You are on page 1of 54

[10/17, 7:15 AM] మీ 🙏తిరునగరి rk

*తప్పులు అనేవికావాలనిఎవరుచెయ్యరు,
సందర్భాలు అలా వస్తా య్.....
*వెంటనే ఉండివెన్నుపోటుపొడుస్తుంటుంది,
*తప్పులు సహజం అంటాం కానీ,వాటివల్ల బాధపడ్డవారిని హింసిస్తాం..
*మనుష్యులం కదా కాబట్టే మనిషి చేతనే విమర్శకు లోనవుతాం?
*కాసేపాగి అర్డంచేసుకుంటే మీరు దేవుళ్ళే.
*మనిషిలో మార్పు రావడం అంటే,జరిగిన తప్పిదాలను గుర్తు చేస్తూ హింసించడంకాదు
ఎందుకు జరిగాయో అర్డంచేసుకుని అండగా ఉండడం...
*క్షణమొక యుగమై కృంగదీస్తు న్న, పరిస్థితు లను సైతం దీటుగాఎదుర్కొంటూ,చిన్న చిరు నవ్వులో ఎన్నో వ్యధలను కప్పిపుచ్చుతూ,
నిర్మలమైన,స్వచ్ఛమైన మనసుతోఅందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ,బాధ్యతతో కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ,ముందుడుగు వేసే
వాళ్ళ ధైర్యానికి మోకరిల్లా ల్సిందే.....
నువ్వు వెతుకుతూ వెళ్ళిన బంధం.. నిన్ను పదిమందిలో ఒకరిగా చూస్తుంది. కానీ..  నిన్ను వెతుకుతూ వచ్చే బంధం..నిన్ను పది
మందికి సాటి అనుకొంటుంది.అందుకే.. కోరి వచ్చిన బంధంను,చులకన చేయకు..మన అదృష్టా నికి మనమేకర్తలము.మనబాధలకు
మనమే కారకులం.మంచి చెడులను సృష్టిం చుకునేది మనమే.చేతులతో కళ్ళు మూసు కొని చీకటి అంటున్నదిమనమే అందుకే..
చేతులను తీసివేసి వెళుతురును చూద్దాం...
🌴💛
      ♥️       
వైరాగ్యము క్షమ ఔదార్యము మొదలగు వికారములు,అనగా గుణములు,సత్త్వగుణ ము నుండి కలుగును.కామక్రోధములు,లోభ
ము,ప్రయత్నము మొదలగు గుణములు  రజో గుణములు నుండి ఉద్భవించును.
ఆలస్యము(సోమరితనము)భ్రమ మత్తు మొదలగు వికారములు తమోగుణము వలన కలుగును.
సాత్త్వక వికారముల వలన పుణ్యము కలుగును.
రాజస వికారము వలన పాపము కలుగును
తమో గుణము వలన పుణ్యపాపము లేవి యు కలుగవు.రాయి రప్పలకు వలె నిరర్థక ముగ ఆయువుక్షయించిపోవును.ఇట్టిఅంతః
కరణ వికారములలో “నేను”అనే వికారము నకు కర్తయని పేరు.ఇదే లోక వ్యవహారము.
ప్రథమ ప్రకరణమున శరీరత్రయమును పంచకోశములను విచారించి
“తత్త్వమసి” అనే మహావాక్యమునందలి “త్వం”పదార్థము స్పష్టము చేయబడినది.
“సదేవ సోమ్య ఇదం అగ్ర అసీదేకమేవాద్వితీయమ్ “
అను వాక్యమున “ఇదం” శబ్దముచే జగత్తు సూచింపబడినది.ఆ “ఇదం” శబ్దమునకు అర్థము నిరూపిస్తూ ఆ జగత్తు న దర్శించు
ఏకాదశఇంద్రియములుకర్తయగు“నేను”      (అహంకారము) అన్నియు పంచభూత వికా రములని చూపబడినది.
పంచభూతములు తమః ప్రధానమగు ప్రకృతి నుండి జనించినవి.ఈ ప్రకృతి కృడా బ్రహ్మము యొక్క ఉపాధియే. కనుక ఈ
ఉపాధిని వివేచించి తొలగించినచో ఈ జగత్తు (ఇదం)కూడా బ్రహ్మము మాత్రమే (సత్ఏవ)అని తేటపడును.
నామరూపములతో నిండిన ఈ సృష్టి పుట్టు టకు పూర్వము సత్తు గా ఏకమై అద్వితీయ మై యుండినది.రెండవ వస్తు వే లేదని తెలు
సు కొనుము.ఆసద్రూప పరబ్రహ్మము“నేను” బహురూపములను ధరించెదని మొదట సంకల్పించెను.
సర్వకర్మలు,సర్వకామములు (శబ్ద,స్పర్శ, రూప)సర్వరస గంధములు బ్రహ్మమే.
ముందుగా తేజస్సు ఉత్పత్తి చేసెను.పిమ్మట జమును ఉత్పత్తి చేసెను.అందువలననే పురుషుడు తప్తు డై నపుడు స్వేదము వచ్చు
ను.అగ్ని నుండియే నీరు పుట్టినది.ఆ జల ము అనేక రూపములు ధరించవలెనని జల మునుంచి అన్నము పుట్టింపజేసెను. అందు
వలననే వర్షము కురిసిన సమృద్ధిగా అన్నము అభివృద్ధి యగుచున్నది.
🌹ఛాందోగ్య ఉపనిషత్తు .
బ్రహ్మమే కారణరూపముగా యుండి సత్యమై యున్నదని ఆధ్యాత్మిక విజ్ఞానము.
          💞♥️  💛    
మనకి ఉద్వేగం కలిగేటటువంటి అంశాలు ఏమేమిటీ అంటే ధనం,గృహం,ఆరామం, క్షేత్రం,సంపదలు,అనిత్యమైనటువంటి
ద్వంద్వానుభూతులు.ఏ ఏ అంశములందు మీకు ఆవేశం కలుగుతూవుందో చక్కగా గమనించు.
ఆవేశం ఎందువల్ల కలిగింది, నీకు సంగత్వ దోషం వుండబట్టికలిగింది లేకపోతేకలుగదు. సంగత్వ దోషం ఎందువల్ల వుంది? ఆసక్తి
వుంది కాబట్టి.ఆసక్తి ఎందువల్ల వుందీ అంటే దాని వల్ల నీకు సుఖమో, దుఃఖాన్ని దూరం చేసుకోవడమో,కొత్త సుఖాన్ని
పొందుతాననే భ్రాంతి వుంది కాబట్టి.ఆభ్రాంతిఎందుకుంది? నీకు సుఖాపేక్షయందు ఆసక్తి వుంది కాబట్టి.
ఎల్లప్పుడూ సుఖంగా వుండాలనే బలీయ మైన జీవభ్రాంతివుంది కాబట్టి.ఆ జీవభ్రాంతి ఎందుకుందీ? శరీరమే నేననేటటువంటి బల
మైన పునాది అభిమానము శరీరమునందు ‘దేహాభిమానమే నేను’ అనేటటువంటి బల మైన అభిమానం నీలో వుంది కాబట్టి
ఆయా అంశములను స్పృశించినప్పుడల్లా నీకు ఆవేశం కలుగుతుంది.తప్పదు.ఆ ఆవేశం కలిగిన ప్రతిఒక్కరూ కూడా ఈ ఆత్మాను
భూతిని పొందజాలరు.
కారణమేమిటి అంటే నీ అంతఃకరణము - మనసు బుద్ధి చిత్తము అహంకారము వీటి యందు ఆసక్తమై సంగత్వ దోషాన్ని నిరంత
రాయంగా పొందుతూ వుంటుంది. మీ ప్రతి ఒక్కరి స్వభావంలో గ్రహించండి -- మీరు ఇక్కడ చెప్పినటువంటి అంశాలలో ఏదో ఒక
అంశం మీద మీరు తప్పక స్పందిస్తా రు. స్పందించకుండా వుండలేరు. సమస్యలేదు అందులో. ఆవేశాన్ని పొందుతారు తప్పక. ఆ
ఆవేశాన్ని పొందితే ఆ రకమైనటువంటి సంగత్వ దోషం, మాలిన్యం మీలో ఏర్పడక తప్పదు.
  వీటియందు ఎవరైతే అసంగముగా, నిరాస క్తముగా వైరాగ్యముతో విషయప్రభావం లే కుండా నిశ్చలముగా,గంభీరముతోటినిమిత్త
మాత్రంగా,సాక్షిగా,ఎవరైతే వుంటారో వారు మాత్రమే ఆత్మజ్ఞానమును పొందుటకు అధికారులు.
ఇంకేమి చెప్తు న్నారు?“కామ్య కర్మలవలన కలుగు ఫలము ఐహికాముష్మిక సుఖములు కూడా అశాశ్వతమని ఎరుగుదును”.మనం
చేసేటటువంటి కర్మలన్నీ కూడా కామ్యక కర్మలు.అంటే అర్ధమేమిటీ? ఏదో ఒక కోరిక చేత ప్రేరేపించబడునవి.ఫలము చేత ప్రేరే
పించబడునవి అని కర్మలు ద్వివిధంబులు. కర్మ మనము చేసేటప్పుడు ప్రారబ్ధకర్మఅయి నప్పటికీ కూడా ఆ ప్రారబ్ధ కర్మ భాగంలో
రెండుంటాయి.కోరిక ఫలము.ఈ రెండింటి చేత ప్రేరితమవుతూ చేయబడినటువంటి సమస్తమూ కూడా కామ్యక కర్మే.
  భారతదేశంలో సనాతన ధర్మంలో బోధించ బోధించినది అంతాకూడా మానవులుకర్తవ్య కర్మను ఆచరించ వలనేగానీ అభిమానపూరి
తమైనటువంటి విశేషకర్మని ఆచరించరాదు. విశేషమైన ధనం ప్రాప్తిస్తుంది. విశేషమైనటు వంటి గృహంప్రాప్తిస్తుంది.విశేషమైనటువంటి
రూప లావణ్యవతిఅయినభార్య ప్రాప్తిస్తుంది లేక భర్త ప్రాప్తిస్తా డు.
విశేషమైనటువంటి క్షేత్ర దర్శనం జరుగు తుంది. విశేషమైనటువంటి శారీరిక బలం లభిస్తుంది. విశేషమైనటువంటి విద్యాబలం
లభిస్తుంది.విశేషమైనపాండిత్యంలభిస్తుంది. విశేషమైన శాస్త్ర జ్ఞానం లభిస్తుంది.విశేషమై నటువంటి బుద్ధిబలం లభిస్తుంది.
విశేషమైనటువంటి స్వర్గ సుఖం లభిస్తుంది. ఈ రకంగా ఎన్నివిశేషాలుచెప్పుకుంటూపోతే అన్ని విశేషములు మన జీవితమంతా పరు
చుకుని వుంటాయి. విశేషమైన సుఖం అన మాట దాంట్లో. అదొస్తే చాలండి.నేను లంకం త ఇల్లు కట్టు కుంటే సుఖంగా
వుంటాను.తరు వాత లంకేశ్వరుడు ఏమయ్యాడు? ప్రతివా డూ ఏమనుకుంటూ వుంటాడంటే లంకంత ఇల్లు కట్టు కోవాలి
అనుకుంటాడు.వాడి ఆలో చనంతా ఎప్పుడూ అంతే.కాని లంకేశ్వరుడు ఏమైపోయాడనే అంశాన్ని మాత్రం ఆలోచిం
చడు.ఎందుకనిటా? అప్పుడు ఆరకమైనటు వంటి అభిమానానికిలోనయ్యావుగా.అలాగే ప్రతివాడూ ఏమనుకుంటాడూ? శత
సంవ త్సరములు ఏరకమైనఅనారోగ్యం లేకుండా బలవత్తరమైనటువంటి దేహాన్నికలిగివుండా లి.ఇదీ లంకంతఇల్లు తో
సమానమే.ఇప్పుడా లోపల వున్నవాడు కూడా ఏమౌతాడు? అప్పుడూ? ఆ లంకేశ్వరుడే అవుతాడు. శరీరం కూడా నీ ఇల్లేగా.నువ్వు
నివసించే ఇల్లు ఎట్లా గో,నీ శరీరమే మొదటి ఇల్లు .
అలాగే డబ్బెంత కావాలి నాయనా? అబ్బ, నేనండీ ఒక ఏనుగు మీదకి ఎక్కి ఒక రత్నా న్ని గాలిలోకి విసిరితే ఎంత ఎత్తు వెళ్తుందో
అంత ఎత్తు ధనరాశి గనక నాకు లభిస్తే ఈ జీవితానికి సరిపోతుంది అన్నాడట.ఆ ధనం క్రిందే వాడు నలిగిపోతాడు అనమాట. ఎక్క
డికో పోవవసర్లా .వాడు నలిగిపోవడానికి,ఆ ధనమే చాలు.
  కాబట్టి ఏవేవిఅయితే నీ సుఖప్రాప్తికి అవస రమని నువ్వు నీ జీవితంలో నిర్ణయించుకు న్నావో వాటివలననే నీకుదుఃఖముతప్పదు.
అట్లా అనుభోక్తమవడం సృష్టి ధర్మం.ఈవిడ తో కలిసి జీవిస్తే నేనుసుఖంగా వుంటాను అని ప్రేమించాడు.ఏమైంది? ప్రకృతి యొక్క
ధర్మం ఏమిచేస్తుంది. ఆవిడ వలననే నీకు దుఃఖం ప్రాప్తించేటట్లు గా చేస్తుంది.చేస్తే ఏ మైంది అప్పుడు.ఆపూర్వపు అభిమాన బల
మంతా దూరమైపోతుంది అప్పుడు. కాబట్టి ఎవరితో అయితే దుఃఖం కలుగుతుందని నీవు అనుకుంటావో వారి వలన నీకు సుఖం
కలిగేటట్లు చేస్తుంది.
ప్రకృతి ఎప్పుడూ కూడా విలక్షణమైనటు వంటిదనమాట.నీ అభిమానమును పోగొట్టే టటువంటి పద్ధతిగానే ప్రకృతియొక్క నియ
మాలు వున్నాయి.ఈ సత్యాన్ని గ్రహించాలి. కర్మవశాత్తూ అంటూవుంటా మన్నమాట. అంటే నువ్వు ఊహించనివి జరగడం కర్మవ
శాత్తు అని నీఅభిప్రాయం.కాని నీ బుద్ధిబలం కూడా ప్రకృతిలోభాగమే.ఈ సత్యాన్ని గ్రహిం చాలి.కాబట్టి
అనిత్యములైనటువంటివాటిని నీవు ఆశ్రయించకూడదు. ఐహికము గాని, ఆముష్మికము గాని.
  ఆముష్మికము అనిత్యమెట్లా అయిందండీ అంటే స్వర్గలోక వాస సుఖముగాని, యక్ష లోక సుఖముగాని - చాలామంది ఈ
మధ్య  కాలంలో కుబేరుణ్ణి పూజించే వాళ్ళు ఎక్కు వైపోయారు. ఎందుకంటే కుబేరుణ్ణి పూజిస్తే ధనం బాగా ప్రాప్తించేస్తుందని
అందరి అభి ప్రాయం. అయితే ఆయన ఇంకొక అవకా శాన్ని కూడా ఇస్తా డు.
యక్షలోకాధీశ్వరుడు ఆయన.ఆ యక్షలోకం లో నీకు అవకాశాన్ని ఇస్తా డు.కాని యక్షులు అందరూ కూడా రాజసికమైనటువంటి
గుణ ధర్మముకలిగినవాళ్ళు.వారురాక్షసులకి అతి దగ్గరగా వుండేటటువంటివాళ్ళు.కాబట్టి తమోగుణ సహకారాన్ని తమోగుణ సహ
వాసాన్ని కలిగించేటటువంటి వాళ్ళు. మరి ఉత్తర జన్మలలో ఏమౌతావు?అప్పుడు జన్మ రాహిత్య పద్ధతిలో వెళ్ళలేవు కదా. ఆత్మాను
భూతికి చేరువ కాలేవుకదా.కాబట్టి ఎంతగా ఎవడై తే ఈ ధన గృహ ఆరామ క్షేత్ర అనిత్య సుఖ భోగ సంపద -వీటికి దూరంగా వుండ
మని పరమహంసచెప్తు న్నారు.కాంత కనకం. ఇదిచాలాముఖ్యం.వీటికి ఎవరైతే దూరంగా వుంటారో,వీటిని ఎవరైతే నిరసించివుంటారో
వీటియందు ఆసక్తి లేకుండా వుంటారో,వీటి చేత ఉద్వేగం పొందకుండా వుంటారో, ఆఖ రికి స్వర్గ సుఖం చేత కూడా నువ్వు ప్రేరేపిం
చబడ కుండా వుండాలి.అది కూడా కర్మ ఫల మే.కాబట్టి వాటిని అశాశ్వతములని ఎరుగ వలెను.అతిముఖ్యమైనదన్న మాట.
💘 💛
           ♥️    [10/17, 5:50 AM]
  *దీపం ప్రశాంతంగా ఉండి కాంతిని అన్ని వైపులా ప్రసరింపజేసి  తననుతాను పరిచ యం చేసికుంటుంది..ఆట్లా గే గొప్పవ్యక్తిత్వం
గలవారు కూడా నిశ్శబ్దంగా ఉండి తాను సాధించిన విషయాలను లోకానికి తెలిసేలా చేస్తా డు. తన బిడ్డలకు సమస్య ఎదురైతే పిడికిలి
బిగించి నేర్చుకోవాలి కానీ చేతులు సాచి కాదని నేర్పేది గొప్ప తల్లి
*మానవ చరిత్రనంతటిని పరికిస్తే ఘనకా ర్యాలు చేసినవారి జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువ సామర్ధ్యమిచ్చిన మూలశక్తి వారి
ఆత్మవిశ్వాసమే. మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడా ఆత్మవిశ్వాసమే.అట్టి ఆత్మవిశ్వా సం అన్నింటిని సాధించగలదు         
💙💗💙
      
దేహమును స్వీకరించి‌పుట్టినవాడు అవతా రపురుషుడు,.దేహమును కల్పింప బడిన వాడు జీవుడు.అవతారమూర్తి అంతర్యామి
త్వము నుండి జీవుడుగా దిగివచ్చును, జీవుడు ధర్మసాధన మార్గమున ఆరోహణ ము చేసి అంతర్యామి అగును.
వ్యక్తిగత మోక్షమంటూ లేదు,పరిమితమైన వ్యక్తిత్వము నుండి జగత్తత్వము (Universality) కి పరివ్యాప్తి చెందటమే మోక్షము.
ధర్మమును ఆచరించండి కాని ధర్మమును గురించి వాఖ్యానించక్కరలేదు. దీపమును వెలిగించితే వెలుగు వస్తుంది కానీ దీపపు
వెలుగును గురించి ఎంత ఎలుగెత్తి చాటినా ఫలితము లేదు.....
"ప్రతిగొప్ప విజయం వెనుకఎంతోప్రయత్నం, పట్టు దల,కష్టం...మరెన్నో త్యాగాలు దాగి ఉంటాయి."
"ప్రతి మనిషికి ఓక లక్ష్యం అంటూ ఉండాలి. అంతేకాదు..దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునేలా వ్యూహ
నైపుణ్యం కూడా ఉండాలి."
  "ఉత్సాహంతో శ్రమించడం,అలసటను ఆనందంగా అనుభవించడం విజయానికి ప్రాథమిక లక్షణాలు."
అహంకార పూరితులైన మానవులు తమ లోని కామ,క్రోధ, మోహ,మద,మాత్సర్యము లతో,అపాయకరమైన తనకూ,ఇతరులకు
కూడా హాని కలిగించేవాసనలతోతనయొక్క సంసార సాగరాన్ని సునాయాసంగా దాటి, ఆవలి ఒడ్డు కు క్షేమంగా చేరి, మోక్షాన్ని
పొందాలనే కోరిక, ఎంత ఆశ్చర్యకరము.
💓 💗💙
      
‘స ఆత్మ’ - ‘ఆత్మా అపరిచ్ఛిన్నః’ - అపరిచ్ఛిన్నః - ఏకముగా ఉన్నది.ఇదంతా అనేకముగా నీకు కనబడుతు వున్నదే తప్ప,
వాస్తవమునకు తాత్వికముగా ఏకముగానే ఉన్నది.ఇంత మంది లేరు. ఇంత సృష్టి లేదు. ఇన్ని నక్షత్రాలు లేవు. ఇన్ని గెలాక్సీలు లేవు.
ఇంత విశ్వకుటుంబం లేదు. ఇదంతా కలిపి ఒకే ఒకఆత్మ.స ఆత్మ.మరి అంతటా వ్యాపిం చి ఉన్నటువంటి ఆత్మకు,కదలడానికి అవ
కాశం ఉందా? అంటే లేదట.అంతటా ఉన్నది అన్నప్పుడు ఇకకదలడానికిఎట్లా ఉంటుంది?
*మీఇంటి యందు అంతటా గాలి ఉన్నదా ?  లేదా? ఉన్నది.మరి గాలి కదలడానికి అవకా శమున్నదా? గాలి అన్నివైపులా
కదులుతూ నే ఉందిగా అంటావు, కానీ ఆ గాలి ఆకాశ మనే ప్రదేశములో కదులుతుంది.మరి ఆకా శం కదలటానికి ఉందా అంటే,
ఆకాశానికి కదిలే అవకాశం లేదు. ఎందుకని?
అంతటా ఉన్నది కాబట్టి అనేటటువంటి సాదృశ్యంగా చెబుతున్నారే కానీ, ఆకాశము ను ‘ఆత్మ’ అనుటకు వీలులేదు.కారణంఏమి
టంటే, వాతావరణం ఎంత మేరకు భూమి చుట్టూతా వ్యాపించి ఉన్నదో, అంతమేరకే ఆకాశం అంటున్నాం మనం. దాని అవతల
ఉన్నదానిని అంతరిక్షం అంటున్నారు. మరి అదంతా కూడా విశ్వవ్యాపకంగా ఉన్నదిగా! కాబట్టి, ఆకాశమును ‘ఆత్మ’ అనరాదు.
  కానీ ‘తద్దూరే గతి,తన్నైజతి’ -ఎంతదూరం వెళ్ళగలదయ్యా అంటే,అనంత విశ్వం వ్యా పకం ఎంత దూరం అయితే ఉందో, అన్ని
లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరం వరకూ కూడా వ్యాపించి ఉన్నది. ‘తన్నైజతి’ - ఎక్కడికి కదలదయ్యా! ఎంతగా కదలద
య్యా అంటే, కదలడానికి అవకాశమే లేనం తగా, లేనటువంటి స్థా ణువుగా ఉన్నది. ఈ రెండు లక్షణాలు ఒకచోటే ఉన్నయట.అది
ఆత్మను వివరించేటటువంటి విధానము. అది అపరిచ్ఛిన్నము,అచలము. కదులుట కు అవకాశంవున్నది,కదలనిది.ఆత్మ దూర ము
పోతున్నట్లు గా కనబడుతున్నది.అత్యం త దూరముగా,విశాలంగా,ఎంతో దూరంగా ఉన్నట్లు కనబడుతోంది కానీ,అసలే కదల నిది
కూడా అదే! ఈ రకంగా ఆత్మ ఆనంద ము,ఏక కాలంలో ఆనంద రహిత్యముకూడా అయివున్నది.ఇది చాలా ముఖ్యమైనటు వంటి
ఆనంద అభావము,ఆనంద అభావ ము కూడా అయివున్నది. ఏకకాలంలోభావా భావ వివర్జితమై ఉన్నది.ఈరకమైనటువంటి స్థితి
భేదములతో ఆత్మలక్షణాలను వివరిం చడం జరుగుతున్నది.
       ఏమండీ,ఇట్లా మాటగా చెప్తే తెలిసిపో తుందా? తెలియదు.నీవు ఈ స్థితులన్నీ అనుభూతి పూర్వకంగా నిర్ణయింప చేసు
కోవాలి. ‘ఆనంద భావం’ - అంటే ఏమిటో తెలియాలి.‘ఆనంద అభావం’-అంటేఏమిటో తెలియాలి.‘భావ అభావ వర్జితం’-అంటే
ఏమిటో తెలియాలి.ఈ రకంగా ఆత్మనాకంటే వేరైనవాడెవడు తెలుసుకొనగలడు. అంటే, అంతటా ఉన్నది, నీ లోపల కూడా ఉన్నది
కదా,నీ బయటకూడా ఉన్నది కదా!
  కాబట్టి,అన్ని జీవులకంటే,బుద్ధి వికాసము కలిగిన మానవుడు తప్ప,ఈ ఆత్మను మరొ కరు గ్రహించలేరు.బుద్ధి వికాసము లేనటు
వంటి జీవులు,అసలే తెలుసుకోలేవు. బుద్ధి వికాసము కలిగిన మానవుడు ఒక్కడు మాత్రమే బుద్ధి యొక్క గుహయందు, హృద
యాకాశ స్థితుడై , ఆనంద స్థితుడై , ఫలాపేక్ష రహితుడై నిష్కామకర్మ సహితుడై , ఆంతరిక యజ్ఞాన్ని చేసేవాడై , ఈ
ఆనందభావమును, ఈ ఆత్మానంద స్థితిని తెలుసుకొన గలుగు తున్నాడు. కాబట్టి, దీనిని ఏమన్నారు? అంతర్ముఖుడు.
సదా అంతర్ముఖుడు,తన లోపలికి తాను తిరిగిఉన్నవాడు. అందుకుని, తాబేలు ముడుచుకున్నప్పుడు,ఎట్లా అయితే డిప్ప
మాత్రమే కనబడి,తాబేలు కనబడదో,అట్లాం టివాడన్నమాట ‘అంతర్ముఖుడు’ అంటే!   
💞 💗💙
       
భౌతిక గోళములో కొన్ని ప్రపంచములు లోహములు,వృక్షజాతులతో కూడియున్నవి కొన్నింటిలో అగణితమైన జీవరాసులున్నవి.
మరికొన్ని మానవులతో కూడియున్నవి. ఈ భౌతిక గోళములో అతి ప్రధానమైనది మన భూమి ,ఇక్కడ కొద్దిగనో గొప్పగనో భౌతిక
స్పృహగల జీవులన్నింటిలో,అన్నిభౌతిక ప్రపంచములలోని అన్ని జీవులకంటె పూర్ణ చైతన్యము గల మానవుడు శ్రేష్ఠు డు .
ఆధ్యాత్మిక విషయములను ఎంత చదివిన ను ఎంత చర్చించినను,ఎంత యోచించిన నూ మానవుడు సూక్ష్మ గోళములో మేల్కొ
న్నoత వరకు ఆతని చైతన్యము పూర్తిగా భౌతికమునే ఆవరించి యుండును.
మన భూమిమీదనున్న మానవులు, భౌతి కగోళములో అందరి మానవుల కంటే ఆధ్యా త్మికముగా శ్రేష్ఠు లు.
భౌతికగోళములో మానవులు నివసించు మూడు ప్రపంచములున్నవి.ఈ మూడింటి లో మన భూమియందున్న మానవులు
ఆధ్యాత్మికముగా శ్రేష్ఠతములు .
మనభూమియందున్న మానవుడు సమపా ళ్ళు గల హృదయమస్తిష్కములను కలిగి యున్నాడు.50 పాళ్ళు హృదయము + 50
పాళ్ళు తెలివి .
మిగిలిన రెండు ప్రపంచములోనున్న మాన వులు ఒక ప్రపంచములో నూటికి నూరు పాళ్ళు తెలివితేటలే.మూడవ ప్రపంచములో 75
పాళ్ళు హృదయమును 25 పాళ్ళు తెలివిని కలిగియున్నారు .
మానవుడు 84 లక్షల పునర్జన్మలలో, ఈ మూడు ప్రపంచములో ఏదేని యొక ప్రపం చములో జన్మించుచున్నాడు,కానీ చరమ
ముగా భగవధైక్యము యనెడు తన దివ్య భాగదేయమును కృతకృత్య మొనర్చుటకు ఈభూమిపై పుట్టు చున్నాడు.
సముద్రంలో వాన కురిస్తే..ప్రయోజనం లేదు.
పగటిపూటదీపంవెలిగితే..ప్రయోజనంలేదు.
ధనవంతునికిఇచ్చే చిరుకానుక ప్రయోజనం లేదు.
రోగాలున్న వ్యక్తికి రుచికరమైన భోజనం...
ప్రయోజనం లేదు.
అదే విధంగా ఒక మూర్ఖునికి, నీవు బుద్ధి చెప్పినా..ప్రయోజనం లేదు. "   
" ఎదుటి వారిలో నీకు నచ్చని గుణాలు
ఉన్నాయని ద్వేషించే ముందు,నీలోఅలాంటి గుణాలు ఉన్నాయో లేదో నిర్ధా రించుకో..! "
వ్యక్తు ల్ని ఆరాధించడం.....మానుకో!
వ్యక్తిత్వాన్ని అభిమానించడం...నేర్చుకో"..
" కాలాన్ని కాదన్న వాడు.. కాలంతో కలిసి పోతాడు.కాలం మాట విన్నవాడు, కలకాలం నిలిచిపోతాడు"....
  ఎన్నడూ ఆశపడని వాడు,ఎన్నడూ అసం తృప్తికి గురి కాడు..అధైర్యం అనేక అనర్ధా లకి దారితీస్తుంది. పేదవాడు ధనంకోసం
చూస్తా డు. ధనికుడు స్వర్గసుఖాలకోసం చూస్తా డు. కాని.....ఙ్ఞాని..ప్రశాంతత కోసం చూస్తా రు...
   గొప్ప గుణాలుంటే సరిపోదు.,వాటిని వినియోగించగలగాలి
ఎప్పుడై నా సరే అడిగే ప్రశ్నలో పద్దతి ఉంటే, వచ్చే సమాధానంలోసంస్కారం ఉంటుంది..
ఒకరు మరొకరికీ హాని చేస్తుంటే చూసి నవ్వ డం చాలా తేలిక...అదేహాని తనకి జరిగితే
భరించడం చాలా కష్టం....
ఒక నవ్వు చాలు స్నేహం మొదలు అవ్వడా నికి, ఒక చూపు చాలు హృదయం గెలవడా నికి, ఒక మాట చాలు యుద్ధం ముగించడా
నికి, ఒక అడుగుచాలు గెలుపుతీరం చేరడా నికి, ఒక స్నేహితుడుచాలు బాధలు మరవ డానికి...
స్నేహం చెయ్యడానికి ఒకే వయస్సు, ఒకే కులం,ఒకే అంతస్తు కానవసరం లేదు..అర్థం చేసుకునే రెండుహృదయాలు ఉంటే చాలు..
"నువ్వు గెలిచేవరకు నీకథ ఎవరికీ అవసరం లేదు.ఎవరూ నిన్ను పట్టించుకోరు. నీ కథ ఎవరికైనాచెప్పాలన్నా,వినాలిఅన్నాముందు
నువ్వు గెలవాలి."
"మనం మనకోసం చేసేది మనతోనే అంతరి చిపోతుంది.ఇతరుల కోసం చేసేది శాశ్వతం గా ఉంటుంది."
💗💙💗💞
         
*అజ్ఞాని*ఈగ లాంటి వాడు;*జ్ఞాని*తేనెటీ గలాంటివాడు.
*ఈగ* కనపడ్డ ప్రతీ 'చెత్త' మీద వాలు తుంది;.*తేనెటీగ* చక్కటి పువ్వు యొక్క 'మకరందం' మీద మాత్రమే వాలుతుంది.        
*అజ్ఞాని* ప్రాపంచిక విషయాలు మీదమోజు చూపుతూ మనసు నిండా చెత్తనునింపుకొని దురలవాట్లకు బానీస అవతాడు;కానీ
జ్ఞాని*  సుగంధ పుష్పము యెక్క మకరందాని ఆస్వాదిస్తూ,ఏది తినాలో,ఏది తినకూడదో, ఎంత తినాలో, ఎప్పుడు తినాలో; ఏది
చెయ్యాలో, ఏది చెయ్యకూడదో,అర్ధం చేసు కొని హాయిగా ఆనందముగా, సంతోషంగా, సంతృప్తిగా,జీవితాన్ని గడుపుతూఉంటాడు.
క్రమశిక్షణ లేని జీవినం ఎందులోను రాణించలేదు
❣️
         ♥️[10/17, 5:16 AM]
*పవిత్రంగా ఉండడం, పరులకు మేలు చేయడం ఇదే పూజలన్నిటి సారాంశం. పేదలలో, దుర్బలమైన వారిలో, పీడితుల్లో దేవుని
చూసేవారే నిజంగా దేవుని పూజించే వారు. దేవుణ్ణి కేవలం విగ్రహాల్లో మాత్రమే దర్శిస్తే, వారి పూజ ఇంకా ప్రాధమికమైందే.

*ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి మీరు అందరూ ఒకప్పటి వేదఋషులు. ఇప్పుడు మీరు వేరే రూపాలలో వచ్చారు,అంతే తేడా! మీ
అందరిలో అనంత శక్తిఉంది, పగటివేళ కాంతిలాగా ఈ విషయాన్ని స్పష్టంగా చూస్తు న్నాను.ఈ శక్తిని జాగృతం చేయండి,
మేల్కోండి, మేల్కోండి.
*        💙💗 💞 
*కళ్లముందే ఉన్న వాస్తవాన్ని గుర్తించ మంటుంది... వేదాంతం.....
*నిజమైన స్నేహంలో వందేళ్ళు కలిసి ఉన్నా తనివి తీరదు. ఒక్కక్షణమే కలిసి వెంటనే విడిపోయినా వెలితి ఉండదు. పరమాత్మతో
మన బంధం అలాంటిది. ఆయన సన్నిధిని అనుభవించిన లిప్తకాలం వందేళ్ల కష్టా న్ని తీరుస్తుంది. మనం దైవదర్శనానికి భౌతికం గానే
వెళ్తాం. మానసికంగా వెళ్ళలేము.కానీ ఆయన మనకు భౌతికంగా కనిపించరు, మానసికంగానే కనిపిస్తా రు.వేదాంతం ఏం
చెప్తుందంటే... కళ్ళముందే ఉన్న వాస్తవాన్ని గుర్తించ మంటుంది. ఆ వాస్తవ దృష్టే సత్య దృష్టిగా పరిణమించి గమ్యాన్ని సులభం
చేస్తుంది !
*స్వధర్మము అను దాని సూక్ష్మము తెలియ వలెను.లోకమున మంచిపనులు ఏవి ఉన్న వి? అని తడువుకొనువాడు మూర్ఖుడు. నే
నేమి ఆచరించిన మంచి కలుగునని ప్రశ్నిం చుకొనవలెను.నచ్చినను,నచ్చకపోయినను,గుణవంతమైనను,గుణ హీనమైనను స్వ
ధర్మము తనకు శ్రేయస్సు.ఎంత గుణవంత మైనను పరధర్మము శ్రేయస్సును కూర్చదు. వేదాధ్యయనము కన్న, బోధన విద్య కన్న,
వాణిజ్యం ఎక్కువ సుఖ సంపదలుఇచ్చును. అట్లని బోధన ధర్మశీలుడు తన వృత్తి మాని వాణిజ్యం ఆరంభించినచో ఉభయభ్రష్టు డు
అగును. అన్నము తినుట మానుట కన్నా మంచిది. అట్లని జ్వర పీడితుడు భోజనము చేసినచో శ్రేయస్సు కాదు.‌బుద్ధి బలము
కలిగి శరీర దృఢత్వం లేని వాడు దేహకర్మ చేయుటశ్రేయస్సుకాదు. ఇట్లే తన ప్రకృతిని అనుసరించి గుణవంతము కాకపో యినను
స్వధర్మమునే ఆచరింపవలెను.‌
*ఒక్కొక్కప్పుడు స్వధర్మమున చచ్చుట మేలు. యుద్ధ భటుడు యుద్ధము చేయవల సిన సమయమున వేదములు చదువుకొన్న
చో శ్రేయస్సు అగునా? పాఠ్య గ్రంధముల పరీక్షకు సిద్ధమగు విద్యార్థి మంచి పని అని గీతాపారాయణం చేసినచో ఏమగును? కనుక
స్వధర్మం ఎప్పుడును శ్రేయస్సును నిచ్చును. పరధర్మము ఎప్పుడును భయమును కలిగించును.*
*ప్రకృతి మానవులచే పని చేయించుచుండు నని చెప్పితివి.‌ఇక మానవుడు పాపకార్య ములు ఆచరించుట ఎట్లు జరుగుచున్నది?
ఇష్టము లేకపోయిను బలీయముగా ఆకర్షిం పబడి ఎవరి చేతనో నియోగింపబడినట్లు మానవులు పాపము చేయుచున్నారు. దానికి
కారణం ఎవరు?*
💙💗 💞💗
            
*"సంతోషం,ఆనందం ఒక్కటేనా ? ధ్యానఫలితం కూడా అదేనా...."?
*వస్తు వు ఒక్కటే అయినా మనం పొందిన విధానాన్ని బట్టి దాని భావన మారనట్లే సంతోషం, ఆనందం ఒక్కటే అయినా భావం లో
తేడా వల్ల మార్పుగా కనిపిస్తుంది. ఎవ రైనా మనకు ఒక ఉంగరం ఇస్తే దాన్ని బహు మతి అంటాం.అదే లాటరీలో తగిలితే అదృ ష్టం
(లక్కు,ప్రైజ్) అంటాం. ఆనందం మన సహజ స్వరూపం.అది వ్యక్తంకాకుండా మన లోనితలపులు అడ్డు పడుతూ ఉంటాయి.ఆ
తలపులు తొలగిపోగానే ఆనందమే సంతో షంగా వ్యక్తం అవుతోంది.ప్రయత్న పూర్వకం గా ఆలోచనలు ఆపి ఆనందాన్ని పొందాలని
ప్రయత్నం చేస్తుంటాం.దానికే మనం ధ్యానం అని పేరు పెట్టు కున్నాం.ఆలోచనలు ఆపటం వలన కొత్తగా ఏ
ఆనందంరావటంలేదు.మన లో ఉన్న ఆనందమే మనకు లభిస్తుందనేది ధ్యానంలో తెలిసే విషయం !
💗 💞💗
           
ఆంతరిక సమాధిని, అంతర్యామి తత్వాన్ని, ఆ అంతఃకరణ చతుష్టయాన్ని దాట గలిగే టటువంటి,సమర్థమైనటువంటి,ఆ మనస్సు
ని అంతర్ముఖం వైపుకు, మనస్సుని ఆత్మ యందు సంయమింప చేసేటటువంటి ఏ ప్రయత్నం ఉన్నదో,దానికే ధ్యానం అని పేరు.
అంతేకానీ, ఇతరములైనటువంటి, బాహ్య ములైనటువంటి, దృశ్యవిశేషము లైనటు వంటి దర్శనానుభూతులైనటువంటి, భావ
విశేషములైనటువంటి,భావ వ్యక్తీకరణ లైనటువంటి వాటిని ధ్యానమని పిలుచుట అసంబద్ధం.
   ఎవరికైతే మనస్సు ఆత్మయందు సంయ మింపచేయబడి,వ్యవహారశీలమైనటువంటి మనస్సు లేనటువంటి వారుంటారో, వారు
మాత్రమే ధ్యానం చేస్తు న్నారు.విధిని చక్కగా ఎరిగినటువంటి వారు.వ్యవహార శీలమైన టువంటి మనస్సు కలిగినటువంటి వారంద
రూ తప్పక వారి వారి ఇంద్రియాసక్తు లను అనుసరించి,గుణబలాన్ని అనుసరించి,వాస నాబలాన్ని అనుసరించి,సంస్కార బలాన్ని
అనుసరించి,ఆ యాఇంద్రియరీతులయందు మగ్నత చెందక తప్పదు.అవి భ్రాంతి రూప మైనటువంటి,అద్దము నందు బొమ్మ ప్రతి
బింబం,ఏరకమైనటువంటిసుఖాన్నిఇస్తుందో,అటువంటి ప్రతిబింబ సుఖాన్ని,ఈఇంద్రియ వ్యాపారముల యందు సుఖ దుఃఖముల
రూపంలో, తన కున్న స్మృతి జ్ఞాన రూపమే, ఇక్కడ ప్రతిబింబ రూపముగా కనబడుతు న్నదనే సత్యాన్ని ఎఱుగక,పిల్లవాడుఅద్దా న్ని
ముందు పెట్టు కుని ఆడినట్లు గా, తన ప్రతి బింబమును తానే చూచుకుని ఆనందపడి నట్లు గా,తన యొక్క ప్రతి బింబ.... బింబ
సుఖముయొక్క ప్రతిబింబం అయినటువం టి, ఇంద్రియ వ్యవహారముల యందు ఏర్ప డుతున్నటువంటి,తత్కాల రూప పరిమిత,
అశాశ్వత సుఖ దుఃఖములను అనుభవిం చుచు, వాటినే సత్యమని భావించేటటు వంటి, భ్రాంతికిలోనౌతున్నాడు- అనేటటు వంటి
విషయాన్ని సుస్పష్టముగా మళ్ళా ఇప్పుడు తెలియ జెప్తు న్నారు.
అద్దమును ప్రపంచమువైపు త్రిప్పినప్పుడు, ప్రపంచమును చూపును.తన వైపుకు త్రిప్పు కుని,తన ముఖమును చూపించునటుల,
మనస్సు ఇంద్రియములతో కూడినప్పుడు ప్రపంచమును, అంతర్ముఖమైనప్పుడు ప్రత్యగాత్మను చూపించును.గట్టి ప్రయత్నం
చేత,ఇంద్రియములను,మనస్సును అంత ర్ముఖముగా ఉండునట్లు చేయవలెను. అట్టి వారికే మోక్షము.
    మోక్షాధికారులు ఎవరో సుస్పష్టముగా చెబుతున్నారు.ఎవరైతే మనస్సును, అంత రాత్మవైపు,అంతర్యామి వైపు, స్వస్వరూప
సాక్షాత్కార జ్ఞానం వైపు, స్వస్థా నం వైపు, హృదయాకాశం వైపు, ఎవరైతే తిప్పుతారో, బుద్ధి గుహయందు ఉంచుతారో, వారికి
మాత్రమే మోక్షము సాధ్యమౌతుంది. మిగి లిన వారు మోక్షము, మోక్షము అని పలవ రించుటే తప్ప,వారికి ఎప్పటికీ సాధ్యంకాదు.
కాబట్టి ప్రపంచాన్నిచూడాలి అంటే, ప్రపంచం వైపుకి తిరగాలి. అంతర్యామిని చూడాలి అంటే అంతర్యామి వైపు తిరగాలి. మనస్సు
అనే అద్దా న్ని ప్రపంచం వైపు తిప్పినప్పుడు అదే ప్రపంచం అందులో ప్రతిబింబిస్తుంది.
అదే మనస్సుని అంతర్యామి వైపు గనుక త్రిప్పినట్లయితే,తన ఉనికిని తానేకోల్పోయి ఆ ఆత్మతత్వాన్ని గ్రహిస్తుంది. ఆత్మసాక్షా త్కార
జ్ఞానాన్ని పొందుతుంది. ఆత్మానుభూ తి యందు తానే లేనటువంటి స్థితిలో లయ మైపోతుంది.ఆ అంతఃకరణ మంతా లేన
టువంటి, లయమైనటువంటి స్థితిలో,తానే పరిణామ రహితమైనటువంటి ఏ ఆత్మగా ఉన్నాడో, అంతర్యామిగా ఉన్నాడో, “సర్వ
భూతస్తమాత్మానం, సర్వభూతానిచాత్మని, వీక్షతే యోగయుక్తా త్మ, సర్వత్రసమదర్శినః” - అటువంటి సమదర్శనాన్ని చక్కగా
సాధిస్తా డు.
  అనేకత్వం అనేటటువంటి దృష్టి లేకుండా, ఏకత్వానుభూతియందు స్థిరంగా ఉంటాడు. ఈరకంగా
తనయందుస్వస్థితుడై నటువంటి, తన స్వస్థా నమునందు స్వస్థితుడయ్యేటటు వంటి మోక్షము,ఆ మార్గములో ఈఆత్మనిష్ఠ చాలా
ముఖ్యమైనటువంటిది. అటువంటి ఆత్మనిష్ఠను సాధించడానికి సాధకులందరూ తప్పక అంతర్‌ధ్యానమగ్నులై,అంతర్ముఖం లో
స్థిరంగా ఉండేటటువంటి పద్ధతిని ఆశ్ర యించాలి.అజ్ఞానులు బహిర్గతములైన కామ్య విషయములనే కోరుచున్నారు.అట్టి వారు
జన్మ, జరామరణ రోగాదులతో కూడి, మృత్యపాశమునకు గురియగుచున్నారు. కానీ వివేకవంతులు అశాశ్వతమైన భోగము లను
కోరక,శాశ్వతమైన మోక్షమునే కోరుదు రు. మోక్షము‘న కర్మణా వర్థతేనో కనీయాన్‌’ అను శృతిని అనుసరించు,కర్మల చేత పెరు
గుట కానీ,తరుగుట కానీలేదు.ఇది ధృవమై నది, శాశ్వతమై నది.వివేకులు ఈ విధము గా తెలిసిదాని కురేషణ,ధనేషణ, పుత్రేషణ
లను ఈషణా త్రయములను త్యజించి, మోక్షాభిలాషులు అగుచున్నారు.
  ఈషణ త్రయాన్ని త్యజించాలనేటటువంటి గొప్ప సందేశాన్ని ఇందులో ఇస్తు న్నారు. ధనే షణ, ధారేషణ,పుత్రేషణ - అనేటటువంటి
ఈషణ త్రయాన్ని జయించాలి మానవుడు.
సదా మనస్సు ఎప్పుడూ కూడా ఈ ఈషణ త్రయాలచేత ప్రేరేపించబడుతూ ఉంటుంది. మా అబ్బాయి ఏం చేస్తు న్నాడు? మా
ఆవిడ ఏం చేస్తుందో, మా ఆయన ఏం చేస్తు న్నాడో, మా ధనం అంతా ఏమై పోయిందో,నా ఇల్లు ఏమైపోయిందో,నా వస్తు వులు
ఏమైపోయి నాయో,నాఉద్యోగంఏమైపోయిందో,నాసమ స్యలు ఏమైపోయందో,నా వారంతా ఏమైపో యారో,నా బంధువులు
ఏమైపోయారో,నా అనేటటువంటి వారంతా ఏంచేస్తు న్నారో,నా స్నేహితులు ఏమైపోయారో,ఈ రకముగా
రక్తసంబంధముఉన్నవారు,రక్తసంబంధము లేనివారు,మనః సంబంధీకులు,ప్రాణ సంబం ధీకులు,శరీరసంబంధీకులు.ఈ రకంగా
అనే క రకాల సంబంధాలతో తాదాత్మ్యతచెంది, ముడిపడి,పాత్రోచితమైనటువంటి మగ్నత చెంది,ఆయా పాత్రలే
సత్యమనుకొని,ఆయా పాత్రల యొక్క వ్యవహారమే సత్యమను కొని,ఆయాఇంద్రియ వ్యవహారమే సత్యమ నుకొని,వారి వారి
యందు చరించుట చేత ఏర్పడేటటువంటి సౌఖ్యమునే సత్యముగా భావించి,అశాశ్వతమైన పద్ధతిగా జీవించేట టువంటి జీవ
భావంతో మానవులు జరామ రణ చక్రంలోకి లాగబడుతున్నారు.
ఈ భోగము...భోగము అంటే సుఖ- దుఃఖ ముల రెండింటియొక్కఅనుభవముభోగమే. కాబట్టి,ఆయా సుఖదుఃఖ
ద్వంద్వానుభూతి యందు సుఖం లేకపోతే దుఃఖానికి విలువ లేదు,దుఃఖం లేకపోతేసుఖానికివిలువలేదు. కాబట్టి,ఆ యా
సంవేదనలు మనఃపూర్వక సంవేదనలు ఇవి.
అటువంటి సంవేదనల యందు మనస్సు ను లగ్నం చేసి,ఇంకా కావాలి,ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటటువంటి దాహము
కలిగించేటటువంటి ఈషణత్రయం.దాహం బాగా పెరిగితే వాటి యందు చింత కలుగు తుంది. ఎంతగా దాహం పెరిగితే,ఇంకా అను
భవించాలనేటటువంటి భావన బలంగా బలపడిపోయి,ఆక్రమించుకునేటటువంటి అంతర్యామిత్వం. అంతరంగ లక్షణాన్ని
కలిగినటువంటి వారందరూ,ఆయా అను భూతులయందు ఇంకా ప్రపంచాన్ని అలా చూడాలి,ఇంకా ప్రపంచాన్ని ఇలా చూడాలి,
ఇంకా అనేక సంబంధాలని ఇలా అనుభవిం చాలి, ఇంకా అనేక మందిని దర్శించాలి, ఇంకా అనేక మందితో బాంధవ్యాన్ని పెంచు
కోవాలి, అనంతంగా విశ్వవ్యాపకంగా 750 కోట్ల మంది మానవులలో నేనుగొప్పవాడిని, నేను ప్రతిభాశీలిని అనేటటువంటి గుర్తింపు
ను పొందాలి.ఈ రకంగా ప్రతి ఒక్క చోట,ఆ యా అభిమానమును బలపరిచేటటువంటి శరీరాభిమానమును, దేహాభిమానమును
బలపరచుకుని ప్రత్యగాత్మకు దూరంగా, స్వాత్మస్థితికి దూరంగా చరించేటటువంటి లక్షణమే బంధము.ఎవరైతే స్వాత్మ నిగ్రహం,
స్వాత్మ అనుగ్రహం, స్వాత్మ సాక్షాత్కారం, స్వాత్మానుభూతి, ఆత్మనిష్ఠ దీనిని సాధించి నటువంటి వారు ఉంటారో,వారందరూ
వివేకులు.
ఎవరైతే నాశరహితమైనటువంటి, పరిణామ రహితమైనటువంటి, శాశ్వతమై నటువంటి, మోక్షదాయకమైనటువంటి, జనన మరణ
మృత్యురూప సంసారము నుంచి బయట పడవేయ గలిగినటువంటి ఈ ఆత్మదర్శ నాన్ని, ఈ ఆత్మోపదేశాన్ని,ఈ ఆత్మవిచార
ణని,ఈ ఆత్మభావాన్ని,ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని,ఈ ఆత్మాను భూతిని, ఈఆత్మనిష్ఠ ని ఆశ్రయిస్తా రో,వారు
శాశ్వతమైనటువంటి, ధృవమైనటువంటి,తరగుట,పెరగుట లేన టువంటి,పరిణామ రహితమైనటువంటి, ద్వంద్వానుభూతికి
అవకాశమే లేనటువంటి స్థితిలో ఉన్నటువంటివారు.
ఎప్పుడై తే నీకంటే అన్యము తోచిందో, ఆ అన్యమైనటువంటి వారు ధనము చేతగానీ, ధారేషణ అంటే భార్య, బిడ్డల చేతగానీ,
పుత్రేషణ చేతగానీ, ఈషణాత్రయము చేత సంబంధపడుతున్నటువంటివారై ఉంటారు. కాబట్టి, ఆ ఈషణాత్రయసంబంధమునందు
మనోవ్యాపారమును లగ్నము చేయుట అవివేకము,అజ్ఞానము,అవిద్య, అధ్వాన్న ము.కాబట్టి, అటువంటి సంగత్యాగాన్ని
చేయవలసినదిగా కోరుతున్నారు.సర్వసాక్షి త్వాన్ని ఆశ్రయించవలసినది..అటువంటి సర్వాధారమైనటువంటి, సర్వసాక్షి అయి
నటువంటి, సర్వవ్యాపకమైనటువంటి,సర్వ విలక్షణమైనటువంటి ఆత్మ స్వరూపాన్ని ఎవరైతే ఆశ్రయిస్తు న్నారో, వాళ్ళు వివేకం
పొందినటువంటి వారు....
💗🌴💗
         
గోధుమలు మొదలగు ధాన్యము మానవు లకు,పూర్ణిమ అమావాస్యల యజ్ఞములు దేవతలకు,పాలు జంతువులకు,మనస్సు
వాక్కు ప్రాణములు ఆత్మకు నని ఏడు అన్న ముల విభాగమును తెలియవలె....
అవియన్నియు స్వరూపమున నీశ్వరునిచే సృష్టింపబడినను జీవుడు తన జ్ఞానముచే (యుక్తా యుక్త విషయ జ్ఞానముచే) విహిత ము
ప్రతిషిద్ధము అగు కర్మచే వానిని తనకు భోగ్యవస్తు వులుగ జేసికొనెను.గనుక అవి జీవసృష్టయే యగుచున్నవి.
జ్ఞానము వలన ధర్మాధర్మ వివేకము కలుగు చున్నది.దీనినుండి జరుగు కర్మ సత్కర్మయై నచో పుణ్యమును దుష్కర్మయైన పాపము
ను జీవునకు సంక్రమించును.పుణ్యమునకు ఫలము సుఖము.పాపఫలము దుఃఖము. ఈ విధముగ సప్తా న్నములను యజ్ఞాది
కర్మలందు వినియోగించుచు భోగ్యవస్తు వు లుగ జేయుటచే ఇవిజీవసృష్టియగుచున్నవి.
అన్నము ధర్మాధర్మములతో మిశ్రమమైనది. అన్నమును భగవత్ ప్రసాదముగా స్వీకరిం చవలెను గాని,తన దేహధారణ కొరకు ఉప
యోగించెడిజనులుపాపములనుపొందును.
ఆ పరమపితయైన ప్రజాపతిమూడురకము లైన అన్నములను తనకొరకు చేసెను. అవి యే మనస్సు,వాక్కు ప్రాణము అనెడు అన్న
ములు.ఆ అన్నములను తన కొరకు చేసెను. నేను వేరొకచోట మనస్సు గలవాడనుఅయి తిని. మనస్సు చేతనే చూచు చున్నాడు.
మనస్సు చేత వినుచున్నాడు, వాంఛించుట సంకల్పము.
  సంశయజ్ఞానమీ,అస్తిక్యబుద్ధి,అశ్రద్ధ, ధారణము,అదృతి,లజ్జ,ప్రజ్ఞయు,భయము.  ఈ సమస్తమును మనస్సే.అందువలన
వీపునందు తాకినను,మనస్సుచేత తెలిసి కొనుచున్నాడు.
సర్వశబ్దములు ఆవాక్కే.ఈ వాక్కే వస్తు నిర్ణయమును అనుసరించి పొందుచున్నది. ఈ వాక్కు స్వయముగా పేరుగల  వస్తు వు
వలెనే ప్రకాశింపదగినది కాదు.(వస్తు వును ప్రకాశింపజేయునది యగుచున్నది)
ప్రాణమును,అపానమును,వ్యానమును,ఉదానమును,సమానమును అన్నమును దేహచేష్టా సంబంధమగు వృత్తియు ఈసమ
స్తమును,ప్రాణమేయగును.
ఈ మనో వాక్ర్పాణములను పేరుగల అన్న ముల యొక్క వికారమగు ఈదేహమే,వాగ్వి కారమైనదియును,మనోవికారమైనదియు
ను,ప్రాణవికారమైనదియును,అగుచున్నది.
స్పష్టముగా తెలిసికొను జ్ఞానమును, తెలిసి కొనుటకు ఇష్టపడు ప్రేమయును,ఇంద్రియ గోచరములును,ఈ వాజ్మనఃప్రాణములే.
💜 💕🧡
        
అసురస్వభావముగల జనులు ధర్మప్రవృత్తి నిగాని, అధర్మనివృత్తినిగాని యెఱుగరు. వారియందు శుచిత్వముగాని, ఆచారము
(సత్కర్మానుష్ఠా నము) గాని, సత్యముగాని యుండదు.అసురస్వభావయుతులు ధర్మ కార్యములను చేయుటనుగాని, అధర్మకార్య
ములనుండి మఱలుటనుగాని యెఱుగరు. ఒకరు చెప్పినను వినరు. వీరు అధములు. తమ తప్పిదమునుగూర్చి మఱియొకరు
చెప్పినపుడు దానిని మార్చుకొనువారు మధ్యములు. అసలు తప్పిదమే చేయని వారు ఉత్తములు
మఱియు ప్రవృత్తి, నివృత్తియని ఇచట రెండు తెలుపబడినవి. ఇచట ‘ప్రవృత్తి' యనగా చేయదగినదియనియు, నివృత్తి యనగా
విడిచిపెట్టదగినదిఅనియుఅర్థము. రెండిటిని విజ్ఞుడు తెలిసికొనియుండవలెను. అనగా దైవసంబంధ కార్యములు, దైవగుణ ములు
మున్నగు గ్రాహ్యవస్తు వులను గూర్చి యు, విషయ సేవనము,అధర్మకార్యములు, అసురగుణములు మున్నగుత్యాజ్యవస్తు వు లను
గూర్చియు ఎఱిగియుండవలెను. అసుర స్వభావయుతులు వాని నెఱుగరని ఇలా చెప్పబడినది.అసురస్వభావుల కొన్ని
లక్షణములను పేర్కొనుము.....
వారు ధర్మప్రవృత్తిగాని, పాపనివృత్తిగాని యెఱుగరు.శుచిత్వము,ఆచారము,సత్యము వారియందుండదు.
🌹🌴🌹🌴🌹
       
"ప్రతి గొప్పవిజయంవెనుకఎంతోప్రయత్నం, పట్టు దల,కష్టం..మరెన్నో త్యాగాలు దాగి ఉంటాయి."
"ప్రతి మనిషికి ఓక లక్ష్యం అంటూ ఉండాలి. అంతేకాదు..దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునేలా వ్యూహ
నైపుణ్యం కూడా ఉండాలి."
       "ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం విజయానికి ప్రాథమిక లక్షణాలు."
🌹*మేదోనిష్టా .....*
తల లోపల ఉండే మెత్తని తెల్లని మాంసాన్నే మేదస్సు అంటారు. ఇదే మెదడు. ఈ సిద్ధే శ్వరీ దేవత మేదోధాతువు నందుఉంటుంది.
మేదస్సు కావలసినవారు'ఓం మేదోనిష్టా యై నమః' అని జపంచేసి ఆ దేవతను తృప్తి పరచినట్లైతే మేదస్సువృద్ధి అవుతుంది.
❣️🌴❣️
        
రెండు విషయాలు నీవెవరోతెలియజేస్తా యి. ఒకటి నీ దగ్గర ఏమీ లేనపుడు నీ ఓపిక, రెండు నీ దగ్గర అన్నీ ఉన్నపుడు నీప్రవర్తన."
  అణువంతైనా అర్థం చేసుకునే మనస్సు లేకపోతే,ఆకాశం అంత ప్రేమ ఉన్నావ్యర్థమే. అర్థం చేసుకునే మనస్సు ఉంటే ఆవగింజం త
ప్రేమ అయిన అది అమూల్యమైనదే.
💕🧡 🌴💙
     
పగలు దేదీప్యమానంగావెలిగిపోతుంటుంది. అయితే రాత్రి కాగానే చీకటి ముంచేస్తుంది. పోనీ ఆచీకటి అలాగే ఉంటుందా?
ఉండదు. ఉదయం అనేది వస్తుంది. వెలుగు రేకలు తెస్తుంది. మధ్యాహ్నం ఉజ్జ్వలంగా వెలుగు తుంది. చివరకు సాయంకాలమనే
సంధ్యా రాగంలో కలిసిపోతుంది. ప్రతిరోజూ ఇంతే. కాలచక్రంలో రోజులు,వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి.
ఈ ప్రయాణంలో ఎక్కడా ఒక్క క్షణమైనాఆగదు కాలం. శిశిరం, వసంతం గ్రీష్మం అంటూ ఆరు ఋతువులున్నాయి. అవీ ఒకదాని
తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. కాలచక్రం అలా అలా దొర్లు తుంటూ వెళ్ళి పోతుంది. ఇలా కాలచక్రం
దొర్లిపోతూ ఉంటే -అలా అలా ఆడుకుంటూ వెళ్ళిపోతూఉంటే ప్రాణుల యొక్క ఆయుష్కాలం తరిగిపోతూ ఉంటుంది.
సంవత్సరాని కొకసారి బర్త్ డే చేసుకుంటాం. అంటే ఆయుష్కాలంలో మరొ క సంవత్సరం తగ్గిపోయిందీఅనిగుర్తు .కాలం ముందుకు
వెళ్తుంటేమృత్యువు దగ్గరకొస్తు న్నదని గుర్తు .కాలం కదిలి పోతుంటే భవి ష్యత్తు వర్తమానంగాను, వర్తమానం భూత కాలంగాను
మారి పోతుంటుంది. కనుక ఏదీ నిత్యం కాదు, శాశ్వతం కాదు*.
ఈ జీవితం అనిత్యమైనది. ఎంతశ్రమపడ్డా , ఎన్ని అనుభవించినా, ఎంత ప్రోగుచేసినా ఒక నాటికి మృత్యువు అనేది అతడి నుంచి
అన్నింటిని బలవంతంగా లాక్కుంటుంది. కష్టపడి సంపాదించిన అన్నింటిని విడిచిపెట్టి జీవుడు దుఃఖంతో, బాధతో, ఏడుస్తూ
దీనంగా, హీనంగా, ఒంటరిగా వెళ్ళిపోవా ల్సిందే. కాకపోతే అతడు తీసుకెళ్లేది ఈ జీవితంలో కోరి సంపాదించుకొన్న సంచిత కర్మల,
వాసనల మూటను మాత్రమే*
[10/18, 8:37 AM]  🧡 🌴💙
*ఎవరైతే మీముఖంలో సంతోషం చూడటం కోసం,ఓటమినిఒప్పుకుంటారో.వారితోమీరు ఎన్నడూ గెలవలేరు...ఎందుకంటే వారి
వద్ద గెలుపోటములకి,అతీతమైన అద్భుత హృదయం ఉంది కనుక.....
*నిజాయితీగా ఉండడానికి, నిజాయితీని ప్రదర్శించడానికి చాలా తేడా ఉంది..
*నిజాయితీ అనేది,మన నడవడికలో ఒక భాగంగా ఉండాలి.!
*ఎవరి మెప్పుకోసమో,నిన్నునువ్వు మార్చు కోనవసరం లేదు.!
*ఒక్కసారి మార్చుకోవటం అలవాటై తే, నీ పెంపుడు కుక్క కూడా, నిన్ను చూసి మొర గడం ఆరంభిస్తుంది..
*ప్రత్యేకమైన గొప్పతనం అంటూ, ఏ మనిషి లోనూ విడివిడిగా ఉండదు...ప్రతి ఒక్కటి నేర్చుకోవాలన్న తపన, అన్ని అర్థం చేసుకో
వాలనే ఆరాటం, ఉన్నవాళ్లు మాత్రమే గొప్ప వారిగా కనిపిస్తు న్నారు.!
      🧡💙
నీవు ఇంకనూ అవతరించలేదు. ఆయనకు నీవు తప్ప మరిఎవ్వరు భార్యకాగల్గుదురు? హే శివే! నీవు భూమి యందవతరించి ఆ
మహేశ్వరుని మోహింపజేయుము
నీవు తక్క మరియొకరు ఏనాడై ననూ ఆయనను మోహింపచేయజాలరు. కావున నీవు నాకు కుమార్తెవై జన్మించి హరునకు పత్నివి
కమ్ము
నీవు ఇట్టి చక్కని లీలను ప్రదర్శించి శివుని మోహింపజేయుము. ఓ దేవీ! ఇదియే నేను గోరు వరము. నీ ఎదుట సత్యమును
పలికితిని
దీనిలోనాస్వార్థంమాత్రమేగాక,సర్వజగత్తు ల క్షేమము,బ్రహ్మ విష్ణుశివల ఆకాంక్షకూడ గల వు.ఈపనికి బ్రహ్మ నన్ను ప్రేరేపించెనని చెప్పే
హితకరమగు మాటను వినుము.నేనుసత్య మును చెప్పెదను.నేను నీ భక్తిచే మిక్కిలి ప్రసన్నురాలనైతిని.నీ కోర్కెల నన్నిటినీ
ఈడేర్చెదను
మహేశ్వరినగు నేను నీభక్తికి వశురాలనై నీ భార్యయందు నీ కుమార్తెగా జన్మించెదను. దీనిలో సందేహము లేదు
ఘోరమైన తపస్సనును చేసి శివుని వరము ను పొంది శివునకు భార్యను కాగల్గే విధము గా యత్నించెదను
కార్యసిద్ధికి తపస్సు తక్క మరియొక మార్గ ములేదు.ఆ ప్రభువు వికారరహితుడు.బ్రహ్మ విష్ణువులచే సేవింపబడువాడు.సదాశివుడు
మాత్రమే పూర్ణుడు.నేను ఆయనకు జన్మ జన్మల యందు దాసిని, ప్రియురాలను. శివుడు అనేక రూపములను ధరించిననూ నా
ప్రభువు ఆయనయే.
ఆయన వర ప్రభావముచే బ్రహ్మ యొక్క కనుబొమనుండి అవతరించి,వాడు,నేను కూడా ఆయన వరము వలన ఆయన ఆదేశ
ముచే ఈ లోకమునందు అవతరించగలను.
నీవు ఇంటికి వెళ్లు ము.నాకు,శివునకు మధ్య దౌత్యమును చేయవలసిన వ్యక్తిని కూడా నేను ఎరుంగుదును.నేను కొద్దికాలములో
నీకు కుమార్తెగా జన్మించి,శివుని భార్య కాగలను
ఆదేవి దక్షునితో ఇట్లు మంచి వచనము లను పలికి,మనస్సులో శివుని ఆజ్ఞను పొంది,శివుని పాదపద్మములను స్మరించి, మరల ఇట్లు
పలికెను
ఒక షరతు గలదు. నీవు దీనిని నీ మనస్సు లో దృఢముగా నుంచుకొనుము. నేను నీకు ఆ షరతును చెప్పెదను.అదిసత్యమనియు,
అసత్యము కాదనియు తెలుసుకొనుము
ఏనాడై తే నీవు నాయందు ఆదరమును కోల్పోయెదవో,ఆనాడు నేనునా దేహమును విడిచి పెట్టెదను.ఇది సత్యము.దేహమును వీడి
నేను స్వస్వరూపము నందుండెదను. లేదా,మరియొక దేహమును ధరించెదను
ఓ ప్రజాపతీ! ప్రతికల్పమందు నీకు ఈ వర మీయబడినది. నేను నీ కుమార్తెగాజన్మించి, హరునకు పత్ని కాగలను.
ప్రజాపతులలో ముఖ్యుడగు దక్షునితో నిట్లు పలికి ఆ మహేశ్వరి వెంటనే దక్షుడు చూచు చుండగా అచటనే అంతర్థా న మయ్యెను.
ఆ దక్షుడు దుర్గ అంతర్ధా నము కాగానే తన ఆశ్రమమునకు వెళ్లెను. ఆమె కుమార్తెగా జన్మించ బోవుచున్నందుల కాతడు
సంతసించెను
         💙🌹🌴🌹
జీవుని సాన్నిధ్యమున అతని త్రిగుణాత్మక ప్రకృతి వర్తించు చుండును. స్వభావములో సంగము చెందుట చేతనే అతడు జీవుడు.
లేనిచో దేవుడే.....    
సమస్తమును తానే నిర్వర్తించు చున్నాడు అని తలచుట అహంకారము. మూఢత్వ మున మానవుడట్లు భావించుచున్నాడు.
కర్మములన్నియు ప్రకృతినుండి పుట్టిన గుణ ములచే ఏర్పడుతున్నవి.సమస్త కర్మలకును గుణత్రయమే కారణము.వానియందు
జీవు డు ఉపస్థితుడై యున్నాడు. తానుండుటచే వానికి కదలిక కలదు. తాను లేనిచో వానికి కదలిక లేదు. ప్రకృతి జడమే.అందు
చైతన్య ము చేరినపుడు వివిధములుగ వర్తించును.
విద్యుత్ పరికరములన్నియు జడములే. అనగా తమంత తాము పనిచేయవు.విద్యు త్తు సాన్నిధ్యమిచ్చినచో ఒక్కొక్క పరికరము
ఒక్కొక్కరకముగ పని చేయును. వైవిధ్యము పరికరముల యందువున్నది.గాని,విద్యుత్తు యందు
లేదు.విద్యుత్తు ఎప్పుడునువిద్యుత్తే.
అట్లే,జీవుని సాన్నిధ్యమున అతని త్రిగుణా త్మక ప్రకృతి వర్తించుచుండును. నర్తించుచు కూడ నుండును.అదియును జీవుడు
స్వభా వముతో సంగమము నొందినప్పుడే. స్వభా వములో సంగము చెందుట చేతనే అతడు జీవుడు.లేనిచో దేవుడే.
దేవుడు సంగం లేక సృష్టి యందుండును. ప్రకృతి తన గుణములతో అంతయు అల్లిక చేయును. గుణముల లోనికి దిగిన జీవుడు
అహంకారియై చేయుచున్నాననుకొనును. లేనిచో స్వభావము జడమై యుండును. తాను చేయువాడుకాడు.స్వభావమే చేయిం
చును.స్వభావంనకు ఆకర్షణ చెందుటచే జీవుడు బంధింపబడుచున్నాడు.తానే చేయుచున్నట్లు భ్రమపడుచున్నాడు.తన
యాధారముగ నిజమునకు గుణములు అంతయు చేయుచున్నవి.తాను కర్త కాదు. సాక్షి,ఆధారము,ప్రకృతికి ఆలంబనము.
చేయునది మాత్రము ప్రకృతియే.ఇది తెలి యని వాడు అహంకారి. అట్టివాడు మూఢాత్ముడు.
💚🌹💜
          
‘మనో యజ్ఞేన కల్పతాం,వాగ్యజ్ఞేనకల్పతాం, ఆత్మాయజ్ఞేన కల్పతాం, యజ్ఞోయజ్ఞేన కల్పతాం’ –అన్నట్లు అంతాకూడా యజ్ఞమే! “ఆ
మానసమైన యజ్ఞం నారాయణుని గురించిచేసి అతడితోసంబంధం,అనుగ్రహం తో ఉంటాను.అతడు విశ్వాత్ముడు,విశ్వేశు డు,
విశ్వమయుడు.అతడియొక్క మొదటి అవతారము సహస్రశీర్షాదియుక్తమై ప్రకృతి ప్రవర్తకమగు ఆదిపురుషరూపము అంటే
విరాట్పురుషుడు.
ఆయన లీలామాత్రంగా అనేక అవతారము లు ఎత్తు తూఉంటాడు.చుట్టూఉండే అవిద్య ను నిర్మూలనం చేయటం కొరకే ఆయన
అవ తరిస్తా డని ఆయన లీలావిశేషములు చెబు తున్నవి.సుయజ్ఞ, కపిల,దత్తా త్రేయ, సనక,
నర,నారాయణ,ధ్రు వ,పృథ,వృషభ,మత్స్య, కూర్మ,నృసింహ,వామన,శ్రీరమాద్యవతార ములు అని వాటికి పేరు.
తనను తాను సృష్టించుకుంటాడాయన, పరమేశ్వరుడు,సర్వాత్మకుడు అయి విశ్వం  యొక్క స్థితి,లయ, హేతువు లన్నింటికి ఈ
హరియే కారణము....
“ధృవము అంటే... కదలనిది, అచలము. ఇంద్రియములకు గోచరము కానటువంటిది, కంటికి కనబడనిది, చెవులకు వినబడనిది,
మనసుకు ఊహించటానికి కూడా సాధ్యం కానటువంటిది అయిన సత్యమొకటి ఉంది.
సూక్ష్మముగానైనా,దానితో పోల్చటానికి వీలైన,దాని పోలిక కలిగిన మరొకవస్తు వు సృష్టిలో లేకపోవటంచేత; అది ఇలాఉంటుం దని
చెప్పటానికి వీలులేదు.అది అంతరాత్మ యే ఎఱుగలవసిన తత్త్వం.ఆరాధ్య వస్తు వు అది ఒక్కటే.అంతకన్న సృష్టిలో వేరొకటి లేదు.
దానికి ఏపేరైనా పెట్టు కో అదే శివుడు, అదే హరి,అదే బ్రహ్మ, అదే బ్రహ్మవస్తు వు, నిర్గుణము,అదే సగుణము. ఈవిశ్వమంతా
అందులోంచే పుట్టి,అందులోనే ఉండి,అందు లోనే లయిస్తు న్నది.దానిని నీవు హరిభావన చేసుకో.నేను కూడా ఎల్లప్పుడూ దానినే
ధ్యానిస్తూ ఇక్కడే ఉంటూ ఉంటాను. ప్రతీ కల్పంలోనూ ఇలా పుట్టమని ఈశ్వరాజ్ఞ, నారాయణ ఋషి అనే పేరుతో ఈ బదరికా
వనంలోనే ప్రతీ కల్పంలోనూ పుట్టి తపస్సు చెసుకుంటూ ఉంటాను.నాకు వేరే పనిలేదు” అని చెప్పాడాయన...
💚💜
            
*ప్లా నెటరీ లైట్ బాడీ యాక్టివేషన్:-*
మన అన్నమయకోశంలోనికి అధిక కాంతి ప్రవేశిస్తుంది. భౌతిక దేహానికి సంబంధించిన ఏడు చక్రా లలోకి భగవంతుని కాంతి నింప
బడి 1 నుండి 6 ప్రోగుల DNA యాక్టివేషన్ లోకి తీసుకురాబడుతుంది. 
ఇందులో ఉన్న12అగ్నిఅక్షరాలుయాక్టివేషన్ లోకి వస్తా యి.శరీరం లోపల బయట కాంతి తో నింపబడి మనచుట్టూ1.8 మీటర్ల వరకు
బంగారురంగుకాంతివలయంఏర్పడుతుంది.
కాంతిదేహంతో కూడుకున్న fluorescent tube మన యొక్క సహస్రార చక్రం నుండి ఏర్పడుతుంది. మన యొక్క ఆరా, శరీరం,
చక్రా స్, అణువులు, పరమాణువులు అన్నీ కాంతితో నింపబడి *"ప్లా నెటరీ లైట్ బాడీ"* యాక్టివేషన్ లోకి
తీసుకురాబడుతోంది.అన్న మయకోశం-ప్లా నెటరీ లైట్ బాడీగా మారు తుంది.మనం ప్లా నెటరీ స్థా యికిఎదుగుతాం.
*సోలార్ లైట్ బాడీ యాక్టివేషన్:-*
ప్రాణమయకోశం సోలార్ లైట్ బాడీగామారు తుంది.ఏడవ ప్రోగుDNA యాక్టివేషన్ లోకి వస్తుంది. ఇందులో ఉన్న12 అగ్ని అక్షరాలు
యాక్టివేషన్ లోకి వస్తా యి. 8 నుండి 15 చక్రా లు యాక్టివేషన్ లోకి వచ్చి నీలిరంగు, గులాబి రంగు కలిసి బంగారురంగుకాంతితో
శరీరమంతా నిండిపోతుంది.
భగవంతుని యొక్క ప్రేమ,జ్ఞానం,శరీరం అంతా వ్యాపించి 2వ దేహమైన ప్రాణమయ కోశం*"సోలార్ లైట్ బాడీ"*గా మారుతుంది.
దీని వలన మన యొక్క భౌతికస్థా యి మనం ఏ సూర్యకుటుంబంలో ఉన్నామో   ఆ స్థా యికి ఎదుగుతుంది.
*ఇంటర్ స్టెల్లా ర్ లైట్ బాడీ యాక్టివేషన్:-*
3వ దేహమైన మనోమయకోశం, ఇంటర్ స్టెల్లా ర్ లైట్ బాడీగా మారుతుంది.8వ ప్రోగు DNA యాక్టివేషన్ లోకి వస్తుంది. ఇందులో
ఉన్న12 అగ్ని అక్షరాలు యాక్టివేషన్ లోకి వస్తా యి.15 నుండి 22 చక్రా లు యాక్టివేషన్ లోకి తీసుకురాబడతాయి.గ్రీన్ వైలెట్ బంగారు
రంగు కాంతితో మీఆరా2.5 మీటర్ల వరకు పెరుగుతుంది.కాంతితో కూడుకున్న 4 sides పిరమిడ్స్ శరీరంలో జాయిన్ అవు
తాయి.మన యొక్క ఆరా చుట్టూ ఒకగొప్ప కాంతి గోళఏర్పడుతుంది. అది మన చుట్టూ రొటేట్ అవుతుంది.
దీని కారణంగా 3 వ దేహం మనోమయకోశం ఇంటర్ స్టెల్లా ర్ లైట్ బాడీగా మారుతుంది. దీనివలన మన సౌర కుటుంబంతో సమాన
మైన సౌర కుటుంబాల స్థా యికి మనం ఎదుగుతాం....
*Ignorance is the cause of egoism, attachment, aversion, and clinging to life.*
*అహంకారానికి,రాగానికి,ద్వేషానికి,అభిని వేశానికి(ప్రాణంపై తీపికి)అవిద్యయేకారణం.
*How long is this life for? As you have come into this world, leave some mark behind. You the
descendants of the most glorious Rishis the world ever saw." In every one of you lies that Eternal Power",

💘🌹🍀
and try to wake It up.*
        
*పుట్టిన ప్రతీ మనిషి గిట్టక తప్పదు కనుక ఈ ప్రపంచం మీద, మీదంటూ ఒక గుర్తు ముద్రించి పొండి! మీరందరూ మహాత్ములైన
ఋషుల సంతతికి చెందినవారు.మీరు ఘనకార్యాలు సాధించడానికి జన్మించారని నమ్మండి.       
*పరమగమ్యాన్ని చేర్చే మార్గంలో ప్రయాణిం చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగాఉండాలి. మనస్సు కామలోభాలకులొంగిపోయి
ఆధ్యా త్మిక సాధకుడు దిగజారిపోయే ప్రమాదం నిరంతరంఉంటుంది.ఎంతో పురోగతి సాధిం చిన వారికి తప్ప నిజమైన రక్షణ
లభించదు.
*ఆత్మసాక్షాత్కారం లభించే లోపల ఎంత గొప్ప భక్తు డై నా అధఃపతనం చెంది,వేదన లో మునిగిపోవచ్చు.కాబట్టి తగిన పురోగతి
సాధించకుండా మన సామర్ధ్యం గురించి ఎక్కువగా అంచనా వేసుకుని సాహసాలు చేయకూడదు.
*ఆధ్యాత్మిక సాధనను,ప్రార్థనలను ఉధృతం చేయాలి.రాత్రింబవళ్ళూ  నిరంతర ప్రార్థన, నిరంతర ధ్యానం, గాఢమైన సద్విచారణ చేస్తే
అపారమైన  మంచి జరుగుతుంది.
*సాధన ప్రారంభదశలోఉన్నవారు తన మన స్సును భగవంతునికి సంబంధించిన ఆలోచ నలతో నింపుతూ,వాటిని ఒక అలవాటుగా
మార్చుకోవాలి.
*ఒకసారి బలమైన అలవాట్లు ఏర్పడ్డా క మార్గం సుగమం అవుతుంది.అప్పుడుశ్రమ కొంత తగ్గుతుంది.
"ఆలోచనలు రావటానికి కోరికలే కారణం అయితే, కోరికలు లేనప్పుడు ఆలోచనలు ఉండవా..?"
శాంతి మన సహజస్థితి.తలపులు ఏవైనా మనని సహజస్థితి నుండి దూరం చేసావే. తలపులు అంటే ఆత్మకు విజాతీయాలు. అవి
మనలో సహజంగా ఉండేవికావు. అద నంగా వచ్చి చేరేవి. కోరికలే ఈ తలపులకు కారణం. ప్రతి తలపు వెనుక ఒక కోరికఉండి
తీరుతుంది.కాబట్టి అవి శాంతినిదూరం చేసే తలపులు అయ్యాయి.చేస్తు న్న పనిలో మన సు నిలిస్తే అప్పుడు మనం సహజస్థితిలోనే
ఉంటాం. సహజస్థితిలో మనస్సు శాంతిగా ఉంటుంది. అలా కాకుండా మరొక తలపు ఏర్పడటం సహజస్థితిని భంగపరుస్తుంది. అది
శాంతికి అడ్డు గా ఉంటుంది.మనం రైలు వెళ్తు న్నప్పుడు చూస్తే పెట్టెలన్నీ ఒకదాని వెనుక ఒకటి కదిలి వెళ్ళిపోతూఉంటాయి. మనకు
కన్పించినా,కనిపించకపోయినా కారణం మాత్రం ముందున్న ఇంజనే! అలాగే మనలో అనేకఆలోచనలు కలుగుతుంటాఇ.  వివిధ
తలపులే ఆలోచనలకు కారణం.ఆ తలపులు ఏర్పడటానికి ఏదో ఒక కోరిక కారణమై ఉంటుంది. కోరికే రైలింజన్ లాగా
మనతలపులను,ఆలోచనలనుకదిలిస్తుంది!
🌹🌴🌹🌴❣️
        
*సృష్టికర్మ ఒక చిత్రమైన యంత్రాగారము. అందు ప్రకృతి నుండి సత్వరజస్తమస్సులు పుట్టు చున్నవి. అందు రజో గుణము పని
చేయుట వలన పచనమునకు నిప్పుఅంటిం చినట్లు జరుగుచున్నది.నిప్పు కావలసినప్పు డు కట్టెలనుమండించవలెను.అందు పొగ
భస్మము పుట్టు ట తప్పదు.అట్లు మానవుని ప్రకృతిలో కామము, క్రోధము పుట్టు చున్నవి. ఇవి ఆకలి వంటివి. ద్రవ్యమును హరించి
భస్మము చేయు స్వభావం కలవి.అవి వికాస మునకు శత్రు వులు కనుక పాపకారణము లు అనబడును.వానివలన పాపము
పుట్టు చున్నది.
*నిప్పు కావాలన్నచో పొగ తప్పదు. జీవిత ము ఉన్నచోట రాగద్వేషాలుతప్పవు.అద్దా ల బీరువా కావాలన్నచో దానిపైదుమ్ము పడక
తప్పదు.దుమ్ముపడి వికాసము మసకగును జీవి గర్భమున పడి పెరగవలెనన్నచో మావి తప్పదు.ఆ మావే జన్మ కాలమున పొరయై
చీల్చుకొన వలసినదగును.నిప్పునకుభస్మం  వలె,అద్దమునకు దుమ్మువలె, గర్భమునకు మావి వలె, జీవికి కామక్రోధములు ఆవరించి
ఉండును.వానిని నిత్యము తొలగించుకొను చుండు కర్తవ్యం తప్పదు.
💘🌹🍀🌹💚
        
*కోరిక దైవాన్ని అనుభవంలోకి రాకుండా చేస్తుంది....
*అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటా ము.అదే సమయంలో మనం అద్దా న్నికూడా చూడవచ్చు.అందుకు మన ప్రతిబింబం
అడ్డ మేమీకాదు.కొద్దిగామనదృష్టిమరలిస్తేచాలు. కానీ మనపనితొందరవల్ల,ఆ దృష్టి లేకపోవ డం వల్ల మన ప్రతిబింబాన్నితప్ప
ఎదురుగా ఉన్న అద్దా న్ని పట్టించుకోము.అలానే దైవం నిరంతరాయంగా మనకు అనుభవానికి సిద్ధంగా ఉన్నా మనలోని కోరిక
దైవాన్ని అనుభవంలోకి రాకుండా చేస్తుంది....        
(అసురసంపద గల)వారు జగత్తు అసత్య మనియు.(వేదాదిప్రమాణరహితమనియు), ప్రతిష్ఠ (ధర్మాధర్మవ్యవస్థలు) లేనిదనియు,
(కర్తయగు) ఈశ్వరుడు లేనిదియు, కామమే హేతువుగా గలదై స్త్రీపురుషులయొక్క పర స్పరసంబంధము చేతనే కలిగినదనియు,
అదిగాక ఈ జగత్తు నకు వేఱుకారణమేమి యు లేదనియు చెప్పుదురు.అసురతత్త్వం  కలవారు.
  ఈ జగత్తు వేదప్రమాణసహితమైన ధర్మా ధర్మవ్యవస్థలతో గూడి భగవంతునిచేసృష్టిం పబడినట్లు అంగీకరింపక,జగత్తు తనంతట
దానే కలుగుచున్నదనియు,స్త్రీ పురుష సంయోగమే జగత్తు నకు కారణమనియు చెప్పుదురు.వారిది స్తూలదృష్టియే కావున వారికి
అంతమాత్రమే గోచరించినది. కంటికి పొరకప్పబడినవాడు ఎదుటనున్న వస్తు వు లను సరిగా చూడజాలనట్లు అజ్ఞానతిమిరా
వృతుడగు జీవుడు సత్యస్థితిని చూడలేరు. 

[10/18, 9:09 AM]    💕🖤💛🖤


ఎప్పుడై తే నిష్కామ కర్మకి అవకాశం లేదో, అప్పుడు తనలోపలికి తాను ముడుచు కుంటాడన్నమాట! తన యందు తాను రమిస్తూ
వుంటాడు.తన యందే తాను స్థిరమై ఉంటాడన్నమాట! అలా లోపలికి ముడుచుకోవడం చేతనైనటువంటి వాడు అన్నమాట.
దీనిని ఏమన్నారు అంటే? ఇంద్రియ నిగ్రహం అన్నారు.
ఈ బుద్ధి గుహయందు సర్వేంద్రియములను నిక్షిప్తంచేయడం ఏదైతే ఉన్నదో,దానికి ఇంద్రి యనిగ్రహం అనిపేరు.అంతేకానీ,బహిర్
వ్యాపారంలో ఒకచోట చేయుట, ఒక చోట చేయకుండుట కర్మ వ్యాపారంతో ఇంద్రియ నిగ్రహం బోధించ బడుటలేదు. ఇంద్రియము
లు వ్యవహరించినను, వ్యవహరించకున్న నూ,తాను వ్యవహరించుటలేదు.తానుసదా ఈ ఆంతరిక యజ్ఞమునందు నిమగ్నుడై ,
ఆత్మానందమగ్నుడై ఉన్నాడు.కాబట్టిసామా న్య వ్యవహారం ఏదైతేఉన్నదో,అట్టిసామాన్య వ్యవహారమునకు సుఖ దుఃఖ ఆసక్తిని
పొందక,శీతోష్ణాదిద్వంద్వములచేత కుంగక, శరీరాది జరామరణాది వార్థక్యరూప జరా మృత్యు వార్థక్యరూపమైనటు వంటి వాటి
చేతకుంగక,పొంగక,యవ్వనాది విశేషముల చేత లాభింపక, శరీర ఇంద్రియ వ్యాపార సహితమైనటువంటి చర్యలయందు నిమ
గ్నము కాక,సంగత్వమును పొందక ఉండేట టువంటి వాడు ఎవడై తే ఉన్నాడో, వాడు *జ్ఞాని*అని పిలువబడుతున్నాడు.
   ‘జ్ఞాని’ అంటే అర్థం ఏమిటంటే “ఎవరైతే ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేసి, ఈ ఆత్మానంద భావమునందుకున్నారో,వాళ్ళందరూ
జ్ఞానులు” కాబట్టి,వీళ్ళు మాత్రమే ఇలా ఈ క్రమంలో వెళ్ళేటటువంటి అంతర్ముఖులైన టువంటివారు మాత్రమే దీన్ని సాధించగలు
గుతారు.అంతేకాని, విషయవ్యావృత్తి కలిగి నటువంటి,విషయావృత్తం అయినటువంటి, విషయముల యందు రమించేటటువంటి
లక్షణం కలిగినటువంటి వాళ్ళు, ఆత్మను తెలియలేరు. ఎప్పటికీ తెలియలేరు.
   జిలేబీ బాగుందా? పులిహోరా బాగుందా? దద్దోజనం బాగుందా? పచ్చిమిరపాకాయ బజ్జీ బాగుందా? ఆవకాయ బాగుందా?
మాగాయి బాగుందా? అని పదార్థముల వెంటపడి వెళ్ళేవారు ఇంద్రియార్థములైనటు వంటి శబ్ద, స్పర్శ, రూప, రస,గంధాదుల
యందు మనస్సు లగ్నం చేసేవారు కానీ, కర్మల యందు ఫలాపేక్ష చేత, రమించేటటు వంటి వారు కానీ, ఈ ఆత్మను తెలుసుకొన
లేరు.అనగా ప్రవృత్తిమార్గంలోవున్నటువంటి వారు ఎప్పటికీ ఈ ఆత్మను తెలియలేరు.
జనన మరణ మృత్యురూప భయమును పొందేటటువంటి వారు ఎప్పటికీ ఈఆత్మను తెలియలేరు. శబ్ద గ్రాహ్యత యందు కానీ,
స్పర్శ గ్రాహ్యత యందు కానీ,రూప గ్రాహ్యత యందు కానీ, రస గ్రాహ్యత యందు గానీ, గంథ గ్రాహ్యత యందుగానీ బుద్ధిని రమింప
చేసేటటువంటి వారు,బుద్ధిని బహిర్ముఖ ముగా వ్యవహరింప చేసేటటువంటి వారు, ఈ ఆత్మను తెలియజాలరు. కాబట్టి బుద్ధిని
ఒకదానిని బుద్ధి ఇంద్రియములకు రాజు వంటిది. దానిని వేరు చేయాలి.
        ఇంద్రియముల నుంచీ వేరుచేయాలి. ఇంద్రియముల యందు రమించితానుపొందే సుఖము నుంచీ వేరు చేయాలి. ఇంద్రియ
ములు ఇచ్చే సంవేదనలద్వారా తానుపొందే దుఃఖము నుంచీ బుద్ధిని వేరుచేయాలి.వేరు చేసి, తాను తానుగా
ఉండగలిగేటటువంటి, వ్యవహరించ గలిగేటటువంటి స్థితిని బుద్ధికి కల్పించాలి.  అటువంటి విరమణ అనేటటు వంటి
యజ్ఞాన్ని,విరమణ అనేటటువంటి క్రతువును, విరమణ అనేటటువంటి అంత ర్ముఖత్వాన్ని ఎవరైతే చేస్తా డో, ఈ నిరసించే
టటువంటి విధానంలో ఎవరైతే తన యొక్క ప్రయాణాన్ని పూర్తి చేస్తా డో, తానైనటువంటి స్థితిలో తాను నిలబడి ఉంటాడో, తానైనటు
వంటి స్థితిలో తాను నిలకడచెంది ఉంటాడో, ఆచలుడై ఉంటాడో,అంతర్ముఖుడై ఉంటాడో, సర్వవ్యాపియై ఉంటాడో,ఫలాపేక్ష రహిత
ముగా వుంటాడో,సంగత్వరహితంగా ఉంటా డో,అటువంటి వారు మాత్రమే ఆత్మానంద స్థితిలోఉంటారనిస్పష్టముగాచెపుతున్నారు.
  ఈ ఆత్మ శరీరము లేనివాడు,కనుక అశరీర యనబడును.శరీరములు అనిత్యంలు జీర్ణించి పోవునవి.ఆత్మనిత్యుడు,సర్వవ్యాప
కుడును అచలుడునై అంతటా ఎల్లప్పుడూ ఉండును.అందుచేత అనిత్యములైన శరీర ములందు నిత్యుడై యుండును. అట్టి
గోప్ప వాడును,సర్వ వ్యాప్తియునగు ఆత్మను ధ్యానాదులు మూలమున తెలిసికొనిన జ్ఞాని శోకింపడు.
❤️ 🖤💛🖤
         
దిక్కు,కాలమునకు లోబడియున్న భౌతిక గోళము,అసంఖ్యాక విశ్వములతో సూర్యుల తో,గ్రహములతో,ప్రపంచములతోకూడిన
అనంతాకాశముతోసహా యీభౌతికగోళము, సూక్ష్మ ప్రపంచముతో పోల్చిచూచినచో,ఒక చిన్న తునకవంటిది.
భౌతికగోళమునుఆవశ్యకఅస్తిత్వమందురు. ఇది సూక్ష్మ గోళమునుండి తమ ఉనికిని పొందుచున్నది.ఇది సూక్ష్మగోళము యొక్క
ప్రతిబింబముఈదశలోభగవంతునికి-సృష్టికి గల సంబంధము ప్రభువు-బానిసవంటిది. ఈ దశలో ఉన్న పరిణామ చైతన్యము
దుష్టా త్మ యందురు.
ఈ దుష్టా త్మకు భౌతిక సంబంధమైనదేదియై నను సంతోషించి అనుభవించు స్వాభావిక మైన ప్రవృత్తి కలదు.ఇక్కడ భగవంతునికి
మానవునకుగల సంబంధ భావమునుమౌఖి క ఏకత్వ మందురు(అనగామాటలలోమాత్ర మే భగవంతునితో తనకుగల ఐక్యం ను
అంగీకరించుచున్నాడు)
అసంఖ్యాకమగు సూర్యులు,చంద్రు లు, నక్షత్రములు,గ్రహములు,అనంతాకాశము దిక్కు,కాలము,విశ్వములు
భౌతిక ఆస్తికత్వమైన పాంచభౌతిక స్థూల కాయము ద్వారానే ఱాతి నుండి మానవుని వరకు పరిణామము జరిగినది. భగవంతుని
అనుగ్రహము వలననే రూపము లేనిఆత్మకు స్థూలరూపము వచ్చినది.ఈ స్థూలరూపము లేనిదే ఆధ్యాత్మిక పరిపూర్ణత్వము గాని,
ఋషిత్వము గాని కలుగునని ఊహించుట వెర్రితనము.
స్థూలదేహము పరమాద్భుతమైన అద్వి తీయ యంత్ర నిర్మాణము.దీనిలో మిగిలిన నాలుగుని అస్తిత్వములనుఉన్నవి. మానవ
రూపమును క్షుద్ర జగత్తనియు,ఇది విశ్వ జగత్తు యొక్క సంగ్రహరూపమనియు సూఫీలు పిలుతురు.
ఒక సద్గురువు లేక అవతారపురుషుని యొక్క సార్వభౌమమిక మనసుయొక్క సహాయము లేకుండా వీటి మర్మమెవరికీ
తెలియరాదు....
🖤💛🖤
     
*మనకు ఎన్ని కష్టనష్టా లు రానివ్వండి,ఎంత టి బాధ కానివ్వండి,ముందు మనం భగవం తుణ్ణే ఆశ్రయించాలి.దీనివలన భారమంతా
గుండెలనుండి దిగిపోతుంది.వచ్చిన కష్టనష్ట ములు గడ్డిపోచవలే ఎగిరి పోతాయి. ఇంక నూ ఏమీ చేయడానికి దిక్కుతోచని పరిస్థితు
లలో ఆర్తితో భగవంతుని పిలచి చూడండి! పరిష్కారం తప్పక చూపి స్తా రు.భగవంతుని యడల సంపూర్ణ విశ్వాసం,శరణాగతిఉండా
లే తప్ప కంటికి రెప్పవలే కాచుకుంటాడు.
💛🖤❣️
         
మనం మన జీవితాన్ని ఎలా స్వీకరిస్తా ము అనే దాని పైన అన్నీ ఆధారపడి ఉంటాయి.  మన జీవితాన్ని ఎలాచూస్తా ము అనేది మన
మీదే ఆధారపడి ఉంటుంది.మీ దృష్టి కోణం, మీదృక్పథం మారితే అంతా మారిపోతుంది.
శరణు కోరడం అంటే అర్థం..నిన్ను నీవు అస హాయుడుగా భావించడం,నాతో ఏమీ కాదు అని తెలుసుకోవడం,నా వలన ఎప్పుడూ
ఏదీ అవలేదు అని గ్రహించడం, అనంతం తోటి సంఘర్షణ వదలివేయడం.నిజంచెప్పా లంటే ఈ జగత్తు లో "నేను"అనేదానికి మించి
న దుఃఖము,వేదన ఇంకెక్కడా లేనే లేవు.
మనం జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చూస్తా ము. దేన్ని ముక్కలు చేస్తా మో, దాని పూర్ణతనష్టపోతుంది.ఈజీవితంఅంతా
ఈ విశ్వమంతా ఒక్కటే.ఎవరు ఒక్కటిగా భావిస్తా రో,వారు పరమ సౌందర్య అనుభవా న్ని పొందుతారు.అదే భగవత్ సౌందర్యము.
పరమాత్మని అన్నిభూతములయందుచూడ డంప్రారంభించండి.వర్షంలో,మేఘంలో సూ
ర్యునిలో,నీటిలో,దుఃఖంలో,సుఖంలో,మిత్రు నిలో,శత్రు వులో,శబ్దంలో,మౌనంలోఒకేదాన్ని చూడడం మొదలు పెట్టండి.అలా
చూస్తు న్న ప్పుడు,ఒక రోజు ఒక ఘటన జరుగుతుంది. దాని వలన ఇక వ్యతిరేకమైనది అంటూ ఏదీ ఉండదు.ద్వైతము అనేదే
ఉండదు. రెండు ఉండవు.ఒక్కటే మిగిలి వుంటుంది...
*పాదంలో గుచ్చుకున్న ముల్లు తొలగిపోతే నడవడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది.* *మనసులో అహంకారం తొలగిపోతేజీవించ
డంలో ఆనందం అనుభవమవుతుంది. *నడిచే కాళ్ళలో ఎంత అంతరం. ఒకటి ముందుంటే మరొకటి వెనుక.కానీ ముందు
ఉన్నందుకు అభిమానము లేదు, వెనుక ఉండడములో అవమానము లేదు*. ఎందు కంటే వాటికి తెలుసు,క్షణంలో తమస్థా నాలు
మారుతాయని, దీనినే జీవితం అంటారు. అందుకే నవ్వుతూ సంతోషంగా ఉండండి...
💙🌴🌹🌴
       
వార్ధకం వయసా నాస్తి
మనసా నైవ తద్భవేత్‌
సంతతోద్యమ శీలస్య
నాస్తి వార్ధక పీడనమ్‌
    ముసలితనం వయసులో లేదు.మనసు లోనూ ఉండకూడదు.ఎప్పుడూ పని చేసు కునేవానికి ముసలితనపు పీడ ఉండదని
సుభాషితం.ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం. దుఃఖం వల్ల వచ్చేది భావజం. వయోభారం
వల్ల వచ్చేదికూడా ఆపాదింపబడిన ముసలి తనమే. కొంతమంది యాభయ్యవ పడిలోకి రాగానే వృద్ధు లయ్యారంటారు.కొందరు
అరవై సంవత్సరాలకు ముసలివారనిపించు కుంటారు.70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు.శరీర బలం తగ్గి,
అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలనుసాధించేవారుఉన్నారు.
కొందరికి సోమరితనం వల్ల వృద్ధా ప్యం వస్తుంది.
పని చేయడానికి బద్ధకించి పని సామర్థ్యాన్ని కోల్పోతే దాన్ని మించిన వార్ధక్యం మరొకటి లేదు.అటువంటివారు సమాజప్రగతికే కాక
సొంత ప్రగతికి కూడా శత్రు వులే.అతి పిసినా రితనం,స్వార్థం,మద్యపానం,ధూమపానం, మత్తు మందుల వాడకం వంటి దురలవాట్లు
శరీరంలో అనేక సామర్థ్యాలను బలహీన పరుస్తా యి.అకాలవార్ధక్యానికిదారితీస్తా యి. ఆయుర్దా యాన్ని తగ్గిస్తా యి.అటువంటి
వృద్ధు లు తమ కుటుంబాలకు సమాజానికి కూడా భారమే. మానసిక ఒత్తిడులు, కుంగు బాటు వల్ల వచ్చే ముసలితనం చెదపురుగు
లాంటిది.మనిషి భవితను సమూలంగా తినేస్తుంది.
మానసిక వృద్ధా ప్యం అంటే.. ‘నాకు ముసలి తనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధా ప్యాన్ని రానీయకూడదు.
‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’ అన్న మాటలను గుర్తు పెట్టు కుని ఏదో ఒక పని పెట్టు కోవాలి. భారతీయ సంప్రదాయం లో
జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారుగానీ వయో వార్ధక్యాన్నికాదు. భరద్వాజ మహర్షి మూడు ఆయుర్దా యాల కాలం తపస్సు చేసి
జ్ఞానాన్ని సంపాదించాడని పురాణ ప్రతీతి. నిత్యవ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతతక్రియాశీలత, మితాహారం,
హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు.....
💞❣️
     
భౌతిక గోళములో కొన్ని ప్రపంచములు లోహములు,వృక్షజాతులతో కూడియున్నవి కొన్నింటిలో అగణితమైన జీవరాసులున్నవి.
మరికొన్ని మానవులతో కూడియున్నవి. ఈ భౌతిక గోళములో అతి ప్రధానమైనది మన భూమి,ఇక్కడ కొద్దిగనో గొప్పగనో భౌతిక
స్పృహగల జీవులన్నింటిలో, అన్నిభౌతిక ప్రపంచములలోని అన్ని జీవులకంటె పూర్ణ చైతన్యము గల మానవుడు శ్రేష్ఠు డు.
ఆధ్యాత్మిక విషయములను ఎంత చదివిన ను ఎంత చర్చించినను,ఎంత యోచించిన నూ మానవుడు సూక్ష్మగోళములో మేల్కొ
న్నంత వరకు ఆతని చైతన్యము పూర్తిగా భౌతికమునే ఆవరించి యుండును.
మన భూమిమీదనున్న మానవులు, భౌతిక గోళములో అందరి మానవులకంటేఆధ్యాత్మి కముగా శ్రేష్ఠు లు. భౌతికగోళములో
మానవు లు నివసించు మూడు ప్రపంచములున్నవి. ఈ మూడింటి లో మన భూమియందున్న మానవులు ఆధ్యాత్మికముగా
శ్రేష్ఠతములు.
మనభూమియందున్న మానవుడు సమ పాళ్ళు గల హృదయమస్తిష్కములను కలిగి యున్నాడు.50 పాళ్ళు హృదయము + 50
పాళ్ళు తెలివి .
మిగిలిన రెండు ప్రపంచములోనున్న మాన వులు ఒక ప్రపంచములో నూటికి నూరు పాళ్ళు తెలివితేటలే.మూడవ ప్రపంచములో 75
పాళ్ళు హృదయమును 25 పాళ్ళు తెలివిని కలిగియున్నారు .
మానవుడు 84 లక్షల పునర్జన్మలలో,ఈ మూడు ప్రపంచములో ఏదేని యొక ప్రపంచ ములో జన్మించుచున్నాడు,కానీ చరమము గా
భగవధైక్యము యనెడు తన దివ్య భాగదేయమును కృతకృత్య మొనర్చుటకు ఈభూమిపై పుట్టు చున్నాడు.
❣️🌴🌷
       
      *ఆనందాన్ని* మించిన ఆరోగ్యం లేదు *చిరునవ్వుని మించిన *సంపద* లేదు. ఎదురు పడితే పలకరించేవారు ఎందరో
ఉంటారు కానీ ఎదురు చూసేవారు ఉండటం *అదృష్టం*. 
ప్రయాణంలో *ప్రతి* మలుపు కఠినంగానే ఉంటుంది,అయితే ఆ మలుపు తరువాత కచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయాణం
ఉంటుంది, మన *జీవితం* కూడా అంతే, *కష్టం* తరువాత *సుఖం* తప్పకుండా ఉంటుంది.
నీకు *సంపద* వస్తే నీవు వాడే ఫోన్ మార్చు కో నీఉండే *ఇల్లు * మార్చుకో నీవు తిరిగే *కారు* మార్చుకో అంతే కానీ నీవ్యక్తిత్వాన్ని
మార్చుకోవద్దు *నేస్తమా !*.
నీవు *గొప్పవాడివి* కాకా పోయిన పర్వా లేదు *కానీ* ఈ లోకానికి *మంచోడిలాగా* అస్సలు కనిపించవద్దు ఎందుకంటే
ఈలోకం *మంచోళ్ళేనే ముంచుతుంది* అందుకే  నేను ఒక మాటచెప్తా ను *నోరులేని మేకను* బలిస్తా రు కానీ *సింహాలని* బలి
ఇవ్వరు....
*సాధనకు కావాల్సింది ప్రత్యేక మైన ప్రదేశం ఒక్కటే కాదు.నన్ను నేను సాధనకు సిద్ధపర చుకోవడం అనేది తొలి అంశం.ఇక
రెండవది  నేను నా ఆత్మతో కలిసి ఉండాలి. ఇది మీకు నవ్వు తెప్పించవచ్చు.
"నేను నా ఆత్మ తో కలిసి లేనా?"అని మీరడ గవచ్చు.కానీ మీరు మీతో లేనందు వల్లే సహజమార్గం అవసరమైంది.మీరు మీ ఆత్మ
తోనే ఉన్నట్లయితే,మీరు ఒక యోగి అయి ఉండేవారు.మీకుబయటి శత్రు వులు,స్నేహి తులు ఎవరూ లేరు. మీకు బయటి సమస్య
లూ లేవు అని యోగశాస్త్రం చెబుతుంది. ఉన్నదంతా లోపలే ఉంది.ఈ కనపడే దాన్ని, కనపడకుండా లోపల ఉన్న దాన్ని,ఈ రెండు
అర్థభాగాల్ని ఒక చోటికి చేర్చినప్పుడు,మీరే దైతే అవ్వాల్సి ఉందో అదే అవుతారు.ఇది ఉన్నత ఆత్మను నిమ్న ఆత్మతో విలీనం
చేయడమే.అప్పుడే నీవు నీతో ఉన్నట్లు ..
🌴❣️
          ♥️
'రాత్రము అనే మాట 'రేపు' ను సూచిస్తుంది. ఉత్తరభారతంలో వాడే పదం.సాధారణంగా పగటిపూట పురుష దేవతలకు,రాత్రి పూట
స్త్రీ దేవతలకు పూజలు జరుపుతారు.కానీ, నవరాత్రు ల సమయంలో రెండు పూటలా జరిపే పూజలు పరాశక్తి అమ్మవారికే చెందు
తాయి.
నవరాత్రు లలో పరమశివుడు తాండవ నృత్యం చేస్తా డనే విషయం అందరికీ ఆశ్చ ర్యం కలిగించే విషయం.
అమావాస్య, పౌర్ణమి తిధులకు ముందు వచ్చే త్రయోదశి నాడు సాయం సమయం లో నాలుగు గంటల తర్వాత ప్రదోషకాలం లో
కైలాసనాధుడు లాస్యతాండవం చేస్తా డు
ప్రపంచమంతటికి జలప్రళయం సంభవించే ప్పుడు శివుడు'ప్రళయతాండవం'చేస్తా డని, ఆ తాండవాన్ని జగదంబిక మాత్రమే వీక్షించ
గలదని పురాణాలు వివరిస్తు న్నాయి. ఈ విషయాన్ని'లలితాసహస్రనామాలలో''మహా ప్రళయ సాక్షిణి' అనే నామం స్పష్టంచేస్తోంది.
పరమశివుడు యీ నవరాత్రు లలో నవ విధ ములైన తాండవ భంగిమలుప్రదర్శించ కాలి వ్రేళ్ళతో అద్భుతమైన రంగవల్లు లను తీర్చి
దిద్దు తాడని,తన తాండవంలోఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గను రంగవల్లు ల ద్వారారూపొం దించి నవదుర్గలను వెలయింప జేస్తా డని,
అలా వెలసిన నవదుర్గలనే శరన్నవరాత్రు లు లో మనందర్శనం చేసుకుంటామని ప్రతీతి.
ఆ నవ దుర్గలే -
*శైలపుత్రి : మొదటిరోజు అధిదేవత శివుడు తన కుడికాలును నేలపై ఆన్చి ఎడమకాలు ను పైకెత్తి చేసేతాండవమే'ఆనందతాండవం'
ఈ భంగిమలో తీర్చి దిద్దిన రంగవల్లి 'ఋషి మండల రంగవల్లీ'.దీని నుండే 'అక్షరములు జన్మించాయి.
*కూష్మాండాదేవి:రెండవరోజు సాయంసంధ్య లో పరమేశ్వరుడు చేసే తాండవ సమయం లో ఎడమకాలి వ్రేలితో దిద్దిన రంగవల్లి
'సప్తప్రకాశిని'.ఇందునుండే,కూష్మాండాదేవి ఉద్భవించింది.
*బ్రహ్మచారిణి : మూడవ రోజు తాండవంలో ఎడమకాలు పెద్దవ్రేలితో తీర్చి దిద్దిన రంగ వల్లి 'అష్టవసు రంగవల్లి. దీని నుండి 'బ్రహ్మ
చారిణి' ఆవిర్భవించింది.
*చంద్రఘంటాదేవి : నాలగవరోజు తాండవం ఊర్ధ్వతాండవం.ఈ తాండవంలో మహేశ్వ రుడు ఒక కాలును నేలపై ఆన్చి తన మరి
యొక కాలును తన భుజములకు ఆన్చి యుంచుతాడు. 'తిరువేలంగాడు' క్షేత్రంలో శివుడు కాళికాదేవిని యీతాండవంతోనే
ఓడించాడని స్థలపురాణాలు చెపుతాయి.
శివుడు దిద్దిన 'ప్రణవనాద' రంగవల్లి నుండి 'చంద్రఘంటాదేవి' ఉద్భవించింది.
*స్కందమాత :దేవ దానవులు అమృతం కోసం జరిపిన మధనంలో వచ్చిన కాలకూట విషాన్ని పరమశివుడు తన గొంతులో దాచు
కొని 'నీలకంఠుడు' అయ్యాడు.ఆ సందర్భం గా చేసిన తాండవమే 'భుజంగతాండవం' అప్పుడు దిద్దినరంగవల్లినుండి'స్కందమాత'
ఆవిర్భవించింది.
*'కాత్యాయనీ దేవి' : శివభక్తు డై న పతంజలి ముని మృదంగం వాయింప శివుడు తగిన విధంగా నాట్యం చేసి తన భక్తు నికి ఆనందం
కలిగించాడు. అందుకే యీ తాండవాన్ని 'మునితాండవం' అంటారు. శివుడు తన మూడవనేత్రం ద్వారాతీర్చినరంగవల్లినుండే
'కాత్యాయనీ దేవి' ఉద్భ్యవించింది.
*'కాళరాత్రి' :గజ రూపంలో వచ్చినదానవుని పరమశివుడు సంహారం చేసి ఆగజ చర్మాన్ని ధరించి,కరములలో ఆయుధములు
ధరించి చేసిన తాండవమే భూత తాండవం.ఈ తాండవంలో దిద్దిన రంగవల్లి నుండి 'కాళరాత్రి' దేవి జన్మించింది.
*"మహాగౌరీదేవి" :దండకారణ్యాలలోని మునులను అసురుల బారినుండి కాపాడిన సందర్భంగా మహేశుడు చేసిన తాండవం '
శుధ్ధ తాండవం' అప్పుడు తీర్చిదిద్దిన రంగ వల్లినుండి 'మహాగౌరీ' ఉద్భవించింది.
*'సిధ్ధిధాత్రీదేవి':నవరాత్రు లలో ఆఖరిరోజున సిధ్ధిధాత్రీదేవి ఆరాధన.నవరసములతో అత్యంత మనోహరంగా శివుడు చేసిన శృంగార
తాండవం.ఈ నవరసతాండవరంగ వల్లినుండి 'సిధ్ధిధాత్రీదేవి' ఆవిర్భవించింది.
ఈ నవరాత్రి ఆరాధన గురించి పరశు రాము డు శ్రీరామునికి వివరించగా శ్రీరాముడు యీ నవరాత్రి మహోత్సవాలను భక్తితో జరిపి
పరమేశ్వరుని అనుగ్రహం పొందారు
💘❣️
        
"నిలువ ఉన్న నీరు చెడిపోతుంది. పారే నది నీరు ప్రయోజనకారి అవుతుంది. అలాగే మనిషి గొప్ప జ్ఞానవంతుడు అయితే సరి
పోదు.ఆ జ్ఞానం పది మందికి ఉపయోగపడి నప్పుడే అతడు ప్రయోజనకారిఅవుతాడు."
  "ప్రతిది పరిక్షించాలి.పరిక్షిస్తేనే నిజాలు నిగ్గు తేలతాయి...బంగారానికి పుటం పెడితేనే దాని వన్నె పెరుగుతోంది.వజ్రానికి కోత పెడి
తేనే మరింత ప్రకాశించి విలువపెరుగుతుంది
మనలో తప్పులు వెతికే ఒకగుంపుకుమనం ఉత్తములుగాఉండనవసరం లేదు.మనల్ని  నమ్మిన ప్రతి మనిషికి,మనం మంచివారుగా
ఉంటే చాలు.
కౌరవులు జూదంలో గెలిచారు.కానీ యుద్ధం లో కాదు.రావణుడు సీతను బంధించాడు
కానీ రాముడ్ని జయించలేదు.అంటే అధర్మం మొదట్లో గెలవచ్చు కానీ,చివరికి ధర్మమే నిలుస్తుంది.
💜💗
       
పరమగమ్యాన్ని చేర్చే మార్గంలో ప్రయాణిం చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగాఉండాలి. మనస్సు కామలోభాలకు
లొంగిపోయిఆధ్యా త్మిక సాధకుడు దిగజారిపోయే ప్రమాదం నిరంతరంఉంటుంది.ఎంతో పురోగతి సాధిం చిన వారికి తప్ప నిజమైన
రక్షణ లభించదు.
ఆత్మసాక్షాత్కారం లభించే లోపల ఎంత గొప్ప భక్తు డై నా అధఃపతనం చెంది,వేదన లో మునిగిపోవచ్చు.కాబట్టి తగిన పురోగతి
సాధించకుండా మన సామర్ధ్యం గురించి ఎక్కువగా అంచనా వేసుకుని సాహసాలు చేయకూడదు.
ఆధ్యాత్మిక సాధనను, ప్రార్థనలను ఉధృతం చేయాలి.రాత్రింబవళ్ళూ నిరంతర ప్రార్థన, నిరంతర ధ్యానం,గాఢమైన సద్విచారణ చేస్తే
అపారమైన మంచి జరుగుతుంది.
సాధన ప్రారంభదశలో ఉన్నవారు తన మన స్సును భగవంతునికి సంబంధించిన ఆలోచ నలతో నింపుతూ,వాటిని ఒక అలవాటుగా
మార్చుకోవాలి.ఒకసారి బలమైన అలవాట్లు ఏర్పడ్డా క మార్గం సుగమం అవుతుంది. అప్పుడు శ్రమ కొంత తగ్గుతుంది.
💙💘 💛
          ♥️ 
తిరుమల వేంకటేశ్వర స్వామిని చూడగానే మనకు మొదటగా కనపడేది ముఖం మీద పెద్దగా ఉన్న నామమే. తిరుమలకు వెళ్లిన
చాలా మంది భక్తు లు భక్తితో ఈ నామం ధరిస్తాం....
మొదట తెలుపు రంగుతో Y ఆకారంలో నుదుటి నుండి ముక్కు మీద వరకు పెద్దగా ఒక నామం పెడతారు. ఈ తెల్లటి నామాన్ని
తిరునామం అంటారు.తిరు అంటే పవిత్ర మైన నామం అంటే చూర్ణం అని తమిళము  లో అర్థం. వేంకటేశ్వర స్వామికి వాడే తిరు
నామం కర్ణాటక లోని మేలుకొటే అనే క్షేత్రం దగ్గర దొరికే ఒక రకమైన అభ్రకం నుండి తీ స్తా రు.ఈ మేలుకొటే మైసూరుదగ్గరఉంది.
ఇక్కడ ప్రసిద్ధిమైన చలువ నారాయణస్వా మి గుడిఉంది.మధ్యలో ఉన్న చిన్నగా ఉన్న ఎర్రటి నామాన్ని శ్రీ చూర్ణం అంటారు. ఈ శ్రీ
చూర్ణం పసుపు,సున్నం కలిపి పెడతారు.
సంప్రదాయం ప్రకారం వైష్ణవంలో 2 శాఖలు ఉన్నాయి. అవి తెంగలై, వడగలై. తెంగలై వారు నుదుటి నుండి ముక్కు వరకు వచ్చే
తెల్లటి నామం పెడతారు. వడగలై వారు ఎర్రటి లేదా గంధపు రంగు గీత నామం పెడతారు.
ఈ రెండూ కలిపి వేంకటేశ్వర స్వామినామం ఉంటుంది.ఈ నామంలో ఉండే రెండు తెలు పుగీతలు విష్ణువుపాదాలుగా,మధ్యలో
ఉండే ఎర్రటి గీత లక్ష్మీ దేవిగా చెబుతారు.. ఒక సంప్రదాయం ప్రకారం విష్ణువు,లక్ష్మీదేవి విడిగా ఉండరని అందుకే స్వామి వారికి 
తెలుపు,లక్ష్మీ దేవి ఎరుపు కలిసి ఉంటాయి.
తిరుమలలో ప్రతి శుక్రవారం నాడుఉదయం అభిషేక సేవ అనంతరం స్వామికి ఈనామం పెడతారు.మరలా శుక్రవారం వారం వరకు
ఆ నామం అలానే ఉంటుంది. శుక్రవారం అభిషేక సేవకు ముందు దీన్ని తొలగిస్తా రు. అందుకే శుక్రవారం అభిషేక సేవ,నిజ పాద
దర్శనంకు వెళ్లే వాళ్ళు నామం లేకుండా స్వామిని చూడొచ్చు.....
💕💘 💛
         ♥️ 
*పూరణాత్ పురాణమ్* అంటే వేదార్థ విజ్ఞానాని సమగ్రంగా అందించి మానవుడిని పరిపూర్ణ విజ్ఞానవంతుడిని చేసేది.
పురాభవమ్ ఇతి పురాణమ్* పూర్వం జరిగినదాన్ని తెలిపేది గనుక *పురాణం*.
*పురానవం భవతి*అంటే పూర్వ వృత్తాంతా లను ఇప్పుడు కొత్తగా అనిపించే విధంగా వర్ణించేవి పురాణాలు....
*యస్మాత్ పురాహ్యు న క్తీదం*
*పురాణం తేన తత్ స్మృతమ్*
*నిరుక్త మస్య యో వేద*
*సర్వ పా పైః  ప్రముచ్యతే*
వేదార్థా లను సమగ్రంగా తెలుసుకోవాలంటే ఇతిహాసాల,పురాణాల జ్ఞానం కావాలి.....
అందుకే *ఇతిహాస పురాణాభ్యాం వేదాన్ సముప బృంహయేత్*.
  ప్రాచీన కాలంలో అన్ని పురాణాలు ఒక్క పురాణంగానే ఉండేవి.... తర్వాత కాలంలో మానవుల గ్రహణశక్తి తగ్గి,పురాణ విషయా లను
శ్రద్ధతో అధ్యయనం చెయ్యలేకపోవటం వల్ల వేదవ్యాసుడు ఆ ఏక పురాణ్ణాన్నే, అష్టా దశ పురాణాలుగా వెలయించాడు....
❣️💘 💛
       ♥️
త్రికరణాల్లో మనోకర్మలు మొదటివి. మనసు అనే మొక్కకు మనమే తోటమాలి. బీజాలు నాటడం నుంచి మొక్కగా
ఎదిగేవరకుమనం ఎలా సాకుతామో అలా పెరుగుతుంది.మన జాగ్రత్తలన్నీ బీజాలు ఎంపిక చేయడంలోనే చూపాలి.అక్కడ
పొరపాటు చేస్తే అమృత బీజాలకు బదులు విషబీజాలు పడతాయి. ఈ రెండింటి మధ్యగల తేడా ఏమిటోకూడా మనం
గ్రహించాలి.అమృతబీజాలంటే-ప్రేమ, కరుణ,దానం,దయ వంటివి.విషబీజాలంటే- అసూయ,ద్వేషం,కోపం,అహంకారంవంటివి.
మొదటివి పూలమొక్కల్ని మొలిపిస్తా యి. రెండోరకం- విషవృక్షాలు పుట్టిస్తా యి. బాల్య దశ తల్లిదండ్రు ల సంరక్షణలో గడుస్తుంది.
పిల్లల పెంపకంలో శ్రద్ధ చూపవలసింది వారే. పిల్లలకు తల్లిదండ్రు లే ఆదర్శం.వారి ప్రతి చర్యనూ పిల్లలు సమీపం నుంచి గమనిస్తుం
టారు.కాబట్టి,తమనుంచి పిల్లలుసద్గుణాలు నేర్చుకునేట్టు పెద్దల ప్రవర్తన ఉండాలి.చాలా మంది పిల్లల పెంపకం అంటే తిండి, గుడ్డ,
ఇతర సౌకర్యాలు,చదువు మాత్రమే అను కుంటారు. వీటికంటే ఎంతో ముఖ్యమైనది సంస్కారం.సంస్కారానికి సరైన నిర్వచనం
సత్ప్ర వర్తన.ఎలా ప్రవర్తించాలి,ఎలా మాట్లా డాలి, ఏమి మాట్లా డకూడదు- ఇలాంటివన్నీ సత్ప్ర వర్తన కిందికే వస్తా యి.కొందరు పిల్లలు
అతిగా మాట్లా డతారు.కొందరు మూతి కుట్టే సినట్టు అసలు మాట్లా డరు.అతిస్వేచ్ఛ, పట్టించుకొనక పోవడం వల్ల పిల్లలు వారికి
తోచినదల్లా మాట్లా డుతుంటారు.ఈ అలవా టు మార్చు కోకపోతే పెద్దయ్యాక ఎవరూ వారి ‘అతి’ని భరించలేరు.పిల్లలను అతిగా
మందలించడం,ఏది చేసినా అందులోతప్పు లు చూపడం వంటి పెద్దల ధోరణి పిల్లల్ని మానసికంగా మూగవారిని చేస్తుంది. వారు
తమలో తాము సంభాషించుకుంటారే తప్ప, నోరుతెరిచి మాట్లా డరు.దీనివల్ల భావ వ్యక్తీ కరణలో వారు విఫలమవుతుంటారు.‘అతి
సర్వత్ర వర్జయేత్‌’ అన్నది అందరూ గుర్తుం చు కోవాల్సిన అద్భుతమంత్రం.
*‘ 💲రాజవత్‌పంచవర్షాణి.......*
పిల్లల్ని అయిదేళ్లవరకు రాజ మర్యాదలతో, పదేళ్లు వచ్చేవరకు దాసులుగా,పదహారేళ్ల నుంచి మిత్రు లుగా చూడాల్సి ఉంటుంది.....
వాస్తవానికి ఇది పుత్రు లకు వర్తించేలాచెప్పిన శ్లోకం.ఇప్పుడు పుత్రు డు,పుత్రికల మధ్య వ్యత్యాసాలు ఎవరూ చూపడంలేదు.పుత్రిక లు
పుత్ర సమానంగానే అన్ని విషయాల్లో ఉంటున్నారు.శరీరభేదం తప్ప,మనసుల్లో తేడాఉండదు.చాలామంది-పిల్లలకుసుఖంగా
జీవించేందుకు సరిపడా ఆస్తు లు ఇస్తే చాలనుకుంటారే తప్ప, సంస్కారమే గొప్ప ఆస్తి అనే సత్యాన్ని గ్రహించరు.బాల్యంలో మనసులో
పడిన బీజాలు పెరిగి పెద్దవై జీవి తకాలం ఉండిపోతాయి.అందువల్లవిషబీజా లు పడకుండా పెద్దలు జాగ్రత్తచూపాలి.ఆత్మ శక్తి
గలవారు,ఇతరుల ప్రభావాలకు లోను కారు.తమవ్యక్తిత్వాన్ని తామే నిర్మించు కుంటారు.తమ సంస్కారాన్ని చక్కదిద్దు
కుంటారు.ఇలాంటివారే సమాజ క్షేమంకోసం పాటుపడతారు.
వారికి ఆధ్యాత్మిక జ్ఞానంపట్ల ఆసక్తి,అనురక్తి కలుగుతాయి. ఫలితంగా తమకై తాము మనోకాలుష్యాలను తొలగించుకో గలుగు
తారు. మనసును పవిత్రమైన భూమికగా చేసుకుని, అమృత బీజాలను నాటుతారు. అవి ఫలించి,మానవీయ పరిమళంతో ప్రభ
వించే ఆలోచనాసుమాలవుతాయి.సత్సమా జ నిర్మాణానికి అవే ఆలంబనమవుతాయి.
         🧡🌹🌴🌹🌴🌹
  *జీవితంలో చిత్రమైన అయోమయ పరిస్థి తులు ఏర్పడినప్పుడు,మానసికంగా  క్రుంగి పోయి ఆత్మహత్యలు వంటి నిర్ణయాలను
తీసుకోకుండా,తీర్ధయాత్రలు,దైవపూజలు, దానధర్మాల వంటి సత్కర్మలను ఆచరించ టంవల్ల పరిస్థితులుచక్కపడేఅవకాశంఉంది
అయితే పరిస్థితి తీవ్రతను బట్టి,పుణ్య కార్యాలను మిక్కుటంగా చేస్తేనే మంచి ఫలితాలు లభిస్తా యి.
*తీర్ధయాత్రలు చేసే శక్తి లేకపోయినా భక్తి  ఉంటేచాలు.దైవం తానే దర్శనమిస్తా రు.కల లో కావచ్చు,ఇలలోకావచ్చు.భక్తిముఖ్యం.
భక్తి అంటే,పాపాలు చేస్తూ భగవంతునికి  పాపపుసొమ్మును కానుకగా సమర్పించే  నాటకీయమైన భక్తి కాదు.స్వచ్చమైన ప్రేమ  భక్తి.
*భగవంతునికి జీవులంటే ఎంతోప్రేమ.ఎన్నో తప్పులను చేసిన వారికి కూడా మంచిగా  మారటానికి మళ్ళీమళ్ళీ అవకాశాలను 
కల్పిస్తా రు.
  ఎన్ని అవకాశాలను కల్పించినా పట్టించు కోకుండా పాపాలను చేస్తూ ఉంటే అప్పుడు లోకహితం కొరకు,దైవం పాపాత్ములను
శిక్షిస్తా రు.
*పాపాలు చేసినవారుకూడా చేసినతప్పులు   తెలుసుకుని  పశ్చాత్తా పపడి  మంచిగా  మారితే దైవానుగ్రహానికి పాత్రు లే.
*లోకములో అదృష్టవంతులు ఎవరంటే దైవాన్ని నమ్మినవారు. దురదృష్టవంతులు ఎవరంటే దైవాన్ని నమ్మనివారు.
*మనం భగవంతుని నమ్మినప్పుడు వారికి ఇష్టమయిన పనులను చెయ్యటానికి ప్రయ త్నించాలి. అంతేకానీ భగవంతుడు మెచ్చని
అన్యాయమైన పనులను చేస్తే అది దైవభక్తి అనిపించుకోదు.
*ఒకోసారి మన నిర్ణయములలో పొరపాట్లు జరగవచ్చు.కానీ పరమాత్మ విషయంలో అలాజరగదు.పరమాత్మ చూపిన దారి,వారి
నిర్ణయములు ఎప్పుడూ సరిగ్గానేఉంటాయి. వాటి వెనుక కారణాలు ఒకోసారి మనకు తెలియవుఅంతే అందుకే పరమాత్మను
నమ్మేవాళ్ళు అదృష్ట వంతులు అనేది.ఇంకా, భగవంతుని నమ్మినవారు అదృష్టవంతులని ఎందుకు అంటారంటే,మనకు ఎప్పుడయి
నా ఆపదలు వస్తే ఆదుకునే శక్తి భగవంతు నికి మించి ఈ విశ్వంలో ఎవరికీ ఉండదు కాబట్టి. జీవితంలో ఒక్కోసారి మనం సంపా
దించిన సొమ్ము కానీ,మనవాళ్ళు అని అను కున్న ఆప్తు లు కానీ,ఏ విజ్ఞాన శాస్త్రంకానీ, మనకు సహాయము చెయ్యలేని సందర్భా లు
ఉంటాయి.అలాంటప్పుడు ఆపదలలో అన్నివేళలా అందరినీ ఆప్యాయముగా ఆదుకునే ఆపన్న అమృత అద్భుత హస్తం ఆ
పరమాత్మదే.అందుకే అందరం ఆదైవాన్ని సదాగుర్తుంచుకోవాలి.సత్ప్ర వర్తనతో జీవిస్తూ వారిని ఆనందపరచాలి........
💘🌹🌴🌹🌴🌹
        
గురువు ఆత్మానుభవాన్ని ఏవిధంగా నేను తెలుసుకునేలా చేస్తా రు ?
సద్గురు ఎప్పుడూ తన ఆత్మానుభవాన్ని అనుచరులకుపంచేప్రయత్నంలోనేఉంటారు.నిజానికి ఆత్మానుభవం మనకు ప్రతిరోజూ,
ప్రతిక్షణం జరుగుతూనే ఉంది!మనమనసు, శరీరం చైతన్యంతో ఉండటమే ఇందుకు ప్రమాణం.గురువు మనకు జరిగేఈఆత్మాను
భవాన్ని మనం తెలుసుకునేలా చేయగలరు.
*తనకు తాను తెలిసే ఆత్మ' ఎందుకు తెలియటం లేదు..?
ఆ ప్రశ్న వేసేది ఆత్మశక్తితో అన్న విషయం తెలియకనే......
ఎవరైనా మన వద్దకు వచ్చి నాకు మనసు ఉందా అని ప్రశ్నిస్తే మనం ఏమి చేస్తాం ? అసలు మనసు ఉండబట్టే కదా ఈ ప్రశ్న
పుట్టింది.అలాగే మనలోఉన్న ఆత్మచైతన్యం వల్లనే మనసు,దేహం పనిచేస్తు న్నాయని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న క్షణమే ఈ
సంశయం పోతుంది.....
🖤🌹🌴🌹🌴🌹🌴
        
ఇతర జీవులతో,మన ఋణాలు ఎలా ఉంటాయంటే....
మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితం గా ధనంకానీ,వస్తు వులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవచేయించుకున్నా,ఆ
ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతా నంగా,మనతో సేవ చేయించుకునే వారిగా
నూ వారే తారసపడతారు.......
*ద్వేషం కూడా బంధమే ....* పూర్వజన్మలో మనమీద గల పగను తీర్చుకోవడానికే, మనల్ని హింసించే యజమానిగానో లేదా
సంతానంగానో ఈ జన్మలో మనకి వారు తారసపడతారు......
మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చు కోవడానికి,ఈ జన్మలో శత్రు వులు గానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు
అపకారం చేసేవారిగా తిరిగి ఎదురవుతారు.
మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉప కారం చేయడానికి వచ్చేవారు మాత్రం, మనకు ఈ జన్మలో మిత్రు లు గానో, సహాయ కులు
గానో మనకు ఎదురవుతారు......
*యాచన చేసే ఒక కుంటి బిచ్చగాడు,ఉద యం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండే
వాడు.ఆ వృత్తిలో నెలకి పదివేల రూపాయ లకు పైగానే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే, బిచ్చం
వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్నితింటూ,
చిరిగిన దుస్తు లు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ. ఎస్ చదివిస్తు న్నాడు. ఒకసారి  దర్శనానికి
వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడి ని చూసి ఇలా చెప్పాడు. పూర్వ జన్మలో ఇతను ఇద్దరు వ్యక్తు ల దగ్గర డబ్బులు తీసు
కుని,వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను,ఇవ్వగలిగే స్థితిలో ఉండికూడా ఇవ్వ లేదనీ..అందుకే,ఈ జన్మ లో తాను కష్టపడి
సంపాదిస్తూ,బాధలుపడుతూ వాళ్లను చది విస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడని..
ఒకోసారి, మనం తెలిసీ తెలియక చేస్తూన్న చిన్న చిన్న తప్పులుకూడా,మనకుబంధాలు అవుతాయని నిరూపించే మరొక కథ ఇదిగో.
అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో, తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లా డుతున్నారు.
అది చూసిన కొందరు..ఈ దారుణ పరిస్థితికి కారణమేమి...ఈ పిల్లలంతా వారి గతజన్మ లలో ఆహార పదార్థా లను అధికంగా దుర్విని
యోగం చేశారు. అందుకని వారు ఈజన్మలో ఇలా ఆహారం కోసం పరితపిస్తు న్నారు. ఎవ రైనా నీటిని బాగా
దుర్వినియోగంచేస్తే,వారు మరుజన్మలో ఎడారిలో పుడతారు. కాబట్టి ఏ వనరులను దుర్వినియోగం చేసినా, దాని ఫలితాన్ని మనం
తప్పక అనుభవించాల్సి ఉంటుంది....
'నువ్వు మోయగలిగి ఉండి కూడా,ఈ జన్మ లో నీ మిత్రు డి చేత సంచీని మోయిస్తే, వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తా ను
మోయాల్సి ఉంటుంది.
ఇలాంటివి మనము తెలిసీ తెలియక,చాలా నే చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో,మర్యాదకో,కృతజ్ఞత
గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కార ణాల ద్వారానో,ఉచితంగా స్వీకరించినవన్నీ కూడా కర్మబంధాలయి జనన-మరణ చక్రం లో
మనల్ని బంధిస్తా యి..
కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తు వులను తీసుకోవడం,మన పెట్టె లాంటివి మోయించ డం, పక్క వాళ్ళు షాప్కి వెళ్తుంటే,నాకూ
ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాం టివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.అవి కర్మ బంధాల
వుతాయని తెలియక, మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలలో చిక్కు కుపోతూంటాము. ఆరడుగుల
తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో,అలాగేఅంగుళం తాచుపాము విషమైనా కూడా అంతే ప్రమా దకరం కదా! అలాగే కర్మ
ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరు తుంది తప్ప మాయం కావడం జరగదు.
ఆత్మ చింతనను తప్ప అన్య చింతనలు ఉదయించడానికి కొంచమైనా చోటివ్వక 'ఆత్మనిష్ఠా పరుడై ' ఉండుటే,తనని ఈశ్వరు నికి
అర్పించటం.
🌴🌹🌹🌴🌹🌹
        ♥️
*దైవీశక్తిని చవిచూడాలంటే ఏంచేయాలి.....
*500 రూపాయిలు జేబులో ఉంచుకుని,ఆ పైకంతో బస్సులోగానీ, రైలులోగానీ ఎంత దూరం ప్రయాణం చేయగలవో అంతదూరం
ప్రయాణం చేసి అక్కడ దిగేయ్.నీ జేబులో ఒక్కరూపాయి కూడా ఉండకూడదు.అక్కడ ఓ నెలరోజులు గడిపి,తిరిగి నీ స్వస్థలానికి
చేరుకోగలిగితే తెలుస్తుంది..ఆ దైవీశక్తి నిన్ను ఎలా నడిపించిందో......
*ప్రత్యక్షానుభవం కలుగుతుంది.కోటి ఆధ్యా త్మికగ్రంథాలు చదివినా కలగని అనుభవం, ఈ ఒక్క పని చేయడం వలన
కలుగుతుంది.
*ఇదివిని ఒకతను అలా రైలులో బయలు దేరి గాణ్గాపురం చేరాడు..అక్కడ దిగి మిగి లిన చిల్లర పైకాన్ని పారవేసి, ఊళ్లోకి
ప్రవేశించాడు....
*అక్కడే ఓ కాషాంబరధారి వద్ద శిష్యుడిగా చేరి,ఊళ్లో భిక్షంచేసుకుంటూ ఓ నెలరోజులు గడిపి,తిరిగి స్వస్థలమైన శ్రీకాళహస్తి
చేరాడు అతనొక్కడే అలా ప్రయత్నం చేసి దైవీశక్తిని అనుభవించాడు.
తిరిగొచ్చాక అతడు ఓ అవధూతలా మారి పోయాడు.కొందరుఅతడు పిచ్చివాడై పోయాడు."అనిదూరమైపోయారు.కొందరు
అతన్ని ఓగురువుగా ఆరాధించడంమొదలు పెట్టా రు. *అతడు పిచ్చివాడో,అవధూతో దైవానికెరుక.....
వాస్తవానికి ప్రతి ఒక్కరు ఈ భూమ్మీదకు దిగంబరంగానే వస్తా రు."ఖాళీ" గానే ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తా రు..తనువును, తల్లి
దండ్రు లను, బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డల్ని,సంపదలను,అనుభవాలను ఉచితంగానే పొందుతారు.తిరిగి అందరినీ,
అన్నింటినీ,చివరకు తనువునుకూడా"ఖాళీ" చేసి వెళ్లిపోతారు."ఖాళీ"అవడం తథ్యం.
*కాబట్టి అన్నీ ఉన్నప్పుడుకూడా "ఖాళీ"గా ఉండడమే.*"మెలకువలో నిద్ర".*"అందరూ మేలుకుని ఉంటే,యోగి నిద్రిస్తుంటాడు."
నిద్ర అంటే పడుకుని నిద్రపోవడం కాదు.
"ఖాళీ"గా ఉండడం.అదే *యోగనిద్ర.*
సర్వధర్మాన్ పరిత్యజ్య... సర్వధర్మాలను వదిలేసి "ఖాళీ" అయిపొమ్మన్నారు. ధర్మము లన్నీ ఇహానికి సంబంధించినవి."ఖాళీ"అనేది
పరానికి సంబంధించినది.
*"ఖాళీ"యే కాళీమాత. కాళీమాత అనేది ఓ విగ్రహం కాదు,అర్థరాత్రి..ప్రపంచంలో ఉండే నిశ్శబ్ధా న్ని (మౌనాన్ని),అంధకారాన్ని (అభే
దాన్ని) ఆస్వాదించడమే కాళీమాతదర్శనం.
పట్టపగలు కూడా ఆ నిశ్శబ్ధా న్ని,ఆ"ఖాళీ"ని అనుభవించగలగడమే సహజ సమాధి.
కర్తృత్వభావన "ఖాళీ" అయిపోవడమే కర్మయోగం.
వ్యక్తిత్వభావన"ఖాళీ" అయిపోవడమే భక్తి యోగం. అహమిక "ఖాళీ"అయిపోవడమే జ్ఞానయోగం.నిజానికి తాను"ఖాళీ" అయి
పోతే., ఆ ఖాళీ ఖాళీగా ఉండదు.. ఆ ఖాళీ దైవంతో నిండిపోయి ఉంటుంది.ఇదే "ఖాళీ తత్త్వరహస్యం".అదే ఇది..ఎవరూ లేకపోవ
డమే దేవుడు ఉండడం. ఏమీ తెలియక పోవడమే దేవుణ్ణి తెలియడం.ఏ అనుభవ మూ లేకపోవడమే దైవానుభవం.
*నేను చేస్తు న్నాను అనేది మన బ్రమ అదే మన కర్మ కు మూలం. అలా కాకుండా ఈ జగత్తు మొత్తం *జగన్మాత(ఖాళీ)* నడుపు
తోంది.అని అనుకుంటే, అది దైవ దర్శనం మార్గం అవుతుంది.,మన ప్రయాణం శక్తి (ఖాళీ)తో కూడి చక్కగా సాగిపోతుంది. అదే
ఖాళీ తత్వ మార్గం. ఈ మార్గం కర్మలకు దూరంగావున్న సర్వసంతోషాల నిలయానికి *చేరుకోవడానికి* సహాయపడుతుంది. ఆ
సంతోషిమాతదర్శనం మనకులభిస్తుంది.
*తింటేనే రుచి*తెలుస్తుంది,అనుభవంతోనే అమ్మ (ఖాళీ) గొప్పతనం తెలుస్తుంది.*
[10/19, 1:39 PM] 🌹🌹🌴🌹🌹
*ఇది దగాపడ్డ సమాజం మనల్ని ఎప్పుడూ ప్రోత్సహించదు, మనకు మనమే ప్రోత్సా హించుకోవాలి,
*పోరాడాలి గెలుపు సాదించేవరకు..! నీకేమి తెలియనప్పుడు నువ్వేమి మాట్లా డకు,
ఎందుకంటే కాలంచెప్పే సమాధానానికి,
సాక్షి నిజం మాత్రమే...నువ్వో,నేనో కాదు!
*ప్రపంచానికి తనని తాను చూపించుకోలేని,
పిరికివాళ్లు ,చేతకాని వాళ్ళు, ఎదుటివారిని అవహేళన చేస్తుంటారు..వాళ్లు నీ"వ్యక్తిత్వ మనే" కాలిగోటికింద, ఏనాడో అణగదొక్క
బడిన చేవలేని చీమలు....
నిజాయితీగా ఉండి నటించని వారికి
మర్యాద ఇవ్వు.
*నీమనసు ముక్కలైనా మాట గాంభీర్యంగా పలుకు, అందర్నీ  పరిశీలించు ఎవ్వడికి భయపడకు...
జీవితంలోకి *వచ్చే* వారు వస్తూఉంటారు, *పోయే* వారు పోతూ ఉంటారు వారి కోసం *నువ్వు పరిగెత్తకు* నిన్ను కావాలనుకున్న
వాళ్ళు *నీతో* ఉంటారు.కాదనుకునే వాళ్ళు పోతారు.జీవితాన్ని *ప్రేమించు* ఆనందాన్ని *జయించు*.
ఒక మనిషి గురించి మరోక మనిషికి *జీవితాంతం*గుర్తుండి పోయే రెండే రెండు విషయాలు చేతితో చేసిన *సాయం*,.మాట తో
మనసుకు చేసిన *గాయం* .
అబద్దంచెప్పడానికి*తెలివి*ఉండాలి,*నిజం*చెప్పడానికి*ధైర్యం*ఉండాలి.  నిజమైనా  అది ఇతరుల *మనసులు* నొచ్చుకోకుండా
చెప్పడానికి *గొప్ప సంస్కా రం* ఉండాలి .
*అపార్థం* కలిగినప్పుడే *బంధం*బలపడు తుంది *ఏడుపు* పరిచయం అయినపుడే నవ్వు *విలువ* తెలుస్తుంది *కష్టా న్ని*
ఎదురిస్తేనే *సంతోషం*మనవశంఅవుతుంది  *బాధ* ఉన్నపుడే *భవిష్యత్తు * బాధ్యతగా మారుతుంది *సమస్య* తలెత్తినపుడే
మన *సామర్థ్యం* బయటపడుతుంది. *చిరున వ్వుతో* సమస్యలను ఎదురించు *ప్రేమగా* పరష్కరించుదాం.....
*మీరు మంచిగా తయారయ్యేటటువంటి తరంగాలు నెగిటివ్ను పాజిటివ్ లోకి మార్చే స్తుంది,ఇంతటి శక్తి పిల్లలైన మీలో ఉంది కేవలం
ఉపయోగించండి.శక్తు లు చాలా ఉన్నాయి,సమయానికి ఉపయోగించిచూసి నట్లయితే చాలా మంచిమంచి అనుభవాలు
చేసుకుంటారు.
*జీవితంలో తొందరగా ఎదిగిపోవాలని అను కోకండి.నిదానంగా,నిజాయితీగా ఎదగాలని అనుకోండి.....
*నీది కానీరోజు మౌనంగా ఉండు -నీదైన రోజు వినయంగా ఉండు -అప్పుడే --నీవు జీవించినంత కాలం నీ విలువ పెరుగుతూ
ఉంటుంది."ఆయాచక"వృత్తినిఅవలంభించు.తేరగా లభించేదానికి ఆశ పడకు....
*మనం పారేసింది తింటుంది కాబట్టి కుక్క ను హీనంగా చూస్తాం.అదే సింహం అంటే భయం ఎందుకో తెలుసా..?అది సొంతంగా
వేటాడి తింటుంది కాబట్టి. రొట్టె ముక్కలు తిని బ్రతికిన పర్వాలేదు సొంతంగా సంపా దించుకో... పరమాన్నం కోసం ఒకడి ముందు
తోక ఆడించకు.....
*ఎంత దుఃఖం వచ్చినా కూడా పెదవిపై  చిరునవ్వు చెదర నివ్వకు.....
ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకు.   
కాసేపు ఆగి ఆలోచించు..జీవితం నీ కేదో నేర్పడానికి ప్రయత్నిస్తుంది అని గ్రహించు..
*గాయపరిచింది అని.."గతాన్ని", కలిసి రావట్లేదని...." కాలాన్ని" నిందించకూడదు. ఎందుకంటే. ప్రతి దారికి ఒక మలుపు.. ప్రతి
జీవితానికి గెలుపు ఉంటుంది. ఆ సమయం కోసం వేచి ఉండు..
*మనిషి చెడు ఆకర్శించినంతాగా మంచి ఆకర్శించలేదు..*ఎందుకంటే.."చెడు " సుఖా లతో మొదలై కష్టా ల పాలు చేస్తుంది.
"మంచి" కష్టా లతో మొదలై సుఖంగా బ్రతి కేలా.. చేస్తుంది....
*తలో రాయి విసురుతున్నారని నువ్వు ఒక రాయి విసరడం గొప్పకాదు,అయ్యో ఎవరు సహాయం చేయడంలేదు నేనైనా చేస్తా అని
సహాయం చేయడం గొప్ప.
విధి నిర్వహణను మించిన దేశసేవ లేదు.       *రెచ్చగొట్టే వాళ్ళకు చిచ్చుపెట్టే వాళ్ళకు
దూరంగా ఉంటే జీవితానికి మంచిది..
*గెలుపుకు తుదిమెట్టు అంటూఏదీఉండదు.
*ఓటమిఅన్నది ఎప్పుడూఅపాయకారికాదు
*మనకు ఈ రెండింటిని సాధించడానికి కావాల్సింది ఒక్క ధైర్యమే...!!
*విమర్శలన్నింటిలోనికి ఉత్తమమైనది  
"ఆత్మవిమర్శ".
🌹🌴🌹🌴🌹
        
  కష్టపడకుండా హాయిగా జీవించాలని,లేదా తక్కువ పనిచేసి ఎక్కువ లాభం పొందాలని మానవులు సహజంగా భావిస్తుంటారు.....
సర్వసంగ పరిత్యాగుల్లా గా వేషాలువేసుకొని మోసాలు చేస్తూ, పొట్టనింపుకొనే వారిని గురించి.....
కొందరు జుట్టు పెంచుకొని జడలు కట్టించి తిరుగుతారు. కొందరు నున్నగా గుండు గీయించుకొని తిరుగుతూ ఉంటారు.
కొందరు తలపై గల వెంట్రు కలను పీకివేసి తిరుగుతారు. కొందరు కాషాయ వస్త్రా లను ధరించి తిరుగుతూ ఉంటారు.
ఈ వేషాలన్నీ నిజంగా సర్వసంగ పరిత్యాగు లవి - సన్యాసులవి.అయితే ఈ వేషాలు వేసేవారందరూ నిజమైన సన్యాసులుకాదు.
ఇందులో కొందరు పొట్టకూటి కోసంమాత్రమే ఈ వేషాలు వేస్తా రు. నిజమైన సన్యాసులు ప్రాపంచిక విషయాలను వదలిపెట్టి, జీవిత
పరమార్థం ఏమిటో తెలుసుకొని, దానిని సాధించటానికి సాధనలు చేస్తుంటారు.నిరం తరం పరమాత్మకు సంబంధించిన విషయా
లను శాస్త్రా ల ద్వారా -గురువుల ద్వారా తెలుసుకుంటూ,శిష్యులకుబోధిస్తూ,ఆ విష యాలనే విచారణచేస్తూఉంటారు.ధ్యానిస్తూ
ఉంటారు.అట్టివారు దేహపోషణ కు ప్రాధా న్యత నివ్వరు. అలాంటి వారికి సమాజంలో ఎంతోగౌరవముంటుంది.వారిని మహాత్ములు
గా పరిగణించి,పిలిచి అన్నం పెట్టి తమ జన్మ ధన్యమైనట్లు భావిస్తా రు గృహస్థు లు......
అలాంటి గౌరవమర్యాదలు పొందాలన్నా, కడుపునిండా కమ్మని తిండి దొరకాలన్నా ఆ వేషాలు వేయాలనుకుంటారు కొందరు సోమ
రులు.ఐతే అట్టివారు చూస్తూ కూడా చూడ నివారే.అంటే ఈ మోసగాళ్ళు కూడా భగవం తునికి సంబంధించిన మాటలు
మాట్లా డు తారు.వేదాలు - ఉపనిషత్తు లలో తెలిపిన విషయాల్లో రెండు మూడింటిని బండగుర్తు లు పెట్టు కొని,అక్కడక్కడ
కంఠస్థంచేసి,కొన్ని కొన్ని పదాలను పుక్కిట పట్టి ఉపన్యాసాలి స్తూ మధ్యమధ్య ఆ శ్లోకాలను వల్లె వేస్తుం టారు.ఇవి గనుక అసలు
చేయకపోతే వాళ్ళ బండారం బయటపడుతుంది.అందువల్ల వారు కూడా ముఖంపై ప్రశాంతతను పులు ముకొని మహాత్ములులాగా
ఫోజ్ ఇస్తూ భగ వత్తత్త్వాన్ని గురించి అనర్గళంగా బోధిస్తా రు. అయితే వారు చెప్పేవిషయాలయొక్క అంత రార్థా న్ని
వారెన్నడూవిచారణచేయరు, ఆ విషయాలను ఆచరించరు.వారికి ఎటువంటి అనుభూతి కూడాఉండదు..వారేమూఢులు.
💚🌹🌴🌹🌴🌹
🌹
[10/19, 01:58 PM]
*గాయత్రి:: గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తు లు.మహా శక్తి వంతమైన గాయత్రి మంత్రాక్షరాలు.
*తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరు....
స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్న మయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో
వ్యవహరిస్తా రు. నా నుండి అగ్ని.అగ్నినుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రు తితో వ్యాహృతి,
వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతున్నాయి.....’
💙
       
దేవుడిని ప్రార్ధించడం అనేది మన ధర్మంలో లేదు.ఉపస్థా నం అనేది ఉంది.ఉపస్థా నం అంటే ఒక విశాల భావంతో గొప్పఫలితాన్ని
ఇవ్వమని అడగడమే గాని,సంకుచిత కోరి కలు తీర్చమని కాదు.ఉదాహరణకు రోగం పోవాలంటే,సార్వజనీకంగా ఆరోగ్యాన్ని
ఆయుష్షును అడగాలి కానీ,ఈ పుండు మా నాలి,జ్వరం ఇన్ని డిగ్రీలు తగ్గిపోవాలి, క్రికెట్ మ్యాచ్ మొదలయ్యే లోగా తలనొప్పి పోవా
లి వంటివి కాదు...అవి ప్రార్ధించడం కిందికి వస్తా యి. ప్రార్ధించడం అనేది తేలిక మాట. అందులో డొల్లతనంఉంది.సంస్కృతంలో
ప్రార్ధించడం అంటే కేవలం రిక్వెస్ట్ చేయడం అని అర్థం.లేదా కోరిక కోరడము. సినిమా ల్లో చూపినట్టు ఏదో ఉపద్రవం జరగ్గానే
పరుగున వెళ్లి దేవుడి ముందర మోకరిల్లితే, దేవుణ్ణి నిలదీస్తే,నిందిస్తే.. అద్భుతాలు, చమత్కారాలు జరగవు.
  దేవుడిని నిజానికి ఏదీ అడగక్కరలేదు. కర్మణిఏవ అధికారః తే మాఫలేషు కదాచన. అని కదా భగవానుడి ఉవాచ.
మనకు ఏది ఇవ్వాలో, ఏమి జరగాలో అది నిర్ణయించాల్సింది మనము కాదు.ఈ ప్రార్థిం చడము అనేది కిరస్తా నపు పద్దతి.మనపద్ద
తిలో అయితే మొదట సాంగోపాంగముగా విధివిధానంతో పూజచేయాలి.ఫలితం ఆయనకు వదిలేయాలి.సంకల్పము అనేది
మనకుఉంది.సంకల్పానికి,కోరికకు తేడా ఉంది.సంకల్పము అంటే ఏఉద్దేశముతో కర్మ చేస్తా మో అది.,ఆ ఉద్దేశము జరగవచ్చు,
జరక్కపోవచ్చు,ఇంకా గొప్పగా జరగవచ్చు, అది మనచేతుల్లోలేదు.కిరస్తా నపు పద్ధతు లకు అలవాటై మనము సత్యము ఎరుగక
ఉన్నాము.దానికితోడు సినిమాలు, సీరియ ళ్లు ,కథలు మనల్ని తప్పుదోవ పట్టిస్తు న్నాయి.......
❣️🌹🌴🌹🌴🌹
          
*శ్రీమాత త్రిశక్తు లలో జ్ఞాన శక్తి ఒకటి. జ్ఞాన దీపము మనయందు వెలిగించుట ఆమెయే చేయవలెను.సద్గురువులు,యోగులు,
భక్తు లు కేవలము ఆమెకు వాహికలు మాత్రమే. జీవుల నుద్ధరించుటకు వారియందు జ్ఞాన దీపములనువెలిగించుచు
తీరుబడిలేకుండా తన పరివారముతో పనిచేయుచుండును.
*లక్షవత్తు లు బయట వెలిగించుట కన్నా ఒక వత్తి లోపల వెలిగినచో సమస్తమగు అజ్ఞానము హరింపబడును.
*లోపల దీపము వెలుగవలెనని, దర్శనము, భాషణము కలుగవలెనని ఆర్ద్రతతో ఆరా ధించుట ప్రధానము.బయట దీపములు
పెట్టు టవలన చర్మచక్షువుల కానందము కలుగును.చూచువారు మెచ్చుకొనుటవలన డంబము పెరుగును.అమ్మ అనుగ్రహమున
లోపల వెలిగినచో ఆత్మతృప్తి కలుగును. అపుడు ఆరాధకునికి తనలోనివెలుగు, తన పరిసరములలో ఉన్న వారి యందున్న వెలుగు
గోచరమగును.
*పరమగమ్యాన్ని చేర్చే మార్గంలో ప్రయాణిం చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగాఉండాలి. మనస్సు కామలోభాలకు లొంగిపోయి
ఆధ్యాత్మిక సాధకుడు దిగజారిపోయే ప్రమా దం నిరంతరం ఉంటుంది. ఎంతో పురోగతి సాధించిన వారికి తప్ప నిజమైన రక్షణ
లభించదు.
*ఆత్మసాక్షాత్కారం లభించే లోపల ఎంత గొప్ప భక్తు డై నా అధఃపతనం చెంది, వేదన లో మునిగిపోవచ్చు. కాబట్టి తగిన పురోగతి
సాధించకుండా మన సామర్ధ్యం గురించి ఎక్కువగా అంచనా వేసుకుని సాహసాలు చేయకూడదు.
*ఆధ్యాత్మిక సాధనను,ప్రార్థనలను ఉధృతం చేయాలి.రాత్రింబవళ్ళూ నిరంతర ప్రార్థన, నిరంతర ధ్యానం, గాఢమైన సద్విచారణ చేస్తే
అపారమైన  మంచి జరుగుతుంది.*
*సాధన ప్రారంభదశలో ఉన్నవారు తన మనస్సును భగవంతునికి సంబంధించిన ఆలోచనలతో నింపుతూ, వాటిని ఒక అల వాటుగా
మార్చుకోవాలి. ఒకసారి బలమైన అలవాట్లు ఏర్పడ్డా క మార్గం సుగమం అవు తుంది.అప్పుడు శ్రమకొంత తగ్గుతుంది.
*The secret of life is not enjoyment, but education through experience.*
*జీవిత రహస్యం భోగానుభవంలో లేదు. అనుభవంద్వారా లభించేజ్ఞానార్జనలోఉంది.
*ఆత్మవిశ్వాసం మనపూర్వుల హృదయం లో ప్రవేశించింది. నాగరికాభివృద్ధిలో వారిని ముందుకు తీసుకువచ్చిన క్రియశక్తి ఈ ఆత్మ
విశ్వసమే! మనకు ఏదైనా భ్రష్టత్వం, దోషం సంభవిస్తే నా మాటలను గుర్తు పెట్టు కోండి - ఆ భ్రష్టత్వం మన ప్రజలు ఆత్మవిశ్వాసాన్ని
కోల్పోయిన నాటి నుండి ప్రారంభమైంది.*
❤️💘 💛
         ♥️
*"ఎంతగా ప్రయత్నించినా మనసు నిలవ టంలేదు,శ్రీనివాస నామజపం కుదరటం లేదు...
*మనందరికీ ఈ భావన కలుగుతుంది.నిజా నికి ఈ భావన కూడా మన సహజ స్థితికి అడ్డు గా ఉన్న తలపే.. నామజపం అంటే
ఏమిటో అవగాహన చేసుకోకపోవడం వల్ల అదేదో నాకు లభించలేదని భావన కలుగు తోంది. మనం కోరుకున్నది లభించట లేదనే
భావనే అశాంతికికారణం అవుతుంది. చివ రికి ధ్యానం విషయంలో కూడా మనం అదే రకమైన అశాంతికి లోనవుతున్నాం.ఇప్పటికి
మనం ఉన్న స్థితిలో శాంతిగా ఉంటే అది ధ్యానమన్న విషయాన్ని గుర్తించలేక పోతు న్నాం.దాన్నొక ఉన్నతమైన శిఖరమని,దాన్ని
మనం చేరుకోలేక పోతున్నామనే మానసిక వ్యధ ఎక్కువవుతుంది ! ఎవరి ఇష్టా లలో వారి మనసుకుఏకాగ్రతకుదురుతూనేఉంది.
ఇష్టమైన పనిలో ఇతర తలపులు అడ్డు రాని కారణంగా శాంతిలభిస్తూనేఉంది. అలాగే ఆధ్యాత్మిక సాధనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క
మార్గంలో తెలియకుండానే ఇష్టం ఏర్పడి ఆ దిశగా వారు సహజంగా సాగిపోతారు. మన స్వభావంలో ఆ రకమైన ఇష్టం,శ్రద్ధ లేకుండా
దాన్ని అనుసరించే ప్రయత్నం చేయటం అదనపు అశాంతికి కారణమవుతుంది !
💓💘💛
         
*కోరిక వల్లనే మనసుకు ప్రశాంతత దూరం అవుతుంది !
*గాఢనిద్రలో  హృదయంలో లీనమైపోయే మనసు మెలకువ రాగానే మెదడులోనికి వస్తుంది.మనసుకు పరిపూర్ణశాంతి హృద
యంలోనే ఉంటుంది.అలా హృదయంలో ఉన్న మనసే ఈశ్వరుడుగా వెలుగొందుతుం ది. ఆ సమయంలోనే అది అన్ని సంశయా
లకూ సమాధానాలు కనుక్కో గలుగుతుంది. మనసును హృదయం నుండి దూరం చేసేది భావం.భావానికి కారణం
సంకల్పం.అందుకు కారణం కోరిక.కోరికవల్ల మనసు మెదడు లోకి చేరి ప్రశాంతత దూరమై సమాధానం పొందే అవకాశంకూడా
దూరమౌతుంది.ఆత్మ సదా అనుభవానికి సంసిద్ధంగా ఉన్నప్పటికీ, ఈచిన్నకారణంచేతనే అది తెలియడంలేదు!
🧡🌹🌴🌹🌷🌹
        
*జ్ఞాని యొక్క జ్ఞానమునకు పొరలుగా అజ్ఞానం ఆవరించి ఉన్నది. కోడి పిల్లకు తన చుట్టు ఉన్న గుడ్డు తో ఎట్టిసంబంధంఉన్నది?
తొలుత తనకు రక్షణము (అస్తిత్వానికి ఆధారం),పిదప తాను దానిని బ్రద్దలు కొట్టు కొనవలసిన సంబంధం. దానిని ఎప్పుడును
పోగొట్టు కొనుచుండవలెను.
*పుట్టు చున్న అజ్ఞానము కామ క్రోధముల రూపమున వ్యక్తమగును.వాని నివారణో పాయం ఏమి?వానిని పూరించినచో తృప్తి యై
నివారణమగునని భావింపరాదు.నిప్పు పై నెయ్యి జల్లినచో ఏమగునో కామపూరణ ప్రయత్నమున అదే జరుగును. కోరినది,
ఆవశ్యకమగునది వేరువేరుగా బుద్ధితో నిర్ణ యింపవలెను.కోరినది పూరించక ఆవశ్యక మగు దానిని పూరించవలెను. దానితో పాప
కారణమగు కామ క్రోధ తృష్ణ చల్లా రును. ఉదాహరణకు జిహ్వయందు వర్తించు మన సు రుచులను కోరును.జీర్ణకోశం ఆహారము
ను కోరును.ఆకలి,రుచులు,కోరిక సమిశ్రము గాఉండును. ఆకలిని బట్టి ఆహారమును నిర్ణయించినచో రుచికరమైన ఆహారంతో
ఆకలి తీరును. రుచిని బట్టి నిర్ణయించినచో ఆకలిని మించి స్వీకరించిన ఆహారము రోగ కారణమై రుచులు ఇంకనూ చెలరేగును.
ఆకలి ఆవశ్యకము. రుచి కోరిక.వీని వివేచ నము ఉచిత ప్రవర్తనము,బుద్ధి యొక్క ప్రయోగమగును అదియే యోగము.
🖤🌹🌴🌹🌴🌹
         
శ్రోత్రాది ఇంద్రియములు జడములగుట చేత శబ్దా ది విషయములను గ్రహించు శక్తి లేని విగా యున్నవి. ఇంద్రియములకు అంతర
ముగా ఉన్నటువంటి, విజ్ఞానమే స్వభావ ముగా గల, ఆత్మమాత్రమే అన్నిటిని తెలుసుకొనుచున్నది.
ఎట్లనగా ఆత్మతో కూడిన అంతఃకరణ వృత్తి బహిర్గతమై చక్షరింద్రయముల ద్వారా దశ విధరూపములను, జిహ్వేంద్రియముల ద్వారా
షడ్రసములను, ఘ్రాణేంద్రియము ద్వారా చతుర్విధ గంధములను, త్వగీంద్రి యము ద్వారా ద్వాదశ స్పర్శలను, శ్రోత్రము ద్వారా
చతుర్విధ శబ్దములను, అటులనే విషయానందమును తెలిసికొను చున్నది. ఈ దేహములో ఆత్మచైతన్యము ఉన్నంత వరకే
ఇంద్రియములు విషయములను గ్రహించుచున్నవి. ఆత్మచైతన్యము లేనప్పు డు,(మరణించినప్పుడు) ఇంద్రియములు వానివాని
స్థా నములలోఉన్నప్పటికీ,విషయ ములను గ్రహించుట లేదు. కనుక అన్నిటిని తెలుసుకొనునది ఆత్మయే.ఆత్మ తెలుసు కొనుటకు
శక్యముకాని వస్తు వు ఏదియునూ లేదు.ధర్మా ధర్మముల కంటే భిన్నమైన ఏ ఆత్మతత్వమును నీవు ఎరుంగ గోరితివో, దేవతలు సైతం
దేని విషయమున సంశయ గ్రస్థు లైరో,అట్టి ఆత్మ తత్వము ఇదియేనని తెలుసుకొనుము.
జ్ఞాత-జ్ఞాతుం ఇచ్ఛతి.జ్ఞాతకు ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం - తెలుసుకొనుట. జ్ఞానము- జ్ఞాత్వాం ఇతి సర్వత్రం -మిగిలిన 24
లక్షణా లని,24 తత్త్వాలని,24 అంశాలని పిండాండ పంచీకరణయందున్నటువంటి భావమును, అందించే ప్రయత్నాన్ని
చేస్తు న్నారు.జ్ఞాత చక్షురింద్రియము ద్వారా పని చేస్తు న్నాడు. అనుకున్నట్లయితే, ఆ యా దృశ్యములను గ్రహిస్తు న్నాడు. అదే జ్ఞాత
యొక్క ప్రభావం రసనేంద్రియము ద్వారా పనిచేసినప్పుడు, రుచులను సంగ్రహిస్తు న్నాడు. అదే జ్ఞాత ఘ్రాణేంద్రియము ద్వారా పని
చేసినప్పుడు, ఆ ఘ్రాణము యొక్క వాసనలను ఆఘ్రాణి స్తు న్నాడు. అదే జ్ఞాత స్పర్శేంద్రియ మైనటు వంటి త్వక్ ద్వారా
పనిచేసినప్పుడు ఆజ్ఞాత యొక్క ప్రభావము చేత త్వక్‌- త్వగింద్రియ ము స్పర్శను తెలుసుకోగలుగుతున్నారు. శీతోష్ణములు, సుఖ
దుఃఖములు అనేక రకములైనటువంటి ద్వంద్వాది స్పర్శము లను తెలుసుకోగలుగు తున్నాడు.
అయితే ఈ జ్ఞానేంద్రియములు అన్నీ కూడా ను,స్వయముగా పనిచేయుచున్నవా? అనే విచారణ చేయకపోయి నట్లయితే,కళ్ళు
ఉన్నాయి కాబట్టి చూడగలుగుతున్నానని, చెవులు ఉన్నాయి కాబట్టి వినగలుగుచున్నా నని, నోరుంది కాబట్టితినగలుగుతున్నానని,
ముక్కు ఉన్నది కాబట్టి వాసనను గ్రహించ గలుగుతున్నానని, త్వగింద్రియము ఉన్నది కాబట్టి స్పర్శారూప సుఖదుఃఖాలను పొంద
గలగు చున్నాను అనేటటువంటి భావనలు కలుగుచున్నాయి.
    కానీ నిజానికి ఆత్మచైతన్యం కనుక ఈ శరీరంలో వ్యాపకమై,వ్యవహారశీలం కాక పోయినట్లయితే,ఆత్మచైతన్యం యొక్క ఉనికి
ఉండక పోయినట్లయితే,ఈ ఇంద్రియ ములన్నీ సమర్థవంతములు కావు.అవి నిల బడి ఉన్నప్పటికి,శరీరమునందున్నటు వంటి
ఇంద్రియములు ఆత్మచైతన్యం గనుక సహా యం చేయకపోయినట్లయితే,జ్ఞాత యొక్క సహాయంలేకపోయినట్లయితే,ఏ రకమైనటు
వంటి అనుభవాన్ని ఈయజాలవు.దీనికి ఉదాహరణ చెబుతున్నారు.
  శవం.శవానికి అన్నిఇంద్రియాలుఉన్నాయి. లేనిది ఒక్క ఆత్మచైతన్యము మాత్రమే.మరి ఆ ఇంద్రియములు వేటిని గ్రహించడము
లేదు కదా! కాబట్టి,ఈ గోళకములు కానీ,ఆ నాడీ వ్యవస్థ అయినటువంటి ఇంద్రియము లు కానీ, దానికి
ఆధారభూతమైనటువంటి, శబ్ద స్పర్శాది రూపకమైన తన్మాత్ర సహిత జ్ఞానము కానీ, దాన్ని అనుసంధానపరిచే టటువంటి మనస్సు
కానీ,దాన్ని నిశ్చయించే టటువంటి బుద్ధికానీ,ఇవన్నీ ఆత్మచైతన్యం చేతిలో పనిముట్లు .
ఇవన్నీ పంచభూతాత్మకమైనటువంటి మహతత్త్వము,అవ్యక్తములో భాగములు. అట్టి పంచభూతాత్మకమైనటువంటి శరీరం,
వాటియందున్నటువంటి ఇంద్రియములు, వాటియందున్న గోళకములు,వాటియందు పనిచేయుచున్న శబ్దా ది విషయజ్ఞానము,
పంచతన్మాత్రల యొక్క ప్రభావము,ఇవన్నీ కూడా ఒక దానికంటే ఒకటి సూక్ష్మతరము, సూక్ష్మతమమైనప్పటి కి ఇవన్నీ ప్రత్యగాత్మ
యొక్క చైతన్యం చేతనే ప్రవర్తిస్తూన్నాయి, వ్యవహరిస్తూ ఉన్నాయి.
తమకు తాము స్వయముగావర్తింపజాలవు అనేటటువంటి నిర్ణయాన్ని, పంచీకరణని బాగా అధ్యయనం చేయడం ద్వారా నిరంత
రాయముగాఅనుసంధానంచేయడంద్వారా, బాగా పరిశీలనం చేయడం ద్వారా, పరిశో ధన చేయడం ద్వారా,అధ్యయనం చేయడం
ద్వారా నిజజీవితం లో ఆ పిండాండ పంచీక రణని అన్వయం చేసుకోవడం ద్వారా తన కు తాను విరమించడంద్వారా,తననుతాను
తెలుసుకోవడం ద్వారా,తనదైనటువంటి స్వ స్వరూప ఆత్మాసాక్షాత్కార జ్ఞానస్థితిలో నిల కడ కలిగి ఉండడం ద్వారా మాత్రమే మాన
వుడు ఆత్మనిష్ఠను పొందగలుగు చున్నాడు. ఇదిచాలా ముఖ్యమైనటువంటిది.
ఎందుకనంటే ఇవి ఏవీ కూడా స్వయముగా పనిచేయడం లేదు. కారణం ఏమిటంటే, దేవతలకి కూడా ఆయా ఆసక్తు లు పని
చేయడం చేత,వాళ్ళు కూడా ఈవిషయంలో సంశయగ్రస్థు లుఅవుతున్నారు.వాళ్ళుకూడా ఆత్మతత్వాన్ని ఎరగాలి అంటే,
ఆత్మనిష్ఠు లు అవ్వాలి అంటే, ఆయా ఇంద్రియ అధిష్ఠా న దేవతలు కూడా మరలా మానవశరీరాన్ని ధరించవలసినటువంటి
అవసరముఉన్నది.
అంత విశేషమైనటువంటి మానవ దేహాన్ని ధరించి,కేవలము ఇంద్రియవ్యాపార లక్షణ ము చేత,కేవలము ఇంద్రియ వ్యాపార సుఖ
ము చేత,లాగబడుతూ,ప్రేరేపించ బడుతూ అట్టి ఇంద్రియ వ్యాపారముల ఫలితములై నటువంటి సుఖదుఃఖములేసత్యమనుకొని,
సుఖాపేక్షచేత ప్రేరేపించబడుతూ, జీవభావ మునుండి మగ్నత చెందడం వల్ల, ఆ వివే కంతో, ప్రయత్నశీలివై లక్ష్యమునందు శుద్ధి
కలిగినటువంటివాడవై,సరియైన గురువును ఆశ్రయించి,ఈ పంచీ కరణాన్ని,సాంఖ్యవిచా రణని సాంగోపాంగముగా ఎరిగిన
వాడవై,నీ నిజజీవితంలో ఆ రకమైనటువంటి, నిర్ణయా త్మకమైనటు వంటి, ఆత్మసాక్షాత్కార జ్ఞాన మును,పరిణామ
రహితమైనటువంటి స్థితి ని పొందవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది.ఇట్టి ఆత్మోపదేశాన్ని మానవులంద రూ తప్పక
అందుకోవాలి అనేటటు వంటి ఉపదేశాన్ని అందిస్తూఉన్నారు.
  (ఇంతకు మందు ఇంద్రియములకు అంతర ముగా మనస్సు,మనస్సుకు అంతరముగా బుద్ధి,బుద్ధికి అంతరముగా ఆత్మ
ఉన్నటుల చెప్పబడినది. ఇప్పుడు ఆ ఆత్మ అన్నిటికి, అంతరముగాయుండి బుద్ధి మనస్సులతో కూడి,ఇంద్రియముల ద్వారా శబ్దా ది
విషయ ములను గ్రహించుచున్నటుల చెప్పబడినది. ఈ విధముగా ఆత్మ ఉనికి దృఢముగాను, స్పష్టముగాను
చెప్పబడినది.అయినప్పటికి అవిద్యతో కూడిన,అల్ప జ్ఞానులు ఈ ఆత్మ ను తెలియలేకున్నారు.
     మరలా ఇప్పుడు మనం మాట్లా డుకున్న అంశాలని సుస్పష్ట పరిచే ప్రయత్నం చేస్తు న్నారు.అజ్ఞానం ఆవరించి యున్నప్పడు,    
ఆయా దేహేంద్రియ మనోవ్యాపారం సత్యం అని తోస్తూఉంటాయి.తాత్కాలికములైనటు వంటి సుఖదుఃఖములు
సత్యములని,షడ్రు చులు సత్యమని తోస్తూ ఉంటాయి.దశవిధ నాదాలు సత్యమని,బాహ్యములైనటువంటి ఇంద్రియ వ్యాపారములే
సత్యమని తోస్తూ ఉంటాయి.జన్మించినది అసలు ఇంద్రియ సుఖం కోసమేనని,తోస్తూ,తలపోస్తూ ఉంటా డు.ఇంద్రియాదులందు
సుఖదుఃఖములను అనుభవించడం కొరకే పుట్టా ను అనేటటు వంటి మోహాన్ని పొందుతున్నాడు.
  ప్రయత్నశీలియైనటువంటి వాడు, వివేకి అయినటువంటి వాడు, పెద్దల మార్గమును అనుసరించినటువంటి వాడు, మోక్షమార్గ
అనురక్తు డై నటువంటి వాడు, స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి ప్రయత్నశీలియై నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, అతడు
దృఢముగా ప్రయత్నం చేస్తా డు.జీవితంలోని దశాంతర్దశలయందు ఆత్మయొక్క ఉనికి లెస్సగా తెలుసుకునే ప్రయత్నం చేస్తా డు.
  పైన చెప్పినటువంటి ఉపమానం ఏదైతే మరణావస్థతో పోలిక చెప్పారో,ప్రతీఒక్కరూ ఆ మృత్యుకాలమందు తాను ఎట్లు అగు
చున్నాడో గుర్తు చేసుకుని, మరణావసాన సమయమందు,ఈశరీరము ఎట్లు నిశ్చేతన మగుచున్నదో, అచేతనమగుచున్నదో, కట్టె
వలె,కొయ్యవలె,దారువు వలె,శిలవలె పరి ణామ రహితమై పడివుండుచున్నదో,కేవల ము ఆత్మచైతన్య సంగత్వము చేత,ఆత్మ చైతన్య
ప్రభావము చేత, ఆత్మచైతన్య అంశీ భూతము అగుట చేత, ఆత్మ చైతన్య ప్రభా వశీలమై శరీరమంతా వ్యాపించి తన చైత న్యమును
వ్యాప్తి ఒనరించడం చేతమాత్రమే ఇవన్నీ పనిచేస్తు న్నాయనే సత్యాన్ని గుర్తించ గలుగుతాడు.
తన మరణాన్ని తాను ఎఱిగినటువంటి వాడు ఎవడై తే ఉన్నాడో, తనలో ఉన్నటు వంటి ఆత్మచైతన్యాన్నితెలుసుకున్నటువంటి వాడు
ఎవడై తే ఉన్నాడో,వాడు ఈ శరీరాన్ని ఒక తోలుతిత్తి వలె, ఒక వస్త్రము వలె, ఒక చెక్కవలె, ఒక మృణ్మయ దేహము వలె, ఒక
మృత్తికా భాండము వలె చూస్తూ ఉంటాడు. ఈ రకమైనటువంటి దృష్టి కలిగి నటువంటి వాడికి, ఈ ఘటము యొక్క
విశేషము,ఈ ఘటము యొక్క పనితనము తెలిసినటు వంటివాడై , ఘటమును ప్రకాశింప చేసేటటు వంటి స్వప్రకాశమే ప్రధానం
గాని, ఘటము అప్రధానం అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుంటాడు.
💗🌹🌴🌹🌴🌹
        
ఈశ్వరసృష్టము జీవభోగ్యము అగు సప్తా న్న రూపమైన జగత్తు ఆ ఇరువురి తోడను సంబంధ పడియున్నది.ఒక కన్య మాతా
పితలకుపుత్రిక,భర్తకు భార్యయుఅయినట్లే.
సకల జగత్తు యొక్క సృష్టికి మాయాశక్తి సహితమైన ఈశ్వర సంకల్పమే సాధనము వాని ననుభవించుటయందు అంతఃకరణ
వికారరూపమగుజీవసంకల్పముసాధనము.
త్రిగుణాత్మికమైన మాయను ఉపాధిగ చేసుకుని ఈశ్వరుడు సంకల్ప మాత్రముననే సృష్టికార్యము నెరపును.
అందలి వస్తు వులను అనుభవించుటకు జీవుడు పుణ్యాపుణ్య సంపాదనకై ధర్మా ధర్మకర్మను జేయును. పుణ్యాపుణ్యముల ఫలమగు
సుఖదుఃఖములు మనోవృత్తు ల ద్వారా అనుభవ మగును.
ఈ విధముగా జీవసృష్టి జీవసంకల్పములపై ఆధారపడి అంతఃకరణ వికారముల ద్వారా భోగసాధనమగుచున్నది.
ఆ పరమాత్మయే మాయచే మోహింపబడిన అంతఃకరణముగ‌లవాడై ,శరీరమును పొంది సమస్తకార్యములను జేయుచున్నాడు.జీవే
శ్వరుడు స్వప్నమనే తనయొక్క మాయ చేత కల్పింపబడి సకల లోకములలో సుఖ దుఃఖముల ననుభవించుచున్నాడు.తిరిగి
పూర్వజన్మ కర్మ సంబంధము వలన ఆ జీవే  శ్వరుడే (దుఃఖము లేక అజ్ఞానము నుండి) మేల్కొని మరల జాగృతి జెందుచున్నాడు.
ఒకే బంగారము ఆభరణాలుగా వివిధరూపా లను పొందిన విధముగా ఆపరమాత్మయే వివిధ రకాలుగా ప్రకాశించుచున్నారు. ఒకే
వ్యక్తి ఒకరికి తండ్రిగా ఒకరికితాతగా, ఒకరికి భర్తగా వివిధ రకాలుగా ఒకే వ్యక్తి వున్నవిధ ముగా ఆ పరమాత్మ సర్వస్వరూపిగను ఈ
ప్రపంచమునకు ముఖ్యస్థా నమగు సూక్ష్మ ము కంటే సూక్ష్మముగను నుండు పరబ్రహ్మ మే అంతఃకరణముగానుండి సర్వమును 
నడపబడుచున్నాడు....
🌹🌴🌹🌴🌹
          
( అసురస్వభావము కలవారు) ఇట్టి నాస్తిక దృష్టిని అవలంబించి చెడిన మనస్సు గల వారును,అల్పబుద్ధితోగూడియున్నవారును,
క్రూ రకార్యములను జేయువారును,(జగత్తు నకు)శత్రు వులును(లోకకంటకులును)అయి ప్రపంచము యొక్క వినాశము కొఱకు
పుట్టు చున్నారు.
"నష్టా త్మానః" అను ఈ పదముచే నాస్తిక దృష్టి,కామస్వభావములు కలవారి మనస్సు తప్పకచెడిపోగలదని స్పష్టమగుచున్నది.
మఱియు అట్టివారిబుద్ధి అల్పముగనే ఉం డును,కాని విశాలముగావుండదనియు,తెలి యుచున్నది.వారిది హ్రస్వదృష్టి. విశాల దృ
క్పథము,విశాలదృష్టి వారికి ఉండదు. ఇవ్వి ధముగ నాస్తికత్వము,కామదృష్టి చిత్త వినా శకరములగుటచే త్యాజ్యములని పై భగవ
ద్వాక్యముల వలన ఋజువగు చున్నది.
మఱియు నాస్తికులు,కామమే సర్వస్వమని, సృష్టికి మూలమని తలంచు అవివేకులు. తమను గొప్పగా తలంచుకొనినను భగవ
ద్దృష్టిలో,పెద్దలదృష్టిలోవారు“అల్పబుద్ధు లే”.
“క్షయాయ జగతః”- జగత్తు యొక్క నాశము కొఱకే వారి పుట్టు క కాని ఉద్ధా రము కొఱకు గాదు.పరప్రాణులను హింసించుటయే
వారి పని గాని,వారికి ఉపకారముచేయుటగాదు. వారు లోకకంటకులేకాని,లోకహితులుకారు.
వారు"కబంధులే”కానిలోకబంధువులుకారు. వెయ్యేల,అట్టివారు భూమికి భారభూతులే యగుదురు.
అసుర స్వభావముకలవారి లక్షణములను మఱికొన్నింటిని పేర్కొనుము....
(ఇట్టి) నాస్తికదృష్టి నవలంబించి మనస్సును చెడగొట్టు కొందురు.స్వల్పబుద్ధి గలిగి యుందురు.క్రూ రకర్మలు చేయుదురు....
లోకకంటకులై వర్తించుదురు.... జగత్తు యొక్క క్షయమునకే జన్మించుదురు.
💕🌹🌴🌹🌴
          
   మనకు కావలసింది తదేకదీక్ష.క్రమం తప్ప కుండా,అచంచలంగా సాధన చేయాలి. మనశ్శరీరాలను పవిత్రంగా ఉంచుకోవడాని కి
చేసే పోరాటంలో ప్రాణాలు పోయినా లెక్క చేయని స్థితికి చేరాలి.
చనిపోతే నష్టం ఏముంది? సత్యసాక్షాత్కా రాన్ని సాధించి,మన స్వస్వరూపాన్ని అను భూతి చెందడం ఘనకార్యం కాదా? మన
ప్రయత్నలోపం లేకుండా,సాధనలుఆచరించి ఫలితాన్ని దైవానికే వదిలేయాలి.ఇదే నిజ మైన శరణాగతి అనబడుతుంది.
మనస్సు అనే రథాన్ని నడుపగలిగిన వివేకం కలవాడు,పగ్గాలుకట్టిన గుర్రాలను నియం త్రించగల సత్తకలవాడు మాత్రమే పరమగ
మ్యాన్నిచేరగలడనికఠోపనిషత్తు బోధిస్తోంది.
*మనం బాగానే కష్టపడుతున్నాం గదా* అని ప్రస్తు తం ఉన్న  పురోగతితో సంతృప్తి పడకూడదు.ఉన్న పరిస్థితులలో మన ప్రయ త్నం
సమంజసం కావచ్చునేమో కానీ సాధన కోసం మరింత ఎక్కువ శక్తిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి.
ఈ రోజు నాకు పది కిలోల బరువు ఎత్తే సామర్ధ్యం ఉండి ఉండవచ్చు.వంద కిలోల బరువు ఎత్తే బలాన్ని ప్రసాదించమని వేడు కోవాలి.
మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
మనం చేసిన,చేస్తూన్న సాధన సర్వోత్కృష్ట మైంది అయినా సరే,ఇంకా ఎక్కువ చేయ వచ్చును. సర్వోత్కృష్టతకు అవధులు లేవు.
🌹🌴🌹🌴
          ♥️
"డబ్బు ఎవరికోసమైనా ఖర్చు చేయవచ్చు.. కానీ సమయాన్ని మాత్రం అర్హత ఉన్నవారి కోసమే ఖర్చు
చేయాలి...!"                                            
🌹*కొంగ జపం......
మోసపూరితంగా ప్రవర్తించటం,కొంగనీళ్ళలో ఒంటికాలి మీద నిశ్చలంగా నిలుచొని తనకు కావాల్సిన చేప దగ్గరకు వచ్చేదాకా కాపు
కాసి దాన్ని పట్టు కొని తింటుంది.
మంచి వారుగా ప్రవర్తిస్తూ అమాయకులను మోసం చేయటం......
*నీ పప్పు నా పొట్టు కలిపి ఊదుకు తిందాం రా! అన్నట్లు *.ఎదుటివారి సొమ్మును ఏదో ఒక విధంగా కాజేద్దా మని ఎదుటివారికి
మేలుచేసిపెడతా మంటూ వారికి మాయ మాటలు చెప్పి వారి చేత ఖర్చు పెట్టించి తమపనిచేసుకుపోవటం ఎదుటివారి చేత ఖర్చు
చేయించి చివరకు డబ్బంతా తామే సమకూర్చినట్లు గా ప్రచారం చేసుకోవటం...
*నీ వేలు నా నోట్లో,నా వేలు నీ కంట్లో*
*ఉపకారికి అపకారం చేసిన సందర్బం..... నీ వేలితో నాకు తినిపిస్తే నా వేలితో నీ కంట్లో పొడుస్తా .....
*ఎన్నాళ్లు బ్రతుక బోదురుకొన్నాళ్ల.....
సృష్టిలో చావు పుట్టు కలు సహజం. లోకంలో ఎవరైనా సరే,ఎన్నాళ్లో బతకలేరు.అందరూ ఎప్పటికైనా మరణించక తప్పదు. ఎంతటి
వారికైనా చావు తథ్యమనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.ఈ మేరకు సద్గుణా లను అలవర్చుకొనిసత్కర్మలతోఆదర్శవంత
మైన జీవితంగడపాలి.అప్పుడే మరణించిన తర్వాత కూడా శాశ్వత కీర్తిని పొందుతారు..
*అజ్ఞానం విజ్ఞానం వైపునకు పయనించే అవకాశం ఉంది, కానీ మూఢత్వం పతనం వైపునకు దారి తీస్తుంది...
🌹🌴🌹🌴🌹*
*కలలు, లక్ష్యాలు కార్యరూపం దాల్చక ముందే  చాలామంది వాటికి సంబంధించిన ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉంటారు.....
వాటి గురించి నలుగురి ముందు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు....దాంతో తెలియకుం డానే బయటి నుంచి మనపై అంచనాలు
పెరిగి, ఒత్తిళ్ళకు గురిచేస్తా యి.
లక్ష్యసాధనలో ఏ కాస్త తేడా వచ్చినా,నలు గురికి ఏం సమాధానం చెప్పుకోవాలా! అన్న మానసిక సంఘర్షణ మొదలవుతుంది.....
అందుకే మనం ఎంతగుప్తంగా కలలు కంటా మో,గమ్యాన్ని నిర్ణయించుకుంటామో,అంత గుట్టు గా ప్రచారాలు లేకుండా ప్రణాళికలు
రచించుకుంటూ మన ప్రయత్నాల్ని కొనసా గిస్తూ ఉంటే...... బాహ్యపరమైన ఒత్తిళ్ళు తగ్గుతాయి.
మన బాధ్యతల్ని మోస్తు న్నవారితో, అయిన వారితో, మనం జవాబుదారీగా మసలు కోవలసిన వారితో,సంబంధిత రంగాల్లోఅను భవం
ఉన్నవారితో తప్ప..... ఇతరులతో మన లక్ష్యాల గురించి చర్చించాల్సిన అవసరం లేదు.
చెట్టు పై పక్షి ఎంత నిశ్శబ్దంగా, నిబ్బరంగా ఒక్కొక్క పుల్లను ఏర్చికూర్చి పేర్చుకొని పది లంగా గూడు కట్టు కుంటుంది.....
అలా మనం కూడా అంత పొందికగా కర్తవ్య నిష్ఠతో ముందుకుసాగుతూ..మనవి పగటి కలలు కాదని,పసిడికలలని నిరూపించు
కుందాం.....
*మనిషి మనస్సుచంచలమైనది..ఎప్పుడూ వక్రమార్గాల వైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూ వుంటుంది, దాని వలన అనేక సమస్యలు
వస్తా యి,దీని వలన దుఃఖం చేకూరుతుంది..
కాబట్టి,ఎవ్వరికీ హానితలపెట్టని మనస్తత్వం ఉన్న వారితోఉందాం..ధర్మంగా,న్యాయంగా, నడవడానికి ప్రయత్నం చేద్దాం.మనస్సును
ఎల్లప్పుడూఉల్లా సంగాఉండేలా ప్రయత్నం చేద్దాం....పగ, కసి,ద్వేషంతో,ప్రత్యక్షంగానో, పరోక్షం గానో,ప్రతి నిత్యం నిందించే వారితో,
ద్వేషించే వారితో,దూరంగా ఉండేలా ప్రయ త్నం చేద్దాం..ఇంకా అవసరం అనుకుంటే, ఓదండం  పెట్టి పక్కకు తప్పుకుందాం......
జీవితం లో కష్టా లు అనేవి సహజం.వాటి నుంచి బయట పడగలిగినప్పుడే మీ సామ ర్ధ్యం ఏంటో అందరికి అర్థం అవుతుంది.
మనం*ఏస్థా యిలో*ఉన్నామన్నది ముఖ్యం కాదు,మనప్రవర్తనతో-మన*మంచితనంతో*ఏ స్థా యికి ఎదిగామన్నది ముఖ్యం,,
గుర్తుంచుకోండి.అనురాగం,ఆప్యాయతలు మన ఇంటిపేరు కావాలి కానీ,, అసూయ, కుళ్లు ,కుతంత్రాలు కాదు,,    
నేను జీవితంలో *ఓడి* పోతున్నాను,అంటే నాలో *బలం* లేక కాదు.నేను *అబద్థం* ఆడలేక ఎదుటివారిని *మోసం* చేయలేక
మాత్రమే.
*కష్టా ల్ని*ఎదురించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడై తే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావనిఅర్థం.
    జీవితంలో ఎవరికి ఎవరూ *శాశ్వతం* కాదు.ఉన్నన్ని రోజులు ఒకరికొకరు తోడుగా కలిసిమెలసి *సంతోషంగా* బ్రతకడంలోనే
ఉంది నిజమైన ఆనందం.
   మన ముఖం పై *చేదుగా*మాట్లా డే వారు ఎప్పుడు మనల్ని *మోసం*చేయరు. మనం భయపడవలసింది మనతో *తీయ్యగా*
మాట్లా డే వారితోనే మనసులో అసూయ పెంచుకుంటారు సమయం వచ్చినప్పుడు మారిపోతారు.*అద్దం* బలహీనమైనదే కానీ
*నిజాన్నిచూపడంలోఎప్పుడూభయపడదు.
   మనం ఒంటరిగా *వస్తాం* ఒంటరిగానే *పోతాం*. మనిషి చేతిలో ఏది ఉండదు , ఉన్నన్ని రోజులు నలుగురిని *ప్రేమించు*
ఒంటరితనాన్ని *నవ్వుతూ* జయించు. నీకున్న కష్టా లను *ఆనందంగా* ఓడించు, *ఒక్క గుండెలోనైనా* చెక్కచెదరని స్థా నాన్ని
సంపాదించుదాం...
*జీవితము...పలికేటప్పుడు..నాలుగు అక్షరాలే..కాని...అందులో ప్రయాణం అంతు చిక్కని అన్వేషణ...
*ప్రతి మనిషి*చూడడానికి బాగానే అనిపిం చినా,మనస్సులో ఎన్నో బాధలు.....
కావాలన్నది దొరకదు..దొరికినది మనతో ఉండదు....ప్రతిక్షణం సంతోషంగాఉండాలనే తపన..కానీ సంతోషం మనిషిజీవితంలో
కొన్ని నిమిషాలు మాత్రమే.....
*కష్టా నికి అలవాటుపడిన మనిషికి ప్రతి క్షణమూ సంతోషమే..కాబట్టి.,దొరికిన దాని తో సంతృప్తిపడటమే జీవితము.......
*Mistake is a Single Page

💕🌴🌹🌴🌹
           in a Part of Life*              

🌹
        
*గోమాతా.....*
ధేనువులకు తల్లి.కామధేను రూపమైనది.
గో అనే శబ్దం ....వాక్కు అవటంచేత, అన్ని వర్గాలకు మాత ఆ పరమేశ్వరియే.....
పూర్వకాలంలో,అంటే సృష్టి ప్రారంభంలో పంటలు పండించటమువంటివిలేవు. అప్పు డు ఉన్నదంతా పశుసంపదయే.ఆ రోజుల లో
అందరూ పాలుత్రాగి జీవించేవారు.
అప్పట్లో పశుసంపద అంటే ఆవులు........ శ్రీకృష్ణుడు కూడా గోవర్ధనగిరి ఎత్తి గోవులను రక్షించాడు. అందుచేత పశుసంపద అంటే
గోసంపదే.....
ఇవే జీవులన్నింటికీ ఆహారమైన పాలను ప్రసాదించాయి.అందుకే గోవు మాతయింది.
*గో* అనే శబ్దా నికి - స్వర్గము, వృషభము, వజ్రము,చంద్రు డు,నేత్రము,దిక్కు బాణము. ఇలా
అనేకార్థా లున్నాయి.వీటన్నింటికీమాత కాబట్టే ఆ పరమేశ్వరే..... *గో మాతా*
*ప్రతీది డబ్బుతో కొనగలం అనుకుంటాం. కానీ...... కొన్ని కోట్లు *గుమ్మరించినా కొనలే నివి కొన్ని ఉంటాయి....
*అవే అనుబంధాలు,ఆప్యాయతలు.వాటి విలువ పొందిన వారికంటే *పోగుట్టు న్న వారికే బాగా తెలుస్తుంది.
*తెలుసుకొనే సరికి పుణ్యకాలం కాస్తా దాటి పోతుంది.....
*మనం అందరం జీవిస్తు న్నామని అనుకుం టూ వుంటాం..కాని రోజు నటిస్తూజీవిస్తు న్నా మని తెలుసుకోలేకపోతున్నాం...అందరినీ
అనడం నాఉద్దేశం కాదు కాని,ఇలాంటివారు చాలామంది వున్నారని చెప్పడమే నా ఈప్రయత్నం..
*నాటకం మనకు తెలియకుండా మన మా డే బ్రతుకు నాటకం...రంగులు పులుముకు ని రోజుకో వేషం..నవ్విస్తాం,ఏడిపిస్తాం,నమ్మి
స్తూ మోసంచేస్తాం.పడక లేచిన మొదలు పడక చేరే దాకా బ్రతుకు పాత్రలో జీవిస్తాం.. *పగలూ,రేయీ నడుమ పడుతూ లేస్తూ సాగే
అద్బుత కధలోని నటులంమనం.
*ప్రేమలూ, స్నేహాలూ,బంధాల చిక్కుముడు లతో రాసిన అద్భుతమైన కధనం మన జీవితం ....ఎవరిబ్రతుకూ వ్యర్థం కాదోయ్ ప్రతీ
పాత్రదీ సముచిత స్థా నం ..
*నేను ఆత్మ ధ్వని నుండి అతీతముగా నా శాంతి స్వధర్మంలో స్థిరమైన శాంత స్వరూప మును. నా ప్రియమైన మధురమైన శివ తండ్రీ
సమీపంలో ఉన్నాను... ఈ స్థితిలో ఏ బంధంలేదు..ఏ భారంలేదు..పూర్తిగా మధు రమైన,లోతైన శాంతిలో సంకల్పధారీగా ఉ
న్నాను.సర్వ ధర్మ బంధనాల నుండి ముక్తం గా కర్మాతీతంగా ఉన్నాను.
*రోజంతా కర్మల ప్రభావం నుండి ముక్తంగా  ఉన్నారా?కర్మలు తన వైపుకి ఆకర్షితంచేయ కూడదు.రోజంతా బాబాతో ఏదో ఒక
సంబం ధంతో ఉంటూ కర్మలు చేయండి. ఎలానైతే బాబా అవ్యక్తంలోఉంటూ వ్యక్తంలో ప్రవేశిం చి కార్యాలు చేస్తా రో...అలాగే బాబా
సమా నముగా అంటే అవ్యక్త స్థితిలో ఉంటూ వ్యక్త కర్మేంద్రియాలతో కర్మలు చేయించాలి. ఎంత సమీపతో అంతా మహానత. ఎవరైతే
కర్మలో అనాసక్తంగా ఉంటారో వారే కర్మయోగి. మీ కర్మలను ఆటగా భావించి చేయండి... భారంగా అనిపించకూడదు.
💚🌹🌴🌹🌴🌹
        
ఏ జ్ఞానము ద్వారా భిన్న శరీరములందు భిన్న జీవులున్నట్లు మనుజుడు గాంచునో అట్టి జ్ఞానము రజోగుణ సంబంధమైనదని
నీవెరుగుము.
*దేహమే జీవుడనియు,దేహము నశించగనే చైతన్యము సైతము నశించిపోవుననియు తలచు జ్ఞానము రజోగుణ సంబంధమైన
ట్టిది.అట్టి జ్ఞానము ప్రకారము వివిధ చైతన్య ముల వృద్ది కారణముననే పలువిధములైన దేహములు గోచరించుచున్నవి.అంతియే
గాని చైతన్యమును కలిగించు ఆత్మ వేరొక్క టి లేదు.అనగా అట్టి రజోగుణజ్ఞానము ననుసరించి దేహమేఆత్మగాని,దేహమునకు
పరముగా వేరొక్క ఆత్మలేదు. అట్టి జ్ఞానము ప్రకారము చైతన్యము తాత్కాలికమైనది.
జీవాత్మలు వేరుగాలేక జ్ఞానపూర్ణమైన ఒక్క ఆత్మనే సర్వత్రా వ్యాపించియున్నదనియు, మరియు ఈదేహము తాత్కాలికఅజ్ఞానము
యొక్క ప్రదర్శనమనియు తలచుట లేదా దేహమునకు పరముగా వేరొక్క ఆత్మ గాని, దివ్యాత్మగాని లేదని భావించుట మొదలగు
నవన్నియు రజోగుణఫలములుగా భావింపబడును.
[1/11, 4:59 AM]  💕🌹🌴🌹🌴🌹
పుట్టినప్పుడు ఏ ఒక్కడుకూడా వస్త్రం కప్పు కుని రాలేదు.మొట్టమొదటిది వస్త్రం కప్ప డంతోనే మొదలౌతుంది.వస్తూపలబ్ది:జన్మిం
చడానికి ఆధారమైనటువంటి,ఆశ్రయించిన టువంటి..బొడ్డు తాడు కోయడానికి బ్లేడుకా వాలి.వస్తూపలబ్ది దానితోనేముడిపడిఉంది.
మరి అలా ఇవన్నీ నీకు అవసరాలే అయివు న్నప్పటికి,ఇవేవీ నీవుకాదు.నీ యొక్కవాస్తవి కమైనటువంటి ఉనికి,నీదది కాదు.నీవు
అఖండమైనటువంటి ఆత్మస్వరూపుడవు.
నీవు ప్రత్యగాత్మ,విశ్వతైజస ప్రాజ్ఞరూపంగా ఉన్నట్లు గా తోచుచున్నప్పటికి లేదా సమిష్టి గా ఉన్నటువంటి స్థూల,సూక్ష్మ,కారణ దేహ
ములైనటువంటి విరాట్‌,హిరణ్యగర్భ,అవ్యా కృత,పరమాత్మలు అనేటటువంటి దేహము లు కానీ, సాక్షులు కానీ,ఇవేవియూ నీవు
కాదు.వీటి అన్నిటికి అతీతమైనటువంటి, అఖండముగా ఉన్నటువంటి పరమాత్మవు, పరబ్రహ్మవు.ఆ పరబ్రహ్మముకూడా బట్టబ
యలందు లేనిది అనేటటువంటి చిట్ట చివరి నిర్ణయమునుపొందటానికి,జన్మరాహిత్య మును పొందడానికి,అమృతత్వాన్ని పొంద
డానికి మాత్రమే నేను ఈమానవోపాధిలోనికి వచ్చాను.అనేటటువంటి,స్పష్టమైనటువంటి
లక్ష్యాన్ని,లక్షణాన్ని,ఆశ్రయించి,మనంప్రయా ణం చేయాలి.అందుకని ఏమన్నాడు?జహర్ల క్షణం,అజహర్లక్షణం,జహద
జహర్లక్షణంఅనే లక్షణత్రయాన్ని సాధకులకు నిర్దేశించారు. ఎవరైతే ‘సూణోధావతి’అనేది సూత్రం అన్న మాట జహర్లక్షణానికి.అంటే
ఏమిటి? అంటే ఎర్రరంగు ప్రవహిస్తుంది అన్నామండి. ఎర్ర రంగు ప్రవహించడం ఏమిటి అయ్యా అంటే?
ఎర్రరంగు జెండాలు పట్టు కున్నటువంటి వా రందరూ కూడా నదిలో ప్రయాణము చేస్తూ ఉంటే,నదంతా ఎర్రగా కనబడి,ఎర్రరంగు
ప్రవహిస్తోందిగాతోచింది. తోచినటువంటి ఎర్ర రంగు ప్రధానమా? అది ప్రవాహం ప్రధా నమా? అలా ప్రవహించే అవకాశం ఉందా?
  ప్రత్యక్ష పరోక్ష అనుమాన విహిత అవిహిత ఇలా ప్రమాణ సహితాలన్నింటినీ విచారణ చేయగా,షట్ప్రమాణ సహితమైనటువంటి
విచారణ చేయగా,యథార్థం బోధ పడింది. కాబట్టి యథార్థం ఏమిటి? అనంటే,నది ప్రవ హిస్తోంది,నదిలో కొంతమంది ప్రయాణీకులు
ప్రయాణిస్తు న్నారు.
వారు ఎర్రరంగు జండాలు పట్టు కున్నారు. దూరం నుంచీచూడగా,ఒక భ్రాంతి కలిగింది. ఎర్రని నది ప్రవహిస్తోంది.నది ఎర్రగా ఉండ
డం ఏమిటి? అనే ప్రశ్న వేసుకుంటే తప్ప, ప్రయోజనము లేదు.
ఈ రకంగా జహర్లక్షణం,అజహర్లక్షణం, జహ దజహర్లక్షణం...ఈ రకంగా లక్షణత్రయాన్ని చక్కగా గురుసమక్షంలో విచారణచేయాలి.
అంటే అర్థం ఏమిటి? ఏది ప్రధానం? ఏది అప్రధానం? ఏది మనం పట్టు కోవాలి? ఏది మనం త్యజించాలి?
🖤🌹🌴🌹🌴🌹
         
శ్వాసము అనగా ఉచ్చ్వాసనిశ్వాసములు, అనగా గాలిని లోపలికి పీల్చి వెలుపలకు వదలుటఅనిఅందురు.ముక్కుయొక్కరెండు
నాసికలద్వారా శ్వాసజరుగుతున్నది. కుడి నాసిక ద్వారా జరుగు శ్వాసమును సూర్య నాడి అనియు,ఎడమనాసిక ద్వారా జరుగు
శ్వాసమును చంద్రనాడి అని అందురు. శ్వాసము కుడి నాసిక ద్వారా 90 శాతము జరుగునప్పుడు,ఎడమనాసికలో10 శాతం
జరుగును.అప్పుడు శరీరంలో ఉష్ణ తత్త్వం   ఉండును. అందువలన దీనిని సూర్య నాడి అని అందురు.ఇదే విధముగా ఎడమనాసిక
ద్వారా 90శాతము జరుగునప్పుడు కుడి నాసిక నుంచి 10 శాతము శ్వాసజరుగును. అప్పుడు శరీరము శీతలస్థితి కలిగి,సరాసరి
ఉష్ణోగ్రత ఉండును.అందువలన దీనిని చంద్రనాడి అనిఅందురు.రెండు నాసికల ద్వారా సరిసమానముగా జరిగే శ్వాసను
*సుషుమ్ననాడి* అని అందురు. ఈ శ్వాస జరిగేటప్పుడు శీతల స్థితి లేకుండా అధిక ఉష్ణస్థితి ఉండును. అందువలన దీనిని
"సుషుమ్ననాడి" అని అందురు.
    ఈ మూడు విధములైన శ్వాసలు మన శరీరములో పూర్తిగా వ్యాపించుచున్నవి. సూర్యనాడి ముక్కు యొక్క కుడినాసిక
ద్వారము నుండి ఎడమకాలు వరకు 16 స్థా నములు అనగా మొత్తం 32 స్థా నములు ఎక్కిదిగుచున్నది. ఆ విధముగనే చంద్రనాడి
శ్వాస ముక్కుయొక్క ఎడమనాసిక ద్వార ము నుండి ప్రారంభమయి, కుడికాలు వరకు 16 స్థా నములు అనగా మొత్తం
32స్థా నము లు ఎక్కిదిగుచున్నది.కానిసుషుమ్ననాడి ముక్కు మొదలు కాళ్ళ వరకు దేహమంతా వ్యాప్తి జరుగుతున్న్నది.ఇవే మన
శరీరము లోని మూడు శ్వాసప్రక్రియలగును.
🌹🌷🌹🌴🌹
         
*సన్న్యాసము -దేనిని కోరనివాడు,ద్వేషింప నివాడు సన్న్యాసి అని తెలియుము. అతడే నిత్య సన్న్యాసి.అతనికి రాగద్వేషములు లేవు
కనుక బంధము లేదు.కోరుట రాగము. తనకిది అక్కర లేదనుకొనుట ద్వేషము. తనకిది కావలెననుకొనుట రాగము. జీవిత ము
కర్మానుసారము సాగుచుండగ,కేవలం  అందు తన కర్తవ్యమును నిర్వర్తించుచు జీవించువాడు బంధముల నుండి బయల్ప డుట
కవకాశమున్నది.కర్తవ్యములను నిర్వ ర్తించినపుడు ఫలితములుకోరుట రాగము. దృష్టి ఫలితములపై నున్నపుడు సత్ఫలితం  కొరకై
ప్రక్కదారులు తొక్కుట బంధము.కర్మ ము సత్ఫలితముల నిచ్చినపుడు వాని యందు తగుల్కొనుట మరల రాగము. సన్యసించిన
బుద్ధితో కర్మల నాచరించుట కర్మసన్న్యాసము..దేనినికోరనివారు, ద్వేషింపనివారు సన్న్యాసి.
అట్లే జరుగకూడదనుకున్నవి జరుగుట లోక విదితమే.కష్టము,నష్టము,మృత్యువు రాకూ డదని;సుఖము,లాభము,జీవనము సాగ
వలెనని సామాన్య జీవులందరును కోరుదు రు.కాని జీవితమున నిత్యసత్యమైన చేదు నిజమొకటి తారసిల్లు చునే ఉండును.
ఆరోగ్యముకోరిన,అనారోగ్యమువచ్చును. లాభము కోరినను నష్టము వచ్చును. ఆయుషు కోరినను మృత్యువు వచ్చును.  జీవునికి
తీరని కోరిక లెప్పుడును మిగిలి పోవును.కోరని బంధములు ఎప్పుడును ఏర్పడుచుండును.
తీరని కోరికలు,వదలని బంధములు జన్మ పరంపరలు కలిగించు చుండును. వీటన్నిటి కిని రాగద్వేషములే కారణము. జీవితము
కర్మానుసారము సాగుచుండగ, కేవలము అందు తన కర్తవ్యమును నిర్వర్తించుచు జీవించువాడు బంధముల నుండి బయల్ప డుట
కవకాశమున్నది. కర్తవ్యములను నిర్వ ర్తించినపుడు ఫలితములు కోరుట రాగము.
దృష్టి ఫలితములపై నున్నపుడు సత్ఫలిత ము కొరకై ప్రక్కదారులు తొక్కుట బంధము. కర్మము సత్ఫలితముల నిచ్చినపుడు వాని
యందు తగుల్కొనుట మరల రాగము.
కర్మలు ఫలించనపుడు కలుగునది క్రోధము, ద్వేషము. ఇట్టి ఒడుదొడుకుల జీవితములే అన్నియును. కర్తవ్యమే తనవంతని, మిగి
లిన దంతయు దైవమని భావించి కాలక్రమ మున తనను సమీపించు కార్యములను రాగ ద్వేషములు లేక నిర్వర్తించుట నిజమ గు
సన్న్యాసము.
సన్యసించిన బుద్ధితో కర్మల నాచరించుట కర్మసన్న్యాసము. అనగ రాగద్వేషముల నంటనీయక ఆసాంతము కర్తవ్యకర్మలనే
నిర్వర్తించుట ఈ శ్లోకమున సూచింప బడి నది. అట్లు నిర్వర్తించువారు సంసారమందు న్నను సన్న్యాసియే. రాగద్వేషములకు
చిక్కినవారు సన్యసించిననూ సంసారులే.
❤️🌹🌴🌹🌴🌹🌴
        
ఈ సృష్టిలో చిట్టచివరికి పొందదగింది జ్ఞాన మొక్కటే! ఇంకేమీలేదు.సృష్టిలో ప్రతీజీవుడు కోరుకోదగిన ఆత్యంతిక వస్తు వు ఒక్కటే
ఉంది.అదే జ్ఞానం,మోక్షం.అదితప్ప ఇక కావ లసింది ఏముంది ఇందులో! నీవు తపస్సు కు వెళ్ళిపో” అని ప్రేరణ చేసాడు.
అశ్వినీ దేవతలు వైద్యులుకాబట్టి యజ్ఞంలో వాళ్ళకు హవిర్భాగాలు లేవు. స్వాహాకారం తో అగ్నిహోత్రంలో నెయ్యివేస్తాం. ‘అగ్నయే
స్వాహా అగ్నయ ఇదం న మమ’ అంటాం. అగ్నిహోత్రు డికి,ఇతర దేవతలకు హవిస్సు లు ఇస్తాం. అశ్వినులకు అలా లేవు. వాళ్ళు
వైద్యులు కావటమే ఇందుకు కారణం.
   ఆర్యసంస్కృతిలో మొదటనుంచీ వైద్యుడి కి, సంగీతం పాడేవాడికి, నాట్యంచేసేవాడికి- ఇలాంటివాళ్ళను అపాంక్తేయులని-
బ్రాహ్మణ పంక్తిలో వాళ్ళు పనికిరారు.వాళ్ళను తక్కు వగా చూసేవారు.ఎందుకంటే, ఉదాహరణకు వైద్యుడు సంఘానికి
ఎంతసేవచేసినా, అత డు చేసే వృత్తి ఎలాంటిదంటే; రోగంలో స్థితి నిబట్టి,విచక్షణలేకుండావెళ్ళివైద్యంచేయాలి.
ఏ కులమైనా,ఏ స్త్రీ అయినా,ఏ పురుషుడ యినా ఎండిపోయి చచ్చిపోవడానికి సిద్ధం గా ఉండి శవాకారంగా ఉండేవాడికి అయినా
సరేవెళ్ళి చేయాలి.అదంతా శౌచంకాదు.శౌచ విధికాదు.అశుచికరమైనటువంటి వృత్తిఅది. కాబట్టి వైద్యవృత్తిని ఉత్తమకులానికి కాని,
లేకపోతే బ్రాహ్మణ ధర్మానికి నిషేధంగా భావించారు.
ఇప్పుడు ఎంత ఉత్తమ కులస్థు డు అయితే అంతపోటీగా వెళ్ళి వైద్యవృత్తికై ప్రయత్నం చేసే యుగంమనది! నేడు వైద్యవృత్తి అంత
పవిత్రమయినది ఇంకొకటి లేదు.కాని ఆనాడు మాత్రం ‘అపవిత్రం భేషజం'(భేషజం అంటే వైద్యం).సంగీతం కూడా అటువంటిదే.
వీళ్ళను ‘నటవిటగాయకులు’ అనేవారు; వారందరూ అలాంటివాళ్ళే! వీళ్ళు అందరినీ వినోదింపచెయ్యాలి.రాజు కొలువులో కూడా
పాడాలి. ఎవరు ధనవంతులయితే వారి ఇంటికి,పిలిస్తే వచ్చి పాడాలి.ఇక అట్టివారికి నిత్యఆహ్నికాలెలా ఉంటాయి? వాడి వృత్తే అది.
వీళ్ళందరూ (నటవిట గాయకులంద రూ) కూడా వైద్యుడితో సహా తక్కువగా పరిగణించబడ్డా రు.     
మానవుని ఆధ్యాత్మిక వికాసములలోఇది  యొకటి. ఇది భగవంతుని సత్యస్థితి(సత్య గోళము).ఈ గోళములో భగవంతునిఅనంత
శక్తి, జ్ఞాన,ఆనంద స్థితులు ఇమిడియున్నవి.
భగవంతుని అనాది అనంతస్థితి. అనంత శక్తి -అనంత జ్ఞానము -అనంత ఆనందము.
భగవంతుని బాహ్యస్థితి. ఎరుకతోకూడిన ఏకత్వము. ఏకమ్.అనుభవాతీత స్థితి యొక్క అనుభవస్థితి పరమాత్మ స్థితిద్వారా
భగవంతుడు అనుభవాతీత స్థితి యందు ఎఱుక కలిగియున్నాడు.
🌹🌴🌹🌴
   
మనకు కావలసింది శ్రద్ధ..మనిషికి మనిషికి మధ్య తేడా శ్రద్ధలోఉన్న తారతమ్యమే గాని వేరేమికాదు.ఒకమనిషిని గొప్పవాడు గాను;
ఇంకొకరిని బలహీనుడిగాను,అధముడిగా ను చేసేది,*శ్రద్ధే*.అంటే శ్రద్ధలో వ్యత్యాసమే కాబట్టి ఈ శ్రద్ధ మీలో పాదుకోవాలి.
*మార్పుని కోరని జడత్వం మూర్ఖుడి స్వభా వం.చెడును నివారించి, మంచిని కోరడం మనిషి లక్షణం,ద్వందాలన్నింటినీ అతిక్ర
మించి దేన్నీ ఆశించక సదానందుడై ఉండ డం భగవంతుడి తత్వం, అదే మన గమ్యం.
*కృతజ్ఞత, అతిథి సత్కారం భారతీయుల విశిష్ట లక్షణాలని మనం గుర్తించాలి.*
🌹🌴🌹🌴🌹
        ♥️
*సృష్టిలో అన్ని జీవులకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.సింహము గర్జిస్తే పది మైళ్ళ దూరము అవలీలగా వినపడుతుంది.ఏనుగు ఐదు
టన్నులబరువుఉంటే,తిమింగలం100-150 టన్నుల బరువు ఉంటుంది.మిణుగురు పురుగు కటిక చీకట్లో స్వయం ప్రకాశంతో
చూడగలదు,కుక్కలు వాసన చూసి దొంగల ను పట్టగలవు – చీమలు తమకంటే 52 రెట్లు బరువును అధికంగా మోసుకు  పోగ
లవు,చిరుత గంటకు 100  మైళ్ల కుమించిన వేగముతో పరిగెతగలవు , గ్రద్దలు ఆకాశము లో ఎంతో ఎత్తు న ఎగురుతూ నేలమీదఉన్న
నలుసంత కోడిపిల్లనుచూడగలదు,భూమిపై ఉన్న పశు,పక్షి,క్రిమి,కీటకాలలో ఎన్నో ప్రత్యే కతలు గలవి ఎన్నో జీవులు కలవు.
*మరీ మనషి పత్యేకత ఏమిటి..? ఈ చరా చర సృష్టిలో అతని స్థా నము ఏమిటి ? జీవ జాతులలో అతని గొప్పతనం ఏమిటి? నేడు
భూమిమీద నివసిస్తు న్న జంతువులలో 20 లక్షల రకాల కన్నా కీటకాలలోని 15 లక్షల జాతుల కన్నా ,పక్షులలోని 8,650 జాతుల
కన్నా నిశ్చయంగా ఉన్న మానవుడే మహనీయుడు.
*ఇన్ని కోట్ల జీవాలలో ఇన్ని లక్షలజాతులలో ఒక మానవ జాతే సమస్త భూమండలాన్ని , భూమండలంలోని కోటాను కోట్ల జాతుల్ని
తన చెప్పు చేతుల్లో ఉంచుకో గలిగిందంటే దానికి కారణం?మానవుని మేధస్సులోఉన్న  జ్ఞానం –ఆలోచన –అన్వేషణ కలిగిన
మానవుడు ప్రపంచం ఫై ఆధీపత్యము వహిస్తు న్నాడు.
*సమస్త జీవ ప్రపంచాన్నిసృష్టించిందిఎవరు అసలు సృష్టికర్త ఎవరు? అతను అపారాశక్తి సంపన్నుడు ఆది అంతములేనివాడు,సృష్టి ,
స్థితి,లయాలకు మూల కారకూడై న ఆ శక్తి సంపన్నున్ని – ఎలా దర్శించాలి ? ఎలా ప్రసన్నం చేసుకోవాలి ? అతనిలో ఎలా లీనం
కావాలి?ఎలా ధ్యానించాలి?ఎలా పూజిం చాలి ? అసలు అతడు ఒక్కడా! అనేకులా?
*మరి మానవుడు ఎక్కడ నుండి వచ్చాడు. అన్ని రంగాలలో ఆలోచన చేయగలిగిన మానవుడు తను ఎందుకు వచ్చాడో,తన
ప్రత్యేకత ఏమిటి ? అని తనకు తానూ తెలుసుకునే ప్రయత్నము చేయడం లేదు. ఈనాడు అనంతమైనవిజ్ఞానాన్నిపొందుతూ 
ఖగోళంలో ఏముందో చూడగలిగిన మానవు డు, భూగర్భములో ఏముందో చెప్పగలిగిన మానవుడు,గర్భస్థ శిశువు ఆడ,మగ అని
చెప్పగలిగిన మానవుడు,దేహ రచన శాస్త్ర ములో కానీ అన్ని రంగాలలో ఎంతోముందు కు పోతున్నాడు. కానీ ఆధ్యాత్మిక రంగంలో
మాత్రం తనని తాను తెలుసుకునే దానిలో ముందుకు పోలేకపోతున్నాడు కారణం ? జ్ఞానం లేకనా ? ఆలోచన లేకనా ? అశ్రద్ధ
వలననా ? తనలో ఉన్న జ్ఞానం, ఆలోచన, అన్వేషణ అనునవి సూక్ష్మ స్థితిలో తనలోనే ఉన్నా-వీటికి మూలము ఏమిటి అని అన్వే
షించలేక పోతున్నాడు కారణం ? మార్గం తెలవకనా,ఈ విశాల సృష్టికి మూలం ఎవరో ఒకరు ఉంటారు కదా? అతనిని వెతకటం
ఎందుకు ప్రయత్నము చేయడం లేదు.
*తనను సృష్టించింది ఎవరు? తన చుట్టూ ఉన్న జీవ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు? ఈ ప్రకృతిని,ఈ అనంత ఆకాశాన్ని , సువి శాల
భూమండలాన్ని, మహాపర్వత శ్రేణు లను, సరస్సులు,సాగరములు ఇలాఆనంత సృష్టిని సృష్టించిందెవరు.ఆ సృష్టికర్తఎవరు? అతడు
అపారాశక్తి సంపన్నుడై ఉండాలి- సృష్టి స్థితి లయకు కారణమై ఉండాలి. అన్ని తెలుసుకునే మానవుడు నిన్ను నీవు ప్రథ మంగా
తెలుసుకో.తరువాత అన్ని నీకే తెలు స్తా యి అని ఋషులు,యోగులు  తెలుసు కునే మార్గాన్ని చూపించినప్పటికీ దానిని దర్శించ
లేకపోవడం మన ఆశ్రద్ధ తార్కాణ మే గదా? ఈ మానవుడికి పరిపూర్ణమైన మేధస్సు ఇచ్చి జ్ఞనము ఆలోచన, అన్వేషణ అన్నింటిని
కలిపింది సృష్టిలోనిసమస్తజీవుల యెడ దయార్ధ హృదయంతో చూడాలని, వచ్చిన మార్గాన్ని వెతకడమే నీ బాధ్యత. ప్రయత్నం
చేయండి.
*నీవు కావలన్నది సాధించుకోవాలంటే నీలో ఉన్న శక్తిని నీవు విశ్వసించాలి.
*నిజమైన సంతోషం కోసం బయట ఎక్కడ ఉంది అని వెతకకు,అది నీ అంతరంగంలోనే  అంతర్యామి అయిన అంతరాత్మలోనే
ఉంటుంది.
*సంతోషానిచ్చేది సంపదలు,అంతస్తు లు లేదా వైభవం కాదు, ప్రశాంతమైన మనసు వృత్తి మాత్రమే.
*నిరంతరము నిన్ను ఎవరో కనిపెట్టి చూస్తు న్నారన్న సృహతో నీవు ప్రవర్తించు.
*మన సమస్యలకు,మన దుఃఖాలకు,మన బాధలకుపరిస్కారాలు మనదగ్గరేఉంటాయి కాని ఎవరో పరిష్కరించాలని అనుకుంటాం.
*సంతోషంఅనేది ఎంతోమధురమైనది కాని, ఆ మాధుర్యం పొందాలంటే ఎంతో వేదన పడాలి.
*విజయం సాధించడములో ఎవరు నిన్ను మోసము చేయలేరు-నిన్ను నీవు మోసం చేసుకుంటే తప్పా.
*నీలో ఉన్న శక్తిని నీవు తెలుసు కున్నపుడే గమ్యం చేరగలము, ముందు నీ గురించి నీవే పరిశోధిoచుకో.
*నిన్ను నీవు విమర్శించించుకో,నిన్ను నీవు పురికొల్పుకో,నిన్ను నీవే పరీక్షించుకో,దీని వలన నీవు సదా జాగ్రత్తతో సురక్షితంగా
ఉంటావు,కాలము సుఖంగా గడుస్తుంది.
*నీ శత్రు వులు నీలోనే ఉన్నారు, నిజానికి వేరే శత్రు వులు ఎవరు లేరు, తప్పుతోవ త్రొక్కే నీ మనసే నీ శత్రు వు అని తెలుసుకో.
*నిన్ను నీవు మోసాగించు కున్నంతగా, ఇంకొక రెవరూ నిన్ను మోసాగించరు.
*దేని నైనా ఆశించబోయే ముందు అందుకు కావలిసిన అర్హతను సంపాదించుకో–తనను తానూ జయించుకోగల వ్యక్తీ అన్నింటిని
జయించగలడు.
*దీపము తానూ వెలుగుతూ ఉంటేనే మరో దీపాన్ని వెలిగించగలదు.
*నీమీద నీకు నమ్మకం పెరుగుతున్నప్పుడు, నీ సమర్ధత కూడా పెరుగతుంది.అనుభవం నుంచి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
మనము పదార్ధ సముపార్జన కోసము ఆరా టపడుతూ,తింటూ,తిరుగుతూ,ఇంకా పోగే సుకుంటూ అదే కార్యక్రమములో ఉంటే 
మూలాధారములో ఉన్నట్టు లెక్క. మనకి తీరవలసిన కోరికలు బాగా ఉండి,వాటిమీదే ధ్యాస ఉంటే స్వాధిష్టా నములోఉన్నట్లు లెక్క
ప్రాపంచిక భావాలలో మన మనసు ఎక్కువ తిరుగుతూ  ఉంటే మణిపూరకములో  ఉన్నట్లు లెక్క......
*వీటికి అలవాటు పడిన మనస్సుని సరా సరి తీసుకొని వెళ్లిభ్రూమధ్యములోఉంచాలి. ఇది జిజ్ఞాసువులు చేయవలసినటువంటి
ప్రధానమైన ప్రయత్నము. మనసు అక్కడ నుండి విచలితమై అటు,ఇటుపోతూఉన్నా, మరల తీసుకొని వెళ్ళి అక్కడే పెడుతూ
ఉండాలి. ఇది ఓపిగ్గా అభ్యాసము చేయాలి. దీనినే *A game of patience* అన్నారు.
💜🌹🌴🌹🌴🌹
       
*"శాంతి పొందేందుకు మనసును సంస్కరిం చుకునే విధానాలు ఏమిటి !?"
*శాంతి కావాలనే కోరిక ఉత్కృష్టమైనది. జీవనంలో ఉన్న అసమతౌల్యాన్ని గుర్తించి తొలగించుకుంటూ పోతే మనసుకు ఏర్పడే
ఫలమే ధ్యానం. ఆత్మలక్షణమే శాంతి.అందు కే నిద్రలో మనకి రోజూ అది అందుతూనే వుంది.నిద్రలో ఎలాగైతే మనసుకు ఉన్న
బాధలు,శరీరానికి ఉన్న వ్యాధులు ఏవీ తెలి యనివ్వని అత్యున్నత శాంతి లభిస్తుందో అలాగే నిత్యజీవితంలో కూడా పొందే స్థితిని
పొందటమే నిజమైనధ్యానఫలం.మనసును సంస్కరించేందుకు ఉపయోగపడే దైవారాధ నను నిత్యనైమిత్తిక కర్మల్లో కొనసాగించాలి.
అయితే వాటిద్వారా ఏదో పొందాలన్న కోరిక ను విడనాడాలి.అప్పుడే...సత్యంఅనుభవం లోకి వస్తుంది.మనం దైవానికి భిన్నంగా
లేమన్నజ్ఞానం కలుగుతుంది !
🧡🌹🌴🌹🌷🌹
          
*మనసును మౌనంగాఉంచితే సత్యం సంపూర్ణంగాసిద్ధించి అఖండ శాంతినిస్తుంది!
*ఒకడు శివుడిని కనిపించమని కోరతాడు. మరొకడు శివుడిని తనకు కావాల్సిన లౌకి కమైన కోర్కెలు తీర్చమని కోరతాడు. తేడా
ఏమిటంటే ఒకరు లౌకిక విషయాల్లో మౌనం గా ఉంటే, మరొకరు పారలౌకిక విషయాల్లో మౌనంగా ఉన్నారు. కానీ ఇద్దరిదీ సంపూర్ణ
మౌనం కాదు. ఎవరెవరు ఏఏ విషయాల్లో మనసును మౌనంగా ఉంచలేకపోతున్నారో, వారు ఆయా విషయాల్లో మనసును మౌనం
గా ఉంచితే అది సంపూర్ణంగా సిద్ధించి అఖండశాంతినిస్తుంది. చిత్తహీనులు, తత్ అయినవారు, సంసారహీనులకు సులభం అని
చెప్తు న్నారు.సంసార హీనులు అంటే బాహ్యంగా సంసారాలు లేనివారని కాదు.  మనసులో సంసార జంజాటం లేనివారు. సంసార
పోషణను ఒక బంధంగా కాకుండా బాధ్యతగా చేసేవాళ్ళు !*_
💞🌹🌴🌹🌴🌹
      
*నశించుచున్న పదార్థజాలమంతయు నశిం పనివానియందే ద్రష్టచేఆరోపితమైయున్నది. అదియు,ద్రష్టయు కూడి క్షేత్ర క్షేత్రజ్ఞులు.వీరి
సంయోగమున సర్వజీవులయందు సమా నముగా నిలిచియున్న పరమేశ్వరుని దర్శిం చినవాడే దర్శించినవాడు.
*ఇట్లు దర్శించినవాడు సమస్తము తానే. తనను తాను హింసించుకొనడు కనుక తాను సృష్టికి హింసాకారణము కాదు.ఇట్టి
సమబుద్థితో ఉత్తమగతి యందుండును.
*ఇతరులుగాని,తాను గాని ఆచరించుచున్న సర్వకర్మలును ప్రకృతిచే ఆచరింపబడు చుండెనని దర్శించును.తాను కర్త కాదని
తెలియును.
*జీవులలో వేర్వేరుగాయున్న అస్థిత్వము నాయందు ఏకత్వముగా ఉన్నదని దర్శన ము చేయును. అప్పుడిది అంతయు విస్తా రమై
ఆద్యంతములులేని 'నేను'గా అనుభూ తమగును.ఇదియేబ్రహ్మత్వమునుపొందుట
*ఈ బ్రహ్మము అనాదియు,నిర్గుణము, జ్ఞేయము కానిది అని తెలిసినప్పుడు శరీర మునందున్నను ఏమియుచేయుట గాని,
అంటుటగాని ఉండదు.
*వాయువు ఆకాశము నందు పుట్టి అందే చరించును.అది ఉండుటవలన గాని, వీచు టవలన గాని ఆకాశమునకు అంటుటలేదు.
అట్లే పృథివ్యాది భూతములు, ప్రకృతులు, జీవులు, వారి ప్రవర్తనలు ఆకాశమునందే ఉన్నవి. వాని అణువుల అంతర్భాగముల లో
ఆకాశము మునిగి తేలుతున్నను అంటు కొనుటలేదు.అట్లే ఆత్మ వానికిఅంటుకొనదు.‌
💙🌹🌴🌹🌴🌹
         
పంచకోశములలో మొదటిదగు ఆనంద మయకోశము సుషుప్తి యందునుఉండును. అది చైతన్యమును అస్పష్టముగ మాత్రమే
ప్రకటించును.ఆ ఆనందమయకోశమే ఆత్మ యని ప్రాభాకరులు,తార్కికులుభావింతురు. ఆత్మ యొక్క గుణములని వీరు చెప్పునవి
ఈ ఆనందమయ కోశపు గుణములే.
సుషుప్తిలో చైతన్యం లేక జాగ్రత్ స్వప్నంలం దు మాత్రమే ఉండినచో"సుఖముగా నిద్రిం చితిని,నాకేమీ తెలియలేదు"అనే సుఖము,
అజ్ఞానముల జ్ఞాపకము సంభవింపదు. వీనిని అనుభవించి మరల గుర్తు తెచ్చుకొను ఒక చైతన్యసత్త ఉండే తీరవలెను.
శ్రు తి కూడా ఆత్మ నిర్గుణమని వర్ణించును.
మనస్సు పనిచేయు జాగ్రత్ స్వప్నములం దు మాత్రమే ఇచ్ఛాదులు కన్పించును కదా !
తార్కికులనునట్లు అసంఖ్యాకులగు పురు షులందరు సర్వవ్యాపులైనచో అందరును అన్ని శరీరములు కర్మలతో సంబంధపడు టచే
ఏది ఎవరికి చెందునో అనే నిర్ణయము కష్టమగును.ఇతర కారణములచే కూడా ఆత్మను గూర్చి ప్రాభాకరుల,తార్కికుల వాదము
అసమంజసము.ఆత్మయని వారు భ్రమపడునది ఆనందమయకోశం మాత్రమే
ధర్మా ధర్మ సుఖదుఃఖాదులు బుద్ధి ధర్మాలు. నిజానికి బుద్ధి జడము.దానికి సుఖదుఃఖాది జ్ఞాన రూపధర్మములు కుదరవు. ఆత్మ
నిర్ధ ర్మకం గనుక వాటిని బుద్ధిధర్మాలని చెప్పవలసి వచ్చినది.
బుద్ధి,సుఖదుఃఖాలు ఇవన్నీ ఆత్మయందా రోపితములు.కనుక వాస్తవముగా లేనివి. రజ్జు వునందు సర్పము లేదు గదా! అలాగే
ఆరోపిత వస్తు వునందు మరో వస్తు వు ఉండదు.
శుద్ధచైతన్యం మీద అజ్ఞానముఆరోపితము. ఈ ఆజ్ఞానోపహిత శుద్ధ చైతన్యము మీద అంతఃకరణము ఆరోపితం. అంతఃకరణోప
హిత చైతన్యమునందు ధర్మా ధర్మ సుఖ దుఃఖాదులు ఆరోపితములు.ఈ విధముగా ఆత్మయందు సుఖదుఃఖాదులనుఆరోపించు
టకు ఉపాధి అయిన అంతఃకరణము కార ణము కనుక సుఖదుఃఖాదులు దాని ధర్మములని చెప్పారు.
ఉపాధి=తటస్థము. వస్తు వు తనతో ఉన్నా అది దానికన్నా భిన్నంగా ఉండును.
విశేషణం=తటస్థం కాదు. వస్తు వును తనతో కలిపియే చూపును. "ఉపాధి-ఉపహితం;
విశేషణం-విశిష్టం"
"అంతఃకరణాధిష్ఠా న" చైతన్యమందే అధి ష్ఠా న లక్షణం ఉంది.ఈ అంతఃకరణం అజ్ఞా నోపహిత చైతన్యం మీద ఉన్నది.విశిష్ఠం మీద
కాదు.కాగాఆత్మ-అధిష్ఠా నము;ధర్మము దాని మీద ఆరోపితము.ఉపాధి-అంతఃకర ణము.కనుక ధర్మాదికము, బుద్ధి ధర్మముల
మధ్య తేడా తెలియకపోవడం వలన మరి యు అంతఃకరణము ఆత్మ అనే రెండింటి యందు కనబడుతున్నది.అందుచే అంతః
కరణ విశిష్టు డై న ప్రమాత యొక్క ధర్మాలు గా ఇవి ప్రసిద్ధం."ఆత్మధర్మ"ములు మాత్రము కావు.ఆరోపిత పదార్ధా లు ఎప్పటికి అధిష్ఠా
న ధర్మాలు కావు.కనుక "ఆత్మ"  "నిర్ధర్మకం".
❣️🌹🌴🌹🌴🌹
       
ఉగ్రనరసింహమూర్తీ! నీ దవడల ముడతలు ముఖముపైకి ఎగబ్రాకి ప్రస్ఫుటించుచుండగా నీవు భీకరముగా గర్జించితివి.నరకేసరి
రూపమునున్న నీ కంఠము చిన్నదిగా ఉండి బహు ధృఢముగా నున్నది. నీ బాహువులు నూరు హస్తముల శక్తికలిగి బలిష్టముగా
నున్నవి. నీ చేతి నఖముల (గోళ్ళ) కాంతి నీ రౌద్రంనకు ప్రతీకగా మెరయుచూ దూరము నకు కూడా కనిపించుచుండెను. నీ ఘర్జన
ధ్వని - దట్టమగు వర్షాకాలపు కాలమేఘ గర్జనవలె అంబరమును దాటి వినిపించు చుండెను. అట్టి నీ ఉగ్ర రూపమును చూచి నీ
శత్రు వులగు ఆ అసురులు (భయబ్రాంతు లై) చెల్లా చెదురుగా పారిపోయిరి. ప్రభూ! అట్టి నీ 'ఉగ్రనరసింహ' రూపమునకు నేను
నమస్కరించుచున్నాను.
హిరణ్యకశిపుని భార్య మగపిల్లవాడు ప్రహ్లా దుడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడికి ఈ రాక్షస ప్రవృత్తు లు ఏమే అంటలేదు. అతడు
పూర్తిగా విష్ణుమూర్తి భక్తు డయ్యాడు. హిర ణ్యకశిపుడు శతవిధాల ప్రహ్లా దుని విష్ణుభక్తి నుండి మరల్చుదామని ప్రయత్నించాడు.
ఎన్నిమార్లు ప్రయత్నించిన విఫలమౌతూనే ఉన్నాడు.
తండ్రి ప్రయత్నిస్తు న్నకొద్దీ ప్రహ్లా దునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది.ప్రహ్లా దుని మృ త్యువు వరకు తీసుకువెళ్లినా అతనిలో ఏ
మార్పూలేదు.విషప్రయోగం చేసినా, ఏనుగు లతో తొక్కించినా లోయలో పడవేసినాఎప్ప టికప్పుడు విష్ణుమూర్తిరక్షిస్తుండేవాడు.ప్రహ్లా
దుని నారాయణ మంత్రం విన్నమాత్రంతో క్రు ద్ధు డై తనకుమారుని పరిపరివిధాల మృ త్యు సమీపానికి దండించే నిమిత్తం శిక్షలు
వేయసాగాడు.ఇక విసిగిపోయిన హిరణ్య కశిపుడు నీవిష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్ప మంటాడు.ఇందుగలడని అందులేడని సందే
హము వలదు,ఎందెందు వెదికిన అందందే కలడు.,నా శ్రీహరి అని శలవిస్తా డు ప్రహ్లా దు డు.దానితో మరింత ఆగ్రహావేశాలకులోనై
ఉన్న హిరణ్యకశిపుడు ఐతే ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీహరి అని ఒక్కపెట్టు న ఆ స్థం భాన్ని తన గదతో పడగొడతాడు.అంతే
భయంకరాకారుడై ,తలసింహం రూపంలో మొండెం మనిషిఆకారంలో గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద
పరుండబెట్టి ఆయన వాడి గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపు డిని అంతమొందిస్తా డు.
💖🌹🌴🌹🌷🌹
     
తనయొక్క ధర్మము (తన అవివేకముచే) గుణములేనిదిగ కనబడినను(లేక,అసంపూ ర్ణముగ అనుష్ఠింపబడినను) చక్కగా అను
ష్ఠింపబడిన ఇతరుల ధర్మముకంటె (లేక, ఇతర ధర్మములకంటె) శ్రేష్ఠమైనదే యగును. స్వభావముచే ఏర్పడిన (తన ధర్మమునకు
తగిన) కర్మమును చేయుచున్నయెడల మనుజుడు పాపమును పొందనేరడు.స్వ కీయకర్మ, లేక తన ధర్మము ఆచరించుట ఒకింత
కఠినమైనను,తేలికగా ఆచరింపబడి నట్టి ఇతరుల కర్మను గ్రహించుటకంటె అది ఎంతయో మేలని చెప్పబడినది. కావున
నిజధర్మమును ఒకింత కష్టమైనను వదల రాదు. స్వకీయకర్మను పైశ్లోకమందు తెలుప బడిన చందమున ఈశ్వరార్పణబుద్ధి తో
చేసినచో మనుజుడు పాపమును బొందకుం డును.(లేక, ఇచట స్వధర్మమనగా ఆత్మకు సంబంధించిన ధర్మమనియు చెప్పవచ్చును.
ఆత్మచింతనాదులు,ఆత్మధ్యానాదులు ఒకింత ప్రయాసముగా తోచినను,పరధర్మ ములైన దృశ్యవస్తు ధర్మములను,లేక,దృశ్య
వస్తు చింతనమును గ్రహించుట కంటె ఎంత యో మేలైనవి.ఆత్మచింతనాదులు (స్వధర్మ ము) ప్రారంభమున ఒకింత కష్టముగ తోచి
నను తుదకు అనంత సౌఖ్యమును ప్రసా దించును.దృశ్యవస్తు వులు (పరధర్మము) ప్రారంభమున సుఖవంతములుగ తోచినను
తుదకు పరమదుఃఖమునే కలుగజేయును. కావున పరధర్మముకంటె స్వధర్మమే మేలని చెప్పబడినది).
*జీవునకు ఏకర్మము,ఏ ధర్మము శ్రేష్ఠమైనది.
ఒకింతకష్టముగా తోచినను స్వకీయకర్మమే శ్రేష్ఠమైనది.
*దేనిచే మనుజుడు పాపమును పొంద  కుండును...
స్వభావముచే ఏర్పడిన కర్మమును,స్వధర్మ మును (ఈశ్వరార్పణబుద్ధితో)చక్కగ నాచ రించినపుడు పాపమును పొందకుండును.
[1/11, 5:07 AM] 🌹🌴🌹🌴🌹
*మనకు ఏవైనా  బాధలు, కష్టా లు ఉంటే వాటిని ముందుగా భగవంతునికే చెప్పుకో వాలి. ఎందుకంటే ఏ బాధలు లేని వాడు
మాత్రమే వేరొకని బాధలు తీర్చగల సామ ర్ధ్యం కలిగి ఉంటాడు. మనలో బాధలు లేని వారంటూ ఎవరూ లేరు.ఏబాధలులేనివాడు
భగవంతుడొక్కడే.కనుకఆయనకేముందుగా చెప్పుకోవాలి.అయితే ఒక్కసారి మనంమన బాధలను గూర్చి ఆయనకు చెప్పాక
వాటిని గూర్చి ఆలోచించడం మానేయాలి. పదే పదే చెప్పడం చేయకూడదు. భగవంతుడే వాటి సంగతి చూసుకుంటాడు
అన్నధీమాతోమన పని మనం చేసుకుంటూ ఉండాలి.ఇదే అస లైన విశ్వాసం,అదే నిజమైన శరణాగతి.....
💘🌹🌴🌹🌹🌴🌷
         
*దేవుడు మనకళ్ళకు ఎందుకు కనబడడు..
ఈసృష్టిమొత్తం వ్యాపించివుండి,దాని ఉత్ప త్తి, పెంపు,లయములకు ఎవరుకారణమవు తున్నారో…,అతనినే
‘దేవుడు’అనిఅన్నారు.  మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళ కు ఎందుకు కనబడడు?అనేసందేహం మన లో చాలామందికి
కలగవచ్చు.నిజాన్ని పరిశీ లిస్తే…పాంచభౌతికమైన మన శరీర అవయ వాలకు వున్న శక్తి చాలా పరిమితం...మన కాళ్ళు
ఈవిశ్వాన్నిమొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.మన చేతులు కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టు కుని మోయలేవు.వాటి కి అంత
శక్తిలేదు.మన కళ్ళు…అతి విసృత మైన పదార్ధా న్నిగానీ.. అతిసూ‌క్ష్మమైన పదా ర్ధా న్నిగానీ చూడలేవు.వాటికి అంతశక్తిలేదు. ఆకాశం
మన కంటికి కనిపించదు.చూస్తు న్నా మని అనుకోవడం మనభ్రమ.అతి సూక్ష్మ క్రిమైన ‘అమీబా’ ని సూక్ష్మదర్శిని (మైక్రో స్కో ప్)
సాయంతోచూస్తు న్నాంకదా అని మీరు అడగవచ్చు.మన కళ్ళకు అంత శక్తిలేదు. కనుకనే…మనం సూక్ష్మదర్శిని ని ఆశ్రయించ
వలసి వస్తుంది. మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా..అనిమీరు అడగవచ్చు.కళ్ళు భౌతిక మైన పదార్ధా లను
మాత్రమే చూడగలవు. మనోనేత్రం అభౌతిక మైన పదార్ధా లను దర్శిస్తా యి.
‘దేవుడు’మనోనేత్రానికిదర్శనమిస్తా డు.తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాలముందు ప్రత్యక్షమౌతాడు.చూడడాని
కి,దర్శించడానికి ఉన్న తేడా అది.మరి మనో నేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా? అన్నదే ఈనాటి మనప్రశ్న.పంచ భూతాల శక్తు ల
సమ్మిళితమే,భూలోక జీవుల శరీరనిర్మాణం. అందుకే ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల
తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నం త వరకూ వాటికి అతీతంగా ఉండే ‘పరమా త్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు.ఆ దేవ దే
వుని దర్శించాలంటే పంచభూత తత్త్వాల నూ,వాటి గుణాలనూ త్యజించాలి.ఏమిటి వాటి గుణాలు,తత్త్వాలు…అంటే…ఆకాశాని
కి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం. వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దము,స్పర్శ.,అగ్నికి ఉన్న గుణాలు 3..శబ్ద,స్పర్శ,రూపములు.
జలముకు ఉన్న గుణాలు నాలుగు: శబ్ద, స్పర్శ,రూప,రసము(రుచి)లు.
భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద,స్పర్శ, రూప,రస,గంథాలు. ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలుగల మన శరీరానికి
ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయిం చి జీవిస్తు న్నాం.
జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడంవల్ల,మనం నీటిని చేతితో పట్టు కో లేము.నీటికి మన చేతిని ఆధారంగా మాత్ర
మే ఉంచగలం.కొంతసేపటికి ఆ నీరు ఆవిరై పోతుందేగానీ.,మనం బంధించలేము.
అగ్ని…‘రస, గంథము’లనే గుణాలనుత్యాగం చేయడంవల్ల,అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే
శిక్షిస్తుంది. వాయువు…‘రస,గంథ, రూపము’ లనే గుణాలను త్యాగం చేయడంవల్ల,మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా
చూడ లేము.వాయువే తనంతట తాను మనలను స్పృశించి,తన ఉనికిని మనకు తెలియజే స్తుంది.ఆకాశం…‘రస, గంథ,
రూప,స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల,అది మన కళ్ళకు కనిపించకుండా,తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.
కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకా శాన్నే మనం చూడలేనప్పుడు, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక
నేత్రానికి కనిపిస్తా డు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవా లంటే…,పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను,
అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి.అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు
అవుతావు.నిన్ను నీలోనేదర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే.
అదే *దైవ సాక్షాత్కారం అంటే*
💓🌹🌹🌴🌹🌹
🌹
         
*ఏమని ప్రార్థించాలి....*
ప్రార్థన(ప్ర+ఆర్థన)అంటే చక్కగావేడుకోవడం ఈ వేడుకోలుకు అర్థం, పరమార్థం అనేవి రెండూ బొమ్మ బొరుసు లాంటివి. మనిషి
ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలనుకోవడం, అందుకు తగ్గ వెసులుబాటుకోసం ప్రయత్నిం చడం సహజం.ధర్మంగా ధనం
సంపాదించు కోవచ్చు.ధర్మబద్ధంగాకోర్కెలుతీర్చుకోవచ్చు.
ధనం ఇంధనంలా దహించుకుపోతుంది.కోరి కలు గుర్రాల్లా పరుగులు తీస్తూనే ఉంటాయి. ఈ విషయం ప్రతి మనిషికీ ఏదో ఒక రోజు
అర్థం అవుతుంది.అప్పుడు ఈ భౌతికమైన సుఖాలు కేవలం తాత్కాలికమేనన్న ఎరుక కలుగుతుంది.వీటికి మించినశాశ్వతానందం
ఎక్కడుందన్న జిజ్ఞాస మొదలవుతుంది. గుండెలోతుల్లో నుంచి గంగాజలంలా పైకి లేచిన ఆ ఆకాంక్ష,ఒక ఆర్తనాదమై ఒక ఆవే
దనారూపమైచెలరేగుతుంది.అదేప్రార్థన!
*దూడను ప్రసవించగానే గోమాత తన బిడ్డ ను ఆప్యాయంగా నాలుకతో నిమిరినట్టు , భగవంతుడు భక్తు లనులాలించి,పాలిస్తా డు.
పరమ ప్రేమస్వరూపుడై న భగవంతుడికి తన సంతానంపై ఉన్న అనంతమైన ప్రేమా నురాగాలను వరాల రూపంలో అందిస్తా డు.
సాత్వికులైన ధ్రు వుడు, ప్రహ్లా దుడు శ్రీమహా విష్ణువు సాక్షాత్కరించగానే భౌతికమైన వాంఛలు తొలగి భగవంతుడి పాదసేవనం అనే
పరమానందం కావాలని అడిగారు. తపస్సు చేసిన హిరణ్యకశిపుడు,రావణుడు అధికారం,ఆధిపత్యం కోరారు! కోరి తమ వినాశాన్ని
వారే కొని తెచ్చుకున్నారు. పరుల సుఖాల్నే మన సుఖమని,విశ్వశ్రేయమే మన కూ శ్రేయోదాయకమని,బుద్ధిగా జీవించాలని త్రికరణ
శుద్ధితో ఆ పరమాత్మకు చేసే విన్న పమే ప్రార్థన! అదే మన ఆధ్యాత్మిక ప్రగతికి తొలి సోపానం.
భగవంతుణ్ని సేవించే భక్తు లను నాలుగు తెగలుగా చెబుతారు- ఆర్తి, అర్ధా ర్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఈ నలుగురిలో ఆయనకు చాలా
దగ్గరివాడు జ్ఞాని.....
*భగవంతుడు అన్నీ ఇచ్చాడు. అయినా, ఏదో తెలియని ఆరాటం గుండెల్లో ఆరడి చేస్తూనే ఉన్నది. కారణం ఏదో ఒకమూల
స్వార్థపిశాచం పీడించడంవల్లే అలా మనసు అల్లా డుతూ ఉంటుంది.మనం చేయవలసిన దేదో శక్తివంచన లేకుండా,సక్రమంగా చేస్తే
చాలు..తక్కినదంతా ఆయనే చూసుకుంటా డు. ఆ మాట కూడా గీతాచార్యుడు చాలా స్పష్టంగానే చెప్పాడు. అయినా అజ్ఞానం,
అహంకారం,మమకారం..ఈ మూడూ ఏక మై మనల్ని పెడదారికి ఈడుస్తూఉంటాయి.
అలా జరగకుండా మనసును నిర్మలంగా ఉంచమని, ప్రపంచాన్ని ప్రేమగా చూడగల హృదయ సౌందర్యాన్ని ప్రసాదించమని,
పరోపకారం వైపు బుద్ధిని మరల్చమని, మాటలకందని మౌనభాషలో భగవంతుణ్ని వేడుకోవడమే నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థన సన్నని
వెలుగై మనజీవితాలను గమ్యంవైపు నడిపిస్తుంది. ‘సర్వేజనాః సుఖినో భవంతు’ అనే ఒక గొప్ప ప్రార్థనను వేదం ప్రపంచానికి
అందించింది. అదే మన జీవితాలకో దారి దీపమై వెలుగు చూపాలని అర్థించాలి. అదే మనం చేయవలసిన ప్రార్థన.......
చీకటి తరువాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లు గానే కష్టా ల తరువాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తా యి.
ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం వెయ్యి కోరికలు తీర్చుకున్నా లభించదు..
*నచ్చితే ఇష్టం పెరుగుతుంది,ఇష్టం ఎక్కువై తే ప్రేమగా మారుతుంది..ప్రేమ పెరిగితే ఆరాధనగా మారుతుంది...ఆరాధనలోనే
ఆనందం కలుగుతుంది,ఆ ఆనందమే ఒక మధురానుభూతిగా మిగులుతుంది.. ఇదే నేమో చక్కటి అనుబంధం ఏర్పడటానికి
పునాది..ఆ బంధం *జీవితభాగస్వాములు*  కావచ్చు లేదా*మంచి స్నేహితులు* కావచ్చు అది కలకాలం అలానే
ఉండాలంటే,నమ్మకం ఉండాలి.. ఒకరికొకరు ఒక్కటై ఉండాలి.....        🌹🌴🌹🌴🌹                
పూలలో సువాసన,మనస్సులో యోగ్యత దాచినా దాగదు....
మనిషి అందంగా కనపడాలంటే ఎన్నోరకాల తెరలు తగిలించాలి..కానీ మనసు అందంగా కనపడాలంటే అహం, అసూయ అనే అడ్డు
పొరలు తొలగిస్తే చాలు..
జీవితంలో అవసరమైన బంధాలతో పాటు అవసరంలేని బంధాలుకూడాఅప్పుడప్పుడు తొంగి చూస్తుంటాయి..అవి ఒకోసారి మనకు
కలవరాన్ని కలిగిస్తుంటాయి కావున మనం  జాగురూకత తో  ఉండాలి......     
కళ్ళతో చూసిన వన్నీ" నిజం"అని బ్రమ పడ కండి.ఒక్కొక్కప్పుడు దూరం నుండి చూస్తే ఉప్పు కూడా చెక్కరలాగే కనిపిస్తుంది......
ఇచ్చే బహుమతి విలువకంటే..ఇచ్చేవిధానం లోనే గొప్పతనం ఉంది. అలాగే చెప్పే మాట కంటే చెప్పే విధానం లోనే ఎదుటివారు
శ్రద్ధగా వినేదానికి ఆస్కారం ఉంది......
*కోపం లో వచ్చిన మాటను పట్టు కుంటే మనసు విరిగి పోతుంది.అదే ఆ కోపంవెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం
నిలబడుతుంది.....
విశ్వాసంలేని ఏబంధమైనా ఇంధనంలేని వా హనం లాంటిది.మనం అందులో ఎలాగైనా, ఎంతసేపైనాకూర్చోవచ్చు.అదికదలదు.అను
బంధానికి నమ్మకమనే ఇంధనంకావాలి.          🌹🌴🌹🌴🌹                
🌹ద - ద - ద,..ఈ మూడు 'ద' లు ఏమిటి?
అవి దమం -దయ-దానం.ఆ మూడు గుణా లను ఆశ్రయించుకొని, ఆత్మశ్రేయస్సును పొందుదాం
కామం - క్రోధం - లోభం వీటిని విడిచిపెడితే,
దమం - దయ - దానం వీటిని ఆశ్రయిస్తే ఆత్మశ్రేయస్సు.
ఇప్పుడు మనం ఆలోచించాలి.ఈ రెండూ నిజమేనా?.నిజమే....ఎలా? ఎలాగంటే ....
కామాన్ని జయించాలి.ఎలా? దమంతో - ఇది దేవతలకు
క్రోధాన్ని జయించాలి. ఎలా? దయతో - ఇది దానవులకు
లోభాన్ని జయించాలి. ఎలా? దానంతో - ఇది మానవులకు. ఎలాగో చూద్దాం.
కామం*:-కామంఅంటేకోరిక.చూచినవాటిని, విన్నవాటిని, తిన్నవాటిని, బాగున్నవాటిని కావాలనుకోవటమే కామం, కోరిక.
*పచ్చగ కనబడితే చాలు పరుగెత్తేది పశు లక్షణం.ప్రపంచంలోని వస్తు వులను,విషయా లను, భోగాలను ఇంద్రియాలద్వారాతెలుసు
కోవటంతో వాటివైపుకు పరుగెత్తితే అతడు పశువులాంటివాడే.చూచిన గడ్డినల్లా మేయా లను కుంటుంది పశువు. కాని మనిషి
తనకు తగినటువంటి దానిని-సరైనదానినిమాత్రమే కావాలనుకుంటాడు*. బుద్ధితో ఆలోచించ గలిగే శక్తి మానవుడికి మాత్రమే
ఉన్నది. కనుక ఇంద్రియాలను బుద్ధి యొక్క అధీనం లో ఉంచి - నిగ్రహంతో ఆలోచించి అనుభవించాలి.
పశువుకు దేహం ప్రధానం.మనిషికి బుద్ధి ప్రధానం. అందుకే పశువుకు భోగజీవితం కావాలి. మనిషికి యోగజీవితం కావాలి*. ఇలా
ఇంద్రియనిగ్రహం ద్వారా - దమం ద్వారా కామాన్ని జయించాలి.
*క్రోధం*:- క్రోధాన్ని దయతో జయించాలి. క్రోధం అంటే కోపం. అదొక భూతం. క్రోధుడు తన గొప్ప తనాన్ని ఇలా చెబుతున్నాడట.
"నేను తలచుకొన్నానా! నీవు కళ్ళున్నా గ్రు డ్డివాడివైపోతావు. చెవులున్నా చెవిటి వాడివైపోతావు.మాటఉన్నా మూగవాడి వై
పోతావు.తెలివి ఉన్నా బుద్ధిహీనుడవైపోతా వు.నీ చదువు,సంస్కారం అన్నింటిని వ్యర్థం చేస్తా ను.నీ నోటితో అనరాని మాటలను
అనిపిస్తా ను.అసలు నీరూపాన్నికూడామార్చే స్తా ను.నీ శరీరాన్ని వణికిస్తా ను.నీపెదవులను అదిరిస్తా ను. గజగజ వణికిస్తా ను.ఆప్తు ల
మాటలు వినకుండా చేస్తా ను.నీ చేత చిందు లు వేయిస్తా ను. చివరకు నిన్ను నలుగురిలో నగుబాట్లు గావిస్తా ను" - ఇది క్రోధుడి
ప్రతిజ్ణ
కాఠిన్యం కంటే కరుణ చాలా ఎక్కువ సత్ఫలితాలను ఇస్తుంది..
నీ తప్పును ఈ రోజు కప్పి పుచ్చుకోగలిగినా రేపటి దాని పర్యవసనాన్ని మాత్రం తప్పించుకోలేము..
ఇతరులతో పోల్చుకోవడం ఇతరులనుండి ఆశించడం ఈ రెండూ వదిలేస్తే జీవితం లో సగం సమస్యలు తీరినట్లే..
మనం మన ఆలోచనలకు బంధీలం. ఆలోచ నలు మార్చు కోనిదే దేన్నీ మార్చలేము.....
సహనం, నమ్మకం ఈ రెండు మాటలలోనే మానవ జాతి మనుగడ అంతా దాగుంది....
*ఇతరులను జయించాలి అనుకునే వాడు రోగి అవుతాడు.తనను తాను జయించాలి అనుకునే వాడు యోగి అవుతాడు......       
అజ్ఞానితో తిరిగితే  ఆయాసం వస్తుంది. జ్ఞానితో తిరిగితే ఆనందం,ఆరోగ్యంవస్తుంది.
*అంతరాత్మ మీకు మంచి స్నేహితుడు లాం టిది.కాబట్టి మీరు తనమాటను ఏకాంతంగా వినాల్సిందే....
మన సాధన ద్వారా మనం పొందిన శక్తికి, మనం దేనిని స్వీకరించటానికి అర్హత పొంది వుంటామో, దానినే ఈ విశ్వం మనకు
ప్రసాదిస్తుంది.....
        🌹🌴🌹🌴🌹 💜🌴
           ❤
తోట మాలి  రోజు చెట్టు కు నీరు పోస్తా డు. కానీ కాలం వచ్చినప్పుడే ఆచెట్టు ఫలాలు ఇస్తుంది. ప్రతి రోజు మంచి పనులు చేస్తూ
ఉంటే సమయం వచ్చినపుడు వాటి ఫలితం కనిపిస్తుంది.....
*కష్టా ల్లో ఉన్నపుడు మనిషి ఆశా జీవిగా బ్రతకటం ఎంత అవసరమో ఇంకొకరి బాధ చూసినపుడు కూడా వారి బాధను పోగొట్టి,
వారికొక ప్రోత్సహకరమైన  మాట చెప్పడం అంతే అవసరం......
*ఎవరు వున్నా లేకున్నా చిట్ట చివరి క్షణం వరకు నీ దారిలో నీవు  అడుగులు వేస్తే ఎవరిని ఎప్పుడు కలపాలో ఆ ప్రకృతి
చూసుకుంటుంది..
*అల వచ్చినపుడు తలవంచితే ప్రాణం నిల బడుతుంది..గొడవ అయినపుడు ఒక అడుగు వెనక్కితగ్గితే బంధంనిలబడుతుంది ఒక్క
క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తాం.....
అర్థం అయినా కాకపోయినా నచ్చినా నచ్చ కపోయినా ప్రతి సంఘటనా దృష్టి మార్చితే తప్పక ఒక గొప్ప బహుమతిగా అయి
తీరుతుంది.....
ఎవరో విలువ నివ్వలేదని ఎప్పుడూ భాధ పడొద్దు .గుర్తుంచుకోండి.. బంగారం కూడా భద్రంగా ఉండేది ఇనుప బీరువాలలోనే. దేని
విలువ దానిదే.....
🌹🌴🌹🌴🌹
ప్రతి మనిషిలో సధహజ సిద్ధంగా దైవిక శక్తు లు,అసుర శక్తు లు ఉంటాయి.ప్రేమ, దయ, కరుణ,ఉదారత,వాత్సల్యం ఇలంటివన్ని
దైవశక్తు లు,కోపం,అసూయ,ద్వేషం, అసహ నం, హింస ఇవి రాక్షస గుణాలు.ఈ రెండు రకాల శక్తు ల్లోవేటిని మనం పెంచి పోషిస్తే అదే
పైచేయి సాధిస్తా యి.మిగిలినవి అణ గారిపోతాయి.
దైవిక గుణాల్ని పెంపొందించుకుని,శుభ లక్ష ణాల్ని అలవరచుకునే వ్యక్తు ల్లో దైవత్వం దివ్యంగా ప్రకాశిస్తుంది.దైవ శక్తు లలోసహనం
ఉత్తమగుణం,ఇది జీవితంలో ఆపదలు వచ్చిన వేళ కొండంత అండగా నిలుస్తుంది. ఓ వజ్రకవచంలా రక్షిస్తుంది.అసరాగా ఆదు
కుంటుంది, మనోనిబ్బరాన్ని అందిస్తుంది. సహనశీలం కలిగిన వ్యక్తు లు జీవన వ్యవహా రంలో ఎదురయ్యే కష్టా లి ధైర్యంగాఎదుర్కొం
టారు.ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి విజయాన్ని సాధిస్తా రు.సహనం కోల్పోయిన వారు గాలి తాకిడికి రెల్లు గడ్డి,చిందర వందర
అయినట్టు గా తమ జీవిత్నా అల్లకల్లోలము చేసుకుంటారు.
అసహనం క్రోధాన్ని కలిగిస్తుంది. క్రోదం వల్ల వివేకం నశిస్తుంది.వివేక రాహిత్యంతో విచ క్షణ లోపిస్తుంది.దాంతో వ్యక్తి జీవితానికి
చుక్కాని లేని పడవలా,తెగిన గాలిపటంలా గమ్యం తెలియనిస్థితి దాపురిస్తుంది.
కురు రాజ సభలో ద్రౌపదీ వస్త్రా పహరణం జరుగుతున్నపుడు భీమార్జు నాదులు ఆక్రో శంతో క్రోధాన్ని అశ్రయించారు.కళ్లముందే
అంతటి ఘోరపరాభవంజరుగుతుంటేచూసి సహించలేక విచలితులయ్యారు. కానీ ధర్మ రాజు,అంతటి విపత్కర పరిస్థితిలో కూడా
నిగ్రహముకోల్పోలేదు.పెను తుఫానుకు ఏ మాత్రం చలించని ఉత్తుంగ శిఖరంలా ధైర్య స్థిర్యాలతో ఓర్పు కనబరిచారు. దుర్యోధను డు
పూర్తిగా విరుద్ధ ప్రవర్తనలో ఉన్నాడు. అతను అసహనానికి మారు పేరు ఓర్పు, దయ కరుణ సద్గుణాలు అతనిలో ఎంత
మాత్రంలేవు.పాండవులు అసహనాన్ని ఆక్రో శాన్ని వెళ్లగక్కి కయ్యానికి కాలుదువ్వాడు. కురుక్షేత్రం సంగ్రామానికి కారకుడయ్యాడు.
కురువంశ నాశనానికి అపారజన,ధన నష్టా నికీ మూలహేతువయ్యాడు..వరద తాకిడికి మహా వృక్షాలు నేలకొరిగి మళ్లీ లేవ లేనట్లు
గా సహనాన్ని వీడినవారు పూర్తిగా చతికిల పడ్డ తమ ఔన్నత్యాన్ని కోల్పోతారు.
*సహన సంపదఅనేది మనిషికి ఆత్మ స్థైర్యా న్ని,వివేకాన్నీ,వివేచననూ పెంపొందించి మనిషిని మాననీయుణ్ణి చేస్తుంది. కాబట్టి సహన
గుణాన్ని అవలంభిస్తూ జీవనగమ్యా న్ని మున్ముందుకు కొనసాగించాలి,సహనమ నే నౌక మనిషిని క్షేమకరమైన ఒడ్డు కు చేరు
స్తుంది.తద్వారా మనశ్శాంతి చేకూరుస్తుంది.
🌹🌴🌹🌴🌹
చెడునుపట్టు కోవడంసులభం.వదలడం కష్టం.మంచిని పట్టు కొని చిరకాలం ఉండడం కష్టం. వదలడం సులువు. అందుకే ఎవరైనా,
దేనిని పట్టు కోవాలి.. దేనిని వదలాలి అనే విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి.
సంసారం, కుటుంబం వంటి లంపటాలు తమను బంధిస్తు న్నాయని ఆ బాదరబందీ వల్లనే భక్తి మార్గం పట్టలేకున్నామని చాలా
మంది అనుకుంటూ ఉంటారు.
కానీ,అది నిజం కాదు. అవి మనల్ని పట్టు కోవడం కాదు.. మనమే సంసారాన్ని,కుటుం బాన్ని, లోకాన్ని, సకల ప్రాపంచిక విషయా
లనూ గట్టిగా పట్టు కొని కూర్చుంటున్నాం.      
కోతులను పట్టు కునేవాళ్లు .. ఇరుకు మెడ ఉండే బరువైన కూజాలో వేరుశనగ పప్పుల ను వేసి చెట్టు కింద పెడతారు.
అటువైపు వచ్చిన కోతి..ఆ కూజాలోకి చేతి ని పోనిచ్చి గుప్పెట నిండా గింజలను పట్టు కొని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుంది.
మూతి ఇరుగ్గా ఉండడంతో.. పిడికిలి బయ టకు రాదు. చేతిలో ఉన్న వేరుశనగ పప్పు లను వదిలేస్తే చెయ్యి సులభంగానే బయట
కొచ్చేస్తుంది.
కానీ, ఆశ.. ఆ గింజలను వదలనీయదు. కూజాతో సహా అక్కడి నుంచి పారిపోదామా అంటే.. అది బరువుగా ఉంటుంది. దీంతో,
కోతి అక్కడే ఉంటుంది. కోతులు పట్టేవారు అక్కడికి వచ్చి దాన్ని బంధిస్తా రు.పట్టు విడ వడం తెలియక కోతి బందీ అయినట్లు గా..
ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గించుకుని క్రమేణా విడిచిపెట్టడం తెలియక ఆధ్యాత్మిక చింతనాసక్తు లు దారితప్పు తుంటారు.
పట్టు కోకూడనిదాన్ని తెలివితక్కువగా పట్టు కోవడం.. తీరా పట్టు కున్నాక దానివల్ల కలిగే ముప్పు గురించి తెలిసినా, దాన్ని విడిచే
ఆలోచన చేయకపోవడం.. ఫలితంగా కడ గండ్లకు గురికావడం.. ఇదీ జరుగుతున్నది.       
తనది కాని స్ర్తీని పొందాలనుకొని పట్టు పట్టి న రావణాసురుడు..ఆమెను విడిచి పెట్టా లంటూ తన శ్రేయోభిలాషులు చెప్పిన మాట
లను విని ఉంటే కొడుకులను, సోదరుడు కుంభకర్ణుడిని, బంధువులను, పరివారాన్ని, రాజ్యాన్ని, చివరకు ప్రాణాల్ని పోగొట్టు కుని
ఉండేవాడు కాదు.
అలాగే భారతంలో పాండవులకు ‘సూది మొన మోపినంత భూమి కూడా యివ్వనం టూ పట్టిన పట్టు విడువక అహంకరించిన
దుర్యోధనుడికి చివరికి ఏ గతి పట్టిందో అందరికీ తెలిసిందే.
   *దురదృష్టం ఏమిటంటే బాహ్య విషయా లపై పట్టు గురించి ఆలోచిస్తా మేగానీ.. మన అంతర్గత, ఆధ్యాత్మిక విషయాల పట్ల‘పట్టు ’
సాధించటానికి ప్రయత్నించం.
మనసు, జిహ్వ, ఇంద్రియాలపైన పట్టు లేక పోవటం చేతనే భగవంతుడు మెచ్చే కార్యా లు చేయలేకున్నాం. ఆయన అనుగ్రహానికి
పాత్రు లం కాలేకపోతున్నాం.
మనం ‘పట్టు ’వదలవలసింది..లౌకికవిషయా ల్లో! పట్టు బిగించవలసింది.. ఆధ్యాత్మిక సాధనాంశాల్లో....అప్పుడే మనం భగవంతు
నితో అనుబంధాన్ని పెంచుకోగలం
🌹🌴🌹🌴
వేదనిర్దేశము ననుసరించి
ఆరు రకముల దుర్మార్గులు కలరు. వారే..
1.విషముపెట్టు వాడు.
2.ఇంటికినిప్పుపెట్టు వాడు.
3.మారణాయుధములతోదాడిచేయువాడు
4.ఇతరుల ధనమును దోచెడివాడు.
5.ఇతరుల స్థలము నాక్రమించెడివాడు.
6.పరుల భార్యను చెరపట్టెడివాడు.
అట్టి దుర్మార్గులనుశీఘ్రమేసంహరింపవలెను
వారి సంహారముచే ఎట్టి పాపము కలుగదు.
అట్టి దుర్మార్గుల వధ సామాన్య వ్యక్తికైనను సరియైనది.దేవుడు ఈ క్షణాన్ని యథా తథంగా అనుభవించమన్నాడేగానీ క్షణం లోనే
స్థిరంగా ఉండిపొమ్మని చెప్పలేదు....
-అది సుఖమైనా,కష్టమైనా.....
*కష్టా న్ని కదిలిపోతున్న క్షణంతోపాటు మర చిపోవాలి. కదిలిపోతున్న క్షణాన్ని మనం మూర్ఖత్వంతో ఆపివేస్తు న్నాం.పదేపదే ఆ క్ష
ణాన్ని,అదిఇచ్చిపోయిన కష్టా న్ని నెమరు వే సుకుంటూ అనుభవిస్తు న్నాం.అదిసరికాదు.
మనముందు ఎవరూ ఆపలేని మరోఅద్భుత క్షణంఉంది.మరెన్నోఅమృతక్షణాలున్నాయి.
వాటికి అవకాశం ఇస్తూ గడిచిపోయిన క్షణాన్ని సంతోషంగా సాగనంపుదాం...
*నెమరువేసే అలవాటు పశువులది. మనది కాదు.
🌹🌴🌹🌴🌹
నీచ యోనులలోజన్మించినవారికిభగవంతు ని తలంపే ఉండదు.కనుక ఒక్కమెట్టు కూడా పైకి ఎక్కటం జరగదు.ఏ జంతువు గానో,
క్రిమిగానో,కీటకంగానో,మట్టిదినే తుట్టె పురు గుగానో జన్మించి,*కర్మఫలాన్ని అనుభవించ వలసిందే.అలా వేలకు వేల జన్మలెత్తి భయం
కరమైన యాతనలను అనుభవించాల్సిందే. పైగా ఆ జన్మలలో ఏదైనా మంచి చెయ్యటా నికి కూడా వీలులేదు.ఎందుకంటే అవి భోగ
జన్మలేగాని,కర్మజన్మలుకాదు.కనుక మంచి పనులు చేసి ఒక్కమెట్టు కూడా ఎక్కే వీలు లేదు.ఒకవేళమధ్యలో ఎప్పుడై నా మానవ
జన్మవచ్చినా పిచ్చివాడుగానో, మెదడు మొద్దు బారినవాడుగానో,మూర్ఖుడుగానో, నాస్తికుడుగానో జన్మించి భగవంతుని చేరు
కొనుటకుఏమాత్రంప్రయత్నంచేయడు.ఇంకా ఇంకా పాపకర్మలను,క్రూ రకర్మలను,దుర్మార్గా లను చేసి మరింత నీచమైన జన్మ పరంపర
లను కొనసాగించటం జరుగుతుంది.
*ఒక బంతి మేడ మెట్ల పైనబడి జారితే అది మధ్యలో ఎక్కడా ఆగదు. ఒక మెట్టు నుండి మరో మెట్టు కు దిగజారుతూ చివరి
మెట్టు కు వచ్చి, అక్కడి నుండీ క్రిందకు నేలపైకి వచ్చి, ఇంకా క్రిందికి జారటానికి వీలుందేమోనని అటూఇటూ తిరిగి తిరిగి వీలులేక
ఆగిపోతుంది. ఈ క్రూ రకర్మలు చేసే ఆసురీ సంపన్నుల గతి కూడా ఇంతే. వారి గతి అధోగతియే. కనుక
*ఒక్క మానవ జన్మలో చేసిన తప్పిదానికి ఎన్ని వేల నీచ,నికృష్ట జన్మలెత్తా లో తెలుసు కుంటే ఈ మానవజన్మ యొక్క ప్రాధాన్యం
ఏమిటో,ఈ జన్మను ఎంత జాగ్రత్తగా సార్థకం చేసుకోవాలో తెలుస్తుంది. కనుక ఈ ఒక్క జన్మలో మంచి సాధన చేస్తే, భగవంతుని
ఆశ్రయిస్తే, ఆయన గురించి తెలుసుకుంటే, అజ్ఞానాన్ని పారద్రోలే ప్రయత్నం చేస్తే ఎంతో ముందుకు వెళ్ళగలుగుతాం*. భగవంతుని
దరి చేరుకోగలుగుతాం. 'మాం అప్రాప్త్యెవ ' - నన్ను చేరుకోలేక -అని భగవంతుడంటున్నా డంటే *భగవంతుని చేరుకోవటమే
మానవ జన్మ యొక్క పరమార్థం అని తెలుస్తు న్నది.
🌹🌴🌹🌴
           
అయితే ఇక ఈ రకమైన జీవుళ్ళు తరించే అవకాశమే ఉండదా? అంటే ఉంటుంది. తరించవచ్చు. ఎప్పటికి? ,*కొన్ని లక్షల, కోట్ల
జన్మలు ఎత్తిన తర్వాత. ఈ జన్మలన్నింటిలో దుర్భరమైన దుఃఖాన్ని, నరకయాతనలను అనుభవించిన తర్వాత;లేదా కొన్నియుగాల
తరువాత. గడచిన అనేక జన్మలలో ఏవో కొన్ని మానవ జన్మలు ఎత్తి ఏ కొంచెమైనా సత్కార్యాలు చేస్తే, మంచి ఆలోచనలు చేస్తే, అవి
సద్వాసనలుగా ముద్రించబడి,అవి పక్వానికి వచ్చినప్పుడు మంచి మానవజన్మ కలిగి,ఆ జన్మలో ఈ సద్వాసనల ప్రేరణలతో
భగవంతుని వైపుకు తిరగాలనే ఆలోచన వస్తుంది.ఆ ఆలోచనల కనుగుణంగా సత్క ర్మలను,జ్ఞాన సాధనలను చేస్తే దారి మారి
భగవంతుని వైపుకు ప్రయాణం చేసే జన్మలు వస్తా యి.అలా క్రమక్రమంగా తరించే అవకా శం ఉంటుంది.అయితే
దీర్ఘకాలపుశిక్షమాత్రం తప్పదు.దొంగతనాలు,తప్పుడు పనులు చేసినవాడు ఆ పనుల ఫలితాన్ని అనుభవిం చాల్సిందే. మంచివాడుగా
మారాలనుకుంటే మారవచ్చు గాని, చేసినవాటికి శిక్షలు అనుభవించక తప్పదు.
🌹🌴🌹🌴🌹
*మానవ సంబంధాలు దృఢంగా కనిపించే
అతి సున్నితమైనవి.వాటిని నిలబెట్టు కోవ డానికి అడ్డు పడేవి అనుమానాలు.అనుమా నం నివృత్తి చేసుకోవాలి.అనుమానం పెను
భూతం.అనవసరంగా ఎవరినీ అనుమానిం చవద్దు .కూలంకషంగా విషయాన్ని తెలుసు కోండి. చర్చల ద్వారా సున్నితంగా సమస్య
లను వ్యక్తిగతంగాపరిష్కరించుకోండి.మూడ వ మనిషి మాటలను ప్రోత్సహించకండి. నమ్మకంతో అనుబంధాలను ఆనందంగా
మలచుకుందాం.
*నవ్వించడం ఏముంది ఎవరైనా నవ్వించ గలరు...కానీ,ఆనందంగా ఉంచడం మాత్రం అందరి వల్ల అవ్వదు...
*నవ్వించే వారిని మర్చిపోగలం..కానీ,ఆనం దంగా ఉంచేవారిని మర్చిపోలేం...
*అవతల మనిషి విసుగును సహనంతో,
కోపాన్ని క్షమతో, బలహీనతని ప్రేమతో,
తప్పుని నవ్వుతో ఎదుర్కొనే మనిషికి జీవి తంలో విషాదం ఉండదు....
*రాలిన ఆకునుచూసి పైనున్న ఆకు నవ్వ కూడదు.రేపటి వంతు తనదే మరి..
*ఎంత మంచి పనైనా ఆరంభంలో అసంభవ మైనదిగానే అనిపిస్తుంది..
*మెరిసేదంతా బంగారం కానట్లే, మధురంగా వినిపించే దంతా మంచిది కాకపోవచ్చు..
*సమాజ సేవకు కావలసింది సంపద కాదు. ఉదార హృదయం..
*బంగారునాణేన్ని సముద్రంలో విసరడానికి ఒక్క మూర్కుడు చాలు. కానీ వంద మంది మేధావులు కలిసి కూడా దాన్ని వెనక్కి
తీయలేరు..
*అందరినీ అన్ని వేళలా సంతృఫి  పరచాల నుకుంటే ఓటమి తప్పదు.
🌹🌴🌹🌴🌹
"దర్శనే స్పర్శనే వాపి భాషణే భావనే తథా
యత్ర ద్రవత్యంతరంగంసస్నేహఃఇదికథ్యతే"
*ఎవరినైతే చూసినప్పుడు గాని, స్పృశించి నప్పుడు కానీ,మాట్లా డినప్పుడు కానీ, మన సులో భావించినప్పుడు కానీ మనస్సు ఆహ్లా  
దంతో,ఆనందంతో,ఆత్మీయతతో,ఆర్ద్రతతో ద్రవిస్తుందో దానిని స్నేహం అని అంటారు.
*ఎంత మంచి చెప్పినా సరే వినటం లేదు, గ్రహించటం లేదు......ఎందుకు......
*ఈ జీవన చక్రంలో ప్రతిఒక్కరూ వారి,వారి సామర్ధ్యం, సంకల్పం, సంస్కారం ప్రకారం నడుచుకుంటారు...
*నాకు నచ్చినట్లు నడుచుకోవాలని మీరు అనుకున్నట్లు గానే ఇతరులు కూడా వారికి నచ్చినట్లు మీరు ప్రవర్తించాలని భావిస్తా రు.. 
*ఒకరికి జీర్ణం కాని ఆహారం మరొకరు సునా యాసంగా జీర్ణం చేసుకుంటారు కదా...*
*ఈ విశ్వరంగస్థలంపై అందరూ పాత్రధారులే అని పరమాత్ముడు చెప్తు న్న మహవాక్యాన్ని అర్థం చేసుకుని భావ స్వభావాలను కలుపు
కుంటూ నడిస్తే సంఘమే స్వర్గ సీమ అవుతుంది.
🌹🌴🌹
*వార్ధకం వయసా నాస్తి మనసా నై....
ముసలితనం వయసులో లేదు. మనసులోనూ ఉండకూడదు.ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపుపీడఉండదు
ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం...దుఃఖం వల్ల వచ్చేది భావజం....
*వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింప బడిన ముసలితనమే. కొంతమంది యాభ య్యవ పడిలోకి రాగానే వృద్ధు లయ్యారం
టారు.కొందరు అరవై సంవత్సరాలకు ముసలి వారనిపించుకుంటారు. 70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారుమరికొందరు.
శరీర బలం తగ్గి,అవయవాలు పటుత్వం కోల్పోయి,నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించే
వారు ఉన్నారు. కొందరికి సోమరితనం వల్ల వృద్ధా ప్యం వస్తుంది.
పని చేయడానికి బద్ధకించి పని సామర్థ్యాన్ని కోల్పోతే దాన్ని మించిన వార్ధక్యం మరొకటి లేదు. అటువంటివారు సమాజ ప్రగతికే కాక
సొంత ప్రగతికి కూడా శత్రు వులే.అతి పిసినా రితనం,స్వార్థం,మద్యపానం,ధూమపానం, మత్తు మందుల వాడకం వంటి దురలవాట్లు
శరీరంలో అనేక సామర్థ్యాలను బలహీన ప రుస్తా యి.అకాల వార్ధక్యానికి దారితీస్తా యి. ఆయుర్దా యాన్ని తగ్గిస్తా యి.అటువంటి
వృద్ధు లు తమ కుటుంబాలకు సమాజానికి కూడా భారమే.మానసిక ఒత్తిడులు, కుంగు బాటు వల్ల వచ్చే ముసలితనం చెదపురుగు
లాంటిది. మనిషి భవితను సమూలంగా తినేస్తుంది.
*మానసిక వృద్ధా ప్యం అంటే..‘నాకు ముసలి తనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధా ప్యాన్ని రానీయకూడదు.
‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’ అన్న మాటలను గుర్తు పెట్టు కుని ఏదో ఒక పని పెట్టు కోవాలి. భారతీయ సంప్రదాయం లో
జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారుగానీ వయో వార్ధక్యాన్నికాదు.భరద్వాజ మహర్షి మూడు ఆయుర్దా యాల కాలం తపస్సు చేసి
జ్ఞానాన్ని సంపాదించాడు
నిత్యవ్యాయామం,యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, ఇవి ఉన్న
చోట ము...స...లి..తనమా....!"
🌹🌴🌹
లోకానికి మనం ఏది ఇస్తే వర్తమానంలో అదే మనకు ప్రతిఫలంగా లభిస్తుంది. నష్టం చేస్తే నష్టం.లాభంచేస్తే లాభం లభిస్తుంది.
సామాజిక స్పృహతో చేసే ఏ కృషి అయినా వృధా పోదు.ఈ విషయంలో మరొకరితో పోల్చుకోవడం సరికాదు.
*స్వధర్మం అందరికీ ఒకేలాగ ఉండదు. ఎవ రైనా తన పాత్రకు న్యాయం చేయడం స్వ ధర్మం.తనలోని అంతర్యామి ప్రబోధే,దానికి
ప్రమాణం.అంతర్యామి అంటే సర్వాంతర్యా మికి ప్రతినిధి.మానవ జీవితానికి ధర్మాచర ణే ఒక బాధ్యత. అందులోనే హక్కులు,
ఆనందం ఇమిడి ఉంటాయి.
💜🌴
        ❤
పుణ్య కర్మల పల్లకి ఇతరుల పొగడ్తలు ప్రశం సల పై ఆధారపడితే ఎన్నటికీ పరమాత్ముని సన్నిధి కి చేరదు...ఈరోజు పొగిడిన వారే
రేపటి రోజు నిందించవచ్చు.
మంచి పనులు చేస్తూ ఉంటే... వీరు పేరు కోసమే ఇదంతా చేస్తు న్నారని నింద వేస్తా రు. ఈర్ష్య పడతారు...
*నవ్వుతూ ఉంటే నాగరికతలేదు అంటారు. మౌనంగాఉంటే ఎంతఅహంకారం అంటారు.
అనేవారు ఏదోకటి అంటూనే ఉంటారు... కనుక పరుల చింత మాని పరమాత్ముని చింతన లో తోచినంత మంచి చేస్తూముందు కు
వెళితే స్వకార్యం స్వామి కార్యం కూడా నెరవేరుతుంది.
🌹🌴🌹🌴🌹
“ కోటిమంది వైద్యులు కూడివచ్చినకాని మరణమన్న వ్యాధి మాన్పలేరు”
“జాతస్యః ధృవో మృత్యుః”
“పుట్టు టయు నిజము పోవుటయునిజము”
“పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం”
*ఎంతో అనుభవముతో ఆర్తితో జ్ఞానంతో చెప్పిన వన్నీ వింటున్నాం, కానీ ఏ రోజైన దీనిని గురించి ఆలోచించామా?కనీసం ఆలో
చించే ప్రయత్నమైనా చేశామా? ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించండి. “మాకురు ధన జన యవ్వన గర్వం హారత...
*మనకు ఏదిఅవసరమో,ఏది నిత్యమో ఏది సత్యమో తెలియచేయుచున్నారు. కావున ఈ మానవ ఉపాధి మహోత్కృష్టమైనది.
కొన్ని కోట్ల కోట్ల జన్మలకు,కానీఎన్నో ఉపాధు లు దాటితే కానీ ఈ మానవ ఉపాధి లభించ దు.లభించిన ఈ ఉపాధినిభగవంతుడు
మనకు ఇచ్చిన ఈ మహద్భాగ్యాన్ని,అవకా శమును అవివేకంతో,అజ్ఞానంతో దుర్విని యోగం చేసుకొనరాదు.ఈ మహదావకాశ
మును దుర్వినియోగం చేయడం అవివేకం, అజ్ఞానం. 
*ఈ ఉపాధికి(ఆత్మకు) ఎన్ని కోట్ల కోట్లమంది (భార్యల తో/భర్తల తో/పిల్లల తో) సంబంధ బాంధవ్యములు ఉన్నాయో ....
🌹🌹🌴🌹🌷
*కాఠిన్యం కంటే కరుణ చాలా ఎక్కువ సత్ఫ లితాలను ఇస్తుంది..
*నీ తప్పును ఈరోజు కప్పి పుచ్చుకోగలిగినా రేపటి దానిపర్యవసనాన్ని మాత్రం తప్పించు కోలేము..
*ఇతరులతో పోల్చుకోవడం ఇతరులనుండి ఆశించడం ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తీరినట్లే..
*మనం మన ఆలోచనలకు బంధీలం.ఆలో చనలు మార్చుకోనిదే దేన్నీ మార్చలేము.....
*సహనం, నమ్మకం ఈ రెండు మాటలలోనే మానవ జాతి మనుగడ అంతా దాగుంది....
*ఇతరులను జయించాలి అనుకునే వాడు రోగి అవుతాడు.తనను తాను జయించాలి అనుకునే వాడు యోగి అవుతాడు......
*అజ్ఞానితో తిరిగితే  ఆయాసం వస్తుంది. జ్ఞానితోతిరిగితే ఆనందం,ఆరోగ్యం వస్తుంది.
*అంతరాత్మ మీకు మంచి స్నేహితుడు లాంటిది .కాబట్టి మీరు తన మాటను ఏకాంతంగా వినాల్సిందే....
*మన సాధన ద్వారా మనం పొందిన శక్తికి, మనం దేనిని స్వీకరించటానికి అర్హత పొంది వుంటామో, దానినే ఈ విశ్వం మనకు
ప్రసాదిస్తుంది.....
*మన సాన్నిహిత్యం కోరుకునే ప్రతి వారూ మన స్నేహితులు కారు.మన హితం కోరు కునే వారే అసలైన స్నేహితులు..
*నీ బాధ్యత నీవు నిర్వర్తించు. అంత వరకు మాత్రమే నీకు అధికారంఉంది.ఫలితాల  కోసం ఎందుకాలోచిస్తా వ్.అది నీపని కాదు..
*లాభాల్లో, నష్టా ల్లో, కష్టా ల్లో, సుఖాల్లో నీ మనసు అటూనిటూ పరుగెత్త నీయకు. సాధ్యమైనంత ప్రశాంతంగా వుంచు..
*నీకు నీవే ఆప్తు డివి.నీకు నీవే శత్రు వువి. నీకు నీవే ఇచ్చుకుంటే నీకు నీవే అధిపతివి అవుతావు ..
*నీది చెప్పులు కుట్టే ఉద్యోగమే కావచ్చు. అందులోనే ఎవరూ చూపని నైపుణ్యం చూపించు.సరికొత్త పోకడలకుప్రయత్నించు.
అద్భుతాలు సాధిస్తా వు.!!
*శక్తి వంతుడవై ఉండాలి.ఓర్పు ఉండాలి. దృఢ నిశ్చయము తప్పనిసరి, పవిత్రంగా బ్రతకాలి.గొప్పలు చెప్పుకునే అలవాటు అస్సలు
ఉండకూడదు.వీటినే దైవీ సంపద లు అంటారు..
*యోగమంటే ఇంకేమీ కాదు.నీకర్తవ్యాన్ని నువ్వు నైపుణ్యంగా  నిర్వర్తించడమే..
*జ్ఞానులు,అజ్ఞానులు జీవితాన్ని వేరు వేరు దృక్పథాలతో చూస్తా రు....
🌹🌴🌹🌴
శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయనమః,
శ్రీ గోవిందాయనమః
ఈ కలియుగంలో మనల్ని పడద్రోయడానికి కలిపురుషుడు అనేక రూపాలతో మనమీద దాడికి దిగుతాడు. వీటిలో అనేకరకాలు..
వాటిలో ముఖ్యంగా శారీరకంగాకూడా అనేక రోగాలను సృష్టిస్తా డు.ఆ రోగాలన్ని ఒక ఆయుధంగా మలిచి సంధిస్తా డు. దానిపేరు
సర్వారోగాస్త్రం.
దీనికి విరిగుడు మనకితెలిసినంతలోఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేలు,లక్షలు వదిలించు కోవడం.కాని మన శాస్త్రంలో ఈ అస్త్రా నికి
విరుగుడు,దానిపేరు నామత్రేయాస్త్రం.
నామత్రయం అంటే మూడు నామాలు.అవి.
శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయ నమః,
శ్రీ గోవిందాయ నమః
ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి
కలి ప్రేరితమైన రోగాలురావు.జబ్బులు ఏమై నా ఉంటే అనతికాలంలోనే తగ్గిపోతాయి.
ఈనామాలు ఒక దివ్యౌషధం మీరు
స్మరించండి.
అచ్యుత, అనంత,గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ:-సాధు పరిత్రాణంకొరకుా,
దుష్టవినాశం కొరకుా, ధర్మసంస్థా పన కొరకుా
పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తుా ఉంటానని చెప్పాడు.
భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తు లు ఉన్నాయి.అద్భుత మహిమఉంది.అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్ట
నామాలలో మరీ విశిష్ట నామాలు
అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి.       
ఓం అచ్యుతాయ నమః,
ఓం అనంతాయ నమః,
ఓం గోవిందాయ నమః       
అచ్యుతానంత గోవింద నామెాచ్ఛారణ భేషజాత్ నశ్యంతి సకలారోగాః సత్యం సత్యం వదామ్యహ.!
ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించితీరుతాయి.ఇదిసత్యం, నేను సత్యం చెబుతున్నాను".ఇలా రెండు
మార్లు సత్యం అని చెప్పటం ద్వారా
శ్రీ ధన్వంతరి ప్రమాణంచేసిచెప్పారన్నమాట.
వైద్యవిద్యా గురువైనధన్వంతరివచనంకంటే
ఇంకొక ప్రమాణం అవసరమా"!.ఇది పరమ ప్రమాణం.      
    🌹🌴🌹🌴🌹
ఇతరులను మెచ్చుకుంటే మన గొప్పతనం తగ్గిపోతుందనే భావం మీలో ఉన్నంతకాలం మీరు ఎప్పటకీ సర్వజనప్రియులు కాలేరు.
  స్వార్థం,స్వలాభంకోసం ఎదుటివారిని అతి గా పొగడటం మీ వ్యక్తిత్వానికి చేటు కలిగి స్తుంది.మృదువుగా,ఆత్మీయంగా, నిజాయి
తీగా, స్వచ్ఛమైన మనసుతో స్పందించడం సాధన చేయండి.అది మీ సహజ ప్రవర్తనగా స్థిరపడాలి.సర్వజనప్రియత్వానికిఇంతకన్నా
గొప్ప విధానం మరొకటి లేదు. సర్వజన ప్రియులపట్ల అంతర్యామి అతి ప్రసన్నంగా ఉంటాడన్నది ఎందరో మహాత్ముల జీవితా లు
మనకు ఆదర్శంగా నిలిచాయి. కాబట్టి ఎదుటి వారి మంచిని మాత్రమే మెచ్చుకోవ డం అలవాటు చేసుకోండి.అందరినీ ఆత్మీ
యంగా పలుకరించండి. మీరు కూడా సర్వ జనప్రియులు అవుతారు.
*ఆత్మ క్రీడిస్తే -- ప్రపంచం.
    *ఆత్మ శాంతిస్తే -- ప్రశాంతం
🌹🌴🌹🌴🌴
        
   *మహా ప్రస్థా నం:-ప్రస్థా నం అనగా యాత్ర*
*మహాప్రస్థా నం అనగా అంతిమయాత్ర (తిరిగి రాని యాత్ర)
    *ఈ యాత్ర జరగవలసినది ఆత్మకు కానీ, దేహానికి కాదు.
*అనగా ఆత్మ, భూమి మీద జన్మకు మళ్ళీ తిరిగి రాని యాత్రను నిర్వర్తించాలి.
*ఈ యాత్రను సమాప్తం చేయాలంటే 'నేను' అనే అహంకారం తొలగాలి.అహంకారం పోవాలంటే"ధ్యానం",ఆత్మవిచారణ,స్వాధ్యా
యం,సజ్జనసాంగత్యం తప్పకుండాచేయాలి.
🌹🌴🌹🌴
ఒక పట్టు దలఎన్నోవిజయాలనుఅందిస్తుంది
ఒక నమ్మకం ఆత్మకుబలాన్ని చేకూరుస్తుంది.
ఒక విశ్వాసం ఎవ్వరూ ఇవ్వలేని భరోసాని కలుగజేస్తుంది...
ఒక తాళంకప్ప పూరీగుడిసెనేకాదు,ఏడంత స్తు ల మేడనూ కాపాడుతుంది....
ఒక రాత్రిమాత్రమే చుక్కలు చూపించగలదు
ఒక కృషి మాత్రమే అసాధ్యాన్ని సాధ్యం చేయగలదు....
ఒక సంస్కారం మనిషిని మహోన్నితుణ్ణి  చేయగలదు...ఒకసంస్కృతీ దేశసమగ్రతను నిలబెట్టగలదు...
ఒక విత్తనం మహావృక్షాలకుజన్మనివ్వగలదు
ఒక కన్నీరూ మాత్రమే గుండెలోని బాధను బయట పెట్టగలదు....
ఒక కోయిల మాత్రమే తియ్యని పాట పాడ గలదు...ఒక వసంతమే మనసుకు ఆహ్లా ద పర్చగలదు...
ఒక తల్లిమాత్రమే పసిబిడ్డకు పాలివ్వగలదు
ఒక గుండెమాత్రమే రక్తా న్నిశుద్ధిచేసి నరనరా లకు పంపిణీ చేయగలదు...
ఒక మంచి మాట మాత్రమే మనిషిలో ఎన్నో మార్పులు తేగలదు...
ఒక మంచి ఆలోచన మాత్రమే చెడును చెండాడగలదు...
ఒక గొడుగు ఎండావానల నుండి కాపాడ గలదు....ఒక నీళ్లు మాత్రమే దాహార్తిని తీర్చగలదు...ఒక చంద్రు డు మాత్రమేవెన్నెల
కురిపించ గలడు...
ఒక మానవత్వం ఉన్నవాడే మనిషిగా బ్రతకగలడు...
ఒక మనిషి మాత్రమే ఏదైనాచేయగలడు....
ఒక నిజాన్ని మాయంచేసి అబద్ధమూ చేయ గలడు...స్వార్థం కోసం దేనికైనా వెను కాడక చేయగలడు.ఎన్ని చేసినా...ఎంత ఎదిగినా
ముందు మనిషన్నాకా..మనిషినని తెలుసు కోవాలి...ఒక మనిషి,మనిషిని గౌరవిస్తూ బ్రతికిననాడే అనుబంధాల ఆత్మీయత
పరిమళిస్తుంది.
*ఫలస్య కార....ఫలమునకు కారణంపువ్వు,
ఫలించడం పూవునకు వినాశకారణము.
అట్లే జ్ఞానమునకు కర్మయే కారణము, కర్మ వలన కలిగిన జ్ఞానమే కర్మలను నశింపజే యును.
*బలవా నప్యక్త.....
*ఏ మనుజుడు ధర్మమార్గమున నడుచుకొ నడో వాడు చదువుకొన్ననూ మూర్ఖుడే.
ధనికుడై వుండిన్నీ నిరుపేదవాడే.బలవంతు డై ననూ శక్తిహీనుడే.     
*అపూర్వో భాతి .....
వాక్కు యొక్క అమృత ఫలమైన కావ్య మందలి కవనము అపూర్వమై ప్రకాశించు చున్నది.దాని అందరూ రుచి చూచుచునే
వుంటారు. కానీ దాని స్వారస్యమును గ్రహిం పగలిగినవారు బహు కొద్దిమంది సాహిత్య వేత్తలు మాత్రమే.
*పాతకానాం సమస్తం
సమస్త పాతకములలోనూ రెండు మరీ నికృ ష్టములైనవి.అవే దుష్టు లైన మంత్రు లు గల ప్రభువులుండుట,వారి పాలనక్రిందవుండుట
మన దౌర్భాగ్యం.యివిరెండున్నూ. దేశము నకు ఇంతకన్నా అరిష్టము మరేదీకాదు.
*అవివేకమతి ....    
పాలకులు అవివేకులై వుంటూ,మంచి సల హాలిచ్చు మంత్రు ల పట్ల పెడమొగముగ వర్తించుతూ,దుర్జనులకు ప్రాబల్యము యిచ్చుచో
ఆ దేశమున,సమాజమున సజ్జ నులకు పని ఏమి యుండును?
కడచి పోయినట్టి క్షణము తిరిగిరాదు
ఉపకారః పరో ధర్మః పరార్థ:....
పరోపకార మొనర్చుటయే ఉత్తమ ధర్మము, నేర్పుతో పనులు గావించుటయే ఉత్తమ అర్థము, భార్యాగతమైనదేఉత్తమకామము,
కోరికలను జయించుటయేఉత్తమమోక్షము.
🌷🌴🌷🌴🌷🌴
*వ్యాలాశ్రితాపి విఫలాపి సకంటకాపి*
*వక్రా పి పంకిలభవాపు దురాసదాపి,*
*గంధేన బంధురసి కేతకి సర్వజంతోః*
*ఏకో గుణః ఖలు నిహంతి సమస్తదోషాన్.*         
🌹మొగలి పుష్పమా....నిన్ను సర్పాలు ఆశ్రయించి ఉంటాయి.నువ్వుపండ్లనూ
ఇవ్వవు.ముళ్ళతో నిండిఉంటావు.వంకరగా ఉంటావు.బురద నేలలో పుడతావు.,నిన్ను చేరడం చాలా కష్టం...అయినప్పటికీ, సువా
సన చేత అందరికీనువ్వు బంధువు అవుతు న్నావు‌.ఒక్క మంచి గుణం సకల దోషాలను కప్పివేస్తుంది.
🌹🌴🌷
    
దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య

యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి ॥


దానమిచ్చుట,అనుభవించుట,పరాధీనమ గుట అనుమూడు గుణములు ధనమునకు కలవు. దాన మివ్వక, అనుభవించకపోయి
నచో ధనము మూడవదైన పరాధీనము
అనగా దొంగల పాలు అగును.         
ఆయుర్విత్తం గృహచ్చిద్రంమంత్రమౌషధ సంగమం
దానమానావమానాశ్చ నవ గోప్యామనేశిభిః
🌹ఆయుష్షు,డబ్బు,ఇంట్లో జరిగే గొడవలు, మంత్రం,ఔషధం,సంగమం,దానం,మానం,
అవమానం - ఈ తొమ్మిది అంశాలనుగోప్యం గా ఉంచుదాం.
*జీవితంలోమనిషికిడబ్బుమాత్రమేముఖ్యం కాదు.మనశ్శాoతికూడాముఖ్యం మనసుకు ప్రశాంతత లేకపోతే ఎంత డబ్బు సంపాదిం
చినా వ్యర్థమే !
*ఒక్క నోరుచేసిన పాపానికిఒక్కోసారి,ఒళ్ళు మొత్తం బాదపడాల్సివస్తుంది..ఏంమాట్లా డు తున్నావో
తెలుసుకోలేకపొతే,ఎందుకుఇంకా బ్రతికానా అనేలా అవుతుంది పరిస్థితి..      
ఊరు మంచిది కాకపోయినా, నోరు మంచి దైతే ఎక్కడై నా బ్రతకొచ్చు..
కొన్నికన్నీళ్ళకికారణం మీనోరు కానివ్వకండి
🌹🌴🌹🌴
"మానవుణ్ణి దానవునిగా మార్చునది విత్త ము( ధనము).మానవుణ్ణి మాధవునిగా మార్చునది చిత్తము.నేడు ఎచ్చట చూసిన నూ
విత్తము కొరకు పరితపించువారే తప్ప చిత్తము కొరకు పరితపించువారు కానరావ డం లేదు. జీవితమంతయూ ధనము కొరకై
పరుగులెత్తినా చివరకు మృత్యువుకు లొంగ వలసిందే! ఎంతటి ధనవంతుడై ననూ కర్మ ఫలితమును అనుభవించక తప్పదు. మీ
అధికారము,మీ ధనము,మీ బంధుమిత్రు లు ఏవియునూ యమునిపాశంనుండిమిమ్మల్ని కాపాడలేవు.వీటికోసం పరుగులు తీస్తూ
జీవితమును వృథా పరచుకుంటున్నాం.
🌹🌴🌹🌴
         
భగవంతుడు మీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాడు.కనుక ముందు మీహృదయా లను తెరవండి.ఆర్తితో పిలవండి.ఆయనపై
విశ్వాసముతో....
ఆయన మీ హృదయమందు స్థిరపడెనా!! ఇక మీకు తిరుగుండదు!!! ఈ సమస్త జగ త్తు లో ఉండే ఐశ్వర్యములన్నియూ తామం
తట తామే మీపాదాల చెంతకు వచ్చి వాలును.
దైవము పుట్టిన ప్రతి జీవి చుట్టూ కొంతమం దిని ఏర్పరుస్తా డు.వారితో అనుబంధము ఏర్పరుచుకో,బంధం ఏర్పరుచుకోక అని
చెప్తా డు. అనుబంధం అంటే కలిసి ఉండడ ము గాని,కలిసిపోయి ఉండడము గాదు. 
అనుబంధాలు బంధము అయిపోతే దుఃఖా నుభూతి. బంధము పీటముడిగాఉంటుంది. తీయడానికి రాదు.తీయబోయి
విసుగొచ్చి ఇంకొంచెము చిక్కువేసుకుంటాము. అను బంధము అంటే దూ ముడి లేక కుచ్చుముడి
అలాగని ఎవరితో సంబంధము లేదు, అను కొని అందరితో కలిసి ఎలా ఉండాలో తెలి యక విడివడుతూ అది వైరాగ్యము అను కొని
భ్రమపడి దుఃఖభాజనులనుకుంటారు.
🌹🌴🌹🌴🌹
లేనోడికి పూట గడిస్తే చాలు.,ఉన్నోడికి కోట్లు గడించినా చాలదు.పేదోడిదిమనుగడ కోసం పోరాటం.ధనికుడిది విలాసంకోసం
ఆరాటం.
బీదవాడు బ్రతకలేక 'రోజు'చావాలనుకుంటా డు. శ్రీమంతుడు ప్రాణం మీద తీపితో ప్రతి క్షణం బ్రతకాలనుకుంటాడు.
*కోపంగా మనల్ని వదలివెళ్ళేవారు ఏదో రోజు తిరిగివస్తా రు.మౌనంగా మనల్ని వదలి వెళ్ళేవారు ఎన్నటికీ తిరిగిరారు.
*మందితో పోల్చుకుని బాధపడడం కంటే మనలోపాలను సవరించుకొని బాగుపడటం మేలు....మనసా వాచా కర్మణా సర్వుల
ప్రయోజనానికి అంకితమైతే నీలోని అంతర్ శక్తి నీవశ మౌతుంది....
*ఉదయాన్నే మనం పలకరించే చిన్న చిరు నవ్వు ఒకరికి ఆరోజంతా హాయిని చేకూర్చ వచ్చు.కావునప్రారంభించండిఅలా..
*సకల జీవుల పట్ల అత్యంత గౌరవం కలిగి వుండటం అనేది అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక భావన....
*ఓర్పుతో నిరీక్షించగలవారికే జీవితంలో కోరినవి లభిస్తా యి....
*బంధాల్లో అనుబందంఆనందంఉండాలంటే అహంకారం ఉండకూడదు.వేరే దారిలేదు...
*ఏమిసాధించావు.ఎంత సాధించావుఅన్నది కాదు లెక్క.ఎలా జీవించావు అన్నదే లెక్క...
🌹🌴🌹🌷
“జీవితంలో ప్రతి క్షణం ‘వైభోగం’ అన్నది ఉండాలి. అసలు మానవ జీవితం యొక్క మౌలికమైన పరమార్థం .. ఏ పని చేస్తు న్నా సరే
ప్రతి క్షణం వైభోగంగా జీవించుదాం
*“సూర్యుడూ,చంద్రు డూ,వెన్నెలా, నక్షత్రా లూ,కొండలూ,కోనలూ ఇలా .. ప్రకృతిలోని అందాలన్నీ చూసి ఆనందించడానికే మనకు
రెండు కళ్ళు ఉన్నాయి.ఈ లోకంలో ఉన్న సంగీతాన్నంతా వినడానికే రెండు చెవులు ఉన్నాయి.సూర్యోదయాన్ని చూసి తన్మయ త్వం
చెంది గొప్ప గ్రంథమే వ్రాయాలి
*ఆకాశంలో పక్షులు హాయిగాఎగరడంచూసి తన్మయత్వంతో సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే అదీ వైభోగం అంటే!
“కనుక ‘జీవితం’అన్నది వైభోగంగా జీవించ డం కోసమే ఉంది! ఇక్కడ వైరాగ్యం అన్న స్థితికి తావే లేదు! వైరాగ్యం అన్నది ప్రకృతి
విరుద్ధమైనటువంటి అసహజ ధోరణి! అందుకే..‘బ్రతుకంటే ఆట అంట.,బ్రతుకంటే పాట అంట.. బ్రతుకంటే నాటకమంట ..
వైరాగ్యం వద్దంటరో .. అన్నలార! వైభోగం ముద్దంటరో ..
‘ఈ జీవితం అంతా కూడా ఒకానొక నాటక రంగం’ అనీ ‘ఇందులో మనం అంతా కేవలం పాత్రధారులం’ అనీ ఎరుకతో కూడిన
అవగాహన రావాలి
‘ఇందులో నేను భర్తలా,భార్యలా,తల్లిలా, తండ్రిలా,కూతురిలా,కొడుకులా,గురువులా, శిష్యుడిలా ఇలా నాకు అప్పజెప్పబడిన
పాత్రకు తగ్గట్లు చక్కగా నటిస్తు న్నాను’ అన్నదిసత్యం.,ఈ సత్యాన్ని మరచిపోయిన మరుక్షణం ..కర్మసిద్ధాంతం ఎలా పుటంపెడు
తుందో కూడా తెలుస్తుంది.
“అందుకే ‘నానాటి బ్రతుకు నాటకము’
‘ఈ జీవితం ఒక నాటకరంగం .. ఇందులో మనం అంతా కేవలం పాత్రధారులం’....
🌹🌴🌹🌴
         
కాబట్టి ఈ జీవిత నాటకం వేస్తూనే మనం ఎన్నెన్నో విషయాలను నేర్చుకోవాలి. “ఇలాంటి నేర్చుకునే క్రమంలో అప్పుడప్పు డూ
తప్పటడుగులు పడినా..తమాయించు కుని నాటకాన్ని రక్తికట్టిస్తూ పూర్తిచెయ్యాలి!. నాటకం మధ్యలో నుంచి విరమించుకో
గూడదు.
వైరాగ్యం కానీ, ఏడుపుకానీ ఉన్న జీవితాలు అనారోగ్యాలకు నిలయాలు అవుతాయి. కనుక వైరాగ్యాన్నీ మరి ఏడుపులనూ వది
లిపెట్టి జీవితాన్ని ఒక ఆటలా ఆడుకోవాలి...
*చక్కటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఇంకోవైపు హాయిగా సంసారాన్నికూడా నిర్వ హించుకోవాలి.ఒకవైపు సంగీతాన్ని ఆస్వా
దిస్తూ మరి ప్రకృతి అందాలకు పరవశించి పోతూ..ఇంకోవైపు హాయిగా ఉద్యోగవిధులు నిర్వహించుకోవాలి.సంసారంలోనే నిర్వాణం
చెందుతూ వైభోగంగా జీవించుదాం.
💚🌹🖤
      
వెలుతురు వైపు ఒక అడుగు.,
మీరు వెలుగులో ఉన్నారా? ఒక్కసారి ఆలో చించండి,ఇంకా మీరు చీకట్లోనే మగ్గుతు న్నారు, మీ మూఢనమ్మకాలు ఛాదస్తా లు,
భయాలు,అందోళనలు,అప్పులు,దేవుళ్ళు,దయ్యాలు,జ్యోతిష్యాలు లాంటి వాటితో ఏది నమ్మాలో ఇంకా ఎక్కడికి వెళ్ళాలో ఏవరు
ఏది చెబితే అది తల ఊపుతూ అది చేసేస్తూ మీ డబ్బు ,సమయం అంతా వృధా చేస్తు న్నారు,ఇంకా ఎన్నాళ్ళు? మీకంటూ
జ్ఞానముంది,దాన్ని భయటకు తీయండి. చాలు మీరే మాహిమాన్వితులు.మిమ్మల్ని మించి గొప్పవారు ఈ సృష్టిలోలేరు. భయ టకు
తీయాలంటే మీలో ఉన్న ఆత్మ జ్యోతిని ముందు వెలిగించండి,వెలిగించాలంటే......
ముందుగా మీరున్న స్థితి నుండి ఉన్నతమై న జీవితానికి మారడానికి మిమ్మల్ని మీరు ఉన్నతంగా ఒప్పుకుంటూ ప్రతిఙ్ఞ చేయండి.
మరుక్షణం మీలో జ్యోతి వెలుగుతుంది,
అది మీజీవితానికి నిరంతరం వెలుగై నిలు స్తుంది,మీలోని పాతభావాల్ని కాల్చేసి అనం తం వైపు దారిచూపుతుంది,ఆదారిలో నడు
చుకుంటూ అభ్యున్నతివైపు ఆనందం వైపు డబ్బు,సంపదతో కూడిన జీవితంవైపు అడు గులు వేయండి.అందరికీ మీరు ఆదర్శంగా
నిలవండి.
*ప్రగల్బమ్ అంటే అసందర్భపు ప్రేలాపన,  పనికిరాని మాటలు మాట్లా డటం.*
*' ప్రగల్బ రాహిత్యం'అంటే నోటినుండి ఒక్క అనవసరపు మాట కూడా మాట్లా డకుండా ఉండటం.
*తన్ను తాను తెలుసుకున్న వారికి తన్నులు  తప్పుతాయి.తన్నులు అంటే కష్టా లు.
*నేను చైతన్య స్వరూపాన్ని అని తెలుసు కున్న వారికి కష్టా లు ఉండవు.
*పుట్టు క గుట్టు అందరికీ తెలుస్తుంది.,  'పుట్టినవానికి తప్ప',చావు గుట్టు ఎవరికి తెలియదు.,'చచ్చిన వానికి తప్ప'.
🌹🌴🌴🌷🌴
    *నా,మా,లు పెట్టు కోవడమే ప్రాపంచికత.
*నా,మా,లు తీసివేయడమే ఆధ్యాత్మికత.
తీసివేయ వలసివి  'నా', 'మా' లు.  
*నా శరీరం,నా ఇల్లు ,నా పిల్లలు ..నావాళ్ళు. అనే నా".....మా జాతి, మాకులం,మాదేశం, మాఊరుఅనే మా"......
*ఇకనుంచి నా, మా అనేవి తీసేసి ''మన" అని పెట్టు కుందాం.*
*ఏ జ్ఞానికి అజ్ఞాని కనబడడో ఆ జ్ఞానే -- 'మహా జ్ఞాని' 🙏మీఆచార్యులు,రామకృష్ణ

You might also like