుఁగొందునుచూఱదు
చెలియరొయెందయునునిందుఁజెటట్లతఱచున౯. ​<poem>శుద్దాంద్రనిరోష్ఠ్యనిర్యచననైషభము

క. ఈసాతునాకుఁదోడుగ

నేసేగియు లేకయిందు నెలనాగకొ నే


గాసిలకరిగెడాఁ చ్రా చుల కోసరిలుచునేఁడ్డు చైద్యునూరికిసరగన్.

సీ. నాతోడనచ్చట కే తెంచెదేనియు


నేనిన్ను ద్రో డ్కొని యేగుడు నన
నింతియీకొనంత నెంతయునెనరునఁ
దోడీసెట్టు లతోడ జేడేఁగొనుచు
నేగుచు నాయయ్య లెండనుగడుడస్సి
యెక చోటఁగూర్చుండి యున్నతఱిని
జీఁకటీకదిసినఁ జెంగటికొల నల్లఁ
జేరి యోర నిడ్డు రఁ గూరియుంద
నచటీకొక్కటనడగొండలట్ల్ల్ల్లతనరు
కొన్ని
యేనుఁగుల్ దగఁఁదీకొనఁదలంచి
యరుగుచెదెనుపడిరేయియళుకు లెక
సాతునిదురించుకడఁ జెట్ల చదిసికూల.

గీ. కటికిచీఁకటిలోఁ దెన్నుగానలేక


చచ్చిరరుగంగ నేరకచదిసికొద
ఱొడలెఱుంగక నిదురించుచున్న కతన
గొందఱడఁగి
రెఱుంగక కొలనుదరిని

ఉ.కొందఱు కాలి త్రొ క్కుడుల గొందఱు కోఱలోడళ్ళుగాడుటం


గొందఱు చేతి యేటులను గూలిన డొయ్యలి చూచి
యక్కటా
యిందఱుకాన నేడుమఱలిట్లు తొఱంగిరి కీడులంగడుం
గుందుచు నుండు నేజదిసి కూలక యుండితి నిద్దొ
సేయుచున్. ​క.:ఈసాతుచై ద్యునూరికి

దీసుకయేయెడును నన్ను దిన్నఁగవనుచో


నీసునవందఱఁగూలిచి
గాసిలఁగాఁజేఎస్ఁదాత కడుకట్టిఁడియై.
క. ​

                           శుద్ధాంద్రనిరోష్ట్యనిర్వచన నైషధము

గీ . -ఇట్లు తోడ్తెచ్చి చేలినా కెయెదురనిడి

దానిసొగసున కొక్కింత తల గదల్చి

యల్ల నల్లన నిట్లని యానితిచ్చే

దనరి యెదలొన ఁ గోర్కులు కొనలుసగ.

చ. చిఱిఁగిన చీరఁగట్టు కొని చేక్కులుకన్నుల కాటుకంటిడాల్

తఱిగిచెడంగ నెండకడుఁదాకి యెడల్ కసుకంద నొంటిఁ

న్న ఱిచెరలడనేల నినునాదట సేలెడునాత ఁడేఁడు నీ


తెఱఁగుఁగొఱంత యుంచకిఁకఁదేటనంతయు నానతిఁదగున్.

క. అనికడునెనరొలయంగా

ననిన నెల త ంగని నలునాలునుజాలిం

గొననిక ఱకుగుండె యతఁడు

గనిన ఁగనికరించునట్లు గా నిట్లనియె

క. నేనొకయెుడనియలను
దానొక ఁడొకఁడేగుదేంచి తక్కిన రేడుల్

కానుకలిచ్చిన ఁగై కొను


చేనును నాతండు నేలయెలుచునుండన్.

క. కల్లిరి దాయ యెుక ఁడతనిఁ

దల్లి రొజూదాన నొడిచి తగుసిరియెల్ల


     గొల్ల ఁగొననతడు నేనును
     నిల్లు ను గిడుకులనుడించి యెల్లరు జూడన్.

 ఉ. కానుల కేగి యాకులను గాయలు గడలు నారగించి క్రొం

దేనెల కొన్ని నాళ్ళచట ఁదిండిగనుండ నంతనంచ తే

జినర రౌతు కిన్ననెడచెసును రెనిని నన్ను గ్రు ళయై

యేనిట కేగుదేంచి తెట కేగెనొ రెడెరుగనెలంతుకా.

          ద్వితియాశ్వాసము

            

క. కానవనుడించి యతడొ ండుకకునేగ


నతని గానుక యడల చునకసి కొనుచు
గడ్డ లాకులు గుడుచుచు గానులొన
జికదుర నిదురునింతు జే ట్లక్రింద .

గీ ఇట్టు లాతని గనులొ నేల్ల యెడల


నరసికనుక కట్టి డినగుచు దల్లి

యిచట కేతెంచితి నటంచు నేరే గ నాడి

యేడే నెలు గేతి కొయిల లేగుదేర.

క. నాకడనిటనుండందగు

నీ కొకకొ ఱఁతయును లేదు నీకేడిడున్

లేకుండ ఁగఁదగ ఁగాచెద


నాకుతులతొడసరిగ నర సదని నిను ౌ

క . నీయెలిక నెల్లడలను
రొయననుతుజన్ని గట్ల స్రు క్కకులోనన్

నీయిచయ యినతీరన

నాయొద్ధనె నిలిచియుండు నాతుకయని౯

గీ. తొంటికం టె నెవరు తో ఁ చునట్లు గఁజూడ్కి

ఱేనితల్లియందెన యానఁజెసి

హళియళుకుగదుర నన్నెలంతుకయట్టె

యెలుఁగుసన్నగించి యిట్టు లనియె.

శుద్ధాంధ్రనిరోష్ట్యనిర్వచన నైషధము

<poem>గీ.తల్లినీయొద్ద నన్నుంచఁ దలఁచితేని


కడఁగినానేర్చునట్లు రాకన్నియలకు ననలుగై సేయు నింతినై
నగళులందు
నుండుదాననొండైన నేనుండనిచట.

క.ఒడయనిరోయంగాఁ జనఁ
దొడఁగిన యాజన్నిగల్లు తోఁ దక్కఁగనీ
యడుగాన లాఁతులంగని
నుడియొక్కటియైన
నాడనొల్లనుదల్లీ.

గీ.కాళ్ళుగడుగనెంగిలియంటఁగాదునాకు
నట్టు లైనను నీయొద్ద గుట్టు చెడక
యుందుననిననీకొని తనయొద్దికూఁతు
రగునునందచెంగటనుండనానతిచ్చె.

క.నిచ్చలునలు నెదఁదలఁచుచు
నిచ్చటనెలనాగయొండ నెడసిచని నలుఁ
డచ్చటఁగానలఁదిరుగుచుఁ
జెచ్చెరఁదిలకించె
నొక్కచెంతనుగానన్.

మత్తకోకిల.కొండదాఁకుచుఁ జెట్లఁగాల్చుచుఁ గూడితద్దయుఁగారుచి


చ్చెండగాయుచు నుండఁగాఁగడు
హెచ్చిచుట్టు కొనంగలో
నుండునాగులఱేఁడొకండిదె యోనలుండ యొకింతనే
గండడంగకయుండ గ్రక్కునఁ
గాచియేలఁగదేయనన్.

చ.ఒనరఁగనాలకించి యతఁడొయ్యన డాయఁగ నేగి యందులోఁ


గనుఁగొనెఁజుట్టు చుట్టు కొని కన్నులనీ రొలుకంగ
నేడ్చుచున్
నెనరునఁజిచ్చులోనడఁగి నీల్లకయుండఁగ నన్నుఁదీయ గ్ర
క్కుననిటురాఁగదయ్య
యనికుయ్యిడుత్రాఁచులఱేని నొక్కని౯. ​ద్వితీయా శ్వాసము

గీ. అతడును నలునకు జోహారొనర్చియనియె

నేనొక జడదారి కెగ్గు చేసి


కదలనేరకుంటి గర్కోటకుండండ్రు
నన్ను నగ్గిగదిసె నాల్గు దెసల.

క. ఇందుండి కెడయజాలను

సందిట నన్నెత్తికొనుచు సాగిచనికొలం


కెందున్ననచటానూఱట
చెందగ నన్నుంచ లగ్గు సేయుదునీకున్ .

గీ. అనిననింతంతయనరాని నెనరుతోడ

దన్ను గొనియేగగనొడలతందుకుంచి
చులకనైన యుండ దఱిజేరి యళుకులేక
యెత్తు కొనికారుకానలోనేగితేగి.

సీ. కొంతకురంగట గొలకొండుగని దాని గట్టు నడించంగ గడగజూ యింతతొందరయేల యింకనన్నో ఱేడ
యీరైదడుగులు గొంచేగియచట డించిననీకుగడిందిలగ్గొ నరింతు ననుడునడుగులెన్ని కొనుచునరుగ గర్కోటకుడుఱేని
గఱిచియిట్లనెనన్న నిన్నేనుగఱుచుట యెన్నరాని

కీడుగదలంచి యదలోననోడకింక దొంటిసిరి చెడికాన నిట్లుంటనినన్ను నొరులెఱింగిన నెగ్గగునోయటంచు


నీసొగసుదూలగఱచితి నీసులేక. శుద్ధాంధ్రనిరోష్ఠ నిర్వచన వైషధము

క. నాకోఱల చేదెన్నా

ళ్ళీకొనినీయెడలనుండు నికనన్నాళ్ళున్
నీ కేకడ నేచేదును
దాకదునిను జెనకలేరు దాయలునింకన్

గీ. కొన్నినాళ్ళకుదొల్లింటిచెన్ను గలిగి

యాలంతో గూడుకొని సిరుల్ చాలగుడుతు


తొంటిసొగసూని తిరుగనీకుంతయిచ్చ
యైననన్నుదలచునదియంతలోన.

గీ. చీరయొకటి నిన్ను జెచ్చెరజేరును

దానిగట్టజక్క నౌనునొడలు
తగునయోధ్య యనగ దనరునూరొక్కటి
యెంచిచూడనెందు నీడు లేక.

క. తగునైదైదుల రెండయి

సొగసగు తెనుగచ్చరాన నూటియెసంగన్


దగితెడుతుర్ణు లసందు గ
లిగిన ఋతుర్ణు డనుఱేడు లెస్సగనచటన్.

గీ.అతనిగొలిచియుండి యతనికి గుఱ్ఱా ల

దోలుజూడాయెల్ల దొలుతనొసగ
జెట్లయాకులలరు జేరకలెక్కించు
తెఱగునీకతండు తెలియజేయు. ​
ద్వితీయాశ్వాసము

గీ. నాలుగాఱులనాలుగై శ్రా లిడుద

యానుగలయచ్చ తెలుగచ్చరానదొలుత
నలరియుండినహుకుడననతనియొద్ద
నుండునదియని యానతియొసగిచనివు.

చ. నలుడునయోధ్య కేగియుట నల్గ డలు దిలించియొక్క చో

దళదళలాడురాచయిలు దగ్గఱగన్గొ ని చొచ్చిఱేనితో


గలయది యంతయుం దెలియగానెఱిగించి కలకడేటి జ
క్కులనడలోలిదిద్దగను గూరలిగూడును జక్కజేయగాన్.

క. తానేర్చు టెల్లనెఱుగం

గానాడి నినుగడునచ్చికం గొలుచుటకై నేనెరుదెంచితి ననుడున్


లోనంగడుసంతసిల్లి లోగకదొరయున్. ​
శుద్ధాంధ్రనిరోష్ఠ నిర్వచన వైషధము

శా. ఎచ్చోట న్ననుగాన కారయుచు నేనేతేరగా గానలో

నచ్చోనొంటిగనుండి యితలుకుతో నానాడెవంగుందితో


నిచ్చల్నన్నుదలంచి కానలగడుంజీ కాకులతో నుండితో
హెచ్చౌరాయిడి నొందజాల కకటా యొందైననందీల్గి తో.

క. తల్లిదండ్రు ల జేరితొ లే

కెలనాగరొ కానలేక యొందైనం జి


క్కులుగుడుచుచుంటొ యెట్లీ
యలజడి నేనీగగందు నక్కటానెలతా.

గీ. ఇరులగనుగొన్న నీసోగ కురులతీరు

దొగలజూచిన నీకనుదోయిడాలు
నింగిగాంచిన నీకౌనునిండుహొయలు
నెదకు దోచెడు నింక నేనెట్టు లోర్తు .

చ. అనుచు దలంచు చున్నతఱి నందలి లెంకయొకండు కొంత చెం

తనిలిచియాలకించి నలిదారసిలం జనుదెంచి చూచి యీ


చినిగినగుడ్ద లుం గుఱుచచేతులు గూనును సొట్ట కాళ్లు గ
ల్గి నయితనాలు నీతనిని గెల్చినచక్కన దంచు దద్దయున్ .

గీ. గేలిసేయుచు నగుచు జాల్చాలునితని

గనులనేరైన నొకసారి కనిరయేని


రేయికలలోననేతెంచు నీయనసొగ
పట్టు లయ్యునునింతికై యడలదొడగె.

సీ. అనియెదననుకొని యరుదెంచియాతని

గనుగొనియిట్లనె నెనరుతోడ
నీఇతలంచినయట్టి నెంతకుననీకును
నెడయాట కటకటా యేలకలిగె. ​ద్వితీయా శ్వాసౌము

  నన సిగ్గు దొలకాడ నాలోనగొండొక

క్రొ త్తయౌకత యల్లు కొనికడంగి

నాతుక నాకేల నాతుక కేనేల

నన్నుగన్గొ ని రేని నగనె చెలులు

తొల్లియొకలెంక తనయింతిదొలగియుండి

తల్లడిల్లిన తెఱ గేనుదలచుకొంటి

నంతయేకాక నేనేడయింతియేడ

యనుచుదనగుట్టు లో లోననడచెనతడు.

క. అక్కరణి న్నలుడుండగ

నిక్కడ నల్లు డుగూతు రెందులజనిరో

యక్కటయనియెద దలకుచు

గ్రక్కునగ్రధకై శికుండు కడునెరడరన్

గీ. సరగనిద్దఱరో యంగ జన్నిగట్ల

నల్దెశలకంచె దెచ్చిన నగకునూళ్ళు;

గొల్లగానొసంగుదు నంచు నెల్లరకును

దెలియగాజేసి యాసలు చెలగజేసి.

క. నేలంగల యూళ్ళన్నియు

జాలంగారోసియెందు జాననుపలుని

గాలించికొందఱు కనం

జాలక యరుదెంచి రిండ్ల చక్కికిదిరుగన్

క. తక్కటి కొందఱు నలుజెలి

నెక్కడనుంగానకూర కిండ్లకురా లో

నొక్కింతయునొల్లక కడు

నక్కఱతో దిరిగిచుండి రందందుదగన్.

శుద్ధాంధ్రనిరోష్ఠ నిర్వచన నైషధము

ఉ. అందొకజన్ని గట్టరిగి యల్లననాతుక యున్నయూరికిం

గొందఱతోడ గూడిచని కొల్లగ నీగియొసంగురాచయిల్


సందడిలోన జొచ్చి యొక చకినిగాంచె సునందలోనుగా
నందులోనున్న రాచయెలనాగలలోన నొయారినచ్చటన్ .

గీ. నీఱుగదిసియున్న నెఱచిచ్చునచ్చున

గూటనున్న చిలిక జోటిసాటి

జెన్నుదఱిగియున్న యన్ను గనుంగొని

తొలుతగలతెఱంగు తెలియలేక.

చ. నుదటనుగాననయ్యును గనుంగునగూడని నల్లచుక్క యొం

డెదుటను జూచిసంతసిలి యింతిని నన్నలుక్రా లుగంటిగా

నెదను నెఱింగి యీకరణి నింకినయేటి తెఱంగునం గడుం

జెదరినచెన్నునందనరె జేడె నలుండెడయైననంచులోన్

క. కడునడలుచు జేరంజని

జడిగొని కన్గొ నలనీరు జాఱగదల్లీ

కడకన్నిన్నరయగ ని

య్యెడనేనరుదెంచినాడ నెక్కటినిటకున్.

క. నీతల్లియుసైదోడులు

నీతండ్రియు గుఱ్ఱ లచట నెఱితోనున్నా

రోతొయ్యలి నిన్నును ఱే

డైతగునలు నరసికాంచి యరుదేరంగ౯.

గీ. నన్ను నీతండ్రియని చిన నిన్న నిటకు

నరుగుదెంచి యీ యూరెల్లనరసియరసి

నిన్ను గనగంటినిచ్చట నేడునాదు

గోర్కులెల్లగొనసాగెగొదలుడాగె.
ద్వితీయా శ్వాసము

క. ఎన్నడు చెలులంగలసెదొ

యెన్నడు తొల్లింటియట్టు లెనలేనిసిరుల్


చెన్నుగ నందెదొ యెన్నం
డన్నలతో గూడదండ్రియలరుచుగనుగో

క. నీయెదలో నించుకయును

నా యానకలకయుడుగు నన్నెఱుగుడె త
ల్లీ యేనుజన్ని గట్టను
జేయడయని నీదుతండ్రి చెలికాడనన౯.

క. తన కొడుకుగూతు దలచుక

కనుదోయిన్నీరునించి కలచుట్టల నె
ల్ల నడిగి యేడ్చుచునున్నం
గనుంగొనిసునందలోనుగా గలకలుకుల్.

ఉ. ఏలొకొ యింతియిక్కరణి నేడ్చుచున్నది చూచిరాదగు౯

జీడియలార రండనుచు జెచ్చెర డగ్గఱ జేరి రందులో


జాలిని దల్లిచెంగటికి జయ్యననేగి సునందచక్కగా
జేలనుచేర్చుచుం దెలియజేసిన నాయెలనాగక్రచ్చఱ౯.

క. చనుదెంచి తద్దయును నెన

రెనయంగా గూరుచుండి యెద్దియెచెలితో


ననుచుండునేల జేజే
గనియరుదెంది కడుతియ్యగా నిట్లనియె౯.

ఉ. తొంటితెఱంగ దెట్టియది తొయ్యలితండ్రియు నెందునుండు నే

యింటనుజొచ్చె నిక్కరణి నిచ్చటకుంజనుదెంచి యొంటిగా


నుంటకునెద్దికీలెచటనుందురు చుట్టలు తల్లిదండ్రు ల
న్నింటను జాలియుండుదురె నెట్టనదాచక యానతీయరే. ​

క. అనియంతయు దెలిసికొనం

దనయెడగోరికలు క్రేళ్ళుదాటంగానా
తనినన్నెలంతయడిగిన
నొనరగ నెరిగించి నిట్టు లున్న తెఱ్ఱంగున్.
క. ఇదిక్రధకై శికుకూతురు

చదురుండగు నలునిరాణి సరిజూదాన౯


జదురడగి నేలయెల్లను
దుదకాయన యోడీయాలుతో గానలకున్.

చ. చనె ననుటాలకించి యెదజల్లని యాక్రధకై శికుండు న

ల్లు నిదనకూతు జయ్యన నలుంగడ లారసి యెందునున్న గై


కొని చనుదేరగా ననిచెగొందఱ సాదుల జన్నిగట్ల నే
నును నరుదెంచి చేడియగు నుంగొనియుం దొలుతందటాలున౯.

గీ. గుఱుతిడంగలేక కొంతనిలిచితాత

సిరులుదొరకుకొఱకు చేసినట్టి
చిన్నెనుదుట గాంచి చెలరేగితుద కేను
నిన్నెలంతయౌటయెఱిఁగికొంటి.

మ. అనినన్నీళ్లు లి తేరగాననిచి యొయ్య న్నెన్నొసల్ తానెలో

నెనరారం దనచేతులంగడిగి చిన్నెంగాంచి రాకన్నియల్


కని యెంతో యరుదందగౌగిటను జక్కంజేర్చియాతొయ్యలిం
దనయోరంజెయిసాచిరాదిగిచి కన్నీరొల్క గానిట్లను౯

సీ. ననుగన్నతల్లి నేనునునీదుతల్లి యుఁ

జేదిదశార్ణు ని చెలికిగకిగి

నేనెతానుగనుండ నా నెలంతయుదొల్లి

యలక్రధకై శికు నాలియయ్యె ​


ద్వితీయా శ్వాసము

నేనునీచినతండ్రి కిక్కడనాలనై

యెన్నండు నినుజూడకున్న దాన

నాకుగూతురగుదు నాకడనింకనుఁ

గొన్ని నాళ్ళందఱగూడియుండి
తల్లి దండ్రు లజూడంగ దల్లినీకుఁ
గోర్కియౌతఱి నేగెదుక్కొడియంత
దనుకనిచ్చటనే యుండదగునునీకు
నడ్దు లాడిననింక నాయడుగులాన.
గీ. అనిన దల్లికి జోహారులొనర జేసి

దరిసునందనెత్తు కొని యాతల్లి యనిన


దాని కీకొనికొన్నాళ్ళు దండనుండి
యింతియల్ల ననొక్కనాఁడిట్ట్టులనియె.

క. ఈయిల్లు నునారయగా

నాయిలునాకొక్క సరియె యైననుదల్లి౯


న యనుఁగుఁగుఱ్ఱ లంగన
నీయెడనెంతయునుగోర్కి యెసగెడు నాకున్.

శా. కానన్నేనట కేగనానతియొసంగం జెల్లు నా నాతియున్

లోనింతం తనరాని జాలిగదురందొత్తు ల్ తగందోడరా


సానందీర్చినయీడు లేనిరతనాల్ చాలంగ జెక్కంగఁ జె
న్నైనీటొందుసరుల్ కడానినగలొయ్య గానితికిన్

గీ. ఒసగియడ్డలయందలానపకినుంచి

తల్లిదండ్రు లయొద్దకు దగినయట్లు


తోలజెలిరాక యూరనందొఱునెఱింగి
చూడనేతేర దనయిల్లు చొచ్చెగలికి. ​

గీ. అనినంతయు నాలించియరుదుగాంచి

చెంతజడదారిఁదిలకించిగొంతికొడుకు
నింతితనయిల్లు చేరినయంత నెద్ది
జరగెనానతీ జనునిక సరగననుడు

క. రక్కనులును జేజేలును

జక్కఁగఁగడలితరుచు తఱిజాలయియొడళుల్
చెక్కలు చేసినచేదును
గ్రు క్కంగొన్నట్టిఱేఁడకొట్టికసూడా.
పంచచామరము. కలంగితో డిరక్కసీండ్రు కాలికొల్ది దూటఁగాఁ
జెలంగుచుం దిగంచుక త్తిచేతఁ దళ్కులీనఁగాఁ
గొలందిలేనికిన్కతో డగ్రు డ్డు లెఱ్ఱఁజేసియా
తొలంగుహా త్తిసోఁకు ఱేనిఁద్రుంచినట్టిరాయ@ండా.

ఇది శ్రీమదాపస్తంబసూత్ర లోహితసగోత్ర కందుకూరివంశపయః పారా


వార రాకాకై రవమిత్ర సుబ్రహ్మణ్యామాత్యపుత్ర సుజనవిధేయ
వీరేశలింగనామధేయ వ్రణీతంబైన శుద్ధాంధ్ర నిరోష్ట్య
నిర్వచన నైషధంబునందు ద్వితీయాశ్వాసము.

"https://te.wikisource.org/w/index.php?
title=కందుకూరి_వీరేశలింగం_కృత_గ్రంథములు/
శుద్ధాంధ్ర_నిరోష్ఠ్య_నిర్వచన_నైషధము-
ద్వితీయాశ్వాసము&oldid=118857" నుండి వెలికితీశారు


Rajasekhar1961 చివరిసారి 7 సంవత్సరాల క్రితం దిద్దు బాటు చేసారు

వికీసోర్స్

You might also like