You are on page 1of 5

స్వరూపానుసంధానాష్ట కం

శ్రీ గురుభ్యోమ్ నమః శ్రీ మాత్రే నమః


అపార కరుణాసింధుం జ్ఞా నదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

శ్లో కం 1

శంపాలతాసవర్ణ ం సమ్పాదయితుం భవజ్వర చికిత్సాం |

లింపామి మనసి కిఞ్చన కమ్పాతటరోహి సిద్ధభైషజ్యం ||

శ్లో కం 2

దధానో భాస్వత్తా ం అమృతనిలయః లోహితవపుః

వినమ్రా ణాం సౌమ్యః గురుః అపి కవిత్వం చ కలయన్ |

గతౌ మన్దో గంగాధరమహిషి కామాక్షి భజతాం

తమః కేతుః మాతః తవ చరణపద్మో విజయతే ||


తపో యజ్ఞ దానాభిః శుద్ధ బుద్ధిః -
విరక్తో నృపాదేః పదే తుచ్ఛబుద్ధ్యా |
పరిత్యజ్య సర్వం యదా ఆప్నోతి తత్త ్వం
పరం బ్రహ్మ నిత్యం తత్ ఏవ అహం అస్మి ||

తా: తపస్సు, యజ్ఞ ము, దానము మొదలైన సత్కార్యములచే పరిశుద్ధ


బుద్ధి కలవాడై, రాజు మొదలైన పదవులలో తుచ్ఛ బుద్ధి కలవాడై,
సర్వము పరిత్యజించి, ఏ తత్త ్వమును మానవుడు పొ ందుచున్నాడో
నిత్యమైన ఆ పరబ్రహ్మను నేనే .. 1..

దయాళుం గురుం బ్రహ్మనిష్ఠ ం ప్రశాంతం


సమారాధ్య భక్త్యా విచార్య స్వరూపం |
యత్ ఆప్నోతి తత్త ్వం నిదిధ్యాస్య విద్వాన్-
పరం బ్రహ్మ నిత్యం తత్ ఏవ అహం అస్మి ||

తా: దయావంతుడు, బ్రహ్మనిష్ఠు డు, ప్రశాంతుడు, అగు గురువును


చక్కగా ఆరాధించి, బుద్ధితో స్వరూపమును విచారించి, ధ్యానించి,
విద్వాంసుడు ఏ తత్త ్వమును పొ ందుచున్నాడో , నిత్యమైన ఆ పరబ్రహ్మను
నేన.ే .. 2..

యదానందరూపం ప్రకాశస్వరూపం
నిరస్త ప్రపంచం పరిచ్ఛేదహీనం |
అహం బ్రహ్మ వృత్తి ఏక గమ్యం తురీయం
పరం బ్రహ్మ నిత్యం తత్ ఏవ అహం అస్మి ||
తా: ఆనందరూపము, ప్రకాశస్వరూపము, ప్రపంచాతీతము,
భేదరహితము, " నేను బ్రహ్మను" అను భావనచే మాత్రమే
తెలుసుకొనదగినది, నాలుగవది, నిత్యమైనది అగు పరబ్రహ్మను నేన.ే ..
3..

యత్ అజ్ఞా నతో భాతి విశ్వం సమస్త ం


వినష్ట ం చ సద్యో యత్ ఆత్మప్రబో ధే |
మనోవాగతీతం విశుద్ధ ం విముక్త ం
పరం బ్రహ్మ నిత్యం తత్ ఏవ అహం అస్మి ||

తా: ఏ బ్రహ్మ ను గురించి తెలుసుకొనకపో వుట వలన ఈ విశ్వమంతా


కనబడుచున్నదో , ఏ పరమాత్మ జ్ఞా నము కలిగినంతనే సంసారము
వెంటనే నశించుచున్నదో , మనస్సుకు మరియు వాక్కుకు అతీతమైన,
విశుద్ధ మైన, విముక్త మైన, నిత్యమైన ఆ పరబ్రహ్మను నేన.ే .. 4..

నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః


సమాధిస్థితానాం యదాభాతి పూర్ణ ం |
అవస్థా త్రయాతీతం ఏకం తురీయం
పరం బ్రహ్మ నిత్యం తత్ ఏవ అహం అస్మి ||

తా: ఇది బ్రహ్మ కాదు, ఇది కాదు అను వాక్యములచే అంతా


నిషేధించబడగా, సమాధిలో ఉన్నవారికి పూర్ణ ముగా ప్రకాశించునది,
మూడు అవస్థ లకు అతీతమైనది, అద్వితీయమైనది, ఒక్కటైనది,
నిత్యమైనది అగు పరబ్రహ్మను నేనే... 5..

యదానందలేశైః సమానంది విశ్వం


యదాభాతి సత్త్వే తత్ అభాతి సర్వం |
యదాలోకనే రూపం అన్యత్ సమస్త ం
పరం బ్రహ్మ నిత్యం తత్ ఏవ అహం అస్మి ||

తా: ఏ బ్రహ్మ యొక్క ఆనందలేశములచే విశ్వము ఆనందించుచున్నదో ,


ఏది ప్రకాశించుచుండగా సమస్త మూ ప్రకాశించుచున్నదో , దేనిని
చూచినచో ఇతరమంతా కనబడునో నిత్యమైన ఆ పరబ్రహ్మను నేనే... 6..

అనంతం విభుం సర్వయోనిం నిరీహం


శివం సంగహీనం యత్ ఓంకార గమ్యం |
నిరాకారం అతి ఉజ్జ ్వలం మృత్యుహీనం
పరం బ్రహ్మ నిత్యం తత్ ఏవ అహం అస్మి ||

తా: అనంతము, అంతటా వ్యాపించినది, నిర్వికల్పము, కోరికలు లేనిది,


శుభకరమైనది, సంబంధము లేనిది, ఓం కారము ద్వారా తెలియునది,
ఆకారము లేనిది, అతి ప్రకాశము కలది, మృత్యువు లేనిది, నిత్యమైనది
అగు పరబ్రహ్మను నేన.ే .. 7..

యదానంద సింధౌ నిమగ్నః పుమాన్ స్యాద్-


అవిద్యావిలాసః సమస్త ప్రపంచః |
తదా నః స్ఫురతి అద్భుతం యత్ నిమిత్త ం
పరం బ్రహ్మ నిత్యం తత్ ఏవ అహం అస్మి ||

తా: ఏ బ్రహ్మానంద సముద్రములో మానవుడు మునుగగా సమస్త


ప్రపంచము అజ్ఞా న విలాసముగా అగునో, దేని కారణంగా మనకు
అద్భుతమైన ఈ ప్రపంచము కనబడుచున్నదో , నిత్యమైన ఆ
పరబ్రహ్మను నేన.ే .. 8..
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రా జకాచార్యస్య
శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ
స్వరూపానుసంధానాష్ట కం సంపూర్ణ ం ..

You might also like