You are on page 1of 53

[12/3, 5:29 AM] మీ రామకృష్ణా ఆచార్యులు.

txt
*Ethics,Values,Morals అనేవి..పుస్తకా ల్లో ఓ మూలన పడుంటాయ్.వాటిని నువ్వు నీనిజజీవితంలో అప్లై చేస్తే,నిన్ను ఓమూలన
పడేస్తా రు...
*చాలా మంది మనచుట్టే ఉంటారు,చప్పట్లు కొడుతు ఉంటారు,ఆ ధ్వనిలో ఎవరు మన వాడు, ఎవరు కాదో తెలుసుకోలేదనుకో  ఆ
చప్పట్ల సునామీలో కొట్టు కపోవడంఖాయం.
*వెనుక జనం ఉన్నారని ఎగిరిపడకు..వెన్ను పోటు పొడిచే వాడు,వెనుక నుంచే వస్తా డని మరువకు..మనల్ని అభిమానించే వాళ్ళని,
మనకోసం ఎదురు చూసేలా చేయకూడదు..
ఒకసారి వాళ్లకు సహనం నశిస్తే,వాళ్ల కోసం మనం ఎదురు చూడాలి..
*మనం అన్న భావన ఉన్నవాళ్ళందరూ మన వాళ్లే, కానీ నా..నీ..అనుకునేవాళ్లను,
"అర మైలు" దూరం...పెట్టవలసిందే.
*నిజం నిలకడగా నివాసం ఉండాల్సింది మనిషి హృదయంలో.పైపై పెదవులపై కాదు.         
మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండికాదు, నాణ్యమైన మట్టి! అలాగే
పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు,సంస్కారం. తెగ మాట్లా డే వారు"ఓటికుండ"ల్లాంటివారు. వారి దగ్గర
ఏమి నిల్వ ఉండదు.నీబాధలనుండి నువ్వు ఎలాబయటపడాలో ఆలోచించు కానీ...
వాటిని ఇతరులకు చెప్పటానికి కాదు. ఎందుకంటే ఒకరిబాధలు వేరేవాళ్ళు తీర్చరు
💛🌹🌴🌹🌴🌹
        
సాంబా... అని పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతోఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు, మహాభారతంలో
ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివ దీక్ష ఇస్తూ...
నమశ్శివాయ సాంబాయ శాంతాయ పర మాత్మనే.._య ఇదం కీర్తయేన్నిత్యం శివ సాయుజ్య మాప్నుయాత్_అనే మంత్రాన్ని
ఉపదేశించారు.
    చాలా గొప్ప మంత్రం. నమశ్శివాయ.. సాంబాయ..శాంతాయ..పరమాత్మనే.నాలు గు నామాలలో అత్యద్భుతమైన శక్తిఉంది.
నమశ్శివాయ...
(శివాయనమః) మహాపంచాక్షరీ మంత్రం. శివభక్తు లకు నిరంతర జప్యమైన పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రా లు పలువిధాలు గా
వర్ణించాయి.అ, ఉ, మ,బిందు,నాద అనే పంచ అవయువాలతో కూడిన ఓంకారం సూక్ష్మప్రణవం..న, మ, శి, వా,య అనే ఐదు
అక్షరాల శివమంత్రం స్ధూల ప్రణవం.పంచా క్షరీని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధం.
సాంబాయ...అమ్మతో ఉన్నవాడు.ఇలా పిలి స్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని
దయవేరు.అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే  కావలసినవి అన్ని సమృద్ధిగాపొందవచ్చును
శాంతాయ..ఆయనని తలంచుకొంటే వచ్చేది శాంతం. జీవితానికి కావలసిందికూడాశాంత మే. "ప్రపంచోప శమం శాంతం అద్వైతం
మన్యంతే" అని ఉపనిషత్తు చెప్పింది. అల జడులు అన్నీ అణగిన తరువాత వచ్చే శాంతం అది.
పరమాత్మనే నమః...
చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్త్వమే. అన్నిటిని కలిపి నాలుగు నామాల తో పొదిగిన మంత్రరాజం ఈ శ్లోకం.
ఈ శ్లోకాన్ని అర్థా నుసంధానంగా మననం చేస్తే శివసాయుజ్యమే....
రోగాలున్న వ్యక్తికి రుచికరమైన భోజనం... ప్రయోజనం లేదు.అదే విధంగా ఒక మూర్ఖు నికి నీవు ఎంత బుద్ధి చెప్ప ప్రయత్నించినా
ప్రయోజనంలేదు.
*నీ విజయాన్నినీకంటేచిన్నవాళ్ళతోపంచుకో
*వాళ్ళు నిన్నుస్ఫూర్తిగాతీసుకునిపైకివస్తా రు
*నీ ఓటమిని నీకంటే పెద్దవాళ్ళతో పంచుకో.
*ఓటమిని ఎలా అధిగమించాలో పాఠం నేర్పిస్తా రు...
అదేంటో తెలియదు కానీ ప్రతి మనిషి చేసిన తన తప్పులను,బీరువాలోబాండు పత్రాల్లా దాచుకుని..ఇతరులచేసిన తప్పులు ప్రచార
పత్రాల్లా వీధుల్లో పంచిప్రచారం చేస్తా రు....                
  *అందం అనేదిఅర్థం చేసుకునే మనసులో ఉంటుంది కాని,అర్థంలేని అహంకారంలో కాదు...అందం అనేది నవ్వే పెదవిలో లేదు. 
బాధను దాచుకునే హృదయంలోఉంది. అందం అనేది అవమానించే గుణంలో లేదు  ప్రేమతో ఆదరించేగొప్పమనసులోఉంది.
అందంఅనేదిశరీరానికిసంబందించినదికాదు 
స్వచ్ఛమైన మనసుకు సంబందించినది ..                                         
      💚🌷🌴🌷🌴🌷
*మాగ్నటిక్‌రైళ్లు చక్రా లు లేకుండానే ఎలా..
బండి జరగాలంటే చక్రంతిరగాలి.అందుకోస మే శక్తి అవసరం.మాగ్నటిక్‌రైళ్లలో రైలు బండి చక్రా ల ఆధారంగా పట్టా ల మీద నిల
బడదు. రైలు పట్టా లకు రైలు బండి అడుగు న ఉన్న చక్రా ల స్థా నే ఉన్న పట్టీలకు ఒకే ధృవత్వం ఉన్న అయస్కాంత తత్వాన్ని
విద్యుశ్చక్తి ద్వారా ఏర్పరుస్తా రు. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి.... పట్టా ల అయస్కాంత ధృవత్వం,రైలుఅడుగునఉన్న
విద్యుదయస్కాంత పట్టీల అయస్కాంత తత్వం ఒకేవిధంగా ఉండటం వల్ల ఏర్పడిన వికర్షణ రైలు మొత్తంగా పట్టా ల నుంచి కొన్ని
మిల్లిమీటర్ల మేరపైకి తీస్తుంది. దీన్నే అయ స్కాంత ఉత్‌ప్లవనం అంటారు.ప్రత్యేక పద్ధ తిలో పట్టా లకు,పట్టీలకు మధ్య ఏర్పడిన
వికర్షణ బలాన్ని మార్చడం ద్వారా రైలు ముందుకు వెళ్లేలా ఏర్పాటు ఉంటుంది. మామూలు రైలు పట్టా ల్లా గా ఈ మాగ్నటిక్‌రైలు
బండి పట్టా లు సాఫీగా అవిచ్ఛిన్న రేఖలాగా కాకుండా విచ్ఛిన్నంగా ఉండటం వల్ల ఇలా చలనం వీలవుతుంది......
"పరాజయం అంటే నువ్వు చేసిన పనిని వదిలి పారిపొమ్మనటం కాదు. ఆ పనిని మరింత శ్రద్ధగా పట్టు దలగాచేయమనిఅర్థం"
"వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు.
కొత్త ప్రేరణకు పునాది కావాలి".....
💙🌷🌴🌷🌴🌷
       
మనిషి స్వతఃసిద్ధంగా ఆత్మస్వరూపుడు, పరమాత్మునికి చెందినవాడు.
మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని మర్చిపోవ టంకన్నా ఘోర విపత్తు మరొకటి లేదు. దానిని మరువడం అజ్ఞానాన్ని స్వచ్ఛంధంగా
అంగీకరించటమే అవుతుంది.
ఆత్మ ప్రకాశం వైపు మన మనస్సునుత్రిప్పితే మనలో విస్తా రతను పెంపొందిస్తూ స్ఫూర్తిని కలిగిస్తుంది. దానివలన ఏపనిని నిర్వహించ
వలసి వచ్చినా నైపుణ్యంతో చేయగలం.
జీవితం మన ఆలోచనలతో, ఆశయాలతో, క్రియలతోతయారుచేసుకొన్నదే.ముఖ్యమైన విషయాలకుస్వస్తిచెప్పి అనవసరమైనఅల్ప
మైనవాటికి నిరంతరం ప్రాధాన్యతనిస్తు న్నాం
అల్ప విషయాల నుండి దృష్టి మళ్ళించుకు ని ఉన్నత భావాలను స్వంతం చేసుకునే దిశగా ప్రయాణించాలి.పారమార్థిక జీవనమే
దీనికి ఆవశ్యకం.
[12/3, 5:17 AM]  ♥️ 🌹🌴🌹🌴🌹
*నీకంటూ ఒకరు......
ఈ ప్రపంచంలో నీ కష్టా న్ని గురించి శ్రద్ధగా, సానుభూతిగా వినే ఒక్కరైనా లేకపోవడం అన్నింటికన్నా పెద్ద దురదృష్టం. మన సంతో
షాన్ని పంచుకునేవారుంటారు. కానీ మన కష్టా న్ని పంచుకోవడానికి, కన్నీళ్లను తుడిచి పోవడానికి ఎవరు ముందుకొస్తా రు? మనం
నవ్వుల్ని తోటివారితో ప్రకృతితో పంచుకుం టాం. కానీ మన కన్నీటిని ఎవరు పంచుకుం టారు? దాన్ని పంచుకోవాలంటే అవతలి
మనిషికి మధుర హృదయంఉండాలి. మాన వీయ కోణం ఉండాలి. తన హృదయపు పొరల పూలరేకులతో అవతలివారి గాయ పడిన
గుండెను పదిలంగా పొదువుకుని, గాయాల మరకలను తుడిచి మాధుర్యపు మందులను వేసి, చిరునవ్వుల మృదుగా యంతో సేద
తీర్చే ఔషధీయ హృదయం ఉండాలి. ఈ వైద్యానికి ఔషధం అవసరం లేదు. ధనం అగత్యం లేదు. మంచి మనసు ఉండాలి.
అవతలివారి గాయాన్ని తనదిగా భావించే స్పందించే మనసు ఉండాలి.
అలాంటి ఒకరు మనకుంటే మన కన్నీరు పన్నీరు అవుతుంది. కష్టం కూడా ఇష్టం అవుతుంది. శ్రీకృష్ణుడి స్నేహితులకు కష్టం
లేకపోలేదు. కన్నీరు రాకపోలేదు. నిజానికి అవన్నీ వాళ్లకు ఎక్కువ. కానీ అంత ప్రియ మైన స్నేహితుడు ఉన్నాక, అంత మృదువు గా
కన్నీరు తుడిచే సహచరుడు ఉన్నాక, అంతగా కష్టంపంచుకునే ఆత్మీయుడు మన కంటూ ఉన్నాక- కన్నీరు కాటు వేయగలదా,
కష్టం వేటువేయగలదా,కారుమేఘం కూడా మధురమైన నాట్యం చేయదా? స్నేహాన్ని వెన్నలా పంచుకుతిన్నశ్రీకృష్ణుడు,అటుకుల్ని
అమృతంలా ఆరగించిన శ్రీకృష్ణుడు స్నేహి తులు, సన్నిహితులు, సహచరుల దుఃఖ బాష్పాల్ని ఆనందబాష్పాలుగామార్చకుండా
వదులుతాడా,వదలగలడా? పెనుతుపాను ను గోవర్ధనగిరి కింద ఆటవిడుపు విహారంగా మలచకుండా ఉంటాడా? రహస్యం కళ్లలో,
కన్నీళ్లలో లేదు. వాటిని తుడిచే ఆ అమృత హస్తంలో ఉంది. కష్టంలో,దాని పరిణామాల్లో లేదు.వాటిని కమనీయంగా మలచే ఆహృద
యపు సొంపులో ఉంది. శిల ఏదైనా శిలే. దాన్ని శిల్పంగా మలచేనేర్పు శిల్పిలో ఉండా లి. పాపాయిగానా,యువతిగానా, రాజుగా నా,
సర్పంగానా,సర్వేశ్వరుడిగానా అదంతా శిల్పి నేర్పు, ఓర్పు.మన కన్నీళ్లకు అర్థా న్ని మార్చే నేర్పు వాటిని తుడిచే వేళ్లు కుండాలి. ఏది
ఏమైనా కన్నీళ్లకు తుడిచే ఒక అమృత హస్తం కావాలి.నీకు నేనున్నానంటూ ఆ కన్నీ ళ్లకు అమృత బిందువులుగా మార్చే కమనీ య
హృదయం కావాలి. ఆ హస్తం మనదే అయితే..అలాంటి హృదయం మనకే ఉంటే. మనమే ఆ శ్రీకృష్ణుడై తే? మన ఇంటికప్పు
గోవర్ధనగిరిగా మారదా? మారుతుంది! ఎవ రికి ఏం సాయం చేయాలన్నా మనకు ధనం అవసరం లేదు. బలం అవసరం లేదు....
  మనం ప్రేమించే హృదయం అయిపోవాలి. మన వేళ్లు కన్నీళ్లను తుడిచే తామర రేకులు గా మారాలి.మాటలు మకరందపు బిందు
వులుగా జాలువారాలి.లోకంలో ఏఒకరికైనా నీకు నేనున్నానంటూ నిలబడగలిగితే లోక మే తోడుగా మన పక్కన నిలబడదా? మన
వెనక నడిచిరాదా? ఒక్కరు కోటి మందిగా మనకు గొడుగు పట్టరా?ప్రేమంటే హృదయా నికి ప్రణమిల్లని మనిషి ఉండడు. కన్నీరు
తుడిచే చేతికి అంత విలువ ఉంది. అంత శక్తి ఉంది. మనమూ ఆ ‘ఒకరం’ అవుదాం. కన్నీరు తుడుద్దాం.కన్నీరు కార్చేవారు లక్షల
మంది ఉంటారు. కానీ, ఆ కన్నీ ళ్లను తుడిచే చేతులు కోటిలో ఒకరికే ఉంటాయి. శ్రీకృష్ణుడు జీవితమంతా కష్టా లు ఎదురు
దెబ్బలతో సహవాసం చేసినా ఏఒక్క రోజూ ఆభావంతో బాధపడిన దాఖలాల్లేవు. ఎవరి సహాయాన్ని, సానుభూతిని కోరిన రుజువు
ల్లేవు. ఎందుకంటే- ఇతరుల కన్నీటిని తుడ వడంలోనే సాటిలేని ఆనందంఉంది.
💞🌷🌴🌷🌴🌷
      
జీవితంలో మనం ఎదగాలిఅంటేముందుగా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి.గెలవాలిఅంటే ఓటమి ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దు
బాటు లేనిదే జీవితంలోఏదిసంపూర్ణంకాదు.
     ఎవరితోనైనా పరిచయం కాపాడుకుంటే పదికాలాలు.కాదనుకుంటే పది నిముషాలు.
     విజయం గొప్పది కాదు..సాధించినవారు గొప్ప.... బాధపడటం గొప్పకాదు... బాధను తట్టు కోవడం గొప్ప... బాంధవ్యాలు గొప్ప
కాదు వాటిని నిలబెట్టేవాడు గొప్ప.
         శారీరక వ్యామోహం కన్నా మానసిక సౌందర్యం మిన్న... సేవ చేసే ఔదార్యంకన్నా మాటమీరని మనస్తత్వం మిన్న.. ఆహార
నియమాలకన్నా మితమైన ఆహరం మిన్న.
💲
        We can't see our reflection in boiling water.. Similarily we can not see Truth in a state of Anger...
When the water Calms clarity comes..
           ఒకరిని గుర్తు చేసుకోవడం కాదు మర్చిపోకపోవడమే నిజమైన అభిమానం..
    తనకు కష్టా లు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం.... తనకు వచ్చిన కష్టా లు ఎవరికీ రాకూడదని కోరుకోవడం మానవ త్వం.
సమస్యలతో తనలాగే ఇంకెవరు బాధపడకూదని ఆలోచించడం మహాత్ముల తత్వం..
[12/3, 5:41 AM ❤ 🌹🌴🌹🌴🌹
*ఆయుర్వేదం* అనేది భగవంతుడు ఈ ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప వరం... . మిగిలిన వైద్యపద్ధతులవలే ప్రత్యేకమైన చదువు
దీనికి అవసరం లేదు . ఆయుర్వేదంలో అనుభవం అనేది ప్రధానం . రోగి ఏ వ్యాధితో భాధపడుతున్నాడో సరిగ్గా అంచనావేసి దానికి
సరైన చికిత్సను అందించడంలోనే  గొప్పతనం అనేది ఉంటుంది....

💲ఈమధ్యకాలంలో సోషల్  మీడియాలో అది..ఇది... వాడుకోండి అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇలా వాడండి అలా చేస్తే తిరుగే
ఉండదు వంటి మాటలతో జనాన్ని పిచ్చివాళ్లని చేస్తు న్నారు...
అసలు మనిషి శరీరతత్వం తెలియకుండా మందు ఎలాచెప్తా రు అన్నదే అర్ధంకాని ప్రశ్న.
       ప్రతిమనిషిలోను ఆయుర్వేదం ప్రకారం మూడు తత్వాలు ఉంటాయి. అవి *వాత పిత్త కఫాలు* . తల భాగం నుంచి ఉదర
పైబాగం వరకు కఫ శరీరం ఉంటుంది. ఉదర భాగం నుంచి నడుము పై భాగం వరకు పిత్త శరీరం ఉంటుంది. నడుము భాగం నుంచి
పాదాల వరకు వాత శరీరం ఉంటుంది.  మనం తీసుకునే ఆహారాల వల్లకాని లేక మనం సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లకాని
వాతపిత్తకఫాల మద్య అసమతు లనం ఏర్పడి రకరకాల రోగాలు సంప్రాప్తి స్తా యి. ఈ మూడు తత్వాలు సమానంగా ఉన్నంత వరకు
మనకి ఎటువంటి సమస్యలు ఉండవు.
💲ఒక వ్యక్తిని చూడగానే అతనిశరీరతత్వా న్ని ముందుగా అంచనావేసే అనుభవాన్ని వైద్యుడు పొందగలగాలి.రోగికి సమీపమున
కూర్చొని ముందుగా కొన్నిరకాల ప్రశ్నలు అడగాలి.
*💲రోగనిర్థా రణ ప్రశ్నలు....*
* రోగి వయస్సు మరియు రోగి కలుగు వేదన గురించి అడుగవలెను .
* మలమూత్రములు క్రమముగా వెళ్లు చు న్నావా ?  మలమూత్రాల రంగు గురించి అడగవలెను.
* రోగిని అడుగుచూ రోగి యొక్క శరీర ప్రకృతి వాతమా? పిత్తమా ? లేక కఫామా ? అన్నది నిర్ధా రణకు రావలెను .
* 💲భుజించు పదార్ధా లలో ఏయే పదార్థా లు ఎక్కువుగా తింటారు ?
*  నిద్ర సక్రమముగా పట్టు నా ?
*  సుఖవ్యాధులు ఏమైనా ఉన్నావా ? వాటి లక్షణాలు ఏ విధంగా కనిపిస్తు న్నాయి .
* జ్వరం వచ్చుచున్నదా ? ఏయే సమయాలలో వచ్చును ?.
* ఎప్పుడు అయినా కర్పూర సంబంధమైన రసాలు ( menthol ) సేవించారా ?
* మద్యపానం , ధూమపానం వంటి అలవాట్లు ఉన్నాయా ?
* రోగి యొక్క రక్తసంబంధీకులలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నదా ?
*  చల్లటి పదార్థా లు తీసుకున్నపుడు ఎలా ఉంటుంది ? వేడిపదార్థా లు తీసుకున్నపుడు ఎలా ఉంటుంది ?
*  రోగి స్థూల శరీరుడా ? శుష్క శరీరుడా ?
*  💲రోగి కూర్చొని పనిచేయువాడా లేక తిరుగుతూ పనిచేయువాడా అనగా మన ఉద్యోగం వల్ల కూడా మనకొచ్చే జబ్బులు
ఉంటాయి.
* ఇదివరలో ఎమైనామందులు సేవించారా?  ఇప్పుడు ఎమైనామందులు వాడుతున్నారా
*  స్త్రీ అయినచో సంతానవతియా ? కాదా?  గర్భిణీ స్త్రీ అయిన ఎన్నో మాసము ? ఋతువు సరిగ్గా వచ్చుచున్నదా ? ప్రసూతి
అయ్యినప్పుడు మలినములన్నియు బయటకి వెడలినవా ?  ఎంతకాలం అయినది ? దేహదారుఢ్యం ఎలా ఉంది ?.
* చంటిపిల్లలు అయినా పాలు సరిగ్గా తాగుదురా....
* చంటిపిల్లకు కలిగే బాలపాప చిన్నె అనే వాత సంబంధ రోగం ఉన్నదా ?.
* కడుపునొప్పి , కడుపు వెంట జిగురు వెళ్లు ట, పాలు కక్కుట ఉందా...

   ఇన్ని రకాల ప్రశ్నలు వేసి నాడిని పట్టు కొని చూసి రోగాన్ని సరిగ్గా అంచనా వేసుకొని ఆ తరువాత రోగి యొక్క శరీర తత్వాన్ని
దృష్టిలో పెట్టు కొని ఔషధాన్ని ఇవ్వవలెను....

  💲మనిషికి 120 సంవత్సరములు ఆయు ర్దా యం అని జ్యోతిష్యగ్రంధాలు తెలుపుచు న్నాయి. కాని ప్రస్తు తం మనంతినే ఈ
పురుగు మందులతిండికి 60 సంవత్సరాలు బ్రతకడమేగొప్పఅవుతున్నది. కేవలం నాడీ జ్ఞానం వల్లనే రోగం తెలుసుకొనుట కష్టం...
*అష్టమస్థా న పరీక్ష...*
💲 నాడీ ,  - స్పర్శ , - రూపము , - శబ్దము ,  - నేత్రము,మూత్రము , పురీషము, నాలుక .
   ఇన్నిరకాల పరీక్షలుచేసి రోగనిర్దా రణ చేసీ, రొగికి ఇచ్చే ఔషదం శుద్ది చేసి మాత్రమే ఇవ్వవలెను. శుద్ధి చేయనటువంటి ఔషధం
పనిచేయదు .        
🌷🌴🌷🌴🌷
            
ఏమయ్యావయ్యా? అంటే నేను.. స్వస్వరూ ప సాక్షాత్కార జ్ఞానము చేత,నేను ఆత్మస్వ రూపుడుగా ఉన్నాను.స్వయం సిద్ధముగా
ఉన్నాను.ఏ రకమైనటువంటి విచలితమైన టువంటి మనస్సులేనటువంటి వాడిని.మన స్సు నాకు పనిముట్టు .బుద్ధి నాకు పనిము
ట్టు . మహతత్త్వము నాకు పనిముట్టు .అవ్య క్తము నాకు పనిముట్టు . నేను ప్రత్యగాత్మ స్వరూపుడను అనేటటువంటి,స్పష్టమైనటు
వంటి నిర్ణయముతో, స్పష్టమైనటువంటి జ్ఞానముతో,స్పష్టమైనటువంటిఅనుభవము తో, స్పష్టమైనటువంటి నిర్ణయంతో తాను
వ్యవహరిస్తూ ఉంటాడు.అటువంటి వ్యవ హారమంతా కూడా, ఇటువంటి జ్ఞానమంతా కూడా ఈ జ్ఞానమార్గమనేటటువంటి లక్షణ
ము ఎటువంటిదయ్యా అంటే, కత్తి అంచు మీద నడవటం వంటిది.
అంటే అర్థం ఏమిటంటే, ‘అసిధార వ్రతం’ - అంటారన్నమాట! ఏ మాత్రము ఏమరపా టుగా ఉన్నా, రెప్పపాటు ఏమరపాటుతనం
ఆవహించినా కత్తి అంచు మీద నడిచేటప్పు డు, కాలు ఎలా తెగిపోతుందో, అలాంటి ప్రమాదాలకు లోనయ్యేటటువంటిఅవకాశం
ఉన్నది. మరల బహిర్ముఖంలోపడిపోతూ ఉంటాడు. మరలా కాలము, కాలగతిలో కొట్టు కుపోతూ ఉంటాడు. ఆ కర్మవశమున ఏది
అవ్వాలో అది అయి పోతూ ఉంటాడు. ఆ సంగత్వ దోషాన్ని పొందుతూ ఉంటాడు. ఆ రకమైన టువంటి మాలిన్య ప్రభావానికి
గురౌతాడు. కాబట్టి, నిరంతరాయముగా మెలకువ కలిగి ఉండాలి. తస్మాత్‌జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మేలుకొమ్ము, మేలుకొమ్ము,
మేలుకొమ్ము.
ఎల్లప్పుడూ మెలకువగా ఉండుము. ఎల్ల ప్పుడూ ఎఱుక కలిగి ఉండుము. నీదైనటు వంటి స్థితిని, నీ స్వస్థితిని, నీయొక్క ఆత్మ
స్థితిని, నీ యొక్క నిరూపణను, నీ యొక్క స్వస్వరూప జ్ఞాన నిర్ణయాన్ని, నీ స్వప్రకాశి త్వాన్ని ఎల్లప్పుడూ నిలుపుకో!
సర్వకాల సర్వావస్థల యందును, సర్వదా శశ్వధా నిలుపుకో! నిలుపుకోఅనేటటువంటి ఉపదేశంగా తస్మాత్‌జాగ్రత్త, జాగ్రత్త,అంటు
న్నాడు. కాబట్టి, అటువంటి ‘అయమస్మి’ అనేటటువంటి లక్ష్యాన్ని తప్పక మానవుడు చేరాలి.ఈ అసిధారా వ్రతాన్ని తానుస్వయం
గా స్వీకరించాలి.
  ఎవరు ఎవరినీ ఏమీ నియమించలేరు.ఎవ రు ఎవరినీ ఒక పరిస్థితికి లొంగేటట్లు చేయ లేరు. తనకుతా లొంగి వచ్చుటయేజ్ఞానము.
తనకుతా అంతర్ముఖత్వమును సాధించు టయే జ్ఞానము. తనుకుతా ఆత్మసాక్షాత్కార జ్ఞానదిశగా, మనోబుద్ధు లను సంయమింప
చేయుటయే జ్ఞానమార్గము.ఇటువంటి జ్ఞాన మార్గంలో బాగా పరిశీలనతో,బాగా అవగా హనతో, బాగా పరిజ్ఞానముతో,బాగా సూక్ష్మ
మైనటువంటి అవగాహనతో,మానవులంద రూ తప్పక నడవాలి.
అందులో ముఖ్యముగా సాధకులైన వారు, తప్పక ఈ మార్గంలో పురోగమించాలి.అట్లా ఎవరైతే ఈ అసిధారా వ్రతాన్ని చేపడుతారో
వాళ్ళు సూక్ష్మాత్మి సూక్ష్మమైనటువంటి ఆత్మ ను దర్శింపగలుగుతారు.బుద్ధి గుహయందు దర్శిస్తా రు.హృదయాకాశం
నందుదర్శిస్తా రు.
   కానీ,ఇది కష్టమైనదని విద్వాంసులు చెబు తూఉంటారు. విద్వాంసులు అంటే ఎదిగిన వారు, పండితులు.ఎవరైతే ఈ ఆత్మవిచార
ణ మార్గంలో ప్రవేశించి, ప్రయాణము చేసి, ఆ అనుభూతిని పొందినటువంటి విద్వాం సులు ఉన్నారో, వారంతా కూడా ఎంత కష్ట
మైనదైనా సాధించవలసినదే. ‘దుర్లభం మానుష దేహం, దుర్లభం త్రయమేవచ’ అని అంటుంది వివేకచూడామణి.
మూడు దుర్లభం. అంటే కష్టసాధ్యమైనప్ప టికీ తప్పక మానవుడు సాధించాలి. కాబట్టి, ‘మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష
సంశ్రయం’ ఈ మూడూ కూడా మానవుడు తప్పక సాధించాలి.
మానవత్వంతో జీవించకపోతే మానవుడవై ప్రయోజనమేముంది?అట్లా గేముముక్షుత్వం లేకుండా జీవిస్తే మానవ జీవితానికి ప్రయో
జనం ఏముంది?
ఈ రెండింటికీ ఆధారభూతమైనటువంటి, సహకారభూతమైనటువంటి, సహకరించే టటువంటి మహాపురుషులను ఆశ్రయించే
టటువంటి, శరణాగతి స్థితి లేకపోతే, మహా పురుషుల సంశ్రయం ఆశీర్వచనం లేకపోయి నట్లయితే,వారి కృపా విశేషాన్ని పొందక
పోతే మానవజన్మ వృధా కదా!కాబట్టి,ఎంత కష్టమైనా సరే, దుర్లభం త్రయమేవచ.ఈ మూడు సృష్టిలో బాగా కష్టసాధ్యములు.
కాబట్టి,తప్పక మానవు లందరూ ప్రయత్నిం చి, ప్రయత్న సాధ్యముగా పొందుదాం..
*Arise, awake and stop not till the desired end is reached. Already everything is opening out before us. Be
bold and fear not. It is only in our scriptures that this adjective is given unto the Lord-Abhih, Abhih.
*ఉత్తిష్ఠత! జాగ్ర్రత!  ప్రాప్యవరాన్నిభోధత! - లెండి,మేల్కొనండి!మీ గమ్యాన్ని చేరేవరకు ఆగకండి -కఠోపనిషత్తు ) ఇప్పటికే మార్గం
సుగమమవ్వటం ప్రారంభించింది. ధైర్యం వహించండి; భయపడకండి,మన గ్రంధాల లో మాత్రమే అభీః అనే విశేషణం భగవంతు నికి
ఆపాదించబడింది.
*It won't do to become impatient - wait wait - patience is bound to give success.*
*అసహనంతో ఒరిగే ప్రయోజనమేమీ లేదు. ఓర్పు వహించండి విజయం మిమ్మల్ని తప్ప క వరిస్తుంది...
💛🌷🌴🌷🌴🌷
              
*ఒక్కొక్క మతానికి ఒక్కొక్కదేవుడు ఉంటా డని మా దేవుడు వేరు అనుకుంటారు కొంద రు. ఒకే దేవుడు ఒక్కొక్క మతంలో
ఒక్కొక్క పేరుతో ధ్యానింప బడుతుంటాడు. మతాలన్నీ వేరు వేరు భాషల వంటివి.అనేక భాషలలోకి అనువదింపబడిన ఒకే గ్రంథము
లాంటిది ఈసృష్టి.దానితాత్పర్యముదేవుడు. అయినప్పటికీ అనేక రూపాలలో అదే దేవు డు దిగి వస్తూ ఉంటాడు‌.
*ఈ సృష్టిలోని జీవరాసుల రూపాలు అన్నీ అవే. ప్రతిజీవి హృదయంలోనూ దేవుడు "నేను" అనే పేరుతో ఉంటాడు.అతనిచుట్టూ
జీవుడు కూడాఅదేపేరుతో ఉంటాడు.జీవుడి దృష్టిలో అనేక మతాలు ఉన్నాయి.అవి శిక్ష ణ పొందే విద్యాలయాల వంటివి ఈ విష
యం తెలియక కొన్ని మతాల వాళ్ళు తమ మతమే గొప్పదిఅనీ,తమ దేవుడు మిగిలిన దేవుళ్ళ కన్నా గొప్పవాడు అనీ తెలియచెప్ప
డానికి ఆదుర్దా పడుతుంటారు.ఈ ఆదుర్దా లో మిగిలిన మతాల వాళ్ళని తిట్టడం,వీల యినంత మందికి తమ మతం ఇప్పించడం
గురించి ఆదుర్దా పడుతూ ఉంటారు.దేవుడి సృష్టిలో ఇది ఒక చిత్రమైన భాగం.
హిందూమతంలో రాముడు,కృష్ణుడు మొద లైన అవతారాలు,ఆంజనేయస్వామి, వినా యకుడు మొదలైన దేవుళ్ళు ఎంత మందో
ఉన్నారనీ,విష్ణువు,శివుడు,అమ్మవారుమొద లైన వివిధ ఆరాధనలు ఉన్నాయని ఇలా ఉండటం ఒక లోపంగా మాట్లా డుతూఉంటా
రు. ఇవిఅన్నీ సర్వాంతర్యామిఅయిన ఒకే దేవుని యొక్క అనేకరూపాలు.సృష్టించే ట ప్పుడు అదే దేవుడు తన‌కుమారుడి రూపం
లో సృష్టికర్తగాదిగివస్తా డు.ఆరూపాన్ని బ్రహ్మ అంటారు.అతడు నాలుగు స్థితులలో దేవు ని వాక్కుగా దిగి వస్తా డు కనుక చతుర్ముఖ
బ్రహ్మ అంటారు. సృష్టిని తనలో లీనం చేసు కునేటప్పుడు పనిచేసే దేవుడికి శివుడు అని పేరు పెట్టా రు‌. సృష్టిలో ఉంటూ సృష్టిని తన
లక్షణాలతో నింపి రక్షించేటప్పుడు అదే దేవు డికి విష్ణుమూర్తి అని పేరు పెట్టా రు‌. తాను తండ్రిగా ఉండి తన శక్తిని తన నుండి వేరు గా
సృష్టిస్తా డు ఆ వేరయిన రూపాన్ని శక్తి అనీ,అమ్మ వారు అనీ అంటారు. అలాగే విఘ్నాలను తొలగించుకొనే శక్తిగా జీవులలో పని చేస్తూ
ఉన్నప్పుడు విఘ్నేశ్వరుడు లేక వినాయకుడు అంటారు‌. కనుక దేవుడు ఒకడే,ఇన్ని రూపాలలో ఆరాధింపబడుతూ ఉంటాడు.
         🧡🌹🌴🌹🌴🌹
*కామంలేని మనసు మాయకు లోబడని స్థితిలో ఉంటుంది...
*సంపూర్ణ అవగాహనసాధించుకున్నమనసు తనకి తానే గురువుగా మార్గదర్శకం చేసు
కుంటుంది.గురువు అంటే గుర్తించేలా చేసే గుణం. మనసుకు సత్యం అర్థమయ్యే కొద్ది గురుతత్త్వం మనలోనే ఇనుమడిస్తూ
ఉంటుంది. అప్పుడు మనసు ప్రకృతి ప్రభా వం చేత దోషప్రవృత్తితో వ్యవహరించి నా, మనసులోని శుద్ధత్వం ,పరిపూర్ణత్వం ఎక్క డికీ
పోవు అని తెలుస్తుంది. నిర్మల చిత్తంతో ఈవిషయం తెలుసుకున్న మనసు, తనకు ఇక దేనితో పనిలేదని తెలిసి కామవిహీనం
అవుతుంది. కామంలేని మనసుఏమాయకు లోబడని స్థితిలో ఉంటుంది.కామానికి, మా యకు లోనుకాని మనసు దోషరహితంగా
పరిణమించి పరిమళిస్తుంది!.
           🌷🌴🌷🌴🌷
*"నిద్రలో ఏ బాధలు ఉండటం లేదు కదా అలా మెలకువలో ఉండటంఎందుకుసాధ్యం కావట్లేదు...?
*మనని తీవ్రంగా బాధించేశారీరకవ్యాధులు, మానసిక వేదనలు, చుట్టూ ఉన్న సామాజిక సమస్యలు, కుటుంబ కలతలు అన్నీ
నిద్రలో మటుమాయం అవుతున్నాయి నిజానికి అవి పోవటం లేదు. మనకు తెలియకుండా పోతున్నాయి అంతే ! తెలియకుండా
పోవ టం అంటే అనిపించకుండా ఉండటమే.ఇలా అనిపించకుండా ఉండే స్థితిని సంపాదిస్తే జీవనం కూడా నిద్రలాగా హాయిగా
గడిచి పోతుంది.నిద్రాలాగా అంటే జీవనం లేకుండా కాదు. ఎవరో మనని అవమానించారు. ఆ విషయం మనకి అనిపించకపోతే అది
నిద్రే !
         💕🌹🌴🌹🌴🌹
*ఇన్నిటి యందు నేను ప్రకృతిగ ఎట్లుంటినో వివరించెదను. ప్రకృతి అనగా నా నుండి నేను వర్తించుట. నీటికి రుచిలేదు.నాలుకకు
రుచిలేదు.నీటియందును,నాలుకయందును నేనున్నాను.నాలుకపై నీరు పడినప్పుడు రుచి, తృప్తి పుట్టు ను.ఇది నా ప్రకృతి సృష్టి.
అట్లే సూర్యుడు తనకు తాను వెలుగుకాదు. చంద్రు డును కాదు.కన్ను తనకుతానుచూపు కాదు. కిరణము చూపుకాదు.కిరణము
కంటిని స్పృశించి నపుడు నేను చూపగుదు ను. గ్రంథములలో, అక్షరములు పదములు కావు. పదములు వాక్యము కావు.వాక్యమం
దు అర్థముండదు.మనస్సునందు అర్థం ఉం డదు. వాక్యము మనస్సునకు సోకినపుడు నేను అర్థముగా పుట్టు చున్నాను.ఇట్లు వేద
ముల యందు అర్థమగు తత్వము నేను. దానిని 'ఓం' అని వ్యవహరింతురు. ఆకాశ ము నందు శబ్ద తరంగములు వినిపింపవు. చెవి
వినదు.తరంగములు చెవికి సోకినపు డు నేను వినబడుచున్నాను.పురుషునిలో పురుషత్వము వలె నేనీ సర్వము నందు ఇమిడి
ఉన్నాను.
*ఇట్లే సుగంధమునేను.సుగంధ,దుర్గంధము లను విడమరచు ప్రజ్ఞ నేను. అగ్ని యందు తేజస్సు నేను. జీవులయందు జీవమునేను.
తపస్సు చేయువాని యందు తపస్సెక్కడ ఉన్నది? కానీ ఉన్నదని తెలియును.తపస్సు నేను. తెలియుట నేను.
*మొలకెత్తు ట,గర్భధారణము అనుశక్తినేను. దీని వలన శాశ్వతుడనైనను నిత్య నూతను డుగ భాసించుచున్నాను. బుద్ధి
మంతులలో బుద్ధి, చురుకయిన వారిలో చురుకుతనము నేను.
          ❣️
చిత్రీకరించడంలో వస్త్రము,బిగువునిచ్చుట,
రేఖాచిత్రము,వర్ణచిత్రము అనే నాలుగు అవ స్థలున్నవి. జగద్రచనలో కూడా అట్లె శుద్ధ బ్రహ్మము(చిత్) అంతర్యామి సూత్రాత్మ విరాట్టు
అను నాలుగు అవస్థలు గలవు.వర్ణ చిత్రమునకు ఆధారమైన వస్త్రము ఇతర ద్రవ్యములతో సంయోగము లేనపుడు శుభ్రముగ
ఉండును.దానినే ధౌత వస్త్ర మంటాము.గంజిపెట్టు ట వలన అది బిగువు పొందును.అది సిరా మొదలగు వానిచే రేఖ లతో లాంఛిత
మగును.ఈ రేఖాచిత్రమున తగినట్లు వర్ణములునింపుట వలన వర్ణ చిత్రము సిద్ధమగుచున్నది.
మాయాకార్యమగు అపంచీకృత భూత కార్యమగు సమిష్టి సూక్ష్మశరీరమును ఉపా ధిగ జేసికొని హిరణ్యగర్భుడు సూత్రాత్మ
అనబడుచున్నది.అట్లే పంచీకృత భూతకా ర్యమగు సమిష్టి స్థూలశరీరము ఉపాధియై నపుడు విరాట్ అనబడుచున్నది.
పరము అనగా పరమాత్మ బ్రహ్మము, స్వరూ పమున శుద్ధచైతన్యము. మాయ-విరహిత మైనది.మాయా-సమన్వితమైన బ్రహ్మము
ఈశ్వరుడు అంతర్యామి అనబడుచున్నది.
ఈశ్వరుడు అందరియందు అంతర్యామియై యున్నాడు.ఆ పరమాత్మ బాహ్యమందును వ్యాపించియున్నాడు.కనుకనే అతని
స్తూల శరీరము సమస్త సమిష్టి ప్రపంచము,అంతర మందును ఉన్నాడు.
కనుక సూక్ష్మశరీరము సమిష్టి సూక్ష్మశరీర మగుచున్నది.అంతరాంతరమున ఉన్నాడు.
అందుచే కారణశరీరము మాయ (మూలా ప్రకృతి అయ్యేను)ఆ పరమాత్మ యొకడే ఆయా ఉపాధులనుబట్టి అనేకముగా
నున్నాడు.
కావున జీవోపాధి ఈశ్వరోపాధిదొలగి చైత న్యమే మిగులుచున్నది.ఇటుల జీవుడే పర బ్రహ్మము.ఈ విషయమును వేదాంత శాస్త్ర
ములు చెప్పుచున్నవి.
రంగులు,రేఖాచిత్రాలు లేనప్పుడు ధౌత వస్త్రము శుభ్రముగానే యుండును.కాని వస్త్రా నికి గంజి పెట్టు టవలనను‌,రంగులు
చిత్రాలవలనను,శుభ్రమైన వస్త్రా నికి బదు లు దానిపై వున్న రంగులు చిత్రాలుమాత్రమే సత్యం అనుకో కూడదు కదా!
బురదతో గూడిన జలము చిల్లగింజ సంబం ధముతో బురదపోయి శుద్ధమగు చున్నదో, ఆలాగునే జీవాత్మయు బ్రహ్మాత్మైక విజ్ఞాన
విచారణచే పరిచ్ఛిన్నత్వాది రూపాజ్ఞానదోష మును తొలగగా నిరావరణ బ్రహ్మమై ప్రకా శించుచున్నది.బ్రహ్మము తప్ప మరేమియూ
లేదు. కోశములుగానీ,ఇంద్రియములుగాని ఏవియు భాసించవు.అన్నియుపరబ్రహ్మము లై యున్నందున బాహ్యవస్తు వులును ఆంత
రిక వస్తు వులును పరమాత్మ స్వరూపములే.
ఆత్మ పరమాత్మమైయున్నందున నిరతిశయ నిరవధికానందమును తనలోనే తాను అను భవించుచున్నాడు.మనోబుద్ధ్యాది సాధన
లేమియు అపేక్షింపపనిలేదు.బ్రహ్మముకన్నా వేరు లేదుగదా
         ❣️🌷🌴🌷🌴🌷
సాత్త్విక, రాజసిక, తామసిక, త్యాగములు మూడు....
(వేదశాస్త్రా దులచే) విధింపబడినట్టికర్మము యొక్క పరిత్యాగము యుక్తముకాదు. అజ్ఞా నముచే అట్టి కర్మమును ఎవడై న విడిచి
పెట్టిన అది తామస త్యాగమే యగును.....
శాస్త్రవిహితమగు కర్మను ఎవరును త్యజిం చరాదు.శాస్త్రములందు విధింపబడు కర్మల న్నియు జీవునియొక్క నైతిక ఆధ్యాత్మిక
సమున్నతికి దోహదము కలుగజేయునవి యే యగుటవలన వాని నెవరును త్యజించ రాదు.అట్లు త్యజించుట అవివేకమే యగు
ను. కనుకనే "మోహాత్” అని యిచట చెప్ప బడినది.
అనగా మోహముచే,అజ్ఞానముచే ఆవరింప బడునపుడు మాత్రమే అట్టి విధ్యుక్త కర్మము ను,ధర్మమును త్యజించు సంకల్పము
జీవు నకు కలుగుచుండునని భావము. కాబట్టి వివేకము నాశ్రయించి అట్టి శాస్త్ర నియత కర్మలను పరిత్యజించక ఆచరించుటయే
శ్రేయస్కరము.సోమరితనముచేగాని,అజ్ఞన ముచేగాని అట్టిదేయగు మఱే కారణముచే గాని వానిని త్యజించినచో అది తామసత్యా
గమే కాగలదు. ఇదివరలో యజ్ఞదానాదుల ను గూర్చి వర్ణించునపుడును,మున్ముందు జ్ఞానము,ధైర్యము మున్నగువానిని చెప్పున
పుడును మొదట సాత్త్వికమైనదానిని,తదు పరి రాజసమైనదానిని,ఆపిమ్మట తామస మైన దానిని చెప్పి,ఈ ఒక్క త్యాగమును
గూర్చి చెప్పునపుడు మాత్రము మొదట తామసమును,తదుపరి రాజసమును,ఆపి మ్మట సాత్త్వికమును చెప్పుట గమనార్హమై
నది. మొట్టమొదటనే తామసత్యాదుల చర్యను ఖండించవలె....
*తామసత్యాగ మెట్టిది....
శాస్త్రవిహితములగు తపోయజ్ఞదానాది కర్మలయొక్క పరిత్యాగము తగదు. అట్టి త్యాగము తామసమనియే చెప్పబడును.
*దేనివలన జనులు నియతకర్మలను త్యజిం చుచుందురు..?అవివేకమువలన,అజ్ఞానం వలన. కాబట్టి శాస్త్రవిహితకర్మలను త్యజిం చు
వారెట్టివారని నిశ్చయించుకొనవచ్చును.
అవివేకులని, మోహవశులని నిశ్చయించు కొనవచ్చును.
           💕🌹🌴🌹🌴🌹
ద్రవ్య యజ్ఞము,తపో యజ్ఞము,యోగయజ్ఞ ము, స్వాధ్యాయజ్ఞానయజ్ఞము.ఈనాలుగు యజ్ఞములు
దృఢవ్రతములుగప్రయత్నించు వారుకూడ దివ్యానుభూతిని పొందగలరు.
ద్రవ్య యజ్ఞము : తనకున్న సమస్త ఒనరుల ను సమర్పణ బుద్ధితో సద్విషయములకు వినియోగించుట ఒక మహత్తరయజ్ఞం.బలి,
శిబి యిత్యాది మహాత్ములు ఈ యజ్ఞము ద్వారా దైవానుగ్రహ పాత్రు లై, శాశ్వతులైరి.
2.తపో యజ్ఞము :
తపస్సు ఎందరినో దైవానుగ్రహ పాత్రు లను గావించినది. తపస్సు మూడు భాగములుగ నున్నది. శారీరక తపస్సు,వాజ్మయతపస్సు,
మనోమయతపస్సు.ఈసోపానములద్వారా మనస్సును దైవమున కర్పించి,స్థిరముగ చే యు తపస్సు వలన దైవమను గ్రహించును.
విశ్వామిత్ర మహర్షి తపస్సునకు పెట్టినది పేరు. ఆ మహర్షి చేసిన తపస్సు అనుపమా నము.ఆయనయందు బ్రహ్మమునుగూర్చిన
తపనయే నిరుపమానమగు తపస్సుగ నడ చినది. దైవమునుగూర్చి తపనలేనిచో తప స్సు కుదరదు.
తపన యున్నవానికి దైవముచే పొందబడు టయే ప్రధానమగుకర్తవ్యమై,యితర వ్యాపా రములను మాని రహస్య ప్రదేశమున తప
స్సు చేయును.కలియుగమున మానవులకు ఇది దుష్కర విషయము. గౌతమ బుద్ధు డీ మార్గముననే కలియుగమున
సిద్ధిపొందెను.
యోగ యజ్ఞము :-యోగమనగా అష్టాంగ యోగమే.ఇది సమగ్రముగ ఏడుసోపానము లతో కూడిన మార్గమిది.ఎనిమిదవది సిద్ధి.
దానిని సమాధి అందురు. కలియుగమున అష్టాంగ యోగమునకు జగద్గురువు మైత్రే యులు అధిపతిగనున్నారు. పరమగురువు
లందించు మార్గము అష్టాంగ యోగమే.
ఇందు యమము, నియమము,ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము ఏడు సోపానములుగ నున్నవి.
దీక్షతో క్రమముగ ఈఏడింటిని అధిగమించు ట సక్రమమగు మార్గము.ఈ మార్గము సక్ర మము కానిచో యోగము సిద్ధించదు.
ఇది యొక యజ్ఞము.
స్వాధ్యాయము :-స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం కూడ దైవసన్నిధికి చేర్చగలదు. వేదములు, శాస్త్రములు,పురాణములు,ఇతిహాసములు
ఇత్యాది వాజ్మయమున రుచికలిగి వాని నధ్యయనము చేసి,వానియందలి అంతరా ర్థములను గ్రహించి,(గ్రహింపలేకున్నచో సద్గు
రువులను సేవించి,పూజించి,వారి అనుగ్రహ ముగ జ్ఞానము ఉపదేశముగ పొంది)అందు అనుష్ఠా నపరమైన విషయములనుఆచరణ
మార్గమున కొనివచ్చితాదాత్మ్యముచెందుట వలన,అజ్ఞానముతొలగిజ్ఞానమునిలుచును. ఈవిధముగ కూడ దైవ సాన్నిధ్యము చేర్చ
వచ్చు...
💘🌴🌷🌴🌷🌴🌷
              
. శ్రీమహావిష్ణువు వరాహమూర్తిగా, భూమిని మూలమ్నుంచీ ఎత్తా డు. ఇక్కడకూడా ఈ పందులు గడ్డికోసం భూమిని త్రవ్వుతూ
ఉంటాయి. గడ్డిమొక్కలకు భూమిలో కాయ లుంటాయి. ఆ కాయలు వాటికి ఆహారం. వీటికోసమని భూమిని సమూలంగా ఛేది
స్తుంది. అది దానిలక్షణం.
శత్రు వృక్షాన్ని సమూలంగా అక్కడనుండి ఎత్తి పారేయాలి అన్నమాట. సమూలంగా ఛేదించాలి. దాని విత్తనంకూడా లేకుండా
నాశనం చేయమని ఆయన ఉద్దేశ్యం. అడే ఆర్యధర్మం.
మన దేశ చరిత్రలో గతంలో అనేకమంది హిందూ మహారాజులు,శత్రు వులు తమచేతి కి చిక్కిన తరువాత వారిని శిక్షించకుండా
క్షమించి, మర్యాదచేసి పంపిన సంఘటనలు అనేకం ఉన్నాయి.అయితే అది ఎంత తెలివి తక్కువపనో, ఆ తరువాత భారతదేశ చరిత్ర
మనకు తెలియజేసింది.అలాచేసి ఆహిందూ రాజులు తమదాక్షిణ్యంబయటపెట్టు కున్నా రు కాని,వారుఅలాచేసిఉండకూడదు. నీ
మనసులో ఉండేటటువంటి కరుణ,విశాల దృష్టి శత్రు వుదృష్టిలో, శత్రు వుహృదయంలో లేకపోతే ఏమవుతావు నువ్వు? కాబట్టి శత్రు
వును ఉపేక్షించడం అనార్యపద్ధతి ‘యుద్ధం చేయక పోవడాన్ని’ మూడు విశేషణాలతో ఖండించాడు.
“నీ శత్రు వుల ప్రసక్తి వచ్చినప్పుడు నువ్వు కోయిలవలే మాట్లా డాలిమధురంగా,నీ వాక్పారుష్యంచేత శత్రు త్వం పెంచవద్దు . యుద్దా నికి
నువ్వు మొదటి కారణంకావద్దు ” అని. రాజు ఎప్పుడూ కూడా జాగ్రత్తలో ఉండాలి.
చతురంగబలాలుఉన్నాయికదాఅని,నిద్రపో కూడదు.తనచుట్టూ అనేకమంది పరివారం ఉన్నది కాబట్టే జాగ్రత్తగాఉండాలి.అందులో
ఎవరిలో ఏవిధమైన మనస్తత్వం ఉంటుందో తెలియదు.నమ్మితేనే మోసంచేయటం కుదు రుతుంది. అందుకని ద్రోహమంటే
నమ్మకద్రో హమనే అర్థం.ఈ ప్రకారంగా మనుష్యులు ఉంటారు. అందుకనే శత్రు పక్షంలో కోయిల వలె
మధురంగామాట్లా డాలి.శత్రు వుల ఎడ ల దయాదాక్షిణ్యాలు ఉండకూడదు.
💗🌹🌴🌹🌴🌹
          
   ఆశయం గొప్పదైతే ఆలోచన పవిత్రమైతే
ఆత్మబలమే ఆయుధమైతే విజయం తప్పక వరిస్తుంది.
ఆత్మీయులతోపంచుకుంటేసంతోషం రెట్టింప వుతుంది. అలాగే విషాదం సగమవుతుంది.
*చిమ్మచీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో..
*మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే ఒక వ్యక్తి మనతో ఉంటే అంతే.....
💘🌹🌴🌹🌴🌹🌴🌹
             
*తాపత్రయం......
*తాపం అంటే దుఃఖం.త్రయంఅంటేమూడు. త్రి విధ దుఃఖాలే తాపత్రయం,తాపాలు మూడు రకాలు....
*1.ఆధ్యాత్మిక తాపం: మనలోని కామ,క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలనే అరిష డ్వర్గాల వలన కలిగే బాధలనే 'ఆధ్యాత్మిక'
తాపాలంటాం.ప్రతి మనిషికి ఉండేబాధల మొత్తంలో 90% ఈవిధంగా ఎవరికివారు కల్పించుకుంటున్న బాధలే !.
*2.ఆది భౌతిక తాపం:ఇతర ప్రాణికోటివలన కలిగే తాపాలని' ఆది భౌతిక తాపా'లంటారు
ఇతరుల అజ్ఞాన,అక్రమచర్యల వలన మన కు కలిగే బాధలు అన్నమాట. ప్రతి మనిషికి 9% బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.
*3.ఆది దైవిక తాపం : ప్రకృతి సహజమైన మార్పుల వలన కలిగే తాపాలని 'ఆది దైవిక తాపాలు' అంటాం.అతివృష్టి, అనావృష్టి,
భూకంపాలు మొదలైనవి. 1% బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.
*తాపత్రయాలు లేని స్థితే ముక్త స్థితి.
*ఆత్మ జ్ఞానం వల్లనే ముక్తి సంప్రాప్తిస్తుంది..
"ఆటలో ఒకరు గెలవాలంటే పోటీదారులం దరినీ ఓడించాలి.కానీ జీవితంలో ఒకరు గెలవాలంటే తోటి వారందరినీ ప్రేమించాలి."
"స్నేహాన్ని చెయ్యడానికి ఒకటికి పది సార్లు ఆలోచించు. ఆ స్నేహాన్ని వ
[12/4, 7:0
*అందరూ అనుకుంటారు భూమి, ఆకాశం ఎప్పటికీ కలవవు అని...కానీ వాళ్ళకు తెలి యదు ఒకటి లేకపొతే రెండవది ఉండదని
కొన్ని బంధాలు కూడా అంతే.. మనుషులే దూరంగా ఉంటారు.మనసులు కాదు..
*మోయలేనంతడబ్బులు సంపాదించేవాళ్ళు పెరిగిపోతున్నారు.చివరికి మనల్ని మోయా ల్సిన నలుగుర్ని సంపాదించుకునే వాళ్ళు
తగ్గిపోతున్నారు...
   బంధాలు వాటంతటవే దూరం కావు,వ్యక్తి త్వం వల్లనో ప్రవర్తనవల్లనో ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వల్లనో అవి దూరమవు
తాయి....
నిజాలు మాట్లా డేవారుఎప్పుడూ ఒంటరిగా మిగిలిపోతారు.నిజాయితీగా ప్రేమించే వారి ప్రేమను ఎప్పుటికిపొందలేరు..ప్రేమించేవారు
ఎప్పుడు కష్టపడుతూనేఉంటారు.కుటుంబం కోసం కష్టపడేవారినీ ఎప్పటికిసుఖపడనివ్వ రు. పదిమంది కోసం పాటుపడేవారు నింద
లపాలు అవుతూనే ఉంటారు..కానీ మనిషి గా మంచివారి మనస్సులలో శాశ్వతంగా ఉంటారు .
    డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళగలదు , అందులో ఎటువంటిఅనుమానంలేదు,కానీ! మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బునితీసుకెళ్ళ
లేడు. ఇందులోను ఎంటువంటి అనుమానం లేదు! ఐనా మనిషి ఆకలికోసం చేసే పోరా టం కన్నా పైసలు కోసం చేసే పోరాటమే
ఎక్కువైంది.ఇది పచ్చి నిజం...
    ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతా
యి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తా యి. అందుకే గతం మరిచిపోవద్దు ...
   సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనషుల విలువలను కూడాసంపాదించాలి కష్టా ల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెకించే వారి
ని సంపాదించాలి భాదల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి...
మన మనసుకి హత్తు కునేలా మాట్లా డేవారు కొందరు,మన మనసు నొచ్చుకునేలామాట్లా డే వారు మరికొందరు మనతో మనస్ఫూర్తి
గా మాట్లా డేవారు ఇంకొందరు మన అందరి మధ్యసాగే జీవన ప్రయాణమే జీవితం..
  దైర్యం అంటే ఎవరో నీకు తోడు వున్నానని చెప్పడం కాదు ! ఎవరు లేకున్న నాకు నేను వున్నానని చెప్పుకోవడమే అసలైనా దైర్యం.
ఈ రోజుల్లో మోయలేనంత డబ్బులుసంపా దించే వాళ్ళు పెరిగిపోతున్నారు కానీ ! చివ రికి మనల్ని మోయల్సిన నలుగుర్ని సంపా
దించుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు.
మనం దేనినైనా పోగొట్టు కోవడం చాలా సులువు కానీ ! దానిని సంపాదించడమే చాలా కష్టం. అది సంపద అయినా ప్రేమ అయినా
స్నేహమైనా నమ్మకమైనా ...
  మనచేతిలో ఏదిఉండదు,ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు,ఒంటరితనాన్ని నవ్వు తూ జయించు నీకున్న కష్టా లను ఆనందం
గా ఓడించు ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కుచెదరని స్థా నాన్ని సంపాదించు.
💘🌹🌴🌹🌴🌹
       
*ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా......
బయట వినిపించే మాటల్లో ఇదొకటి.కుటుం బసభ్యులు ఎవరైనా మరణిస్తే,ఏడాది వరకు ఎటువంటి పూజలుచేయకూడదని
ప్రచారం చేస్తు న్నారు. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు,దేవతలందరినిఒకబట్టలోచుట్టి, అటక
మీదపెట్టేస్తా రు.సంవత్సరీకాలన్నీ అయిపోయిన తర్వాత మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి, శుభ్రం చేసి పూజ
చేస్తా రు.అంటే ఆ వ్యక్తి మరణిం చిన ఇంట్లో ఏడాదిపాటు దీపారాధాన,దైవా నికి పూజ,నివేదన ఉండవన్నమాట....ఇది సరైన పద్ధతి
కాదు.శాస్త్రం ఇలా చెప్పలేదు..
*దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం...
దీపం శుభానికి సంకేతం.దీపం ఎక్కడ వెలి గిస్తే అక్కడకు దేవతలు వస్తా రు.ప్రతి ఇంట్లో ను నిత్యం దీపారాధాన అనేది జరగాలి.
మరణం సంభవించిన ఇంట్లో 11వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది.12 వ రోజు శుభస్వీకారం జరుగుతుంది.ఆ
కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యే కంగా పూజ చేయకూడదు.అంతవరకే శా స్త్రంలో చెప్పబడింది.అంతేకానీఏడాదిపాటు
దీపం వెలిగించకూడదని,పూజలు చేయకూ డదని చెప్పలేదు.నిజానికి సూతకంలో ఉన్న సమయంలోకూడా సంధ్యావందనం చేయా
లని,అర్ఘ్యప్రధానం వరకుబాహ్యంలో చేసి, మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది.ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళ
కూడదని కూడా చెప్పలేదు. మనం నిత్యం ఇంతకముందు ఏదైతే చేస్తు న్నామో, అది నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. కొత్త
పూజలు అనేవి ప్రారంభించకూడదు.ఇంతక ముందు రోజూ ఆలయానికి వెళ్తుంటే, సూ తకం అయిన తర్వాత కూడా యధా విధిగా
ఆలయదర్శనం చేయవచ్చు.మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్ర పటాల్లో దేవతలువచ్చి కూర్చుంటారు. అలా
ఏడాది పాటు వారికి ధూప,దీప,నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా,బట్టలో చుట్టి పక్కన పెట్టడమే తప్పు.అది దోషము,
అరిష్టము కూడా. కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి. ఇంటికి గానీ,ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి
దోషాలున్నా, వాటిని అన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది. కనుక ఎన్నడూ దైవారాధన,దీపారాధన మానకూ
డదు. ఈ విషయంలో పూజలు చేయవచ్చు అనే కంటే చేసి తీరాలి అని చెప్పడం సరైన సమా ధనం అవుతుందేమో.....     
🖤🌴💗
           
తెలిసికొన వలసిన ఆత్మతత్వము అతి సూక్ష్మమగుటచేత సద్గురువుల నాశ్రయించి, వారి బోధలచేత అజ్ఞానమును పోగొట్టు కొని,
నిరంతర ప్రయత్నముచేత,మనస్సును బాహ్యవిషయముల నుండి మరల్చి,పరిశు ద్ధమైన సూక్ష్మబుద్ధితో,ఆత్మ సందర్శనము నకు
ప్రయత్నించవలెను.
   బాహ్య విషయములందు ప్రవర్తించు మన స్సును, ఆత్మాభిముఖము చేయుట ఎంత కష్టమో, అసిధారా వ్రతముతో పోల్చి చెప్ప
బడినది..ఏది ఏమైనప్పటికీ తప్పక బాహ్య విషయములనుండి మనస్సునుమరల్చాలి. అంతర్ముఖత్వము వైపు నడపాలి.అయితే
ఆశ్రయించినటువంటి మహనీయులు ఆత్మ జ్ఞానములో మునిగిఉన్నారా,లేదా? ఆత్మ నిష్ఠు లై ఉన్నారా? లేదా?అనేటటువంటి పరి
స్థితిని గమనించుకోవలసినటువంటి అవస రం ఉంది.తనకే స్వానుభవం అయినటువం టి, స్వానుభవ ప్రమాణ నిర్ణయమైనటువం టి
ఆత్మానుభూతి కనుక లేకపోయినట్లయి తే, కేవల శాస్త్రజ్ఞాన పరిధిలోనే నీకుబోధించ ప్రయత్నిస్తు న్నట్లయితే,ఎవరూ కూడా దాని ని
అందుకోజాలరు.కాబట్టి,మహానుభావుల ను,సద్గురువులను ఆశ్రయించి,వారి బోధల చేత అజ్ఞానమును పోగొట్టు కోవాలి.నిరంత
రాయముగా నువ్వు సద్గురు ఆశ్రయంలో ఉన్నంత సేపూ కూడా నీలోపలగల సందేహా లని పోగొట్టు కోవడం,నీ లోపల అజ్ఞానయు
తమైన భావనల నుండీ విముక్తమవ్వడం, నిర్ణయం తీసుకో లేకుండా మిగిలిపోయిన టువంటి,అంతర్ముఖ ప్రయాణానికి సంబం
ధించినటువంటి అంశాలను కూలంకషంగా తెలుసుకోవడంఇలాంటి ప్రయత్నాన్ని చేయాలి.
అంతేగాని,సద్గురుని వ్యావహారిక జీవితాన్ని కనుక మనముఉపయోగించుకున్నట్లయితే, ఈ అంతర్ముఖ
ప్రయాణముకుంటుపడుతూ ఉంటుంది.
ఏవండీ! మా అబ్బాయిని విదేశాలకు పంప మంటారా? వద్దంటారా? నన్ను ఇల్లు కట్ట మంటారా? కట్ట వద్దంటారా? ఏమండీ!నన్ను
బండి కొనమంటారా? కొనొద్దంటారా? ఏమండీ! నన్ను భోజనం చేయమంటారా? చేయవద్దంటారా? ఇలాంటి విషయాలు అడి
గారనుకోండి, ఏం చెబుతారు? కాబట్టి, ఈ బాహ్య విషయ పరిజ్ఞానానికి ఆత్మ నిష్ఠు లు అయినటువంటివారు ఉపయోగపడరు.
   కానీ,వాళ్ళు అంతర్ముఖ ప్రయాణానికి, సాధన విశేషానికి సంబంధించి, మనస్సుని సంయమించేటటువంటి స్థితి గురించి,
స్వభావాన్ని గెలిచేటటువంటి స్థితి గురించి, స్వాత్మనిష్ఠను పొందేటటువంటి స్థితిని గురించి, ప్రశ్నించినప్పడు వాళ్ళు మహదా నంద
పడిపోయి,ఆ రకమైన సాధనా మార్గ ములో పురోగతిలో ఉన్నటువంటి విషయా లను గురించి, పురోగతిలో ఉన్నటువంటి అంశాల
గురించి నీకు చక్కగా వివరిస్తా రు.
అంతేగాక, స్వానుభవ ప్రమాణం ఉన్నటు వంటి ఆత్మనిష్ఠు లైతే, ఆ స్థితి నుంచీ నీకు ఉద్ధరణకు సహాయం కూడా చేస్తా రు.
        కాబట్టి, సహాయం ఎవరికి చేస్తా రు? అనేది చాలా ముఖ్యం. అందరికి సహాయం చేస్తా రనుకోవడం భ్రాంతి.అందరికీ సహాయం
చేయరు. ఎవరికి చేస్తా రు?
ప్రధానంగా ఎవరైతే మనః సంయమనం చే యడానికి సిద్ధపడ్డా రో,ఈ జన్మలోనే సాధకు లుగా వారు పురోగమనంచెంది,సచ్ఛిష్యులు
గా మారి,అధికారులుగా మారి,జ్ఞానబలాన్ని పొందగలిగేటటువంటి అవకాశం ఉన్నదో, వాళ్ళకి మాత్రమే సహాయంచేస్తా రు. జ్ఞాన
పూర్వకసహాయం వాళ్ళకుమాత్రమేచేస్తా రు.
మిగిలిన వాళ్ళతో కూడా వ్యవహరిస్తూ ఉంటారు కానీ,అది విషయపూర్వకమైనటు వంటి వ్యవహారం.ఎక్కడికక్కడ ఉత్తమమైన
మార్గంలో నిన్ను ప్రవేశపెట్టే ప్రయత్నంచేస్తూ ఉంటారు. నిన్ను ఆ రకమైనటువంటి జ్ఞాన మార్గంవైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తూ
ఉంటారు.
కానీ సరియైనటువంటి సహాయం,సరియైన టువంటి నిర్ణయం,సరియైనటువంటి సమర్థ త పొందగలిగేటటువంటి
అధికారికిమాత్రం, సద్గురువు సాక్షాత్తు ఈశ్వరుడే! ఈశ్వరాను గ్రహమన్నా సద్గురుని కృపన్నా రెండింటికి అభేదం.
  అలాంటి ఆశ్రయాన్ని సాధిస్తే నీవుసుఖంగా జీవించవచ్చు.ఇక నిశ్చింతగా జీవించవచ్చు. ఎందుకని? ‘నీ భారమతడే మోశాడు రా
ఓ మానవుడా హరి నామము మరువ వద్దు రా’ - ఏ సాధన అయినా జీవితకాల సాధనలు గా స్వీకరించాలి.
ఏ సాధనల్ని అయినా,ఏ నియమాల్ని అయి నా ఏ రకమైనటువంటి ప్రయత్నాల నైనా కూడా నిత్యం చేయాలి. నిరంతరాయంగా
చేయాలి. 24 గంటలు చేయాలి.అదే జీవి తంగా జీవించాలి.
తీవ్రమోక్షేచ్ఛ కలిగిన వాడవై ఉండాలి. తీవ్ర వైరాగ్యం కలిగిన వాడవై ఉండాలి. చతుర్వి ధ శుశ్రూషలను ఆంతరంగికంగా చేయగలగి న
సమర్ధు డవై ఉండాలి.ఆ రకమైనటువంటి సచ్ఛిష్యుడు గురువుకి ప్రేమాస్పదుడై నటు వంటి వాడు.
గురువు యొక్క చైతన్యాన్ని అందిపుచ్చుకో గలిగేటటువంటి సమర్థు డై నటువంటివాడు. కాబట్టి,అటువంటి సచ్ఛిష్యపదవికి సాధకు
లు అందరూ కూడా తప్పక ప్రయత్నించాలి..
*Goodness is our nature, purity is our nature, and that nature can never be destroyed.
*మంచితనం మనసహజస్వభావం,పవిత్రత మన సహజస్వభావం. ఆ స్వభావం నశింపబడదు...
*The idea of true Shraddha must be brought back once more to us, the faith in our own selves must be
reawakened, and, then only, all the problems which face our country will gradually be solved by
ourselves.*
*'శ్రద్ధ' అనే ఆదర్శాన్ని మరలా మనలోతీసు కురావాలి. ఆత్మవిశ్వాసం పునః జాగృతం కావాలి. అప్పుడు మాత్రమే మన దేశం
ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ క్రమంగా మనమే పరిష్కరించుకోగలం.
💛🌷🌴🌷🌴🌷
         
*6 వ రుద్రు డు : ఋతధ్వజుడు -సర్పిస్సు.*
*శుక్రధాతువు మనలో ఏర్పడడానికి ఈ రుద్రు డు పనిచేస్తా డు. శుక్రధాతువు చక్కగా నిర్మాణమవడానికి, ప్రజోత్పత్తికి  ఈ రుద్రు డే
కారణము.*
*భావన లో నుంచి అగ్ని ఆధారముగా చిన్న చిన్న పామురూపాలలో పురుషుడిలో  దిగి వస్తుంది.శుక్రా న్ని తయారుచేసి,శుక్రములో
జీవులను పుట్టించే శక్తి ఈ రుద్రు డిస్తా డు.
*7వ రుద్రు డు :  ఉరుడు - ఇలా
*పట్టి ఉంచే తత్త్వము. ఏర్పడిన శుక్రమును స్త్రీ యందు ప్రవేశపెట్టి, గర్భధారణ ఏర్పడ డానికి కృషి చేస్తా డు. సృష్టిలో జీవులు ఏర్ప
డాలంటే ఈ రుద్రు డు పనిచేయాలి. లేకపోతే సృష్టి ఉండదు. ఏర్పడిన గర్భము నిలవాల న్నా శివానుగ్రహముండాలి. కాబట్టి జీవుల
పుట్టు క అంతా కూడా రుద్రశక్తి వలన జరుగు తుంది. ఈ జ్ఞానము తెలుసుకొని మనము ఎంతో కృతజ్ఞతా భావనతో ఉండాలి.
🧡
          
*"అనుకోవటాలు, భావాలు లేకుండా జీవనం కొనసాగలేదుకదా !?"
*నేను అబ్బాయిని-అమ్మాయిని,నేను ఉద్యో గిని-నిరుద్యోగిని,నేను భక్తు డిని- నాస్తికుడిని ఇలా అనుకునేవాన్నీ భావాలే.
అనుకోకపో తే జీవనం ఎట్లా అనేది సంశయం.పసివయ సులో పిల్లలకు తాము ఆడ,మగ అనభావం ఉండదు.అయినా వాడికి
జీవనంఉంటుంది. మల్లెచెట్టు వద్దకు వెళ్ళి ఇది మల్లెపూలచెట్టు అనుకుంటేనే అది గుబాళిస్తుందా ? అలా అనుకోకపోతే మనకు ఆ
పరిమళం అంద కుండా ఉంటుందా!.సినిమా చూస్తు న్నంత సేపు మనసు అనేక ఆలోచనలతోసాగుతుం ది కానీదానికి భావం
ఉండదు. ఒక్క సినిమా విషయంలోనే కాదు ఏ అనుభవంలోనైనా అనుభవసమయంలోభావంఉండదు.భావం వచ్చిన తర్వాత
అనుభవంఉండదు.శాంతి మన శాశ్వతమైనఆస్థి.కానీ మనలో ఏర్పడు తున్న భావాలే దానిని భంగపరుస్తు న్నాయి.!
💙🌷🌴🌷🌴🌷
          
*వ్యవహారిక సత్యంలో "నేను" భావంఎంత అవసరమో... మానసికంగా సత్యానుభవా నికి అది అంత అవరోధం !
*కామంలేని మనసుకు సంకల్పాలు,వికల్పా లు ఉండవు.సంకల్ప,వికాల్పాలు లేని మన సు తానే సదా శివంగా ఉంటుంది.నిర్మలమై
న తురీయానుభూతిలో విహరిస్తోంది.నేను, నాది అనే అహంకారమే మనిషిని జనన, మరణ,సంసారచక్రంలో బంధిస్తుంది. వ్యవ
హారిక సత్యంలో "నేను" భావం ఎంత అవ సరమో మానసికంగా అది సత్యానుభవాని కి అంత అవరోధం.అందుకే నేను,నాది అనే
భావన పరిధి తెలుసుకొని మసలుకుంటే అవి ఆధ్యాత్మిక మార్గానికి అడ్డు రాకుండా ఉంటాయి !.
💘🌹🌴🌹🌴🌹
       
బ్రహ్మ విష్ణువు మొదలగు శ్రేష్ఠములైన చిత్ర ములు,నీరు తృణములు మొదలగు సామా న్య చిత్రములుఉన్నట్లే శుద్ధబ్రహ్మము నందు
ను బ్రహ్మాది దేవతలు గడ్డి,గరికవంటి సామా న్య ద్రవ్యములు ఆరోపింపబడు చున్నది. బ్రహ్మ మొదలు గరికవరకు చేతనాత్మకము
ఉత్తమము.పర్వతములు నదులు మొదల గునవి జడాత్మమకములు,అధమములు.
మనుష్యులకు మరల వివిధములగు వస్త్ర ములు, చిత్రమునకు ఆధారమైన వస్త్రము వంటివే,కల్పింపబడును.ఆ కల్పిత వస్త్రము లు
వస్త్రా భాసలు.ఒక్కసారి పరిమితి నెల కొన్నచో పిదప ఇతర పరిణామములు దాని వెంట సంభవించును.అవి భౌతిక, మానసిక
వ్యాధులు.సముద్రముపై భాగమున తరంగ ములు ఆవిర్భవించి పిదప బుడగలు మొద లగు వానిని సృజించును.
పటచిత్రమునందు భగవంతునివంటి శ్రేష్ఠమై న చిత్రములు,తరువాత వివిధ రకములైన సామాన్యచిత్రములు కూడా ఉంటాయి.
మానవుల చిత్రములు,అందులోని మానవ బొమ్మలకు వస్త్రములు,ఆ వస్త్రములకు మళ్ళీ వివిధములైన రంగులును,అలంకర ణకు
ఆభరణములు ఇలా ప్రతిది కల్పననే. ఆకల్పితములన్నిఅభాసలు. అలాగే శుద్ధ బ్రహ్మమునందుకూడాబ్రహ్మాదిదేవతలనుండి
గడ్డి,గరికవంటి సామాన్య ద్రవ్యముల వరకు ఆరోపింపబడుచున్నవి.ఇందులో చేతనాలు (ఉత్తమమైనవి), జడాలు (అధమములు)
వరకు ఉన్నవి.
శుద్ధ చైతన్యము కేవలచైతన్యమయము, జ్ఞేయవిషయరహితము,సర్వవ్యపియునగు చిదాత్మ స్వచ్ఛము,దాని వెలుగులో సర్వ జీవులు
తమ నిజాత్మను తెలిసికొందురు.
మనస్సుగా,బుద్ధిగా,ఇంద్రియములుగా,అట్టి ఇతర సర్వభావనలుగా తన స్వరూపము నిషేధింపబడిన (తిరస్కరింపబడిన) పిదప
శుద్ధ చైతన్యమయిన బ్రహ్మము నేను అని తెలియవలెను.
బ్రహ్మము ఏకముకావున ద్వితీయత్వాదు లు ఎచటనుంచి వచ్చును.అవిద్యా కల్పిత మైన వ్యవహారంలో బ్రహ్మ పరిణామం ఎన్నో
రూపాలలో కనబడవచ్చు. కానీ పారమార్థక రూపంలో బ్రహ్మమొక్కటే.నామరూపాలు లేవు. నీ ఆత్మయే పరబ్రహ్మ అని తెలుసు
కోవటం వల్ల మోక్ష ఫలసిద్ధి కలుగుతుందని పరిణామ శ్రు తి బోధిస్తు న్నది...
🌷🌴🌷🌴🌷
          
*బలవంతులలో బలము పట్టు దలతో కలు షితమై ఉండును.తీవ్ర రాగ ద్వేషములతో ఉండును. ఈ దోషములను దమింప గల
బలము నేను. సృష్టి సంకల్పము కామము గా వ్యక్తమగుచున్నది.అందు పశు ప్రయత్న ము, అపరిశుద్ధి కలుషములుగ ఉండును.
వానిని దమించి మానవుడు దాంపత్య కామమును సాధించుకొన గలుగుట ప్రత్య క్షమే కదా! అట్టి ధర్మబద్ధ కామము నేను. కనుకనే
కలుషములుజయింపబడుచున్నవి.
*ఎవరెవరిలో సత్వ రజ స్తమస్సుల భావ ములు పొటమరించుచున్నవో వారి యందు అవి నా నుండియే కానీ వానిలో నేనులేను.
అవి నాయందున్నవి. కనుకనే అవి నన్ను అంటవు.కుండలో మట్టిఉన్నట్లు భ్రమ కలు గును. అచ్చట మట్టి తప్ప, కుండయను
పదార్థమేమియులేదు.ఆకారమును కుండ అందుము. మట్టియందు ఆకారమున్నది కాని ఆకారము నందు మట్టి నిలబడ లేదు
కదా! అట్లే నా యందు ఈ ప్రకృతులున్నవి గాని వానియందు నేను లేను.
*మూడు గుణముల నూలు పోగుల అల్లిక వలె సృష్టి ఉన్నది.దారముతో అల్లిన రుమా లుపై బొమ్మలున్నచో బొమ్మలు జ్ఞప్తి ఉండి
దారము మరుపునకు వచ్చును. ఈ మరు పును మోహమందురు.జీవులు త్రిగుణమ యము అయిన సృష్టియందు మోహితులై
దానికి అతీతుడగునన్ను మరచు చున్నారు.
💚🌹🌴🌹🌴🌹
        
ఎవడు శరీరప్రయాసవలని భయముచేత దుఃఖమును గలుగజేయునది యనియే తలంచి విధ్యుక్తకర్మమును విడిచిపెట్టు నో,
అట్టివాడు రాజసత్యాగమును గావించిన వాడై త్యాగఫలంను బొందకయేయుండును.
తామస త్యాగి అజ్ఞానమువలన విధ్యుక్త కర్మలను వదలుచున్నాడు.రాజసత్యాగియో ఆ కర్మచేయుట ప్రయాసమని తలంచి దాని ని
వదలివేయుచున్నాడు.అనగా సోమరిత నము వహించుచున్నాడని అర్థము.ఉత్తమ సుఖమును గలుగజేయుక్రియలు సామాన్య
ముగ ప్రారంభములో కష్టముగా తోచును. కాని తుదకు అనంతసుఖమునేకల్గించును.
కాని రాజసత్యాగి ప్రారంభమున తోచు కష్ట మునకు బెదరిపోయి,సోమరితనముచే ఏ మాత్రము శ్రమించక,ఆ కర్మలనేవదలి వైచు
చున్నాడు. బ్రహ్మముహూర్తమున లేచుట, శీతలోదకముచే స్నానముచేయుట, బ్రహ్మ చర్యమును పాలించుట మున్నగు క్రియలు
పారంభములో కష్టముగా తోచవచ్చును. కాని అవియే తుదకు మహదానందమును కలుగజేయును. కాని రాజసత్యాగి (బద్ధక ము
వలన) వానిని చేయుటకు నిచ్ఛగింపక వదలిపెట్టు చున్నాడు.అట్టివానికి త్యాగము యొక్క ఫలమేమియు లభించుట లేదు
ఏలననగా త్యాగమనగాసంగత్యాగమే కాని కర్మత్యాగముకాదు.వారో,కర్మలనే త్యజించి వైచుచున్నారు.ఈ ప్రకారముగ తామసుడు,
రాజసుడు వేర్వేఱు కారణములచే విధ్యుక్త కర్మలను త్యజించివైచుచు తత్ఫలములను పొందకున్నారు.
*రాజసత్యాగముయొక్క లక్షణమేమి......
కార్యము కష్టమని తలంచి (సోమరితన ముచే) దానిని వదలివేయుట రాజస త్యాగ మనుబడును.
*దానివలన అతనికి కలుగు నష్టమేమి....*
అతడు త్యాగఫల మిసుమంతేని పొందకుండును.
💕🌷🌴🌷🌴🌷
         
ప్రాణాయామ మనగా ప్రాణము యమింప బడుట.ప్రాణము యమింపబడుటకు శ్వాస నిబద్ధము కావలెను.శ్వాసను క్రమబద్ధముగ
నిర్వర్తించుటకు మనసును శ్వాసపైలగ్నము చేయవలెను.ఉచ్ఛ్వాసతో అంతర్ముఖ మగు ట, నిశ్వాసతో బహిర్ముఖమగుట జరుగుచు
న్న సందర్భములో తనప్రజ్ఞను మించిన ప్రజ్ఞ యేదియో తనయందీ శ్వాస యజ్ఞమును నిర్వర్తించుచున్నట్లు ......
ప్రాణాయామ యజ్ఞము...అర్హతలేని ప్రాణా యామ యజ్ఞము అనర్థములకుదారితీయు ను. అష్టాంగ యోగమున
ప్రాణాయామము 4,వఅంగము.అహింస,సత్యము,బ్రహ్మచర్య ము,ఇతరులసంపదను తెలివితో దొంగిలిం చకుండుట,ఉచితముగ
ఇతరులవద్ద బహు మానములను,ఉపకారములను పొందకుం డుట అనునవి ఐదు నియమములు.
బాహ్యమునను, అంతరమునను శుచిగా నుండుట అనునవి. మరి రెండు నియమ ములు. ఈ ఏడు నియమములను శ్రద్ధతో
దీర్ఘకాలము ఆచరించినవారే సహజమగు సంతోషము గలవారై యుందురు.ఇట్టివారికి సంతోషముగ నుండుటకు కారణమక్కర
లేదు. ఇట్టి మనస్సు కలవారు పై తెలిపిన ఏడు నియమములను పాటించి,సంతోషం ను చేరుట ఎనిమిదవమెట్టు . అట్టి వారు
చేయవలసి నది శాస్త్రా ధ్యయనము.
పై నియమములను పాటింపని వారు శాస్త్ర ములను అధ్యయనము చేసినచో మిడి మిడి జ్ఞానులగుదురు.తెలిసీ తెలియని
మూర్ఖులగుదురు.వీరికి అభివృద్ధి కుంటు పడును. వీరిననుసరించిన వారి అభివృద్ధి కూడ కుంటుపడును. భారతీయ సంప్రదా
యమున అధ్యయనమునకు పై అర్హతలు తప్పనిసరి.
పై నియమములను పాటించిన వారి మేథ స్సు, శాస్త్రములను సరిగ అవగాహన చేసు కొనగలదు. అందులకే చదివిన వారందరు
పండితులు కారు.చదువులు వేరు,విద్యలు వేరు. పై నియమములను పాటించు వారికి శాస్త్రా ధ్యయనము,సమస్తము నందును
ఈశ్వరుని దర్శనము చేయుప్రయత్నమును రెండు నియమములుగ అష్టాంగ యోగము తెలుపుచున్నది.ఇట్టి వారికే స్థిరము,సుఖం
అగు మనస్సు ఏర్పడును....
అదే విషయమును దైవము భగవద్గీత యం దు ప్రాణాయామమునకు ముందు తెలిపిన యజ్ఞములలో పేర్కొనినాడు. ద్రవ్యయజ్ఞం
ఇంద్రియయజ్ఞము, మనోయజ్ఞము,బ్రహ్మ యజ్ఞము- పై తెలిపిన నియమములకు సంబంధించిన యజ్ఞములే. ఎనిమిది యజ్ఞ
ములు తెలిపిన భగవానుడు,9,వ యజ్ఞంగ ప్రాణాయామము తెలుపుచున్నాడు.అట్లే మూడు అంగములలో పదకొండు నియమ
ములను పాటించిన వారికే ప్రాణాయామం అని తెలిపెను.
ప్రాణాయామము రాజయోగ మార్గమున జరుగునదే కాని చేయునది కాదు.ఈ హెచ్చ రికను పాఠకులు గుర్తించి తరువాత అంశ
మును పఠించవలెను. ప్రాణాయామ మన గా ప్రాణము యమింపబడుట. ప్రాణము
యమింపబడుటకు శ్వాస నిబద్ధము కావ లెను. శ్వాస నిబద్ధమగుటకు క్రమబద్ధముగ శ్వాసను పీల్చుట, వదలుటచేయవలెను.
శ్వాసను క్రమబద్ధముగ నిర్వర్తించుటకు మనసును శ్వాసపై లగ్నము చేయవలెను. ఉచ్ఛ్వాసతో పాటు మనసు అంతర్ముఖము గ
పయనించి ఉచ్ఛ్వాసకొసకు చేరవలెను.
ఉచ్ఛ్వాసకొసన నిశ్వాస ప్రారంభమగును. నిశ్వాసను మరల అనుసరించుచు మనసు నిశ్వాస కొసను చేరవలెను.మనసుశ్వాసతో
లగ్నమై యుండునట్లు పై విధముగ అభ్యా సము చేయవలెను.ఈ అభ్యాసము సిద్ధించి నచో మనసు పరిపరి విధములపోక శ్వాస కు
కట్టు బడి యుండును. ఇట్లు అనేకానేక భావముల నుండి మనసు ఏక భావము నకు చేరును. అపుడు మనసు భావము కూడ
శ్వాసను గూర్చియే యుండును.
ఉచ్ఛ్వాసతో అంతర్ముఖ మగుట, నిశ్వాస తో బహిర్ముఖమగుట జరుగుచున్న సందర్భ ములో మనసు యొక్క సహజ లక్షణమైన
కుతూహలము ఉచ్ఛ్వాస,నిశ్వాసలు ఎట్లు జరుగుచున్నవో గమనించును.తాను చేయ క తనయందు అవి జరుగుచున్నట్లు గ గుర్తిం
చును. అనగా తన ప్రజ్ఞను మించిన ప్రజ్ఞ యేదియో తనయందీ శ్వాస యజ్ఞమును నిర్వర్తించుచున్నట్లు తెలియును.
తనయందు తనకు తెలియని ప్రజ్ఞ యొకటి యున్నదని తెలియును.అది తనకుమించిన ప్రజ్ఞయని తెలియును.తానుగ చేయకున్న
ను, తన యందు జరుగు శ్వాస, జరుగుట అను మరియొక స్థితిని తెలియచేయును.
తాను చేయువాడు, తనయందు జరుపు వాడుగ మరియొక ప్రజ్ఞ తనయందు గోచ రించును. ఈ చేయుటకు ఆ జరుగుట ఆధా
రమని కూడ తెలియును. జరుగుట, చేయు ట యొక్క వ్యత్యాసములు తెలియును. పనులు జరుగునని తెలియును. చేయుట
జరుగుటలో భాగమని తెలియును.
❣️🌴❣️
           
బహు ఉత్తమమయిన ధర్మం అనుత్తమమై నటువంటి కార్యంలో నిర్వహించబడటం మన దేశంలో జరుగుతోంది. A great
principle wrongly applied అని దీనిని అనవచ్చు. ఈశ్వరుడిని చేరుకోవటానికి అహింస పనికివస్తుంది.కాని లోకపాలనకోస
మని అహింస అనేది పనికిరాదు. అందుకే, “అనార్యజుష్టం, అస్వర్గం, అకీర్తికరం”
శత్రు వులు దండెత్తి వస్తు న్నారంటే రాజు మేరుపర్వతంవలె నిశ్చలంగా గంభీరంగా ఉండాలట. రాజులో కలవరం ఏమీ కనబడ
కూడదు. “అలాగా! శత్రు వులు వస్తు న్నారా! రానియ్యండి. ఏమీ ఫరవాలేదు ధైర్యంగా ఎదుర్కొందాము!”అని దైర్యంగా కనబడాలి.
తనను నమ్ముకున్నవాళ్ళందరికీ రాజు ధైర్య స్థు డిగా కనబడాలి. ఎంత ఉపద్రవం వచ్చిన ప్పటికీ మేరువువలె ధైర్యంగా ఉండాలి.
“ప్రభువు శూన్యగృహంవలె ఉండాలి”
  అంటే,సంపదల విషయంలో శూన్యగృహం లాగా ఉండాలి. శూన్యగృహాలు ఎప్పుడూ కూడా సంపదలు ఎన్నైనా తీసుకు రమ్మని
ఆహ్వానిస్తు న్నట్లు ఉంటాయి.ఇంకా తీసుకు రా! నవనిధులున్నాయా అని అంటాము. అందుకనే రాజు, శూన్యగృహంవలె, ఎంత
సంపద వచ్చినప్పటికీ తీసుకునేటట్లు ఉండాలట
ఆర్యధర్మంలో చాలా గొప్పసూత్రాలు,ఆధ ర్శాలు ఉన్నాయి.కానీ వాటికి సముచితమై నస్థా నాలున్నాయి.సముచితమైన,సందర్భో
చితమైన కాలాలు కూడాఉన్నయి.ఆ ప్రకా రంగా రాజు నటుడిలాగాఉండాలని భరద్వా జుడు రాజధర్మం చెప్పాడు.అనేక అవతా
రాలతో ఉండాలన్నాడు.
అనేక అవతారలక్షణాలు కలిగి ఉండడమం టే – రాజు వద్దకు అనేకులు వస్తా రు. పండి తులొస్తా రు.గోష్ఠి చేస్తా రు. కవులు కవిత్వం
చెప్తా రు.ఒకరు బ్రహ్మసూత్ర భాష్యం చెప్పవ చ్చు.మరొకనాడు ఎవరైనాస్వాముల వారు వస్తా రు. వారి బోధకూడా వినవచ్చు. అయి తే
అది తనకే, తన జీవలక్షణంలో,తన ఆత్మ యొక్క ఔన్నత్యం కోసం మాత్రమే పనికొచ్చే విషయం అది.
అంతేకాని Administration లోకి తీసుకెళ్ళే Subject కాదు అది. It is purely personal. Highly Personal. Exclusively
Personal. ప్రాపంచిక విష యాలలో సంబంధంలేని విషయమది. కాబ ట్టి ఎక్కడ ఎలా ఉండాలో ఆచితూచి అడు గులేస్తూ
వెళ్ళాలి.అందువల్ల అనేక అవతార లక్షణాలు కలిగి ఉండాలి. సర్వతో ముఖంగా ఉండాలి.రాజుఎప్పుడూ రాజ్యాన్నిఅభివృద్ధి
చేసుకునే దృష్టిలోనే ఉండాలని భరధ్వాజు డి బోధ.
కాశ్మీరపటం చూస్తే,ఇప్పటికే సగంపోయింది. ఒకవేళ మనం సరిగా మన ఆర్యధర్మం విస్త రించిన రాజధర్మంతో వ్యవహరించి ఉంటే,
అది నిలబడి ఉండేది.మనమే అవతలవాడి land ను ఆక్రమించు కొంటా మనే భయం వాడికిఉంటే,వాడు మనదాకా రాడు!
రాజనీతి అది.
అయితే మనం బౌద్ధనీతిని అవలంభించాం. అందుకే రాజ్యం ఈట్లా ఉంది.బౌద్ధనీతిసన్యా స ఆశ్రమంలో ఉండేవాడికి ఉచితం. రాజ్యం
పరిపాలించేవాడికి క్షాత్రమే ఉచితం. అయి తే మన చరిత్రలో జరిగిందేమంటే,గొప్పగొప్ప విలువలన్నీ,పాటించరాని సందర్భంలో,ప్రదే
శంలో,పాటించకూడని వ్యక్తు లచేత లేదా వ్యక్తు లకొరకు పాటించబడ్డా యి. Great values, కానీ Wrong man, wrong place,
wrong application. ఆర్యధర్మం నశించటానికి ఈ మహాసూత్రాల అసందర్భ పు ఆచరణే కారణం.ఆర్యధర్మాలన్నీ ఉత్త మధర్మాలే!
కాని ఏ ధర్మమూ నేడు సరిగ్గా, సక్రమంగా అమలుజరగటం లేదు. ధర్మాలు సక్రమంగానే ఉన్నాయి.కాని ఏదీ కూడ సరి గా,
స్వస్థా నంలో లేదు.అదే చిత్రం! ఇప్పుడు భారతదేశంలో అన్నిధర్మాలుకూడా వాటి వాటి గతులు తప్పి స్థా నాంతరాలల్లో ాయి......
💞🌹🌴🌹🌴🌹
        
  5 తెరల వరకు సామాన్య మానవుడు స్వతంత్రు డై సాధించవచ్చును. కాని ఆరవ తెరను (5 భూమిక)తొలగించుటలో సద్గురు
సహాయము కావలెను.
సంస్కారములు......
సంస్కారముల ద్వారా సృష్టి చైతన్యము సేకరించబడినది. చైతన్య పరిణామములో, సంస్కారములే, భగవంతునికి మానవస్థితి
అనుభవమును కలుగజేసినవి.
సంస్కారములు సృష్టి రూపమున నున్న అభావమును పోషించినవి.
సృష్టిని పోషించుచున్న సంస్కారములు, వాటికి భిన్నమైన సంస్కారములచేపెకిలించ బడి, సృష్టి నాశనమై, సత్యానుభవము
కలుగుచున్నది......
   🌷🌴🌷🌴🌷
కృతజ్ఞత ఓ అద్భుతమైన భావన జీవితంలో కృతజ్ఞతాభావాన్ని ఎంత ఎక్కువగాఆచరణ లోపెడితే అంత అద్భుతమైన ఫలితాలు
వస్తా యి.....
మనకోసం నవ్వే మొఖాలని చాలా చూస్తాం.
కానీ!,మనకోసం కన్నీరు కార్చే కన్నులను వెదకడం చాలా కష్టం..అలాంటి కన్నులను ఎప్పటికీ వదులుకోవద్దు ....
💙🌹🌴🌹🌴🌹
      
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణములు గల పృథ్వి స్థూలమైనది. శబ్ద, స్పర్శ, రూప, రస గుణములు గల జలము పృథ్వి కన్న
సూక్ష్మము. శబ్ద, స్పర్శ, రూప గుణములు గల అగ్ని జలము కన్న సూక్ష్మము.శబ్ద,స్పర్శ గుణములు గల వాయువు అగ్నికన్న సూక్ష్మ
ము. శబ్ద గుణమే గల ఆకాశము వాయువు కన్న సూక్ష్మము. పంచభూతములు ఒక్కొక్క గుణము తగ్గిన కొలదీ
సూక్ష్మమగుచున్నది. ‘నిశ్శబ్దో బ్రహ్మ ముచ్యతే’అని చెప్పబడినటు ల ఏ గుణము లేని పరమాత్మ అతి సూక్ష్మం. ఈ విధంగా
స్థూలమైన పృథ్వికంటే ఆకాశ ము సూక్ష్మమని గ్రహించగలుగుచున్నాము.
అదే విధముగా శబ్ద, స్పర్శ, రూప,రస,గంధ ములను ఏ గుణములేని పరమాత్మ సూక్ష్మా తి సూక్ష్మమని గ్రహింపవచ్చును కదా!
అవ్యక్తము విత్తనము వంటిది.ఆ విత్తనము ఉబ్బినట్లు ఉండునది మహతత్త్వం దాని నుండి బయటకు వచ్చిన మొలక వంటిది
అహంకారతత్వం, కాండం,కొమ్మలు, ఆకు లు మొదలగునవి ఆకాశాది పంచభూతము లుగా యున్నవి.మరియు ఇవి కార్య కారణ
రూపముగా నున్నవి.మరియు ఆద్యంతము లు కలిగి యున్నవి. ఏ కారణములేని ఆత్మ, ఆద్యంతములు లేనిదిగాను,అవ్యయము
నిత్యమునైయున్నది.శాశ్వతమైన ఇట్టితత్త్వ మును తెలుసుకున్నవారు ముక్తు లగుదురు.
    చాలా స్పష్టంగా రెండు ఉపమానాలను తీసుకున్నారు.ఒక్కటేమిటి అంటే, పంచ భూత విచారణ.
రెండవది ఎట్లా సృష్టి క్రమము ఏర్పడుతు న్నది? ఈ రెండు అంశాలని ఇక్కడ బోధించే ప్రయత్నము చేస్తు న్నారు. మనందరమూ
దేని మీద ఆధారపడి ఉన్నాము అంటే, భూమి మీద ఆధారపడి ఉన్నాము అని, ప్రతీ ఒక్కరూ చెబుతారు.కారణము ఈ నేల మీదే
ఉన్నాం కాబట్టి. భూమి మీద ఆధార పడి ఉన్నాము అంటున్నామా? పరమాత్మ మీద ఆధారపడి ఉన్నాము అంటున్నామా? అనేది
ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే, ఈ నేలే కదండీ మనకు ఆధారము.
ఈ నేల లేకపోతే మనం ఏం చేయగలుగు తాము? ఎక్కడ ఉంటాము? ఏ రకంగా జీవి స్తా ము? ఏ రకమైన అవకాశాలున్నాయి
మనకు. ఈ భూమిలేకపోతే? ఏమీ లేదండీ అని అన్నామనుకో, అప్పుడు మనము శబ్ద స్పర్శ రూప రస గంధాలనే ఐదు గుణాల
తోనూ, ఈ పృథ్వి మీద జీవిస్తు న్నటువంటి వాళ్ళము.
అయితే ఈ పంచభూతాలు.. ఏవయ్యా? భూమి ఉంటే సరిపోతుందా? భూమి మీద నీళ్ళు అవసరం లేదా? అని అడిగామను
కోండి? అయ్యో! నీళ్ళు లేకపోతే ఎట్లా జీవి స్తా మండీ? నీరే ప్రాణాధారము.నీళ్ళు లేక పోతే అసలు ప్రాణ శక్తే లేదు. నీళ్ళు త్రాగ
కుండా ఒక గంటకూడా ఉండలేమండీ.నీళ్ళు ప్రతీ గంట గంటకూ అవసరమేనండీ! నీళ్ళు లేకపోతే ఏ జీవలక్షణమూ కుదరదండీ!
అబ్బో నీళ్ళు చాలా ముఖ్యం అండీ నీళ్ళు లేకపోతే నడవదండీ.
మరి ఇందాక ఏమన్నావయ్యా? పృథ్వే ము ఖ్యం అన్నావు కదా! పృథ్వే లేకపోతే నీళ్ళే లేవు కదండీ అంటావు! కాబట్టి,మానవులం
దరూ, ఇప్పుడు ఏమైపోయిందీ అంటే,నీకు ఆకాశం ప్రధానమా? పృథ్వి ప్రధానమా? అంటే, పృథ్వే ప్రధానం.ఎందుకంటే ఆకాశం
వలన నేనుజీవించడంలేదు.అనుకుంటున్నా డు కాబట్టి.
        ఏమయ్యా! మరి నీకు నీళ్ళు అవసరం లేదా? నిప్పు అవసరం లేదా గాలి అవసరం లేదా? అంటే, అవి లేకుండా ఎట్లా జీవిస్తా
మండీ అంటాడు.
కాబట్టి, నీవు జీవన పర్యంతమూ దేని మీద ఆధారపడియున్నావయ్యా అంటే, పంచభూతాల మీద ఆధారపడియున్నావు.
అందుకని,ఈ దేహం పేరేమిటి?పాంచభౌతిక దేహము.పంచభూత లక్షణసముదాయము చేత, నీకు దేహంలో ఉన్నటువంటి ఆర్గాన్స్‌
అన్నీ ఏర్పడ్డా యి.నీ దేహములోవున్న ఇంద్రి యాలు అన్నీ ఏర్పడ్డా యి. నీ దేహలో ఉన్న గోళకాలన్నీ ఏర్పడ్డా యి.
నీ వ్యవహారమంతా ఈ పంచభూతాలపై ఆధారపడే జరగుతుంది.ఎట్లా జరుగుతుంది అనే విచారణ మాత్రం చేయావు. శబ్ద,స్పర్శ,
రూప, రస,గంధాలనే ఐదుతన్మాత్రలయొక్క జ్ఞానాన్ని పూర్తిగా కలిగియున్నటు వంటిది, పూర్తి విషయ వ్యావృత్తి కలిగినటు వంటిదీ
పృథ్వితత్వము సాత్వికమైనటువంటి బోధ.
తత్‌త్వం ఈ పృథ్వి దేని మీద ఆధార పడి ఉంది? దీనకంటే సూక్ష్మమైనటువంటి,స్థూల మంతా సూక్ష్మం మీద ఆధారపడి
యున్నది. సూక్ష్మము సూక్ష్మతరంమీద ఆధారపడి యున్నది.
ఆ సూక్ష్మతరం సూక్ష్మతమమైనటువంటి పరమాత్మ మీద ఆధారపడి యున్నది. ఈ ఆధార ఆధేయ విమర్శని చెబుతున్నారన్న
మాట! కాబట్టి, ఆకాశంలో నుంచి మొట్ట మొదట వాయువు వచ్చింది. వాయువు నుంచి అగ్ని వచ్చింది.అగ్ని నుంచి జలము
వచ్చింది.జలము నుంచి పృథ్వి వచ్చింది. ఎందుకు చెప్పారు అంటే, రేపు విరమణ సమయంలో కూడా ఇదే రీతిగా
విరమించబడుతుంది
💓🌷🌴🌷🌴🌷
      
*8 వ రుద్రు డు:- రేతోభవుడు - అంబికా గర్భధారణ శక్తి. శిశువును బయటకు నెట్ట గలిగే శక్తి. సుఖ ప్రసవమునకు ఈ రుద్రు డు,
శక్తి సహకరిస్తా రు. గర్భము  ధరించినపుడు అనారోగ్య సమస్యలు, complications రాకుండా ఉంటాయి.
*6, 7, 8 శక్తు లు జీవుల పుట్టు కకు సంబం ధించిన ప్రాతిపదికకు తోడ్పడతారు.ఇది ఒక రకంగా కుమారసంభవము కధ లాంటిది.
గర్భము ధరించినపుడు ఈ రుద్రశక్తు లు వినకూడదు, పాటించకూడదు అని చెప్తూ ఉంటారు. కాని మాస్టర్ ఇ.కె.గారు వీటిని ఎంత
ధారణ చేయ గలిగితే అంత సమర్ధత పెరుగుతుందని చెప్పారు.
*ఆధ్యాత్మికతను స్వంతం చేసుకుని జీవించే వారి పట్ల మనకు ఆరాధనా భావం కలుగు తుంది. జ్ఞానులు, ప్రవక్తలు మొదలైన మహా
త్ములంతా ఈ కోవకు చెందినవారే. వారికీ మనకూ మధ్య తేడా ఏమిటి అనేది గమ నిద్దాం.వారిలో మృదుత్వం, పారదర్శకత్వం
అధికంగా ఉంటాయి.
*ఒక సాధారణ కిటికీ అద్దా న్ని మనం పట్టిం చుకోక వదిలివేస్తే అది దుమ్ము ధూళి తో కప్పబడి తన పారదర్శకతను కోల్పోతుంది,
తిరిగి శుభ్రం చేసినపుడే దాని నుండివెలుగు ప్రసరితమవుతుంది.
*అదే విధంగా మనలో సందేహం, స్వార్థం, దాస్య భావనల ధూళి పేరుకుని ఉన్నది. వాటిని తుడిచి వేయగలిగితే స్వతః సిద్ధమై న
ఆత్మస్వరూపం ప్రకాశవంతంగా గోచరమ వుతుంది.
*ప్రకాశవంతమైన కాంతి ఉనికి సర్వదామన చుట్టు ముట్టి ఉన్నది,దానిని గుర్తించ గల గాలి.మనం అంధకారంలోమునిగి ఉండవల
సిన ఆవశ్యకత ఏదీ లేదు.ఎందుచేతనంటే ప్రతీ జీవిలోనూ నశించని ఆత్మజ్యోతి ప్రకా శం నిలిచి ఉన్నది.
*భగవంతుడు ఆ బ్రహ్మకీట పర్యంతం ప్రతీ జీవికి కలుగజేసిన అద్భుత వరం ఇది. ఆ అంతర్జ్యోతి అత్యంత పారదర్శకంగా వెలు
గొందుతూ తన ఉనికి ద్వారా ప్రకాశాన్ని విర జిమ్ముతూనే ఉన్నది.
*స్వయంప్రకాశితమైన ఆ కాంతిరేఖలను అల్పబుద్ధితో,అహంతో,కోరికల వలయాల తో అడ్డు కుంటూ అడ్డు గోడను మనమే
నిర్మించుకుంటున్నాం.
*The life is one of equilibrium and balance. Whether on the ground of materialism, or of intellect, or of
spirituality, the compensation that is given by the Lord to everyone impartially is exactly the same.*
*భౌతిక సంపదకు, నైతిక పురోగతికి మధ్య అభిలషణీయమైన సమతుల్యం పొసగితే తప్ప వ్యక్తికి శాంతి, సమాజానికి అభ్యుద యం
చేకూరదు..
*పాశ్చాత్యదేశాలలో మీరు చూసే భౌతిక అభివృద్ధి అంతా వారికున్న శ్రద్ధ వలన కలి గిందే. వాళ్ళ కండరాలను వాళ్ళు విశ్వసి
స్తా రు.ఆత్మబలాన్ని విశ్వసిస్తే ఇంకెంత అధిక తర ప్రయోజనం కలుగుతుందో కదా! మీ శాస్త్రా లు, ఋషులు ముక్తకంఠంతో బోధిస్తు
న్న అనంతశక్తి సమన్వితమైన ఆ అనంతా త్మను విశ్వసించండి. నాశరహితమైన ఆ ఆత్మ నుంచి అనంతశక్తి బయల్పడ డానికి
సంసిద్ధంగాఉంది.ధైర్యంగా ఉండండి. శ్రద్ధ కలిగి ఉండండి.తక్కినదంతా దానంతట అదే వచ్చి తీరుతుంది.
💞🌹🌴🌹🌴🌹
           
*"అసంకల్పితంగా వచ్చే భావాలను సంక ల్పంతో అడ్డు కునే వీలు ఉన్నదా ? అలాచేసి శాంతిని పొందవచ్చా !?"
*నిద్రలో మనకు ఏ భావాలు ఉండవు.మెల కువ రాగానే భావాలు వస్తు న్నాయి. భావం రాగానే అది సంతోష,దుఃఖాలుగా,కష్టసుఖా
లుగా పరిణమిస్తు న్నాయి.ఆ ద్వంద్వము లేని స్థితే శాంతి. భావంలేని స్థితిలో మనసు శాంతిగా ఉంటుంది. వివేకవంతులు ఎవరై నా
ఎక్కువ కాలం కొనసాగే దాన్నే కోరుకుం టారు. మనం ప్రపంచంలోని ఏవస్తు వు, విష యంలనుండై నా సంతోషం, సుఖం కోరుకుం
టాం. కానీ ఏ సుఖసంతోషాలు శాశ్వతంగా నిలిచి ఉండవు. భావాలు మనలోని కోరిక లవల్ల ఏర్పడుతున్నాయి.వస్తు వులను అను
భవించటం కోరికకాదు.సుఖసంతోషాల కోసం ఆరాటపడటం కోరిక.ఆ కోరికే పరిణ మించి భావాలకు కారణం అవుతుంది.దీన్ని
అర్థం చేసుకుంటే శాంతిసులభంఅవుతుంది!
💜🌷🌴🌷🌴🌷
           
*మానసిక జీవనంలో నేనుకు ప్రయోజనం లేదు !!.
*సంసారం అంటే భార్యా, పిల్లలు, వృత్తి ఉద్యోగాలు కాదు.వాటన్నింటిని మానసికం గా మోసే "నేను", వాటిని నాది అనే అహం
కారం... ఇదే సంసారం.అహంకారం అణగా రిన రోజున పుణ్యపాపాల ప్రసక్తికూడాఉండ  దు. ఇది,ఇతడు అనే భేదం
ఎందుకొస్తుందం టే నాది, నేను అనే భావం చేతనే. వ్యవహా రికంగా జీవనంలో అవి అత్యావశ్యమైనా మానసిక జీవనంలో వాటికి
ప్రయోజనం లేదు. అహంకార వివర్జితమైతే నేను అంటూ ఏదీలేదని, జీవనానికి అసలు ఆ స్మరణతోనే నిమిత్తం లేదని తెలుస్తుంది !.
💚🌹🌴🌹🌴🌹
           
*ఈ దారముల అల్లిక కూడ నాదే కనుక దివ్యతత్వము, జీవుల మోహము కూడా దివ్యమే! అందు ఏ భాగమున ఎవ్వడును
శరణాగతి మాత్రము చెందరాదు. అనగా పరమార్థమని అనుకొనరాదు.అతడుమోహ మునుండి మోహమునకు ప్రయాణము
చేయుచుండును.ఈ మోహమును దాటుట సాధ్యము కాదు.మనస్సు మోహమయము. నా యందు స్మరణ నిలిపి
శరణుజొచ్చిన వాడు నేనుగ నాతో ఉండును కనుక ఈ మోహమును దాటును.
*మోహముచే కప్పబడిన వారు ఒకరి కొకరు గాక యుందురు.ఒకరుచేయు పనులు ఇంకొ కరికి బాధకలిగించును.అవియే
దుష్కర్మలు. దానిని ఆచరించువారు నరులలో అథమ స్థితిలో నున్నవారు.అప్పటి వారి స్వభావ మును అసుర
మందురు.నిద్రించువాని తెలి వివలె వారిజ్ఞానము మోహమున మాటుప డును దాని వలన జీవులకు ఆర్తి కలుగుచు న్నది. ఆర్తి
నుండి తప్పించుకొనుటకు ధన మునో, వ్యక్తినో,అన్నపానీయములనో వెతు కును. ఇట్లు వెతుకుచు ఆర్తి నుండి ఆర్తికి
నడయాడుతూ వెతికి వెతికితటాలుననన్ను వెదకును. ఏ వ్యక్తిలో నన్ను వెదకినను నా పూజ ఆరంభమగును.ఈ అన్వేషణలో ఆర్తి
హరములైన మార్గములకై జిజ్ఞాస పుట్టు ను. దానితో అనేక శాస్త్రములను కనుగొనును. అందును ఒకడు నన్ను కనుగొనును. మరి
యొకడు ప్రయోజనములను తీర్చుకొనుటకై ఇతరులను ఆశ్రయించుచు ప్రయోజన రూప మున నా వెంట వచ్చును. అతడును
నన్ను కనుగొనును. తుదకు ఇది అంతయు నేనని ఎరిగి నన్ను తెలిసికొని జ్ఞాని అగును.
🌷🌴🌷🌴🌷
         
శుద్ధ చైతన్యమునందు ఆరోపింపబడిన బ్రహ్మాది శరీరములకు శుద్ధ చైతన్యమువంటి చైతన్యములు అనగా చిదాభాసలు,కల్పింప
బడుచున్నవి.ఈ చిదాభాసలకే జీవులని పేరు. ఈ జీవులే బహు విధములుగా సంసా రచక్రమున పరిభ్రమింతురు.
అజ్ఞానులు కల్పితవస్త్రముల యందలి రంగులనే,చిత్రమునకు ఆధారమైనవస్త్రము వలె నిజమైన వస్త్రములుగ భావింతురు. అట్లే
పరమాత్మ యందు ఆరోపించబడిన జీవులు,చిదాభాసలు జన్మ మృత్యు సంసార మున తిరుగుచుండగా అజ్ఞానులు పరమా త్మయే
సంసారచక్రమున భ్రమించుచున్నది..
ఇది చేయదగినదియే యని తలంచి శాస్త్ర నియతమగు ఏకర్మము అభిమానము,ఫల ము విడిచిపెట్టబడి చేయబడుచున్నదో అట్టి
(కర్మమందలి సంగఫల) త్యాగము సాత్త్విక త్యాగమని నిశ్చయింపబడినది.
త్యాగమనగా సంగత్యాగమేకాని, ఫలత్యాగ మే కాని,కర్మత్యాగముకాదని ఈశ్లోకము ద్వారా స్పష్టముగ వెల్లడియగుచున్నది.
మఱియు “కార్యమ్"అని చెప్పినందు వలన శాస్త్రని యతమగు కర్మ మనుజుడు తప్పక చేయవలెననియే బోధితమగు చున్నది.
తామసుడు శాస్త్రవిధి తెలియక దాని నాచ రించకనుండును. రాజసుడు తెలిసియు ఆచరించుట కష్టమనిభావించి దానిని చేయ
కుండును.సాత్త్వికుడు తెలిసియు,కష్టము లకు జంకక - సంగమును,ఫలమునుత్యజిం చి దాని నాచరించును.సాత్త్వికునిదే
ఉత్తమ పద్ధతి యనియు,ఆతడుకావించినత్యాగమే ఉత్తమత్యాగమనియు ఈశ్లోకముద్వారా విదితమగుచున్నది. కావున అద్దా నినే
విజ్ఞు లవలంబించవలెను.
*సాత్త్వికత్యాగముయొక్క లక్షణమేమి..*
శాస్త్ర నియతమగు కర్మను, "ఇది తప్పక చేయవలెను" అని యెంచి  ఫలమును, సంగమును (ఆసక్తిని) వదలివైచి చేయుట
సాత్త్వికత్యాగమనబడును.
💛🌹🌴🌹🌴🌹
          
ఎంత నెమ్మదిగ శ్వాసను పీల్చిన మనసు అంత నెమ్మదించును. నిదాన మగుచున్న మనసునకు ప్రశాంతత రుచి తెలియును. ఈ
ప్రశాంతత రుచిగొనిన మనసు మరింత ప్రశాంతతకై మరింత నెమ్మదిగ పీల్చుట,వద లుట చేయును.ఈ అభ్యాసమున మనో శాంతి
అనునది యిట్లు అప్రయత్నముగ లభించను
ప్రవాహము పైన వస్తు వులు తేలుచువేగము గ కదలుచున్నను అది వస్తు వుల కదలిక కాదు కదా!.ప్రవాహ వేగమే పైనతేలువస్తు వు ల
వేగము.అట్లే శరీర ప్రయాణ వేగమునకు, మనో ప్రయాణ వేగమునకు శ్వాసయేఆధార మని తెలియును.శ్వాస ప్రవాహమున మన
సు లగ్నమగును.శ్వాస నెమ్మదించినచో మనసు నెమ్మదించును.మనసు నెమ్మదించి నచో శ్వాస నెమ్మదించును. కావున మనసు
నెమ్మదించ వలెనన్నచో శ్వాసను నెమ్మదిగ నిర్వర్తించవలెను. మనసు వేగముగ పని చేయు వారి యందు శ్వాస కూడ వేగముగ
పనిచేయు చుండును.అట్టివారి శ్వాస బుస లు కొట్టు చున్నట్లు గ యుండును. ఇది రజో గుణపూరితమైన శ్వాస.
మనసు లగ్నముచేసి శ్వాసను నెమ్మదిగ పీల్చుట అభ్యాసమున రెండవ మెట్టు .ఎంత నెమ్మదిగ శ్వాసను పీల్చిన మనసు అంత
నెమ్మదించును. పీల్చినంత నెమ్మదిగనే వద లుట కూడ చేయవలెను. పీల్చుట, వదలుట నెమ్మదియగుకొలది మనసు నిదానమగు
చుండును.
నిదాన మగుచున్న మనసునకు ప్రశాంతత రుచి తెలియును. ఈ ప్రశాంతత రుచిగొనిన మనసు మరింత ప్రశాంతతకై మరింత నెమ్మ
దిగ పీల్చుట, వదలుట చేయును.ఈ అభ్యా సమున మనోశాంతి అనునది యిట్లు అప్ర యత్నముగ లభించును.
మనోశాంతియే ధ్యేయముగ ప్రస్తు తకాలము న ధ్యానములు బోధింపబడుచున్నవి. వాస్త వమునకు మనోశాంతి నిజమగు ధ్యానము
నకు ఆరంభము.ధ్యేయముకాదు, అంతము కాదు.మనోశాంతి ఆధారముగప్రాణాయామ యజ్ఞము ఆరంభమై ప్రత్యాహార,ధారణ
స్థితులను దాటి ప్రజ్ఞ ధ్యానమును చేరును.
అందులకే భగవానుని బోధ ధ్యానమును గూర్చి తరువాతఅధ్యాయమైనఆరవఅధ్యా యమునవున్నది.నాలుగవఅధ్యాయమగు
జ్ఞాన యోగమున- నాలుగవ అంగమైన ప్రాణాయామమును బోధించుటయోగశాస్త్ర మునకు, భగవద్గీతకుగల సమన్వయము.
ప్రశాంతతో కూడిన మనస్సు శ్వాసను నెమ్మ దిగ పీల్చుటతో పాటు పూర్ణముగ పీల్చుట చేయును. శ్వాసనెంత పూర్ణముగ పీల్చినచో
అంత పూర్ణముగ వదలుట జరుగును.పూర్ణ ముగ పీల్చుట వలన ప్రాణవాయువు దేహ మున పూర్ణముగ నిండును.పూర్ణముగ వద
లుట వలన అపానవాయువు పూర్ణముగ బయలు వెడలును.
అపానము పూర్ణముగ బయలు వెడలినచో దేహమందలి మలినములు బై టకు నెట్టబ డును. మలినములు నెట్టబడుట, ప్రాణము
పీల్చబడుట కారణముగ ఈ అభ్యాసమున దొరకు రెండవ బహుమతి ప్రాణశక్తి.క్రమము గ దేహము ఆరోగ్యవంతమగుటకు క్రొత్తగా
కొనివచ్చిన ప్రాణము సహకరించును. ప్రాణ శక్తి పెరుగుట,మలినములు తొలగుట అను నది నిరంతరము జరుగు ప్రాణాయామము
అభ్యాసమున మరియొక భాగము.
ప్రాణమును అనేక విధములుగ దేహము అందుకొను చుండును.ఆహారము అందులో ఒక భాగము.మనసును లగ్నముచేసి శ్వాస
ను నెమ్మదిగ పీల్చుట,వదలుట,పూర్ణముగ పీల్చుట, వదలుట కారణముగ శ్వాసక్రమ బద్ధము చెందుట జరుగును.మనసు ప్రశాం
తత చెందు చుండును. ప్రాణశక్తి పెరుగుచు నుండును. ఉచ్ఛ్వాస నుండి పొందు ప్రాణ వాయువు వలసిన ప్రాణశక్తిని దేహమున
కిచ్చుచుండును.అట్టివారు నియతాహారుల గుదురు. అనగా సహజముగ వారి ఆహార ము నియమింప బడును. ఇదియొక సిద్ధి.
*వీరు ఆహారమును అల్పముగనే స్వీకరిం చినను శక్తివంతులై యుందురు,సులభ ము గ అలసట చెందరు. దేహము తేలికపడుచు
పలుచనై కాంతివంతమగు చుండును.దేహ మున శుభమగు మార్పులు ఈ విధముగ శ్వాస నభ్యసించుట వలన వచ్చును.శ్వాస
నుండి వలసిన ప్రాణశక్తి లభించుటచే ఆహా రము నందు నియమము సహజముగ ఏర్పడును. ఆహారము తగ్గుటజరుగునేకాని
చేయుటగ నుండదు.తగ్గించుటచేయువారు అకస్మాత్తు గ ఎక్కువతినుచుందురు.ఎక్కువ తినుట,తక్కువ తినుటవలన
దేహమునకు అవ్యవస్థత కలిగించును.ఈ అవస్థకు గురి యగు దేహము,అస్వస్థతకుకారణమగును. ఉపవాసములు చేయువారు,
ఎక్కువగను, తక్కువగను తినువారు యోగమున కనర్హు లు. యోగజీవనము నిర్మల సెలయేరువలె ప్రవహించవలెనే కాని వరదవలె
కాదు.
        🧡🌷🌴🌷🌴🌷
అరామాల్లో, వేశ్యావాటికల్లో,సత్రాల్లో,మంది రాల్లో, స్నాన-పానప్రదేశాల్లో దొంగలు చేరు తూఉంటారు.జార,చోరులవల్ల ప్రజలకు
భయంఉంటుంది.అందుకని వాళ్ళను పట్టు కుని దండించాలి. అది పరిపాలనలో ప్రథమ ధర్మం. ప్రజాక్షేమం కోసమని ఎక్కడెక్కడ ఏ
మేమి జరుగుతున్నదో నువ్వుగమనించాలి.
  ఎవరి గురించో మరెవరో ఉత్తమ కులస్థు డనీ, పుణ్యాత్ముడనీ, చాలా మంచివాడనీ చెబుతారు. అది తీసుకుని నివు నమ్మవద్దు .
అలాగని వాడిని అక్కడే అనుమానించనూ వద్దు ” అని చెప్పాడు.
నమ్మవద్దు ,అనుమానించవద్దు అంటే, మరి ఏం చెయ్యాలి! పరీక్ష చేయాలి. పరీక్షించాలి వాళ్ళను. తన మనిషినే వాడిదగ్గరికి
పంపించి పరీక్షించాలి.
రాజు తనమనిషిని అనుమానం కలిగిన వాడి దగ్గరికి పంపించి ఎట్లా పరీక్షిస్తా డంటే; రాజు యొక్క అంతరంగికుడు, ఉద్యోగంలో
కొత్తగాచేరిన వాడిదగ్గరికివెళ్ళి, “మన రాజు చాలా దుర్మార్గుడు. అందరి మనసులలోనూ ఆయన మీద క్రోధంఉంది.ఎప్పుడోసమయం
చూచి మేము తిరుగుబాటు చేద్దా మనుకుం టున్నాము నువ్వేమంటావు?ఆయనతమ్ము డొకడు మంచివాడున్నాడు; ఆయనకు రా
జ్యమొస్తే సుఖపడతాం మనం.నిన్ను రేపు ఆయన దగ్గరికి తీసుకెళతాను”అంటాడు. అప్పుడు ఆ కొత్తవాడు,“అలాగా! రేపు వెడ
దాం” అని కనుక అంటే, మర్నాడు వాడిని పంపించెయ్యాలి. అదీ పరీక్ష చేయటమంటే! దానితో వీడి నిజస్వభావం బయట పడిపో
తుంది.
వాడికి ఆశపెట్టి, ధనాశపెట్టి పరీక్ష చేయాలి. అనుమానించినట్లు కనబడకూడదు. అలా గని గుడ్డిగా నమ్మనేకూడదు. ఈ ప్రకారంగా
ప్రతివాడినీకూడా పరీక్షించాలి. గిల్లికజ్జా లు పెట్టు కొని,చిన్నచిన్న కారణాలకోసం ఎవరూ కూడా బలమయినవాడితో శత్రు త్వం పెట్టు
కోకూడదు. రాజు చిన్నచిన్న విషయాలను అన్నిటినీకూడా ఉదారస్వభావంతో వదిలి పెట్టా లి. కాని వాటిని మాత్రం వెతుకుతూ
ఉండాలి.
సాధారణంగా మనం తేలు,పాముఎక్కడుం దోఅని వెలుతురులో పరీక్షించినట్లు ,పాలకు డు శత్రు వులను వెతుకుతూఉండాలి.ఒకడు
మనకు అపచారం చేసాడు అంటే,వాడిని గురించి చాలాజాగ్రత్త వహించి ఎప్పుడూ పరిశీలన చేస్తూండాలి.మనమే వైరం పెట్టు కో
కూడదు.చిన్న నేరాలన్నింటినీ క్షమించి వది లివేయాలి.
హృదయంలో ఒకడిమీద ద్వేషం పెట్టు కోవ టము,అతడంటే తనకు ఇష్టంలేదని అందరి లోనూ అనటము, వాడిమీద వైరభావము
పెట్టు కోవడము, ఇట్లాంటివి ఉండకూడదు. ఎందుకంటే తన ఇస్టా ఇస్టా లకు అక్కడతావు లేదు. అది Public administration.
ప్రతీవాడికి ఏదో స్వభావం ఉంటుంది. ఏదో మతంఉంటుంది. వాడిని dislike చేసినప్ప టికీకూడా వాడితో రాజు వైరం పెట్టు కోకూడ
దని స్నేహమే పాటించాలి
            💘🌹🌴🌹🌴🌹 సంస్కారములున్నంతవరకు, సృష్టి నిలిచి యుండును, భగవంతుడు మరుగుపడి యుండును.
సంస్కారములు నాశనమైనచో సృష్టి అదృ శ్య మగును.భగవంతుడుకాన్పించును
సంస్కారముల వలననే,సృష్టిలో నిద్రావస్థ యు, జాగ్రదవస్థయు పగటి జీవితమును స్థా పింపబడుచున్నవి.
భగవంతుడు రూపముతో తాదాత్మ్యము చెందుటకు సంస్కారములే కారణము.
సంస్కారములే అనుభవమును ఇచ్చును.
అది ప్రేరణము యొక్క పరిమాణు ప్రమాణ మైన తొలి సంస్కారమే,ఆత్మయొక్కఅనంత చైతన్య రాహిత్య స్థితికి, పరమాణు
ప్రమాణ మైన తొలి చైతన్యము నొసంగినది.

❣️🌷🌴🌷🌴🌷
(5/12/2020, 8:45AM)
       
ఆధ్యాత్మికతను స్వంతం చేసుకుని జీవించే వారి పట్ల మనకు ఆరాధనా భావం కలుగు తుంది. జ్ఞానులు, ప్రవక్తలు మొదలైన మహా
త్ములంతా ఈ కోవకు చెందినవారే. వారికీ మనకూ మధ్య తేడా ఏమిటి అనేది గమ నిద్దాం. వారిలో మృదుత్వం, పారదర్శకత్వం
అధికంగా ఉంటాయి.ఒక సాధారణ కిటికీ అద్దా న్ని మనంపట్టించుకోక వదిలివేస్తే అది దుమ్ము ధూళితో కప్పబడి తన పారదర్శక తను
కోల్పోతుంది,తిరిగి శుభ్రం చేసినపుడే దాని నుండివెలుగు ప్రసరితమవుతుంది.
అదే విధంగా మనలో సందేహం, స్వార్థం, దాస్య భావనల ధూళి పేరుకుని ఉన్నది. వాటిని తుడిచి వేయగలిగితే స్వతః సిద్ధమై న
ఆత్మస్వరూపం ప్రకాశవంతంగా గోచర మవుతుంది.
ప్రకాశవంతమైన కాంతి ఉనికి సర్వదా మన చుట్టు ముట్టి ఉన్నది, దానిని గుర్తించ గల గాలి. మనం అంధకారంలోమునిగిఉండవల
సిన ఆవశ్యకత ఏదీ లేదు. ఎందుచేత నంటే ప్రతీ జీవిలోనూ నశించని ఆత్మజ్యోతి ప్రకా శం నిలిచి ఉన్నది.
భగవంతుడు ఆబ్రహ్మకీటక  పర్యంతం ప్రతీ జీవికి కలుగజేసిన అద్భుత వరంఇది. ఆ అంతర్జ్యోతి అత్యంత పారదర్శకంగావెలుగొం
దుతూ తన ఉనికి ద్వారా ప్రకాశాన్ని విరజి మ్ముతూనే ఉన్నది.
స్వయంప్రకాశితమైన ఆ కాంతిరేఖలను అల్పబుద్ధితో, అహంతో, కోరికల వలయాల తో అడ్డు కుంటూ అడ్డు గోడను మనమే
నిర్మించుకుంటున్నాం.
💕🌹🌴🌹🌴🌹
      
       *దైవానుగ్రహం ఎవరికి...*సంకల్పం స్వచ్ఛమైంది, ధార్మికమైంది అయినప్పుడు తప్పక దైవానుగ్రహం తోడవుతుంది.
*మన సనాతన సంస్కృతిలో ఇందుకెన్నో దృష్టాంతాలున్నాయి. ఫలితాన్ని ఆశించ కుండా కర్తవ్యాన్ని ఉత్సాహంతోచేస్తుండాలి.
*లోకంలో అనేక రకాల వాళ్ళుంటారు. చేయ బోయే పనులకు కలుగబోయే ఆటంకాలను ముందుగానే ఊహించుకొని వాటిని
అసలు ప్రారంభించకుండానే వుండేవారు కొందరు. చేస్తు న్న పనుల్లో ఏవైనాఆటంకాలో కష్టా లో వస్తే వాటిని మధ్యలోనే వదిలేసే వారు
మరి కొందరు.కానీ, ధైర్యవంతులైన వారు ఉత్సా హం కోల్పోక, ఎలాంటిఅవాంతరాలు వచ్చి నా,ఎంత కష్టమైన పని అయినా లక్ష్యం
చేరే వరకు వదలక తెలివిగా సాధిస్తా రు.
తలపెట్టిన పని సఫలం కావాలంటే ధైర్యం వుండాలి. అంతమాత్రాన సరిపోదు, దీనికి తగిన 'ఉత్సాహమూ' తోడవ్వాలి.
*'దైవానుగ్రహం' లభించాలి. వీరుడు విజేత కావాలంటే కత్తిని పూజిస్తే సరిపోదు. కదన రంగంలో పదునెక్కిన కరవాలం ఝళిపించే
ఉత్సాహాన్ని ఉరకలెత్తించాలి. అప్పుడే శత్రు మూకల పని పట్టగలుగుతాడు.
* వీర శివాజీ ధార్మిక నిష్ఠకు మెచ్చి భవానీ మాత వీరఖడ్గాన్ని అనుగ్రహించడంచారిత్రక సత్యం కదా!నవరసాల్లో వీరరసానికి స్థా యీ
భావం ఉత్సాహం.కొందరి పలుకుల్లో వీరత్వ మున్నా చేతల్లో చేవఉండదు.అలాంటివారు ఎన్నటికీ గెలుపుదారి పట్టలేర.
*'మహాభారతం'లో ఉత్తర గోగ్రహణ వేళ ఉత్తరుని ప్రగల్భాలు ఇలాంటివే.పనిని నెర వేర్చగల ప్రయత్నమే కర్మయోగం. కానీ, పని
చేయగలిగీ చేయలేక చేతులెత్తేసిన వారికి ఒక ప్రేరణ, సక్రమ ప్రోత్సాహం కొండంత బలాన్నిస్తా యి.
* కురుక్షేత్ర మహాసంగ్రామంలో సవ్యసాచి గాండీవిని జగదేకవీరునిగా నిలిపింది శ్రీ కృష్ణ పరమాత్మ అందించిన గీతా ప్రబోధమే! అదే
యుద్ధంలో రథసారథి శల్యుడు సూటిపోటి మాటలతో మహావీరుడై న కర్ణుని వేధించడ మేకాక ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీసి,తీవ్రమైన
ఓటమికి కారకుడయ్యాడు.
*'ప్రోత్సహిస్తే విజయం, నిరుత్సాహపరిస్తే అపజయం' తప్పవన్న దానికి ఈ రెండూ ఋజువులు.
శ్రీమద్రామాయణం' లో అన్నివేళలాఅన్నగారి మాట ప్రకారమే నడచుకున్న లక్ష్మణుడు, ఒక సందర్భంలో శ్రీరామునికే మార్గదర్శనం
చేయాల్సి వచ్చింది.'కిష్కింధ కాండ'లో సీతా వియోగ దుఃఖాన్ని అనుభవిస్తూ అశక్తు డిగా
రోదిస్తు న్నాడురాముడు.అప్పుడులక్ష్మణుడు, 'అన్నయ్యా!సీతమ్మను వెదకాలి.రావణుణ్ణి వధించాలి. ఈ రెండు పనులు
చేయాలంటే దైన్యం వదిలి,ధైర్యాన్ని మనసులో నింపుకో వాలి.మనసులో ఉత్సాహం ఉంటేనేకదా ఏపనైనా అత్యంత సమర్థవంతంగా
చేసి, విజయం సాధించగలం' అన్నాడు.
*'ఉత్సాహంలో చాలా బలముంటుంది. అతనికి ఓటమేఉండదు.ఉత్సాహవంతుడు సాధించలేనిదేదీ లేదు.పూనికతో ప్రయత్నిస్తే
సీతమ్మను నువు తిరిగి పొందగలవు' అని లక్ష్మణస్వామి పలికిన మాటలు ఒక్కరాము నికే కాదు, ప్రతీ మనిషికీ దారి దీపాలు.
అధైర్యాన్ని పరిహరించి,ఉత్సాహాన్ని నింపే వారు ఒక్కరున్నా చాలు, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతారు.
జాంబవంతుని ప్రోత్సాహంతోనే కదా, హను మ శతయోజనదూరమైనా సముద్రాన్నిఅవ లీలగా దాటేశాడు.తన తల్లి ఇచ్చిన ప్రోత్సా
హంతోనే శాస్త్రవేత్త థామస్‌అల్వా ఎడిసన్‌తన ప్రయోగాల్లో ఎన్నిసార్లు విఫలమైనా చివరికి విద్యుత్‌బల్బును కనుక్కునే దాకా
ఉత్సాహాన్ని వదిలిపెట్టలేదు. పైగా ప్రయోగం లో పొందిన వైఫల్యాలన్నీ తన నూతన ఆవి ష్కరణలకు మార్గదర్శకాలయ్యాయి....
'ఉడుకు రక్తా నికి ఉత్సాహమెక్కువ' అన్న పెద్దల మాట అక్షరసత్యం.పిల్లలలోని ఉత్సా హాన్ని పరిణత బుద్ధు లైన విజ్ఞులు సక్రమ
పథంలోకి మళ్ళిస్తే వారినుండి అద్భుతల ను రాబట్టగలం. ...
ఇతరులను తక్కువ చేసి మాట్లా డితే నీ స్థా యి గొప్పగా ఉంటుందో లేదో తెలియదు గానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగాజారి
పోతుంది......
💗🌹🌴🌹🌴🌹
          
*జీవితాన్ని ఎలా గడపాలి.......*
*‘‘మీరింక ఒక్క గంట మాత్రమే బతుకుతా రని తెలిస్తే ఏం చేస్తా రో ఆస్థితిలోజీవించాలి.
*ఇంకో గంటలో మరణిస్తా అని తెలియగా నే బాహ్యమైన వ్యవహారాలు వెంటనే చక్క బెడతారు. వీలునామా రాయడం,కుటుంబ
సభ్యులను,మిత్రు లనుపిలిచి వాళ్లకేదయినా నష్టం కలిగించిఉంటే క్షమించాలనిఅడగడం, వాళ్లు మీకేదయినా హాని చేసి ఉంటే
వాళ్లను క్షమించడంతో పాటు మనసుకు సంబంధిం చిన కోరికలను, ఒక్క గంట కోసం ఇదంతా చేయగలిగినప్పుడు..మీరుఉన్నంత
కాలం ఎందుకు ఆపని చేయలేర’’ని ప్రశ్నిస్తా రు.ఇది మహోన్నత స్థితి.నిర్వికల్పసమాధిఅయినా, ‘సహజస్థితి’ అయినా ఈ
చట్రంలోనివే.    
  అంతఃకరణాన్ని,ఇంద్రియాలను జయించి నవాడు, సమస్త భోగ సామగ్రిని వదిలిపెట్టి నవాడు, ఆశారహితుడై న సాంఖ్యయోగి..
శారీరక కర్మలను చేసినట్టు కనిపించినా, వాటి ఫలితం అంటకుండా జీవిస్తా డని గీతా చార్యుడు చెప్పాడు. మన పౌరాణిక, ఇతి హాస
గాథల్లో భోగాలను తృణప్రాయం గా త్యజించిన చక్రవర్తు లు కన్పిస్తా రు.
*రుషభుడు* కేవలానందావస్థలో సర్వం త్యజించి వెళ్లిపోయాడు. అలాగే ఎందరో మహారాజులు అన్నింటినీ కాలితో తన్నేసి
అంతర్ముఖులై జ్ఞానులయ్యారు.రోగాన్ని కూడా లక్ష్యపెట్టకుండా అదే స్థితిలో జీవించా రు. ఇంకొందరు సిద్ధ పురుషులు వాళ్లకున్న
యోగత్వాన్ని కూడా గమనించ లేదు.అదొక కర్మబంధ విముక్తి.అయితే ఇక అందరూ సన్యాసం పుచ్చుకోవాల్సిందేనా? అంటే..
ఎంతమాత్రం కాదు..... నిత్యజీవనంలో ఆ స్థితిని పొంది దానిలో నిలిచి ఉండడం.అపు డు ఏమీ మనల్ని అంటుకోవు. అదే ముక్త
జీవనం.......
*ఎవరైతే ప్రకృతి స్వభావంలో ఇరు క్కుని అహంకారం అనేపాశంలో బందీలు అవుతా రో వారు ఎప్పుడూ అన్ని రకాలఆధిపత్యాల
కోసం జీవిస్తూ ఉంటారు.ఎవరైతే సర్వభూ తాంతర్గతమైన ఈశ్వర దర్శనం పొందుతా రో వారికి అన్నిజీవుల్లో ‘ఆత్మదర్శనం’కలుగు
తుంది. ఆ స్థితిని నిలకడగా నిలబెట్టు కోవడ మే యోగం. ఆ దర్శనం మానవుల్లో ఏ వయ సులో, ఏ పరిస్థితుల్లో కలిగినా అది ధారా
పాత్రలా నడుస్తూనే ఉంటుంది. చమత్కారం లా కన్పించే ఈ పరమోన్నత స్థితిని.. చాలా మంది మరణం
తర్వాతఆశిస్తుంటారు.కానీ, దేహం ఉండగానే ముక్తిని కలిగించే మహో న్నత స్థితి అది. అది తెలుసుకుంటే జీవితం ఎలా గడపాలో
అర్థమవుతుంది.
🖤🌷🌴🌷🌴🌷
           
  *మీ చిరునామా ఏంటి......*
మనందరి చిరునామా ఒక్కటేనమ్మా..... *స్మశానం*...నిజంగా ఎంత చక్కగా చెప్పేరు అయినా చెప్పిన సమాధానం ...జీవితానికి
నిజమైన అర్ధం చెప్పింది.....
  *అక్కడ కొస్తే తిరిగి రాలేము కదా......
అదేంటి మరి రోజు అర్ధరాత్రి వెళ్లొస్తు న్నాం..
అర్ధరాత్రిలో ఆసాహసయాత్రలు ఎందుకండీ.
సాహసయాత్రలు కావవి స్మశానవాటికలో
పంచనామాలు.ఊరుకోండి.. స్మశానవాటి కలో పంచనామాలు ఏంటి అంటారా......
మనుషులుగా ఉన్నప్పుడు ఎన్నోవిషయాల గురించి నేను నాది అంటూఆలోచిస్తూ పరు గులు పెడుతూ మనశ్శాంతి లేకుండా ఎదు
టివారికి మనశ్శాంతి పోగొట్టేలా పోట్లా డిన వారు మనసులను బాధపెట్టినవారు శవా లుగానైనా ప్రశాంతంగా పడుకున్నారో లేదో నని
చూసోస్తా నికి.....
  ఎంత జీవిత పరమార్థం దాగి ఉందో కదా..
అసలు అర్థం చేసుకుంటే *స్మశానం ఒకజ్ఞాన మందిరం.అవునా!ఎలా అంటారా?.బ్రతికు న్న మనిషికి నీరాజనాలు పట్టడంసహజము
ఎందుకంటారా భయమో భక్తిని అవసరమో ఉంటాయి. ఆ మనిషితో అందుకే ఆ మనిషి ని అందలం మెక్కించి భుజమిచ్చి పైకెత్తు
తుంటాము,కానీ ఆ మనిషి శవంగా మారగా నే చూడటానికి ముట్టు కోవడానికి కూడా భయపడతాం.కానీ చచ్చిన శవానికి విలు
వనిచ్చి అక్కున చేర్చుకునే ఏకైక మందిరం స్మశానం. నిలువ నీడలేని మనిషికీ కూడా ఆరడుగుల నేల నిచ్చి భుజం తడుతుంది.
అక్కడ పేర్చిన కట్టెలనుచూస్తుంటే ఇంకెప్పు డు అన్నట్టు గా ఏ సంబంధం లేని ఆత్మీయు డు కోసం ఎదురు చూస్తుంటాయి.కన్నం
పెట్టిన కుండ బోరున ఏడుస్తుంది,చివరకి ఆ శవం కోసం ఆత్మార్పణ చేసుకుంటుంది.  నిప్పంటించిన కట్టెలలో ప్రేమ గుణం కనిపి
స్తుంది. అవి ఆ శవాన్ని ఆలింగనంచేసుకుని బూడిదవుతాయి.ఆమండుతున్న అగ్నిసాక్షి గానే మన జీవిత నిర్మాణ క్రమానికి పునాది
రాళ్ళు పడతాయి ఆ అగ్నిసాక్షిగానే మనం మటుమాయమవుతాయి.ఇవన్నీచూస్తుంటే ఏమనిపిస్తుంది....నిజమైన ఆత్మీయ అను
రాగాలు స్మశానంలోనే ఉన్నాయి అనిపిస్తుం ది కదా...నిజంగా మనంపాఠాలు నేర్చుకోవా ల్సింది ఈ జ్ఞాన మందిరంలోనే అనిపిస్తుంది
కదా. ఆ స్మశానానికుండే విశాల హృదయం సమాజానికి ఉంటే ఎంత బాగుండేదో కదా, స్మశానమేమోప్రశాంతతను,ఆత్మీయత
అను రాగాలను పోగేసుకుంటుంది.కానీ సమాజ మేమో కుళ్ళు కుతంత్రాలతో, అసూయ ద్వే షాలతో నేను నాది
అంటూ,ఆత్మీయ,అను రాగాలని దూరం చేసుకుంటూ మనశ్శాంతి నికోల్పోయి దుఃఖానికి చేరువై ఉన్న కర్మల ను
తొలగించుకోకుండా వాటికీ మరి కొన్ని కర్మలను జత చేస్తూ జీవిస్తుంది.. పైపెచ్చు మేము ఏతప్పుచేయలేదు.బోలేడు పూజలు
వ్రతాలు హోమాలుచేస్తు న్నాం.నీవు మాకేం చేసేవు పూజలు చెయ్యటమే కానీ, నీవు అసలు మావంక చూడటం లేదని ఆ తండ్రి
పరమాత్మను నిలదీస్తు న్నాం...అసలు చిత్త శుద్ధి లేని శివ పూజ ఏల..*ఒకటి చెప్పనా..
నిర్మలమైన మనస్సుతో స్వచ్ఛమైన వాక్కు తో పవిత్రమైన ఆలోచనలతో ఉన్నవారు ఒక పుష్పం లేదా ఒక పత్రం సమర్పిస్తే చాలు
ప్రసన్నుడౌతాడు నాతండ్రి బోలాశంకరుడు. వచ్చి హృదయంలో ప్రతిష్ఠ అవుతాడు .
తానా నివాసం అయిన స్మశానం చేరువరకు చేయి పట్టి నడిపిస్తా డు.ముక్తినిప్రసాదిస్తా డు మన తండ్రి పరమేశ్వరుడు.....
💜🌷🌴🌷🌴🌷
           
*వ్యామోహంతోనే మనిషి పతనం.......*
భగవంతుడు సాధారణ సందేహాలకు సమా ధానమయ్యేంత అల్పస్థా యి వాడుకాదు. ఏ ప్రశ్నకూ అందనంత ఉన్నతుడు. మాటలకు
ఇమడనివాడు. మనసుకు అందనివాడు. ఆత్మానుభూతికి మాత్రమే అవగాహన అయ్యేవాడు. దేవుడు సమాధానాలకు
తావుకాడని, ప్రశ్నలకు అంతకంటే బద్ధు డు కాడని తెలుసుకొన్న జీవుడు..దేవుడికి సమీ పగతుడై వ్యామోహరహితడౌతాడు.
సత్‌, చిత్‌ఆనందాలు మనలోనే ఉన్నాయి. కానీ, మనకు తెలీదు. నిరంతరం వాటికోసం బయట అన్వేషిస్తూ ఉంటాం.అయినా వెతు
కుతూనే ఉంటాం. నిరంతర అన్వేషణలో మనమేమిటో, మనం తెలుసుకున్నప్పుడు ఆనందం మనదవుతుంది. మనం సచ్చిదా
నందులం అయినప్పుడు, మన దిగుళ్లు , భయాలు,దుఃఖాలు,కష్టా లు అన్నీకనుమరు గవుతాయి.అప్పుడు వ్యామోహరహితమైన
స్థితప్రజ్ఞులమవుతాం.దైవానికి దగ్గరవుతాం.
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యా లనే అరిషడ్వర్గాలలో మోహంమిగుల ప్రమా దకారి. ఆమోహం తీవ్రంగా
ప్రకోపిస్తే‘వ్యామో హం’అవుతుంది.దానికి‘తృష్ణ’సమానార్ధకం. ముసలితనంవల్ల శరీరం జీర్ణమైనా వ్యామో హం జీర్ణం
కాదు.తత్ఫలితంగా అత్యంత భయంకరమైన పాపబంధాలు ఏర్పడి మన శ్శాంతి లేకుండా పోతుంది.
దారాపుత్రు లు,ధన,కనక, వస్తు వాహనాదు లు, కీర్తి,ఇత్యాదులపై వ్యామోహం ఉంటుం ది. ఈ వ్యామోహంలోఅంతర్లీనంగాఅధర్మం,
అసత్యం,అన్యాయం అత్యధిక శాతం ఉండి మానవాళిని పతనావస్థకు చేరుస్తా యి. మనిషి పతనం సమాజానికి మచ్చవంటిది. ఆ
మచ్చ బాహ్యసౌందర్యాన్ని చెడగొట్టి అంతః సౌందర్యాన్ని హరించి వేయడానికి వ్యామోహమే ప్రధాన కారణం.
అనంతమైన మన పూర్వానుభవాన్ని మన పురాణాల్లో పూర్వచిత్తి అంటారు.మన ఏకా గ్రతకు భంగం కలిగించే పూర్వ వాసనలూ,
జ్ఞాపకాలే పూర్వచిత్తి. ఇది గతానుగతంగా సంభవించే వ్యామోహజనితమని గ్రహించా లి. పరమాద్భుతమైన సాధనోప కరణమైన ఈ
ప్రపంచంలో మమతానురాగాల మాయా తెరలు, జిహ్వచాపల్యాలు,అందమైన సర్పా ల్లా ఆకర్షించే ప్రాపంచిక సుఖాలు ఇవన్నీ
ఉంటాయి.వీటన్నిటివైపూ మనసును నడి పించేది వ్యామోహమే.దానికి బద్ధు లం కా కుండా చూసుకోగలిగితే మోక్షసాధన మార్గం
లో అనేకబంధాలు తొలగిపోయినట్టే.అందు కే వ్యామోహాన్ని తొలగించుకుని,మంచికి యజమానులం అవుదాం.అంతే తప్ప చెడు కు
బానిసలం కావద్దు .
💚🌹🌴🌹🌴🌹
          
ఆధునిక కాలమంతా ధనార్జనతోనే గడచి పోతూంది. సంపాదించిన ఆ ధనాన్ని కూడా సక్రమంగా ఖర్చు పెడుతున్నారా అంటే అదీ
సందేహమే! మనం ఏ వస్తు వునూ అవసరా నికి మించి కోరకూడదు.ఒక వస్తు వును కొనే టప్పుడు, మనం బేరం చేసి ఎంత తక్కువ
ధరలో కొనవచ్చో అంత తక్కువ ధరలో కొం టాం.కానీ ఆవస్తు వు మనకు అవసరమో కాదో ఆలోచిస్తు న్నామా? వస్తు సముదాయా
న్ని వృథాచేసుకుంటూ పోవడంవల్ల మనకు సుఖం అధికమవుతుందని అనుకోవడంఒక భ్రమ. జీవితం సుఖంగా గడవాలంటే కొన్ని
ముఖ్యమైన వస్తు వులుంటే చాలు.ఈ విష యం మనం గుర్తించగలిగితే మన ఆచారా లు, అనుష్ఠా నాలు వదలుకొని దేశాంతరాల కు
పోయి మరీ విస్తా ర ధనార్జన చేయవల సిన అవసరంఏర్పడదు.ఆత్మవిచారానికీ, ఈశ్వర ధ్యానానికీ, పరోపకారానికీ మనకు
కావలసినంత సమయంకావాలంటే, అవస రాలకు మించి వస్తు వును సముపార్జించే లౌక్యాన్ని వదిలిపెట్టా లి.మనం రెండు విధా లుగా
కాలాన్ని వ్యయం చేస్తు న్నాం.ఒకటి ధనార్జన కోసం, రెండవది ఆ ధనార్జనతో సంపాదించిన వస్తు వుల రక్షణ కోసం! ఈ రెండింటి
నుంచి కాస్త మనస్సును మళ్ళించ గలిగితే, ఆత్మ తుష్టి కరములైన సాధనలు చేసి జీవితాన్ని శాంతంగానూ, సుఖంగానూ,
ఆనందంగానూ, తృప్తిగానూ గడపవచ్చు. ఈపొదుపు వస్తు వుల విషయం లోనే కాదు సంభాషణల్లోనూ అలవరచుకోవాలి. పది
మాటల్లో చెప్పవలసిన విషయాన్ని ఒక్క మాటలో చెప్పగల సామర్థ్యాన్ని పెంపొందిం చుకోవాలి. ఎప్పుడు మనకు ఈ విదమైన వాక్
సంయమనం కలుగుతుందో, అప్పుడు బుద్ధిలో తీక్ష్ణమూ,వాక్కులోప్రకాశమూమనం చూడగలం.మనవాక్కులువ్యర్థంకాకూడదు.
’మౌనేన కలహం నాస్తి;మౌనం వల్ల కలహాలు పొడచూపే అవకాశమే ఉండదు కదా!మిత భాషణ వలన మనశ్శాంతి, ఆత్మ శ్రేయస్సూ
వృద్ధిచెందుతాయి. కానీ ఈకాలం లో మనం చూస్తు న్నదంతా వాగా డంబరమే! పొదుపు ఒక్కచేతల్లోనే కాకుండా మాటల్లో కూడా
ఉండాలి.భాషణలో కూడా పరిమితిని పాటి స్తే ప్రశాంతంగా ఉండగలం.
దాతృత్వంతోనే లక్ష్మీకటాక్షం: నిజానికి అన్ని కోరికలూ సంకల్పం వల్లనేఉద్భవిస్తు న్నాయి. కొత్త, కొత్త సంకల్పాలు ఉదయించ కుండా
చూసుకుంటే కోరికలూ క్రమక్రమంగా క్షీణిస్తా యి. కోరికలు క్షీణించే కొద్దీ మన కార్యక్రమా లు,ధనార్జన,వస్తు సంపాదన తగ్గుతూ
వస్తా యి.సంకల్పాలు క్షీణించాలంటే సద్వస్తు వుల పై దృష్టి నిలపాలి. అప్పుడు చిత్త వృత్తు లు
సమసిపోయి,ఏకాగ్రతసిద్ధిస్తుంది.ఏకాగ్రతకు అపరిగ్రహం అత్యవసరం.మనంసంపాదించే ధనమంతా స్వార్థం కోసమే కాక దానధర్మా
లకుకూడా వెచ్చించాలి.మన సమాజంలోనే సత్కార్యాలకోసం దానధర్మా లు చేసే సుకృ తులు ఎంతోమంది ఉన్నారు.లోకంలోఎంతో
మంది దుఃఖితులూ,దరిద్రు లూ ఉంటే,వారు కష్టపడుతూ ఉంటే,మనం వృథాగా ధనాన్ని ఖర్చుపెట్టడం పాపం.మన ధనంతో దీనుల
దుఃఖాశ్రు వులను తొలగించ గలిగితే అంత కన్నా పుణ్యకార్యం వేరే ఉండదు. సంపద ఉండగానే సరిపోదు! పరోపకారానికి అది
ఉపయోగపడుతుందా? దీనజనోద్ధరణకు సహాయ పడుతుందా?అని గమనిస్తూ,సంప దను ఇలా సద్వినియోగపరిస్తే,సంపద సద్వి
నియోగమయ్యే కొద్దీ మనకు లక్ష్మీకటాక్షం కూడా సమృద్ధిగా లభిస్తుంది.
❤️💜💚💜
        
ఒక ఇంటిని చూచామంటే,ఈ ఇంటిని నిర్మిం చినవాడెవడు? అని యోచిస్తాం. ఇంటిని కట్టడానికి ఎన్నో వస్తు వులు కావాలి. వాటిన
న్నిటినీ సేకరించి,ఇంటిని కట్టడానికి ఒక పథ కం వేసుకోవాలి.దానిని కట్టడానికి ఒక ఉద్దే శమూ ప్రయోజనమూ ఉండాలి.ఇన్ని
ఉంటే కాని ఒకఇల్లు తయారు కావటంలేదు. ఐతే ఎన్నో నియతులకు కట్టు బడిన ఈ ప్రపంచ మునకు కూడా ఒకకర్త
ఉండవలసిందేకదా?
ఈ ప్రపంచములో ఎన్నో విధములైన సృష్టు లున్నవి.నదీనదములు,పర్వతములువనములు, నక్షత్రములు,గ్రహములు- వీనికన్ని టికీ
ఒక నియతి ఉన్నది.వీనినంతా సృష్టిం చినవానికి జ్ఞానం అపారంగా ఉండాలి. శక్తియూ అనంతంగా ఉండాలి. మనిషితన్ను మేధావిగ
భావిస్తు న్నాడు.అట్టి మేధావియైన మనిషి,ఈ ప్రపంచాన్నిసృష్టించిఊరుకోలేదు. దీనినిపాలిస్తు న్నాడు,సంరక్షిస్తు న్నాడు. మన కున్న
మేధయూ, అతడిచ్చిన భిక్షయే అని తెలుసుకొని అతనిని ప్రార్థిస్తే ఆ పరమ కరు ణాళువు మనకు సకల శ్రేయస్సులనూ ఇవ్వ గలడు.
స్వామి అనగా అతడే. ఆ స్వామి మన హృదయ కుహరములలో ఉన్నాడని వేదాలు చెబుతున్నవి.
స్వామి అనగా ఏమి? స్వం అనగా సొత్తు . తెలుగులో స్వం-సొమ్ముఐనది. సొమ్ము మనకు స్వంతమైనది.కేరళ దేశములో ఆల
యములను,'దేవస్వం' అని అంటారు. సొమ్ముకు స్వంతదారుడు స్వామి.స్వామికి మనంసొమ్ముగాఉన్నాము.
ఈ ప్రపంచమంతా అతని 'స్వం' సొత్తు గా ఉన్నది. మనం ఎన్నో వస్తు వులను క్రొత్త క్రొత్తగా నిర్మిస్తు న్నాం. విజ్ఞానం పెరిగే కొద్దీ నిర్మాణ
ప్రణాళికలూ వృద్ధి ఔతున్నవి. కానీ వీనికంతా మూల వస్తు వులను మనకు ఎవ రు నిర్మించి ఇచ్చారు? ఆ ముడి పదార్థము ల
ఆధారంచేతనే కదా మనం వీనిని తయా రు చేస్తు న్నాం. మనం నిర్మిస్తు న్న ఈ పదార్థ జాలమునకంతా నిజమైన నిర్మాత ఎవడు?
భగవంతుడే.!నేను నేను'అని మనం వ్యవ హారంలో మాట్లా డుకుంటాం. నేను' ఎవరు? ఈ 'నేను' ఎవరిసొత్తు ? ఈ'నేను' ఎక్కడ
నుంచీ వచ్చింది?దీనిని తెలుసుకున్నామం టే, అనగా మనం ఎవరి సొమ్మో తెలుసుకు న్నామంటే,అపుడు మనకని స్వంతముగా
ఒకఆశయూ, ద్వేషమూ లేకుండా పోతుంది. అప్పుడు అలసట అనేమాట లేదు. అంతా శాంతియే. ఆనంద మే.స్వామి తత్త్వమంటే
అదే. ఆ తత్త్వమే శరణాగతి.నేను అనే వస్తు వు లేదు.సర్వమూ నీవే అన్న భావన ఆధ్యా త్మికమార్గంలో భక్తికి పరమావధి.మనం చూ
స్తు న్న ప్రపంచములో సర్వమూ క్షరమూ పరి ణామ శీలముగనూ ఉన్నవి.వీనిలో హెచ్చు తక్కువలున్నవి.వీటినన్నిటినీ పరిణామరహి
తుడునూ, అక్షరుడునూ ఐన భగవంతుడు సృష్టించియున్నాడు.మనం కొరతలతోనిండి యున్నాం,ఆయనకు ఏ కొరతయూలేదు.
మనశక్తి అల్పముగా నున్నది.ఆయనపరమ శక్తివంతుడుగానున్నాడు.అట్టిస్వామి అను గ్రహం మనయందుకల్గితే, మనకున్న కొరత
లన్నీపోయి,శాంతినీ,ఆనందాన్నీ మనం సులభంగా పొందగలం...
💜💚💜
                
*ఇన్వెస్ట్‌మెంట్* అంటే మన మదిలో మెది లేది బంగారం, ఆస్తు లు,ప్లా ట్లు .మహా అయి తే స్టా క్ మార్కెట్, షేర్లు , మూచువల్ ఫండ్స్
అంతే. నిజమే ఇవన్నీ ఇన్వెస్ట్‌మెంట్‌కు అద్భుతమైన అవకాశాలిచ్చేవే. అయితే ఇన్వెస్ట్‌మెంట్ అంటే కేవలం ఇవేనా?ఒక్కరి ఆరోగ్యం
అస్సలు బాగాలేదు. కానీ వారు భూములపై చేసిన ఇన్వెస్ట్‌మెంట్ విలువ ఈరోజు కోట్లరూపాయలకు చేరుకుంది.ఐతే ఏంలాభం
దాన్ని అతను అనుభవించలేడు. అంతర్జా తీయ విమానాశ్రయం ఏర్పాటుతో భూముల విలువకోట్లరూపాయలకు చేరుకు న్నాయి.ఆ
భూములు అమ్ముకున్న వారికి ఆ డబ్బును లెక్కపెట్టడం కూడా రాదు.
   చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి ఇన్వెస్ట్ చేశారు. బోలెడు ఆస్తి కూడబెట్టా రు.కానీ ఏం లాభం పిల్లలు దారితప్పారు.వారికి చదువు
అబ్బలేదు. తాను చెమటోడ్చి సంపాదించి ఇచ్చిన డబ్బును జాగ్రత్త చేస్తా రనే నమ్మకం కూడా లేదు. పిల్లలు ఇలా అయ్యారేమిటనే
ఆవేదనతో కుమిలి పోతున్నాడు. ఇంటి నిండా కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా కంటి నిండా నిద్ర లేదు. ఇలాంటి వారు మన జీవి
తంలో చాలా మందే కనిపిస్తుంటారు.
*ఎందుకు జరుగుతుంది ఇలా?*
ఇన్వెస్ట్‌మెంట్ అంటే కేవలం డబ్బురూపంలో విలువ మాత్రమే అనుకుంటే వచ్చే సమస్య లు ఇవి.జీవితానికి డబ్బు చాలా ముఖ్యం.
సంపాదించే శక్తి, వయసు, తెలివి తేటలు ఉన్నప్పుడు అవకాశం ఉన్నంతకాలం సంపా దించాల్సిందే అది తప్పేమీకాదు.కానీ ఇన్వె
స్ట్‌మెంట్ అంటే కేవలం బంగారం, భూములు అనుకోవడమే తప్పు.కేవలం ఇవే ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటే జీవిత చరమాంకంలో
బాధలు తప్పవు.ఒక పిల్లా డు స్కూల్‌కు వెళుతున్నాడు. అతనికిసంపాదన ఏమీ ఉండదు. మరి అతను ఇన్వెస్ట్ చేయవచ్చా ఏలా
చేయాలి,... ఏం చేయాలి...
చదువుకునే విద్యార్థివద్ద ఉండేది ప్రధానంగా సమయం.చదువుకునే పిల్లా డు ప్రతి రోజు ను, ప్రతి నిమిషాన్ని ఇన్వెస్ట్ చేయవచ్చు.
విద్యార్థి తన వద్ద ఉన్న సమయాన్ని జ్ఞానం మీద తన ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి విషయం తెలుసుకోవాలి. పెద్ద వయసులో కొత్త భాష ను
నేర్చుకోవాలన్నా, కొత్త విషయాలు నేర్చు కోవాలన్నా కొంత కష్టంగానే ఉంటుంది. కానీ చదువుకునే వయసులో వీటిని ఎంతో ఈజీ గా
చేయవచ్చు. తన వద్ద ఉన్న సమయాన్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తు న్నాడు అనే దానిపైనే ఆ విద్యార్థి భవిష్యత్తు జీవితం ఆధారపడి ఉంటుంది.
టీవిలో సీరియల్స్, క్రికెట్, సినిమాలుచూస్తూ గడిపేస్తుంటే ఒక అనామకుడిగానే జీవితం ముగిసిపోతుంది. చదువుపై సమయాన్ని
ఇన్వెస్ట్ చేస్తే ఉజ్వలమైన భవిష్యత్తు కు దారి చూపుతుంది. ఒక కొత్త భాష నేర్చుకుంటే ఉత్సాహంగా ఉండడమే కాదు. ఆ భాషలో నే
అవకాశాలు లభించవచ్చు.చిన్న వయసు లో జ్ఞానంపై ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి మించిన తెలివైన నిర్ణయం ఉండదు. సమ యం
విలువ తెలిసిన విద్యార్థికి దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలుసు. జ్ఞానంపై చేసిన ఇన్వెస్ట్‌మెంట్ జీవితానికి కావలసిన వన్నీ
సమకూర్చుతుంది. పుట్టి బుద్దెరిగిన దగ్గర నుంచి జీవితచరమాంకం వరకుమనం ఏదో ఒకదానిపై ఇన్వెస్ట్చేస్తూనే ఉండవచ్చు.
*ఆరోగ్యంపైచేసే ఇన్వెస్ట్‌మెంట్,జీవితమం తా అనారోగ్యానికి దూరంగాఉంచుతుంది.
జైనులు దేశంలోనే కాదు.అమెరికాలో కూడా వ్యాపారరంగంలో దూసుకువెళుతున్నారు. వారి ఇన్వెస్ట్‌మెంట్ పాఠాల్లో పరిశుభ్రత,
ఆరోగ్యం కూడా ఉంటుంది.సాయంత్రం ఆరు గంటల తరువాత వారు తినరు.ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ కాలం జీవిస్తాం.
ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంపాదించే శక్తి ఉంటుంది అని వారికి ఇళ్ల లోనే ఆచరణ ద్వారా బోధిస్తా రు. ఆరోగ్యంపై ఇన్వెస్ట్ చేయ డం
అంటే మన అలవాట్లు ఆరోగ్యకరంగా ఉండడం, అనా రోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండ డం. ఉదయమే
లేవడం,వ్యాయామం, యోగా వంటివి ఆరోగ్య ఇన్వెస్ట్‌మెంట్లు .....
ఆరోగ్యం బాగుంటేనే సంపాదించవచ్చు, సంపాదించింది అనుభవించవచ్చు.జీవితా న్ని జీవించాలి అంటే ఆరోగ్యం ఉండాలి.
ఆరోగ్యంపై ఇన్వెస్ట్‌మెంట్ జీవితంలో భాగం కావాలి.ఆరోగ్యం, చదువు, జ్ఞానం, మానవ సంబంధాలు వీటన్నింటిపైనా ఇన్వెస్ట్‌మెంట్
చేయవచ్చు. నలుగురితో నడవమన్నారు.
   *మనుషులెవరూ లేని దీవిలో బంగారు కొండలున్నా ఒక వ్యక్తి ఆనందాన్ని అనుభ వించలేడు. మనుషులెవరూ లేకుండా మీ వద్ద
బంగారు కొండలు ఉన్నట్టు ఊహించు కోండి. పెద్దగా సంతోషంకలగదు.మనిషితో నే మనిషి సంతోషాన్ని పొందగలడు.కొద్ది సమయం
తనతోతాను గడపగలడేమోకానీ మనుషులెవరూ లేకుండా కొన్ని రోజులు గడపడం అసాధ్యం.అందుకేఆరోగ్యకరమైన మానవ
సంబంధాలు కొనసాగించడం కూడా జీవితానికి సంబంధించి గొప్పఇన్వెస్ట్‌మెంట్.
స్టా క్‌మా ర్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారు ఎప్పటికప్పుడు తమ ఇన్వెస్ట్‌మెంట్ ఫోర్ట్‌పోలియో ఎలా ఉందో సమీక్షించు కుంటారు.
మార్పులు చేర్పులు చేస్తా రు.జీవితానికి ఉప యోగపడే మనీఇన్వెస్ట్‌మెంట్ విషయంలో ఇలాంటి సమీక్ష అనివార్యం.
*అదే విధంగా జీవితమనే స్టా క్‌మా ర్కెట్‌లో మనం ఎప్పటికప్పుడు చదువు,జ్ఞానం,ఆరో గ్యం, సంబంధాలకు సంబంధించిన ఇన్వెస్ట్‌
మెంట్ ఎలా ఉందో సమీక్షించుకుని,అవసర మైన మార్పులు చేర్పులు చేసుకుందాం....
     [12/6, 11:   💜💚💜
    విజయాన్ని నిరంతరం నిలబెట్టు కోవడమే విజేతకు ఎదురయ్యే అసలైన సవాల్. జీవి తం శాశ్వతం కాదు..ఏ ప్రాణానికి గ్యారంటీ
లేదు.జీవించే కొంత కాలానికి ఎన్నో బాధలు బంధాలు,బాధ్యతలు....
*ఎవరైనా చనిపోతే పాపంపోయాడు అం టాం. బతికి ఉంటే ఇంకాపోలేదే అంటాం..
*మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరో గ్యంగా ఉంటాడు అనేదే నిజము.అందుకే మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గడిచి పో
యినా గతాన్ని గురించి తక్కువగా ఆలోచిం చు, రాబోయే భవిష్యత్తు ను ఎక్కువగా ప్రేమించు...
ప్రపంచంలో దేని గురించి అయినా తెలుసు కోవచ్చు కానీ.,ఆత్మ గురించి మాత్రం ఎవరూ తెలుసుకోలేరు.అసలు 'అది' తప్ప వేరే
ఏమీ లేదు అన్న జ్ఞప్తి ఉంటే చాలు.......
*నా జీవితానికి ఏమితక్కువైంది అని సంతో షంగా బ్రతికి చూడండి..
*జీవితం ఎంతో బాగుంటుంది...మనకన్నా కొన్ని వేలమంది బాగుండి ఉండవచ్చుకానీ,. కొన్ని కోట్లమంది కన్నా మనం బాగున్నా
మన్న నిజాన్ని మరవద్దు .సంతోషం అనేది మన మనసు సృష్టించు కోవాలి. అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది.
*అందాన్ని పెంచుకుంటే,కెమెరాల్లో బంధించి ఆనందిస్తా రు. ఆస్తిని పెంచుకుంటే గంధపు చెక్కల్లో తగలపెడతారు.*సన్మాన పత్రాలతో
సత్కరిస్తా రు.హోదాని పెంచుకుంటే హోర్డింగ్ లో నిలబెడతారు. అదే వ్యక్తిత్వాన్ని పెంచు కుంటే జనం గుండెల్లో గుడి కట్టి
పూజిస్తా రు.
ఎదుటివారి తప్పోప్పులు నవ్వుతూ భరించి నంత కాలం మనం మంచివాళ్ళమే.ఎప్పుడై తే తప్పును తప్పుఅనిచెప్పి సరిచేయాలని
చూస్తా మో అప్పుడే మనలో మనకి తెలియ ని లోపాలను వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తా రు. అప్పటి వరకు
మనం చూపిన ప్రేమాభిమానాలు అన్ని మరుగున పడిపోతాయి.ఇదే నేటి కొoదరు బందువుల, మనుషుల తీరు.
     💚💜💜
అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు.ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు.
సన్యాసం నాలుగు రకాలు .
*వైరాగ్య సన్యాసం*  వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది . ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన
ఉండదు.అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది. *జ్ఞాన సన్యాసం* సత్ సాంగత్యంద్వారా,లౌకిక వాంచలు తగ్గి పోయి
సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ , ఏది తనకు అంట కుండా వసిస్తూ ఉంటాడు .
*జ్ఞాన వైరాగ్య సన్యాసం* : సాధన ద్వారా , ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని నిత్య ఆనంద స్దితిలో
జీవిస్తా డు .
*కర్మ సన్యాసం* : బ్రహ్మ చర్యము , గృహస్త వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ, ఫలి తాన్ని ఆశించకకర్మలు చేస్తూ వెళ్ళిపోతూ
ఉండటం.ఈ సన్యాసులు ఆరు
*కుటిచకుడు*
శిఖ,యజ్నోపవితము దండ,కమండలాలు ధరించి సంచారం చేయకుండాభక్తీమార్గంలో వసిస్తూ అల్పాహారం
తీసుకుంటూఉంటారు.
బహుదకుడు : ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాదాన చేస్తూ ఉంటారు.
హంస : ఇతను జడధారియై కౌపినంధరించి ఉంటాడు...
*పరమహంస:వెదుర దండాన్ని కలిగి ,ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కోపినం మాత్రం ధరించి నిరంతర సాధనలోఉంటారు 
*తురియాతితుడు:-దేహాన్ని ఓ శవంలా చూస్తా డు...
*అవధూత:-ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియ మాలు లేవు. జగత్ మిధ్య నేను సత్యం అంటూ నాశనమయ్యే ఈశరీరం నేనుకాదు.
చూసే వాడికి కనిపించే ఈరూపంనాదికాదు. నాకు పాప పుణ్యాలు,సుఖ దుఖాలు లేవు,
గర్వము,మాత్సర్యము,దంభము,దర్పము,ద్వేషము, అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి అగ్ని దేవుడికి కాస్త దొరి కిన
ఆహరం అర్పణ చేస్తూ, దొరకని రోజు ఏకాదశి,దొరికిన రోజు ద్వాదశి అంటూ రాత్రి పగలు నిత్యఎరుకతో సంచారంచేస్తూ పిచ్చి
వాడిలా తిరుగుతూ ఉంటాడు. కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకునిఉంటాడు.(నిర్వాణ
షట్కా నికి ప్రతిరూపంఅవధూతల మరో రూపం )
అద్దము లో ప్రతిబింబం ఎంతకల్పితమో
ఎంత అసత్యమో ఈ ప్రపంచం కూడ అంతే
చిన్నపిల్లలు పశుపక్షాదులు ఈవిషయము ను అజ్ఞానముతో ఎట్లా గ్రహించలేరోఅలాంటి అజ్ఞానంచేతనే మనంపరమాత్మను గ్రహించ
లేకున్నాము.సత్యమునకు ఉన్నది పరమా త్మనే అ పరమాత్మనే ప్రపంచముగా కనిపి స్తుంది పరమాత్మకు వేరుగా ఏదిలేదు నీవు
కూడా లేదు.. తత్ త్వం అసి అది న
      💜🌴💜
పృథ్వి అంతా జలమయమైంది.ఆ జల మ యమైనటువంటి పృథ్వి మరల ద్వాదశ సూర్యుల చేత ఎండగట్టబడుతుంది. అగ్ని
తప్తమైపోతుంది.అయః పిండమై పోతుంది. అయః పిండమైనటువంటిది కాస్తా వాయు రూపాన్ని ధరిస్తుంది.
ఆ వాయు రూపాన్ని ధరించింది కాస్తా ఆకా శంలో లయమైపోతుంది. ఎక్కడ నుంచైతే ఉత్పన్నమైనాయో అవి తమతమ స్వస్థా న
మందు లీనమైపోతాయి.ఈరకముగా ఈ పంచభూతాలు వాటి యొక్క వ్యక్తీకరణ, వాటి యొక్క లయాన్ని ఇక్కడ బోధించే
ప్రయత్నం చేస్తు న్నారు.
     మరలా ఎట్లా ప్రాదుర్భవిస్తా యి అంటే, ఈ సృష్టి మొత్తా న్ని సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలనేటటువంటి పంచకృత్యాలుగా
బోధించే ప్రయత్నం చేస్తు న్నారు. ఒక విత్త నము స్వయంగా మొలకెత్తేస్తుందా? అంటే, దానికినీళ్ళయొక్క సంయోజనీయత జరిగి,
దాని యొక్క బీజ కవచం ఉబ్బి సిద్ధంగా మొలక రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితి ఒకటి. మొలక ఎత్తేటువంటి స్థితిఒకటి.
మొలక ఎత్తిన తరువాత రెమ్మలు,కొమ్మలు వచ్చికాండము ఏర్పడినటువంటిస్థితిఒకటి. తరువాత పూలు, ఫలములు వచ్చేటటు
వంటి స్థితి ఒకటి. ఈ రకంగా చెట్టు కి ఈ స్థితులు ఎట్లా అయితే ఉన్నాయో, అట్లా గే ‘బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తా న్‌మహత్‌మహదో
మహద హంకారః, మహదహంకారో ఆకాశః’ అని ఎక్కడిదాకా చెబుతున్నామో దానిని చక్కగా వివరిస్తు న్నారన్నమాట!
   ఒక చెట్టు యొక్క ఉత్పన్నము ఎలా అవు తుందో, అంకురం ఎట్లా వస్తుందో,ఆ అంకు రం మొలక ఎలాగవుతుందో, ఆ మొలక
కాండం ఎట్లా అవుతుందో, ఆ కాండమే ఫల పుష్పాదులను ఎట్లా ఇస్తుందో,ఆ ఉపమానా న్ని స్వీకరించి,విత్తనము ఏదైతేఉందో ఆ
విత్తనము ఉబ్బినటువంటిస్థితి మహతత్త్వ ము.విత్తనము విత్తనముగా ఉంటే నేమో మహత్తు కంటే ముందుఉన్నటువంటి అవ్య
క్తము. ఆ అవ్యక్తముకంటే ముందున్నటు వంటిది పరమాత్మ.
    కాబట్టి, అహం బీజ ప్రవర్తిత.అని,భగవ ద్గీతలోకూడా పరమాత్మ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెబుతూఉన్నాడు. నేను బీజ
ప్రదాతను. ప్రకృతి తల్లి వంటిది. నేను తండ్రి వంటివాడను అనేటటువంటిదికూడాఅక్కడ మనకు బోధిస్తు న్నాడు.అక్షర పరబ్రహ్మ
యో గము,పురుషోత్తమప్రాప్తియోగము. ఈరెండి టిని బాగా అధ్యయనం చేయాలన్నమాట.
  ఎవరైతే మహతత్త్వాన్ని,అవ్యక్తా న్ని,దాని పైనున్నటువంటి బ్రహ్మమును, తెలుసుకోవా లనుకుంటారో, వాళ్ళు ఈ భగవద్గీతలో అక్ష
రపరబ్రహ్మయోగాన్ని,పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని బాగాఅధ్యయనం చేయాలి.బాగా అధ్యయనంచేయడమంటే భగవద్గీతని,అది
ఉపనిషత్ సారముగా బోధింపబడింది కాబ ట్టి, ఏ ఉపనిషత్తు లనుంచి ఆయాశ్లోకములు స్వీకరించబడినాయో, ఆయా ఉపనిషత్తు
లని కూడా చదువవలసిన అవసరం ఉంది.
అధ్యయనం చేయవలసినటువంటి అవస రం ఉంది. శ్రవణం చేయాల్సిన అవసరం ఉంది. మనన నిధిధ్యాసలుచేయాల్సిన
అవసరంఉంది.అట్లా చదివేటటువంటివాళ్ళు మాత్రమే భగవద్గీతను క్షుణ్ణంగా చదివినట్లు .
ఎక్కడికక్కడ వ్యాఖ్యాన సహితంగాఉన్నటు వంటి గ్రంధాలలో,ఆ యా వాక్యములను,ఏ ఉపనిషత్తు ల నుంచి స్వీకరించ బడ్డా యో, ఏ
ఉపనిషత్ వాక్యములకు సమన్వయం అవుతుందో, శ్వేతాశ్వతరోపనిషత్, కఠోప నిషత్ ఇలా అనేక రకాలైనటువంటి,సమన్వ
యీకరించబడేటటువంటి,ముండక, మాం డూక్య,కేన,బృహదారాణ్యక.ఈ ఉపనిషత్తు ల యొక్క వాక్యాలన్నింటినీ కూడా,ఈ
భగ వద్గీతకు అనుసంధానపరచి, వ్యాఖ్యన విశేషాలు లభిస్తోంది.
  కాబట్టి,అటువంటి వ్యాఖ్యాన విశేషముల ను చదివేటప్పుడు కూడా,ఈసమన్వయం తో చదువుకోవల్సినటువంటి, అధ్యయనం
చేయవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడే భగవద్గీతను బాగా అధ్య యనం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అప్పుడే
సమగ్రమైనటువంటి అవగాహన కూడా కలుగుతుంది.
అప్పుడేమి తెలుస్తుందంటే, సర్వవేదాంత గ్రంథములన్నియూ కూడా ఆత్మనిష్ఠ, బ్రహ్మ నిష్ఠ, పరబ్రహ్మనిర్ణయం అనేటటువంటి
లక్ష్యాలు దిశగానే బోధించారు అనేటటువం టి సుస్పష్టమైన మార్గము బోధపడుతుంది.
🖤🌴🖤
        
     పురాతనమైన, వైశ్వికమైన సనాతన సాంప్రదాయం,మానవునిలో సప్త భూమిక లను కనుగొన్నది.1.భౌతికశరీరం 2.ప్రాణం
3.సూక్ష్మ శరీరం 4.పశుత్వం 5.మానవత్వం 6.ఆధ్యాత్మికం 7.దివ్యత్వం.ఈ దివ్యత్వాన్ని సమాధి అంటారు.సమాధిలో ఈశ్వర చైత
న్యాన్ని ఒకసాధకుడు అనుభవిస్తా డు.చిత్తా నికి ఆధారమైన ఆత్మశక్తి ఈ ఏడవ స్థితిలో వ్యక్తం అవుతుంది.మనస్సు సమాధిలో
ప్రవేశించడం వలన, మనస్సు ద్వారా కొన్ని లేదా చాలాసిద్ధు లు వ్యక్తంఅవుతూంటాయి.
   సమాధి స్థితిని చేరిన యోగి దేశకాలాల పరిధి దాటిన స్థితిలో ఆ పరమాత్ముడితో కూడా ఐక్య జ్ఞానాన్ని సాధిస్తా డు. అనంత
శక్తినిలయమైన పరమాత్ముడి ద్వారా దివ్య శక్తు లు ప్రవహించడానికి జీవాత్మ ఒక పరి కరంగా భాసిస్తుంది.
*మనిషి తనను తానుస్వస్థతపరచు కోవడ
ము. మన ఉనికిని నిర్దేశించే ప్రకృతి సూత్రా లను అర్థం చేసుకొని, జీవితాన్ని ఎవరు గడుపు తారో వారు మంచి ఆరోగ్యంతో ఉంటారు.
"యద్భావం తద్భవతి "...అనే వాక్యంలో, గొప్ప వైశ్విక సత్యం ఉంది. మన భావం ప్రకృతి బద్ధ జీవనం అయితే, ఫలితం గొప్ప
ఆరోగ్యంగా ఉంటాము. ఒక పూర్ణుడై న యోగి జబ్బు పడడు.అతడు సమాధి స్థితిని సాధించి ఉండడం వలన, అతను వైశ్విక
ప్రాణశక్తితో నిరంతరం అనుసంధానం అవ్వ డం వలన పూర్ణ ఆరోగ్యంతోఉంటాడు. ఒక హఠ యోగి అయితే, తాను జబ్బు పడడా
నికి ఇష్టపడడు. అయితే అతడు ఏ ఒక్కనా డై నా కర్మను అనుభవించాల్సి వచ్చినపుడు జబ్బుపడవచ్చును.నిత్యమూ సమాధి స్థితి
లో ఉన్నవాడు, ప్రాపంచిక వ్యవహారాల్లోకి రావడం అంతగా ఇష్టపడడు.
*మనో స్వస్థత - ఒక సిద్ధి :*
    మనో శక్తి ఒక సహజ శక్తి.ఆ శక్తి స్పృహ తో రోగి అర్థబాహ్య మనస్సులోకి, సూటిగా ప్రయోగించబడుతుంది. ఇక్కడ బాహ్య
మనస్సు కంటే (స్థూల మనస్సు), సూక్ష్మ మనస్సు వ్యాపక శక్తి విశాలమైనది. బాహ్య మనస్సు, నేను-నాది అనే పరిధిలో ఉండి
పోతుంది.ఎరుక గలిగిన మనస్సు, శరీరము యొక్క రోగాన్ని అదుపు చేసి,మనో స్వస్థత కు కారణమై అద్భుత ఫలితాలనిస్తుంది.
మనస్సు బాగుంటే, శరీరము బాగుంటుంది
*మహిమాసిద్ధి*అనగా తన శరీరాన్ని,అనూ హ్యమైన పరిమాణంలోకి పెంచుకోవడం. హిందూపురాణ,ఇతిహాసాది సాహిత్యంలో ఈ
మహిమాసిద్ధికి సంబంధించి,ఎన్నో ఉదా హరణలు ఉన్నాయి. ఉదాహరణకు,శ్రీమద్రా మాయణంలో,హనుమంతుడు సందర్భాన్ని
బట్టి...ఎన్నో సిద్ధు లు ప్రదర్శిస్తా డు కదా! అలాగే భగవద్గీతలో గల విశ్వరూప సంద ర్శన యోగంలో మనము ఆ భగవానుని
విశ్వరూపాన్ని చూస్తా ము.....
పెక్కు ముఖములు, నేత్రములు కలదియూ, అనేకములగు అద్భుత విషయాలు చూపు నదియూ, దివ్యములైన పెక్కు ఆభరణము
లతో కూడినదియూ,అనేక దివ్యాయుధము లతో కూడినదియూ,దివ్యములైన వస్త్రము లు-పుష్ప మాలికలతో కూడినదియూ,అనే
క ఆశ్చర్యములతో నిండియున్నదియూ ప్రకాశమానమైనదియూ,అంతము లేనిది యూ,అయిన ఆవిశ్వరూపము చూపిరి
మిమ్ము,అనేక హస్తములు,ఉదరములు, ముఖములు, నేత్రములు గలవారిగను, అనంత రూపులుగనూ నేను చూస్తు న్నాను.
మరియూ మీ యొక్క తుది - మధ్యము - మొదలునుగాని,నేను గాంచజాలకున్నాను.
    ఇలా భగవంతుని శక్తిని మనము పవిత్ర గ్రంథాలలో చూస్తా ము. అయితే మనిషి సాధించే సిద్ధు లకు-భగవద్విభూతులకు
హస్తిమశకాంతరం ఉంది!!!
   మరో విషయం.మహిమా సిద్ధితో అనుసం ధానించబడిన మరొక సిద్ధి దూర దృష్టి. దీనిని clairvoyance అంటారు.
ఈ మహిమా సిద్ధిని ప్రదర్శించగలయోగులు ఉన్నతస్థా యి యోగులు.ఈసిద్ధిని ప్రదర్శించ గలయోగులుఅరుదుగాఉంటారు.ఒక
పూర్ణు డై న యోగి కూడా ఈ సిద్ధిని అరుదుగా ప్రయోగిస్తా డు.
యోగ సిద్ధిని పొందిన యోగి సూర్యకాంతిని వినగలడు. శబ్దా న్ని చూడగలడు కూడా. దూరంగా ఉన్న వస్తు వు పరిమళాన్ని రుచి
చూడగలడుకూడా దూరంగాఉన్న పదార్ధా ల సుగంధాన్ని ఆఘ్రాణించగలడు.ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి?మన
ఇంద్రియాలసహజ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం వల్లనే ఇవన్నీ సాధ్యమవుతాయి.ఒకయోగి, సత తం ధ్యానం ద్వారా తన
ఇంద్రియాల సామ ర్థ్యాన్ని,ఎన్నోరెట్లు అధికంచేయగలడు. ఇంద్రి యాలలోని నిబిడీకృతమైన అతీంద్రీయ జ్ఞానమంతా,ధ్యానంలో ఒకే
ఒక్క విషయం పై పొందే ఏకాగ్రత వలన వెల్లడి అవుతుంది. సిద్ధు లు,అతీంద్రియాను భూతులు ఈ విధం గా కూడా ప్రకటిత
మవుతూ ఉంటాయి.
    కుండలినీ శక్తి జాగృతమైన యోగి, తన సాధనల ప్రభావంలో ఉన్నప్పుడు...అతని భౌతిక శరీరమందలి అవయవాలన్నీ,మంచి
సామర్థ్యంతో చురుకుగాఉంటాయి.అటువం టి యోగిశరీరం దివ్యానుభూతులు,సిద్ధు లు
ప్రకటనంకావడానికిఅనుకూలంగాఉంటుంది
🌷🌴🌷🌴🌷
     
   భూ ఉపరితలం క్రింద,ఏదైనా నాగరికత ఉందా? లేక కేవలం ఘనపదార్ధంగానేభూమి ఉందా?నికెల్,ఇనుము, తదితర లోహాలు,
మట్టి, రాళ్ళు రప్పలతోనే భూమి యొక్క ఉపరి భాగం తర్వాత పొరలు ఉన్నాయా? లేక ఏవైనాభూగర్భనాగరికతలుఉన్నాయా? ఈ
ప్రశ్న జిజ్ఞాసువైన ప్రతిఒక్కరికీ వస్తుంది. అయితే భూమి గూర్చి, భూస్వరూపాల గూర్చి మనిషికి తెలిసినది తక్కువే. తెలుసు
కోవలసినది చాలా ఉంది.
ఈ నేపథ్యంలో "హాలో ఎర్త్" సిద్ధాంతం ప్రకారం..  భూమి క్రిందగల "అగార్తా "
(Aghartha),గూర్చి తెలుసుకుందాం.అయి తే "అగార్తా " హిందూ పురాణాల్లో చెప్పబడ్డ పాతాళ లోకమా పరిశీలిద్దాం. "అగార్తా "
ఒక ప్రాచీన, మార్మిక నగరం. ఈ నగరం భూమి లోపలి పొరల్లో కలదు. చాలా సార్లు ఈ "అగార్తా ".."శంబల" నగరానికి
సన్నిహితంగా ఉన్నట్లు కథనాలు చెబుతు న్నాయి. శంబల ప్రస్తా వన, విష్ణు పురాణం నందు మనం కాంచవచ్చును.
  శంబల-కల్కిభగవానుడు-కలియుగాంతం- పోతులూరి వీరబ్రహ్మం గారి కాల జ్ఞాన తత్వాలు-వీటిలో కలి యుగాంత ప్రస్తా వన
అలాగే భవిష్య పురాణంలో కూడా కలియు గాంతప్రస్తా వన ఇదంతా చదువరులందరికీ తెలిసిన విషయమే !!!
ఆధ్యాత్మిక జిజ్ఞాసువులైన చాలామందిలో కొంత మందికైనా "శంబల" గూర్చి తెలుసు. (గతంలో నేనే శంబల గూర్చి కొన్నివ్యాసాలు
ఇచ్చాను. ఆసక్తి కలవారు చదువగలరు.)
  మానవ పరిణామ క్రమంలో...మన కంటే ముందున్న బుద్ధి జీవులనివాసమే "శంబల". శంబల వాసులు, తపస్వులు. నిరంతరం
ఊర్థ్వ చైతన్యంతోసంబంధంకలిగిఉంటారు. శంబల వాసులు,నిరంతరం ఉన్నత తలాల తో (డై మన్షన్స్) సంబంధం కలిగిఉంటారు.
శంబలను జంగమ దేవరల నివాస స్థలం గాను, విస్మృత దైవీక రాజ్యంగానూ, శ్వేత- జలాల భూమి గానూ, జీవించే అగ్ని గల భూమి
గానూ కూడా "శంబలను" గుర్తిస్తా రు.
ఇక "అగార్తా "విషయానికొద్దాం.చాలామంది పరిశోధకుల ప్రకారం"అగార్తా " అన్న భూగర్భ నగరానికి వెళ్ళడానికి కొన్ని
దారులున్నాయి Kentucky Mammoth Cave - USA, బెర్ముడా ట్రయాంగిల్,భారత్- టిబెట్ సరి హద్దు
హిమాలయాలు,భూమి యొక్క ధృవ ప్రాంతాలలోని గుహ్యమైన మార్గాలు....వీటి ద్వారా "అగార్తా "కు వెళ్ళే మార్గాలున్నాయని
చెబుతున్నారు. అయితే భారత-టిబెట్ దేశాలలో మాత్రం ..ఆయా మార్మిక దారుల న్నీ, శక్తివంతులైన హిందూ- బౌద్ధ యోగుల చే
కాపాడబడుతున్నాయి. అర్హులకు మాత్ర మే ఆరహస్యాలు అందజేయబడుతున్నాఇ
ప్రాచీన చరిత్రలు ఏం చెబుతున్నాయంటే, లక్షల సంవత్సరాల క్రిందట, అనేక కారణాల వలన, బుద్ధి జీవులైన కొందరు ప్రజలు భూ
గర్భంలో గల నగరానికి వలసవెళ్లిపోయారు. వారు తమస్వంతదైన అనుకూల పరిస్థితు లతోనూ,పర్యావరణ అనుకూల పరిస్థితుల
తోనూ, తమకుగల మార్మిక,ఆధ్యాత్మిక అవ గాహనతోనూ తమ నివాసం అయిన "అగా ర్తా " నగరాన్ని నిర్మించుకున్నారు.
ఇక "హాలో ఎర్త్" సిద్ధాంత నిరూపణలకొస్తే, గత మూడు, నాలుగు శతాబ్దా లుగా భూమి లోపలి నాగరికతలను పరిశోధించే పరిశోధ
నలు ఎక్కువయ్యాయి.భూమి కేవలం మట్టి, రాతి ముద్ద కాదు.శాస్త్ర వేత్తల ప్రకారం,వారి పరిశోధనల ప్రకారం భూమి కేంద్ర భాగంలో
అతి వేడిగా ఉన్న మాగ్మా కలదు.కానీ"పాతా ళావరణం "(hollow sphere) చుట్టూ దట్ట మైన భూ ద్రవ్యరాశి (భూమి-భూ
స్వరూపా లు)కలదు. ఉత్తర దక్షిణ ధృవాలలో తెరుచు కొనేటట్లు గానూ కూడా కలదు. ఈ భూమి లోపలి భాగంలో ఒకసూర్యుడు
కూడా ప్రకా శిస్తు న్నాడనికూడా సిద్ధాంతాలు చెబుతున్నా యి. "హాలో ఎర్త్" సిద్ధాంతం ప్రకారం భూద్ర వ్యరాశి వలయం సుమారు
600 నుండి 800 మైళ్ళ వ్యాసం తోనూ, ధృవాల వద్ద 100 నుండి 1400 మైళ్ళ వ్యాసం తోనూ ఉన్నాయి అని హాలో ఎర్త్ సిద్ధాంతం
చెబు తోంది. ఈ రకంగా కేంద్రంలో 7000 మైళ్ళ తోనూ ,ఈ పాతాళం విస్తరించి ఉందట.విచి త్రమైన విషయమేమిటంటే, భూమి-
నీరు ఆవరించిన నిష్పత్తి పరిశీలిస్తే, భూమి ఉపరి భాగానికి, భూమి అంతర్భాగానికి (హాలో ఎర్త్) , పరస్పర విరుద్ధం గోచరిస్తోంది.
భూమి పై భూభాగం,జల భాగముల నిష్పత్తి 1 : 4 అయితే, ఈ inner crust లో వీటి నిష్పత్తి 4 : 1 గా ఉంది. ఈ వైరుధ్యానికి
కారణం భూమి పైభాగంలో ప్రవహించే జల స్వరూపా లైనసముద్రాలు,నదులు,సరస్సులవలన ఆ నిష్పత్తి 1 : 4 గా ఉంటే,ఆ
జలస్వరూపాలు, వాటి క్రింద గల భూభాగంపై ననే ఆధారపడి ఉన్నాయి.....
"హాలో ఎర్త్" సిద్ధాంతాన్ని ధృవీకరిస్తూ, మన పురాణ, ఐతిహ్యాలలో కూడా సాక్ష్యాధారా లున్నాయి.....
   సగర పుత్రు ల కథ - పాతాళ గంగ (బ్రహ్మాండ పురాణాంతర్గతం)
*సగర పుత్రు లు....*
సగరుడు సత్య యుగానికి చెందిన గొప్ప చక్రవర్తి. సూర్య వంశం లేదా ఇక్ష్వాకు వంశా నికి చెందిన రాజు. రామాయణంలో దశరథ
మహారాజుకి ఈయనపూర్వీకుడు.ఆయనకి ఇద్దరు భార్యలు ఒకరు విదర్భ రాజకుమారి. మరొకరు శైబ్య.సగరునకు
వైదర్భి,శైబ్యఅను ఇద్దరు భార్యలు. శైబ్యకు అంశుమంతుడను కుమారుడు, వైదర్భికి 60వేలమంది కుమా రులు కలిగిరి.సగరుని
అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రు డు యాగధేనువు ను పాతాళంలో(పాతాళం అనగా హాలో ఎర్త్ అని అగార్తా అని
బలమైనభావన)దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రు లు కపిలమహాముని శాపమున భస్మమై
పోయారు.వారికి ఉత్తమ గతులు లభించాలంటే దివిజ గంగను పాతా ళానికి తేవలసి ఉంది.సగరుడు,అతని కొడు కు
అసమంజసుడూ తపస్సు చేసినా ప్రయో జనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు
భగీరధుడు.
భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరా
వడానికి సిద్ధంగా ఉన్నాను.కాని నా దూకు డు భరించగల నాధుడెవ్వరు?"అని అడిగిం ది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు.
అనుగ్రహించిన శివుడు దివిజ గంగను భువి కి రాగానే తన తలపై మోపి,జటాజూటంలో బంధించాడు.భగీరధుని ప్రార్థనతోఒకపాయ
ను నేలపైకి వదలాడు.భగీరధుని వెంటగంగ పరుగులు తీస్తూ సాగింది.దారిలో జహ్ను ముని ఆశ్ర్రమా న్ని ముంచెత్తి,"జాహ్నవి"
అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి,పాతా ళానికి చేరి,సగరుని పుత్రు లకు ఉత్తమ గతు లను కలుగజేసింది.ఇది మనందరికీ చాలా
వరకు తెలిసిన కథయే.ఈ కథలోచెప్పబడ్డ పాతాళమే, నేటి "హాలో ఎర్త్ (Hollow Earth) కావచ్చందామంటారా?  పరిశోధనార్హం.
*మహా విష్ణువు యొక్క కల్క్యావతారం..
శ్రీమద్భాగవతంలో, ద్వాదశ స్కందంలో చెప్పబడ్డ శ్లోకం ప్రకారం .......
కలియుగాంత కాలంలో,కల్కి భగవానుడు, ఈ శంబల నగరం నుండే ఉద్భవిస్తా డని, అతను భూమిపై అవతరించి "సత్య యుగ"
స్థా పన చేస్తా డని చెప్పబడి ఉన్నది. ఈ విష యం పద్మ పురాణం, భవిష్య పురాణంలలో కూడా చెప్పబడినది. అయితే ఈ "శంబల"
నగరం ఆనుపానులు ఇంకా,ఈ రోజుకీ తెలి యరాలేదు.రక రకాలుగా చెబుతున్నప్పటికీ అంతా మార్మికం !!! గూఢం !!! ఇలాగే
ఉంటుంది.చాలామంది పరిశోధకులు ఈ "శంబల" హాలో ఎర్త్ లేదా అగార్తా కు చెందిన నగరమే అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తు
న్నారు. కొన్ని సార్లు టిబెట్ సాంప్రదాయాల ప్రకారం ఈ శంబల భూగర్భ నగరమే!
   శ్రీమద్రామాయణం ప్రకారం,భూమి లోపల కూడా జీవనం ఉంది అని తెలియడానికి తగు ఆధారాలున్నాయి.సీతా మాత, రావ
ణునిచే అపహరించబడిన తరువాత, రావ ణుణ్ణి తాను వెంటాడి వేటాడతానని,భూమి లోపలి చీకటి గుహల పర్యంతంతాను వెంట
తరుముతానని,ఆయా ప్రాంతాల నుండి సీతమ్మను విడిపించి,వెనుకకు తీసుకువస్తా నని, శ్రీరామునితో లక్ష్మణుడు అంటాడు.
దీనిని బట్టి ఆనాటికే ,భూమిలో గల రహస్య ప్రాంతాలు తెలుసునని ఈ సంఘటన చెబు తోంది. రామాయణ కాలంనాటికే ఈ రోజు
మనం చెప్పుకొనే అగార్తా , హాలో ఎర్త్ తెలు సును అందామా? ఆ అగార్తా యేపాతాళమా
  ఇక రామాయణమందలి కిష్కిందకాండలో వాలినిచంపడానికి తనబలాన్ని నిరూపించు కొనే ప్రయత్నంలో శ్రీరాముడు 7 తాళ వృక్ష
ముల ద్వారా తన నిశితమైన శరాన్ని సంధి స్తే, ఆ శరం,ఆ తాళ వృక్షములను ఖండిస్తూ ఒక కఠిన మైన రాతిని చీల్చుతూ, పాతాళా
న్ని స్పృశిస్తూ...తిరిగి తన అమ్ముల పొది లోకి చేరుతుంది.
    బౌద్ధు లు ఈ అగార్తా వాసులను,వీరు నివసించే అగార్తా ను,అగార్తా గలపాతాళాన్ని (హాలో ఎర్త్)....ఎటువంటి సంకోచం లేకుండా
విశ్వసిస్తా రు..ఈ అగార్తా లో లక్షలాది మంది ప్రజలు నివసిస్తూ ఉంటారని, వారిలో గొప్ప లామాలతో,ఈ అగార్తా వాసులుసంభాషిస్తూ
ఉంటారని బౌద్ధు లు చెబుతూంటారు. దలైలామా, భూమి మీదగల ఆ రహస్య ప్రపంచానికి ప్రతినిధిఅనినమ్మూతూంటారు.
కొన్నివేలసంవత్సరాలనుండిఅగార్తా వాసుల, శంబల వాసుల సందేశాలు తమలామాలకు ప్రసారం చేయబడుతున్నాయని బౌద్ధు ల
గాఢ విశ్వాసం.అనేక భూగోళ ప్రళయాల నుండి తట్టు కుని ఈ భూ అంతర్భాగంలో నివసిస్తు న్న ఈ అతి మానవజాతి గొప్ప మేధో
సంపత్తి కలది.....
   టిబెట్ రాజధాని లాసా,శంబలకు వెళ్ళే ఒకానొక రహస్య మార్గంతో కనెక్టు చేయ బడిందని,తనకు ఒకసిద్ధు డై న తాపసి అయి న
లామా చెప్పాడని చెబుతాడు. అయితే ఈ అగార్తా వాసులు, మన మానవ జాతి కంటే కూడా హెచ్చు వయస్సు కలవారని,
మార్మికులు చెబుతూఉంటారు.వారికి,ఒక్కొ క్కరికీ కొన్ని వేల సంవత్సరాలు భట్టా చార్య ఉన్నప్పటికీ ,ఒక్కొక్కరూ విచిత్రంగా 35-40
సంవత్సరాల వయస్కులుగా ఉంటారట. వారు ఇచ్ఛా శరీరధారులు కూడా...
  వారికి"రాత్రి"తెలియదుట.పొగచూరిన సూర్యుడు లేదా మబ్బుపట్టిన సూర్యుని వెలుతురు,ఈ అగార్తా కేంద్రకంలో భాసిస్తూ
ఉంటుందట.మనం భూమ్యాకర్షణశక్తికి లోనై ఉంటాముకదా! కానీ ఈ అగార్తా లో ఈ భూ మ్యాకర్షణ
శక్తిచాలాతక్కువఉంటుంది.లేదా ఆశక్తి ఇక్కడ ప్రభావం చూపడం తక్కువ. ఫలితంగా ఇక్కడిజీవుల శరీరాలు తేలికగా
ఉంటాయి.ఈ అగార్త పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం అగార్తా లో ఎప్పుడూ24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని, ఇక్కడ
gravitational force తక్కువగా ఉండడం వలన ఇక్కడ మనుజులు, చాలా తక్కువ బరువును కలిగి యున్నట్లు భావిస్తా రు.
💘🌹🌴🌹🌴🌹
       
*"కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁడాకాశంబునం, గుంభినిం గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం గలఁ,
డోంకారమునం ద్రిమూర్తు లఁ ద్రిలింగ వ్యక్తు లం దంతటం గలఁ, డీశుండు గలండు, తండ్రి వెదకంగా నేల యీ యా యెడన్.....
శ్రీమహావిష్ణువు లేనిచోటు విశ్వములో ఎక్క డ లేదు.అంతటవ్యాపించియే ఉన్నాడు. నీటిలో,గాలిలో,ఆకాశంలో ఉన్నాడు.భూమి
మీద ఉన్నాడు.అగ్నిలోను ఉన్నాడు. సర్వ దిక్కులలోను ఆయనఉన్నాడు.పగలు,రాత్రి సమయాలలో ఉన్నాడు.సూర్యుడు,చంద్రు
డు, ఆత్మ, ఓంకారం, త్రిమూర్తు లైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్త్రీ పురుష నపుంసక అనే త్రిలింగ వ్యక్తు లు అందరు ఇలా బ్రహ్మాది
పిపీలక పర్యంతమందు ఆయన ఉన్నాడు. అట్టి సర్వ పూర్ణుడు,సర్వవ్యాపి,సర్వేశ్వరు డు కోసం ఎక్కడెక్కడో వెదకాల్సినపనిలేదు.
సర్వే,సర్వకాల సర్వావస్థలలోన ఉంటాడు.
  ఇందుగలఁ డందు లేఁ డని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన నందందే కలఁడు దానవాగ్రణి!వింటే
శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల
అన్నటి యందు ఉండేవాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నదిలేదు;అందుచేత ఎక్కడై నా సరే వెతికి చూడాలే కాని
అక్కడే ఉంటాడయ్యా. రాక్షసరాజా!” పదౌచిత్యం, సందర్భౌచిత్యం,పాత్రౌచిత్యం అందంగా అమరినపద్యం.బాలురనోట
సున్నాముందు న్న దకారం అందంగాపలుకుతుంది. ప్రతి పదంలో రెండవ అక్షరాలకి సామ్యం ఉండా లన్నది అందమైన
ప్రాసనియమం..ఈ రెంటి ని చక్కగా సమన్వయం చేసిన తీరు అద్భు తం. చిన్నపిల్లలు చేతులు కాళ్ళు కదుపుతు చెప్తు న్నట్లు
చెప్తా రు..అది పద్యం నడకలోనే స్ఫురిస్తు న్న తీరు ఇంకా బావుంది.తనకే ఎదురు చెప్తా డా అన్న ఆగ్రహంతో ఊగిపో తున్నాడు తండ్రి
హిరణ్య కశిపుడు.అంచేత ‘హరి హరి అంటున్నావు,.ఎక్కడున్నాడ్రా చూపగలవా?’అంటు బెదిరిస్తు న్నాడు తండ్రి. కొడుకు
ప్రహ్లా దుడు నదురు బెదురులేని అయిదేళ్ళ పిల్లా డు.తన బాల్యానికి తగి నట్లు అలా చిరునవ్వులతో నటనలు చేస్తూ ‘సర్వోపగతుడు
శ్రీహరి’ అని సమాధానం చెప్పాడు.ఆ సందర్భానికి తగినట్లు పద్యం నడకసాగింది.పలుకుతున్న బాలకుడి పాత్ర కు గంభీరమైన
సున్నితమైన పదాలు ‘ఎం దెందు’, ‘అందందు’ చక్కగా తగి ఉన్నాయి. మరి అప్పుడు ఆపరమభక్తు ని మాట బోటు పోనివ్వని
నారాయణుడు నరసింహ రూపం లో విశ్వమంతా వ్యాపించి సిద్ధంగాఉంటాడు
💙🌴💙
                                
ఎవరితోనైనా  స్నేహంచేయడం ఎంతో కష్టం.
శత్రు త్వం చేయడం ఎంతో తేలిక.....
    లోపాలున్న వ్యక్తిలోనూ సుగుణాలుంటా యి.వాటిని గుర్తించి అతన్ని ప్రోత్సహించడ మే మనం చేయవలసిన పని......
" కారం మన నాలుకను మండిస్తింది. అహం కారం ఎదుటివారి  హృదయాలను తీవ్రంగా గాయపరుస్తుంది.
ఉద్రేకం మనసులనుదండిస్తుంది.అదే మమ కారం అయితే,.మన మనజీవితాలను
పండిస్తుంది..
అందరితో కలిసి ఉండు.అందరిలానవ్వుతూ ఉండు. అంతేగాని అంతా నావాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి...
విషం కన్నా చాలా ప్రమాదం అని తెలుసు కుని నడుచుకో.....
గతాన్ని గూర్చి ఆలోచించకు. మనసు కలిచి వేస్తుంది. భవిష్యత్త గూర్చి ఆలోచించకు. భయంవేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని
ఆస్వాదించు.సంతోషంనీసొంతమవుతుంది
ఎవరు ఎంత హేళన చేసినా, నీవు తొందర పడకు. హేళన చేసినవారితో సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది.ఓర్పుతో ఉండు.
నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది.
విజయం సాధించిన వ్యక్తిగాకాదు.విలువలు కలిగినవ్యక్తిగా ఎదగడానికి ప్రయత్నించు. బాధలు అనేవి గాలిలాంటివి.అవిలేని చోటం
టూ ఏదీలేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్టు బాధపడకు.
గొప్పవారి యొక్క గొప్పతనం, వారు చిన్న వారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది.
గొప్పపనులు చేయడానికికావలసినదిఓపిక.
జీవితంలో ఎదురయ్యే ప్రతిఓటమి,విజయా నికి అవసరమైన ఎన్నో విషయాలు నేర్పు తుంది.ఇటువంటి సందర్బాలలోనే మనుషు ల
తత్వాలుబోధపడతాయని అర్దమౌతుంది
సమస్యలు, అవహేళనలు, అవమానాలు జీవితంలో సర్వసాధారణమని గ్రహించాలి.
అప్పుడే జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవ చ్చు.సమున్నతంగాను తీర్చిదిద్దు కోవచ్చు. ఆదర్శంగాను నిలుపు కోవచ్చు. కోపము మన
స్వార్థంకోసంవస్తే అది మనకు వినాశన హేతువు అవుతుంది. కానీ సామాజిక రుగ్మ తలు,అసమానతలు,దురాగతాలుమరియు
అనుచిత ధోరణులపై వస్తే మంచిదే.
ప్రపంచములో మంచి చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మంచి చేసే వాళ్ళు తక్కువగా వున్నారు.మనదరి చేరని వాటి కోసం
పట్టు పట్టడం ఎంత మూర్ఖత్వమో, మన చెంత ఉన్నవాటిని వదులుకోవడం కూడా అంతే మూర్ఖత్వము.
   జీవితంలో ఆనందంగా మనంఉండాలంటే ఆస్తు లు ఉండవలసిన అవసరంలేదు.మన మే ఒక ఆస్తిగా భావించే ఓ తోడు ఉంటే
చాలు. జీవితంలో బాధలు లేకుండా ఉండా లంటే బంగ్లా లు ,కారులు ఉండవలసిన అవ సరం లేదు .మనకు బాధే తెలియకుండా
చూసే ఓ బంధముంటే చాలు..
    ప్రాణం పోతే తిరిగి రాదు అనే నిజం మనకు తెలిసినా మనిషి చనిపోగానే తిరిగి రమ్మని , బతికి రమ్మని శవం మీద పడి గుండెలు
బాదుకుని బోరునఏడుస్తాం.అంత ప్రేమ మనిషి బతికుండ గా చూపించరు.. ఎందుకని ? .
    మనం నవ్వినా కన్నీళ్లు వస్తా యి.ఏడ్చినా కన్నీళ్లే వస్తా యి.కానీ ! మనల్ని నవ్వించిన వారు నాలుగు రోజులు గుర్తుంటారు.కాని
మనల్ని బాధపెట్టిన వారు బతుకంతా గుర్తుంటారు.
తనవరకు వచ్చినప్పుడుమాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగా కనిపిస్తుంది.
అనుభవమే మనిషికి గుణపాఠం..
[12/19, 5:03 AM 💙🌷🌴🌷🌴🌷
*త్యాగం, ఆదర్శం లోపిస్తే వ్యక్తు లకు ఎంత ప్రతిభ ఉన్నా,ఎంత సంపదఉన్నా అవి
మానవాళికి నిష్పయ్రోజనంగా పరిణమిస్తా యి. ఉత్తముడు తన జీవితంలోకి చెడు రానివ్వడు.స్వీకరించిన పనిని నిజాయతీ గా చేసే
వ్యక్తు ల జీవన విధానాల్లోఆదర్శం, త్యాగం మిళితమై ఉంటాయి.‘మనం వేరు, సమాజం వేరు’ అనే భావన అహంకారానికి
దారితీస్తుంది. మనలాంటివారే మన చుట్టు పక్క ఉన్నవారు అనేభావనధైర్యాన్నిస్తుంది.
*మన సమాజంలో చాలామందికి ‘నేను ఒక్కణ్నే కష్టా లు పడుతున్నాను’అనే భావన ఏర్పడుతూ ఉంటుంది.‘కాదు కాదు నాలాం
టివారు ఎందరోఉన్నారు’ అని గ్రహిస్తే ధైర్యం కలుగుతుంది. అహంకారంతో నలుగురికీ దూరమైతే బిక్కుబిక్కుమంటూ భయంతో
బతకాల్సి వస్తుంది.
*ఈశ్వరుడు తప్ప సర్వజ్ఞులెవరూఉండరు. తమకు అన్నీ తెలుసునని ఎవరైనా అహంక రిస్తేవాళ్లకు ఏమీ తెలియదని అర్థం!.
అందరితో కలిసిమెలిసిజీవించడానికి అహం కారం అడ్డు వస్తుంది.అహంకారికి లోకం తెలి యదు.అందరిలో తానూ ఒకడనే సంగతి
గ్రహించినవాడే ధన్యుడు..
  *విజ్ఞులైనవారు కష్టకాలాన్నిసద్వినియోగ పరచుకుంటారు. అస్త్ర శస్త్ర పరీక్షల్లో ఉత్త ముడిగా అర్జు నుడునెగ్గాడు. ఆ తరవాత
అర్జు నుడు విద్యాభ్యాసం కొనసాగించాడు. విద్యార్థికి అహంకారం కూడదు.. నిత్యవిద్యార్థి,వినయశీలి.సామాన్యులతో కలిసిమెలిసి
జీవిద్దాం.....
*కష్టా లను స్వయంగా రుచి చూసినవాళ్లు ఇతరుల కష్టా లకు వెంటనే స్పందిస్తా రు....
ఒకరికోసం ఒకరు నిస్వార్థంగా జీవితాలు సైతం అర్పించడానికి సిద్ధపడటంకంటే గొప్ప త్యాగం ఉండదు....
*అహంకారి ఒకహద్దు కు పరిమితమై ఉంటా డు. గిరిగీసుకొని దాంట్లో తననుతాను బం ధించుకుంటాడు. అదే సర్వలోకం,సర్వస్వం
అంటాడు. మొండిగా,మూర్ఖంగా ప్రవర్తిస్తా డు. సమాజ సమగ్ర స్వరూపం,సత్యం తెలు సుకోవడం అతడికి అసాధ్యమవుతుంది.
*ఇతరుల గొప్పతనం గుర్తించడంలోనే గొప్ప  తనం ఉంది. ‘సమాజంలో ఎప్పుడూ మన కంటే గొప్పవాడు ఉంటాడని గ్రహించడం
అవసరం’. అది జ్ఞానుల లక్షణం......
        🖤🌹🌴🌹🌴🌹
మనష్యుడుగా దిగజారుతూ ఎదుగుతన్నా మనుకుంటున్నాం, ఎంత భ్రమలో ఉన్నాం!.
  ఆలోచిస్తేనే మనుష్యుడు.“మనుష్యః కస్మాత్?”ఎవరిని మనుష్యుడనాలి.?
“మననాత్ మనుష్యః” ఆలోచించేవాడు మనుష్యుడు.“క్రైస్త వులు” క్రైస్త వేతరులను క్రైస్త వులు కాండని ఉద్భోధిస్తు న్నారు.
“మహమ్మదీయులు” మహమ్మదీయేతరు లను, మహమ్మదీయులు గండని కత్తిఝులి
పిస్తు న్నారు...వేదం,మాత్రము,”మనుర్భవ”మనష్యుడవు కమ్ము.మనుష్యులు మను ష్యులుగానున్నప్పుడు విశ్వమానవ సౌభ్రా
తృత్వం వెల్లివిరుస్తుంది అని భోదిస్తుంది..
         ❣️🌹🌴🌹🌴🌹
*స్వప్నాలలో  రకాలు....*
అవి..1.దృష్టం :మనకి అనుభవమైన సంఘ టనలు కలలో చూడడం.
2.శృతం :విన్నవి కలలో చూడడం.
3.అనుభూతం :స్పర్శ, ఆస్వాదన, వంటివి కలలో కనిపించడం.
4.ప్రాదితం:మనంఆశించినవాటినిచూడడం
5.కల్పితం :కల్పనా వస్తు వులను, సంభవా లను చూడడం.
6.భావిజం :ఏ విధానికి చెందనివి.
7.దోషజం :త్రిదోషాల బాధలోఏర్పడే కలలు.
ఫలించని కలలు పగటికలలు.ఉదయం లేవ గానే మరచిపోయే కలలు.చాలాసేపు వరస గా కనే కలలు.అర్ధరాత్రి కి ముందు వచ్చే
కలలు. ఇటువంటి కలలు ఫలించవు.
తెల్లవారుజామున వచ్చే కలలు భవిష్యత్ లో ఫలించే అవకాశమున్నది.
*జీవితం అంటే అనిపించింది చేయటంకాదు అనుకున్నది చేయటం,అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్లు ,అనుకు
న్నదిచేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు .
🖤🌹🌴🌹🌴🌹
        
*‘హరిదాసు’ బహుసా ఈ పేరు తెలియని తెలుగువారుగానీ,తెలుగు లోగిలిగాని ఉండ కపోవచ్చు,ధనుర్మాసం,హరిదాసుల సందడి
ఎంతోబాగుండేది. హరినామ సంకీర్తనచేస్తూ శిరస్సున అక్షయ పాత్ర ధరించి ,సాక్ష్యాత్తు ఆ శ్రీహరే నడిచి వస్తు న్నాడా అనిపించేది. ప్రతి
ఇంటి ముందు వీరు భిక్ష స్వీకరించి ఆశీర్వదించేవారు…
*వీరు భిక్ష రూపేణా  స్వీకరించిన బియ్యాన్ని కానీ ,మరే ఇతర పదార్ధా లను కానీ ,వీరి స్వార్ధా నికి కాకుండా ,గ్రామ సంతర్పనకు
నివేదించే నిస్వార్ధపరులు వీరు(ఈ విషయం నేను స్వానుభవంలో తెల్సుకున్నది). సంవ త్సరం అంతా వీరి వృత్తిని వదలకుండా(వీరి
జీవనాధారానికి సంబందించినవి) చేస్తూ కూడా ,ధనుర్మాసం నుంచి సంక్రాంతి వరకు మాత్రం ఈ హరిదాస వృత్తిని పవిత్రంగా
స్వీకరిస్తా రు …
అయితే పట్టణీకరణ హరిదాససంస్కృతి మీద కూడా కత్తిగట్టినట్లే అనిపిస్తుంది ,ఒక  హరిదాసుగారితో మాట్లా డిన తర్వాతతెలిసి
నది ఏమిటంటే ,ఆయన ఎంత బ్రతిమాలినా కూడా వారి కొడుకు ఈ వృత్తిని స్వీకరించ డానికి ఇష్టపడలేదట …
పట్టణాలలో అంటే ఎదో అనుకోవచ్చు,కానీ పల్లెల్లోకూడా పెరుగుతున్న పట్టణసంస్కృతి హరిదాస సంస్కృతిని మాయం చేస్తుంది ..
*ఆంగ్ల సంస్కృతికిసంబంధించిన“హాలోవెన్ (hallowen)” లాంటి దిక్కుమాలిన పండ గలు ,మన పండగల్లా చేసేస్కుంటున్న మన
లాంటి వారికి ఇలా తెలుగు సంస్కృతికి సాంప్రదాయానికి నిజమైన అద్దమైన ఈ హరిదాస సంస్కృతిని కోల్పోవడం తెలుగు వారైన
మన దురద్రు ష్టమే ......
*కష్టం దేవుడిచ్చిన వరం* సుఖం మనిషి కోరుకునే పాపం* ఎందుకంటే* కష్టంతర్వాత వచ్చే సుఖం* విలువ చాలా గొప్పది* సుఖ
పడిన తర్వాత వచ్చే కష్టంభరించ లేనిది
*మనిషి పుట్టే వరకు తపన.మనిషి పెరిగిన తర్వాత కోరిక. మనిషి ఇంకాస్త పెద్దయ్యాక ఆశ., మనిషి అభివృద్థి చెందాక ఆరాటం.
ఇలా ఎన్నో తీరని కోరికలు. ఎన్నెన్నో చెప్ప లేని ఆలోచనలు.ప్రారంభం ఎక్కడై నాముగిం పు మాత్రం చావుతోనే...
చిన్నప్పుడు అనుకున్న,.పెద్దయ్యాక జీవితం రంగులమయం అని కానీ, పెద్దయ్యాక తెలి సింది ఏంటంటే మనుషుల రంగులని గుర్తిం
చలేని చిన్నతమే బెటర్అని..
💖🌹🌴🌹🌴🌹
      
*ప్రత్యవాయ దోషమంటే ఏమిటి? దానిని నివారించడం ఎలా.....*
ఏదైనా శాస్త్రోక్తంగా కర్మ చేసేటప్పుడు దానికి విధించిన నియమాలను ఉల్లంఘిస్తే వచ్చే దోషానికి 'ప్రత్యవాయ దోషమ'ని పేరు. ఇవి
అనేక రకాలు. ఆ దోషాలనుబట్టి ప్రాయ శ్చిత్తా లు ఉంటాయి. అందుకే ఏ కర్మ చేసినా వాటి నియమాలను బాగా తెలుసుకోవాలి.
అంతేకాక కర్మానంతరం భగవన్నామ స్మరణ ప్రత్యవాయ దోషాన్ని పోగొడుతుంది. మంత్ర జపాదులు
చేసినప్పుడుకూడాగురూపదేశం, శుచిగా, ఒకే స్థలంలో ఆసీనుడై జపించడం వంటి నియమాలున్నాయి. వాటిని తప్పినా ప్రత్యవాయ
దోషాలున్నాయి.
     కానీ భగవన్నామ స్మరణకు నియమాలు లేవు. స్మరణను మధ్యలో ఆపి, ఎప్పుడు కొనసాగించినా ప్రత్యవాయ దోషం అంటదు.
*ఆవేశానికి అరుపులు ఎక్కువ ఆలోచన తక్కువ.
*అభద్ధా నికిఅభిమానులుఎక్కువ,ఆయుష్షు తక్కువ. నిజానికి శత్రు వులు ఎక్కువ,
సావాసం తక్కువ...
*స్నేహానికి సాన్నిహిత్యంఎక్కువ,పట్టింపులు తక్కువ...
[12/19, 5:55 AM] 💟🌹🌴🌹🌴🌹
రోజు మొత్తం మీద ‘నేను ఈశ్వరుడు’ అనే తలపు కలుగుతోందా? కలగటం లేదు కదా! నేను అది అయ్యి ఉంటే, నాకు అది తోచి
ఉండాలి కదా! నా సహజ స్థితిలో నాకది ఎప్పటికీ తోచడం లేదు కదా! నేనేదో మూడ డుగులు, నాలుగడుగులు వెడల్పు ఉన్నటు
వంటి మనిషిగానే, మానవ శరీరంగానే తోస్తు న్నానే గాని, నాకు ‘నేను ఈశ్వరుడను’ అన్న తలపే రావడం లేదు కదా! మరి ఎట్లా
అవుతాను నేను? అనేటటువంటి సందేహం అందరికి ఉండవచ్చు. అందుకని ప్రతి ఒక్క దానిని సనాతన ధర్మంలో ‘నాహం
కర్త,హరిః కర్త’ - అనే పద్ధతిగా ప్రార్ధన చేయమన్నారు. దీనికి ‘నిష్కామ కర్మ’ అని పేరు.
    ఈ ‘నైష్కర్మ్యసిద్ధి’ ని సాధించకుండా, ఈ నిష్కామకర్మను సాధించకుండా మానవుడు ఈ అభిమానాన్ని ఏమీ
చేయలేడు.అప్పుడు ప్రతీఒక్కరూతప్పకసాధించవలసినటువంటి మొట్టమొదటినియమము,సిద్ధిఏమిటయ్యా అంటే, నిష్కామకర్మ.
సర్వకర్మఫలములను నాకర్పించుము - అంటున్నాడు భగవద్గీత లో. ‘సర్వధర్మాన్‌పరిత్యజ్య’ - అని కూడా అంటున్నాడు. ‘మాం
ఏకం శరణం వ్రజ’ – శరణాగతుడవై చేయి. నీవు లేనివాడుగా చేయి. లేక ఉన్నవాడుగా వ్యవహరించు.
ఇదేమిటండీ, ఉన్నవాడుగా వ్యవహరించా లంటేనే నానా తిప్పలు పడుతుంటే, లేక ఉన్నవాడిగా ఎట్లా వ్యవహరిస్తా రు అంటే, నీ
గాఢనిద్రావస్థలో నువ్వు లేవు కదా!అయినా సామాన్య వ్యవహారం చేస్తూనే ఉన్నావుగా! మరి అప్పుడు ఏమైనావిశేషాలుఉన్నాయా?
కర్మఫలం ఉన్నదా? లేదు కదా! అట్లే మెలకు వలో, స్వప్నంలో కూడా సామాన్య వ్యవహా రం చెయ్యి. కర్తవ్యం వరకే చెయ్యి. ధర్మం
వరకే చెయ్యి. నేను కర్తను కాదని చెయ్యి. నేను భోక్తను కాదనిచెయ్యి. కర్త ఈశ్వరుడు. నేను అన్న స్థా నంలో ప్రతీ ఒక్కరూ కూడా
ఈశ్వరుడిని పెట్టు కోవాలి.
అందరు తల్లు లు పిల్లలనిపెంచుతూ ఉంటా రు. నేనే ఈ పిల్లవాడిని కన్నానండి. నానా కష్టా లు పడి పెంచానండి.ఈ పిల్లవాడి చిన్న
ప్పుడు ఎవ్వరిసహాయం అందలేదండి.నేను అలా కష్టపడ్డా నండీ,నేను ఇలా కష్టపడ్డా నం డి, ఎన్ని కష్టా లుపడో పిల్లవాడిని పెంచుకు
న్నానండి.అని పిల్లవాని తోటి మమకారాను బంధాన్ని కలిగి ఉంటారు. ఇది స్త్రీసహజమై నటువంటి, ప్రకృతి సహజమైనటువంటి
లక్షణముగా మనం స్వీకరిస్తా ము. అయితే ఇందులో సత్యం ఎంతఉందని మనం ఎప్పు డై నా విచారించామా? అలా విచారణ చేస్తే
ఏమౌతుందంటే,ఆత్మవిచారణ దృక్పథంతో చూచినప్పడు, సర్వజీవులను సృష్టిస్తు న్న వాడు ఎవడు? ఈశ్వరుడు కదా! సర్వ జీవు
లను పోషిస్తు న్నవాడు ఎవడు? ఈశ్వరుడే కదా! మరి నేను కన్నాను అనటంలో అక్కడ నిమిత్తమాత్రపు ధర్మమే ఉంది కాని,వాస్తవి
కమైనటువంటి సత్యము లేదు. అట్లే,నేను పోషించాను,నేనుపెంచానుఅనడంలోకూడా నిమిత్తమాత్రపు ధర్మము,నిమిత్త మాత్రపు
కర్తవ్యమే కలదు కాబట్టి(అయితే), నీవేమి చేయడంలేదు అని అక్కడ చెప్పడం లేదు. కాని,‘ఈశ్వరుని చేతిలో పనిముట్టు గా చేస్తు
న్నాను’ - అనే భావన వల్ల ఈ అభిమానపు తెరను తొలగించుకోగలుగుతాము.
    అనేకమంది మనకు జీవితంలో సహ కరిస్తూఉంటారు. అనేకమంది సహాయాన్ని మనం పొందుతూ ఉంటాము. పొందినప్పు డల్లా
ఎవరు సహాయం చేశారమ్మా నీకు? అని నేను అడిగితే ‘ఈశ్వరానుగ్రహం’అండి, దేవుని దయవలన నేను ఈ పనిని పూర్తిచే
యగలిగాను. పూర్తి చేయగలిగాను అనడం లో కూడా అహం ఉంటుందన్నమాట. ఈ పని పూర్తి చేయబడింది.ఈపని పూర్తి చేయ
డం జరిగింది. కేవలం ఈ సృష్టిలోఅన్ని పను లు జరగటమే ఉంది కానీ, చేయడం లేదు. ఆ సమయానికి అన్నీ కలిసి వస్తే,అది జరు
గుతోంది. ఏ ఒక్కటి లోపించినా కూడా అది జరగడం లేదు.మరి అలా కుదురుస్తు న్నటు వంటి కాలానికి,అలా
కుదురుస్తు న్నటువంటి కాలరూపుడై న ఈశ్వరుడికి, అలా ఫలితాలు వచ్చేటట్లు గా చేస్తు న్నటువంటి కర్మఫల ప్రదా త అయిన
ఈశ్వరుడికి చెందాలే కాని, నీకు చెందటం అసమంజసం కదా! అన్యాయం కదా! అధర్మంకదా!మరి ఆ రకమైనటువంటి
అభిమానాన్ని భుజాన వేసుకోవడం వల్ల, ‘మమకారము, అహంకారము’ - ఈ రెండూ బలపడు తున్నాయి. తద్వారా ‘ఈ జగత్తు
నాకు భోగ్యమైనటువంటిది.
నేను అనుభవించడానికి తగినటువంటిది’ అనేటటువంటి దృష్టితో జగత్తు ను చూస్తు న్నాము. ఓహో! ఇది చాలా బాగుంది. ఇది
ప్రియం. ఇది అప్రియం.ఈ ప్రియము, అప్రి యము.... ప్రియం మోదం ప్రమోదాలుగా మారి, మోహంగా మారి,అనుభూతమౌతూ,
బంధించుతూ, అభిమానగ్రస్థమయ్యేటట్లు చేస్తూ, మెల్లగా నడిపిస్తుంది.
💛🌹🌴🌹🌴🌹
       
సంతుల సాంగత్యము చేసి మనసును వేగి రపర్చుము శ్రీపతిని పట్టు టకు ఈ నామ మార్గము చాలా సులభము.. భావముతో
రామ కృష్ణ నామము నాలుకతో పఠించ డము జీవుడిధర్మము.శివుడు ఆత్మరాము డు, కావున శివుడు రామ నామ జపము
చేయుచున్నాడు.
నామము ఏక తత్వము, సాధనము ఇదే, సాధ్యము కూడ ఈ నామమే, ఇలా తెలుసు కున్న వారిని ద్వైతముబంధించిబాధించదు.
నామామృతములోని మాధుర్యాన్ని వైష్ణవు లు పొందినారు.యోగులు జీవించేకళలు సాధించగల్గినారు.. ప్రహ్లా దుడికి హరినామ ము
హృదయములో నాటు కొనుటచే సత్వ రమే ఉచ్చరించగల్గినాడు.
దాతయైన శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి లభించి నాడు. నామము సులభ సాధనము. నామ జపము చేయువారు మాత్రము దుర్లభము.
ఎక్కడనో ఒక్క భక్తు డున్నాడు. కనుగొను మని జ్ఞానదేవులు అంటున్నారు.
*సంతులతో సాంగత్యము చేయుము.
గతి తప్పిన మనసును అరికట్టు ము
వేగిరపడి శ్రీపతిని పట్టు ము
ఈ పంతము ఎన్నటికీ మానకుము
రామకృష్ణ నామమునే పాడుము
ఈ నామమే జీవుడి భావము
శివుని ఆత్మ రాముడని ఎరుగుము
అందుకే జపించు శివుడా నామము
ఒక్కటే తత్వము భక్తు డి భావము
సాధనతో సాధ్యము ఆ నామము
తొలగి పోయినది బంధము
ఇక నుండి బాధించదు ద్వైతము
మధురమైన నామామృతము
సులభముగ వైష్ణవులకు లభ్యము
కష్టించితే జీవన పర్యంతము
యోగులకు జీవనకళ సాధ్యము
స్మరించెను ప్రహ్లా దుడు సత్వరము
నాటుకున్నది దైవ భావము
ఉద్దవునికి అయినాడు లభ్యము
దాతయైన శ్రీకృష్ణుడు ప్రాప్తము
జ్ఞానదేవుడన్నాడు ఆ నామము
అన్నింటిలో ఈ సాధన సులభము
సాధించే సాధకులు దుర్లభము
ఉన్నారు ఏ ఒక్కరో కనుగొనుము.
❣️🌹🌴🌹🌴🌹
           
  యజ్ఞార్థ జీవనము -యజ్ఞార్థ కర్మలు. యజ్ఞార్థముగ తెలుసుకొని ఆచరించినచో కర్మము నుండి ముక్తు డై నిలుతువు.  జీవుడు
కర్మబద్ధు డు. బద్దతకు కారణము ఫలాసక్తియే. ఫలమునందాసక్తి గొన్న మన సును, కర్తవ్యము నందాసక్తి గలుగునట్లు చేయుట
ముఖ్యము.శ్రీకృష్ణుడు కర్మయందు కర్తవ్యమును చూడమని, తనకు వలసినది చూడవలదని,కర్తవ్యమును మాత్రమే నిర్వ
ర్తించినచో కర్మమంటదని, యిప్పటి వరకు అంటిన కర్మ కూడ నశించును......
💲ఈ ప్రకారముగ అనేక విధములైన యజ్ఞ ములు బ్రహ్మాదుల ముఖము నుండి సవిస్త రముగ చెప్పబడి యున్నవి. ఇవి యన్నియు
వివిధములగు యజ్ఞార్థ కర్మలు.వానిని యజ్ఞార్థముగ తెలుసుకొని ఆచరించినచో కర్మము నుండి ముక్తు డై నిలుతువు.
   జీవుడు కర్మబద్ధు డు. బద్దతకు కారణము ఫలాసక్తియే. ఫలమునందాసక్తి గొన్న మన సును, కర్తవ్యమునందాసక్తి గలుగునట్లు
చేయుట ముఖ్యము.
శ్రీకృష్ణుడు కర్మ యందు కర్తవ్యమును చూడ మని, తనకు వలసినది చూడవలదని, కర్త వ్యమును మాత్రమే నిర్వర్తించినచో కర్మమం
టదని, యిప్పటివరకు అంటిన కర్మ కూడ నశించునని తెలిపినాడు. ఈ అధ్యాయము నకు వేదవ్యాస మహర్షి జ్ఞానయోగమని
పేరిడుట ఆసక్తికరము. నిజమగు జ్ఞానము కర్మబంధ విమోచన జ్ఞానమే కదా!
దైవారాధన చేసినను, బ్రహ్మయజ్ఞము చేసి నను, ద్రవ్యయజ్ఞముచేసినను,భగవంతుడు తెలిపిన 12 రకముల యజ్ఞము లన్నియు
చేసినను బంధములే కలుగుచు నుండును గాని, విముక్తి చాల మందికి కలుగదు. కార ణము, చేయు విషయమునందు మమకార
మోహములు కలుగుట,ఆ కార్యములు తనవిగా భావించుట, అందలి ఫలితములు ద్రవ్యరూపమునగాని,కీర్తిరూపము న గాని తనకే
దక్కవలె ననిపించుట, యివన్నియు బంధములే.అందులకే సత్కార్యములు చేయువారు కూడ బంధవిముక్తు లు కాలేక
యున్నారు.
విముక్తి కల్గించనియజ్ఞములు,యాగములు, సేవా కార్యక్రమములు ప్రస్తు తము జ్ఞానము కలిగిన మానవులను కూడ బంధించియు
న్నవి. జ్ఞానులు కూడ అజ్ఞానులవలె, ఫలా సక్తి కలిగి పరుగులెత్తు ట, తాము చేయు కార్యములందు వ్యామోహపడుట, తమ
కార్యములు నెరవేరవలెనని పట్టు దలతో పలువిధములైన సాధనములను ఉపయో గించుట జరుగుచునున్నది. అజ్ఞానులు -
జ్ఞానులు ఒకే రకముగ విమోచనారహిత మార్గముల నడచు చున్నారు.
  ఇది ప్రకృతి చేయు యింద్రజాలము. దానికి కృష్ణు డందించిన పరిష్కారము యజ్ఞార్థ జీవనము.
            🧡🌹🌴🌹🌴🌹 సత్వగుణంచేత-పుణ్యశీలి కాబట్టి- వైశ్యుడి స్తా డు, క్షత్రియుడు క్షాత్ర గుణంతో ఇస్తా డు.
బ్రాహ్మణుడు లోభగుణం కలిగి ఉంటాడు భయస్థు డు కాబట్టి. సత్వగుణంచేత ఇతడు దాత కాలేడు అనిచెప్పి, అనేక స్మృతులలో
కూడా ఉంది. అయితే ఎవ్వరూ చేయలేని దానం బ్రాహ్మణుడిని చేయమని స్మృతిలో ఒకచోట చెప్పబడింది. తపస్సుచేసి దానిని
దానంచెయ్యమనిఉంది.అందులోనూ,తప స్సుచేసి ఆ ఫంలాన్ని ధారపోస్తే సహజంగా ముక్తిలభిస్తుంది.అందుకనే బ్రాహ్మణుడు
చేసేవన్నీకూడా లోకానుగ్రహంకోసమే అంటా రు.యజ్ఞయాగాది క్రతువులుచేసి ఆఫలాన్ని లోకపాలకులైన ఈశ్వరుడు-బ్రహ్మలకు,పర
మేశ్వర భావనతో అర్పణం చెయ్యటం- పర మేశ్వరార్పణం.అలాచేస్తే లోకానికి క్షేమం కలుగుతుందని,అలాచెయ్యమని చెప్పారు.
(బ్రాహ్మణుడు ధనం నిల్వపెట్టు కోకూడదు అనిఒకసూచన). ఆ మాట కొస్తే ఐశ్వర్యవం తులయిన బ్రాహ్మణులున్నారు, తపోవృత్తి
యందుండేటటు వంటి బ్రాహ్మణులు; అంతే గాక లోకంలో,సంఘంలో ప్రవర్తించేబ్రాహ్మణు లు కూడాఉన్నారు.తరువాత
యుగములు మారినకొద్దీ,వాళ్ళల్లో అనేకమార్పులువచ్చా యి.అనేక ధర్మాలు బ్రాహ్మ్యంలో క్షాత్రం, క్షాత్రంలో బ్రాహ్మణ్యం ఇలాగ
సంకీర్ణమయిన ధర్మములువచ్చాయి.
  ఈయుగానికి ఈధర్మమని అలాగ కచ్చితం గా గీతలుగీసి విడిగా చూపించటానికి లేదు. క్షాత్రలక్షణం కలిగిన బ్రాహ్మణులు,
బ్రాహ్మణు డయిన క్షత్రియుడు,ఇలాగ చెప్పుకుంటుంటే అనేక ధర్మములు ఒకదాంతో ఒకటి కలిసి
పోతాయి.కలిలోప్రధానమయినది,అందరూ విధిగా నిర్వర్తించవలసింది సత్యధర్మము. కలిలో అంతఃశౌచము......
*మనోబుద్ధి చిత్తముల శుచి ముఖ్యం. వంద మాట్లు స్నానంచేసి,అంతఃకరణలో శౌచంలే నటువంటివాడు వ్యర్థు డు. శరీరానికి శుచి
అనేమాట అసలు వర్తించనేవర్తించదు.ఎన్ని సార్లు స్నానంచేసినా లోపల మాలిన్యం అనేది ఉండనేఉంది కదా! స్నానంచేసేది కేవలం
చర్మం మాత్రమే కదా! స్నానంవలన లోపలి వస్తు వు క్షాళనమవుతుందా!చర్మాన్ని శుభ్రపరచుకోవడమే స్నానం అవుతుంది గాని,
దీనివలన శుచిని పొందాడని అనుకో వటం పొరపాటే అవుతుంది.
    పూర్వయుగాలలో శరీరకశౌచము కూడా చాలా గొప్పగాఉండేది. యోగబలంచేత వాళ్ళు నిరాహారులుగాఉండేవాళ్ళు.ఆహారం
లేకుండా ఎందుకు తపస్సు చేయాలి? శౌచం తో నిరాహారంగా తపస్సుచేయటం వాళ్ళ ఉద్దేశ్యం.నిత్యమూ ఆహారం తీసుకునే శరీ
రంలో శౌచమేలేదు, శుచి ఉండదు కాబట్టి; పరిపూర్ణమయిన శౌచవిధితో శరీరంతపస్సు యందు వినియోగించాలి.
  అంటే ఆహారం తీసుకోకుండా ఉండటమే! శరీరం అనేది ప్రాణానికిచిన్నగూడులాంటిది. శుష్కించిన శరీరం,దమించబడిన
ఇంద్రియా లు, మహోగ్రమైనటువంటి అంతఃకరణ -ఇదీ తపస్సుయొక్క స్థితి. శరీరాన్ని క్షయింపచేస్తే, మనుష్యుని లోపలుండే
అంతరంగ బలం క్షీణిస్తుందని ఎప్పుడూ అనుకోకూడదు.శరీ రం శుష్కించటం వేరు.లోపల బలం,నేను అనే
అహంకారం,జీవునియందున్నప్రాణశక్తి, దాంట్లో ఉండే బలంవేరు.అది తపస్సుతో పెరుగుతుంది. శరీరం క్షీణిస్తుంది.
💞🌹🌴🌹🌴🌹
      
  నిర్వికల్పసమాధిఅనగా "నేనునిస్సందేహం గా భగవంతుడను" అనెడు స్వానుభవము.
"నేను భగవంతుడను" అనెడి నిర్వికల్ప సమాధిస్థితి అనుభవమును పొందుచున్న వారిని "బ్రహ్మి భూతుడు" అందురు. వీరు
భగవంతుని అనంత స్వభావత్రయమైన అనంత జ్ఞాన - శక్తీ - ఆనందములు, తమ యొక్క అనంత స్వస్వభావమేనని, అను భూతి
నొందెదరు.
💲
* Everyone worships God. Whatever be the name, they are all worshipping God.*
*భగవంతుణ్ణి ఏ పేరుతో పిలిచినా చివరకు చేరుకొనేది ఒకే గమ్యానికే.*
💲 When a man is under the control of senses, he is of the world. When he has controlled the senses the
world is of him.*
*ఇంద్రియ సుఖాలకు బానిసగా ఉన్నంతకా లం మానవుడు, ప్రపంచానికి దాస్యం చేయాలి. ఇంద్రియాలను జయించిన మరు క్షణం
ప్రపంచమే అతడికి లోబడుతుంది.*
💕🌹🌴🌹🌴🌹
            
*భగవత్ మార్గానికి భక్తి ప్రధానం. భగవద్భ క్తు ల యందు ఎంతఆరాధనబుద్ధి, ప్రసన్నత కలిగి ఉంటామో, అంతవరకు వారు మనకు
ప్రసన్నులవుతారు.వారు ప్రసన్నులవుతుంటే మనకు భాగవతము సులభముగా అవగా హన అవుతుంది. భాగవతములోముఖ్యమై
నది సాన్నిధ్యము. భగవద్భక్తు ల ద్వారా భగవంతుని సాన్నిధ్యము ఎక్కువగాలభించే  అవకాశమున్నది.*
*హనుమంతుని ఆరాధిస్తే రాముడుతన సా న్నిధ్యాన్ని ఇస్తా డు.ఒకరిని ఆరాధన చేస్తుం టే వారికి సంబంధించిన పరివారమంతా
అక్కడకి వస్తా రు.స్మరించుట చేత పరంపరా గతమైన భాగవతజ్ఞానము మనలో ఆవిర్భ వించి వికాసముచెందుతూ ఉంటుంది.
💙🌹🌴🌹🌴🌹
          
*అహంకారంలేని వారిని దేవుళ్ళతో సమానంగా పోలుస్తా రు ఎందుకని...."*_
_*అహంకారం అనే అసురుడి చెరలో మనం ఉన్నంతకాలం మనకు నరకం తప్పదని బోధించేదే నరకాసుర వృతాంతం. చీకటికి
కూడా వెలుతురుతో సమానంగా వ్యాపించే శక్తి ఉంది. చీకటికి స్వశక్తిలేదు. ఎక్కడై తే వెలుతురు శక్తి తగ్గుతుందో అక్కడ చీకటి శక్తి
పెరుగుతుంది. అలాగే ధర్మం విషయంలో మన బలహీనతే అహంకారానికి బలాన్ని పెంచుతుంది. అందుకే అహంకారం చంటి
పిల్లవాడి మొదలు దేవతలవరకూవ్యాపించి ఉంది. అహంకార స్పర్శ కూడా లేని స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియజేసే వారే
శివకేశవులు. అహంకారాన్ని పూర్తిగా వదల గలిగిన మరుక్షణం మనం కూడా వారి స్థితి లోనే ఉంటాం. అందుకే అహంకారం లేని
వారిని దేవుళ్ళతో సమానంగా పోలుస్తా రు!.
❤️🌹🌴🌹🌴🌹
         
_*జగమే జ్ఞానానందమయం....*_
_*జగతి అంటేనే గతి కలిగినది. అది కదిలి వెళ్ళిపోవడం దాని సహజగుణం. పిల్లా డి వయసుతోపాటే తల్లి, తండ్రి, తాతల వయ
సులు కూడా పెరుగుతాయి. జగతి అంటే అంతా కలిసి గతి కలిగిఉంటుంది.గతి కలిగి నది ఏదైనాగతించిపోతుంది.జగతిలో అన్నీ
గతిస్తా యి.అదే జగతి"గతి".అదే ఈశ్వరశక్తి. జగతికి గమనం ఉంటుంది గానీ గమ్యం ఉండదు. ప్రతి అనుభవం జ్ఞానంగా, ఆనం
దంగా స్వీకరిస్తే జగమే జ్ఞానానంద మయం అని అర్ధంఅవుతుంది.ఏ అనుభవం తోనూ బాధ,దుఃఖంకలగనిస్థితే జ్ఞానానందమయం
🌹🌴🌹🌴🌹
         
*పొగ, రాత్రి, చీకటి, కృష్ణపక్షము,దక్షిణాయ నము అవరోహణక్రమమును సూచించును. అందు దేహము విడుచుట, ధ్యానించుట
కలిగినచో ఈచక్రమునందు తిరుగుట అబ్బు ను.అందు మొదటి దానినిశుక్లగతిఅందురు. అది సూర్యతత్వముగలది.సూర్యుడు
అణు వులను జీవ ప్రజ్ఞలుగా ఉద్ధరించుచున్నాడు. అట్లే శుక్లగతి చక్రభ్రమణంనుండి విమోచ నము కలిగించును.రెండవది కృష్ణగతి
అన బడును.అది చంద్ర తత్వము గలది. చంద్రు డు తన కిరణముల వలన జీవ ప్రజ్ఞలను దేహములందు
అంకురింపచేయుచున్నాడు. అట్లే ఈమార్గము దిగివచ్చుటను కలిగించు ను.ఈశుక్ల,కృష్ణగతులు జగత్తు న శాశ్వతం గా
వర్తించుచున్నవి.ఒకదానిచే విమోచనం, ఒక దానిచే బంధనం జీవులకు నిరంతరము కలుగుచున్నవి. ఈ చక్రప్రవృత్తిలో జీవులు
జ్ఞానులగుచు,మరల అజ్ఞానంలోనికి దిగుచు తమవశము లేక వర్తించు చున్నారు. జ్ఞానం  పొందినవారు కూడా మరల అజ్ఞానమున
పడకుండుటఎట్లోతెలియకున్నారు.ఈమార్గ మున ఎట్టి జ్ఞానము కలిగినను బ్రహ్మలోకం వరకే! అనగా మరల బ్రహ్మకు రాత్రి అగుట
తో దిగిపోవును.దీనివలన ఒకజన్మలో ఆర్జిం చుకున్న జ్ఞాన మంతయు ఒక మృత్యువుతో చెల్లిపోవును.
💚🌹🌴🌹🌴🌹
          
అవిద్య యొక్క ఆవరణ శక్తిచే ఆవరింపబడి న కూటస్థ చైతన్యముపై సూక్ష్మ స్థూల శరీర ములు విక్షేపశక్తి వలనకల్పింపబడుచున్నవి.
ఇదే విక్షేపాధ్యాస.ముత్యపు చిప్పపై రజితం ఆరోపింపబడినట్లే కూటస్థ చైతన్యముపై శరీరత్రయము అధ్యస్తమగుచున్నది.
   అధ్యాసకు,అనగా ఒక వస్తు వు మరొక వస్తు వుగా భ్రమపడుటకు,అద్వైత వేదాంత మున "అవిద్య" కారణముగా చెప్పబడినది.
   అవిద్యకు గల ఆవరణశక్తి మొదట వస్తు స్వరూపమును కప్పిపుచ్చును.దానికి బదు లుగా మరొక వస్తు వు యొక్క అభాసను
విక్షేపశక్తి సృష్టించును.
  ఆవరణశక్తి ముత్యపుచిప్ప నిజస్వరూప మును కప్పిపుచ్చగా, విక్షేపశక్తి దానిస్థా న మున రజతాభాసను కల్పింపగా,మనకు ముత్యపు
చిప్పకు బదులు రజితము కన్నించుచున్నది.
    అహం ప్రవృత్తి తొలగిపోగా ద్వైతము నశింపగా బేదభావము చిత్తములో రహిత ము కాగా, అజడమగు ఏస్థితికలదో అదియే
స్వరూపస్థితి అని చెప్పబడును.
హేయమగుదృశ్యమునుత్యజించువాడును, గ్రహింపదగిన ఆత్మవస్తు వును గ్రహించు వా డును,దృక్ స్వరూపమునుచూచువాడును,
దృక్కు కంటె అన్యమును చూడని వాడును తెలియదగిన పరతత్త్వమందు జాగరూకుడై జీవించువాడు చిల్లగింజచే జలము నిర్మల
మగునట్లు విజ్ఞానవశమున అవిద్య తొలగి నవాడునునగు మహానీయునకు స్వస్వభా వము(ఆత్మస్థితి) ప్రసన్న మగును.
జగద్వికారమైనవి,ఆత్మయందు వివిధ భంగి మలతో దృశ్యజగత్తు గా కనిపించు చున్నది.
అవిద్య యొక్క ఆవరణ శక్తిచే, ఏ బ్రహ్మము సత్యమైయున్నదో దానియందు విక్షేపధ్యాస వలన సూక్ష్మ స్థూల శరీరములు ఆరోపింప
బడుచున్నవి.
లోకముల జ్ఞానము అనాది అయిన అవిద్య (అజ్ఞానము)యైనను,అది తత్త్వవిచారణ సహాయముతో అదృశ్యమగును.
శుద్ధచైతన్యమే నా స్వరూపం.శారీరక బాధ  లు, మానసికాందోళనలు,బుద్ధిలోనిఅశాంతి నాచేతనే తెలియబడుతున్నాయి. వాటిని
నేను తెలుసుకుంటున్నాను.నా స్వభావం సత్ చిత్ ఆనందం.ఈ జ్ఞానాన్ని దృఢంగా నమ్మాలి. ఆభరణములలోని బంగారాన్ని
మాత్రమేచూడవలెను.తరంగంలలో సము ద్రమును మాత్రం చూడుము.అదే విధము గా కేవలబ్రహ్మమును మాత్రమే దర్శించవలె
ను. ఆత్మజ్యోతి యొక్క ప్రకాశమే సర్వాన్ని మనకు తెలిసేలాచేస్తోంది.దీని ప్రకాశంలో రాత్రిలోని చీకటికూడా తెలియబడుతొంది. ఇది
అగ్ని-దీపశిఖ మొదలయినవాటి వంటి కాంతి కాదు.
💜🌹🌴🌹🌴🌹
         
*రాజసకర్మ*
ఫలాపేక్ష గలవానిచేతగాని, మరియు అహంకారముతో గూడినవానిచేగాని అధిక ప్రయాసకరమగు కర్మ మేది చేయబడుచు న్నదో-
అది రాజసకర్మ.....
   ఫలాపేక్షతోను అహంకారముతోను గూడి చేయబడు కర్మ రాజసకర్మ మనబడును. "ఆయాసమ్' అని చెప్పక "బహులాయాస
మ్' అనిచెప్పుటవలన రాజసకర్మావలంబి అత్యంత ప్రయాసతో గూడిన కార్యములను జేయుచుండునని తెలియుచున్నది.
కాని అట్టి కర్మలవలన ఆతనికి ప్రయాసయే మిగులునుగాని,బంధనివృత్తి కలుగజాలదు ఏలయనిన అయ్యవి అహంకారము,ఫలా
పేక్షయను దోషములతో గూడి యున్నవి. అహంకారమేబంధము,కర్తృత్వమేబంధముఫలాకాంక్షయే బంధము. కాబట్టి విజ్ఞుడట్టి
రాజసకర్మలజోలికిపోక సాత్త్విక కర్మలనే నిష్కామబుద్ధితో నాచరించితరించవలెను.
*రాజసకర్మ ఎట్టిది : ఫలాపేక్షతోను అహంకా రముతోను గూడి యాచరింపబడునది అధి క ప్రయాసతో గూడినది......
*విజయం నిన్ను జీవితంలో ఉన్నత స్థితికి చేరిస్తే, మంచి ప్రవర్తన నిన్ను అందరి హృద యాల్లో ఉన్నత స్థితికి చేరుస్తుంది.
🌹🌴🌹🌴🌹
*మనం కలవటానికి,అంతలోనే విడిపోవ టానికి చూపించే తొందర ఆలోచించటానికి,
అర్థం చేసుకోవటానికి, దగ్గర అవ్వడానికి చూపిస్తే ప్రతి బంధం కూడా అనందంగానే ఉంటుంది.
*ఆనందం, నమ్మకం అనేవి,అమ్మకానికి దొర కవు,.ఆనందాన్నీమనుషులతోపంచుకోవాలి
నమ్మకాన్నీ మనస్సులో పెంచుకోవాలి.!
*గెలవ వచ్చు గర్వపడకూడదు,
*భయపడ వచ్చు పారిపోకూడదు, *ఓడిపోవచ్చు కృంగి పోకూడదు,
*అర్ధం కాకపోవచ్చు విసిగి పోకూడదు,
*రూపాయి బిళ్ళ లాగానే,మానవజీవితానికి కూడా రెండు పార్శ్వాలుంటాయనీ,ఒకసారి అటై తే ఇంకోసారి ఇటౌతుందీ..
*మనం పీల్చే గాలిలో ఆక్సిజెన్ ఉంటుంది .
అది ప్రాణవాయువు కనుక మనకు బ్రతుకు నిస్తుంది.వదిలే గాలిలో కార్బన్డయాక్సయిడ్ ఉంటుంది,అదిలోపలేఉంటే ప్రాణానికే
ప్రమా దం.వదిలితీరాలి.దీనినిబట్టి మంచిని మాత్ర మే లోపలికి పంపి,చెడును వదిలించుకోవా లని ప్రకృతి చెబుతుంది.
ఎవర్నీ తగ్గించి మాట్లా డకూడదు,ఎవర్నీ బాధించకూడదు.ఇవాళ నువ్వు శక్తివంతం గా ఉండొచ్చుకానీ,కాలం నీకన్నా శక్తివంతమై
నదని గుర్తుంచుకో, మంచితనంతోఉండాలి. మంచిమనసుతో ఆలోచించాలి.
  ఒకరు ఉన్నత స్థా నంలో ఉన్నా తప్పులు వెతుకుతారు ,ఒకరు అట్టడుగు స్థా నంలో ఉన్నా నిందలు వేస్తా రు ,ఎలా ఉన్నా తప్పే ఎలా
ఉన్నా ముప్పే నేటి సమాజంలో...
కానీ చివరికిగెలిచెది నీలోని మంచి మాత్రమే
నీవెంటవచ్చేది నీవుచేసిన పుణ్యంమాత్రమే.
*నిన్ను నమ్మని వారికి నిజాలు చెప్పకు... నిన్ను నమ్మే వారితో నిజాలు దాచకు...
Do not repent, do not brood over past deeds, and do not remember your good deeds; be azad (free). You
cannot undo, the effect must come, face it, but be careful never to do the same thing again.
*జరుగవలసింది ఏదో జరిగిపోయింది, చింతించకు.జరిగిపోయిన కార్యాలనుగూర్చి పదే పదే తలపోయకు.వాటిని నీవు రద్దు
చేయలేవు.కర్మఫలం కలిగే తీరుతుంది.దాని ని ఎదుర్కో! కాని చేసినతప్పునే మరల చేయకుండా జాగ్రత్త వహించు.
కొంతమందితోమాట్లా డితే మనసుకు హాయి గా ఉంటుంది, మరి కొంతమందితో మాట్లా డక పోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
పిల్లల నుంచి తల్లి తండ్రు లు ఏమి కోరుకుం టారు?కాసింత ప్రేమ,పలకరింపు అంతేకదా!
ఆస్తు లు,ఇల్లు కావాలా వారికి కాదు కదా!!!
వారు కని,పెంచి,పెద్దవాళ్ళనుచేసి సంపాదిం చి పెడితేనే గా నువ్వు అనుభవిస్తు న్నావు...
నీ కోసము ఎంత కష్టపడి ఉంటారు? ఎన్ని ఆనందాలను త్యాగము చేసుకున్నారో?
దూరముగా ఉన్నవారు ఒకరకంగా బాధ కలిగిస్తే, పక్కనే ఉన్న పిల్లలు.పట్టించుకోక  బాధ పెడుతున్నారు. ఆ బాధ చెప్పడానికి అలవి
కాదేమో..అనుభవించే వారికే తెలు స్తుంది...ఈ జన్మకే వారు నీతల్లి తండ్రు లు!!వారిని దూరము చేసుకున్న తర్వాత తెలు స్తుంది.
నువ్వు పోగొట్టు కున్నదేమిటో....
నువ్వు నీపిల్లల చేతిలో ఓడిపోయినప్పుడు తెలుస్తుంది...నువ్వు వేసిన తప్పుఏమిటో,, అందుకే వారితో ప్రేమగా ఉండండి.. ఆప్యా
యంగా పలకరించండి...ఇలాంటి కష్టము మీకు రాకుండా చూసుకో.....
*నిజానికి, వాస్తవానికి చాలా తేడా ఉంది.
*సూర్యుడు తూర్పునఉదయిస్తా డు,పడమ రన అస్తమిస్తా డు అనేది "నిజం".
*సూర్యుడు ఉదయించడు అస్తమించడు. తిరిగేది భూమి మాత్రమే అనేది "వాస్తవం".
నిజానికి వాస్తవానికి మధ్య ఆ సన్నని గీత మనకు అర్ధం అయినప్పుడు ఈ మనుషు లు,ఈ లోకం అర్థం అవుతారు..
*గమ్యము అనేది మనం కాళ్లకు వేసుకునే
పాదరక్షల మీద కాదు: మన పాదాలు వేసే
అడుగుల మీద ఆధారపడి ఉంటుంది....
తప్పటడుగులు పడుతూ ఉంటాయి,పడి లేస్తూ సరిదిద్ది కుంటూ వెళ్ళాలి...మనము వెళ్లే దారిలో ఏన్నో ముల్లకంచెలు,రాళ్ళు రప్పలే
కాక పూలబాట కూడా ఉంటుంది. .
వేసే ప్రతిఅడుగు.నీస్వభావాన్ని,నీ వ్యక్తిత్వా న్ని తెలియచేస్తూ ఉంటుంది..నువ్వు మనో దేర్యముతో అన్నిటినీఎదుర్కుంటూ వెళితేనే
జీవితము...
*సిరిసంపదలు ఎన్నిఉన్నాయ్,అనిముఖ్యం కాదు..? అర్థం చేసుకునే తోడు..ఉందా లేదా అనేది ముఖ్యం. అది స్నేహం
అయినా,ప్రేమ అయినా, జీవిత భాగస్వామి అయినా...
*విజయం నిన్ను జీవితంలో ఉన్నతస్తితికి చేరిస్తే, మంచిప్రవర్తన నిన్ను అందరిహృద యాలలో ఉన్నత స్థితికి చేరుస్తుంది....
*బుద్ధిని‌ఉన్నతవిషయాలతో,అద్వితీయమై న ఆదర్శాలతో‌నింపుకోండి. రేయింబవళ్ళు వాటినే స్మరించండి. అపుడే‌‌అద్భుతాలు
సాధించగలరు.
"కారణములేనికోపము,బాధ్యతలేని యవ్వ నము, గౌరవములేని బంధము, అలంకరణ తో వచ్చేఅందము,ఎక్కువ
కాలముఉండవు మరియు నిలబడవు"...
"ఎవ్వరికీ ఉపయోగపడని వజ్రంలాగా ఉండ డం కంటే.. అందరికి ఉపయోగపడే ఉక్కు లాగా ఉండడం మంచిది"...
   *జీవన్ముక్తు డు - అంటే.....*
ఈదేహంతోనే ముక్తినిసాధించటం జీవన్ముక్తి, శ్రావణ,మనన,నిధి ధ్యాసనల ద్వారా మనో వాసనలను క్షయమొనర్చుట ద్వారా జీవ
న్ముక్తి సాధ్యమవుతుంది.
సూర్యుడు చల్లగా భాసించినా,చంద్రు డు చాలా వేడిగా అనిపించినా,జ్వాలలు తలక్రిం దులుగా మండుతున్నా జీవన్ముక్తు డు ఆశ్చ
ర్యపోడు.
*"మిధిలాయాం ప్రదీప్తా యాం నమే కించిత్ ప్రదహ్యతే"మిథిలానగరం తగలబడుతున్నా నాకేమీ కాదు అని అంటే ఏమిటంటే
బ్రహ్మాత్మైక్యానుభవం గల జీవన్ముక్తు డు దేని వలననూ ప్రభావితుడు కాడు అని అర్ధం.
జీవన్ముక్తు డు ఏ ప్రాణిని ద్వేషించడు. స్తు తి, నిందలు రెండు ఒక విధంగానే స్వీకరిస్తా డు. మౌనంగా ఉంటూ ఎల్లప్పుడూ సంతుష్టు డై ,
స్థిరమైన నివాసమనేది ఏమిలేకుండ, స్థిర చిత్తంతో భక్తి భావనలో ఉంటాడు.
జన్మనెత్తిన ప్రతి యొక్కరికీ, ముక్తిని పొంద టమే లక్ష్యం, జ్ఞానాన్ని పొందినప్పుడే ఆ స్థితి లభిస్తుంది...                            
*రహస్యం..అనేది నీదగ్గరున్నంతసేపూ నీకు బానిస.మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని.
  మన జీవితం సాఫిగా నడుస్తు న్నంత కాలం హాయిగానే ఉంటుంది,. కానీ మనజీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వాటిని
నీకు అనుకూలంగా మార్చుకున్నప్పుడే  మనమేం టో అందరికీ తెలుస్తుంది .
  మనం కలవటానికి మనం విడిపోవటానికి చూపించేతొందర ఆలోచించటానికి మనల్ని అర్థం చేసుకోవటానికి చూపిస్తే ప్రతి బంధం
కూడా అనందంగానే ఉంటుంది..
*ప్రేమ లేని మనిషి ఈ ప్రపంచంలోఉండరు. గాయంలేనిగతంకూడా ఉండదు.ఇవిరెండూ లేనిదే మన జీవితమేఉండదు.. జీవితంలో
జరిగిన మధురమైనసంఘటనలు మర్చిపో తే కానీ బతకలేం, కొన్ని గాయాలను గుర్తుం చుకుంటే కానీఎదగలేం.అలలకు అలసట
ఉండదు ఆశలకు హద్దు ఉండదు.ఇదే జీవితం...
*మనిషిఎలాంటివాడంటే,! పక్కవాడు బాగు పడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ ,లోపల ఈర్ష్యతో రగిలిపోతారు.అదే ఒకడు నాశనం
అవుతుంటే ,లోపలసంతోషిస్తూ బై టబాధగా  నటిస్తా డు .ప్రపంచమే రంగస్థలం,మనుషులే  మహానటులుఅని ఊరికే అనలేదు
మహాను భావులు..
*విధానపరమైన విమర్శ విత్తు లాంటిది.
ఆలోచన రేకెత్తిస్తుంది.వికారమైన విమర్శ
ముల్లు లాంటిది.గాయం మాత్రమే చేస్తుంది.
అభిమానం, అవసరాలకు అతీతంగా
ప్రశ్నించే వాడు కావాలి,.
  నేనుఏఅపరాధంచేయలేదు.నాకుఎవ్వరూ కష్టం కలిగించరు "అనిభావించరాదు.ఎందు కంటే దుర్మార్గులు మంచివాళ్ళకి ఏదో ఒక
విషయంలో భయంకలిగిస్తూనే ఉంటారు.
  ఎలాంటి విషయాలు పట్టించుకోకుండా ఒక మూలన కూర్చుంటే వారు మంచివారుగా మారిపోరు .     
సద్వస్తు వు బయట దొరకదు.ధనంతోటి  భోగాలు కొనుక్కోవచ్చు.అలాగే పుణ్యకర్మల  ఫలితం సుఖరూపంలో వస్తుంది.పాపఖర్మల 
ఫలితం దుఃఖరూపంలోఖర్చయిపోతుంది.  ఒక చైతన్యంతప్పించి,కాలప్రవాహంలోఅన్ని  భోగాలు,సుఖాలు కొట్టు కుపోతాయి.
Nothing  is  too  heavy  for  dsstiny.
మోక్షం శాస్త్రంలోలేదు.శాస్త్రం ఆత్మనుసూచి స్తుంది తప్ప,ఆత్మజ్ఞానంఇవ్వదుకదా!శాస్త్రం ఆ సద్వస్తు వు హృదయంలో ఉందని చెబు
తుంది.ఆ సద్వస్తు వు ఉన్నచోట అన్వేషణ చెయ్యాలి.అందుకే ఏసుక్రీస్తు "తట్టండి తెరు వ -బడుతుంది.అడగండి ఇవ్వబడుతుంది"
అన్నాడు.
భక్తు లలో మోక్షకాంక్షఉన్నవారు,వెయ్యి మం దిలో ఒక్కరుకూడా ఉండటం లేదు.వారికి మోక్షంవిలువ తెలియదుకదా,పాపం వాళ్ళు 
మాత్రం ఏంచేస్తా రు?డబ్బు విలువ తెలుస్తోం ది, చదువువిలువతెలుస్తోంది,అధికారం  విలువతెలుస్తోంది.అందుకని వాటి గురించే 
ఆభగవంతుడినిఅడుగుతారు.భగవంతుడు  మనం అడిగిందిఇస్తా డు.మనంలౌకికమైనవి  అడుగుతూ ఉంటే మోక్షంఇవ్వడు.
[2/24, 5:44 AM]  🖤💘🖤
*మనకు ఏది లభించినది అంతా భగవదను గ్రహ ఫలితమే!.మనం నిజానికి భగవంతు డికి ఏమీఇవ్వవలసిన పనిలేదు. భగవంతు నికి
మనం పత్రమో,పుష్పమో,ఫలమో, తో యమో,సమర్పించడమన్నది మనం భగవం తుని యందు చూపించే కృతజ్ఞత మాత్రమే.
మనకు ఈ దేహాన్నిచ్చి,సంపదలిచ్చి,పుత్ర పౌత్రాదులనిచ్చి కాపాడుతున్న పరమాత్మకు మనం సమర్పించే వస్తు వులన్నీ ఆయనకు
మనం కృతజ్ఞతను వెల్లడించడానికే, నిజాని కి ఆయనకు కావలసిన దేమీలేదు.
*ఆయన సర్వసంపూర్ణుడు.అయితే భగవం తునికి ఏమియివ్వాలి."పత్రం,పుష్పం,ఫలం, తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి తదహం
భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః "..
*నిర్మల బుద్ధితో, నిష్కామ భావంతో పరమ భక్తు నిచే సమర్పింపబడిన పత్రమును గానీ, పుష్పమునుగానీ,ఫలమునుగానీ,జలమను
గానీ నేను ప్రత్యక్షంగా,స్వయంగా ప్రీతితో ఆరగిస్తా ను.
*పత్రం :"పతతీతి పత్రం".పడిపోయేదిపత్రం. మనిషిని పడవేసేది మనస్సు.కాబట్టి పత్రా న్ని సమర్పించాలీ అంటే మన మనస్సును
దైవాంకితం చేయాలని దాని అంతరార్థం.
*పుష్పం:  "పుష్యతీతి పుష్పం". వికసించేది పుష్పం, మనిషిలో వికసించేది బుద్ధి కాబట్టి మన బుద్ధిని దేవునిపై లగ్నం చేయాలని దీని
అంతరార్థం.
*ఫలం  :  "విశీర్యతే ప్రహారైరితి ఫలం" ప్రహారైః అనగా దెబ్బలచే విశీర్యతే అనగా పగిలేది ఫలము. జ్ఞాన బోధము అనే దెబ్బ లచే 
పగిలేది మనస్సులోని అహంకారం. కాబట్టి ఫలాన్ని అనగా అహంకారాన్నిమనం దైవానికి సమర్పించాలని అంతరార్థం.
*తోయం: "తాయతే_పాయతీతి".అనగా రక్షించునది కనుక తోయము.సోహం భావం తో ఉన్నప్పుడు, ధ్యేయాన్ని గుర్తుంచుకొని ,
రక్షించేది చిత్తము.కాబట్టి తోయము అంటే చిత్తము అని అంతరార్థం.అంటే మన చిత్తా న్ని భగవంతునికి సమర్పించాలని భావము.
*మనస్సు మనపతనానికి మూలకారణము అందుకే దాన్ని మనం ముందుగా భగవంతు నికి సమర్పించాలి.
*"భవతు భవదర్థం మమ మనః" ..
ఈశ్వరా! నామనస్సు నీస్వాధీనంఅగుగాక"                     
*జీవితంలో కష్టా లు వచ్చేది,నిన్ను నాశనం చేయడానికి కాదు..నీలో దాగి ఉన్న శక్తి సామర్ధ్యాలను తెలుసుకోవడానికి.
ఆ కష్టా లకుకూడా తెలియాలి,.నిన్ను జయిం చడం చాలా కష్టమని.
ఎదుటివారికి నువ్వుదారిచూపకున్నా పర్వా లేదు.కానీ... ఎదుటివారి దారిని నాశనం చేయాలని మాత్రం ప్రయత్నించకు.అదిచెడు
కర్మ అయి జీవితాంతం నిన్ను వేధిస్తుంది.
ఎంత ఓపికతో ఉంటామో,అంత అగ్రస్థా నం.
ఎంత దూరంగా ఉంటామో, అంత గౌరవం.
ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తా మో, అంత మనశ్శాంతి.ఎంత తక్కువ ఆశపడతామో, అంత ప్రశాంతత.ఎంత తక్కువ మాట్లా డతా
మో, అంత విలువ.
మనిషి అందంగా కనపడాలి అంటే..అనేక రకాల పొరలు వేయాలి.కానీ మనస్సు అంద ముగా కనపడాలి అంటే..అహం,అసూయ,
ఈర్ష్య,ద్వేషం అనే పొరలను తొలగిస్తేచాలు.
జనందృష్టిలో నువ్వుగొప్పగా ఉన్నా, లేకు న్నా, ఫర్వాలేదు.కానీ..మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తు కొని బ్రతకగలిగితే.. అంత కంటే
గొప్ప జీవితం లేదు.
చాలావరకు సత్యం కంటే తియ్యటి అబద్ధా న్ని ఎక్కువ మంది నమ్ముతారు. అందుకే నిజం చెప్పి జనాల్ని మార్చాలనుకోవడం కంటే
,అబద్ధం చెప్పి వారిని ఏమార్చడమే సులభం !
    అబద్ధం పెట్టే ముద్ద కన్నా నిజం కొట్టే చెంపదెబ్బ మనకు ఎంతో మేలు చేస్తుంది .
🖤🌴💛
        
  *జాగ్రత్తగల మనుషులు ఎప్పుడో గాని తప్పు చేయరు,
*జీవితం చాలా కష్టమైనపరీక్ష.దానిలోచాలా మంది వ్యక్తు లు విఫలమవడానికి కారణం
ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించలేక పోవడమే....
*రాలిపోయిన ఆకులపైన కొంచెము మర్యా దగా నడవాలి.ఒకప్పుడు అవికూడామనకు నీడనిచ్చాయనిమరవరాదు.అందుకే గతం
లో మనకు సాయపడినవారు, ప్రస్తు తం మనకు సాయపడే స్థితిలో లేకపోయినా వారిపట్లకృతజ్ఞత మరువరాదు..
💞💞 💞
          
*సర్వమూ శివమయంగా ఎలా....
*ప్రకృతి ప్రభావం చేత ఏర్పడే గుణాలు లేకుండా చూడగలిగిన రోజు మనకు సర్వ మూ శివమయంగా తెలుస్తుంది.
*మామిడుపండు చాలా రుచిగా ఉంటుంది. ఆ రుచి తెలియని పిల్లవాడికి ఆ పండు ఒక బొమ్మతో సమానం.
*ఆ మాధుర్యాన్ని చవిచూసినతర్వాత మన లో ఆ రుచికోసం తపన మొదలవుతుంది.
ఇలా మొదలైనతపనే మనలోఏర్పడేగుణం.
*ఇప్పుడు గుణం మామిడిపండులో ఉందా? లేక మనసులో ఉందా? అంటే ఆ రెండింటి సంబంధంలో ఉంది.మామిడిపండులో
రుచి ఉన్నది కనుక మనలో కోరిక కలిగింది.
  ఈ ప్రకృతి అంతా చైతన్యంతో నిండిఉంది. మామిడిపండులోమనలోనూచైతన్యంఉంది.కానీ ఇప్పుడు ఏర్పడిన ఈరుచి అనే
గుణం ఈ ఆ రెండింటినీ చైతన్యంగా కాక ప్రాపంచిక వస్తు వులుగా భాసించేలా చేస్తుంది.
  ఒక్క మామిడిపండునే కాదు,మనం చేసే ప్రతిదాన్ని దానిగుణాలతోకలిపిచూస్తు న్నాం. అందుకే అది మనను ప్రభావితం చేస్తుంది..
*ప్రకృతి ప్రభావం చేత ఏర్పడే గుణాలు లే కుండా చూడగలిగిన రోజు మనకుసర్వమూ శివమయంగా స్పష్టంగా
అర్ధమవుతుంది...             
🔯🔯🔯🔯🔯🔯
*మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు*
చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పను లకు తెగించడం మానవ బలహీనత.కానీ..
*‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,నన్ను ఎవ రూ గమనించడం లేదు’అని మనిషి అనుకో వటం చాలా పొరపాటు.మనిషి ఏ పని చేస్తు
న్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు 'పద్దెనిమిదిఉన్నాయి.'అవి నాలుగువేదాలు, పంచభూతాలు,అంతరాత్మ,ధర్మం,యము
డు,ఉభయ సంధ్యలు,సూర్య చంద్రు లు, పగలు,రాత్రి.వీటినే అష్టా దశ మహాపదార్థా లు అంటారు.ఈ మూగసాక్షులు మనిషిని
అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి.
ఇవి మనలోకంలోని న్యాయస్థా నాల్లోసాక్ష్యం చెప్పక పోవచ్చునుగాని,వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం
సాధ్యపడదు.దీన్ని గుర్తించలేనికారణంగానే ఇవన్నీ జడపదార్థా లేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు
భ్రమపడుతుంటాడు.ఈ మహా పదార్థా లు రహస్యయంత్రాలవంటివి. అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తా యి. ఆ నివేదికల్ని
విధికి చేరవేస్తా యి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది.మనిషి చేసే పనులు మంచిఅయితే సత్కర్మలుగా,చెడ్డవి అయితే
దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది.సత్కర్మల కు సత్కారాలు,దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .
అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తా యని అనుకోకూడదు,ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు.ఇది నిరంతరాయంగా
సాగి పోయే సృష్టిపరిణామక్రమం .
అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతిమనిషికీ తెలుసు. అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే
చెప్పేస్తుంది.కానీ ఆవేశం,కోపంతో విచక్షణ కోల్పోయినవ్యక్తి అంతరాత్మ సలహాను కాల రాస్తా డు అది అనర్థా లకు దారితీయటం
మనందరికి అనుభవమే .
ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తు న్నప్పుడు పశ్చాత్తా పంతో సిగ్గుతో తలదించుకుంటాం .
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పదిహేడు కూడా
నిజమేనని గ్రహించగలగటం వివేకం.నలుగు రికీ తెలిసేలా దానధర్మాలు,క్రతువులు,పూజ లు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం.
అష్టా దశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తు న్నా యంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తు న్న ట్లేగా అర్థం.ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మని
షీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .
ఎవరు చూసినా చూడకపోయినా మంచిత నంతో, తోటి వారికి సాధ్యమయినంత సహా యం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని
గడపడం ఉత్తమం.ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్ర త్నిస్తూసుఖశాంతులకునోచుకుంటాడు
🔯🔯🔯🔯🔯🔯
🌹 ప్రాప్తం:- ఏ కాస్తయినా కోరికఅనేదిఉన్న ట్లయితే భగవంతుణ్ణి పొందలేము.సూదిలో నికి దారం ఎక్కించేటప్పుడు దారంలోని
ఒక నూలు పోగు విడివడి ఉన్నాసరే, దానిని సూది(బెజ్జం) లోనికి ఎక్కించలేము.
కొందరు 30 ఏళ్లపాటు జపం చేస్తుంటారు.
అయినప్పటికీ ఏం ప్రయోజనం? కుళ్లిపోతు న్న పుండు మామూలుమందులతోమానదు. దానికి పిడకలుకాల్చి వాతలుపెట్టా ల్సి ఉం
టుంది. కోరికలున్నట్లైతే సాధనలెన్ని చేసినా యోగంసిద్ధించదు.కానిఒక్కవిషయంమాత్రం నిజం.భగవత్ కృపగలిగినట్లైతే, ఆయన
అను గ్రహించి నట్లైతే ఒక్కక్షణంలోనేయోగం సిద్ధిస్తుంది. వెయ్యేళ్లు గా చీకటితో నిండిన గదిలోనికి ఎవరైనాదీపాన్నితెస్తే ఆ గది ఒక్క
క్షణంలో ప్రకాశవంత మవుతుంది గదా అలాంటిదే ఇదీను.
నిరుపేద బాలుడొకడు ఒక పెద్ద ధనవంతుని
దృష్టిలో పడ్డా డు. ఆయన (ధనవంతుడు) వానికి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేశాడు.
వెంటనే ఆ నిరుపేద బాలునికి ఇల్లూ వాకిలీ,
పొలం పుట్టా ,బండ్లు వాహనాలుఅన్నీ చేకూ రాయి. భగవత్ కృప అట్టిదే.భగవత్ కృప ఎలా లభిస్తుంది..అంటే..భగవంతుడిదిచిన్న
పిల్లవాడి స్వభావం.
పిల్లవాడొకడు జేబులో రత్నాలు పెట్టికొని
ఇంటిగడపమీద కూర్చొని ఉన్నాడనుకుం దాం. దారిలో ఎంతోమంది వస్తూపోతూంటా రు. వారిలో చాలామంది ఆ బాలుణ్ణి రత్నా
లివ్వమని అడుగుతారు. కాని ఆ పిల్లవాడు ముఖం ప్రక్కకు తిప్పుకొని ఊహూ, నేనివ్వ నంటే ఇవ్వను అంటాడు. అయితే కాసేపటి
తరువాత ఒకవ్యక్తి ఆదారిన వెళ్లు తున్నాడు.
అతడు పిల్లవానిని రత్నాలు కావాలి అని కూడా అడుగడు.అయినా సరే ఆ బాలుడు పరుగు పరుగున అతని వద్దకెళ్లి రత్నాలన్ని
టిని ఆ వ్యక్తి చేతిలో పెడుతాడు. త్యాగం లేకుండా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోలేం
ఎవరి జీవితం ఏ మలుపు తిరుగుతుందో
ఎవరికి ఎరుక మనం చేసే మంచి పనులు ఎప్పుడూ మనలనుకాపాడతాయి. మనం చేసే కర్మల బట్టి మన జీవితఫలితాలు మన కోసం
మనం వేసుకున్న ప్రణాళిక కంటే,
ఆ భగవంతుడు చేసిన ప్రణాళిక గొప్పది మంచిదినోచుకుంటాడు
🔯🌞🔯
       
   శ......రీ...ర....మ్
*కొందరు తమ శరీరమే తామను కొందురు. శరీరమునకు తగిలిన దెబ్బలు, రోగములు, ముసలితనము మున్నగునవన్నియు
వారికి అంటి బాధపడు చుందురు. అనుక్షణము ఏమి కలుగునో అను భీతితో వ్యర్థముగా జీవించుచు,చనిపోయినవారితో
సమానంగ నే తమకు,నితరులకునిష్ఫలులగుచున్నారు
*కొందరు ఈ శరీరములో తామున్నా మను కొని జీవింతురు.వారికి శరీరమొక చెరసాల యై,అందు
కోరికలు,ఆశలు,కోపము,ఈర్ష్యా సూయలు అను గొలుసులలో పట్టు దలయ ను తాళముతో బంధింప బడుచున్నారు. ఇట్టి
ఖైదీలవలన కూడ నెవరికి నుపయోగం  లేదు. మరికొందరు ఈ శరీరమును తమకు బానిసగా వినియోగించుచున్నారు.     
*అట్టివారు పరిశ్రమలకు,నియమరహితము లైన ఆహార విహారాదికములకు లొంగి,అణ కువ కలిగి వర్తించుచు, తమ శరీరము అకా
లమున శిథిలావస్థ పొంది బాధలకు కారణ మగుచున్నది. అకాల మరణము కూడ దీని వలన ప్రాప్తించును.
*కొందరు తమ శరీరము మట్టితో చేయబడి న దనియు,అశాశ్వతమనియు,బుడగవంటి దనియు భావించి,అవమానించు
చున్నారు. వారికి శరీరము శుష్కించి దౌర్బల్యము కలిగి జీవితము నిస్సారమై ఆనందము పొందుట కు అపాత్రమగు చున్నది.
*కొందరు బుద్ధిమంతులు తమ శరీరమొక దైవదత్తమైన రథము వంటిదని గుర్తించుచు న్నారు.ఇంద్రియములను గుఱ్ఱములను
గౌర వముతో పెంచి తమ అదుపున నుంచి,మన స్సు అను పగ్గముననడుపుకొనుచు,ఆనంద పథమును సుగమము
చేసికొనుచున్నారు.
*మరికొందరు తమ శరీరము దైవదత్తమగు పవిత్ర ధర్మ సాధనముగా గుర్తించి,ఇంద్రియ ములతో మైత్రి చేసి,తమ ధర్మములను క్రీడ
గా నిర్వర్తించు కొనుచున్నారు.
*మరికొందరు ఈశరీరములు దేవాలయము లనియు,అందలి జీవుడు దేవుడే యనియు గుర్తించి ముక్తసంగులై మోక్షమను
శాశ్వత జీవితమును అనుభవించుచున్నారు.
💚💜
     
*జీవుడు ఈశ్వరుడై నప్పటికీ అతని దృష్టి ఈశ్వరుని యందు గాక అతడేర్పరచుకున్న స్వభావమునందుఇరుక్కుపోయిఉంటుంది.
*ఈశ్వరుని నుండి దిగివచ్చిన జీవుడుఈశ్వ రునితో కూడి,ఈశ్వరుని సంకల్పము నిర్వ ర్తిస్తూ ఉంటే ఈశ్వర జ్ఞానము గూడా లభి
స్తుంది. ఈశ్వర సాన్నిధ్యములో ఉన్న సౌల భ్యము ఏమిటంటే సంకల్పము,జ్ఞానము, క్రియ ఈ మూడు అతని నుండి మనకు ప్రవ
హించి మన ద్వారా చక్కని దివ్యకార్యము నిర్వర్తింపబడుతుంది...
🌹🌴🌹🌴🌹             
🌹సన్యాసం:-సన్యాసం నాలుగు రకాలు .
వైరాగ్య సన్యాసం : వ్యర్ధమైన విషయం విన డం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది .
   ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు.అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది.
జ్ఞాన సన్యాసం :-సత్ సాంగత్యం ద్వారా , లౌకిక వాంచలు తగ్గిపోయి. సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యంకర్మలుఆచరిస్తూ
ఏది తనకు అంటకుండా వసిస్తూ ఉంటాడు.
జ్ఞాన వైరాగ్య సన్యాసం :సాధన ద్వారా , ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని నిత్య ఆనంద స్దితిలో జీవిస్తా డు.
కర్మ సన్యాసం :బ్రహ్మ చర్యము ,గృహస్త , వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ, ఫలి తాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ
ఉండటం .       
ఈ సన్యాసులు ఆరు రకాలు :
1.కుటిచకుడు :శిఖ,యజ్నోపవితము,దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుం డా భక్తీ మార్గంలో వసిస్తూ అల్పాహారం
తీసుకుంటూ ఉంటారు.
2.బహుదకుడు :ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాదాన చేస్తూ ఉంటారు.
3.హంస :ఇతను జడధారియై కౌపినం ధరించి ఉంటాడు.
4.పరమహంస :వెదుర దండాన్నికలిగి,ఐదు గృహాలనుండి భిక్షతెచ్చుకునికోపినంమాత్రం ధరించి నిరంతర సాధనలోఉంటారు
5.తురియాతితుడు :దేహాన్ని ఓ శవంలా చూస్తా డు.
6.అవధూత :ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియ మాలులేవు.జగత్ మిధ్యనేనుసత్యంఅంటూ నాశనమయ్యే ఈశరీరం నేనుకాదు. చూసే
వాడికి కనిపించే ఈరూపం నాదికాదు.
నాకు పాప పుణ్యాలు, సుఖ దుఖాలు లేవు, గర్వము మాత్సర్యము,దంభము,దర్పము, ద్వేషము,అన్నింటిని త్యజించి ప్రాణాలు
నిలుపుకోవడానికి అగ్నిదేవుడికికాస్త దొరికిన ఆహరం అర్పణచేస్తూ,దొరకని రోజు ఏకాదశి  దొరికిన రోజు ద్వాదశి అంటూ,రాత్రి పగలు
నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడి లా తిరుగుతూఉంటాడు.కర్మలుఅన్నిక్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి
కప్పుకుని ఉంటాడు ...
🌹🌴🌹🌴🌹                
"లక్ష్మి అంటే ధనంకాదు ధైర్యం" లక్ష్మి ని వడ్డి కాసుల వాడు హృదయం లో దాచుకున్నద. ఆమె కురిపించే కాసుల కోసం కాదు
లేమి లో ఆమె నింపే ధైర్యం కోసం....
*మనసు మృదు మధురంగా ఉన్నపుడు మనలోని భావాలు ఎలా ఉంటాయో ప్రకృతి కూడా అలానే స్పందిస్తుంది.....
*పుట్టు కతో సహజంగా మనమంతా సజ్జను లమే! ధన్యులమే!ప్రపంచం వల్ల మనపై పడి న దుమ్ము దులుపు కోవడమే మనం చేయ
వలసిన పని.....
*మనల్ని అధఃపాతాళానికి తోసేది! మనల్ని స్వర్గానికి తీసికెళ్లేది మనఆలోచనలే.కావున వాటిగురించి అప్రమత్తమంగా
ఉండాలి....      
*మీరు ఎప్పుడుమాట్లా డటం ఆపుతారాని  ఇతరులు ఎదురుచూసేలా మాట్లా డకండి..
*మీరు ఎప్పుడు మాట్లా డతారా అని ఇతరు లు ఆసక్తిగా ఎదురు చూసేంత తక్కువగా మాట్లా డడం నేర్చుకోవాలి.....
*గాలి బలంతెలీదు,సుడిగాలైచుట్టేంతవరకు
*నీటి బలం తెలీదు ఉప్పెనై పోటు ఎత్తేంత వరకు.....
*విత్తు బలం తెలీదు మొక్కగా మొలకెత్తేంత వరకు..
*నీ బలం నీకుతెలీదు నిన్ను నువ్వు నమ్ము వరకు ....
*మాట్లా డాల్సినచోట మౌనం వహించడం, మౌనంగా ఉండాల్సినచోట మాట్లా డటం రెండూ తప్పే.
*ఒక మంచి పుస్తకం ఎలా అర్థం కాదో
ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కారు
ఏదైనా లోతుగా చదవాల్సిందే..!!      
*బ్రతికున్నపుడు,ఎకరాలకోసం తన్నులాట.
*చచ్చాక ఆరడుగులకోసం వెతుకులాట.
*జీవితంలో అతి ముఖ్యమైనది ఒక చిరున వ్వు,.ప్రేమతో ఒక పలకరింపు.అవి ఎంతటి భాదనైనాఇట్టే మాయం చేస్తుంది. అందరినీ
మన చుట్టూ చేరుస్తుంది..
*నవ్వుతూ జీవించండి,నలుగురికి మీనవ్వు లు పంచండి..
*మౌనం ఓ మానసిక నిశ్శబ్దం..మాట ఓ భౌతిక శబ్ధం..
*మౌనం ఓ సమస్యకు పరిష్కారం..మాట ఓ సమస్యకు కారణం..
*మౌనం హద్దు లు దాటితే ఆత్మజ్ఞానం,మాట హద్దు దాటితేయుద్ధం.కొన్నిటికి సమాధానం మౌనం..కొన్నిటికి సమాధానం మాట..
*మాట,మౌనం రెండు అవసరమే..వాటిని వాడే విధానం తెలుసుకోవాలి..
🌹🌴🌹🌴🌹
                  
మనసు మొదటి స్పందన కన్నీరే, ఆనంద మైన విషాదమైన....
*నీ మేలు కోరే వారు ఎప్పుడు నీకు తెలియ కుండానే నిన్ను అనుసరిస్తూవుంటారు,వారి ని వెతికి పట్టు కోవడంవిజ్ఞత,నిలుపుకోవడం
బాధ్యత.
*ఏ తప్పుచేయనప్పుడు ఎవరిదగ్గరచేతులు కట్టు కొని నిలుచోకు,అలా చేతులు కట్టు కోవ డం అలవాటుగాచేసుకున్నామంటే జీవితాం
తం ఎవరో ఒకరి చెప్పుచేతల్లో వుండి బ్రతకా లిసిందే...
*ఎన్ని మతాలు వున్న అసలైన మతం మానవత్వం.
*ఒడిపోయిన ప్రతిసారీ అర్థం అయ్యేది  గెలుపు ఎంతో దూరంలో లేదు అని.
*లక్ష నక్షత్రాలు అయిన ఒక చంద్రు డు కాలేవు.
*ప్రశాంతతకు మించిన ఆస్తి,మరి ఒకటి వుండదు.
*గొంతు పెంచడం కాదు.నీమాట విలువ పెంచుకో.వాన చినులకే తప్ప ఉరుములకి పంటలుంపండవు..
*భయం సుత్తి లాంటిది.గెలుపు ద్వారాలకు మేకులేసి కొట్టేస్తుంది.టెన్షన్ విషం లాంటిది. గెలుపుని చంపేస్తుంది..
*ఇచ్చే బహుమతి విలువకంటే,ఇచ్చే విధానం లోనే విలువవుంటుంది..
*మనం చేసేది తప్పా కాదా అనేది ఎవరో చెప్పనక్కరలేదు. ఒంటరిగా కూర్చొని అంత రాత్మని అడిగితే చాలు!!
*విమర్శలకు అవసరానికి మించి స్పందించ డం ఒకానొక శక్తి విహీనత!! 
*యోగమంటే ఇంకేమి కాదు .నీకర్తవ్యాన్ని నీవు నిర్వర్తించడమే!!
*మనం చేసేది ఎలాంటి ఉద్యోగమైనా సరే, అందులో ఎవరూ చూపించని నైపుణ్యం చూపించు,సరికొత్త పోకడలకు ప్రయత్నించు
అద్భుతాలు చూస్తా వు!!..
*మేఘమువెళ్ళిపోయాక సూర్యుడు కనిపిం చినట్లే, అజ్ఞానం అంతరించాక జ్ఞానం గోచరిస్తుంది
*నీకు నువ్వే ఆప్తు డివి,నీకు నువ్వే శత్రు వ్వి. నీకు నీవే స్నేహితుడివి,నీకు నీవే ఇచ్చుకుం టే నీకు నీవే అధిపతివి!! ..
గతం లో జరిగిన తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకోకపోతే ఎప్పటికి అభివృద్ధి సాధించ లేరు!!..
*ఒక మనిషి తాను గొప్పవాడినని అనుకోవ డం ఎంత తప్పో, తాను తక్కువవాడినని అనుకోవడం కూడా అంతే తప్పు.మొదటిది
గర్వానికి, రెండవది పిరికితనానికి దారి తీస్తా యి..
*కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్ట పెట్టరు.ఇష్టం విలువ తెలిసినవారు ఎవరిని వదులుకోరు.. 🌹🌴🌹🌴🌹   
అష్టాంగ నమస్కారమే సాష్టాంగ నమస్కా రము. తప్పక చదవండి.తెలుసు కోండి , ఇతరులకు తెలియచెప్పండి.
నమస్కారం అన్న పదం సంస్కృతం నుంచి వచ్చింది. సంస్కృతానికి చెందిన నమః అనే
పదం నుంచి నమస్కారం అన్నపదం ఏర్పడి నది. సంస్కృతంలో నమఃఅంటే విధేయత ప్రకటించామని అర్ధం.మనషులందరిలోనూ
దైవత్వము ఉంటుందని హిందువులు నమ్ముతారు. దీనినే ఆత్మ అంటారు.
నమస్కారం పెట్టడం అంటే ఒకవ్యక్తిలో ఉన్న ఆత్మ ఎదుటి వ్యక్తిలోని ఆత్మను గుర్తించి దానికి విధేయత ప్రకటించడం.ఇది అధ్యా త్మిక
పరమైన వివరణ. శాస్త్రీయంగా చూస్తే నమస్కారం చేసేటప్పుడు రెండు చేతుల వేలి కోసలు ఒకదానికొకటి తాకుతాయి. మనం
చేతివేళ్లకొనలకు,కళ్ళు,చెవి,మెదడు లతో సంబంధం ఉంటుంది.
నమస్కారం చేసేటప్పుడు వేలి కొనలు పర స్పరం ఒత్తు కోవడం వలన కళ్ళు,చెవి, మెద డు కేంద్రాలు ఉత్తేజమవుతాయి. దానితో
కళ్ళకు ఎదురుగా ఉన్న వ్యక్తిని మెదడు ఎక్కువకాలం గుర్తు పెట్టు కోవడం.వాళ్ళ మాటల్ని చెవి గుర్తుంచుకోవడం జరుగుతుం ది.
అంటే మనం ఎవరికైనా చేతులుజోడించి నమస్కారం పెడితే వాళ్ళు మనకుఎక్కువ కాలం గుర్తుండిపోతారని అర్థం.
నమస్కారం అనేది మనసంస్కృతి,సంప్రదా యాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం.తల్లిదండ్రు లకు,
గురువుకి,అతిధులకి అందరికంటే ముఖ్యం గా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేయాలి.మంచి నమస్కారం ఎలా ఉండా
లంటే , మనసునిండా గౌరవాన్ని నింపుకుని, వినయం, విధేయత ఉట్టిపడేలా అవతలి వారి హృదయాన్ని తాకాలి.అందుకే నమ
స్కారానిది హృదయం భాష.
సత్ప్ర వర్తన అలవడాలంటే చెడును విస్మరిం చాలి. వినయ పూర్వకంగా "నమస్కారం లేదా నమస్తే" అని అనాలి.చూడగానే మన
మేమిటో ఎదుటి వారికి తెలియదు.వినయా న్ని చాటుకోవాలంటే నమస్కారాన్ని అవత లి వారి హృదయాన్ని సుతారంగా తాకేలా
గౌరవంగా చేయాలి.
శివునకు, విష్ణువుకు నమస్కరించేటపుడు తలనుంచి 12 అంగుళాల ఎత్తు న చేతులు జోడించి నమస్కరించాలి. శివకేశవుల్లో ఏ
భేదం లేదని చాటడానికి ఇది గుర్తు . హరి హరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడ దు.
గురువునకు నమస్కారం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమ స్కరించాలి.
తండ్రికి, ఇతర పెద్దలకు నోరుకు ఎదురుగా చేతులు జోడించాలి.తల్లికి నమస్కరించేట పుడు చాతికి ఎదురుగా చేతులు జోడించి
నమస్కరించాలి.యోగులకు,మహానుభావు లకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమ స్కరించాలి.నమస్కారంలోని అంతర్గతం.
భారతీయ హిందూసంస్కృతిలోనమస్కారం ఒక విశిష్ట ప్రక్ధియ.ఒకరి కొకరు ఎదురైతే..
రెండు చేతులు జోడించి హృదయ స్థా నం దగ్గర ఉంచి నమస్కారం చెప్పడంహిందువు అలవాటు.మామూలుగా చూస్తే నమస్కా రం
చేయడం అంటే ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం.
సాష్టాంగ నమస్కారం పురుషులు మాత్రమే చేయాలి. స్త్రీలు చేయకూడదు.పురుషులు తమ ఎనిమిది అంగాలను అంటే వక్షస్థలం,
నుదురు, చేతులు, కాళ్లు , కళ్లు భూమిపై ఆనించి నమస్కరించడం.స్త్రీలను సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదని మన
పెద్దలు చెప్పారంటే స్త్రీ ఉదరం నేలకు తగు లుతుంది.ఆ స్థా నంలో గర్భ కోశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల గర్భకోశానికి ఏదైనా
కీడు జరిగే అవకాశం ఉంది.అందుకే ఇతి హాసాల్లో, ధర్మశాస్త్రా ల్లో స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కరించాలని చెప్పారు.
సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో నమస్కారము అనిఅర్ధం.ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసాతథాపద్భ్యాం
కరాభ్యాం జానుభ్యాం ప్రణామో సాష్టాంగ ఈరితః
అష్టాంగాలు :- అంటే "ఉరసా"అంటేతొడలు, "శిరసా" అంటే తల, "దృష్ట్యా" అనగా కళ్ళు, "మనసా"అనగా
హృదయం,"వచసా"అనగా నోరు, "పద్భ్యాం"అనగా పాదములు, "కరా భ్యాం" అనగా చేతులు, "కర్నాభ్యాం" అంటే చెవులు.ఇలా
"8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.
మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటారు.అందుకే దేవాలయం లో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ
దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి.
ఇలా చేయడం వల్ల మనం చేసినటువంటి పాపాలను దేవుడుక్షమింస్తా డనివిశ్వసిస్తా రు
ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమ స్కారం దేవునికి, ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక చేయాలి.
1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కా రము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.
2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కా రం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.
3) దృష్టితో - నమస్కారం చేసేటపుడు కను లు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తు న్నామో ఆ మూర్తిని
చూడగలగాలి.
4) మనస్సుతో నమస్కారం - అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.
5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం - నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో
స్మరించాలి.
అంటే ఓం నమో నారాయణాయ లేదా ఓం నమశ్శివాయ అనో అంటూ నమస్కారం చేయాలి.
6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.
7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కా రం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.
8.జానుభ్యాం నమస్కారం అంటే నమస్కా రం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి. 
*ఎవరెవరికి ఎలా నమస్కారముచెయ్యాలి?       💐రెండు చేతులు జోడించి నమస్కారం చెయ్యాలి.నమస్కారాలు ఐదు రకాలుగా
ఉంటుంది.
1) స్నేహితులకు హృదయం వద్ద చేతులుం చి నమస్కరించాలి.దీని‌ని 'వినమిత మస్తకమంటారు ;
2)గురువులకు నుదిటివద్ద చేతులు జోడించి నమస్కరించాలి,ఇది ధ్యానముద్ర; కానీ శిష్యులు గురువుకు సాష్టాంగపడి నమస్క
రించాలి;         
3) దేవతలకు తలపై ~ నుదుటిపైన మ‌ణి కట్టు అంటేలా నమస్కరించాలి; దీనికి విన్నపమంటారు;
4) సన్యాసులకూ,పౌరా‌ణికులకు వక్షస్థలం వద్ద చేతులుంచి నమస్కారం చెయ్యాలి;                     దీ‌ని ని ప్రార్థనా ముద్ర అంటారు;
5)తల్లితండ్రు లకు పెదవుల మధ్యగా చేతు లుంచి నమస్కరించాలి. పాదాభివందనము చెయ్యాలి భక్తిశ్రద్దలతో,ఇది అత్యుత్తమమైన 
నమస్కారము.
ఇలాచేసే నమస్కారాలుశ్రేయోదాయకాలని పెద్దలంటారు.,నమస్కారంఅన్నదిసత్యగుణ మైనది .అవకాశం ఉన్నంత వరకు ఎదుటి
వ్యక్తికి మంచి మనస్సుతో చేతులు జోడించి నమస్కంరించడంమంచిది.నమస్కారం ఒక మంచి సంస్కారం దీనిని మనం అందరం
పాటిదాం.ఎదుట వారికి నమస్కరించటంతో మనవిలువ పెరుగుతుంది.ఈ సాంప్రదాయా న్ని మనం పాటిస్తూ మన
పిల్లలకునేర్పిద్దాం.                                                                                                   💐🌹
    *మన సంస్కార 🙏నమస్కారం💐
*తూర్పుదిక్కుకు నమస్కరిస్తే మన తల్లిదం డ్రు లకు నమస్కరించినట్లు .మనిషికి తల్లి దండ్రు ల ఋణం గొప్పది.
*పశ్చిమ దిక్కు నమస్కారం భార్యబిడ్డలపై ప్రేమకు చిహ్నం.భార్యబిడ్డల ఆలనాపాలనా చూడాలి.
*ఉత్తర దిక్కు నమస్కారం బంధుమిత్రు ల ఆదరణకు కృతజ్ఞత చెప్పడం.బంధుమిత్రు లను ఎప్పడూ దూరం చేసుకోకూడదు.
*దక్షిణ దిక్కుకునమస్కరిస్తే గురుపరంపరకు నమస్కరించినట్లు .గురువులనుగౌరవించాలి
*భూమికి నమస్కారం చేయడమం అంటే సాటివారి ఆదరణకు కృతజ్ఞత తెలపడం.
*ఆకాశం వైపు నమస్కరించడం మనపూర్వీ కులైన మహర్షులకు, ప్రస్థు త ఉన్న మహాత్ము లకు ఆశీస్సులు కోరుతూ, కృతజ్ఞతలు
తెలపడం.
*అందువలన రోజూ ఒకసారి స్నానం చేసాక అన్ని వైపులకుతిరిగి నమస్కరించి అందరికీ కృతజ్ఞతలు చెప్పవలెను...
*నమస్కారం చేసే విధానం*
*నమస్కారం అనేది మన సంస్కృతి, సంప్ర దాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం.
తల్లిదండ్రు లకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేయాలి.
మంచి నమస్కారం ఎలా ఉండాలంటే ,మన సునిండా గౌరవాన్ని నింపుకుని, వినయం,  విధేయత ఉట్టిపడేలా అవతలివారి హృద
యాన్ని తాకాలి. అందుకే నమస్కారానిది హృదయం భాష.
సత్ప్ర వర్తన అలవడాలంటే చెడును విస్మ రించాలి. వినయపూర్వకంగా  "నమస్కారం లేదా నమస్తే" అని అనాలి.చూడగానే మన
మేమిటో ఎదుటి వారికి తెలియదు.  వినయాన్ని చాటుకోవాలంటే నమస్కారాన్ని అవతలి వారి హృదయాన్ని సుతారంగా  తాకేలా
గౌరవంగా చేయాలి.        
🙏శివకేశవులకు నమస్కరించేటపుడు తల నుంచి 12అంగుళాల ఎత్తు న చేతులు జోడించి నమస్కరించాలి.(శివకేశవుల్లో ఏ
భేదంలేదని చాటడానికి ఇది గుర్తు )
🙏హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరిం చకూడదు..
🙏గురువుకి వందనం చేసేటప్పుడు ముఖా నికి నేరుగా చేతులుజోడించి నమస్కరించా
🙏తండ్రికి, ఇతర పెద్దలకు నోటి నేరుగా చేతులు జోడించాలి.
🙏తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి.
🙏యోగులకు, మహానుభావులకు వక్షస్థ లం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి.
          🌞🙏🏽🌞💐💐💐మీ... తిరునగరి రామకృష్ణ🌹...........,,............

You might also like